breaking news
Vintalu Visheshalu
-
ఒకే నగరం.. ఎన్నో మ్యూజిక్ వేదికలు! ఎందుకంత స్పెషల్?
నగర వీధుల్లో చిందులాడే అడుగుల చప్పుడు... రాత్రివేళల రంగుల వెలుగులు... వాటికి మృదువైన సాక్సోఫోన్ స్వరం తోడైతే? ఆ అనుభూతే వేరు! సంగీతానికి హద్దులు లేవని చాటుతూ, జాజ్ స్వరాలతో తైపీ నగరాన్ని ముంచెత్తేందుకు సిద్ధమవుతోంది 2026 తైపీ జాజ్ ఫెస్టివల్. సెప్టెంబర్ 4న ప్రారంభమై అక్టోబర్ 11 వరకు జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు ఇప్పటికే ప్రపంచం నలుమూలలకు చెందిన పర్యాటకులు తైపీ నగరానికి క్యూ కట్టారు.ఈ ఏడాది 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ఈ తైపీ జాజ్ ఫెస్టివల్‌కి ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి సంగీతాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా నగర జీవనశైలిలో భాగంగా పరిచయం చేస్తోంది. జాజ్ సంగీతాన్ని వినడానికి ప్రత్యేకంగా ఒక హాలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నగర వీధుల్లో నడుస్తూ, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తూ, విశ్రాంతి తీసుకుంటూ కూడా సంగీతాన్ని ఆస్వాదించేలా ఈ వేడుకను రూపొందిస్తున్నారు. జాజ్ క్లబ్బుల నుంచి సాంస్కృతిక ప్రదేశాల వరకు; చిన్న వేదికల నుంచి భారీ బహిరంగ ప్రదర్శనల వరకు; నగరాన్నే ఒక సంగీత వేదికగా మార్చేసింది ఈ జాజ్ ఫెస్టివల్. అందుకే ఈసారి తైపీ నగరం కేవలం సందర్శనకే కాదు, మ్యూజిక్‌ను కూడా వినిపించేస్తుంది.ఎన్నో సంగీత వేదికలుఈ ఫెస్టివల్లో భాగంగా 12 జాజ్ వేదికల్లో 19 ఇండోర్ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. చిన్న వేదికలపై కళాకారులు ప్రేక్షకులకు దగ్గరగా ప్రదర్శనలు ఇవ్వడం వల్ల సంగీతాన్ని మరింత ఆత్మీయంగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఫెస్టివల్‌లోని ఆసక్తికరమైన కార్యక్రమాల్లో సెప్టెంబర్ 26న ట్రెజర్ హిల్ ఆర్టిస్ట్ విలేజ్‌లో జరిగే ప్రత్యేక ప్రదర్శన ఒకటి. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తైవాన్ కు చెందిన తొలి పూర్తి స్థాయి స్కా సంగీత బృందంగా గుర్తింపు పొందిన ‘స్కారకియో’ ఉత్సాహభరితమైన సంగీతంతో ప్రేక్షకులను అలరించనుంది.ఒకవైపు వేగవంతమైన స్కా సంగీతం; మరోవైపు మృదువైన జాజ్, ఫ్రెంచ్ గీతాల సౌందర్యం. ఒకే వేదికపై ఇంత భిన్నమైన సంగీత ప్రపంచాలను పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఇందులో భాగంగా తైపీలోని ఐదు ప్రముఖ పర్యాటక, సాంస్కృతిక ప్రదేశాల్లో 12 ప్రత్యేక సంగీత ప్రదర్శనలు జరుగుతు న్నాయి. అంటే, సంగీతాన్ని వినడమే కాదు, నగర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జాజ్‌లో మునిగిపోయే అవకాశం అన్నమాట!సంగీతమే కాదు!తైపీ జాజ్ ఫెస్టివల్ లక్ష్యం కేవలం పెద్ద కచేరీలు నిర్వహించడం మాత్రమే కాదు. జాజ్ సంగీతాన్ని ప్రజల రోజూవారీ జీవితంలో ఒక ఆహ్లాదకరమైన భాగంగా మార్చడం కూడా ఈ వేడుక ఉద్దేశం. 2007 నుంచి కొనసాగుతున్న ఈ ఉత్సవం.. తైపీ నగర జీవనశైలిని జాజ్ సంగీతంలోని స్వేచ్ఛా భావంతో కలుపుతోంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు తమ సంగీతంతో తైపీకి అంతర్జాతీయ జాజ్ రంగును తీసుకువస్తున్నారు.మూడు రోజులు ప్రత్యేక ఆకర్షణఈ ఫెస్టివల్‌కు ప్రత్యేక ఆకర్షణ.. అక్టోబర్ 9 నుంచి 11 వరకు తైపీ మ్యూజిక్ సెంటర్లో మూడు రోజుల పాటు జరిగే బహిరంగ సంగీత వేడుక. ఈ ప్రధాన వేదికపై తైవాన్ కు చెందిన ప్రముఖ కళాకారులతో పాటు అంతర్జాతీయ జాజ్ బృందాలు కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. మొత్తం 11 సంగీత బృందాలు తమ ప్రతిభను ప్రదర్శించనున్నాయి. అనుభవజ్ఞులైన కళాకారులతో పాటు కొత్త తరానికి చెందిన సంగీతకారులు ఒకే వేదికపై కనిపించనుండటం ఈ వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకురానుంది.ఇదీ చదవండి: ఈ వారం కథ: చీమ బ్రతుకేనా? -
ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ శ్మశానం.. ఎందుకు కట్టారో తెలుసా?
ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటిక.. కానీ ఇక్కడ ఒక్క సమాధి కూడా నిజమైనది కాదు! చూస్తే అచ్చం నిజమైనదిలా కనిపించే ఈ ప్రదేశంలో ఏకంగా 5 వేల కృత్రిమ సమాధులు ఉన్నాయి. ఇంత భారీ కృత్రిమ శ్మశానాన్ని ఎందుకు నిర్మించారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే!ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ శ్మశాన వాటిక. ఇందులో కనిపించేవన్నీ కృత్రిమ సమాధులే! పనికట్టుకుని మరీ ఈ కృత్రిమ శ్మశానాన్ని ఎందుకు నిర్మించారని అనుకుంటున్నారా? దీనిని 1966 నాటి సూపర్ డూపర్ హిట్ హాలీవుడ్ సినిమా ‘ది గుడ్, ది బ్యాడ్ అండ్ ది అగ్లీ’ కోసం శ్మశాన వాటికలో చిత్రించాల్సిన సన్నివేశాల కోసం దీనిని ప్రత్యేకంగా నిర్మించారు.స్పెయిన్ ఉత్తర ప్రాంతంలోని మిరాండిలా లోయలో పదిహేడున్నర ఎకరాల స్థలంలో ‘సేడ్హిల్ సెమట్రీ’ పేరుతో ఈ కృత్రిమ శ్మశానం సెట్‌ను నిర్మించారు. ఇది అత్యంత సహజంగా కనిపించడానికి ఇందులో ఏకంగా ఐదువేల కృత్రిమ సమాధులను, నలభై మీటర్ల వ్యాసంలో ఒక భారీ వధ్యశిలను కూడా ఏర్పాటు చేశారు.ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈ సెట్‌ను అలాగే ఉంచేశారు. ఇది ఇప్పటికీ నిలిచి ఉంది. స్పెయిన్ పర్యటనకు వచ్చే హాలీవుడ్ అభిమానులు తప్పనిసరిగా దీనిని చూసి పోతుంటారు. వాతావరణ పరిస్థితుల వల్ల దెబ్బతిన్న ఈ కృత్రిమ శ్మశాన వాటికకు 2015లో ‘సేడ్హిల్ కల్చరల్ అసోసియేషన్’ వాలంటీర్లు మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికీ వారు ఈ శ్మశాన వాటికను ఒక చారిత్రక ప్రదేశంలా కాపాడుతూ వస్తుండటం విశేషం.ఇదీ చదవండి: కొబ్బరి.. కాయా? పండా..? కోర్టు మెట్లు ఎక్కించిన ప్రశ్న! -
మశూచితో చనిపోయి... మళ్లీ పుట్టాడు? అసలేం జరిగిందంటే?
అది 1955 నాటి ఉత్తరప్రదేశ్... చిన్న పట్టణం ఛత్తా. అందులో సువిశాలమైన ఓ పెంకుటిల్లు... తల్లి తన నాలుగున్నరేళ్ల కుమారుడు ప్రకాశ్ వర్ణ్షేకి గోరుముద్దలు తినిపిస్తోంది. రెండు ముద్దలు తిన్న ఆ బాలుడు– మూడో ముద్ద పెడుతుంటే తల్లి చేతిని వెనక్కి నెట్టేశాడు. ‘‘నన్ను నా ఇంటికి తీసుకెళ్లండి. నా కోసం కోసికలాన్‌లో నా వాళ్లు ఎదురుచూస్తున్నారు’’ అనేసరికి తల్లి బిత్తరపోయింది.ఆ రాత్రి నిద్రలో నుంచి లేచిన బాలుడు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశాడు. తల్లిదండ్రులు ఎంత ఆపినా వినకుండా ఒకటే ఏడుపు. ‘‘నేను ఇక్కడివాడిని కాదు. కోసికలాన్‌లో నా ఇల్లు ఉంది. నా పేరు ప్రకాశ్ కాదు, నిర్మల్. వెంటనే నన్ను అక్కడకు తీసుకెళ్లండి’’ అని మారాం చేశాడు.నాలుగున్నరేళ్ల బాలుడు కోసికలాన్ గురించి మాట్లాడటమేంటి? అసలు ఆ ఊరి పేరు ఈ ఇంట్లో ఎవరూ ఎప్పుడూ ఎత్తలేదే! అని తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ప్రకాశ్ ప్రవర్తన మరింత విచిత్రంగా మారసాగింది. తన తండ్రి పేరు బోలానాథ్ అని, ఆయనకు నాలుగు దుకాణాలు ఉన్నాయని చెప్పేవాడు. పాత ఇంటికి తీసుకెళ్లాలని గట్టిగా పట్టుబట్టేవాడు. రాత్రిళ్లు ఉలిక్కిపడి లేచి, ‘‘నా కడుపు మండిపోతోంది. మంచం చుట్టూ జనం ఉన్నారు. నేను చనిపోతున్నాను!’’ అంటూ భయంతో వణికిపోయేవాడు.కోసికలాన్ తీసుకెళ్తే తప్ప తమ కుమారుడి విషయంలో మార్పు రాదని భావించిన తల్లిదండ్రులు 1956లో బాలుడిని తీసుకుని కోసికలాన్ వెళ్లారు. అయితే, ఆ సమయంలో బోలానాథ్ లేకపోవడం వల్ల కలవకుండానే వెనక్కి వచ్చేశారు. కానీ ప్రకాశ్ జ్ఞాపకాలు మాత్రం కోసికలాన్కు ప్రయాణిస్తూనే ఉన్నాయి. పలుమార్లు కొసికలాన్కు వెళ్లడానికి విఫలయత్నాలు చేశాడు.ఓరోజు పెద్ద మేకును పట్టుకుని కోసికలాన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించాడు. ప్రకాశ్ నాన్న వెంటనే గమనించి ఆపాడు. చేతిలో ఉన్న మేకు ఏమిటని అడిగితే– ‘‘ఇది నా ఇనప్పెట్టె తాళం చెవి’’ అని చెప్పాడు. ప్రకాశ్‌కు పదేళ్ల వయసు వచ్చేసరికి కోసికలాన్ గురించి మరింత మారాం చేస్తుండటంతో 1961లో మళ్లీ అతడిని తీసుకుని వెళ్లారు. బస్సు దిగీదిగగానే వడివడిగా నడవడం మొదలుపెట్టాడు. ఆ వెనుకే అతడి తల్లిదండ్రులు కూడా అనుసరించారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక పాత డాబా ఇంటి ముందు ఆగాడు.‘‘ఇదే నా ఇల్లు!’’ అన్నాడు గట్టిగా.ఇంట్లోంచి బయటకు వచ్చిన మహిళను చూడగానే ప్రకా‹శ్ కళ్లు చెమ్మగిల్లాయి. ‘అమ్మా!’ అంటూ ఆమెను హత్తుకున్నాడు. పక్కనే నిలబడిన ఓ యువకుడిని ‘‘నువ్వు నా తమ్ముడు దేవేంద్ర కదా’’ అని అడిగాడు. ‘‘తారక్క ఎక్కడుంది?’’ అని ప్రశ్నించాడు. ఇది చూసి అంతా నిశ్చేష్టులయ్యారు. బోలానాథ్ జైన్ కుమారుడు నిర్మల్ నిజంగానే ఉన్నాడని, 1950లో సుమారు పదేళ్ల వయసులో మశూచితో మరణించినట్లు తెలిసి అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు.ప్రకాశ్ అంతటితో ఆగలేదు. ఆ ఇల్లంతా తిరిగాడు. ఏ గది ఎక్కడుందో, వెనుక పెరట్లో ఏముందో చెప్పాడు.ఇవన్నీ చూసిన నిర్మల్ తల్లి కన్నీటిపర్యంతమైంది. మరోవైపు తమ బిడ్డ తమకు దక్కకుండా పోతాడేమోనని ప్రకాశ్ తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ చూశారు. ఆ క్షణంలో ఆ వాకిట్లో నిశ్శబ్దం ఆవరించింది. రెండు కుటుంబాల మధ్య మమకారాలు, అనుమానాలు, అంతుచిక్కని కాలచక్రపు రహస్యాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. చివరకు, బాలుడి భవిష్యత్తు కోసం ప్రకాశ్‌ను అతడి తల్లిదండ్రులతోనే పంపాలని అందరూ నిర్ణయించుకున్నారు.ఈ విషయం పునర్జన్మలపై అధ్యయనం చేస్తున్న అమెరికా వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్కు తెలిసింది. దీంతో ఆయన 1961లో భారత్‌కు వచ్చారు. ప్రకాశ్, అతడి కుటుంబం, జైన్ కుటుంబం, స్థానిక సాక్షులను ఇంటర్వ్యూ చేశారు. 1964లో మరోసారి భారత్‌కు వచ్చి వివరాలు సేకరించారు. ఈ కేసులో ఆయన దృష్టిని ఆకర్షించిన అంశం భౌగోళిక దూరం. ప్రకాశ్ కుటుంబం నివసించే ఛత్తా, నిర్మల్ కుటుంబం నివసించే కోసికలాన్ పట్టణాల మధ్య దూరం కేవలం 10 కిలోమీటర్ల లోపే! పైగా రెండు కుటుంబాలకు ముందుగా పరిచయం కూడా లేదు. డాక్టర్ స్టీవెన్సన్ ఈ కేసును ‘పునర్జన్మ కేసు’గా పరిగణించారు.ప్రకాశ్ చెప్పిన పేర్లు, కుటుంబ సంబంధాలు, దుకాణాల వివరాలు, ఇంటి నిర్మాణం వంటి కొన్ని అంశాలు జైన్ కుటుంబానికి సంబంధించిన సమాచారంతో సరిపోలినట్లు గుర్తించారు. పునర్జన్మలపై తాను రాసిన పుస్తకంలో ప్రకాశ్ ఉదంతం గురించి వివరంగా రాశారు. కాలం గడిచేకొద్దీ ప్రకాశ్ సాధారణ జీవితంలోకి వెళ్లాడు. అయితే బాల్యంలో తనకు కలిగిన నిర్మల్ జ్ఞాపకాల ప్రభావం పూర్తిగా మాయం కాలేదు.ఒక చిన్నారి తనకు తెలియని మరో కుటుంబం, మరో ఊరు, మరో వ్యక్తి పేరు ఎందుకు చెప్పాడు? ఆ కుటుంబాన్ని కలిసినప్పుడు కొన్ని వ్యక్తులను, ప్రదేశాలను గుర్తించినట్లు ఎందుకు ప్రవర్తించాడు? అతడు చెప్పిన కొన్ని వివరాలు అక్కడి వాస్తవాలతో ఎలా సరిపోయాయి? ఇవన్నీ పునర్జన్మకు సాక్ష్యాలేనా? లేక ఇప్పటికీ పూర్తిగా అర్థంకాని బాల్య జ్ఞాపకాలు, సమాచార మార్పిడి, మానసిక ప్రక్రియల ఫలితమా?ప్రకాశ్ వర్ణే›్ష ఉదంతం ఈ ప్రశ్నలకు తుది సమాధానం ఇవ్వకపోయినా, ‘మరణం తర్వాత కూడా జ్ఞాపకం కొనసాగుతుందా’ అనే ప్రశ్నను మరోసారి తెరపైకి తెచ్చింది.- సత్యకిశోర్ కొండ్రెడ్డిఇదీ చదవండి: చిటికెడు ఉప్పుతో.. గిన్నిస్ రికార్డు! -
చిటికెడు ఉప్పుతో.. గిన్నిస్ రికార్డు!
ఉప్పు అంటే కూరలో చిటికెడు, మిరియాలు అంటే సూప్‌లో కాస్తంత! కానీ అమెరికాలోని లిండా షుల్జ్‌కు మాత్రం ఇవే ప్రపంచ రికార్డుకు కావాల్సినంత సరుకు! 67 ఏళ్ల లిండా ఉప్పు, మిరియాల ప్యాకెట్లను ఎక్కడున్నా వెతికి పట్టుకుని దాచేస్తారు. అలా దాచుకుంటూ పోయి ఏకంగా ప్రపంచ రికార్డునే తన వంటింటి షెల్ఫ్పైకి తెచ్చుకున్నారు!ఇప్పటివరకు 754 జంటలను పోగేశారు. దీంతో అతిపెద్ద ఉప్పు మిరియాల ప్యాకెట్ల సేకరణగా గిన్నిస్ రికార్డును మరోసారి సొంతం చేసుకున్నారు. అంటే మనం రెస్టరెంట్లో భోజనం అయిపోయాక టేబుల్‌పై మిగిలిన చిన్న ప్యాకెట్‌ను పట్టించుకోకుండా వదిలేస్తే లిండా మాత్రం వాటితోనే రికార్డు సాధించారు. ఈ రికార్డు లిండాకు కొత్తేమీ కాదు.2024లో 494 జంటలతో తొలిసారి రికార్డు సాధించిన ఆమెను, మరుసటి ఏడాది 594 జంటలతో సలాక్నిబ్ సోనీ మోలినా దాటేశారు. కానీ లిండా అక్కడితో ఆగలేదు. మళ్లీ ప్యాకెట్ల వేట మొదలుపెట్టి ఈసారి 754 జంటలతో రికార్డును తిరిగి పట్టేశారు! ఆమె సేకరణలో ఎన్నో రకాల డిజైన్లు, ప్రత్యేక ప్యాకెట్లు ఉన్నాయి. అయితే లిండాకు అన్నింటికంటే ఇష్టమైనవి హవాయియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన హవాయియన్ షర్ట్ డిజైన్ నట. మొదట సరదాగా మొదలైన హాబీ... చివరికి గిన్నిస్ రికార్డుగా మారింది.ఇదీ చదవండి: ఆకాశం నుంచి.. వెండితెర పైకి! -
ప్రపంచ వేదికపై ముంబై తాజ్!
సముద్రాన్ని చూస్తూ.. వందేళ్లకు పైగా చరిత్రను మోస్తూ.. ముంబై నగరానికి ఓ ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన తాజ్ మహల్ ప్యాలెస్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 2026లో ప్రపంచంలోని 50 ఉత్తమ హోటళ్ల జాబితాలో 30వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 38వ స్థానంలో ఉన్న ఈ చారిత్రక హోటల్ ఈసారి ఏకంగా ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకింది. 1903లో ప్రారంభమైన ఈ హోటల్ నేటికీ తన రాజసాన్ని కోల్పోకుండా ప్రపంచ స్థాయి అతిథులను ఆకట్టుకుంటోంది. వైభవమైన నిర్మాణం, సముద్రతీర దృశ్యం, ఆతిథ్యానికి పేరుగాంచిన సేవలు.. ఇవన్నీ తాజ్ ప్రత్యేకతలు. ప్రపంచంలోని ప్రముఖ హోటల్ రంగ నిపుణులు, ప్రయాణ రచయితలు, అనుభవజ్ఞులైన ప్రయాణికుల అభిప్రాయాల ఆధారంగా ఈ జాబితా రూపొందింది.ఇదీ చదవండి: స్టూల్ మధ్యలో ఆ రంధ్రం ఎందుకో తెలుసా? కారణం తెలిస్తే షాక్! -
స్టూల్ మధ్యలో ఆ రంధ్రం ఎందుకో తెలుసా? కారణం తెలిస్తే షాక్!
సాధారణంగా మనం కూర్చునే ప్లాస్టిక్ స్టూల్ మధ్యలో రంధ్రం ఉంటుంది. మీరెపుడైనా ఆలోచించారా? అది ఎందుకు ఏర్పాటు చేస్తారో..! అది అలంకారం కోసం పెట్టింది కాదు. స్టూల్‌ను తయారు చేయడం, మోయడం, ఉపయోగించడం సులభంగా ఉండేందుకు ఈ చిన్న రంధ్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.స్టూల్ మధ్యలో రంధ్రం ఉండటం వల్ల స్టూల్‌ను పట్టుకుని ఒకచోట నుంచి మరోచోటికి సులభంగా తరలించవచ్చు. అలాగే తయారీ సమయంలో ప్లాస్టిక్ పూర్తిగా ఒకే ముక్కగా ఉండకుండా, సరైన ఆకారంలోకి రావడానికి కూడా ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా స్టూల్‌పై ఎవరైనా కూర్చున్నప్పుడు గాలి, ఒత్తిడి ప్రభావాన్ని కొంత తగ్గించడంలోనూ ఈ డిజైన్ ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలా? ఈ ఒక్క రూల్ పాటించండి! -
పులులు, ఏనుగులే కాదు.. అడవిలో ఆరు కొత్త జీవజాతులు!
అడవి అంటే పులులు, ఏనుగులే కాదు.. మన కంటికి చిక్కని ఎన్నో జీవుల ప్రపంచం కూడా! కేరళలోని పెరియార్ పులుల అభయారణ్యంలో నిర్వహించిన జీవ వైవిధ్య సర్వేలో ఆరు కొత్త జీవజాతులు వెలుగులోకి వచ్చాయి.నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో ఒక పక్షి, ఒక సీతాకోకచిలుక, నాలుగు తూనీగ జాతులు తొలిసారిగా పెరియార్లో నమోదయ్యాయి. వీటిలో గోల్డెన్ –హెడ్ సిస్టికోలా అనే పక్షి, కామన్ ఓనిక్స్ అనే సీతాకోకచిలుకలు ఉన్నాయి. వీటిలో ప్యారకీట్ డార్నర్, ఫ్రేజర్స్ క్లబ్టైల్, స్పైని హార్న్టైల్, నీలగిరి క్లాటైల్ ఉన్నాయి.ఈ సర్వేలో 75 మంది నిపుణులు, 21 సంస్థలకు చెందిన ప్రతినిధులు, 21 బృందాలుగా ఏర్పడి, 20 ప్రాంతాల్లో సర్వే చేశారు. అయితే ఈ ఆవిష్కరణ పెరియార్ అడవిలో ఇంకా వెలుగులోకి రాని జీవ వైవిధ్యం ఎంత విస్తారంగా ఉందో చెబుతోంది. ఇలాంటి సర్వేలు అరుదైన జీవులను గుర్తించడంతో పాటు, వాటి సంరక్షణకు కూడా కీలకంగా మారుతున్నాయి.– నిర్వహణ రమా జంబులఇదీ చదవండి: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలా? ఈ ఒక్క రూల్ పాటించండి! -
ఎట్టకేలకు 59 ఏళ్ల వయసులో టీచర్ ఉద్యోగం..!
ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్. కానీ ఆ వ్యక్తిలా ఇంతలా ఇన్నిసార్లు ప్రయత్నించి ఉండరు. ఎందుకంటే..ఎవ్వరైనా మహా అయితే ఓ పదిసార్లు ట్రై చేసి ఆగిపోతారామె. కానీ ఇతడు పట్టువదలని విక్రమార్కుడిలా చేసిన ప్రయత్నం నిజంగా స్ఫూర్తిదాయకం. ఓపికకు చిరునామా కూడా. అతడే ఉత్తరప్రదేశ్‌కి చెందిన విజయ్ కుమార్ శర్మ. దాదాపు 27 ప్రయత్నాల తర్వాత ప్రభుత్వ ఉపాద్యాయుడిగా ఉద్యోగం సాధించారు. 1999 నుంచి నియమాక పరీక్షలకు హాజరవుతూ వచ్చిన 59 ఏళ్ల శర్మ సంస్కృత విభాగంలో 'ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్' (TGT)గా ఎంపికయ్యారు. ఆయన అనేకసార్లు రాత పరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ ఇంటర్యూలో ఫెయిలవ్వడంతో ఉద్యోగం పొందలేకపోయినట్లు తెలిపారు. ఈసారి నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూని తొలగించడంతో తాను ఎంపికైనట్లు వెల్లడించారు శర్మ. ఏళ్ల తరబడి రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించనప్పటికీ, కేవలం ఇంటర్వ్యూలో వైఫల్యం చెందడం వల్లే ఉద్యోగం సాధించలేకపోయినట్లు తెలిపారు. ఆయన టీజీటీ నియామకానికి ఆరుసార్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్ నియమాకానికి నాలుగుసార్లు రాతపరీక్షలలో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఆయన 26 ఏళ్ల పాటు 'డూన్ పబ్లిక్ స్కూల్'లో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పాఠశాలలో బోధిస్తూనే ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు సన్నద్ధమైనట్లు పేర్కొన్నారు. అంతేగాదు ఆ ప్రైవేట్ పాఠశాల డైరెక్టర్ మాట్లాడుతూ.. శర్మ 2003 నుంచి తమ సంస్థతో అనుబంధ కలిగి ఉన్నారని, రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడ బోధించారని చెప్పారు. ఆయన పాఠాలు బోధిస్తూనే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారని పేర్కొన్నారు. విచిత్రం ఏంటంటే శర్మ తండ్రి లక్ష్మణ్ సింగ్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. ఇక ఆయనకు ఐదుగురు పిల్లలు, వీరిలో ఇద్దరు కుమారులు ఉత్తప్రదేశ్ పోలీస్ విభాగంలో పనిచేస్తుండగా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరు ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక తన నియమాకం గురించి శర్మ మాట్లాడుతూ..ఎట్టకేలకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకోవడం తన జీవితంలోని అత్యంత గొప్ప విషయమని అన్నారు. తన ప్రతి ప్రయత్నంలో తప్పులను సరిదిద్దుకుంటూ పనితీరుని మెరుగుపరుచుకున్నాని అన్నారు. అంతేగాదు పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా శర్మ సెప్టెంబర్ 22న లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆయన షామ్లీ జిల్లాలోని ఒక ఎయిడెడ్ మాధ్యమిక పాఠశాలలో టీజీటీ(TGT) సంస్కృత ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు.ఇదీ చదవండి: ఎలక్ట్రీషియన్ నుంచి మాస్టర్ చెఫ్ విజేత, రెస్టారెంట్ యజమాని రేంజ్‌కి..!) -
ఆ రెస్టారెంట్లో మెనూనే ఉండదట..! ఫుడ్ ఎలా ఆర్డర్ చేస్తారంటే..
ప్రత్యేకమైన భోజనం అనుభవం కోసం వెరైటీ రెస్టారెంట్‌కి లేదా విభిన్న రుచుల ఆహారాలను అందించే హోటల్‌కో వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెస్టారెంట్ మాత్రం అత్యంత ప్రత్యేకం. అంతేగాదు అసలు ఇలాంటి రెస్టారెంట్‌ని చూసే అవకాశం అస్సలు ఉండదు. ఎందుకుంటే అక్కడ అస్సలు మెనూ ఉండదు..అయినా జనం తినేందుకు తండోపతండాలుగా ఎగబడుతుంటారు. అదెలా అని ఆశ్చర్యం కలుగక మానదు. మరి కస్టమర్లు ఫుడ్ ఎలా ఆర్డర్ చేస్తారంటే..ఇక్కడ దొరికే ఏ ఫుడ్‌ని అయినా వేలం ద్వారా దొరకుతుంది. అంటే చాలా ఖర్చు అవుతుందా అనుకోకండి. ఇక్కడ సర్వర్లు ఫుడ్ ప్లేట్లతో మనముందుకు వచ్చి..వారి చేతిలో ఏయే ఏయే ఆహారాలు ఉన్నాయో గట్టిగా అరుస్తూ చెబుతారు. మనం ఠక్కున మనకు కావాలా? వద్దా? అని చెబితే చాలు. తక్షణమే సర్వర్లు మనకు నచ్చిన వంటకాన్ని వడ్డిస్తారు. బిల్లు కూడా మనం తిన్న ప్లేట్ల సంఖ్యను బట్టి డబ్బులను వసూలు చేస్తారంతే. సింపుల్‌గా చెప్పాలంటే దీన్ని అరుపుల రెస్టారెంట్ అని పిలవొచ్చు. ఇదెక్కడ ఉందంటే..స్పెయిన్‌లోని మాలాగాలో ఉన్న 'ఎల్ టింటెరో' రెస్టారెంట్లో ఇలాంటి ప్రత్యేకమైన విందు లభిస్తుందట. స్టెఫ్, మార్కో అనే కంటెంట్ క్రియేటర్ జంట ఈ రెస్టారెంట్‌ని సందర్శించి అక్కడి ఫుడ్ అనుభవాన్ని వీడియో రూపంలో షేర్ చేశారు. పైగా ఇక్కడ తాజాగా వండిన ఆహారాన్నే వడ్డిస్తారట. నేరుగా బొగ్గులపై లేదా ఫ్రైయర్లలో వేయించి వడ్డిస్తారని చెబుతున్నారు. ఇక్కడ ప్రతి వంటకం నోరూరించే రుచితో అత్యంత మధురంగా ఉంటుందట. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి మరి..!.ఇదీ చదవండి: Shruti Haasan: ఎప్పటికీ తల్లిని కాలేననుకున్నా..!: శ్రుతి హాసన్) -
బంతిపూల బొకేలు.. ఇండియాలో ఎందుకు ఉండవు?
మన పూజా గదులు, పెళ్లి మండపాలు, ద్వార తోరణాలు, రాజకీయ సభల వేదికలు.. ప్రదేశమేదైనా సరే, కనిపించే ఏకైక రంగు ‘బంతిపూల’ప్రకాశవంతమైన కాంతి. మన సంస్కృతిలో, ప్రతి శుభకార్యంలో బంతిపూల ఉనికి తప్పనిసరి. అయితే తాజాగా విదేశాలలో కూడా ఫ్లోరిస్ట్ షాపుల్లో బంతిపూలకు లభిస్తున్న గౌరవం, ఒక మోడర్న్ ఫ్లోరల్ ఆర్ట్‌గా పొందుతున్న గుర్తింపు చూస్తుంటే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! అవును, విదేశాలలో ఇప్పుడు ‘బంతిపూల బొకేలు’సరికొత్త ట్రెండ్‌గా మారాయి. పశ్చిమ దేశాల్లో వీటిని అధునాతన పూలగుచ్ఛాలలో ప్రధాన ఆకర్షణగా ఉపయోగిస్తున్నారు. కానీ మనదేశంలో మాత్రం ఇవి కేవలం సంప్రదాయ వేడుకలకే పరిమితమై, బొకేల సంస్కృతికి దూరంగా ఉండిపోయాయి.మెక్సికో నుంచి మన ముంగిట్లోకి..! బంతిపూలు పక్కా భారతీయ జాతి అనుకుంటే పొరపాటే. ఇవి 16వ శతాబ్దంలో స్పానిష్, పోర్చుగీస్ వర్తకుల ద్వారా మెక్సికో నుంచి మన దేశానికి వచ్చాయి. ఇక్కడి నేల, వాతావరణం, మన సంప్రదాయాలకు ఇవి ఎంతలా అలవాటు పడ్డాయంటే... ఇవాళ బంతిపూలు లేని భారతీయ వేడుకను ఊహించుకోవడం కూడా కష్టమే.న్యూజెర్సీలో ‘బంతుల’హంగామా న్యూజెర్సీలోని స్థానిక ఫ్లవర్ మార్కెట్లను గమనిస్తే.. పాస్టెల్–పింక్, సాఫ్ట్ ఎల్లో గులాబీలు, లిల్లీలు, పచ్చని ఆకుల నడుమ ప్రకాశవంతమైన నారింజ రంగు బంతిపూలను అమర్చి అద్భుతమైన బొకేలు తయారు చేస్తున్నారు. బంతిపూలలో ఉండే దట్టమైన రేకులు, రిచ్ ఎర్తీ లుక్ ఆ పూలగుచ్ఛానికే ఒక ప్రత్యేకమైన విలువను, ఎనర్జీని తెచ్చిపెడుతున్నాయి. లేలేత రంగులకు, బంతిపూల నారింజ రంగు ఇచ్చే కాంట్రాస్ట్ పాశ్చాత్య దేశాలలో ట్రెండ్ సెట్టర్‌గా మారింది.ఇండియాలో ఎందుకు ఉండవు? మనదేశంలో బంతిపూలను మోడర్న్ బొకేలలో వాడకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి, సాంస్కృతిక మనస్తత్వం. మన ఆలోచనల్లో బంతిపూలు అంటే గుడులు, దండలు, మండపాల డెకరేషన్ మాత్రమే. ‘బ్లూమింగ్ టేల్స్’వ్యవస్థాపకుడు మను మహల్వార్ తెలిపినట్లు.. ఇవి మతపరమైన భక్తి భావాలతో లోతుగా ముడిపడి ఉన్నాయి. పైగా, ఇవి అతి చౌకగా, ప్రతిచోటా విరివిగా లభించడం వల్ల భారతీయ వినియోగదారులు వీటిని ‘లగ్జరీ మెటీరియల్’గా చూడలేకపోతున్నారు. రెండోది, భారతదేశంలోని హోల్‌సేల్ మార్కెట్లలో బంతిపూలు కేవలం దండలు అల్లడానికి వీలుగా ‘విడి పూల’రూపంలోనే లభిస్తాయి. బొకేలు చేయడానికి కావలసిన పొడవైన, గట్టి కాడలతో కూడిన బంతిపూలు మార్కెట్లో అసలు దొరకవు.ఇదీ చదవండి: వ్యాయామం తర్వాత కంప్రెషన్ దుస్తులు ఎందుకు ధరిస్తారు?దండల నుంచి.. గ్లోబల్ బొకేల వైపు! బంతిపూలలో ఒక అద్భుతమైన కనువిందు చేసే అందం దాగి ఉంది. మనం చూసే కోణాన్ని కొద్దిగా మార్చితే, ఆధునిక ఫ్లోరిస్ట్రీకి (అలంకరణ కళ) ఇదొక కొత్త వన్నె తెచ్చిపెడుతుంది. బంతిపూలను కేవలం దండలకే పరిమితం చేయకుండా, విదేశీ రీతిలో మోడర్న్ బొకేలలో అమర్చితే అవి ఇచ్చే రంగుల వెల్లువ అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా మీ ప్రియమైన వారికి ప్రత్యేకమైన బొకే ఇవ్వాలనుకుంటే... అందులో కాస్త బంతిపూల కళను జోడించి చూడండి, అది తెచ్చే డిజైన్ సరికొత్తగా ఉంటుంది! – సాక్షి స్పెషల్ డెస్క్ -
సముద్రం మధ్యలో పచ్చని స్వర్గమా?! ఈ దీవి ఎక్కడుందో తెలుసా?
భారత్‌లో ఎన్నో అందమైన దీవులు ఉన్నాయి. అయితే పచ్చని ప్రకృతి, నీలిరంగు సముద్రం, ప్రశాంతమైన వాతావరణంతో అండమాన్ లోని హేవ్‌లాక్ ఐలాండ్‌ను భారతదేశపు ఎమరాల్డ్ ఐలాండ్‌గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ దీవిని స్వరాజ్ ద్వీప్ అని కూడా పిలుస్తున్నారు. సముద్రం మధ్యలో పచ్చని అడవులు, తెల్లని ఇసుక తీరాలు కలిసిన ఈ దీవి ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ దీవుల సమూహంలో స్వరాజ్ ద్వీప్ ఒక ముఖ్యమైన పర్యాటక ప్రాంతం. ఒకప్పుడు హేవ్‌లాక్ ఐలాండ్‌గా ప్రసిద్ధి చెందిన ఈ దీవికి 2018లో స్వరాజ్ ద్వీప్గా పేరు మార్చారు. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతమైన బీచ్‌లు, స్వచ్ఛమైన సముద్రపు నీరు కనిపిస్తాయి. అందుకే ‘ఎమరాల్డ్’ అనే పేరు దీనికి చక్కగా సెట్ అవుతుంది.స్వరాజ్ ద్వీప్‌లో రాధానగర్ బీచ్ ప్రధాన ఆకర్షణ. తెల్లటి ఇసుక, నీలి సముద్రం, చుట్టూ పచ్చని చెట్లు.. ఇవన్నీ కలిసి పైసా వసూల్ అనుభూతిని అందిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో బీచ్ వాతావరణం మరింత ప్రశాంతంగా మారుతుంది. ఎలిఫెంట్ బీచ్ వద్ద స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ వంటి వాటర్ యాక్టివిటీస్ ట్రై చేయవచ్చు. నీటి అడుగున కనిపించే పగడాలు, రంగురంగుల చేపలు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.ఇక్కడికి చాలా మంది వెళ్లే ముందు బీచ్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. అయితే ఉదయం పూట పచ్చని చెట్ల మధ్య ప్రయాణించడం, చిన్న చిన్న లోకల్ షాపుల్లో షాపింగ్ చేయడం, సముద్ర తీరంలో కొంతసేపు ప్రశాంతంగా గడపడం కూడా ఈ ప్రయాణంలో భాగమే. అక్టోబర్ నుంచి మే వరకు సాధారణంగా అండమాన్ పర్యటనకు అనుకూలమైన కాలంగా భావిస్తారు. పోర్ట్ బ్లెయిర్ నుంచి ఫెర్రీ ద్వారా స్వరాజ్ ద్వీప్ చేరుకోవచ్చు.పచ్చని అడవులు, నీలి సముద్రం, తెల్లటి ఇసుక తీరాల కాంబినేషన్ లో కనిపించే ఈ ఎమరాల్డ్ ఐలాండ్.. అంటే ఒకప్పటి హేవ్‌లాక్ ఐలాండ్.. ప్రయాణికులకు ఎవర్గ్రీన్ మెమరీగా మిగిలిపోతుంది.ఇదీ చదవండి: ఆకాశానికి దగ్గరగా ఓ నగరం ఉందా?! ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే? -
ఆకాశానికి దగ్గరగా ఓ నగరం ఉందా?! ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే?
సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న నగరాల్లో ఒకటైన ఎల్ ఆల్టోలో లైఫ్ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి చాలా మంది దక్షిణ అమెరికాలోని బొలీవియాలో ఉన్న ఎల్ ఆల్టోకు వెళ్తుంటారు. లా పాజ్ నగరానికి సమీపంలో ఉన్న ఈ నగరం.. ఎత్తైన ప్రాంతాల్లో ప్రజల దైనందిన జీవితం ఎలా ఉంటుందో పరిచయం చేస్తుంది.విశాలమైన రహదారులు, ఇటుక భవనాలు, కలర్‌ఫుల్ మార్కెట్ స్ట్రీట్స్, దూరంగా కనిపించే మంచు పర్వతాలు ఎల్ ఆల్టో ప్రత్యేకత. కేబుల్ కారులో ప్రయాణిస్తే నగరం విస్తరించిన తీరు, కొండలు, రహదారులపై రాకపోకలు మరో కోణంలో కనిపిస్తాయి. మార్కెట్లలో స్థానికులు తమ రోజువారీ పనుల్లో బిజీగా కనిపిస్తారు.ఎల్ ఆల్టో వైబ్‌ను ఫీల్ అవ్వాలంటే కేబుల్ కారులో ప్రయాణిస్తే సరిపోతుంది అంటారు. ఇక్కడి మెర్కాడో 16 డి జులియో మార్కెట్లో స్థానికుల సందడి కనిపిస్తుంది. సమీపంలోని లా పాజ్ నగరం, వల్లే డి లా లూనా ప్రాంతాలను కూడా ట్రావెల్ లిస్టులో యాడ్ చేసుకోవచ్చు. ఎల్ ఆల్టోలో మన సమోసాల్లా ఉండే సాల్టెనాస్ను వేడివేడిగా ఆస్వాదించవచ్చు. ఉదయాన్నే హాట్ డ్రింక్‌తో పాటు స్వీట్‌గా ఉండే ఆపి కాన్ పాస్టెల్ను ఎంజాయ్ చేయవచ్చు. ఎత్తైన ప్రాంతం కావడంతో ఇక్కడి వాతావరణం, నగర దృశ్యాలు ప్రయాణికులకు కొత్త అనుభూతిని ఇస్తాయి.ఎప్పుడు వెళ్లాలి?ఎల్ ఆల్టోలో మే నుంచి అక్టోబర్ వరకు వర్షాలు తక్కువగా కురుస్తాయి. ఈ సమయంలో వాతావరణం సాధారణంగా పొడిగా ఉండటంతో పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎప్పుడు వెళ్లినా.. మొదటి రోజు కాస్త నెమ్మదిగా స్థానిక వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీ చెక్‌లిస్ట్ ప్రకారం ట్రావెల్‌ను కంటిన్యూ చేయొచ్చు.హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి?హైదరాబాద్ నుంచి బొలీవియాకు నేరుగా విమానాలు లేవు. ఒకటి లేదా రెండు కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా బొలీవియా రాజధాని లా పాజ్ చేరుకోవాల్సి ఉంటుంది. మొత్తం ప్రయాణానికి సుమారు 24–30 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. లా పాజ్ నుంచి ఎల్ ఆల్టోకు రోడ్డు మార్గంలో లేదా కేబుల్ కార్ ద్వారా చేరుకోవచ్చు.ఇదీ చదవండి: ఈ 5 పర్వతాలను ఎవరూ అధిరోహించలేదు! ఎందుకంటే? -
ఎగరలేని రామచిలుక కోసం.. యజమాని ఐడియా ఇప్పుడు వైరల్!
రెక్కలు దెబ్బతింటే పక్షి ఎగరడం కష్టమే. కానీ ఈ రామచిలుక విషయంలో మాత్రం అలా జరగలేదు. యజమాని చేసిన ఓ అద్భుత ప్రయత్నంతో రెక్కలు పనిచేయకపోయినా.. అది మళ్లీ ఆకాశంలోకి ఎగరగలుగుతోంది.ఫిలిప్పీన్స్‌లోని డవావో నగరంలో మార్క్ జోసెఫ్ కొలాండో అనే వ్యక్తి ముచ్చటగా ఒక పంచవన్నెల రామచిలుకను పెంచుకుంటున్నాడు. ఒకనాడు రామచిలుకపై ఒక పిల్లి దాడిచేసింది. పిల్లి దాడిలో రామచిలుక రెక్కలు రెండూ దెబ్బతిన్నాయి. అప్పటి వరకు స్వేచ్ఛగా ఎగరగలిగే రామచిలుక ఎగరలేని స్థితిలో మూలపడింది.తన రామచిలుకను ఎగరలేని స్థితిలో చూసి మార్క్ కలత చెందాడు. గాయపడ్డ చిలుక తిరిగి ఎగరడానికి ఏదైనా చేయాలని తలచాడు. అప్పుడే అతడికి అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచే ఈ డ్రోన్ రూపుదిద్దుకుంది. ఈ డ్రోన్‌కు రామచిలుక సౌకర్యంగా కూర్చునేలా ప్లాస్టిక్ క్యాబిన్‌ను అమర్చాడు. ఇప్పుడు ఈ రామచిలుక డ్రోన్‌కు అమర్చిన క్యాబిన్లో చక్కగా కూర్చుని, డ్రోన్ రెక్కల సాయంతో మళ్లీ ఎగరగలుగుతోంది.ఇదీ చదవండి: పూల రారాణి గులాబీ.. ప్రపంచాన్ని ఎలా చుట్టేసిందో తెలుసా? -
పూల రారాణి గులాబీ.. ప్రపంచాన్ని ఎలా చుట్టేసిందో తెలుసా?
ప్రపంచంలో గులాబీని పూల రారాణి అంటారు. గులాబీల గుబాళింపు ప్రపంచానికి సహస్రాబ్దాలుగా తెలుసు. భూమ్మీద ఉత్తరార్ధగోళంలో ఉన్న దాదాపు అన్ని దేశాలకు గులాబీలు పురాతన కాలం నుంచి తెలుసు.భారత భూభాగంలోని హిమాలయ ప్రాంతంలో గులాబీలు విరివిగా పూసేవి. మొఘల్ చక్రవర్తుల కాలంలో గులాబీలకు బాగా ఆదరణ పెరిగింది. కాకతీయుల కాలం నాటికి గులాబీలు దక్షిణ భారత ప్రాంతానికి కూడా విరివిగా విస్తరించాయి. గులాబీల గురించి మరిన్ని విశేషాలను గణాంకాల్లో...పంతొమ్మిదో శతాబ్దిలో ఇది దక్షిణార్ధగోళానికి కూడా వ్యాపించింది. ప్రాచీన గ్రీకు, రోమన్, మెసపటేమియన్ నాగరికతల ప్రజలు గులాబీ తోటలను విరివిగా పెంచేవారు. గులాబీలతో పరిమళ ద్రవ్యాల తయారీలోను, ఔషధాల తయారీలోను నాటి ప్రజలు ఉపయోగించేవారు.ఇదీ చదవండి: బట్టతల వచ్చిందా? స్టయిల్ మార్చండి.. లుక్ అదిరిపోవాల్సిందే! -
కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ!
కొన్ని పండుగల వెనుక సంస్కృతీ సంప్రదాయాల చరిత్ర ఉంటే, మరికొన్ని పండుగలు భావోద్వేగాలు, విశ్వాసాలతో ముడిపడి ఉంటాయి. అలాంటి అరుదైన పండుగే ‘నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లా మెజొరానా’. పనామాలోని గ్వరారేలో ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో ఈ వేడుకలను నిర్వహిస్తారు. పనామా ప్రజల గ్రామీణ సంస్కృతి, సంగీతం, నృత్యం, సంప్రదాయ దుస్తులు, రైతుల జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ ఉత్సవం 1949లో ప్రారంభమైంది.ఈ మెజొరానా పండుగ ప్రారంభం వెనుక ఓ తండ్రి వేదన ఉంది. ఈ పండుగ నిర్వాహకులలో ఒకరైన మాన్యుయెల్ ఫెర్నాండో జారాతె కుమార్తె లుకీమియాతో బాధపడేది. దీంతో జారాతె ‘వర్జిన్ డి లాస్ మెర్సిడెస్’ అమ్మవారిని వేడుకున్నాడు. తన కుమార్తె ఆరోగ్యం బాగుపడితే, అమ్మవారి దయకు కృతజ్ఞతగా ప్రతి ఏడాది జానపద సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తానని మొక్కుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ బాలిక కోలుకోవడంతో– ఇచ్చిన మాట ప్రకారం 1949లో మొదటిసారి ఈ జానపద సంబరాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా సెప్టెంబర్‌లో నిర్వహించే ఈ వేడుకలకు వేలాదిమంది భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తరలివస్తారు. ఈ ఏడాది ఈ వేడుకలను సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు.పనామా గ్రామీణ సంప్రదాయాలను కాపాడటమే ఈ మెజొరానా పండుగ లక్ష్యం. ముఖ్యంగా రైతుల జీవన విధానం, వారి పాటలు, సంగీతం, నృత్యాలు, దుస్తులు, చేతివృత్తులు, స్థానిక కళలను తరువాతి తరాలకు అందించాలనుకున్నారు. అందులో ప్రధాన పాత్రను ‘మెజొరానా’ అనే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ సంగీత వాయిద్యానికి ఇచ్చారు. పరిమాణంలో చిన్నదిగా కనిపించినా దాని శబ్దానికి ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పనామా గ్రామీణ కవులు పాడే ‘దెసిమా’ పాటలకు ఇది సంగీత సహకారం అందిస్తుంది. సెడార్, బాల్సో, వోలడార్ వంటి స్థానిక కలపతో ఈ మెజొరానాలను తయారు చేస్తారు. గతంలో వీటి తంత్రుల కోసం కోడి పేగులను ఉపయోగించేవారు, ప్రస్తుతం నైలాన్ తీగలను ఉపయోగిస్తున్నారు.కారెటాస్ పరేడ్ మరో ప్రత్యేకత అలంకరించిన ఎద్దుల బండ్ల ఊరేగింపు. పండుగ ముగింపు వేడుకల్లో ఈ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.‘ఫెస్టివల్ ఆఫ్ మెజొరానా’ కేవలం ఒక సంగీత వేడుక కాదు. అనేక సంప్రదాయ కళలకు వేదిక. దాదాపు 75 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఈ వేడుక ప్రాంతీయ అస్తిత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యానికి కూడా వేదిక కల్పిస్తోంది. ఒక కుటుంబం మొక్కుకున్న మొక్కు ఓ దేశానికి పండుగగా మారి, జానపద సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.పాటల్లో పలికే రైతు జీవితం..ఈ ఉత్సవంలోని ‘దెసిమా’ పాటలు ప్రత్యేక ఆకర్షణ. గ్రామీణ జీవితం, రైతుల కష్టాలు, ప్రేమ, ప్రకృతి వంటి ఎన్నో విషయాలను పాటల రూపంలో చెప్పే సంప్రదాయం ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పోటీల్లో పాల్గొంటారు.- రమా జంబులఇదీ చదవండి: శాపంతో చెట్లుగా మారిన దంపతులు.. వినాయక పూజలో దాగిన కథ! -
‘అమ్మా.. నా ఇంటికి నన్ను తీసుకెళ్లు!’ బాలుడి మాటలలో మిస్టరీ!
2010... ఓక్లహామానగరం ప్రశాంతంగా నిద్రపోతోంది. రోడ్డుపై అడపాదడపా వెళ్లే వాహనాలు మినహా ఎలాంటి అలికిడీ లేదు. అంతలో ర్యాన్ హ్యామన్స్ అనే నాలుగేళ్ల బాలుడు నిద్రలోనే గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. అది విని తల్లి సిండీ మేలుకుంది. ఏదైనా పీడకల వచ్చేందేమో అనుకుని ర్యాన్‌ను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. అయినా ఆ బాలుడు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూనే ఉన్నాడు. కాసేపటి తర్వాత నెమ్మదిగా కళ్లు తెరిచాడు.‘అమ్మా... నన్ను హాలీవుడ్‌లోని నా ఇంటికి తీసుకెళ్లు. అక్కడున్న నా వాళ్లను వెంటనే చూడాలి’ అని అనేసరికి సిండీకి ఏమీ అర్థం కాలేదు. ఏదైనా కల వచ్చి అలా అన్నాడేమో అని సరిపెట్టుకుంది. రోజులు గడిచేకొద్దీ ర్యాన్ మాటలు మరింత విచిత్రంగా మారాయి. ‘నాకు పెద్ద ఇల్లు, కారు ఉండేవి. ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్ కూడా ఉండేది. నేను చాలా డబ్బున్నవాడిని’ అని తరచుగా చెబుతుండేవాడు. తాను గతంలో మరో కుటుంబంతో జీవించానని, అక్కడికి తిరిగి వెళ్లాలని పట్టుబట్టేవాడు. అతడి మాటల్లో ఏౖదైనా నిజం ఉందేమో తెలుసుకోవాలని భావించిన సిండీ, ఓ రోజు లైబ్రరీ నుంచి హాలీవుడ్‌కు సంబంధించిన కొన్ని పుస్తకాలు తెప్పించి కుమారుడికి ఇచ్చింది.అవి చూస్తున్న ర్యాన్‌కు 1932లో వచ్చిన ‘నైట్ ఆఫ్టర్ నైట్’ సినిమా ఫొటో ఒకటి బాగా ఆకర్షించింది. అందులో ఓ వ్యక్తిని చూపిస్తూ, ‘ఇది నేనే...’ అంటూ బిగ్గరగా అరిచాడు. ఆ వ్యక్తిని చూసిన తల్లికి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ వ్యక్తి సినిమాలో హీరో కాదు. పెద్ద నటుడు కూడా కాదు. ఆయన పేరు కూడా ఫొటోలో లేదు. ఆ ఫొటోలోని ఓ వ్యక్తిని చూపించి, అతడు జార్జ్ అని చెప్పాడు. నిజంగానే అతడు ప్రముఖ నటుడు జార్జ్ రాఫ్ట్ కావడంతో సిండీ అయోమయానికి గురైంది.‘ఇది కేవలం ఓ చిన్నారి ఊహా? లేక నిజంగా అతడి జ్ఞాపకాల్లో దాగిన ఏదైనా గతం ఉందా?’ ఈ ప్రశ్నే చివరకు ఈ కేసును డాక్టర్ జిమ్ టక్కర్ వద్దకు తీసుకెళ్లింది. గత జన్మ జ్ఞాపకాలపై పరిశోధనలు చేస్తున్న ఆయన, ఈ ఉదంతంపై లోతుగా అధ్యయనం చేశారు. ఆ ఫొటోలోని వ్యక్తిని మార్టీ మార్టిన్ అని గుర్తించారు. ‘నైట్ ఆఫ్టర్ నైట్’ సినిమాలో చిన్న పాత్ర చేసిన మార్టిన్, తర్వాత నటనను పక్కనపెట్టి హాలీవుడ్లో టాలెంట్ ఏజెంట్‌గా ఎదిగాడని, 1964లో మరణించాడని తెలుసుకున్నారు.ఇక్కడి నుంచి ర్యాన్ కథ మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో అతడు చెబుతున్న విషయాలను సిండీ డైరీలో రాయడం ప్రారంభించింది. తనకు ఒక కుమార్తె ఉందని చెప్పిన ర్యాన్, తాను ఎన్నో సముద్ర ప్రయాణాలు చేశానని, అందమైన మహిళలతో కలిసి డ్యాన్స్ చేశానని చెప్పాడు. ఇవన్నీ సరిపోల్చుకోవాలని టక్కర్ భావించారు. దీంతో ర్యాన్ కు కొన్ని ఫొటోలను చూపించారు. వాటిలో మార్టీకి తెలిసిన వ్యక్తులతోపాటు ఎలాంటి సంబంధంలేని వారు కూడా ఉన్నారు.‘వీరిలో ఎవరైనా నీకు పరిచయంగా అనిపిస్తున్నారా?’ అని టక్కర్ అడిగితే, ర్యాన్ కొన్ని ఫొటోలను ఎంచుకున్నాడు. అందులో ఒకరు మార్టీకి పరిచయం ఉన్న వ్యక్తిగా తేలారు. మార్టీ నాలుగో భార్య ఫొటోను కూడా చూపించాడు. అయితే ఈ పరీక్షలో కొన్ని విషయాలు సరిపోలలేదు. దీంతో టక్కర్ ఈ కేసును మరింత జాగ్రత్తగా పరిశీలించారు.ఈ క్రమంలో మార్టిన్ కుమార్తెతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పటిదాకా బయటి ప్రపంచానికి తెలియని, కుటుంబానికి మాత్రమే తెలిసిన చాలా అంశాలను ఆ బాలుడు చెప్పడంతో ఆమె నిశ్చేష్టురాలైంది. మార్టిన్ నివసించిన పాత ఇంటి అడ్రస్, ఆయనకు నలుగురు భార్యలు ఉన్నారనే రహస్యం వంటివి చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ర్యాన్ చెప్పిన చాలా అంశాలు సరైనవేనని నిర్ధారించింది.అయితే ర్యాన్ది నిజంగానే పునర్జన్మా? అనే విషయంలో పూర్తి స్పష్టత రాలేదు. డాక్టర్ జిమ్ టక్కర్ పరిశోధనలు ఈ కేసును అసాధారణమైనదిగా తేల్చినా, శాస్త్రీయంగా ‘పునర్జన్మకు రుజువు’ అని చెప్పలేకపోయాయి. నాలుగేళ్ల వయసులో ఎంతో స్పష్టంగా కనిపించిన ఆ ప్రపంచం, కాలం గడిచేకొద్దీ మసకబారిపోయింది. పెద్దయ్యేసరికి ర్యాన్ కు ఆ జ్ఞాపకాలు దాదాపుగా కనుమరుగయ్యాయి. నిజంగా అది గత జన్మ జ్ఞాపకమా? బాల్యంలో ఏర్పడిన ఏదైనా మానసిక ప్రభావమా? లేక ఇప్పటికీ శాస్త్రానికి అంతుపట్టని మరో రహస్యమా?సమాధానం ఏదైనా కావచ్చు కానీ, 1932 నాటి ఓ సినిమాలోని మరుగునపడిన వ్యక్తిని నాలుగేళ్ల బాలుడు గుర్తించిన ఆ క్షణం మాత్రం ఇప్పటికీ ఓ ప్రశ్నగానే మిగిలిపోయింది.- సత్యకిశోర్ కొండ్రెడ్డిఇదీ చదవండి: పాస్ పోర్ట్ కెనడాది... పల్స్ ఇండియాది -
సముద్రం లోతుల్లో ‘పాట’.. తిమింగలాల రహస్యం వింటే షాకే!
సముద్రం లోతుల్లో నుంచి గంటల తరబడి ఓ వింత శబ్దం వినిపిస్తోంది.. విషాదంగానూ, అదే సమయంలో ఏదో తెలియని ఆకర్షణీయంగా ఉన్న ఆ శబ్దం ఏంటో తొలుత ఎవరికీ అర్థం కాలేదు. ఏదైనా యంత్రం నుంచి వస్తుందా? సముద్రంలో భూకంప కదలికలకు సంబంధించినదా? అనే అనుమానాలు కూడా వచ్చాయి. చివరకు ఆ శబ్దం ఓ భారీ జీవి నుంచి వస్తున్నట్లు తేలింది.అది హంప్‌బ్యాక్ తిమింగలం. అంతేకాదు.. అది సాధారణ అరుపు కాదు, ఒక క్రమంలో సాగే ‘పాట’ అని గుర్తించారు. 1952లో అమెరికా సోనార్ ఇంజినీర్ ఫ్రాంక్ వాట్లింగ్టన్ బెర్ముడా సముద్ర తీరంలో హైడ్రోఫోన్‌తో శబ్దాలను రికార్డు చేస్తుండగా ఈ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.ఆ రికార్డింగులతో తిమింగలాలపై ప్రపంచం ఆలోచన మారిపోయింది.వాట్లింగ్టన్ రికార్డు చేసిన శబ్దాలను 1967లో పరిశోధకులు రోజర్, కేటీ పేన్లు విన్నారు. శబ్దాలు ఒకే క్రమంలో పదేపదే పునరావృతమవుతున్నట్లు వారు గుర్తించారు. కొన్ని పాటలు అరగంట వరకు కొనసాగి, మళ్లీ మొదటి నుంచి వినిపించేవి. దీంతో తిమింగలాలు కేవలం శబ్దాలు చేయడం కాదని, పాటలు పాడుతున్నాయని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. అయితే, రోజర్ పేన్ ఈ రికార్డింగులను ప్రజలకు వినిపించడం మొదలుపెట్టారు. దీంతో సమావేశాల నుంచి తిమింగలాల సంరక్షణ ఉద్యమాల వరకు ఎక్కడ అవకాశం దొరికినా వాటిని వినిపించేవారు. సముద్రంలో కనిపించని ఓ జీవి చేస్తున్న ఆ వింత సంగీతం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ ఆసక్తి 1970లో మరో మలుపు తీసుకుంది. రోజర్, కేటీ పేన్, వాట్లింగ్టన్ కలిసి ‘Songs of the Humpback Whale’ పేరుతో ఐదు హంప్‌బ్యాక్ తిమింగలాల రికార్డింగులతో ఆల్బమ్ విడుదల చేశారు. అది ఊహించని స్థాయిలో ఆదరణ పొందింది. 1.25 లక్షలకు పైగా కాపీలు అమ్ముడై, అత్యధికంగా అమ్ముడైన ప్రకృతి సంబంధిత ఆల్బమ్‌గా నిలిచింది. అలాగే, నేషనల్ జియోగ్రాఫిక్ సబ్స్క్రైబర్లకు కూడా రికార్డింగ్లోని కొంత భాగాన్ని పంపించారు. బీటిల్స్, బాబ్ డిలన్ వంటి ప్రముఖులకు ఆల్బమ్ కాపీలు చేరాయి. అదేవిధంగా జూడీ కాలిన్స్, కేట్ బుష్ తమ సంగీతంలోనూ తిమింగలాల శబ్దాలను ఉపయోగించారు. 1977లో వాయేజర్-1 అంతరిక్ష నౌకతో పంపిన ‘గోల్డెన్ రికార్డ్’లో కూడా ఈ పాటకు చోటు దక్కింది.మరోవైపు అప్పట్లో తిమింగలాలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి. నూనె, సబ్బులు, సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగించే పదార్థాల కోసం శతాబ్దాలుగా వాటిని వేటాడేవారు. 1970ల ప్రారంభానికి హంప్‌బ్యాక్ తిమింగలాల సంఖ్య గతంలో ఉన్న స్థాయిలో ఐదు శాతానికంటే తక్కువకు పడిపోయింది. అయితే, ఇలాంటి సమయంలో తిమింగలాల పాటలు ప్రపంచవ్యాప్తంగా సంరక్షణ ఉద్యమానికి కొత్త ఊపునిచ్చాయి. దీంతె ప్రజలు తొలిసారిగా తమ ఇళ్లలోనే తిమింగలాల శబ్దాలను విని వాటితో ఓ అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. 1972లో అమెరికా ‘మెరైన్ మామల్ ప్రొటెక్షన్ యాక్ట్’ను తీసుకురాగా, 1982లో వాణిజ్య తిమింగలాల వేటపై అంతర్జాతీయ నిషేధానికి మార్గం ఏర్పడింది. ఆ తర్వాత హంప్‌బ్యాక్ తిమింగలాల సంఖ్య అనేక ప్రాంతాల్లో గణనీయంగా పెరిగింది.అయితే, ఇప్పటికీ తిమింగలాలు ఎందుకు పాడుతాయన్న ప్రశ్నకు పూర్తి సమాధానం లేదు. ప్రధానంగా మగ తిమింగలాలే పాటలు పాడుతుండటంతో ఆడ తిమింగలాలను ఆకర్షించడానికి లేదా ఇతర మగ తిమింగలాలతో పోటీ పడేందుకు ఈ పాటలను ఉపయోగిస్తుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సముద్రంలో దూర ప్రాంతాలకు సమాచారాన్ని పంపేందుకు కూడా వీటిని ఉపయోగించే అవకాశం ఉందని చెబుతున్నారు.అంతేకాదు.. ఒక ప్రాంతంలోని తిమింగలాలు పాడే పాట కాలక్రమంలో మారుతుందని, ఆ మారిన పాటలు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తాయని పరిశోధనల్లో తేలింది. అంటే సముద్రంలోనూ ఒక రకమైన ‘సంస్కృతి’ మార్పు జరుగుతోందన్నమాట. అయితే నౌకల ఢీకొనడం, చేపల వలల్లో చిక్కుకోవడం, వేట, సముద్ర కాలుష్యం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వంటి ముప్పులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయినా 1970లో వినిపించిన ఆ ‘తిమింగలాల పాట’ మాత్రం వాటి రక్షణ కోసం ప్రపంచాన్ని కదిలించిన అరుదైన శబ్దంగా చరిత్రలో నిలిచిపోయింది.ఇదీ చదవండి: భారతదేశవ్యాప్తంగా త్వరలో కళాకారిణి ప్రసన్న వెలగాల ప్రదర్శనలు -
వ్యాయామం చేస్తే డబ్బులు.. ఉద్యోగులకు కంపెనీ అదిరే ఆఫర్!
జీతం కోసం ఉద్యోగం.. ఆరోగ్యం కోసం వ్యాయామం.. రెండింటికీ ఒకేసారి ప్రోత్సాహం లభిస్తే? ఇదే ఇప్పుడు ఆఫీస్ వెల్నెస్ ట్రెండ్‌గా మారుతోంది. ఆఫీసుకు వెళ్లడం.. పని చేయడం.. ఇంటికి రావడం.. ఇదే ఉద్యోగుల రోజువారీ రొటీన్.కానీ ఈ రొటీన్ లో వ్యాయామానికీ చోటు కల్పిస్తే? పైగా అందుకు కంపెనీనే రివార్డ్ ఇస్తే? దక్షిణ కొరియాలో ఓ కంపెనీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు అలాంటి కార్యక్రమాన్నే చేపట్టడంతో ఆసక్తికరంగా మారింది. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే ఉద్యోగులను ప్రోత్సహించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో ఉద్యోగులు నిర్దిష్ట కాలం పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది.అంటే రెండు నెలల పాటు క్రమశిక్షణగా కొనసాగించిన వారికి రివార్డ్ అందించడం ద్వారా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ భారతీయ ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకోవడంతో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.ఇదీ చదవండి: కేరళలో వృద్ధులే అధికం.. కుటుంబాలకు కొత్త సవాల్! -
12 ఏళ్లకోసారి ప్రకృతిలో అద్భుత దృశ్యం!
నీలగిరులకు ఆ పేరును సార్థకం చేసిన అరుదైన, అందమైన పువ్వు నీలికురింజి. పన్నెండేళ్లకోసారి ప్రకృతిలో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించే ఈ పూల వెనుక ఉన్న నిజానిజాలు, వాటి జీవిత చక్రం, విశేషాల గురించిన ఆసక్తికరమైన వివరాలివి. నీలికురింజి ప్రత్యేకతలు శాస్త్రీయ నామం: స్ట్రోబిలాంథెస్ కుంతియానా జీవిత కాలం: ఈ మొక్కలు సాధారణంగా 12 సంవత్సరాలు జీవిస్తాయి. ఒకేసారి భారీ స్థాయిలో పూస్తాయి, విత్తనాలను భూమ్మీద రాల్చిన తర్వాత ఆ మొక్క మరణిస్తుంది. వ్యాప్తి: పశ్చిమకనుమల్లోని తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాలలో ఇవి విస్తరించి ఉంటాయి. ముందస్తు పూతపై గందరగోళం! వాస్తవం: ఎరవికుళం నేషనల్ పార్క్‌లో 2018లో నీలికురింజి పూసింది. తర్వాతి బ్లూమింగ్ 2030లో ఉంటుందని అంచనా. అయితే మున్నార్‌లో ఈ ఆగస్టు నుంచి ఈ పూలు వికసించడంతో ఇవి కాలనియమం తప్పుతున్నాయా అనే సందేహం కలుగుతుంది. కానీ, ప్రకృతి తన టైమ్‌టేబుల్‌ని కచ్చితంగా పాటిస్తుంది. వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు కాలచక్రాలు: ఎరవికుళం నేషనల్ పార్క్, మున్నార్‌లోని మట్టుపెట్టి ప్రాంతాలు వేర్వేరు కాలనీలు. చోక్రముడి, మట్టుపెట్టి, కన్నెమల కొండల్లో నీలికురింజి 2014లో పూసింది, ఆ కాలనియమం ప్రకారం ఇప్పుడు సరిగ్గా పన్నెండేళ్లకు మళ్లీ వికసించాయి.ఈ ప్రకృతి చక్రం ఎలా పనిచేస్తుంది? మోనోకార్పిక్ మొక్కలు: ఇవి ప్లీటీసియల్ జీవిత చక్రాన్ని అనుసరిస్తాయి. ఒక దశాబ్దానికి పైగా పెరిగి, పరిపక్వత చెంది, తగినంత శక్తిని కూడగట్టుకుని ఒకేసారి వికసించి ఆ తర్వాత అంతరిస్తాయి. ఇదీ చదవండి: దెయ్యం మొక్క... తిస్మియా డెమోనా స్వతంత్ర సమూహాలు: వేర్వేరు పర్వత శ్రేణులు వేర్వేరు సంవత్సరాలలో పరిపక్వం చెందుతాయి. ఉదాహరణకు, ఎరవికుళంలో పూసే కాలానికి నాలుగేళ్ల ముందు మున్నార్‌లో ఈ పూలను చూడవచ్చు. 2022లో కర్నాటకలోని చంద్రద్రోణ కొండల్లో కూడా ఇవి వికసించాయి. టూర్ ఆపరేటర్లు ఎరవికుళం షెడ్యూల్‌ను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఈ చిన్న అపోహ కలుగుతుంది. పువ్వును చూడాలి... కోయవద్దు! నీలికురింజి వన్యప్రాణి (సంరక్షణ) చట్టం కింద సంరక్షణలో ఉన్న మొక్క. వీటిని కోయడం, మొక్కను నాశనం చేయడం చట్టరీత్యా నేరం.నిబంధనలు: నిబంధనలను ఉల్లంఘించి ఈ పూలను కోస్తే, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 25,000 వరకు జరిమానా, లేదా రెండూ విధించడం జరుగుతుంది. కాబట్టి వీటి సౌందర్యాన్ని కళ్లతో ఆస్వాదిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం! ఈ అరుదైన నీలికురింజి పూల అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి గతంలో పశ్చిమ కనుమల ప్రాంతాలను సందర్శించారా? ఇప్పటి వరకు చూడకపోతే ఇప్పుడు చూసితీరాలి. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
క్యాష్ కొడితేనే పెళ్లి భోజనం!
మన దగ్గర పెళ్లి తంతు పూర్తవగానే.. కళ్లు చూసేది భోజనాల వైపే. కానీ దక్షిణ కొరియాలో మాత్రం అలా డైరెక్ట్‌గా భోజనానికి వెళ్లడానికి వీల్లేదు. డైనింగ్ రూమ్‌కి ముందుండే సెక్యూరిటీ గార్డు.. ద్వారపాలకుడిలా అమాంతంగా ఆపేస్తాడు. భోజనం చేయడానికి వీల్లేదని నిర్దయగా చెప్పేస్తాడు. ‘కానుక ఇచ్చుకో .. కంచం పుచ్చుకో’ అని హుకుం జారీ చేస్తాడు. అదీనూ ఏదో ఒక గిఫ్ట్ కాదూ.. కచ్చితంగా క్యాషే ఇవ్వాలని ఆర్డర్ వేసేస్తాడు. క్యాష్ ఇచ్చి.. రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాతనే టోకెన్ ఇస్తాడు. దక్షిణ కొరియాలో ఉన్న ఈ వింతైన వివాహ సంస్కృతి గురించి తాజాగా ఓ భారతీయ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కవర్లో క్యాష్ ఉంటేనే భోజనం అనే ఈ సంస్కృతిని కొరియన్ల భాషలో ‘చుగిగుమ్’ అని పిలుస్తారు. పెళ్లికి వచ్చిన అతిథులు ముందుగా ఓ ప్రత్యేకమైన డెస్క్ వద్ద తమ క్యాష్ కవర్‌ను అందించి తమ పేరు నమోదు చేసుకుంటారు. ఆ తరువాతే వివాహ వేడుకలోపా ల్గొంటారు. అయితే ఎన్నో ఏండ్లుగా వస్తున్న ఈ ఆచారం వెనుక ఒక గొప్ప ఆలోచన ఉంది. గిఫ్ట్స్ రూపంలో కాకుండా డబ్బులు ఇవ్వడమే.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న జంటకు తోడ్పాటునిస్తుందన్నదే ఆ ఆలోచన. అంటే వారిచ్చే డబ్బే వారి కొత్త ఇంటికి అవసరమైన వస్తువులు, ఇతర ఖర్చులు వంటి వాటికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకే తమకు నచ్చిన వస్తువు కొనడం కంటే, అవసరానికి తగ్గట్టు ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వడం కొరియన్ల సంస్కృతిలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చుగిగుమ్లో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఎవరు తమ పెళ్లికి ఎంత ఇచ్చారో గుర్తుంచుకోవడం. భవిష్యత్తులో అతిథుల ఇంట్లోనూ పెళ్లి జరిగినప్పుడు తగిన మొత్తంలో తిరిగి ఇవ్వాలనే సామాజిక ఆనవాయితీ కూడా ఉంది. అయితే కాలంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతిలో ఇప్పుడిప్పుడే మార్పులు ప్రారంభమయ్యాయి. అంటే డిజిటల్ పేమెంట్ల ద్వారా కూడా కానుకలు పంపే పద్ధతి నెమ్మదిగా విస్తరిస్తోందంట. ఏది ఏమైన ప్పటికీ ఈ గమ్మత్తైన ఆచారం వివాహం జరిపే కుటుంబాలకు, వివాహం చేసుకుంటున్న దంపతులకు ఆర్థిక తోడ్పాటుని అందిస్తూ.. అండగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Brut India (@brut.india) (చదవండి: గాఢంగా నిద్రపోతే... 3.76 లక్షలు!) -
గాఢంగా నిద్రపోతే... 3.76 లక్షలు!
నిద్రపోతూ కూడా బహుమతులు సాధించవచ్చా? ‘యస్’ అంటోంది జపాన్‌లో జరిగే స్లీప్ టోర్నమెంట్. టోక్యోకు చెందిన ఒక మ్యాట్రస్ కంపెనీ స్లీప్ టోర్నమెంట్స్ నిర్వహిస్తుంటుంది. ఈ పోటీలో బాగా నిద్రపోయిన వ్యక్తి మన కరెన్సీలో చెప్పాలంటే 13.76 లక్షలు గెలుచుకోవచ్చు. ఈ టోర్నమెంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. పోటీదారులు 90 నిమిషాల వ్యవధిలో గాఢమైన, నాణ్యమైన నిద్రలోకి జారుకున్నామని నిరూపించుకోవాలి. ఈ టోర్నమెంట్లో పోటీదారుల నిద్రను ట్రాక్ చేసే పరికరాన్ని ఉపయోగిస్తారు. స్లీప్ టోర్నమెంట్లో పాల్గొనడానికి ముందు పోటీదారులు కొన్ని వ్యాయామాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా రాత్రంతా మేల్కొవడం లేదా నిద్రమాత్రలు వేసుకుని తీవ్రమైన నిద్రలేమితో టోర్నమెంట్లో పాల్గొనడాన్ని నిషేధించారు. ఈ టోర్నమెంట్ వచ్చే నెల మొదటి వారంలో టోక్యోలోని షేర్ గ్రీన్ మినామీలో జరగనుంది. ఇదీ చదవండి: 132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి మ్యాగజైన్..జరిమానా ఏకంగా రూ. 11 లక్షలు! -
132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి మ్యాగజైన్..జరిమానా ఏకంగా రూ. 11 లక్షలు!
అమెరికాలోని న్యూహాంప్‌షైర్ లైబ్రరీ నుంచి తీసుకున్న పుస్తకాలు తిరిగి వస్తాయనే ఉద్దేశ్యంతో జరిమానాను మినహాయించింది. ఈ ప్రకటనతో ఎన్నో పుస్తకాలు మళ్లీ లైబ్రరీ అరల్లోకి వస్తాయని ఆత్రుతగా చూసింది. అలాంటిది ఏం జరగకపోగా ఊహించనిది ఎదురైంది. గడుపు దాటిన ఎన్నో పుస్తకాలు తిరిగి వస్తాయనుకుంటే..ఒకే ఒక్క పుస్తకం తిరిగి వచ్చింది. పోనీ అది కూడా మూడు లేదా నాలుగేళ్ల నాటిది కూడా కాదు ఏకంగా 132 ఏళ్ల నాటి మ్యాగజైన్ తిరిగి రావడంతో లైబ్రరీ నిర్వాహాకులు ఒక్కసారగా కంగుతిన్నారు. అది కూడా 84 ఏళ్ల జాన్ హాన్సన్ వృద్ధుడు తీసుకురావడంతో మరింత విస్తుపోతారు. జాన్ 19వ శతాబ్దాం నాటి మ్యాగజైన్‌ని లైబ్రరీకి తిరిగి ఇచ్చాడు. అంటే సుమరు 48,220 రోజులు గడుపు దాటిపోయిన ఏళ్ల నాటి మ్యాగజైన్ అది. అంటే 1894లో ప్రచురితమైన మ్యాగజైన తిరిగి రావడం లైబ్రరీ నిర్వాహకులు ఒకింత ఆశ్చర్యానికి లోను చేసింది. నిజానికి జరిమానా మినహాయిస్తే ఓ పదేళ్ల క్రితం నాటి ఎన్నో పుస్తకాలు వస్తాయని భావించాం, కానీ 19వ శతాబ్దపు చివరలో వచ్చిన మ్యాగజైన్ తిరిగి వస్తుందని అస్సలు ఊహించలేదంటూ ఆ అమెరికా లైబ్రరీ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొనడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. ఇక ఆ తాతగారు తిరిగి లైబ్రరీకి ఇచ్చిన మ్యాగజైన్ పేరు ది సెంచరీ ఇల్లస్ట్రేటెడ్ అనే మంత్లీ మ్యాగజైన్. అది కూడా సెప్టెంబర్ నెలదట అది. దశాబ్దాలుగా ఆయన ఇంట్లోనే ఉండిపోయింది. అది తన వద్దకు ఎలా వచ్చిందో తెలియదని, తనకసలు గుర్తు కూడా లేదని చెప్పడం గమనార్హం. సదరు లైబ్రరీ జరిమానాను మినహాయించిందన్న ప్రకటన చూసి.. ఆ మ్యాగజైన్‌ని తిరిగి ఇచ్చేసే సమయం ఆసన్నమైందని భావించి లైబ్రరీకి ఇచ్చేశానని అన్నారు. 1966లో బోస్కావెన్ నుంచి బారింగ్టన్కు మారే సమయంలో ఆ మ్యాగజైన్ తనకు దొరికిందని చెప్పారు. అయితే తన దివంగత భార్య కరోల్ పుస్తకాలను అమితంగా ఇష్టపడుతుండేదని, పబ్లిక్ లైబ్రరీలకు వెళ్తుండేదని చెప్పారు. అయితే లైబ్రరీ నుంచి పుస్తకాన్ని గానీ, పత్రికను గానీ అన్నేళ్లపాటు ఇంట్లో ఉంచుకోవడానికి ఆమె అస్సలు ఇష్టపడదని పేర్కొనడం విశేషం. విచిత్రంగా జాన్ వద్దకు చేరిన ఆ మ్యాగజైన్ అంతే చిత్రంగా లైబ్రరీకి తిరిగి వచ్చింది కదూ..!.ఇదీ చదవండి: పేద కుటుంబం నుంచి ఐదు మెడికల్ సీట్లు..!తల్లిదండ్రులు దినసరి కూలీలు..) -
ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె
కొన్ని సంఘటనలు అత్యంత విచిత్రంగా అబ్బురపరిచే విధంగా ఉంటాయి. సాధారణంగా తప్పిపోయిన కొన్నేళ్లకు అనుకోని విధంగా కలిసిన ఉదంతాలను చూసుంటాం. కానీ ఇలా ఇన్నేళ్లు ఒకరినొకరు చూసుకోకుండా ఉన్న అరుదైన ఘటనను చూసి ఉండరు. మహా అయితే ఐదు, ఆరేళ్లు దూరం ఉండొచ్చు కానీ ఈ తల్లి కూతుళ్లు ఎన్నేళ్లు ఒకరికొకరు సంబంధం లేకుండా బతికారో తెలిస్తే విస్తుపోతారు. ఈ అరుదైన ఘటన దక్షిణ కన్నడలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..105 ఏళ్ల సీతమ్మకు 11 మంది సంతానం. వారిలో పెద్ద కుమార్తె సుశీల తన అమ్మను కలుసుకోలేకపోతుంది. అది ఏకంగా ఎన్నేళ్లు వరకు అంటే..దాదాపుగా 20 ఏళ్ల పైగానే తల్లిని కలవలేకపోతుంది. ప్రధాన కారణం తన తల్లి సీతమ్మ దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి తాలూకా సమీపంలోని మక్కీ అనే గ్రామంలో నివశిస్తోంది. అయితే ఆమె ఇంటికి వెళ్లే ప్రదేశం అటవీ మార్గం, పైగా అటు వైపు సరైన రహదారి లేకపోవడం, అందులోనూ కొండ దిగువున ఉండే ఆ గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. ఆ నేపథ్యంలోనే సుశీల తన తల్లిని చాలా ఏళ్లపాటు కలుసుకోలేకపోతుంది. కాలం గడుస్తున్న కొద్దీ వారి దగ్గర ఒకరికి సంబంధిచి ఒకరికి పాత జ్ఞాపకాలే తప్ప రాకపోకలు లేక అమ్మను చూసుకునే భాగ్యం లేక తల్లిడిల్లిపోయింది సుశీలమ్మ. ఇక్కడ సుశీలమ్మ వయసు కూడా 85 ఏళ్ల కావడంతో వయసు రీత్యా వచ్చే సమస్యల వల్ల ఆ అమ్మ కూతుళ్ల మధ్య రాకపోకలు దశాబ్దంగా నిలిచిపోయాయి. మనవళ్ల చొరవతో.. నెరవేరిన చిరకాల కోరిక!తమ అమ్మమ్మ చిరకాల కోరికను నెరవేర్చాలని నిశ్చయించుకున్నారు సుశీల మనవళ్లు. వారి చొరవతో సుశీల మక్కికి చేరుకునే అటవీ మార్గం గుండా జీపులో ప్రయాణించింది అయితే జీపు నేరుగా ఇంటి వరకు వెళ్లలేకపోయింది. చేసేది లేక అటవీ మార్గం గుండా సుశీలమ్మను ఓ చిన్నపిల్లను పట్టుకున్నట్లుగా పొదివి పట్టుకుని తీసుకెళ్లారు ఆమె మనవళ్లు. ఆ కష్టమైన ప్రయాణం తదనంతరం ఎట్టకేలకు తల్లిని కలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనైంది సుశీల. రెండు దశాబ్దాల తర్వాత తన తల్లి సీతమ్మను కలుసుకున్న ఆనందంతో ఉబ్బితబ్బిబైంది సులశీలమ్మ. తాము ఎన్నాళ్ల నుంచో అమ్మమ్మను తన అమ్మ దగ్గరకు తీసుకెళ్లాలని చాలాసార్లు అనుకున్నాం కానీ, ఆమెకు వయసురీత్యా ఉన్న సమస్యల వల్లే ఇన్నేళ్లూ అది వీలు కాలేదని, చివరకు ఇన్నళ్ల తర్వాత తన అమ్మమ్మ, ముత్తవ్వను కలవగలిగిందని ఆనందంగా చెబుతున్నారు సుశీలమ్మ మనవళ్లు. ఇదీ చదవండి: ఈజిప్ట్ పిరమిడ్ల వద్ద వివాహం చేసుకున్న భారత సంతతి జంట! -
ఈజిప్ట్ పిరమిడ్ల వద్ద వివాహం చేసుకున్న భారత సంతతి జంట!
డెస్టినేషన్ వెడ్డింగ్‌లని, ఆకాశంలో పెళ్లి, నీటి అడుగుభాగన పెళ్లి తంతు వంటి వగైర విభిన్న పెళ్లిళ్ల గురించి విన్నాం. సమాధుల వద్ద పెళ్లి తంతు అదీకూడా భారతీయ వైవాహక పద్ధతిలో చేసుకుందో జంట. అయినా శుభకార్యం, అమంగళకరమైన ప్రదేశంలోనా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అత్యంత పర్యాటక ఆకర్షణగా పేరుగాంచిన గిజా పిరమిండ్ల వద్ద చేసుకుంది ఈ జంట. అలా అని అక్కడ వివాహం చేసుకోవడం ఏమంత ఈజీ కాదు. అక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటే.. పెళ్లి మండపం బుక్ చేసుకున్నంత ఈజీ కాదు. అందుకోసం పురావస్తు శాఖ అధికారుల తోపాటు ఈజిప్టు అధికారులను నుంచి కూడా ప్రత్యేకంగా అనుమతి తెచ్చుకోవాలి. ఈ కార్యక్రమం జరిగే రోజుల్లో సందర్శకులకు నిషేధం విధించాల్సి ఉంటుంది. అయితే ఈ జంట ఆ పర్మిషన్లన్నీ తెచ్చుకుని మరి ఆ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ప్రాంతంలోనే గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. వాళ్లే డాక్టర్ మోనికా నాయర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వివేక్ నందా దంపతులు. పిరమిడ్ల వద్ద ఇలా ఒక వ్యక్తిగత వేడుకను నిర్వహించుకున్న ముగ్గురు జంటల్లో ఈ దంపతులు ఒకరుగా నిలిచారు.అలాగే అలాంటి చోట పెళ్లి తంతుని ఏర్పాటు చేసుకున్న తొలి భారతత సంతతి జంటగా ఈ వధువరులిద్దరూ నిలిచారు. అంతేగాదు వారి వేడుకలో ప్రతి అంశం ప్రభుత్వ పర్యవేక్షణలో సమీక్షించబడి, ఆమోదించడం జరుగుతుంది. ప్రతి సాయంత్రం సందర్శకుల కోసం మూసివేసి, ఆ తర్వాత ఈ జంట వేడుక కోసం వేదికను ఏర్పాటు చేస్తుంటారు అక్కడ అధికారులు. ఇలా మొత్తం పది రాత్రులు అక్కడే గడిపారు. వేదికలు, వంటశాలలు, లైటింగ్‌తో సహా తాత్కాలిక మౌలిక సదుపాయాలను రాత్రికి రాత్రే ఏర్పాటు చేసి, వేడుకలు ముగిసిన తర్వాత తొలగించడం చేస్తుంటారు. అలా మూడు రోజుల పాటు జరిగిన ఈ వివాహా వేడుకలో స్ఫింక్స్ (ఈజిప్ట్‌లోని గిజా పిరమిడ్ల సమీపంలో నెలకొన్న ఈ శిల్పం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది) పాదాల వద్ద ఏర్పాటు చేసిన విందు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పిరమిడ్ల ప్రవేశంపై కఠినమైన నియంత్రణలు ఉన్న తరుణంలో ఈ జంట వివాహ వేడుక అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి పలు దేశాల నుంచి అతిథులు హాజరయ్యారు.పిరమిడ్ల వద్ద ఈ వేడుకలు జరగడానికి ముందే ఈ జంట కైరోలో సాంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుకలు జరుపుకున్నారు. అయినా మరి అక్కడ వేడుకలు ఎందుకంటే.. పిరమిడ్లకు ఉన్న చారిత్రక ప్రాముఖ్యత, ఆ దేశంతో ఉన్న వ్యక్తిగత అనుబంధం తదితర కారణాల రీత్యా దీన్ని ఎంచుకున్నామని చెబుతున్నారు ఆ దంపతులు. కాగా నందా తన కెరీర్ తొలినాళ్లలో ఇక్కడే పనిచేశారట. ఇదీ చదవండి: గులాబీలు పండిస్తూ.. నెలకు రూ. 2.5 లక్షలు..! -
పట్టుచీరపై వాసవీ మాత చరిత్ర
సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత మగ్గంపై మరో అద్భుతాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. చేనేత మగ్గంపై 45 రోజులు శ్రమించి.. వాసవీమాత చరిత్రతో ఉన్న పట్టుచీరను తనదైన సృజనాత్మకతతో రూపొందించారు. చేనేత మగ్గంపై పట్టుదారం పోగులు, గోల్డ్ జరీని వినియోగించి ఏడు మీటర్ల పొడవు, 45 ఇంచుల వెడల్పు, 1200 గ్రాముల బరువైన చీర నేశారు.గుంటూరుకు చెందిన రత్నకుమారి–కోటేశ్వరరావు ప్రత్యేకంగా ఇచ్చిన ఆర్డర్ మేరకు వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దివ్య చరిత్రను పట్టుచీరపై ఆవిష్కరించారు. ఈ చీరలో 102 మంది రుషుల పేర్లు, 102 గోత్రనామాలు, వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి చరిత్రను తెలిపే 25 చారిత్రక చిత్రాలను పట్టుపోగులతో నేశారు.కాగా చేనేత మగ్గంపై నిత్యప్రయోగాలు చేసే హరిప్రసాద్ గతంలో 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను చేనేత మగ్గంపై నేశారు. మగ్గంపై వేగం, నైపుణ్యం, కచ్చితత్వం, సృజనాత్మకతను సమన్వయం చేస్తూ సాధించిన ఆ ఘనత చేనేత రంగంలో ప్రత్యేకంగా నిలిచింది. సాధారణంగా ఒక చీరను నేయడం ఒక కళ.ఇదీ చదవండి: ఈ ఇంటిని మూటకట్టి పట్టుకొచ్చారు! అయితే చరిత్రను చిత్రాలుగా, గోత్రాలను అక్షరాలుగా, రుషుల పేర్లను చేనేత డిజైన్లుగా, ఆధ్యాత్మిక భావనలను పట్టుదారంతో మగ్గంపై మలచడం అత్యంత అరుదైన కళగా భావిస్తున్నారు. ఆధ్యాత్మికకత ఉట్టిపడే పట్టుచీరను మగ్గంపై మలచడం విశేషమని స్థానికులు పేర్కొన్నారు. -
ఈ ఇంటిని మూటకట్టి పట్టుకొచ్చారు!
ఇల్లు కట్టుకోవాలంటే సాధారణంగా స్థలం చూసుకుని, ఆర్కిటెక్ట్‌ను పిలిచి, నచ్చిన డిజైన్‌లో నిర్మించుకుంటాం. కానీ అమెరికాకు చెందిన ఓ బిలియనీర్ మాత్రం భిన్నంగా ఆలోచించారు. తొలుత ఇండోనేషియాలోని బాలి దీవిలో ఓ ఇల్లు కట్టించారు. తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి, వేల కిలోమీటర్ల దూరంలోని హవాయికి తెచ్చుకుని అక్కడ పునర్నిర్మించుకున్నారు. ఇన్ని వ్యయప్రయాసలకోర్చి ముచ్చటగా కట్టించుకున్న ఆ ఇంటిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడంతో ఇది మరోసారి వార్తల్లోకి వచ్చింది.ఇదంతా ఎప్పుడు, ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మూడున్నర దశాబ్దాలు వెనక్కి వెళ్లాల్సిందే. అమెరికాకు చెందిన జాన్ పాల్ డిజోరియా (John Paul DeJoria) పెద్ద బిజినెస్‌మేన్. 1990లో ఓసారి బాలి వెళ్లారు. అక్కడి సంప్రదాయ వాస్తుశైలిని చూసి మనసు పారేసుకున్నారు. అలాంటి ఇల్లు తనకూ ఉండాలని భావించారు. వెంటనే వందల మంది స్థానిక నిపుణులు, పనివాళ్లను రంగంలోకి దించారు. బోర్నియో అడవుల నుంచి తెచ్చిన పచ్చి కలప, టేకుతో దేవాలయాన్ని పోలిన నిర్మాణ శైలిలో ఇల్లు కట్టించారు. పైకప్పు కోసం ఏకంగా పది లక్షలకు పైగా చెక్క పలకలను అమర్చారు. డ్రాగన్ ముఖాల శిల్పాలు అలంకారానికే కాకుండా వర్షం పడినప్పుడు నీటిని కిందకు మళ్లించే స్పౌట్లుగా తీర్చిదిద్దారు. ఆ ఇంటిని చూసి సంతృప్తి చెందిన డిజారియో.. ఇల్లు మొత్తం జాగ్రత్తగా విప్పేయమన్నారు. దీంతో ఆ ఇంటిని నిర్మించినవారే ఒక్కో చెక్కముక్కా తీసి నంబరింగ్ ఇచ్చారు.ఇదీ చదవండి: రాత్రికి రాత్రే 2 కిలోమీటర్లు వెనక్కి సముద్రం!వాటిని గోనెసంచుల్లో మూటలు కట్టి ఓడలో పసిఫిక్ మహాసముద్రం మీదుగా హవాయిలోని బిగ్ ఐలాండ్‌కు తరలించారు. అక్కడ కిహోలో బే వద్ద ఉన్న ప్రైవేటు తీర ప్రాంతంలోని మూడెకరాల స్థలంలో యథాతథంగా పునర్ నిర్మించారు. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు ఆరేళ్లు పట్టింది. ఆ రోజుల్లో దాదాపు రూ.17 కోట్లు ఖర్చయింది. ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నా.. తక్కువ తేమ ఉన్న హవాయి వాతావరణం కారణంగా ఇల్లు కొంచెం కుచించుకుపోయింది. అయినా, ఆ వాస్తుశైలి కారణంగా అది అక్కడ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.తాజాగా ఈ ఇంటిని 3.25 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.270 కోట్లు) అమ్మకానికి పెట్టారు. దీని యజమాని డిజోరియా టెక్సాస్‌లో స్థిరపడటంతో ఈ ఇంటిని వినియోగించడంలేదు. దీంతో అమ్మేయడమే బెటరని ఈ నిర్ణయానికి వచ్చారు. ఎక్కడో పుట్టి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి హవాయి చేరిన ఆ ఇల్లు.. ఇప్పుడు కొత్త యజమాని కోసం ఎదురుచూస్తోంది.– సాక్షి, సెంట్రల్ డెస్క్ -
భారీ పుర్రె.. చిన్న వేట! టాస్మేనియన్ టైగర్ కథేంటి? విన్నారంటే షాకే!
ఒకప్పుడు ఆస్ట్రేలియాలో సంచరించిన టాస్మేనియన్ టైగర్ ఇప్పుడు భూమిపై లేదు. దాదాపు 90 ఏళ్ల క్రితమే ఈ జంతువు పూర్తిగా అంతరించిపోయింది. అయితే తాజాగా దాని పుర్రె, దవడను పరిశీలించిన పరిశోధకులు.. ఈ జంతువు గురించి ఇప్పటివరకు ఉన్న కొన్ని అంచనాలు తప్పని గుర్తించారు. ముఖ్యంగా ఇది చూడటానికి కుక్క లేదా తోడేలులా ఉన్నప్పటికీ, వాటిలా జీవించేది కాదని పరిశోధకులు చెబుతున్నారు.టాస్మేనియన్ టైగర్‌ను మరో పేరుతో ‘థైలాసిన్’ అని పిలుస్తారు. దీనికి శరీరంపై పులిలా చారలు ఉండటంతో టాస్మేనియన్ టైగర్ అనే పేరు వచ్చింది. అయితే ఇది నిజమైన పులి కాదు. ఇది కంగారూ, కోయాలా వంటి సంచిలో పిల్లలను పెంచే మార్సుపియల్ జంతువు. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగంలో ఇవి సుమారు 2,000 ఏళ్ల క్రితమే కనుమరుగైనప్పటికీ, టాస్మేనియా ప్రాంతంలో మాత్రం మరికొంతకాలం జీవించాయి.ఈ జంతువును అప్పట్లో రైతులకు నష్టం చేసే ప్రమాదకరమైన వేటగాడిగా భావించేవారు. ముఖ్యంగా గొర్రెలను చంపుతున్నాయని పెద్ద సంఖ్యలో థైలాసిన్లను వేటాడారు. దీంతో వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. చివరకు 1936లో టాస్మేనియాలోని హోబార్ట్ జూలో ఉన్న చివరి థైలాసిన్ కూడా చనిపోయింది. అప్పటి నుంచి ఈ జాతి పూర్తిగా అంతరించిపోయినట్లుగా పరిగణిస్తున్నారు.అయితే తాజా పరిశోధనలో వాటి పుర్రెను పరిశీలించిన శాస్త్రవేత్తలకు ఆసక్తికరమైన విషయం తెలిసింది. టాస్మేనియన్ టైగర్ పుర్రె శరీర పరిమాణంతో పోలిస్తే చాలా పెద్దగా ఉండేదట. కానీ దాని ముక్కు పొడవుగా, సన్నగా ఉండేది. ఈ నిర్మాణం పెద్ద జంతువులతో పోరాడి వాటిని పడగొట్టేందుకు కాకుండా.. చిన్న జంతువులను వేగంగా పట్టుకుని కొరికేందుకు ఉపయోగపడేదని పరిశోధకులు చెబుతున్నారు.గతంలో టాస్మేనియన్ టైగర్ బరువు దాదాపు 30 కిలోల వరకు ఉండేదని భావించారు. కానీ కొత్త అంచనాల ప్రకారం వాటి సగటు బరువు సుమారు 17 కిలోలు మాత్రమే. అంటే ఇవి మనం ఊహించేంత పెద్ద జంతువులు కావు. కుందేలు లేదా అంతకంటే కొంచెం పెద్ద పరిమాణంలో ఉండే జంతువులను వేటాడేందుకు వీటి దవడ, పళ్లు బాగా సరిపోయేవని పరిశోధకులు చెబుతున్నారు. వేగంగా నోరు తెరిచి ఒక్కసారిగా కొరికే సామర్థ్యం వీటికి ఉండేదని వారు గుర్తించారు.టాస్మేనియన్ టైగర్ చరిత్ర కూడా చాలా పురాతనమైనదే. దాని పూర్వీకులు ఇతర క్షీరదాల నుంచి కోట్ల సంవత్సరాల క్రితమే విడిపోయినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే బయటకు కుక్కలా కనిపించినా.. దాని శరీర నిర్మాణం, జీవించే విధానం పూర్తిగా భిన్నంగా ఉండేవి. ఒకేలా కనిపించే రెండు జంతువులు పరిణామ క్రమంలో ఎంత భిన్నమైనవిగా మారగలవో ఈ జంతువు మంచి ఉదాహరణ అని పరిశోధకులు చెబుతున్నారు.ఇక అంతరించిపోయిన టాస్మేనియన్ టైగర్‌ను మళ్లీ భూమిపైకి తీసుకురావచ్చా అనే అంశంపైనా ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. పురాతన డీఎన్ఏ, జన్యు సాంకేతికత, ఆధునిక పునరుత్పత్తి విధానాలను ఉపయోగించి ఈ జాతిని తిరిగి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇది నిజంగా సాధ్యమవుతుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా.. టాస్మేనియన్ టైగర్‌పై జరుగుతున్న పరిశోధనలు మాత్రం అంతరించిపోయిన జంతువుల జీవితం, పరిణామం గురించి ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.ఇవీ చదవండి: ‘డాల్ఫిన్ గార్డ్’..! ఆరేళ్ల చిన్నారి ఘనత.. -
మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!
మేనకోడలు అంటే ఏ మేనమామకు ఇష్టం ఉండదు. అందుకేనేమో అడిగి అడగంగానే కొనిస్తాడు కాబట్టే కవులు మామయ్యను చందమామతో పోల్చి మరి చెబుతుంటారు. అలానే ఇక్కడొక మామయ్య తన ముద్దులు మేనకోడలు చిరుకోరికను నెరవేర్చేందుకు ఎంత రిస్క్ చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లు ఖర్చు పెట్టి మరి ఏం కొనిచ్చాడో తెలిస్తే విస్తుపోతారు. ఈ వింత ఘటన అబుదాబిలో చోటు చేసుకుంది. షేక్ అల్ మన్సూరి అనే చిన్నారి తన మేనమామతో కలిసి అబుదాబి ఇంటర్నేషనల్ హంటింగగ్ అండ్ ఈక్వెస్ట్రియన్ ఎగ్జిబిషన్ (ADIHEX) 2026కు హాజరైంది. ఆ కార్యక్రమంలో డేగల ఔత్సాహికులు, పెంపెకందారుల కోసం అత్యంత ఖరీదైన వేలం నిర్వహిస్తుంది. అయితే ఈ వేలంలో అత్యంత రికార్డు స్థాయిలో ఓ అరుదైన డేగను కొనుగోలు చేశాడు ఓ వ్యక్తి. నిజానికి బూడిదరంగు, నలుపు వంటి డేగలను చూస్తాం గానీ తెలుపు రంగు డేగలు అత్యంత అరుదు. అలాంటి అత్యంత అరుదైన తెల్లటి ఫాల్కన్ జాతి డేగ వేలంలో ఏకంగా రూ. 3.85 కోట్లకు అమ్ముడైపోయింది. దీన్ని తన మేనకోడలు కోసం వెచ్చించాడట. ఆమెకు డేగలంటే అమితమైన ఇష్టమని, అందులోనూ ఈ తెలుపు రంగు డేగ అంటేచాలా ఇష్టమని అందుకే ఇంత డబ్బు వెచ్చించినట్లు తెలిపాడు. ఈ అరుదైన డేగ అమెరికాలోని మార్క్ మెగ్లిచ్ ఫాల్కన్ ఫార్మ్‌కు చెందినది. దాని ఆకర్షణీయమైన స్వచ్ఛమైన తెల్లని ఈకలు, విలక్షణమైన శారీరక లక్షణాలు కారణంగా ఇది ఎల్లప్పుడు అందరి దృష్టిని ఆకర్షించే డేగగా చెప్పొచ్చు. ఇది సుమారు కిలోగ్రాము బరువు, పొడవు, వెడల్పుల్లో దాదాపు 16.5 అంగుళాల కొలతతో ఉంటుంది. ఇక ఆ చిన్నారి మన్సూరిని ఈ డేగలపై ఆసక్తి ఎలా పెరిగిందని అడిగితే..అందుకు తన మామయ్యే కారణమని చెబుతుండటం విశేషం. View this post on Instagram A post shared by علي الجابري🇦🇪 (@ali.aljabri2) (చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!) -
బొప్పాయి మన దేశంలో పుట్టలేదా? ఘనాంకాలు ఏం చెప్తున్నాయంటే?
మన దేశంలో ఏడాది పొడవునా దొరికే పండ్లలో బొప్పాయి ఒకటి. నిజానికి బొప్పాయి మన దేశానికి స్థానిక ఫలం కాదు. బొప్పాయి ఉత్పాదనలో ఇప్పుడు మన భారత దేశమే అగ్రస్థానంలో కొనసాగుతోంది. బొప్పాయి విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం...చాలా పండ్ల జాతుల మాదిరిగానే పోర్చుగీసు నావికుల ద్వారా పదహారో శతాబ్దంలో మన దేశానికి చేరుకుంది. బొప్పాయిని భారతీయులు అమితంగా ఇష్టపడటంతో దీని సాగును బాగా పెంచారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ బొప్పాయిని పండిస్తున్నారు.ఇవి కూడా చదవండి: గతం గతః! ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందా? -
బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా?
నైజీరియాలోని ఓండో రాష్ట్రంలో ఉన్న ఓవో నగరం శోభాయమానంగా వెలిగిపోతోంది. 600 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ‘ఇగోగో’ మహోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఆగస్టు చివరిలో ప్రారంభమై, సెప్టెంబరు మాసమంతా ఈ పండుగ సాగుతుంది. ఇది నైజీరియన్ల స్థానిక జ్ఞాపకాలతో, రాచరికంతో, సామాజిక గుర్తింపుతో ముడిపడి ఉన్న వేడుక. ఎంతో ఉత్సాహంగా సాగే ఈ వేడుకలను తిలకించడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇప్పటికే ఓవో నగరానికి క్యూకట్టారు.నైజీరియాలో వర్షాకాలం ముగిసే వేళ జరిగే సాంస్కృతిక పండుగల కాలంలోనే ఈ ఉత్సవం కూడా జరుగుతుంది. ఈ ఇగోగో వేడుక మూలాలు పురాణ కాలపు రాణి ఒరోన్సే చరిత్రతో ముడిపడి ఉన్నాయి. దేవలోకం నుంచి దివికి దిగివచ్చిన ఒరోన్సే, ఓవో రాజును వివాహమాడి, రాజసౌధంలో కొన్ని నియమాలను విధించింది. తనకు ఇష్టంలేని బెండకాయలను వండరాదని, తన సమక్షంలో తలపాగాలు ధరించరాదని, తన దారిలో నీరు చల్లకూడదని కోరింది.ప్రజలు కొన్నేళ్లపాటు ఆ నిబంధనలను గౌరవించినప్పటికీ, కాలక్రమంలో వాటిని ఉల్లంఘించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాణి ఒరోన్సే, అడవుల్లోకి వెళ్లి అదృశ్యమైపోయింది. కానీ వెళ్లేముందు తన జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఇగోగో ఉత్సవాన్ని నిర్వహించాలని, అలా చేస్తే రాజ్యానికి శుభం కలుగుతుందని వరమిచ్చింది. నాటి నుంచి ఇగోగో పండుగ ఆచారంగా మారింది. వేడుకకు కొన్ని వారాల ముందునుంచే నగరం నూతన శోభను సంతరించుకుంటుంది. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది.మహిళలు ఊదా, తెలుపు, పసుపు రంగుల ప్రత్యేక వస్త్రాలను నేస్తారు. సంగీత, నృత్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పిల్లల నుంచి పెద్దవారి వరకు సన్నద్ధమవుతారు. విదేశాల్లో స్థిరపడినవారు తమ మాతృభూమికి చేరుకుంటారు. మహిళలు పగడపు పూసల ఆభరణాలు ధరించి, ఒరోన్సే రాణి గుణగణాలను, ఆమె త్యాగాన్ని కీర్తిస్తూ తరతరాలుగా వస్తున్న సంప్రదాయ గీతాలను ఆలపిస్తారు. ఈ వేడుకల్లో ఆనాడు రాణి ఒరోన్సే విధించిన నిబంధనలను ప్రజలంతా కచ్చితంగా పాటిస్తారు. నేడు ఇగోగో పండుగ కేవలం సంప్రదాయానికే పరిమితం కాకుండా, పర్యాటకంగానూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రత్యేక ఆకర్షణ ఒలోవో రాజుఇగోగో ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ ఓవో సామ్రాజ్య అధిపతి అయిన ‘ఒలోవో’ రాజు ప్రత్యేకమైన అలంకరణ. సాధారణ రోజుల్లో కిరీటాలు, మిరుమిట్లుగొలిపే వస్త్రాలు ధరించే రాజు, ఈ పండుగ రోజుల్లో విభిన్నంగా కనిపిస్తాడు. తలపాగా లేకుండా, పగడాల పూసల టోపీని, పగడాల హారాలను ధరిస్తాడు. అంతేకాక, రాణి ఒరోన్సే స్త్రీత్వాన్ని, ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని చాటడానికి చీర వంటి ప్రత్యేక వస్త్రాన్ని ధరిస్తాడు. రాజ పురోహితులు, సర్దారులతో కలిసి వీథుల్లో నృత్యం చేస్తూ సాగుతాడు.- రమా జంబులఇవి కూడా చదవండి: బ్రేకింగ్ న్యూస్! -
ఇది నాణెమా.. వెండి కొండా? చూస్తే షాక్ అవుతారు!
రెండు అడుగుల వ్యాసం.. దాదాపు 79 కిలోల బరువు.. చూస్తే ఇది నాణెమని నమ్మడం కష్టమే! అచ్చం వెండి కొండలా కనిపిస్తున్న ఈ భారీ నాణెం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. అసలు ఈ నాణెం ప్రత్యేకత ఏంటి? దీని విలువ ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం!ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వెండినాణెం. అమెరికా 250వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టెక్సస్‌కు చెందిన ‘టెక్సస్ ప్రీషియస్ మెటల్స్ ఎల్ఎల్సీ’ కంపెనీ ఈ నాణేన్ని ‘సన్‌షైన్ మింటింగ్’ కంపెనీతో కలసి రూపొందించింది. దీని తయారీ కోసం స్వచ్ఛమైన వెండిని ఉపయోగించింది. రెండు అడుగుల వ్యాసం గల ఈ నాణెం బరువు 78.881 కిలోలు. సన్‌షైన్ మింటింగ్ కంపెనీకి చెందిన హస్త కళాకారులు దీనిని తయారు చేశారు.ఒకవైపు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో కాగడా ధరించిన చేతిని, నక్షత్రాలను; మరోవైపు గద్దను అమెరికా వైభవానికి ప్రతీకలుగా తీర్చిదిద్దారు. ఈ నాణెం ముఖవిలువ 250 డాలర్లు. దీనిని కస్టమ్ డిస్ప్లే బాక్స్‌లో పెట్టి, ప్రదర్శనకు అనువుగా భద్రపరచారు. ఇప్పటి వరకు ఇంత భారీనాణెం ఎక్కడా లేకపోవడంతో గిన్నిస్ బుక్ ఈ నాణేన్ని ప్రపంచంలోనే అతిపెద్ద నాణెంగా గుర్తించింది. టెక్సస్‌లోని ఆస్టిన్ నగరంలో దీనిని ప్రజల కోసం ప్రదర్శనకు పెట్టారు.ఇవి కూడా చదవండి: సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూ..12 వేల అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగు! -
పెట్రోలు కొరతతో క్యూబా ఏం చేసిందో తెలుసా?
పెట్రోలు కొరతతో అల్లాడుతున్న క్యూబా.. ఇప్పుడు సరికొత్త దారిని ఎంచుకుంది! బస్సులు, ట్యాక్సీలు కనిపించాల్సిన రోడ్లపై.. సోలార్ ఆటోలు దూసుకెళ్తున్నాయి! చైనాలో తయారైన ఈ వాహనాలు క్యూబా రవాణా ముఖచిత్రాన్నే మార్చేస్తున్నాయి!అమెరికా–ఇరాన్ యుద్ధం ఒకవైపు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా దేశాలు పెట్రోలు కొరతతో ఇబ్బందిపడుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతూ వస్తోంది. అయితే, పెట్రోలు సమస్యను అధిగమించడానికి, ప్రజల రవాణా సౌకర్యాన్ని సులభతరం చేయడానికి క్యూబా ఇటీవల సోలార్ ఆటోలను రంగంలోకి దించింది. చైనాలో తయారైన సోలార్ ఆటోలను దిగుమతి చేసి, స్థానిక ఆటో డ్రైవర్లకు అందుబాటులోకి తెచ్చింది. వీటి ధర ఒక్కొక్కటి రెండువేల నుంచి నాలుగువేల డాలర్ల వరకు ఉంటోంది. వీటిని ప్రజల రవాణాతో పాటు సరుకుల రవాణా కోసం కూడా వాడుతున్నారు. క్యూబా నగరాలు, పట్టణాల్లో ఒకప్పుడు బస్సులు, ట్యాక్సీలు తిరిగిన వీథుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సోలార్ ఆటోలే దూసుకుపోతూ కనిపిస్తున్నాయి.ఇవీ చదవండి: ఏఐతో వైరస్ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా? -
మనిషి శరీరం లేకుండానే మెదడు ఎదగగలదా?
ఒక చిన్న మిరియం గింజంత పరిమాణం. కానీ అందులో స్పందించే శక్తి, ఎదిగే జీవం!! ల్యాబ్‌లో మానవ కణాలతో సృష్టించిన ఆ మిరియపు గింజంత మెదడు భాగాలు (ఆర్గనాయిడ్స్) కొన్ని నెలలో, ఏడాదో కాదు... తొలిసారిగా ఏడేళ్ల పాటు విరామం లేకుండా జీవించి ఉండి, శాస్త్రవేత్తలనే విస్మయానికి గురిచేస్తున్నాయి. మెదడు రహస్యాలను ఛేదించే ఈ అపూర్వ ప్రయోగం, వైద్య రంగాన్ని మలుపు తిప్పే ఒక అద్భుత ఘట్టం! అందుకే ఇప్పుడిది శాస్త్ర పరిశోధనా రంగంలో అత్యంత ఆశాజనకమైన ముందడుగుగా నిలిచింది.ఆసక్తికరమైన విషయమేమిటంటే, మన తలలోని నిజమైన మెదడు.. కాలంతో పాటు ఎలా వికసిస్తుందో, ల్యాబ్‌లోని ఈ చిన్న మెదడు కణాలు కూడా సరిగ్గా అలాగే వయసుతోపాటు (కాలంతో పాటు) ఎదుగుతూ వచ్చాయి! అంతేకాదు, ఇవి తమ పెరిగిన ‘సమయ గమనాన్ని’ తమలో నమోదు చేసుకోవటం కూడా పరిశోధకులు గుర్తించారు. అంటే, మనలాగా చిన్ననాటి పుట్టినరోజు వేడుకల జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకునే తెలివితేటలు వీటికి ఉన్నాయని కాదు. ఇవి పెరిగే క్రమంలో ఏయే మార్పులు దాటుకుంటూ వచ్చాయో, ఆ సమాచారం మొత్తం వాటి కణాల లోపల ఒక గుర్తులా ముద్రపడి ఉంది! అందుకే సైంటిస్టుల పాలిట ఈ బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ పరిశోధన ఒక కల్పవృక్షం అయింది.బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ అంటే?బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ అనేవి ల్యాబ్‌లో మానవ స్టెమ్ సెల్స్ (మూల కణాలు) ఉపయోగించి తయారు చేసిన అతి చిన్న, 3–డి రూపంలో ఉండే మెదడు కణజాల నమూనాలు. అయితే ఇవి మన తలలో ఉండే నిజమైన మెదడుకు చిన్న రూపాలు మాత్రం కావు. ఇవి మెదడు ఎదుగుదలకు సంబంధించిన కొన్ని లక్షణాలను మాత్రమే పోలి ఉంటాయి తప్ప, నిజమైన మెదడులో ఉండే సంక్లిష్టమైన నిర్మాణాలు లేదా నరాల అనుసంధానాలు వీటికి ఉండవు. కాకపోతే వీటి ద్వారా న్యూరాన్లు, వాటికి సహాయపడే ఇతర మెదడు కణాలను పెంచవచ్చు.అలాగే మనుషుల ప్రారంభ మెదడు ఎదుగుదల ఎలా ఉంటుందో కూడా వీటి ద్వారా పరిశీలించవచ్చు. అసలు మెదడు ఎలా పెరుగుతుంది; నాడీ వ్యవస్థ, మెదడు ఎదుగుదలకు సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు ఎలాంటి లోపాలు జరుగుతాయి అనేది అధ్యయనం చేయడానికి పరిశోధకులకు ఈ ప్రయోగాలు ఉపయోపడతాయి. మరొక అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒక రోగి సొంత కణాల నుండి కూడా ఈ ఆర్గనాయిడ్స్‌ను తయారు చేయవచ్చు. దీనివల్ల నిర్దిష్టమైన జన్యు మార్పులు మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో పరిశోధకులు సులభంగా తెలుసుకోవచ్చు.పరిశోధన కాలక్రమం2019: డాక్టర్ పౌలా అర్లోటా నేతృత్వంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మానవ మూల కణాల నుండి 3–డి ఆర్గనాయిడ్లను (మిరియపు గింజ పరిమాణంలో ఉండే చిన్న మెదడు కణజాలాలు) తయారు చేయడం ప్రారంభించారు. కణాలు ఎక్కువ కాలం జీవించడానికి వీలుగా వాటికి ప్రత్యేకమైన పోషక ద్రావణాన్ని అందించారు.తొలి మూడు నెలలు: ఈ ల్యాబ్ మెదళ్లు మానవ పిండం మొదటి మూడు నెలల మెదడు ఎదుగుదలకు సమానమైన జన్యు సంకేతాలను, ప్రారంభ నాడీ కణాలను ప్రదర్శించడం ప్రారంభించాయి!6–12 నెలల మధ్య: మొదటి సంవత్సరం పూర్తయ్యేసరికి, ఇవి విద్యుత్ సంకేతాలను ప్రసారం చేయడం, సైనాప్స్ (రెండు నాడీ కణాల మధ్య ఉండే సమాచార మార్పిడి కేంద్రం) ను ఏర్పాటు చేసుకోవడం, గ్లియల్ మద్దతు కణాలను (నాడీ కణాలకు నిరంతరం సహకరిస్తూ వాటిని సంరక్షించే సహాయక కణాలు) అభివృద్ధి చేయడం ప్రారంభించాయి.1–2 సంవత్సరాలు: రెండు సంవత్సరాలకు పైగా ఇవి సమన్వయంతో కూడిన విద్యుత్ సంకేతాలను కొనసాగించాయి. నాడీ తంత్రువులపై రక్షణ పొర అయిన ‘మైలిన్’ ఏర్పడటం ప్రారంభమైంది. ఇది పుట్టిన తర్వాత శిశువు మెదడులో జరిగే మార్పులకు సమానంగా ఉంది.3–5 సంవత్సరాలు: సింగిల్–సెల్ ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్, డీఎన్ఏ మిథైలేషన్ పరీక్షల ద్వారా, ఈ కణాలు పిండం దశ నుండి చిన్నపిల్లల మెదడు కణాల జన్యు లక్షణాలకు మారటం కనిపించింది.5 సంవత్సరాల తర్వాత: శాస్త్రవేత్తలు పాత ఆర్గనాయిడ్ కణాలను, కొత్త కణాలతో కలిపినప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఈ పాత కణాలు ప్రారంభ దశలను దాట వేసి, నేరుగా తదుపరి దశ నాడీ కణాలను తయారు చేశాయి! అంటే తమకు ఎంత వయస్సు ఉందో గుర్తుపెట్టుకునే ‘ఎపిజెనెటిక్ క్లాక్’ కణాలు వృద్ధి చెందినట్లు పరిశోధకులు గమనించారు.2026 ఆగస్టులో 7 ఏళ్ల రికార్డు వెల్లడి: హార్వర్డ్ బృందం తమ పరిశోధన ఫలితాలను ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురించింది. మానవ మెదడు కణాలు శరీరం వెలుపల కూడా 7 ఏళ్ల పాటు జీవించడమే కాకుండా, కాలాన్ని కూడా గుర్తుంచుకోగలవని అధికారికంగా నిరూపణ అయింది.- ప్రొఫెసర్ పౌలా ఆర్లోటా, హార్వర్డ్ స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూట్పెద్ద లోటు భర్తీ అయిందిబ్రెయిన్ ఆర్గనాయిడ్స్ అనేవి మన నిజమైన మెదడు కంటే చాలా సరళమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వీటికి బయటి ప్రపంచం నుండి ఎలాంటి స్పర్శ కానీ, జ్ఞానేంద్రియ సమాచారం కానీ అందవు. అందుకే వీటికి స్పృహ, ఆలోచించే శక్తి, ఆత్మజ్ఞానం లేదా మెదడుకు ఉండే ఏ ఇతర ఉన్నత స్థాయి శక్తులు ఉండవు. అయినప్పటికీ, ఇవి మన నిజమైన మెదడు తీరును పోలి ఉంటాయి కాబట్టి మెదడు ఎదుగుదలను, వ్యాధులను అర్థం చేసుకోవడానికీ పరిశోధకులకు ఇవి ఒక అద్భుతమైన ‘బయోలాజికల్ మోడల్’గా ఉపయోగపడతాయి. అయితే ఇంతవరకు ఇందులో ఒక పెద్ద సమస్య ఉండేది. ఈ ఆర్గనాయిడ్స్ ల్యాబ్‌లో ఎదిగే క్రమంలో కొన్ని నెలలు మాత్రమే బతికేవి. దీనివల్ల పరిశోధనల్లో ఏర్పడిన పెద్ద లోటును, ఇప్పుడు ఏడేళ్ల పాటు బతికిన ఈ కృత్రిమ మెదడు కణాలు భర్తీ చేసే ఆవకాశాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.ఆర్గనాయిడ్లలో ఆలోచనలు!శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా కృత్రిమ మెదడు కణాలకు కావాల్సిన సరైన పరిస్థితులను అందించి, వాటిని ఏడేళ్ల సుదీర్ఘ కాలం పాటు సజీవంగా ఉంచగలిగారు. ఆ తర్వాత కణాల జీవసంబంధ వయస్సును అంచనా వేసే మూడు కొత్త ‘జెనెటిక్ క్లాక్స్’ ఆధారంగా వీటిని పరీక్షించారు. ఆశ్చర్యకరంగా, నిజమైన మెదడులోని కణాలు కాలక్రమేణా ఎలాగైతే రూపాంతరం చెందుతాయో, ఈ ఆర్గనాయిడ్ కణాలు కూడా సరిగ్గా అలాగే వయసు పైబడుతూ, ఆ ఎదుగుదలకు సంబంధించిన ‘కణాల జ్ఞాపకాలను’ తమలో భద్రపరుచుకున్నాయని తేలింది! ‘హార్వర్డ్ స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూట్’ ప్రొఫెసర్ పౌలా ఆర్లోటా చెబుతున్న దానిని బట్టి – ‘‘మనుషులతో సంబంధం లేకుండా, వారి శరీరాల బయట కూడా మానవ మెదడు ఇంత సుదీర్ఘకాలం పాటు పెరుగుతూ ఉండటం నిజంగా ఒక సంచలనం! భవిష్యత్తులో ఈ పరిశోధన ఆటిజం, స్కీజోఫ్రెనియా వంటి తీవ్రమైన మానసిక, నరాల సమస్యలు అసలు ఎలా మొదలవుతాయి, కాలక్రమేణా ఎలా తీవ్రం అవుతాయి అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది’’.విస్తృతంగా మస్తిష్క ప్రయోగాలునిజానికి ఇప్పటికే అల్జీమర్స్, పార్కిన్సన్స్, వెన్నుపాము గాయాలకు చికిత్సలు కనిపెట్టడానికి ఈ ఆర్గనాయిడ్లపై విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిలో భాగమే ‘యాక్సోనిస్ థెరప్యూటిక్స్’ అనే బయోటెక్నాలజీ సంస్థ చేసిన ఒకానొక ప్రయోగం! నాడీ వ్యవస్థలోని కణాలకు ప్రయోజనకరమైన జన్యు చికిత్సను అందించడానికి వీరు ఒక వైరస్‌ను ప్రత్యేకంగా రీప్రోగ్రామ్ చేశారు. ఈ చికిత్స ఎంతవరకు పనిచేస్తుందో పరీక్షించడానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పెంచిన బ్రెయిన్ ఆర్గనాయిడ్స్‌ను ఉపయోగించారు. ఎందుకంటే అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీ (తక్కువ గురుత్వాకర్షణ) వాతావరణంలో ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. అయితే ఈ కృత్రిమ మెదడు భాగాలు అసలు ఎంత కాలం బతుకుతాయి అనేది ప్రస్తుతం సైంటిస్టులకు కూడా ఒక మిస్టరీనే. వీటికి జబ్బులు పడటానికి గానీ, ఇన్ఫెక్షన్లు రావడానికి గానీ నిజమైన శరీరం ఏదీ ఉండదు కాబట్టి.. సైద్ధాంతికంగా చూస్తే ఇవి ఒక సాధారణ మనిషి కంటే కూడా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని ప్రొఫెసర్ ఆర్లోటా అంటున్నారు. ప్రస్తుతానికైతే వీటి ఆయుష్షు ఎంతో శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోతున్నారు.దిగ్భాంతిగొల్పిన ‘కైమీరా’! కణాల వయసు పెరిగే తీరును ఇంకా లోతుగా పరిశోధించడానికి, ప్రొఫెసర్ ఆర్లోటా ఒక ‘పిచ్చి ప్రయోగం’ చేశారు! ఏడాది వయసున్న కృత్రిమ మెదడు కణాలను తీసుకుని, కేవలం రెండు వారాల వయసున్న కృత్రిమ మెదడు కణాలతో కలిపి ఒక కొత్త ‘కైమీరా’ను తయారు చేశారు. రెండు వేర్వేరు జీవులకు లేదా రకాలకు చెందిన కణాలను కలిపి తయారు చేసిన ఒక కొత్త జీవి లేదా కణజాలమే ‘కైమీరా’.ఇందులో చిన్న వయసు కణాలు సాధారణంగానే స్పందించినప్పటికీ, పెద్ద వయసు కణాలు మాత్రం ఒక పెద్ద వింతను ప్రదర్శించాయి. అవి తమ ఎదుగుదల క్రమంలో చాలా ముందుకు దూసుకెళ్లిపోయాయి! అసలు సాధారణంగా రూపుదిద్దుకోవడానికి నాలుగు నెలల సమయం పట్టే నాడులను ఈ పెద్ద కణాలు తక్షణం తయారు చేయడం మొదలుపెట్టాయి. ఈ ప్రయోగం మెదడు ఎదుగుదల విషయంలో ‘సమయాన్నే మార్చేసిందని’, ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయమని ప్రొఫెసర్ ఆర్లోటా అభివర్ణించారు. మున్ముందు జరగబోయే ప్రయోగాల కోసం మెదడు కణాల ఎదుగుదలను వేగవంతం చేయడానికి ఈ వినూత్న కైమీరా పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు ఆశిస్తున్నారు. దీనివల్ల వయసు పైబడినప్పుడు వచ్చే మెదడు సంబంధిత సమస్యలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఏకంగా 20 ఏళ్ల పాటు వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు!- సాక్షి స్పెషల్ డెస్క్ఇవీ చదవండి: ‘ఇదే నా ఇల్లు.. ఈయనే నా రాజు!’ పురావస్తు శాస్త్రవేత్తలకే షాక్! -
‘ఇదే నా ఇల్లు.. ఈయనే నా రాజు!’ పురావస్తు శాస్త్రవేత్తలకే షాక్!
అది 1907... లండన్‌లోని ఓ సువిశాలమైన భవనం... డోరతి లూయిస్ ఈడీ అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ మెట్లపై నుంచి జారి కిందపడిపోయింది. తలకు గట్టి దెబ్బ తగలడంతో ఎలాంటి చలనం లేదు. వెంటనే వైద్యుడు వచ్చి పరిశీలించారు. ‘పాప శ్వాస ఆడటంలేదు. గుండె కొట్టుకోవడంలేదు. ఆమె చనిపోయింది’ అని చెప్పడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.కొద్దిసేపటికే అద్భుతం జరిగింది. చనిపోయిందనుకున్న ఆ చిన్నారి కళ్లు తెరిచి, ‘అమ్మా...’ అని పిలిచేసరికి శోకసంద్రంలో ఉన్న ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఎందుకంటే, బతికిన ఆ పాప డోరతీ ఈడీ కాదు ప్రమాదం తర్వాత డోరతి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇంగ్లిష్ కుటుంబంలో పుట్టిన ఆ చిన్నారి, స్పష్టమైన బ్రిటిష్ యాక్సెంట్ మరచిపోయి, వింతైన ప్రాచీన ఈజిప్షియన్ శైలిలో మాట్లాడటం మొదలుపెట్టింది.నిద్రలో లేచి కూర్చుని ‘నన్ను మా ఇంటికి తీసుకెళ్లండి... ఇది నా ఇల్లు కాదు’ అని ఏడ్చేది. తలకు దెబ్బ తగలడం వల్ల పాప మానసిక స్థితి సరిగ్గా లేదని తల్లిదండ్రులు భావించేవారు. కానీ రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఒకరోజు డోరతిని ఆమె తల్లిదండ్రులు బ్రిటిష్ మ్యూజియానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న పురాతన ఈజిప్ట్ విగ్రహాలు, ఫారోల శిల్పాలను చూడగానే డోరతి కళ్లు మెరిసిపోయాయి. ఒక్కసారిగా ఆ విగ్రహాల వైపు పరుగెత్తుకెళ్లి, వాటి పాదాలను ముద్దాడి, గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది.ఒక ఫారో ప్రతిమను చూపిస్తూ, ‘ఇదిగో... ఇది నా ఇల్లు. ఈయన నా రాజు సెటి–1’ అని బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు అయోమయం చెందారు.ఆ తర్వాత ఆమెకు ప్రాచీన ఈజిప్ట్‌పై ఆసక్తి రోజురోజుకూ పెరిగింది. ఈజిప్టు చరిత్ర, హైరోగ్లిఫిక్స్, దేవాలయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది.కొంచెం పెద్దయ్యాక తన గతజన్మ గురించిన జ్ఞాపకాలను స్పష్టంగా వివరించడం ప్రారంభించింది. తన పేరు బెంట్రెషిట్ అని, మూడేళ్ల వయసులో తల్లి చనిపోగా, తండ్రి తనను వదిలేయడంతో అబిడో‹స్లోని సెటి–1 ఆలయ పూజారి తనను పెంచినట్టు చెప్పింది.అక్కడ పూజారిణిగా ఉన్న తాను కఠినమైన బ్రహ్మచర్యం పాటించాలని, కానీ ఈజిప్ట్ రాజు సెటి–1 ఆ ఆలయ సందర్శనకు వచ్చినప్పుడు తమ ఇరువురి మధ్య ప్రేమ చిగురించి గర్భవతిని అయ్యానని చెప్పింది. విషయం బయటకు వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని భావించి, ఆత్మహత్య చేసుకున్నానని పేర్కొంది. తనకు రాత్రివేళల్లో ‘హోర్–రా’ అనే ఆత్మ కనిపించేదని ఆమె చెప్పింది. ఆ ఆత్మ తన గతజన్మ కథను నెమ్మదిగా చెప్పేదని, దాన్ని తాను హైరోగ్లిఫిక్ లిపిలో రాసుకున్నానని పేర్కొంది.డోరతి మాటలను ప్రపంచం మొదట్లో పట్టించుకోలేదు. ఆమెను ఓ పిచ్చి వ్యక్తిలానే చూశారు. అయితే, ఆమె పెద్దయ్యాక ఇంగ్లండ్ వదిలి ఈజిప్ట్ చేరుకుంది. అక్కడ ఈజిప్షియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటిక్విటీస్‌లో పనిచేసే పరిశోధకులతో తన గతజన్మ వివరాలను పంచుకుంది. పురావస్తు శాస్త్రవేత్తలు ఆమె చెప్పేది నిజమో కాదో తేల్చడానికి సిద్ధమయ్యారు. ‘అబిడోస్ సెటి–1 ఆలయం’ వద్ద ఆమెకు కఠినమైన పరీక్ష పెట్టారు.చీకటి పడిన తర్వాత, ఎలాంటి వెలుతురు లేని సమయంలో డోరతిని ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. గతంలో అక్కడ ఉన్న కుడ్య చిత్రాల లొకేషన్లు, భూగర్భంలో దాగి ఉన్న తోటల అమరికను గుర్తించమన్నారు. ఆ చీకటిలోనే ప్రాచీన కుడ్య చిత్రాలతోపాటు రాజభవన తోటల సరిహద్దులు ఎక్కడున్నాయో చెప్పడం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఆమె సూచించిన ప్రదేశాలను పరిశీలిస్తే, అక్కడి పురాతన నిర్మాణాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం వారిని ఆశ్చర్యపరచింది.ఈ విషయం అలా బయటకు రావడంతో ఈజిప్షియన్లు ఆమెను గౌరవంతో ‘ఓమ్ సెటి’ అని పిలవడం ప్రారంభించారు. అనంతరం ఈజిప్షియన్ వ్యక్తిని వివాహం చేసుకున్న డోరతికి ఓ కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి సెటీ అని పేరు పెట్టారు. జీవితాంతం గతజన్మ తాలూకు జ్ఞాపకాలతోనే బతికిన డోరతి 1981లో కన్నుమూసింది.ఆమె నిజంగానే బెంట్రెషిటా? లేక ప్రాచీన ఈజిప్ట్‌పై ఉన్న చిన్ననాటి మక్కువ ఒక అసాధారణమైన మానసిక ప్రపంచాన్ని సృష్టించిందా? డోరతి చెప్పిన విషయాల్లో చరిత్ర ఎంత? జ్ఞాపకం ఎంత? ఊహ ఎంత? ఈ ప్రశ్నలకు శాస్త్రం ఇప్పటికీ తుది సమాధానం ఇవ్వలేదు. కానీ, లండన్ లో పుట్టిన ఓ చిన్నారి.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అబిడోస్ అనే పురాతన నగరంతో ఏర్పరచుకున్న అనుబంధం సాధారణ కథ కాదు.డోరతీ ఈడీ చనిపోయింది. కానీ ‘ఓమ్ సెటీ’గా ఆమె వదిలిన మిస్టరీ మాత్రం ఇంకా బతికే ఉంది.- సత్యకిశోర్ కొండ్రెడ్డిఇవి కూడా చదవండి: ఏఐతో వైరస్ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా? -
ఒక్క చెట్టు 4,000 పండ్లు.. ఈ చెట్టు కథ విన్నారా?
జపాన్‌లో ఒక ఊరు ఉంది. ఆ ఊరంతా పియర్ చెట్లే! ఆ ఊరి పేరు టొట్టోరి. అక్కడ ఇంటి ముందు, బడి ముందు, రోడ్ల పక్కన అంతా పియర్ చెట్లే కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? టొట్టోరి కొండ వాలు ఊరు. వర్షం పడితే నీళ్లు నిలవకుండా వెళ్లిపోతాయి.ఇలాంటి చోటు పియర్ చెట్లకు చాలా ఇష్టం. భలే పెరుగుతాయి. అందుకే ఇక్కడ పండ్లు ఎంతో జ్యూసీగా, తియ్యగా పండుతాయి. టొట్టోరి రైతులు పియర్ చెట్లను చాలా ప్రేమగా చూసుకుంటారు. అక్కడ ఒక పెద్ద పియర్ చెట్ల మ్యూజియం కూడా ఉంది. అందులో 20 మీటర్ల వెడల్పున్న ఒక పెద్ద చెట్టు ఉంది.అది ఒక్కటే ఏడాదికి 4000 పండ్లు ఇస్తుంది! అందుకే టొట్టోరిలో కొత్త సీజన్ వస్తే మొదటి పియర్ బాక్స్ లక్షల రూపాయలకు అమ్ముడవుతుంది. ఆగస్టు 27న ఒసాకా నగరంలో మొదటి పియర్ పండ్ల వేలం జరిగింది. 10 కిలోల ఒక బాక్స్ పండ్లు ఏకంగా 6,00,000 యెన్లు అంటే మన లెక్కలో దాదాపు 3 లక్షల 40 వేల రూపాయలకు అమ్ముడుపోయింది! ఇది రికార్డ్.ఇవీ చదవండి: కొండపై నుంచి జారుతూ రేసు.. ఈ వింత పండుగ ఎక్కడో తెలుసా? -
కొండపై నుంచి జారుతూ రేసు.. ఈ వింత పండుగ ఎక్కడో తెలుసా?
ఈ ఫోటోలో అంకుల్ని చూశారా? చిన్న పిల్లాడిలా మూడు చక్రాల సైకిల్ మీద దూసుకు΄ోతున్నాడు. పైగా అతను సైకిల్ తొక్కడం లేదు, కొండ మీద నుంచి జారుతున్నాడు. ఈ వింత రేసు కొలంబియా దేశం, మెడలిన్ నగరంలో జరిగింది.ప్రతి సంవత్సరం జరిపే దీని పేరు ‘వాలు పండుగ’. కొండ వాలు మీద సొంతగా తయారు చేసుకున్న ఇంజన్ లేని బండ్లు, తొక్కనవసరం లేని సైకిళ్లతో రేసులో పాల్గొనాలి. ఈ ఊళ్లో పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తున్నారని వాళ్లకు వ్యాపకం కోసం ఇలా బండ్లు తయారు చేయమంటారు.పిల్లలు తమ చేతులతోనే చెక్కతో, ఇనుముతో ఈ ముచ్చటైన బుడ్డి బండ్లను తయారు చేస్తారు. వాటితో రేసు పెట్టి గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. ఈ రేసు ఉద్దేశం భయాన్ని గెలవడం. కొండ అంటే భయం కాదు, సరదా అని చెప్పడం. ఇంజిన్ లేదు, పెట్రోల్ లేదు. ఉన్నదల్లా ధైర్యం, స్నేహితుల చప్పట్లు. అవి చాలు కదా గెలవడానికి.ఇవి కూడా చదవండి: చిన్నారి జాలి చూపితే.. కుక్క ప్రాణం కాపాడింది! -
ముక్కుతో ఒకేసారి 10 చేపలు పట్టే ఈ పక్షిని గురించి విన్నారా?
హాయ్ ఫ్రెండ్స్! ఫొటోలో ఉన్న ముద్దుముద్దు పక్షులను చూశారా? నలుపు–తెలుపు కోటు, ఎర్రటి ముక్కు, నారింజ రంగు కాళ్లతో పెంగ్విన్‌లా ఉన్నాయి కదా? వీటి పేరు పఫిన్. వీటిని సముద్రపు చిలుకలు అని కూడా పిలుస్తారు.ఈ ఫోటో ఐస్‌ల్యాండ్ లోని వెస్ట్మన్నేయర్ దీవుల్లో తీసింది. అక్కడ ఆగస్టు నెలలో ఉష్ణోగ్రత కేవలం 12 డిగ్రీలే! అయినా పిల్లలకు అదే పెద్ద వేసవి. ఎందుకంటే అక్కడ రోజుకు 18 గంటలు సూర్యుడు ఉంటాడు. మరి ఈ పఫిన్లు ఎందుకు అక్కడికి వస్తాయి? గుడ్లు పెట్టడానికి. ఇవి చెట్లపై గూడు కట్టవు. ఫొటోలో కనిపిస్తున్నట్లుగా పచ్చటి కొండ అంచున బొరియలు తవ్వి ఇల్లు చేసుకుంటాయి.ఒక బొరియలో ఒకే ఒక్క గుడ్డు పెడుతుంది. ఈ పక్షులకు ఒక సూపర్ పవర్ ఉంది. ఒకేసారి 10 చేపలను ముక్కుతో పట్టుకోగలదు. పిల్లల కోసం అలా చేపలు తెస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు, 60 మీటర్ల లోతు వరకు నీటిలో దూకి ఈదగలదు. ఈ సందడి ఆగస్టు చివరి వరకే. సెప్టెంబర్ రాగానే ఇవన్నీ మళ్ళీ సముద్రంలోకి వెళ్లిపోతాయి. మళ్ళీ వచ్చే ఏప్రిల్ వరకు కనిపించవు. అందుకే ఈ ఫొటో చాలా స్పెషల్. మీకు తెలుసా? పఫిన్ ముక్కు వేసవిలో మాత్రమే ఎర్రగా మారుతుంది. చలికాలం వస్తే మళ్ళీ బూడిద రంగులోకి మారిపోతుంది.నిర్వహణ: కెఇవి కూడా చదవండి: మన కుల్ఫీ ముందు ప్రపంచ డెసర్ట్లు సైతం ఫిదా! -
పాము మన శత్రువు కాదా? ఈ స్టూడెంట్స్ ఏం చెబుతున్నారంటే!
ఈ ఫోటో చూడండి ఫ్రెండ్స్! మెక్సికోలోని కుయెర్నవాకా నగరంలో UNAM యూనివర్సిటీ ల్యాబ్‌లో ఇద్దరు స్టూడెంట్స్ ఒక పామును చేతిలో పట్టుకుని పరిశీలిస్తున్నారు. దీని పేరు వెస్ట్రన్ లైర్ స్నేక్. పాము అనగానే మనకు భయం వేస్తుంది కదా? కానీ ఈ స్టూడెంట్స్‌కు పాము అంటే భయం కాదు, ఆసక్తి! వీళ్ళు జీవశాస్త్రం చదివే విద్యార్థులు.వీరి చేతిలో ఉన్న పామును లైర్ స్నేక్ అంటారు. ఇది రాత్రిపూట తిరిగే పాము. కొండల్లో, రాళ్ల సందుల్లో ఉంటుంది. మనిషికి అంత ప్రమాదం కాదు. దాని విషం చిన్న బల్లులు, ఎలుకలను చంపడానికి మాత్రమే. మనల్ని కరిసినా జ్వరంలా వచ్చి తగ్గిపోతుంది. మెక్సికోలో ఇలాంటి పాముల గురించి పిల్లలకు, రైతులకు భయం పోగొట్టడానికి ఈ ల్యాబ్‌లో పరిశోధనలు చేస్తారు. పాము మన శత్రువు కాదు పిల్లలూ, పొలంలో ఎలుకలను తిని రైతుకు సాయం చేస్తుంది.చూశారా, పామును కూడా ప్రేమించవచ్చు!ఇవి కూడా చదవండి: రోడ్డుపై ఈము.. పోలీస్ పరుగులు! చివరికి ఏం జరిగిందంటే? -
మన కుల్ఫీకి ప్రపంచమే ఫిదా.. టాప్-10లో చోటు!
కుల్ఫీకి ప్రపంచస్థాయిలో దక్కిన ఈ గుర్తింపు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అసలు మన కుల్ఫీకి ఈ స్థానం ఎలా దక్కింది? ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ప్రపంచాన్ని మెప్పించిన ఈ చల్లని భారతీయ డెసర్ట్ గురించి ఇప్పుడు చూద్దామా?ప్రసిద్ధ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ‘టేస్ట్అట్లాస్’ విడుదల చేసిన ప్రపంచంలోనే 50 అత్యుత్తమ ఫ్రోజెన్ డెసర్ట్‌ల జాబితాలో భారతదేశానికి చెందిన సాంప్రదాయ ఐస్‌క్రీమ్ ‘కుల్ఫీ’ 7వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా లభించే ఇటాలియన్ జెలాటో, టర్కిష్ దొందుర్మా వంటి ప్రసిద్ధ డజర్ట్లతో పోటీపడి ఈ ఘనత సాధించింది.పాలను మరిగించి చిక్కబరిచిన తర్వాత కుంకుమపువ్వు, యాలకులు, పిస్తా, బాదం వంటి వాటిని కలిపి దీనిని తయారు చేస్తారు. అంతేకాకుండా, ఎందరికో ఇష్టమైన ‘కుల్ఫీ ఫలూదా’ 33వ స్థానంలో చోటు సంపాదించి అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ స్వీట్స్ ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పింది.ఇవి కూడా చదవండి: మీ షాపింగ్ బిల్లు పేపరు తెల్లగా మారుతోందా? అయితే ఇదే కారణం! -
మీ షాపింగ్ బిల్లు పేపరు తెల్లగా మారుతోందా? అయితే ఇదే కారణం!
మనం షాపింగ్ చేసినప్పుడు ఇచ్చిన రిసిప్ట్‌లలో కొన్ని రోజులకే అక్షరాలు కనిపించకుండా తెల్లగా మారిపోతుంటాయి. వీటిల్లో కొన్ని ముఖ్యమైన బిల్లులు కూడా ఉంటాయి. మరి వాటిని ఎలా దాచుకోవాలి?షాపింగ్ మాల్స్‌లో సాధారణంగా రిసిప్ట్‌ల కోసం థర్మల్ పేపర్ని ఉపయోగిస్తుంటారు. ఈ పేపర్ పై వేడికి స్పందించే రసాయనాలు (ల్యూకో డైస్) పూతగా ఉంటాయి. ప్రింటర్ ప్రింట్ చేసేటప్పుడు వేడి తగలడంతో అక్కడ నల్లటి అక్షరాలు ఏర్పడతాయి. అలాగే ఈ పేపర్‌పై ఎండతగిలినా, గాలి తగిలినా అక్షరాలు మాయమవుతుంటాయి. అందువల్ల ముఖ్యమైన బిల్లులను వెంటనే మొబైల్లో స్పష్టమైన ఫోటో తీసి ఉంచుకోవడం లేదా స్కాన్ చేయడం అత్యంత సురక్షితమైన మార్గం.ప్లాస్టిక్ ఫోల్డర్లు లేదా వాలెట్లలో ఉంచకుండా, పేపర్ ఎన్వెలప్లలో ఉంచి వెలుతురు, వేడి తగలని చల్లని ప్రదేశంలో దాచండి. లేదా బిల్లు తీసుకునేపుడే ఇమెయిల్ లేదా మెసేజ్ ద్వారా డిజిటల్ రిసిప్ట్లు పంపమని కోరండి. కొంతమంది బిల్లు చిరిగిపోకుండా సెల్లోటేప్ వేస్తుంటారు. కానీ సెల్లోటేప్లోని రసాయనాలు కొన్ని వారాల్లోనే ప్రింట్‌ని పూర్తిగా చెరిపివేస్తాయి.ఇవీ చదవండి: బబుల్ రాప్ ఎలా పుట్టిందో తెలిస్తే షాకే! -
ఒక టెక్నికల్ లోపం.. ప్రపంచానికి కొత్త ప్యాకింగ్ సొల్యూషన్!
బబుల్ రాప్.. ఈ రోజుల్లో దీని పాత్ర చెప్పలేనిది. ఆన్లైన్ షాపింగ్ వచ్చాక ప్యాకేజింగ్‌లో దీని అవసరం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణాలు, గాజు వస్తువులు ఒక్కటేమిటీ ప్రతీ వస్తువుకు రక్షణ కవచంలా మారిపోయింది. మరి ఇంతలా వినియోగిస్తున్న ఈ బబుల్ రాప్ కవర్..మీకు తెలుసా? బబుల్ రాప్ కథ అమెరికాలోని న్యూజెర్సీలో 1957లో మొదలైంది. ఆల్ఫ్రెడ్ ఫీల్డింగ్, మార్క్ చవాన్నెస్ అనే ఇద్దరు ఇంజనీర్లు తమ గ్యారేజీలో పని చేస్తూ.. గోడలకు ఒక కొత్త స్టైల్ ఇవ్వడానికి ప్లాస్టిక్ వాల్‌పేపర్‌ను తయారు చేయాలని భావించారు. దీని కోసం రెండు ప్లాస్టిక్ షీట్లను ఒక యంత్రం సాయంతో అతికించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు, యంత్రంలో ఒక చిన్న సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్ల రెండు ప్లాస్టిక్ షీట్ల మధ్య చిన్నచిన్న గాలి బుడగలు చిక్కుకుపోయాయి. బయటకు వచ్చిన షీట్ సాదాగా కాకుండా, బుడగలతో నిండి ఉంది. అయితే ఈ బుడగల వాల్ పేపర్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేదు.1960లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బబుల్ రాప్కి మంచిరోజులొచ్చాయి. అప్పట్లో ఐబీఎం సంస్థ 1401 కంప్యూటర్ను లాంచ్ చేసింది. అది చాలా సున్నితమైన యంత్రం, కాబట్టి దానిని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం పెద్ద సవాలుగా మారింది. అప్పుడు మార్క్ చవాన్నెస్ ఈ బబుల్ ప్లాస్టిక్‌ను ఆ సంస్థకి చూపించారు. ఆ గాలి బుడగలు వస్తువులకు రక్షణ కవచంలా పనిచేస్తాయని ఐబీఎం ఇంజనీర్లు గుర్తించారు. అలా తమ కంప్యూటర్లను సురక్షితంగా రవాణా చేయడానికి దీనిని వాడటం మొదలుపెట్టారు. దీంతో బబుల్ రాప్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. నేటి ఈ–కామర్స్ కాలంలో ఈ బబుల్ రాప్ లేని పార్సిల్స్‌ను ఊహించడం అసాధ్యం.ఇవి కూడా చదవండి: నెల జీతంతో ఇంత కుటుంబాన్ని నడిపించేది ఎవరో తెలుసా? -
లండన్ వీధుల్లోకి డ్రైవర్‌లెస్ టాక్సీ
లండన్ రోడ్డును డ్రైవర్‌లెస్ టాక్సీ పలకరించింది. ఊబర్ యాప్‌లో ఊబర్ ఎక్స్, ఊబర్ ఎలక్ట్రిక్ లేదా ఊబర్ కంఫర్ట్ బుక్ చేసినవారికి ఈ కార్లు అందుబాటులోకి వస్తాయి. అయితే ప్రస్తుతం భద్రత కోసం కారులో ఓ నిపుణుడు ఉంటాడు. పూర్తిగా డ్రైవర్‌లెస్‌గా నడిపేందుకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. అయినప్పటికీ యుకేలో ప్రయాణికుల కోసం మొదలైన తొలి డ్రైవర్‌లెస్ టాక్సీ సర్వీస్ ఇదే...!గేమ్ ఛేంజర్గేమింగ్ ఇండస్ట్రీలో సరికొత్త సంచలనం మార్కెట్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్ల జనాభా గేమ్స్ ఆడుతారని అంచనా. మరి వారి కోసం ఎప్పటికప్పుడు టెక్ గ్యాడ్జెట్స్ మారుతూ ఉండాలిగా? అందుకే ప్రముఖ ల్యాప్ టాప్ తయారీ సంస్థ ఏసర్ ఓ గ్యాడ్జెట్‌ను తీసుకొచ్చింది. ప్రాజెక్ట్ డ్యుయల్ ప్లే మిని’గా పిలిచే ఈ డివైస్‌లో 8 అంగుళాల తెర ఉంటుంది. రెండు వైపులా చివరన గేమింగ్ కన్సోల్ ఉంటుంది. కాని ఆసక్తికరమైన విషయం ఏంటంటే టైల్స్ రూపంలో మడతపెట్టి ఉన్న ఈ గ్యాడ్జెట్‌ని అన్ఫోల్డ్ చేయగానే కీ ప్యాడ్ కనిపిస్తుంది. స్క్రీన్ రివర్స్ చేస్తే దాన్నే ల్యాప్ట్యాప్గానూ, చిన్నసైజు పీసీలా ఉపయోగించుకోవచ్చు. ఆకర్షణీయంగా ఉన్న ఈ డ్యూల్ ప్లే మిని తాలూకు ప్రోటోటైప్‌ను ఐఎఫ్ఏ 2026లో ప్రదర్శనకు ఉంచగా గేమింగ్ ప్రియులు తెగ ఆసక్తిగా చూస్తున్నారు.(చదవండి: చిన్నారులు ఏఐ నేర్చుకునేలా శుతి ధరివాల్ గేమ్ స్ట్రాటజీ..!) -
రోడ్డుపై ఈము.. పోలీస్ పరుగులు! చివరికి ఏం జరిగిందంటే?
అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అటువంటిదే ఈ ఘటన కూడా. రోడ్డుపైకి వచ్చిన ఓ భారీ ఈము పక్షి.. ఓ పోలీస్ అధికారిని పరుగులు పెట్టించింది. ఈమును పట్టుకునేందుకు అధికారి చేసిన ప్రయత్నం కాసేపు సరదా ఛేజింగ్‌గా మారింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో నాష్డేల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈము పక్షి రోడ్డుపైకి వచ్చి అటూ ఇటూ సంచరించడంతో వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో సమాచారం అందుకున్న ఓ యువ పోలీస్ అధికారి అక్కడికి చేరుకున్నాడు. రోడ్డుపై నుంచి ఈమును పక్కకు పంపించేందుకు ప్రయత్నించగా.. అది ఆ అధికారిని పరుగులు పెట్టించింది. అధికారి ఎంత వేగంగా పరుగెత్తినా ఈము ఏమాత్రం దొరకకుండా ఉరకలు తీసింది. దీంతో అక్కడ కొద్దిసేపు సరదా ఛేజింగ్ కనిపించింది. ఎట్టకేలకు అధికారి ఆ పక్షిని రోడ్డుకు దూరంగా పంపించడంలో విజయవంతమయ్యాడు.అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ‘క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్’ అని పేర్కొంటూ పోస్ట్ చేశారు. రోడ్డుపై ఈము ఉండటం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డుపైకి వచ్చిన పశువులు, కంగారూలను పోలీసులు తరలిస్తుంటారు. అయితే ఈము కోసం ట్రాఫిక్ నిర్వహించాల్సి రావడం మాత్రం అరుదైన అనుభవమని అధికారులు పేర్కొన్నారు.ఈ వీడియోకు దాదాపు 90 వేల వ్యూస్ రావడంతో నెటిజన్లు కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ‘అది తిరిగి పోలీస్‌ను వెంటాడితే అసలు వేగం తెలుస్తుంది’ అంటూ కొందరు సరదాగా స్పందించారు. మరికొందరు ఈ ఘటనను 1932లో ఆస్ట్రేలియాలో జరిగిన ‘ఈము వార్’తో పోల్చారు. అప్పట్లో పంటలను నాశనం చేస్తున్న ఈములను నియంత్రించేందుకు సైన్యం చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించకపోవడంతో ఆ ఘటన చరిత్రలో నిలిచిపోయిందని గుర్తుచేసుకున్నారు.అయితే, ఈ ఘటన సరదాగా కనిపించినప్పటికీ రోడ్డుపైకి వచ్చే పెద్ద జంతువులు వాహనదారులకు ప్రమాదకరంగా మారవచ్చు. అలాంటి పరిస్థితుల్లో డ్రైవర్లు వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ఉండాలి. పక్షులను, జంతువులను భయపెట్టకుండా దూరంగా వెళ్లి, అవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వడం మంచిదని మరికొందరు వారి వారి అభిప్రాయాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. View this post on Instagram A post shared by ABC News (@abcnews) ఇవి కూడా చదవండి: సన్యాసం కోసం..రూ. 47 కోట్ల కంపెనీ అమ్మకానికి! -
నాలుగేళ్ల వయసుకే రచయిత్రిగా..ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులు!
వచ్చిరాని ముద్దుముద్దు మాటలతో అలరించే వయసుకే పుస్తకం రాసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా భావోద్వేగాలు అంటే అర్థాకానీ వయసుకే దానిపైనే పుస్తకం రాసి గిన్నిస్ రికార్డు దక్కించుకుంది. ఏకంగా రెండు రికార్డులు నెలకొల్పడం విశేషం. ఎవరా చిచ్చరపిడుగు అంటే..ఆ చిన్నారే భువనేశ్వర్‌కు చెందిన అన్వి విశేష్ అగర్వాల్. చాలామంది పిల్లలు తాము ఏం అనుకుంటున్నారో చెప్పే ప్రయత్నం చేసే వయసులోనే తన సొంత భావోద్వేగాలపై పుసక్తం రాసేసింది ఈ చిచ్చరపిడుగు. పైగా రెండు భాషాల్లో పుస్తకాన్ని రాసిన అతిపిన్న వయస్కురాలైన చిన్నారిగా నిలిచింది. దాన్ని ఆ చిన్నారి ఆంగ్ల, స్పానిస్ భాషల్లో రాయడం విశేషం. ఆ చిన్నారి ‘లిటిల్ గర్ల్, బిగ్ ఎమోషన్స్’ అనే పేరుతో రాసిన ఈ పుస్తకంలో తన భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో పడిన ఇబ్బందిని పూసగుచ్చినట్లు రాసుకొచ్చింది. అంతేగాదు ఆమె తన భావోద్వేగాలను విస్పోటనం చెందే అగ్నిపర్వతంగా అభివర్ణించి తన వయసుకి మించి సృజనాత్మకతతో ఆకట్టుకుందామె. తనలాంటి భావోద్వేగాలను అనుభవిస్తున్న పిల్లల కోసం ఈ పుస్తకం రాసిందట. అందుకుగాను గిన్నిస్ రికార్డు సొంత చేసుకోవడమే కాదు. అతిపిన్నవయస్కురాలైన టెడ్ఎక్స్ స్పీకర్‌గా మరో గిన్నిస్ రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నారి. ఈ పుస్తకంలో కేవలం రాయడం మాత్రమే కాదు స్వయంగా తనే చిత్రాలను కూడా గీసింది. చిత్ర లేఖనం, సృజనాత్మకతతో తనలో రెండు కళలను ఒకేసారి పుస్తక రూపంలో చూపించింది. అంతేకాదండోయ్ రెండేళ్ల వయసులోనే 72కి పైగా చిత్రాలను గీసిందట. ఆమె కళాకృతులు ముంబై, గురుగ్రామ్, దుబాయ్‌లో ప్రదర్శించారట కూడా. అంతేగాదు ఆ చిట్టితల్లిని చిన్న ఏజ్‌లోనే రెండు గిన్నిస్ రికార్డులు దక్కించుకోవడం ఎలా ఉంది అని అడిగితే..ఒకేసారి రెండు ఐస్‌క్రీంలు తిన్నంత తియ్యగా ఉందని చెబుతుండటం విశేషం.(చదవండి: బరువు తగ్గడం ఇంత కష్టమా? నటి నిమిష సజయన్ వెయిట్‌లాస్ జర్నీ) -
‘లీఫ్రానిక్స్’! వాడేసి పడేస్తే మట్టిలో కలిసిపోతాయి.. ఇవే భవిష్యత్ గ్యాడ్జెట్స్!
మన స్మార్ట్ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పాడైపోతే చెత్తకుప్పల్లో ప్లాస్టిక్ వ్యర్థాలుగా మిగిలిపోతాయి కదా. అలా కాకుండా ప్లాస్టిక్ స్థానంలో రాలిపోయిన ఆకుల ఈనెలను సర్క్యూట్ బోర్డులుగా వాడుకుని సర్క్యూట్లను తయారుచేసే కొత్త సైన్స్ మ్యాజిక్కే లీఫ్ట్రానిక్స్. అన్బి‘లీఫ’బుల్ అనిపిస్తోందా! వాడేశాక, లేదా కాలం తీరిపోయాక ఈ లీఫ్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని చెత్తలో పడేసినా, ప్లాస్టిక్‌లా అవి పర్యావరణాన్ని పాడుచేయకుండా మట్టిలో సహజంగానే కుళ్లిపోయి, ఎరువుగా మారిపోతాయి. అంటే, రాబోయే తరాల వారి కోసం ఒక ఆకుపచ్చని భవిష్యత్తు ఎదురు చూస్తోందన్నట్లే!ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇదొక కొత్త, ప్రకృతి హితమైన సాంకేతికత. సాధారణంగా మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల సర్క్యూట్ బోర్డులు, ప్లాస్టిక్ మెటీరియళ్లు పర్యావరణానికి చాలా హాని చేస్తాయి. అవి త్వరగా భూమిలో కలిసిపోవు. దీనికి పరిష్కారంగా జర్మనీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆకుల సహాయంతో ఎలక్ట్రానిక్స్‌ను కనిపెట్టే ప్రయోగాల్లో తలమునకలై ఉన్నారు. ఈ టెక్నాలజీనే ‘లీఫ్ట్రానిక్స్’ అంటున్నారు.ఆకులలో ఉండే ‘ఈనెల’ నెట్వర్క్ నిర్మాణం చాలా గట్టిగా, ప్లాస్టిక్ లాంటి మన్నికను కలిగి ఉంటుంది. శాస్త్రవేత్తలు ఆకులలోని మెత్తని భాగాన్ని తొలగించి, ఆ ఈనెల అస్థిపంజరం లాంటి నిర్మాణాన్ని ప్లాస్టిక్ లేదా గాజుకు బదులుగా ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్ తయారు చేయడానికి వాడేందుకు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ టెక్నాలజీతో తయారైన ఎలక్ట్రానిక్ పరికరాలు భూమిలో సులభంగా కలిసిపోతాయి. దీనివల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఇ–వేస్ట్) చాలా వరకు తగ్గుతాయి.రెండేళ్ల క్రితమే దాదాపుగా విజయంజర్మనీలోని ప్రఖ్యాత ‘డ్రెస్డెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ’ శాస్త్రవేత్తలు 2024 నవంబరులో ఈ టెక్నాలజీని ఒక కొలిక్కి తెచ్చారు. ఈ పరిశోధన బృందానికి ప్రొఫెసర్ కార్ల్ లియో, భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రాకేష్ ఆర్. నాయర్ నేతృత్వం వహించారు. లీఫ్ట్రానిక్స్పై వారి కృషికి సంబంధించిన పరిశోధన వివరాలు ప్రసిద్ధ సైన్స్ జర్నల్ ‘సైన్స్ అడ్వాన్సెస్’ లో ప్రచురితమయ్యాయి. భూమిపై నానాటికీ వేగంగా పెరిగిపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఈ బృందం రీసెర్చ్ ప్రారంభమైంది.పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు మొదట మగ్నోలియా చెట్ల ఆకులను తీసుకుని, అందులోని మెత్తని కణాలను పూర్తిగా తొలగించారు. కేవలం బలమైన ఈనెల అస్థిపంజరం మాత్రమే మిగిలేలా చేశారు. ఆ అస్థిపంజరం ‘లిగ్నోసెల్యులోజ్’ అనే పదార్థంతో కూడి ఉంటుంది. ప్రకృతి సిద్ధమైన ఆ ఈనెల నిర్మాణానికి పాలిమర్ కోటింగ్ ఇచ్చారు. ఎలాగంటే, ఈనెను ‘ఇథైల్ సెల్యులోజ్’ అనే ప్లాస్టిక్ లాంటి గట్టి, పర్యావరణ హితమైన (భూమిలో కలిసిపోయే) ద్రవ పదార్థంలో ముంచటం ద్వారా! సాధారణంగా పర్యావరణానికి హాని చేయని పదార్థాలు త్వరగా వేడికి కరిగిపోతాయి.కానీ, ఈ ఆకు ఈనెలల ఆధార (బేస్) నిర్మాణం వల్ల ఆ ‘ఇథైల్ సెల్యులోజ్’ పదార్థానికి ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే దృఢమైన బలం చేకూరింది! దీనిపై లేజర్ కటింగ్ ద్వారా సర్క్యూట్లు ప్రింట్ చేసి, ఎలక్ట్రానిక్ విడిభాగాలను అమర్చారు. ఈ విధంగా ఆకుల సహజ నిర్మాణాన్ని ఉపయోగించి, పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులను తయారు చేసే విధానాన్ని కనిపెట్టి, దానికి ‘లీఫ్ట్రానిక్స్’ అని పేరు పెట్టారు. వాడేసిన తర్వాత వాటిని పారేస్తే సుమారు నెల రోజుల్లో శిథిలమైపోయి, మట్టిలో కలిసిపోతాయి.మాగ్నోలియా చెట్టు కథలీఫ్ట్రానిక్స్ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కార్ల్ లియో... డ్రెస్డెన్ యూనివర్శిటీలో సీనియర్ ప్రొఫెసర్. ఆర్గానిక్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నవారు. ఆయనతో పాటుగా డాక్టర్ హాన్స్ క్లీమాన్ అనే శాస్త్రవేత్త అదే విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ గ్రూప్ లీడర్‌గా ఉన్నారు. ఆయన కూడా ప్రొఫెసర్ కార్ల్ లియో ఆధ్వర్యంలో పనిచేస్తూ, ఈ లీఫ్ట్రానిక్స్ ప్రాజెక్ట్‌లో కీలకమైన పాత్ర పోషించారు. వీళ్లిద్దరూ ఒకే విశ్వవిద్యాలయంలో, ఒకే ల్యాబ్‌లో కలిసి పనిచేస్తున్న సహచర శాస్త్రవేత్తలు అయినప్పటికీ ఈ లీఫ్ట్రానిక్స్ అనే ఐడియా వచ్చింది మాత్రం వీరిద్దరికీ కాదు. అక్కడే పీహెచ్డీ చేసిన రాకేష్ నాయర్‌కి వచ్చిన ఆలోచన అది! యూనివర్సిటీ ప్రాంగణంలోని మాగ్నోలియా చెట్టు కింద నడుస్తున్నప్పుడు రాకేష్‌కి లీఫ్ట్రానిక్స్ ఆలోచన తట్టింది. అంటే లీఫ్ట్రానిక్స్ అనే భావన ఏ రసాయన ప్రయోగశాలలోనో పుట్టలేదు. యూనివర్సిటీ ఆవరణలోని ఒక మాగ్నోలియా చెట్టు కింద జీవం పోసుకుంది.దానికి ముందరి కథ..!క్లీమాన్ దగ్గర పీహెచ్డీ చేసిన డాక్టర్ రాకేష్ నాయర్, ప్లాస్టిక్ లేదా గాజుకు బదులుగా పర్యావరణంలో సులభంగా కుళ్లిపోయే, లేదా శిథిలమైపోయే సహజ పదార్థాల కోసం వెతుకుతున్నారు. ఇద్దరూ కలిసి రకరకాల కాగితాలు, ప్లాస్టిక్, రబ్బరు, నైలాన్ పాలిథిన్ కవర్లను, సెల్యులోజ్‌ను పరీక్షించినప్పటికీ, ఎలక్ట్రానిక్స్ తయారీలో అవసరమైన వేడిని అవి తట్టుకోలేక కరిగిపోవటమో లేదా వంకరపోవటమో జరిగింది. ఏం చేయాలా అని సతమతమవుతున్న సమయంలో, రాకేష్ నాయర్ ఒక రోజు మాగ్నోలియా చెట్టు పక్కనుండి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే ఆయనకు.. ప్రకృతిలోని చెట్ల ఆకులు ఈ సమస్యకు పరిష్కారం చూపగలవనే ఆలోచన వచ్చింది.ప్రయోగశాలలో నిర్ధారణమాగ్నోలియా ఆకులు చాలా గట్టిగా, బలమైన ఈనెల నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. నాయర్ వెంటనే ఆ ఆకులు సేకరించి ల్యాబ్‌కి తీసుకెళ్లారు. ఆకులపై ఉన్న మెత్తని భాగాన్ని తొలగించి, కేవలం బలమైన ఈనెల అస్థిపంజరాన్ని మాత్రమే మిగిల్చారు. ఆ ప్రకృతి సిద్ధమైన ఈనెల నిర్మాణం, పర్యావరణ హితమైన పదార్థాలకు 180 సెల్సియస్ డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తుందని కనుగొన్నారు. అలా ఆ మాగ్నోలియా చెట్టు కింద కలిగిన చిన్న ఆలోచనే నేడు ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ‘లీఫ్ట్రానిక్స్’కు దారితీసింది!ఐదు శాస్త్ర విభాగాలు కలవాలిలీఫ్ట్రానిక్స్ సాంకేతికత విజయవంతమై, ల్యాబ్ నుండి మన రోజువారీ వినియోగంలోకి రావాలంటే ప్రధానంగా 5 ముఖ్యమైన శాస్త్ర విభాగాలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది.అవి: మెటీరియల్స్ సైన్స్, బయో–మెటీరియల్స్ ఇంజనీరింగ్ (ఆకుల నుండి రసాయనాలను తొలగించి, కేవలం గట్టి పీచు చట్రాన్ని వేరు చేయడం; అది తేమకు, వేడికి దెబ్బతినకుండా స్థిరపరచడం ఈ విభాగం బాధ్యత); ఆర్గానిక్–ఫ్లెక్సిబుల్ ఎలక్టాన్రిక్స్ (సహజమైన ఆకు ఉపరితలంపై ప్రవహించే వెండి/రాగి లిక్విడ్ ఇంక్‌లు, విద్యుత్ ప్రసరించే ఆర్గానిక్ పొరలు, సర్క్యూట్లు, ఒలెడ్ డిస్ప్లేలను డిజైన్ చేయడానికి ఈ శాస్త్రం అవసరం); ప్లాంట్ బయాలజీ–బయోమిమెటిక్స్ (ఏ రకం ఆకులు, వాటి ఈనెల ఆకారాలు ఎలక్ట్రానిక్స్‌కు బాగా సరిపోతాయో అధ్యయనం చేయడం, మొక్కల కణజాలం, వాటి బలాన్ని అర్థం చేసుకోవడంలో ఈ శాస్త్రం తోడ్పడుతుంది); కెమికల్ ఇంజనీరింగ్– సర్ఫేస్ సైన్స్ (ఆకు పొరలపైన లోహపు మార్గాలు ఊడిపోకుండా ఉండేలా చూడటం, లోహాల అణువులు ఆకు కణాల్లోకి వ్యాపించి సర్క్యూట్ పాడవకుండా ఉండేలా కెమికల్ బాండింగ్‌ను నిర్వహించడం ఈ విభాగం కిందకు వస్తుంది); ఎన్విరాన్మెంటల్ సైన్స్–ఎకో టాక్సికాలజీ (ఈ పరికరాలు వాడి పడేసిన తర్వాత మట్టిలో ఎంత త్వరగా కుళ్లిపోతాయి? వీటిలోని లోహాలు మట్టిని లేదా నీటిని విషపూరితం చేస్తాయా? అనే అంశాలను పరిశోధించి పర్యావరణానికి పూర్తిగా సురక్షితమని ధ్రువీకరించటానికి ఈ విభాగం అవసరం).భవిష్యత్ ప్రయోజనాలులీఫ్ట్రానిక్స్ సాంకేతికత అందుబాటులోకి వస్తే, మానవ జీవితం మీద, పర్యావరణంపైన దాని ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎలక్టాన్రిక్ వ్యర్థాల సమస్యను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.వ్యవసాయ పొలాల్లో, అడవుల్లో నీటి శాతం, నేల సారం లేదా వాతావరణ మార్పులను పర్యవేక్షించే సెన్సర్లను తయారు చేయవచ్చు. ఇవి పని పూర్తయ్యాక నేలలో కలిసిపోతాయి కాబట్టి వీటిని తిరిగి సేకరించాల్సిన అవసరం ఉండదు.మానవ శరీరంపై అంటించే స్మార్ట్ హెల్త్ ప్యాచెస్, షుగర్ టెస్ట్ స్టిప్స్ర్, ఈసీజీ సెన్సర్ల తయారీలో వాడవచ్చు. ఇవి చర్మానికి ఎలాంటి హానీ చేయవు. ప్లాస్టిక్ వ్యర్థాలను పెంచవు.కొరియర్ ప్యాకింగ్‌లపై వాడే స్మార్ట్ ట్రాకింగ్ ట్యాగ్లు, తాత్కాలిక డిస్ప్లేలు, స్మార్ట్ లేబుల్స్గా వాడొచ్చు.ఆకుల ఈనెల ఆకారాన్ని ఉపయోగించి, వాటిపై రాగి లేదా వెండి పూత పూసి సూక్ష్మక్రిములను సంహరించే సహజమైన ఫిల్టర్లుగా మార్చవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో ఇ–కోలి వంటి బ్యాక్టీరియాలను నీటి నుండి తొలగిస్తుంది.వంగే స్వభావం ఉండే ఫ్లెక్సిబుల్ సోలార్ ప్యానెళ్లు, సూపర్ కెపాసిటర్లు, తేలికపాటి ఒలెడ్ (ఆర్గానిక్ లైట్–ఎమిటింగ్ డయోడ్) డిస్ప్లేల తయారీలో ఉపయోగించవచ్చు. ప్రస్తుతం మనం వాడే ఎలక్ట్రానిక్స్ ప్లాస్టిక్, పలు విషపూరితమైన కెమికల్స్‌తో తయారై వేల సంవత్సరాలు మట్టిలో కరగకుండా ఉండిపోతున్నాయి. అలా కాకుండా, లీఫ్ట్రానిక్స్ ద్వారా ‘వాడేసి పడేశాక మట్టిలో కలిసిపోయే’ ఆకుపచ్చని భవిష్యత్తును నిర్మించవచ్చు.తయారీలో ప్రధాన సవాళ్లు ‘లీఫ్ట్రానిక్స్’ అనేది సహజమైన ఆకుల ఈనెల వ్యవస్థను, ప్లాంట్ స్కాఫోల్డ్లను (ఆకుల అస్థిపంజరాలు) ఉపయోగించి పర్యావరణ రహిత, బయోడిగ్రేడబుల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను తయారుచేసే ఒక నూతన సాంకేతిక రంగం కనుక సహజంగానే పరిశోధకులకు కొన్ని సవాళ్లూ ఎదురౌతున్నాయి. మొదటది, ప్రతి ఆకు పరిమాణం, మందం, ఈనెల నిర్మాణం వేర్వేరుగా ఉంటాయి. అందుకే పరిశ్రమలలో ఒకే ప్రమాణంతో మాస్ ప్రొడక్షన్ చేయడం పెద్ద సవాలు. రెండవది, ఆకులలో ఉండే పీచు పదార్థాలు గాలిలోని తేమను త్వరగా పీల్చుకుంటాయి. దీనివల్ల ఆకుల సర్క్యూట్లలో షార్ట్ సర్క్యూట్లు కావడం లేదా పొరలు విడిపోవడం జరిగే అవకాశం ఉంది.మూడు, సాధారణ ఎలక్ట్రానిక్ (ఎఫ్.ఆర్.–4) బోర్డులతో పోలిస్తే ఆకుల పీచు, బయో–పాలిమర్లు అధిక ఉష్ణోగ్రతల వద్ద (ఉదాహరణకు సోల్డరింగ్ చేసేటప్పుడు) దెబ్బతినే అవకాశం ఉంది. నాలుగు, సర్క్యూట్ మార్గాల కోసం వాడే వెండి లేదా రాగి లోహాల సూక్ష్మ అణువులు కాలక్రమేణా ఆకు కణజాలంలోకి విస్తరించి సర్క్యూట్ పనితీరును దెబ్బతీస్తాయి. చివరిగా, లీఫ్ట్రానిక్స్ సాంకేతికత తక్కువ విద్యుత్ వాడే, స్వల్పకాలిక లేదా పునర్వినియోగ పరికరాలకు మాత్రమే అనుకూలం. హై–పెర్ఫార్మెన్స్ ప్రాసెసర్ల స్థానంలో దీనిని ఇప్పటికిప్పుడే వాడలేము.పదహారేళ్లుగా ప్రయోగాలు!లీఫ్ట్రానిక్స్ను ఆవిష్కరించేందుకు 2010 చివర్ల నాటి నుంచీ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ఆకుల నిర్మాణాన్ని సోలార్ సెల్స్, సూపర్ కెపాసిటర్లు, ఫ్లెక్సిబుల్ ఎనర్జీ స్టోరేజ్ కోసం ఉపయోగించడంపై విశ్వవిద్యాలయాలలో గత పదేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. తొలిసారి 2024 చివరిలో ముందడుగు పడింది! వీరు ఆకుల స్కాఫోల్డ్లపై ఆధారపడి పనిచేసే ‘ఆర్గానిక్ లైట్–ఎమిటింగ్ డయోడ్’ (ఒలెడ్)ను, ట్రాన్సిస్టర్లను విజయవంతంగా తయారు చేసి చూపించారు.ప్రస్తుతం వివిధ విశ్వవిద్యాలయాలు గ్రీన్–టెక్ స్టార్టప్‌లు దీనిని వ్యాపారాత్మకంగా వినియోగంలోకి తీసుకురావడానికి పైలట్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తున్నాయి. లీఫ్ట్రానిక్స్ కేవలం ఒక కొత్త టెక్నాలజీ మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి మన భూమిని రక్షించే ఒక తిరుగులేని పరిష్కారం. ప్రకృతి ఇచ్చిన ఆకులతో భవిష్యత్ ఎలక్ట్రానిక్స్‌ను నిర్మించడం ద్వారా టెక్నాలజీ అంటే పర్యావరణాన్ని నాశనం చేయడం కాదు, దానితో కలిసి జీవించడమే అని ఈ సాంకేతికత నిరూపిస్తోంది. రాబోయే కాలంలో మనం వాడే గ్యాడ్జెట్స్ పర్యావరణానికి భారం కాకుండా, తిరిగి మట్టికి ప్రాణం పోసేలా మారనున్నాయనే అనుకోవాలి!- సాక్షి స్పెషల్ డెస్క్ఇవి కూడా చదవండి: కొబ్బరిచెట్టు కోసం కేసు.. ‘టీ తాగుతూ మాట్లాడుకోండి’ అన్న కోర్టు! -
కొబ్బరిచెట్టు కోసం కేసు.. ‘టీ తాగుతూ మాట్లాడుకోండి’ అన్న కోర్టు!
‘సొంత లాభము కొంత మానుకు పొరుగువానికి తోడుపడవోయ్’ అన్నారు మహాకవి గురజాడ. కానీ కేరళలో ఓ వ్యక్తి ‘పక్కవాని కొబ్బరిచెట్టు పెకలించేదాక నిదురపోనోయ్’ అన్నట్టు కంకణం కట్టుకున్నాడు. పంచాయతీ నుంచి హైకోర్టు దాకా కేసులు పెట్టాడు. కల్పవృక్షంగా ఉండాల్సిన కొబ్బరిచెట్టు కలహాల చెట్టుగా ఎందుకు మారింది? కేసుల వరకు వెళ్లడానికి కారణం ఏంటి? ఈ కేసులో హైకోర్టు తీర్పు ఎందుకు ఆసక్తికరంగా మారిందనేదే ఈ వారం ‘లీగలాటా’...కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కారేకులం గ్రామంలో గోపీనాథ్, రంజిత్ పక్క పక్క ఇళ్లల్లో నివసిస్తున్నారు. ఇద్దరి ఇళ్లకు సరిహద్దుగా ఉన్న గోడకు ఆనుకుని రంజిత్ స్థలంలో ఓ కొబ్బరి చెట్టు ఉంది. ఆ చెట్టు తన ఇంటివైపునకు వాలి ఉందని, అది కూలి ఇంటిపై పడితే పాడవుతుందని గోపీనాథ్ ఫిర్యాదు. కొబ్బరి ఆకులు, కాయలు పడి తన రెండు కార్లు దెబ్బతినే అవకాశం ఉందని అతని వాదన.తన సమస్యను వివరిస్తూ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అది పడిపోయే స్థితిలో ఉంటే తప్ప పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని పంచాయతీ అధికారులు చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులకు, తర్వాత స్థానిక సంస్థలకు చెందిన అంబుడ్స్‌మెన్‌కు సైతం ఫిర్యాదు చేశాడు. వారు సూచించిన పరిష్కారాలతో సంతృప్తి చెందని గోపీనాథ్ చివరకు హైకోర్టును ఆశ్రయించాడు.చెట్టు పరిశీలనకు రూ. లక్షకొబ్బరిచెట్టుపై ఉన్న అభ్యంతరాలు, ఆందోళనలను పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై సమగ్ర పరిశీలనకు కోర్టు కమిషనర్‌ను నియమించాలని అభ్యర్థించాడు. ఖర్చులను భరిస్తే నియమిస్తామని కోర్టు చెప్పడంతో అంగీకరించారు. కోర్టు కమిషనర్ ఫీజును రూ. లక్షగా నిర్ణయించి చెల్లించాలని ఆదేశించింది. పిటిషనర్ ఆ మొత్తాన్ని చెల్లించారు.ఆ సెక్షన్ వర్తించదుకొబ్బరి చెట్టు ఉన్న ప్రాంతాన్ని కోర్టు కమిషనర్ పరిశీలించారు. చెట్టు బలమైన వేళ్లతో ఉందని వెంటనే పడిపోయే ప్రమాదం లేదని తేల్చారు. చెట్టు పడిపోకుండా ఇప్పటికే ఇనుప తీగతో కట్టి ఉంచారని, కొబ్బరికాయలు, ఆకులు పక్కస్థలంలో పడకుండా నెట్ కూడా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రక్షణ వలను మరింత వెడల్పు చేసి, క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే సరిపోతుందని తన నివేదికలో పేర్కొన్నారు. కమిషనర్ నివేదికతోనూ పిటిషనర్ సంతృప్తి చెందలేదు.కేరళ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 238 కింద చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాడు. ఈ సెక్షన్ ప్రకారం చెట్టు కొమ్మలు లేదా చెట్టు కూలిపోయి వ్యక్తులు, భవనాలు, పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పంచాయతీ, అంబుడ్స్‌మెన్, కోర్టు కమిషనర్ నివేదికలన్నీ ఆ చెట్టు వల్ల ప్రస్తుతానికి ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదని తేల్చాయి. అందువల్ల ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకోలేమని కోర్టు తేల్చింది.విలక్షణ తీర్పుపొరుగింటి వారితో ఉన్న చిన్న సమస్య పట్టుదల, అహంకారాల కారణంగా న్యాయవివాదంగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఈ కొబ్బరిచెట్టుకే గనుక నవ్వే శక్తి ఉంటే, ఇద్దరు పొరుగువారు తన కోసం కొట్టుకోవడం చూసి అది నవ్వుకునేదేమో!’ అని న్యాయమూర్తి చమత్కరించారు. ఇంత చిన్న సమస్యకు కోర్టు సమయాన్ని వృథా చేశారని ఇప్పటికే సివిల్, క్రిమినల్ కేసుల పెండింగ్ భారం కోర్టులపై ఉందని జడ్జి అసహనం వ్యక్తం చేశారు.‘పొరుగు వానిని నీలాగే ప్రేమించు’ అనే వాక్యాన్ని ప్రస్తావిస్తూ, ఇద్దరూ కలిసి టీ లేదా కాఫీ తాగుతూ కూర్చుని చర్చించుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. హైకోర్టు ఈ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని తేల్చారు. భవిష్యత్తులో నిజమైన ప్రమాదం ఏర్పడితే పంచాయతీ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘విలువైన కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు ఇద్దరి నుంచి ఖర్చులు వసూలు చేయవచ్చు కానీ, కోర్టు ఉదారంగా వ్యవహరించి ఆ చర్యలు తీసుకోవడం లేదు’ అంటూ పిటిషన్‌ను కొట్టేశారు.- దిలీప్ మాదిరెడ్డిఇవీ చదవండి: ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి? -
ఉగాండాలో మొదలైన బయింబా ఫెస్టివల్.. ప్రత్యేకతలేంటో తెలుసా?
ఉగాండా అంటే ప్రకృతి అందాలు, వన్యప్రాణులు మాత్రమే కాదు.. వైవిధ్యమైన సంగీతం, కళలు, సంప్రదాయాలతో కళకళలాడే దేశం కూడా. ఆ దేశంలోని సాంస్కృతిక, సృజనాత్మక ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రముఖ వేడుక బయింబా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ది ఆర్ట్స్. ఆగస్టు 28న మొదలైన ఈ వేడుకలు 30న ముగుస్తున్నాయి. ఈ ఫెస్టివల్లో సంగీత నాటక నృత్యాలు సహా పలు దృశ్య కళల ప్రదర్శనలు జరుగుతాయి.ఉగాండా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటాలనే లక్ష్యంతో 2006లో బయింబా ఫౌండేషన్ ప్రారంభమైంది. ఈ ఫౌండేషన్ 2008లో తొలిసారిగా బయింబా ఫెస్టివల్ నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఉత్సవం తూర్పు ఆఫ్రికాలోని ప్రముఖ బహుళ కళా ఉత్సవాల్లో ఒకటిగా ఎదిగింది. లంకులు ఐలండ్ వేదికగా ఈ ఉత్సవాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఉగాండా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ బయింబా ఫెస్టివల్ ప్రధాన లక్ష్యం.అంతేకాకుండా సృజనాత్మక రంగానికి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు, కళావిద్య, కళాకారుల అభివృద్ధి, సాంస్కృతిక వ్యాపార అవకాశాలను పెంచడం కూడా దాని కార్యక్రమాల్లో భాగం. ఉగాండా ఆర్థికాభివృద్ధిలో కూడా ఈ ఉత్సవం తోడ్పడుతుంది. బయింబా ఫెస్టివల్‌కు ఉన్న ప్రత్యేకతల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఒకటి. వివిధ దేశాలు, విభిన్న సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన కళాకారులు, సంగీతకారులు, ప్రదర్శనకారులు ఇక్కడ కలుసుకుంటారు. వారంతా తమ తమ అనుభవాలను పంచుకుంటారు.ఈ బయింబా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ది ఆర్ట్స్– కళాభిమానులకు, పర్యాటకులకు, ప్రపంచ సంస్కృతులను తెలుసుకోవాలనుకునే వారికి ఒక ప్రత్యేక అనుభవంగా నిలుస్తుంది. ఈ ఫెస్టివల్ కోసం ఈ ఏడాది బయింబా అంతర్జాతీయ కళాకారుల నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. సంగీతం, నృత్యం, సినిమా, ఫ్యాషన్, ఫోటోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్, థియేటర్ తదితర విభాగాలకు చెందిన కళాకారులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.ఇవి చదవండి: ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి? -
దెయ్యమా? మనిషేనా? హాలోవీన్ హత్యలో ఊహించని ట్విస్ట్!
నగరం చీకటి దుప్పటి కప్పుకున్న వేళ... అక్కడ హాలోవీన్ వేడుకలు మొదలయ్యాయి. వ్యాపారవేత్త చేతన్ విల్లా అంతా వింత ఆకారాలు, భయంకరమైన అలంకరణలతో నిండిపోయింది. మోడల్ నమిత, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ మిత్రా, జర్నలిస్ట్ శుక్లా, నమిత స్నేహితురాలు వినతి, రమ్య అక్కడ చేరారు. అందరూ విభిన్నమైన ఫ్యాన్సీ డ్రెస్సుల్లో, ముసుగుల్లో ఉన్నారు. నమిత తెల్లటి దుస్తుల్లో ప్రేతాత్మలా భ్రమను కలిగిస్తోంది.వేడుక పీక్స్‌కి చేరింది. అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు హారర్ ఎఫెక్ట్ కోసం ఇంట్లోని లైట్లన్నీ ఆపేశారు. ఐదు నిమిషాల పాటు అంతా కారుచీకటి. కేవలం భయంకరమైన నవ్వుల సౌండ్ ట్రాక్ మాత్రమే వినిపిస్తోంది. సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత లైట్లు ఆన్ అయ్యాయి.ఒక్కసారిగా అక్కడ కనిపించిన దృశ్యానికి అందరూ షాకయ్యారు. హాల్లో ఉన్న సోఫాపై నమిత నిర్జీవంగా రక్తం మడుగులో పడి ఉంది. ఆమె గుండెల్లో పదునైన కత్తి దిగి ఉంది. ఆ గదిలో మంత్రాల్లా గోడపై రక్తం గుర్తులు రాసి ఉన్నాయి. అక్కడి వారంతా ఇది ‘ఆత్మ చేసిన హత్య’ అని ప్రచారం మొదలుపెట్టారు.∙∙ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు రంగంలోకి దిగాడు. మీడియాలో ‘హాలోవీన్ రాత్రి ఆత్మ చేసిన హత్య’ అంటూ అప్పటికే రూమర్స్ మొదలయ్యాయి. రక్తం మడుగులో నమిత– లక్షలాది మంది మగవాళ్ల హార్ట్ బీట్. తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న మోడల్. డెడ్ బాడీని పోస్ట్‌మార్టమ్‌కు పంపి, అక్కడ ఉన్న ఐదుగురినీ విచారించడం ప్రారంభించాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.డైరెక్టరు మిత్రా తన తదుపరి యాడ్ ఫిలింలో చేయమని నమితను కోరితే, ఆమె చేయనంది. అతనికి నమిత మీద పీకల దాకా కోపం వుంది.జర్నలిస్ట్ శుక్లా– నమితకు కెరీర్ మొదట్లో సాయం చేసి, ఫేమస్ చేశాడు. కానీ స్టార్ అయ్యాక నమిత అతన్ని దూరం పెట్టడంతో లోలోపల రగిలిపోతున్నాడు.బిజినెస్‌మేన్ చేతన్ నమితను పిచ్చిగా ప్రేమించి ప్రపోజ్ చేశాడు. నమిత అతని ప్రపోజల్‌ను తిరస్కరించింది. అతని ఈగో దెబ్బతింది.ఇక వినతి, రమ్యలకు పెద్దగా మోటివ్స్ లేవు. అభిమన్యు నోటీసులోకి రెండు విషయాలు వచ్చాయి. ఒకటి, నమిత గుండెల్లో దిగిన కత్తిని కుడిచేత్తో బలంగా పొడిచారు. రెండు, లైట్లు ఆపే సమయానికి, ఆన్ అయ్యే సమయానికి అందరూ ఒకే చోట ఉన్నారా లేదా?అభిమన్యు క్రైమ్ సీన్ ను పరిశీలించాడు. గోడపై రాసిన రక్తపు గుర్తులు ఆత్మ చేసిందిగా నమ్మించడానికి కావాలనే రాసినట్టు అర్థమైంది. హాల్లోని స్మార్ట్ హోమ్ లైటింగ్ సిస్టమ్ డేటాను ఫోరెన్సిక్ టీమ్ పరిశీలించింది. లైట్లు స్విచ్ బోర్డు నుండి కాకుండా, మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ అయినట్లు గుర్తించింది.అభిమన్యు అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి. ‘లైట్లు పోయిన ఆ ఐదు నిమిషాలు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు?’ అని అడిగాడు.మిత్రా తాను స్విచ్ బోర్డు వైపు వెళ్లానని చెప్పాడు. చేతన్ తను అక్కడే వున్నానని చెప్పాడు. లైట్లు ఆఫ్‌లో ఉండటం వాళ్ళ సీసీ కెమెరాలు పని చేయలేదు.అందరి మొహాల్లో టెన్షన్– పోలీసులు సంకెళ్లతో సిద్ధంగా ఉన్నారు. బయట మీడియా హడావుడి. .∙∙ అక్కడ అంతా నిశ్శబ్దం. అభిమన్యు పోలీసుల వైపు చూశాడు.‘మిస్టర్ మిత్రా! పదండి’ అన్నాడు.‘ఎందుకు? మిత్రా అడిగాడు.‘నమితను హత్యకు కారణమైనందుకు’, అని చేతన్ వైపు తిరిగి ‘మిస్టర్ చేతన్! మీరు కూడా... నమితను కత్తితో పొడిచి చంపినందుకు’ అన్నాడు.మిత్రాను, చేతన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.∙∙ మీడియా చుట్టుముట్టింది.‘హత్య జరిగి గంట గడవక ముందే వీళ్ళే హంతకులని ఎలా తెలుసుకున్నారు?’ మీడియా అడిగింది.మిత్రా తాను స్విచ్ బోర్డు వైపు వెళ్లానని అబద్ధం చెప్పాడు. కానీ ఫోన్లో యాప్ లాగ్స్‌లో అసలు నిజం బయటపడింది.అతడి కుడిచేతికి ఫ్రాక్చరై బెల్ట్ ఉంది. ఎడమచేత్తో అంత బలంగా పొడవడం సాధ్యం కాదు. అప్పుడే సందేహం వచ్చింది. లైట్లను ఆర్పింది మిత్రా... నమితను చంపే ప్రయత్నంలో నమిత గట్టిగా గోళ్లతో గీరింది. చేతన్ కుడి చేతి మణికట్టుపై ఉన్న గాయం, ఆ గోళ్ల ముక్కల్లో ఉన్న చర్మం మ్యాచ్ అయ్యాయి. అతను వేసుకున్న దెయ్యం కాస్ట్యూమ్‌పై నమిత రక్తం చిందింది. వాటిని విల్లా వెనుక డస్ట్ బిన్ లో దాచాడు. దాన్ని నా టీమ్ స్వాధీనం చేసుకుంది’ చెప్పాడు అభిమన్యు.‘హాలోవీన్‌లో కనిపించే ఆత్మల కన్నా మన కళ్ళ ముందు స్వార్థం, ద్వేషంతో ఘోరాలు, నేరాలు చేసే మనుష్యులే అసలైన ప్రేతాత్మలు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి’ చెప్పి ముందుకు కదిలాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.- శ్రీసుధామయిఇవీ చదవండి: ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి? -
ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి?
అది 1990వ దశకం... అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలోని చిన్న పట్టణం థావోస్. అర్ధరాత్రి దాటింది. పట్టణమంతా ప్రశాంతంగా ఉంది. అంతలో ఒక్కసారిగా మంచంపై నుంచి లేచి కూర్చున్నాడు 52 ఏళ్ల మైకేల్. చెవులను చేతులతో నొక్కుకుంటూ చిరాకుగా కిటికీ బయటకు చూశాడు.‘ఎక్కడో డీజిల్ ఇంజిన్ నడుస్తున్నట్లుంది... ఆపరా బాబోయ్’ అంటూ విసుక్కున్నాడు.పక్కనే నిద్రిస్తున్న అతడి భార్య సారా కళ్లు తెరిచి ఏమైందని అడిగింది... ‘ఏంటా గోల? ఎక్కడి నుంచి వస్తోందది’ అని చిరాకుగా అడిగాడు. ‘నాకేం వినిపించడంలేదే. కల ఏమైనా వచ్చిందా?’ అని సారా అడిగే సరికి మైకేల్ కళ్లు నులుముకున్నాడు. అతడికి చెవుల్లో ఆ శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇంట్లో ఎలాంటి యంత్రం లేదు. బయట రోడ్డు మీద వాహనాలూ లేవు. కానీ అతడి చెవుల్లో మాత్రం ఒకే శబ్దం...‘హ్మ్...’ అది దగ్గరగా ఉన్నట్లూ కాదు, చాలా దూరంలో ఉన్నట్లూ కాదు– వినిపిస్తుంది, అంతలోనే మాయమైపోతుంది. చెవులు మూసుకున్నా వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఆ రాత్రి అతడికి నిద్ర లేదు. మరుసటి రోజు పక్కింటి వాళ్లను అదే విషయం గురించి అడిగాడు. ‘ఏ శబ్దం? మాకేమీ వినిపించలేదు’ అని చెప్పడంతో మైకేల్ అయోమయానికి గురయ్యాడు.క్రమంగా ఆ శబ్దం గురించి చెబుతున్న వారి సంఖ్య పెరిగింది. ‘రాత్రిళ్లు ఓ వింత శబ్దం వినిపిస్తోంది. ఎక్కడి నుంచి వస్తోందో అర్థం కావడం లేదు. రోజంతా ఉండదు కానీ, రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది’ అంటూ వారంతా ఒకే విధంగా వర్ణించారు. అది దూరంలో డీజిల్ ట్రక్కు ఇంజిన్ నడుస్తున్నట్లు; భారీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మోగుతున్నట్లు; ఒక పెద్ద ఈగ చెవి దగ్గర నిరంతరం రొద పెడుతున్నట్లు గంభీరమైన ‘హ్మ్...’ అనే ధ్వనిలా ఉంటుందని చెప్పారు.అయితే, అదే ప్రాంతంలో నివసిస్తున్న చాలా మందికి ఆ శబ్దం అసలు వినిపించకపోవడం; కొందరికే అది తెలుస్తుండటం వింతగా అనిపించింది. ఒకే ఇంట్లో భార్యాభర్తల్లో ఒకరికి వినిపిస్తే, మరొకరికి అసలు వినిపించకపోవడం సాధారణమైపోయింది. కొంతమంది చెవులు మూసుకున్నా వినిపిస్తోందని చెబితే, ఇంకొందరు అది తమ తలలోనే ప్రతిధ్వనిస్తున్నట్లుగా అనిపిస్తోందన్నారు.మొదట్లో చిన్న అసౌకర్యంగా భావించిన ఈ హమ్... క్రమంగా చాలామందిని మానసికంగా వేధించడం ప్రారంభించింది. రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు; పగలు పనిపై దృష్టి నిలిచేది కాదు. తలనొప్పి, చిరాకు, ఒత్తిడి వెంటాడేవి. ఈ బాధ పడలేక కొందరు వేరే ఊరికి వెళ్లిపోయారు కూడా. మరికొందరు వైద్యులను ఆశ్రయించారు. కానీ పరీక్షల్లో పెద్దగా సమస్యలు కనిపించలేదు.ఈ శబ్దం గురించి ఫిర్యాదులు పెరగడంతో 1993లో అమెరికా అధికారులు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వినికిడి నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం విద్యుత్ లైన్లు, ఫ్యాక్టరీలు, భూకంప ప్రకంపనలు, రేడియో తరంగాలు, సైనిక స్థావరాలు– అన్నింటినీ పరిశీలించింది. కానీ ఆ శబ్దానికి కచ్చితమైన మూలం మాత్రం దొరకలేదు. పట్టణమంతటా అత్యంత సున్నితమైన, అత్యాధునిక అకోస్టిక్ రికార్డర్లను, వైబ్రేషన్ డిటెక్టర్లను అమర్చారు. కానీ ఏ ఒక్క డిజిటల్ మెషిన్ కూడా ఆ శబ్దాన్ని కచ్చితంగా రికార్డు చేయలేకపోయింది.ఈ హమ్పై ఎన్నో సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. దూరంలోని పరిశ్రమల యంత్రాల శబ్దమని కొందరు చెప్పారు. భూమి లోపల జరిగే సూక్ష్మ ప్రకంపనలేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. మనిషి వినలేని అత్యల్ప ఫ్రీక్వెన్సీ శబ్దాలు కారణమై ఉండవచ్చని అనుకున్నారు. చెవులకు సంబంధించిన టిన్నిటస్ అనే వైద్య సమస్యతో ముడిపడి ఉండవచ్చని కొందరు భావించారు. అయితే ఈ వివరణల్లో ఏదీ అందరికీ సరిపోయేలా రుజువు కాలేదు.శాస్త్రవేత్తలకు సమాధానం దొరకకపోవడంతో ఊహాగానాలు మరింత పెరిగిపోయాయి. ఇది అమెరికా సైన్యం రహస్య ప్రయోగాల ప్రభావమని, భూగర్భంలో దాగి ఉన్న రహస్య కేంద్రాల నుంచే ఈ శబ్దం వస్తోందని, గ్రహాంతరవాసుల సంకేతాలేనని– ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ వాటిలో దేనికీ విశ్వసనీయమైన ఆధారాలు లభించలేదు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మూడు దశాబ్దాలు గడిచినా కొందరు థావోస్ నివాసితులు ఇప్పటికీ అదే హమ్ వినిపిస్తోందని చెబుతున్నారు. మరికొందరికి మాత్రం అసలు అలాంటి శబ్దం ఎప్పుడూ వినిపించలేదు. అంటే, శబ్దం నిజంగానే ఉందా? లేక కొందరు మాత్రమే గ్రహించే సహజ ధ్వనా? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.ప్రపంచం ఎన్నో మిస్టరీలను ఛేదించింది. సముద్రపు అడుగున ఏముందో తెలుసుకుంది. అంతరిక్షంలో కోట్ల కిలోమీటర్ల దూరంలోని గ్రహాల చిత్రాలు తీసింది. కానీ అమెరికాలోని ఒక చిన్న పట్టణంలో కొందరి చెవుల్లో మాత్రమే వినిపించే ఆ ‘హ్మ్...’ అనే శబ్దం వెనుక రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయింది. అందుకే, థావోస్ హమ్ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన, అంతుచిక్కని రహస్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది.- సత్యకిశోర్ కొండ్రెడ్డిఇవి కూడా చదవండి: అంతరిక్షంలో వరిపంట -
పాప్‌కార్న్ పేలేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? షాకింగ్ నిజాలు!
పాప్ కార్న్ ఎనీ టైమ్ స్నాక్.. సరదా కోసం ఎప్పుడు తినాలనిపించినా తింటుంటాం.. మరి పాప్ కార్న్కీ కొన్ని సరదా ముచ్చట్లున్నాయి. సరదాగా చదివేయండి.ఓల్డ్ మెయిడ్స్ – గింజలన్నీ పగిలి పాప్‌కార్న్ అయినా, గిన్నె అడుగున కొన్ని విత్తనాలు అలాగే ఉండిపోతాయి చూశారా? వాటికి అధికారికంగా ఒక పేరుంది... అదే ‘ఓల్డ్ మెయిడ్స్’! గింజ లోపల తగినంత తేమ లేకపోవడం వల్ల ఇవి పేలలేవు. పాప్‌కార్న్ బయట నుంచి ఎండిపోయినట్లు కనిపించినప్పటికీ, దాని లోపల దాదాపు 13% నుంచి 15% వరకు తేమ ఉంటుంది. గింజను వేడి చేసినప్పుడు, లోపల ఉన్న నీరు ఆవిరిగా మారడం ప్రారంభించి పాప్ కార్న్‌గా పనిచేస్తుంది.ఒక చిన్న పాప్‌కార్న్ గింజ పేలినప్పుడు గాలిలోకి ఏకంగా 3 అడుగుల (సుమారు 1 మీటరు) ఎత్తు వరకు ఎగురుతుంది. దాని పరిమాణంతో పోలిస్తే, ఇది ఒలింపిక్ హై జంపర్ కంటే ఎత్తుకు ఎగిరినట్లే!పాప్‌కార్న్ పేలినపుడు ఏర్పడే రూపాలను బట్టి రెండు రకాలుగా విభజిస్తారు. బటర్ ఫ్లై ఆకారం– ఇవి బటర్‌ఫ్లై రెక్కల ఆకారంలో ఉంటాయి. వీటిని ఎక్కువగా థియేటర్లలో ఉపయోగిస్తారు. మష్రూమ్ ఆకారం– గుండ్రంగా, పుట్టగొడుగులా ఉండే ఆకారం. కెరమెల్ పాప్‌కార్న్ తయారీలో విరిగిపోకుండా ఉండేందుకు వీటిని వాడతారు.1920ల కాలంలో సినిమా థియేటర్ల యజమానులు పాప్‌కార్న్‌ను నిషేధించారు. కారణం... థియేటర్లు చాలా రిచ్‌గా కనిపించాలని, పైగా జనాలు నమిలే శబ్దం వల్ల సినిమాల్లోని సంభాషణలు వినపడవని భయపడ్డారు. కానీ ఆర్థిక మాంద్యం వచ్చాక, ఇది చాలా చవకైన వ్యాపారమని మళ్లీ ప్రవేశపెట్టారు.పూర్వం అమెరికాలోని ఆదివాసీలు మొక్కజొన్న కంకులను నేరుగా వేడి ఇసుకలో లేదా మంటల్లో వేసి, అవి పేలి బయటకు ఎగురుతున్నప్పుడు పట్టుకునేవారు.పాప్‌కార్న్ పేలినపుడు వచ్చే శబ్దం విత్తనం పొర పగలడం వల్ల రాదు. లోపల ఉన్న నీటి ఆవిరి ఒక్కసారిగా సూపర్సోనిక్ స్పీడ్‌తో బయటకు వచ్చి, పిండి పదార్థాన్ని విడదీసినప్పుడు వచ్చే చిన్న స్థాయి ‘ధ్వని విస్ఫోటనం’ అది!ఇవి కూడా చదవండి: ఆఫీస్ వర్క్‌లో ఫోకస్ పెరగాలంటే.. ఈ చిన్న బ్రేక్ తప్పనిసరి! -
నిచ్చెన ఎక్కేప్పుడు కాళ్లు ఎందుకు వణుకుతాయి?
పిల్లలూ... మనలో చాలా మందికి నిచ్చెన ఎక్కుతున్నప్పుడో లేదా ఎతై ్తన మేడ మీద నిలబడినప్పుడో కాళ్లు లైట్‌గా వణకడం, లోపల ఏదో తెలియని భయం కలగడం జరుగుతుంది కదా! దీనికి కారణం మన మెదడు మనల్ని కాపాడటానికి చేసే ఒక సైంటిఫిక్ మ్యాజిక్!మనం భూమి మీద నడుస్తున్నప్పుడు మన కళ్లు, మన చెవి లోపల ఉండే ఒక ప్రత్యేక ద్రవం (Vestibular System), కాళ్ల కండరాలు కలిసి బాడీని బ్యాలెన్స్ చేస్తాయి. కానీ నిచ్చెన ఎక్కినప్పుడు కళ్లు స్థిరమైన భూమిని చూడలేవు. దాంతో కళ్లకు, కాళ్లకు అందే సిగ్నల్స్ మ్యాచ్ కాక మెదడు కాస్త కన్ఫ్యూజ్ అవుతుంది.మనం ఎత్తుకు వెళ్లగానే ‘ఎక్కడ కింద పడిపోతామో’ అని మెదడులోని రక్షణ వ్యవస్థ అలర్ట్ అవుతుంది. వెంటనే బాడీలోకి ‘అడ్రినలిన్’ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో మనల్ని పారిపోవడానికి లేదా పోరాడటానికి సిద్ధం చేస్తుంది. ఈ హార్మోన్ ఒక్కసారిగా విడుదల కావడం వల్లే కాళ్లలో వణుకు వస్తుంది.నిచ్చెన ఎక్కేటప్పుడు కిందకు చూడకుండా, కేవలం పైనున్న మెట్లను మాత్రమే చూడాలి. నిచ్చెనను రెండు చేతులతో బలంగా పట్టుకుని, నెమ్మదిగా శ్వాస తీసుకుంటే మెదడు ప్రశాంతపడి వణుకు తగ్గిపోతుంది!ఇవీ చదవండి: వరి పొలంలో 3డీ ఆర్ట్.. రైతుల సూపర్ క్రియేటివిటీ! -
వరి పొలంలో 3డీ ఆర్ట్.. రైతుల సూపర్ క్రియేటివిటీ!
మీరు పేపర్ మీద బొమ్మ వేస్తారు కదా? మరి వరి పొలంలోనే బొమ్మ వేస్తే? ఇది చైనాలో వరిపొలం. అక్కడ రైతులు వరి మొక్కలతోనే పెద్ద పెద్ద బొమ్మలు వేస్తారు. దీన్ని ‘ప్యాడీ ఆర్ట్’ లేదా ’టాన్బో ఆర్ట్’ అంటారు. అసలు ఈ ఆర్ట్ జపాన్ లో మొదలైంది, ఇప్పుడు చైనాలో సూపర్ ఫేమస్.ఈ ఫోటోలోని అమ్మాయి జుట్టు, చీర, వాయిద్యం అన్నీ వరి మొక్కలే! కింద నుంచి చూస్తే పొలం మామూలుగా ఉంటుంది. టవర్ మీద జనం ఎక్కి చూస్తేనే బొమ్మ కనిపిస్తుంది. అందుకే దీన్ని 3డి పెయింటింగ్ అంటారు.రంగు ఎలా వస్తుంది? మనకు తెల్ల బియ్యం ఉన్నట్టే, నల్ల బియ్యం, ఎర్ర బియ్యం, ఊదా బియ్యం కూడా ఉంటాయి. వాటి ఆకులు కూడా అదే రంగులో ఉంటాయి. ఆకుల్లో ‘ఆంథోసైనిన్’ అనే సహజ రంగు ఉంటుంది. రైతు ఏ చోట ఏ రంగు కావాలో, ఆ చోట ఆ రంగు విత్తనం నాటుతాడు. మొక్కలు పెరిగేకొద్దీ బొమ్మ పెద్దదవుతుంది!ఈ ఆర్ట్ చైనాలో షెన్యాంగ్ నగరంలో చాలా ఫేమస్. అక్కడ ‘రైస్ డ్రీమ్ పార్క్’ అనే పెద్ద పార్క్ ఉంది. అక్కడి రైతులు ప్రతి ఏడాది 13 హెక్టార్లలో 17 పెద్ద బొమ్మలు వేస్తారు. మొక్కల ఎత్తును కూడా కంట్రోల్ చేసి 3డి ఎఫెక్ట్ తెస్తారు. రైతు అంటే అన్నం పండించేవాడే కాదు, ఆర్టిస్ట్ కూడా! మనం కూడా మన పొలంలో బతుకమ్మ బొమ్మ వేయొచ్చు కదా!- నిర్వహణ: కెఇవీ చదవండి: గుర్రం కోపంగా లేదు.. అది భయం! 12 ఏళ్లలోనే అలెగ్జాండర్ సాహసం! -
గుర్రం కోపంగా లేదు.. అది భయం! 12 ఏళ్లలోనే అలెగ్జాండర్ సాహసం!
అలెగ్జాండర్‌కు 12 ఏళ్ల వయసు ఉండగా అతని తండ్రి ఫిలిప్ దర్బారుకు ఒక వ్యాపారి చాలా అందమైన, బలమైన గుర్రాన్ని అమ్మడానికి తెచ్చాడు. దాని పేరు ‘బుసిఫాలస్’. కాని ఆ గుర్రం ఎంత కోపంగా ఉందంటే దాన్ని లొంగదీసుకోవడానికి దర్బారులోని పెద్ద పెద్ద వీరులు, సైనికులు వచ్చినా అది ఎవరినీ దరి చేరనివ్వకుండా వెనక కాళ్లతో తంతూ భీభత్సం సృష్టించింది. దాంతో రాజు ఫిలిప్ విసిగిపోయి ‘ఇది ఎవరికీ లొంగదు, దీన్ని అవతలికి తీసుకెళ్లండి‘ అన్నాడు.అప్పుడు అలెగ్జాండర్ ముందుకు వచ్చి, ‘నాన్న! నేను దీన్ని లొంగదీస్తాను’ అన్నాడు. అందరూ ఆ చిన్న పిల్లోడిని చూసి నవ్వారు. కానీ అలెగ్జాండర్ అందరిలా గుర్రాన్ని కొట్టలేదు. గుర్రం తన స్వంత నీడ కదలడం చూసి భయపడుతోందని గ్రహించాడు. వెంటనే అతను గుర్రం ముఖాన్ని సూర్యుడి వైపు తి΄్పాడు. దాంతో గుర్రానికి తన నీడ కనిపించకుండా పోయింది.అలెగ్జాండర్ మెల్లగా దాని వీపు నిమిరి, ఒక్క ఉదుటున దానిపైకి ఎక్కాడు. అంతే! అంతవరకు భయంకరంగా ప్రవర్తించిన గుర్రం అలెగ్జాండర్ చేతిలో చాలా శాంతంగా మారిపోయింది. ఆ బుసిఫాలస్ గుర్రమే అలెగ్జాండర్ చివరి యుద్ధం వరకు అతని ్రపాణ స్నేహితుడిగా నిలిచింది. సమస్య ఎంత పెద్దదైనా, భయపడకుండా దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తిస్తే విజయం మనదేనని ఈ బాల్య ఘట్టం మనకు నేర్పుతుంది!ఇవి కూడా చదవండి: ‘రావే చెలీ’... పాట మైకంలో చెవిటిదైపోయే పక్షి.. ఎక్కడుందో తెలుసా? -
‘రావే చెలీ’... పాట మైకంలో చెవిటిదైపోయే పక్షి.. ఎక్కడుందో తెలుసా?
పిల్లలూ... ఈ ఫోటోలో ఉన్న పక్షి పేరు ‘వుడ్ గ్రౌస్’ (Wood Grouse). యూరప్ అడవుల్లో ఉండే ఒక రకమైన అడవి కోడి ఇది. సాధారణంగా పక్షులు భయం వేస్తే పారిపోతాయి కదా, కానీ దీనికి కోపం వస్తే మనుషులపైనే దాడి చేస్తుంది! ముఖ్యంగా ఆడకోళ్లను ఆకర్షించడానికి ఇది చేసే హడావిడి అంతా ఇంతా కాదు.అడవిలో ఒక ఎత్తైన చెట్టు కొమ్మ మీదో, నేల మీదో కూర్చుని ‘రావే చెలీ’ అంటూ ప్రేమ పాటలు లంఘించుకుంటుంది. అయితే ఇది పాట పాడుతున్నప్పుడు చేసే ఒక రకమైన పెద్ద శబ్దం వల్ల దాని చెవి లోపల ఉన్న ఒక చిన్న కండరం గట్టిగా మూసుకుపోతుంది. అంటే ఆ పాట పాడే చివరి 3 నుండి 4 సెకన్ల పాటు పూర్తిగా తాత్కాలిక చెవిటిదైపోతుంది.పాట మైకంలో పడి, తనకు తానుగా చెవిటిదైపోయే ఈ చిన్న బలహీనతను కనిపెట్టిన వేటగాళ్లు ఆ కొన్ని సెకన్లలోనే దీనికి దగ్గరగా వెళ్లి వేటాడుతుంటారు. పాపం కదూ! ప్రకృతి ఈ పక్షికి ఎంతటి అద్భుతమైన గాత్రాన్ని ఇచ్చిందో, అంతే వింతైన అమాయకత్వాన్ని కూడా ఇచ్చింది.ఇవి చదవండి: చక్కెర ధరలు పెరిగినా.. తీపి తగ్గొద్దు! -
నేపాల్‌ను ముంచిన బురద సునామీ!
పిల్లలూ... ఆగస్టు 26 ఉదయం నేపాల్ సరిహద్దుల్లో ఒక భయంకరమైన ప్రకృతి వింత జరిగింది. హిమాలయ పర్వతాల పైన ఉండే భారీ ఐస్ గ్లేసియర్ (మంచు కొండ) ముక్కలై కింద పడింది! భూమి వేడెక్కడం వల్ల ‘లాంగ్తాంగ్ లిరుంగ్’ అనే ఎత్తైన కొండ దగ్గర ఉన్న మంచు పర్వతం బలహీనపడి, ఒక్కసారిగా విరిగిపోయి వందల మీటర్ల కింద ఉన్న లెండే ఖోలా నదిలోకి కూలిపోయింది.అంత పెద్ద మంచు కొండ కింద పడేసరికి వచ్చిన ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత ఉన్న భూకంపం లాగా రికార్డయ్యాయి. దాంతో ప్రజలంతా భూకంపం వచ్చిందేమో అనుకుని ఇళ్లలోనే ఉండిపోయారు, కానీ పైనుంచి ప్రమాదం వస్తోందని ఊహించలేకపోయారు.వేల అడుగుల ఎత్తు నుంచి అంత పెద్ద మంచు కొండ కింద పడటంతో పుట్టిన ఘర్షణ వేడికి ఆ మంచు ముక్కలన్నీ క్షణాల్లో కరిగిపోయి నీళ్లలా మారాయి. ఆ నీరు పర్వతం మీది నుంచి కిందికి వస్తున్నప్పుడు దారిలో ఉన్న మట్టి, ఇసుక, పెద్ద పెద్ద బండరాళ్లను కూడా తనతో పాటు లాక్కొచ్చేసింది. దాంతో నదిలోని నీళ్లు మనం ఇళ్లు కట్టేటప్పుడు సిమెంట్, ఇసుక కలిపిన ‘లిక్విడ్ కాంక్రీట్‘ లాంటి భయంకరమైన బురద ప్రవాహంగా మారిపోయాయి.ఈ బురద ప్రవాహం చాలా బరువైంది, వేగమైంది. ఇది నదిలోకి దూసుకొచ్చిన కేవలం 30 నిమిషాల్లోనే నది నీటి మట్టం 30 అడుగుల పైకి లేచింది. పైగా ఇలాంటి మంచు కొండలు ఎప్పుడు విరిగిపడతాయో ముందుగా ఊహించడం శాస్త్రవేత్తలకు కూడా చాలా కష్టం. దాంతో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకపోవడం, బురద విపరీతమైన వేగంతో రావడం వల్ల జనం ప్రాణాలు కాపాడుకునే సమయం లేకుండా పోయింది. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ ’మంచు సునామీ’ మనకు నేర్పుతోంది!ఇవీ చదవండి: నేపాల్‌లో ఆగని మృత్యుఘోష -
చెత్త ఇస్తే చదువు.. ఈ స్కూల్ ఐడియా అదిరిపోయింది!
ప్లాస్టిక్ చెత్తను పారేయకుండా.. దానితోనే పిల్లలకు ఉచితంగా చదువు చెప్తోంది అస్సాంలోని ఒక పాఠశాల. మనం పడేసే ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ బాటిళ్లే ఇక్కడ పిల్లలకు ‘స్కూల్ ఫీజు’! పిల్లలకు విజ్ఞానాన్ని పంచడంతో పాటు పర్యావరణ హితమే ప్రధాన ధ్యేయంగా సాగుతున్న ఈ పాఠశాల అందరిచే ప్రశంసలు పొందుతోంది.అస్సాంలోని పమోహి గ్రామంలో పేదరికం తాండవించేది. చాలా కుటుంబాలు రాతి గుహల్లో పని చేస్తూ జీవనం సాగించేవి. డబ్బు లేక పిల్లలు బడి మానేసి పనుల్లోకి వెళ్లేవారు. మరోవైపు గ్రామంలో తీవ్ర ప్లాస్టిక్ సమస్య ఉండేది. చలికాలంలో వెచ్చదనం కోసం గ్రామీణులు ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెట్టేవారు. ఆ విషపూరిత పొగ కారణంగా పాఠశాలలో పిల్లలు తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు.అలా ఈ రెండు సమస్యలకు పరిష్కారం దిశగా మజిన్ ముఖ్తార్, ఆయన భార్య పర్సిత శర్మ కలసి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టారు. 2016లో కేవలం 20 మంది పిల్లలతో ‘అక్షర్’పాఠశాలను ్రపారంభించారు. డబ్బులకు బదులుగా ప్లాస్టిక్ వ్యర్థాలనే ఫీజుగా నిర్ణయించారు. దీనికి తోడు ప్రతి కుటుంబం ప్లాస్టిక్ తగలబెట్టబోమని ప్రతిజ్ఞ కూడా చేసేలా ఒప్పించారు.ప్లాస్టిక్‌ని ఏం చేస్తారు?పాఠశాలలో ప్రతి విద్యార్థి వారానికి కనీసం 25 ప్లాస్టిక్ ముక్కలను ఫీజుగా తీసుకురావాలి. అలా ΄ోగుచేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ‘ఇకో బ్రిక్స్’ కి రూపకల్పన చేస్తున్నారు. వీటితో స్కూల్ ఆవరణలో నడిచే దారులు, బెంచీలు, పూల కుండీలు నిర్మించారు. స్కిల్ డెవలప్మెంట్ కూడా!ఈ స్కూల్లోని విద్యార్థులకు చదువుతో పాటు కార్పెంట్రీ, ఎలక్ట్రానిక్స్, సోలార్ ΄్యానెల్ ఇన్సా›్టలేషన్, ప్రథమ చికిత్స వంటి ్రపాక్టికల్ విద్యను కూడా నేర్పిస్తారు. కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో ఈ స్కూల్ విద్యార్థులు సామాజిక కార్యకర్తలుగా మారి గువాహటి పరిసర ్రపాంతాల్లోని దాదాపు 15,000 మందికి నిత్యావసర సరుకులు అందించారు. ఒకప్పుడు పాఠశాల మెట్లు ఎక్కలేని ఎంతోమంది పేద పిల్లలు నేడు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ ఒక్క స్కూల్‌తో ్రపారంభమయిన ఈ పర్యావరణ పరిరక్షణ నేడు ఆ చుట్టు పక్కల ఉన్న పాఠశాలల్లోకి కూడా విస్తరించింది. ఉపాధిని, చదువును, పర్యావరణ పరిరక్షణను ఒకే తాటిపైకి తెచ్చిన అక్షర్ స్కూల్ విద్యా వ్యవస్థకే ఒక కొత్త దిశానిర్దేశం చేస్తోంది.ఇవీ చదవండి: డిగ్రీ కాదు.. స్కిల్స్ ఉంటే చాలు! ఈ రాష్ట్రం టాప్‌లో! -
ఆ అక్కా తమ్ముళ్లది విమాన బంధం..! ఇద్దరూ..
రాఖీ పూర్ణిమ సందర్భంగా కొన్ని బంధాలు నిజంగా ఆశ్చర్యం కలిగించేలా ఎలా స్ఫూర్తిగా ఉంటాయో తెలుసా..!. అందుకు ఈ ఇద్దరు తోబుట్టువులే ఉదాహరణ. ఔను మీరు వింటుంది నిజమే. ఒకే ఇంట్లోని ఏ తోబుట్టువులు కూడా ఒకే రంగంలో కొనసాగడం అనేది అత్యంత అరుదు. ఒకవేళ కొనసాగినా..సహోద్యోగులగా ఉండటం అనేది..చాలా వృత్తిల్లో సాధ్యం కాదు. కానీ ఈ అక్కా తమ్ముళ్లు ఒకే వృత్తిని ఎంచుకోవడమే కాదు..ఒకో చోట కొలిగ్స్‌గా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అలా అని ఇద్దరికీ పెద్ద ఏజ్ గ్యాప్ ఉండదనుకుంటే పొరపాటే.ఆ తోబుట్టువులే మణిపూర్‌కి చెందిన వాహెంగ్‌బామ్ సురేయా, రోహిత్ సింగ్‌లు. వారిద్దరికి విమానయానం ఉద్యోగానికి మించి అని చెప్పొచ్చు. ఇంఫాల్‌లో ఎనిమిదేళ్ల వయసు తేడాతో పెరిగిన ఇద్దరూ..ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ సభ్యులు. ఇద్దరికి ఒకే రకమైన కఠినమైన షెడ్యూళ్లు, ఒకే చోట వేచి ఉండటం తదితరాలన్ని ఎదుర్కొంటుంటారు. అయితే వారి కుటుంబంలో విమానయాన రంగంలోకి ప్రవేశించిన తొలి వ్యక్తి సురేయా కాగా, ఆమె తమ్ముడు కూడా ఆమె బాటలో పయనించి ఈ వృత్తిని ఎంచుకోవడం విశేషం. అక్క సురేయా 2014లో విమానయాన జర్నీని ప్రారంభించింది. అయితే అక్క డ్యూటీ నుంచి తిరిగి వచ్చాక రోహిత్‌కి వివిధ ప్రాంతాలు, ఆ వృత్తి విధివిధానాల గురించి ఆమె కథలు కథలుగా చెప్పేది. ఆమె అనుభవాలు వింటూ పెరిగిన రోహిత్‌కి తెలియకుండానే ఆ వృత్తిపై అమితంగా ఆసక్తి పెరిగిపోయింది. అలా చివరికి కొన్నేళ్ల తర్వాత అక్క మాదిరిగానే ఎయిర్ ఇండియాలో చేరి తన చిన్న నాటి కలను వృత్తిగా మార్చుకుఉన్నాడు. అన్నింట్లకంటే విశేషం ఏంటంటే ఒకే ఎయిర్‌లైన్ పనిచేయడంతో వారి బంధం మరింత స్ట్రాంగ్‌గా మారింది. ఎంత బిజీ షెడ్యూళ్లు ఉన్నా ఒకరినొకరు సులభంగా అర్థ చేసుకుంటుంటారు. అలాగే ఒకరికొకరు తమ అనుభవాలను పంచుకుంటుంటామని చెబుతున్నారు. అయితే ఈ వృత్తి కారణంగా తోబుట్టువుల నుంచి సహోద్యోగులుగా కూడా మారామని నవ్వుతూ చెబుతుంటారు ఇద్దరూ. అలా తామిద్దరి లైఫ్‌స్టైల్ ఒకటే కాబట్టి ప్రతీది పూర్తిగా వివరించకుండానే..అవతల వాళ్ల బిజీని అర్థం చేసుకుంటామని అంటున్నారు. అలాగే తాము విరామ సమయాల్లో కలిసి గడుపుతామని, అది మాకు ఇంట్లో ఉన్న అనుభూతిని ఇస్తుందంటున్నారు. అంతేగాదు మాకు ఎయిర్ ఇండియా క్యాబ్ కేటాయించినప్పుడూ మా ఇద్దరి అడ్రస్ ఒకటే కావడంతో క్యాబ్ డ్రైవర్ ఎయిర్ ఇండియా ఫ్యామిలీ ప్యాకేజీలను ఎప్పుడు అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది అని జోక్ చేస్తుంటాడని చెబుతున్నారు. ఒక్కోసారి తన తమ్ముడు రోహిత్‌కి డ్యూటీ లేకపోతే తనకోసం వేడివేడిగా భోజనం తీసుకొస్తాడని, అది నాకు ఇంట్లో ఉన్న అనుభూతిని అందిస్తుందని చెబుతోంది సురేయా. ఇక తమ్ముడు రోహిత్ తన అక్క శ్రద్ధ , దయను ప్రశంసిస్తూ..క్యాబిన్ సిబ్బందిగా ఆమె ఆత్మవిశ్వాసం, వృత్తి నైపుణ్యం, ప్రవర్తించే తీరుకి తాను సదా అభిమానిని అంటున్నాడు. నిజంగా ఇలాంటి అదృష్టం ఎందరి సోదర సోదరీమణులకు దక్కుతుంది చెప్పండి. (చదవండి: హమ్మయ్యా ఎట్టకేలకు గంగానదిలో స్నానమాచరించా..! వీడియో వైరల్) -
హమ్మయ్యా ఎట్టకేలకు గంగానదిలో స్నానమాచరించా..! వీడియో వైరల్
భారతీయ సంస్కృతి, ఇక్కడ ఆచార వ్యవహారాలు ఎందరో విదేశీయులను ఆకర్షించాయి. దాంతో ఈ గడ్డపైనే ఉండిపోవాలని నిర్ణయించుకుని మరి స్థిరపడినవారు కూడా ఉన్నారు. కానీ ఈ జపాన్ అమ్మాయి ఆధ్యాత్మిక అనుభూతి కోసం ఏం చేసిందో తెలిస్తే విస్తుపోతారు. జపాన్ కంటెంట్ క్రియేటర్ మాయో జపాన్ ఇటీవల భారతదేశ పర్యటనలో భాగంగా హరిద్వార్‌లోని గంగా ఘాట్ వద్ద ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందింది. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ వీడియోలో ఆమె సంప్రదాయ దుస్తులు ధరించి కెమెరా వైపు చూస్తూ..జీవితంలో మొదటిసారి గంగాస్నానం చేస్తున్నాని చెప్పింది. ఆ తర్వాత నదిలో ఏర్పాటు చేసిన భద్రతా గొలుసులు పట్టుకుని నీటిలో మునిగి స్నానం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. నదీప్రవాహానికి కొట్టుకుపోకుండా గట్టిగా గొలుసులు పట్టుకుని కనిపిస్తుంది వీడియోలో. ఆ తర్వాత ఆమె స్నానం సరిపోతుందా అని అక్కడే ఉన్న స్థానికుడిని అడుగుతుంది కూడా. మొత్తం మూడుసార్లు హిందూ భక్తుల మునిగినట్లుగానే మునిగి స్నానం చేస్తుందామె. ఒక అపరిచితుడి సాయంతో ఈ వీడియోని తీయగలిగానని, ఆయన చాలా అద్భుతంగా తీశారని ప్రశంసించిందామె. చివరగా ఆమె బాగా స్నానం చేశాను, చాలా సంతోషంగా ఉంది. అని అన్నారామె. అయితే ఆమెకు హిందీ ఎలా వచ్చు అని సందేహించకండి. ఎందుకంటే..ఆమె హిందీ, భారతీయ సంస్కృతులపై 13 ఏళ్లకు పైగా అధ్యయనం చేసి, ఎట్టకేలకు గంగా నదిలో పవిత్ర స్నానం చేసి, చాలా మంచి అనుభూతి పొందింది. అంతేగాదు చివర్లో ఈ ఊహించని జీవిత ప్రయాణం అందించినందుకు భారత్‌కి సదా ధన్యావాదాలు అని పోస్ట్‌లో పేర్కొంది కూడా. నెటిజన్లు ఈ పుణ్యస్నానం తర్వాత నిజంగానే మీలో మంచి మార్పు వచ్చింది. ఇది గంగా నది అనుగ్రహం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Mayo Japan (@mayojapan) (చదవండి: గూగుల్‌లో రూ. 83 లక్షల వేతనం వదులుకుని..సేంద్రీయ వ్యవసాయం!) -
అక్కడ వినూత్నంగా రక్షాబంధన్..చెట్టుకు రాఖీ..!
రాఖీ పండుగకు సంబంధించిన పౌరాణిక గాథల్లో ఐక్యత కోసం, శత్రుత్వాన్ని మాపి రక్షగా మార్చుకునేందుకు ఈ పండుగను ఉపయోగిస్తే..ఇంకాస్త ముందడుగు వేసి పరిసరాలకు రక్షగా మార్చి పర్యావరణంపై ప్రేమను చాటుకుంటున్నారు అక్కడ స్టూడెంట్స్. వృక్షో రక్షతి రక్షితః అన్న మాటను సార్థకం చేసేలా పర్యావరణ పరిరక్షణ బాధ్యతను గుర్తుచేసేలా రక్షాబంధన్ వేడుకను కాస్తా ‘వృక్షాబంధన్‌గా’ జరుపుకుంటున్నారు హర్యానా, మఖండ్ గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థినులు. అక్కడ రాఖీ పూర్ణిమను పురస్కరించుకుని “ఏక్ రాఖీ పేడ్ కే నామ్” అనే ప్రచారం పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. అదే చెట్టుకు రాఖీ. అక్కడ మొత్తం 101 మంది విద్యార్థులు చెట్లకు రాఖీ కట్టి వాటి సంరక్షణను తామే చూసుకుంటామని ప్రతిజ్ఞ చేయడం విశేషం. ఈ పండుగలోని ‘రక్షణ’ సందేశాన్ని తెలియజేసేలా పర్యావరణ పరరక్షణకు అనుసంధానించి ఇలా వినూత్నంగా పండుగను జరుపుకున్నారు అక్కడ విద్యార్థినులు. ఇందుకు ఉపాధ్యాయులు, అక్కడ అధికారులు విద్యార్థినులను చైతన్యపర్చేలా ప్రోత్సహిస్తూ..ఆ కార్యక్రమంలో భాగమయ్యేలా చేశారు. ఇలాంటి కార్యక్రమాలే దేశవ్యాప్తంగా మరికొన్ని ఉన్నాయి అవేంటే ఈ సందర్భంగా చూద్దామా..!.ఇలాంటి "వృక్ష బంధన్" కార్యక్రమాలు కేవలం హర్యానాలోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా చేపట్టారు. వాటిలో కొన్ని..జార్ఖండ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం దాదాపు ఒక లక్షకు పైగా చెట్లకు రాఖీలు కట్టే భారీ ప్రచారాన్ని నిర్వహించారుమహారాష్ట్రలోని థానే పాఠశాల విద్యార్థులు పర్యావరణ అనుకూల రాఖీలను స్వయంగా తయారు చేసి చెట్లకు కట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో అక్కడ విద్యార్థులు దాదాపు 150 ఏళ్ల నాటి చారిత్రాత్మక మర్రిచెట్టుకు విత్తన రాఖీలు (Seed Rakhis) కట్టి తమ ప్రేమను చాటుకున్నారు.(చదవండి: చెఫ్ వికాస్ ఖన్నాకు రాఖీ కట్టిన రాధికా మర్చంట్) -
స్మార్ట్‌వాచ్‌కు మించిన ట్రాకర్.. ‘టెంపుల్’లో ఏముంది?
వేరబుల్స్ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి... స్మార్ట్ వాచ్, ఫిట్నెస్ బ్యాండ్, రింగ్.... మొదలైనవి. ‘టెంపుల్ రూపంలో కొత్త రకం వేరబుల్ రావాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు ‘జొమాటో’ ఫౌండర్ దీపీందర్ గోయల్.గత కొన్ని నెలలుగా గోయల్ ఈ ‘టెంపుల్’ గురించి ఊరిస్తున్నారు. దానిపై హైప్ సృష్టిస్తున్నారు. ‘త్వరలోనే టెంపుల్ భారతదేశంలో విడుదల కాబోతుంది’ అని ఆయన ప్రకటించారు.ఇంతకీ ఏమిటి ఈ టెంపుల్?దీపీందర్ గోయల్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రయోగాత్మక వెల్నెస్ వేరబుల్...టెంపుల్. అథ్లెట్ల కోసం రూపొందించిన ఒక హై–పెర్ఫార్మెన్స్ ట్రాకర్‌గా ‘టెంపుల్’ గురించి ప్రచారం చేస్తున్నారు. మెదడు, శరీర కార్యకాలపాలను పర్యవేక్షించడానికి దీన్ని రూపొందించారు. ప్రామాణిక ఫిట్నెస్ కొలమానాలకు మించి ఇది పనిచేస్తుందని చెబుతున్నారు. ప్రముఖ అథ్లెట్లలో కొందరు ‘టెంపుల్’ ధరించి కనిపిస్తున్నారు. తేలికైన డిజైన్‌తో ఉండే ఈ పరికరాన్ని కణతల ప్రాంతంలో నొప్పి లేకుండా ధరించవచ్చు.ఇవీ చదవండి: ఐఐటీ చదివి గూగుల్‌లో జాబ్ కొట్టాలనుకుంటే..ఏకంగా ఆ కంపెనీనే..! -
కార్లే లేవు.. నడక, సైక్లింగ్తోనే జీవనం! ఈ ప్రాంతం గురించి విన్నారా?
అమెరికా అంటేనే భారీ రహదారులు, కార్లు, ట్రాఫిక్ గుర్తుకొస్తాయి. కానీ అదే అమెరికాలో కార్లు లేకుండానే ప్రజలు హాయిగా జీవించే ఓ ఆధునిక ప్రాంతం ఉంది. నడక, సైక్లింగ్, ప్రజా రవాణాకే ప్రాధాన్యం ఇస్తూ.. ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రత్యేకంగా నిలిచిన ఈ ప్రాంతం ఇప్పుడు భవిష్యత్ నగరాలకు ఓ కొత్త నమూనాగా మారుతోంది. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది? అక్కడి ప్రత్యేకతలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం!అమెరికాలోని అరిజోనా రాష్ట్రం టెంపేలో ఉన్న కల్డెసాక్ (Culdesac) ప్రాంతం ఇప్పుడు వినూత్నమైన నగర నిర్మాణానికి ఉదాహరణగా నిలుస్తోంది. సాధారణంగా అమెరికా నగరాల్లో కార్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో పెద్ద రహదారులు, ట్రాఫిక్, కాలుష్యం, పార్కింగ్ కోసం భారీగా స్థలం అవసరమవుతుంది. అయితే కల్డెసాక్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. మొదటి నుంచే కార్ల రహిత ఆధునిక నివాస ప్రాంతంగా దీన్ని రూపొందించారు. ప్రజలు కార్లకు బదులుగా నడక, సైక్లింగ్, ప్రజా రవాణాను ఉపయోగించేలా ఇక్కడి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.కల్డెసాక్ వాతావరణం, నిర్మాణ శైలి కూడా ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇక్కడ రోడ్లపై కార్ల రద్దీ కనిపించదు. అందమైన భవనాలు, నడకదారులు, పూల మొక్కలు, అలంకరణ దీపాలతో ఆహ్లాదకరంగా కనిపించే ఈ ప్రాంతాన్ని చూసిన కొందరు పర్యాటకులు ‘ఇది అమెరికాలో ఉన్నట్టుగా అనిపించడం లేదు.. గ్రీస్‌లోని ఏదో ప్రాంతంలా ఉంది’ అని చెబుతుంటారు.సుమారు 17 ఎకరాల్లో విస్తరించిన కల్డెసాక్ ప్రాంతం మధ్యలో ఓ విశాలమైన ప్లాజాను ఏర్పాటు చేశారు. దాని చుట్టూ తక్కువ ఎత్తున్న తెల్లని భవనాలు, సన్నని నడకదారులు, గోడలపై చరిత్రకు సంబంధించిన రంగురంగుల చిత్రాలు, పూల మొక్కలు, అలంకరణ దీపాలు కనిపిస్తాయి. ఈ నిర్మాణ శైలికి ఇటలీ, ఫ్రాన్స్‌లోని కొండ ప్రాంతాలు, తీర గ్రామాల నుంచి స్ఫూర్తి పొందినట్లు ఆర్కిటెక్ట్ డేనియల్ పరోలెక్ తెలిపారు.ఇక్కడ కార్ల వినియోగం లేకపోయినా రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు నడవడానికి అనువైన ఫుట్‌పాత్‌లు, సైకిళ్ల కోసం ప్రత్యేక దారులు ఏర్పాటు చేశారు. రెస్టారెంట్లు, దుకాణాలు, కొరియన్ కన్వీనియన్స్ స్టోర్, వైద్యుల కార్యాలయం, డాగ్ పార్క్, స్విమ్మింగ్ పూల్, జిమ్, కో-వర్కింగ్ స్పేస్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.ఇవి కూడా చదవండి: ఇది...ఇ–తాబేలు! 16 ఏళ్ల యువకుడి ఆవిష్కరణకల్డెసాక్ వెలుపలే లైట్ రైల్ స్టేషన్ ఉండటంతో డౌన్‌టౌన్ ఫీనిక్స్, విమానాశ్రయం వంటి ప్రాంతాలకు సులభంగా వెళ్లవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ వేమో రోబోటాక్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ-బైక్‌లను అద్దెకు తీసుకునే సదుపాయం కూడా ఉంది. అవసరమైనప్పుడు షేర్డ్ ఎలక్ట్రిక్ కార్లను గంటకు సుమారు 5 డాలర్లకు అద్దెకు తీసుకోవచ్చు.అలాగే, కార్లు లేకుండా జీవించే విధానంతో పాటు ఎడారి వాతావరణంలో వేడిని తగ్గించేలా కల్డెసాక్ను రూపొందించడం మరో ప్రత్యేకత. భవనాల గోడలు, పైకప్పులకు తెల్లటి రంగు వేయడం ద్వారా సూర్యకాంతిని ఎక్కువగా ప్రతిబింబించేలా చేశారు. భవనాలను ఒకదానికొకటి దగ్గరగా నిర్మించడంతో అవి పరస్పరం నీడనిచ్చేలా ఉన్నాయి. గాలి నగరంలోకి సులభంగా వచ్చేలా ప్రజలు నడిచే దారులను, భవనాల మధ్య ప్రాంతాలను ప్రత్యేకంగా రూపొందించారు.దీంతో చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే కల్డెసాక్లో నేల ఉపరితల ఉష్ణోగ్రత 30 నుంచి 40 డిగ్రీల ఫారన్‌హీట్ (సుమారు 17 నుంచి 22 డిగ్రీల సెల్సియస్) వరకు తక్కువగా ఉన్నట్లు పరిశోధకుల అధ్యయనంలో తేలింది.కల్డెసాక్ జీవన విధానం పర్యావరణానికే కాకుండా అక్కడి ప్రజల సామాజిక సంబంధాలకు కూడా ఉపయోగపడుతోందని నివాసితులు చెబుతున్నారు. ప్రస్తుతం దాదాపు 21 చిన్న వ్యాపారాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. మెక్సికన్ రెస్టారెంట్లు, సిరామిక్స్, కొవ్వొత్తుల తయారీ స్టూడియోలు, బైక్ షాప్, పర్యావరణహిత దుస్తుల దుకాణాలు వంటి వ్యాపారాలు ప్రాంతాన్ని సందడిగా ఉంచుతున్నాయి.కార్ల రాకపోకలు లేకపోవడంతో పొరుగువారు, వ్యాపారులు, సందర్శకులు తరచూ ఒకరినొకరు కలుసుకునే అవకాశం పెరిగిందని అక్కడి నివాసితులు చెబుతున్నారు. దీంతో ఒంటరితనం తగ్గడంతో పాటు కమ్యూనిటీ భావన బలపడుతోందని వారు అంటున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా ప్రశాంతంగా నడుచుకుంటూ ప్రాంతాన్ని ఆస్వాదించగలగడం ప్రత్యేక అనుభూతిగా చెబుతున్నారు.కార్ల వినియోగాన్ని తగ్గించి నడక, సైక్లింగ్, ప్రజా రవాణాను ప్రోత్సహించడం వల్ల వాయు కాలుష్యం, కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని ఐక్యరాజ్యసమితి పేర్కొంటోంది. కల్డెసాక్ పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఏడాదికి సుమారు 3,000 టన్నుల గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను నివారించవచ్చని అంచనా.ప్రస్తుతం కల్డెసాక్లో సుమారు 760 నివాస యూనిట్లు, దాదాపు 1,000 మంది నివసించేలా అభివృద్ధి చేయాలనే ప్రణాళిక ఉంది. అమెరికాలోని ఇతర ప్రాంతాల్లోనూ కార్ల వినియోగాన్ని తగ్గించి, నడకకు అనుకూలమైన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆసక్తి పెరుగుతోంది. దీంతో కల్డెసాక్ భవిష్యత్ నగరాల రూపకల్పనకు కొత్త నమూనాగా మారుతోంది. ప్రజలు కార్లపై ఆధారపడకుండా నడక, సైక్లింగ్, ప్రజా రవాణాతో సౌకర్యవంతంగా జీవించేలా నగరాలను ఎలా రూపొందించవచ్చో ఈ ప్రాంతం చూపిస్తోంది.ఇవి కూడా చదవండి: ప్రకృతి పరీక్ష.. మానస సరోవర్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం? -
పదేళ్ల తర్వాత యజమాని చెంతకే చేరిన చిలుక..!
ఈ రోజుల్లో ఏదైనా పోతే మళ్లీ మన చెంతకే చేరుతుందనేది చెప్పడం కష్టం. అది మనిషైనా.. పెంపుడు జంతువైనా.. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ మనకు దూరమైనవి తిరిగి చెంతకు చేరితే ఆ ఆనందం మాటలకందనిది. అలాంటి భావోద్వేగ స్థితిని అనుభవిస్తున్నాడు ఈ వ్యక్తి.ఇంగ్లాండ్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌కు చెందిన రాబర్ట్ మోర్టిమర్ అనే వ్యక్తి, పెంపుడు చిలుక అపహరణకు గురైంది. దాదాపు పదేళ్ల తర్వాత అదే చిలుక అతడి చెంతకు చేరింది. నిజానికి అతడు అది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుందని అనుకున్నాడు. యాదృచ్ఛికంగా దాని ఆచూకి తెలియడం, తన చెంతకు చేరడం ఆ వ్యక్తిని ఆనందంలో ముంచెత్తింది. అదెలా అపహరణకు గురైందంటే..2017లో బ్రాడ్ఫోర్డ్ నగరంలోని తన ఇంటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నా బార్నీ అనే పెంపుడు చిలుక కనిపించకుండా పోయింది. యజమాని రాబర్ట్ దాన్ని ఎవరో ఎత్తుకుపోయారని చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో తన పక్షి ఆచూకీ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏళ్లు గడిచే కొద్దీ ఆ పెంపుడు పక్షి మళ్లీ కనిపించే అవకాశాలే అస్సలు కనిపించలేదు. కానీ ఇటీవల ఆ చిలుక యజమాని 56 ఏళ్ల రాబర్ట్‌కు స్థానిక పోలీసు అధికారి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. బార్నీ అనే చిలుక సజీవంగా దొరికిందని, ఫోన్ చేసి చెప్పారు. అది నిజమా కల అని ఒక్కసారిగా విస్తుపోయాడు రాబర్ట్. అంతేగాదు ఆ చిలుక ఎక్కడైతే దొంగలింపబడిందో..అక్కడికి సుమారు 20 మైళ్ల దూరంలో ఐక్య(IKEA) పార్కింగ్ స్థలంలో దొరికింది. జంతు సంరక్షణ కార్యకర్త బార్నీకి అటాచ్ చేసి ఉన్న మైక్రోచిప్‌ని స్కాన్ చేయగా..దానికి అనుసంధానించి ఉన్న ఫోన్ నెంబర్ పనిచేయకపోవడంతో యజమానిని గుర్తించలేకపోయినట్లు పోలీసులు చెప్పారు. అయితే చాలామంది అది మా చిలుక అంటూ వచ్చారు గానీ..వాళ్లెవరూ తమ వద్ద సరైన ఆధారాలను చూపించలేకపోయారు అని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ పక్షికి ఉన్న చిప్ ద్వారా దాని పేరు బార్నీ అని తెలిసింది. తాము మొదటిసారి దానిపేరుతో పిలవగానే నా పేరు వీళ్లకి ఎలా తెలుసు అన్నట్లుగా ఆశ్చర్యపోయిందన్నారు. ఆ తర్వాత తాము ఇంటర్నెట్లో దాని కోసం వెతకగా..తిరిగి దాని యజమాని చెంతకు చేర్చగలిగామని చెప్పారు. (చదవండి: వీల్‌చైర్‌లో మహిళ పుల్ అప్స్..! వీడియో వైరల్) -
మంచు కొండలో ఈ వాల్ట్ ఎందుకో తెలుసా?
మన భూమిపై పలు రకాల మొక్కలు, పంటలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఏదైనా జరిగితే, వాతావరణ మార్పులు, ప్రకతి విపత్తుల వల్ల కొన్ని జాతుల పంటలు, మొక్కలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు మళ్లీ వాటిని పండించేందుకు, ఆహార పంటలు, మొక్కల వైవిధ్యాన్ని రక్షించేందుకు నార్వేలోని స్వాల్బార్డ్ అనే ప్రదేశంలో ఈ విత్తనాల బ్యాంకును ఏర్పాటు చేశారు.ప్రపంచంలోని వేలాది పంటల విత్తనాలను బ్యాకప్‌గా భద్రపరిచే ప్రత్యేకమైన గ్లోబల్ సీడ్ వాల్ట్ ఇది. నార్వే దేశంలోని స్వాల్బార్డ్ అనే ఆర్కిపెలాగోలోని స్పిట్స్‌బెర్గెన్ ద్వీపంలో ఈ సీడ్ వాల్ట్ ఉంది. ఈ వాల్ట్‌ను ఆర్కిటిక్ మంచు, కొండల మధ్యలో, ఒక పర్వతం లోపల నిర్మించారు. అందుకే ఇది బయట నుంచి చూస్తే మంచు మధ్య దాగి ఉన్న పెద్ద లాకర్లా ఉంటుంది.సీడ్ వాల్ట్ లక్ష్యం ఏంటి?నిజానికి ప్రపంచంలో అనేక దేశాల్లో విత్తనాల బ్యాంకులు ఉన్నాయి. మన దేశంలో కూడా విత్తనాలను భవిష్యత్తు తరాల కోసం సంరక్షించే సంస్థలు ఉన్నాయి. అలాగే స్వాల్బార్డ్ అనేది సీడ్ బ్యాంక్ కాదు.. ఇది వాల్ట్.వివిధ దేశాలు, పరిశోధనా సంస్థలు, జీన్ బ్యాంకుల నుంచి విత్తనాలను ఇక్కడ భద్రపరుస్తారు. ఒక దేశంలో ప్రకతి విపత్తు సంభవించినా, యుద్ధం కారణంగా పంటలు లేదా విత్తనాల సేకరణలు నాశనమైనా, భవిష్యత్తులో ఈ విత్తనాలను తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.దీనిని పర్వతం లోపల నిర్మించారు. అది ఒక నేచురల్ ఫ్రీజర్‌గా పని చేస్తుంది. పర్వతం లోపల లోతుగా ఉండటం వల్ల బయట ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల నుంచి ఈ విత్తనాలకు ప్రొటెక్షన్ లభిస్తుంది. ఆర్కిటిక్ ప్రాంతంలోని సహజమైన చల్లని వాతావరణం కూడా ఈ సంరక్షణకు సహాయపడుతుంది.స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్‌ను 2008లోప్రారంభించారు. దీని నిర్మాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పర్వతం లోపలికి వెళ్లే ఒక పొడవైన టన్నెల్ ద్వారా సీడ్ స్టోరేజ్ చాంబర్లకు చేరుకోవచ్చు. అక్కడ మన షాపింగ్ మాల్లో ఉన్నట్టు ర్యాక్స్ ఉంటాయి. ఒక దేశానికి ర్యాక్‌లో కొంత ప్లేస్ ఇస్తారు. ఆ ప్లేస్‌లో ఆ దేశం పంపించే విత్తనాలను సేవ్ చేస్తారు.ఇది సాధారణ సీడ్ స్టోరేజ్ సెంటర్ కాదు. భవిష్యత్ తరాల కోసం ప్రపంచంలోని వ్యవసాయ వైవిధ్యాన్ని కా΄ాడే ఒక గ్లోబల్ బ్యాకప్ సిస్టమ్. అందుకే దీనిని కొన్నిసార్లు ‘‘డూమ్స్‌డే వాల్ట్’’ అని కూడా పిలుస్తారు.ఇవి చదవండి: బ్రహ్మపుత్రను ‘రెడ్ రివర్’ అని ఎందుకు అంటారో తెలుసా? -
బ్రహ్మపుత్రను ‘రెడ్ రివర్’ అని ఎందుకు అంటారో తెలుసా?
భారత దేశంలో ఎన్నో రివర్స్ ఉన్నాయి. అందులో కొన్ని నదులు ఒక ప్రాంత చరిత్ర, సంస్కృతి, ప్రకృతితో స్ట్రాంగ్ కనెక్షన్ కలిగి ఉంటాయి. అలాంటి గొప్ప నదుల్లో బ్రహ్మపుత్ర కూడా ఒకటి. బ్రహ్మపుత్ర నదిని కొన్ని సందర్భాల్లో రెడ్ రివర్ అని కూడా అంటారు.బ్రహ్మపుత్ర నది జర్నీ టిబెట్‌లో ప్రారంభం అవుతుంది. టిబెట్‌లో దీనిని యార్లాంగ్ సాంగ్పో అని పిలుస్తారు. హిమాలయాలను దాటుకుంటూ భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోకి ఎంటర్ అయ్యాక, దీనిని బ్రహ్మపుత్ర నది అని పిలుస్తారు. అక్కడి నుంచి అస్సాం మీదుగా ప్రయాణించి బంగ్లాదేశ్‌లోకి వెళ్తుంది.అస్సాంకి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చిన నేచురల్ ఫోర్స్‌గా బ్రహ్మపుత్ర నదిని కీర్తిస్తారు. నది చుట్టూ కనిపించే పచ్చని అడవులు, ద్వీపాలు, వెట్‌ల్యాండ్స్, హిమాలయన్ పాద ప్రాంతాలు కలిసి ఒక అద్భుతమైన సీనరీని క్రియేట్ చేస్తాయి.రెడ్ రివర్ అని ఎందుకు అంటారు?ఇక రెడ్ రివర్ అనే పేరు విషయానికి వస్తే, నది నీటిలో కనిపించే ఎరుపు రంగే దీనికి కారణం. హిమాలయాల నుంచి భారీ స్థాయిలో వచ్చే సెడిమెంట్స్, మట్టి, ఖనిజాలు నదిలో కలుస్తాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఈ నదీ నీరు ఎర్రగా లేదా మట్టిగా కనిపిస్తుంది.బ్రహ్మపుత్ర అస్సాంకి కేవలం ఒక నది మాత్రమే కాదు. స్థానిక ప్రజల జీవితం కూడా. వ్యవసాయం, చేపలు పట్టడంలో ప్రజలకు ఉపయోగపడటంతో పాటు ఇక్కడి కల్చర్‌తో కూడా ఈ నదికి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. నదీ లోయలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రజల జీవితం కూడా ఈ నదితో పాటు కొన్ని శతాబ్దాలుగా సాగుతోంది.బ్రహ్మపుత్ర నదీ జర్నీలో మజూలీ అనే ప్రముఖ నది ద్వీపం కూడా ఒక స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం అస్సాం కల్చర్, ట్రెడిషన్స్, నేచురల్ బ్యూటీకి ప్రతీకగా నిలుస్తుంది.హిమాలయాల నుంచి ప్రారంభమై, అస్సాం మైదానాల మీదుగా ప్రవహిస్తూ బంగ్లాదేశ్ వరకు ప్రయాణించే బ్రహ్మపుత్ర నది జర్నీ నిజంగా అద్భుతంగా ఉంటుంది. అందుకే రెడ్ రివర్ అనే పేరుతో భారతీయ భౌగోళిక అద్భుతాల్లో దీనికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.ఇవి చదవండి: ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న 5 అద్భుత ప్రదేశాలు! -
ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న 5 అద్భుత ప్రదేశాలు!
ఒక చోట చెట్ల వేర్లు వంతెనలుగా మారుతాయి. మరొక చోటు నీటిపై తేలుతున్న ద్వీపాలు కనిపిస్తాయి. ఇంకొక చోటు పూలతో నిండిన లోయలు, ఆకాశాన్ని తాకిన సరస్సులు, వర్షం వచ్చినప్పుడు రంగులు మార్చుకునే మైదానాలు, లోయలు కనిపిస్తాయి. ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఉంటాయి.ఈ ఐదు ప్రదేశాలు అలాంటి ప్రకృతి అద్భుతాలే. మేఘాలయలోని సజీవ వేర్ల వంతెనల నుంచి మహారాష్ట్రలోని కాస్ పీఠభూమి వరకు ప్రతి ప్రదేశంలో ప్రకృతి మనకు కొత్త రూపంలో కనిపిస్తుంది.త్సో మోరీరి సరస్సులడఖ్ అంటే చాలా మందికి ప్యాంగాంగ్ గుర్తొస్తుంది. కానీ చాంగ్థాంగ్లో ఉన్న త్సో మోరీరి ఒక ప్రశాంతమైన అనుభవాన్ని ఇస్తుంది. సుమారు 4,500 మీటర్ల ఎత్తులో, చుట్టూ కొండల మధ్య నీలం రంగులో విస్తరించిన ఈ సరస్సు ఒక పెద్ద ప్రకృతి చిత్రంలా కనిపిస్తుంది.లేహ్ నుంచి త్సో మోరీరి వైపు ప్రయాణం చేస్తుంటే భూదృశ్యం పూర్తిగా మారిపోతుంది. రాళ్లు, గడ్డి మైదానాలు, దూరంగా కనిపించే హిమ శిఖరాల మధ్య చివరికి సరస్సు కనిపించిన క్షణం మర్చిపోలేని దృశ్యంగా మిగిలిపోతుంది. కోర్జోక్ గ్రామం, కోర్జోక్ మఠం, సరస్సు చుట్టూ తిరిగే వలస పక్షులు ఈ ప్రదేశంలో ప్రత్యేక జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చాంగ్పా సంచార జీవన విధానాన్ని కూడా చూసే అవకాశం లభిస్తుంది.నీళ్లపై తేలే జీవితంమణిపూర్లోని లోక్టక్ సరస్సును మొదటిసారి చూసినప్పుడు అది ఒక పెద్ద సినిమాటిక్ సీన్లా, ఒక కొత్త సముద్రంలా అనిపించవచ్చు. కానీ దగ్గరగా చూస్తే ఆ నీళ్లపై చిన్న చిన్న తేలియాడే ద్వీపాలు కనిపిస్తాయి. వీటిని ఫుమ్డీలు అంటారు. వాటిపై ఇళ్లు, జీవనం, చేపల వేట అన్నీ ఉంటాయి. ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలా అనిపిస్తుంది.ఇంఫాల్ నుంచి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్టక్, ఈశాన్య భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు. అదే సరస్సులో కీబుల్ లాంజోవా జాతీయ ఉద్యానవనం ఉండటం మరో అద్భుతం. ప్రకృతి, నీరు, జీవన విధానం కలిసి ఒక చిత్రంలా కనిపించే అందమైన ప్రదేశం ఇది.మేఘాలు నివసించే లోయనాగాలాండ్, మణిపూర్ మధ్య ఉన్న జుకోవ్ లోయను చూస్తే భూమిపై ఒక పచ్చని సముద్రం పరుచుకున్నట్టు అనిపిస్తుంది. సుమారు 2,452 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ లోయలో సీజనల్ పూలు, వెదురు తోటలు, చిన్న చిన్న సెలయేర్లు అందంగా ఉంటాయి.హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు పడితే ముందుగా నాగాలాండ్ చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో ఈశాన్య భారతదేశపు భూదృశ్యం మెల్లిగా మారుతుంది. నాగాలాండ్ కొండలు దగ్గరవుతున్న కొద్దీ రోడ్డు ప్రయాణంలోనే ప్రకతి తన రంగులను మార్చుకుంటూ వస్తుంది.జుకోవ్లో ఒక రోజు గడపడం అంటే కేవలం ట్రెక్కింగ్ అనుభవం మాత్రమే కాదు. మేఘాల లోయలో నిలిచిపోయిన సమయం, గాలిలో వెదురు ఆకుల శబ్దం, దూరంగా కనిపించే కొండలు ఇవన్నీ కలిసి ఒక అందమైన నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. ఎండాకాలంలో కనిపించే ప్రత్యేక జుకోవ్ లిల్లీ ఈ ప్రదేశానికి మరో గుర్తింపు ఇస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఈ ఐదు గమ్యస్థానాలకు వెళ్లే మార్గం అనేది గమ్యస్థానాన్ని బట్టి మారుతుంది. మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ ప్రాంతాలకు మీరు గువాహటి, ఇంఫాల్, దిమాపూర్ నుంచి చేరుకోవచ్చు. లడఖ్ వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి లేహ్ చేరుకుని, అక్కడి నుంచి చాంగ్‌థాంగ్ వైపు రోడ్డు ప్రయాణం చేసి వెళ్లవచ్చు. ఈ ప్రయాణం చాలా మందికి నచ్చుతుంది. కాస్ పీఠభూమికి పుణే లేదా సతారా మార్గంలో వెళ్లడం అనుకూలంగా ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలులివింగ్ రూట్ బ్రిడ్జ్‌లు అనేవి మేఘాలయలోని ఖాసీ, జైంటియా సామాజిక వర్గాల ప్రజలు ప్రకృతితో కలిసి పెంచిన సజీవ నిర్మాణాలు.లోక్టక్ సరస్సు అనేది ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇందులో కనిపించే ఫుమ్డీలు దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.జుకో లోయ అనేది నాగాలాండ్, మణిపూర్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న లోయ. సీజనల్ పూలతో పాటు జుకోవ్ లిల్లీకి ప్రసిద్ధి.త్సో మోరీరి చాంగ్‌థాంగ్ ప్రాంతంలో సుమారు 4,500 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన, ఎత్తైన ప్రాంతంలోని సరస్సు.కాస్ పీఠభూమి అనేది పశ్చిమ కనుమల్లోని జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ పీఠభూమి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.దక్షిణాది పూల లోయమహారాష్ట్రలోని సతారా దగ్గర ఉన్న కాస్ పీఠభూమిని మహారాష్ట్రలోని పూల లోయ అని కూడా పిలుస్తారు. వర్షాకాలం తరువాత ఈ పీఠభూమిపై వందల రకాల పూలు ఒకేసారి విరిసి, భూమి మొత్తం రంగుల తివాచీలా మారుతుంది. 1200 మీటర్ల ఎత్తులో ఉన్న కాస్‌లో 850 కిపైగా పూల జాతి మొక్కలు ఉంటాయి.హైదరాబాద్ నుంచి పూణే వైపు ప్రయాణం చేసి, అక్కడి నుంచి సతారా మార్గంలో సాగాల్సి ఉంటుంది. పశ్చిమ కనుమల మధ్య సాగే ఈ ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది. ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య పూల సీజన్ లో ఈ పీఠభూమి పూర్తిగా మారిపోతుంది. దగ్గరలోని కాస్ సరస్సు, బమ్నోలి, ఠోసేఘర్ జలపాతాలు, సజ్జన్ గడ్ లాంటి ప్రదేశాలు ఈ ప్రయాణంలో ప్రత్యేక ఆకర్షణలుగా మిగిలిపోతాయి.ఏం తినాలి?మేఘాలయలో స్థానిక ఖాసీ వంటకాలు, మణిపూర్‌లో అన్నంతో తయారు చేసే సంప్రదాయ వంటకాలు, నాగాలాండ్‌లో స్థానిక మాంసాహార వంటకాలు, లడఖ్‌లో తుక్పా, మోమోలు, మహారాష్ట్రలో కంది పెఢా, పిట్లా, ఇతర స్థానిక మహారాష్ట్ర వంటకాలు మీ ప్రయాణానికి రుచికరమైన అనుభూతిని ఇస్తాయి.వేర్లతోనే వంతెనలు మేఘాలలో ఖాసీ ప్రజల జీవన విధానం ప్రకతితో మమేకమైన జీవన విధానం. దీనికి సాక్షాలే సజీవ వేర్ల వంతెనలు. ఫికస్ ఎలాస్టికా చెట్ల వేర్లను సంవత్సరాల పాటు పెంచి, నది రెండు వైపుల కలిసేలా తయారు చేసిన ఈ వంతెనలు కాంక్రీట్ నిర్మాణంలా బలంగా ఉంటాయి. కొన్ని వంతెనలు వందేళ్ల పాటు నిలిచి ఉన్నాయని మేఘాలయ పర్యాటక శాఖ చెబుతుంది.నాంగ్రియాట్, సోహ్రా, మాలినాంగ్ ప్రాంతాల్లో ఇలాంటి వంతెనలను చూడవచ్చు. పచ్చని అడవుల్లో నడుస్తుంటే కింద ప్రవహిస్తున్న నీటి మధ్య వేర్లు కలిసి వంతెనలా మారడం చూస్తే, మనిషి, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం అవుతుంది.ఎక్కడ ఉండాలి?లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల సమీపంలో గ్రామీణ హోమ్‌స్టేలు, లోక్టక్ సరస్సు వద్ద సరస్సు ఒడ్డున ఉండే వసతి సౌకర్యాలు, జుకో లోయ ప్రయాణంలో పర్వత రహదారులు కనిపించే వసతి ప్రదేశాలు బాగుంటాయి.త్సో మోరీరి సమీపంలోని కొర్జోక్లో అతిథి గృహాలు, క్యాంపులు అందుబాటులో ఉంటాయి. కాస్, సతారా ప్రాంతంలో హోటళ్లు, హోమ్‌స్టేలు ఉంటాయి. ప్రతీ గమ్యస్థానంలో బస చేయడం కూడా ఒక జ్ఞాపకంగా మారిపోతుంది.ఏం చూడాలి?లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల మధ్య ప్రవహించే నీరు, లోక్టక్ సరస్సులో తేలియాడే ఫుమ్డీలు, జుకో లోయలో కనిపించే సీజనల్ పూలు, త్సో మోరీరి నీలిరంగు సరస్సు, కాస్‌లో విరబూసే సీజనల్ పువ్వులుం ఈ ఐదు గమ్యస్థానాల్లో మీరు ఎక్కడా ప్రయాణ అనుభూతిని మిస్ అవరు. ఈ గమ్యస్థానాలను వేగంగా చుట్టేయాలని కాకుండా ప్రశాంతంగా ఆస్వాదించడానికి ్రపాధాన్యత ఇవ్వండి.సందర్శనీయ ప్రదేశాలుఈ ఐదు ప్రదేశాలలో ఒక్కో ప్రదేశం ఒక్కో అనుభూతిని ఇస్తుంది. మేఘాలయలో మనిషి చేతులతో పెంచిన వేర్ల వంతెనలు ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని కొనసాగించే సందేశాన్ని అందిస్తాయి. అలాగే లోక్టక్లో నీటిపై జీవితం, జుకోలో పూల మధ్య మేఘాలు, త్సో మోరీరిలో ఆకాశం సరస్సులో ప్రతిబింబించడం, వర్షాల తరువాత భూమి పూలనే అక్షరాలుగా మార్చుకుని మాట్లాడటం ఇవన్నీ తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలే కదా.యాక్టివిటీస్ఈ ప్రయాణంలో రూట్ బ్రిడ్జ్‌పై నడవడం, లోక్టక్ సరస్సులో తేలియాడే ప్రకతి దశ్యాలను చూడటం, జుకో లోయలో మేఘాల మధ్య నడవడం, త్సో మోరీరి సరస్సు తీరంలో పర్వతాల ప్రతిబింబాలను ఆస్వాదించడం, కాస్‌లో సీజనల్ పూల మధ్య ప్రకృతిని గమనించడం ఇవన్నీ ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతాయి.యాత్ర, బడ్జెట్ వివరాలుఐదు రోజుల ట్రిప్‌లో బడ్జెట్ అనేది గమ్యస్థానాన్ని బట్టి మారిపోతుంది. హైదరాబాద్ నుంచి విమానంలో ప్రయాణించడం, స్థానిక రవాణా, బస, ఆహారం అన్నీ కలిపి బడ్జెట్ ప్రయాణానికి సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చు అవ్వొచ్చు.సాధారణ స్థాయి ప్రయాణ బడ్జెట్‌తో వెళ్తే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు, ప్రత్యేకమైన ప్రయాణ అనుభవానికి అయితే రూ.70,000కు పైగా ఖర్చు కావచ్చు. త్సో మోరీరి, జుకో లోయ, లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల వంటి ప్రాంతాల్లో స్థానిక రవాణా, బస ఆధారంగా బడ్జెట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.బస విషయానికి వస్తే ఒక్క రాత్రికి రూ.1,000–4,000 మధ్యలో బడ్జెట్ పెట్టుకోవడం మంచిది. ప్రీమియం హోటళ్లకు మరింత ఖర్చు కావచ్చు. ఆహారం కోసం రోజుకు సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ రుచికి, ఎంపికకు అనుగుణంగా ఈ ఖర్చులు మారుతాయి.- ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుఇవి కూడా చదవండి: బ్రహ్మపుత్రను ‘రెడ్ రివర్’ అని ఎందుకు అంటారో తెలుసా? -
శ్రీలంకలో ఘనంగా పెరహెర వేడుకలు.. ఎందుకు జరుపుతారంటే?
సంస్కృతి, ఆధ్యాత్మికతతో ముడిపడినటువంటి ‘కాండీ ఎసల పెరహెర వేడుకలు’ శ్రీలంకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 18 నుంచి 28 వరకు సాగే ఈ వేడుకలను మొత్తం 10 రాత్రులు, 11 రోజులు పాటు అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఊరేగింపులు, కళాకారుల ప్రదర్శనలు, అలంకరణలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో తుది ఘట్టమైన ‘రాందోళి పెరహెర’ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.కాండీ ఎసల పెరహెర ఉత్సవాల తేదీలు ప్రతి సంవత్సరం మారుతున్నప్పటికీ, ఈ పండుగ నిర్వహణ ఎప్పుడూ ఒకేలా సాగుతుంది. ఈ సంబరాలు ప్రధానంగా మూడు ఘట్టాలుగా కొనసాగుతాయి.ఉత్సవాల్లో ప్రారంభ క్రతువు కప్ సిటువీమ. ఈ వేడుకలు శ్రీ దళదా మాలిగావా (బుద్ధుని పవిత్ర దంత అవశేషం ఉన్న దేవాలయం) ప్రాంగణంలో ప్రారంభమవుతాయి. ఉత్సవ ప్రారంభానికి సూచికగా ఆలయ ప్రాంగణంలో ఒక పవిత్ర వృక్షాన్ని నాటుతారు. ఇది ప్రధానంగా మతపరమైన ఆచారం అయినప్పటికీ, పెరహెర సీజన్ కు ఇది అధికారిక ప్రారంభ ఘట్టంగా నిలుస్తుంది.ఉత్సవాల్లో రెండో ఘట్టం కుంభాల్ పెరహెర. పండుగ మొదటి ఐదు రాత్రులను ‘కుంభాల్ పెరహెర’ అని పిలుస్తారు. ఈ ప్రారంభ ఊరేగింపులు పరిమాణంలో కాస్త చిన్నవిగా, సంప్రదాయబద్ధంగా సాగుతాయి. ఎక్కువ రద్దీ లేకుండా పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా ఆస్వాదించడానికి ఇవి చక్కటి అవకాశం. ఈ రాత్రులలో సంప్రదాయ కాండియన్ నృత్యకారులు, కొరడా ఝళిపించే ప్రదర్శకులు, మేళతాళాల వాయిద్యకారులు, అలంకరించిన ఏనుగులు, దివిటీలు పట్టిన సేవకులు పాల్గొంటారు.మూడో ఘట్టం రాందోళి పెరహెర. అంటే మహా ఊరేగింపులు. ఆఖరి ఐదు రాత్రులను ‘రాందోళి పెరహెర’ అని పిలుస్తారు. పండుగ మొత్తంలోనే అత్యంత అద్భుతంగా, వైభవంగా సాగే రాత్రులు ఇవే! ఈ ఊరేగింపులు జరిగేటప్పుడు కాండీ నగర వీథులు వేలాదిమంది భక్తులతో, పర్యాటకులతో నిండిపోతాయి. వందలాది మంది నృత్యకారులు, కళాకారులు, వాద్యకారుల బృందాలు, రాత్రి ఆకాశాన్ని కాంతులతో నింపే అగ్ని విన్యాసకులు, విద్యుత్ దీపాలతో ప్రకాశించే వస్త్రాలు ధరించిన గజరాజులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి కాండీ పెరహెరకే అత్యంత ముఖ్యమైన ఘట్టాలు కావడంతో అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.ఈ ఉత్సవాల్లో చివరి ఊరేగింపు రాత్రి వేకువ జామున జరిగే వేడుక దహవల్ పెరహెర. ఇందులో భాగంగా మహావలి నది ఒడ్డున జరిగే ‘దియా–కెపీమ’ అంటే ‘జలఖండన’ కార్యక్రమంతో ఎసల పెరహెర ముగుస్తుంది. ఇందులో భాగంగా నదీ జలాలను లాంఛనప్రాయంగా ఖండించినట్లు నీళ్లల్లో కత్తులను తాటిస్తారు. ఈ క్రతువును వీక్షించేందుకు సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు.శ్రీలంకలో జరిగే ప్రసిద్ధ ‘కాండీ ఎసల పెరహెర’ ఉత్సవం కేవలం ఒక సాంస్కృతిక ప్రదర్శన మాత్రమే కాదు. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం. గౌతమ బుద్ధుని పవిత్ర దంత అవశేషానికి అత్యంత భక్తిశ్రద్ధలతో గౌరవం అర్పిస్తూ, దేశానికి సమృద్ధిగా, సమయానుకూల వర్షాలు, ప్రజలకు శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ చారిత్రాత్మక వేడుక శ్రీలంక బౌద్ధ సంస్కృతి విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతోంది.- రమా జంబుల -
ఫేస్బుక్లో ఫోటోకి క్యాప్షన్ పెడుతున్నారా? పాపం ఆ వ్యక్తి ఏకంగా..
మీ సంతోషాన్ని, విషాదాన్ని, ప్రతి చిన్న విషయాన్నీ ఫేస్బుక్లో పోస్టు చేస్తున్నారా? ఫొటోలు పెట్టి క్యాప్షన్లు పెడుతున్నారా?... అయితే తస్మాత్ జాగ్రత్త! మీరు పెట్టేవి ఒక్కోసారి అపార్థాలకు దారితీయొచ్చు; మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పొచ్చు. అలాంటిదే ఓ సంఘటన తమిళనాడులో జరిగింది. ఓ వ్యక్తి ఎఫ్బీలో చేసిన పోస్టు పెద్ద దుమారమే రేపింది. చివరికి కుట్ర కేసు వరకు వెళ్లింది. ఆ కేసు ఏమిటో, దాని కథా కమామిషు ఏమిటో తెలుసుకుందాం..తమిళనాడుకు చెందిన మథివనన్ ఓ రాజకీయపార్టీకి చెందిన నాయకుడు. అతడు తన కుమార్తె, అల్లుడితో కలిసి 2021 సెప్టెంబరులో సిరుమలై కొండ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లాడు. ఆ జ్ఞాపకాలను పదిలపరచుకునేందుకు ఫొటోలు తీసుకున్నాడు. వాటిలో ఓ ఫొటోను ఫేస్బుక్లో పోస్టు చేసి, ‘షూటింగ్ ప్రాక్టీస్ కోసం సిరుమలై ప్రయాణం’ అనే అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ పెట్టాడు. ఎఫ్బీలో అది చూసి కొంతమంది లైక్ కొట్టారు. సన్నిహితులు కామెంట్ పెట్టారు. పోలీసులు మాత్రం కేసు పెట్టారు.‘జిహ్వకో రుచి... పుర్రెకో బుద్ధి’ అంటారు. పోలీసుల బుర్రకు ఆ క్యాప్షన్ మరోలా తోచింది. షూటింగ్ ప్రాక్టీస్ అంటే వేరేలా అర్థం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 120(బి), సెక్షన్ 122, సెక్షన్ 505(1)(బి), సెక్షన్ 507 కింద ఎడాపెడా కేసులు నమోదు చేశారు. హడావుడిగా మథివనన్ను అరెస్ట్ చేసి, వాడిపట్టి కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. రిమాండ్ ఇవ్వాలని కోరారు. మేజిస్ట్రేట్ తిరస్కరించారు.హైకోర్టులో ఆసక్తికర వాదనలుకేసు హైకోర్టు మధురై బెంచ్‌కి చేరింది. వాడిపట్టి మేజిస్ట్రేట్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తినీ యాంత్రికంగా రిమాండ్‌కు పంపడం కుదరదని తేల్చింది. రిమాండ్ అవసరమా, లేదా? అన్నది మేజిస్ట్రేట్ పరిశీలిస్తారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నవ్వడం కూడా పౌరుల విధుల్లో ఒకటిగా ఉండాలేమో!’ అంటూ వ్యాఖ్యానించింది. హాస్యం, ఎగతాళి రెండూ వేర్వేరు అంశాలని పేర్కొంది.సెక్షన్ల వారీగా వివరణ‘ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం అవడానికి కేవలం ఒక క్యాప్షన్ సరిపోదు. వ్యక్తులను సమీకరించడం, ఆయుధాలను సేకరించడం, ఇతర సన్నాహాలు’ ఉండాలి. ఆ ఫొటోల్లో ప్రకృతి, కూతురు, అల్లుడు తప్ప అలాంటి చర్యలేవీ కనపడడం లేదు. పోలీసులు ఎలాంటి ఆయుధాలనూ స్వాధీనం చేసుకున్నట్టు రిపోర్టులో రాయలేదు. కాబట్టి సెక్షన్ 122 వర్తించదని కోర్టు స్పష్టం చేసింది.సెక్షన్ 505(1)(బి) వర్తించాలంటే, ఒక ప్రకటనతో ప్రజల్లో భయం కలగాలి; అలజడి రేగాలి. ప్రభుత్వానికి/ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రజలను ప్రేరేపించాలి. కానీ ఆ క్యాప్షన్ చూస్తే నవ్వు వస్తుంది తప్ప పైన పేర్కొన్నవేవీ కలగడం లేదు. కాబట్టి ఈ సెక్షన్ అసంబద్ధమైంది.అజ్ఞాతంలో ఉండి బెదిరింపులకు పాల్పడే వారికి సంబంధించింది సెక్షన్ 507. అతను సామాజిక మాధ్యమంలో బహిరంగంగా క్యాప్షన్ పెట్టాడు. ఇక్కడ అజ్ఞాత కమ్యూనికేషన్ ఏం ఉంది? ఇదీ చెల్లదని పేర్కొంది. మథివనన్ ఒక్కడ్నే నిందితుడిగా చేర్చారు. కుట్ర అంటే కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక నేరం చేయడానికి కలవాలి. ఒక వ్యక్తి తనతో తానే కుట్ర చేయలేడని వ్యాఖ్యానించింది. కుట్రకు ఆధారమైన ఇతర ఆరోపణలూ నిలవలేదు. ఇక ఈ సెక్షన్ కూడా వర్తించదని స్పష్టం చేసింది.పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అసంబద్ధమైనది, న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసేదిగా ఉందని పేర్కొంటూ ఆ ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టేసింది. ఒక క్యాప్షన్ తెచ్చిన తంటా చివరికి హైకోర్టు జోక్యంతో ప్రశాంతంగా ముగిసింది. ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో!- దిలీప్ మాదిరెడ్డి -
నక్షత్రం కడుపులో రాక్షస బ్లాక్‌హోల్.. ఇదేం వింత!
మన విశ్వం ఎప్పుడూ వింతల పుట్టే. తాజాగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఒక ఊహించని సరికొత్త వింత వస్తువును కనుగొన్నారు. దానికి వాళ్లు ‘బ్లాక్ హోల్ స్టార్’ అని పేరు పెట్టారు.సాధారణంగా నక్షత్రం వేరు, బ్లాక్ హోల్ వేరు. కానీ ఈ వింత వస్తువు మాత్రం నక్షత్రంలా కనిపిస్తూ... మన సూర్యుడి కంటే లక్ష రెట్లు పెద్దదైన ఒక రాక్షస బ్లాక్ హోల్‌ను తన కడుపులో దాచుకుంది! దీని చుట్టూ మన సౌరవ్యవస్థ అంత పెద్ద పరిమాణంలో దట్టమైన హైడ్రోజన్ వాయువు ఒక రక్షణ కవచంలా అల్లుకుపోయింది.మన విశ్వం పుట్టిన కొత్తలో అంటే బిగ్ బాంగ్ జరిగిన కేవలం 66 కోట్ల సంవత్సరాల తర్వాత ఇది ఏర్పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది విశ్వంలో ఉండే ఏ సాధారణ నక్షత్రం విడుదల చేయలేనంతగా దాదాపు 10,000 కోట్ల రెట్లు ఎక్కువ శక్తిని ఇది కాంతి రూపంలో బయటకు వదులుతోంది! అందుకే ఇది టెలిస్కోప్‌కు ఒక పెద్ద ‘ఎర్రటి చుక్క’(Mysterious Red Dot) లా కనిపించింది. మన విశ్వం ఎలా పుట్టిందో తెలుసుకోవడానికి ఈ ‘బ్లాక్ హోల్ స్టార్’ ఒక పెద్ద తాళంచెవిలా మారబోతోంది!ఇవి చదవండి: రోజూ విమానం కోసం ఎదురుచూసే బాలుడు! చివరికి.. -
సముద్రాన్నే సవాల్ చేసిన ఈతగాడు.. కేవలం వారికోసమే!
మీరెప్పుడైనా ఓ వంద మీటర్ల దూరం ఈత కొట్టారా? బావిలోనో, స్విమ్మింగ్ పూల్లోనో, అటు నుంచి ఇటుకి ఆపసోపాలు పడి ఈత కొట్టే బ్యాచే కదా మనమంతా.. కాని సముద్రంలో సుదీర్ఘంగా ఈతకొట్టేవాళ్లను చూశారా? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి ఈత కొట్టే గజ ఈతగాడిని చూశారా? అంత దూరం ఎలా ఈత కొట్టాడు? అది కూడా సముద్రంలో... అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీద ఓ లుక్కేయండి...అది స్వీడన్ దేశ తీరం... గాలివాటంగా ఉంది.. సముద్రంలోని నీరు వణికించేలా ఉంది. 2022 ఆగస్టు నెల..బార్ట్లో మీజ్ కుబ్కోవ్‌స్కీ అనే 27 ఏళ్ల యువకుడు సముద్రంలోకి దిగాడు...ఈతకొట్టడంప్రారంభించాడు. ఐదు, పది కిలోమీటర్లు కాదు 32 గంటలు ఈది 115 కిలోమీటర్లు వెళ్లాడు. కాని వాతావరణం సముద్రాన్ని హెచ్చరించింది..సముద్రం ఉప్పెన రూపం దాల్చింది.. అల్లకల్లోలం అయ్యేలోపే బార్ట్లో తప్పించుకున్నాడు.అంతటితో ఆగలేదు..2023 మళ్లీ ఈదడానికి సిద్ధపడ్డాడు. ఈసారి 40 గంటలు ఈది 116.7 కిలోమీటర్ల దూరానికి చేరుకున్నాడు. కాని వాతావరణం తన ప్రతాపాన్ని చూపి మళ్లీ పైచేయి సాధించింది. తర్వాత 2024 ముచ్చటగా మూడో ప్రయత్నంప్రారంభించాడు. కాని ఈసారి 19 గంటలకే వాతావరణం బలమైన పరిస్థితిని పూర్తిగా తన అదుపులోకి తీసుకుంది... కాని బార్ట్లో71.7 కిలోమీటర్లు వెనక్కి తగ్గాడు. 2025లో నాలుగో ప్రయత్నం...ఈసారి మాత్రం విజయం చేతికి చిక్కి తప్పించుకుంది. ఆగస్టు 17న బయలుదేరిన కుబ్కోవ్‌స్కీ 55 గంటలపాటు ఈది 159 కి.మీల దూరానికి చేరుకున్నాడు. పక్కనున్న పోలాండ్ దేశ తీరానికి కాస్త దూరంలోకి వచ్చి తీవ్రమైన అలసటతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే సహాయక బృందం అతడిని కాపాడింది.చివరగా 2026 జూలై 31... ఈసారి కూడా 55 గంటల పది నిమిషాల పాటు నిర్విరామంగా ఈతకొట్టి పోలాండ్ తీరానికి చేరుకున్నాడు. బాల్టిక్ సముద్రాన్ని ఈదిన తొలి వ్యక్తిగా కుబ్కోవ్‌స్కీ నిలిచాడు. నాలుగుసార్లు సముద్రం అతడిని ఆపింది. ఐదోసారి మాత్రం అతడు సముద్రాన్ని గెలిచాడు. ఇంత ప్రయత్నానికి కారణం లేకపోలేదు. కేన్సర్‌తో బాధపడే పిల్లల కోసం నిధులు సేకరించాలని ప్రతి ఏటా కుబ్కోవ్‌స్కీ సముద్రంపై అలుపెరగని యుద్ధం చేశాడు. ఈ విజయాన్ని పిల్లలకు అంకితం చేసి, తన భగీరథ ప్రయత్నం ద్వారా వచ్చిన మొత్తాన్ని పిల్లల వైద్యానికే ఇచ్చేసి ధైర్యశాలిగా, ఔదార్యం నిండిన మంచి మనిషిలా మిగిలాడు.అతని అలుపెరగని ప్రయత్నం చూసి ఆశ్చర్యపోనివారంటూ లేరు.. బలమైన అలలు.. వణికించే నీళ్లు.. ఏమాత్రం తేడా వచ్చినాప్రాణానికే ప్రమాదం... కాని అవేవి అతడిని ఆపలేదు. గజినీ మహమ్మద్‌లా సముద్రం చేతిలో ఎన్నిసార్లు ఓడినా మళ్లీ ప్రతి దాడికి సిద్ధపడుతూనే ఉన్నాడు. -
పుడమితల్లి వేడుక 'పాచామామా'!
దక్షిణ అమెరికా దేశమైన పెరూ ‘పాచామామా’ వేడుకకు సిద్ధమైంది. పుడమితల్లికి కృతజ్ఞతలు తెలిపే ఈ వేడుకలను ఆగస్టు మాసమంతా అండీస్ పర్వత ప్రాంతాల్లోని ప్రాచీన తెగలు, గ్రామీణ ప్రజలు, పెరూ పౌరులందరూ ఏకమై ఘనంగా నిర్వహిస్తారు. స్పానిష్ వలస పాలకుల రాకకు శతాబ్దాల ముందు నుంచే కొనసాగుతున్న ఈ సంప్రదాయం నేటికీ ఆండియన్ క్యాలెండర్లో అత్యంత ముఖ్యమైన పండుగగా నిలుస్తోంది.పాచామామా అంటే...‘పాచా’ అంటే ప్రపంచం, భూమి, స్థలం, సమయం, విశ్వం అని అర్థం. ‘మామా’ అంటే తల్లి అని అర్థం. అంటే ‘విశ్వానికి మూలమైన నేలతల్లి’అని అర్థం. ఆండియన్ ప్రజల దృష్టిలో భూమి అనేది అందరినీ పోషించే ఒక జీవ వ్యవస్థ.ఆగస్టులోనే ఎందుకు?ఆండియన్ సంప్రదాయాల ప్రకారం, ఆగస్టు నెలలో భూమాత తన నోరు తెరుస్తుందని, మానవులు సమర్పించే నైవేద్యాలను స్వీకరిస్తుందని నమ్ముతారు. పంటల కాలం పూర్తయి, కొత్త వ్యవసాయ చక్రం ప్రారంభమయ్యే సమయం కాబట్టి, భూమి సారవంతంగా ఉండాలని, కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలని, వ్యాపారంలో అభివృద్ధి ఉండాలని కోరుకుంటూ ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ప్రధాన ఆచారాలుఈ ఉత్సవాల్లో షామన్లుగా పిలిచే ప్రాచీన పూజారుల నేతృత్వంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముందుగా భూమి తల్లికి పూలు, పండ్లు, జొన్నలతో నైవేద్యం సమర్పించే ‘దేశ్పాచో’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం ‘పాగో అ లా తియెర్రా’ అని నిర్వహించే ‘నేలతల్లికి చెల్లింపు’ కార్యక్రమంలో అనేక ప్రత్యేక కానుకలను అగ్నిదేవునికి సమర్పించి, పాటలు, ప్రార్థనల ద్వారా భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. చివరగా వనమూలికలతో ధూపం వేసి వాతావరణాన్ని, మనుషులను శుద్ధి చేసే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది దుష్టశక్తులను పారద్రోలి, నూతనోత్తేజాన్ని ఇస్తుందని ఆండియన్ ప్రజల నమ్మకం.ఆండియన్ సంస్కృతిలో ప్రపంచాన్ని మూడు లోకాలుగా విభజించారు. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే ‘పాచామామా’ పూజ ప్రధాన ఉద్దేశం. మొదటిది ‘హనన్ పాచా’– అంటే ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు, వాతావరణాన్ని సూచించే ఊర్ధ్వలోకం. రెండోది ‘కే పాచా’ అంటే మానవులు సహా సమస్త జీవజాలం నివసించే నేల ఉపరితలం. మూడవది ‘ఉఖు పాచా’ అంటే భూమి లోపలి భాగం. విత్తనాల మొలకెత్తే శక్తికి ప్రతిరూపం.ఈ పాచామామా ఉత్సవాలు కేవలం స్థానికులకే కాక, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. అయితే ఈ వేడుకల్లో పాల్గొనాలనుకునేవారు ఈ ప్రాంత ఆచార సంప్రదాయాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఉత్సవాల్లో అందరిపట్ల గౌరవంగా మెలగడం, ఫొటోలు, వీడియోలు తీసుకోవాలనుకుంటే స్థానికుల అనుమతి తీసుకోవడం వంటి నిబంధనలుంటాయి. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అనే సూత్రం ఆధారంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. అంటే ప్రకృతి మనకు జీవనాన్ని ఇచ్చినపుడు, మనం తిరిగి కృతజ్ఞతగా నైవేద్యాలను సమర్పించి ప్రకృతి సమతుల్యతను కాపాడాలి అనేది వీరి సిద్ధాంతం. ∙ రమా జంబుల -
వందల అస్థిపంజరాల వెనుక అసలు కథేంటి?
అది 1942 సంవత్సరం... రెండో ప్రపంచ యుద్ధ సమయం...సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉన్న అవిభాజ్య ఉత్తరప్రదేశ్‌లోని రూప్‌కుండ్ ప్రాంతం. గడ్డకట్టే చలి– చుట్టూ తెల్లటి మంచు పర్వతాలు– ఆ కొండల నడుమ ఒక చిన్న సరస్సు– ప్రకృతి అందం అంతా అక్కడే ఉందా అని పరవశించేంత సోయగం ఆ ప్రాంతం సొంతం. ‘నందాదేవి అభయారణ్యం’ ఫారెస్ట్ రేంజర్ హరికిషన్ మధ్వాల్ రోజువారీ విధుల్లో భాగంగా పరిసరాలను పరిశీలిస్తున్నారు. వేసవి కాలం కావడం వల్ల సరస్సులోని మంచు కొద్దికొద్దిగా కరుగుతోంది.అలా చూస్తూ వెళ్తున్న హరికిషన్‌కు సరస్సులో నుంచి తెల్లగా మెరుస్తున్న వస్తువు ఒకటి బాగా ఆకర్షించింది. దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూశారు. అక్కడి దృశ్యం చూడగానే కాళ్లూ చేతులూ వణికిపోయి, అంతటి చలిలోనూ ముచ్చెమటలు పట్టేశాయ్. సరస్సు అంచున, నీటి లోపల వందలాది మానవ కంకాళాలు, కపాలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మంచు వాతావరణం వల్ల కొన్ని శవాలకు ఇంకా మాంసం, జుట్టు కూడా అలాగే ఉండిపోయాయి.సరస్సులో కేవలం అస్థిపంజరాలే కాదు, మంచు తీవ్రత వల్ల వందల ఏళ్లు గడిచినా చెడిపోకుండా భద్రంగా ఉన్న కొన్ని అద్భుతమైన పురాతన వస్తువులను కూడా గుర్తించారు. చనిపోయిన వారు ధరించిన తోలు చెప్పులు, బూట్లు, ఉన్ని దుస్తుల ముక్కలు గడ్డకట్టిన మంచు వల్ల అలాగే ఉండిపోయాయి. మహిళలు ధరించిన గాజులు, వెండి, రాగి నగలు లభించాయి. రక్షణ లేదా వేట కోసం ఉపయోగించిన ఇనుప ఈటెలు, కత్తుల ముక్కలు, బాణాలు కూడా దొరికాయి.కొండలు ఎక్కడానికి వారు ఉపయోగించిన గట్టి వెదురు కర్రల ముక్కలు కూడా బయటపడ్డాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఈ వార్త వినగానే ఉలిక్కిపడింది. ఆ సమయంలో భారతదేశంపై దాడి చేయడానికి రహస్యంగా వస్తున్న జపాన్ సైనికుల బృందం ఏమైనా ఇక్కడ చనిపోయిందా? అని అనుమానించింది. వెంటనే సైనిక నిపుణులు రంగంలోకి దిగి ఆ ఎముకలను పరీక్షించారు. అవి దాదాపు 600 నుంచి 800 మందివి అయి ఉండొచ్చని అంచనాకు వచ్చారు. కానీ, అవి ఇటీవలివి కావని, శతాబ్దాల క్రితం నాటివని పరీక్షల్లో తేలడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల దృష్టి ఈ ‘అస్థిపంజరాల సరస్సు’పై పడింది.ఈ అస్థిపంజరాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీతోపాటు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అత్యాధునిక డీఎన్ఏ, కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించారు. అందులో తేలిన విషయాలు పరిశోధకులను నివ్వెరపరచాయి. వారంతా ఒకేసారి చనిపోలేదని, ఎక్కువ శాతం మంది క్రీ.శ. 800 ప్రాంతంలో (1200 ఏళ్ల క్రితం) చనిపోగా.. కొంతమంది క్రీ.శ. 1800 (226 ఏళ్ల క్రితం) ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారని గుర్తించారు.మరింత విచిత్రం ఏమిటంటే, అక్కడ దొరికిన పుర్రెలు, ఎముకలపై ఎలాంటి కత్తుల గాయాలు కానీ, బుల్లెట్ గుర్తులు కానీ లేవు. అంటే అక్కడ ఎలాంటి యుద్ధం జరగలేదు. మరి అంతమంది ఒకేసారి ఎలా చనిపోయారు? ఎముకల తీరును పరిశీలించిన నిపుణులు ఒక సంచలన విషయాన్ని కనుగొన్నారు. ఆ పుర్రెల పైభాగంలో లోతైన ఫ్రాక్చర్లు ఉన్నాయి. అంటే తలపై గట్టి వస్తువు ఏదో బలంగా తాకడం వల్లే వారు చనిపోయినట్టు నిర్ధారించారు.ఆ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన నందాదేవి యాత్రకు వెళ్తున్న బృందంలోని వారివే ఆ మృతదేహాలు అయి ఉంటాయని అంచనా వేశారు. అకస్మాత్తుగా వచ్చిన భయంకరమైన తుఫానులో భారీ వడగళ్లు ఆకాశం నుంచి బాంబుల్లా కురిసి ఉండొచ్చని, తల దాచుకోవడానికి చెట్లు కూడా లేని ఆ గుట్టలపై, ఆ వడగళ్ల దెబ్బలకు తాళలేక వారంతా అక్కడికక్కడే ప్రాణాలు విడిచి ఉండొచ్చని భావించారు.డీఎన్ఏ పరీక్షల్లో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. అక్కడ చనిపోయిన వారిలో మన భారతీయులతో పాటు వేల మైళ్ల దూరంలో ఉన్న తూర్పు మధ్యధరా ప్రాంతానికి (గ్రీస్, క్రేట్ దీవుల పరిసరాలు) చెందిన ప్రజల డీఎన్ఏ కూడా ఉండటంతో శాస్త్రవేత్తలు అవాక్కయ్యారు. అసలు 1800ల కాలంలో అక్కడి ప్రజలు అంత ఎత్తైన హిమాలయ పర్వతాల పైకి ఎందుకు వచ్చారు? ఎలా చనిపోయారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు.రూప్‌కుండ్ చుట్టుపక్కల గ్రామాల్లో శతాబ్దాలుగా ఒక జానపద కథ ప్రచారంలో ఉంది. కన్నౌజ్ దేశానికి చెందిన రాజా జస్ధవాల్, తన గర్భిణి భార్య రాణి బాలాంపాతో కలిసి నందాదేవి యాత్రకు వెళ్లారు. అయితే యాత్ర నియమాలను ఉల్లంఘించి.. వారు సంగీత నృత్యాలతో, ఆడంబరాలతో ఆ పవిత్ర పర్వతాలపై ప్రయాణించారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన నందాదేవి... ఇనుప గుండ్ల లాంటి వడగళ్ల వానను కురిపించి రాజును, అతని సైన్యాన్ని సర్వనాశనం చేసిందని స్థానికులు నమ్ముతారు.రూప్‌కుండ్ సరస్సు కేవలం ఒక మిస్టరీ మాత్రమే కాదు, అదొక ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతం కూడా. ట్రెక్కర్లు ఇప్పటికీ అక్కడికి వెళ్లినప్పుడు సరస్సు చుట్టూ ఎముకలు కనిపిస్తుంటాయి. అయితే, చాలామంది పర్యాటకులు ఆ పురాతన అస్థిపంజరాలను నాశనం చేయడం లేదా లగేజీల్లో దొంగిలించుకుపోతుండటం వల్ల ఈ చారిత్రక సంపద క్రమంగా కనుమరుగవుతోంది.ఎముకలు కొరికే చలిలో, మంచుకొండల మధ్య పడి ఉన్న ఆ అస్థిపంజరాలు... సహజ విపత్తుకు సాక్ష్యాలా లేక ఇంకా ఛేదించని చరిత్రకు ఆనవాళ్లా? సై న్స్ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నా.. రూప్‌కుండ్ సరస్సు రహస్యం ఇప్పటికీ మానవాళికి అంతుచిక్కని మిస్టరీనే!- సత్యకిశోర్ -
కొబ్బరి పీచుతో సముద్ర కాలుష్యానికి చెక్..! టెన్త్ స్టూడెంట్ ఆవిష్కరణ
కాలుష్యంతో నిండిన సముద్రపు నీటిని శుభ్రం చేయడానికి హవాయి హైస్కూల్ విద్యార్థి వేరావాంగ్(vera wang) అద్భుతమైన ఆవిష్కరణకు నాంది పలికాడు. సముద్రపు నీటి నుంచి మైక్రోప్లాస్టిక్, సన్స్క్రీన్లు(మనం స్నానం చేసేటప్పుడు లేదా సముద్రంలో ఈత కొట్టేటప్పుడు ఈ రసాయనాలు నీటిలో కలుస్తాయి.) ఫిల్టర్ చేయడానికి కొబ్బరి వ్యర్థాలు ప్రభావంతంగా పనిచేస్తాయని గుర్తించింది. సాధారణ హైస్కూల్ ప్రాజెక్టుగా మొదలైన ఈ పరిశోధన ఓ సరికొత్త శాస్త్రీయ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. కొబ్బరి పీచులో సహజంగా లభించే శిలీంధ్రాలు ప్లాస్టిక్, సన్‌స్క్రీన్‌ను విచ్ఛిన్నం చేయగలవని తెలిసింది. ఆ నేపథ్యంలోనే కొబ్బరి ఆధారిత సముద్ర ఫిల్టర్లను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌ని రూపొందించాడు. ఈ ఫిల్టర్లలో ఉపరితల నీటి నుంచి మైక్రోప్లాస్టిక్‌లు, సన్‌స్క్రీన్‌ను తొలగించేలా కొబ్బరి ఉప-ఉత్పత్తులను ఉపయోగించినట్లు పేర్కొంది. ఆ విధ్యార్ధి హవాయిలోని మానోవా విశ్వవిద్యాలయంలో ఆంథోనీ అమెండ్ ప్రయోగశాలలో ఈ పరిశోధన చేసింది. కొబ్బరిపీచుకు గాలి, నీరు ప్రవహించడానికి వీలు కల్పించే రంధ్రాల నిర్మాణం ఉందని, ఇది సూక్ష్మజీవుల పెరుగదలకు ఉపకరిస్తుందని గుర్తించింది. అందువల్ల ఈ కొబ్బరి పీచు కేవలం కాలుష్య కారకాలను బంధించడం కంటే ఎక్కువ చేయగలదా అనే దిశగా చేయగా..అది అద్భుతమైన ఫలితాలను అందించిందని తెలిపింది. ఆకొబ్బరిపీచులో సహజంగా లభించే శిలీంధ్ర సముదాయాలు సన్‌స్క్రీన్, ప్లాస్టిక్‌లను విచ్చిన్నం చేయగలదని అధ్యయనంలో నిరూపితమైందని వెల్లడించింది. ఇది పర్యావరణ శుద్ధిలో రెండు దశలను ప్రభావవంతంగా చేయగలదని పేర్కొంది. మాములుగా అయితే సముద్రంలో ప్లాస్టిక్‌ని వడకట్టి..దాన్ని ప్రాసెస్ చేసి విచ్ఛిన్నం చేయడం లేదా రీసైకిల్ చేయడం జరుగుతుంది. కానీ సన్‌స్క్రీన్ సమ్మేళనాలను మాత్రం విచ్చిన్నం చేయడం సులభం కాదు. అవి నీటిలో కలసిపోయి ఉంటాయి. కానీ ఈ కొబ్బరి పీచు ప్లాస్టిక్‌ని వడపోసి విచ్చిన్నం చేయడం తోపాటు సన్‌స్క్రీన్ వంటి ఇతర సమ్మేళనాలను సైతం విచ్చిన్నం చేసి శుభ్రపర్చగలదని వెల్లడించింది వాంగ్. అంతేగాదు ఈ హైస్కూల్ విద్యార్థి వాంగ్ పరిశోధనకు హవాయి స్టేట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్‌లో గుర్తింపు లభించడమే కాకుండా సముద్ర పర్యావరణాలను పీడిస్తున్న కొన్ని అత్యంత మొండి కాలుష్య కారకాలను ఎదుర్కోవడానికి సరికొత్త మార్గాన్ని అందించింది.(చదవండి: ఎవరీ కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్ ? స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీకి..) -
భార్య కోసం అతిపెద్ద పూల తోట..!
ఇటీవల కాలంలో భార్యభర్తల బంధాలు ఎంత ఘోరంగా మారిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. అలాంటి తరుణంలో నెట్టింట వైరల్ అవుతున్న కథ నెటిజన్ల మనసుని అమితంగా ఆకర్షిస్తోంది. వారి 35 ఏళ్ల అనురాగ దాంపత్యానికి ముచ్చటపడి అభినందనలు చెబుతుండటం విశేషం. ఇంతకీ అసలేం జరిగిందంటే..చైనాకి చెందిన జౌజియావోలిన్, తన భార్య యిన్ జీ కోసం భారీ తోటను నిర్మించాడు. అది ఎంత పెద్దదంటే..ప్రపంచంలో అతిపెద్ద ఉద్యానవన తోట. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో అతిపెద్ద రంగరంగు పూల తోట కనువిందు చేస్తోంది. ఆ దంపతులే ఈ భారీ తోటను స్వయంగా చూసుకుంటున్నారు. ఒక టెలివిజన్ షోలో ఈ దంపతులు కనిపించడంతో వారి కథ వెలుగులోకి వచ్చింది. ఆ షో వారిని ఆదర్శ జంటగా అభివర్ణించడం విశేషం.ఇంతకీ జౌజియావోలిన్ ఎందుకు ఈ తోటను నిర్మించాడంటే..2013లో తన భార్య యిన్ బీజింగ్‌లో పెరిగే హాలీహాక్లుగా పిలిచే ఆ పువ్వులంటే తనకెంత ఇష్టమో చెప్పింది. ఆ నేపథ్యంలోనే జౌ ఆమె కోసం ఒక తోటను నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అతనికి తోటపని చేసిన అనుభవం లేదు. అయినా తన సొంత ఇంటిని అమ్మి..ఝువాన్లాంగ్ టౌన్లో సుమారు 80 హెక్టార్ల లోయను కొని, హాలీహాక్ మొక్కలను పెంచడం గురించి నేర్చుకున్నాడు. అలా పదేళ్లకు పైగా దేశ విదేశాల నుంచి విత్తనాలను సేకరించి ఒక పెద్ద తోటనే నిర్మించాడు. అదికాస్తా ఇప్పుడు అతి పెద్ద వైవిధ్యమైన హాలీహాక్ తోటగా ప్రసిద్ధి చెందింది. 35 ఏళ్ల వైవాహిక బంధం వారిది. పిల్లలు లేని ఆ దంపతులు తమ విశ్రాంత జీవితాన్ని పెంపుడు జంతువులు, పూల మొక్కల మధ్య గడుపుతున్నారు. సంప్రదాయబద్ధంగా సంపద లేదా కుటుంబంతో కాకుండా ప్రకృతిలో తమ ఆనందాన్ని వెతుక్కుంటున్న ఈ జంట నిజంగానే ఆదర్శ దంపతులు కదూ..!. నెటిజన్లు కూడా డబ్బు సంపాదించడం, పిల్లలను పెంచడం కంటే జీవితంలో ఇంకా చాలానే ఉందని నిరూపించారు ఈ దంపతులు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..) -
'ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..
పసిబిడ్డలు ఏడిస్తే సహజంగా ఏం చేస్తాం పాలు, లేదా డైపర్ వంటివి తనిఖీ చేస్తాం. ఒకవేళ అవి కాకపోతే భయపడ్డాడేమోనని దగ్గరకి తీసుకోవడం లేదా ఊయల్లో వేసి ఊపడం వంటివి చేస్తే ఆ పసివాడు ఏడుపు ఆపుతాడు. సహజంగా ఎవ్వరైనా ఇలానే చేస్తాం. కానీ ఈసారి నెట్టింట వైరల్ అవుత్తున్న వీడియోలో వ్యక్తి మాదిరి చేసి చూడండి. అంతేగాదు ఈ ఘటన మన ఆధ్యాత్మకి శక్తి గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఉండటం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో క్లిప్‌లో ఒక తండ్రి ఏడుస్తున్న బిడ్డను పట్టుకుని ..నెమ్మదిగా ఓం శబ్దాన్ని ఆలపిస్తాడు. క్షణాల్లో బిడ్డ ఏదో మత్తువచ్చినట్లుగా శాంతించి నిద్రపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య పేరెంటింగ్ హ్యాక్‌గా మారింది. కఈ వీడియోకి మిలియన్లలో వ్యూస్ లైక్‌లు రావడమే గాక నెటిజన్ల మనసుని దోచుకుంది కూడా."ఓం" అనేది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయిన ఒక పవిత్రమైన మంత్రం. దీనికి భారతీయ ఆధ్యాత్మికత, యోగ సంప్రదాయాలలో "ఓం"కు సుదీర్ఘ చరిత్ర ఉంది, అక్కడ దీనిని మంత్రంగా, ధ్యానం చేసేటప్పుడు ఒక సాధనంగా ఉపయోగిస్తారు. అందువల్ల ఈ పద్ధతి భారతీయ తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తుంది. అయితే “ఓం” జపించడం వల్లనే శిశువు ఏడుపు ఆగిపోతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ లయబద్ధమైన శబ్దాలు, పునరావృతమయ్యే ఇంద్రియ అనుభూతి, కదలిక, సంరక్షకుని సాన్నిధ్యం వల్ల శాంతిని చేకూరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే ఈ ఓం మంత్రపై పరిశోధనలు పెద్దలపైనే జరిగాయి. ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీలో 2022లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, ధ్యానంలో ఎటువంటి అనుభవం లేని 33 మంది పెద్దలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఓం జపం చేయడం వల్ల, వాళ్లలో ప్రతికూల భావాలు తగ్గడమే గాక ఆలోచన విధానంలో కూడా మంచి మార్పు వచ్చింది.పేరెంట్స్ ప్రయత్నించొచ్చా?తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, శిశువులలో కడుపునొప్పి, మితిమీరిన ఏడుపు లేదా నిద్ర సమస్యలను 'ఓం' నయం చేస్తుందనడానికి ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవు. అలాగే, ఈ ధ్వని శిశువు నాడీ వ్యవస్థపై ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పడానికి కూడా తగినంత ఆధారాలు కూడాలేవు.అయితే శిశువులు తమ సంరక్షకుల స్వరాలకు లయబద్ధమైన ఇంద్రియ అనుభవాలకు అత్యంత వేగంగా స్పందిస్తారు. అందువల్ల, ఈ "ఓం", శిశువులకు జోలపాట లేదా గుసగుసలు లేదా "ష్ష్ష్" వంటి ఊహించదగిన శ్రవణ సంకేతంగా పనిచేయవచ్చునని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన శిశువు ఏడుపు ఆపడానికి ఇలాంటి "ఓం" టెక్నిక్‌ని అనుసరించడంలో సమస్యల లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ దీన్ని ఓ అద్భుత పరిష్కారంగా మాత్రం చూడొద్దని హెచ్చరిస్తున్నారు. View this post on Instagram A post shared by Siqueiros Bolado (@ck.bolado)గమనిక: ఇది కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన అంశం. అలాగే కొన్ని శబ్దాలు సహజంగా ప్రభావం చూపిస్తాయని అవగాహన కల్పించేందుకు మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం మంచిది. (చదవండి: ఎవరీ యాల్డా మోయిరీ..? ఏకంగా 15 ఏళ్లు..) -
స్నేహితురాలే సొంత చెళ్లెలు! 40 ఏళ్లకు డీఎన్ఏ టెస్టుతో షాక్!
కథల్లో, సినిమాల్లో మాత్రమే కనిపించే కొన్ని అద్భుత సంఘటనలు... కొన్నిసార్లు నిజజీవితంలోనూ చోటుచేసుకుంటుంటాయి. అలాంటి సంఘటనే ఇది. పుట్టిన కొన్నిరోజులకే వేర్వేరు అనాథాశ్రమాలకు చేరి, వేర్వేరు కుటుంబాల్లో పెరిగిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు. నాలుగు దశాబ్దాల తర్వాత డీఎన్ఏ టెస్టు ద్వారా తిరిగి ఒకటయ్యారు.భారతదేశంలో పుట్టిన మీనా గెల్టింక్ (43), మీనాల్ టిజ్సెన్ (44)లను చిన్నప్పుడే నెదర్లాండ్స్‌కు చెందిన రెండు వేర్వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. వారిద్దరు కేవలం 130 కిలోమీటర్ల దూరంలోనే పెరుగుతున్నప్పటికీ తమకు ఒక తోబుట్టువు ఉందనే విషయం ఇద్దరికీ తెలియదు. అయితే 1996లో దత్తత పిల్ల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరిమధ్య స్నేహం ఏర్పడి... సరదాగా ఉత్తరాలలో ‘సిస్’ అని పిలుచుకునేవారు. కానీ కాలక్రమేణా వీరిమధ్య సంబంధాలు తెగిపోయాయి. దాదాపు 15 ఏళ్లపాటు దూరంగా ఉన్నారు.అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘మై హెరిటేజ్’ యాప్ ద్వారా చేసిన డీఎన్ఏ పరీక్ష వీరి జీవితాలను ఒక్కసారిగా మార్చివేసింది. ఫ్రాన్స్‌లో ఉంటున్న మీనాల్ ఫోన్‌కి ఒకరోజు ‘మీనాల్ యువర్ సిస్టర్... 100 శాతం డీఎన్ఏ మ్యాచ్’ అని నోటిఫికేషన్ వచ్చింది. మొదట నమ్మలేకపోయిన మీనాల్, సోషల్ మీడియాలో వెతికి పాత ఫోటోలను పరిశీలించాక... 30 ఏళ్ల క్రితం కలిసిన ఆనాటి టీనేజ్ స్నేహితురాలే తన సొంత చెల్లెలని తెలిసి ఆశ్చర్యపోయింది. ఆ తరువాత వీరిద్దరూ నెదర్లాండ్స్‌లో ఎంతో సంతోషంగా కలుసుకున్నారు.పెంచిన తల్లిదండ్రులున్నప్పటికీ ఇంతకాలం ఏదో ఒక తెలియని లోటు ఉండేదని... తన సోదరి రాకతో జీవితంలో తప్పిపోయిన పజిల్ ముక్క దొరికినట్లుందని మీనా చెబుతోంది. అయితే ‘‘తాము అక్కాచెల్లెళ్లమని తెలియకముందే మంచి స్నేహితులం. నిజానికి మేము మొదటినుంచీ అక్కాచెల్లెళ్లమే, కాకపోతే ఆ విషయం మాకు ఆలస్యంగా తెలిసిందని’’ ఈ సందర్భంగా మీనాల్ చెబుతోంది. -
ఆఫ్రికన్ పాఠశాల విద్యార్థి నోట మన దేశ మహారాజు ప్రసంగం ..!
మన భారతదేశంలో ఎందరో గొప్ప మహారాజులు ఉన్నారు. వాళ్ల గురించి మన చిన్నారులు మాట్లాడితేనే సంబరపడిపోతాం. అప్పుడే వీళ్లకి చరిత్ర గురించి ఎంతో తెలుసు అని గర్వంగా ఫీలవుతాం. అలాంటిది వేరే దేశంలోని ఓ పాఠశాల విద్యార్థి నోట వింటే..కచ్చితంగా విస్తుపోతాం కదా.!. అచ్చం అలాంటి సంఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.అది తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో ఒక పాఠశాలలో రికార్డు చేసిన వీడియోగా తెలుస్తోంది. ఆ వీడియోలో ఒక బాలుడు భారతీదేశానికి చెందిన ప్రముఖ మహారాజు, మరాఠాల ఆరాధ్య దైవం అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఎంత చక్కగానో ప్రసగించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బాలుడు తన ప్రసంగంలో ప్రజల కోసం, న్యాయం కోసం నిలబడిన వీరుడిగానూ, మహిళలను గౌరవప్రదంగా చూసే ధైర్యవంతమైన పాలకుడిగా పరిచయం చేసిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది. చాలా సరళంగా స్పష్టంగా వివరించే విధానం అందరి మనసులను తాకుతుంది. శివాజీ తన దేశాన్ని, ప్రజలను ప్రేమించే పాలకుడిగా వర్ణించి చెబుతాడు. ఆ రాజు న్యాయం, స్వేచ్ఛ కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టేవాడని అద్భుతంగా చెబుతాడు వీడియోలో. చివరగా "ధైర్యంగా ఉండండి, దయగా ఉండండి, మీదేశం పట్ల గర్వపడండి". అని శివాజీ సందేశం ఇస్తూ.."జై భవానీ, జై శివాజీ" అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు ఆ విద్యార్థి. ఆఫ్రికాలోని ఒక తరగతి గదిలో ఒక బాలుడు మహారాష్ట్రకు చెందిన ఒక చారిత్రక వ్యక్తి గురించి మాట్లాడటం భారతీయులందర్నీ భావోద్వేగానికి గురిచేసింది. ముఖ్యంగా మరాఠాకు చెందిన వ్యక్తులు ఆ విద్యార్థి ప్రయత్నాన్ని స్వాగతించడమే గాక చారిత్రక వ్యక్తులు కథలు, విలువలు విద్య ద్వారా సరిహద్దులు దాటగలవని చెప్పే అపురూపమైన క్షణంగా అభివర్ణిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Abhijit | Life in Africa 🇮🇳 🇺🇬 🌍 (@kalashetti_abhijit) (చదవండి: 79 ఏళ్ల తర్వాత..మా ఊరికి బస్సొచ్చిందహో!) -
ప్రపంచంలోనే అతిపెద్ద గుహ.. ఇదొక ట్రావెల్ అడ్వెంచర్!
ప్రపంచంలోనే అతి పెద్ద గుహ అయిన సాన్ డూంగ్ కేవ్‌లోకి ఎంటర్ అయితే మనం మరో గ్రహంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. వియత్నాంలోని ఫోంగ్ నా కే బ్యాంగ్ నేషనల్ పార్క్‌లో సాన్ డూంగ్ కేవ్ ప్రపంచంలోనే అతిపెద్ద నేచురల్ కేవ్‌గా ప్రసిద్ధి పొందింది.ఈ గుహ లోపల పెద్ద పెద్ద అడవులు, ప్రవహిస్తున్న నదులు, 200 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తైన రాక్ వాల్స్, పై నుంచి పడే సూర్య కిరణాలు కలిసి ఒక మ్యాజికల్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. నేచర్ తన కళతో క్రియేట్ చేసిన మాస్టర్ పీస్ అని చెప్పడం అతిశయం కాదు.ఎందుకు స్పెషల్ ?సాన్ డూంగ్ గుహను 1991లో కనుగొన్నారు. కానీ 2009 లో అంతర్జాతీయ పరిశోధకులు పూర్తిగా సర్వే చేసిన అనంతరం ఈ గుహకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. సుమారు 9 కిమీ పొడవు, 200 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గుహలో ఒక చిన్న అడవి, మేఘాలు క్రియేట్ అయ్యే వాతావరణం, అండర్‌గ్రౌండ్ నది కూడా ఉంటాయి. అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద గుహ అని కూడా అంటారు.హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ముందుగా వియత్నాంలోని హానోయ్ లేదా హో చి మిన్ సిటీ కి కనెక్టింగ్ విమానం తీసుకోవాలి. అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్‌లో డాంగ్ హోయ్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. డాంగ్ హోయ్ నుండి సుమారు 45 కిమీ దూరంలో ఫోంగ్ నా విలేజ్‌కి ట్యాక్సీ లేదా షటిల్ బస్‌లో చేరుకోవచ్చు. సాన్ డూంగ్ కేవ్‌కి గవర్నమెంట్ అప్రూవ్డ్ గైడ్ ద్వారా మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి.బడ్జెట్ ఎంత అవుతుంది? అఫిషియల్ సాన్ డూంగ్ ఎక్స్పిడిషన్ అనేది 4 నుంచి 6 రోజులు ఉంటుంది. గైడ్, పర్మిట్స్, క్యాంపింగ్, ఫుడ్ అన్నీ కలిసి ఒక వ్యక్తికి రూ.2 లక్షల 80 వేల నుంచి రూ.3 లక్షల 5 వేల వరకు ఖర్చు అవుతుంది. వియత్నాం ట్రిప్‌ని సాన్ డూంగ్ ఎక్స్పిడిషన్ లేకుండా ఫోంగ్ నా రీజియన్ వరకు ప్లాన్ చేస్తే రూ.60 వేల నుంచి రూ.90 వేల బడ్జెట్లో కంఫర్టబుల్‌గా పూర్తి చేయవచ్చు.ఏం తినాలి?వియత్నాం ఫుడ్ లవర్స్‌కి స్వర్గంలాంటిది. ఒక్క ఫో నూడిల్ సూప్, బాన్ మీ శాండ్విచ్, ఫ్రెష్ స్ప్రింగ్ రోల్స్, కామ్ టామ్ చాలా ఫేమస్. శాఖాహారుల కోసం వెజ్ ఆప్షన్స్ కూడా బాగానే ఉంటాయి. వియత్నాం లోకల్ కాఫీని మాత్రం మిస్ అవ్వకండి.దగ్గర్లో చూడాల్సినవిసాన్ డూంగ్ కేవ్‌తో పాటు ఫోంగ్ నా కేవ్, ప్యారడైజ్ కేవ్, డార్క్ కేవ్, మూక్ స్ప్రింగ్ ఎకో ట్రెయిల్, బొటానిక్ గార్డెన్ లాంటి ప్రాంతాలను అన్వేషించవచ్చు. ఈ ప్రాంతం మొత్తం యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపద కాబట్టి ప్రతీ చోట నేచర్ బ్యూటీ కనిపిస్తుంది.సాహసమే శ్వాసగా సాగిపోయేవారికి, నేచర్, ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్ ఈ నాలుగు మీకు ఇష్టం అయితే సాన్ డూంగ్ కేవ్‌ని లైఫ్‌లో ఒక్కసారి అయినా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశం. ఇది ఒక గుహ మాత్రమే కాదు... భూమిలోపల దాగున్న అద్భుత ప్రపంచం ఇది. వియత్నాం ట్రిప్ ప్లాన్ చేస్తున్న వాళ్లకి ఇది ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. -
విమానం కాలిపోతోంది... కాపాడండి! అర్ధరాత్రి బాలుడి కేకలు..
1945 మార్చి 3 – జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని ఇవోజిమా ద్వీపం...రెండో ప్రపంచ యుద్ధం ఉద్ధృతంగా సాగుతున్న సమయం... అప్పుడే అమెరికాకు చెందిన యుద్ధ విమాన పైలట్ జేమ్స్ హూస్టన్– యుద్ధనౌక నుంచి టేకాఫ్‌కు సిద్ధమయ్యాడు.‘జాక్! ఈరోజు శత్రువుల పీచమణిచి విజయంతో తిరిగొస్తా. పార్టీ చేసుకుందాం’ అని తన సహచరుడికి చెప్పి ఇవోజిమా ద్వీపం వైపు దూసుకెళ్లాడు జేమ్స్ హూస్టన్. జపాన్ సేనలపై బాంబుల వర్షం కురిపించాడు. అయితే, జపాన్ సైన్యం చేసిన దాడిలో ఇంజిన్‌కు మంటలంటుకుని విమానం సముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న జేమ్స్ చనిపోయాడు.2000 ఏప్రిల్ 10 – అమెరికాలోని లూసియానాలో నివసించే బ్రూస్ లైనింజర్, ఆండ్రియా లైనింజర్ దంపతులు తమ రెండేళ్ల కుమారుడు జేమ్స్ లైనింజర్తో కలిసి ఎప్పటిలాగే నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆ బాలుడు గట్టిగా కేకలు వేశాడు.‘విమానం కాలిపోతోంది! మంటలు అంటుకున్నాయి! ఆ చిన్న మనిషి బయటకు రాలేకపోతున్నాడు... కాపాడండి!’ అంటూ అరిచాడు. దీంతో ఉలిక్కిపడ్డ అతడి తల్లిదండ్రులు జేమ్స్‌ను దగ్గరకు తీసుకుని బుజ్జగించి నిద్రపుచ్చారు. ఇక ఆ రోజు నుంచి వారికి నిద్ర కరువైంది. ప్రతిరోజూ రాత్రివేళ నిద్రపోతున్న బాలుడు ఉన్నట్టుండి గాల్లో కాళ్లు, చేతులు విసిరేస్తూ, ఊపిరి ఆడనట్లు విలవిలలాడిపోయేవాడు. చెమటలతో తడిసిపోతూ గట్టిగా కేకలు వేసేవాడు.వారంలో నాలుగైదు రోజులు ఇదే సీన్. మొదట్లో తల్లిదండ్రులు ఏదో పీడకల అనుకున్నారు. కానీ అంతకంతకూ ఆ చిన్నారి ప్రవర్తన విచిత్రంగా మారింది. బొమ్మ విమానాలతో ఆడుకుంటూ, వాటిని నేలకేసి కొడుతూ ‘విమానం క్రాష్ అయిపోయింది’ అని అరిచేవాడు.రోజులు గడిచేకొద్దీ ఆ చిన్నారి చెబుతున్న మాటలకు తల్లిదండ్రులు షాకయ్యేవారు. ఆ వయసు పిల్లలకు అస్సలు తెలియని ‘విమాన çపరిభాష’ గురించి జేమ్స్ మాట్లాడటం చూసి నిర్ఘాంతపోయేవారు. విమానం కింద ఉండే ‘డ్రాప్ ట్యాంక్’ గురించి, దాన్ని ఎలా డిస్కనెక్ట్ చేయాలో స్పష్టంగా చెప్పేవాడు. దీంతో ఒకరోజు తండ్రి బ్రూస్ తన కొడుకుని దగ్గరకు తీసుకుని నెమ్మదిగా ఆరా తీశాడు.‘నాన్నా, అసలు ఆ విమానం ఎక్కడి నుంచి ఎగిరేది?’ అని అడిగితే, ‘అది నటోమా అనే పెద్ద యుద్ధనౌక మీద నుంచి ఎగిరేది డాడీ’ అని బదులిచ్చాడు. ఆ చిన్న మనిషి ఎవరు నాన్నా అని ప్రశ్నిస్తే, ‘అది నేనే.. నా పేరు కూడా జేమ్సే’ అని సమాధానమిచ్చాడు. ‘నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా?’ అంటే.. ‘నా బెస్ట్ ఫ్రెండ్ జాక్ లార్సన్ నాతోనే ఉండేవాడు’ అని చెప్పాడు. ‘జపాన్ సైనికులు తన విమానం ఇంజిన్ పై దాడి చేసి కూల్చివేశారు. విమానానికి మంటలు అంటుకుని సముద్రంలో పడిపోయి చనిపోయాను’ ఆ పసివాడు కళ్లు పెద్దవి చేసి మరీ వివరించాడు.ఇదంతా పసివాడి ఊహాజనిత కథ అని నిరూపించాలని బ్రూస్ నిశ్చయించుకున్నాడు. సైనిక రికార్డులు, రెండో ప్రపంచ యుద్ధ పత్రాలను జల్లెడ పట్టాడు. అవి చూసిన తర్వాత ఆయన వెన్నులో వణుకు పుట్టింది.పసిఫిక్ మహాసముద్రంలో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పేరు యూఎస్ఎస్ నటోమా బే అని, ఆ నౌకపై జాక్ లార్సన్ అనే పైలట్ పనిచేశాడని, అప్పటికి ఆయన ఇంకా జీవించే ఉన్నాడని తెలుసుకున్నాడు.1945 మార్చి 3న జేమ్స్ హూస్టన్ జూనియర్ అనే 21 ఏళ్ల పైలట్ విమానంపై జపాన్ సైనికులు దాడి చేయడంతో అది సముద్రంలో కూలిపోయి అతడు మరణించాడని మిలిటరీ రికార్డులను బట్టి బ్రూస్ నిర్ధారణకు వచ్చాడు. ఈ నమ్మలేని నిజాలను ప్రత్యక్షంగా నిరూపించుకోవడానికి లైనింజర్ కుటుంబం– చనిపోయిన పైలట్ జేమ్స్ హూస్టన్ సోదరి యాన్ బారన్ దగ్గరకు వెళ్లింది. అప్పటికి వృద్ధురాలైన యాన్ బారన్ ను చూడగానే జేమ్స్– పరిగెత్తుకుంటూ వెళ్లి ‘అక్కా’ అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు. వారి చిన్నతనంలో ఆడుకున్న ఆటలు, హూస్టన్ ఇంట్లో ఉన్న బొమ్మల పేర్లు, కేవలం ఆ ఇద్దరికీ మాత్రమే తెలిసిన కుటుంబ విషయాలను పూసగుచ్చినట్లు చెప్పాడు.అవన్నీ విన్న తర్వాత ఆనందబాష్పాలతో యాన్ బారన్ అన్న మాట: ‘ఇతడు నా తమ్ముడు జేమ్స్ హూస్టన్... నా తమ్ముడే మళ్లీ పుట్టాడు’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అనంతరం అప్పటికి బతికి ఉన్న సహచర పైలట్ జాక్ లార్సన్ను కలిసినప్పుడు కూడా చిన్నారి జేమ్స్ ఆయనను గుర్తుపట్టి, నాటి యుద్ధ జ్ఞాపకాలను పంచుకున్నాడు.చిన్నారి జేమ్స్ లైనింజర్ కథ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియాను, పారాసైకాలజీ పరిశోధకులను ఆకర్షించింది. గత జన్మ వివరాలన్నీ చెప్పిన జేమ్స్... తను మరణించిన జపాన్ సముద్ర తీర ప్రాంతానికి వెళ్లి నివాళులర్పించాడు. అంతే, అప్పటి నుంచి అతడికి పీడకలలు రావడం ఆగిపోయాయి. శాస్త్రవేత్తలు, డాక్టర్లు దీనికి ఎటువంటి శాస్త్రీయ వివరణ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం సాధారణ యువకుడిలా జీవితం గడుపుతున్న జేమ్స్ లైనింజర్ కథ– ‘పునర్జన్మ’ ఉందనే నమ్మకానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన, సజీవ ఆధారంగా ఉంది.- సత్యకిశోర్ కొండ్రెడ్డి -
కీబోర్డ్‌లో 'ఎఫ్, జే' కీలపై గీతలు ఎందుకుంటాయో తెలుసా?
మనలో చాలామంది ప్రతిరోజూ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ కీబోర్డ్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే, కీబోర్డ్‌లోని ‘ఎఫ్’, ‘జె’ అనే రెండు కీస్పై చిన్న ఎత్తుగా ఉండే గీతలు లేదా బంప్స్ ఉంటాయి. ఇవి ఎందుకుంటాయో ఎపుడైనా ఆలోచించారా? ఈ గీతలను టచ్ టైపింగ్ సౌకర్యం కోసం తయారుచేశారు.కీబోర్డ్ వైపు చూడకుండానే వేగంగా టైప్ చేయడానికి ఈ గీతలు ఎంతగానో ఉపయోగపడతాయి. టైపింగ్ నేర్చుకునే సమయంలో చేతి వేళ్లను కీబోర్డ్ మధ్య వరుసలో ఉంచడాన్ని ‘హోమ్ రో’ అంటారు. ఎడమ చేతి చూపుడు వేలిని ‘ఎఫ్’ పై, కుడి చేతి చూపుడు వేలిని‘జె’పై ఉంచడానికి ఈ గీతలు సూచికగా పనిచేస్తాయి.అంతేకాదు టైప్ చేసేటప్పుడు ప్రతిసారీ కీబోర్డ్ వైపు చూడాల్సిన అవసరం లేకుండా, వేళ్ల స్పర్శ ద్వారా చూపుడు వేళ్లు సరైన స్థానంలో ఉన్నాయో లేదో గుర్తించవచ్చు. వేళ్లు సరైన స్థానంలో ఉండటం వల్ల సమయం ఆదా అయి, టైపింగ్ వేగం పెరుగుతుంది. స్క్రీన్ నుంచి దృష్టి మళ్లించకుండా టైప్ చేయడం వల్ల కళ్లకు విశ్రాంతి లభిస్తుంది. చూపు లేనివారు లేదా కీబోర్డ్ చూడకుండా టైప్ చేయాలనుకునే వారి కోసం జాన్ ఇ బార్ట్లీ అనే మహిళ ఈ టెక్నిక్‌ను రూపొందించి.. 2002లో పేటెంట్ పొందారు. -
తిమింగలాల వమనంతో పరిమళద్రవ్యం..!
సాధారణంగా పర్ఫ్యూమ్ల తయారీలో పువ్వులు, వేర్లు; కొన్నిరకాల జంతువుల నుంచి సేకరించిన పదార్థాలను ఉపయోగిస్తారు. తిమింగలాల వమనం(వాంతి)తో కూడా పర్ఫ్యూమ్ను తయారు చేస్తారంటే నమ్మశక్యంగా ఉండదు గాని, ఇది నిజం.ఈజిప్టు నాగరికత కాలం నుంచి వాడుకలో ఉన్న అత్యంత పురాతన పరిమళద్రవ్యం ఇది. తిమింగలాలు తినే కదంబ చేపలు, కనవ చేపలలోని అరగని భాగం గట్టి వ్యర్థపదార్థంగా మారి, తిమింగలాల వమనంలో బయటకు వస్తుంది. దీనిని ‘అంబర్గ్రిస్’ అంటారు. దీనిని ఇప్పటికీ పర్ఫ్యూమ్ల తయారీలో వినియోగిస్తున్నారు. -
గుడ్డు.. ‘నువ్వు ఇంటికి తిరిగి వెళ్తూండగా మరణించావు.’
‘‘నువ్వు ఇంటికి తిరిగి వెళ్తూండగా మరణించావు.’’‘‘నీకు పిచ్చా?’’ వెంటనే అడిగాను.‘‘అదో కారు ప్రమాదంలో జరిగింది. నువ్వు నీ భార్యని, ఇద్దరు పిల్లలని వదిలి ఇక్కడికి వచ్చావు. నీది బాధలేని తక్షణ మరణం.’’‘‘నేను... నేను నిజంగా చచ్చిపోయానా?‘‘అవును.’’ నేను చుట్టూ చూశాను. అంతా శూన్యం. ఆశ్చర్యంగా భూమి కాని, ఆకాశం కాని కనపడలేదు. కేవలం అతను, నేను మాత్రమే ఉన్నామని గ్రహించాను.‘‘ఈ ప్రదేశం ఏమిటి? ఇదేనా మరణానంతర జీవితం?’’ అడిగాను.‘‘అవును.’’ అతను చెప్పాడు.‘‘నువ్వు దేవుడా?’’ ‘‘అవును. నేను దేవుడిని.’’ అతను బదులు చెప్పాడు.నేను ఆసక్తిగా చూశాను. అతను దేవుడిలా కనిపించలేదు. సర్వశక్తిమంతుడిలా కూడా కాదు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిలా కనిపించాడు.‘‘నా భార్య, పిల్లలు నా గురించి ఏడుస్తున్నారా?’’‘‘నీ భార్య పైకి ఏడుస్తూ లోపల ఉపశమనం పొందుతోంది. ఐతే నీకు ఊరటని ఇచ్చేది, ఉపశమనం పొందినందుకు ఆమెలో చాలా అపరాధభావం ఉంది.’’‘‘ఇప్పుడు నేను స్వర్గానికో, నరకానికో లేక ఇంకెక్కడికైనా వెళ్తానా?’’ అడిగాను.‘‘రెండూ కాదు. నువ్వు పునర్జన్మ ఎత్తుతావు.’’‘‘అంటే భగవద్గీతలో చెప్పింది నిజమే అన్నమాట.’’‘‘ప్రతి మతం దాన్నే తనదైన పద్ధతిలో చెప్పింది.’’‘‘నేను మళ్ళీ జన్మించాక ఓ ఖాళీ పలకలా ఉంటానా? పసిబిడ్డలా. ఈ జీవితంలో నేను నేర్చుకున్నవి, నా అనుభవాలు ఏవీ నాతో రావా?’’‘‘నీ గత జన్మలన్నింటి జ్ఞానం నీలో ఉంది. కాని అవి నీకు ఇప్పుడు గుర్తులేవు. నీ ఆత్మ ఎంత అద్భుతమైందో, విశాలమైందో నీకు తెలీదు. నీ మనసు నీలోని అత్యంత చిన్న భాగాన్ని మాత్రమే ఇముడ్చుకోగలదు. అది నీళ్ళు వేడిగా ఉన్నాయో, చల్లగా ఉన్నాయో చూడటానికి గ్లాసు నీళ్ళలో వేలు ముంచడం లాంటిది. దాన్ని తిరిగి బయటకి తీసినప్పుడు, అది పొందిన అనుభవాలన్నీ నీలో నిక్షిప్తమవుతాయి. నువ్వు ఇంకా విస్తరించలేదు. నీ అపారమైన చైతన్యంలోని మిగిలినవన్నీ నువ్వు అనుభూతి చెందలేదు.’’‘‘నేను ఎన్నిసార్లు పునర్జన్మ ఎత్తాను?’’‘‘చాలాసార్లు. ఎన్నో రకాల జీవితాల్లోకి ప్రవేశించావు. సాంకేతికంగా చెప్పాలంటే నీకు తెలిసిన కాలం నువ్వు జీవించిన విశ్వంలో మాత్రమే ఉంటుంది. కాని కాలం నిజం కాదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నీకు చెప్పినా ఇప్పుడు అర్థం కాదు.’’‘‘నేను గతంలో మరణించినప్పుడల్లా నీతో ఇలా సంభాషించానా?’’‘‘అవును. అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నువ్వు గుడ్డు మాత్రమే కాబట్టి అది నీకు గుర్తు లేదు.’’‘‘దీని ప్రయోజనం?‘‘‘‘నేను ఈ విశ్వాన్ని సృష్టించడానికి కారణం, నువ్వు పరిణతి చెందడమే.’’‘‘నేను మాత్రమేనా? లేక మానవాళి మొత్తం పరిణతి చెందాలనా?’’‘‘లేదు. కేవలం నువ్వు మాత్రమే. నేను ఈ విశ్వాన్ని నీ కోసమే సృష్టించాను. ప్రతి కొత్త జీవితంలో నువ్వు ఎదుగుతూ, పరిణతి చెందుతూ మరింతగా విస్తరిస్తావు.’’‘‘నేనేనా? అంతానా?’’‘‘మరెవరూ లేరు. ఈ విశ్వంలో నువ్వు మాత్రమే ఉన్నావు.’’నేను అతని వంక పిచ్చివాడిని చూసినట్లుగా చూశాను.‘‘భూమి మీది ప్రజలందరి మాటేమిటి?’’‘‘అంతా నువ్వే. అవన్నీ నీ విభిన్న అవతారాలు.’’‘‘ఆగాగు. నేను అందరినా !?’’‘‘ఇప్పుడు నీకు అర్థమవుతోంది.’’‘‘ఇప్పటివరకు జీవించిన ప్రతి మానవుడినీ నేనే?’’ తెల్లబోతూ అడిగాను.‘‘అవును.’’‘‘నేను గాంధీనా?’’‘‘నువ్వు గాడ్సేవి కూడా.’’‘‘నేనే హిట్లర్నా?’’ దిగ్భ్రాంతిగా అడిగాను.‘‘అతను చంపిన లక్షలాదిమంది కూడా నువ్వే. నువ్వు ఎవరినైనా బాధించిన ప్రతిసారీ, నువ్వు నిన్నే బాధించావు. నువ్వు ఇతరులకి చేసిన ప్రతి మంచి పనీ నీకోసమే చేసుకున్నావు. ఏ మనిషైనా అనుభవించిన ప్రతీ సంతోషం, ప్రతీ బాధ నువ్వే అనుభవించావు, ఇకపైనా అనుభవిస్తావు.’’ అతను చెప్పాడు.‘‘ఇదంతా ఎందుకు?’’‘‘ఎందుకంటే ఏదో రోజు నువ్వు నాలా మారడానికి. నువ్వు నాలాంటి వాడివే. నిజానికి నువ్వే నేను. నేనే నువ్వు.’’‘‘అంటే నేను కూడా దేవుడినా?’’‘‘ఇంకా కాదు. నువ్వు నా ఊహవి. నేను నీ ఊహని. నువ్వు ఇంకా ఎదుగుతున్నావు. సకల కాలాల్లోని ప్రతి మానవ జీవితాన్నీ నువ్వు గడిపిన తర్వాత, ప్రతీ జన్మలోనూ ఎదుగుతూంటావు.’’‘‘ఐతే నేనో గుడ్డుని అన్నమాట.’’ నేను చెప్పాను.‘‘అవును. నేను కూడా నీ గుడ్డుని. ఇప్పుడు నువ్వు నీ తర్వాతి జీవితానికి వెళ్ళే సమయం వచ్చింది.’’ అతను చెప్పాడు.- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
9 ఏళ్ల చిన్నారి.. రెండు జన్మల కథ!
సూర్యుడు నడినెత్తి మీదకు వస్తున్నాడు. మధుర పట్టణంలోని ద్వారకాధీశ్ ఆలయ పరిసరాల్లో రద్దీ ఓ మోస్తరుగా ఉంది. అప్పుడే అక్కడ అడుగుపెట్టిన తొమ్మిదేళ్ల శాంతిదేవి కళ్లలో ఒక విచిత్రమైన శూన్యం, అంతకంటే వింతైన వెలుగు కనిపిస్తున్నాయి.ఆమె ఆ ఊరికి రావడం ఇదే మొదటిసారి. కానీ, ఆమె అడుగులు మాత్రం వడివడిగా ముందుకు పడుతున్నాయి. ఆమెతోపాటు ఉన్న 15 మంది ప్రముఖులు ఒకింత ఆశ్చర్యం, మరికొంత ఉత్కంఠతో వెనకే వెళ్తున్నారు. ఆ బాలిక ఓ ఇంటి ముందు ఆగి, ‘ఇదే నా ఇల్లు..’ అని చెప్పి తలుపు తట్టింది. లోపలి నుంచి వచ్చిన వ్యక్తిని చూసి.. ‘ఏవండీ ఎలా ఉన్నారు’ అని అడిగేసరికి వారంతా నిర్ఘాంతపోయారు.1926 డిసెంబరు 11న ఢిల్లీలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది శాంతిదేవి. నాలుగేళ్ల వయసు వచ్చే వరకు అందరిలాగా ఆటపాటలతో గడిపింది. కానీ, మాటలు స్పష్టంగా వస్తున్న కొద్దీ ఆమె ప్రవర్తనలో మార్పు రాసాగింది. అద్దం ముందు నిలబడి.. ‘ఇది నేను కాదు, నా ముఖం ఇలా ఉండదు’ అని విచారంగా అనుకునేది.మొదట్లో తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె చెప్పే మాటలు వారిని భయాందోళనలకు గురిచేశాయి. ‘నా పేరు శాంతిదేవి కాదు, నేను లుగ్దీదేవిని. మధుర నా సొంతూరు. నాకు పెళ్లయింది. నా భర్త పేరు కేదార్నాథ్ చౌబే. ఒక బాబుకు జన్మనిచ్చిన తొమ్మిది రోజులకే నేను కన్నుమూశాను’ అంటూ ఏడ్చేది. ఈ విషయం శాంతిదేవి చదువుకునే స్కూలు టీచరుకు తెలియడంతో ఆయనకు ఆసక్తి కలిగి ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కేదార్‌నాథ్‌కు లేఖ రాశారు.ఆశ్చర్యం.. అక్కడ నుంచి జవాబు వచ్చింది. తన పేరు కేదార్నాథ్ చౌబే అని, లుగ్దీదేవి తన భార్యే అని, ఆమె 1925లో చనిపోయిందని చెప్పడంతో ఆ టీచరుకు నోటమాట రాలేదు. వెంటనే కేదార్‌నాథ్‌కు విషయాలన్నీ వివరించి ఢిల్లీ రావాలని కోరారు. ఈ విషయాలేవీ శాంతిదేవికి చెప్పకుండా కేదార్‌నాథ్‌ను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లారు. ఆయన్ను చూసిన శాంతిదేవి– ఎంతో ఉద్విగ్నతకు లోనై, ‘ఏవండీ..’ అంటూ పిలిచేసరికి కేదార్నాథ్ బిత్తరపోయారు. ఎందుకంటే తనను అలా పిలిచే ఏకైక వ్యక్తి ఆయన భార్య మాత్రమే. కానీ ఆమె మరణించిన పదేళ్ల తర్వాత ఓ చిన్నారి అలా పిలిచేసరికి ఆయన షాక్‌లో ఉండిపోయారు. తమ ఇద్దరికీ మాత్రమే తెలిసిన ఎన్నో వ్యక్తిగత విషయాలను శాంతిదేవి ప్రస్తావించడంతో ఆమె గత జన్మలో తన భార్యే అని కేదార్నాథ్ నిర్ధారణకు వచ్చారు.ఈ వార్త మహాత్మా గాంధీ వరకు చేరింది. దీంతో 1935లో శాంతిదేవిని, ఆమె తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. చిన్నారి చెప్తున్న విషయాల్లోని నిజాయతీని గమనించిన ఆయన.. లోతైన విచారణ కోసం 15 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.కమిటీ సభ్యులు శాంతిదేవిని తీసుకొని 1935 నవంబరులో ఢిల్లీ నుంచి మధురకు రైలులో బయలుదేరారు. ఢిల్లీ దాటి ఎప్పుడూ వెళ్ళని ఆ బాలిక మధుర స్టేషన్ రాగానే స్థానిక ‘బ్రజ్’ యాసలో అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టింది. స్టేష¯Œ లో దిగగానే, గత జన్మలో తన భర్తకు పెద్దన్నయ్య అయిన వ్యక్తిని గుర్తుపట్టింది. అక్కడి నుంచి తన పాత ఇంటికి వారందరినీ తీసుకువెళ్లింది.ఒక గదిలో నేల కింద తాను దాచిన డబ్బు గురించి చెప్పింది. అయితే అక్కడ తవ్వగా ఖాళీ డబ్బా మాత్రమే దొరికింది. కమిటీ సభ్యులు శాంతిదేవి వైపు అనుమానంగా చూశారు. ఆ క్షణంలో కేదార్నాథ్ కన్నీళ్లు పెట్టుకుంటూ.. ‘ఆ డబ్బు లుగ్దీదేవి చనిపోయాక నేనే తీశాను’ అని అంగీకరించడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అలాగే తమ కుమారుడి చిన్నప్పటి గుర్తులు కూడా చెప్పి అందరినీ విస్తుపోయేలా చేసింది.శాంతిదేవి చెప్పిన చాలా అంశాలు వందకు వంద శాతం సరిపోయాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. పలువురు పారానార్మల్ పరిశోధకులు కూడా శాంతిదేవి కేసును పునర్జన్మలకు సంబంధించిన బలమైన ఉదాహరణగా ప్రస్తావించారు. అయితే, దీనిపై శాస్త్రీయంగా ఏకాభిప్రాయం రాలేదు. కొందరు దీనిని పునర్జన్మకు ఆధారంగా పేర్కొన్నారు. మరికొందరు మెదడులోని పాత జ్ఞాపకాల పొరలని వాదించారు.ఓవైపు ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు.. మరోవైపు గత జన్మ తాలూకు జ్ఞాపకాలు.. ఇలా జీవితాంతం రెండు జన్మల మధ్య బతికిన శాంతిదేవి వివాహం చేసుకోకుండా తన 61వ ఏట 1987లో మరణించారు.- కె.సత్యకిశోర్ -
15 చెర్రీలు.. ధర లక్షల్లో! జపాన్ పండుకు ప్రపంచం ఫిదా!
మామూలుగా చెర్రీ ధర కిలోకు రెండువందల నుంచి నాలుగువందల రూపాయలు ఉంటుంది. కొన్ని అరుదైన రకాల చెర్రీ ధర కిలోకు మూడువేల రూపాయల వరకు కూడా ఉంటుంది. జపాన్‌లో పండే ఈ అత్యంత అరుదైన చెర్రీ ధర మాత్రం చుర్రుమనిపిస్తుంది.ఈ చెర్రీ రకం పేరు ‘అమరీ హార్ట్‌బీట్’. జపాన్‌లో పండించే చెర్రీ రకాలలో ఇవి అత్యంత అరుదైనవి. వీటిని కిలోల లెక్కన కాకుండా, పదిహేనేసి చొప్పున ప్యాక్‌చేసి, అందమైన ప్యాకెట్లలో విక్రయిస్తారు. ఇవి ఇతర రకాల చెర్రీల కంటే ఎక్కువ తీపిగా ఉంటాయి. వీటిలో చక్కెర శాతం మిగిలిన చెర్రీ రకాల కంటే ఇరవై శాతం ఎక్కువగా ఉంటుంది.ఈ చెర్రీలను ఎక్కువగా వేలం పాటల్లో విక్రయిస్తుంటారు. వేలంలో పదిహేనేసి చెర్రీలు ఉండే ఒక్కో ప్యాకెట్ ధర నాలుగున్నర లక్షల నుంచి ఆరులక్షల యెన్ల వరకు పలుకుతుంటుంది. ‘అమరీ హార్ట్‌బీట్’ చెర్రీలలో అత్యంత నాణ్యమైన వాటిని వేరుచేసి, వేలంశాలల్లో విక్రయిస్తుంటారు. మిగిలిన వాటిని లగ్జరీ ఫ్రూట్ షాపుల్లో అమ్ముతుంటారు. లగ్జరీ ఫ్రూట్ షాపుల్లో వీటి ధర ఒక్కో ప్యాకెట్‌కు యాభైవేల యెన్ల వరకు ఉంటుంది. -
పుచ్చకాయలో దాగిన ఆరోగ్య రహస్యాలు..
పుచ్చకాయకు దాదాపు నాలుగువేల ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. ప్రాచీన ఈజిప్షియన్లు ఎడారి దారుల్లో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలను తప్పనిసరిగా వెంట తీసుకుపోయేవారు.ఆఫ్రికాలో మొదలైన పుచ్చకాయ ప్రస్థానం దాదాపు ప్రపంచమంతటా పాకింది. పుచ్చకాయ ఏడాది పొడవునా పండుతుంది. వేసవి ప్రారంభం నుంచి వేసవి ముగిసే లోపు అత్యధికంగా పండుతుంది.పుచ్చకాయలో అత్యధిక శాతం నీరు ఉంటుంది. వేసవిలో దాహార్తి నుంచి ఉపశమనం కోసం బాగా పనికొస్తుంది. పుచ్చకాయలో అనేక విలువైన పోషకాలు కూడా ఉంటాయి. రుచులకు మెచ్చుకాయ అయిన పుచ్చకాయ విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం... -
కరీబియన్ వేడుక... కెనడా వేదిక
ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద కరీబియన్ సాంస్కృతిక వేడుకకు కెనడాలోని టొరంటో నగరం వేదికగా నిలుస్తోంది. ‘టొరంటో కరీబియన్ కార్నివాల్’ ఈ ఏడాది 59వ వసంతంలోకి అడుగుపెట్టింది.ఈ వేడుకల్లో అత్యంత కీలకమైన గ్రాండ్ పరేడ్ ఆగస్టు ఒకటిన టొరంటో ఎగ్జిబిషన్ ప్లేస్‌లో అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది. కరీబియన్ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి ఇప్పటికే లక్షలాది మంది పర్యాటకులు టొరంటోకు చేరుకున్నారు.ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలు..ప్రస్తుతం ఈ కార్నివాల్లో భాగంగా కంటికిఇంపుగా సాగే భారీ పరేడ్లు, సంగీత పోటీలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీబియన్ దీవుల నుంచి వచ్చిన కళాకారుల సంగీత హోరు, రంగురంగుల దుస్తులలో నృత్యాలు చేస్తూ సాగే పరేడ్లు సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఒకనాడు చిన్నగా ప్రారంభమైన ఈ పండుగ, నేడు ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఎదిగి, టొరంటో నగర వైభవాన్ని ప్రపంచానికి చాటుతోంది.టొరంటో ఆర్థిక వ్యవస్థకు ఏటా అర బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని అందించే ఈ కరీబియన్ కార్నివాల్ ఉత్సవ ప్రస్థానం 1967లో ప్రారంభమైంది. కెనడా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, అక్కడ నివసిస్తున్న కరీబియన్ సమాజం తమ సాంస్కృతిక మూలాలను చాటుకోవడానికి 1967లో ‘కరిబానా’ పేరుతో ఈ వేడుకను మొదటిసారిగా ప్రారంభించింది. నాటి యోంగ్ స్ట్రీట్‌లో జరిగిన తొలి పరేడ్‌లో దాదాపు యాభైవేల మంది పాల్గొన్నారు. కెనడాకు కరీబియన్ ప్రజలు అందించిన ఈ బహుమతే, కాలక్రమేణా నేటి భారీ అంతర్జాతీయ ఉత్సవానికి బలమైన పునాదిగా మారింది.కరీబియన్ ప్రాంతంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ వేడుక ‘కరీబానా’ పేరుతో మొదలైంది. తరువాతి కాలంలో ఈ పేరును ‘టొరంటో కరీబియన్ కార్నివాల్‘గా మార్చారు. కెనడాలో స్థిరపడిన కరీబియన్ ప్రజల సాంస్కృతిక పరిరక్షణకు, వారి ఆర్థిక స్వావలంబనకు ఈ వేడుక ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.- రమా జంబుల -
మటన్ నల్లీ వివాదంలో నలిగిన పెళ్లి!
‘పెళ్లి బాజాలు మోగాయి.. తలంబ్రాలు పడాల్సిందే.. కానీ, ఇంతలోనే పన్నీర్ ముక్క ప్లేట్లో పడలేదు! మటన్ నల్లీ కనబడలేదు! ఇంకేముంది.. అప్పటి వరకు సందడిగా కనిపించిన వివాహ వేదిక.. ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. ఫైనల్‌గా పెళ్లి క్యాన్సిల్. ఒక్కటి కావాల్సిన జంట చెరోదారిన వెనుదిరిగింది. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. ఈ మధ్యకాలంలో ఇలాంటి అనూహ్యమైన విచిత్రాలు, ఊహించని వివాదాలు తరచుగా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉన్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు..మటన్ నల్లీ వివాదం.. తెలంగాణలో జరిగిన ఈ సంఘటనలో వధువు తరఫు వారు ఏర్పాటు చేసిన నాన్ వెజ్ మెనూలో మటన్ బోన్ మ్యారో లేకపోవడమే గొడవకు ప్రధాన కారణం. దీనిని తమకు అవమానంగా భావించిన వరుడు కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో జీవితాంతం ఒక్కటిగా ఉండాల్సిన బంధం పెళ్లిపీటల దగ్గరే తెగిపోయింది.మటర్ పన్నీర్లో ‘పన్నీర్’ ఏది?సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ సంఘటనలో మటర్ పన్నీర్ కూర ఘర్షణకు దారితీసింది. అతిథులు ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ డిష్‌లో అసలు పన్నీర్ ముక్కలే కనిపించకపోవడంతో వివాదం మొదలైంది. వధువు, వరుడి తరఫు బంధువుల మధ్య చిన్నగా ప్రారంభమైన మాటల యుద్ధం కాస్తా .. దాడిచేసుకునే వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయింది.స్నేహితుల మాటతో పెళ్లి క్యాన్సిల్స్నేహితుల సలహాతో వధువు తన వివాహాన్ని రద్దు చేసుకున్న విచిత్ర సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతికి ఆమె కుటుంబ సభ్యులు 30 ఏళ్ల మేనబావతో వివాహం నిశ్చయించారు. అయితే తన స్నేహితులతో చర్చించిన అనంతరం, ఈ సంబంధం సరికాదని భావించిన వధువు పెళ్లిని రద్దు చేసుకుంది.డబ్బులు లెక్కించలేదని!ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో డబ్బులు లెక్కపెట్టలేని వరుడిని చూసి వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. వివాహ తంతు జరుగుతుండగా వరుడి ప్రవర్తనపై పూజారికి అనుమానం వచ్చి వధువు కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. సందేహంతో వరుడికి కొన్ని కరెన్సీ నోట్లు ఇచ్చి లెక్కపెట్టమనగా, అతడు లెక్కపెట్టలేక నిలబడిపోయాడు. దీంతో వరుడి మానసిక స్థితి సరిగ్గా లేదనే నిజాన్ని అతని కుటుంబం దాచిపెట్టిందని గ్రహించి వధువు వివాహాన్ని రద్దు చేసుకుని పెళ్లిపీటల నుంచే వెళ్లిపోయింది.డ్యాన్స్ వద్దనడంతో..పెళ్లి ఊరేగింపులో వధువు డ్యాన్స్ చేయడాన్ని వరుడు నిరాకరించాడని.. పెళ్లిని రద్దు చేశాడు వధువు తండ్రి. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో చిన్న విషయంలో మొదలైన వివాదం పెళ్లి ఆగిపోయేలా చేసింది. పెళ్లి వేడుకలో భాగంగా ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువులు డ్యాన్స్‌లు చేస్తుండగా.. వధువరులిద్దరినీ డ్యాన్స్ చేయాల్సిందిగా వారి స్నేహితులు కోరారు. దీనికి వరుడు నిరాకరించడంతో పాటు వధువు డ్యాన్స్ చేయడాన్ని కూడా వరుడు నిరాకరించాడు. దీంతో వధువు తండ్రి పెళ్లిని రద్దు చేశాడు. విందులో వంటకాల పట్ల వచ్చిన చిన్నపాటి అసంతృప్తులు హాస్యంగా అనిపించినప్పటికీ, పెళ్లి సంబంధాల్లో పారదర్శకత లోపించడం, నిజాలు దాచడం వంటి విషయాలు పీటల మీద పెళ్లిళ్లు ఆగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. -
అరే.. అలా కూడా ఫ్రెండ్షిప్ చేస్తారా?!
ఆగస్టు 2 ఫ్రెండ్షిప్ డే. మనం ఫ్రెండ్షిప్ డే వస్తే ఏం చేస్తాం? ఒక బ్యాండ్ కడతాం లేదా చాక్లెట్ ఇస్తాం. కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఫ్రెండ్స్‌ను గౌరవించడానికి, కొత్త దోస్తులను చేసుకోవడానికి చాలా విచిత్రమైన పద్ధతులు ఉన్నాయి. అవేంటో చూసేద్దామా!కొరియా: ‘కంగారూ’ కౌగిలింతలు! (Kangaroo Hugs)దక్షిణ కొరియాలో పిల్లలు ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి వింత పద్ధతి ఉంది. ఒకరి వెనుక ఒకరు నిలబడి వెనుక ఉన్న దోస్త్ ముందున్న దోస్త్‌ని కంగారూ తన బిడ్డను పొట్టలో దాచుకున్నట్లు గట్టిగా కౌగిలించుకోవాలి. దీనిని ‘బ్యాక్ హగ్ దోస్తీ’ అంటారు. ఇలా చేస్తే వాళ్ల స్నేహం వందేళ్లు ఉంటుందట!జర్మనీ: ‘లెటర్ బాక్స్’ స్నేహం! సీక్రెట్ లెటర్ బాక్స్)జర్మనీలో స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్ వెనుక ఒక ఖాళీ డబ్బాను ‘ఫ్రెండ్షిప్ బాక్స్’గా పెడతారు. ఫ్రెండ్ ఎవరైనా బాగా నచ్చితే ముఖం మీద చెప్పకుండా ఒక చిన్న కాగితం మీద పేరు రాసి ఆ బాక్సులో వేస్తారు. శనివారం రోజు బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఎవరికి ఎక్కువ లెటర్స్ వస్తే వారే ఆ వారం క్లాస్ ‘సూపర్ ఫ్రెండ్‘!అర్జెంటీనా: స్కూల్ బంక్!అర్జెంటీనాలో జూలై 20న ఫ్రెండ్షిప్ డే వస్తే పిల్లలెవ్వరూ స్కూల్‌కి, పెద్దవాళ్లు ఆఫీసులకి వెళ్లరు. ప్రభుత్వం దీనిని అధికారిక సెలవుగా ప్రకటించకపోయినా అందరూ కలిసి ఒకేరోజు బంక్ కొట్టి, రోజంతా పార్కుల్లో ఆటలు ఆడుతూ గడుపుతారు.డెన్మార్క్: ‘కలర్ కోడ్’ దోస్తీ!’డెన్మార్క్ దేశంలో పిల్లలు వేసుకునే బట్టల రంగులను బట్టి వాళ్ల ఫ్రెండ్షిప్ స్టేటస్ తెలిసిపోతుంది. ఒకవేళ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకేరోజు ఒకేరంగు డ్రెస్ వేసుకుని స్కూల్‌కి వస్తే, వాళ్లు ‘ట్విన్ ఫ్రెండ్స్’ అని అర్థం. ఆ రోజు క్లాస్ టీచర్ వాళ్లను విడదీయకుండా ఒకే బెంచ్‌లో కూర్చోబెడతారు. -
ఎవరీ మిరాండా గిబ్సన్? ఏకంగా 449 రోజులు..
ఒంటరిగా నిరసన చేయడానికి ఎంతో గుండె నిబ్బరం కావాలి. అది ప్రజల మనసును కదిలించి..అందుకు అందరూ చేయి చేయి కలిపి ముందు వచ్చేలా చేయగలగాలి. సమస్య పరిష్కారం దిశగా నడిపించగలగాలి. అందుకు నిరసనలో ప్రత్యేకత తప్పనిసరి. ముఖ్యంగా యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసేలా ప్రేరేపించాలి. అచ్చం అలాంటి నిరసననే చేపట్టి మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. పైగా ఆ సమస్యపై ప్రతి పౌరుడు బాధ్యత వహించేలా చేసి ప్రభుత్వాన్నే చైతన్యపరిచింది.ఆ అమ్మాయే మిరాండా గిబ్సన్. ఆమె ఏమి మొదటి నుంచి పర్యావరణ కర్త కాదు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఇప్స్విచ్లో పెరిగిన ఆమెకు అడవులు గురించి అంతగా తెలియదు, వాటితో పరిచయం కూడా లేదు. సరిగ్గా టీనేజ్ వయసులో విశ్వవిద్యాలయ చదువుల సమయంలో అటవీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంది. టాస్మానియా అడవులు ఎలా అంతరించిపోతున్నాయో తెలుసుకుంది. అలా ఆ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాల గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆ అడవులు ఉండే రాష్ట్రాన్ని సందర్శించి ఆ సమస్యను కళ్లారా చూసి.. చలించిపోయింది. అక్కడ అప్పర్ ఫ్లోరెంటైన్ లోయకు ఒక పర్యటనలో అప్పటికే మొద్దుగా మారిపోయిన ఒక భారీ చెట్టు ఆమెకు ఎదురైంది. ఆ దృశ్యం రానున్న రోజుల్లో ఎంతటి నష్టాన్ని దారితీయనున్నదో తెలియజేసిందామెకు. దాంతో సెలవుల్లో నిరసనలలో చేరేందుకు టాస్మానియాకు తిరిగి రావడం ప్రారంభించింది. ఆ తర్వాత ప్రచార కార్యకర్తలతో పనిచేయడం మొదలుపెట్టడమే కాకుండా అక్కడే స్థిరపడింది. అలా ఆమె అప్పర్ ఫ్లోరెంటైన్ లోయ దిగ్బంధంలో సంవత్సరాలు గడిపింది. కానీ అడువులు కనుమరుగవుతూ ఉండటాన్ని సాంప్రదాయ నిరసనలు తగినంత ప్రభావాన్ని చూపించడం లేదని గుర్తించింది. టాస్మానియా అడవులను దాటి ఈ విధ్వంసాన్ని ప్రపంచానికి కనిపించేలా చేయడానికి ఒక మార్గం కోసం వెతికి మరి.. 'ట్రీ సిట్ నిరసన'ను ఎంచుకుందామె. అదీగాక కలప నరికివేత ఉన్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉందని తెలుసుకుందామె. ఆ కనెక్షన్ ద్వారా, ఆమె అడవిలోని చిత్రాలను నేరుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రసారం చేయగలిగితే తన పని సులువవుతుందని అనుకుంది. అలా గిబ్సన్ డిసెంబర్ 14, 2011న అడవిలోని ఒక చెట్టుని ఎంచుకుని, దానిపై సుమారు 60 కిలోమీటర్ల ఎత్తులో ఒక చిన్న వేదికపై కూర్చొని నిరసన ప్రారంభించింది. అంతేగాదు అడవికి రక్షణ లభించేంత వరకు 'ట్రీ సిట్' నిరసన కొనసాగిస్తానని ప్రకటించింది. ఆమె చెట్టుపై ఏర్పాటు చేసుకున్న ఆవాసం చాలా సాధారణమైనది. కేవలం 1.5 మీటర్ల వెడల్పుతో పరిమిత స్థలాన్ని మాత్రమే అందించింది. అలా ఆమె ఏకంగా 449 రోజులు ఒంటరిగా ఆ చెట్టుపైనే గడిపింది. టాస్మానియా అనూహ్య వాతావరణం మార్పులన్నింటిని తట్టుకుంది. తాజా సమాచారాన్ని పంచుకునేందుకు సౌరశక్తితో నడిచే కంప్యూటర్ని వినియోగించింది. చురుకుగా ఉండటానికి ఒక చిన్న వాకింగ్ మెషీన్, యోగ సాధన వంటి దినచర్యతో ఒంటరిగా ఆ చెట్టుపైనే నిరసన చేసింది. ఈ నిరసన ఫలితంగా ఆమె కనీస అవసరాలను తీర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఆ చెట్టుపైనే ఉంటూ.. పచ్చి ఆహారమే తింటూ నిరసన కొనసాగించింది. ముఖ్యంగా ఒంటరితనం, నిత్యావసరాలను సర్దుకుని మరి కొనసాగించక తప్పని స్థితి అయినా అధైర్యపడలేదు. అనుకున్నట్లుగానే నెలలు గడిచేకొద్దీ, గిబ్సన్ చెట్టుపై కూర్చోవడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అంతేగాదు ప్రజల నుంచి అమితమైన స్పందన మద్దతు లభించాయి. అలా 2013 ప్రారంభంలో టాస్మానియా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడమే గాక అడవుల విస్తరణకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే అదంతా అధికారికంగా గుర్తింపు లభించేంత వరకు ఆ చెట్టుపైనే ఉండి నిరసన చేద్దాం అనుకుంటే ప్రకృతి కార్చిచ్చు రూపంలో వ్యతిరేకించడంతో నిరసనను విరమించక తప్పలేదు గిబ్సన్కి. ఎలాగైతేనేం ఆమె పోరాటం ఫలించింది. గిబ్సన్ గడిపిన చెట్టుతో సహా అటవీ ప్రాంతాలకు అదనపు రక్షణను ప్రపంచ వారసత్వ కమిటీ ఆమోదించింది. గిబ్సన్ 449 రోజులు గడిపిన ఆ నివాస చెట్టుకి అధికారిక గుర్తింపు లభించింది. అయితే గిబ్సన్ ఆ తర్వాత పూర్తికాల కార్యకర్తగా తన వృత్తిని విడిచిపెట్టి, మెల్బోర్న్లో ఉపాధ్యాయురాలిగా పనిచేయడం ప్రారంభించింది. టాస్మానియా అడవులపై జరుగుతున్న విస్తృత పోరాటంలో ఆ చెట్టుపై ఆమె గడిపిన సమయం ఒక కీలక అధ్యాయంగా నిలిచింది.(చదవండి: సీతగా అలరించనున్న సాయిపల్లవి జపమాల ఎందుకు ధరిస్తుందంటే..!) -
అమ్మ కోసం ఆవిష్కరణ..సాక్షాత్తు సీఎం సైతం ఫిదా!
అమ్మ రోజువారీ పనుల్లో కష్టాన్ని చూసి తను సాయం చేయాలనుకోలేదు. కానీ టెక్నాలజీ సాయంతో ఆమెకు సహకరించే ఆవిష్కరణలు చేశాడు. అందుకోసం పెద్ద పెద్ధ ఖరీదైన పరికరాలను కూడా ఉపయోగించలేదు. చుట్టూ ఉండే వస్తువులు, పనికిరాని కార్డుబోర్డులాంటి వాటితోనే అద్భుత ఆవిష్కరణలు చేసి అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు శెభాష్ అని ప్రశంసలందుకుంటున్నాడు. అతడే కేరళకు చెందిన 12 ఏళ్ల లెవిన్ పౌలోస్. రోజువారీ సమస్యలను పరిష్కరించడానికి రూపొందించిన అతడి చేసిన ఆవిష్కరణలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వాటలో కొన్ని వాక్యూమ్ క్లీనర్, ఒక బటన్ నొక్కగానే కర్టెన్లను తెరిచి మూసే మోటార్‌తో నడిచే ఆటోమేటెడ్ కర్టెన్ సిస్టమ్, అలాగే స్టవ్ నుంచి దూరంగా వెళ్లిన ఆటోమేటిగ్గా గరిట పట్టుకుని తిప్పే ఆటోమేటిక్ ఫుడ్ స్టిరర్ తదితరాలు. ఆచరణాత్మకమైన రూపకల్పన, రోజువారీ పనుల్లో ఉపయోగపడే అతడి ఆవిష్కరణలు అందర్నీ అబ్బురపరుస్తున్నాయి. వీటన్నింటి తోపాటు తాజాగా పారేసిన కార్డ్‌బోర్డ్‌తో నిర్మించిన ఒక హ్యూమనాయిడ్ రోబోట్, అతడి క్రియేటివిటీకి, ఇంజనీరింగ్ నైపుణ్యలను నిదర్శనం. పూర్వినయోగ వస్తువులు, ప్రాథమిక ఎలక్ట్రానిక్ భాగాలతో ఆకర్షణీయంగా రూపొందించడం విశేషం. అతడు రూపొందించిన ఈ రోబోట్ తన తల్లికి రోజువారీ పనులలో ఉపయోగపడుతుంది. ఇవననీ తన తల్లి పడే కష్టాన్ని చూసి చేసిన అద్భుతమైన ఆవిష్కరణలు. పొద్దున లేస్తే ఇంటి పనులతో, వంటతో అమ్మ పడుతున్న అలసటను తగ్గించాలనే ఉద్దేశంతో చేసినవే. అంతేగాదు అతడి ఆవిష్కరణల కారణంగా సాక్షాత్తు తన రాష్ట్ర సీఎంనే కలిసే అవకాశం దక్కించుకున్నాడు. ఆయన సైతం అతడి ప్రతిభకు ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు. లెనిన్ కథ యువతను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం వంటి (STEM) రంగాలను ఆచరణాత్మక అభ్యాసం ద్వారా అన్వేషించేలా చేస్తున్నాడు. అంతేగాదు లెవిన్ ఆవిష్కరణలు విద్యావేత్తలు, టెక్నాలజీ ఔత్సాహికులు, సోషల్ మీడియా వినియోగాదారులందరినీ ఆకట్టుకుంది. పైగా ఉత్సుకత, పట్టుదల సమయస్ఫూర్తి సాధారణ గృహోపకరణాలను అద్భుతమైన ఆవిష్కరణలుగా ఎలా మారుస్తుందో చూపించింది. View this post on Instagram A post shared by levin paulose (@ppv931680) (చదవండి: నందన్-రోహిణి నీలేకనిల ప్రేమ కథ: అలా మొదలైంది..!) -
ఈ 5 ప్రదేశాలకు మీరు ఎప్పటికీ వెళ్లలేరు!
ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు గూగుల్‌లో కనిపిస్తాయి, డాక్యుమెంటరీల్లో ఉంటాయి. కానీ రియల్ లైఫ్‌లో ఈ ప్రదేశాలకు డైరక్టుగా వెళ్లడం దాదాపు అసాధ్యం. కొన్ని ప్రదేశాలను వాటి నేచర్‌ని ప్రొటెక్ట్ చేయడానికి, కొన్ని తెగల గిరిజనుల మనుగడను కాపాడేందుకు, మరికొన్ని ప్రాంతాను మిలిటరీ రహస్యాల వల్ల సాధారణ ప్రజలకు దూరంగా ఉంచారు. మరి ఆ మిస్టరీ ప్రదేశాలు ఇవే..నార్త్ సెంటినల్ ఐలాండ్భారతదేశంలో ఉన్న అండమాన్ ద్వీప సమూహంలో ఈ చిన్న ద్వీపంలోనికి బయటి ప్రపంచం నుంచి ఎవరూ వెళ్లేందుకు అనుమతి లేదు. ఇక్కడ సెంటినెలీజ్ అనే ప్రపంచంతో సంబంధం లేని ప్రజలు ఉంటారు. వాళ్లను అంటువ్యాధుల నుంచి దూరంగా ఉంచేందుకు భారత ప్రభుత్వం ఈ ఐలాండ్ చుట్టూ స్ట్రిక్ట్‌గా నో–ఎంట్రీ జోన్ మెయింటైన్ చేస్తోంది.ఏరియా 51ఏలియెన్స్ ఉన్నారా? సీక్రెట్ వెపన్స్ తయారు చేస్తున్నారా? ఇలాంటి ఎన్నో పుకార్లకు కేరాఫ్ చిరునామాగా మారింది అమెరికాలోని ఏరియా 51 అనే ప్రాంతం. నిజం ఏంటి అనే విషయం కాస్త పక్కన పెడితేం ఇది అమెరికా మిలిటరీకి చెందిన హై–సెక్యూరిటీ జోన్ లేదా బేస్. సాధారణ ప్రజలు ఇక్కడికి వెళ్లడం పూర్తిగా నిషేధం.స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్దీనినే ప్రపంచ బ్యాకప్ లాకర్ అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో లక్షలాది మొక్కల విత్తనాలను సంరక్షిస్తారు. భవిష్యత్తులో ఏదైనా తెలియని విపత్తు వచ్చినా కూడా వ్యవసాయం మళ్లీ ప్రారంభించేందుకు ఇది ప్రపంచానికి ఇన్సూరెన్స్ పాలసీలా పని చేస్తుంది. అందుకే సాధారణ ప్రజలను ఇక్కడికి వెళ్లేందుకు అనుమతించరు.లాస్కాక్స్17,000 ఏళ్ల నాటి పురాతనమైన పెయింటింగ్స్ ఉన్న ఈ గుహల్లోకి ఒకప్పుడు సందర్శకులు వెళ్లేవారు. అయితే కాల క్రమేన మనుషుల శరీరం నుంచి వెలువడే ఉష్ణోగ్రత, బయటి ప్రపంచం నుంచి వచ్చే కాలుష్యం వల్ల పెయింటింగ్స్‌కు డ్యామేజ్ అవ్వడం మొదలైంది.దీంతో కంప్లీట్‌గా పర్యాటకులను బ్యాన్ చేసేశారు.వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్శతాబ్దాల నాటి పురాతనమైన, అత్యంత రహస్యాత్మక డాక్యుమెంట్స్, రాజపత్రాలు, చారిత్రాత్మక రికార్డులు అన్నీ కూడా ఇక్కడే దాచి పెడతారు. ప్రత్యేక అనుమతి తీసుకుని వెళ్లే పరిశోధకులకు త΄్పా ఇతరులకు ఎవరికీ ఇక్కడికి వెళ్లేందుకు పర్మిషన్ లభించదు.నిజానికి ప్రతీ అందమైన ప్రదేశం మనం విజిట్ చేయడానికి కాదు. కొన్ని ప్రదేశాలకు రహస్యమే అందం. ఇలా సీక్రెట్‌గా ఉండటం వల్లే వాటి ప్రత్యేకత అలాగే కంటిన్యూ అవుతుంది. ట్రావెల్ అంటే చెక్‌లిస్ట్ పూర్తి చేయడం కాదుం వెళ్లిన ప్రతీ ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను గౌరవించడం. అలాగే వెళ్లకూడని ప్రదేశాలను అలా ఏకాంతంగా వదిలేయడం కూడా వాటిని గౌరవించడమే అవుతుంది. -
20 ఏళ్లుగా భార్యతో మాటల్లేవ్.. కానీ కలిసే ఉన్నారు! కారణం తెలిస్తే కంగుతింటారు
ఇటీవల కాలంలో భార్యభర్తల సంబంధాలు ఎంత దారుణంగా వికృతంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. కొన్నింటిని చూస్తే..మనసు కలిచివేస్తుంది కూడా. అలాంటి తరుణంగా ఈ ఇద్దరి భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న అభిప్రాయ భేదం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఏ సంబంధంలోనైనా..పొరపొచ్చాలు సహజం. కానీ ఈ ఆలుమగలు..మధ్య ఎదురైనా అత్యంత సాధారణ అభిప్రాయభేదం వాళ్లను వేరు చేయలేదు..కానీ వారి మధ్యమాటలను దూరం చేసింది. ఇరువురి మధ్య భౌతికంగా దూరం లేదు గానీ మానసికంగా కలిసి లేరు, మాటల్లేవ్. పాపం వాళ్లని కలిపేందుకు సిద్ధమయ్యాడు కూమారుడు. మరి అతడి ప్రయత్నం ఫలించిందా అంటే..ఈ విచిత్ర ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. దాదాపు దశాబ్దం క్రితం ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అద్భుతమైన ప్రేమకథ. అసాధారణ మలుపుతో భావోద్వేగంగా ముగిసినా..ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. 2017లో, 18 ఏళ్ల యువకుడు హోక్కైడోలోని ఒక టెలివిజన్ షోకు అసాధారణమైన విజ్ఞప్తి చేశాడు. తన జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఒక కుటుంబ సమస్యకు సహాయం చేయమని కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లిదండ్రులు దాదాపుగా 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నప్పటికీ సరిగ్గా మాట్లాడుకోవడం ఎప్పుడు చూడలేదని అందువల్ల తాను మళ్లీ కలిపి చక్కగా మాట్లాడుకునేలా చేయాలనుకున్నట్లు తెలిపాడు. అందుకోసం సదరు టెలివిజన్ షోన్ని సహాయం చేయమని అర్థిస్తాడు. అతడి పేరెంట్స్ ఓటో కటాయమా ( యామా, భార్య యూమి ఒకే ఇంట్లో ఉంటున్నా..రెండు దశాబ్దాలుగా ఇద్దరి మధ్య మాటల్లేవ్. ముగ్గురు పిల్లలను పెంచారు, కలిసే భోజనం చేశారు. అయినా ఒకరితో ఒకరు అర్థవంతంగా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అంత నిశబ్ద వాతావరణం వెనుక ఇద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం గానీ తీవ్రమైన ద్రోహం గానీ చోటు చేసుకోలేదు. కానీ ఎందుకని ఇద్దరి మధ్య సైలన్స్ చోటు చేసుకుందంటే..పిల్లల పట్ల భార్య చూపిస్తున్న శ్రద్ధ చూసి అసూయతో కటాయామా మాట్లాడటం మానేశారట. యామీ మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడల్లా..అతను కేవలం తల ఊపడం, అవును అని మాత్రమే స్పందించి ఊరుకునేవారట. ఈ పరిస్థితిని చూసి వాళ్ల చిన్న కుమారుడు వాళ్లను తిరిగి కలిపేందుకు టెలివిజన్ సాయం కోరాడు. ఆ కార్యక్రమం నిర్వాహాకులు ఆ దంపతులు మొదట డేట్‌కు వెళ్లిన పార్కులోనే కలుసుకునేలా ఏర్పాటు చేసింది. ముగ్గురు పిల్లలు పేరెంట్స్‌ని దూరం నుంచి గమనిస్తూనే ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల మౌనాన్ని వీడుతూ..కటాయమా తన భార్యతో ఇలా అన్నారు, "ఏదో తెలియని కారణం వల్ల మనం మాట్లాడుకుని చాలా కాలం అయ్యింది. నువ్వు పిల్లల గురించి చాలా ఆందోళన చెందావు. యూమి, ఇప్పటి వరకు నువ్వు చాలా కష్టాలను భరించావు. నేను ఎందుకు మాట్లాడటం లేదో నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు పిల్లలను తనకంటే అత్యంత ప్రేమగా చూసుకోవడంతో అసూయపడ్డాను, అలిగాను. అందువల్ల మాట్లాడలేదు. జరిగిపోయినా కాలాన్ని వెనక్కి తేలేను కానీ..మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టడం మాత్రం సాధ్యమే మరి మాట్లాడుకుందామా.. అని అతను అడగడంతో..ఆ షోని చూస్తున్నవాళ్ల ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఈ భావోద్వేగమైన పునః కలయిక నెట్టింట త్వరగా వైరల్ అయ్యి..అందర్నీ అమితంగా ఆకర్షించింది. చాలా ఏళ్ల నిశబ్దం తర్వాత మళ్లీ కలవడానికి ఆ జంట చూపిన సుముఖతను చాలా మంది ప్రశంసించారు. అంతేగాదు ప్రస్తుతం మారుతున్న సంబంధాల ధోరుణుల కారణంగా ఈ దంపతుల కథ అందరి మనసులను తాకింది.(చదవండి: జీవితాన్నే డాక్యుమెంట్ చేస్తూ..రూ. 8.35 కోట్లు..!) -
విచారం వద్దు... అవి ఘోస్ట్ జాబ్స్ అయినా కావచ్చు!
అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ చాలామందికి ఉద్యోగం దొరకడం కష్టం కావచ్చు. దీనికి కారణం వారికి సరైన మార్గదర్శకత్వం లేకపోవడమే. ఈ నేపథ్యంలో దేవ్‌శ్రీ అనే టెకీ ‘జాబ్ సెర్చ్ టిప్స్’పై ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.‘జాబ్ సెర్చ్ టిప్స్ తెలుసుకోవడానికి నాకు చాలాకాలం పట్టింది. మీరు మాత్రం త్వరగా నేర్చుకుంటారు’ అంటున్న దేవ్‌శ్రీ శాలరీ... రెండు కోట్లు! మన దేశంలో ఒక కంపెనీలో సాధారణ జీతం నుండి అమెరికాలో అధిక ఆదాయం గల ఉద్యోగాన్ని ఎలా సంపాదించిందో వివరిస్తూ దేవ్‌శ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. పుణెలో డిగ్రీ చేసిన దేవ్‌శ్రీ ఒక చిన్న కంపెనీలో చేరి తన కెరీర్ ప్రారంభించింది. అయితే అక్కడే ఉండిపోవాలనుకోలేదు.ఒక్కో మెట్టు ఎక్కుతూ పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉంది. ‘నేను ఈ స్థితిలో ఉంటానని కలలో కూడా ఊహించలేదు’ అంటున్న దేవ్‌శ్రీ నిరుద్యోగులకు, తాము చేస్తున్న ఉద్యోగం నుంచి మరో మెట్టు ఎక్కాలనుకునేవారికి సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇచ్చింది.వృత్తిపరమైన తన ఎదుగుదలను స్టెప్ బై స్టెప్ వివరించడమే కాదు...ఎవరైనా సరే తమ కెరీర్‌ను వేగవంతం చేసుకోవడానికి అనుసరించదగిన వ్యూహాల గురించి కూడా ప్రస్తావించింది.‘ఆ వ్యూహాలను అర్థం చేసుకోవడానికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది. కాని మీరు వాటిని మూడు నెలల్లోనే అమలు చేయవచ్చు’ అంటుంది దేవ్‌శ్రీ. కేవలం ఉద్యోగ దరఖాస్తుపై మాత్రమే ఆధారపడకుండా రిక్రూటర్ల దృష్టిలో పడడం గురించి ఆమె ప్రస్తావించింది. ‘లింక్డ్ ఇన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోమని మీకు చాలామంది చెబుతుంటారు.అయితే మీలోని ప్రతిభను గ్రహించి రిక్రూటర్లే మిమ్మల్ని సంప్రదిస్తే అది మీకు అదనపు ప్రయోజనం. మీరు దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలలో దాదాపు 30 శాతం ఘోస్ట్ జాబ్స్. నిజానికి ఆ ఉద్యోగాలు ఖాళీగా ఉండవు. అయితే ఉద్యోగావకాశం రాకపోవడంతో తనను తిరస్కరించారని చాలామంది భావిస్తుంటారు’ అంటుంది దేవ్‌శ్రీ.రెజ్యూమ్ అనేది ఎలా ఉండాలి? ఇంటర్వ్యూ వ్యూహాలేమిటి?.... మొదలైన వాటి గురించి తన పోస్ట్‌లో ప్రస్తావించింది దేవ్‌శ్రీ. ‘ఏ కంపెనీకైతే ఇంటర్వ్యూకు వెళుతున్నామో, ఆ కంపెనీ గురించి అన్ని కోణాలలో తెలుసుకోవడం, ఆ కంపెనీ ఎదుర్కొనే సమస్యలపై అవగాహన ఉండడం అనేది మనకు ఉపకరిస్తుంది’ అని చెబుతోంది దేవ్‌శ్రీ.ఘోస్ట్ జాబ్స్ అంటే?ఘోస్ట్ జాబ్స్ లేదా ఫాంటమ్ జాబ్స్ అంటే... తక్షణమే భర్తీ చేయాలనే ఉద్దేశం లేకుండా కంపెనీలు ఆన్లైన్లో ఇచ్చే ఉద్యోగ ప్రకటనలు. ప్రతిభావంతులైన ఉద్యోగులను తీసుకుంటున్నట్లు భ్రమ కలిగించడం. పోటీ కంపెనీల జీతాల గురించి అధ్యయనం చేయడం... మొదలైన వ్యూహాత్మక కారణాల వల్ల ఘోస్ట్ జాబ్స్ లేదా ఉత్తుత్తి జాబ్స్‌ను కంపెనీలు సృష్టిస్తుంటాయి. -
బుర్జ్ ఖలీఫాలో ఆఫీస్ పెట్టిన 14 ఏళ్ల భారతీయుడు!
బహుశా పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో... నువ్వు 14 ఏళ్ల వయసులో ఏం చేసేవాడివి? అని మీ ఫ్రెండ్స్‌లో ఎవరినైనా అడిగి చూడండి... మహా అయితే ఎనిమిదో తరగతి చదువుతూ హోంవర్క్ చేస్తూ ఉండేవాడినని చెబుతారు కాని అదే వయసులో ఉన్న ఓ కుర్రోడు ఓ ఏఐ కంపెనీ స్థాపించాడు.అంతేకాదు ప్రపంచంలోనే అతి ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో ఏకంగా ఆఫీస్ పెట్టేశాడు. పుణేకు చెందిన జైనమ్ జైన్ ఐదేళ్ల వయసున్నప్పుడే అతని తల్లిదండ్రులు దుబాయ్‌కి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి మంచి తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరిచే జైన్ కేంబ్రిడ్జ్ కరికులమ్ ద్వారా 13 ఏళ్ల వయసులోనే పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత బిజినెస్ చేయాలన్న ఆలోచనతో ఏఐ సాంకేతికతపై దృష్టి పెట్టాడు.సరిగ్గా ఏడాది గడిచాక ‘మెంగో ఇంజిన్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌ను స్థాపించాడు. కంపెనీల కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్, కస్టమర్ కమ్యూనికేషన్ వంటి పనులు ఆటోమేట్ చేయడానికి ఈ ప్లాట్‌ఫాం సహాయపడుతుంది. విశేషమేమిటంటే జైన్ సొంత ఆసక్తితోనే నేర్చుకుని చిన్న వయసులో కంపెనీని స్థాపించి ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించాడు. -
పెళ్లిలో ప్రాంక్ తెచ్చిన తంట..! పాపం ఆ వధువు స్నేహితురాలు..
పెళ్లిళ్లలో సరదాగా ఆటపట్టించడం అనేది మాములు. ఆ వేడుకకు వచ్చినవారందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తే పర్లేదు..అది కాస్త సీరియస్ అయితేనే లేనిపోని తలనొప్పులు మొదలవుతాయి. అందుకే ఏదైనా శృతి మించకుండా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇక్కడ అది లోపించడంతో ఆ పెళ్లి బృందం, ఆ కొత్త దంపతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏ సరదా అయినా నష్టం చేకూర్చేలా ఉండకూదనే సత్యాన్ని నేర్పించే బాధకర ఘటన ఇది.చైనాలో చోటు చేసుకుంది ఈ ఘటన. అక్కడ పెళ్లిళ్లలో హున్నావో అనే పురాతన చైనీస్ ఆచారం ఉంది. ఇది వాస్తవానికి దుష్టశక్తులను తరిమికొట్టడానికి, నూతన వధూవరులు, అతిథుల మధ్య బిడియాన్ని తొలగించేందుకు ఏర్పాటు చేసిన సరదా ఆచారం. అయితే ఏళ్లు గడుస్తున్న కొద్ది అది కాస్తా ప్రమాదకరమైన చిలిపి పనిగా మారిపోయింది. గతంలో కూడా ఇలాంటి ఆచారంతోనే ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు కూడా. ఈసారి మాత్రం మరింత సీరియస్‌గా మారింది. 2023 అక్టోబర్‌లో ఒక జంట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. వివాహ తంతులో భాగంగా ఓ ఫ్రాంక్ చేశారు. అది కాస్తా చూస్తుండగానే సీరియస్‌గా మారింది. ఆ ఫ్రాంక్‌లో భాగంగా వధువు స్నేహితురాలు జాంగ్ని పెళ్లి కొడుకు స్నేహితుల గదిలో ఒంటరిగా వదిలేశారు. ప్రాంక్‌లో భాగంగా ఆమెను అల్మరా నుంచి బయటకు లాగి మంచ మీదకు విసిరి ఆపై ఒక దుప్పటితో గాలిలోకి ఎగరవేస్తారు. ఆ క్రమంలోనే వధువు స్నేహితురాలిని ఒకసారి ఎగరువేసినప్పుడు పెళ్లికొడుకు బృందం పట్టుకుంది. ఆ తర్వాత విసిరినప్పుడు ఆమె నేల మీద సరాసరి పడిపోవడంతో వెన్నుముకకు తీవ్ర గాయమైంది. దాంతో జాంగ్ సుమారు 18 రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందాల్సి వచ్చింది. ఆ ఫ్రాంక్ ఆమెకు తీవ్రమైన గాయంతోపాటు శాశ్వత వైకల్యాన్ని మిగిల్చిందామెకు. దాంతో జాంగ్ కోర్టుని ఆశ్రయించింది. ఆ నేపథ్యంలో ఆగస్టు 2024 ఫోరెన్సిక్ న్యాయ బృందం ఆమె గాయాన్ని విచారించి గ్రేడ్ 9 వైకల్యంగా వర్గీకరించింది. అంటే ఇది 20% శాశ్వత వైకల్య రేటింగ్‌కు సమానం. దాంతో ఈ ఘటనకు కారణమైన వధువువరులకు, మరో తొమ్మిది మందిపై వైద్య ఖర్చులు, మానసిక క్షోభకు పరిహారంగా 32 లక్షలు చెల్లించమని ఆదేశించింది చైనా కోర్టు. వివాహ నిర్వాహకులకు ఈ ఫ్రాంక్ గురించి తెలిసినప్పుడు తగిన జాగ్రత్తలు లేదా ఆపడంలో ఎందుకు విఫలమైందంటూ చురకలంటించింది. ఈ దుశ్చర్యకు గానూ ఆ నష్టపరిహారాన్ని.. ఆ నూతన వధువరులకు 40%, అలా చేయమని సూచించిన వ్యక్తికి 20%, ఆ సమయంలో ఉన్న మిగతా తొమ్మిది మందికి 40% వంతున చెల్లించాలని పేర్కొంది.(చదవండి: Dr Deepti Sharma: ఎవరీ డాక్టర్ దీప్తి శర్మ? వైద్య విద్యలో ఏకంగా 19 పతకాలు..) -
వైభవంగా గియాన్ మత్సూరీ సంబరాలు..
జపాన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సాంస్కృతిక ఉత్సవం గియాన్ మత్సూరీ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూలై నెల మొత్తం అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. యాసకా ఆలయానికి సంబంధించిన ఈ చారిత్రాత్మక ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన భారీ రథాల ఊరేగింపు జూలై 17న ప్రారంభమైంది. అంగరంగవైభవంగా నిర్వహించే ఈ వేడుకలను వీక్షించేందుకు ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు క్యోటో నగరానికి క్యూకట్టారు.దైవదూతగా స్థానిక బాలుడు!క్రీస్తుశకం 869లో నగరంలో వ్యాపించిన ఒక తీవ్రమైన అంటువ్యాధి నుంచి తమను రక్షించాలని దేవుళ్లను వేడుకుంటూ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఉత్సవాలను నిరంతరాయంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ పండుగలో ఇప్పటికీ ఒక విలక్షణమైన ఆచారాన్ని పాటిస్తారు. ఒక స్థానిక బాలుడిని దైవదూతగా ఎంపిక చేస్తారు. ఆ బాలుడు జూలై 13 నుంచి 17వ తేదీన ఊరేగింపు పూర్తయ్యే వరకు నేలపై కాలు మోపరాదనే కఠినమైన నియమం పాటించాల్సి ఉంటుంది.ఆకట్టుకునే భారీ రథాలుఈ ఉత్సవాల్లో ముఖ్యమైనది భారీ రథాల ఊరేగింపు. ఈ ఊరేగింపులో యమ, హొకో అనే రెండు రకాల రథాలను ఉపయోగిస్తారు. ఇందులో హోకో రథాలు సుమారు 25 మీటర్ల ఎత్తు, 12 టన్నుల బరువుతో మనుషులంత పరిమాణం ఉన్న భారీ చక్రాలతో నిర్మితమై ఉంటాయి. జూలై 17న జరిగిన మొదటి ఊరేగింపులో 23 రథాలు పాల్గొంటాయి. జూలై 24న జరిగే రెండో ఊరేగింపులో మిగిలిన 10 రథాలు నగర వీధుల్లో విహరిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రథాల తయారీలో ఒక్క మేకును కూడా ఉపయోగించకుండా కేవలం తాళ్లతోనే రథ భాగాలను అనుసంధానిస్తారు.రాత్రి వేళల్లో యోయియామా బ్లాక్ పార్టీలు!జూలై 17, 24 తేదీల్లో జరిగే ప్రధాన ఊరేగింపులకు ముందు వచ్చే మూడు సాయంత్రాలు క్యోటో నగరం సరికొత్త శోభను సంతరించుకుంటాయి. వీటిని వరుసగా యోయి– యామా వీధి వేడుకలుగా పిలుస్తారు. వేడుకల సమయంలో రాత్రి వేళల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేస్తారు. ఆహార శాలలు, రంగురంగుల దుకాణాలతో వీధులలో పండుగ వాతావరణం నెలకొంటుంది. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా సాంప్రదాయ ‘యుకతా’ నూలు వస్త్రాలు ధరించి, వీధుల్లో నృత్యాలు చేస్తారు. ఈ సమయంలోనే స్థానిక ప్రజలు తమ ఇళ్ల తలుపులు తెరిచి, తమ వంశపారంపర్యంగా వస్తున్న పురాతన వస్తువులను ప్రదర్శించే ‘బ్యోబు మత్సూరీ’ అనే వేడుక కూడా ఈ సమయంలోనే జరుగుతుంది.- రమా జంబుల -
సూర్యుడికే సన్‌స్క్రీన్!
ప్రకృతి వైపరీత్యాలు, అడవుల నరికివేత, విచ్చలవిడి కాలుష్యాలతో భూగోళం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భూతాపం నానాటికీ పెరిగి పోతుండటంతో, రాబోయే కాలంలో మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో, భూమిని ఎలాగైనా చల్లబరచాలనే పట్టుదలతో శాస్త్రవేత్తలు అత్యంత వినూత్నమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి ఒక ప్రయోగమే ‘సూర్యుడి కాంతిని తగ్గించడం’!అయితే, ప్రపంచాన్ని రక్షించేందుకు ఉద్దేశించిన ఈ ‘జియోఇంజనీరింగ్’ ప్లాన్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనివల్ల విమాన ప్రయాణికులు, పైలట్లు, క్యాబిన్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడికి సన్‌స్క్రీన్ వేయటంలా అనిపించే ఈ ప్రయోగం వల్ల ఆకాశంలో ప్రమాదకరమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ (గంధక ఆమ్లం) మబ్బులు ఏర్పడతాయి. అవి ఎంతో హానికరమైనవి.సూర్యుడిని ఎలా ‘డిమ్’ చేస్తారు!ప్రస్తుతం కేవలం కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా మాత్రమే భూమి వేడెక్కడాన్ని ఆపడానికి మనకు సరిపడా సమయం లేదు. అందుకే, వాతావరణంలో చిక్కుకునే వేడిని తగ్గించడం కంటే.. అసలు సూర్యుడి నుండి భూమికి వచ్చే కాంతిని, వేడిని ముందే అడ్డుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండి పుట్టిందే ఈ జియోఇంజనీరింగ్ బృహత్ప్రణాళిక. స్ట్రాటోస్పియరిక్ ఏరోసోల్ ఇంజెక్షన్ (ఎస్.ఎ.ఐ) అనే ఈ విధానంలో ఆకాశంలోని పైపొరల్లోకి (స్ట్రాటోస్పియర్) ప్రత్యేక విమానాల ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ వాయువును భారీ మొత్తంలో విడుదల చేస్తారు.ఆ వాయువు గాల్లోని తేమతో కలిసి చిన్న చిన్న సల్ఫేట్ కణాలుగా (ఏరోసోల్స్) మారుతుంది. గతంలో భూమిపై పెద్ద అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఎలాగైతే పొగ, బూడిద ఆకాశాన్ని కమ్మేసి కొన్ని నెలల పాటు భూమిని చల్లబరిచాయో, అదే ఫార్ములాను ఇక్కడ కృత్రిమంగా అమలు చేస్తున్నారు. ఈ కెమికల్ కణాలు ఒక అద్దంలా పనిచేసి, సూర్యకాంతిని తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందేలా చేస్తాయి. దాంతో భూమిపై వేడి తగ్గుతుంది.మానవాళికి కొత్త చిక్కులుభూమిపై మనం నివసించే దిగువ వాతావరణ పొరను ‘ట్రోపోస్పియర్’ అంటారు. ఇక్కడ వర్షాలు పడటం వల్ల కాలుష్యం త్వరగానే కిందకి వచ్చేస్తుంది. కానీ, దీనికి పైన ఉండే ‘స్ట్రాటోస్పియర్’ పొరలో అసలు వర్షాలు పడవు. కాబట్టి మనం అక్కడ వెదజల్లే రసాయన జల్లులు సాధారణ కాలుష్యం కంటే 50 రెట్లు ఎక్కువ కాలం గాల్లోనే ఉండిపోతాయి. ఇది భూమిని చల్లబరచడానికి మంచిదే అయినప్పటికీ, మానవాళికి సరికొత్త తలనొప్పులను తెచ్చిపెడుతుంది. శాస్త్రవేత్తలు ఊహించిన ఈ అద్భుతమైన ప్రణాళికలో అసలు ప్రమాదం విమాన ప్రయాణాల దగ్గరే మొదలవుతుంది.సాధారణ కమర్షియల్ (ప్యాసింజర్) విమానాలు ఆకాశంలో ప్రయాణించేటప్పుడు, ప్రయాణికులకు కావలసిన ఆక్సిజన్ కోసం బయట ఉండే గాలిని వాటి శక్తిమంతమైన ఇంజిన్లు లోపలికి లాక్కుంటాయి. ఆ గాలిని ఫిల్టర్ చేసి, ప్రయాణికులు, సిబ్బంది సులభంగా శ్వాస తీసుకోవడానికి వీలుగా క్యాబిన్ లోపలికి పంపుతాయి. ఒకవేళ విమానాలు ప్రయాణించే ఆకాశ మార్గంలో సల్ఫర్ డయాక్సైడ్ మబ్బులు ఉంటే, విమాన ఇంజన్లు ఆ వాయువును కూడా లోపలికి లాగేసుకుంటాయి.ఆ వాయువు విమానం కంప్రెషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లోకి వెళ్లినప్పుడు, అక్కడ ఉండే విపరీతమైన వేడి, తేమ కారణంగా రసాయన చర్య జరిగి క్షణాల వ్యవధిలో ఘాటైన సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగా మారిపోతుంది. అంటే, ప్రయాణికులు శ్వాసించే గాలిలోకి నేరుగా యాసిడ్ కణాలు ప్రవేశిస్తాయన్న మాట! దీనివల్ల విమానం లోపల ఉన్న వారికి ఊపిరాడకుండా పోయే ప్రమాదం ఉందని, ముఖ్యంగా – తరచూ ప్రయాణించే వారికి ఇది శాపంగా మారుతుందని న్యూజెర్సీలోని రట్జర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలన్ రోబాక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్యాసింజర్ రూట్లలోనే ‘విషాయన’ మబ్బులుభూమధ్యరేఖ పైభాగంలో దాదాపు 1.2 కోట్ల టన్నుల సల్ఫర్ డయాక్సైడ్ను వదిలితే, భూమి ఉష్ణోగ్రతను 0.6 నుండి 1 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గించవచ్చు. దీనివల్ల ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల ప్యారిస్ ఒప్పందం నిర్దేశించిన 1.5 డిగ్రీల లోపే ఉంటుంది. ఇక ఈ ఏరోసోల్ను భూమికి దాదాపు 13 నుండి 15 కిలోమీటర్ల (8 నుండి 9 మైళ్ల) ఎత్తులో వదలాల్సి ఉంటుంది. సాధారణ ప్యాసింజర్ విమానాలు అంత ఎత్తుకు వెళ్లలేవు. దీనికి ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు మరో మార్గాన్ని వెతికారు.భూమి ధ్రువ ప్రాంతాల (ఉత్తర, దక్షిణ ధ్రువాలు) వద్ద స్ట్రాటోస్పియర్ పొర భూమికి కాస్త దగ్గరగా (తక్కువ ఎత్తులో) ఉంటుంది. కాబట్టి, బోయింగ్ 777 వంటి భారీ విమానాలను ఉపయోగించి ఆ ధ్రువ ప్రాంతాల వద్ద సల్ఫర్‌ను సులభంగా ఆకాశంలోకి వదలవచ్చని భావిస్తున్నారు. ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ఉత్తర అమెరికా (అమెరికా, కెనడా) నుండి యూరప్, ఆసియా దేశాలకు వెళ్లే వందలాది ప్యాసింజర్ విమానాలు ప్రయాణించేది కూడా సరిగ్గా అదే ధ్రువ ప్రాంతాల రూట్లలోనే! దీనివల్ల సాధారణ విమానాలు తమకు తెలియకుండానే అకస్మాత్తుగా ఆకాశంలో దట్టంగా పేరుకుపోయిన సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ జోన్లలోకి దూసుకెళతాయి. ఈ రసాయనాలను ఆకాశంలో పొడవాటి గీతల్లా చల్లుకుంటూ వెళ్తారు కాబట్టి, కొన్ని చోట్ల ఈ గ్యాస్ అంచనాలకు మించి అత్యంత గాఢతతో ఉండే అవకాశం ఉంది.పక్షవాతం, గుండెపోటు ముప్పు!ప్రొఫెసర్ రోబాక్ లెక్కల ప్రకారం ఈ రసాయనాలను చల్లిన కొత్తలో కొన్ని ప్రాంతాలలో వీటి గాఢత ఒక క్యూబిక్ మీటరుకు 50 మైక్రోగ్రాముల వరకు పెరిగిపోతుంది. ఇది యూరోపియన్ యూనియన్ పర్యావరణ, ఆరోగ్య ప్రమాణాల ప్రకారం మానవ ఆరోగ్యానికి అత్యంత హానికరమైన స్థాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్ మిశ్రమం ఉన్న గాలిని పీల్చడం వల్ల గొంతు, ముక్కు, ఊపిరితిత్తులు తీవ్రంగా మంట పుడతాయి.ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇది తక్షణమే ‘ఆస్తమా ఎటాక్’కు దారితీసి ప్రాణాంతకంగా మారుతుంది. రసాయన ప్రభావం వల్ల శ్వాస నాళాలు ముడుచుకుపోయి, ఊపిరి తీసుకోవడం అసాధ్యంగా మారుతుంది. పదే పదే లేదా ఎక్కువ సమయం ఈ యాసిడ్ ప్రభావం ఉన్న వాతావరణంలో గడపడం వల్ల రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు దెబ్బతినడం జరిగి పక్షవాతం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్య పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా వారంలో చాలా గంటలు ఆకాశంలోనే గడిపే పైలట్లు, ఎయిర్ హోస్టెస్‌లు, క్యాబిన్ క్రూ సిబ్బంది ఈ భయంకరమైన ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.విమానానికేం కాదు కానీ..!సల్ఫ్యూరిక్ యాసిడ్‌కు లోహాలను, వస్తువులను క్షీణింపజేసే గుణం ఉంటుంది. అయితే, ఆకాశంలో ప్రయాణించే విమానాల బాడీకి లేదా లోహ భాగాలకు ఈ మోతాదు వల్ల ఎలాంటి నష్టమూ వాటిల్లదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విమానాలకు భౌతికంగా ఏం కాకపోవచ్చు కానీ, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా అస్తవ్యస్తం అయ్యే ప్రమాదం మాత్రం ఉందని కొలంబియా క్లైమేట్ స్కూల్ తల్చేసింది. ధ్రువ ప్రాంతాల వద్ద ఏరోసోల్స్ వదలడం వల్ల ఉష్ణమండల దేశాలలో (భారతదేశం వంటి దేశాలలో) వచ్చే రుతుపవనాలు దెబ్బతిని, తీవ్ర కరువు లేదా అకాల వరదలు రావచ్చు.అయితే, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ వాతావరణ పరిశోధకుడు డాక్టర్ వేక్ స్మిత్ మాత్రం ఈ ప్రయోగాన్ని ఇప్పుడే పూర్తిగా పక్కన పెట్టేయకూడదంటున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, భూతాపం అనే పెద్ద రాక్షసుడిని చంపడానికి ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులను మనం ఎదుర్కోక తప్పదు.ఏమైనప్పటికీ, ప్రకృతి శక్తులతో మానవుడు కృత్రిమంగా ఆడుకోవాలనుకున్నప్పుడు ఊహించని సవాళ్లు ఎదురవడం సహజం. మరి భవిష్యత్తులో సైన్స్ ఈ సమస్యకు ఎలాంటి సురక్షితమైన పరిష్కారాన్ని చూపుతుందో చూడాలి.జియోఇంజనీరింగ్ అంటే?భూతాపాన్ని తగ్గించేందుకు భూవాతావరణ ప్రక్రియలను కృత్రిమంగా, భారీ ఎత్తున మార్చడాన్నే ‘జియోఇంజనీరింగ్’ అంటారు. సూర్యకాంతిని వెనక్కి తిప్పి పంపడానికి ఆకాశంలో రసాయన కణాలు చల్లడం, లేదా గాల్లోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకునేలా సముద్రపు రసాయనిక శక్తిని మార్చడం వంటివి ఇందులో ముఖ్యమైనవి. అయితే, ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ ప్రయోగాలు వికటిస్తే, సమస్య పరిష్కారం కాకపోగా వాతావరణం మరింత వినాశకరంగా మారే ప్రమాదం ఉందని పరిశోధకులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జియోఇంజనీరింగ్ లోపాలు..వాతావరణ మార్పులతో పోరాడటానికి శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరిష్కారాలను ప్రతిపాదించారు. వాటిలో కొన్ని వివాదాస్పద పద్ధతులు కూడా ఉన్నాయి. అడవుల పెంపకంఆస్ట్రేలియా, ఉత్తర ఆఫ్రికా వంటి ప్రాంతాల్లోని ఎడారులకు నీటిని అందించి, అక్కడ లక్షలాది చెట్లను నాటుతారు. ఈ చెట్లు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి.లోపం: సాధారణంగా ఎడారులు సూర్యకాంతిని తిరిగి అంతరిక్షంలోకి పంపేస్తాయి (రిఫ్లెక్ట్ చేస్తాయి). కానీ అక్కడ చెట్లు పెంచితే, అవి సూర్యకాంతిని లోపలికి లాక్కుంటాయి. దీనివల్ల భూమి మరింత వేడెక్కే ప్రమాదం ఉంది.కృత్రిమ సముద్ర ఉప్పెనపెద్ద పెద్ద పైపులను ఉపయోగించి సముద్రం అడుగున ఉండే చల్లటి, పోషకాలు దట్టంగా ఉండే నీటిని పైకి పంపిస్తారు. ఇది సముద్రం పైపొరల్లోని నీటిని చల్లబరుస్తుంది.లోపం: ఈ ప్రక్రియ గనుక ఎప్పుడైనా మధ్యలో ఆగిపోతే, సముద్రాలు తమ వేడిని ఒక్కసారిగా సర్దుబాటు చేసుకోవడం వల్ల వాతావరణం చాలా వేగంగా, అస్తవ్యస్తంగా మారిపోతుంది.సముద్ర క్షారీకరణసముద్రాలలో పెద్ద ఎత్తున సున్నాన్ని కలపడం ద్వారా.. నీటికి కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువగా పీల్చుకునే రసాయనిక శక్తిని పెంచుతారు.లోపం: ప్రపంచ ఉష్ణోగ్రతలను తగ్గించడంలో ఈ పద్ధతి పెద్దగా ఉపయోగపడదని పరిశోధనలు చెప్తున్నాయి.సముద్రంలో ఇనుమును వేయడంసముద్రాలలో ఇనుమును వేయడం ద్వారా, కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకునే చిన్న చిన్న మొక్కలు/జీవుల ఎదుగుదలకు పుష్టిని అందిస్తారు.లోపం: ఈ పద్ధతి కూడా భూమి వేడిని తగ్గించడంలో అంతగా పని చేయదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.సూర్య కిరణాల నియంత్రణఆకాశంలోకి సూర్యకాంతిని తిరిగి వెనక్కి తిప్పి పంపే సల్ఫేట్ కణాలను వాతావరణంలోకి వదలడం ద్వారా భూమికి వచ్చే ఎండ తీవ్రతను తగ్గిస్తారు.లోపం: దీనివల్ల భూమి చల్లబడవచ్చు కానీ, వాతావరణంలో పేరుకుపోయే కార్బన్ డయాక్సైడ్ సమస్య మాత్రం అలాగే ఉండిపోతుంది.- సాక్షి స్పెషల్ డెస్క్ -
అమ్మా... 'నేను లారీ కింద పడి చనిపోయాను..!'
కొలీన్ హాకిన్ కిచెన్‌లో పనిచేసుకుంటోంది. హాల్లో ఆడుకుంటున్న ఆమె మూడేళ్ల చిన్న కుమారుడు బ్లేక్ హాకిన్ భయంతో గట్టిగా అరిచాడు. బయట రోడ్డుపై స్కూల్ బస్సు కోసం వేచి చూస్తున్న తన అన్నయ్యను ఉద్దేశించి ‘రోడ్డుపై నుంచి పక్కకు రా... బస్సు వచ్చేస్తోంది!’ అంటూ కేకలు వేశాడు.కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి కొలీన్ కు... బ్లేక్ తన ఎడమ చెవిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని, నొప్పితో విలవిలలాడుతూ ఏడవడం కనిపించింది.‘ఏమైంది నాన్నా?’ అంటూ బ్లేక్‌ను గుండెలకు హత్తుకుంది. ఒళ్లు వణుకుతుండగా వాడు చెప్పిన మాటలకు కొలీన్ మైండ్ బ్లాక్ అయింది ‘అమ్మా! నన్ను ఒక పెద్ద లారీ ఢీకొట్టింది. నేను ఆ భారీ చక్రాల కింద పడిపోయాను!’ అని చెప్పాడు. కొలీన్ బయటకు పరుగెత్తి చూసింది.కానీ అక్కడ ఎలాంటి లారీ లేదు. మొదట ఆ చిన్నారి ఏదో కార్టూన్ చూసి ఊహించుకుని చెప్తున్నాడని అనుకుంది. కానీ, బ్లేక్ ఆ ప్రమాదం గురించి చెప్తున్నప్పుడు తన ముఖంలో కనిపించిన భయం ఆమెను ఆలోచనలో పడేసింది. కొలీన్ ఆ చిన్నారి కళ్లల్లోకి చూస్తూ, ‘నువ్వు చనిపోయావా బ్లేక్?’ అని అడిగింది. ఆ బాలుడు ఏమాత్రం తడబడకుండా, ‘అవును’ అని బదులిచ్చాడు!ఆ ఒక్క సంఘటనతో బ్లేక్ జీవితం తలకిందులైంది. ఎప్పుడూ ఇల్లంతా పరుగెడుతూ, నవ్వుతూ ఉండే ఆ చిన్నారి... ఒక్కసారిగా తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయాడు. శూన్యంలోకి చూస్తూ గంటల తరబడి ఒకే చోట కూర్చునేవాడు. ప్రతిరోజూ తన ఎడమ వైపు ఉన్న చెయ్యి, కాలు లేదా కన్ను విపరీతంగా నొప్పి పెడుతున్నాయంటూ ఏడ్చేవాడు. వైద్య పరిభాషలో దీనిని ‘ఫాంటమ్ పెయిన్’ అంటారు. అంటే ప్రస్తుతం ఎలాంటి దెబ్బ తగలకున్నా, గతంలో అనుభవించిన తీవ్రమైన శారీరక నొప్పులు మెదడుకు గుర్తుండిపోయి మళ్లీ బాధించడం!ఆ భయంకరమైన నరకాన్ని మాటల్లో చెప్పలేక, బ్లేక్ తెల్ల కాగితాలపై పెన్నుతో పిచ్చి గీతలు గీస్తూ, తల్లి దగ్గరకు తెచ్చి, ‘అమ్మా... చూడు, ఇవే నా ఒంటిపై ఉన్న గాయాలు’ అని చూపిస్తూ ఏడ్చేవాడు. బ్లేక్ మానసిక స్థితిని చూసి తట్టుకోలేక, కొలీన్ పునర్జన్మలపై పరిశోధనలు చేసే ప్రముఖ థెరపిస్ట్ క్యారల్ బోమన్‌ను సంప్రదించింది.ఇలాంటి పరిస్థితుల్లోనే, ఆ కుటుంబం క్రిస్మస్ కోసం అమెరికా నుంచి లండన్ వెళ్లింది. అక్కడ రద్దీగా ఉన్న ఒక రోడ్డు పక్కన బ్లేక్ చిన్న పిల్లల స్ట్రాలర్లో కూర్చుని ఉన్నాడు. హఠాత్తుగా ఓ లారీ తమ వైపు వేగంగా రావడం చూశాడు. వెంటనే స్ట్రాలర్ లోంచి బయటకు దూకి, నేరుగా దూసుకొస్తున్న ఆ లారీ ముందుకు పరుగెత్తాడు. చుట్టుపక్కల వాళ్లంతా గట్టిగా కేకలు వేశారు. అదృష్టవశాత్తూ పక్కనే ఉన్న బ్లేక్ తండ్రి క్షణాల వ్యవధిలో బ్లేక్‌ను వెనక్కి లాగాడు. గత జన్మలో లారీ కింద పడి చనిపోయిన ఆ భయంకరమైన సంఘటనను బ్లేక్ ఈ జన్మలో పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తల్లి కొలీన్ భయంతో వణికిపోయింది. ఈ విషయం తెలుసుకున్న క్యారల్ బోమన్... కొలీన్కు ఒక ఉపాయం చెప్పింది.క్యారల్ చెప్పినట్లే ఆ రాత్రి కొలీన్.. బ్లేక్ మంచం దగ్గరకు వెళ్లి, తన తలపై ప్రేమగా నిమురుతూ, ‘కన్నా.. నువ్వు గతంలో లారీ కింద పడి చనిపోయావు కదా, అది నిజమే. కానీ నా బంగారు కొండా... అది నీ గత జన్మ. అప్పుడు నీ శరీరం వేరు, నిన్ను కన్న తల్లి వేరు. ఇప్పుడు నువ్వు నా కడుపున పుట్టావు. ఇది నీ కొత్త జీవితం. ఇక్కడ నువ్వు పూర్తిగా సురక్షితంగా ఉన్నావు. ఆ పాత లారీ నిన్ను ఏమీ చేయలేదు...’ అని చెప్పింది.ఆశ్చర్యం! ఆ మాటలు వినగానే ఆ మూడేళ్ల చిన్నారి ముఖంలో తెలియని ఒక ప్రశాంతత కనిపించింది. మరుసటి రోజు ఉదయం నుంచే బ్లేక్ ఆ పాత జ్ఞాపకాలను, ఆ భయాన్ని పూర్తిగా మరచిపోయాడు. తన శరీరంలో ఎడమవైపు వస్తున్న ఆ ‘ఫాంటమ్ పెయిన్స్’ కూడా మాయమయ్యాయి! మళ్లీ ఎప్పటిలాగే నవ్వుతూ, ఆడుకుంటూ సాధారణ స్థితికి వచ్చాడు.సైన్స్ పరంగా పునర్జన్మలను నిరూపించడానికి లేదా పూర్తిగా తోసిపుచ్చడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ బ్లేక్ హాకిన్ అనుభవం, తన మెదడులో దాగున్న కాలం దాటిన జ్ఞాపకాలు మాత్రం ప్రకృతి మానవాళికి వదిలేసిన అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయాయి!- సత్యకిషోర్ -
మొక్కజొన్న పొత్తు'పొడుపు'
ప్రపంచవ్యాప్తంగా పండే తృణధాన్యాలలో మొక్కజొన్నను రారాజుగా చెప్పుకోవచ్చు. మొక్కజొన్న నిజానికి మన దేశంలో స్థానిక పంట కాదు. పోర్చుగీసువారి ద్వారా ఐదు శతాబ్దాల కిందట మనకు మొక్కజొన్నతో పొత్తు కుదిరింది. వానాకాలంలో చిరుజల్లులు కురుస్తున్నప్పుడు బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తుల్లోని గింజలను ఒలుచుకుంటూ తినడం ఒక చక్కని కాలక్షేపం.ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న గింజలను నేరుగాను, పిండి రూపంలోను రకరకాల వంటకాల్లో వినియోగిస్తారు. మొక్కజొన్నను మద్యం సహా వివిధ ఉత్పత్తుల తయారీ కోసం కూడా వినియోగిస్తారు. పదహారో శతాబ్ది వరకు మొక్కజొన్న అంటే ఏమిటో ఎరుగని మన దేశం– ఇప్పుడు మొక్కజొన్న ఉత్పాదనలోని టాప్–10 దేశాలలో ఒకటిగా నిలుస్తోంది. మొక్కజొన్న విశేషాలు గణాంకాల్లో తెలుసుకుందాం.మొక్కజొన్నలో పోషకాలు..మొక్కజొన్న అత్యంత శక్తినిచ్చే ఆహార పదార్థాల్లో ఒకటి. మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో పాటు పుష్కలంగా పీచుపదార్థం, స్వల్పంగా కొవ్వు పదార్థాలు, కీలకమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ప్రతి వంద గ్రాముల మొక్కజొన్న 96 కిలోకేలరీల శక్తినిస్తుంది. మొక్కజొన్నలో ఉండే పోషకాలు ఇవీ: -
రెక్కల రాకెట్: ఎవరెస్ట్ దాటిన బాతు!
పిల్లలూ, మీకో సూపర్ పక్షి కథ చెప్పనా? ఊపిరి ఆడని ఎత్తులో, వణికించే చలిలో, ఎవరెస్ట్ పైనుంచి టప్ అని దూకేసే బాతు గురించి! బార్ హెడెడ్ గూస్. ‘చారల తల బాతు’ అని కూడా అనొచ్చు. తల మీద రెండు నల్ల చారలు. అదే దీని గుర్తు. రాకెట్లా ఎవరెస్ట్ శిఖరం పై నుంచి అంటే తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో హాయిగా ఎగురుతుంది. మనకు అక్కడ ఊపిరి ఆడదు. దీనికి మాత్రం అది రాజమార్గం!ఎందుకు అంత కష్టపడుతుంది?చలికాలం వస్తే మంగోలియా, టిబెట్‌లో పూర్తిగా మంచు. తినడానికి గడ్డిపోచ కూడా దొరకదు. అందుకే సెప్టెంబర్ వచ్చిందంటే చాలు, ‘పదండి ఇండియా యాత్ర వెళ్దాం’ అని ఐదు వేల మంది నేస్తాలతో బయల్దేరుతుంది ఈ బాతు. మధ్యలో హిమాలయాలు అడ్డొస్తే? ‘దాటేద్దాం పద’ అని పైనుంచి వెళ్లిపోతుంది. దీనివి గొప్ప ఊపిరితిత్తులు. మనకన్నా మూడు రెట్లు ఎక్కువ గాలిని పీల్చుకుంటుంది. బలమైన గుండె. నిమిషానికి నాలుగు వందల సార్లు కొట్టుకుంటుంది. కొండల మధ్య, లోయల మధ్య పైకి కిందికి ఊగుతూ శక్తిని పొదుపు చేస్తుంది.ప్రపంచంలోనే గొప్పది... ‘ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఎగిరే పక్షి’ అని దీనికి పేరుంది. శాస్త్రవేత్తలు పరిశీలిస్తే ఎనిమిది గంటల్లో హిమాలయాలు దాటేసింది. కాబట్టి నెక్స్ట్ టైమ్ ‘‘నేను చేయలేను’’ అనిపిస్తే ఈ చారల తల బాతుని గుర్తు తెచ్చుకోండి. రెక్కలు లేకపోయినా పర్లేదు, గుండె ధైర్యం ఉంటే చాలు. -
భయం వేస్తే వీపు తట్టేదెందుకో తెలుసా?
సడన్‌గా మనం భయపడినప్పుడు అమ్మో, నాన్నో వచ్చి వీపు తడతారు కదా. ఎందుకో తెలుసా? మన వీపు మీద చాలా సున్నితమైన నరాలు ఉంటాయి. పెద్దలు తట్టినప్పుడు ఆ నరాలు మెదడుకు కబురు పంపిస్తాయి... ‘భయపడకు, నీ పక్కన నీవాళ్లు ఉన్నారు’ అని.ఆ సిగ్నల్ రాగానే మన మెదడు ‘సేఫ్’ అని ఫీల్ అవుతుంది. భయం వేస్తే మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. వీపు మీద లయగా తడితే ఆ తట్లు గుండెకి ‘మెల్లగా కొట్టుకో’ అని మెసేజ్ చేస్తాయి. డాక్టర్లు దీన్ని ‘టచ్ థెరపీ’ అంటారు.పూర్వం అడవిలో మనుషులు గుంపులుగా తిరిగేవాళ్లు. క్రూరమృగాలు తమను పసిగట్టకుండా మెల్లగా నడిచేవారు. అప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తే పెద్దవాళ్లు వీపు తట్టి ‘ష్... పడుకో. పులి వస్తుంది’ అని కాపాడేవాళ్లు. ఆ అలవాటు ఇప్పటికీ మన రక్తంలోనే ఉంది. కాబట్టి నెక్ట్స్ టైమ్ భయం వేస్తే, పెద్దల దగ్గరికి పరిగెత్తి వీపు అప్పగించేయండి. తట్టు ఫ్రీ... భయం పరార్. -
రోబో అంకుల్! చాక్లెట్ కావాలా... చిప్స్ కావాలా?
పిల్లలూ... మనం షాపుకెళితే ‘చాక్లెట్ కావాలా... చిప్స్ కావాలా’ అని అంకుల్ అడుగుతాడు. కాని ఇక్కడ అంకుల్ లేడు రోబో ఉంది. అందుకే ఈ షాపు పేరు ‘గెలాక్సీ రోబో కియోస్క్’.2026 జూలై 17న చైనాలోని బీజింగ్‌లో తీసిన ఫోటో ఇది. ఈ షాపులో ఏం కావాలన్నా రోబోనే అమ్ముతుంది. జ్యూస్ బాటిల్స్, నీళ్లు, చిన్న బొమ్మలు.... ఏవైనా సరే. పిల్లలు క్యూలో నిలబడి స్క్రీన్ పై ఏది కావాలో టచ్ చేస్తే, లోపల ఉన్న రోబో ఆ వస్తువును తీసి ఇస్తుంది. చూశారా ఎంత బాగుందో! పిల్లలకు ఇది కొత్త అనుభవం. ‘వావ్! రోబో మనకు జ్యూస్ ఇస్తోంది‘ అని సంతోషంగా చూస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రోబో షాపులు ఇంకా ఎక్కువ అవుతాయట. అప్పుడు మన ఊళ్లో కూడా వస్తాయేమో! అన్నట్టు ఈ రోబో పేరు ‘హ్యూమనాయిడ్ సెల్లర్ రోబో’. అంటే మనిషిలా నిలబడి సామాన్లు అమ్మే రోబో. బీజింగ్‌లోని ‘గెలాక్సీ’ కంపెనీ దీనిని తయారు చేసింది. వెల దాదాపు 15 లక్షల నుంచి 25 లక్షల వరకు. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 8 నుంచి 12 గంటల వరకు ఆగకుండా పని చేస్తుంది. లోపల కెమెరా, సెన్సార్లు ఉంటాయి. మీరు ఏ బటన్ నొక్కితే ఆ వస్తువును తీసి ఇస్తుంది. అలసి΄ోదు, కోప్పడదు, లెక్క తప్పదు! -
గోల్ఫ్ ఆటకు గద్ద కాపలా!
పిల్లలూ... ఈ ఫోటోలో పెంపుడు గద్ద కనిపిస్తుంది చూశారా? ఇది ఏం చేస్తుందో తెలుసా? ఇది గోల్ఫ్ ఆటగాళ్లకు కాపలాదారుగా పని చేస్తోంది! అవును, నిజంగా! మొన్న జూలై 16న ఇంగ్లాండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో 154వ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ మొదలైంది. వేదిక రాయల్ బిర్క్డేల్ గోల్ఫ్ క్లబ్.ప్రపంచంలోనే అతి పెద్ద గోల్ఫ్ టోర్నమెంట్ ఇది. ఇక్కడ ఆటగాళ్లు చాలా దూరం బంతిని కొట్టాలి. కానీ ఒక చిన్న సమస్య. ‘గల్స్’ అని సముద్ర పక్షులు ఈ మైదానానికి వస్తుంటాయి. నేల మీద గడ్డిని పాడు చేస్తాయి. గోల్ఫ్ బంతిని కూడా తన్నేస్తాయి. అప్పుడు ఆటగాళ్లు ఇబ్బంది పడతారు. అందుకే నిర్వాహకులు గద్దను కాపలా పెట్టారు. ఈ ఫోటోలో కనిపించే గద్దకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీని పని ఏంటంటే గల్స్ పక్షులను చూస్తూనే భయపెట్టి తరిమేయడం.గ్రద్దను చూడగానే చిన్న పక్షులు దగ్గరకు రావడానికి భయపడతాయి కదా! గద్ద గాల్లో ఎగురుతూ మొత్తం మైదానంపై కాపలా కాస్తుంది. ఎక్కడైనా పక్షులు కనిపిస్తే వెంటనే అరుస్తూ వాటిని పారిపోయేలా చేస్తుంది. గద్దకు కూడా ఇది ఒక ఉద్యోగం లాంటిదే. మంచి ఆహారం, పోషణ దొరుకుతాయి. మరి మీకు కూడా ఇలాంటి పెంపుడు పక్షి ఉంటే అది మీకు ఏ పనిలో సహాయం చేయాలని ఉంటుంది? -
Travel: 15,000 అడుగుల ఎత్తులో 'హోటల్ కాదు.. అడ్వెంచర్!'
రోడ్లు లేవు, వాహనాలు లేవు, ట్రెక్ చేస్తేనే చేరగలిగే హోటల్ 15,000 అడుగుల ఎత్తులో ఉంటే... ఆ హోటల్‌కి వెళ్లాలంటే 5 గంటలు ట్రెక్కింగ్ చేయాల్సిందే!లగ్జరీ హోటల్స్ గురించి వినుంటారు. కానీ స్విట్జర్లాండ్–ఇటలీ సరిహద్దులో ఆల్ఫ్స్ పర్వతాల మధ్య సుమారు 15,000 అడుగుల (4,554 మీటర్లు) ఎత్తులో ఉన్న మార్గెరిటా హట్ మాత్రం పూర్తిగా భిన్నం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న మౌంటైన్ హోటల్స్‌లలో ఒకటి. ఇక్కడికి వెళ్లేందుకు రోడ్డు లేదు, ఏ వాహనం కూడా వెళ్లలేదు. ట్రెక్కింగ్ చేస్తేనే ఇక్కడికి చేరుకోగలం. అది కూడా అందరూ కాదు.5 గంటల ట్రెక్.. జీవితంలో మర్చిపోలేని అనుభూతిమార్గెరిటా హట్ చేరడానికి ముందుగా గ్లేషియర్‌పై నడవాలి. సాధారణంగా పర్వతారోహకులు పుంటా గ్నిఫెట్టి అనేప్రాంతం నుండి గైడ్‌తో కలిసి సుమారు 5 గంటల ట్రెక్ చేస్తారు. మంచుతో నిండిన ఐస్ ఫీల్డులు, స్నో రిడ్జులు, హై ఆల్టిట్యూడ్ టెర్రెయిన్ లో సాగే ఈ జర్నీ అడ్వెంచర్ లవర్స్‌కి మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. దారి మధ్యలో ఆల్ఫ్స్ శిఖరాలు, ఎండ్లెస్ స్నో వ్యూస్ ప్రతి అడుగులో థ్రిల్‌ను పెంచుతాయి.హోటల్ కాదు.. అడ్వెంచర్ బేస్ క్యాంప్ ఇదిఇది రెగ్యులర్ లగ్జరీ హోటల్ కాదు. మౌంటైన్ క్లైంబర్స్, ట్రెక్కర్స్, పరిశోధకుల కోసం నిర్మించిన హై ఆల్టిట్యూడ్ రెఫ్యూజ్ ఇది. సాధారణమైన రూమ్‌లు, షేర్డ్ ఫెసిలిటీస్, వేడి వేడి భోజనం ఉంటాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆల్పస్ మౌంటైన్ రేంజెస్ మీద పడే బంగారు వెలుగు చూడవచ్చు. ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల అక్లైమటైజేషన్ చాలా ముఖ్యం.హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ముందుగా మిలాన్ లేదా జూరిచ్‌కు అంతర్జాతీయ విమానం ఎక్కాలి. అక్కడి నుండి రైలు లేదా కార్ ద్వారా అలాగ్నా వాల్సేసియా లేదా స్టాఫల్ చేరుకోవాలి. తరువాత కేబుల్ కార్ ద్వారా పుంటా ఇండ్రెన్ వరకు వెళ్లవచ్చు. అక్కడి నుండి సర్టిఫైడ్ మౌంటైన్ గైడ్‌తో ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుంది. హై ఆల్టిట్యూడ్ ట్రెక్కింగ్ అనుభవం లేనివారు గైడ్ లేకుండా ప్రయాణించకూడదు.ట్రావెల్ టిప్స్జూన్ నుండి సెప్టెంబర్ మధ్య సీజన్ ట్రెక్కింగ్‌కు అనుకూలం. థర్మల్ వేర్, వాటర్‌ప్రూఫ్ జాకెట్, ట్రెక్కింగ్ బూట్స్, గ్లవ్స్, సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్ తప్పనిసరి. వాతావరణం నిమిషాల్లో మారిపోతుంది. కాబట్టి సరైన ప్లానింగ్ అవసరం. మార్గెరిటా హట్ అనేది ఒక హోటల్ మాత్రమే కాదు. ప్రకృతి, సాహసం, మానవ సంకల్పం కలిసిన ఒక జీవితానుభవం. రోడ్డు లేకుండా, వాహనం లేకుండా మంచి డిటర్మినేషన్ తో చేరగలిగే ఈ మౌంటైన్ హట్ సాహసయాత్రికుల బకెట్ లిస్టులో తప్పకుండా ఉండాల్సిన డెస్టినేషన్. -
సజీవ సాంస్కృతిక 'నాదమ్'
మంగోలియా అస్తిత్వానికి, అక్కడి ప్రజల జీవన విధానానికి అద్దం పట్టే జాతీయ ఉత్సవం ‘నాదమ్’. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఈ వేడుకను ప్రతి సంవత్సరం జూలై 11 నుంచి 13 వరకు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకొంటారు. మంగోలియన్ల సంచార నాగరికతతో విడదీయరాని బంధం ఉన్న ఈ వేడుక, 2010లో సాంస్కృతిక వారసత్వ పండుగగా యునెస్కో గుర్తింపు పొందింది. మంగోలియా అనగానే మనకు గుర్రాల గుంపులు, అంతులేని పచ్చని మైదానాలు, చెంఘిజ్ ఖాన్ పరాక్రమం గుర్తొస్తాయి. నేటి ఆధునిక యుగంలోనూ ఆ ప్రాచీన సంచార సంస్కృతిని, వీరత్వాన్ని సజీవంగా ఉంచుతూ ఏటా జూలై నెలలో అత్యంత వైభవంగా ‘నాదమ్’ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. స్థానికంగా దీనిని ‘ఎరీన్ గుర్వన్ నాదమ్’ కూడా అని పిలుస్తారు.నాదమ్ పండుగలో నిర్వహించే గుర్రపు పందాలు, కుస్తీ, విలువిద్య అనే మూడు సాంప్రదాయ క్రీడలు వారి జీవన పరిస్థితులకు ప్రత్యక్ష రూపాలు. ఇవి కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, పూర్వకాలంలో సైనికులను యుద్ధానికి సిద్ధం చేసే శిక్షణలో భాగంగా ఉండేవి. వీటిని తరతరాలుగా కుటుంబ సభ్యులే పిల్లలకు నేర్పిస్తారు. అయితే, ఇటీవలి కాలంలో కుస్తీ, విలువిద్యల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఇక్కడి ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. గెలుపొందిన విజేతలకు ప్రత్యేక బిరుదులు ఇవ్వడమే కాకుండా, పోటీదారులను కొనియాడుతూ ప్రత్యేక ప్రశంసా గీతాలు, కవితలను అంకితం చేయడం ఇక్కడి ఆచారం.నాదమ్ కేవలం ఆటల పోటీ మాత్రమే కాదు.. అదొక సాంస్కృతిక సంబరం!పండుగ రోజుల్లో మంగోలియన్లు అందరూ ‘దీల్’ అని పిలిచే తమ సాంప్రదాయ, రంగురంగుల పట్టు దుస్తులను ధరించి ఎంతో ముచ్చటగా తయారవుతారు. ఉత్సవాల సమయంలో ‘ఖుషూర్’ అనే ప్రత్యేకమైన వంటకంతో పాటు, గుర్రం పాలను పులియబెట్టి తయారుచేసే ‘ఐరాగ్’ అనే సాంప్రదాయ పానీయాన్ని అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. ఈ వేడుకలో మంగోలియన్ల ప్రత్యేక సంగీత వాద్య పరికరాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.మంగోలియా రాజధాని ఉలాన్ బాటర్లో జరిగే జాతీయ ఉత్సవాలతో పాటు, గ్రామీణ ప్రాంతాలలో స్థానిక స్థాయిలో జరిగే నాదమ్ వేడుకలు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న విలువలనూ, ప్రకృతితో ముడిపడిన సంచార జీవనాన్నీ నేటికీ గౌరవిస్తూ, సమాజాన్ని ఏకం చేసే శక్తి నాదమ్. అందుకే ఇది కేవలం ఒక పండుగగా మిగిలిపోకుండా, ప్రపంచ సాంస్కృతిక సంపదగా వెలుగొందుతోంది.- రమా జంబుల -
World Population Day: మీకో విచిత్రమైన నిజాలు తెలుసా?
రోజురోజుకి సోషల్ మీడియాలో అకౌంట్ యాక్టివ్ కొత్త లాగిన్లు అధికంగా పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం.. జనాభా పెరుగుదలకన్నా అకౌంట్ లాగిన్ల పెరుగుదలే ఎక్కువ. దీని ప్రకారం.. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, షేర్‌చాట్, యూట్యూబ్, ట్విట్టర్ లాగిన్ల సంఖ్య చూసినట్లయితే... ఫేస్బుక్ ముందు స్థానంలో ఉంది.ఫేస్బుక్ జనాభా.. చైనా, భారత్ కంటే ఎక్కువ! మీకో విచిత్రమైన నిజం తెలుసా? ఒకవేళ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ గనుక ఒక దేశం అయితే, అదే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అవుతుంది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ను ప్రతి నెలా వాడే యాక్టివ్ యూజర్ల సంఖ్య దాదాపు 300 కోట్లకు పైమాటే! భారతదేశం, చైనా దేశాల ఉమ్మడి జనాభా కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ.అత్యంత పిన్న వయస్కుల ఖండం.. ఆఫ్రికా..!ప్రపంచంలోనే అత్యంత వేగంగా జనాభా పెరుగుతున్న ప్రాంతం ఆఫ్రికా ఖండం. ఇక్కడి సగటు వయస్సు కేవలం 19 ఏళ్లు మాత్రమే. రాబోయే 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పుట్టబోయే పిల్లల్లో సగానికి పైగా ఆఫ్రికాలోనే జన్మిస్తారని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. దీనికి భిన్నంగా యూరప్ ఖండంలో సగటు వయస్సు 43 ఏళ్లుగా ఉంది. -
ఓ సముద్రజీవి.. ఐదేళ్ల ఉపవాసం!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఒక్క రోజు ఉపవాసం ఉండటమే మనకు కష్టమనిపిస్తుంది. కానీ ఆహారం తినకుండా ఐదేళ్లపాటు జీవించగల ఒక వింత జీవి ఉన్నట్లు చైనా పరిశోధకులు గుర్తించారు. ఆ జీవి పేరు సూపర్‌జైంట్ ఐసోపాడ్ (supergiant isopod). సముద్రగర్భంలో నివసించే ఈ జీవి మనుగడ రహస్యాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు ఛేదించారు. ఈ పరిశోధన వివరాలు సెల్ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.సముద్ర గర్భంలో చీకటి, తీవ్రమైన ఆహార కొరత, అతిశీతల పరిస్థితుల మధ్య ఈ భారీ ఐసోపాడ్‌లు నివసిస్తాయి. చనిపోయిన తిమింగలాలు, చేపల కళేబరాలను తిని బతుకుతాయి. దొరికినప్పుడు కడుపు పగిలేలా కదల్లేనంతగా తింటాయి. మళ్లీ ఐదేళ్ల వరకు ఏమీ దొరక్కపోయినా బతకగలగటం వాటి ప్రత్యేకత. విలక్షణమైన శరీర అమరిక, ప్రత్యేక జన్యువులే ఈ సుదీర్ఘ, అద్భుత మనుగడ సామర్థ్యానికి కారణమని పరిశోధకులు గుర్తించారు.పెద్ద జీర్ణాశయం.. ప్రత్యేక జన్యువు.. 20 అంగుళాల సైజు వరకు పెరిగే ఈ ఐసోపాడ్లలో జీర్ణాశయం చాలా పెద్దది. మొత్తం శరీరంలో దాదాపు మూడింట రెండు వంతులు వాటి పొట్టే ఆక్రమిస్తుంది. ఆహారం దొరికినప్పుడు భారీ మొత్తంలో నిల్వ చేసుకోగలవు. ఒక ప్రత్యేక జన్యువు ఏళ్ల తరబడి ఉపవాసానికి దోహదపడుతోందట. అదే ‘ఎన్డీ1’. ఇది స్వతహాగా వాటిది కాదు. ఒక బ్యాక్టీరియా నుంచి గ్రహించిన జన్యువు కావడం విశేషం.తీవ్రమైన చలి వాతావరణంలో ఈ జన్యువు ఒక స్విచ్‌లా పనిచేసి, ప్రాథమిక జీవక్రియ రేటు (బీఎంఆర్)ను అత్యంత కనిష్ట స్థాయికి తగ్గిస్తుంది. దీనివల్ల శరీరంలో నిల్వ ఉన్న శక్తి చాలా నెమ్మదిగా ఖర్చవుతుంది. వాటికి గల వినూత్న శారీరక, జన్యుపరమైన రక్షణ విధానం వల్లే సుదీర్ఘకాలం ఉపవాసం ఉంటూ ప్రాణాలు నిలుపుకోగలుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. తీవ్రమైన చలి వాతావరణంలో ఆకలిని తట్టుకునే సామర్థ్యాన్ని ఈ జన్యువు 37% మేర పెంచుతోందని పరిశోధనల్లో తేలింది.చదవండి: బ్యాటరీ రీచార్జ్.. భిక్షాందేహీ...!ఈ జీవి జీర్ణాశయంలో ఉండే క్లామిడియా అనే బ్యాక్టీరియా కొవ్వును సమర్థంగా నిల్వ చేయడానికి సహాయపడుతోందట. వ్యోమగాములు, అతిశీతల ప్రదేశాల్లో సైనికుల ఆహార అవసరాలు తీర్చే పరిశోధనలకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుందని భావిస్తున్నారు. అంతేనా..? మనుషుల్లో ఊబకాయాన్ని తగ్గించే ఔషధాల తయారీకీ భవిష్యత్తులో ఉపయోగపడొచ్చేమో! -
అక్షరాల్లోకి... అంతరిక్ష యాత్ర
వ్యోమగాముల అంతరిక్ష యానానికి సంబంధించిన విశేషాలను అక్కడొకటి, ఇక్కడొకటి చదివితేనే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటిది ‘మా యాత్ర ఇలా జరిగింది తెలుసా!’ అని కథ చెప్పినట్లుగా ఒక వ్యోమగామి చెబితే ఎంత ఆసక్తికరంగా ఉంటుంది? ఆ ప్రయత్నమే చేశారు శుభాంశు శుక్లా. మన దేశపు అంతరిక్ష వీరుడు శుభాంశు శుక్లా రచయితగా మారారు!నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఎఎఫ్ఎ) వంటి శిక్షణ కేంద్రాలలో రాణించి, టెస్ట్ పైలట్‌గా అనేక యుద్ధ విమానాలను నడిపిన శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఆ చారిత్రక యాత్ర వెనక ఉన్న విషయాలను పాఠకులతో పంచుకోవడానికి ‘సెకండ్ ఆర్బిట్’ పేరుతో పుస్తకం రాశారు శుక్లా. ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఒక వ్యక్తి సాధించిన ఘనతను కీర్తించేది కాదు.అంతరిక్ష యాత్రను సాధ్యం చేసిన ఎంతోమంది కృషిని తలుచుకోవడం. శుక్లా రాసిన పుస్తకంలో ఇంజినీర్లు, ట్రైనర్లు, మిషన్ ప్లానర్లు, డాక్టర్లు, టెక్నిషియన్లు, తోటి వ్యోమగాములు, కుటుంబ సభ్యులు ప్రధాన పాత్రలు. ‘ఏ వ్యోమగామి ఒంటరిగా కక్ష్యలోకి చేరుకోలేడు’ అని చెప్పే పుస్తకం...సెకండ్ ఆర్బిట్. ఆక్సియమ్–4 మిషన్‌కు సంబంధించి తన ఎంపికను తెలియజేస్తూ తన జీవితాన్ని మార్చిన ఫోన్ కాల్ అందుకున్న క్షణాలను ఆసక్తికరంగా తెలియజేస్తారు శుక్లా. తన కమాండర్‌ను తొలిసారి కలవడం నుండి దాదాపు ఒక సంవత్సరం పాటు తీవ్రమైన శిక్షణ పొందడం వరకు...సంవత్సరాల తరబడి చేసిన ప్రయోగాలు, సన్నాహాలు, కొన్ని నిమిషాల్లో పరీక్షకు గురయ్యే ఉద్విగ్న క్షణాలు ఎలా ఉంటాయో చెబుతారు శుక్లా. -
బోరబండలో డొనాల్డ్ ట్రంప్!
హైదరాబాద్‌లోని ఒక రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అని తన పేరు పెట్టారనే విషయం తెలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకేసారి వంద ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీగా ఇంటికొచ్చినంతగా సంతోషించాడు. ఆ సంతోషంలో... ‘అర్జంటుగా హైదరాబాద్‌కు వెళ్లాలనుకుంటున్నాను. ప్రయాణ ఏర్పాట్లు చేయండి’ అని సిబ్బందిని ఆదేశించాడు. విమానం ఎక్కడానికి ముందు ‘30 రోజుల్లో తెలంగాణ భాష–యాస’ అనే పుస్తకాన్ని బట్టీ పట్టాడు ట్రంప్. కొన్ని రోజుల్లోనే తెలుగు భాషపై గట్టి పట్టు సంపాదించి గ్రేట్ అనిపించుకున్నాడు.హైదరాబాద్‌లో ట్రంప్.... ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అనే బోర్డ్‌ను చూస్తూ నాన్‌స్టాప్‌గా ఆనందించాడు. ఆ తరువాత... ‘మారు వేషంలో గల్లీ గల్లీ తిరగాలనుకుంటున్నాను. నో సెక్యూరిటీ గిక్యూరిటీ’ అన్నాడు ట్రంప్.‘సార్...ప్రాబ్లం అవుతుందేమో!’ అన్నారు అమెరికా నుంచి వచ్చిన హై ప్లస్ సెక్యూరిటీ వాళ్లు. ‘ఐ లవ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమే నాప్రాణం. ప్రాబ్లమే నా ప్రతిబింబం. ప్రాబ్లమే నా సుడిగుండం. ప్రాబ్లమే నా అగ్నిగుండం. ప్రాబ్లమ్ లేకుండా నేనే లేను’ కవితాత్మకంగా అన్నాడు ట్రంప్.‘సరే... తమరి ఇష్టం’ అన్నారు సెక్యూరిటీ వాళ్లు.ఒక సాధారణ రైతు వేషంలో హైదరాబాద్‌లో తిరుగుతున్న ట్రంప్ బోరబండలోని ‘పీపీటీ–పీపాలకు పీపాలు తాగండి’ అనే జనతా బార్ దగ్గర ఆగాడు. మందుబాబులు బార్లో కాదు... రోడ్డు మీద, రోడ్డు పక్కన, చెట్టు కింద, చెట్టు పైనా... ఎక్కడ పడితే అక్కడ మందు తాగుతూ కనిపించారు.వారిని ఆసక్తిగా గమనిస్తున్నాడు ట్రంప్. ఇంతలో దూరం నుంచి ఒక మందుబాబు పరుగెత్తుకు వచ్చి... ‘అన్నా... నువ్వు ఇక్కడున్నవా... నీ కోసం వెదుకని స్టేట్ లేదు. ఊరు లేదు’ అని ట్రంప్ మీద పడి ఏడ్వడంప్రారంభించాడు. ‘నేను నీ అన్నేమిటీరా... లిక్కరికీ కిరికిరీ. నోర్ముస్కొని పో’ అని గద్దించాడు ట్రంప్.‘ఒరేయ్ ఎంకులు, శ్రీను, ఎంకటేశ్వర్లు, గుర్నాదం... ఒకసారి ఇటొచ్చేయండి’ అని గట్టిగా అరిచాడు మందుబాబు. అంతే... సాటి మందుబాబులు పరుగెత్తుకు వచ్చారు. ‘ఇన్ని రోజులు ఎక్కడికి బోయినవు అన్నా... మేమెట్ల బతకాలే అన్నా... నిన్ను చూస్తే బోనాల పండుగ ముందుగాల్నే వచ్చినట్లుంది’ అని ట్రంప్‌ను గట్టిగా పట్టుకున్నారు ఆ నలుగురు.ఇంతలో అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చాడు. ‘ఏందిరా మీ లొల్లి?’ అని గద్దించాడు.‘ఈయన మా అన్న నర్సింగ్. రెండు సంవత్సరాల కింద ఇంట్ల నుంచి పారిపోయిండు. ఇప్పుడు దొరికిండు’ అన్నాడు గుర్నాదం.‘ఈనే మీ అన్న అని గ్యారెంటీ ఏమిటీ?’ అడిగాడు కానిస్టేబుల్. సెల్‌ఫోన్ ఫొటోగ్యాలరీలో పాత ఫోటోలు చూపించాడు శ్రీను.‘ఏమయ్యా పెద్ద మనిషి... ఈ ఫోటోలలో ఉన్నది నువ్వే కదా! ఎందుకు అబద్దం ఆడుతున్నవు?’ అని ట్రంప్‌పై చిరాకు పడ్డాడు కానిస్టేబుల్.‘మిస్టర్ కానిస్టేబుల్... సేమ్ టు సేమ్ ఉండే వ్యక్తులు లోకంలో ఏడుగురు ఉంటారు అనే స్మాల్ విషయం నీకు తెలియదా?’ కానిస్టేబుల్‌పై కన్నెర్ర చేశాడు ట్రంప్. ట్రంప్ కోపాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కానిస్టేబుల్.‘అన్నా... నువ్వు చీపు లిక్కర్ తాగక చానా రోజులైంది’ అంటూ అపురూప మద్యాన్ని ట్రంప్‌తో బలవంతంగా తాగించారు ఆ నలుగురు. అంతే... శ్రీ ట్రంప్‌కు క్షణాల్లో పద్నాలుగు లోకాలు, సమస్త జీవరాసులు, నక్షత్రమండలాలు, ఉల్కలు, అంతరించి పోయిన డైనోసర్లు, గ్రహాంతర జీవులు కనిపించాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా కనిపించింది!!! – యాకుబ్ పాషా -
మన పనస ఘనత..
వేసవి ఫలాల్లో మామిడి తర్వాత చెప్పుకోదగినది పనసపండు. పనసపండు వేసవి ముగిసిన తర్వాత కూడా దొరుకుతుంది. మన దేశంలో మార్చి నుంచి ఆగస్టు వరకు పనసపండ్లు దొరుకుతాయి. పనస పుట్టినిల్లు ఏ దేశమో సరైన సమాచారం లేదు గాని, ఇది తూర్పు ఆసియా దేశాల నుంచి పాశ్చాత్య దేశాలకు పాకినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.పదహారో శతాబ్దంలో కాలికట్ రేవులో అడుగుపెట్టిన పోర్చుగీసు నావికుడు గార్షియా డి ఓర్టా కేరళ ప్రాంతంలో విరివిగా పండే పనసపండ్లను చూసి ఆశ్చర్యపోయాడు. మలయాళీలు వీటిని ‘చక్కా’ అనేవారు. దీని ఆధారంగా ఓర్టా పోర్చుగీసు భాషలో ‘జాకా’ అని రాసుకున్నాడు. ‘జాకా’ పదం ఆధారంగా ఇంగ్లిష్‌లో పనసపండుకు ‘జాక్‌ఫ్రూట్’ అనే పేరువచ్చింది. మామిడి పండ్లతో పాటు పనసపండ్ల ఉత్పాదనలో కూడా మన భారతదేశం చాలాకాలంగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. మన పనస ఘనతకు గణాంకాల్లో తెలుసుకుందాం.పనసపండు పోషకాల గని. ఇందులో శక్తినిచ్చే పిండి పదార్థాలు, చక్కెరలు, ఆరోగ్యానికి మేలు చేసే పీచు పదార్థాలతో పాటు విలువైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పనసపండులో ఉండే పోషకాలు ఇవీ...పనసపండ్ల ఉత్పాదనలో మన దేశం అగ్రస్థానంలోనే ఉన్నా, ఇక్కడి ఉత్పాదనలో ఎక్కువ భాగం ఇక్కడే వినియోగం అయిపోతోంది. అందువల్ల పనస ఎగుమతుల్లో మన దేశం ఐదో స్థానానికి పరిమితమై ఉంది. ప్రపంచవ్యాప్తంగా పనస ఎగుమతుల విలువ ఏటా 150 మిలియన్ డాలర్ల వరకు ఉంటోంది. పనస ఎగుమతుల్లో మొదటి పది దేశాల వివరాలను గణాంకాలలో తెలుసుకుందాం. -
అలనాటి అస్త్రాలు... ఎంత శక్తిమంతాలు?
ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామంలో కౌరవ, పాండవులు ఉపయోగించిన అస్త్రాలు ఎలాంటివి? ఎంత శక్తిమంతమైనవి ?... నేటి ఆయుధాలు, అణుబాంబులు, క్షిపణుల కంటే గొప్పవా?...? అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఆనాడే ఉందా... అంటే....ఉందనే చెప్పాలి... నాటి ఆయుధాలు రష్యా, ఉక్రై యిన్, అమెరికా, ఇరాన్ ల మధ్య జరుగుతున్న యుద్దాల మధ్య వినియోగిస్తున్న ఆయుధాల కంటే ఎన్నో వేల రెట్లు శక్తి మంతమైనవని చెప్పుకోవచ్చు. ఈ అస్త్రాలన్నీ భగవత్ ప్రసాదితమైనవి. అందుకే ఎంతో ఉపాసన, దీక్షలతో పాటు, తగిన మంత్ర, తంత్రాలతో ప్రయోగించాలి. మహాభారత సంగ్రామంలో వినియోగించిన కొన్ని శక్తి మంతమైన అస్త్రాల గురించి తెలుసుకుందాం.....చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధంగా మహాభారత యుద్దాన్ని చెప్పుకోవచ్చు. కురుక్షేత్రమనే ప్రదేశం, ఉత్తర భారత దేశం లోని ప్రస్తుత హర్యానా రాష్ట్రంలో ఉంది. 18 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఈ యుద్ధంలో, 18 అక్షౌహిణిల సైన్యం అంటే. కౌరవులది 11 అక్షౌహిణిల సైన్యం కాగా పాండవులది 7 అక్షౌహిణుల సైన్యం. ఈ యుద్ధంలో 47 లక్షల, 23 వేల, 920 మంది పాల్గొంటే, అందులో కేవలం 10 మంది మాత్రమే మిగిలారంటే... భారీ జననష్టం సంభవించడానికి కారణం మహాభారత యుద్ధంలో ప్రయోగించబడిన అణ్వస్త్రాలే కారణమనే వాదన కూడా ఉంది. ఆ నాడు జరిగినది మామూలు యుద్ధం కాదని, అత్యంత ఉత్పాతాలు సృష్టించిందని పాశ్చాత్య చరిత్రకారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై దాదాపు శతాబ్ది కాలంగా, ఆయా ప్రాంతాలలో ఎన్నో పరిశోధనలూ, సుదీర్ఘ చర్చలూ జరుగుతూనే ఉన్నాయి. కేవలం 18రోజుల్లో 47 లక్షల పైబడి జనాభా మరణించడం అంటే, సామాన్యమైన విషయం కాదని, సాధారణ ఆయుధాలతో సాధ్యపడే విషయం అంతకంటే కాదని శాస్త్రవేత్తలే అంటున్నారు. మన ధార్మిక గ్రంథాలను లోతుగా పరిశీలిస్తే, రెండు రకాల ఆయుధాలను వివరించాయి. ఒకటి అస్త్రం, అంటే, మంత్రించి ప్రయోగించేది. రెండవది శస్త్రం, అంటే, హానికరమైన ఆయుధం. నేటి తరంలో, వీటిని పోల్చుకుంటే మిస్సైల్స్ లాంటివి కంటే ఎంతో శక్తిమంతమైనవని చెప్పుకోవచ్చు. వీటిలో ప్రధానంగా బ్రహ్మాస్త్రం, బ్రహ్మశీర్షాస్త్రం,బ్రహ్మాండాస్త్రం, సుదర్శన చక్రం, నారాయణాస్త్రం, వజ్రాయుధం, పాశుపతాస్త్రం, శక్తి ఆయుధం, నాగాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాసవి శక్తి, గాండీవం తదితరాలను చెప్పుకోవచ్చు.మరి మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్రశస్త్రాల గురించీ, వాటి విశిష్ఠత గురించీ, వాటిని ఎవరు ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాలను గురించి ముందు వారాలలో మరింత వివరంగా తెలుసుకుందాం...– సి.ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
ఆన్ చేస్తే టీవీ.. ఆఫ్ చేస్తే ఆర్ట్ గ్యాలరీ.. అద్భుతం!
కొన్ని గాడ్జెట్స్‌ను చూస్తే ఆశ్చర్యం, కొన్ని చూస్తే ఆనందం, మరికొన్ని చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది! అలాంటి స్టయిల్, సౌకర్యం, సాంకేతికత కలయికగా వచ్చిన ఈ గాడ్జెట్స్ మీకోసం..హాల్లో టీవీ పెట్టాలా? లేక ఖరీదైన పెయింటింగ్ తగిలించాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే రెండింటి పనీ చేసే ఈ ‘ఆర్ట్లై¯Œ టీవీ’ మీ కోసం! ఇది ఆన్ చే స్తే టీవీలా, ఆఫ్ చేస్తే గోడపై వేలాడే కళాఖండంలా పనిచేస్తుంది. మ్యాట్ 4కే క్యూఎల్ఈడీ డిస్ప్లేతో వచ్చే ఈ టీవీని చూడనప్పుడు ఇందులో అందుబాటులో ఉన్న రెండు వేలకుపైగా కళాఖండాలను ప్రదర్శించుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల చిత్రాల నుంచి ఆధునిక కళాఖండాల వరకు ఎన్నో ఎంపికలు ఉన్నాయి. అంతేకాదు, మీ గది అలంకరణకు సరిపోయే చిత్రాలను కృత్రిమ మేధస్సే సూచిస్తుంది. కుటుంబ ఫొటోలను కూడా ఇందులో ప్రదర్శించుకోవచ్చు. ‘లాస్ట్ ట్రిప్ ఫొటోలు చూపించు’ అని చెప్పగానే వాటిని తెరపై చూపించే సౌకర్యం కూడా ఉంది. గోడపై నిజమైన ఫొటో ఫ్రేమ్‌లా కనిపించే ఈ స్మార్ట్ టీవీ ధర సుమారు రూ. 77 వేల నుంచి ప్రారంభమవుతుంది.బ్యాగ్‌లో మడత కుర్చీ..!ఎక్కడికైనా వెళ్లినా కూర్చోవడానికి చోటు దొరకక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ మినీ ఫోల్డింగ్ క్యాంపింగ్ స్టూల్! చూడటానికి చిన్నగా ఉన్నా, అవసరమైనప్పుడు వెంటనే ఓ కుర్చీగా మారిపోతుంది.కేవలం కొన్ని సెకన్లలో దీనిని పూర్తిగా తెరిచి వాడుకోవచ్చు, పని అయిపోయాక మడిచి బ్యాగ్‌లో వేసుకోవచ్చు. బలమైన కార్బ¯Œ స్టీల్ ఫ్రేమ్, వాటర్‌ప్రూఫ్ ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్‌తో తయారైన ఈ స్టూల్ 150 కిలోల వరకు బరువు తట్టుకోగలదు. క్యాంపింగ్, ఫిషింగ్, పిక్నిక్లు, బీచ్ ట్రిప్స్, ట్రెక్కింగ్ లేదా గార్డెన్లో కూర్చోవడానికి ఇది బెస్ట్ ఆప్ష¯Œ . పైగా ప్రత్యేక క్యారీ బ్యాగ్ కూడా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ధర కేవలం రూ. 530 మాత్రమే! -
వైరస్ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్ ప్రయోగం..
భవిష్యత్తులో వచ్చే సరికొత్త వైరస్‌లకు... అవి అసలు పుట్టకముందే మన శాస్త్రవేత్తలు కర్మకాండలు జరిపించే పనిలో ఉన్నారు! వాటి అంత్యక్రియలు జరిపించేది మరెవరో కాదు, ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్’! శత్రువు యుద్ధానికి రాకముందే ఆ శత్రువును కనిపెట్టి, చిత్తు చేసే ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నది మాత్రం కేంబ్రిడ్జ్ నిపుణులు. తాజాగా వాళ్లు కనిపెట్టిన సూపర్ వ్యాక్సిన్... ఇకపై కరోనా అయినా, ఎబోలా అయినా, అవి ఎలాంటి రూపు మార్చుకుని వచ్చినా సరే, ఆ వేషధారులను ఊచకోత కోసేస్తుంది.‘ప్యాండమిక్–ప్రూఫ్’ వ్యాక్సిన్మున్ముందు రాబోయే మహమ్మారుల అంతానికి శాస్త్రవేత్తలు ఇప్పుడే పునాది వేశారు. మనకింకా తెలియని, అసలు పుట్టనే పుట్టని కరోనా రకాల వైరస్‌లను సైతం ముందే ఊహించి, వాటిని మట్టుపెట్టే వ్యాక్సిన్స్‌ను శాస్త్రవేత్తలు ఏఐ సహాయంతో రూపొందించారు. ఈ వ్యాక్సిన్ సర్వరోగ నివారిణిలా సకల కరోనా జాతులకూ నిరోధకంగా పని చేస్తుందని కేంబ్రిడ్జి పరిశోధకులు జూన్ మొదటి వారంలో వెల్లడించారు.ఒక్కటిస్తే చాలు.. ఒక్కటీ రాదు!సాధారణంగా ఒక వైరస్ బయటపడిన తర్వాత దానికి వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలకు నెలలు లేదా సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఈ సరికొత్త ఏఐ టెక్నాలజీ, భవిష్యత్తులో వైరస్లు ఎలా రూపాంతరం చెందుతాయో ముందే ఊహించి, వాటిని ఎదుర్కొనేలా ఈ వ్యాక్సిన్‌ను డిజైన్ చేసింది. ఒక్కటంటే ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే చాలు... ఎబోలా వంటి వేలాది ప్రమాదకర వైరస్ రకాల నుండి, అలాగే భవిష్యత్తులో అవి మార్చుకునే ఏ కొత్త రూపం నుండి అయినా ఇది మనల్ని కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.ప్రొఫెసర్ జొనాథన్ హీనీ, వైరల్ జూనోటిక్స్అలాంటిలాంటిది కాదుప్రస్తుతం మనం వాడుతున్న వ్యాక్సిన్లు యాంటీజెన్ల ఆధారంగా పనిచేస్తాయి. యాంటీజెన్ అంటే మన శరీరంలోకి ఏదైనా హానికరమైన క్రిమి ప్రవేశిస్తే... ‘ఇది శత్రువు!’ అని మన రోగనిరోధక వ్యవస్థ గుర్తుపట్టేలా చేసే ఒక రకమైన సిగ్నల్. అయితే, యాంటీజెన్లు కేవలం అప్పటికే మనుషుల్లో బయటపడిన నిర్దిష్ట వైరస్ రకాలపైన మాత్రమే పనిచేస్తాయి. అయితే ఈ సరికొత్త వ్యాక్సిన్‌లో పరిశోధకులు ఒక ఉపాయం ఆలోచించారు. ఒకే జాతికి చెందిన మొత్తం వైరస్ కుటుంబాలన్నిటిలోనూ ‘కామన్‌గా’ ఉండే కొన్ని ముఖ్యమైన లక్షణాలను సేకరించి, వాటన్నిటినీ నిరోధించే గుణాలను కలిపి కొత్త వ్యాక్సిన్‌లో పొందుపరిచారు.‘‘వైరస్ దాడి మొదలవ్వడానికి ముందే... ఈ సరికొత్త రకం వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి, క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోగలిగితే, భవిష్యత్తులో లక్షలాది ప్రాణాలను కాపాడవచ్చు. లాక్డౌన్ల అవసరమే రాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలకుండా నిలబడతాయి’’ అని ఈ ప్రాజెక్టు చీఫ్, సౌతాంప్టన్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ సాల్ ఫాస్ట్ అంటున్నారు.సార్స్, కోవిడ్, ఎబోలా.. ఏదైనా!ఈ కొత్త వ్యాక్సిన్ కేవలం కరోనా పైనే కాదు... గతంలో వణికించిన సార్స్, మొన్నటి వరకు ఉన్న కోవిడ్, ఇప్పుడున్న ఎబోలా, అలాగే భవిష్యత్తులో జంతువులు, గబ్బిలాల నుండి మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉన్న వైరస్లన్నిటి నుంచి కూడా మనల్ని కాపాడగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన వైరల్ జూనోటిక్స్ (జంతువుల నుండి మనుషులకు వచ్చే వైరస్‌లపై పరిశోధన చేసే విభాగం) ప్రొఫెసర్ జొనాథన్ హీనీ మాట్లాడుతూ... ఈ సరికొత్త టెక్నాలజీ వైద్య రంగపు రూపురేఖల్నే మార్చే ఒక పెద్ద ‘గేమ్ చేంజర్’ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఈ టెక్నాలజీ వల్ల వ్యాక్సిన్లు మరింత శక్తిమంతంగా, విస్తృతంగా మారి, వైరస్ల నుండి మనకు అత్యంత బలమైన రక్షణను అందిస్తాయి’’ అని ఆయన నమ్ముతున్నారు.సూపర్ యాంటీజెన్: రోగ నిరోధక వ్యవస్థకు తిరుగులేని ఆయుధంఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌కు ‘సూపర్–యాంటీజెన్’ అని పేరు పెట్టారు. ఏఐలో ఒక భాగమైన మెషిన్ లెర్నింగ్ ద్వారా దీనిని తయారు చేశారు. గతంలో వచ్చిన మహమ్మారులను, ఇప్పుడున్న వైరస్‌లను ఏఐ క్షుణ్ణంగా విశ్లేషించి... ఒక వైరస్ బ్రతికి బట్టకట్టాలంటే దానికి అత్యంత ముఖ్యమైన భాగాలు ఏంటో కనిపెట్టింది. సరిగ్గా అవే భాగాలపై ఈ సూపర్ యాంటీజెన్‌ను ఎక్కుపెట్టారు.వేర్వేరు వైరస్లలో ఉండే కొన్ని ముఖ్యమైన ప్రొటీన్లను ఒకదానితో ఒకటి అతుకుపెట్టి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ మన శరీరంలోకి వెళ్లగానే, మన రోగనిరోధక వ్యవస్థకు ఆ ప్రొటీన్లపై దాడి చేయడం నేర్పుతుంది. భవిష్యత్తులో ఆ ప్రొటీన్ ఉన్న ఏ కొత్త వైరస్ మన శరీరంలోకి వచ్చినా... మన రోగనిరోధక వ్యవస్థ దాన్ని వెంటనే గుర్తుపట్టి అక్కడికక్కడే నిర్మూలిస్తుంది.సూది లేని ఇంజెక్షన్!సూపర్ యాంటీజెన్ వ్యాక్సిన్‌ను మన శరీరంలోకి పంపే విధానం కూడా చాలా సరళంగా, సరికొత్తగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సూదీ ఉండదు! బదులుగా ‘మైక్రో ఫ్లూయిడ్ జెట్’ అనే పద్ధతిని పాటిస్తారు. ఇది చాలా ఎక్కువ ఒత్తిడితో, ఒక సన్నని ద్రవ రూపంలో వ్యాక్సిన్‌ను నేరుగా మన చర్మ కణాల్లోకి పంపుతుంది. అంటే సూది గుచ్చుకునే నొప్పి అస్సలు ఉండదు!మైక్రో ఫ్లూయిడ్ జెట్వెనుక పరిగెత్తడం ఆపేద్దాం!కాంగోలో మళ్లీ ఇప్పుడు ఎబోలా వైరస్ కలకలం రేపుతున్న విషయాన్ని గురు ్తచేస్తూ: ‘‘కోవిడ్ మహమ్మారి మనకు వ్యాక్సిన్లను వేగంగా తయారు చేయడం నేర్పించింది నిజమే కానీ, మనం ఇంకా పాత విధానాన్నే అనుసరిస్తున్నాం. వైరస్ కొత్తగా పుట్టడం, అది మనల్ని భయపెట్టడం, ఆ తర్వాత మనం దాని వెనుక పరిగెత్తి వ్యాక్సిన్ కనిపెట్టడం... ఈ ధోరణి మారాలి’’ అని ప్రొఫెసర్ హీనీ అంటున్నారు.‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైరస్ జెనెటిక్ కోడ్ మొత్తాన్ని ఈ ఏఐకి ఇస్తాం. అది వాటన్నిటినీ పరిశీలించి, ఆ వైరస్ కుటుంబంలో అస్సలు మారకుండా ఉండే భాగం ఏంటో కనిపెడుతుంది. వైరస్ తన రూపాన్ని ఎంత మార్చుకున్నా ఆ ముఖ్య భాగాన్ని మార్చుకోలేదు. మనం సరిగ్గా దాన్నే టార్గెట్ చేస్తున్నాం. దీనివల్ల ఈరోజు ఉన్న వైరస్ల నుండే కాదు... భవిష్యత్తులో పుట్టబోయే సరికొత్త వైరస్ల నుండి కూడా మనం ముందే రక్షణ పొందవచ్చు!’’ అని హీనీ వివరించారు. ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారిన బర్డ్ ఫ్లూ వైరస్‌ను కూడా అంతమొందించేందుకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బృందం ఇదే టెక్నాలజీతో మరో సరికొత్త వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో పడింది.వైరస్ల కంటే ఒకడుగు ముందేఇతర సైన్స్ నిపుణులు కూడా ఈ వాక్సిన్ను ఒక అద్భుతమైన ‘సరికొత్త విప్లవం’గా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుత వైద్య విధానం అంతా ‘రియాక్టివ్’ (కంటì æముందుకు ప్రమాదం వచ్చాక స్పందించేది)గా ఉంది. అంటే వైరస్ రూపాంతరం చెందుతూ ముందుకు దూసుకుపోతుంటే, దాన్ని పట్టుకోవడానికి మన వ్యాక్సిన్లు వెనుకబడిపోతున్నాయి. కానీ ఈ కొత్త టెక్నాలజీ.. వైరస్ కంటే ఒకడుగు ముందే ఉంటుంది!రెండో దశ ప్రయోగాలుసిద్ధంగా మరో 200 మందిట్రయల్స్ ఎక్కడివరకు వచ్చాయి? మొదటి దశ విజయవంతం అయింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ సరికొత్త టెక్నాలజీతో చేసిన వ్యాక్సిన్‌ను 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న 49 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ప్రయోగించి, ఇది పూర్తిగా సురక్షితమైనదని నిర్ధారించుకున్నారు. అంతకుముందు జంతువులపై చేసిన ప్రయోగాల్లో కూడా ఇది రకరకాల కరోనా వైరస్‌లపై ప్రభావంతంగా పనిచేసి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు రెండవ దశ మొదలైంది. ఈ వ్యాక్సిన్ తదుపరి పరీక్షల కోసం మరో 200 మందికి పైగా వ్యక్తులను సంసిద్ధం చేస్తున్నారు.అత్యంత బలమైన రక్షణఏఐ సహాయంతో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ల గురించి బ్రిటన్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్’ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైంటిఫిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ మేరియన్ నైట్ అత్యంత ఆశాజనకంగా మాట్లాడారు. ‘‘ఏఐ డిజైన్ చేసిన ఈ ‘సూపర్–యాంటిజెన్’ క్లినికల్ ట్రయల్స్ సాధించిన అద్భుత విజయం. వైద్య రంగంలోనే ఒక విప్లవాత్మకమైన అడుగు. భవిష్యత్తులో వైరస్ల నుండి మానవాళికి సుదీర్ఘమైన, అత్యంత బలమైన రక్షణను అందించడంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది’’ అన్నారు. మొత్తానికి, ఈ ‘సూపర్–యాంటీజెన్’ వ్యాక్సిన్ గనుక అందుబాటులోకి వస్తే... భవిష్యత్తులో మనం ఎలాంటి వైరస్ మహమ్మారికీ భయపడాల్సిన అవసరం ఉండదు. శాస్త్ర విజ్ఞాన రంగం సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది కూడా! - సాక్షి స్పెషల్ డెస్క్ -
డెత్ యాపిల్.. ఈ చెట్టు కింద నిలబడితే అంతే సంగతి!
ఫ్లోరిడా అడవుల్లో, కరేబియన్ బీచ్‌ల దగ్గర ఒక చెట్టు ఉంది. పేరు ‘మంచినీల్’. చూడ్డానికి పచ్చగా ఉండే కాయలు కాస్తుంది. కానీ దాని ఆకు, కాయ, బెరడు, పాలు... అన్నీ విషం. అందుకే కొలంబస్ దీనిని ‘డెత్ యాపిల్’ అని పిలిచాడు.ఈ చెట్టు 9 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. వాన పడుతుంటే ఈ చెట్టు కింద నిలబడితే... అంతే సంగతి. చెట్టు మీద నుంచి కారే వాననీళ్లు ఒంటి మీద పడితే చర్మం మంట పుట్టి దురద వస్తుంది. బొబ్బలు వస్తాయి. చెట్టు కింద కార్ పార్క్ చేస్తే, దాని పాలు కారు మీద పడి పెయింట్ ఊడిపోతుంది. అందుకే ఆ చెట్ల చుట్టూ ‘డేంజర్’ బోర్డులు పెడతారు. ఈ చెట్టులో ‘హిప్పోమేన్’ అనే విషం ఉంటుంది. చెట్టు మొత్తం విషమే. పొరపాటున ఈ చెట్టు కర్రని నరికినా, కాల్చినా వచ్చే పొడిని, పొగని పీల్చామంటే గొంతులో మంట, దగ్గు, జ్వరం వచ్చేస్తాయి. ఊపిరి ఆడదు. అందుకే ఈ చెట్టు జోలికి ఎవరూ వెళ్లరు.మంచినీల్ కాయలు చూడ్డానికి జామకాయల్లా, చిన్న యాపిల్స్‌లా ముద్దుగా ఉంటాయి. కానీ ఒక్క కాయ తిన్నా నోరు, గొంతు కాలిపోతుంది. కడుపులో మంట. ప్రాణానికే ప్రమాదం. అందుకే అడవికి వెళ్లినా, బీచ్‌కి వెళ్లినా తెలియని కాయలు, పళ్లు అస్సలు ముట్టుకోకూడదు. తినకూడదు. ‘డేంజర్’ బోర్డు ఉంటే దూరం నుంచే దండం పెట్టాలి. -
ఆస్ట్రోనాట్లు రోదసిలో తేనీరు ఎలా తాగుతారో తెలుసా?
ఫ్రెండ్స్... మనం ఉదయం లేవగానే వేడివేడి టీ తాగుతాం కదా? మరి రోదసిలోకి వెళ్లిన ఆస్ట్రోనాట్లు టీ ఎలా తాగుతారు?రోదసిలో టీ, కాఫీ, జ్యూస్ అన్నీ ప్యాకెట్లలో పెట్టి సీల్ చేస్తారు. టీ ప్యాకెట్లో టీపొడి, పంచదార, పాలపొడి ఉంటాయి. తాగాలనిపించినప్పుడు ఆస్ట్రోనాట్లు ఒక మిషన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వేడి నీళ్ల పైపు ఉంటుంది. ప్యాకెట్‌కి ఉన్న చిన్న నాజిల్లోకి ఆ పైప్ గుచ్చి వేడి నీళ్లు నింపుతారు. తర్వాత బాగా కలుపుతారు. టీ తయారువుతుంది.ఇంకో రంధ్రంలో స్ట్రా పెట్టి తాగేస్తారు. గ్లాసు అవసరం లేదు. ఒలికిపోతుందనే భయం లేదు. మరి స్ట్రా లేకుండా తాగాలంటే? అదీ అవుతుంది. ప్యాకెట్లోంచి కొంచెం టీని బయటకు పిండితే అది గాల్లో గుండ్రటి బుడగలా తేలుతుంది. ‘సర్ఫేస్ టెన్షన్’ వల్ల అది విడిపోకుండా బంతిలా ఉంటుంది.ఆస్ట్రోనాట్లు నోరు తెరిచి ఆ బుడగని మింగేస్తారు. కానీ జాగ్రత్తగా చేయాలి. లేదంటే ఆ బుడగ మిషన్ వైర్లలోకి దూరి షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. అంతరిక్షంలో టీ తాగితే మజా ఉంటుందా? ఉండదట. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల శరీరంలో రక్తం, నీరు అంతా తల వైపు చేరుతుంది. దాంతో ముక్కు దిబ్బడగా అనిపిస్తుంది. జలుబు చేసినట్టు రుచి, వాసన సరిగా తెలియవు. ఇంటి టీ రుచి కోసం భూమ్మీదకు వచ్చేదాకా ఆగాల్సిందే. -
ఈ పీతను చూస్తే ఫ్రాన్స్‌కు భయం, ఎందుకో తెలుసా?
పిల్లలూ... ఈ పీతను చూడండి. దీని దెబ్బకు ఫ్రాన్స్ దేశం గజగజ వణుకుతోంది. దీని పేరు ‘నీలి పీత’. ‘బ్లూ క్రాబ్’. దీని పుట్టినిల్లు అమెరికా. కాని ఓడల్లో సముద్ర నీరు నింపేటప్పుడు ఎలాగో చేరి ఫ్రాన్స్ సముద్రంలో పడింది. ఇంకేముంది... ఒక్కో ఆడపీత ఒకేసారి లక్షల గుడ్లు పెడుతుంది. అమెరికా సముద్రంలో ఈ పీతల్ని తినే ఆక్టోపస్‌లు ఉన్నాయి. ఫ్రాన్స్ సముద్రంలో లేవు. అమెరికాలో బ్లూ క్రాబ్ విలువైన సీఫుడ్. ప్రతి ఏడాది లక్షల టన్నులు పట్టి తింటారు, ఎగుమతి చేస్తారు. ఫ్రాన్స్‌లో పెద్దగా ఈ అలవాటు లేదు. ఈ నీలి పీతలకు ఆకలి ఎక్కువ. చిన్న చేపల్ని, మరో రకం పీతల్ని గుటుక్కుమనిపిస్తాయి. దాంతో ఫ్రాన్స్‌లో జాలర్లు వల వేస్తే చేపలు పడటం లేదు. ఈ పీతలే పడుతున్నాయి. ఫ్రాన్స్ సైంటిస్టులు మేం ఏమీ చేయలేము అని చేతులెత్తేశారు. ఇవి తగ్గాలంటే పట్టుకుని తినాల్సిందే అన్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పీతలు తినే ప్రోగ్రామ్ నడుస్తోంది. అక్కడ బ్లూ క్రాబ్ బిర్యానీ, బ్లూ క్రాబ్ ఫ్రై ఫేమస్ అయిపోయింది.నీతి: వేరే దేశం నుంచి వచ్చిన జీవులు మన ఇంట్లో సమస్య తెస్తాయి. అందుకే ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదీ చదవండి: రూ. 3,800 కోట్ల గిఫ్ట్ : మురిసిపోయిన డొనాల్డ్ ట్రంప్ -
ఒళ్లు గగుర్పొడిచే.. ఈ జైళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా?
ఇప్పటివరకు మనం ఎన్నో భయంకరమైన కథలుగానీ, ప్రదేశాలను గురించి వినుంటాం. వాటిలో జైళ్లు కూడా ఒకటి. ఇక వీటిలో ఉండే శిక్షలగురించైతే చెప్పనవసరంలేదు. మరి ఈ జైళ్లు నేటికి ఉన్నాయా? లేవా? ఖైదీలకు ఎలాంటి శిక్షలు అమల్లో ఉండేవి అనే విషయాలగురించి తెలుసుకుందాం.1. అల్కాట్రాజ్ ఫెడరల్ జైలు..ఈ జైలు అమెరికాలోని అత్యంత ప్రసిద్ధ జైళ్లలో ఒకటి. ఇది అల్కాట్రాజ్ ద్వీపంపై శాన్ ఫ్రాన్సిస్కో సమీపంలో ఉంది. ఇదొక ద్పీపంపై ఉన్నందున జైలు నలువైపులా చల్లని నీరుతో కూడుకుని ఉంది. జైలులో గస్తీ టవర్లు, ఇనుప తలుపులు, కఠిన పర్యవేక్షణ ఉండేది. ఆనాడు నియమాలను వ్యతిరేకించిన ఖైదీలను ప్రత్యేక నిర్బంధ గదులలో ఉంచేవారు. ఈ గదులను ది హోల్ అని పిలిచేవారు. అయితే, కొన్ని గదుల్లో ఖైదీలను పూర్తిగా చీకటిలో రోజులు తరబడి అలాగే ఉంచేవారు.1962 లో ఫ్రాంక్ మొర్రిస్, జాన్ ఆంగ్లిన్, క్లారెన్స్ ఆంగ్లిన్ అనే ఖైదీలు ఈ జైలునుంచి పారిపోవడానికి చెంచాలు, సాధారణ పనిముట్ల సాయంతో జైలుగోడలనే తవ్వారు. అలా అక్కడినుంచి పారిపోయినవారి అచూకి ఇప్పటికీ లభించలేదు. అయితే ఈ జైలు ఏర్పడకముందు ఇదొక సైనిక కోటగా ఉండేది. తరువాత సైనిక జైలుగా మార్చారు. తప్పించుకోవడానికి కూడా వీలులేని ఈ జైలు బయటికి రావడమనేది అప్పట్లో ఒక అద్భుత విషయం. ప్రస్తుతం ఈ అల్కాట్రాజ్ జైలును నేషనల్ పార్క్ సర్వీసు ఆధ్వర్యంలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశంగా నడుపుతున్నారు.2. సెల్యులర్ జైలు..భారత స్వతంత్ర పోరాట సమయంలో అత్యంత ముఖ్యమైన జైళ్లలో ఇది ఒకటి. ఇది అండమాన్-నికోబార్ దీవుల రాజధాని అయినటువంటి పోర్ట్ బ్లైర్ లో ఉంది. ఈ జైలును సాధారణంగా కాలాపానిగా పిలిచేవారు. బ్రిటీషు పాలన సమయంలో భారత స్వాతంత్ర సమరయోధులను దూరంగా పంపి బంధిచడానికి 1896-1906 సంవత్సర మధ్యకాలంలో దీని నిర్మాణం జరిగింది.ఈ జైలులో 7 రెక్కలు ఉండేవి. మధ్యలో గోపురంగా ఉండి జైలు మొత్తంపై దృష్టి పెట్టేలా ఉంటుంది. ఇందులో కొన్ని వందల ఒంటరి గదులు ఉండి, ఖదీలను ఒక్కోగదిలో ఒక్కొక్కరిని ఉంచేవారు. అలా దీనికి సెల్యూలర్ జైలు అని పేరు వచ్చింది. ఖైదీలను సంవత్సరాల తరబడి జైలులో ఒంటరిగా ఉంచి, కఠిన శిక్షలను అమలుచేసేవారు. ప్రస్తుతం ఇది జాతీయ స్మారక చిహ్నంగా మారింది.3. ఎస్-21 జైలు..కంబోడియా రాజధాని ప్నోమ్ పెన్ లోని టుయోల్ స్లెంగ్ జనుసైడ్ మ్యూజియంలో ఉన్న ఒక భవనమే ఈ ఎస్-21 జైలు. కంబోడియా చరిత్రలోనే అత్యంత భయానకమైన నిర్బంధ కారాగారం ఇది. 1975లో ఖ్మేర్ రూజ్ అధికారంలోకి వచ్చాక ఈ జైలును నిర్మించారు. ఆనాటి ప్రభుత్వ వ్యతిరేకులను, శత్రువులను ఇందులో బంధించి చిత్రహింసకు గురిచేసేవారు.తప్పుడు నేరాలు అంగీకరించేలా ఒత్తిడి చేసి, మరణశిక్షను కూడా అమలుచేసేవారు. మరణశిక్ష అమలు అయిన వారిని కిల్లింగ్ ఫీల్డ్స్ కు తీసుకెళ్లి చంపేవారు. జనవరి 1979 లో కంబోడియా-వియత్నాం యుద్ధంలో వియత్నాం దళాలు ఫ్నామ్ పెన్లోకి ప్రవేశించడంతో ఖ్మేర్ రూజ్ పాలనకు, ఈ జైలు శిక్షలకు ముగింపు పడింది. చివరికి ఈ ప్రదేశాన్ని 1980లో మ్యూజియంగా మార్చారు. ఈ ఎస్-21 జైలును భారతదేశంలోని కాలాపాని జైలుతో పోలుస్తారు.4. బ్లాక్ డాల్ఫిన్ జైలు..రష్యాలోని అత్యంత కఠినమైన కారాగారాల్లో ఇది కూడా ఒకటి. దీనికి ఐకే-6 అని అధికారికంగా పేరు ఉంది. ఇది కజకస్తాన్ సరిహద్దుకు సమీపంలో సోల్-ఇలెట్స్క్ ప్రాంతంలో ఉంది. దీనిని 18వ శతాబ్దం నుంచే కారాగారంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉగ్రవాద నేరస్తులు, హత్యలు, హింసాత్మక నేరాలు చేసిన వారిని బంధించేవారు. ఖైదీ ఉన్నటువంటి గదికి వివిధ రకాల భద్రతా తలుపులు ఉండేవి.ఖైదీల కదలికపై తీవ్రమైన నియంత్రణను పాటించేవారు. ఈ జైలులోని ప్రధాన ప్రవేశం వద్ద ఖైదీలు తయారుచేసినటువంటి నల్ల డాల్ఫిన్ విగ్రహం ఉండటంతో బ్లాక్ డాల్ఫిన్ జైలుగా పేరు వచ్చింది. ఇది నేటికి పనిచేస్తున్నటువంటి కారాగారాలలో ఒకటి. నేడు పనిచేస్తున్న కఠిన శిక్షా వ్యవస్థకు ఈ జైలు ఒక ఉదాహరణ.5. లా సబనెటా జైలు..వెనిజులాలోని మరకైబో ప్రాంతంలో అత్యంత భయంకరమైన జైలు ఇది. దీని నిర్మాణం 1958 సంవత్సరంలో జరిగింది. ఈ జైలులో ఖైదీలను బంధించగా.. చివరికి ఖైదీలే జైలును నిర్వహించే స్థాయికి వెళ్లింది. దీంతో ప్రభుత్వ నియంత్రణ చాలా బలహీనమవడంతో.. గ్యాంగ్ నాయకులే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.జైలు సామర్థ్యం దాదాపు 700 ఖైదీలకు మాత్రమే ఉండగా.. సుమారు 3,700 మందిని బంధించేవారు. అంటే సామర్థ్యానికి 5 రెట్లు ఎక్కువ అన్నమాట. ఆహారం, తాగునీరు, వైద్యసేవలు కొరతగా ఉండేవి. జైలులోని ఖైదీలు అక్రమ రవాణాతోపాటు, వారి వద్ద తుపాకులు, కత్తులు, మాదకద్రవ్యాలుండేవి. 1994లో భారీ అల్లర్లు చెలరేగి అగ్నిప్రమాదం జరగగా, 100 మందికిపైగా మరణించిట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 2013లో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 16 మంది ఖైదీలు మరణించగా.. అదే సంవత్సరంలో అక్కడి ప్రభుత్వం జైలును మూసివేసింది. -
ఖర్చు లేకుండా.. ప్రశాంతతను చేకూర్చే సహజ ఔషధం ఇదే..!
ఎలాంటి ఖర్చు లేకుండా మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే ఒక అద్భుతమైన సహజ ఔషధం మ్యూజిక్. కేవలం వినోద సాధనంగానే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా సంగీతం ఒక దివ్యౌషధంగా పనిచేస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి.శాస్త్రీయ సంగీతం మనస్సుకు ఎనలేని ప్రశాంతతను, నిశ్చలతను ఇస్తే, రాప్ సంగీతం జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మానసిక బలాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే పక్షుల కిలకిలరావాలు, వాన జల్లుల చప్పుడు, సముద్రపు అలల ధ్వనులు గుండె వేగాన్ని నియంత్రించి, ఒత్తిడిని పూర్తిగా దూరం చేస్తాయి.అందువల్ల మనకు నచ్చిన సంగీతాన్ని వినడం వల్ల మన మెదడులోని రసాయన ప్రక్రియల్లో సానుకూల మార్పులు వస్తాయి. ఇది ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గించి, మూడ్‌ను మెరుగుపరుస్తుంది. ప్రతికూల ఆలోచనల నుంచి మనస్సును పక్కకు మళ్లించడానికి ఇది ఒక సులువైన మార్గం.ఆఫీసులో ప్రతిరోజూ 30 నిమిషాల పాటు సంగీతం వినే ఉద్యోగుల్లో కేవలం నెల రోజుల్లోనే ఒత్తిడి స్థాయిలు భారీగా తగ్గినట్లు పరిశోధనల్లో గుర్తించారు.అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఉత్సాహభరితమైన పాటలు వింటూ ఇల్లు లేదా డెస్క్ శుభ్రం చేసుకోవడం వల్ల అలసట తెలియదు. అలాగే, చదువుకునేటప్పుడు లేదా ఆఫీస్ పనులు చేసేటప్పుడు లిరిక్స్ లేని కేవలం ఇ¯Œ స్ట్రుమెంటల్ సంగీతాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు ప్రశాంతత కోసం హెడ్‌ఫోన్స్ తగిలించుకుని మీకు నచ్చిన సంగీత ప్రపంచంలోకి వెళ్ళిపోవడమే ఒత్తిడికి సరైన పరిష్కారం! -
మనం వాడుతున్న టొమాటోలు.. ఏ దేశానికి చెందినవో తెలుసా..?
నిత్యం మనం వాడుతున్న కొన్ని పదార్థాలు ఎక్కడినుంచి వచ్చాయి? ఆ పదార్థాలతో లాభాలేంటి అనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం!ఇండియాలో మిరపకాయలను, టొమాటోలను, బంగాళా దుంపలను ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో టొమాటోలు లేని కూరలు అసలే ఉండదు. అలాంటి ఈ టొమాటోలు అసలు మనదేశానివే కావనే విషయం మీకు తెలుసా..? వీటిని పోర్చుగీసు వారు భారత దేశానికి తీసుకొచ్చారు.జలుబు, దగ్గు లేదా సైనస్ సమస్యలు వచ్చినప్పుడు తల్లులు పిల్లలకు పాలు తాగించడం మానేస్తారు. అయితే పాలు ఎలాంటి హాని కలిగించవు, సైనస్ సమస్యలను మరింత తీవ్రతరం చేయవు. జలుబుతో బాధపడే పిల్లలు, పెద్దవారు ఎలాంటి భయం లేకుండా పాలు తాగొచ్చు. -
అధునాతన వీడియో క్రియేషన్కై.. 'ఏఐ-వర్య'
అవతార్ ఏఐ అభివృద్ధి చేసిన కొత్త వీడియో జనరేషన్ మోడల్ ‘వర్య’ మన దేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో అడుగు. అధునాతన వీడియో క్రియేషన్ సాధనాలను మరింత సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడంలో ‘వర్య’ ముఖ్యమైన ముందడుగుగా చెబుతున్నారు విశ్లేషకులు.సాధారణ టెక్ట్స్, సూచనలు, ఇమేజ్‌ల నుండి అధిక–నాణ్యత గల వీడియోలను రూపొందించడంలో ‘వర్య’ సహాయపడుతుంది. సాంకేతిక నైపుణ్యం, అధునాతన ఎడిటింగ్ పరిజ్ఞానం అవసరమయ్యే సంక్లిష్టమైన ఏఐ సాధనాల వలే కాకుండా ఎవరైనా సులభంగా ఉపయోగించేట్లుగా దీన్ని రూపొందించారు. తమకు ఏమి కావాలో యూజర్లు వివరించవచ్చు.మన ఆలోచనలు, ఐడియాలను తక్షణమే రెడీ–టు–యూజ్ విజువల్ కంటెంట్‌గా మారుస్తుంది వర్య. తక్కువ ఖర్చుతో వీడియోలు రూపొందించాలనుకునే మార్కెటింగ్ టీమ్స్, స్టార్టప్‌లకు, ఇండిపెండెంట్ క్రియేటర్లకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది.‘వర్య’ ముఖ్య బలం ఏమిటంటే ఇది మన దేశ సంస్కృతులు, వివిధ సందర్భాలను స్పష్టంగా అర్థం చేసుకోగలదు. మన పండగలు, సంప్రదాయ నేపథ్యాలు, రోజువారి జీవిత దృశ్యాలు, సుపరిచితంగా, సందర్భోచితంగా అనిపించడానికి ‘వర్య’కు రూపకల్పన చేశారు. దేశీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుక్ను బ్రాండ్లు, ఏజెన్సీలకు ఇది మరింతగా ఉపయోగపడుతుంది. -
ఓ విద్యార్థి చేసిన చిలిపి పనే.. ఈ ఆటకి ఆరంభమని తెలుసా?
19వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లోని వివిధ పాఠశాలల్లో ఫుట్‌బాల్ ఆటకు కొన్ని వేర్వేరు నియమాలు ఉండేవి. అయితే ఈ నియామాలనే ఆధారం చేసుకుని.. కాస్త రివర్స్‌లో ఏర్పడిందే ఈ రగ్బీ ఆట.1823వ సంవత్సరంలో రగ్బీ స్కూల్ (Rugby School) అనే పాఠశాలలో ఫుట్‌బాల్ ఆటను నిర్వహించారు. ఆట జరుగుతున్న సమయంలో విలియమ్ వెబ్ ఎల్లిస్(William Webb Ellis) అనే 16 ఏళ్ల విద్యార్థి బంతిని చేతులతో ఎత్తుకుని పరిగెత్తాడు. ఆనాడు ఫుట్‌బాల్ నియమాలకు ఇది పూర్తి వ్యతిరేకం. ఆ రోజుల్లో బంతిని కాలుతో తోయడం(కిక్) మాత్రమే ఉండేది. ఇలా చేతితో తీసుకుని పరిగెత్తిన సంఘటనే రగ్బీ ఆటకు పునాదిగా మారిందని కొందరి అభిప్రాయం. అయితే దీనిపై చరిత్రకారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదనే చెప్పవచ్చు. కానీ స్థానికులు మాత్రం ఆ విద్యార్థి కారణంగానే ఈ ఆట పుట్టుకొచ్చిందని విశ్వసిస్తారు. ఆనాడు ఎల్లిస్ చేసిన ఈ కొత్త ప్రయోగం అక్కడి విద్యార్థులకి తెగ నచ్చేసింది. 1845లో రగ్బీ స్కూల్లోనే విద్యార్థులచే ఈ ఆటకు నియమాలు నిర్ణయించారు. 1871 లో రగ్బీ యూనియన్ ఏర్పడి, అధికారిక నియమాలను రూపొందించుకుంది.ఈ ఆట ఇంగ్లాండ్‌లో పుట్టి, రగ్బీ స్కూల్లో మొదలై, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్ గా మారింది. ఈ వరల్డ్‌కప్ మొదటిసారిగా 1987లో ఎడిన్‌బర్గ్‌లోని రేబర్న్ ప్లేస్‌లో స్కాట్లాండ్, ఇంగ్లాండ్ మధ్య నిర్వహించారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? రగ్బీ ప్రపంచకప్ విజేతకు ఇచ్చే ట్రోఫీ పేరు 'విలియమ్ వెబ్ ఎల్లిస్' కప్. అంటే ఈ కథలో మొదటిసారిగా ఫుట్‌బాల్ ఆటకి వ్యతిరేకంగా బంతిని చేతులలో తీసుకుని పరిగెత్తిన విద్యార్థి పేరే గౌరవార్థంగా పెట్టడం విశేషం. -
గోబెక్లీ టెపే గురించి విన్నారా? ఇదొక పురాతన మందిరం..
ఈ ప్రపంచంలో అతి పురాతన గుళ్ల నిర్మాణాల్లో గోబెక్లీ టెపే ఒకటి. ఇది సుమారు క్రీ.పూ 9600-8200 కాలం నాటిదని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా. అంటే దాదాపు 11,500 నుండి 12,000 సంవత్సరాల కాలంనాటిదన్నమాట.ఈ టెంపుల్ టర్కీలోని షాన్లీఉర్ఫా ప్రాంతంలో ఉంది. వ్యవసాయం పూర్తిగా అభివృద్ధి కాకమునుపే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని పరిశోధకులు సూచిస్తున్నారు. గోబెక్లీ టెపే ఆలయాన్ని ప్రపంచంలోనే ఇప్పటివరకు అతి పురాతన నిర్మాణాల్లో ఇది కూడా ఒకటని పరిశోధకులు పరిగణిస్తున్నారు.గోబెక్లీ టెపే అంటే.. టర్కీభాషలో బొడ్డులాంటి కొండ లేదా పొట్టికొండ అని అర్థం. ఈ ఆలయం స్టోన్ ఏజ్ చివరి భాగమైన నియోథిక్ యుగానికి చెందినదని పరిశోధకులు చెప్తున్నారు. ఈ నిర్మాణ జరుగుతున్న సమయానికి ఇంకా ప్రజలు వేట, ఆహార సేకరణపైనే ఆధారపడి జీవిస్తున్నారని పురావస్తు శాస్త్రవేత్తల అంచనా.ఈ ప్రాంతం 1960లలో గుర్తించబడింది. యునెస్కో ఈ టెంపుల్‌ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 1990లో జర్మన్ పురావస్తు శాస్రవేత్త అయిన క్లాస్ ష్మిత్ (Klaus Schmidt) దీని ప్రాముఖ్యతను గురించి చెప్పారు. నేడు ఈ నిర్మాణం సగానికన్నా ఎక్కువ భాగం పూడ్చివేయడం జరిగింది. ఎందుకంటే? దీనిపై ఖచ్చితమైన ఆధారం లేదు. అయితే ఆచారపరమైన లేదా కొత్త నిర్మాణాల కారణం అయిఉండవచ్చని కొందరి అభిప్రాయం. ఈ టెంపుల్ కట్టడంతో.. మానవ నాగరికత, మతం, సమాజం ఎలా ప్రారంభమయ్యాయనే విషయాల గురించి శాస్త్రవేత్తల ఆలోచనలలో కొత్తములపు తిప్పిందని చెప్పవచ్చు. -
మానవ జల నిర్మాణాల్లో.. ఇది కూడా ఒక అద్భుతం!
ఈ భూమిపై ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. అందులో కొన్ని సహజంగా ఏర్పడినవయితే, మరికొన్ని మానవ మేధస్సుతో నిర్మితమైనవి. మారుతున్న కాలానుగుణంగా నూతన పరిఙానంతో కూడిన మానవ నిర్మాణాల్లో 'పనామా కాలువ' కూడా ఒకటి. దీని గురించి చూసినట్లయితే..ప్రపంచంలో మానవులు నిర్మించిన జలమార్గాల్లో ఇదొక అద్భుత నిర్మాణం. ఇది (Panama Canal) మధ్య అమెరికాలోని పనామా దేశంలో ఉంది. అట్లాంటిక్ మహాసముద్రాన్ని అలాగే, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూ 82 కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్న జలమార్గం. పొడవు సుమారు 82 కిలోమీటర్లు, వెడల్పు సాధారణంగా 91 మీటర్ల నుండి 300 మీటర్ల వరకు మారుతుంది. లోతు సుమారు 12 నుండి 15 మీటర్లు. మూడు ప్రధాన లాక్ప్.. గాటూన్ లాక్స్, పెడ్రో మిగెల్ లాక్స్, మిరాఫ్లోరెస్ లాక్స్ సిస్టమ్ ని కలిగిఉంది. ప్రయాణ సమయం.. 8 నుండి 10 గంటలు పడుతుంది.ఎలా పనిచేస్తుందంటే?పనామా కాలువ కేవలం లాక్స్ సిస్టంతోనే పనిచేస్తుంది. ఈ కాలువ వద్ద భూమి సముద్రమట్టం కంటే ఎత్తుగా ఉండగా.. ఈ నిర్మాణంతో ఓడలు పైకెత్తడం, కిందకు దించుతారు. కాలువలో పెద్ద పెద్ద నీటి గదులు లాక్స్ రూపంలో ఉంటాయి. ఇవి ఓడలు వచ్చినప్పుడు వాటి పరిమాణం తగ్గట్టుగా అటూ, ఇటూ జరుగుతుంటాయి. ఓడ ఒక లాక్ చాంబర్లోకి వెళ్లగానే గేట్లు మూసేస్తారు. మరో పక్కనుంచి నీటిని చాంబర్లోకి వదులుతూ, నీటి స్థాయి పెరిగేలా చేసి ఓడను పైకెత్తుతారు. ఈ విధంగా మూడు ప్రధాన లాక్స్ ద్వారా ఓడను పైకెత్తి.. సమాంతర స్థానానికి చేరగానే నీటి సహాయంతో ప్రయాణించేలా చేస్తారు.తరువాత అట్లాంటిక్ నుంచి బయలు దేరిన ఓడలను చివరగా పసిఫిక్ వైపుగా దిగేలా చేస్తారు. ఈ కాలువ నీటి వంపులను వినియోగించకుండా కేవలం గురుత్వాకర్షణతోనే పనిచేయబడుతుంది. అంటే నీరు ఒక లెవెల్ నుంచి మరో లెవెల్ కు సహజంగా ప్రయాణించేలా దీని నిర్మాణం చేయబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒక నీటి ఎలివేటర్ లాంటిదన్నమాట. సముద్ర మట్టాలు రెండు వైపులా వేరుగా ఉండటం, అలాగే, మధ్యలో ఎత్తైన భూభాగం ఉండటం వల్ల దీనిని 'లాక్ సిస్టమ్' ద్వారా నిర్మించారు. ఓడలు లాక్‌ల ద్వారా దాదాపు 85 అడుగుల ఎత్తుకు చేరుకుంటాయి. తరువాత గటూన్ సరస్సుపైగుండా ప్రయాణిస్తూ, అవతలి వైపు సముద్రమట్టానికి చేరుకుంటాయి. ఈ కాలువ నిర్మాణం పూర్తయిన తరువాత అట్లాంటిక్–పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఇదివరకున్న 9500 కిమీ కిలోమీటర్ల దూరాన్ని తగ్గించడమే కాకుండా వాణిజ్య వ్యాపారాలకు సమయం ఆదా చేయడంలో ఈ పనామా కాలువ ఎంతగానో ఉపయోగపడుతుంది. -
వర్షం రాసే దక్షిణ భారత ప్రయాణ గీతం..
కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేస్తాం. కొన్ని ప్రయాణాలకు మాత్రం వర్షమే మనల్ని పిలుస్తుంది. చినుకులు పడిన వెంటనే పచ్చని పర్వతాలు, మేఘాలలో దాగిపోయిన లోయలు, జలజలా పారుతున్న జలపాతాలు కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి.దక్షిణ భారతంలో వర్షాకాలం అంటే కేవలం సీజన్ కాదు. అది ప్రకృతి తన అందాన్ని మరోసారి కొత్తగా అలంకరించే సమయం. కేరళ బ్యాక్ వాటర్స్ నుండి కర్ణాటకలోని ఘాట్స్ వరకు, తమిళనాడు హిల్ స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని లోయల వరకు ప్రతీ చోట వర్షం ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుంది.దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాకాలంలో పచ్చని స్వర్గాన్ని తలపిస్తాయి. వెస్ట్రన్ ఘాట్స్ మొత్తం మేఘాలతో కవర్ అవుతుంది. ఈ సమయంలో ఈ ప్రాంతం మొత్తం ఒక పెయింటింగ్లాగ కనిపిస్తుంది. రోడ్డు పక్కనే వెలిసిన కాఫీ తోటలు, టీ ఎస్టేట్స్, శాండిల్‌వుడ్ సువాసనలు, వర్షంతో తడిసిన అడవులుం ప్రతీ దశ్యం ఒక సినిమా ఫ్రేమ్‌లా ఉంటుంది. ఉదయం సమయంలో మేఘాలు కొండల్ని ముద్దాడుతుంటే, మధ్యాహ్నం చినుకుల మధ్య సూరీడు అందంగా ప్రకాశిస్తాడు. సాయంత్రం అయితే కురిసే వర్షం ఆ తరువాత వీచే చల్లని గాలి మనసుని కూడా ఫ్రెష్‌గా మార్చేస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి మాన్ సూన్ జర్నీ మొదలైతే ట్రెయిన్ విండో పక్కన కూర్చొని వెళ్లడంలోనే ఒక ప్రత్యేక ఆనందం ఉంటుంది. సిటీ బిల్డింగ్స్ మెల్లిగా కనుమరుగై, పంటపొలాలు, నదులు, అడవులు మొదలవుతాయి. రోడ్ జర్నీలో ఘాట్ రోడ్డులు, మేఘాల మధ్య ట్రావెల్ చేస్తూ ప్రతీ టర్న్‌లో కొత్త సీన్ ను ఎంజాయ్ చేయవచ్చు.ఫ్లైట్ జర్నీ అయినా కూడా మేఘాల పైన వెళ్తున్న అనుభవం వేరే ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుండి హిల్ స్టేషన్స్ వైపు వెళ్తుంటే వెదర్ మెల్లిగా మారడం గమనించవచ్చు.విజయవాడ నుంచి ప్రయాణం మొదలు పెట్టే వారికి కూడా రైల్ అండ్ రోడ్డు మార్గంలో ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.ప్రతీ కిలో మీటర్లో వాతావరణం మారిపోతుంది. గాలి చల్లబడుతుంది. పచ్చని దశ్యాలు చూసి మనసు పరవశించి పోతుంది. ఈ చిన్న చిన్న విషయాలు ప్రయాణాల్ని మెమోరెబుల్ చేస్తాయి.యాత్రా, బడ్జెట్ వివరాలు..హైదరాబాద్ లేదా విజయవాడ నుండి 5 రోజుల మాన్ సూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే, ఎంచుకునే ప్రయాణ శైలిని బట్టి బడ్జెట్ మారుతుంది. ఒక సాధారణ బడ్జెట్ రేంజ్ ట్రిప్ కోసం వ్యక్తికి సుమారు రూ. 18,000 నుండి రూ. 25,000 వరకు ఖర్చు అవుతుంది.అదే కొంచెం సౌకర్యవంతంగా ఉండే స్టాండర్డ్ కంఫర్ట్ ట్రిప్ అయితే రూ. 30,000 నుండి రూ. 45,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రీమియం రిసార్టులు, ప్రైవేట్ వాహనాలతో లగ్జరీగా ప్లాన్ చేసుకుంటే మాత్రం మనిషికి రూ. 60,000 నుండి రూ. 90,000 వరకు బడ్జెట్ అవసరమవుతుంది.ఇక బస విషయానికి వస్తే, బడ్జెట్ హోటల్స్‌లో ఒక రాత్రికి రూ. 1,500 నుండి రూ. 3,000 మధ్య ఛార్జీలు ఉంటాయి. మధ్యస్థంగా ఉండే స్టాండర్డ్ రిసార్టులు అయితే రూ. 4,000 నుండి రూ. 8,000 వరకు, విలాసవంతమైన ప్రీమియం స్టేలు రాత్రికి రూ. 10,000 పైనే ఉంటాయి.ఇక ఆహార ఖర్చుల కోసం మీ లైఫ్‌స్టైల్‌ను బట్టి రోజుకు సుమారు రూ. 600 నుండి రూ. 1,500 మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. n విజయవాడ నుంచి ట్రావెల్ చేసే వాళ్లకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కొంచెం మారవచ్చు కానీ ఓవరాల్ బడ్జెట్ దగ్గరగానే ఉంటుంది. కొన్నిప్రాంతాల్లో ప్లాంటేషన్ స్టేలు, హెరిటేజ్ కాటేజీలు, హౌజ్ బోర్డు ఎక్స్పీరియన్సులు, లోకల్ సైట్ సీయింగ్ ΄్యాకేజీలు కూడా లభిస్తాయి. ఈ అనుభవాలు వర్షాకాలం జర్నీని మరింత మెమోరెబుల్గా మార్చేస్తాయి.ఏం చూడాలి?వర్షాకాలంలో జలపాతాలు ఫుల్ ఫ్లోలో ఉంటాయి. లోయలు మొత్తం తెల్లని పొగ మంచు కప్పేసుకుంటాయి. టీ తోటల్లో వర్కర్స్ మెల్లిగా పని చేసుకుంటూ కనిపించే దశ్యం స్థానికుల జీవితాన్ని దగ్గరగా చూపిస్తుంది.అడవి మార్గాల్లో ట్రావెల్ చేస్తుంటే చిన్న చిన్న జలపాతాలు రోడ్డు పక్కనే పరిగెడుతూ ఉంటాయి. సరస్సులపై పడుతున్న చినుకులు, అవి సష్టించే చిన్న చిన్న వలయాల సోయగం కళ్లతో చూడాల్సిందే.ఉదయం సూర్యోదయం కోసం వేచి చూస్తున్న మేఘాలు చాలా అందంగా ఉంటాయి. సాయంత్రం సమయంలో మేఘాలు మెల్లిగా క్లియర్ అయ్యాక కనపించే పచ్చదనం పైసా వసూల్ సీన్ లా అనిపిస్తుంది.ఈ ప్రయాణంలో జలపాతాల దగ్గర కొన్ని నిమిషాలు గడపడం, ప్లాంటేషన్ వాక్స్ ఎంజాయ్ చేయడం, లోకల్ మార్కెట్లో తిరగడం, బోటింగ్‌ను ఆస్వాదించడం, సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద సైలెంట్‌గా నిలబడటం అనే ఈ ఐదు అనుభవాలు సహజంగానే ఈ సీజన్ ని మరింత మధురంగా మార్చేస్తాయి.ఎక్కడ ఉండాలి?వర్షాకాలంలో స్టే అంటే కేవలం రూమ్ మాత్రమే కాదు. మార్నింగ్ బాల్కనీలో కాఫీ కప్ పెట్టుకుని మేఘాలను చూస్తూ గడిపే నిమిషాలు గుర్తుండిపోయే జ్ఞాపకాలు అవుతాయి.వుడెన్ కాటేజీలు, ప్లాంటేషన్ రిసార్టులు, లోయవైపు ఉన్న హోమ్ స్టేలు, లేక్ సైడ్ ప్రాపర్టీలుం ఇవన్నీ ప్రకతి మధ్య కలిసిపోయిన అనుభవాన్ని ఇస్తాయి.రాత్రి సమయంలో వర్షం చినుకుల శబ్దం అనేది వినసొంపైన శబ్దంగా అనిపిస్తుంది.ప్రతీ ఉదయం విండో తెరిస్తే చల్లని తాజా గాలి, తడిసిన మొక్కల సువాసనలు, దూరంలో కనిపించే ఫాగ్ ఇవన్ని కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి.మున్నార్..వర్షాకాలంలో మున్నార్ టీ గార్డెన్స్ మధ్య నడుస్తుంటే ప్రతీ క్షణం మేజికల్‌గా అనిపిస్తుంది. ఆకాశంలో మేఘాలు కొండల మధ్య తిరగడాన్ని చూస్తుంటే సమయం కూడా నెమ్మదిగా నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది.కూర్గ్..కూర్గ్ కాఫీ ఎస్టేట్స్‌లో వర్షం పడిన తరువాత వచ్చే కాఫీ వాసన చాలా రోజులు గుర్తుండిపోతుంది. చిన్న జలపాతం, గ్రీన్ వ్యాలీస్, తొలి మంచుతో కలిసిన రోడ్డు మార్గాల్లో వెళ్తుంటే సైలెంట్ మెలోడీలో మనం భాగం అయినట్టు అనిపిస్తుంది.వయనాడ్..వయనాడ్ అడవుల మధ్య ట్రావెల్ చేస్తుంటే ప్రకృతి మాత్రమే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బాంబూ ఫారెస్ట్, జలపాతాలు, లేక్స్ అన్నీ మాన్ సూన్ లో మరింత లైవ్లీగా మారుతాయి.చిక్‌మగళూరు..చిక్‌మగళూరు కొండల్లో సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తే మేఘాల మధ్య నుండి వెలుగు బయటికి వస్తున్న దశ్యాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు.అరకు వ్యాలీ..ఆంధ్రప్రదేశ్‌లో అరకు వ్యాలీ కూడా ఈ సీజన్ లో మరింత అందంగా మారిపోతుంది. కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా పరిసరాలు అన్ని చినుకులతో కలిసి ఒక ఫ్రెష్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.ఏం తినాలి?కేరళలో అప్పం అండ్ వెజిటెబుల్ స్టూని వర్షం పడుతున్నప్పుడు తినడం అనేది ఎప్పుడూ మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. అలాగే తాజా మసాలాలతో తయారు చేసిన కూరలు లోకల్ ఫ్లేవర్‌ను పరిచయం చేస్తాయి.కూర్గ్‌లో ఫిల్టర్ కాఫీ ప్రతీ సిప్పులో కాఫీ ఎస్టేట్ అరోమా ఉంటుంది. చిక్‌మగళూరు కాఫీ కూడా ట్రావెల్ మెమోరీస్‌లో స్పెషల్ ప్లేస్‌ను పొందుతుంది.తమిళనాడు హిల్ స్టేషన్ లో హాట్ హాట్ ఇడ్లీలు, దోశ, పొంగల్ చల్లని వాతావరణంలో ఒకరకమైన కంఫర్ట్‌ను ఇస్తాయి.అరకులో బాంబూ చికెన్, ట్రైబల్ వంటకాలు, ఫ్రెష్ కాఫీ కాంబినేషన్ అనేవి లోకల్ కల్చర్‌ని రుచుల ద్వారా తెలుసుకునే అవకాశంగానే భావించవచ్చు.ఆసక్తికరమైన విషయాలు..మాన్ సూన్ బెస్ట్ టైమ్: జూన్ నుండి సెప్టెంబర్ వరకు సౌత్ ఇండియాలో ప్రకతి దర్శనం అత్యంత అందమైన అనుభూతిగా మిగులుతుంది. ఫేమస్ప్రాంతాలు: పశ్చిమ కనుములు అనేవి యునెస్కో జీవ వైవిధ్యప్రాంతంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. స్లో ట్రావెల్, నేచర్ వాక్, ఫోటోగ్రఫీతో పాటు ప్రశాంతమైన హాలిడేస్ కోసం వర్షాకాలం చాలా అనువైన కాలం అని చెప్పవచ్చు. అయితే ట్రిప్ స్టార్ట్ చేసే ముందు మీరు వెళ్లే దారి, డెస్టినేషన్ లో పరిస్థితి గురించి తెలుసుకోవడం మరవద్దు.గమనిక: ట్రావెల్, బడ్జెట్ వివరాలు అనేవి మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా అప్డేట్స్ స్వయంగా వెరిఫై చేసుకోగలరు. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
ఇప్పుడు మీ డెస్క్‌పై, మీ మెడలో, మీ చేతిలోకే..
ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన టెక్నాలజీ ఇప్పుడు మీ డెస్క్‌పై, మీ మెడలో, మీ చేతిలోకి వచ్చేసింది. ఆశ్చర్యపరిచే ఫీచర్లతో, ఆకట్టుకునే డిజైన్లతో ఉన్న ఈ గాడ్జెట్స్ నిజంగానే ఫ్యూచర్ వైబ్స్ ఇస్తాయి!చేతికి కట్టుకునే స్పేస్ ల్యాబ్! మీ మణికట్టుపై టైమ్ మాత్రమే కాదు, ఒక చిన్న అంతరిక్ష ప్రయోగశాల కూడా ఉండాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ‘నాసా ఆర్టెమిస్ వాచ్ 2.0!’ చంద్రయాన్ కలలు కనే టెక్నాలజీ ప్రియుల కోసం రూపొందించిన ఈ స్మార్ట్ వాచ్ చూడటానికి స్టయిలిష్‌గా ఉంటుంది. ఇందులో ఉన్న యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, బ్లూటూత్ వంటి సెన్సర్లతో మీ రోజువారీ కదలికలను ట్రాక్ చేయవచ్చు. అయితే దీని అసలు ప్రత్యేకత వేరే! ఈ వాచ్‌ను మీకు నచ్చినట్టుగా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. కొత్త వాచ్ ఫేస్‌లు డిజైన్ చేయడం, చిన్న చిన్న ఆటలు తయారు చేయడం, మీ సొంత యాప్‌లను రూపొందించడం కూడా సాధ్యమే. టెక్నాలజీని సరదాగా నేర్చుకోవాలనుకునే పిల్లలకు, యువతకు ఇది ఒక మినీ లెర్నింగ్ ల్యాబ్‌లా పనిచేస్తుంది. ధర రూ. 10,700.మాట్లాడే బుజ్జి రోబో! కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఆఫీస్ టేబుల్‌పై కూర్చుని పని చేస్తున్నప్పుడు మీతో కబుర్లు చెప్పే ఓ చిన్న ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి ఫ్యూచరిస్టిక్ ఫన్ ను తీసుకొచ్చే గాడ్జెట్ ఇదే. ఏఐ వాయిస్ ఇంటరాక్షన్ కంపానియన్ రోబో! చూడటానికి చిన్న బొమ్మలా కనిపించినా, ఇందులో ఉన్న స్మార్ట్ వాయిస్ ఇంటరాక్షన్ ఫీచర్‌తో మీ మాటలకు స్పందిస్తూ సరదాగా ఇంటరాక్ట్ అవుతుంది. దీని చిన్న డిస్ప్లేలో కనిపించే క్యూట్ యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్స్ వల్ల ఇది నిజంగానే ఎమోషన్స్ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు మాట్లాడితే ఇది రియాక్ట్ అవుతూ, టేబుల్‌పై కూర్చున్న చిన్న డిజిటల్ పెట్లా ఫీల్ ఇస్తుంది. మాగ్నెటిక్ మౌంట్‌కు సపోర్ట్ ఉండటంతో కార్ డ్యాష్‌బోర్డ్‌పై సులభంగా అమర్చుకోవచ్చు. ధర రూ. 18,000.మెడలోనే చిన్న ఏసీ, చిన్న హీటర్!వేçసవిలో ఎండలు మండిపోతుంటే ‘చల్లని గాలి తగిలితే బాగుండు!’ అనిపిస్తుందా? లేదా చలికాలంలో ‘కొంచెం వెచ్చదనం ఉంటే చాలు!’ అని కోరుకుంటున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ వేరబుల్ కూలింగ్–హీటింగ్ పరికరం!ఇది కేవలం ఒక గాడ్జెట్ కాదు, మీ వ్యక్తిగత ఉష్ణోగ్రత నియంత్రణ సాధనం. మెడకు వేసుకునే పట్టీతో దీనిని మెడకు లేదా ఛాతీ దగ్గర ధరించవచ్చు. అవసరాన్ని బట్టి ఇందులో ఉన్న మూడు చల్లదనం స్థాయులు, మూడు వెచ్చదనం స్థాయులు ఎంచుకుని క్షణాల్లో మీకు కావాల్సిన సౌకర్యాన్ని పొందవచ్చు. ఇంట్లో, ఆఫీస్‌లో, ప్రయాణాల్లో లేదా బయట తిరిగేటప్పుడు కూడా ఇది మీతో పాటు ఉంటుంది. చిన్న సైజులో ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. స్టీల్, సిలికాన్ తో తయారైన దీన్ని శుభ్రం చేయడం కూడా చాలా సులువు. ధర రూ. 16,760. -
అవును! దివి నుంచి దివ్యౌషధాలు రాబోతున్నాయి!
మనకు జ్వరం వచ్చినా, జలుబు చేసినా మెడికల్ షాప్‌కి వెళ్లి టాబ్లెట్స్ కొనుక్కుంటాం. ఈ మందులన్నీ భూమి మీద ఉండే ఫ్యాక్టరీలలో తయారవుతాయని మనకు తెలుసు. కానీ, భవిష్యత్తులో మనం వేసుకునే ప్రాణాధార మందులు ‘అంతరిక్షం’ నుండి రాబోతున్నాయి!అవును! సైన్స్, టెక్నాలజీల ప్రపంచంలో ఇప్పుడు ఒక సరికొత్త విప్లవం రానుంది. రాకెట్లను అంతరిక్షంలోకి పంపే ప్రైవేటు కంపెనీలు, ఇప్పుడు అక్కడే మందుల ఫ్యాక్టరీలను కూడా పెట్టడానికి ప్రణాళికలు వేస్తున్నాయి. భూమి మీద గురుత్వాకర్షణ శక్తి వల్ల ఉత్పత్తి చెయ్యటానికి సాధ్యం కాని కొన్ని శక్తిమంతమైన మందులను అంతరిక్షంలో ఉండే శూన్య వాతావరణంలో చాలా సులభంగా తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు! వార్దా స్పేస్ ఇండస్ట్రీస్ అనే ఒక స్టార్టప్ కంపెనీ అయితే ఏకంగా అంతరిక్షంలోనే ఒక ల్యాబ్‌ని ఏర్పాటు చేసి ప్రయోగాలు మొదలుపెట్టేసింది. వ్యోమగాముల సహాయం కూడా లేకుండా, కేవలం కంప్యూటర్ల ద్వారా అంతరిక్షంలో మందులు తయారు చేసి, వాటిని తిరిగి భూమి మీదకు భద్రంగా తీసుకొచ్చే ఈ సరికొత్త టెక్నాలజీ విశేషాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.అణువుల్లోనే అసలు కీలకంవ్యోమనౌకలు పరిభ్రమించే భూ కక్ష్యలో మందులపై ప్రయోగాలు చేయడంతో పాటు, కొత్త ఔషధాలను తయారు చేయడం కోసం వార్దా స్పేస్ చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా నిజరూపం దాల్చుతున్నాయి. అందులో కనుక వారు సఫలమైతే, కొత్త మందుల తయారీలో ఇదొక విప్లవాత్మక అడుగు అవుతుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రంగా సాగే సరికొత్త ఉత్పత్తి రంగానికి ఇది నాంది పలుకుతుంది. అరుదైన శ్వాసకోశ వ్యాధులకు చికిత్సలు అందించడంలో, అవయవ మార్పిడి రంగంలో పేర్గాంచిన ‘యునైటెడ్ థెరప్యూటిక్స్’ అనే బయోటెక్ కంపెనీతో తాము చేతులు కలిపినట్లు వార్దా సంస్థ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. లాస్ ఏంజెలెస్ కౌంటీకి చెందిన ‘వార్దా’ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా అంతరిక్షంలోకి చిన్న ‘ప్రయోగ పరికరాల పెట్టెలను’ (పేలోడ్స్) పంపుతోంది. కేవలం అంతరిక్షంలోని గురుత్వాకర్షణ లేని స్థితిలో మాత్రమే చేయగల కొన్ని ఆటోమేటెడ్ ప్రయోగాల సాంకేతికతను అభివృద్ధి చేయడం కోసం వార్దా పరిశోధకులు ఈ పని చేస్తున్నారు. ‘ఆటోమేటెడ్’ అంటే కంప్యూటర్లు, రోబోలు లేదా ముందే సెట్ చేసి పెట్టిన మిషన్ల ద్వారా వాటికవే పనిచేయటం! యాంటీబయాటిక్స్ నుండి కార్టికోస్టెరాయిడ్స్ వరకు మనం వాడే రకరకాల మందులకు మూలాధారమైన కొన్ని రకాల చిన్న అణువులను మార్చటం కూడా ప్రయోగాలలో భాగంగా ఉన్నాయి.‘‘ఆశ్చర్యకరంగా, ఇలాంటి చిన్న అణువుల ప్రయోగాలకు అంతరిక్షం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అంతరిక్షంలో వీటితో సరికొత్త స్ఫటిక విత్తనాలను (క్రిస్టల్ సీడ్స్) తయారు చేసి, వాటిని తిరిగి భూమిపైకి తీసుకురావచ్చు’’ అని వార్దా సంస్థ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మైకేల్ రీలీ అంటున్నారు.సెలైన్‌కు బదులు ‘షాట్స్’!యునైటెడ్ థెరప్యూటిక్స్ సంస్థ ప్రాథమికంగా తన చిన్న అణువుల మందులను వార్దా సాంకేతికత ద్వారా అంతరిక్షంలో పరీక్షించబోతోంది. అయితే భవిష్యత్తులో ఈ సాంకేతికత కేవలం ఆ కంపెనీ మందులకే పరిమితం కాకుండా, ‘మోనోక్లోనల్ యాంటీబాడీస్’ వంటి ఇతర బయోటెక్నాలజీ మందులకు కూడా ఉపయోగపడుతుందని ఆయన నమ్ముతున్నారు. దీనివల్ల ప్రస్తుతం హాస్పిటల్లో నరాల ద్వారా సెలైన్ బాటిల్‌తో ఇచ్చే ఇంజెక్షన్లను, భవిష్యత్తులో చర్మం కింద సులభంగా ఇచ్చే చిన్న సూదులు (సబ్‌క్యుటేనియస్ షాట్స్) గా మార్చవచ్చు.భూమిపై ఏమాత్రం సాధ్యం కాని పరిస్థితులలో, అంతరిక్ష వాతావరణాన్ని ఉపయోగించుకుని ఔషధాలకు అవసరమైన స్పటికాలను తయారు చేయడమే వార్దా కంపెనీ ముఖ్య ఉద్దేశం. ‘‘అంతరిక్షంలో మనం భూమి కంటే పెద్దవిగా, ఎటువంటి లోపాలు లేనివిగా, ఒకే పరిమాణంలో ఉండే స్ఫటికాలను తయారు చేయవచ్చు’’ అని యూఎస్‌లోని బట్లర్ యూనివర్సిటీ రసాయన శాస్త్రవేత్త యాన్ విల్సన్ చెబుతున్నారు. ఆమె గతంలో అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్) కోసం ప్రయోగాలు రూపొందించారు.అంతరిక్షంలో ప్రత్యేకమైన భౌతిక నిర్మాణాలు గల స్పటికాలను సృష్టించవచ్చని యాన్ నిర్థారించారు. ‘‘ఇటువంటి ప్రయోగాల ద్వారా అత్యంత విలువైన గుణాలు కలిగిన మందులను తయారు చేయటం నిస్సందేహంగా సాధ్యమౌతుంది. ఉదాహరణకు, ఒక మందును శరీరంలో త్వరగా కరిగేలా చేయడం ద్వారా, రోగి తక్కువ డోసులు వేసుకుంటే సరిపోయేలా చేయవచ్చు. దీనివల్ల మందుల ఖర్చు కూడా బాగా తగ్గుతుంది’’ అని విల్సన్ వివరించారు.‘పెంటగాన్’ సహకారం!అంతరిక్ష ప్రయోగాలకు అయ్యే ఖర్చులను తగ్గించుకోవడానికి వార్దా సంస్థ కేవలం మందుల ప్రయోగాలే కాకుండా, అమెరికా రక్షణ శాఖకు (పెంటగాన్) సంబంధించిన కొన్ని రక్షణ ప్రయోగాల పరికరాలను కూడా వారి ఆర్థిక సహాయంతో అంతరిక్షానికి తీసుకెళుతున్నట్లు వార్దా చీఫ్ రీలీ వెల్లడించారు. ఎలాన్ మస్క్ ‘స్పేస్–ఎక్స్’ సంస్థ తయారు చేసిన ‘మళ్లీ మళ్లీ వాడగలిగే రాకెట్ల’ (రీయూజబుల్ రాకెట్ల)వల్ల గత పదేళ్లలో అంతరిక్షంలోకి వస్తువులను పంపే ఖర్చు తగ్గినప్పటికీ, అది ఇప్పటికీ చాలా ఖరీదైన వ్యవహారమే. అందుకే వార్దా, ఇతర అంతరిక్ష కంపెనీలు నిరంతరం పెంటగాన్ వంటి కొత్త కస్టమర్ల కోసం వెతుకుతూనే ఉంటాయి. నిజానికి వార్దా కంటే కూడా ‘అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ’ను తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ఫార్మా రంగమే అత్యంత ఆసక్తిగా ఉంది. ‘‘ఎందుకంటే మందుల మార్కెట్ చాలా పెద్దది. ఇక మందుల తయారీకి అవసరమయ్యే ముఖ్యమైన రసాయన పదార్థాల బరువు చాలా తక్కువగా ఉంటుంది’’ అని ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని పరిశోధించే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధకుడు మాథ్యూ వీంజియర్ల్ అంటారు.త్వరలో కొత్త ఐ.ఎస్.ఎస్.లుచాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు భూకక్ష్యలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, చైనాకు చెందిన ‘తియాంగాంగ్’ పరిశోధనా కేంద్రాలకు తమ ప్రయోగాల పరికరాలను పంపుతున్నారు. కానీ, వ్యోమగాముల సహాయం అవసరం లేకుండా, ఆటోమేటిక్‌గా అంతరిక్షంలో ప్రయోగాలు జరిపించే సామర్థ్యం ప్రస్తుతం కేవలం వార్దా, స్పేస్–ఎక్స్ కంపెనీలకు మాత్రమే ఉందని రీలీ తెలిపారు.ఇక 2030లో కాల పరిమితి తీరబోతున్న ఐ.ఎస్.ఎస్. స్థానంలో సరికొత్త ప్రైవేట్ అంతరిక్ష కేంద్రాలు రాబోతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్నది కమర్షియల్ స్పేస్ స్టేషన్ల యుగం కాబట్టి మరిన్ని కొత్త టెక్నాలజీలు రావచ్చు. ఉదాహరణకు, ‘స్పేస్ టాంగో’, ‘వాయేజర్ టెక్నాలజీస్’ వంటి కంపెనీలు అంతరిక్షంలో ప్రయోగాలు చేసుకోవడానికి ప్లగ్–అండ్–ప్లే (సులభంగా వాడుకోగలిగే) సేవలను ఇప్పటికే అందిస్తున్నాయి. వాయేజర్ టెక్నాలజీస్ సంస్థ ‘స్టార్లాబ్’ పేరుతో ఒక సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే పనిలో ఉంది. ఈ కొత్త ప్రాజెక్టులన్నీ ఫార్మా రంగాన్ని దృష్టిలో పెట్టుకునే రూపొందుతున్నాయని వీంజియర్ల్ తెలిపారు. మరోవైపు వార్దా సంస్థ కూడా మరిన్ని కొత్త భాగస్వామ్యాల కోసం, అలాగే ప్రయోగాల వేగాన్ని పెంచడానికి ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం మూడు నెలలకు ఒకసారి చేసే ప్రయోగాలను, భవిష్యత్తులో రెండు నెలలకు ఒకసారి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.కదిలే స్పేస్ ఫ్యాక్టరీవార్దా సంస్థ తను రూపకల్పన చేసిన అంతరిక్ష మందుల ల్యాబ్‌కు ‘వినెబాగో’ అని నామకరణం చేసింది. ఇది దాదాపు 300 కిలోగ్రాముల బరువున్న ఒక శాటిలైట్. రాకెట్ ద్వారా దీనిని అంతరిక్ష కక్ష్యలోకి చేరిన తర్వాత, ఈ వినెబాగో తన సొంత ఇంధన ఇంజిన్ సహాయంతో సరైన దిశలోకి మారుతుంది. ఈ శాటిలైట్ లోపల ప్రయోగాలు చేయడానికి ఒక చిన్న క్యాప్సూల్ (పెట్టె వంటి నిర్మాణం) ఉంటుంది. కాగా, ‘వినెబాగో’ అనే మాటను వార్దా, అమెరికాలో ప్రసిద్ధి చెందిన ‘వినెబోగో మోటార్హోమ్స్’ అనే పేరు నుండి స్వీకరించింది. వినెబాగో మోటార్హోమ్స్ అనేవి ప్రయాణించే ఇళ్లలాగే అన్ని వసతులను కలిగి ఉంటాయి. వార్దా కూడా ‘కదిలే స్పేస్ ఫ్యాక్టరీ’ అనే అర్థంలో వినెబాగో పేరును తన స్పేస్ ల్యాబ్‌కు పెట్టుకుంది. ఆ ల్యాబ్‌లో ప్రయోగాలు పూర్తయిన తర్వాత, ఆ క్యాప్సూల్ గంటకు సుమారు 18,000 మైళ్ల వేగంతో తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. చివరకు పారాషూట్ సహాయంతో ఆస్ట్రేలియాలోని నిర్జన ప్రాంతంలో ల్యాండ్ అవుతుంది. ఇంతకు మించి, మరే వివరాలూ వార్దా ఇప్పటికైతే వెల్లడించలేదు.2024లో ఈ కంపెనీ తయారుచేసిన మొదటి నమూనా క్యాప్సూల్‌ను అమెరికాలోని ఉటా ఎడారిలో దించాలని ప్లాన్ చేశారు. కానీ అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మొదట్లో అనుమతి నిరాకరించడం వల్ల అది భూమికి తిరిగి రావడం ఆలస్యమైంది. ఈసారి అలా జరగకుండా ఉండేందుకు ఆస్ట్రేలియాలో ల్యాండ్ చేస్తున్నారు.గేమ్ ఆఫ్ ఛాన్స్?! అంతరిక్షంలో మందుల తయారీకి మంచి అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న పని అని న్యూజెర్సీలోని రోవాన్ యూనివర్సిటీకి చెందిన కెమికల్ ఇంజనీర్ గెరార్డ్ కాపెల్లాడెస్ అంటున్నారు. ఆయన చెబుతున్న దానిని బట్టి ఈ ప్రయోగాలలో కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఉన్నాయని అర్థమౌతోంది.మొదటిది, పరిమాణం సమస్య. అంతరిక్షంలో పెంచిన స్పటికాలను విత్తనాలుగా ఉపయోగించి, వాటి సహాయంతో భూమిపై పెద్ద ఎత్తున మందులను తయారు చేయడానికి పరిశోధకులు ప్రయత్నించాలి. లేదా ఫార్మా రంగం వెలుపల ఉండే ఇతర అత్యంత విలువైన రంగాల కోసం ఒకే ఒక పరిపూర్ణమైన స్ఫటికాన్ని వృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి. ఇది ఎందుకు సవాలు అవుతుందంటే, అంతరిక్షంలోకి భారీ ఫ్యాక్టరీ సామగ్రిని పంపలేం. రాకెట్లలో చాలా తక్కువ బరువులను, చిన్న పెట్టెలను మాత్రమే పంపగలం. ల్యాబులో గ్రాముల లెక్కన మందులు తయారు చేయటం తేలికే. కానీ ప్రపంచంలో ఉన్న రోగులందరికీ సరిపడా కిలోలు, లేదా టన్నుల కొద్దీ మందులు అంతరిక్షంలో తయారు చేయటం ప్రస్తుతానికైతే కష్టం.రెండవది, ప్రయోగం జరిగే వాతావరణాన్ని మన అధీనంలో ఉంచుకోవడం చాలా కష్టం. తక్కువ ఖర్చుతో, అనుకున్న సమయానికి కచ్చితమైన స్ఫటిక నిర్మాణాన్ని సాధిస్తామని గ్యారంటీ ఇవ్వడం చాలా కష్టం. ఈ ప్రయోగాలను ఆయన ఒక ‘గేమ్ ఆఫ్ ఛాన్స్’గా అభివర్ణించారు. అంటే అంతా అదృష్టంపై ఆధారపడి ఉందని! ‘‘ఒకే రకమైన వాతావరణం ఉన్నప్పటికీ, కొన్నిసార్లు స్ఫటికం ఏర్పడటానికి కేవలం నిమిషాల సమయం పడుతుంది, మరికొన్నిసార్లు వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు’’ అని గెరార్డ్ అంటారు. అయితే, భవిష్యత్తులో దీని ఖర్చులు తగ్గుతాయని, ఈ ప్రయోగాలను కొనసాగించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.ఫార్మారంగం నక్కను తొక్కినట్లే!వార్దా, యునైటెడ్ థెరప్యూటిక్స్ సంస్థల భాగస్వామ్యం విజయవంతమై, ఇదొక మంచి ఉదాహరణగా నిలవాలని వీంజియర్ల్ ఆశిస్తున్నారు. ఇది గనుక సఫలమైతే, ఒక డోమినో ఎఫెక్ట్ (ఒకదాని వెనుక ఒకటిగా జరిగే మార్పు)ను సృష్టిస్తుంది. అంటే, దీనిని చూసి భవిష్యత్తులో మరిన్ని ఫార్మా కంపెనీలు అంతరిక్ష సంస్థలతో జతకడతాయి. ‘‘ఈ భాగస్వామ్యం ద్వారా మార్కెట్లో సూపర్ హిట్ అయ్యే ఒకటి రెండు మందులు గనుక తయారైతే, అది అంతరిక్షంలో పెద్ద ఎత్తున లాభసాటి వ్యాపారాలు చేయడానికి ఫార్మా రంగానికి ఒక అద్భుతమైన బాటలు వేస్తుంది’’ అని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.వీంజియర్ల్ ఆశాభావాన్ని బట్టి భూమిపై నయం చేయలేని ఎన్నో రోగాలకు అంతరిక్షం వేదికగా తక్కువ ఖర్చుతో కూడిన, మరింత శక్తిమంతమైన మందులు అందుబాటులోకి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది. - సాక్షి స్పెషల్ డెస్క్ -
లీటర్ పెట్రోల్.. 914 కిలోమీటర్ల మైలేజీ..
అసలే చమురు ధరలు మండిపోతున్నాయి. కారు రోడ్డు మీదకు వస్తే 15–20 కిలోమీటర్ల దూరానికే లీటరు చమురు ఆవిరైపోతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చినా, వాటితో ఇబ్బందులు ఉండనే ఉంటున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ చమురుతోనే సుదూరాలకు పరుగు తీయగల కారును అమెరికాలోని ఉటా రాష్ట్రానికి చెందిన బ్రిగ్హామ్ యంగ్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించారు. ఈ కారు లీటరు పెట్రోలుకు ఏకంగా 914 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మామూలు కార్లతో పోల్చుకుంటే, దీని బరువు కూడా చాలా తక్కువ. ఈ సూపర్ మైలేజీ కారు బరువు కేవలం 49 కిలోలు మాత్రమే! ఈ కారుకు దాని పనితీరుకు తగినట్లే ‘సూపర్ మైలేజ్’ అని పేరు పెట్టారు. అయితే, దీనిని రేసు ట్రాక్‌లపై పరుగులు తీయించడానికి ప్రయోగాత్మకంగా తయారు చేశారు. -
తడిసిన పుస్తకం.. మూడు రోజుల కూలీ!
అబ్రహాం లింకన్ కి 11 ఏళ్లు ఉన్నప్పుడు ఇండియానాలోని పిజన్ క్రీక్ దగ్గర ఉండేవాడు. చదువంటే పిచ్చి. పక్క ఊరిలో జోసియా క్రాఫోర్డ్ అనే రైతు దగ్గర ‘ద లైఫ్ ఆఫ్ జార్జ్ వాషింగ్టన్’ అనే పుస్తకం ఉందని తెలిసింది. లింకన్ బతిమాలి తెచ్చుకున్నాడు. ఆ రాత్రి వర్షం. గుడిసె కప్పులో నుంచి నీళ్లు కారి, పుస్తకం తడిసి నాశనం అయ్యింది.తెల్లారి లింకన్ ఏడుస్తూ క్రాఫోర్డ్ దగ్గరికి వెళ్లి, ‘నేను పుస్తకం పాడు చేశాను సార్’ అని ఒప్పుకున్నాడు. క్రాఫోర్డ్ దానికి ‘సరే, మూడు రోజులు నా పొలంలో పని చెయ్. అప్పు తీరిపోతుంది’ అన్నాడు. 11 ఏళ్ల లింకన్ మొక్కజొన్న పొలంలో, పందుల షెడ్డులో మూడు రోజులు కూలి చేశాడు. పుస్తకానికి ఖరీదు కట్టాడు. ఆ పుస్తకాన్ని మళ్లీ ఎండబెట్టి, అట్ట వేసి, పూర్తిగా చదివాడు. నిజాయితీ ఉన్నవాడు పైకి వస్తాడని ఈ ఘటన చెబుతోంది. -
ఆలోచిస్తూ బుర్ర ఎందుకు గీరుకుంటారో తెలుసా?
‘వినీష్... మన రాష్ట్రపతి పేరేంటి?’ అని టీచర్ అడిగితే వాడు లేచి బుర్ర గీరుకుంటాడు. శ్రేష్ఠ ఎగ్జామ్ రాస్తూ ఆన్సర్ గుర్తుకు రాక తల గీరుకుంటుంది.ఎందుకు అలా తల గీరుకుంటారు?మన చర్మం కింద లక్షల కొద్దీ నరాలు ఉంటాయి. తల గీరినప్పుడు ఆ నరాలు మెదడుకు మెసేజ్ పంపిస్తాయి. ఆ సిగ్నల్‌తో మెదడులో నిద్రపోతున్న భాగాలు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఆలోచన వేగం పుంజుకుంటుంది. దీన్నే సైంటిస్టులు ‘సోమాటోసెన్సరీ యాక్టివేషన్’ అంటారు. తల గీరడం వల్ల అక్కడి చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది.రక్తంతో పాటు ఆక్సిజన్ కూడా మెదడుకు ఎక్కువగా అందుతుంది. ఆక్సిజన్ అందిన మెదడు చురుకుగా పనిచేస్తుంది. అందుకే ఒక్కసారిగా సమాధానం గుర్తొస్తుంది. మన మెదడు ఒక పెద్ద లైబ్రరీ లాంటిది. సమాధానం దొరకకపోతే మెదడు పుస్తకాలు అన్నీ వెతుకుతుంది. ఆ సమయంలో బుర్ర గీరడం వల్ల మెదడుకు ఎక్స్ట్రా ఎనర్జీ అందినట్టు అవుతుంది. అందుకే సరైన జ్ఞాపకం టక్కున దొరుకుతుంది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే బుర్ర గోకడం అనేది అలసిపోయిన మెదడుకు మనం ఇచ్చే మసాజ్ లాంటిది. -
‘గుర్రాల స్నానం’ 300 ఏళ్ల పాత పండగ గురించి తెలుసా?
పిల్లలూ... మన ఊర్లో ‘ఎడ్ల పందాలు’, ‘కోడి పందాలు’ లాగే ఇంగ్లాండ్‌లో గుర్రాల పండగ జరుగుతుంది. ఇంగ్లాండ్‌లో ‘యాపిల్బై’ అనే చిన్న ఊరులో మొన్న జూన్ 6న ‘గుర్రాల స్నానం పండుగ’ జరిగింది. ప్రతి వేసవిలో ఈ పండగ చేస్తారు. ఇది 300 ఏళ్ల పాత పండగ!పండుగ రోజు ‘జిప్సీ’ అనే సంచార జాతి వాళ్లు ఎక్కడెక్కడి నుంచో అందమైన గుర్రాలు, రంగురంగుల బండ్లతో యాపిల్ బైకి వచ్చేస్తారు. తాము ప్రయాణం చేసి వచ్చిన గుర్రాలకి అక్కడి ‘ఈడెన్’ నదిలో స్నానం చేయిస్తారు. చల్లటి నీళ్లలో గుర్రాలు హాయిగా ఈదుతాయి. స్నానం చేసి, జూలు దువ్వుకున్న గుర్రాలు మెరిసిపోతాయి. అప్పుడు వాటిని కొనడానికి, అమ్మడానికి బేరాలు జరుగుతాయి.గుర్రాలే కాదు, చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అందరూ కలుసుకుని ఆడతారు, పాడతారు, కథలు చెప్పుకుంటారు. గుర్రాలు నదిలో ‘టప్ టప్’ అని నడుస్తుంటే చూడ్డానికి వేల మంది వస్తారు. కొందరు గుర్రాల మీద కూర్చునే నదిలోకి దిగుతారు. భలే థ్రిల్లింగ్‌గా ఉంటుంది! ఈ జాతరలో ‘బౌ–టాప్ వాగన్’ అనే గుండ్రని పైకప్పు ఉన్న బండ్లు స్పెషల్. ఇవి జిప్సీల తిరుగాడే ఇళ్లు. మనం ప్రతి సంస్కృతిని గౌరవించాలి. -
చంద్రుడి దారిలో.. 'ఆర్టెమిస్-3'
పిల్లలూ... చంద్రుడి పై మళ్లీ మనిషి కాలు పెట్టే ప్రయత్నం వేగంగా సాగుతోంది. 2026 జూన్ 9న అమెరికా హ్యూస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ ‘ఆర్టెమిస్ 3’ అంతరిక్ష యాత్రకు వెళ్లే నలుగురు వ్యోమగాములను అనౌన్స్ చేసింది.ఆ వ్యోమగాములురాండీ బ్రెస్నిక్ – యాత్రకు కమాండర్. ఇంతకు ముందు రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లారు.లూకా పర్మిటానో – పైలట్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి ఆర్టెమిస్ కార్యక్రమానికి ఎంపికైన మొదటి వ్యోమగామి.ఫ్రాంక్ రూబియో – మిషన్ స్పెషలిస్ట్. వైద్యుడు. అంతరిక్షంలో 371 రోజులు గడిపిన అమెరికన్ రికార్డు ఇతనిదే!ఆండ్రే డగ్లస్ – మిషన్ స్పెషలిస్ట్. ఇది ఆయన మొదటి అంతరిక్ష యాత్ర.వీరి యాత్ర 2027 చివర్లో ప్రారంభం కానుంది. కానీ, ఈ వ్యోమగాములు చంద్రుడిపై అడుగుపెట్టరు.అసలు సంగతి..ఆర్టెమిస్ 3 మొదట చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగాల్సిన యాత్ర. కానీ ల్యాండర్ వాహనాలు సిద్ధం కాకపోవడంతో, నాసా 2026 ఫిబ్రవరిలో ప్లాన్ మార్చింది. ఇప్పుడు వీరు భూమికి దగ్గరగా ఉన్న లోఎర్త్ ఆర్బిట్లోనే ఉంటారు.ప్రధాన లక్ష్యంఓరియన్ అనే వ్యోమనౌకను, చంద్రుడిపై దిగడానికి స్పేస్ఎక్స్, బ్లూ ఆరిజిన్ తయారు చేస్తున్న ‘హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్’ వాహనాలతో అంతరిక్షంలో అనుసంధానం చేయడం. దీనినే ‘డాకింగ్’ అంటారు. ఇది భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులు దిగడానికి చేసే కీలక సన్నాహం.పిల్లలూ.... మనుషులు చివరిసారిగా 1972 డిసెంబర్లో అపోలో 17 యాత్రలో చంద్రుడిపై దిగారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ దేశం కూడా మనుషులను చంద్రుడిపైకి పంపలేదు. 2026 ఏప్రిల్‌లో ‘ఆర్టెమిస్ 2’ యాత్ర విజయవంతంగా చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చింది. అందులో నలుగురు వ్యోమగాములు ఉన్నారు. కానీ వారు కూడా చంద్రుడిపై దిగలేదు. 2027లో జరగబోయే ‘ఆర్టెమిస్ 3’ యాత్ర విజయవంతమైతే, తర్వాత వచ్చే ‘ఆర్టెమిస్ 4’ యాత్ర 2028లో మనుషులను నిజంగా చంద్రుడిపై దించుతుంది. -
ఇదెక్కడి 'డెలివెర్రి'రా బాబు!
ఆలూ లేదు చూలు లేదు అన్నది పాత సామెత. ఆర్డర్ లేదు.. డెలివరీ లేదు అంతా ఉత్తుత్తిదే అన్నది కొరియన్ల కొత్త సామెత. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తరహాలో ఇక్కడ కొన్ని ఆన్లైన్ సైట్లు ఉంటాయ్ అందులో మనం వస్తువులను సెలెక్ట్ చేసుకోవడం, ఆర్డర్ పెట్టడం, అవి కాస్తా డెలివరీ అవ్వడం అన్నీ నిమిషాల్లోనే చకచకా జరిగిపోతాయి. కాని చోద్యమేమిటంటే ఇదంతా వాస్తవం కాదు.జస్ట్ యూజర్లకు కొత్త అనుభూతినివ్వడానికే ఈ సైట్లు. వీటిని అక్కడ యూత్ డోపమైన్ సైట్లు అని పిలుస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. వీరి పిచ్చికి పరాకాష్ట ఏంటంటే ఇలా ఆర్డర్ పెట్టి డెలివరీ మెసేజ్ వచ్చిన వస్తువులకు రేటింగులు, రివ్యూలు ఇవ్వమని ఆయా వెబ్సైట్లు యూజర్లను కోరడం. -
ఫ్రమ్ నూడుల్స్ టు పేపర్..!
కొన్ని విషయాలు వినడానికి గమ్మత్తుగా ఉంటాయ్. బియ్యం లేదా గోధుమలనుప్రాసెస్ చేస్తే వచ్చేవే న్యూడిల్స్. మరి ఆ నూడుల్స్‌ని ప్రాసెస్ చేస్తే? అసలు ఇంత దూరం ఎందుకు ఆలోచిస్తాం నూడుల్స్ కనబడగానే ప్లేటు లాగించేస్తాం అనుకుంటున్నారా? కాని జపాన్‌లోని కగవా యూనివర్సిటీ పరిశోధకులు మాత్రం లాగించేయడం పక్కన పెట్టి ఇంకేమైనా చేద్దామా అని ఆలోచించారు.అలా వారి ఆలోచనలో పుట్టిందే బయోడీగ్రేడబుల్ పేపర్ తయారీ. ఈ కొత్త పద్ధతి ప్రకారం ఒక్క ప్లేటు నూడుల్స్‌తో పది ఏ4 సైజు పేపర్లను తయారు చేయవచ్చు. పేపర్ తయారీకి నీటితో పాటు ఎసిటిక్ బ్యాక్టీరియా, ఇతర కొన్ని ర కాల ఎంజైమ్స్ కలిపి మిశ్రమంగా మార్చడం వల్ల మాములు పేపర్ కంటే దృఢంగా ఉండేలా ఈ బయోడీగ్రేడబుల్ పేపర్ని తయారు చేయవచ్చునని వారు పేర్కొన్నారు. -
స్కూల్..! అసలు ఈ పదం ఎక్కడినుంచి వచ్చిందో తెలుసా?
ప్రస్తుతం స్కూల్ అని పిలువబడుతున్న ఈ పదాన్ని మొదట ఏమని పిలిచేవారో తెలుసా? అసలు ఈపదం ఎక్కడినుంచి వచ్చింది? ఎలా స్కూల్ గా మారింది? అనేదానిగురించి ఇప్పుడు తెలుసుకుందాం!"స్కూల్" అనే పదాన్ని ఒక వ్యక్తి ప్రత్యేకంగా కనుగొనలేదు. కొన్ని భాషల్లోని పదాలు వ్యక్తులు సృష్టించినవీ కూడా కావు. శతాబ్దాలపాటు ప్రజల వాడుకలో క్రమక్రమంగా రూపుదిద్దుకున్నాయి. అలాంటి పదాల్లో నేడు వాడుకలో ఉన్నది స్కూల్ అనే పదమొకటి.నేడు ఆంగ్లంలో స్కూల్ (School) అనే పదం ప్రాచీన గ్రీకు పదమైన "స్కోలే"(scholē) నుంచి వచ్చింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే? ఈ గ్రీకు పదానికి మొదట్లో విశ్రాంతి సమయం లేదా ఖాళీ సమయం అనే అర్థాలు ఉండేవి. ప్రజలు వారి పనులు ముగించుకున్నాక దొరికే ఖాళీ సమయంలో చర్చలు చేయడం, తత్వశాస్త్రం నేర్చుకోవడం, జ్ఞానం సంపాదించడం చేసేవారట. స్కోలే పదానికి "విద్యాభ్యాసం", "ఉపన్యాసాలు జరిగే స్థలం" అని అర్థాలు వచ్చేవి. కాలక్రమేనా గ్రీకులో స్కోలే, లాటిన్లో స్కోలా, పాత ఇంగ్లీష్ లో స్కోల్ గా మారి, చివరికి ఆధునిక ఇంగ్లీష్ లో స్కూల్ గా రూపాంతరం చెందింది. అంటే నేడు మనం "స్కూల్" అని పిలిచే పదానికి అసలు అర్థం "ఖాళీ సమయంలో జ్ఞానం సంపాదించే స్థలం" అన్నమాట!ఈ స్కూల్ పదం తెలుగులో చూసుకున్నట్లయితే, పూర్వకాలంలో బడి అని పిలిచేవారు. బడి అనే పదానికి అర్థం చదువు చెప్పే స్థలం, పాఠశాల అనే అర్థం. ఇది ఇంగ్లీష్ స్కూల్ నుంచి వచ్చిన పదం అసలే కాదు. తెలుగు భాషలో చాలా కాలంగా వాడుకలో ఉన్న స్వదేశీ పదంగా భాషావేత్తల భావన. పూర్వకాలంలో గురువు తన ఇంటి వద్ద లేదా ఖాళీస్థలంలో పిల్లలకు అక్షరాలు, లెక్కలు నేర్పేవారట. ఆ చదువు జరిగే చోటును బడి అని పిలిచేవారు. ఇప్పటికీ ఈ పదం సహజంగా వాడుకలో కొనసాగుతుంది. అయితే అధికారిక పదం పాఠశాల. పాఠం అంటే.. చదువు, శాల అంటే.. ఇల్లు లేదా స్థలం అని అర్థం. ప్రజల నిత్య వాడుకలో ఉన్న స్వచ్ఛ తెలుగు పదం బడిగా ఉంటే, సంస్కృత మూలం ఉన్న అధికారిక పదం పాఠశాల. -
యుద్ధం తెచ్చిన తీపి జ్ఞాపకం.. రైలునే మ్యూజియంగా మార్పు!
ఏ దేశమైనా, ఏ జాతి అయినా యుద్ధం అంటే చివరికి మిగిలేవి దారుణ మరణాలు, తీరని శోకాలే. రెండో ప్రపంచ యుద్ధం దాదాపు ప్రపంచంలోని ప్రతి దేశాన్ని తీవ్రంగా బాధించింది. నాటి యుద్ధ కాలంలో ఫ్రాన్స్‌కి ప్రత్యక్షంగా సహకరించిన దేశం అమెరికా. యుద్ధం ముగిశాక అమెరికా తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది.ఆ సమయంలో అమెరికా అందించిన సహాయానికి కృతజ్ఞతగా ఫ్రాన్స్ మెర్సిట్రెయిన్ పేరుతో 1949లో 49 బోగీలున్న ఓ ప్రత్యేక రైలును పంపింది. ఫ్రాన్స్‌లో మెర్సి అంటే ధన్యవాదాలు అని అర్థం. ఈ రైలులో ఫ్రాన్స్ పౌరులు ఎన్నో విలువైన వస్తువులను, జ్ఞాపికలను, కళాత్మక చిత్రాలను బహుమానంగా పంపారు. ప్రస్తుతం అమెరికాకి స్వాతంత్య్రం వచ్చి 250 ఏళ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఫ్రాన్స్ ఇచ్చిన మెర్సిట్రెయిన్ను 77 ఏళ్ల తర్వాత ‘గ్రాటిట్యూడ్ ట్రెయిన్’ పేరుతో ఓప్రాజెక్టు మొదలుపెట్టి అత్యంత సుందరంగా వింటేజ్ లో లుక్ తయారు చేసి రైలునే మ్యూజియంగా మార్చేశారు. ప్రస్తుతం ప్రదర్శన కోసం అందుబాటులో ఉంచారు. అలా నాటì చేదు గురుతులు నేటి తీపి జ్ఞాపకాలుగా మారాయి. -
భారతదేశంలోని 5 విశిష్ట గ్రామాలు
భారతదేశం అంత వైవిధ్యభరితమైన వాతావరణం, సంప్రదాయాలు, ఐక్యత, భిన్నత్వం, భాషలు, ఆహార అలవాట్లు, నాగరికత, చరిత్ర, నైపుణ్యం ఉన్న దేశం భూమిపై మరొకటి లేదు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే మన దేశంలో కొన్ని గ్రామాలు తమ ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అలాంటి ఐదు విశిష్ట గ్రామాల గురించి తెలుసుకుందాం.1. ఖోనోమా, నాగాలాండ్భారత్లో తొలి గ్రీన్ విలేజ్‌గా గుర్తింపు పొందిన ఖోనోమా ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంలా ఉంటుంది. ఇక్కడి ప్రజల సంప్రదాయాలు, వ్యవసాయ పద్ధతులు, సామాజిక ఐక్యత ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.2. మాలినోంగ్, మేఘాలయఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా గుర్తింపు పొందిన మాలినోంగ్‌లో ఎక్కడా చెత్త కనిపించదు. మేఘాలయలోని ఈ అందమైన గ్రామం షిల్లాంగ్‌కు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఖాసీ తెగకు చెందిన ప్రజలు నివసిస్తారు.3. చిట్కుల్, హిమాచల్ ప్రదేశ్భారత్–టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చివరి గ్రామంగా చిట్కుల్ ప్రసిద్ధి చెందింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, సాంప్రదాయ ఇళ్లు, స్వచ్ఛమైన గాలి ఈ గ్రామాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి.4. లంబసింగి, ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లో ఉన్న లంబసింగిని ‘ఆంధ్రా కాశ్మీర్‘ అని పిలుస్తారు. ఎండాకాలంలో కూడా చల్లని వాతావరణంతో ఈ గ్రామం ప్రత్యేక గుర్తింపు పొందింది. 5. బానవాసి, కర్ణాటకకర్ణాటకలోని బానవాసి చారిత్రకప్రాధాన్యం కలిగిన పురాతన గ్రామం. కదంబ రాజవంశానికి తొలి రాజధానిగా నిలిచిన ఈప్రాంతం రెండు వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది.పరిశుభ్రతకు మాలినోంగ్, పర్యావరణ పరిరక్షణకు ఖోనోమా, హిమాలయ సౌందర్యానికి చిట్కుల్, ప్రకృతి ప్రశాంతతకు లంబసింగి, చారిత్రక వైభవానికి బానవాసి ప్రతీకలుగా నిలుస్తాయి. భారతదేశం ఎంత వైవిధ్యభరితమైనదో ఈ గ్రామాలు మరోసారి మనకు గుర్తు చేస్తాయి. ఒకసారి వీటిని సందర్శిస్తే జీవితాంతం గుర్తుండి΄ోయే అనుభవాలను సొంతం చేసుకోవచ్చు. -
ఇదొక సముద్రపు వాక్యూమ్ క్లీనర్!
సముద్రంలో నివసించే ఈ జీవిపేరు వాంపైర్. అంటే రక్తం తాగే దెయ్యం అని అర్థం. దీని పేరు వినడానికి కాస్త భయంగా ఉన్నా, ఇది చాలా చిన్నది, సాధుజీవి.ఈ స్క్విడ్ చూడటానికి ఎరుపు రంగులో, దాని చేతుల మధ్య ఉండే చర్మం నల్లటి ముసుగులా ఉండటం వల్ల దీనికి ఆ పేరు పెట్టారు. ఇది సముద్రంలో చాలా లోతుగా, సూర్యరశ్మి అస్సలు పడని చీకటి ప్రదేశంలో బతుకుతుంది. అక్కడ శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇది తన శరీరం నుంచి నీలి రంగు వెలుతురును విడుదల చేస్తుంది.ఆ వెలుతురు చూసి వేరే పెద్ద చేపలు భయపడి ΄ారి΄ోతాయి. మిగతా స్క్విడ్లు చిన్న చిన్న చేపలను వేటాడి తింటాయి. కానీ మన వాంపైర్ స్క్విడ్ మాత్రం వేటాడదు. సముద్రం పైభాగం నుంచి కిందికి కొట్టుకు΄ోయే చని΄ోయిన చిన్న జీవుల ముక్కలు, మురికి వంటి వాటిని తింటుంది. అంటే ఇది సముద్రాన్ని శుభ్రం చేసే వాక్యూమ్ క్లీనర్ అన్నమాట! నిర్వహణ : రమాదేవి జంబుల -
పుట్టినపుడు పెన్సిల్ పరిమాణంలోనే!
జైంట్ పాండాలను సాధారణంగా పాండాలు అని కూడా పిలుస్తారు. ఇవి అడవులలో, ముఖ్యంగా మధ్య చైనాలోని ఎత్తైన పర్వతాలలో ఉండే దట్టమైన వెదురు అడవులలో కనిపిస్తాయి.పాండాలు అప్పుడప్పుడు చిన్న జంతువులను, చేపలను తిన్నప్పటికీ... ముఖ్యంగా వీటి ఆహారంలో 99 శాతం వెదురు మాత్రమే ఉంటుంది.పాండాలు చాలా ఎక్కువగా తింటాయి. ఎంతగా అంటే ప్రతిరోజూ దాదాపు 12 గంటల ΄ాటు తమ పొట్టలను నింపుకుంటూ, సుమారు 12 కిలోల వెదురును తింటాయి!పాండాలు 1.2 మీటర్ల నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇవి 75 కేజీల నుంచి 135 కేజీల బరువు ఉంటాయి.పాండా పిల్లలు పుట్టినప్పుడు గులాబీ రంగులో ఉండి కేవలం 15 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి. అంటే దాదాపు ఒక పెన్సిల్ పరిమాణంలో ఉంటాయి! ఇవి పుట్టినప్పుడు గుడ్డిగా ఉంటాయి, పుట్టిన ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాతే కళ్ళు తెరుస్తాయి. -
ఇవి.. కాళ్లతో రుచి చూస్తాయి!
పిల్లలూ! మనం రుచి ఎలా చూస్తాం? నాలుకతో కదా.. కానీ సీతాకోకచిలుకలు వాటి కాళ్ళతో రుచి చూస్తాయి! అవును, మీరు విన్నది నిజమే. సీతాకోకచిలుకల కాళ్ళ చివరన చిన్న చిన్న సెన్సార్లు (రుచిని కనిపెట్టే భాగాలు) ఉంటాయి.మన నాలుక మీద టేస్ట్ బడ్స్ ఎలా ఉంటాయో, వాటి కాళ్ళకు అలా ఉంటాయన్నమాట. ఒక సీతాకోకచిలుక ఏదైనా ఆకు మీద గానీ, పువ్వు మీద గానీ వాలినప్పుడు... అది తినడానికి మంచిదా కాదా అనేది దాని కాళ్ళ ద్వారా వెంటనే తెలిసి΄ోతుంది. అలాగే సీతాకోక చిలుకకు మనలాగా నోరుకూడా ఉండదు. దానికి బదులు ఒక స్ట్రా లాంటి పొడవైన గొట్టం ఉంటుంది. కాళ్ళతో రుచి చూసి నచ్చిన తర్వాత, ఆ స్ట్రా ద్వారా పువ్వుల్లోని తేనెను తాగేస్తాయి. -
మన కన్ను దాదాపు 576 మెగాపిక్సెల్స్ కెమెరాతో సమానం!
హాయ్ ఫ్రెండ్స్! మన శరీరంలో అన్నిటికన్నా సంక్లిష్టమైన అవయవం ఏది అంటే మెదడు అని చెప్తాం. అయితే, మన మెదడు తర్వాత అంతకంటే ఎక్కువ భాగాలు కలిగిన, అత్యంత కాంప్లికేటెడ్ ఆర్గాన్ మన కన్ను! మనం వాడే ఫోన్ కెమెరాలు 50 లేదా 108 మెగాపిక్సెల్స్ ఉంటాయి.కానీ, సైన్స్ ప్రకారం మన కన్ను దాదాపు 576 మెగాపిక్సెల్స్ కెమెరాతో సమానం! అందుకే మనం ప్రపంచాన్ని ఇంత అందంగా, స్పష్టంగా చూడగలుగుతున్నాం. నిజానికి మన కళ్ళు ఈ ప్రపంచాన్ని తలకిందులుగా చూపిస్తాయి! కానీ, మన సూపర్ బ్రెయిన్ క్షణాల్లో ఆ బొమ్మను మామూలుగా మార్చి మనకు చూపిస్తుంది. అలాగే మన కళ్ళు సుమారు పది మిలియన్ల వేర్వేరు రంగుల మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను కూడా చాలా సులభంగా గుర్తుపట్టగలవు!ఇవి చదవండి: శరీరం 10 శాతం కాలితే ఐసీయూ కాపాడలేదా? -
ఈ జీవుల నిద్రపోయే విధానమే వేరు! ఎందుకంటే?
మనం కాసేపు కూర్చుని నిద్రపోతేనే మన శరీరం నిలకడగా ఉండదు. అటూ ఇటూ వంగిపోతూనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు నేలపై వీపు వాల్చాలా అని అనుకుంటాం. అలాంటిది ఈ జీవులు, అలాగే అవి నిద్రపోయే తీరును చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!సహజంగా పక్షులు ఎక్కడ నివసిస్తాయి. చెట్లపై గూళ్లు కట్టుకుని కదా.. కానీ ఈ స్విఫ్ట్ పక్షులు మాత్రం తమ జీవితంలో ఎక్కువ భాగం ఆకాశంలో ఎగురుతూనే గడుపుతాయి. మీరు విన్నది నిజమే. ఇవి కేవలం గుడ్లు పెట్టడానికి, పిల్లల్ని చూసుకోవడానికి మాత్రమే భూమిపైకి లేదా గూళ్ళలోకి వస్తాయి.ఈ పక్షులు ఆకాశంలో ఎగురుతూనే నిద్రపోగలవు. తమ రెక్కలను ఆటో–పైలట్ మోడ్‌లో పెట్టి చిన్న చిన్న కునుకులు తీస్తాయి. ఇవి నేల మీద వాలి ఆహారాన్ని వెతకవు. ఆకాశంలో ఎగురుతున్నప్పుడే తమ నోటిని పెద్దగా తెరిచి, గాల్లో ఉండే చిన్న చిన్న దోమలు, ఈగలు, పురుగులను పట్టుకుని తినేస్తాయి. దాహం వేస్తే ఇవి చెరువులు లేదా నదుల పైభాగంలో చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ, నీటిని నోటితో తాకుతూ ఎగురుతూనే తాగేస్తాయి.చుక్క నీరు తాగడానికి కూడా ఇవి కింద వాలవు. ఈ పక్షుల కాళ్ళు చాలా చిన్నగా, బలహీనంగా ఉంటాయి. అందుకే ఇవి నేల మీద అస్సలు నడవలేవు. ఇవి దాదాపు 10 నెలల పాటు అసలు నేల మీద కాలే పెట్టకుండా నిరంతరాయంగా ఆకాశంలోనే ఎగరగలవు! భలే విచిత్రమైన పక్షి కదా!నిల్చునే నిద్రిస్తాయి!మీరెపుడైనా గమనించారా? గుర్రాలు ఎప్పుడూ నిల్చునే నిద్రపోతుంటాయి. మరి అవి అలా ఎందుకుచేస్తాయో తెలుసా? పూర్వకాలంలో గుర్రాలు అడవుల్లో పెరిగేవి. అడవిలో సింహాలు, పులులు వంటి జంతువులు గుర్రాలపై దాడి చేయడానికి చూసేవి. ఒకవేళ గుర్రం కింద పడుకుని నిద్రపోతే, ఏదైనా జంతువు దాడి చేసినప్పుడు అది వెంటనే లేచి పరుగెత్తడం కష్టం అవుతుంది. అదే నిలబడి ఉంటే, శత్రువు రాగానే టపటపా మంటూ వేగంగా పరుగెత్తి తప్పించుకోవచ్చు! అందుకే అవి నిలబడే నిద్రపోవడం అలవాటు చేసుకున్నాయి.మరి వాటి కాళ్లు నొప్పులు పుట్టవా? అంటే... గుర్రాల కాళ్ళల్లో ‘స్టే అపారేటస్’ అనే ఒక స్పెషల్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఒక మ్యాజిక్ లాంటిది. గుర్రం నిద్రపోయేటప్పుడు దాని కాళ్ళల్లోని కండరాలు, కీళ్ళు లాక్ అయిపోతాయి. దీనివల్ల గుర్రం ఎటువంటి కష్టం లేకుండా, కింద పడిపోకుండా హాయిగా నిలబడి నిద్రపోగలదు. గుర్రాలకి గాఢ నిద్ర కావాలన్నప్పుడు, అవి సురక్షితంగా ఉన్నాయని నమ్మినప్పుడు మాత్రమే కింద పడుకుని నిద్రపోతాయి.మీకు తెలుసా!ప్లాటిపస్ పాలిచ్చే జంతువు. అయినప్పటికీ, పిల్లలకి జన్మనివ్వకుండా గుడ్లు పెడుతుంది.కాపుచిన్ వంటి కోతులు గింజల పెంకులను పగలగొట్టడానికి రాళ్ళను పరికరాలుగా ఉపయోగిస్తాయి.జెయింట్ పాండాలు రోజులో దాదాపు 12 గంటల సమయాన్ని కేవలం వెదురు తినడానికే కేటాయిస్తాయి.మీర్‌క్యాట్స్ గుంపులో కొన్ని ఆహారం వెతుక్కుంటున్నప్పుడు, క్రూర జంతువుల నుంచి రక్షణ కోసం ఒక మీర్‌క్యాట్ కాపలాదారుగా నిలబడి గమనిస్తూ ఉంటుంది. - నిర్వహణ: రమా జంబుల -
ఐదువేల ఏళ్ల నాటి 'మమ్మీ'లో సజీవంగా పేగు బ్యాక్టీరియా..!
నిజంగా జీవంలేని ఏ ప్రాణిలోని కణాలు గానీ సూక్ష్మజీవులు గానీ బతికే ఛాన్స్ ఉండదు. అది కూడా వేల ఏళ్ల నాటి మమ్మీ లాంటి వాటిల్లో కూడా ఉండవనేది జగమెరిగిన సత్యం. ఒక జీవిలో ప్రాణం లేకపోతే..అచైతన్యంగా..నిర్జీవంగా అయిపోతుంది లేదా కొన్ని రోజులకి విచ్ఛిన్నమైపోతుంది. అలాంటిది వేల ఏళ్ల నాటి మమ్మీ అది కూడా గడ్డకట్టిన చలిలో ఉన్న మృతదేహంలో సజీవంగా పేగు బ్యాక్టీరియా ఉండటాన్ని చూసి విస్తుపోయారు శాస్త్రవేత్తలుఇటాలియన్ ఆల్ప్స్ పర్వతాల్లో ఓట్జీ ది ఐస్‌మ్యాన్ బాణం దెబ్బకు గురై చనిపోయాడు. కానీ అతని శరీరం గట్ బ్యాక్టీరియాతో కళకళలాడుతుండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలు. ఇది అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణ. ఇక్కడ చరిత్ర పూర్వపు ప్రేగు బ్యాక్టీరియా చలికి ఇంకా బతికే ఉండటం అనేది విశేషం. ఆ చలి వాతావరణానికి అనుగుణంగా ఈస్ట్ జాతులు జీవక్రియపరంగా చురుకుగా ఉన్నాయని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ పురాతన సూక్ష్మజీవులు తమ కళ్లముందే చురుకుగా తమను తాము మార్చుకుంటూ పరిణామం చెందుతున్నాయని చెబుతున్నారు. వీటిని మమ్మీ చర్మం, అంతర్గత కణజాలాలు, కరిగిన మంచు నీటిని విశ్లేషించడం ద్వారా ఈ రహస్య పూర్వ జీవావరణ వ్యవస్థను గుర్తించినట్లు తెలిపారు. ఒక రకంగా ఈ పరిశోధన మన గతాన్ని తెలిపే అద్భుతమైన ఆవిష్కరణగా పేర్కొన్నారు. అంతేగాదు చనిపోయిన ఆ వ్యక్తి ఓట్జీ చివరి భోజనమైన అధిక కొవ్వు అడవి మాంసం, పురాతన ధాన్యాలతో అతని పేగులోని క్రియాశీల బ్యాక్టీరియా కచ్చితంగా సరిపోలిందన్నారు. ఆ వ్యక్తిలో రోంబౌట్సియా హోమినిస్, క్లోస్ట్రిడియం మోనిలిఫార్మ్ వంటి అరుదైన గట్ బ్యాక్టీరియాను గుర్తించినట్లు తెలిపారు. ఇది ఆధునిక మానువుల్లో దాదాపు కనుమరుగైందన్నారు. కానీ ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని గిరిజన సముహాల్లో ఇలాంటి పేగు బ్యాక్టీరియా ఉందన్నారు. ఇవి శరీరాన్ని రక్షించేలా హానికరమైన క్రిమిసంహారకాలను తింటూ..మనుగడ సాగిస్తాయన్నారు.(చదవండి: చింతగింజలతో మైక్రో ప్లాస్టిక్‌కి చెక్..!) -
ఈ జీవుల గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!
పిల్లలూ! సాధారణంగా జీవులన్నింటికీ కళ్ళు, చెవులు, గుండె, రక్తం వంటివి ఉంటాయని మనకు తెలుసు. కానీ, వీటికి భిన్నంగా ఉండే కొన్ని జీవుల గురించి తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే!నోరు ఉంటే పళ్ళు ఉండటం సహజం, కానీ తాబేలుకు పళ్ళు అస్సలు ఉండవు.మనల్ని ఎంతగానో భయపెట్టే పాములకు బాహ్య చెవులు ఉండవు.రైతు బంధువుగా పేరొందిన వానపాముకు కళ్ళు ఉండవు.రోజంతా కష్టపడే చీమలకు నోటిలో నాలుక ఉండదు.సాధారణంగా రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, కానీ మన ఇళ్లలో తిరిగే బొద్దింకలకు తెల్లటి రక్తం ఉంటుంది.సముద్ర గర్భంలో ఉండే అక్టోపస్ శరీరంలో ఒక్క ఎముక కూడా ఉండదు.సముద్రంలో కనిపించే అందమైన జెల్లీఫిష్‌లకు అటు తల గానీ, ఇటు గుండె గానీ ఉండవు.అత్యధికంగా 32 మెదళ్లు (మెదడు లాంటి నరాల కణాల కేంద్రాలు) ఉండే జీవి ‘జెలగ’. -
ఈ నాలుగింటి మధ్య తేడా ఏంటో మీకు తెలుసా..!
మన నిత్య జీవితంలో తరచుగా వాడే కొన్ని పదాల మధ్య అసలు తేడా చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో హోటల్, మోటెల్, రెస్టారెంట్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన రిసార్ట్ పదాలు ఉన్నాయి. ఈ నాలుగు ప్రదేశాలు దాదాపు ఒకే విధంగా అనిపించినా, వాటి సేవలు, ఉద్దేశం, స్థానాల విషయంలో స్పష్టమైన వ్యత్యాసం ఉంది. వీటిని ఒకే విధంగా వాడటం వల్ల కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి, ఈ రోజు ఈ నాలుగు పదాల మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.హోటల్ అంటే..హోటల్ అనేది చాలా మందికి బాగా తెలిసిన, తరచుగా ఉపయోగించే ఒక వసతి కేంద్రం. ప్రయాణ సమయంలో బస చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వసతి పొందే ప్రదేశం. హోటల్స్‌లో సాధారణంగా భోజనం (రెస్టారెంట్), టీవీ, వైఫై వంటి అదనపు సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. హోటళ్లు పట్టణాల మధ్యలో లేదా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో నిర్మించి ఉంటాయి.మోటెల్ అంటే..మోటెల్స్ అనేవి హోటల్స్‌కు భిన్నంగా, చాలా ప్రత్యేకమైన ఉద్దేశంతో నిర్మించబడ్డాయి. మోటెల్ అంటే కారు డ్రైవ్ చేస్తూ సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి, ఆగి వెళ్లడానికి వీలుగా ఉండే ప్రదేశం. ఇవి ప్రధానంగా సుదూర హైవేల వెంబడి నిర్మించబడి ఉంటాయి. ముఖ్యంగా అమెరికా, కెనడా వంటి దేశాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.మోటెల్స్‌లో సాధారణంగా రాత్రి బస చేయడానికి గది దొరుకుతుంది, ఉచిత పార్కింగ్ తప్పనిసరి ఉంటుంది. అయితే, రెస్టారెంట్ లేదా పూర్తి భోజన సౌకర్యం ఉండకపోవచ్చు. కొన్ని మోటెల్స్‌లో కేవలం కేఫ్ సౌకర్యం మాత్రమే ఉంటుంది.రెస్టారెంట్..హోటల్, మోటెల్తో పోలిస్తే రెస్టారెంట్ ఉద్దేశం పూర్తిగా భిన్నమైనది. రెస్టారెంట్ అనేది వసతి సౌకర్యం లేకుండా, కేవలం తినే సదుపాయం మాత్రమే ఉన్న ప్రదేశం. ఇక్కడ వివిధ రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. చాలా పెద్ద హోటళ్లు తమ అతిథుల కోసం తమ సొంత రెస్టారెంట్లను కలిగి ఉంటాయి. కానీ, రెస్టారెంట్లలో రాత్రి బస చేసే సదుపాయం ఉండదు.రిసార్ట్ అంటే... రిసార్ట్ అనేది హోటల్ కంటే చాలా విస్తృతమైన సౌకర్యాలు, అనుభవాన్ని అందిస్తుంది. రిసార్ట్లు సాధారణంగా హోటళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఇవి కేవలం బస కోసమే కాకుండా, కుటుంబం లేదా స్నేహితులతో విశ్రాంతి తీసుకోవడానికి, వినోదం పొందడానికి ఉద్దేశించబడ్డాయి.రిసార్ట్‌లో వసతి, భోజనాలతో పాటు అదనపు వినోద సౌకర్యాలు ఉంటాయి. ఉదాహరణకు, స్విమ్మింగ్ పూల్, గేమ్ జోన్, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్పా, ఇతర ఆటల సౌకర్యాలు ఉంటాయి. హైదరాబాద్‌తో సహా అనేక పర్యాటకప్రాంతాలలో ఈ రిసార్ట్‌ల సంఖ్య పెరుగుతోంది. -
హిమాలయాల ఒడిలో సాగే చార్ధామ్ యాత్ర!
హిమాలయ శిఖరాల నుంచి జారే మంచు బిందువులను చూస్తూ గంటానాదాల మధ్య పరవశించి పోయే దివ్యక్షేత్రాల ప్రయాణమే ఉత్తరాఖండ్ గర్వాల్ పర్వతాల మధ్య సాగే చార్ ధామ్ యాత్ర. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదిరీనాథ్.. ఈ నాలుగు క్షేత్రాలను కలుపుతూ చేసే యాత్ర చార్ధామ్.ప్రతి మనిషి తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలి అనుకునే ఈ నాలుగు పవిత్ర స్థలాల దర్శనం కేవలం తీర్థయాత్ర మాత్రమే కాదు. అది ఒక ఆధ్యాత్మిక సంచారం. ప్రశాంతంగా సాగే ఈ యాత్ర మనసులోని అలజడి మొత్తాన్ని దూరం చేసి కొత్త ప్రశాంతతను చోటు ఇస్తుంది.చల్లని గాలులు మేనిని తాకుతుండగా, మబ్బుల మధ్య నుంచి కనిపించే పర్వతాల అందాలు చూస్తుంటే ప్రకృతి తన సహజ అందాలను చూపుతున్నట్టుగా ఉంటుంది.హిమాలయాల ఒడిలో సాగే చార్ధామ్ యాత్ర ఆధునిక ప్రపంచ అలజడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోతుంది. మొదటి ఘట్టం యమునోత్రి దగ్గర మట్టి వాసనలతో మొదలై మనసుకు హాయిని ఇస్తుంది. తరువాత గంగోత్రి క్షేత్రానికి వెళ్లే దారి ΄÷డవునా ఉన్న చెట్ల వరుసలు, భగీరథి నది జోరుగా సాగే ప్రవాహం చూస్తుంటే ప్రకృతి తన అసలు స్వరూపాన్ని చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.కేదార్నాథ్ చేరగానే చుట్టూ ఉన్న మంచు పర్వతాల మధ్య గుడి గోపురం వెనుక కనిపించే శిఖరాలు భక్తి భావంతో పాటు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. చివరగా అలకనంద నది ఒడ్డున ఉన్న బద్రినాథ్ క్షేత్రాన్ని చూస్తుంటే యాత్రకు ఒక పరిపూర్ణత వచ్చినట్టుగా అనిపిస్తుంది. క్షేత్రాల చుట్టూ ఉండే చిన్న చిన్న గ్రామాలు, పర్వతాల అందాలు ఈ ఆధ్యాత్మిక యాత్రకు మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయి.చేయాల్సిన పనులు..జానకి చట్టి నుంచి యమునోత్రి వరకు ట్రెక్కింగ్ చేస్తూ ప్రకృతితో చేసే మౌన సంభాషణను ఆస్వాదించవచ్చు.గంగోత్రిలో భగీరథి నది నీటిని స్పర్శించి ఆ పవిత్రతను అనుభవించవచ్చు.గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకు సాగే ప్రయాణంలో తోటి యాత్రికుల భక్తి స్వరాలు వింటూ ట్రెక్కింగ్ లేదా గుర్రంపై ప్రయాణించవచ్చు.బద్రినాథ్ దర్శనం తరువాత తప్త కుండ్‌లో స్నానం చేసి ఆ వేడి నీటి హాయినీ ఆస్వాదించవచ్చు.మానా గ్రామంలో తిరుగుతూ అక్కడి స్థానిక స్థల పురాణాలను తెలుసుకోవచ్చు.ఆసక్తికరమైన విషయాలు..ట్రెడిషన్ ప్రకారం చార్ ధామ్ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభమై గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్‌తో ముగుస్తుంది.ఈ యాత్ర ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నుంచి అక్టోబర్ వరకు ఓపెన్ ఉంటుంది.కేదార్నాథ్ చేరడానికి గౌరీకుండ్ నుంచి సుమారు 16 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.మానా గ్రామం భారతదేశంలోని చివరి గ్రామంగా ప్రసిద్ధి చెందింది.యాత్రకు ముందు ఉత్తరాఖండ్ పోర్టల్‌లో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి.ఎక్కడ ఉండాలి?యాత్ర సాగే ప్రతి చోట హోటల్స్, ధర్మశాలల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ గెస్ట్ హౌస్‌లు కానీ, కొండ అంచున ఉన్న చిన్న కాటేజీలు కానీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. హడావిడి లేని వాతావరణం, ఎటు చూసినా కనిపించే పర్వతాల దృశ్యాలు, ఉదయాన్నే వీచే చల్లని గాలిని ఆస్వాదిస్తూ పర్వతాల మధ్య కూర్చోవడం ఒక మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. పెద్ద పెద్ద విలాసాలు లేకపోయినా ఇక్కడ ప్రతి లాడ్జిలో దొరికే అతిథ్యం, చుట్టూ ఉన్న ప్రకృతి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. కొండ గాలిలో కలిసిన ఆ మౌనాన్ని ఆస్వాదించడం చార్ ధామ్ యాత్ర ప్రత్యేకత.ఏం చూడాలి?పర్వతాల వెనుక నుంచి మెల్లిగా ఉదయించే సూర్యుడు, సాయంత్రం వేళ నదుల దగ్గర జరిగే హారతి దృశ్యాలు తప్పకుండా చూడాలి. కేదార్నాథ్ దగ్గర మందాకిని నది ప్రవాహం మధ్య నిలబడితే ప్రకృతితో కలిసి ఒక పాట పాడుతున్నట్టుగా అనిపిస్తుంది. బద్రినాథ్‌లోని తప్త్ కుండ్‌లో వేడి నీటి స్నానం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా హాయిని ఇస్తుంది.భారతదేశంలోని చివరి గ్రామంగా పిలువబడే మానా గ్రామంలో నడుస్తుంటే ఒక కొత్త ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. గంగా, యమునా నదుల ఉద్భవ స్థలాలను చూస్తుంటే మనసులోని ఆలోచనలు కూడా ప్రశాంతంగా మారిపోతాయి. రాత్రివేళ మంచు కప్పిన పర్వతాల మధ్య చుక్కలతో నిండిన ఆకాశం అద్భుతమైన విజువల్ ట్రీట్‌లా కనిపిస్తుంది.ఎలా వెళ్లాలి?ఈ పవిత్ర యాత్రను హైదరాబాద్ నుంచి ప్రారంభించాలంటే ముందుగా దెహ్రాడూన్ లేదా ఢిల్లీకి ఫ్లైట్ లేదా ట్రైన్ ద్వారా చేరుకుని అక్కడి నుంచి హరిద్వార్ వైపు ప్రయాణం సాగించాలి. విజయవాడ నుంచి వచ్చిన వారికి కూడా ఢిల్లీ కనెక్టివిటీ సులభంగా లభిస్తుంది.హరిద్వార్ నుంచి పర్వత దారుల్లో బస్ లేదా ట్యాక్సీలో సాగే ప్రయాణంలో ఒకవైపు లోయలు, మరోవైపు ఆకాశాన్ని తాకే కొండలు కనిపిస్తాయి. కొండలపై మబ్బుల తెరలు దాటుకుంటూ, చల్లని గాలుల స్పర్శను ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోతుంది.ఏం తినాలి?ఈ కొండప్రాంతాల్లో దొరికే వేడి వేడి ఆలూ పరాటా, పహాడి దాల్ చావల్‌తో పాటు గరం చాయ్ ప్రయాణంలో మరో అందమైన భాగంగా అనిపిస్తాయి. లోకల్‌గా తయారు చేసే జొన్న రొట్టెతో పాటు పహాడి కర్రీ రుచి మరిచిపోలేనిదిగా ఉంటుంది. ప్రతి గుడి దగ్గర దొరికే ప్రసాదంలో ప్రత్యేకమైన రుచిని ఆస్వాదించవచ్చు. చల్లని వాతావరణంలో వేడి వేడి జిలేబీ తినడం, స్వచ్ఛమైన కొండ నీటితో తయారైన వంటలను ఆస్వాదించడం ఈ యాత్రను మరింత మధురంగా మారుస్తాయి.యాత్ర బడ్జెట్ వివరాలు..చార్ధామ్ యాత్ర మొత్తంగా పూర్తి చేయడానికి సాధారణంగా 10 నుంచి 12 రోజుల సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి దెహ్రాడూన్ వరకు ఫ్లైట్ లేదా ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు.స్టాండర్డ్ గ్రూప్ ప్యాకేజీల ప్రకారం ఒక్కరికి సుమారు రూ.25 వేల నుంచి రూ.45 వేల మధ్య బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ క్యాబ్ లేదా ప్రీమియం ప్యాకేజీలు తీసుకుంటే ఈ ఖర్చు రూ.55 వేల నుంచి రూ.75 వేల వరకు పెరగవచ్చు.స్టే కోసం ప్రతి రాత్రి రూ.1000 నుంచి రూ.3500 మధ్య మంచి రూమ్స్ లభిస్తాయి. ఫుడ్ కోసం ప్రతి రోజు రూ.400 నుంచి రూ.600 మధ్య వెజిటేరియన్ ఫుడ్ లభిస్తుంది.హెలికాప్టర్ సర్వీస్ ఉపయోగించాలనుకుంటే ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సీజన్ సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుగమనిక : ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. ప్రయాణానికి ముందు తాజా అప్డేట్స్ వెరిఫై చేసుకుని యాత్రను ప్లాన్ చేసుకోవడం మంచిది. -
ఈ ఐదు దేశాల్లో అసలు నదులే లేవు..
నది ఉన్న చోటే నాగరికత వెలుస్తుంది. నది లేని చోట ఉండరాదు అని ఆచార్య చాణిక్యుడు కూడా చెప్పాడు. నదుల వల్ల నీటి లభ్యతే కాదు, రవాణా సౌకర్యం, వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు కూడా అందుతుంది. అయితే ప్రపంచంలో కొన్ని దేశాల్లో అసలు నదులే లేవు. అందులో ‘ఐదు’ దేశాల గురించి తెలుసుకుందాం.1. సౌదీ అరేబియాఅరేబియా ద్వీపకల్పంలోని అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ఈ దేశంలో ఒక్క నదీ లేదు. కానీ ఆధునిక డిసాలినేషన్ సాంకేతికత సాయంతో భూగర్భంలో ఉన్న నీటిని వినియోగించుకుంటుంది ఈ దేశం.2. బహ్రెయిన్ఈ చిన్న ఐలాండ్ దేశంలో నది లేదు . అందుకే తాగునీటి అవసరాల కోసం భూగర్భ జలాలపై, అడ్వాన్స్ డిసాలిటేషన్ టెక్నాలజీపై ఆధారపడతారు.3. కువైట్తన పొరుగు దేశాల్లాగే కువైట్ కూడా నదీజలాలపై ఆధారపకుండా నాగరికతను ముందుకు తీసుకెళ్తోంది. ఇక్కడ ప్రధానంగా డిసాలినేషన్ ప్లాంట్స్ వల్లే నీరు అందుతుంది. దీంతో పాటు వర్షాకాలలో ఎండిపోయిన నదుల్లో చేరిన నీటిని కూడా వినియోగించుకుంటారు.4.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్యూఏఈలో నదులు లేకపోయినా అది తన ప్రజల అవసరాల కోసం నీటిని అందించేందుకు ఆధునిక సాంకేతిక సాయం తీసుకుంటోంది. ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టుకోవడం వంటి విధానాలతో పాటు, అత్యాధునిక డిసాలినేషన్ సాంకేతికత వల్ల ప్రజల దాహాన్ని తీర్చగలుగుతోంది.5. ఖతార్ఖతార్లో మంచి నీటిని మొత్తం డిసాలినేషన్ ప్రాసెస్‌లో సేకరించడంతో పాటు దిగుమతి చేసుకుంటారు. దీన్ని బట్టి ఆ దేశంలో నీరు ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవచ్చు. చుక్క చుక్కను ఒడిసిపట్టుకుని జాగ్రత్తగా వాడుతారు.డిసాలినేషన్ అంటే..డిసాలినేషన్ అంటే సముద్రపు నీరు లేదా ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీటిలోని ఉప్పు, ఇతర మలినాలను తొలగించడం. ఈప్రాసెస్ పూర్తి చేసి ఈ నీటిని ప్రజల అవసరాలకు అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ నీటిని తాగడానికి, సాగుకోసం, పరిశ్రమల కోసం వినియోగిస్తారు. -
అది పామో లేక చెట్టు కొమ్మో..
గ్రీన్ వైన్ స్నేక్ (పసిరిక పాము) గా పిలిచే ఈ పాము రంగు అచ్చం పచ్చటి ఆకులా ఉంటుంది. ఇది చెట్ల కొమ్మల మధ్య ఉన్నప్పుడు, అది పామో లేక చెట్టు కొమ్మో కనిపెట్టడం చాలా కష్టం!శత్రువుల నుంచి తప్పించుకోవడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి ఈ రంగు దీనికి బాగా సహాయపడుతుంది. చాలా పాములకు చూపు అంతగా తెలియదు, కానీ పసిరిక పాములకు చూపు చాలా ఎక్కువ. వీటి కంటి పాపలు అడ్డంగా, తాళం రంధ్రం ఆకారంలో ఉంటాయి. దీనివల్ల ఇవి దూరంగా ఉన్న వస్తువులను కూడా చాలా స్పష్టంగా చూడగలవు. చాలా సన్నగా, బరువు తక్కువగా ఉండటం వల్ల ఇది ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మపైకి వేగంగా, సులువుగా వెళ్తుంది. పసిరిక పాములకు కొద్దిగా విషం ఉంటుంది, కానీ అది కేవలం అవి తినే చిన్న చిన్న బల్లులు, కప్పలను పట్టుకోవడానికే సరిపోతుంది. -
ధ్రువపు ఎలుగుబంటి వింతలెన్నో!
ఉత్తర ధ్రువం అంటే మంచు, మంచు, ఇంకా మంచు. అక్కడ మనం రెండు నిమిషాల్లో గడ్డకట్టేస్తాం. కానీ అక్కడ ఒక రాజు హాయిగా తిరుగుతుంటాడు. పేరు ‘ధ్రువపు ఎలుగుబంటి’. ఇంగ్లీష్‌లో ‘పోలార్ బేర్’ అంటారు. ఇది మామూలు ఎలుగుబంటి కాదు. దీని దగ్గర చాలా వింతలు ఉన్నాయి.వింత 1: తెల్లగా లేదు!అదేంటి, తెల్లగా కదా కనిపిస్తుంది అంటారా? దాని బొచ్చు అసలు తెల్లగా ఉండదు. గాజు పీచులా పారదర్శకంగా (్టట్చnటp్చట్ఛn్ట) ఉంటుంది. సూర్యుడి కాంతి దాని మీద పడి మనకు తెల్లగా కనిపిస్తుంది. దాని చర్మం మాత్రం నల్లగా ఉంటుంది. ఆ నలుపు ఎండను పీల్చుకుని శరీరాన్ని వేడిగా ఉంచుతుంది.వింత 2 వాసన రాడార్!ధ్రువపు ఎలుగుబంటి ముక్కు సూపర్ పవర్. 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీల్ వాసనను కూడా పసిగట్టేస్తుంది. అంటే హైదరాబాద్‌లో ఉండి సికింద్రాబాద్‌లో బిర్యానీ వాసన చూసినట్టు.వింత 3 స్విమ్మింగ్ ఛాంపియన్దీనికి నీళ్లంటే భయం లేదు. ఆగకుండా 100 కిలోమీటర్లు ఈదుతుంది. దాని కాళ్లు తెడ్డుల్లా పెద్దగా ఉంటాయి. మంచు నీళ్లలో గంటల తరబడి చేపల్లా ఈదేస్తుంది.వింత 4 హీటర్ బాడీదీని ఒంటి మీద 11 సెంటీమీటర్ల మందం కొవ్వు ఉంటుంది. అది ఒక పెద్ద బ్లాంకెట్ లాంటిది. బయట మైనస్ 40 డిగ్రీలు ఉన్నా, దీని బాడీ మాత్రం వెచ్చగా ఉంటుంది. కానీ పాపం, ఇప్పుడు దీనికి కష్టం వచ్చింది. భూమి వేడెక్కిపోతుంటే అక్కడ మంచు కరిగిపోతోంది. మంచు లేకపోతే అది సీల్స్‌ని వేటాడలేదు. ఆకలితో బాధపడుతోంది. మనం కరెంట్, పెట్రోల్ వృధా చెయ్యకుంటే ఈ తెల్ల రాజు హాయిగా బతుకుతాడు. -
కొన్ని పూలకే వాసనెందుకు?
మల్లెపూలు గుప్పుమంటాయి. గులాబీలు ఘుమఘుమలాడతాయి. కానీ మందారం, పొద్దుతిరుగుడు పూలకు వాసన ఉండదు. ఎందుకో తెలుసా? పూలు ఊరికే వానసనను వెదజల్లవు. తమ వంశం పెరగాలి కదా! అందుకే వాసనను ’పెర్ఫ్యూమ్’లా వాడతాయి.పువ్వు లోపల సూక్ష్మమైన ‘సుగంధ తైలాలు’ ఉంటాయి. ఎండ వేడికి అవి ఆవిరై గాలిలోకి వస్తాయి. ఆ వాసనకు సీతాకోకచిలుకలు, తేనెటీగలు ‘అబ్బా, తేనె ఉంది‘ అని ఎగిరి వస్తాయి. అవి తేనె తాగుతూ ఒక పువ్వు పుప్పొడిని ఇంకో పువ్వుకు అంటిస్తాయి. దాన్నే ‘పరాగ సంపర్కం’ అంటారు. దానివల్లే కాయలు, విత్తనాలు వస్తాయి.మరి మందారానికి వాసన ఎందుకు లేదు? దాని రంగే పెద్ద సిగ్నల్ బోర్డు. ఎర్రగా, పెద్దగా ఉంటుంది కదా. పక్షులు, సీతాకోకచిలుకలు దూరం నుంచే చూసి వాలిపోతాయి. వాటికి ముక్కు కంటే కన్నే గట్టిది. అందుకే వాసన అవసరం లేదు. పొద్దుతిరుగుడు కూడా అంతే. కొన్ని పూలు రాత్రిపూట మాత్రమే వాసన వస్తాయి. బ్రహ్మకమలం, రాత్రిరాణి లాంటివి. ఎందుకంటే వాటికి పరాగ సంపర్కం చేసేది రాత్రి తిరిగే మాత్‌లు, గబ్బిలాలు. చీకట్లో రంగు కనిపించదు కాబట్టి, వాసనే వాటి అడ్రస్. అంటే వాసన ఉండడం పువ్వు తెలివి. ఎవరిని పిలవాలో దానిని బట్టి పెర్ఫ్యూమ్ కొట్టుకుంటుంది. ప్రపంచంలో అతి పెద్ద పువ్వు ‘రాఫ్లేసియా’. దానికి వాసన ఉంటుంది కానీ... కుళ్లిన మాంసం వాసన! ఎందుకంటే దానికి కావాల్సింది సీతాకోకచిలుక కాదు, ఈగలు. -
స్కూల్ బ్యాగ్ ఎప్పుడు మొదలైంది?
పిల్లలూ... మీరు రోజూ వీపు మీద వేసుకునే స్కూల్ బ్యాగ్‌కి పెద్ద చరిత్రే ఉంది. ఒకప్పుడు పిల్లలు పుస్తకాలు చేతిలో పట్టుకుని లేదా గుడ్డలో మూట కట్టుకుని బడికి వెళ్లేవారు. ఆ తర్వాత స్కూల్ బ్యాగ్ వచ్చింది. అయితే మొదటి బ్యాగ్ ఎవరు కనిపెట్టారు? దీనికి సరైన జవాబు లేదు. కానీ ‘మోడ్రన్ స్కూల్ బ్యాగ్’ అంటే భుజానికి వేసుకునే బ్యాగ్‌ను మొదట జర్మనీ దేశంలో తయారు చేశారు.1850ల నాటికి జర్మనీలో పిల్లలు బళ్లకు వెళ్లడం ఎక్కువైంది. పుస్తకాలు, పలక, సుద్దముక్కలు మోయడం కష్టంగా ఉండేది. అప్పుడు సైనికులు వాడే ‘రాన్ జెన్’ అనే వీపు సంచిని చూసి 1870లో జర్మనీ షూ తయారీదారులు తోలుతో గట్టిగా ఉండే సంచులు చెయ్యడం మొదలుపెట్టారు. దాని పేరు ‘టోర్నిస్టర్’ లేదా ‘షుల్రాన్ జెన్’. అదే మొదటి స్కూల్ బ్యాగ్. పుస్తకాలు నలగకుండా, వానలో తడవకుండా ఉండటానికి దిట్టంగా దీనిని తయారు చేసేవారు. అప్పట్లో పుస్తకాలు చాలా ఖరీదు. అందుకే అంత జాగ్రత్త.అమెరికాలో 1938లో ‘జిప్పర్’ ఉన్న కాన్వాస్ బ్యాగ్‌లు వచ్చాయి. కానీ 1967లో ‘జాన్ స్పోర్ట్’ కంపెనీ ఈ రోజు మనం వాడే నైలాన్ బ్యాక్΄్యాక్‌ను స్కూల్ కోసం తయారు చేసింది. మన దగ్గర 1960 వరకు చాలామంది పుస్తకాలను టవల్లో, అల్యూమినియం పెట్టెలో పెట్టుకుని వెళ్లేవారు. 1980 తర్వాతే స్కూల్ బ్యాగులు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. -
ఈ రంగులను.. పరిగెత్తినా పట్టుకోలేం!
నేస్తాలూ! ఆకాశంలో రంగురంగుల ఇంద్రధనస్సు కనిపిస్తే మనందరికీ ఎంతో సరదాగా ఉంటుంది కదూ.. అయితే, ఈ అందమైన రంగుల విల్లుల వెనుక మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా...!సాధారణంగా మనం చూసే ఇంద్రధనస్సులు ఒక గంట కంటే తక్కువ సమయం మాత్రమే ఆకాశంలో ఉంటాయి. కానీ, 2017లో తైవాన్ దేశంలోని ‘తైపీ’ అనే నగరంలో ఒక ఇంద్రధనస్సు ఏకంగా 9 గంటల పాటు ఆకాశంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది.చలికాలంలో మనకు ఇంద్రధనస్సులు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎందుకంటే, ఇంద్రధనస్సు ఏర్పడటానికి ఆకాశంలో చిన్న చిన్న నీటి చుక్కలు ఉండాలి. కానీ చలికాలంలో వర్షానికి బదులు మంచు ఎక్కువగా కురుస్తుంది. అందుకే ఈ కాలంలో రంగుల విల్లులు దాగుడుమూతలు ఆడతాయి. అదే మన భూమిపై ఉన్న ‘హవాయి’ దీవుల్లో మాత్రం ప్రపంచంలోనే అత్యధికంగా ఇంద్రధనస్సులు కనిపిస్తాయట!మన సౌర కుటుంబంలో ఇంద్రధనస్సులు కనిపించే ఏకైక గ్రహం మన భూమి మాత్రమే! అయితే, శని గ్రహం ఉపగ్రహమైన ‘టైటాన్’ పై కూడా ఇంద్రధనస్సులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మీకు తెలుసా? ఇంద్రధనుస్సు అనేది నిజానికి అక్కడ ఉండదు! అది కేవలం మన కళ్లకు కనిపించే ఒక దృష్టి భ్రాంతి మాత్రమే. సూర్యుని కాంతి నీటి చుక్కలపై పడి పరావర్తనం చెందినప్పుడు, చూసేవారికి కరెక్ట్‌గా 42 డిగ్రీల కోణంలో ఈ రంగులు కనిపిస్తాయి.ప్రతి సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ‘నేషనల్ ఫైండ్ ఎ రెయిన్ బో డే’ గా జరుపుకుంటారు. ఈ సారి వర్షం పడినప్పుడు ఆకాశంలో ఇంద్రధనస్సు కోసం వెతకడం మర్చిపోకండి!ఇంద్రధనస్సు నిజంగా ఒక చోట అంటూ ఉండదు కాబట్టి, మనం ఎంత దూరం పరిగెత్తినా దాని అంచుని పట్టుకోలేం, అసలు దాన్ని తాకలేం కూడా!


