రాజమండ్రిలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు | Major Gambling Bust In Rajahmundry, Crores Seized In Police Raid, More Details Inside | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు

Mar 5 2026 9:16 PM | Updated on Mar 6 2026 11:32 AM

East Godavari: Poker Clubs In Rajahmundry

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి నగరం పేకాట అడ్డాగా మారుతోంది.  కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక రాజమండ్రిలో పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా పెరిగిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. రాజమండ్రి క్వారీ ఏరియాలో టీడీపీ నేత.. పేకాట క్లబ్బులను భారీగా నిర్వహిస్తుండగా.. స్పెషల్ పార్టీ పోలీసుల దాడుల్లో కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి.

జూదంలో పాల్గొన్న 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సంఘటన స్థలంలో కోట్ల రూపాయలు దొరికితే అధికారికంగా వేల రూపాయలు మాత్రమే చూపించే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజకీయ నేతలు, పోలీసుల సహకారంతో రాజమండ్రిలో  పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. పట్టుబడిన డబ్బు గోల్‌మాల్‌ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement