 
													అయోధ్యలో రామమందిరం నిర్మించడం వారికి ఇష్టం లేదు
ఓటు బ్యాంకు కోసం చొరబాటుదారులను కాపాడుతున్నారు
బిహార్‌లో కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిపై ప్రధాని మోదీ ఆగ్రహం
చాప్రా/ముజఫర్‌పూర్: బిహార్‌లో కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. బిహార్ ప్రజలు పవిత్రంగా నిర్వహించుకొనే ఛఠ్ పూజలను ఆ కూటమి కించపర్చిందని మండిపడ్డారు. అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మించడం విపక్ష నేతలకు ఇష్టం లేదన్నారు. ఓటు బ్యాంకు కోసం చొరబాటుదారులను కాపాడుతున్నారని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీ గురువారం ముజఫర్‌పూర్, చాప్రాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. బిహార్‌లో అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీఏను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఛఠ్ పూజకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచి్చందని ఆనందం వ్యక్తంచేశారు. పవిత్రమైన ఈ పండుగపై కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి విషం కక్కుతోందని, డ్రామా అంటూ నిందలేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.   
వారి దయ వల్ల ప్రధానమంత్రిని కాలేదు 
మన విశిష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిపక్ష నాయకులు చిన్నచూపు చూస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. వారు తీరిక చేసుకొని విదేశాలకు యాత్రలకు వెళ్తుంటారు తప్ప అయోధ్యలో రామమందిరాన్ని ఏనాడూ దర్శించుకోలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరును పరోక్షంగా తప్పుపట్టారు. ఛాయ్ అమ్ముకొని బతికిన ఒక సామాన్యుడు ప్రధానమంత్రి కావడం చూసి విపక్ష నాయకులు జీరి్ణంచుకోలేకపోతున్నారని విమర్శించారు. తాను అలాంటి వారి దయ వల్ల ప్రధానమంత్రిని కాలేదన్నారు. 
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
