breaking news
Delhi
-
భారత్ బద్నాం కాకుండా మీరే కాపాడారు! లేకుంటేనా..
ఫ్లైదుబాయ్ విమానంలో పెను ప్రమాదాన్ని అడ్డుకుని వందలాది మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఘటన మరోలా ముగిసి ఉంటే.. భారత్‌పై ఎలాంటి ముద్ర పడేదో ఊహించలేమంటూ ఆయన పేర్కొన్నారు. ‘‘మీరు అందరినీ కాపాడారు. చాలా గొప్ప పని చేశారు’’ అంటూ కెప్టెన్ మచ్చార్‌ను ప్రధాని మోదీ అభినందించారు. యూఏఈలో చికిత్స పొందుతున్న మచ్చార్‌తో ఫోన్లో మాట్లాడిన మోదీ.. ‘‘ఇలా జరగకపోయి ఉంటే.. భారత్ ఏం ఎదుర్కోవాల్సి వచ్చేదో, భారత పైలట్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేదో, వారిని ప్రజలు ఎలా చూసేవారో ఎవరికి తెలుసు. మీరు అందరినీ కాపాడారు. మీరు చాలా గొప్ప పని చేశారు. భారత్, భారత పైలట్ల ప్రతిష్ఠను కాపాడారు’’ అని మోదీ వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చార్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రధాని ప్రశంసించారు. ‘‘దేశం మొత్తం మీ కోసం ప్రార్థిస్తోంది. మీ ఆరోగ్యం కోసం మహా మృత్యుంజయ జపం కూడా చేస్తున్నారు. మీ ధైర్యం, సమయస్ఫూర్తి, ప్రశాంతత ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి. భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కాదు.. ఇతరులను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారు అని దేశం గర్వంగా చెప్పుకోగలదు’’ అని మోదీ పేర్కొన్నారు. ఇదే సమయంలో.. సోషల్ మీడియాలో ఈ ఘటనపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కాక్‌పిట్‌లో దాడి.. ప్రాణాలకు తెగించిదుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఒమన్‌కు చెందిన కో-పైలట్ కెప్టెన్ మచ్చార్‌పై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత విమానాన్ని కూల్చేయాలని అతను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మచ్చార్.. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులను సహాయం కోరేలా చేశారు. దీంతో ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఉన్న అదనపు సిబ్బందిలో పైలట్లు.. విమానాన్ని కంట్రోల్ చేసి సౌదీ అరేబియాలో సేఫ్ ల్యాండ్ చేశారు. ఆ తర్వాత రక్తపు గాయాలైన మచ్చార్‌ను ఆస్పత్రిలో చేర్చి.. అతని ప్రాణాలను కాపాడగలిగారు.సోషల్ మీడియాలో మరో చర్చఫ్లైదుబాయ్ ఘటన తర్వాత.. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు, థియరీలు కనిపించాయి. ఎక్స్‌లో కొన్ని సంచలనాత్మక పోస్టులు కనిపించాయి. విమానం ప్రమాదానికి గురై ఉంటే.. భారత్‌ను బద్నాం చేసేందుకు కుట్రలు జరగాయని అందులో ఉన్నాయి. అందులోని భారత పైలట్‌పైనా ప్రశ్నలు, నిందలు గుప్పించేందుకు రంగం సిద్ధమైందన్నది వాటి సారాంశం. వీటిని ప్రధానంగా పాకిస్థాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు ప్రచారం చేసేందుకు రెడీ అయ్యాయని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. అయితే ప్రధాని మోదీ తన సంభాషణలో ఆ పోస్టులను నేరుగా ప్రస్తావించలేదు. కానీ, భారత పైలట్లపై ఏర్పడే అవకాశం ఉన్న అభిప్రాయాన్ని మాత్రమే ప్రస్తావించారు.An unforgettable conversation with Captain Smit, filled with pride and emotions. pic.twitter.com/CCf46PKOWR— Narendra Modi (@narendramodi) October 2, 2026ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలుకో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. మచ్చార్ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. విమానంలో 170 మందికి పైగా ప్రయాణికులు ఉన్న సమయంలో ఆయన ప్రదర్శించిన తెగువ కీలకంగా మారింది. లేకుంటే ఘోరమే జరిగి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ చదవండి: మీరే నాకు స్ఫూర్తి.. మోదీతో మచ్చార్ -
ఢిల్లీలో హైటెన్షన్.. ఇంటర్నెట్ బంద్
జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు అప్డేట్స్.. 👉సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు.. పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. జంతర్ మంతర్ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే, సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 👉ఢిల్లీలో ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై నిరసన తెలిపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు, కార్యకర్తలు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో భద్రతను కట్టుదిట్టం చేసిన ఢిల్లీ పోలీసులు డ్రోన్లతో ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. ఆందోళనలో పాల్గొన్న ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురు ఆప్ కార్యకర్తలను కూడా పోలీసులు డిటైన్ చేసినట్లు తాజా సమాచారం.No chance this time.🚨 AAP leader Saurabh Bhardwaj detained by Delhi Police at Jantar Mantar while protesting against CEC Gyanesh Kumar.Next number: Neha Bora, Abhijeet Dipke and whole CJP 🔥🤣 pic.twitter.com/f5apluLSBH— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) October 2, 2026👉ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR), ఎన్నికల సంఘం పనితీరుపై నిరసన వ్యక్తం చేస్తూ కార్యకర్తలు, రాజకీయ నేతలు, పౌరసమాజ ప్రతినిధులు ఆందోళనకు పిలుపునిచ్చారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనలు చేపట్టారు. అయితే జంతర్ మంతర్ వద్ద ఈ ఆందోళనకు ఢిల్లీ పోలీసులు ముందస్తు అనుమతి ఇవ్వలేదు.👉ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరసనకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో కేంద్ర ఢిల్లీలో భద్రతను మరింత పెంచారు. పరిస్థితిని బట్టి డ్రోన్ల ద్వారా గుంపుల కదలికలను పర్యవేక్షించే ఏర్పాట్లు కూడా చేశారు.JANTAR MANTAR PROTEST OVER CEC GYANESH KUMARDelhi Police denied permission for a protest at Jantar Mantar over the SIR and electoral-roll controversy involving CEC Gyanesh Kumar. Section 163 BNSS was imposed in New Delhi restricting gatherings without permission. The… pic.twitter.com/l6ScHMliza— Ravi Prakash Official (@raviprakash_rtv) October 2, 2026👉ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ మెట్రో 11 స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. జంతర్ మంతర్ వద్ద ప్రతిపాదిత ఆందోళన నేపథ్యంలో ప్రజల భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు న్యూఢిల్లీలో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ముందస్తు అనుమతి లేకుండా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, ర్యాలీలు, ధర్నాలు, నినాదాలు, ప్రసంగాలపై ఆంక్షలు విధించారు. నిషేధాజ్ఞలు అమలు చేయడంతో రాజధానిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.👉ఇంటర్నెట్ సేవలు నిలిపేయడంతో యాప్ బుకింగ్.. ఊబర్, ఓలా, భారత్ టాక్సీ, ఫోన్ పే, గూగుల్ పే సేవలు ఆగిపోయాయి. సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. #WATCH | Delhi | Police and RAF personnel and Riot Control Vehicle deployed at Jantar Mantar, in view of a call for protest by activists, political leaders and civil society representatives against the ongoing Special Intensive Revision and demanding accountability from the Chief… pic.twitter.com/Kg21aCgGYY— ANI (@ANI) October 2, 2026👉ఇక, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. అక్టోబర్ 2న ముంబైలోని శివాజీ పార్క్‌లో ఆందోళనకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. అయితే శివాజీ పార్క్‌లో కార్యక్రమానికి ముంబై పోలీసులు అనుమతి ఇవ్వలేదని, ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవాలని సూచించారు. దీంతో, ముంబైలో హైఅలర్ట్ వాతావరణం నెలకొంది.👉ఇదిలా ఉండగా.. జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందిని మోహరించారు. అల్లర్ల నియంత్రణ వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జంతర్ మంతర్ సమీపంలోని జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్, సేవా తీర్థ్, మండీ హౌస్, లోక్ కల్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్ల గేట్లను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేశారు. దీంతో ఆయా స్టేషన్ల వద్ద ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. Delhi Metro Rail Corporation says, "The entry and exit at the following metro stations will remain closed till further notice: Janpath, Patel Chowk, Central Secretariat, Rajiv Chowk, Seva Teerth, Mandi House, Lok Kalyan Marg, INA, Chawri Bazar, Ramakrishna Ashram Marg and New… pic.twitter.com/aLGhbJOPXY— ANI (@ANI) October 2, 2026 -
ఈసీకి రాహుల్ గాంధీ బిగ్ క్వశ్చన్
కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఆన్లైన్ ఫామ్–6లో మార్పులు అక్రమంగా జరిగాయంటూ శుక్రవారం తన ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్ చేశారు. ఎవరి ఒత్తిడి మేరకు ఇలా చేశారో చెప్పాలంటూ వరుస ప్రశ్నలు సంధించారాయన. ఎన్నికల సంఘం (ECI) సూచనల మేరకు టీసీఎస్ (TCS) తన డిజిటల్ పోర్టల్‌లో మార్పులు చేసిందా? ఒకవేళ చేస్తే.. ఆ మార్పులకు టీసీఎస్‌లో ఎవరు ఆమోదం తెలిపారు? వారిపై ఒత్తిడి ఏమైనా ఉందా? అంటూ రాహుల్ గాంధీ ఈసీని వరుస ప్రశ్నలు సంధించారు.‘‘ఆన్లైన్ ఫామ్–6ను అక్రమంగా మార్చారు. ఈ మార్పుపై ఈసీలోని కమిషనర్లే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టీసీఎస్‌ను ఈ మార్పు చేయాలని ఈసీలో ఎవరు ఆదేశించారు?’’ అని అని ప్రశ్నించారు. ఈ మార్పులకు టీసీఎస్‌లో ఎవరు ఆమోదం తెలిపారో, ఆ నిర్ణయం తీసుకునేలా వారిపై ఒత్తిడి తెచ్చారా? అని అడిగారు.The online Form 6 was changed illegally - as the EC's own Commissioners have recorded.Who at the ECI ordered Tata Consultancy Services to make that change?Who at TCS signed off on it? And were they pressured into doing it?— Rahul Gandhi (@RahulGandhi) October 1, 2026ఫామ్–6లో ఏం మారిందంటే..కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫామ్–6ను ఉపయోగిస్తారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) సమయంలోనూ ఇది కీలకమైన ఫామ్. ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగిపోయిన పేర్లను మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చుకోవడానికి కూడా దీనిని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ ఫామ్‌కు అదనంగా ఓ డిక్లరేషన్ జత చేశారు. గతంలో జరిగిన ఎస్ఐఆర్ సమయంలో రూపొందించిన ఓటర్ల జాబితాలో దరఖాస్తుదారుడి పేరు ఉందా? లేక వారి తల్లిదండ్రులు లేదా తాత, నానమ్మ/అమ్మమ్మ పేర్లు ఉన్నాయా? అనే వివరాలను ఇందులో కోరారు.ఇద్దరు ఈసీల అభ్యంతరాలు..ఈ మార్పుపై ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ సంచలనాత్మక కథనం ఇచ్చింది. 1960 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్ రూల్స్‌లో నిర్దేశించిన ఫామ్‌ను నిబంధనలను సవరించకుండా మార్చే అధికారం ఎన్నికల సంఘానికి లేదని వారు అభిప్రాయపడినట్లు ఆ కథనం పేర్కొంది. ఇలాంటి మార్పులను సూచించే లేదంటే అమలు చేసే అధికారం న్యాయశాఖకు మాత్రమే ఉందని వారు చెప్పినట్లు తెలుస్తోంది. ఈసీ వివరణ ఏంటి?అయితే ఫామ్–6ను తాము మార్చలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అసలు చట్టబద్ధమైన ఫామ్–6 యథాతథంగానే ఉందని.. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం దానికి కేవలం ‘అనెక్సర్–డి’ అనే అదనపు డిక్లరేషన్‌ను జత చేశామని వివరించింది. మే 27న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ డిక్లరేషన్ జత చేసే అంశానికి సమర్థన లభించిందని కూడా ఈసీ పేర్కొంది. ఎస్ఐఆర్కు సంబంధించిన నిర్ణయాలకు ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదం ఉందని తెలిపింది.ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో తొలగింపుఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో ఫామ్–6కు జత చేసిన అదనపు డిక్లరేషన్‌ను సెప్టెంబర్ 30 నుంచి ఈసీఐనెట్(ECINET) పోర్టల్ నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో కొత్త ఓటర్లు సాధారణ ఫామ్–6తోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న 13 రాష్ట్రాల్లో ఈ అదనపు డిక్లరేషన్ అందుబాటులోనే ఉంటుంది. ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో మాత్రమే ఈ అదనపు ఫామ్ అవసరం ఉండదని ఈసీ స్పష్టం చేసింది.ఆందోళనలకు సిద్ధమవుతున్న విపక్షాలుఫామ్–6 వివాదంతోపాటు ఎస్ఐఆర్పై విపక్షాలు ఎన్నికల సంఘంపై విమర్శలు కొనసాగిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమన్వయ సమావేశంలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆందోళనలకు నిర్ణయించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి 8వ తేదీ వరకు జిల్లా స్థాయిలో ‘సేవ్ డెమోక్రసీ మార్చ్’ నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అక్టోబర్ 6న విపక్ష ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ రెండో వారంలో ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి తమ అభ్యంతరాలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు.ఫామ్–6లో మార్పులపై రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రధాన ప్రశ్న మాత్రం ఇదే. ఈ మార్పు చేయాలని టీసీఎస్‌ను ఆదేశించింది ఈసీలో ఎవరు? ఆ నిర్ణయానికి ఎవరు ఆమోదం తెలిపారు?. ఈ ప్రశ్నలపై ఎన్నికల సంఘం, టీసీఎస్ నుంచి వచ్చే తదుపరి వివరణ కీలకంగా మారనుంది.ఇదీ చదవండి: ఆఫ్రికా నుంచి సీబీఐ ఆఫీసర్లా? -
పండుగ వేళ గ్యాస్‌పై బాదుడు.. సిలిండర్ ధరల పెంపు
ఢిల్లీ: దసరా పండుగ సీజన్ వేళ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర మరింత పెరిగింది. అక్టోబర్ నెల తొలి రోజే గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల సిలిండర్‌పై ఏకంగా రూ.62.50 పెంచడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారాలపై అదనపు భారం పడనుంది. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది.తాజా పెంపుతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ.2,810కి చేరింది. సెప్టెంబర్‌లో కూడా కమర్షియల్ సిలిండర్ ధర రూ.9.50 పెరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈనెలలో కూడా 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో రూ.942, ముంబైలో రూ.941.50, చెన్నైలో రూ.957.50, కోల్‌కత్తాలో రూ.968, హైదరాబాద్‌లో రూ.994గా ధరలు కొనసాగుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ ధర పెరగడంతో ముఖ్యంగా వ్యాపారుల నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.తాజాగా ధరల పెంపు తర్వాత ఇలా.. ఢిల్లీలో రూ.2,810ముంబైలో రూ.2,763.50, హైదరాబాద్‌లో రూ.3,058.50, కోల్‌కతాలో రూ.2,946.50, చెన్నైలో రూ.2,979కి కమర్షియల్ సిలిండర్ ధర చేరింది. #BREAKING | Ahead of the festive season, commercial LPG prices hiked again from October 1, with the price of a 19-kg cylinder in Delhi rising by Rs 62.50 to Rs 2,810.#LPG pic.twitter.com/HgKAVqJOcW— OTV (@otvnews) October 1, 2026ఇదీ చదవండి: వంట గ్యాస్‌పై సుంకం.. కేంద్రం కొత్త ప్లాన్ -
కీలక నిర్ణయాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీలో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1,789.52 కోట్ల అంచనా వ్యయంతో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ITMS) అమలుకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని 42 ప్రధాన ట్రాఫిక్ కారిడార్లను మూడు దశల్లో 24 నెలల్లో ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్, రియల్‌టైమ్ ట్రాఫిక్ సమాచారం, ఆటోమేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ అందుబాటులోకి తెస్తారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు గ్రీన్ కారిడార్ సౌకర్యం కల్పించనున్నారు. ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలను రియల్‌టైమ్‌లో గుర్తించి వేగంగా స్పందించేలా వ్యవస్థను రూపొందించనున్నారు. రాంగ్ రూట్, స్పీడింగ్, రెడ్‌లైట్ జంపింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ ఉల్లంఘనలను టెక్నాలజీతో గుర్తించనున్నారు.కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలురబీ సీజన్ కు పంటల మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం2027-28 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ఆరు రబీ పంటల కనీస మద్దతు ధరలను (MSP) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందికుసుమకు అత్యధికంగా క్వింటాల్‌కు రూ.675, ఆవాలు-రాప్సీడ్కు రూ.413 చొప్పున పెంచిందిమసూర్ పప్పుకు రూ.390, బార్లీకి రూ.136, శనగకు రూ.83, గోధుమకు రూ.25 పెంపు లభించిందిపెరిగిన ధరలతో గోధుమ MSP రూ.2,610, శనగ రూ.5,958, మసూర్ రూ.7,390, ఆవాలు రూ.6,613, కుసుమ రూ.7,215, బార్లీ రూ.2,286కు చేరిందిరైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యమని కేంద్రం వెల్లడిగ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు కేంద్ర కేబినెట్ ఆమోదంరూ.1,86,405 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌లోకి అనుసంధానం50 గిగావాట్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏర్పాటు 2032-33 ఆర్థిక సంవత్సరం నాటికి పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంకేంద్ర ఆర్థిక సాయం రూ.54,082 కోట్లువిద్యుత్ ప్రసార ఖర్చులను తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగం పెంచేందుకు ఈ పథకం దోహదం -
ఫైర్ క్రాకర్స్ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో బాణసంచా కాల్చడంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం (సెప్టెంబర్ 30) విచారణ జరిపింది. ఈ సందర్భంగా టపాసుల వినియోగంపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.ఢిల్లీలో బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని, అలాగని రోజంతా వాటి వాడకాన్ని అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. బాణసంచాపై పూర్తి నిషేధం విధిస్తే కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతింటాయని కోర్టు పేర్కొంది. అదే సమయంలో, రోజంతా బాణసంచా కాల్చడానికి అనుమతిస్తే వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లలతో సహా ప్రతి ఒక్కరిపైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. బాణసంచా కాల్చడానికి నిర్దిష్ట సమయాలను,అనుమతించదగిన బాణసంచా రకాలను నిర్ణయించడం ద్వారా ఒక మధ్యేమార్గాన్ని కనుగొనాలని సూచించింది. బాణసంచా తయారీలో బేరియం వినియోగం, శబ్ద స్థాయిలను (డెసిబెల్ స్థాయిలు) పరిశీలించేందుకు సంయుక్త పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారానికి సంబంధించి తదుపరి విచారణను అక్టోబర్ 15వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.ఇదీ చదవండి : కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం -
అఖిలేశ్ డుమ్మా.. ఏ కోణంలో చూసినా అలకే!
కేంద్ర ఎన్నికల సంఘం, ఎస్ఐఆర్ అంశాలపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించేందుకు ఇండియా కూటమి కీలక నేతలు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీకి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ హాజరుకాలేదు. ఈ గైర్హాజరు ఇప్పుడు హస్తిన రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అఖిలేశ్ కావాలనే ఈ సమావేశానికి దూరంగా ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అఖిలేశ్ కీలక సమావేశానికి గైర్హాజరు కావడం హాట్ టాపిక్ అయ్యింది. కూటమిలో సీట్ల లెక్కలు తేలకముందే కాంగ్రెస్‌కు తన అసంతృప్తిని పరోక్షంగా తెలియజేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సీట్ల లెక్కపై పేచీ..ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కనీసం 150 స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ ప్రకటించారు. మొత్తం 403 స్థానాల్లోనూ పోటీకి సిద్ధమవుతున్నామని ఆయన చెప్పారు. మరోవైపు ఎస్పీ మాత్రం కాంగ్రెస్‌కు సుమారు 85–90 స్థానాల వరకు మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాయ్‌బరేలీ, అమేథీ పరిధిలోని కొన్ని స్థానాల విషయంలోనూ ఇరు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.అయితే ఎస్పీ మాత్రం కాంగ్రెస్‌తో విభేదాలు లేవనే అంటోంది. అఖిలేశ్ గైర్హాజరుకు రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియే కారణమని ఎస్పీ చెబుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారని తెలిపింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా అఖిలేశ్‌తో మాట్లాడానని, నామినేషన్ ప్రక్రియ కారణంగానే ఆయన వ్యక్తిగతంగా సమావేశానికి రాలేకపోయారని చెప్పారు. రియాక్షన్ మరీ ఇలాగనా?కానీ, అఖిలేశ్ స్థానంలో ఎస్పీకి చెందిన ప్రముఖ నేతలు ఇండియా కూటమి సమావేశానికి రాలేదు. మొహిబుల్లా నద్వీ, హరేంద్ర మాలిక్ లాంటివాళ్లను సమావేశానికి పంపడం కూడా చర్చకు దారితీసింది. దీంతో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నుంచి వస్తున్న ఒత్తిడికి అఖిలేశ్ తనదైన రీతిలో స్పందిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా అఖిలేశ్ కూటమి సమావేశానికి దూరంగా ఉండటంపై వ్యాఖ్యలు చేశారు. కూటమికి నాయకత్వం వహించాలంటే అఖిలేశ్ మరింత విశాల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ఎస్పీ వర్గాల్లో ఇప్పుడు అసంతృప్తికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరోవైపు ఇండియా కూటమి సమావేశంలో ఎస్ఐఆర్, ఎన్నికల సంఘంపై ఉమ్మడి కార్యాచరణ, తదుపరి ఆందోళనలపై చర్చ జరిగింది. అఖిలేశ్ గైర్హాజరుతో పాటు డీఎంకే, ఆప్ వంటి పార్టీల దూరం నేపథ్యంలో కూటమి అంతర్గత సమన్వయంపై చర్చ మొదలైంది.ఇదీ చదవండి: సీఈసీపై ‘ఇండియా’ కూటమి సమరశంఖం! -
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద ఫారం-6లో మార్పులను ఎన్నికల సంఘం తొలగించింది. మార్పులను చట్ట విరుద్ధం అంటూ గతంలో ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఎస్ఐఆర్ ముగిసిన రాష్ట్రాల్లో పాత ఫారం-6 మళ్ళీ అమల్లోకి తెచ్చారు. ‘సర్’ డిక్లరేషన్‌పై ఈసీ కీలక మార్పు చేసింది.ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లోని అదనప ‘సర్’ డిక్లరేషన్‌ను ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈసీ తొలగిస్తూ నిర్ణయం తీసకుంది. ఆయా ప్రాంతాల్లో కొత్త ఓటర్లు సాధారణ ఫారం-6 మాత్రమే సమర్పించాలి. ‘సర్’ ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం ఈ అదనపు డిక్లరేషన్ కొనసాగించనున్నారు.గతంలో ఈ డిక్లరేషన్ ద్వారా దరఖాస్తుదారులు, వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల పేర్లు గతంలో జరిగిన ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాల్లో ఉన్నట్లు వివరాలు ఇవ్వాల్సిన పరిస్థితి. సెప్టెంబర్ 26న సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది.ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో ‘ఇరుముడి’ సీన్ రిపీట్! -
కాగితపు పులిలా ఐరాస!.. షోలే మీమ్‌తో ఇరాన్ పంచ్!
భారతీయ సినిమాలతో ఇరాన్ చేస్తున్న ‘మీమ్ డిప్లమసీ’ ఇప్పుడు మరో లెవల్‌కు చేరింది. మొన్న బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’.. నిన్న ప్రభాస్ ‘బాహుబలి’.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ క్లాసిక్ ‘షోలే’లోని థాకూర్ బల్దేవ్ సింగ్‌ను రంగంలోకి దించింది. ఈసారి ఇరాన్ టార్గెట్ అమెరికా కాదు.. ఐక్యరాజ్యసమితి (ఐరాస). యుద్ధాలు, అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో ఐరాస సమర్థంగా డీల్ చేయలేకపోతోందంటూ తన అభిప్రాయాన్ని ఓ వ్యంగ్య మీమ్ ద్వారా చెప్పింది. భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్‌లో ఓ మీమ్‌ను పోస్టు చేసింది. అందులో రెండు ఫొటోలను పక్కపక్కన పెట్టింది. మొదటి ఫొటోలో మార్వెల్ సూపర్‌హీరో డాక్టర్ స్ట్రేంజ్‌ను పలు చేతులతో చూపించింది. దానిపై స్కూల్ పుస్తకాల ప్రకారం ఐక్యరాజ్య సమితి అని రాసింది. అంటే పుస్తకాల్లో ఐరాసకు ప్రపంచ సమస్యలను పరిష్కరించేంత శక్తి, అనేక మార్గాల్లో పనిచేసే సామర్థ్యం ఉన్నట్లు చూపిస్తున్నారనే కోణం. అదే పక్కన ‘షోలే’లోని థాకూర్ బల్దేవ్ సింగ్ ఫొటోను పెట్టింది. షోలే చిత్రంలో గబ్బర్ చేతిలో చేతులు కోల్పోయిన థాకూర్ పాత్ర కింద యూఎన్ ఇన్ రియాలిటీ అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే వాస్తవ పరిస్థితుల్లో పెద్ద అంతర్జాతీయ సంక్షోభాలపై చర్య తీసుకునే విషయంలో ఐరాస ‘చేతులు కట్టేసిన’ సంస్థలా ఉందన్నది ఇరాన్ వ్యంగ్య సందేశం. UN according to school booksUN in reality pic.twitter.com/GQ4gOG8fC0— Iran in India (@Iran_in_India) September 29, 2026ఆరాఘ్చీ విమర్శల వేళ..ఈ మీమ్ రావడానికి ముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాఘ్చీ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో సమావేశమయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఐరాస తగినంతగా స్పందించడం లేదని అరాఘ్చీ విమర్శించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. యూఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనల విషయంలో ప్రపంచ సంస్థ మౌనం వహించకూడదని, అమెరికా నుంచి వస్తున్నాయని ఇరాన్ పేర్కొంటున్న బెదిరింపులను ఐరాస స్పష్టంగా ఖండించాలని ఆయన కోరినట్లు సమాచారం. అయితే తాజా మీమ్‌లో ఇరాన్ ఏదైనా నిర్దిష్ట ఐరాస తీర్మానం లేదంటే ఒక్క ఘటనను నేరుగా ప్రస్తావించలేదు. ప్రపంచ సంక్షోభాల సమయంలో ఐరాసకు ఉన్న అధికారిక పాత్రకు, ఆచరణలో అది చూపగల ప్రభావానికి మధ్య వ్యత్యాసం ఉందన్న తన విమర్శను మాత్రమే మీమ్ రూపంలో వ్యక్తం చేసింది. భారతీయ సినిమాలే ఎందుకు?ఇరాన్ దౌత్య కార్యాలయాలు భారతీయ సినిమాలను తమ డిజిటల్ ప్రచారంలో ఉపయోగించడం ఇటీవల వరుసగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 27న హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ యుద్ధ సన్నివేశాన్ని పోస్టు చేసింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఐరాస ప్రసంగంలో ‘తలవంచబోం’ అన్న సందేశాన్ని బాహుబలి పోరాటంతో పోల్చింది. అంతకుముందు బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సన్నివేశాన్ని.. ట్రంప్‌పై సెటైరిక్‌గా ఇరాన్ దౌత్య వర్గాలు ఉపయోగించాయి. ఇప్పుడు ‘షోలే’లోని థాకూర్ పాత్రతో ఐరాసపై సెటైర్ చేయడం ద్వారా భారతీయ పాప్ కల్చర్‌ను మరోసారి తన అంతర్జాతీయ సందేశానికి వాడుకుంది.మీమ్ డిప్లమసీకి కొత్త రూపంసాధారణంగా దేశాలు అంతర్జాతీయ వివాదాలపై ప్రకటనలు, ప్రెస్నోట్లు, అధికారిక ప్రసంగాల ద్వారా తమ వైఖరిని వెల్లడిస్తాయి. ఇరాన్ మాత్రం సోషల్ మీడియాలో మీమ్స్, సినిమాల సన్నివేశాలు, వ్యంగ్య వీడియోలను ఉపయోగిస్తూ తన సందేశాన్ని ప్రజలకు చేరువ చేస్తోంది. ఇటువంటి పోస్టులు క్లిష్టమైన భౌగోళిక రాజకీయ అంశాలను సులభమైన, వెంటనే అర్థమయ్యే విజువల్స్‌గా మార్చుతున్నాయి. ఇదీ చదవండి: ట్రంప్ సంచలన నిర్ణయంతో కొత్త చర్చ! -
బస్సులో బాలికపై అత్యాచారం ఘటన.. కీలక ఆధారాలు లభ్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆగస్ట్ 4వ తేదీన 16 ఏళ్ల బాలికపై బస్సులో అత్యాచారం జరిగిన కేసులో పోలీసులు ఛార్జ్‌షిట్ దాఖలు చేశారు. మరో నిర్భయ ఘటనగా సంచలనం రేపిన ఈ కేసులో ఇద్దరు నిందితులపై అభియోగాలకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. కశ్మీర్ గేట్ పోలీస్‌స్టేషన్ పోలీసులు సమర్పించిన 398 పేజీల ఛార్జ్షిట్ను పరిశీలించిన న్యాయస్థానం గత వారం కేసు విచారణకు అంగీకరించినట్లు తెలిసింది. 11వ తరగతి చదివే బాధితురాలు యూపీలోని ఫరీదాబాద్‌లో బస్సెక్కింది. నోయిడాలో దిగాల్సి ఉంది.అయితే, ఆమె తెలియక సుమారు 10 కిలోమీటర్లు ముందుగానే బస్సు దిగింది. పొరపాటు తెలుసుకుని, లిఫ్టు కోసం అటుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన మరో బస్సును ఆపింది. అందులోని వారు ఆమెను ఎక్కించుకున్నారు. బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడాన్ని గమనించిన ఆమె కిందికి దిగేందుకు ప్రయత్నించగా కండక్టర్ బలవంతంగా అడ్డుకున్నాడు. అనంతరం, బస్సు ముందుకు వెళ్తుండగానే ఆమెపై డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. దాదాపు 40 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం ఢిల్లీ కశ్మీరీ గేట్ ప్రాంతంలో బాలికను వదిలివేసి వెళ్లిపోయారు. బాధితురాలు కశ్మీర్ గేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగు గంటల్లోనే నిందితుల అరెస్ట్ సీసీటీవీ ఫుటేజీ సాయంతో పోలీసులు ఆ బస్సు ఆచూకీని తెలుసుకున్నారు. తిమార్పూర్లోని పార్కింగ్ ప్రాంతంలో ఉన్న ఆ బస్సును గుర్తించారు. డ్రైవర్ కుల్దీప్ (39), కండక్టర్ సందీప్ (26)లను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ యూపీలోని కాన్పూర్ వాసులు. ఫిర్యాదు అందిన 4 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో భద్రత, నిబంధనల అమలుకు సంబంధించిన తనిఖీలకు సంబంధించిన అధికారులెవరూ బస్సును ఆపలేదని తెలిపారు. అదే సమయంలో బస్సుపై సుమారు రూ. 63 వేల 11 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడైంది. అతివేగానికి సంబంధించిన వాటిలో ఏడు చలాన్లు జూలైలోనే జారీ అయినవని పోలీసులు పేర్కొన్నారు.ఆధారాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు డ్రైవర్, కండక్టర్‌ను నియమించే సమయంలో పోలీస్ వెరిఫికేషన్ నిర్వహించలేదని కూడా పోలీసులు గుర్తించారు. బస్సులోని సీసీటీవీ కెమెరా కూడా పనిచేయడం లేదని, కిటికీలకు భారీ తెరలు ఉండటంతో బయట నుంచి లోపలి పరిస్థితులు కనిపించని విధంగా ఉన్నట్లు గుర్తించారు. బస్సులో జీపీఎస్, వాహన ట్రాకింగ్ వ్యవస్థలు, అత్యవసర సమయంలో ప్రయాణికులు వినియోగించే పానిక్ బటన్లు వంటి భద్రతా వ్యవస్థలు ఉన్నాయా? ఉంటే అవి ఘటన సమయంలో పనిచేస్తున్నాయా? అనే అంశాలనూ పోలీసులు పరిశీలించారు. దర్యాప్తులో సేకరించిన వీర్యం, వెంట్రుకల వంటి జీవ సంబంధిత నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపించారు. కేసు విచారణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ నివేదికను త్వరగా అందించాలని పోలీసులు కోరినట్లు సమాచారం. -
కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్, ఉత్తమ్ భేటీ
సాక్షి, ఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించామని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు.ఢిల్లీలో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో వారు చర్చించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీని ఎఫ్ఆర్ఎల్ +152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా అంగీకారం కుదిరేలా చూడాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఆ స్థాయిలో బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ఆధారంగా నీటిని ఎల్లంపల్లికి తరలించేందుకు వీలుంటుందని తెలిపారు. దాంతో నీటి తరలింపునకు అవసరమయ్యే విద్యుత్ వినియోగం, విద్యుత్ వ్యయం తగ్గుతుందని వివరించారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్), డిండి ఎత్తిపోతల పథకం (డీఎల్ఐఎస్), సీతారామ సాగర్ బహుళార్ధక ప్రాజెక్టు (ఎస్‌ఎస్‌ఎంపీ), గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్యావరణ అనుమతులకు మార్గదర్శకాలను జారీ చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులకు వెంటనే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు. అనుమతుల జాప్యంతో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతోందని సీఎం తెలిపారు.సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను త్వరగా మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం పొందేందుకు తాము చర్చిస్తున్నామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆధ్వర్యంలో చేపడుతున్న టెలీమెట్రీ యంత్రాలను త్వరగా ఏర్పాటు చేయాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మొదటి దశ టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటుకు అవసరమైన రూ.4.15 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.మొదటి దశ టెలీమెట్రీ యంత్రాలను ఏర్పాటు త్వరగా పూర్తి చేయడంతో పాటు రెండు, మూడో దశలకు సంబంధించిన యంత్రాలను త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల) ఆదిత్యనాధ్ దాస్, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: రూ.500 నోటుకు చిల్లర అడిగితే ఇస్తున్నారా? జర భద్రం.. -
అక్కడ జనవరి దాకా నిర్మాణాలపై నిషేధం
న్యూఢిల్లీ: శీతాకాలం సమీపిస్తున్న వేళ ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశరాజధాని వాసులపై తీవ్ర ప్రభావం చూపే వాయు కాలుష్యం కట్టడికి నడుం బిగించింది. వాహనాల్లో ఇంధనం నింపాలంటే పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం, కార్యాలయాల పని వేళలను కుదించడం వంటి పలు చర్యలను కఠినంగా అమలు చేయనుంది. ఢిల్లీ పర్యావరణ శాఖమంత్రి మంజిందర్ సింగ్ సిర్సా సోమవారం ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. నవంబర్ ఒకటి నుంచి 2027 జనవరి 31వ తేదీ వరకు ధూళిని వ్యాప్తి చేసే నిర్మాణాల కూల్చివేత, బహిరంగ సివిల్ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం ఉంటుందన్నారు. అదేవిధంగా, డిసెంబర్ 10 నుంచి జనవరి 20వ తేదీ వరకు అన్ని రకాల నిర్మాణ, కూల్చివేతల కార్యకలాపాలన్నింటిపై పూర్తి స్థాయి నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. నవంబర్ ఒకటి నుంచి పార్కింగ్ చార్జీలు రెట్టింపు చేస్తామని, ఎలక్ట్రిక్ వాహనాలకైతే పార్కింగ్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. ఆఫీసు పని వేళలను తగ్గించడం తోపాటు సగం పనిని వర్క్ ఫ్రం హోం విధానంలో పూర్తి చేసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని వివరించారు.నవంబర్ ఒకటో తేదీ నుంచి ఉద్గారాలు బీఎస్–6 ప్రమాణాల కంటే తక్కువగా ఉండే వాహనాలను ఢిల్లీలోకి ప్రవేశం ఉండదని తెలిపారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సారథ్యంలో సీఎం రేఖా గుప్తా తదితరులతో ఏర్పాటైన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నామని సిర్సా వివరించారు. ‘నో పీయూసీ– నో ఫూయల్’విధానం కఠినంగా అమలవుతుందన్నారు. అదేవిధంగా, కాలం చెల్లిన వాహనాలను గుర్తించేందుకు ఢిల్లీ వ్యాప్తంగా 500 పెట్రోల్ బంక్‌ల్లో ఏఎన్పీఆర్(ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) పరికరాలను అమర్చామని వివరించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం తమ బాధ్యతన్నారు. ఇందుకుగాను, అక్టోబర్‌లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, నవంబరులో కాలుష్య పరీక్ష కేంద్రా(పీయూసీ)లను అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు. ఢిల్లీ–ఎన్సీఆర్ వ్యాప్తంగా గుర్తించిన 62 కాలుష్య హాట్స్పాట్లకు గాను ఇప్పటివరకు 42 చోట్ల కాలుష్య తీవ్రతను అదుపులోకి తెచ్చామన్నారు. -
ఈసీ వివాదం.. అదే డిమాండ్ చేసిన మహారాష్ట్ర సీఈవో!
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో మహారాష్ట్ర నుంచి కీలక ప్రతిపాదన వచ్చింది. ఓటర్ల వివరాల్లో సాఫ్ట్వేర్ గుర్తించే చిన్నపాటి వ్యత్యాసాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులకు మరింతగా ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎస్. చోక్కలింగం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే..ఇందుకోసం ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్‌లో నాలుగు మార్పులు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ముఖ్యంగా ‘లాజికల్ డిస్క్రెపెన్సీ’గా గుర్తించిన కేసుల్లో.. ఓటరు సమర్పించిన పత్రాలను పరిశీలించిన తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ERO) సంతృప్తి చెందితే, ఆ కేసును స్వయంగా పరిష్కరించే అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే అవసరమైన ఆధారాలు ఉన్నప్పుడు సంబంధిత ఓటరును వ్యక్తిగత విచారణకు పిలవకుండా మినహాయించే ఆప్షన్ కూడా ఉండాలని సూచించారు. ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో ఈఆర్వో వద్ద ఆధారాలు ఉన్నా.. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న పరిమితుల కారణంగా కేసును ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఇదే అంశం.. ఈసీ వివాదానికి కేంద్రబిందువుమహారాష్ట్ర సీఈవో ఇప్పుడు లేవనెత్తిన అంశం ఇక్కడే కీలకంగా మారింది. ఎందుకంటే ఈఆర్వోల అధికారాలు, ఈసీఐనెట్‌లో వారి యాక్సెస్‌పై ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కూడా గతంలో పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా తయారీ, పేర్లు చేర్చడం, తొలగించడం, అభ్యంతరాలపై నిర్ణయం తీసుకోవడం వంటి బాధ్యతలు చట్టపరంగా ఈఆర్వోలకే ఉన్నప్పటికీ.. సాఫ్ట్‌వేర్‌లో కొన్ని నిర్ణయాలు లేదంటే మార్పులకు అవసరమైన యాక్సెస్ కేంద్రీకృత నియంత్రణలో ఉండటంపై వారు ప్రశ్నలు లేవనెత్తారు.అసలు ఈసీఐనెట్ ఏం చేస్తోంది?సర్‌లో ప్రస్తుత ఓటరు వివరాలను గత సర్‌లోని తల్లిదండ్రులు, తాతముత్తాతల వివరాలతో సాఫ్ట్వేర్ సరిపోల్చుతుంది. పేరు, వయసు వంటి వివరాల్లో తేడా కనిపిస్తే దాన్ని ‘లాజికల్ డిస్క్రెపెన్సీ’గా గుర్తిస్తుంది. అయితే ఇలాంటి మిస్ మ్యాచ్ రావడం అంటే ఆ వ్యక్తి ఓటరు కాదని తేల్చినట్లు కాదు. కేవలం పాత రికార్డులతో వివరాలు సరిపోలలేదన్నమాట.ఇక్కడే ఈఆర్వోల పాత్ర కీలకం. ఓటరు ఇచ్చిన పత్రాలను పరిశీలించి, అవసరమైతే విచారణ జరిపి.. ఆ వ్యక్తి పేరు జాబితాలో ఉండాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే. కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన ఆప్షన్లు, యాక్సెస్ కూడా ఉండాలన్నది మహారాష్ట్ర సీఈవో తాజా డిమాండ్ సారాంశం.అందుకే ‘ఫ్రీ హ్యాండ్’ డిమాండ్మహారాష్ట్ర సీఈవో ప్రతిపాదన వెనుక ఉన్న అసలు విషయం ఇదే. సాఫ్ట్వేర్ ఒక వ్యత్యాసాన్ని గుర్తించడం ఒక అంశం. ఆ వ్యత్యాసానికి ఓటరు ఇచ్చిన వివరణ, పత్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మరో అంశం. రెండో విషయంలో ఈఆర్వోకు మరింత వెసులుబాటు ఉండాలని ఆయన కోరుతున్నారు. ఇదే అంశంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కూడా గతంలో ఈఆర్వోల చట్టపరమైన అధికారాలను సాఫ్ట్వేర్ పరిమితం చేయకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో మహారాష్ట్ర సీఈవో తాజా లేఖతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.ఇప్పటికే కొన్ని మార్పులుఈ వివాదం నేపథ్యంలో సెప్టెంబర్ 26న ఎన్నికల సంఘం ఈసీఐనెట్పై సమీక్షకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే సర్ నోటీసులు అందుకున్నవారి విషయంలో విధానాన్ని సులభతరం చేసింది. అవసరమైన పత్రాలను బీఎల్వోలు ఓటర్ల ఇళ్ల వద్దే సేకరించి ఈసీఐనెట్‌లో అప్లోడ్ చేయవచ్చని, సంతృప్తికరమైన పత్రాలు ఉంటే ఈఆర్వో వ్యక్తిగత విచారణ నుంచి మినహాయించవచ్చని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి అధికారులకు మరింత వెసులుబాటు అవసరమైతే అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామని కూడా ఈసీ తెలిపింది.అందుకే ఇప్పుడు మహారాష్ట్ర సీఈవో లేవనెత్తిన డిమాండ్ ప్రాధాన్యం సంతరించుకుంది. సర్‌లో సాఫ్ట్వేర్ గుర్తించే మిస్‌మ్యాచ్ ఒకటైతే.. దానిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈఆర్వోది. ఆ నిర్ణయాన్ని తీసుకునేందుకు ఈఆర్వోకు సాఫ్ట్‌వేర్‌లో ఎంత స్వేచ్ఛ ఉండాలి? అనేదే ఈ మొత్తం వివాదంలో కీలకమైన ప్రశ్న.ఇదీ చదవండి: సీఈసీకి చుక్కలు చూపించాలని నిర్ణయం! -
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి కఠిన ఆంక్షలు!
దేశ రాజధానిలో కాలుష్య కట్టడికి బీజేపీ ప్రభుత్వం భారీ యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. శీతాకాలం మొదలయ్యేలోపే కాలుష్య నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తూ.. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే పాత వాహనాలపై కొరడా ఝుళిపించనుంది. నవంబర్ 1 నుంచి BS-VI ఉద్గార ప్రమాణాలు అందుకోని ఇతర రాష్ట్రాల వాహనాలను ఢిల్లీలోకి అనుమతించబోమని పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. దీంతోపాటు పార్కింగ్ ఛార్జీల పెంపు, నిర్మాణ పనులపై ఆంక్షలు, కాలుష్యం వెదజల్లే వాహనాలపై తనిఖీలు, ‘నో పీయూసీ.. నో ఫ్యూయల్’ వంటి చర్యలను అమలు చేయనున్నారు.ఇతర రాష్ట్రాల వాహనాలకు బ్రేక్..ఢిల్లీలో కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు నవంబర్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. BS-VI ప్రమాణాలు లేని ఇతర రాష్ట్రాల వాహనాలను రాజధానిలోకి అనుమతించరు. ఈ ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. వాహనాలపై ఈ నిబంధనను ముందుగానే ప్రజలకు తెలియజేస్తామని అధికారులు తెలిపారు. BS-IV వాహనాలకు సంబంధించి విధించే మరో ఆంక్ష నుంచి CNG వాహనాలకు మినహాయింపు ఉంటుందని మంత్రి సిర్సా చెప్పారు.పార్కింగ్ ఛార్జీలు డబుల్..కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఢిల్లీలోని అధికారిక పార్కింగ్ కేంద్రాల్లో ఛార్జీలను రెట్టింపు చేయనున్నారు. ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ పెంపు వర్తించదు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్వహించే పార్కింగ్ కేంద్రాలకు కూడా మినహాయింపు ఇచ్చారు.ఆఫీసుల టైమింగ్స్‌లోనూ మార్పులు..నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేయనున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తమ సిబ్బందిలో 50 శాతం మందితోనే ఆఫీసుల నుంచి పని చేయించి.. మిగిలిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని ప్రభుత్వం సూచించింది.మరో 150 ఎలక్ట్రిక్ బస్సులు..ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు ఢిల్లీ రవాణా వ్యవస్థలో మరో 150 ఎలక్ట్రిక్ బస్సులను చేర్చనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 5,088 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రజలకు మెట్రో, బస్ స్టాప్లకు సులభంగా చేరుకునేలా పరిసర ప్రాంతాల మధ్య కనెక్టివిటీని కూడా మెరుగుపరచనున్నారు.‘నో పీయూసీ.. నో ఫ్యూయల్’..ఢిల్లీలోని 500 పెట్రోల్ బంకుల్లో ‘నో పీయూసీ.. నో ఫ్యూయల్’ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల సాయంతో పీయూసీ సర్టిఫికెట్ లేని వాహనాలను గుర్తించనున్నారు. అక్టోబర్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి.. నవంబర్‌లో కాలుష్య పరీక్షా కేంద్రాలను మరింత ఆధునీకరించనున్నారు. దాదాపు 2.5 లక్షల వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు మూడు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను వినియోగించనున్నారు.నిర్మాణ పనులపై కఠిన ఆంక్షలు..కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటైన దుమ్మును నియంత్రించేందుకు నిర్మాణ, కూల్చివేత పనులపై దశలవారీగా ఆంక్షలు విధించనున్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు దుమ్ము ఉత్పత్తి చేసే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ పనులను నిషేధించనున్నారు. డిసెంబర్ 10 నుంచి జనవరి 20 వరకు నిర్మాణ, కూల్చివేత పనులపై పూర్తిస్థాయి నిషేధం అమల్లో ఉంటుంది. ఇందులో ఇండోర్ పనులు కూడా ఉంటాయి.62 కాలుష్య హాట్స్పాట్లపై నిఘా..ఢిల్లీలో గుర్తించిన 62 కాలుష్య హాట్స్పాట్లలో 42 ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి హాట్‌స్పాట్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలో కాలుష్యానికి కారణమవుతున్న అంశాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 2026లో మొత్తం 3,065 కిలోమీటర్ల రహదారులను పునరాభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్ 20 నాటికి 1,193 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. అక్టోబర్ 31 నాటికి మార్కెట్లతో సహా అన్ని రహదారులను డీప్ క్లీనింగ్ చేయాలని నిర్ణయించారు. గుంతలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను 72 గంటల్లో పరిష్కరించే విధానాన్ని అమలు చేస్తున్నారు.70 లక్షల లక్ష్యాన్ని దాటిన మొక్కల పెంపకం..పచ్చదనం పెంచే కార్యక్రమంలో భాగంగా 70 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 71 లక్షల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక నుంచి కేవలం మొక్కలు నాటడంపైనే కాకుండా అవి బతికి ఉన్నాయా లేదా అన్నదానిపై దృష్టి పెట్టనున్నారు. 2027 మార్చిలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించనున్నారు.ఇదీ చదవండి: మరింత శక్తివంతంగా ఎల్ నినో -
రూ. 336 కోట్ల స్కామ్ : భారతీయుడికి 11 ఏళ్ల శిక్ష
అమెరికాలో అడుగుపెట్టి అసాధారణ విజయాలు సాధించాలనుకున్న ఓ భారతీయుడి డాలర్ డ్రీమ్స్ కటకటాల వెనక్కి పీడ కలగా మిగిలిపోతోంది. అమెరికాలో 35 మిలియన్ డాలర్ల పాన్జీ స్కామ్ చేసిన భారతీయుడికి భారీ షాక్ తగిలింది. ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ. 336 కోట్లుకి పైగా భారీ మెసానికి పాల్పడిన ఢిల్లీకి చెందిన సిద్ధార్థ్ జవహర్ (38) కి 11 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. ప్రముఖ ఎన్ఎఫ్ఎల్ (NFL) స్టార్ ట్రావిస్ కెల్స్‌తో సహా అనేకమంది ప్రముఖులను మోసగించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.2005లో 21 ఏళ్ల వయసులో ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లిన సిద్ధార్థ్ జవహర్ (Siddharth Jawahar).. టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. ఆ తర్వాత 'స్విఫ్టార్క్ క్యాపిటల్' (Swiftarc Capital) పేరిట ఒక ఇన్వెస్ట్మెంట్ సంస్థను ప్రారంభించి ఫైనాన్స్, వెంచర్ క్యాపిటలిజం రంగాల్లో ఎదిగా డు. ఆండీ రోడిక్ ఫౌండేషన్ బోర్డులో స్థానం సంపాదించి, మంచి గౌరవనీయమైన దాతగా కూడా పేరు పొందాడు. కట్ చేస్తే.. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు 11 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు, బాధితులకు రూ.300 కోట్లకుపైగా( 31.35 మిలియన్ డాలర్లు) నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.స్కామ్‌కు తెరలేచిందిలా..2016 , జూలై నుంచి డిసెంబర్ 2023 మధ్య కాలంలో వివిధ ఇన్వెస్టర్ల నుంచి 35 మిలియన్ డాలర్లకు పైగా సేకరించిన సిద్ధార్థ్, అందులో కేవలం 28 శాతం మాత్రమే (సుమారు 10 మిలియన్ డాలర్లు) పెట్టుబడిగా పెట్టారు. మిగతా డబ్బును విలాసవంతమైన జీవితం, ప్రైవేట్ జెట్ ప్రయాణాలు, లగ్జరీ హోటళ్లు, ఖరీదైన అపార్ట్మెంట్ల కోసం దుర్వినియోగం చేశారు. పాత ఇన్వెస్టర్లకు డబ్బు చెల్లించడానికి కొత్త ఇన్వెస్టర్ల నిధులను వాడుతూ పాన్జీ స్కామ్‌ను నడిపారు.బాధితుల్లో చాలామంది ప్రముఖులుఈ మోసంలో మొత్తం 64 మంది బాధితులు ఉండగా.. వారిలో సింగర్ టేలర్ స్విఫ్ట్ భర్త, ప్రముఖ ఎన్ఎఫ్ఎల్ (NFL) ఆటగాడు ట్రావిస్ కెల్స్ కూడా ఉన్నారు. అలాగే ఎన్బీఏ (NBA) ఆటగాళ్లు గ్యారీ హారిస్, టిమ్ హార్డవే జూనియర్, మేసన్ ప్లమ్లీ తదితరులు కూడా ఈ మోసానికి బలయ్యారు.దాతృత్వ ముసుగులో మోసాలుఆండీ రోడిక్ ఫౌండేషన్ బోర్డు సభ్యుడిగా కొనసాగుతూ, అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సిద్ధార్థ్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ దాతృత్వ ముసుగే సెలెబ్రిటీలు మరియు ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి అతనికి సహకరించింది.అరెస్ట్ -శిక్షచట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న ఇతని నేర చరిత్రను గుర్తించిన అధికారులు.. మోసాలకు పాల్పడినట్లు తేలడంతో అరెస్ట్ చేశారు. జనవరిలో వైర్ ఫ్రాడ్ ఆరోపణలను అంగీకరించిన సిద్ధార్థ్‌కు సెప్టెంబర్ 15న. విచారణను తప్పుదారి పట్టించడానికి సాక్ష్యాలను ధ్వంసం చేయడం, ఐఫోన్‌ను రిమోట్‌గా వైప్ చేయించడం వంటి అక్రమాలకు కూడా ఆయన పాల్పడినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. -
కొత్త రూల్స్.. 50 శాతం మంది మాత్రమే ఆఫీసుకు!
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలం వచ్చిందంటే.. వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారుతుంది. చలికాలంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం ఈసారి శీతాకాలం ప్రారంభం కాకముందే కొన్ని చర్యలను ప్రకటించింది.పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు2026 నవంబర్ 1 నుంచి పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రజలు అవసరం లేని సమయంలో వ్యక్తిగత వాహనాలను ఉపయోగించడం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.అంతే కాకుండా.. నవంబర్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు ఆఫీసుల పనివేళల్లో కూడా మార్పులు చేయనున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేస్తాయి.50 శాతం మంది ఆఫీసుకుమరో ముఖ్యమైన నిర్ణయం.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు వెళ్లేలా చేయడం. మిగిలిన 50 శాతం మంది ఇంటి నుంచే పని చేస్తారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగుల రాకపోకలు, వాహనాల సంఖ్య తగ్గి కాలుష్యం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.దుమ్ము ఎక్కువగా వచ్చే నిర్మాణ, కూల్చివేత పనులను కూడా కొంతకాలం పూర్తిగా నిలిపివేయనున్నారు. ఢిల్లీలో కాలుష్యానికి వాహనాల పొగ మాత్రమే కారణం కాదు. రోడ్లపై, నిర్మాణ ప్రదేశాల్లో ఏర్పడే దుమ్ము, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కూడా ముఖ్యమైన కారణాలే.గతంలో కూడా.. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఆడ్-ఈవెన్ విధానం వంటి చర్యలను ప్రభుత్వం అమలు చేసింది. ఈ విధానంలో వాహనాల నంబర్ల ఆధారంగా కొన్ని రోజుల్లో కొన్ని వాహనాలకే రోడ్లపై తిరిగే అవకాశం ఇచ్చారు. అయితే.. ఢిల్లీ కాలుష్య సమస్య చాలా పెద్దది కావడంతో ఒక్క చర్యతోనే దాన్ని పూర్తిగా పరిష్కరించడం సాధ్యం కాదు.ఇక శీతాకాలంలో పంజాబ్, హర్యానా వంటి పొరుగు రాష్ట్రాల్లో పంట అవశేషాలను కాల్చడం వల్ల వచ్చే పొగ కూడా ఢిల్లీ గాలి నాణ్యతపై ప్రభావం చూపుతుంది. అందువల్ల ఢిల్లీ ప్రభుత్వం మాత్రమే కాకుండా.. పొరుగు రాష్ట్రాలు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: మీ పేరుతో సిమ్ కార్డు ఉందా.. జాగ్రత్త! -
యూపీఐ ఛార్జీలు.. కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు
యూపీఐ చెల్లింపులపై కొత్తగా తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధానంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.2,000కు మించిన కొన్ని యూపీఐ ‘పర్సన్ టు మర్చంట్’ (పీ2ఎం) లావాదేవీలపై చార్జీలు విధించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఛార్జీల విధానం, దాని ప్రాతిపదికకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఈ పిటిషన్‌ను న్యాయవాది అంజన్ దత్తా దాఖలు చేశారు. సోమవారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, ఎన్పీసీఐలకు నోటీసులు జారీ చేసింది. కొత్త ఎండీఆర్ విధానానికి చట్టపరమైన ప్రాతిపదిక ఏంటి? ఈ ఛార్జీపై పన్ను ఎలా ఉంటుంది? పన్ను భారం ఎవరిపై పడుతుంది? ఈ విధానం తీసుకొచ్చే అధికారం కేంద్రానికి ఏ మేరకు ఉంది? ఎండీఆర్ విధానం తీసుకురావడానికి కారణమేంటి? వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరింది. వీటన్నింటిపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అదే సమయంలో అక్టోబర్ 15 నుంచి కొత్త విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో.. దాని అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.రూ.2 వేలు దాటితే.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం.. అక్టోబర్ 15 నుంచి కొత్త ఎండీఆర్ విధానం అమల్లోకి రావాల్సి ఉంది. రూ.2,000కు మించిన నిర్దిష్ట యూపీఐ పీ2ఎం లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధిస్తారు. రూ.75,000, అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు గరిష్ఠ చార్జీ రూ.300గా ఉంటుంది. అయితే వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే పీ2పీ యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఎండీఆర్ ఉండదు. రూ.2,000 వరకు చేసే సాధారణ మర్చంట్ చెల్లింపులూ చార్జీ పరిధిలోకి రావు.కొన్ని ప్రత్యేక రంగాలకు మాత్రం వేర్వేరు రేట్లు నిర్ణయించారు. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్పుట్స్ వంటి రంగాల్లో రూ.2,000కు మించిన లావాదేవీలపై ఒక్కో లావాదేవీకి రూ.5 ఎండీఆర్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీస్, స్టాక్‌బ్రోకర్లు, డీలర్లకు సంబంధించిన లావాదేవీలపై 0.02 శాతం ఎండీఆర్ విధిస్తారు. దీనికీ రూ.300 గరిష్ఠ పరిమితి ఉంటుంది.విధానంపై పిటిషనర్ అభ్యంతరాలుకేంద్రం సెప్టెంబర్ 14న జారీ చేసిన నోటిఫికేషన్, సెప్టెంబర్ 15న ప్రకటించిన ఎండీఆర్ విధానాన్ని అంజన్ దత్తా తన పిటిషన్లో సవాలు చేశారు. తగిన చట్టపరమైన రక్షణలు, పారదర్శకత, ప్రజా సంప్రదింపులు లేకుండానే కొత్త చార్జీల విధానాన్ని తీసుకొచ్చారని ఆయన వాదించారు. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10ఏ సవరణ చట్టబద్ధతను కూడా ప్రశ్నించారు.అలాగే యూపీఐ, రూపే డెబిట్ కార్డులకు వేర్వేరు నిబంధనలు ఎందుకన్న అంశాన్ని పిటిషన్లో లేవనెత్తారు. రూ.2,000 దాటిన యూపీఐ మర్చంట్ చెల్లింపులపై ఎండీఆర్ విధిస్తుండగా.. రూపే డెబిట్ కార్డు లావాదేవీలకు చార్జీల విషయంలో కొనసాగుతున్న రక్షణపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.ఏం కోరుతున్నారు?రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించే నిబంధనను రద్దు చేయాలని లేదంటే అమలును నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. ప్రత్యామ్నాయంగా.. సంబంధిత డేటాను బహిర్గతం చేసి, ప్రభావంపై అధ్యయనం నిర్వహించి, పారదర్శకంగా సంప్రదింపులు జరిపిన తర్వాత విధానాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిన్న, సూక్ష్మ వ్యాపారాలపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.అక్టోబర్ 15 నుంచి అమలుకొత్త ఎండీఆర్ విధానం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దాని అమలును నిలిపివేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రస్తుత దశలో అంగీకరించలేదు. అయితే కేంద్రం నుంచి పూర్తి వివరాలతో అఫిడవిట్ కోరడంతో.. ఈ చార్జీల విధానానికి సంబంధించిన చట్టపరమైన ప్రాతిపదిక, అమలు విధానంపై తదుపరి విచారణలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రిస్క్‌లో 96 భారత విమానాలు? -
నాసిరకం రోడ్డును రికార్డ్‌చేసిన యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తిలక్ నగర్లో రోడ్డు తనిఖీ కార్యక్రమాన్ని వీడియో తీస్తున్న ఒక వ్యక్తిని ఢిల్లీ రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేశ్ వర్మ చెంపదెబ్బ కొట్టడం వివాదమైంది. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మంత్రి తీరుపై జనం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న తిలక్ నగర్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే జర్నెయిల్ సింగ్ కొత్తగా వేసిన రోడ్డు ఉపరితలాన్ని పరిశీలించి, దాని నాణ్యతను ప్రశ్నించారు. సమీపంలోనే నిలబడి ఉన్న ఒక యువకుడు ఈ ఘటనను రికార్డ్ చేస్తుండగా, పర్వేశ్ వర్మ అతడిపై చేయి చేసుకున్నారు. అనుచితంగా ప్రవర్తించిన మంత్రిని అరెస్టు చేయాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. స్థానికులు రోడ్డు నాణ్యతను ప్రశ్నించడంతో మంత్రి సంయమనం కోల్పోయారని ‘ఆప్’ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. తనపై వచి్చన ఆరోపణల పట్ల మంత్రి పర్వేశ్‌వర్మ స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేస్తున్న వీడియోను సందర్భం లేకుండా ప్రచారంలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. అలాగే, రోడ్డు కాంట్రాక్టర్ నుంచి స్థానిక ఆప్ ఎమ్మెల్యే కమిషన్ డిమాండ్ చేశారని ఆరోపించారు. రోడ్డు నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని జర్నెయిల్ సింగ్ ఫిర్యాదు చేశారని, తాను అక్కడికి వెళ్ళినప్పుడు ఆప్ ఎమ్మెల్యేను రావాలని కోరానని వర్మ చెప్పారు. అయితే, జర్నెయిల్ అక్కడికి ఆప్ కార్యకర్తలను పిలిపించారని, వారు తన కుటుంబాన్ని దూషించారని వర్మ చెప్పుకొచ్చారు. -
సీత పాత్రలో మిస్ యూనివర్స్ ఇండియా కజియా లిజ్ మెజో..!
ప్రతి ఏడాది దేశ రాజధాని ఢ్లిలీ అయోధ్య కీ రామ్‌లీలాని ప్రదర్శిస్తారనే విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ కార్యక్రమం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌కు చెందిన మావలంకర్ హాల్లో వచ్చే నెల అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 20 వరకు అత్యంత వైభవంగా జరగనుంది. భోజ్‌పురి నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ ఈ రామ్‌లీలాలో భగవాన్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే సీత పాత్రలో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియ్ లిజ్ మెజో కనిపించనుంది. ఆమె ఈ ఏడాది ఆగస్టులోనే మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నారు. కేరళలోని మావేలిక్కరకు చెందిన కజియా, గతంలో మిస్ యూనివర్స్ కేరళ 2026, మిస్ టీన్ దివా 2024 టైటిళ్లను కూడా గెలుచుకున్నారు. ఆమె లా స్టూడెంట్, క్లాసికల్ డ్యాన్సర్ కూడా. కాగా ఈ రామ్‌లీలాలో భారతీయ చలన చిత్రపరిశ్రమకు చెందిన వివిధ నటులు కూడా నటించనున్నారు. అరుణ్ బక్షి రావణుడి పాత్రలో కనిపించగా, బిందు దారా సింగ్ కుంభకర్ణుడి పాత్రలో నటిస్తారు. అలాగే అవతార్ గిల్ మేఘనాథుడిగా, పునీత్ ఇస్సార్ పరశురాముడిగా కనిపించనున్నారు.ఇదీ చదవండి: రాయల్ టిష్యూ చీరలో సాయిపల్లవి స్టన్నింగ్ లుక్..! -
నోయిడా నిరసనలు: చదువులు, ఉద్యోగాలకు దూరమైన ‘జెన్ జీ’
న్యూఢిల్లీ: నోయిడాలో గత ఏప్రిల్‌లో జరిగిన కార్మికుల వేతన నిరసనల నేపథ్యలో కేసులు నమోదై, అరెస్టయిన పలువురు యువకుల జీవితాలు జైలు కారణంగా నిలిచిపోయాయి. ఐదు నెలలు గడిచినా కొందరికి బెయిల్ లభించకపోవడంతో చదువులు, ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వారి కుటుంబాలు న్యాయవాదుల ఫీజులు, బెయిల్ కోసం అవసరమైన మొత్తాన్ని సమకూర్చేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ‘ది ప్రింట్’ కథనం ప్రకారం.. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నవారిలో 20–28 ఏళ్ల మధ్య వయసున్న కార్మికులు, విద్యార్థులు, కార్యకర్తలు అత్యధికంగా ఉన్నారు.పరీక్షలకు వారం ముందు అరెస్టుహర్దోయికి చెందిన 20 ఏళ్ల అన్షు కుష్వాహా ఫిబ్రవరిలో నోయిడాకు వచ్చాడు. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలుస్తూనే బీఎస్సీ చదువును కొనసాగించాలనుకున్నాడు. నోయిడాలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో రోజుకు దాదాపు 10 గంటలు పనిచేసేవాడు. ఏప్రిల్ 14న నిరసనల సమయంలో మోథర్సన్ ఇంటర్నేషనల్ సమీపంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తన సెమిస్టర్ పరీక్షలకు మరో వారం మాత్రమే ఉందని, పరీక్షలు రాయలేకపోతానని పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని అన్షు తెలిపాడు.మూడు ఎఫ్ఐఆర్లలో కేసులుఅన్షుపై మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిలో రెండు కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ మరో కేసులో ఇంకా బెయిల్ రాలేదు. అల్లర్లు, హత్యాయత్నం, ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, అక్రమ నిర్బంధం, నేరపూరిత కుట్ర, అగ్ని లేదా పేలుడు పదార్థాలతో నష్టం కలిగించడం వంటి పలు అభియోగాలు నమోదయ్యాయి. ఐదు నెలలుగా జీతం లేకపోవడంతో పాటు న్యాయవాదుల ఫీజుల కోసం అతడి తండ్రి బంధువులు, పొరుగువారి నుంచి అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు.న్యాయ ఖర్చుల కోసం అప్పులుఅన్షు తండ్రి పర్మానంద్ కుష్వాహా తన కుమారుడి కేసుల కోసం ఇప్పటికే పలువురు న్యాయవాదులకు డబ్బు చెల్లించినట్లు చెప్పారు. ఒక న్యాయవాదికి రూ.10 వేలు, మరో బెయిల్ కోసం రూ.15 వేలు, మరో కేసుకు రూ.14 వేలు చెల్లించినట్లు తెలిపారు. మరో కేసులో బెయిల్ కోసం నాలుగో న్యాయవాదిని నియమించేందుకు కూడా డబ్బు సమకూర్చుకోవాల్సి వస్తోందన్నారు. నిరసనలకు సంబంధించి పోలీసులు మొత్తం 11 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, కనీసం 11 మంది ఇంకా బెయిల్ పొందలేదని ‘ది ప్రింట్’ పేర్కొంది.బెయిల్ వచ్చినా.. విడుదలకు మరో అడ్డంకి28 ఏళ్ల అమన్ సోనీకి మూడు ఎఫ్ఐఆర్ల్లోనూ బెయిల్ లభించింది. అయితే బెయిల్ కోసం అవసరమైన ఐదుగురు ష్యూరిటీలను కుటుంబం సమకూర్చలేకపోవడంతో అతడు ఇంకా జైలులోనే ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన అమన్ 2025 అక్టోబరులో ఐటీఐ కోర్సు పూర్తి చేసిన తర్వాత మోథర్సన్ ఇంటర్నేషనల్‌లో ఉద్యోగం పొందాడు. కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న అతడి న్యాయ ఖర్చుల కోసం బావ రూ.1.7 లక్షలు అప్పు చేసినట్లు తెలిపారు. ష్యూరిటీల కోసం ఆస్తి పత్రాలు సమకూర్చడంలోనూ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.జైలులోనూ చదువు, పుస్తకాలుఈ కేసుల్లో విద్యార్థులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన 25 ఏళ్ల న్యాయ విద్యార్థిని అకృతి చౌధరిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ) కింద కూడా చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్ 2న అలహాబాద్ హైకోర్టు ఆమె నిర్బంధ ఉత్తర్వును కొట్టివేసి, రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాన్ని నిలిపివేసింది. జైలులో ఉన్నప్పటికీ అకృతి పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం, ఇతర మహిళా ఖైదీలతో మహాభారతం గురించి చర్చించడం వంటి పనులు చేస్తోంది.జైల్లోనే యూజీసీ-నెట్లో 99.3 పర్సంటైల్24 ఏళ్ల హిమాంశు ఠాకూర్ హన్స్‌రాజ్ కాలేజీలో హిస్టరీ చదువుకున్నాడు. జైలులో ఉన్న సమయంలో యూజీసీ-నెట్ పరీక్షలో 99.3 పర్సంటైల్ సాధించి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు అర్హత సాధించాడు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ ఇంటర్వ్యూకు వెళ్లాల్సిన సమయంలో అతడిని పోలీసులు అరెస్టు చేసి 11 ఎఫ్ఐఆర్లలో నిందితుడిగా చేర్చారు. ఎనిమిది కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ మరో మూడు కేసుల్లో నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు. పర్యావరణ, కార్మిక చరిత్రపై పరిశోధన చేయాలనుకుంటున్న హిమాంశు ప్రస్తుతం జైలులోనే తనకు అవసరమైన పుస్తకాలను చదువుతున్నాడు.ఐదు నెలల జైలు.. భవిష్యత్తుపై అనిశ్చితినోయిడా నిరసనల కేసుల్లో అరెస్టయిన యువతకు జైలు శిక్ష మాత్రమే కాకుండా వారి చదువులు, ఉద్యోగాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులపైనా ప్రభావం పడుతోంది. కొందరు పరీక్షలకు దూరమయ్యారు.. మరికొందరి ఉద్యోగాలు పోయాయి. కుటుంబాలు న్యాయ ఖర్చుల కోసం అప్పుల్లో కూరుకుపోతున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ నోయిడా వంటి నగరాలకు ఉద్యోగాల కోసం రావాలా, స్వగ్రామాల్లోనే ఉండాలా అనే సందిగ్ధతలో పలువురు కార్మికులు ఉన్నారు. అయినప్పటికీ జైలులో ఉన్న కొందరు యువత తమ చదువు, పుస్తకాలు, పరిశోధనపై దృష్టి కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: పితృపక్ష వేళ.. నేపాల్ మృతులకు నటుడు పిండప్రదానం -
‘సర్’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఢిల్లీ: సర్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. అంతర్గత విబేధాలు బయటపడిన తర్వాత తొలిసారి జరిగిన భేటీకి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్, ఈసీలు సందు, జోషి హాజరయ్యారు. ‘సర్’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘సర్’లో అభ్యంతరాలపై నవంబర్ 30 వరకు గడువు పొడిగించింది. నోటీసులు అందుకున్నవారు బీఎల్వోను కలవక్లర్లేదని.. బీఎల్వోలే ఓటర్లక ఇళ్లకు వస్తారని ఈసీ తెలిపింది.ఎస్ఐఆర్ (SIR)లో నోటీసు వచ్చిన వారికి బీఎల్వోలు ఇంటికి వచ్చి డాక్యుమెంట్లు తీసుకొని ఈసీఐనెట్‌లో అప్లోడ్ చేస్తారు. ఈఆర్వో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అసాధారణ పరిస్థితుల్లోనే ఆన్లైన్ హియరింగ్. కుటుంబ సభ్యుడు కూడా హాజరు కావచ్చు. రాత్రి షెల్టర్లు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం డీఈవోలు సహాయ కేంద్రాలు, స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి’’ అని సీఈసీ పేర్కొన్నారు.‘‘ఎస్ఐఆర్ ఫామ్-6 డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఎస్ఐఆర్ కాకుండా ఇతర సమయాల్లో సాధారణ నియమాల ప్రకారం ఫామ్‌లు వాడాలి. ఈసీఐనెట్‌ను సీనియర్ డీఈసీ అధ్యక్షతన కమిటీ సమీక్షిస్తుంది. కొత్త ఐటీ మాడ్యూళ్లు కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ ద్వారా ఆమోదం తీసుకోవాలి. ఢిల్లీ క్లెయిమ్స్, అబ్జెక్షన్లు 30 అక్టోబర్ 2026 వరకు, డిస్పోజల్ 30 నవంబర్ 2026 వరకు పొడిగింపు. మహారాష్ట్రలో క్లెయిమ్స్ 12 అక్టోబర్ 2026 వరకు, డిస్పోజల్ 10 నవంబర్ 2026 వరకు పొడిగిస్తున్నాం’’ అని సీఈసీ తెలిపారు.ఎస్ఐఆర్ 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తయింది. ఓటర్లు, యువకులు కంటిన్యుయస్ అప్డేషన్ ద్వారా పేరు చేర్చుకోవచ్చు. ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలని సీఈవోలకు ఈసీ ఆదేశించింది. కమిషన్ సమావేశాలకు ముందుగా అజెండా, తర్వాత మినిట్స్ జారీ చేయాలి. అధికారుల ఏపీఏఆర్లు ప్రతి సంవత్సరం డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలి. విదేశీ పర్యటనలకు కమిషన్ అనుమతి తప్పనిసరి’’ అని సీఈసీ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమంలో కలకలం.. -
జెన్‌జీ జేబులో మన్మోహన్.. ఆ అడుగులే ఇప్పుడు!
మన్మోహన్ సింగ్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది.. నిశ్శబ్దంగా మాట్లాడే మాజీ ప్రధాని. కానీ నేటి జెన్‌జీకి ఆయన అంతకంటే ఎక్కువ. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ నుంచి ఇంటర్నెట్ వరకు.. స్టార్టప్‌ల నుంచి విదేశీ కంపెనీల ఉద్యోగాల వరకు.. భారత ఆర్థిక వ్యవస్థలో మూడు దశాబ్దాలుగా కనిపిస్తున్న ఎన్నో మార్పుల వెనుక ఆయన ఆలోచనల ముద్ర కనిపిస్తుంది.ఒక్కసారి 1991కి వెళ్దాం. అప్పట్లో దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. దేశం తన అవసరాలకు కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికే ఇబ్బంది పడే పరిస్థితి. ఆ సమయంలో పీవీ నరసింహారావు ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టారు. దిగుమతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రైవేట్ రంగంపై ఉన్న అనేక ఆంక్షలను క్రమంగా సడలించారు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో మరింతగా అనుసంధానం చేసే దిశగా అడుగులు వేశారు.ఆ మార్పులు అంటే అప్పట్లో సామాన్యుడికి వెంటనే అర్థమయ్యే విషయం కాదు. కానీ వాటి ప్రభావం క్రమంగా కనిపించింది. విదేశీ కంపెనీలకు భారత మార్కెట్ తెరుచుకుంది. ప్రైవేట్ రంగానికి అవకాశాలు పెరిగాయి. పోటీ పెరిగింది. కొత్త పరిశ్రమలు, కొత్త సేవలు వచ్చాయి. తర్వాతి సంవత్సరాల్లో ఐటీ రంగం వేగంగా విస్తరించడానికి కూడా ఈ మారిన ఆర్థిక వాతావరణం ఒక నేపథ్యంగా నిలిచింది.ఇప్పుడు 2026. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడితే జీడీపీ వృద్ధి బలంగానే కనిపిస్తోంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2025–26లో భారత ఆర్థిక వృద్ధి 7.6 శాతంగా నమోదైంది. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ పరిస్థితులు, ముఖ్యంగా ఇంధన ధరలు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో వృద్ధి 6.6 శాతానికి తగ్గొచ్చని అంచనా వేసింది. అయితే జెన్‌జీ ప్రశ్న మాత్రం జీడీపీ దగ్గర ఆగిపోదు.మరి నాకు మంచి ఉద్యోగం ఎప్పుడు?ఇదే అసలు ప్రశ్న. ఇటీవలి ఆర్థిక విశ్లేషణల్లోనూ ఇదే అంశం ప్రధానంగా కనిపిస్తోంది. ఐఎంఎఫ్ తాజా విశ్లేషణ ప్రకారం భారత వృద్ధికి ఉద్యోగాలు, ఉత్పాదకత, నైపుణ్యాల మధ్య ఉన్న అంతరం పెద్ద సవాలుగా మారింది. కోట్లాది మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్న సమయంలో.. జీడీపీ పెరగడం కంటే వారికి స్థిరమైన, మంచి ఆదాయం ఇచ్చే ఉద్యోగాలు ఎంత వస్తున్నాయన్నదే కీలకం.ఇక్కడే మన్మోహన్ మళ్లీ జెన్‌జీ జేబులోకిఎందుకంటే ఆయన కాలంలో మొదలైన ఆర్థిక మార్పులు “ప్రపంచంతో పోటీ పడే భారత్” అనే దిశను బలపరిచాయి. నేడు ఒక చిన్న పట్టణంలో ఉన్న యువకుడు విదేశీ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేయగలగడం, ఇంటి నుంచే ఆన్లైన్ సేవలు అందించడం, యాప్ ద్వారా వ్యాపారం మొదలుపెట్టడం, ప్రపంచ మార్కెట్ గురించి తెలుసుకోవడం.. ఇవన్నీ ఒక్కరోజులో వచ్చిన మార్పులు కావు. మూడు దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన మార్పుల ఫలితంగా ఏర్పడిన అవకాశాల గొలుసులో ఇవి భాగం. అయితే కథ ఇక్కడితో పూర్తికాదు. అప్పట్లో భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కలపడం పెద్ద సవాలు అయితే.. ఇప్పుడు ఆ వృద్ధి ఫలాలను ఎక్కువ మందికి చేరేలా చేయడం మరో పెద్ద సవాలు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలకు అవకాశాలు, మహిళలకు ఉపాధి, నైపుణ్యాలకు తగ్గ పనులు రావాల్సి ఉంది. ఉద్యోగ కల్పన కోసం ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచే సంస్కరణలపై ప్రపంచ బ్యాంకు కూడా దృష్టి పెట్టింది. అప్పట్లో మన్మోహన్ సింగ్ ముందున్న ప్రశ్న.. “భారత ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడాలి?”ఇప్పుడు జెన్‌జీ ముందున్న ప్రశ్న.. “ఈ ఆర్థిక వృద్ధిలో నా భవిష్యత్తు ఎక్కడ?”మన్మోహన్ సింగ్ జయంతి రోజున ఆయనను గుర్తు చేసుకోవడం అంటే కేవలం ఓ మాజీ ప్రధానికి, గొప్ప ఆర్థికవేత్తగా గుర్తుంచుకుని నివాళి ఇవ్వడం కాదు.. నేటి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఇక్కడికి వచ్చిందో గుర్తు చేసుకోవడం కూడా.:::వెబ్ డెస్క్ ప్రత్యేకం -
చిక్కుల్లో సీఈసీ జ్ఞానేశ్ కూతురు! సీజేఐకి లాయర్ల సంఘం లేఖ
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ చుట్టూ ఇప్పటికే వివాదం కొనసాగుతున్న వేళ.. ఆయన కుమార్తె మేధా రూపమ్ కూడా ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఆమె దాఖలు చేసిన ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో ఏ బెంచ్ ముందు, ఎలా లిస్ట్ అయిందన్న దానిపై లాయర్స్ అసోసియేషన్ ఫర్ కాన్స్టిట్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అంతేకాదు.. విచారణ మధ్యలో వర్చువల్ కోర్టు ఆడియోను మ్యూట్ చేయడంపైనా ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు సంఘం ఓ లేఖ రాసింది. ఈ వివాదం నోయిడాలో కార్మికుల ఆందోళనకు సంబంధించినది. ఏప్రిల్‌లో జరిగిన కార్మికుల నిరసన నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని, కార్యకర్త ఆకృతి చౌదరిని జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించారు. దీనిపై ఆమె అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 2న విచారణ జరిపిన హైకోర్టు.. ఆకృతి చౌదరి నిర్బంధాన్ని రద్దు చేసింది. ఆమెకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని, ఆ మొత్తాన్ని నిర్బంధ ప్రక్రియలో భాగమైన అధికారుల జీతాల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. అందులో నోయిడా జిల్లా మేజిస్ట్రేట్(ఐఏఎస్) మేధా రూపమ్ కూడా ఉన్నారు. ఆమె సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కూతురు. అంతేకాదు నోయిడాకు తొలి మహిళా మెజిస్ట్రేట్ కూడా.హైకోర్టు తన తీర్పులో నోయిడా యంత్రాంగం వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్ఎస్ఏ వంటి కఠిన చట్టాన్ని ప్రయోగించే ముందు సంబంధిత రికార్డులను అధికారులు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మేధా రూపమ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.అక్కడే కొత్త ప్రశ్నలుహైకోర్టు తీర్పులో తనపై చేసిన వ్యాఖ్యలు, రూ.5 లక్షల పరిహారాన్ని తన జీతం నుంచి వసూలు చేయాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ మేధా రూపమ్ పిటిషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా హైకోర్టు తీర్పును సవాలు చేసింది. సెప్టెంబర్ 23న జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్. కోటిశ్వర్ సింగ్ ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. మేధా రూపమ్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించగా.. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ హాజరయ్యారు.అయితే విచారణ జరుగుతుండగానే వర్చువల్ కోర్టు ఆడియోను మ్యూట్ చేశారు. అనంతరం వర్చువల్ యాక్సెస్‌ను కూడా మూసివేశారు. దీంతో విచారణలోని కొంత భాగాన్ని మీడియా వినలేని పరిస్థితి ఏర్పడింది. ఈ అంశమే ఇప్పుడు లాయర్ల సంఘం అభ్యంతరాల్లో కీలకంగా మారింది. ఆ బెంచ్ ముందే ఎందుకు?ఇక మేధా రూపమ్ పిటిషన్ లిస్టింగ్‌పైనే లాయర్స్ అసోసియేషన్ ఫర్ కాన్స్టిట్యూషన్ ప్రధాన ప్రశ్నలు లేవనెత్తింది. జూలై 13 నుంచి అమల్లో ఉన్న సుప్రీంకోర్టు రోస్టర్ ప్రకారం.. నిర్బంధం, హెబియస్ కార్పస్ వంటి అంశాలు వేరే బెంచ్‌ల పరిధిలో ఉన్నాయని సంఘం పేర్కొంది. ఇదే కార్మికుల ఆందోళనకు సంబంధించిన ఇతర నిర్బంధ కేసులు జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని బెంచ్ ముందు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. అయినప్పటికీ మేధా రూపమ్ పిటిషన్ అనూహ్యంగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్. కోటిశ్వర్ సింగ్ ధర్మాసనం ముందు ఎలా లిస్ట్ అయిందని ప్రశ్నించింది. దీనిని ‘ఔట్ ఆఫ్ టర్న్’ లిస్టింగ్‌గా పేర్కొంటూ.. కేసును ప్రత్యేకంగా ఒక బెంచ్‌కు కేటాయించారా? అనే సందేహాన్ని సంఘం వ్యక్తం చేసింది. మేధా రూపమ్ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కుమార్తె కావడంతో.. ఈ వ్యవహారంపై మరింత పారదర్శకత అవసరమని పేర్కొంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు లేఖ రాసింది. స్టే విషయంలోనూ గందరగోళమే!ఈ కేసులో సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశంపైనా తొలుత కొంత గందరగోళం నెలకొంది. అనంతరం సెప్టెంబర్ 24న కోర్టు తన ఆదేశాన్ని సవరించింది. ఆకృతి చౌదరి ఎన్ఎస్ఏ నిర్బంధాన్ని రద్దు చేసిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయంపై స్టే లేదని స్పష్టం చేసింది. మేధా రూపమ్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, రూ.5 లక్షల పరిహారాన్ని ఆమెతో పాటు ఇతర అధికారుల నుంచి వసూలు చేయాలన్న ఆదేశానికి సంబంధించిన భాగాలపైనే స్టే వర్తిస్తుందని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కి వాయిదా వేసింది.అదే రోజు.. సీఈసీ నియామక కేసులోనూ జస్టిస్ శర్మసెప్టెంబర్ 23నే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ మరో కీలక కేసులోనూ ధర్మాసనంలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ నియామక వ్యవస్థకు సంబంధించిన 2023 చట్టాన్ని సవాలు చేసిన పిటిషన్లపై జస్టిస్ దీపాంకర్ దత్తాతో కలిసి విచారణ జరిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. తదుపరి చర్యల కోసం అంశం సీజేఐ పరిశీలనకు వెళ్లింది. మేధా రూపమ్ కేసుతో పాటు ఈ వ్యవహారాన్ని కూడా లాయర్ల సంఘం తన లేఖలో ప్రస్తావించింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే..సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చుట్టూ ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్న సమయంలో.. ఆయన కుమార్తె మేధా రూపమ్ కేసు కూడా సుప్రీంకోర్టు లిస్టింగ్, విచారణ పారదర్శకతపై ప్రశ్నలకు దారితీసింది. నిర్బంధానికి సంబంధించిన కేసు ఈ బెంచ్ ముందుకు ఎలా వచ్చింది? విచారణ మధ్యలో ఆడియో ఎందుకు మ్యూట్ అయింది? అన్నదే ఇప్పుడు లాయర్ల సంఘం లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఈ అంశాలపై సీజేఐకి లేఖ వెళ్లడంతో.. సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి వివరణ వస్తుంది? లిస్టింగ్ ప్రక్రియపై ఏదైనా స్పష్టత ఇస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: మోదీని ఇలా మునుపెన్నడూ చూసి ఉండరు -
ఎయిరిండియా పైలట్ సస్పెన్షన్.. ఏం జరిగిందంటే..?
ఢిల్లీ: జ్యూరిక్ విమానాశ్రయంలో ఢిల్లీకి విమానం బయలుదేరే ముందు నిర్వహించిన ఆల్కహాల్ పరీక్షలో ఫెయిలైన ఎయిర్ ఇండియా సహ పైలట్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. సెప్టెంబర్ 6న జరిగిన ఈ ఘటన జరిగింది. జ్యూరిక్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానానికి చెందిన కో-పైలట్ మద్యం సేవించినట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక పరీక్షలో అతను ఫెయిల్ కాగా, రెండో పరీక్ష ఫలితం ఇంకా రావాల్సి ఉంది.తర్వాత అతడిని ప్రయాణికుడిగా భారత్‌కు తిరిగి పంపించారు. తుది వైద్య పరీక్ష నివేదిక వచ్చే వరకు అతను సస్పెన్షన్‌లోనే ఉంటాడని అధికారులు తెలిపారు. భద్రత, నియంత్రణ నిబంధనలు, సంస్థ ప్రోటోకాల్స్‌కు సంబంధించిన ఏ ఉల్లంఘననైనా తీవ్రంగా పరిగణిస్తామన్న ఎయిరిండియా.. ఉల్లంఘన నిర్థారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ ఘటన అనంతరం ఎయిర్ ఇండియా తన పైలట్లందరికీ కొత్తగా తప్పనిసరి డ్రగ్ (డోప్) పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. మరో ఘటనలో ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలోని పైలట్‌కు కూడా డ్రగ్ పరీక్షలో పాజిటివ్‌గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: వినీత్ మనోచా హత్య కేసులో బిగ్ ట్విస్ట్! -
ఈసీలో మళ్లీ అదే రచ్చ.. నాడు టీఎన్ శేషన్ ఏం చేశారో గుర్తుందా?
ఎన్నికల సంఘం.. దేశ ఎన్నికల ప్రక్రియకు కాపలాదారు. ఆ సంస్థలో ముగ్గురు సభ్యులు ఉంటే.. నిర్ణయం ఎవరిది? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) మాటే తుది మాటా? లేదంటే ముగ్గురూ కలిసి నిర్ణయం తీసుకోవాలా? ఇప్పుడు ఈ ప్రశ్న మరోసారి చర్చకు వచ్చింది. కారణం.. ఈసీలోనే ఇద్దరు కమిషనర్లు వరుసగా తమ అభ్యంతరాలను నమోదు చేసినట్లు వచ్చిన తాజా కథనాలు. సరిగ్గా ఇలాంటి ప్రశ్నే మూడు దశాబ్దాల క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకెళ్లింది. ఆ సమయంలో చీఫ్ కమిషనర్‌గా ఉన్న టీఎన్ శేషన్ ఈసీలో తనకే అధికారం ఉండాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.టీఎన్ శేషన్.. భారత ఎన్నికల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పేరు. ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ.. రాజకీయ నేతలు, మంత్రులు, అధికారులపై కూడా చర్యలకు వెనుకాడని అధికారిగా ఆయన గుర్తింపు పొందారు. దీంతో ఈసీకి గతంలో లేని స్థాయిలో ప్రాధాన్యం వచ్చింది. అయితే ఆ 1993లో పరిస్థితి మారింది. అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం ఎంఎస్ గిల్, జీవీజీ కృష్ణమూర్తిలను ఎలక్షన్ కమిషనర్లుగా నియమించింది. అప్పటివరకు సీఈసీ ఒక్కరితోనే నడిచిన ఈసీ మళ్లీ ముగ్గురు సభ్యుల సంస్థగా మారింది.ఇక్కడే అసలు వివాదం మొదలైంది. కొత్తగా వచ్చిన ఇద్దరు కమిషనర్లకు సీఈసీతో సమాన నిర్ణయాధికారం ఉండటాన్ని ఈసీ బాస్ వ్యతిరేకించారు. వారి నియామకాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీంకోర్టులో కీలక ప్రశ్నశేషన్ వాదనలో ప్రధాన అంశం ఒక్కటే.. సీఈసీకి రాజ్యాంగం ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు, మిగిలిన ఇద్దరు కమిషనర్లతో సమానంగా ఎలా పరిగణించగలరన్నది. ముఖ్యంగా బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు మెజారిటీతో తీసుకోవడాన్ని కూడా ఆయన సవాలు చేశారు. ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. 1995లో సంచలన తీర్పు వెలువడింది. బహుళ సభ్యుల ఎన్నికల కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమేనని ధర్మాసనం స్పష్టం చేసింది.అంతేకాదు.. సీఈసీ కమిషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, మిగిలిన కమిషనర్లపై ఆయనకు తుది నిర్ణయాధికారం లేదని కోర్టు తేల్చింది. కమిషన్‌లో అభిప్రాయ భేదాలు వస్తే మెజారిటీ నిర్ణయమే అమలవుతుందని స్పష్టం చేసింది. అంటే.. సీఈసీ ‘ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్’ మాత్రమే. మిగిలిన ఇద్దరు కమిషనర్లు కూడా నిర్ణయ ప్రక్రియలో సమాన భాగస్వాములే అన్నది ఆ తీర్పు సారాంశం.ఆయన అక్కడితో ఆగలేదుసుప్రీంకోర్టు తీర్పుతో శేషన్ పూర్తిగా వెనక్కి తగ్గలేదు. తీర్పును సమీక్షించాలంటూ మరోసారి కోర్టును ఆశ్రయించారు. కమిషన్ సమావేశం ఎప్పుడు జరగాలి, ఎజెండాలో ఏ అంశాలు ఉండాలి వంటి విషయాల్లో సీఈసీకే ప్రధాన అధికారం ఉండేలా నిబంధనలు రూపొందించే ప్రయత్నం కూడా చేశారు. అయితే సుప్రీంకోర్టు సమీక్ష పిటిషన్‌ను కొట్టివేసింది.ఇప్పుడు మళ్లీ అదే చర్చ ఎందుకు?మూడు దశాబ్దాల తర్వాత.. ఈసీలో అంతర్గత నిర్ణయాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని కమిషన్‌లో ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 14సార్లు కొన్ని నిర్ణయాలపై లిఖితపూర్వకంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది. ఓటర్ల జాబితా, ఫామ్–6 మార్పులు, ఈసీ ఐటీ వ్యవస్థ వంటి కీలక అంశాలపై తమకు సమాచారం లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది.జ్ఞానేశ్‌కు రాజీనామా సెగ!ఇదిలా ఉండగా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై ప్రతిపక్షాల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది. ఈసీలోని ఇద్దరు కమిషనర్లు కీలక నిర్ణయాలపై పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న నివేదికల నేపథ్యంలో.. కాంగ్రెస్ సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా ఈసీ కార్యాలయాల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కూడా ఇదే అంశంపై ఉద్యమానికి సిద్ధమైంది. 48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయకపోతే ‘జంతర్ మంతర్ 2.0’ పేరుతో మరో భారీ ఆందోళన చేపడతామని ప్రకటించింది. అయితే ఈ ఆరోపణలను ఈసీ ఖండిస్తూ.. కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు సంస్థాగత చర్చల్లో సహజమేనని, గత ఏడాది తీసుకున్న తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే ఉన్నాయని స్పష్టం చేసింది.భారత ఎన్నికల లెజెండ్‌గా టీఎన్ శేషన్ 1932 డిసెంబర్ 15న కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించారు. పాలక్కాడ్‌లోని గవర్నమెంట్ విక్టోరియా కాలేజీలో, ఆ తర్వాత చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. కొంతకాలం అక్కడే లెక్చరర్‌గా పనిచేసిన ఆయన.. అనంతరం సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశారు. 1955లో ఐఏఎస్‌లో చేరిన శేషన్.. కేరళ, కేంద్ర ప్రభుత్వాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్లానింగ్ కమిషన్ సభ్య కార్యదర్శిగా, కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1990 డిసెంబర్ 12న భారత 10వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటివరకు పెద్దగా ప్రజల దృష్టిలో లేని ఎన్నికల సంఘానికి తన కఠినమైన శైలితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ, బూత్ క్యాప్చరింగ్, అధికార దుర్వినియోగం, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను గట్టిగా అమలు చేయడంతో పాటు.. ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు (EPIC) అందించే ప్రక్రియను దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లారు. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం జవాబుదారీతనాన్ని పెంచడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1996లో రామన్ మెగసెసే అవార్డు లభించింది. 1996లో సీఈసీ పదవి నుంచి వైదొలిగిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి 1999 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు. అనంతరం ప్రజాజీవితం నుంచి క్రమంగా దూరమైన శేషన్.. 2019 నవంబర్ 10న చెన్నైలో 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఎన్నికల సంఘం అధికారాలను సమర్థంగా ఉపయోగించి.. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో కొత్త నమ్మకం కలిగించిన సీఈసీగా ఆయన పేరు మాత్రం ఇప్పటికీ భారత ఎన్నికల చరిత్రలో ప్రత్యేకంగానే నిలిచిపోయింది.ఇదీ చదవండి: లడాఖ్ పాపాల భైరవుడు అమిత్ షానే! -
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ‘అభిశంసన’ అస్త్రం!
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల్లో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఇటీవల కాలంలో మొత్తం 14 సార్లు అభ్యంతరాలను ఎన్నికల కమిషనర్లు సందు, వివేక్ జోషి నమోదు చేశారు. ఫామ్-6లో జరిగిన మార్పులను వారు వ్యతిరేకించారు. మెజారిటీ లేని నిర్ణయాలు చట్ట విరుద్ధమని విపక్ష పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలంట విపక్షా నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. గత పది నెలల కాలంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్జోషీలు మొత్తం 14 సార్లు వివిధ నిర్ణయాలపై తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వ్యక్తం చేశారని, అనధికారిక, అక్రమ ఉత్తర్వులంటూ తెలిపినప్పటికీ ఆ నిర్ణయాలు అమలయ్యాయని ఈ కథనం ఆరోపించింది.దీంతో సర్‌తోపాటు ఎన్నికల కమిషన్ తీరుతెన్నులపై ఇప్పటికే పలుమార్లు విమర్శలు, ఆరోపణలు గుప్పించిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మరోసారి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉండే అర్హత ఆయనకు లేదని, వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుండగా.. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీపార్టీ, సీపీఐ(ఎం), టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, పీడీపీలు కూడా గొంతుకలిపాయి.ఇదీ చదవండి: 48 గంటల్లో రాజీనామా చేయకపోతే.. -
48 గంటల్లో రాజీనామా చేయకపోతే..
ఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా మళ్లీ జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపడతామంటూ తేల్చి చెప్పారు. భారత ఎన్నికల సంఘం (ECI)లో అంతర్గత విభేదాల నేపథ్యంలో సీజేపీ మూడు డిమాండ్లు పెట్టింది. భారత ఎన్నికల కమిషన్.. వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ప్రచురించిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలో అభిజీత్ దీప్కే ఎక్స్‌లో ‘జ్ఞానేశ్, ఇక అయిపోయింది బ్రో!’ అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ(గురువారం) మీడియా సమావేశంలో సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్.. ఈసీ ముందు డిమాండ్లు పెట్టారు. ‘‘జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి. జరగబోయే అన్ని రాష్ట్రాల ఎన్నికలనూ నిలిపివేయాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను నిలిపివేసి.. ఓటర్ల జాబితాలను జనవరి 2025 నాటి జాబితాకు తిరిగి మార్చాలి. ‘సర్’కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను పరిశీలించేందుకు స్వతంత్ర విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు.యువత తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడాలంటూ అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. దేశం కోసం రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. సీఈసీపై అభిజీత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్ఞానేశ్ కుమార్ ఈ దేశంలోనే అతిపెద్ద దేశద్రోహి. ఆయన వెంటనే రాజీనామా చేయాలి.. ఎందుకంటే ఆయన భారతదేశ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పుగా పరిణమించారు. మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం.. కానీ జ్ఞానేశ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినప్పటి నుండి ఎవరు ఓటు వేయాలి? ఎవరు వేయకూడదు అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. ఇదేనా ప్రజాస్వామ్యం?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.ఇదీ చదవండి: ఈసీలో అంతర్గత విభేదాలు -
సీజేపీ నెక్స్ట్ మిషన్.. మరికాసేపట్లో బిగ్ అనౌన్స్మెంట్?
భారత ఎన్నికల సంఘంలో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన నివేదికల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ రంగంలోకి దిగింది. ఈసీ పనితీరు, ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల సంస్కరణలపై కాసేపట్లో కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ‘హైజాకింగ్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రసీ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. ఇటు.. ఈసీని సంస్కరించాల్సిన అవసరం ఉందంటూ ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియాలో స్పందించారు.ఈసీ వ్యవహారాలపై ఇకపై తమ ప్రధాన దృష్టి ఉంటుందని నిన్న సీజేపీ ప్రతినిధులు తెలిపారు. పార్టీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. పాఠశాలలు, నిరుద్యోగం, మౌలిక వసతులు వంటి అంశాలపై తమ ప్రచారాలు కొనసాగుతున్నప్పటికీ, ప్రజలకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకపోతే వాటి ద్వారా ఆశించిన మార్పు సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈసీపై తమకు ఉన్న అభ్యంతరాలను ఢిల్లీ ప్రెస్మీట్లో వివరిస్తామని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఠీక్ కరో పేరిట కొత్త ఉద్యమం నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అసలేం జరిగింది?ఈసీలో ఎన్నికల కమిషనర్ల మధ్య బేదాభిప్రాయాలు నడుస్తున్నాయని.. పలు అంశాలపై ఆ ప్యానెల్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఓ సంచలన కథనం ప్రచురించింది. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు, ఆదేశాలపై లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలిపింది. అలాగే కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు–పునరుద్ధరణ, ఫారమ్–6లో మార్పులు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ, ఐటీ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై ఈ అభ్యంతరాలు ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఓటర్ల డేటాబేస్ కేంద్రీకృతం కావడంపై కూడా కమిషనర్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది.ఫారమ్–6పై అభ్యంతరంకొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఉపయోగించే ఫారమ్–6లో ఎస్ఐఆర్కు సంబంధించిన ప్రశ్నను చేర్చడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమైనట్లు నివేదిక పేర్కొంది. నిబంధనల్లో మార్పు లేకుండా ఫారమ్‌లో మార్పు చేయడంపై కమిషనర్లు ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలిపింది. అంతేకాదు.. గోవాలో 97 మంది ఓటర్లకు సంబంధించిన కేసులోనూ సాఫ్ట్వేర్ సమస్య తలెత్తినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. అర్హులని అధికారులు నిర్ధారించినప్పటికీ, వారిని తిరిగి జాబితాలో చేర్చేందుకు అవసరమైన సాంకేతిక సదుపాయం సకాలంలో అందుబాటులో లేకపోయిందని నివేదించింది.పార్టీల నుంచి భిన్న స్పందనలు..ఈసీలోని అంతర్గత అభ్యంతరాలపై రాజకీయ పార్టీల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. ప్రతిపక్ష నేతలు ఈ పరిణామాలపై ఈసీ తీరును ప్రశ్నించగా.. బీజేపీ మాత్రం కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు అంతర్గత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమేనని పేర్కొంది. దీంతో ఈసీ వ్యవహారంపై రాజకీయంగానూ చర్చ మొదలైంది.ఈసీ వివరణ ఇదీ..అయితే ఈ కథనంపై ఈసీ స్పందించింది. కమిషన్‌లో భిన్నాభిప్రాయాలు, రాతపూర్వక సూచనలు, సాంకేతిక అభిప్రాయాలు సాధారణ ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేసింది. ఎస్ఐఆర్తో సహా అన్ని కీలక నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ నిర్ణయాలేనని పేర్కొంది. అంతర్గత నోట్స్‌లోని కొన్ని అంశాలను మాత్రమే చూపించడం వల్ల మొత్తం నిర్ణయ ప్రక్రియలోని మరో కోణం కనిపించదని తెలిపింది.ఇప్పుడు సీజేపీ ఏం చెబుతుంది?ఈ నేపథ్యంలోనే.. ఇప్పటివరకు స్కూల్స్ క్యాంపెయిన్ వంటి అంశాలపై దృష్టి పెట్టిన సీజేపీ హఠాత్తుగా ఈసీ సంస్కరణల అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈసీ పనితీరు, ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తమ వైఖరిని ఢిల్లీలో జరిగే ప్రెస్మీట్లో వెల్లడించనుంది. ‘ఎలక్షన్ కమిషన్ ఠీక్ కరో’ పేరుతో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతుందా? ఈసీపై ఏవైనా కీలక డిమాండ్లు, కార్యాచరణ ప్రకటిస్తుందా? అన్నదానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: ఐఐటీ బాంబే సాహిల్ కేసు.. సంచలన ఫుటేజీ బయటకు! -
లండన్ - ఢిల్లీ ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
లండన్ నుండి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణీకులు భయభ్రాంతులకు లోనయ్యారు. కారణంగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. లండన్ నుంచి 250 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం (ఫ్లైట్ 6E 04), టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి సురక్షితంగా వెనక్కి (Air turnback) చేరుకుంది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే టెక్నికల్ ఇష్యూ తలెత్తడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. టేకాఫ్ అయిన తర్వాత కాక్‌పిట్ సిబ్బంది విమానంలో పొగను గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించి ఎమర్జెన్సీని ప్రకటించారు. నిబంధనల ప్రకారం (SOP) విమానాన్ని వెనక్కి మళ్లించి హీత్రూ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేష్ కుమార్ జైలుకెళ్లాల్సిందే : సంజయ్ రౌత్ ఆగ్రహంబాధిత ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని తగ్గించడానికి హోటల్ వసతి కల్పించడంతో పాటు, తదుపరి లభ్యమయ్యే వేరే విమానాలలో వారి గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రస్తుతం ఆ విమానానికి (బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్) మెయింటెనెన్స్ తనిఖీలు నిర్వహిస్తున్నామని, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే తిరిగి సర్వీసులను ప్రారంభిస్తామని ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని ఇండిగో పేర్కొంది. ఇదీ చదవండి: 23 ఏళ్ల తరువాత అమెరికా డ్రీమ్స్ వదిలి ‘అమ్మ’దగ్గరికి -
మళ్లీ సిగ్గుచేటు రాజధాని.. 12 రోజుల్లో 4 ‘తలవంపులు’
న్యూఢిల్లీ: ఆలయానికి వెళ్లిన బాలిక.. పెన్నులు, పుస్తకాలు కొనడానికి వెళ్లిన విద్యార్థిని.. స్నేహితుడిని కలవడానికి వెళ్లిన మరో బాలిక.. ఆరేళ్ల చిన్నారి.. ఢిల్లీలో కేవలం 12 రోజుల వ్యవధిలో నలుగురు మైనర్లపై అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఓ 17 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. వరుస ఘటనలు దేశ రాజధానిలో మహిళలు, బాలికల భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.పార్కులో 17 ఏళ్ల బాలికపై దారుణంసోమవారం రాత్రి కల్కాజీ ఆలయం సమీపంలోని ఆస్తా కుంజ్ పార్కులో 17 ఏళ్ల బాలిక తన స్నేహితుడితో కలిసి ఉండగా ముగ్గురు వ్యక్తులు పోలీసులమని చెప్పి, వారిని అడ్డుకున్నారు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అసిఫ్, హేమంత్, అతడి సోదరుడు ముఖేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.ఆరేళ్ల చిన్నారిపైనా అత్యాచారంఅదే సోమవారం ఢిల్లీలోని దేశ్‌బంధు గుప్తా రోడ్ సమీపంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.స్టేషనరీ కోసం వెళ్లి.. సెప్టెంబర్ 16న సదర్ బజార్లో ఆరో తరగతి చదువుతున్న బాలిక స్టేషనరీ కొనడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఓ దుకాణ యజమాని ఆమెను దుకాణంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.స్నేహితుడిని కలవడానికి వెళ్లి..సెప్టెంబర్ 10న స్వరూప్ నగర్లో 17 ఏళ్ల బాలిక తనకు తెలిసిన వ్యక్తిని కలవడానికి వెళ్లింది. అక్కడ ఆమెపై పలువురు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మృతదేహం లభించింది. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా, వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు.పోక్సో.. జువెనైల్ చట్టాల ప్రకారం..నలుగురు బాధితులు 18 ఏళ్లలోపు వారు కావడంతో అన్ని కేసుల్లోనూ పోక్సో చట్టం వర్తిస్తుంది. ప్రత్యేక కోర్టులు, బాధితురాలి గుర్తింపును వెల్లడించకపోవడం, సాధ్యమైనంత వరకు విచారణను ఏడాదిలో పూర్తి చేయడం వంటి నిబంధనలు ఈ చట్టంలో ఉన్నాయి. అయితే పోక్సో కేసుల పెండింగ్ కారణంగా విచారణలు ఆలస్యం అవుతున్నాయని కథనం పేర్కొంది.మైనర్ నిందితుల విషయంలో ప్రత్యేక నిబంధనలుస్వరూప్ నగర్ కేసులో అరెస్టైన ముగ్గురు మైనర్ల విషయంలో జువెనైల్ జస్టిస్ చట్టంలోని నిబంధనలు కీలకంగా మారుతున్నాయి. 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలుడు ఘోరమైన నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటే, జువెనైల్ జస్టిస్ బోర్డు అంచనా అనంతరం అతడిని పెద్దవాడిగా విచారించే అవకాశం ఉంటుంది. 16 ఏళ్లలోపు వారిపై మాత్రం ఈ విధానం వర్తించదు.ఢిల్లీలో నేరాల గణాంకాలుఎన్సీఆర్బీ 2023 నివేదిక ప్రకారం ఢిల్లీలో 1,088 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2024 గణాంకాల్లో 19 ప్రధాన మెట్రో నగరాల్లో ఢిల్లీలో అత్యాచార కేసులు 1,058గా నమోదయ్యాయి. 2026 జనవరిలో ఢిల్లీ పోలీసుల గణాంకాల ప్రకారం మహిళలపై నేరాలు 5 నుంచి 8 శాతం తగ్గినట్లు, కేసుల పరిష్కార రేటు 95 శాతానికి పైగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే 2025కు సంబంధించిన ఎన్సీఆర్బీ పూర్తి గణాంకాలు ఇంకా విడుదల కాలేదు. వరుస ఘటనల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో పోలీసుల గస్తీ, భద్రతా ఏర్పాట్లు, వేగవంతమైన దర్యాప్తు వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. ఇదీ చదవండి: 360 డిగ్రీల అద్భుత ‘స్కైడోమ్’.. చూసి తీరాల్సిందే! -
బిట్టూ… నువ్వు సూపర్ రా!
నదులు, చెరువుల్లో చెత్త పారబోయడం ఒక ఎత్తయితే.. పేరుకుపోయిన ఆ చెత్తకంపుతో ముక్కు మూసుకుని పట్టించుకోకుండా వెళ్లిపోతుంటాం మనం. కానీ సురేంద్ర అలాంటోడు కాదు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూడడం అతనికి చేత కాదు. చిన్నప్పటి నుంచే నీళ్లలోకి దిగి.. తన చేతులతోనే చెత్తను తొలగిస్తూ పర్యావరణ పరిరక్షణకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. అలా సోషల్ మీడియాలో ‘బిట్టూ తబాహీ’గా గుర్తింపు పొందిన అతడు.. ఇప్పుడు యమునా నదిని శుభ్రం చేసే మిషన్ చేపట్టాడు. సెప్టెంబర్ 20న ప్రపంచ శుభ్రత దినోత్సవం సందర్భంగా.. యమునా నదిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని బిట్టూ తబాహీ చేపట్టారు. అతడి వెంట వచ్చిన వాలంటీర్లు సుమారు నాలుగున్నర గంటలపాటు యమునా ఒడ్డును శుభ్రం చేశారు. ఈ సమయంలో ఏకంగా 585 కిలోల చెత్తను తొలగించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు పూలు, దండలు, పూజా సామగ్రి, ఇతర చెత్తను ఒడ్డునుంచి సేకరించారు. స్థానికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అతడికి సహకరించారు. బిట్టూ తబాహీ అసలు పేరు సురేంద్ర సింగ్ చౌదరి. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరాకు చెందిన అతడు స్కూల్ పిల్లాడిగా ఉన్నప్పుడే నదులు, బహిరంగ ప్రదేశాల శుభ్రతపై దృష్టి పెట్టాడు. అతడి సోషల్ మీడియా ఖాతాల్లో చెత్తతో నిండిన ప్రాంతాల్లోకి వెళ్లి స్వయంగా శుభ్రం చేస్తున్న వీడియోలు కనిపిస్తాయి. పెద్ద యంత్రాలు, భారీ సిబ్బంది లేకుండానే సాధారణ పరికరాలతో చెత్తను తొలగించడం అతడి ప్రత్యేకతగా మారింది. అజ్నార్ నదితోనే అసలు గుర్తింపు..బిట్టూకు భారీగా గుర్తింపు తెచ్చింది మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నది. ప్లాస్టిక్, చెత్త, ఆల్గీతో నది దాదాపు డంపింగ్ యార్డులా మారిన పరిస్థితిని చూసి.. జనవరి 26న అక్కడ శుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించాడు. తొలుత కొందరు స్నేహితులు అతడితో కలిసి పనిచేసినా.. ఆ తర్వాత వారు తప్పుకోవడంతో బిట్టూ ఒంటరిగానే నదిలోకి దిగి చెత్త తొలగించడం కొనసాగించాడు. వారాలపాటు ఈ పని చేస్తూ ప్లాస్టిక్, సీసాలు, ఇతర వ్యర్థాలను బయటకు తీశాడు. అతడు చేస్తున్న పనిని వీడియోలుగా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి. నదిని శుభ్రం చేయడానికి బిట్టూ తన సొంత డబ్బుతో అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశాడు. కొందరు మాత్రం పిల్లాడు సోషల్ మీడియా ప్రచారం కోసమే చేస్తున్నాడంటూ విమర్శించారు. కానీ బిట్టూ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఆయన ప్రశంసతో వెలుగులోకిఅజ్నార్ నదిని శుభ్రం చేస్తున్న బిట్టూ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. బియోరాకు చెందిన ఈ యువకుడిని తన ‘మండే మోటివేషన్’గా పేర్కొంటూ ఆయన బిట్టూ చేసిన పనిని ప్రశంసించారు. దీంతో బిట్టూ కథ దేశవ్యాప్తంగా మరింతగా వైరల్ అయింది. జెన్‌జీకి ఇలాంటి కుర్రాళ్ల స్ఫూర్తి కచ్చితంగా ఉండాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. విదేశీ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్!బిట్టూ చేసిన పని అంతర్జాతీయ స్థాయిలోనూ దృష్టిని ఆకర్షించింది. నెదర్లాండ్స్‌కు చెందిన పర్యావరణ సంస్థ ది ఓషన్ క్లీనప్ వ్యవస్థాపకుడు, సీఈవో బోయన్ స్లాట్.. సోషల్ మీడియాలో బిట్టూ పనిపై స్పందిస్తూ అతడిని తమ సంస్థలో పనిచేయాలని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత బిట్టూ తన శుభ్రత కార్యక్రమాన్ని ఒక్క నదికే పరిమితం చేయకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఏ రాష్ట్రానికి వెళ్లాలి, ఎక్కడి నదిని శుభ్రం చేయాలి అంటూ సోషల్ మీడియాలో ప్రజలను సూచనలు కూడా కోరాడు.ఇప్పుడు యమునా! తర్వాత ఎక్కడంటే..అజ్నార్ నది తర్వాత బిట్టూ దృష్టి మధ్యలో చిన్నాచితకా కాలువలు, చెరువులపై పడింది. ఆ తర్వాత దేశ రాజధానికి చేరి .. యమునా నదిని శుభ్రం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతని పిలుపునకు వందల మంది వలంటీర్లు ముందుకు వచ్చారు. మూడు రోజులపాటు యమునా పరిసరాల్లో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. తొలి రోజే.. అదీ నాలుగు గంటల్లోనే వందల కిలోల చెత్తను తొలగించడంతో ఈ కార్యక్రమం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తదుపరి తన శుభ్రత కార్యక్రమాన్ని గురుగ్రామ్‌లోని ఖేడ్కీ దౌలాకు తీసుకెళ్లనున్నట్లు బిట్టూ వెల్లడించాడు. ఒక చిన్న పట్టణానికి చెందిన యువకుడు.. ప్రభుత్వ యంత్రాంగం కోసం ఎదురుచూడకుండా తన చేతులతోనే నదిలోని చెత్తను తొలగించడం మొదలుపెట్టాడు. ఆ పని వీడియోలుగా మారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు అదే వైరల్ ప్రయాణం అతడిని యమునా ఒడ్డుకు, అక్కడి నుంచి దేశవ్యాప్తంగా శుభ్రత కార్యక్రమాల వైపు తీసుకెళ్తోంది. -
పోలీసుల వేషంలో వచ్చి.. పార్క్‌లో మైనర్‌పై గ్యాంగ్‌రేప్
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులమని చెప్పి ఓ మైనర్ బాలికను బెదిరించిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ మందిరం దగ్గర ఉన్న పార్కులో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. 17 ఏళ్ల బాలిక సోమవారం సాయంత్రం తన 17 ఏళ్ల స్నేహితుడితో కలిసి కల్కాజీ మందిరానికి వెళ్లింది. అక్కడ పూజాలు చేశాక.. ఆలయానికి పక్కనే ఉన్న పార్కుకు వెళ్లారు. వాళ్లు ఒంటరిగా ఉండడం గమనించిన ముగ్గురు.. తాము పోలీసులమంటూ వాళ్లను బెదిరించారు. వాళ్లలో ఇద్దరూ ఆ బాలుడ్ని మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లగా.. ఒకడు బాలికను తుపాకీ, కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం మిగిలిన ఇద్దరూ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘటన గురించి బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇద్దరినీ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు బాధితులను గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు.సీసీటీవీలతో నిందితుల కోసం..కల్కాజీ మందిరం–ఇస్కాన్ ఆలయాన్ని కలిపే మార్గంలోని పార్కులో ఘటన జరిగినట్లు పోలీసులకు రాత్రి 8.45 గంటలకు పీసీఆర్ కాల్ వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్కుతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్నవారు, పరిసరాల్లో సంచరించిన వ్యక్తుల వివరాలను సేకరించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.పోలీసులపై కాల్పులు.. కుడికాలికి బుల్లెట్దర్యాప్తులో భాగంగా ఓ నిందితుడు ఢిల్లీలోని అమర్ కాలనీ పరిధిలోని డీఎం ఆఫీస్ రోడ్డువైపు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడ వలపన్ని అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోగానే నిందితుడు కాల్పులు జరిపాడు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడి కుడికాలికి బుల్లెట్ తగిలింది. గాయపడ్డ అతన్ని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతని పేరు అసిఫ్ అని.. ఓఖ్లా మండీలో పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనపై పోక్సో సహా సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు.Minor Girl Allegedly Sexually Assaulted at Astha Kunj Park; Accused Injured in Police EncounterA 17-year-old girl was allegedly sexually assaulted by three men at Delhi’s Astha Kunj Park after the accused allegedly posed as policemen and separated her from her male friend,… pic.twitter.com/6vtUPaPHnk— Atulkrishan (@iAtulKrishan1) September 22, 2026పది రోజుల్లో నాలుగో ఘటనఢిల్లీలో పది రోజుల వ్యవధిలో మైనర్లపై అత్యాచారానికి సంబంధించిన నాలుగు ఘటనలు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్ 13న స్వరూప్‌నగర్‌లో 17 ఏళ్ల బాలికపై నలుగురు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. సెప్టెంబర్ 16న సదర్‌బజార్‌లో 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. సెప్టెంబర్ 21న కిషన్‌గంజ్‌లో ఆరేళ్ల బాలికపై 34 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాజాగా కల్కాజీ ఘటన ఈ వరుసలో చేరింది. ఇదీ చదవండి: ఆ అమ్మాయిని అలా వేధించడం కామన్ అంట! -
ఈవీల వాడకంలో ఢిల్లీయే బాస్!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) వాడకం, మౌలిక వసతుల కల్పనలో దేశ రాజధాని ఢిల్లీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ (ఐఈఎంఐ) 2025’ నివేదిక ప్రకారం... ఢిల్లీ అత్యధికంగా 84 స్కోరు సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర (78), కర్ణాటక (73), చండీగఢ్ (71), గోవా (65) ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి.రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ రవాణాకు సంబంధించిన విధాన రూపకల్పనతో పాటు క్షేత్రస్థాయి అమలు ఫలితాలను అంచనా వేసేందుకు ఈవీ ఇండెక్స్‌ని రూపొందించారు. ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ పురోగతి (50% వెయిటేజీ), ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సన్నద్ధత (30% వెయిటేజీ), ఈవీ పరిశోధన, ఆవిష్కరణలు (20% వెయిటేజీ) అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా రాష్ట్రాలకు స్కోరింగ్ ఇచ్చారు.ఈవీ ఇండెక్స్ నివేదికలో ముఖ్యాంశాలు...పెద్ద రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర, కర్ణాటక ముందంజలో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల విభాగంలో మణిపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్రపాలిత ప్రాంతాలు, సిటీ స్టేట్లలో ఢిల్లీ, చండీగఢ్, గోవాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. 2024తో పోలిస్తే 2025 నాటికి మధ్యప్రదేశ్ గణనీయమైన వృద్ధిని సాధించి 23వ స్థానం నుంచి ఏకంగా 7వ స్థానానికి ఎగబాకింది. ఛార్జింగ్ వసతుల కల్పనలో కర్ణాటక దేశంలోనే అత్యధికంగా 97 స్కోరు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. డిసెంబర్ 2022 నాటికి దేశంలో 5,151గా ఉన్న పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య జూన్ 2025 నాటికి ఏకంగా 29,000 దాటింది.పర్యావరణం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావందేశీయ రవాణా రంగాన్ని కార్బన్ రహితంగా మార్చేందుకు ఈవీల విప్లవం అత్యంత కీలకమైనదని నివేదిక స్పష్టం చేసింది. రోడ్డు రవాణా రంగం వల్ల దేశంలో ఇంధన ఆధారిత కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 12%, నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలు 18% వెలువడుతున్నాయి. ఈవీల వినియోగం పెరగడంతో ఈ ఉద్గారాలు గణనీయంగా తగ్గనున్నాయని నివేదిక తెలిపింది. దేశ జీడీపీలో ఆటోమొబైల్ రంగం వాటా 7.1 శాతం కాగా, తయారీ రంగ ఉత్పత్తుల్లో సగానికి పైగా వాటా ఉంది. ఇది సుమారు 1.9 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తోంది. ఈవీ మార్పు ఆటో మొబైల్ రంగానికి సుస్థిర భవిష్యత్తును అందిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది.పశ్చిమాసియా సంక్షోభం ఈవీలకు కీలక మలుపు నివేదికను విడుదల చేసిన నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా మాట్లాడుతూ... అమెరికాలో కొత్త కార్ల విక్రయాల్లో ఈవీల వాటా 10 శాతం, యూరప్‌లో 25 శాతం, చైనాలో 50 శాతానికి పైగా ఉందన్నారు. 1970ల నాటి చమురు సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సామర్థ్యానికి ఎలా కారణమైందో, ఇటీవలి పశ్చిమాసియా సంక్షోభం కూడా ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి పెద్ద మార్పుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. 2018 నాటికి భారత వాహన విక్రయాల్లో ఈవీల వాటా కేవలం 0.5 శాతంగా ఉండగా, 2025–26 నాటికి అది 8.25 శాతానికి చేరిందని, ప్రస్తుతం రోడ్లపై 87 లక్షలకు పైగా ఈవీలు తిరుగుతున్నాయని గౌబా తెలిపారు.ఇదీ చదవండి: వెళ్లిపోయాడనుకునేలోపే మళ్లీ ఐదేళ్ల పదవి! -
కత్తెరతో బెదిరించి బాలికపై టైలర్ రేప్
న్యూఢిల్లీ: రాత్రి 11 గంటల సమయంలో స్టేషనరీ వస్తువులు కొనేందుకు బయటికొచ్చిన 11 ఏళ్ల అమ్మాయిని 56 ఏళ్ల టైలర్ మక్సూద్ రేప్‌చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 16వ తేదీన సదర్ బజార్ ప్రాంతంలో జరిగిన ఈ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక గత బుధవారం రాత్రి బయటికొస్తుంటే వెళ్లొద్దని తల్లి వారించింది. సమీపంలోని బంధువుల దుకాణానికే వెళ్లొస్తానని చెప్పి బయల్దేరింది. అయితే మార్గమధ్యంలో మక్సూద్ అమ్మాయిని గమనించి మాయమాటలు చెప్పి టైలర్ షాప్‌కు తీసుకెళ్లి కుర్చీకి కట్టేసి నోట్లో ఒక వస్త్రం కుక్కి అరుపులు వినపడకుండా చేశాడు. అరిస్తే పొడిచి చంపేస్తానని కత్తెరతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యలో బయటకు వచ్చినప్పుడు ఇతనికి అమ్మాయి తల్లి తారసపడింది. మా అమ్మాయిని చూశారా? అని అడిగితే లేదు అని బుకాయించాడు. తర్వాత భయపడిపోయి వెంటనే అమ్మాయిని దుకాణం నుంచి బయటకు గెంటేశాడు. ఇది చూసిన పొరుగువ్యక్తి ముజామిల్ ఖురేషి వెంటనే తల్లికి సమాచారం ఇచ్చాడు. ఇంటికెళ్లిన అమ్మాయి తనకు జరిగిన ఘోరం చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అదే రాత్రి మక్సూద్ను అరెస్ట్‌చేసి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా జైలుకు తరలించారు. నార్త్ డిస్ట్రిక్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేసి దర్యాప్తు ఆరంభించారు. -
బీజేపీపైనే దూకుడు! ఆప్ థ్యాంక్స్.. కాంగ్రెస్ ట్విస్ట్
జంతర్ మంతర్ వేదికగా నీట్ పేపర్‌లీక్ వ్యవహారం, విద్యా వ్యవస్థలో అవకతవకలపై ఉద్యమం చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కాక్రోచ్ జనతా పార్టీ. అయితే ఇప్పుడు అది ప్రదర్శిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. స్కూళ్ల బాగు కోసం మీద దేశవ్యాప్త క్యాంపెయిన్ నడుపుతున్న ఈ సంస్థ.. పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందనే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ తరుణంలో సీజేపీ ఓ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ‘స్కూల్ ఠీక్ కరో’, ‘ఆదివాసీ స్కూల్ ఠీక్ కరో’ పేరుతో సీజేపీ పలు రాష్ట్రాల్లో పాఠశాలలను తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే ఈ కార్యక్రమంపై మరో ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీజేపీ నిరసనలు, అల్టిమేటాలు, రాజీనామా డిమాండ్లతో దూకుడుగా వ్యవహరిస్తుండగా.. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం మెతక ధోరణికే పరిమితమవుతోందట. దీంతో ఇదేనా కాక్రోచ్ల ఫెయిర్‌నెస్? అనే ప్రశ్న పుట్టుకొచ్చింది.జూన్ 6న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన సీజేపీ ఆందోళన.. అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో సాగింది. పరీక్షల పేపర్ లీకులు, నియామకాల్లో అవకతవకలు వంటి అంశాలపై 37 రోజులపాటు ఉద్యమం జరిగింది. జూలై 25న ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత సీజేపీ విజయోత్సవ సంబురాలు చేసుకుంది. అయితే ఆ వెంటనే దాని దృష్టి ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లింది. ఆగస్టు 15న మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, భవనాల పరిస్థితి వంటి అంశాలను పరిశీలిస్తూ.. సమస్యలను వీడియోల రూపంలో బయటకు తీసుకొస్తోంది. ఆపై ఆదివాసీ స్కూళ్లపైనా ఈ క్యాంపెయిన్‌ను ఉధృతం చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దూకుడు..స్కూల్ ఠీక్ కరో కోసం మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ఉత్తరప్రదేశ్‌లో పరీక్షల అక్రమాలపై నిరసనల్లో పాల్గొన్న ఆ సంస్థ.. తర్వాత నోయిడాలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసింది. రాజస్థాన్‌లో పాఠశాలల పరిస్థితిపై తనిఖీలు చేపట్టింది. మహారాష్ట్ర తన స్వరాష్ట్రం కావడంతో సీజేపీ నేత అభిజీత్ దీప్కే స్వయంగా రంగంలోకి దిగి ఉద్యమించారు. సెప్టెంబర్ 17న గడ్చిరోలిలో ఆదివాసీ పాఠశాలల కోసం ప్రత్యేక ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అంతేకాదు తమ పోరాటం వల్లే హర్యానా ప్రభుత్వంలో పాఠశాలల రిపేర్ల కోసం కదలిక వచ్చిందని గర్వంగా ప్రకటించుకుంది. ప్రతిపక్ష రాష్ట్రాల్లో మరోలా!బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీజేపీ నిరసనలు, అల్టిమేటాలు, రాజీనామా డిమాండ్లతో ఒత్తిడి పెంచగా.. బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం మరోలా సాగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోనూ సీజేపీ బృందాలు పాఠశాలలను తనిఖీ చేశాయి. పంజాబ్‌లో సౌరవ్ దాస్ నేతృత్వంలోని బృందం లూధియానాలో మూడు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించింది. ‘స్కూల్స్ ఆఫ్ ఎమినెన్స్’లోని స్విమ్మింగ్ పూల్, ఏఐ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ వంటి సౌకర్యాలను ప్రశంసించడంతో పాటు కొన్ని లోపాలను గుర్తించింది.ఈ విషయాలను విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఇక కర్ణాటకలో సీజేపీ బృందం బెంగళూరు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, భవనాల భద్రత, పారిశుధ్య సమస్యలను గుర్తించింది. ‘స్కూల్ ఠీక్ కరో’ను రాష్ట్రంలోని 31 జిల్లాలకు విస్తరించనున్నట్లు ప్రకటించి, విద్యాశాఖ మంత్రి మధు బంగారప్పతో సమావేశమైంది.కాంగ్రెస్ ట్విస్ట్అయితే సీజేపీ ఉద్యమంపై కాంగ్రస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తమ పాలిత రాష్ట్రాల్లో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడంపై కౌంటర్ ఇచ్చింది. బీజేపీయేతర రాష్ట్రాల్లో చేసినట్టే.. మిగతా రాష్ట్రాల్లోనూ పక్షపాతం లేకుండా అడిటింగ్ చేపట్టాలని సీజేపీకి సూచిస్తోంది. అదే దృష్టితో, అదే ప్రశ్నలతో, అదే ధైర్యంతో తనిఖీలు చేయండి అంటూ సచిన్ పైలట్ చురకలు అంటించారు. అయితే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ విమర్శలను తోసిపుచ్చారు. పంజాబ్, కర్ణాటక, జార్ఖండ్‌లోనూ తమ బృందాలు పర్యటించి పాఠశాలల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాయని చెప్పారు.అందుకే ఇప్పుడు చర్చ సీజేపీ ఎక్కడికి వెళ్లిందన్నదానిపై కాదు.. ఎక్కడ ఎంత ఒత్తిడి తీసుకొచ్చిందన్నదే*. రాష్ట్రాన్ని బట్టి పరిస్థితులకు అనుగుణంగా వైఖరి మారిందా? లేక రాజకీయ తేడా ప్రభావం చూపిందా? అన్న ప్రశ్నలు మాత్రం కొనసాగుతున్నాయి. దీనికి సమాధానం సీజేపీ రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాల తీరు మరింత స్పష్టత ఇవ్వొచ్చు. ఇదిలా ఉంటే.. పాఠశాలల్లోని సమస్యలు బయటకు రావడం, వాటిపై ప్రభుత్వాలు స్పందించడం మాత్రం ఈ క్యాంపెయిన్ ద్వారా కనిపిస్తున్న పరిణామం. -
జైశంకర్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం
ఇటీవల కేంద్రప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ పలు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆధారాలు సరిపోలడం లేదంటూ ప్రముఖులకు సైతం ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం వారు మాకే నోటిసులిస్తారా అంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడం ఇలా ఈ అంశం వివాదాస్పదమవుతూ వచ్చింది. అయితే ఈ సారి ఆ జాబితాలో ఏకంగా భారత విదేశాంగ శాఖ మంత్రి చేరారు. గతంలో ఇచ్చిన వివరాలతో ప్రస్తుత వివరాలు సరిపోవడం లేదంటూ ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది.ఢిల్లీలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో పలువురు ప్రముఖులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్, ఆయన భార్య క్యోకో జైశంకర్, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్య సునీత ద్వివేది, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన కుటుంబ సభ్యులు నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ప్రస్తుత ఓటరు వివరాలను 2002లో జరిగిన గత సవరణలోని రికార్డులతో అనుసంధానం చేయలేకపోవడం లేదా పేర్లు, కుటుంబ వివరాల్లో తేడాలు ఉండటమే ఇందుకు కారణాలుగా ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు.జైశంకర్ దంపతులు, ప్రవీణ్ సూద్ కుటుంబ సభ్యులు, జనరల్ ఉపేంద్ర ద్వివేది దంపతులను “అన్మ్యాప్డ్ విత్ లాస్ట్ SIR” విభాగంలో చేర్చారు. అంటే ప్రస్తుత ఓటరు జాబితాలోని వారి వివరాలను గత SIR సమయంలో రూపొందించిన ఓటరు జాబితాతో అనుసంధానం చేయలేకపోయినట్లు అర్థం. వీరంతా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటర్లుగా నమోదై ఉన్నారు. అయితే నోటీసు అందుకోవడం వల్ల ఓటు హక్కు రద్దయిందని లేదా ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తారని అర్థం కాదని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు.మాజీ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆయన కుటుంబ సభ్యులకు సైతం నోటీసులు వచ్చాయి. సిసోడియా భార్య సీమా సిసోడియా వివరాల్లో పేరుకు సంబంధించిన తేడాను, కుమారుడు మీర్ సిసోడియా రికార్డులో తల్లిదండ్రుల పేరుకు సంబంధించిన తేడాను అధికారులు గుర్తించారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజనా దేశాయ్, ఆమె భర్త ప్రకాశ్ దేశాయ్, కుమారుడు మైక్ దేశాయ్, కోడలు సాక్షి దేశాయ్ పేర్లు కూడా “అన్మ్యాప్డ్” విభాగంలో ఉన్నాయి. సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ కుటుంబ సభ్యులకూ వివిధ కారణాలతో నోటీసులు జారీ అయ్యాయి.పలువురు సీనియర్ అధికారులు కూడా SIR నోటీసులు అందుకున్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్, ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ తదితరులను “అన్మ్యాప్డ్ విత్ లాస్ట్ SIR” కేటగిరీలో చేర్చారు. మరికొందరు అధికారుల రికార్డుల్లో పేరు లేదా కుటుంబ వివరాలకు సంబంధించిన తేడాలను అధికారులు గుర్తించారు.ఎన్నికల సంఘం ప్రకారం, నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత ఎన్నికల నమోదు అధికారికి తమ వివరణతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన అనంతరం అధికారి తగిన నిర్ణయం తీసుకుంటారు. ఎవరి పేరునూ విచారణకు అవకాశం ఇవ్వకుండా తొలగించబోమని, నిర్ణయం కారణాలతో కూడినదిగా మరియు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేలా ఉంటుందని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. నోటీసుల పరిష్కార ప్రక్రియను అక్టోబర్ 29లోగా పూర్తి చేసి, తుది ఓటరు జాబితాను నవంబర్ 4న ప్రచురించనున్నట్లు తెలిపారు. -
హడలెత్తిన రైడ్.. వెంటపడ్డ వాహనాలు.. రెండు గంటల భయానక జర్నీ!
వెనకాలే వస్తున్న వాహనాలు.. చుట్టూ వింత చూపులు.. రాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్న ఢిల్లీ రోడ్లు.. స్కూటర్‌పై ఒంటరి ప్రయాణం.. వెనుక నుంచి వస్తున్న వాహనాలు.. చీకటిలో తనవైపు నిలిచిపోయిన చూపులు.. మొదట ఇదంతా ఓ సాధారణ రాత్రి రైడ్‌లానే అనిపించింది. కానీ కొన్ని నిమిషాలు గడిచేసరికి పరిస్థితి మారిపోయింది. ఒకటి తర్వాత మరొకటి ఎదురైన ఘటనలతో ఆ ప్రయాణం చివరకు భయానక అనుభవంగా మారింది.రాత్రివేళ మహిళలు ఎదుర్కొనే పరిస్థితులను స్వయంగా తెలుసుకోవాలనుకున్న ఓ కంటెంట్ క్రియేటర్ ఈ ప్రయోగం చేశాడు. BeJaintle పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ చేసే అతడు.. ఇంట్లోనే మహిళ మాదిరిగా కనిపించే మేకప్ వేసుకుని, డ్రెస్ ధరించి, తలకు దుపట్టా కప్పుకున్నాడు. ఆ తర్వాత స్కూటర్ తీసుకుని ఢిల్లీ రోడ్లపైకి బయలుదేరాడు.మొదట చూపులు.. ఆ తర్వాత వెంటపడటం!రోడ్డుపైకి వచ్చిన కొద్దిసేపటికే తనవైపు పలువురు చూస్తున్నారని క్రియేటర్ గుర్తించాడు. ఎక్కడికి వెళ్లినా ఆ చూపులు తనను వెంబడిస్తున్నట్లు అనిపించాయని అతడు వీడియోలో పేర్కొన్నాడు. ఒక దశలో ఇద్దరు వ్యక్తులు తనను గమనిస్తూ స్కూటర్‌ను అనుసరించారని అతడు ఆరోపించాడు. మొదట దూరంగా కనిపించిన వారు.. క్రమంగా తనకు దగ్గరగా రావడానికి ప్రయత్నించారని చెప్పాడు. మరో సందర్భంలో స్కూటర్ నడుపుతుండగానే ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి మాట్లాడటం ప్రారంభించాడని తెలిపాడు.చీకటి రోడ్డుపై ఆటోలు.. అసలు టెన్షన్ అక్కడితో ఆగలేదు. ప్రయాణంలో రెండు ఆటోలు తన స్కూటర్ మార్గంలోకి పదేపదే వచ్చినట్లు క్రియేటర్ చెప్పాడు. ఓ ఆటో డ్రైవర్ తన స్నేహితులు వీడియో తీస్తున్నారని గుర్తించిన తర్వాత ఆగిపోయాడని అతడు తెలిపాడు. మరో డ్రైవర్ మాత్రం తన స్కూటర్ వైపు పలుమార్లు వాహనాన్ని మళ్లించినట్లు ఆరోపించాడు. ఆ వాహనం చివరకు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నానని చెప్పాడు.‘ఇక చాలు..’ అంటూ ముగింపురెండు గంటలు గడిచేసరికి అతడి ఉత్సాహం మొత్తం భయంగా మారిపోయింది. పదేపదే ఎదురైన చూపులు, అనుసరిస్తున్నట్లు అనిపించిన వ్యక్తులు, తన దారిలోకి వస్తున్న వాహనాలతో తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని చెప్పాడు. గత రెండు గంటల్లో నాకు చాలా అసహ్యంగా అనిపించింది. ఆటోవాళ్లు, సైకిల్ వాళ్లు.. అందరూ చూస్తూనే ఉన్నారు. రాత్రివేళ అమ్మాయిలు ఒంటరిగా బయటకు రావడం నిజంగా సురక్షితం కాదనిపించింది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు. చివరకు ఆ ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేశాడు. మహిళ వేషంలో చేసిన ఆ రాత్రి ప్రయాణం.. కేవలం సోషల్ మీడియా ప్రయోగంగా మొదలై, తనకు భయాన్ని మిగిల్చిన అనుభవంగా మారింది.ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మహిళలు రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఎదుర్కొనే అవాంఛిత చూపులు, అనుసరణ, వేధింపులపై పలువురు స్పందించారు. అయితే ఒక్క వ్యక్తి చేసిన ఈ ప్రయోగాన్ని ఆధారంగా చేసుకుని ఢిల్లీలో మహిళల భద్రతపై విస్తృతమైన నిర్ధారణకు రావడం సరికాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. He Dressed as a Woman and Rode Through Delhi at Night. What He Experienced in 2 Hours Is Now Raising Questions About Women’s Safety.A Delhi-based content creator conducted a social experiment by dressing as a woman and riding a scooty through the capital after dark.His… pic.twitter.com/5eVM92jtLp— News Insider 24x7 (@newsinsider24x7) September 19, 2026ఇదీ చదవండి: గణేశ్ మండపం వద్ద కరెంట్ షాక్.. మహిళ, బాలిక మృతి -
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో.. ఏబీవీపీ ఘన విజయం
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం సాధించింది. ఏబీవీపీ నేత యష్ దబాస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయనకు మెుత్తంగా 24,576 ఓట్లు వచ్చాయి. వైస్ ప్రెసిడెంట్ పోస్టును ఇండిపెండెంట్ అభ్యర్థి దీపాన్షు గెలుచుకున్నారు. కార్యదర్శిగా రియాచావ్డి (ఏబీవీపీ) సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన లక్ష్ రాజ్ సింగ్ (ఏబీవీపీ ) ఎన్నికయ్యారు.ప్రధాన విద్యార్థి సంఘాల మధ్య హోరాహోరీగా జరిగిన పోటీ అనంతరం ఈ ఫలితాలు వెలువడ్డాయి. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), ఏఐఎస్ఏ-ఎస్ఎఫ్ఐ కూటములు ఈ ఎన్నికల్లో పోటీచేశాయి. ఈ రోజు (శనివారం) ఉదయం 8 గంటలకు నార్త్ క్యాంపస్‌లోని యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టేడియం మల్టీపర్పస్ హాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అనేక రౌండ్ల పాటు పోటీ హోరాహోరీగా సాగగా చివరకు ఏబీవీపీ అభ్యర్థి యష్ దబాస్‌ను విజయం వరించింది. కాగా ఈ విజయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. పంజాబ్, మంగళూరు, కేరళ, ఢిల్లీ విశ్వవిద్యాలయాలలో ఏబీవీపీ గెలిచిందని దీనిపై రాహుల్ గాంధీ సిగ్గుతో తల దించుకోవాలని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. "ఢిల్లీ విశ్వవిద్యాలయ ఎన్నికలలో ఏబీవీపీ ఘన విజయం సాధించింది. స్వార్థ ప్రయోజనాలతో నడిచే, యువత సంరక్షకులమని చెప్పుకునే వారి దుర్మార్గపు ప్రయత్నాలన్నీ విద్యార్థులను తప్పుదోవ పట్టించడంలో విఫలమయ్యాయి.భారతదేశపు విద్యార్థులు, జెన్-జీ భారత్‌కి అదే విధంగా ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు.ఏబీవీపీ కార్యకర్తకు..విజేతలైన అభ్యర్థులందరికీ నా అభినందనలు." అని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేళారు. -
అంత్యక్రియలొద్దు, అస్థికలు యమునలో : అందుకే నిప్పంటించుకున్నా!
పశ్చిమ ఢిల్లీలోని 64 ఏళ్ల వ్యక్తి మరణించిన తీరు కలచి వేస్తోంది. తొలుత ఇంట్లో అగ్నిప్రమాదం జరగడంతో చనిపోయాడని భావించారు. కానీ మరణానికి ముందు ఆ వ్యక్తి వాట్సాప్‌లో సూసైడ్ నోట్, యూట్యూబ్‌లో వీడియోను కూడా అప్లోడ్ చేశాడు. ఇదే నా లాస్ట్ వీడియో అని చెప్పడం అందర్ని షాక్‌కు గురిచేసింది. ఓల్డ్ షాపురా ప్రాంతంలో సుమారు ఐదేళ్లుగా ఒంటరిగా అద్దెకు ఉంటున్నాడు విజయ్. శనివారం తెల్లవారు జామున 3.26 గంటలకు అగ్నిప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందింది. నాలుగు అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలానికి పంపించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు ఆరిపోయిన తర్వాత, ఇంటి లోపల తీవ్రంగా కాలిపోయిన మృతదేహం లభ్యమైంది.ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా తేలిందని పోలీసులు వెల్లడించారు. మరణానికి ముందు విజయ్ వాట్సాప్‌లో ఒక సూసైడ్ నోట్ షేర్ చేశాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.అలాగే యూ ట్యూబ్‌లో తన చివరి వీడియోను కూడాపోస్ట్ చేయడం కలకలం రేపింది అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. ఇదీ చదవండి : మొదటి భార్యతో రిలేషన్ : కొడుకు, ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది! సుభాష్ నగర్ నివాసి అయిన ప్రకాష్ చౌహాన్ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు వాట్సాప్ సందేశంలో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. అలాగే తాను స్వయంగా ప్రాణాలను తీసుకుంటున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని యూట్యూబ్‌లో ఒక వీడియోను కూడా అప్లోడ్ చేశాడు. విజయ్ తన కుమార్తె గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఆమెను చాలా ప్రేమిస్తున్నానని, ఆమె లేని లోటు తీరనిదని చెప్పాడు. తన అంత్యక్రియల వల్ల తన కుటుంబం పడే వేదన నుండి తప్పించుకోవడానికే తాను నిప్పంటించుకుంటున్నానని చెప్పాడు. తన అస్థికలను తన కుమార్తె యమునా నదిలో నిమజ్జనం చేయాలని కూడా అతను ఆకాంక్షించాడు.ఇదీ చదవండి: పూణె వ్యాపారి కిడ్నాప్ కేసు ట్విస్ట్ : మలేషియా ట్రిప్ అని చెప్పి!విజయ్‌కు విడాకులు అయ్యాయని, అతను యూట్యూబ్‌లో వ్లాగ్‌లను రూపొందించి అప్లోడ్ చేసేవాడని పోలీసులు తెలిపారు. త్మహత్యగా ప్రాథమిక విచారణలో తేలిందని తదుపరి దర్యాప్తు కొనసాగుతందని వెల్లడించారు. -
మన దగ్గరా ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది..
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు తాజాగా భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. శుక్రవారం నుంచి అమ్మకాలు ప్రారంభం కావడంతో, ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ తెరవడానికి ముందు నుంచే ఫ్యాన్స్ బారులు తీరారు. ముంబై, ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు చాలా ప్రాంతాల్లో చాంతాడంత క్యూలు కనిపించాయి. పలువురు ఫ్యాన్స్ తమ పాత ఐఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ‘మూడు కెమెరాలు, అప్‌గ్రేడ్ చేసిన అనేక ఫీచర్లు, మెరుగైన పనితీరుతో పాటు షో ఆఫ్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. పైగా యాపిల్ అనేది చాలా పెద్ద బ్రాండ్ కూడా. సెప్టెంబర్ 12 సాయంత్రం ప్రీ–బుక్ చేసుకుంటే 18 ఉదయం 8.15 గం.కి మొదటి స్లాట్ దొరికింది. మొత్తానికి మొదటి ఫోన్ అందుకున్నా‘ అని ఓ కస్టమర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న అమెరికాలో ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో ధర భారత్‌లో రూ. 1,64,900 నుంచి, 18 ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,79,900 నుంచి ప్రారంభమవుతుంది. బ్లాక్, సిల్వర్ తదితర నాలుగు రంగుల్లో ఇవి లభిస్తాయి. యాపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ’డ్యుయో’ని ప్రవేశపెట్టింది. భారత్‌లో దీని ధర రూ. 2,99,900 నుంచి రూ. 4,49,900 వరకు ఉంది. -
నెల రోజుల్లో పెళ్లి : డ్రైనేజీలో శవమై తేలిన హెచ్ఆర్ ఉద్యోగి
సరిగ్గా నెల రోజుల్లో పెళ్లి. ఏర్పాట్లనీ త్వర త్వరగా చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే తన పెళ్లి కోసం తన సోదరీమణులతో కలిసి షాపింగ్ చేశాడు. తనకెంతో ఇష్టమైన'షేర్వానీ' కొనుకున్నాడు. ఇంతలో అత్యవసర మీటింగ్ అని చెప్పి వెళ్లిన 31 ఏళ్ల యువకుడు యువరాజ్ సింగ్ మంచంద అనూహ్యంగా శవమై తేలాడు. ఏం జరిగింది? హత్య చేసింది ఎవరు?ఢిల్లీ పోలీసుల సమాచారం ప్రకారం హెచ్ఆర్ (HR) ప్రొఫెషనల్ యువరాజ్ సింగ్ తన చెల్లెళ్లతో కలిసి లజ్‌పత్ నగర్ మార్కెట్‌కు పెళ్లి షాపింగ్‌కు చేశాడు. సాయంత్రం 4:15 గంటల సమయంలో అక్కడే ఉన్న 'గోల్డెన్ డ్రాగన్' రెస్టారెంట్లో భోజనం చేశారు. కాసేపటి తర్వాత, గురుగ్రామ్‌లో తన మాజీ సహోద్యోగిని కలవాల్సి ఉందని చెప్పి వెళ్లాడు. దీంతో అతని సోదరీమణులు క్యాబ్‌లో ఇంటికి వెళ్లి పోయారు.సాయంత్రం 7 గంటల సమయంలో ఫోన్లో మాట్లాడిన అతను రాత్రి 10 గంటలకల్లా ఇంటికి వస్తానన్నాడు. ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతన్ని సంప్రదించడానికి ప్రయత్నించారు, కానీ అతను అందుబాటులో లేడు. రెండు రోజుల తర్వాత, సెప్టెంబర్ 8న యువరాజ్ నుండి చివరి వాట్సాప్ సందేశం వచ్చింది, ఆ తర్వాత అతని ఫోన్ మళ్లీ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో సెప్టెంబర్ 11న లజపత్ నగర్ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారించగా యువరాజ్ చివరిసారిగా గురుగ్రామ్‌లో యువరాజ్ మాజీ సహోద్యోగి అన్య అన్య వత్స్ తోనే యువరాజ్ చివరిసారిగా ఫోన్లో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. అనుమానితురాలి కార్యాలయాల్లో విచారణ చేపట్టారు. భర్తతో కలిసి ఈ హత్యకు పథకం వేసినట్టు తేలింది. నిందితురాలు ఉత్తరాఖండ్‌లో ఉండగా పోలీసులు ఆమెను, భర్తను అరెస్ట్ చేశారు. విచారణలో ఇద్దరు నిందితులు తామే యువరాజ్‌ను హత్య చేసి, శవాన్ని గురుగ్రామ్‌లోని తమ ఇంటి సమీపంలో ఒక డ్రైనేజీలో పడేసినట్లు అంగీకరించారు. ఈ హత్యకు ఆర్థిక వివాదమే కారణమని అనుమానిస్తుండగా, నిందితురాలు హత్యకు గల అసలు కారణాన్ని దాచిపెడుతోందని యువరాజ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.ఎవరీ అన్య వత్స్అన్య వత్స్ , భర్త సంయమ్ సచ్‌దేవా గురుగ్రామ్ ఉంటారు. తమకు వయసున్న కుమారుడు ఉన్నాడని ఆ జంట విచారణ అధికారులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. యువరాజ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేసేవాడు. 2022లో యువరాజ్‌తో కలిసి అన్య మరొక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేశారు. ప్రస్తుతం ఆమెను ఆ సంస్థ నుంచి తొలగించారు. ఆర్థిక అక్రమాలతోనే ఆమెను తొలగించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త సంయమ్కు కూడా ఉద్యోగం లేదు.ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్ఏడు గంటలు కారులోనే డెడ్బాడీయువరాజ్ను అతని కారులోనే రెండుసార్లు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. యువరాజ్ కారులో వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాతే అతను హత్యకు గురయ్యాడని సమాచారం. మృతదేహాన్ని ఎక్కడ పారేయాలో ఆలోచిస్తూ కనీసం ఏడు గంటల పాటు కారులోనే ఉంచామని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణలుగురుగ్రామ్ పోలీసులు సెప్టెంబర్ 10నే మృతదేహాన్ని కనుగొన్నప్పటికీ, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, చివరికి ఆ వివరాలను 'జోనల్ ఇంటిగ్రేటెడ్ పోలీస్ నెట్వర్క్' (ZIPNET - గుర్తుతెలియని మృతదేహాల వివరాలను తనిఖీ చేయడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పోర్టల్)లో సకాలంలో అప్లోడ్ చేయలేదని యువరాజ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాదు తమకు తెలియ జేయకుండానే సెప్టెంబర్ 14న మృతదేహానికి దహన సంస్కారాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.యువరాజ్ తన కుటుంబంతో కలిసి సరితా విహార్‌లో నివసించేవారు. తండ్రి పక్షవాతంతో బాధపడుతుండగా, తల్లికి గుండె జబ్బు. ఈ కుటుంబానికి యువరాజే ఏకైక ఆధారం. ప్రస్తుతం నిందితులను 5 రోజులు పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు.ఇదీ చదవండి: దారుణం : గ్యాంగ్‌రేప్, కుళ్లిపోయిన శవం, పీక్కుతిన్న కుక్కలు -
దారుణం : గ్యాంగ్‌రేప్, కుళ్లిపోయిన శవం, పీక్కుతిన్న కుక్కలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరోహత్యాచార ఘటన కలకలం రేపింది. మైనర్ బాలికపై ముగ్గురు మైనర్లతో సహా నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ఒక బహిరంగ ప్రదేశంలో పడేశారు. దీంతో ఆమె శరీర భాగాలను కుక్కలు తినడం మరింత ఆందోళన రేపింది. సెప్టెంబర్ 13న ఆలస్యంగా ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల సమాచారం ప్రకారం 16 ఏళ్ల బాలికను నలుగురు (ముగ్గురు మైనర్లతో సహా) గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం బాలికను కత్తితో పొడిచి చంపేశారు. ఆమె శవాన్ని బహిరంగ ప్రదేశంలో పడేసి పారిపోయారు. మృతదేహంలోని కొన్ని భాగాలను కుక్కలు పీక్కు తిన్నాయి. దీంతో మృతదేహం మరింత కుళ్లిపోయింది. ఎంతగా అంటే పోలీసులు లింగ నిర్ధారణను కూడా వెంటనే చేయలేకపోయారు.సెప్టెంబర్ 13న వాయువ్య ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో కుషాక్ రోడ్డు సమీపంలో గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మృతురాలితో నిందితులకు ముందే పరిచయం ఉన్నట్టు భావిస్తున్నారు. ఎందుకంటే సంఘటన జరిగే రోజు ఆమె వారితో కలిసి ఒక టెంపోలో ప్రయాణించింది. టెంపో లోపల అందరూ కలిసి మద్యం సేవించిన తర్వాత, బాలికపై లైంగిక దాడి చేసి, కత్తితో పొడిచి హత్య చేశారు. శవంలో కొన్ని భాగాలను కుక్కలు తినేశాయి. ఒక చేయి కూడా వేరుపడి ఉంది. దీంతో చనిపోయింది ఆడా, మగా అని నిర్ధారించడానికి పోలీసులకు సమయం పట్టింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు శివమ్ అలియాస్ సుదామ మిగిలిన ముగ్గురు 16, 17 ఏళ్ల మైనర్లు.అయితే బాలిక తరచూ ఇంటి నుంచి వెళ్లి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చేది కావడంతో, ఆమెపై ఎలాంటి మిస్సింగ్ ఫిర్యాదు చేయలేదని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేసి, నిందితుల నుంచి రెండు కత్తులు, టెంపో, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది. ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్ -
గుండె.. 95 కిలో మీటర్లు.. 63 నిమిషాలు
హర్యానాలోని రోహ్తక్ నుంచి ఢిల్లీకి 95 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 63 నిమిషాల్లో అధిగమిస్తూ ఓ దాత గుండెను తరలించారు. అత్యవసర గుండె మార్పిడి కోసం గురువారం ఈ అవయవాన్ని షాలిమార్ బాగ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రోహ్తక్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో రాత్రి 7.20 గంటలకు దాత గుండెను సేకరించారు.అనంతరం గుండెను వైద్య బృందం 7.40 గంటలకు ఆసుపత్రి నుంచి బయలుదేరింది. హర్యానా, ఢిల్లీ పోలీసుల సమన్వయంతో ఏర్పాటు చేసిన గ్రీన్ కారిడార్ ద్వారా అంబులెన్స్ ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించి.. రాత్రి 8.43 గంటలకు ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ఫోర్టిస్ ఆసుపత్రికి చేరుకుంది. బి-పాజిటివ్ రక్తగ్రూప్ కలిగిన ఓ రోగికి గుండె అవసరమని ఉదయం 8.50 గంటలకు నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ నెట్వర్క్ ద్వారా ఆసుపత్రికి సమాచారం అందింది.ఉదయం 9.55 గంటలకు ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు గుండెకు సరిపడే గ్రహీతను గుర్తించారు. వైద్య బృందం మధ్యాహ్నం 2.49 గంటలకు ఢిల్లీ నుంచి రోహ్తక్కు బయలుదేరి.. సాయంత్రం 4.34 గంటలకు ఆసుపత్రికి చేరుకుంది. గుండె సేకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం గ్రీన్ కారిడార్ ద్వారా అవయవాన్ని తిరిగి ఢిల్లీకి తరలించారు.95 km. 63 minutes. One donor heart, transported from #PGIMS #Rohtak to #Fortis Hospital, #ShalimarBagh, through an interstate #GreenCorridor for an emergency #heart #transplant. Seamless coordination between #Haryana and #DelhiPolice helped make the life-saving journey possible,… pic.twitter.com/HDp6yDdxpg— Anuja Jaisswal (@AnujaJaiswalTOI) September 17, 202695 కిలోమీటర్ల అంతర్రాష్ట్ర మార్గంలో గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసి గుండెను తరలించడం అంటే పోలీసు, వైద్య బృందాల మధ్య అసాధారణ స్థాయిలో సమన్వయం అవసరం. ఈ తరలింపులో ప్రతి నిమిషం కీలకం అని ఫోర్టిస్ ఆసుపత్రి షాలిమార్ బాగ్ వైస్ ప్రెసిడెంట్, ఫెసిలిటీ డైరెక్టర్ నవీన్ శర్మ తెలిపారు. అనంతరం దాత గుండెను ఆసుపత్రికి తీసుకెళ్లి.. అవయవ మార్పిడి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ‘పిట్‌బుల్’ బీభత్సం.. సీసీటీవీలో భయానక దృశ్యాలు -
ఢిల్లీలో అభిషేక్ తుఫాన్.. 30 బంతుల్లోనే సెంచరీ
-
ట్రంప్ 100% టారిఫ్ బిల్లు: భారత్ రియాక్షన్ ఇదే..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించేలా అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై భారత్ స్పందించింది. తమ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో దేశ ఇంధన అవసరాలు, జాతీయ ప్రయోజనాలే తమ చమురు కొనుగోళ్లకు ప్రాతిపదిక అని మరోసారి తేల్చిచెప్పింది.అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’కు 262–159 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై గరిష్టంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు దీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.భారత్ స్పందన.. బిల్లు ఆమోదం నేపథ్యంలో.. భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. తన వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకునే విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు తెలిపింది. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడంపై భారత్ ఇప్పటికే తన విధానాన్ని పలుమార్లు వివరించిందని గుర్తు చేస్తోంది. దేశంలోని 140 కోట్లకుపైగా ప్రజల ఇంధన అవసరాలను తీర్చేందుకు వివిధ దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నామని పేర్కొంది. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్ తన ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేస్తోంది. అదే సమయంలో.. అమెరికా ప్రతినిధులతో గత కొన్ని నెలలుగా ఉన్నతస్థాయిలో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ అంటోంది. ఈ బిల్లు వల్ల భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై పడే ప్రభావాలను కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే అమెరికా వర్గాలకు స్పష్టంగా వివరించిందని పేర్కొంది. అమెరికా చర్య వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేస్తామని తెలిపింది.ట్రంప్ డెస్క్ మీద.. అమెరికా ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదం పొందింది. అయితే అంత మాత్రాన భారత్‌పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. ఈ బిల్లు ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదానికి వెళ్లనుంది. సంబంధిత చట్టానికి సంబంధించిన ఫైల్.. ట్రంప్ డెస్క్ వద్దకు వెళ్లినట్లు వైట్‌హౌజ్ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఏ దేశంపై, ఎంత టారిఫ్ విధించాలి అనే అధికారం ఇప్పుడు అధ్యక్షుడి నిర్ణయంపై ఆధారపడి ఉంది. రష్యా ఆంక్షల బిల్లులో.. రష్యా చమురు, గ్యాస్ కొనుగోళ్లపై ఆంక్షలతో పాటు రష్యా ‘షాడో ఫ్లీట్’, ఆ దేశ నాయకత్వం(పుతిన్ సహా అక్కడి పలువురు అగ్రనేతలు), ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంపైనా బిల్లు కఠిన చర్యలను ప్రతిపాదిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఇంధన ఆదాయాన్ని పరిమితం చేయడమే అమెరికా చర్యల ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటోంది. ఇక భారత్‌పై ఈ చట్టం ఎలా అమలవుతుంది? టారిఫ్ విధిస్తే ఎంత మేరకు ఉంటుంది? రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? అనే అంశాలు ట్రంప్ తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతానికైతే భారత్ మాత్రం తన ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం.. 2026 జూలైలో ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన మరుసటి రోజే మరణించారు. రష్యాపై కఠిన ఆంక్షలకు ఉద్దేశించిన ఈ బిల్లును ఆయనే ముందుకు తీసుకెళ్లడంతో.. ఆయన గౌరవార్థం ఈ బిల్లుకు ట్రంప్ ‘లిండ్సే ఓ. గ్రాహం’ పేరు పెట్టారు.ఇదీ చదవండి: ట్రంప్ రష్యా బిల్లు.. భారత్, చైనాపైనే ఎందుకు? -
మోదీ గుండె ధైర్యానికి ఇదిగో సాక్ష్యం!
నరేంద్ర మోదీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న భారత ప్రధాని. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకంటూ భారీ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది ఇవాళ ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే మోదీ చిన్ననాటి జీవితం గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిలో ఓ ఘటన తెలిస్తే మాత్రం.. ఆయన ‘గుండె ధైర్యం’ ఏపాటిదో ఇట్టే అర్థమైపోతుంది. మోదీకి చిన్నతనంలో ఈత అంటే చాలా ఇష్టం ఉండేదట. ఉదయం కుటుంబ టీ దుకాణంలో పని చేసిన తర్వాత మోదీ వడ్నగర్లోని శర్మిష్ఠ సరస్సుకు వెళ్లేవారు. సరస్సు మధ్యలో ఉన్న ఆలయం వరకు ఈత కొట్టి, అక్కడి జెండాను తాకి తిరిగి ఒడ్డుకు వచ్చేవారు. ఇలా రోజుకు మూడుసార్లు చేసేవారు. అయితే ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఆయనకు ఓ భయానక అనుభవం ఎదురైంది. ఈత కొడుతుండగా ఓ మొసలి ఆయన కాలిని బలంగా తాకింది. దీంతో తీవ్రంగా గాయపడి తొమ్మిది కుట్లు వేయించుకోవాల్సి వచ్చింది. ఆ దెబ్బతో వారం రోజులు ఆయన మంచానికే పరిమితం అయ్యారు. అయితే నెల తిరగకుండానే ఆయన మళ్లీ అదే సరస్సులో ఈతకు వెళ్లారట. ఈ విషయాన్ని మోదీ జీవితంపై వచ్చిన నరేంద్ర మోదీ: ది గేమ్ చేంజర్ అనే పుస్తకంలో జర్నలిస్ట్ సురేశ్ కే వర్మ ప్రస్తావించారు. అదే తొలిసారి కాదు!మోదీ చిన్ననాటికి సంబంధించిన మరో మొసలి కథ కూడా ప్రచారంలో ఉంది. ఓసారి సరస్సు ఒడ్డున ఓ మొసలి పిల్ల కనిపించడంతో దాన్ని ఆయన భుజాన వేసుకుని ఇంటికి తీసుకెళ్లారట. అది అడుగుకుపైగా పొడవు ఉందట. దాన్ని ఇంట్లోనే పెంచుకోవాలని మోదీ అనుకున్నప్పటికీ.. తల్లి హీరాబెన్ మాత్రం వద్దని చెప్పారట. వెంటనే దాన్ని ఆయన తిరిగి సరస్సులో వదిలేశారట. ఈ చిన్ననాటి జ్ఞాపకాన్ని మోదీ స్వయంగా కూడా 2019లో బేర్ గ్రిల్స్‌తో కలిసి పాల్గొన్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నారు. సాధారణ కుటుంబంలో, చిన్న ఇంటి నుంచి మొదలైన ఈ ప్రయాణం.. ఆ తర్వాత రాజకీయాల్లోకి మళ్లింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2014లో తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జూన్ 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయ జీవితంలోనూ ఆయన తీసుకున్న పలు కీలక నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బాల్యంలో మొసలిని ఎదుర్కొన్న ఘటన కావొచ్చు.. తర్వాత పాలనలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు కావొచ్చు.. మోదీ జీవిత ప్రయాణంలో ధైర్యం, నిర్ణయాత్మకతకు సంబంధించిన అధ్యాయాలు చాలానే కనిపిస్తాయి. అయితే వాటన్నింటికీ చాలా ముందే.. వడ్నగర్లోని శర్మిష్ఠ సరస్సు దగ్గర ఓ బాలుడిగా ఎదుర్కొన్న ఆ మొసలి ఘటన మాత్రం ఆయన చిన్ననాటి జ్ఞాపకాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.ఇదీ చదవండి: మోదీని శ్రీ కృష్ణుడితో పోల్చేశాడే! -
యూపీఐ ‘ట్యాక్స్’ రచ్చ.. చిదంబరం పేరుతో రాహుల్‌కు కౌంటర్!
యూపీఐ లావాదేవీలపై కొత్తగా అమలు చేయనున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విషయంలో రాజకీయ రగడ ముదురుతోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఛార్జీల విధానాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని ఆయన ‘యూపీఐ ట్యాక్స్’గా అభివర్ణిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పేరును హైలైట్ చేస్తూ బీజేపీ తాజాగా కాంగ్రెస్‌పై ప్రశ్నలు సంధించింది.బీజేపీ వర్గాల ప్రకారం.. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యూపీఐకి సంబంధించి శ్రేణుల వారీగా (టైర్డ్) ఎండీఆర్/రెవెన్యూ విధానాన్ని తీసుకురావాలని సిఫార్సు చేసింది. ఈ కమిటీలో కాంగ్రెస్‌కు చెందిన పి. చిదంబరం(మాజీ ఆర్థిక మంత్రి), మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, కిషోరీ లాల్, కే. గోపీనాథ్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 12న కమిటీ నివేదికను ఆమోదించిన సమావేశానికి వీరంతా హాజరయ్యారని, ప్రచురితమైన మినిట్స్‌లో ఎలాంటి అసమ్మతి నమోదు కాలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.దీంతో.. పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పుడే యూపీఐకి స్థిరమైన రెవెన్యూ మోడల్ అవసరమని సిఫార్సు చేశారని, ఇప్పుడు రాహుల్ గాంధీ కొత్త ఎండీఆర్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది.ఆ కమిటీ ఏం చెప్పిందంటే..యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలికంగా ఆర్థికంగా నిలబెట్టేందుకు టైర్డ్ రెవెన్యూ మోడల్ అవసరమని కమిటీ పేర్కొంది. యూపీఐ వ్యవస్థకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన మొత్తం సుమారు రూ.2,000 కోట్లుగా ఉండగా.. పరిశ్రమ అంచనా వేసిన నిర్వహణ వ్యయం దాదాపు రూ.20,700 కోట్లుగా ఉందని కమిటీ ప్రస్తావించింది. తగిన రెవెన్యూ వ్యవస్థ లేకపోతే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అధికంగా ఆధారపడాల్సి వస్తుందని, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, నెట్వర్క్ మౌలిక వసతులపై పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.అసలు కొత్త ఛార్జీ ఎంత?కేంద్రం ప్రకటించిన ప్రస్తుత విధానం ప్రకారం అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన కొన్ని మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి రానుంది. ఈ ఛార్జీని వ్యాపారుల నుంచి వసూలు చేస్తారు. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300గా పరిమితి ఉంటుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే సాధారణ యూపీఐ బదిలీలు ఈ ఛార్జీ పరిధిలోకి రావు.రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, విద్యుత్, నీటి వంటి కొన్ని విభాగాల్లో రూ.2,000కు మించిన చెల్లింపులకు శాతం ఆధారిత ఎండీఆర్‌కు బదులుగా ఫ్లాట్ రూ.5 రుసుము ఉండనుంది. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు 0.02 శాతం ఎండీఆర్, గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది.రాహుల్ గాంధీ ఏమంటున్నారు?ఈ కొత్త విధానాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూపీఐ ట్యాక్స్ వెనక అమెరికా ఒత్తిడి ఉందని ఆరోపించారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణను తిరస్కరించింది. యూపీఐ విధాన నిర్ణయాలు ఎలాంటి బయటి ఒత్తిళ్లతో తీసుకోలేదని స్పష్టం చేసింది. అలాగే కేంద్రం మరోవైపు ఎండీఆర్ అంటే పన్ను కాదని, వినియోగదారుల నుంచి ప్రభుత్వం లేదంటే ఎన్పీసీఐ నేరుగా వసూలు చేసే ఛార్జీ కూడా కాదని చెబుతోంది. పేమెంట్ వ్యవస్థలోని బ్యాంకులు, యాప్ ప్రొవైడర్లు తదితర భాగస్వాముల మధ్య ఈ రుసుము పంపిణీ అవుతుందని వివరిస్తోంది.ఇక రాజకీయంగా కొత్త చర్చ..ఇలా రాహుల్ గాంధీ కొత్త ఎండీఆర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వేళ.. అదే సమయంలో పార్లమెంటరీ కమిటీ గతంలో చేసిన టైర్డ్ రెవెన్యూ మోడల్ సిఫార్సును బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. కమిటీలో ఉన్న ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు నివేదిక ఆమోద సమయంలో ఉన్నారని, ప్రచురితమైన మినిట్స్‌లో వారి అసమ్మతి నమోదు కాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన రెవెన్యూ మోడల్‌కు, ఇప్పుడు అమల్లోకి వస్తున్న ఎండీఆర్ విధానానికి ఉన్న తేడాలు ఏమిటన్నదే తాజా రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.ఇదీ చదవండి: ఆన్లైన్ పేమెంట్లు చేస్తున్నారా?.. ఛార్జీలు కట్టాల్సిందేనా?! -
వాటర్‌బాయ్‌గా వైభవ్!.. సూర్యవంశీ తండ్రి స్పందన ఇదే
అఫ్గానిస్తాన్‌తో రెండు టీ20 మ్యాచ్‌లలో టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్, ఓపెనర్ సంజూ శాంసన్ రాక కారణంగా ఈ పదిహేనేళ్ల పిల్లాడికి తుదిజట్టులో చోటు దక్కడం లేదు. దీంతో వైభవ్ జట్టుకు వాటర్ బాయ్‌గా సేవలు అందిస్తున్నాడు.సిరీస్ టీమిండియా కైవసంఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా అఫ్గాన్ బోర్డు ఢిల్లీ వేదికగా టీమిండియాకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం నాటి తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. మంగళవారం జరిగిన రెండో టీ20లోనూ ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ కంటే ముందు భారత టీ20 జట్టు జింబాబ్వేలో పర్యటించింది. జింబాబ్వేలో ధనాధన్ఇందులో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడగా.. వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి 151 పరుగులు సాధించి.. జట్టు క్లీన్‌స్వీప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.అయితే, జింబాబ్వేతో సిరీస్‌కు దూరమైన వరల్డ్‌కప్ వీరుడు సంజూ శాంసన్ అఫ్గాన్‌తో సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. దీంతో వైభవ్‌పై వేటు పడింది. అయితే ,తొలి టీ20లో సంజూ 10 పరుగులే చేసి అవుటయ్యాడు. దీంతో వైభవ్‌ను కాకుండా సంజూను ఆడించి తప్పుచేశారనే విమర్శలు వచ్చాయి.మావాడు సిద్ధంగానే ఉన్నాడు.. కానీఈ నేపథ్యంలో అఫ్గాన్‌తో టీమిండియా రెండో టీ20కి ముందు స్టేడియానికి వచ్చిన వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీని స్పోర్ట్స్‌తక్ పలకరించింది. వైభవ్‌కు తుదిజట్టులో చోటు దక్కడం లేదు.. రెండో మ్యాచ్‌లోనైనా అవకాశం వస్తుందనుకుంటున్నారా? అని ప్రశ్నించింది.ఇందుకు బదులిస్తూ.. ‘‘మీ అందరి ఆశీర్వాదాలు వైభవ్‌పై ఉండాలి. మాకు అదే పదివేలు. జట్టుకు అవసరమైన వేళ అతడు సిద్ధంగా ఉంటాడు. నా కుమారుడు ఇప్పటికీ పూర్తిస్థాయి ప్రదర్శన ఇచ్చేందుకు సన్నద్ధంగానే ఉన్నాడు. ఏదేమైనా జట్టు గెలవడం ముఖ్యం. మాకు అదిచాలు’’ అని సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.కాగా రెండో టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరిమితం కాగా.. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా సంజూ బరిలోకి దిగాడు. కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా విమర్శలకు చెక్ పెట్టాడు. అయితే, నామమాత్రపు మూడో టీ20లో మాత్రం మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వైభవ్‌ను ఆడిస్తామని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంకేతాలు ఇచ్చాడు. చదవండి: అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్‌తో పోటీ.. స్పందించిన సంజూ -
మోదీని కలిసిన వారం రోజుల్లోనే..
దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదం.. ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య. పైగా ఆ వెనక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారన్న ఆరోపణ. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో బాల్య స్నేహితుడ్ని కలిసి.. సీబీఐ విచారణ జరిపించాలని ఆ పెద్దాయన కోరారు. అవతలి ఉంది మాములు వ్యక్తి కాదు.. అందుకే వారం తిరగ్గ ముందే ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది.ప్రధాని నరేంద్ర మోదీతో పాఠశాలలో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోరా.. మహారాష్ట్రలోని భయందర్‌లో తన భూమి వివాదంపై సెప్టెంబర్ 8న మోదీని కలిశారు. ఇది జరిగిన.. వారం రోజుల్లోనే వివాదాస్పద స్థలంపై బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా వెనక్కి తగ్గారు. భూమిపై తనకున్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించడంతోపాటు, అక్కడ నిర్మాణానికి తీసుకున్న అనుమతులను కూడా సరెండర్ చేశారు. వోరాపై గతంలో ఇచ్చిన పోలీస్ ఫిర్యాదును సైతం ఉపసంహరించుకున్నారు.నాకేం తెలియదు: వోరామోదీతో చిన్నప్పుడు కలిసి చదువుకున్న వోరా.. ప్రస్తుతం ముంబై సమీపంలోని మీరా రోడ్లో నివసిస్తున్నారు. భయందర్ ఈస్ట్‌లోని నవ్‌ఘర్‌లో సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని 1989లో రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేశారు. తాను ఆ భూమిని ఎప్పుడూ విక్రయించలేదని, మరెవరికీ బదలాయించలేదని పేర్కొన్నారు.అయితే 2011లో తనకు తెలియకుండా భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి, ఆస్తిని రెండు భాగాలుగా విభజించినట్లు వోరా ఆరోపించారు. ఒక భాగాన్ని స్వయం బిల్డర్స్ పేరుతో, మరో భాగాన్ని నరేంద్ర మెహతాకు సంబంధించిన సెవెన్ ఎలెవన్ కన్స్ట్రక్షన్స్ పేరుతో చూపించినట్లు ఆయన పేర్కొన్నారు. తన భూమిపై నిర్మాణ అనుమతులు ఎలా ఇచ్చారనే అంశంపైనా అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కూడా ఆయన కోరారు.15 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా..ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు దాదాపు 15 ఏళ్లుగా వివిధ ప్రభుత్వ విభాగాలను ఆశ్రయిస్తున్నానని వోరా తెలిపారు. 2015లో నకిలీ పత్రాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైందని, అయితే దర్యాప్తు నివేదిక చాలా ఆలస్యంగా వచ్చిందని ఆయన ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసు విభాగాల అధికారులకు ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని వోరా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 8న ప్రధాని మోదీని కలిసి తన సమస్యను వివరించారు. ఈ భేటీ అనంతరం మహారాష్ట్ర అధికార యంత్రాంగం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది.మోదీ ఎఫెక్ట్.. సచివాలయంలో కీలక సమావేశంసెప్టెంబర్ 15న మహారాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీకర్ పరదేశి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో అస్గర్ అలీ వోరాతో పాటు ఎమ్మెల్యే నరేంద్ర మెహతా, మీరా-భయందర్ మున్సిపల్ కమిషనర్ రాధా బినోద్ శర్మ, టౌన్ ప్లానర్ పురుషోత్తమ్ షిండే పాల్గొన్నారు.ఈ సమావేశంలో నరేంద్ర మెహతా టౌన్ ప్లానింగ్ విభాగానికి లేఖ ఇచ్చారు. వివాదాస్పద భూమిపై తాను కలిగి ఉన్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు, ఆ స్థలానికి మంజూరైన నిర్మాణ అనుమతిని కూడా సరెండర్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే ఈ భూమిని తాను 2019లో మెర్విన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు మెహతా తన లేఖలో తెలిపారు.ఫిర్యాదు కూడా ఉపసంహరణఇదే సమయంలో వోరాపై గతంలో తాను చేసిన పోలీస్ ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు మెహతా పోలీస్ కమిషనర్‌కు మరో లేఖ రాశారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరినందున ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భూవివాదానికి ఓ ఎండ్ కార్డ్ పడినట్లైంది.ఇదీ చదవండి: ఆ హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఊరట -
అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్‌తో పోటీ.. స్పందించిన సంజూ
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. అఫ్గానిస్తాన్‌తో రెండో టీ20 సందర్భంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు అర్ధ శతకంతో అలరించాడు. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 57 పరుగులు సాధించాడు.తొలి మ్యాచ్‌లో విఫలం కావడంతోకాగా జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న సంజూ శాంసన్.. అఫ్గాన్‌తో ఢిల్లీలో జరుగుతున్న టీ20 సిరీస్‌తో టీమిండియాలోకి తిరిగి వచ్చాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం పది పరుగులే చేసి ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో సంజూపై విమర్శల వర్షం కురిసింది.బ్యాట్‌తోనే సమాధానం సంజూకు బదులు.. జింబాబ్వేలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా పంపాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు సంజూ. రెండో టీ20లో భారత ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి తన బ్యాటింగ్ పదును తగ్గలేదని నిరూపించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు.వైభవ్, అభిషేక్‌తో పోటీపై స్పందనఈ నేపథ్యంలో అఫ్గాన్‌పై విజయానంతరం సంజూ శాంసన్ మీడియాతో మాట్లాడగా.. సహచర ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలతో పోటీ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘బయటి ప్రపంచం దృష్టిలోనే వాళ్లిద్దరు (అభిషేక్, వైభవ్) నాకు పోటీదారులు. అయితే, జట్టుగా మేమంతా ఒకటే.దేశం కోసం ఆడుతున్నాము. అన్నింటికంటే జట్టు విజయమే మా మొదటి ప్రాధాన్యం. ఆ తర్వాతే వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తాము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకరి పట్ల ఒకరికి ప్రతికూల ఆలోచనలు ఉండవు. కోపం తెచ్చుకునే మైండ్‌సెట్ కూడా ఉండదు.నన్ను కాదని అతడిని ఎలా ఆడిస్తారు?‘నాకు కాకుండా.. అతడికే ఎందుకు అవకాశం ఇచ్చారు?.. నన్ను కాదని అతడిని ఎలా ఆడిస్తారు?’ అనే ప్రశ్నలకు తావు లేదు. అలాంటి మనస్తత్వం ఉంటే ఇక్కడ పనికిరాదు’’ అని సంజూ శాంసన్ విలేకరులతో పేర్కొన్నాడు. ఏదేమైనా గతంలో విమర్శల గురించి ఆలోచిస్తూ బాధపడేవాడినన్న ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ప్రస్తుతం తానెంతో పరిణతి సాధించానని తెలిపాడు.కచ్చితగా ప్రభావం ఉంటుంది.. కానీ‘‘ప్రస్తుతం నాకు తగినంత అనుభవం, పరిణతి వచ్చాయి. కెరీర్ ఆరంభంలో ట్రోల్స్ చూసి బాధపడేవాడిని. నేనేమీ యంత్రాన్ని కాదు. ఆటగాళ్లు రోబోలు కాదు. కాబట్టి.. ‘అలాంటి మాటలు నాపై ప్రభావం చూపలేవు’ అని సులువుగా చెప్పలేము. ఎందుకంటే కొంతమంది మాటలు తప్పకుండా ప్రభావం చూపుతాయి.అయితే, గతంలో మాదిరి నేను ఇప్పుడు ఆ మాటల్ని పట్టించుకోవడం మానేశాను. ఒక షాట్ ఆడేముందు గతంలో చాలా ఆలోచించేవాడిని. సోషల్ మీడియాలో ఎలాంటి విమర్శలు వస్తాయో ఊహించుకునేవాడిని. కానీ ఇప్పుడు కేవలం ఆట మీదే పూర్తిగా దృష్టి పెట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఎలాంటి సమస్యా ఉండదనే పరిణతి సాధించాను’’ అని సంజూ శాంసన్ ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చాడు.చదవండి: ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డుSanju Samson putting Mohammed Nabi through the boundary tour. 😮💨 Watch #AFGvIND 2nd T20I LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork pic.twitter.com/hNKWkuiSbL— Sony Sports Network (@SonySportsNetwk) September 15, 2026 -
'అత్యధిక ప్రపంచానికి' అసలైన ప్రాతినిధ్యం
ఢిల్లీలో జరిగిన ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు ఏ విధంగా చూసినా ఘన విజయమే. ఈ మాట అనేందుకు గల కారణాన్ని ఒకే ఒక మాటలో చెప్పాలంటే, 20 ఏళ్ల క్రితం స్థాపితమై ఈసారితో కలిపి 18 శిఖరాగ్ర సమావేశాలు జరుపుకొన్న ఈ సంస్థ, తన ప్రకటిత లక్ష్యాల దిశగా ఇంతవరకెన్నడూ లేనంత పట్టుదలగా, ధైర్యంగా ముందడుగులు వేసింది. అందుకు కారణాలు రెండు: ఒకటి, వర్ధమాన దేశాలలో చైతన్యాలు, ఆత్మవిశ్వాసాలు, ఐక్యతలు పెరుగుతుండటం. రెండు, ప్రపంచంపై దశాబ్దాల పాటు ఆధిపత్యం సాగించిన అమెరికా నాయకత్వపు పాశ్చాత్య కూటమి క్రమంగా బలహీనపడుతుండటం.ముఖ్యమైన ముందడుగులు‘బ్రిక్స్’ వ్యవహరణలో ఈ మార్పు కనిపించటం రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన 16వ సమావేశాల (2024)లోనే మొదలై, బ్రెజిల్‌లోని రియో డి జనేరో (2025)లో కొనసాగింది. ఈ రెండింటికి మధ్య అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ తిరిగి బాధ్యతలు చేపట్టారు. తన కన్న ముందు జో బైడెన్ హయాంలోనే ఎదురవుతుండిన సమస్యల దృష్ట్యా ‘బ్రిక్స్’ నాయకులు కజాన్‌లో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ప్రధానమైనవి బహుళ ధ్రువ ప్రపంచాన్ని బలోపేతం చేయబూనటం, ఐక్యరాజ్య సమితిని, ప్రపంచ బ్యాంకును, ఐఎంఎఫ్‌ను ప్రజాస్వామీకరించా లనే డిమాండ్, ‘బ్రిక్స్’ దేశాల మధ్య వాణిజ్యం డాలర్లకు బదులు స్థానిక కరెన్సీలలో జరగాలనే ప్రతిపాదన. వీటిలో ముఖ్యంగా చివరి అంశం అపుడు పాశ్చాత్య లోకంలో ఆర్థికంగా, రాజకీయంగా కూడా పెద్ద కలకలాన్ని సృష్టించింది. అమెరికా ఆధిపత్యానికి ఆయువుపట్లలో ఒకటైన డాలర్ రాజ్యం దెబ్బ తింటే మొదటికే మోసం రాగలదనుకున్న ట్రంప్, ‘బ్రిక్స్’ దేశాలు అటువంటి పని చేసినా, ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించినా అందరిపై 100 శాతం సుంకాలంటూ హెచ్చరించారు. నిజానికి డీ– డాలరైజేషన్, ప్రత్యామ్నాయ కరెన్సీ ఆలోచనలు అపుడెంత మాత్రం లేవు. అది తేలికైన పని కాదు కూడా. అదే సమయంలో ఒక స్పష్టత అవసరం. డాలర్‌కు బదులు స్థానిక కరెన్సీలు అంతర్జాతీయ చెల్లింపుల కోసం అమెరికా నియంత్రణంలో గల ‘స్విఫ్ట్’ వ్యవస్థకు బదులు మరొకటి ఏర్పాటు చేసే యోచన, రిజర్వ్ కరెన్సీగా డాలర్‌కు బదులు చైనీస్ యువాన్‌ను ముందుకు తెచ్చే ప్రయత్నాలు మొద లైనవి క్రమంగా ముందుకు సాగిన కొద్దీ డాలర్ బలహీన పడుతుంది. వీటిలో స్థానిక కరెన్సీల ఉపయోగం ఇప్పటికే విస్తరిస్తూ డాలర్‌పై ప్రభావాన్ని చూపుతున్నది కూడా. అనగా, క్రమంగా డాలర్ బలహీనపడటమే పరోక్ష రీతిలో డీడాలరైజేషన్ జరగడ మన్నమాట. తక్కిన వాటిలో అదీ ఒక కరెన్సీగా మిగులుతుంది.ఆకాశంలో సగంఢిల్లీ ‘బ్రిక్స్’ సందర్భంగా ఈ నేపథ్యాన్నంతా రాయటం ఎందు కంటే, కజాన్ నుంచే ఆరంభించి అమెరికా వైపు నుంచి ఎన్నెన్ని ఒత్తిడులు వచ్చినా, సంస్థ నాయకత్వం ఎంత మాత్రం జంకలేదు. సరికదా, స్థానిక కరెన్సీల చెల్లింపులను మరింత విస్తరించాలని ఢిల్లీ డిక్లరేషన్‌లో స్పష్టంగా తీర్మానించింది. బహుళ ధ్రువ ప్రపంచానికి తప్పనిసరి అవసరాలు మరికొన్ని కూడా ఉన్నాయిగాని, ధనం మూలం మిదం జగత్ అన్నట్లు బండికి ఆర్థికమే ఇరుసు గనుక, ‘బ్రిక్స్’ వైఖరిలోని ఈ కీలకాన్ని అర్థం చేసుకోవాలి. వార్తలకు అంతగా ఎక్కలేదు గానీ, ఢిల్లీ సమావేశాలకు ముందు రోజున ‘బ్రిక్స్’ దేశాల ఆర్థిక మంత్రులు, రిజర్వ్ బ్యాంకుల గవర్నర్లు ముంబైలో సమావేశమై, స్థానిక కరెన్సీలతో పాటు పలు ఇతర నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిలో దేశాల మధ్య చెల్లింపులకు ప్రత్యేక వ్యవస్థ (స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయమనాలి) ఒకటి. అదిగాక, విచ్చలవిడి ట్యారిఫ్లను, డబ్ల్యూటీవోకు విరుద్ధమైన వాణిజ్య ఒప్పంద ధోరణులను, ధనిక దేశాల ప్రొటెక్షనిజాన్ని, ప్రపంచ బ్యాంకుపైన, ఐఎంఎఫ్పైన ఏకపక్ష నియంత్రణను తీవ్రంగా వ్యతిరే కించారు. తాము ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవాలనుకున్నారు.చివరగా ఢిల్లీ డిక్లరేషన్ సరేసరి. సమావేశాలలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని గణాంకాలను పేర్కొనటాన్ని కూడా ఈ ఆర్థిక సందర్భంలో గమనించాలి. బ్రిక్స్ దేశాల జనాభా ఇపుడు ప్రపంచ జనాభాలో సగమనీ, ప్రపంచ జీడీపీలో పాశ్చాత్య కూటమి జీ–7 వాటా 29 శాతం కాగా, ‘బ్రిక్స్’ది 40 శాతం అనీ, ‘బ్రిక్స్’ ఏర్పడిన గత రెండు దశాబ్దాలలో ఆ సంస్థ సభ్యుల జీడీపీ 4.5 రెట్లు పెరగగా, ప్రపంచానిది 2 రెట్లు మాత్రమేననీ చెప్పారు. అట్లా గుర్తు చేయటం పాశ్చాత్య దేశాలకేనని వేరే చెప్పనక్కర లేదు. గుర్తు చేయటం ఎందుకో కూడా అర్థం చేసుకోగలదే. సినిమా పరిభాషలో చెప్పాలంటే, ‘వస్తున్నాం కాస్కో, ఇకనైనా దారికి రా’ అనడమన్న మాట!అందరితో కలిసి నడుస్తూ...యథాతథంగానే ఒక స్థాయికి అభివృద్ధి చెందిన బ్రిక్స్ దేశాలకు, పాశ్చాత్య కూటమికి ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు ఈ పరిణామాలు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి. దీనికి తగినట్లు, కజాన్, రియో, ఢిల్లీ డిక్లరేషన్లలో దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండా లతో పాటు విశాల సముద్రాలలో గల చిన్న దేశాలు, పేద దేశాల సమస్యలు, అవసరాలు, ప్రాతినిధ్యాల గురించిన ప్రస్తావనలు అనేకం ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అత్యధిక దేశాలు, అత్యధిక జనాభాతో కూడిన లోకానికి ‘బ్రిక్స్’ ప్రజాస్వామికమైన రీతిలో ప్రాతినిధ్యం వహించనున్నదని చెప్పడమన్నమాట. ఈ రహస్యం ఆ యా దేశాలకు ఇప్పటికే చేరిపోయింది. కనుకనే ‘బ్రిక్స్’ పట్ల ఆసక్తి, అందులో చేరాలనే కోరిక, కజాన్ నుంచి పెరగగా, ఇపుడు ఢిల్లీ తర్వాత ఊపందుకోగలవని భావించవచ్చు.ఇతర అంశాలలో వివిధ అంతర్జాతీయ సంస్థల సంస్కరణలు, బహుళ ధ్రువ ప్రపంచ లక్ష్యాల కోసం ‘బ్రిక్స్’ డిమాండ్లు కజాన్ కన్న ఢిల్లీలో పదునెక్కాయి. ఆర్థిక, వాణిజ్య, రాజకీయ, సైనిక రంగాలలో అంతర్జాతీయ నియమ నిబంధనల ఉల్లంఘనను మరింత తీవ్రంగా ఆక్షేపించారు. ఇరాన్, పాలస్తీనా, సిరియా, క్యూబా, జెరూసలేం స్వయంప్రతిపత్తి, శాంతియుత అణుపరిశోధనలకు మరింతగా మద్దతు ప్రకటించారు. మొదట అనుకున్నట్లు, బ్రిక్స్ శక్తిమంతమవుతుండటానికి గల రెండు కారణాలలో, ట్రంప్, ఆయనతోపాటు పాశ్చాత్య ప్రపంచం బలహీనపడుతుండటం ఒకటి. ఇంతకాలం లోకాన్ని ఏలినవారు, తిరుగు లేదన్నట్లు వీస్తున్న కొత్త గాలులను ఇప్పటికైనా గుర్తించి తమ ధోరణిని మార్చుకుంటూ తక్కిన ప్రపంచంతో సమానులుగా, సఖ్యతతో జీవించటం అందరికీ మేలు చేస్తుంది. లేని పక్షంలో, బ్రిక్స్ సమావేశాలు జరుగుతూ పోయినకొద్దీ అనివార్యపు మార్పులు తప్పవనాలి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
శాంసన్ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్ సంజూ శాంసన్ (57) అర్థసెంచరీ చేయగా, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (39) రాణించాడు. చివర్లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (34 నాటౌట్), తిలక్ వర్మ (15 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (37) టాప్ స్కోరర్‌గా నిలవగా, డార్విష్ రసూలీ (26), రషీద్ ఖాన్ (28) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో నితీశ్‌కుమార్ రెడ్డి మూడు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్, బిష్ణోయిలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇరుజట్ల మధ్య చివరి టీ20 గురువారం ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.Series victory sealed 🔒Superb from start to finish as #TeamIndia make it 2️⃣-0️⃣ in the Friendship Cup 🇮🇳👏Scorecard ▶️ https://t.co/96e4nhbYLf#AFGvIND pic.twitter.com/zvWVii5nBC— BCCI (@BCCI) September 15, 2026ఇదీ చదవండి: రెన్షా శతకం, ఇల్లిస్ విజృంభణ.. తొలి వన్డే ఆసీస్‌దే..! -
‘నాపై అంత జాలి ఉంటే..’ కల్యాణ్‌కు బైకర్ సియా కౌంటర్
రోడ్డుపై వెళ్తున్న ఓ యువతి బైక్‌ను కారు ఢీకొట్టడం.. ఆమె కిందపడిపోయినా వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవడం.. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. గురుగ్రామ్‌లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. తనను కారు కావాలనే వెంబడించి ఢీకొట్టారని బైకర్ ‘రెబల్ వీల్స్ సియా’ ఆరోపిస్తుండగా.. నిందితుడి తరఫు న్యాయవాది మాత్రం తప్పంతా బైకర్లదేనని అంటున్నాడు.గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగింది. సియా తన ఏప్రిలియా ఆర్ఎస్ 457 స్పోర్ట్స్ బైక్‌పై తోటి బైకర్లతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో తెల్లరంగు సెడాన్ తమను వెంబడించిందని ఆమె చెబుతోంది. కారులోని వారు తనకు దగ్గరగా వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తించారని, దూరంగా ఉండాలని తాను సూచించినా.. బైక్‌ను ఆపాలని సైగలు చేశారని ఆమె ఆరోపించింది. చివరకు కారు పక్క నుంచి వచ్చి తన బైక్‌ను ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయానని తెలిపింది.‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని’ప్రమాదంపై తొలిసారి స్పందించిన సియా.. నిందితుడు కల్యాణ్ బైన్స్లా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘నాపై జాలిపడుతున్నానని చెబుతున్నారు. నిజంగా జాలిపడితే ప్రమాదం తర్వాత ఎందుకు ఆపలేదు?’ అని ప్రశ్నించింది. తనను కారు చాలా దూరం వెంబడించిందని చెబుతూ.. ‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని. ఎముకలు విరిగిపోయేంత తీవ్ర గాయాలు కూడా అయ్యుండొచ్చు’ అని పేర్కొంది.కారు తనను వెంబడించలేదన్న వాదనను కూడా ఆమె ఖండించింది. ‘నా జుట్టు కనిపించింది.. నా దగ్గరకు వచ్చారు.. ఆపాలని సైగ చేశారు. అలాంటప్పుడు బైక్‌పై మహిళ ఉందో లేదో తెలియదని ఎలా చెబుతారు?’ అని ప్రశ్నించింది. ప్రమాదానికి సంబంధించిన రెండు వీడియోల్లోనూ కారు తన బైక్ వైపు లేన్ మార్చి ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపింది.This isn't hit and run... it's hit and kill 🖐️Car No: HR 30Y 4949In Gurugram, first a female bike rider was harassed by 4 louts sitting in a Verna car, they made vulgar vulgar gestures When the girl stopped them from doing so and told them to leave, the beasts rammed her… pic.twitter.com/W1141MIGSJ— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 14, 2026కొత్త వీడియో.. మరో కోణంలో ఢీకొట్టిన దృశ్యంఈ ఘటనకు సంబంధించి సియా వెనుకే వస్తున్న మరో బైకర్ రికార్డు చేసిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో కారు సియా బైక్ వైపు వచ్చి ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. కారు తమను చాలా దగ్గరగా వెంబడించిందని, డ్రైవర్ కిటికీ దించి ఆపాలని సైగ చేశాడని ఆ బైకర్ ఆరోపించాడు. ప్రమాదం తర్వాత కారు వెళ్లిపోవడంతో తాను దాన్ని వెంబడించి డ్రైవర్ ముఖాన్ని కెమెరాలో రికార్డు చేశానని చెప్పాడు. ప్రమాదం కారణంగా సియాకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అయితే రైడింగ్ గేర్ ధరించి ఉండటంతో తీవ్ర గాయాలు తప్పాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ మాత్రం దెబ్బతింది.‘కారులో నలుగురు.. మద్యం మత్తులో ఉన్నారు’సియా సోదరుడు కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రమాదం జరిగిన వెంటనే తనకు సియా ఫోన్ చేసి.. ఎవరో కారుతో ఢీకొట్టి వెళ్లిపోయారని చెప్పిందన్నాడు. కారులో నలుగురు ఉన్నారని, వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించారని ఆమె చెప్పినట్లు వెల్లడించాడు. కారులోని వారు అసభ్యకరమైన సైగలు చేశారని కూడా ఆరోపించాడు. సియా తండ్రి ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా చూడలేమని, ఇది హత్యాయత్నంగా భావిస్తున్నామని అన్నారు. రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ కూడా లేదని.. అలాంటి సమయంలో ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.‘తప్పంతా బైకర్లదే’.. నిందితుడి తరఫు వాదనగురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్యాణ్ బైన్స్లా బాడీబిల్డర్, జిమ్ ట్రైనర్. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ‘ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్’, ‘ఇండియన్ రగ్బీ టీమ్ సభ్యుడు’గా రాసుకున్నాడు. హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్ బైన్స్లా తరఫు న్యాయవాది మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపించారు. కారులో నలుగురు ఉన్నారని.. వారిలో బంధువులు కూడా ఉన్నారని చెప్పారు. బైకర్లు రోడ్డుపై అడ్డంకిగా మారుతున్నారని, వారి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కారు ఫుట్‌పాత్‌ను తప్పించుకునే క్రమంలో కొంచెం ఎడమవైపు వెళ్లిందని.. అదే సమయంలో యువతి కుడివైపు రావడంతో ఢీకొట్టిందని న్యాయవాది చెప్పారు. ప్రమాదం తర్వాత ఆపకపోవడానికి కారణం అక్కడ గుమిగూడిన వారు దాడి చేస్తారనే భయమేనని, ఆ పరిస్థితుల్లో కారు వెళ్లిపోయిందని తెలిపారు. సియా సోషల్ మీడియాలో ఫాలోవర్లు, వ్యూస్ కోసం ఘటనను ప్రచారం చేస్తోందని కూడా ఆరోపించారు. ఆమె బైక్ వేగం గంటకు 140–170 కిలోమీటర్ల వరకు ఉందని వాదించారు.కారు ఎవరిది?ప్రమాదానికి ఉపయోగించిన కారు హరియాణాలోని పల్వాల్‌కు చెందిన మనీష్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను ఆ సమయంలో కారులో లేనని మనీష్ స్పష్టం చేశాడు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, ఘటన జరిగిన సమయంలో అసోంలో విధుల్లో ఉన్నానని చెప్పాడు. ఆదివారం తన కుటుంబానికి చెందిన కారును ఓ స్నేహితుడు తీసుకెళ్లాడని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాతే ప్రమాదం విషయం తనకు తెలిసిందని వివరించాడు.పోలీసుల దర్యాప్తుకల్యాణ్ బైన్స్లా మాత్రం తాను కావాలనే బైకర్‌ను ఢీకొట్టలేదని చెబుతున్నాడు. బైకర్ అధిక వేగంతో వెళ్తుండగా, తాను కారు మలుపు తిప్పే సమయంలో ఢీకొన్నట్లు అతడి వాదన. ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడానికి బైకర్ల గుంపు దాడి చేస్తుందనే భయమే కారణమని కూడా అతడి తరఫున వాదన వచ్చింది. అయితే మహిళా బైకర్ మాత్రం కారు తనను ఉద్దేశపూర్వకంగా వెంబడించి ఢీకొట్టిందని ఆరోపిస్తోంది. ఈ రెండు వాదనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గురుగ్రామ్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వైరల్ వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, కారు వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? కారు ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బీజేపీ బిగ్ విక్టరీ -
కేంద్ర మంత్రి నివాసంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
సోమవారం వినాయక చవితి పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీలోని పీయూష్ గోయల్ ఇంటికి వెళ్లిన మోదీ గణపతి బప్పాను దర్శించుకున్నారు. అనంతరం హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ గణేశుడి కృప అందరిపై ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అనంతరం గణపతి బొప్ప మోరియా అని మోదీ తన నోటి వెంట పలికారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఇంట్లో గణేషుడికి చేసిన పూజ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ స్వయంగా తన ‘ఎక్స్’లో పంచుకున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రధాని మోదీ స్పందిస్తూ..‘‘నా తోటి పౌరులందరికీ హృదయపూర్వక గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. విఘ్న నివారకుని దర్శన పూజలకు సంబంధించిన ఈ పవిత్ర పండుగ ప్రతిఒక్కరి జీవితాల్లోకి నూతన శక్తిని, తాజా ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను. ఆయన దివ్య ఆశీస్సులతో అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ ముగించారు.VIDEO | Delhi: Prime Minister Narendra Modi participates in Ganesh Utsav at Union Minister Piyush Goyal’s residence.(Source: PM Modi's YT)(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/l1kLZzNxBg— Press Trust of India (@PTI_News) September 14, 2026ఇదీ చదవండి: గురుగ్రామ్ ఘటన.. సియా కుటుంబం చెప్పిన మరో కోణం! -
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్‌కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
పెద్దల నుంచి సామాన్యుల వరకు.. ఎవరినైనా గౌరవించే తీరు ప్రత్యేకమే. అలాంటి ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చేసిన ఈ చిన్న పని.. ఆయన వినయానికి నిదర్శనంగా నిలిచింది.18వ బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఆయన.. సెప్టెంబర్ 12న ఢిల్లీ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయానికి బయలుదేరేందుకు కారులో నుంచి దిగిన షేక్ ఖలీద్.. అక్కడున్న అధికారులకు వీడ్కోలు చెబుతున్నారు. ఇంతలో తనను తీసుకొచ్చిన డ్రైవర్‌కు మాత్రం చెప్పకుండా వెళ్లిపోతున్నానని గుర్తించారు.వెంటనే వెనక్కి తిరిగిన ఆయన.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌తో చేతులు కలిపారు. కాసేపు అతడితో మాట్లాడి మరీ వీడ్కోలు చెప్పారు. ఆ డ్రైవర్ భారతీయుడని ఏఎన్ఐ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘చిన్న పని.. పెద్ద మనసు!’యువరాజు చేసిన ఈ చిన్న పనిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. హోదా, స్థాయి చూడకుండా డ్రైవర్‌ను ప్రత్యేకంగా పలకరించడాన్ని ఆయన వినయానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. ‘ఇదే అసలైన క్లాస్’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు యూఏఈ వ్యవస్థాపకుడు షేక్ జాయెద్ విలువలను ఈ ఘటన గుర్తుచేస్తోందని పేర్కొన్నారు.భారత్ పర్యటనలో భాగంగా షేక్ ఖలీద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇంధన సరఫరాలు, వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక సహకారం, విద్య, పర్యాటకం తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన భేటీలో భారత్–యూఏఈ బంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చించారు.18వ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ‘బిల్డింగ్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ’ అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సుకు 13 మంది ప్రపంచ నేతలు, 17 ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.అయితే అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, కీలక చర్చల మధ్య.. ఒక భారతీయ డ్రైవర్‌కు స్వయంగా వెనక్కి వెళ్లి వీడ్కోలు చెప్పిన అబుదాబి యువరాజు తీరు మాత్రం ప్రత్యేకంగా నిలిచింది.#WATCH | Delhi: Crown Prince of Abu Dhabi, Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan departs from India after BRICS Summit 2026. pic.twitter.com/cw3XPOlTTz— ANI (@ANI) September 12, 2026 -
వెంబడించి మరీ.. లేడీ బైకర్‌పైకి కారు!
రోడ్డుపై ఓ లేడీ బైకర్‌ను కొందరు ఆకతాయిలు వెంబడించారు. తనను వెంబడించొద్దని.. దూరంగా ఉండాలని ఆమె వాళ్లకు సున్నితంగానే చెప్పింది. అయినా పట్టించుకోకుండా వెంటపడ్డారు. చివరకు కారుతో ఆమె బండిని ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఆమె కింద పడిపోగా.. బైక్ కొద్దిదూరం ముందుకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగినట్లు బాధిత బైకర్ సియా వెల్లడించింది. ఆమె తన బైకింగ్ గ్రూప్‌తో కలిసి ఏప్రిలియా ఆర్ఎస్ 457పై వెళ్తుండగా.. ఓ కారు వెనుక నుంచి వెంటపడటం మొదలుపెట్టిందని తెలిపింది. కారులో ఉన్నవారు దూకుడుగా ప్రవర్తించడంతో.. కొంత దూరం పాటించాలని తాను కోరినట్లు చెప్పింది. అయితే వారు బైక్ ఆపాలని చెప్పారని, మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపించారని తెలిపింది.కారు తనను పక్కకు రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించానని సియా తెలిపింది. వెనుక వస్తున్న తన స్నేహితుడు కూడా కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడని చెప్పింది. అయినప్పటికీ కారు డ్రైవర్ బైక్‌కు ముందుగా వచ్చి కట్ చేయడంతో ఢీకొట్టిందని ఆరోపించింది. దాంతో సియా బైక్‌పై నుంచి కిందపడిపోగా.. ఆమె స్పోర్ట్స్ బైక్ కొంత దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లింది.ఈ మొత్తం ఘటన ఆమె బైక్‌కు అమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డైంది. ప్రమాదం తర్వాత సియా స్నేహితుడు కారును వెంబడించి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆపేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్‌ను ప్రశ్నించగా.. తన తప్పేమీ లేదంటూ అక్కడి నుంచి కారుతో వెళ్లిపోయినట్లు సియా తెలిపింది.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సియా.. గురుగ్రామ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది. వాహనం నంబర్‌తో పాటు ఆర్సీ యజమాని వివరాలను కూడా వెల్లడించింది. వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ, గురుగ్రామ్, హరియాణా పోలీసులను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.Caught on Cam: Gurugram Woman Biker Thrown Off Aprilia After Car Rams Her for Asking to Keep Distance#Gurugram - A woman motorcyclist in Gurugram has alleged that a car rammed into her sports bike and fled after she asked the driver to keep a distance. The incident, recorded on… pic.twitter.com/Mq3xdfq83o— Siraj Noorani (@sirajnoorani) September 14, 2026 -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆసియా క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. అఫ్గానిస్తాన్‌తో ఆదివారం నాటి తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ ఈ ఫీట్ నమోదు చేశాడు. 13.4 ఓవర్లలోనేకాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అఫ్గాన్ ఢిల్లీలో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం తొలి టీ20 జరుగగా.. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఫ్గాన్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే ఛేదించింది.తుఫాన్ ఇన్నింగ్స్ఇందులో అభిషేక్ శర్మదే కీలక పాత్ర. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 32 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. స్ట్రైక్‌రేటు 256.25. అయితే, మహ్మద్ నబీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా అభిషేక్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. పొట్టి క్రికెట్లో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 3420 బంతుల్లోనే అభిషేక్ ఈ మార్కును అందుకున్నాడు.ఆసియాలోనే తొలి ప్లేయర్‌గా..ఈ క్రమంలో అత్యంత వేగంగా టీ20లలో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆసియా క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా రెండో ప్లేయర్‌గా నిలిచాడు. కాగా దేశీ క్రికెట్లో పంజాబ్ తరఫున.. ఐపీఎల్లో.. టీమిండియా తరఫున కలిపి అభిషేక్ శర్మ ఈ మేరకు భారీగా పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.ఫాస్టెస్ట్ 6000 రన్స్ (బంతుల పరంగా)👉ఫిన్ అలెన్ (న్యూజిలాండ్)- 3386 బంతుల్లో👉అభిషేక్ శర్మ (ఇండియా)- 3420 బంతుల్లో👉ఆండ్రీ రసెల్ (వెస్టిండీస్)- 3550 బంతుల్లో👉టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా)- 3681 బంతుల్లో👉విల్ జాక్స్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్)- 3857 బంతుల్లో.చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి?𝐓𝐇𝐈𝐒 𝐊𝐈𝐍𝐃 𝐎𝐅 𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆. 🤌💥When Abhishek Sharma gets going, the bat does the talking. 🔥Watch #AFGvIND 1st T20I, LIVE NOW on Sony Sports Ten 5 & Sony MAX.#SonySportsNetwork #SonyMAX #ExtraaaInnings pic.twitter.com/aLu13MB9JF— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 -
అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా అఫ్గాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.టీమిండియా బౌలర్ల విజృంభణఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ నామమాత్రపు స్కోరు చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) కూడా తేలిపోయాడు. మిగిలిన వారిలో సెదీకుల్లా అటల్ (13), గుల్బదిన్ నైబ్ (2), డార్విష్ రసూలీ (2) పేలవ ప్రదర్శన కనబరిచారు.దీంతో జట్టు కష్టాల్లో కూరుకుపోగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (44 బంతుల్లో 64)తో ఆదుకున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ 33 పరుగులతో రాణించాడు. దీంతో అఫ్గాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ 10 పరుగులు చేసి.. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 22 బంతుల్లోనేఅఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్ కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. అయితే, సెంచరీకి చేరువవుతున్న వేళ మహ్మద్ నబీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.మిగిలిన వారిలో వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42) రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 8, తిలక్ వర్మ 3 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 13.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 157 పరుగులు సాధించి టార్గెట్ పూర్తి చేసింది. తద్వారా అఫ్గాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.చదవండి: Asia Cup 2026 Final: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్𝐓𝐇𝐈𝐒 𝐊𝐈𝐍𝐃 𝐎𝐅 𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆. 🤌💥When Abhishek Sharma gets going, the bat does the talking. 🔥Watch #AFGvIND 1st T20I, LIVE NOW on Sony Sports Ten 5 & Sony MAX.#SonySportsNetwork #SonyMAX #ExtraaaInnings pic.twitter.com/aLu13MB9JF— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 -
భారత బౌలర్ల విజృంభణ.. అఫ్గాన్ నామమాత్రపు స్కోరు
అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అ ప్గాన్ భారత బౌలర్లు విజృంభించడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కాగా భారత్ వేదికగా అఫ్గాన్ బోర్డు.. టీమిండియాకు మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.UPDATES:ఇరవై ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 156-8ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) నిరాశపరిచాడు. మిగిలిన వారిలో సెదీకుల్లా అటల్ 13 పరుగులు చేయగా.. గుల్బదిన్ నైబ్ (2), డార్విష్ రసూలీ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు.అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (44 బంతుల్లో 64) చేయగా.. మహ్మద్ నబీ 33 పరుగులతో రాణించాడు. ఫలితంగా అఫ్గాన్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు.పదిహేను ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 104-5అజ్మతుల్లా 33, నబీ 26 పరుగులతో ఉన్నారు.సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి అఫ్గాన్ స్కోరు: 56-5 (10)అజ్మతుల్లా ఒమర్జాయ్ 10, నబీ 4 పరుగులతో ఉన్నారు. అంతకు ముందు ఏడో ఓవర్ ఆఖరి బంతికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డార్విష్ రసూలీ (2) బౌల్డ్ అయి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.పవర్ ప్లేలో అఫ్గాన్ స్కోరు: 41-4 (6 ఓవర్లు)ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్‌ను జస్ప్రీత్ బుమ్రా డకౌట్ చేయగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) రనౌట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ సెదీకుల్లా అటల్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. గుల్బదిన్ నైబ్ ఆరు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.టాస్ గెలిచిన టీమిండియా.. వైభవ్ ఆడటం లేదుఇక టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. ఢిల్లీ వికెట్ మీద తొలుత బౌలింగ్ చేస్తే అనుకూలంగా ఉంటుంది. జింబాబ్వే పర్యటనలో మాకెన్నో సానుకూల అంశాలు కనిపించాయి. ఇక్కడా అదే జోరు కొనసాగిస్తాం. అయితే, వైభవ్ సూర్యవంశీ ఆడటం లేదు’’ అని తెలిపాడు.తిరిగి వచ్చిన సంజూకాగా జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా వచ్చిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో భారత్ 3-0తో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేయగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును వైభవ్ గెలుచుకున్నాడు. అయితే, అఫ్గాన్‌తో సిరీస్‌తో సంజూ తిరిగి రావడంతో వైభవ్‌కు తుదిజట్టులో చోటు కరువైంది. ఇదిలా ఉంటే.. గాయాల నుంచి కోలుకున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుదిజట్టులోకి వచ్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు మాత్రం ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు.తుదిజట్లుభారత్సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.అఫ్గానిస్తాన్ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదీకుల్లా అటల్, డార్విష్ రసూలి, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫారూకీ.చదవండి: పంత్వి పిల్లాడి చేష్టలు: సంజీవ్ గోయెంకా -
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
-
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని వాయువ్య ప్రాంతమైన స్వరూప్ నగర్లో ఆదివారం ఉదయం ఒక గోడౌన్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 15 అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్థలానికి రప్పించారు.ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం, భయాందోళనల మధ్య కొందరు స్థానికులు భవనాల పైనుంచి దూకడం వల్ల మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. మంటలు చెలగడానికి అసలు కారణం ఏమిటి అనే కోణంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విచారణ జరుపుతున్నారు. -
ఒక చేతిలో ‘బ్రహ్మోస్’.. మరో చేతిలో సెమీకండక్టర్ చిప్..
న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్సీఆర్లో గణేశోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 14 నుంచి పది రోజులపాటు దేశభక్తి, సాంస్కృతిక అంశాలతో మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముంబై, చెన్నైతో పాటు దక్షిణాది కళాకారులు ఢిల్లీకి రానున్నారు. ‘ఢిల్లీ కా మహారాజా’ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి వినూత్న థీమ్‌ను ఎంచుకున్నారు. 9 అడుగుల గణపతి విగ్రహం చేతుల్లో సంప్రదాయ వస్తువులకు బదులుగా బ్రహ్మోస్ క్షిపణి, డ్రోన్, సెమీకండక్టర్ చిప్‌ను ఉంచారు. ‘విఘ్నహర్త నుంచి వికాసకర్త’ అనే ఇతివృత్తంతో దేశ పురోగతిలో సాంకేతికత, భద్రత, యువత పాత్రను చాటనున్నారు. 80 అడుగుల ప్రదర్శన వేదికపై సంప్రదాయ ఆలయాలు, రాకెట్లు, డ్రోన్లు, 10 అడుగుల బుల్లెట్ రైలు నమూనాలను ప్రదర్శించనున్నారు.2,100 శంఖాలతో ఘన ప్రారంభంలాల్బాగ్ కా రాజా గణపతి మహోత్సవం సెప్టెంబర్ 14న ప్రారంభం కానుంది. రాత్రి 7.30 గంటలకు 2,100 మంది భక్తులు ఒకేసారి శంఖాలు ఊది కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం ముంబైలోని లాల్బాగ్చా రాజా విగ్రహాలను రూపొందించే కళాకారులు తయారుచేసిన 18 అడుగుల గణపతి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రోజుకు సుమారు 20 వేల నుంచి 25 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.ఢిల్లీలో మహారాష్ట్ర సందడి29వ సార్వజనిక గణేశ్ ఉత్సవంలో మహారాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించనుంది. మరాఠీ గజల్స్, నాటకాలు, లావణి, సంగీత కార్యక్రమాలతో పాటు పూరణ్ పోళీ, ఉక్కడిచే మోదక్ వంటి సంప్రదాయ వంటకాలు అందుబాటులో ఉంటాయి. పైఠణీ, ఇర్కల్ చీరల విక్రయాలు, ప్రత్యేక నిమజ్జన ఊరేగింపు కూడా నిర్వహించనున్నారు.చెన్నై కళాకారుల గణపయ్యమయూర్ విహార్‌లోని శ్రీ శుభ సిద్ధి వినాయక మందిరంలో చెన్నై కళాకారులు రూపొందించిన నాలుగు అడుగుల గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సెప్టెంబర్ 14న 25 మూలమంత్ర జపం అనంతరం 5,000 మోదకాలను నైవేద్యంగా సమర్పించనున్నారు. దక్షిణాది కళాకారులు సంప్రదాయ భజనలు నిర్వహించనున్నారు.నోయిడాలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలునోయిడాలోని శ్రీ వరసిద్ధి వినాయక మందిరంలో ఐదు రోజులపాటు గణేశ్ చతుర్థి వేడుకలు జరగనున్నాయి. హవనం, అభిషేకాలు, సహస్రనామ పారాయణాలతో పాటు భరతనాట్యం, వేణుగానం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ఇదీ చదవండి: అద్దెకు ఫైబర్ గణేశుడు.. 10 అడుగుల విగ్రహం మూడు వేలకే.. -
మోదీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. ఏం జరిగింది?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల సందర్భంగా షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక విందుకు మాత్రం హాజరుకాలేదు. శనివారం జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించిన జిన్‌పింగ్.. రాత్రి జరిగిన గాలా డిన్నర్‌కు దూరంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.కాగా, ప్రధాని మోదీ శనివారం బ్రిక్స్ దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల కోసం విందును ఏర్పాటు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అయితే జిన్‌పింగ్ మాత్రం విందుకు రాలేదు. ఆయన ఎందుకు హాజరుకాలేదన్న దానిపై అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడికాలేదు. అయితే ఓ వర్గం సమాచారం ప్రకారం.. సదస్సు కార్యక్రమాల తర్వాత జిన్‌పింగ్ హోటల్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ కూడా విందుకు హాజరుకాలేదు. అయితే ఆయన సదస్సు కార్యక్రమాల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వెళ్లారు. జిన్‌పింగ్ గైర్హాజరుపై కారణం స్పష్టత లేకపోవడంతో ఆయన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్.. మోదీతో డిన్నర్‌కు దూరంగా ఉండటం ఆసక్తిని రేపుతోంది. అయితే ఇది కేవలం విశ్రాంతి కోసమేనా.. లేక మరేదైనా కారణమా అన్నది మాత్రం అధికారికంగా తేలాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. నిన్న (సెప్టెంబర్ 12) మోదీ-జిన్‌పింగ్ మధ్య సుమారు 50 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రధానంగా సరిహద్దు వివాదం, వాణిజ్య లోటు, మార్కెట్ యాక్సెస్, సరఫరా చైన్, రవాణా-ప్రజల మధ్య సంబంధాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా సరిహద్దు విషయంలో న్యాయబద్ధమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం పనిచేయాలని ఇద్దరూ అంగీకరించారు. మోదీ ఇప్పటికే ఉన్న సరిహద్దు ఒప్పందాలు, అవగాహనలను గౌరవించాలని స్పష్టం చేశారు. ఇక ఆర్థిక అంశాల్లో భారత్-చైనా మధ్య వాణిజ్య అసమతుల్యతను తగ్గించడం, మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేయడం, సప్లై చెయిన్ సమస్యలను పరిష్కరించడంపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య విమానాలు, వీసాలు, కైలాస్ మానసరోవర్ యాత్ర వంటి సంబంధాలు కూడా క్రమంగా పునరుద్ధరిస్తున్నాయి.ఇదీ చదవండి: సముద్రం అడుగున బంగారు ఖజానా.. చైనా సంచలన అన్వేషణ! -
సభ్య దేశాల సహకారంతో ఉమ్మడి ప్రయోజనం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు రెండో రోజుకు చేరుకుంది. దీనిలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘బ్రిక్స్’లో గ్లోబల్ సౌత్ దేశాల స్వరం గట్టిగా వినిపిస్తోందని అన్నారు. భారత అధ్యక్షతన నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. సత్సీలత, నవకల్పన, సహకారం, సుస్థిరత అనే నాలుగు స్తంభాలపై కృషి చేశామని చెప్పారు. సభ్య దేశాల సహకారం, మద్దతుతో ఉమ్మడి ఆలోచనలను అందరికీ ప్రయోజనం చేకూర్చే సహకారంగా మార్చగలిగామని పేర్కొన్నారు.సరఫరా గొలుసులను మరింత విశ్వసనీయంగా, బలోపేతంగా మార్చేందుకు బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ సహకార ఫ్రేమ్‌వర్క్ దోహదపడుతుందని మోదీ తెలిపారు. బ్రిక్స్ ఇన్క్యుబేటర్ నెట్వర్క్ ద్వారా స్టార్టప్‌లు, ఇన్క్యుబేటర్లను అనుసంధానించనున్నట్లు చెప్పారు. విస్తృతంగా అమలు చేయగల కొత్త పరిష్కారాలను ప్రోత్సహించేందుకు బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi receives President of Kazakhstan, Kassym-Jomart Tokayev, at Bharat Mandapam on Day 2 of the BRICS Summit 2026. (Source: DD News) https://t.co/NRkO6pDWBM— ANI (@ANI) September 13, 2026డిజిటల్ వ్యవసాయంపై బ్రిక్స్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని మోదీ అన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), జియోస్పేషియల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా అనుసంధానించనున్నట్లు తెలిపారు. సాంకేతికత, కీలక ఖనిజాలను ఆయుధాలుగా ఉపయోగించడం ఉమ్మడి అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చని హెచ్చరించారు. సాంకేతికతను అందిపుచ్చుకునే విషయంలో అందరినీ భాగస్వాములను చేసే విధానానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు.తొలి రోజు సమావేశాల్లో సభ్య దేశాల నేతలు ‘న్యూఢిల్లీ ప్రకటన-2026’ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రపంచ పాలనలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్‌కు మరింత పెద్ద పాత్ర కల్పించాలన్న ఆకాంక్షలకు మద్దతు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడంతోపాటు ఏకపక్ష ఆంక్షలు, సుంకాలు, వాణిజ్య పరిమితులపై ఆందోళన వ్యక్తం చేశారు.రెండో రోజు సమావేశాల్లో భారత్ 2026 అధ్యక్షతన నిర్దేశించిన స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే నాలుగు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పాలనలో సంస్కరణలకు సంబంధించి పది ప్రతిపాదనలు చేశారు. ప్రపంచ దక్షిణాది దేశాలు కేవలం నిబంధనలు అనుసరించే స్థాయి నుంచి వాటి రూపకల్పనలో భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ సాంకేతికతలు, వాటికి సంబంధించిన నియమాల రూపకల్పనలో సమాన భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. సముద్ర రవాణా సిబ్బంది అత్యవసర సహాయానికి ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi, Russian President Vladimir Putin and other world leaders at Bharat Mandapam PM Modi has hosted gala dinner for global leaders and delegates here (Source: DD) https://t.co/lOlKp0W7Df— ANI (@ANI) September 12, 2026బ్రిక్స్ ప్రకటనలో పశ్చిమాసియా సంక్షోభంపై ఆందోళన వ్యక్తమైంది. పౌరులు, పౌర మౌలిక వసతుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రపంచ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు, ఇంధన ప్రవాహం సజావుగా కొనసాగేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పేర్కొంది. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారమే మార్గమని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. భారత్-చైనా సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నట్లు జిన్‌పింగ్ పేర్కొన్నారు. మరోవైపు, బ్రిక్స్ దేశాలు కృత్రిమ మేధ, క్వాంటమ్ సాంకేతికత, డిజిటల్ మౌలిక వసతులు, స్టార్టప్‌లు, సరఫరా వ్యవస్థల వంటి రంగాల్లో సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి. సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించి, మూల దేశాలకు పురాతన వస్తువులు, ఆధ్యాత్మిక, చారిత్రక వస్తువులను తిరిగి అప్పగించేందుకు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. -
కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది?
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రమే వారు హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని కొండా మురళి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రానున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.కీలక బాధ్యత అప్పగిస్తారా?సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈపర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే ఢిల్లీ పర్యటన పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందేనని నాయకులు అంటున్నారు.రాజకీయ వర్గాల్లో ఉత్కంఠఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా దంపతులతో మాట్లాడారు. ఈనేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, కొండా దంపతుల రాజకీయ పాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే సురేఖకు పార్టీపరంగా కొత్త బాధ్యత దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు, కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో ఉన్న రాజకీయ ప్రభావాన్ని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోందని వారి అనుచరులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు, కేడర్‌ను సమన్వయం చేసేందుకు సురేఖ సేవలను వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేనని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని నాయకులు చెబుతున్నారు. దీంతో ఆదివారం రాంనగర్లో జరగనున్న కార్యకర్తల సమావేశం, అనంతరం కొండా సురేఖ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో కొండా దంపతులు చేసే వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనపై వెల్లడించే వివరాలు, పార్టీ అధిష్టానంతో జరిగే చర్చలపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు! -
రూల్స్ మనమే రూపొందించాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య ఘర్షణలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు పెరుగుతున్న నేపథ్యంలో గ్లోబల్ సౌత్ దేశాలు ‘నియమాలను రూపొందించేవిగా’మారాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ప్రపంచ పాలనలో ప్రస్తుతం ఉన్న ‘విశేషాధికారాల పిరమిడ్’స్థానంలో ‘భాగస్వామ్య వేదిక’కావాలని తేల్చిచెప్పారు. రెండు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని భారత్ మండపంలో అట్టహాసంగా మొదలైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. బ్రిక్స్ చట్రం కింద ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 పాయింట్ల రోడ్‌మ్యాప్‌ను ప్రతిపాదించారు. ప్రపంచ, ప్రాంతీయ సంక్షోభాల వల్ల అధిక ముప్పును ఎదుర్కొంటున్న నావికుల రక్షణ కోసం ‘సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్’ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, ఇండోనేసియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో, అబూదాబీ యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది బ్రిక్స్‌కు భారత్ నేతృత్వం వహిస్తోంది. కీలకమైన ప్రపంచ సంస్థగా బ్రిక్స్ బ్రిక్స్ కూటమి ఒక కీలకమైన ప్రపంచ సంస్థగా ఆవిర్భవించిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. తీవ్రమైన ప్రపంచ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాబోయే 20 ఏళ్లలో కూటమికి ఒక నూతన, ప్రతిష్టాత్మక ఎజెండా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ పాలనా వ్యవస్థ ఒక పిరమిడ్‌ను పోలి ఉందని చెప్పారు. అధికారం, నిర్ణయాధికారం పైస్థాయిలో కేంద్రీకృతమై ఉండగా, కింది స్థాయిలోని దేశాలు ఆ నిర్ణయాల ప్రభావానికి లోనవుతున్నాయి తప్ప వాటిని ప్రభావితం చేయలేకపోతున్నాయని వెల్లడించారు. నేడు ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కోవడంలో ‘గ్లోబల్ సౌత్’ముందు వరుసలో ఉన్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుకంజలోనే ఉందన్నారు. అందుకే విశేషాధికారాల పిరమిడ్ స్థానంలో అన్ని దేశాలతో కూడిన భాగస్వామ్య వేదికను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ప్రతి దేశానికీ గళం వినిపించే అవకాశం ఉండాలన్నారు. ప్రతి ప్రయత్నానికీ మానవాళి అభివృద్ధే కేంద్ర బిందువుగా ఉండేలా చూడాలని తెలిపారు. ఉమ్మడిగా రోడ్‌మ్యాప్ మానవాళి సంక్షేమం కోసం బ్రిక్స్ కూటమి సంస్కరణ ప్రణాళికా చట్రం పరిధిలోనే ప్రపంచ పాలనా సంస్కరణల కోసం 10 అంశాలతో కూడిన రోడ్‌మ్యాప్‌ను ఉమ్మడిగా రూపొందించాలని మోదీ ప్రతిపాదించారు. తదుపరి శిఖరాగ్ర సమావేశం నాటికి ఈ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో మనం మూడు కీలక అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘ప్రాతినిధ్యం, స్పందించే గుణం, నియమావళి రూపకల్పన’అవసరమని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని, దీనికి సంబంధించిన చర్చలను ఒక నిర్దిష్ట కాలపరిమితితో స్పష్టమైన ఫలితాల దిశగా ముందుకు తీసుకెళ్లాలని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆర్థిక సంస్థల్లో ఓటింగ్ అధికారం, నాయకత్వ స్థానాలు, విధానపరమైన ప్రాధాన్యతలు నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే దేశాలు ప్రపంచ ఆర్థిక పాలనను తీర్చిదిద్దడంలోనూ తగిన పాత్ర పోషించాలని సూచించారు. భవిష్యత్తులో ప్రపంచ నియమాలను నిర్ణయించడంలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించడం అత్యంత కీలకమని తేల్చిచెప్పారు. కృత్రిమ మేధస్సు, సైబర్ స్పేస్, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కీలక సాంకేతికతల వంటి రంగాలు భవిష్యత్తు అవకాశాలను తీర్చిదిద్దడమే కాకుండా, భవిష్యత్తు నియమాలను కూడా నిర్దేశిస్తున్నాయన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు ఇక కేవలం నియమాలను పాటించేవారి స్థాయిలో ఉండడానికి వీల్లేదన్నారు. నియమాలను రూపొందించే స్థాయికి ఎదగాలని స్పష్టంచేశారు. ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాం బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈ ఏడాది బ్రిక్స్ 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు. మానవ జీవితంలో 20 ఏళ్ల వయస్సు అనేది పరిపక్వత, బాధ్యతతో కూడిన ఒక కొత్త దశకు ఆరంభమని వ్యాఖ్యానించారు. బ్రిక్స్ కూడా పరిపక్వత సాధించే దశకు చేరుకుందని, ప్రపంచ వేదికపై క ప్రత్యేక గుర్తింపును సాధించిందని అన్నారు. తాము ఇతరుల ఆకాంక్షలను గౌరవిస్తామని, ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని వివరించారు. ఎవరినో వ్యతిరేకించడం ద్వారా కాకుండా అందరినీ కలుపుకొని వెళ్లడం ద్వారా పురోగతి సాధించడానికి కృషి చేస్తామన్నారు. కూటమిలో మనకున్న ఐక్యతను, ఏకాభిప్రాయాన్ని ప్రపంచ వేదికపై ప్రత్యక్ష ఫలితాలుగా మార్చుకోవాలని సూచించారు. రాబోయే 20 ఏళ్లకు సంబంధించిన బలమైన ఎజెండాపై మనం కృషి చేయాలన్నారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు ఏటా మారుతున్నప్పటికీ అది మన సంస్థాగత పురోగతికి ఆటంకం కలిగించకూడదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’మన ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఈ తీర్మానాలను స్పష్టమైన ఫలితాలుగా మార్చడం మన బాధ్యత అని ఉద్బోధించారు. 10 పాయింట్ల రోడ్‌మ్యాప్ 1. నియమాలను పాటించేవారి నుంచి నియమాలను రూపొందించేవారిగా బ్రిక్స్ ఎదగడం 2. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు 3. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం బలోపేతం 4. కూటమి అధ్యక్షులు మారినప్పటికీ నిర్ణయాలు కొనసాగింపు 5. కూటమి నిర్ణయాల అమలుపై దృష్టి 6. వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడం 7. సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరింపజేసుకోవడం 8. అభివృద్ధి భాగస్వామ్యాలను బలోపేతం చేయడం 9. గ్లోబల్ సౌత్‌కు మరింత ప్రాధాన్యత ఇవ్వడం 10. ప్రపంచ వేదికపై బ్రిక్స్‌ను మరింత సమర్థవంతంగా మార్చడం -
విషాదం.. విమానం ఎగరడానికి కొన్ని గంటల ముందే..
ఢిల్లీ: ఓ స్టార్ హోటల్ రూమ్‌లో ఎయిరిండియా పైలట్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన వసంత్ కుంజ్‌లో ఉన్న స్టార్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, ఫ్లైట్ కెప్టెన్‌గా పనిచేస్తున్న ఆ వ్యక్తి ది గ్రాండ్ హోటల్లోని తన గదిలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని సన్నీ అసల్దేకర్గా పోలీసులు గుర్తించారు.పైలట్ సెప్టెంబర్ 10న హోటల్లో చెక్-ఇన్ చేశారు. మరుసటి రోజు ఆయన ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో ఆయన సోదరుడు హోటల్ మేనేజర్‌ను సంప్రదించాడు. దీంతో మేనేజర్ గదికి వెళ్లగా.. తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. మాస్టర్ కీ సహాయంతో తలుపు తెరిచి చూడగా పైలట్ స్పందన లేకుండా కనిపించారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఆయనకు పోస్టుమార్టం నిర్వహించారు. మరణానికి కచ్చితమైన కారణం తెలియలేదు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.ఇవాళ (శనివారం) తెల్లవారుజామున విధులకు ఆయన హాజరు కావాల్సి ఉంది. ఢిల్లీ నుంచి సియోల్‌కు వెళ్లే విమానాన్ని నడపాల్సి ఉంది. గుండెపోటు కారణంగానే ఆయన మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నాయి. పైలట్ గతంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పనిచేశారు. కొద్ది నెలల క్రితమే ఎయిర్ ఇండియాకు మారారు.ఇదీ చదవండి: ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది? -
అంతర్జాతీయ ఖ్యాతి.. అద్భుత ఆకృతి
ఢిల్లీ: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ అతిథ్యమివ్వడంతో ప్రపంచ దేశాధినేతలు భారత్‌కు తరలివచ్చారు. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి భారత్‌పై పడింది. ఈ నేపథ్యంలో ఈ అంతర్జాతీయ శిఖరాగ్రసదస్సుకు ఆతిథ్యమిస్తున్న భరతమండపం ప్రత్యేకతలు ఏంటి..దానిని ఎప్పుడు నిర్మించారు. అనే వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ప్రపంచ దేశాల అగ్రనేతలు హాజరవుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 2026 బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు భారత్ రాజధాని న్యూఢిల్లీ వేదికైంది. ఈ వార్షిక సదస్సు కోసం దేశ నడిబొడ్డున ఉన్న అత్యాధునిక 'భారత్ మండపం' సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే ఇది వరకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సహా పలువురు ప్రపంచ స్థాయి నాయకులు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.భరత మండపం నిర్మాణంప్రగతి మైదాన్ కాంప్లెక్స్‌లో 123 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,700 కోట్ల వ్యయంతో ఈ వేదికను నిర్మించారు. 2023లో ప్రారంభమైన ఈ సముదాయం నేడు భారతదేశ ఆతిథ్య సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది. 12వ శతాబ్దపు 'అనుభవ మండపం' స్ఫూర్తితో దీనికి 'భారత్ మండపం' అని నామకరణం చేశారు.నటరాజ విగ్రహం ప్రత్యేకతఈ సముదాయంలో ఏర్పాటు చేసిన 27 అడుగుల ఎత్తు, 18 టన్నుల బరువు కలిగిన భారీ నటరాజ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అష్టధాతువులతో తమిళనాడు శిల్పులు దీనిని అద్భుతంగా మలిచారు. ప్రధాన సమావేశ మందిరం భవనం 'శంఖం' ఆకారంలో రూపొందించబడింది. ఇది చేతన శక్తిని, శుభారంభాన్ని సూచిస్తుంది. సూర్య శక్తి, జీరో నుంచి ఇస్రో సాధించిన ప్రయాణం, పంచ మహాభూతాల ప్రాముఖ్యతను తెలిపేలా దీని లోపలి బయటి డిజైన్లు భారతీయ నాగరికతను ప్రతిబింబిస్తున్నాయి.భారత్ మండపంలో వివిధ హాళ్లు150 దేశాల ప్రతినిధులకు సరిపడే సామర్థ్యం ఉన్న ఈ హాలులో కీలకమైన ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమం ఇక్కడే జరిగింది. డ్రోన్ టెక్నాలజీతో పాటు భారత్ సాధించిన నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పారు.హాల్ నెం. 14: బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొనే ఈ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాపార వర్గాలనుద్దేశించి ప్రసంగించనున్నారు.హాల్ నెం. 5: ప్రపంచ వ్యాప్తంగా విచ్చేసిన సుమారు 1,200 నుంచి 1,400 మంది జర్నలిస్టుల కోసం ఇంటర్నేషనల్ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు.ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య సంక్షోభాలు, ఉగ్రవాద నిరోధక విధానాలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సవాళ్లపై ప్రపంచ నేతలు చర్చిస్తున్నారు. అలాగే బ్రిక్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విధానాలను చర్చించనున్నారు.కట్టుదిట్టమైన భద్రతభారత్ మండపంలో భద్రతా వ్యవస్థ అత్యంత అత్యాధునిక సాంకేతికతతో, అభేద్యమైన కోటను తలపించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడింది. అంతర్జాతీయ సదస్సులు జరిగే సమయంలో ఇక్కడ శత్రు దుర్భేద్యమైన మల్టీ-లేయర్డ్ (బహుళ అంచెల) భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంగణంలోని ప్రధాన సెక్యూరిటీ ప్రత్యేకతలు భారత్ మండపం చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల మేర బహుళ అంచెల భద్రతా వలయం ఉంటుంది. ఔటర్ రింగ్‌లో ఢిల్లీ పోలీస్ మరియు పారామిలటరీ బలగాలు కాపలా ఉంటే, అంతర్గత కోర్ జోన్లో (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండోలతో పాటు ప్రత్యేక దళాలు మోహరిస్తాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నైజేషన్: ఇక్కడి నిఘా వ్యవస్థలో AI సాంకేతికతను ఉపయోగిస్తారు. హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనుసంధానించబడి ఉంటుంది. ఇది అనుమానాస్పద వ్యక్తులను లేదా నేరస్థుల డేటాబేస్‌లో ఉన్న ముఖాలను క్రౌడ్‌లో సైతం క్షణాల్లో గుర్తించి అలర్ట్ చేస్తుంది.డ్రోన్ సిస్టమ్స్ ఆకాశ మార్గం నుండి ఎలాంటి ముప్పు రాకుండా భవనం చుట్టూ అత్యాధునిక యాంటీ-డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్స్ అప్రమత్తంగా ఉంటాయి. అనుమతి లేని ఏ డ్రోన్ లేదా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అయినా ఈ పరిధిలోకి వస్తే వాటిని జామ్ చేయడం లేదా కూల్చివేయడం జరుగుతుంది. ఇలా భరతమండపంకు ఆధునాతనమైన ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. -
అడ్డంకులు అధిగమించి ముందడుగు
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యం అంతరాయాలు లేకుండా కొనసాగాలంటే నౌకాయాన స్వేచ్ఛ, సురక్షిత సముద్ర మార్గాలు, నావికుల భద్రత అత్యవసరమని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. పెరుగుతున్న ఆర్థిక బలాన్ని భారీ పెట్టుబడులుగా, నూతన వ్యాపార సంబంధాలుగా మార్చుకోవాలని బ్రిక్స్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో ‘బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్’లో ఆయన ప్రసంగించారు. 10 ప్రధాన వాణిజ్య అవరోధాలను గుర్తించి తొలగించాలని చెప్పారు. ప్రతి సంవత్సరం 100 బ్రిక్స్ స్టార్టప్‌లను ఇతర సభ్య దేశాల మార్కెట్లలోకి విస్తరించాలని, అలాగే ఏటా 1,000 కొత్త వ్యాపార భాగస్వామ్యాలను నిర్మించాలని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలపై మన పురోగతిని ప్రతి ఏటా సమీక్షించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరమైన అడ్డంకులు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి అడ్డంకులను అధిగమిస్తూ మన ఆర్థిక శక్తిని నూతన వ్యాపార అవకాశాలుగా మార్చుకోవాలని స్పష్టంచేశారు. నౌకాయాన స్వేచ్ఛకు, నావికుల భద్రతకు భారత్ మద్దతిస్తోందని తెలిపారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ జీడీపీలో 40 శాతం మరియు ప్రపంచ వాణిజ్యంలో నాలుగో వంతు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ జీడీపీ సుమారు రెండున్నర రెట్లు వృద్ధి చెందగా, బ్రిక్స్ దేశాల ఉమ్మడి జీడీపీ మాత్రం నాలుగున్నర రెట్లు పెరిగిందని హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ప్రపంచ వ్యాపారాలకు భారతదేశం చేసే ప్రతిపాదనలో మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక సాంకేతికతలను ప్రధానాంశంగా మోదీ పేర్కొన్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాల వేగవంతమైన విస్తరణతోపాటు నౌకా నిర్మాణం, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, కీలక ఖనిజాలు, బయోటెక్నాలజీ రంగాల్లో నూతన సామర్థ్యాలను ప్రస్తావించారు. ‘మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ వరల్డ్’అన్నారు. ప్రపంచ మార్కెట్లకు భారత్ ఒక తయారీ కేంద్రంగా, సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య మరింత లోతైన సహకారం కోసం భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను ఒక వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. బ్రిక్స్ దేశాలు తమ సొంత మార్కెట్లకు అనువైన డిజిటల్ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి భారతదేశ అనుభవాన్ని వాడుకోవచ్చని అన్నారు. ఇండియాలో 2 లక్షలకు పైగా స్టార్టప్‌లు, 120కి పైగా యూనికార్న్‌లు ఉన్నాయని గుర్తుచేశారు. ఇలాంటి ఆవిష్కరణలను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లడంలో బ్రిక్స్ సహాయపడాలని కోరారు. వాణిజ్య అనుసంధానం అనేది మరో ప్రధాన అంశమని చెప్పారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, వ్యాపార అవకాశాలను విస్తరించడంపై బ్రిక్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి చెప్పారు. -
ఐరాస చీఫ్ గుటేరస్‌తో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్‌తో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, నౌకాయాన స్వేచ్ఛ, సుస్థిరాభివృద్ధి, మానవ కేంద్రీకృత కృత్రిమ మేధ(ఏఐ), ప్రపంచ ఆహార భద్రత వంటి పలు అంశాలపై చర్చించారు. బహుళ ధ్రువత్వం ప్రాముఖ్యతను వారు ప్రస్తావించారు. సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్ నాలుగోసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్నందుకు ప్రధాని మోదీకి ఆంటోనియా గుటేరస్ అభినందనలు తెలియజేశారు. గుటేరస్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని మోదీ ఎక్స్‌లో పోస్టుచేశారు. భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ కార్యకలాపాలు, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల ఆవశ్యకత వంటి అంశాలపై చర్చించానని పేర్కొన్నారు. -
దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోండి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ప్రస్తుత నెలకొన్న సంక్షోభాన్ని చర్చలు, దౌత్య మార్గాల్లో ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు సూచించారు. శుక్రవారం ఇరువురు నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పురోగతిపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, ఇరాన్ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొడానికి పెజెష్కియాన్ ఢిల్లీకి చేరుకున్న తర్వాత కొద్ది గంటల్లోనే ఈ భేటీ జరగింది. పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడి హోదాలో భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపైమోదీ, పెజెష్కియాన్ చర్చించారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న భారతదేశ స్థిరమైన వైఖరిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడం, నౌకాయాన స్వేచ్ఛ, వాణిజ్య కార్యకలాపాలు, నావికుల భద్రత, సంక్షేమాన్ని పరిరక్షించడం కోసం కృషి అవసరమని పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నప్ప టికీ బ్రిక్స్ సమావేశాల్లో ఇరాన్ భాగస్వామ్యం వహిస్తున్నందుకు పెజెష్కియాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఘర్షణను నివారించడానికి సహకరించాలని మోదీని ఇరాన్ అధ్యక్షుడు కోరారు. -
బ్రిక్స్ సదస్సుకు దేశాధినేతలు, విశిష్ట అతిథులు
న్యూఢిల్లీ: బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సుకు కూటమి దేశాల అధినేతలతోపాటు పలువురు విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. శనివారం నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఈజిప్ట్ అధినేత అబ్దెల్ ఫతాహ్ ఎల్–సిసీ, ఇండోనేíసియా ప్రెసిడెంట్ ప్రబొవో సుబియాంతో, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ, మలేíసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, సౌదీ అరేబియా యువరాజు ఫైజల్ బిన్ ఫర్హాన్ అలీ సౌద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బ్రెజిల్ విదేశీ వ్యవహారాల మంత్రి మౌరో వియేరా పాల్గొనబోతున్నారు. అలాగే ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో, నైజీరియా ఉపాధ్యక్షుడు సెనేటర్ కాషిమ్ షెట్టిమా, క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగెజ్ పారిల్లా, బెలారస్ విదేశాంగ మంత్రి మాక్సిమ్ రిజెన్కోవ్, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హంగ్ మరియు కజకిస్తాన్ అధ్యక్షుడు కాస్సిమ్–జోమార్ట్ టోకాయెవ్ సైతం హాజరు కాబోతున్నారు. బ్రిక్స్ కూటమిలో గత ఏడాది బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేíసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా మారాయి. -
బ్రిక్స్ అతిథులకు ‘దేశీ’ విందు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే దేశాధినేతలకు, విశిష్ట అతిథులకు భారతీయ సంప్రదాయ వంటకాలను వడ్డించేందుకు కేంద్ర ప్రభుత్వం, నగరంలోని హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల అభిరుచులకు అనుగుణంగా ఆహార మెనూను రూపొందించాయి. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ దేశీ, విదేశీ రుచుల కలయికతో వంటకాలను సిద్ధం చేస్తున్నాయి. సిరిధాన్యాలతో వంటకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్న సిరిధాన్యాలతో (బాజ్రా, జొన్న, రాగి) కూడిన వంటకాలకు మెనూలో ప్రత్యేక స్థానం కల్పించారు. రాగి దోశ, బాజ్రా ఉప్మా, మిల్లెట్ పొంగల్‌తో పాటు సీజనల్ పండ్లు, కొబ్బరి నీళ్లు, తాజా మజ్జిగను అల్పాహారంగా అందించనున్నారు. మధ్యాహ్న భోజనంలో గుజరాతీ, రాజస్తానీ, దక్షిణ భారతీయ థాలీలను ఏర్పాటు చేశారు. కశ్మీరీ పులావ్, దక్కనీ తడ్కా, హైదరాబాదీ వెజ్, నాన్‌వెజ్ బిర్యానీ, సౌత్ ఇండియన్ సాంబార్ ఈ మెనూలో ఉన్నాయి. విదేశీ ప్రతినిధుల డైట్‌ను దృష్టిలో ఉంచుకుని నూనె, మసాలాలు లేని కస్టమైజ్డ్ కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ కోసం లైవ్ కుకింగ్ కౌంటర్లు కూడా అందుబాటులో ఉంచారు. జైశంకర్ ఆధ్వర్యంలో ‘దేశ్ కీ థాలీ’ బ్రిక్స్ సదస్సు జరుగునన్న ‘భారత్ మండపం’లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విదేశీ ప్రతినిధులకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాలకు చెందిన నలభీములు ‘దేశ్ కీ థాలీ’ని సిద్ధం చేయబోతున్నారు. దేశాధినేతల కోసం లక్నోవీ కబాబ్, తందూరీ వంటకాలు, స్లో కుక్డ్ గ్రేవీ వంటకాలను ప్రత్యేకంగా వడ్డిస్తారు. వారి మతపరమైన ప్రాధాన్యతలు, వ్యక్తిగత అభిరుచులను దృష్టిలో పెట్టుకొని శాకాహార, మాంసాహార వంటకాల తయారీ కోసం వేర్వేరు సెక్షన్లు, ప్రత్యేక కిచెన్లను ఏర్పాటు చేశారు. ల్యాబ్‌లో ఆహార పదార్థాల పరీక్షలు బ్రిక్స్ సదస్సులో అతిథులకు వడ్డించే ఆహారం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడడం లేదు. ఆహార నాణ్యత, పరిశుభ్రతపై భారత ఆహార భద్రత, నాణ్యాతా ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) పకడ్బందీ చర్యలు చేపట్టింది. హోటళ్లలో వంటలకు వాడే ముడిసరుకులు, సుగంధ ద్రవ్యాలు, బేకరీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు. అతిథులకు వడ్డించే ముందు ఆహార నాణ్యతను తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, మైక్రోబయాలజిస్టులను నియమించారు. ఐదు నక్షత్రాల హోటళ్లలో బస సదస్సుకు హాజరవుతున్న అతిథుల బస కోసం ఢిల్లీలోని ల్యుటియెన్స్లో ఉన్న తాజ్‌మహల్ హోటల్, తాజ్ ప్యాలెస్, ఐటీసీ మౌర్య, ద లీలా ప్యాలెస్, ద ఒబెరాయ్, షాంగ్రిలా, ద లలిత్ తదితర ఫైవ్ స్టార్ హోటళ్లలో వీవీఐపీ బ్లాక్‌లను కేటాయించారు. రష్యా, చైనా, యూఏఈ, దక్షిణాఫ్రికా తదితర దేశాల ప్రభుత్వ, వ్యాపార ప్రతినిధులకు ద లలిత్ హోటల్లో బస కల్పించారు. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్‌్ట, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాల అగ్రనేతలు, దౌత్యవేత్తలకు ఐటీసీ మౌర్య, తాజ్‌మహల్, ద లీలా ప్యాలెస్ హోటళ్లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాలదే: మోదీ
ఢిల్లీ: ప్రపంచ జీడీపీలో 40 శాతం బ్రిక్స్ దేశాలదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ఆయన ప్రసంగిస్తూ.. బ్రిక్స్ 4 దేశాలతో మొదలై 21 దేశాలకు చేరిందన్నారు. ప్రపంచ జనాభాలో 50 శాతం బ్రిక్స్ దేశాలదే. బ్రిక్స్ కూటమి ప్రపంచంలో సగం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుంది, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు భారత్ పరిష్కారం చూపిస్తుందన్నారు.బ్రిక్స్ జీడీపీ 4.5 శాతం పెరిగింది. సుస్థిరాభివృద్ధి, సహకారం, ఇన్నోవేషన్స్‌కి బ్రిక్స్ దేశాలు ఆలంబనగా నిలుస్తున్నాయి. రోడ్డు, రైళ్లు, ఎయిర్‌పోర్టుల వంటి మౌలిక సదుపాయాల్లో భారత్ వేగంగా విస్తరిస్తోందని మోదీ అన్నారు. -
ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ
ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో అడుగుపెట్టారు. 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. భారత్ మండపంలో ఇవాళ(శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ భేటీ అయ్యారు. భారత్, రష్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిపారు. కీలక రక్షణ ఒప్పందాలు, వ్యాపారం, వాణిజ్యం, భద్రత, ఎల్ఎన్జీ దిగుమతి, అధునాతన యుద్ధ విమానాల తయారీ సాంకేతికత బదిలీ తదితర అంశాలపై చర్చించారు. రెండు నెలల్లోనే రెండోసారి ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పుతిన్‌కు మోదీ కానుకద్వైపాక్షిక భేటీలో పుతిన్‌కు రష్యన్ భాషలో అనువదించిన ఓ పుస్తకాన్ని ప్రధాని మోదీ కానుకగా అందించారు. తమిళ కవి తిరువళ్లువరు రచించిన ‘తిరుక్కురళ్’ పుస్తకాన్ని అందజేశారు. పుతిన్ మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. వార్షిక బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. కాగా, బ్రిక్స్ సదస్సుకు షీ జిన్‌పింగ్ హాజరు కాబోతున్నారని చైనా ప్రభుత్వ మీడియాతోపాటు భారత విదేశాంగ శాఖ నిర్ధారించింది.జిన్‌పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. బ్రిక్స్–2026 శిఖరాగ్ర సదస్సుకు అంతా సిద్ధం అంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సదస్సు జరిగే ‘భారత్ మండపం’దృశ్యాలు, ఏర్పాట్లతో కూడిన 30 సెకండ్ల వీడియో క్లిప్‌ను సైతం షేర్ చేశారు.ఇదీ చదవండి:బ్రిక్స్‌తో మనకు లాభాలున్నాయండోయ్..! -
జిన్‌పింగ్ భారత్ పర్యటనపై సస్పెన్స్.. చైనా వ్యూహం ఇదేనా?
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు బీజింగ్ చివరి నిమిషంలో అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా అందరి చూపూ మోదీ-జిన్‌పింగ్ భేటీపై పడింది. అసలు ఇంత కీలకమైన పర్యటనను చైనా చివరి వరకు ఎందుకు సస్పెన్స్‌లో పెట్టింది? ఇదే ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.2019లో మహాబలిపురం అనధికారిక సమావేశం తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. గాల్వాన్ ఘర్షణ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలు ఇటీవల క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, జిన్‌పింగ్ పర్యటనకు కేవలం 48 గంటల ముందే అధికారిక ప్రకటన రావడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.చివరి నిమిషం వరకు ఎందుకు?జిన్‌పింగ్ పర్యటనను ఆలస్యంగా ప్రకటించడం వెనుక ఎలాంటి అనిశ్చితి లేదని.. ఇది చైనా అనుసరించే దౌత్య వ్యూహంలో భాగమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సదస్సుకు ముందు జరిగే చర్చల్లో తనకు గరిష్ఠ స్థాయి వెసులుబాటు ఉండేలా బీజింగ్ వ్యవహరించిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. బ్రిక్స్ డిక్లరేషన్, సదస్సు అజెండా, మోదీ-జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ వంటి కీలక అంశాలపై చివరి వరకు చర్చలు కొనసాగించేందుకు ఈ సస్పెన్స్ చైనాకు ఉపయోగపడిందనే విశ్లేషణలు ఉన్నాయి.NOW:🇨🇳🤝🇮🇳 Chinese President Xi Jinping is coming to India for the first time post Covid for BRICS summit. pic.twitter.com/8CkwJ8MeLu— RealWestern (@RealWestern2003) September 11, 2026భేటీలో ఏం జరుగుతుంది?అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మోదీ-జిన్‌పింగ్ భేటీలో సరిహద్దు పరిస్థితి, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గాల్వాన్ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా తొలగిపోలేదు. దీంతో ఈ సమావేశంలో ఇరువురు నేతలు ఇచ్చే సంకేతాలు అత్యంత కీలకం కానున్నాయి.బ్రిక్స్ వేదికగా చైనా మరో వ్యూహంబ్రిక్స్లో ఇప్పుడు 11 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సు ద్వారా గ్లోబల్ సౌత్‌లో తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా కీలక దేశాల నేతలు పాల్గొంటున్న నేపథ్యంలో జిన్‌పింగ్ హాజరు చైనా దౌత్యానికి కూడా కీలకమే. అందుకే చివరి నిమిషం వరకు సస్పెన్స్.. ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడినట్టు తెలుస్తోంది. జిన్‌పింగ్ భారత్ పర్యటన వెనుక అసలు ఫోకస్ బ్రిక్స్ సదస్సేనా? లేక మోదీతో కీలక ద్వైపాక్షిక డీల్‌కు రంగం సిద్ధమైందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్ -
పిల్లలు పుట్టడం లేదని టెస్టులకు వెళ్తే.. లోపల గర్భాశయం!
పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన ఓ 26 ఏళ్ల వ్యక్తికి.. వైద్య పరీక్షల్లో ఊహించని విషయం బయటపడింది. సాధారణంగా పురుషుల్లో ఉండని గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి అవయవాలు అతడి శరీరంలో ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. అంతేకాదు.. రెండు వృషణాలు కూడా సాధారణ స్థానంలో లేకపోవడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఇన్ఫెర్టిలిటీకి కారణమేంటో తెలుసుకునేందుకు చేసిన పరీక్షలతో ఈ అరుదైన పరిస్థితి వెలుగులోకి వచ్చింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడికి వీర్యంలో శుక్రకణాలు పూర్తిగా లేకపోవడం (అజూస్పెర్మియా) గుర్తించారు. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో గర్భాశయంతోపాటు ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి ముల్లెరియన్ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. దీనిని పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ (PMDS)గా నిర్ధారించారు.అసలు PMDS అంటే ఏమిటి?మగ శిశువు గర్భంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు.. వృషణాల నుంచి ఉత్పత్తయ్యే యాంటీ-ముల్లెరియన్ హార్మోన్ (AMH) ప్రభావంతో ముల్లెరియన్ డక్ట్స్ అనే ప్రారంభ నిర్మాణాలు సాధారణంగా కనుమరుగవుతాయి. అయితే ఈ హార్మోన్ తగినంతగా ఉత్పత్తి కాకపోవడం లేదంటే దానికి శరీరం సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఈ నిర్మాణాలు అలాగే ఉండిపోవచ్చు. దీంతో జన్యుపరంగా పురుషుడైన వ్యక్తిలో సాధారణ పురుష బాహ్య జననాంగాలు ఉన్నప్పటికీ.. శరీరం లోపల గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి అవయవాలు ఉండొచ్చు. ఈ అరుదైన పరిస్థితినే పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ అంటారు.పిల్లలు కలగకపోవడానికి కారణమేంటి?ఈ కేసులో ప్రధానంగా గుర్తించిన సమస్య.. వృషణాలు సాధారణ స్థానంలో లేకపోవడం. సాధారణంగా వృషణాలు శరీరం బయట ఉండే సంచిలో ఉంటాయి. అక్కడి ఉష్ణోగ్రత శరీరం లోపల కంటే కొంత తక్కువగా ఉంటుంది. శుక్రకణాల ఉత్పత్తికి ఈ పరిస్థితి అవసరం. అయితే వృషణాలు పొత్తికడుపులో లేదంటే గజ్జల ప్రాంతంలోని మార్గంలోనే ఉండిపోతే.. శుక్రకణాల ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితినే అన్‌డిసెండెడ్ టెస్టిస్ అంటారు. పీఎండీఎస్లో ఇది తరచుగా కనిపించే లక్షణాల్లో ఒకటి. అలాగని PMDS ఉన్న ప్రతి వ్యక్తికీ సంతానలేమి ఉంటుందని చెప్పలేం. వృషణాల పనితీరు, శుక్రకణాల ఉత్పత్తి, పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు వంటి అంశాలపై సంతాన సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.చికిత్స ఎలా ఉంటుంది?వీర్యంలో శుక్రకణాలు కనిపించని సందర్భాల్లో.. వృషణాల్లో శుక్రకణాలు ఉత్పత్తి అవుతున్నాయా? అనే విషయాన్ని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైతే వృషణాల నుంచి నేరుగా శుక్రకణాలను సేకరించే ప్రయత్నం చేస్తారు. శుక్రకణాలు లభిస్తే ఐవీఎఫ్, ఐసీఎస్ఐ వంటి సహాయక పునరుత్పత్తి విధానాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. కొన్ని కేసుల్లో వృషణాల పనితీరు సరిగా లేకపోతే.. ఇతర సంతానోత్పత్తి మార్గాలను కూడా వైద్యులు సూచించవచ్చు. పీఎండీఎస్ ఉన్న కొందరు పురుషుల్లో సంతానోత్పత్తి సాధ్యమేనని వైద్య కేసు నివేదికలు చెబుతున్నాయి. చాలా అరుదైన పరిస్థితిపీఎండీఎస్ చాలా అరుదైన వైద్య పరిస్థితి. కొందరిలో చిన్న వయసులోనే వృషణాలు కిందికి దిగకపోవడం లేదంటే గజ్జల్లో హెర్నియా వంటి సమస్యల కారణంగా ఇది బయటపడుతుంది. మరికొందరిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకపోవడంతో.. పెద్దయ్యే వరకు గుర్తించకపోవచ్చు. సంతానలేమి కోసం పరీక్షలు చేయించుకున్నప్పుడు అనుకోకుండా నిర్ధారణ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితిని కేవలం ‘వింత’గా చూడకుండా.. వృషణాల పనితీరు, హార్మోన్లు, జన్యు కారణాలు, పునరుత్పత్తి వ్యవస్థను పూర్తిగా పరిశీలించాల్సి ఉంటుంది. సరైన సమయంలో గుర్తిస్తే సంతానోత్పత్తి అవకాశాలను కాపాడేందుకు, భవిష్యత్ ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించేందుకు చికిత్సా మార్గాలను ఎంచుకోవచ్చు. ఇదీ చదవండి: ఫాస్ట్‌గా తింటున్నారా? అయితే ఇది మీకోసమే! -
బ్రిక్స్ సదస్సు.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీ: 18 అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సుకు భారత్ అతిథ్య నివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12,13 ఢిల్లీలోని భరత మండపంలో జరిగే ఈ సదస్సుకు ప్రపంచ అగ్రనేతలతో పాటు విదేశీ ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఢిల్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అత్యంత కఠిన ఆంక్షలు విధించనుంది. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గాల మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి.రేపు బ్రిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నేటి నుంచి (శుక్రవారం) ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడిచే, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆ రోజు పనిచేయవు. వారాంతం అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఢిల్లీ మెట్రో సేవలు కొనసాగింపుఅయితే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైలు సేవలు పూర్తిగా నిలిపివేయడం లేదు. నగరవ్యాప్తంగా మెట్రో సేవలు కొనసాగుతాయి. అయితే సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్‌లోని ఢిల్లీ మెట్రో మ్యూజియాన్ని సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూసివేయనున్నారు. 35కుపైగా రహదారులపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విదేశీ ప్రముఖులు, వీవీఐపీల కాన్వాయ్‌ల రాకపోకల కోసం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 4,800 మంది ట్రాఫిక్ సిబ్బందిని విధుల్లో మోహరించారు. వీవీఐపీ రాకపోకలు, కాన్వాయ్ రిహార్సల్స్ సమయంలో 22 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.మథురా రోడ్, సర్దార్ పటేల్ మార్గ్, శాంతి పథ్, జనపథ్, అశోకా రోడ్, బరాఖంబా రోడ్, టాల్‌స్టాయ్ మార్గ్, ఆఫ్రికా అవెన్యూ రోడ్, నీతి మార్గ్, ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ తదితర 35కుపైగా రహదారులపై వివిధ సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు లేదా మళ్లింపులు ఉండవచ్చని అధికారులు తెలిపారు.బస్సులు, క్యాబ్‌లకు మార్గ మళ్లింపులుసదస్సు జరిగే రోజుల్లో పరిస్థితిని బట్టి బస్సుల రూట్లను మళ్లించడం లేదా కొంతకాలం నియంత్రించడం జరగవచ్చని అధికారులు పేర్కొన్నారు. క్యాబ్ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసరం కాని ప్రయాణాలను ముందుగా ప్లాన్ చేసుకోవాలని, బయలుదేరే ముందు తాజా ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించాలని ఢిల్లీ వాసులకు అధికారులు సూచించారు. -
భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ
ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో ఆయన భారత్ పర్యటన సాగుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు, అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల ప్రభావం వంటి అంశాలు ఈసారి బ్రిక్స్ సదస్సులో కీలకంగా మారనున్నాయి.మోదీ–పుతిన్ భేటీలో కీలక అంశాలుపుతిన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఔషధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ భేటీలో ప్రధానంగా ఉండనుంది.President Putin arrives in New Delhi:Government Il-96 landed at the base of the air force of the Republic of Palam.(3:54 am, Delhi time)NEW DELHI, September 11. /TASS/. Russian President Vladimir Putin arrived in India, in the capital of which New Delhi the BRICS summit… https://t.co/K9ZBz6ZsHk pic.twitter.com/tnM4Q7pHIM— ⏳Towhee 🌏☮️ (@amborin) September 10, 2026రక్షణ రంగంలో బ్రహ్మోస్ క్షిపణి ఆధునికీకరణపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. రష్యా నుంచి భారత్‌కు మిగిలిన ఎస్–400 వ్యవస్థల సరఫరా, సు–57 యుద్ధ విమానాల ప్రతిపాదిత సరఫరాపైనా చర్చలు జరగనున్నాయి. భారత్‌లో కొత్త సివిల్ న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుపైనా ఇరు దేశాలు చర్చించనున్నట్లు సమాచారం.ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్పింగ్పుతిన్ మాత్రమే కాదు బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా హాజరుకానున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. వాణిజ్యం, పెట్టుబడులతోపాటు ఇరు దేశాల సంబంధాలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని కూడా నేతలు సమీక్షించే అవకాశం ఉంది.పశ్చిమాసియా సంక్షోభం.. బ్రిక్స్‌కు సవాల్ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బ్రిక్స్ సదస్సుకు కీలక సవాల్‌గా మారాయి. ముఖ్యంగా ఇరాన్, యూఏఈ మధ్య విభేదాల నేపథ్యంలో కూటమి ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం అంతర్జాతీయ చమురు వాణిజ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై బ్రిక్స్ నేతలు చర్చించనున్నారు. ఇదే సమయంలో అమెరికా వాణిజ్య, సుంకాల విధానాలు కూడా బ్రిక్స్ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ పాలనలో బహుపాక్షిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై భారత్ తన అధ్యక్ష హోదాలో దృష్టి పెట్టనుంది.విస్తరించిన బ్రిక్స్.. పెరిగిన ప్రాధాన్యంబ్రిక్స్లో తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఉండేవి. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా కూటమిలో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, హైటెక్నాలజీతోపాటు ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారం, ఇంధనం, విపత్తుల నిర్వహణ, సరఫరా వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం ఈ సదస్సు ప్రధాన అజెండాలో ఉంది.రెండు రోజులపాటు కీలక భేటీలుభారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు సదస్సు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బ్రిక్స్ నేతలు రాజకీయాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సహకారం, సాంస్కృతిక, మానవతా సంబంధాలపై చర్చిస్తారు. ఆదివారం విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను విడుదల చేయడంతో సదస్సు ముగియనుంది.బ్రిక్స్ వేదికపై అధికారిక సమావేశాలతోపాటు నేతల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలపైనా ఆసక్తి నెలకొంది. పుతిన్‌తో మోదీ భేటీ, ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మోదీ చర్చలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తంగా.. ఒకవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ పరిణామాలు, వాణిజ్య యుద్ధాల ప్రభావం వంటి కీలక అంతర్జాతీయ సవాళ్ల మధ్య ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పుతిన్–మోదీ భేటీతోపాటు భారత్ వేదికగా జరిగే ఇతర ద్వైపాక్షిక చర్చలు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇదీ చదవండి: మిస్టర్ సింగ్.. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ల్యాండ్ -
ముంబై పేలుళ్ల కేసు.. అబూ సలేంకు సుప్రీంకోర్టు ఝలక్!
న్యూఢిల్లీ: ముంబై 1993 వరుస పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేం ముందస్తు విడుదలకు చేసిన ప్రయత్నానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. 25 ఏళ్ల జైలు శిక్షను ఇప్పటికే పూర్తి చేశానంటూ సలేం దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బాంబే హైకోర్టు ఏప్రిల్ 2026లో ఇచ్చిన తీర్పును సమర్థించింది.పోర్చుగల్ నుంచి భారత్‌కు అప్పగించే సమయంలో అక్కడి ప్రభుత్వానికి భారత్ ఇచ్చిన హామీని సలేం తన పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించాడు. తనను భారత్‌కు అప్పగిస్తే మరణశిక్ష విధించబోమని, అలాగే 25 ఏళ్లకు మించి జైలులో ఉంచబోమని 2002లో భారత్ హామీ ఇచ్చిందని పేర్కొన్నాడు. 2005 నవంబర్ 11న అతడిని పోర్చుగల్ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. తాను విచారణ ఖైదీగా గడిపిన కాలం, శిక్ష అనుభవించిన కాలం, మంచి ప్రవర్తనకు లభించిన రిమిషన్ అన్నింటినీ కలిపితే 2025 మార్చి 31 నాటికే 25 ఏళ్లు పూర్తయ్యాయని సలేం వాదించాడు. అందువల్ల ఇకపై తనను జైలులో ఉంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ముందస్తు విడుదల కోరాడు.అయితే, ఈ వాదనను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. సలేం పిటిషన్ ముందుగానే దాఖలైందని, 25 ఏళ్ల వ్యవధి 2030లో పూర్తవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో సలేం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. గతంలో 2022లో ఇదే అంశంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. సలేం 25 ఏళ్ల జైలు కాలాన్ని పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అతడి ముందస్తు విడుదలను నిర్ధారించాలని పేర్కొన్నప్పటికీ.. అతడి శిక్షను కమ్యూట్ చేయడం లేదని స్పష్టం చేసింది. పోర్చుగల్‌లో పాస్‌పోర్టు మోసం కేసులో గడిపిన జైలు కాలాన్ని 25 ఏళ్ల వ్యవధిలో లెక్కించరాదని కూడా తేల్చింది.కాగా, అబూ సలేం 2002లో పోర్చుగల్‌లో అరెస్టయ్యాడు. 1993 ముంబై పేలుళ్ల కేసుతో పాటు మరో టాడా కేసులో అతడికి వరుసగా 2015, 2017లో జీవిత ఖైదు పడింది. ఈ నేపథ్యంలో 2025కే 25 ఏళ్లు పూర్తయ్యాయన్న అబూ సలేం వాదనను సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించడంతో.. తక్షణ విడుదలకు అతడి ప్రయత్నాలకు మరోసారి బ్రేక్ పడింది.ఇదీ చదవండి: తమిళనాడులో సంచలనం.. స్టాలిన్‌కు బంపరాఫర్ -
12న మోదీ-జిన్‌పింగ్ భేటీ!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య సెప్టెంబరు 12న న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సు సందర్భంగా భేటీ జరిగే అవకాశముంది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం ఇరువురు నేతలు ముఖాముఖిగా ద్వైపాక్షిక చర్చలు జరపడం ఇదే తొలిసారి కానుంది. అయితే ఈ భేటీపై భారత్, చైనా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబరు 12, 13 తేదీల్లో భారత్ ఆతిథ్యంలో జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు జిన్‌పింగ్ శనివారం న్యూఢిల్లీకి రానున్నారు. ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇటీవల కిర్గిజిస్థాన్లోని బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో మోదీ, జిన్‌పింగ్ కలుసుకుని కరచాలనం చేసినప్పటికీ, అధికారిక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించలేదు.జిన్‌పింగ్ పర్యటనకు ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) సమావేశం కూడా జరిగింది. అనంతరం సరిహద్దు అంశంపై ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధులు చర్చించారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పలు ఘర్షణ ప్రాంతాల నుంచి సైన్యాల ఉపసంహరణతో సంబంధాల్లో క్రమంగా స్థిరత్వం కనిపిస్తోంది.2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. చైనా తన నలుగురు సైనికులు మరణించినట్లు తర్వాత వెల్లడించింది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య సైనిక ప్రతిష్ఠంభన, రాజకీయ, ఆర్థిక, దౌత్య సంబంధాల్లో తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. సైనిక, దౌత్య చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ విస్తృత సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారం కాలేదు.అరుణాచల్‌ప్రదేశ్ అంశం కూడా ఇరు దేశాల మధ్య కీలక వివాదంగా కొనసాగుతోంది. మొత్తం అరుణాచల్‌ను చైనా ‘జాంగ్నాన్’ లేదా దక్షిణ టిబెట్‌గా పేర్కొంటూ హక్కు కోరుతోంది. భారత్ ఆ వాదనను తిరస్కరిస్తూ అరుణాచల్‌ప్రదేశ్ దేశంలో అంతర్భాగమని స్పష్టం చేస్తోంది. ఇటీవల అప్పర్ సుబన్సిరి ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు, దూకుడు వైఖరిపై వచ్చిన నివేదికలు ఆందోళన పెంచాయి.మోదీ-జిన్‌పింగ్ భేటీలో సరిహద్దు సమస్య, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు, ఎల్ఏసీ వెంబడి మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు చర్చకు వచ్చే అవకాశముంది. బ్రిక్స్ సహా బహుపాక్షిక వేదికల్లో సహకారం పెంపుపైనా ఇరువురు నేతలు దృష్టి సారించే అవకాశం ఉంది. -
బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపనుంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ఎదురైన పరిణామాలను జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటు మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేయించబోతోంది.సభ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ ఈ అసెంబ్లీ సమావేశాల సెషన్ నుంచి 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గురువారం ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో వాళ్లంతా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపాలని నిర్ణయించారు. అసెంబ్లీ వద్ద పోలీసులు దాడి చేశారని.. తమతో అనుచితంగా ప్రవర్తించారని ఎన్హెచ్ఆర్సీతో పాటు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయయనున్నారు. అలాగే హోం శాఖపైనా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. తెలంగాణ హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ వద్దే ఉన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ పరిణామాలకు సంబంధించిన ఫొటో, వీడియో ఫుటేజీలను ఇప్పటికే ఆ పార్టీ బహిరంగంగా ప్రదర్శించింది. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫొటోలు నకిలీవంటూ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ సాయంత్రానికే సబిత, సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలో మహిళా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: స్మార్ట్ రేషన్ కార్డ్‌లో అన్నీ తప్పులే! -
సీజేపీ నేతలు దీప్కే, ఆశుతోష్, సౌరవ్‌పై రూ.2 కోట్లకు దావా
కాక్రోచ్ జనతా పార్టీ, ఆ పార్టీ నేతలు అభిజీత్ దీప్కే, ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌పై ఢిల్లీ హైకోర్టులో బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని చెప్పారు.భాటియా నష్టపరిహారంగా రూ.2 కోట్లు చెల్లించాలని, తనకు సంబంధించిన పరువు నష్టం కలిగించే సమాచారాన్ని ప్రచురించడం, తిరిగి పోస్టు చేయడం, ప్రసారం చేయకుండా ప్రతివాదులను ఆదేశించాలని కోర్టును కోరారు. సామాజిక మాధ్యమాల నుంచి వివాదాస్పద సమాచారాన్ని తొలగించాలని కూడా ఆయన కోరారు.స్వతంత్ర భరద్వాజ్‌కు సంబంధించి భాటియా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంటూ కృత్రిమ మేధస్సుతో రూపొందించిన గ్రాఫిక్‌ను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రచారం చేయడంతో వివాదం మొదలైందని దావాలో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని భాటియా ఖండించి, పోస్టును తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సౌరవ్ దాస్‌ను కోరారు.సౌరవ్ దాస్ ఆ పోస్టును తొలగించి, అది కృత్రిమ మేధస్సుతో రూపొందించిన గ్రాఫిక్ అని తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసినట్లు దావాలో పేర్కొన్నారు. అయితే ఆ సమాచారం ఇతరులు కూడా ప్రచారం చేశారని భాటియా ఆరోపించారు. ఆశుతోష్ రాంకా కూడా దాస్ ఖాతా నుంచి ఆ గ్రాఫిక్‌ను తిరిగి పోస్టు చేసి, భారతీయ జనతా పార్టీ నేతలను ఎగతాళి చేసే కామెంట్‌ను జత చేసినట్లు దావాలో ఆరోపించారు.ఉద్దేశపూర్వకంగా ప్రచారం!తనపై తప్పుడు, కల్పిత, తప్పుదోవ పట్టించే, పరువు నష్టం కలిగించే సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురించి ప్రసారం చేశారని భాటియా ఆరోపించారు. ఆ పోస్టుల్లో ఒకదాన్ని ప్రచురించిన కొద్దిసేపటికే 1.32 లక్షలకు పైగా మంది చూశారని దావాలో పేర్కొన్నారు. ఈ ప్రచారం తన ప్రతిష్ఠ, వృత్తిపరమైన స్థాయిపై ప్రతికూల ప్రభావం చూపిందని భాటియా తెలిపారు.సౌరవ్ దాస్ గతంలో ఉమర్ ఖలీద్, న్యాయవ్యవస్థపై చేసినట్లు ఆరోపించిన కొన్ని పోస్టులను కూడా దావాలో ప్రస్తావించారు. నిర్దిష్ట న్యాయ వ్యవహారంపై న్యాయమైన విమర్శల పరిధిని ఆ పోస్టులు దాటి న్యాయవ్యవస్థపై విస్తృత దాడిగా మారాయని భాటియా ఆరోపించారు.రిజిస్టర్‌కాని సంఘం పేరుతో ప్రతివాదులు న్యాయవ్యవస్థ సహా రాజ్యాంగ సంస్థలకు వ్యతిరేకంగా సమాచారాన్ని ప్రచురిస్తూ, ప్రసారం చేస్తున్నారని దావాలో ఆరోపించారు. అయితే ఇవన్నీ పౌర దావాలో చేసిన ఆరోపణలే. వాటిపై ఢిల్లీ హైకోర్టు ఇంకా విచారణ జరిపి నిర్ణయం తీసుకోలేదు. -
ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్ నోట్
ఢిల్లీ మాజీ ప్రధాన కార్యదర్శి, 74 ఏళ్ల రాకేష్ మెహతా (Rakesh Mehta) నోయిడాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 1975 బ్యాచ్ IAS అధికారి అయిన మెహతా దివంగత మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో పనిచేశారు. తన నిర్ణయానికి అనారోగ్యం ,మానసిక సమస్యలే కారణమని పేర్కొంటూ రాసిన ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 6న ఆయన మృతదేహం లభ్యమైంది. ఆదివారం నాడు ఆయన అంత్యక్రియలు జరిగాయి.ఆయన ఢిల్లీ ప్రభుత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కమిషనర్‌తో సహా వివిధ హోదాల్లో పనిచేశారు. 2007లో ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, మూడేళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగారు. రాజధాని నగరంలో రవాణా, విద్యుత్ మరియు పౌర మౌలిక సదుపాయాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీకాలంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ విజయవంతంగా నిర్వహించారు. -
ఇవి అచ్చంగా హత్యలే!
పీడలా వెంటాడుతున్న పేదరికంనుంచి తప్పించుకుందామని... మెరుగైన జీవితాన్ని అందుకుందామని చదువుల కోసం, కోచింగ్ కోసం, చిన్నా చితకా కొలువుల కోసం దేశ రాజధాని నగరం వచ్చే లక్షలమంది యువతకు అక్కడ అడుగడుగునా మృత్యువు పొంచివుంటుందని తెలియదు. బడాయి కబుర్లుచెప్పి గద్దెలెక్కే నేతలకు ఇలాంటివేమీ పట్టవని అసలే తెలియదు. అందుకే ఆదివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి కుప్పకూలిన ఢిల్లీ సత్యనికేతన్ కాలనీ పీజీ హాస్టల్లో ఏడుగురు యువకులు తనువు చాలించారు. శిథిలాల్లో చిక్కుకున్నవారు మమ్మల్ని కాపాడండని ఆర్తనాదాలు చేస్తున్నా అవి అరణ్యరోదనలే అయ్యాయి. ఆలస్యంగా మొదలైన సహాయక చర్యల్లో కొందరు ప్రాణాలతో బయటపడినా తీవ్ర గాయాలపాలయ్యారు. ఢిల్లీకి ఇలాంటి విషాదకర ఉదంతాలు కొత్తగాదు. గత పదేళ్లకాలంలో చూసుకున్నా వీటి సంఖ్య ఎక్కువే. మొన్నటికి మొన్న మే నెలాఖరు, జూన్ మొదటివారం మధ్య రెండుచోట్ల ఇటువంటివే చోటు చేసుకున్నాయి. అయిదంతస్తుల భవంతి కూలిన ఘటనలో ఆరుగురు మరణించగా,20 మంది గాయపడ్డారు. మరో మూడు రోజులకు ఒక హోటల్ మంటల్లో చిక్కుకుని 23 మంది మరణించారు. అక్కడ ఆరు గదులకు అనుమతి తీసుకుని ఏకంగా 26 గదులు నిర్మించి అద్దెకిచ్చారు. కుప్పకూలేందుకు సిద్ధంగా ఉండే భవంతుల్ని పోల్చుకోవటం పెద్ద కష్టం కాదు. అవేమీ బయటకు రాజమహళ్ల మాదిరిగా కనబడవు. నాచుపట్టిన గోడలతో, పెచ్చులూడిపడుతూ, కరెంటు వైర్లు వేలాడుతూ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతూ ఉంటాయి. లోపలికెళ్తే ఇరుకిరుకు గదులు, విరగడానికి సిద్ధంగా ఉండే మంచాలు, టేబుళ్లు, పెద్దగా ధ్వని చేసుకుంటూ ఎప్పుడు మీదపడతాయో తెలియని ఫ్యాన్లు దర్శనమిస్తాయి. ఎక్కడికక్కడ నల్లా గొట్టాలు చిట్లి నీళ్లు లీకవుతుంటాయి. కానీ ఓట్ల కోసం ఇల్లిల్లూ తిరిగే నాయకులకు ఇవేమీ కనబడవు. గెలిచాక అసలే పట్టవు. అధికార గణానికీ, సిబ్బందికీ ఇలాంటి భవంతులు అదనపు ఆదాయ మార్గాలు. వివిధ పట్టణాల్లో, నగరాల్లో చదువుల్లో టాపర్లుగా ఉంటూ, పోటీ పరీక్షల్ని సునాయాసంగా గెలుచుకునే పిల్లలు ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 90 కళాశాలల్లో చేరడానికి వస్తారు. వీటిల్లో చేరే లక్షన్నరమందిలో అత్యధికులు బయటివారే. కానీ కేవలం 20 కళాశాలలకు మాత్రమే హాస్టల్ సదుపాయం ఉంది. అవి 3,000 మందికి మించి చోటిచ్చే అవకాశం ఉండదు. ఢిల్లీలో రాష్ట్ర, కేంద్ర పరిధుల్లోని యూనివర్సిటీలు, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు మొత్తంగా 38 ఉంటాయి. వీటిల్లో 5 లక్షలమంది విద్యార్థులుంటే ఇందులో మూడింట రెండొంతులమంది బయటివారే. దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తోందని గంభీరోపన్యాసాలిచ్చే వారికి ఇవేమీ కనబడవు. కనీసం నెలకు పదో పదిహేనో భవంతుల్ని తనిఖీ చేసి నివాసయోగ్యం కాని, అగ్నిప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నవాటిని గుర్తించి తక్షణం ఖాళీ చేయించేలా తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉండదు. పదే పదే చోటుచేసుకునే ఉదంతాల్ని చూశాకైనా కళ్లు తెరవాలని తోచదు. ఒకప్పుడు జనావాసంగా ఉన్న ఈ ప్రాంతంలో అనేక ప్రైవేటు హాస్టళ్లకు అనుమతించారు. ఈ మహానగరంలో మనుగడ సాగించటానికి ఉన్నంతలో అవే దిక్కని మధ్యతరగతి, దిగువమధ్యతరగతి పిల్లలు వస్తారు. కానీ అవి సురక్షితమో కాదో, కట్టడం నాణ్యత ఏ మేరకుందో చూసే నాథుడుండడు. సొమ్ము వచ్చిపడేసరికి ఉదారంగా అనుమతులీయటం ఒక్కటే అధికారులకు తెలుసు. చిత్రమేమంటే... సాధారణ సమయాల్లో వీటిపై ఏమాత్రం శ్రద్ధపెట్టని నేతలు ఏదైనా జరిగాక పరామర్శకొస్తారు. ఇకపై ఇలాంటివి జరగబోవని ఉదారంగా హామీ ఇస్తారు. ఎన్నడో 2007లో రూపొందించిన నిబంధనల్లో ఇలాంటి భవంతుల్ని వెంటవెంటనే గుర్తించి ఖాళీ చేయించాలని ఉన్నా తమకు పట్టింపులేకపోయిందన్న సంగతి తెలియనట్టు ప్రవర్తిస్తారు. ఇంతకూ నలుగురు అధికారుల్ని సస్పెండ్ చేశామని చెప్పడం ఎవర్ని వంచించటానికి? ఇవి ప్రమాదాలు కాదు... అవినీతి, నిర్లక్ష్యం కలగలిసిన పర్యవసానంగా జరిగిన హత్యలు. ఇందుకు బాధ్యత కేవలం ఆ అధికారులదేనా? పాలకులకు జవాబుదారీతనం ఉండదా? -
ఢిల్లీ విషాదం: వారికి 14 రోజుల కస్టడీ, సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: డిల్లీలోని సత్య నికేతన్‌లో భవనం కూలిపోయిన ఘటనలో సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై సెప్టెంబర్ 10న విచారించనుంది. అలాగే ఈ ఘటనపై దాఖలైన అత్యవసర ప్రజాప్రయోజనవ్యాజ్యాన్ని (PIL) ఢిల్లీ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ అధికారుల స్పందనను కోరుతూ పలు మార్గదర్శకాలను, ఆదేశాలను జారీ చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సౌత్ జోన్‌కు చెందిన ఐదుగురు అధికారులను (డిప్యూటీ కమిషనర్ రాకేష్ గుప్తాతో సహా) మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) సస్పెండ్ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఈ హాస్టల్ యజమాని, 81 ఏళ్ల హరిరామ్ గుప్తా, భార్యను పాటియాలా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఇది ఇలా ఉండగా ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టూ ఉన్న ప్రమాదకరమైన భవనాలకు MCD కూల్చివేత నోటీసులు జారీ ప్రక్రియను ప్రారంభించింది. కూలిపోయిన భవనానికి ఆనుకుని ఏ క్షణమైనా కూలిపోయే స్థితిలో ఉన్న మరో భవనంతోపాటు మరికొన్ని భవనాలను పరిశీలిస్తున్నామని MCD సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ఇదీ చదవండి: నో జిమ్, సోషల్ మీడియాను ఊపేస్తున్న కొత్త ఫిట్నెస్ ట్రెండ్?మరోవైపు బాధితులు గాయపడిన వారి కుటుంబాలను రేఖా గుప్తా ఆసుపత్రిలో పరామర్శించారు. చికిత్స ఖర్చును ఎన్సిటి (NCT) ప్రభుత్వమే భరిస్తుందని ఆమె తెలిపారు. ప్రమాదకరమైన మరో భవనాన్ని బుధవారం కూల్చివేస్తామని కూడా ఆమె పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్, కీలక వ్యాఖ్యలుఈ ఘటన అనంతరం పారిపోతున్న పీజీ యజమానిని హరిరామ్ రాజస్థాన్‌లోని భివాడిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓనర్‌తోపాటు, అతని భార్య ఊర్మిళా గుప్తా (75), కుమారుడు మహేష్ గుప్తా (52)లను కూడా అరెస్టు చేశారు.ఇదీ చదవండి: Delhi building collapse జస్ట్ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్! -
ప్రధాని మోదీ పర్యటనకు ముందు కలకలం
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటన సందర్భంగా తీవ్ర కలకలం చెలరేగింది. ప్రధాని పాల్గొనాల్సిన కార్యక్రమంలో ఇద్దరు అగంతకులు చొరబడ్డారు. పీఎంవో అధికారులమంటూ అనుమానాస్పదంగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తుపాకితో పాటు ఫేక్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వేదికగా ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026’ సదస్సు జరగాల్సి ఉంది. ఈ సదస్సును ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రావాల్సి ఉంది. అంతకంటే ముందే రోహన్ పరేఖ్ తాను ప్రధాన మంత్రి కార్యాలయ అధికారినంటూ ఆ ఈవెంట్‌కు వచ్చారు. తనిఖీల్లో భాగంగా అతని వద్ద నకిలీ పీఎంవో ఐడీ కార్డుతో పాటు తుపాకీ లభించడంతో భద్రతా బలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అతనితో పాటు ఉన్న సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన తీవ్రత దృష్ట్యా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లు, గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్నారు.తుపాకులతో, నకిలీ ఐడీలతో నేరుగా ప్రధాని మోదీ హాజరు కావాల్సిన కార్యక్రమానికి ఎందుకు వచ్చారనే అంశంపై లోతుగా విచారణ జరుపుతున్నారు.అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక ఫిన్‌టెక్ సదస్సులలో ఒకటైన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026’ను ముంబైలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన వేళ జరిగిన ఈ భద్రతా లోపం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. -
ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్, కీలక వ్యాఖ్యలు
Delhi building collapse ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ (Sonu Sood)స్పందించారు. ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుండి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు సురక్షితమైన వసతి సౌకర్యాలను కల్పించాలని ఈ సందర్భంగా సోనూ సూద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.Every year, lakhs of students leave their homes to chase a dream in another city. But are we giving them a safe place to live?In Delhi, around 7 lakh students are enrolled, while hostel capacity is barely 30,000 — just 1 in 31 gets a hostel.Why not identify vacant government…— sonu sood (@SonuSood) September 8, 2026ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని భవనంలో సరైన నిబంధనలు పాటించకుండా ఇరుకైన స్థలాల్లో నిర్మించిన ప్రైవేట్ హాస్టల్స్ విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న తీరుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా హాస్టళ్ల కొరత, విద్యార్థుల వసతి సౌకర్యాలపై సోనూ సూద్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన గణాంకాలతో ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రతీ ఏడాది లక్షల మంది విద్యార్థులు తమ కలల సాకారం కోసం ఇళ్లను వదిలి వేరే నగరానికి తరలిపోతున్నారు. కానీ మనం వారికి భద్రమైన జీవితాన్నికల్పించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఢిల్లీలో సుమారు 7 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే, అందుబాటులో ఉన్న హాస్టల్ సీట్లు కేవలం 30,000 మాత్రమే. అంటే ప్రతి 31 మంది విద్యార్థులలో ఒక్కరికి మాత్రమే హాస్టల్ సౌకర్యం లభిస్తోంది. విశ్వవిద్యాలయాల సమీపంలో ఉన్న ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించి విద్యార్థులకు సురక్షితమైన, తక్కువ ధరలోని హాస్టళ్లను నిర్మించాలని ఆయన సూచించారు. క్యాంపస్ పరిధిలోనే మరిన్ని వసతి గృహాలు కట్టడానికి విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలన్నారు.ఇదీ చదవండి: Delhi building collapse జస్ట్ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్!విద్యార్థులకు భద్రత, తల్లిదండ్రులకు మనశ్శాంతి లభిస్తుంది. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు ఆదాయాన్ని పొందుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా, మనం బిడ్డల ప్రాణాలు భద్రంగా ఉంటాయని ట్వీట్ చేశారు. చిన్న విధానపరమైన మార్పులు అనేకమంది విద్యార్థుల ప్రాణాలను, వారి కలలను కాపాడగలవని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారుకాగా ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రదిగ్భ్రాంతిరేపింది. ప్రమాదానికి కారణమైన భవన యజమాని హరిరామ్ గుప్తా, ఆయన భార్య ఊర్మిళ గుప్తాకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వారి కుమారుడు మహేష్ గుప్తాను రెండు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. ప్రమాదం జరిగిన భవనానికి ఆనుకుని ఉన్న మరొక భవనం కూడా ప్రమాదకరంగా మారిందని, దానిని కూల్చివేయనున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు.ఇదీ చదవండి: నో జిమ్, సోషల్ మీడియాను ఊపేస్తున్న కొత్త ఫిట్నెస్ ట్రెండ్? -
ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైను మించిపోతున్న ఆ నగరం
భారత్‌లో వినియోగ మార్కెట్ తీరు వేగంగా మారుతోంది. వినియోగ మార్కెట్ అంటే సామాన్యులు తమ రోజువారీ సొంత అవసరాల కోసం వస్తువులు, సేవలను కొనుగోలు చేసే మార్కెట్. వస్తువులను వీళ్లు వ్యాపారం చేయడానికి కొనరు. తమ సొంత వినియోగం కోసం మాత్రమే కొంటారు. ఇప్పటివరకు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వంటి మహానగరాల చుట్టూనే అధిక వినియోగం కనిపించేది. ఇప్పుడు సూరత్ ఈ తీరును మార్చుతోంది. దేశంలోని టాప్ వినియోగ మార్కెట్లలో సూరత్ 7వ స్థానంలో ఉంది. ఆరు పెద్ద మహానగరాల తర్వాత ఇది అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. సూరత్ వినియోగ మార్కెట్ విలువ 34 బిలియన్ డాలర్లుగా ఉంది. అహ్మదాబాద్, పుణె కంటే ఇది ముందుంది. ‘ది మెనీ అర్బన్ ఇండియాస్’ నివేదిక ప్రకారం సూరత్‌లో కుటుంబానికి సగటు వినియోగం బెంగళూరును కూడా మించింది.దేశంలోని 100 నగరాల మొత్తం వార్షిక వినియోగం 844 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఆరు పెద్ద మహానగరాలు ఇందులో 46 శాతం వాటా కలిగి ఉన్నాయి. అయితే సూరత్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వినియోగం మరింత వేగంగా పెరుగుతోంది. ఈ నగరాల్లో గృహ వ్యయం ఏటా 10.4 శాతం పెరుగుతుండగా, దేశవ్యాప్తంగా వృద్ధి 8.5 శాతంగా ఉంది. సూరత్‌ను 19 వేగంగా అభివృద్ధి చెందుతున్న ‘బూమ్‌టౌన్’ నగరాల్లో చేర్చారు. పుణె, అహ్మదాబాద్, లక్నో, కోయంబత్తూరు, జైపూర్, ఇండోర్, వడోదర ఈ జాబితాలో ఉన్నాయి.సూరత్ సగటు కుటుంబ ఆదాయం హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా కంటే ఎక్కువగా ఉంది. వస్త్ర పరిశ్రమ, వజ్రాల వ్యాపారం, వలస జనాభా ఆర్థిక స్థాయి పెరగడం ఈ ఆదాయ వృద్ధికి ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. దేశంలోని టాప్ 100 నగరాల్లో రూ.6 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు వార్షిక ఆదాయం పొందే మధ్యతరగతి కుటుంబాల వాటా గత దశాబ్దంలో 29 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది. 2030-31 నాటికి ఇది 60 శాతానికి చేరుతుందని అంచనా. రూ.36 లక్షలకు పైగా ఆదాయం ఉన్న కుటుంబాల వాటా 3 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది.సూరత్‌లో పెరుగుతున్న ఆదాయం వినియోగ అలవాట్లపైనా ప్రభావం చూపుతోంది. 2025-26లో బూమ్‌టౌన్ నగరాల్లో మొత్తం ఖర్చు రూ.20.1 లక్షల కోట్లు కాగా, కుటుంబానికి సగటు వ్యయం రూ.12.2 లక్షలుగా ఉంది. ఈ ఖర్చులో ఆహారానికి 31.1 శాతం, ఇల్లు-యుటిలిటీలకు 25.8 శాతం, రవాణాకు 19.2 శాతం, విద్యకు 6.8 శాతం వెచ్చిస్తున్నారు. కార్ల వినియోగం 32 శాతానికి, మోటార్‌సైకిళ్ల వినియోగం 72 శాతానికి చేరింది. వాషింగ్ మెషీన్, మైక్రోవేవ్ వినియోగం కూడా పెద్ద మహానగరాల కంటే ఎక్కువగా ఉంది.ఈ మార్పులు సూరత్ మాత్రమే కాకుండా దేశంలోని అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కొత్త వినియోగ అవకాశాలు పెరుగుతున్నాయనే సంకేతాన్ని ఇస్తున్నాయి. పెరుగుతున్న ఆదాయం, యువ జనాభా, బలమైన రిటైల్-సేవల వ్యవస్థ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో వినియోగ వస్తువులు, జీవనశైలి ఉత్పత్తులు, గృహ రంగాల్లో ఈ నగరాల ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉంది. -
జస్ట్ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్!
Delhi building collapse ఢిల్లీలోని ఐదంతస్తుల పేయింగ్ గెస్ట్ (PG) భవనం కుప్పకూలి ఏడుగురు మరణించిన ఘటన తీవ్ర విషాదాన్నినింపింది. అయితే ఈ ఘోర ప్రమాదంనుంచి ఒక విద్యార్థి తృటిలో తప్పించు కున్నాడు. ఈ ప్రమాదం జరగడానికి కేవలం 15 నిమిషాల ముందు, మోతీలాల్ నెహ్రూ కాలేజీకి చెందిన 18 ఏళ్ల మొదటి సంవత్సరం విద్యార్థి సనా వర్ష్ (Sana Varsh) ప్రాణాలతో బయటపడ్డాడు.నైరుతి ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఉన్న విద్యుత్, నీటి కొరతతోపాటు, పూర్తి లోపభూయిష్టంగా ఉన్న ఈ భవనంలోని నల్లాలో నీళ్లు రాకపోవడంతో అతినికి పెద్ద ముప్పు తప్పింది. మూడో అంతస్తులో ఉంటున్న వర్ష్, స్నానం చేయడానికి వెళ్లగా నల్లాలో నీళ్లు రాలేదు. దీంతో ఫ్రెష్ అవ్వడానికి సమీపంలోని తన స్నేహితుడి గదికి వెళ్లాడు. వర్ష్ గది నుంచి బయటకు వచ్చిన 15 నిమిషాల వ్యవధిలోనే ఆ భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. దీంతో ఒక్క క్షణం అతను భయంతో వణికిపోయాడు. "ఒకవేళ నల్లాలో నీళ్లు వచ్చి ఉంటే, నేను కూడా ఆ శిథిలాల కిందే పూడిపోయి ఉండేవాడిని" అని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ విద్యార్థి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అయితే భవనం కూలిపోవడంతో వర్ష్‌కు చెందిన విలువైన సర్టిఫికెట్లు, ముఖ్యమైన పత్రాలు, సామగ్రి అన్నీ శిథిలాల కింద చిక్కుకుపోయాయని విచారం వ్యక్తం చేశాడు.ఇదీ చదవండి: సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారుదాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేదని వర్ష్ గుర్తు చేసుకున్నాడు. మెట్లు కూడా చాలా ఇరుకుగా, తేమగా ఉండేవని, ఈ బిల్డింగ్ ఏదో ఒకరోజు కూలిపోతుందనని స్నేహితులతో జోకులు వేసేవాడినని పేర్కొన్నాడు. చివరిక ప్రమాదం జరిగిన రోజు ఉదయం నుంచే భవనం బేస్మెంట్ (నేలమాళిగ) నుంచి వింత శబ్దాలు వచ్చాయని కూడా చెప్పాడు.ఇదీ చదవండి: నో జిమ్, సోషల్ మీడియాను ఊపేస్తున్న కొత్త ఫిట్నెస్ ట్రెండ్?మరోవైపు వర్ష్ గదిలో ఉండే నితీష్, నీరజ్ అనే ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో చి 12 మందిని సహాయక బృందాలు (NDRF, ఫైర్ సర్వీసెస్) కాపాడాయి. గాయపడిన వారి కుటుంబాలను, బాధితులను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కలిశారు చికిత్స ఖర్చును NCT ప్రభుత్వమే భరిస్తుందని ఆమె తెలిపారు. అలాగే, ఆ పీజీ (PG) పక్కనే ఉన్న సురక్షితం కాని భవనాన్ని బుధవారం కూల్చివేస్తామని ప్రకటించారు.ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన అర్పిత జజ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువరాజ్ సోని అనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వీరిద్దరూ రక్షాబంధన్ పండుగ జరుపుకోవడానికి కొన్ని రోజుల ముందే ఇళ్లకు వెళ్లి వచ్చారు. కానీ ఇంతలోనే తమ బిడ్డలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని ఊహించని కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయాయి. ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్‌లో సింగర్ హఠాన్మరణం -
సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి బయట జరుగుతున్న గోల, అరుపులపై అభ్యంతరం వ్యక్తం చేసిన 55 ఏళ్ల మణిపురి సంగీత విద్వాంసుడు చోంగ్థమ్ విక్రమ్ సింగ్‌ను దారుణంగా కొట్టి చంపారు కొంతమంది దుండగులు. ఇంటి బయట పనిచేస్తున్న డెలివరీ సిబ్బంది, దాబా సిబ్బందితో జరిగిన వివాదం చివరకు దాడికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదైనాయి. ఆగ్నేయ ఢిల్లీలోని సన్‌లైట్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలోక్రి వద్ద 17 ఏళ్లుగా ప్రైవేట్ సంగీత ఉపాధ్యాయుడిగా, గిటారిస్ట్‌గా పనిచేస్తున్న చోంగ్థమ్ విక్రమ్‌ను కొందరు వ్యక్తులు కొట్టి హత్య చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆగ్నేయ ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి ఆదివారం అర్ధరాత్రి విక్రమ్ చెత్త పారవేయడానికి తన మూడవ అంతస్తులోని ఫ్లాట్ నుండి కిందికి వెళ్ళారు. తన ఇంటి వద్ద దాబా కార్మికులు, డెలివరీ బాయ్స్ చేస్తున్న అరుపులు, గోల భరించలేక విక్రమ్ సింగ్ కిందకు వచ్చి గోల చేయ వద్దని కోరారు. ఈ క్రమంలో జరిగిన వివాదంతో రెచ్చిపోయిన ఎనిమిది మంది ఆయనపై దాడికి దిగారు. అపార్ట్మెంట్లో థర్డ్ఫ్లోర్దాకా తరుముకుంటూ వచ్చి కారిడార్‌లో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన విక్రమ్‌ను ఆయన కుమారుడు యైఫాబా సమీపంలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గాయపడిన విక్రమ్‌ను మెట్ల మీదుగా మోసుకెళ్తున్న దృశ్యాలు, దాడి చేసినవారు అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైనాయి. ఈ కేసులో ఏడుగురుని అరెస్టు చేయడంతో పాటు ఒక బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా స్థానిక హోటళ్లలో ఫుడ్ ప్యాకింగ్, డెలివరీ పనులు చేస్తున్నారు. అరెస్టు అయిన వారిని భరత్ కుమార్(19), ప్రమోద్(26), రంజాన్ ఖాన్(22), విజయ్(36), దీపాంశు (21), మోహన్ విశ్వకర్మ(32), మన్ను(26) గా గుర్తించారు.Chongtham Vikram Singh ji, a renowned musician from Manipur, went downstairs to ask some men to lower the noise outside his home. He was beaten to death for it.A father, killed outside his own home, in his own country's capital. After many such incidents, every Northeast family…— Rahul Gandhi (@RahulGandhi) September 8, 2026Manipuri musician beaten to death for objecting to shouting, drinking outside his Delhi flat; 7 held#ChongthamVikramSingh pic.twitter.com/U0fZBjClqa— Raajeev Chopra (@Raajeev_Chopra) September 7, 2026చోంగ్థమ్ విక్రమ్ సింగ్ మణిపూర్‌లో పేరుగాంచిన సంగీత విద్వాంసుడు. ఆయన ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు చోంగ్థమ్ ఓంగ్బి కమలా దేవి కుమారుడు. అలాగే భారత్‌కు చెందిన మొదటి బాఫ్టా (BAFTA) అవార్డు పొందిన చిత్ర దర్శకురాలు లక్ష్మీప్రియ దేవికి విక్రమ్ వరుసకు సోదరుడు అవుతారు. ఆయన ఢిల్లీలో ఒక మ్యూజిక్ స్కూల్‌ను కూడా నడుపుతున్నారు. ఈ ఘటన అనంతరం, మణిపురి సమాజ సభ్యులు న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ దాడిలో ప్రమేయం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్ఈ ఘటన సమయంలో అసలు ఏం జరిగింది? ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పోలీస్ డిప్యూటీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు బాధితుడి కుటుంబాన్ని, కమ్యూనిటీ సభ్యులను కలిసి చట్టపరమైన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు సింగ్ మరణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్‌లో సింగర్ హఠాన్మరణంహోంమంత్రి, హోం మంత్రిత్వ శాఖపై రాహుల్ గాంధీ ఆగ్రహంలోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చోంగ్థమ్ విక్రమ్ సింగ్ హత్యను తీవ్రంగా ఖండించారు. విక్రమ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఢిల్లీలోని ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన హోంమంత్రి, హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులు ఏమి చేస్తున్నారని మండి పడ్డారు. సత్వరమే విచారణజరిపి దోషులను శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు.ఈ హత్యను మద్యం మత్తులో జరిగిన హింసాత్మక ఘటనగా కొట్టిపారేయకూడదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా అన్నారు. పెద్ద శబ్దంతో సంగీతం, బహిరంగ గొడవలు, నిబంధనలను పట్టించుకోకపోవడం వంటి వాటిని ఏళ్లుగా సహించడం వల్లే ఈ స్థితికి దారితీసిందన్నారు. ఢిల్లీలోని తన ఇంటి బయట శబ్ద కాలుష్యంపై అభ్యంతరం చెప్పినందుకు సింగ్‌ను కొట్టి చంపారని ఖేరా అన్నారు. ఇటువంటి ప్రవర్తనకు వ్యతిరేకంగా నిబంధనలను స్థిరంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.THIS IS SHOCKING🚨😡Delhi.Modi’s capital.BJP’s city.Manipuri musician Chongtham Vikram Singhobjected to drunk boys making noise outside his home.They beat him on the road.Chased him into his third-floor flat.Beat him again.Hours later, he was dead in hospital.His… pic.twitter.com/QN3cr5TV7x— The Rebel (@TheRebel_IN) September 8, 2026ఇదీ చదవండి: రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్‌లోకి..కట్ చేస్తే! -
ఢిల్లీ ట్రాజెడీ : మళ్లీ వార్తల్లో ఐఏఎస్ సంజీవ్
న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ అధికారి, ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్‌పై మరోసారి తీవ్ర ఉచ్చు బిగుస్తోంది. గతంలో తన పెంపుడు కుక్కతో త్యాగరాజ్ స్టేడియంలో చక్కర్లు కొట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అధికారి, తాజాగా ఢిల్లీలోని సత్యనికేతన్ ఏరియాలో బిల్డింగ్ కుప్పకూలిన ఘోర ప్రమాదంతో మరోసారి వివాదాల కేంద్రబిందువుగా మారారు. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించడంతో ఆయనపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని సత్యనికేతన్ ఏరియాలో ఆదివారం (సెప్టెంబర్ 6, 2026) మధ్యాహ్నం ఐదు అంతస్తుల పీజీ హాస్టల్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవన బేస్మెంట్లో మరమ్మతులు, నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఢిల్లీ పోలీసులు, సహాయక బృందాలు ఇప్పటివరకు 12 మందిని రక్షించాయి. ప్రమాదానికి కారణమైన హాస్టల్ యాజమాని హరిరాంబ్ బన్సల్‌ను రాజస్థాన్‌లో అరెస్టు చేశారు.మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రాణనష్టానికి కారణమంటూ డిమాండ్లు వ్యక్తమవుతుండటంతో, ఐఏఎస్ సంజీవ్ ఖిర్వార్ రాజీనామా చేయాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. ఘటన జరిగిన మరుసటి రోజే (సోమవారం) ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ రంగంలోకి దిగి ఐదుగురు అధికారులను తక్షణమే సస్పెండ్ చేసింది.స్పందించిన ఎంబీసీ కమిషనర్ ఈ ప్రమాదంపై ఎంసీడీ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ స్పందిస్తూ.. అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఆగస్టులో అదే ప్రాంతంలోని 3-4 భవనాలను కూల్చివేయాలని మేము ఆదేశాలు జారీ చేశాము. గత మూడు నెలల్లో 960 భవనాలను కూల్చివేశాము. 407 భవనాలను సీల్ చేశాం. మరో 1,500 భవనాలకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. కూలిపోయిన 14వ నంబరు ఆస్తికి సంబంధించి, గతంలో కేవలం గ్రౌండ్+1 యూనిట్‌కు మాత్రమే అనుమతి ఉందని, ఎలాంటి భవన ప్రణాళికకు ఆమోదం లేదని అధికారులు తేల్చారు.విద్యార్థి సంఘాల ఆందోళనసత్యనికేతన్లో సహాయక చర్యలను పర్యవేక్షించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పందిస్తూ.. నగరంలో ఐదు అంతస్తులు ఉన్న అన్ని భవనాలను వెంటనే సీల్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పీజీలు, నర్సింగ్ హోమ్‌లు, పాఠశాలలు లేదా వాణిజ్య సంస్థలను ప్రారంభించే ముందు పాత భవనాల యజమానులు తప్పనిసరిగా స్ట్రక్చరల్ ఆడిట్ నివేదికలను సమర్పించేలా ఒక కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. మరోవైపు, పౌర సంస్థల వైఫల్యానికి నిరసనగా ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఆధ్వర్యంలో సుమారు 150 నుంచి 200 మంది కార్యకర్తలు ఎంసీడీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఎంసీడీ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గతంలోనూ వివాదాలకే కేంద్రబిందువు1994 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ గతంలోనూ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో సాధారణ అథ్లెట్లను బయటకు పంపివేసి, తన భార్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గాతో కలిసి తన పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకువెళ్లిన వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది.మేము ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు శిక్షణ తీసుకునేవాళ్ళం. కానీ ఆ అధికారి తన కుక్కను నడపడానికి వీలుగా మమ్మల్ని సాయంత్రం 7 గంటలకే మైదానం విడిచి వెళ్ళమని చెబుతున్నారు’ అని మే 26, 2022 నాటి కథనంలో కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలను ఖిర్వార్ అప్పట్లో ఖండించినప్పటికీ, తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆయనను లడఖ్‌కు బదిలీ చేసింది. ఆ తర్వాత కాలంలో మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చిన ఆయన, ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మకమైన ఎంసీడీ కమిషనర్ బాధ్యతలను చేపట్టారు. అయితే, ఇప్పుడు ప్రాణనష్టం సంభవించిన సత్య నికేతన్ భవనం కూలిన దుర్ఘటన నేపథ్యంలో అధికార యంత్రాంగం వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో,సంజీవ్ ఖిర్వార్ చుట్టూ వివాదాల ఉచ్చు మరింత బిగుసుకుంది. 👉ఇదీ చదవండి : ‘అయ్యా.. నేను ఐఏఎస్ తుకారాం ముండేని!’ -
ఓడించాలని కంకణం.. తొలి టీ20కి ఆఫ్గన్ తుది జట్టు ఇదే!
టీమిండియాతో టీ20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. పసికూనలం కాదని ఇప్పటికే నిరూపించుకున్న అఫ్గానిస్తాన్ టీమిండియాతో సిరీస్‌కు బలమైన జట్టుతో బరిలోకి దిగాలని చూస్తోంది. ఈ మేరకు తమ వద్ద ఉన్న బలమైన బ్యాటింగ్, బౌలింగ్ అస్త్రాలను టీమిండియాపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బలమైన జట్టును ఎంపిక చేసింది. ఆదివారం (సెప్టెంబర్ 13న) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆ జట్టు తుది కూర్పు ఎలా ఉంటుందనేది ఒకసారి పరిశీలిద్దాం.ఓపెనర్లుగా ఆ ఇద్దరే..తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రహ్మనుల్లా గుర్బాజ్, కెప్టెన్ ఇబ్రహీం జద్రన్లు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. తమ జట్టుకు పటిష్టమైన ఆరంభాన్ని అందించే బాధ్యతను ఈ ఇద్దరు అనుభవజ్ఞులు తీసుకోనున్నారు. మరోవైపు రహ్మనుల్లా గుర్బాజ్‌కు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉండడంతో అతని నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వచ్చే అవకాశం లేకపోలేదు. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ కూడా మంచి ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం. ఇక వన్‌డౌన్‌లో దర్విష్ రసూలీ బ్యాటింగ్ చేసే అవకాశముంది. కొంతకాలంగా టీ20ల్లో ఆఫ్గన్‌కు కీలక బ్యాటర్‌గా మారిన రసూలీ 28 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఇందులో నాలుగు హాఫ్‌సెంచరీలు ఉన్నాయి.మిడిలార్డర్ ఇలా..సాదిఖుల్లా అటల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో పంపవచ్చు. అటల్ 29 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన గుల్బదిన్ నైబ్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. 2024 టీ20 సిరీస్‌లో నైబ్ తన బ్యాట్‌తో భారత జట్టును ఇబ్బంది పెట్టాడు. ఈసారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అజ్మతుల్లా ఉమర్జయ్ ఆరో స్థానంలో, సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ఏడో స్థానంలో రానున్నారు. ఈ ఇద్దరు అనుభవజ్ఞులు తమ ఫినిషింగ్ టచ్‌తో భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇక జట్టు ఐకాన్ ప్లేయర్ రషీద్ ఖాన్‌తో పాటు నూర్ అహ్మద్ కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవాళ్లే.బౌలింగ్ దళం..అఫ్గానిస్తాన్‌కు స్పిన్ బౌలింగ్ ప్రధాన ఆయుధం. ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ త్రయం భారత్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. తొలి టీ20కి ఈ ముగ్గురు అందుబాటులో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జట్టులో ఏకైక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌గా ఫజల్ ఫరూఖీ ఉండవచ్చు. అతడికి తోడుగా అజ్మతుల్లా, గుల్బదిన్ నైబ్‌లు కూడా బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టొచ్చు. ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ తన ఆఫ్ స్పిన్‌తో ఇబ్బందిపెట్టగల సత్తా ఉన్నవాడే. మొత్తం మీద అఫ్గానిస్తాన్ జట్టు పేపర్‌పై మాత్రం బలంగా కనిపిస్తోంది. ఇటీవలే కాలంలో ఓటములను అంత త్వరగా ఒప్పుకోని అఫ్గానిస్తాన్ జట్టు సొంతగడ్డపై దుర్భేద్యంగా కనిపిస్తున్న టీమిండియాను ఏ మేరకు నిలువరించగలదనేది చూడాలి.తొలి టీ20కి అఫ్ఘనిస్తాన్ తుది జట్టు అంచనా:రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రన్ (కెప్టెన్), దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఉమర్జయ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, ఫజల్ ఫరూకీ, నూర్ అహ్మద్.Read: రెస్ట్ తీసుకోమన్నా వినలేదు; నొప్పిని భరిస్తూనే డబుల్ సెంచరీ -
సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో బహుళ అంతస్తుల పీజీ (PG) భవనం కూలిపోయిన తీవ్ర విషాదాన్ని నింపింది. ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో కనీసం ఏడుగురు మరణించిన, పలువురు గాయపడిన ఘటనలో పరారీలో ఉన్న భవన యజమాని హరిరామ్ గుప్తాను రాజస్థాన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.మరోవైపు ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. చదువు లేదా ఉద్యోగం కోసం నగరానికి బయటి ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని కోర్టు పేర్కొంది.ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలో ఉన్న ఈ బాలుర పీజీలో ఎక్కువగా కేరళ, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన విద్యార్థులు నివసిస్తున్నారు.పాత భవనంలో మరమ్మతులు చేస్తుండగా, బేస్మెంట్లో నీరు చేరడంతో భవనం బలహీనపడి కూలి పోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత పరారైన పీజీ యజమాని హరిరామ్ గుప్తాను రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు 12 మందిని వెలికితీశారు. వారిలో ఏడుగురు మరణించగా, మిగిలిన ఐదుగురు గాయపడి చికిత్స పొందుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా ఐదు అంతస్తులు ఉన్న భవనాలన్నింటినీ తక్షణమే సీల్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్‌లో సింగర్ హఠాన్మరణం మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు. బాధ్యులైన ఎంసీడీ (MCD) అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పక్కనే ఉన్న ప్రమాదకరమైన మరొక భవనాన్ని కూడా కూల్చివేయనున్నట్లు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఫైర్ సర్వీసెస్, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ పరిస్థితిని కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా ప్రధాని కార్యాలయం నిశితంగా పరిశీలిస్తున్నాయి.ఇదీ చదవండి: రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ! -
ఢిల్లీలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం CCTV ఫుటేజ్ విజువల్స్
-
ఢిల్లీ హాస్టల్ ఘటన: పెరిగిన మృతుల సంఖ్య
ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వచ్చిన విద్యార్థుల జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఆదివారం కుప్పకూలిన పీజీ హాస్టల్ భవనం ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రాత్రంతా కొనసాగిన సహాయక చర్యల్లో మరో వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీసినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 11 మందిని రక్షించగా.. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది.బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతుండగానే.. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో లోపల ఉన్న పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. భవనం కూలడానికి బేస్మెంట్ పనులు, నిర్మాణంలో లోపాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదానికి సంబంధించిన మరో సీసీటీవీ దృశ్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. కూలిపోయిన భవనానికి ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఓ వ్యక్తి కూర్చుని ఉండగా.. ఒక్కసారిగా భవనం కూలడం ప్రారంభమైంది. భారీగా దుమ్ము కమ్ముకోవడంతో అప్రమత్తమైన అతడు వెంటనే దుకాణం నుంచి బయటకు పరుగెత్తాడు. క్షణాల వ్యవధిలోనే భవనం కుప్పకూలడంతో అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.DELHI: SATYA NIKETAN BUILDING COLLAPSE: CCTV FOOTAGE EMERGESCCTV footage from opposite the building captures the moment a person rushes out of his shop to save his life as the collapse unfolds.Search and rescue operations continue at the site. pic.twitter.com/svxVTwDYhW— Subodh Kumar (@kumarsubodh_) September 7, 2026తప్పిన పెనుముప్పు?సత్య నికేతన్‌లోని ఈ ఐదు అంతస్తుల భవనంలో సుమారు 15 గదులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కో గదిలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు ఉండేవారని చెప్పారు. ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకోవడంతో చాలామంది విద్యార్థులు బయట ఉండటం వల్ల ప్రాణనష్టం కొంత తగ్గిందని స్థానికులు పేర్కొన్నారు. ఇక సుమారు 30 ఏళ్ల నాటి ఈ భవనంలో ‘హాస్టల్ డేజ్’ పేరుతో పీజీ వసతి గృహం నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి ముందు బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవలి వర్షాలతో బేస్మెంట్లో నీరు చేరి పునాది బలహీనపడటం వల్లే భవనం కూలిపోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.శిథిలాల కింద ఆర్తనాదాలు..భవనం కూలిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారు తమను కాపాడాలంటూ ఫోన్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కొందరు బాధితులు లోపల నుంచి వీడియోలు తీసి మిత్రులకు పంపించారు. శిథిలాల కింద ఉన్నవారు ఊపిరి పీల్చుకునేందుకు ఆక్సిజన్ సిలిండర్లను పంపించినట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు.ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగిస్తున్నారు. ఇరుకైన వీధులు కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.పీజీల నిర్వహణపై ప్రశ్నలుసత్య నికేతన్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పీజీలు, హాస్టళ్లలో ఉంటున్నారు. పాత భవనాలను పీజీలుగా మార్చి నిర్వహిస్తున్న తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాల నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, నిర్వహణపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ప్రముఖుల సంతాపంఈ విషాద ఘటనపై రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జీత్ సింగ్ సంధు కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు.. మృతుల సంఖ్య ఆరుకు చేరడం, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతుండటంతో సత్య నికేతన్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా బయటపడిన సీసీటీవీ దృశ్యాలు మాత్రం ప్రమాదం కూలిన భవనం లోపలే కాదు.. చుట్టుపక్కల ఉన్నవారినీ ఎంతటి ముప్పులోకి నెట్టిందో స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రీల్స్ చూసి మోసపోవద్దు! పాపం ఆ అమ్మాయి.. -
ఢిల్లీలో ఘోర విషాదం.. భవనం కూలి ఐదుగురు మృతి
-
విద్యార్థుల ఆశలు సమాధి
న్యూఢిల్లీ: ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీలో హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లోని ఓ హాస్టల్ భవనం ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద దాదాపు 20 మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అన్వేషణ, సహాయక బృందాలు అంచనావేశాయి. రద్దీగా ఉండే ఒక వీధిలోని 30 ఏళ్ల నాటి ఈ ఐదు అంతస్తుల భవనంలో ‘హాస్టల్ డేజ్’ పేరిట పేయింగ్ గెస్ట్(పీజీ) వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. భవన బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతుండగా ఆదివారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో కూలింది. తాజా వర్షాలతో బేస్మెంట్లో నీరు చేరి పునాది బలహీనపడిందని, అందుకే కుప్పకూలిందని స్థానికులు చెప్పారు. ప్రమాదం విషయం తెల్సి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. భవనం కుప్పకూలి విద్యార్థులు మరణించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జీత్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు వివరించారు. లోపల చిక్కుకున్న వారి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఘటనా స్థలంలో బీజేపీ ఎమ్మెల్యే అనిల్ చెప్పారు. ఆదివారం కావడం వల్లే తక్కువ ప్రాణనష్టం కూలిపోయిన భవనంలో దాదాపు 15 గదులు ఉండేవని, ఒక్కో గదిలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు కలిసి ఉండేవారని స్థానికులు తెలిపారు. ఆదివారం సెలవు కావడంతో చాలామంది విద్యార్థులు బయటకు వెళ్లినందున మరణాల సంఖ్య తగ్గిందని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఈ ప్రాంతంలోని ఇతర భవనాల పరిస్థితి, నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సత్య నికేతన ప్రాంతంలో భవనాలను ఐదు, ఆరు అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. చాలా ఇళ్లను బాలుర పీజీలుగా మార్చేసి, యజమానులు వేరే చోటికి తరలిపోతున్నారు. వారు తమ ఇళ్లకు పీజీలని పేరు పెట్టి, ఆన్లైన్లో అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. భవనాల నిర్వహణ ఎలా ఉందో కూడా పట్టించుకోవడం లేదు’’ అని రెండు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రియాంక పేర్కొన్నారు. ప్రధాని మోదీ సంతాపం ఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. బాధితులకు సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు ఉంటున్న భవనం కూలిపోవడం చాలా బాధాకరమని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రాణం విలువైనదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ప్రాణాలకు భరోసా కల్పించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఈ ఘటనను అత్యంత హృదయ విదారకమైనది, ఆందోళనకరమైనదిగా అభి వరి్ణంచారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సరైన వసతి గృహాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ‘నివారించదగిన విషాదం’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.శిథిలాల కింద అరుపులు, ఆర్తనాదాలు ఘటనా స్థలంలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల నుంచి పెద్ద ఎత్తున అరుపులు, ఆర్తనాదాలు వినిపించాయి. తమను కాపాడాలంటూ బాధితులు రోదిస్తూ వేడుకున్నారు. కొందరు ఫోన్లు సైతం చేశారు. లోపల చిక్కుకుపోయిన వారు అక్కడి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించి మిత్రులకు పంపించారు. బాధితుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శిథిలాల కింద బాధితులు ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్లను జారవిడిచినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక వాహనాలను మోహరించారు. ఈ ప్రాంతంలోని ఇరుకైన వీధుల్లో విద్యార్థుల కోసం హోటళ్లు, పీజీ వసతి గృహాలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న విద్యార్థుల్లో చాలామంది కేరళ, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని, వారు రోడ్డుకు అవతల ఉన్న కాలేజీల్లో చదువుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తుండగా స్థానికులు సహకరించారు. వారు తమ చేతులతో, అందుబాటులో ఉన్న సామగ్రితో బాధితుల కోసం గాలించారు. శిథిలాల కింద పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. కలచి వేసిన వీడియోహాస్టల్ భవనం కూలిపోగా కాంక్రీటు దిమ్మెల కింద ఓ విద్యార్థి చిక్కుకుపోయి నరకయాతన అనుభవించిన దృశ్యం చూపరులను కలచివేసింది. అతడిపై దుమ్ము పేరుకుపోయింది. ముఖంపై రక్తపు చారలు కనిపించాయి. నుదుటి పక్క నుండి రక్తం కారుతోంది. ఈ వీడియోను ఆత్మరామ్ కాలేజీ విద్యార్థులు షేర్ చేశారు. శిథిలాల కింద నుంచి ‘సేవ్ మీ, సేవ్ మీ’ అనే అరుపులు చాలాసేపు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. -
కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
-
ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సత్యనికేతన్ ప్రాంతంలో కుప్పకూలిన భవనం
సాక్షి, ఢిల్లీ : దేశ రాజధానిలో ఘోర ప్రమాదం జరిగింది. సత్యనికేతన్ ప్రాంతంలో విద్యార్థుల పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ ఉన్న భవనంగా ఒక్కసారిగా కుప్పకూలింది. . ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో పదిమందికి గాయాలు కాగా వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆ భవనంలో దాదాపుగా 25 మంది విద్యార్థులున్నట్టు తెలుస్తోంది. అయితే భవనం కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
గాల్లో ఉండగానే ‘హైడ్రాలిక్’ విఫలం
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తూ గాల్లో భారీ కుదుపులకు లోనైన ఎయిరిండియా విమానంలో ఉన్న మూడు హైడ్రాలిక్ వ్యవస్థలు విఫలమైనట్లు ఎయిర్‌క్రాఫ్ట్ ఆక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ (ఏఏఐబీ) ప్రకటించింది. సుమారు 145 మందితో 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూండగా ఈ ఎయిర్‌బస్ విమానంలోని హైడ్రాలిక్ వ్యవస్థలు విఫలమయ్యాయని, దీంతో ఆటోపైలట్‌తో అనుసంధానం లేకుండా పోవడమే కాకుండా.. అకస్మాత్తుగా విమానం కిందకు జారిపోవడం మొదలైన విషయం తెలిసిందే. ఆగస్టు నాలుగవ తేదీన జరిగిన ఈ ఘటనలో దాదాపు 24 మంది గాయపడ్డారు. ఆ తరువాత విమానం ఢిల్లీలో సురక్షితంగానే ల్యాండైనా మాదకద్రవ్య పరీక్షల్లో పైలట్ విఫలమయ్యాడు. దీంతో ఏఏఐబీ పైలట్‌పై చర్యకు సిఫారసు చేస్తూ ఏఏఐబీ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. అయితే పైలట్ మత్తుమందులు తీసుకోవడానికి, హైడ్రాలిక్ వ్యవస్థలు విఫలమయ్యేందుకు సంబంధం ఉన్నదీ లేనిది మాత్రం ఈ నివేదిక స్పష్టం చేయలేదు. విచారణ కొనసాగుతోందని మాత్రం తెలిపింది. ఘటన జరిగిన సమయంలో వాతావరణ పరిస్థితులు అంత ప్రతికూలంగా ఏమీ లేకపోవడంతో ఏఏఐబీ అధికారులు హైడ్రాలిక్ వ్యవస్థలు, ఇతర కారణాలపై దృష్టి పెట్టారు. సుమారు పది పేజీలున్న ప్రాథమిక నివేదిక ప్రకారం ఘటన జరిగిన సమయంలో విమానానికి సంబంధించిన పచ్చ, నీలి, పసుపు హైడ్రాలిక్ వ్యవస్థలు ఒకేసారి విఫలమయ్యాయి. ఆ తరువాత కొన్ని సెకన్లలోనే పనిచేయడం మొదలైనప్పటికీ తాత్కాలిక వైఫల్యం కారణంగా విమానం కేబిన్ లోపల భారీ నష్టం జరిగింది. సీలింగ్ ప్యానెళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి, సీట్లపైనున్న బిన్స్ చెల్లాచెదురయ్యాయి. అలాగే కురీ్చ ల హ్యాండ్ రెయిల్స్ ధ్వంసమయ్యాయి. కోపైలట్‌పై జరిపిన పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని ఈ నివేదిక తెలిపింది. పైలట్ విషయంలో పరీక్షలు పాజిటివ్‌గా తేలినందున డీజీసీఏ తగిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. పైలట్‌కు ఉద్వాసన ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం భారీ కుదుపులకు గురై 24 మంది గాయపడిన ఘటనలో ప్రధాన పైలట్‌కు ఎయిర్ ఇండియా శుక్రవారం ఉద్వాసన పలికింది. ప్రమాద ఘటన తరువాత న్యూఢిల్లీలో పైలట్‌పై జరిపిన మాదకద్రవ్యాల పరీక్షలు పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. భద్రత, ఫిట్నెస్, రెగ్యులేటరీ అంశాలకు సంబంధించిన ఎలాంటి ఉల్లంఘనలను సహించేది లేదని, అందువల్లనే పైలట్‌ను తక్షణం ఉద్యోగం నుంచి తొలగించామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. -
దంచి కొట్టిన వర్షం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టును ముంచెత్తిన వరద నీరు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కురిసిన కుండపోత వర్షం నగరాన్ని తీవ్రంగా అస్తవ్యస్తం చేసింది. ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, అండర్పాస్లలోకి వర్షపు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది.ఈ వర్షం ప్రభావం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై తీవ్రంగా పడింది. ఎయిర్పోర్ట్ ప్రాంగణంతో పాటు అరైవల్ గేట్లు, పాసేజ్ ఏరియాల్లోకి మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో ప్రయాణికులు తమ లగేజీ ట్రాలీలను నీళ్లలోనే తోసుకుంటూ నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రవాహం తగ్గే వరకు ప్రయాణికులు గంటల తరబడి అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈదురు గాలులతో కూడిన ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. ఢిల్లీకి రావలసిన పలు విమానాలను ముందస్తు జాగ్రత్తగా జైపూర్, లక్నో, అహ్మదాబాద్ వంటి సమీప నగరాలకు మళ్లించగా, వందలాది సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. రహదారులు, విమానాశ్రయంలో నిలిచిన నీటిని తొలగించేందుకు విమానాశ్రయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. పంపింగ్ మిషన్ల సహాయంతో నీటిని బయటకు పంపే చర్యలను వేగవంతం చేశారు. -
ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు
-
ఎందరి తాళిబొట్లు తెంచావో మరిచిపోయావా?
కశ్మీర్లో 1990లలో జేకేఎల్ఎఫ్ సాగించిన ఉగ్రవాద హింసకు బలైన కుటుంబాలు.. ఆ సంస్థ అధినేత యాసిన్ మాలిక్ తాజా అఫిడవిట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నర్సు సరళా భట్ హత్య కేసులో తనకు మరణశిక్ష విధించాలని కోరుతూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మాలిక్.. అదే సమయంలో తన భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే తన భార్య వితంతువుగా జీవించకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనడంపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి.జేకేఎల్ఎఫ్(JKLF) ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన స్క్వాడ్రన్ లీడర్ రవి ఖన్నా భార్య నిర్మల్ ఖన్నా.. యాసిన్ మాలిక్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1990 జనవరి 25న శ్రీనగర్‌లోని ఓ బస్‌స్టాప్ వద్ద రవి ఖన్నాతో పాటు మరో ముగ్గురు వైమానిక దళ సిబ్బందిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాల ప్రకారం ఈ దాడికి యాసిన్ మాలిక్ నాయకత్వం వహించి కాల్పులు జరిపిన ప్రధాన షూటర్‌గా అతడిని గుర్తించారు.“నా ఆయుధాలు లేని భర్తను చంపాడు. ఆయన శరీరంలోకి 28 తూటాలు దూసుకెళ్లాయి. ఇప్పుడు తానే గొప్ప వ్యక్తినన్నట్లు మాట్లాడుతున్నాడు. అతడికి ఎలాంటి సానుభూతి అవసరం లేదు. మాలిక్‌కు మరణశిక్ష తప్ప మరో శిక్ష వద్దు. అతడిని ఉరితీసే రోజు కోసం ఎదురుచూస్తున్నా” అని నిర్మల్ ఖన్నా అన్నారు.మా సంగతేంటి?..తన భార్య వితంతువుగా జీవించకూడదనే ఉద్దేశంతో ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు మాలిక్ చెప్పడంపై నిర్మల్ ఖన్నా తీవ్రంగా స్పందించారు. “నీ భార్య వితంతువు కాకూడదని అంటున్నావు. మరి నీ వల్ల భర్తలను కోల్పోయిన ఎన్నో మహిళల సంగతేంటి? వారి కుటుంబాల బాధ నీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా?” అని ప్రశ్నించారు.మాలిక్ చేతులకు రక్తం అంటుకుందని, అతడు చేసిన హింసకు మూల్యం చెల్లించాల్సిందేనని ఆమె అన్నారు. 36 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నామని చెబుతూ.. ఇంతకాలం గడిచినా బాధిత కుటుంబాలకు న్యాయం ఎందుకు జరగడం లేదని ప్రభుత్వం, న్యాయవ్యవస్థను ప్రశ్నించారు. మాలిక్ తాజా అఫిడవిట్ సానుభూతి పొందేందుకు చేస్తున్న ప్రయత్నమేనని ఆరోపించారు.‘నా తల్లి కూడా వితంతువైంది’మరో ఉగ్ర బాధితురాలు డాక్టర్ సుష్మా షల్లా కూడా మాలిక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమె తండ్రి ఇన్స్పెక్టర్ చునీలాల్ షల్లాను 1990 మే 1న ఉత్తర కశ్మీర్లో జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు.“నేను ప్రత్యక్షంగా ఉగ్రవాద బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తిని. యాసిన్ మాలిక్ తన పాపాలకు చివరకు మూల్యం చెల్లించాల్సి వస్తుండటం సంతోషంగా ఉంది. నా తండ్రిని జేకేఎల్ఎఫ్ చంపింది. నా తల్లి ఆయన మరణంతో వితంతువుగా జీవించాల్సి వచ్చింది. ఆ బాధను నువ్వెప్పుడైనా అనుభవించావా? ఇప్పుడు మాత్రం ఏడుస్తున్నావు” అని సుష్మా షల్లా మండిపడ్డారు.సరళా భట్ హత్య కేసులో..1990లో శ్రీనగర్‌లో నర్సు సరళా భట్ హత్యకు సంబంధించిన కేసులో యాసిన్ మాలిక్ విచారణను ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో తనకు మరణశిక్ష విధించాలని కోరుతూ అతడు తాజాగా అఫిడవిట్ దాఖలు చేశాడు. ఇకపై విచారణలో తన తరఫున ఎలాంటి వాదనలు వినిపించబోనని కూడా స్పష్టం చేశాడు. అదే అఫిడవిట్లో పాకిస్థానీ భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ రెండు నిర్ణయాల వెనుక సానుభూతి పొందే ప్రయత్నం ఉందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.36 ఏళ్లుగా ఎదురుచూపులు1990లలో కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల్లో భర్తలను, తండ్రులను కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికీ ఆ విషాదం నుంచి పూర్తిగా బయటపడలేకపోతున్నాయి. యాసిన్ మాలిక్ తాజా అఫిడవిట్ నేపథ్యంలో ఆ పాత గాయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తన భార్య వితంతువు కాకూడదనే కారణాన్ని మాలిక్ ప్రస్తావించడమే ఇప్పుడు బాధిత కుటుంబాల ఆగ్రహానికి కారణమైంది.ఇదీ చదవండి: ఆ పెళ్లి కూతురి సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్ -
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
-
పదకొండేళ్లుగా ఆ అలవాటు ఎంత పనిచేసిందంటే..! చివరికి కడుపులో..
కొన్ని అలవాట్లను చుట్టూ ఉన్న సన్నిహితులు, స్నేహితులు గమనించకపోతే..ఎంతటి ప్రమాదం కొనితెచ్చుకుంటారో చెబుతోంది ఈ ఉదంతం. ఆమెకు తొమ్మిదేళ్లుగా ఉన్న అలవాటు గురించి 20 ఏళ్ల తర్వాత అనారోగ్యం కారణంగా బయటపడి ఆస్పత్రిపాలుజేసింది. ఈ విచిత్ర ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంంది. ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల యువతికి తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. వికారం, పదే పదే వాంతులు అవ్వడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె కడుపు పైభాగం ఉబ్బి ఉండటంతో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్ట్‌లో ఆమె కడుపులో భారీ పరిమాణంలో హెయిర్‌బాల్ ఉన్నట్లు గుర్తించారు. ఇది ఆహారనాళం, కడుపు కలిసే చోట చిన్న ప్రేగులకు వెళ్లే ద్వారం వరకు విస్తరించి ఉండటంతో ఎండోస్కోపీతో తొలగించడం సాధ్యం కాలేదు. దాంతో ఆమెకు సర్జరీ చేయక తప్పలేదు. ఇది సుమారు 1.16 కిలోల పరిమాణంలో ఆంగ్ల అక్షరం ‘జే’ ఆకారంలో ఉంది. ఆమె కడుపు దాదాపు జుట్టుతో నిండిపోయి ఉందని, ఎండోస్కోప్ చేస్తే కడుపు పైపొర దెబ్బతినే అవకాశ ఉన్నందున శస్త్ర చికిత్స చేసి ఆ హెయిర్ బాల్ని తొలగించినట్లు తెలిపారు వైద్యులు.హెయిర్‌బాల్ ఏర్పడటానికి కారణం..ఆహారంలా కాకుండా, మానవ వెంట్రుకలు జీర్ణం కావు. వెంట్రుకలను పదేపదే మింగినప్పుడు, అవి క్రమంగా కడుపులో పేరుకుపోతాయి. కాలక్రమేణా, ఆ పదార్థం గట్టిగా అతుక్కుపోయి, ఆహారాన్ని, ఇతర పదార్థాలని గట్టిగా బంధించి ఒక దట్టమైన బెజోర్గా ఏర్పడుతుంది. చిన్న బెజోర్లను కొన్నిసార్లు ఎండోస్కోపీ ద్వారా తొలగించవచ్చు, కానీ చాలా పెద్దవి లేదా గట్టిగా అతుక్కుపోయిన ఉండలకు శస్త్రచికిత్స అవసరం.ప్రస్తుతం ఆ యవతి ఆరోగ్యం మెరుగుపడినట్లు అధికారులు తెలిపారు. ఇంతకుముందులా ఆకలి లేకపోవడం, అరగకపోవడం వంటి సమస్యలు ఆమెకు లేవన్నారు. అయితే ఆమె ఏళ్ల తరబడి వెంట్రుకలు తినే అలవాటు ఉందని, ఎవ్వరికీ ఇది తెలియలేదని చెబుతున్నారు వైద్యులు. కాగా, ఇలా వెంట్రుకలు తినే అలవాటుని ట్రైకోఫాగియా అంటారు. ఈ అలవాటుని నుంచి బయపటడకుండా వెంట్రుకల ఉండను తొలగిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదంటున్నారు. అలాంటి అలవాటు ఉన్నవారిని సైక్రియాట్రిస్టుల వద్దకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి ఆ అలవాటు నుంచి బయటపడేలా చేయాలని చెబుతున్నారు వైద్యులు.(చదవండి: సాధువుగా మారి..54 ఏళ్ల వయసులో సీఆర్పీఎఫ్ పోలీస్‌గా!) -
అదంతా రాఘవ్ చద్దా ప్లానే.. ఆప్ ఎదురుదాడి
ఓటర్ జాబితాలో పేరు తొలగింపుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మాటల యుద్ధం మొదలైంది. పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడంపై చద్దా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది పొరపాటు కాదని.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన పేరును తొలగించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఆప్ ఎదురుదాడికి దిగింది.ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఆగస్టు 13న విడుదలైన పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితాలో రాఘవ్ చద్దా పేరు లేదు. ఆయన పేరును ‘పర్మినెంట్‌గా షిఫ్ట్ అయ్యారు’ అనే కారణంతో తొలగించినట్లు జాబితాలో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని చద్దా రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. అయితే ఇదంతా చద్దా వ్యూహంలో భాగమేనని.. ఢిల్లీలో ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఆయన ‘బ్యాక్‌డేటెడ్’ విధానాన్ని ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది.‘బ్యాక్‌డేటెడ్ విధానం’ అంటే.. ఇప్పుడు ఓటరుగా నమోదు చేసుకుంటూ, గతంలోనే ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్లు రికార్డుల్లో చూపించడం. రాఘవ్ చద్దా ఢిల్లీలోని రాజిందర్ నగర్లో ఓటరుగా నమోదు చేసుకునే విషయంలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని ఆప్ ఆరోపిస్తోంది. అంటే.. ఇప్పుడు జరిగే ఓటరు నమోదును గత తేదీ నుంచే అమల్లో ఉన్నట్లు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారన్నది ఆప్ వాదన.‘రాజకీయ కక్షతోనే’..అంతకు ముందు.. తన ఓటర్ ఐడీ పంజాబ్‌లోని మొహాలీలో నమోదై ఉందని చద్దా తెలిపారు. తాను పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ‘షిఫ్టెడ్’గా ఎలా గుర్తించారని ప్రశ్నించారు. ఇది సాధారణ క్లరికల్ తప్పిదం కాదని.. రాజకీయ కక్షతోనే తన పేరును తొలగించారని ఆరోపించారు. అయితే ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని, అభ్యంతరాలు–దావాల ప్రక్రియ ద్వారా పేరు తిరిగి చేర్చుకునే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.ఆప్ ఎదురుదాడి..చద్దా ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండించింది. సర్ ప్రక్రియను నిర్వహించేది ఎన్నికల సంఘమే తప్ప పంజాబ్ ప్రభుత్వం కాదని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో ఎవరి పేరు చేర్చాలి, ఎవరి పేరు తొలగించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని పేర్కొంది.అంతేకాదు.. ఢిల్లీలోని రాజిందర్ నగర్లో తన ఓటరు నమోదును గత తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా చేయడానికి చద్దా ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని తెలిపింది. ఇలాంటి బ్యాక్‌డేటెడ్ లేదంటే చట్టవిరుద్ధమైన ప్రక్రియ జరిగి ఉంటే దానిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.‘ఢిల్లీలోనే ఉంటున్నారు’చద్దా ప్రస్తుతం పంజాబ్‌లో కాకుండా ఢిల్లీలో నివసిస్తున్నారని ఆప్ పేర్కొంది. ఒకవేళ ఆయన పంజాబ్‌లో నివసించకపోతే తన ఓటర్ నమోదును కొనసాగించడమో లేదంటే మార్చుకోవడమో ఆయన వ్యక్తిగత బాధ్యతేనని తెలిపింది. ఇప్పుడు ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపునకు ఆప్, పంజాబ్ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. సర్‌లో భాగంగా తొలగించిన పేర్లపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌లో విడుదల చేయనున్నారు.ఇదీ చదవండి: స్టాలిన్ ఆశలకు మద్రాస్ హైకోర్టు గండి -
లవర్ని కత్తితో పొడిచి చంపి, విషం తాగిన ప్రియుడు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలోని లహోరీ గేట్ ప్రాంతంలోని ఒక హోటల్లో నిన్న రాత్రి ఒక మహిళ రక్తపు మడుగులో పడి శవమై కనిపించిన ఘటన పోలీసులకు ఉలిక్కిపడేలా చేసింది. తన ప్రియుడి చేతిలోకత్తిపోట్లకు గురై మరణించిందని, ఆ తర్వాత నిందితుడు విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు గురువారం తెలిపారు.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం రాజస్థాన్‌కు చెందిన నిందితుడు బిహార్‌కు చెందిన ఆ మహిళ బుధవారం సాయంత్రం 'హోటల్ ప్రిన్స్'లో బస చేశారు. ఏం జరిగిందో తెలియదుగానీ, రాత్రి ఆ వ్యక్తి కత్తితో మహిళపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే కన్నుమూసింది. ఆ తర్వాత తన ప్రాణాలను తీసుకోవాలనే ఉద్దేశంతో అతను విషం సేవించాడు. హోటల్ సిబ్బంది ఆ గదిలో రక్తపు మడుగులో మహిళ పడి ఉండటాన్ని గమనించి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. తదుపరి విచారణ జరుగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు -
బైకుపై దూసుకెళ్లిన థార్.. ఇద్దరు మృతి
ఢిల్లీ: అతివేగం, నిర్లక్షపు డ్రైవింగ్ వాహనదారుల పట్ల శాపంగా మారింది. తాజాగా ఢిల్లీలో అతివేగంతో దూసుకవచ్చిన థార్ వాహనం రెండు ప్రాణాలను బలిగొంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను థార్ వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం వాహనదారుడు తప్పించుకునే యత్నం చేయడంతో స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.నిన్న బుధవారం రాత్రి ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.మృతులు అంజు, సుఖ్బీర్గా గుర్తించారు. ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అక్కడే రోహిణిలో ప్రాంతంలో పాడి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
ఆ ఇద్దరు ఐఏఎస్‌లదీ ఒకే కథ!
సివిల్స్‌లో విజయం సాధారణమేమీ కాదు. మన దేశంలో ఎంతోమంది యువతకు అదొక కల. అందుకోసం ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు కూడా. కానీ ఆ ప్రతిష్ఠాత్మక ఉద్యోగాన్ని సాధించిన తర్వాత కూడా.. అదే కెరీర్లో జీవితాంతం కొనసాగాలని లేదనుకుంటే?. రోమన్ సైనీ, దివ్యా మిట్టల్ ప్రయాణాలే దీనికి ఆసక్తికరమైన సమాధానం. ఇద్దరూ తమకు దక్కిన అవకాశాన్ని వదులుకుని.. తమకు నచ్చిన దారిని ఎంచుకున్నారు.రోమన్ సైనీ 2013లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో 18వ ర్యాంక్ సాధించి IASలోకి అడుగుపెట్టారు. మరోవైపు దివ్యా మిట్టల్ 2012 UPSC పరీక్షలో 68వ ర్యాంక్ సాధించి IASకు ఎంపికయ్యారు. ఆమె 2013 బ్యాచ్ అధికారిణిగా సర్వీసులో చేరారు. ఒకరు ఐఏఎస్‌లో చేరిన 20 నెలల్లోనే బయటకు వచ్చి స్టార్టప్ ప్రపంచంలోకి వెళ్లగా.. మరొకరు 13 ఏళ్ల సుదీర్ఘ సేవ అనంతరం తాజాగా రాజీనామా చేశారు. ఇద్దరి నిర్ణయాల వెనుక దారులు వేరు.. కానీ లక్ష్యం మాత్రం తమకు నచ్చిన జీవితాన్ని ఎంచుకోవడమే. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం కంటే వ్యాపారాన్ని ఎంచుకుంటే.. మరొకరు సుదీర్ఘ ప్రజాసేవ తర్వాత కొత్త అధ్యాయం వైపు అడుగులు వేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి ప్రయాణాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.ఇందులో రోమన్ సైనీ ప్రయాణం చాలా ప్రత్యేకం. 16 ఏళ్లకే ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో విజయం సాధించి వైద్య విద్య పూర్తి చేసిన ఆయన.. 2013లో యూపీఎస్సీ సివిల్స్‌లో ఆల్ ఇండియా 18వ ర్యాంక్ సాధించారు. కేవలం 22 ఏళ్ల వయసులో ఐఏఎస్ అయ్యారు. అయితే ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీస్‌లో ఆయన కెరీర్ రెండేళ్లు కూడా కొనసాగలేదు. లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)లో ఉన్న సమయంలో గౌరవ్ ముంజాల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఐఏఎస్‌ను వీడి ముంజాల్‌తో కలిసి యూన్‌అకాడమీ నిర్మాణంలో భాగమయ్యారు.ఐఏఎస్ నుంచి ఎడ్టెక్ వైపు..2015లో ప్రారంభమైన యూన్ అకాడమీకి రోమన్ సైనీ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరించారు. ఆన్లైన్ విద్య అంతగా విస్తరించని సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద సాహసమే. అయితే కొవిడ్ సమయంలో యూన్ అకాడమీ భారీ స్థాయిలో విస్తరించింది. నెలకు లక్షకు పైగా లైవ్ క్లాసులు, దాదాపు 10 లక్షల మంది చెల్లింపు సబ్స్క్రైబర్లు ఉన్న దశను సంస్థ చూసింది. తాజాగా యూన్ అకాడమీని అప్‌గ్రాడ్ 200 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆల్-స్టాక్ డీల్‌లో కొనుగోలు చేసింది. ఈ పరిణామంతో సైనీ ఐఏఎస్‌ను వదిలి నిర్మించిన అధ్యాయం మరో మలుపు తిరిగింది.13 ఏళ్ల తర్వాత దివ్యా మిట్టల్ రాజీనామారోమన్ సైనీకి పూర్తి భిన్నంగా దివ్యా మిట్టల్ ఐఏఎస్‌లో సుదీర్ఘ ప్రయాణం సాగించారు. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదువుకున్న ఆమె.. లండన్‌లో ఉద్యోగం చేసిన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి సివిల్ సర్వీసెస్‌లో చేరారు. 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. దేవరియా, మిర్జాపూర్, సంత్‌కబీర్ నగర్ వంటి జిల్లాల్లో జిల్లా మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.మీర్జాపూర్‌లోని ఓ మారుమూల కొండ గ్రామానికి పైపుల ద్వారా తాగునీరు అందించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు తాగునీరు అందించడం ఆమె సేవా కాలంలోని గుర్తుండిపోయే పనుల్లో ఒకటిగా నిలిచింది.2026లో ఈ ఇద్దరి కెరీర్ ప్రయాణాలు మరోసారి ఆసక్తికరమైన మలుపు తీసుకున్నాయి. యూపీఎస్సీ 2013 బ్యాచ్‌కు చెందిన రోమన్ సైనీ అప్పటికే ఐఏఎస్‌ను వదిలి వ్యాపార రంగంలోకి వెళ్లారు. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత ఆయన సహ వ్యవస్థాపకుడిగా నిర్మించిన యూన్‌అకాడమీ మరో చేతుల్లోకి వెళ్లింది. రోనీ స్క్రూవాలా నేతృత్వంలోని ఎడ్టెక్ సంస్థ అప్‌గ్రాడ్, యూన్అకాడమీని 200 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆల్-స్టాక్ డీల్‌లో సొంతం చేసుకుంది. ఒకప్పుడు 3.44 బిలియన్ డాలర్ల గరిష్ఠ విలువను అందుకున్న యూన్‌అకాడమీ.. ఇప్పుడు దానితో పోలిస్తే దాదాపు 94 శాతం తక్కువ విలువకు డీల్ కావడం విశేషం. ఈ ఒప్పందంతో యూన్‌అకాడమీ షేర్హోల్డర్లకు upGradలో వాటాలు దక్కాయి. రోమన్ సైనీ మాత్రం సంస్థ నిర్వహణ నుంచి తప్పుకుని ఇకపై అడ్వైజరీ పాత్రలో కొనసాగనున్నారు.అదే సమయంలో దివ్యా మిట్టల్ 13 ఏళ్ల సుదీర్ఘ ఐఏఎస్ సేవకు స్వచ్ఛందంగా ముగింపు పలికారు. ఒకరు ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి స్టార్టప్ నిర్మించి, 13 ఏళ్ల తర్వాత ఆ సంస్థ కొత్త యాజమాన్యంలోకి వెళ్లడాన్ని చూశారు. మరొకరు 13 ఏళ్లపాటు ఐఏఎస్‌గా సేవలందించిన తర్వాత స్వయంగా ఆ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఇద్దరి ప్రయాణాలూ వేర్వేరైనా.. 2026లో మాత్రం ఇద్దరూ తమ జీవితాల్లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.ఇద్దరి నిర్ణయాలు భిన్నమైనప్పటికీ.. సందేశం మాత్రం ఒకటే. యూపీఎస్సీలో విజయం అనేది కెరీర్‌కు ముగింపు కాదు.. కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే. తాను సాధించిన ప్రతిష్ఠాత్మక స్థానంలోనే జీవితాంతం కొనసాగాల్సిన అవసరం లేదని ఈ ఇద్దరి కథలు చెబుతున్నాయి. ఒకరు ఐఏఎస్ నుంచి వ్యాపారవేత్తగా మారితే.. మరొకరు 13 ఏళ్ల పరిపాలనా సేవ తర్వాత కొత్త అధ్యాయం వైపు అడుగులు వేశారు. అందుకే.. యూపీఎస్సీ క్లియర్ చేయడమే అంతిమ లక్ష్యం కాదని, ఆ తర్వాత మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడమే అసలు సవాల్ అని రోమన్ సైనీ, దివ్యా మిట్టల్ ప్రయాణాలు గుర్తుచేస్తున్నాయి.ఇదీ చదవండి: రాఘవ్ చద్దా ఓటు మిస్సింగ్? -
ఢిల్లీలో YSR అవార్డ్స్-2026 ప్రదానోత్సవం
-
రాఘవ్ చద్దా సంచలన ఆరోపణలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఉద్దేశపూర్వకంగా ఆయా ప్రభుత్వాలు ఓటర్లను తొలగిస్తున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఆప్ నేత రాఘవ్ చద్దా ఓటు గల్లంతు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామంపై చద్దా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సర్ ప్రక్రియలో తన పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించడం సాధారణ క్లరికల్ తప్పిదం కాదని చద్దా ఆరోపించారు. ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన తర్వాత తనపై ఆ పార్టీ నాయకత్వం కక్ష పెంచుకుందని చద్దా ఆరోపించారు. ఆ రాజకీయ విభేదాలను ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ వరకు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎన్నికల జాబితా రూపకల్పనలో పనిచేసే అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ.. తన పేరును ‘షిఫ్టెడ్’గా గుర్తించడంపై సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. తన పేరును ఏదైనా కారణంతో ఫ్లాగ్ చేసినప్పటికీ, SIR మార్గదర్శకాల్లోని నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులకు కల్పించిన ప్రత్యేక రక్షణ కింద తన పేరును డ్రాఫ్ట్ జాబితాలో ఉంచాల్సి ఉందని వాదించారు. ఈ నిబంధనను తన విషయంలో ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారని ఆరోపించారు.రూల్స్‌ను కావాలనే..SIR మార్గదర్శకాల్లోని పారా 4(d)ను కూడా రాఘవ్ చద్దా ప్రస్తావించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధుల పేర్లు ఎన్నికల డేటాబేస్‌లో ఫ్లాగ్ అయినప్పటికీ.. క్లెయిమ్స్, అభ్యంతరాల సమయంలో అవసరమైన పత్రాలు సమర్పించుకునేందుకు వారి పేర్లను డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో చేర్చాలని ఈ నిబంధన చెబుతోందని అన్నారు. తాను పంజాబ్ నుంచి సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడినని, అయినప్పటికీ తన పేరును డ్రాఫ్ట్ జాబితాలో ఉంచకుండా ‘షిఫ్టెడ్’గా పేర్కొనడం నిబంధనల ఉద్దేశపూర్వక ఉల్లంఘనేనని ఆరోపించారు.The AAP government in Punjab has now taken its politics of revenge to the Draft Electoral Rolls.I am a sitting Rajya Sabha MP from Punjab, with my voter ID registered in Mohali, Punjab. Yet my name has been classified as “shifted” in the draft electoral rolls.Thankfully,… pic.twitter.com/laAFAAWYiQ— Raghav Chadha (@raghav_chadha) September 3, 202620.66 లక్షల పేర్లు తొలగింపుపంజాబ్లో సర్ సందర్భంగా మొత్తం 20.66 లక్షల ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితా నుంచి తొలగించారు. వీళ్లలో శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవాళ్లు, మరణించినవారు, డూప్లికేట్ నమోదులు ఉన్నవారు ఉన్నారు. మొత్తం ఓటర్లలో ఇది దాదాపు 9.7 శాతం. చద్దా పేరు కూడా ‘ఆబ్సెంట్, షిఫ్టెడ్, డిజీస్డ్ అండ్ డూప్లికేట్’ (ASDD) జాబితాలో పర్మినెంట్లీ షిఫ్టెడ్‌గా నమోదైంది. ఆప్ కౌంటర్అయితే చద్దా ఆరోపణలను అధికార ఆప్ తీవ్రంగా ఖండించింది. సర్ ప్రక్రియను ఎన్నికల సంఘమే నిర్వహిస్తోందని, ఇందులో పంజాబ్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు చద్దా తన ఓటరు నమోదును ఢిల్లీకి మార్చుకునే ప్రయత్నం చేశారని ఆప్ ఆరోపించింది. దీంతో ఓటరు జాబితా వ్యవహారం ఇరు పార్టీల మధ్య రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది. తుది జాబితా ఇంకా రాలేదు: ఈసీఇది ప్రస్తుతం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా మాత్రమేనని ఎన్నికల సంఘం చెబుతోంది. పేరు తొలగింపుపై అభ్యంతరాలు, క్లెయిమ్స్ దాఖలు చేసుకునే అవకాశం చద్దాతో పాటు ఇతర ఓటర్లకు కూడా ఉంది. సెప్టెంబర్‌లో ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబర్‌లో తుది ఓటర్ల జాబితా వెలువడనుంది అని క్లారిటీ ఇచ్చింది.ప్రస్తుతం ఇది డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా మాత్రమే. పేరు తొలగింపుపై క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. తన పేరు ‘షిఫ్టెడ్’గా ఎలా నమోదైందనే దానిపై రాఘవ్ చద్దా అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ వ్యవహారంపై వివరాలు సేకరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఆప్ మాత్రం SIR ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది.ఇదీ చదవండి: ఎవరు చెబితే అలా మాట్లాడుతున్నావ్?.. హీరోయిన్‌పై బీజేపీ ఫైర్ -
ఇతర మహిళల్ని అవమానించొద్దు.. నటిపై భగ్గుమన్న బీజేపీ!
కృతి సనన్ రాఖీ యాడ్ దుమారం చల్లారక ముందే.. మరో నటి స్వరా భాస్కర్ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ సినిమాలోని ‘జౌహర్’ సన్నివేశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. మహిళల త్యాగాన్ని అవమానించేలా మాట్లాడటం సరికాదని విమర్శించింది.ఢిల్లీలో ఇటీవల జరిగిన ‘వుమన్, లైఫ్, ఫ్రీడమ్’ కార్యక్రమంలో స్వరా భాస్కర్ ‘పద్మావత్’లోని జౌహర్ సన్నివేశాన్ని ప్రస్తావించారు. సినిమాలో మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆత్మాహుతి చేసుకున్నట్లు చూపించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ లైంగిక హింసకు గురైన మహిళ ఈ సన్నివేశాన్ని చూస్తే.. తన జీవితాన్ని కొనసాగించాలనుకోవడం తప్పా అనే భావన కలగొచ్చని స్వరా ప్రశ్నించారు. ‘గౌరవం కోసం చనిపోకపోతే పిరికిదానిననే భావన కలుగుతుందా?’ అన్న కోణంలో ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. లైంగిక హింసకు గురైన మహిళలకు కూడా బతికే హక్కు ఉందన్న సందేశమే సమాజానికి వెళ్లాలని ఆమె పేర్కొన్నారు.జౌహర్ (Jauhar) అంటే.. యుద్ధంలో శత్రు సైన్యం చేతిలో చిక్కి అవమానం, లైంగిక హింసకు గురికాకుండా ఉండేందుకు మహిళలు సామూహికంగా అగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకునే ఆచారం.‘ఆమె పిరికిదని అనలేదు’స్వరా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వివరణ ఇచ్చారు. తాను రాణి పద్మావతిని కానీ, జౌహర్ చేసిన మహిళలను కానీ పిరికివాళ్లుగా పేర్కొనలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అనువదించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రశ్నించింది జౌహర్ చేసిన మహిళల ధైర్యాన్ని కాదని.. ఆ సన్నివేశం ఆధునిక సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందన్నదేనని వివరించారు.‘ఇతర మహిళలను గౌరవించాలి’ఈ వివాదంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతి మహిళ ఇతర మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వరా పేరులోని ‘స్వర్’ (గొంతు/స్వరం)ను ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. ఆమె ఎవరి గొంతుతో మాట్లాడుతున్నారనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. మహిళల త్యాగాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.పోలీసులకు ఫిర్యాదుఈ వివాదం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. బిహార్‌కు చెందిన బీజేపీ నేత కృష్ణకుమార్ సింగ్ స్వరా భాస్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హిందూ సమాజం, రాజ్‌పుత్ మహిళలను కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించినట్లు కథనాలు పేర్కొన్నాయి.కర్ణిసేన కూడా..పద్మావత్ విడుదల సమయంలోనే ఆ సినిమాలోని అంశాలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన కర్ణిసేన.. తాజా వివాదంలోనూ స్వరా భాస్కర్‌ను తప్పుబట్టింది. జౌహర్‌ను, రాజ్‌పుత్ మహిళల త్యాగాన్ని విమర్శించే ముందు చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది. కర్ణిసేన మహిళా విభాగం నేత కీర్తి రాథోర్.. స్వరా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌పుత్ మహిళల త్యాగం, ధైర్యాన్ని కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు.మళ్లీ తెరపైకి ‘పద్మావత్’ వివాదం2018లో విడుదలైన ‘పద్మావత్’లో రాణి పద్మావతి పాత్రను దీపికా పదుకొణె పోషించారు. ఆ సమయంలో కర్ణిసేన అభ్యంతరాలతో సినిమా టైటిల్ పద్మావతి కాస్త పద్మావత్‌గా మారింది. ఇక చిత్ర క్లైమాక్స్‌లో శత్రు సేనల చేతికి చిక్కకుండా రాజ్‌పుత్ మహిళలు సామూహికంగా జౌహర్ చేసినట్లు సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ సన్నివేశం అప్పట్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. స్వరా భాస్కర్ కూడా సినిమా విడుదల సమయంలో దర్శకుడు భన్సాలీకి బహిరంగ లేఖ రాసి జౌహర్ చిత్రీకరణపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించడంతో వివాదం తాజాగా మళ్లీ రాజుకుంది.చరిత్రా? సమాజానికి సందేశమా?‘పద్మావత్’లో జౌహర్ చిత్రీకరణ చుట్టూ సాగుతున్న తాజా వివాదం.. చరిత్రను సినిమాల్లో ఎలా చూపించాలి? చారిత్రక ఘటనలను ఆధునిక సామాజిక విలువలతో ఎలా చూడాలి? అనే ప్రశ్నలను మరోసారి ముందుకు తెచ్చింది. ఇదే సమయంలో ‘పద్మావత్’ రచయిత ప్రకాశ్ కపాడియా కూడా జౌహర్ సన్నివేశాన్ని సమర్థించారు. అది ఆ కాలంలోని వాస్తవ పరిస్థితుల ప్రతిబింబమని, నేటి ప్రమాణాలతో మాత్రమే దాన్ని అంచనా వేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరా భాస్కర్ మాత్రం తన ఉద్దేశం ఏ మహిళనూ అవమానించడం కాదని స్పష్టం చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలకు బీజేపీ, కర్ణిసేన నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో.. ‘పద్మావత్’ జౌహర్ వివాదం మరోసారి బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.వివాదాలు స్వరా భాస్కర్‌కు కొత్తేమీ కాదు. నటిగా ‘తను వెడ్స్ మను’, ‘రాంఝనా’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘నిల్ బట్టే సన్నాటా’, ‘వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత తన వ్యాఖ్యలు, రాజకీయ వైఖరితోనూ తరచూ వార్తల్లో నిలిచారు. సీఏఏ-ఎన్ఆర్సీ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడం నుంచి ‘వీరే ది వెడ్డింగ్’లోని ఓ సన్నివేశంపై వచ్చిన విమర్శల వరకు.. ఆమెపై పలు సందర్భాల్లో చర్చ జరిగింది. 2024లో యాహ్యా సిన్వార్పై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఇప్పుడు ‘పద్మావత్’లోని జౌహర్ సన్నివేశంపై వ్యాఖ్యలతో మరోసారి వివాదం రేగింది.ఇదీ చదవండి: పాతికేళ్ల జలయుద్ధానికి ఎట్టకేలకు తెర -
5న శ్రీరామ్ కాలేజీకి ప్రధానమంత్రి మోదీ
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఐదో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ హస్తినలోని ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రముఖ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్(ఎస్ఆర్సీసీ)ని సందర్శించనున్నారు. అదే రోజు జరిగే కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. యువతతో మమేకం కావాలన్న బీజేపీ లక్ష్యానికి చేరుక కావాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని మోదీ ఈ శనివారం కాలేజీ విద్యార్థులనుద్దేశించి మాట్లాడతారని తెలుస్తోంది. చివరిసారిగా 13 సంవత్సరాల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఈ కాలేజీని మోదీ సందర్శించారు. -
నా కుమార్తె వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. వివాహం చేసుకుని స్వతంత్రంగా జీవిస్తున్న ఆమె మాట్లాడిన మాటలకు, మంత్రిగా ఉన్న తనకు పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వడం పెద్ద తప్పని పేర్కొన్నారు. తన కుమార్తె మాట్లాడిన మాటలకు తననెలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనకుండి మాట్లాడించిన శక్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.‘మంగళవారమే ఢిల్లీకి చేరుకున్నప్పటికీ సమయం దొరకలేదు. బుధవారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడిని కలిసి అన్ని అంశాలను సమగ్రంగా వివరించా. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బిజీగా ఉండటంతో ఆయన్ను కలవలేకపోయా. నా వివరణను ఖర్గే, మీనాక్షి నటరాజన్‌లకు లిఖితపూర్వకంగా అందజేశా. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాం«దీలకు ఈ–మెయిల్ ద్వారా, కేసీ వేణుగోపాల్‌కు వాట్సాప్ ద్వారా పంపించా. నా వివరణను పరిశీలిస్తానని ఖర్గే చెప్పారు..’అని సురేఖ వెల్లడించారు. నా కూతురు పూర్తి స్వతంత్ర వ్యక్తిగా జీవిస్తోంది.. ‘నా కూతురికి పెళ్లయింది. తను ఒక ఇంటి కోడలిగా పూర్తి స్వతంత్ర వ్యక్తిగా జీవిస్తోంది. తన ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తం చేసే, మాట్లాడే అధికారం ఆమెకు ఉంది. మాట్లాడవద్దని చెప్పే అధికారం తల్లిదండ్రులుగా మాకు లేదు. సమాజంలో నిత్యం వందల మంది ఎన్నో మాట్లాడుతుంటారు. అలాగే ఆమె కూడా మాట్లాడింది. ఆమె నా బిడ్డ అయినంత మాత్రాన నన్ను ఎందుకు బాధ్యురాలిని చేయాలి? మహిళలు మనుస్మృతి భావజాలాన్ని వీడి తండ్రి లేదా సోదరుల మద్దతుపై ఆధారపడకుండా స్వతంత్రంగా మాట్లాడాలని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నారు. నా బిడ్డ అలాగే స్వతంత్రంగా మాట్లాడింది. ఆ వ్యాఖ్యలను సమరి్ధంచడం లేదా ఖండించడంపై నేనేమీ మాట్లాడను. నా సొంత రాజకీయ జీవితం, నా భర్త రాజకీయ ప్రస్థానం వేరు. మంత్రి పదవి కొనసాగించాలని కోరా.. నేను పద్మశాలి వర్గానికి, నా భర్త మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాళ్లం. తెలంగాణలో ఈ రెండు సామాజిక వర్గాలకు కలిపి దాదాపు 16 శాతం ఓటు బ్యాంకు ఉంది. బీసీ మంత్రిగా ఉన్న నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అప్పగించిన శాఖలను నిరి్వఘ్నంగా నిర్వహిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నా. నా మంత్రి పదవికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనసాగేలా చూడాలని అధిష్టానాన్ని కోరా. నాపై మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ స్వచ్ఛందంగా మాట్లాడలేదు. కొందరు వెనకుండి బలవంతంగా మాట్లాడించారు. వివాదం అవుతుందనే ఉద్దేశంతో వారి పేర్లు బయటపెట్టడం లేదు. ఎవరు మాట్లాడించారో అధిష్టానానికి తెలుసు. మాట్లాడినవారే స్వయంగా మాకు ఫోన్లు చేసి..వాళ్లు పిలిస్తే అయిష్టంగానే వెళ్లాల్సి వచి్చందని చెప్పారు. తప్పు చేయని నన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలి. వారి వెనుక ఉండి నడిపించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది..’అని సురేఖ అన్నారు. పీసీసీ క్రమశిక్షణ సంఘం తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా నివేదిక ఇచ్చి ఉండవచ్చని, ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్న తనపై నిర్ణయం తీసుకునే తుది అధికారం కేవలం అధిష్టానానికే ఉంటుందని చెప్పారు. ఏఐసీసీ తీసుకునే నిర్ణయం ఆధారంగా తన తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. -
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్-2026 ప్రదానోత్సవం
ఢిల్లీ: ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో వైఎస్సార్ అవార్డ్స్-2026 కార్యక్రమం జరిగింది. స్వామినాథన్ ఫౌండేషన్‌కు వైఎస్సార్-2026 అవార్డ్ ప్రదానం చేశారు. కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు తెలంగాణ మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘‘పేద ప్రజల కోసం పనిచేసిన నాయకుడు వైఎస్సార్. ఆయన వల్లే కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చాం. వైఎస్సార్ వల్లే ఏపీలో 39 లోక్‌సభ సీట్లు గెలిచాం. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దే. హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్. స్వామినాథన్ ఫౌండేషన్‌కు వైఎస్సార్ అవార్డు ఇవ్వడం సంతోషం’’ అని ఖర్గే పేర్కొన్నారు. -
వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ
-
ఢిల్లీ అత్యాచార ఘటన: ఇంటిని విడిచిపెట్టిన బాధిత కుటుంబం!
ఆగ్రా: రాజధాని ఢిల్లీలో ఇటీవల కదులుతున్న బస్సులో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. ఈ క్రమంలో మీడియా తాకిడి, సామాజిక వివక్షకు భయపడి బాధితురాలి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని తమ గ్రామాన్ని విడిచిపెట్టారు. మైన్‌పురి జిల్లాలోని తమ ఇంటికి తాళం వేసి వారు వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.బాధిత కుటుంబం గురించి వివరాల కోసం మీడియా ప్రతినిధులు గ్రామానికి రావడం మొదలైనప్పటి నుంచి వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని స్థానికుడు ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఇంటి పరిసరాలు నిర్మానుష్యంగా మారామని చెప్పారు. సోమవారం మీడియా ద్వారానే గ్రామంలోని ప్రజలకు ఈ దారుణం గురించి తెలిసిందని మరో పొరుగింటి వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి భవిష్యత్తు, గోప్యతను దృష్టిలో ఉంచుకుని మీడియా ప్రతినిధులు పదేపదే గ్రామానికి రావద్దని, వీడియోలు, ఫొటోలు తీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.ఆగస్టు 4న గ్రేటర్ నోయిడా నుంచి సెక్టార్ 63 వైపు ప్రయాణిస్తుండగా, బస్సు డ్రైవర్, కండక్టర్ కలిసి ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. దాదాపు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించిన బస్సులో ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. అనంతరం పాత ఢిల్లీలోని కశ్మీరీ గేట్ రింగ్ రోడ్డు వద్ద ఆమెను వదిలేసి వెళ్లారు. నిందితులను డ్రైవర్ కులదీప్ (39), కండక్టర్ సందీప్ (26)గా గుర్తించారు. ప్రస్తుతం బాధిత కుటుంబం బంధువుల వద్ద సురక్షితంగా ఉందని స్థానిక ఎస్హెచ్ఓ తెలిపారు.గ్రామాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాధితురాలి ఇంటికి తాళం వేసి ఉందని, తండ్రి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు బబితా చౌహాన్ గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితురాలి వివరాలను వెల్లడించలేదు.ఇది కూడా చదవండి: రాజస్థాన్ అంటే జైపూర్, ఉదయ్‌పూర్ కాదు.. మరి? -
ఎర్రకోట పేలుడుకు నిధులిచ్చారంటూ రూ. 30 లక్షలు దోచేశారు
సాక్షి, ఢిల్లీ: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు సంబంధించి ఢిల్లీలో ఒక దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (NIA,ATS) అధికారులమని చెప్పుకొని ఒక ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నుంచి 30 లక్షల రూపాయలను కాజేసీన వైనం కలకలం రేపింది.ఢిల్లీలోని ద్వారకాకు చెందిన 74 ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి గత ఏడాది జరిగిన రెడ్ ఫోర్ట్ పేలుడులో నిందితులకు నిధులిచ్చారని భయపెట్టేశారు. ఎర్రకోట పేలుడు కేసు నిందితులకు అతని బ్యాంక్ ఖాతా నుంచే నిధులు వెళ్లాయని బెదిరించారు. బ్యాంక్ ఖాతాను ఉపయోగించారని చెప్పి కేటుగాళ్లు అధికారిని, ఆయన భార్యను భయభ్రాంతులకు గురిచేశారు. దాదాపు ఏడు రోజుల పాటు 'డిజిటల్ అరెస్టు'లో ఉంచారు. దీంతో బెంబేలెత్తిపోయిన భయపడిన ఆ దంపతులు, తమ జీవితకాలం లో దాచుకున్న సొమ్ము రూ. 30 లక్షలను మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు.ఇదీ చదవండి: సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలువీడియో కాల్స్ ద్వారా వారిని బెదిరించి, నిఘా పెట్టి, ('డిజిటల్ అరెస్ట్') బయటివారితోగానీ, పిల్లలతోగానీ మాట్లాడకుండా భయభ్రాంతులకు గురిచేశారు. వాట్సాప్‌లో నకిలీ రహస్య ఒప్పంద పత్రాలు (Confidentiality Agreement) పంపి సంతకాలు కూడా చేయించుకున్నారు. ఖాతాలోని డబ్బులను తనిఖీ చేయాలని, విచారణ ముగిశాక తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. దీంతో బాధితుడు తన ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసి రెండు విడతలుగా (రూ. 15 లక్షలు చొప్పున) మొత్తం రూ. 30 లక్షలను ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత నేరగాళ్లు ఆర్బీఐ గవర్నర్ సీల్‌తో ఉన్న నకిలీ వెరిఫికేషన్ లెటర్ పంపారు. ఆతరువాత యధావిధిగా ముఖం చాటేశారు.బాధితుడి ఫిర్యాదుతో క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది. హర్యానాకు చెందిన సునీల్ సింగ్లా అనే వ్యక్తికి చెందిన 'శ్రీ బాలాజీ ట్రాక్టర్' కంపెనీ బ్యాంక్ ఖాతాకు ఈ డబ్బు బదిలీ అయినట్లు మే నెలలో గుర్తించి, అతడిని మే 11న అరెస్ట్ చేశారు. ఇతని ఖాతా ద్వారా దాదాపు రూ. 1 కోటికి పైగా సైబర్ మోసాల లావాదేవీలు జరిగినట్లు తేలింది. పోలీసులు వెంటనే స్పందించి బాధితుడు పంపిన రూ. 15 లక్షల ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయగలిగారు. అందులో రూ. 12 లక్షలను రికవరీ చేసి తిరిగి బాధితుడికి అందించారు. -
ఇంజన్ ఫెయిల్.. ఇండిగో ఫ్లైట్ కు తప్పిన ఘోర ప్రమాదం
-
ఢిల్లీలో నిర్భయ-2.. కదులుతున్న బస్సులో 47 కిలోమీటర్లు రాక్షసత్వం
ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో చోటుచేసుకున్న మరో నిర్భయ తరహా దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్, బాధితురాలిపై దారుణం జరిగిన ప్రైవేట్ స్లీపర్ బస్సును ఎన్హెచ్ఆర్సీ సభ్యులు స్వయంగా పరిశీలించారు. ఈ ఘోరానికి సంబంధించి ఢిల్లీ పోలీస్ కమిషనర్, గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్, మైన్‌పురి ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. విచారణ పురోగతి, బాధితురాలికి అందించిన పరిహారం వివరాలతో కూడిన సమగ్ర నివేదికను రెండు వారాల్లోపు సమర్పించాలని ఆదేశించింది.అసలేం జరిగింది?ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని (16) ఆగస్టు 4న తల్లి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. నోయిడా సెక్టార్-63లోని బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో పొరపాటున గ్రేటర్ నోయిడా పరిచౌక్ వద్ద బస్సు దిగింది. జోరు వానలో సెక్టార్-63 వైపు వెళ్లే వాహనం కోసం వేచి చూస్తుండగా, సుర్జాపూర్ నుంచి వస్తున్న 'విశ్వనాథ్' అనే ప్రైవేట్ స్లీపర్ బస్సు డ్రైవర్ కుల్దీప్ (39), కండక్టర్ సందీప్ (26)లు తాము సెక్టార్-63 వైపే వెళ్తున్నామని నమ్మబలికి ఆమెను బస్సులోకి ఎక్కించుకున్నారు.47 కిలోమీటర్లు నరకంబాధితురాలు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన నిందితులు, బస్సు కర్టెన్లు మూసివేసి లైట్లు ఆర్పివేశారు. గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వరకు సుమారు 47 కిలోమీటర్ల మేర కదులుతున్న బస్సులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి, కశ్మీరీ గేట్ వద్ద ఆమెను దింపివేసి పరారయ్యారు.తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న బాధితురాలు ధైర్యం చేసి ఆటోలో సమీప పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బస్సులోని సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంతో, మార్గమధ్యలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఢిల్లీ పోలీసులు పక్కా ఆధారాలతో డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు.నాటి నిర్భయ ఘటనను గుర్తు చేసేలా ఈ ఘోరకలి 2012 నాటి ‘నిర్భయ’ దారుణాన్ని తలపించింది. ఢిల్లీ-నోయిడా ఎక్స్‌ప్రెస్ వే, రింగ్ రోడ్డు వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన నిఘా మార్గాల్లో బస్సు అంత దూరం ప్రయాణిస్తున్నా పెట్రోలింగ్ వాహనాలు గానీ, పోలీసులు గానీ గుర్తించకపోవడంపై మీడియా భద్రతా లోపాలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల మహిళా భద్రతా దావాల డొల్లతనాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్, ఆప్ వంటి ప్రతిపక్షాలు మండిపడటంతో రాజకీయంగానూ పెద్ద దుమారమే రేగింది.మరోవైపు, వివాదాలకు తావివ్వకుండా కశ్మీరీ గేట్ స్టేషన్‌కు వచ్చిన బాధితురాలికి ఢిల్లీ పోలీసులు తక్షణమే స్పందించి జీరో-ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్‌తో పాటు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించాయి.ఆగస్టు 4న ఘటన జరగగా.. ఆగస్టు 31న జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్ 1న జాతీయ మానవ హక్కుల కమీషన్ చర్యలకు ఉపక్రమించింది. -
సీజేపీ నిరసనకారులకు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన నిరసనల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు రద్దు కానున్నాయి. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన సీజేపీ నిరసనలపై దేశంలో ఎక్కడా ఎఫ్ఐఆర్లను నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2,873 నేరచరిత్ర కలిగిన వారి నేపథ్యంలో వారిపై ఎఫ్ఐఆర్ల నమోదుపై పోలీసులకు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నష్టపరిహారం చెల్లింపులపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించింది. విధివిధానాలు రూపొందించిన మూడు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలరని చెప్పింది. ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలనే షరతుకి లోబడి ఆర్టికల్ 142 కింద ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తున్నామని, ఈ విధానాన్ని రాష్ట్రాలు సైతం పాటించవచ్చని పేర్కొంది.‘సెప్టెంబర్ 5 ర్యాలీ’ రద్దువిద్యార్థులపై కేసుల ఉపసంహరణతో కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5న తలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. మరోవైపు, అంతకుముందు ఎఫ్ఐఆర్ల రద్దుకు సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు ఢిల్లీ , బిహార్, అస్సాం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర పోలీసులు. రెండు పక్షాలు పరస్పర నమ్మకంతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిదని సీజేఐ చెప్పారు. విద్యార్థులను ప్రత్యర్థులుగా భావించడం లేదని సొలిసిటర్ జనరల్ తెలిపారు. -
ప్లేస్కూల్లో మూడేళ్ల బాలుడిపై అమానుషం, సీఎం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో మకూన్స్ ప్లే స్కూల్లో మూడేళ్ల బాలుడిని టీచర్, కేర్ టేకర్ దారుణంగా కొట్టిన ఉదంతంపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్రంగా స్పందించారు. ఆ ప్లేస్కూల్ ప్రాంగణాన్ని తక్షణమే సీల్ చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) స్పందిస్తూ, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ద్వారా స్కూల్ సీలింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.ఢిల్లీలో ఒక ప్లేస్కూలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రిళ్లు నిద్రపోకుండా, భయంతో వణికిపోతున్న తమ బిడ్డను చూసి అనుమానం వచ్చిన తల్లితండ్రులు ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. భయంతో గడిచిన 15 రోజులుగా సరిగ్గా స్నానం కూడా చేయలేకపోతున్నాడని, వాష్‌రూమ్‌లోకి వెళ్లడానికి భయపడుతున్నాడని బాలుడి తండ్రి వాపోయారు. A three-and-a-half-year-old boy was allegedly physically and sexually assaulted and mentally harassed at a private playschool in northeast Delhi's Maujpur, with CCTV footage purportedly showing him being tied to a chair, kicked and held by his ears.Police have registered a case… pic.twitter.com/TaLzjs8XNk— Hate Detector 🔍 (@HateDetectors) August 31, 2026 ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు? Delhi Government has taken serious cognisance of the deeply disturbing incident reported from a play school in Maujpur.On the directions of Chief Minister Smt. Rekha Gupta, the District Magistrate has initiated proceedings to seal the premises of the school. Police…— CMO Delhi (@CMODelhi) August 31, 2026అంతేకాదు బాలుడిని ఆసుపత్రికి తీసుళ్లడంతో మరో ఘోరం బయటపడింది. బాలుడి రెండు చెవుల కర్ణభేరిలువాచినట్లు వైద్యులు తెలిపారు. అతని ముఖం, చేతులపై స్పష్టమైన గాయాల గుర్తులు కనిపించాయి. దీంతో తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. తమకేం తెలీదంటూ యాజమాన్యం బుకాయించడంతో తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీ కావాలని డిమాండ్‌చేశారు. అది ఇవ్వాలంటే రూ.1,500 చెల్లించాలని స్కూల్ యాజమాన్యం చెప్పింది. ఆ నగదు చెల్లించి ఫుటేజీ తెప్పించి ఆగస్ట్ 16, 17, 18 తేదీల దృశ్యాలను పరిశీలించగా అసలు సంగతి బయటపడింది. బాలుడిని చిన్న చైర్‌కు కట్టేసి మూడు గంటల వ్యవధిలో పలుమార్లు కొట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇదేంటని స్కూలు యాజమాన్యాన్ని నిలదీస్తే పిల్లాడు బాగా అల్లరి చేస్తుంటే మందలించామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.#WATCH | Delhi | On play school Attendant arrested for allegedly abusing 3-year-old boy in Maujpur, Navneet Chaudhary, father of 3-year-old boy, says, “…The child had been troubled for several days… Then, suddenly, on 18 August, my son came home from school. As soon as he got… https://t.co/wu7RfIAjo0 pic.twitter.com/vmILhjfgcC— ANI (@ANI) August 31, 2026 దీనిపై బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదుచేశారు. కేర్‌టేకర్‌ను అరెస్ట్‌చేసి స్కూల్ డైరెక్టర్ సునీతా బన్సల్, ప్రిన్సిపల్ నీలమ్, ఉపాధ్యాయులు సిమ్రాన్, పూజలపై కేసు నమోదుచేశారు. పోక్సో చట్టంతోపాటు భారతీయ న్యాయసంహిత సెక్షన్ల కింద కేసు వేసి దర్యాప్తు ఆరంభించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలమేరకు పాఠశాల ప్రాంగణాన్ని సీజ్‌చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఘటనలో అన్ని రకాల సాక్ష్యాధారాలను సేకరించేందుకు పాఠశాల ప్రాంగణాన్ని పోలీసులు సీజ్‌చేశారు. పాఠశాల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాదీనంచేసుకున్నారు. ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్‌బై చెప్పిన ‘నేషనల్ క్రష్’ -
ఇంజన్ లోపం, ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
పనాజీ : ఢిల్లీనుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా ఆందోళన తలెత్తింది. గోవా-ఢిల్లీ మార్గంలో ప్రయాణిస్తున్న విమానాన్ని తిరిగి గోవా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.మంగళవారం ఉదయం 9:10 గంటలకు గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం (6E 2102), గాలిలో ఉండగా ఇంజిన్ వైఫల్యాన్ని సిబ్బంది గుర్తించారు. ఇంజిన్లలో ఒకటి సరిగా పనిచేయకపోవడంతో వెంటనే మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దీంతో కొద్ది సమయం పాటు 'పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితి' (full emergency) ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?ఇదీ చదవండి: రూ. 15 లక్షల కారు, 70 తులాల గోల్డ్ : అయినా కట్నదాహానికి టీచర్ భువనేశ్వరి ఆహుతి -
ఇదంతా స్కూల్లో ఓ బ్యాడ్ అంకుల్ చేశాడు అని చెప్పిన నర్సరీ పాప
ఢిల్లీ ఔటర్-నార్త్‌లోని బవానా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడేళ్ల నర్సరీ బాలికపై బస్సు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు సోమవారం తెలిపారు. పాఠశాల బస్సు నడిపే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వారు చెప్పారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక శరీరంలోని ప్రైవేట్ భాగాల్లో గాయాలను కుటుంబ సభ్యులు గుర్తించడంతో ఆగస్టు 19న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి అడిగినప్పుడు.. తనకు చాక్లెట్లు ఇస్తున్న ఒక అంకుల్ గురించి తల్లికి ఆ పాప చెప్పినట్లు పోలీసులు తెలిపారు. చాక్లెట్స్ ఇస్తున్న ఓ బ్యాడ్ అంకుల్ ఇదంతా చేశారని ఆ పాప చెప్పిందన్నారు. ఆగస్టు 24న బాలికకు పాఠశాలలోని వ్యక్తుల ఫొటోలు, సీసీటీవీ దృశ్యాలు చూపించగా, ఆమె నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిపై బవానా పోలీస్ స్టేషన్లో బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో)లోని సెక్షన్లు 8, 10, 21, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 74 కింద కేసు నమోదు చేశారు. మహిళపై ఆమె గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో దాడి చేయడం లేదా నేరపూరిత బలప్రయోగానికి సంబంధించిన సెక్షన్ 74 కింద కూడా కేసు నమోదు చేసి, పాఠశాల నుంచే నిందితుడిని అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై ఆగస్టు 24న బవానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆ పాఠశాల ఢిల్లీ ఔటర్-నార్త్‌లోని పూత్ ఖుర్ద్‌లో ఉంది. నిందితుడు సుమారు 8 నెలలుగా పాఠశాల బస్సు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బాలికను బాత్రూమ్ వరకు వెంబడించి, అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమిక దర్యాప్తులో బాలికపై 4 సార్లు లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోందని అధికారి తెలిపారు. బస్సు డ్రైవర్ తన ఫోన్లో పిల్లలకు చాక్లెట్లు ఇస్తున్న వీడియోలను కూడా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.“పాఠశాల ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నాం. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపిస్తున్నాం” అని అధికారి తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. -
అప్పుడు సీజేపీ నేతలు నిరసనను వదిలేద్దామనుకున్నారు
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద పోలీసులు జులై 20న నిరసనలపై చర్యలు తీసుకున్న తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు తమ ఆందోళనను ముగించే మార్గం కోసం ప్రయత్నించారని పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ వెల్లడించారు. ఆ చర్యలో భాగంగా నిరసన వేదికను తొలగించడంతో పాటు పలువురు నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారని అన్నారు.పీడీఎక్స్ పాడ్‌కాస్ట్‌లో ప్రకర్ గుప్తాతో మాట్లాడిన వాంగ్‌చుక్ పలు వివరాలు తెలిపారు. పోలీసుల చర్య తర్వాత సీజేపీ నాయకత్వం తీవ్ర నిరుత్సాహానికి గురైందని చెప్పారు. జంతర్ మంతర్ నుంచి వెళ్లిపోయి ఇళ్లకు తిరిగి వెళ్లాలని నిరసనకారులను ప్రోత్సహించే సందేశాన్ని రూపొందించడంలో సహాయం చేయాలని తనను కోరినట్లు తెలిపారు.జులై 20న జరిగిన చర్య తర్వాత సీజేపీ నాయకత్వం తనతో.. “ఇప్పుడు అందరూ వెళ్లిపోయారు, మన వేదిక కూడా ధ్వంసమైంది, ఇక ఆశ లేదు” అని చెప్పినట్లు వాంగ్‌చుక్ గుర్తుచేసుకున్నారు. నిరసనకారులు అలసిపోయారని, కొంత విరామం తీసుకోవాలని చెబుతూ సందేశం పెట్టాలని నిర్వాహకులు కోరినట్లు వాంగ్‌చుక్ తెలిపారు.“ఇప్పుడు మీకు మంచి విశ్రాంతి అవసరం, ఇంటికి వెళ్లి నిద్రపోండి, జంతర్ మంతర్ వద్ద ఉండకండి, రేపు ఏం చేయాలో చూద్దాం” అని చెప్పేలా సందేశం పెట్టాలని వారు కోరినట్లు ఆయన చెప్పారు. అలాంటి సందేశాన్ని తాను రాశానని, అయితే చివరకు దాన్ని ప్రచురించలేదని వాంగ్‌చుక్ తెలిపారు.సీజేపీ నాయకత్వం తీవ్ర నిరాశకు గురైందినిరసనలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చిన తర్వాత జులై 20న పోలీసుల చర్య జరిగింది. ఆ తర్వాత పరిస్థితితో సీజేపీ నాయకత్వం తీవ్ర నిరాశకు గురైందని వాంగ్‌చుక్ చెప్పారు. ఆందోళన పూర్తిగా ముగిసిపోయిందని నాయకత్వం భావించిందని తెలిపారు. “ఒకటి, రెండు లక్షల మంది వచ్చినా ఆ రాత్రే అందరూ వెళ్లిపోయారు.. అంతా అయిపోయిందని అందరూ అనుకున్నారు” అని ఆయన చెప్పారు. నిరసన మళ్లీ ఎప్పటికైనా ప్రారంభమవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో నిర్వాహకులు ఉన్నారని తెలిపారు.“ఇప్పుడు ఎప్పుడైనా మళ్లీ మొదలైతే మొదలవుతుంది, లేకపోతే లేదు” అని సీజేపీ నాయకత్వం భావించినట్లు వాంగ్‌చుక్ గుర్తుచేసుకున్నారు. అయితే, మరుసటి రోజు యువ నిరసనకారులు జంతర్ మంతర్‌కు తిరిగి రావడం ప్రారంభించడంతో పరిస్థితి మారిందని వాంగ్‌చుక్ చెప్పారు. పోలీసుల చర్య తర్వాత దెబ్బతిన్న సీజేపీ నాయకత్వం నమ్మకం, యువత తిరిగి రావడంతో మళ్లీ పెరిగిందని తెలిపారు.యువత అద్భుతమైన పని చేసిందిపోలీసుల చర్యను ఎదుర్కొన్నప్పటికీ తిరిగి వచ్చిన యువ నిరసనకారులను వాంగ్‌చుక్ ప్రశంసించారు. యువత అద్భుతమైన పని చేసిందని ఆయన అన్నారు. లాఠీచార్జిని ఎదుర్కొన్న తర్వాత కూడా తిరిగి వచ్చిన వారిని ప్రశంసించారు. నిరసన వద్ద ఎంతమంది ఉంటున్నారనే దానిపై సీజేపీ నాయకత్వం ధైర్యం పెరగడం, తగ్గడం జరుగుతుందని ఆయన చెప్పారు. వారు వెళ్లిపోయినప్పుడు ధైర్యం తగ్గిపోయిందని, మరుసటి రోజు యువత తిరిగి వచ్చినప్పుడు ధైర్యం పెరిగిందని చెప్పారు.ఇదీ చదవండి: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ -
ఇంట్లోంచి వెళ్లిపోయిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో..
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో ఈ నెల ప్రారంభంలో ఓ స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన ఆగస్టు 4న పరి చౌక్ సమీపంలో జరిగింది.తన ఫిర్యాదులో బాధితురాలు.. నిందితులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, తాను ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారని ఆరోపించింది. అనంతరం వారు ఆమెను ఢిల్లీలోని కశ్మీర్ గేట్ సమీపంలో వదిలి వెళ్లిపోయారు. ఢిల్లీ ఉత్తర జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ నిహారిక భట్ మాట్లాడుతూ.. డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను అదే రోజు టిమార్పూర్లోని పార్కింగ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు తెలిపారు.పోలీసులు బస్సును కూడా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఆగస్టు 14న బస్సు ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ దృశ్యాలను సేకరించారు. ఈ బాలిక ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి నివాసి అని పోలీసులు తెలిపారు. చదువు విషయంలో తల్లి మందలించడంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. నోయిడా సెక్టార్ 63లో నివసించే తన బంధువు వద్దకు వెళ్లేందుకు ఆమె బయలుదేరింది.భారీ వర్షం, చీకటి కారణంగా తాను పొరపాటున పరి చౌక్ వద్ద దిగిపోయినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. తాను వేరే ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకుని స్లీపర్ బస్సును ఆపినట్లు చెప్పింది. ఆ బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. బస్సు నోయిడా సెక్టార్ 63కు వెళ్తోందని కండక్టర్ చెప్పడంతో ఆమె బస్సు ఎక్కింది.సూరజ్‌పూర్‌లోని వర్క్‌షాప్‌లో మరమ్మతుల అనంతరం స్లీపర్ బస్సు ఖాళీగా తిరిగి వస్తోందని పోలీసులు తెలిపారు. బస్సు కదలడం ప్రారంభించిన కొద్దిసేపటికే కండక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడని బాలిక ఆరోపించింది. అనంతరం ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, తాను ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారని ఆమె తెలిపింది. నిందితులు ఆమెను రింగ్ రోడ్ సమీపంలో వదిలి పారిపోయిన తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించింది.కుల్దీప్, సందీప్‌లపై సామూహిక అత్యాచారం, కిడ్నాప్, దాడి కేసులు నమోదు చేశారు. స్లీపర్ బెర్త్‌లకు బస్సులో తెరలు ఉంటాయి. ఫోరెన్సిక్ బృందాలు బస్సులో బాలికకు చెందిన వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలల సంక్షేమ కమిటీ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. 2012లో ఢిల్లీలో బస్సులో 23 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్భయ కేసును తలపించేలా ఈ తాజా ఘటన చోటుచేసుకుంది. -
IND vs AFG: టీమిండియాలోకి ఊహించని ప్లేయర్!
శ్రీలంక పర్యటనను ముగించుకున్న భారత క్రికెట్ జట్టు తదుపరి.. స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. అయితే, ఈ సిరీస్‌లో అఫ్గాన్ భారత్‌లో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఇందుకు వేదిక.కాగా అఫ్గాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా అక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో యూఏఈ లేదంటే భారత్‌లో అఫ్గాన్ బోర్డు తమ మ్యాచ్‌లు నిర్వహించుకుంటోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో టీమిండియా- అఫ్గాన్ టీ20 మ్యాచ్‌లకు షెడ్యూల్ ఖరారైంది.తెరమీదకు ఊహించని పేరుఈ క్రమంలో భారత జట్టు ఎంపిక గురించి చర్చ జరుగుతుండగా.. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ ఒకరు అనూహ్యంగా కృనాల్ పాండ్యా పేరును తెరమీదకు తెచ్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానాన్ని సెలక్టర్లు కృనాల్‌తో భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. కాగా టీమిండియా ఇటీవల యూకే పర్యటనలో భాగంగా ఘోర పరాభవాలు చవిచూసిన సంగతి తెలిసిందే.తొలిసారి టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో తొలుత పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయిన టీమిండియా.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్‌వాష్ అయింది. అనంతరం జింబాబ్వే పర్యటనలో ఆతిథ్య జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసి పరువు నిలబెట్టుకుంది.అయితే, యూకే టూర్లో అక్షర్ పటేల్ ప్రదర్శన పట్ల సెలక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అతడి స్థానంలో కొత్త లెఫ్టార్మ్ స్పిన్నర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెలక్టర్ల చూపు కృనాల్ పాండ్యాపై పడినట్లు సదరు రిపోర్టర్ పేర్కొన్నారు.భువనేశ్వర్ కుమార్‌తో కృనాల్ పాండ్యా (PC: RCB/BCCI)ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ?2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కృనాల్ పాండ్యా 2021లో టీమిండియా తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. మొత్తంగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటి వరకు ఐదు వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన కృనాల్ పాండ్యా.. 130, 124 పరుగులు చేశాడు. అదే విధంగా.. వన్డేల్లో రెండు, టీ20లలో 15 వికెట్లు పడగొట్టాడు.ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర35 ఏళ్ల కృనాల్ పాండ్యా ఐపీఎల్ 2025,2026 సీజన్లలో అద్భత ప్రదర్శన కనబరిచాడు. గతేడాది 109 పరుగులు చేయడంతో పాటు పదిహేడు వికెట్లు తీశాడు. ఇక ఈ ఏడాది తొమ్మిది ఇన్నింగ్స్ ఆడి 226 పరుగులు సాధించిన కృనాల్.. 15 ఇన్నింగ్స్‌లో కలిపి 14 వికెట్లు కూల్చాడు.తద్వారా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండు టైటిళ్లు గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో కృనాల్ పాండ్యాకు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఓ మోస్తరుగా రాణించాడు. పదకొండు ఇన్నింగ్స్‌లో కలిపి 173 పరుగులు చేసిన అక్షర్.. 13 ఇన్నింగ్స్‌లో 11 వికెట్లు తీశాడు. అయితే, యూకే పర్యటనలో ఆరు ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు వికెట్లు తీసి.. 48 పరుగులు మాత్రమే చేయగలిగాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ వీరవిహారం -
ఢిల్లీలో నిర్భయ తరహాలో ఘటన.. స్లీపర్ బస్సులో బాలికపై..
-
Delhi: మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలోని రాజధాని పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఒక కలప (టింబర్) గోదాములో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఢిల్లీ అగ్నిమాపక సేవల విభాగం వెల్లడించింది. ఒక భవనం బేస్మెంట్లో సుమారు 2,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ కలప గోదాములో మంటలు చెలరేగాయి. గోదాములో భారీ ఎత్తున కలప నిల్వలు ఉండటంతో క్షణాల్లోనే మంటలు శరవేగంగా వ్యాపించాయి. #WATCH | Delhi: Fire breaks out at a timber godown near Rajdhani Park metro station; 25 fire tenders are deployed. Further details awaited.(Source: Fire Department) https://t.co/kkLqWmtovx pic.twitter.com/MFCtjY9Hls— ANI (@ANI) August 30, 2026సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపు చేసేందుకు మొత్తం 25 ఫైరింజన్లను ఘటనా స్థలానికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి, పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. ఎట్టకేలకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. గోదాము బేస్మెంట్లో ఉన్నప్పటికీ మంటలను సకాలంలో నియంత్రించగలిగామని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు, గోదాములో జరిగిన ఆస్తి నష్టం తీవ్రతకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: బెడిసికొట్టిన వితంతు వదినతో ప్రేమ.. యువకుడు ఆత్మహత్య -
వైద్యానికని చెప్పి.. కన్న కొడుకును కడతేర్చిన తండ్రి
న్యూఢిల్లీ: మానసిక సమస్యలు, స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న తన 38 ఏళ్ల కుమారుడిని ఓ తండ్రి తన స్నేహితుడితో కలిసి దారుణంగా హతమార్చిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి 64 ఏళ్ల నిందితుడితో పాటు అతడికి సహకరించిన 49 ఏళ్ల వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని కాళింది కుంజ్ వద్ద ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో పాడుబడిన షిప్పింగ్ కంటైనర్‌లో తీవ్ర గాయాలతో ఉన్న గుల్ హసన్ (38) మృతదేహాన్ని ఆగస్టు 23న ఉదయం గుర్తించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ఈస్ట్) వినీత్ కుమార్ తెలిపారు.ఎన్టీపీసీ ప్రహరీ గోడ పక్కనే ఉన్న కంటైనర్‌లో రక్తం మడుగులో, తలకు బలమైన గాయంతో ఉన్న మృతదేహం కనిపించడంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద హత్య కేసు నమోదు చేశారు. ఏసీపీ అనిల్ కుమార్ శర్మ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఘటనా స్థలం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, బాధితుడిని ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలానికి తీసుకెళ్లడం, ఆ తర్వాత వారు మాత్రమే ఒంటరిగా తిరిగి రావడం కనిపించింది.ఆ ఆధారాలతో నిందితులను గోవింద్‌పురిలోని ఓ టైలరింగ్ ఫ్యాక్టరీ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వైద్యుడి వద్దకు తీసుకెళ్తున్నామని నమ్మించి బాధితుడిని నిర్జన ప్రదేశంలోని కంటైనర్ వద్దకు తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. అక్కడ మొదట రాయి లేదా బండతో తలపై బలంగా కొట్టి, అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, హత్యకు గల పూర్తి కారణాలు, ఘటన క్రమాన్ని తెలుసుకునేందుకు నిందితులను విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: భారత డీఎన్ఏలోనే ఏకత్వం: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ -
ఆ మూడింటి వల్లే.. సోనియా పుస్తకాన్ని ఆపేశారా!?
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం భారత్‌లో ప్రచురణపై వివాదం ముదురుతోంది. ప్రపంచవ్యాప్తంగా పుస్తకాన్ని ప్రచురించేందుకు సిద్ధమైన పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా.. ఇక్కడ మాత్రం పబ్లిష్ చేయబోమని ప్రకటించింది. అయితే వ్యవహారంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతోనే పెంగ్విన్ వెనక్కి తగ్గిందని అంటోంది.సోనియా గాంధీ రాసిన ఈ జ్ఞాపకాల పుస్తకాన్ని అమెరికాకు చెందిన ఆల్ఫ్రెడ్ ఏ. నాఫ్.. పెంగ్విన్ రాండమ్ హౌస్ గ్రూప్‌లోని సంస్థగా నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే భారత్‌లో ఈ పుస్తకానికి పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురణకర్త కాదని తాజాగా స్పష్టం చేసింది. పుస్తకాన్ని ప్రచురించేందుకు తాము ఆసక్తి చూపామని, అయితే అందులో కొన్ని విషయాల్ని తాము నిజమా? కాదా? అని ధృవీకరించుకోవాల్సి ఉంటుందని, ఈ క్రమంలో రచయిత(సోనియా గాంధీ)తో జరిగిన చర్చల పూర్తి ఫలవంతంగా జరగలేదని వెల్లడించింది. ఆ వివరాలు గోప్యమైనవని, వాటిపై మరింత వ్యాఖ్యానించబోమని తెలిపింది.మూడు అంశాలే అసలు వివాదమా?కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆటోబయోగ్రఫీలో మూడు కీలక అంశాలపై పెంగ్విన్ ఇండియాతో సోనియా గాంధీకి విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మొదటిది చైనా సరిహద్దు వివాదం, భారత భూభాగంలో చొరబాట్లు. రెండోది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన పనితీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సోనియా గాంధీ అభిప్రాయాలు. మూడోది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రభావం, భారత రాజకీయాలు-సామాజిక వ్యవస్థపై దాని పాత్ర. ఈ అంశాలకు సంబంధించిన కొన్ని భాగాలను సవరించాలని లేదంటే పూర్తిగా తొలగించాలని పెంగ్విన్ ఇండియా సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తన అనుభవాలు, అభిప్రాయాల ఆధారంగా రాసిన విషయాలను మార్చేందుకు సోనియా గాంధీ అంగీకరించలేదని సమాచారం.‘ఒత్తిడి ఉంది’.. కాంగ్రెస్ ఆరోపణఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్.. పెంగ్విన్ ఇండియా ప్రకటన బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్, ఇతర అంశాలపై పుస్తకాలను ప్రచురించేందుకు సంస్థ సిద్ధంగా ఉండగా.. సోనియా గాంధీ పుస్తకంపై ఎందుకు వెనుకడుగు వేసిందని ప్రశ్నించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తారు. ప్రపంచవ్యాప్తంగా అదే పుస్తకాన్ని ప్రచురిస్తున్నప్పుడు భారత్‌లో మాత్రం మార్పులు ఎందుకు కోరుతున్నారని నిలదీశారు. పుస్తకాన్ని ఒత్తిడితో అడ్డుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం అని ఆరోపించారు.‘కట్టుకథలు అల్లొద్దు’.. బీజేపీ కౌంటర్కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పుస్తకంపై భయాందోళన వాతావరణం ఉందంటూ కాంగ్రెస్ తప్పుడు కథనాన్ని సృష్టిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేసవన్ విమర్శించారు. పుస్తకంలోని ఏ భాగాలకు వాస్తవ నిర్ధారణ అవసరమైందో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత అజయ్ అలోక్.. పుస్తకంలో వాస్తవాలు, గణాంకాలు సరిగా లేకపోవడం వల్లే ప్రచురణకర్తలు వెనక్కి తగ్గుతున్నారని వ్యాఖ్యానించారు.ఆత్మకథలో ఏముంది?‘Belonging: A Journey of Love’లో తన జీవితంలోని వ్యక్తిగత, రాజకీయ ప్రయాణాన్ని సోనియా గాంధీ వివరించారు. ఇటలీలో ఓ చిన్న పట్టణంలో గడిపిన బాల్యం నుంచి రాజీవ్ గాంధీ భార్యగా భారత్‌కు రావడం, ఇందిరా గాంధీ కోడలిగా మారడం, 1984లో ఇందిరా గాంధీ హత్య, 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత రాజకీయాల్లోకి రావడం వంటి కీలక ఘట్టాలను పుస్తకంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం కొనసాగిన తన రాజకీయ జీవితంతోపాటు.. 2004లో ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ దాన్ని తిరస్కరించిన నిర్ణయం గురించి కూడా తన జ్ఞాపకాలను పంచుకున్నట్లు ప్రచురణకర్త వెల్లడించింది.ఇక భారత్‌లో ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పెంగ్విన్ ఇండియా నుంచి పుస్తక ప్రచురణ తప్పుకున్న నేపథ్యంలో హార్పర్‌కాలిన్స్ సహా పలు భారతీయ ప్రచురణ సంస్థలు హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే పెంగ్విన్ అభ్యంతరాలపై కాంగ్రెస్-బీజేపీ మధ్య కౌంటర్లతో సోనియా గాంధీ పుస్తకం విడుదలకు ముందే రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చుట్టూ వివాదాలు కొత్తేమీ కావు. గతంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రచించిన Four Stars of Destiny విషయంలోనూ ప్రచురణపై వివాదం చెలరేగింది. అలాగే వెండీ డోనిగర్ రచించిన The Hindus: An Alternative History పుస్తకాన్ని 2014లో న్యాయపరమైన వివాదాల నేపథ్యంలో పెంగ్విన్ ఇండియా భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. తాజాగా సోనియా గాంధీ Belonging: A Journey of Love విషయంలోనూ ప్రచురణపై వివాదం తెరపైకి రావడంతో పెంగ్విన్ వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: మలాలా ఆత్మకథ చదివినందుకు.. పనిష్మెంట్! -
ల్యాండింగ్ సమయంలో పేలిన విమాన టైర్
ఢిల్లీ నుంచి బిలాస్‌పూర్‌కు వెళ్తున్న అలయన్స్ ఎయిర్ విమానం టైరు ల్యాండింగ్ సమయంలో పంక్చర్ అయింది. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న 41 మందినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విమానయాన సంస్థకు చెందిన అధికారి ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.అలయన్స్ ఎయిర్‌కు చెందిన 9I613 విమానంలో 37 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ల్యాండింగ్ సమయంలో విమానం ఎడమవైపు ఉన్న టైర్ పంక్చర్ అయినట్లు అధికారి చెప్పారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.ఘటన తర్వాత ప్రయాణికులు, సిబ్బంది అందరినీ రన్‌వే నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చి టెర్మినల్ భవనానికి తరలించినట్లు అధికారి తెలిపారు. ఆ తర్వాత బిలాస్పూర్ నుంచి వెళ్లాల్సిన విమానం తదుపరి సర్వీసును రద్దు చేసినట్లు విమానయాన సంస్థ అధికారి చెప్పారు. -
రాఖీ పండుగ: విరాట్ కోహ్లి అక్క పోస్ట్ వైరల్
టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. కుటుంబంతో కలిసి ఎక్కువగా లండన్‌లోనే నివాసం ఉంటున్న ఈ స్టార్ బ్యాటర్.. ఇటీవల ఢిల్లీకి వచ్చాడు. భార్య అనుష్క శర్మతో కలిసి విమానాశ్రయం నుంచి కోహ్లి బయటకు వెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి సోదరి భావనా కోహ్లి ధింగ్రా తాజాగా పెట్టిన పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంతదూరంగా ఉన్నప్పటికీ చాలా మంది అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్లు రాఖీ పూర్ణిమ రోజైనా ఒక్క చోట చేరి ఈ పండుగ జరుపుకొంటారన్న సంగతి తెలిసిందే.కోహ్లికి రాఖీ కట్టిన భావనాఇక భావనా సైతం తన అన్న- తమ్ముడితో కలిసి రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అన్న వికాస్ కోహ్లితో దిగిన సెల్ఫీని.. తమ్ముడు విరాట్ కోహ్లికి తాజాగా రాఖీ కట్టిన ఫొటోను భావనా ఈ సందర్భంగా ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు. ‘‘ఈ జీవితం మనల్ని ఎంత దూరం, ఎంత ఎత్తుకు తీసుకువెళ్లినా సరే.. నా ప్రార్థనల్లో మీరు ఎల్లప్పుడూ ఉంటారు’’ అని సోదరులపై ప్రేమను చాటుకున్నారు.ఈ నేపథ్యంలో సోదరితో రాఖీ కట్టించుకునేందుకే కోహ్లి లండన్ నుంచి ఢిల్లీకి వచ్చాడేమోనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఢిల్లీకి చెందిన ప్రేమ్ కోహ్లి, సరోజ్ కోహ్లికి ముగ్గురు పిల్లలు సంతానం. తొలుత వికాస్ జన్మించగా.. తర్వాత భావనా, విరాట్ జన్మించారు.ఆమె ఎవరంటే?విరాట్ అక్క భావనా ఎంటర్ప్రెన్యూర్. వ్యాపారవేత్త సంజయ్ ధింగ్రాను పెళ్లాడిన ఆమెకు మెహక్, ఆయుశ్ సంతానం. విరాట్ కోహ్లికి చెందిన ఫ్యాషన్ లేబుల్ వన్8సెలక్ట్‌తో కలిసి భావనా పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా విరాట్ వీలైనప్పుడల్లా తన సోదరి ఇంటికి వెళ్తాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భావనా షేర్ చేయగా.. ‘భారత దిగ్గజ బ్యాటర్‌గా ఎదిగినప్పటికీ తన అక్కకు ఎప్పటికీ చిన్ని తమ్ముడినేనని విరాట్ నిరూపించాడు’ అంటూ అభిమానులు కోహ్లిపై ప్రశంసలు కురిపించడం పరిపాటి. తన అన్న వికాస్తోనూ కోహ్లికి మంచి అనుబంధం ఉంది. కాగా వన్డేల్లో అత్యధికంగా 54 శతకాలు బాదిన కోహ్లి.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డే, ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న కోహ్లికి కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ ఉన్నారు. వీరంతా ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్నారు.చదవండి: భారత జట్టులోకి వారసులు వచ్చారు! View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ఫైవ్ స్టార్ హోటల్లో విలాసాలు.. రూ.5.74 లక్షల బిల్లు రాగానే..
ఉదయ్‌పూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ప్రముఖ లగ్జరీ హోటల్ ‘ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్’లో 10 రోజుల పాటు బస చేసిన ఢిల్లీకి చెందిన నలుగురు సభ్యుల కుటుంబం రూ. 5.74 లక్షల బిల్లు చెల్లించేందుకు నిరాకరించినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అనురాగ్ యాదవ్ అనే వ్యక్తి ఆగస్టు 12న ‘మేకర్ బహా ట్రావెల్ ఏజెన్సీ’ ద్వారా ఈ హోటల్లో బసను బుక్ చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆయన తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆగస్టు 14 నుంచి 23 వరకు ఆ ఫైవ్ స్టార్ ప్రాపర్టీలో గడిపారు. ఈ క్రమంలో భోజనం, డిన్నర్ సహా హోటల్‌కు సంబంధించిన పలు సేవలను వినియోగించుకున్నారు.తీరా చెక్అవుట్ సమయంలో హోటల్ సిబ్బంది రూ. 5.74 లక్షల బిల్లును వారికి అందించగా యాదవ్ ఆ మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించారు. ఆ బిల్లు మొత్తాన్ని ట్రావెల్ ఏజెన్సీయే చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే బుకింగ్ సమయంలో యాదవ్‌తో అలాంటి చెల్లింపు ఒప్పందం ఏదీ కుదుర్చుకోలేదని సదరు ట్రావెల్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఈ వివాదంపై హోటల్ లైజన్ మేనేజర్ రవీంద్ర సింగ్ అంబామాతా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పర్యాటకుడు ట్రావెల్ ఏజెన్సీ పరస్పర కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తున్నదని సబ్ ఇన్స్పెక్టర్ అజయ్‌రాజ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. గతంలో తమిళనాడుకు చెందిన 69 ఏళ్ల బింగ్సన్ జాన్ అనే వ్యక్తి దాదాపు మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా 300కు పైగా లగ్జరీ హోటళ్లను మోసం చేసిన కేసులో జూలైలో అరెస్టయిన ఘటనను పోలీసులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఉదయ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఈ తాజా ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: పాకిస్థాన్‌కు సిమ్ కార్డులు పంపిన దంపతులు అరెస్ట్! -
పాకిస్థాన్‌కు సిమ్ కార్డులు పంపిన దంపతులు అరెస్ట్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ గూఢచార సంస్థ (ఐఎస్ఐ)తో సంబంధాలు కొనసాగిస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఢిల్లీకి చెందిన యువ దంపతులను పోలీసుల ప్రత్యేక విభాగం (స్పెషల్ సెల్) అరెస్టు చేసింది. నిందితులను సరాయ్ కాలే ఖాన్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సాహిల్, అతని భార్య సమీరాగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దంపతులు 2024 నుంచి సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.వీరు భారత సిమ్ కార్డులను సేకరించి, దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు చేరవేసే లాజిస్టికల్ మద్దతును అందించారు. 2024–2025 మధ్య కాలంలో 8 భారతీయ సిమ్ కార్డులను పాకిస్థాన్‌కు పంపినందుకు గాను వీరు సుమారు రూ.30,000 నగదును పారితోషికంగా అందుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సిమ్ కార్డులతో పాక్ ఏజెంట్లు భారత్‌లోని వాట్సాప్ గ్రూపుల్లో చేరి, రక్షణ రంగానికి సంబంధించిన కీలక, సున్నితమైన సమాచారాన్ని సేకరించడానికి వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది. The Northern Range of the Delhi Police Special Cell busts an alleged ISI-backed, Pakistan-based espionage network and arrests a Delhi-based couple accused of working for Pakistani Intelligence Operatives (PIOs) through social media since 2024.According to Delhi police, the… pic.twitter.com/6qFbGdQ9j8— All India Radio News (@airnewsalerts) August 28, 2026సాహిల్‌ను అదుపులోకి తీసుకుని మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా పాక్ ఏజెంట్లతో జరిపిన సంభాషణలు వెలుగుచూశాయి. 2024లో సమీరా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పాక్ ఏజెంట్‌తో పరిచయం ఏర్పడిందని, అనంతరం మరింత మంది ఏజెంట్లతో సంబంధాలు కుదిర్చి ఆర్థిక ఎర చూపినట్లు సాహిల్ విచారణలో అంగీకరించాడు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆర్మీ కంటోన్మెంట్ల వద్ద రెక్కీ నిర్వహించే వారిని వెతకడం, సైనిక న్యాయస్థానాల్లో కోర్టు మార్షల్ విచారణలు ఎదుర్కొంటున్న ఆర్మీ సిబ్బంది వివరాలను సేకరించడం వంటి బాధ్యతలను కూడా సాహిల్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సమీరాను కూడా అరెస్టు చేసి, వీరి వద్ద నుంచి కుట్రకు ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. భారత్‌లోని స్థానిక ఏజెంట్లు, ఓవర్‌గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్స్‌తో ఈ నెట్‌వర్క్‌కు ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: ఈ సీజన్లో తొలి స్వైన్ ఫ్లూ మృతి నమోదు -
అంతటా రక్షా బంధన్ రద్దీ.. ‘హెల్ప్‌లైన్’ ప్రకటించిన పోలీసులు
న్యూఢిల్లీ: రాఖీ పండుగ వేళ ఢిల్లీ, నోయిడాల నుంచి స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే స్తంభించిపోయింది. గురువారం (ఆగస్టు 27) సాయంత్రం నుంచి ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వాహనదారులు దాదాపు 5 నుంచి 6 గంటల పాటు నరకయాతన అనుభవించారు. ఘజియాబాద్ మీదుగా వెళ్లే ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు నోయిడా-గ్రేటర్ నోయిడా, ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రధాన రహదారుల్లోనూ తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తింది.నోయిడా సెక్టార్ 62 నుంచి దాస్నా వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పండుగ షాపింగ్ కోసం మార్కెట్లకు భారీగా జనం తరలిరావడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సాధారణ ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణంగా 10-15 నిమిషాల్లో ప్రయాణించే 4 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 35 నుంచి 40 నిమిషాల సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు తెలిపాడు. ట్రాఫిక్ నియంత్రణకు ఘజియాబాద్ పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను (9643322904) ఏర్పాటు చేశారు. లాల్ కువాన్ వద్ద ట్రాఫిక్ నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. చిజ్జార్సీ సమీపంలో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. Ghaziabad: Raksha Bandhan की पूर्व संध्या पर Delhi-Meerut Expressway पर लगा भीषण जाम। 🚨🚗 pic.twitter.com/KFDEZhI4c0— Greater Noida West (@GreaterNoidaW) August 27, 2026ఘజియాబాద్ నుంచి మీరట్ వెళ్లేవారు దాస్నాకు ముందున్న కనెక్టర్ల ద్వారా ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే తీసుకోవాలని సూచించారు. ఢిల్లీ, ఘజియాబాద్ వాసులు మురాద్‌నగర్, మోదీనగర్ మీదుగా పాత జాతీయ రహదారిలో వెళ్లవచ్చు. మీరట్ ప్రయాణికుల కోసం ఎన్సీఆర్టీసీ నమో భారత్ రైళ్ల సర్వీసులను పెంచి ప్రతి 8 నిమిషాలకొకటి చొప్పున 47 అదనపు ట్రిప్పులను నడుపుతోంది.ఇది కూడా చదవండి: విద్యార్థులకు అదిరిపడే గుడ్ న్యూస్.. ఇక నో ఫెయిల్! -
ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్ ప్రసన్న వెంకటేశ్
ఢిల్లీ: నీట్, జేఈఈ లాంటి కీలక పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో కీలక నియామకాలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్‌ను ఎన్టీఏ డైరెక్టర్‌గా నియమించింది. ఐదేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ (DoPT) గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ ప్రసన్న వెంటేష్‌తో పాటు 2012 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రవి కుమార్ సింగ్‌ను ఎన్టీఏకు మరో డైరెక్టర్‌గా నియమించారు. సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ప్రసన్న వెంకటేశ్, రవి కుమార్ సింగ్ ఐదేళ్లపాటు డైరెక్టర్లుగా కొనసాగనున్నారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్లు లేదంటే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు.. ఏది ముందైతే అప్పటివరకు వారు ఈ పదవుల్లో కొనసాగుతారు.ప్రసన్న వెంకటేశ్ గతంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఏలూరు జిల్లా కలెక్టర్‌గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. మరోవైపు రవి కుమార్ సింగ్ కేంద్ర డిప్యుటేషన్‌కు కేంద్ర హోంశాఖ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆయనను ఎన్టీఏ డైరెక్టర్‌గా నియమించారు.ఇదే సమయంలో 2016 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్) అధికారి అమిత్ సాందారియాను NTA జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు. డిప్యూటీ సెక్రటరీ స్థాయి హోదాలో ఆయన నాలుగేళ్లపాటు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నీట్ పేపర్ లీకేజ్, పరీక్షల అవకతవకల నేపథ్యంలో ఎన్టీఏ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే దాని ప్రక్షాళనకు దిగిన కేంద్రం.. పలువురిని తప్పించింది కూడా. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు డైరెక్టర్లు, ఒక జాయింట్ డైరెక్టర్ నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఎవరీ ప్రసన్న వెంకటేశ్?2012 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి వీ ప్రసన్న వెంకటేశ్. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోయంబత్తూరులో బీఎస్సీ అగ్రికల్చర్ చదివారు. ఐఏఎస్‌లోకి వచ్చిన తర్వాత పాడేరు సబ్ కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, అనంతరం ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, పోర్ట్స్ డైరెక్టర్, కర్నూలు జాయింట్ కలెక్టర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా 2019లో బాధ్యతలు చేపట్టిన ఆయన.. పారిశుధ్యం, చెత్త నిర్వహణ, నీటి సరఫరా, ట్రాఫిక్, నగర హరితీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై నుంచి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్‌గా ఐదేళ్ల కాలానికి నియమించింది. దేశవ్యాప్తంగా NEET, JEE వంటి కీలక పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ కీలక పాత్ర పోషిస్తుండడం, వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర, జిల్లా స్థాయి పరిపాలనలో అనుభవం ఉన్న ప్రసన్న వెంకటేశ్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: ఇక నో ఫెయిల్.. స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్ -
మోదీ హవా తగ్గిందా? లేదా?.. తాజా సర్వేలో షాకింగ్ లెక్కలు
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా నిజంగా తగ్గిందా?.. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పరిస్థితి ఏంటి?.. జెన్‌జీ ఎఫెక్ట్‌ను తట్టుకుని మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతుందా?. అయితే ఆ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇండియా టుడే–సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (MOTN) సర్వే వెల్లడించింది.మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కాస్త సర్ప్రైజింగ్ విషయాలే కనిపించాయి. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఏకంగా 326 సీట్లు వస్తాయని తెలిపింది. పార్టీల వారీగా చూస్తే బీజేపీకి 261 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుని 106 సీట్లకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. అయితే ఇదే పోల్ ఏజెన్సీ ఈ ఏడాది జనవరిలో జరిపిన సర్వే కంటే ఎన్డీయేకు ఇప్పుడు కాస్త ప్రతికూలతే కనిపిస్తోంది. జనవరి సర్వేతో పోలిస్తే ఎన్డీయే కూటమి బలం 26 సీట్లు తగ్గడం గమనార్హం. ఆ టైంలో ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని ఇదే సర్వే అంచనా వేసింది. ఇందులో బీజేపీకి పార్టీకి 287 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఆ సంఖ్య ఇప్పుడు 26 సీట్లు తగ్గినట్లైంది. అయినప్పటికీ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒరిజినల్‌గా బీజేపీ సాధించిన 240 సీట్ల కంటే తాజా అంచనా కూడా ఎక్కువగా ఉండటం విశేషం.మరోవైపు కాంగ్రెస్ బలం గణనీయంగా పెరిగే అవకాశముందని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌కు 106 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జనవరి సర్వేతో పోలిస్తే ఇది 26 సీట్ల పెరుగుదల. అప్పట్లో కాంగ్రెస్‌కు 80 సీట్లు వస్తాయని అంచనా వేశారు.ఇండియా కూటమికి 185మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో.. ఎన్డీయే కూటమికి 326 సీట్లు వస్తాయని చెప్పగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 185 సీట్లు వస్తాయని తాజా ఎంవోటీఎన్ సర్వే అంచనా వేసింది. జనవరి సర్వేతో పోలిస్తే ఇది స్వల్పంగా మాత్రమే పెరిగింది. అప్పట్లో ఇండియా కూటమికి 182 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఈ కూటమి వాస్తవంగా.. 234 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.ఎన్డీయే ఓటు షేర్ 45.1 శాతంఓటు శాతం పరంగానూ ఎన్డీయే ముందంజలోనే ఉంది. తాజా సర్వే ప్రకారం ఎన్డీయేకు 45.1 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. జనవరి సర్వేలో ఇది 47 శాతంగా ఉంది. మరోవైపు ఇండియా కూటమి ఓటు షేర్ స్వల్పంగా పెరిగి 39.1 శాతానికి చేరుతుందని అంచనా. జనవరిలో ఇది 39 శాతంగా ఉంది.400 పార్కు దూరమే..!ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఇప్పటికీ ఓటర్లలో గట్టి మద్దతు ఉందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే 2024 ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన ‘400 పార్’ నినాదానికి ఈ అంచనా చాలా దూరంలో ఉంది. ముఖ్యంగా యువత, విద్యార్థులకు సంబంధించిన అంశాలు బీజేపీకి సవాలుగా మారుతున్నాయని సర్వే విశ్లేషణ పేర్కొంది.పరీక్ష పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో అవకతవకలు వంటి అంశాలపై యువతలో అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపింది. అదే సమయంలో రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పలు కీలక అంశాలపై బీజేపీని లక్ష్యంగా చేసుకోవడం ఆ పార్టీకి కొంత మేర రాజకీయంగా కలిసొస్తున్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి.ఇండియా టుడే గ్రూప్ దాదాపు రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో భాగంగా ఈ తాజా అంచనాలను రూపొందించారు. సీ ఓటర్ నిర్వహించిన ఈ సర్వేలో జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. దీనికి అదనంగా గత ఆరు నెలల్లో సీ ఓటర్ నిర్వహించిన రెగ్యులర్ ట్రాకింగ్‌లో భాగంగా సేకరించిన 91,795 ఇంటర్వ్యూలను కూడా విశ్లేషణలో పరిగణనలోకి తీసుకున్నారు.ఇదీ చదవండి: విదేశీ పర్యటనకు మోదీ.. పుతిన్ భేటీకి ఛాన్స్? -
ఆగు బ్రో.. రాహుల్ గాంధీకి కంగనా కౌంటర్
నటి కృతి సనన్ రక్షాబంధన్ ప్రకటనపై మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఆ యాడ్‌లో కృతి సనన్ వస్త్రధారణపై విమర్శలు రావడంతో ఆమెకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. మహిళలు ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని పేర్కొంటూ ‘స్మాష్ ద ప్యాట్రియార్కీ’ (పితృస్వామ్య వ్యవస్థను కూల్చేయాలి) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. అయితే దీనికి మరో నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు స్పందిస్తూ కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో.. బ్రో.. కాస్త ఆగండి. భారత్ ‘మాతా’ కీ జై.. ప్రారంభిద్దాం’ అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇందులో మాతా(తల్లి)ని హైలైట్ చేస్తూ.. రాహుల్‌కు కంగనా వెటకారంగా కౌంటర్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత అక్కడున్న అమ్మాయితో రాహుల్ గాంధీ సంభాషణ అలాగే కొనసాగుతుంది. ట్రిపుల్ తలాక్, మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదనే ధోరణితో ఆమె రాహుల్‌ను ప్రశ్నించినట్లు ఆ బొమ్మలను కంగనా తన ఇన్‌స్టాలో స్టోరీలా పోస్ట్ చేశారు. ఓ యాడ్‌లో కృతి సనన్ దుస్తులపై మొదలైన వివాదం.. రాహుల్ జోక్యంతో రాజకీయ చర్చగా మారగా, కంగనా తాజా వ్యాఖ్యలతో మరింత ఆసక్తికరంగా మారింది.రక్షాబంధన్ సందర్భంగా ఓ నగల బ్రాండ్ రూపొందించిన 32 సెకండ్ల ప్రకటనలో కృతి సనన్ ఆధునిక దుస్తుల్లో కనిపించారు. అందులో ఆమె తన సోదరుడికి రాఖీ కట్టడంతోపాటు పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టే సన్నివేశం ఉంది. కృతి ధరించిన దుస్తులు, ప్రకటనలో పండుగను చూపించిన తీరుపై సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై కంగనా రనౌత్ కూడా స్పందించారు. రక్షాబంధన్ వంటి సంప్రదాయ పండుగ సందర్భంగా కృతి ధరించిన దుస్తులపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకటనను ‘ఇంటెన్షనల్లీ క్రీపీ’(ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందికరంగా చూపించారు)గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో కంగనా–కృతి మధ్య సోషల్ మీడియా వేదికగా వాదన మొదలైంది.తనపై వస్తున్న విమర్శలకు కృతి సనన్ కూడా ఘాటుగానే స్పందించారు. ఒక మహిళ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని ఆమె ధరించే దుస్తులతోనే ఎందుకు అంచనా వేయాలని ప్రశ్నించారు. పండుగల అసలు భావం దుస్తుల్లో కాకుండా వాటి వెనుక ఉన్న అనుబంధం, విలువల్లో ఉంటుందని పేర్కొన్నారు. మహిళలు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారని ప్రశ్నించారు. అలాగే కుక్కకు రాఖీ కట్టడంపైనా స్పందిస్తూ.. రక్షాబంధన్ తమ కుటుంబంలో సోదరసోదరీమణుల మధ్య పరస్పర రక్షణ, ప్రేమకు ప్రతీక అని కృతి వివరించారు. తన సోదరి, తాను ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటామని.. ఆ బంధంలో సోదరుడు మాత్రమే రక్షించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.కృతి స్పందనను రాహుల్ గాంధీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. “ఒక మహిళ ఏం ధరిస్తుంది, ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఆమె ఎంపిక. తన స్వేచ్ఛను ఉపయోగిస్తున్నందుకు మహిళలను ట్రోల్ చేయడం ఆపండి” అంటూ వ్యాఖ్యానించారు. దీనికి తోడు ‘Smash the Patriarchy’ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు. ఇక్కడే ఎంట్రీ ఇచ్చిన కంగనారాహుల్ గాంధీ కృతికి మద్దతు ప్రకటించిన కొద్దిసేపటికే కంగనా తనదైన శైలిలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ‘భారత్ మాతాకీ జై.. ప్రారంభిద్దాం’ అని పేర్కొనడం ద్వారా రాహుల్ వ్యాఖ్యలకు వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఇంకా ఎటు దారి తీస్తుందో చూడాలి.ఇదీ చదవండి: అన్నాచెల్లెళ్ల ఆలయంలో.. రాఖీ వేడుకలు -
ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1) కేసులు కలకలం రేపుతున్నాయి. నగరంలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటివరకు 3,000 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడం అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో తక్షణ నివారణ చర్యలు, వైద్య సదుపాయాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తా మంగళవారం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పలువురు మంత్రులతో సీఎం రేఖా గుప్తా ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. నగరవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ వ్యాప్తి తీరు, ఆస్పత్రుల్లో బాధితులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య మరింత పెరిగితే, దానికి అనుగుణంగా అదనపు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట పడకల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షా సమావేశం అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. నగరంలో స్వైన్ ఫ్లూ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని స్పష్టంచేశారు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించేందుకు సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని స్పష్టం చేశారు. స్వైన్ ఫ్లూ చికిత్సకు అవసరమైన ఔషధాలు, ఇతర అత్యవసర వైద్య పరికరాల నిల్వలు పూర్తిస్థాయిలో ఉన్నాయని మంత్రి వివరించారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించాలని ప్రజలకు సూచించారు. సొంత వైద్యం చేసుకోకుండా, వైద్యుల సలహా మేరకే ఔషధాలు ఉపయోగించాలని కోరారు. -
ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు 'డాక్టర్ వైఎస్సార్ అవార్డు-2026'
హైదరాబాద్: ‘‘డాక్టర్ వైఎస్సార్, డాక్టర్ కేవీపీ’’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అవార్డు-2026ను ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు ప్రదానం చేయనున్నారు. రూ.25 లక్షల నగదు బహుమతితో కూడిన ఈ అవార్డును సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో అందజేయనున్నారు.భారత వ్యవసాయం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి రంగాల్లో ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నట్లు ఫౌండేషన్ తెలిపింది.భారత హరిత విప్లవంలో కీలక పాత్ర పోషించిన భారతరత్న డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్ వారసత్వాన్ని ఫౌండేషన్ కొనసాగిస్తోందని పేర్కొంది. సుస్థిర వ్యవసాయం, ఆహార-పోషక భద్రత, జీవవైవిధ్యం, గ్రామీణ జీవనోపాధి రంగాల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతులు, గ్రామీణ వర్గాలకు చేరువ చేస్తోందని తెలిపింది.డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రం, ఆహార భద్రతకు చేసిన సేవలు, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులు, పేదల సంక్షేమం కోసం చూపిన నిబద్ధతకు ఈ అవార్డు ప్రతీకగా నిలుస్తుందని ఫౌండేషన్ పేర్కొంది. ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ తరఫున ఆ సంస్థ చైర్పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈ అవార్డును స్వీకరించనున్నారు. -
5 రాష్ట్రాల ఎన్నికల ముందు బీజేపీకి డబుల్ ఛాలెంజ్
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల వేళ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ఓబీసీ జనగణన, రిజర్వేషన్ల పరిధి పెంపునకు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వంటి విపక్షాలు మద్దతు ఇస్తుండగా, అగ్రవర్ణాల వర్గాలు రిజర్వేషన్లలో మార్పులు చేయాలని, అవసరమైతే వాటిని రద్దు చేసి ఆర్థిక ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి అటు అగ్రవర్ణాలను, ఇటు దళితులు, ఓబీసీలను ఒకేసారి సంతృప్తిపరచడం కష్టంగా మారింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశం బీజేపీకి నష్టం కలిగించిన నేపథ్యంలో ఇప్పుడు అదే అంశం మరోసారి పార్టీకి రాజకీయంగా ఇరుకునపెట్టే పరిస్థితిగా మారింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా విపక్షాలు కులగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని, రిజర్వేషన్ల పరిధిని పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు అగ్రవర్ణ వర్గాలకు చెందిన యువత, సామాజిక సంస్థలు రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు చేయాలని, అవసరమైతే దాన్ని తొలగించి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రారంభమైన ‘రిజర్వేషన్ సంస్కరణ సత్యాగ్రహం’ లక్నోకు కూడా విస్తరించింది.బ్రజేశ్ పాఠక్‌ను కలిసిన ఆందోళనకారులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్న హర్ష్ దూబే తదితరులు ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్‌ను కలిశారు. వారి డిమాండ్లను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారు కుల ఆధారిత రిజర్వేషన్లను తొలగించి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని, ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ నిబంధన తీసుకురావాలని, ప్రస్తుత రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని కోరుతున్నాయి. యూజీసీ తీసుకొచ్చిన దళిత, ఓబీసీ విద్యార్థులపై వివక్షను నిరోధించే నిబంధనలను కూడా తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.బ్రజేశ్ పాఠక్ ఆందోళనకారులతో మాట్లాడటంతో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ బీజేపీపై విమర్శలు ప్రారంభించాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ రిజర్వేషన్ సంస్కరణ పేరుతో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం రిజర్వేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పునూ అంగీకరించబోమని హెచ్చరించారు. దీంతో రిజర్వేషన్ల అంశం బీజేపీకి ఒకవైపు అగ్రవర్ణ ఓటర్ల అసంతృప్తి, మరోవైపు దళిత-ఓబీసీ ఓట్లపై ప్రభావం అనే ద్వంద్వ సవాలుగా మారింది.బీజేపీకి ఇది కొత్త సవాలు కాదు రిజర్వేషన్ల అంశం బీజేపీకి కొత్త సవాలు కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశాలను ప్రధానంగా ప్రస్తావించడంతో విపక్షాలు బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందనే ప్రచారం చేశాయి. బీజేపీ ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో పార్టీ 29 లోక్‌సభ స్థానాలను కోల్పోయింది. మహారాష్ట్ర, హరియాణా, బిహార్‌లోనూ ఎన్డీయేకు నష్టం జరిగింది. ఎన్నికల అనంతరం బీజేపీ సమీక్షలో రాజ్యాంగం-రిజర్వేషన్ అంశంపై విపక్షాలు నిర్మించిన ప్రచారం దళిత, ఓబీసీ ఓట్లపై ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతకుముందు 2015 బిహార్ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లను సమీక్షించాలన్న వ్యాఖ్య కూడా బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించింది.ఇప్పుడు బీజేపీ ముందున్న అసలు సమస్య అగ్రవర్ణ, ఓబీసీలు, దళితులను ఒకే రాజకీయ కూటమిలో కొనసాగించడం. గత దశాబ్దంలో బీజేపీ అగ్రవర్ణాలతో పాటు నాన్-యాదవ్ ఓబీసీలు, నాన్-జాటవ్ దళితులను తనవైపు తిప్పుకుని విస్తృత సామాజిక ఆధారం నిర్మించుకుంది. అయితే రిజర్వేషన్లపై అగ్రవర్ణ వర్గాల డిమాండ్లకు అనుకూలంగా అడుగు వేస్తే దళిత, ఓబీసీ ఓటర్లు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఎలాంటి మార్పు చేయకపోతే సంప్రదాయ సవర్ణ ఓటు బ్యాంకులో అసంతృప్తి పెరగవచ్చు. అందుకే ఎన్నికల ముందు రిజర్వేషన్ల అంశం బీజేపీకి 2024 తరహాలో మరోసారి ‘డబుల్ ఛాలెంజ్’గా మారే అవకాశముంది.ఇదీ చదవండి: భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ భారీ ప్రణాళిక -
Red Alert : మరో 2 రోజులు భారీ వర్షాలు.. ఢిల్లీ ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ
-
Delhi: రెండో రోజూ భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రెండో రోజూ భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. రహదారులు జలమయమై, నడుము లోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. రానున్న గంటల్లో వర్షం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది.మంగళవారం ఉదయం 6:45 గంటల ప్రకటన ప్రకారం, రాబోయే రెండు నుంచి మూడు గంటల్లో ఢిల్లీ అంతటా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సెంట్రల్, ఈస్ట్, న్యూఢిల్లీ, నార్త్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, షహదరా, సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ ఢిల్లీ జిల్లాలకు ఈ హెచ్చరికలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సోమవారం నాడు 3 అంతర్జాతీయ విమానాలతో సహా మొత్తం 15 విమానాలను జైపూర్ (12), చండీగఢ్ (2), లక్నో (1)లకు మళ్లించారు.ఉత్తరం నుంచి వీస్తున్న పొడి గాలులు, పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమతో కూడిన తూర్పు గాలులు పరస్పరం కలవడం వల్లే ఈ ఆకస్మిక భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ శశికాంత్ వెల్లడించారు. మరోవైపు, పొరుగున ఉన్న గురుగ్రామ్‌లోనూ భారీ వర్షానికి ప్రధాన రహదారులు, చౌరస్తాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజీవ్ చౌక్, ఇఫ్కో చౌక్, ఓల్డ్ ఢిల్లీ రోడ్ సహా పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పాఠశాల బస్సులు, ఇతర వాహనాలు నీటిలో చిక్కుకుపోవడంతో, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని, పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని గురుగ్రామ్ యంత్రాంగం ఆదేశించింది. Delhi Weather Update Heavy rainfall likley over Delhi during next 2-3 hours (valid till 0945 hrs IST of 25/08/2026). pic.twitter.com/0xEWZsD8nW— India Meteorological Department (@Indiametdept) August 25, 2026 -
భారత్–చైనా సంబంధాలు.. ఏ మలుపు తిరుగునో?
వచ్చే నెల భారత్ పర్యటనకు చైనా అధినేత షీ జిన్‌పింగ్ రానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్ హాజరుకానున్నట్లు తెలిసింది. 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలను గాడిన పెట్టే ప్రయత్నాలలో భాగంగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.షీ జిన్‌పింగ్ పర్యటన ఖరారు అయితే, ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి అవుతుంది. షీ జిన్‌పింగ్.. చివరిసారిగా ఆయన 2019 అక్టోబర్‌లో భారత్‌ను సందర్శించారు. ఆ తర్వాత తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు రెండు దేశాల సంబంధాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన కోసం సుమారు 400 మంది అధికారులతో కూడిన బృందం రానున్నట్లు భారతీయ వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో శాంతిభద్రతలు, ప్రాంతీయ భద్రతా అంశాలపై ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపే అవకాశం ఉంది.కాగా, చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారానికి జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)అజిత్ దోవల్ సోమవారం బీజింగ్‌కు చేరుకున్నారు. రెండు దేశాల సరిహద్దు అంశంపై జరిగే ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతోపాటు దోవల్ పాలుపంచుకోనున్నారు. ఈ చర్చలు మంగళ, బుధవారాల్లో జరుగుతాయి. ఢిల్లీలో వచ్చే 12, 13వ తేదీల్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్రంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు జిన్‌పింగ్ రానున్న నేపథ్యంలో దోవల్, వాంగ్యీల చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.ఇదీ చదవండి: ఎస్ఐని కొట్టిన ఎమ్మెల్యే కుమార్తె.. ఆ రోజు అసలేం జరిగింది?భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు వివాదాలు, అరుణాచల్ ప్రదేశ్‌పై భేదాలు తీవ్రరూపం దాలి్చన తరుణంలో ఈ చర్చలు జరుగుతుండటం గమనార్హం. 2020లో గల్వాన్ లోయలో రెండు దేశాల సైనికుల తీవ్ర ఘర్షణలు దైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపడం తెల్సిందే. అప్పట్నుంచి సంబంధాలను తిరిగి గాడినపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వివాద పరిష్కారానికి 2003లో ఏర్పాటు చేసిన చర్చల యంత్రాంగానికి దోవల్, వాంగ్ ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు. -
రికార్డు స్థాయికి కేంద్ర మంత్రుల బంగ్లాల మరమ్మతుల ఖర్చు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని కేంద్ర మంత్రుల బంగ్లాల నిర్వహణ ఖర్చు రికార్డు స్థాయికి చేరింది. లూటియన్స్ బంగ్లాజోన్లోని మంత్రుల అధికారిక నివాసాల పునరుద్ధరణ, ఫర్నిషింగ్, మరమ్మతుల ఖర్చు అమాంతం పెరిగిపోయింది. 2014–15లో రూ. 27.47 కోట్లున్న వార్షిక వ్యయం, 2025–26లో మూడు రెట్లు అధికంగా రికార్డు స్థాయిలో రూ. 92.35 కోట్లకు పెరిగింది. ఈ మరమ్మతులు, పునరుద్ధరణ, నిర్వహణ చూసే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ) ద్వారా ప్రభుత్వం 2014–15 నుంచి 2025–26 మధ్య రూ. 547.68 కోట్లు ఖర్చు చేసింది. పాత నిర్మాణాలు కావడం, ద్రవ్యోల్బణం పెరుగుదలే నిర్వహణ ఖర్చులు పెరగడానికి కారణమని తెలిపింది. 2014 నుంచి 2019 వరకు, మంత్రుల నివాసాల మరమ్మతులు, ఆధునీకరణ కోసం ఏడాదికి సగటున రూ. 26.78 కోట్లు ఖర్చు చేశారు. 2019 నుంచి 2024 వరకు ఈ సగటు వార్షిక వ్యయం దాదాపు రెట్టింపు అయి రూ. 50 కోట్లకు చేరింది. ఇక, 2024–25లో ఈ వ్యయం రూ. 71.98 కోట్లకు చేరింది. ఇక, ఈ ఏడాది అది రూ. 92.35 కోట్లుగా నమోదైంది. కొన్నేళ్లుగా కేంద్ర మంత్రివర్గంలో సుమారు 70 నుంచి 72 మంది వరకు మంత్రులు, సహాయ మంత్రులు ఉంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు రూ. 92.35 కోట్లు ఖర్చవగా, ఒక్కో మంత్రికి సగటున రూ. 1.2 కోట్ల వ్యయం అయినట్లు లెక్క తేలింది. అయితే, వాస్తవంగా ఒక్కో ఇంటి ఖర్చు ఒక్కో విధంగా ఉంటుంది. ఈ మరమ్మతులు, ఆధునీకరణలో తరచూ ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్ల వంటి విద్యుత్ పరికరాలు, ప్లంబింగ్ పనులకు, అలాగే ఫ్లోర్ టైల్స్ మార్చడానికి సంబంధించినవి ఉంటాయని కేంద్ర మంత్రి సిబ్బంది ఒకరు వెల్లడించారు. ఒక్క మంత్రుల నివాసాలకే.. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల నివాసాలపై ఖర్చుకు సంబంధించిన వివరాలను సీపీడబ్ల్యూడీ వెల్లడించలేదు. 2004 నుంచి 2009 వరకు ఐదేళ్ల కాలంలో పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రుల బంగళాల నిర్వహణ, ఆధునీకరణకు మొత్తం మొత్తం రూ. 93.50 కోట్లు ఖర్చు చేసినట్లు సెపె్టంబర్ 2009లో ఆర్టీఐ తెలిపింది. పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రుల బంగళాల నిర్వహణకు ఐదేళ్లలో రూ.93.50 కోట్లు కాగా, 2025–26 ఒక్క ఏడాదిలోనే, ఒక్క మంత్రుల నివాసాల నిర్వహణకే రూ.92.35 కోట్లు ఖర్చు చేశారు. -
కాక్రోచ్ జనతా పార్టీ కీలక ప్రకటన.. ఢిల్లీలో భారీ ర్యాలీ
సాక్షి, ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ కీలక ప్రకటన చేసింది.విద్యార్థులపై ఎఫ్ఐఆర్ల రద్దుకై కేంద్రం వ్యవహారిస్తున్న వైఖరికి నిరసనగా భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు ప్రకటించింది. నీట్ వ్యతిరేక నిరసనల్లో విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని కేంద్రం హామీ ఇచ్చి ఇప్పుడు కాలయాపన చేస్తుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపింది.ఏం జరిగింది?నీట్‌పేపర్ లీకేజ్‌కు నిరసనగా జూలై 20న జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల “సంసద్ చలో” నిరసన పార్లమెంట్ వైపు వెళ్లడంతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరసనకారులను ఆపేందుకు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వంటి చర్యలు చేపట్టారు. నిరసనకారులు పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం, బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడం, ఘర్షణలు జరగడం వంటి కారణాలతో కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.అయితే ఆందోళనల విరమణలకై జరిగిన ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. ఇప్పుడు వాటిని నెరవేర్చడంలో ఆలస్యం చేస్తున్నందున సెప్టెంబర్ 5 న.. యువజన మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించింది. -
భారీ వర్షం..ఎక్కడికక్కడే ఆగిపోయిన వాహనాలు
-
సోషల్ మీడియాలో ‘సీజేపీ’ సౌరవ్ దాస్ అడ్రస్.. వారికి సమన్లు
న్యూఢిల్లీ: తన అనుమతి లేకుండా నివాస చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత సౌరవ్ దాస్ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో యాంకర్ అభిజిత్ అయ్యర్-మిత్రతో పాటు పలు మీడియా ప్లాట్‌ఫాంలకు ఢిల్లీ హైకోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది.వ్యక్తిగత సమాచారం బయటపెట్టారన్న ఆరోపణలపై మధ్యంతర రక్షణ కోరుతూ దాస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. దాస్ నివాస చిరునామా ఉన్న పోస్టులను ఎక్స్ తొలగించినట్లు కోర్టుకు తెలియజేశారు. న్యాయమూర్తి సచిన్ దత్తా నోటీసులు జారీ చేసి, ప్రతివాదులు తమ సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ సెప్టెంబర్ 14న జరగనుంది.దాస్ తరఫున సీనియర్ న్యాయవాది అఖిల్ సిబల్ వాదిస్తూ.. ‘ది పాంఫ్లెట్’కు చెందిన సిబ్బంది అనుమతి లేకుండా తన క్లయింట్ నివాస ప్రాంగణంలోకి ప్రవేశించి ఒక వీడియో చిత్రీకరించారని తెలిపారు. అయ్యర్-మిత్ర ఆ వీడియోకు మరిన్ని దృశ్యాలను జత చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారని సిబల్ ఆరోపించారు. ఎక్స్‌లోని కొన్ని పోస్టుల్లో దాస్ నివాస చిరునామాను ప్రత్యేకంగా పేర్కొన్నారని కూడా ఆయన తెలిపారు.ఎక్స్‌లో ఇంకా ఉన్నాయా? తన క్లయింట్‌కు రక్షణ కల్పించాలని కోరుతూ, ఎక్స్ తన విధానం ప్రకారం ఇప్పటికే తొలగించిన పోస్టులను తిరిగి అందుబాటులోకి తీసుకురాకుండా చూడాలని సిబల్ కోర్టును కోరారు. ఎక్స్ తరఫున హాజరైన న్యాయవాది, సంబంధిత లింకులు "ఇకపై అందుబాటులో లేవు" అని కోర్టుకు తెలిపారు. ఈ వాదనను కోర్టు నమోదు చేసింది.‘ది పాంఫ్లెట్’ తరఫు న్యాయవాది కూడా పోస్టులు ఎక్స్‌లో ఇక అందుబాటులో లేవని తెలిపారు. ఆరోపణలపై పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వడానికి సమయం కోరారు. 3 రోజుల్లో ప్రతివాదుల వివరాల పత్రం, వ్యాజ్య పత్రాన్ని సవరించుకునేందుకు అనుమతించింది.అయ్యర్-మిత్ర, ‘ది పాంఫ్లెట్’తో పాటు లాబీట్, ‘ది జైపూర్ డైలాగ్స్’, ‘ది సండే గార్డియన్’, గూగుల్ ఎల్ఎల్సీ, ఎక్స్ కార్ప్‌లను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. తన గోప్యత, గౌరవం, భద్రతకు భంగం కలిగిందని ఆరోపిస్తూ, ప్రతివాదులపై శాశ్వత, తప్పనిసరి నిషేధాజ్ఞలతో పాటు నష్టపరిహారం చెల్లించాలని దాస్ కోరారు.తన అనుమతి లేకుండా తన నివాస చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేసి ప్రచారం చేశారని దాస్ తన పిటిషన్లో ఆరోపించారు. తన కచ్చితమైన చిరునామా బయటపడటం వల్ల తనకు, తన నివాసంలో ఉండే ఇతరులకు భద్రతాపరమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.తాను నివసించే నివాస ప్రాంగణంలోకి ‘ది పాంఫ్లెట్’ ప్రతినిధులు ప్రవేశించి, ఇంటి లోపలి భాగాలతో సహా ఆస్తికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించారని దాస్ ఆరోపించారు. ఆ దృశ్యాలను తర్వాత ఎక్స్‌లో పోస్టు చేశారని తెలిపారు.


