పర్యాటక ప్రదేశానికి వెళ్లినపుడు, అక్కడి ప్రకృతిని ఆస్వాదించడం కంటే, సెల్పీ తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం పైనే దృష్టి. ప్రాణాలకు తెగించి మరీ సెల్ఫీ తీసుకునేటపుడు పొంచి ఉన్న ప్రమాదాలపై ఎన్నిమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ ఈ ధోరణి మాత్రం మారణం లేదు. అత్యంత ప్రమాదకరమైన 130 అడుగులు కొండపై నుంచి నడుస్తున్నపుడు సెల్ఫీ తీసుకుంటూ జారీ పడ్డాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ది సన్ కథనం ప్రకారం, చైనాలోని గ్వాంగ్'ఆన్‌లోని హువాయింగ్ పర్వతంపై ఈ సంఘటన జరిగింది. బ్లేడ్ రాక్ అనే పర్యాటక ప్రదేశంలోని 130 అడుగుల కొండ శిఖరం వద్ద సెల్ఫీ తీసుకుంటూ జారి పడిన పర్యాటకుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింటవైరల్‌గా మారింది. దీని ప్రకారం అతను ఫోన్ పట్టుకుని కొండ అంచున నడుస్తున్నాడు. రాళ్లపై తన అడుగులు ఎక్కడ పడుతున్నాయో చూసుకుంటూ అడుగులు వేస్తున్నాడు. సెల్పీ కోసం ఇటు తిరిగాడు. అంతే క్షణాల్లో, అతని పాదాల కింద ఉన్న రాయి జరిగిరి, అదుపు తప్పి, ఠక్కున జారిపడ్డాడు. అలా కింద ఉన్న చెట్ల పొదలలోకి పడిపోయాడు.
ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్
ఇది చూసి తోటి హైకర్లు దెబ్బకి షాక్‌అయ్యారు. కేకలు పెడుతూ కొండ అంచున పరుగులుపెట్టారు. కానీ పడిపోయిన వ్యక్తి దాదాపు 15 మీటర్ల ఎత్తులో ఉన్న అడవిలో పడిపోయాడు. ఆ భయంకరమైన జలపాతం నుండి తీవ్రమైన గాయాలు లేకుండా , ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.
⚠️ Important
Video shows the terrifying moment as a tourist, in China, plunges off a 130ft high cliff while taking a selfie pic.twitter.com/0chRYp0Ban— Open News© (@OpenNewNews) December 8, 2025
ఆ దేవతలే కాపాడారు
ఈ విషయాన్ని సదరు పర్యాటకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ WeChatలో పోస్ట్ చేశాడు. చచ్చిపోతాననే అనుకున్నా.. కానీ ఆ పర్వత దేవతలే నన్ను ఆశీర్వదించారు. చాలా అదృష్టవంతుడిని. 40 మీటర్ల ఎత్తైన కొండపై నుండి పడి దాదాపు 15 మీటర్లు వాలుపైకి దొర్లాను అని రాసుకొచ్చాడు. మరోవైపు ప్రమాదం జరిగిందని చెబుతున్న బ్లేడ్ రాక్ ర్యాటక ప్రదేశం సుందరమైన ప్రాంతం , సరిహద్దుల్లో లేదు. వారు ఈ ప్రాంతాన్ని "దూరం నుండి మాత్రమే వీక్షించడానికి అనుమతి ఉంది , ఎక్కడానికి అనుమతి లేదు అని చెప్పారు అధికారులు. హైకింగ్ చేస్తున్నప్పుడు నిబంధనలను పాటించాలని, ఇలాంటి ప్రమాదకరమైన ప్రాంతాలలోకి ప్రవేశించకూడదని సందర్శకులకు గుర్తు చేశారు.
ఇదీ చదవండి: రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులు


