ఎల్లుండి భారత్‌కు కెనడా ప్రధాని | Canadian Prime Minister Mark Carney To Visit India On February 26 | Sakshi
Sakshi News home page

ఎల్లుండి భారత్‌కు కెనడా ప్రధాని

Feb 24 2026 8:06 AM | Updated on Feb 24 2026 9:13 AM

Canadian Prime Minister Mark Carney To Visit India On February 26

ఒట్టావా: కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ గురువారం భారత పర్యటనకు రానున్నారు. ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు రక్షణ, ఇంధన, ఏఐ రంగా ల్లో నూతన ఒప్పందాలే లక్ష్యంగా ఆయన పర్యటన జరగనుంది. కార్నీ తొలుత ముంబై సందర్శిస్తారు. తర్వాత ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు.

‘‘అనంతరం పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో కూడా కార్నీ సమావేశం అవుతారు. కెనడా లో పెట్టుబడి అవకాశాలపై వారితో లోతు గా చర్చిస్తారు’’ అని ఆయన కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 2024లో భారత్, కెనడా నడుమ 30.8 బిలియన్‌ డాలర్ల మేరకు వాణిజ్య కార్యకలాపాలు జరిగాయి. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత ఇరుదేశాల నడుమ సంబంధాలు పూర్తిగా క్షీణించడం తెలిసిందే. ఆ ఉదంతం అనంతరం భారత్‌లో పర్యటిస్తున్న తొలి కెనడా ప్రధాని కార్నీయే.

 

 

Advertisement
 
Advertisement
Advertisement