ఢిల్లీ: 13 ఏళ్లుగా శాశ్వత అచేతనావస్థలో ఉన్న హరీష్ రాణాకు కారుణ్య మరణం ప్రసాదించాలని తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది రష్మి నందకుమార్ వాదనలు వినిపించారు. ‘19 ఏళ్ల వయసులో చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి పడిన హరీష్ అప్పటి నుంచి కోలుకోలేదు. వందశాతం అచేతనావస్థలో ఉన్నందున కారుణ్య మరణం అనుమతించాలని కుటుంబం కోరుకుంటుంది’ అని తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని ఉపయోగింలేదు. మేం నిత్యం ఎన్నో కేసులు విచారిస్తుంటాం. కానీ, ఇది చాలా సున్నితమైన అంశం మేమూ మనుషలమే. .. ‘ఎవరు బతికి ఉండాలో, ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరం?’ అని వ్యాఖ్యానించింది.
వాదనలు,అనంతరం సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పును వెలువరించే ముందు పలు అంశాలను పరిశీలించనుంది. ఆ తర్వాతే తుది తీర్పు వెలవరించనుంది.
Will Supreme Court allow euthanasia for man in coma for 13 years? Verdict today
India allows passive euthanasia ( withdrawing life support) recognising the right to die with dignity while active euthanasia remains illegal
Parents of harsh have sought passive euthanasia from… pic.twitter.com/AfTaaQhrzj— Sneha Mordani (@snehamordani) January 15, 2026


