సగటు భారతీయ కుటుంబాలకు విమాన ప్రయాణం అంటే విలాసవంతమైందే. ఆకాశంలో విహరించేందు కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండటం, అందుకనుగుణంగా డబ్బులు దాచుకోవడంతోపాటు కొన్ని త్యాగాలు కూడా ఉంటాయి. అలా నెటిజనులలో భావోద్వాగాన్ని కలిగించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌వుతోంది.
విష్ణు అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం తన తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించాడు. ఈ అనుభవాన్ని రికార్డ్ చేశాడు. ప్రతీ కొడుకు స్వప్నం నెరవేరిన క్షణం ఇదీ అంటూ ఎలాంటి ఫిల్టర్లు, సౌండ్‌ట్రాక్‌లు లేకుండా చాలా సాదా సీదాగా, అత్యంత హృద్యంగా ఈ క్షణాలను వీడియో తీశాడు. సెక్యూరిటీ చెకప్‌నుంచి, గేటులోకి ఎంట్రీ ఇవ్వడం, విమానం ఎక్కడం, చివరగా విమానంలో కూర్చునే దాకా తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు
ఈ సెంటిమెంట్‌తో సోషల్ మీడియా వినియోగదారులు త్వరగా కనెక్ట్ అయ్యారు. "స్వచ్ఛమైన ప్రేమ మరియు కృతజ్ఞత అంటూ విష్ణుకు అభినందనలు తెలిపారు. గ్రేట్ బ్రో.. ఇది కదా ఆనందం అంటే అని మరొకరు, "ఇది ప్రతి మధ్యతరగతి మనిషి కల" చిన్నప్పటినుంచీ కష్టపడి పెంచి, చదివించినందుకు వారికి మనం చాలా రుణపడి ఉంటాం అంటూ కమెంట్లు వెల్లువెత్తాయి.


