బీజేపీ నేత దారుణ కామెంట్స్‌పై స్పందించిన త్రిష | Actress Trisha Sensational Reaction To Nainar Nagendran Comments About Her Personal Life, Check Out Post Went Viral | Sakshi
Sakshi News home page

Trisha Krishnan: విజయ్‌-త్రిష బంధంపై రాజకీయ విమర్శలు.. హీరోయిన్ పోస్ట్ వైరల్

Feb 16 2026 1:56 PM | Updated on Feb 16 2026 2:07 PM

Actress Trisha Responds Nainar Nagendran Comments

ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్యనే తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్.. విజయ్‌ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కి రాజకీయాలు తెలియవు, ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా అనేశాడు. దీంతో పెద్ద చర్చే నడిచింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు.. ఈ విషయాన్ని ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఇప్పుడు త్రిష కూడా స్పందించింది. ఈమె తరఫున లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

(ఇదీ చదవండి: అలాంటి కంటెంట్‌కి లేని సమస్య.. టైటిల్స్‌కి ఎందుకు?)

'ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్‌(త్రిష) ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలని పబ్లిక్‌గా చర్చించడం తగదు. త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం' అని లాయర్ నిత్యేష్ నటరాజ్ ప్రకటన విడుదల చేశారు.

దళపతి విజయ్, త్రిష పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు. చివరగా విజయ్ హీరోగా నటించిన 'గోట్' మూవీలో త్రిష, ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అయితే వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే రూమర్స్ చాన్నాళ్లుగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే వీటిని విజయ్‌పై విమర్శల చేయడానికి ఉపయోగించడమే ఈ మొత్తం వివాదానికి కారణమైంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement