లోన్లీ మంకీ ‘పంచ్’ కథ తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు..! | Baby Monkey From A Japanese Zoo Read His Story | Sakshi
Sakshi News home page

లోన్లీ మంకీ ‘పంచ్’ కథ తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు..!

Feb 19 2026 4:07 PM | Updated on Feb 19 2026 4:15 PM

Baby Monkey From A Japanese Zoo Read His Story

మూగజీవులు సైతం అమ్మ దగ్గరే కథే సురక్షితంగా, ధైర్యంగా ఉండగలవు. అమ్మ స్పర్శ ధైర్యం, ఆమె చెంత ఓదార్పు, నిశ్చింత అందిస్తుంది. అలాంటిది కన్నతల్లే బిడ్డను సాకేందుకు ఇష్టపడకపోతే..అంతకుమించిన దురదృష్టం ఇంకొకటి ఉండదు. పాపం ఈ కోతి పిల్లకు కూడా అలాంటి కష్టమే వచ్చింది. అ‍మ్మ వద్దంటున్నా..అమ్మే కావలంటే అల్లాడిని చిట్టి కోతి ఎంతలా..అమ్మ సహచర్యం కోసం ఎంతలా ఆరాట పడిందో తెలిస్తే..కన్నీళ్లు వచ్చేస్తాయి. 

ఆ చిట్టి కోతి జపాన్‌కి చెందిన మకాక్‌ జాతీ కోతి. ఇది జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో పుట్టింది. ఆ కోతిపిల్ల పేరు పంచ్‌. గతేడాది జూలై 26, 2025న జన్మించింది. తక్కవు బరువుతో పుట్టడంతో తల్లిసహచర్యం అత్యంత అవసరం అయితే. చిట్టికోతి తల్లి మాత్రం దాన్ని దగ్గరకు రానివ్వలేదు,పైగా దాని బాగుగోలు చూసుకునేందుకు విముఖత వ్యక్తం చేసింది. నిజానికి ఇదే తొలిసంతానం కూడా. అయినా కోతుల్లో కొన్ని ఎందుకనే మాతత్వాన్ని అంగీకరించవట. వాటి పిల్లలను సరిగా చూసుకోవట. సదరు జూ సంరక్షకులు చెబుతున్నారు. దాంతో ఆ చిట్టికోతి జూ సంరక్షకుల చేతిలోనే పెరిగింది. అయితే దానికి తన తల్లితోనే ఉండాలని చూసేది. 

దాంతో  జూ సంరక్షకులు ఆ కోతి పిల్ల బాధను తీర్చేలా అచ్చం దాని జాతి కోతి బొమ్మని ఇచ్చారు. ఎందుకంటే ఆ బెంగతో పిల్ల కోతి చచ్చిపోకుండదని గత్యంతరం లేక అలా చేశారు జూ అధికారులు. అయితే ఆ బొమ్మతో ఆడుకున్న తీరు..దాంతో మసిలిన తీరు  చూస్తే..మనసు ద్రవించిపోతుంది. అదే తల్లి అనుకుని దాన్ని గట్టిగా కౌగించుకుని పడుకోవడం వంటి చర్చలన్ని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. 

ఆ తర్వాత తన జాతి కోతుల్లా పెరగాల్సి కూడా ఉంటుంది. కాబట్టి అందుకోసం అని దాని జాతి కోతి దళంలోకి ఆ కోతిపిల్లను మార్చారు. పాపం మొదట్లో పెద్దపెద్ద కోతులు మందలించినా..వాటితో కలసిపోయింది. సహజంగా కోతుల ఉండే తీరులో పెరగడం, వాటితో సంభాషించడం నేర్చుకుంది. పైగా ఇప్పుడు దానికో సహచర్య స్నేహితుడు దొరికాడు. దాంతో ఎంతో సంతోషంగా గడుపుతోంది. 

అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ మారాయి. అవి చూస్తే..ఎవ్వరికైనా..అమ్మ..అమ్మే కదా అనిపిస్తుంది. ఒక్క క్షణం అమ్మ కనిపించకపోతే..ఏ బిడ్డైన అల్లాడిపోతాడు అది మూగజీవులకు కూడా వర్తిస్తుంది కదా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి ఆ వీడియోపై.

 

(చదవండి: డ్యామేజ్‌ని కూడా ఫ్యాషన్‌గా మార్చేశారు..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement