రీసెంట్‌గా వచ్చిన 'శంబాల' సినిమాలో విలన్‌గా చేసిన రవివర్మ మంచి పేరు తెచ్చుకున్నాడు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ అడపాదడపా మాత్రమే మూవీస్ చేస్తూ వస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం వచ్చిన 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ మూడో సీజన్లోనూ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ క్రమంలోనే తాజాగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఒకదానిలో ఎన్టీఆర్‌తో తనకున్న జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. ఎంతలా తనని ర్యాగింగ్ చేశాడో చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)
'రాఖీ సినిమాని కేవలం ఎన్టీఆర్, కృష్ణవంశీని చూసే చేశారు. స్టోరీ కూడా నాకు సరిగా తెలియదు. వాళ్లు చెప్పింది చేసేశాను. నేను మొదట నటించిన 'వెన్నెల' మూవీ ప్రివ్యూ చేసిన కృష్ణవంశీ.. బాగా చేశావ్ ఇదెన్నో సినిమా అని అన్నారు. ఇదే తొలి చిత్రమని చెబితే ఆశ్చర్యపోయారు. సరే కలిసి పనిచేద్దాం అని అన్నారు. అలా పిలిచి 'రాఖీ'లో అవకాశమిచ్చారు. అందులో మెయిన్ విలన్ నేను అన్నట్లు చూపించారు గానీ నేనైతే అలా అనుకోలేదు. ఆ మూవీ చూపించిన ప్రభావం నుంచి బయటకు రావడానికి చాలా ఏళ్లు పట్టేసింది. నా ఫ్రెండ్స్ కూడా కొందరు.. మా చెల్లికి ఇలాంటి భర్త వస్తే ఏంటి పరిస్థితి అని భయపడ్డారు'
'రాఖీ సినిమాలో ఎన్టీఆర్.. నా కాళ్లు పట్టుకునే సీన్ ఒకటి ఉంది. అయితే నా దగ్గరకొచ్చి.. ఏంటి ఇప్పుడు నేను నీ కాళ్లు పట్టుకోవాలి అని ర్యాగింగ్ చేశాడు. గురువు గారు, నాకు తెలీదు, డైరెక్టర్-మీరు చూసుకోండి అని దండం పెట్టేశా. ఆ రోజంతా కూడా.. నీ పని చెప్తా అని నన్ను ఆటపట్టించారు. ఓ రేంజులో ఆడుకున్నారు. అలానే నా పుట్టినరోజు నాడు నేను చనిపోయే షూటింగ్ జరిగింది. దానిపై కూడా తారక్ కౌంటర్స్ వేస్తూనే ఉన్నారు. అలానే పెద్ద కేక్ కూడా సెట్‌కి తెప్పించి సెలబ్రేట్ చేశారు. తారక్,కృష్ణవంశీ ఇద్దరూ కలిసి నా ముఖమంతా కేక్ పుసేశారు' అని రవివర్మ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: బీజేపీ నేత దారుణ కామెంట్స్‌పై స్పందించిన త్రిష)


