హీరోయిన్ నిత్యా మేనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే నాని, నితిన్ తదితర హీరోలతో పలు సినిమాలు చేసింది. హిట్స్ కొట్టింది. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో నటించిన ఈమె.. ప్రస్తుతం ఇతర దక్షిణాది భాషలపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది ఈమె నుంచి మూడు తమిళ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతానికి నిత్య చేతిలో కొత్త ప్రాజెక్టులు అయితే ఏం లేనట్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాతగా ఓ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు ప్రకటించింది.
(ఇదీ చదవండి: వాళ్లు తప్పు చేశారు.. నేను క్షమాపణలు చెబుతున్నా: రాజమౌళి తండ్రి)
'కేయూరి ప్రొడక్షన్ (Keyuri Productions)' పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు వెల్లడించిన నిత్యా మేనన్.. ఇన్ స్టాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. వ్యాపార లాభాల కంటే కథాబలం, లోతైన పాత్రలు, సమాజంపై ప్రభావం చూపే సినిమాలకే తన ప్రాధాన్యం అని పేర్కొంది. ప్రస్తుతానికి కొత్తగా ఈ నిర్మాణ సంస్థ నుంచి ప్రాజెక్టులేం ప్రకటించలేదు. చూస్తుంటే తనకున్న యాక్టింగ్ కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాత నటి, నిర్మాత కొనసాగనుంది. 'అలా మొదలైంది' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిత్యా మేనన్.. ఇష్క్, గుండెజారి గల్లంతయిందే, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్ తదితర చిత్రాల్లో కనిపించింది.
(ఇదీ చదవండి: ప్రముఖ హీరో ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత)


