breaking news
Bihar
-
బావిలో విషవాయువు.. క్షణాల్లో నలుగురి మృతి
పాట్నా: బీహార్‌లోని గయా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బావిలోని మోటార్‌ను రిపేర్ చేయడానికి బావిలోకి దిగి విషవాయువులు పీల్చి తాత, తండ్రి, మనువలు చనిపోయారు. ఈ విషాద ఘటన నిన్న (శుక్రవారం) గయా జిల్లా డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్ కర్మౌనీ గ్రామంలో జరిగింది.వివరాల్లోకి వెళితే.. బావిలో మోటార్‌ను మరమ్మతు కోసం తండ్రి, కుమారుడు సహా చమారీ మాంఝీ, ఆయన కుమారులు దిల్చంద్ మాంఝీ, వికాస్ చౌదరి, విజయ్ చౌదరి అందులోకి దిగారు. ఈ క్రమంలో మోటార్‌ను మరమ్మతు చేస్తుండగా విషవాయువులు విడుదలయ్యాయి దీంతో ఊపిరాడక వారు మృతి చెందారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.ఈ విషయమై గయా జిల్లా ఎస్ఎస్పీ సుశీల్ కుమార్ మాట్లాడుతూ, "బావిలో విషవాయువు కారణంగా ఊపిరాడక నలుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తుంది.పోలీసులు బావిలో నుంచి నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. బావి వంటి మూసివున్న ప్రదేశాల్లో ప్రమాదకర వాయువులు పేరుకుపోయి ఉండే అవకాశం ఉండటంతో, సరైన భద్రతా చర్యలు లేకుండా లోపలికి వెళ్లడం ప్రమాదకరం" అని అన్నారు.ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గయాజీలో బావిలో విషవాయువుకు గురై నలుగురు మృతి చెందిన వార్త ఎంతో బాధాకరంగా ఉందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. -
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. స్టేషన్లో పెళ్లి.. గంటలోనే విషాదం!
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం.. ప్రేమగా మారింది. ఆ ప్రేమ కోసం కుటుంబాన్ని ఎదిరించింది. ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. చివరకు రైల్వే స్టేషన్లోనే అతడి చేత సింధూరం పెట్టించుకుంది. కొత్త జీవితంపై ఎన్నో కలలు కంటూ.. ఆ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. పెళ్లైన కొన్ని గంటల్లోనే ఆమె జీవితం విషాదంగా ముగిసింది.బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 19 ఏళ్ల మానిషా కుమారి బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. దిల్ఖుష్ కుమార్ అనే 20 ఏళ్ల యువకుడితో ఆమెకు ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ ప్రేమకు కుటుంబం నుంచి అంగీకారం లభించలేదు. మానిషాకు మరో యువకుడితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో తనకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న మానిషా.. ప్రియుడు దిల్ఖుష్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.ఆగస్టు 10న దిల్ఖుష్ మానిషాను అరారియా నుంచి తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ పూర్ణియా జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు లేరు.. బంధువులు లేరు.. పెళ్లి సందడి లేదు. అయినా తమ ప్రేమే తమకు అండగా భావించిన ఆ జంట.. రైల్వే స్టేషన్ పరిసరాల్లోనే పెళ్లి చేసుకున్నారు. దిల్ఖుష్ మానిషా పాపిట్లో సింధూరం పెట్టాడు. ఇద్దరూ భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ ఆనంద క్షణాలను కెమెరాలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కానీ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించిన కొద్దిసేపటికే కథ ఒక్కసారిగా మారిపోయింది.పెళ్లి తర్వాత ఇద్దరూ రాంబాగ్ నుంచి సిటీ కాళీ ఆలయానికి కాలినడకన బయలుదేరారు. ఎండ తీవ్రంగా ఉంది. మార్గమధ్యంలో మానిషాకు ఒక్కసారిగా కళ్లు తిరిగాయి. దీంతో, ఆమెను హుటాహుటిన పూర్ణియా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు చికిత్స ప్రారంభించారు. మరోవైపు.. కుటుంబ సభ్యులు తమ కూతురి కోసం వెతుకుతున్నారు. ఇంతలో ఆసుపత్రిలో విషాద వార్త వినిపించింది. చికిత్స పొందుతూనే మానిషా మృతి చెందింది. కొన్ని గంటల క్రితం భర్త పక్కన నిలబడి సింధూరంతో పెళ్లి ఫొటో దిగిన యువతి.. అదే రోజు విగతజీవిగా మారింది. మానిషా కుటుంబ సభ్యులు ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోలు చూసి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎక్కడుందో తెలుసుకునేలోపే.. ఆమె మరణవార్త కుటుంబానికి చేరింది.మానిషాకు అకస్మాత్తుగా ఏమైంది?ఎండ కారణంగానే ఆమె అస్వస్థతకు గురైందా? లేక ఆమె మరణం వెనుక మరేదైనా కారణం ఉందా? యువతి ఆకస్మిక మరణం అనుమానాలకు తావివ్వడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేహాట్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. మానిషా భర్త దిల్ఖుష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరారియా నుంచి బయలుదేరినప్పటి నుంచి.. స్టేషన్లో జరిగిన పెళ్లి.. ఆలయానికి వెళ్తున్న సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడం.. ఆసుపత్రిలో మృతి చెందడం వరకు జరిగిన మొత్తం పరిణామాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మానిషా మృతికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు నిజం బయటపడనుంది. ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ప్రేమ.. చివరకు రైల్వే స్టేషన్లో పెళ్లిగా మారింది. ఆ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో మెరిసిన కొన్ని గంటల్లోనే.. అదే కథ విషాదంగా ముగిసింది. -
బీజేపీకి వార్నింగ్ బెల్స్.. సీఎం కుర్చీకే ముప్పు?
బీహార్ రాజకీయాల్లో ఒక్క ఉప ఎన్నిక.. ఎన్నో ప్రశ్నలకు తెరతీసింది. మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో ఆ పార్టీని ఓడిస్తూ జన సురాజ్ అధినేత ప్రశాంత్ కిశోర్ సాధించిన విజయం ఇప్పుడు బీజేపీ శిబిరంలో చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా.. ఈ విజయాన్ని ముందుగానే బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి నాయకత్వంపై రెఫరెండంగా చిత్రీకరించిన పీకే.. ఫలితం వచ్చిన తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. దీంతో అసలు టార్గెట్ బంకీపూర్ సీటా? లేక బీహార్‌లో బీజేపీ నాయకత్వమా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.బంకీపూర్ అంటే బీజేపీకి సాధారణ నియోజకవర్గం కాదు. 1995 నుంచి వరుసగా ఆ పార్టీ గెలుస్తూ వచ్చిన బలమైన కోట. నితిన్ నబీన్ ఈ సీటును ఐదుసార్లు గెలిచారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎదిగి రాజ్యసభకు వెళ్లడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. పార్టీకి అంత బలమైన సీటు కావడంతో.. మొదట బీజేపీ వర్గాల్లో ఈ ఎన్నికను పెద్ద సవాలుగా భావించలేదు. పైగా బీజేపీ శిబిరం పోటీని ‘నో కాంటెస్ట్’ అన్నంత ధీమాతో చూసింది. కానీ రంగంలోకి దిగిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన పరిస్థితి నుంచి.. తన తొలి ప్రత్యక్ష ఎన్నికల పోరులోనే బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడం రాజకీయంగా పీకేకు భారీ బూస్ట్‌గా మారింది.అసలు ట్విస్ట్ ఇక్కడే..ఎన్నికలకు ముందే పీకే బంకీపూర్ పోరును కేవలం ఎమ్మెల్యే ఎన్నికగా చూడలేదు. సామ్రాట్ చౌదరి నాయకత్వంపై రెఫరెండంగా ప్రచారం చేశారు. బీజేపీ గెలిస్తే అది సీఎం నాయకత్వానికి ప్రజల ఆమోదంగా భావించాలని వ్యాఖ్యానించారు. అంటే.. ఎన్నిక ఫలితం తనకు అనుకూలంగా వస్తే దాన్ని నేరుగా సామ్రాట్ చౌదరి నాయకత్వానికి వ్యతిరేక తీర్పుగా మలుచుకోవాలన్నది పీకే వ్యూహం. దీంతో, ఇప్పుడు పీకే అడుగులు బంకీపూర్ దాటి.. నేరుగా సీఎం వైపు పడుతున్నాయి. ఎన్నికల ఫలితం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీహార్‌కు ‘సామర్థ్యం, సత్ప్రవర్తన ఉన్న’ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా కూడా సామ్రాట్ చౌదరినే రాజకీయంగా టార్గెట్ చేస్తూ విమర్శలు కొనసాగిస్తున్నారు.అయితే ఇక్కడ బీజేపీకి మరో చిక్కు ఉంది. బంకీపూర్ ఓటమి కేవలం సీఎం చౌదరికి సంబంధించినదేనా? లేక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వ్యక్తిగత కంచుకోట కోల్పోవడమా? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు రెండో కోణాన్నీ బలంగా ప్రస్తావిస్తున్నారు. ఈ ఓటమి సామ్రాట్ కంటే నితిన్ నబిన్ కుటుంబానికి, మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంపై ఉన్న పట్టు కోల్పోవడానికే ఎక్కువ సంకేతమని అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే బంకీపూర్‌లో గెలిచింది మరో సంప్రదాయ పార్టీ ఆర్జేడీనో లేక కాంగ్రెస్ పార్టీనో కాదు. 2025 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన జన సురాజ్ పార్టీ. ఆ పార్టీ అధినేతగా పీకే స్వయంగా బరిలోకి దిగి.. బీజేపీకి చెందిన అత్యంత సురక్షితమైన పట్టణ నియోజకవర్గాన్ని చేజిక్కించుకున్నారు. ఇది జన సురాజ్‌కు ఒక సీటు మాత్రమే కాదు.. ‘బీజేపీకి ప్రత్యామ్నాయం కావచ్చు’ అనే రాజకీయ సందేశాన్ని పరీక్షించుకునే తొలి పెద్ద అవకాశంగా మారింది.ఆర్జేడీకి ఝలక్..మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే.. ఇక్కడ మరో పెద్ద రాజకీయ ట్విస్ట్ కూడా ఉంది. పీకే దెబ్బ బీజేపీతోనే ఆగలేదు. బంకీపూర్‌లో ఆర్జేడీ కూడా వెనుకబడింది. ఆ పార్టీ సంప్రదాయ ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంక్‌లో కొంత భాగం జన సురాజ్ వైపు మళ్లిందన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ ఓటమి తర్వాత ఆర్జేడీ తన సంస్థాగత వ్యవస్థపై పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే.. పీకే ఇప్పుడు బీజేపీ, ఆర్జేడీ రెండింటికీ మధ్యలోకి వచ్చి కొత్త రాజకీయ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.అయితే. పీకే గెలిచింది ఒక సీటు మాత్రమే కావచ్చు.. కానీ ఆయన గెలిచిన చోటు మాత్రం బీజేపీకి అత్యంత బలమైన కోట. ఇప్పుడు ఆ విజయాన్ని పీకే రాష్ట్రవ్యాప్త రాజకీయ ప్రచారంగా మలిస్తే? ఉద్యోగాలు, విద్య, అవినీతి, పాలన వంటి అంశాలతో యువతను ఆకర్షించగలిగితే? సంప్రదాయ కుల సమీకరణాలకు అతీతంగా ఓటర్లను కూడగట్టగలిగితే? అప్పుడు బీహార్‌లో పోటీ కేవలం బీజేపీ వర్సెస్ ఆర్జేడీగా ఉండకపోవచ్చు. మూడో శక్తిగా జన సురాజ్ ఎదగడం మొదలైతే.. అది ఎన్డీఏకే కాకుండా మొత్తం బీహార్ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంటుంది. -
‘అఫ్జల్‌గంజ్ దొంగలు’ దొరికారు!
సాక్షి, హైదరాబాద్: కర్నాటకలోని బీదర్, హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో గతేడాది జనవరి 16న తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు అమన్ కుమార్, అలోక్ కుమార్ ఎట్టకేలకు చిక్కారు. వీరిని బీదర్ పోలీసులు బుధవారం బిహార్‌లో పట్టుకున్నారు. బీహార్‌లోని వైశాలీ జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన వీరిద్దరూ 2023లో ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి నేరమే చేయడంతో అక్కడి వారికీ వాంటెడ్‌గా ఉన్నారు. ఈ గ్యాంగ్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకుంటోంది. అలోక్ కుమార్ నేతృత్వంలోని ఈ ముఠాలో అమన్, చందన్ కుమార్, రాజీవ్ సాహ్ని సభ్యులుగా ఉండేవారు. 2023 సెపె్టంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సెక్యూరిటీ గార్డు జైసింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు ఉన్న ట్రంక్ పెట్టెతో ఉడాయించారు. 2024 సెప్టెంబర్‌లో చందన్ కుమార్‌ను ముంబైలో, రాజీవ్ సాహ్నిని వైశాలీలో యూపీ ఎస్టీఎఫ్ పట్టుకుంది. అప్పట్లో అమన్, అలోక్‌లు వైశాలీ జిల్లాలోని మహిసౌర్ జన్‌ధన్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం వేట ముమ్మరం చేయగా... ఇరువురూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గతేడాది జనవరి 16న బీదర్‌లో ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ ఉద్యోగి గిరి వెంకటే‹Ùను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలతో ఉడాయించారు.కూకట్పల్లి ప్రాంతంలో షెల్టర్.. నగరంలో కూకట్పల్లి ప్రాంతంలో షెల్టర్ తీసుకున్న అమన్, అలోక్ నగదుతో తిరిగి ఇక్కడికే వచ్చి నేరానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ బస్సులో రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో టికెట్ బుక్ చేసుకున్నాడు. అక్కడ మేనేజర్ జహంగీర్‌ను కాల్చి పారిపోయారు. ఈ హత్యాయత్నంపై అఫ్జల్‌గంజ్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ దోపిడీ దొంగలు నగరం నుంచి కడప, నెల్లూరు మీదుగా చెన్నై వరకు వెళ్లినట్లు అఫ్జల్‌గంజ్ పోలీసులు గుర్తించారు. ఆపై వీరి కదలికలు కనిపెట్టడం సాధ్యం కాలేదు. ఈ ద్వయం కోసం ముమ్మరంగా వేటాడిన బీదర్ పోలీసులు బీహార్‌లో పట్టుకున్నారు. దీంతో ఈ వీరిని త్వరలో పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
బీజేపీకి టెన్షన్.. బంకీపూర్‌కు పీకే బంపరాఫర్
బీహార్‌లో మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌ను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ఆ పార్టీకి మరో టెన్షన్ మొదలుపెట్టారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే 10 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానంటూ ప్రకటించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. “మీ పిల్లల సీవీలు, బయోడేటాలు పంపండి.. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తా” అంటూ ఆయన ఇచ్చిన పిలుపు.. ఓవైపు యువతలో కొత్త ఆశలు రేపుతుండగా, మరోవైపు బీజేపీకి ఇది కొత్త రాజకీయ సవాలుగా మారే అవకాశముందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా బీజేపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ప్రాంతంలో గెలిచి.. అదే నియోజకవర్గంలో ఉద్యోగాలు, అభివృద్ధిని అజెండాగా ముందుకు తీసుకెళ్లడం కమలనాథులకు టెన్షన్ పెంచే అంశంగా మారింది.బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన ప్రశాంత్ కిషోర్.. ఆగస్టు 3న జరిగిన ఉపఎన్నికలో తనపై నమ్మకం ఉంచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. జన సురాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన.. దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో అనూహ్య విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. ఈ ఫలితంతో బంకీపూర్‌లో బీజేపీకి ఉన్న దాదాపు 30 ఏళ్ల ఆధిపత్యానికి బ్రేక్ పడింది.బయోడేటా పంపండి..విజయం తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్.. తాను ప్రజలకు దూరంగా ఉన్నానంటూ వస్తున్న విమర్శలకు కూడా సమాధానం ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదు, ఆరు రోజులుగా నియోజకవర్గంలో కనిపించలేదని కొందరు విమర్శిస్తున్నారని, కానీ తాను ఎక్కడికీ వెళ్లడం లేదని చెప్పారు. “నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మీ కోసం పనిచేస్తున్నాను” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. బంకీపూర్‌లో చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేని యువత కుటుంబాలు తమ పిల్లల CVలు, బయోడేటాలను తన కార్యాలయానికి పంపాలని కోరారు. దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలు, వ్యక్తులతో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించి అర్హత ఉన్న యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లభించేలా ప్రయత్నిస్తానని తెలిపారు.జనసూరజ్ ఎజెండా.. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాత్రం తాను హామీ ఇవ్వలేనని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం కొంతమంది యువత ప్రారంభంలో బీహార్ వెలుపలికి వెళ్లాల్సి రావచ్చని కూడా చెప్పారు. అయినప్పటికీ వచ్చే ఒకటి నుంచి రెండేళ్లలో కనీసం 10 వేల కుటుంబాల పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించడం తన లక్ష్యమని ప్రకటించారు. ఇది కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన హామీగా కాకుండా.. భవిష్యత్తులో బీహార్‌లో జన సురాజ్ పార్టీ రాజకీయ అజెండాకు సంకేతంగా కూడా కనిపిస్తోంది. జన సురాజ్ పార్టీ బీహార్‌లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలోనే తగినన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించి.. యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు ప్రయత్నిస్తామని కిషోర్ చెప్పారు.బంకీపూర్ అభివృద్ధిపై కూడా ఆయన గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన నియోజకవర్గం ఒక్క రాత్రిలో బెంగళూరుగా మారిపోదని, అయితే రెండు మూడు నెలల్లోనే కనిపించే మార్పులు మొదలవుతాయని చెప్పారు. ఉద్యోగాలతో పాటు విద్య, నెలకు రూ.1,100 పెన్షన్, ఆహార ధాన్యాల పంపిణీ వంటి అంశాలను కూడా నియోజకవర్గంలోని తన ప్రాధాన్యతలుగా పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు అందరి చూపూ 10 వేల ఉద్యోగాల హామీపైనే ఉంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఉద్యోగాల నియామక హామీ కాదు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తన వ్యక్తిగత, రాజకీయ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తానన్న హామీ. అందుకే ఆయన కార్యాలయానికి ఎన్ని సీవీలు వస్తాయి? వాటిలో ఎంతమందికి నిజంగా ఉద్యోగాలు దక్కుతాయి? అన్నదే కీలకం. -
బిహార్‌లో ఫేక్ ఐఏఎస్..!
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారినని, జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)తరఫున అండర్ కవర్ ఏజెంట్‌నని చెప్పుకుంటున్న ఓ ఘరానా మోసగాడిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు వాడుతున్న అత్యంత అధునాతన టెస్లా కారు, ఇతర ఖరీదైన వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. ఖగారియా జిల్లా గోగ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని జమాల్‌పూర్‌లో ఉంటున్న మనీష్ గుప్తాగా గుర్తించారు. అతడి ఇంట్లో తనిఖీలు జరిపారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉన్న టెస్లా కారును స్వా«దీనం చేసుకున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ కలిగిన ఇటువంటి కార్లు మనదేశంలో చాలా తక్కువగా ఉన్నాయని పోలీసులు చెప్పారు. దీంతోపాటు, టాటా సఫారీ కారును, భారీగా విదేశీ మద్యం, ఐదు యాపిల్ ఫోన్లు, ఇతర ఖరీదైన వస్తువులను సీజ్ చేశారు. విచారణ సందర్భంగా ఇతడు చూపిన ఐఏఎస్ అధికారి గుర్తింపు కార్డు ఫేక్ అని ఖగారియా ఎస్పీ భానుప్రతాప్ సింగ్ చెప్పారు. ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ అండర్ కవర్ ఏజెంట్‌గా చెప్పుకుంటూ ఇతడు చూపుతున్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కార్డు కూడా నకిలీదేనన్నారు. ఈ కార్డులతో ఇతడు ఖగారియాతోపాటు బిహార్ వ్యాప్తంగా మోసాలు, బెదిరింపులు, వసూళ్లకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఇతడి ఆస్తుల విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిని ఇతడు ఎలా సంపాదించిందీ తెలుసుకునేందుకు వివిధ విభాగాల సహకారం తీసుకుంటామని ఎస్పీ వివరించారు. పారిన్ మద్యం.. జింక కొమ్ములు గుప్తా నివాసంలో జరిపిన సోదాల్లో అధికారులు కళ్లు చెదిరే స్థాయిలో ఖరీదైన వస్తువులు, మద్యం ఉండటం చూసి కంగుతిన్నారు. దిగుమతి చేసుకున్న విదేశీ మద్యం 31 లీటర్లకుపైగా ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు ఐదు ఐఫోన్లు, 23 క్రెడిట్ కార్డులు, 8 డెబిట్ కార్డులు, నాలుగు చెక్ బుక్కులను గుర్తించారు. తనిఖీల్లో ఇంట్లో రెండు జింక కొమ్ములు కూడా బయటపడ్డాయి. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం వీటిని కలిగి ఉండటం నేరం. పలు అటవీ సంరక్షణకు సంబంధించిన ట్రోఫీలను కూడా స్వా«దీనం చేసుకున్నారు. ఇతడి నివాసం వద్ద అమర్చిన 11 సీసీటీవీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులోని ఫుటేజీని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. -
10 నెలల క్రితమే ప్రేమ పెళ్లి : రీల్స్ చేస్తోందని చంపేశాడు!
కలకాలం కలిసి ఉందామని బాస చేశాడు. తల్లిదండ్రులను కూడా మరిపించి సుమారు 10 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కన్న ఊరు వదిలి బెంగళూరులో మకాం పెట్టాడు. అంతలోనే తననుపట్టించుకోవడంలేదనీ, ఎక్కువ సమయం రీల్స్చేయడంతోనే గడుపుతోందంటూ అసహనం పెంచుకుని భార్యను మట్టు బెట్టాడు.పోలీసుల వివరాల ప్రకారం, బిహార్‌కు చెంది 24 ఏళ్ల ధీరజ్ కుమార్, రీమా కుమారి ప్రేమించాడు. 10 నెలల క్రితం వీరు వివాహం చేసుకున్నారు. రీమా కుటుంబ సభ్యులకు చెప్పకుండా వీరిద్దరూ బెంగళూరు వచ్చి కుంబళగోడు (Kumbalgodu) పట్టణంలో నివాసం ఉంటున్నారు. అయితే భార్య రీమాను గొంతు నులిమి హత్య చేసి స్వగ్రామమైన బిహార్‌కు పారిపోయాడు. చివరకు పోలీసులు ధీరజ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు కీలక విషయాలను వెల్లడించాడు.బెంగళూరు వచ్చాక రీమాకు తనపై ఆసక్తి తగ్గిందని, రోజంతా సోషల్ మీడియాలో 'రీల్స్' (Reels) చేస్తూ గడిపేదని ధీరజ్ పోలీసులకు తెలిపారు. సఅలు తనతో శారీరక సంబంధానికి నిరాకరించడంతో పాటు, కేవలం తన కోసమే వంట చేసుకుని, అతనికి వడ్డించేది కాదని పేర్కొన్నాడు. తిరిగి బీహార్ వెళ్దామని పట్టుబట్టడంతో వీరి మధ్య రోజూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో జూలై 25న ధీరజ్ ఇంటికి వచ్చేసరికి అతనికి ఆహారం సిద్ధం చేయలేదు. దీనిపై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ధీరజ్ ఆమెను పడుకోమని చెప్పగా, రీమా నిరాకరించి కలప కర్రతో అతనిపై దాడి చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన ధీరజ్, ఆమె చున్నీతోనే (Dupatta) ఉరివేసి చంపేశాడు. హత్య అనంతరం ఆమె ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి, మృతదేహాన్ని బెడ్ షీట్లో చుట్టేసి, గదికి తాళం వేసి బీహార్‌కు పారిపోయాడు.ఇదీ చదవండి : ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనతఆమె మృతదేహం కుళ్లి ఆ గది నుంచి తీవ్ర దుర్గంధం రావడంతో, ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. జూలై 29న పోలీసులు వచ్చి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో రీమా మృతదేహం లభ్యమైంది. హత్య, సాక్ష్యాల నాశనం కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి నిందితుడిని కుంబళగోడు పోలీసులు బిహార్‌లో అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్నిఅంగీకరించాడని, సీసీటీవీ ఫుటేజ్ వైజ్ఞానిక ఆధారాలను కూడా సేకరించామని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి : అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ -
బీహార్ ప్రధాన ప్రతిపక్షంగా జనసురాజ్ పార్టీ?
-
PK విజయానికి కారణం వాళ్లే.. కొడాలి నాని ఫస్ట్ రియాక్షన్
-
బీజేపీ 35 ఏళ్ల కంచుకోట బద్దలుకొట్టిన పీకే
-
పీకే గెలిస్తే.. బీజేపీ గెలిచినట్టే: మీసా భారతి
బిహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నికలో జనసూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించిన తర్వాత రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. 35 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న స్థానాన్ని కైవసం చేసుకున్న పీకే విజయంపై విపక్షాలు ప్రశంసలు కురిపిస్తుండగా.. లాలూ కూతురు, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి మాత్రం భిన్నంగా స్పందించారు. ప్రశాంత్ కిషోర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన గెలుపు వెనుక బీజేపీ వ్యూహం ఉందని ఆరోపించారు.బంకీపూర్ ఫలితాలపై ఇండియా టుడేతో మాట్లాడిన మీసా భారతి.. బీజేపీ అధికారిక అభ్యర్థి నీరజ్ కుమార్ కాదని, అసలు అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ అని వ్యాఖ్యానించారు. బీజేపీ తన సొంత బలంతో ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేమని భావించి పరోక్షంగా పీకేకు మద్దతిచ్చిందని ఆరోపించారు. “మీరు బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ అని అనుకుంటారు.. కానీ అసలు అభ్యర్థి ప్రశాంత్ కిషోర్” అని ఆమె పేర్కొన్నారు. బంకీపూర్ ఎప్పటి నుంచో బీజేపీ బలమైన ప్రాంతమని, అక్కడ బీజేపీ ఓడిపోయినా ఆ పార్టీకి నష్టం లేదని వ్యాఖ్యానించారు.“పీకే గెలిస్తే.. బీజేపీ గెలిచినట్టే”ప్రశాంత్ కిషోర్ విజయాన్ని బీజేపీకి అనుకూలంగా మలిచే ప్రయత్నం చేశారని మీసా భారతి మండిపడ్డారు. బీజేపీ అధికారిక అభ్యర్థి ఓడిపోయినప్పటికీ.. పీకే గెలవడం ద్వారా బీజేపీ తన లక్ష్యాన్ని సాధించిందన్నారు. బీజేపీ అభ్యర్థిని రాత్రికి రాత్రే ఎందుకు మార్చారని ప్రశ్నించిన ఆమె.. సొంతంగా గెలిచే నమ్మకం లేకపోవడం వల్లే ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.“గుంటనక్క” అంటూ విమర్శలుప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రయాణంపై విమర్శలు చేసిన మీసా భారతి.. ఆయనను “గుంటనక్క”గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదని అన్నారు. ప్రజలను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారని ఆరోపించారు.తేజస్వి గైర్హాజరుపై వివరణబంకీపూర్ ప్రచారంలో ఆర్జేడీ దూకుడుగా వ్యవహరించలేదన్న విమర్శలను మీసా భారతి ఖండించారు. ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ వ్యక్తిగత పర్యటనలో ఉండటం వల్ల ప్రచారానికి రాలేకపోయారని సమర్థించారు. అదే సమయంలో ప్రధాని మోదీపై కూడా ఆమె విమర్శలు చేశారు. విద్యార్థుల నిరసనలు జరుగుతున్న సమయంలో విదేశీ పర్యటనలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇదిలా ఉంటే.. విజయ సంబురాల్లో ఉన్న జన సురాజ్ పార్టీగానీ, ప్రశాంత్ కిషోర్గానీ మీసా భారతి ఆరోపణలపై స్పందించాల్సి ఉంది. 36 రౌండ్ల పాటు ఆధిక్యం.. భారీ మెజారిటీతో విజయంబంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ తొలి ఎన్నికల విజయాన్ని నమోదు చేశారు. మొత్తం 36 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఆయన ఆధిక్యాన్ని కొనసాగించారు. జనసూరాజ్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాకు 44,827 ఓట్లు వచ్చాయి. దాదాపు 19,324 ఓట్ల మెజారిటీతో పీకే విజయం సాధించారు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో.. ఇదే స్థానం నుంచి నితిన్ నబీన్(98,299 ఓట్లు) రేఖా కుమారి(46,363 ఓట్లు)పై దాదాపు 52 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.35 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలుబంకీపూర్ నియోజకవర్గం చాలా కాలంగా బీజేపీకి పట్టున్న ప్రాంతంగా ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో ఈ స్థానాన్ని గెలుచుకుంది. అయితే తాజా ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం ద్వారా జనసూరాజ్ పార్టీకి అసెంబ్లీలో తొలి అడుగు పడింది.ఎన్నికల వ్యూహకర్తగా అనేక పార్టీలకు విజయాలు అందించిన ప్రశాంత్ కిషోర్.. రాజకీయ నాయకుడిగా మాత్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులను బరిలోకి దింపినా ఆశించిన ఫలితం సాధించలేకపోయారు. కానీ ఇప్పుడు ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.అయితే బంకీపూర్ ఫలితం కేవలం బీజేపీకి ఎదురుదెబ్బ మాత్రమే కాదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విజయం ద్వారా ప్రశాంత్ కిషోర్ ఆర్జేడీ రాజకీయ స్థలానికే సవాల్ విసిరారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లలో కొంత భాగం జనసూరాజ్ వైపు మళ్లడం ఆర్జేడీకి ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇప్పటివరకు బీహార్‌లో ప్రధాన ప్రతిపక్ష శక్తిగా ఉన్న ఆర్జేడీకి ముస్లిం–యాదవ్ (ఎంవై) ఓటు బ్యాంకు ప్రధాన బలంగా ఉండేది. అయితే బంకీపూర్‌లో సంప్రదాయంగా ఆర్జేడీ వైపు ఉండే కొన్ని వర్గాల ఓట్లు కూడా ప్రశాంత్ కిషోర్ వైపు మళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయంగా జనసూరాజ్ను కొందరు ఓటర్లు చూడటం మొదలుపెడితే.. భవిష్యత్తులో బీహార్ ప్రతిపక్ష రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
బీహార్ బంకిపూర్‌లో బీజేపీ కంచుకోట బద్దలు : మంత్రి పొన్నం ప్రభాకర్
బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామంగా నిలిచిన బంకిపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బంకిపూర్‌లో ఆ పార్టీ ఓటమిపాలవడం ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పుకు నిదర్శనమని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు చెందిన నియోజకవర్గంలోనే జన్ సూరజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ భారీ మెజారిటీతో గెలవడం ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు.అయితే, అధికార బలం, ప్రభుత్వ యంత్రాంగం, విస్తృత ప్రచారం ఉన్నప్పటికీ ప్రజల తీర్పును ఎవరూ మార్చలేరు. దీనికి బంకిపూర్ ఫలితం మరో నిరూపన. ప్రజలు తమ ఓటుతో బీజేపీ అహంకారానికి గట్టి సమాధానం చెప్పారు. ప్రజల సమస్యలను విస్మరించి అహంకారపూరిత పాలన కొనసాగిస్తే తగిన సమయంలో ప్రజలు తీర్పు ఇవ్వడమే కాకుండా, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని మంత్రి గట్టిగా చెప్పుకొచ్చారు.ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని ప్రస్తావించిన మంత్రి.. దేశవ్యాప్తంగా యువతలో అసంతృప్తి పెరుగుతోందని, అలాగే, విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందనే భావన బలపడుతోందని, అదే భావోద్వేగం బంకిపూర్ ఉపఎన్నిక ఫలితంలో ప్రతిబింబించిందని ఆయన అన్నారు.అలాగే, బంకిపూర్ తీర్పు కేవలం ఒక ఉపఎన్నిక ఫలితం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ప్రజల సంకల్పానికి ప్రతీక. దీంతో ప్రజల గొంతుకను అణచివేయాలని చూసే రాజకీయాలకు దేశ ప్రజలు సరైన సమయంలో సమాధానం చెబుతారని, బంకిపూర్‌లో బీజేపీ కంచుకోట బద్దలవడం దేశ రాజకీయాల్లో మరింత పెద్ద మార్పులకు నాంది పలుకుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. -
బీజేపీపై పీకే ఘన విజయం
-
ఉపఎన్నికల ఫలితాలు.. బీజేపీకి షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్
దేశంలోని బంకీపూర్, మంజల్పూర్, దతియా అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరిగింది. బిహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గంలో జన సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. ఆయన 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ నేత నీరజ్ కుమార్‌పై విజయం సాధించారు. అంతకుముందు బంకీపూర్ నియోజకవర్గంలో వరసగా 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రస్తుత జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ గెలిచారు. అంతగా బీజేపీకి పట్టున్న బంకీపూర్ నియోజక వర్గంలో ఆ పార్టీని ప్రశాంత్ కిశోర్ ఓడించారు. గుజరాత్‌లోని మంజల్పూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సతేంద్రభాయ్ పటేల్ (సతీశ్ పటేల్) విజయం సాధించారు. ఆయనకు మొత్తం 55,481 ఓట్లు పడగా 30,630 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి భిఖంభాయి రబారీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మధ్యప్రదేశ్‌లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ విజయం సాధించారు. ఆయనకు మొత్తం 66757 ఓట్లు రాగా, 6,016 తేడాతో బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై గెలుపొందారు. -
బీజేపీకి బిగ్ షాక్.. లీడింగ్ లో పీకే
-
బిహార్: రైలు ఇంజిన్ దగ్ధం.. ప్రయాణికులు పరుగులు
సహర్సా: బిహార్‌లోని సహర్సా జిల్లా సిమ్రి బక్తియార్పూర్ రైల్వే స్టేషన్లో సోమవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. సమస్తిపూర్ నుంచి సహర్సా వెళ్తున్న ప్యాసింజర్ రైలు (నెం. 63344) ఇంజిన్‌తో పాటు దాని పక్కనే ఉన్న ఒక బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సంభవించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. #WATCH | Saharsa, Bihar: A fire broke out in the engine of a rail and an adjoining coach of passenger train No. 63344 (Samastipur–Saharsa) at Simri Bakhtiyarpur railway station in Bihar's Saharsa district around 3 AM. Passengers were evacuated safely, and no casualties have been… pic.twitter.com/NxMpJlIbie— ANI (@ANI) August 3, 2026సమాచారం అందుకున్న వెంటనే సహర్సా ఫైర్ స్టేషన్ నుంచి అగ్నిమాపక సిబ్బంది రెండు వాటర్, ఫోమ్ ట్యాకర్లతో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ కుమార్ వెల్లడించారు. రైలు ఇంజిన్ అకస్మాత్తుగా మంటలకు గురికావడానికి కారణం ఏమిటనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.అర్ధరాత్రి వేళ రైలులో మంటలు చెలరేగడంతో తాము తీవ్ర భయాందోళనలకు గురయ్యామని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. రైలు నిలిచిపోవడంతో స్టేషన్లో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, గత మే నెలలో కూడా బీహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్లో జయనగర్-ఉధ్నా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ ఖాళీ బోగీలలో ఇలాంటి ఘటనే జరిగింది. ప్లాట్‌ఫామ్ నంబర్ 3పై షంటింగ్ ఆపరేషన్లు జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగడంతో ఒక బోగీ పూర్తిగా దగ్ధమైంది.ఇది కూడా చదవండి: ‘రేపటి గాలి రేపు వీస్తుంది’.. జపనీస్ రహస్యం! -
బీజేపీకి బిగ్ టెస్ట్.. మరికాసేపట్లో పూర్తి ఫలితాలు!
దేశవ్యాప్తంగా పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు హోరెత్తిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. బీజేపీ పాలిత మూడు రాష్ట్రాలు.. బిహార్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. యువతలో పెరిగిన అసంతృప్తి ఓట్ల రూపంలో బయటపడుతుందా? లేదంటే బీజేపీ తన పట్టును కొనసాగిస్తుందా? అన్నది ఈ ఫలితాలతో తేలనుంది.బంకీపూర్, దాతియా, మంజల్పూర్ ఉప ఎన్నికల స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. బంకీపూర్‌లో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ ముందంజంలో కొనసాగుతున్నారు. ఇక దాతియా, మంజల్పూర్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దాటియాలో కాంగ్రెస్ అభ్యర్థి కాసేపు ఆధిక్యంలో కొనసాగినా.. కాసేపటికే మళ్లీ వెనుకంజలోకి వెళ్లారు.ఈ ఉప ఎన్నికలు సంఖ్యాపరంగా చిన్నవే అయినప్పటికీ.. రాజకీయంగా మాత్రం కీలకంగా మారాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు, పరీక్షల నిర్వహణపై ప్రభుత్వాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.బంకీపూర్.. బీజేపీ కంచుకోటలో ఆసక్తికర పోరుబిహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పటి నుంచో బీజేపీకి బలమైన స్థానం. ఇప్పటివరకు ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఖాళీ ఏర్పడింది. అయితే ఈసారి ఎన్నికల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ తొలుత ప్రకటించిన అభ్యర్థి అభిషేక్ కుమార్ సిన్హా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. దీంతో చివరి నిమిషంలో యువ మోర్చా నేత నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దింపింది.ఈ పరిణామాన్ని ప్రతిపక్షాలు బీజేపీపై ఒత్తిడి పెరిగిందనే సంకేతంగా ప్రచారం చేశాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ కూడా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఈ నియోజకవర్గంపై ఆసక్తిని పెంచింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. కుల, మతాలకు అతీతంగా తమ అభ్యర్థికి మద్దతు లభించిందని చెబుతూ అనూహ్య ఫలితాలపై ఆశలు పెట్టుకున్నారు.దాతియా.. బీజేపీ అంతర్గత అసంతృప్తికి పరీక్షమధ్యప్రదేశ్లోని దాతియా నియోజకవర్గం కూడా బీజేపీకి కీలకంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుకు గురికావడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ తరఫున తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆశుతోష్ తివారీ బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఘనశ్యామ్ సింగ్ పోటీ చేశారు.అయితే ఈ ఎన్నికలో అసలు చర్చ బీజేపీ అంతర్గత రాజకీయాలపైనే సాగింది. మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాకు ఈ నియోజకవర్గంలో బలమైన పట్టు ఉంది. ఆయన వరుసగా మూడు సార్లు దాతియా నుంచి గెలిచారు. ఈసారి అభ్యర్థి మార్పుపై నరోత్తమ్ మిశ్రా వర్గంలో అసంతృప్తి వ్యక్తమైంది. ఆయన అనుచరులు నిరసనలు కూడా చేపట్టారు. ఈ అంతర్గత విభేదాలు ఫలితాలపై ప్రభావం చూపుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.మంజల్పూర్.. గుజరాత్లో బీజేపీ ఆధిపత్యానికి పరీక్షగుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గం బీజేపీకి మరో కీలక పరీక్షగా మారింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ నేత యోగేష్‌భాయ్ నరేంద్రభాయ్ పటేల్ మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. బీజేపీ తరఫున మాజీ వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ సతీష్ గోవింద్‌భాయ్ పటేల్ పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి భిఖాభాయ్ రబారీ బరిలో నిలిచారు. గుజరాత్లో బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్నప్పటికీ.. స్థానిక అంశాలు, అభ్యర్థుల ప్రభావం ఈ ఎన్నికలో కీలకంగా మారాయి.యువ ఓటర్ల తీర్పు ఏంటి?ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా అందరి దృష్టి యువ ఓటర్ల తీర్పుపైనే ఉంది. పేపర్ లీక్‌లు, పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ ఆగ్రహం ఓటింగ్‌లో ప్రతిబింబిస్తుందా? లేక సాధారణ రాజకీయ అంశాలే ఆధిపత్యం చెలాయిస్తాయా? అన్నది ఫలితాల తర్వాత స్పష్టమవుతుంది.అయితే మూడు స్థానాల ఫలితాలు ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో లేకపోయినా.. ప్రజల మూడ్, ముఖ్యంగా యువత ఆలోచనా విధానంపై ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వనున్నాయి. బీజేపీ కంచుకోటలను కాపాడుకుంటుందా? లేదంటే విద్యార్థి నిరసనల ప్రభావం ప్రతిపక్షాలకు ఊరటనిస్తుందా? మరికాసేపట్లో వెలువడే ఉప ఎన్నికల ఫలితాలు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నాయి. -
నకిలీ వారసుడు! తల్లి అనుమానమే నిజమైంది!
‘కావమ్మ మొగుడు... కావమ్మ మొగుడు అని అందరూ అంటుంటే... కామోసనుకున్నాను నాకేం తెలుసు’ అన్నాడట ఒకడు. అలా అందరూ ‘అతడు తప్పిపోయిన మీ కొడుకే, అచ్చం అలాగే ఉన్నాడ’ని చెప్పడంతో వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రి నిజమే అని నమ్మాడు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కొడుకు తిరిగొచ్చాడని, ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. కానీ, కన్నపేగు కదా! ఆ తల్లి ఆ వ్యక్తిని తన కొడుకుగా అంగీకరించలేకపోయింది. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు కోర్టుకు చేరింది. 41 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి ఎవరో తేలింది.‘వారసుడొచ్చాడు’ సినిమాలో వెంకటేష్‌లా, ‘అతడు’లో మహేష్‌బాబులా... కొడుకుగా ఆ వ్యక్తి మరొకరి ఇంటికెళ్లాడు. ఆ సినిమాల్లో హీరోలు ఆ కుటుంబాలను నిలబెట్టేందుకు వారసులుగా వెళ్లారు. కానీ ఈ వ్యక్తి ఆస్తులు కొట్టేసి, విలాసంగా జీవించేందుకు నకిలీ వారసుడిగా ఆ ఇంట అడుగుపెట్టాడు. అయితే నిజం నిలకడమీద తెలిసింది. అతని మోసం బట్టబయలైంది. ఆ తల్లి నమ్మకమే నిజమని రుజువైంది.బీహార్‌లోని నలందా జిల్లా ముర్గావస్ గ్రామానికి చెందిన కామేశ్వర్ సింగ్ ఓ భూస్వామి. 1977లో అతని ఏకైక కుమారుడు కన్హయ్య పరీక్ష రాయడానికి వెళ్లి తిరిగి రాలేదు. ఎంతగా గాలించినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడి జాడ తెలియలేదు. చివరికి కామేశ్వర్ సింగ్ ఓ మంత్రగాడిని కలిశాడు. కొడుకు ఆచూకీ కోసం ఆరా తీశాడు. ‘మీ కొడుకు బతికే ఉన్నాడు. త్వరలోనే తిరిగొస్తాడ’ని అతడు చెప్పాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా కొడుకు తిరిగి రాలేదు. ఆ బెంగతో కామేశ్వర్ ఆరోగ్యం క్షీణించింది. అయితే తన కొడుకు తిరిగొస్తాడనే ఆశ చావలేదు. కన్హయ్య తప్పిపోయిన నాలుగేళ్లకు అతడి ఊరికి సమీపంలోని ఓ గ్రామానికి ఓ యువకుడు కాషాయ వస్త్రాలు ధరించి వచ్చాడు. తాను ముర్గావస్ గ్రామానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడిగా చెప్పాడు. దీంతో ఆ గ్రామస్థులు అతడే కన్హయ్య అని భావించారు. ఆ విషయాన్ని కామేశ్వర్సింగ్కు చెప్పారు. ‘వయోభారంతో నా చూపు మందగించింది. అతడ్ని సరిగా గుర్తించలేకపోతున్నాను. మీరందరూ నాకొడుకే అని చెబుతున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి అతడ్ని నా ఇంటికి తీసుకెళ్తున్నా’ అని చెప్పాడు.అంగీకరించని తల్లి..తన కుమార్తె ఇంటి దగ్గర ఉన్న కామేశ్వర్ సింగ్ భార్య రామ్సఖీదేవికి కుమారుడు తిరిగొచ్చాడనే విషయం తెలిసింది. ఆ వ్యక్తిని చూసి తమ కుమారుడు కాదని స్పష్టంగా చెప్పింది. అయితే అతడు వచ్చిన తర్వాత నుంచి తన భర్త ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో కొంతకాలం వేచి చూసింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి తల ఎడమ వైపున గాయం గుర్తు ఉండేదని, ఈ యువకుడి తలపై అలాంటి గుర్తులేవీ కనిపించడం లేదని తెలిపింది. తమ బంధువులు, ఉపాధ్యాయుల్ని సైతం ఆ వ్యక్తి గుర్తించలేదని పేర్కొంది. తమ కుమారుడి వేషంలో వచ్చిన అతడు ఓ మోసగాడని తేల్చి చెప్పింది.నాలుగు దశాబ్దాలు అదే కుటుంబంలోతల్లి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నెల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. తానే కన్హయ్యను అంటూ తిరిగి అదే ఇంటికి వెళ్లాడు. తండ్రి అతడ్ని నమ్మి ఇంట్లోనే ఉంచుకున్నాడు. అక్కడే ఉంటూ క్రమంగా ఆ కుటుంబంలో సభ్యుడిగా మారాడు. కన్హయ్య పేరుతో గుర్తింపు కార్డులు పొందాడు. డిగ్రీ పూర్తి చేశాడు. వివాహం చేసుకున్నాడు. నాలుగు దశాబ్దాల పాటు నకిలీ గుర్తింపుతో కొనసాగాడు. ఈలోగా భూస్వామికి చెందిన కొంత భూమిని సైతం విక్రయించాడు.చివరికి మిస్టరీ వీడిందిదయానంద్ గోసాయి పేరుతో జముయి జిల్లాలోని అతడి స్వగ్రామం చిరునామాతో ఉన్న ఓ లేఖ పోలీసులకు లభించింది. పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి విచారించారు. అతడి ఫొటో చూసిన కొందరు గ్రామస్థులు అతడు దయానంద్ గోసాయిగా గుర్తించారు. దీంతో అతడు దయానంద్ పేరుతో మరణ ధ్రువపత్రాన్ని సృష్టించాడు. అందులో 1982లో మరణించినట్టు నమోదు చేశారు. అయితే డెత్ సర్టిఫికెట్ 2014లో జారీ చేశారు. 32 ఏళ్ల తర్వాత జారీ చేయడంతో కోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీనికి తోడు కన్హయ్య పేరుతో జారీ అయిన గుర్తింపు పత్రాల్లోనూ పుట్టిన తేదీ వేర్వేరుగా ఉండడాన్ని కోర్టు గుర్తించింది.డీఎన్ఏ పరీక్షలకూ నిరాకరణకామేశ్వర్ సింగ్ కుటుంబ వారసుడా? కాదా? అని తేల్చేందుకు ఆధారమైన డీఎన్ఏ పరీక్షకు సైతం అతడు నిరాకరించాడు. తానే కన్హయ్య అని నిరూపించుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ అతడు ఉపయోగించుకోలేదు. వీటన్నిటినీ పరిశీలించిన కోర్టు అతడు కన్హయ్య సింగ్ కాదు దయానంద్ గోసాయి అని నిర్ధారించింది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఐపీసీ సెక్షన్ 419 కింద మూడేళ్లు, ఐపీసీ సెక్షన్ 420 కింద మూడేళ్లు, ఐపీసీ సెక్షన్ 120 బి కింద ఆరు నెలలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించింది. ఈ శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. 2022లో ఈ తీర్పు వెలువడింది. అప్పటికే ఆ తల్లిదండ్రులిరువురూ మృతి చెందారు. అయితే అసలు కన్హయ్య ఏమయ్యాడనే మిస్టరీ మాత్రం వీడలేదు.- దిలీప్ మాదిరెడ్డి -
నేపాల్‌లో లౌడ్‌స్పీకర్ల వల్ల అల్లర్లు.. సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్
న్యూఢిల్లీ: నేపాల్‌లో ఇటీవల జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో బిహార్‌లోని మధుబనీ జిల్లా వద్ద భారత్-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోషి ప్రావిన్స్‌లోని సున్సారీ జిల్లాలో గత వారాంతంలో రెండు మత వర్గాల వేడుకల సందర్భంగా లౌడ్‌స్పీకర్ల వినియోగంపై వివాదం చెలరేగి ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటన తర్వాత నేపాల్‌లోని పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడి అధికారులు కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు అమలు చేస్తూ అదనపు భద్రతా బలగాలను మోహరించారు.జులై 26న జరిగిన ఘర్షణలు, పోలీసుల కాల్పుల్లో దాదాపు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. భారత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న మధేశ్ ప్రావిన్స్‌లోని సప్తరీ జిల్లా కొన్ని ప్రాంతాల్లో జూలై 31న నేపాల్ అధికారులు నిరవధిక కర్ఫ్యూ విధించారు.ముందుజాగ్రత్త చర్యగా బిహార్‌లోని మధుబనీ జిల్లా పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు భద్రతను మరింత పెంచారు. ప్రధాన రహదారులు, ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల తనిఖీలు, గాలింపు చర్యలు చేపడుతున్నారు. సరిహద్దు పోలీస్ స్టేషన్ల వద్ద అదనపు బలగాలను కూడా మోహరించారు.ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అధికారుల ఆదేశాలను పాటించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. -
బంకీపూర్ బైపోల్.. బీజేపీ కంచుకోటలో పీకే సవాల్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా నేడు మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్‌లోని బంకీపూర్, గుజరాత్‌లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఆగస్టు 3న జరగనుంది.అయితే ఈ మూడు ఉపఎన్నికల్లో బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ స్థానం దేశవ్యాప్తంగా అత్యధిక రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా అభ్యర్థిగా బరిలో దిగుతుండటంతో ఈ పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. మరోవైపు ఈ స్థానం బీజేపీకి బలమైన కోటగా ఉండటంతో పార్టీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఆర్జేడీ తన సంప్రదాయ ముస్లిం–యాదవ్ (ఎం-వై) ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహించింది.బంకీపూర్ స్థానం ఖాళీ కావడానికి బీజేపీ సీనియర్ నేత నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడమే కారణం. గుజరాత్‌లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్‌లోని దతియా స్థానాల్లో కూడా ఖాళీలు ఏర్పడటంతో ఎన్నికల సంఘం ఉపఎన్నికలను ప్రకటించింది. ఈ ఉపఎన్నికల ఫలితాలు అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ బలాబలాలను అంచనా వేయడమే కాకుండా, ఆయా రాష్ట్రాల్లో భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.#WATCH | Patna, Bihar: Voting begins for the by-election of Bankipur Assembly constituency.(Visuals from Bihar State Library) pic.twitter.com/wXhhIuUpCJ— ANI (@ANI) July 30, 2026ఇక, బంకీపూర్‌లో బీజేపీకి పట్టు ఉన్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు సర్వేల ప్రకారం బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇటీవలి పరిణామాలు ప్రశాంత్ కిషోర్ ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జన్ సురాజ్ ఓటు శాతం గణనీయంగా పెరగడం, బీజేపీ ఓటు శాతం తగ్గడం విశేషం. అదే సమయంలో ఆర్జేడీ ఓటు బ్యాంకు కూడా క్షీణించినట్లు పలు సర్వేల్లో వెల్లడైంది.బీజేపీకి ప్రతిష్ఠాత్మక ఎన్నికఈ నియోజకవర్గం దాదాపు రెండు దశాబ్దాలుగా బీజేపీ ఆధీనంలో ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించింది. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ సహా పలువురు సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలో ప్రధాన పోటీ బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా, జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్, ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి గుప్తా మధ్య నెలకొంది. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, పోటీ ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యే కొనసాగుతోంది.యువ ఓటర్లే నిర్ణయాత్మకంబ్యాంకీపూర్లో సుమారు 3.69 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్లు దాదాపు 1.25 లక్షల మంది ఉన్నారు. యువతలో ప్రశాంత్ కిషోర్‌కు ఎక్కువ మద్దతు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. మరోవైపు మహిళలు, వయోజన ఓటర్లలో బీజేపీకి బలమైన మద్దతు కనిపిస్తోంది. -
‘‘రష్యాలో 4 నెలలుగా ఉన్నా.. నీట్ నిరసన కేసులో నా పేరు పెట్టారు’’
పట్నా: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలకు సంబంధించిన కేసులో తన పేరు చేర్చారని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యానని బిహార్‌కు చెందిన ఓ యువకుడు చెప్పాడు. బిహార్‌లోని కిషన్‌గంజ్‌కు చెందిన మహ్మద్ సదాఖత్ తాను గత 4 నెలలుగా రష్యాలో ఉన్నానని పేర్కొన్నాడు.“జూలై 24న నీట్ లీక్‌కు వ్యతిరేకంగా ఎల్‌ఆర్‌పీ చౌక్ వద్ద నిరసన జరిగింది. ఆ కేసులో బహదూర్‌గంజ్ అడ్మినిస్ట్రేషన్ నా పేరు చేర్చింది. నేను గత 4 నెలలుగా రష్యాలో ఉన్నాను” అని సదాఖత్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు.“నేను రష్యాలో ఉండడంతో నా పేరును అక్కడి నుంచి తొలగించాలని అడ్మినిస్ట్రేషన్‌ను కోరుతున్నాను. అలా చేస్తే వారికి రుణపడి ఉంటాను” అని అతడు కోరాడు. అతడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నప్పటికీ దాని ప్రామాణికతను స్వతంత్రంగా ఇప్పటివరకు ఏ మీడియా కూడా నిర్ధారించలేకపోయింది.పోలీసులు ఏమన్నారు?కిషన్‌గంజ్ పోలీసు సూపరింటెండెంట్ హరి మోహన్ శుక్లా స్పందిస్తూ... వైరల్ వీడియోలోని వ్యక్తిపై కేసు నమోదైందా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించలేదు, ఖండించలేదు. సదాఖత్ వీడియోపై అడిగిన ప్రశ్నకు హరి మోహన్ స్పందిస్తూ.. “నిరసనలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు ఉన్నవారు పోలీసులను సంప్రదించవచ్చు. పరిష్కారం పొందవచ్చు” అని చెప్పారు.బిహార్ పోలీసుల అధికారిక ఎక్స్ ఖాతా గతంలో ఈ వైరల్ వీడియోపై స్పందిస్తూ, విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అయితే ఆ పోస్టు ఇప్పుడు కనిపించడం లేదు. తొలగించినట్టు తెలుస్తోంది.విద్యార్థులపై కేసులు ఉపసంహరించనున్న ప్రభుత్వంముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం... నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించనున్నట్టు ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమైన సీజేపీ ఆందోళనలు చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీశాయి.రాష్ట్ర హోం శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జూలై 26 ఉదయం 6 గంటల కంటే ముందు జరిగిన ఘటనలకు సంబంధించి నమోదైన “అన్ని ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదులు, షోకాజ్ నోటీసులు” ఉపసంహరించాలనే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ కేసుల్లో అరెస్టైన వారందరినీ వెంటనే విడుదల చేయాలని కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.मोहम्मद सदाकत 4 महीने से रूस में हैं। बिहार पुलिस ने स्टूडेंट प्रोटेस्ट में उनके खिलाफ भी FIR दर्ज कर दी है !! pic.twitter.com/jEDqWs27ck— Sachin Gupta (@Sachingupta) July 29, 2026 -
Gen Z ఎఫెక్ట్.. బీజేపీకి కంచుకోటలో టెన్షన్!
అది బీజేపీకి బలమైన కంచుకోట.. వరుస విజయాలతో పార్టీకి అండగా నిలిచిన నియోజకవర్గం. కానీ ఇప్పుడు అదే స్థానంలో ఫలితం ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అందుకే బంకీపూర్‌లో పార్టీ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సాధారణంగా గెలుపు ఖాయంగా భావించే ఈ సీటులో ఈసారి మాత్రం బీజేపీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కారణం.. ఒకవైపు జన సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం.. మరోవైపు జెన్ జీ (Gen Z) విద్యార్థుల ఉద్యమం రాజకీయ చర్చకు కేంద్రంగా మారడం.బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఈసారి సాధారణ పోరుగా కాకుండా.. బీజేపీ ఆధిపత్యానికి పరీక్షగా మారింది. జులై 30న పోలింగ్ జరగనుండగా.. ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున నీరజ్ కుమార్ సిన్హా పోటీ చేస్తుండగా.. జన సూరాజ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిశోర్ బరిలో ఉన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఉన్నప్పటికీ.. ప్రధాన పోరు బీజేపీ, జన సూరాజ్ మధ్యే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ కంచుకోటలో కొత్త సవాల్బంకీపూర్ నియోజకవర్గం చాలాకాలంగా బీజేపీకి అనుకూలంగా ఉంది. గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే నితిన్ నబీన్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ స్థానం ఖాళీ అయింది. బీజేపీ తన సంప్రదాయ బలాన్ని నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా తరఫున ప్రచారం చేస్తున్న నితిన్ నబీన్.. ప్రజల్లో పార్టీపై విశ్వాసం కొనసాగుతోందని చెబుతున్నారు. “యువత ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం సామ్రాట్ చౌధరీ, ఎన్డీయేకు మద్దతుగా ఉంది. ప్రజల ఆశీర్వాదం బీజేపీకి కొనసాగుతుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.పీకే ఎంట్రీతో ఆసక్తికర పోరురాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్.. జన సూరాజ్ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన సూరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. బంకీపూర్ ఉప ఎన్నిక ఆయనకు కీలక పరీక్షగా మారింది. ఈ ఎన్నిక ద్వారా బిహార్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో జన సూరాజ్ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా యువ ఓటర్లు, పట్టణ ప్రాంత ప్రజలు, సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయం కోరుకునే వర్గాలపై ప్రశాంత్ కిశోర్ దృష్టి పెట్టారు.యువ ఓటర్లే నిర్ణాయక శక్తిబంకీపూర్ ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర కీలకంగా మారనుంది. నీట్ వివాదంపై ఢిల్లీలో జరిగిన జెన్ జీ ఉద్యమం, ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అటు బిహార్‌లోనూ నీట్ నిరసనల సందర్భంగా కేసులు, అరెస్టుల వ్యవహారం వివాదాస్పదమైంది. దీంతో యువతలో ఈ అంశాలపై ఉన్న అభిప్రాయం ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? అన్న చర్చ మొదలైంది. పరీక్షల పారదర్శకత, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల సమస్యలు యువ ఓటర్ల నిర్ణయంలో కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది.జెన్ జీ ఉద్యమ ప్రభావం ఉంటుందా?జెన్ జీ ఉద్యమ ప్రభావం బంకీపూర్ ఎన్నికలపై ఉండదని బీజేపీ నేతలు చెబుతున్నారు. యువత తమకు మద్దతుగానే ఉందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు బలమని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం విద్యార్థుల ఆందోళనలను ప్రస్తావిస్తూ యువతలో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జెన్ జీ ఉద్యమం కేవలం నిరసనగానే మిగిలిపోతుందా? లేక ఓటు రూపంలో ప్రభావం చూపుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.బంకీపూర్ ఫలితం ఎందుకు కీలకం?బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం ఒక సీటు గెలుపోటములకే పరిమితం కాదు. బీజేపీ తన కంచుకోటను నిలబెట్టుకుంటుందా? లేక ప్రశాంత్ కిశోర్ జన సూరాజ్ ప్రభావాన్ని చాటుతుందా? అన్నది బిహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితం బీజేపీ బలాన్ని మాత్రమే కాకుండా.. యువ ఓటర్ల మూడ్, ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఉన్న అవకాశాలను కూడా సూచించే అవకాశం ఉంది. అందుకే బంకీపూర్ బైపోల్ ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
విద్యార్థులపైకి ఏకే–47
పట్నా: కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో పార్లమెంట్ దిశగా ‘చలో సంసద్ ర్యాలీ’కి పిలుపునివ్వగా ఆ ర్యాలీకి మద్దతుగా శనివారం బిహార్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో వందలాది మంది ఉద్యమకారుల పైకి పోలీసులు ఏకంగా ఏకే–47 మారణాయుధాన్ని ప్రయోగించిన వార్త ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజికవేత్తలను లాఠీచార్జ్‌తో రెచ్చగొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి చివరకు ఏకే–47 గన్ను పోలీసులు వినియోగించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది? పట్నా, సరణ్ జిల్లాలోని ఛాప్రా, సివాన్, ఔరంగాబాద్, భాగల్పూర్, సమస్తీపూర్, నవాడా, పూరి్ణయా, నలందా, బోజ్పూర్, మధుబని, షేక్పురాల్లో జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థి ర్యాలీలు జరిగాయి. అయితే సివాన్ పట్టణంలో జరిగిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక్కడ జేపీ చౌక్ ప్రాంతంలో జాతీయరహదారి గుండా రాకపోకలను నిలిపేశారు. దుకాణాలను మూసేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ర్యాలీగా వెళ్తున్న తమను అడ్డుకున్న పోలీసులపైకి ఉద్యమకారులు రాళ్లతో దాడిచేశారు. ట్రాఫిక్ పోలీస్బూత్లను ధ్వంసంచేశారు. విద్యార్థుల రాళ్ల దాడిలో సివాన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పురన్ కుమార్ ఝా గాయపడ్డారు. దీంతో బాష్పవాయుగోళాలు ప్రయోగించాలని ఆయన ఆదేశించారు. అయితే ఉద్యమకారులు రాళ్ల వర్షం కురిపించడంతో వారిని నిలువరించేందుకు జిల్లా నిఘా విభాగానికి చెందిన అభిషేక్ పటేల్ అనే కానిస్టేబుల్ తన వద్ద ఉన్న ఏకే–47ను విద్యార్థుల పైకి ఎక్కుపెట్టారు. నాలుగు రౌండ్లు కాలుస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో తాజాగా ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఝా ప్రకటించారు. నాలుగు రౌండ్ల కాల్పుల్లో అటుగా వెళ్తున్న కుమార్ గోండ్ ఒక వ్యక్తి కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయితే ఉద్యమకారులు నాటుబాంబులు విసిరేయడంతోనే ఈ కాల్పుల ఘటన జరిగిఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి. వాళ్లేమైనా ఉగ్రవాదులా?న్యూఢిల్లీ: బిహార్‌లో నీట్ లీకేజీ నిరసనోద్యమంలో విద్యార్థులపైకి పోలీసులు ఏకే–47 గన్ను ఎక్కుపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మోదీ సర్కార్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిలదీశారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘మోదీ ప్రభుత్వసారథ్యంలో యావత్ పోలీస్‌వ్యవస్థ విద్యార్థులను హతమార్చే స్థాయికి దిగజారింది. బిహార్‌లో ఏకే–47 గన్ను విద్యార్థులపైకి గురిపెట్టారు. వందలాది మందిని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌చేశారు. మోదీజీ.. విద్యార్థులపై ఒక్క ఎఫ్ఐఆర్ నమోదుకాబోదన్న మీ వాగ్దానం ఏమైంది? ఢిల్లీలో పెల్లెట్ గన్స్ వాడితే బిహార్‌లో ఏకంగా ఏకే–47ను వాడా రు’’అని అన్నారు. ఏకే–47 గురిపెట్టిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా మాట్లాడారు. ‘‘మీ అమ్మాయిలను నిరసనలకు ఎందుకు పంపించారు? అని తల్లిదండ్రులను కొందరు నేతలు మందలిస్తున్నారు. అమ్మాయిలు ఉద్యమంలో పాల్గొనకూడదా? ఏకే47, పెల్లెట్ గన్స్ వాడొచ్చా? విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? ’’అని ప్రియాంక నిలదీశారు. కాల్పుల ఘటనపై సుప్రీంలో పిల్ సాక్షి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై రాజ్యస భ సభ్యుడు, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా బిహార్‌లో జరిగిన పోలీసుల కాల్పుల ఘటనతో పాటు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసనకారులపై జరిగిన లాఠీచార్జి తదితర ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. -
‘జంతర్ మంతర్’ లవ్ స్టోరీ.. తలకు గాయంతో వివాహం!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరిగిన ‘నీట్’ పేపర్ లీక్ నిరసన ప్రదర్శన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫలితంగా కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నిరసనలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి యువత తరలివచ్చింది. ఈ క్రమంలోనే బీహార్‌కు చెందిన మోహన్ శ్రీవాస్తవ్, ఢిల్లీకి చెందిన ఓ యువతి మధ్య చిగురించిన ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. This could be a prank from Bihar. But it ends so authentically with a question, that is so steeped in reality. pic.twitter.com/t1EBCziYhy— Smita Prakash (@smitaprakash) July 26, 2026నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పాల్గొనేందుకు మోహన్ బీహార్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆందోళన ప్రాంతంలో భోజన వసతి లేకపోవడంతో ఒ యువతి అతనికి ఆహారం అందించింది. తర్వాతి రోజు తాగునీరు కూడా తెచ్చి ఇచ్చింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య మంచి స్నేహానికి దారితీసింది. ఆ యువతి కూడా ‘నీట్’ పరీక్ష రాసి, పేపర్ లీక్ బాధితురాలే కావడంతో ఆందోళనలో పాలుపంచుకుంది.ఈ క్రమంలో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో మోహన్ తలకు తీవ్ర గాయమై అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్పందించిన ఆ యువతి అతనిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడింది. మోహన్ కోలుకున్నాక ఆమె తన ప్రేమను వ్యక్తం చేసింది. మోహన్ కూడా తన మనసులోని భావాన్ని బయటపెట్టాడు. గాయాలతో బాధపడుతూనే మోహన్ ఆ యువతిని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఒంటరిగా ఢిల్లీకి వెళ్లిన మోహన్, ఆందోళన ముగిశాక నూతన వధువుతో కలిసి బీహార్‌కు తిరుగుముఖం పట్టాడు.ఇది కూడా చదవండి: ఇక గడ్కరీకి ‘బొద్దింకల’ బెడద? -
కలకలం.. నలుగురు పాఠశాల విద్యార్థినులు అదృశ్యం
సంగారెడ్డి : జిల్లాలోని ఇస్నాపూర్‌లో ఒకేసారి నలుగురు పాఠశాల విద్యార్థినులు అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. బీహార్ రాష్ట్రానికి చెందిన నలుగురు బాలికలు ఇస్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈనెల 23వ తేదీన యథావిధిగా పాఠశాలకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిన విద్యార్థినులు, సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి విచారించగా, ఆ రోజు వారు అసలు స్కూల్‌కే రాలేదని అక్కడి సిబ్బంది తెలిపారు.బాధిత కుటుంబాలు బీహార్‌కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. మిస్సింగ్ అయిన విద్యార్థినులను కుష్బూ కుమారి (16), మహిమా కుమారి (12), రోజా కుమారి (12), ప్రియా కుమారి (12)లుగా గుర్తించారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ సూత్రధారి.. బిహార్‌లో దొరికాడు
గత కొంతకాలంగా పరారీలో ఉన్న మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు బిజేంద్ర గుప్తా ఎట్టకేలకు మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు. బీహార్‌లో అదుపులో తీసుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. అతడు బీహార్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన అతడి అనుచరుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గుప్తా భార్యతో పాటు మరికొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుప్తా మాత్రం పోలీసులకు చిక్కకుండా కొంతకాలం పరారీలో ఉండటంతో మహారాష్ట్ర పోలీసులు విస్తృతంగా గాలించారు. పేపర్ లీక్ రాకెట్‌తో బిజేంద్ర గుప్తా భార్యకు కూడా సంబంధం ఉందని.. సిండికేట్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఈమె సమక్షంలోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, పాట్నాలలో ఆస్తుల కొనుగోలుపై దర్యాప్తు చేస్తున్నారు.బిజేంద్ర గుప్తా భార్యతో సహా 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా అనేక పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులతో బిజేంద్ర గుప్తాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.జూన్ 28న జరగాల్సిన మహారాష్ట్ర టెట్ పరీక్షకు ముందు థానేలోని కొంగావ్ ప్రాంతంలో లీకైన ప్రశ్నపత్రాలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఆకాష్ కుమార్, రాజీవ్ కుమార్, ధీరజ్ సింగ్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ పరీక్షను వాయిదా వేసింది. ఆరు లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు బిజేంద్ర గుప్తాను ట్రాన్సిట్ రిమాండ్‌పై రాష్ట్రానికి తీసుకువచ్చారు. -
డీఎస్పీలుగా భారత క్రికెటర్లు
టీమిండియా ఫాస్ట్ బౌలర్లు ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్‌లకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరు క్రికెటర్లను బీహార్ ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హోదాతో సత్కరించింది. పాట్నాలోని 'ఎనర్జీ ఆడిటోరియం'లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి వీరిద్దరికీ నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వారిద్దరూ అంతర్జాతీయ స్ధాయిలో బీహార్‌కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారని సమ్రాట్ చౌదరి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, క్రీడా శాఖ మంత్రి శ్రేయసి సింగ్‌లు కూడా పాల్గొన్నారు. కాగా ముకేష్, ఆకాష్ దీప్ బీహార్‌లో జన్మించినప్పటికి దేశవాళీ క్రికెట్లో మాత్రం బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ముఖేష్ కుమార్ 2023లో వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. ఇదే టూర్లో మొత్తం మూడు ఫార్మాట్లలోనూ డెబ్యూ చేశాడు. అయితే అతడు నిలకడగా రాణించకపోవడంతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో మాత్రం ఫర్వాలేదన్పిస్తున్నాడు. అతడు ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 10 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆకాష్దీప్ విషయానికి వస్తే.. అతడు భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడతుండంతో ఆకాష్ పోటీ క్రికెట్ దూరం కానున్నాడు. ఈ గాయం కారణంగా ఐపీఎల్-2026 నుంచి కూడా అతడు వైదొలిగాడు.క్రీడకారులకు అండగా బీహార్కాగా గత కాలంగా బీహార్ ప్రభుత్వం క్రీడకారులకు అండగా ఉంటుంది. ఇప్పటివరకు క్రీడా కోటా కింద దాదాపు 180 మంది అథ్లెట్లకు వేర్వేరు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు కల్పించింది. సమ్రాట్ చౌదరి సర్కార్ ఈ ఏడాది 637 మందికి స్కాలర్‌షిప్‌లతో పాటు 'సక్షమ్' పథకం కింద ₹3 లక్షలు, 'ఉత్కర్ష్' పథకం కింద ₹5 లక్షల నుండి ₹20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. -
స్కూల్‌కు వెళ్తుండగా నడిరోడ్డులో విద్యార్థినిపై బుల్లెట్ల వర్షం.. మృతి
పట్నా: బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన దారుణ ఘటన ఆ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పూసా వైని పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలకు వెళ్తున్న 15 ఏళ్ల విద్యార్థినిని రోడ్డుపైనే కాల్చి చంపాడు ఓ యువకుడు. సైకిల్‌పై ఆ అమ్మాయి కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమెను చంపాక నిందితుడు బైక్‌పై పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.బైక్‌పై వెంబడించి.. వరుసగా కాల్పులుమృతురాలిని పూసా వైని పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సోనం కుమారిగా గుర్తించారు. సమాచారం ప్రకారం, సోనం ఎప్పటిలాగే ఉదయం సైకిల్‌పై పాఠశాలకు బయల్దేరింది. ఆమె మంగళ్ స్థాన్ సమీపానికి చేరుకున్న సమయంలో పల్సర్ బైక్‌పై వచ్చిన ఓ యువకుడు వెంబడించడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కేజియా వార్డు-13 సమీపంలో నిందితుడు ఆమె సైకిల్‌ను ఓవర్టేక్ చేసి ఎదురుగా వచ్చాడు. వెంటనే తుపాకీ తీసి వరుసగా కాల్పులు జరిపాడు. సోనంకు 4 బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఘటన తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి వచ్చారు. సమాచారం అందుకున్న వైని పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమస్తిపూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) బృందం ఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరించింది. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. సదర్ డీఎస్పీ-1 సంజయ్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ సభ్యుల నుంచి కీలక సమాచారం లభించిందని చెప్పారు. ఆ సమాచారం ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటు చేస్తున్నామని, నిందితుడిని త్వరగా అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. -
అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా.. ప్రశాంత్ కిషోర్ సవాల్!
పట్నా: బిహార్‌లోని పట్నా పరిధిలోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక రాజకీయం వేడెక్కింది. జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత నితిన్ నబీన్‌కు అలాగే బీజేపీకి బహిరంగ సవాల్ విసిరారు. ‘దమ్ముంటే ఎవరి మద్దతూ లేకుండా ఒంటరిగా పోరాడి చూడండి’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పట్నాలోని బాంకీపూర్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను తిప్పికొట్టేలా ఆయన నేరుగా ఎన్నికల రణక్షేత్రంలోకి దూకారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా ఆయన ఈ సవాల్ విసిరారు. ఈ రాజకీయ సవాల్‌తో బీహార్ రాజకీయాల్లో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ప్రధాన రాజకీయ కేంద్రంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ దూకుడుతో అధికార, ప్రతిపక్ష శిబిరాల్లో ఉత్కంఠ నెలకొంది.ఇది కూడా చదవండి: పెరూలో భూకంపం.. ఆరుగురు మృతి -
బిహార్‌లో ప్రమాదం.. 40 మందితో వెళుతున్న పడవ బోల్తా
పాట్నా: బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో ఘెర ప్రమాదం జరిగింది. బాగ్మతి నదిలో దాదాపు 40 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ బరువు తట్టుకోలేక నదిలో బోల్తాపడింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి నదిలో పడ్డవారిని రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బాగ్మతి నదికి ఇరువైపులా ఉన్న గ్రామాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ నది దాటాల్సిందే. అయితే ఈ నదిపై ప్రభుత్వం వంతెన నిర్మించకపోవడంతో రోజూ గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు, ఇతర వ్యాపారులు తమ రోజువారీ పనులకోసం పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. కాగా పడవలు నడిపే వారు సామర్థ్యంకు మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు అంటున్నారు. వారు తక్షణమే స్పందించడంతోనే ఎవరికి ప్రాణాపాయం కలగలేదని చెబుతున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పరిపాలనా యంత్రాంగం, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీనిపై స్పందించిన అధికారులు ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఓవర్ లోడింగ్‌కు పాల్పడే నావికులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నదిలో నడిచే అన్ని పడవల్లో తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్ వంటి ప్రాణరక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని నావికులకు ఆదేశాలు జారీ చేశారు.#BREAKING : Boat Carrying 40 Passengers Capsizes in Bihar's Bagmati RiverA boat carrying around 35 to 40 passengers capsized in the Bagmati River in Bihar's Sitamarhi district after reportedly becoming overloaded. The vessel lost balance midstream and overturned, triggering… pic.twitter.com/4hatCRP27D— upuknews (@upuknews1) July 19, 2026 -
బాల్ కట్వా గ్యాంగ్ దాడులు.. పోలీసులకు సవాల్
పాట్నా: అందరూ ఇంట్లో ఉండగానే చొరబడతారు. చాకచక్యంగా మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తారు. దొరికిన డబ్బు, నగలు దోచుకుని పరారవుతారు. అయితే వెళ్తూ వెళ్తూ ఇంట్లోని మహిళల జుట్టును కత్తిరించి తీసుకెళ్తుండటమే ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. దొంగతనాల కేసులను ఛేదించడమే పోలీసులకు సవాలుగా ఉంటే, ఈ ‘జుట్టు కత్తిరించే’ గ్యాంగ్ మాత్రం వారికి కొత్త తలనొప్పిగా మారింది. బిహార్‌లో ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.నిత్యం సోషల్ మీడియాలో ‘చడ్డీ గ్యాంగ్’, ‘షట్టర్ కట్వా గ్యాంగ్’ గురించి వింటుంటాం. ఇప్పుడు ‘బాల్ కట్వా గ్యాంగ్’ బిహార్ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వారం రోజుల వ్యవధిలో ఒకే గ్రామంలో రెండు చోట్ల ఒకే తరహాలో దోపిడీలు జరిగాయి. డబ్బు, నగలతో పాటు మహిళల జుట్టును కూడా కత్తిరించి తీసుకెళ్లడంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.దొంగలు ఎత్తుకెళ్లిన డబ్బు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వారు కత్తిరించి తీసుకెళ్లిన జుట్టును ఏం చేస్తున్నారనే ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. ఇదే స్థానికుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల బిహార్‌లోని దర్భంగా జిల్లా దర్హార్ గ్రామంలో రెండు వేర్వేరు ఇళ్లలో ఒకే తరహాలో దోపిడీలు జరిగాయి. జూలై 8న డాక్టర్ పవన్ కుమార్ మిశ్రా ఇంట్లోకి చొరబడ్డ ఐదుగురు అగంతకులు కుటుంబ సభ్యులను బంధించి, ఇంజెక్షన్ రూపంలో మత్తుమందు ఇచ్చారు. సుమారు 20 నిమిషాల్లో రూ.5 లక్షల విలువైన బంగారం, రూ.35 వేల నగదు దోచుకుని పరారయ్యారు. వెళ్లే ముందు పవన్ మేనకోడలు, 22 ఏళ్ల కరిష్మా దేవి జుట్టును కత్తిరించి తీసుకెళ్లారు.అదే గ్రామంలో ఉపాధ్యాయుడు సుమన్ కుమార్ ఇంట్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో దోపిడీ చేసిన దుండగులు అక్కడ నిద్రిస్తున్న బాలిక జుట్టును కూడా కత్తిరించి తీసుకెళ్లారు. వరుస దోపిడీలపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. బాధిత కుటుంబాలను విచారించి, ఘటనాస్థలాలను పరిశీలించాయి. రెండు చోట్ల జరిగిన దోపిడీల తీరు ఒకే విధంగా ఉందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.మరోవైపు, దుండగులు మహిళల జుట్టును ఎందుకు కత్తిరించి తీసుకెళ్తున్నారన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దోపిడీల కంటే ఈ అంశమే స్థానికులను ఎక్కువగా కలవరపెడుతోంది. రెండు ఘటనల వెనుక ఒకే ముఠా ఉందా? జుట్టును తీసుకెళ్లడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.దర్హార్ గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భయంతో చాలా మంది గ్రామస్తులు రాత్రిళ్లు ఇళ్లకు కాపలా కాస్తూ మేల్కొని ఉంటున్నారు. అయితే నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు. -
‘నీట్’లో ఇటుక బట్టీ కార్మికుడి పిల్లల జయకేతనం
నవాదా: బీహార్‌లోని నవాదా జిల్లా, పక్రిబరావాం ప్రాంతానికి చెందిన రివ రంజన్ కుమార్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఇటుక బట్టీలో పనిచేస్తూ, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, తన పిల్లలు రితేష్ కుమార్, రిచా కుమారీలను ఉన్నత చదువులు చదివించాలన్న తండ్రి పట్టుదల ఫలించింది. ఇద్దరూ ఈ ఏడాది జరిగిన ‘నీట్ యూజీ 2026’ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వైద్య విద్యకు అర్హత సాధించారు.తొలి ప్రయత్నంలో విఫలమైనా వెనకడుగు వేయకుండా, రెండో ప్రయత్నంలో కోటాలో శిక్షణ పొంది ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు. రితేష్ కుమార్ 720 మార్కులకు గానూ 655 మార్కులు సాధించి 1160 ఆల్ ఇండియా ర్యాంకును కైవసం చేసుకోగా, రిచా కుమారి 622 మార్కులతో 4685వ ర్యాంకును సాధించారు. తల్లి శోభా కుమారి ప్రోత్సాహం కూడా తోడవడంతో వారు డాక్టర్లు అయ్యేందుకు సిద్ధమయ్యారు. వీరి విజయం అందరిలో స్ఫూర్తిని నింపుతోంది. ఇదే జిల్లాకు చెందిన ఆయుష్ భలోటియా ఆల్ ఇండియా స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి బీహార్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు.ఇది కూడ చదవండి: ‘మందు కొట్టి మొగుడిని చావగొడతా’ -
రికార్డు సృష్టించిన విద్యార్థి .. ఏకంగా రూ.3 కోట్ల స్కాలర్షిప్
పాట్నా: బీహార్‌కు చెందిన శ్రేయా కౌశిక్ అనే 18 ఏళ్ల విద్యార్థి రికార్డు సృష్టించారు. ప్రతిష్టాత్మకమైన రూ. 3 కోట్ల విలువైన "లింకన్ స్కాలర్షిప్"కు అర్హత సాధించారు. అమెరికాకు చెందిన ఈ పూర్తి ఉచిత విద్యా కార్యక్రమానికి ఈ ఏడాది ఎంపికైన ఏకైక భారతీయురాలిగా నిలిచారు.ఈ ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ సాధించడం ద్వారా అంతర్జాతీయ విద్యా రంగంలో భారత ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు.లింకన్ స్కాలర్షిప్ అంటే ?అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ స్మారకార్థం ఈ అంతర్జాతీయ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ను అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మందికి మాత్రమే దీనిని అందజేస్తారు. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రంగా ఉంటుంది. అసాధారణ విద్యా ప్రతిభ, నాయకత్వ లక్షణాలు,సమాజ సేవ పట్ల ఉన్న నిబద్ధత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ప్రస్తుతం సివాన్, బీహార్‌కు చెందిన భారతీయ విద్యార్థిని శ్రేయా కౌశిక్ (18 సంవత్సరాలు) ఈ స్కాలర్ షిప్‌కు ఎంపికయ్యారు. ఈ స్కాలర్షిప్ ద్వారా రూ. 3 కోట్ల విలువైన ఈ స్కాలర్షిప్ అమెరికాలో నాలుగేళ్ల విద్యకు అయ్యే పూర్తి ఖర్చులను భరిస్తుంది. పూర్తి ట్యూషన్ ఫీజు , వసతి, భోజన ఖర్చులు, పుస్తకాలు, ఇతర స్టడీ మెటీరియల్స్ ఇతర ఆమోదించబడిన వ్యక్తిగత ఖర్చులు ఉంటాయి. ప్రస్తుతం సెంటర్ కాలేజ్ , కెంటుకీ, అమెరికా విద్యాసంస్థలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు ఆమె చదవబోతున్నారు.శ్రేయా కౌశిక్ విద్యా ప్రస్థానంబీహార్లోని సివాన్‌లో జన్మించిన శ్రేయ, ఆ తర్వాత ఢిల్లీలోని 'సర్వోదయ కన్యా విద్యాలయ' (అయా నగర్) లో తన పాఠశాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆమెకు 13 ఏళ్ల వయసులో విద్యార్థులకు నాయకత్వ శిక్షణ, విద్యా అవకాశాలు కల్పించే 'డెక్స్టెరిటీ గ్లోబల్ అనే సంస్థలో చేరారు. ఈ సంస్థ ద్వారా ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో, లీడర్షిప్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ సాధించడంలో ఈ అనుభవం కీలక పాత్ర పోషించింది. -
కోర్టులో గెలిచిన 103 ఏళ్ల బామ్మ.. ఇప్పుడు ఆ ఆస్తంతా ఏం చేసుకోవాలి?
పట్నా: చాలామంది వృద్ధులు మంచానికే పరిమితమై, అనారోగ్యంతో బాధపడుతూ, ఇతరులపై ఆధారపడే పరిస్థితిలో ఉంటారు. అలాంటిది 103 ఏళ్ల హబీబన్ ఖాతూన్ మాత్రం తన భూమిని తిరిగి పొందేందుకు దశాబ్దాల పాటు న్యాయ పోరాటం సాగించారు. 3 దశాబ్దాలకు పైగా న్యాయం కోసం ఎదురుచూశారు. తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన ఖాతూన్ పోరాటం ఇప్పుడు ఫలించింది. కేసులో ఆమె గెలిచింది. గ్రామంలో 35 ఏళ్లుగా కొనసాగిన భూ వివాదం ఈ తీర్పుతో ముగిసింది. కోర్టు ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య వివాదాస్పద భూమిని జిల్లా యంత్రాంగం అధికారికంగా ఖాతూన్‌కు అప్పగించింది.అధికారుల వివరాల ప్రకారం.. దాదాపు 1,600 చదరపు అడుగుల భూమికి సంబంధించిన వివాదం 1994 నుంచి కొనసాగుతోంది. ఈ కేసు సివిల్ కోర్టులో విచారణకు వచ్చింది. సుదీర్ఘ న్యాయ విచారణ తర్వాత కోర్టు ఖాతూన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చి, ఆదేశాలను అమలు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించింది.కోర్టు తీర్పు తర్వాత రెవెన్యూ శాఖ, స్థానిక యంత్రాంగం, పోలీసులు కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త బృందం గ్రామానికి చేరుకుంది. అన్ని న్యాయ ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత భూమిని ఖాతూన్‌కు అప్పగించారు. ఈ ప్రక్రియలో భాగంగా డప్పులు మోగిస్తూ గ్రామంలో కోర్టు ఆదేశాన్ని బహిరంగంగా ప్రకటించారు.ఈ వివాదం సున్నితమైనది కావడంతో ఘటన స్థలంలో దాదాపు 300 మంది పోలీసులను మోహరించారు. కార్యనిర్వాహక మేజిస్ట్రేట్లు, రెవెన్యూ అధికారులు, కల్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ అధికారులు మొత్తం ప్రక్రియలో అక్కడే ఉన్నారు. యంత్రాంగం పర్యవేక్షణలో ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.భూమిని పొందిన తర్వాత హబీబన్ ఖాతూన్ కుటుంబం న్యాయవ్యవస్థకు, యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపింది. ఎన్నో ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత తమకు రావాల్సిన హక్కు లభించిందని కుటుంబ సభ్యులు చెప్పారు. సహనం, న్యాయ ప్రక్రియపై నమ్మకం వల్లే ఈ ఫలితం వచ్చిందని వారు తెలిపారు.కల్యాణ్‌పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినీత్ కుమార్ మాట్లాడుతూ.. అన్ని న్యాయ ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు భూమిని అప్పగించామని చెప్పారు. మొత్తం ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని, ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని వెల్లడించారు. -
ఏకంగా 10 అడుగుల కోబ్రా : చున్నీలా మెడలో చుట్టేసుకుంది
బిహార్‌లో వర్షాలతో నదుల నీటిమట్టం పెరగడం సర్వసాధారణం. ప్రస్తుతం పశ్చిమ చంపారన్ జిల్లాలో గండక్ నది నీటిమట్టం పెరుగుతుండటంతో, వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఏకంగా 10అడుగుల పొడవైన విషపూరితమైన కోబ్రా ఒకరి ఇంట్లోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అక్కడంతా ఆందోళన నెలకొంది. కానీ తక్షణమే 'స్నేక్ లేడీ' రంగంలో దూకడంతో అంతా సద్దు మణిగింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింగ తెగ చక్కర్లు కొడుతోంది. పశ్చిమ చంపారన్‌లోని వాల్మీకినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మున్నీ లాల్ అనే వ్యక్తి ఇంట్లోకి దాదాపు 10 అడుగుల పొడవైన భారీ విషసర్పం దూరింది. ఇంట్లో అంత పెద్ద పాము బుసలు కొట్టడం చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు. ఆ శబ్దాలు విని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కాసేపు తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొన్నాయి.जिन महिला के गले में आप किंग कोबरा देख रहे हैं वो हैं बिहार के बगहा में वाल्मीकिनगर की जानकी देवी और लोग उन्हें 'स्नेक लेडी' के नाम से जानते हैं. वाल्मीकिनगर के विशाहा गांव में उस समय अफरा-तफरी मच गई, जब एक आदमी के घर में करीब 10 फीट लंबा जहरीला किंग कोबरा निकल आया. तुरंत… pic.twitter.com/hna8qso1S8— Kishor Joshi (@KishorJoshi02) July 16, 2026 ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్మహిళా స్నేక్ క్యాచర్ 'జానకి దేవి'ఇంట్లో పాము ఉన్న సమాచారం అందుకున్న స్థానిక మహిళా సర్ప మిత్ర (స్నేక్ క్యాచర్), స్నేక్ లేడీ తక్షణమే అక్కడికి చేరుకున్నారు. ఆమె ఏమాత్రం భయపడకుండా, చాలా చాకచక్యంగా ఆ భారీ కోబ్రాను పట్టుకున్నారు. పాము పొడవు చాలా ఎక్కువగా ఉండటంతో, ఆమె దాని తల భాగాన్ని చేత్తో పట్టుకుని, మిగిలిన శరీరాన్ని తన మెడలో దుపట్టా లాగా వేసుకుని అడవి వైపు బయలుదేరారు. ఈ దృశ్యం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ పామును సురక్షితంగా వాల్మీకినగర్ అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో అటు మనుషులకు, ఇటు ఆ వన్యప్రాణికి ఎలాంటి హాని జరగకుండా కథ సుఖాంతమైంది.ఇదీ చదవండి: రూ. 150 కోట్ల ఆస్తి, తండ్రిని కాల్చి చంపిన పెద్ద కొడుకుఅటవీ శాఖ అధికారుల విజ్ఞప్తినేపాల్ నుండి వచ్చే వరద నీరు, అడవుల్లో నీరు చేరడం వల్ల పాములు, ఇతర వన్యప్రాణులు సురక్షిత ప్రాంతాల కోసం జనావాసాల్లోకి వస్తున్నాయని అటవీశాఖ తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా, వెంటనే అటవీ శాఖకు లేదా శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు : వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం -
అఫిడవిట్ ట్విస్ట్: ప్రశాంత్ కిషోర్ ఆస్తులు ఎంతంటే..?
ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నిక బరిలోకి దిగిన ఆయన.. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ప్రశాంత్ కిషోర్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన పేరిట చరాస్తులు రూ.22.19 కోట్లు, స్థిరాస్తులు రూ.73.87 కోట్లు ఉన్నాయి. మొత్తంగా ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.96 కోట్లకు చేరింది. అఫిడవిట్లో తన అప్పుల వివరాలను కూడా ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ప్రస్తుతం తనపై రూ.5.77 కోట్ల బ్యాంకు రుణం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన ఆస్తుల్లో ఘజియాబాద్‌లోని అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు, మరో రెండు ఫ్లాట్లలో 50 శాతం వాటా ఉన్నట్లు తెలిపారు. అలాగే పాట్నాలోని పటాలిపుత్ర కాలనీ, ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ప్లాట్లు, బక్సర్, స్వగ్రామంలో ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.భార్య పేరిట భారీగానే..ఇక ఆయన భార్య జాన్వి దాస్ పేరిట ఉన్న ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ భార్య జాన్వి దాస్ వైద్యురాలు. ఆమెకు రూ.89.51 కోట్ల చరాస్తులు, రూ.12.42 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. ఆమెకు గువాహటిలో రెండు ఫ్లాట్లు, ఓ బంగ్లాలో మూడో వంతు వాటా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే నోయిడాలోనూ ఆస్తులు ఉన్నట్లు వివరించారు.ఆ కంపెనీ నుంచి పార్టీకి విరాళాలుప్రశాంత్ కిషోర్ ‘వేదా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీకి యజమానిగా ఉన్నారు. ఈ సంస్థ 2024-25లో జన్ సురాజ్‌కు రూ.85 కోట్ల విరాళం ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అంతకుముందు 2023-24లో జన్ సురాజ్ ఫౌండేషన్‌కు రూ.50 లక్షలు, ‘జాయ్ ఆఫ్ గివింగ్’కు రూ.2.75 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వివరాలు ఉన్నాయి.8 కేసులు.. ఇంకా విచారణ దశలోనే!ప్రశాంత్ కిషోర్‌పై ఎనిమిది కేసులు నమోదై ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. వీటిలో పరువు నష్టం, అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, మోసం వంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏ కేసులోనూ ఇప్పటివరకు అభియోగాలు నమోదు కాలేదని పేర్కొన్నారు.పీకే ఏం చదివారంటే..ప్రశాంత్ కిషోర్ లక్నో విశ్వవిద్యాలయం నుంచి బీబీఏ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో హెల్త్‌కేర్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ కోర్సు చేశారు. ఫ్రెంచ్ భాషలోనూ సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేశారు.ఎన్నికల వ్యూహకర్త నుంచి..ప్రశాంత్ కిషోర్ గతంలో దేశంలోని పలు ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రూపొందించిన విషయం తెలిసిందే. అయితే 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ వ్యూహకర్తగా తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. అనంతరం బిహార్‌కు తిరిగి వెళ్లి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.2022 అక్టోబర్ 2న ‘జన్ సురాజ్ అభియాన్’ను ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజలను కలిశారు. ఆ తర్వాత జన్ సురాజ్‌ను రాజకీయ పార్టీగా మార్చారు. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆ ఎన్నికల్లో పీకే పోటీకి దూరంగా ఉన్నారు. అయితే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ ఉప ఎన్నిక ద్వారా పోటీ చేస్తున్నారు.పాట్నా జిల్లా పరిధిలో ఉన్న బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం నుంచి గెలిచిన బీజేపీ నేత నితిన్ నబీన్ రాజీనామా చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం(బీజేపీ జాతీయాధ్యక్షుడు+రాజ్యసభ సభ్యుడు)తో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీజేపీ తరఫున నీరజ్ కుమార్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అతి త్వరలో బై ఎలక్షన్ జరగనుంది.బిహార్ రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్న ప్రశాంత్ కిషోర్.. ఎన్నికల బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే తన అఫిడవిట్‌తో రాజకీయ వర్గాల్లో మరో చర్చకు తెరలేపారు. -
‘పాక్’తో లింకులు.. బిహార్ యువకుడి అరెస్ట్!
కతిహార్: బిహార్‌లోని కతిహార్ జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అహద్గా అధికారులు గుర్తించారు.కతిహార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) పరిచయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద ముఠాతో అహద్‌కు సంబంధాలు ఉన్నాయనే నిర్దిష్ట సమాచారం మేరకు భద్రతా సిబ్బంది సోమవారం అతడిని అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను సాంకేతికంగా విశ్లేషించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టి ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధమున్న రాణా హసీన్ అనే వ్యక్తితో నిందితుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు విచారణలో తేలింది.దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన చాటింగ్‌లు చేయడం, ఆడియో కాల్స్ మాట్లాడటం, దేశంలోని సున్నితమైన ప్రాంతాల సమాచారాన్ని చేరవేయడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో భారతదేశానికి వ్యతిరేకంగా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తూ, పాకిస్తాన్ వాట్సాప్ ఛానళ్ల లింకులను ఇతరులకు షేర్ చేస్తూ దేశంలో ఉగ్ర నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇతర కేంద్ర భద్రతా సంస్థల సహాయంతో విచారణ జరుపుతున్నారు. -
82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?
బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. తన వృద్ధాప్య పింఛను విత్‌డ్రా చేసుకునేందుకు వెళ్లిన 82 ఏళ వృద్ధుడికి విచిత్ర అనుభవం ఎదురైంది. తన ఖాతాలో అనూహ్యంగా వందల కోట్ల రూపాయలు డబ్బు ఉండటం చూసి షాకయ్యాడు. అంతేకాదు ఆయన దివ్యాంగ కుమారుడి ఖాతాలో కూడా ఇదే తరహాలో భారీ మొత్తంలో బ్యాలెన్స్ ఉండటంతో విస్తుపోవడం వారి వంతైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.ఆ కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం..పింఛను విత్డ్రాకామన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్లారు కామేశ్వర్ మిశ్రా అనే పెద్దాయన. పింఛను డబ్బులు తీసుకున్న తర్వాత, మిశ్రా తన ఖాతాలో ఉన్న మిగిలిన బ్యాలెన్స్ తనిఖీ చేసుకున్నారు. ఖాతాలో ఏకంగా రూ. 759,69,51,951 (దాదాపు రూ. 759 కోట్లు) బ్యాలెన్స్ చూపించడంతో ఆయన షాక్‌కు గురయ్యారు. తనతో తోపాటు వచ్చిన దివ్యాగ కుమారుడి ఖాతాలో కూడా ఇదే తరహాలో భారీ మొత్తంలో బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించింది. ఈ రెండు ఖాతాల్లోని మొత్తం బ్యాలెన్స్ కలిపితే రూ. 1,500 కోట్లకు పైగానే ఉంది.ఇదీ చదవండి: మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్, తలలు పగిలాయ్!ఈ ఊహించని డబ్బును చూసి, ఆ కుటుంబంతో పాటు సిఎస్సి ఆపరేటర్ కూడా తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఖాతాల్లోకి ఎలా వచ్చిందో తనకు అర్థం కావడం లేదని మిశ్రా పేర్కొన్నారు. ఈ విషయంపై బ్యాంక్ మరియు సంబంధిత అధికారులు విచారణ జరిపి, తప్పును సరిదిద్దాలని ఆయన కోరారు. ప్రభుత్వం, అధికారులు ఈ లోపాన్ని గుర్తించి సరిచేస్తారనే ఉద్దేశంతోనే తాను ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ వింత పరిణామం బ్యాంకింగ్ లేదా సాంకేతిక లోపం (టెక్నికల్ గ్లిచ్) వల్ల జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు, అయితే దీనిపై అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.గతంలో గయా జిల్లాలో కూడా గయా జిల్లాలోని దెల్హాలో కూడా ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, ఈ-రిక్షా డ్రైవర్ అయిన శివ్ కుమార్ పటేల్ ఖాతాలో ఇదే పద్ధతిలో రూ. 759 కోట్లు జమ అయ్యాయి. వైశాలి ,సమస్తిపూర్ జిల్లాలలో కూడా, కొంతమంది పెన్షనర్ల ఖాతాలలో రూ. 740 కోట్ల నిల్వలు కనిపించాయి. -
ఎన్నో ఏళ్లుగా జీతం.. 3,035 మంది టీచర్లు ప్రతి రూపాయి తిరిగివ్వాలి
బిహార్: నకిలీ ధ్రువపత్రాల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 3,035 మంది ఉపాధ్యాయులను బిహార్ విద్యాశాఖ విధుల నుంచి తొలగించింది. ఈ ఉపాధ్యాయులకు ఎన్నో ఏళ్లుగా జీతాల రూపంలో చెల్లించిన దాదాపు రూ.1,400 కోట్లను వడ్డీతో పాటు వెనక్కి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2006 నుంచి 2015 మధ్య స్థానిక సంస్థల ద్వారా జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై పాట్నా హైకోర్టు అప్రమత్తత దర్యాప్తు బ్యూరోను దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత ఈ కుంభకోణం బయటపడింది. ఆయా ఉపాధ్యాయులు నకిలీ కుల ధ్రువపత్రాలు, ఆధార్, వయస్సు, దివ్యాంగ ధ్రువపత్రాలు, విద్యార్హత ధ్రువపత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో పలువురు ఉపాధ్యాయులు నకిలీ సీటెట్, టెట్ ధ్రువపత్రాలు వినియోగించినట్లు గుర్తించారు. కొన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు జారీ చేసిన డిగ్రీలు కూడా నకిలీవేనని తేలింది.బిహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ మాట్లాడుతూ, ఈ తొలగింపులు పెద్ద ఎత్తున చేపట్టనున్న చర్యలకు ఆరంభం మాత్రమే అని చెప్పారు. "ఈ దర్యాప్తు చాలా కాలంగా కొనసాగుతోంది. 3,000 మందికిపైగా ఉపాధ్యాయులు నకిలీ డిగ్రీలతో ఉద్యోగాలు పొందినట్లు అధికారులు గుర్తించారు. కఠిన చర్యలు తీసుకోవాలని మా శాఖ అధికారులను ఆదేశించాం. ఇకపై ఇలాంటి మోసపూరిత చర్యలకు ఎవరూ పాల్పడే ధైర్యం చేయకుండా విద్యాశాఖ అత్యంత కఠిన చర్యలు అమలు చేస్తుంది" అని తెలిపారు. -
పీకే దాడికి ముందే బీజేపీ ప్లాన్ మార్చిందా?
బిహార్‌లోని బాంకిపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థిని మార్చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తొలుత అభిషేక్ కుమార్ బంటీని అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ.. ఆయనతో నామినేషన్ కూడా దాఖలు చేయించింది. అయితే.. గంటల వ్యవధిలోనే వెనక్కి తగ్గి, నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దింపింది. దీంతో అసలు ఈ హఠాత్పరిణామం వెనుక కారణమేంటన్న ప్రశ్న బిహార్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.బాంకిపూర్ బీజేపీకి సంప్రదాయ బలమైన నియోజకవర్గం. 1995 నుంచి ఈ స్థానం ఆ పార్టీ చేతిలోనే ఉంది. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభిషేక్ కుమార్ బంటీని అభ్యర్థిగా ఎంచుకుంది బీజేపీ. దీంతో గురువారం ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సహా ఎన్డీఏ అగ్రనేతల సమక్షంలో అభిషేక్ ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. గంటలు కూడా తిరగక ముందే సీన్ మారింది. Patna, Bihar: BJP candidate Abhishek Kumar “Bunty” filed his nomination for the Bankipur Assembly by-election. Several senior NDA leaders attended the nomination pic.twitter.com/YqQ6MUU7f7— IANS (@ians_india) July 9, 2026శుక్రవారం అనూహ్యంగా ఆయన దానిని ఉపసంహరించుకున్నారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో.. పెద్దగా చదువుకోని బంటీని బరిలోకి దింపడం సబబు కాదని బీజేపీ భావించిందనే ప్రచారం ఉదృతంగా జరిగింది. అయితే దానిని బంటీ కొట్టిపారేశారు. "వ్యక్తిగత కారణాల వల్ల పోటీ చేయడం సాధ్యం కాదని" రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరావోగికి లేఖ రాసి తప్పుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో కూడా అదే కారణాన్ని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు కారణం వేరేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. सुनिए क्यों बांकीपुर से BJP के उम्मीदवार अभिषेक बंटी नॉमिनेशन के बाद अपना उम्मीदवारी वापस लिए #BJP #Bankipur #election pic.twitter.com/MQ0UWMrwk5— Mukesh singh (@Mukesh_Journo) July 10, 2026అభిషేక్ బంటీ తండ్రి రవీంద్ర ప్రసాద్.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలిసి దాణా (ఫోడర్) కుంభకోణం కేసులో దోషిగా తేలిన వ్యక్తి. 2022లో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూతో పాటు మరో 75 మందికి శిక్ష విధించగా, అప్పట్లో మగధ్ కెమికల్ కార్పొరేషన్ మేనేజర్‌గా పనిచేసిన రవీంద్ర ప్రసాద్‌కు కూడా మూడేళ్ల జైలు శిక్ష పడింది.ఈ నేపత్యంలో.. జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఈ కేసుకు సంబంధించిన పత్రాలను సేకరించి, ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఎన్నికల ప్రచారంలో రక్షణాత్మక స్థితిలో పడకూడదన్న ఉద్దేశంతో బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చినట్లు తెలుస్తోంది. ఈ వివరాలు ఇటీవలే పార్టీ అగ్రనేతల దృష్టికి రావడంతో వెంటనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా సాధారణ పార్టీ కార్యకర్తగా గుర్తింపు పొందిన నీరజ్ కుమార్ సిన్హా బరిలో నిలిచారు. ఆయన నేరుగా ప్రశాంత్ కిశోర్‌తో తలపడనున్నారు.#WATCH | Bye-elections | Bihar BJP President Sanjay Sarogi felicitates party's candidate from Bihar's Bankipur Assembly seat, Neeraj Kumar Sinha Neeraj Kumar Sinha says, "I am overjoyed. I am deeply grateful to the top leadership, the state president, our leader Nitin Nabin ji,… pic.twitter.com/aKPWkznCQq— ANI (@ANI) July 10, 2026ప్రశాంత్ కిశోర్ బరిలో ఉండటం, చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి మారడం వంటి పరిణామాలతో ఈ ఉపఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత ఆసక్తికర రాజకీయ పోరుగా మారింది. -
మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్, తలలు పగిలాయ్!
ఎంతో ఉత్సాహంగా కళకళలాడిన పెళ్లి వేడుక కాస్తా ఉన్నట్టుండి హింసాత్మకంగా మారి పోయింది. మటన్ విందు ఇస్తామని చెప్పి, చికెన్ వడ్డించారనే ఆగ్రహంతో వివాదం మొదలైంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. బిహార్‌లోని సహర్సా జిల్లా సిమ్రి బక్తియార్పూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.అసలేం జరిగిందంటేఅధికారుల సమాచారం ప్రకారం బిహార్‌కు చెందిన మహ్మద్ అన్వర్ కుమారుడైన మహ్మద్ అబ్దుల్లా అలియాస్ చాంద్‌కు, మహ్మద్ జావేద్ అలియాస్ మోటో కుమార్తెకు గురువారం మధ్యాహ్నం నిఖా (పెళ్లి) జరిగింది. కార్యక్రమాలన్నీ ప్రశాంతంగా ముగిసాయి. అందరూ మంచి ఆకలితో భోజనాలకు కూర్చున్నారు. అంతే తీవ్ర కలకలం రేగింది. కారణం ఏమిటయ్యా అంటే మటన్ విందు అని చెప్పి చీప్‌గా చికెన్ వడ్డిస్తారా అంటూ మగపెళ్లివారు గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ మాటల యుద్ధం కాస్తా క్షణాల్లోనే పరస్పర దాడులకు దారితీసింది. ఈ ఘర్షణలో దాదాపు ఒక డజను మందికి పైగా గాయపడ్డారు.मटन की जगह बना दिया चिकन तो निकाह बन गया मैदान ए जंग,मियाँ Vs बीवी के तरफ़दारों की भिड़ंत में कई बाराती-घराती घायल,बिहार के सहरसा में बख्तियारपुर की घटना प्रदेश में आई चर्चा में,मोहम्मद इरफ़ान, आसिफ व अन्य पुलिस से लगा रहे इंसाफ की गुहार.#Bihar #Saharsa @SaharsaPolice pic.twitter.com/XrOFS8kkAb— Sudarshan News (@SudarshanNewsTV) July 10, 2026ఇదీ చదవండి : 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!కత్తులు, కర్రలతో దాడిఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అందులోని ఒక క్లిప్‌లో కొందరు వ్యక్తులు అతిథులపై కర్రలతో దాడి చేయడం, ఒక వ్యక్తి ఏకంగా కత్తి పట్టుకుని బెదిరించడం కనిపించింది. పెళ్లికూతురు కుటుంబ సభ్యులే తమ బరాత్లపై దాడి చేశారని పెళ్లికొడుకు తరఫు వారు ఆరోపించారు. ఈ గొడవలో గాయపడిన వారిని వెంటనే సిమ్రి బక్తియార్పూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.ఇదీ చదవండి: ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..! -
అందరిచూపు ‘బాంకీపూర్’ వైపే..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన బిహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ స్థానం నుంచి బీజేపీ తమ యువ నేత అభిషేక్ కుమార్‌ను అభ్యర్థిగా నిలిబెట్టింది. జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ తన రాజకీయ జీవితంలో తొలి ఎన్నికను ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షం ఉమ్మడి మద్దతు లభిస్తుందన్న ప్రచారానికి చెక్ పెడుతూ ఆర్జేడీ గత ఎన్నికల్లో పోటీ చేసిన రేఖా గుప్తాను మరోసారి అభ్యర్థిగా ప్రకటించడంతో ఇక్కడ త్రిముఖ పోరుకు తెరతీసింది. బాంకీపూర్ బీజేపీకి బలమైన పట్టున్న నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. 1995 నుంచి వరుసగా ఈ స్థానాన్ని బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఈ స్థానం నుంచి నితిన్ నబిన్ ఐదు సార్లు, ఆయన తండ్రి నాలుగుసార్లు గెలిచారు. జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యాక నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అభిషేక్‌ను ఈసారి బరిలో నిలిపింది. నబీన్ మాదిరే అభిషేక్ సైతం కాయష్థ కులానికి చెందిన నేత. రాజకీయ వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్‌కు ఇది తొలి ఎన్నిక. బీజేపీ బలమైన కోటలోనే పోటీకి దిగడం ద్వారా తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ ఉపఎన్నికను ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా ఆయన అభివర్ణిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ బరిలోకి దిగిన తర్వాత బీజేపీని ఎదుర్కోవాలంటే మహాఘఠ్బంధన్ ఉమ్మడి అభ్యర్థిగా ఆయనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ వర్గాలు సూచించాయి. అయితే తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అందుకు అంగీకరించకుండా స్వంత అభ్యర్థి రేఖా గుప్తాను ప్రకటించింది. దీంతో విపక్షాల అనైక్యతతో ప్రతిపక్ష ఓట్లు చీలిపోయే అవకాశాలు పెరిగాయి.కుల సమీకరణాలే కీలకం...బాంకీపూర్ నియోజకవర్గంలో 3.91 లక్షల ఓటర్లలో కాయస్థ ఓటర్లు ప్రభావవంతమైన వర్గంగా పరిగణిస్తారు. వారి తర్వాత వైశ్య ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. ఓటర్లలో 14శాతం మంది కాయస్థులేనని, వీరి సంఖ్య దాదాపు 65వేలు ఉంటుందని అంచనా. యాదవ్ ఓటర్లు 12 శాతంతో రెండో స్థానంలో ఉండగా, ముస్లింలు 10 శాతం, చంద్రవంశీయులు 9, వైశ్యులు 9, దళితులు 8, భూమిహార్ 7, బ్రాహ్మణులు 7, రాజపుత్రులు 5, కుర్మీలు 5, కుష్వాహాలు 3 శాతం ఉన్నారు. బీజేపీ సంప్రదాయ కాయస్థ మద్దతును నిలబెట్టుకోవాలని చూస్తుండగా, ఆర్జేడీ వైశ్య, ముస్లిం, యాదవ్ ఓట్ల కలయికపై దృష్టి పెట్టింది. ప్రశాంత్ కిశోర్ అన్ని వర్గాల ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికలో సామాజిక సమీకరణాలే ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఘట్బంధన్లో విభేధాలతో పీకేకు కష్టాలు..బాంకీపూర్ ఉప ఎన్నిక ద్వారా తన రాజకీయ ఆరంగ్రేటాన్ని బలంగా చాటాలనుకున్న ప్రశాంత్ కిషోర్‌కు ప్రతిపక్షం నుంచే అవరోధాలు ఏర్పడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ భోజ్‌పూర్ ఎన్కౌంటర్, నీట్ విద్యార్థి కేసు, టెండర్ల కుంభకోణం, నిరుద్యోగం, అవినీతి వంటి తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతున్నారు. ఈ సమస్యలపై ప్రజలు తమ తీర్పును వెలిబుచ్చడానికి ఉప ఎన్నిక ఒక అవకాశమని అంటున్నారు. అయితే ఆయనకు ఉమ్మడి మద్దతివ్వాలన్న ప్రతిపాదనను ఆర్జేడీ పెడచెవిన పెట్టి రేఖా గుప్తాను పోటీలో నిలిపింది. ఆమె వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఈ వర్గం ఓట్లు, సంప్రదాయ ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంక్ కలిస్తే గట్టి పోటీ ఇవ్వవచ్చని ఆర్జేడీ అంచనా వేస్తోంది. ఆమె పోటీతో ఓట్ల చీలిక జరిగి బీజేపీకి లాభించడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఎగువ మధ్యాదాయ రేసులో 5 రాష్ట్రాలు!
భారతదేశం స్థూలంగా తక్కువ మధ్య ఆదాయ (లోయర్ మిడిల్ ఇన్కమ్) ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నప్పటికీ దేశీయంగా కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆదాయంలో దూసుకుపోతున్నాయి. ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన దేశాల ఆర్థిక వర్గీకరణ గుర్తింపు, రాష్ట్రాల తలసరి ఆదాయ డేటాను విశ్లేషిస్తూ కొన్ని సంస్థలు అందించిన నివేదిక ప్రకారం.. భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఎగువ మధ్య ఆదాయ (అప్పర్ మిడిల్ ఇన్కమ్) పరిమితిని దాటేశాయి.మరోవైపు కొన్ని రాష్ట్రాలు ఈ మైలురాయికి అత్యంత సమీపంలో ఉండగా మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ పేదరికంలో వెనుకబడి ఉండటం దేశీయ ఆర్థిక అసమానతలను స్పష్టం చేస్తోంది.గ్లోబల్ బెంచ్‌మార్క్‌ను దాటిన రాష్ట్రాలుప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం, ఏ దేశం లేదా ప్రాంతం తలసరి ఆదాయమైనా 4,636 డాలర్ల నుంచి 14,375 డాలర్ల మధ్య ఉంటే దానిని ‘ఎగువ-మధ్య-ఆదాయ’ ఆర్థిక వ్యవస్థగా గుర్తిస్తారు. ఈ బెంచ్‌మార్క్‌ను అధిగమించి టాప్-5లో నిలిచిన భారతీయ రాష్ట్రాల వివరాలు..స్థానంరాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతంతలసరి ఆదాయం (డాలర్లలో)1ఢిల్లీ6,2172కర్ణాటక5,5793తెలంగాణ5,4074తమిళనాడు5,3295గుజరాత్4,734అడుగు దూరంలో మరిన్ని రాష్ట్రాలుమరికొద్దిపాటి వృద్ధిని నమోదు చేస్తే ‘ఎగువ-మధ్య-ఆదాయ’ హోదాను అందుకోవడానికి మరో మూడు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో..మహారాష్ట్ర: తలసరి ఆదాయం 4,628 డాలర్లు (బెంచ్‌మార్క్ కంటే కేవలం 8 డాలర్లు తక్కువ).హరియాణా: తలసరి ఆదాయం 4,627 డాలర్లు (బెంచ్‌మార్క్ కంటే కేవలం 9 డాలర్లు తక్కువ).కేరళ: తలసరి ఆదాయం 4,610 డాలర్లు (బెంచ్‌మార్క్ కంటే కేవలం 26 డాలర్లు తక్కువ).ఒకవైపు కొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ ప్రమాణాల వైపు దూసుకుపోతుంటే, మరోవైపు దేశంలో ప్రాంతీయ అసమానతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాల పరిస్థితి దయనీయంగా ఉంది. అందులో అట్టడుగున బిహార్ ఉంది. కేవలం 984 డాలర్లు తలసరి ఆదాయంతో బిహార్ భారతదేశంలోనే పేద రాష్ట్రంగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ (1,403 డాలర్లు), ఝార్ఖండ్ (1,470 డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇదీ చదవండి: కలెక్టర్ల జీతభత్యాల మాటేంటి? -
బంకీపూర్ ఉప ఎన్నిక బరిలో ప్రశాంత్ కిశోర్
పట్నా: ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ సీటుకు జరిగే ఉప ఎన్నికలో పోటీ చేస్తానని తెలిపారు. ఈ ఎన్నిక రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రిఫరెండం వంటిదని, అక్కడున్న 4 లక్షల ఓటర్లు మార్పు కోసం ఓటేయాలని పిలుపునిచ్చారు.ఆదివారం ఆయన పట్నాలో మీడియాతో మాట్లాడారు. 2006నుంచి బంకీపూర్ నుంచి ఎన్నికవుతున్న నితిన్ నబీన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికవడంతో ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేశారు. ఈ నెల 30వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. తనకు మద్దతివ్వాలని కాంగ్రెస్, ఆర్జేడీలతో పాటు బీజేపీని కోరుతానన్నారు. తాము పోటీ చేస్తామని ఆర్జేడీ ప్రకటించింది. బీహార్ రాజకీయాల్లో బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ, జన్ సూరజ్ పార్టీలకు ప్రతిష్టాత్మక పోరుగా మారింది. బీజేపీకి కంచుకోటగా భావించే ఈ స్థానానికి జూలై 30న పోలింగ్ జరగనుండగా, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నిక ఒకవైపు బీజేపీ సంస్థాగత బలానికి, నితిన్నబీన్ రాజకీయ వారసత్వానికి పరీక్ష కాగా.. మరో వైపు 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రశాంత్ కిషోర్.. ఈ ఉప ఎన్నిక తన పార్టీ బలోపేతానికి అవకాశంగా భావిస్తున్నారు. -
బిహార్ ఎమ్మెల్యేకి నాలుగేళ్ల జైలు
న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కాల్పులు జరిపి ఒకరి మృతికి కారణమైన బిహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్‌కి ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. చట్టపాలన నడిచే మన దేశంలో పుష్ప, సింగమ్‌ల వంటి వారితో పని లేదంటూ స్పెషల్ కోర్టు విశాల్ గొగ్నె వ్యాఖ్యానించారు. ‘అధికారముందనే అహంకారంతో మద్యం మత్తులో తన హోదాను ప్రదర్శించుకునేందుకు కాల్పులు జరిపినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఉదాసీనత చూపితే అక్రమ ఆయుధాల దందా మొదలై రాజకీయాల్లోకి బాహుబలులు ప్రవేశిస్తారు. చట్టపాలన నడిచే చోట పుష్ప, సింగమ్‌ల వంటి వారితో అవసరం లేదు. దోషి రాజు కుమార్ సింగ్ బరితెగింపు చర్య మిగతా వారిని ప్రేరేపించేలా ఉంది’అని ఆయన వ్యాఖ్యానించారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రాజు సింగ్.. వేడుక సమయంలో చుట్టూ జనం ఉన్నారన్న విషయాన్ని, వారిలో సొంత కుటుంబీకులున్న విషయాన్ని సైతం విస్మరించి, నిర్లక్ష్యంగా, నేరపూరితంగా వ్యవహరించారని జడ్జి విశాల్ పేర్కొన్నారు. నివాసంలో వివిధ రకాల మారణాయుధాలు, బుల్లెట్లు లభించడాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఆయనకు ప్రొబేషన్‌ను నిరాకరిస్తున్నట్లు తీర్పులో స్పష్టం చేశారు.జరిమానాతో ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేమంటూ జడ్జి విశాల్..వివిధ వ్యాపారాలతో భారీగా ఆదాయం పొందే రాజు సింగ్ బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. 2018 డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఫతేపూర్ బేరిలోని ఓ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ నూతన సంవత్సర వేడుకలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆహ్వనంపై అర్చనా గుప్తా, ఆమె భర్త, పిల్లలు హాజరయ్యారు. నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన గుర్తుగా ఎమ్మెల్యే సింగ్ తన చేతిలోని తుపాకీని పలుమార్లు కాల్చారు. అయితే, బుల్లెట్లు తగిలి అర్చనా గుప్తా(45) ప్రాణాలు కోల్పోయారు. -
వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు
బిహార్‌లో పాఠశాల త్రైమాసిక పరీక్షలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండగా, బక్సర్‌లోని ఓ విద్యా కేంద్రంలో ప్రశ్నపత్రాలు, ఖాళీ జవాబు పత్రాల కట్టలు వర్షపు నీటిలో తేలుతూ కనిపించాయి. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. పరీక్షా సామగ్రి నిర్వహణ తీరు ఉండాల్సింది ఇలాగేనా? అని విమర్శలు వస్తున్నాయి.ఈ ప్రశ్నపత్రాలు, ఖాళీ జవాబు పత్రాలను 9, 10, 12 తరగతుల త్రైమాసిక పరీక్షల కోసం బిహార్ బోర్డు పంపింది. అవి బక్సర్‌లోని బునియాది పాఠశాలకు చేరాయని ప్రధానోపాధ్యాయులకు సమాచారం ఇచ్చి, వచ్చి తీసుకెళ్లాలని సూచించారు.వైరల్ దృశ్యాలు.. ప్రజల్లో ఆగ్రహంఅయితే, భారీ వర్షంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోల్లో ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల కట్టలు నీటిలో పడి కనిపించాయి. ఇంత కీలకమైన పరీక్షా సామగ్రిని వర్షంలో నిర్లక్ష్యంగా వదిలేశారని పలువురు అధికారులపై విమర్శలు చేశారు. ఈ దృశ్యాలు వేగంగా వైరల్ అయ్యాయి. సున్నితమైన పరీక్షా సామగ్రి వర్షంలోకొట్టుకుపోయేలా ఎలా చేశారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. చాలామంది దృష్టిలో ఈ ఘటన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రతీకగా మారింది. మరోవైపు, పరీక్షా సామగ్రికి ఎలాంటి నష్టం జరగలేదని విద్యాశాఖ అధికారులు చెప్పారు. అకస్మాత్తుగా వర్షం పడటంతో కట్టలు నీటిలో కనిపించినా, ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు సురక్షితంగానే ఉన్నాయని, పరీక్షలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Bharat Desh (@desh) -
3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ: బిహార్‌లోని బాంకీపూర్, మధ్యప్రదేశ్‌లోని దటియ, గుజరాత్‌లోని మంజల్పూర్ అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. బిహార్‌లోని బంకీపూర్ సీటుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. అసెంబ్లీ ఉపఎన్నికలకు జులై 6 నుంచి జులై 13 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఆ తర్వాత జులై 14న నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. జులై 16 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది. జులై 30న పోలింగ్, ఆగస్టు 3న కౌంటింగ్ ఉంటుంది. -
నితీష్ కుమార్‌కు డిప్యూటీ పీఎం పదవి?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి విస్తరణ త్వరలో జరగనుందనే వార్తల మధ్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను దేశ ఉప ప్రధాన మంత్రి (డిప్యూటీ పీఎం)గా నియమించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ ప్రతిపాదనకు అధికార జనతాదళ్ (యునైటెడ్)తో పాటు ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కూడా మద్దతు ప్రకటించింది. జేడీయూ శాసనసభ్యుడు పంకజ్ మిశ్రా, ఆర్జేడీ సీనియర్ నేత ముఖేష్ రోషన్ ఇద్దరూ నితీష్ కుమార్‌కు కేంద్రంలో తగిన గౌరవం దక్కాలని, ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవానికి డిప్యూటీ పీఎం పదవి సరైనదని అంటున్నారు.దాదాపు రెండు దశాబ్దాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా సేవలు అందించడమే కాకుండా, గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన నితీష్ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే అన్ని అర్హతలు ఉన్నాయని జేడీయూ పేర్కొంది. ఆర్జేడీ నేత ముఖేష్ రోషన్ ఒకడుగు ముందుకు వేసి, ఆయనకు ఉప ప్రధాని పదవితో పాటు వ్యవసాయం లేదా రైల్వే వంటి కీలక శాఖల బాధ్యతలను కూడా అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. ఈ డిమాండ్లపై అటు బీజేపీ కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.రాజకీయ సమీకరణాల విషయానికొస్తే, నితీష్ కుమార్ 2026, ఏప్రిల్ 10న రాజ్యసభకు ఎన్నికైన తర్వాత, ఏప్రిల్ 14న బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఏప్రిల్ 15న బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి బీహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం జేడీయూ జాతీయ అధ్యక్షునిగా, రాజ్యసభ సభ్యునిగా ఉన్న నితీష్ కుమార్‌ను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవాలా లేదా అనే తుది నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనాయకత్వంపైనే ఆధారపడి ఉంది.ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్ర షురూ.. రిజిస్ట్రేషన్ వివరాలివే.. -
బింబిసారుడి వేల కోట్ల బంగారం.. ఆ రహస్య గుహ ఎక్కడుందో తెలుసా?
బిహార్‌లోని రాజ్గిరి కొండల్లో ఉన్న సోన్ భండార్ గుహల వెనక మిస్టరీ శతాబ్దాలుగా వీడడం లేదు. సైన్స్ సమాధానం చెప్పలేని వింత కోడ్ల కారణంగా.. ఆ గుహలను ఇంతవరకు ఎవరూ డీకోడ్ చేయలేకపోవడం గమనార్హం..! ఆ గుహల వెనక మగధ సామ్రాజ్యకాలంలో దాచిన బంగారు నిధులు ఉన్నాయని అంతా విశ్వసిస్తారు. ఆ గుహలోకి వెళ్లేందుకు ఒక భారీ రాతి ద్వారం ఉంది. దానిపై ఉన్న వింత లిపిని చదవగలిగితేనే.. గుహలోకి ఎలా వెళ్లాలి? అనేది తెలుస్తుందని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు.బిహార్‌లోని వైభవ్ కొండల అడుగుభాగంలో ఉన్న రెండు భారీ రాతి గుహలనే 'సోన్ భండార్' అంటారు. సోన్ భండార్ అంటేనే 'బంగారపు నిధి' అని అర్థం. పురాణాల ప్రకారం మహాభారత కాలంలో జరాసంధుడి నిధిని ఇక్కడే దాచారు. అయితే చరిత్రకారుల ప్రకారం.. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన బింబిసార మహారాజు, శత్రువుల దాడి నుంచి తన అపారమైన బంగారాన్ని, రత్నాలను రక్షించుకోవడానికి ఇక్కడే నిధులను దాచాడని చెబుతారు. బింబిసారుడి భార్య 'మగధ సామ్రాజ్య ఖజానా' మొత్తాన్ని ఈ గుహలో దాచి, ఎవరూ దొంగిలించకుండా ఒక భారీ రాతి తలుపును ఏర్పాటు చేసి, లాక్ చేయించిందని స్థానికుల నమ్మకం. ఆ రాతి గది వెనుక వేల కోట్ల విలువైన నిధి ఇప్పటికీ భద్రంగా ఉందనేది ఒక పెద్ద మిస్టరీ.ఈ గుహలోకి ప్రవేశించగానే ఒక మూసి ఉన్న రాతి ద్వారం కనిపిస్తుంది. దాని పక్కనే గోడపై ఒక వింతైన లిపి దర్శనమిస్తుంది. దీన్ని 'శంఖ లిపి' అని పిలుస్తారు. ఈ రహస్య కోడ్‌ను ఎవరైతే సరిగ్గా చదువుతారో.. ఆ మంత్ర శబ్దానికి ఆ రాతి ద్వారం దానంతట అదే తెరుచుకుంటుందని ఒక బలమైన నమ్మకం ఉంది. భారతదేశాన్ని దోచుకున్న బ్రిటిషు వారి కన్ను కూడా ఈ నిధిపై పడింది. ఎలాగైనా ఆ తలుపులు బద్దలు కొట్టాలని, ఒక బ్రిటిష్ అధికారి ఏకంగా పెద్ద పెద్ద ఫిరంగులను తెప్పించి ఆ రాతి ద్వారంపై బాంబుల వర్షం కురిపించాడు. కానీ ఆశ్చర్యకరంగా.. ఫిరంగి దెబ్బలకు కూడా ఆ తలుపులు అంగుళం కూడా కదల్లేదు. ఆ దాడికి గుర్తుగా గుహ ద్వారంపై పడిన ఫిరంగి దెబ్బల గుర్తులు నేటికీ స్పష్టంగా కనిపిస్తాయి.సైన్స్, హిస్టరీ.. ఈ రెండు కూడా ఈ గుహలను వేర్వేరు కోణాల్లో చూస్తాయి. స్థానికులు దీన్ని బింబిసారుడి నిధిగా నమ్ముతుంటే, ఆర్కియాలజిస్టులు మాత్రం దీని వెనుక మరో మతపరమైన కోణాన్ని చెబుతున్నారు. ఇక్కడి ఉన్న శాసనాలను బట్టి ఇవి క్రీస్తుశకం 3 లేదా 4వ శతాబ్దానికి చెందిన జైన్ గుహలు అని వివరిస్తున్నారు. 'ముని వైరాదేవ' అనే జైన సాధువు ఈ గుహలను నిర్మించి, లోపల జైన్ తీర్థంకరుల విగ్రహాలను ప్రతిష్టించారని.. గోడలపై ఉన్నది గుప్త సామ్రాజ్యం కాలం నాటి శంఖ లిపి అని పేర్కొంటున్నారు. దానిని పూర్తిగా డీకోడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అది కేవలం ఒక మతపరమైన శ్లోకం మాత్రమే అయి ఉండవచ్చు, నిధి కోడ్ కాకపోవచ్చని చెబుతున్నారు.ఆర్కియాలజిస్టులు ఇవి జైన గుహలని చెబుతున్నప్పటికీ... గుహ వెనుక ఉన్న ఆ రహస్య గదిలోకి మాత్రం ఇప్పటివరకు ఎవరూ ప్రవేశించలేకపోయారు. హైటెక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా.. ఒక సాధారణ రాతి తలుపు వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించలేకపోవడం ఒక పెద్ద సవాల్‌గానే మిగిలిపోయింది. ఆ రాతి తలుపు వెనుక మగధ సామ్రాజ్య వేల కోట్ల నిధి ఉందా? లేక హిస్టరీ దాచిన మరేదైనా ఆధ్యాత్మిక రహస్యం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. ఆ గోడలపై ఉన్న శంఖ లిపి మిస్టరీ వీడే వరకు వేచి చూడాల్సిందే! ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. ఇలాంటి అప్డేట్స్ను మిస్సవ్వకుండా ఉండేందుకు మా చానల్ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.. -
యువతకు స్ఫూర్తిప్రదాత
డాక్టర్ బి.సి.రాయ్‌గా సుపరిచితులైన బిధాన్ చంద్రరాయ్ 1882 జూలై 1న నేటి బిహార్‌లోని బాంకీపూర్‌లో జన్మించారు. వైద్యవిద్య అభ్యసించారు. 1925లో రాజకీయాలలో ప్రవేశించారు. బెంగాల్‌లోని బారక్పూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి ‘గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ బెంగాల్’గా పేరొందిన సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించారు. 1928లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.ఎం.ఎ.) ఏర్పాటులోనూ, 1939లో దేశంలో వైద్య విద్య నియంత్రణకు, అభివృద్ధికి పాటుపడే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ.) ఏర్పాటు చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు.మహత్మాగాంధీకి అనుంగు మిత్రునిగా, వ్యక్తిగత వైద్యునిగా వ్యవహరించారు. 1942లో పుణేలో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమంలో నిరాహార దీక్షకు దిగారు. ఆరోగ్యం క్షీణించడంతో రాయ్ మందులు ఇచ్చారు. ఆ మందులు ఇండియాలో తయారైనవి కావని గాంధీజీ వాటిని నిరాకరించారు. అంతేకాక... ‘నేను, నువ్వు ఇచ్చిన మందులు ఎందుకు తీసుకోవాలి? ఈ దేశంలోని 40 కోట్ల ప్రజలకు నువ్వు ఉచితంగా వైద్యం చేస్తావా?’ అని ప్రశ్నించారు. అందుకు డాక్టర్ రాయ్ ‘లేదు, అందరికీ ఉచితంగా వైద్యం చేయలేను. కానీ నేను వచ్చింది... మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీకి వైద్యం చేయడానికి కాదు, ఈ దేశంలోని 40 కోట్ల మంది ప్రజలకు సారథ్యం వహిస్తున్న వ్యక్తి’కి అన్నారు. గాంధీజీ మాట్లాడకుండా మందులు తీసుకున్నారు.స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల ఒత్తిడి మేర 1948 జనవరి 23న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రాయ్. ఆ రోజుల్లో దేశవిభజన కారణంగా బెంగాల్ అతలాకుతలమవుతోంది. రాయ్ ప్రణాళికబద్ధంగా పశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టించారు. తన 80వ ఏట 1962 జూలై 1న తన పుట్టినరోజే తుదిశ్వాస విడిచేవరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోగులను చూడటం మాత్రం మానుకోలేదు. భారత ప్రభుత్వం బి.సి. రాయ్ సేవలను గుర్తించి, 1961లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’తో గౌరవించింది. రాయ్ అవివా హితులు. తన ఇంటిని తల్లి అఘొర్ కామినీదేవి పేరుతో హాస్పిటల్‌కు విరాళంగా ఇచ్చారు. తన ఆస్తులతో ప్రజాప్రయోజనార్థం ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆయన నేటి వైద్యులకు, రాజకీయ నాయకులకే కాదు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత. – డా. టి. సేవకుమార్, ఐ.ఎం.ఎ. నేషనల్ కౌన్సిల్ సభ్యులు (రేపు డా. బి.సి. రాయ్ జయంతి, వర్ధంతి – జాతీయ వైద్యుల దినోత్సవం) -
24 ఏళ్లకే పీహెచ్డీ.. రికార్డులను బద్దలు కొట్టిన లెజెండ్ : ఎవరీ సత్యం
సాంకేతిక రంగంలో భారతీయులు సాధిస్తున్న విజయాలు ఎంతోమందికి స్ఫూర్తి అనడంలో సందేహం లేదు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి పేదింటి రైతు బిడ్డ శ్రమ, కృషి,అద్భుతమైన ప్రయాణమే ఇందుకు నిదర్శనం. బిహార్‌లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో 'సత్యం కుమార్' భారతదేశంలోనే అత్యంత పిన్న వయసులోప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈ (IIT JEE) పరీక్షను పాసైన విద్యార్థిగాసత్యం కుమార్ చరిత్ర సృష్టించాడు .అంకిత భావం, ఓర్పు పట్టుదలగా ప్రయత్నించాలే గానీ అద్భుత విజయాలు, మరెన్నో రికార్డులు అతణ్ణి వరించాయి. 13 ఏళ్లకే ఐఐటీ ర్యాంక్ సాధించి, 13 ఏళ్లకే ఐఐటీ జేఈఈ క్రాక్, 24 ఏళ్లకే పీహెచ్డీ! సత్యం కుమార్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందామా!1999, జూలై 20న బీహార్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించిన సత్యం, చిన్న వయస్సు నుండే అసాధారణమైన విద్యా ప్రతిభను కనబరిచాడు. అతనిలోని తెలివితేటలను గుర్తించిన ఒక కుటుంబ స్నేహితుడు.. ఐఐటీ జేఈఈ కోచింగ్ కోసం అతడిని రాజస్థాన్‌లోని కోటాకు పంపించాల్సిందిగా తండ్రికి సలహా ఇచ్చాడు. అయితే ఒక చిన్న గ్రామం నుండి ఐఐటి వరకు, ఆపై అమెరికా వరకు సత్యం కుమార్ ప్రయాణం చాలా సాఫీగా సాగినట్లు అనిపించినా, అది అంత సులభమైనది కాదు. అతని జీవితంలో ఎన్నో ఒడి దుడుకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా అతని తండ్రి రైతు కావడంతో, సత్యంను చదువుల కోసం అమెరికాకు పంపించడం వారి కుటుంబానికి ఒక సవాలుగా మారింది. ఒకానొక సమయంలో అతని తండ్రి తన పొలాన్ని, ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. సత్యం ప్రతిభ, తెలివితేటల కారణంగా, అతనికి టెక్సాస్ విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్ లభించింది. అలా సత్యం కుమార్ కేవలం 12 ఏళ్ల వయసులోనే మొదటిసారి ఐఐటీ జేఈఈ పరీక్షను క్లియర్ చేసి, దేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఐఐటీయన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే, ఆ ఫలితంతో సంతృప్తి చెందని అతను, మరుసటి ఏడాది (2013లో) మళ్లీ పరీక్ష రాసి.. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఆల్ ఇండియా 670వ ర్యాంక్ (AIR 670) సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.తన విజయం గురించి ఐఐటీ కాన్పూర్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సత్యం మాట్లాడుతూ.. "నేను జేఈఈ క్రాక్ చేసినప్పుడు నా కల నిజమైంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకదానిలో చదువుకునే అవకాశం నాకు దక్కింది" అని పేర్కొన్నాడు.ఐఐటీ కాన్పూర్ర్యాంక్ సాధించిన తర్వాత సత్యం కుమార్ ఐఐటీ కాన్పూర్‌లో చేరి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డ్యూయల్ డిగ్రీ (BTech, MTech) పూర్తి చేశాడు. ఐఐటీలో ఉన్న సమయంలోనే అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) అడ్వాన్స్డ్ కంప్యూటింగ్‌పై పట్టు సాధించాడు. ఇది అతని భవిష్యత్తు సాంకేతిక రంగానికి బలమైన పునాదిగా మారింది.ఐఐటీ కాన్పూర్ వాతావరణం నన్ను పరిశోధనలు, ఆవిష్కరణల వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించింది అంటారు సత్యం. కష్టమైన సమస్యలను కూడా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని తనకు ఇచ్చిందని గర్వంగా ప్రకటించారు.24 ఏళ్లకే పీహెచ్డీఆ తర్వాత సత్యం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. కేవలం 24 ఏళ్ల వయసులోనే పీహెచ్డీ (PhD) పూర్తి చేశాడు. తన డాక్టరేట్ చదువు సమయంలోనే, అతను ప్రముఖ యాపిల్ (Apple) సంస్థలో మెషిన్ లెర్నింగ్ విభాగంలో ఇంటర్న్‌షిప్ చేసి, ఏఐ (AI) రీసెర్చ్‌లో మంచి అనుభవం సంపాదించాడు. ప్రస్తుతం అతను ప్రసిద్ధ 'టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్' (Texas Instruments) సంస్థలో 'మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ ఇంజనీర్'గా పని చేస్తున్నాడు. అక్కడ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల అభివృద్ధిపై దృష్టి పెట్టాడు.నెటిజన్ల ప్రశంసలుసత్యం కుమార్ స్ఫూర్తిదాయక కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతని అసాధారణ ప్రతిభను కొనియాడుతున్నారు. పల్లెటూరి బిహారీ పిల్లగాడు13 ఏళ్లకే ఐఐటీ సాధించి, ఇప్పుడు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎమ్ఎల్ ఇంజనీర్‌గా రాణించడం అద్భుతం, ఎంతో స్ఫూర్తిదాయకమైన సంగతి అంటూ ఒకరు ప్రశంసించారు. మరొకరు.. "ఖచ్చితంగా, ఇది తరానికి ఒక్కరు మాత్రమే పుట్టే అద్భుతమైన ప్రతిభ" అని ప్రశంసించారు. అన్ని రికార్డులను, నిబంధనలను బద్దలు కొట్టిన ఒక లెజెండ్ అంటూ మరొకరు కొనియాడటం గమనార్హం. -
తండ్రి చివరి కోరిక : వీడియో కాల్‌లోనే పెళ్లి, అంతలోనే..!
ఒకవైపు కన్నకూతురి పెళ్లి కళ్లారా చూడాలన్న కన్నతండ్రి కోరిక, మరవైపు అనూహ్యంగా తీవ్ర అనారోగ్యం బారిన తండ్రి. చివరికి ఆసుపత్రి బెడ్‌పై నుంచే వీడియో కాల్లో కూతురి పెళ్లి చూసి సంతోషంగా ఆనంద బాష్పాలు రాల్చాడు. కానీ అంతలోనే తీవ్ర విషాదం అలుముకుంది.బిహార్‌లోని సీతామఢీ జిల్లా సోన్బర్సాకు చెందిన లాల్‌బాబు మహతో ఒక ట్రావెల్ కంపెనీలో బస్సు కండక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. తన చిన్న కూతురు నిధి కుమారి వివాహాన్ని ఘనంగా జరిపించాలని ఎన్నో కలలు కన్నారు. ఈ శుభఘడియ కోసం ఏళ్లుగా ఎదురు చూశారు. అయితే పెళ్లికి సరిగ్గా మూడు రోజుల ముందు ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీనితో ఆయన్ను లక్నోలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. లాల్‌బాబు మహతో చివరి కోరిక తీర్చేందుకు కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన భార్య మీనూ దేవి, కుమారుడు రాజేష్ కలిసి ఆసుపత్రి నుండే వీడియో కాల్ ద్వారా నిధి పెళ్లి చూసే ఏర్పాటు చేశారు.అలా కూతురి వివాహ వేడుకను ఆసుపత్రి బెడ్‌పై నుండి వీడియో కాల్ ద్వారా వీక్షించారు. ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని హల్దీ వేడుక, పూలదండలు మార్చుకోవడం, ప్రధాన వివాహ ఘట్టం వరకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూసి తన కోరిక నెరవేర్చుకున్నారు. కొత్త పెళ్లికూతురిగా కుమార్తె అలా అత్తగారింటికి వీడ్కోలు తీసుకున్న మరుక్షణమే ఒక తండ్రి గుండె ఆగిపోయింది. ఆసుపత్రి నుండే వీడియో కాల్ ద్వారా ఆమె కూతురి వీడ్కోలు వేడుక ముగిసి, ఇల్లు వదిలి వెళ్తుండగా ఆ తండ్రి కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. అలాగా చివరి శ్వాస విడిచారు. ఈ ఊహించని పరిణామం కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది కంట కన్నీరు తెప్పించింది. (ఆపరేషన్ సింధూర్‌లో అసువులు బాసిన సైనికులు వీరే!)ఒకేరోజు చెల్లి పెళ్లి.. తండ్రి మరణంలాల్బాబు కుమారుడు రాజేష్ కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఒకవైపు చెల్లి వీడ్కోలును, మరోవైపు తండ్రి మరణాన్ని చూడాల్సి వచ్చింది. నిధి సీతామఢీ జిల్లాలోని మోహన్పూర్కు చెందిన తన భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అత్తగారింటికి బయలుదేరి వెళ్లడం, మరోవైపు తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఆ అన్న ఆవేదనకు అంతులేకుండా పోయింది. లాల్‌బాబు మహతోకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇదీ చదవండి: కాటేసిన పామును బిస్కెట్ డబ్బాలో బంధించి.. వీడియో వైరల్ -
ఎన్కౌంటర్ ప్రకంపనలు.. దేశవ్యాప్త ఉద్యమ హెచ్చరిక
-
వైభవ్ సూర్యవంశీ తమ్ముడి మరో భారీ సెంచరీ.. పదేళ్లకే!
భారత సంచలన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం టీమిండియాతో కలిసి ఐర్లాండ్‌లో ఉన్నాడు. అతడి అంతర్జాతీయ టీ20 అరంగేట్రం దాదాపుగా ఖరారై పోయింది. ఇలాంటి తరుణంలో వైభవ్ సూర్యవంశీ.. తన తమ్ముడి గురించి షేర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది.టీమిండియాతో ఐర్లాండ్కుబిహార్లోని సమస్తిపూర్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పద్నాలుగేళ్లకే రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టాడు. రాయల్స్ ఓపెనర్‌గా 2025లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 2026లో సంచలన ప్రదర్శనతో మెరిశాడు.ఆరెంజ్ క్యాప్పదహారు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 776 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ అత్యధిక పరుగుల వీరుడిగా.. ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో భారత్- ‘ఎ’ జట్టుతో పాటు.. టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు పదిహేనేళ్ల వైభవ్. ఇక శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్ లీగ్ దశలో అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.అయితే, ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించిన వైభవ్.. జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం టీమిండియాతో కలిసి ఐర్లాండ్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలో తన తమ్ముడి విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ ఇన్‌స్టా స్టోరీ షేర్ చేశాడు.తమ్ముడూ తగ్గేదేలేసమస్తిపూర్ స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో రిషవ్ ఎలెవన్‌కు ప్రాతినిథ్యం వహించిన వైభవ్ తమ్ముడు, పదేళ్ల ఆశీర్వాద్ సూర్యవంశీ.. భారీ శతకం సాధించాడు. వైశాలి ఎలెవన్‌పై 119 బంతుల్లో 19 బౌండరీలు, ఆరు సిక్సర్లు బాది 168 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా దిగిన ఆశీర్వాద్ శతక ఇన్నింగ్స్ కారణంగా రిషవ్ ఎలెవన్ ఘన విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన స్కోరు కార్డును షేర్ చేస్తూ తమ్ముడి ప్రదర్శన పట్ల వైభవ్ మురిసిపోయాడు.కాగా ఆశీర్వాద్ ఇటీవలే తేజ్‌పూర్ క్రికెట్ అకాడమీ తరఫున మ్యాచ్ ఆడి.. 87 బంతుల్లోనే 103 పరుగులు సాధించాడు. ఇప్పుడిలా మరో సెంచరీ సాధించాడు. కాగా వైభవ్‌కు అన్న ఉజ్వల్, తమ్ముడు ఆశీర్వాద్ ఉన్నారు. చదవండి: డ్రెసింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ! -
NEET రీ-ఎగ్జామ్.. వెలుగులోకి భారీ కుంభకోణం!
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించిన నీట్-యూజీ రీ-ఎగ్జామ్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అభ్యర్థులకు బదులుగా వేరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడిన వ్యవహారాలు సంచలనంగా మారాయి. ఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టగా, ఒక్క బీహార్లోనే ఇప్పటివరకు 30 మందిని అరెస్ట్ చేశారు. ఈ మోసం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, నెట్‌వర్క్‌ను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి.బిహార్‌లో నీట్ రీటెస్ట్-2026 సందర్భంగా భారీ అక్రమాలు వెలుగు చూశాయి. పరీక్ష రాస్తున్న వారి స్థానంలో ఇతరులు హాజరయ్యిన ఘటనలు బయటపడటంతో అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మొత్తం 30 మంది అరెస్టు కాగా, అందులో 9 మంది నకిలీ అభ్యర్థులుగా పరీక్ష రాస్తూ పట్టుబడటం కలకలం రేపింది. లఖిసరాయ్ జిల్లాలో పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన తనిఖీల్లో ఈ మోసం బయటపడింది. కేఆర్కే హైస్కూల్ పరీక్ష కేంద్రం నుంచి ఒకరు, కేంద్రీయ విద్యాలయం నుంచి ఏడుగురు, హసన్పూర్ స్కూల్ నుంచి మరో వ్యక్తి.. నకిలీగా పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. వీరంతా వేరే అభ్యర్థుల స్థానంలో పరీక్షకు హాజరైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో పాటు మరో 21 మందిని కూడా అనుమానితులుగా అరెస్టు చేశారు. వీరి పాత్ర ఈ మోసపూరిత నెట్‌వర్క్‌లో ఉందా? అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. మొత్తం అరెస్టుల సంఖ్య 30కి చేరగా.. ఆ సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.అరెస్టయిన వారిని ఎస్డీఎం ప్రభాకర్ కుమార్, ఎస్డీపీవో శివమ్ కుమార్ పర్యవేక్షణలో ప్రశ్నిస్తున్నారు. విచారణలో వెలుగులోకి వస్తున్న సమాచారం ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు సంబంధిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ మోసానికి వెనుక పెద్ద నెట్వర్క్ ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్, ఎస్పీ ప్రేరణ కుమార్ ఈ కేసు విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. మరింత మంది ఈ రాకెట్లో భాగమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే NEET పరీక్షలో ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి నెట్‌వర్క్‌ను బయటకు తీసేందుకు విచారణ కొనసాగుతుండగా, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ స్పందించాల్సి ఉంది. -
అశ్లీల, కుల వివక్ష పాటలు పెడితే ఇక జైలుకే!
పట్నా: బిహార్ ప్రభుత్వం సామాజిక శాంతిభద్రతల పరిరక్షణ కోసం అత్యంత సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. బహిరంగ సభలు, సామాజిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాల్లో అశ్లీలత, కుల ఆధారిత అంశాలతో కూడిన పాటలను ప్లే చేయడంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సమాజంలో శాంతి భద్రతలకు, మత సామరస్యానికి లేదా సామాజిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఇలాంటి పాటలను ప్రసారం చేసినా, పాడినా లేదా ప్రోత్సహించినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.సామాజిక సామరస్యానికి విఘాతంరాష్ట్రవ్యాప్తంగా వివిధ బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లు, వాహనాలు, వివాహ వేడుకలు, ఇతర సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలలో విభజన భావాలను ప్రేరేపించే అశ్లీల, కుల ఆధారిత కంటెంట్ బహిరంగంగా ప్లే అవుతోందని ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల సమాజంలో పరస్పర సోదరభావం, సామరస్యం పెరగడానికి బదులుగా, అశ్లీలత, హింసాత్మక సంఘటనలు, పరస్పర ద్వేషం, శత్రుత్వం, అశాంతి పెరుగుతున్నాయని హోం శాఖకు పంపిన లేఖలో అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో ఉద్రిక్తతలను రేకెత్తించే ఎలాంటి అసభ్యకరమైన భాష లేదా కుల సంబంధిత వ్యాఖ్యలను సహించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.నిఘా నీడలో వేడుకలుఈ తాజా హెచ్చరికలు కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం కాకుండా.. సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు, కమ్యూనిటీ ఈవెంట్లు, పండుగ వేడుకలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అన్ని బహిరంగ సందర్భాలకు వర్తిస్తాయి. కులపరమైన లేదా ద్వంద్వార్థాలు ఉన్న కొన్ని పాటలు సామాజిక విభజనలను సృష్టించి, తగాదాలకు దారితీసి, శాంతిభద్రతలపై ప్రభావం చూపుతాయని ప్రభుత్వం నమ్ముతోంది. ఇందుకోసం జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్ఎస్పీలు, ఎస్పీలు అలర్ట్‌గా ఉండాలని, ఆయా కార్యక్రమాల నిర్వాహకులు చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించకుండా చూసుకోవాలని, అభ్యంతరకరమైన కంటెంట్‌పై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.అసెంబ్లీ వేదికగా మొదలైన పోరుఈ సమస్య ఈనాటిది కాదు. గత 2023లోనే బిహార్ అసెంబ్లీలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతిమా కుమారి ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోనే దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవలి కాలంలో బిహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ స్పష్టమైన బూతు పదాలు, కుల గుర్తింపులను ప్రస్తావించే పాటలు తరచూ వివాదాలకు దారితీస్తున్నాయి. సామాజిక విబేధాలను ప్రోత్సహిస్తూ, సమాజంలోని కొన్ని వర్గాలను కించపరిచే విధంగా ఉన్న ఈ ధోరణిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయానికి వచ్చింది.ఇది కూడా చదవండి: ఉదయం పొడవు.. రాత్రికి పొట్టి.. -
ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి
బిహార్‌లోని నలంద జిల్లా, ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక విచిత్రమైన పెళ్లి నెట్టింట సందడి చేస్తోంది. అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్న 36 ఏళ్ల వివాహిత మహిళ., తనకంటే 12 ఏళ్ల చిన్నోడు, అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమాయణం. గత కొంతకాలంగా గోప్యంగా సాగుతున్న ఈ వ్యవహారంలో అనుకోని ట్విస్ట్. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అసలేమైంది?కట్వా రసూల్పూర్ గ్రామంలో ఒక విచిత్రమైన ఘటన వివరాలు...శుక్రవారం రాత్రి ఒక భర్త తన భార్యను ఆమె ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో గ్రామంలో కలకలం రేగింది,సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. దీంతో ఈ విషయం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే, ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళను, ఆమె ప్రియుడిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు మహిళ భర్తను, ఆమె ప్రియుడి తండ్రిని కూడా విచారణకు పిలిచారు. విచారణ సమయంలో, ఆ వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలనే తన కోరికను వెల్లడించింది. దీని తరువాత, ఇరు పక్షాల మధ్య చర్చోప చర్చలు జరిగాయి. View this post on Instagram A post shared by tvn99urdu News 24/7 (@tvn99urdu)ఇదీ చదవండి: అఫ్గాన్‌లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా!చివరికి మరుసటి రోజు, శనివారం, ఆ మహిళ భర్త వీరి పెళ్లిక అంగీకరించి, స్థానిక గుడిలో ఆమెకు ప్రియుడితో వివాహం జరిపించాడు. ఈ పెళ్లికి ఆ వారి ముగ్గురు పిల్లలు కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..పిల్లలు తమ తల్లితో వెళ్ళడానికి నిరాకరించి, తమ తండ్రితోనే ఉండాలని కోరుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం, పెళ్లి తర్వాత ఆ మహిళ తన ముగ్గురు పిల్లలను అక్కడే వదిలేసి, తన కొత్త భర్తతో కలిసి పంజాబ్‌లోని లూథియానాకు వెళ్లిపోయింది. ఇది కులాంతర వివాహంగా నివేదించబడుతున్నందున, ఈ సంఘటన ఆ ప్రాంతంలో విస్తృత చర్చకు దారి తీసింది.ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..! -
నీట్ పోర్టల్‌లో మరో కలకలం
న్యూఢిల్లీ: నీట్ (NEET-UG) పరీక్ష నిర్వహణలో ఇప్పటికే ప్రశ్నపత్రం లీకేజీ వివాదంతో విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో మరోసారి కలకలం రేగింది. నీట్ అధికారిక పోర్టల్‌లోకి అక్రమంగా చొరబడిన 19 ఏళ్ల యువకుడు నవీన్ యాదవ్ 150 మంది అభ్యర్థులకు చెల్లించాల్సిన రీఫండ్ మొత్తాలను తన బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నాడు. అహ్మదాబాద్ పోలీసులు నిందితుణ్ని బిహార్‌లో అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన విషయం తెలిసిందే. దీంతో జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రీ-ఎగ్జామ్ కోసం అభ్యర్థుల నుంచి అదనపు ఫీజు వసూలు చేయకుండా, ఇప్పటికే చెల్లించిన ఫీజులో భాగంగా రీఫండ్ అందించేందుకు ఎన్టీఏ ప్రత్యేక రీఫండ్ మాడ్యూల్‌ను ప్రారంభించింది.ఈ ప్రక్రియలో అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్ వంటి సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇదే ప్రక్రియను లక్ష్యంగా చేసుకున్న నవీన్ యాదవ్, పోర్టల్‌లోని భద్రతా లోపాలు,బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించి విద్యార్థుల ఖాతాల్లోకి చొరబడ్డాడని పోలీసులు వెల్లడించారు.పోలీసుల దర్యాప్తులో బిహార్ గయా జిల్లాకు చెందిన నవీన్ యాదవ్ సుమారు 350 మంది అభ్యర్థుల ఖాతాలను లక్ష్యంగా చేసుకుని, వారిలో 150 మందికిపైగా ఖాతాల్లోకి విజయవంతంగా ప్రవేశించాడు. ఇందుకోసం బ్రూట్ ఫోర్స్ అటాక్ పద్ధతిని ఉపయోగించాడు. అంటే పాస్వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను ఊహిస్తూ అన్ని సాధ్యమైన కాంబినేషన్లను వరుసగా ప్రయత్నించడం. అలా పాస్‌వర్డ్‌లను గుర్తించిన అనంతరం నిందితుడు విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాల స్థానంలో తన ఖాతా వివరాలను నమోదు చేశాడు. దీంతో ఒక్కో అభ్యర్థికి చెల్లించాల్సిన రూ.1,700 రీఫండ్ మొత్తం అతని ఖాతాలో జమైంది.ఎన్టీఏ పోర్టల్‌లో నగదు లావాదేవీల్లో అవకతవకలు జరగడంతో అధికారులు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు రీఫండ్ లావాదేవీల్లో అసాధారణ మార్పులు గుర్తించారు. అనంతరం ఎన్టీఏ నుంచి బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించి డబ్బు బదిలీలను ట్రాక్ చేసి నిందితుడిని బీహార్‌లో అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) శరద్ సింఘల్ మాట్లాడుతూ.. పోర్టల్‌లోని భద్రతా లోపాలను నిందితుడు సద్వినియోగం చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం అతను ఇతర సైబర్ నేరాల్లో కూడా పాల్గొన్నాడా అనే కోణంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు.నీట్ అభ్యర్థులకు చుక్కలు ఇదిలా ఉండగా, జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ ఆన్లైన్లో విడుదల చేసింది. అయితే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ లింక్ సరిగా పనిచేయకపోవడంతో దేశవ్యాప్తంగా అనేక మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, అడ్మిట్ కార్డుల విడుదల ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం ఉదయం నాటికి కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే వాటిని డౌన్లోడ్ చేసుకున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. సాంకేతిక సమస్యలు, సర్వర్‌పై అధిక భారం కారణంగా ఈ ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొంది.ఈ సమస్యల పరిష్కారానికి తమ సాంకేతిక బృందం నిరంతరం పనిచేస్తోందని, అతి త్వరలో అన్ని అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఏ తన అధికారిక ఎక్స్ ద్వారా వెల్లడించింది. అభ్యర్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది -
అనుమానాస్పద స్థితిలో ‘ఖాన్ సార్’ ప్రత్యర్థి మృతి
పాట్నా: బిహార్ రాష్ట్రం పాట్నాలో కోచింగ్ సెంటర్ల మధ్య కొనసాగుతున్న ఘర్షణలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రౌషన్ ఆనంద్ (రౌషన్ సర్) సోదరుడు ప్రిన్స్ యాదవ్ నేపాల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆయనపై ఖాన్ సర్ కోచింగ్ సెంటర్‌పై దాడి, విధ్వంస్వం కేసు ఆరోపణలు ఉన్నాయి.రౌషన్ ఆనంద్ పాట్నాలోని జ్ఞాన్ బిందు జీఎస్ అకాడమీ డైరెక్టర్. ఆయన ప్రత్యర్థి ఫైసల్ ఖాన్ (ఖాన్ సర్), ఖాన్ గ్లోబల్ స్టడీస్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. ఈ రెండు సంస్థల మధ్య పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష ఫలితాలు, విద్యార్థుల సంఖ్య, క్యాంపస్ నియంత్రణ వంటి అంశాలపై కొన్నేళ్లుగా తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన బిహార్ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష ఫలితాల్లో ఈ రెండు ఇనిస్టిట్యూట్ల మధ్య ఘర్షణ వాతావరణమే చోటు చేసుకుంది. ఈఘటనకు సంబంధించి కేసులో రౌషన్ ఆనంద్ అరెస్టు కాగా ప్రిన్స్ యాదవ్ దాడి కేసులో అభియోగం ఎదుర్కొంటూ పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రిన్స్‌యాదవ్ నేపాల్‌లోని బిరాట్నగర్లోని హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. అదే హోటల్లో ప్రిన్స్ యాదవ్‌తో పాటు తన ఆరుగురు స్నేహితులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్ యాదవ్ స్నేహితులు, ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ప్రిన్స్ మరణంపై స్పష్టత రాలేదు. ప్రిన్స్ యాదవ్ మృతి వార్త తెలిసిన వెంటనే రౌషన్ ఆనంద్ కుటుంబ సభ్యులు నేపాల్‌కు బయలుదేరారు. ఈ ఘటనతో పాట్నాలోని కోచింగ్ హబ్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. స్థానికంగా పోలీస్ బలగాలను పెంచి అప్రమత్తం చేశారు. ఈ ఘర్షణ విద్యార్థుల మధ్య కూడా హింసాత్మక రూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఆరోపణలు2021నుంచి రౌషన్ ఆనంద్ సోదరుడు ప్రిన్స్ యాదవ్‌పై పలు ఆరోణలు కొనసాగుతున్నారు. 2021 ఖాన్ సర్ కోచింగ్ సెంటర్లోకి దూసుకెళ్లి హింసాత్మక దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 2న విధ్వంసం ఘటనకు సంబంధించిన కేసు ఎఫ్ఐఆర్లో పోలీసులు ప్రిన్స్ పేరును చేర్చారు. ఈ కేసులో రౌషన్ ఆనంద్ ఇప్పటికే పాట్నా జైలులో ఉన్నారు. కాగా ఖాన్ సర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రౌషన్ ఆనంద్ సోదరుడు అనుమానాస్పద మృతితో పరిస్థితులు మరింత దిగజారాయి. బిహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఫలితాలుగత మే 27న బిహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఫలితాలు విడుదలయ్యాయి. సెంట్రల్ సెలెక్షన్ బోర్డ్ ఆఫ్ కానిస్టేబుల్ , బిహార్ అధికారికంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటించింది. మొత్తం 19,838 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారు. అయితే ఈ ఫలితాలు కోచింగ్ హబ్‌గా పేరొందిన పాట్నాలోని ముసల్లాపూర్ కిసాన్ కోల్డ్ స్టోరేజ్ క్యాంపస్‌లో ఖాన్ సార్ (ఖాన్ సార్) కోచింగ్ సెంటర్, జ్ఞాన్ బిందు జీఎస్ అకాడమీ (రౌషన్ సార్) మధ్య చిచ్చు రాజేసింది. ఇద్దరూ తమ ఇన్స్టిట్యూట్ నుంచి వేలాది మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రకటించడంతో పోస్టర్లు చించుకోవడం, హింసాత్మక దాడులు, కేసులు వరకు వివాదం పెరిగింది.ఖాన్ సార్‌పై ఆరోపణలుఖాన్ సార్ తన ఇనిస్టిట్యూట్ నుంచి 12,000 మంది విద్యార్థులు ఎంపికయ్యారని చెప్పారు. రౌషన్ ఆనంద్ తన జ్ఞాన్ బిందు అకాడమీ నుంచి 10,000 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రకటించారు. ఇద్దరూ టాపర్ అభిషేక్ పటేల్ తమ విద్యార్థి అని ప్రకటించడం, అభిషేక్ పటేల్.. ఖాన్ సార్‌ని కలవడం, ఆయన బ్లెసింగ్స్ తీసుకోవడంతో రౌషన్ ఆనంద్‌ను ఆగ్రహానికి గురి చేసింది. అభిషేక్ పటేల్‌ను ఖాన్ సర్ రూ.10 లక్షలతో కొనుగోలు చేశారని ఆరోపించారు. అభిషేక్ పటేల్ ఈ ఆరోపణలను ఖండించారు.అయితే జూన్ 2న జ్ఞాన్ బిందు అకాడమీకి చెందిన సుమారు 20 మందివారు ఖాన్ సర్ ఇనిస్టిట్యూట్‌పై దాడి చేశారు. ఇనిస్టిట్యూట్‌లో వస్తువుల్ని ధ్వంసం చేయడం,రాళ్లు రువ్వారు. దీంతో ఖాన్ సార్ బాడీగార్డులు గాల్లో కాల్పులు జరపడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జ్ఞాన్ బిందు డైరెక్టర్ రౌషన్ ఆనంద్, ఆయన సోదరుడు ప్రిన్స్ యాదవ్‌తో పాటు ఇతరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాన్ సార్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో రౌషన్ ఆనంద్‌పై జైలు శిక్ష పడింది. ప్రిన్స్ యాదవ్ బెయిల్ మీద విడుదలయ్యారు. ఖాన్ సార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో ప్రిన్స్ యాదవ్ అనుమానాస్పద మృతితో బిహార్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. -
సమ్రాట్ చౌధరీ (బిహార్ సీఎం) రాయని డైరీ
నా నివాస గృహ కార్యాలయం నుంచి, సమీపంలోనే ఉన్న సచివాలయానికి కాలినడకన వెళ్లటం కోసం నేను వేగంగా మెట్లు దిగుతున్నప్పుడు నా పైన దాదాపుగా ఒక మెరుపు దాడి వంటిదేదో జరిగినట్లయింది! కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఆ ప్రాంగణంలోని గుబురు చెట్ల కొమ్మల పైనుంచి దుమికినట్లుగా మీడియా ప్రతినిధి ఒకరు ఒక్క గెంతున నా మీదకు వచ్చి పడ్డాడు! ఆ హఠాత్ఘటనకు నాతో పాటుగా, ఒక అడిషనల్ చీఫ్ సెక్రటరీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, నా కోసం వేచి చేస్తున్న ఒక విద్యాసంస్థ డీన్... ఎక్కడి వాళ్లు అక్కడే స్తంభించిపోయారు. ‘‘సమ్రాట్జీ, బిహార్ ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించి జూన్ 15కి రెండు నెలలు పూర్తవుతాయి. ఈ రెండు నెలల్లో మీరేం సాధించారు?’’ అని అడిగాడు, ఆ ‘ఒక్క ఊపున వచ్చి పడిన’ మీడియా ప్రతినిధి. అతడి వైపు విస్మయంగా చూశాను.‘‘మిత్రమా, నేను ఏప్రిల్ 15న బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. మీరు ఏప్రిల్ 16న వచ్చి, ‘మీరీ 24 గంటల్లో ఏం సాధించారు?’ అని నన్ను అడగవలసిన ప్రశ్నను... రెండు నెలల తర్వాత ఇప్పుడు నింపాదిగా వచ్చి, ‘మీరేం సాధించారు?’ అని అడుగుతున్నారు!’’ అన్నాను, నవ్వుతూ. ‘‘కానీ సీఎం సార్... కేవలం 24 గంటల్లో ఏమౌతాయి చెప్పండి?’’ అన్నాడు ఆ మీడియా ప్రతినిధి కూడా నవ్వేస్తూ. ‘‘24 గంటల్లో ఏమౌతాయి అని మీరు అంటున్నారు. కానీ, చాలానే అవుతాయి. బిహార్‌లో ఈ 70 ఏళ్లలో చట్టం తన పని తాను చేసుకుపోయింది. నేను వచ్చాక చట్టం తన పని తాను 24 గంటల్లోనే చేసుకుపోతోంది. గమనించే ఉంటారు’’ అన్నాను. ‘‘అవును సీఎం సార్. మీరు వచ్చాక 12 ఎన్ కౌంటర్లు జరిగాయి. ప్రతి ఎన్‌కౌంటరూ 24 గంటల్లోనే జరిగిపోయింది. కానీ... ఇవన్నీ పోలీసుల విధి నిర్వహణల కిందికే కదా వస్తాయి, సీఎంగా మీరేదైనా సాధించటం కిందికి వస్తాయా?’’ అని అడిగాడు. నా నడకను ఆపాను. అతడూ ఆగాడు. ‘‘పోలీసులకైనా స్వేచ్ఛ ఇస్తేనే కదా వాళ్లు 24 గంటల్లో ఏదైనా చేయగలరు! వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వటం కంటే ఒక సీఎం సాధించ వలసింది ఏం ఉంటుంది?!’’ అని అన్నాను. సచివాలయం దగ్గర పడింది. ‘‘సరే మిత్రమా, కలుద్దాం. సోమవారం మధ్యాహ్నంగానీ, సాయంత్రంగానీ ప్రెస్ మీట్ ఉండొచ్చు’’ అన్నాను, లోపలికి నడుస్తూ. ‘‘శ్రీమతి రబ్డీదేవిని సర్క్యులర్ రోడ్లో ఉన్న ప్రభుత్వ బంగ్లా నుంచి ఖాళీ చేయించే విషయం మీదనేనా సీఎం సార్, ఆ ప్రెస్ మీట్?’’ అని అడిగాడతడు! నవ్వాను. ‘‘సర్క్యులర్ రోడ్ బంగళాను ఖాళీ చేయించటం మీద, హార్డింగ్ రోడ్లో వేరే బంగళాను కేటాయించటం మీద ప్రెస్ మీట్లు ఉంటాయా మిత్రమా?’’ అన్నాను, సచివాలయంలోకి వచ్చేస్తూ.క్యారిడార్లో లేషీ సింగ్ ఎదురొచ్చారు. నవ్వాను. ఆమె నవ్వలేదు! ‘‘మీ కోసమే చూస్తున్నా సమ్రాట్జీ. శ్రీమతి రబ్డీ దేవికి మనం ఇచ్చిన రెండో గడువు కూడా ఆదివారంతో ముగుస్తోంది. ఆమె తన బంగళాను ఖాళీ చేసే ప్రసక్తే లేదని అంటున్నారు’’ అన్నారు టెన్షన్‌గా! లేషీ భవన నిర్మాణ శాఖ మంత్రి. నేరుగా నా ఛాంబర్ లోకి వచ్చి, డీజీపీ వినయ్ కుమార్‌కి ఫోన్ చేసి, ‘‘ఏం చేద్దాం?’’ అని అడిగాను. ‘‘ఈసారికి చట్టాన్ని తన పని తను చేసుకుపోనిద్దాం సర్... చట్టానికి 24 గంటల డెడ్‌లైన్ లాంటిది ఏమీ పెట్టకుండా’’ అన్నాడు. ‘‘గుడ్’’ అని ఫోన్ పెట్టేశాను. వినయ్ కుమార్ ఖరగ్‌పూర్ ఐఐటీ స్టూడెంట్. ఒక ఐపీఎస్, ఐఐటీ నుంచి వచ్చాడంటే అతడు డెడ్‌లైన్ ఏమీ లేకుండానే డెడ్‌లైన్ లోపలే పని పూర్తి చేయగలిగినవాడై ఉంటాడు. -
కాశీయాత్రలో విషాదం
సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం నుంచి కాశీ యాత్రకు 43 మందితో బయలుదేరిన టూరిస్టు బస్సు బిహార్ రాష్ట్రంలోని గయ జిల్లా బుద్ధగయ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో బస్సులోని ముగ్గురు యాత్రికులు దుర్మరణం చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడగా, పలువురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతుల్లో సంగంకు చెందిన టూరిస్టు బస్సు నిర్వాహకుడు, విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ పసుపులేటి వెంకటేశ్వర్లు (64), వంట మాస్టర్ చవడం హజరత్తయ్య (57), ఆత్మకూరుకు చెందిన సోమా పద్మావతి (43) ఉన్నారు.తీవ్రంగా గాయపడిన వారిలో సంగంకు చెందిన బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ, నీలం శీనయ్య, పద్మ, వింజమూరు శివరంగయ్య, లక్ష్మమ్మ, కంటాబత్తిన సంపూర్ణమ్మ, కంటాబత్తిన కామాక్షమ్మ, గురవయ్య, డి.రమణమ్మ, జి.శ్రీదేవి, డి.మల్లేశ్వరి ఉన్నారు. ఆత్మకూరు, దుత్తలూరుకు చెందిన పలువురు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులకు గయలోని అనుగ్రహ నారాయణ మగధ మెడికల్ కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. కాగా క్షతగాత్రులకు హిందీ భాష తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైద్యులు మాత్రం క్షతగాత్రులకు చికిత్స అందించి కాపాడారు. సరైన ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.బస్సు ప్రమాదం బాధాకరం: వైఎస్ జగన్సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు బీహార్‌లోని ఔరంగాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు భక్తులు మృతిచెందిన ఘటనపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడిన 15 మంది యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
బస్సును చీల్చుకెళ్లిన లారీ ముగ్గురు ఏపీ వాసుల మృతి..
-
యాత్రికుల బస్సు ప్రమాదం బాధాకరం : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు భక్తులు మృతిచెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నెల్లూరు జిల్లా నుంచి ఉత్తర భారతదేశ యాత్రకు బయల్దేరిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరగడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన 15 మంది యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఖాన్ సర్‌పై కేసు.. పోలీసుల గాలింపు
బిహార్ రాజధాని పట్నాలో కోచింగ్ సెంటర్ల ఆధిపత్య పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఖాన్ సర్, రోషన్ ఆనంద్ మధ్య జరుగుతున్న వివాదంలో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తమ కోచింగ్ సెంటర్‌పై రోషన్ ఆనంద్ దాడి చేయించాడని ఖాన్ సర్ ఆరోపించగా, ఇదంతా ఖాన్ సర్ ఆడిస్తున్న నాటకమని రోషన్ ఆనంద్ ప్రత్యారోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు ఖాన్ సర్ వెంట పడ్డారు.పట్నా: ఖాన్ సర్గా ప్రసిద్ధి చెందిన ఫైసల్ ఖాన్ ఆచూకీ కోసం బిహార్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఫైసల్ ఖాన్‌పై హత్యాయత్నం, ఆయుధాల చట్టం (ఆర్మ్స్ యాక్ట్) కింద నమోదైన కేసు నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నట్టు సమాచారం. ఖాన్ సర్ శుక్రవారం పట్నాలోని కోర్టులో లొంగిపోయే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఆయన కోర్టులో హాజరవుతారా లేదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.ఖాన్ సర్‌ను అప్రతిష్టపాలు చేయడానికే కేసులో ఇరికించారని ఆయన తరపు న్యాయవాది అరవింద్ కుమార్ మవ్వార్ ఆరోపించారు. ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. జూన్ 2న పట్నాలోని ఖాన్ గ్లోబల్ స్టడీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన విధ్వంస ఘటన నేపథ్యంలో ఫైసల్ ఖాన్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 15 నుంచి 20 మంది వ్యక్తులు కోచింగ్ సెంటర్‌పై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు రాళ్లు రువ్వారు.అల్లర్ల సమయంలో ఖాన్ సర్ విద్యాసంస్థకు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పట్నాలోని కదమ్కువాన్ పోలీస్ స్టేషన్లో ఖాన్ సర్‌తో సహా ముగ్గురు వ్యక్తులపై బీఎన్ఎస్ సెక్షన్ 109, ఆయుధ చట్టంలోని సెక్షన్లు 25(9), 27, 35 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు గార్డులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఖాన్ సర్‌ను కూడా అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ప్రత్యర్థి కోచింగ్ సంస్థ ఆరోపణలుఇదిలా ఉండగా, ప్రత్యర్థి కోచింగ్ సంస్థ ప్రతినిధులు గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. విధ్వంస ఘటనను ఖాన్ సర్ స్వయంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించారని వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు వారు వెల్లడించారు. కాగా, ప్రత్యర్థి కోచింగ్ సంస్థకు చెందిన వ్యక్తులే తమ కోచింగ్ సెంటర్‌పై దాడులకు పాల్పడ్డారని మొదట ఖాన్ సర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. చదవండి: ఖాన్ సర్.. గొడవలొద్దు -
గ్రామస్తుని ఖాతాలోకి రూ.294 కోట్లు
గయాజీ: బాత్రూమ్ పైపులు, ఫిట్టింగ్‌లను మరమ్మతులు చేసే ఒక సాధారణ ప్లంబర్‌కు చెందిన బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా 294 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. దీంతో హుతాశుడైన ఆ వ్యక్తి భయపడిపోయి స్థానిక నేతలకు సమాచారమిచ్చారు. అసలే సైబర్ నేరగాళ్లు తాము కాజేసిన సొత్తును ఎవరికీ తెలీకుండా ఇంకొకరి ఖాతాలోకి మళ్లిస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో వెంటనే బ్యాంక్ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానిక నేతలు సూచించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశాడు. బిహార్‌లోని గయాజీ జిల్లాలోని మస్త్‌పురా గ్రామంలో ఈ ఘటన జరిగింది. బ్యాంక్ ఖాతాదారు వికాశ్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. ‘‘నా బ్యాంక్ ఖాతాలో కేవలం 113 రూపాయలే ఉన్నాయి. గురువారం ఉదయం నీళ్ల పైపులు ఫిట్టింగ్, రిపేర్ చేసినందుకు ఒక కస్టమర్ ఇచ్చిన డబ్బు బ్యాంక్ ఖాతాలో పడటంతో ఆ రూ.1,300 మాత్రమే విత్‌డ్రా చేశా. అప్పుడు ఖాతాలో ఏకంగా రూ.94 కోట్లు ఉన్నాయి. అది కాస్తా సాయంత్రానికి రూ.294 కోట్లకు పెరిగింది. ఇంతటి నగదు ఎక్కడి నుంచి వచ్చిపడుతుందో తెలీక నాయకులకు సమాచారం ఇచ్చా. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు’’అని తెలిపారు. దీనిపై బోద్‌గయ పోలీస్‌స్టేషన్ హౌస్ఆఫీసర్ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడారు. ‘‘ఇది పొరపాటున జరిగిందా? ఏదైనా సాంకేతిక తప్పిదమా లేదా సైబర్ నేరస్తులు దాచుకున్న డబ్బా? అనేది తేలుస్తాం’’అని ఆయన చెప్పారు. -
రూ. 549 కోట్ల బ్రిడ్జ్‌పై పగుళ్లు : వీడియో తీస్తోంటే.. ట్విస్ట్!
బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లోని జడోపూర్-మంగల్పూర్ వంతెనపై జరిగిన ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. రూ. 549 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన పిల్లర్ల వద్ద నిర్మాణం లోపాలను వీడియో తీయాలని భావించిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. అతను వీడియో తీస్తున్న ఆ పగులు గుండానే అతని మొబైల్ ఫోన్ కిందకి జారీ పోవడంతో వార్తల్లో నిలిచాడు.2016 మార్చిలోఈ వంతెనను అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో క్లిప్‌లో, వంతెన పిల్లర్ల వద్ద, స్పాన్లలో భారీగా గ్యాప్‌లు, పగుళ్లు ఏర్పడడంతో అధికారులు భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. అయితే ఈ పగుళ్ల గురించే అతను రికార్డ్ చేయాలను కున్నాడు. ఆ పగులు ఎంత పెద్దదిగా ఉందో చూపించడానికి ఒక ఇటుకను అందులోకి దించుతూమొబైల్ ఫోన్‌తో రికార్డ్ చేస్తున్నాడు. ఇక్కడే అతని ప్రయత్నం బెడిసి కొట్టింది. మొబైల్ ఫోన్ చేతిలోంచి జారి ఆ గ్యాప్ గుండా వంతెన కింద పడిపోయింది.Man on Jadopur–Mangalpur bridge tries to measure a massive pavement crack with a brick, bends over and accidentally drops his phone into the deep gap😭💀pic.twitter.com/XTd8nHdwdX— Ghar Ke Kalesh (@gharkekalesh) June 4, 2026ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్చివరికి వంతెన కింద పడిన ఫోన్‌ను సురక్షితంగానే వెలికితీశారు. కానీ, వంతెన లోపాన్ని చూపించబోయి సొంత ఫోన్‌నే పోగొట్టుకోబోయిన వైనంపై నెటిజన్లు ఫన్నీగా కమెంట్స్ చేశారు. పనిలో పనిగా వంతెన నిర్మాణ నాణ్యత, నిర్వహణపై ప్రజలు సోషల్ మీడియాలో తీవ్ర ప్రశ్నలు గుప్పిస్తున్నారు. పట్టుమని పదేళ్లు కూడా కాకముందే, గుంతలు, లోపాలు కనిపించడం విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఆ యువకుడి ఫోన్ దొరికి నప్పటికీ, వైరల్ వీడియోకి కారణమైన వంతెన నిర్మాణ లోపాలపై మళ్లీ అందరి దృష్టి మళ్ళేలా చేసింది.ఇదీ చదవండి: రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్‌తో రోజుకు రూ. 1500 -
ఖాన్ సర్.. గొడవలొద్దు
పట్నా: ఉపాధ్యాయులు విద్వేషాలకు దూరంగా ఉండాలని జన అధికార్ పార్టీ అధినేత, పూర్నియ పార్లమెంట్ సభ్యుడు పప్పు యాదవ్ వేడుకున్నారు. బిహార్‌లోని పట్నాలో కాదంఖాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖాన్ గ్లోబల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్పై దాడి నేపథ్యంలో ఆయన స్పందించారు. పెద్ద మనసు చేసుకుని ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని ఖాన్ సర్‌ను (Khan Sir) కోరారు. ఎవరి విషయంలోనైనా తన వైపు నుంచి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే కాళ్లు పట్టుకుని తాను క్షమాపణ చెబుతానని అన్నారు. ఖాన్ సర్, రోషన్ సర్ ఇద్దరూ తనకు సోదర సమానులేనని.. వీరిద్దరికీ తన హృదయంలో స్థానముందని పేర్కొన్నారు. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, వివాదానికి ముగింపు పలకాలని పప్పు యాదవ్ విజ్ఞప్తి చేశారు. విద్యా రంగంలో ఉన్నవారు ద్వేషాన్ని కాకుండా సంభాషణను, సామరస్యాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఇద్దరు విద్యావేత్తల మద్దతుదారుల మధ్య కొనసాగుతున్న వాగ్వివాదం, ఆరోపణలు బిహార్ విద్యా సంస్కృతికి మంచి సంకేతం కాదని అభిప్రాయపడ్డారు. ఇదంతా వద్దు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయవద్దు, విద్వేషాలు రెచ్చగొట్టవద్దు.. ఒక వ్యక్తి తప్పు చేయవచ్చు కానీ మొత్తం సమాజాన్ని, భావజాలాన్ని నిందించడం సరికాదని ఎంపీ పప్పు యాదవ్ ఉద్వేగభరితంగా చెప్పారు.బిహార్ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్య అనేది సమాజాన్ని ఏకం చేసే సాధనమని.. ఉపాధ్యాయులు, వారి మద్దతుదారులు సమాజంలో విభజన లేదా విద్వేషాన్ని సృష్టించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. బిహార్ బలం ప్రతిభ, విద్య, సామాజిక ఐక్యతలో ఉందని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనైనా కాపాడుకోవాలని ఆయన అన్నారు.బాధ్యులపై చర్యలు తీసుకోండిగ్లోబల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్పై దాడిపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు పప్పు యాదవ్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని అన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసిన విద్యార్థిని మృతి కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కోచింగ్ సెంటర్‌పై దాడిని పెద్దదిగా చూపిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతి కేసులో దోషులు తప్పించుకోకుండా చూడాలని, చట్టప్రకారం శిక్ష పడాల్సిందే అన్నారు. విద్యార్థిని మృతి కేసుపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు.చదవండి: అది సరిపోదు.. మంత్రి రాజీనామా చేయాల్సిందేకోచింగ్ సెంటర్‌పై దాడి అందుకేగ్లోబల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్పై మరో కోచింగ్ సెంటర్‌పై మంగళవారం రాత్రి 10.10 గంటల ప్రాంతంలో దాడి జరిగింది. కోచింగ్ సెంటర్ వద్ద కాపలాగా ఉన్న గార్డ్‌ను చితకొట్టి భవనం మీదకు పలువురు రాళ్ల వర్షం కురిపించారు. డైరెక్టర్ సహా పలువురు దాడికి దిగి విధ్వసం సృష్టించారు. కాల్పులు సైతం జరిపారని ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, విద్యావేత్త ఫైసల్ ఖాన్ ఆరోపించారు. తక్కువ ఫీజుకే నాణ్యమైన విద్యను అందిస్తున్నామనే అక్కసుతో వేరే కోచింగ్ సెంటర్ నిర్వాహకులు దాడిచేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటలో వేరే కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రోషన్ ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. దాదాపు 20 మంది ఈ దాడి ఘటనలో పాల్గొన్నారని, ఆర్థిక కోణంలోనూ దర్యాప్తు ఆరంభించామని పట్టణ డీఎస్పీ రాజేశ్ రంజన్ తెలిపారు. -
ఐసీయూలో మంటలు.. పలువురి సజీవదహనం!
పాట్నా: దేశ రాజధాని ఢిల్లీలోని హోటల్ అగ్నిప్రమాదం విషాదం మరువకముందే బిహార్‌లో మరో ఘోర ఘటన చోటుచేసుకుంది. ముజఫర్‌పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు సమాచారం. మరికొందరికి గాయాలు కాగా.. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రసాద్ ఆస్పత్రి ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూ విభాగంలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. క్షణాల్లోనే దట్టమైన పొగ భవనం అంతటా వ్యాపించడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ కారణంగా పలువురు శ్వాస తీసుకోలేక అపస్మారక స్థితికి చేరుకున్నట్లు సమాచారం.అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అత్యవసర సేవల బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అత్యవసరంగా ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో ఇప్పటిదాకా ముగ్గురు మరణించినట్లు సమాచారం అందుతోంది.मुजफ्फरपुर के प्रसाद हॉस्पिटल के ICU में लगी भीषण आग ने दिल दहला दिया। हादसे में 3 लोगों की मौत की खबर है, जबकि कई मरीज आग की चपेट में आए। अस्पतालों में सुरक्षा व्यवस्था और फायर सेफ्टी मानकों पर गंभीर सवाल खड़े हो गए हैं।दिवंगतों के परिजनों के प्रति संवेदना। प्रशासन से निष्पक्ष… pic.twitter.com/0gZPFHnnb2— Indian Observer (@ag_Journalist) June 4, 2026ప్రాథమిక విచారణలో.. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ మాలవీయ నగర్‌లోని హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన నేపథ్యంలో, తాజాగా బిహార్‌లో ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ విషాదం మరింత కలకలం రేపుతోంది.కీలకాంశాలుబిహార్లోని ముజఫర్‌పూర్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదంఐసీయూ విభాగంలో ప్రారంభమైన మంటలుముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం!20 మందికి పైగా రోగులను సురక్షితంగా బయటకు తెచ్చారుపలువురి పరిస్థితి విషమం.. మృతుల సంఖ్య పెరిగే చాన్స్షార్ట్సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానంకొనసాగుతున్న సహాయక చర్యలు.. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం -
వైరల్ వీడియో.. సుప్రీం కోర్టులో బిగ్ హైడ్రామా
ఒక వైరల్ వీడియో దేశం మొత్తాన్ని ‘‘అయ్యో పాపం పెద్దాయన..’’ అనుకునేలా చేసింది. అటు ఇటు తిరిగి.. అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం కదిలించింది. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. అయితే.. ఈ హైడ్రామాలో చివరి క్షణంలో ‘ట్విస్ట్’ చోటు చేసుకోవడంతో విచారణను విరమించుకోవాల్సి వచ్చింది.బిహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన ఓ కేసులో 85 ఏళ్ల వృద్ధుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడినట్లు వచ్చిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నడవడానికే కష్టపడుతున్న ఆ వృద్ధుడు కర్ర సాయంతో కోర్టు ఆవరణ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు.. ఇద్దరు వ్యక్తుల సాయంతో పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందన వ్యక్తమవుతుండగా.. సుప్రీంకోర్టు కూడా అప్రమత్తమైంది.बिहार में 33 साल पुराने केस में 84 साल के बुजुर्ग को भेजा गया जेल, दो लोगों ने सहारा देकर पहुंचाया सलाखों तक। pic.twitter.com/HSlPTwqKAZ— छपरा जिला 🇮🇳 (@ChapraZila) June 1, 2026మంగళవారం మధ్యాహ్నం సుమారు 2.40 గంటల సమయంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఆదేశాలతో కోర్టు నం.1 (ప్రధాన న్యాయమూర్తి కోర్టు)ను తక్షణం తెరవాలని సూచించారు. సుమోటో విచారణ చేపట్టే అవకాశముందని భావించి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అయితే సాయంత్రం 4 గంటల సమయానికి పరిస్థితి మారింది.బిహార్ హైకోర్టు నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. వృద్ధుడికి అప్పీల్ దాఖలు చేసుకునేందుకు ట్రయల్ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినట్లు తెలిసింది. ఈ వివరాలు తెలిసిన వెంటనే సుప్రీంకోర్టు సుమోటో చర్యను నిలిపివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుపై తక్షణ చర్యకు ఆసక్తి చూపినట్లు సమాచారం. అదే సమయంలో ఆయన కొలీజియం సమావేశాల్లో ఉన్నప్పటికీ.. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రీకి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ వివాదానికి కారణమైన కేసు 1992 నాటి హత్యాయత్నం ఘటనకు సంబంధించినది. అప్పట్లో ఓ కుటుంబానికి చెందిన తొమ్మిది మందిపై కాల్పుల ఆరోపణలు నమోదయ్యాయి. దీర్ఘకాల విచారణ అనంతరం వారిలో నలుగురు మరణించగా, మిగిలిన ఐదుగురిపై తీర్పు వెలువడింది. ఇందులో 85 ఏళ్ల దీప్ రాయ్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది. మిగిలిన నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడింది. వైరల్ వీడియో ప్రభావంతో సుప్రీంకోర్టు వరకు చేరిన ఈ ఘటన చివరి క్షణంలో భిన్న మలుపు తిరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
ఇద్దరు అమ్మాయిల పెళ్లి : అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!
బిహార్‌లోని జముయి జిల్లాలో జరిగిన ఒక వింత వివాహం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బీపీఎస్సీ (BPSC) ఉపాధ్యాయురాలు తోబుట్టువు వరుసైన (బాబాయ్ కూతురు/మేనత్త కొడుకు)ను వివాహమాడింది. ఈ స్టోరీలో ట్విస్ట్ అర్థం కావాలంటే పూర్తి కథనం చదవాల్సిందే. 2025లో బీపీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, లక్ష్మీపూర్ బ్లాక్‌లోని మేద్నీపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తోంది వధువు నయన్‌శ్రీ. తన చిరకాల ప్రియురాల్ని తన కజిన్ (సొంత మేనత్త కూతురు) రాఖీ అలియాస్ రాహుల్‌ని వివాహం చేసుకుంది. విషయం ఏమిటంటే రాఖీ సుమారు ఆరు నెలల క్రితం ఎయిమ్స్-ఢిల్లీలో జరిగిన లింగమార్పిడి శస్త్రచికిత్స తర్వాత రాహుల్‌గా మారాడు. రాఖీని ఆమె పెళ్లి చేసుకుంది. ఈ సర్జరీ కోసం నయన్‌శ్రీ రూ. 8 లక్షల బ్యాంకు రుణం తీసుకుంది. అన్నీ సవ్యంగా ముగిసిన తర్వాత మే 31న ఒక ఆలయంలో జరిగిన వేడుకలో ఇద్దరూ అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. లక్ష్మీపూర్‌లోని పటేశ్వర్ నాథ్ ఆలయంలో వీరి వివాహం జరిగింది. వీరు నడిచారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.कल तक बहन, आज जीवनसाथी ! बिहार के जमुई में एक BPSC शिक्षिका ने अपनी फुफेरी बहन से शादी कर ली। शादी से पहले बहन ने जेंडर ट्रांजिशन कराया और दोनों ने हिंदू रीति-रिवाज से विवाह किया। मामला चर्चा का विषय बना हुआ है। pic.twitter.com/xSv0NNMsFD— Yash Ahmad (@YashAhmad8) June 2, 2026 ఐదేళ్ల లవ్నయన్శ్రీ తండ్రి బిహార్ సచివాలయంలో ఉద్యోగి, తల్లి గృహిణి. రాహుల్/రాఖీ తండ్రి కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. నయన్‌శ్రీ తల్లి, రాఖీ తండ్రి తోబుట్టువులు. వారు లక్ష్మీపూర్ బ్లాక్‌లో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు చెందినవారు. నయన్ శ్రీ, రాఖీ ఇద్దరూ చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. 2019లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, డిగ్రీ సమయంలో ఒకే హాస్టల్లో ఉన్నారు. ఆ తర్వాత 2023లో BPSC పరీక్షల ప్రిపరేషన్ కోసం పాట్నా వెళ్లారు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుండే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచారు.లక్ష్మీపూర్ వార్డు సభ్యుడు రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నయన్ శ్రీ తన ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని భావించి, తాను లింగమార్పిడి చేయించుకోకుండా, రాఖీని (రాహుల్) చేయించుకోమని కోరింది. అందుకోసం ఆమె తన పేరు మీద రూ. 8 లక్షల బ్యాంక్ లోన్ కూడా తీసుకుంది.కుటుంబంలో గొడవలురాహుల్ మే నెలలో ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చే వరకు ఈ సర్జరీ విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. మే 31న రాహుల్ మొబైల్ ఫోన్ కొంటానని చెప్పి బయటకు వెళ్లి నయన్ శ్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన విషయం తెలిసి నయన్ శ్రీ తల్లిదండ్రులు రాహుల్ ఇంటికి వచ్చి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో ఇంటి గేటును కూడా ధ్వంసం చేశారు. దీంతో భయపడిన కొత్త జంట ఇంటి వెనుక తలుపు నుండి తప్పించుకుని, ప్రస్తుతం ఎవరికీ తెలియని రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అయితే, ఈ వివాహం ఇద్దరి పరస్పర అంగీకారంతోనే జరిగిందని బంధువులు చెబుతున్నారు. -
‘నన్ను నెట్టేసినా సరే.. ఇల్లు ఖాళీ చేయను’
పాట్నా: బీహార్‌లో ప్రభుత్వ బంగ్లా చుట్టూ వివాదం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకురాలు రబ్రీ దేవి తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేయడానికి నిరాకరించారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలోని ఒక మంత్రికి కేటాయించిన ఆ ఇంటిని వదిలి, మరో ఇంటికి మారేందుకు ఆమె ససేమిరా ఒప్పుకోవడం లేదు. రాజ్ భవన్, ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఉన్న '10, సర్క్యులర్ రోడ్' బంగ్లాను మత్స్యశాఖ మంత్రి నంద్ కిషోర్ రామ్‌కు కేటాయిస్తూ భవన నిర్మాణ శాఖ మే 27న ఉత్తర్వుల్లో జారీ చేసింది.ఈ ఉత్తర్వులు జారీ అయినప్పుడు ఆమె నగరంలో లేరు. ఆమె విమానాశ్రయానికి చేరుకోగానే.. జర్నలిస్టులు ఈ విషయంపై మీడియా ప్రశ్నించడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామ్రాట్ చౌదరి సీఎం అయినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన ప్రభుత్వం నన్ను బలవంతంగానైనా ఖాళీ చేయించమనండి. నేను మాత్రం ఈ ఇల్లు ఖాళీ చేయనంటూ ఆమె సమాధానమిచ్చారు. దశాబ్ద కాలంగా ఆమె ఉంటున్న ఈ బంగ్లాను, గతంలో జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెకు మాజీ సీఎం హోదాలో కేటాయించిన సంగతి తెలిసిందే.శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉన్న రబ్రీ దేవిని ఇల్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం గతేడాది నవంబర్లోనే మొదటిసారి కోరింది. అప్పట్లో నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో భవన నిర్మాణ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో... 10, సర్క్యులర్ రోడ్ బంగ్లాను అప్పటి ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, సీనియర్ బీజేపీ నాయకుడైన సిన్హా ప్రస్తుతం క్యాబినెట్లో కొనసాగుతున్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి హోదాను కోల్పోయారు. రబ్రీ దేవి ఆ బంగ్లాను వదిలిపెట్టేందుకు నిరాకరించారు.తాజా వివాదంపై భవన నిర్మాణ శాఖ మంత్రి, సీనియర్ జేడీయూ నాయకురాలు లేశి సింగ్ మాట్లాడుతూ... శాసనమండలి ప్రతిపక్ష నేతకు '39, హార్డింజ్ రోడ్' బంగ్లాను కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని చెప్పారు. కాబట్టి, రబ్రీ దేవి ఆ ఇంటికి మారడం మంచిదన్నారు. ఆమె గత ఉత్తర్వులను పాటించారా? అనే విషయంతో మాకు సంబంధం లేదు. కానీ, ప్రభుత్వ ప్రముఖులకు తగిన బంగ్లాలు కేటాయించడంలో ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. ఎవరూ కూడా నిర్దిష్ట బంగ్లాపై తమకు హక్కు ఉందని పట్టుబట్టలేరు. మాజీ సీఎంగా రబ్రీ దేవి ఈ విషయాన్ని అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా నడుచుకుంటారని ఆశిస్తున్నామంటూ సింగ్ పేర్కొన్నారు.1997లో తన భర్త తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రబ్రీ దేవి.. ప్రస్తుతం ఆయనతో కలిసే ఈ బంగ్లాలో ఉంటున్నారు. వారి చిన్న కుమారుడు, ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వి యాదవ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత హోదాలో 1 పోలో రోడ్ నివాసంలో ఉన్నప్పటికీ, ఎక్కువ సమయం ఈ '10, సర్క్యులర్ రోడ్' బంగ్లాలోనే గడుపుతుంటారు. -
‘చదివించా.. ఉద్యోగం తెప్పించా.. ప్రియుడితో టీచర్ జల్సాలు’
కట్టుకున్న భార్యను చదివించేందుకు ఓ భర్త చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. కూలి పనులకు వెళ్లి.. ఉన్న పొలం అమ్మి భార్యను చదివిస్తే.. తీరా ఉద్యోగం వచ్చాక కుటుంబాన్ని ఎగతాళి చేసి కన్న కొడుకును వదిలేసి మరొకరితో వెళ్లిపోయింది. దీంతో.. తన భార్యను నిలదీసేందుకు వెళ్లిన భర్తకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లిన భర్తకు షాక్ తగిలింది. ఆమె తన ప్రియుడితో కలిసి చనువుగా ఉన్న దృశ్యం చూసి భర్త గుండె ఆగిపోయినంత పనైంది. ఈ ఘటన కుటుంబ బంధాలు, ఉద్యోగం తర్వాత మారే సంబంధాలపై మరోసారి పెద్ద చర్చకు దారి తీసింది.బీహార్‌లోని వైశాలి జిల్లా హాజీపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై భర్త అమన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అతను 2013లో గుంజన్ కుమారిని వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఆమె ఇంటర్మీడియట్ మాత్రమే పూర్తిచేసి ఉంది. అయితే, ఆమెకు టీచర్ కావాలన్న లక్ష్యం ఉందని భర్తకు చెప్పింది. దీంతో, ఆమెను చదివించాలని అమన్ అనుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలంగా లేకపోయినా, తాను కూలి పనులు చేస్తూ ఆమె చదువులకు అండగా నిలిచాడు. అంతేకాకుండా 2022లో తన భూమిని అమ్మి.. ఆమె డిగ్రీ, బీఈడ్ చదువులు, బీపీఎస్సీ టీచర్ నియామక పరీక్ష సన్నద్ధత కోసం డబ్బులు సమకూర్చినట్లు తెలిపాడు.తర్వాత గుంజన్ కుమారి BPSC TRE-02 నియామక ప్రక్రియలో ఎంపికై టీచర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. సుపౌల్ జిల్లాలో శిక్షణ పూర్తిచేసిన అనంతరం బిదుపూర్ బ్లాక్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పోస్టింగ్ పొందింది. అయితే, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. 2025 జనవరిలో గుంజన్ తమ 10 ఏళ్ల కుమారుడు ఆరుష్ ఆర్యను తన వద్దకు పంపించి, తాను సహచర టీచర్లతో కలిసి డార్జిలింగ్ వెళ్తున్నానని చెప్పింది. కానీ తర్వాత ఆ ప్రయాణానికి ఇతర టీచర్లు ఎవరూ వెళ్లలేదని అమన్‌కు తెలిసింది. దీంతో తన అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ఆరా తీయగా.. శిక్షణ సమయంలో ప్రేమ్ ప్రకాశ్ జైస్వాల్ అనే మరో టీచర్‌తో ఆమెకు సన్నిహిత సంబంధం ఏర్పడిందని, ఆ తర్వాత కుటుంబానికి దూరంగా ఉండడం ప్రారంభించిందని గుర్తించాడు.🚨Betrayal of Sacrifices: Wife Leaves Husband After BPSC SuccessThe shocking case of Aman Kumar from Hajipur, Bihar, exposes a bitter reality of changing attitudes after financial independence.Aman worked day and night, selling ancestral land to fund the education of his… pic.twitter.com/jryTz01uer— Ramesh Tiwari (@rameshofficial0) May 29, 2026ఈ క్రమంలో మే 23న హాజీపూర్‌లోని లిచ్ఛవి నగర్ ప్రాంతంలో ఆమె అద్దె ఇంటికి వెళ్లగా, అక్కడ ప్రేమ్ ప్రకాశ్‌తో కలిసి ఉండడాన్ని అమన్ చూసి షాకయ్యాడు. అనంతరం వెంటనే డయల్-112 పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భర్తతో గుంజన్ గొడవ పెట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇక, ఈ వివాదంలో వారి కుమారుడు కూడా కేంద్ర బిందువుగా మారాడు. తన తల్లి మరో వ్యక్తిని “అంకుల్” అని పిలవాలని ఒత్తిడి చేసిందని, తాను ఆమెతో ఉండాలని అనుకోవడం లేదని బాలుడు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో చిన్నారి భవిష్యత్తు, మానసిక పరిస్థితిపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
అవినీతి ఆరోపణలపై ఇద్దరు ఐఏఎస్‌ల సస్పెన్షన్
పట్నా: తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులను శనివారం బిహార్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), స్పెషల్ విజిలెన్స్ యూనిట్ (ఎస్వీయూ)ల నుంచి వచ్చిన సిఫారసుల మేరకు నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. వీరిలో సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న 2017 బ్యాచ్‌కు చెందిన యోగేశ్ కుమార్ సాగర్ కాగా, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే 2014 బ్యాచ్ అధికారిణి అభిలాష కుమారి శర్మ అని సాధారణ పరిపాలన శాఖ తెలిపింది. సస్పెన్షన్ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
Women Power: పక్కా పల్లెటూరులో... ఫైవ్‌స్టార్ లైబ్రరీ!
బిహార్‌లోని జమయి జిల్లాలోని దబిల్ గ్రామంలో.... దినపత్రికలు, పుస్తకాలు చదువుకునేవారు, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు పట్టణంలోని లైబ్రరీలు తప్ప ఇతరత్రా సదుపాయాలు ఉండేవి కాదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చింది సర్పంచ్ దబిల్.‘మన ఊరికి మంచి లైబ్రరీ ఉండాలి. అది మన పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని గ్రామ ప్రజలను ఒప్పించింది దబిల్. ఇప్పుడు ఈ గ్రంథాలయం వందలాది మంది విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు కూడా ఈ లైబ్రరీకి రెగ్యులర్‌గా వస్తుంటారు.విద్యార్థులకు సహాయం చేయడానికి ఈ లైబ్రరీలో ఇద్దరు ఉద్యోగులను నియమించారు. ఎయిర్ కండిషన్డ్ గదులతో పాటు భద్రతా పర్యవేక్షణ కోసం సీసీ టీవి కెమెరాలు అమర్చారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశించకుండా, ప్రభుత్వ ఫండ్స్ కోసం ఎదురుచూడకుండా గ్రామస్థులే పదిహేను లక్షల ఖర్చుతో ఈ ఫైవ్–స్టార్ లైబ్రరీని నిర్మించుకోవడం విశేషం. -
రైలులో చెలరేగిన మంటలు.. కాలి బూడిదైన బోగీ!
మధుబని: ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున బిహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్ మూడు వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ నిలిపి ఉంచిన జయనగర్-ఉధ్నా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు, గురువారం బయలుదేరాల్సి ఉంది. షంటింగ్ ప్రక్రియ సమయంలో అకస్మాత్తుగా ఒక బోగీ నుంచి మంటలు రావడం మొదలైంది. చూస్తుండగానే మంటలు తీవ్రరూపం దాల్చడంతో, ఆ బోగీ పూర్తిగా కాలి బూడిదైంది.రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బందిసమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు 10 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని, గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే యంత్రాంగం అప్రమత్తమై ప్లాట్‌ఫాం ప్రాంతాన్ని ఖాళీ చేయించి, భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఉన్నతస్థాయి విచారణకు ఆదేశంసమస్తిపూర్ డివిజన్ డీఆర్ఎం జ్యోతి ప్రకాష్, కమాండెంట్ ఆశిష్ కుమార్ తదితర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైలు నిలిపి ఉంచిన సమయంలో మంటలు ఎలా వచ్చాయనే కోణంలో రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ఆధారాలను సేకరిస్తున్నామని, సమగ్ర విచారణ నివేదిక తర్వాతే ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు. #WATCH | Fire broke out in the empty coaches of the Jaynagar–Udhna Antyodaya Express at the Madhubani Railway Station in Bihar. The train was stationary on Platform No. 3 at Madhubani Station, undergoing shunting operations, when the incident occurred. pic.twitter.com/eli4tYMmhF— ANI (@ANI) May 28, 2026 -
వైభవ్‌ను సూర్యవంశీని వెతికి తీసుకొచ్చింది ఇతడే
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఐపీఎల్-2026లో ముల్లాన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు వైభవ్.ఐపీఎల్ మొదలై 19 సీజన్లు అవుతున్నప్పటికి ప్లే ఆఫ్స్‌లో ఇలాంటి ఇన్నింగ్స్‌ను ఇప్పటివరకు చూడలేదు. ఈ నాకౌట్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లుకు సూర్యవంశీ చుక్కలు చూపించాడు. ఆఖరికి ప్లాన్-బి, ప్లాన్-సి అని చెప్పిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ను సైతం ఈ వండర్ కిడ్ వదల్లేదు. 15 ఏళ్ల వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 97 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్ల బాదిన ప్లేయర్‌గా క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డును సూర్యవంశీ(62) బ్రేక్ చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు సైతం ఫిదా అయిపోయారు. అయితే వైభవ్ సూర్యవంశీ వంటి చిచ్చర పిడుగును ఐపీఎల్‌కు పరిచయం చేసింది ఎవరో తెలుసా? అతడి ఐపీఎల్ ఎంట్రీ వెనక చాలా కథ దాగి ఉంది.థాంక్యూ సమర్..వైభవ్ సూర్యవంశీలోని టాలెంట్‌ను తొలుత గుర్తించింది బిహార్ మాజీ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ టాలెంట్ స్కౌటింగ్ టీమ్‌లో సభ్యుడైన సమర్ ఖాద్రీ. సమర్ ఖాద్రీ దేశవాళీ మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను మొదటిసారి చూశాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ ఆడుతున్న అద్భుతమైన షాట్లు, అతడిలోని టాలెంట్ చూసి ఖాద్రీ ఆశ్చర్యపరిచాడు.వెంటనే వైభవ్ గురుంచి రాజస్తాన్ హై పర్ఫార్మెన్స్ అండ్ స్కౌటింగ్ హెడ్ జుబిన్ భరుచాకు సమాచారం అందించాడు. దీంతో జూబిన్.. వైభవ్ కోసం ప్రత్యేకంగా ట్రయల్స్ ఏర్పాటు చేశారు. అయితే ట్రయల్స్‌లో వైభవ్ తను ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఇది చూసిన జుబిన్ సైతం బిత్తరపోయాడు. ఎందుకంటే రాజస్తాన్ రాయల్స్ ట్రయల్స్‌లో అప్పటివరకు సంజూ శాంసన్, జైశ్వాల్ మాత్రమే తాము ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్ బాదాడు. ఆ జాబితాలో వైభవ్ కూడా చేరాడు. ట్రయల్స్ ముగిసిన వెంటనే ఆర్ఆర్ మేనేజ్మెంట్కు జుబిన్ ఒక సందేశం పంపాడు. రాబోయే ఐపీఎల్ వేలంలో ఈ అబ్బాయి కోసం రూ.10 కోట్లు సిద్ధంగా ఉంచుకోండి.ఎందుకంటే మనం ఒక అరుదైన, అసాధారణమైన టాలెంట్‌ను చూశాను అంటూ రాజస్తాన్ యాజమాన్యానికి తెలియజేశాడు. దీంతో ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.1.10 కోట్లతో వైభవ్‌ను పట్టుబట్టి మరి రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. అప్పటిలో ఒక యువ ఆటగాడిపై అంత మొత్తాన్ని వెచ్చించడాన్ని చాలా మంది తప్పుపట్టారు. కానీ ఇప్పుడు అతడి విలువ వందల కోట్లతో సమానం.చదవండి: ఆ ఇన్నింగ్స్ అద్భుతం.. వైభవ్ బ్యాటింగ్‌కు సచిన్ ఫిదా -
రూ. 16 వేలు, 10 చీరల కోసం కన్నకూతుర్నే అమ్మేసింది!
ఉత్తర ప్రదేశ్‌లోని పవిత్ర పుణ్య క్షేత్ర వారణాసిలో దారుణం చోటు చేసుకుంది. కేవలం చీరలు, డబ్బుల కోసం 12 కన్నకూతుర్ని విక్రయించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఆ బిడ్డ భయంకరమైన వేధింపులు, అత్యాచారాలకు గురైన ఘటన కలకలం రేపింది.టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) కథనం ప్రకారం 12 ఏళ్ల బాలికను స్వయనా ఆమె తల్లే ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి అమ్మేసింది. అదీ రూ.16,000 , 10 చీరలకు విక్రయించింది. ఆ తరువాత ఆమెకు ఘోరమైన నరకం అంటే ఏంటో చూపించారు. పదేపదే అత్యాచారం చేసి, వారణాసిలో వదిలేశారు.అసలేం జరిగిందంటే నిందితుడు 40 ఏళ్ల లహ్రూ యాదవ్ (అలియాస్ రాకేష్) ఈ ఏడాది జనవరిలో బాలిక తల్లి నుంచి ఆమెను కొనుగోలు చేశాడు. చందౌలీలోని ఒక గుడిలో నకిలీ వివాహం చేసుకున్నాడు. తానేదో చిన్న వయస్కుడిగా కనిపించడం కోసం అతను ఢిల్లీలో దాదాపు రూ. 90,000 ఖర్చు చేసి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేయించుకున్నాడు.పెళ్లి పేరుతో బాలికను తన ఇంటికి తీసుకెళ్లిన యాదవ్, ఆమెపై అమానుషంగా నిరంతరం అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, పనిమనిషిగా మార్చి చిత్రహింసలు పెట్టాడు. మైనర్ బాలికను ఇంట్లో ఉంచుకుంటే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని స్థానికులు హెచ్చరించడంతో ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని చూశాడు. మే 19న బనారస్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆ బాలికను నిందితుడు వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడ రవి వర్మ అనే ఆటో డ్రైవర్, ఆ బాలికకు సహాయం చేసి తల్లి వద్దకు చేరుస్తానని నమ్మించి తీసుకెళ్లాడు. కానీ, అతను కూడా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత రెండు రోజులకే ఆమెను మళ్లీ రోడ్డుపై వదిలేశాడు.మే 21న వారణాసిలోని సార్నాథ్ ప్రాంతంలో బాలిక ఒంటరిగా ఏడుస్తూ తిరుగుతుండటం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ముందు బాలిక తన గోడును వెళ్లబోసుకుంది. బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు మే 22న భారతీయ న్యాయ సంహిత (BNS) అత్యాచార సెక్షన్లు, అలాగే పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.ఈ కేసులో బాలికను అమ్మేసిన సొంత తల్లిని, కొనుగోలు చేసిన లహ్రూ యాదవ్‌ను, మరియు ఆటో డ్రైవర్ రవి వర్మను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసుపై సమగ్ర విచారణ జరుగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సార్నాథ్ ఏసీపీ విదూష్ సక్సేనా తెలిపారు. -
ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ.. వైభవ్‌కు ప్రమోషన్!
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారంతో లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది టైటిల్ ఎవరి సొంతమవుతుందనేది మే 31న తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడనున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. బీహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీకి అనుమతి ఇస్తే 'బెమిసల్ బీహార్' పేరుతో కొత్త జట్టును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి బీసీసీఐ ఒప్పుకుంటే వచ్చే ఏడాది ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీని చూసే అవకాశముంది. ఈ ఫ్రాంచైజీ ఏర్పాటైతే ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని, వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా ఉంటాడని ఆయన పేర్కొన్నారు. ‘బెమిసల్ బీహార్’తో కూడిన జెర్సీని కెప్టెన్, వైస్ కెప్టెన్ హోదాలో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ కలిసి ఆవిష్కరిస్తున్న ఫొటో చాట్ జీపీటీ ద్వారా ప్రత్యక్షమవ్వడం వైరల్‌గా మారింది. బీహార్‌కు చెందిన ఈ ఇద్దరితో పాటు ఈ సీజన్లో వేర్వేరు జట్లకు ఆడుతున్న అంగ్క్రిష్ రఘువంశీ (కేకేఆర్), సాకిబ్ హుస్సేన్ (ఎస్ఆర్హెచ్) కూడా అదే రాష్ట్రానికి చెందినవారు కావడం విశేషం. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఈ నలుగురు బీహార్ నుంచి వచ్చినవారు కావడంతో సెపరేట్‌గా ఒక ఐపీఎల్ జట్టు ఉంటే బాగుంటుందని అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ అంశం క్రీడల పరంగా బీహార్‌ను ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు తర్వాతి తరం క్రికెటర్లకు ఇది స్ఫూర్తినిచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లాగే బీహార్‌కు కూడా సొంత ఫ్రాంచైజీ ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే బీహార్ గడ్డ ఈ దేశానికి ఎంతో మంది క్రికెటర్లను అందించింది. పట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు. ఇక బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన సూర్యవంశీ ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. గోపాల్‌గంజ్‌లోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సాకిబ్ హుస్సేన్ ఇవాళ తన బౌలింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు. ఇదే రాష్ట్రానికి చెందిన అంగ్క్రిష్ రఘువంశీ తన డైనమైట్ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. వీరందరిని ఒక చోట చేర్చేలా బీహార్ పేరుతో ఒక ఫ్రాంచైజీని తీసుకొస్తే బాగుంటుంది' అని చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2026 సీజన్లో బ్యాటింగ్‌లో మెరిసిన వాళ్లలో రాజస్తాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ వైస్‌కెప్టెన్ ఇషాన్ కిషన్ ముందు వరుసలో ఉంటారు. ఈ సీజన్లో వైభవ్ 13 మ్యాచ్‌ల్లో 579 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉండగా, ఇషాన్ కిషన్ 13 మ్యాచ్‌ల్లో 490 పరుగులతో రేసులో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా అనిల్ అగర్వాల్ ప్రతిపాదనతో బీహార్ నూతన ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీ ఏకీభవించారు. 'బీహార్ క్రికెట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం స్పష్టమైన దార్శనికతో ఒక మిషన్ మోడ్లా పనిచేస్తోంది. మీరు ప్రతిపాదించిన విషయంతో ఏకీభవిస్తూ ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటాం' అని చెప్పుకొచ్చారు. ఇక ఐపీఎల్లో తొలుత 8 ఫ్రాంచైజీలు ఉంటే ఆ సంఖ్య 10కి పెంచారు. ఇటీవలే ఆర్సీబీ, రాజస్తాన్ ఫ్రాంచైజీలు భారీ ధరకు చేతులు మారాయి. ఒకవేళ బీసీసీఐ ఐపీఎల్లో ఫ్రాంచైజీల సంఖ్యను విస్తరించాలనుకుంటే మాత్రం బీహార్‌కు చెందిన అనిల్ అగర్వాల్ ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ముందుకు రావొచ్చు.क्या आपको नहीं लगता Chennai Super Kings, Mumbai Indians और Kolkata Knight Riders की तरह बेमिसाल बिहार की भी एक टीम होनी चाहिए?बिहार की मिट्टी ने देश को बहुत से बेहतरीन क्रिकेट खिलाड़ी दिए हैं।पटना में जन्मे ईशान किशन ने सबसे कम गेंदों में ODI double century लगाई। समस्तीपुर… pic.twitter.com/bgScCh40Zd— Anil Agarwal (@AnilAgarwal_Ved) May 22, 2026 आपकी बात से पूर्णतः सहमत हूँ।बिहार के क्रिकेट "इमोशन" के लिए सरकार स्पष्ट "विजन" के साथ "मिशन" मोड में कार्यरत है। आपके सहयोग से निश्चित ही बिहार की क्रिकेट टीम को लेकर सकारात्मक निर्णय लिया जाएगा। https://t.co/Q5xfXYGwiC— Samrat Choudhary (@samrat4bjp) May 22, 2026చదవండి: పంత్ డిమోషన్ వెనుక అతడిదే కీలకపాత్ర! -
‘బిహార్’ దెబ్బ: బంగ్లా వీడి ఆశ్రమానికి ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం దరిమిలా రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్‌ను కొత్త నిర్ణయం తీసుకున్నారు. పట్నాలోని విలాసవంతమైన బంగ్లాను వదిలి, ఒక ఆశ్రమానికి తన నివాసాన్ని మార్చారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.షేక్‌పురా హౌస్ ఖాళీ.. ఆశ్రమంలోనే బసదర్భంగాలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్ తాను పట్నాలోని పాత నివాసాన్ని ఖాళీ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఐఐటీ పట్నాకు సమీపంలో ఉన్న ‘బిహార్ నవనిర్మాణ ఆశ్రమం’ ఇకపై తన నివాసమని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ తన ముద్ర వేసేంత వరకు, అంటే తదుపరి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు తాను ఈ ఆశ్రమంలోనే ఉంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇంతకాలం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక ‘షేక్‌పురా హౌస్’ బంగ్లా నుండి కార్యకలాపాలు సాగించారు.ఘోర పరాజయం.. నితీష్‌పై తీవ్ర విమర్శలుఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ ఘోర పరాభవం తర్వాత పీకే రూట్ మార్చారు. ఇదే సమయంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లక్ష్యంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ కుమారుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కావడంపై మండిపడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజల వలసలను ఆపలేని ముఖ్యమంత్రి, తన కుమారుని రాజకీయ భవిష్యత్తుకు మాత్రం గట్టి పునాది వేసుకున్నారని పీకే ఎద్దేవా చేశారు.ఓటర్లకు పిలుపు.. రూ.10 వేల పథకంపై ఎటాక్కుల మతాలకు, డబ్బు ఆశలకు లొంగకుండా ప్రజలు తమ పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఓటు వేయాలని ప్రశాంత్ కిశోర్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ వంటి నాయకుల మాటలకు మోసపోవద్దన్నారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ కింద సుమారు 1.5 కోట్ల మంది మహిళలకు పంపిణీ చేసిన రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని ఉద్దేశిస్తూ.. కేవలం పదివేల రూపాయల కోసం ఓట్లను అమ్ముకోవద్దని పీకే ఓటర్లను హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ‘నాన్నా.. నీ కల నిజం చేస్తా’.. రాహుల్ భావోద్వేగ ట్వీట్! -
ఇంట్లో తిట్లు, బయట సెటైర్లు.. అయినా బస్సు డ్రైవర్లుగా అమ్మాయిలు
బిహార్‌లో ఆరుగురు యువతులు కొన్ని నెలల క్రితమే బస్ డ్రైవర్లుగా తమ వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. వాళ్లని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆడపిల్లలు బస్సులు నడపడం ఏంటని అంటున్నారు. బిహార్‌లో మహిళల భద్రత కోసం ప్రారంభించిన ‘పింక్ బస్’ పథకంలో భాగంగా తొలి మహిళా బస్ డ్రైవర్లుగా ఆరుగురు ముసహర్ దళిత మహిళలు బాధ్యతలు చేపట్టారు. అయితే మహిళా సాధికారత పేరుతో వచ్చిన ఈ పథకంలోనూ లింగ వివక్ష, అవమానాలు వారిని వెంటాడుతున్నాయి. అధికారులు ఇప్పటికీ వారితో పాటు పురుష డ్రైవర్లను పర్యవేక్షణకు పంపుతున్నారు. “ఇది మగవాళ్ల పని” అంటూ కొందరు సహచరులు ఎగతాళి చేస్తున్నారని మహిళా డ్రైవర్లు చెబుతున్నారు. పేదరికం, కుల వివక్ష, కుటుంబ అడ్డంకులను దాటుకుని వచ్చిన ఈ యువతులు ఇప్పుడు బిహార్ రోడ్లపై తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు పోరాడుతున్నారు.విశాలమైన బస్ డిపోలో 21 ఏళ్ల రాగిణి కుమారి జీన్స్, గులాబీ రంగు కుర్తీ, చెప్పులు ధరించి గులాబీ బస్సును కిక్కిరిసిన పార్కింగ్ ప్రాంతం నుంచి నెమ్మదిగా బయటకు తీసుకొస్తోంది. వరుసగా నిల్చున్న పురుష డ్రైవర్లు ఆమెను గమనిస్తున్నారు. బిహార్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన గులాబీ బస్ పథకం కింద నియమితులైన తొలి మహిళా బస్ డ్రైవర్లలో ఆమె ఒకరు. “పార్కింగ్ నుంచి బస్సును బయటకు తీసుకురాగలవా?” అని ఓ సహచరుడు అడిగాడు. రాగిణి మాత్రం స్టీరింగ్‌పై నుంచి చూపు తిప్పలేదు. “మా అమ్మాయిలపై మీకు నమ్మకం ఎప్పుడు వస్తుంది? కనీసం మమ్మల్ని నమ్మేందుకు ప్రయత్నించండి” అని ఆమె సమాధానం ఇచ్చింది. కొద్ది సేపటికి ఆ బస్సు డిపో నుంచి గాంధీ మైదాన్ వైపు బయల్దేరింది. రాగిణి నడిపే మార్గాల్లో అది ఒకటి. బిహార్ తొలి మహిళా బస్ డ్రైవర్ల బృందంలో ఆమెతో పాటు ఇంకో ఐదుగురు ఉన్నారు.ఈ నెల బిహార్ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ నియమించిన ఆరుగురు మహిళలూ ముసహర్ సమాజానికి చెందినవారే. బిహార్‌లో అత్యంత వెనుకబడిన దళిత వర్గాల్లో ఇది ఒకటి. బిహార్ ప్రభుత్వం చేసిన ఈ నియామకాలు మహిళా సాధికారతలో కీలక ఘట్టమని ప్రశంసలు అందుకున్నాయి. అయితే ఆ మహిళలకు అసలు పోరాటం అప్పుడే మొదలైంది. డిపోలో అనుమానం, మహిళలపై ద్వేషభావం, మహిళలకు పూర్తిగా బాధ్యత ఇవ్వటానికి వెనుకాడుతున్న రవాణా వ్యవస్థతో ఆ మహిళా డ్రైవర్లు పోరాడాల్సి వస్తోంది. పితృస్వామ్య సమాజంలో మార్పు తెస్తారా? బిహార్ తొలి మహిళా బస్ డ్రైవర్లుగా నియమితులైన ఈ ఆరుగురు ముసహర్ మహిళల పేర్లు రాగిణి కుమారి, గాయత్రి కుమారి, ఆర్తి కుమారి, సరస్వతి కుమారి, బేబీ కుమారి, అనిత కుమారి. ఈ యువతులు పేదరికం, కుల వివక్ష, కుటుంబ అడ్డంకులను దాటుకుని బస్సు స్టీరింగ్ పట్టారు. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వారికి పూర్తిస్థాయి స్వేచ్ఛ దక్కలేదు. మహిళల శారీరక సామర్థ్యంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకంలో 100 బస్సులకుగాను కేవలం ఆరుగురు మహిళా డ్రైవర్లే చేరారు. మిగతావారిని కుటుంబాలు ఆ పనులకు పంపలేదు. మరికొందరు అమ్మాయిల పెళ్లిళ్లు జరగడంతో వారు డ్రైవర్లుగా ఉద్యోగాల్లో చేరలేదు. అయినా, రాగిణి కుమారి, గాయత్రి కుమారి, ఆర్తి కుమారి, సరస్వతి కుమారి, బేబీ కుమారి, అనిత కుమారి బిహార్ పితృస్వామ్య ఆలోచనలకు సవాల్ విసురుతూ పోరాడుతున్నారు.గత ఏడాది ప్రారంభమైన బిహార్ గులాబీ బస్ పథకం పూర్తిగా మహిళల ఆధారిత వ్యవస్థగా మార్చాలనుకున్నారు. మహిళా ప్రయాణికులు, మహిళా కండక్టర్లు, మహిళా నోడల్ అధికారులు, మహిళా డ్రైవర్లు ఉండేలా రూపకల్పన చేశారు. ఆరు నగరాల్లో ప్రవేశపెట్టిన ఈ బస్సులు మహిళలకు సురక్షిత ప్రజా రవాణా అందించాలనే ఉద్దేశంతో వచ్చాయి. ఉద్యోగం కంటే పెళ్లికే ప్రాధాన్యం ఇవ్వాలని కుటుంబాలు ఒత్తిడి చేయటం, మహిళల సామర్థ్యంపై పురుష డ్రైవర్ల అనుమానాలు, మహిళా ఉద్యోగులకు సరిపడా సదుపాయాలు లేని రవాణా కార్యాలయాలు సమస్యలుగా మారాయి. బిహార్ అణచివేతకు గురైన ముసహర్ సమాజానికి చెందిన ఆరుగురు యువతులు తమవారి భవిష్యత్తు మారేలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పట్టు వదలకుం డ్రైవర్ జాబ్ చేస్తూ పితృస్వామ్య సమాజంలో మార్పు తెస్తారన్న భావనను అందరిలో కలిగిస్తున్నారు. “బిహార్ పితృస్వామ్య సమాజంలో ఈ అమ్మాయిల ప్రవేశం విప్లవాత్మకం. వీరు చూపిన ధైర్యం రాష్ట్రవ్యాప్తంగా యువతులకు ప్రేరణ అవుతుంది. పితృస్వామ్య ఆలోచనలను సవాలు చేసే మార్గం ఇది” అని సామాజిక కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుధా వర్గీస్ చెప్పారు. బస్సు స్టీరింగ్‌ను తాకితే ఆత్మవిశ్వాసం ప్రతి రోజు ఉదయం 6 గంటలకు 21 ఏళ్ల రాగిణి కుమారి పాట్నాలోని బిహార్ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ డిపోకు చేరుకుంటుంది. “బస్సు స్టీరింగ్‌ను తాకిన ప్రతిసారి నాకు ఆత్మవిశ్వాసం వస్తుంది. బస్సు స్టార్ట్ చేసిన ప్రతిసారి నా కష్టాల ప్రయాణం కళ్లముందు తిరుగుతుంది” అని ఆమె చెప్పింది.రాగిణి కుమారి, గాయత్రి కుమారి, ఆర్తి కుమారి, సరస్వతి కుమారి, బేబీ కుమారి, అనిత కుమారి 2025లో ఔరంగాబాద్‌లోని డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు. ఈ పథకానికి “మహిళలకు భద్రత, గౌరవం అందించేందుకు కట్టుబడి ఉన్న బిహార్ ప్రభుత్వం” అనే నినాదాన్ని ఇచ్చారు. పట్నా, గయా, ముజఫర్‌పూర్, దర్భంగా, భాగల్పూర్, పూర్ణియా నగరాల్లో బస్సులను ప్రారంభించారు.పట్నా పున్పున్ ప్రాంతంలోని అల్లౌద్దీన్చక్ గ్రామం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్‌కు పంపేందుకు రాగిణి తండ్రి తొలుత నిరాకరించాడు. “నాన్న అనుమతించలేదు. అయినా నేను ఇంటి నుంచి వెళ్లిపోయి శిక్షణ తీసుకున్నాను. అది సులభమైన ప్రయాణం కాదు” అని ఆమె చెప్పింది.గ్రామంలో పొరుగువారు ఆమె తల్లిదండ్రులను ఎగతాళి చేశారు. పెళ్లి చేయాలని సలహాలు ఇచ్చారు. ఆమె తల్లి సోనీ దేవి మాత్రం తన కూతురికి మద్దతుగా నిలిచింది. “ఆమె కోరుకున్నది చేయనిచ్చాను. నేను జీవితాంతం పేదరికంలో గడిపాను. ఆమె మాత్రం అలాంటి జీవితం గడపకూడదు” అని చెప్పింది. మసౌర్హిలో చరిత్ర ఆనర్స్ చదివిన రాగిణి ఇప్పుడు తన సహచరులతో కలిసి నెలకు రూ. 3,000 అద్దె చెల్లిస్తూ డిపోకు సమీపంలో ఉంటోంది. -
ఈ తల్లి ధైర్యానికి చేతులెత్తి మొక్కాల్సిందే
-
రైలులో ఒక్కసారిగా లేచిన మంటలు.. అంతటా ఆర్తనాదాలు
సాసారాం: నిద్రమత్తు వదలకముందే ఆ రైలు ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలింది. ప్రశాంతంగా సాగుతున్న వారి రైలు ప్రయాణం క్షణాల్లో భయానకంగా మారింది. బిహార్‌లోని సాసారాం జంక్షన్ సమీపంలో సోమవారం ఉదయం సాసారాం-పట్నా ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. అయితే, సకాలంలో అప్రమత్తం కావడంతో పెను ప్రాణనష్టం తప్పింది.ఉదయం 6 గంటలకు కలకలంసోమవారం తెల్లవారుజామున సుమారు 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాసారాం-పట్నా ప్యాసింజర్ రైలు జంక్షన్ ఏరియా సమీపానికి చేరుకోగానే, రైలులోని ఒక బోగీ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. పొగతో పాటు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీయడంతో రైల్వే స్టేషన్ పరిసరాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. Rohtas, Bihar: A fire broke out in the Sasaram-Patna passenger train at around 6AM due to a suspected short circuit Sasaram Junction. pic.twitter.com/HKaLPIIyzM— IANS (@ians_india) May 18, 2026షార్ట్ సర్క్యూటే కారణమా?ఈ అనుకోని అగ్నిప్రమాదానికి ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బోగీలో విద్యుత్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే మంటలు వ్యాపించినట్లు రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నారు.రంగంలోకి అత్యవసర బృందాలుప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక రైల్వే సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఎవరికీ గాయాలు గానీ కాలేదని తెలుస్తోంది. -
నిర్దోషని కోర్టు చెప్పినా..14 ఏళ్లు నిర్బంధంలోనే..
హత్య కేసులో ఓ వ్యకి జైలు కెళ్లాడు. సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది. ఆ వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయినా ఆ వ్యక్తికి స్వేచ్ఛ లభించలేదు. జైలు గోడలు దాటి బయటకు రాలేదు. రోజులు నెలలయ్యాయి.. నెలలు సంవత్సరాలయ్యాయి.. అలా 14 సంవత్సరాలు గడిచాయి. విడుదల ఊసు లేదు. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. తనను విడుదల చేయాలని బాధితుడే చివరికి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. ఫైలు కదిలింది..ఆ వ్యక్తికి విడుదల లభించింది. తీర్పుకు ముందే ఇదంతా జరిగింది. అయితే అధికారుల తీరును, వ్యవస్థలోని లోపాలను కోర్టు తప్పుబట్టింది. ఓ వ్యక్తి జీవించే హక్కును కాలరాశారంటూ మండిపడింది. పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఒక చారిత్రక ముందడుగుకు ఈ కేసు మార్గం చూపింది.బిహార్‌కు చెందిన రుదుల్ సాహ్ ఓ హత్య కేసులో అరెస్టయి జైలు కెళ్లాడు. ముజఫర్‌పూర్ సెషన్స్ కోర్టు అతనిపై నమోదైన అభియోగాలను కొట్టేసింది. 1968లో నిర్దోషిగా ప్రకటించింది. అయినా అతడ్ని విడుదల చేయలేదు. దాంతో 1982 వరకు అంటే 14 సంవత్సరాల పాటు నిర్బంధంలోనే ఉన్నాడు. ‘సుప్రీం’లో పిటిషన్తన నిర్బంధం చట్టవిరుద్ధమని, నిర్దోషిగా ప్రకటించినా కారాగారంలోనే ఉంచారని, వెంటనే విడుదల చేయాలని రుదుల్ సాహ్ సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.. పునరావాసం, అక్రమ నిర్బంధానికి పరిహారం ఇవ్వాలని అభ్యర్థించాడు. అయితే బాధితుడు పిటిషన్ వేసిన తర్వాత అధికారులు అతడ్ని జైలు నుంచి విడుదల చేశారు. ఈ పిటిషన్ 1982 నవంబర్ 22న విచారణకు వచ్చింది. పిటిషనర్ ఇప్పటికే విడుదలైనందున ‘విడుదల’ అభ్యర్థన అర్థం లేనిదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నాడు. విడుదలే పరిష్కారం కాదుపిటిషనర్ విడుదలతో ఈ కేసు ముగిసినట్టు కాదని విచారణ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్‌ను 14 సంవత్సరాలు జైల్లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు జైలులో ఉంచాలని సెషన్స్ కోర్టు పేర్కొంది..అతని మానసిక స్థితి కూడా సరిగా లేకపోవడంతో విడుదలలో జాప్యం జరిగింది’ అని ముజఫర్‌పూర్ జైలు అధికారి అఫిడవిట్ సమర్పించాడు. సరైన ఆధారాలేవీ?అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్ మానసిక స్థితి సరిగా లేదని నిరూపించే మెడికల్ సర్టిఫికెట్లు, చికిత్స వివరాలు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది. 1977లో సాధారణ స్థితికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత అయినా ఎందుకు విడుదల చేయలేదని ధర్మాసనం నిలదీసింది. ఒకవేళ పిటిషనర్ మానసిక స్థితి సరిగా లేకపోతే చట్టం అతడికి కల్పించిన హక్కుల ప్రకారం విచారణ కూడా చేయకూడదు కదా? అని ప్రశ్నించింది.‘ పిచ్చి వాడనే’వాదన తర్వాత తయారు చేసినట్టుగా కనిపిస్తోందని ఆక్షేపించింది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం చెల్లింపునకు ఆదేశంప్రాథమిక హక్కు ఉల్లంఘిస్తే, ఆ ఉల్లంఘనకు పరిహారం చెల్లించాలని ఆదేశించడం కూడా కోర్టు పరిధిలోకి వస్తుందని ‘సుప్రీం’ స్పష్టం చేసింది. అక్రమంగా 14 ఏళ్లపాటు జైలులో ఉన్నాడు. కాబట్టి కావున అతనికి పరిహారం ఇవ్వడం తప్పని సరి అని కోర్టు పేర్కొంది. తాత్కాలిక ఉపశమనంగా చెల్లించిన ఐదువేల రూపాయలకి అదనంగా మరో రూ. 30,000 చెల్లించాలని ఆదేశించింది. మరింత నష్టపరిహారం కోసం సివిల్ కోర్టును ఆశ్రయించడానికి ఇది అడ్డంకి కాదని పేర్కొంది. వ్యక్తిగత హక్కుల రక్షణే ప్రజాస్వామ్యానికి మూలాధారం. ప్రభుత్వ అధికారులు చేసిన తప్పుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని, ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిందే అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసుకు ముందు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే కేవలం విడుదల ఆదేశాలకు మాత్రమే కోర్టు పరిమితమయ్యేది. కానీ, ఒక వ్యక్తి ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తే .. నేరుగా జోక్యం చేసుకుని పరిహారం ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వగలదని ఈ కేసులో స్పష్టం అయింది. కేసులో ప్రధానంగా ఆర్టికల్ 21, ఆర్టికల్ 32 గురించి ధర్మాసనం ప్రస్తావించింది..ఆర్టికల్ 21: చట్టబద్ధమైన కారణం లేకుండా ప్రభుత్వం ఎవరినీ నిర్బంధించకూడదు. ఏ వ్యక్తి జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదని ఈ ఆర్టికల్ చెబుతోంది. ఆర్టికల్ 32: రాజ్యాంగ పరిహారాల హక్కుకు హామీ ఇస్తుంది . ఇది ప్రాథమిక హక్కుల అమలు కోసం నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించే అధికారాన్ని పౌరులకు కల్పిస్తుంది. -
ఆ తల్లి తన ప్రాణాల్ని పణంగా పెట్టి..
కొంచెంసేపు ఉంటే.. ఆ ఐదుగురి ప్రాణాలు పట్టాల కింద నలిగిపోయేవి. కానీ, సమయస్పూర్తితో ఆమె వ్యవహరించిన తీరు.. అదనంగా ఆ తల్లి చూపిన తెగువ.. వాళ్లను సురక్షితంగా బయటపడేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.శుక్రవారం ఉదయం బిహార్ షాహ్పూర్ పటోరీ రైల్వే స్టేషన్లో ఓ ఘోర ప్రమాదం తప్పింది. ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కాస్త ఉంటే ప్రాణాలు కోల్పోయేవారు. అయితే అందులో మమత అనే మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు బంధువులనూ రక్షించుకోగలిగింది. ఈ క్రమంలో ఆమెకు గాయాలు అయ్యాయి. వీళ్లంతా వైశాలి జిల్లా జందాహాలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యారు. రోసరా వెళ్లేందుకు టికెట్ తీసుకుని ఫ్లాట్‌ఫారమ్‌కు వెళ్తున్నారు. అయితే ఫుట్ఓవర్ బ్రిడ్జి ద్వారా కాకుండా పట్టాల ద్వారా దాటేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ప్లాట్‌ఫారమ్ మీద ఓ గూడ్స్ రైలు ఉంది. దాని కింద నుంచి దాటుతున్న టైంలో.. రైలు హఠాత్తుగా కదిలింది. అంతే.. ఆ దృశ్యం చూసిన అందరి గుండెలు గుభేల్మన్నాయి. వాళ్లు రైలు కింద నలిగిపోవడం ఖాయమని అంతా భావించారు. హాహాకారాలతో ఆ ప్రాంతం మారోమోగిపోయింది. కానీ, మమత సమయస్ఫూర్తి ప్రదర్శించింది. తన ఇద్దరు పిల్లలను కౌగిలించుకుని.. మిగతా వాళ్లనూ రైలు-ప్లాట్‌ఫారమ్ మధ్యలో సన్నని ఖాళీలో పట్టుకుని ఉండిపోయింది. అది గమనించిన కొందరు ఆమెకు చెయ్యి అందించారు. ఈలోపు గూడ్స్ వేగం పుంజుకోవడంతో అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ క్రమంలో రైలు ఆమెను ఢీ కొట్టుకుంటూ పోవడంతో గాయాలు అయ్యాయి. ఆపై గూడ్స్ వెళ్లిపోవడంతో.. వాల్లు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అక్కడే ఉన్న ప్రయాణికుల సాయంతో గాయపడిన మమతకు తక్షణ చికిత్స అందించగా.. ఆమె కోలుకుని వెళ్లిపోయింది. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది. తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను రక్షించిన ధైర్యాన్ని ప్రజలు ప్రశంసించారు. “రెప్పపాటులో తీసుకున్న నిర్ణయం ఐదు ప్రాణాలను కాపాడింది” అని వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. అదే సమయంలో.. ఈ సంఘటన రైల్వే భద్రతా చర్యలపై ప్రశ్నలు లేవనెత్తింది. ప్రయాణికులు ఎప్పుడూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వాడాలని అధికారులు మళ్లీ హెచ్చరించారు. షార్ట్‌కట్ ప్రయత్నాలు ప్రాణాలకు ముప్పు అని గుర్తు చేశారు. ఈ వీడియో చూశాక.. 'ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు..’ అనకుండా ఉండగలరా?.. SHOCKING VISUALS 🚨A mother in Bihar risked her own life to save her two children after a train suddenly arrived while they were crossing the tracks near Shahpur Patori railway station.According to reports, the three women quickly sat down with the children pressed beneath… pic.twitter.com/JCEdu5R9Y3— Megh Updates 🚨™ (@MeghUpdates) May 15, 2026 A major accident was averted at Shahpur Patori railway station. The abductor was none other than a mother who risked her own life to save his children's #samastipur #Bihar https://t.co/vwgSvpyA1s pic.twitter.com/bQeGowUl2N— Siraj Noorani (@sirajnoorani) May 15, 2026 -
అసలు అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి.. వైరల్ అవుతున్న బీహార్ మంత్రి మాటలు
-
పెళ్లైన నాలుగు రోజులకే దారుణం : బంగారు గొలుసు కోసం
బీహార్‌లో ఒక నవ వధువు కేవలం బంగారం గొలుసుకోసం పెళ్లైన నాలుగు రోజులకే ప్రాణాలు కోల్పోయింది. చాలా నెమ్మదస్తు రాలు, డిగ్రీ చదువుకుంది. సంప్రదాయబద్ధంగా నడుచుకునే పొందికైన అమ్మాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎవరిపైనా ఎప్పుడూ గట్టిగా మాట్లాడని సౌమ్యురాలు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కనేది. కానీ పెళ్లి, అత్తింటి వారి అత్యాశ ఆమె నూరేళ్ల కలల్ని కాలరాచింది. నవవధువు అన్న కనికరం కూడా లేకుండా అత్యంత పాశవికంగా హత్య చేయడమే కాదు, పుట్టింటి వారికి కనీసం చివరి చూపు కూడా దక్కకుండా మృతదేహం దహనం చేయడం కలకలం రేపింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.బీహార్‌కు చెందిన 23 ఏళ్ల సంజు కుమారికి, వినోద్ పాల్‌తో మే 7న ఘనంగా వివాహం జరిగింది. సంజు కుటుంబ సభ్యులు తమ ఆర్థిక శక్తికి మించి రూ. 4 లక్షల నగదు, మోటార్ సైకిల్, ఫ్రిజ్, ఫర్నిచర్,ఇతర బంగారు, వెండి ఆభరణాలను కట్నంగా ఇచ్చారు. అయితే, పెళ్లి సమయంలో వరుడి పక్షం వారు ఒక బంగారు గొలుసు కావాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఇవ్వలేక పోయిన సంజు కుటుంబం, తర్వాత ఇస్తామని హామీ ఇచ్చింది. వధువు కుటుంబం బంగారు గొలుసు తప్ప అన్నీ 'బహుమతిగా' ఇచ్చింది. సంజు బంధువైన తమ తమ ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు పెట్టి మరీ ఏప్రిల్ 30న తిలక్ వేడుక మొదలు, హల్దీ వేడుక ఇలా అంగరంగ వైభవంగా, ఆడంబరంగా పెళ్లి చేశారు. కానీ ఏం లాభం అత్తింటి ఆరళ్లకు ఆమె బలైపోయింది.అత్తింట్లో ఉన్న నాలుగు రోజులు సంజును అత్తగారింటి వారు శారీరకంగా, మానసిక హింసకు గురిచేశారు. "ఇంత గొప్పగా పెళ్లి చేశారు కానీ ఒక బంగారు గొలుసు ఇవ్వలేకపోయారా?" అంటూ సూటిపోటి మాటలతో వేధించేవారు. నరకం చూపించారు. ఆమెను తన పుట్టింటి వారితో మాట్లాడనిచ్చేవారు కాదు. రహస్యంగా ఫోన్ కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా, కొట్టే వారట. తనపై జరుగుతున్న ఈ వేధింపుల గురించి ఆ కొత్త వధువు తన కుటుంబానికి ఫిర్యాదు చేసింది. "అన్నా, ఇక్కడ చాలా హింసిస్తున్నారు. నాకు ఇక్కడ బాగోలేదు," అని అన్నతో వాపోయింది. అయితే పరిస్థితులు చక్కబడతాయిలే అని కుటుంబ సభ్యులు అనుకున్నారు.సోదరుడితో సంజు చివరి మాటలు మే 13న అమ్మాయికి పుట్టింటికి తీసుకురావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మే 11న సంజు సోదరుడు శివమ్ తన బావ వినోద్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా, వినోద్ తల్లి ఫోన్ లాక్కొని, "నీ చెల్లి ప్రాణాలతో రాదు, ఆమె శవమే వస్తుంది" అని బెదిరించింది. అదే సమయంలో వెనుక నుంచి సంజు అరుపులు వినిపించాయని శివమ్ ఆరోపించాడు.ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్‌షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?హత్య , హడావిడిగా అంత్యక్రియలు సంజును గొంతు నులిమి చంపేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలను తుడిచిపెట్టడానికి పోలీసులు వచ్చేలోపే అత్తగారింటి వారు ఆమె మృతదేహాన్ని దహనం చేశారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు, అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో మే 12న కుటుంబ సభ్యులు స్మశానానికి చేరుకునేసరికి మృతదేహం దాదాపు కాలిపోయింది. కేవలం కొన్ని శరీర భాగాలు (కాళ్లు, పుర్రె భాగం) మాత్రమే మిగిలాయి.శివం ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు జగదీష్పూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుశాంత్ కుమార్ మండల్ తెలిపారు. భర్త వినోద్ ,అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు. సంజు అత్త సుమిత్రా దేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు విషయంలో గొడవ జరిగిన మాట నిజమేనని, అయితే సంజు ఆత్మహత్య చేసుకుందని ఆమె పోలీసు విచారణలో పేర్కొంది.పోలీసులు దీనిని హత్య, ఆత్మహత్య రెండు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్న యువతి కలలు ఇలా వరకట్నపు విషజ్వాలలకు ఆహుతి కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను -
కొడుకు కోసం నితీష్ అంత పనిచేశారా?.. ఆ రోజు ఏం జరిగింది?
పట్నా: బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో భాగంగా బిహార్‌లో 32 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న నిశాంత్, ఇప్పుడు పూర్తిస్థాయి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిశాంత్ కుమార్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.నిశాంత్ ప్రాథమిక విద్యాభ్యాసం పట్నాలోని సెయింట్ కారెన్స్ స్కూల్లోసాగింది. ఆ తర్వాత ముస్సోరీలోని మానవ్ భారతి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. ప్రఖ్యాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT) మెస్రా నుండి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేశారు.నిశాంత్ కుమార్ చిన్నతనంలో జరిగిన ఓ ఆసక్తికరమైన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నిశాంత్ రెండో తరగతి చదువుతున్నప్పుడు.. ఓ ఉపాధ్యాయుడు అతడిని బెత్తంతో కొట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న నితీష్ కుమార్ కోపంతో నేరుగా స్కూల్‌కి వెళ్లారు. అయితే, ఉపాధ్యాయుడిపై ఎటువంటి గొడవ చేయలేదు. మౌనంగా తన కుమారుడిని వేరే పాఠశాలలో చేర్పించారు.ఇది నితీష్ కుమార్ క్రమశిక్షణ, తన కొడుకు పట్ల ఆయనకున్న బాధ్యతకు నిదర్శనంగా చెబుతుంటారు. 2007లో నిశాంత్ తల్లి మంజు సిన్హా మరణించారు. ఈ ఘటన నిశాంత్‌ను తీవ్రంగా కలచివేసింది. ఆయన చాలా కాలం పాటు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 8న ఆయన అధికారికంగా జేడీయూ పార్టీలో చేరారు. -
రెండు రాష్ట్రాల టాపర్‌గా ఎంఎస్ ధోని
టీమిండియా దిగ్గజ ఆటగాడు, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌టైమ్ గ్రేట్ అయిన ఎంఎస్ ధోని, ఓ ఆర్దికపరమైన అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల టాపర్‌గా నిలిచాడు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా రికార్డు నెలకొల్పాడు.ఇన్కమ్ ట్యాక్స్ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, బిహార్-ఝార్ఖండ్ కలిపి గత ఆర్థిక సంవత్సరంలో సుమారు ₹20,000 కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేశాయి. ఇందులో ₹12,000 కోట్లు ఒక్క ఝార్ఖండ్ రాష్ట్రం నుంచే వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుగా ధోని నిలిచాడు. ఈ విషయాన్ని బిహార్-ఝార్ఖండ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ డా. డి. సుధాకర రావు మీడియాకు వెల్లడించారు.ధోని ఎంత పన్ను చెల్లించాడన్న వివరాలను అధికారికంగా వెల్లడించకపోయినా, అతని ఆస్తులు, పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ఆధారంగా సుమారు ₹38 కోట్ల పన్ను చెల్లించినట్లు అంచనా వేస్తున్నారు.ధోని నికర సంపద మరియు ఆదాయాలు: 2026 మే నాటికి ధోని నికర సంపద సుమారు ₹1,060 కోట్లుగా అంచనా వేయబడింది. సంవత్సరానికి సుమారు ₹75 కోట్లు వివిధ వనరుల ద్వారా సంపాదిస్తున్నాడు. టెక్నాలజీ, ఫిన్‌టెక్ రంగాల్లో కార్స్24, గరుడ ఏరోస్పేస్, ఖటాబుక్ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్‌గా, ఇన్వెస్టర్‌గా ఉన్నాడు.ఫుడ్ & బెవరేజెస్ రంగంలో సెవెన్ ఇంక్ బ్రివ్స్, హౌస్ ఆఫ్ బిర్యాని, షాకా హ్యారీ (ప్లాంట్ బేస్డ్ మీట్) వంటి బ్రాండ్లతో ముడిపడి ఉన్నాడు. క్రీడా యాజమాన్యంలో చెన్నైయిన్ ఎఫ్‌సి (ISL ఫుట్‌బాల్), మహి రేసింగ్ టీమ్ ఇండియా (సూపర్‌స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్)కు కో-ఓనర్‌గా ఉన్నాడు.ధోని పేరిట రాంచీలో 7 ఎకరాల్లో ఓ లగ్జరీ ఇళ్లు ఉంది. 100కి పైగా వింటేజ్, మోడరన్ బైకులు ఉన్నాయి. వీటన్నటి కోసం ఓ గాజు గోడల గ్యారేజీ ఉంది. అలాగే 43 ఎకరాల ఫామ్‌ను నిర్వహిస్తూ వాణిజ్యపరంగా కూరగాయలు సాగు చేస్తున్నాడు.భారతీయ క్రికెటర్లలో ఎవరు ఎంత పన్ను చెల్లిస్తున్నారు..?(2023-24 ఆర్థిక సంవత్సరం ఆధారంగా)- విరాట్ కోహ్లీ : ₹66 కోట్లు - ఎంఎస్ ధోని : ₹38 కోట్లు - సచిన్ టెండూల్కర్ : ₹28 కోట్లు - సౌరవ్ గాంగూలీ : ₹23 కోట్లు - హార్దిక్ పాండ్యా : ₹13 కోట్లు -
వరుడి అనూహ్య మరణం, పెద్దల షాకింగ్ నిర్ణయం
బిహార్‌లో అత్యంత దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. బంధుమిత్రులు, పెళ్లి వేడుకలతో కళకళలాడుతున్న ఉన్నట్టుండి విషాదంగా మారిపోయింది. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడంతో అంతా నివ్వెర పోయారు. కానీ పుట్టెడు దుంఖాన్నిగుండెల్లో దాచుకుని ఆ శుభకార్యాన్ని జరిపించారు. అదేంటి.. అదెలా అనుకుంటున్నారా? పూర్తి వివరాలు తెలియాంటే ఈ కథనం చదవాల్సిందే.ఒక వైపు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకును కోల్పోయిన బాధ, మరోవైపు బాధ్యతగా జరిపించిన పెళ్లి.. ఈ సంఘటన చూస్తుంటే కాలం ఎంత క్రూరమైనదో కదా అనిపించకమానదు. దంపతులిద్దరూ సంతోషకరమైన వేడుకగా కలకాలం గుర్తుంచు కోవాల్సిన మధురమైన క్షణాలు కాస్తా జీవితకాల దుఃఖంగా మారిపోవడం విధి విచిత్రమే. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అంటే ఇదేనేమో!వివరాల్లోకి వెళ్తే.. ముందుగా నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి జరిపించే సందడిలో ఉన్నాయి ఇరు కుటుంబాలు. ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహితులతో పెళ్లి మండపం కళకళలాడుతోంది. మరోవైపు వరుడు తన బంధుమిత్రులు, మేళతాళాలతో కలిసి పెళ్లి వేదిక వైపు ఊరేగింపుగా బయలుదేరాడు. అందరూ ఎంతో ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకొంటున్న సమయంలో, వరుడు ప్రయాణిస్తున్న వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద తీవ్రతకు వరుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ వార్త తెలియగానే అందరూ నిశ్చష్టులైపోయారు. సంతోషంతో నిండిపోవాల్సిన ఇరు కుటుంబాల్లోనూ, గ్రామంలోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఆటపాటలతో సందడిగా ఉన్న వాతావరణం అంతా హాహాకారాలతో నిండిపోయింది. ఇక్కడే బంధవులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: ఎంపీ మహువాకు ఇండిగో విమానంలో చేదు అనుభవంఅనూహ్య నిర్ణయంఅయితే, ఈ ఘోర విషాదం జరిగిన తర్వాత ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సామాజిక ఆచారాలు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వరుడి కుటుంబ సభ్యులు గుండెలు దిటవు చేసుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన వరుడి స్థానంలో, అతని తమ్ముడికి ఇచ్చి వధువుకు వివాహం చేయాలని నిర్ణయించారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి ఆగిపోకూడదనే ఉద్దేశంతో, పెళ్లి పీటల మీద తమ్ముడిని కూర్చోబెట్టి వివాహ క్రతువును పూర్తి చేశారు. విషాద ఛాయల మధ్యే ఆ వివాహం ముగిసింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే వధూవరులు ఈ తంతును ముగించారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 🚨SHOCKING | Groom died in a horrific accident while on the way to his own wedding, after which the bride was married to his younger brother with the family's consent. Both cry inconsolably pic.twitter.com/KYow2jVOJ4— The Tatva (@thetatvaindia) May 7, 2026స్థానికుల భిన్నాభిప్రాయాలుఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సామాజిక ఒత్తిడి, ఆచారాల దృష్ట్యా ఆ కుటుంబం తీసుకున్నది చాలా కష్టమైన నిర్ణయమని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలవంతంగా పెళ్లి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. -
హృదయ విదారకం : పట్టాలు దాటుతూండగా!వైరల్ వీడియో
బీహార్‌లోని పాట్నా పరిధిలోని బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అటు నుంచి శరవేగంగా దూసుకొస్తున్న రైలు. మరోవైపు పట్టాలు దాటుతున్న జనం. అంతే క్షణాల్లో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పటిదాకి తమ చేయి పట్టుఉన్న వారు, కళ్లముందే ఛిద్రం కావడంతో బంధువులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటనకు సంబంధించిన హృదయవిదారక వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.ఢిల్లీ నుంచి మాల్దాకు వెళ్తున్న ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు ప్లాట్‌ఫాం నంబర్ 1 వద్దకు వస్తుండగా ఈ దిగ్భ్రాంతి కర ఘటన జరిగింది. బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్లో అతివేగంగా దూసుకొస్తోంది. ఇంతలో కొంతమంది పట్టాలు దాటడానికి ప్రయత్నించారు. కొంతమంది వేగంగా ముందుకెళ్లిపోగా, ఇద్దరు మహిళలు బ్యాగులతో ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ వెనుక బడిపోయారు. అంతే క్షణాల్లో వారు రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోయారు. వారి తొందరపాటును గమనించిన ఇద్దరు ప్రయాణికులు సహాయానికి వచ్చారు కానీ వారిని పైకి లాగలేకపోయారు. ఒక వ్యక్తి మహిళల్లో ఒకరిని ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కించే ప్రయత్నంలో కింద పడియాడు. మరొక వ్యక్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. రైలు వారిపై నుండి దూసుకెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. దీంతో ప్లాట్‌ఫాంపైన ఉన్నవారితో పాటు వీక్షకులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన మే 4వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు జరిగింది. ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి? <मित्रों ये वीडियो देखकर मेरा कलेजा फट गया बख़्तियारपुर रेलवे स्टेशन प्लेटफार्म पार करते समय दो महिलाओं की ट्रेन से कटकर दर्दनाक मौत हो गईयह घटना उस समय घटी जब दिल्ली से मालदा जाने वाली फरक्का एक्सप्रेस प्लेटफार्म नंबर 1 पर आ रही थीउसी समय दो महिलाएं पटरी क्रॉस करके प्लेटफार्म… pic.twitter.com/VRd6sPZ3Je— Jitendra Verma (@jeetusp) May 5, 2026దీంతో కొద్ది సేపు స్టేషన్లో రైలు సేవలు కొద్దిసేపు నిలిపివేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.మృతుల వివరాలు ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల బంధువులకు సమాచారం అందించామని, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జవహర్ లాల్ ధృవీకరించారు. ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే! నోట్ : దయచేసి వేగంగా వెళ్లాలనే తొందరలో ప్లాట్‌ఫాం చేరుకోవడానికి పట్టాలు దాటొద్దు. ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. కాస్త నిదానించండి. ఫుట్‌బ్రిడ్జ్‌ను ఉపయోగించండి. -
Bihar: ఎన్‌కౌంటర్‌తో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
సుల్తాన్‌గంజ్: బిహార్ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పుడు తుపాకుల మోత వినిపిస్తోంది. పట్టపగలు జరిగిన ఓ దారుణ హత్యకు.. కొద్ది గంటల వ్యవధిలోనే ఎన్కౌంటర్ రూపంలో పోలీసులు ముగింపు పలికారు. సుల్తాన్‌గంజ్ మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసులో జరిగిన రక్తపాతానికి ప్రతీకారంగా జరిగిన ఈ భాగల్పూర్ ఎన్కౌంటర్.. రాష్ట్రంలో నేరస్తులకు కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఇస్తున్న స్పష్టమైన, కఠినమైన హెచ్చరికగా మారింది.పట్టపగలు హత్య.. గంటల్లోనే ఎన్కౌంటర్సుల్తాన్గంజ్ మున్సిపల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణ భూషణ్ కుమార్‌ను దారుణంగా కాల్చి చంపిన ప్రధాన నిందితుడు రామ్‌ధాని యాదవ్‌ను పోలీసులు అదే వేగంతో మట్టుబెట్టారు. ఆ దాడిలో చైర్మన్ రాజ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిందితుడిని తీసుకెళ్తుండగా, అతను పోలీసులపైకి కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రామ్‌ధాని ఆసుపత్రిలో మరణించగా, ముగ్గురు పోలీసులు సైతం గాయపడి చికిత్స పొందుతున్నారు.రాజకీయ రగడ.. విపక్షాల ఆరోపణలుఈ ఎన్కౌంటర్ బీహార్‌లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. మృతి చెందిన నేరస్తుడికి బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నాయంటూ ఫోటోలను పంచుకున్న ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్, ప్రభుత్వమే నేరస్తులను కాపాడుతోందని ఆరోపించారు. అయితే అధికార ఎన్డీఏ పక్షాలు ఈ విమర్శలను తీవ్రంగా తిప్పికొట్టాయి. చట్టం తన పని తాను చేసుకుపోతోందని బీజేపీ పేర్కొనగా.. ‘ఇది కొత్త బీహార్, ఇక్కడ తూటాకు ఫిరంగితోనే సమాధానం చెబుతాం’ అని కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ స్పష్టం చేస్తూ పోలీసుల చర్యను సమర్థించారు.‘యూపీ మోడల్’ దిశగా కొత్త ప్రభుత్వంఈ ఘటనను అత్యంత విచారకరంగా వర్ణించిన ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారాన్ని, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ అవలంబించిన కఠినమైన విధానాన్ని ఇప్పుడు బీహార్ ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. భాగల్పూర్ ఎన్కౌంటర్.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాలపై ఉక్కుపాదం మోపడానికి కొత్త ప్రభుత్వ తొలి అడుగుగా నిలిచింది.ఇది కూడా చదవండి: కప్పు టీ.. కోటిన్నర విరాళం: ఆశ్రమం కోసం అద్భుతం -
Bihar: సొంత ఇంటి మెట్లనే కూల్చేసుకున్న సీఎం!
పట్నా: బిహార్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి.. ఈ తరహా చర్యలను తన సొంత ఇంటి నుంచే ప్రారంభించి, అందరినీ ఆశ్యర్యానికి గురిచేశారు. ముఖ్యమంత్రి ఇంటి మీదకు బుల్డోజర్లు వెళ్లడం సంచలనంగా మారింది.సీఎం సొంత ఇంటిపైకే బుల్డోజర్ముంగేర్ జిల్లా తారాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం సామ్రాట్ చౌదరి సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన తన సొంత ఇంటి మెట్లను సైతం అధికారులు కూల్చివేస్తున్నారని ఆయన వెల్లడించారు. ‘వ్యక్తిగత భూమిలో ఇల్లు కడితే ఎలాంటి ఇబ్బందీ లేదు, కానీ ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపడితే అది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన, అందమైన బిహార్ నిర్మాణానికే ఈ కఠిన చర్యలని స్పష్టం చేశారుఅధికారులకు అల్టిమేటంసామాన్యుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా పంచాయతీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. అదే సమయంలో ప్రభుత్వ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏ అధికారి అయినా ఒక ఫైలును నెల రోజులకుపైగా పెండింగ్‌లో పెడితే, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్లాక్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లలో పెండింగ్ పనులపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, ఇకపై సీఎంవో నేరుగా ఆయా కార్యాలయాలను పర్యవేక్షిస్తుందని చెప్పారు.మోదీ కలల ప్రాజెక్టు.. నితీష్ కుమార్‌కు ప్రశంసలుబీహార్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చాలన్న ప్రధానమంత్రి కలను నెరవేర్చి తీరుతామని సామ్రాట్ చౌదరి ఉద్ఘాటించారు. 20 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసి ఏప్రిల్ 14న రాజీనామా చేసిన నితీష్ కుమార్ గతంలో చేసిన అభివృద్ధి పనులను ఆయన ప్రశంసించారు. అయితే ఆ అభివృద్ధి వేగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని కొత్త సీఎం అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 15న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, తొలి సభలోనే తన మార్క్ పరిపాలనను చూపారు.ఇది కూడా చదవండి: బీజేపీ అభ్యర్థి ఇంటివద్ద బాంబుల మోత -
Viral: మోదీ హత్యకు స్కెచ్..!
-
దుమారం రేపుతున్న ఎంపీ ‘పడకగది’ వ్యాఖ్యలు
పాట్నా: ఒకవైపు మహిళల రాజకీయ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి దేశ వ్యాప్తంగా విపరీతంగా చర్చలు నడుస్తున్న వేళ.. బిహార్ ఎంపీ పప్పూ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు పప్పూ యాదవ్. 90 శాతం మహిళల రాజకీయ జీవితం.. నాయకుల బెడ్రూమ్ నుంచే మొదలవుతోందంటూ అసభ్యంగా మాట్లాడారు. రాజకీయ నాయకులంతా మహిళలపై కన్నేసి వారిని హింసిస్తున్నారని కొత్త వివాదానికి తెరలేపారు. మహిళల పట్ల రాజకీయ నేతల ప్రవర్తనకు సంబంధించి నిత్యం ఏదో ఒక నాయకుడి సీసీ టీవీ ఫుటేజ్ బయటపడుతూనే ఉందని, అమెరికా నుంచి భారత్ వరకూ అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోందని అసహ్యంగా మాట్లాడారు. ఎంపీ పప్పూ యాదవ్ వ్యాఖ్యలపై బిహార్ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది, ఇది మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ కోరింది. మరొకవైపు పప్పూ యాదవ్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పప్పు యాదవ్‌ను పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి పప్పూ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.'Women start careers in men's bedrooms... 90% female Netas start this way.'Despicable,outrageous comments by Pappu Yadav,abusing self made women politicians. Will @priyankagandhi sack this obnoxious misogynist or does she endorse his views?Disgusting ppl pic.twitter.com/7PDBhp5Nrv— Tuhin A. Sinha तुहिन सिन्हा (@tuhins) April 21, 2026 -
బిహార్ అభివృద్ధిపై ఓ కన్నేసి ఉంచుతా : జేడీయూ చీఫ్ నితీష్
సాక్షి, పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జేడీయూ (JD-U) అధ్యక్షుడు నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నప్పటికీ బిహార్ అభివృద్ధి , పురోగతిపై తాను ఒక కన్నేసి ఉంచుతానని పేర్కొన్నారు. తన పార్టీ శాసనసభ్యులతో సమావే మైన సందర్భంగా ఆయన రాష్ట్ర అభివృద్ధి , పురోగతిపై తన పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉండాల్సిన సమయం మినహా, మిగిలిన గరిష్ట సమయాన్ని తాను బిహార్‌లోనే గడుపుతానని నితీష్ కుమార్ పార్టీ నేతలకు తెలిపారు. ప్రభుత్వ పనులను నిశితంగా పర్యవేక్షిస్తూ, రాష్ట అభివృద్దిపై దృష్టి పడతానని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంలో జేడీయూ కీలక భాగస్వామిగా ఉన్నందున, గతంలో తాను ప్రారంభించిన మంచి పనులు కొనసాగేలా చూస్తానని, దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు జేడీయూ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకునే అధికారాన్ని ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా నితీష్ కుమార్‌కే అప్పగించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్), ఉప ముఖ్యమంత్రులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ తదితర కీలక నేతలు పాల్గొన్నారు.ఇదీ చదవండి: కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకిఏప్రిల్ 10న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, నితీష్ కుమార్ ఏప్రిల్ 14న బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ గత నెలలోనే జేడీయూలో చేరారు. అయితే, సామ్రాట్ చౌదరి ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టడానికి ఆయన నిరాకరించారు.నిశాంత్‌ను పార్టీ భవిష్యత్తు నాయకుడిగా అందరూ అంగీకరించారని, అయితే తాజా సమావేశంలో ఆయన పాత్ర గురించి ఎటువంటి చర్చ జరగలేదని జేడీయూ ప్రతినిధి నీరజ్ కుమార్ వెల్లడించారు. ఇదీ చదవండి: అపుడు సస్పెన్షన్, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్, ఎవరీ దుర్గా శక్తి? -
బిహార్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం
అధికారం కోసం రాజకీయ నేతల వారసులు ఎగబడుతున్న ప్రస్తుత రోజుల్లో బిహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ భిన్నంగా వ్యవహరించారు. డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం వచ్చినా కాదనుకున్నారు. ప్రజల నమ్మకాన్ని పొందిన తర్వాతే పదవి చేపట్టాలని, అప్పటి వరకు జనం మధ్య ఉండేందుకే ఆయన మొగ్గుచూపారు. బిహార్‌లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు (Bihar Politics) మరో మలుపు తిరిగాయి. నితీశ్ కుమార్ సీఎం పదవిని వదిలిపెట్టి హస్తిన బాట పట్టడంతో కాషాయపార్టీకి తొలిసారి బిహార్ ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అయితే నితీశ్ ఢిల్లీకి వెళ్తూ తన కొడుకు నిశాంత్ కుమార్‌ను బిహార్ కేబినెట్లోకి ప్రవేశపెడతారన్న వార్తలు షికారు చేశాయి. జేడీ(యూ) సీనియర్ నాయకులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర యాదవ్‌లు బుధవారం సమ్రాట్ చౌదరితో కలిసి ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ ఊహాగానాలకు తెరపడిపోయింది. నితీశ్ వారసుడిగా కాకుండా తను తానుగా పదవి సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉన్నారని జేడీ(యూ) పార్టీ వర్గాలు వెల్లడించాయి.పార్టీకే పరిమితమవుతాఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని నిశాంత్ కుమార్‌ను ఒప్పించేందుకు పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తాను డిప్యూటీ సీఎం కావడానికి ఇంకా సమయం ఉందని పార్టీ నేతలకు ఆయన చెప్పారు. కొంతకాలం పార్టీకే పరిమితమవుతానని స్పష్టంచేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని నిశాంత్‌ను కోరుతూ మంగళవారం అర్ధరాత్రి వరకు పార్టీ నాయకులు చర్చలు జరిపారు. కానీ ఆయన ససేమీరా అన్నారు. డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు అవసరమైన అనుభవం తనకు ఇంకా రాలేదంటూ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు.తన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి పార్టీ కార్యకర్తలు, ప్రజలతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నారు. కేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా అనుభవం గడించాలని ఆయన భావిస్తున్నారు. ఈ అనుభవం ప్రభుత్వాన్ని ఎలా నడపాలో అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందని నిశాంత్ నమ్ముతున్నారు. అయితే నితీశ్ కుమార్ వారసత్వాన్ని సజీవంగా ఉంచడానికి నిశాంత్.. డిప్యూటీ సీఎం అయితే బాగుండేదని పార్టీలోని ఒక వర్గం భావిస్తోందని జేడీ(యూ) సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు.ఆరు నెలల తర్వాతే పదవి!ఆరు నెలల పాటు తాను ఏ పదవినీ స్వీకరించే అవకాశం లేదని నిశాంత్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 44 ఏళ్ల నిశాంత్ కుమార్ గత నెలలో అధికారికంగా జేడీ(యూ)లో చేరారు. ఆయన పార్టీలో చేరే సమయంలో ఆయన తండ్రి నితీశ్ కుమార్ అక్కడ లేకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. నితీశ్, నిశాంత్ ఎల్లప్పుడూ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించారని, అందుకే నిశాంత్ ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్నాకే పదవి చేపట్టాలని కోరుకుంటున్నారని పార్టీ నాయకుడొకరు అన్నారు. "తన తండ్రి రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాతే నిశాంత్ బిహార్ రాజకీయాల్లోకి వచ్చారు. నితీశ్ కుమార్ ఇప్పుడు ఢిల్లీకి మారినందున, పార్టీని బలోపేతం చేయడంపై నిశాంత్ కుమార్ దృష్టి పెట్టాలనుకుంటున్నారు" అని వివరించారు.చదవండి: కేరళ ఎన్నికల్లో జరుగుతోంది ఇదే!నిశాంత్ నెగ్గుకొస్తారా?నితీశ్ కుమార్ హస్తిన బాట పట్టడంతో బిహార్‌లో జేడీ(యూ) భవిష్యత్తు మన్ముందు ఎలా ఉండబోతోందో ఊహించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ వ్యూహాలను తట్టుకుని పార్టీని కాపాడుకోవడం కత్తి మీద సామేనేనని అభిప్రాయపడుతున్నారు. బిహార్ కేబినెట్లో నిశాంత్ చేరితేనే బాగుండేదని పేర్కొంటున్నారు. ఆరు నెలలు అనుభవం గడించిన తర్వాత పదవి తీసుకుంటానని చెప్పడం ఇప్పటి రాజకీయాలకు సూటుకాదంటున్నారు. ఎందుకంటే 6 నెలల తర్వాత పరిస్థితులను ఎవరూ ఊహించలేరని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిశాంత్ ఎలా నెగ్గుకొస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
బిహార్‌కు బీజేపీ సారథ్యం!
మండల్ రాజకీయాలకు పుట్టిల్లుగా మారి, రెండున్నర దశాబ్దాలుగా జాతీయ రాజకీయ పక్షాలకు నిలువనీడ లేకుండా పోయిన బిహార్‌లో బుధవారం తొలిసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఆ పార్టీ నాయకుడు సమ్రాట్ చౌధరి నేతృత్వంలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం కొన్నేళ్ల క్రితం ఊహించని పరిణామం. అయితే కింగ్‌మేకర్‌గా లేదా జూనియర్ భాగస్వామిగా జేడీ(యూ) అధినేత నితీశ్‌కుమార్ నాయకత్వంలోని ప్రభుత్వాల్లో కొనసాగుతూ వచ్చిన బీజేపీ... ఎంతో సహనంతో, ఓపికతో సుదీర్ఘకాలం ఈ రోజు కోసం వేచిచూసింది. ఆఖరికి 2020లోనూ, నిరుడు జరి గిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన భాగస్వామ్య పక్షం జేడీ(యూ)కు మించి స్థానాలొ చ్చినా సీఎం పదవి కోసం పట్టుబట్టకుండా ఉండిపోయింది. ఎలా ఒప్పించిందో, ఏం చేసిందో... ఆర్నెల్లు కాకుండానే ఆయన్ను రాజ్యసభకు పంపి, ఆ పదవి కైవసం చేసుకుంది. అసలు నిరుడు నవంబర్‌లో జరిగిన బిహార్ ఎన్నికల సందర్భంలోనే ఈసారి నితీశ్‌ను సీఎం పదవినుంచి తప్పించి, బీజేపీయే పగ్గాలు చేపడుతుందన్న ప్రచారం జరిగింది. కానీ అది విజయావకాశాలను దెబ్బతీయొచ్చన్న ఉద్దేశంతో రెండు పార్టీలూ కొట్టిపారేశాయి. బహుశా తనను తప్పిస్తారని నితీశ్ కూడా ఊహించివుండరు. ఎందుకంటే కుమారుడికి రాజ్యసభ సీటు ఇవ్వాలంటూ ఆయన ఫిబ్రవరిలో బీజేపీ అగ్రనేతలను కలిసి పట్టుబట్టారు. చివరికి తానే ఆ సీటు తీసుకుని, సీఎం పదవి బీజేపీకి అప్పగించాలని నితీశ్ నిర్ణయించటంతో కుమారుడితోపాటు పార్టీ అగ్ర నేతలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో మునిగారు. పదకొండేళ్లనాడు అప్పటి పార్టీ నేత జితన్‌రాం మాంఝీని తొమ్మిది నెలలపాటు సీఎం పదవిలో కూర్చోబెట్టడం మినహా దాదాపు 21 ఏళ్లపాటు బిహార్ ఏలికగా నితీశ్ కొనసాగారు. మధ్యలో కూటములు మార్చినా, జనం మాత్రం ఆయన వెనకే దృఢంగా నిలబడ్డారు. మునుపటితో పోలిస్తే పార్టీ అధినేతగా నితీశ్ అంత ఆత్మవిశ్వాసంతో లేరని స్థానిక మీడియా చెబుతూవచ్చింది. ఇది వయసు పైబడటంవల్లనా, పార్టీలోని అంతఃకలహాలా అన్న విషయంలో ఎవరి విశ్లేషణలు వారివి. మండల్ రాజకీయాలు బలంగా వేళ్లూను కున్న రాష్ట్రాన్ని జాతీయపక్షం చేతుల్లో పెట్టడంపైనా నితీశ్‌పై విమర్శలొచ్చాయి. కానీ బీజేపీ ఆ రాజకీయాలకు భంగం వాటిల్లకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఉత్తరప్రదేశ్ తరహాలో బిహార్‌లో కూడా ఆదినుంచీ సంఘ్ పరివార్‌ను నమ్ముకున్నవారికే పగ్గాలు అప్పగించాలని ఒత్తిళ్లు వచ్చినా అధిష్టానం వాటిని అంగీకరించలేదు. మొదటి నుంచీ పార్టీలో కొనసాగినవారిని కాదని, ఎనిమిదేళ్లనాడు వచ్చిన సమ్రాట్వైపే మొగ్గు చూపటానికి కారణం ఆయన బాగా వెనకబడిన కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన వారు కావటమే. బిహార్ ప్రత్యేక పరిస్థితులరీత్యా ఇది తప్పదని అధిష్టానం భావించింది. లాలూ సతీమణి రబ్డీదేవి ప్రభుత్వంలో ఉంటూ 26 యేళ్ల క్రితం బీజేపీ కారణంగానే మంత్రి పదవి పోగొట్టుకున్న సమ్రాట్... 2018లో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంటరీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు... కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయంటారు. కానీ ప్రయోజనాలు మాత్రమే చూసుకున్నా ఎదగటం కష్టమే. తనేంటో నిరూపించుకోవాలి. పార్టీ నాయకత్వానికి నమ్మకం కలిగించాలి. ఆ పని సమ్రాట్ సమర్థవంతంగా చేయబట్టే ఇవాళ సీఎం పదవి అందుకో గలిగారు. యాదవేతర కులాల్లో పట్టు సంపాదించుకోవాలన్న బీజేపీ వ్యూహానికి ఆయన సమర్థత, కులం తోడ్పడ్డాయి.అయితే బిహార్‌కు సమస్యలు తక్కువేం లేవు. ఇప్పటికీ అది దేశంలోని నిరుపేద రాష్ట్రాల్లో ఒకటి. బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిపోయిందంటూ ఎంత గొప్పలుపోయినా బిహార్‌లో రోడ్లు, ఆరోగ్యరంగం, విద్యారంగం సక్రమంగా లేవు. లాలూ హయాంతో పోలిస్తే మెరుగ్గానే ఉండొచ్చుగానీ... శాంతిభద్రతలు ఇంకా పూర్తిస్థాయిలో చక్కబడలేదంటారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, పారదర్శకత, జవాబుదారీతనం తన ప్రాముఖ్యతలని ప్రమాణస్వీకారం చేశాక ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సమ్రాట్ ప్రకటించటం గమనిస్తే ఎక్కడెక్కడ మరమ్మతు అవసరమో ఆయన సక్రమంగానే గుర్తించారని అర్థమవుతుంది. మొత్తానికి బీజేపీ నేతృత్వంలో బిహార్ పయనం ఎలా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది. -
బిహార్ బీజేపీ తొలి సీఎం చదువు, నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
సాక్షి,పట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత,సమ్రాట్ చౌదరి బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి బిహార్‌లో తొలి ముఖ్యమంత్రి ఈయనే కావడం విశేషం. ఆయనతో పాటు, జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) కు చెందిన విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు. అయితే నూతన సీఎం సమ్రాట్ చౌదరి ఆస్తులు, విద్యార్హతలపై నెట్టింట ఆసక్తి నెలకొంది.ఆస్తుల వివరాలుసమ్రాట్ చౌదరి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఆయన రూ.9.29 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉండగా, ఆయన సతీమణి మమతా కుమారి రూ.2.01 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. వీరిద్దరి చర, స్థిరాస్తుల మొత్తం విలువ కలిపి మొత్తం రూ.11.31 కోట్లకు పైమాటే. గత ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆయన చరాస్తులు మరియు స్థిరాస్తుల వివరాలను అందించారు. దీని ప్రకారం తారాపూర్ ఎమ్మెల్యే అయిన సమ్రాట్ చౌదరి కుటుంబం వద్ద రూ. 1,71,550 నగదు ఉంది. అఫిడవిట్లో తనకు ఎలాంటి అప్పులు లేవని చౌదరి ప్రకటించారు.pic.twitter.com/Fy8rLbcc6T— Samrat Choudhary (@samrat4bjp) April 15, 2026 ఈ దంపతుల పేరిట బ్యాంకు డిపాజిట్లు మొత్తం రూ.27 లక్షలు ఉండగా, ఒక్కొక్కరి వద్ద రూ.20 లక్షల విలువైన బంగారం ఉంది. అంతేకాకుండా, వీరి వద్ద రూ.75,000 విలువైన వెండితో పాటు, షేర్లు, బాండ్లు , మ్యూచువల్ ఫండ్లలో రూ.32 లక్షల విలువైన పెట్టుబడులు కూడా ఉన్నాయి. విద్యార్హతలు, వివాదాలుసమ్రాట్ చౌదరి విద్యా అర్హతలు చర్చనీయాంశంగా మారాయి. బిహార్‌లోని ముంగేర్ జిల్లా, లఖన్‌పూర్ గ్రామంలో 1968 నవంబర్ 16న జన్మించారు. ఆయన తండ్రి శకునీ చౌదరి కూడా బిహార్‌లో సీనియర్ నాయకుడు. రికార్డుల ప్రకారం ఆయన తమిళనాడులోని మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి ప్రీ-ఫౌండేషన్ కోర్సు (PFC) పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కొన్ని ఆధారాలు, ఆయన స్వయంగా సమర్పించిన అఫిడవిట్లు (కొన్నిసార్లు) సాహిత్యంలో డాక్టరేట్ (డి.లిట్.) ఉందని పేర్కొంటుండగా, ప్రశాంత్ కిషోర్ వంటి ప్రతిపక్ష నాయకులు ఆయన పదో తరగతి పరీక్షలోకూడా ఉత్తీర్ణుడు కాలేదని ఆరోపించారు. -
బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం
-
సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
-
సీఎం రేసులో కీలక నేతలు
-
బిహార్ కొత్త సీఎం ఈయనే.. అధికారిక ప్రకటన
పట్నా: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. పట్నాలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు.సామ్రాట్ చౌదరి బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకోనున్నారు. త్వరలో గవర్నర్‌ను కలిసి తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు విజ్ఞప్తి చేయనున్నారు. బుధవారం (ఏప్రిల్ 15న) సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.సామ్రాట్ చౌదరి ఎవరు? సామ్రాట్ చౌదరి 1968 నవంబర్ 16న ముంగేర్ జిల్లాలో జన్మించారు. ఆయనకు బలమైన రాజకీయ వారసత్వం ఉంది. ఆయన తండ్రి శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తల్లి పార్వతీ దేవి 1998లో అదే స్థానంలో అప్పటి సమతా పార్టీ తరఫున గెలిచారు. గత 12 ఎన్నికల్లో 9 సార్లు తండ్రి, తల్లి, కుమారుడు కలిసి ఆ స్థానంలో గెలిచారు.సామ్రాట్ చౌదరికి 57 ఏళ్లు 1990లో రాజకీయ ప్రవేశం చేశారు. 1999లో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ప్రభుత్వం నడిపిన సమయంలో, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు సామ్రాట్ వ్యవసాయ మంత్రి అయ్యారు. 2000, 2010 ఎన్నికల్లో పర్బట్టా అసెంబ్లీ స్థానంలో గెలిచారు. 2010లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీఫ్ విప్‌గా ఉన్నారు. 2023 మార్చి నుంచి 2024 జూలై వరకు బీజేపీ బిహార్ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలో క్రీడలు, ఆర్థిక, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి-గృహ నిర్మాణ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.సీఎం పదవికి అవసరమైన రాజకీయ, పరిపాలనా అనుభవం ఆయనకు ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు వంటి అన్ని అంశాల్లో అనుభవం ఉంది. ఆయన కుశ్వాహా సామాజిక వర్గానికి చెందినవారు. ఇది రాష్ట్ర జనాభాలో సుమారు 4.3 శాతం. బిహార్‌లో యాదవుల తర్వాత అతిపెద్ద ఓబీసీ వర్గం ఇదే. -
బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
పట్నా: బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. బిహార్ గవర్నర్‌కు ఆయన రాజీనామా సమర్పించారు. క్యాబినెట్‌ను రద్దు చేస్తూ నితీశ్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 21 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగారు నితీశ్. ఇటీవలే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేసిందని నితీశ్ కుమార్ రాజీనామా తర్వాత ఎక్స్‌లో తెలిపారు. “హిందువులు, ముస్లింలు, ఉన్నత వర్ణాలు, వెనుకబడిన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, దళితులు, మహాదళితులు.. ఇలా ప్రతి ఒక్కరి కోసం మా ప్రభుత్వం పనిచేసింది. విద్య, ఆరోగ్యం, రహదారులు, విద్యుత్, వ్యవసాయం వంటి ప్రతి రంగంలో అభివృద్ధి పనులు జరిగాయి. మహిళలు, యువత కోసం ఎంతో చేశాం” అని నితీశ్ చెప్పారు. కాగా, నితీశ్ కుమార్ మంగళవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. నితీశ్ కుమార్ క్యాబినెట్‌కు ఇదే చివరి సమావేశం. సీఎంగా సామ్రాట్ చౌదరి? బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బుధవారం (ఏప్రిల్ 15న) బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. నితీశ్ శాసన మండలి సభ్యత్వానికి గత నెల 30న రాజీనామా చేశారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బిహార్‌లో శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునేందుకు కేంద్ర పరిశీలకుడిగా నియమించినట్లు తెలిపింది.జేడీయూ సీనియర్ నేత విజయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. “బీజేపీ సిఫారసుపై ఎన్డీఏ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుంది, ఇందులో బీజేపీకి పెద్ద పాత్ర ఉంది” అని అన్నారు. జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ కుమార్ ఝా ఇటీవల మాట్లాడుతూ.. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో లేకపోయినా, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కృషి కొనసాగుతుందని తెలిపారు. గత బిహార్ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నాయకత్వంలో, ఎన్డీఏ మద్దతుతో పార్టీ పోటీ చేసిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం నితీశ్ విధానాలను, పాలనా మోడల్‌ను కొనసాగిస్తుందని అన్నారు. -
నితీశ్ కుమార్ రాజీనామా.. కొత్త సీఎం ఆయనేనా?
పాట్నా: బిహార్ సీఎం ఎవరు అనే అంశం నేడు తేలనుంది. ఈ రోజు ఏన్డీఏ కూటమి అధికారిక సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఈ అంశమై ఇదివరకే కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని పరిశీలకుడిగా బీజేపీ పార్టీ నియమించింది. అయితే ఆ రాష్ట్రానికి ఎంతో కాలంగా ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీశ్ కుమార్ ఈ రోజు సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు.బిహార్ రాష్ట్రంలో నూతన శకం ఆవిష్కృతం కాబోతుంది. బీజేపీ నాయకుడు తొలిసారిగా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ అంశమై నేడు జరిగే ఎన్డీఏ సమావేశంలో శాసన సభ పక్ష నేతను ఎన్నుకుంటారు. అనంతరం రేపు (బుధవారం) కొత్త పార్టీ ఎన్నుకున్న అభ్యర్థి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తప్పుకోనున్న నితీశ్బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ తనదైన ముద్ర వేశారు. సీఎంగా దాదాపు 10 సార్లు ప్రమాణ స్వీకారం చేసి ఆ రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా వెళ్లనున్నారు. దీంతో జేడీయూ నేతలు ఒకింత భావోద్వేగానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆరాష్ట్రంలోని 243 సీట్లకు 202 స్థానాలు సాధించి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ 89 సీట్లు, జేడీయూ 85 స్థానాలు సాధించింది. దీంతో బిహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ ప్రస్తుతం రాజీనామా చేయనున్నారు.ముఖ్యమంత్రి రేసులో?బిహార్ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత సామ్రాట్ చౌదరి. 1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి.. 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. అనంతరం ప్రభుత్వ విఫ్‌గా 2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ)లో చేరి 2 జూన్ 2014న పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. చాలా వరకూ సామ్రాట్ చౌదరినే సీఎంగా ఎన్నుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరోవైపు దళిత నేతను సీఎంగా ఎన్నుకునే అవకాశాలు లేకపోలేదు. -
నితీశ్ నేతృత్వంలో చివరి క్యాబినెట్ సమావేశం!
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం (ఏప్రిల్ 14న) క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. నితీశ్ కుమార్ క్యాబినెట్‌కు ఇదే చివరి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇందులో అనేక ముఖ్య అజెండా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ సమావేశం అనంతరం నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. ఏప్రిల్ 15న బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. ఇటీవలే నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో లేకపోయినా, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కృషి కొనసాగుతుందని తెలిపారు. గత బిహార్ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నాయకత్వంలో, ఎన్డీఏ మద్దతుతో పార్టీ పోటీ చేసిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం నితీశ్ విధానాలను, పాలనా మోడల్‌ను కొనసాగిస్తుందని అన్నారు. కాగా, నితీశ్ కుమార్ శాసన మండలి సభ్యత్వానికి గత నెల 30న రాజీనామా చేశారు. సీఎం పదవి నుంచి ఏప్రిల్ 14వ తేదీన వైదొలగనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమవుతోంది. బీజేపీ నేత బిహార్ సీఎం అవుతుండడం ఇదే తొలిసారి. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బిహార్‌లో శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునేందుకు కేంద్ర పరిశీలకుడిగా నియమించినట్లు తెలిపింది.జేడీయూ సీనియర్ నేత విజయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. “బీజేపీ సిఫారసుపై ఎన్డీఏ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుంది, ఇందులో బీజేపీకి పెద్ద పాత్ర ఉంది” అని అన్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి, 25 మందికి గాయాలు
పట్నా: బిహార్‌లో శనివారం (ఏప్రిల్ 11) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కటిహార్ జిల్లా వద్ద బస్సు, ట్రక్, పికప్ వాన్ ఢీకొని పది మంది మృతి చెందగా, మరో 25 మందికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.శనివారం సాయంత్రం ఈ ప్రమాదం కటిహార్‌లో కోఢా బ్లాక్ వద్ద ఎన్‌హెచ్-31పై జరిగిందని ఎస్పీ శిఖర్ చౌధరి మీడియాకు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు."టిహార్ జిల్లా కోఢా పోలీస్ స్టేషన్ పరిధిలో గెరాబారి సమీపంలో బస్సు, పికప్ వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన సుమారు 25 మందికి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు" అని కటిహార్ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్ సూపరింటెండెంట్ శిఖర్ చౌధరి తెలపిఇన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం కటిహార్‌లో కోఢా బ్లాక్ వద్ద ఎన్‌హెచ్-31పై జరిగింది. -
నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం పూర్తి
ఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. న్యూఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆయన కార్యాలయంలో నితీశ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జేపీనడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు.అయితే తన శాసనమండలి సభ్యత్వానికి మార్చి 30న నితీశ్ కూమార్ రాజీనామా చేశారు. ప్రస్తుతం బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయన తన పదవికి ఏప్రిల్ 14వ తేదీన తన పదవి నుంచి వైదొలగనున్నారు. కాగా బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలలో నితీశ్‌కున్న అనుభవం పార్లమెంట్ సంప్రదాయాలను కాపాడడంలో ఎంతో సహకరిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
బిహార్ కొత్త సీఎం ఆయనే.. బ్యాక్ గ్రౌండ్ ఇదే!
పట్నా: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టనున్నారు. జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీలో బీజేపీ ముఖ్య నాయకులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి పేరును ఖరారు చేయనున్నారు.ఏప్రిల్ 14వ తేదీన బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేస్తారు. అనంతరం కొత్త సీఎం పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ఏప్రిల్ 15న సామ్రాట్ చౌదరి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతుండడం బిహార్ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం వల్ల నామమాత్రపు నాయకుడిగా మిగిలిపోతారని, రాష్ట్రంలో ఆయన పార్టీ ప్రభావం తగ్గిపోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి.. 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. ఆయన 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్‌గా నియమితులయ్యారు.2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ)లో చేరి 2 జూన్ 2014న పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సామ్రాట్ చౌదరి 2018లో భారతీయ జనతా పార్టీలో చేరి బీహార్ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా, 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2024 జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సామ్రాట్ చౌదరి.. బీహార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. -
పార్కింగ్ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారు
బిహార్‌లో జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేపాయి. ఒక చిన్న పార్కింగ్ వివాదం రెండు హింసాత్మక ఘటనలకు దారి తీసింది. రోడ్డు పక్కన వ్యాపారి ఒక పికప్ డ్రైవర్‌ను తల నరికాడు, ఆ తర్వాత మృతుడి కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట నిందితుడిని హతమార్చిన కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం, అరేరియా జిల్లాలోని ఫోర్బ్స్గంజ్ పట్టణంలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడైన డ్రైవర్‌ను అరేరియాలోని జోగ్బాని పట్టణానికి చెందిన అలీ హుస్సేన్‌గా గుర్తించారు. ప్రతీకారంగా హత్యకు గురైన రోడ్డు పక్కన వ్యాపారిని రవి చౌహాన్‌గా గుర్తించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫోర్బ్స్గంజ్ పట్టణంలో ఒక చిన్న పార్కింగ్ సమస్యపై 'సత్తు' అమ్మే చౌహాన్, హుస్సేన్‌పై దాడి చేసి, అతని తల నరికి, అందరి ముందూ వీరంగం సృష్టించాడు. ఆ తర్వాత నిందితుడు మృతదేహాన్ని, నరికిన తలను సంఘటనా స్థలంలోనే వదిలిపెట్టి అక్కడినుంచివెళ్లి పోయాడు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?ఇది చూసి మృతుడి బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. హుస్సేన్ బంధువులతోపాటు, స్థానికులు కూడా ఇంటి దగ్గర దాక్కున్న నిందితుడిని సంఘటనా స్థలానికి లాక్కొచ్చి, కర్రలతో, రాడ్లతో కొట్టి, పోలీసుల కళ్లెదుటే చంపేశారు. ఈ జంట హత్యల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులకు, ఆగ్రహించిన గుంపుకు మధ్య ఘర్షణ జరిగింది. సంఘటనా స్థలం చుట్టూ ప్రజలు గుమిగూడటం ప్రారంభించడంతో, అదనపు పోలీసు బలగాలు మెహరించాయి. ఈ రెండు ఘటనల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ, పోలీసులు ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే! -
17 కిలోల బంగారం, రూ. 25 కోట్లు : వ్యాపారుల గుండెల్లో రైళ్లు
బీహార్‌లో చోటుచేసుకున్న భారీ దోపిడీ అక్కడి వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ఒక ఆభరణాల వ్యాపారికి చెందిన రూ. 25 కోట్ల విలువైన బంగారాన్ని, అత్యంత పకడ్బందీగా, సినిమా ఫక్కీలో ప్లాన్ వేసి కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దుండగులు దోచుకున్న వైనం కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం రాజధాని పాట్నాలో దనాపూర్లోని ఖాగౌల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో, దుండగులు బంగారు వ్యాపారి సిబ్బంది నుండి 17 కిలోల బంగారాన్ని దోచుకున్నారు. దీని విలువ సుమారు 25 కోట్ల రూపాయలు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి సంస్థ కేవీ & సన్స్ లో మహేష్ మమ్తోరా, ప్రిన్స్ రాన్పారియా అనే ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లిద్దరు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాల డెలివరీ ఇచ్చేందుకు రైలులో బీహార్‌కు వెళ్లారు. అక్కడ వారు రైల్వే స్టేషన్లో దిగీ దిగగానే, పక్కా ప్లాన్‌తో మోటార్‌సైకిళ్లు, కారులోవచ్చిన సుమారు ఎనిమిది మంది దుండగులు వీరిని చుట్టుముట్టారు.ఇదీ చదవండి: నో ఫుడ్,నో ఫోన్, చిమ్మ చీకటి, భయంకర శబ్దాలు : కట్ చేస్తే!అదీ కస్టమ్స్ శాఖ అధికారులుమంటూ వారిని చుట్టుముట్టారు. విచారణ జరపాలంటూ వారిని భయపెట్టారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనగానే బాధితులు కూడా నిజమైన అధికారులు కావొచ్చని భ్రమపడ్డారు. దీంతో బాధితులను కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత వారిని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, వారి వద్ద ఉన్న రూ. 25 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకున్నారు. అనంతరం, దుండగులు అక్కడి నుండి ఉడాయించారు. ఆ తర్వాత తేరుకున్న బాధితులు సంస్థ యజమానికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బీహార్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.ప్లాన్ తోనే ఈ దోపిడీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాజ్‌కోట్‌లోని 'సోని బజార్' వ్యాపారుల మధ్య ఆందోళన మరియు అలజడిని రేకెత్తించింది. ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండి -
కొత్త సీఎం కోసం అన్వేషణ.. రేసులో ఉన్నది ఎవరు?
పాట్నా: మరో ఐదు రోజుల్లో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణి స్వీకారం చేయబోతున్న బిహార్ సీఎం నితీష్ కుమార్ స్థానంలో కొత్త సీఎంను ఎంపిక చేసే ప్రక్రియ వేగమంతమైంది. ఈ నెల 10వ తేదీ నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ తరుణంలో అక్కడ సీఎం పోస్ట్ ఖాళీ కానుంది. అయితే స్థానాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరోగి స్పష్టం చేశారు. ఆ బాధ్యతను ఎన్డీఏ తీసుకుంటుందని పేర్కొన్నారు. ‘ నితీష్ కుమార్ గత వారమే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనను రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేసిన క్రమంలో కౌన్సిల్ సభ్యునిగా రాజీనామా చేశారు. ఈ తరుణంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బిహార్ సీఎంను ఎంపిక చేసే పనిలో పడింది. ఇందులో నూతన సీఎం ఎంపిక చేసే ప్రక్రియలో నితీష్ కుమార్ కూడా పాలు పంచుకుంటారు’ అని తెలిపారు. కాగా, మార్చి 16న నితీష్ కుమార్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101, 190 ప్రకారం.. ఒక వ్యక్తి ఏకకాలంలో అటు పార్లమెంటులోనూ, ఇటు రాష్ట్ర శాసనసభ లేదా మండలిలోనూ సభ్యునిగా కొనసాగకూడదు. 1950 నాటి ‘ప్రొహిబిషన్ ఆఫ్ సైమల్టేనియస్ మెంబర్షిప్’ నిబంధనల ప్రకారం, ఎన్నికైన 14 రోజుల లోపు ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు మార్చి 30 (సోమవారం) నాటితో ముగియనుండటంతో, చివరి రోజున ఆయన తన ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.రేసులో ఉన్నది ఎవరు..?నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్ తదుపరి ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్ తదితర అగ్రనేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ ప్రస్తుత బాధ్యతలకు సంబంధించి రానున్న కొద్ది రోజుల్లో పార్టీ నుంచి మరిన్ని కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని (Marriages are made in heaven) చాలామంది విశ్వసించే మాట. ‘ఎవరికి ఎవరు రాసి పెట్టి ఉన్నారో’ అని పెద్దలు కూడా తరచుగా అంటుంటారు. బిహార్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే ఔరా, విధి రాత అని అనుకోకమానరు. విషయం పూర్తిగా తెలియాలంటే సినిమా లెవల్లో మలుపులు తీరిగిన ఈ కథనం చదవాల్సిందే.ఊహించని విధంగా, నిశ్చయించిన వరుడితో కాకుండా వేరొకరితో ఏడు అడుగులు వేసిందో వధువు. బిహార్‌లోని సిగోయిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోరారాచక్లో ఈ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఒకవైపు బంధుమిత్రులు ఆనంద సందోహాలు, మరోవైపు బాజా భజంత్రీల మధ్య పెళ్లి మండపంలో అంతా సందడిగా ఉంది. పెళ్లి పీటల మీద వరుడు కూర్చుని ఉండగా, వధువు మండపం వైపు వస్తోంది. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే పెళ్లి కొడుకుని పోలీసులు తీసుకెళ్లపోయారు. గెస్ట్‌లంతా గందరగోళంతో చూస్తుండగా, ఎన్నో ఆశలతో పెళ్లి మండపం అడుగుల వేస్తున్న వధువు నిశ్చేష్టురాలైపోయింది. గ్రామ పెద్ద జోక్యంతో వధువు వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకోవాలనినిర్ణయించారు. దీంతో సినీ ఫక్కీలో వారిద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. పోలీసులు ఎందుకొచ్చారంటే..సియారాంపూర్కు చెందిన సంజయ్ యాదవ్ కుమారుడు, వరుడు అనిల్ కుమార్, మోరారాచక్కు చెందిన భీమ్ యాదవ్ (పంకజ్ ) అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఉన్నట్టుండి ఈ పెళ్లి గురించి తెలిసిన అనిల్ ప్రియురాలు ఎంట్రీ ఇచ్చింది. తాను మొదటి భార్యనని, తనకు న్యాయం కావాలంటూ సిగోయిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా చూపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.దీంతో పెళ్లికొడుకుకు అప్పటికే రూబీ అనే మహిళతో వివాహం జరిగిందని గ్రామ పెద్ద అశోక్ యాదవ్‌కు తెలిపారు. ఆయన వెంటనే ఈ విషయాన్ని అమ్మాయి తండ్రికి తెలియజేయడంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వార్త గ్రామం అంతటా వేగంగా వ్యాపించింది. పోలీసులతో పాటు ఆ అమ్మాయి గ్రామానికి తిరిగి వచ్చి, అనిల్‌తో తన వివాహానికి సంబంధించిన ఆధారాలను చూపించింది. దీంతో గ్రామ పెద్ద ఇరు పక్షాల సుదీర్ఘ చర్చల అనంతరం, వధువు వరుడి తమ్ముడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఆ ఉదయమే, ఇరు కుటుంబాల సమక్షంలో ఆ వివాహం జరిపించడంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. తదనంతరం, అనిల్ రూబీ విషయాన్ని అంగీకరించి, ఆమెతో కలిసి జీవిస్తూ, ఆమెను సంరక్షిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో పోలీసులు అతన్ని విడుదల చేశారు. అలా కథ సుఖాంతం అయింది. -
బిహార్ ఆలయంలో విషాదం
బిహార్ షరీఫ్: బిహార్‌లోని నలంద జిల్లాలోని శీతలామాత ఆలయంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. దీప్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బిహార్ షరీఫ్ పట్టణంలోని ఈ ఆలయానికి మంగళవారం భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఎనిమిది మంది గాయపడ్డారు. విషయం తెల్సి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రుల్లో చేర్పించారు.మంగళవారం ఉదయం ఈ తొక్కిసలాట జరిగిందని బిహార్ షరీఫ్ పట్టణ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నూరుల్ హక్ మీడియాకు తెలిపారు. చైత్రమాసం చివరి మంగళవారం కావడంతో అత్యంత శుభప్రదంగా భావించి మంగళవారం తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. సరైన నిర్వహణ లేకపోవడంతో తొక్కిసలాట జరిగిందని అక్కడి ప్రత్యక్ష సాక్షులు, భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘చైత్రమాసం చివరి మంగళవారం, మహావీర్ జయంతి కలిసిరావడంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఇదే సమయంలో బారికేడ్లు విరిగిపోవడంతో జనం ఒక్కసారిగా కిందపడడంతో తొక్కిసలాట జరిగింది’’ అని స్థానికుడు ఒకరు వెల్లడించారు.‘‘తొక్కిసలాట జరగడంతో అంతా గందరగోళ పరిస్థితి తలెత్తింది. వెంటనే పోలీసులు వచ్చి భక్తులను వెనక్కి తోసేశారు. లాఠీచార్జ్ చేశారు’’ అని ఒక భక్తుడు తెలిపారు. భక్తుల మరణవార్త తెల్సి ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి అందజేయనున్నారు.క్షతగాత్రులకు తలో రూ.50,000ను ఇవ్వనున్నారు. ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ.6 లక్షల ఎక్స్‌గ్రేíÙయా ప్రకటించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని దీప్‌నగర్ పోలీస్‌స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. వివరాలు తెల్సుకునేందుకు ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆలయంలో అధ్వాన్న ఏర్పాట్ల కారణంగానే తొక్కిసలాట జరిగిందని బిహార్ శాసనసభలో విపక్షనేత తేజస్వీయాదవ్ వ్యాఖ్యానించారు. -
బిహార్‌లో తొక్కిసలాట.. 8 మంది మృతి
నలంద: బిహార్‌లో విషాదం జరిగింది. నలందలోని శీతల మాత ఆలయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మహిళలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలింఒచారు. పూజలు నిర్వహించడానికి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక గ్రామస్తులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. #WATCH | Bihar: A stampede occurred during puja at Maa Sheetla Mandir in Maghra village of Nalanda. Injuries reported, deaths feared. More details awaited. Visuals from the spot as an ambulance reaches here. pic.twitter.com/1UU0kwN6OA— ANI (@ANI) March 31, 2026 -
కిరోసిన్ దీపం వెలుగులో చదువుకుని ఐఏఎస్ అయ్యాడు..!
మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా.. మన లక్ష్యం దృఢంగా ఉండాలి. ఎంతలా పరిస్థితులు కుంగదీస్తున్నా..మన ధ్యేయం గురితప్పకూడదు. కష్టమే కష్టపెట్టలేక విసిగిపోయేలా..గెలుపు తీరాలని అందుకుని స్ఫూర్తిగా నిలవాలి. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ అన్షుమాన్ రాజ్.బిహార్‌కి చెందిన అన్షుమాన్ రాజ్ బాల్యం మొత్తం బక్సర్జిల్లా నవానగర్ బ్లాక్‌లో సాగింది. తండ్రి రైస్‌మిల్లు వ్యాపారం నష్టాల్లోకి వెళ్లడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయింది. దాంతో కనీసం ఇంట్లో విద్యుత్ సౌకర్యం లేక ఇక్కట్లు పడుతుండేది. అయితే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలైన అతడి తల్లి ఒక్కరే కుటుంబానికి ఆధారంగా మారింది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ఎంతో పట్టుదలతో చదువుకునేవాడు. నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను ప్రారంభించి అక్కడే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. మెట్రిక్యులేషన్ తర్వాత, అతను జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో తన చదువును కొనసాగించి, 12వ తరగతిని పూర్తి చేశాడు. ఆ తర్వాత అదే సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. అప్పుడే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధం కావాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాడు. అన్షుమాన్ తన అచంచలమైన పట్టుదలతో తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగాడు గానీ మెయిన్స్‌లో సక్సెస్ కాలేకపోయాడు. ఆ ఎదురుదెబ్బకు నిరుత్సాహపడకుండా మరోసారి పయత్నించేందుకు ఢిల్లీకి మకాం మార్చాడు. రెండో ప్రయత్నంలో కూడా రాత పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణుడయ్యాడు కానీ పర్సనాలిటీ టెస్ట్‌లో పాస్ కాలేకపోయాడు. దాంతో ముచ్చటగా మూడోసారి పరీక్ష రాశారు. ఆ ప్రయత్నంలో మొత్తం మూడు దశలనూ విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ ఐఏఎస్‌కు కాకుండా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ పోస్ట్ పొందాడు. కానీ అన్షుమాన్ తన డ్రీమ్‌ని వదులుకోవడానికి ఇష్టపడక.. మరోసారి అకుంఠిత దీక్షతో సివిల్స్‌కు సన్నద్ధమై 2019 నాల్గో ప్రయంత్నంలో తన ఆకాంక్షను నెరవేర్చుకున్నాడు. 107 ఆల్ ఇండియా ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారి అయ్యాడు. అతడి కథ..అకస్మాత్తుగా వచ్చిపడే కష్టాలకు లక్ష్యాన్ని త్యాగం చేయాల్సిన పనిలేదని తెలుపుతోంది. ఎన్ని కష్టాలు వెంటాడినా..వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తే..కచ్చితంగా ఏదో ఒకరోజు విజయం పాదాక్రాంతం అవుతుందని ఐఏఎస్ అన్షుమాన్ కథ చెప్పకనే చెబుతోంది కదూ..!. (చదవండి: నాడు కాలేజ్ డ్రాపౌట్..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు..!) -
ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా
పట్నా: బిహార్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన శాసనమండలి సభ్యత్వానికి (ఎంఎల్సీ) సోమవారం రాజీనామా చేశారు. ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ ఎమ్మెల్సీ సంజయ్ గాంధీ ఈ రాజీనామా లేఖను కౌన్సిల్ సెక్రటేరియట్‌కు సమర్పించారు.గడువు ముగియడంతో నిర్ణయంమార్చి 16న నితీష్ కుమార్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101, 190 ప్రకారం.. ఒక వ్యక్తి ఏకకాలంలో అటు పార్లమెంటులోనూ, ఇటు రాష్ట్ర శాసనసభ లేదా మండలిలోనూ సభ్యునిగా కొనసాగకూడదు. 1950 నాటి ‘ప్రొహిబిషన్ ఆఫ్ సైమల్టేనియస్ మెంబర్షిప్’ నిబంధనల ప్రకారం, ఎన్నికైన 14 రోజుల లోపు ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు మార్చి 30 (సోమవారం) నాటితో ముగియనుండటంతో, చివరి రోజున ఆయన తన ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.మరిన్ని మార్పులు ఖాయమేనా?నితీష్ కుమార్ మాత్రమే కాకుండా, బీజేపీ నేత నితిన్ నబిన్ కూడా బిహార్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల కారణంగా ఆయన రాజీనామా ప్రక్రియలో స్వల్ప ఆలస్యం జరిగిందని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరోగి త్వరలోనే ఆ లేఖను సమర్పిస్తారని సమాచారం.తదుపరి సీఎం ఎవరు?నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్ తదుపరి ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్ తదితర అగ్రనేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ ప్రస్తుత బాధ్యతలకు సంబంధించి రానున్న కొద్ది రోజుల్లో పార్టీ నుంచి మరిన్ని కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
బిహార్ సీఎంగా ‘సామ్రాట్’.. నితీష్ వ్యాఖ్యలకు మంత్రి క్లారిటీ!
పట్నా: బిహార్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే చర్చ.. సీఎం నితీష్ కుమార్ వారసుడు ఎవరు? ఆయన తన వారసుడిగా డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీని ప్రొజెక్ట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటికి సీనియర్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి బ్రేక్ వేశారు. ఆ వార్తల్లో నిజం లేదని, మీడియా కేవలం ఊహాగానాలతో వార్తలు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు.అసలేం జరిగింది?ఇటీవల జముయి జిల్లాలో జరిగిన ‘సమృద్ధి యాత్ర’లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పక్కనే ఉన్న సామ్రాట్ చౌదరీని చూపిస్తూ.. ‘ఇకపై ఈయనే బీహార్ బాధ్యతలను చూసుకుంటారు, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది’ అని పేర్కొన్నారు. నితీష్ రాజ్యసభకు వెళుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపాయి. సామ్రాట్ చౌదరిని నితీష్ తన రాజకీయ వారసుడిగా ప్రకటించేశారని అంతా భావించారు.మంత్రి క్లారిటీ ఇదీ..ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఇఫ్తార్ వేడుక అనంతరం మంత్రి విజయ్ కుమార్ చౌదరి మీడియాతో మాట్లాడారు. నితీష్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన కోరారు. ‘ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. నితీష్ కుమార్ ఎప్పుడూ తన కేబినెట్ సహచరులను ఇలాగే ప్రోత్సహిస్తుంటారు. బాధ్యతలు చూసుకోమని చెప్పడం ఆయనకు అలవాటే. ఇందులో కొత్త సిగ్నల్స్ ఏమీ లేవు’ అని స్పష్టం చేశారు.మారుతున్న రాజకీయ సమీకరణలునితీష్ కుమార్ తన పదవిని వదులుకున్నాక, బీహార్‌లో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ గత వారమే పార్టీలో చేరారు. కొత్త ప్రభుత్వంలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కవచ్చని జేడీయూ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, మైనారిటీల పట్ల నితీష్‌కు ఉన్న అంకితభావాన్ని మంత్రి కొనియాడారు. రాజకీయం అనేది భావోద్వేగాలతో కాకుండా సమీకరణలతో నడుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు జేడీయూలో కీలక నేత కేసీ త్యాగి రాజీనామా చేయడంతో బిహార్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.ఇది కూడా చదవండి: నవరాత్రి శోభ: వర్షంలోనూ వైష్ణోదేవికి పోటెత్తిన భక్తులు -
సింగర్ ఓవరాక్షన్.. డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన
పాట్నా: బీహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భోజ్‌పురి సింగర్ ధనంజయ్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రైవేటు ఈవెంట్లో భాగంగా స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్‌తో శర్మ అనుచితంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా.. మహిళ అని కూడా ఆమెను పైకి ఎత్తి జనాలపైకి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోజ్‌పురి సింగర్ ధనంజయ్ శర్మ తాజగా బీహార్‌లో ఓ ప్రైవేటు ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనాలు విపరీతంగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే పాటలు పాడుతూ అందరూ ఎంజాయ్ చేస్తున్న తరుణంలో అనూహ్య ఘటన జరిగింది. స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్‌ను పైకి ఎత్తి జనాల్లో పడేశాడు ధనంజయ్ శర్మ. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా టచ్ చేస్తూ ఆమెను లిఫ్ట్ చేశాడు. అనంతరం, స్టేజ్ కింద ఉన్న ఆడియన్స్పైకి ఆమెను విసిరేశాడు. దీంతో ఆ లేడీ డ్యాన్సర్ తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది.⚠️VIRAL | Singer Dhananjay Sharma lifts female dancer off stage and throws her into reaching fans during Muzaffarpur show. pic.twitter.com/neHNwWTdFl— The Tatva (@thetatvaindia) March 16, 2026ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ధనంజయ్ శర్మకు కొంచెం కూడా బుద్ధి లేదని ఫైర్ అవుతున్నారు. లేడీ డాన్సర్ అని చూడకుండా, పబ్లిక్ సిటీ కోసం ఇలాంటి పనులు చేస్తారా? అని మండిపడుతున్నారు. మహిళలంటే అతడికి ఎలాంటి గౌరవం లేదని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ ధనుంజయ్ శర్మ స్పందించారు.. ఈ క్రమంలో తాను కావాలని అలా చేయలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఆమెతో అనుచితంగా ప్రవర్తించలేదని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో వేదికపై ఏం జరిగిందో ప్రజలకు పూర్తి నిజం తెలియదని ఆయన అన్నారు. తాను పాట పాడుతున్న సమయంలో డ్యాన్సర్లు నన్ను ఢీకొట్టారు. వారు నన్ను పట్టుకుని వేదికపై నుండి నెట్టడానికి ప్రయత్నించారు. ఈ మధ్యలో, ఒక మోడల్ నన్ను తన్ని.. నా ఛాతీపై చేయి వేయడం ప్రారంభించింది. ఇది ఎలాంటి ప్రవర్తన? అని ఆయన ప్రశ్నించారు. సదరు డ్యాన్సర్‌ను తాను విసిరేయాలని అనుకోలేదని ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో సింగర్ ధనంజయ్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. -
రాజ్యసభకు నితీశ్, నితిన్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. బిహార్‌లోని ఐదు, ఒడిశాలో నాలుగు, హరియాణాలో రెండు సీట్లకు సోమవారం జరిగిన పోలింగ్‌లో బీజేపీ అత్యధిక సీట్లను దక్కించుకుంది. 11 సీట్లకు గాను బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. ఒకటి బీజేడీకి, మరోటి బీజేపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థికి దక్కింది.హరియాణాలో కౌంటింగ్ నిలిచిపోవడంతో ఫలితం వెల్లడి కాలేదు. బిహార్ నుంచి ఖాళీ అవనున్న మొత్తం ఐదు స్థానాలను ఎన్డీయే క్లీన్‌స్వీప్ చేసింది. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్, నితిన్ నబీన్లతోపాటు జేడీయూ నేత, కేంద్ర మంత్రి రాంనాథ్ ఠాకూర్, బీజేపీ నేత శివేశ్ కుమార్, రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా ఎన్నికయ్యారు.ఐదు సీట్లకుగాను ఆర్జేడీకి చెందిన అమరేంద్ర ధారి సింగ్ సహా ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, వరుసగా రెండో విడత గెలవాలన్న అమరేంద్రకు మహాగఠ్‌బంధన్ నుంచి సహకారం కరువైంది. దీంతో, ఆయన ఓడిపోయారు. కాగా, బిహార్‌కు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన నితీశ్ కుమార్ ఇటీవల రాజ్యసభకు వెళ్లనున్నట్లు చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్య పర్చింది. రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆయన త్వరలోనే రాజీనామా చేస్తారని భావిస్తున్నారు.ఒడిశాలో బీజేపీకి రెండు సీట్లుఒడిశాలో అధికార బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్, పార్టీ ఎంపీ సుజీత్ కుమార్ 35 చొప్పున ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ అధికార అభ్యర్థి సంతృప్త్ మిశ్రా 31 ఓట్లతో గెలిచారు. బీజేపీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే కూడా గెలిచారు. తమ 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులకు ఓటేశారని బీజేడీ ఆరోపించింది. కాంగ్రెస్ కూడా తమ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసినట్లు పేర్కొంది. -
బిహార్ డిప్యూటీ సీఎంగా నిశాంత్ కుమార్?
పాట్నా: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజ్యసభలో అడుగు పెట్టనున్న తరుణంలో ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ జేడీయూలో చేరారు. ఆదివారం నితీష్ ఆధ్వర్యంలో నిశాంత్ పార్టీ సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ తన కుమారుడికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన నితీష్ కుమార్ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆయన నిర్ణయంతో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న నిశాంత్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. త్వరలో బిహార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది.బిహార్‌లో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ‘సుశాషన్ బాబు’ (మంచి పాలన అందించే వ్యక్తి) అనే పేరు తెచ్చుకున్న నితీష్ మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. త్వరలో ముఖ్యమంత్రి పదవిని వదులుకోనున్నారు. -
వైభవ్ సూర్యవంశీ మామకు సివిల్స్‌లో బెస్ట్ ర్యాంక్
భారత క్రికెట్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. మైదానంలో పరుగుల వరద పారించడం ఈ పిల్లాడికి పరిపాటి అయిపోయింది. పద్నాలుగేళ్ల వయసులోనే ఎన్నెన్నో ప్రపంచ రికార్డులు సాధించాడు ఈ బిహారీ అబ్బాయి.యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో అతి పిన్న వయసులోనే విధ్వంసకర శతకాలు బాదిన బ్యాటర్‌గా వైభవ్ చరిత్రకెక్కాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున మొదలైన అతడి పరుగుల ప్రవాహం.. భారత్ అండర్-19 జట్టు తరఫునా కొనసాగుతోంది.ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 175 పరుగులు చేసి.. భారత్‌ను గెలిపించాడు వైభవ్ (Vaibhav Suryavanshi). తద్వారా టీమిండియా వైపు తొలి అడుగు వేశాడు. ఇక ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 కోసం రాజస్తాన్ రాయల్స్‌తో కలిసి నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు.పదో తరగతి పరీక్షలు డుమ్మాఇదిలా ఉంటే.. ఆటతో కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఇటీవల వైభవ్ సూర్యవంశీ పేరు వైరల్ అవుతోంది. క్రికెట్‌తో బిజీగా ఉన్నందున అతడు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయలేకపోయాడు. ఈ విషయాన్ని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ధ్రువీకరించారు.102వ ర్యాంకుమరోవైపు.. తాజాగా సంజీవ్ సూర్యవంశీ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. వైభవ్ సూర్యవంశీకి వరుసకు మేనమామ అయిన అభిషేక్ చౌహాన్ (Abhishek Chauhan) యూపీఎస్సీ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 102వ ర్యాంకు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. తొలి ప్రయత్నంలోనే అభిషేక్ ఈ మేర ర్యాంకు సాధించడం మరో విశేషం. ఆయన ఐపీఎస్ సర్వీస్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.ఉన్నత విద్యావంతుల కుటుంబంబిహార్లోని సమస్తిపూర్‌లో గల మొహియుద్దీన్నగర్ బ్లాక్‌లో గల రాజాజన్ గ్రామంలో 1999లో అభిషేక్ చౌహాన్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు డాక్టర్ అభయ్ కుమార్ సింగ్, తల్లి అనురాధా రాజ్‌పుత్. అభయ్ కుమార్ సింగ్ నలంద ఓపెన్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. ఇక ఎంటెక్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అభిషేక్ 2022 నుంచి సివిల్స్ పరీక్షకు సన్నద్ధం అయ్యారు. 2025లో తొలిసారి పరీక్ష రాయగా.. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 102వ ర్యాంకు సాధించారు. దీంతో సమస్తిపూర్‌లో సంతోషకర వాతావరణం నెలకొంది. బంధువులు, స్నేహితుల రాకతో హడావుడిగా మారింది. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ.. అభిషేక్ చౌహాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
బిహార్‌లో ‘జాతీయ’ గీతం!
ఊహించని నిర్ణయాలతో తరచు అందరినీ ఆశ్చర్యపరిచే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈసారి మాత్రం దిగ్భ్రాంతిలో ముంచెత్తారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుని గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయటంతో జేడీ(యూ) అగ్రనాయకులే ఖిన్నులయ్యారు. వారికి కేవలం కొన్ని గంటలముందు మాత్రమే తెలిసింది మరి. పదేళ్లుగా తన పదునైన వ్యూహాలతో దేశంలో బీజేపీ ఎదుగుదలకు చక్రం తిప్పుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే ఈ ఊహించని పరిణామానికి కూడా బాధ్యులని మీడియా కథనాలు చెబుతున్నాయి. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నితీశ్ వాస్తవానికి తన కుమారుడికి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని నెల్లాళ్లుగా బీజేపీ అగ్రనేతలను అడుగుతూ వస్తున్నారు. తీరా ఆయన హఠాత్తుగా స్వరం మార్చారు. మధ్యమధ్య కొత్త పొత్తులతో జనం ముందుకెళ్తున్నా మెజారిటీ కాస్త అటూ ఇటూఅయింది తప్ప గత 20 సంవత్సరాలుగా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగారు. తాను రాష్ట్రంలో ఉభయ సభలతోపాటు లోక్‌సభ సభ్యుడిగా కూడా పనిచేశాననీ, రాజ్యసభకు వెళ్లలేదన్న అసంతృప్తిని పోగొట్టుకోవటానికే తాజా నిర్ణయం తీసుకున్నాననీ ఆయన చెబుతున్న మాటల్ని మద్దతుదారులు విశ్వసించటం లేదు. పార్టీలో అంతఃకలహాలు, సహకరించని ఆరోగ్యం ఆయన తాజా నిర్ణయానికి కారణమన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.బిహార్ రాజకీయాలపై నితీశ్ ముద్ర చెరగనిది. 1974 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమ నేతగా ముందుకొచ్చిన విద్యార్థి నాయకుల్లో నితీశ్ ఒకరు. 90వ దశకం నుంచీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనదే కీలక భూమిక. తనతోపాటు రాజకీయాల్లో అడుగుపెట్టిన లాలూ ప్రసాద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్‌లతో పోలిస్తే నితీశ్ వ్యూహ చతురత గలిగినవారు. అందుకే ‘సామాజిక న్యాయ’ రాజకీయాల ప్రభావం గణనీయంగా ఉన్న రాష్ట్రంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో లేని కుర్మీ సామాజిక వర్గం నుంచి వచ్చినా అందరినీ ఆకట్టుకోగలిగారు. అత్యంత వెనుకబడిన కులాలకూ(ఈబీసీ), దళితుల్లో అట్టడుగు వర్గాలకూ పదవుల పంపకంలో ప్రాధాన్యమీయటంతోపాటు తన కుర్మీ సామాజిక వర్గాన్నీ, కుష్వాహాలనూ ఏకం చేశారు. ఆయన విజయాలకు ఈ సమీకరణాలొక్కటే కాదు... వాటితోపాటుæరాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించి ‘మంచి పాలన’ అందిస్తున్నా రన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించగలిగారు. ఆయనకు ‘సుశాసన్ బాబు’ అనే పేరు వచ్చింది అందుకే!కూటమిలో జూనియర్ భాగస్వామిగా చేరినా, అచిరకాలంలోనే అగ్రభాగానికి ఎగబాకుతుందని బీజేపీపై ఇప్పటికే ముద్రపడింది. మహారాష్ట్రలో జరిగింది ఇదే. ఇప్పుడు బిహార్‌లోనూ ఇదే కొనసాగుతోంది. కేంద్రంలో ఎన్డీయే మనుగడకు జేడీ(యూ) మద్దతు తప్పనిసరైనా, రాష్ట్రంలో ఆ పార్టీ సారథ్యాన్ని తప్పించటం చిన్న విషయమేమీ కాదు. 2020 ఎన్నికల్లో తొలిసారి జేడీ(యూ)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో బీజేపీ కన్నా తనకు అదనంగా ఒక్క స్థానమైనా కావాలని పట్టుబట్టి తీసుకున్న ఆ పార్టీకి తీరా 43 మాత్రమే లభించాయి. బీజేపీకి ఆ ఎన్నికల్లో వచ్చినవి 74. అందుకే సీఎం పదవి నిలుపుకోవటంపై సంశయం ఏర్పడి నితీశ్ మధ్యలో ఆర్జేడీ వైపు వెళ్లారు. ఆ చెలిమి ఎన్నాళ్లో కొనసాగలేదు. తిరిగి ఎన్డీయే గూటికి చేరారు. మొన్న నవంబర్‌లో జేడీ(యూ)కు 85 లభించగా, బీజేపీ గెల్చుకున్నవి 89. అధిక స్థానాలున్న పక్షంగా సీఎం పదవి అడగాల్సి ఉన్నా తాత్కాలికంగా బీజేపీ వెనక్కుతగ్గింది. అదును చూసి నాలుగు నెలల్లో సాధించింది. పార్టీకి ప్రధాన వనరైన మహిళలు, రైతులు బీజేపీ వైపు మొగ్గుతున్నారన్న సమాచారంతో జేడీ(యూ) నేతలు అప్రమత్తమవుతున్నట్టు కథనాలు వచ్చాయి. అందుకే ఇక ఆలస్యం చేయరాదని బీజేపీ భావించినట్టు కనబడుతోంది.నితీశ్ నిష్క్రమణ, బీజేపీ ఆగమనంతో బిహార్ రాజకీయాల్లో సోషలిస్టు నేపథ్యంగల ప్రాంతీయ పార్టీల పాత్ర కొడిగడుతుంది. రాజ్యసభకు వెళ్లినా బిహార్‌లో తన ముద్రఉంటుందని నితీశ్ చెబుతున్నా అది ఆచరణలో సాధ్యపడదు. ఒకటి నిజం – ఇప్పటికీ బిహార్ నిరుపేద రాష్ట్రాల్లో ఒకటిగానే ఉంది. తన ఏలుబడిలో బీజేపీ దాని ముఖచిత్రాన్ని ఏ మేరకు మార్చగలదో వేచిచూడాలి. -
‘నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లొద్దు’
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడంపై జేడీయూ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నారు. పట్నాలోని జేడీయూ పార్టీ కార్యాలయం ఎదుట పోస్టర్లు పెట్టి మరీ నితీశ్ కుమార్‌కు కార్యకర్తలు విజ్ఞప్తులు చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ, ప్రజాస్వామ్యంలో ఆత్మగౌరవాన్ని తక్కువ చేయడాన్ని ఇక సహించబోమని పేర్కొన్నారు. ఇన్నాళ్లు నితీశ్ కుమార్‌కు మద్దతు తెలిపిన వారే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టర్లు సైతం పెడుతుండడం గమనార్హం. కాగా, నితీశ్ కుమార్ గురువారం రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఆ సమయంలో ఆయన వెంటే ఉన్నారు. బిహార్‌లో బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతోంది. దీనిపై విపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. బీజేపీపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. నితీశ్‌పై బీజేపీ కుయుక్తులు చేసిందని, ‘2025 సే 30 ఫిర్ సే నితీశ్’ అనే ఎన్నికల నినాదానికి విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పారు. నితీశ్ సీఎం కుర్చీలో 6 నెలలకంటే ఎక్కువ ఉండరని తాము ముందే చెప్పామని అన్నారు.మరోవైపు, నితీశ్ కుమార్ మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన సీఎంగా పదవిలో ఉన్న కాలాన్ని బిహార్ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా పేర్కొన్నారు. ఎన్నో పదవుల్లో నితీశ్ కుమార్ సుదీర్ఘ రాజకీయ జీవితం కొనసాగించినా ఆయనపై ఏ మచ్చా పడలేదని అమిత్ షా అన్నారు. -
రాజ్యసభకు నితీశ్ నామినేషన్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ సహా ఐదుగురు గురువారం ఎన్డీయే తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. జేడీయూ చీఫ్‌గా ఉన్న నితీశ్ కుమార్, జనవరిలో బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నబీన్లు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో విధాన సభ సెక్రటేరియట్లో అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్లు వేసిన ఎన్డీయే అభ్యర్థుల్లో జేడీయూకు చెందిన కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్, ఆర్ఎల్ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివేశ్ కుమార్ ఉన్నారు. వీరితోపాటు ఆర్జేడీ బలపరిచిన సిట్టింగ్ ఎంపీ, వ్యాపారవేత్త అమరేంద్ర ధారి సింగ్ సైతం నామినేషన్ వేశారు. ఆయన వెంట ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు. డిప్యూటీ సీఎంగా నిశాంత్సీఎం నితీశ్ కుమారుడు నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా వార్తలు గుప్పుమన్న రెండు రోజుల్లోనే నితీశ్ రాజ్యసభకు నామినేషన్ వేయడం గమనార్హం. నితీశ్ కుమార్ రాజీనామాతో సీఎం పదవిని బీజేపీ నేత చేపడతారని భావిస్తున్నారు. అదేవిధంగా, ఇంజనీరింగ్ పట్టభద్రుడైన 40 ఏళ్ల నిశాంత్ కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేరుతారని అంటున్నారు. సీఎం రేసులో ఉన్న వారిలో ప్రస్తుత డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి పేరు గట్టిగా వినిపిస్తోంది.నితీశ్ నివాసం వద్ద నిరసనలు..గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయేను అఖండ విజయం వైపు నడిపించిన నితీశ్ రాజీనామాతో బీజేపీ నేత ఒకరు ఆ పదవిని చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆ పార్టీ అభ్యర్థి సీఎం పదవిని చేపట్టని ఏకైక హిందీ రాష్ట్రం బిహార్. అయితే, నితీశ్ నిర్ణయాన్ని నిరసిస్తూ జేడీయూ కార్య కర్తలు ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.‘రాష్ట్ర రాజకీయాలను వదిలి రాజ్యసభకు వెళ్లా లని నితీష్ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన నిర్ణయంపై పార్టీ కార్యకర్తలు సంతోషంగా లేరు. ఆయన సీఎంగా కొనసాగాలి’ అని రాష్ట్ర సున్నీ వక్ఫ్ బోర్డు చైర్మన్, జేడీ(యూ) నేత అల్హాజ్ మొహమ్మద్ ఇర్షాదుల్లా అన్నారు. నితీశ్ ట్వీట్ చూడగానే ఆయన రాసింది కాదని తేలిపోయింది. అది ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశమని అర్థ మైందని ఆర్జేడీ మరో నేత మనోజ్ ఝా వ్యాఖ్యానించారు. నితీశ్ స్వచ్ఛంద నిర్ణయం.బిహార్‌లో చోటుచేసుకున్న ఆకస్మిక పరిణామంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ కిశోర్ స్పందించారు. “రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నట్లు నితీశ్ మూడేళ్ల క్రితమే తెలిపారు. ఇప్పుడు ఆయన ఆమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమిది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఏర్పడినా అది ఆయన నాయకత్వంలోనే ఉంటుంది’అని తెలిపారు.ఆ ఒక్క సీటు ఆర్జేడీకి దక్కుతుందా?ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికలు జరుగుతున్న ఐదు రాజ్యసభ స్థానాలకు గాను రెండు ఆర్జేడీకి చెందినవే. 2025 ఎన్నికల్లో ఆ పార్టీకి 25 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కడంతో ప్రస్తుతం కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పోటీ చేస్తోంది. ఆర్జేడీకి మహాగఠ్ బంధన్‌లోని మరో 10 మంది సభ్యులు ఇప్పటికే మద్దతు తెలిపారు. ఎంఐఎం, బీఎస్పీలకు చెందిన మరో ఆరుగురు మద్దతిస్తే ఒక్క రాజ్యసభ సీటు గ్యారంటీగా దక్కుతుంది.అయితే, మద్దతుపై ఎంఐఎం, బీఎస్పీ చీఫ్‌లు ఇప్పటి వరకు ఎవ్వరికీ మద్దతు ప్రకటించలేదు. అదే సమయంలో, ఎన్డీయేకి 243 మందితో కూడిన అసెంబ్లీలో ఏకంగా 202 మంది ఉన్నారు. దీంతో, ఐదో సీటును దక్కించుకోవాలంటే కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం అవసరమవుతారు. ఆ మేరకు మద్దతును కూడగట్టడం ఎన్డీయేకు ఏమంత కష్టం కాదని పరిశీలకులు అంటున్నారు.రాజ్యసభకు వెళ్తున్నా..నామినేషన్ దాఖలు చేయడానికి ముందు, సీఎం నితీశ్ కుమార్ తాను రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో, బిహార్‌కు అత్యధికంగా 20 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సుదీర్ఘ ప్రస్థానానికి తెరపడినట్లయింది. అనంతరం ఆయన ‘ఎక్స్’లో రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ‘రెండు దశాబ్దాలకు పైగా, మీరు నాపై నమ్మకం ఉంచారు. మద్దతిచ్చారు.ఆ బలంతోనే అంకితభావంతో సేవ చేశాను. మీ నమ్మకం, మద్దతు బిహార్ అభివృద్ధికి, రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకురావడానికి అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఉభయసభలతోపాటు పార్లమెంటు ఉభయ సభలలో సభ్యుడిగా ఉండాలన్నది నా కోరిక. అందుకనుగుణంగా ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యునిగా ప్రయాణం ప్రారంభించాలనుకుంటున్నా’ అని ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు. భవిష్యత్‌లోనూ రాష్ట్రంతో అనుబంధం కొనసాగుతుందన్నారు. కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారం, మార్గదర్శకత్వం ఉంటుందని పేర్కొన్నారు. -
నామినేషన్ దాఖలు చేశారు.. నితీశ్ ఇకపై..: అమిత్ షా
న్యూఢిల్లీ: నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న కాలాన్ని ఆ రాష్ట్ర చరిత్రలో “సువర్ణ అధ్యాయం”గా కేంద్ర మంత్రి అమిత్ షా అభివర్ణించారు. నితీశ్ జాతీయ రాజకీయాల్లోకి తిరిగి రావడాన్ని అమిత్ షా స్వాగతించారు. రాజ్యసభ స్థానానికి ఇవాళ నితీశ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో నితీశ్ వెంటే అమిత్ షా ఉన్నారు. దీనిపై అమిత్ షా మాట్లాడుతూ.. ‘ఇవాళ రాజ్యసభ స్థానానికి బిహార్ సీఎం కూడా నామినేషన్ దాఖలు చేశారు. నితీశ్ కుమార్ 2005 నుంచి ఇప్పటి వరకు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలం నిజంగా గొప్పది. ఈ కాలం బిహార్ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి వంటి పదవుల్లో సుదీర్ఘ రాజకీయ జీవితం కొనసాగించినా ఆయనపై ఏ మచ్చా పడలేదు. ఆయన జీవితం మొత్తం స్వచ్ఛంగా ఉంది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 సంవత్సరాల కాలంలో నితీశ్ కుమార్ బిహార్ అభివృద్ధిలో అన్ని విధాలుగా ముఖ్యమైన పాత్ర పోషించారు. మోదీ ప్రారంభించిన ప్రతి కార్యక్రమం బిహార్ ప్రజలకు చేరేలా నితీశ్ నాయకత్వం పనిచేసింది. ఇప్పుడు ఆయన మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీకి తిరిగి వస్తున్నారు. నేను, ఎన్డీఏ మిత్ర పక్షా నేతలు అందరమూ ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం’ అని అన్నారు.మేము ముందే చెప్పాం: తేజస్వీ బిహార్‌లో రాజకీయంగా అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. బీజేపీపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీశ్ కుమార్‌పై బీజేపీ కుయుక్తులు చేసిందని ఆరోపించారు. ‘2025 సే 30 ఫిర్ సే నితీశ్’ అనే ఎన్నికల నినాదానికి విరుద్ధంగా వ్యవహరించిందని అన్నారు.‘బీజేపీ, ఎన్డీఏ మిత్ర పక్షాలు కుయుక్తులు, కుతంత్రాలను వాడి, మొత్తం వ్యవస్థను వాడుకుని ఎన్నికలు ఎలా నిర్వహించాయో తెలుసు. అప్పుడే నితీశ్ కుమార్‌ను బీజేపీ హైజాక్ చేసిందని చెప్పాం. ఆయనను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోనివ్వరని తెలిపాం. ఆయన ఆ కుర్చీలో 6 నెలలకంటే ఎక్కువ ఉండరని మేము చెప్పాం’ అని తెలిపారు. -
రాజ్యసభకు నితీష్.. బీహార్ సీఎం రేసులో ఇద్దరు?
పాట్నా: బీహార్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్నట్లు నితీష్ కుమార్ అధికారికంగా ప్రకటన చేశారు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి బీహార్ ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ మొదలైంది.అయితే, బీహార్‌లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న కారణంగా బీజేపీ నుంచి ముఖ్యమంత్రి స్థానం దక్కించుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో ఇద్దరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టవచ్చని తెలుస్తోంది. అలాగే, నిత్యానంద రాయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక, సామ్రాట్ చౌదరి బీహార్ రాజకీయాల్లో అంతర్భాగంగా ఉన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పటి నుండి ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వరకు బీజేపీ నాయకుడిగా కీలక పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.సీఎం రేసు కోసం నిత్యానంద్ రాయ్ కూడా పోటీలో ఉన్నారు. రాయ్ ప్రస్తుతం హోంమంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్రంలో పని చేయడానికి ముందు, రాయ్ బీహార్‌కు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాయ్ హాజీపూర్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2015లో రాయ్ పార్లమెంటరీ టికెట్ గెలుచుకుని ఉజియార్పూర్ నుండి ఎంపీగా పనిచేశారు. మరోవైపు.. నితీష్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.నితీష్ కీలక వ్యాఖ్యలు.. అంతకుముందు సీఎం నితీష్ కుమార్ ట్విట్టర వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘గత రెండు దశాబ్దాలకు పైగా మీరు నాపై ఉంచిన విశ్వాసం, మద్దతు నిరంతరం కొనసాగుతోంది. అదే బలంతో మేము బీహార్ రాష్ట్రానికి, మీ అందరికీ సంపూర్ణ నిబద్ధతతో సేవ చేయగలిగాం. మీ విశ్వాసం, మద్దతు వల్లే బీహార్ ఈరోజు అభివృద్ధి మరియు గౌరవానికి కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇందుకు నేను గతంలో కూడా మీ అందరికీ పలుమార్లు కృతజ్ఞతలు తెలిపాను. నా పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచే ఒక కోరిక నా మనసులో ఉంది.బీహార్ శాసన మండలి (విధాన మండల) రెండు సభలతో పాటు, పార్లమెంట్‌లోని రెండు సభల సభ్యుడిగా కూడా ఉండాలని ఆశించాను. ఆ క్రమంలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా మారాలని కోరుకుంటున్నాను. మీతో నా ఈ అనుబంధం భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందని నేను పూర్తి నిజాయితీతో హామీ ఇస్తున్నాను. మీ అందరితో కలిసి అభివృద్ధి చెందిన బిహార్ నిర్మాణం అనే సంకల్పం అలాగే కొనసాగుతుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి నా పూర్తి సహకారం మరియు మార్గదర్శనం ఉంటుంది’ అని ఆయన అధికారిక ప్రకటన చేశారు. -
సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
-
శకం ముగిసింది.. బిహార్ సీఎం పదవికి నితిష్ కుమార్ రాజీనామా!
పాట్నా: బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ శకం ముగిసింది. సీఎం పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలని కోరుకుంటున్నాను. రెండు దశాబ్దాలుగా నాపై నమ్మకం ఉంచారు. అంకితభావంతో బీహార్ అభివృద్ధి కోసం పనిచేశారు’ అని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా మీరు నాపై చూపిన విశ్వాసం, మద్దతుతోనే నేను బిహార్ రాష్ట్రానికి, మీ అందరికీ పూర్తి నిబద్ధతతో సేవ చేయగలిగాము. మీ విశ్వాసం, మద్దతు వల్లే బిహార్ ఈరోజు అభివృద్ధి, గౌరవానికి కొత్త దిశను చూపుతోంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ,ఎంపీగా పనిచేశాను. రాజ్యసభ సభ్యుడిగా పనిచేయాలనేది నా చిరకాల కోరిక.అందుకే రాబోయే ఎన్నికల్లో నేను రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాలని అనుకుంటున్నా. మీతో నా సంబంధం కొనసాగుతుంది. అభివృద్ధి చెందిన బీహార్ కోసం నేను కృషి చేస్తూనే ఉంటా. నేను మీకు హామీ ఇస్తున్నాను. కొత్త ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు, మార్గదర్శకత్వం లభిస్తుంది. पिछले दो दशक से भी अधिक समय से आपने अपना विश्वास एवं समर्थन मेरे साथ लगातार बनाए रखा है, तथा उसी के बल पर हमने बिहार की और आप सब लोगों की पूरी निष्ठा से सेवा की है। आपके विश्वास और समर्थन की ही ताकत थी कि बिहार आज विकास और सम्मान का नया आयाम प्रस्तुत कर रहा है। इसके लिए पूर्व में…— Nitish Kumar (@NitishKumar) March 5, 2026 -
సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా?
పాట్నా: బిహార్ రాజకీయాల్లో పెను సంచలనం జరగనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. బీజేపీకి ముఖ్యమంత్రి స్థానం కట్టబెట్టి నితీశ్ కుమారునికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా బీజేపీతో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.బిహార్ రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారాయి. నిన్నటి వరకూ నితీష్ కుమార్ కుమారుడు.. నిశాంత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నారని ఆయన కోసం రాజ్యసభ సీటు సైతం కేటాయించారని జేడీయూ సీనియర్ నేత శ్రవణ్ కుమార్ తెలిపారు. దీంతో నితీష్ కుమార్ వారసుడి ఎంట్రీ ఖరారైందని అంతా భావించారు. అంతలోనే ఊహించని ట్విస్ట్ జరిగింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లనున్నట్లు సమాచారం అందుతుంది. దీనికోసం ఢిల్లీలో ఒప్పంద కూడా జరిగిందని జేడీయూ కీలక నేత చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇది చాలా బాధపడాల్సిన సమయం అని అంతా ఢిల్లీలోనే జరిగిందని ఆయన ఆ నేత తెలిపినట్లు ప్రచురించాయి. అయితే నితీష్ కుమార్‌ని వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో నామినేట్ చేయనున్నారని ప్రచారం నడుస్తోంది. ఆయన స్థానంలో నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. కాగా గతేడాది బిహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి స్థానం బీజేపీకి దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ చివరికి నితీష్ కుమారే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ముఖ్యమంత్రి మార్పు జరగనుందనే ప్రచారం జోరందుకుంది.ఇది చదవండి: రాజ్యసభ బరిలో నితీష్ తనయుడు నిశాంత్? -
BJP చేతికి బీహార్ సీఎం పోస్ట్ నితీష్ కుమార్ గుడ్ బై!
-
24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!
విదేశీ టూర్ వ్లాగర్ అనగానే మంచి ఆదాయం, వీసా, మంచి ఆంగ్ల భాషా నైపుణ్యం తదితరాలతో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే సాధ్యం. అది కూడా డబ్బున్నవాళ్లకే సాధ్యం, అని అందరి మదిలో నాటుకున్న భావన. అయితే అందరి అంచనాలను బ్రేక్ చేస్తూ ఓ గ్రామీణ యువకుడు..ఎలాంటి బడ్జెట్, కనీసం ఇంగ్లీష్ భాషా నైపుణ్యం, వివిధ వీసాలు కూడా లేకుండానే ఏకంగా 197 దేశాలు చుట్టేస్తూ..గ్రేట్ ట్రావెల్ వ్లాగర్‌గా పేరుతెచ్చుకుంటున్నాడు. అది కూడా తన సొంత డబ్బుతోనే ఇన్ని దేశాలు చుట్టేసి రావడం విశేషం. కేవలం 24 ఏళ్లకే ఇన్ని దేశాలంటే మాటలు కాదుకదా..!. మరి ఆ యువకుడు ఎవరు..?, ఏమా కథ చూద్దామా..!. బిహార్‌లోని ముంగేర్, భాగల్పూర్ల మధ్య ఒక చిన్న గ్రామానికి చెందని శుభమ్ కుమార్ అనే యువకుడు 197 దేశాలు పర్యటించాడు. అదికూడా కేవలం భారతీయ పాస్‌పోర్ట్‌తో, తన సొంత డబ్బుతో చుట్టొచ్చాడు. సాధారణంగా విదేశీ ప్రయాణం అంటే.. చేతినిండా డబ్బు, బహుళ వీసాలు పొందే సామర్థ్యం, మంచి ఆంగ్లభాషా నైపుణ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. తనవద్ద ఇవేమి లేకపోయినా..కేవలం తనకున్న ఇష్టం, ప్యాషన్‌తో అలవోకగా దేశాలు చుట్టేశాడు. నిజానికి శుభమ్ది మధ్య తరగతి నేపథ్యం. తండ్రి ప్రభుత్వ పాఠశాల టీచర్. ఇరుకైన గ్రామదారుల నడుమ చిన్న చిన్న గదులతో ఉండే ఇల్లు. సోషల్ మీడియాలో తన హోమ్‌టూర్ వీడియోలతో వేలాదిగా అభిమానులను సంపాదించుకున్న అతడి జర్నీ..నెమ్మదిగా ట్రావెల్ వ్లాగ్ పేరుతో విదేశీ టూర్లు పర్యటించే రేంజ్‌కు చేరుకున్నాడు. అతడి వీడియోలు చాలా నేచురల్‌గా, వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో అందరూ సులభంగా కనెక్ట్ అయ్యేవారు. అలా అతడి యూట్యూబ్ ఛానెల్‌కి ఏకంగా మూడు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు, ఆరు లక్షలకు పైగా ఫోలోవర్లు ఉన్నారు. అతని ప్రతి ట్రావెల్ వీడియో కనీసం మూడు నుంచి నాలుగు లక్షల వ్యూస్ వస్తుంటాయి. ఇదంత శుభమ్‌కి ఒక్కరాత్రిలో సంపాదించిన ఘనత మాత్రం కాదు. జర్నీ ఎలా ప్రారంభమైందంటే..తనకేమి బహుళ వీసాల సామర్థ్యం లేదని, అలాగే ఇంగ్లీష్‌పై అంత పట్టు కూడా లేదని ఓపెన్‌గానే చెప్పేశాడు శుభమ్. కేవలం ఇండియా పాస్‌పోర్ట్‌తోనే పర్యటిస్తున్నట్లు తెలిపాడు. తనకు 13 లేదా 14 ఏళ్ల వయసు నుంచి విదేశాలు పర్యటించాలనే కోరిక బలంగా ఉండేదని అలా ఈ ట్రావెల్ వ్లాగ్‌గా వీడియోలు చేస్తూ..తన కోరికను నెరవేర్చుకున్నానని అంటున్నాడు. సరిగ్గా 2018లో లేహ్-లడఖ్ పర్యటనతో మొదలైంది అతడి ప్రస్థానం. ఓ పక్క పాఠశాల తరగుతులు..మరోవైపు ఈ విదేశాల టూర్లుతో బిజీగా ఉండేవాడు. తన తొలి అంతర్జాతీయ పర్యటన మాత్రం నేపాల్, తర్వాత రష్యా, థాయిలాండ్, లావోస్..అలా 2019 నాటికి చైనా నుంచి తన మొదటి గ్లోబల్ వ్లాగ్ పోస్ట్ చేశాడు. అలా చేస్తున్నప్పుడు సవాళ్లు మాములుగా లేవని..తన టూర్ ఖర్చుల కోసం కోచింగ్ సెంటర్లను కూడా మినహాయించాల్సి వచ్చేదని చెప్పుకొచ్చాడు శుభమ్. అంతేగాదు 16 ఏళ్ల వయసుకి రష్యా వెళ్లి అక్కడ భూభాగంలో దాదాపు 3 వేల కిలోమీటర్లు హిచ్హైక్ చేశాడు. అలాగే తల్లిదండ్రులకు ఐఏఎస్‌కి ప్రిపేరవ్వుతా, ఢిల్లీ వెళ్తానని అబద్ధం చెప్పి..మలేషియా విమానం ఎక్కాడు. అయితే ఇక్కడ విదేశీటూర్లకు వెళ్లాలంటే ఎంతో స్ట్రాంగ్ పాస్‌పోర్టులు చాలానే ఉండాలి. కేవలం భారత పాస్‌పోర్ట్‌తో అన్ని దేశాలు చుట్టిరావడం చాలా కష్టం.. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ఒత్తిడి, పరిమిత వీసా యాక్సెస్, వీసా స్టాంపులకు పాస్‌పోర్ట్‌లో తగినంత ఖాళీ పేజీలు ఉండాలి కూడా. ఆ క్రమంలో ఈక్వెడార్ పర్యటనకు దాదాపు బహిష్కరింపబడతానని భయపడ్డాడట శుభమ్. ఎందుకంటే అప్పటికే తన పాస్‌పోర్ట్‌లో ఖాళీ పేజీలు లేనందున తనకు ఈక్వెడార్‌లోకి ప్రవేశం దాదాపుగా నిరాకరిస్తారనే అనుకున్నాడు. పైగా అప్పటికే ఆరు పాస్‌పోర్ట్‌లను నింపాడు. అయితే శుభమ్ ప్రతి దేశానికి ఈ పాస్‌పోర్ట్‌తోనే వెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నాడట. అలాగే దీంతోనే వెళ్లగలను అని పూర్తిగా విశ్వసించాడట. ఆ నమ్మకంతోనే విజయవంతంగా విదేశాలు చుట్టిరాగలిగాను అంటున్నాడు శుభమ్. 16 ఏళ్లకు మొదలు పెట్టిన ఈ జర్నీని ఏడేళ్లు తన తండ్రి ఇచ్చిన డబ్బులతో పర్యటించగా, 23 ఏళ్లు వచ్చేటప్పటికీ తన పూర్తి సొంత నిధులతో టూర్లు ప్లాన్ చేసుకున్నాడట. అంటే శుభమ్ అప్లోడ్ చేసే వీడియోల ద్వారా వచ్చిన ఆదాయం..అలాగే ఆయా దేశాల్లో ఉంటూ కొంత సంపాదించిన డబ్బుతో తన ప్రయాణానికి నిధులు సమకూర్చుకునేవాడట. అలా శుభమ్ శుభప్రదంగా 197 దేశాలు పర్యటించాడు. అంతేకాదండోయ్ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం అతడికి ఫోన్‌చేసి మరి అభినందించారట. ఇప్పుడు అతని టూర్ బకెట్ లిస్ట్‌లో బ్రెజిల్ దేశం ఉంది. ప్రస్తుతం అక్కడే ఉన్నాడట శుభమ్. పరిమిత వనరులే ఉన్నా..గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి కూడా..తన ఆసక్తితో ఇంతటి అనితరసాధ్యమైనదాన్ని సాధించి చూపించి..ఇతర ట్రావెల్ వ్లాగర్లకు, నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు కదా..!. View this post on Instagram A post shared by Shubham Kumar || Extreme Traveller (@nomadshubham) (చదవండి: అత్యంత విషపూరితమైన పాయిజన్‌తో..ప్రాణాంతక వ్యాధులకు చెక్..!) -
పవన్‌కు మొండిచేయి.. అందుకే పక్కనపెట్టారా?
రాజ్యసభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే శివేష్ కుమార్ బిహార్ నుంచి బరిలో ఉన్నారు. అసోం రాష్ట్రం నుంచి తేరాష్ గోవాల్లా, జోగెన్ మోహన్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. మన్మోహన్ సమల్, సుజీత్ కుమార్‌లను ఒడిశా తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాకు అవకాశం దక్కింది. లక్ష్మీవర్మ (ఛత్తీస్‌గఢ్), సంజయ్ భాటియా(హరియాణా)లకు కూడా రాజ్యసభ అభ్యర్థిత్వం దొరికింది. ప్రఖ్యాత భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్‌కు కమలం పార్టీ మొండిచేయి చూపింది. ఎంపీ కావాలకున్న ఆయన ఆశలపై బీజేపీ అధినాయకత్వం నీళ్లు చల్లింది. దీంతో ఆయనను రాజ్యసభకు పంపిస్తారని వస్తున్న ఊహాగానాలకు తాజాగా తెరపడింది. బిహార్ నుంచి నితిన్ నబీన్‌తో పాటు సీనియర్ నాయకుడు శివేష్ కుమార్ (Shivesh Kumar) అవకాశం దక్కించుకున్నారు.తీరని పవన్ కలఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టాలన్న పవన్ సింగ్ కోరిక ఇంకా ఫలించలేదు. ఈసారైనా తనకు ఎంపీ దక్కుతుందని భావించినా ఆయనకు నిరాశే మిగిలింది. రెండోసారి కూడా అవకాశం దక్కినట్టు దక్కి చేజారిపోయింది. ఎంపీ కావాలన్న ఉద్దేశంతోనే బిహార్ ఎన్నికలకు ముందు ఆయన రెండోసారి బీజేపీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లోని అసన్‌జోల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎంపీగా పోటీలో నిలిచారు. అయితే తన పాటల్లో బెంగాలీ మహిళలను అభ్యంతకరంగా చిత్రీకరించారనే విమర్శలు రావడంతో పోటీ నుంచి ఆయనను తప్పించింది. దీంతో మనస్తాపం చెందిన పవన్ సింగ్.. బిహార్‌లోని కరకట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఫలితంగా బీజేపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయితే పవన్ సింగ్ కారణంగా పలుచోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఓటమిపాలయ్యారన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి.'ఎమ్మెల్యే కాదు.. ఎంపీయే'గతేడాది అక్టోబర్ 1న తిరిగి కమలం గూటికి వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ బిహార్ ఇన్ఛార్జ్ వినోద్ తవ్డే, కరకట్‌లో ఆయన ప్రత్యర్థి ఉపేంద్ర కుష్వాహా సమక్షంలో బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి రావడంతో.. పవన్ సింగ్ శాసనసభకు పోటీ చేస్తారని మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే పవన్‌కు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశం లేదని, ఎంపీ కావాలన్నది ఆయన కోరిక అని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వెల్లడించారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున పవన్ సింగ్ ప్రచారం సాగించారు.చదవండి: రాజ్యసభ బరిలో నితీశ్ కుమార్ తనయుడు?అందుకే ఇవ్వలేదా?ఎన్డీఏ కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధించడంతో ఆయనకు కచ్చితంగా రాజ్యసభ సీటు దక్కుతుందని బాగా ప్రచారం జరిగింది. అయితే బిహార్‌కే చెందిన నితిన్ నబీన్ (Nitin Nabin) బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పరిస్థితి మారినట్టు తెలుస్తోంది. నబీన్ పార్లమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో పవన్‌ను పక్కన పెట్టాల్సివచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు పవన్ సింగ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయనకు ఎంపీ సీటు దక్కలేదన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. మరోవైపు ఎప్పటికైనా తమ హీరో ఎంపీ అవుతారని పవన్ సింగ్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.BJP announces its candidates for the upcoming Rajya Sabha elections.Nitin Nabin, Shivesh Kumar from Bihar.Terash Gowalla, Jogen Mohan from Assam.Laxmi Verma from Chhattisgarh.Sanjay Bhatia from Haryana.Manmohan Samal, Sujeet Kumar from OdishaRahul Sinha from West Bengal. pic.twitter.com/jM3afnPLLi— ANI (@ANI) March 3, 2026 -
రాజ్యసభ బరిలో నితీష్ తనయుడు నిశాంత్?
పట్నా: బిహార్ రాజకీయ ముఖచిత్రంలో మరో కీలక మలుపు చోటుచేసుకోనుంది. ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమయ్యింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జేడీయూ తరఫున ఆయనను రాజ్యసభకు పంపేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది.నిశాంత్ రాజకీయ రంగ ప్రవేశాన్ని జేడీయూ సీనియర్ నేత శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారని, రాబోయే ఒకటి రెండు రోజుల్లో దీనిపై పార్టీ అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన పేర్కొన్నారు. హోలీ పండుగకు ముందే ఈ నిర్ణయం వెలువడటంతో పార్టీ శ్రేణులు, మద్దతుదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత కొన్నేళ్లుగా నిశాంత్ కుమార్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని పార్టీ కార్యకర్తలు నిరంతరం కోరుతున్న తరుణంలో, ఈ ప్రతిపాదనకు కార్యరూపం లభించింది.నిశాంత్ కుమార్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, అది రాజ్యసభ సభ్యత్వం కూడా కావచ్చని మంత్రి శ్రవణ్ కుమార్ పరోక్షంగా తెలియజేశారు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించినప్పటి నుండి నిశాంత్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. గత ఏడాది డిసెంబర్లో జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా సమక్షంలోనే నిశాంత్ ప్రవేశంపై చర్చ జరగగా, సరైన సమయం కోసం నిరీక్షించినట్లు తెలుస్తోంది. జేడీయూ మనుగడకు, పార్టీ పటిష్టతకు నితీష్ వారసుడు రావడం అనివార్యమని అటు విపక్ష నేతలు సైతం గతంలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఈ పరిణామం బిహార్ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఇది కూడా చదవండి: మాజీ కేంద్ర మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత -
ఐజీ సునీల్ నాయక్‌కు.. హైకోర్టు ఊరట
సాక్షి విజయవాడ: బిహార్ ఐజీ సునీల్ నాయక్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సునీల్ నాయక్‌ని అరెస్టు చేయెుద్దని కోర్టు ఆదేశించింది. చట్టానికి లోబడే విచారణ చేపట్టాలని పోలీసులకు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. కాగా కొద్దిసేపటి క్రితం బిహార్ ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.ఈ కేసులో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను పోలీసులు విత్‌డ్రా చేసుకున్నారు. సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని గుంటూరు స్పెషల్ మెుబైల్ కోర్టును పోలీసుల ఆశ్రయించారు దీంతో అరెస్ట్ చేసిన తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ ఏంటి అని అధికారులను ప్రశ్నించింది. గుంటూరు స్పెషల్ కోర్టు. దీంతో కోర్టు ప్రశ్నలకు కంగుతిన్న పోలీసులు, లాయర్లు సునీల్ నాయక్ నాన్ బెయిలబుల్ వారెంట్ ను విత్‌డ్రా చేసుకున్నారు. -
బతుకు కోసం కాదు..గుర్తింపు కోసం చేసిన పోరాటం..!
‘నేను జీవించే’ ఉన్నాను.. నమ్మండి..‘దెయ్యాన్ని’ కాదు.. మీలా మనిషినే.. అంటూ ఓ వ్యక్తి ‘తన ఉనికి’ కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు సాగించాడు.. గుర్తింపు కోసం అభ్యర్థించాడు... ఛీత్కారాలు.. చీదరింపులకు గురయ్యాడు. అయినా తన పోరాటం.. ఆపలేదు. కోర్టు మెట్లెక్కాడు.. చివరికి తాను బతికే ఉన్నానని నిరూపించుకున్నాడు. వ్యవస్థలో లోపాల్ని లోకానికి ఎలుగెత్తి చాటాడు.. డబ్బులకు కక్కుర్తిపడి కొంతమంది ఉద్యోగులు బతికున్నోడ్ని ‘కాగితాల్లో’ ఎలా చంపేస్తున్నారో బహిర్గతం చేశాడు.. ఇది బతుకు కోసం చేసిన పోరాటం కాదు. ‘నేను బతికే ’ ఉన్నానని ఓ వ్యక్తి రెండు దశాబ్దాల పాటు సాగించిన ‘గుర్తింపు’ పోరాటం. అతడే లాల్ బిహారి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖలీలాబాద్‌కు చెందిన లాల్ బిహారి సన్నకారు రైతు. వారసత్వంగా వచ్చిన అతని భూమిని కొట్టేసేందుకు బంధువులు అతడు చనిపోయినట్టు రికార్డులు సృష్టించారు. అవినీతి అధికారులు వారికి సహకరించారు. డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో బిహారి ‘లీగల్’గా చనిపోయాడు. ఎలా బయటపడిందిఅంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలనుకున్నాడు లాల్ బిహారి. 1976లో తన 22వ ఏట ఓ చిరు వ్యాపారం కోసం బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకున్నాడు. నివాస ధ్రువపత్రం కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాడు. అప్పుడే అతనికి ‘తాను చనిపోయాననే ‘చావు కబురు ’ తెలిసింది. అధికారి చెప్పిన ఆ మాట విని గుడ్లు తేలేశాడు.. భయం.. భయంగాబిహారి ‘చనిపోయాడనే’ వార్త ఊరంతా వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల వారు అతన్నో దెయ్యంలా, బతికే ఉన్నాడా.. అనే అనుమానపు చూపులతో వేధించేవారు. చిన్న పిల్లలు సైతం ఆట పట్టించేవారు. బంధువులు అతన్ని దూరం పెట్టారు. న్యాయ పోరాటం తాను బతికే ఉన్నట్టు నిరూపించుకునేందుకు లాల్ బిహారి ప్రయత్నాలు ప్రారంభించాడు. స్థానిక అధికారిని కలిసి రికార్డులు సరిచేయాలని కోరాడు. తమ తప్పును సరిదిద్దేందుకు వారు ససేమిరా అన్నారు. తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో రికార్డులను సరి చేయాలని, తాను జీవించే ఉన్నానని అధికారికంగా ప్రకటించాలని కోర్టు మెట్లెక్కాడు. కేసు వాయిదాలు పడుతూనే ఉంది. ఏళ్లు గడిచినా ఎటూ తేలకపోవడంతో ఉద్యమ బాట పట్టాడు. అధికారుల తీరుకు నిరసనగా తన పేరు చివరిలో ‘మృతక్’ (చనిపోయిన) అని తగిలించుకున్నాడు. అప్పటి నుంచి ‘లాల్ బిహారి మృతక్’ అని పిలవడం మొదలు పెట్టారు. తాను చనిపోయాను కాబట్టి తన భార్యకు వితంతు పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన సమస్యను వెలుగులోకి తెచ్చేందుకు మాజీ ప్రధానులు రాజీవ్‌గాంధీ, వీపీ సింగ్‌లపై ఎన్నికల్లో పోటీకి సైతం దిగాడు. ఇలా అయినా తన ‘బతుకు’ పోరాటం చర్చనీయాంశం అవుతుందని భావించాడు. ‘మృతక్’ సంఘం ఆవిర్భావంఇది తనొక్కడి సమస్యే కాదని, ఉత్తరప్రదేశ్‌లోని కొంతమంది అవినీతి అధికారుల కారణంగా తనలాంటి అనేకమంది ‘రికార్డుల్లో’ చనిపోయారని అతనికి తెలిసింది. దీంతో ‘మృతక్ సంఘం’(అసోసియేషన్ ఆఫ్ ది డెడ్) ఏర్పాటు చేశాడు. బతికే ఉన్నా, రికార్డుల్లో చనిపోయిన వారి హక్కుల కోసం ఈ సంఘం పోరాటం ప్రారంభించింది. వందలాది మంది ఈ సంఘంలో చేరారు. జాతీయ/అంతర్జాతీయ మీడియా సైతం ఈ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. మీడియాలో వార్తలు.. మానవహక్కుల సంఘాల ఆందోళనలు.. ఇలా అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అలుపెరగని అతని పోరాటం చివరికి ఫలించింది. ‘అతడు బతికే ఉన్నాడు’ అని 1994లో ప్రభుత్వం గుర్తించింది. ‘లైవ్’ సర్టిఫికెట్ జారీ చేసింది. కోర్టు తీర్పు కూడా అనుకూలంగా వచ్చింది. ఇది అతనొక్కడి విజయం కాదు, తనలా పోరాటం చేస్తున్న అనేక మందికి ఆ విజయం దక్కింది. అయితే బిహారి తన పోరాటాన్ని ఇంతటితో ముగించలేదు. తనలా నష్టపోయిన వారికి అండగా పోరాటాన్ని కొనసాగించాడు. లాల్ బిహారి కేసు ఓ వ్యక్తి బతుకు పోరాటంగా మాత్రమే మనం చూడకూడదు. సమాజంలో వేళ్లూనుకున్న అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, కోర్టుల్లో కేసుల సాగదీత.. న్యాయం కోసం ఏళ్లతరబడి ఎదురుచూపులు.. వంటి వైకల్యాల్ని తేటతెల్లం చేస్తోంది. అవమానాలు..అడ్డంకులు, ప్రతికూలతలు ఎదురైనా న్యాయం కోసం ఓ సామాన్యుడు సాగించిన పోరాటం, సాధించిన విజయం బాధితులకు, సమాజానికి స్ఫూర్తిదాయకం.తెరకెక్కిన ‘కాగజ్’లాల్ బిహారి కేసు ఎంతోమందిని ఆకర్షించింది. పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఎంతోమందికి అతని పోరాట గాథను కథలుగా మలిచారు. డాక్యుమెంటరీలు రూపొందించారు. సతీష్ కౌశిక్ అనే బాలీవుడ్ దర్శకుడు ‘కాగజ్’ పేరుతో 2021తో బిహారి పోరాటగాథను వెండి తెరకెక్కించారు. దిలీప్ మాదిరెడ్డి (చదవండి: సామాన్యురాలిలా కనిపించే అసామాన్య 'సువర్ణ'..! ఆమె ఆత్మవిశ్వాసానికి సలాం కొట్టాల్సిందే..) -
రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు
సాక్షి, అమరావతి: ‘రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు... మన సహచర పోలీసు అధికారులను వేధించేందుకు మీ తెలివితేటలు ఉపయోగించవద్దు’ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పోలీసు అధికారులకు చేసిన సూచన ఇది. బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అక్రమ అరెస్టుకు ప్రయత్నించిన ఏపీ పోలీసులకు చెంపపెట్టుగా బిహార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే.బిహార్ ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ రిటైర్డ్ ఐజీ ఇ. దామోదర్ ఐపీఎస్ అధికారుల వాట్సాప్ గ్రూపులో ఒక పోస్టు పెట్టారు. ఆ గ్రూపులో ప్రస్తుతం సర్వీసులో ఉన్న, రిటైర్ అయిన ఐపీఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. దామోదర్ పోస్టుపై డీజీ మాదిరెడ్డి ప్రతాప్ స్పందిస్తూ సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారుల వాట్సాప్ గ్రూపులో ఇచ్చిన జవాబు ప్రస్తుతం యావత్ పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.బిహార్ ప్రభుత్వ నోటిఫికేషన్ న్యాయబద్దం కాదు: రిటైర్డ్ ఐజీ ఇ. దామోదర్ బిహార్ క్యాడర్ పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేముందు తమ అనుమతి తప్పనిసరి అని ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ న్యాయబద్ధమైనది కాదు. ఆ రాష్ట్ర క్యాడర్ పోలీసు అధికారి సునీల్ నాయక్‌ను రక్షించేందుకే హడావుడిగా ఆ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర సాయుధ బలగాలకు ఉద్దేశించిన నిబంధనను పోలీసు అధికారులకు వర్తింపజేయడం సరైన చర్య కాదు. రాజకీయ నేతల చేతిలో పావులు కావద్దు: మాదిరెడ్డి ప్రతాప్ ‘మన తెలివితేటలన్నీ కూడా సహచర పోలీసు అధికారులను వేధించేందుకు ఉపయోగించవద్దు. ఇప్పటికే దేశంలో ఏపీలో మాత్రమే పలువురు పోలీసు అధికారులు జైలుకు వెళ్లారు. విచారణ ఎదుర్కొంటున్నారు. అందుకే రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెడతాం. అంతేగానీ రాజకీయ నేతల ప్రభావానికి గురై ఇటువంటి కక్ష సాధింపు, ప్రతీకార చర్యలకు పాల్పడవద్దు. వాటికి ముగింపు పలుకుదాం’.మాదిరెడ్డి స్పందన పట్ల హర్షం రిటైర్డ్ ఐజీ దామోదర్ పెట్టిన పోస్టుపై పోలీసు అధికారుల్లోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పోలీసు అధికారులకు రక్షణ కల్పిస్తూ ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సాటి పోలీసు అధికారి తప్పుబట్టడం ఏమిటని ప్రశ్నించారు. పైగా పోలీసు అధికారుల సంక్షేమం, సమన్వయం కోసం ఉద్దేశించిన వాట్సాప్ గ్రూపులలో అందుకు విరుద్ధమైన పోస్టు పెట్టడం పట్ల కూడా పోలీసు అధికారులు అంతర్గత సంభాషణల్లో తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే డీజీ ర్యాంకు అధికారి మాదిరెడ్డి ప్రతాప్ కాస్త కటువుగానే స్పందించి సరైన సమాధానం ఇచ్చారని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోలీసు శాఖ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఒక్కరైనా ధైర్యంగా స్పందించి పోలీసు అధికారులు చట్టబద్ధంగా చేయాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేశారని ప్రశంసిస్తున్నారు. -
సునీల్ నాయక్ కేసులో బీహార్ ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
బాబు సర్కారుకు బిహార్ ఝలక్ !
సాక్షి, అమరావతి : చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగ అరాచకానికి బిహార్ ప్రభుత్వం చెంపపెట్టులాంటి గట్టి ఝలక్ ఇచ్చింది. ఏపీ పోలీసు అధికారులు బిహార్ కేడర్ ఐజీ సునీల్‌నాయక్‌ను అరెస్టుచేసేందుకు ఆ రాష్ట్ర రాజధానిలో హంగామా చేయడంపై తీవ్రంగా స్పందించింది. తమ రాష్ట్ర కేడర్‌కు చెందిన పోలీసు అధికారులపై ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా తమ ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. బిహార్ కేడర్ అధికారులు డెప్యుటేషన్‌పై ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన విధులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా కేసులు నమోదు చేయాలనుకుంటే తమ అనుమతి తప్పనిసరని ఆ నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. అంతేకాదు.. ఆ అధికారులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా తాము అనుమతించాలంటే పాటించాల్సిన నిబంధనలను కూడా వెల్లడించింది. కేంద్ర పోలీసు బలగాలకు చెందిన అధికారులకు వర్తించే అన్ని రకాల రక్షణ చర్యలు బిహార్ ప్రభుత్వ అధికారులకు వర్తిస్తాయని పేర్కొంది. అంటే.. కేంద్ర బలగాలకు చెందిన అధికారులపై ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేసు నమోదుచేయాలంటే అనుసరించాల్సిన నిబంధనలను తమ అధికారుల విషయంలోనూ పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. అంతేగానీ.. ఇతర రాష్ట్రాల పోలీసులు బిహార్ వచ్చి తమ అధికారులను ఏకపక్షంగా అరెస్టు చేయడం, ఇతరత్రా చర్యలు తీసుకోడానికి వీల్లేదని కుండబద్దలు కొట్టింది. అందుకోసం బిహార్ కేడర్ అధికారులకు బీఎన్ఎస్ఎస్ చట్టం 218 కింద రక్షణ కల్పిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్లో ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు.. బిహార్ ప్రభుత్వ చర్య చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తప్పుడు ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన అక్రమ కేసులో ఐజీ సునీల్‌నాయక్‌ను వేధించేందుకు ఏపీ పోలీసులు తెగబడ్డారు. ఈ కేసు దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ తన బృందంతో పాట్నా వెళ్లి ఏకంగా ప్రస్తుతం బిహార్‌లో అగి్నమాపక, హోంగార్డుల విభాగం ఐజీగా ఉన్న సునీల్‌నాయక్ నివాసంలోకి గోడదూకి వెళ్లి అక్రమంగా అరెస్టు చేసేందుకు యతి్నంచింది. అయితే ఆ రాష్ట్ర పోలీసులు వీరి ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఈ కేసును విచారించిన పాట్నా సివిల్ కోర్టు ఏపీ పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సునీల్‌నాయక్‌ను అరెస్టుచేసి తీసుకువెళ్లేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీకి నిరాకరించింది. అయినా.. ఎస్పీ దామోదర్ టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం సాగించారు. సునీల్‌నాయ క్‌ను తాము అరెస్టుచేసినట్లు ప్రకటించారు.మరోవైపు న్యాయస్థానం తిరస్కరించినా సునీల్‌నాయక్‌ను ఏపీకి తీసుకొచ్చేందుకు దామోదర్ తనబృందంతో పాటా్నలోనే మకాం వేయడం గమనార్హం. అంతేకాదు.. ఆయన నివాసం, ఆఫీసుపై ఏపీ పోలీసులు నిఘా పెట్టారు. సునీల్ నాయక్ ఆఫీసుకు రావడంలేదని, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారని టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేశారు. రంగంలోకి బిహార్ సీఎం.. ఈ పరిణామాలపై బిహార్ పోలీసు ఉన్నతాధికారులు రగిలిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ పోలీసులు బిహార్‌లో మాటువేసి మరీ అరాచకానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని తమ సీఎం నితీశ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారం యావత్ బిహార్ పోలీసు శాఖ ప్రతిష్టకు సంబంధించినదిగా ఆయన భావించారు. దీంతో బిహార్ పోలీసు అధికారులపై ఇతర రాష్ట్రాలు అక్రమంగా చర్యలు తీసుకోకుండా తగిన ఆదేశాలు జారీచేయాలని ఆదేశించారు. ఫలితంగా.. బీఎన్ఎస్ఎస్–218 కింద బిహార్ పోలీసు అధికారులకు రక్షణ కల్పిస్తూ ఆ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పరిణామాలతో ఎస్పీ దామోదర్ తన బృందంతో వెనుదిరుగుతారా.. లేక అక్కడే మాటువేసి మళ్లీ దుస్సాహసానికి తెగబడతారా అన్నది చూడాలి. -
ఏపీ పోలీసుల వేధింపుల పర్వం: బిహార్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఢిల్లీ: బిహార్ రాష్ట్రంలో ఐపీఎస్‌గా విధుల నిర్వరిస్తున్న సునీల్ నాయక్‌పై ఏపీ పోలీసుల వేధింపుల నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు అధికారులపై రాజకీయ వేధింపులకు చెక్ పెడుతూ బిహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారిక విధులు నిర్వరిస్తున్న సమయంలో నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటే తమ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బిహార్ ప్రభుత్వం. బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ 218 కింద బీహార్ పోలీసులకు రక్షణ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర సాయుధ దళాలకు రక్షణ తరహాలోనే బీహార్ పోలీసులకు ప్రభుత్వ రక్షణ కల్పించనుంది. బిహార్ పోలీస్ అధికారి సునీల్ నాయక్ పై ఏపీ పోలీసుల దుందుడుకు చర్యలు నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతీకార, రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో అధికారులను వేధించకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. కేసులను సమీక్షించిన తర్వాతే అనుమతి పై నిర్ణయం తీసుకునేలా నోటిఫికేషన్ జారీ చేసింది. -
మేక పిల్లను కాపాడిన బాలుడు
-
పెళ్లి పీటలపై యువతికి షాక్
పాట్నా: ఆ వధువు మరికొద్దిసేపట్లో పెళ్లి చేసుకొని నూతన జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. అయితే అంతలోనే ఊహించని ఘటన జరిగింది. పెళ్లి చేసుకొని నవ జీవితాన్ని ప్రారంభించాల్సిన వధువు పెళ్లి పీటలపైనే కాల్పులకు గురైంది. తనను ప్రేమించి వేరే వారిని పెళ్లి చేసుకుంటుందని కోపంతో పెళ్లికూతురి బాయ్ ఫ్రెండ్ ...వివాహ వేడుకలోనే ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో ఆర్తీ అక్కడే కుప్పకూలింది.బిహార్ బక్సర్లోమంగళవారం ఉదయం ఆర్తీ అనే 18 ఏళ్ల యువతికి చెందిన వివాహ వేడుక ఘనంగా జరుగుతుంది. వారి కుటుంబసభ్యులు, అతిథుల సమక్షంలో పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తన సోదరి పెళ్లికూతురుకు నుదుట సిందూరం పెడుతుంది. ఇంతలోనే ఊహించని విషాదం జరిగింది. బంధుమిత్రుల మధ్యలోనుంచి అకస్మాత్తుగా వచ్చిన యువకుడు ఆర్తీపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆమె కడుపులోకి వెళ్లడంతో ఆమె పెద్దగా అరుస్తూ పెళ్లిమండపంలోనే కుప్పకూలింది.దీంతో పెళ్లికూతురు బంధువులు హుటాహుటీన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం వారణాసిలోని ట్రామా సెంటర్‌కి తరలించారు. ప్రస్తుతం ఆర్తీ పరిస్థితి విషమంగా ఉందని తెలిస్తోంది. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి ఆర్తీకి పరిసర ప్రాంతంలోనే ఉండే వ్యక్తి దీనబంధుగా పోలీసులు గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే ప్రేమ వ్యవహారం కారణంగానే కాల్పులు జరిపి ఉండవచ్చని భావిస్తున్నారు. నిందితుడిపై గతంలోనూ పోలీసు కేసు నమోదైనట్లు తెలిపారు.बिहार के जिला बक्सर के चौसा मे आधी रात जयमाला की रस्म के दौरान सिरफिरे युवक दीनबंधु ने दुल्हन आरती (18) की छाती से पिस्टल सटाकर गोली मार दी। सैंकड़ो लोगो की मौजूदगी मे यह वारदात हुई। नकाब लगाकर आए हमलावर को कोई पहचान नहीं पाया। अस्पताल जाते समय दुल्हन का वीडियो बयान सामने आया है pic.twitter.com/TZK2KTDx5W— Vedant Sharma ( son of uttar pradesh ) (@vedant_livee) February 25, 2026 -
రాజ్యసభ సీట్లపై బీజేపీ వ్యూహాం.. 21 టార్గెట్!
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకునేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 37 స్థానాల్లో కనీసంగా 21 స్థానాలను తన ఖాతాలో వేసుకునే దిశగా కసరత్తులు మొదలుపెట్టింది. మొత్తం సీట్లలో 19 స్థానాలు కచ్చితంగా ఎన్డీఏ పక్షాలకు దక్కుతాయని రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి. మరో రెండు సీట్లను కొద్దిపాటి సర్దుబాట్లతో దక్కించుకోవచ్చన్న అంచనాతో ఆ దిశగా రాష్ట్రాల నేతలతో బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు మొదలుపెట్టింది. మెజార్టీ సీట్లే లక్ష్యంగా కసరత్తు..ప్రస్తుతం 245 సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీయేకు 133 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి సొంతంగా 103 సీట్లున్నాయి. మెజారిటీకి అవసరమైన 123 సీట్లకు ఇంకా కొంత దూరంలోనే ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అధికార బీజేపీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో 10 రాష్ట్రాల ముఖ్య నేతలతో ఇప్పటికే బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబిన్, అగ్ర నేతలు చర్చలు మొదలుపెట్టారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. 288 మంది ఎమ్మెల్యేలున్న మహారాష్ట్రలో ఎన్డీయేకు 235 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఖాళీ అయిన 7 స్థానాల్లో కనీసం 6 స్థానాలు ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉంది.బీహార్‌లో ఎన్డీఏ పక్షాలకు ఉన్న బలం ఆధారంగా 5 స్థానాలకుగాను 4 స్థానాలు గెలుచుకోవడం ఖాయంగా కని్పస్తోంది. ఐదో స్థానంపై ఎన్డీఏ కూటమి ఆశలు పెట్టుకుంది. ఐదో స్థానం గెలిచేందుకు ప్రతిపక్ష శిబిరం నుంచి ముగ్గురు శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఎన్డీఏకు దొరకడం అంత కష్టమేమీ కాదనేది పార్టీ వర్గాల అంచనా. ఒడిశాలో 4 స్థానాలకు గానూ రెండింటిలో ఎన్డీఏ, మరొక సీటును ప్రతిపక్ష పార్టీలు గెలుచుకునే అవకాశం ఉంది. మరో సీటును ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే బీజేడీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం.హరియాణాలో రెండు సీట్లకుగాను ఒక సీటు బీజేపీ ఖాతాలో పడగా మరో సీటుకు ఏ పారీ్టకి తగినంత బలం లేదు. దీంతో ఆ సీటుపైనా బీజేపీ కన్నేసింది. వరుసగా రెండు పర్యాయాలు పూర్తిచేసిన వారిని పక్కనపెట్టడం, పార్టీ జాతీయస్థాయి పదవుల్లో ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, వయోపరిమితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ మార్చినెల తొలివారంలో అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ఆరంభించింది.బీహార్ నుంచి నితిన్ నబిన్.. ప్రస్తుతం బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు బిహార్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీయూకి చెందిన కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్లకు తిరిగి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను బిహార్ రాష్ట్రం నుంచే రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. కొత్తగా పార్టీ తీర్థం పుచ్చుకున్న భోజ్‌పురి నటుడు పవన్ సింగ్‌కు ఇదే రాష్ట్రం నుంచి సభ్యత్వం దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్‌దాస్ అథావాలేకు తిరిగి రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయి. ఒడిశా లేదా హరియాణా రాష్ట్రం నుంచి మాజీ కేంద్ర మహిళా మంత్రి స్మృతీ ఇరానీని రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు.. సంచలన ట్వీట్
-
ఏపీ పోలీసులపై బీహార్ కోర్టు సీరియస్
-
రెడ్‌బుక్ రివర్స్.. బిహార్‌లో బేజార్!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ అరాచకాలకు బిహార్ గడ్డ ఘాటుగా బుద్ధి చెప్పింది! రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపులను బిహార్‌లో కూడా అమలు చేసేందుకు బరితెగించిన ఏపీ పోలీసులు ఘోర పరాభవానికి గురయ్యారు. ప్రస్తుతం బిహార్‌లో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఐపీఎస్, ఐజీ స్థాయి అధికారి సునీల్ నాయక్‌ను అక్రమంగా అరెస్టు చేసేందుకు అక్కడకు వెళ్లిన సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ దామోదర్ తన బృందంతో కలసి బీభత్సం సృష్టించారు. సోమవారం తెల్లవారుజామున పట్నాలోని సునీల్ నాయక్ నివాసం గోడదూకి మరీ ఎస్పీ దామోదర్ బృందం కిడ్నాపర్ల మాదిరిగా చొరబడటం తీవ్ర విభ్రాంతికి గురి చేసింది. ఏపీ పోలీసుల దౌర్జన్యాన్ని బిహార్ పోలీసు యంత్రాంగం యావత్తూ ఒక్కటై అడ్డుకుంది.మరోవైపు ఏపీ పోలీసుల తీరుపై పట్నా కోర్టు తీవ్రంగా మండిపడింది. ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారులు పాటించాల్సిన కనీస నిబంధనలను కూడా అనుసరించకుండా ఓ ఐపీఎస్ అధికారి నివాసంలో చొరబడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఎఫ్ఐఆర్లో పేరు లేదు.. కేసు డైరీ లేదు.. స్థానిక కోర్టు నుంచి వారెంట్ లేదు.. ఇవేవీ లేకుండా ఒక సామాన్యుడిని కూడా అరెస్టు చేయడానికి వీల్లేదు.. అటువంటిది ఒక ఐపీఎస్ అధికారిని అరెస్టు చేయడానికి ఏపీ నుంచి పోలీసులు బిహార్ రావడం ఏమిటి..? సునీల్ నాయక్ అరెస్టును అనుమతించేది లేదు.. ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసే ప్రసక్తే లేదు..‘‘ అని పట్నా సివిల్ కోర్టు మండిపడింది. సునీల్ నాయక్‌ను అరెస్టు చేసేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. ఒక దశలో ఏపీ పోలీసులను అరెస్టు చేస్తామని కూడా వ్యాఖ్యానించింది. దాంతో బిహార్‌లో తీవ్ర అవమానానికి గురైన ఏపీ పోలీసులు బిక్క మొహంతో తిరుగుముఖం పట్టారు. ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను బజారుకీడ్చి తీవ్ర అవమానభారంతో వెనుదిరిగారు. యావత్ దేశంలో సంచలనంగా మారిన ఏపీ పోలీసుల రెడ్‌బుక్ అరాచకం ఇలా ఉంది..!! కిడ్నాపర్ల మాదిరిగా ఏపీ పోలీసులు.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇచి్చన ఫిర్యాదుపై అక్రమ కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు బరితెగించి వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఆయన అహాన్ని సంతృప్తి పరచడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు యావత్ పోలీసు శాఖకు రెడ్‌బుక్ టాస్క్ ను అప్పగించారు. దాంతో గుంటూరులోని నగరపాలెం పోలీసు స్టేషన్లో అక్రమ కేసు నమోదు చేయించి దర్యాప్తు పేరిట దళిత, గిరిజన ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారు. అందుకోసం అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన విజయనగరం జిల్లా ఎస్పీగా బదిలీ అయినా సరే ఈ కేసు దర్యాప్తు అధికారిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గతంలో డిప్యుటేషన్‌పై రాష్ట్రంలో సీఐడీ డీఐజీగా పని చేసిన గిరిజన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.ప్రస్తుతం బిహార్‌లో అగ్నిమాపక శాఖ, హోంగార్డ్స్ విభాగం ఐజీగా ఉన్న ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసుల బృందం తాజాగా పట్నా వెళ్లింది. అందుకోసం ఏపీ పోలీసులు కిడ్నాపర్ల మాదిరిగా వ్యవహరించారు. ఎస్పీ దామోదర్ తన బృందంతో కలసి సోమవారం తెల్లవారుజామున సునీల్ నాయక్ అధికారిక నివాసం గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఆయన్ను చుట్టిముట్టి బలవంతంగా తమతో లాక్కెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన సునీల్ నాయక్ ప్రతిఘటించి కేకలు వేయడంతో పక్కన పోలీస్ క్వార్టర్స్‌లో ఉన్న అధికారులు అక్కడకు చేరుకున్నారు. కిడ్నాపర్లు వచ్చారని భావించి దాదాపు వందమంది పోలీసులు, హోంగార్డులు ఆ నివాసాన్ని చుట్టుముట్టారు. ఎఫ్ఐఆర్లో పేరు లేదు... కేసు డైరీ, వారెంటూ లేదు.. బిహార్ అగ్ని మాపక శాఖ డీజీతోపాటు పలువురు అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు అక్కడకు చేరుకుని గట్టిగా నిలదీయడంతో ఏపీ పోలీసుల బండారం బయటపడింది. తాను ఎస్పీనని.. సునీల్ నాయక్‌ను అరెస్టు చేసేందుకు వచ్చామని దామోదర్ చెప్పడంతో బిహార్ పోలీసు అధికారి, న్యాయవాదులు తీవ్రంగా స్పందించారు. అరెస్టు వారెంటు ఉందా? అని ప్రశ్నించగా ఏపీ పోలీసులు తెల్లమొహం వేశారు. పోనీ ఏ కేసులో అరెస్టు చేస్తున్నారు..? కేసు డైరీ ఉందా..? ఎఫ్ఐఆర్ కాపీ ఉందా..? స్థానిక కోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ వారెంట్ ఉందా..? అని నిలదీయడంతో అవేవీ తమ వద్ద లేవని బదులిచ్చారు. అసలు సునీల్‌నాయక్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది కదా..! అని న్యాయవాదులు గుర్తు చేయడంతో ఏపీ పోలీసులు మౌనం దాల్చారు. అయినా సరే.. 35 బీఎన్ఎస్ఎస్ కింద సునీల్‌నాయక్‌ను తాము అరెస్టు చేస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించారు.అయితే ఆ నిబంధన కింద అరెస్టు చేసేందుకు వారికి అధికారం లేదని న్యాయవాదులు అభ్యంతరం తెలిపినా ఆలకించలేదు. ఆయన్ను అరెస్టు చేశామని, తమతో తీసుకువెళ్తామని మొండిగా వాదించారు. సునీల్‌నాయక్‌ను బలవంతంగా తీసుకువెళ్లేందుకు యత్నించారు. దాంతో బిహార్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. వంద మందికిపైగా పోలీసులు, హోంగార్డులు ఏపీ పోలీసు బృందాన్ని చుట్టుముట్టడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడకు చేరుకున్న పట్నా ఎస్పీ (ఈస్ట్) భానుప్రతాప్‌సింగ్ ఏపీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీల్ నాయక్‌ను మీరు అరెస్టు చేశామనుకుంటే అనుకోండి..! కానీ ఆయన్ను మా అనుమతి లేకుండా... న్యాయస్థానం ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తీసుకెళ్లేందుకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఏపీ పోలీసులపై పట్నా కోర్టు ఫైర్.. సునీల్ నాయక్ అరెస్టుకు ‘నో’ ఈ క్రమంలో సునీల్ నాయక్ తరపు న్యాయవాదులు సోమవారం ఉదయం పట్నా కోర్టును ఆశ్రయించారు. బిహార్ ఐపీఎస్ అధికారిని ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఓ ఐపీఎస్ అధికారి నివాసంలోకి ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని ఏపీ పోలీసుల బృందం గోడదూకి చొరబడటంపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఒకానొక దశలో ఏపీ పోలీసులను అరెస్టు చేసేందుకు ఆదేశిస్తామని కూడా హెచ్చరించింది. దీంతో ఏపీ పోలీసులు అప్పటికప్పుడు ఆగమేఘాలపై పట్నా కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.సునీల్ నాయక్‌ను అరెస్టు చేశామని చెబుతూ, ఏపీకి తీసుకువెళ్లేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని కోరారు. దీనిపై బిహార్ పోలీసుల తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సునీల్ నాయక్ పేరు ఎఫ్ఐఆర్లో లేదని.. ఆయనకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలే లేవని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని హైకోర్టుకు నివేదించారు. అనంతరం సునీల్ నాయక్‌ను నిందితుడిగా చేర్చి నోటీసులు జారీ చేయగా పట్నా హైకోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందిన విషయాన్ని గుర్తు చేశారు. విచారణకు సహకరిస్తారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు.సునీల్ నాయక్‌పై ఏపీ పోలీసులు పెట్టిన కేసును క్వాష్ చేయాల్సిందిగా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేస్తామని నివేదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం పట్నా కోర్టు సునీల్ నాయక్‌కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను అరెస్టు చేసేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. సునీల్ నాయక్‌కు వ్యతిరేకంగా ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు నిరాకరించింది. సునీల్ నాయక్‌పై 30 రోజుల వరకూ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దాంతో ఎస్పీ దామోదర్ బృందం బిహార్‌లో భంగపాటుకు గురైంది. ఏపీ డీజీపీ vs బిహార్ డీజీపీసునీల్ నాయక్ అక్రమ అరెస్టు పన్నాగం బెడిసికొట్టడంతో నాలు క కరుచుకున్న ఏపీ పోలీసులు డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను ఫోన్లో బిహార్ డీజీపీ వినయ్‌కుమార్‌తో మాట్లాడించినట్లు సమాచారం. సునీల్ నాయక్‌ను అరెస్టు చేసేందుకు సహకరించాలని కోరడంపై బిహార్ డీజీపీ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ‘ఐజీ సునీల్ నాయక్ నా పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి.ఈ రోజు ఏపీ పోలీసులు ఆయన నివాసంలో గోడ దూకి ప్రవేశించారు. ఆయన్ను ఎత్తుకు పోయేందుకు యత్నించారు. ఇందుకు అనుమతిస్తే భవిష్యత్‌లో నా బంగ్లాలోకి కూడా అక్రమంగా ప్రవేశించి నన్నూ ఎత్తుకుపోతారేమో..’ అని తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. బిహార్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. స్థానిక ఎస్పీకి, చివరికి సంబంధిత పోలీసు స్టేషన్ అధికారికి కనీస సమాచారం ఇవ్వకుండా ఒక ఐపీఎస్ అధికారిని అపహరించేందుకు యత్నించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసినట్లు సమాచారం.బందిపోటు దొంగల్లా వచ్చారు..! బిహార్‌కు చెందిన ఐజీ సునీల్ నాయక్‌ను అక్రమంగా అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు బందిపోటు దొంగల్లా వచ్చారు. ఏపీకి చెందిన ఎస్పీ స్థాయి అధికారి గోడదూకి సునీల్‌నాయక్ నివాసంలోకి చొరబడ్డారు. ఏపీ పోలీసులు ఎటువంటి నిబంధనలను పాటించలేదు. వారి వద్ద అరెస్టు వారెంటూ లేదు.. కేసు డైరీ లేదు.. ఎఫ్ఐఆర్లో కనీసం సునీల్ నాయక్ పేరు లేదు. బిహార్ వచ్చి ఏదైనా చేయవచ్చని అనుకుంటే ఎలా..? ఏపీ పోలీసుల తీరును పట్నా కోర్టు తప్పుబట్టింది. సునీల్ నాయక్‌ను అరెస్టు చేయడానికి వీల్లేదని చెప్పింది. సునీల్ నాయక్‌పై ఏపీ పోలీసులు పెట్టిన అక్రమ కేసును రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం. – శ్రీవాస్తవ్, కునాల్ తివారీ, సునీల్‌నాయక్ తరపు న్యాయవాదులు -
ఏపీ పోలీసులకు బిహార్‌లో భంగపాటు
పాట్నా: ప్రస్తుతం బిహార్‌లో పని చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పాట్నా కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఎలాంటి ఎఫ్ఐఆర్, కేస్ డైరీ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు రక్షణ ఉన్నప్పటికీ సునీల్ నాయక్‌ను బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని నిలదీసింది.పాట్నా హైకోర్టు చెప్పినప్పటికీ ఏపీ పోలీసులు రావడమేంటని ప్రశ్నించింది. 30 రోజుల వరకూ సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా రఘురామకృష్ణరాజు కేసు విషయానికి సంబంధించి సునీల్ నాయక్‌ను ట్రాన్సిట్ రిమాండ్‌ను పాట్నా సివిల్ కోర్టు తిరస్కరించింది. ఏపీ పోలీసులపై బిహార్ లాయర్ల ఆగ్రహంఇలా బలవంతపు అరెస్టును బిహార్ లాయర్లు తీవ్రంగా ఖండించారు. ఏపీ పోలీసులు గోడదూకి మరీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బిహార్ పోలీసులు సైతం.. ఏపీ పోలీసుల తీరును తప్పుబట్టారు. ఏపీలో రెడ్‌బుక్ పాలన అంటే ఇదేనా అని బిహార్ పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ నాయక్ గతంలో ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటేషన్‌లో పని చేశారు. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు కేసు విషయంలో ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సునీల్ నాయక్ నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. దీన్ని బిహార్ డీజీపీ కూడా తీవ్రంగా ఖండించారు. గోడదూకి వచ్చి తమ అధికారిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. ప్రధానంగా సిట్ చీఫ్ దామోదర వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. -
భారీ నగదు పురస్కారం అందుకున్న వైభవ్ సూర్యవంశీ
భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేతుల మీదుగా భారీ నగదు పురస్కారం అందుకున్నాడు. ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనలు చేసినందుకు గానూ బిహార్ ప్రభుత్వం వైభవ్‌కు 'పశుపతినాథ్ యోజన' స్కీం కింద రూ.50 లక్షల చెక్కును అందజేసింది. నిన్న (ఫిబ్రవరి 22) పాట్నాలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో నితీశ్ కుమార్ చేతుల మీదుగా వైభవ్ ఈ క్యాష్ ప్రైజ్‌ను అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా, సమ్రాట్ చౌధరి తదితరులు పాల్గొన్నారు. పలువురు అధికారులు వైభవ్‌ను సన్మానించారు. వైభవ్ ఇటీవల పదో తరగతి బోర్డు పరీక్షలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచాడు. క్రికెట్‌పై ఫోకస్ పెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపాడు. త్వరలో జరుగబోయే ఐపీఎల్ 2026 కోసం వైభవ్ ఇప్పటినుంచే ప్రాక్టీస్ షురూ చేశాడు. వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ మరోసారి రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. వైభవ్ గత ఎడిషన్‌లోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తొలి ఎడిషన్‌లోనే అతను రాయల్స్ తరఫున అద్భుతాలు చేశాడు. 7 మ్యాచ్‌ల్లో 206 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 252 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌పై వైభవ్ చేసిన 38 బంతుల శతకం ఐపీఎల్ చరిత్రలో భారత ఆటగాడు చేసిన అత్యంత వేగవంతమైన శతకం కావడం విశేషం. అరంగేట్రం ఎడిషన్‌లో, అదీ 14 ఏళ్ల వయసులోనే ఈ ఫీట్‌ను సాధించిన వైభవ్ రాత్రికిరాత్రే సూపర్ స్టార్ అయ్యాడు.స్వరాష్ట్రం అండదండలు వైభవ్ చిన్న వయసులోనే కోచ్ మనీష్ ఓజా మార్గదర్శకత్వంలో రోజుకు 600 బంతులు ఎదుర్కొంటూ కఠిన శిక్షణ పొందాడు. స్వరాష్ట్ర క్రికెట్ సంఘం (బిహార్) నుంచి అతనికి అత్యంత పిన్న వయసులోనే రంజీ ట్రోఫీ అవకాశం కూడా లభించింది. బిహార్ క్రికెట్ బోర్డు అండదండలే వైభవ్ కెరీర్‌కు పునాది అయ్యాయి. రెండో అత్యధిక రన్ స్కోరర్ ఇటీవల జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో వైభవ్ రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 62.71 సగటున 439 పరుగులతో మెరిశాడు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై అతను చేసిన భారీ శతకం (80 బంతుల్లో 175 పరుగులు) భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టింది. -
టాప్ 10లో ఆ రాష్ట్రం నుంచి అతనొక్కడే!
బిహార్‌లోని గయకు చెందిన శుభం కుమార్ జేఈఈ మెయిన్ 2026లో 100 పర్సంటైల్ సాధించి ‘వావ్’ అనిపించుకున్నాడు. కుమార్ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. తండ్రి శివ్ కుమార్ హార్ట్‌వేర్ షాప్ యజమాని. తల్లి కాంచన్‌దేవి గృహిణి. శుభం కుమార్ ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. దేశస్థాయిలో టాప్ 10లో ఉన్న ఏకైక బిహారి యువకుడిగా ఘనత సాధించాడు. బిహార్ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ఆమోదించిన సందర్భంగా... ‘శుభం కుమార్ విజయం రాష్ట్రానికి గర్వకారణం’ అని స్పీకర్ డాక్టర్ ప్రేమ్ కుమార్ అని ప్రశంసించారు. శాసనసభ్యులు చప్పట్లు కొట్టారు.‘రాష్ట్రానికి ప్రేరణ ఇచ్చే విజయం ఇది’ అని శుభం కుమార్‌ను ప్రశంసించారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ చౌదురి.శిక్షణా కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటకు వెళ్లడానికి ముందు ఇంట్లోనే పరీక్షలకు ప్రిపేరయ్యాడు కుమార్. కోటకు (Kota) వచ్చిన కొత్తలో కుమార్ కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉంది. కుమార్ కోటలో ఉండలేని పరిస్థితి వచ్చింది. అయినా తల్లిదండ్రులు వెనకడుగు వేయకుండా, ఆర్థిక ప్రతికూలతలను అధిగమించి కుమార్ తీసుకునే కోచింగ్‌కు అంతరాయం కలగకుండా చూశారు. దాని ఫలితం ఊరకే పోలేదు. కుమార్ దేశస్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా చేసింది. ఒకవైపు తల్లిదండ్రులు గుర్తుకు వస్తున్నా.. తన లక్ష్యంపైనే గురి పెట్టాడు. రోజుకు పది నుంచి పన్నెండు గంటలు ప్రిపేరయ్యేవాడు. ప్రాక్టీస్ పరీక్ష దశలో 14 గంటల వరకు చదివాడు.‘నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వం, కష్టపడి చదవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది’ అంటున్నాడు శుభం కుమార్ (Shubham Kumar).చదవండి: విభాగాల వారీగా జేఈఈ మెయిన్ టాపర్లు వీరే -
వైభవ్ సూర్యవంశీ తండ్రి కీలక వ్యాఖ్యలు
భారత యువ క్రికెట్ తరంగం వైభవ్ సూర్యవంశీ పద్నాలుగేళ్ల వయసులోనే ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులోనే విధ్వంసకర శతకం బాదిన ఈ బిహారీ పిల్లాడు.. యూత్ వన్డే, టెస్టుల్లోనూ శతకాల మోత మోగించాడు.ఇటీవల అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీ-2026లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో ఫైనల్లో మెరుపు, భారీ శతకం (80 బంతుల్లో 175) బాది.. భారత్ ఆరో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు.ఐపీఎల్-2026కు సన్నద్ధంఇక వైభవ్ సూర్యవంశీ తదుపరి ఐపీఎల్-2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. అంతకంటే ముందు అతడు పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. తొలుత వైభవ్ పరీక్షలకు హాజరవుతాడని.. ఇందుకోసం ఆటకు విరామం ఇస్తాడనే వార్తలు వచ్చాయి.పరీక్షలకు దూరంఅయితే, వైభవ్ చదివే స్కూల్ డైరెక్టర్ మాత్రం అతడు ఈ ఏడాది పరీక్షలకు హాజరు కావడం లేదని వెల్లడించారు. ఈ విషయాన్ని వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తాజాగా ధ్రువీకరించారు. ‘మిడ్డే’తో మాట్లాడుతూ..అవును.. మాకు అదే ముఖ్యం‘‘అవును.. నా కుమారుడు ప్రస్తుతం నాగ్‌పూర్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈసారి వైభవ్ పరీక్షల గురించి చాలా చర్చ నడుస్తోంది. అందుకే అతడు పరీక్షలు రాయకూడదని నిర్ణయించుకున్నాడు.వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తాడు. ఈ ఏడాది ఒకవేళ పరీక్షలకు హాజరైనా అతడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయేవాడు. ఒత్తిడిలో ఏ పనీ చేయకూడదు. నిజానికి చదువులో వైభవ్ ఎప్పుడూ ముందే ఉంటాడు.అన్ని సబ్జెక్టులలోనూ వాడికి 90 శాతానికి పైగా మార్కులు వచ్చేవి. అయితే, ఇప్పుడు మా ప్రాధాన్యం క్రికెట్ మాత్రమే’’ అని సంజీవ్ సూర్యవంశీ స్పష్టం చేశారు. కాగా మంగళవారం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలో భాగంగా వైభవ్ బిహార్‌లో ఉన్న పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎగ్జామ్‌కు హాజరుకావాల్సింది. అయితే, అతడు పరీక్షా కేంద్రానికి రాలేదని.. అతడికి ఆబ్సెంట్ వేశామని పాఠశాల ప్రిన్సిపల్ ఎన్కే సిన్హా ANIకి తెలిపారు.చదవండి: అతడి ఖేల్ ఖతం.. కెరీర్ ముగిసినట్లే: పాంటింగ్ -
లండన్ వీధుల్లో గోరియాదేవి సమోసాలు, ఫన్నీవీడియో వైరల్
వేడి వేడి సమోసాలు అంటే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. సప్త సముద్రాల ఆవల కూడా సమోసా తన ఉనికిని గొప్పగా చాటుకుంటోంది. హాట్ సమోసాల మాయాజాలం అలాంటిది మరి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.యూకే రాజధాని లండన్ వీధుల్లో మహిళ బిహారీ సమోసాలను అందిస్తున్న క్షణాన్ని ఇన్స్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతోంది. ఆన్లైన్లో "గోరియా దేవి" అచ్చమైన దేశీ స్టైల్లో సమోసాలను విక్రయిస్తూ జనాన్ని ఆకర్షిస్తోంది. యాప్రాన్, టోపీ ధరించి,ధోతీ-శైలి స్కర్ట్ వేసుకున్న ఆమె"సమోసా సమోసా!" అంటూ ఉల్లాసంగా వీధిలో విక్రయిస్తుంది. దీంతో అక్కడున్నవారంత ఉత్సాహంగా నవ్వులు కురిపించారు."గోరియా దేవి ఆజ్ లండన్ కే స్ట్రీట్స్ మే బిహారీ సమోసా బేచేగీ ( లండన్ వీధుల్లో గోరియా దేవి సమోసాలు అమ్ముతుంది)." అంటుంది, మరోవైపు సహోద్యోగి వైపు తిరిగి, "జల్దీ జల్దీ బనావో (త్వరగా తయారు చేయి), నేను మార్కెట్లో వెళ్లాలి, బాబూ" అని చెబుతుంది, ఆపై తాజాగా వేయించిన సమోసాల ట్రేలతో బయలు దేరుతుంది. "సమోసే సమోసే, బిహార్ కే సమోసే, గోరియా నే పరోసే" అంటూ నవ్వులు పూయించింది.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుఅంతేనా.. ఆమె ఒక ఆలయం దగ్గర ఆగి, "హర్ హర్ మహాదేవ్" భక్తితో మొక్కడం కూడా చూడొచ్చు. "మేహెనాత్ కర్తే హై జీ" ( కష్టపడి పని చేస్తున్నామండీ) అని చెబుతూ సమోసాలు అమ్మడం చూడొచ్చు. View this post on Instagram A post shared by Bihari Samosa UK (@biharisamosa.uk)నెటిజన్లు ప్రశంసలుఈ వీడియో సోషల్ మీడియాలో నెలిజన్ల ప్రశంసలను అందుకుంది, బిహారీగా ఉండటం గర్వంగా ఉందని ఒకరు, వావ్.. చాలా రుచిగా ఉంది, మీ వ్యాపారాన్ని మార్కెటింగ్ చేయడానికి, ప్రోత్సహించడానికి చాలా మంచి మార్గం అని మరో యూజర్ కొనియాడారు.


