బొమ్మ కాదు.. మా అమ్మ.. | Monkey goes viral at Ichikawa City Zoo in Japan | Sakshi
Sakshi News home page

బొమ్మ కాదు.. మా అమ్మ..

Feb 19 2026 4:38 AM | Updated on Feb 19 2026 3:40 PM

Monkey goes viral at Ichikawa City Zoo in Japan

అవును.. ఈ బొమ్మ ఈ కోతికి అమ్మే! పుట్టినప్పుడే దీని అమ్మ వదిలేసింది. అప్పట్నుంచి ఈ బొమ్మే దీనికి అమ్మ అయింది. అమ్మ ఒడిలో ఉన్నంత భద్రంగా అనిపిస్తోందో ఏమో.. ఈ బొమ్మను ఎప్పుడూ కావలించుకునే పడుకుంటోంది. ఎక్కడికి వెళ్తే.. అక్కడికి తీసుకెళ్తోంది. జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో ఉండే ఈ ఆరు నెలల వానరం ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

చిన్నప్పుడు కోతి పిల్లలు(Baby Monkey) తల్లినే అంటిపెట్టుకుని ఉంటాయి. తల్లి దీన్ని వదిలేయడంతో జూ సిబ్బంది జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నారు. అందులో భాగంగా కొన్ని బొమ్మలను ఉంచారు. అందులోని ఈ కోతి బొమ్మను ఈ పిల్ల వానరం తల్లిగా భావిస్తూ.. ఇదిగో ఇలా ప్రేమను కురిపిస్తోంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement