breaking news
rajahmundry
-
పోలీసులకు దండం పెట్టి అడుగుతున్న దయచేసి.. ప్రియాంక తండ్రి ఆవేదన
-
రాజమండ్రి: బీరు సీసాలతో యువకులపై మహిళల దాడి
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులపై మహిళల దాడి చేశారు. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై బీరు సీసాలతో దాడి చేయడంతో ఒకసారిగా కలకలం రేగింది.సోమాలమ్మగుడి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అర్థరాత్రి చనిపోతే యువకులు విజయ్, దుర్గాప్రసాద్ చూసేందుకు వెళ్లారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో యువకులు ఆలయం వద్దకు చేరుకున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న తుమ్మలోవకు చెందిన ముగ్గురు మహిళలు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: ఖైదీతో మహిళా ఎస్ఐ అర్దనగ్నంగా వీడియో కాల్..! -
తల వంచని తార
మంచి నటి... తొలి చిత్రం ‘షావుకారు’తోనే ఆ విషయాన్ని నిరూపించుకున్నారు జానకి. ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. మంచి వ్యక్తిత్వం... వ్యక్తిగా జానకి మీద చాలామందికి ఉన్న అభి్రపాయం ఇది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తల వంచలేదు... తనని తాను తగ్గించుకోలేదు. వెండితెరపై నటిగా ఆమె షావుకారు... తెరవెనక నిజజీవితంలో తొలి దశలో పేదరికాన్ని అనుభవించినా నిఖార్సయిన వ్యక్తిగా ఉన్న జానకి వ్యక్తిత్వపరంగానూ షావుకారే! తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి, నటనకు నిలువెత్తు నిదర్శనంగా పేరు తెచ్చుకోవడంతో పాటు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ‘షావుకారు’ ఇక లేరు.‘షావుకారు’ జానకి అసలు పేరు శంకరమంచి జానకి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1931 డిసెంబరు 11న శచీదేవి, టేకుమళ్ల వెంకోజీరావు దంపతులకు మూడో సంతానంగా జన్మించారు జానకి. ఆమెకు అన్నయ్య, అక్కయ్యతో పాటు చెల్లి కృష్ణకుమారి తోబుట్టువులు. జానకిది సంప్రదాయ కుటుంబం కావడంతో అమ్మ నుంచి ఆచారాలు, శుచీశుభ్రత అలవడ్డాయి. రాజమండ్రి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు జానకి. అయితే తండ్రి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు మారుతూ ఉండటం వల్ల ఆమె చదువు సరిగ్గా సాగలేదు. చెన్నై వెళ్లిన తర్వాత ఆంధ్ర మహిళా సభలో జానకిని మెట్రిక్‌లో చేర్పించారు. చిన్నతనంలోనే స్పష్టమైన ఉచ్చారణ, అద్భుతమైన వాక్చాతుర్యంతో ఆకాశవాణి నాటికల ద్వారా కళారంగంలో అడుగుపెట్టారామె. ఓ సారి చెన్నైలో ఆకాశవాణిలో ‘బాలానందం’ అనే ప్రోగ్రామ్‌లో జానకి గాత్రం ప్రముఖ దర్శక–నిర్మాత బి. నాగిరెడ్డికి నచ్చింది. దీంతో ‘నీ గాత్రం బాగుంది. పదాలను చక్కగా ఉచ్చరిస్తున్నావు. సినిమాలో చాన్స్ ఇస్తాను.. నటిస్తావా’ అన్నారట. అసలు నటనంటే ఏంటో తెలియకపోయినప్పటికీ ‘నటిస్తాను’ అని చెప్పేసి ఇంటికొచ్చిన జానకి.. జరిగిన విషయాన్నంతా తల్లిదండ్రులకు చెప్పారు. అయితే జానకిని మందలించి, శంకరమంచి శ్రీనివాసరావుతో వివాహం చేశారు తల్లిదండ్రులు. ఓవర్ కోట్ కప్పుకుని పరీక్షకు వెళ్లి... పెళ్లయినప్పుడు జానకి వయస్సు 15 ఏళ్లు. భర్తతో కలిసి విజయవాడలో కొత్త కాపురం ఆరంభించారామె. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల అస్సాంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు జానకి. అప్పట్లో జానకి చెల్లి కృష్ణకుమారి చదువుకుంటోంది. తనని చదివిస్తూ, తాను కూడా చదువుకుంటూ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటికీ ఓవర్ కోట్ కప్పుకుని పరీక్ష రాశారు జానకి. పెళ్లి తర్వాత ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండటం సరి కాదని చెన్నైలోని మేనమామ ఇంటికెళ్లారు. అక్కడే యజ్ఞ ప్రభకి జన్మనిచ్చారు. ఆ సమయంలో బి. నాగిరెడ్డి గతంలో తనకు ఇస్తానన్న సినిమా చాన్స్ గురించి భర్తకు చెప్పి, నటించటానికి ఒప్పించారు. చంకలో పాపాయితో ఆడిషన్స్‌కి... అవకాశం కోసం చంకలో పాపాయి, భర్తతో కలిసి బి. నాగిరెడ్డిని కలిశారు జానకి. పలు ఆడిషన్స్ తర్వాత ‘షావుకారు’ సినిమాలో హీరోయిన్గా తొలి అవకాశం వచ్చింది. మూడు నెలలు ఉన్న యజ్ఞ ప్రభని ఇంట్లో వదిలి ‘షావుకారు’లో నటించారు. ఆ సమయంలో ఓ తల్లిగా ఎంతో మానసిక వేదన అనుభవించారట ఆమె. ఆ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా నటించారామె. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో బి. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ‘షావుకారు’ సినిమా 1950 ఏప్రిల్ 7న విడుదలై మంచి విజయం అందుకుంది. తొలి చిత్రంతోనే అసాధారణమైన అభినయాన్ని కనబరిచి, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని ‘షావుకారు జానకి’గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఐదువందల సినిమాల్లో... ‘షావుకారు’ మూవీ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 500 సినిమాల్లో నటించి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారామె. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు జీవం పోసిన జానకి దక్షిణాది సినిమా చరిత్రలో చెరగని అధ్యాయంగా మిగిలిపోయారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి అగ్ర కథానాయకుల సరసన సుమారు రెండు వందలకు పైగా సినిమాల్లో ఆమె కథానాయికగా నటించడం విశేషం. ‘రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, అక్కాచెల్లెలు, బడిపంతులు, సంసారం ఒక చదరంగం, మంచి మనసులు’ వంటి పలు సినిమాలు జానకి నటనా పటిమకు నిదర్శనాలు. బుల్లితెర పైనా... ‘షావుకారు’ జానకి కేవలం వెండితెరపైనే కాదు... సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. తెలుగులో ‘నీడ, వరూధిని పరిణయం’, తమిళంలో ‘ఊరరింద రహస్యం, పెన్, అక్షయ’ వంటి సీరియల్స్‌లో నటించారు జానకి. వయసు మీద పడుతున్నప్పటికీ నటనపై ఉన్న మక్కువతో విశ్రాంతి తీసుకోకుండా ‘బిస్కోత్’ (తమిళం), ‘అన్నీ మంచి శకునములే’ (తెలుగు) వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారామె. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం ‘అన్నీ మంచి శకునములే’(2023).పద్మశ్రీ జానకిషావుకారు జానకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2022లో భారత ప్రభుత్వం ఆమెకు దేశంలోని అత్యున్నత ΄ûర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు నంది అవార్డులు అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు అవార్డులు అందుకున్నారు. పలు సంస్థలు ఆమెను జీవిత సాఫల్య పురస్కారాలతో గౌరవించాయి. అస్సాంలోని గౌహతి యూనివర్సిటీలో మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్న జానకి కళారంగంతో పాటు సామాజిక సేవకు గాను యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా నుంచి డాక్టరేట్ పొందారు. షావుకారు జానకి మృతితో భారతీయ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు నటీనటులు సంతాపం తెలిపారు.ఇంట్లోకి రానివ్వని బంధువులు సినిమాల్లో వేషాలు వేయడానికి వెళ్లడం... హీరోయిన్గా హీరోలతో తాళి కట్టించుకునే సన్నివేశాలు, డ్యాన్స్ చేయడం.. వీటి వల్ల బంధువులు జానకిని ఇంట్లోకి రానిచ్చేవారు కాదట. ఒకసారి ఇల్లు వెతుక్కునే క్రమంలో చుట్టాల ఇంట్లో నిద్రపోదామని వెళ్తే.. ‘వద్దమ్మా! అంకుల్ ఏదైనా అంటారు. రావద్దు’ అని మొహం మీదే చెప్పారట. కుటుంబంలో ఎవ్వరూ ప్రోత్సహించనప్పటికీ వృత్తి పట్ల అంకితభావంతో పని చేశారు. మూడు ప్రసవాలు జరిగినా కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా సంవత్సరానికి 20 సినిమాలు చేయడం విశేషం. ‘నటిగా నువ్వు పనికి రావు’ అన్న కె. వి. రెడ్డితో ‘పనికి వస్తావు’ అనిపించుకునే స్థాయికి ఎదిగానని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. నలుగురు ముఖ్యమంత్రులతో... భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ నటికీ దక్కని అరుదైన గౌరవం ‘షావుకారు’ జానకికి దక్కింది. దక్షిణాది రాజకీయాల్లో, సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తులుగా వెలిగిన నలుగురు దిగ్గజ ముఖ్యమంత్రులతో ఆమె వెండితెరను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎం.జి. రామచంద్రన్, జయలలిత, ఎం. కరుణానిధి... ఇలా నలుగురు సీఎంలతో కలిసి నటించారామె. వ్యక్తిత్వంలోనూ షావుకారే... కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే అలవాటు ఉన్న జానకి దానివల్ల కొన్ని అవకాశాలు కోల్పోయారు. ఈ విషయం గురించి ఓ సందర్భంలో ఆమె చెప్పారు. ‘‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికీ నచ్చదు. కెరీర్ మొదట్లో నాకు నచ్చిన పాత్ర మాత్రమే ఎంచుకునేదాన్ని. పాత్రలో పూర్తిగా లీనమవ్వగలనన్న నమ్మకం ఉన్నప్పుడే అంగీకరించేదాన్ని. కొందరు నాకు పొగరు అన్నారు... కొందరు జానకితో సినిమా కష్టం అనేవారు... నేను మాత్రం అలా ఉండడమే నా వ్యక్తిత్వం అంటాను. అలా ఉండడం వల్ల చాలా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది. అయినా నేను మాత్రం నా వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. కుటుంబం విషయంలోనూ ఇలానే ఉండేదాన్ని... మా అబ్బాయి 19 ఏళ్ల వయసులో చదువు కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు. తిరిగి రాలేదు. అది అతని వ్యక్తిత్వం... అతని నిర్ణయం. ఇక తల్లిదండ్రులు బతికుండగా పిల్లలకు ఆస్తులు పంచకూడదు. ఏ బంధం శాశ్వతం కాదు. ఓసారి ఆరోగ్యం బాలేనప్పుడు పుట్టింటికి వెళ్లా. అప్పుడు వాళ్లకి నేను భారమని నాకు అనిపించింది. పెళ్లయిన తర్వాత ఏ ఆడపిల్లా పుట్టింటికి వెళ్లకూడదనిపించింది. నా భర్తతో విడాకులు తీసుకున్నాక రెండో పెళ్లి చేసుకోవాలనిపించినా పిల్లల కోసం వద్దనుకున్నాను. గొప్పింట్లో పుట్టినా ఆస్తులన్నీ పోయాయి. పేదరికం వల్లే నేను, నా చెల్లి కృష్ణకుమారి సినిమాల్లోకి వచ్చాం. సంపాదించాం. కుటుంబాలను చూసుకున్నాం’’ అని పేర్కొన్నారామె.ఒంటిపూట భోజనం వెండితెరపై రాణించిన జానకి వ్యక్తిగత జీవితం మాత్రం అంత సజావుగా సాగలేదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను కష్టపడి సంపాదిస్తే, తన భర్త విలాసాల కోసం ఖర్చు చేసేవారని, కొంత కాలానికి ఆస్తులన్నీ కరిగిపోయాయని ఆమె ఆ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నమ్మక ద్రోహానికి కూడా గురయ్యానని బాధపడ్డారామె. ఒక దశలో పిల్లల పెంపకం కూడా కష్టమౌతుందని భావించారామె. అందుకే రోజులో ఒక్క పూట మాత్రమే భోజనం చేశానని ఆమె పేర్కొన్నారు.నో బీపీ... షుగర్‘‘షూటింగ్స్ లేనప్పుడు ఇంటి పనులే నాకు పెద్ద వ్యాయామం’’ అని చెప్పేవారు జానకి. అలాగే తన ఆహారపు అలవాట్ల గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘‘నాకు వంట చేయడం బాగా అలవాటు. స్వీట్స్‌లో అరిసెలంటే ఇష్టం. అయితే అవి తిన్నప్పుడు మిగిలినవి కట్ చేస్తాను. వెన్న, నెయ్యి, పాలు వంటి వాటిని పరిమితంగా తీసుకుంటాను. ఆరోగ్యకరమైన భోజనం రోజుకి ఒక్కసారైనా చాలు. ఆకలి లేకపోతే పండు తిని మంచినీళ్లు తాగి పడుకుంటాను. ఈ అలవాట్ల వల్ల నాకు బీపీ, షుగర్లు లేవు. అయితే రెండు మోకాళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నాను. గుండె ఆపరేషన్ అయినా పని చేస్తూనే ఉన్నాను. నాకు దేవుడిపై భక్తి ఉంది. కానీ మూఢనమ్మకాలు లేవు. మంచి ఆలోచనలతో ఉంటే దేవుడు ఇక్కడే ఉన్నాడని నమ్ముతాను’’ అని చెప్పుకొచ్చారు షావుకారు జానకి. -
జగన్ హామీ ఇచ్చారు.. అమ్మా ప్రియాంక ఎక్కడున్నావ్ అమ్మ.. ఏడ్చేసిన మెడికో ప్రియాంక తల్లిదండ్రులు
-
నేడు రాజమండ్రి రూరల్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇందులో రాజమండ్రి రూరల్‌కు చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. -
బ్రిడ్జిపై కారు వదిలి.. సూసైడ్ నోట్ లో షాకింగ్ విషయాలు
-
గోదావరిలో దూకిన AE కుటుంబం.. అసలేం జరిగింది?
-
20 లక్షలిస్తే.. నా కూతురు తిరిగివస్తుందా..! మోసం చేసావ్ చంద్రబాబు..
-
నా కూతురిని చంపిన వాడికి సహాయం చేస్తే.. చంద్రబాబు గుర్తుపెట్టుకో.. ప్రియాంక తండ్రి స్ట్రాంగ్ వార్నింగ్
-
బడా బాబులైనా శిక్ష పడాల్సిందే...
‘‘ఒక్కరోజులో మా భవిష్యత్తు కళ్లెదుటనే కుప్పకూలిపోయింది. డాక్టరుగా పుట్టిన గడ్డకు ఎంతో సేవ చేయాలని తపించిన మా కూతురిని మాకు లేకుండా చేశారు. తప్పతాగి .. రోడ్ల మీదకు వచ్చి, ఇతరుల బిడ్డలను పొట్టన పెట్టుకోకండి..’’ అంటూ పుట్టెడు దుఃఖంతో వేడుకుంటున్నారు డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు వెంకటేష్, చంద్రమ్మ. రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రియాంక, మూడు రోజుల క్రితం మద్యం మత్తులో కారుతో ఉన్మాదులు ఆమె స్కూటర్‌ను ఢీకొట్టి, చేసిన వీరంగానికి బలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన కలకలం రేపింది. తెలంగాణలోని గద్వాల్ జిల్లా అయిజ మండంలోని ఎక్లాస్పురంలో పుట్టి పెరిగిన పెరిగింది ప్రియాంక. దోషులకు శిక్ష పడాలని, సమాజంలో మార్పు రావాలని, ప్రభుత్వాలు తమ బిడ్డకు న్యాయం చేయాలని వెంకటేశ్, చంద్రమ్మలు ‘సాక్షి’తో తమ ఆవేదనను పంచుకున్నారు..చదువులో టాపర్‌గా ఉండే ప్రియాంక మెడిసిన్‌లో ర్యాంకు తెచ్చుకొని ఫ్రీ సీట్ సంపాదించింది.. మరికొన్నాళ్లలో పీజీ పూర్తి చేసి, వైద్యరంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. ‘‘కానీ ఆ కలలను కొందరు దుర్మార్గులు గద్దల్లా ఎత్తుకుపోయారు. మా అమ్మాయి మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. ఎన్ని చేసినా మా అమ్మాయి తిరిగి రాదు. కానీ, వాళ్లను శిక్షిస్తేనే మా అమ్మాయికి న్యాయం జరుగుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. ఉన్న ఊరును వదిలి, అయినవారందకీ దూరంగా పిల్లల చదువుల కోసం శ్రమిస్తాం. ఎంతో కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్నాం. కానీ, కొందరు తమ తండ్రులకు, కుటుంబాలకు పలుకుబడి ఉందని, ఏం చేసినా చెల్లుతుందనే ఆలోచనల్లో ఉంటారు. తాగినవాళ్లు ఇంటిదగ్గర ఉండకుండా బయట పెద్ద పెద్ద కార్లు వేసుకొని షికార్లు చేస్తారు. డబ్బు, హోదా ఉందనే పొగరు, సంపన్నులకు శిక్షలు ఉండవనే ధైర్యం వారిది. రాజకీయ పలుకుబడి ఉందనే ధీమా వారిది. కొవ్వెక్కి చేసిన పనులకు తగిన శిక్ష పడాలి. ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు. దోషులను కఠినంగా శిక్షించి, ఉరి తీయందే మా కడుపు మంట చల్లారదు’ అని తెలిపారు చంద్రమ్మ.చట్టపరంగా శిక్షించాల్సిందే..! వెంకటేష్ మాట్లాడుతూ –‘‘దోషులకు మరణ శిక్ష పడాల్సిందే. ఇలాంటి శిక్షలు అమలు చేస్తేనే సమాజంలో భయం అనేది ఉంటుంది. అప్పుడే మాలాంటి తల్లిదండ్రుల కడుపుకోతలు, ఆర్తనాదాలు ఉండవు. ఇంకా ఎంతమందికి ఇలాంటివి జరుగుతాయో. దోషులకు సరైన శిక్ష పడకపోతే ‘మేం ఏం చేసినా చెల్లుతుంది’ అని తేలిక భావనతో ఉంటారు. ఇలాంటి పోకిరీగాళ్లు ‘మాకు ఏమవుతుందిలే, మా దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది’ అనుకుంటారు. చట్టపరంగా కఠినంగా శిక్షిస్తే భయం ఉంటుంది. ఇలాంటి దోషులకు మరణశిక్ష , యావజ్జీవ కారాగార శిక్ష పడితేనే సమాజంలో కూడా మార్పు వస్తుంది. శిక్షలు కరెక్ట్‌గా అమలు అవ్వాలి. రాజకీయ ఒత్తిడి లేకుండా చూస్తాం అని పోలీసులు చెప్పారు. ప్రజలు కూడా ఇలాంటి అన్యాయాలు జరగడం సరికాదని పదే పదే చెబుతున్నారు. కరెక్ట్‌గా శిక్షలు పడితే సరే, లేదంటే మా గొంతు, మా కడుపుకోత, మా బాధ రాజమండ్రి వేదికగా పోరాటం చేస్తాం. మాకు న్యాయం జరగకపోతే మా ప్రాణాలు పోయేంతవరకు పోరాడుతూనే ఉంటాం. మాలాంటి ఎంతోమంది తల్లిదండ్రల మద్దతుతో అందరి ముం దుకు వస్తాం’’ అన్నారు వెంకటేష్.తీరని లోటు...తల్లితండ్రులు ఇద్దరూ తమ కూతురు గురించి వివరిస్తూ –‘‘మా ప్రియాంక ఎవరినీ నొప్పించేది కాదు. అందరితో కలివిడిగా ఉండేది. తొందరపడి ఎవరినీ ఎమీ అనేది కాదు. ప్రాపర్‌గా పనులు జరగాలి. ఒక మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉండేది. మా ఊరు నుంచి కానీ, మా కుటుంబంలో కానీ ఎవరూ డాక్టర్లు లేరు. అలాంటిది ప్రియాంక డాక్టర్ అయి ఆ పేరు నేను నిలబెడతా అనేది. కర్నూలు మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. పీజీ సీటు కూడా మంచి ర్యాంకుతో తెచ్చుకుంది. ఎక్కడా ఒక్క రిమార్క్ లేదు. చదువు చక్కగా సాగుతున్న సమయంలో, మరో రెండేళ్లలో స్పెషలిస్ట్‌గా బయటకు వచ్చేది. ఇలాంటి సమయంలో ఇలాంటి దారుణం జరిగింది. మా జీవితాంతం తీరని లోటు మిగిలింది. మాకు ఏ మాత్రం అన్యాయం జరుగుతుందని తెలిసినా ఊరుకోం. మా ప్రాణాలను పణంగా పెట్టి అయినా మా బిడ్డకు ఆత్మ శాంతి కలిగిస్తాం’’ అని తమ ఆవేదనను, ఆవేశాన్ని మన ముందు ఉంచారు వెంకటేష్, చంద్రమ్మలు. ఏ మాత్రం సహించం..మా కమ్యూనిటీలోనే డాక్టర్లు ఎవరూ లేరు. అమ్మాయిలను చదివించడం అనేది ఇప్పటి వరకు మా దగ్గర ఏ కుటుంబంలోనూ 28 ఏళ్లుగా లేదు. ఇరవై ఏళ్లు రాగానే పెళ్లి చేసి, అత్తారింటికి పంపించేస్తారు. అలాంటిది ప్రియాంకకు చదువు మీద ఉన్న శ్రద్ధతో ఆమె కలకే ప్రాముఖ్యం ఇచ్చాం. తను మా ఊరుకు పెళ్లి చూపులకని వచ్చి, తిరిగి కాలేజీకి వెళ్లిపోయింది. ఇంకో ఆర్నెల్లలో పెళ్లి అవుతుందని, అమ్మాయి జీవితం బాగుంటుందని ఎన్నో కలలు కన్నాం. ఊరు నుంచి వెళ్లిన ఒక్కరోజులోనే.. ‘మీ అమ్మాయి ప్రియాంకకు యాక్సిడెంట్ అయ్యింది, తీవ్ర రక్త స్రావం అవుతోంది’ అని ఫోన్ వచ్చింది. ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పారు. ఇన్నాళ్లూ తను పడిన కష్టానికి తగిన ఫలితం రాకుండానే దుర్మార్గులు మాకు దూరం చేశారు. తనకు సరైన న్యాయం జరగకపోతే ఏ మాత్రం సహించం. – చంద్రమ్మ, ప్రియాంక తల్లి– నిర్మలారెడ్డి, ఇన్పుట్స్ వాగు గడ్డ నరసింహారెడ్డి, సాక్షి, గద్వాల్ -
కారుతో తొక్కేసి మెడికో ప్రియాంకను చంపి పరార్.. పూర్తి CCTV ఫుటేజ్?
-
మార్గాని భరత్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
రాజమండ్రి: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని మార్గాని భరత్ క్యాండిల్ ర్యాలీకి సిద్ధమయ్యారు. దీంతో భరత్ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.ఈ కేసులో నిందితులను కాపాడే అదృశ్యశక్తులు ఉన్నాయా అంటూ మార్గాని భరత్ మంగళవారం మీడియా సమావేశంలో నిలదీసిన విషయం తెలిసిందే. ప్రియాంక కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఆ ఘటన మూడో తేదీన జరిగితే, ఆరో తేదీన నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారని తెలిపారు. అంత ఆలస్యం ఎందుకు అయ్యిందని, ఆ సమయంలో నిందితులు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. వారిని ఎవరైనా దాచారా అని ప్రశ్నించారు. వారి వెనుక ఎవరు ఉన్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
యువతి మృతిని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తారా? కూటమి ప్రభుత్వంపై మార్గాని భరత్ ఫైర్
-
ప్రియాంక కేసు.. నిందితుల కాల్ డేటా ఏదీ?: మార్గాని భరత్
సాక్షి, రాజమహేంద్రవరం: మెడికో ప్రియాంక హత్య కేసులో నిందితులను కాపాడే అదృశ్య శక్తులు ఉన్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్. ఈ కేసులో నిజాలేమైనా దాచారా? అంటూ చంద్రబాబు సర్కార్‌పై ఆయన మండిపడ్డారు. సమాధానం చెప్పాలంటూ కూటమికి పది ప్రశ్నలు సంధించారు. డాక్టర్ ప్రియాంకను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంతటి తీవ్రమైన ఘటనను మొదట్లో ఎందుకు తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘మూడు రోజులు నిందితులు ఎక్కడున్నారు?’ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ ఆరోపించారు. మూడో తేదీన ఘటన జరిగితే.. ఆరో తేదీన నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారని, ఆ మధ్య మూడు రోజులు నిందితులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వారిని ఎవరైనా దాచారా? దాచితే ఎవరి అండ ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.‘చిన్న యాక్సిడెంట్‌గా ఎలా చెబుతారు?’డాక్టర్ ప్రియాంక మృతిని మొదట చిన్న ప్రమాదంగా పేర్కొనడంపై భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు తొలుత ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారని, హత్య అంశం వెలుగులోకి వచ్చిన తర్వాతే సెక్షన్లు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. తాము ఆందోళన చేపట్టే వరకు కేసు తీవ్రతను ఎందుకు గుర్తించలేదని నిలదీశారు.‘నిందితుల ఫోన్ డేటా ఎందుకు సేకరించలేదు?’హత్య జరిగిన రోజు రాత్రి నిందితులు ఎవరెవరితో మాట్లాడారో, ఎవరిని సంప్రదించారో తెలుసుకోవడానికి ఫోన్ డేటాను ఎందుకు పరిశీలించలేదని భరత్ ప్రశ్నించారు. ఘటన వెనుక ఉన్న శక్తులను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.‘మద్యం మత్తులో జరిగిన ఘటనగా ఎలా చెబుతారు?’స్థానిక ఎమ్మెల్యే ఘటనను మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసుగా పేర్కొనడంపై కూడా భరత్ స్పందించారు. ఒక మనిషి ప్రాణం పోయిన ఘటనను కేవలం ప్రమాదంగా ఎలా చూస్తారని భరత్ ప్రశ్నించారు. సోషల్ మీడియా పేజీలు ఎందుకు మూగబోయాయి?రెండు రాష్ట్రాల్లో చర్చకు వచ్చిన ఈ ఘటనపై రాజమహేంద్రవరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పేజీలు ఎందుకు స్పందించలేదని భరత్ ప్రశ్నించారు. వారిపై ఎవరి ఒత్తిడి ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.‘అధికార పార్టీ ఆదేశాలతోనే కప్పిపుచ్చే ప్రయత్నం’ఈ ఘటనలో అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయంటూ మార్గాని భరత్ ఆరోపించారు. నిందితులు ఘటన అనంతరం వెళ్లిన మార్గాల్లో సీసీ కెమెరాలను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. పోలీసులు వారికి సంబంధించిన వివరాలు ముందుగానే తెలుసుకున్నా.. ఆలస్యంగా అరెస్ట్ చేసినట్లు చూపించారని ఆరోపించారు.సీఐపై చర్యలు ఎందుకు లేవు?ఇంతటి వివాదం నెలకొన్నప్పటికీ ప్రకాష్‌నగర్ సీఐపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భరత్ ప్రశ్నించారు. కేసులో పూర్తి నిజాలు బయటకు రావాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని అన్నారు. -
మెడికో ప్రియాంక కేసు.. అసలు మాల్లో ఏం జరిగింది?
సాక్షి, తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద కారుతో ఢీకొట్టిన సంఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక కేసులో అనుమానాలు వీడడం లేదు. ఇప్పటి వరకు మాల్లో ప్రియాంకపై వాహనంతో జరిగిన దాడికి సంబంధించి మాత్రమే సీసీ ఫుటేజ్ బయటికి వచ్చింది. నిందితులు మాల్‌లోకి వచ్చిన ఫుటేజ్ గాని, ప్రియాంక మాల్‌లోకి ఎప్పుడు వచ్చిందన్న ఫుటేజ్ గాని పోలీసులు బయట పెట్టలేదు.మాల్లో ఏం జరిగిందన్న విషయంపై సందేహాలు తొలగలేదు. ప్రసాదిత్యా మాల్లో నిందితులతో మాల్ సిబ్బందికి జరిగిన గొడవ పుటేజ్ బయటకు ఎందుకు రాలేదన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ ప్రియాంక పోస్ట్‌మార్టం రిపోర్ట్, కెమికల్ ఎనాలసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అల్టర్ చేసే అవకాశం ఉంది.కాగా, ప్రియాంక మృతదేహానికి సోమవారం రాజమహేంద్రవరం డీఎస్పీ సుభాష్ బృందం పోస్టుమార్టం నిర్వహించారు. ప్రియాంక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు పోస్టుమార్టం నిర్వహించేందుకు క్రైం డీఎస్పీ సుభాష్, ప్రకాశ్‌నగర్ సీఐ బాజీలాల్, ఎస్సై సతీష్, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.మర్నాడు పోస్టుమార్టం పక్రియ పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని భారీ ఊరేగింపుతో స్వగ్రామమైన గద్వాల్ జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్‌పురానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. -
డాక్టర్ ప్రియాంక మృతి వెనుక షాకింగ్ నిజాలు
-
ప్రియాంకకు కన్నీటి వీడ్కోలు.. బోరుమన్న ఎక్లాస్పూర్
కన్నవారి కలలు.. కల్లలుఉన్నత చదువులు చదివిన కూతురు.. త్వరలోనే ప్రయోజకురాలై వస్తుందనుకున్న కన్నవారి కలలు కల్లలయ్యాయి. చెదిరిన.. చదువుల తల్లి ఆశలు బాగా చదువుకోవాలి.. డాక్టర్ కావాలి.. నిరుపేదలకు సేవ చేయాలి.. అనుకున్న ఆ చదువుల తల్లి ఆశలు చెదిరిపోయాయి.ఎక్లాస్పూర్.. కన్నీరుమున్నీరు మా ఊరి బిడ్డ ఉన్నత చదువులు చదువుతోంది.. భవిష్యత్‌లో పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటుందనుకున్న ఎక్లాస్పురం.. ఆ వైద్య విద్యార్థిని మాంసపు ముద్దగా తిరిగిరావడంతో వెక్కి వెక్కి ఏడ్చింది. అయిజ: జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంకను దురదృష్టం వెంటాడింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి.. మృత్యువుతో పోరాడిన చదువుల తల్లి చివరికి ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయింది. సోమవారం గాంధీ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ గాంధీ ఆస్పత్రిలో ప్రియాంక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాన్ని ఆమె స్వగ్రామం ఎక్లాస్‌పూర్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకువచ్చారు. అయిజలో అంతిమ యాత్ర.. ప్రియాంక మృతదేహాన్ని వైకుంఠ రథంపై అయిజ పట్టణంలో ఊరేగించారు. అంతిమయాత్రలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ప్రియాంక మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి.. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిందితులకు కఠిన శిక్ష పడాలని, బాధిత కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. అంతిమ యాత్రలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అఖిలపక్ష నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలి.. ఏపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందని, ప్రభుత్వం సత్వరమే స్పందించి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కృషిచేసి ఉంటే ప్రియాంక బతికి ఉండేదని అఖిలపక్ష పారీ్టల నాయకులు, గ్రామస్తులు మండిపడ్డారు. ప్రియాంక మృతికి కారణమైన వారిని ఏపీ ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బోరుమన్న ఎక్లాస్పూర్.. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతదేహం స్వగ్రామం ఎక్లాస్పూర్కు చేరుకోగానే కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. వైద్యురాలివై పేదలకు సేవ చేస్తావని ఆశిస్తే.. మృత్యువుతో పోరాడి మాంసపు ముద్దగా తిరిగొచ్చావా అంటూ కన్నీరుమున్నీ రుగా రోదించారు. అనంతరం అంత్యక్రియలకు ముందు చేయాల్సిన కార్యక్రమాలను సంప్రదాయపరంగా చేశారు. సొంత పంట పొలంలో మృతదేహాన్ని మట్టిలో కలిపి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రియాంక తండ్రి వెంకటేష్‌కు రూ.20 లక్షల చెక్కును అందజేశారు. నిందితులకు కఠిన శిక్షపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
Big Question: ఆ నిందితులను 3 రోజులు ఎక్కడ దాచిపెట్టారు
-
ఆలనాపాలన... రోడ్డుపాలు చేయొద్దు!
డాక్టర్ కావాల్సిన ప్రియాంక నూరేళ్ల జీవితం క్షణాల్లో కడతేరిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన అందరి మనసునూ కలచివేసింది. పిల్లలకు కార్లిచ్చి పంపుతున్న తల్లిదండ్రులు ఆ పిల్లల ధోరణి గమనిస్తున్నారా?రేస్ ఉన్మాది – స్పీడ్ కోసం ప్రాణాలు తీసేవాడుఈగో ఉన్మాది – ‘దారి ఇవ్వలేదు’ అని గుద్దేవాడుమత్తు ఉన్మాది – తాగి స్టీరింగ్ పట్టేవాడుడాడీ పవర్ ఉన్మాది – ‘నాన్న చూసుకుంటాడు’ అని నడిపేవాడు. ఇంట్లో ‘బంగారు తండ్రి’ అని పిలుచుకునే కొడుకు రేపు ఈ నలుగురిలో ఒకడు కాకుండా చూసుకుంటున్నామా?ఆగస్టు 3, 2026 రాత్రి 10:00 గంటలు. రాజమండ్రిలోని ఒక మాల్లో సినిమా చూసి బయటకు వచ్చిన ప్రియాంక (28) తన స్కూటీ తీసి ఫ్రెండ్‌తో కలిసి ఇంటికి బయలుదేరింది. బహుశా ఆమె సినిమా కబుర్లలో మునిగి ఉంటుంది. హాస్టల్ నుంచి ఫోన్ వస్తే ‘ఇంకో పావుగంటలో చేరుకుంటున్నాం’ అని కూడా చెప్పి ఉంటుంది. కాని ప్రియాంక జీవితం సడన్‌గా విషాదంలో కూరుకుపోయింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ వాహనంతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టడమే కాదు, ప్రియాంక తలపై నుంచి కారును పోనిచ్చి పరారయ్యారు.ఆ క్షణమే కోమాలోకి వెళ్లిన ప్రియాంక ఆగస్టు 9న మృతి చెందింది. ఆ అమ్మాయి చేసిన నేరం ఏమిటి? ఏ కొద్ది మందికో దక్కే ఎంబీబీఎస్ కోర్సు చదివి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఉన్న అమ్మాయి క్షణంలో ఉన్మాద చర్యకు ప్రాణం కోల్పోవడం ఏమిటి? ఆమె మృతికి ఇద్దరు వ్యక్తులే కారణంగా పైకి కనిపించవచ్చు. కాని వారి ‘మైండ్‌సెట్’ను అలా తయారు చేసిన వ్యవస్థ, పెంపకం, వ్యసనం, లెక్కలేనితనం... ఇవన్నీ కారణాలే. ఇవి సరికానంత వరకూ ఇలాంటి ఉత్పాతాలు జరగవని గ్యారంటీ ఇవ్వలేము. రోడ్డు మీద క్షేమంగా తిరగలేము.నాలుగు రకాల ఉన్మాదాలురోడ్ల మీద తిరిగే వాహనాల బ్రాండ్ కంటే వాటిని నడుపుతున్న మనుషుల మనస్తత్వాలు ముఖ్యం. నేటి రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే వాటికి కారణమైన వారిలో నాలుగు రకాల ఉన్మాదులు కనిపిస్తున్నారు.రేస్ ఉన్మాది: కేవలం స్పీడ్ కోసం, రోడ్డుపై థ్రిల్ కోసం పక్కవారి ప్రాణాలు తీసేవాడు. ‘మావాడు బైక్ స్పీడ్‌గా నడుపుతాడు’ అని తల్లిదండ్రులే గొప్పగా చెప్పి ఇలా తయారు చేస్తున్నారు. ‘ఫాస్ట్‌గా నడిపే వాడే గొప్ప’ అని కుర్రాడి బుర్రలో ఉంటే ఎవరిది దోషం?ఈగో ఉన్మాది: ‘నాకు దారి ఇవ్వలేదు’ అని, అహం దెబ్బతిన్నదని కావాలనే వెనుక నుంచి గుద్దేసేవాడు. ‘వాడికి ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు’ అని తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి అహాన్ని సాకుతారు.మత్తు ఉన్మాది: ఒంట్లో ఎంత మద్యం ఉందో తెలియకుండానే స్టీరింగ్ పట్టి, రోడ్డుపై నడిచే ప్రతి ఒక్కరినీ టార్గెట్‌గా మార్చేవాడు. స్నేహితులు ఎలాంటివారో తల్లిదండ్రులు చూడకపోవడం, రాత్రి ఒంటి గంటకు కూడా రాకపోతే పార్టీకి వెళ్లాడు అని సరిపెట్టుకోవడం... దాని ఫలితం ఇది.డాడీ పవర్ ఉన్మాది: ‘నా వెనుక నాన్న ఉన్నాడు, ఏ తప్పు చేసినా చూసుకుంటాడు’ అనే నమ్మకంతో బరితెగించి వాహనం నడిపేవాడు. కొడుక్కు పద్దెనిమిదేళ్లు రాకముందే తండ్రి కారు కీ చేతికి ఇవ్వడం, పోలీసు ఆపితే నా పేరు చెప్పు అని తండ్రి అనడం... ఇంకేముంది?రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను బలితీసుకున్నది ఈ ఉన్మాదాల కలయికే. ఈ విపరీత ధోరణులు రాత్రికి రాత్రి పుట్టవు. చిన్నప్పటి నుంచి తయారై ఉంటాయి. 20 సెకన్లలో జరిగిన ప్రియాంక మృత్యుఘటన వెనుక ‘20 ఏళ్ల బాధ్యతారాహిత్యపు పెంపకం’ కారణమై ఉండొచ్చు. రాత్రి పది తర్వాత కొడుకు బయట ఉంటే కారో, బైకో వేసుకుని తిరుగుతుంటే ‘ఎక్కడ ఉన్నావు?’ అని అడగ్గలిగే స్థితిలో తల్లిదండ్రులు లేకపోయినా, ‘చెప్పాల్సిన పని లేదనే’ ధోరణిలో పుత్రరత్నాలు ఉన్నా అది సమాజానికి అపాయకరం. మరవకూడని పాఠంఈ రోజు డాక్టర్ ప్రియాంక మన మధ్య లేదు. కానీ ఆమె మరణం నేర్పిన పాఠం చాలా పెద్దది. తల్లిదండ్రులారా.. మీ కొడుకులకు ఎదుటివారికి గౌరవం ఇవ్వడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్పండి. రోడ్డు మీద కారు స్టీరింగ్ చేతిలో ఉందనో, వెనుక అండ ఉందనో అహంకారంతో ప్రవర్తిస్తే చట్టం ముందు, సమాజం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించండి. కొడుకులను బాధ్యతగల పౌరులుగా పెంచినప్పుడే మన ఇళ్లలో, సమాజంలో నిజమైన భద్రత ఉంటుంది. బతుకును మింగే ‘బెల్టు’కంటి రెప్ప కునుకేస్తేనే స్టీరింగ్ ఎటో పోతుంది. మరి మత్తు తలకెక్కితే? అడుగుకొక బెల్టు షాపు రారమ్మని పిలుస్తుంటే దారిన పోయేవాడు ఆగి కాసింత పోసుకొని బయల్దేరుదాం అనుకుంటాడు. ఆ తర్వాత ప్రాణాల మీదకు తెస్తాడు. వ్యవస్థ ఇలా ఉంటే దానిని ఆపాల్సిన బాధ్యత పాలనది, పౌర సమాజానిది. అధిక అందుబాటు, వేళాపాళా లేకుండా సాగే అమ్మకాలు సహించరానివి. దీనికి కారకులెవరు... నిజంగా మత్తులో తేలుతున్నది ఎవరు అనేది కూడా తేలాలి.ఏం చేయాలి?→ లైసెన్స్ తీసుకోకుండా, 21 ఏళ్లు రాకుండా కారు ఇవ్వకండి. ఇచ్చే ముందు ‘నువ్వు తప్పు చేస్తే నేను కేసు నుంచి తప్పించను’ అని గట్టిగా చెప్పండి → ప్రతి రాత్రి 9 గంటలకల్లా కొడుకు ఇంటికి వచ్చాడా? కారు ఎక్కడుంది? పార్టీలో ఉన్నాడా... ఫోన్ చేసి చెక్ చేయండి. ఇది అనుమానం కాదు. బాధ్యత → ‘సారీ’ చెప్పడం నేర్పండి. రోడ్డుపై ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే దిగి క్షమాపణ చెప్పే అలవాటు చేయండి. ఈగో కంటే మనిషితనం గొప్పదని చూపించండి → సినిమా, రీల్స్ గురించి మాట్లాడండి. ‘రేసింగ్ సీన్లు సినిమాకే బాగుంటాయి... నిజ జీవితంలో చాలా ప్రాణాంతకం’ అని కూర్చుని చెప్పండి. హీరోయిజం అంటే స్పీడ్ కాదు.... బాధ్యత అని చెప్పండి.→ శిక్ష నుంచి తప్పించకండి. చిన్న స్క్రాచ్ అయినా, చిన్న ఫైన్ అయినా అబ్బాయినే కట్టనివ్వండి. ‘నాన్న ఉన్నాడు’ అనే నెట్ తీసేయండి. భయం ఉంటేనే బుద్ధి వస్తుంది. -
మెడికల్ విద్యార్థిని ప్రియాంక ఘటనపై అనితకు ఇచ్చిపడేసిన తెలంగాణ ప్రజలు
-
ఎంతో బాధతో ఈ వీడియో చేస్తున్న.. డాక్టర్ ప్రియాంక మృతిపై మార్గాని భరత్ ఎమోషనల్
-
ఆటమ్ టూ మర్డర్ కేసు..!? డాక్టర్ ప్రియాంక కేసులో ఎస్పీ సంచలన విషయాలు!
-
రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి
-
మెడికో ప్రియాంక కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: ప్రియాంక ఘటన దురదృష్టకరమని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ‘‘ఈ నెల మూడో తేదీ రాత్రి 10 గంటలకు మెడికల్ సమాచారం వచ్చింది...వెంటనే ప్రకాష్ నగర్ పీఎస్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. ముందస్తు సమాచారంతో కేసు నమోదు చేశాం. ఆ మర్నాడు ఉదయానికి కల్లా నిందితులను గుర్తించాము. నిందితులు బైక్ మీద ఉన్న ప్రియాంకను మూడు సార్లు కారుతో ఢీకొట్టారు. ఇద్దరు నిందితులను విచారించి ఆరో తేదీన అరెస్ట్ చేశాం’’ అని ఎస్పీ తెలిపారు.‘‘గ్యాస్ కనెక్షన్ ఆధారంగా నిందితులను గుర్తించాం. నిందితులు మాల్లో కొందరితో ఘర్షణ పడ్డారు. ప్రియాంకది రోడ్డు ప్రమాదం కాదు.. క్రిమినల్ చర్య. ప్రియాంక ఫ్రెండ్ ఉమేశ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశాం. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశాం. ప్రియాంక తండ్రికి ఈ కేసు విచారణపై బ్రీఫ్ చేశాం. నిందితులను పోలీసు కస్టడికీ తీసుకుంటున్నాం. ఉద్దేశపూర్వకంగా చేశారా? లేదా అనేదానిపై విచారణ చేస్తాం. ఘటన తరువాత ఒక చోటకు వెళ్లి నిందితులు పడుకున్నారు. నిందితులపై గతంలో కేసులు లేవు. నిందితులపై బీఎన్ఎస్ 110 సెక్షన్ నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. -
డా. ప్రియాంక ఘటనపై SP సంచలన వ్యాఖ్యలు
-
‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం స్పందించరా?’
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు సర్కార్‌పై మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్ల అన్యాయమైపోతే మహిళా హోంమంత్రి మనసు కరగలేదా? అంటూ ప్రియాంక తండ్రి మండిపడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకుని మా పాపను చదివించుకున్నాం. మా పాపను బతికించుకోవాలనే తపనలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదు. మా కడుపుకోత లోకేష్‌కు అర్థం కావడం లేదా?’’ అంటూ ప్రియాంక తండ్రి నిలదీశారు.‘‘ఆడపిల్లను చంపేసి హాయిగా తిరగొచ్చా.. మీ చట్టాలు సరిగా పనిచేస్తున్నాయా?. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కనీసం స్పందించలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా పట్టించుకోలేదు. ప్రతినెల హైదరాబాద్ వస్తారు కదా.. మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా?. కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా బిడ్డ పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర హోం మంత్రి గాని, జిల్లా అధికారులు గానీ ఇప్పటివరకు ఈ ఘటన గురించి మాట్లాడలేదు. నా బిడ్డ అవయవదానం చేసే ఆలోచన లేదు. బతికించుకునే ప్రయత్నమే చేస్తున్నాం’’ అని ప్రియాంక తండ్రి పేర్కొన్నారు.కాగా, రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కర్నూలుకు చెందిన ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.ఈ నెల 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్‌లు కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, గ్లాస్గో కోమా స్కేల్ (జీసీఎస్) తక్కువగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. -
రాజమండ్రి మెడికల్ విద్యార్థిని ఘటనపై సంచలన నిజాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి ప్రియాంక ఫ్రెండ్..
-
పాపం! డాక్టర్ ప్రియాంక.. ఇంత దారుణమా?
ఇద్దరు వ్యక్తుల ఉన్మాదానికి యువ డాక్టర్ జీవచ్ఛవంలా మారింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం ఊరి కాని ఊరికి వచ్చిన ఆ యువతి ఇప్పుడు మృత్యువు ముంగిట నిలిచింది. మద్యం మత్తులో విచక్షణ మరిచిపోయి కండకావరంతో కారుతో తొక్కించి కిరాతకంగా వ్యవహరించిన దుర్మార్గులపై కఠినంగా వ్యవహరించడంలో పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి.రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి జిల్లా): వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక(28) బ్రెయిన్ డెడ్ పాలైన కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఘటన జరిగిన మూడు రోజుల వరకు పోలీసులు కేసును గుంభనంగా ఉంచారన్న దానిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఎందుకు తాత్సారం ప్రదర్శించారో తెలపాలని ప్రశ్నించారు. పోలీసులపై ఎవరి ఒత్తిడి ఉందని నిలదీస్తున్నారు. ప్రియాంక ప్రమాదానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రియాంకకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ మోరంపూడి జంక్షన్ వద్ద శనివారం నిర్వహించిన ధర్నాలో మార్గాని భరత్ పాల్గొన్నారు. 'జస్టిస్ ఫర్ డాక్టర్ ప్రియాంక' ప్లకార్లు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ.. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రియాంకకు జరిగిన అన్యాయంపై తాము పోరాడుతున్నామని, న్యాయం జరిగే వరకు పోరాడేందుకు జనమంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.''డాక్టర్ ప్రియాంకను కారుతో మూడు సార్లు ఢీకొట్టడం అత్యంత దారుణం. ఆగస్టు 3న ఘటన జరిగితే మూడు రోజుల తర్వాత నిందితులను అరెస్ట్ చేసినట్టు చూపించారు. ఘటన జరిగిన రోజు రాత్రే నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు కానీ, అధికారికంగా వారి అరెస్ట్ గురించి వెల్లడించలేదు. ఏదో కుట్ర జరిగిందని మాకు అనుమానంగా ఉంది. మాకున్న సమాచారం ప్రకారం.. యాక్సిడెంట్ కేసుగా చూపించి, నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చూశారు. పోలీసులపై ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉందని అర్థమవుతోంది. డాక్టర్ ప్రియాంక కేసు గురించి పోస్టులు పెట్టొద్దని సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్లు అందరినీ బెదిరించారు. ప్రజాస్వామాన్ని కూటమి ప్రభుత్వం ఖానీ చేస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని నారా లోకేశ్ చెప్పారు, ఇప్పుడు రాజమండ్రిలో అదే జరుగుతోంది. ఒక డాక్టర్‌ను కారుతో తొక్కించిన ఘటనలో నిందితులను పోలీసులు, ప్రభుత్వం కాపాడటానికి ప్రయత్నించడం దారుణం. నిందితులపై ముందే ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టలేదు? 3 రోజుల పాటు నిందితులను ఎందుకు దాచారు? ప్రియాంకకు జరిగిన అన్యాయంపైనా సీబీఐతో దర్యాప్తు చేయించాలి. యాక్సిడెంట్ చేసిన తర్వాత నిందితులు ఎవరెవరికి ఫోన్ చేశారనే కాల్ డేటా బయటపెట్టాలి. ఈ కేసులో నిజానిజాలు వెల్లడి కావాలంటే ప్రజలు బయటకు వచ్చి పోరాడాలి. నిందితులను ఎవరు కాపాడుతున్నారు, ఎందుకు కాపాడుతున్నారు, ఎన్ని సూటుకేసులు ఎన్ని చేతులు మారాయి.. ఇవన్ని బయటకు రావాలి. డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరగాల''ని మార్గాని భరత్ అన్నారు.ఈనెల 21 వరకు నిందితులకు రిమాండ్ డాక్టర్ ప్రియాంక బ్రెయిన్ డెడ్‌కు కారణమైన కేసులో నిందితులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసఫ్లకు కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. వీరిద్దరూ మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ప్రియాంకకు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
విద్యార్థిని ఘటనపై జక్కంపూడి రాజా ఏమన్నారంటే?
-
తాగుబోతుల అరాచకం.. మూడు సార్లు
-
రాజమండ్రి డాక్టర్ ప్రియాంక ఘటనపై ఫ్రెండ్స్ సంచలన నిజాలు..!
-
మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం
సాక్షి, హైదరాబాద్: మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం రాజమండ్రిలో కారు ప్రమాదంలో ప్రియాంక గాయపడిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో ప్రియాంక బైక్‌ను యువకులు కారుతో ఢీకొట్టారు. ప్రియాంకపై నుంచి కారు దూసుకెళ్లడంతో బ్రెయిన్ డెడ్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటన సంచలనం రేపింది.ఘటనకు సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదని.. ఉద్దేశపూర్వకంగా చేసినదేనని స్పష్టమవుతోంది. ప్రమాదానికి కారణమైన యువకులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఈ నెల మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాద్ ఆదిత్యమాల్కు సినిమా చూసేందుకు కారులో వచ్చారు. వారు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించిన మాల్ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్‌తో పరిశీలించగా, ఆ యువకులు వారిపై దురుసుగా ప్రవర్తించారు.మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో వారిని థియేటర్ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ యువకులు బయటకు వెళ్లే క్రమంలో నియంత్రణ లేకుండా కారును నడిపినట్టు సీసీ టీవీ ఫుటేజీల్లో నిర్ధారణ అయ్యింది. వారి కారు ఆదిత్య మాల్ గేటు దాటుతున్న సమయంలోనే... వైద్య విద్యార్థిని ప్రియాంక, ఆమె స్నేహితుడు మల్లి వెంకటదుర్గసాయి కూడా బైక్‌పై మాల్ గేటు దాటుతున్నారు. ఈ క్రమంలో యువకుల కారు వారి బైక్‌ని ఢీకొట్టింది. ప్రియాంక వారి వైపు కోపంగా చూడటంతో మరోసారి కారుతో వారి బైక్‌ను ఢీకొట్టారు. అలా మూడుసార్లు వెంటవెంటనే బైక్‌ని ఢీకొట్టారు. దీంతో బైక్ పైనుంచి ప్రియాంక కింద పడిపోయింది.ఇది చూసిన మాల్ సిబ్బంది కేకలు వేయడంతో యువకులు కారును వేగంగా దూసుకువెళ్లారు. ఈ క్రమంలో కిందపడిన ప్రియాంక తల పైనుంచి కారు ఎక్కి వెళ్లడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. ప్రియాంకను ఆమె స్నేహితుడు, థియేటర్ సిబ్బంది హుటాహుటిన కంబాలచెరువులోని స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి అత్యంత విషమించడంతో అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని, మృత్యువుతో పోరాడుతోందని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.ప్రమాద ఘటనపై థియేటర్ మేనేజర్ విజయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ప్రియాంక తండ్రి కనికే వెంకటేష్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైన కారు నంబర్ ఆధారంగా యువకులను పోలీసులు గుర్తించారు. వారిద్దరూ చింతల నామవరానికి చెందినవారుగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయినా ప్రకాశ్‌నగర్ పోలీసులు మాత్రం ఇది మద్యం మత్తులో జరిగిన ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని హడావిడిగా ప్రకటించ డం పలు అనుమానాలకు తావిస్తోంది. -
యాక్సిడెంట్ చేసింది వాళ్లే..? రాజమండ్రి డాక్టర్ కేసులో మార్గాని భరత్ సంచలన నిజాలు
-
ప్రమాదం కాదు.. ఉద్దేశపూర్వకంగానే..!
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనకు సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసినదేనని స్పష్టమవుతోంది. ప్రమాదానికి కారణమైన యువకులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఈ నెల మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాద్ ఆదిత్యమాల్కు సినిమా చూసేందుకు కారులో వచ్చారు. వారు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించిన మాల్ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్‌తో పరిశీలించగా, ఆ యువకులు వారిపై దురుసుగా ప్రవర్తించారు. మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో వారిని థియేటర్ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ యువకులు బయటకు వెళ్లే క్రమంలో నియంత్రణ లేకుండా కారును నడిపినట్టు సీసీ టీవీ ఫుటేజీల్లో నిర్ధారణ అయ్యింది. వారి కారు ఆదిత్య మాల్ గేటు దాటుతున్న సమయంలోనే... వైద్య విద్యార్థిని ప్రియాంక, ఆమె స్నేహితుడు మల్లి వెంకటదుర్గసాయి కూడా బైక్‌పై మాల్ గేటు దాటుతున్నారు. ఈ క్రమంలో యువకుల కారు వారి బైక్‌ని ఢీకొట్టింది. ప్రియాంక వారి వైపు కోపంగా చూడటంతో మరోసారి కారుతో వారి బైక్‌ను ఢీకొట్టారు. అలా మూడుసార్లు వెంటవెంటనే బైక్‌ని ఢీకొట్టారు. దీంతో బైక్ పైనుంచి ప్రియాంక కింద పడిపోయింది. ఇది చూసిన మాల్ సిబ్బంది కేకలు వేయడంతో యువకులు కారును వేగంగా దూసుకువెళ్లారు. ఈ క్రమంలో కిందపడిన ప్రియాంక తల పైనుంచి కారు ఎక్కి వెళ్లడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. ప్రియాంకను ఆమె స్నేహితుడు, థియేటర్ సిబ్బంది హుటాహుటిన కంబాలచెరువులోని స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి అత్యంత విషమించడంతో అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని, మృత్యువుతో పోరాడుతోందని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.విచారణ చేపట్టాలి: రాజమహేంద్రవరం వైద్య విద్యారి్థని ప్రియాంక ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జుడా) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర, పారదర్శక, నిష్పాక్షిక విచారణ జరిపించాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా యువకుల గుర్తింపుప్రమాద ఘటనపై థియేటర్ మేనేజర్ విజయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ప్రియాంక తండ్రి కనికే వెంకటేష్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైన కారు నంబర్ ఆధారంగా యువకులను పోలీసులు గుర్తించారు. వారిద్దరూ చింతల నామవరానికి చెందినవారుగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయినా ప్రకాశ్‌నగర్ పోలీసులు మాత్రం ఇది మద్యం మత్తులో జరిగిన ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని హడావిడిగా ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
బాబుకు షాక్.. TDPపై జనసేన ఘన విజయం
-
టీడీపీ ఎమ్మెల్యే బంధువు గుప్పెట్లో ఇన్నీసుపేట కోృఆపరేటివ్ బ్యాంకు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 108 ఏళ్ల చరిత్ర కలిగిన ఇన్నీసుపేట కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రస్తుతమున్న సహకార సంఘ చట్టం నుంచి మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్ చట్టం)లోకి మార్చేందుకు ముమ్మర యత్నాలు సాగుతున్నాయి. ఈ నెల 28న జరిగే బ్యాంకు సర్వసభ్య సమావేశంలో ఖాతాదారులకు నజరానాలు పంచి, దాని మాటున మ్యాక్స్ చట్టంలోకి మారేలా వారితో సంతకాలు తీసుకునేందుకు పాలకవర్గం పన్నాగాలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 20 ఏళ్లుగా బ్యాంకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కోళ్ల అచ్యుత రామారావు (బాబు) రాజమహేంద్రవరం సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు బంధువు. రూ.145 కోట్ల డిపాజిట్లు, రూ.200 కోట్ల టర్నోవర్ కలిగి, 17 వేల మంది సభ్యులున్న ఈ బ్యాంకును మ్యాక్స్ చట్టంలోకి తెస్తే బ్యాంకు నిధులు, నియామకాలు కోళ్ల బాబు చేతుల్లోనే ఉంటాయి. మ్యాక్స్ చట్టంలోకి మారితే బ్యాంకు డిపాజిట్లు, ఇతర వ్యవహారాలు బ్యాంకు పాలకవర్గం ఇష్టారాజ్యంగా చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.ఎన్నికలు లేకుండా చైర్మన్‌గా కోళ్ల బాబు నచ్చినంత కాలం కొనసాగడంతో పాటు, పాలకవర్గ సభ్యులను తనకు ఇష్టమైనవారిని నియమించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు కోళ్ళ బాబుకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం ద్వారా పరోక్షంగా బ్యాంకును ఎమ్మెల్యే చేతిలో పెట్టినట్టేనన్న భావన ఖాతాదారుల్లో వ్యక్తమవుతోంది.ఆర్బీఐ అనుమతి లేకుండానే...ఇన్నీసుపేట కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును మ్యాక్స్ చట్టంలోకి మార్చేందుకు తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంది. కానీ అటువంటిదేమీ లేకుండానే ఈ నెల 28న జరగనున్న సర్వసభ్య సమావేశంలో ఈ బ్యాంక్‌ను మ్యాక్స్ చట్టం పరిధిలోకి తేవాలనే అజెండాను పాలకవర్గం రూపొందించడం కొసమెరుపు. అయితే ఇది ఎంతమాత్రం చెల్లుబాటు కాదని సహకార అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్‌కు బ్యాంకు సీనియర్ సభ్యుడు, డిపాజిట్‌దారు యజ్జరపు మరిడయ్య ఫిర్యాదు చేశారు.కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం...ఇన్నీసుపేట కో–ఆపరేటివ్ బ్యాంకును మ్యాక్స్ చట్టంలోకి మార్చడం వల్ల సభ్యులు, డిపాజిటర్లకు తీవ్ర నష్టం జరుగుతుంది. సహకార సంఘం చట్టం ప్రకారం రెండు పర్యాయాలు పదేళ్లు చైర్మన్‌గా చేసిన వ్యక్తి మరలా ఉండకూడదు. కోళ్ల బాబు దానిని ఆసరాగా చేసుకుని మ్యాక్స్ చట్టం తీసుకువచ్చేందుకు ఆర్బీఐ ఎన్వోసీ లేకుండానే సర్వసభ్య సమావేశం అజెండాలో చేర్చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. – యజ్జరపు మరిడయ్య, సీనియర్ సభ్యుడు, డిపాజిట్‌దారు, ఇన్నీసుపేట కో–ఆపరేటివ్ బ్యాంకు, రాజమహేంద్రవరం -
వైఎస్ జగన్‌ను కలిసిన రాజమండ్రి కల్తీ పాల బాధితులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమండ్రి కల్తీ పాల బాధితులు ఇవాళ(మంగళవారం) కలిశారు. గత ఫిబ్రవరిలో కల్తీ పాలు తాగి తమ పిల్లలు అనారోగ్యానికి గురైన విషయాన్ని వైఎస్ జగన్‌కు తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మూడు రోజులు హడావుడి చేసి ఆపై పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా నిలుస్తామని వైఎస్ జగన్ తెలిపారు. -
ఏపీ : గోదావరి తీరాన రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
ఏకాంత వీడియోలతో.. భర్త బ్లాక్ మెయిల్
సాక్షి, విజయవాడ: తన భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుని తనని చంపడానికి యత్నిస్తున్నాడని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మహిళ.. విజయవాడ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజమండ్రిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చిత్రీకరిస్తున్నాడని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వీడియోలు అడ్డం పెట్టుకుని మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధిత మహిళ తెలిపింది.‘‘నా భర్తను 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాను. రెండేళ్లు నన్ను భాగానే చూసుకున్నాడు. పెళ్లికి ముందు నుంచి అక్రమ సంబంధాలు ఉన్నాయని నాకు తెలిసింది. వ్యాపారం పేరుతో నా దగ్గర 100 గ్రాముల బంగారం, రూ.60 లక్షలు బ్యాంకు లోన్లు, రెండు ప్లాట్స్ తీసుకున్నాడు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 50 మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. ..అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోస్ తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నాతో ఉన్న వీడియోలు తీసుకుని కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. మే 4 తేదీన నన్ను కొట్టాడు. నన్ను చంపుతానని బెదిరించాడు. ఆయనకు భయపడి నేను పారిపోయి వచ్చాను. నాకు నా భర్తతో ప్రాణహాని ఉంది. విజయవాడ మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లెంట్ ఇచ్చాను. న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాను’’ ఆమె పేర్కొంది. -
చెయ్యి తియ్యి ఫస్ట్.. ఇచ్చిపడేసిన మార్గాని భరత్
-
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ పాల ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఏపీ సీఎస్, డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించింది. నివేదికలో బాధితుల ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు వివరాలు, చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు తదితర అంశాలను వెల్లడించాలని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.గత ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లా లాలా చెరువు చౌడేశ్వరి నగర్ స్వరూపనగర్లో కల్తీపాల తాగి 16 మంది మృత్యువాత పడ్డారు మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. పాలలో విషపూరిత రసాయనాలు ఇథైల్ గ్లైకోల్ కలిసింది. విషపూరిత పాలను నరసాపురం గ్రామంలోని డెయిరీ నుంచి సరఫరా అయినట్లు గుర్తించారు. దాదాపు 100 ఇళ్లకు సరఫరా చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. మీడియా ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం.. ఘటనపై విచారణకు స్వీకరించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని ఎన్హెచ్ఆర్సీ స్పష్టం చేసింది. -
చింతా అనురాధ ఇంటికి ఆర్కే రోజా
-
కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి
-
రాజ్యసభలో రాజమండ్రి కల్తీపాల ఘటన ప్రస్తావన
ఢిల్లీ: రాజమండ్రి కల్తీ పాలన ఘటనను రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రస్తావించారు. జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో కల్తీ పాలతో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాల కల్తీని అరికట్టేందుకు ఎఫ్ఎస్ఏఐ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. కల్తీ పాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని.. లాలాపేటలో కల్తీ పాల వల్ల 16 మంది చనిపోయారని ఆయన తెలిపారు. నిరంతరం తనిఖీలు చేపట్టి శాంపిల్స్ ల్యాబ్‌లకు పంపించాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.శ్వేత విప్లవం మన దేశాన్ని పాల కొరత ఉన్న దేశం నుండి ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చింది. ఏదైనా వస్తువు కొరత ఉన్నప్పుడే కల్తీ జరుగుతుందని, అది సమృద్ధిగా ఉన్నప్పుడు కాదని మనందరికీ తెలుసు. కానీ, ఆశ్చర్యకరంగా, దిగ్భ్రాంతికరంగా, భారీ ఉత్పత్తి ఉన్నప్పటికీ, మన దేశంలో పాల కల్తీ విచ్చలవిడిగా జరుగుతోంది.ఆరోగ్యానికి పాలు చాలా ముఖ్యం, ఎందుకంటే శారీరక పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడే 10 రకాల పోషకాలు వాటిలో ఉన్నాయి. అంతేకాకుండా, మన శరీరం ఉత్పత్తి చేయలేని 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు కూడా వాటిలో ఉంటాయి. ప్రతి ఏడాది పలు కల్తీ కేసులు నమోదవుతున్నాయన్నారు. -
పాల విషాదం.. ప్రజల్లో భయం.. బయటపడ్డ నిజం..
-
మృత్యువుతో పోరాడి.. ఓడిన మూడేళ్ల జయకృష్ణ
సాక్షి,తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురైన జయకృష్ణ గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడాడు. ఈ క్రమంలో బుధవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. జయ కృష్ణ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కుమారుడి మరణంలో న్యాయం చేయాలని కోరుతున్నారు. -
కల్తీ పాల కేసు CBIకి అప్పగించాలి
-
బొమ్మూరు ట్రాన్స్‌కో స్టోర్స్‌లో అగ్ని ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి రూరల్ బొమ్మూరు విద్యుత్ శాఖ స్టోర్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్ ఉంచిన గదిలో మంటలు చెలరేగాయి. స్క్రాప్, సామాగ్రీ దహనమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని ప్రాథమికంగా భావిస్తున్నారు.ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజిన్లతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు వ్యాపించకుండా అదుపుచేశారు. ట్రాన్స్‌కో ఎస్ఈ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ప్రమాదం కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యగా బొమ్మూరు విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు బొమ్మూరు నుంచే విద్యుత్ సరఫరా జరుగుతుంది. -
కల్తీ పాల ఘటనను ‘కూల్’ చేశారు!
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్తీ పాల మరణాలకు కారణం ఏమిటనే విషయమై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు అధికారులు తెరదించారు. మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్), విజయవాడలోని రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఆర్ఎఫ్ఎస్ఎల్) నుంచి శనివారం ఐదుగురి మరణాలకు సంబంధించిన ఫోరెన్సిక్ తుది అభిప్రాయం వెల్లడైనట్టు ఓ ప్రకటన ద్వారా అధికారులు వెల్లడించారు. కూలెంట్ నుంచి లీకైన విషపూరిత ఇథలీన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగడం వల్లే పలువురు కిడ్నీలు ఫెయిలై మృతి చెందినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా నిర్ధారణకు వచ్చినట్టు ప్రకటించారు. ఈ నివేదిక ప్రతులను మాత్రం బహిర్గతం చేయలేదు. కేవలం ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనినిబట్టి చూస్తే.. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నివేదిక కాపీలను బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇథలీన్ గ్లైకాల్ కాకుండా మరేదైనా కలిసినట్టు ఆ రిపోర్టుల్లో నిర్ధారించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నివేదికలను ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిశీలించి తుది అభిప్రాయం తెలిపారని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 9 కేసులకుగాను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులకు సంబంధించి ఈ నివేదికలు వచ్చాయన్నారు. ల్యాబ్‌ల నుంచి వచ్చిన రిపోర్టులు, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిశీలించి ఇచ్చిన ఫైనల్ ఒపీనియన్ ఆధారంగా విషపూరితమైన ఈజీ–ఇథలీన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగడం వల్ల కిడ్నీ, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో ఈ ఐదుగురూ మృతి చెందినట్టు నిర్ధారించారు. మిగిలిన వారి రిపోర్టులు ఎందుకు ఆలస్యమవుతున్నాయనే ప్రశ్నలకు జవాబు లేదు. -
రాజమండ్రిలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి నగరం పేకాట అడ్డాగా మారుతోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాజమండ్రిలో పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా పెరిగిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. రాజమండ్రి క్వారీ ఏరియాలో టీడీపీ నేత.. పేకాట క్లబ్బులను భారీగా నిర్వహిస్తుండగా.. స్పెషల్ పార్టీ పోలీసుల దాడుల్లో కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి.జూదంలో పాల్గొన్న 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సంఘటన స్థలంలో కోట్ల రూపాయలు దొరికితే అధికారికంగా వేల రూపాయలు మాత్రమే చూపించే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాజకీయ నేతలు, పోలీసుల సహకారంతో రాజమండ్రిలో పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. పట్టుబడిన డబ్బు గోల్మాల్ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి: 8కి చేరిన మృతుల సంఖ్య
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. అయితే అధికారికంగా ఏడుగురే చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కిమ్స్‌లో చికిత్స పొందుతూ జి సూర్యారావు(80) మృతిచెందారు. మృతుడు రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్ వాసి. కల్తీ పాల బాధితుడు జి సూర్యారావు. మరో 13 మంది ఇంకా వెంటిలేటర్లపైనే చికిత్స పొందుతున్నారు. కల్తీ పాలు తాగి రాజమహేంద్రవరం లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. డయాలసిస్ చేయించుకుంటున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తోంది. కిమ్స్ బొల్లినేని, రెయిన్బో చిల్డ్రన్ ఆస్పత్రి, డెల్టా, రవి చైతన్య కిడ్నీ కేర్, రాక్ ఆస్పత్రుల్లో 13 మంది కల్తీ పాల బాధితులకు వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. వారికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం శనివారం రాజమహేంద్రవరం వచ్చింది. -
విషమిస్తున్న కల్తీ పాల బాధితుల ఆరోగ్యం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీ పాలు తాగి రాజమహేంద్రవరం లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. డయాలసిస్ చేయించుకుంటున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తోంది. కిమ్స్ బొల్లినేని, రెయిన్బో చి్రల్డన్ ఆస్పత్రి, డెల్టా, రవి చైతన్య కిడ్నీ కేర్, రాక్ ఆస్పత్రుల్లో 15 మంది కల్తీ పాల బాధితులకు వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి, మరింత మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం శనివారం రాజమహేంద్రవరం వచ్చింది. అత్యవసర చికిత్స పొందుతున్న వారిని పరీక్షించి, ఇప్పటివరకూ అందించిన చికిత్స వివరాలు అడిగి తెలుసుకుంది. బాధితులకు ప్రస్తుతం అందిస్తున్న చికిత్స కంటే మెరుగైన చికిత్స అందించడానికి ఏమీ లేదని బృందం చేతులెత్తేసింది. హైదరాబాద్ కిమ్స్ సీనియర్ కన్సల్టెంట్లు డాక్టర్ సుభాష్ కౌల్ (న్యూరాలజీ), డాక్టర్ వెంకట కృçష్ణ చైతన్య కొడూరి (న్యూరాలజిస్ట్), అపోలో ఆస్పత్రి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ క్రాంతికుమార్, ఏఐజీ ఆస్పత్రి డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ డాక్టర్ ఆదర్శ్ సింగంశెట్టి ఈ బృందంలో ఉన్నారు. -
దేవుడా.. ఏంటీ దుస్థితి!
సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు: కల్తీ పాలు తాగి మూత్రపిండాల సమస్యల బారినపడిన వారిలో 8 మంది ఆరోగ్యం ఇప్పటికీ విషమంగానే ఉంది. రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన కల్తీ పాల ఘటనలో 21 మంది బాధితులను గుర్తించగా.. వీరిలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు. మరో 15 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. కిమ్స్ ఆస్పత్రిలో 8 మంది, రెయిన్బో ఆస్పత్రిలో ముగ్గురు, డెల్టా ఆస్పత్రిలో ఇద్దరు, రవిచంద్ర ఆస్పత్రిలో ఒకరు, రవి చైతన్య ఆస్పత్రిలో మరొకరు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యాధికారులు తెలిపారు. 8 మందిని వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ అందిస్తున్నారని, వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. రెయిన్బో ఆస్పత్రిలో మూడేళ్లలోపు చిన్నారులు ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఇందులో 5 నెలల చిన్నారికి సైతం డయాలసిస్ చేస్తున్నారు. కొనసాగుతున్న రక్త నమూనాల సేకరణ కల్తీ పాల బాధితులను గుర్తించేందుకు వైద్యాధికారులు రక్త నమూనాలు సేకరిస్తున్నారు. 9 వైద్య బృందాలు 110 గృహాలను సందర్శించి 315 రక్త నమూనాలను సేకరించామని కలెక్టర్ కీర్తి సీఎంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. 14 సరై్వలైన్స్ బృందాల ద్వారా 957 కుటుంబాలను ప్రతిరోజూ స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. నివేదికలు ఎప్పుడొస్తాయో కల్తీ పాల బాధితుల్లో 12 మంది నుంచి రక్తం, ముగ్గురి నుంచి మూత్ర నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం తిరుపతి ఐఐటీకి పంపారు. ఆ నివేదికలు గురువారం సాయంత్రానికి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికీ రాకపోవడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. ప్రత్యేక ఇంజెక్షన్ల వినియోగం ఎప్పుడో? ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ సూచనల మేరకు ముంబై నుంచి 50 ప్రత్యేక ఇంజెక్షన్లు తెప్పించారు. వాటిని వినియోగించాలంటే రక్తం, పాల నివేదికలు ల్యాబ్ నుంచి రావాల్సి ఉంది. వీటిని పంపించి ఐదు రోజులు దాటుతున్నా నేటికీ రాలేదు. మరో మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ఇంజెక్షన్లను వినియోగించాలంటే ల్యాబ్ రిపోర్టులు తప్పనిసరి. పాలల్లో ఇథలీన్ గ్లైకాల్ కలిసి ఆస్పత్రి పాలైన బాధితులకు మాత్రమే ఈ ఇంజెక్షన్లు ఇస్తారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో క్రియాటినిన్, యూరియా అవశేషాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వాటిని డయాలసిస్ చేస్తున్న వారికి వినియోగిస్తామని వైద్యులు వెల్లడించడమే తప్ప.. నేటికీ వాడిన దాఖలాలు లేవు. గణేష్ కస్టడీ కోరుతూ పిటిషన్ పాల వ్యాపారి గణేష్ ను అరెస్టు చేసిన పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరచడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో అతడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. గణేష్ ను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ జిల్లా పోలీసులు రాజమహేంద్రవరం న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. ఇప్పటికే 2 రోజులపాటు పోలీసుల వద్ద ఉన్న గణేష్ ను ఏం విచారించారో అంతుచిక్కని రహస్యంగా ఉంది. విచారణలో కల్తీపాల నిజాలు రాబట్టారా?, నిజాలు నిగ్గుతేలి ఉంటే ఎందుకు బహిర్గతం చేయడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ చర్యలు గణేష్ ను కాపాడేందుకు, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. -
ల్యాబ్ రిపోర్టు లేకుండానే యాంటీడోట్?
-
ఆరుకి చేరిన కల్తీ పాల మరణాల సంఖ్య
-
ఆరోగ్య శాఖ నిద్రపోతుంది..! కల్తీ పాల ఘటనపై రజిని
-
బాబు సర్కార్ ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసింది: వైఎస్సార్సీపీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాల బాధితులను వైఎస్సార్సీపీ నేతలు విడదల రజని, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్, జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం మీడియాతో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు.మెరుగైన వైద్యం అందించాలి: వేణుగోపాలకృష్ణపాలలో కల్తీ జరిగి ఐదు ప్రాణాలు పోయాయి. ప్రతిపక్షం స్పందించిన తరువాతే ప్రభుత్వ స్పందించింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైపోయింది. సంబంధిత మంత్రులు ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదు. విషయం తెలిసిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి... వైఎస్సార్ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లందరికీ పూర్తిస్థాయిలో వైద్యం అందించాలి. చనిపోయిన వారికి రూ.25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి. తిరుపతి లడ్డూ కల్తీ అనే మాట ద్వారా రాష్ట్రంలో చంద్రబాబు కల్తీకి తెర తీశారు. ఇంకా చాలామంది పేషెంట్లు ఉన్నారు. వారిని కూడా ఆస్పత్రిలో చేర్చి మెరుగైన వైద్యం అందించాలి.ముందే ఎందుకు స్పందించలేదు?: విడదల రజనికల్తీ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఘటన 19 మంది బాధితులయ్యారు. ఐదుగురు చనిపోయారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ నిలదీస్తే ప్రభుత్వ స్పందించింది. ప్రభుత్వానికి బాధ్యత ఉంటే ఎందుకు ముందే స్పందించలేదు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నిద్రపోతుంది. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ పని చేస్తుందా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 900 మంది డయేరియాతో ఆసుపత్రుల్లో చేరారు. అనేక మంది చనిపోయారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమైంది. కల్తీ పాలతో అనారోగ్యంతోనే రాజమండ్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే వైద్యం దొరికే పరిస్థితి కనిపించలేదు.రెయిన్బో ఆస్పత్రిలో రితిక్ అనే బాలుడికి సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రిలో ఇప్పటివరకు వైద్యం కోసం ఎనిమిదిన్నర లక్షలు బిల్లు కట్టాల్సి వచ్చింది. మిగిలిన వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. కల్తీ పాల వల్ల రీనల్ ఫెయిల్యూర్ జరిగింది. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారు. చనిపోయిన వారికి పది లక్షలు ఇస్తారట.. ఏమూలకు సరిపోతుంది.ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉపయోగకరంగా ఉంటాయని గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాల ప్రారంభించారు. చంద్రబాబు తన వ్యాపారం స్కాముల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.. ప్రజారోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. తప్పు జరిగిందన్న విషయం వాళ్ళ మాటల్లోనే బయటపడింది. రాష్ట్రంలో అనేక హాస్టల్లో విద్యార్థులు కూడా బాధితులు అవుతున్నారు. హెరిటేజ్ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చాము ప్రజలన్నీ గమనిస్తున్నారుబాధితులకు అండగా ఉంటాం: తానేటి వనితఒకే ఫ్యామిలీకి చెందిన అనేకమంది బాధితులు ఆసుపత్రిలో చేరడంతో వైద్యులకు అనుమానం రావడంతోనే పాల కల్తీ వ్యవహారం బయటపడింది. బాధితులకు అండగా ఉంటాం. గత ప్రభుత్వ హయాంలో సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అండగా ఉండేది. చికిత్స పొందుతున్న బాధితులకు భవిష్యత్తులో ఎంత బిల్లు అవుతుందో తెలియని పరిస్థితి. బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం 25 లక్షల రూపాయలు చెల్లించాలి. -
కల్తీ పాల విషాదానికి సంబంధించి వెలుగులోకి సంచలన విషయాలు
-
Rajahmundry : 'పాల' కూట విషం మరణ మృదంగం
-
ఏపీలో మరణ మృదంగం మోగిస్తున్న ‘పాల’కూట విషం. ఐదుకు చేరిన మృతుల సంఖ్య
-
పాలతోనే డయాలసిస్ సమస్యలు వచ్చాయి: సీఎం చంద్రబాబు
విజయవాడ: రాజమండ్రిలో కల్తీ పాల ఘటన కారణంగా పలువురు మృతిచెందిన అనంతరం జరిగిన పరిణామాలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పాలతోనే డయాలసిస్ సమస్యలు వచ్చాయన్నారు చంద్రబాబు. ఈ ఘటన కారణంగా నలుగురు చనిపోయారని, ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు. -
కల్తీ పాల మరణాలపై YS జగన్ రియాక్షన్
-
కల్తీపాలు తాగి పలువురు చిన్నారులకు అనారోగ్యం
-
కల్తీ పాలు తాగి ఇద్దరు మృతి
-
పోలీసుల అత్యుత్సాహం.. కాన్వాయ్ ఆపుదాం అని చూసారు దెబ్బకి ఇచ్చిపడేసిన అంబటి
-
రాజమండ్రిలో హైటెన్షన్.. అంబటి ర్యాలీకి అడ్డంకులు
-
జైలు నుండి అంబటి విడుదల పులిలా బయటకొచ్చిన కాపు టైగర్
-
బాబోయ్ పెద్ద పులి..!
-
గేదెను తప్పించబోయి.. మూడు బస్సులు ఢీ
-
రాజమండ్రిలో మూడు బస్సులు ఢీ..
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దివాన్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అడ్డువచ్చిన గేదెను తప్పించబోయి వెనుక వచ్చి మూడు బస్సులు ఢీకొన్నాయి. బస్సులో తెలంగాణ పీఎంసీ మోడల్ స్కూల్‌కి చెందిన 109 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. బస్ డ్రైవర్లకు గాయాలు కావడంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ప్రమాదం నుంచి విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ నెల 17వ తేదీన అరకు వెళ్ళి స్వగ్రామం నల్గొండ జిల్లా దిండికి తిరిగి వస్తుండగా.. ఘటన జరిగింది. -
రాజమండ్రిలో వినూత్నంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. గోదావరి మధ్య బ్రిడ్జి లంకలో 40 వేల అడుగుల వైఎస్ జగన్ భారీ ఫ్లెక్స్‌ను ఆ పార్టీ కార్యకర్త కంటే వినయ్ తేజ ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజా, వినయ్ తేజ వైఎస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారుగోదావరిలో పడవలను అలకరించిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. సంబరాలు జరిపాయి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో కక్ కట్ చేసి ఆ పార్టీ నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కుంచనపల్లిలో..తాడేపల్లి: కుంచనపల్లిలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్‌ను కట్ చేసిన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
అందరినీ నరికేస్తాం.. యూనివర్సిటీలో జనసైనికుల రచ్చ
-
రాజమండ్రి: ‘నన్నయ్య’లో జనసేన కార్యకర్తల వీరంగం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో నన్నయ్య యూనివర్శిటీలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఫ్లెక్సీలు తొలగించినవారి అంతుచూస్తామంటూ బెదిరింపులకు దిగారు. వీసీ ఆఫీసులో వెళ్లేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్యను వీసీ పీఏ నెట్టేశారని ఆరోపిస్తున్నారు. -
Margani: డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలింత మృతి..
-
Rajahmundry: 5000 బైకులతో YSRCP భారీ ర్యాలీ
-
5000 బైకులతో YSRCP భారీ ర్యాలీ..
-
రాజమండ్రిలో టీడీపీ లిక్కర్ రాజకీయాలు.. మరోసారి బట్టబయలు
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో టీడీపీ లిక్కర్ రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయి. రాజమండ్రి ఎమ్మెల్యే, లిక్కర్ సిండికేట్ బాగోతాలను మరో టీడీపీ నేత బర్ల బాబురావు బట్టబయలు చేశారు. గతంలో వరుసగా టీడీపీ నేతలు మద్యం సిండికేట్ల ముడుపుల గురించి మాట్లాడిన ఆడియోలను బాబురావు విడుదల చేశారు. ఎక్సైజ్ సీఐ ముడుపుల దందా ఆడియోను సైతం బర్ల బాబురావు బయటపెట్టారు. తాను విడుదల చేసిన ఆడియోలు ఏఐ క్రియేషన్ కాదని, టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ బాబురావు సవాల్ చేశారు. బర్ల బాబురావుతో బహిరంగ చర్చకి వచ్చేందుకు టీడీపీ నేతలు ముఖం చాటేశారు.కాగా, గతంలో కూడా రాజమండ్రిలో టీడీపీ నేత మద్యం అక్రమ దందా ఆడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆడియోలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉంచాలి.. ఎక్సైజ్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి.. ఎవరెవరికి ఎంత కమీషన్ ఇవ్వాలనేది మాట్లాడుతున్నారు. దీంతో, ఈ ఆడియో తీవ్ర కలకలం సృష్టించింది.రాజమండ్రి అర్బన్, రూరల్‌లో ఉన్న 39 షాపులను సిండికేట్ చేసేందుకు మద్యం షాపు నిర్వాహకుడితో రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్చార్జ్ మజ్జి రాంబాబు మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఎమ్మార్పికంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించి మందుబాబులను దోచేసే పన్నాగం బయటపడింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడైన టీడీపీ రాజమహేంద్రవరం నగర అధ్యక్షుడే నగరంలోని సిండికేట్‌లో ఉన్న లిక్కర్ షాపుల యజమానుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
Margani Bharat: రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన..
-
#KartikaPournami : భక్త జనసంద్రంగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ (ఫొటోలు)
-
మద్యం సిండికెట్ కొత్త రూల్స్.. TDP సంచలన ఆడియో..
-
పకడ్బందీ ప్లాన్.. ఇలా దొరికేశారేంటి? టీడీపీ నేత సంచలన ఆడియో
-
మద్యం సిండికేట్‌లో రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి వీడియో వైరల్
-
జైల్లో మిథున్ రెడ్డిని కలిసిన YSRCP నేతలు
-
రాజమండ్రి జైలులో ఎంపీ మిథున్ రెడ్డితో YSRCP నేతల ములాఖత్
-
స్పా సెంటర్‌పై పోలీసుల దాడి
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులోని వెదర్ టచ్ మసాజ్ సెంటర్‌పై ఆదివారం పోలీసులు దాడి చేశారు. దీనికి సంబంధించి నార్త్‌జోన్ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపిన వివరాల గత కొంతకాలంగా ప్రియాంకా గార్డెన్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న భవనంలో నరేష్ స్వామి వెదర్టచ్ పేరుతో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు దాడి చేశారు. స్పా సెంటర్లో నలుగురు విటులు, ఆరుగురు బా«ధిత మహిళలను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్పా సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్పా సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్నింటిపై దాడులు చేస్తామని, త్వరలో మరిన్ని దాడులు చేయనున్నామని డీఎస్పీ శ్రీకాంత్ ఈ సందర్భంగా తెలిపారు. -
కులాల మధ్య చిచ్చు పెడుతున్న కూటమి సర్కార్: వేణు
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం కులాల మధ్య అంతరాలను సృష్టించి లబ్ది పొందాలని కుటిల యత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కుటిల యత్నాన్ని ప్రజలు, కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కులధృవీకరణ పత్రాల జారీలో తూర్పుగోదావరి జిల్లాలో శెట్టిబలిజ సామాజిక వర్గం ఆందోళన చెందే విధంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.శెట్టిబలిజ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రం మంజారు చేసే సమయంలో ముందుగా గౌడ అని చూపించి ఆ తర్వాత బ్రాకెట్లో శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, సిగిడి అని నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. పైగా ఈ నిర్ణయం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నదేనన్న మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టారు. గతంలో మెమో జారీ చేసిన తర్వాత అభ్యంతరాలు వ్యక్తం అయితే దాన్ని రద్దు చేస్తూ జీవో నెంబరు 25 విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెమోకు జీవోకు తేడా తెలియకుండా మంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..జీవో జారీ చేసిందే చంద్రబాబు ప్రభుత్వంప్రభుత్వం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రం మంజారు చేసే సమయంలో ముందుగా గౌడ అని చూపించి ఆతర్వాత బ్రాకెట్ లో శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, సిగిడి అని నమోదు చేస్తుంది. దీనిపై శెట్టిబలిజ సామాజికవర్గంలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీనిపై కొందరు మంత్రులు మాట్లాడుతూ... ఇది సాంకేతికపరమైన ఇబ్బంది, త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామన్నారు. కొద్ది రోజుల తర్వాత సాంఘిక సంక్షేమశాఖ మంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా.. వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవో జారీ చేసింది, దాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ విధంగా కులధృవీకరణ పత్రాలు జారీ చేసిందని చెబుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.తమకు నష్టం జరుగుతుందని, తమ ఆత్మ గౌరవానికి ఇబ్బంది కలుగుతుందని ఆందోళన చెందుతున్న వారందరికీ... నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 19-06-1997లో జీవో నెంబరు 16 విడుదల అయింది. వాస్తవానికి 15-05-1995లో సామాజిక స్పృహ కలిగిన నాయకుడు, అందరూ సర్ధార్ అని పిలిచే గౌతు లచ్చన్న గారు ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదన ప్రకారం కల్లుగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆలోచన చేసి ఈ జీవో నెంబరు 16ను ప్రతిపాదించారు.ఆ సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రభాకర్ రావు వంటి పెద్దలు కూడా సమ్మతి తెలిపారు. అనంతరం విడుదలైన జీవో ప్రకారం అంతా గౌడగా ఉండాలన్న ప్రతిపాదన చేశారు. దీనిపై కొంతమంది శెట్టిబలిజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఇది తమ అస్తిత్వానికి భంగం కలిగించేదిగా ఉందని.. ఎప్పటిలానే శెట్టిబలిజలుగానే తమ నామకరణం ఉండాలని ప్రతిపాదించారు. ఇదే విషయంపై కోర్టులకు కూడా వెళ్లారు. దీంతో కులాల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం కాబట్టి.. ప్రభుత్వాలు దీనిపై పునరాలోచన చేశాయి. ఈ జీవోను జారీ చేసింది చంద్రబాబేఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ జీవో అమలు కాలేదు. 2014-19 వరకు మరలా చంద్రబాబు ఉన్నప్పుడూ కూడా ఈ జీవో అమలు కాలేదు. 2019-24 వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది గౌడ సోదరులు గౌతులచ్చన్న గారి ప్రతిపాదనను మరలా తెరపైకి తీసుకొచ్చారు. కేవీ సుబ్బారావు గౌడ్, జోగి రమేష్ తో పాటు కొంతమంది కలిసి 23-02-2023 నాడు చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది.మా హయాంలోనే జీవో నెంబరు 25 జారీ..గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అసమ్మతి వచ్చిందో.... ఈ మెమో జారీ చేసినప్పుడు కూడా అదే విధంగా వ్యతిరేకత వచ్చింది. కృష్ణా జిల్లాలో శెట్టిబలిజ కులస్తులు కులధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకుంటే గౌడ అని వస్తుందని అప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు 10-11-2023 నాడు రాష్ట్ర వ్యాప్తంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కులధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకున్నా వారికి కేవలం శెట్టిబలిజ అని మాత్రమే ఇవ్వాలని జీవో ఎం ఎస్ నెంబరు 25 జారీ చేశాం. అదే సమయంలో రాయలసీమలో ఉన్న శెట్టిబలిజలుది గీత వృత్తి కాకపోవడంతో గ్రేటర్ రాయలసీమ జిల్లాలకు కూడా వర్తించదని జీవోలో పొందుపరిచాం.మళ్లీ వివాదాన్ని తెరపైకి తెచ్చిన కూటమి ప్రభుత్వంకానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కారణమో లేక ఇతర కారణాల వల్ల గతంలో ఎవ్వరూ అమలు చేయని నిర్ణయాన్ని కేవలం ఒక మెమోని మాత్రమే ఆధారంగా చేసుకుని గౌడ అని ముందు చేర్చి తర్వాత శెట్టిబలిజ, ఈడిగ, యాత అని చేర్చడం మొదలుపెట్టారు. ఇది మళ్ళీ శెట్టిబలిజల్లో ఆందోళనకు కారణమైంది. ధృవీకరణ పత్రాలు జారీ చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా.. తమ తప్పును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించకుండానే.. ప్రజలకేం చెప్పినా నమ్ముతారన్న అతి విశ్వాసంతో ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తున్నారు.మెమోకి, జీవోకి తేడా తెలియకుండా మాట్లాడ్డం హాస్యాస్పదం. ప్రజలు వారి వారి కులాల పేర్ల మీదే కులధృవీకరణ పత్రాలు మంజారు చేయాలని కోరుకుంటున్న నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఆ పని చేయకుండా, జీవో నెంబరు 6 జారీ చేయడం ద్వారా వారి అశాంతికి కారణం అయింది. గౌత లచ్చన్న గారి ఆశయానికి కూడా కూటమి ప్రభుత్వం చరమ గీతం పాడింది. మాస్టర్ కేస్ట్ సర్టిఫికేట్ పేరుతో మా ప్రభుత్వం గౌడ, శెట్టిబలిజ, యాత కులాలను కలిపి ఉంచామని ఒకవైపు చెబుతారు, మరోవైపు వైఎస్ జగన్ వచ్చి అందరికీ విడిగా కార్పొరేషన్లు ఇచ్చారని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 139 కులాలకు ఆకాంక్షలు, ఆశలు ఉన్నాయి. వారికి ఒక వేదిక ఉండాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 672 మందిని డైరెక్టర్లుగా నియమించాం. ఇవాళ ఏడాదిన్నర కావస్తున్నా కూటమి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను భర్తీ చేయలేదు.బీసీలకు అండగా నిలిచింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేబీసీలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యలుంటే వాటిని ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా అందేటట్టు చేసిన ఘనత దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్‌లకే చెందుతుంది. మార్కెటింగ్ కమిటీల్లోనూ, దేవాలయాల్లోనూ బీసీలకు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్ కాదా?, ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీల, ఎస్టీలు, మైనార్టీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉన్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. బీసీలకు మేలు చేశామని చెప్పుకునే చంద్రబాబు మాత్రం వారికి ఒక మగ్గమో, మోకూ, చక్రమో ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప వారి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పనిచేయలేదు.కేవలం వారిని గౌరవిస్తున్నట్టు నటిస్తూ.. వారి ఆశయాలను నశింపజేసే ప్రక్రియ కూటమి పాలనలో జరుగుతుంది. కులాల మధ్య ఐక్యత దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ రోజు మా ప్రభుత్వ హయాంలో సమస్య వచ్చినప్పుడు దాన్ని తక్షణమే పరిష్కరించాం. కానీ అవగాహన లేని మంత్రి మాత్రం ఫేక్ జీవో అంటూ మాట్లాడ్డం హాస్యాస్పదం. ఆయన మెమోకి జీవోకి తేడా తెలుసుకోవాలి. కేవలం కులాల నడుమ ఆందోళనలు సృష్టించి రాజకీయ లబ్ది పొందడానికే చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమే ఈ వివాదం. ప్రభుత్వం తక్షణమే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి -
Byreddy: మీ యాక్షన్ కు మా రియాక్షన్... మీ ఊహకే వదిలేస్తున్నా
-
ఎంపీ మిథున్ రెడ్డి తో అనంతపురం YSRCP లీడర్లు ములాఖత్
-
తెలివైన మోసగాడు.. ఫ్రీ బస్సు పథకం పై బాబును ఏకిపారేసిన మహిళలు
-
Margani Barath: జైల్లో మిథున్ రెడ్డికి కనీస సదుపాయాలు... లెటర్ తీసుకుని వెళ్తే పోలీసులు..
-
రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు
-
Central Jail: జైల్లో నేలపైనే మిథున్ రెడ్డి
-
Jakkampudi Raja: రాజమండ్రిలో హైటెన్షన్..
-
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా YSRCP నేతలు నిరసన
-
మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డికి రిమాండ్
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు ఆదివారం విజయవాడ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. మిథున్‌రెడ్డిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశించింది. ఓ పార్లమెంట్ సభ్యుడికి నిబంధనల ప్రకారం జైలులో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తారో వాటన్నింటినీ మిథున్‌రెడ్డికి కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. వెంట మందులు తీసుకెళ్లేందుకు మిథున్‌రెడ్డికి అనుమతినిచ్చింది.ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం అక్రమ కేసులో నాలుగో నిందితునిగా ఉన్న మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘ విచారణ తరువాత శనివారం రాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం కోర్టు ఎదుట హాజరుపరిచే ముందు మిథున్‌రెడ్డిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ఈసీజీ, బీపీ, షుగర్ వంటి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆయనను ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు.రాజకీయ కక్ష సాధింపుతో నాపై కేసు పెట్టారు ఈ సందర్భంగా మిథున్‌రెడ్డితో న్యాయాధికారి మాట్లాడారు. ఊరు, పేరు, తల్లిదండ్రుల పేర్లు, కుటుంబంలో ఎంత మంది ఉంటారు.. వంటి వివరాలు అడిగారు. వాటన్నింటికీ మిథున్‌రెడ్డి సమాధానం చెప్పారు. తనపై దురుద్దేశాలతో, రాజకీయ కారణాలతో ఈ కేసు నమోదు చేశారని మిథున్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. తానెలాంటి తప్పు గానీ, నేరం గానీ చేయలేదన్నారు. కోర్టు ముందు హాజరుపరిచే ముందు వైద్యులు తనకు రెండుసార్లు ఈసీజీ పరీక్షలు నిర్వహించారని, రెండింటికీ తేడాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల తనకు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన కోర్టుకు నివేదించారు. ప్రత్యేక సౌకర్యాలు కల్పించండి.. ఆ తర్వాత మిథున్‌రెడ్డి తరఫు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. మిథున్‌రెడ్డి మూడు పర్యాయాల నుంచి ఎంపీగా ఉన్నారని తెలిపారు. ఆయన లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా కూడా వ్యవహరించారని వివరించారు. ఆయనకున్న ప్రాణహాని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించిందని నాగార్జునరెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో జైలులో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే వెంట మందులు తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని కోరారు. పిటిషనర్‌కు రిమాండ్ విధిస్తే తగిన సౌకర్యాలు ఉన్న నెల్లూరు కేంద్ర కారాగారానికి గానీ, రాజమండ్రి కేంద్ర కారాగారానికి గానీ పంపాలని కోరారు. జైలులో వీఐపీ బ్యారెక్ కేటాయించాలని అభ్యర్థించారు.కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు వీలుగా జైలులో ఎక్కువ ములాఖాత్‌లను మంజూరు చేయాలని కోర్టును కోరారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిట్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ మద్యం విధానంలో మిథున్‌రెడ్డిది కీలక పాత్ర అని తెలిపారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మిథున్‌రెడ్డికి జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరారు. నెల్లూరు, రాజమండ్రి కేంద్ర కారాగారాలకు కాకుండా, విజయవాడ లేదా గుంటూరు జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు మిథున్‌రెడ్డికి ఆగస్టు 1 వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశించింది.రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు మిథున్‌రెడ్డి సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు: వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాత్రి 8.38 గంటలకు తీసుకొచ్చారు. జైలు అధికారుల ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ఆయనకు కేటాయించిన బ్యారక్‌లోకి తీసుకెళ్లారు. పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కాకినాడ వెళ్లే రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. 144 సెక్షన్, 30 సెక్షన్లు అమలు చేశారు. మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుపై వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఆయనకు మద్దతుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలి వచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. పార్టీ నేతలు జైలు వద్ద నిరసనకు దిగారు. జైలు గేటు ఎదురుగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ బైఠాయించి, నిరసన తెలిపారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. -
తోలు తీస్తామన్న లీడర్లు ఎక్కడ?.. బాధితురాలికి సత్యదేవ్‌తో వివాహం జరిపించాల్సిందే: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న లీడర్లు.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. రాజమండ్రిలో ఓ దళిత బాలికకు అన్యాయం జరిగితే చివరకు మహిళా కమిషన్ కూడా స్పందించని స్థితిలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం ఈ ఉదంతంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘దళిత బాలికకు ఎంత అన్యాయం జరిగితే మహిళ కమిషన్ ఎందుకు స్పందించలేదు. ఈ వ్యవహారంపై చంద్రబాబు లోకేష్, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న ఆ నాయకులు ఎక్కడికి వెళ్లిపోయారు?. ఏపీలో ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. వెలుగులోకి రానివి ఇంకెన్ని ఉన్నాయో?.. 40 రోజులుగా బాధితురాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎందుకు కేసు కట్టలేదు. కలెక్టర్ ఆదేశించే వరకు డీఎస్పీ కూడా ఇన్వాల్వ్ కాకపోవటం దారుణం. ఎవరి రాజకీయ ఒత్తిడితో పట్టించుకోలేదా?. ఈవీఎం ఎమ్మెల్యే ఒత్తిడి చేశారా?. ఈ వ్యవహారం రాష్ట్ర డీజీపీని కలుస్తాం. ఈ ప్రభుత్వం స్పందించి మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని బాధితులానికి న్యాయం చేయాలి. బాధితురాలికి సత్యదేవ్‌తో వివాహం జరిపించాలి’’ అని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. తల్లికి వందనం మోసంపై..మరోవైపు.. తల్లికి వందనం పథకం పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపైనా ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 89 లక్షల మంది విద్యార్థులున్నారు. తల్లికి వందనం కోసం రూ.13,000 కోట్లు ఖర్చు అవుతుంది. బీపీఎల్‌లో ఉన్న వారందరికీ ఈ పథకం వర్తించాలి. అలాంటప్పుడు ఎంతమందికి తల్లికి వందనం లేకుండా చేస్తున్నారు?. వైఎస్సార్సీపీ సానుభూతి పరులను ఆ జబితా నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లికి వందనం గతేడాది నిధులు విద్యార్థులకు బకాయి ఉన్నారు. ఎంతమంది విద్యార్థులున్నారో అందరికీ తల్లికి వందనం నిధులు జమ చేయాలి. లేదంటే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’’ అని భరత్ హెచ్చరించారు.కేసు ఏంటంటే..బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మోరంపూడికి చెందిన పులవర్తి సత్యదేవ్ ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి దళిత బాలికను మోసం చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు సత్యదేవ్ వద్దకు వెళ్లి తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని అడిగారు. తాను స్వామి మాలలో ఉన్నానని చెప్పాడు. ఆపై ధవళేశ్వరంలోని సీఈఎం ఆసుపత్రిలో గత ఏడాది డిసెంబర్ 17న అబార్షన్ చేయించారు. ఆ తరువాత బాలికను వివాహం చేసుకోవడానికి సత్యదేవ్ నిరాకరిస్తూ వస్తున్నాడు. గట్టిగా నిలదీస్తే.. కులం తక్కువ దానివంటూ దూషించాడు. ఈ నేపథ్యంలో బాలిక, తల్లిదండ్రులు బొమ్మూరు సీఐకి ఫిర్యాదు చేయగా ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు. నిందితుడు సత్యదేవ్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. వివాహం చేసుకోమని అడిగితే.. పెద్ద సమక్షంలో సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడని మండిపడుతోంది. ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. -
8 మందిలో ముగ్గురు మృతి దేహాలు
-
గోదావరిలో స్నానానికెళ్లి 8 మంది గల్లంతు
-
వందల ఏళ్ల నాటి వృక్షాలు తొలిగించే ప్రయత్నం
-
పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు: ఎస్పీ
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇంకా రాలేదని.. అది వచ్చిన తర్వాతే పీఎం రిపోర్టు వస్తుందని ఆయన తెలిపారు. విచారణలో భాగంగా సేకరించిన వీడియో ఫుటేజ్ విశ్లేషణ జరుగుతుందన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వారి కుటుంబ సభ్యులకి ఎవరికీ ఇవ్వలేదని.. అలాంటి ప్రచారాలను నమ్మొద్దన్నారు.పాస్టర్ ప్రవీణ్ మృతి దర్యాప్తుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఇప్పటికీ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా సమగ్రంగా పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తు నిర్వహిస్తోందన్నారు. క్రికెట్ బెట్టింగ్‌పై రాజమండ్రిలో ఒక కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశామని.. విచారణ కొనసాగుతోందన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లో ఎవరు కూడా ఇరుక్కోవద్దని ఎస్పీ నర్సింహ కిషోర్ అన్నారు. -
రాజమండ్రి నాగాంజలి కేసు.. ఎన్నో అనుమానాలు?
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బొల్లినేని కిమ్స్‌లో మృతి చెందిన ఫార్మసిస్ట్ నాగాంజలి కేసులో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 23న నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకుందన్న సమయంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఏం జరిగిందన్న విషయంపై స్పష్టత లేదు. ఈ సమయంలో నాగాంజలికి ఏం జరిగిందో వాస్తవాలు వెల్లడికాలేదు. సాయంత్రం 6:30 నుండి 8:30 మధ్యలో నాగాంజలికి ఎలాంటి చికిత్స జరిగింది?. ట్రీట్మెంట్ ఎవరిచ్చారు?. వార్డు నెంబర్ 802లో నాగాంజలికి అనస్థీషియా ఇంజెక్షన్ ఎవరు చేశారో? ఇప్పటివరకు స్పష్టం కాలేదు.బాధితురాలు తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు. ఆ రూమ్‌లో సీసీ ఫుటేజ్ ఏమైనట్టు?. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే దీపక్‌తో పాటు ఎవరెవరు ఈ దారుణానికి సహకరించారో బయటపడే అవకాశం ఉంది. సంఘటన జరిగిన రోజు సాయంత్రం 6:30కు అంజలి ఫోన్‌తో దీపక్ క్యాజువాలిటీకి ఎందుకు వచ్చాడు?. ఆసుపత్రి యాజమాన్యం సకాలంలో ట్రీట్మెంట్ చేస్తే అంజలి బతికేదా?. నాగాంజలిది ఆత్మహత్యా? లేక హత్యా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.కాగా, మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి నిన్న(శుక్రవారం) ఉదయం తుది శ్వాస విడిచింది. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో అప్రంటీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి ఏజీఎం దీపక్ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23న అదే ఆస్పత్రిలోనే వెక్రోనియం బ్రోమైడ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆస్పత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది. -
బలైపోయిన అంజలి.. హార్ట్ స్ట్రోక్ అని నిర్ధారణ.. ప్రభుత్వమే కారణమా ?
-
రాజమండ్రి నాగాంజలి కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యకు కారణమైన నిందితుడు దీపక్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నాగాంజలిని పెళ్లి చేసుకుంటానని చెప్పి దీపక్ లైంగికదాడికి పాల్పడ్డాడు. పెళ్లి పేరుతో విషయం బయటకు చెప్పకుండా బాధితురాలిని కట్టడి చేశాడు. దీపక్ మాటలను అమాయకంగా నమ్మిన బాధితురాలు.. వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమెను దీపక్ రెండు,మూడు సార్లు కొట్టాడు. దీపక్ అకృత్యాలను తండ్రికి, రూమ్మేట్లకు సైతం నాగాంజలి తెలియనివ్వలేదు.ఈ నెల 23న దీపక్‌కు కాల్ చేసి పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. చనిపోవాలంటే చనిపోవచ్చని.. తనకు ఇబ్బందిగా ఉందంటూ దీపక్ కర్కశంగా వ్యవహరించాడు. తాను మోసపోయినట్టు గుర్తించిన నాగాంజలి.. తీవ్ర మానసిక వేదన అనుభవించింది.కాగా, దీపక్‌కు పెళ్లయి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2010లో బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో దీపక్ చేరాడు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్‌లో ఉన్నాడు.రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న నాగాంజలి శుక్రవారం ఉదయం మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, గత 28 నుంచి నాగాంజలిని వ్యైదుల బృందం పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. నాగాంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు ఉదయమే పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇప్పటివరకు ఫార్మసీ విద్యార్థిని ఘటనకు సంబంధించి ప్రభుత్వం, మంత్రులు స్పందించకపోవడం గమనార్హం. -
ఫార్మా స్టూడెంట్ నాగాంజలి మృతిపై తల్లి సంచలన వ్యాఖ్యలు
-
కాన్పు కోసం వచ్చి మాయం.. ఆపై బస్టాండ్‌లో ప్రత్యక్షం
కాకినాడ, సాక్షి: కాన్పు కోసం వచ్చిన ఓ మహిళ.. ఉన్నట్లుండి ఆస్పత్రి నుంచి మాయమైంది. ఆందోళనకు గురైన భర్త, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే.. కొన్నిగంటల తర్వాత ఆమె ఆచూకీ లభ్యమైంది. అయితే తనకు బలవంతంగా ప్రసవం చేసి పుట్టిన కవలలను ఎత్తుకెళ్లారంటూ ఆమె కన్నీళ్లు పెడుతుండడంతో ఇటు భర్త, అటు పోలీసులు షాక్‌కు గురయ్యారు. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన కుప్పిశెట్టి సంధ్యారాణికి నెలలు నిండడంతో కాన్పు కోసం రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నాం చేర్పించారు. కాసేపటికే ఆసుపత్రి బయట వాకింగ్ చేస్తూ హఠాత్తుగా ఆమె అదృశ్యమైంది. ఆందోళనకు గురైన భర్త లోవరాజు.. రాజమండ్రి త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో రాత్రి కాకినాడ ఆర్టీసి బస్టాండ్ వద్ద సంధ్యారాణీ ఆచూకీ లభించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనను కారులో అపహరించారని, తనకు ఇంజెక్షన్ ఇచ్చి డెలివరీ చేశాక పుట్టిన కవలలను ఎత్తుకెళ్లారని సంధ్యారాణీ ఏడుస్తూ చెబుతోంది. అనంతరం ఆమెను కాకినాడ జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందించారు. అయితే ఆమె చెబుతున్న విషయాలు నిజమో కాదో తెలుసుకునేందుకు.. శుక్రవారం ఉదయం ఆమెను పోలీసులు రాజమండ్రికి తరలించారు. ఈ క్రమంలో సీసీఫుటేజీ కీలకంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ఓ ఆటోలో ఆమె ఎక్కి వెళ్తున్నట్లుగా దృశ్యాలు అందులో రికార్డు అయినట్లు కనిపిస్తోంది. -
ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి
-
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరం ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు ఈ రోజు నన్ను కలిశారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని, ప్రస్తుత పరిస్థితిని నాకు వివరించారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘‘బాధ్యులకు శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. విద్యార్థిని పరిస్థితి ఆ తల్లిదండ్రులు వివరిస్తుంటే బాధనిపించింది. ఈ ప్రభుత్వం ఆడబిడ్డల భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమైంది. ఫార్మసీ విద్యార్థిని కుటుంబ సభ్యులకు పూర్తి న్యాయం జరిగేలా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగ అంజలి తల్లిదండ్రులు ఈ రోజు నన్ను కలిశారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని, ప్రస్తుత పరిస్థితిని నాకు వివరించారు. బాధ్యులకు శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమకు… pic.twitter.com/NLm75iVpc5— YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2025 -
పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు.. చేతులు, ముఖంపై గాయాలు: డీఐజీ
సాక్షి, తూర్పుగోదావరి: ఈ నెల 24న అనుమానాస్పద స్థితిలో కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందినట్టు గుర్తించామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం.. ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను మీడియాకు ఆయన వెల్లడించారు. ప్రవీణ్ బంధువులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేశామని తెలిపారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని.. తూర్పుగోదావరి ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ఈ నెల 24న ఉదయం 11 గంటలకు పాస్టర్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 1.29 గంటలకు చౌటుప్పల్ టోల్గేట్ దాటారు. విజయవాడలో మూడు గంటల పాటు ఆయన ఎక్కడున్నారనే విషయంపై ట్రాక్ చేస్తున్నాం. కొంతమూరు పెట్రోల్ బంక్ వద్దకు రాత్రి 11:40 గంటలకు చేరుకున్నారు. 11:42కు ఘటన జరిగింది. పోస్టుమార్టం రిపోర్టులో కొన్ని అంశాలకు సంబంధించి సమాచారం వచ్చింది. చేతులు, ముఖంపై కొన్ని గాయాలు ఉన్నాయని తేలింది. పూర్తి వివరాలు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ప్రవీణ్ ఎలా మృతి చెందారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కారు ఢీ కొడితే మోటార్ సైకిల్ కింద పడిందా లేదా.. అన్న విషయాన్ని కూడా ట్రాన్స్‌పోర్టు అధికారులు పరిశీలిస్తున్నారు.’’ అని ఐజీ చెప్పారు.జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ మాట్లాడుతూ.. హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డేటా పరిశీలిస్తామని తెలిపారు. ‘‘అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నాం. రాజమహేంద్రవరం ఎందుకు వచ్చారో పరిశీలించాం. లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరిట ప్రవీణ్ కొంత స్థలం కొనుగోలు చేశారు. అక్కడ ఒక భవనం నిర్మించాలనుకున్నారు. దీని కోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఆయన రాజమండ్రి వస్తున్నట్టు భార్య, స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్‌కు మాత్రమే తెలుసు. కుటుంబ సభ్యులందరినీ విచారించాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా పరిశీలిస్తాం’’ అని ఎస్పీ తెలిపారు. -
రాజమండ్రి ఫార్మసిస్ట్ ఘటన.. సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలి: మార్గాని
సాక్షి, తూర్పుగోదావరి: ఆత్మహత్యా యత్నం చేసిన ఫార్మసిస్ట్కి న్యాయం జరిగేదాకా పోరాడుతామని, ఆమె కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రకటించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపైనా వాస్తవాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫార్మసిస్ట్ కేసులో నిందితుడు దీపక్ టీడీపీ క్రియాశీల కార్యకర్త అని, ఆయన మామ రాజమహేంద్రవరం టీడీపీలో ముఖ్య నేత అని మాజీ ఎంపీ గుర్తు చేశారు. దీపక్ పని చేస్తున్న ఆస్పత్రి యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ కోరారు.మార్గాని భరత్ ఇంకా ఏం మాట్లాడారంటే..:బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో ఏజీఎంగా పని చేస్తున్న దీపక్ అనే వ్యక్తి కారణంగానే తాను ఆత్మహత్యా యత్నం చేస్తున్నట్లు ఫార్మసిస్ట్ సుదీర్ఘ లేఖలో రాసుకొచ్చారు. ఆమెను దీపక్ శారీరకంగా, మానసికంగా హింసించాడు. అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. అంజలి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలి. లేకపోతే అవన్నీ బయట పెడతాం. దీపక్ వ్యక్తిత్వం మంచిది కాదని అందరూ చెబుతున్నారు. గత మూడు నాలుగు రోజులుగా బాధితురాలి తల్లిదండ్రులు అనుభవిస్తున్న బాధ వర్ణణాతీతం. ప్రభుత్వం మీద నమ్మకం లేక న్యాయం చేయమని వారు నన్ను ఆశ్రయించారు. ప్రభుత్వం సరిగ్గా స్పందించి ఉంటే వారు నా దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంటుంది?పక్కదారి పట్టించే ప్రయత్నం:ఆస్పత్రి యాజమాన్యం కూడా మొదటిరోజు ఈ ఘటనను పక్కదారి పట్టించేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. ఫార్మసిస్ట్ సహచర విద్యార్థులు రోడ్డుమీదకొచ్చి ధర్నా చేస్తే కానీ ప్రభుత్వం, ఆస్పత్రి యాజమాన్యం దిగి రాలేదు. మూడు రోజుల తర్వాత కానీ ఆమె ఆత్మహత్యకు యత్నించిన ఇంజెక్షన్ గురించి ఆస్పత్రి యాజమాన్యం నోరు విప్పలేదు. ఫార్మసిస్ట్ సూసైడ్ నోట్ దొరకనంత వరకు ఈ కేసును నీరు గార్చడానికి దీపక్ చేయని ప్రయత్నం లేదు. మా నాయకుడికి ఈ విషయం తెలియజేయడంతో ఫార్మసిస్ట్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా అండగా ఉండాలని ఆదేశించారు. బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడుతుంది. నిందితుడు దీపక్ టీడీపీ కార్యకర్త:నిందితుడు దీపక్ టీడీపీ కార్యకర్త అని తెలిసింది. ఆయనకు పిల్లనిచ్చిన మామ కూడా రాజమండ్రిలో టీడీపీ నాయకుడని సమాచారం. కాబట్టే ఈ కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు ఫార్మసిస్ట్ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 10 నెలల్లో మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. కానీ ఎక్కడా నిందితులకు శిక్ష పడిన దాఖలాలు లేవు.సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలి:సీసీ టీవీ ఫుటేజ్‌ను ఆస్పత్రి యాజమాన్యం వెంటనే బయట పెట్టాలి. రూమ్ నెం.801లో ఆమే స్వయంగా ఇంజక్షన్ చేసుకుందా? లేక ఎవరైనా బలవంతంగా ఎక్కించారా అనేది నిర్ధారణ కావాలి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు దీపక్ నుంచి సేకరించిన వివరాలు ఫార్మసిస్ట్ తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఈనెల 23న దీపక్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే మాత్రం 24వ తేదీ కనిపిస్తోంది. అలాగే ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారా? లేదా? అన్నది కూడా పోలీసులు చెప్పాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివరాలు వెల్లడించాలి:పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయి ఐదు రోజులు గడిచినా ఆయనది హత్యా? లేక రోడ్డు ప్రమాదమా? అనేది ఇంతవరకు పోలీసులు నిర్ధారించలేకపోవడం దారుణం. ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ప్రవీణ్ పగడాల మృతి విషయంలో నారా లోకేష్ ట్వీట్ పలు అనుమానాలకు తావిస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు రాకుండానే హత్యా? యాక్సిడెంటా? అనేది నిర్ధారణ కాకుండానే ప్రమాదవశాత్తు చనిపోయారని ఆయన ఎలా ప్రకటిస్తారు?. అందుకే పాస్టర్ ప్రవీణ్ మృతిపై పూర్తి వివరాలు చెప్పాలని మార్గాని భరత్ కోరారు.కాగా, ఫార్మసిస్ట్ తల్లిదండ్రులు కూడా మీడియాతో మాట్లాడుతూ..సరైన సమాచారం ఇవ్వలేదు:మా పాప వికాస్ కాలేజీలో చదువుతూ బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తోంది. మా పాప కళ్లు తిరిగిపడిపోయిందని ఈనెల 23న సా. 4 గం.కు ఆస్పత్రి నుంచి మాకు ఫొనొచ్చింది. మేము అక్కడికి వెళ్లేసరికి రాత్రి 8 గం. అయింది. అప్పటికే ఆమెను వెంటిలేటర్ మీద ఉంచారు. మేం వెళ్లాక ఐసీయూకు మార్చారు. వైద్యం చేస్తున్నామని చెబుతున్నారే కానీ దేనికి అనేది చెప్పలేదు. స్లో పాయిజన్ అయి ఉంటుందని మర్నాడు ఒక డాక్టర్ చెప్పారు. మా పాపకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. ఈ పరిస్థితి మరే ఇతర అమ్మాయికి రాకూడదు. మా పాప ఆస్పత్రికి ఎలా వచ్చిందో అలాగే తిరిగి ఇంటికి రావాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి.ఆస్పత్రికి కనీసం బాధ్యత ఉండదా?:డ్యూటీలో ఉన్న అమ్మాయి పడిపోతే ఆస్పత్రికి బాధ్యత తీసుకోదా? అందుకే ఈ ఘటనలో ఆస్పత్రి యాజమాన్యం పాత్ర కూడా ఉందనే అనుమానం వస్తోంది. ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటి వరకు మాతో మాట్లాడలేదు. మాజీ ఎంపీ భరత్ జోక్యం చేసుకున్నాకే వారిలో మార్పు కనిపిస్తోందని ఫార్మసిస్ట్ తల్లిదండ్రులు వెల్లడించారు. -
‘ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపరా?'
తూర్పుగోదావరి, సాక్షి: ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే సహించబోనని.. చెయ్యి వేసిన వాడి తాట తీస్తానని గతంలో పవన్ కల్యాణ్ ఎన్నో ప్రకటనలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయనెక్కడ ఉన్నారు? అంటూ రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు, ఆమె స్నేహితులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం దాకా వచ్చిన చంద్రబాబుకి.. ఇక్కడిదాకా వచ్చే టైం లేదా? అని అడుగుతున్నారు. మహిళా హోం మంత్రి అనితకు పరామర్శించే సమయమే లేదా? అని నిలదీస్తున్నారు. లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన డీ ఫార్మ్ ఫైనలియర్ విద్యార్థిని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె చికిత్స పొందుతున్న రాజమండ్రి బొల్లినేని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యమే వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నమూ చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కమిటీ వేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు సారథ్యంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం ఆసుపత్రికి వచ్చి విద్యార్థినికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యంపై ఇవాళ(శనివారం) హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్ ఓ టీడీపీ ఎమ్మెల్యేకి బంధువు కావడంతో కేసును నీరు కారుస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన మూడు రోజుల దాకా అంతా గోప్యంగా ఉంచారని అంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళన బాట పట్టారు. సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని.. దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం అంటోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు. -
ఏపీలో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ మరణం
-
పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిష్పాక్షిక విచారణ జరగాలి: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ప్రముఖ మత ప్రబోధకుడు, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్న ఆయన.. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరోవైపు ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదంలో పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రవీణ్‌కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని.. అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్లు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై సోమవారం రాజమహేంద్రవరం బయలుదేరిన ప్రవీణ్‌కుమార్ అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం ఉదయం దాకా ఆయన అలా పడి ఉండడం ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: పాస్టర్ ప్రవీణ్ ఒంటిపై గాయాలు! -
పాస్టర పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి
-
రాజమండ్రిలో హీరో రామ్ పోతినేనికి అభిమానులు ఘన స్వాగతం (ఫొటోలు)
-
రాజమండ్రిలో మధురపూడి ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్
-
కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా
-
నృత్య పోటీల్లో..శ్రీరాధాకృష్ణ ‘హై’లైట్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): “గోదావరి నీటిని తాగితే కళాకారులవుతారు’ అనేది నానుడి. దీనిని నిజం చేస్తూ అనేక మంది సంగీత, నృత్య కళాకారులు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరికొందరు సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. చరిత్ర పుటల్లో తమదైన ముద్రను వేసి రాజమహేంద్రవరం ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నారు. ఆ కోవలోకే శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం చేరింది. ఈనెల 2న మలేషియాలోని టీఎంసీ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో 14 బహుమతులను గెలుచుకుని ఇక్కడి కళాకారులు ప్రతిభ చాటారు. ఇందులో ప్రథమ బహుమతి ఉండటం విశేషం. మలేషియాలోని స్వర్ణ మరియమ్మన్ కుచాంగ్ వారు ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పోటీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించారు.ఇందులో 13 దేశాల నుంచి 615 మంది కళాకారులు పాల్గొన్నారు. గాత్రం, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్స్, సెమీ క్లాసికల్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. దీన్లో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం నుంచి 68 మంది విద్యార్థులు పాల్గొని 14 మంది బహుమతులు గెలుచుకున్నారు. ఆన్లైన్లో పోటీలు మలేషియాలో జరిగిన ఈ పోటీల్లో ఆన్లైన్ ద్వారా కళాకారులు తమ ప్రతిభను కనబరిచారు. వీటిని రికార్డ్ చేసుకున్న నిర్వాహకులు అన్నీ పరిశీలించాక బహుమతులు ప్రకటించారు.స్థానిక శ్రీరాధాకృష్ణ క్షేత్రం మొత్తం 14 బహుమతులు దక్కించుకుంది. ఇందులోమొదటి బహుమతి కూచిపూడి నాట్యానికి రాగా, ఐదు ద్వితీయ బహుమతుల్లో రెండు గాత్రం, ఒకటి సెమీ క్లాసికల్, రెండు కూచిపూడికి వచ్చాయి. తృతీయ బహుమతులు రెండు కూచిపూడి నృత్యానికి, సెమీ క్లాసికల్‌కు రెండు, గాత్రానికి ఒకటి వచ్చాయి. ఇవి కాకుండా కన్సొలేషన్ బహుమతులు సెమీ క్లాసికల్‌కు ఒకటి, కూచిపూడి నృత్యానికి రెండు వచ్చాయి. ఆయా బహుమతులను మలేషియా నుంచి కొరియర్లో మంగళవారం కళాక్షేత్రానికి వచ్చాయి. ఈ బహుమతులను శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వాహకులు డాక్టర్ జి.వి. నారాయణ, డాక్టర్ ఉమా జయశ్రీ కళాకారులకు అందజేశారు.చదువుతో పాటు డ్యాన్స్ కూడా... నేను పదో తరగతి చదువుతున్నా. ఆరేళ్ల నుంచి కూచిపూడితో పాటు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా. మలేషియాలో జరిగిన పోటీల్లో సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి వచ్చిoది. నాట్యాచార్యులు ఉమ జయశ్రీ నాట్య సాధన చేస్తున్నా. అలాగే చదువుకూ సమయం కేటాయిస్తున్నా. – చెరుకుమిల్లి సిరిచందన నాట్యం అంటే ప్రాణం నేను ఏడో తరగతి చదువుతున్నాను. నాకు నృత్యం అంటే ప్రాణం. మలేషియాలో జరిగిన పోటీలో ద్వితీయ బహుమతి వచి్చంది. నేను 2024లో కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రతి ప్రముఖ దేవాలయంలో నృత్య నీరాజన కార్యక్రమంలో పాల్గొన్నా. – కె.హర్షిత కావ్య అనేక బహుమతులు వచ్చాయి నేను ఐదోతరగతి చదువుతున్నాను. మలేషియా పోటీలో సెమీ క్లాసికల్ జూనియర్ కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించా. 2023 జూన్‌లో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం వారు నిర్వహించిన హనుమాన్ చాలీసాను 14 గంటల 2 నిమిషాల పాటు 101 మంది కళాకారులతో కలసి నృత్యం చేసినందుకు గోల్డెన్ స్టార్, భారత్ వరల్డ్ రికార్డ్, గిన్సిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందా. – ధర్నాలకోట శరణ్య -
రాజమండ్రి పేపర్ మిల్ లాకౌట్
-
రాజమండ్రి : పర్యాటకుల మనస్సుదోచే పాపికొండల విహార యాత్ర (ఫొటోలు)
-
పోలీసులపై దొంగనోట్ల ముఠా దాడి
-
రాజమండ్రిలో సందడి చేసిన సినీనటి శ్రీలీల (ఫొటోలు)
-
రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును ప్రశ్నించిన దళితయువకుడిని..
-
AP: టీచర్ MLC ఎన్నికల పోలింగ్
-
రాజమండ్రిలో భూకంపం.. ఆందోళనలో ప్రజలు
-
ఏ కేసుపై అరెస్ట్ చేశారో FIR కాపీ చూపించడం లేదు: రవికిరణ్ భార్య
-
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం
-
పెట్రోల్ బంక్ వద్ద ఆగిఉన్న లారీలో మంటలు
-
పెట్రోల్‌బంక్ వద్ద లారీలో మంటలు.. తప్పిన ముప్పు
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా:రాజమండ్రి శివారు దివాన్ చెరువులో ఆదివారం(నవంబర్ 3) పెద్ద అగ్ని ప్రమాదం తప్పింది.పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది.వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటల్లో లారీ పాక్షికంగా దగ్ధమైంది. లారీ కేబిన్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిసింది. లారీలో నుంచి మంటలు పొగ ఎగిసిపడడంతో స్థానికులు పరుగులు తీశారు.ఇదీ చదవండి: పరవాడ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం -
జనసేన నేతల వేధింపులు.. మహిళా ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అంతులేని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా, సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించే ఓ శాఖలో పనిచేసే మహిళ ఉద్యోగిని సునితని జనసేన నాయకులు వేధింపులకు గురి చేశారు. తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరుల రూరల్ జనసేన అధ్యక్షుడు బండారు మురళీ,నానీలు నడకుదురు ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్‌ను వేధింపులకు గురి చేశారు. వేధింపులు తట్టుకోలేని బాధితురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే బాధితురాలు ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రూరల్ జనసేన అధ్యక్షుడు బండారు మురళీ,నానీ వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని బాధితురాలి భర్త వీరబాబు ఆరోపించారు. నిందితులు తన భార్యను నెలకు రూ.20 వేల లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, తాము అడిగినంత ఇవ్వలేదంటే లైగింక కోరికలు తీర్చాలని వేధించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏలూరు జిల్లాలో చిరుత కలకలం
ఏలూరు జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. ద్వారకాతిరుమల మండలం ఎం. నాగులపల్లి శివారులో రెండ్రోజుల చిరుత పులి సంచరించింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను గుర్తించేందుకు స్థానికంగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.అయితే సోమవారం ట్రాప్ కెమెరాలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు గుర్తించారు. ఆ ప్రాంతం పాదముద్రలు సేకరించి రాజమండ్రి ల్యాబ్‌కు పంపించారు. అదే సమయంలో చితరు సంచరిస్తుందని, పరిసర ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. -
రాజమండ్రి నుంచి మకాం మార్చిన చిరుత
-
ట్రాప్ కెమెరా నుంచి తప్పించుకున్న చిరుత..
-
రాజమండ్రిలో రూట్ మార్చిన చిరుత..
-
రాజమండ్రి శివారు ప్రజల్ని భయపెట్టిస్తున్న చిరుత
-
వారం రోజులు గడుస్తున్నా అటవీ శాఖ అధికారులకు చిక్కని చిరుత
-
రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్రరూపం (ఫొటోలు)
-
రాజమండ్రిలో చిరుత పులి కలకలం
-
తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు
-
రాజమండ్రిలో చిరుత కలకలం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. జాతీయ రహదారి సమీపంలో దూరదర్శన్ కేంద్రం వెనుక చిరుత సంచరించినట్లు ఆనవాళ్లను గుర్తించారు.చిరుత సంచారం దృశ్యాలు దూరదర్శన్ కేంద్రం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. చిరుత కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
-
రాజమండ్రి ఏటీఎం నగదు చోరీ కేసు: నిందితుడిని 12 గంటల్లో పట్టేశారు..
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు చెందిన రూ.2.2 కోట్ల చోరీ కేసును 12 గంటలలోపే పోలీసులు ఛేదించారు. నిందితుడు అశోక్ పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకున్ పోలీసులు నగదను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టి.. ఎస్పీ నర్సింహ కిశోర్ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు.హెచ్డీఎఫ్సీ ఏటీఎంలలో డబ్బులు నింపే ఏజెన్సీ తరఫున అశోక్ పనిచేస్తున్నాడని.. పక్కా ప్రణాళికతో బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ కళ్లు గప్పి నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఐదు ప్రత్యేక బృందాలతో గంటల వ్యవధిలో కేసును ఛేదించినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. సాంకేతిక, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.డిగ్రీ చదివిన మాచరమెట్లకు చెందిన వాసంశెట్టి అశోక్‌కుమార్.. రాజమండ్రిలోని ఏటీఎంలలో నగదు నింపే హెచ్‌టీసీ అనే ప్రైవేటు ఏజెన్సీ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నగరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సంబంధించిన 11 ఏటీఎంల్లో నగదు నింపేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఏజెన్సీ ఇచ్చిన రూ.2,20,50,000 చెక్కును దానవాయిపేట హెచ్డీఎఫ్సీ శాఖకు వెళ్లి నగదుగా మార్చాడు. ఆ సొమ్ము ఇనుప పెట్టెలో సర్దుకుని వ్యక్తిగత కారులో పరారయ్యడు.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కారును వదిలి పరారైన అశోక్‌ను స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలోని తన ఇంట్లో తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు అశోక్ తన ఊళ్లో గుండు చేయించుకుని తిరిగినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. -
ఏటీఎంల్లో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో ఉద్యోగి పరార్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దానవాయిపేటలో ఘరానా మోసం జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్ పరారయ్యాడు. 19 ఏటీఎంల్లో ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా డబ్బుతో హుడాయించాడు. అశోక్‌పై 'ఇటాచి ప్రైవేట్ ఏజెన్సీ' అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాజమండ్రి సౌత్ జోన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న టోల్ గేట్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు. -
రాజమండ్రి : గోదావరి ఉగ్రరూపం..నీట మునిగిన లంక గ్రామాలు (ఫొటోలు)
-
భారీగా పెరిగిన గోదావరి నీటిమట్టం
-
మీకు చేతులెత్తి మొక్కుతాం..టీడీపీ అరాచకాలపై సామాన్యులు
-
రాజమండ్రిలో పచ్చమూకల రచ్చ.. టీడీపీపై మార్గాని భరత్ రామ్ ఫైర్
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమని ఆ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మోరంపూడి ఫ్లై ఓవర్ శిలాఫలాకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చేశారని ధ్వజమెత్తారు. రాజమండ్రిని సొంత ఇల్లులా భావించాను. సొంత కార్యక్రమాలకు, వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జనం మధ్యలోనే గడిపాను. ఎంతోమంది నాయకులు ఎంపీలు, మేయర్లు అయ్యారు. రాజమండ్రిలో ఈ తరహా అభివృద్ధి ఎప్పుడు జరగలేదు. రాజమండ్రిలో మోరంపూడి శిలా ఫలాకాన్ని టీడీపీ నేతలు కూల్చేసినా ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడటం దారుణం. శిలాఫలకం కూల్చేసి క్రమశిక్షణకు మారుపేరని చెప్పటం ఎంతవరకు కరెక్ట్. అమరావతి రైతులు నిజమైన రైతులు కాదు.. రైతుల రూపంలో ఉన్న టీడీపీ మూకలు రాజమండ్రిలో మాపై దాడి చేశారు. దానిని మాత్రమే ప్రతిఘటించాం’’ అని మార్గాని పేర్కొన్నారు.‘‘అమరావతిలో కూల్చేసిన ప్రజావేదిక ఎన్జీటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది. ఉండ్రాజవరం, జొన్నాడ కైకలూరు, తేతలి నాలుగు ఫ్లై ఓవర్లు మంజూరు చేసిన జీవో కాపీలు కూడా చూపించాం. నాలుగు ఫ్లైఓవర్లకు సంబంధించి 345 కోట్ల రూపాయలు 2020లోనే మంజూరు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలపై చాలా బాధ్యత ఉంది. తమకు ఇంకా మంచి చేస్తారని ప్రజలు భావించి వారికి విజయాన్ని కట్టబెట్టారు. ఇచ్చిన హామీలు ఎంతమేర నిలబెట్టుకుంటారో చూద్దాం’’ అని మార్గాని భరత్ అన్నారు. -
రాజమండ్రిలో 1577 పోలింగ్ స్టేషన్లు
-
రాజమండ్రి సెంట్రల్ జైలు నీకోసం వెయిటింగ్: ఎంపీ భరత్
-
రాజమండ్రిలో సీఎం జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే
-
జగన్ సీఎం అయ్యాకే సక్రమంగా పింఛన్: వృద్ధులు


