బాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి ప్రవీణ దేశ్‌పాండే (60) కన్నుమూశారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. మంగళవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రవీణ కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ప్రవీణ దేశ్‌పాండే 2019లో మల్టిపుల్ మైలోమా (బ్లడ్ క్యాన్సర్ రకం) బారిన పడ్డారు. అయినప్పటికి ఓ వైపు చికిత్స పొందుతూనే తన నటనను కొనసాగించారు. 2023లో కొంత కాలం విరామం తర్వాత ఆమె మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆమె చివరిగా ఇటీవల విడుదలైన 'తస్కరీ' (Taskaree) వెబ్ సిరీస్‌లో ఆతిది పాత్రలో కన్పించారు.
తన హుందాతనమైన నటనతో ఈ సిరీస్‌లోనూ ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే దేశ్‌పాండే ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ నటించిన 'రెడీ' చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఆమె కేవలం వెండితెరపైనే కాకుండా, అనేక సూపర్ హిట్ హిందీ, మరాఠీ సీరియల్స్‌లో నటించి ఇంటింటికీ సుపరిచితురాలయ్యారు. ఆమె 'పరమాణుస, 'జలేబీస, 'ఏక్ విలన్' వంటి చిత్రాలలో ఆమె సహాయ నటిగా అలరించారు. ఆమె మృతి పట్ల సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం వ్యక్తంచేసింది.


