ఐపీఎస్ సుమతికి వేధింపులు.. పోకిరీలకు దిమ్మతిరిగే షాక్ | IPS Sumathi Special Drive In Dilsukhnagar | Sakshi
Sakshi News home page

ఐపీఎస్ సుమతికి వేధింపులు.. పోకిరీలకు దిమ్మతిరిగే షాక్

May 6 2026 1:40 PM | Updated on May 6 2026 2:15 PM

IPS Sumathi Special Drive In Dilsukhnagar

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పోకిరీల ఆట కట్టించేందుకు మల్కాజ్‌గిరి సీపీ సుమతి సరికొత్త ప్రయోగం చేశారు. కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్నారు. దీంతో, సుమతిని చుట్టుముట్టిన పోకిరీలు.. వేధింపులకు గురి చేశారు. వస్తావా? రేటెంత? అంటూ ఐపీఎస్‌నే వేధింపులకు గురిచేశారు. అనంతరం, దాదాపు 40 మంది పొకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఐపీఎస్ అధికారిణినే ఇంత వేధించారు అంటే అత్యవరస పరిస్థితుల్లో అర్ధరాత్రి బయటకు వెళ్ళే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

మల్కాజ్‌గిరి సీపీ సుమతి తన మార్క్‌ చూపించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో పోకిరీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. సీపీ సుమతి మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 వరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్నారు. ఈ సందర్భంగా అధికారి సుమతిని పోకిరీలు చుట్టుముట్టారు. ‘వస్తావా? రేటెంత?’ అంటూ అసభ్య పదజాలంతో వేధించారు. దీంతో, దాదాపు 40 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, స్పెషల్ ఆపరేషన్‌లో పట్టుబడ్డ వారంతా విద్యార్థులు, ఉద్యోగార్థులు కావడం గమనార్హం. వీరిలో పలువురు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం. 40 మంది పోకిరీలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement