తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్ | Hot Spot 2 Much Movie OTT Release Date Confirmed, Check Out Six OTT Streaming Platforms Details Inside | Sakshi
Sakshi News home page

OTT: ట్రెండ్‌కి తగ్గట్లే తీసిన బోల్డ్ మూవీ.. ఏకంగా ఆరు ఓటీటీల్లో

Feb 16 2026 4:57 PM | Updated on Feb 16 2026 5:01 PM

Hotspot2 Much Movie OTT Streaming Details

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా అప్పుడప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు కూడా వస్తుంటాయి. అలా 2024లో తమిళ వచ్చిన చిత్రం 'హాట్ స్పాట్'. మాట్లాడటానికే భయపడే కొన్ని కాన్సెప్ట్‌లని ఇందులో చూపించారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత డబ్బింగ్ కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా షాకయ్యారు. దీనికి 'హాట్‌స్పాట్ 2 మచ్' అని సీక్వెల్ తీయగా.. ఇది మాత్రం ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ఏకంగా ఆరు ఓటీటీల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? వేటిలోకి రానుంది?

(ఇదీ చదవండి: ఏంటి ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా అని తారక్ నాతో..)

సీక్వెల్‌లో ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రధారి కాగా.. బ్రిగిడ, భవానీ శ్రీ, తంబి రామయ్య తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. తొలి భాగాన్ని తీసిన విఘ్నేశ్ రాజా దీనికి కూడా దర్శకత్వం వహించాడు. గత నెల 23న థియేటర్లలోకి రాగా ఈ శుక్రవారం(ఫిబ్రవరి 20) నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రకటించారు. కాకపోతే అమెజాన్ ప్రైమ్, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా, లయన్స్ గేట్ ప్లే, షార్ట్ ఫ్లిక్స్ ఓటీటీ యాప్స్‌లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇదివరకు కొన్ని చిత్రాలు రెండు లేదా మూడింటిలోకి వచ్చాయి గానీ ఇలా ఒకేసారి ఆరింటిలో రానుండటం మాత్రం కచ్చితంగా విచిత్రమే.

హాట్‌స్పాట్ 2 మచ్ విషయానికొస్తే.. సినిమా హీరోల పట్ల అభిమానం పిచ్చిగా మారిపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఒకదానిలో చూపించగా.. స్వలింగ సంపర్కుల వివాహం గురించి జరిగే చర్చ మరోదానిలో.. ఓ వ్యక్తి తనకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు, సమాజం చూసే చూపు తదితర అంశాలతో మూడో స్టోరీతో తీశారు. ఈ మూడింటికి ఎలాంటి ముగింపు ఇచ్చారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement