బీహార్‌లోని పాట్నా పరిధిలోని బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అటు నుంచి శరవేగంగా దూసుకొస్తున్న రైలు. మరోవైపు పట్టాలు దాటుతున్న జనం. అంతే క్షణాల్లో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పటిదాకి తమ చేయి పట్టుఉన్న వారు, కళ్లముందే ఛిద్రం కావడంతో బంధువులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటనకు సంబంధించిన హృదయవిదారక వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
ఢిల్లీ నుంచి మాల్దాకు వెళ్తున్న ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు ప్లాట్‌ఫాం నంబర్ 1 వద్దకు వస్తుండగా ఈ దిగ్భ్రాంతి కర ఘటన జరిగింది. బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్‌లో అతివేగంగా దూసుకొస్తోంది. ఇంతలో కొంతమంది పట్టాలు దాటడానికి ప్రయత్నించారు. కొంతమంది వేగంగా ముందుకెళ్లిపోగా, ఇద్దరు మహిళలు బ్యాగులతో ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ వెనుక బడిపోయారు. అంతే క్షణాల్లో వారు రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోయారు. వారి తొందరపాటును గమనించిన ఇద్దరు ప్రయాణికులు సహాయానికి వచ్చారు కానీ వారిని పైకి లాగలేకపోయారు. ఒక వ్యక్తి మహిళల్లో ఒకరిని ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కించే ప్రయత్నంలో కింద పడియాడు. మరొక వ్యక్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. రైలు వారిపై నుండి దూసుకెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. దీంతో ప్లాట్‌ఫాంపైన ఉన్నవారితో పాటు వీక్షకులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన మే 4వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు జరిగింది.
ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి?
<
मित्रों ये वीडियो देखकर मेरा कलेजा फट गया
बख़्तियारपुर रेलवे स्टेशन प्लेटफार्म पार करते समय दो महिलाओं की ट्रेन से कटकर दर्दनाक मौत हो गई
यह घटना उस समय घटी जब दिल्ली से मालदा जाने वाली फरक्का एक्सप्रेस प्लेटफार्म नंबर 1 पर आ रही थी
उसी समय दो महिलाएं पटरी क्रॉस करके प्लेटफार्म… pic.twitter.com/VRd6sPZ3Je— Jitendra Verma (@jeetusp) May 5, 2026
దీంతో కొద్ది సేపు స్టేషన్‌లో రైలు సేవలు కొద్దిసేపు నిలిపివేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.మృతుల వివరాలు ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల బంధువులకు సమాచారం అందించామని, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జవహర్ లాల్ ధృవీకరించారు.
ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్‌లో ఔటింగ్... కట్ చేస్తే!
నోట్ : దయచేసి వేగంగా వెళ్లాలనే తొందరలో ప్లాట్‌ఫాం చేరుకోవడానికి పట్టాలు దాటొద్దు. ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. కాస్త నిదానించండి. ఫుట్‌బ్రిడ్జ్‌ను ఉపయోగించండి.


