నాలుగు రోజుల్లో రిలీజ్‌.. 'హే భగవాన్‌' టైటిల్‌ మార్పు | CBFC Suggested To Hey Bhagawan Movie title change | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో రిలీజ్‌.. 'హే భగవాన్‌' టైటిల్‌ మార్పు

Feb 16 2026 1:22 PM | Updated on Feb 16 2026 1:28 PM

CBFC Suggested To Hey Bhagawan Movie title change

టాలీవుడ్‌ను సెన్సార్ సమస్యలు ప్రభావితం చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం 'కపుల్ ఫ్రెండ్లీ, వానర సినిమాల టైటిల్స్‌ మార్చాలని సెన్సార్‌ బోర్డ్‌ సూచించింది. ఇప్పుడు తాజాగా సుహాస్ సినిమాకు అలాంటి ఇబ్బందే వచ్చింది. విడుదలకు కేవలం నాలుగురోజుల ముందు టైటిల్‌ మార్చాలని CBFC పేర్కొంది. దీంతో తప్పని పరిస్థితిల్లో సినిమా పేరును మార్చి పోస్టర్‌ను విడుదల చేశారు.

తండ్రీ తనయుల మధ్య అనుబంధాన్ని 'హే భగవాన్‌' మూవీలో  ఓ కొత్త కోణంలో చూపిస్తామని దర్శకుడు గోపీ అచ్చర అన్నారు. అయితే, తాజాగా సెన్సార్‌ సూచన ప్రకారం ఈ టైటిల్‌ను 'హే బల్వంత్‌'(Hey Balwanth)గా మార్చారు. దీంతో నెటిజన్లు షాకవుతున్నారు.  అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత  సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన చిత్రమిది. వీకే నరేశ్, యాంకర్‌ స్రవంతి కీలక పాత్రలు పోషించారు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంతోష్ శోభన్ నటించిన   కపుల్ ఫ్రెండ్లీ మూవీకి CBFC నుండి A సర్టిఫికేట్ లభించింది. కేవలం టైటిల్ కారణంగానే ఆ సర్టిఫికేట్ వచ్చిందని నిర్మాత, డిస్ట్రీబ్యూటర్‌ ధీరజ్ మొగిలినేని చెప్పారు. అదే 'ఫ్రెండ్లీ కపుల్' టైటిల్‌ పెడితే 'U/A' వచ్చేదని ఆయన గుర్తుచేశారు. దీంతో పెద్దలు మాత్రమే థియేటర్లలో సినిమా చూడాల్సి ఉంటుందనేది తెలిసిందే. మరోవైపు వానర మూవీ టైటిల్‌ను కాస్త వనవీరగా మార్చారు. హనుమంతుడితో ముడిపడి ఉన్న పేరు కావడంతో సున్నితమైన కుల,రాజకీయ అంశాలు ఉండటం వల్ల సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పలు కారణాలతో చిన్న సినిమాలకు సెన్సార్‌ చిక్కులు తప్పడం లేదని విమర్శలు వస్తున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement