కన్నడలో హిట్‌ టాక్‌తో దూసుకెళ్తున్న తెలుగు సినిమా | O Andala Rakshasi Wins Appreciation In Kannada | Sakshi
Sakshi News home page

కన్నడలో హిట్‌ టాక్‌తో దూసుకెళ్తున్న తెలుగు సినిమా

Feb 18 2026 2:26 PM | Updated on Feb 18 2026 2:58 PM

O Andala Rakshasi Wins Appreciation In Kannada

దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీకి చిత్ర పరిశ్రమలో ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కెఎస్ 100, ఆమ్లెట్, ఇంకా ఏమీ అనుకోలేదు, పార్సిల్ వంటి చిత్రాలతో మెప్పించాడు. ఇక మల్టీ టాలెంటెడ్ అయిన షెరాజ్ మెహదీ రీసెంట్‌గా ‘ఓ అందాల రాక్షసి’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇక ఈ ఇదే మూవీని కన్నడలోనూ రిలీజ్ చేశారు. కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నట్టుగా షెరాజ్ మెహదీ తెలిపారు.

అమ్మాయిలపై వేధింపులు, అత్యాచారాలు చేసే వారికి ఎలాంటి శిక్షలు వేయాలి.. అమ్మాయిల జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే కథాంశంతో షెరాజ్ మెహదీ ‘ఓ అందాల రాక్షసి’ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రంలో హీరోగా, దర్శకుడిగా షెరాజ్ మెహదీ అందరినీ మెప్పించారు. ఈ మూవీలో విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా వచ్చిన ‘ఓ అందాల రాక్షసి’ ఇప్పుడు కన్నడ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement