
ఆశ్వయుజ మాసం పౌర్ణమి తర్వాత వచ్చే మూడో రోజుని దక్షిణ భారతదేశంలో అట్లతద్దిగా జరుపుకుంటే ఉత్తర భారతదేశంలో పౌర్ణమి తర్వాత నాల్గవ రోజు.. చవితి తిధి నాడు కర్వాచౌత్ పండుగ జరుపుకుంటారు. ఈ రెండు పర్వదినాలు, వివాహితులకు, కన్నెపిల్లలకు ప్రత్యేకం అనే చెప్పాలి. ఆ రోజు కన్నెపిల్లలు మంచి వరడు కోసం, పెళ్లైన స్త్రీలు తమ భర్త క్షేమం కోసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంంటారు.
సాయంత్రం చంద్ర దర్శన అనంతరం విరమిస్తారు. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రంలో చంద్ర దర్శనాన్ని భర్త సమక్షంలో సందర్శించి ఉపవాసాన్ని విరమించడం విశేషం. అయితే ఈ పండుగ భారతీయ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా ప్రజలు విభిన్న రకాలుగా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..ఈ ఆచారాన్ని ఓ విదేశీయుడి ఆచారించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.
బ్రిటిష్ కంటెంట్ క్రియేటర్ నిక్ బుకర్ తన భార్య కోసం ఉపవాసం ఉండటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాదు హాట్‌టాపిక్‌గా మారింది. భారతచరిత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సదా షేర్ చేసుకునే నిక్ బుకర్ "మై డెస్పరేట్ కర్వా చౌత్ సెర్చ్ ఫర్ ది మూన్" అనే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆ వీడియోలో నిక్ తన భార్యతో కలిసి ఈ పండుగను జరుపుకున్నానని, ఉపవాసం కూడా ఉన్నట్లు వెల్లడించాడు. ఆయన ముంబైలోని జుహూ బీచ్ సమీపంలో తన నివాసంలో ఈ పండుగను నిర్వహించి ఉపవాసం ఉన్నారు. అయితే త్వరితిగతిన చంద్రుడిని సందర్శించేందుకు ముంబై నుంచి ఢిల్లీ వచ్చి..అక్కడ లోధి హోటల్ నుంచి చంద్రుడిని చాలా త్వరితగతిన సందర్శించి తన భార్యతో కలిసి ఉపవాసం విరమించినట్లు తెలిపాడు.
అంతేగాదు కర్వా చౌత్‌ను ఎందుకు జరుపుకుంటారు చాలా చక్కగా వివరించి భారతీయులందరి మనసులను గెలుచుకున్నాడు. చివరగా ఆ వీడియోలో ఈ రోజు ఉపవాసం ఉన్నవారందరికీ శుభాకాంక్షలు అని చెప్పాడు. అయితే నెటిజన్లంతా మా భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీకరించినందుకు ధన్యవాదాలు, అలాగే మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నిక్‌ని ఆశీర్వదిస్తూ..పోస్టులు పెట్టారు.
(చదవండి: 'ఖతర్నాక్ మొక్కలు'..! వీటి టక్కు టమారాలకు విస్తుపోవాల్సిందే..!)