సినిమాల తీయడంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, కలర్ నుంచి యానిమేటెడ్, ఇప్పుడేమో కొత్తగా ఏఐ మూవీస్ రెడీ అయిపోతున్నాయి. ఓవైపు కెమెరాతో ఎప్పటిలానే సినిమాలు తీస్తున్నప్పటికీ కొందరు ఏఐ ఉపయోగించి వందలాది కోట్ల బడ్జెట్ అయ్యే చిత్రాల్ని ఎంచక్కా ఒక్కరోజులోనే తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఇదే విషయమై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
(ఇదీ చదవండి: వాళ్లు తప్పు చేశారు.. నేను క్షమాపణలు చెబుతున్నా: రాజమౌళి తండ్రి)
ఆర్జీవీ లేటెస్ట్‌గా ఓ ఏఐ మూవీకి సంబంధించిన చిన్న బిట్‌ని తన ట్విటర్‌లో షేర్ చేశాడు. 'సినిమాలకు ఇది అంతం కాకపోతే మరేంటి?' అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దాదాపు మూడున్నర నిమిషాలున్న ఈ వీడియో చూస్తే.. ఎక్కడా ఏఐతో తెరకెక్కించారనే సందేహం రాదు. హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీస్ స్టైల్లోనే చాలా భారీగా ఉంది. బిల్డింగ్స్ కుప్పకూలడం, ఆకాశం నుంచి విమానం నేలకూలడం, అమెరికాలోని బ్రిడ్జ్ విరిగిపోవడం, ఇలా ప్రతి సీన్ ఎంతో రియలస్టిక్‌గా అనిపించింది. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏఐతో సినిమాలకు భారీ ప్రమాదమే పొంచి ఉంది.
(ఇదీ చదవండి: హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు: సుహాస్)
If this is not the end of films , I don’t know what is ?😳 Watch till END https://t.co/MVZA7mJKYH
— Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2026


