కుమారుడి ఊహించని సర్‌ప్రైజ్‌..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు | Techie Surprises Parents With A BMW Goes Viral | Sakshi
Sakshi News home page

కుమారుడి ఊహించని సర్‌ప్రైజ్‌..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు

May 6 2026 11:44 AM | Updated on May 6 2026 11:53 AM

Techie Surprises Parents With A BMW Goes Viral

ఓ టెకీ తల్లిదండ్రులకు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చి నెటిజన్ల మనసును దోచుకున్నాడు. ఎప్పుడు పిల్లల కోసం అన్ని త్యాగం చేసే తల్లిదండ్రుల కోసం ఏం చేసినా అతి తక్కువే. కానీ మనకు చేతనైనంతలో ఏది ఇచ్చినా..వాళ్లకు అత్యంత అపురూపం. పైగా తమ పిల్లలు ఇంత పెద్ద వాళ్లైపోయారా అన్న ఆనందానికి మించింది మరొకటి లేదు. ఆ విషయాన్ని ఈ టెకీ సోషల్‌మీడియా వేదికగా షేర్‌  చేసుకున్నాడు.

సిద్ధార్థ్ భదౌరియా అనే కంటెంట్‌ క్రియేటర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన తల్లిదండ్రులను ఏవిధంగా సర్‌ప్రైజ్‌ చేశానో షేర్‌ చేసుకున్నారు. అందుకు సంబంధించని వీడియోని షేర్‌  చేశారు. ఆ వీడియోలో తాను స్కూటర్‌ మాత్రమే కొంటున్నానని చెప్పి ఎలా బీఎండబ్ల్యూ ఎక్స్‌ 1 కారుని గిఫ్ట్‌గా ఇచ్చానో వివరించాడు. ముందుగా తన తల్లికి నాన్నకి కొత్త టూ వీలర్‌ కొంటున్నట్టు కలరింగ్‌ ఇచ్చాడు. అయితే అంత డబ్బు ఖర్చు చేసి స్కూటర్‌ కొంటున్నందుకు కచ్చితంగా నీకు తిట్టు తప్పవని కొడుకుని హెచ్చరించిందామె. 

కానీ కొడుకు అంతకు మించిన ఖరీదైన బహుమతి ఇవ్వబోతున్నాడని ఆ క్షణం ఆమె ఊహించలేదు. పాపం ఆమె కొడుకు ఏ లక్షో లేదా ఒకటిన్నర లక్షలు ఖర్చు పెట్టాడనుకుందా ఆ పిచ్చితల్లి. అయితే కుమారుడు సిద్ధార్థ్‌ తన తల్లిదండ్రులను పార్కింగ్‌ ప్రదేశానికి తీసుకెవెళ్లి తండ్రికి తాళాలు అందించాడు. అంతే ఒక్కక్షణంపాటు అయోమయానికి గురైన ఆ తల్లిదండ్రులు అంతలోనే తేరుకుని తమ కుమారుడు ఇచ్చింది అత్యంత లగ్జరీ ఎస్‌యూవీని తెలిసి ఉప్పొంగి పోయారు. 

అంతేగాదు ఇది నిజమా కలా అన్ని సందిగ్ధానికి లోనవ్వుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు అతడి పేరెంట్స్‌. ఆ తర్వాత తండ్రి ఇంత ఖరీదైన కారు ఎవరైనా కొంటార్రా అని కుమారుడిని నవ్వుతూ ప్రశ్నించారు. నాన్న ధర గురించి మర్చిపోండి, మీరు హాయిగా కూర్చోని ప్రయాణం ఆస్వాదించండిని బదులిచ్చాడు. పైగా ఆ కారు తనకు ఉచితంగా వచ్చిందని చెప్పాడు టెకీ. 

కానీ అతడి తల్లి ఇంకా సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ..ఓరి దేవుడా..! నేను నిజంగా ఇంత లగ్జరీ కారులో కూర్చొన్నానా..!..అస్సలు నమ్మలేకపోతున్నా కన్నా..అంటూ మురిసిపోయిందామె. ఆ టెకీ ఆ వీడియోకి ఇచ్చిన క్యాప్షన్‌ సైతం మనసును హత్తుకుంది. "వాళ్లు నాకు అన్ని ఇచ్చారు. ఈ రోజు నావంతు" అనే క్యాప్షన్‌ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని పంచుకున్నాడు ఆ టెకీ. 

 

(చదవండి: ఐదు పదుల వయసులో నీట్‌ పరీక్ష..! ఐతే..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement