శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు: ‍ప్రధాని మోదీ | PM Modi calls for global participation in AI Impact Summit | Sakshi
Sakshi News home page

శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందడుగు: ‍ప్రధాని మోదీ

Feb 16 2026 9:52 AM | Updated on Feb 19 2026 1:34 PM

PM Modi calls for global participation in AI Impact Summit

న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ దేశ యువతలోని ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములు కావాలంటూ సోమవారం ఆయన పిలుపునిచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ఎంత వేగంగా పురోగమిస్తోందో చెప్పడానికి ఈ సదస్సే నిదర్శనమని, ఈ రంగంలో దేశం సాధిస్తున్న వృద్ధిని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు భారత్‌కు రావడం మనందరికీ గర్వకారణం. ఇది మన దేశ యువత శక్తిసామర్థ్యాలను ప్రతిబింబిస్తోంది’ అని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ అగ్రగామిగా ఎదుగుతూ, ప్రపంచ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తోందనడానికి ఈ సందర్భమే ఒక గొప్ప నిదర్శనమని ఆయన కొనియాడారు.
 

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 16 నుండి 19 వరకు ఈ సదస్సు జరగనుంది.  ప్రధాని మోదీ దీనిని  ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో సుమారు 600 స్టార్టప్‌లు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాంwestడ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్తాన్, ఆఫ్రికా తదితర 13 దేశాలు ఈ ప్రదర్శనలో తమ ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేయడం విశేషం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రపంచ దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఇది ఒక వేదికగా నిలవనుంది. సుమారు 300 పైగా ఎగ్జిబిషన్ పెవిలియన్లు, 500 పైగా సెషన్లు నిర్వహించనుండగా, దాదాపు 2.5 లక్షల మంది సందర్శకులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితర ప్రపంచ నేతలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

ఇది కూడా చదవండి: ‘SIR’ విధుల్లో అక్రమాలు.. ఏడుగురిపై ఈసీ వేటు!

Advertisement
 
Advertisement
Advertisement