కారూ, గోల్డూ లేదు, కేసులు మాత్రం..కాబోయే సీఎం ఆస్తుల చిట్టా! | Rs 12k in cash Suvendu Adhikaris Rs 86 lakh net worth details inside | Sakshi
Sakshi News home page

కారూ, గోల్డూ లేదు, కేసులు మాత్రం..కాబోయే సీఎం ఆస్తుల చిట్టా!

May 7 2026 1:39 PM | Updated on May 7 2026 2:56 PM

Rs 12k in cash Suvendu Adhikaris Rs 86 lakh net worth details inside

2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తరువాత బీజేపీ నాయకుడు సువేందు అధికారి పేరు సీఎం రేసులో ప్రముఖంగా నిలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ ఆస్తుల వివరాలు, క్రిమినల్‌ కేసులపై చర్చ జోరుగా నడుస్తోంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. సువేందు అధికారి నికర ఆస్తుల విలువ రూ. 85.87 లక్షలు. సొంత కార్లూ లేవు. ఎటువంటి అప్పులు లేవు.  చేతిలో ఉన్న న‌గదు రూ. 12 వేలు మాత్ర‌మే.

  • చరాస్తులు (Movable Assets) రూ.24.57 లక్షలు.14 బ్యాంకు ఖాతాల్లో మొత్తం  రూ.7.34 లక్షలు ఉన్నాయి.

  • ఇక పెట్టుబడుల విషయానికి వస్తే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు రూ. 5.45 లక్షలు, కిసాన్ వికాస్ పత్రాలు రూ.2.60 లక్షలు, 6 ఎల్‌ఐసీ (LIC) పాలసీల విలువ  రూ.7.71 లక్షలు. ఆయన పేరు మీద ఎటువంటి కార్లుగానీ, బంగారమూ కానీ లేదు. 

  • స్థిరాస్తుల విలువ మొత్తం రూ. 61.30 లక్షలు. ఇందులో పూర్బా మేదినీపూర్‌లో వ్యవసాయ భూమి (9.05 లక్షలు), వ్యవసాయేతర స్థలాలు (రూ. 27.50 లక్షలు), రూ.24.75 లక్షల విలువ చేసే మూడు నివాస గృహాలు/ఫ్లాట్లు  ఉన్నాయి.

  •  2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.17.38 లక్షలు. ఇది గత నాలుగేళ్లలో ఇది రెట్టింపు  కావడం గమనార్హం
     

క్రిమినల్‌ కేసులు : 29 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, అయితే దేనిలోనూ నేరం రుజువు కాలేదు. అఫిడవిట్ వివరాల ప్రకారం మమతా బెనర్జీతో పోలిస్తే సువేందు అధికారి ఆస్తులు ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మమతా బెనర్జీకి ఎటువంటి స్థిరాస్తులు (భూమి లేదా ఇల్లు) లేనప్పటికీ, ఆమె వార్షిక ఆదాయం సువేందు అధికారి కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం ఆమెకు వచ్చే రాయల్టీ, వడ్డీలు. ఇద్దరూ తమకు సొంత కార్లు లేవని అఫిడవిట్‌లో పేర్కొనడం విశేషం.

కాగా సువేందు అధికారి ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో రెండు (నందిగ్రామ్, భవానీపూర్) అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. భవానీపూర్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 15,105 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల తరువాత బెంగాల్‌లో తీవ్ర హింస చెలరేగింది. తాజాగా సువేందు పీఏను చంద్రనాథ్ రథ్‌ను కొంతమంది దుండగులు అత్యంత దారుణంగా కాల్చి చంపడం ఆందోళన రేపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement