శాండల్‌వుడ్ హీరో యశ్ నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. కేజీఎఫ్- 2 తర్వాత రాకింగ్ స్టార్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ సీన్ పెట్టడంపై దర్శకురాలిపై విమర్శలు చేశారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహంచారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ సినీ ప్రియులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను భారీ డీల్‌కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ పంపిణీ హక్కుల కోసం ఏకంగా రూ. 120 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఓ డబ్బింగ్ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్‌గా రికార్డ్ సృష్టించనుంది.
ఈ మూవీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు ఇదొక బిగ్ డీల్ అని టాలీవుడ్‌లో చర్చ మొదలైంది.
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. 'యశ్ సినిమా రంగంలో ఒక పవర్‌ఫుల్ స్టార్‌గా ఎదిగారు. కేజీఎఫ్ -2 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అతని మార్కెట్ మరింత పెరిగింది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత వస్తోన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అందించడానికి థ్రిల్‌గా ఉన్నాం. భవిష్యత్తులో యశ్‌తో మరిన్ని చిత్రాలకు కలిసి పనిచేస్తాం' అని అన్నారు.
ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు.
The chaos is beginning to unfold.
Toxic: A Fairy Tale for Grown-ups arrives in theaters across Andhra Pradesh and Telangana through @SVCRelease
Intoxicating the world from 19-03-2026.#DaddyIsHome #ToxicTheMovie#TOXIConMarch19th @TheNameIsYash#Nayanthara@humasqureshi… pic.twitter.com/1uB4RbQ9sg— KVN Productions (@KvnProductions) February 6, 2026


