నగరంలో మంగళవారం చంద్రగ్రహణంలో భాగంగా బ్లడ్ మూన్ కనిపించింది. హుస్సేన్ సాగర్ ప్రాంతంలో తూర్పు దిశలో స్వల్ప ఎరుపు, మసక ఛాయలతో చంద్రుడు దర్శనమిచ్చాడు. ఈ దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా వీక్షించారు.
చంద్ర గ్రహణం ఖగోళ ప్రియులకు ప్రత్యేక అనుభూతినిచ్చింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత బిర్లా మందిర్ సహా ఆలయాలను మూసివేశారు.


