ఇండస్ట్రీలో విషాదం. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితమే ఇది జరిగినప్పటికీ.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో సిద్ధార్థ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టేసరికి అందరికీ ఈ విషయం తెలిసింది. ఈ క్రమంలోనే హిందీ సెలబ్రిటీలు అందరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. నివాళి అర్పిస్తున్నారు.
(ఇదీ చదవండి: హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు)
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఏక్ విలన్, షేర్ షా తదితర సినిమాలతో హీరోగా కాస్త గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా.. ఫిబ్రవరి 14న ఢిల్లీ తుదిశ్వాస విడిచారు. నిద్రలోనే కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే భార్య కియారా అడ్వానీతో కలిసి ఢిల్లీ వెళ్లిన సిద్ధార్థ్.. అక్కడే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. కష్టకాలంలో కుటుంబంతో కలిసి ఉన్నారు. నాన్న చనిపోయిన విషయాన్ని మర్చిపోలేకపోతున్న సిద్ధార్థ్.. మంగళవారం రాత్రి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని బోలెడన్ని ఫొటోలని పంచుకున్నాడు.
'ఆయన నిజాయతీ కలిగిన వ్యక్తి. ఎప్పుడూ తలవంచలేదు. జీవితం ఆయన్ని పరీక్షించినప్పుడు కూడా బలంగా నిలబడ్డారు. మర్చంట్ నేవీ కెప్టెన్‌గా సముద్రాన్ని శాసించడం దగ్గర నుంచి అనారోగ్యాన్ని ఎదుర్కోవడం వరకు ఎప్పుడూ ఒకేలా ఉండేవారు. స్ట్రోక్ వల్ల ఆయన వీల్ ఛైర్‌కే పరిమితమైనప్పటికీ బలంగా నిలబడ్డారు. మీ పాజిటివిటీ ఇప్పటికీ ఈ కుటుంబాన్ని కలిపి ఉంచుతోంది. నిద్రలోనే మమ్మల్ని మీరు వదిలి వెళ్లారు. మీరు లేని లోటు తీరనిది. మీ వల్లే నేను ఇలా ఉన్నాను. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను నాన్న' అని సిద్ధార్థ్ రాసుకొచ్చాడు.
(ఇదీ చదవండి: సరైన న్యాయం దక్కలేదు.. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి ఆవేదన)


