Andhra Pradesh
-
ఆదాయం పెంచాలి: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు పెంచడం ద్వారా ఆదాయం పెంచాలని, అప్పుడే తాను చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేయగలనని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను కోరారు. ఆదాయం పెంచకుండా సంక్షేమం, అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒక శాతం వృద్ధి రేటు పెంచితే అదనంగా రూ.15 వేల కోట్లు, 3 శాతమైతే రూ.45 వేల కోట్ల ఆదాయం వస్తుందని.. అప్పుడైతేనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలనని పునరుద్ఘాటించారు. వచ్చే ఆర్ధిక ఏడాది 15 శాతం పైగా వృద్ధి రేటు సాధించేందుకు అనుగుణంగా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సును ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలలి, పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. మే నెలలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ద్వారా రూ.15 వేలు చొప్పున ఇస్తామని, స్కూల్స్ తెరిచేలోగా ఈ మొత్తాన్ని పంపిణీ చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద మూడు వాయిదాల్లో ఇస్తున్న మొత్తంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, 5 వేలు, 4 వేలు చొప్పున మూడు వాయిదాల్లో రైతులకు ఇస్తామని తెలిపారు. (హామీ మేరకు రూ.6 వేలు+రూ.20 వేలు = రూ.26 వేలు ఇవ్వాలి. కానీ కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు). మెగా డీఎస్సీ కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎస్సీ వర్గీకరణతో సహా ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. స్కూల్స్ తెరిచే నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని చెప్పారు. ఏప్రిల్‌లో మత్స్యకారుల జీవనోపాధికి రూ.20 వేలు ఇస్తామని, 2027లో పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. కలెక్టర్లు సీఈవోలా పని చేయాలని, ఎప్పటికప్పుడు పనితీరుపై సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. రెవిన్యూ సమస్యలపై దృష్టి పెట్టడం లేదు – రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కలెక్టర్లు వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కేవలం భూ సంబంధిత సమస్యలే 60–70 శాతం ఉన్నాయి. దీనిపై వర్క్‌షాప్ నిర్వహించాలి. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసిన కలెక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, మంత్రులు, నిపుణులు నెల రోజుల్లో నివేదికతో రావాలి. “వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్’ అనే నినాదంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. – ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు రూ.1,030 కోట్లు విడుదల చేశాం. ఇప్పుడు మరో రూ.6,200 కోట్లు విడుదల చేస్తాం. రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరముంది. అన్ని వర్క్ ప్లేసుల్లో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అంతర పంటలతో అరకు కాఫీని ప్రోత్సహించాలి. – బీసీల్లో వడ్డెర కులస్తులకు క్వారీలు ఇచ్చేలా, మత్స్యకార సొసైటీలకు చెరువులు అప్పగించి చేపలు పెంచుకునేలా తోడ్పాటు ఇవ్వాలి. కల్లు గీత కార్మీకులకు కేటాయించిన వైన్ షాపులు దుర్వినియోగం కాకూడదు. – రైతులు ఇచి్చన భూములను తాకట్టు పెట్టడం, విక్రయించడం ద్వారా వచ్చే నిధులతోనే అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. అనకాపల్లి వద్ద స్టీల్ ప్లాంట్, రామాయపట్నం కోసం భూములతో పాటు మిగతా ప్రాజెక్టులకు ఇదే నమూనాను అమలు చేయాలి. అనకాపల్లిలో టౌన్íÙప్, రామాయపట్నంలో మరో టౌన్ షిప్ వస్తాయి. – కలెక్టర్లు.. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతులను వచ్చేలా చూడాలి. సోలార్ రూఫ్ టాప్, సహజ సేద్యంను ముందుకు తీసుకెళ్లాలి. గ్రీన్ ఎనర్జీ, పర్యాటకం, వాట్సాప్ గవర్నెన్స్, పీ4 గేమ్ చేంజర్ కానున్నాయి. – వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి. పశువులకు మేతపై దృష్టి పెట్టాలి. వడగాడ్పుల వల్ల ఒక్క వ్యక్తి కూడా మృతి చెందకూడదు. కాల్ సెంటర్ నిర్వహించాలి. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా పచ్చి మేత పెంపకానికి చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వలసలకు తావివ్వొద్దు. – మంత్రులు, శాఖాధిపతులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా, నియోజకవర్గ, మండల, సచివాలయాల స్ధాయిలో విజన్ ప్రణాళికలతో ముందుకు సాగాలి. శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీలతో కలిసి పని చేయాలి. సాంకేతికతను ఉపయోగించుకోవాలి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ప్రారంభంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో సీఎం పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కుర్చీ వేశారు. అయితే ఆయన రాకపోయినప్పటికీ ఆ చైర్‌ను అలాగే ఖాళీగా ఉంచి సదస్సు నిర్వహించారు. కాగా, 2025–26 ఆర్థిక ఏడాదిలో స్థూల ఉత్పత్తి లక్ష్యాలలో భాగంగా వృద్ధి శాతం 16, 17, 18 చొప్పున జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు. -
రోడ్డెక్కిన మిర్చి రైతులు
సాక్షి, ప్రతినిధి గుంటూరు/కొరిటెపాడు(గుంటూరు): కూటమి ప్రభుత్వ తీరుతో కడుపు మండిన మిర్చి రైతులు మరోసారి రోడ్డెక్కారు. ‘తేజ’ మిర్చి క్వింటా ధర దారుణంగా పడిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కష్టించి పండించిన మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇవే ధరలు కొనసాగితే పురుగు మందు తాగి చస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరీ ఇంత దారుణమా?గుంటూరు మిర్చి యార్డులో మంగళవారం ఉదయం తేజ రకం మిర్చి క్వింటా ధర కేవలం రూ.8 వేలు పలకడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఉదయం 9.30 ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున గుంటూరు మిర్చి యార్డు మెయిన్ గేట్ ఎదుట ఉన్న మెయిన్ రోడ్డుపైకి చేరుకొని ధర్నాకు దిగారు. మరీ ఇంత దారుణమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మిర్చి యార్డుకు చేరుకున్నారు. రైతులతో మాట్లాడి.. ధర్నాను విరమింపజేసే ప్రయత్నం చేశారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవతేజ, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు ఇన్చార్జి సుబ్రమణ్యం.. రైతుల వద్దకు వచ్చారు. ప్రభుత్వం క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించిందని.. అంతకన్నా తగ్గితే రైతుల ఖాతాల్లో మిగిలిన మొత్తాన్ని జమ చేస్తామని భార్గవ తేజ చెప్పారు. ప్రభుత్వం ప్రకటించాక.. ధరలు మరింత పతనం.. జేసీతో పలువురు రైతులు మాట్లాడుతూ.. గతేడాది తేజతో పాటు మిగిలిన రకాలకు క్వింటా ధర రూ.23 వేలు నుంచి రూ.27 వేల వరకు పలికిందని చెప్పారు. తాలు కాయలకు కూడా రూ.15 వేలు నుంచి రూ.18 వేలు వరకు ధర వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించకముందు.. తేజ రకం రూ.13 వేలు నుంచి 15 వేలు వరకు పలికిందని తెలిపారు. ప్రభుత్వం ధర ప్రకటించాక.. నిలువు దోపిడీకి గురవుతున్నామని రైతులు మండిపడ్డారు. ఉదయం క్వింటా ధర రూ.9 వేలు పలికిందని చెబుతున్నారని.. మరో గంట తర్వాత రూ.8 వేలేనంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు 2 శాతం బదులు.. 6 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో, కూలీలకు డబ్బులెలా ఇవ్వాలో అర్థం కావడం లేదని వాపోయారు. జేసీ భార్గవ తేజ స్పందిస్తూ.. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి.. యార్డు నుంచి వెళ్లిపోయారు. దీంతో రైతులు మరోసారి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. ఇవే ధరలు కొనసాగితే పురుగు మందు తాగి ఇక్కడే చస్తామని హెచ్చరించారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.కూలీలకు ఇచ్చేందుకూ సరిపోవు..నాలుగు ఎకరాల్లో తేజ రకం సాగు చేశా. గతేడాది ఎకరాకు సుమారు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.23 వేల నుంచి రూ.27 వేల వరకు వచ్చాయి. ఈ ఏడాది పెట్టుబడి కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు చేశా. ఇప్పుడు గుంటూరు యార్డుకు తేజ రకం మిర్చి 20 బస్తాలు తీసుకువచ్చా. క్వింటా రూ.8 వేలుకు అడుగుతున్నారు. ఈ డబ్బులు కూలీలకు కూడా సరిపోవు. ఇవే ధరలు కొనసాగితే ఆత్మహత్య చేసుకోవడమే మార్గం. – దారం ఎలీసారెడ్డి, దారంవారిపాలెం, ప్రకాశం జిల్లాధరలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు..గత 15 ఏళ్లుగా మిర్చి సాగు చేస్తున్నా. ఈసారి రెండు ఎకరాల్లో తేజ రకం వేశా. ఎకరాకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశా. తెగుళ్ల వల్ల దిగుబడి 15 క్వింటాళ్లు మించి వచ్చే పరిస్థితి లేదు. గుంటూరు యార్డుకు 40 బస్తాలు తీసుకువచ్చా. క్వింటా రూ.8 వేలకే అడుగుతున్నారు. మిర్చి ధరలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు. మా ఇంటిల్లిపాది నెలలు పాటు సేద్యం చేసినా.. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. ఇలాగైతే సాగు చేయలేం. – గొల్ల చిరంజీవి, పరమాదొడ్డి గ్రామం, కర్నూలు జిల్లా -
సాయం పేరుతో స్వాహా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి అందరూ బియ్యం ఇవ్వాలంటూ జనసేన శ్రేణులు గత ఏడాది ఊరూరా తిరిగి సేకరించారు. ఇలా దాతలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల నుంచి భారీగా సేకరించారు. చివరికి అనుకున్న స్థాయిలో బియ్యం సేకరించాక ఆ మొత్తాన్ని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ఒకరు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడిది బయటకు పొక్కింది. దీంతో.. ఆ మొత్తం డబ్బును పార్టీకి విరాళంగా ఇస్తానని.. ఇదంతా మంత్రి కందుల దుర్గేష్‌కు చెప్పేచేశానని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివాదం ముదరడంతో రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో దీనిపై పంచాయితీ జరిగింది. అయినా సెటిల్ కాకపోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్లారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పుడీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..అసలేం జరిగిందంటే.. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికంటూ జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు నేతృత్వంలో గతేడాది నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భారీగా బియ్యం సేకరించారు. కానీ, ఇలా సేకరించిన బియ్యాన్ని విజయవాడలో బాధితులకు పంచకుండా ఆయన విక్రయించేశారు. ఈ సొమ్మును నియోజకవర్గ ఇన్చార్జే స్వాహా చేశాడని ఒక వర్గం దుమ్మెత్తిపోస్తుండగా.. ఇన్చార్జి వర్గం మాత్రం సొమ్ము తమవద్దే ఉందని, పార్టీకి విరాళం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే కుదరడంలేదని, మంత్రి కందుల దుర్గేష్‌కు విషయం చెప్పామని, ఆయన విరాళం ఇవ్వడానికి పవన్‌కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్తారంటూ చెబుతున్నారు. అయితే, నాలుగు నెలల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వచ్చినప్పడు కూడా ఆయనకు చెక్కు ఇవ్వడం కుదరలేదా అని ప్రత్యర్థి వర్గం నిలదీస్తోంది.రూ.10 లక్షలు కాదు.. 16 లక్షలకు అమ్ముకున్నారు..జనసేన నియోజకవర్గ ఇన్చార్జి సువర్ణరాజు, ఆయన వ్యతిరేక వర్గం మధ్య ఈ విషయంలో కొద్దిరోజులుగా తారాస్థాయిలో వివాదం నడుస్తోంది. సేకరించిన బియ్యాన్ని రూ.10.27 లక్షలకు విక్రయించానని సువర్ణరాజు చెబుతుంటే.. రూ.16 లక్షలకు అమ్ముకున్నారని వ్యతిరేక వర్గం చెబుతోంది. దీనిపై పార్టీ జిల్లా నేతల వద్ద పంచాయితీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో.. రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో జనసేన నాయకుడు కరాటం సాయి పార్టీ ఆదేశాలతో గోపాలపురం నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. సువర్ణరాజు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఘర్షణకు దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో కరాటం సాయి చేతులెత్తేసి జిల్లా ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్తున్నట్లు చెప్పి సమావేశం ముగించారు. -
అన్నదాతకు సర్కారే శాపం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలు, కరువు దెబ్బతీస్తున్నా, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో 2024–25 ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యవసాయమే అస్తవ్యస్తమైపోయింది. రైతులు తీవ్ర ఒడిదొడుకుల మధ్య పంటలు సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరకు రైతులు తీవ్ర నష్టాలపాలయ్యారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్ సాగు ఆలశ్యం కాగా, ఆ ప్రభావం రబీ పైనా పడింది. రబీ సాగు కోసం ముందస్తు ఏర్పాట్లు చేయడంలో విఫలమైన ప్రభుత్వం రెండో పంటకు నీరివ్వడంలోనూ వైఫల్యం చెందింది. ప్రభుత్వ నిర్వాకం, పెట్టుబడి సాయం అందకపోవడం, అదనుకు విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు పడరాని పాట్లుపడ్డారు. ఈ తిప్పలన్నీ పడలేక చాలా మంది రైతులు వారి పొలాల్లో సాగే చేయకుండా వదిలేశారు. రెండు సీజన్లలో కలిపి 1.51 కోట్ల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం కాగా, 1.24 కోట్ల ఎకరాల్లోనే సాగయ్యాయి. ఖరీఫ్‌లో 16 లక్షల ఎకరాలు.. రబీలో 11 లక్షల ఎకరాల్లో.. మొత్తంగా 27 లక్షల ఎకరాల్లో సాగే లేకుండా సీజన్ ముగిసింది. ఖరీఫ్‌లో వరుస వైపరీత్యాల బారిన పడి 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 6 లక్షల ఎకరాలు కరువు బారిన పడ్డాయి. అయినా ప్రభుత్వం నుంచి రైతులకు కనీస మద్దతు కూడా దక్కలేదు. దీంతో రైతులు కుదేలైపోయారు. దాని ప్రభావం రబీ పైనా పడింది. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. లక్షలాది ఎకరాల్లో విత్తనం నాటడానికి కూడా రైతులు సాహసించలేకపోయారు. రబీ సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలు కాగా.. సాగైన విస్తీర్ణం 46.40 లక్షల ఎకరాలే. అంటే 11.25 లక్షల ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు రాలేదు. దాళ్వాలో వరి సాగు లక్ష్యం 20 లక్షల ఎకరాలు కాగా సాగైంది 16.52 లక్షల ఎకరాల్లోనే. అంటే 3.50 లక్షల ఎకరాలు ఖాళీగా ఉండిపోయాయి. సాధారణంగా రెండో పంటలో వరి కంటే ఎక్కువగా అపరాలు సాగవుతాయి. ఈసారి అపరాల సాగు లక్ష్యం 23.50 లక్షల ఎకరాలు కాగా, సాగైన విస్తీర్ణం 16.72 లక్షల ఎకరాలే. అంటే దాదాపు 6.78 లక్షల ఎకరాలు ఖాళీగా ఉండి పోయాయి. వీటిలో ప్రధానంగా శనగలు 11.17 లక్షల ఎకరాలకు గాను, 7.5 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. మినుము సాగు లక్ష్యం 8.50 లక్షల ఎకరాలు కాగా, 6.95 లక్షల ఎకరాల్లో పంట వేశారు. గతేడాది రికార్డు స్థాయిలో సాగైన మొక్కజొన్న కూడా ఈసారి తగ్గిపోయింది. ఈ ఏడాది మొక్కజొన్న సాగు లక్ష్యం 5.27 లక్షల ఎకరాలకుగాను 4.55 లక్షల ఎకరాలే సాగైంది. ఇలా పంటలన్నీ లక్ష్యానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి. ఇప్పటికీ రబీ పంటల సాగు చివరి దశకు చేరుకున్నా కొన్ని ప్రాంతాల్లో సాగు నీరందక పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సీజన్ ఆరంభంలోనే ఫెంగల్ తుపాన్ దెబ్బతీయగా, ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు రైతులను దెబ్బతీశాయి. దీనికి తోడు సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట పెను శాపంగా మారింది. -
మామిడి గుజ్జు.. ఎగుమతులు నుజ్జు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: విదేశాలకు మామిడి గుజ్జు (పల్ప్) ఎగుమతులు క్షీణించాయి. గడచిన సీజన్లో ఒక్క ఏపీ నుంనే 3 లక్షల టన్నుల మామిడి గుజ్జు ఎగుమతులు జరుగుతాయని అంచనా వేయగా.. ఊహించని పరిస్థితులు తలెత్తడంతో 2.75 లక్షల టన్నుల మేర నిల్వలు ఎగుమతి కాకుండా నిలిచిపోయింది. వివిధ దేశాల్లో యుద్ధాలు. ఆర్థిక మాంద్యం, పౌర అశాంతి ప్రభావంతో దేశం నుంచి ఎగుమతులు పడిపోయాయి. ఈ ఏడాది కూడా పరిస్థితులు మరింత తీవ్రం కావడంతో ఎగుమతులు మరింత క్షీణించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితి మామిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది అకాల వర్షాలు, వరుస వైపరీత్యాలతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడం, నాణ్యత లోపించడం వంటి కారణాలతో ధర లేక మామిడి రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. అదే సమయంలో మామిడి గుజ్జు ఎగుమతులు నిలిచిపోవడం రైతులతో పాటు ఎగుమతి దారులకు ఆశనిపాతంగా మారింది. ఆ ప్రభావం ఈసారి మార్కెట్‌పై మరింతగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నుంచి ఏటా 2.5 లక్షల టన్నులకు పైగా ఎగుమతి రాష్ట్రంలో 9.97 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండగా.. ఈ ఏడాది 45 లక్షల టన్నులకుపైగా దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాగయ్యే పంటలో 65–70 శాతం పంట తోతాపురి రకమే. తోతాపురి మామిడిని గుజ్జు రూపంలో యూరప్, గల్ఫ్, ఉక్రెయిన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రం నుంచి ఏటా 2.5 లక్షల టన్నులకు పైగా మామిడి గుజ్జు ఎగుమతి అవుతుంటుంది. 2019–24 మధ్య 8.5 లక్షల టన్నుల పల్ప్ విదేశాలకు ఎగుమతి చేశారు. అదేవిధంగా 550 టన్నులకుపైగా మామిడి పండ్లు సైతం విదేశాలకు ఎగుమతి అయ్యాయి. రైతులు, ఎగుమతిదారులకు ఇది కష్టకాలమే 2024–25లో ప్రపంచ దేశాల్లో యుద్ధాలు, ఆర్థిక మాంద్యం వంటి కారణాల వల్ల దేశం నుంచి మామిడి గుజ్జుతో పాటు పండ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో విదేశాల నుంచి ఆర్డర్స్ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది తోతాపురి రకం టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేలు ధర పలకగా, ఈ ఏడాది టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15వేలకు మించి పలకకపోవచ్చని చెబుతున్నారు. వాతావరణ మార్పులు, చీడపీడలు, కొత్తరకం పురుగులు మామిడిపై దాడి చేయడంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గుజ్జు ఎగుమతులు కాకపోతే ధరలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు రైతులను మరింత కలవరానికి గురి చేస్తున్నాయి.పేరుకున్న రూ.1,750 కోట్ల విలువైన గుజ్జు నిల్వలు మామిడి గుజ్జు పరిశ్రమలన్నీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. మొత్తంగా 47 ఫ్యాక్టరీలు ఉండగా.. వాటి సామర్థ్యం 8 లక్షల టన్నులు. గతేడాది 3.50 లక్షల టన్నులకు పైగా గుజ్జు ఉత్పత్తి అయ్యింది. ఇందులో స్థానిక వినియోగం పోగా.. ఇంకా 2.75 లక్షల టన్నుల నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ రూ.1,750 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సాధారణంగా ఏటా 10–20 శాతం వరకు గుజ్జు నిల్వలు మిగులు ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి గుజ్జు ఎగుమతులు ప్రారంభం కాగా.. గతేడాది పేరుకుపోయిన నిల్వల్లో కేవలం 10 శాతం మాత్రమే ఎగుమతి అయింది. మే నాటికి పాత నిల్వలు అమ్ముడవకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతామని వ్యాపారులు చెబుతున్నారు. తమకు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని చిత్తూరు జిల్లా ఫ్రూట్ ప్రోసెసర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయింది.ఈసారి కూడా మామిడి కష్టమే మాకు 10 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈసారి పూత ఆలస్యమైంది. వాతావరణ ప్రభావంతో పిందె సక్రమంగా రాలేదు. తెగుళ్లు, కొత్త రకం పురుగులు పంటను పట్టి పీడిస్తున్నాయి. ఎండ తీవ్రత అధికం కావడంతో పిందె ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. ఇప్పటివరకు 3 సార్లు మందుల పిచికారీ చేశా. ఖర్చులు విపరీతంగా పెరిగాయి. మరోవైపు మామిడి గుజ్జు నిల్వలు ఫ్యాక్టరీల్లో పేరుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు దక్కుతాయో లేదో అనుమానంగా ఉంది. – పద్మనాభరెడ్డి, ఎర్రచేను, చిత్తూరు జిల్లా అయోమయంలో ఉన్నాం మహరాష్ట్ర వెళ్లి ఎగుమతిదారులతో మాట్లాడాం. వాళ్లు ఏమాత్రం స్పందించడం లేదు. మామిడి గుజ్జు నిల్వలు అమ్ముడుపోయే పరిస్థితి కనిపించడం లేదు. యుద్ధాలు, ట్రాన్్పపోర్ట్ చార్జీలు పరిశ్రమదారులను నిండా ముంచుతున్నాయి. అప్పులు నిలిచిపోయాయి. ఈసారి ఎలా ఉంటుందో అర్థంగాక అయోమయంలో ఉన్నాం. జ్యూస్ తయారీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఉత్పత్తులపై దృష్టి సారిస్తున్నాయి. గతంలో జ్యూస్‌లో 80 శాతం గుజ్జు కలిపేవారు. ఇప్పుడు 5 శాతమే గుజ్జు కలుస్తోంది. ఇది కూడా పరిశ్రమదారులను దెబ్బతీస్తోంది. వీటిపై ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలి. – తలపులపల్లి బాబురెడ్డి, గుజ్జు పరిశ్రమ యజమాని మామిడి గుజ్జు పరిశ్రమను ఆదుకోవాలి: ఏఐఎఫ్‌పీఏ తీవ్ర సంక్షోభంలో ఉన్న మామిడి పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని, చిత్తూరులో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసింగ్ అసోసియేషన్ (ఏఐఎఫ్‌పీఏ) కోరింది. ఈ మేరకు అసోసియేషన్ సౌత్ జోన్ చైర్మన్ కట్టమంచి గోవర్ధన్ బాబీ చిత్తూరు జిల్లా ఫ్రూట్ ప్రాసెసింగ్ ఫెడరేషన్తో కలిసి సీఎం చంద్రబాబుకు, కేంద్రానికి లేఖ రాశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పల్ప్ ఇండస్ట్రీని ఆదుకునేందుకు రుణాల వసూళ్లను ఆరునెలలు వాయిదా వేసేలా బ్యాంకర్లకు ఆదేశాలివ్వాలని కోరారు. మామిడి గుజ్జు నిల్వలు అమ్ముడయ్యేందుకు వీలుగా ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో మామిడి గుజ్జు పరిశ్రమల సమాఖ్యకు స్టాల్స్ కేటాయించాలని, మధ్యాహ్న భోజనం మెనూలో మామిడి ఉత్పత్తులు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. పల్ప్ పరిశ్రమలకు పెండింగ్ సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని కోరారు. -
సీఐడీ నమోదుచేసిన కేసు కొట్టేయండి
సాక్షి, అమరావతి: కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో నిందితులైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులతో ప్రభుత్వం కుమ్మక్కైందని, అందువల్లే ఈ కేసులో మరో నిందితుడైన యర్రం విక్రాంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విక్రాంత్‌రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి. నిరంజన్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. వారితో ప్రభుత్వం కుమ్మక్కయినందునే వారు ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేయలేదని తెలిపారు. విక్రాంత్‌రెడ్డిపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టును కోరారు. తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను అరబిందో సంస్థ కొన్నదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, పోర్టు ప్రమోటర్ కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన కేసులో యర్రం విక్రాంత్ రెడ్డికి హైకోర్టు గతంలో ముందస్తు బెయిలు మంజూరు చేసింది. కాగా, ఈ కేసును కొట్టేయాలని కోరుతూ విక్రాంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ మంగళవారం విచారణ జరిపారు. విక్రాంత్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాస్తవానికి వాటాల బదిలీ విషయంలో ఫిర్యాదుదారు కేవీ రావు, అరబిందో గ్రూపునకు మధ్య రాజీ కుదిరిందని, దీనిపై పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని తెలిపారు. ఈ వాటాల బదిలీతో విక్రాంత్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయినా దర్యాప్తు పేరుతో పిటిషనర్‌ను సీఐడీ అధికారులు వేధింపులకు గురి చేసే అవకాశం ఉందని చెప్పారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను బహిర్గతం చేస్తూ పత్రికల్లో కథనాలు కూడా రాయిస్తున్నారని వివరించారు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కాకినాడ పోర్టు యజమాని కేవీ రావుకు రూ.25 లక్షలు ఖర్చులు విధించాలని ఆయన కోర్టును కోరారు. -
నాటి స్టార్టప్ వెలుగులకు కితాబు
సాక్షి, అమరావతి : గత ఐదేళ్లలో స్టార్టప్ రంగంలో రాష్ట్రం వేగంగా దూసుకుపోయిన విధానాన్ని నారా లోకేశ్ మంత్రిగా నిర్వహిస్తున్న ఐటీ శాఖ తాజాగా విడుదల చేసిన స్టార్టప్ పాలసీలో ప్రముఖంగా ప్రస్తావించింది. వచ్చే ఐదేళ్లలోనూ స్టార్టప్‌లను ప్రోత్సహించేలా ఏపీ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 4.0ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గత ఐదేళ్లలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో 50 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే ఏర్పాటయ్యాయని.. రాష్ట్రంలో మొత్తం 6,600 స్టార్టప్స్ ఏర్పాటు కాగా, అందులో 2,400 స్టార్టప్‌లకు డీపీఐఐటీ గుర్తింపు లభించిందని కూటమి ప్రభుత్వం విడుదల చేసిన పాలసీలో పేర్కొంది. అంతే కాకుండా డీపీఐఐటీ గుర్తించిన స్టార్టప్‌లలో 1,159 స్టార్టప్‌లు మహిళల నేతృత్వంలో ఉన్నాయని చెప్పింది. ఇది రాష్ట్రంలో పారిశ్రామికీకరణ అన్ని వర్గాల్లో ఎంత బలంగా విస్తరించిందన్న విషయాన్ని ధృవీకరిస్తోందని పేర్కొంది. డీపీఐఐటీ విడుదల చేసిన 2022 స్టార్టప్ ర్యాంకుల్లో రాష్ట్రం “లీడర్’షిప్ హోదా దక్కించుకుందని, వరుసగా మూడేళ్లుగా సులభతర వాణిజ్యంలో మొదటి ర్యాంకును పొందుతూ వ్యాపారానికి ఏపీ అత్యంత అనువైన రాష్ట్రంగా నిలిచిందని ప్రశంసించింది. రాష్ట్రంలో 46 ఇంక్యుబేటర్స్ ఉండటమే కాకుండా కీలకమైన ఐవోటీ–ఏఐ, ఇండస్ట్రీ 4.0, బయోటెక్, మెడికల్ డివైసెస్, మారిటైమ్ అండ్ షిప్పింగ్, రూరల్ ఇన్నోవేషన్ సెంటర్ పేరుతో ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. ఇదీ స్టార్టప్ పాలసీ 4.0 లక్ష్యం » వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 20 వేల స్టార్టప్‌ల ఏర్పాటు లక్ష్యంగా ఏపీ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 4.0 విడుదల. »హబ్ అండ్ స్పోక్ మోడల్లో స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పాటు ద్వారా లక్షల మందికి ఉపాధి. »కొత్తగా 10 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు, 20 సూని కార్నర్స్, 10 యూనీ కార్నర్స్ ఏర్పాటు. »కీలకమైన 15 డిపార్ట్మెంట్లలో స్టార్టప్‌లకు ప్రోత్సాహం. రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపు. »అమరావతి కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) ఏర్పాటు.. దీనితో అనుసంధానం చేస్తూ ఐదు ప్రాంతాల్లో స్పోక్ సెంటర్లు. ఐదేళ్లల్లో స్టార్టప్‌లకు నిధులు సమకూర్చేలా ఆర్టీఐహెచ్కు రూ.250 కోట్లు, ప్రతి స్పోక్ సెంటర్‌కు రూ.100 కోట్ల గ్రాంట్ బడ్జెట్. »ఎంపికైన ప్రతి కాన్సెప్‌్టకు రూ.2 లక్షల ప్రారంభ గ్రాంట్.. దశల వారీగా రూ.15 లక్షల వరకు.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకైతే రూ.20 లక్షల వరకు గ్రాంట్.. 8 శాతం వడ్డీ రాయితీ, రూ.50 లక్షల చొప్పున సీడ్ ఫండింగ్, మార్కెటింగ్ సపోర్ట్.. »ఈవెంట్స్‌కు వెళ్లినప్పుడు అయ్యే ఖర్చులో 75 శాతం.. గరిష్టంగా రూ.3 లక్షలు అందజేత. ఐదేళ్లు ఎస్‌జీఎస్‌టీపై 100 శాతం రీయింబర్స్మెంట్. »వేగంగా అనుమతులు మంజూరు చేసేలా ఏపీ స్టార్టప్ వన్ పోర్టల్ ఏర్పాటు. సార్టప్ పాలసీ సేŠట్ట్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్న ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ.. త్వరలోనే ఆపరేషనల్ గైడ్‌లైన్స్ విడుదల. -
నామినేటెడ్ పదవులపై మీనమేషాలు
సాక్షి, అమరావతి: కార్యకర్తలతో ఎన్నికల్లో పని చేయించుకొని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి పదవులిచ్చే విషయంలో నానా తిప్పలు పెట్టడం సీఎం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ప్రధానమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇంకా సాగుతూనే ఉంది. ఇక జిల్లా, నియోజకవర్గస్థాయి పోస్టులు, దేవాలయాల ట్రస్టు బోర్డుల నియామకంలో ఇప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా 200కి పైగా మార్కెట్ యార్డు చైర్మన్లు, వెయ్యికి పైగా దేవస్థానం ట్రస్టు బోర్డులు, పలు పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్ల నియామకంపై చంద్రబాబు సాగతీత వైఖరే అవలంబిస్తున్నారు. ఈ పదవుల కోసం కార్యకర్తలు ఎంతగా ఎదురు చూస్తున్నా త్వరితగతిన భర్తీ చేయకపోగా.. వాటి భర్తీలో జాప్యాన్ని ఎమ్మెల్యేలపై నెట్టేయడం అందరిలో అసహనం కలిగిస్తోంది. పదవుల కోసం విజ్ఞాపనలు ఇస్తున్న క్యాడర్ పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన తమకు ఈ పదవుల్లో అవకాశం ఇవ్వాలని మధ్యస్థాయి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు. నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలు పట్టించుకోకపోవడంతో చాలామంది మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. టీడీపీ కార్యాలయంలో వారంలో నాలుగైదు రోజులు నిర్వహించే విజ్ఞప్తుల స్వీకరణలో సగం మంది పదవుల కోసం వచ్చిన వారే ఉంటున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు పదవులు అందరికీ ఇవ్వలేమని పరోక్షంగా చెబుతున్నారు. పైపెచ్చు ఏ పదవైనా రెండేళ్లేనని, ఆ తర్వాత వేరే వారికి ఇస్తామని చెబుతున్నారు.వీటితోపాటు పదవుల భర్తీకి ఎమ్మెల్యేలు సహకరించడంలేదని, పార్టీ కోసం పనిచేసిన వారి పేర్లను సిఫారసు చేయమని అడిగితే వారు పట్టించుకోవడంలేదని ఇటీవల ఒక సమావేశంలో చెప్పారు. దీనిపై పలువురు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క తమను పేర్లు అడుగుతూనే, మరోపక్క వారికి ఇష్టం వచ్చిన వారి పేర్లను వారే రాసేసుకుంటున్నారని చెబుతున్నారు. ఈమాత్రం దానికి తమను పేర్లు అడగడం ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఎమ్మెల్యేల బేరసారాలతో మరింత ఆలస్యం అనేక చోట్ల ఎమ్మెల్యేలు పదవులను బేరం పెట్టినట్టు టీడీపీ శ్రేణుల్లోనే ప్రచారం జరుగుతోంది. తమ కోసం పని చేసిన వారికి పదవులు ఇచ్చేందుకు సైతం ముడుపులు అడుగుతుండడం, వారు ఇవ్వలేమని చెబుతుండడంతో ఎవరి పేర్లనూ అధిష్టానానికి సిఫారసు చేయడంలేదనే చర్చ జరుగుతోంది. ఇలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నామినేటెడ్ పదవుల భర్తీ చేయడంలో తన తప్పు లేదంటూ ఎమ్మెల్యేలపై నెపం నెట్టివేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బేరాలు పెట్టిన ఎమ్మెల్యేలను నియంత్రించి, కార్యకర్తలకు పదవులు ఇవ్వాల్సిన సీఎం.. ఎమ్మెల్యేలు సహకరించడం లేదంటూ తప్పించుకోవడాన్ని పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యే, ఎంపీల మధ్య సమన్వయం లేకపోవడం, ముడుపుల లెక్కలు తేలకపోవడం వల్లే ఈ పదవుల భర్తీలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. మరోపక్క టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పదవుల పంపకంపైనా ఏకాభిప్రాయం కుదరడంలేదని చెబుతున్నారు. టీడీపీకి 80 శాతం పోస్టులు, జనసేన, బీజేపీకి కలిపి 20 శాతం కేటాయించాలని మొదట్లో ఒప్పందం జరిగింది. అయితే ఇది సరిగ్గా అమలు కావడంలేదని క్షేత్ర స్థాయిలో జనసేన, బీజేపీ నేతలు వాపోతున్నారు. దీంతో అటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ కేడర్‌లోనూ పదవుల పంపకంపై ఆందోళన నెలకొంది. -
జలాంతర్గాములకు రక్షణ కవచం.. నిస్తార్
డైవింగ్ సపోర్ట్ వెసెల్స్ నిర్మాణంలో భారత్ కీలక మైలురాయిని అధిగమించింది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి ఉపక్రమించిన హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ.. ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధ నౌకని అందుబాటులోకితీసుకొచ్చింది.ఇప్పటి వరకు 11 సార్లు సీ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ జలాంతర్గామి రక్షిత యుద్ధ నౌక.. త్వరలోనే నౌకాదళ అమ్ముల పొదిలో చేరి సేవలందించనుంది. తొలిసారిగా ఓ యుద్ధనౌకలో 3 మెగావాట్ల డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేయడం.. నిస్తార్ నుంచే మొదలు పెట్టడం విశేషం. – సాక్షి, విశాఖపట్నంవెల్ కమ్ బ్యాక్ ..నిస్తార్ భారత్–పాక్ యుద్ధ సమయంలో పీఎన్ఎస్ ఘాజీ సబ్‌మెరైన్‌ని కాలగర్భంలో కలిపేసింది ఐఎన్ఎస్ నిస్తార్. దాయాదితో జరిగిన పోరులో చారిత్రక విజయాన్ని అందించిన నిస్తార్ ఆ తర్వాత సేవల నుంచి ని్రష్కమించింది. ఇప్పుడు మళ్లీ స్వదేశీ పరిజ్ఞానంతో నిస్తార్ క్లాస్ నిర్మించాలని భారత నౌకాదళం భావిస్తూ.. ఆ బాధ్యతని విశాఖలోని హెచ్‌ఎస్‌ఎల్‌కు అప్పగించింది. 11 సార్లు సీ ట్రయల్స్ నిర్వహణ.. నిస్తార్–క్లాస్ సామర్థ్య ధ్రువీకరణ నిమిత్తం ఇప్పటి వరకు చేపట్టిన 11 సీ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. ఇటీవల తుది ట్రయల్ నిర్వహించారు. యార్డ్–11190 పేరుతో నౌక పనులు చివరి దశకు చేరుకున్నాయి. షిప్‌యార్డు డిజైన్ మేనేజర్ ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది దీన్ని రూపొందించారు.ఐఎన్ఎస్ నిస్తార్ స్వరూపమిదీ.. బరువు 9,350 టన్నులుపొడవు 118.4 మీటర్లు వెడల్పు 22.8 మీటర్లు స్వదేశీ పరిజ్ఞానం 80%ప్రాజెక్టు వ్యయం రూ.2,396 కోట్లు సెన్సార్ నేవిగేషన్ రాడార్ నిస్తార్ ప్రత్యేకతలు» డీప్ సబ్ మెరైన్స్ రెస్క్యూ వెహికల్ » సముద్ర గర్భం నుంచి 15 టన్నుల బరువుని ఎత్తేలా మెరైన్ క్రేన్ ఏర్పాటు » 75 మీటర్ల లోతువరకు డైవింగ్ చేస్తుంది » 3 మెగావాట్ల జనరేటర్ దీని సొంతం » 300 మీటర్ల లోతు వరకు కార్యకలాపాల నిర్వహణ ఉపయోగంఆపదలో ఉన్న జలాంతర్గాములకు సహాయంసముద్రంలో నిరంతర గస్తీ, పరిశోధన, రక్షణ -
అడుగుకు కమీషన్.. 'రూపాయి పావలా'
సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేమో ఓ వైపు సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ అమలు చేస్తానని చెబుతూ.. మరోవైపు మద్యం దందా, ఇరిగేషన్ పనుల్లో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట సొంతంగా సంపద సృష్టించుకుంటుంటే, టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం రెండడుగులు ముందుకేసి సొంతానికి సంపద సృష్టించుకోవడానికి వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఆక్రమ ఆదాయ మార్గాలను అన్వేషించడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పరిస్థితి మరీ చిల్లరగా ఉంది. కిలో చికెన్‌కు రూ.10 మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఇటీవల హుకుం జారీ చేసిన విషయంపై కలకలం సద్దుమణగక ముందే ఈ దంపతుల కన్ను గోడౌన్లపై పడింది. చదరపు అడుగుకు రూపాయి పావలా కమీషన్ ఇచ్చి తీరాల్సిందేనని స్వయంగా ఎమ్మెల్యేనే గోడౌన్ల యజమానులకు అల్టిమేటం జారీ చేశారు. సొంత పార్టీ నేతలైనా సరే కమీషన్ ఇచ్చిన తర్వాతే గోడౌన్ లీజుకు పర్మిషన్ ఇస్తామని తెగేసి చెప్పడంతో టీడీపీ నాయకులు సైతం గగ్గోలు పెడుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు సుమారు 14 వేల ఎకరాల్లో పొగాకు పంట సాగు చేశారు. ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. రైతుల వద్ద నుంచి కొన్న పొగాకును నిల్వ చేసుకునేందుకు పొగాకు కంపెనీలకు ఆళ్లగడ్డ, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, ఆర్.జమ్ములదిన్నెలోని గోడౌన్లు అవసరమవుతాయి. సుమారు 2.50 లక్షల చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. ఒక్కో చదరపు అడుగుకు నెలకు రూ.5.25 చొప్పున ఇస్తామని పొగాకు కంపెనీలు యజమానులకు ఆఫర్ ఇచ్చాయి. మూడేళ్ల పాటు అగ్రిమెంట్ ఇవ్వాలని చెప్పడంతో యజమానులంతా సంతోషపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సదరు ప్రజాప్రతినిధి ప్రతి అడుగుకు తనకు రూపాయి పావలా కమీషన్ ఇచ్చి తీరాల్సిందేనని ఖరాకండిగా చెప్పేశారు. కమీషన్ ఇవ్వకుంటే అగ్రిమెంట్ ఎలా చేసుకుంటారో చూస్తానని హెచ్చరించినట్లు యజమానులు వాపోతున్నారు. తమకు పెద్దగా మిగిలేది ఉండదని మొరపెట్టుకున్నా వినిపించుకోలేదని సమాచారం. దీంతో చేసేది లేక ఆమె గారు అడిగిన మేరకు అడుగుకు “రూపాయి పావలా’ కమీషన్‌కు ఓకే చెప్పారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ.3.12 లక్షల మేర ఎమ్మెల్యేకు ముట్టజెప్పాల్సి ఉంటుంది. ఈ విషయం స్థానికంగా రైతులందరికీ తెలియడంతో ఇంత చిల్లర వ్యవహారాలు ఎక్కడా ఉండవని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
హద్దు మీరొద్దు.. పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
పోలీసుల తీరు చూస్తుంటే మాకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతోంది. చాలా క్యాజువల్‌గా కేసులు పెడుతున్నారు. వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ఏదో ఒక కేసు నమోదు చేయాలి. ఎవరో ఒకరిని అరెస్టు చేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. -హైకోర్టు ధర్మాసనం తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేం చేయలేం..! మీరు మరో మార్గం చూసుకోండని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్ ఉంది. దాన్ని కూడా ఫాలో కావడం లేదు. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదు.. మా మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉంది. పోలీసులు ఏది దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారు. వారు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల ‘అతి’పై హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. పెద్దల మెప్పు కోసం పనిచేస్తే, సమస్య వచ్చినప్పుడు వాళ్లొచ్చి మిమ్మల్ని కాపాడరని వ్యాఖ్యానించింది. చట్టం, నిబంధనలు, పోలీసు మాన్యువల్‌కు లోబడి పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పోలీసులు తమ పరిధులు గుర్తెరిగి విధులు నిర్వర్తించాలంది. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తమకు బాగా తెలుసని పేర్కొంది. అలాగే తాము ఏమీ చేయలేమని అనుకోవద్దని హెచ్చరించింది. ఏం చేస్తున్నా కూడా చూడనట్లుగా తమను (కోర్టు) కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారని, అది ఎంత మాత్రం సాధ్యం కాదని తెలిపింది. పోలీసుల తీరు చూస్తుంటే తమకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతోందంటూ వ్యాఖ్యానించింది. చాలా క్యాజువల్‌గా కేసులు పెట్టేస్తున్నారని, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారని పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి వాటిని తాము నమ్మాలని పోలీసులు అనుకుంటున్నారని పేర్కొంది. ఏదో ఒక కేసు నమోదు చేయాలి.. ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడింది. ప్రభుత్వాన్ని డ్రామా రూపంలో వ్యంగ్యంగా విమర్శించినందుకు కేసు పెడితే.. ప్రతి సినిమా హీరోను, ప్రతి నటుడినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం తప్పా? దానిపై రీల్ చేయడం తప్పా? అని పోలీసులను నిలదీసింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కిందకు వస్తుందా? అని విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు ఎలా పడితే అలా కేసులు పెడితే విశ్వసనీయత ఏముంటుందని ప్రశ్నించింది. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదని, తమ మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. పోలీసులు ఏం దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసులు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదని, ఈ విషయాన్ని తాము ఒప్పుకుని తీరాల్సిందేనని పేర్కొంది. ఇప్పటికే పలు సందర్భాల్లో మేజిస్ట్రేట్ల తీరును ఆక్షేపించామని హైకోర్టు గుర్తు చేసింది. డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించి, రీల్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్ చేయడంపై సంబంధిత రికార్డులన్నీ తమ ముందుంచాలని కర్నూలు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించింది. అలాగే పోలీసులు సమర్పించిన రికార్డులు, నమోదు చేసిన వాంగ్మూలాల కాపీలను తమకు పంపాలని కర్నూలు ఫస్ట్ క్లాస్ స్పెషల్ జుడీషియల్ మేజిస్ట్రేట్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.అక్రమ నిర్భంధంపై హెబియస్ కార్పస్..పోలీసులు తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను అక్రమంగా నిర్భంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభినయ్ గతేడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ నిర్వహించింది. అభినయ్ తరఫున న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించగా, పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపించారు.తప్పుల మీద తప్పులు...డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ కేసు పెడతారా? అది కూడా అరెస్టు సమయంలో రూ.300 దొరికాయంటూ! అని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, ఇలా చేస్తే సమస్యలపై సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. నానాపటేకర్ నటించిన వజూద్ సినిమాలో పోలీసులు వ్యవహరించిన రీతిలో ఈ కేసులో పోలీసులు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల పట్ల పోలీసులు ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం బేఖాతరు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో చట్ట నిబంధనల గురించి పోలీసులను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జోక్యం చేసుకుని పోలీసుల చర్యలను సమర్థించే ప్రయత్నం చేయగా ధర్మాసనం ఆయన్ను వారించింది. తప్పు చేసిన వారిని వెనకేసుకురావద్దని హితవు పలికింది.అరెస్ట్ చేయడానికే కేసు పెడతామంటే ఎలా..?“ప్రేమ్‌కుమార్‌ను అర్థరాత్రి అరెస్ట్ చేస్తారా? అంత అత్యవసరంగా అరెస్టు చేయాల్సినంత కేసా ఇది? పైగా కర్నూలు నుంచి 8–9 గంటలు ప్రయాణం చేసి వచ్చి మరీ అరెస్ట్ చేస్తారా? ఆయననేమన్నా పారిపోతున్నారా? ప్రేమ్‌కుమార్ రీల్‌ను సోషల్ మీడియాలో చూశానంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడం.. మీరు పోలోమంటూ కర్నూలు నుంచి అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం! అంతేకాదు.. అరెస్ట్ చేసి పలు ప్రదేశాలు తిప్పారు. ఇదంతా ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు? ఉన్నతాధికారుల మెప్పు కోసం పనిచేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఓ వ్యక్తిని ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడి వ్యక్తులను పంచాయతీదారులుగా చూపాలి. కానీ ఈ కేసులో కర్నూలు పోలీసులు తమ వెంట అక్కడి నుంచే పంచాయతీదారులను తెచ్చుకున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసులు కొత్త కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. మీరు ఇలాంటివి చేస్తుంటే, మేం కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారు. మీరు ఇలాగే వ్యవహరిస్తుంటే చాలా సమస్యలు వస్తాయి. తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య’ అని ధర్మాసనం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎలా పడితే అలా చేసే ముందు బాగా ఆలోచించుకోండి...!“గుంటూరులో ప్రేమ్ కుమార్ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కర్నూలు పోలీసులు కేసు ఎలా పెడతారు? మీకున్న పరిధి ఏమిటి? అసలు కర్నూలు నుంచి గుంటూరుకు వచ్చేందుకు మీ జిల్లా ఎస్పీ నుంచి అనుమతి తీసుకున్నారా? మేం ఇప్పుడు అనుమతి ఉందా? అని అడిగాం కాబట్టి వచ్చే విచారణ నాటికి అనుమతి తెస్తారు. ప్రేమ్‌కుమార్ అరెస్ట్ గురించి గుంటూరు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. కానీ వారికి మీరెప్పుడు సమాచారం ఇచ్చారు? మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల చర్యలు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది. ప్రేమ్ కుమార్‌ను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన కర్నూలు త్రీటౌన్ ఎస్‌హెచ్‌వో.. ఫిర్యాదులు అందగానే ఎన్ని కేసుల్లో ఇలా అప్పటికప్పుడు అరెస్టులు చేశారు? ఎన్ని కేసుల్లో ఇలా అర్ధరాత్రులు వెళ్లారు? మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేమీ చేయలేం.. మీరు మరో మార్గం చూసుకోండని మమ్మల్ని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు వారి సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్ ఉంది. దాన్ని కూడా వాళ్లు ఫాలో కావడం లేదు. ఇక్కడ మా మేజిస్ట్రేట్ల తప్పు కూడా ఉంది. ఈ కేసులో ప్రేమ్‌కుమార్ నేరాలు చేయడమే అలవాటైన వ్యకిŠాత్గ పేర్కొంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో రాస్తే మేజిస్ట్రేట్ దాన్ని కనీస స్థాయిలో కూడా పరిశీలించలేదు. రూ.300 వసూలు చేయడం అలవాటైన నేరం కిందకు వస్తుందా? అనే విషయాన్ని కూడా గమనించలేదు. ఈ కేసుకు సంబంధించిన అన్నీ రికార్డులను మేం పరిశీలించాలనుకుంటున్నాం’ అని ధర్మాసనం తెలిపింది. ఈమేరకు రికార్డులను తమ ముందుంచాలని కర్నూలు త్రీటౌన్ ఎస్‌హెచ్‌వో, మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది.పౌర స్వేచ్ఛపై “సుప్రీం’ ఏం చెప్పిందంటే...“ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు..’’“స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది’’“భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియచేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి’’– ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజమ్ కేసులో “సుప్రీం కోర్టు’’ కీలక వ్యాఖ్యలు -
ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలో భవనాలు, ఖాళీ స్థలాలకు 2024–25 సంవత్సరానికి చెల్లించాల్సిన ఆస్తి పన్నుతోపాటు పాత బకాయిలపై వడ్డీని 50 శాతం మాఫీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే వడ్డీపై 50 శాతం రాయితీ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారుల విజ్ఞప్తి మేరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. -
వెల్లువలా ఫిర్యాదులు
సాక్షి నెట్వర్క్:⇒ పింఛన్ ఇప్పించాలంటూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల వేడుకోలు..!⇒ తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ కాళ్లరిగేలా తిరుగుతున్న గిరిజనులు..!⇒ రేషన్ కార్డులు, ఇళ్ల కోసం నెలల తరబడి ఆరాటంతో ఎదురు చూస్తున్న పేదలు..! ⇒ అడుగు ముందుకు పడని భూముల మ్యుటేషన్లు.. పాస్‌బుక్‌లు అందక రైతన్నల గగ్గోలు..! ⇒ స్థలాలు ఆక్రమణలకు గురై తీవ్ర ఆందోళనలో సామాన్యులు..! ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ అందక చదువులు మధ్యలో ఆగిపోయిన పిల్లలు..!ఇంతమంది ఇన్ని సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నా పరిష్కారం లభిస్తుందనే భరోసా ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఓ ప్రహసనంగా.. సమస్యల నిలయంగా మారింది! కలెక్టర్ నుంచి జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్న ఈ వేదిక ప్రజలకు ఏమాత్రం భరోసా కల్పించలేకపోతోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు తరలి వస్తున్న వారితోపాటు కార్యాలయాలను కుప్పలు తెప్పలుగా ముంచెత్తుతున్న అర్జీలే ఇందుకు సాక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కడ చూసినా సమస్యలతో సతమతమవుతూ నెలల తరబడి తిరుగుతున్నవారే కనిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిష్కార వేదికల వద్దకు వచ్చిన వారిని ‘సాక్షి’ ప్రతినిధుల బృందం పలుకరించగా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం కల్పిస్తూ అడుగులు ముందుకు వేసిందని, గ్రామ స్థాయిలో ఇంటి వద్దకే పౌర సేవలను అందచేసిందని గుర్తు చేసుకున్నారు. ఏ కారణం చేతనైనా సరే.. అర్హుల్లో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా లబ్ధి చేకూరేలా ఏటా రెండుసార్లు జాబితాను సిద్ధం చేసి సచివాలయాల్లో పారదర్శకంగా ప్రదర్శించి వలంటీర్ల ద్వారా ఇంటికే పథకాలను చేరవేసిందని చర్చించుకోవడం కనిపించింది.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామలింగం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురానికి చెందిన ఆయన కుమారుడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 32లో 89 సెంట్లను రామచంద్రుడు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. ఇందులో 44 సెంట్ల భూమిని ఈశ్వరయ్య అనే వ్యక్తికి విక్రయించాడు. మిగిలిన 45 సెంట్ల భూమికి పాస్‌బుక్ కోసం వెళితే మూడు సార్లు సర్వే కోసం చలానా కట్టించుకున్నారు. సర్వేయర్ ఒక్కసారి కూడా వచ్చి సర్వే చేయలేదు. కోర్టు పరిధిలో భూమి ఉందంటూ దాట వేస్తున్నారు. దీంతో బాధితుడు నాలుగైదుసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నమ్మలు తన కుమారుడిని పాలిటెక్నిక్ చదివిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం వారిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ నుంచి దివ్యాంగుడైన తండ్రి సాయంతో కలెక్టరేట్‌కు వచ్చింది. కాలేజీకి ఫీజు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందించింది. నిరుపేదనైన తాను ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులతోనే కుమారుడిని చదివిస్తున్నానని, ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని చిన్నమ్మలు వాపోయింది.⇒ చిత్రంలో కనిపిస్తున్న గిరిజనులు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుణదతీలేసు పంచాయతీ పరిధిలోని లాబేసు గ్రామం వాసులు. వీరంతా నిరుపేదలు. గ్రామానికి చెందిన18 మంది గిరిజన రైతులు సర్వే నంబర్ 16, 11లోని కొంత ప్రభుత్వ భూమిలో తుప్పలు తొలగించి 1995 నుంచి పంటలు పండిస్తున్నారు. సాగు హక్కు పట్టాలు మంజూరు చేయాలంటూ తొమ్మిది నెలలుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.నేను చచ్చిన తరువాత పింఛన్ ఇస్తారా? పెన్షన్ కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్‌కు వస్తే సచివాలయానికి వెళ్లమంటారు. అక్కడికి వెళితే మళ్లీ ఇక్కడికే పొమ్మంటారు. అసలు పెన్షన్ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వబోమంటే మా పని ఏదో చేసుకొని బతుకుతాం. పేదలను ఇలా తిప్పుకోవడం మంచిది కాదు. నేను చచ్చిన తరువాత పెన్షన్ ఇస్తామంటే ఏం లాభం? గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల మంజూరు చాలా చక్కగా ఉండేది. – మద్దయ్య, బి.తాండ్రపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లాఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు బండిపై బాదంపాలు విక్రయిస్తూ జీవిస్తున్నా. ఒంటరి మహిళను. ఈ ఏడాది జనవరి 22వ తేదీన చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారు ఢీకొనడంతో కాలు, చేయి విరిగాయి. ఆపరేషన్‌కు రూ.లక్ష ఖర్చు అయింది. ఇప్పటికీ నడవలేకపోతున్నా. నిందితుడిని గుర్తించి, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. ప్రమాదానికి కారకుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. –షేక్ సైదాబీ, కావూరు లింగంగుంట్ల, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లాముళ్ల పొదల్లో మృతదేహాలను మోసుకుంటూ..మా గ్రామం నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో మాంటిస్సోరి స్కూల్ వెనుక భాగంలో 70 సెంట్ల హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అక్కడకు వెళ్లాలంటే రహదారి లేదు. పొలం గట్లపై, ముళ్ల పొదల్లో భయంభయంగా మృతదేహాలను మోసుకుంటూ తీసుకెళ్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాథుడే లేరు. – చాపిరేవుల గ్రామస్తులు, నంద్యాల జిల్లా -
‘టీడీపీ అధికారంలో ఉంటే రైతన్నకు కష్టాలే’
సాక్షి,విశాఖ: టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతన్నకు కష్టాలే. వ్యవసాయం అంటే దండగన్న చంద్రబాబు రైతన్నను ఆదుకోకుండా వారిపై పగబడుతున్నారని కూటమి ప్రభుత్వంపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో రైతన్నల దుస్థితిపై బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం అయినా రైతుల కష్టాలను తీర్చేలా ఉంటే బాగున్ను..అది రాష్ట్రంలో లేదు.. టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదు. కడపలో అరటి తోటలు గాలికి నేలకొరిగాయి.పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు.మిర్చి పరిస్థితి కూడా అలానే ఉంది ఏం చెయ్యాలో తోచని దుస్థితి.చెరకు రైతులు స్వయంగా పంటను వాళ్ళే కాల్చుకునే పరిస్థితి. ఈ ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతులను ఎందుకు చిన్నచూపు చూస్తుంది. మిర్చి కొంటాం అని హామీ ఇచ్చారు. ఒక్క క్వింటా అయినా కొన్నారా..?.ఒక్క కేజీ అయినా కొన్నారా? కొంటే రైతులు యార్డ్ దగ్గర ఎందుకు ఉంటారు. గోవాడ చెరకు రైతులకు రూ.24 కోట్లు బకాయి పడ్డారు. ఎందుకు రైతులకు చెల్లించడం లేదు. వ్యవసాయం అంటే దండగ అని టీడీపీ నానుడి. ఏ రకంగా చూసినా గత ప్రభుత్వంలో రైతులకు మంచి చేశాం. మా హయాంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. రైతులకు మాటలే తప్ప చేసినది ఏమి లేదు.గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తే పరిస్థితి తెలుస్తుంది. మేము చెప్పింది అబద్దం అయితే అక్కడికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. హామీలు ఇవ్వడం కాదు చేతల్లో చూపించండి. కూటమి హామీలు చూసి ప్రజలు మోసపోయారు..హామీలు నమ్మి మోసపోయామని ప్రజలకు కూడా అర్థమైంది.ఇక్కడ పండిన పంటకు ఇతర ప్రాంతాల్లో మార్కెటింగ్ చేయొచ్చు కదా.రైతులను ఆదుకోవాలనే తపన ఈ ప్రభుత్వానికి లేదు.రైతుల ఇబ్బందులను ఈ పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రైతులను వెంటనే ఆదుకోవాలి.రైతులకు ఇచ్చిన హామీలను మాటల్లో కాదు చేతల్లో చూపించాలి’ అని డిమాండ్ చేశారు. -
‘సార్ అని పిలవాలంటూ మెట్లపై పరుగెత్తించి దాడి చేశాడు’
విశాఖ: మూడు రోజుల క్రితం అనిల్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ పై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. నగరంలోని ఆక్సిజన్ టవర్ లో డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన అనిల్ అనే యువకుడిపై ప్రసాద్ అనే వ్యక్తి దారుణంగా దాడి చేశాడు. అయితే ఈ అవమానం భరించలేక అనిల్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కథనాలు రావడంతో డెలివరీ బాయ్స్ సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఆ యువకుడి అండగా నిలబడింది. ప్రస్తుతం క్షేమంగా ఉన్న ఆ యువకుడు ‘సాక్షి’ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించాడు.‘ అన్నా అనీ పిలిచినందుకు ప్రసాద్ అనే వ్యక్తి నాపై దాడి చేశాడు. సార్ అని పిలవాలి అంటూ విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. డ్యూటీలో జాయిన్ మొదట రోజు మొదటి ఆర్డర్ ఆక్సిజన్ టవర్ లో వచ్చింది. నాకు అడ్రస్ తెలియక వెతుక్కొని వెళ్లాను. ఆక్సిజన్ టవర్ లో ఉన్న 29 ఫ్లోర్ కి వెళ్లి ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ ఒక యువతి తీసుకున్నారు. లిఫ్ట్ వద్దకి వచ్చి ప్రసాద్ అనే వ్యక్తి నా పై దాడికి యత్నించిన్నారులిఫ్ట్ వద్దకి వచ్చిన ప్రసాద్.. మెట్లపై పరుగెత్తించి దాడి చేశాడు. నా బట్టలు విప్పించి కర్రతో కొట్టారు. నాతో బలవంతంగా రెండు లేటర్లు రాయించారు. నా తప్పు ఉంది అని చెప్పి లెటర్ రాయించారు. నాకు తగిన న్యాయం కావాలి. ప్రసాద్ నన్ను ఎవరు ఎం చెయ్యలేరు అని చెప్పి దాడి చేశారు’ అని పేర్కొన్నాడు బాధితుడు అనిల్ నిందితుడికి ఏప్రిల్ 7 వరకూ రిమాండ్ఈ దాడిలో నిందితుడిగా ఉన్న ప్రసాద్ కు రిమాండ్ విధించారు. ఏప్రిల్ 7 వ తేదీ వరకూ రిమాండ్ విధించింది కోర్టు. దాంతో నిందితుడు ప్రసాద్ ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. -
టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చీప్ పాలిటిక్స్
సాక్షి, కృష్ణాజిల్లా: పెనమలూరులో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దిగజారుడు రాజకీయాలకు తెర లేపారు. వేసవిలో ప్రజలకు దాహం తీర్చేందుకు చలివేంద్రం పెట్టిన వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. నాలుగు రోజుల క్రితం యనమలకుదురులో అభయ హస్త సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేశారు.చలివేంద్రాన్ని పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ప్రారంభించారు. వైఎస్సార్‌షీపీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడంతో బోడే ప్రసాద్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఎమ్మెల్యే బోడే ఆదేశాలతో చలివేంద్రం తీసేవేయించాలని మున్సిపల్ కమిషనర్‌కు టీడీపీ నాయకుడు వీరంకి కుటుంబరావు ఫిర్యాదు చేశారు.కమిషనర్ సమక్షంలోనే అక్రమంగా క్రేన్‌తో చలివేంద్రం తొలగించారు. చలివేంద్రం నిర్వాహకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చలివేంద్రం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఆరేపల్లి ఈశ్వర్ రావును కాలర్ పట్టుకుని మరీ బయటికి లాగి పడేసిన పోలీసులు ఆయనను బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడిపోతున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ గుంటూరు యార్డుకు వెళ్లేదాకా చంద్రబాబు ప్రభుత్వం.. మిర్చి రైతుల గురించి పట్టించుకోలేదని.. ఆ తర్వాతే హడావుడిగా రూ.11,781 లకు కొనుగోలు చేస్తామని ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ నేటి వరకు ఒక్క కిలో మిర్చి కూడా కొనలేదు’’ అని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.మిర్చి రైతులు ఇవాళ కూడా గుంటూరులో ధర్నాలు చేశారు. రైతు కంట కన్నీరు వస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఈ ప్రభుత్వం రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు?. వైఎస్ జగన్ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసింది?. మిర్చి రైతులతా ఆందోళనలో ఉన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక రైతులంతా ఆవేదన చెందుతున్నారు’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.‘‘రైతులను కాదని వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోంది. అచ్చెన్నాయుడు వైఎస్ జగన్‌ను ఎగతాళి చేయటమే పనిగా పెట్టుకున్నారు. దానివలన రైతులకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు’’ అని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. -
మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు.. లావుకు పేర్ని స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,గుంటూరు: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరని మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మెప్పు కోసం ఎంపీ లావు లోక్‌సభలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్నినాని మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరు. పార్లమెంటును అడ్డు పెట్టుకుని కక్షసాధింపు రాజకీయాలు చేయటం మానుకోవాలి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా లిక్కర్ స్కాం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు లిక్కర్ షాపులను చెరపట్టారు. ప్రతిచోటా బెదిరించి కమీషన్లు, లంచాలు తీసుకుంటున్నారు. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వీటిపై పార్లమెంటులో మాట్లాడాలివైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేలకోట్లు దేశం దాటి వెళ్లినట్టు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపణలు చేశారు. అప్పుడు ఆయన మా పార్టీలోనే ఉన్నారు కదా? మరెందుకు మాట్లాడలేదు?.లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెమింగో పక్షిలాంటివాడు.టీడీపీ గూటిలో చేరి చంద్రబాబు మాటలను చిలక పలుకులుగా మాట్లాడుతున్నారు. పల్నాడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని శ్రీకృష్ణ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడితే ఉపయోగ పడుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను ఆపటానికి, పోలవరానికి నిధులు తేవటానికి తన అధికారాన్ని వాడుకుంటే మంచిది. రాయలసీమ లిఫ్టు ఎత్తిపోతల పథకం కోసం వాడితే మంచిది.దక్షినాది రాష్ట్రాల్లో తగ్గబోతున్న సీట్ల గురించి మాట్లాడాలి.కనీసం పల్నాడులో నీటి ఎద్దడి గురించి కూడా మాట్లాడటం లేదు.కేవలం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటమే లావు శ్రీకృష్ణ దేవరాయలు పనిగా పెట్టుకున్నారు.ఇప్పుడు లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని టీడీపీ నేతలే చెరబట్టారు.కమీషన్లు, వాటాల కోసం వ్యాపారుల గొంతు మీద కత్తి పెట్టారు.చంద్రబాబు, లోకేష్ తో సహా అందరూ దోపిడీ చేస్తున్నారు. ఇదికదా అసలైన లిక్కర్ స్కాం అంటే? ఇవేమీ కనపడటం లేదా శ్రీకృష్ణ దేవరాయలూ? అవినీతి, అక్రమాలు చేసిన చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.దానిపై ఐటీ శాఖ పూర్తి విచారణ ఎందుకు చేయటంలేదో శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నించాలి.పాపపు సొమ్ము చంద్రబాబుకి చేరిందని ఈడీ చెప్పింది.దానిపై శిక్షలు వేయమని శ్రీకృష్ణ దేవరాయలు గట్టిగా అడగాలి.స్కిల్ స్కాం విచారణ మొదలవగానే చంద్రబాబు పిఏ శ్రీనివాస్ దుబాయ్ ఎందుకు పారిపోయాడో ప్రశ్నించాలి. శ్రీనివాస్ పదేపదే దుబాయ్ ఎందుకు వెళ్తున్నాడో? ఆయన వెనుకే లోకేష్ ఎందుకు వెళ్తున్నాడో ప్రశ్నించాలి.బేవరేజ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో తప్పుడు వాంగ్మూలం తీసుకుని వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేయాలని చూస్తున్నారు.ఏదోలా వైఎస్ జగన్ మీద అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదని’ స్పష్టం చేశారు. -
రాజ్యసభలో ‘కాశీనాయన’ కూల్చివేతల ప్రస్తావన.. గళమెత్తిన వైఎస్సార్సీపీ ఎంపీ
సాక్షి, ఢిల్లీ: కాశీనాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఎంపీ మేడా రఘునాథరెడ్డి అన్నారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కాశీనాయన క్షేత్రం ప్రాంతాన్ని అటవీ శాఖ నుంచి డీనోటిఫై చేయాలని డిమాండ్ చేశారు. క్షేత్రం కార్యకలాపాల కోసం 33 ఎకరాల భూమిని కేటాయించాలన్నారు. కాశీనాయన క్షేత్రం దాదాపు 100 అన్నదాన సత్రాలను నిర్వహిస్తోందని.. ఆధ్యాత్మిక గురువు కసిరెడ్డి నాయన బోధనలు ఎందరికో ఆదర్శమని మేడా రఘునాథరెడ్డి అన్నారు.కాగా, తెలుగు రాష్ట్రాల్లో అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రం.. ఆధ్యాత్మికవేత్తలకు దివ్యానుభూతిని కలిగిస్తోంది. ఏ సమయంలో వెళ్లినా అన్నదానం జరుగుతుండడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే అనాథలకు ఇది ఆకలి తీర్చే ఒక దేవాలయం. వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం, కాశినాయన మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ధార్మిక సేవలు కొనసాగుతున్నాయి. అయితే అటవీ ప్రాంతం పేరుతో ఈ ఆశ్రమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఇప్పటికే సత్రాలు, వాష్ రూమ్‌లను కూల్చివేశారు.గతంలో అటవీ శాఖ అధికారులు అక్కడి నిర్మాణాలపై అభ్యంతరాలు తెలిపినా కూల్చివేత వరకూ వెళ్లలేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న 13 హెక్టార్ల భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ కూడా రాశారు. అటవీ సంరక్షణ చట్టం రాకముందు నుంచే ఇక్కడ దేవాలయాలు ఉన్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సైతం పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి ఇదే సమస్యను తీసుకెళ్లారు.అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వెనుకా ముందు చూడకుండా కూల్చివేతలు చేపట్టింది. నెల్లూరు జిలాకు చెందిన కాశినాయన అనే సిద్ధుడు బాల్యం నుంచి ఆధ్యాత్మిక చింతనతో దేశాటన చేస్తూ పుణ్యక్షేత్రాల్లో గడిపారు. పాడుబడ్డ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమన్న గురువు ఆదేశాల ప్రకారం జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని 1980వ దశకంలో పూర్తి చేశారు. కాశినాయన పరమపదించాక 1995 నుంచి జ్యోతిక్షేత్రం... కాశినాయన క్షేత్రం అయ్యింది. ఇక్కడి నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట కూడా ఉంది. జ్యోతిక్షేత్రంలో నిర్మాణాలకు గతంలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి, మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి సైతం సహకారం అందించడం గమనార్హం. -
ఆ విషయంపై టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడరు?: గురుమూర్తి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. రాష్టవ్యాప్తంగా అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నారని.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని నిలదీశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.‘‘21 మంది కూటమి ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఏమీ చేయటం లేదు. కేంద్రం నుంచి ఎలాంటి నిధులనూ తీసుకురాలేకపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా నిధులు వెళ్తున్నా కూటమి ఎంపీలు మాట్లాడటం లేదు. కేవలం వైఎస్సార్సీపీ ఎంపీలపై ఆరోపణలు చేయటానికే వారు పరిమితం అయ్యారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. లేని లిక్కర్ స్కాం గురించి మాట్లాడారు. చంద్రబాబు స్కిల్ స్కాం గురించి ఐటీ, ఈడీ సమన్లు కూడా ఇచ్చింది. వీటిపై పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని గురుమూర్తి ప్రశ్నించారు.‘‘యోగేష్ గుప్త, మనోజ్ పాత్ర ఉన్నట్టు కేంద్ర సంస్థలు గుర్తించాయి. టిడ్కోలో కూడా భారీగా ముడుపులు తీసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. వీటిపై శ్రీకృష్ణ దేవరాయలు ఎందుకు ప్రశ్నించటం లేదు?. కేంద్రం చంద్రబాబుని పట్టించుకోవడం లేదు. ఏదో కేసుల్లో ఇరికించటానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎక్సైజ్ శాఖతో సంబంధం లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్‌కసిరెడ్డి, మిథున్‌రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తున్నారు’’ అని గురుమూర్తి దుయ్యబట్టారు.‘‘వైఎస్ జగన్ వచ్చాక 43 వేల బెల్టు షాపులు తొలగించారు. మద్యం అమ్మే సమయాన్ని కుదిరించారు. అలాంటప్పుడు లంచాలు ఎవరైనా ఎలా ఇస్తారు?. అయినప్పటికీ కొంతమంది పత్రికాధిపతులను అడ్డం పెట్టుకుని తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఏ ఒక్క డిస్టలరీలకూ పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం బ్రాండులకు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. మార్కెట్లో ఉన్న బ్రాండులన్నిటికీ చంద్రబాబే అనుమతులు ఇచ్చారు. కానీ టీడీపీ నేతలు మాపై విష ప్రచారాన్ని చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు’’ అని గురుమూర్తి చెప్పారు. -
చంద్రబాబు సర్కార్ అంటేనే లీకేజీలు: రవిచంద్ర
సాక్షి, తాడేపల్లి: పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని నారా లోకేష్‌కు మంత్రిగా పనిచేసే అర్హత లేదని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది లీకేజీల ప్రభుత్వమంటూ రవిచంద్ర దుయ్యబట్టారు.కడప జిల్లాలో టెన్త్ పేపర్ వాట్సాప్‌లో ఎలా వచ్చింది? అంటూ రవిచంద్ర ప్రశ్నించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎలా వెళ్తున్నాయి?. నారా లోకేష్ అసమర్థ మంత్రిగా నిలిచిపోయారు. బీఈడీ పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేకపోయారు. అధికారులను సమర్థవంతంగా ఎందుకు వినియోగించలేకపోతున్నారు?. చంద్రబాబు ప్రభుత్వం అంటేనే లీకేజీల ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. రామబ్రహ్మం 1997లో ఇంటర్ పేపర్ లీక్ చేశారు. ఆ తర్వాత నారాయణ సంస్థల్లోనూ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. నారాయణ సంస్థలకే ర్యాంకులు రావాలని పేపర్లు లీక్ చేశారు. అప్పట్లో నారాయణ సంస్థల వైఎస్ ప్రిన్సిపాల్‌ని కూడా అరెస్టు చేశారు’’ అని రవిచంద్ర గుర్తు చేశారు.‘2024లో చంద్రబాబు రాగానే మళ్లీ పేపర్లు లీకవుతున్నాయి. 6 లక్షల 19 వేల మంది విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏనాడూ పేపర్ల లీకేజ్ అనేదే లేదు. నారాయణ సంస్థల ఉద్యోగిని ఇంటర్మీడియట్ బోర్డులో సభ్యునిగా పెట్టారు. తద్వారా ఇంటర్మీడియట్ బోర్డును తమ చేతుల్లోకి మంత్రి నారాయణ తీసుకున్నారు’’ అని రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై కూటమి సర్కార్ రాజకీయ కక్ష వేధింపులకు దిగింది. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఆయనపై మరో అక్రమ కేసు నమోదైంది. కాకాణి సహా ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాటిపర్తిలో క్వార్జ్ అక్రమ రవాణా అభియోగాల నేపథ్యంలో కేసు నమోదైంది. కాకాణి లక్ష్యంగా కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.అక్రమ కేసులపై కాకాణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక కేసు పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచే నా గళం విప్పుతున్నా. కేసులకు భయపడే ప్రసక్తే లేదు’’ అంటూ ఆయన తేల్చి చెప్పారు. హామీలు అమలు చేయాలని కోరితే కేసు పెట్టారు. క్వార్జ్కి సంబంధించి మరో కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నేనేమి తప్పు చేయలేదు’’ అని కాకాణి పేర్కొన్నారు.‘‘ఉడత బెదిరింపులకు భయపడను. ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాను. సిట్, విజిలెన్స్ విచారణలకు భయపడను. ఈ కేసుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. కొన్ని కేసుల్లో క్వాష్ పిటిషన్ వేశాను. ఈ కేసు మీద కూడా వేస్తాను’’ అని కాకాణి తెలిపారు. -
సత్యసాయిజిల్లా: కదిరి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరి వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, కదిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మక్బూల్ పై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. చామలగొంది ఎంపీటీసీ లక్ష్మీదేవిని కిడ్నాప్ చేశారంటూ ఎఫఐఆర్ నమోదు చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఇప్పటికే ఎంపీటీసీ లక్ష్మీదేవి ఓ సెల్ఫీ విడియో విడుదల చేశారు. టీడీపీ నేతల డైరెక్షన్లో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. ఎంపీటీసీ లక్ష్మీదేవి దూరపు బంధువు నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 27న గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ కుట్రలకు తెరతీసింది.గుత్తిలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలుకాగా, అనంతపురం జిల్లా గుత్తిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ కోన మురళీధర్‌రెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్ధాలు, వాహనాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. -
ఆదిలక్ష్మిని అతి కిరాతకంగా చంపిన ప్రియుడు..
పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సోమవారం తెల్లవారుజామున జరిగన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జానపాడు గ్రామానికి చెందిన తాటి కొండలు, తాటి ఆదిలక్ష్మి(30)లు భార్యాభర్తలు. నిత్యం పని నిమిత్తం పిడుగురాళ్ల పట్టణంలోని సున్నపు బట్టీలకు వస్తుంటారు. ఈ క్రమంలో వేముల ఏడుకొండలు అనే బట్టీ మేస్త్రీతో ఆదిలక్ష్మికి పరిచయమేర్పడింది. దీంతో ఆదిలక్ష్మి కొండలను వదిలిపెట్టి ఐదేళ్లుగా పిడుగురాళ్ల పట్టణంలో పిల్లలతో పాటు ఏడుకొండలుతో సహజీవనం సాగిస్తోంది.ఆదిలక్ష్మి డ్వాక్రా ద్వారా రూ.3 లక్షలు తీసుకుందని, ఆ డబ్బుల విషయంలో ఆదిలక్ష్మికి, ఏడుకొండలకు తరచూ గొడవలు జరుగుతుంటాయని స్థానికులు చెప్పారు. రోజులాగే పిల్లలిద్దరూ వారి అమ్మమ్మ ఇంటికి పడుకునేందుకు వెళ్లారు. ఉదయాన్నే నిద్రలేచి ఇంటికి వచ్చి చూడగా ఇల్లు మొత్తం రక్తంతో ఉంది. వెంటనే పిల్లలు వారి అమ్మమ్మకు విషయం చెప్పడంతో అమ్మమ్మతో పాటు చుట్టుపక్కల బంధువులు వచ్చి చూడగా.. ఇంటి నుంచి దారి పొడవునా రక్తపు మరకలు కనిపించాయి.సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి రక్తపు మరకలను చూసుకుంటూ వెళ్లగా కొత్తగా కడుతున్న స్కూల్ సమీపంలోని క్వారీ వద్ద తాళిబొట్టు, రక్తపు మరకలు కనిపించాయి. వారు వెంటనే క్వారీలోకి దిగి వెతకగా ఆదిలక్ష్మి మృతదేహం లభ్యమైంది. వెంటనే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపారు. పోలీసుల అదుపులో నిందితుడు ఏడుకొండలు ఉన్నట్టు తెలిసింది. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
గురు శిష్యుల కాకమ్మ కథలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా రేవంత్‌ను చంద్రబాబు శిష్యుడుగానే చాలామంది భావిస్తుంటారు. దానిని రేవంత్ ఒప్పుకున్నా, లేకున్నా జనాభిప్రాయం అలాగే ఉంది. పలు విషయాలలో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు చంద్రబాబు తరహాలోనే కనిపిస్తుంటాయి. మార్గదర్శి అక్రమ డిపాజిట్లకు సంబంధించి హైకోర్టులో వీరిద్దరి ప్రభుత్వాలు దాదాపు ఒకే తరహాలో రామోజీ సంస్థకు అనుకూలంగా అఫిడవిట్లు వేసిన సంగతి తెలిసిందే. అందులోనే కాదు అనేక అంశాలలో ఇదే ధోరణి కనిపిస్తుంది. గత ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఇద్దరిది ఒకటే తీరు. అప్పుల విషయంలో రేవంత్ గత కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.👉అలాగే చంద్రబాబు గత జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటారు. ఇది ఒకరకంగా చూస్తే ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా అన్నమాట. రేవంత్ అధికారంలోకి వచ్చి అప్పుడే పదిహేను నెలలు గడిచిపోయింది. అయినా ఇంకా పట్టు రాలేదని ఆయనే చెబుతున్నారు. దానికి కూడా కేసీఆర్ కారణం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరమే అనిపిస్తుంది. అవినీతితో దోచుకుంటే పట్టు వచ్చినట్లవుతుందా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ కొద్ది రోజుల క్రితం ఒక విషయం చెప్పారు. అది ఆయన నిజాయితీతో చెప్పారా?లేక కేసీఆర్ ప్రభుత్వంపై బండ వేయడానికి చెప్పారా? అన్నది తేల్చజాలం కాని, వినడానికి మాత్రం సంచలనంగానే ఉంది. 👉తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని అన్నారు. తెలంగాణ పేరు గొప్పగాని, అప్పుపుట్టకుంది అని ఆయన అన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. డబ్బు తనవద్ద ఉంటే గంటలో రుణమాఫీ చేసేవాడినని, 25 లక్షల ఇళ్లు నిర్మించేవాడినని, ఎన్నో అద్భుతాలు చేసేవాడినని రేవంత్ అన్నారు. ఏపీలో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంత ఇదే తరహాలో మాట్లాడడం గమనార్హం. తాను ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ సంక్షేమ స్కీములు అమలు చేయాలని ఉందని, కాని నిధులు లేవని, గల్లా పెట్టే చూస్తే ఖాళీగా కనబడుతా ఉందని చంద్రబాబు సభలలో అంటున్నారు.👉తల్లికి వందనం స్కీము కింద ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయలు ఇచ్చే స్కీమును ప్రస్తావిస్తూ అప్పులు దొరకడం లేదని అన్నారు. చంద్రబాబు, రేవంత్‌లు ఒకవైపు రాష్ట్రాలను గత ప్రభుత్వాలు అప్పుల పాలు చేశాయని చెబుతూ, మరో వైపు అప్పటికన్నా అప్పులు అధికంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరూ మనల్ని నమ్మడం లేదని రేవంత్ చెప్పడం సంచలనమే. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ తరహాలో మాట్లాడలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నమ్మి ఆర్థిక సంస్థలు అప్పులు ఇచ్చాయని ఎవరైనా అడిగితే రేవంత్ ఏమని సమాధానం ఇస్తారో తెలియదు.👉కాళేశ్వరానికి అధిక వడ్డీకి రుణాలు తెచ్చారని, ఆ వడ్డీరేటును తగ్గించడానికి యత్నిస్తున్నానని అన్నారు. మంచిదే. కాని అన్నిటికి ఒకే మంత్రం జపించినట్లు కేసీఆర్ వల్లే తాను ఏమి చేయలేకపోతున్నట్లుగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి?నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పులపై రేవంత్ చాలా విమర్శలు చేశారు కదా! దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినట్లు కెసిఆర్ పై ఆరోపణలు చేశారు కదా?. కాని కాంగ్రెస్ బడ్జెట్లో అలా ఎందుకు చూపించలేకపోయారు. ఏపీలో కూడా ఇదే తంతు. మరీ ఘోరంగా జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన వివరాల ప్రకారమే గత ఏడాది ప్రభుత్వం మారేనాటికి అన్ని రకాల అప్పులు కలిసి ఏడు లక్షల కోట్లే ఉన్నాయి. ఇందులో చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పులు, రాష్ట్రం విభజన నాటి అప్పులు కలిసి సుమారు మూడు లక్షలకోట్ల వరకు ఉన్నాయి.👉అంతేకాక రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష ముప్పైవేల కోట్ల అప్పులు చేసింది. ఇవి చాలవన్నట్లుగా కేశవ్‌ను ఢిల్లీ పంపించి మరో 68 వేల కోట్ల అప్పుకోసం యత్నిస్తున్నారని ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. రేవంత్ ఒక మాట అన్నారు. ఎన్నిరోజులు దాచిపెట్టుకోను.. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా.. కాన్సర్ ఉంటే సిక్స్‌ఫ్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా అని ఆయన అన్నారు. ఇవి కొంచెం సీరియస్ వ్యాఖ్యలే. ఇలాంటి కామెంట్ల వల్ల తెలంగాణ ప్రభుత్వ పరపతి దెబ్బతింటుందని కొందరి అభిప్రాయం. అయితే వాస్తవ దృక్పధంతో రేవంత్ ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. ఇక్కడ ఒకదానికి బేసిక్‌గా సమాధానం చెప్పవలసి ఉంటుంది.👉కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై కాని, ఇతరత్రా రుణాలపై కాని 2023 ఎన్నికల కంటే ముందుగానే రేవంత్ కాని, కాంగ్రెస్ నేతలు కాని తీవ్ర విమర్శలు చేశారు కదా?. రాష్ట్రం అప్పులకుప్ప అయిపోయిందని అన్నారు కదా!. అయినా ఆరు గ్యారంటీలు అంటూ ఎందుకు భారీ హామీలు గుప్పించారు? అన్నదానికి ఎన్నడైనా జవాబిచ్చారా? ఈ విషయంలో చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తున్నారన్న భావన కలగదా! ఏపీ ఆర్థిక మంత్రి కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని అంటే, తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి కూడా విధ్వంస తెలంగాణ నుంచి వికసిత తెలంగాణవైపు నడిపిస్తున్నామని చెప్పారు. అప్పు కూడా పుట్టడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం తెలంగాణ వికసించడం ఎలా అవుతుంది?👉అంచనా వేసిన దానికన్నా 70 వేల కోట్ల ఆదాయం ఎలా తగ్గింది? ఏపీని రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబులు పడిన హిరోషిమాతో కేశవ్ పోల్చితే, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కాన్సర్‌తో రేవంత్ పోల్చుతున్నారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, గత ప్రభుత్వం ఎనిమిదివేల కోట్ల బకాయిపెట్టి వెళ్లిందని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో, లేక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఆకర్షితులయ్యో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కదా! ఎన్నికల సమయంలో ఎన్నడైనా చంద్రబాబుకాని, రేవంత్ కాని ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాత హామీలు అమలు చేస్తామని అన్నారా?లేదే!👉రేవంత్ ఏమో తాము అధికారంలోకి రాగానే రైతు బంధు డబ్బులు మరో ఐదువేలు కలిపి ఇస్తామని, రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఒకేసారి చేసి చూపిస్తామని ఎలా హామీ ఇచ్చారో చెబుతారా?. అది కూడా రాహుల్ గాంధీతో ప్రకటింపచేశారే?. చంద్రబాబేమో తాను అప్పులు చేయనక్కర్లేదని, సంపద సృష్టించి పేదలకు పంచుతానని ప్రచారం చేసి,ఇప్పుడేమో సంపద ఎలా సృష్టించాలో తెలియదని, అదెలాగో ప్రజలే చెవిలో చెప్పాలని ఒకసారి, జనానికి సంపద సృష్టి నేర్పుతానని మరోసారి అంటున్నారు. ఒక్కోసారి ఒక్కరకంగా చెబుతూ డబ్బులు లేవని కథలు చెబితే ప్రజలను పిచ్చోళ్లను చేసినట్లు కాదా?. ఇప్పుడు రేవంత్ ప్రయారిటీ ఫ్యూచర్ సిటీ అయితే, చంద్రబాబు ప్రాధాన్యత అమరావతి అన్నది అందరికి తెలిసిందే. అమరావతికి వేల కోట్ల అప్పులు తీసుకువస్తున్న చంద్రబాబు సంక్షేమానికి వ్యయం చేయలేనని చేతులెత్తేశారు.👉రేవంత్ ప్రభుత్వం కొంతలో కొంత బెటర్. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో కొంతమేర అయినా అమలు చేసే యత్నం చేసింది.కాగా ఏటా అప్పులకే 66 వేల కోట్లు మిత్తి కింద కట్టవలసి వస్తోందని రేవంత్ అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను దండుకోవడానికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత గత ప్రభుత్వాల మీద కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజల చెవిలో పూలు పెట్టాలని చూడడం శోచనీయం. ఇవన్ని గమనించిన తర్వాత చంద్రబాబు, రేవంత్‌లు గురు,శిష్యులే అనిపించదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 58,358 మంది స్వామిని దర్శించుకున్నారు. 27,024 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.45 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంవార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 26వ తేదీన అంకురార్పణ, మార్చి 27వ తేదిన మేషలగ్నంలో ఉదయం 9.15 గంటల నుండి 9.30 గం.ల వరకు ధ్వజారోహణం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 03వ తేదీన ఉదయం 9.15 గం.లకు రథోత్సవం, ఏప్రిల్ 07వ తేదీన రాత్రి 07 గం.ల నుండి 9.30 గం.ల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుందని, భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు నడిచేందుకు వీలుగా వైట్ పెయింట్, చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, ఏఈవో శ్రీ రవి, ఆలయ ఇస్పెక్టర్ శ్రీ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జిల్లా: ఘోర అగ్నిప్రమాదం.. కోల్డ్‌స్టోరేజ్‌లో కాలిబూడిదైన మిర్చి
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: జగ్గయ్యపేట పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కోల్డ్ స్టోరేజ్‌లో మిర్చి బస్తాలు తగలబడిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.తొర్రగుంటపాలెంలోని సాయి తిరుమలగిరి అగ్రి ప్రొడక్ట్స్ కోల్డ్ స్టోరేజ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు నలభై వేల మిర్చి బస్తాలు తగలబడినట్లు సమాచారం. నాలుగు ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. మిర్చి ఘాటుకు తుమ్ములు, దగ్గులతో పరిసరి గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. నష్టంపై ఇప్పుడే అంచనాకి రాలేమంటున్న అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. -
రెచ్చిపోయిన సీఐ.. తిరగబడ్డ జనం
గుంటూరు: శాంతియుతంగా సమస్యను పరిష్కరించాల్సిన సీఐ రెచ్చిపోవడంతో ఓ మామూలు వివాదం శాంతిభద్రతలకే విఘాతం కలిగించే పరిస్థితికి దారితీసింది. ఫిర్యాదు చేసిన దళితులపైనే విచక్షణ మరిచి తన ప్రతాపం చూపడంతో.. ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఓ యువకుడిని సీఐ తుపాకీతో కొట్టడంతో న్యాయం చేయాల్సిన తమపైనే దాడిచేయడం ఏమిటని ప్రజలు ముట్టడించడంతో సదరు సీఐ అక్కడి నుంచి ఆటోలో జారుకున్నారు. ఆగ్రహించిన ప్రజలు స్థానిక అంబేడ్కర్ బొమ్మ వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలోని శాంతిపేటలో పోలేరమ్మ ఆలయ స్థలం ఉంది.ఈ స్థలాన్ని స్థానిక వ్యక్తి ఒకరు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ స్థలంలో సోమవారం షెడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వివాదం చెలరేగింది. సమాచారం అందుకున్న ఏఎస్ఐ మురళీ, తన సిబ్బందితో అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడికి ఫిరంగిపురం సీఐ బి.రవీంద్రబాబు హోంగార్డుతో అక్కడికి చేరుకున్నారు. వచ్చీ రావడంతో అక్కడ గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వారిని విచక్షణారహితంగా కొట్టారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఫిర్యాదు చేసిన తమపైనే దాడి చేయడమేమిటని అక్కడి యువకులు ప్రశ్నించడంతో సీఐ ఆగ్రహానికి గురయ్యారు.తన గన్ బయటకుతీసి అఖిల్ అనే యువకుడిని కొట్టడంతో అతనూ గాయపడ్డాడు. దీంతో స్థానికులు సీఐ రవీంద్రబాబును ముట్టడించడంతో ఆయన అక్కడి నుంచి ఆటోలో జారుకున్నారు. అనంతరం.. దళితులు సీఐ డౌన్ డౌన్ అంటూ స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న గుంటూరు డీఎస్పీ భానూదయ మేడికొండూరు, నల్లపాడు సీఐలు నాగూల్ మీరా, వంశీధర్‌తో అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. సీఐపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్థానికులు పట్టుబట్టడంతో వారికి సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్
-
కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
కడప (సెవెన్ రోడ్స్): భూసమస్య పరిష్కారం కోసం ఓ అన్నదాత రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. సమస్య పరిష్కరించాలంటే లంచమివ్వాలని అధికారులు డిమాండ్ చేయడంతో ప్రజాప్రతినిధులకు గోడు వెళ్లబోసుకున్నాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో భూ సమస్యల పరిష్కారం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుకు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నాడు. అక్కడా పట్టించుకోకపోవడంతో మూడుసార్లు కలెక్టరేట్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. న్యాయం జరక్కపోవడంతో విసిగిపోయిన రైతు కలెక్టర్ ఎదుటే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. డబ్బాలో డీజిల్ నింపుకుని సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. పోలీసులు ముందుగానే గుర్తించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. కడప కలెక్టరేట్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు నేపథ్యమిదీ.. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం ముడుమాల గ్రామానికి చెందిన గడిమె సుధాకర్‌కు తండ్రి ద్వారా మూడు ఎకరాల పొలం సంక్రమించింది. ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తండ్రి ఇచ్చిన పొలంలో రెండెకరాలను రెవెన్యూ అధికారులు రికార్డుల నుంచి తప్పించారు. ఈ విషయం తెలిసిన సుధాకర్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. తప్పును సరిచేసేందుకు సర్వేయర్, వీఆర్వో చెరో రూ.10 వేల చొప్పున లంచం డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌ని కలిసి డబ్బు ఇచ్చుకోలేనని, న్యాయం చేయాలని కోరినా ఫలితం లేకపోయింది.ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోలేదు. కాగా.. భూ సమస్యల పరిష్కారం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుకు వెళ్లిన రైతు తన గోడు వెళ్లబోసుకున్నాడు. అయినా ఎవరూ స్పందించలేదు. కలెక్టర్‌కు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మూడుసార్లు గ్రీవెన్స్ సెల్లో అర్జీలు సమర్పించినా ఫలితం కనిపించలేదు. దీంతో సోమవారం డీజిల్ నింపిన క్యాన్ పట్టుకుని కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. కలెక్టర్ సమక్షంలోనే వంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకోవాలనుకున్నాడు. పోలీసులు అడ్డుకోవడంతో.. అయితే, గత వారం కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రైతు సుధాకర్‌ను ప్రధాన ద్వారం వద్దే నిలిపి తనిఖీ చేయగా అతడి వద్ద ప్లాస్టిక్ కవర్లో తెచ్చిన డీజిల్ క్యాన్ బయటపడింది. అప్రమత్తమైన పోలీసులు డీజిల్ క్యాన్ని లాక్కుని ఆయన్ను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదులు స్వీకరిస్తున్న డీఆర్వో విశ్వేశ్వరనాయుడు వద్దకు రైతును తీసుకొచ్చారు. డీఆర్వో ఎదుట సుధాకర్ గోడు వెళ్లబోసుకుంటూ.. తనకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా.. వారిలో ఒకరు దివ్యాంగురాలని చెప్పారు.తన భూమిని రికార్డుల్లో నమోదు చేసేందుకు వీఆర్వో, సర్వేయర్ రూ.10 వేల చొప్పున లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. రాజకీయ నాయకులు మొదలు అందరి అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించకపోవడంతో కలెక్టర్ ఎదుటే ఆత్మహత్యకు పాల్పడితే సమస్య పరిష్కారమై,, తన కుటుంబమైనా బాగుపడుతుందని ఆశించి వచ్చానంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. స్పందించిన డీఆర్వో బి.మఠం తహసీల్దార్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు. -
వాట్సాప్‌లో పదో తరగతి ప్రశ్నపత్రం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో సోమవారం అధికారులు తనిఖీ చేస్తుండగా, 10వ తరగతి గణితం పేపర్ వాట్సాప్‌లో షేర్ అయినట్లు తెలిసింది. ఆరా తీయగా స్కూల్లోని వాటర్ బాయ్ విద్యార్థుల నుంచి పేపర్ తీసుకుని వాట్సాప్ ద్వారా స్థానిక వివేకానంద పాఠశాలలో పనిచేస్తున్న విఘ్నేశ్వరరెడ్డి అనే వ్యక్తికి పంపినట్టు గుర్తించారు. వాటర్ బాయ్‌పై కేసు నమోదుచేసి, విచారణ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో 15 మంది సస్పెన్షన్..ఈనెల 21న జరిగిన ఇంగ్లీష్ పరీక్షలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాలలోని ఏ,బీ కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్‌కు సహకరించిన 15 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని కళేష్ సర్కిల్, బస్ స్టాండ్ రోడ్డులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఏ,బీ కేంద్రాల వద్ద భారీగా గణితం స్లిప్పులు దొరకడంతో ఇరువురు ఇన్విజిలేటర్లు సస్పెండ్ అయ్యారు. -
ఇంటర్మిడియట్‌లో కొత్త సిలబస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మిడియట్ విద్యలో మార్పులు చేశారు. రానున్న విద్యా సంవత్సరం (2025–26) నుంచి ఇంటర్లో కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు ఎన్సీఈఆర్టీ సిలబస్‌లో విద్యా బోధన పూర్తి చేసినందున ఇంటర్మిడియట్‌లోనూ ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను, సీబీఎస్ఈ విధానాలను అమలు చేయనున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్, 2026–27లో సెకండియర్ విద్యార్థులకు కొత్త సిలబస్‌లో బోధన మొదలవుతుంది. అలాగే, పరీక్షల నిర్వహణ, ప్రశ్నలు సీబీఎస్ఈ విధానంలోకి మారాయి. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఎంబైపీసీ గ్రూప్‌ను ప్రవేశపెట్టారు. జేఈఈ, నీట్ పరీక్షలకు అనుగుణంగా ఎంపీపీ, బైపీసీ సిలబస్‌లోనూ మార్పులు చేశారు. వార్షిక పరీక్షలను ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభిస్తారు. తాజా మార్పులను ఇంటర్మిడియట్ విద్యా మండలి ప్రకటించింది.ఏప్రిల్ 1 నుంచి జూనియర్ కాలేజీలు రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అదే తేదీన ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. వచ్చే నెల 7వ తేదీ నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభిస్తారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఉంటాయి. కొత్త విద్యా సంవత్సరంలో కళాశాలలకు 235 రోజులు పనిదినాలు, 79 సెలవులు ప్రకటించారు. ఎలక్టివ్ సబ్జెక్టు విధానంవిద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో సౌలభ్యాన్ని పెంచుతూ ఎలక్టివ్ విధానం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అన్ని గ్రూపులకు పార్ట్–1లో ఇంగ్లిష్, పార్ట్–2 లో రెండో భాష (లాంగ్వేజెస్), పార్ట్–3 లో కోర్ సబ్జెక్టులు ఉండగా, పార్ట్–2లో ఎలక్టివ్ సబ్జెక్టు విధానం ప్రవేశపెట్టారు. ఇందులో లాంగ్వేజెస్, సైన్స్, హ్యుమానిటీస్ విభాగాల్లో 20 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ గ్రూప్ వారికైనా ఇంగ్లిష్ తప్పనిసరి. రెండో భాష స్థానంలో ‘ఎలక్టివ్’ సబ్జెక్టుగా తెలుగు/సంస్కృతం/ఉర్దూ/హిందీ/అరబిక్/ తమిళం/కన్నడ/ఒరియా/ ఫ్రెంచ్/పర్షియన్ (10 భాషలు) ఉంటాయి. మోడ్రన్ లాంగ్వేజెస్ (ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ)/ భూగోళశాస్త్రం/లాజిక్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/చరిత్ర/సివిక్స్/కామర్స్/ఎకనామిక్స్ (10 సబ్జెక్టులు) ఉంటాయి. వీటిలో ఒకటి విద్యార్థులు ఎంపిక చేసుకోవాలి.ఐదు సబ్జెక్టులు.. 1000 మార్కులుఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఐదు సబ్జెక్టుల విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం సైన్స్ గ్రూపుల్లో 2 భాషా సబ్జెక్టులు, 4 కోర్ సబ్జెక్టులు (మొత్తం 6 సబ్జెక్టులు), ఆర్ట్స్ గ్రూప్‌లో 2 భాషా సబ్జెక్టులు, 3 కోర్ సబ్జెక్టులు ఉన్నాయి. ఇకపై ఏ గ్రూపులో అయినా ఐదు సబ్జెక్టులే ఉంటాయి. మేథమెటిక్స్–ఏ, బీ పేపర్లను ఒక సబ్జెక్టుగా, బాటనీ–జువాలజీ రెండు సబ్జెక్టులను కలిపి ఒక సబ్జెక్టుగా మార్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరు సబ్జెక్టులతో ‘ఎంబైపీసీ’ గ్రూప్‌ను ప్రవేశపెడుతున్నారు. ఎంపీసీ విద్యార్థులు బోటనీ, బైసీపీ విద్యార్థులు మేథమెటిక్స్ తీసుకుని పూర్తి చేస్తే ‘ఎంబైపీసీ’ సర్టీఫికెట్ ఇస్తారు.అన్ని గ్రూపులకు రెండేళ్లకు కలిపి 1000 మార్కుల విధానం అమల్లోకి తెచ్చారు. సైన్స్ సబ్జెక్టులకు థియరీకి 85 మార్కులు, ప్రాక్టికల్స్‌కు 30 మార్కులు కేటాయిస్తారు. అన్ని గ్రూపుల పరీక్షల్లోను మార్పులు చేశారు. ప్రశ్నా పత్రాల్లో వ్యాసరూప ప్రశ్నల స్థానంలో సీబీఎస్ఈ విధానాలకు అనుగుణంగా 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. -
ఐపీఎల్లో బెట్టింగ్ జోరు
ఈ సీజన్ ఐపీఎల్లో మొదటి మ్యాచ్ కోల్‌కత నైట్రెడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మొదలైంది. డఫ్పా బెట్‌తో పాటు దాదాపు అన్ని బెట్టింగ్ యాప్‌లు కేకేఆర్ ఫేవరెట్ టీంగా బెట్టింగ్ నిర్వహించాయి. ఆర్సీబీపై మొదట్లో బెట్టింగ్ కాసిన వారు ఆ తర్వాత మళ్లీ కేకేఆర్‌పై బెట్టింగ్ కాశారు. కానీ, చివరికి ఆర్సీబీ గెలుపొందింది. దీంతో కేకేఆర్‌పై బెట్టింగ్ చేసిన వారంతా నిండా మునిగిపోయారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల్లో బెట్టింగ్‌ల జోరు తీరిది.సాక్షి ప్రతినిధి కర్నూలు : అందరి చేతిలో స్మార్ట్ఫోన్లు ఉండటం, ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్‌లు పుష్కలంగా ఉండడంతో అధికశాతం క్రికెట్ అభిమానులు ఆన్లైన్ బెట్టింగ్‌లో మునిగిపోతున్నారు. సెలబ్రిటీలు కూడా వీటిని ప్రమోట్ చేస్తుండడంతో రెండేళ్లుగా ఈ యాప్‌లు భారీగా పెరిగాయి. పైగా.. ఈసారి ప్లేయర్ల ఆక్షన్‌లో ఎక్కువశాతం ప్లేయర్లు జట్లు మారారు. దీంతో బెట్టింగ్ రాయుళ్లు జట్ల విజయావకాశాలను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. చివరికి.. వారి ఖాతాల్లోని డబ్బు ఆవిరవుతోంది. ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లోనే బెట్టింగ్‌లు ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులకు కూడా ఇవి సవాల్‌గానే మారాయి. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసేలోపు రూ.లక్ష కోట్లు చేతులుమారే అవకాశముందని అంచనా.బెట్టింగ్ యాప్‌లు ఇవే.. ఆన్లైన్ బెట్టింగ్‌లో ఎక్కువమంది ‘డఫ్పా బెట్టింగ్’ యాప్‌ను వాడుతున్నారు. దీంతో పాటు ఎక్స్ బెట్, స్కై ఎక్సే్ఛంజ్, ఫ్యాన్సీ లైఫ్, క్రికెట్ మజా, లైవ్‌లైన్, లోటస్, బెట్ 65, బెట్ ఫెయిర్, టెన్క్రిక్, 22 బెట్, ఫోర్రాబెట్, వన్ విన్, పారిమ్యాచ్, మెల్బెట్తో పాటు అనేక బెట్టింగ్ యాప్‌లు ఉన్నాయి.ఆన్లైన్ బెట్టింగ్ తీరిది..⇒ ఈ విధానంలో మ్యాచ్‌కు గంట ముందే కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. దాంతోనే బెట్టింగ్ కాయాలి. ⇒ మ్యాచ్‌కు ముందు రేటింగ్స్ ఇస్తారు. ఆ ప్రకారం పందెం వేయాలి. ⇒ మ్యాచ్ సాగేతీరును బట్టి ఇవి మారుతుంటాయి. డిపాజిట్ క్లోజ్ అయితే అప్పటికప్పుడు డిపాజిట్ చేసి బెట్టింగ్ కాసే అవకాశం ఉండదు. దీంతో చాలామంది రూ.50వేల నుంచి లక్షల రూపాయలు ముందుగానే యాప్స్‌లో డిపాజిట్ చేస్తున్నారు. ⇒ మ్యాచ్ పరిస్థితి, రేటింగ్స్‌ను బట్టి అప్పటికప్పుడు ఆకర్షితులై కూడా భారీగా బెట్టింగ్ కాస్తారు. ⇒ బెట్టింగ్‌లో గెలిస్తే క్షణాల్లో డబ్బు ఖాతాల్లో జమవుతుంది. ఓడిపోతే ఖాతా ఖాళీ అవుతుంది. .. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఆన్లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని రూ.వేల నుంచి రూ.లక్షల వరకూ పొగొట్టుకుంటున్నారు.ఆఫ్‌లైన్ బెట్టింగ్ ఇలా.. టాస్ నుంచి బాల్ టు బాల్ వరకూ బెట్టింగ్ సాగుతుంది. టాస్ ఎవరు గెలుస్తారు? తొలి ఓవర్ స్పిన్నర్‌తో బౌలింగ్ వేయిస్తారా? పేసర్‌తో వేయిస్తారా? మొదటి ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయి? జట్టు ఎంత స్కోర్ చేస్తుంది? ఎవరు గెలుస్తారు? ఫలానా బాల్‌కు ఫోర్ వస్తుందా? సిక్స్ వస్తుందా? లేదా ఒక్క పరుగే వస్తుందా? ఇలా అనేక రకాలుగా బెట్టింగ్‌లు ఉంటాయి. ఇక బుకీలు ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఉంటారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో సబ్‌బుకీలు ఉంటారు. మ్యాచ్ మారుతున్న స్వరూపాన్ని బట్టి బెట్టింగ్ లెక్కలు మారుస్తారు. వీరు వాట్సప్ గ్రూపుల్లో బెట్టింగ్ ధరలు నిర్ధారిస్తారు. ఆఫ్‌లైన్‌లో బెట్టింగ్ కాసేవారు బార్లతో పాటు హోటళ్లలో కూర్చుని బెట్టింగ్ కాస్తారు. 357 రకాల వెబ్సైట్లు బ్లాక్.. బెట్టింగ్‌లను అరికట్టేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) 357 రకాల వెబ్సైట్లను బ్లాక్ చేసింది. వాటికి చెందిన 2,400 బ్యాంకు ఖాతాల్లో రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసింది. మరో 700 యాప్‌లపై నిఘా ఉంచింది. అనుమతితో నడిచే బెట్టింగ్ యాప్‌లను టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. ఈనెల 16న ఫణీంద్రశర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో హైదరాబాద్‌లో దగ్గుబాటి రానా, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, శ్రీముఖి, వర్షిణితో పాటు 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెట్టింగ్ ఊబిలో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు యువత ఎక్కువగా చిక్కుకుంటున్నారు. -
సాయం అందించే చేతులకు వేదిక పీ–4
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ–4 విధానం ద్వారా ప్లాట్‌ఫామ్ నిర్మిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ–పీ–4 విధానంపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని, ఎవరినీ ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్నారైలు కూడా పీ–4లో భాగస్వాములు కావొచ్చన్నారు. పీ–4 విధానంలో ప్రభుత్వ పాత్ర కేవలం ఇరువర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడమేనని, ప్రభుత్వం తరఫున ఎవరికీ అదనపు సాయం ఉండదన్నారు. ఉన్నతవర్గాల వాళ్లు సాయానికి ముందుకొచ్చేలా వారిలో స్ఫూర్తి నింపాలని సూచించారు. లబ్ధి పొందేవారిని ‘బంగారు కుటుంబం’గా, సాయం చేసే వారిని ‘మార్గదర్శి’గా పిలవాలని సూచించారు. బంగారు కుటుంబం ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని, గ్రామసభ, వార్డు సభల ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాదరహితంగా ఉంటుందన్నారు. పీ–4 కార్యక్రమానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాల ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడండి రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం వేసవి ప్రణాళిక, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధిత శాఖలతో సీఎం సమీక్ష నిర్వహించారు. పశువులకు నీరు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన రూ.39 కోట్లు విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు బయట ప్రాంతాల్లో పని అప్పగించొద్దన్నారు. ఆపరేషన్ మోడల్లో పోలవరం–బనకచర్ల పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఆపరేషన్ మోడల్లో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు అయ్యే విద్యుత్ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి చేసి ఆర్థిక భారం తగ్గించవచ్చన్నారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
రెడ్‌బుక్‌కు సహకరించకపోతే ఇక అంతే...
సాక్షి, అమరావతి: ‘రెడ్‌బుక్’ అరాచకాలు, కుట్రలకు అంగీకరించకుండా.. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే అధికారులను చంద్రబాబు కూటమి ప్రభుత్వం పొగబెట్టి, రాష్ట్రం నుంచి బయటకు పంపేస్తోంది. ఇదే కోవలో చంద్రబాబు ప్రభుత్వ ‘రెడ్‌బుక్’ అరాచకాలకు ఎదురుతిరిగి సంచలనం సృష్టించిన 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్కూ పొగ పెట్టేసింది. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం రవాణా వ్యవహారంలో చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాలని ఆయనపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన ఇక్కడ పనిచేయలేక రాష్ట్ర సర్విసులను వీడుతున్నారు. డెప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారు. ఆయన డెప్యుటేషన్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా బాధ్యతలు చేపట్టనున్నారు. వినీత్ ఐదేళ్లపాటు కేంద్ర సర్విసుల్లో కొనసాగుతారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన వినీత్ బ్రిజ్‌లాల్ టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రలకు సహకరించేందుకు ససేమిరా అనడం పోలీసు శాఖలో పెద్ద సంచలనమే సృష్టించింది. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేశారనే అభియోగాలతో నమోదైన కేసు దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్ చీఫ్‌గా ఆయన్ని ప్రభుత్వం నియమించింది. కానీ, దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తాము చెప్పినట్టుగా వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు, డీజీపీ, సీఐడీ చీఫ్ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అందుకు బ్రిజ్‌లాల్ అంగీకరించలేదు. అయినా తాము చెప్పినట్లుగానే నివేదిక ఇవ్వాలని వారంతా పట్టుబట్టడంతో బ్రిజ్‌లాల్ రాజీనామాకు సిద్ధపడ్డారు. దాంతో బెంబేలెత్తిన డీజీపీ, సీఐడీ చీఫ్ ఆయన్ని బుజ్జగించి, అతి కష్టం మీద ఆ నిర్ణయాన్ని ఉపసంహరింపజేశారు. కానీ, సిట్ చీఫ్‌గా కొనసాగేందుకు సమ్మతించకుండా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన సిట్ వ్యవహారాలను పర్యవేక్షించలేదు. ఆయన్ని సిట్ చీఫ్ పోస్టు నుంచి తొలగించి అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ పెద్దల ఉద్దేశాన్ని గుర్తించిన బ్రిజ్‌లాల్ డెప్యుటేషన్‌పై కేంద్ర సర్విసులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన్ని సీఆర్పీఎఫ్ ఐజీగా నియమించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. బ్రిజ్‌లాల్‌తో ఇక రెడ్‌బుక్ అరాచకాలకు ఇబ్బంది ఉండదని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆయన డెప్యుటేషన్కు అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆపరేషన్ పరివర్తన్‌లో కీలక పాత్ర ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా యథేచ్ఛగా సాగుతున్న గంజాయి సాగు, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్‌ను విజయవంతం చేయడంలో వినీత్ బ్రిజ్‌లాల్ కీలక పాత్ర పోషించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్‌గా ఆయన ఆధునిక సాంకేతికతను సది్వనియోగం చేసుకుంటూ రెండు దశల్లో ఆపరేషన్ పరివర్తన్‌ను విజయవంతం చేశారు. 11 వేలకు పైగా ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని ధ్వంసం చేశారు. 2.50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా గిరిజనులను ప్రోత్సహించారు.అంతటి సమర్థ అధికారిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రకు సహకరించలేదనే అక్కసుతో పొగబెట్టి మరీ పంపించేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దలు చెప్పిన అక్రమ మార్గాల్లో పనిచేయలేక ఇప్పటికే పలువురు ఐపీఎస్‌లు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. వారిలో పలువురు దరఖాస్తు కూడా చేసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రం నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
విపత్తులను మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: కరువు ఉరిమినా.. తుఫాన్లు తుడిచిపెట్టినా.. వరదలు, వర్షాలు ముంచెత్తినా.. అన్నదాతపై చంద్రబాబు ప్రభుత్వానికి కనికరం లేదు. కష్టాల్లో ఉన్న రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిందిపోయి వారిని అన్ని విధాలుగా మోసం చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ముగిసి, రబీ కూడా చివరి దశకు చేరుకుంది. అయినా, ఖరీఫ్ ప్రారంభంలో దెబ్బతిన్న పంటలకూ పరిహారం ఇవ్వాలన్న ధ్యాసే లేదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా అటకెక్కించి ఆ పరిహారమూ అందకుండా చేసింది. సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు చెల్లించాల్సిన రూ.26 వేల ( పీఎం కిసాన్ సాయంతో కలిపి)పెట్టుబడి సాయమూ ఇవ్వకుండా మోసం చేసింది. ఇంకొక వైపు సీజన్ ముగియకుండానే అందించాల్సిన పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) చెల్లింపులోనూ కావాలనే కాలయాపన చేస్తోంది. పంటలకు మద్దతు ధర లభించేలా చూడటంలోనూ చంద్రబాబు సర్కారుది మొండి వైఖరే. ఎరువులు, పురుగు మందులు, నాణ్యౖమెన విత్తనాలు లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకోవడంలేదు. వ్యాపారులు, దళారుల చేతిలో అన్యాయానికి గురవుతున్న అన్నదాతను ఆదుకోవాలన్న ఆలోచనే లేదు. మొత్తం మీద ప్రకృతి విపత్తులకంటే అన్నదాతకు కూటమి సర్కారు నిర్లక్ష్యమే పెద్ద విపత్తుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.అడ్డగోలు కోతలతో.. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు నెలకొక వైపరీత్యం రైతులను వెంటాడుతూనే ఉంది. ఖరీఫ్ మొదట్లోనే జూలైలో అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. 16 జిల్లాల 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మాత్రం 44 వేల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నాయని, 31 వేల మందికి రూ.31.53 కోట్లు చెల్లించాలని లెక్కతేల్చింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్ణా, వంశధార, నాగావళి నదులతో పాటు బుడమేరు, ఏలేరు వరదలు పంట పొలాలను ముంచెత్తాయి. 10 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొలుత 5.93 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన 4 లక్షల మందికి రూ.557.63 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనావేశారు. ప్రభుత్వం ఇందులో అడ్డగోలుగా కోతలు వేసి దెబ్బతిన్న పంటల విస్తీర్ణం 3.11 లక్షల ఎకరాలకు కుదించింది. కేవలం 2 లక్షల మందికి రూ.319.08 కోట్లు ఇవ్వాలని చెప్పింది. పోనీ అదైనా ఇచ్చిందా అంటే అదీ లేదు.వైఎస్ జగన్ హయాంలో..⇒ విపత్తులకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేకంగా రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు ⇒ ఏ సీజన్ పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అదే సీజన్ ముగిసేలోగా జమ. ఇలా ఐదేళ్లలో 34.41 లక్షల మందికి రూ.3,261.60 కోట్లు చెల్లించి అండగా నిలిచారు. ⇒ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్లు అందజేశారు. ⇒ వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288.17 కోట్లు లబ్ధి చేకూర్చారు.చంద్రబాబు హయాంలో.. ⇒ బీమా ప్రీమియం బకాయిలు రూ.1,280 కోట్లు చెల్లించకపోవడం వల్ల రైతులకు దాదాపు రూ.2వేల కోట్లకు పైగా పరిహారం అందకుండా మోకాలడ్డారు. ⇒ 2024–25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ పాటికే రూ.833 కోట్లు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇందులో పైసా కూడా చెల్లించకపోవడంతో రైతులకు రూ.1200 కోట్లకుపైగా బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. ⇒ కూటమి పాలనలో పంటల బీమా పథకం ఉందో లేదో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొంది. ⇒ సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రమిచ్చే పీఎం కిసాన్ సాయంతో సంబంధం లేకుండానే ఒకే విడతలో ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున 2024–25లో చెల్లించాల్సిన రూ.10,717 కోట్లు కూడా చంద్రబాబు ఎగ్గొట్టారు.సగం మండలాల్లోనే కరువంటూ..లోటు వర్షపాతంతో రాయలసీమ జిల్లాల్లో 100 మండలాలకు పైగా కరువు కోరల్లో చిక్కుకున్నాయి. 60 రోజులకు పైగా చినుకు జాడ లేదు. 10 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా 54 మండలాలనే కరువు ప్రభావితంగా ప్రకటించింది. వీటికీ పైసా పరిహారం విదల్చలేదు. నవంబరులో విరుచుకుపడిన ఫెంగల్ తుఫాను కోతకొచ్చిన పంటలను తుడిచిపెట్టింది. దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. అయినా రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలై మొదలుకొని డిసెంబర్ వరకు వివిధ వైపరీత్యాలకు 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని, రూ.2 వేల కోట్లకు పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఇందులోనూ కోతలేసి చివరికి 6.65 లక్షల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నట్లు, రూ.527.18 కోట్లు చెల్లించాలంటూ లెక్కగట్టింది.దీంతోపాటు ఆధార్ సీడింగ్ కాకపోవడం, సరైన బ్యాంక్ ఖాతా నంబర్లు ఇవ్వక పోవడం వంటి సాంకేతిక కారణాలతో నిలిచిన 2023, 24 సీజన్ల కరువు సాయం బకాయిలు రూ.311.39 కోట్లు విడుదల చేయకుండా మోకాలడ్డింది. ఇలా మొత్తం రూ.838.57 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలంæ 1.85 లక్షల మందికి రూ.284.56 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకుంది. అదీ కూడా ప్రజలు, వివిధ సంస్థలు ఇచ్చిన వరద విరాళాల పుణ్యమే. -
రూ.5,258.68 కోట్లతో టీటీడీ బడ్జెట్
తిరుమల: వచ్చే 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించినట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు అంగీకరించినట్లు చెప్పారు. శ్రీవారికి దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల సంరక్షణ, సది్వనియోగం ప్రధాన లక్ష్యంగా విస్తృత చర్యలు చేపడతామన్నారు. స్వామివారి ఆస్తులపై కోర్టు కేసుల్లో విచారణ వేగంగా పూర్తయి సద్వినియోగంలోకి తెచ్చేందుకు చూస్తామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం, భూ కేటాయింపులను అనుసరించి కార్యాచరణ వేగిరం చేస్తామని వివరించారు.సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో బోర్డు సమావేశం తర్వాత ఈవో జె.శ్యామలరావుతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. 2024–25లో 5,179.85 కోట్ల బడ్జెట్ అంచనా కాగా.. ఈసారి రూ.78.83 కోట్లు పెరిగాయి. బ్యాంకు డిపాజిట్లు, బంగారం ద్వారా రూ.1,253 కోట్ల వడ్డీ వస్తున్నట్లు అంచనా వేసిన టీటీడీ.. వచ్చే ఏడాది మరో రూ.57 కోట్లు పెరిగి రూ.1,310 కోట్లు వస్తాయని పేర్కొంది.శ్రీవారి హుండీ ద్వారా రూ.1,729 కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.1,671 కోట్లుగా ఉంది. ఇందులో ఉద్యోగులు, పొరుగు ఉద్యోగులు, ఒప్పంద సేవ సిబ్బంది జీతాలకు రూ.1,773.75 కోట్లు వెచ్చిచనున్నారు. పరికరాల కొనుగోలుకు రూ.768 కోట్లు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభ నిల్వ రూ.350 కోట్లుగా అంచనా వేశారు. కార్పస్, ఇతర పెట్టుబడులకు రూ.800 కోట్లు వ్యయం చేయనున్నారు. ముఖ్యాంశాలు ఇలా.. ⇒ హిందూ ధర్మప్రచారానికి రూ.121.50 కోట్లు. ⇒ తెల్లవారుజామున 5.30కు శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం మార్పునకు పరిశీలన. ⇒ ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్‌కు భూ కేటాయింపుల రద్దు. కొత్త ఆగమ సలహామండలి ఏర్పాటుకు ఆమోదం.⇒ సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలిపింది.ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఏప్రిల్ 6 నుంచి 14 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. -
బాబూ.. విద్యుత్ బాదుడు ఆపండి
సాక్షి, అమలాపురం: ‘ఆక్వాకు విద్యుత్ రాయితీ ఇస్తున్నామని పేరుకే చెబుతున్నారు. ఏదో ఒక రూపంలో భారీగా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. బాబూ... విద్యుత్ బాదుడు ఆపండి... ఆక్వా రైతులను ఆదుకోండి’ అంటూ కోనసీమకు చెందిన ఆక్వా రైతులు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కోనసీమ ఆక్వా రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆక్వా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వ విద్యుత్ విధానాల వల్ల రైతులపై పెనుభారం పడుతోంది. ఆక్వాకు విద్యుత్ సరఫరాలో తరచూ లో ఓల్టేజ్ సమస్య ఏర్పడుతోంది. దీనివల్ల విద్యుత్ వినియోగం అధికమవుతోంది. దానిని సాకుగా చూపించి కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలని, ఇందుకోసం రూ.లక్షలు చెల్లించాలని రైతులకు నోటీసులు పంపుతున్నారు. ఎస్పీఎల్ చార్జీలని, అదనపు లోడని, షార్ట్ ఫాల్ చార్జీలని ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నారు. చెరువుల్లో రొయ్యలు, చేపలు ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అదేవిధంగా రొయ్యల కొనుగోలుదారులు సిండికేటుగా మారి రైతులను ముంచేస్తున్నారు. చెరువుల్లో రొయ్యలు లేని సమయంలో కౌంట్ ధరలు పెంచుతున్నారు.పట్టుబడుల సమయంలో రేటు తగ్గించేస్తున్నారు. మేత, ఆయిల్‌పై కస్టమ్స్ డ్యూటీ ఎత్తేశామని బడ్జెట్లో ప్రకటించినా ధరలు యథాతథంగా ఉన్నాయి.’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో టీడీపీ, జనసేనకు చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. రైతు సంఘాల ప్రతినిధులు యాళ్ల వెంకటానందం, రుద్రరాజు వెంకట రాజు (నానీరాజు), మోటూరి నాని, యేడిద శంకరం, బొలుసు రాంబాబు, టీడీపీ అల్లవరం మండల అధ్యక్షుడు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబు రాజు, జనసేన నేత త్సవటపల్లి నాగభూషణం పాల్గొన్నారు. -
7 నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో ఏప్రిల్ 7 నుంచి సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందచేసినట్లు అసోసియేషన్ తెలిపింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ 26 సార్లు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు సీఈఓను, వైద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, ఐటీ శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని కలిసి తమ ఇబ్బందులను వివరించినట్లు తెలిపారు.అయినప్పటికీ తమ సమస్యలపట్ల సానుకూల స్పందన కొరవడటంతో, ఆస్పత్రులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయి నిర్వహించలేని దయనీయ స్థితిలో ఉన్నందున.. వచ్చేనెల 7 నుంచి పూర్తిగా సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆషా అధ్యక్షుడు డాక్టర్ కె. విజయ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం తక్షణమే రూ.1,500 కోట్లు రిలీజ్ చేయడంతో పాటు, అనంతరం చెల్లింపులపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తేగానీ ఆరోగ్యశ్రీని నిర్వహించలేని స్థితిలో నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఏకంగా రూ.3,500 కోట్ల మేర ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉందని నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ చెబుతోంది.వివిధ రూపాల్లో నిరసనలుఏప్రిల్ 7 వరకూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విజయ్‌కుమార్ వివరించారు. అందులో భాగంగా.. మార్చి 25న జిల్లా కలెక్టర్లు, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్స్, డీఎంహెచ్ఓలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. అంతేకాక.. తమ ఇబ్బందులను మీడియాకు వివరించనున్నట్లు తెలిపారు. మార్చి 27న ఎంఎల్ఏలు, ఎంపీలు, జిల్లా ఇన్‌ఛార్జిలను కలిసి వినతిపత్రాలు అందించనున్నట్లు తెలిపారు. 29న నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమాలు.. ఏప్రిల్ 3న కార్పొరేట్ హాస్పిటల్స్ హెడ్స్, ఆషా ప్రతినిధులు విజయవాడ, విశాఖపట్నంలలో ప్రెస్మీట్ల నిర్వహణకు కార్యాచరణను రూపొందించినట్లు ఆషా ప్రతినిధులు తెలిపారు.నగదు రహిత వైద్యం అందించలేంనిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 నెలల్లో 26 సార్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ బకాయిలపై ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినప్పటికీ సర్కారు నుంచి సరైన స్పందనలేదు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఆమోదించిన బిల్లులు రూ.1,300 కోట్లు, సీఈఓ ఆమోదించనివి రూ.1,700 కోట్లు ఉన్నాయి. ఇక ఆస్పత్రులు అప్లోడ్ చేయాల్సిన బిల్స్ మరో రూ.500 కోట్ల మేర ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పెద్దఎత్తున బిల్లులు నిలిచిపోవడంతో గతేడాది నుంచే చాలావరకూ ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవల కల్పనకు వెనుకడుగు వేస్తున్నాయి. పేదలు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే.. ‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదు. నగదు రహిత వైద్యసేవలు అందించలేం’ అని యాజమాన్యాలు చెబుతున్నాయి. -
1 నుంచి మాల్స్‌లో పార్కింగ్ ఫీజు రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో వాహనాల పార్కింగ్ ఫీజును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకొస్తుందని పేర్కొన్నారు.మొదటి అర గంటకు ఎవరి నుంచీ పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని, అనంతరం గంట వరకు వాహనం ఉంచితే సదరు మాల్లో వస్తువుల కొనుగోలు బిల్లు చూపిన వారి నుంచి ఫీజు వసూలు చేయరాదని, గంటకు పైగా ఉన్న వాహనదారులకు సినిమా టికెట్ లేదా పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ బిల్లు చూపినా ఉచిత పార్కింగ్ అవకాశం వినియోగించుకోవచ్చునన్నారు. -
3న కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి తీసుకువెళ్లాల్సిన ప్రతిపాదనలను ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా సాధారణ పరిపాలన శాఖ(కేబినెట్ విభాగం)కు పంపాల్సిందిగా అన్ని శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. -
ఏపీ అప్పు రూ.5.62 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.5.62 లక్షల కోట్లకు చేరుతాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో అప్పులు 34.70 శాతం ఉంటాయని చెప్పారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2023–24)లో జీఎస్డీపీలో అప్పులు 34.58 శాతమని వెల్లడించారు.సోమవారం లోక్‌సభలో ఎంపీ మనీష్ తివారి అడిగిన ప్రశ్నకు దేశంలోని రాష్ట్రాల అప్పుల వివరాలను పంకజ్ చౌదరి వెల్లడించారు. రాష్ట్రాల నికర రుణ పరిమితిని ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రాలు అధికంగా తీసుకున్న రుణాలకు సర్దుబాట్లు ఏమైనా ఉంటే ఆ తర్వాత సంవత్సరాల రుణాల పరిమితుల్లో చేరుతాయని వివరించారు. ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుగుణంగా అప్పులు ఉన్నాయా..? లేదా..? అనేది రాష్ట్రాల శాసనసభలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. -
న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయం
సాక్షి, అమరావతి: న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్.ద్వారకానాథరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బార్ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకుంది. న్యాయవాదులు మరణించినప్పుడు వారి నామినీలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచింది. ఈ పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్ర బార్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం హైకోర్టులోని బార్ కౌన్సిల్లో జరిగింది. కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయవాదుల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయవాదులు, వారి కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న వైద్య సాయాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు.బార్ కౌన్సిల్ రోల్స్‌లో నమోదు చేసుకున్న న్యాయవాదులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబసభ్యులకు రూ.5 లక్షల మేర పరిహారం అందించాలని తీర్మానించారు. ఈ కొత్త పథకాన్ని ఈ ఏడాది మే 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. వీటన్నింటికీ అవసరమైన సొమ్మును బార్ కౌన్సిల్ నిధుల నుంచి చెల్లిస్తారు. అనంతరం గుంటూరుకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు.తెలుగు భాషకు, సాహిత్యానికి చేసిన అసాధారణమైన సేవలకు గానూ ఆయన ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎస్.కృష్ణమోహన్, సభ్యులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, ఎస్బ్రహ్మనందరెడ్డి, గంటా రామారావు, వజ్జా శ్రీనివాసరావు, రోళ్ల మాధవి, రావిగువేరా, కార్యదర్శి పద్మలత పాల్గొన్నారు. -
బీమా ఎగ్గొట్టావు 'పరిహారం కట్టు బాబూ': వైఎస్ జగన్
చంద్రబాబు ఇక్కడి రైతులకు కచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే.. తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. సాక్షి కడప: ‘అకాల వర్షం.. పెనుగాలులు.. వడగళ్ల ధాటికి అరటి తోటలు నేల కూలాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతన్నలు ఇవాళో రేపో అరటి గెలలు కోసే సమయంలో తీవ్ర నష్టం సంభవించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. ఇన్పుట్ సబ్సిడీ అందించి ఎంతో కొంత ఆసరాగా నిలబడాలి.. కానీ ఈ సర్కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు.. ఇలాంటప్పుడు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి’ అని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) డిమాండ్ చేశారు. పడిపోయిన గెలలను కూడా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురు గాలులు, అకాల వర్షాలకు నేలవాలిన అరటి తోటలను వైఎస్ జగన్ సోమవారం పరిశీలించారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలలో అరటి తోటల్లోకి వెళ్లి రైతులను ఓదార్చి నష్టాన్ని ఆరా తీశారు. కోమన్నూతల వద్ద తోటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలోని లింగాల మండలంతోపాటు అనంతపురం జిల్లాలోని నేర్జాంపల్లె, దాడితోట తదితర గ్రామాల్లో దాదాపు 4 వేల ఎకరాల్లో అరటి తోటలకు నష్టం జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబు ప్రీమియం ఎగ్గొట్టడంతో... అరటి రైతు ఎకరానికి రూ.1.50 లక్షల వరకు ఖర్చు పెట్టి సాగు చేస్తే తీరా పంట చేతికొచ్చే సమయంలో పెను గాలులు దెబ్బతీయడంతో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఆదాయం రాకపోగా, చివరికి నష్టం మిగలడం బాధేస్తోంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా వైఎస్సార్సీపీ హయాంలో అమలయ్యేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. దీన్ని ఎత్తివేయడం ఒక నేరమైతే.. 2024 మే, జూన్ నెలల్లో కట్టాల్సిన పంటల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని చంద్రబాబు కట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ప్రీమియం రూ.1,280 కోట్లు కట్టి ఉంటే రైతులకు మేలు జరిగేది. బాబు అధికారంలోకి వచ్చాక ప్రీమియం ఎగ్గొట్టడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ తర్వాత 2024–25కి సంబంధించిన ప్రీమియం కూడా ఆయన కట్టలేదు. అసలు ఈ రోజు ఉచిత పంటల బీమా ఉందా? లేదా? మీరిచ్చిన జీవోను చూస్తే దశల వారీగా ఎత్తేస్తామని చెబుతున్నారు. చంద్రబాబు పుణ్యాన ఇప్పటికే పలు పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ధాన్యం రంగు మారింది. మొక్కజొన్న, జొన్నకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. వరుసగా రెండేళ్లు ఖరీఫ్ సీజన్లో అదే జరిగింది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. ఈ–క్రాప్ పక్కాగా నమోదు చేయాలి. ప్రతి రైతు పండించిన పంటల వివరాలు ఈ–క్రాప్ కింద నమోదు చేసి నష్టం జరిగితే వారికి ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలి. ఎవరూ ఇన్సూరెన్స్ కట్టలేదన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదు.పెట్టుబడి సాయం... సున్నామన ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా కింద రైతన్నలకు ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చాం. చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే రూ.26,000 (కేంద్ర సాయంతో కలిపి మొత్తం) ఇస్తానన్నాడు. కానీ రూ.20 కూడా ఇవ్వలేదు. ఇప్పటికే ఒక ఏడాది పెట్టుబడి సాయాన్ని రైతులకు ఎగ్గొట్టారు. ఇవాళ పరిస్థితి చూస్తుంటే రైతులను ఎంతమాత్రం ఆదుకునే ఉద్దేశం కనిపించడం లేదు. సున్నా వడ్డీ పంట రుణాలకు మంగళం పాడారు. రైతులకు సున్నా వడ్డీ మొత్తం చెల్లించలేదు. ఇలా అన్నదాతలకు అడుగడుగునా చంద్రబాబు అన్యాయం చేస్తూనే ఉన్నారు. నిరుపయోగంగా కోల్డ్ స్టోరేజీ..రాష్ట్రంలోనే అరటి సాగు పులివెందులలో అత్యధికం. ఆ రైతన్నలకు మేలు చేయడం కోసం ఇక్కడ రూ.25 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేశాం. ఎన్నికలకు ముందే అన్ని వసతులతో ప్రారంభించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దారుణంగా వ్యవహరిస్తోంది. టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీకి అప్పగించడం లేదు. దీన్ని బట్టే రైతులపై ఈ సర్కార్ ఎంత కపట ప్రేమ చూపుతోందో అర్థమవుతోంది. ఈ కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం 500 మెట్రిక్ టన్నులు కాగా, దాన్ని టెండర్ ద్వారా యూజర్ ఏజెన్సీకి అప్పగిస్తే రైతులకు మేలు జరిగేది. కానీ ఆ పని చేయకుండా, కోల్డ్ స్టోరేజీని వాడుకోకుండా నిరుపయోగంగా వదిలేశారు. అదే ఇప్పుడు యూజర్ ఏజెన్సీ ఉండి ఉంటే వారు పంట కొనుగోలు చేసేవారు. మరోవైపు రైతులు తమ పంటను ఇక్కడ దాచుకునే వీలుండేది. తద్వారా నష్టపోయే అవకాశం లేకపోగా మంచి జరిగేది. వైఎస్సార్సీపీ హయాంలో రెండు కంటైనర్ల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతులు కూడా చేసి రైతులకు ప్రోత్సాహం అందించాం. పంటల ధరలు దారుణంగా పతనం.. రాష్ట్రంలో వర్షాలు, ఈదురు గాలులతో పంటలకు తీవ్ర నష్టం జరగ్గా మరోవైపు ధరలు దారుణంగా పడిపోయాయి. నెల క్రితం టన్ను అరటి ధర రూ.26 వేలు ఉంటే ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. అయినా కొనుగోళ్లు లేవు. కొన్నిచోట్ల రూ.6వేలకు పతనమైనా ఈ ప్రభుత్వం ఎక్కడా రైతులను పట్టించుకోవడం లేదు. మిర్చిది కూడా అదే పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లలోనూ అదే దుస్థితి. ధాన్యం రైతులు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. మిర్చి రూ.11,800కి కొంటామని చెప్పి ఒక్క కేజీ కూడా కొనుగోలు చేయలేదు. పెసలు, శనగలు, మినుములు, కందులు.. ఇలా ఏ పంటకూ ఇవాళ గిట్టుబాటు ధర లేదు. చీనీ రైతులకు వైఎస్సార్సీపీ హయాంలో టన్నుకు లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చింది. స్యూట్ (కమీషన్) లేకుండా రైతులకు మనం మేలు చేయగా, ఈరోజు చీనీ టన్ను కేవలం రూ.23 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.నష్టపోయిన రైతన్నకు ఇదే నా భరోసా..ఈ 4 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతన్నలకు భరోసా ఇస్తున్నా. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే నా పర్యటన! చంద్రబాబు ఇక్కడి రైతులకు కచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే.. తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. అంతేకాకుండా ప్రతి రైతుకు 2023లో మన ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా రూ.50 వేలు కూడా ఇస్తాం. ఇది ప్రతి రైతుకూ భరోసా కల్పిస్తూ చెబుతున్నా. పార్టీ తరఫున కూడా రైతులకు సాయం అందించి ఆదుకుంటాం.నేలమట్టమైన తోటలు.. చలించిన జగన్ఎక్కడ చూసినా నేలమట్టమైన అరటి చెట్లు.. మట్టి పాలైన గెలలు.. కంటతడి పెడుతున్న రైతన్నలను చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామాల పరిధిలో అరటి తోటలను ఆయన స్వయంగా పరిశీలించారు. తమ బాధలు చెబుతున్న సమయంలో రైతన్నలు కన్నీటి పర్యంతం కాగా, వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. దారి వెంట అరటి తోటలను పరిశీలిస్తూ.. పొలాల్లోకి వెళ్లి ప్రతి రైతుకూ ధైర్యం చెప్పి ఓదార్చుతూ ముందుకు సాగారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. జిల్లాలో జగన్ రెండు రోజుల పర్యటన సోమవారం మధ్యాహ్నంతో ముగిసింది. వేంపల్లెలో జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి నివాసంలో నూతన వధూవరులు సాయి భైరవ ప్రీతంకుమార్రెడ్డి, వైష్ణవిలను ఆశీర్వదించిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని తిరిగి విజయవాడకు పయనమయ్యారు. తీవ్రంగా నష్టపోయాం.. ఆత్మహత్యలే శరణ్యం..ఎనిమిది ఎకరాల్లో అరటి పంట సాగు చేశా. మొక్క రూ.20 చొప్పున 9,500 మొక్కలను కొనుగోలు చేశా. సుమారు రూ.16 లక్షలు పెట్టుబడి చేతికి అందకుండా పోయింది. ఇంటిల్లిపాది అన్నపానీయాలు లేకుండా గడుపుతున్నాం. ఎరువుల దుకాణాల్లో అప్పులు చేశాం. పెట్టుబడికి అప్పులు తెచ్చాం. పది రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంట కళ్లెదుటే నేలమట్టమైంది. ప్రభుత్వం ఆదుకోకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. – మందలపల్లి కేశవయ్య, తాతిరెడ్డిపల్లె, లింగాల మండలంఅరటి వ్యాపారులు, కూలీలను వెళ్లగొట్టారు..గత నెలలో టన్ను అరటి రూ.25–26 వేల వరకు పలికింది. అయితే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని కూలీలను పులివెందుల పోలీసులు చితకబాదారు. లారీలను ఆపి డబ్బులు వసూలు చేశారు. దీంతో పులివెందుల నుంచి వ్యాపారులు, కూలీలు వెళ్లిపోవడంతో ధరలు పడిపోయాయి. ప్రస్తుతం ధర రూ.6–10 వేలుæమాత్రమే ఉంది. లారీలు, కూలీలు లేకపోవడం, పంట ఒక్కసారిగా చేతికి అందడంతో అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు అకాల వర్షాలు నిండా ముంచాయి. 3.5ఎకరాల్లో అరటి సాగుచేసి రూ.7లక్షలు నష్టపోయా. – పీసీ వాసుదేవరెడ్డి, కోమన్నూతుల, లింగాల మండలంపెట్టుబడి సాయం ఏది?మూడు ఎకరాల్లో అరటి సాగు చేశా. సుమారు రూ.6 లక్షల మేర పెట్టుబడులు పెట్టా. గాలివానకు పంట మొత్తం నేలకూలింది. నేల కూలిన అరటి పంటను తొలగించాలన్నా ఎకరాకు రూ. 30 వేల వరకు ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వం ఇంతవరకు రైతు భరోసా సొమ్ములు కూడా అందించలేదు. – పీసీ ప్రభాకర్‌రెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, లింగాల మండలంఎప్పుడూ చూడలేదుపదేళ్లుగా అరటి సాగు చేస్తున్నా. ఏప్రిల్, మే నెలల్లో ఈదురు గాలులు, వర్షాలు కురిసే నాటికి పంట చేతికి వచ్చేది. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చే సమయంలో మార్చిలోనే వడగళ్ల వానలు కురిశాయి. ఈదురు గాలులు వీచాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఐదు ఎకరాలలో పంట సాగు కోసం రూ.10 లక్షల వరకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేశా. ఊరు వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – పురుషోత్తంరెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, లింగాల మండలంరూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు..అరటి రైతులకు పంటల బీమాను వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఐదు ఎకరాలలో అరటి సాగు చేశా. 6,000 మొక్కలు అకాల వర్షాల వల్ల నేల కూలాయి. అరటి గెలలపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. – దినేష్‌కుమార్‌రెడ్డి, కోమన్నూతుల, లింగాల మండలం -
‘డ్రగ్స్’పై ‘డర్టీ’ ప్రచారం
సాక్షి, అమరావతి: స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు కూటమి డ్రగ్స్ దందా అంటూ యావత్ రాష్ట్రంపై అభాండాలేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోయిందంటూ నిత్యం విష ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించింది. ఇదంతా కేవలం దుష్ప్రచారమేనన్న వాస్తవాన్ని కేంద్ర హోం శాఖ తాజా నివేదిక వెల్లడించింది. 2022 నుంచి 2024 వరకు దేశంలో అత్యధికంగా డ్రగ్స్ కేసులు నమోదైన 12 రాష్ట్రాల జాబితాను కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు సమర్పించింది. ఈ జాబితాలో మన రాష్ట్రం పేరే లేదు.అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్ ప్రభావమే లేదని, ఎల్లో మీడియా, చంద్రబాబు ముఠా చేసిన రాద్ధాంతమంతా రాజకీయ కుట్రే అన్న విషయాన్ని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. అంతేకాదు.. గుజరాత్ పోర్టుకు వచ్చిన ఓ కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు తేలగానే చంద్రబాబు ముఠా దాన్ని రాష్ట్రంతో లింకు పెట్టి రచ్చ చేసింది. విశాఖపట్నం పోర్టుకు వచ్చిన డ్రై ఈస్ట్ కంటైనర్ విషయంలోనూ ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్న చందంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. ఈ కంటైనర్ల విషయంలో బాబు ముఠా ఆరోపణలన్నీ అవాస్తవాలేనని సీబీఐ దర్యాప్తుల్లో వెల్లడైంది.కేంద్ర హోం శాఖ తాజా నివేదిక కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. నాడు డ్రగ్స్ కేసుల జాబితాలోనే లేని ఏపీ దేశంలో 2022, 2023, 2024 సంవత్సరాల్లో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా (ఎన్డీపీఎస్) కేసులు, ఈ కేసులు అత్యధికంగా నమోదైన 12 రాష్ట్రాల వివరాలను కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు నివేదించింది. ఈ మూడేళ్లలో దేశంలో ఎన్డీపీఎస్ చట్టం కింద మొత్తం 3,02,228 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఎన్డీపీఎస్ కేసుల్లో.. కేరళ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో పంజాబ్, మూడో స్థానంలో మహారాష్ట్ర ఉన్నట్లు తెలిపింది. మొత్తం 12 రాష్ట్రాల్లో నమోదైన కేసుల వివరాలనూ ఇచ్చింది. హోం శాఖ ఇచ్చిన ఈ టాప్ 12 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేనే లేదన్న వాస్తవం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం డ్రగ్స్ దందాను సమర్ధంగా కట్టడి చేసిందన్న విషయాన్ని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.కంటైనర్ల విషయంలోనూ విష ప్రచారమేఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విదేశాల నుంచి రాష్ట్రానికి భారీగా డ్రగ్స్ దిగుమతి చేస్తున్నారంటూ చంద్రబాబు ముఠా చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అదంతా దుష్ప్రచారమేనని సీబీఐ దర్యాప్తుతో నిగ్గు తేలింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వచ్చిన ఓ నౌకలోని కంటైనర్‌లో భారీగా డ్రగ్స్‌ను గుర్తించారు. వెంటనే దీనిపై చంద్రబాబు కూటమి, ఎల్లో మీడియా విష ప్రచారం ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకే ఆ డ్రగ్స్‌ను దిగుమతి చేశారంటూ యాగీ చేశాయి. డీఆర్ఐ, సీబీఐ దర్యాప్తులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కంటైనర్‌లోని మాదక ద్రవ్యాలను గుజరాత్ పోర్టులో దిగుమతి చేసి చెన్నైకు తరలించాలన్నది ఆ డ్రగ్స్ ముఠా మాస్టర్ ప్లాన్ అని ఆ రెండు కేంద్ర సంస్థల దర్యాప్తులో వెల్లడైంది. సీబీఐ చెన్నైకు చెందిన కొందరిని అరెస్ట్ కూడా చేసింది. ఇక ఎన్నికలకు ముందు ఓ ఆక్వా సంస్థ విదేశాల నుంచి డ్రై ఈస్ట్‌ను దిగుమతి చేసుకుంది. ఈ కంటైనర్‌పై అనుమానంతో సీబీఐ అధికారులు తనిఖీ చేయగానే చంద్రబాబు కూటమి మళ్లీ రాద్ధాంతం మొదలెట్టింది. డ్రై ఈస్టు పేరుతో డ్రగ్స్‌ను దిగుమతి చేశారంటూ కూటమి నేతలు, ఎల్లో మీడియా విష ప్రచారం చేశారు. సీబీఐ దర్యాప్తులో వాస్తవాలు వెల్లడయ్యాయి. ఆ కంటైనర్ ద్వారా దిగుమతి చేసింది డ్రై ఈస్టు మాత్రమేనని సీబీఐ నిర్ధారించింది. దీంతో ఈ రెండు కంటైనర్ల విషయంలో టీడీపీ కూటమి చేసిందంతా దుష్ప్రచారమేనన్నది నిర్ధారణ అయ్యింది. కేవలం ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయ ప్రయోజనం పొందేందుకే చంద్రబాబు ముఠా వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోపాటు యావత్ రాష్ట్రంపై విష ప్రచారానికి తెగించిందన్న విషయం నిగ్గు తేలింది. -
టీడీపీ ఎంపీలు మూగబోయినా మేం పోరాడుతూనే ఉంటాం
న్యూఢిల్లీ, సాక్షి: ఒకవైపు ఏపీకి తీరని అన్యాయం జరుగుతుంటే.. మరోవైపు ఏ ఒక్క అంశంపైనా టీడీపీ ఎంపీలు(TDP MPs) నోరు విప్పడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. అయితే.. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారాయన. ఫైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ తరఫున ఆయన చర్చలో పాల్గొన్నారు. పోలవరం అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు. ప్రాజెక్టు ఎత్తు(Polavaram Hight)పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పోలవరం ఎత్తును 45 . 72 నుంచి 41.15 తగ్గించడం అన్యాయం. దాదాపు 194 టీఎంసీల కెపాసిటీతో దీనిని డిజైన్ చేశారు. కానీ, ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 115 టీఎంసీలకు పడిపోతుంది. అలాగే.. రూ.60 వేల కోట్ల వ్యయం అవుతుండగా కేవలం 30 వేల కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతోంది. పార్లమెంటులో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోకపోవడం అన్యాయం. 👉టీడీపీ ఎంపీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatization) అంశాన్ని ప్రస్తావించలేకపోతున్నారు. ఓవైపు ప్రైవేటీకరణ చేస్తామని, మరోవైపు మద్దతిస్తామని విరుద్ధ ప్రకటన చేస్తున్నారు. ప్రైవేటీకరణే జరిగితే ఉద్యోగులకు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది.👉ఏపీలో రూ.2,000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాన్ని నిలిపివేసింది. మంజూరైన సీట్లను సైతం తాము కాలేజీని నడపలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్మివేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మెడికల్ కాలేజీలను నడిపేలా చర్యలు తీసుకోవాలి. 👉ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం విస్మరించింది. విభజన చట్టంలోని హామీలను మరిపోయింది. ఒక కిలోమీటర్ నేషనల్ హైవే నిర్మించడానికి 20 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కానీ, అమరావతిలో మాత్రం 40 నుంచి 50 కోట్ల రూపాయలకు పెంచారు. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. ఇందులో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతోంది. ఈ గణాంకాల పైన అధికారిని నియమించి దర్యాప్తు చేయాలి. 👉వైఎస్సార్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టారు. కానీ, గడిచిన 11 నెలల నుంచి ఏపీలోని కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయడం లేదు. విద్యార్థులు డబ్బు చెల్లిస్తే తప్ప హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లించాల్సిన బకాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. ఫలితంగా రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ‘‘మేము రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసులకు భయపడేది లేదు.. ప్రశ్నిస్తూనే ఉంటాం ఏపీకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తుంటాం’’ అని మిథున్ రెడ్డి అన్నారు. -
‘కూటమి పాలనలో స్కీమ్స్ లేవు.. అన్నీ స్కామ్‌లే’
నెల్లూరు: కూటమి ప్రభుత్వ పాలనలో స్కీమ్స్ అనేవే లేకుండా పోయాయని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి.. ‘కూటమి ప్రభుత్వంలో స్కీమ్స్ లేకుండా.. స్కామ్ లే కనిపిస్తున్నాయి.. అభివృద్ది పేరిట అవినీతే ఎక్కువగా కనిపిస్తోంది. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానానికి ప్రభుత్వం మంగళం పాడుతోంది. కాంట్రాక్ట్ పనులను తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ లో 800 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. 7500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకొచ్చాం. ఈ విధానాన్ని నీతి అయోగ్ కూడా అభినందించింది. పథకం ప్రకారం చంద్రబాబునాయుడు దోపిడికి పాల్పడుతున్నారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో తన వారికి చంద్రబాబునాయుడు కాంట్రాక్ట్ పనులు అప్పగించాడు. కాంట్రాక్ట్ విధానం లోపబూయిష్టంగా ఉంది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని కొనసాగించండి. అమరావతి నిర్మాణం పేరిట అభివృద్దిలో అవినీతి కనిపిస్తోంది. ప్రజాధనం దోపిడికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదుంది’ అని పేర్కొన్నారు. -
ఏపీ పోలీస్ శాఖలో కీలక పరిణామం..
విజయవాడ: ఏపీ పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో సీఐడీ చీఫ్ గా ఉన్న వినీత్ బ్రిజ్ లాల్ డిప్యూటేషన్ పై సీఆర్పీఎఫ్ ఐజీగా వెళ్లనున్నారు. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజలాల్ కేంద్ర సర్వీస్ లకు రిలీవ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లపాటు కేంద్ర సర్వీస్ లో ఉండనున్నారు వినీత్ బ్రిజ్ లాల్.ప్రస్తుతం ఏపీలో సీఐడీ చీప్ తో పాటు కాకినాడ పోర్టు రేషన్ బియ్యం సిట్ కి చీఫ్ గా ఉన్నారు వినీత్ బ్రిజ్ లాల్. ముక్కుసూటి అధికారిగా గుర్తింపు ఉన్న వినీత్.. కొద్ది నెలలుగా అసంతృప్తితో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలోని రెడ్ బుక్ అక్రమ కేసులపై వినీత్ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుండి వెళ్లిపోవానలి నిర్ణయించుకున్న వినీత్.. కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న వినీత్ కు డిప్యూటేషన్ పై సీఆర్పీఎష్ ఐజీగా కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతి లభించింది. -
బంగారం భద్రం.. రెండు రోజుల్లో ఇచ్చేస్తా
కొత్తపేట((రాజమహేంద్రవరం): రెండు రోజుల్లో తిరిగి వస్తా.. నా షాపులో తాకట్టు పెట్టిన వస్తువులు ఎవరివి వారికి తిరిగిస్తా.. అని షాపు మూసేసి పరారైన తాకట్టు వడ్డీ వ్యాపారి కూర్మదాసు హేమంత్‌కుమార్ తెలిపాడు. ఆ మేరకు ఆదివారం సాయంత్రం ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. స్థానిక మెయిన్‌రోడ్డులో సత్యసూర్య బ్యాంకర్స్ (తాకట్టు వడ్డీ వ్యాపారం) నిర్వహిస్తున్న హేమంత్‌కుమార్ గత నెల 1, 2 తేదీల్లో షాపు మూసేసి పరారయ్యాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు గతనెల ఆ షాపు వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా హేమంత్‌కుమార్ సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ, తాకట్టు వడ్డీ వ్యాపారంలో తనతో పాటు మరో ఇద్దరు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టగా రియల్టర్ వాసు తాను నష్టపోయానని చెప్పి వెళ్లిపోయాడని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తనతో పెట్టుబడి పెట్టిన వారు చంపుతామని బెదిరించడంతో ప్రాణభయంతో పారిపోయానని, తన వద్ద తాకట్టు పెట్టిన వస్తువులన్నీ భద్రంగా ఉన్నాయని, కరిగించలేదని పేర్కొన్నాడు. కొన్ని తన వద్ద, మరికొన్ని తన వ్యాపార భాగస్వామి సత్యప్రియ శ్రీఘాకోళ్లపు రామకృష్ణ వద్ద, వాళ్ల నాన్న వద్ద ఉన్నాయని, పోలీసుల సహకారంతో తిరిగి వచ్చి ఎవరివి వారికి అప్పగిస్తానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనకు రక్షణ కావాలని పేర్కొన్న వీడియో తాకట్టుదారులకు కొంత ఊరటనిచ్చింది. -
చంద్రబాబు కొత్త రాగం.. ఆత్మవంచన ఇంకెంత కాలం?
పూటకో రకంగా మాట్లాడటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రత్యేక లక్షణం. అసెంబ్లీలో కానీ.. మరో చోట కానీ.. నిన్న చేసిన ప్రసంగానికి, నేటికి అస్సలు సంబంధం ఉండకపోవచ్చు. ఎన్నికల ముందు చేసే ప్రసంగాలు ఒకలా ఉంటే.. ఆ తరువాత ఇంకోలా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలో ఉంటే మరోలా అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. వాగ్దాన భంగాల గురించి ఆయన ఆచరించే పద్ధతులు ఒక పరిశోధన అంశం అవుతుందేమో!.కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో ఆయన విజన్-2047 గురించి ప్రసంగించారు. అందులో ఆయన పెట్టిన అంకెలు చూస్తే అది ఎంత పెద్ద గారడీనో అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు ‘సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా’ అన్న ఆయన అధికారంలోకి రాగానే సంపద ఎలా సృష్టించాలో చెప్పండని ప్రజలను కోరారు. చెవిలో అయినా చెప్పాలని వ్యాఖ్యానించారు. తాజాగా సంపద సృష్టి నేర్పిస్తాం అంటున్నారు. చంద్రబాబు ఏది చేస్తారో తెలియదు కానీ, ఏపీని అప్పుల కుప్పగా మరుస్తుండటం మాత్రం స్పష్టం. అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలపై ఉన్నట్లు కనిపించదు. ఒక్క అమరావతి కోసమే రూ.ఏభై వేల కోట్లకుపైగా అప్పు తెచ్చి ఖర్చు పెట్డడానికి సిద్దం అవుతున్నారంటే ఈ ప్రభుత్వం సంపన్నులకు, బడా బాబులకు ఉపయోగపడుతున్నదా? లేక పేదలను ఉద్ధరించడానికా? అన్నది తెలిసిపోతుంది.అమరావతిలో భూములు కొన్నవారి ప్రయోజనాల కోసం ఇంత భారీ వ్యయం చేస్తున్న ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు మాత్రం పాతరేసింది. అమరావతిలో ధనికులు బాగుపడితే తామంతా బాగుపడినట్లు పేదలు అనుకోవాలన్నది కూటమి సర్కార్ భావన. కానీ, శాసనసభలో, బయట మాత్రం చంద్రబాబు నాయుడు పేదల కోసమే అంతా చేస్తున్నట్లు చెబుతూ వారిని మభ్యపెట్టేయత్నం చేస్తుంటారు. ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ జగన్ విశాఖలోని రుషికొండపై ప్రభుత్వానికి ఉపయోగపడేలా మంచి భవనాలు నిర్మిస్తే, అవేవో ఆయన సొంతమైనట్లు ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం చేశారు. అదే అమరావతిలో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బిల్డింగ్‌లను మాత్రం ఐకానిక్ భవనాలని ప్రచారం చేసుకుంటున్నారు.అమరావతి గ్రామాలలోనే ఇన్ని వేల కోట్ల వ్యయం చేస్తే అక్కడి వారికి సంపద సృష్టించినట్లు అవుతుంది తప్ప రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా సంపదవుతుంది?. ప్రభుత్వాన్ని సమతులంగా నడపవలసిన పెద్దలు మిగిలిన ప్రాంతాలను ఎండగట్టి అంతా అమరావతిలోనే ఉందన్న భ్రమ కల్పించే యత్నం చేస్తున్నారు. దానికి తోడు విజన్-2047 అని, పీ-4 అని ఏవో కొత్త డైలాగులు ప్రచారంలోకి తేవడం ద్వారా ప్రజలంతా కూటమి ఇచ్చిన అనేక హామీల ఊసెత్త కూడదన్నది వారి వ్యూహం. ఇది ప్రజస్వామ్య వ్యవస్థను కూడా మోసం చేస్తున్నట్లు అన్న సంగతి గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి తలసరి ఆదాయ లక్ష్యం 18వేల డాలర్లుగా ఉండాలని భావిస్తుంటే ఏపీలో అది 42వేల డాలర్లుగా పెట్టుకున్నారు. అంటే అప్పటికి ఒక డాలర్ విలువ వంద రూపాయలు ఉందనుకుంటే ఏపీ ప్రజలు ఏడాదికి నలభై రెండు లక్షల మేర తలసరి ఆదాయం కలిగి ఉంటారన్నమాట. నిజానికి ఇంకో పాతికేళ్ల తర్వాత డాలర్ విలువ ఇంకా ఎక్కువే కావచ్చు. అది వేరే సంగతి. అంటే ఇలాంటి అంకెల గురించి ప్రజలకు అంత తేలికగా అర్థం కావు. అందువల్ల వారిని భ్రమింప చేయడానికి ఈ అంకెల గందరగోళం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట.చంద్రబాబు 2004 వరకు సీఎంగా ఉన్న రోజుల్లో కూడా విజన్-2020 అంటూ ఒక కథ నడిపించారు. ఆ విజన్ పుస్తకం చదివిన వారంతా ఇవేమి లెక్కలు.. ఇవేమి లక్ష్యాలు.. అంటూ ఆశ్చర్యం చెందారు. అప్పట్లో ఒకసారి ఏపీకి వచ్చిన స్విస్ మంత్రి ఒకరికి జీడీపీపై, రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై ఇలాంటి లెక్కలు చెప్పబోతే, తమ దేశంలో అయితే ఇలా చెబితే వారిని మతి ఉండి మాట్లాడుతున్నారా అని అడుగుతారని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో ఒకట్రెండు పదాలు ఆయన వాడటం చంద్రబాబుకు అప్రతిష్టగా మారడంతో ఆ మాటలపై వివరణ ఇప్పించే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు తన వ్యూహాన్ని ఎప్పుడూ మార్చుకోలేదు. ఏవో లెక్కలు చెబితే ప్రజలు నమ్మకపోతారా అన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.సూపర్ సిక్స్ హామీలు కాని, ఎన్నికల ప్రణాళికలోని హామీలు కాని అమలు చేయడం అసాధ్యం వాటికి రూ.లక్షన్నర కోట్లు అవసరం అవుతాయని అప్పటి ముఖ్యమంత్రి జగన్ అంటే ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం తాము చేసి చూపిస్తామని అనేవారు. తనకు సంపద సృష్టించడం తెలుసు అని చంద్రబాబు బడాయి కబుర్లు చెబితే, అవునవును అని పవన్ కళ్యాణ్ బాజా వాయించే వారు. అప్పటికే జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందన్న అబద్ధాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు. అంకెలతో జనాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా మోసం చేశారో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు అవుతాయి.నారా లోకేష్ అయితే అన్ని స్కీములకు తమ వద్ద లెక్కలు, ప్రణాళికలు ఉన్నాయని, అమలు చేయకపోతే తమ కాలర్ పట్టుకోవచ్చని అన్నారు. ఇప్పుడు కాలర్ ఎవరూ పట్టుకునే పరిస్థితి లేకుండా రెడ్ బుక్ పేరుతో జనాన్ని భయపెడుతున్నారు. అవసరమైన ప్రజలకు చేపలు అందిస్తారట. ప్రతిరోజూ చేపలు ఇస్తూనే వలవేసి వాటిని ఎలా పట్టుకోవాలో నేర్పుతానని అదే తమ విధానం అని చంద్రబాబు అన్నారు. మరి ఈ మాటే ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు? పేదల తక్షణావసరాలు తీర్చడం అంటే ఒక ఏడాదిపాటు ఫ్రీ బస్, తల్లికి వందనం, రైతు భరోసా, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి వాటిని లేకుండా చేయడమా?. వలంటీర్లకు నెలకు పది వేలు ఇస్తామని చెప్పి అసలుకు మంగళం పాడడమా? ఇప్పటికీ 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవశాలి ఎంతమందికి సంపద సృష్టించారు? ఎంత మందికి నేర్పారు? ఇప్పుడు కొత్తగా నేర్పుతానని అంటే జనం చెవిలో పూలు పెట్టడం కాదా? ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట.అలాగే వ్యక్తి, కుటుంబం, సమాజం, రాష్ట్రం అన్ని స్థాయిలలో పురోగతికి ప్రణాళికలు రూపొందిస్తున్నారట. నియోజకవర్గాల విజన్ ఎజెండా పెట్టి స్వర్ణాంధ్ర సాకారం చేస్తారట. అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తొమ్మిది నెలలుగా తన నియోజకవర్గంలో ఒక్క పని చేయలేక పోయానని వాపోయారు. పది నెలల పాలన తర్వాత వీధులలో చెత్త ఎత్తడానికి సీఎం, మంత్రులు ఆయా చోట్ల తిరుగుతున్నారు. అలా ఉంటుందన్నమాట విజన్ అంటే!.పరిస్థితి ఇలా ఉంటే స్వర్ణాంధ్ర అని, మరొకటని కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేయడమేమిటో అర్థం కాదు. అదేమంటే పేదలను ధనికులు దత్తత తీసుకోవాలట. అప్పుడు వారికి సంపద సృష్టించడం నేర్పనక్కర్లేదా!. ఉగాది నాడు ఆ కార్యక్రమం ఆరంభిస్తారట. అది ఎంత చక్కదనంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ప్రతీ కుటుంబానికి కోరుకున్న చోట స్థలాలు ఇస్తారట. రాజధానిలో పేదలకు గత ప్రభుత్వం స్థలాలు ఇస్తే వాటిని రద్దు చేసిన చంద్రబాబు ఈ మాట చెబితే ఎవరైనా నమ్ముతారా?. వైఎస్ జగన్ టైమ్ లో నిర్మాణంలో ఉన్న పోర్టులను ప్రైవేటు పరం చేస్తూ సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తాం అని అంటున్నారు. తాను ఒక్కడినే పనిచేస్తే చాలదని, ఎమ్మెల్యేలంతా పని చేయాలని చెబుతున్నారు. అంటే వారిలో చాలా మంది పనిచేయడం లేదని చెప్పడమే అవుతుంది కదా! పనుల సంగతి దేవుడెరుగు! కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతున్నారని ఎల్లో మీడియాలోనే కథనాలు వస్తున్నాయి.చంద్రబాబు సీఎం కాబట్టి ఆయన చేతిలో నిధులు ఉంటాయి కనుక, తన నియోజకవర్గంలో ఏదో పని చేసుకోవచ్చు. విచిత్రం ఏమిటంటే ఇంత విజన్ ఉన్న ఆయన నియోజకవర్గమైన కుప్పంలో సరైన బస్టాండ్ లేదు, కొన్ని వార్డులలో మట్టి రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో చెప్పలేం. కుప్పం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాలను జగన్ ప్రభుత్వం బాగు చేసింది. ఒక్క గెస్ట్ హౌస్ మాత్రం బాగానే ఉంటుంది. 2004, 2019లలో తనను ఎవరూ ఓడించలేదని, అభివృద్ది చేసే క్రమంలో ఎమ్మెల్యేలను, పార్టీని సమన్వయం చేయలేక పోయినందువల్ల ఓడిపోయామని అంటున్నారు. అంటే ఆయన నిజంగా అభివృద్ది చేసినా ప్రజలు ఓడించారని చెబుతున్నారా? అంతే తప్ప అప్పుడు కూడా ఆచరణ సాధ్యం కాని వందల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత వాటిని అమలు చేయలేక ఓడిపోయామని అంగీకరించలేక పోతున్నారన్నమాట.జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడిన సంగతిని విస్మరిస్తున్నారు అన్నమాట. ఇది ఆత్మవంచన కాదా! పెద్ద వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అంకెల గారడీ, బురిడీ మాటలు కాకుండా చిత్తశుద్దితో పనిచేసి, ఇచ్చిన వాగ్దానాలపై దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేస్తే ఆయనకే మంచి పేరు వస్తుంది. కానీ ఆ దిశలో ఆయన ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ ఉన్నట్లు కనిపించడం లేదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రైతులపై కూటమి ప్రభుత్వ కపట ప్రేమ: వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం: ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం కారణంగా వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. వర్షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడింది. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదు.వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేది. మన వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ రైతుకు న్యాయం చేశాం. అరటి సాగులో రాష్ట్రంలోనే పులివెందుల నంబర్ వన్ స్థానంలో ఉంది. మా ప్రభుత్వంలో రూ.25కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు కూడా వాడుకోలేకపోతున్నారు. యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. మళ్లీ ప్రతీ రైతు కళ్లలో ఆనందం కనిపించేలా చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం’ అని రైతులకు హామీ ఇచ్చారు. అకాల వర్షానికి భారీ నష్టం..శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. -
విద్యారంగ ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి
రాజమహేంద్రవరం సిటీ: విద్యారంగంలో పేరుకుపోతున్న ఆర్థిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తలపెట్టిన పోరుబాటలో భాగంగా రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఆదివారం విద్యా సదస్సు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిల చెల్లింపులపై సరైన శ్రద్ధ చూపించడం లేదని అన్నారు.29 శాతం ఐఆర్ ప్రకటించి, 12వ పీఆర్సీ వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు డీఏలు, పీఆర్సీ ఎరియర్లు, సరెండర్ లీవులు, మెడికల్ రీయింబర్స్మెంట్ ఎప్పటిలోగా చెల్లిస్తారో రోడ్ మ్యాప్ తెలియజేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ పోరుబాట ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉనికి కోల్పోతున్నాయన్నారు. భవిష్యత్తులో మోడల్ పాఠశాలల పేరుతో గ్రామాల్లోని చాలా పాఠశాలలను ఎత్తివేసే యోచనతో ప్రభుత్వం ఉందన్నారు.గ్రామాల్లో కామన్ పాఠశాలలు ఉండాలని, విద్యా రంగానికి జీడీపీలో 6 శాతం నిధులు ఖర్చు చేయాలని ఎన్నో సూచనలు చేసిన కొఠారి కమిషన్ నివేదికను ప్రభుత్వాలు ఆచరించటం లేదన్నారు. ఊరి బడిని బతికించుకోవటానికి ఉపాధ్యాయులంతా నడుం కట్టాలన్నారు. అందుకోసం పిల్లలు, పిల్లల తల్లిదండ్రులతో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా విధానానికి పాలకులు పెద్దపీట వేయాలన్నారు.పోరాటాల ద్వారా మాత్రమే ఉపాధ్యాయుల హక్కుల సాధన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తోటకూర చక్రవర్తి, అరుణకుమారి, రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీదేవి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఎస్సీ కాలనీలో విద్యుత్ కనెక్షన్లు కట్
బత్తలపల్లి: ఎస్సీ కాలనీల్లో గృహావసరాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. అయితే.. 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించారంటూ అధికారులు కనెక్షన్లు కట్ చేసిన సంఘటన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలోని పోట్లమర్రి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోట్లమర్రి ఎస్సీ కాలనీవాసులు తెలిపిన సమాచారం మేరకు..కాలనీలో 20 మందికి పైగా లబ్ధిదారుల ఇళ్లకు 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరిగిందని, వీరంతా రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు బకాయిలు పడ్డారని ఆదివారం విద్యుత్ అధికారులు దాదాపు 12 మంది గ్రామానికి చేరుకుని కనెక్షన్లు కట్ చేశారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2020 సంవత్సరంలో కూడా ఇలాగే సమస్య ఎదురైతే అప్పటి అనంతపురం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. అప్పటి నుంచి ఎటువంటి ఇబ్బందులూ లేవని, ఇప్పుడు మరోసారి అదేవిధంగా అధిక బిల్లులు వచ్చాయని విద్యుత్ అధికారులు కనెక్షన్లు కట్ చేశారని వాపోయారు. అప్పటి విద్యుత్ బిల్లులు కూడా ఇప్పుడు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సోమవారం తీసుకువెళతామని తెలిపారు. -
పడిపోతే.. ఫట్
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ముఖ్యంగా శరీర నిర్మాణానికి ఆధారంగా నిలిచే ఎముకలు చాలా త్వరగా పటుత్వాన్ని కోల్పోతున్నాయి. చిన్నగా కాలు తడబడి కింద పడితే చాలు.. ఫట్‌మంటూ విరిగిపోతున్నాయి. ఇక ద్విచక్ర వాహనాల పైనుంచి పడితే మల్టిపుల్ ఫ్రాక్చర్లు అవడం అనేది సర్వసాధారంగా మారిపోతోంది. చిన్నారుల నుంచి మూడు పదుల వయస్సు కూడా నిండని యువతలో సైతం ఎముకలు పటుత్వం తగ్గుతోంది.ఎముకలు గుల్లబారడం, బలహీనపడటం, తేలికగా విరిగిపోయే స్థితిని వైద్య పరిభాషలో (ఆస్టియోపొరోసిస్) అంటారు. పౌష్టికాహార లోపం, వయోభారం, కాల్షియం, డి–విటమిన్ లోపం దీనికి ప్రధాన కారణాలని ఆర్థోపెడిక్ సర్జన్లు (ఎముకల శస్త్రచికిత్స నిపుణులు) చెబుతున్నారు. వీటికి తోడు హార్మోన్ల అసమతుల్యత, వారసత్వ (జెనిటిక్) ప్రభావం, మద్యపానం, ధూమపానం, శారీరక వ్యాయామం లేకపోవడం కూడా ఎముకల ఆరోగ్యంపై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, కాకినాడయువతలో సైతం.. ఒకప్పుడు ఆరు పదుల వయస్సు మీద పడినా చాలా మందిలో ఎముకలు బలహీన పడటమనే సమస్య ఉండేది కాదు. మారిన జీవన విధానంతో ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆహార విధానంలో వస్తున్న మార్పులు ఎముకల పటుత్వాన్ని దెబ్బ తీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్లనే ఈ సమస్య ఇప్పుడు అన్ని వయస్సుల వారిలోనూ కనిపిస్తోందని అంటున్నారు. యువతలో ఈ సమస్య ఉంటే జువైనల్ ఆస్టియోపొరోసిస్ అని వైద్య పరిభాషలో పిలుస్తారు.ఆహారంలో పోషకాల లోపం ఉండటం, రోడ్డు పక్కన ఆహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, హార్మోన్లు అవసరమైన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం, స్టెరాయిడ్ల వంటి మందులు అధికంగా వినియోగించడం, రుమటాయిడ్ ఆర్ర్థరైటిస్, లూపస్ వంటి వ్యాధుల బారిన పడిన యువతీయువకులు ఎముకల పటుత్వం కోల్పోతున్నారని వైద్యులు నిర్ధారించారు. కాల్షియం లోపంతో పుట్టడం వలన కూడా ఎముకలు గుల్లబారుతుండటం ఇటీవల ఎక్కువైందని ఇటీవల కాకినాడ జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగ వైద్యుల పరిశీలనలో తేలింది. మహిళల్లో సైతం.. యువత తరువాత ఈ సమస్య మహిళల్లో తీవ్రంగా కనిపిస్తోందని వైద్యులు నిర్ధారించారు. ప్రతి ఐదుగురు మహిళల్లో కనీసం ఇద్దరు ఆస్టియోపొరోసిస్‌తో బాధ పడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన మహిళల్లో రుతుచక్రం ఆగిపోయే (మెనోపాజ్) దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతూంటుంది. దీనివలన ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. అదే పురుషుల్లో అయితే 60 సంవత్సరాలు దాటిన వారిలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. మహిళల్లోనే ఎక్కువగా ఎముకలు గుల్లబారడానికి హార్మోన్ల లోపం, శారీరక నిర్మాణం, జీవనశైలి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు.పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎముకలు సన్నగా, సున్నితంగా ఉండటం కూడా మరో కారణమని అంటున్నారు. గర్భిణుల్లో ఉండే కొద్దిపాటి కాల్షియాన్ని గర్భంలో ఉండే బిడ్డకు కూడా అందుతుంటుంది. దీనివల్ల కూడా వారిలో ఎముకల పటుత్వం తగ్గుతుంది. అలాగే, పిల్లలకు పాలిచ్చే సమయంలో పోషకాహారం లేకపోవడంతో శరీరంలో కాల్షియం నిల్వలు తగ్గిపోయి, ఎముకలు గుల్లబారుతుంటాయి. పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్ (పీసీఓడీ), థైరాయిడ్, గర్భాశయ తొలగింపు (హిస్టరెక్టమీ) వంటి వాటి వలన హార్మోన్లలో విపరీతమైన అసమతుల్యత ఏర్పడి, మహిళల్లో ఎముకలు గుల్లబారుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.అప్రమత్తతే ఆయుధంచిన్నచిన్న గాయాలైనప్పుడు తక్కువ ఒత్తిడితో కూడా ఎముకలు విరిగిపోతుంటాయి. నడుము, వెన్నెముక, కాళ్లలో దీర్ఘకాలిక నొప్పులు, వెన్నెముక దెబ్బతినడం, ఎముకలు కుచించికుపోయి ఎత్తు, పొడవు తగ్గడం, నడుము, మోకాళ్లు, భుజాల జాయింట్లలో నొప్పి, నిస్సత్తువ వంటి లక్షణాలున్న వారు వైద్యుల సూచనల మేరకు తప్పనిసరిగా తగిన పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా బోన్ మినరల్ డెన్సిటీ (బీఎండీ), ఎముకల క్షీణతను గుర్తించే ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కాన్, కాల్షియం, విటమిన్–డి స్థాయి అంచనా వేసేందుకు రక్త, మూత్ర పరీక్షల వంటివి తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.50 ఏళ్ల వయస్సు దాటిన మహిళలు, 65 ఏళ్లు పైబడిన పురుషులు ఆరు నెలలకోసారి వైద్యులను సంప్రదించి, ఈ పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా ఆస్టియోపొరాసిస్ ఉన్నా, నీడ పట్టున, ఏసీలలో ఎక్కువ సమయం గడిపే ఉద్యోగులు, ఇతర వర్గాలు, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వారు, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపంతో వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు కచ్చితంగా తగిన పరీక్షలు చేయించుకుకోవాలి.నిర్లక్ష్యం చేయకండి ఎముకల బలహీనత ఉందనే అనుమానం ఎవరికైనా ఉంటే తక్షణం కాకినాడ జీజీహెచ్‌కు రావాలి. బీఎండీ పరీక్షలు జీజీహెచ్‌లో ఉచితంగా చేస్తున్నాం. మందులు ఉచితంగా అందిస్తున్నాం. బీఎండీ పరీక్షల కోసం ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. ఆస్టియోపొరాసిస్ చిన్న సమస్య అని నిర్లక్ష్యం చేయకండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల జీవిత కాలాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. కాల్షియం, విటమిన్–డి ఉన్న పోషకాహారం తీసుకోవాలి. అధిక ప్రొటీన్ ఉండే ఆహారంతో పాటు సూర్యరశ్మిలో గడపడం, తగినంత నిద్ర మేలు చేస్తాయి. వయస్సును బట్టి కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. వయస్సుతో సంబంధం లేకుండా వ్యాయామాలు కచ్చితంగా చేయాలి. – డాక్టర్ ఎం,పాండురంగ విఠల్, ఆర్థోపెడిక్ విభాగాధిపతి, జీజీహెచ్, కాకినాడప్రతి నెలా 3 వేల మంది పైనే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) ఎంతో ప్రధానమైనది. ఇక్కడకు కోనసీమ, రాజమహేంద్రవరం ప్రాంతాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం అనేక మంది చికిత్స కోసం వçస్తుంటారు. కేవలం ఈ ఒక్క ఆసుపత్రికే ప్రతి నెలా 3 వేల మందికి పైగానే రోగులు ఎముకల సంబంధిత సమస్యలతో వస్తున్నారు. ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కూడా కలిపితే ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. దీనినిబట్టి సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
విశాఖలో నేటి ఐపీఎల్ మ్యాచ్‌కు గవర్నర్ రాక
విశాఖ స్పోర్ట్స్: ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య విశాఖపట్నం వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో సోమవారం జరగనున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ను గవర్నర్ అబ్దుల్ నజీర్ వీక్షించనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి ఇక్కడ జరగనున్న ఈ తొలి మ్యాచ్ నేపథ్యంలో.. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, ఎంపీ కేశినాని శివనాథ్ (చిన్ని) ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రారంభ మ్యాచ్‌ను వీక్షించేందుకు ముఖ్యమంత్రిని ఆహ్వానించగా పలు కార్యక్రమాలవల్ల ఆయన రావట్లేదని.. కానీ, గవర్నర్ అంగీకారం తెలిపినట్లు చెప్పారు.మరోవైపు.. ఉమెన్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు విశాఖ అతిథ్యమివ్వనుందని, అయితే.. బీసీసీఐ నుంచి ఇంకా వివరాలు అందాల్సి వుందన్నారు. త్వరలోనే టీ20 మ్యాచ్‌ల్ని కూడా విశాఖలో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇక విజయవాడలో అతిపెద్ద స్టేడియం నిర్మాణం అసంభవమని.. మోదీ స్టేడియంని మించి స్టేడియం కట్టడం సాధ్యపడే విషయం కాదని కేశినేని తేల్చిచెప్పారు. అమరావతి స్పోర్ట్స్ సిటీలో భాగంగా స్టేడియం నిర్మిస్తామని చెప్పారు.మంగళగిరి స్టేడియం కన్‌స్ట్రక్టింగ్ స్ట్రక్చర్లు పాడవడంతో కొన్ని స్టాండ్స్‌ను తొలగించాల్సి వస్తోందన్నారు. స్టేడియంను రంజీ మ్యాచ్‌లు, అకాడమి అవసరాలకే తప్ప అంతర్జాతీయ మ్యాచ్‌లకు వాడలేమన్నారు. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి సానా సతీష్‌బాబు మాట్లాడుతూ.. ఏపీఎల్ నాలుగో సీజన్‌ను కొనసాగిస్తామన్నారు. మరింత మెరుగ్గా నిర్వహించేందుకు విధివిధానాలు మారుస్తున్నామని తెలిపారు. గవర్నింగ్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయని.. త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
తాడేపల్లిలో మహిళపై అత్యాచారం.. హత్య
తాడేపల్లి రూరల్: విజయవాడ–గుంటూరు జాతీయ రహదారి మధ్య డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఓ మహిళ అత్యాచారం, ఆపై హత్యకు గురైంది. స్థానికుల కథనం మేరకు.. కొలనుకొండ జాతీయ రహదారి నుంచి గుంటూరు చానల్ మీదుగా ఇప్పటం వెళ్లే రహదారిలో జాతీయ రహదారికి 100 మీటర్ల దూరంలో ఈ దారుణం జరిగింది. మహిళ మృతదేహానికి ఎడమ చేతి వైపున గొంతుపై బలంగా పొడిచినట్లు గాయం కనిపిస్తోంది. మహిళ మొహంపై పూర్తిగా రక్తం ఉండడంతో ఆమె ముఖఛాయలు సరిగా కనిపించడం లేదు. మర్మాంగం వద్ద రక్తం కారుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మహిళ రెండు కాళ్లూ మోకాలు నుంచి కిందకు వంచి ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లే సరికి హత్య జరిగి సుమారు 40 నిమిషాలు అయ్యుండొచ్చని భావిస్తున్నారు. తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అది హత్యగా నిర్ధారించారు. సంఘటన స్థలం వద్ద సెల్‌ఫోన్, హ్యాండ్ బ్యాగ్ లభించాయని.. వాటిని పరిశీలించి ఆ మహిళ ఎవరో గుర్తిస్తామని తెలిపారు. కాగా, డీజీపీ కార్యాలయం సమీపంలో, జాతీయ రహదారి పక్కనే ఓ హోటల్లో నిత్యం పోలీసులు ఉంటున్నప్పటికీ ఈ సంఘటన జరగడం చర్చనీయాంశమైంది. జనవరి 31వ తేదీన కూడా గుంటూరు ఛానల్ నుండి నులకపేటకు వచ్చే రహదారిలో ఇదే గ్రామంలో డీజీపీ కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఇదే తరహాలో ఓ మహిళ హత్యకు గురైంది. ఆ మహిళ ఎవరో ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఈ రెండు హత్యలు ఒకేలా జరగడంతో ఒకే వ్యక్తి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.వెలిగే ఉన్న సెల్ ఫోన్ టార్చిలైట్సంఘటనా స్థలం వద్ద మహిళ మృతదేహం కనిపించేలా సెల్ఫోన్లో టార్చిలైట్ వెలిగే ఉంది. హత్య చేసిన వ్యక్తే ఈ పని చేసి ఉంటాడనే అనుమానం వ్యక్తమవుతోంది. మహిళ సెల్‌ఫోన్‌కు ఎటువంటి రక్తపు మరకలు కనిపించ లేదు. లేదా హత్య జరగక ముందే ఆ మహిళ సెల్ ఫోన్లోని టార్చ్ లైట్‌ను ఆన్ చేసి ఉంచిందా.. అనే దిశలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ సెల్‌ఫోన్ కీలకంగా మారడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మరో కోణంలో.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేసులు నమోదైన నేరస్తుల ద్వారా కూడా వివరాలు సేకరించి ఆ మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తామని సీఐ తెలిపారు. -
కిలో చికెన్‌కు రూ.10 మామూళ్లు!
సాక్షి టాస్క్ ఫోర్స్ : వ్యాపారం ఏదైనా ఆయనకు పర్సంటేజీ ఇవ్వాల్సిందే. ఈ విషయంలో రికమండేషన్లు ఏమీ పని చేయవు. ఆ నేత ఎంత చెబితే అంత ఇచ్చుకోవాల్సిందే. లేకుంటే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించేందుకు ఆయన బినామీలు, అధికారులు రంగంలోకి దిగుతారు. అయితే పర్సేంటేజీ.. లేకుంటే గుడ్‌విల్. ఏదో ఒకటి సెటిల్మెంటు చేసుకోవాలి. ఇదీ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భర్త భార్గవరామ్ సాగిస్తున్న కమీషన్ల బాగోతం. తాజాగా చికెన్ అంగళ్ల నిర్వాహకులు పర్సంటేజీ/గుడ్‌విల్ ఇవ్వడానికి ససేమిరా అనడంతో అధికారులపై ఒత్తిడి తెచి్చ.. అనుమతులు లేవంటూ నోటీసులిచ్చి, దుకాణాలకు తాళం వేయించడం విస్తుగొలుపుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే హోల్‌సేల్ చికెన్ దుకాణాల వారిని టీడీపీ నేత పిలిపించారు. నియోజకవర్గంలో ఎంత చికెన్ అమ్మినా కిలోకు రూ.10 చొప్పున మామూలు ఇవ్వాలని, అది కూడా గోవా నుంచి తాము తెప్పించే చికెన్‌ను మాత్రమే కొనుగోలు చేసి రిటైల్ వ్యాపారులకు విక్రయించాలని హుకుం జారీ చేశారు. ఇందుకు చికెన్ అంగళ్ల నిర్వాహకులు ఒప్పుకోలేదు. దీనికంతటికి కారకుడు ఏఎన్ఆర్ హోల్‌సేల్ చికెన్ సెంటర్ నిర్వాహకుడే అని అతన్ని పిలిపించి రూ.కోటి ఇవ్వాలని, లేకుంటే నీ వ్యాపారం జరగనివ్వమని బెదిరించారు. అంత ఇచ్చుకోలేమని అతను తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో మీకు వ్యాపారం నిర్వహించుకునేందుకు అనుమతులు లేవని మున్సిపల్ కమిషనర్‌తో నోటీసులు ఇప్పించి సీజ్ చేయించారు. నోటీసులు అందుకున్న చికెన్ సెంటర్ యాజమాన్యం.. ట్రేడ్ లైసెన్స్ ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయం వద్దకు పలుమార్లు తిరిగినా స్పందించలేదు. దీంతో కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నారు. అయినప్పటికీ లైసెన్స్ ఇవ్వక పోవడంతో జిల్లా ఎస్పీ, కలెక్టర్ దృష్టికి విషయం తీసుకెళ్లారు. కలెక్టర్ మందలించడంతో ఎట్టకేలకు అనుమతులు ఇచ్చారు. అయితే సమస్య సద్దు మణిగిందని అందరూ అనుకుంటున్న సమయంలో శనివారం రాత్రి ఒక్కసారిగా ఆళ్లగడ్డలో కలకలం రేగింది. పట్టణంలో విక్రయిస్తున్న చికెన్ మనుషులు తినేందుకు పనికి రాదని, ఈ మేరకు విజయవాడలోని పశు సంవర్దక శాఖ లేబరేటరీ నివేదిక ఇచ్చిందని మున్సిపల్, ఫుడ్, రెవెన్యూ అధికారులు.. పోలీసులను వెంటబెట్టుకుని నాలుగు చికెన్ దుకాణాలకు నోటీసులు ఇచ్చారు. అంతటితో ఆగక తాళాలు వేయించడం చర్చనీయాంశం అయింది. అధికార పార్టీ నేతతో బేరం కుదరక పోవడం వల్లే ఇలా జరిగిందని పట్టణంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. -
ప్రియురాలిని, ఆమె తల్లిని కిరాతకంగా హత్యచేసిన ప్రియుడు
రాజమహేంద్రవరం రూరల్: ఆమెకు 16.. అతడికి 20.. ఇద్దరి మనస్సులూ కలిశాయి. ఆరు నెలలుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఇంతలోనే కొద్దిరోజులుగా ప్రియురాలు వేరొకరితో చాటింగ్ చేస్తోందనే అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో.. ప్రియురాలిని, ఆమె తల్లిని ప్రియుడు కూరలు కోసే కత్తితో కిరాతకంగా హత్యచేసి, ఇంటికి తాళంవేసి, పరారయ్యాడు. రాజమహేంద్రవరంలో ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మా (38), ఆమె కుమార్తె మహ్మద్ సానియా ఎలియాస్ సానా (16) మూడునెలలుగా రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో ఉంటున్నారు. స్థానిక జాంపేట ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ మజీద్‌కు సల్మా రెండో భార్య. ఆయన మూడేళ్ల క్రితం మృతిచెందాడు. ఆయన మొదటి భార్యకు ముగ్గురు కుమారులు. వారు జాంపేటలో నివసిస్తున్నారు. మహ్మద్ సానియా ఈవెంట్లకు యాంకర్‌గా వెళ్తుంటుంది. సల్మా, సానియాలకు తోడుగా వారి ఇంట్లో మజీద్ మొదటి భార్య చిన్న కుమారుడు ఉమర్ ఉంటున్నాడు. ఆరునెలల క్రితం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ ఈవెంట్‌కు వెళ్లిన సమయంలో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీకాకుళం జిల్లా వాసి పల్లి శివకుమార్ లైట్‌బాయ్‌గా అక్కడకొచ్చాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తోందని..ఈ నేపథ్యంలో.. వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి శివకుమార్ సానియా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సానియా ఎవరితోనో ఫోన్లో చాటింగ్ చేస్తోందని గమనించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవ పడుతుంటే మొదటి భార్య కుమారులైన మహ్మద్ ఆలీ, ఉమర్‌లు శివకుమార్‌తో మాట్లాడి వెళ్లారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంటికి కూర పట్టుకుని ఉమర్ వచ్చాడు. తాళం వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా సల్మా, సానియా రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే 100 నంబర్‌కు ఫోన్‌చేసి పోలీసులకు విషయం చెప్పాడు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్, తన సిబ్బందితో తాళాలు పగులగొట్టి లోపల పరిశీలించారు. మెడమీదే బలమైన కత్తిపోటు గాయాలుండడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందినట్లు నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, శాంతిభద్రతల ఏఎస్పీ ఏవీ సుబ్బరాజు, డీఎస్పీలు బి. విద్య, శ్రీకాంత్ పరిశీలించారు. ఉమర్‌ను ఎస్పీ వివరాలడిగి తెలుసుకున్నారు. మహ్మద్ ఆలీ ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుడు శివకుమార్‌ను ఆదివారం మధ్యాహ్నం కొవ్వూరు ప్రాంతంలో కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి పట్టుకున్నారు. -
నేటి నుంచి పార్లమెంట్లో ‘అరకు’ కాఫీ ఘుమఘుమలు
సాక్షి, అమరావతి: ఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం కానున్నాయి. అరకు కాఫీకి మరింత ప్రచారం కల్పించేందుకు లోక్‌సభ స్పీకర్ అవకాశం కల్పించారు.సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద సోమవారం నుంచి ఈ నెల 28 వరకు స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి.సంధ్యారాణి, గిరిజన కో–ఆపరేటివ్ సొసైటీ(జీసీసీ) అధికారులు ఆదివారం ఢిల్లీ వెళ్లారు. -
ఓ వైపు ఎండలు.. మరోపక్క వానలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. రాయలసీమలోని అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య తదితర జిల్లాల్లో పలుచోట్ల శనివారం సాయంత్రం పిడుగులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసలపల్లెలో ఆదివారం 2.9 సెం.మీ. వర్షం పడింది.శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్నిచోట్ల వడగళ్ల వర్షం కురిసింది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లోనూ పలుచోట్ల ఆదివారం సాయంత్రం చెదురుమదురు వర్షాలు కురిశాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో జల్లులు పడ్డాయి. విజయవాడలోని గుణదల, ప్రసాదంపాడు తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో భారీ వర్షం కురిసింది.అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో చిరు జల్లులు కురిశాయి. ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు, మూడు రోజుల క్రితంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయి. ఆవర్తనం.. ద్రోణి ప్రభావంతోనే..ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఒక ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం వల్ల వీచే గాలులు, ద్రోణి ప్రభావంతో వీచే గాలులు కలిసినప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు పడుతున్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. -
ఎస్టీ రైతులపై పోలీసుల దాడి
ఖాజీపేట: చెరువులోని మట్టిని తరలించడంవల్ల తమ భూములకు నష్టం కలుగుతుందని ఎస్టీ రైతుల పోరాటం ఓవైపు.. ప్రభుత్వం అనుమతిచ్చిoది కాబట్టి చెరువు మట్టిని ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకుపోతాం అని కాంట్రాక్టర్ల బెదిరింపులతో ఆదివారం వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లె ఎస్టీ కాలనీలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, ఎస్టీ కాలనీ వాసులపై దాడిచేసి అడ్డొచ్చిన వారిని ఈడ్చిపడేసి పోలీసులు కాంట్రాక్టర్లకు దన్నుగా నిలిచారు. వివరాలివీ.. జాతీయ రహదారి నిర్మాణం కోసం నాగసానిపల్లె చెరువులో నుంచి మట్టిని తరలించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిoది. సుమారు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించుకునేందుకు అధికారులు ఓకే అన్నారు. అయితే, ఈ మట్టిని తరలించడంవల్ల చెరువుపై ఆధారపడ్డ రైతుల భూములకు నష్టం కల్గుతుందని.. సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని ఎస్టీ రైతులు నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్నారు. అలాగే, చెరువు మట్టిని తరలించొద్దని ఎస్టీ రైతులు రహదారికి అడ్డుగా మట్టివేసి నిరసనకు దిగారు. కానీ, ప్రత్యేక బలగాలతో వచ్చిన పోలీసులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. అడ్డొచ్చిన వారిని ఈడ్చిపడేశారు. నిర్దాక్షిణ్యంగా చొక్కాలు పట్టుకుని బలవంతంగా జీపు ఎక్కించే ప్రయత్నం చేశారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు వారిపై దౌర్జన్యం చేశారు. దీంతో నాగమ్మ అనే ఎస్టీ మహిళకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను కడప రిమ్స్‌కు తరలించారు. అలాగే, బలరాంనాయక్ అనే రైతుపై కూడా పోలీసుల దాడిచేయడంతో అతనికీ గాయాలయ్యాయి. పైగా అతని మెడలోని బంగారు గొలుసు మాయమైంది. వీరితోపాటు మరో ముగ్గురికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదిలా ఉంటే.. మట్టిని తరలించుకునేందుకు వీలుగా గ్రామంలో పోలీస్ పహారా ఏర్పాటుచేశారు. స్థానిక ప్రజలెవరూ అడ్డురాకుండా పోలీసులు తీవ్రస్థాయిలో గ్రామస్తులను హెచ్చరించారు. బయటకొస్తే కేసులు పెడతామని బెదిరించారు. అనంతరం కాంట్రాక్టర్లు రోడ్డుపై అడ్డుగా ఉన్న మట్టిని తొలగించి చెరువులోని మట్టిని యథేచ్ఛగా తరలించారు. పోలీసుల దౌర్జన్యం దారుణం.. మట్టి తరలింపుతో మా పొలానికి నీళ్లువచ్చే అవకాశంలేదు కాబట్టి నిరసన తెలుపుతున్నాం. అయితే, కాంట్రాక్టర్లకు మద్దతుగా పోలీసులు మాపై దౌర్జన్యం, దాడిచేయడం దారుణం. నా మెడలో గొలుసు పోయింది. పోలీసులు కాంట్రాక్టర్లకు మేలుచేయడం మంచి పద్ధతికాదు. – బలరాంనాయక్, నాగసానిపల్లె ఎస్టీ కాలనీరైతులు నష్టపోయినా ఫర్వాలేదా!? చెరువులో మట్టిని తరలించడంవల్ల మాకు పూర్తిగా నష్టం కల్గుతుందని మేం పోరాడుతున్నాం. కానీ, పోలీసులు మాత్రం కాంట్రాక్టర్ల మేలు కోరడం బాధాకరం. అంటే.. రైతులు నష్టపోయినా వారికి ఫర్వాలేదా!? – కృష్ణానాయక్, రైతు, నాగసానిపల్లె ఎస్టీ కాలనీ -
అరటి రైతుల ఆత్మహత్యాయత్నం
యల్లనూరు/పులివెందుల రూరల్: వారం రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట అకాల వర్షానికి దెబ్బతినడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక ఇద్దరు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నంచిన ఘటన అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జాంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.బాధిత కుటుంబాల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న వెంగప్ప 9 ఎకరాలు, లక్ష్మీనారాయణ మరో 10.5 ఎకరాల్లో అరటి తోటలు సాగు చేశారు. అప్పులు తెచ్చి ఒక్కొక్కరూ రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వారం రోజుల్లో పంట కోత కోయాల్సి ఉంది. ఒక్కో రైతుకు కనీసం రూ.20 లక్షల వరకు వస్తుందని ఆశపడ్డారు. కానీ.. శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి పంట దెబ్బతింది.వడగళ్లు అరటి గెలలపై పడటంతో కాయలకు మచ్చలు వస్తాయని, దీనివల్ల పంటను ఎవరూ కొనరని బాధిత రైతులు ఆవేదన చెందారు. పంట నష్టాన్ని పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆదివారం ఉదయం ఉద్యాన శాఖ అధికారులను ఫోన్లో కోరారు. సెలవు రోజు కావడంతో అధికారులు సరైన రీతిలో స్పందించలేదు. దీంతో రైతులిద్దరూ తాము తీవ్రంగా నష్టపోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. అప్పులు తీర్చే దారిలేక... చివరకు ఆత్మహత్యలే గతి అని భావించి తోటలోనే పురుగు మందు తాగారు.చిన్నవెంగప్ప భార్య రాజమ్మ ఈ విషయాన్ని గమనించి గ్రామస్తులకు చెప్పగా.. ఇద్దరినీ పులివెందుల ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. పంట నష్టం జరిగిన తోటలను ఆదివారం మధ్యాహ్నం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఉద్యాన అధికారి ఉమాదేవి, తహసీల్దార్ రాజా పరిశీలించారు. కాగా.. రైతులు ఫోన్ చేసినా తాము స్పందించలేదనడంలో వాస్తవం లేదని, వెంటనే పొలాల వద్దకు వెళ్లి బాధిత రైతులను ఆస్పత్రికి తరలించడంలో సహాయపడ్డామని ఉద్యాన అధికారి ఉమాదేవి చెప్పారు. ఎవరూ పట్టించుకోవడం లేదుమొత్తం పదిన్నర ఎకరాల్లో అరటి పంట వేశాను. 15 వేల మొక్కలు నాటాను. ప్రస్తుతం ఐదు వేల చెట్లలో పంట కోతకు వచ్చింది. రెండు, మూడు రోజుల్లో కోసి విక్రయించేవాళ్లం. మా ఖర్మ ఏమైందో గానీ వడగళ్ల వాన వచ్చింది. పంట మొత్తం దెబ్బతింది. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి?. ఒక్క అధికారి కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. – లక్ష్మీనారాయణ, ఆత్మహత్యాయత్నం చేసిన రైతుతీవ్రంగా నష్టపోయాంతొమ్మిది ఎకరాల్లో అరటి పంట వేశా. రూ.లక్షలు అప్పు చేసి పంట పెట్టా. 11 నెలలు పడ్డ కష్టానికి రెండు రోజుల్లో ఫలితమిచ్చేది. గెలలు విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో కాస్తయినా అప్పులు తీర్చుకునేవాళ్లం. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. మా ఆశలపై నీళ్లు పడ్డాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే ఆత్మహత్యే శరణ్యం. – చిన్నవెంగప్ప, ఆత్మహత్యాయత్నం చేసిన రైతు -
పాపికొండల్లో.. అరుదైన అతిథులు!
వేలాది పక్షి జాతుల నిలయంగా పాపికొండలు అటవీ ప్రాంతం అలరాలుతోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 1,01,200 హెక్టార్లలో ఇది విస్తరించి ఉంది. వేసవిలోనూ ఇక్కడ చల్లటి వాతావరణం ఉండటంతో వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది పక్షుల గణనలో 46,700 వరకు వివిధ రకాల పక్షి జాతులున్నట్టు గుర్తించామని వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజనల్ ఫారెస్ట్ అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ మడ అడవుల వద్ద క్రిస్టడ్ సర్పెంట్ ఈగల్(నల్ల పాముల గద్ద), మలబార్ పైడ్ హార్న్‌బిల్, స్కేర్లెట్ మినివెట్, ఇండియన్ స్కిమ్మర్‌తో పాటు మరో ఆరు రకాల అరుదైన వలస పక్షులను గుర్తించినట్టు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అధికారి మహేష్ చెప్పారు. – బుట్టాయగూడెం -
‘రెడ్‌బుక్’కు సహకరించని వారిపై బదిలీ వేటు!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలకు సహకరించని పోలీస్ అధికారులకు పొగబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతోంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, సీఐడీ విభాగంలో ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌లను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసేందుకు సిద్ధపడుతోంది. దీర్ఘకాలిక సెలవు నుంచి తిరిగొచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను కీలక పోస్టులో నియమించాలని భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీకి ప్రభుత్వం ఉపక్రమించింది. ఐజీ నుంచి డీజీ స్థాయి అధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో భాగంగా.. ⇒ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చీని బదిలీచేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయనపట్ల టీడీపీ ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విశాఖపట్నం వంటి కీలక నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకోవాలని అమరావతిలోని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, అందుకు శంఖబత్ర బాగ్చీ సహకరించడంలేదని ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో విశాఖపట్నం సీపీగా ప్రస్తుత గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అక్రమాలకు ఆయన ఏకపక్షంగా కొమ్ముకాసిన విషయం తెలిసిందే. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం ఆపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన వివాదంపై దర్యాప్తు కోసం నియమించిన సిట్‌లో ఆయన్నే సభ్యునిగా చేర్చారు. ఈ నేపథ్యంలో.. నిబంధనలతో నిమిత్తం లేకుండా టీడీపీ పెద్దల ఆదేశాలను అమలుచేస్తారనే నమ్మకంతోనే సర్వశ్రేష్ఠ త్రిపాఠిని విశాఖ పోలీస్ కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ అలాగే, నిబంధనల మేరకు మాత్రమే పనిచేసే అధికారిగా గుర్తింపు పొందిన సీఐడీ విభాగంలో ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్‌ను కూడా బదిలీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెడ్‌బుక్ కుట్రలో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్ ఇన్చార్జ్గా ఈయన ఉన్నారు. దర్యాప్తుతో నిమిత్తం లేకుండా తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడికి ఆయన ఏమాత్రం లొంగలేదు. నిబంధనల మేరకు దర్యాప్తు చేస్తా.. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోతానని వినీత్ స్పష్టంచేసి సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో.. అప్పటికప్పుడు ఆయన్ను బదిలీచేస్తే అభాసుపాలవుతామని ప్రభుత్వ పెద్దలు వెనుకంజ వేశారు. అందుకే ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ పేరుతో ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి అప్రాధాన్య పోస్టుకు పరిమితం చేయాలని చూస్తున్నారు. ⇒ ఇక దీర్ఘకాలిక సెలవు ముగించుకుని వచ్చిన డీజీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను ప్రభుత్వం కీలక పోస్టులో నియమించనుంది. ఆయనకు పోలీసు శాఖలో పోస్టు ఇస్తారా లేదా ఇతర శాఖలో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఐటీ శాఖలో ఆయన్ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ⇒ మరోవైపు.. తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి కేటాయించిన డీజీ స్థాయి అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్ ఇంకా రాష్ట్రంలో రిపోర్టు చేయలేదు. మరో ఐపీఎస్ అభిషేక్ మహంతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారు ఏపీలో రిపోర్ట్ చేసిన అనంతరం వారిని ఏ పోస్టుల్లో నియమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారులను కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులను ఈ వారంలోనే బదిలీ చేసే అవకాశాలున్నాయని పోలీసుశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
అకాల వర్షం.. అపార నష్టం.. నేడు పరిశీలించనున్న వైఎస్ జగన్
ఇది నిన్నటి దృశ్యం.పచ్చటి అరటి తోటలు.. బారెడు గెలలతో కోతకు సిద్ధమయ్యాయి.. తమ ఆశలు పండించేలా ఉన్న తోటల్ని చూసి రైతు కళ్లల్లో ఆనందం తాండవించింది. ఇక అప్పులన్నీ తీరతాయని ధైర్యం వచ్చింది. ఇది నేటి పరిస్థితి.ఎటు చూసినా విరిగిన అరటి చెట్లు.. నేలవాలిన తోటలు. చేతికందే దశలో పంట నేలపాలై కంట నీరు పెట్టుకుంటున్న రైతులు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని దీనస్థితి. అమరావతి/లింగాల/అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షాలకు వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. పెద్దకుడాల గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. 3 ఎకరాల్లో యాలకి (సుగంధాలు) అరటి సాగు చేయగా.. పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. గోరుచుట్టుపై రోకలి పోటులా.. గోరుచుట్టుపై రోకలి పోటులా అకాల వర్షం వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని అరటి రైతులను దెబ్బతీసింది. గత నెలలో టన్ను అరటి ధర రూ.23 వేల నుంచి రూ.25 వేలు ఉండేది. ఇప్పుడు ధరలు పడిపోవడంతో పెట్టుబడులు దక్కుతాయో లేదోనని అరటి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు చేసి పంటల్ని సాగుచేస్తే చేతికందాల్సిన పంట నేలనంటిందని వాపోతున్నారు. పురుగు మందులు, ఎరువుల ధరలు ఏటా పెరుగుతుంటే.. పంట సాగుచేసిన తమకు గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటల్ని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రైతుల్ని ఆదుకుంటాం: సీఎం అకాల వర్షాలు ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పంటలు దెబ్బతిన్న జిల్లాల కలెక్టర్లతో సీఎం ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయి అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లికి చెందిన ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై సీఎం ఆరా తీశారు. ఆ ఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.ప్రభుత్వం ఆదుకోవాలికోటి ఆశలతో అప్పులు చేసి అరటి పంటను సాగు చేస్తే అకాల వర్షం, ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ వర్షానికి తీవ్రంగా నష్టపోయాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – శ్రీనివాసులరెడ్డి, అరటి రైతు, ఎగువపల్లెఈ స్థితి వస్తుందనుకోలేదుఏటా ఏప్రిల్, మే నెలల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసేవి. ఆలోగా రైతులు అరటి పంట దిగుబడి చేతికందేది. ఈ ఏడాది ముందుగానే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో తీవ్రంగా నష్టపోయాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. – రామాంజనేయరెడ్డి, అరటి రైతు, పెద్దకుడాలనేడు వైఎస్ జగన్ పర్యటన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ మండల కన్వినర్ బాబురెడ్డి తెలిపారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిన అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారన్నారు. -
సిండికేటు లూటీ!
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కాజేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్లతో సిండికేట్‌ను ఏర్పాటు చేసి రాజధాని నిర్మాణ పనులను అధిక ధరలకు కట్టబెడుతున్నారు. మొన్న.. రూ.10,696.79 కోట్ల వ్యయంతో 37 ప్యాకేజీల కింద రాజధాని ముంపు నివారణ, రహదారుల నిర్మాణంలో మిగిలిన పనులకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏడీసీఎల్) నిర్వహించిన టెండర్లలో సిండికేట్ బాగోతం బట్టబయలైంది. నేడు.. రూ.16,463.83 కోట్ల వ్యయంతో 22 ప్యాకేజీల కింద భూసమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు లేఅవుట్ల అభివృద్ధి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్.. మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్ అధికారులకు బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఖరారు చేసిన టెండర్లలోనూ ప్రభుత్వ పెద్దల లాలూఛీ బాగోతం మరోసారి బట్టబయలైంది. ఏడీసీఎల్, సీఆర్డీఏ రెండు కలిసి రూ. రూ.27,160.62 కోట్ల కాంట్రాక్టు విలువతో 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. ఈ పనులను రూ.28,209.62 కోట్లకు సిండికేట్‌లోని ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. కాంట్రాక్టు విలువ కంటే సగటున 3.94 నుంచి 4.34 శాతం అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై రూ.1,049 కోట్లు భారం మోపారు. అదే రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో ఉండి ఉంటే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి కనీసం 8 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చేవారని.. దీనివల్ల ఖజానాకు రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల మేర ఆదా అయ్యేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సిండ్ఙికేటు’ రాజ్యం..!రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలవక ముందే సన్నిహిత కాంట్రాక్టు సంస్థలతో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపారు. ఆ కాంట్రాక్టర్లతో సిండికేట్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 2014–19 మధ్య షాపూర్జీ పల్లోంజీ కాంట్రాక్టు సంస్థ నుంచి ముఖ్యనేత తరఫున కమీషన్లు వసూలు చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సాక్ష్యాధారాలతో పట్టుబడిన అధికారే ఇప్పుడూ ప్రభుత్వ పెద్దల తరఫున సిండికేట్ కాంట్రాక్టర్లతో చక్రం తిప్పుతున్నారు. సిండికేట్‌లోని కాంట్రాక్టర్ల ప్రతిపాదన మేరకే వారికి అధికంగా పనులు కట్టబెట్టేందుకు వీలుగా బిడ్ కెపాసిటీని 2 ఎన్ఎన్–బీ నుంచి 3 ఏఎన్–బీకి పెంచుతూ ఫిబ్రవరి 10న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించారు. అంతకు ముందే అంచనాలను ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి, సిండికేట్ కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ జారీ చేయడానికి వీలుగా జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాన్ని కూడా రద్దు చేశారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్డానికి వీలుగా రివర్స్ టెండరింగ్ విధానానికి కూడా మంగళం పాడారు. తమ అక్రమాలకు అడ్డొచ్చే వ్యవస్థలు.. విధానాలను అన్నింటినీ రద్దు చేశాకే రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు.పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధికి రూ.14,887.64 కోట్లు..భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పథకం కింద రాజధానికి రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. ఆ పథకం కింద రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలి. అందుకు రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం వంటి కనీస సదుపాయాలు కల్పించడం ద్వారా లేఅవుట్లను అభివృద్ధి చేయాలి. రాజధానికి భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వడానికే 17 వేల ఎకరాలు భూమి అవసరం. ఇందులో లేఅవుట్ల అభివృద్ధి పనులకు 18 ప్యాకేజీల కింద సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ పనులన్నింటినీ కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకే సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. రూ.14,887.64 కోట్లకు ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ తదితర పన్నుల రూపంలో కాంట్రాక్టర్లకు అదనంగా ఇస్తామని సీఆర్డీఏ చెప్పిన మొత్తాన్ని కూడా కలిపితే ఈ పనుల వ్యయం రూ.17 వేల కోట్లకు చేరుతుంది. అంటే ఎకరం భూమిలో లేఅవుట్ అభివృద్ధి చేయడానికే సగటున రూ.కోటి చొప్పున వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి. వాస్తవానికి అత్యాధునిక సదుపాయాలతో లేఅవుట్‌ను అభివృద్ధి చేయడానికి ఎకరానికి రూ.50 లక్షలకు మించి వ్యయం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇక సీఆర్డీఏ ద్వారా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగుతూ చేపట్టిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్.. మంత్రులు, జడ్జీలకు బంగ్లాలు.. ఐఏఎస్‌లకు బంగ్లాల నిర్మాణ పనులను నాలుగు ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు అప్పగించారు.– ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన కృష్ణారెడ్డికి చెందిన మేఘా సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లే అవుట్లు అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ఐదు ప్యాకేజీల పనులను కట్టబెట్టారు. ఈ పనుల విలువ రూ.5,608.7 కోట్లు.– ఈనాడు కిరణ్ సోదరుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి నాలుగు పనులను ప్రభుత్వ పెద్దలు అప్పగించారు. ఈ పనుల విలువ రూ.2,813.66 కోట్లు.– బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్లకు సంబంధించి ఎనిమిది ప్యాకేజీల పనులను అప్పగించారు. వీటి విలువ రూ.3,945.47 కోట్లు.– ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఏవీ రంగరాజు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఎన్సీసీ సంస్థకు హ్యాపీ నెస్ట్‌తోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం, ఓ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ పని అప్పగించారు. వీటి విలువ రూ.3,438.21 కోట్లు.– మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆయన తరఫున ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన కనకమేడల వరప్రసాద్‌కు చెందిన కేఎమ్వీ ప్రాజెక్ట్స్‌కు ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనులు కట్టబెట్టారు.– సీఎం చంద్రబాబుతో ఆది నుంచి సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ అభివృద్ధి చేసే ఒక ప్యాకేజీ పనిని అప్పగించారు.ఎనిమిది సంస్థలకే పనులన్నీ..రాజధాని అమరావతిలో వరద మళ్లింపు, రహదారుల అభివృద్ధి పనులను 37 ప్యాకేజీల కింద చేపట్టేందుకు రూ.15,095.02 కోట్లతో ఏడీసీఎల్‌కు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇక ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధి, హ్యాపీనెస్ట్, మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్ అధికారుల బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణ పనులను 22 ప్యాకేజీల కింద చేపట్టడానికి రూ.22,607.11 కోట్లతో సీఆర్డీఏకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ రెండూ మొత్తం 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. వాటన్నింటినీ సిండికేట్‌లోని ఎనిమిది సంస్థలే దక్కించుకున్నాయి. ఎన్సీసీ సంస్థ రూ.6,124.08 కోట్లు, బీఎస్సార్ ఇన్ఫ్రా రూ.6,216.47 కోట్లు, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ రూ.6,031.79 కోట్లు, మేఘా రూ.7,022.38 కోట్లు, ఎమ్వీఆర్ ఇన్ఫ్రా (నారా లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ భరత్ సన్నిహితుడికి చెందిన సంస్థ)కు రూ.796.04 కోట్లు, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే కృష్ణయ్యకు చెందిన బీఎస్పీసీఎల్‌కు రూ.779.82 కోట్లు, ఎల్ అండ్ టీ సంస్థకు రూ.809.88 కోట్లు, కేఎమ్వీ ప్రాజెక్ట్స్‌కు రూ.429.23 కోట్ల విలువైన పనులను కట్టబెట్టబెట్టారు.నీకింత.. నాకింత..సీఆర్డీఏ, ఏడీసీఎల్ 59 ప్యాకేజీల కింద పనులకు పిలిచిన టెండర్లను ప్రభుత్వం ఆమోదించింది. ఆ పనులను రూ.28,209.62 కోట్లకు ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. ఆ పనులను అప్పగిస్తూ సీఆర్డీఏ, ఏడీసీఎల్ వాటితో ఒప్పందం చేసుకున్న వెంటనే కాంట్రాక్టు విలువలో పది శాతం అంటే రూ.2,820.96 కోట్లను ఆ సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెబుతాయి. అందులో 8 శాతం అంటే.. రూ.2,256 కోట్లను ప్రభుత్వ పెద్దలు తొలి విడత కమీషన్లుగా రాబట్టుకోనున్నారు. ఇందుకోసమే గత ప్రభుత్వం రద్దు చేసిన మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని పునరుద్ధరించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. సిండికేట్ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసే బాధ్యతను గతంలో ఆదాయపు పన్ను శాఖకు చిక్కిన అధికారికే ప్రభుత్వ పెద్దలు అప్పగించినట్లు చర్చ సాగుతోంది. -
విలువే లేకుండా పోయింది.. ఎందుకీ ఊడిగం!
కూటమి విజయానికి మనమే కారణం అయ్యాం... మనం లేకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా.. ఆయన సీఎం అయ్యేనా.. కాపులంతా గంపగుత్తగా ఓట్లేయకపోతే కూటమికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది.. ఇన్ని సీట్లు ఎలా వస్తాయి..ఈ కూటమి ప్రభుత్వ రథానికి మనమే చక్రాలం..మనమే ఇరుసు..మనమే ఇంధనం కానీ ఇప్పుడు మనం కరివేపాకులం అయిపోయాం. పులుసులో ముక్కలం అయిపోయాం .. మనకు ఎక్కడ విలువ గౌరవం దక్కడం లేదు.దేనికోసం ఇంత త్యాగాలు చేయాలి అంటూ జనసేన ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి.. అందులో 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఈ ముగ్గురికి క్యాబినెట్లో స్థానం దక్కింది.. మిగతా 18 మంది వట్టి ఎమ్మెల్యేలు గానే ఉన్నారు. అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని జనసేన బాధపడుతుంది.జనసేన ఎమ్మెల్యే కన్నా టిడిపి ఇంచార్జీ మిన్నతాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీని ఆ నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జిలకే అధికారులు గౌరవిస్తున్నారని వారి మాట వింటున్నారని తమకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని జనసేన ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతూ కాసేపటి క్రితం విజయవాడలోని హోటల్లో సమావేశం అయ్యారు. దీనికి నాదెండ్ల మనోహర్ కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మనోహర్ తో ఎమ్మెల్యేలంతా ఈ విషయాన్ని మొరపెట్టుకున్నట్లు తెలిసింది. స్థానికంగా తమ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీని తమ మాటను పోలీసులు రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎవరూ వినడం లేదని తెలుగుదేశం వారు చెబితేనే అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని మనోహర్ ఎదుట వాపోయారు.మంత్రులుగా ఉన్న ఆ ముగ్గురికి నియోజకవర్గంలో కాస్త గౌరవం ఉన్నప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి ఇండిపెండెంట్‌గా పని చేసే అవకాశం దక్కడం లేదు. నియోజకవర్గాల పెద్ద పని ఏదైనా ఉంటే ఆ జిల్లా మంత్రి వద్దకు వెళ్లాల్సి వస్తుంది. పైగా ఆ మంత్రి కూడా లోకేష్ కంట్రోల్లో పనిచేస్తున్నారు. లోకేష్ కూడా జనసేన ను పెద్దగా పట్టించుకోకుండా జిల్లాల తన సొంత టీం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. దీంతో అనివార్యంగా జనసేన నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. పలుచోట్ల వ్యాపారాల్లోనూ అక్రమ ఆదాయం తెలుగుదేశం జనసేన మధ్య పోటీ నెలకొన్న తరుణంలో తెలుగుదేశం వారు పలువురు జనసేన కార్యకర్తలను వెంటాడి కొట్టిన ఘటనలు ఉన్నాయి.ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు తెలుగుదేశానికి ఊడిగించేయడం కోసమే తమ పార్టీ ఉందా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం ఇన్చార్జిలకు అధికారులు గౌరవం ఇవ్వడం దానికి ఎంత అవమానం అన్నది ఈ సమావేశంలో వారంతా నాదెండ్ల మనోహర్ కు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పెద్దలతో మాట్లాడి సెటిల్ చేస్తే జిల్లాలో తమ గౌరవం నిలబడుతుందని అంతిమంగా పార్టీ కూడా బలపడే అవకాశం ఉంటుందని వారు చెప్పుకున్నారు.కానీ జనసేన బలపడాలని తెలుగుదేశం ఏ కోశానా కోరుకోదు. జనసేన బలం తమకు బలం కావాలని తెలుగుదేశం భావిస్తుంది తప్పితే జనసేన సొంతంగా తన కాళ్లపై తన నిలబడి పోటీ చేసే పరిస్థితి వస్తే తెలుగుదేశానికి ఎంత ఇబ్బంది అన్నది చంద్రబాబు లోకేష్ లకు తెలుసు. అందుకే ఎక్కడికి అక్కడ జనసేన నాయకులను కార్యకర్తలను తమ కాళ్ళ కింద పెట్టి ఉంచుతూ ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం క్యాడర్‌ను మాత్రమే గుర్తిస్తూ పనులు పథకాలు పైరవీలు అని వాళ్ల ద్వారా జరిగేలా చూస్తున్నారు.నియోజకవర్గాల్లో పనులు అంటూ జరిగితే తెలుగుదేశం వారి ద్వారానే జరగాలి లేదంటే లేదు. అంతేతప్ప జనసేన నాయకుడికి ఎక్కడా మర్యాద దక్కకూడదు అనే సింగల్ పాయింట్ ఏజెండాతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇదంతా తమకు అవమానంగా భావిస్తున్న జనసేన ఎమ్మెల్యేలు తమ గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ మనోహర్ మీద ఒత్తిడి తెచ్చారు. మరోవైపు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ శాఖను సైతం హైజాక్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా జనసేన మనుగడకు.. భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని వారు కలవరపడుతూ దిద్దుబాటు చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏ స్థాయి ఫలితాలు ఇస్తుందో చూడాలి.-సిమ్మాదిరప్పన్న -
రేపు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) పులివెందులలో పర్యటించనున్నారు. లింగాలలో పడిపోయిన అరటి తోటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. భారీవర్షాలు, ఈదురు గాలులకు అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. బాధిత రైతులను ఆయన పరామర్శించనున్నారు.వైఎస్సార్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానకు భారీగా అరటి పంటలు నేలకూలాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘జీవీఎంసీ మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటాం’
విశాఖ : సంఖ్యా బలం లేకపోయినా విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని వైఎస్సార్సీపీ రిజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. తాము జీవీఎంసీ మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటామన్నారు కన్నాబాబు. ఈరోజు(ఆదివారం) విశాఖలో బొత్స సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్నబాబు, గుడివాడ్ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ టీడీపీ ఎప్పుడూ సిగ్గుమాలిన నీతిలేని రాజకీయం చేస్తుంది. కుట్రపూరితంగా మేయర్ పై అవిశ్వాసం ఇచ్చారు. రాష్ట్ర పాలనను కూటమికి ఇచ్చారు. స్థానిక సంస్థలు వైఎస్సార్సీపీకి ఇచ్చారు. భయపెట్టి మా వాళ్లను తీసుకెళ్తున్నారు. బొత్స అధ్యక్షతన మా కార్పోరేటర్లతో సమావేశం నిర్వహించాం. దొడ్డిదారి రాజకీయాలకు టీడీపీ పేటెంట్.. కూటమి తీరును ఖండిస్తున్నాం. . అదే సమయంలో వారి కుట్రలను ఎదుర్కొంటాం. అనైతికి రాజకీయాలు మానేయాలని సీఎం చంద్రబాబుకి హితవు పలుకుతున్నా’ కన్నబాబు పేర్కొన్నారు.అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి?టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి వైఎస్సార్సీపీ కార్పోరేటర్లను కూటమి చేర్చుకుంటుంది. 30, 40 మందితో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి సర్కార్ భావిస్తోంది. మా రాజకీయం మేం చేసఆం.. మా వారిని మేం కాపాడుకుంటాం. మా వ్యూహ రచనలతో మేయర్ పీఠాన్ని కాపాడుకుంటాం.’ అని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.విలువలు వదిలేసి.. మేయర్ పదవిపై కన్నేసి -
పులివెందుల: చవ్వా విజయశేఖర్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు.అనంతరం విజయశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.పులివెందుల ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్‌రెడ్డి అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ప్రజల సందర్శనార్ధం ఆయన పార్థివదేహాన్ని పాల్‌రెడ్డి ఫంక్షన్ హాలులో ఉంచారు. విజయశేఖర్‌రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్‌కి దగ్గరి బంధువు. -
‘మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక లోకేష్ అబద్ధాలు’
నెల్లూరు: శాసనమండలిలో తమకు సమాధానం చెప్పలేక మంత్రులు తోకముడిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్‌రెడ్డి.. ‘ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను మండలిలో అడుడగడునా ఎండగట్టాం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్ అబద్ధాలు చెప్పారు. బీసీల బలవంతపు రాజీనామాలపై సుదీర్ఘంగా చర్చించకుండా లోకేష్ తోకముడిచారు. గత ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు ఇస్తే.. కూటమి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయింది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై సంతకం పెట్టి.. ఇప్పటివరకూ దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వం లక్షల్లో ఉద్యోగాలు ఇస్తే కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను తీసేస్తోంది.వైఎస్సార్సీపీలో ఉండే ఏ ఒక్కరికి రాజకీయ స్వార్థం లేదు. మా నాయకుడు వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకోవడమే మా అందరి లక్ష్యం. నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చూసినా.. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పేద ప్రజలకు వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయడం లేదు’ అని ధ్వజమెత్తారు. -
విలువలు వదిలేసి.. మేయర్ పదవిపై కన్నేసి
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో సంఖ్యా బలం లేనప్పటికీ.. బలవంతంగా మేయర్ పీఠాన్ని లాక్కునేందుకు కూటమి కుటిల యత్నాలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతూ.. ప్రలోభాలకు గురిచేస్తూ బరితెగిస్తున్నారు. అందులో భాగంగానే జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి కూటమి పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర్ ప్రసాద్‌కు నోటీసు ఇచ్చారు..డబ్బు ఎర.. లొంగనివారికి బెదిరింపులుకూటమిలో చేరితే దాదాపు రూ.25 లక్షలు ఇస్తామంటూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు ఎర వేస్తున్నట్టు తెలిసింది. అక్కడికీ లొంగకపోతే మరింత ఎక్కువ ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు. మీ వార్డుల్లో పెద్దఎత్తున పనులకు సహకరిస్తాం.. అని ప్రలోభ పెడుతున్నారు. ఈ ఆఫర్లకు ఒప్పుకోని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. అవిశ్వాసానికి 64 మంది కార్పొరేటర్లు అవసరం..2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 98 కార్పొరేటర్ల స్థానాలకు గాను వైఎస్సార్సీపీ 58 కైవసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుంది. టీడీపీ(30), జనసేన (3), సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కొక్కటి నెగ్గాయి. స్వతంత్రులు 4 స్థానాల్లో గెలిచారు. ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు మరణించగా జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపొందింది. దీంతో వైఎస్సార్సీపీ బలం 60కి చేరింది. 21వ వార్డు కార్పొరేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ తొలుత ఎమ్మెల్సీగా తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ వార్డుకు ఉప ఎన్నిక జరగక ఖాళీగా ఉంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల సంఖ్య 59, టీడీపీ సభ్యుల సంఖ్య 28కి తగ్గింది.స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నుంచి 12 మంది టీడీపీలో, ఏడుగురు జనసేనలో చేరారు. స్వతంత్రులు నలుగురు జనసేనకు మద్దతు తెలపడంతో ఆ పార్టీ బలం 14కి చేరింది. ప్రస్తుతం కూటమికి 55 మంది, వైఎస్సార్సీపీకి 40, సీపీఐ, సీపీఎంలకు ఒక్కో సభ్యుడు ఉన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే 2/3 మెజార్టీ కార్పొరేటర్లు (64) ఉండాలి. -
విశాఖ వాసికి బిల్ గేట్స్ ప్రశంస
అక్కిరెడ్డిపాలెం: అప్పుడే పుట్టిన శిశువుల్లో వచ్చే పచ్చకామెర్ల నివారణకు వినియోగించే ఎనలైట్–360 పరికరాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పరిశీలించారు. అక్కిరెడ్డిపాలేనికి చెందిన ఎం.సుబ్రహ్మణ్యప్రసాద్ ఈ పరికరాన్ని తయారు చేశారు. దీనిని దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో ప్రదర్శించగా.. బిల్‌గేట్స్ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. పరికరం తయారుచేసిన ప్రసాద్‌ను అభినందించారు. ఈ పరికరం తయారీతో నూతన ఆవిష్కరణలకు అందించే ప్రతిష్టాత్మక ఆరోహణ్ సోషల్ ఇన్నోవేషన్ అవార్డు 2023ను ప్రసాద్ ఇప్పటికే సాధించారు. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న బిల్ గేట్స్.. పోలియో నిర్మూలన, హెచ్ఐవీ నివారణ, క్షయ నిర్మూలన వంటి వాటికోసం భారతదేశం చేపట్టిన ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. భారత్ కు వచ్చే ముందు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ పురోగతి అనన్య సామాన్యమని బిల్ గేట్స్ అన్నారు. గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తోందని, కీలక రంగాలలో పురోగతిని సాధించడానికి ప్రభుత్వం, పరిశోధకులు, వ్యవస్థాపకులతో కలిసి పనిచేస్తుందని బిల్ గేట్స్ హైలైట్ చేశారు. గేట్స్ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా.. ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్‌లో సమావేశమవుతోంది. ఈ కార్యక్రమానికి భారత్ అనువైన ప్రదేశం అని ఆయన అన్నారు. -
‘లావు శ్రీకృష్ణదేవరాయలు.. నా కాల్ డేటాను తీశారు’
సాక్షి, పల్నాడు జిల్లా: తనపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వారిని తాను ఎప్పుడూ చూడలేదని.. కూటమి నేతల డైరెక్షన్లోనే తనపై ఏసీబీ కేసు నమోదు చేసిందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాలతోనే ఏసీబీ కేసు పెట్టారని మండిపడ్డారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని ఎంపీ కృష్ణదేవరాయులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నా కాల్ డేటాను తీశారు. ఆయన ఒత్తిడితోనే కాల్‌డేటా తీసినట్లు పోలీసులు ఒప్పుకున్నారు. ఫిర్యాదు చేసిన వారితో నాకెలాంటి సంబంధం లేదు’’ అని విడదల రజిని స్పష్టం చేశారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాలు తారాస్థాయికి చేరాయి. నాపై ఏసీబీ అక్రమంగా కేసు నమోదు చేసింది. కూటమి నేతల బెదిరింపులకు నేను భయపడను. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. రెడ్ బుక్ పాలనలో నన్ను టార్గెట్ చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారు. అదిగో రజిని.. ఇదిగో రజిని అంటూ ఆవు కథలు చెబుతున్నారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారులను ఇంతవరకూ నేను కలవ లేదు. రెడ్ బుక్ పాలనకు పరాకాష్టే ఈ ఏసీబీ కేసు’’ అని రజిని మండిపడ్డారు.‘‘ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తి. మార్కెట్ ఏజెన్సిని పెట్టి నాపై కేసులను పెట్టిస్తున్నారు. ఈ కథకు మొత్తం డైరెక్టర్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు. అక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి ఫిర్యాదు దారులకు సహకరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. నేనంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఎక్కువ కోపమే. 2020లో గురజాల డీఎస్పీ, సీఐలకు లంచం ఇచ్చి నాతో పాటు నా కుటుంబ సభ్యుల కాల్ డేటాను తీయించారు. బీసీ మహిళ, ఎమ్మెల్యే అయిన నా కాల్ డేటాను తీయించారు. నా వ్యక్తి గత జీవితంలో ఎందుకు రావాలనుకున్నారో తెలియదు. మీ ఇంటిలో ఉన్న ఆడపిల్లల కాల్ డేటా తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతటి నీచుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు’’ అని విడదల రజిని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ ఎంపీని ప్రశ్నించారు. అప్పుడే ఆయన మనసులో శ్రీకృష్ణదేవరాయలు నమ్మకాన్ని కోల్పోయారు. అప్పటి నుండి ఎంపీ నాపై కక్ష పెంచుకున్నాడు. పది నెలల నుండి ఒకే ఫిర్యాదును పదేపదే అందరికి ఇప్పించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీగా ఉన్న శ్రావణ్ టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కొడుకు. ఆ ఎస్పీ ఇచ్చే విజిలెన్స్ నివేదిక ఏవిధంగా ఉంటుందో ఆలోచించండి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ తెలుగుదేశం రిపోర్ట్. అవినీతి ఘనాపాటి ప్రత్తిపాటి... నా మీద, జర్మనీలో ఉండే నా మరిది మీద అక్రమ కేసులు పెట్టించారు. నా మామ కారుపై దాడి చేయించారు. ఎవరూ ఎటువంటి వారో అందరికి తెలుసు. నా కళ్లలో భయం చూద్దామనుకుంటున్నారు. ఇటువంటి వాళ్లను చూస్తే నాకు భయమనిపించదు’’ అని విడదల రజిని చెప్పారు.లావు రత్తయ్య అంటే నాకు గౌరవం. శ్రీకృష్ణదేవరాయలు వైజాగ్‌లో చెరువు భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోసానిని రాష్ట్రమంతా తిప్పి ఇబ్బందిపెట్టారు. వడ్లమూడి యూనివర్సిటీ నుంచి చిలకలూరిపేట ఎంత దూరమో? చిలకలూరిపేట నుంచి వడ్లమూడి యూనివర్సిటీ అంతే దూరం. శ్రీకృష్ణదేవరాయలు ఇది గుర్తుపెట్టుకోవాలి’’ అని విడదల రజిని హెచ్చరించారు. -
AP: ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం.. 1000 ఎకరాల్లో..!
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్, అనంతపురం జిల్లాలల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్థరాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానకు భారీ ఎత్తున అరటి పంటలు నేలకూలాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాలతో పాటు అనేక గ్రామాలలో అరటి చెట్లు నేలకూలాయి. సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో లబోదిబోమని అంటున్నారు రైతులు.రెండు జిల్లాలో పరిధిలో సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆకస్మికంగా వచ్చిన ఈదురుగాలులతో కూడా వడగాళ్ల వానకు తన పంట పూర్తిగా నేలకొరికిందని అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పురుగుల మందుల తాగి లక్ష్మీ నారాయణ, వెంగప్ప అనే రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుత వీరికి పులివెందుల మెడికల్ కాలేజ్ లో చికిత్స అందిస్తున్నారు. పంట నష్టపోయిందని బాధతో అధికారులకు ఫోన్ చేస్తే ఈ రోజు సెలవు అన్నారని , దాంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు..పులివెందుల నియోజకవర్గంలో భారీ పంట నష్టంపులివెందుల నియోజకవర్గంలో భారీ అరటి పంట నష్టం జరిగిందని హార్టికల్చర్ అధికారి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని లింగాలలో భారీగా అరటి చెట్లు నేలకూలయాన్నారు. నిన్న రాత్రి ఆకస్మాత్తుగా వచ్చిన వర్షం, ఈదురుగాలులతో తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపామని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. మొత్తం రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామన్నారు. -
బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల కలకలం.. కలెక్టర్ క్లారిటీ, ఏమన్నారంటే..
తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల కలకలంపై కలెక్టర్ ప్రశాంతి స్పష్టతనిచ్చారు. క్యాన్సర్ కేసులు విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. జాతీయ సగటు కంటే తక్కువగా క్యాన్సర్ పాజిటివ్ కేసులను గుర్తించామన్నారు. జాతీయ సగటు ప్రతి 10 వేలకి 30 మందికి క్యాన్సర్ కేసుల నమోదు అవుతుండగా, బలభద్రపురం గ్రామంలో 23 కేసులను గుర్తించామన్నారు. గ్రామస్థులకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలున్నవారిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వైద్య నిపుణుల సూచనలు సలహాల మేరకు ప్రజలకు తగిన వైద్య చికిత్స అందజేస్తామని కలెక్టర్ అన్నారు. నిన్న (శనివారం) ఆమె బలభద్రపురంలోని ఇంటింటి సర్వేను క్ష్రేత స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షించారు. గ్రామంలోని 2,492 గృహాల్లో సుమారు 10 వేలు జనాభా ఉన్నారన్నారు. వీరిలో ఎక్కువగా క్యాన్సర్ కేసుల నమోదు నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు.ఇందుకోసం ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు, ఎనిమిది మంది డాక్టర్లు, 98 సిబ్బంది ఆధ్వర్యంలో 31 బృందాలను నియమించామన్నారు. వీరు ఇంటింటి ఆరోగ్య సర్వే ద్వారా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. వైద్య నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణుల సూచనలు సలహాలను అనుసరించి క్యాన్సర్ కేసుల గుర్తించి తదుపరి వైద్య పరీక్షలను చేపట్టనున్నట్లు తెలిపారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల నుంచి స్పెషలిస్ట్ వైద్యులు, ఆంకా లజిస్టుల సూచనలను అనుసరించి వైద్య పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. -
స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, కేసీఆర్‌పై సోము వీర్రాజు అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ: దక్షిణాది రాష్ట్రాల సమావేశం, స్టీట్ప్లాంట్ ఉద్యోగుల దీక్షపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల సమావేశం కోతికి కొబ్బరికాయ దొరికినట్టుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న వారికి బుర్ర ఉందా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేసే వారు మన వాళ్ళు కాదంటూ ఆరోపించారు.విశాఖలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ అంటూ డీఎంకే రాజకీయం చేస్తోంది. ఏ రాష్ట్రంలో అయినా సీట్లు తగ్గాయని, పెరిగాయని డ్రాఫ్ట్ ఏదైనా రిలీజ్ అయిందా?. మా ముందు చాలామంది ఎన్నో కలలు కన్నారు.. అన్నీ కరిగిపోయాయి. మా ముందు ఎగిరే మీ రాష్ట్రాలు కూడా ఉండవు.. మీరూ ఉండరు. డీఎంకే ఎక్కువకాలం ఉండదు. లక్కీగా అయినా తెలంగాణ ముఖ్యమంత్రి స్క్వేర్ ఫీట్‌కు ఇంత అని లెక్కల్లో ఉన్నారు. మాదే స్టాండర్డ్ ఉన్న పార్టీ అని వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ఉక్కు ఉద్యమంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న వారికి బుర్ర ఉందా?. స్టీల్ ప్లాంట్ నష్టాలకు కార్మిక నాయకులే కారణం. కార్మిక నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు?. కార్మికులు కష్టపడుతుంటే కార్మిక నాయకుల కళ్ళు మండుతున్నాయి. జపాన్‌లో అయితే ఈ కార్మిక నాయకులను ఏం చేసేవారు. తిన్నది అరగక ఉద్యమం చేస్తున్నారా అని ఉద్యమ నాయకులని అడగాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేసే వారు మన వాళ్ళు కాదు. వాళ్ళు చైనా బాగుండాలని కోరుకుంటారు.. వాళ్లని నమ్మవద్దు. ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చాం ఇంకేం కావాలి అని ప్రశ్నించారు.అలాగే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధికారం అంటే అభివృద్ధి కోసం పనిచేయాలి. ప్రజల అభివృద్ధి కోసం కాకుండా కేసీఆర్ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం పని చేశారు. కల్లల్లో ఒత్తులు వేసుకొని అభివృద్ధి చేసి చూపిస్తాం అని కామెంట్స్ చేశారు. -
‘వంద కేసులను, వెయ్యి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొంటా’
సాక్షి,అమరావతి : వంద కేసులను, వేయ్యి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ మాజీ మంత్రి విడదల రజిని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో.. ‘మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు. వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు. ఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధం.నా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం. నేను ఎదురు చూస్తూ ఉంటా.నిజం బయట పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి’ అని పేర్కొన్నారు. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలువ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులుఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధంనా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం నేను ఎదురు…— Rajini Vidadala (@VidadalaRajini) March 23, 2025 -
అమ్మో పోలీస్.. ఇదేం పని బాస్!
చిత్తూరు అర్బన్: దొంగ నుంచి రికవరీ చేసిన సొమ్మును బాధితులకు అప్పగించకుండా వాటాలు వేసేసుకున్నారు. పంచుకున్న వాటాల డబ్బుల్లో ఏకంగా సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేశారా..? స్టేషన్‌కు రంగులు వేయించారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో ఓ దొంగను పట్టుకున్న పోలీసులు అతడి నుంచి రూ.12.50 కొట్టేయడం, ఈ విషయాన్ని రాయచోటి పోలీసులకు పట్టుబడ్డ దొంగ బహిర్గతం చేయడం తెలిసిందే. అక్కడి నుంచి సమాచారం చిత్తూరు పోలీసుశాఖకు చేరడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దీనిపై ఇటీవల ‘సాక్షి’లో ‘పోలీసు దొంగలు..?’ శీర్షికన కథనం ప్రచురితం అయింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ మణికంఠ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రాథమిక విచారణ పూర్తి జిల్లా పోలీసుశాఖలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ప్రాథమిక విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. దొంగ నుంచి లంచంగా తీసుకున్న రూ.12.50 లక్షల్లో.. ఓ పోలీసు రూ.3.50 లక్షలు, మరో పోలీసు రూ.9 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే దొంగను పట్టుకోవడంలోని బృందంలో ఉన్న కానిస్టేబుల్ పెద్ద మొత్తంలో నగదును తన సమీప బంధువుల బ్యాంకు ఖాతాలకు మళ్లించి, ఆపై దీన్ని తన అధికారికి ఇచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో దొంగ సొమ్ముతో స్టేషన్లో పనిచేసే పోలీసులకు ఖాకీ యూనిఫామ్ పంపిణీ చేయడంతో పాటు స్టేషన్‌కు రంగులు వేయించారనే ఆరోపణ విచారణలో బయటపడినట్లు సమాచారం. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు, లంచంగా తీసుకున్న డబ్బును వ్యక్తిగత అవసరాలను వాడుకోవడంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖలోని సిబ్బందికి యూనిఫామ్‌ను కొనుగోలు చేసి ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేసు నమోదుపై చర్చ విచారణ అధికారులు పూర్తి చేసిన ప్రాథమిక నివేదికపై ఓ పోలీసు ఉన్నతాధికారి, జిల్లా అధికారితో చర్చించినట్లు తెలుస్తోంది. ‘దొంగ ఇచ్చిన రూ.12.50 లక్షలు ఎన్ని కేసుల్లో చోరీ చేశాడో, అన్ని కేసుల్లోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను నిందితులుగా ఎందుకు చేర్చకూడదు..? అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నమ్మక ద్రోహం చేసి, పోలీసుశాఖ పరువు తీసిన వీళ్లపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 316(5) కింద కేసు నమోదు చేయొచ్చా..?’ అని సుదీర్ఘంగా చర్చించారనే సమాచారం గుప్పుమంటోంది. ఇక రూ.3.50 లక్షలు స్వయంగా తీసుకున్న పోలీసును సస్పెండ్ చేయడంతో పాటు, మరో పోలీసును సస్పెండ్ చేయడం లేదా వీఆర్‌కు పంపాలని.. ఇద్దరు కానిస్టేబుళ్లను సైతం విధుల నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. పనితీరు నచ్చి, తాను కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన.. తప్పు చేసిన వాళ్లను కాపాడే ప్రసక్తేలేదని, ఈ ఘటనపై చట్టం ప్రకారం ముందుకు వెళ్లడం తప్ప మరో ఆలోచనలేదని పోలీసు ‘బాస్’ సైతం ఒకరిద్దరితో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏది ఏమైనా దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిస్తే అవార్డులు, రివార్డులు పంపిణీ చేసే అధికారులు.. తప్పు చేసినపుడు చర్యలు తీసుకుంటే తప్ప సామాన్యులకు పోలీసుశాఖపై నమ్మకం ఉండదనేది బహిరంగ వాదన. ఈ ఘటన ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. -
‘స్టీల్‌ప్లాంట్‌లో కార్మికులను తొలగిస్తుంటే పల్లా చేస్తున్నారు?’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే స్టీల్‌ప్లాంట్ కార్మికులు నేడు పాదయాత్రకు పిలుపునిచ్చారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొత్త గాజువాక జంక్షన్ నుంచి కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వరకు నిరసన చేపట్టనున్నారు.కాంట్రాక్ట్ కార్మికుల పాదయాత్ర నేపథ్యంలో ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ నరసింగరావు స్పందించారు. ఈ సందర్బంగా నరసింగరావు మాట్లాడుతూ..‘కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రైవేటీకరణలో భాగం. కార్మికులు లేకుండా ప్లాంట్‌ను ఎలా నడుపుతారు. ఒక్క కార్మికుడిని కూడా తొలగించకుండా పోరాడుతాం. స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్లాంట్ కార్మికులతో అవసరం తీరిపోయింది. ఇంత మందిని తొలగిస్తుంటే పల్లా శ్రీనివాస్ ఎందుకు మాట్లాడటం లేదు?. స్థానిక ప్రజా ప్రతినిధులు నిద్రపోతున్నారు. పోరాటంతోనే కార్మికుల హక్కులను సాధిస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
టీడీపీ నేత కుమార్తెతో ప్రేమ.. పెళ్లి చేసుకున్నాడనే కారణంతో..
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ నేత కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంగా వరుడి ఇంటిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేత సుంకర వెంకటరమణ కుమార్తె శివలీల, అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వీరి ప్రేమను పెద్దలు కాదనడంతో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వరుడు వెంకటేశ్వర్లుపై వెంకటరమణ, ఆయన మద్దతు దారులు కక్ష పెంచుకున్నారు. దీంతో, వెంకటేశ్వర్లు ఇంటిపై కర్రలు, రాడ్లతో టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. టీడీపీ నేతల దాడిలో ఇంట్లోని ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసమైంది. -
అరబిక్ వంట.. కడప ముంగిట!
రంజాన్‌లో అత్తర్ల గుబాళింపులే కాదు రకరకాల వంటలూ ఘుమఘుమలాడిస్తున్నాయి. పసందైన రుచులతో నోరూరిస్తున్నాయి. అల్ ఫహమ్... అల్ మంది..షవర్మ.. హలీం.. ఇలా ఒకటా రెండా అనేక అరబిక్ వంట లు.. కడప ముంగిట వాలిపోయాయి. రుచుల పంటను ఆస్వాదించమని ఆహారప్రియులను ఆహా్వనిస్తున్నాయి. అసలే రంజాన్.. ఆపై కొత్త వంటకాలు తొంగిచూసిన నేపథ్యంలో సాక్షి సండే స్పెషల్.కడప కల్చరల్: రంజాన్... మనిషిని మానవత్వంగల పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు అవకాశాలను అందించే పండుగ. శారీరకంగా, మానసికంగా మనిషిని ఉన్నతుడినిచేసే ఆధ్యాత్మికత వేడుక. ఈ సందర్భంగా మార్కెట్లు, వీధులలో సెంట్లు, అత్తర్ల గుబాళింపులు మనసులను దోచేస్తాయి. ఒక్క సెంట్లు.. అత్తర్లే కాదు.. రంజాన్ అనగానే హలీం.. తదితర పౌష్టికాహారం వంటకాలూ గుర్తుకొస్తాయి. కొన్నేళ్లుగా పలు రకాల అరబిక్ వంటలు కడప ముంగిట వాలిపోయాయి. దాదాపు రెండేళ్లకో సారి ప్రత్యేకమైన అరేబియన్ వంటకం పరిచయం అవుతుండడం విశేషం. అల్ ఫహమ్... ఇటీవలి కాలంలో ఎక్కువ ఆదరణ పొందిన వంటకం అల్ ఫహమ్. బొగ్గులపై కాల్చిన కోడి మాంసం కావడంతో రుచి బాగుంటుంది. పైగా నూనెలు.. మసాలాలు లేకపోవడంతో ఆరోగ్యానికీ మంచిదన్న కారణంతో ఇప్పుడందరూ ఈ వంటకాన్ని ఇష్టపడుతున్నారు. కాగా కడప నగరానికి చెందిన జమాల్ వలీ దశాబ్దం పైగా అరబ్ దేశాల్లో వంటమాస్టర్‌గా పని చేశారు. ఆ అనుభవంతో కడప వాసులకు తొలిసారిగా 2006లో ఫహమ్ను పరిచ యం చేశారు. ప్రస్తుతం ‘మాషా అల్లాహ్’ ఫహం నడుపుతూ 8 మందికి ఉపాధి కలి్పస్తున్నారు. అల్ మందీ... రంజాన్ మాసంలోనే కాకుండా ఏడాదంతా లభించే మరో అరబిక్ వంట అల్ మందీ. ఒక పెద్ద పళ్లెంలో పెట్టిన ఆహారాన్ని చుట్టూ ఇద్దరు ముగ్గురు కూర్చుని ఇష్టంగా తింటుంటూరు. సరదాగా ఇతరులతో కలిసి ఆనందించాలనుకునే వారు దీనిని ఇష్టపడతారు. ఆహారంతోపాటు ఆత్మీయతలను కూడా పంచుకునే అవకాశం లభిస్తోంది. ఇక వీటితో పాటు,కబాబ్, షవర్మ, మస్బూస్ తదితర రకాలు ఆహార ప్రియులను ఆకర్శిస్తున్నాయి. సాయంత్రాలలో రంజాన్ ఉపవాస దీక్ష విరమించి స్వీకరించే ఇఫ్తార్‌లో ఇటీవల ఖబాబ్లు సాధారమైపోయాయి. హలీం... రంజాన్ అనగానే ప్రత్యేక వంటకమైన హలీం గుర్తుకు వస్తుంది. ఉపవాస దీక్షల్లో ఉన్న వారితోపాటు ఇతరులకు కూడా ఇది పౌష్ఠికాహారం. నిన్నా మొన్నటివరకు కేవలం రంజాన్ మాసంలో మాత్రమే లభిస్తుండిన ఈ వంటకం ప్రస్తుతం అక్కడక్కడ ఇతర సీజన్లలో కూడా అందుబాటులో ఉంటోంది. దానికి ముస్లిమేతరుల నుంచి కూడా లభిస్తున్న ఆదరణ కారణంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా అందుబాటులో ఉండడంతోపాటు రోజువారి స్పెషల్ వంటకం స్థాయికి ఎదిగింది. పైగా పెళ్లిళ్లలోనూ హలీం దర్శనమిస్తుండడం విశేషం. ప్రస్తుతం కేవలం కడప నగరంలోనే హలీం విక్రయించే హోటళ్లు, దుకాణాలు 50కి పైగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 250కి మించాయి. వ్యాపారం అదుర్స్.. నాన్ వెజ్ వంటకాల దుకాణాలు గణనీయంగా పెరగడంతోపాటు వాటికి ఈ సీజన్లో మంచి వ్యాపారం ఉంది. జిల్లా అంతటా ప్రత్యేకించి అరేబియన్ వంటకాల రెస్టారెంట్లు 100కు పైగానే ఉన్నాయి. ఇవిగాక హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు చిన్నచిన్న రోడ్డుసైడు దుకాణాలలో కూడా వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. ఇటీవల అరేబియన్ ప్రాంతం వంటకాలకు మన ప్రాంతంలో విపరీతమైన ఆదరణ లభిస్తుండడంతో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. స్వీట్లు కూడా.. కేవలం మాంసాహారమే కాకుండా ఇటీవల రంజాన్ సీజన్లో తీపి పదార్థాలను ఆస్వాదించడం కూడా మొదలైంది. ఇటీవల ఇలాంటి వంటకాలలో ఖద్దూకీ ఖీర్, సొరకాయ, ఇతర కాయగూరలతో చేసిన స్వీట్లు ఆరోగ్యాన్ని ఇస్తాయన్న నమ్మకంతో ఆరగిస్తున్నారు. ఇవికాకుండా మంచి శక్తినిచ్చే వస్తువులతో తయారు చేసిన గంజి, ఫలుదా, ఫ్రూట్ సలాడ్ బకెట్ కూడా రంజాన్ స్పెషల్ వంటకంగా ఆదరణ పొందుతున్నాయి. -
కేతిరెడ్డి ఇంటిని కూల్చేస్తా.. జేసీ ప్రభాకర్ బరితెగింపు
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నారనే కారణంగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు తాజాగా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓవరాక్షన్‌కు దిగారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఆయన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు చర్యలకు దిగారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తానని వార్నింగ్ ఇవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. తాడిపత్రిలో వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురు నేతల ఇళ్లను స్వయంగా తానే కూల్చివేస్తానని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. స్వయంగా ఆర్డీవో కేశవ్ నాయుడు ఎదుటే జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే, పోలీసుల వైఫల్యం వల్లే తాడిపత్రిలో రాళ్ల దాడి జరిగిందని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాను అంటూ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీంతో, జేసీ వ్యాఖ్యలు, ఆయన తీరు తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతా జరిగినా పోలీసులు స్పందించకపోవడం విశేషం. -
ధర్నాచౌక్ సాక్షిగా ప్రజాగ్రహం
సాక్షి, అమరావతి: ప్రజాగళం వినిపించే ప్రతిపక్షానికి చోటు లేకుండా చేసి ఆత్మస్తుతి–పరనింద ధ్యేయంగా మారిన అసెంబ్లీ సమావేశాలు ఒకపక్క జరుగుతుండగా, మరోపక్క కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు చేసిన ఆందోళనకు విజయవాడ ధర్నాచౌక్ కేంద్రంగా నిలిచింది. ఉద్యోగ, అంగన్వాడీ, ఆశా, వ్యవసాయ కార్మిక, ఉపాధి హామీ కూలీలు సహా 20కిపైగా విభాగాలకు చెందిన సామాన్య ప్రజానీకం తమ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తెచ్చేలా పది రోజులకుపైగా మండుటెండను సైతం లెక్క చేయకుండా సాగించిన ఉద్యమ హోరు కూటమి ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే పెల్లుబికిన అసంతృప్తికి అద్దం పట్టింది. డిమాండ్లు నాలుగు నెలల్లోగా పరిష్కరించకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ప్రజానీకం అల్టిమేటం ఇచ్చింది. వెల్లువెత్తిన ఆందోళనలు.. » అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వేతనాల పెంపు, గ్రాట్యుటీ, తదితర డిమాండ్స్ నెరవేర్చాలని మహాధర్నాను నిర్వహించారు. » పెద్ద ఎత్తున ఫీజు పోరు, బకాయిల విడుదలకు ఆందోళన జరిగింది. » ఆశా వర్కర్లు కనీస వేతనం నెలకు రూ.26 వేలతోపాటు పలు డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ ధర్నాకు దిగారు. » వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, నెలకు రూ.10వేలు వేతనం హామీని నిలబెట్టుకోవాలని మహాధర్నా జరిగింది. » రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, ఐదు నెలలుగా ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీఓఏ) ధర్నా నిర్వహించారు. » కనీస వేతనాలు వర్తింపజేయాలని ఏపీ గ్రామ పంచాయతీ కార్మికులు ఉద్యమించారు. » గ్రామ, వార్డు సచివాలయాల్లోని హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూధర్నా జరిగింది. » కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది పొట్టగొట్టేలా.. ఆప్కాస్ విధానం రద్దును విరమించుకోవాలని ఉద్యమించారు. » ఆరు నెలల్లో సమస్య పరిష్కరించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అగ్రిగోల్డ్ బాధితులు అల్టిమేటం ఇచ్చారు. » డప్పు కళాకారుల రిజిస్ట్రేషన్ పేరుతో పెన్షన్ తొలగించడంపై ధర్నా నిర్వహించారు. » ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులకు నెలవారి పెన్షన్ రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ధర్నా చేశారు. » నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలంటూ కాటికాపరులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. » మిలియపుట్టి సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేయాలని ఆదివాసీలు ధర్నా చేశారు. » మెప్మా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు, ఉపాధి హామీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు తదితర అనేక విభాగాలకు చెందిన వారు కూటమి ప్రభుత్వం హామీలిచ్చి మోసం చేసిందని ధర్నాచౌక్‌లో నినదించారు. -
వైఎస్ ఇచ్చిన వరం.. మా బతుకు బంగారం
నూజివీడు: ట్రిపుల్ ఐటీ.. ఈ పేరు చెబితేనే వాటి వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు అందరి మదిలో మెదులుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పిల్లలకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను ప్రభుత్వమే అందించి వారి కుటుంబాల్లో మార్పు తీసుకురావాలనే సత్సంకల్పంతో 2008లో వైఎస్ ఈ ట్రిపుల్ ఐటీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అనాటి ఉమ్మడి కృష్ణాజిల్లా.. ప్రస్తుత ఏలూరు జిల్లా నూజివీడులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది. అప్పట్లో ఇక్కడ చదువుకున్న మొదటి బ్యాచ్ (2008–14) విద్యార్థుల సమ్మేళనం శనివారం స్థానిక ట్రిపుల్ ఐటీ ఆడిటోరియంలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాచ్ విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారు. 400 మంది విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్ ఐటీలను స్థాపించి ఉండకపోతే తమ భవిష్యత్తు సాదాసీదాగానే ఉండేదని, తమ జీవితాలు ప్రస్తుతం ట్రిపుల్ ఐటీకి పూర్వం, ట్రిపుల్ ఐటీ తరువాత అన్నట్లుగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు. ట్రిపుల్ ఐటీలవల్లే తాము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. పలువురు విద్యార్థుల భావాలు వారి మాటల్లోనే.. ఏడాదికి రూ.35 లక్షల వేతనం వస్తోంది 2008లో ట్రిపుల్ ఐటీలో చేరి ఈసీఈ బ్రాంచితో ఇంజనీరింగ్ పూర్తిచేశా. మా నాన్న సన్నకారు రైతు, రైతు కూలీ. చదువు పూర్తవగానే సెమీ కండక్టర్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరా. ప్రస్తుతం ఏఆర్ఎం సెమీ కండక్టర్స్ కంపెనీలో జాబ్‌చేస్తున్నా. ఏడాదికి రూ.35 లక్షల వేతనం వస్తోంది. ట్రిపుల్ ఐటీవల్లే ఈ స్థాయిలో ఉన్నా. – నుగ్గు ఆదినారాయణ, గొల్లపల్లి, పొదిలి మండలం, ప్రకాశం జిల్లా అమెరికన్ కంపెనీలో లీడ్ ప్రొడక్ట్ మేనేజర్‌గా.. అమెరికన్ కంపెనీలో లీడ్ ప్రొడక్ట్ మేనేజర్‌గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా. ఏడాదికి రూ.36 లక్షల వేతనం వస్తోంది. ఈసీఈ చదివాక ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఈ స్థాయిలో ఉండటానికి కారణం కేవలం ట్రిపుల్ ఐటీనే. వీటిని స్థాపించకపోయి ఉంటే సాదాసీదా చదువులు చదివేవాడిని. ఇలాంటి విద్యా సంస్థ నెలకొల్పిన వైఎస్ రాజశేఖరరెడ్డికి సెల్యూట్. – పక్కి కార్తీక్, గజపతినగరం, విజయనగరం జిల్లా ఏడాదికి రూ.50 లక్షల వేతనం వస్తోంది.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీలో చదువుకోవడంవల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా. ప్రస్తుతం ఇన్ఫర్మేటికల్ సంస్థలో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నా. ఏడాదికి రూ.50 లక్షల వేతనం వస్తోంది. మా నాన్న రైతు కూలీగా పనిచేస్తూ నన్ను చదివించారు. ట్రిపుల్ ఐటీ లేకపోతే నేను మా ఊరిలోనే ఉండేవాడినేమో. – పప్పల సురేష్, గోరింట, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో మేనేజర్‌గా.. నా సొంతూరు విశాఖపట్నంలోని గాజువాక. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొదటి బ్యాచ్‌లో నేను కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ఆ తరువాత విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నా. మా నాన్న లారీ డ్రైవర్‌గా పనిచేసేవారు. ట్రిపుల్ ఐటీ అనేది లేకపోతే మేం లేం. ట్రిపుల్ ఐటీ అనేది మా జీవితంలో భాగమైంది. – భీశెట్టి గోపి, మేనేజర్, విశాఖ రిఫైనరీ, విశాఖపట్నం ఏడాదికి రూ.36 లక్షల వేతనం ట్రిపుల్ ఐటీ లేకపోతే చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాడిని. ఈసీఈ చదివి ప్రస్తుతం ఒడెస్సా సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేస్తున్నా. వేతనం ఏడాదికి రూ.36 లక్షలు వస్తోంది. మా నాన్న ప్రైవేటు టీచర్‌గా పనిచేసేవారు. ఇంజనీరింగ్ చేసిన తరువాత ఐఐఎం ఇండోర్‌లో ఎంబీఏ చదివి ఆ తరువాత ఉద్యోగంలో చేరా. – నంబూరు మధుబాబు, చల్లవానిపేట, జలుమూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ఇస్రోలో సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నా..ప్రస్తుతం నేను తిరువనంతపురంలో ఇస్రోకు చెందిన విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్లో సైంటిస్ట్–ఈ కేడర్‌లో పనిచేస్తున్నా. ట్రిపుల్ ఐటీలో ఈసీఈ పూర్తిచేసి రగ్పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశా. ఆ తరువాత ఇస్రోలో చేరా. ఆరేళ్లపాటు ట్రిపుల్ ఐటీలో మా భవిష్యత్తుకు బంగారు బాట వేశారు. – కారుమూరి వంశీ, దేవరపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్టార్టప్ ప్రారంభించా.. మా నాన్న సన్నకారు రైతు. వ్యవసాయ కూలి పనులకూ వెళ్లేవాడు. ట్రిపుల్ ఐటీ మొదటి బ్యాచ్‌లో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. ఆ తరువాత ఐఐఎం లక్నోలో ఎంబీఏ చేశా. తర్వాత ఏడాదికి రూ.45 లక్షల వేతనంతో సాఫ్ట్వేర్ జాబ్ చేశా. ప్రస్తుతం స్టార్టప్ ప్రారంభించా. వైఎస్ రాజశేఖరరెడ్డి, రాజిరెడ్డి ఇద్దరూ మా జీవితాల్లో వెలుగులు నింపారు. ట్రిపుల్ ఐటీలు లేకపోతే మా కుటుంబ ఆరి్థక పరిస్థితికి పాలిటెక్నిక్ గాని, డిగ్రీ గాని మాత్రమే చదివేవాడిని. – పరిటాల శివాజీ, కారంపూడి, గుంటూరు జిల్లా రియాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ట్రిపుల్ ఐటీ లేకపోతే స్థానికంగా ఏదోక కాలేజీలో డిగ్రీ చదివి ఉండేవాడిని. ప్రస్తుతం టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీలో సౌదీలోని రియాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఏడాదికి రూ.72 లక్షల వేతనంతో పనిచేస్తున్నాను. ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడు. మా అందరికీ లైఫ్ ఇచ్చారు. – సంజయ్‌ఖాన్, ఖాజీపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లా సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్‌గా చేస్తున్నా.. ఈసీఈ బ్రాంచిలో ఇంజనీరింగ్ పూర్తిచేసి ప్రస్తుతం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కంపెనీలో రూ.30 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్‌గా చేస్తున్నా. ఇక్కడ ఆరేళ్ల పాటు చదవడం ఒక రకంగా స్వర్ణయుగం. ట్రిపుల్ ఐటీలో చదవడం వరం. ఇలాంటి విద్యాసంస్థను ఏర్పాటుచేయడం గొప్ప విషయం. – పసుపురెడ్డి వివేక్, హరిపురం, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా ట్రిపుల్ ఐటీ మా జీవితాన్నే మార్చేసింది.. మా నాన్న మోటార్ మెకానిక్. ట్రిపుల్ ఐటీలో సీఎస్ఈ చదివా. ఆ తరువాత కాకినాడ జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తిచేశా. కొంతకాలం టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. ఆ తరువాత 2018 నుంచి గుంటూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీఎస్ఈ లెక్చరర్‌గా పనిచేస్తున్నా. ట్రిపుల్ ఐటీ మా జీవితాన్నే మార్చేసింది. – గజ్జా ప్రణయని, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా -
దొంగ ఓట్లకు ఇకనైనా చెల్లుచీటీ!
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాపై పెద్దఎత్తున వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేస్తూ.. పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. ఓటరు కార్డుకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా బోగస్ ఓట్లతో పాటు ఒకే వ్యక్తి పలుచోట్ల ఓటరుగా నమోదు కావడానికి అడ్డుకట్ట వేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో దొంగ, మల్టిపుల్ ఓట్లపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసినట్లుగానే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ అనుమానాలు లేవనెత్తడంతో ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ దొంగ ఓట్ల నివారణే లక్ష్యంగా ఓటర్ల జాబితాకు ఆధార్‌ను అనుసంధానం చేయడానికి న్యాయ, సాంకేతికపరమైన ఇబ్బందులను పరిష్కరించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవోలతో కీలక సమావేశం నిర్వహించారు. » ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానించడం అనేది ఆరి్టకల్ 326లోని నిబంధనల ప్రకారం మాత్రమే జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఆధార్ కార్డ్ ఒక వ్యక్తికి గుర్తింపు ఇస్తుందని, ఓటరు కార్డు ద్వారా ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తామంది. ఇంతకాలం ఆధార్ అనుసంధానం అనేది ఆప్షనల్‌గా ఉండగా ఇకమీదట తప్పనిసరి చేయనున్నారు. 2015లో శ్రీకారం ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం 2015లో మొదలుపెట్టినా సుప్రీంకోర్డు ఉత్తర్వులతో ఆగిపోయింది. ఒకే వ్యక్తి పలుచోట్ల ఓటు కలిగి ఉండడంతో వీటి ఏరివేతే లక్ష్యంగా 2015 ఫిబ్రవరిలో ఆధార్ అనుసంధానం చేపట్టింది. మూడు నెలల్లోనే 30 కోట్ల కార్డులను లింక్ చేసింది. కానీ, దీనిపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆధార్ అనుసంధానానికి అడ్డుకట్ట పడింది. తర్వాత ఎవరి ఇష్టాన్ని బట్టి వారు అనుసంధానం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే 66 శాతంపైగా ఓటరు కార్డులు అనుసంధానం అయినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. » ప్రస్తుతం రాష్ట్రంలో 4.14 కోట్ల మంది ఓటర్లుండగా, 70 శాతంపైనే ఆధార్‌తో అనుసంధానం అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. » రాష్ట్ర విభజన తర్వాత చాలామంది అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఓటు కలిగి ఉంటూ రెండుచోట్లా హక్కును వినియోగించుకుంటుండటంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. » గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి మరీ ఓటర్లుగా చేర్పించడంపై వైఎస్సార్సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అనేక పార్టీల నుంచి ఇదే విధమైన విమర్శ వస్తుండటంతో పారదర్శక ఓటర్ల జాబితా తయారీ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. ఓటరు ఐడీ–ఆధార్ అనుసంధానంతో ప్రయోజనాలు » ఓటరు జాబితాకు సంబంధించిన లోపాల పరిష్కారం » ధ్రువీకృత ఓటర్ల జాబితాను దేశానికి సమర్పించడం » ఓటరు జాబితాలో మోసపూరిత పేర్లను చేర్చడాన్ని నివారించడం » రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదుల పరిష్కారం. » వ్యక్తులు వేర్వేరుచోట్ల నమోదు చేసుకునే అవకాశాన్ని తొలగించడం » ఎవరూ రెండు వేర్వేరు ప్రదేశాలలో నమోదు చేసుకోలేరని నిర్ధారించడం -
అమ్మో... కాటు!.. 600 మంది మృతి
దేశంలో మూడేళ్లుగా పాముకాట్లు పెరుగుతున్నాయి. పాము కాటుకు గురై మృతి చెందిన వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. 2022 నుంచి 2024 వరకు గత మూడేళ్లలో దేశంలో 2.69 లక్షల పాము కాటు కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాము కాటుకు మృతి చెందిన వారి సంఖ్య 600కు చేరింది. పాము కాటు కేసులు అత్యధికంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో నమోదైనట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. పాము కాటుకు గురై చనిపోయిన వారు కర్ణాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశాలో అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. – సాక్షి, అమరావతివైద్య వ్యవస్థ బలోపేతానికి చర్యలుపాము కాటు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపింది. పాముకాటు నివారణకు మార్గదర్శకాలను కూడా జారీ చేసినట్లు పేర్కొంది. పాము కాటుకు చికిత్స అందించేందుకు వైద్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అత్యవసర మందులు, పరికరాలు, రవాణా యంత్రాంగం, ఇతర సౌకర్యాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం అందిస్తోందని తెలిపింది. జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన ఔషధాల జాబితాలో పాలీవాలెంట్ యాంటీ స్నేక్ వెనంను చేర్చినట్లు పేర్కొంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉచిత ఔషధాలకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు ఇస్తున్నట్లు తెలిపింది. దేశంలో పాటుకాటు నివారణ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పాము కాటు నిర్వహణ, అత్యవసర సంరక్షణ తదితర అంశాలపై వైద్య నిపుణులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రజా వైద్య శాలల్లోని వైద్యులను పాము కాటు కేసుల అత్యవసర నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. -
మద్యం షాపులపై... బార్ ఓనర్స్ వార్
నరసరావుపేటటౌన్: మద్యం దుకాణాల యజమానులు అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటుచేసి నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అమ్మకాలు సాగించడంపై బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆందోళనబాట పట్టారు. అధికార కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ఎక్సైజ్ అధికారులు తమను నిండా ముంచేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేసి యజమానులు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తాము బార్లు నిర్వహించలేమని తాళాలను అధికారులకు అప్పగించారు. ఇప్పటికే నరసరావుపేట పట్టణంలో 17 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం మరో 11 వైన్ షాపులకు అనుమతులు ఇచ్చింది. ఆ వైన్ షాపుల్లో అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటుచేసి బార్ అండ్ రెస్టారెంట్లకు దీటుగా నిర్వహిస్తున్నారు.మాంసం, బిర్యానీ, ఇతర తినుబండారాలను అందుబాటులో ఉంచుతున్నారు. అక్కడ అన్ని సదుపాయాలు ఉండటం, మద్యం కూడా బార్ అండ్ రెస్టారెంట్ల కన్నా తక్కువ ధరకు వస్తుండటంతో ఎక్కువ మంది వైన్ షాపుల వద్దకే వెళుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పెట్టిన బార్ అండ్ రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి. కూటమి నేతలకు మేలు చేసేలా అధికారుల తీరు ఎక్సైజ్ శాఖ ఆడుతున్న ఆటలో తాము బలైపోతున్నామంటూ నరసరావుపేటలోని బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమ బార్ అండ్ రెస్టారెంట్లకు తాళాలు వేసి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బార్ల తాళాలను ఎక్సైజ్ శాఖ సీఐ సోమయ్యకు అందజేసి తాము వ్యాపారం చేయలేమని తేల్చి చెప్పారు. వైన్ షాపుల్లో అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకునేవరకు తాము బార్లు తెరవబోమని స్పష్టం చేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బార్లు ఏర్పాటు చేసుకుంటే తమకు నెలకు రూ.5లక్షల వరకు నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేక పోతున్నామన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ శాఖాధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. కూటమి నేతలకు మేలు చేసేలా అధికారుల తీరు ఉందని, ఇలాగైతే వ్యాపారం చేయలేం మహాప్ర¿ో... అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఎక్సైజ్ సీఐ హామీ ఇవ్వడంతో బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆందోళనను విరమించి వెనుదిరిగారు. -
సామూహిక అత్యాచారం కేసులో మరో నలుగురి అరెస్ట్
గన్నవరం : బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో నలుగురు నిందితులను కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏఎస్పీ వీవీ నాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన బాలిక(14) సన్నిహితులతో కలిసి ఇటీవల కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వీరపనేనిగూడెం జాతరకు వచ్చి.. సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను స్వగ్రామం తీసుకెళతామని నమ్మబలికిన వీరపనేనిగూడేనికి చెందిన ఇద్దరు మైనర్లు ముందుగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మైనర్లు ఇచ్చిన సమాచారంతో అదే గ్రామానికి చెందిన బాణావత్ జితేంద్ర, పగడాల హర్షవర్ధన్ అక్కడికి వెళ్లి బాలికపై లైంగికదాడి చేశారు. తర్వాత ఆ బాలికను కేసరపల్లిలోని కొండేటి అనిల్ సహకారంతో అతని ఇంట్లో నిర్బంధించారు. అక్కడ జితేంద్ర, హర్షవర్ధన్‌లతో పాటు వారి స్నేహితులైన పరసా సంజయ్, ఉయ్యూరు నవీన్‌కుమార్, పరసా రాజేష్ ఆ బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఇప్పటికే జితేంద్ర, హర్షవర్ధన్‌తో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్ట్ చేసిన అనిల్, సంజయ్, నవీన్‌కుమార్, రాజేష్ లను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. -
ఒక్క మందు.. ఊబకాయం, షుగర్ ఔట్!
భారత్‌లో ఏటేటా ఊబకాయుల శాతం పెరిగిపోతోంది. తద్వారా మధుమేహం బారినపడుతున్నవారూ ఎక్కువగానే ఉంటున్నారు. దేశంలో సుమారు 10 కోట్ల మంది వరకు మధుమేహ బాధితులు ఉన్నట్టు అంచనా. అదే సమయంలో జనాభాలో 6.5 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరిలో సగం మందికిపైగా ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదని పలు అధ్యయనాలు తేల్చాయి కూడా. సరైన ఔషధాలు అందుబాటులో లేకపోవడం, అవగాహన లేమి వంటివి కారణమవుతున్నాయి.ఇలాంటి నేపథ్యంలో మన దేశంలోకి ‘మవుంజారో (టైర్జెపటైడ్)’ పేరిట స్థూలకాయాన్ని, మధుమేహాన్ని నియంత్రించే ఔషధం అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఎలీ లిల్లీ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో గుర్తింపు పొందిన ఈ ఔషధాన్ని తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఊబకాయంతోపాటు మధుమేహాన్నీ ఏకకాలంలో నియంత్రించగల ఈ ఔషధం అనేక మంది బాధితులకు ఆశారేఖ కాగలదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి స్పెషల్ డెస్క్ఎలా పని చేస్తుంది?వారానికి ఒక ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే.. అటు బరువు తగ్గడంతోపాటు ఇటు మధుమేహాన్ని అదుపులో ఉంచే ఔషధాల్లో మొట్టమొదటిది ‘మవుంజారో’. ఇది ‘గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రాపిక్ పాలీపెప్టైడ్ (జీఐపీ)’, ‘గ్లూకగాన్ లైక్ పెప్టైడ్–1 (జీఎల్పీ–1)’ హార్మోన్ రెసెప్టార్లను ప్రేరేపించడం ద్వారా బరువునూ, చక్కెర మోతాదులను నియంత్రిస్తుంది’’ అని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ మందు విషయంలో భారత్‌లో ఏ స్థానిక కంపెనీతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకోలేదని తెలిపింది.క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 72 వారాల పాటు.. ఎంపిక చేసిన వ్యక్తులకు తగిన ఆహారం, వ్యాయామాలతోపాటు ఈ ‘మవుంజారో’ ఔషధాన్ని ఇచ్చి పరిశీలించామని వెల్లడించింది. ఈ మందు 15 ఎంజీ మోతాదులో ఇచ్చినవారు 21.8 కిలోలు బరువు తగ్గారని.. 5 ఎంజీ మోతాదు ఇచ్చినవారు 15.4 కిలోల బరువు తగ్గారని తెలిపింది.‘‘భారతీయుల్లో స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్తో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువే. వారందరికీ ప్రయోజనం కలిగేలా భారతీయ ప్రభుత్వ వర్గాలతో, ఇక్కడి కంపెనీల సహకారంతో ఈ మందుపై అవగాహన కలిగించేందుకు మేం ప్రయత్నిస్తాం’’ అని ఎలీ లిల్లీ ఇండియా ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ విన్సెలోవ్ టక్కర్ పేర్కొన్నారు.నెలకు రూ.17,500 వరకు ఖర్చుతో..‘మవుంజారో’ ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో వారానికి ఒక మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో ఔషధాలు, కాస్మెటిక్స్ నియంత్రణ సంస్థ అయిన ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)’ ఆమోదంతో దీని ధరను 2.5 ఎంజీకి రూ.3,500గా, 5 ఎంజీ రూ.4,375 గా నిర్ణయించారు. అంటే ఒక నెలకు రూ.14,000 నుంచి రూ.17,500 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తుల బరువు, ఆరోగ్య స్థితి, ఇతర అంశాల ఆధారంగా ఎంత మోతాదులో ఇవ్వాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు.అందుకు అనుగుణంగా నెలవారీ ఖర్చులో హెచ్చుతగ్గులు ఉంటాయి. నిజానికి ఈ ఔషధాన్ని మనదేశంలో తక్కువ ధరకే తెచ్చారు. యూఎస్ఏలో దీనికి నెలకు 1,000 – 1,200 డాలర్లు ఖర్చవుతుంది. అంటే మన కరెన్సీలో రూ.86,000 నుంచి రూ.లక్ష అన్నమాట. భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా బాధితులపై పెద్దగా భారం పడకుండా, విలువకు తగిన ప్రయోజనం చేకూరేలా ధరను నిర్ణయించామని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది.మరికొన్ని మందులున్నా..బరువు తగ్గించే కొన్ని రకాల మందులు ఇప్పటికే భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నోవో నార్డిక్స్ కంపెనీకి చెందిన ‘రైబెల్సస్’ ఔషధం మూడేళ్ల కింద అంటే.. 2022 జనవరి నుంచే ఇక్కడ వినియోగంలో ఉంది. ఇది ఇప్పటికే యాంటీ–ఒబేసిటీ మందుల మార్కెట్లో 65 శాతాన్ని చేజిక్కించుకుంది.డ్యూలాగ్లూటైడ్, ఆర్లిస్టాట్, లిరాగ్లూటైడ్ వంటి బ్రాండ్లు కూడా వినియోగంలో ఉన్నాయి. మరోవైపు ఇదే తరహాకు చెందిన ‘సెమాగ్లూటైడ్’ ఔషధం పేటెంట్ కాలవ్యవధి వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. అప్పుడు దాని జనరిక్ మందును తయారు చేసేందుకు ప్రముఖ భారతీయ ఔషధ కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి. అది తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.వందల కోట్ల మార్కెట్..ఫార్మాట్రాక్ వంటి మార్కెట్ రీసెర్చ్ సంస్థల అంచనా ప్రకారం.. భారత్‌లో యాంటీ ఒబేసిటీ మందులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ తరహా మందుల మార్కెట్ 2020లో రూ.137 కోట్లుగా ఉండగా.. 2024 నవంబర్ నాటికి రూ.535 కోట్లకు చేరింది. ఇది మరింతగా పెరుగుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.టైప్–1 డయాబెటిస్ వారికి ఉపయోగపడదుమవుంజారో వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సిన మందు. స్థూలకాయంతోపాటు టైప్–2 డయాబెటిస్ ఉన్నవారు వాడాల్సిన ఔషధం. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 కంటే ఎక్కువగా ఉండి, డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది. కిడ్నీ, గాల్ బ్లాడర్, సివియర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు ఉన్నవారు వాడకపోవడమే మంచిది.టైప్–1 డయాబెటిస్‌కు పనిచేయదు. కొంతమంది సెలెక్టెడ్ పాపులేషన్‌కు మాత్రమే ఉపకరించే ఔషధం. వైద్యుల పర్యవేక్షణలో, వారి సూచనల మేరకు మాత్రమే దీనిని వాడాలి. – డాక్టర్ శివరాజు, సీనియర్ ఫిజీషియన్మంచిదే కానీ.. ఇదే మ్యాజిక్ డ్రగ్ కాదు..భారత్‌లో మధుమేహం, స్థూలకాయం సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మవుంజారో మందు ఆశాజనకంగా కనిపిస్తోంది. షుగర్‌ను తగ్గించడంలోనే కాదు బరువు నియంత్రించడంలో కూడా మంచి ఫలితాలను చూపుతోంది. అయితే ఇదొక్కటే ‘మ్యాజిక్ పిల్’ అని పరిగణించడం తప్పుడు భావన. దీర్ఘకాలికంగా ఈ మందు ఎలా పనిచేస్తుందో ఇంకా పూర్తి సమాచారం లేదు.దీనికి తోడు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండొచ్చు. అందుకే ఈ మందును ఎవరైనా వాడాలనుకుంటే.. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాలి. జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటివి కూడా ఈ మందుతోపాటు తప్పనిసరిగా కొనసాగాలి. అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. – డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి..మవుంజారో మందును కేవలం డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి ఇవ్వాల్సిన మోతాదు, డయాబెటిస్ నియంత్రణకు ఇచ్చే మోతాదు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వాడాల్సిన మందు అన్నది గుర్తుంచుకోవాలి. బరువు తగ్గించే మందులతోపాటు డయాబెటిస్‌ను నియంత్రించే ఈ తరహా మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఈ ‘మవుంజారో’ ఔషధం ప్రపంచవ్యాప్తంగా కాస్తంత గుర్తింపు పొందింది.స్థూలకాయం, అధిక బరువు కారణంగా మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల అరుగుదలతోపాటు డయాబెటిస్, హైపర్‌టెన్షన్, స్లీప్ ఆప్నియా వంటి 200 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఉన్న మందులకు తోడు మరో రెప్యూటెడ్ బ్రాండ్ కావడంతో ఎలీ లిల్లీ వాళ్ల ఔషధం మరో ప్రత్యామ్నాయం అవుతుంది. – డాక్టర్ గురవారెడ్డి, సీనియర్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ఈ ఔషధం చాలావరకు సురక్షితమే.. కానీ..: – డాక్టర్ అమర్ వెన్నపూస, సీనియర్ బేరియాట్రిక్ సర్జన్మవుంజారోను ఇప్పుడు అధికారికంగా భారత్‌లో ప్రవేశపెట్టారుగానీ ఇప్పటికే విదేశాల నుంచి తెప్పించుకుని వాడినవాళ్లు ఉన్నారు. ఇందులో బరువు తగ్గడమనేది జీఐపీ, జీఎల్పీ–1 హార్మోన్ల ఆధారంగా జరుగుతుంటుంది. బేరియాట్రిక్ సర్జరీలో దాదాపు 200కుపైగా బరువును నియంత్రించే హార్మోన్లలో మార్పులు వస్తాయి. అందులో ముఖ్యమైనవి జీఎల్పీ–1, జీఐపీ. సాధారణంగా ఇన్సులిన్ ఆధారితంగా చక్కెరను నియంత్రించినప్పుడు బరువు పెరగడం జరుగుతుంది.కానీ ఈ ఔషధంతో ఇటు చక్కెరను అదుపులో ఉంచడం, అటు బరువును తగ్గించడం ఈ రెండూ జరుగుతాయి. ఇది చాలావరకు సురక్షితమైనదే. కొందరిలో మాత్రం.. వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు, ఆకలి తగ్గడం, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలతోపాటు అరుదుగా కళ్లు మసకబారడం, కిడ్నీ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, పాంక్రియాటైటిస్, థైరాయిడ్ కేన్సర్, సివియర్ అలర్జిక్ రియాక్షన్ వంటివీ రావచ్చు. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మోతాదులో వాడాలి. నిజానికి బరువు తగ్గదలచిన కొందరు తమ జీవనశైలి మార్పులతో, ఆహార నియంత్రణతో బరువు తగ్గుతారు.ప్రాణాంతకమైన మార్బిడ్ ఒబేసిటీ ఉన్నవారికి బేరియాట్రిక్ చికిత్స తప్పదు. కానీ కొందరిలో అటు మార్బిడ్ ఒబేసిటీ కాకుండా, ఇటు జీవనశైలి మార్పులతో బరువు తగ్గకుండా ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికి ఈ ఔషధం మంచిదే. ఇక బేరియాట్రిక్ చికిత్స తర్వాత కూడా బరువు పెరుగుతున్నప్పుడు ఈ మెడిసిన్ వాడవచ్చు. బరువు తగ్గడం, చక్కెర నియంత్రణ రెండూ జరుగుతాయి కదా అంటూ ఎవరు పడితే వారు వాడటం సరికాదు.లైఫ్‌స్టైల్ మార్పులతో బరువు తగ్గడమనేది ఎప్పటికైనా మంచిది. జీవనశైలి మార్పులతో ఫలితాలు కనిపించనప్పుడు దీన్ని ఒక ఉత్ప్రేరకంగా (కిక్ స్టార్లా) వాడవచ్చు. తగ్గిన బరువును అలాగే కొనసాగించడానికి జీవనశైలి మార్పులను అనుసరించడమే ఆరోగ్యకరం. -
‘పచ్చ’ బంధాలతో ‘రొచ్చు’ బిజినెస్
అప్పట్లో టీడీపీ పాలనలో కాల్‌మనీ కాలనాగులు.. ఇప్పుడు కూటమి సర్కారులో స్పా సెంటర్ల విష సర్పాలు..! నాడు మహిళలకు అధిక వడ్డీకి అప్పులిచ్చి.. తీర్చలేనివారిని వ్యభిచార రొంపిలోకి దించింది పచ్చ మూక..! నేడు స్పా సెంటర్ల ముసుగులోనూ అదే తీరున గలీజు దందా..! దాదాపు పదేళ్ల కిందట రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ రాకెట్ కొత్త అవతారంలో పుట్టుకొచ్చిందా అన్నట్లు.. ప్రస్తుతం స్పా రాకెట్ సాగుతోంది..! అప్పుడు.. ఇప్పుడు ఈ అరాచకానికి బలవుతున్నది మహిళలే కాగా.. అడ్డా విజయవాడనే కావడం.. గమనార్హం..! సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పైకి మసాజ్ కేంద్రాలు.. లోపల వ్యభిచార దందా..! అధికార కూటమి పార్టీలలోని ముఖ్య, ద్వితీయ స్థాయి నేతలతో ఉన్న సత్సంబంధాలే పునాది.. సమాజంలో ఉన్న పలుకుబడేపెట్టుబడి..! వాటితోనే కోట్లాది రూపా యల దందా..! కాల్ మనీ–సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో మునిగితేలిన టీడీపీ నాయకుల బాగోతాలు ఇదివరకే బట్టబయలయ్యాయి. ఇప్పుడు ‘స్పా’ (మసాజ్) సెంర్ల వంతు వచ్చింది. విజయవాడ నగరంలోని స్పా సెంటర్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మాచవరం పోలీసులు గత నెలలో దాడిచేసి పది మంది మహిళలు, 13 మంది విటులను అరెస్టు చేశారు. ఆ తర్వాత స్పాలలోని లోగుట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్పాల నిర్వాహకులతో ‘క్రిడ్ ప్రోకో’ సంబంధాలున్న నాయకులు, పోలీసులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. కూటమి వచ్చాక పట్టపగ్గాల్లేకుండా.. ఆరేడు నెలల్లో ‘స్పా’లలో వ్యభిచార, ఇతర జుగుప్సాకర వ్యవహారాలు పెరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రస్థాయిలోని కొందరు కూటమి ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల సహకారంతోనే నిర్వాహకులు నిర్భయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ధనికులు నివసించే కాలనీలు, కాస్త చాటుగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్పాలను నెలకొల్పుతూ, ప్రాచుర్యం పొందిన తర్వాత అక్కడినుంచి మార్చేస్తూ కొత్త పేర్లతో నెలకొల్పుతూ దందా నడిపిస్తున్నారు. అబ్బో భార్గవ్.. అతడే సూత్రధారి చలసాని ప్రసన్నభార్గవ్.. విజయవాడ స్పా సెంటర్ల దందాలో ఇతడే కింగ్ పిన్. స్టూడియో 09, ఏపీ22 పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ అదే భవనం పైన స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నడిపిస్తున్నాడు. గత నెలలో పోలీసులు దాడి చేసింది ఇతడి స్పా సెంటర్ పైనే. అయితే, పోలీసుల రాకపై నిర్వాహకుల హెచ్చరికలతో పలువురు తప్పించుకున్నారు. కాగా, ఏలూరుకు చెందిన భార్గవ్ తనకు కూటమి పార్టీల్లోని పలువురు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయంటూ వేర్వేరు సందర్భాల్లో వారితో కలిసి దిగిన ఫొటోలను చూపుతూ హల్చల్ చేస్తున్నాడు. విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తదితరులతో కలిసి దిగిన ఫొటోలను అవసరమైన చోట ప్రదర్శిస్తూ ఫలానా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే తమ బంధువులని, ప్రభుత్వమూ తమవాళ్లదేనంటూ హడావుడి చేస్తున్నాడు. దీనికోసం యూట్యూబ్ చానల్‌నూ అడ్డుపెట్టుకుంటున్నాడు. నల్ల అద్దాలతో కూడిన ఖరీదైన వాహనాలకు కూటమి పార్టీల లోగోలు ఏర్పాటు చేసుకుని అమ్మాయిల తరలింపునకు వాడుతున్నారు. విజయవాడ కేంద్రంగా పోలీసు అధికారులు, ముఖ్య నాయకులతో ఉన్న సంబంధాలతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్ తదితర నగరాల్లోనూ స్పాల మాటున వ్యభిచార గృహాలను నడుపుతున్నాడనే ఫిర్యాదులు ఉన్నాయి. భార్గవ్.. తెలుగు రాష్ట్రాల్లోని స్పా సెంటర్లకు అధ్యక్షుడిగా, ఆర్గనైజర్గానూ వ్యవహరిస్తుండడం గమనార్హం. విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్పాల ముసుగులో నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార కేంద్రాలకు అమ్మాయిల సరఫరాను భార్గవ్ విజయవాడ నుంచి మార్గదర్శనం చేస్తుంటాడు. ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారానే సాగిస్తున్నాడు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్లాలి? ఏ అకౌంట్లో ఎంత మొత్తం జమ చేయాలి? ఏయే ఖాతాలకు బదిలీ చేయాలి? డెన్ల చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను ఎప్పటికప్పుడు పరిశీలించడం.. అంతా ఫోన్‌తోనే. దీంతో ప్రసన్న భార్గవ్ వేర్వేరుచోట్ల ఉన్నా రాకెట్‌ను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాడు. రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు డిపాజిట్ స్పా సెంటర్లకు.. ఇదివరకే పరిచయాలున్న, వృత్తికి అలవాటుపడిన ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలను, వారి ద్వారా కొత్తవారిని పిలిపిస్తుంటారు. వారినుంచి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేయించుకుంటారు. ఈ డబ్బు తిరిగివ్వరు. కొందరినైతే రెండు, మూడు నెలలు కాంట్రాక్టు పద్ధతిన నిర్ణీత మొత్తానికి కుదుర్చుకుంటారు. వీరిని బృందాలుగా విభజించి ఇతర స్పాలకూ పంపుతుంటారు. డిపాజిట్ మొత్తాన్ని బట్టి సౌకర్యాలున్న రూంలను వారం, పది, పదిహేను రోజుల చొప్పున కేటాయిస్తారు. భార్గవ్ బృంద సభ్యులు సమాచారం ఇచ్చి విటులను రప్పిస్తుంటారు. వారి నుంచి రూ.5 వేలు–రూ.25 వేలు, అవగాహనను బట్టి ఇంకా ఎక్కువ యువతులు వసూలు చేసుకుంటారు. తమ డిపాజిట్‌ను మించి సంపాదించుకుని స్వస్థలాలకు, లేదా నిర్వాహకులు సూచించిన ఇతర ప్రాంతాల్లోని స్పా సెంటర్లకు వెళ్లిపోతారు.అదే సమయంలో స్పా నిర్వాహకులు కౌంటర్ ఫీజు కింద విటుల నుంచి రూ.2,500–రూ.6,500, ఒక్కో యువతి నుంచి టిప్ కింద రూ.1,500–రూ.2 వేల వరకు లాగేసుకుంటున్నారు. మొత్తంమీద నెలకు 80 నుంచి 90 మంది యువతుల ద్వారా డిపాజిట్లు, టిప్స్, కౌంటర్ ఫీజు తదితరాల రూపంలో భార్గవ్ ముఠా నెలకు రూ.రెండున్నర నుంచి రూ.3 కోట్లు పోగేసుకుంటోంది. ఇందులో పోలీసులతో పాటు ఎవరి వాటా వారికి చేరుతుంది. అనుచర బృందంతో వ్యవహారాలు చలసాని ప్రసన్న భార్గవ్‌కు అత్యంత నమ్మకమైన సహచర బృందం ఉంది. వీరిలో మహిళలే అధికం. భార్గవ్ వ్యక్తిగత అనుచరుడు కుమార్ తన సోదరి పేరిట స్పాలు, సెలూన్లు నిర్వహిస్తున్నారు. సతీష్ యువతుల సరఫరా మొదలు ఇతర పనులు చేస్తుంటాడు. గోపీచౌదరి వ్యాపార భాగస్వామి. పోలీసులు, మీడియా వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు యువతుల సరఫరాలో ప్రధాన బాధ్యత ఇతడిదే. నాలుగు నెలల కిందటే ఫిర్యాదు చేసినా‘నాలుగైదు నెలల కిందటే పై విషయాలన్నింటినీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మహిళా సంఘాల వారికీ వివరించాం. వారు ఉన్నతా«ధికారులకు చెప్పారు. ఏసీపీ స్థాయి అధికారి ఒకరు ఒకటి, రెండు స్పా సెంటర్లకు వెళ్లి భారీఎత్తున బేరం కుదుర్చుకున్నారు. హెచ్చరికలు చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. మొక్కుబడిగా స్పా ముసుగులోని ఓ వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇలాంటివి విజయవాడలో ఎన్ని ఉన్నాయో పోలీసులకు బాగానే తెలుసు. –భార్గవ్ బాధితురాలు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ ప్రెసిడెంట్‌గా.. చలసాని ప్రసన్న భార్గవ్ ‘హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా– ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్’ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 2024 నవంబరు 28 నుంచి 2025 నవంబరు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్లు సర్టిఫికెట్ ఉంది.కోడ్ పేర్లతో ఎర.. రాష్ట్రంలోని తన స్పాలకు వచ్చే యువతులు, విటులతో పాటు ఇతర స్పాలకు క్లయింట్లుగా వెళ్లి సమాచారాన్ని రాబట్టడం, ఆ తరువాత బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం భార్గవ్ బృందం దందాలో మరో కోణం. టెలిగ్రామ్, సీక్రెట్ నంబర్ల ద్వారా స్పాకు కొత్త యువతులు వచ్చారంటూ విటులకు సమాచారం చేరవేస్తుంటారు. ‘ఫ్రెషర్స్, ఓన్లీ ఫ్యూ ఫ్లవర్స్ అవైలబుల్, ఫ్రెష్ లుక్స్, హాయ్ ఫ్రెండ్స్, న్యూ చాక్లెట్ అవైలబుల్’ వంటివి వారి కోడ్ పదాలు. ఆటో లిఫ్ట్, పిక్ అప్ మి లాంటి యాప్స్ ద్వారా అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా ఆహ్వానాలు ఉంటాయని సమాచారం. దాదాపు ఎనిమిది మంది సిబ్బందికి అదే పని. స్పాలలో డిజిటల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. స్టాఫ్‌కు కూడా వీటి వివరాలు తెలియవు. స్పాల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ స్థానిక పేద విద్యార్థినులు, యువతులను కూడా రొంపిలోకి దింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారాల ముసుగులో.. చలసాని ప్రసన్న భార్గవ్.. చలసాని కన్స్ట్రక్షన్స్, చలసాని మీడియా, పాంపరింగ్ రిసార్ట్స్ అండ్ స్పా, ఏపీ23 న్యూస్, స్టూడియో 9 సెలూన్ అండ్ స్పా, కోజి 9 సెలూన్ అండ్ స్పా, సిగ్నేచర్ సెలూన్ అండ్ స్పాతో పాటు మరికొన్నింటిలో వ్యాపార భాగస్వామి. ఇతరుల వ్యాపారాల గురించి తెలుసుకోవడం, పెట్టుబడిదారుగా చేరడం, కొంతకాలానికి వారిని దెబ్బతీయడం అతడి నైజమని బా«ధితులు వాపోతున్నారు. విజయవాడతో పాటు ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఆయన చేతిలో మోసపోయినవారున్నారని గుర్తు చేస్తున్నారు. కాగా, భార్గవ్ తన బృందంలోని ముఖ్యులకు ఏరోజుకారోజు రాబడిలో పది నుంచి ముప్పయి శాతం వాటా ఇస్తున్నాడు. దీంతో యువతుల రాకపోకల నుంచి విటులకు ఆహ్వానాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. భిన్న రకాల మీడియా మాటున ఏ రంగం వారినైనా బ్లాక్ మెయిల్ చేయడానికి వెనుకాడడని, తనకు సమాచారం ఇచి్చనవారికి దండిగానే ముట్టజెబుతాడని సమాచారం. -
చెప్పింది చేయాల్సిందే
సాక్షి, అమరావతి: అడ్డగోలు వ్యవహారాలకు చిరునామాగా మారిన కూటమి ప్రభుత్వంలో పలువురు ఎమ్మెల్యేలు సామాన్య ప్రజలనే కాకుండా, ఉన్నతాధికారులను సైతం బెంబేలెత్తిస్తున్నారు. తాము చెప్పిన ఎలాంటి పని అయినా నిబంధనలతో నిమిత్తం లేకుండా చేసేయాలని ఒత్తిడి చేస్తున్నారు. చేయకపోయినా, ఆ పని ఆలస్యమైనా వారిపై విరుచుకు పడుతున్నారు. ఏ స్థాయి అధికారి అయినా సరే బెదిరించడానికి, ఇష్టం వచ్చినట్లు తిట్టడానికి వెనుకాడడం లేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రెవెన్యూ ఉన్నతాధికారులపై వీరంగం వేసిన వ్యవహారం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఇళ్ల స్థలాల క్రమబద్ధికరణకు సంబంధించి ప్రశ్నోత్తరాల్లో ఒక ప్రశ్న అడిగిన ఆయన.. మంత్రి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత అసెంబ్లీలో అధికారులు ఉండే రూమ్‌లోకి వెళ్లి రెచ్చిపోయారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జయలక్మిని తన పని ఎందుకు చేయలేదంటూ ఇష్టానుసారం తిట్టిపోశారు. అరుపులు, కేకలతో వారిపైకి దూసుకెళ్లారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని సర్ది చెప్పినా వినిపించుకోలేదు. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏకవచనంతో సంబోధిస్తూ తిట్టడం చూసిన మిగిలిన అధికారులు బిత్తరపోయారు.పలువురు ఎమ్మెల్యేలు ఆయన్ను బలవంతంగా బయటకు తీసుకెళుతుండగా.. మీ సంగతి తేలుస్తానంటూ అధికారులను బెదిరించడం గమనార్హం. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు (2014–19) కూడా బొండా ఉమ... విజయవాడలో అప్పటి రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను అందరి ముందు తిట్టి రభస సృష్టించడం సంచలనం రేకెత్తించింది. ఎక్సైజ్ కమిషనరేట్‌లో నరసరావుపేట ఎమ్మెల్యే వీరంగం ఇటీవల నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబు ఎక్సైజ్ శాఖ కమిషనరేట్‌కు వెళ్లి నానా బీభత్సం సృష్టించడం అధికార వర్గాల్లో కలకలం రేపింది. నరసరావుపేటలోని మద్యం డిపోలో తాను సిఫారసు చేసిన 10 మందిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించలేదంటూ డైరెక్టర్ నిషాంత్‌కుమార్ ఛాంబర్లోకి వెళ్లి ఆయన్ను కదలనీయకుండా అడ్డుకున్నారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ తాను రాసిన లేఖను ఎందుకు పట్టించుకోలేదంటూ నిలదీశారు. ఇప్పటికిప్పుడు తాను చెప్పిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లనని బీభత్సం సృష్టించారు.ఛాంబర్‌లోనే ఉన్న సోఫాలో పడుకుని హడావుడి చేయడంతో డైరెక్టర్.. సంబంధిత మంత్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. మంత్రి వెంటనే.. ఎమ్మెల్యేకు ఫోన్ చేసి వెనక్కు వచ్చేయాలని, తాను ఆ పని అయ్యేలా మాట్లాడతానని చెప్పినా ఆయన వినలేదు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా అరవింద్‌బాబు పట్టించుకోలేదు. రెండున్నర గంటలపాటు ఛాంబర్‌లోనే ఉండడంతో గత్యంతరం లేక డైరెక్టర్ ఆయన చెప్పిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాతే అరవింద్‌బాబు అక్కడి నుంచి బయటకు వచ్చారు. మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్‌పై జనసేన ఎమ్మెల్యే దాడి కొద్ది రోజుల క్రితం కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేయడం కలకలం సృష్టించింది. విద్యార్థులు ఆడుకోవాల్సిన కాలేజీలో బయట వ్యక్తులకు అనుమతి లేదని చెప్పడంతో రెచ్చిపోయిన నానాజీ అనుచరులు వెంటనే ఆయన్ను పిలుచుకుని వచ్చి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. ఎమ్మెల్యే నానాజీ సైతం బూతులు తిడుతూ డాక్టర్ మాస్క్‌ని లాగిపడేశారు.⇒ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్థానిక అధికారులను బెదిరించడం, తిట్టడం సర్వసాధారణం కావడం అందరికీ తెలిసిందే. తన వద్దకు వచ్చే అధికారులను ఎలా పడితే అలా మాట్లాడుతుండడంతో వారు బెంబేలెత్తుతున్నారు. అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా ఇప్పటికే ఆయన పేరుగాంచారు. ⇒ శ్రీకాళహస్తి, తాడిపత్రి, ఆమదాలవలస, దెందులూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌రెడ్డి, కూన రవికుమార్, చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి (ఈయన కుమారుడు ఎమ్మెల్యే), తదితరులు అధికారులను బూతులు తిట్టడం పరిపాటిగా మారింది. ⇒ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో తనకు ఇష్టం లేని అధికారిని మున్సిపల్ కమిషనర్‌గా నియమించారని అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ దుర్భాషలాడుతూ ఆయన్ను కార్యాలయంలోనికి రానీయకుండా అడ్డుకుని రభస చేశారు. చంద్రబాబు అండతో రుబాబు విధి నిర్వహణలో ఉన్న తమను బెదిరించడం, అసభ్యంగా తిడుతుండడాన్ని ఐఏఎస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో బొండా ఉమ, ఎక్సైజ్ కమిషనరేట్‌లో అరవింద్‌బాబు సృష్టించిన రభస ఉన్నతాధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలాగైతే పని చేయడం కష్టమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోతున్నారు. దీంతో ఇదంతా సీఎం ప్రోత్సాహంతోనే జరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశాల్లో తనది పొలిటికల్ గవర్నెన్స్ అని సీఎం చెప్పడం, ఆ క్రమంలోనే అధికారులపై ఎమ్మెల్యేలు విరుచుకు పడడం జరుగుతుండడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే అధికారులు.. ఎమ్మెల్యేల దగ్గర కుక్కిన పేనుల్లా పడి ఉండి, వారు చెప్పిన తప్పుడు పనులు చేయడమేనా.. అనే చర్చ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని ఒత్తిడి చేయడం, చేయకపోతే దాడులు, దౌర్జన్యాలు చేసే సంస్కృతి రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేదని ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నారు.ఇప్పుడు కూటమి పాలనలోనే ఆ సంస్కృతి కొత్తగా మొదలైందని, ఉన్నతాధికారులపై దాడులు జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు ఇలాంటి సీరియస్ అంశాలపై కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండడం, ఊరికే వారిపై సీరియస్ అయినట్లు, విచారణ జరుపుతున్నట్లు మీడియాకు లీకులిచ్చి, తర్వాత వదిలేయడం పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగానే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. -
ఎరువుల్లేవ్.. అంతా సమస్యల దరువే!
సాక్షి, అమరావతి : ఇది పక్కన చెప్పుకొన్న ఉదాహరణలోని గిరిజన రైతు సమస్యనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం అన్నదాతలు పడుతున్న వెత.. ప్రభుత్వ సేవలపై ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఎరువుల సరఫరాపై ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే దీనికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత రాష్ట్రంలో ఎరువుల సరఫరా అధ్వాన్నంగా ఉందంటూ వారంతా తేల్చి చెప్పారు. సకాలంలో, సరైన సమయానికి అవసరానికి తగ్గట్టు లభ్యం కావడం లేదని స్పష్టం చేశారు. పైగా గతంలో ఎన్నడూలేని విధంగా పంపిణీలో కూడా అవినీతి చోటుచేసుకుంటోందని కుండబద్దలు కొట్టారు. కూటమి పాలనలో కష్టాలు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి నప్పటి నుంచి ఎరువుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల (పూర్వపు ఆర్బీకేలు) ద్వారా ఎరువుల సరఫరాను నిలిపివేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా కూడా అరకొరగానే ఇస్తున్నారు. దీంతో సకాలంలో దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇదివరకు తరహాలో మండల కేంద్రాలకు పరుగులు తీస్తూ సొసైటీల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. కాంప్లెక్స్ మోత ఓపక్క కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు రూ.100 నుంచి రూ.255 మేర పెంచడంతో అన్నదాతలు భారం మోయలేక తల్లడిల్లుతున్నారు. మరోపక్క కృత్రిమ కొరత సృష్టిస్తూ డీలర్లు అందినంత దోచుకుంటున్నారు. యూరియా, డీఏపీ ఎరువుల బస్తాపై రూ.100–500 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు ఖరీఫ్‌లోనే కాదు.. రబీలోనూ దోపిడీ కొనసాగుతూనే ఉంది.రైతు భరోసా లేదు.. అంతా బాదుడే పది ఎకరాల్లో కాఫీ, పసుపు, మిరియాలు, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్స్‌తో పాటు వరి సాగు చేస్తుంటా. వరి మినహా మిగిలిన పంటలన్నీ సేంద్రియ పద్ధతిలోనే పండిస్తా. వరికి కావాల్సిన ఎరువులు గతంలో గ్రామంలోని రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)లోనే దొరికేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక సరఫరా నిలిపివేశారు. దీంతో 25 కి.మీ. దూరంలో ఉన్న చింతపల్లి, అక్కడ లేకపోతే 40 కి.మీ. దూరంలోని నర్సీపట్నం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఎరువుల కట్ట కోసం రోజంతా వృథా అవడమే కాదు. చార్జీలకు రూ.500 పైగా ఖర్చవుతోంది. ఎమ్మార్పీపై బస్తాకు రూ.50 నుంచి రూ.వంద వరకు వసూలు చేస్తున్నారు. అవసరం లేని పురుగు మందులు అంటగడుతున్నారు. ఎరువుల్లో నాణ్యత కూడా ఉండడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఏంటిది? అని అధికారులను అడిగితే మేమేం చేయగలం? అని అంటున్నారు. – బౌడు కుశలవుడు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం గొందిపాకలు గ్రామ గిరిజన రైతు. ఎరువుల సరఫరాపై ఐవీఆర్ఎస్ సర్వేలో ‘ఎరువులు లేవు’ అని చెప్పిన రైతులు 41.2% జనవరిలో44% మార్చిలో74% అత్యధికంగాఏజెన్సీ జిల్లాల్లో56% శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో‘నాసిరకం’ అని చెప్పిన రైతులు 22.4% జనవరిలో34% మార్చిలో67% అత్యధికంగా ఏజెన్సీ జిల్లాల్లో 49% అనంతపురం జిల్లాలో48% కర్నూలు జిల్లాలోఎరువుల సరఫరా సందర్భంగా సహకార సంఘాలు,రైతు సేవా కేంద్రాల్లో అవినీతి జరుగుతోందని చెప్పిన రైతులు 39% జనవరిలో37% మార్చిలో45% అత్యధికంగా పల్నాడు,కర్నూలు జిల్లాల్లోసరిపడాఎరువులు అందుబాటులోఉన్నాయా..?అన్ని జిల్లాల్లోనూ లేవు అని చెబుతున్న వారు 40- 44%అవసరమైనప్పుడు, కోరుకున్న ఎరువులు దొరకడం లేదు..41%ఎమ్మార్పికి మించి యూరియాకు వసూలు చేస్తున్నారు. 60%ఎరువులతో పాటు అవసరం లేని మందులను అంటగడుతున్నారు 60% -
విద్యుత్తు ఉద్యోగులకు బదిలీల ‘షాక్’
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమ్మతితో పని లేదు.. సాధారణ బదిలీల్లో ఇచ్చే వెసులుబాట్లూ లేవు.. ఎప్పుడూ ఉండే.. వైకల్యం, భార్యాభర్తలు, అనారోగ్యం, స్థానికం ‘ఆప్షన్లు’ లేవు.. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ..! విద్యుత్తు శాఖలో ఇప్పుడీ అంశం కలకలం రేపుతోంది. ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏ ప్రభుత్వ విభాగంలోనూ ఇలాంటి నిర్భంధ బదిలీలు జరగలేదని, ఎందుకింత కఠినం అని ఉన్నతాధికారులను అడిగితే.. ‘మేం చెప్పిన చోటకు వెళ్లండి.. లేదంటే మానేయండి’ అనే సమాధానం వస్తోందని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. విమర్శలు రావడంతో అనుమతి పాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వంలో 13 జిల్లాలను 26గా చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లలో దాదాపు 1.92 కోట్లమంది విద్యుత్తు వినియోగదారులకు సేవలందించేందుకు కొత్తగా ఏర్పడ్డ 13 జిల్లాలకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ (ఈఈ) స్థాయి అధికారులను ఇన్చార్జులుగా నియమించారు.కూటమి ప్రభుత్వంలో కొత్త జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుతో పాటు అధికారులు, సిబ్బందిని కేటాయించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంపై విమర్శలొచ్చాయి. దీంతో కొంతకాలం క్రితం కొత్త సర్కిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. చెరో జిల్లాకు భార్యాభర్తలు..!రాష్ట్రంలోని 3 డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు. వీరినే పాత, కొత్త డివిజన్లకు సర్దుబాటు చేసుకోమని, కొత్త పోస్టులు ఇవ్వడం కుదరదని చెప్పింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా సర్కిళ్లు ఏర్పాటు చేయాలంది. డిస్కంలు దీనికితగ్గట్లు.. కమిటీలు వేసి ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. అయితే, సాధారణ బదిలీల్లో అనుసరించే నిబంధనలను పక్కనపెట్టాయి. ఈ కారణంగా ఒక డిస్కం పరిధిలో భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉంటే వారు చెరో జిల్లాకు బదిలీ కావాల్సి వస్తోంది. కొత్త సర్కిళ్ల పేరు చెప్పి ఇప్పటికే సగం సర్వీసులు తగ్గించేశారు. కొన్ని సర్కిళ్లలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎస్‌ఏవో) పోస్టులను తీసేశారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏవో) పోస్టులను ఎత్తేశారు. టెక్నికల్ పోస్టులను కుదించేశారు. ఒక్కో ఉద్యోగి రెండు మూడు విభాగాల పనిచేసే విధంగా భారం మోపుతున్నారు. వీటితోనే సతమతం అవుతున్న ఉద్యోగులు శాశ్వత కేటాయింపులపై ఆందోళనకు గురవుతున్నారు. -
రంగంలోకి అంగడి చదువు!
పేదరికం కారణంగా కొంతమంది ఏపీ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయలేకపోయారన్న వార్తలు వస్తున్నాయి. మన పాలక వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవలసిన పరిణామం ఇది. ఉన్న ఊళ్లో ఉపాధి లేక పొట్టకూటికోసం వెనుకబడిన ప్రాంతాల ప్రజలు వలసబాట పడుతున్నారు. చదువుకుంటున్న వారి పిల్లలు కూడా గత్యంతరం లేక తల్లిదండ్రులను అనుసరించవలసి వస్తున్నది. వారిలో పదో తరగతి చదివిన పిల్లలు కూడా ఉన్నారు. వలస కారణంగా వారు కీలకమైన పదో క్లాసు పరీక్షలకు దూరమయ్యారు. వారి భవిష్యత్తు గురించి వ్యవస్థ పట్టించు కోనట్టయితే డ్రాపవుట్లుగా మిగిలే అవకాశం ఉన్నది. వారి భావి జీవితం వలసకూలి టైటిల్‌తో ముడిపడే ప్రమాదం ఉన్నది.‘‘ఒక్క మలినాశ్రు బిందువొరిగినంత వరకు... ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను’’ అంటాడు కవి బాలగంగాధర తిలక్. నిజంగా ప్రజల ఆలనాపాలనా చూడవలసిన ఏపీ సర్కార్‌కు మాత్రం అటువంటి సెంటిమెంట్లేవీ లేవు. ఇప్పుడు ఒక్క కన్నీటి బొట్టు రాలడం కాదు. మూర్తీభవించిన కన్నీరు దారిపొడుగునా ప్రవహిస్తున్నది. ‘‘జగన్ సర్కార్ అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని కొనసాగించి ఉన్నట్లయితే మా పిల్లలు తప్పకుండా పదో తరగతి పరీక్ష రాసేవార’’ని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. నాణ్యమైన సార్వత్రిక విద్యను అమలు చేయడం కోసం జగన్ మోహన్ రెడ్డి ఎంతగా మేధామథనం జరిపి పథకాన్ని రూపొందించి ఉంటారో ఈ విషాద పరిణామాన్ని చూస్తే అర్థమవు తున్నది.మన దేశంలో విద్యాహక్కు చట్టం అమలులో ఉన్నది. అటు వంటి చట్టాన్ని అమలు చేయాలని భారత రాజ్యాంగం కూడా ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఇది మొక్కుబడి తతంగంగా మారిందన్న సంగతి అందరికీ తెలిసిందే. బడికి వచ్చే పిల్లలకు అరకొర చదువు చెప్పడం ప్రభుత్వ స్కూళ్ల కర్తవ్యంగా మారి పోయింది. ఉద్దేశపూర్వకంగా తలెత్తిన ఈ ధోరణి ఫలితంగా తామరతంపరగా ప్రైవేట్ విద్యాసంస్థలు పట్టుకొచ్చాయి. స్థోమత ఉన్నవాళ్లంతా ప్రైవేట్ స్కూళ్లలో మెరుగైన విద్యను కొనుగోలు చేయడం, పేద పిల్లలు సర్కారు బడి చదువులతో పోటీలో నిలవలేకపోవడం... గత మూడు దశాబ్దాలుగా బాగా ఎక్కువైంది. ఈ ధోరణి పట్ల పలువురు ప్రగతిశీల సామాజిక వేత్తలు, మేధావులు అసహనాన్నీ, ఆందోళననూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు.ఐక్యరాజ్య సమితి సైతం తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్డీజీలు) పిల్లలందరికీ నాణ్యమైన విద్య ఉచితంగా సమా నంగా అందుబాటులో ఉండాలని నాలుగో లక్ష్యంగా నిర్దేశించింది. మన్నికైన జీవన ప్రమాణాలతో మానవజాతి దీర్ఘకాలం పాటు ఈ భూగోళంపై మనుగడ సాగించాలంటే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం అవసరమేనని మేధాప్రపంచం అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. కానీ పాలకుల్లో చిత్త శుద్ధి లేకపోవడం ఈ లక్ష్యాలకు ఆటంకంగా మారింది. ఉదార ప్రజాస్వామిక వ్యవస్థలు క్రమంగా ‘ప్లుటానమీ’ (సంపన్నులు శాసించే వ్యవస్థలు)లుగా పరివర్తనం చెందుతున్నాయని పలు వురు పొలిటకల్ ఎకనామిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన దశాబ్ద్ద కాలానికి ఈ పదప్రయోగం వ్యాప్తిలోకి వచ్చింది.సంస్కరణలు ప్రారంభమైన తొలి దశాబ్దిలో క్రియాశీలకంగా ఉన్న రాజకీయ నాయకుల్లో చంద్రబాబు కూడా ఒకరు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వరాదనే వాదాన్ని ఆయన బలంగా వినిపించేవారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ డిమాండ్‌ను ఆయన ఎంత తీవ్రంగా వ్యతిరేకించేవారో చాలామందికి గుర్తుండే ఉంటుంది. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అమలుచేసిన తర్వాత ఈ అంశానికి సర్వత్రా ఆమోదం లభించింది. అలాగే ప్రభుత్వ సేవలన్నింటికీ ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించాలనే నియమం పెట్టింది కూడా చంద్రబాబే! మితిమీరిన ప్రైవేటీకరణ సూపర్ రిచ్ వర్గాన్ని సృష్టించడం, తిరిగి ఆ వర్గం మొత్తం ఆర్థిక – రాజకీయ వ్యవస్థలను ప్రభా వితం చేయడం ప్లుటానమీకి దారి తీస్తున్నది.ఇటువంటి వ్యవస్థల్లో సహజ వనరుల దగ్గ ర్నుంచి సర్వే సర్వత్రా ప్రైవేటీకరణే తారకమంత్రంగా పనిచేస్తుంది. విద్యారంగం ఇందుకు మినహాయింపేమీ కాదు. విభజిత రాష్ట్రానికి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ‘విద్య ప్రభుత్వ బాధ్యత కాద’ని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతిని గుర్తు చేసుకోవడం అవసరం. ఈ నేపథ్యాన్ని అర్థం చేసు కుంటేనే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగంలో నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని ఎందుకనుకుంటున్నారో అర్థమవుతుంది. అమరావతి కోసం అరవై వేల కోట్ల రూపాయల అప్పును ఆగమేఘాల మీద పుట్టించగలిగిన వ్యక్తి, తాను పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ‘తల్లికి వందనం’ ఎందుకు అమలుచేయలేకపోయాడో అర్థమవుతుంది. ఈ పూర్వరంగం అర్థం కానట్లయితే ఆర్థిక వెసులుబాటు లేకనే అమలు చేయలేకపోయారనే మోసపు ప్రచారానికి తలూప వలసి వస్తుంది.విద్యారంగంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పూర్తి ప్రజాస్వామికీకరణ చర్య లను చేపట్టింది. ప్రజల ఆకాంక్షల మేరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించింది. భాషా – సంస్కృతుల ముసుగులో పెత్తందారులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా చలించలేదు. సీబీఎస్ఈ సిలబస్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. నగరాల్లో సూపర్ రిచ్ పిల్లలకు మాత్రమే పరిమితమైన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్‌ను పిల్లలందరికీ ఉచితంగా ఈ సంవత్సరం నుంచి అమలుచేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసింది. అంతర్జా తీయ స్థాయిలో మన పిల్లలు పోటీపడాలన్న తపనతో చేపట్టిన కార్యక్రమాలివి. డిజిటల్ యుగంలో తన రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో వెలుగొందాలని పాఠశాలల్లో డిజిటల్ బోర్డు లను ఏర్పాటు చేయించారు. ఎనిమిదో క్లాసు నుంచి విద్యార్థుల చేతికి ట్యాబ్‌లను ఉచితంగా అందజేశారు.పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్వయంగా పూనుకొని తయారు చేయించిన మెనూతో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులపై పైసా భారం పడకుండా పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్‌లను పాఠశాలల ప్రారంభానికి ముందే సిద్ధం చేసి ఉంచేవారు. మూడు నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు అన్ని సబ్జెక్టులూ ఏకోపాధ్యా యుడే బోధించే పద్ధతికి స్వస్తిచెప్పి వారికి సబ్జెక్టు వారీగా బోధించే టీచర్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆ మూడు తరగతులను కిలోమీటర్ పరిధి లోపల ఉండే అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో విలీనం చేశారు. ఫలితంగా ఆ విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల సదుపాయం ఏర్పడింది. ఆ వయసు పిల్లల్లో గ్రాహ్యశక్తి బలంగా ఉంటుందన్న అధ్యయనాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల తన పదవీ కాలంలో రెండేళ్లు కోవిడ్ కోతకు గురైనప్పటికీ పాఠశాల విద్యారంగంలో పెను మార్పులకు జగన్ తెరతీశారు.పేద – ధనిక తేడాల్లేని, లింగవివక్ష అసలే లేని ఒక నవ యుగ విద్యాసౌధ నిర్మాణం కోసం ఇన్ని ఇటుకల్ని పేర్చిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి తప్ప ఈ దేశంలో మరొకరు లేరు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విద్యావ్యవస్థ పునర్నిర్మాణా నికి ఇంత వేగంగా అడుగులు వేసిన వ్యక్తి కూడా మరొకరు కాన రారు. కేరళ రాష్ట్ర విద్యారంగం మొదటి నుంచీ కూడా మిగతా దేశంతో పోల్చితే ఆరోగ్యంగానే ఉన్నది. ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా అది తన ప్రతిష్ఠను కాపాడుకోగలిగింది.చదువుల తల్లి సరస్వతిని అమ్ముకోవడం తరతరాలుగా మన సంస్కృతిలో తప్పుగానే భావిస్తున్నారు. ఇందుకు ఆంధ్ర భాగవతం కర్త బమ్మెర పోతనామాత్యులే ఉదాహరణ. ‘‘బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల / కౌద్దాలికు లైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై’’ అన్నారు. తాను రాసిన కావ్యాన్ని సరస్వతిగా భావించి, దాన్ని రాజులకు అంకిత మివ్వడానికి ఆయన నిరాకరించారు. అలా వచ్చిన సొమ్ము పడుపువృత్తితో వచ్చిన సొమ్ముగా ఆయన అసహ్యించుకున్నారు. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ఇప్పుడు చదువుల తల్లిని అంగట్లో నిలబెట్టి అమ్ముకుంటున్నారు. దానికి మనం ఎన్ను కున్న ఏలికలు వత్తాసుగా నిలబడుతున్నారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను విడిచిపెట్టి ప్రైవేట్ స్కూళ్లలో చేరారు. ఆయన అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం రద్దవుతుందన్న భయం ఒక కారణం. ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ కింద డబ్బులొస్తా్తయనే నమ్మకం కూడా ఇంకో కారణం కావచ్చు. అట్లా మారిన విద్యార్థులు ఇప్పుడు ఫీజులు కట్టలేక అల్లాడు తున్నారు. ఇంగ్లీషు మీడియాన్ని రద్దు చేస్తారనే ప్రచారం, సీబీఎస్ఈ సిలబస్‌ను ఎత్తేయడం దేన్ని సూచిస్తున్నాయి? ఎని మిదో తరగతి నుంచి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లను నిలిపి వేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లలో కొత్త కంటెంట్ లోడ్ చేయలేదు. ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద దాదాపు ఇరవై వేల స్కూళ్లలో సౌకర్యాలను ప్రైవేట్ స్కూళ్ల కంటే మిన్నగా జగన్ ప్రభుత్వం మెరుగుపరిచింది. మిగిలిన స్కూళ్లలో ఆ కార్యక్ర మాన్ని నిలిపివేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత చాలాచోట్ల నాసిరకంగా మారింది. మూడు నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్‌ను ఎత్తేస్తారట! ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు ఏర్పడ్డ నమ్మకాన్ని చంపేయడమే లక్ష్యంగా పెట్టు కున్నట్టు కనిపిస్తున్నది. మరోపక్క పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూళ్లకు, జూనియర్ కాలేజీలకు అనుమతులిస్తున్నారన్న ప్రచారం సాగుతున్నది. ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. మెడికల్ కాలేజీల సంగతి తెలిసిందే! మరోసారి ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ప్రైవేట్ జేగంట మోగుతున్నది. అంగడి చదువులు మళ్లీ రంగప్రవేశం చేస్తున్నాయి. విద్యా విప్లవానికి గ్రహణం పట్టింది. ఈ ప్రభుత్వం మారితేనే గ్రహణం విడిచేది!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
విశాఖలో స్విగ్గీ డెలివరీ బాయ్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, విశాఖపట్నం: స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. డెలివరీ ఇవ్వడానికి సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్ అపార్ట్మెంట్లోకి డెలివరీ బాయ్ అనిల్ (22) వెళ్లాడు. డెలివరీ ఇచ్చేటపుడు మర్యాదగా మేడం అని పిలవలేదని ఇంట్లో పని మనిషి చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.సెక్యూరిటీ సిబ్బంది బట్టలు విప్పించి దాడి చేసినట్లు సమాచారం. అవమానం తట్టుకోలేక డెలివరీ బాయ్ ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో అపార్ట్మెంట్ వద్ద నగరంలో డెలివరీ బాయ్స్‌గా విధులు నిర్వహిస్తున్న యువకులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వర్రా రవీంద్రారెడ్డికి బెయిల్.. జైలు నుంచి విడుదల
అమరావతి: సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టైన వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు వర్రా రవీంద్రారెడ్డి శనివారం బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మడకశిరలో వర్రా రవీంద్రా రెడ్డిపై నమోదైన కేసులో బెయిల్ వచ్చింది. దీంతో వర్రాపై నమోదైన 26 కేసుల్లోనూ వర్రాకు బెయిల్ మంజూరైనట్లయ్యింది. దీంతో వర్రా రవీంద్రా రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం. వైఎస్సార్సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసింది. వర్రా రవీంద్రారెడ్డిని గత నవంబర్ లో అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. ఇలా రవీంద్రారెడ్డిపై 26 కేసులు నమోదు చేశారు. మొత్తం అన్ని కేసుల్లో ఇప్పటికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు వర్రా రవీంద్రారెడ్డి -
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం గోట్లపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒక ఆటోను ద్విచక్ర వాహనం డీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తుదిశ్వాస విడిచాడు. మృతులు ఊటుకూరుకు చెందిన మృతులు వరుణ్ కుమార్(17), నందకిషోర్(18), సురేంద్ర(40)లుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘రెడ్ బుక్’ రచయిత ఫోన్ కాల్ వలనే పోసాని విడుదల ఆలస్యం’
సాక్షి, గుంటూరు: రెండు ప్రెస్ మీట్లు పెట్టినందుకు పోసాని కృష్ణమురళిపై 18 కేసులు పెట్టారని.. 24 రోజులు జైలు పాలు చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన పోసానిని అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతటా తిప్పారని.. ఆ వయసులో పోసానిని అలా తిప్పటం కన్నా శిక్ష ఇంకేం ఉంటుంది?’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘రెడ్ బుక్ రచయిత నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ అక్రమ కేసులు నమోదయ్యాయి. పోసాని హాస్య నటుడు కాబట్టి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. అంతమాత్రానికే కేసులు పెడతారా?. వినుకొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు ఎత్తుకుపోయారు. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు మీద వ్యంగ్యంగా మాట్లాడారు కదా?. మరి ఆయనపై ఎందుకు కేసులు ఎట్టలేదు?. అక్రమ కేసులు పెట్టిన ఎవరినీ వదలేదిలేదు’’ అని అంబటి స్పష్టం చేశారు.పోలీసుల కన్నా మా న్యాయ వాదులు డబుల్ ఉన్నారు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మేము వస్తాం. పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కోర్టుల్లో ఇబ్బంది పడతారు జాగ్రత్త. మా లీగల్ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు. శవాలు దొరకట్లేదుగానీ లేకపోతే అన్యాయంగా మర్డర్ కేసు కూడా పెట్టేవారు. నారా లోకేష్ కాల్ చేయటం వలనే పోసాని విడుదల ఆలస్యం అయింది. లేకపోతే మధ్యాహ్నానికే పోసాని బయటకు వచ్చేవారు. ఇలాంటి కుట్ర రాజకీయాలు ఎంతోకాలం నడవవు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
ఎట్టకేలకు పోసాని కృష్ణమురళి విడుదల
గుంటూరు, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యారు. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ దక్కడంతో.. గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు. కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సోషల్ మీడియాలో పోస్టులు చేశారని ఆయా పార్టీల నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కూటమి ప్రభుత్వ ఆదేశాలతో.. వివిధ పోలీస్ స్టేషన్లకు.. కోర్టులకు.. జైళ్లకు.. తిప్పుతూ ఇబ్బంది పెట్టారు.వివిధ జిల్లాల్లో కేసుల నుంచి ఊరట లభించిందని అనుకునేలోపు.. అనూహ్యంగా సీఐడీ కేసు తెర మీదకు వచ్చింది. అయితే ఈ కేసులోనూ ఆయన నిన్న(శుక్రవారం మార్చి 21) ఊరట దక్కింది. సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే..జిల్లా జైలుకు చేరిన రిలిజింగ్ ఆర్డర్స్ చేరడం ఆలస్యమైంది. ష్యూరిటీ సమర్పణకు నిన్న సమయం లేకపోవడం.. ప్రక్రియలన్నీ ఈ ఉదయాన్నే పూర్తవటంతో.. రిలీజ్ ఆర్డర్స్ ఆలస్యమైంది. మరోవైపు కోర్టుకు చేరుకున్న పోసాని న్యాయవాదులు మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్‌పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్‌ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు.. బెయిల్‌కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్ హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్సీఐడీ పెట్టిన కేసు.. బెయిల్ మంజూరు -
‘జబర్దస్త్ స్కిట్లు.. బాబు, పవన్ వెకిలి నవ్వులు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెటకారంగా నిర్వహించారని.. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా, వెటకారంగా నిర్వహించారు అనేది ప్రజలందరూ చూశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జబర్దస్త్ కార్యక్రమంలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారంటూ దుయ్యబట్టారు.‘‘జీవితంలో ఎప్పుడు నవ్వని చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వారు. కనీస సంస్కారం లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వెకిలి నవ్వులు ఎందుకు?. కేవలం జగన్‌ను హేళన చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారా?. ఇవన్నీ మానుకుంటే చంద్రబాబుకు బాగుంటుంది. సిగ్గు లేకుండా, హుందాతనం లేకుండా ప్రవర్తించిన గ్రీష్మ అనే మహిళకు ఏ విధంగా ఎమ్మెల్సీ ఇచ్చావో స్పష్టం చేయాలి. టీడీపీలో ఎంతో మంది సీనియర్లు, నాయకులను కాదని రౌడీలకు పదవులా?’’ అంటూ సతీష్‌రెడ్డి నిలదీశారు.‘‘పులివెందుల నియోజకవర్గం నుంచి పవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హత్య సినిమాపై ట్రోల్ చేశారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలోని సన్నివేశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అదుపులోకి తీసుకుంటారా?. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేస్తే పోలిసులు స్పందించడం దారుణం. టీడీపీ, జనసేన నాయకులకు సిగ్గు లేదు. వైఎస్సార్సీపీ నాయకులు హుందాతనంతో ప్రవర్తిస్తారు. సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అపహస్యం చేశారు’’అని సతీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అక్రమ కేసులతో అణచివేయలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శించారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో జరిగిన ఘర్షణలో 16 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టై రిమాండ్‌లో ఉన్న కార్యకర్తలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఆ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు పరామర్శించారు.పరామర్శ అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, పెనుగంచిప్రోలు తిరునాళ్లలో పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని.. విద్వేషపూరితంగా మాట్లాడుతూ రెచ్చగొట్టారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభల పై రాళ్లు, కర్రలు విసిరేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను నోటికొచ్చినట్లు తిట్టారు. టీడీపీ వాళ్లు రెచ్చగొడుతున్నా పోలీసులు కనీసం కట్టడిచేయలేదు. టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసురుతుంటే ఆత్మరక్షణలో భాగంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు’’ అని పేర్ని నాని వివరించారు.‘‘టీడీపీ కార్యకర్తలు నానా గొడవ చేస్తుంటే పోలీసులు కనీసం స్పందించలేదు. తిరునాళ్లలో గొడవ జరిగినపుడు లేని వాళ్లను పోలీసులు ముద్ధాయిలుగా చేర్చారు. జాతరలో ప్రభలకు పూజలు చేస్తున్న పూజారి కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిపై పోలీసులు అన్యాయంగా అక్రమ కేసులు పెట్టారు. అసలు ఈ రాష్ట్రంలో చట్టం, ధర్మం, న్యాయం ఉందా?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పోలీసులు పసుపు పచ్చ కండువా వేసుకున్న వారిలా ఉద్యోగం చేస్తున్నారు. కిరాయి మూకలు, రౌడీ మూకలకు పోలీసులు వత్తాసు పలకడం దురదృష్టకరం. టీడీపీ వాళ్లు విసిరిన రాళ్లతో దెబ్బలు తగిలితే వైఎస్సార్సీపీ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాకీ చొక్కాలేసుకున్న పోలీసులకు ఇది ధర్మమేనా?. చట్టాన్ని టీడీపీకి చుట్టంలా మార్చేసిన ఖాకీలను న్యాయం ముందు నిలబెడతాం. టీడీపీ పార్టీ ఖాజానా నుంచి మీకు జీతాలివ్వడం లేదని పోలీసులు గుర్తుంచుకోవాలి. అమాయకుల పై హత్యాయత్నం కేసుల్లో ఇరికించడం దుర్మార్గం’’ అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.వారిని చట్టం ముందు నిలబెడతాం.. దేవినేని అవినాష్దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభ కంటే ముందు టీడీపీ ప్రభ వెళ్లాలని పెనుగంచిప్రోలులో పోలీసులు ఆపేశారు. టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు గాయపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసు పెట్టి 16 మందిని జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించాం. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో వారికి ధైర్యం చెప్పాం. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు తస్మాత్ జాగ్రత్త. అలాంటి వారిని చట్టం ముందు నిలబెడతాం’’ అని ఆయన హెచ్చరించారు.టీడీపీ ఆఫీస్ నుంచి పేర్లు.. వారిపై కేసులు: తన్నీరు నాగేశ్వరరావుజగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తిరుపతమ్మకు పసుపు కుంకుమ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ పార్టీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనంగా ఉన్నప్పటికీ టీడీపీ పార్టీ కార్యర్తలు రాళ్లు, బాటిల్స్ విసిరారు. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా 25 మందికి పైగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. చదువుకున్న యువకులను కావాలని కేసుల్లో ఇరికించారు. టీడీపీ ఆఫీస్ నుంచి పేర్లు పంపించిన వారిపై కేసులు పెట్టారు. గత యాభై ఏళ్లలో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై న్యాయ పోరాటం చేస్తాం. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అణచివేయలేరు -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
లింగాపురం: నంద్యాల జిల్లా లింగాపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. పొలానికి వెళుతున్న సమయంలోవైఎస్సార్‌సీపీకి చెందిన సుధాకర్ రెడ్డి అనే కార్యకర్తను గొడ్డలితో అతికిరాతంగా నరికి చంపారు. సుధాకర్ రెడ్డి పొలానికి వెళుతున్న సమయంలో మాటువేసి హత్య చేశారు కొంతమంది దుండగులు. ఈ హత్యకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.ఈ కేసులో కొంతమందిపై అనుమానాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. హత్యగావించబడ్డ సుధాకర్ రెడ్డికి ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో ఒక ల్యాండ్ కు సంబంధించి సుధాకర్ రెడ్డితో కొంతమందికి వైరం ఉందని, దీని వెనుక వారి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ కూడా ఒకటి దొరికిందన్నారు. దాన్ని బట్టి నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్య వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ప్రమేయంతోనేవైఎస్సార్‌సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డిని అతిదారుణంగా హత్య చేశారనివైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
చంద్రబాబుకి అలా చెప్పిన అధికారి ఎవరు?: భూమన
తిరుపతి, సాక్షి: తమ రాజకీయ అవసరాల కోసం దేవుళ్లను, సనాతన ధర్మాన్ని వాడుకోవడం మాత్రమే చంద్రబాబు, పవన కల్యాణ్‌లకు మాత్రమే తెలుసని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakara Reddy) అంటున్నారు. తాజాగా తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలకు, విమర్శలకు భూమన ఘాటుగా బదులిచ్చారు. గతంలో మేము చేసిన తీర్మానం చంద్రబాబు ఓసారి చూడాలి. హిందువులను తప్ప ఇతరులకు ప్రవేశం లేదన్నది వైఎస్ఆర్ పాలనలో తీసుకున్నదే. కానీ ప్రచారం మాత్రం మీరు చేసుకుంటున్నారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, తుడా అనుమతులు ఇచ్చింది ఆయన పాలనలోనే అనే విషయం గుర్తించాలి... తిరుమలలో ఆధ్యాత్మికానికి.. పర్యాటకానికి ఎక్కడా పొంతన ఉండదు. 2014-19 టీడీపీ పాలనలో దేవలోక్(Devlok)కు చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. అదీ మా పాలనపై రుద్దుతున్నారు. హిందూ ధర్మంకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసానికి స్వామీజీలు, సన్యాసులు అంతా కదన రంగానికి కదలి వచ్చారు. ఆ కారణంగా భయపడే విరమించుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ టీడీపీ హయాంలోనే ఏర్పాటు చేశారు. కానీ, వైఎస్సార్సీపీ(YSRCP) పాలనలో అత్యద్భుతంగా నిర్వహించాం. వేల కోట్ల రూపాయలు ఈ ట్రస్ట్ ద్వారానే జమ అయ్యాయి. టీటీడీ తరఫున దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాం. జగన్ పాలనలో 3,600 దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేయించారు. ఇది చూసి ఓర్వలేక.. ట్రస్ట్ నిధులు దుర్వియోగం అయ్యాయని అసత్యప్రచారాలకు దిగారు. విజిలెన్స్ విచారణ జరిపించారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టగానే బీఆర్ నాయుడు ఆ ట్రస్ట్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ, విజిలెన్స్ రిపోర్ట్ సమర్థవంతంగా నిర్వహించిన్నట్లు వచ్చింది. దీంతో.. శ్రీవాణి ట్రస్ట్ గురించి మాట్లాడటం మానేశారు. తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు అనడంపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీతో ఆలయం మూసి వేస్తామని చెప్పిన అధికారి ఎవరు?. అధికారులు మూసేయాలి అనుకున్నారు.. అని ఎలా చెప్తారు?. 90 రోజుల్లో చర్యలు తీసుకోకుంటే .. వారిని అరెస్టు చేయిస్తామని హెచ్చరించడం ఏంటి?. ఏ చట్టంతో మీరు అధికారులు ను అరెస్టు చేస్తారు? భయపెడుతున్నారు?. తప్పు చేసే అధికారులు అధికారులు తప్పు చేస్తే, వారినీ సస్పెండ్ చేయాలి లేదంటే బదిలీ చేయాలి. కేవలం వేంకటేశ్వరస్వామిని వాడుకోవడానికి అధికారులను తెరపైకి తెస్తున్నారు. 👉తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు చనిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. అయినా కూడా చంద్రబాబు తిరుమలకు ఎలా వస్తారు?. అదేమైనా చిత్తూరు జిల్లా సాంప్రదాయం?.. సద్దులు చెప్పడానికేనా? మీరు పాటించరా చంద్రబాబు?. పైగా తిరుమల వేంకటేశ్వర స్వామిని అరకు కాఫీతో పోలుస్తారా?(అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన)👉తిరుమలలో సీఎంవో కార్యాలయం నుంచే వీఐపీల దర్శన దందా నడుస్తోంది. ఈ కారణంగానే సామాన్యులకు మధ్యాహ్నం దాటితే కానీ దర్శనం కావడం లేదు. 👉సనాతన ధర్మం కాపాడతాం అని చెప్పిన పవన్ కల్యాణ్.. విజయవాడలో గణపతి ఆలయం కూల్చివేస్తే ఎక్కడ ఉన్నారు?. మౌనంగానే ఉండి కాపాడుతున్నారా? ఇప్పటికైనా పవన్ సమాధానం చెప్పాలి. అధికారంలోకి రాగానే.. తిరుమలలో ప్రక్షాళన శ్యామలరావుతో మొదలు పెట్టాం అని చెప్పారు. శ్యామల రావు నెయ్యిలో ఎలాంటి జంతు పదార్థాలు కలవలేదు అని చెప్పారు. గతంలో అడిషనల్ ఈవో గా పనిచేసిన ధర్మా రెడ్డిపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇప్పుడున్న అడిషనల్ ఈవో.. తిరుమలలో ఉన్న నిర్వాసితులను వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ బెదిరిస్తున్నారు అంటూ భూమన మండిపడ్డారు. -
తొలియత్నంలోనే గ్రూప్-1లో విజయం
అకుంఠిత దీక్షతో గెలుపుతీరాలను చేరొచ్చని నిరూపించారు భానోదయ. తండ్రి మరణించినా ఆమె కుంగిపోలేదు. మొక్కవోని ధైర్యంతో.. తల్లి ప్రోత్సాహంతో ముందడుగు వేశారు. తన కోసం తల్లి పడే కష్టాన్ని చూసి చదువుతోపాటు కూచిపూడి నృత్యంపైనా శ్రద్ధపెట్టారు. నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు చలించిన ఆమె వాటి నివారణకు తనవంతు కృషి చేయాలని తలంచి గ్రూప్-1కు సిద్ధమయ్యారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ప్రస్తుతం గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె పూర్తి పేరు గొందేశి భానోదయ.లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): విశాఖ ప్రాంతానికి చెందిన గొందేశి భానోదయ తండ్రి రమణారెడ్డి స్టీల్ ప్లాంటులో చిరుద్యోగి. ఈమెకు తల్లి, ఓ సోదరి కూడా ఉన్నారు. చిన్ననాటి నుంచి కూచిపూడి నాట్యంపై అభిరుచితో తర్ఫీదు పొందారు. సిలికాన్ ఆంధ్ర సంస్థ వెయ్యి మందితో నిర్వహించిన నృత్య పోటీలో భానోదయ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 2011లో గిన్నిస్ బుక్ రికార్డును కైవసం చేసుకున్నారు. 2012లో కూచిపూడిలో డిప్లమా సాధించారు. 2013లో తండ్రి మరణించడంతో తల్లి వెంకటలక్ష్మి ఇంటి బాధ్యతలు భుజాన వేసుకున్నారు. ఇద్దరు కూతుళ్ల విద్యాభ్యాసంపై దృష్టిపె ట్టారు. తల్లి ప్రోత్సాహంతో 2018లో ఎంఏ పూర్తిచేసిన భానోదయ సివిల్స్ సర్వీసెస్ కు శిక్షణ తీసుకున్నారు. తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 మెయిన్స్ పూర్తిచేశారు. రిజల్ట్ పెండింగ్ పడింది. 2020లో హైదరాబాద్ లో నిర్మాణ రంగ వ్యాపారం చేస్తున్న రామ్మనోహర్తో పెళ్లయింది. 2022లో గ్రూప్-1 ఫలితాలు వచ్చాయి. భానోదయ విజయం సాధించారు. డీఎస్పీగా శిక్షణ పూర్తిచేసుకుని తొలుత గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. ప్రస్తుతం గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిసున్నారు. భానోదయ దంపతులకు మూడేళ్ల కూమార్తె జుషరిత ఉన్నారు.తల్లి, భర్త ప్రోత్సాహంతోనే -ఈస్థాయికి..సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు బాధ కలిగిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు నా వంతు కృషి చేయాలని పోలీస్ శాఖ వైపు అడుగులు వేశా. నా తల్లి వెంకట లక్ష్మి నా భర్త రామ్మనోహర్ ప్రోత్సాహంతో ఈస్థాయికి వచ్చా. యువత దృఢమైన ఆశయంతో కష్టపడితే గెలుపు తీరాలకు చేరడం సులువే.- గొందేశి భానోదయ, సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ -
AP or TS.. రెండింటిలో ‘సోది బడ్జెట్’ ఏది?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో మీడియాలో చాలా హడావుడి ఉంటుంది. ఆర్థిక శాఖ మంత్రికి తగిన ప్రాధాన్యమూ దక్కుతూంటుంది. ఆయా శాఖలకు కేటాయించిన నిధుల మొత్తం, తదితర వివరాలతో పత్రికలు పేజీలకు, పేజీలు వార్తలు, కథనాలు నింపేస్తుంటాయి. ఆ తర్వాత కాలంలో ఈ బడ్జెట్ గురించి కాని, తదుపరి ఆయా శాఖలు పెడుతున్న ఖర్చుల గురించి కాని పెద్దగా ఎవరూ పట్టించుకోరు!. కొన్ని రాష్ట్రాలు అసలు ఆచరణ సాధ్యం కాని పద్దులతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెట్టడానికి యత్నిస్తున్నాయి. ఈ విషయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఆ స్థాయిలో జనాన్ని మాయ చేయడానికి ప్రయత్నించినట్లు కనబడదు. ఉన్నంతలో తాము ఇచ్చిన హామీలకు అనుగుణంగా కొంతమేర అయినా నిధులు కేటాయించాలన్న ఉద్దేశంతో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారనే భావన కలుగుతోంది.👉ప్రజాకర్షక స్కీములు ఏ స్థాయిలో అమలు చేయాలన్న దానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. అది వేరే సంగతి. కానీ ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చే వాగ్దానాలకు అనుగుణంగా బడ్జెట్ ను పెట్టకపోతే అది మోసం చేసినట్లు అవుతుంది. లేదా అరకొర నిధులు కేటాయించి సరిపెడితే ప్రజలను మభ్య పెట్టడానికి అని అర్థమవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ప్రభుత్వాలు పెట్టిన బడ్జెట్‌ను యథాతథంగా అమలు చేయడం. ఎక్కువ సందర్భాలలో బడ్జెట్ లో పేర్కొన్న విధంగా ఖర్చు చేయలేకపోతున్నాయి. దానికి కారణం అవసరమైన నిధులు అందుబాటులో లేకపోవడమే. బడ్జెట్ అంచనాలు ఒకరకంగా ఉంటే.. వాస్తవం ఇంకోలా అన్నమాట. ఉదాహరణకు తెలంగాణ బడ్జెట్లో గత ఏడాది రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. కానీ అందులో ఆశించిన ఆదాయం కన్నా రూ.70 వేల కోట్లు తక్కువగా వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిరోజులుగా చెబుతున్నారు. అలాంటప్పుడు మళ్లీ గత బడ్జెట్ కన్నా ఐదు శాతం అధికంగా రూ.3.04 లక్షల కోట్ల మేర బడ్జెట్ ఎలా పెట్టారంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. 👉ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలకు మాత్రమే సుమారు రూ.80 వేల కోట్ల మేర బడ్జెట్ కేటాయించవలసి ఉండగా, కేవలం రూ.17 వేల కోట్లే కేటాయించారు. తెలంగాణ బడ్జెట్లో వారు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సుమారు రూ.56 వేల కోట్లు, మిగిలిన హామీలకు రూ.34 వేల కోట్లు పెట్టారు. ఇవన్ని అమలు అవవుతాయా? లేదా? అన్న చర్చ కూడా ఉంటుంది. అయినప్పటికీ కనీసం భట్టి బడ్జెట్లో అధిక కేటాయింపులు చేయడం ద్వారా తమకు చిత్తశుద్ది ఉందనిపించుకునే యత్నం చేశారు. అయినా మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇచ్చే స్కీమ్ వంటి వాటిని బడ్జెట్లో పెట్టలేకపోయారు. అలాగే వృద్దాప్య ఫించన్ రూ.నాలుగు వేలు చేస్తామన్న హామీ గురించి కూడా చెప్పలేదు. సహజంగానే ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు వీటిని ఎత్తి చూపాయి. కాగా ఆరు గ్యారంటీలలో రైతు భరోసా కింద రూ.18 వేల కోట్లు, మహాలక్ష్మి స్కీమ్‌కు రూ.4300 కోట్లు, గృహజ్యోతి, సన్నబియ్యం, కళ్యాణ లక్ష్మి వంటి వాటికి నిధులు కేటాయించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ ఇప్పటికే నెరవేరిన విషయం తెలిసిందే. ఏపీలో కూడా కూటమి సర్కార్ ఈ ఉచిత బస్ హామీ ఇచ్చింది కానీ బడ్జెట్లో దాని ఊసేలేదు. 👉తెలంగాణలో గత ఏడాది సంక్షేమ పథకాలకు రూ. 47 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి మరో రూ.ఎనిమిది వేల కోట్లు అదనంగా ఇస్తామని చెబుతున్నారు. అప్పులపై రెండు రాష్ట్రాలు గత ప్రభుత్వాలపై ఆరోపణలు గుప్పిస్తూనే అప్పటికన్నా అధికంగా అప్పులు చేయడానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ. 70 వేల కోట్ల అప్పులకు ప్రతిపాదిస్తే ఏపీ ఏకంగా రూ.97 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని యోచిస్తోంది. ఏపీలో చంద్రబాబు సర్కారు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్ల అప్పుతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ స్థాయిలో కాకపోయినా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కంటే ఎక్కువ అప్పులు చేస్తోందని అంకెలు చెబుతున్నాయి. ఇక ద్రవ్య లోటు రూ. 54 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. మొత్తం బడ్జెట్లో సంక్షేమానికి 34 శాతం పైగా నిధులు కేటాయించారు. ఇక ఆదాయానికి సంబంధించి ప్రభుత్వ భూముల అమ్మకం, మద్యం అమ్మకాలపై వచ్చే పన్నులు, భూముల రెగ్యులరైజేషన్ స్కీమ్ వంటివాటి ద్వారా అధిక మొత్తాలను రాబట్టుకోవాలని ప్రభుత్వం యత్నిస్తోంది. భూముల అమ్మకం ద్వారా రూ.20 వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.👉గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా భూముల వేలం పాటలు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకు వెళ్లక తప్పలేదు. హైదరాబాద్ అభివృద్దికి రూ. పదివేల కోట్లు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి, ఇతరత్రా సాగునీటి పథకాలకు రూ.24 వేల కోట్లు కేటాయించడం బాగానే ఉంది. అయితే ఆ నిధులను ప్రభుత్వం అదే రీతిలో ఖర్చు చేసి ఆశించిన ఫలితాలు రాబట్టగలిగితేనే ఉపయోగం. ఫ్యూచర్ సిటీపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ సిటీని రూపొందించడానికి రూ.200 కోట్లు కేటాయించడం కూడా బాగానే ఉంది. 👉ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా గత ప్రభుత్వం విధ్వంసం చేసిందంటూ స్పీచ్‌లో రాయడం బాగోలేదు. ఏమి విధ్వంసమో చెప్పకుండా, కేవలం డైలాగుల కోసం ప్రభుత్వాలు ఇలా రాస్తున్నట్లు అనిపిస్తుంది. పోనీ అది విధ్వంసం అయితే గత ప్రభుత్వాల కన్నా ఎక్కువ హామీలు ఎలా ఇచ్చారో చెప్పాలి. అలాగే అప్పటి కన్నా ఇంకా ఎక్కువ అప్పులు తీసుకు రావడాన్ని ఎలా సమర్ధించుకుంటారో అర్థం కాదు. ఏది ఏమైనా ఓవరాల్ గా చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంతలో కొంత ఆయా వర్గాలను సంతృప్తిపరచడానికి యత్నించినట్లు కనిపిస్తుంది. అయినా ఈసారి కూడా అంచనాలకు, వాస్తవ గణాంకాలకు ఎంతవరకు పొంతన ఉంటుందన్నది సందేహమే.ఒకప్పుడు బడ్జెట్ పత్రాలను ఎంతో పవిత్రంగా పరిగణించేవారు. కాని రానురాను అవి అంకెల గారడీ పత్రాలుగా మారిపోతున్నాయి. ఏపీ బడ్జెట్ అయితే మరీ సోది పత్రంగా కనిపించిందన్న విమర్శలు వచ్చాయి. తెలంగాణ బడ్జెట్ ఏపీ కన్నా కొంత బెటర్‌గా ఉంది. ఒక కుటుంబమైనా, రాష్ట్రమైనా వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత పెట్టాలి?ఎంత రుణం తీసుకోవాలి? మొదలైన వాటిపై ఒక అవగాహనతో ఉండాలి. కుటుంబంలో యజమాని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అప్పుల పాలైపోవడమో, లేక వృథా వ్యయం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పద్దతిగా వ్యవహరించకపోతే దాని ప్రభావం ప్రజలందరిపై పడుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మీడియా విశ్లేషిస్తే బాగుంటుంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పెళ్లైన విషయాన్ని దాచి యువతితో ఆస్పత్రి మేనేజర్ ప్రేమ
మదనపల్లె: కుటుంబ పోషణ కోసం ఆస్పత్రిలో నర్సుగా చేరిన ఓ యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రైవేట్ ఆస్పత్రి మేనేజర్‌తో పాటు బెదిరించినందుకు మరో ఇద్దరు వైద్యులపై గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఎరీషావలీ తెలిపారు. కురబలకోట మండలం తెట్టు పంచాయతీ సింగన్నగారిపల్లెకు చెందిన ఓ యువతి (25) నర్సింగ్ పూర్తిచేసి ఉపాధి కోసం మదనపల్లె పట్టణం బెంగళూరురోడ్డులోని ఓ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అదే ఆస్పత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్న వివాహితుడైన రాజేష్ రెడ్డి(30) ఆమెకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. వివాహం చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఇద్దరూ శారీరకంగా ఒకటయ్యారు. ఆమె గర్భవతి కాగా, మాయమాటలు చెప్పి తిరుపతికి తీసుకువెళ్లి గత ఏడాది ఆగస్టులో అబార్షన్ చేయించాడు. తర్వాత కొంతకాలానికి రాజేష్‌రెడ్డి వివాహితుడనే విషయం తెలుసుకున్న యువతి తనకు ఎందుకు మోసం చేశావని నిలదీసింది. తనకు న్యాయం చేయాలని లేకపోతే చట్టపరంగా పోలీసులను ఆశ్రయిస్తానని ఖరాఖండిగా చెప్పింది. దీంతో పెద్దమనుషుల సహాయంతో పలుమార్లు పంచాయతీలు నిర్వహించి యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె వినకపోగా, తనకు కచ్చితంగా న్యాయం జరగాల్సిందేనని లేకపోతే పోలీస్ కేసు పెడతానని చెప్పింది. దీంతో ఆస్పత్రి యజమాని, వైద్యుడైన రవికుమార్‌రెడ్డి ఆమెను నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ ఉద్యోగంలో తొలగించి బయటకు పంపేశాడు. ఇ దే విషయంలో అంగళ్లుకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు రా యుడు యువతిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో తన కు న్యాయం జరగదని నిర్ధారించుకుని, బాధిత యువతి వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. విచారించిన సీఐ ఎరీషావలీ, యువతిని మోసం చేసిన రాజేష్ రెడ్డి, ఆస్పత్రి వైద్యులు రవికుమార్‌రెడ్డి, ఆర్ఎంపీ వైద్యుడు రాయుడులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
డీలిమిటేషన్‌పై ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
అమరావతి, సాక్షి: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఓ లేఖ రాశారు. వచ్చే ఏడాది(2026) జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని వైఎస్ జగన్ కోరారు. ‘‘గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్(Delimitation) ప్రక్రియ గనుక చేపడితే.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి.. .. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నా. అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలో.. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నా’’ అని ప్రధాని మోదీని వైఎస్ జగన్ లేఖలో కోరారు. 👉పూర్తి లేఖ కోసం ఇక్కడ క్లిక్ చేయండిమరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రంలోని బీజేపీకి తమిళనాడు అధికార పక్షం డీఎంకేకు మధ్య రాజకీయ సమరం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం(మార్చి 22న) తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ లేఖ సారాంశాన్ని డీంఎకేకు కూడా పంపించారు. -
TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ది
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,170 మంది స్వామిని దర్శించుకున్నారు. 26,821 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.98 కోట్లు సమర్పించారు.టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 5 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
నేడు గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల
సాక్షి, గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి నేడు గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు జిల్లా జైలుకు రిలిజింగ్ ఆర్డర్స్ చేరాయి. వాస్తవానికి నిన్ననే పోసానికి సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ష్యూరిటీ సమర్పణకు నిన్న సమయం లేకపోవడంతో ఆయన విడుదల కావడం ఆలస్యమైంది. తాజాగా ప్రక్రియలన్నీ పూర్తవటంతో జిల్లా జైలుకు విడుదల ఆర్డర్ వచ్చింది.కూటమి సర్కార్.. పోసానిపై అక్రమ కేసులు బనాయించిన విషయం తెలిసిందే. కక్ష సాధింపుతో పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 18 కేసులు నమోదు చేశారు. పిటీ వారెంట్ పేరుతో పోలీసులు.. ఆయన్ను రాష్ట్రమంతా తిప్పారు. దీంతో, ఆయన కోర్టును ఆశ్రయించగా.. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరైంది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా, బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసిన కోర్టు.. శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఇక, పోసాని బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్‌పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా.. న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.ఫిబ్రవరి 26వ తేదీ అరెస్టు..ఏపీ పోలీసులు ఫిబ్రవరి 26వ తేదీని పోసానిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం కూటమి సర్కార్ ఆదేశాలతో రోజుకో కేసు పెట్టి పోసానిని వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తూ తమ అహంకార పూరిత వైఖరిని ప్రదర్శిస్తోంది కూటమి ప్రభుత్వం. పోసానికి ఆరోగ్యం బాగోలేకపోయినా వరుస కేసులు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరించింది. -
ఎండల నుంచి 2 రోజులు ఉపశమనం
సాక్షి, విశాఖపట్నం: ఎండ, ఉక్కపోతతో ఠారెత్తిపోతున్న రాష్ట్రానికి రెండు రోజులు ఉపశమనం లభించనుంది. శని, ఆది వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి వానలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్, యానాంలో నైరుతి, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. రెండు రోజుల అనంతరం.. మళ్లీ పొడి వాతావరణం ఏర్పడి, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. -
పోషకాల పండు..లాభాలు మెండు 'అవకాడో'
చింతపల్లి: గిరిజన ప్రాంతానికి మేలైన, అనువైన రకాలను గుర్తించడానికి అల్లూరి జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు. ఏజెన్సీలో లాభదాయకమైన పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గతంలో యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, లిచీ వంటి మొక్కలను ప్రభుత్వం సరాఫరా చేసింది. చింతపల్లి మండలంలో గిరిజన రైతులు వాటిని పండించి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అవకాడో వచ్చి చేరింది. నిజానికి రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ మొక్కలకు నీడ కోసమని అవకాడో మొక్కలను మండలంలో గొందిపాకలు పంచాయతీలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ మొక్కలపై రైతులకు అవగాహన లేకపోయినా కాఫీ చెట్లకు నీడనిస్తాయనే ఉద్దేశంతో పెంపకం సాగించారు. ఈ మొక్కలు పెరిగి క్రమేపీ పండ్ల దశకు చేరుకున్నాయి. అయితే ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో విలువ తెలియక వాటిని రైతులు వృథాగా వదిలేశారు. కొన్నేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామానికి వచ్చి ఈ అవకాడో పండ్లను చూసి దాని విశిష్టత, ఆ పండ్లకు మార్కెట్లో ఉన్న విలువను రైతులకు వివరించారు. దాంతో రైతులు నాటి నుంచి మార్కెట్లో ఈ అవకాడో పండ్ల అమ్మకాన్ని ప్రారంభించారు. దాంతో వ్యాపారస్తులు సైతం గ్రామాలకు వచ్చి రైతుల నుంచి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఆరు దేశ, విదేశీ రకాలను దిగు మతి చేసుకొని ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధతో గిరి రైతుల సాగు చింతపల్లి మండలంలో గొందిపాకలు, చిక్కుడుబట్టి, చినబరడý, పెదబరడ మొదలైన గ్రామాల్లో రైతులకు ఐటీడీఏ గతంలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు అవకాడో మొక్కలను పంపిణీ చేసింది. రైతులు ఈ మొక్కలను తమ పొలాల్లో వేసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దవై దిగుబడులను ఇస్తున్నాయి. ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఔషధ గుణాలు, పోషకాలు అధికం అవకాడో పండు ఇతర పండ్ల మాదిరిగా కాకుండా అత్యధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు, పోషకాల నిపుణులు గుర్తించారు. ప్రధానంగా ఈ పండు క్యాన్సర్ కారకాలను నిరోధించడంతోపాటు కంటి చూపు, మధుమేహం, స్థూలకాయం తగ్గుదలకు, సంతానోత్పత్తికి, జీవక్రియ మెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు.» కాఫీ చెట్లకు నీడనిచ్చేందుకు తీసుకొచ్చిన విదేశీ మొక్క» పోషకవిలువలున్నఫలాలనూఇస్తోంది.. » చింతపల్లిఉద్యాన పరిశోధన స్థానంలో 6 దేశీ, విదేశీ రకాలపై పరిశోధనలు చింతపల్లిలో కొత్త రకాలపై పరిశోధనలు అవకాడో పండ్లకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోను మంచి గిరాకీ ఉంది. దీనిని గుర్తించి చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానంలో గత ఏడాది టకేడి–1, హోస్ మొక్కల సాగు చేపట్టగా ఈ ఏడాది కొత్తగా పింకిర్టన్, ప్యూర్డ్, రీడ్ వంటి కొత్త రకాలను ఇక్కడికి తీసుకువచ్చి పరిశోధనలు జరుపుతున్నాం. గిరిజన రైతాంగం పండించి ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న అవకాడోకు శాస్త్రీయ నామం లేదు. దాంతో పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంలేదు.ప్రస్తుతం మా క్షేత్రంలో గత ఏడాది మూడు వెరైటీలు, ఈ ఏడాది 3 రకాలపై పరిశోధనలు జరుపుతున్నాం. ఈ కొత్త రకాలను శాస్త్రీయ నామంతో మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. దీంతో మంచి ధర వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ, మిరియాలు పంటల వలే ఈ అవకాడో పంటను విస్తరించడానికి మేలైన రకాల కోసం ప్రయోగాలు చేపడుతున్నాం. – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త,ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లివిదేశీ పంటలకు అల్లూరి జిల్లా ఆలవాలంగా మారింది. ఇప్పటికే ఏజెన్సీ పాంతంలో స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు మంచి ఫలితాలను ఇస్తుండగా తాజాగా ఈ కోవలోకి అవకాడో వచ్చి చేరింది. కాఫీ చెట్లకు నీడ కోసం పెంచుతున్న ఈ చెట్లు పోషక విలువలతో ఉన్న పళ్లను కూడాఇస్తున్నాయి. -
జేఈఈ మెయిన్స్-2 నిబంధనలివీ..
గుంటూరు ఎడ్యుకేషన్: ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2025 రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో పేపర్–1 (బీఈ, బీటెక్) పరీక్షలు జరుగుతాయి. 9 వ తేదీ ఉదయం పేపర్–2 ఎ బీఆర్క్ పరీక్ష, పేపర్ – 2బి ప్లానింగ్ పరీక్షలు జరుగుతాయి. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ మాదిరిగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఈ ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థుల పరీక్ష కేంద్రం వివరాలను (సిటీ ఇంటిమేషన్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే వెబ్సైట్లో ఉంచింది. పరీక్షలకు మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎన్టీఏ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. వీటిని అడ్మిట్ కార్డుల్లో ఎన్టీఏ పొందుపరిచింది. వాటిని విద్యార్థులు క్షుణ్ణంగా చదువుకొని, ఆ మేరకు ముందుగానే సిద్ధమవ్వాలి.మెయిన్స్–2 పరీక్ష రాసే విద్యార్థులకు ఇవీ సూచనలు» పేపర్–1 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో షిఫ్ట్‌లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు జరుగుతుంది. ఉదయం షిఫ్ట్‌లో పరీక్షకు 7 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంటకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. » పరీక్ష సమయానికి 2 గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. » పరీక్ష సమయానికి అర గంట ముందు వరకే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తరువాత ప్రధాన గేట్లను మూసివేస్తారు.» పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వ్రస్తాలను మాత్రమే ధరించాలి.» బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను తెచ్చుకోవాలి. » ఆభరణాలు, వాచీలు ధరించ కూడదు. కాళ్లకు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులనే ధరించాలి. » ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్‌ను మాత్రమే అనుమతిస్తారు. » దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఆధార్, పాన్ తదితర ఒరిజినల్ ఐడెంటిటీ కార్డులను విధిగా తీసుకెళ్లాలి. » ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు కింది భాగంలో ఇచ్చిన ఒక బాక్సులో కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అతికించాలి. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫొటోనే ఇక్కడ అతికించాలి. పక్కన ఉండే మరొక బాక్సులో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలి. పక్కన ఉన్న మూడో బాక్సులో పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తరువాత ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి.» విద్యార్థి తమ వెంట అడ్మిట్ కార్డుతో పాటు అటెండెన్స్ షీట్‌పై అతికించేందుకు మరొక పాస్‌పోర్ట్ సైజు ఫోటోను వెంట తెచ్చుకోవాలి. » ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తారు. -
38 శాఖలు 1.32 లక్షల పెండింగ్ ఫైళ్లు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో 38 సచివాలయ శాఖల్లో 1,32,395 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఈ–ఆఫీస్‌లో ఫైళ్ల క్లియరెన్స్‌ను పర్యవేక్షిస్తున్న ఆర్టీజీఎస్ తేల్చింది. ఇటీవల సీఎం వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులతో జరిపిన సమీక్షలో ఈ విషయం వెలుగుచూసింది. ఉప ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల్లో అత్యధికంగా 14,140 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తరువాత సీఎం నిర్వహిస్తున్న సాధారణ పరిపాలన శాఖలో 11,958, రెవెన్యూ శాఖలో 11,288 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అత్యల్పంగా 42 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సగటున ఒక రోజు సమయం తీసుకుంటుండగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల శాఖ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి సగటున రెండు రోజులు సమయం తీసుకుంటున్నాయి. న్యాయ శాఖ సగటున మూడు రోజుల్లో ఒక ఫైలు క్లియర్ చేస్తుండగా, రెవెన్యూ శాఖలో సగటున ఒక ఫైలు క్లియర్‌కు ఐదు రోజులు సమయం పడుతోంది. సగటున ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి అత్యధికంగా జలవనరుల శాఖ 50 రోజులు సమయం తీసుకుంటుండగా, విపత్తుల శాఖ 47 రోజులు సమయం తీసుకుంటోంది. ఈ–ఆఫీస్ వచ్చిన తరువాత సాధారణంగా రొటీన్ ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేయవచ్చు. ఏమైనా ఆర్థిక, విధానపరమైన ఫైళ్లను క్లియర్ చేయడానికి మాత్రం సమయం పడుతుంది. అయితే మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి ఫైళ్లను ఏ రోజుకు ఆ రోజు క్లియర్ చేసే అవకాశం ఉన్నా, అటువంటి ఫైళ్లను ఆ శాఖలు క్లియర్ చేయడం లేదు. సీఎం అభీష్టం మేరకు ఆయన కార్యాలయ అధికారులు సంబంధిత అంశాలకు చెందిన ఫైలును సర్క్యులేట్ చేయల్సిందిగా ఆయా శాఖలకు ఆదేశిస్తారు. అలాంటి ఫైళ్లు సంబంధిత అన్ని విభాగాల్లోను వెంటనే క్లియర్ అవుతూ ఉంటాయి. కానీ ప్రజలకు సంబంధించిన లేదా ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్లు అంత వేగంతో క్లియర్ కాకపోవడం గమనార్హం. -
ఆ ఐపీఎస్ అధికారిని ఏపీకి పంపాల్సిందే!
సాక్షి, అమరావతి : ఓ ఐపీఎస్ అధికారిని డిప్యుటేషన్‌పై యూపీ నుంచి ఏపీకి పంపాల్సిందేనని చంద్రబాబు ప్రభుత్వం పట్టుపడుతోంది. నిబంధనలకు విరుద్ధమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేస్తున్నా, తమకు ఆయన కావాల్సిందేనని తేల్చి చెబుతోంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అంతగా పట్టుపడుతోందంటే..అనకాపల్లి జిల్లాకు చెందిన కె.సత్యనారాయణ 1998 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో రహదారి భద్రత విభాగం అదనపు డీజీగా ఉన్నారు. ఆయన టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి సమీప బంధువు కూడా. అందుకే 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన్ను ప్రత్యేకంగా డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. అప్పట్లో ఆయన సీఐడీ విభాగంలో ఐజీగా విధులు నిర్వహించారు. డిప్యుటేషన్ కాలం ముగిసిన తర్వాత తిరిగి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోయారు. చెప్పింది చెప్పినట్లు చేస్తారని.. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వ పెద్దలు సత్యనారాయణపై దృష్టి సారించారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలతో విరుచుకు పడేందుకు అస్మదీయుడైన అధికారి కావాలని భావించారు. దాంతో ప్రభుత్వ ముఖ్య నేత దృష్టి సత్యనారాయణపై పడింది. అందుకే ఆయన్ను రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్ర హోం శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే.. ..ఐజీ లేదా అంతకంటే ఉన్నత స్థాయి పోలీస్ అధికారులను డిప్యుటేషన్‌పై ఇతర రాష్ట్రాలకు పంపేందుకు నిబంధనలు సమ్మతించవు. అదే విషయాన్ని ఆ మధ్య కేంద్ర హోం శాఖ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సత్యనారాయణను డిప్యుటేషన్‌పై ఏపీకి పంపేందుకు నిరాకరించింది. దీనిపై కొన్ని నెలలు మౌనంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు ఇటీవల మరోసారి కేంద్రంపై ఒత్తిడి తెస్తోందని సమాచారం. ఈ ప్రయత్నాలన్నీ రెడ్‌బుక్ రాజ్యాంగం వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసుల బాధ్యతలను సత్యనారాయణకు అప్పగించేందుకేనని పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
పెద్దపులికి పెనుముప్పు
నడకలో రాజసం.. ఒళ్లంతా పౌరుషం.. పరుగులో మెరుపు వేగం.. పెద్దపులికే సొంతం. అది ఒక్కసారి గాండ్రిస్తే అడవి అంతా దద్దరిల్లిపోవాల్సిందే. ఏ జంతువైనా తోక ముడుచుకోవాల్సిందే. టన్నుల కొద్దీ ఠీవీని తనలో ఇముడ్చుకున్న పెద్దపులి మనుగడ ప్రమాదపు అంచులకు చేరడం జంతు, పర్యావరణ ప్రేమికులతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలనూ ఆందోళనకు గురిచేస్తోంది. పులి గాండ్రింపు సురక్షితం కావాలన్న ఆకాంక్ష బలంగా వినిపిస్తోంది. సాక్షి, అమరావతి: దేశంలో పెద్దపులికి పెనుముప్పు వచ్చి పడింది. ఐదేళ్లలో పులుల వేట అమాంతం పెరిగింది. పులులను వేటాడి వాటి ఎముకలు, చర్మాలను విదేశాలకు భారీగా అక్రమ రవాణా చేస్తున్నారు. అందుకోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో ప్రత్యేకంగా కొన్ని ముఠాలు వ్యవస్థీకృతమై మరీ స్మగ్లింగ్ దందాను సాగిస్తున్నాయి.పులి ఎముకలకు చైనా, తైవాన్, జపాన్లలో పెద్దఎత్తున డిమాండ్ ఉండటంతో ఈ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ప్రధానంగా 2024లో దేశంలో పులుల వేట, స్మగ్లింగ్ జోరందుకోవడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర ప్రభుత్వ విభాగం ‘వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో బలైన 100 పులులు కొన్నేళ్లుగా చేపడుతున్న చర్యలతో దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని సంతోషించేలోగానే.. పులుల వేట కూడా అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో ఉన్న పెద్ద పులుల సంఖ్యలో 70 శాతం భారత్‌లోనే ఉన్నాయి. దేశంలో 58 టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో 2022 నాటికి 3,682 పెద్ద పులులు ఉన్నాయి. 2006లో కేవలం 1,411 పెద్ద పులులు మాత్రమే ఉండగా.. 2023 నాటికి వాటి సంఖ్య 3,682కు పెరగడం విశేషం.కాగా 17 ఏళ్లలో క్రమంగా దేశంలో పులుల సంఖ్య పెరగ్గా.. గత ఐదేళ్లలో పులుల వేట కూడా పెరగడం ప్రతికూలంగా పరిణమిస్తోంది. గత ఐదేళ్లలో స్మగ్లింగ్ ముఠాలు దేశంలో 100 పులులను వేటాడాయి. వాటి ఎముకలు, చర్మం, ఇతర భాగాలను అక్రమంగా రవాణా చేశాయి. 2021–23లోనే 33 పులులను హతమార్చగా... 2024లోనే 42 పులులను వేటాడారు. ఐదేళ్లలో అత్యధికంగా మహారాష్ట్రలో 41 పులులను హతమార్చారు. ఆ రాష్ట్రంలో 2024 డిసెంబర్ 30 నుంచి 2025 జనవరి 22 నాటికి.. అంటే కేవలం 24 రోజుల్లోనే 12 పులులను వేటాడటం దేశంలో స్మగ్లింగ్ ముఠాల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. స్మగ్లింగ్‌లో రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఐదేళ్లలో 10 పులులు వేటగాళ్ల దెబ్బకు బలయ్యాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మూడేసి, తమిళనాడులో రెండు పులులు హతమవగా... కేరళ, ఉత్తరాఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్లో మిగిలిన పులులను వేటాడారు. మందుల తయారీ ముడిసరుకుగా పులి ఎముకలు చైనా, తైవాన్, జపాన్ తదితర దేశాల్లో పులుల ఎముకలకు భారీ డిమాండ్ ఉండటంతో వాటి వేట పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పులి శరీర భాగాలను వాణిజ్యపరమైన డిమాండ్ ఏమీ లేదు. పులి చర్మాలను స్టేటస్ సింబల్‌గా కొందరు బడా బాబులు తమ బంగ్లాలలో ప్రదర్శిస్తుంటారు. కానీ.. చైనా, తైవాన్, జపాన్ దేశాల్లో పులి శరీర భాగాలకు వాణిజ్యపరమైన డిమాండ్ భారీగా ఉంది. ప్రధానంగా పులి ఎముకలకు ఆ దేశాల్లో అత్యధిక డిమాండ్ ఉంది. చైనా, తైవాన్లలో ఔషధాల తయారీకి పులి ఎముకలను వినియోగిస్తున్నారు. పులి ఎముకలను పొడి చేసి వాటిని ప్రత్యేకమైన కొన్ని ఔషధాల తయారీకి వాడుతున్నారు. ఇక జపాన్‌లో పులి ఎముకలను బాగా ఉడికించి ఆ రసాన్ని ఖరీదైన మద్యం తయారీకి వాడుతున్నారు. ఆ దేశాల్లో పులులు లేవు. దాంతో ఆ దేశాల్లోని ఔషధ కంపెనీలు భారత్ నుంచి అక్రమంగా పులి ఎముకలను కొనుగోలు చేస్తున్నాయి. అందుకోసం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ముఠాలు పులులను వేటాడి వాటి శరీర భాగాలను ఆ ఏజెంట్లకు విక్రయిస్తున్నాయి. ఏజెంట్లు ఈశాన్య రాష్ట్రాల్లోని షిల్లాంగ్– సిల్చార్–ఐజ్వాల్–చంఫాయి గుండా దేశ సరిహద్దులు దాటించి మయన్మార్ మీదుగా చైనా, తైవాన్, జపాన్ తదితర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. స్మగ్లింగ్ అడ్డుకట్టకు సిట్ ఏర్పాటు దేశంలో పులుల వేట, స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఇప్పటికే కొందర్ని అరెస్ట్ చేసింది. పులులను వేటాడే ముఠాల భరతం పట్టేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. -
తిరుమలలో కొత్తగా మరో ట్రస్టు
తిరుమల: శ్రీవాణి ట్రస్టు పేరుతో ఇప్పటికే ఒక ట్రస్టు ఉన్నప్పటికీ శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్టు పేరుతో నూతన ట్రస్టును ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టు కూడా కొనసాగుతుందన్నారు. తన మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజుకు సరిపడా రూ.44 లక్షల విరాళాన్ని టీటీడీకి అందించారు. ఆ తర్వాత టీటీడీ అధికారులతో సీఎం భేటీ అయ్యారు. ఆలయాల నిర్మాణాల కోసం నూతన ట్రస్టు..అనంతరం.. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాల్లేవు. అలాంటిచోట్ల ఈ ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు నూతన ట్రస్టు ఏర్పాటుచేస్తాం. నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. మూడో కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాన్ని తలపెడుతున్నాం. మాధవసేవ కోసమే ఆలయాల నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటుచేస్తాం. స్వామివారి ఆస్తులు ఎవరు కబ్జాచేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తాం’.. అని అన్నారు.టీటీడీలో హిందువులే పనిచేయాలి..‘టీటీడీలో పనిచేసేవారు హిందువులై ఉండాలి. ఇతర ఏ మతానికి సంబంధించిన ఆలయాల్లో ఆ మతం వారే ఉంటారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించాలని సంకల్పించాం. దీనికోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తాం. అలాగే, ప్రపంచ దేశాల్లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మిస్తాం’.. అని చంద్రబాబు చెప్పారు.ఆ హోటళ్లకు భూకేటాయింపులు రద్దు..తిరుమల కొండకు ఆనుకుని ముంతాజ్, ఎమర్, దేవలోక్ హోటళ్లకు అనుమతులిచ్చి 35.32 ఎకరాలు కేటాయించారు. ఆ భూముల కేటాయింపులను రద్దుచేస్తున్నామని చంద్రబాబు శుక్రవారం ప్రకటించారు. ఏడుకొండలను ఆనుకుని ఎవరూ వ్యాపారం చేయడంగాని, అపవిత్రంగాని చేయకూడదన్నారు. రాజకీయాల కోసమే శ్రీవాణి ట్రస్ట్‌పై ఆరోపణలుగతంలో శ్రీవాణి ట్రస్టులో అనేక అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పెద్దఎత్తున విమర్శలు చేశారు. కానీ, నేడు శ్రీవాణి ట్రస్టు కొనసాగుతుందని చెబుతూ మరో కొత్త ట్రస్టు ఏర్పాటు అంటున్నారు. అంటే.. శ్రీవాణి ట్రస్టులో గతంలో ఎలాంటి అక్రమాలూ జరగలేదని సీఎం చెప్పకనే చెప్పేశారని.. అందుకే శ్రీవాణి ట్రçస్టు కొనసాగుతుందంటున్నారని భక్తులు చెబుతున్నారు. రాజకీయాల కోసం శ్రీవారిని వాడుకుంటారనేది చంద్రబాబు మరోసారి నిరూపించారని వారంటున్నారు. -
ఆధారం ఉంటే ఒట్టు.. అంతా కనికట్టు!
ఫిర్యాదే ఓ కుట్ర.. నివేదికే బూటకం.. కేసే అక్రమం.. ఎఫ్ఐఆర్ కుయుక్తి.. వెరసి దర్యాప్తు పేరుతో వేధింపులు.. అబద్ధపు వాంగ్మూలాలే ఆధారం.. ఇదీ రాష్ట్రంలో సీఐడీ, సిట్ పేరిట అరాచకం. చంద్రబాబు ప్రభుత్వ కుట్రకు తార్కాణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు పేరుతో సాగిస్తున్న రెడ్‌బుక్ కుతంత్రం. ఇందులో భాగంగా కూటమి సర్కారు సిట్ పేరిట ఓ అరాచక వ్యవస్థను సృష్టించి, సాగిస్తున్న వేధింపులు వెర్రి తలలు వేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు ముఠా.. అధికారంలోకి వచ్చాక ఒక్క ఆరోపణను నిరూపించలేక చేతులెత్తేసింది. దాంతో తిమ్మిని బమ్మి చేసైనా సరే వేధించాలని లక్ష్యంగా పెట్టుకుని మద్యం విధానంపై అక్రమ కేసుతో రంగంలోకి దిగింది. ఫిర్యాదు మొదలు దర్యాప్తు వరకు సాగుతున్న కుతంత్రం విస్తుగొలుపుతోంది. - సాక్షి, అమరావతికుట్రపూరితంగా ఫిర్యాదువైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు కోసం కూటమి ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతో పావులు కదిపారు. అందుకోసం కుట్రపూరితంగా ఎవరికీ అనుమానం కలగని రీతిలో వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ అనే ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను తెరపైకి తెచ్చారు. మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ.. విచారణ చేయాలని వారిద్దరూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనాకు గత ఏడాది సెప్టెంబరు 9న ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగిందని భావిస్తే పోలీసు, ఏసీబీ, సీఐడీ తదితర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలి. లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అంతేగానీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయరు. అయితే ఈ ఇద్దరూ అటు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయలేదు. ఇటు న్యాయస్థానాన్నీ ఆశ్రయించ లేదు. ఎందుకంటే వీరి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి. వీరిద్దరి నుంచి ఫిర్యాదు అందుకున్న ముఖేశ్ కుమార్ మీనా.. ప్రభుత్వ పెద్దల కుట్రను కొనసాగిస్తూ తర్వాత అంకానికి తెరతీశారు. ఆయన ఆ ఫిర్యాదు కాపీని ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీకి పంపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.రూ.4 వేల కోట్ల కట్టు కథమద్యం కొనుగోళ్లు, ఇతర రికార్డులన్నీ బెవరేజస్ కార్పొరేషన్ కార్యాలయంలోనే ఉంటాయి. ఏయే తేదీల్లో ఏయే డిస్టిలరీలకు ఎంత విలువైన ఆర్డర్లు ఇచ్చారన్న వివరాలు వారి వద్దే ఉంటాయన్నది బహిరంగ రహస్యం. మద్యం విధానంలో అక్రమాలకు పాల్పడితే ఇవిగో అని చూపించవచ్చు. ఇక్కడ ఎలాంటి స్కామ్ జరగలేదు కాబట్టి బెవరేజస్ కార్పొరేషన్ ఎలాంటి ఆధారాలు చూపించ లేదు. అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా కేవలం తొమ్మిది రోజుల్లోనే అవినీతి కట్టుకథను సృష్టించారు. ఏకంగా రూ.4 వేల కోట్ల అవినీతి జరిగినట్టు నివేదిక ఇచ్చేశారు. అంటే ఎక్సైజ్ శాఖే తూతూ మంత్రపు విచారణతో రూ.4 వేల కోట్ల అక్రమాలంటూ చంద్రబాబు కుట్రను వండి వర్చేసింది. అంతా అనుకున్నట్టు కుట్ర కథను నడిపించిన తర్వాత, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ సాక్షిగా అక్రమ కేసు ఇక ప్రభుత్వ పెద్దల కుట్రకు పదును పెట్టడం తమ వంతు అని సీఐడీ రంగంలోకి దిగింది. పక్కా పన్నాగంతో బెవరేజస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమ కేసు నమోదు చేసేసింది. నిందితులు ఎవరో కూడా పేర్కొనకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి అందులోని ఏడో కాలమ్‌లో నిందితులను చూపించలేదు. నిందితులు ఎవరో తెలీదని కూడా వెల్లడించింది. అంటే ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లను చెబితే వారందరినీ నిందితులుగా చూపించేందుకు కుట్ర పూరితంగా వ్యవహరించింది. ఎవరు ఎవర్ని మోసం చేశారన్న కనీస సమాచారం కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన లేదు. పైగా ఐపీసీ సెక్షన్ 420ని చేరుస్తూ కేసు నమోదు చేయడం విడ్డూరం. అసలు కుట్ర ఏమిటన్నది పేర్కొనకుండా, అవినీతి ఏమిటన్నది చూపకుండా ఐపీసీ సెక్షన్లు 409, 120 బి కింద అభియోగాలు నమోదు చేసింది. తద్వారా బెవరేజస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరిపైనా అక్రమ కేసు నమోదు చేసేందుకు ముందస్తు ఎత్తుగడ వేసింది. ఎఫ్ఐఆర్లోని తొమ్మిదో కాలమ్‌లో పేర్కొనాల్సిన ఆ కేసులో అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా వెల్లడించ లేదు. అవసరమైతే ప్రత్యేకంగా నివేదిస్తామని చెప్పడం గమనార్హం. అవసరమైతే.. అన్నది ఏమిటో సీఐడీ ఉన్నతాధికారులకే తెలియాలి. ఒక కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు అక్రమాలకు సంబంధించిన అంశాలు అన్నీ అవసరమైనవే కదా.. అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి సీఐడీ వద్ద కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్నది సుస్పష్టం. దీన్నిబట్టి బెవరేజస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక పూర్తిగా కట్టుకథేనని స్పష్టమవుతోంది. అందుకే అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలను వెల్లడించ లేకపోయారు. కానీ ఎఫ్ఐఆర్లోని పదో కాలమ్‌లో ఈ వ్యవహారంలో ఏకంగా రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ అవినీతి జరిగినట్టుగా పేర్కొనడం విడ్డూరం. నిందితులు తెలీదు.. ఆ కేసుకు సంబంధించిన ఆస్తుల వివరాలు లేవు.. కానీ రూ.4 వేల కోట్ల అవినీతి జరిగినట్టు మాత్రం కథ అల్లేశారు. ఈ లెక్కన ఎంతటి నిరాధార ఆరోపణలో.. ఎంతటి అక్రమ కేసో అన్నది తేటతెల్లమవుతోందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.కట్టు కథకు తగ్గట్టు వాంగ్మూలాలు ఈ కేసు దర్యాప్తు పేరిట వేధింపులు, అరాచకాల కుట్రకు బరితెగించేందుకు సీఐడీ సరిపోదని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేరుతో అరచకానికి తెగించింది. ఎలాంటి ఆధారాలు లేని కేసులో అబద్ధపు ఆధారాలు సృష్టించేందుకు సిట్ రెండు నెలలుగా పాల్పడుతున్న వేధింపులే ఇందుకు నిదర్శనం. దర్యాప్తు పేరిట బెవరేజస్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులను తీవ్ర స్థాయిలో వేధిస్తోంది. ఆ కేసులో సాక్షుల పేరిట వారిని విచారిస్తూ కనికట్టు చేస్తోంది. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరిస్తోంది. శారీరకంగా, మానసికంగా హింసిస్తోంది. సిట్ వేధింపులు తట్టుకోలేక ఉద్యోగులు ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలాలను తమ అక్రమ కేసుకు ఆధారంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో బెవరేజస్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు తాము సాక్షులుగా భావిస్తూ సిట్ నుంచి తప్పించుకునేందుకు అబద్ధపు వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఓసారి వాంగ్మూలాల నమోదు పూర్తయిన తర్వాతే వారినే ఈ కేసులో నిందితులుగా చేర్చాలన్నది సిట్ పన్నాగం. ఈ కేసులో ఎవరెవరిని ఏ విధంగా ఇరికించాలి.. కనికట్టు చేసి జనాన్ని ఎలా నమ్మించాలి.. జరగని నేరాన్ని జరిగినట్లు ఏ విధంగా చూపించాలన్నది టీడీపీ ప్రధాన కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టు మేరకు జరుగుతోంది. అవే డిస్టిలరీలు.. పెరిగిన ఆదాయం.. ఇంకెక్కడ అవినీతి?వాస్తవానికి డిస్టిలరీల ముసుగులో దందా సాగించింది చంద్రబాబే. మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన మద్యం డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి, నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా, వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. (వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు) 2014 నవంబర్‌లో జీఓ నెంబర్ 993 ప్రకారం రెవెన్యూ (ఎక్సైజ్) డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇక అప్పటి వరకు ఊరూ పేరూ తెలియని బ్రాండ్ల మద్యం అమ్మకాలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. డిస్టిలరీలతో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి దోపిడీకి తెర తీసింది. 2015–2019 మధ్య ఇలా నాలుగైదు కంపెనీలకు లబ్ధి చేకూరింది. వీరి నుంచే 70 శాతం కొనుగోళ్లు చేశారు. ఈ నేపథ్యంలో 2019–24 మధ్య కొత్తగా ఒక్క డిస్టిలరీ కూడా రాలేదు. పైగా మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఈ లెక్కన అవినీతికి తావెక్కడ? అంతా చంద్రబాబు అండ్ కో కట్టుకథే. -
వి వాంట్.. డిస్కౌంట్
సాక్షి, అమరావతి: డిస్కౌంట్.. కొద్దికాలంగా భారతీయులను అత్యంత ఎక్కువగా ఆకర్షించే పదం ఇది. గతంలో కంటే ఎక్కువగా వినియోగదారులు డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పండుగ సీజన్లలో ఇచ్చే డిస్కౌంట్ల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. దేశంలో 70 శాతానికి పైగా అమ్మకాలు డిస్కౌంట్ల వల్లే జరుగుతున్నాయి. దుస్తులు, ఎలక్ట్రానిక్, గృహోపకరణ వస్తువులను 50 శాతానికిపైగా డిస్కౌంట్ ఉన్నప్పుడే ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఇలా 2024 పండుగ సీజన్లలోనే రూ.4.25 లక్షల కోట్ల అమ్మకాలు జరిగినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. ముఖ్యంగా దీపావళి, దసరా పండుగుల సీజన్లలో కొనుగోళ్లు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయని, ఆ సమయంలో వివిధ బ్రాండ్లు ఇచ్చే డిస్కౌంట్లు, చేసే ప్రమోషన్లు కొనుగోళ్లను బాగా ప్రభావితం చేస్తున్నాయని వెల్లడించింది. మొబైల్ షాపింగ్‌కి పెరుగుతున్న ఆదరణఆన్లైన్ షాపింగ్‌లోనూ మొబైల్ షాపింగ్ అంతకంతకు పెరుగుతోంది. ఈ–కామర్స్ అమ్మకాలు పెరగడంలో మొబైల్ షాపింగ్ ఎక్కువగా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రిటైల్ అమ్మకాల్లో 50 శాతం మొబైల్ షాపింగ్ ద్వారానే జరుగుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ అమ్మకాల్లో ముందున్నాయి. ఇలాంటి సంస్థలు సోషల్ మీడియా ద్వారానే వినియోగదారులకు దగ్గరవుతున్నాయి. వారి అభిరుచులకు తగ్గట్టు వ్యూహాలు మార్చుకుంటూ అన్ని రకాల వస్తువుల అమ్మకాలను పెంచుకుంటున్నాయి.ఆన్లైన్ షాపింగ్‌కే ఓటు..గతంలో మాదిరిగా షాపులకు వెళ్లి కావాల్సినవి కొనుగోలు చేయడం కంటే ఇంట్లోనే కూర్చుని ఆఫర్లు ఉన్నప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. డిస్కౌంట్‌తోపాటు డోర్ డెలివరీ అనేది కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తోందని తెలిపింది. ప్రజల అభిరుచి మేరకు వివిధ రకాల వస్తువులను అందించే ఆన్లైన్ స్టోర్లు, పోర్టల్స్ పెరిగిపోయాయి. రోజువారీ నిత్యావసర వస్తువుల నుంచి అత్యాధునిక సాంకేతికత వరకు అన్ని రకాల ఉత్పత్తులను సులభంగా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్నాయి.ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు పెరగడం వెనుక పండుగ షాపింగ్ అత్యంత కీలకంగా ఉంటోంది. సెలవుల సీజన్లలో వివిధ కంపెనీలు తరచూ కొత్త వాటితోపాటు పాత స్టాకుపై గణనీయమైన తగ్గింపులను ఇస్తున్నాయి. క్యాష్ బ్యాక్ డీల్స్, బై వన్– గెట్ వన్, బై టు–గెట్ త్రీ వంటి ఆఫర్లతో అదనపు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’, మింత్రాలో ‘ఫ్లాష్ సేల్స్‘, అమెజాన్‌లో ‘గ్రేట్ ఫెస్టివ్ సేల్‘ వంటి పేర్లతో విస్తృతంగా అమ్మకాలు చేపడుతున్నాయి. ఇలాంటి సంస్థల మార్కెటింగ్ వ్యూహాలు అమ్మకాల పెరుగుదలకు బాగా దోహదం చేస్తున్నాయి. దేశంలోని సంస్కృతి, సంప్రదాదాలు, సెలవు రోజులు, ప్రజల మూడ్‌కు అనుగుణంగా భారతీయులకు దగ్గరవుతూ అమ్మకాలను ఈ సంస్థలు రోజురోజుకూ పెంచుకుంటున్నాయి. -
కొత్త కొలువులు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలూ హుష్!
అయ్యా.. బాబూ.. నిరుద్యోగ భృతి ఇవ్వండని యువత అడుగుతుంటే.. ఉద్యోగాలొస్తుంటే భృతి ఎందుకు అంటూ వితండవాదం చేస్తున్న కూటమి ప్రభుత్వం తనంతకు తానే తన నిర్వాకాన్ని చాటుకుంది. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను సైతం పీకేశామని అసెంబ్లీలో ఆర్థిక విధాన ప్రకటన పత్రం ద్వారా వెల్లడించింది. ఈ లెక్కన కూటమి నేతల ఉద్యోగాల మాటలన్నీ పచ్చి అబద్ధాలేనని స్పష్టమైంది. కనీవినీ ఎరుగని రీతిలో కన్సల్టెంట్ల పేరుతో మాత్రం 30 వేల మందికి వందల కోట్ల రూపాయలు ధారపోస్తోంది. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసింది. ఈ విషయాన్ని ఇదే కూటమి సర్కారే బుధవారం అసెంబ్లీలో స్పష్టం చేసింది. గత నవంబర్‌లో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. గత ఏడాది మార్చి ఆఖరు నాటికి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 11,79,332 మంది ఉన్నారని ఆర్థిక విధాన పత్రంలో పేర్కొంది. అయితే తాజాగా బుధవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా ఇదే కూటమి సర్కారు ప్రకటించిన ఆర్థిక విధాన పత్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 9,79,649 మంది మాత్రమే ఉన్నారని తెలిపింది. అంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కన్నా కూటమి సర్కారు వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 1,99,683 మంది తగ్గిపోయారని తేలింది. కూటమి సర్కారు వలంటీర్లతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా తొలగించేసింది. తద్వారా వారికి ఏటా ఖర్చయ్యే రూ.1500 కోట్లను మిగుల్చుకుంది. కొత్తగా సామాన్య నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, వృత్తిపరమైన సర్వీసుల పేరుతో సూట్లు వేసుకునే.. పలుకుబడిగల వారిని భారీ సంఖ్యలో కన్సల్టెంట్లుగా నియమించుకుంది. ఈ విషయం ఆర్థిక విధాన పత్రంలోనే స్పష్టమైంది. వృత్తిపరమైన సర్వీసుల పేరుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 6,434 మంది ఉండగా వారికి ఏడాదికి వేతనాల కోసం రూ.177 కోట్లు చెల్లించేది. అయితే ఇప్పుడు కూటమి సర్కారులో వృత్తిపరమైన సర్వీసు పేరుతో ఏకంగా 30,246 మందిని కన్సల్టెంట్లుగా నియమించుకుంది. వారికి ఏడాదికి వేతనాల రూపంలో రూ.747 కోట్లు చెల్లిస్తున్నట్లు ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారే స్పష్టం చేసింది.మేనిఫెస్టోకు మంగళం!సూపర్ సిక్స్‌లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని, లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే అధికారంలోకి వచ్చాక అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఏకంగా ఉన్న ఉద్యోగాలను సైతం పీకేసింది. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా, పలుకుబడి గల వారికి నెలకు లక్షల రూపాయల వేతనాలు ఇస్తూ కన్సల్టెంట్లుగా నియమించుకుంటోంది. సామాన్య నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే విషయం గురించి మాత్రం అసలు పట్టించుకోవడమే లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,71,167 మంది వలంటీర్లు ఉండగా, వారికి వేతనాల కింద ఏటా రూ.1,500 కోట్లు చెల్లించిందని గత నవంబర్‌లో అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారు తెలిపింది. బుధవారం అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో వలంటీర్లను తొలగించేసింది. తమకు ఇష్టంలేని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనూ తొలగించేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 96,675 మంది ఉంటే వారికి ఏడాదికి వేతనాల రూపంలో రూ.2,604 కోట్లు చెల్లించిందని గత నవంబర్‌లో అసెంబ్లీకి సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో కూటమి సర్కారు తెలిపింది. బుధవారం సమర్పించిన ఆర్థిక విధాన పత్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 94,420కి తగ్గిపోయినట్లు తెలిపింది. వారికి వేతనాల కింద ఏటా రూ.2,329 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నట్లు పేర్కొంది.ఉద్యోగాల కుదింపే లక్ష్యంగత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ మధ్య 13,321 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. వారి స్థానంలో ఒక్క పోస్టు కూడా కూటమి సర్కారు భర్తీ చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2,55,289 మంది ఉండగా, కూటమి ప్రభుత్వంలో వారి సంఖ్య 2,54,087కు తగ్గిపోయింది. అలాగే గత ప్రభుత్వంలో జిల్లా పరిషత్ ఉద్యోగులు 54,248 మంది ఉండగా, కూటమి సర్కారులో 53,122కు తగ్గిపోయింది.నాడు మండల పరిషత్ ఉద్యోగులు 73,916 మంది ఉండగా, కూటమి ప్రభుత్వంలో 72,747కు తగ్గిపోయింది. మున్సిపల్ ఉద్యోగులు 22,354 మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 21,767కు తగ్గిపోయింది. పీటీడీ ఉద్యోగులు 47,904 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 46,646కు పడిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీఆర్ఏలు 19,406 ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 18,435కు తగ్గిపోయింది. దీన్నిబట్టి ఉద్యోగాలను తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని స్పష్టమవుతోంది. -
నీళ్లో రామ చంద్రా..
సాక్షి నెటవర్క్ : రాష్ట్రంలో వేసవి కాలం ప్రారంభంలోనే మంచి నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. చాలా ప్రాంతాల్లో రక్షిత మంచి నీటి పథకాలు మొరాయిస్తున్నాయి. పలు ఊళ్లలో బోరు బావులు మరమ్మతులకు నోచుకోక పని చేయడం లేదు. మరికొన్ని పట్టణాల్లో కొన్ని కాలనీలకు మాత్రమే నీరు సరఫరా అవుతోంది. ట్యాంకర్లతో సరఫరా ప్రణాళికాబద్ధంగా జరగక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బిందెడు తాగు నీటి కోసం ప్రజలు శివారు ప్రాంతాల్లోని బావులు, వంకల వద్దకు కష్టాలకోర్చి వెళుతుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.వేసవి ముంగిట తాగునీటి ఎద్దడికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేయక పోవడం వల్ల సమస్య మరింత జఠిలం కానుంది. తీవ్ర నీటి ఎద్దడి, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి, నీటి సరఫరాకు చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఎక్కడికక్కడ ప్రజలు మండిపడుతున్నారు.సాక్షాత్తు సీఎం నియోజకవర్గంలోనే మంచి నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ పలుచోట్ల నీటి కోసం ప్రజలు రోడ్డెక్కుతుండటం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతోంది. వంశధార చెంత.. గొంతు తడవక చింత శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదీ తీరాన ఉండే హిరమండలం మేజర్ పంచాయతీలో తాగునీటికి కటకట ఏర్పడింది. ఇటు కుళాయిల ద్వారా నీటి సరఫరా జరగక.. అటు ట్యాంకర్ల ద్వారా నీరు అందక మహిళలు శుక్రవారం రోడ్డెక్కారు. అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది. ఇక్కడ ఎప్పుడో దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన పైపులైన్, మంచి నీటి పథకం సామర్థ్యం చాలడం లేదు. అటు సమగ్ర మంచినీటి పథకం, జలజీవన్ మిషన్ వంటి పథకాలు ఉన్నా ఏవీ అక్కరకు రావడం లేదు. ఏలూరులో రోడ్డెక్కిన మహిళలువేసవి ప్రారంభంలోనే ఏలూరు నగరంలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. స్థానిక 29వ డివిజన్ కుమ్మరి రేవు ప్రాంతంలో తాగునీటి సమస్య తీర్చాలంటూ స్థానిక మహిళలు ఏలూరు కార్పొరేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ ఎ.భాను ప్రతాప్‌కు వినతి పత్రం అందజేశారు. కుమ్మరి రేవు ప్రాంతంలో దాదాపు వెయ్యి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రస్తుతం రోజుకు ఒక ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేస్తున్నారు. అవి కాస్తా ముందు ఉన్న వారికి అందుతున్నాయని, కాలనీ లోపల ఉండే వారికి దొరకడం లేదని స్థానికులు చెబుతున్నారు. డబ్బు పెట్టి నీళ్ల క్యాన్లు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటకు, స్నానానికి, దుస్తులు ఉతికేందుకు సైతం నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం తమకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించాలని కోరుతున్నారు.పుట్టపర్తిలో దాహం దాహంప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం అయిన పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. రూ.వేల కోట్లు వెచ్చించి అనేక రాష్ట్రాలకు తాగునీరు అందించి జల దాతగా పేరు గాంచిన సత్యసాయి బాబా నడయాడిన పుట్టపర్తి ప్రాంతంలోనే తాగునీటి కష్టాలు నెలకొనడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కొన్ని వార్డుల్లో నెల రోజుల నుంచి తాగునీటి సమస్య నెలకొంది. రెండో వార్డు పెద్ద బజారు వద్ద గురువారం అర్ధరాత్రి మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు తారకరామనగర్, 9వ వార్డు కర్ణాటక నాగేపల్లి, 2వ వార్డు పెద్ద బజార్, 6వ వార్డు చిత్రావతి గుట్ట, 12వ వార్డు ఎనుములపల్లి కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. రంజాన్, ఉగాది పండుగలను ఎలా జరుపుకోవాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు. కాగా, వేసవి వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పట్టపర్తి మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సీఎం ఇలాకాలోనూ తాగునీటికి కటకటసీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ, గుడుపల్లె మండలంలో తాగునీటి కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు. గుడుపల్లి మండలం మిట్టూరు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఇటీవల మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గుడుపల్లె మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గుడుపల్లి మండలం కోటపల్లి గ్రామంలో మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని రెస్కో కార్యాలయం చుట్టుపక్కల ఉన్న ప్యాలెస్ ఎక్స్టెన్షన్లో తాగునీటి సమస్య తీర్చాలంటూ మున్సిపల్ కమిషనర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇది సర్కారు నిర్లక్ష్యమేఅమలాపురం మున్సిపాలిటీ 30వ వార్డు పరిధిలోని రావులచెరువు ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. అయినా ఈ సమస్యను అధికారులు పరిష్కరించలేదు. గత వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి మంత్రి పినిపే విశ్వరూప్ ముందుచూపుతో రూ.20 కోట్లతో సమగ్ర తాగునీటి పథకాన్ని తెచ్చారు. నిధులు కూడా మంజూరై పనులు మొదలయ్యాయి. గాంధీనగర్‌లో ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. హౌసింగ్ బోర్డు కాలనీ, ఏవీఆర్ నగర్లో త్వరితగతిన ట్యాంకు నిర్మాణాలను పూర్తి చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో రావులచెరువు, రాజోలు నియోజకవర్గం పరిధిలోని మలికిపురం మండలం తూర్పుపాలెం, గొల్లపాలెం, శంకరగుప్తం, ఆడవిపాలెం, మట్టపర్రు, రామరాజులంక, సఖినేటిపల్లి మండలం మోరి, కేశవదాసుపాలెం, ఉయ్యూరివారి మెరక, అప్పన రాముని లంక, రాజోలు మండలం పొన్నమండలోని శివారు ప్రాంతాలకు తాగు నీరు అందడం లేదు. బిందెడు నీటి కోసం పాట్లుబిందెడు నీటి కోసం చాలా పాట్లు పడుతున్నాం. రక్షిత మంచి నీటి పథకం ద్వారా తాగు నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. ట్యాంకర్ల ద్వారా సరఫరా అనేది ప్రధాన ప్రాంతాలకే పరిమితం అవుతోంది. దీంతో మాలాంటి వీధులకు నీరు అందడం లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. – బూర రాధ, హిరమండలం, శ్రీకాకుళంఇలాగైతే ఎలా?తాగు నీళ్లు రావడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మోటార్ రిపేరీ ఉందని బయటకు తీశారు. అలాగే వదిలేశారు. రేపు మాపు అంటూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వస్తే కానీ అధికారులు స్పందించడం లేదు. ఇలాగైతే ఎలా? ప్రభుత్వం వెంటనే పట్టించుకుని సమస్య పరిష్కరించాలి. – కేశమ్మ, పెద్ద బజార్, పుట్టపర్తిఎమ్మెల్యే స్పందించాలిపుట్టపర్తి మున్సిపాలిటీలో పలుచోట్ల తాగునీటి సమస్యలు ఉన్నాయి. అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల వేళ కాని వేళ నీళ్లు వదులుతున్నారు. కూలి పనులకు వెళ్లకుండా నీటి కోసం పడిగాపులు కాస్తున్నాం. ఉగాది, రంజాన్ పండుగలు దగ్గర పడుతున్నాయి. అధికారులు, ఎమ్మెల్యే సింధూరారెడ్డి స్పందించి నీటి సమస్య లేకుండా చూడాలి.– సత్యనారాయణ, పెద్ద బజార్ 2వ వార్డు, పుట్టపర్తి -
బాబు పెట్రో బాదుడు రూ.5,256 కోట్లు
సాక్షి, అమరావతి: ఒకవైపు సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టి అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు సర్కారు మరోవైపు వీలైనన్ని మార్గాల్లో జనం జేబులకు చిల్లు పెడుతోంది. ఎన్నికల వాగ్దానం ప్రకారం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేకూర్చాల్సింది పోయి పన్నుల బాదుడుతో నిలువు దోపిడీ చేస్తోంది. సంపద సృష్టించి పథకాలను అమలు చేస్తానంటూ నమ్మించిన ప్రభుత్వ పెద్దలు నడ్డి విరిగేలా రూ.వేల కోట్ల భారం వడ్డిస్తున్నారు.ఇప్పటికే విద్యుత్తు చార్జీలను పెంచి రూ.15 వేల కోట్లకుపైగా భారాన్ని జనం నెత్తిన మోపిన కూటమి సర్కారు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామన్న హామీని నెరవేర్చకుండా తొమ్మిది నెలల్లో వాహనదారుల నుంచి ఏకంగా రూ.5,256 కోట్లకుపైగా వసూలు చేసింది. తద్వారా మరో ఎన్నికల హామీకి తిలోదకాలిచ్చింది. తాము అధికారంలోకి వస్తే పెట్రోలుపై లీటర్‌కు రూ.16 చొప్పున ధరలు తగ్గిస్తామని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నమ్మబలికారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ పెట్రోలు బంకులు, ఆటో డ్రైవర్లు వద్దకు వెళ్లి అధికారంలోకి రాగానే గ్రీన్‌ట్యాక్స్ రద్దుతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ హామీలిచ్చారు. ఇక 2021 నవంబర్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.పెట్రోలుపై లీటర్‌కు రూ.16 వరకు ధర తగ్గించాలని నాడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంధన ధరలపై గగ్గోలు పెట్టిన ఆయన అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచారు. ఇది చాలదన్నట్లు ప్రకృతి వైపరీత్యాల నిధి పేరిట అదనపు సెస్ విధించేందుకు ఫైళ్లను సిద్ధం చేయడం గమనార్హం.రూ.5,256 కోట్లు తిరిగి కట్టాల్సిందేప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోలుపై లీటర్‌కు రూ.16 చొప్పున ధర తగ్గించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. దాన్ని అమలు చేయాలని ఇప్పుడు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో రోజూ సుమారు 35.66 లక్షల లీటర్ల పెట్రోలు, 86.01 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడవుతున్నట్లు ఏపీ పెట్రో డీలర్స్ అసోసియేషన్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 270 రోజుల్లో ప్రజల నుంచి కనీసం రూ.5,256 కోట్లు ముక్కుపిండి వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల హామీ అమలులో భాగంగా తక్షణం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడంతోపాటు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు కూటమి నేతల హామీలను సామాజిక మాధ్యమాల్లో రీ పోస్ట్ చేస్తున్నారు. ‘‘వచ్చారు సరే.. తగ్గించరేం..?’’ అంటూ కూటమి సర్కారును నిలదీస్తున్నారు.సరిహద్దు జిల్లాల్లో బంకులు వెలవెలఇక్కడ ధరలు అధికంగా ఉండటంతో ఏపీ సరిహద్దు జిల్లాల్లో వాహనదారులంతా పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో తమిళనాడు, కర్నాటక సరిహద్దు జిల్లాల్లోని పెట్రోలు బంకుల యజమానాలు వ్యాపారాలు లేక లబోదిబోమంటున్నారు. తమిళనాడు కంటే మన రాష్ట్రంలో పెట్రోలు ధర లీటరుకు రూ.7.99 అధికంగా ఉండగా కర్నాటక కంటే రూ.5.89 ఎక్కువగా ఉంది. యానాం కంటే మన రాష్ట్రంలో పెట్రోలు లీటర్‌కు రూ.12.77 అధికంగా ఉంది. ఇవన్నీ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. » ‘కేంద్ర ప్రభుత్వంతోపాటు 12 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయి. మరి మీరెప్పుడు (నాటి సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి) తగ్గిస్తారు? ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం ఆగదు. దీనిపై అన్ని పెట్రోల్ బంక్‌ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.16 తగ్గించి తీరాలి..’– 2021 నవంబర్ 5న మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు డిమాండ్» ‘డీజిల్ రేటు ఎంత..? కర్నాటకలో కొట్టించుకుంటున్నావా..? ఆంధ్రాలో అంత తక్కువ రేటు ఎక్కడుందబ్బా అనుకుంటున్నా..! వచ్చేది మేమే.. తగ్గించేది మేమే..!! దోచుకోవడంలో ఈ ప్రభుత్వం ఎవరినీ మినహాయించడంలేదు. మా ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం. అడ్డగోలు చలానా విధానానికి స్వస్తి పలుకుతాం. ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తాం. ప్రమాదంలో చనిపోయిన వారికి చంద్రన్న బీమా ద్వారా రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటాం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం..’– 2023 మార్చి 27న పుట్టపర్తి యువగళం పాదయాత్రలో నారా లోకేశ్కర్ణాటక వెళ్లొస్తున్నాం..పెట్రోల్, డీజిల్ ధరలపై గగ్గోలు పెట్టిన నారా లోకేష్ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఎందుకు తగ్గించడం లేదు? మేం కర్ణాటక వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అక్కడికి, ఇక్కడికి ధరలో చాలా వ్యత్యాసం ఉంది. – ఎస్ రామకృష్ణారెడ్డి, చిలమత్తూరు, కర్ణాటక సరిహద్దు మండలంరూ.6 తక్కువకే..ఏపీలో లీటర్ పెట్రోల్ సుమారు రూ.110 ఉంటే కర్ణాటకలో రూ.104 మాత్రమే ఉంది. ఏపీ కంటే కర్ణాటకలో రూ.6 తక్కువగా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలి. – ఇంతియాజ్ అహమ్మద్, బసవనపల్లి, అమరాపురం మండలంరాష్ట్రంలో రోజుకు సగటు విక్రయాలు..పెట్రోలు: 35,66,066.66 లీటర్లుడీజిల్: 86,01,966 లీటర్లురోజుకు పెట్రోల్, డీజిల్ కలిపి 121.67 లక్షల లీటర్లు270 రోజులకు 328.50 కోట్ల లీటర్ల వినియోగం.. ఆ లెక్కన లీటరుకు రూ.16 చొప్పున తగ్గించకుండా చంద్రబాబు ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన మొత్తం రూ.5,256 కోట్లు -
‘మీరు వైఎస్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే’
కృష్ణాజిల్లా: ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే అది వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు మాజీ మంత్రి పేర్నినాని. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలనపై నిప్పులు చెరిగిన పేర్ని నాని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వైఎస్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సూచించారు.‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఒక్క జగన్‌కే సాధ్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చంద్రబాబు...ఆయన తొత్తు పవన్ కళ్యాణ్ ... జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ఎ న్నికల ముందు సూపర్ సిక్స్ ..షణ్ముఖ వ్యూహం అని హామీలిచ్చారు. కూటమి ఎమ్మెల్యేలు స్క్రిప్ట్ లు వేసుకుని బ్రతకాల్సిందే. ఐదేళ్ల క్రితం మన బ్రతుక్కి వచ్చింది 23 సీట్లు కాదా?, రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని ధ్వజమెత్తారు పేర్ని నానివైఎస్సార్సీపీ నాయకుల అరెస్టుల వల్ల జనాల్లో జగన్ పరపతి ఏమీ తగ్గలేదని. అరెస్టులతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్సార్సీపీ నాయకులను ఏమీ చేయలేదన్నారు. పోసాని కృష్ణమురళిపై ఏ ఆధారాలు లేకుండానే 18 కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు పేర్ని నాని. -
తిరుపతిలో కలకలం.. కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు మెయిల్
సాక్షి, తిరుపతి: తిరుపతి కలెక్టరేట్‌కు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. దీంతో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఇవాళ(శుక్రవారం) సాయంత్రం పోలీసులకు మెయిల్ రాగా, తిరుపతి కలెక్టరేట్‌ను బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కలెక్టరేట్లో అన్ని విభాగాల సిబ్బందిని బయటకు పంపించిన పోలీసులు.. తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో బాంబు లేదని తేల్చడంతో కార్యాలయంమ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.కాగా, తిరుపతికి బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. గతంలో కూడా కార్పొరేట్ హోటళ్లతో పాటు పలు ఆలయాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. గత నెల(ఫిబ్రవరి)లో ఎస్వీ అగ్రికల్చరల్ కళాశాలలో హ్యూమన్ ఐఈడీ బాంబు పెట్టామంటూ ఆగంతుకుల నుంచి కళాశాల అధికారులకు ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా విద్యార్థులు, అధ్యాపకులు ఉలిక్కిపడ్డారు.వెంటనే కళాశాల అధికారులు తిరుపతి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. గతంలో పలు మార్లు కళాశాలకు బాంబు బెదురింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై ఫేక్ సమాచారంగా తేల్చారు. -
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై టీడీపీ నేతల దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా, వైఎస్సార్సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దాడి చేయించారు.వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా.. తాడిపత్రిలో నూతనంగా ఇంటిని నిర్మించుకోగా, అన్ని అనుమతులు ఉన్నా కానీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వందలాది మంది అనుచరులతో ఫయాజ్ బాషా ఇంటిపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై జేసీ.. రాళ్లతో దాడి చేయించారు. టీడీపీ నేతలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. -
‘ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం’
సాక్షి, తాడేపల్లి: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా? అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. శుక్రవారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక అరుణ్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు కలుగుతున్నాయన్న ఆదిమూలపు.. ఈ అంశంపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘అసలు ఒక చట్టం చేయాలంటే దానికి అనుసరించాల్సిన విధి విధానాలు చంద్రబాబుకు తెలియదా? ఒక బిల్లును పకడ్బందీగా తయారు చేయాలి. దానిని సంబంధిత మంత్రి చేత సభలో ప్రవేశపెట్టాలి. దానిపైన సమగ్ర చర్చ జరగాలి. దానిలో మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఆమోదించి, తరువాత దానిని గవర్నర్‌కు పంపుతారు. దానిని గవర్నర్ ఆమోదిస్తారా లేక కేంద్రానికి పంపుతారా అనేది ఉంటుంది. ఇది ఒక చట్టం విషయంలో ఏ ప్రభుత్వం అయినా పాటించాల్సిన విధానం ఇది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని ఎక్కడా అనుసరించినట్లు కనిపించడం లేదు’’ అంటూ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు...గవర్నర్ ద్వారా తీసుకువచ్చే ఆర్డినెన్స్‌కు కేవలం కొన్ని నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. శాసనసభ సమావేశాలు లేని సమయంలో చట్టం చేయడం కుదరదు కాబట్టి ఆర్డినెన్స్‌ను తీసుకువస్తారు. బడ్జెట్ సమావేశాలు నెల రోజుల పాటు జరుగుతున్నా ఎందుకు ఈ సమావేశాలను వినియోగించుకోలేక పోయారు? అంటే దీని అర్థం ఇంకా రాజకీయం చేయాలన్న చంద్రబాబు ఉద్దేశం బయటపడినట్లే కదా?. ఆర్డినెన్స్ అనేది ఒక తాత్కాలిక వెసులుబాటు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశాన్ని ఆఖరిరోజు లఘు చర్చకు పెట్టడంపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో చిత్తశుద్ది లోపించినట్లు, స్పష్టత లేకుండా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏరకంగా దళితులకు న్యాయం జరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది...ప్రభుత్వం వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను మార్చి 10న కేబినెట్లో పెట్టారు. ఈ రిపోర్ట్ ను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అలా పెట్టి ఉంటే అందరూ దీనిపై చర్చించేవారు. ఏదైనా సందేహాలు ఉంటే దానిపై అందరూ కలిసి ఒక స్పష్టత వచ్చేలా చూసేవారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన చెబుతున్నది ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. రోస్టర్ విధానం మీద చంద్రబాబు చేసిన ప్రకటనలు పూర్తి అయోమయానికి దారి తీసేలా ఉన్నాయి. ఉద్యోగసంఘాలు కూడా ఇలాంటి రోస్టర్ విధానాన్ని ఎప్పుడు చూడలేదని చెబుతున్నారు...రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటమని చెబుతున్నారు. అలాగే 2026 జనాభా లెక్కలు జరిగిన తరువాత మళ్ళీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అంటే సమస్యను మళ్ళీ మొదటికి తీసుకువస్తున్నారనే అనుమానాలు కలిగిస్తున్నారు. చంద్రబాబు చిత్తశుద్దితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం, సమస్యను పరిష్కారం చేయడంకుండా దానిపైన మంటలు రేపడం, దానిపైన తన్నుకుంటూ ఉంటే రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం కనిపిస్తోంది. తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. చట్టం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని పకడ్బందీగా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇలా ఎందుకు చేయలేదు?...ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వ సరైన పరిష్కారం చూపుతుందా? లేదా? లేక సమస్యను ఇలాగే ఉంచి వివాదాన్ని రాజకీయంగా రగిల్చి, ఎప్పటికీ ఆరని మంటలా చేసి, దానిలో చలి కాచుకోవాలని అనుకుంటోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వర్గీకరణ సమస్యను డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాలకు రావాల్సిన ఫలాలను రాకుండా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం రాష్ట్రప్రజలు అనుమానిస్తున్నట్లుగా రాజకీయంగా దీనిని వాడుకునేట్లుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కూటమి పాలనలో మా చదువులు ముందుకు సాగనివ్వకుండా, మా ఆరోగ్యాలకు భద్రత లేకుండా, ఏదైనా భూమిని సాగుచేసుకుంటే కౌలురైతులుగా ఉన్న మా రైతులకు ఎలాంటి సహాయం లేకుండా ఇలా అన్ని రకాలుగా మాకు తీరని ద్రోహం చేస్తున్నారు...ఒకపక్క వర్గీకరణ సమస్యను అలాగే ఉంచి, మరోవైపు దళితుల అభ్యున్నతికి ఉపయోగపడే అన్ని పథకాలను అందకుండా చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, పాఠశాలల్లో నాడు-నేడు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన లేదు, చేయూత లేదు, రైతుభరోసా లేదు ఇలా గతంలో వైయస్ జగన్ గారు మా వర్గాలకు భరోసా కల్పించేందుకు అమలు చేసిన వెన్నుముక లాంటి పథకాలు, కార్యక్రమాలు లేనే లేవు. వర్గీకరణను అయోమయంలో నెట్టారు. 2026 జనాభా ప్రకారం జిల్లాను ఒక యూనిట్ అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఒక యూనిట్ అంటున్నారు. రాష్ట్రం ఒక యూనిట్ అంటే నష్టపోతాం. కోస్తా ప్రాంతంలో మాల సామాజికవర్గం, రాయలసీమ ప్రాంతంలో మాదిగ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. స్టేట్ ఒక యూనిట్ తీసుకుంటే నష్టం జరుగుతుంది. న్యాయం జరగదు. జిల్లాను ఒక యూనిట్ గా చూడాలంటే 2026 జనాభా లెక్కలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ అయోమయం ఎందుకు? ..ముందుగానే కూటమి ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు ఉన్నాయి. మనసా వాచా కర్మేణ అందరికీ న్యాయం జరగాలి. దళితుల్లో ఉపకులాలను విడగొట్టకుండా, దళితుల్లో ఐక్యతను పెంచడానికి, వారిని బలోపేతం చేయడానికి వైయస్ జగన్ గారి ప్రభుత్వం కృషి చేసిందో, సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ను ముందుకు తీసుకుపోవాలని మేం స్పష్టంగా ఆనాడే చెప్పాం. దానికీ ఈరోజుకూ కట్టుబడి ఉన్నాం. కానీ దీనికి విరుద్దంగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవహరించింది. ఈ అంశంపై ఎల్లో మీడియా సమస్యను పక్కదోవ పట్టించేలా తప్పుడు రాతలు రాస్తోంది. ఈ అంశాన్ని అవకాశవాద, స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకోకుండా, దీనిని పరిష్కారం లేని సమస్యగా మారుస్తే ప్రజలు తగిన విధంగా గుణపాఠం నేర్పుతారు.’’ అని ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. -
‘చంద్రబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేది’
సాక్షి,గుంటూరు : విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సాంస్కృతి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేదని, ఆయన ఆ పాత్రకు బ్రహ్మాండంగా సరిపోతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.ఏపీ బడ్జెట్ సమావేశాలపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘2025 బడ్జెట్ సమావేశాలు 16 రోజుల పాటు జరిగాయి. ప్రతిపక్షం లేని శాసన సభ సమావేశాలు చప్పగా సాగాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్ళలేదు. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సమావేశాలు కూటమి నేతలు ఒకరినొకరు పొగుడుకోవడానికే సరిపోయింది. శాసన మండలిలో ప్రతిపక్షం ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను మండలిలో మా సభ్యులు ఎండగట్టారు.ఒక్క క్వింటా మిర్చిని ఈ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. బెల్ట్ షాపులు ఊరూరా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎంతో దౌర్భాగ్యపు స్థితిలో పని చేస్తుందో స్వంత పార్టీ సభ్యులే శాసన సభలో చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు దొంగచాటుగా సంతకం చేయాల్సిన అవసరం ఏముంది. ప్రతిపక్షం హోదా ఇవ్వండి. స్పీకర్ అయన్నపాత్రుడు వైఎస్ జగన్ గురించి ఏవిధంగా మాట్లాడారో అందరూ చూశారు. అచ్చెన్నాయుడు ఏటువంటి వ్యాఖ్యలు చేశారో అందరికి తెలుసు. ప్రజా సమస్యలపై పోరాటం మాకు ముఖ్యం. స్పీకర్,డిప్యూటీ స్పీకర్ శాసన సభకు పవిత్రత లేకుండా చేశారు. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా మార్చి శునకానందం పొందుతున్నారు.మంచి మిత్రుడు అని వైఎస్ గురించి చంద్రబాబు చెబుతాడు. మరి ఆయన పేరుపై ఎందుకంత కోపం. శాసన సభ్యుల వేసిన స్కిట్స్‌లో కూడా జగన్ పేరు మర్చిపోలేకపోయారు. ఆ స్కిట్లో చంద్రబాబుకు శకుని పాత్ర ఇస్తే బాగుండేది. ఆయన శకుని పాత్రకు బ్రహ్మాండంగా సరిపోతారు’ అని సెటైర్లు వేశారు. -
‘ఆన్లైన్ గేమింగ్ యాప్స్‌ను కేంద్రం వెంటనే బ్లాక్ చేయాలి’
ఆన్లైన్ గేమింగ్ యాప్స్‌ను కేంద్రం వెంటనే బ్లాక్ చేయాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కోరారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రకటనలలో నటించి ఒక తీవ్రమైన తప్పు చేసారని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తన అభ్యంతరం తెలిపారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహించారని పలువురిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ తో సహా 25 మందిపై కేసు నమోదు అయ్యిందన్నారు. పలువురు యాంకర్లతో పాటు సోషల్ మీడియా Influencerలపై రెడ్‌విత్, బీఎన్ఎస్ 3, 3(A), 4..ఐటీ యాక్ట్ 66D సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేతిరెడ్డి గుర్తు చేశారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అంశానికి సంబంధించి భారత దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,కేరళ, కర్ణాటకలలో ఒక చట్టం చేయడం జరిగిందన్నారు. పలువురికి సామాజిక వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్‌లను ఏపీలో బ్లాక్ చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని గత ఏపీ ప్రభుత్వం కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా మంత్రిని కోరారన్నారు. ఈ మేరకు 2020లో అప్పటి సీఎం జగన్.. లేఖ రాశారన్నారు. దీనిపై సమగ్ర చట్టం పార్లమెంట్ లో చేయాలని, మిగతా అన్నీ రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ రద్దుకు కేంద్రాన్ని కోరాలని, అప్పుడే భారత్‌లో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ను లేకుండా చేయగలమన్నారు . ఇప్పుడు తెలంగాణలో ఫైల్ చేసిన కేసులో సెలెబ్రిటీలు Influencerలపై ప్రస్తుతం పెట్టిన కేసులో బలం లేదన్నారు. వారి పాత్ర వలన డబ్బు ఎంత చలామణి అయ్యిందో తెలుస్తోందని , భారత దేశంలో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ ప్రస్తుతం 30 శాతం పెరిగిందని, మహిళలు సైతం ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు బానిసలు అవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వివిధ రాష్ట్రాలలో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పై ఉక్కుపాదం మోపడానికి ఒక టాస్క్ ఫోర్స్ ను నియమించడంతో పాటు కేంద్రం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సైట్స్ ను బ్లాక్ చేయాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. "సెలబ్రిటీలు హోదాను కాపాడుకోవాలే కానీ ప్రజలకు నష్టం కలిగే వ్యవహారాలు చేయడం సిగ్గు చేటని, 'మా' అసోసియేషన్ వెంటనే స్పందించి తగిన చర్యలకు తీసుకోవాలని, యూట్యూబ్‌లో స్టార్స్ అయినంత మాత్రాన.. రియల్ లైఫ్‌లో స్టార్స్ కాదన్నది వారు గుర్తెరిగి నడుచుకోవాలని కేతిరెడ్డి హెచ్చరించారు. -
‘చంద్రబాబు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు’
హైదరాబాద్: ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలముందు సూపర్ సిక్స్ అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వంలోకి వచ్చాక ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదంటూ మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం) సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన హర్షకుమార్.. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల ఊసేలేదని విమర్శించారు.‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు , తల్లికి వందనం లేదు. పెన్షన్ పెంపు లేదు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఏపీలో ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు. అమరావతి , పోలవరం అంటూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీలో ఒకరిపై ఒకరు పొగడ్డలకే సరిపోయింది. తిరుపతిలో తలపెట్టిన మాలల సభను చంద్రబాబు అడ్డుకున్నారు. ఏపీలో పాశవిక పాలన సాగుతోంది. మాలలను, మాదిగలను వేరు చేసి రాజకీయాలకు వాడుకుంటున్నారు. మాలల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి ఓటమి రుచి చూపించారు. ప్రజల్లో పూర్తీ వ్యతిరేఖతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటోంది’ అని మండిపడ్డారు. -
పోసానికి బెయిల్ మంజూరు
గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరు చేసింది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్ ను మంజూరు చేసింది. బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు.. ఈరోజు(శుక్రవారం) బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్‌పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా .. న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు.. గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ ఫర్ ప్రొహిబిషన్/ఎక్సైజ్ కోర్డులో హాజరుపరిచారు. అక్కడ్నుంచి పోసానిని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ఈ కేసులో బుధవారం కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం తిరిగి విచారించిన కోర్టు.. పోసానికి బెయిల్ మంజూరు చేసింది.ఫిబ్రవరి 26వ తేదీ అరెస్టు.. ఆపై వేధింపులుకాగా, ఫిబ్రవరి 26వ తేదీని పోసానిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అనంతరం కూటమి సర్కార్ ఆదేశాలతో రోజుకో కేసు పెట్టి పోసానిని వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తూ తమ అహంకార పూరిత వైఖరిని ప్రదర్శిస్తోంది కూటమి ప్రభుత్వం. పోసానికి ఆరోగ్యం బాగోలేకపోయినా వరుస కేసులు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ 19 కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వం. -
గణపతి ఆలయం కూల్చివేత.. కూటమి సర్కార్‌పై వైఎస్సార్సీపీ ఫైర్
సాక్షి, విజయవాడ: దేవి నగర్ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ కామన్ సైట్లో స్థానికులు నిర్మించుకుంటున్న గణపతి ఆలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నిర్మాణం పూర్తవుతున్న సమయంలో బుల్డోజర్లతో కూల్చేశారు. వీఎంసీ కూల్చి వేసిన గణపతి ఆలయాన్ని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు.ఈ సందర్భంగా మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, వీఎంసీ అధికారులపై మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడతామంటూ కూటమి నేతలు వేషాలేస్తున్నారని.. కూటమి పాలనలో దేవుడికే రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో వైకుంఠద్వార దర్శనం క్యూలైన్లలో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు పోయాయి’’ అని మల్లాది ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆలయాల కూల్చివేతలే. గతంలో విజయవాడలో ఆలయాలను కూల్చివేశారు. ఇటీవల కాశీనాయన ఆశ్రమాన్ని, జ్యోతిక్షేత్రంలోని అన్నదాన సత్రాలను కూల్చివేశారు. హిందూధర్మం అని వేషాలేసుకునే పవన్ కల్యాణ్‌కు తన పోర్టుపోలియోలో ఏం జరుగుతుందో తెలియదా?. నిన్న కాక మొన్న వివినరసరాజు వీధిలో గోశాలను కూల్చేశారు. ఈ రోజుకీ గోవులు ఎండలో మాడిపోతున్నాయి.ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ స్థానికులు ఏడాది క్రితం ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ప్రారంభ దశలో అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడెలా కూల్చుతారు. ఆలయ గర్భగుడిని బుల్డోజర్లతో కూల్చివేశారు. ఎవరి ఆదేశాల మేరకు వీఎంసీ అధికారులు గణపతి ఆలయాన్ని కూల్చివేశారు. కూల్చివేతలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. -
ఏపీలో అరాచక పాలనపై కేంద్రం మౌనం సరికాదు: పిల్లి సుభాష్ చంద్రబోస్
సాక్షి, ఢిల్లీ : ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోందని పార్లమెంట్ వేదికగా చెప్పుకొచ్చారు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. అరాచకాలు కొనసాగుతున్న ఈ పరిపాలనను సరిదిద్దాలన్నారు. ఏపీలో విషయంలో కేంద్ర మౌనంగా ఉంటే.. అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అలాగే, ఏపీలో బీసీ కులగణన జరగాలన్నారు.రాజ్యసభలో కేంద్ర హోం శాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా చర్చలో వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ పక్షనేత పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. చర్చలో ఆయన మాట్లాడుతూ..‘తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. తొక్కిసలాట ఘటనపైన కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి. సౌమ్యుడైన ఎంపీ మిథున్ రెడ్డిపై, రెడ్డప్పపై దాడి జరిగింది. ఆయన ఇల్లు, కార్లు ధ్వంసం చేశారు. ఇదేం రకమైన పరిపాలన?. దీనిపైన కేంద్రం చర్యలు తీసుకోవాలి.ఏపీలో అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెడుతున్నారు. 680 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టారు. ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోంది. దీని ఉపేక్షిస్తే కేంద్ర హోంమంత్రి పైన మచ్చ పడుతుంది. పోసాని కృష్ణమురళిపై కేసుల పైన కేసులు పెడుతున్నారు. సీఎంపైన విమర్శలు చేసినందుకు కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం. అరాచకాలు కొనసాగుతున్న ఈ పరిపాలనను సరిదిద్దాలి. కేంద్ర మౌనంగా ఉంటే.. అన్యాయం జరుగుతుంది.ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇవ్వడం లేదు. వారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంటే డీఓపీటీ ఏం చేస్తుంది?. సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారు. కీలక దృఢ నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్ర హోం శాఖ పట్టించుకోవడం లేదు. కేంద్రంలో తమ బలంపై ఆధారపడి ఉన్న ప్రభుత్వం ఉందనే ధైర్యంతో ఏపీలో అనర్ధాలు కొనసాగుతున్నాయి. నా రాజకీయ జీవిత చరిత్రలో ఇన్ని అక్రమ కేసులు ఎప్పుడు చూడలేదు. ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోంది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సరిదిద్దాలి. గుంటూరు మిర్చి రైతులకు మద్దతు ధర కోసం వైఎస్ జగన్ వెళితే సెక్యూరిటీ ఇవ్వలేదు. సెక్యూరిటీని విత్ డ్రా చేశారు. సెక్యూరిటీపైన రాజకీయ క్రీడలు ఆడుతున్నారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
మర్రి రాజశేఖర్‌ను వైఎస్ కుటుంబం ఎంతో గౌరవించింది: విడదల రజిని
పల్నాడు, సాక్షి: వైఎస్సార్సీపీ మర్రి రాజశేఖర్‌ని ఏనాడూ మోసం చేయలేదని, పైగా ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించిందని మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ ఇంఛార్జి విడదల రజిని గుర్తు చేశారు. పార్టీని వీడే క్రమంలో వైఎస్సార్సీపీపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేసిన విమర్శలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మర్రి రాజశేఖర్ నిన్న పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీలో తనకు గౌరవం దక్కలేదని, పదవులు దక్కలేదని అన్నారు. 2004లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మర్రి కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీలో చేరాక ఆయనకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2014 ఎన్నికల్లో ఓడినా సరే.. ఆయనను ఆ బాధ్యతల్లో కొనసాగించారు. వైఎస్ కుటుంబం మర్రి రాజశేఖర్‌కు ఎంతో గౌరవం ఇచ్చింది. వైఎస్సార్సీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది.పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రెడ్ బుక్ పేరుతో పాలన జరుగుతున్నప్పుడు మర్రి రాజశేఖర్ తన గొంతుక వినిపించి ఉంటే గౌరవం పెరిగి ఉండేది. కానీ, ఆయన అలా చేయలేదు. ఒకవేళ.. మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదం పొందితే ఆ సీటు టీడీపీ ఖాతాలోకే వెళ్తుంది. విమర్శించే ముందు మర్రి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైఎస్సార్సీపీ ఆయన్ని మోసం చేయలేదు. ఉన్నత పదవులతో గౌరవించింది అని విడదల రజిని అన్నారు... 2019 ఎన్నికల టైంలో నాకు పోటీ చేసే అవకాశం దక్కింది. ఆ సమయంలో పార్టీలో అంతర్గతంగా ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2024లో చిలకలూరి పేట నుంచి పోటీ చేయలేకపోవడం నా దురదృష్టంగా భావించా. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబితేనే పోటీ చేశాను. తిరిగి చిలకలూరిపేటకు తిరిగి ఆయన పంపిస్తేనే వచ్చా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను కాబట్టే ఆ పనులన్నీ చేశా. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను పాటించడం మాత్రమే నాకు తెలుసు అని అన్నారామె. -
దేశ నేతలను కులాలకు పరిమితం చేస్తారా?
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అద్యక్షుడు బండి సంజయ్‌కు సడన్‌గా ఆంధ్ర ప్రాంత పూర్వ నేతలపై అభిమానం పుట్టుకువచ్చినట్ల అనిపిస్తోంది. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, 1953లో అప్పటి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో 58 రోజులపాటు దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సంజయ్ చేసిన వ్యాఖ్యలు అంత చిత్తశుద్దితో చేసినట్లు కనిపించడం లేదు.. .. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్శిటీగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం బిల్లు పెట్టిన నేపథ్యంలో సంజయ్ ఈ అవకాశాన్ని తన రాజకీయ అవసరాలకు వాడుకున్నట్లు అనుమానం కలుగుతోంది. దీనికి ప్రతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే సమాధానం ఇచ్చారని చెప్పాలి. ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో యూనివర్శిటీ ఉందని, విభజన కారణంగా ఈ మార్పులు చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు ఈయన పేరు పెడితే ఇంకా సమున్నతంగా ఉంటుందని బీజేపీ నేతలకు సూచించారు. అదే టైమ్ లో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య పేరును ప్రకృతి వైద్యశాలకు పెడుతున్నామని, ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేసి జయంతి, వర్ధంతి నిర్వహిస్తామని, ఆర్యవైశ్యుల పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని అన్నారు. 👉పొట్టి శ్రీరాములు పేరుతో ఉన్న యూనివర్శిటీ పేరును తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టవలసిన అవసరం ఏముందని సంజయ్ ప్రశ్నిస్తున్నారు. శ్రీరాములు గొప్ప దేశ భక్తుడు, గాంధేయవాది, స్వాతంత్ర సమర యోధుడని, ఆర్యవైశ్యులకు ఆరాధ్య నాయకుడని సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఆర్యవైశ్య పట్టణ సంఘం ఈ జయంతి సభను నిర్వహించింది. తెలంగాణలో ఆయా చోట్ల వైశ్య సామాజిక వర్గ ప్రభావం కూడా గణనీయంగానే ఉంటుంది. దానిని దృష్టిలో ఉంచుకుని సంజయ్ ఈ ప్రసంగం చేసి ఉండవచ్చు. సురవరం ప్రతాపరెడ్డి అంటే తమకు గౌరవం ఉందని, తెలుగు భాష అభివృద్దికి కృషి చేశారని, దీనికి సంబంధించిన కార్యక్రమాలకు ఆయన పేరు పెట్టవచ్చని బండి సలహా ఇచ్చారు. బాగానే ఉంది. అక్కడితో ఆగి ఉంటే అదో తరహా అనిపించేది. .. ఇక్కడే సంజయ్ తన రాజకీయ ఆలోచనను అమలు చేసే యత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన ఒక ఆరోపణ చేస్తూ, తన కులాభిమానంతోనే పొట్టి శ్రీరాములు పేరు తొలగించి, ప్రతాపరెడ్డి పేరు ప్రతిపాదించారని అన్నారు. ఇందులో నిజం ఎంత ఉందన్నది ఒక ప్రశ్న. పొట్టి శ్రీరాములు పేరు మార్చకుండా ఉండాలని కోరవచ్చు. అంతవరకు ఓకే. కారణం ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చాలని ప్రతిపాదించింది. దీనిని శాసనసభలో కూడా బీజేపీ వ్యతిరేకించింది. ఇందులో కూడా కులం కోణమే ఉందన్న భావన కలుగుతుంది. 👉ప్రతాప్ రెడ్డి పేరును తెలుగు యూనివర్శిటీకి పెడితే రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి కులం ఆపాదించడం ఏమిటి? రేవంత్ ను విమర్శించే క్రమంలో సురవరం ప్రతాపరెడ్డి వంటి ప్రముఖుడిని కూడా ఒక కులానికి పరిమితం చేసినట్లు అనిపించదా! అంతేకాదు.. ముఖ్యమంత్రి తీరు దేశభక్తులు, స్వాతంత్ర్య సమర యోధులతోపాటు, ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని అనడం ద్వారా బండి సంజయ్(Bandi Sanjay) ఎజెండా ఏమిటో తెలిసిపోతుంది కదా! అంటే ఆర్యవైశ్యుల ఓట్లు తనవైపు ఉండేందుకు, కాంగ్రెస్‌కు నష్టం చేసేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తుంది. అదే టైమ్ లో పొట్టి శ్రీరాములును కూడా ఒక కులానికి పరిమితం చేసినట్లు అనిపించదా! ఇది దురదృష్టకరం. శ్రీరాములు అయినా, ప్రతాపరెడ్డి అయినా కులాలకు అతీతం అన్న సంగతిని విస్మరించరాదు. నేతలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుండనిపిస్తుంది. వర్తమాన సమాజంలో అలాంటి ఆశించడం అత్యాశే కావచ్చు. ఈ అంశాన్ని తొలుత చేపట్టి, అక్కడ నుంచి ఆయన తన విమర్శలను కాంగ్రెస్ పై ఎక్కుపెట్టారు.మహనీయులను అవమానించడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ఆరోపించారు. బీఆర్ అంబేద్కర్ ను కూడా అడుగడుగునా అవమానించిందని సంజయ్ విమర్శించారు. అంబేద్కర్ ను ఆయా పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 👉అంబేద్కర్ పై అంత అభిమానం ఉంటే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ అంబేద్కర్ విగ్రహ స్థలాన్ని బీజేపీ నేతలు ఎన్నిసార్లు సందర్శించారో తెలియదు. అదే టైంలో.. సంజయ్ మరో వివాదాస్పద ప్రశ్న సంధించారు. హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ పార్కు పేరు మార్చే దమ్ముందా? అని ఆయన అంటున్నారు. అలాగే కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లు ఉన్న పార్కులకు వాళ్ల పేర్లను తొలగించగలరా? కోట్ల విజయ భాస్కరరెడ్డి పేరుతో ఉన్న స్టేడియంకు కొత్త పేరు పెట్టే దమ్ము ఉందా? అని ఆయన అడగడంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు. 👉పొట్టి శ్రీరాములు మీద గౌరవం ప్రకటిస్తూనే, ఈ మాజీ ముఖ్యమంత్రుల పేర్లు తొలగించగలరా అని అడగడంలో అర్థం ఏమైనా ఉందా? సంజయ్‌కు తెలుసో లేదో కాని.. కాసు, నీలం, కోట్ల వంటివారు కూడా దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్లే.. జైళ్లకూ వెళ్లొచ్చిన వాళ్లే. మరి వారి పేర్లు మార్చగలరా అని అనడంలో ఆయనలో కుల కోణం కనిపిస్తుందే తప్ప సహేతుకత కనిపించదు. ఎన్టీఆర్ ప్రముఖ నటుడు , రాజకీయాలలోకి వచ్చి ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజల అభిమానం చూరగొన్నారు. ఆయన పేరు మార్చగలరా? అని అడగడం ఏమిటి. పరోక్షంగా వారి పేర్లు తీసివేయాలని సూచించడమా? అనే అనుమానం కూడా కలుగుతోంది. లేదంటే.. వీరు రెడ్డి,కమ్మ వర్గానికి చెందినవారు కనుక వాటి జోలికి వెళ్లడం లేదని పరోక్షంగా చెప్పదలిచారా! టాంక్ బండ్ పై అనేకమంది ఆంధ్రుల విగ్రహాలు ఉన్నాయని ,వాటిని తొలగిస్తారా అని ప్రశ్నించడం కూడా రాజకీయ ప్రేరితంగానే కనిపిస్తుంది.తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్నిచోట్ల కాసు, నీలం ఎన్టీఆర్ విగ్రహాలను కొంతమంది ధ్వంసం చేసినప్పుడు బీజేపీ పెద్దగా అభ్యంతరం చెప్పినట్లు కనిపించదు. అలాగే టాంక్ బండ్‌పై ఉన్న ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలను ఉద్యమ సమయంలో ఇప్పటికే ఒకసారి కూల్చారు. ఆ రోజుల్లో కూడా ఈ అంశంపై బీజేపీ గట్టిగా స్పందించినట్లు కనబడలేదు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి విగ్రహాలను వెంటనే పునరుద్దరించారు. బండి సంజయ్ కులపరమైన ఆలోచనలతో కాకుండా చిత్తశుద్దితో పేర్ల మార్పుపై మాట్లాడితే స్వాగతించవచ్చు. కాని ఆర్యవైశ్యులకు, దేశభక్తులకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంలోని ఆంతర్యం తెలుస్తూనే ఉంది. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 👉అసలు పేర్లు మార్చడంలో బీజేపీకి ఉన్న ట్రాక్ రికార్డు మరెవరికి ఉండకపోవచ్చు. పేర్ల మార్పిడి అన్నది కొత్త విషయం కాదు. కాని బీజేపీ కేంద్రంలోను, ఆయా రాష్ట్రాలలో పవర్లోకి వచ్చాక అవసరం ఉన్నా, లేకపోయినా తమ విధానాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసిందన్న విమర్శలు ఉంది.ఇంకో సంగతి చెప్పాలి. ఏపీలో బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) కొన్ని ప్రాజెక్టులకు రెడ్డి ప్రముఖుల పేర్లు ఉంటే వాటిని తొలగించింది. మాజీ మంత్రులు గౌతం రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి పేర్లను తొలగించారు. అంటే దాని అర్థం అక్కడ ప్రభుత్వం రెడ్లకు వ్యతిరేకమని.. ఆ విధానానికి బీజేపీ సమర్థిస్తోందన్న భావన కలగదా?. కొంతమంది తెలుగుదేశం వారు విశాఖలోని స్టేడియంకు ఉన్న వైఎస్ పేరును తీసివేసే యత్నం చేశారు. వారిది కుల జాఢ్యమని బీజేపీ చెబుతుందా! సంజయ్ తెలంగాణలో కులపరమైన ఆరోపణలు చేస్తే, బీజేపీ దేశంలో మతపరమైన విమర్శలు ఎదుర్కుంటోంది. మతాన్ని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీలో పలు రోడ్ల పేర్లు మార్చింది. ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వానికి ఇందులో ఒక రికార్డు ఉంది. ఏకంగా 24 నగరాలు, పట్టణాల పేర్లను మార్చడానికి ప్రతిపాదించింది. వాటిలో పలు నగరాల పేర్లను మార్పు కూడా చేసింది.వీటికి ఉన్న గత ముస్లిం పాలకుల పేర్లను తొలగించి హిందూ పేర్లను పెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది.సెక్యులర్ దేశంగా ఉన్న భారత్ లో ఇలా చేయడం సరైనదేనా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. వీటిలో కొన్నిటికి అభ్యంతరాలు వచ్చినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎప్పటి నుంచో ఉన్న అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చారు. ఫైజాబాద్ ను అయోధ్యగా మార్చారు. అంటే బీజేపీ ఎక్కడ అవసరం అయితే అక్కడ మతం లేదంటే కులం ప్రాతిపదికన రాజకీయం చేయడానికి వెనుకాడడం లేదని అనిపించదా?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సూపర్ సిక్స్‌పై ప్రశ్నిస్తే కేసులు.. అడుగేస్తే నిర్భంధం
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రెడ్‌బుడ్ రాజ్యాంగం అమలవుతోంది. ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ట్ అరెస్ట్, అరెస్ట్‌లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డిని గురువారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్బంగా అభినయ్ రెడ్డి మాట్లాడుతూ..‘ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా చంద్రబాబు ఉచిత బస్సు హామీ గాలికి వదిలేశారు. సూపర్ సిక్స్ అమలు చేయాలని కోరితే హౌస్ అరెస్టు చేస్తారా?. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని మహిళలు అడిగితే వారిని అరెస్టు చేస్తారా?.బడ్జెట్లో సూపర్ సిక్స్‌కు ఏ మాత్రం నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వైఎస్సార్సీపీ శాంతియుతంగా వినతిపత్రం అందచేయాలని అనుకున్నాం. దానికి ఎందుకు హౌస్ అరెస్టు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రజా గొంతుకను నులిమేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు?. వినతి పత్రం ఇచ్చేందుకు సైతం అనుమతించడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలని చూస్తారా? అని ప్రశ్నించారు. -
పుట్టుకతో తోడై.. జీవితం సూదిపోటై!
షుగర్ వ్యాధి బారిన పడకుండా ఒక్కొక్కరు ఒక్కో ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తుంటారు. ఒకరు రైస్ తినకూడదంటారు.. ఇంకొకరు నడక మంచిదంటారు.. ఒక వయస్సుకు వచ్చిన తర్వాత వ్యాధి బారిన పడటం ఒక ఎత్తయితే, రాకుండా జాగ్రత్త పడటం ఇంకొక ఎత్తు. మరి పుట్టుకతోనే ఈ వ్యాధి తోడుగా వస్తే. ఆ పిల్లల జీవితం నరకప్రాయం. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే తప్ప బతకలేని పరిస్థితి తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? వీళ్లు చేసిన పాపం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనంకర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన యువకునికి పుట్టుకతోనే షుగర్ వ్యాధి వచ్చింది. వైద్యులు పరిశీలించి టైప్–1 డయాబెటిస్‌గా నిర్ధారించారు. అప్పటి నుంచి ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్నారు. ప్రస్తుతం ఇతని వయస్సు 30 ఏళ్లు. రోజూ ఇంజెక్షన్ వేయించుకోవాలంటే బాధగా ఉంటోందని, కానీ బతకాలంటే తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్వీట్లు అంటే ఇష్టమని, కానీ తింటే పరిస్థితి దారుణంగా ఉంటుందని వాపోతున్నాడు.పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మల్లయ్య, మానస దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు వెంకట ఉమామహేష్, రెండవ కుమారుడు లిఖిత్. 9 నెలల వయస్సు కలిగిన లిఖిత్‌కు పుట్టుకతోనే చక్కెర వ్యాధి తోడుగా వచ్చింది. తరచూ అపస్మారక స్థితికి చేరుకోవడం గమనించి కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. షుగర్ లెవెల్స్ గుర్తించేందుకు మిషన్ తెచ్చుకుని వారానికోసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేయించాల్సిన పరిస్థితి. వారానికి సుమారు రూ.5వేల దాకా ఖర్చవుతోందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): పేరులో తియ్యదనం దాచుకున్న మహమ్మారి మధుమేహం. ఇది పెద్దలనే కాదు.. చిన్నారులనూ వదలని పరిస్థితి. పుట్టుకతోనే తోడుగా వచ్చి జీవించినంత కాలం వేధిస్తోంది. అందరిలా జీవించాలంటే రోజూ సూదిపోటుతో ఇన్సులిన్ మందు వేసుకోవడం తప్పనిసరి. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలను తల్లిదండ్రులే స్వయంగా ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడం వారికీ నరకంతో సమానం. ఇలాంటి బాధితుల సంఖ్య సమాజంలో రోజురోజుకూ పెరుగుతోంది. శరీరంలోని క్లోమగ్రంధిలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను(బీటా కణాలు) వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని టైప్–1 మధుమేహం(డయాబెటిస్) అంటారు. సాధారణంగా పిల్లలు, యువకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు బీటా కణాలను రోగినిరోధక వ్యవస్థ నిర్వీర్యం చేయడం కాకుండా క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు లేదా గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి. దీనిబారిన పడిన వారికి క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంత మందికి జన్యుపరంగా కూడా రావచ్చు. మరికొంత మందికి పలు రకాల వైరల్ వ్యాధులు, ఇతర ప్రమాదకర అనారోగ్యాల కారణంగా కూడా ఈ పరిస్థితి ఎదురవ్వొచ్చు. అంతేకానీ ఆహారం, జీవనశైలి అలవాట్లు టైప్–1 డయాబెటిస్‌కు కారణం కావు. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఇన్సులిన్ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సతో పాటు ఇన్సులిన్‌ను ఉచితంగా అందించాల్సి ఉంది. అయితే గత 10 నెలలుగా వీరికి అరకొరగా ఇన్సులిన్ ఇస్తున్నారు. కేవలం కర్నూలు, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో మాత్రమే అధికారులు స్థానికంగా కొనుగోలు చేసి ఇన్సులిన్‌ను కొద్దిమొత్తంలో అందజేస్తున్నారు. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో చాలా మంది మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో చిన్నారికి వ్యాధి తీవ్రతను బట్టి నెలకు రెండు నుంచి నాలుగు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. పెరుగుతున్న చికిత్స వ్యయం మెడికల్‌షాపుల్లో ఒక్కో ఇన్సులిన్ ఖరీదు రూ.180 వరకు ఉంటోంది. ఈ మేరకు ప్రతి చిన్నారికి నెలకు రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల వద్ద చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆధునిక వైద్యవిధానాల మేరకు వారికి నొప్పి తక్కువగా ఉండే ఇన్సులిన్ పెన్నుల ద్వారా ఇంజెక్షన్ చేస్తున్నారు. వీటి ఖరీదు సాధారణ ఇన్సులిన్‌తో పోలిస్తే రెట్టింపుగా ఉంటుంది.లక్షణాలు » టైప్–1 డయాబెటిస్ లక్షణాలు బయటపడటానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. » విపరీతమైన దాహం, తిన్న తర్వాత కూడా బాగా ఆకలివేయడం, నోరు తడి ఆరిపోవడం. » కడుపునొప్పి, వాంతులు, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం. »ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం, అలసట, కంటిచూపు తగ్గిపోవడం. » శ్వాస తీసుకోవడానికి ఎక్కువ కష్టపడటం, తరచుగా చర్మ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు. » మూడ్ మారిపోవడం, నిద్రలో మూత్రవిసర్జన చేయడం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50లక్షల వరకు జనాభా ఉంటుంది. ఇందులో 15 నుంచి 20 శాతం వరకు మధుమేహ బాధితులు. వీరిలో టైప్–2 మధుమేహ బాధితులు 90 శాతం కాగా.. టైప్–1 బాధితులు 10 శాతం పైనే. ఈ లెక్కన 7.50లక్షల నుంచి 10లక్షల వరకు మధుమేహ బాధితులు ఉండగా.. 75వేల నుంచి లక్ష దాకా చిన్నారులు ఉంటున్నారు.కోవిడ్ తర్వాత పెరిగిన కేసులు కోవిడ్–19 అనంతరం టైప్–1 డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగింది. గతంలో డయాబెటిస్ రోగులు 5 శాతం ఉండగా ఇప్పుడు 10శాతానికి చేరుకుంది. కోవిడ్ వైరస్ నేరుగా బీటా కణాలపై దాడి చేయడమే ఇందుకు కారణం. ఈ కారణంగా కోవిడ్‌కు గురైన వారికి జన్మించే పిల్లల్లో టైప్–1 డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తోంది. – డాక్టర్ పి.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్‌వోడి, జీజీహెచ్, కర్నూలు ఇన్సులిన్‌తో మాత్రమే చికిత్స చిన్నపిల్లల్లో వచ్చే టైప్–1 డయాబెటిస్‌కు ఇన్సులిన్‌తో మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది. ఆయాసం, కడుపునొప్పి, వాంతులు లక్షణాలతో చిన్నపిల్లలను ఆసుపత్రికి తీసుకొస్తారు. అన్నిరకాల పరీక్షలు నిర్వహించి డయాబెటిస్ నిర్దారణ అయ్యాక చికిత్స ప్రారంభిస్తాం. ఈ పిల్లలకు ఇన్సులిన్‌తో పాటు ఆహార నియమావళి తప్పనిసరి. – డాక్టర్ ఎం.మల్లికార్జున, అసోసియేట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు -
‘సామాజిక’ సాహిత్యం
సాక్షి, అమరావతి: ‘వడగాడ్పు నా జీవితం.. వెన్నెల నా కవిత్వం’ అన్నారు గుర్రం జాషువా. ఆకలి కవిత్వం.. ఆలోచనే కవిత్వం.. కదిలించే ఘటనలు.. కవ్వించే ప్రతినలు.. కవితకు ప్రాతిపదికలు అంటూ కవిత్వం స్వరూపాన్ని వివరించారు శ్రీశ్రీ. రచనలతో సంస్కృతి, సంప్రదాయాల సంపదను, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కవుల పాత్ర గొప్పది. వారు సాహిత్యానికి, తద్వారా సమాజ ఉన్నతికి చేస్తున్న కృషి వెలకట్టలేనిది. వారి కవిత్వానికి గుర్తింపునిస్తూ ఏటా మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సామాజిక మాధ్యమాల ద్వారా సాహిత్యం కొత్తపుంతలు తొక్కుతోంది. పడిలేచిన కెరటం: కాలంతో పాటు సాహిత్యకారులకు ఆదరణ కరువైంది. కరోనా మహమ్మారి ఈ పరిస్థితిలో కాస్త మార్పు తెచి్చంది. సామాజిక మాధ్యమాల ద్వారా రచయితలకు తిరిగి పూర్వ వైభవం వస్తోంది. అక్షర జ్ఞాన ప్రదర్శనకు అనువైన వేదికలు కల్పించే సాహిత్య సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. సామాజిక వేదికల ద్వారా దేశ విదేశాలను ఏకం చేస్తూ సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనుభవజు్ఞల నుంచి అప్పుడే అడుగులు వేస్తున్న వారికీ ఇక్కడ గుర్తింపు దక్కుతోంది. సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలనే ఇతివృత్తంగా కవితలు, కథల పోటీలు నిర్వహిస్తుంటే, గెలుపొందిన వారితో పాటు పాల్గొన్న వారికీ ప్రోత్సాహక బహుమతులు, పురస్కారాలు లభిస్తున్నాయి. దీంతో యువతరంలోనూ క్రమంగా సాహిత్య రచనా కాంక్ష పెరుగుతోంది. ఎన్నో మార్గాలు : అభ్యుదయ కవిత్వం, భావ కవిత్వం, కాల్పనిక కవిత్వం అంటూ ఎవరు ఏం రాసినా పూర్వం పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురిస్తేగానీ ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటయ్యాయి. ప్రతిలిపి, పాకెట్ ఎఫ్ఎం, పాకెట్ నవల్ వంటి ఆన్లైన్ యాప్‌లో కథలు, కవితలు వినడం, చదడం వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.కవులు పెరిగారు సోషల్ మీడియా వేదికగా సాహిత్యానికి పెద్ద ప్లాట్‌ఫాం ఏర్పడింది. కరోనా తర్వాత ఆన్లైన్ వేదికలు రావడంతో ఎంతోమంది కవులు మారారు. కవులకు సరైన సాహిత్య మార్గ నిర్దేశకం అవసరం. అందుకే ప్రత్యేక వేదికలు కల్పిస్తున్నాం. – కత్తిమండ ప్రతాప్, రచయిత, శ్రీశ్రీ కళా వేదిక నిర్వాహకుడు సామాన్యులకు అర్థం అవుతోంది ఒకప్పుడు కవిత్వం రాసేవారిని వెతకాల్సి వచ్చేది. కరోనా తరువాత ప్రతి వంద మందిలో 10 మంది కవులు ఉంటున్నారు. ఏ కాలంలోనూ ఇంతమంది కవులు లేరు. – నిమ్మగడ్డ కార్తీక్, రచయిత, తపస్వి మనోహరం సాహిత్య వేదిక నిర్వాహకుడు -
మా అధికారాల్లోనే జోక్యం చేసుకుంటారా?
సాక్షి, అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేయడం వెనుక ఉన్న నిజానిజాలను తేల్చే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించకుండానే సిట్‌ను ఏర్పాటు చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామంది. సిట్ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో ఇచ్చారని, ఇలా చేయడం తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవడమేనని కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ హైకోర్టుకు వివరించారు. ఈ వ్యవహారాన్ని తాము ఎంత మాత్రం తేలిగ్గా తీసుకునేది లేదన్నారు. తమ అధికార పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నా చూస్తూ ఊరుకుంటే.. రేపు ప్రతి రాష్ట్రం ఇలాగే వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులిచ్చి వివరణ కోరామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీరును అభిశంసించాలని ఆయన కోర్టును కోరారు. సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం మరో జీవో ఇచ్చిందని, ఆ జీవోలో ఉపయోగించిన భాష కూడా సరిగా లేదని తెలిపారు. బేషరతుగా జీవోను ఉపసంహరించుకోకుండా ఎన్నికల సంఘం చట్ట నిబంధనలకు లోబడి తాము చర్యలు తీసుకుంటామని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తమ పరిధిలో జోక్యం చేసుకుంటామన్న సందేశాన్ని ఇచ్చినట్లయిందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సిట్ ఏర్పాటు జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. సిట్ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గురువారం ఉత్తర్వులిచ్చారు. మా అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందిఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, ఎన్నికల నిర్వహణ తదితరాలన్నీ తమ పరిధిలోని వ్యవహారాలని చెప్పారు. వీటిలో ఏవైనా పొరపాట్లు గానీ, లోటుపాట్లు గానీ ఉన్నా వాటిని సరిచేయాల్సింది కేంద్ర ఎన్నికల సంఘంగా తాము మాత్రమేనన్నారు. ఇందులో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. సిట్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వం తమ అధికారాలను లాగేసుకుందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై తాము ఆరోపణలను నమోదు చేసి, ఆయనకు ఖర్చులు విధించాలని కోర్టును కోరారు. ఇలా తాము కోరినట్లు కూడా రికార్డ్ చేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వం తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది అజయ్ వాదనలు వినిపిస్తూ.. సిట్ ఏర్పాటు జీవోను ఉపసంహరించుకుంటూ ఈ నెల 19న మరో జీవో ఇచ్చినట్టు కోర్టుకు వివరించారు. సిట్ ఏర్పాటుపై పిటిషన్ గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పర్చూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు (ఫాం 7) దాఖలయ్యాయంటూ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. దీంతో ఫాం 7 దాఖలుపై విచారణ నిమిత్తం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న జీవో 448 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ బాపట్లకు చెందిన గుండపనేని కోటేశ్వరరావు, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ సుబ్బారెడ్డి విచారణ జరిపారు. -
వర్గీకరణపై ఐదు సిఫారసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల్లోని ఉపకులాల వర్గీకరణపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రంగరాజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఐదు కీలక సూచనలు చేసింది. గతేడాది నవంబర్ 15న నియమితులైన ఆయన అదే నెల 27న బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి 13 జిల్లాల్లో పర్యటించి ఈ నెల 10న ప్రభుత్వానికి నివేదిక సమర్పింపంచారు. నాలుగు నెలలపాటు అధ్యయనం చేసి 3,820 విజ్ఞాపనలు స్వీకరించిన కమిషన్ మొత్తం 360 పేజీల నివేదికలో ఐదు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉపకులాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించింది. వాటిలో గ్రూపు–ఏలో 2.25 శాతం జనాభా కలిగిన అత్యంత వెనుకబడిన 12 రెల్లి ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ అందించాలని సిఫారసు చేసింది. గ్రూప్–బీలో 41.56 శాతం జనాభా కలిగిన వెనుకబడిన 18 మాదిగ ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పేర్కొంది. గ్రూప్ సీలో 53.98 శాతం జనాభా కలిగి మిశ్రమ వెనుకబాటుతనంతో ఉన్న 29 మాల ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు చేసింది. రోస్టర్ విధానం ప్రకారం మొదట వంద పోస్టులు వస్తే 8 శాతం పోస్టులు మాల సామాజిక వర్గానికి వస్తాయి. మాదిగ సామాజిక వర్గానికి 6 శాతం, రెల్లి సామాజిక వర్గానికి ఒక శాతం వస్తాయి. ఈ మూడు కలిపితే 15 శాతమవుతుంది. అదే రోస్టర్ విధానంలో 200 పోస్టులు వస్తే మాల సామాజిక వర్గానికి 15, మాదిగ సామాజిక వర్గానికి 13, రెల్లి వర్గానికి రెండు వర్తిస్తాయి. తద్వారా రోస్టర్‌లో అందరికీ న్యాయం జరుగుతుంది. ఇవీ ఐదు కీలక సూచనలు..» ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్‌గా వర్గీకరణ అమలు చేయాలి. » 2026 జనాభా లెక్కల సేకరణ పూర్తి అయ్యాక ప్రభుత్వం జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేసుకోవచ్చు. » ఎస్సీ 59 ఉపకులాలను ఏ, బీ, సీగా మూడు కేటగిరీల్లో వర్గీకరణ. » 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ శాతం అమలు. » రోస్టర్ విధానాన్ని కూడా ఇదే రీతిలో అమలు చేయాలి.జనగణన తర్వాతే వర్గీకరణఅసెంబ్లీలో సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: రాష్ట్రం యూనిట్‌గా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2026 జనగణన తర్వాతే జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల్లో ఉప కులాల వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం నియమించిన రంగరాజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదికపై గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం ఆమోదిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. 1995లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి సుదీర్ఘకాలం సాగిన వర్గీకరణ అంశం మళ్లీ తన హయాంలోనే పరిష్కారం కావడం సంతృప్తినిచి్చందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఎన్నికల్లో చెప్పినట్లే ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం. 30 ఏళ్ల నిరీక్షణను నిజం చేస్తూ నా చేతుల మీదుగా వర్గీకరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. అంటరానితనంపై అప్పట్లో జస్టిస్ పున్నయ్య కమిషన్ చేసిన 42 సిఫారసులు ఆమోదించి 25 జీవోలు, మెమోలు తీసుకొచ్చాం. పున్నయ్య కమిషన్ వేసి ఎస్సీ, ఎస్టీ చట్టం తెచ్చా. మాదిగ పేరు చెప్పుకొనేందుకు కూడా వెనుకాడిన రోజుల్లో మాదిగ దండోరాను స్థాపించి మందకృష్ణ పెద్ద ఉద్యమం చేశారు. వారి డిమాండ్లు సమంజసమని భావించి 1997 జూన్ 6న ఎస్సీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరిస్తూ ఉత్వర్వులు ఇచ్చాం. దీంతో మాదిగలు, ఉప కులాలకు 22 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఆగస్టులో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచి్చంది. అంటరానితనాన్ని రూపుమాపేందుకు నాకు చాలా సమయం పట్టింది. పేదరికంలేని సమాజమే నా లక్ష్యం. ఉగాది నుంచి పీ 4 విధానం తెస్తాం’ అని చంద్రబాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే మంద కృష్ణ, చంద్రబాబు ఇద్దరే కారణమని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉండే రెల్లి కులస్తుతులకు కూడా న్యాయం చేయాలన్నారు. బుడగ జంగాలనూ ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. -
హజ్ యాత్రికులకు కూటమి సర్కార్ ద్రోహం
రాష్ట్రం నుంచి హజ్‌కు వెళ్లే ముస్లింల సౌకర్యార్థం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టుదలతో సాధించిన ఎంబార్కేషన్ పాయింట్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేయించింది. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రద్దుకు వీలుగా ఏకంగా ఏపీ హజ్ కమిటీతో లేఖ రాయించింది. దీంతో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అరూప్ బర్మన్ ఈ నెల 18న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్సింగ్కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. – సాక్షి, అమరావతి వైఎస్ జగన్ కృషితో సాకారం..భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ఆయా రాష్ట్రాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎంబార్కేషన్ పాయింట్‌కు కేంద్ర పౌర విమానయాన, విదేశీ వ్యవహారాలు, మైనార్టీ తదితర శాఖలు సమీక్షించి అనుమతి ఇస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే వరకు హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల నుంచి హాజీలు వెళ్లేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి.. విజయవాడ(గన్నవరం) విమానాశ్రయానికి ఎంబార్కేషన్ పాయింట్ కోసం అనుమతి సాధించింది. అలాగే ఇక్కడి నుంచి ప్రయాణించే వారిపై పడిన అదనపు చార్జీలను సైతం వైఎస్ జగన్ సర్కార్ భరించింది. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన, కేంద్ర హజ్ కమిటీలతో వైఎస్సార్సీపీ ఎంపీలు అనేక పర్యాయాలు సంప్రదించారు. కేంద్రానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో లేఖ కూడా రాసి ప్రతినిధి బృందాన్ని పంపించి మాట్లాడించారు. అయినా సానుకూల ఫలితం లేకపోవడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లే హాజీలపై రూ.80 వేల చొప్పున పడుతున్న అదనపు చార్జీల భారాన్ని అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే భరించింది. వైఎస్సార్సీపీ హయాంలో గత రెండేళ్లలో ఏకంగా 2,495 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్‌కు వెళ్లారు. 1,813 మందికి చార్జీల భారం లేకుండా రూ.14.50 కోట్లకు పైగా అందించింది.ముస్లిం సమాజాన్ని మోసం చేశారు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముస్లింల ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికే వక్ఫ్ సవరణ బిల్లు వంటి వాటిలో టీడీపీ డబుల్ గేమ్ ఆడింది. తాజాగా ఎంబార్కేషన్ పాయింట్ పోయేలా లేఖ ఇప్పించి.. ముస్లిం సమాజాన్ని మోసం చేసింది. ఇది ముమ్మాటికి ముస్లింలను అవమానపర్చడమే. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా స్పందించి ఎంబార్కేషన్ పాయింట్‌ను తిరిగి సాధించాలి. – షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వినర్ ఇది చంద్రబాబు మార్క్ కుట్ర.. హజ్ యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రద్దు కచ్చితంగా చంద్రబాబు మార్క్ కుట్ర. ఏపీకి చెందిన ఎంపీ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా.. ఎంబార్కేషన్ పాయింట్ రద్దు చేస్తుంటే ఏం చేస్తున్నారు? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు? రూ.లక్ష హామీని ఎగవేసేందుకే ఇలా కుట్ర చేశారా? – షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ తీసుకువస్తే.. బాబు నాశనం చేశారు పొరుగు రాష్ట్రాల్లో ఏపీకి చెందిన హాజీలు అవస్థలు పడకూడదని అప్పటి సీఎం వైఎస్ జగన్.. పట్టుదలతో ఎంబార్కేషన్ పాయింట్ సాధించారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో విమాన టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే ఆ భారాన్ని కూడా భరించారు. అలాంటి సౌలభ్యాన్ని చంద్రబాబు నాశనం చేశారు. – దస్తగిరి, ముస్లిం దూదేకుల జేఏసీ చైర్మన్ -
బాబు విజనరీ.. ఆదాయం ఆవిరి!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ గురువారం వెల్లడించింది.సంపద పెంచేస్తానని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు... తీరా అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త పాలనతో ఉన్న సంపదను సైతం ఆవిరి చేసేస్తున్నారు. కొత్తగా సంపద సృష్టించడం దేవుడెరుగు... గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని కూడా నిలబెట్టలేక పోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం కక్ష సాధింపులు, రెడ్‌బుక్ పాలనపైనే దృష్టి సారించి, సుపరిపాలనను గాలికొదిలేయడమేనని స్పష్టం అవుతోంది. భారీగా తగ్గిన రెవెన్యూ రాబడులు.. పన్నులు ⇒ ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల్లో రూ.11,450కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అంటే చంద్రబాబు పాలనలో సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ⇒ అమ్మకం పన్నుతోపాటు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఆదాయం కూడా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు అమ్మకం పన్ను ఆదాయం రూ.1,068 కోట్లు తగ్గినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా రూ.721 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. భారీగా పెరిగిన అప్పులు... తగ్గిన కేంద్రం గ్రాంట్లు ⇒ 2024–25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే బడ్జెట్ పరిధిలోనే రూ.90,557 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.70 వేల కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా రూ.20 వేల కోట్లు అప్పు చేశారు. ⇒ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో రూ.16,766 కోట్ల తగ్గుదల నమోదైంది. జగన్ పాలనలో కన్నా రూ.10వేల కోట్లు తక్కువగా మూలధన వ్యయం ⇒ అప్పు చేసిన నిధులను ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయంపై ఖర్చు పెట్టాలని ఇటీవలే చంద్రబాబు విలేకరుల సమావేశంలో నీతులు చెప్పారు. అయితే, ఆచరణలో మాత్రం మూలధన వ్యయంలో కోతలు విధించారు. ⇒ జగన్ సీఎంగా ఉండగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి మూలధన వ్యయం కింద రూ.23,251 కోట్లు ఖర్చు చేశారు. నీతులు చెబుతున్న చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు కేవలం రూ.13,303 కోట్లే మూలధన వ్యయం చేశారు. ⇒ ఈ ఏడాది బడ్జెట్ అంచనాలకు మించి ద్రవ్యలోటు, రెవెన్యూలోటు పెరిగిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా బడ్జెట్లో పేర్కొనగా.. అది ఫిబ్రవరి నాటికే ఏకంగా రూ.76,292 కోట్లకు చేరింది. ⇒ ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.68,763 కోట్లుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి నాటికే ద్రవ్యలోటు రూ.90,047 కోట్లకు చేరింది. ⇒ రెవెన్యూ రాబడులు తగ్గుతున్నా.. రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిపోతోందంటూ సీఎం చెప్పడం.. కేవలం అప్పులు ఎక్కువగా చేయడానికేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
మందలించాడని తండ్రిని హత్య చేసిన కూతురు
మండపేట: తనను మందలించాడన్న కోపంతో ఓ మహిళ ప్రియుడి సహాయంతో కన్న తండ్రినే కిరాతకంగా హత్య చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలను గురువారం టౌన్ సీఐ దారం సురేష్ మీడియాకు వెల్లడించారు. 22వ వార్డు మేదరపేట వీధిలో సూరా రాంబాబు అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతని కుమార్తె వస్త్రాల వెంకట దుర్గకు రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన తండ్రి రాంబాబు కుమార్తెను మందలించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన దుర్గ కన్న తండ్రిని చంపాలని నిర్ణయించుకుంది. ప్రియుడు సురేష్‌తో కలిసి హత్యకు పథకం వేసింది. ఈ నెల 16న తండ్రి ఒంటరిగా ఉన్న సమయం చూసి ప్రియుడు సురేష్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. అతను తోడుగా తన స్నేహితుడు తాటికొండ నాగార్జునతో కలిసి వచ్చాడు. ఆ ముగ్గురూ కలిసి మంచంపై నిద్రిస్తున్న రాంబాబు ఛాతిపై కూర్చొని పీక నులిమి.. డొక్కల్లో తన్ని హత్య చేశారు. మృతుడి సోదరుడు సూరా పండు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ.. దుర్గపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి.. విశాఖపట్నం పారిపోతున్న నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో గురువారం వారిని రామచంద్రపురం కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. -
గిరిజన వర్సిటీకి భూములిస్తే మార్చేస్తారా?
కొత్తవలస: పోలీసు శిక్షణ కేంద్రం (గ్రేహౌండ్స్) పేరిట మరోసారి తమను మోసం చేయొద్దని అప్పన్నదొరపాలెం, తమ్మన్నమెరక, జోడిమెరక గ్రామాలకు చెందిన గిరిజనులు ఆర్డీఓ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 526 ఎకరాల భూముల్లో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించేందుకు నిర్ణయించగా.. ఆర్డీఓ దాట్ల కీర్తి ఆధ్వర్యంలో సర్పంచ్ జోడు రాములమ్మ అధ్యక్షతన తహసీల్దార్ బి.నీలకంఠరావు అప్పన్నదొరపాలెంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. సభకు హాజరైన గిరిజనులు మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మిస్తామని చెప్పి తమ భూములను లాక్కున్నారని తెలిపారు. 2019లో ఎన్నో హామీలిచ్చారని, అందులో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. భూములిచ్చిన గిరిజనులను పోలీస్ బందోబస్తు మధ్య బంధించి పూజలు నిర్వహించారన్నారు. ఇప్పుడు అవే భూముల్లో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పడం మోసగించడమేనని పేర్కొన్నారు. తహసీల్దార్ ప్రభుత్వ నిబంధనల్ని వివరిస్తూ గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ సమయంలో గిరిజనులంతా ఒక్కటై తమను మళ్లీ మోసం చేయొద్దని నినదించారు. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం 178 మంది గిరిజనులకు చెందిన 179 ఎకరాల్లోని జీడిమామిడి తోటలను ఏడు రకాల హామీలిచ్చి తీసుకుందని.. నేటికీ వాటి అమలు ఊసే లేదని నిలదీశారు. గ్రేహౌండ్స్ నిర్మాణానికి తమ భూములిచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తే తమ శవాలపై నిర్మాణాలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్డీఓ కీర్తి మాట్లాడుతూ.. గిరిజనుల డిమాండ్లు రాసి ఇస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. మరోసారి గ్రామంలో సభ ఏర్పాటు చేస్తామని అప్పటిలోగా ఆలోచన చేసుకోవాలని సూచించారు. -
విశాఖ స్టేడియంకు వైఎస్సార్ పేరును కొనసాగించాలి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రచేసి స్టేడియం ఆధునీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటుచేసిన ఎంట్రన్స్ ఆర్చ్పై, స్టేడియానికి చెందిన ఫసాట్లలో వైఎస్సార్ పేరు తొలగించినందుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీమంత్రి, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జెడ్పీ చైర్పర్సన్ జె. సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు తొలుత స్టేడియం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పాలతో ఆభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నల్ల రిబ్బన్లతో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. తొలగించిన వైఎస్సార్ పేరును యథావిధిగా పెట్టాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. విశాఖ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు హౌస్ అరెస్ట్..మరోవైపు.. ఈనెల 19న విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్సీపీ ఆందోళన చేపడుతుందని పిలుపునిచ్చిన మరుక్షణం నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం కుయుక్తులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు, కార్పొరేటర్లకు పోలీసులు ఫోన్లుచేసి బెదిరించారు. నిరసన కార్యక్రమానికి ఎవరినైనా తీసుకెళ్తే అరెస్టుచేస్తామని హెచ్చరించారు. విశాఖ నార్త్ నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు వైఎస్సార్సీపీ ముఖ్యనేతల ఇళ్లకు వెళ్లి మరీ వార్నింగ్‌లు ఇచ్చారు.ఐపీఎల్ మ్యాచ్లవల్లే శాంతియుత నిరసనమాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ఈనెల 24, 30 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో విశాఖ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలన్న ఉద్దేశంతో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేశామని మాజీమంత్రి, విశాఖజిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. టీడీపీ కూటమి పార్టీల ఎంపీలు ఏసీఏలో సభ్యులుగా ఉండడంతోనే కుట్రపూరితంగా డాక్టర్ వైఎస్సార్ క్రికెట్ స్టేడియం ఆర్చ్పై వైఎస్సార్ పేరు తొలగించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ మార్క్, ఆయన బ్రాండ్ కనబడకూడదనే వైఎస్సార్ పేరును తొలగించేందుకు కుట్ర చేశారని అమర్నాథ్ మండిపడ్డారు. గతంలో విశాఖ అభివృద్ధిలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీతకొండ వ్యూ పాయింట్‌కు వైఎస్సార్ పేరు పెడితే దాన్ని తొలగించారని ఆక్షేపించారు.అలాగే, విశాఖ ఫిలింనగర్ క్లబ్ లాన్‌కు వైఎస్సార్ పేరు తొలగించారని, ఇవేకాక.. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేకచోట్ల వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్ పేరును ఏసీఏ తొలగించిందా..? లేదంటే కూటమి ప్రభుత్వం ఒత్తిడితో తొలగించారా..? 48 గంటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమాధానం చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
బతుకే ‘పరీక్ష’
మంత్రాలయం: బతుకుదెరువులో భాగంగా ఎంతో మంది పదవ తరగతి విద్యార్థులు పేదరికంతో పరీక్షలకు దూరమై చదువులకు వీడ్కోలు పలుకుతున్నారు. పనికోసం వలస (సుగ్గి) బాటలోనే విలువైన జీవితాలను పణంగా పెడుతున్నారు. తల్లిదండ్రులకు చదివించుకోవాలన్న ఆశ ఉన్నా, పేదరికం శాపంగా మారింది. పూట గడవని జీవులకు బతుకే ఓ పోరాటమైంది.జీవితమే ఓ పరీక్షగా మారింది. ఇదివరకెన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు కావడం గమనార్హం. విద్యార్థులు చదువులకు దూరమవుతున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. పేద కుటుంబాల విద్యార్థుల చదువులకు భరోసా ఇవ్వకుండా వేడుక చూస్తోంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఈ ఏడాది 32,130 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.అందులో మొదటి రోజు తెలుగు, ఉర్దూ, కన్నడ సబ్జెక్టు పరీక్షలకు 700 మంది గైర్హాజరయ్యారు. వీరిలో మంత్రాలయం నియోజకవర్గం వారు 79 మంది, ఆదోనివారు 37 మంది ఉన్నారు. కోసిగి మండలం చింతకుంటకు చెందిన చిన్నారి పరీక్షకు హాజరు కాలేదన్న విషయం ఓ పత్రికలో చదివి తెలుసుకున్న విద్యా శాఖ మంత్రి లోకేశ్.. సదరు చిన్నారిని గురువారం స్వగ్రామానికి పంపారు.రెండు సబ్జెక్టుల పరీక్షలు ముగిసిన తర్వాత ఆమెను ఇంటికి రప్పించారు. ఈ బాలిక మిగతా పరీక్షలకు హాజరైనా, మొదటి రెండు పరీక్షల్లో ఫెయిల్ కాకతప్పదు. ఇలాంటి విద్యార్థులు వందల సంఖ్యలో ఉన్నారు. మరి వారందరి పరిస్థితి ఏమిటన్నది మంత్రి లోకేశ్ సెలవివ్వాలి. పేపర్లో వస్తేనే స్పందించే బదులు తొలుతే అందరూ పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుని ఉంటే బావుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రెండు సబ్జెక్టులకు దూరమైన చిన్నారి ⇒ ఈ విద్యార్థిని పేరు సన్నక్కి చిన్నారి. కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన మారయ్య, కమలమ్మ దంపతుల రెండవ కుమార్తె. కోసిగి బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదవుతోంది. గుంటూరు జిల్లా కేంద్రం సమీపంలో మిరప కోతలకు తల్లిదండ్రులతోపాటు జనవరిలో వెళ్లింది.చిన్నారి కుటుంబానికి సెంటు భూమి కూడా లేదు. కూలికి వెళితేనే నాలుగు మెతుకులు. ఈసారి కూలి పనులు లేకపోవడంతో మారయ్య ఇంటిల్లిపాది పని కోసం వలస పట్టారు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైనా చిన్నారిని మాత్రం పరీక్షలకు పంపలేదు. తోటి వారు వారించడంతో రెండు సబ్జెక్టుల పరీక్షలు అయిపోయాక తల్లి చిన్నారిని వెంటబెట్టుకుని ఊరు చేరుకుంది.వీరేంద్ర పరీక్షకు తండ్రి జబ్బు శాపం ⇒ ఈ ఫొటోలోని విద్యార్థి పేరు వీరేంద్ర. మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన భీమయ్య, ఉసేనమ్మ కుమారుడు. ప్రస్తుతం ఈ విద్యార్థి తండ్రికి జబ్బు చేసి స్వగ్రామంలోనే ఉండిపోగా.. తల్లితోపాటు వీరేంద్ర పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని గడితండా గ్రామంలో మిరప కోతలకు వెళాడు.పదవ తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్తానని వీరేంద్ర మొర పెట్టుకున్నా, అమ్మ ఒప్పుకోలేదు. నాన్న అనారోగ్యంగా ఉండటంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందని, పైగా పోయిన సంవత్సరాల్లాగా అమ్మ ఒడి కూడా రాలేదని వీరేంద్రను వారించడంతో మనసు చంపుకొని పనికి వెళ్లాడు. రెండు నెలలుగా అక్కడే పనులు చేసుకుంటున్నారు.పూట గడవని మాకు పరీక్షలెందుకని?⇒ ఈ ఫొటోలోని భార్యాభర్తల పేర్లు సులువాయి నరసింహులు, నీలమ్మ. వీరిది కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలోని పల్లెపాడు గ్రామం. పచ్చ రంగు చొక్కా ధరించిన బాలుడు ఉరకుందు పదవ తరగతి, క్రీం కలర్ షర్టు ధరించిన బాలుడు వీరేంద్ర ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రెండు సబ్జెక్టులు పూర్తయ్యాయి.బతుకుదెరువు కోసం తల్లిదండ్రులతోపాటు ఉరుకుందు సుగ్గి (పని కోసం వలస)కి వెళ్లడంతో పరీక్షలకు హాజరు కాలేదు. పూట గడవని తమకు పరీక్షలు ఎందుకనుకున్నారేమో తల్లిదండ్రులు పిల్లలను సైతం తమ వెంట తీసుకొని ప్రకాశం జిల్లా పురిమెట్లలో మిరప కోతలకు వెళ్లారు. తల్లిదండ్రుల పేదరికం ఈ విద్యార్థికి శాపంగా మారడం విచారకరం. వీరికి ఎకరా భూమి ఉంది. వానొస్తేనే పొలంలో కాసింత పచ్చదనం కనిపిస్తుది. లేదంటే బీడుగా వదిలేసి సుగ్గి బాట పట్టాల్సిందే.తల్లికి వందనం లేనందునే..ఇలా ఒక్క పదవ తరగతి విద్యార్థులే కాదు.. ఇతర తరగతులు చదివే విద్యార్థుల్లో చాలా మంది వలస వెళ్లారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో దాదాపు 16 వేల మంది వరకు విద్యార్థులు వలస వెళ్లినట్లు అంచనా. గత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం అమలుతో విద్యార్థులు వలస వెళ్లిన దాఖలాలు చాలా తక్కువ.ఈసారి మాత్రం తల్లిదండ్రులతోపాటు విద్యార్థులు అత్యధిక సంఖ్యలో తరలి వెళ్లడం గమనార్హం. తల్లికి వందనం పథకం అమలు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని స్థానికులు వాపోతున్నారు. అంతేగాక సీజనల్ హాస్టళ్ల ఏర్పాటులోనూ కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం కూడా వలసలకు ఓ కారణం.నాగలక్ష్మికి పేదరికమే అడ్డు⇒ ఈ అమ్మాయి పేరు నాగలక్ష్మి. పెద్దకడబూరు మండల కేంద్రానికి చెందిన లింగమ్మ, భీమేష్ దంపతుల కుమార్తె. నాగలక్ష్మి తల్లితోపాటు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కేంద్రం సమీపంలో మిరప కోతల్లో ఉండిపోయింది. మూడు నెలలుగా అక్కడ పొలం పనులకు వెళ్తోంది. ఈ బాలిక పెద్దకడబూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. పబ్లిక్ పరీక్ష రాసేందుకు సైతం హాజరు కాలేదు. సెంటు భూమి లేని నాగలక్ష్మి కుటుంబానికి కూలి పనులే శరణ్యం. గ్రామంలో పనులు ముగియడంతో తల్లితో కలిసి వలస వెళ్లడం గమనార్హం. -
రెడ్‌బుక్ తంత్రం.. సిట్ కుతంత్రం!
సాక్షి, అమరావతి : పోలీస్ స్టేషన్‌కు ఉండాల్సిన అర్హతలు ఉండవు.. ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందో చెప్పరు.. కానీ అది పోలీస్ స్టేషనే. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరో చెప్పరు కానీ అది పోలీస్ స్టేషనే. ఇదంతా ఏమనుకుంటున్నారు? ఇది రెడ్‌బుక్ రాజ్యాంగ కుట్రల కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా సిద్ధం చేసిన రాజ్యాంగేతర శక్తి. దీనిపేరు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్). వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట ప్రభుత్వం బరితెగిస్తోంది. అందుకోసమే ఏర్పాటు చేసిన సిట్ ద్వారా అరాచకాలకు తెగబడుతోంది. చట్టంలో పేర్కొన్న నిబంధనలను బేఖాతరు చేస్తూ.. ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతోనే సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రలోభపెట్టి, బెదిరించి, వేధించి మరీ అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసే కుట్ర దాగుంది. చట్ట విరుద్ధంగా సిట్ ఏర్పాటు సిట్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోనే ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. కేవలం కక్ష సాధింపే లక్ష్యంగా సిట్‌ను ఏర్పాటు చేశారనేది జీవోనే స్పష్టం చేస్తోంది. చట్టంలో నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలను పూర్తిగా ఉల్లంఘించారని స్పష్టమవుతోంది. ఏదైనా వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసే సిట్‌ను ఓ పోలీస్ స్టేషన్‌గా పరిగణించాలి. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సిట్‌ను ఓ పోలీస్ స్టేషన్‌గా గుర్తిస్తున్నట్టు పేర్కొంది. కానీ అసలు పోలీస్ స్టేషన్‌కు చట్ట ప్రకారం ఉండాల్సిన నిబంధనలను మాత్రం గాలికి వదిలేయడం గమనార్హం. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా పోస్టుగానీ, ప్రదేశంగానీ పోలీస్ స్టేషన్‌గా పరిగణిస్తారు’ అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ స్టేషన్ కోసం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా ‘స్థానిక ప్రాంతం’ కూడా అయ్యుండాలని చట్టం స్పష్టం చేసింది. అంటే పోలీస్ స్టేషన్‌కు స్థానిక ప్రాంతం ఏదన్నది స్పష్టం చేయాలి. కానీ మద్యం విధానంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ‘స్థానిక ప్రాంతం’ ఏదన్నది పేర్కొన లేదు. స్థానిక ప్రాంతం అన్నది లేకుండా ఏదైనా పోస్టునుగానీ, ప్రదేశాన్నిగానీ పోలీస్ స్టేషన్‌గా గుర్తించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు కచి్చతంగా స్టేషన్ హౌస్ అధికారిగానీ లేదా ఆఫీసర్ ఇన్చార్జ్ ఆ పోలీస్ స్టేషన్‌కు బాధ్యుడిగా ఉండాలి. మరి సిట్‌ను పోలీస్ స్టేషన్‌గా ప్రకటించిన ప్రభుత్వం అక్కడ ఇన్చార్జ్ ఎవరన్నది పేర్కొన లేదు. అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా సిట్‌ను ఏర్పాటు చేసినట్టేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటైన సిట్ ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందన్నది కూడా ప్రభుత్వం వెల్లడించ లేదు. ఫలితంగా బాధితులెవరైనా సిట్‌పై ఫిర్యాదు ఎవరికి చేయాలన్నది స్పష్టత లేదు. తద్వారా పోలీస్ స్టేషన్‌కు ఉండాల్సిన అర్హతలు ఏవీ సిట్‌కు లేవని తేల్చి చెబుతున్నారు. అబద్ధపు వాంగ్మూలాలుసిట్ అధికారులు ఈ కేసులో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతరులను వేధిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తూ బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేయిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. అసలు అభియోగాలు ఏమిటన్నది చెప్పకుండానే వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయిస్తుండటమే ఇందుకు నిదర్శనం. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 2(క్యూ) ‘చేయకూడని పని ఏదైనా చేసినా, చేయాల్సిన పని చేయకుండా ఉన్నా అది నేరం’ అని నిర్వచించింది. అటువంటి నేరం చట్ట ప్రకారం శిక్షార్హం అని కూడా పేర్కొంది. మద్యం విధానంపై నమోదు చేసిన కేసులో పలువురు అధికారులు, ఇతరులను దర్యాప్తు పేరిట వేధిస్తున్న సిట్.. అసలు నేరం ఏమిటన్నది చెప్పకపోవడం గమనార్హం. ఎందుకంటే చేయకూడని పని చేసినా, చేయాల్సిన పని చేయకపోయినా ఆ ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యులు అవుతారు. బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం.. ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రభుత్వ అధికారి సంబంధిత బాధ్యులకు తెలియజేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఏ పౌరుడైనా సరే తనకు ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకుగానీ, ఇతర దర్యాప్తు సంస్థల అధికారులకుగానీ తెలియజేయాలని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 33 పేర్కొంటోంది. మరి ప్రభుత్వ అధికారులకు మరింత బాధ్యత ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కక్ష సాధింపు కోసమే బరితెగింపు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ పోలీస్ స్టేషన్‌కు ఓ స్థానిక ప్రాంతాన్ని గుర్తిస్తే.. సిట్ కార్యకలాపాలు అక్కడి నుంచే నిర్వహించాలి. సాక్షులు, నిందితులను ఎక్కడ అదుపులోకి తీసుకున్నా సరే ఆ పోలీస్‌స్టేషన్‌గా గుర్తించిన ఆ ప్రదేశానికి తీసుకెళ్లి విచారించాలి. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసు నమోదు చేసింది కాబట్టి ప్రభుత్వ అధికారులు, పూర్వ అధికారులు, ఇతర సాక్షులుగా భావిస్తున్న వారిని దర్యాప్తు పేరుతో ఓ పరిధికి మించి వేధించడం సాధ్యం కాదు. అక్రమంగా నిర్బంధిస్తే బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా సిట్‌ను పోలీస్ స్టేషన్‌గా గుర్తించింది. తద్వారా సిట్‌ను ఓ అరాచక శక్తుల అడ్డాగా, ప్రభుత్వ అధికారిక వేధింపులకు కేంద్రంగా, పోలీసు దాదాగిరీ డెన్‌గా తీర్చిదిద్దింది. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్ అధికారులు దాంతో విచ్చలవిడిగా చెలరేగి పోతున్నారు. దర్యాప్తు పేరిట ఇప్పటికే పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పూర్వ అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులు, ఇతరులను దర్యాప్తు పేరిట తీవ్రంగా వేధించారు. వారిని గుర్తు తెలియని ప్రదేశాల్లో అక్రమంగా నిర్బంధించి శారీరకంగా మానసికంగా హింసించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరించారు. లేకపోతే వారిపైనా, వారి కుటుంబ సభ్యులపైనా అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తామని బెంబేలెత్తించారు. -
డాక్టర్ నుంచి డేటా సైన్స్ వైపు
సాక్షి, ఎడ్యుకేషన్: ‘ఎంబీబీఎస్ పూర్తయ్యాక నచ్చిన స్పెషలైజేషన్‌లో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదవడం. ఆ వృత్తిలో కొనసాగడం.. సాధారణంగా.. ఎంబీబీఎస్ విద్యార్థుల ప్రణాళిక ఇదే. కానీ.. మారుతున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా హెల్త్‌కేర్ సెక్టార్లో కీలకంగా నిలుస్తుందని.. ఇందులో నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. ఎంబీబీఎస్, ఏఐ నైపుణ్యాల కలయికతో మరింత ఉన్నతంగా ఎదగొచ్చని భావించా.అందుకే ఎంబీబీఎస్ తర్వాత బీఎస్ డేటా సైన్స్‌లో చేరాను. ఏఐలో ఎంటెక్ చేయడం, హెల్త్‌కేర్‌లో ఏఐపై రీసెర్చ్ చేయడమే లక్ష్యం..’అంటున్నారు.. గేట్–2025లో డేటా సైన్స్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్లో 96.33 మార్కులతో.. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన..ఏపీలోని నెల్లూరు జిల్లా ఆమంచర్లకు చెందిన సాదినేని నిఖిల్ చౌదరి. పదో తరగతి నుంచి తాజాగా గేట్ ర్యాంకు వరకు అన్నిటా ముందు నిలిచిన నిఖిల్ చౌదరి.. ప్రస్తుతం ఎక్స్‌పర్ట్‌డాక్స్ అనే హెల్త్‌కేర్ ఏఐ సంస్థలో ఇన్ఫర్మాటిక్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక.. 2017లో ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, నీట్–యూజీ రెండింటికీ హాజరయ్యా. ఎయిమ్స్ ఎంట్రన్స్‌లో 22వ ర్యాంకు, నీట్–యూజీలో 57వ ర్యాంకు వచ్చాయి. ఎయిమ్స్ వైపు మొగ్గుచూపి ఢిల్లీలో ఎంబీబీఎస్‌లో చేరా. చదువు పూర్తయ్యాక 2023లో ఆరు నెలల పాటు ఎయిమ్స్‌లోనే తాత్కాలిక ప్రాతిపదికన డాక్టర్‌గా విధులు నిర్వర్తించా.అప్పుడే బీఎస్ డేటా సైన్స్ ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే.. డేటా సైన్స్.. హెల్త్‌కేర్ సెక్టార్లో దాని ప్రాధాన్యంపై అవగాహన ఏర్పడింది. ఆ కోర్సు చదవాలని భావించా. ఐఐటీ– చెన్నైలో ఆన్లైన్ విధానంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) ఇన్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుని అందులో చేరా. 2021 నుంచి 2024 వరకు ఆన్లైన్లో ఈ కోర్సు చదివి సరిఫికెట్ సొంతం చేసుకున్నా. ఇప్పుడు ఇదే అర్హతతో గేట్లో డేటా సైన్స్ / ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్‌కు హాజరయ్యా. హెల్త్‌కేర్ రంగంలో కీలకంగా ఏఐ ప్రస్తుతం హెల్త్‌కేర్ రంగంలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో కీలకంగా నిలుస్తోంది. ఎంఆర్ఐ, కోడింగ్, మెడికల్ ఇమేజెస్ వంటి వాటిని కచ్చితత్వంతో విశ్లేషించడానికి ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ దోహదం చేస్తుంది. అంతేకాకుండా మెడికల్ కోడింగ్, బిల్లింగ్ వంటి ఇతర హెల్త్‌కేర్ సంబంధ వ్యవహారాల్లో కూడా ఏఐ టూల్స్ విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి.ఏఐలో ఎంటెక్.. తర్వాత రీసెర్చ్ గేట్లో వచ్చిన ర్యాంకుతో ఐఐటీలో ఎంటెక్ ఏఐ స్పెషలైజేషన్‌లో చేరతా. ఆ తర్వాత ఈ రంగానికే చెందిన సంస్థల్లో ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నా. భవిష్యత్తులో అవకాశం ఉంటే స్టార్టప్ నెలకొల్పడంపై దృష్టి సారిస్తా. కానీ హెల్త్‌కేర్ ఏఐలో రీసెర్చ్ చేయడమే నా మొదటి ప్రాధాన్యం.గేట్ అంటే భయపడక్కర్లేదు.. నేను ఉద్యోగం చేస్తూనే.. సిలబస్‌ను ఆసాంతం నిశితంగా పరిశీలించి బీటెక్ అకడమిక్స్‌పై పట్టు సాధిస్తే గేట్లో విజయం సులభమే. నేను బీఎస్ డేటా సైన్స్‌లో చదివిన అంశాలను సిలబస్‌తో బేరీజు వేసుకుంటూ చదివా. ప్రాక్టీస్ టెస్టులు, మోడల్ టెస్టులకు హాజరయ్యా. ప్రస్తుతం ఎక్స్‌పర్ట్‌డాక్స్ అనే సంస్థలో ఇన్ఫర్మాటిక్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నా.ఒకవైపు ఉద్యోగం చేస్తూనే గేట్‌కు ప్రిపరేషన్ సాగించా. ప్రతీరోజు 3 నుంచి 4 గంటలు.. సెలవు రోజుల్లో ఏడెనిమిది గంటలు కేటాయించా. కొన్ని ఆన్లైన్ క్లాస్‌లకు కూడా హాజరయ్యా. ఇందులో ముఖ్యమైన అంశం టైమ్ మేనేజ్మెంట్. పరీక్ష రోజు మనకు అందుబాటులో ఉండే సమయాన్ని గుర్తుంచుకుని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ దశ నుంచే ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది.నిఖిల్ అన్నింటిలోనూ టాపరే..⇒ పదో తరగతి: 9.8 జీపీఏ⇒ ఇంటర్మిడియెట్: 986 మార్కులు ⇒ ఎయిమ్స్ ఎంట్రన్స్ – 2017, ర్యాంకు: 22 ⇒ నీట్ – 2017 ర్యాంకు: 57 ⇒ 2017–2023: ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ ⇒ 2024: బీఎస్ డేటా సైన్స్ (ఐఐటీ – చెన్నై) 9.95 జీపీఏ ⇒ గేట్–2025లో డేటా సైన్స్, ఏఐ పేపర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ -
సాగుకు ‘నీటి’ గండం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: నిర్దేశించుకున్న విస్తీర్ణం కంటే దాదాపు పది లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గింది..! దీనిప్రకారం ఉన్న పంటలకు తగినంతగా నీరందాలి..! కానీ, వంతుల వారీ నీరందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం కావడం రైతుల పాలిట శాపంగా మారింది. రబీలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సాగునీటి కోసం వారు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. దీంతో విసుగుచెంది నిరసన బాట పట్టారు. రెండో పంటకు నీరివ్వడంలోనే కాదు.. విడుదల, నిర్వహణలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడుతున్నారు. కళ్లెదుటే ఎండిపోతున్న పంట చేలను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. వరి దుబ్బులను చూపిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బైక్‌లపై పంట చేలల్లో తిరుగుతూ గోడు వినండి మహాప్రభో అంటూ గగ్గోలు పెడుతున్నారు. పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తుండడం అన్నదాతలను కుంగదీస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 46 లక్షల ఎకరాల్లోనే సాగు ప్రభుత్వం రబీలో 57.66 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించింది. మార్చి 19 నాటికి 55 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా.. 46 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. 19.87 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, 16.50 లక్షల ఎకరాల్లోనే సాగైంది. మొత్తమ్మీద నిర్దేశిత లక్ష్యం కంటే దాదాపు పది లక్షల ఎకరాలు తక్కువ. మరోపక్క రెండో పంటకు సరిపడా నీరిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. పరిస్థితి చూస్తే శివారు ప్రాంతాలకు చేరలేనేలేదు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోనే కాక హంద్రీనీవా, వంశధార నదుల కింద కూడా రైతులు పాట్లు పడుతున్నారు. దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది. –నవంబరు, డిసెంబరులో మైనస్ 2.3 మిల్లీ మీటర్ల వర్షపాతం, జనవరి, ఫిబ్రవరిలో 79.2 మిల్లీమీటర్లు, మార్చిలో ఇప్పటివరకు 98.3 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లాలనే కన్నీరు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇందులో 95 శాతం పంట గోదావరి కాలువల కిందనే. 5వేలకు పైగా ఎకరాల్లోని పంటలు ఎండిపోతున్నాయి. రబీకి నీటి సరఫరా విషయంలో తొలి నుంచి అధికారులు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఖరీఫ్ వర్షాలతో చేలల్లో ముంపు దిగక రబీ నారుమడులు ఆలస్యమయ్యాయి. తూర్పు, మధ్య డెల్టాలోని కాలువలకు నీరు విడుదల చేస్తున్నామని చెబుతున్నప్పటికీ శివారుకు చేరడం లేదు. –అమలాపురం మండలం వన్నెచింతలపూడి, ఎ.వేమవరం, ఎ.వేమరప్పాడు, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి పర్రభూమి ప్రాంతం, కూనవరం, ముక్తేశ్వరం పంట కాలువ కింద లొల్ల, వాడపల్లి, ఆత్రేయపురం, అంబాజీపేట మండలం కె.పెదపూడి, మామిడికుదురు మండలం నిడిమిలంక గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. బొబ్బర్లంక–పల్లంకుర్రు ప్రధాన పంట కాలువ ద్వారా కుండలేశ్వరం వైరులాకు దిగువ, ఎగువ ప్రాంతాలకు వంతుల వారీగా ఇస్తున్నా శివారు ఆయకట్టు బీటలు వారింది. కె.గంగవరంలో యండగండి, కూళ్ల, కోటిపల్లి, యర్రపోతవరం పరిధిలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తాళు తప్పలు అధికంగా వస్తాయని రైతులు వాపోతున్నారు. అదనపు భారం అయినప్పటికీ ఆయిల్ ఇంజన్లతో నీటిని తోడుతూ పొట్ట దశలోని వరి పంటను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామంలో సాగునీటి కోసం గురువారం రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు చేలల్లోనే వినూత్న నిరసనలు అయినాపురం–కూనవరం పంట కాలువ శివారు కూనవరం పరిధి గరువుపేట రైతులు పంట చేలో ద్విచక్ర వాహనాలు నడిపి నిరసన తెలిపారు. ఈనే దశలో ఉన్న సుమారు 350 ఎకరాల్లోని పంట దెబ్బతింటోందని వాపోయారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు శివారు దాసరివారిపేటలో ఎండిన చేలలో ఓ రైతు మోటారు సైకిల్ నడిపాడు. ఆత్మహత్యలే శరణ్యం.. తాళ్లరేవు మండల పరిధి పి.మల్లవరం శివారు రాంజీనగర్, మూలపొలం, గ్రాంటు తదితర గ్రామాల్లో 600 ఎకరాలకు సాగు నీరు పూర్తిగా అందడం లేదు. దీంతో ఆత్మహత్యలే శరణ్యమంటూ వరిదుబ్బులు, పురుగు మందు డబ్బాలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాట్రేనికోన మండలం రామాలయంపేట, గొల్లగరువు, లైనుపేట 150 ఎకరాలు, ఐ.పోలవరం మండలం కేశనకుర్రు, చాకిరేవు చెరువు, తిల్లకుప్ప, మొల్లి చెరువు, జి.మూలపొలం తదితర ప్రాంతాల్లో 300 ఎకరాలు బీడువారుతున్నాయి. పి.మల్లవరం పంచాయతీ మూలపొలం, రాంజీనగర్, గ్రాంటు గ్రామాల్లో వరిచేలకు సాగునీరు అందక బీటలు వారాయి. జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ఎండిపోయిన వరి పంటను ప్రదర్శిస్తూ పెద్దఎత్తున ఆందోళన చేశారు. –కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు ఆయకట్టు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. బి.ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం తదితర గ్రామాల్లో చేలు బీటలు వారాయి. తాళ్లరేవు కరప, గొల్లప్రోలు, శంకవరం మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టు ఎండిపోయింది. వట్టిపోయిన కేసీ కెనాల్.. శ్రీశైలం నిండింది..రెండో పంటకు దండిగా నీరు అందుతుందని రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ కేసీ కాల్వ ఒట్టిపోయింది. ఫిబ్రవరి తొలి వారం నుంచి చేలకు నీరు చేరడం లేదు. కేసీ కెనాల్ రైతుల అగచాట్లు మామూలుగా లేవు. గొప్పాడు మండలం యాళ్లూరు వద్ద ముచ్చుమర్రి పంపుల ద్వారా 675 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నట్టు చెబుతున్నా చివరి ఆయకట్టుకు చేరడమే లేదు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్లో 18 వేల ఎకరాల్లో వరి, కంది, మొక్కజొన్న సాగవుతున్నాయి. కోత దశలో ఉన్న మొక్కజొన్నకు కనీసం రెండు తడులు అందించాలి. నీరివ్వకుంటే రూ.లక్షల్లో నష్టపోతామని రైతులు వాపోతున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కింద నీరు బంద్ కావడంతో కర్నూలు జిల్లా దేవనకొండ మండలం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కాల్వ కింద 42 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇవన్నీ కోత దశకు రాగా.. తడులందక రైతులు పాట్లు పడుతున్నారు. సాగర్ కిందా ఇదే దుస్థితి.. ఉమ్మడి గుంటూరు జిల్లాకు 9 రోజులు, ఉమ్మడి ప్రకాశంకు 6 రోజులు నీటిని విడుదల చేస్తున్నా చివరి ఆయకట్టుకు అందడం లేదు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు బ్రాంచి కెనాల్, మల్లాయపాలెం, కాకుమాను మేజర్ కాల్వ ద్వారా ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లోని శివారు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ప్రాంతంలో రబీలో 36 వేల ఎకరాల్లో మిర్చి, పొగాకు, మినప, శనగ, మొక్కజొన్న వేయగా, ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్నకు నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం సాగర్ జలాలను విడుదల చేయకపోవడం, చేసినా చివరి భూములకు నీరు చేరక పంటలు బెట్టకు వస్తున్నాయి. వ్యయ ప్రయాసల కోర్చి చెరువులు, కుంటల్లోని నీటితో ఆయిల్ ఇంజిన్ల ద్వారా పొలాలను తడుపుతున్నారు. మురుగు కాలువల్లో నీటిని తోడి పంటలను కాపాడుకోవల్సిన దుస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. –శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బన్నువాడ గ్రామంలో రైతులు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకొని తడులు అందిస్తున్నారు. వంశధార జలాశయం కింద నీరందని కొందరు పంటలపై ఆశలు వదులుకుంటున్నారు. –కృష్ణా డెల్టాలోని ఏలూరు జిల్లా పెడపాడు, దెందులూరు మండలాల్లో 48 వేల ఎకరాలను ఖాళీగా వదిలేశారు. దెందులూరుతో పాటు బీమడోలు మండల పరిధి పలు గ్రామాల్లో ప్రస్తుతం పొట్ట, ఈనిక దశలో ఉన్న వరి పంటకు నీరందని పరిస్థితి ఉంది. సుమారు 7 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆత్మహత్యలే శరణ్యం ఈ ఏడాది సూపర్–10 రకానికి సంబంధించి పది ఎకరాల మిరప సాగు చేశా. రూ.లక్ష దాక పెట్టుబడి అయింది. మరో రెండు విడతల కోతలు రావాల్సి ఉంది. మార్చి మొదటి వారం నుంచే పొన్నాపురం సబ్ చానల్‌కు నీటి విడుదల ఆపేశారు. భూములు తడులు లేక పగుళ్లిచ్చాయి. కేసీ కెనాల్ అధికారులను వేడుకుంటున్నా సాగు నీటి విడుదలకు ప్రయోజనం లేకపోయింది. దిగుబడులు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం. –చిన్న తిరుపతిరెడ్డి, మిటా్నల, నంద్యాల జిల్లా అధికారులు కన్నెత్తి చూడడం లేదు మాది ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం. మూడెకరాలు కౌలుకు చేస్తున్న. దాళ్వాలో వరి వేశా. నీటికి ఢోకా లేదన్నారు. తీరా ఇప్పుడు చూస్తే చాలా ఇబ్బంది పడుతున్నా. మా గ్రామం వైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేసేది? –వల్లూరి నాగేశ్వరరావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలుషిత నీటిని తోడుకుంటున్నాంవరి చేలు బీటలు వారాయి. టేకి డ్రైన్లో నీటిని మోటార్లతో తోడుతున్నారు. అది ఉప్పగా ఉండడంతో పాటు కలుషితం కావడంతో పంట దిగుబడిపై ప్రభావం పడుతోంది. గతంలో మాదిరిగా తాతపూడి పంపింగ్ స్కీం ద్వారా నీరు సరఫరా చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. –దడాల బుజ్జిబాబు, పోలేకుర్రు, తాళ్లరేవు మండలం, కాకినాడ జిల్లా ఏం చేయాలో పాలుపోవడం లేదు4.5 ఎకరాల్లో మెనుగు పెసర వేశారు. నీరు లేక ఎండల తీవ్రతతో పంట ఎండిపోతోంది. 12 ఎకరాల్లోని జీడి పంటకూ నీరు పెట్టే పరిస్థితి లేదు. ఎండల తీవ్రతకు పువ్వు మాడిపోయింది. కనీస దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏం చేయాలో పాలుపోవడంలేదు. –కనపల శేఖర రావు, పాతయ్యవలస, శ్రీకాకుళం జిల్లా ఎండిపోతున్న మిర్చి పంట పల్నాడు జిల్లాలో వారబందీ అమలులో ఉన్నప్పటికీ నీరందక మిర్చి పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొంపిచర్ల మండలం వీరవట్నం పరిసర గ్రామాల రైతులు సాగునీటి కోసం గురువారం ఆందోళన బాట పట్టారు. నాగార్జున సాగర్ సంతగుడిపాడు ఇరిగేషన్ సర్కిల్ డీఈ ఎస్.విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్‌లో ఉన్నప్పుడు కూడా సాగుకు సరిపడా నీరు విడుదల చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి కన్పించడం లేదని రైతుసంఘాల నేతలు ఆరోపించారు. రైతులు ఏయే పంటలు సాగు చేశారు, ఎన్ని రోజులు పాటు ఎంతమేర నీటి అవసరాలు ఉన్నాయనే వివరాలు అధికారుల దగ్గర లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. మిర్చి, మొక్కజొన్న, వరి, ఇతర కూరగాయ పంటలు దెబ్బతినకుండా ఏప్రిల్ 20 వరకు సాగు నీరు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున సాగర్ కింద ఆయకట్టు రైతులతో కలిసి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. సాగు నీరు అడిగితే పోలీస్ స్టేషన్లో పెట్టారు రాస్తారోకో చేస్తున్న వీరంతా పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామానికి చెందిన సన్న, చిన్నకారు రైతులు. నీళ్లున్నాయన్న ఆశతో రెండో పంటగా చింతపల్లి నాగార్జున సాగర్ కాల్వ కింద 400 ఎకరాల్లో వరి వేశారు. ప్రస్తుతం పొట్ట దశకు రాగా.. మార్చి తొలి వారం నుంచి నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒక్కో రైతు రూ.లక్ష వరకు నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. సాగు నీటి విడుదలలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం రాస్తారోకో చేశారు. దీంతో రైతులను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ‘‘నీళ్లు అడిగిన పాపానికి స్టేషన్‌కు తరలిస్తారా?’’ అంటూ రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వాటిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?.. పుత్తా శివశంకర్‌రెడ్డి సవాల్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులపై పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం, మరోసారి అదే పని చేసి, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. ఆ దిశలోనే మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో ఈ తొమ్మిది నెలల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 4 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందంటూ ప్రగల్భాలు పలికారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందులో అన్ని వివరాలు పొందుపర్చాలని పుత్తా శివశంకర్‌రెడ్డి కోరారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..శ్వేతపత్రం విడుదల చేస్తారా?:కూటమి ప్రభుత్వ ఈ 9 నెలల పాలనలో రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి నారా లోకేష్ ఆర్భాటంగా చెప్పారు. దాదాపు నెల రోజుల క్రితం, గత నెల 24న గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రంలో అప్పటి వరకు రూ. 6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని చెప్పుకున్నారు. నెల కూడా గడవక ముందే, రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు.ఈ వ్యవధిలోనే రూ.50 వేల కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి!. నిజానికి గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా రాష్ట్రంలో రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులపై మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీస్తే, సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఉద్యోగాలు కల్పించామని చెప్పలేదని, అన్ని ఉద్యోగాలకు అవకాశం ఉందని చెప్పామని, పచ్చి అబద్ధం చెప్పారు. ప్రభుత్వానికి నిజంగా ఈ విషయంపై చిత్తశుద్ధి ఉంటే, వారు చెబుతున్నట్లుగా రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులపై పూర్తి వివరాలతో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎక్కడెక్కడ, ఎంతెంత పెట్టుబడులతో ఏయే పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? వాటి ద్వారా ఎంత మందికి ఉపా«ధి లభించింది? అన్న పూర్తి వివరాలు ప్రకటించాలి.ఆ ధైర్యం మీకుందా?:గత మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే వాళ్లం. ఎందుకంటే అంత పారదర్శకంగా ఎక్కడా ఏ లోపం లేకుండా, అర్హతే ప్రామాణికంగా అన్నింటినీ అమలు చేశాం. ఇప్పుడు మీరు కూడా అలా, మీ పనులను, పథకాల అమలును.. ముఖ్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల వివరాలను ఆయా ప్రాంతాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించగలరా? ఆ ధైర్యం మీకుందా?. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి నెలకొంది. దాడులు, కమీషన్ల వేధింపులకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ. కూటమి ప్రభుత్వ వేధింపులతో జిందాల్ స్టీల్ ప్లాంట్ మహారాష్ట్రకు పారిపోయింది. మీడియాను అడ్డం పెట్టుకుని దావోస్ పర్యటనలో హడావుడి చేయడం తప్ప, మీరు సాధించిందేమీ లేదు. దావోస్ పర్యటనను పెయిడ్ హాలిడేగా వాడుకున్నారు.2018కి పూర్వమే ఆ యూనిట్:విజయవాడ సమీపంలోని ఏపీఐఐసీ కారిడార్‌లో 2018కి పూర్వమే అశోక్ లీలాండ్ యూనిట్ ప్రారంభం కాగా, ఆ తర్వాత కోవిడ్ కారణంగా డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి కూడా తగ్గింది. కానీ నిన్న (19వ తేదీ, బుధవారం) అక్కడ నారా లోకేష్ చేసిన అతి చూస్తే 2024లో తాము అధికారంలోకి వచ్చాకే, ఆ యూనిట్ ఏర్పాటైనంత బిల్డప్ ఇచ్చారు. ఆ యూనిట్‌కు తామే అనుమతి ఇచ్చినట్లు, దాన్ని తామే తెచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఎప్పుడో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లో ఇప్పుడు 600 ఉద్యోగాలు రాబోతున్నట్టు ప్రచారం చేసుకోవడం మరీ విడ్డూరం.లోకేష్.. మంత్రిగా మీరు అశోక్ లీలాండ్ బస్పు ఎక్కడం కాదు.. ఎన్నికల్లో సూపర్‌సిక్స్ హామీల్లో మీరిచ్చిన మహిళలకు ఉచిత బస్సు హామీని అమలు చేసి టికెట్లు లేకుండా వారిని బస్సుల్లో తిప్పండి. తన శాఖ తప్ప, అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్న మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు. గవర్నమెంట్ స్కూళ్లలో డ్రాపవుట్స్ పెరుగుతున్నా, విద్యాశాఖను సరిగ్గా నిర్వహించలేకపోతున్న లోకేష్, తనది కాని పరిశ్రమల శాఖలో వేలు పెట్టి హడావుడి చేశాడని పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. -
ఐపీఎస్ అభిషేక్ మహంతికి స్వల్ప ఊరట
సాక్షి,హైదరాబాద్: ఐపీఎస్ అభిషేక్ మహంతికి స్వల్ప ఊరట లభించింది. ఏపీకి వెళ్లాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సోమవారం వరకు నిలిపివేసింది. ఇదే అంశంపై కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది.విభజన సందర్భంగా కేటాయించిన రాష్ట్రం ఏపీలో చేరాలని మహంతికి కేంద్రం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐపీఎస్ అభిషేక్ మహంతి క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ కేంద్ర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ తిరుమలాదేవీ ధర్మాసనం విచారణ చేపట్టింది. గురువారం ఏపీలో చేర్చాల్చి ఉండటంతో.. సోమవారం వరకు కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసింది.