టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఫంకీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ నెల 7న మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్‌లో ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.
The Key for FUN with #FUNKY unlocks tomorrow 🔓💥
Trailer drops on 7th Feb from 4 PM onwards. #FunkyTrailer Launch Event at Sree Ramulu 70MM, Hyderabad.
Join us for pure FUNKY MADNESS 😎🔥
In cinemas from FEB 13 #FunkyFrom13thFeb
Mass Ka Das @VishwakSenActor @11Lohar… pic.twitter.com/g2UyiUjsLL— Sithara Entertainments (@SitharaEnts) February 6, 2026


