హీరోకు తల్లిగా, భార్యగా, కూతురిగా నటించిన హీరోయిన్‌ | This Actress Played Mammootty daughter, girlfriend and mother | Sakshi
Sakshi News home page

మమ్ముట్టికి భార్యగా, కూతురిగా, తల్లిగా నటించిన స్టార్‌ హీరోయిన్‌

Feb 18 2026 7:43 PM | Updated on Feb 18 2026 7:49 PM

This Actress Played Mammootty daughter, girlfriend and mother

హీరోయిన్లు కేవలం హీరోతో జోడీ కట్టడమే కాదు కొన్నిసార్లు అదే హీరోకు తల్లిగా, కూతురిగా కూడా నటించినవాళ్లూ ఉన్నారు. అలా మలయాళ స్టార్‌ మమ్ముట్టికి ఓ స్టార్‌ హీరోయిన్‌ తల్లిగా, కూతురిగా, భార్యగా నటించింది. ఆమె మరెవరో కాదు, అందాల తార మీనా.

స్టార్‌ హీరోయిన్‌గా
13 ఏళ్ల వయసుకే హీరోయిన్‌గా మారింది మీనా. కథానాయికగా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. దాదాపు అందరు హీరోలతో జత కట్టిన మీనా మలయాళ స్టార్‌ మమ్ముట్టికి మాత్రం భార్యగా, కూతురిగా, తల్లిగా నటించింది.

మమ్ముట్టికి జోడీగా..
ఒరు కొచ్చుకథ ఆరుం పరయత కథ మూవీలో మమ్ముట్టి కూతురిగా నటించింది. 2001లో వచ్చిన రాక్షస రాజవు మూవీలో మమ్ముట్టి ప్రేయసిగా కనిపించింది. ఆ తర్వాత కరుత పక్షికల్‌, కద పరయుంబల్‌ సినిమాల్లోనూ మమ్ముట్టితో కలిసి నటించింది. 2014లో మమ్ముట్టి ద్విపాత్రాభినయం చేసిన మూవీ బాల్యకాలసఖి. ఇందులో మమ్ముట్టి తల్లిగా, భార్యగా మీనా యాక్ట్‌ చేసింది. 

చదవండి: జీవితంలో ఒక్క పుస్తకం చదవలేదు: స్టార్‌ హీరో

Advertisement
 
Advertisement
Advertisement