విజయ్‌కు గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌ | tamil nadu governor green signal to TVK Vijay | Sakshi
Sakshi News home page

విజయ్‌కు గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌

May 7 2026 11:50 AM | Updated on May 7 2026 12:21 PM

tamil nadu governor green signal to TVK Vijay

చెన్నై: తమిళ రాజకీయాల్లో ఉత్కంఠకు తెర పడింది. ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే పార్టీకి గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ అనుమతి ఇచ్చారు. విజయ్‌తో భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. అయితే, లోక్‌భవన్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ అధికారిక ప్రకటన కోసం టీవీకే శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. 

మరోవైపు.. న్యాయ సలహా తీసుకున్న తర్వాత తన నిర్ణయం చెబుతానని గవర్నర్‌ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఒకవేళ గవర్నర్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే ఈరోజే విజయ్‌.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో, విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌తో టీవీకే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితమే లోక్‌భవన్‌ వేదికగా గవర్నర్‌, విజయ్‌ మధ్య కీలక సమావేశం జరిగింది. 24 గంటల్లో రెండోసారి గవర్నర్‌ను విజయ్ కలిశారు‌.40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. వీరి భేటీ సందర్భంగా గవర్నర్‌కు విజయ్‌.. కాంగ్రెస్‌ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను అందించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. ఇదే సమయంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని విజయ్‌ చెప్పారు. 113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించారు. 

విజయ్‌కు అనుమతి ఇవ్వాలి..
ఇదిలా ఉండగా.. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి విజయ్‌కు అనుమతి ఇవ్వాలని వీసీకే గవర్నర్‌ను కోరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే అవకాశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే, సీపీఐ సానుకూలంగా స్పందించినా, ఇంకా అధికారికంగా చెప్పలేదు. టీవీకేకు తొలుత అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డీఎంకే కూడా వ్యక్తంచేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement