ఇజ్రాయిల్‌తో లక్షల కోట్ల బిగ్‌డీల్..! | India big deal with Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయిల్‌తో లక్షల కోట్ల బిగ్‌డీల్..!

Feb 23 2026 4:42 PM | Updated on Feb 23 2026 5:02 PM

India big deal with Israel

ప్రధాని  మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ కీలక ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. భారత్ రక్షణ రంగం మరింత బలోపేతం కోసం ఏఐ, డ్రోన్లు ఇతారాత్ర ఆధునాతన ఆయుధాలకై దాదాపు 93.5 బిలియన్ డాలర్లతో ఇజ్రాయెల్‌తో భారీ డీల్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇజ్రాయెల్‌తో జరిగే అతిపెద్ద డీల్‌గా ఇది చరిత్రకెక్కనుంది.

ఇజ్రాయెల్  దేశం సాంకేతికత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విస్తీర్ణంపరంగా చిన్న దేశమైనా తన ఆధునాతన సాంకేతికతో అత్యాధునికి డ్రోన్లు, రక్షణవ్యవస్థ ఇలా ఎంతో మెరుగైన రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఆ దేశ సీక్రెట్ ఏజెన్సీ మోసాద్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సీక్రెట్ ఏజెన్సీగా పేరొందింది. అయితే ప్రధాని మోదీ ఫిబ్రవరి 25 న ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో భారీ రక్షణ ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

భారత్, ఇజ్రాయెల్‌తో 93.5 బిలియన్‌ డాలర్లతో భారీ రక్షణ ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందంలో ప్రధానంగా ఏఐ సాంకేతికతతో డ్రోన్లు, యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, లాంగ్ రేంజ్ స్టాండ్-ఆఫ్ క్షిపణులు ఇతరాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒక వేశ ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే రక్షణపరంగా భారత్ మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది.

అయితే ఇజ్రాయెల సైతం గతంలో ఎన్నడూ లేనివిధంగా  తన అత్యంత రహస్యమైన, అత్యాధునిక రక్షణ సాంకేతికతలను భారత్‌తో పంచుకోవడానికి అంగీకరించంది. గత నవంబర్‌లో రక్షణ శాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ ఇజ్రాయెల్ పర్యటనలో కుదిరిన ప్రాథమిక ఒప్పందాలే ఈ విస్తృత సహకారానికి పునాదిగా నిలిచాయి. 

ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'మిషన్ సుదర్శన్'లో భాగంగా శత్రువుల సుదూర శ్రేణి క్షిపణుల నుండి దేశాన్ని రక్షించేందుకు ఇజ్రాయెల్‌తో కలిసి యాంటీ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. బాలిస్టిక్ క్షిపణి రక్షణలో ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక ఒప్పందం జరగనున్నట్లు సమాచారం.

  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement