మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్‌ డీల్‌ హాట్‌ టాపిక్‌ | Rs 74 lakh over 3 years Sushmita Sen mother rent out Goregaon luxury flat | Sakshi
Sakshi News home page

మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్‌ డీల్‌ హాట్‌ టాపిక్‌

Mar 4 2026 1:01 PM | Updated on Mar 4 2026 1:08 PM

Rs 74 lakh over 3 years Sushmita Sen mother rent out Goregaon luxury flat

ముంబైలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గోరేగావ్ ఒకటి. ఆధునిక హై-రైజ్అపార్ట్‌మెంట్స్‌, గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉండటంతో ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివసించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి సుష్మితా సేన్ (Sushmita Sen), ఆమె తల్లి సుబ్రా సేన్ ముంబైలో తమ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇవ్వడం వార్తల్లో నిలిచింది.  దీని నెలవారీ అద్దె రూ. 1.95 లక్షలతో  36 నెలల (3 ఏళ్లు)  లీజ్‌ కిచ్చారు.  అంటే ఈ ప్రాపర్టీ ద్వారా మొత్తం మూడేళ్లకు గాను సుమారు 74 లక్షలు (73.76 లక్షలు) ఆదాయం సమకూరనుంది

ఈ లగ్జరీ ఫ్లాట్ గోరేగావ్‌లోని ప్రముఖ 'ఓబెరాయ్ ఎక్స్‌క్విజిట్' (Oberoi Exquisite) ప్రాజెక్ట్‌లో ఉంది. లీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) వెబ్‌సైట్‌లో స్క్వేర్ యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం. ఈ ఒప్పందం అధికారికంగా ఫిబ్రవరి 2026లో నమోదు చేయబడింది. దీని ప్రకాం సెక్యూరిటీ డిపాజిట్ కింద 6 లక్షలు కాగా, స్టాంప్ డ్యూటీ కింద  రూ.18,900, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద 1,000 చెల్లించారు. ప్రతి ఏటా 5శాతం మేర అద్దె పెరుగుతుంది.

ఈ ప్రాపర్టీ ప్రత్యేకతలు విషయానికి వస్తే  కార్పెట్ ఏరియా 996 చదరపు అడుగులతో కలిపి మొత్తం ఏరియా 1,241 చదరపు అడుగులు. ఇందులో రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.

ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్‌ప్రైజ్‌, వైరల్‌ వీడియో

సుస్మితా సేన్  గుర్తించి సంక్షిప్తంగా
1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా సుస్మితా సేన్ చరిత్ర సృష్టించారు. 'బీవీ నంబర్ 1', 'మై హూ నా' వంటి సినిమాలతో మెప్పించిన సుస్మితా సేన్‌ ఇటీవల 'ఆర్య', 'తాళి' వంటి వెబ్ సిరీస్‌లతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

(విజయ్‌ దేవరకొండ నయా ట్రెండ్‌ : డైమండ్‌ ఎమరాల్డ్‌ నెక్లెస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement