రూరల్ బ్యాక్‌డ్రాప్‌ ప్రేమకథ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ | tollywood movie Venkatramayya Gari Taluka title and poster | Sakshi
Sakshi News home page

Venkatramayya Gari Taluka: రూరల్ బ్యాక్‌డ్రాప్‌ ప్రేమకథ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Feb 6 2026 9:22 PM | Updated on Feb 6 2026 9:22 PM

tollywood movie Venkatramayya Gari Taluka title and poster

జయమ్మ పంచాయతీ మూవీ ఫేమ్ దినేష్ కుమార్,  దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్నారు.  కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే  లవ్‌స్టోరీతో పాటు ఫాదర్ సెంటిమెంట్‌తో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చేతుల మీదుగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. టైటిల్ చాలా బాగుందని.. సినిమా కూడా బాగుంటుందని సురేష్ బాబు అన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ..'సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కుటుంబమంతా కలిసి ఆహ్లాదంగా చూడదగ్గ మూవీ. శతమానం భవతి, బలగం, ఆ నలుగురు లాంచి మంచి కంటెంట్ ఉన్న కథ. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను కూడా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ..'మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మంచి కుటుంబ కథా చిత్రంగా వస్తోంది. సెంటిమెంట్ పరంగా, అన్నిరకాలుగా మూవీ బాగుంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సురేష్ బాబు లాంఛ్ చేశారు. ఆయన హ్యాండ్ చాలా మంచిది. అది సినిమాకు బాగా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, సుధ, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూముంజెటి, హాసిని యామిని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement