Prakasam
-
కారు ఢీకొని వ్యక్తి మృతి
కొనకనమిట్ల: మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన జాతీయ రహదారిపై కొనకనమిట్ల మండలం చౌటపల్లి సమీపంలో ఆదివారం జరిగింది. కొనకనమిట్ల మండలంలోని తువ్వపాడు పంచాయతీ చౌటపల్లి ఎస్సీకాలనీకి చెందిన చిరుగూరి వెంగయ్య (55) తన మోటార్ సైకిల్‌పై కొనకనమిట్ల వెళ్లి సరుకులు తీసుకుని తిరిగి చౌటపల్లి ఎస్సీకాలనీకి వస్తున్నాడు. అదే సమయంలో పొదిలి వైపు నుంచి మార్కాపురం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి మోటార్ సైకిల్‌పై వెళ్తున్న వెంగయ్యను వెనుక వైపు ఢీకొట్టింది. దీంతో ఎగిరి రోడ్డుపై పడిన వెంగయ్య తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు సంఘటన స్థలానికి కొద్ది దూరం వెళ్లి ఆగింది. మృతుడు వెంగయ్యకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూలి పని చేసుకుని జీవించే వెంగయ్య మృతి చెందడంతో భార్య, పిల్లలు, బంధువులు రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న కొనకనమిట్ల ఎస్ఐ శ్రీకాంత్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలడిగి తెలుసుకున్నారు. వెంగయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నడిరోడ్డుపై టీడీపీ నాయకుల బాహాబాహీ
● పొదిలిలో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్న ఇద్దరు నాయకులు పొదిలి రూరల్: మార్కాపురం జిల్లా పొదిలిలో టీడీపీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. ఒక సమస్యపై మాట్లాడుకునే క్రమంలో విభేదాలు బయట పడ్డాయి. ఆదివారం పొదిలి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఓ ఆస్పత్రి వారు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ రథం కూడా ప్రారంభించారు. ఆ సమయంలో కొత్తపాలేనికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త నరేష్‌కు స్వచ్చ రథం ఎందుకు ఇచ్చారని మాదాలవారిపాలెం సొసైటీ అధ్యక్షుడు యర్రం వెంకటేశ్వరరెడ్డిని ఆ పార్టీ జిల్లా మైనార్టీ కార్యదర్శి షేక్ రసూల్ ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే కందుల ఈ సమస్యపై తరువాత మాట్లాడామని చెప్పి వెళ్లిపోయారు. అనంతరం ఇద్దరు నాయకులు బయటకు వచ్చి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో మాటా మాటా పెరిగి చిలికి చిలికి గాలి వానలా మారి గొడవకు దిగారు. అందరూ చూస్తుండగానే పోలీసుల సమక్షంలోనే బాహాబాహీ తలపడి ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న నాయకులు ఇరువురినీ తప్పించి సర్ది చెప్పి పంపించి వేశారు. దీంతో గొడవ సర్దుమణిగింది. ప్రజల సమక్షంలోనే ఇద్దరు నాయకులు గొడవ పడి కొట్టుకోవడం చూసి జనం విస్తుపోయారు. -
దర్శిలో అర్ధరాత్రి చోరీ
● రూ.4.60 లక్షల నగదు, నాలుగు సవర్ల బంగారు ఆభరణాల దోపిడీ దర్శి: దర్శి నగర పంచాయతీలోని కొత్తరెడ్డిపాలెంలో తూము శ్రీనివాసరెడ్డి ఇంట్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. స్థానికులు వివరాల మేరకు..శనివారం రాత్రి శ్రీనివాసరెడ్డి భవనంపైన నిద్రించాడు. ఆయన భార్య పంచలోని కటకటాల్లో పడుకున్నారు. అయితే ఇంటి వెనుక వైపు ఉన్న పొలాల్లోని ప్రవేశించిన దుండగులు వంటగది తలుపులు గడ్డపారతో పెకిలించి లోనికి ప్రవేశించారు. ఇంట్లోని సొరుగులో ఉన్న నాలుగు సవర్ల చైను, బీరువాలో ఉన్న రూ.4.60 లక్షల నగదు అపహరించారు. తెల్లవారుజామున నిద్ర లేచిన కుటుంబసభ్యులు వెనుక తలుపులు తీసి ఉంది. బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో శ్రీనివాసరెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ రామారావు, ఎస్సై మురళీలు ఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ఒంగోలు నుంచి క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. వాస్తవానికి ఆ బంగారం, నగదు శ్రీనివాసరెడ్డికి చెందినది కాదని తెలుస్తోంది. ఆయన బావమర్దికి చెందిన నగదు బ్యాంక్ నుంచి తీసుకువచ్చి ఇంట్లో పెట్టారు. ఆ నగదు అపహరణకు గురి కావడంతో కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. బీరువాలో మరికొన్ని నగలు.. దుండగులు బీరువా పై అరలో ఉన్న రూ.5 లక్షలు అపహరిచారు. అయితే కింద అర మాత్రం దుండగులు కదిలించలేదు. కింద అర తాళాలు తీస్తే అందులో సుమారు 35తులాలు బంగారం, నగదు కలిపి రూ.50 లక్షల వరకు సొత్తు ఉంది.ఆ తాళం తీయకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ విజయసునీత మార్కాపురంటౌన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎం విజయసునీత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో ఆదివారం విద్యాశాఖాఽధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతరం, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే బస్సు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పారు. మార్కాపురం జిల్లాలో మొత్తం 22 కేంద్రాల్లో 9,502 మంది విద్యార్థులు సఫ్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఏవైనా సమస్యలుంటే 08592 281275 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మాస్‌కాపీయింగ్ జరగకుండా ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ శివరామిరెడ్డి, ఇంటర్‌బోర్డు ఆర్ఐఓ ఆంజనేయులు, రమణారెడ్డి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
స్థల వివాదంలో తోపులాట
● పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంపై కన్నేసిన మూడు వర్గాలు ● గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు పెద్దదోర్నాల: మండల పరిధిలోని కడపరాజుపల్లెలో ఓ స్థల వివాదం ఘర్షణకు దారి తీసింది. గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరింది. దీంతో ఆ స్థలంపై కన్నేసిన గ్రామంలోని కొన్ని వర్గాలకు చెందిన వారి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఽరెండు వర్గాలకు చెందిన వారు శనివారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వివాదం నడుస్తుండగానే ఆదివారం మూడో వర్గానికి చెందిన మరి కొందరు పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంలో మాకూ హక్కు ఉందంటూ కొత్త వివాదానికి తెర తీశారు. దీంతో ఈ వివాదం గ్రామంలో తీవ్ర స్థాయికి చేరింది. దీంతో మూడు వర్గాలకు చెందిన వారు వారి వారి ఇలవేల్పులు, కుల దైవాల ఫొటోలను పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంలో పోటీలు పడి ఏర్పాటు చేసుకోవటంతో వివాదం మరింత ముదిరింది. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారడంతో శనివారం తోపులాటకు దారితీసింది. ఈ వివాదంపై జోక్యం చేసుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ. అజయ్‌కుమర్, ఎస్సై వెంకట రమణయ్యలు సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. స్థలంలో ఏర్పాటు చేసిన దేవుళ్ల ఫొటోలను తొలగించారు. అనంతరం స్థలం ఎంపీపీ స్కూల్‌కు చెందిన స్థలంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలో ఏఎస్సై పోలురాజు ఆధ్వర్యంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెట్ ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
యువకుడు ఆత్మహత్యాయత్నం
గిద్దలూరు రూరల్: మండలంలోని సంజీవరాయుడుపేట గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్ అనే యువకుడు నంద్యాలరోడ్డులోని సగిలేరు బ్రిడ్జి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్ అనే యువకుడు వృత్తి రీత్యా డ్రైవర్‌గా జీవనం కొనసాగి స్తుంటాడు. తల్లిదండ్రులు లేని కారణంగా కుటుంబ సభ్యుల ఆదరణ కోల్పోయి మద్యానికి బానిసై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రైలుపట్టాలపై పడుకున్న సమయంలో గుంటూరు నుంచి గుంతకల్ వైపు వెళ్లే గూడ్స్ రైలు డ్రైవర్ పట్టాలపై పడుకుని ఉన్న శ్రీకాంత్‌ను గుర్తించి రైలును నిలుపుదల చేసి సమాచారాన్ని గిద్దలూరు రైల్వేస్టేషన్‌కు అందజేశారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పిచ్చిరెడ్డి తన సిబ్బంది సంఘటనా స్థలానికి వద్దకు చేరుకొని రైలు పట్టాలపై ఉన్న శ్రీకాంత్‌ను అదుపులోనికి తీసుకొని ఆత్మహత్యకు కారణాలను తెలుసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఊరుకోం
ఒంగోలు సిటీ: ఆర్టీసీ విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి సంస్థ సిబ్బందితోనే నడపడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను పరిరక్షించవచ్చని ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వాకా రమేష్ అన్నారు. ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ రోజు ఒంగోలు డిపో కమిటీ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, సొంత బస్సుల సంఖ్యను పెంచడం వంటి ప్రధాన డిమాండ్లతో నిరసనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిపోలను ఖాళీ చేయడం, ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ ఆధీనంలో నడపించే చర్యలు ప్రజా రవాణా రంగానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు సురక్షితమైన, చవకై న రవాణా సేవలు అందించే సామర్థ్యం కేవలం ఆర్టీసీకే ఉందని గుర్తు చేశారు. ఆర్టీసీలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడంతో యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని విమర్శించారు. డ్రైవర్, కండక్టర్, సాంకేతిక సిబ్బంది కొరతతో ఉద్యోగులపై అదనపు పనిభారం పడుతోందన్నారు. నెల్లూరు జోనల్ అధ్యక్షుడు బెజవాడ రవి మాట్లాడుతూ 2029 నాటికి ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ వారికి అప్పగించే జీఓ నం. 88ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి, విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీ్త్ర శక్తి పథకంలో భాగంగా 3000 బస్సులు కొని 10,000 సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. డీఏ, పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పీఆర్సీ చైర్మన్‌ని నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రచార కార్యదర్శి ఓ. రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కార్యదర్శి పోలయ్య, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎ. అదిశేషు, డిపో నాయకులు ఈ. సాయికృష్ణ, రెడ్డి, గ్యారేజీ కార్యదర్శి ఓ. పోలయ్య, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యుత్ బస్సులు ఆర్టీసీనే కొనుగోలు చేసి సిబ్బందితో నడపాలి ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియర్ రాష్ట్ర కార్యదర్శి వాకా రమేష్ -
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
యర్రగొండపాలెం: నీటి కుంటలో మునిగి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆదివారం పరామర్శించారు. ఆ కుటుంబాలకు రూ.50వేల ప్రకారం ఆర్థిక సహాయం అందచేశారు. మండలంలోని బోయలపల్లి ఎస్సీ పాలెంకు చెందిన కొమ్ము శశికుమార్(11), బోయలపల్లి దీపన్(10)లు గత నెల 14వ తేదిన పొలంలో ఉన్న నీటికుంట(ఫారం పాండ్)లో జారిపడి మృతి చెందారు. సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే ప్రభుత్వ వైద్యశాలకు చేరి చిన్నారుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ఆ కుటుంబం కోలుకోలేని పరిస్ధితిలో ఉండటం వలన ఆయన మరో సారి ఎస్సీ పాలెంకు చేరి వారిని ఓదార్చారు. కూలి పనులకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ఆ చిన్నారుల ఒక్కొక్క కుటుంబానికి రూ.50వేల ప్రకారం ఆర్థికసాయం అందచేశారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, నాయకులు కె.ఓబులరెడ్డి, ఎం.బాలగురవయ్య, చేదూరి విజయభాస్కర్, వై.వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, కోల వెంకటేశ్వర్లు, రాములు నాయక్, సురేష్ నాయక్ ఉన్నారు. -
రేషన్‌కు ఈకేవైసీ గండం
జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాలు: 21 మార్కాపురం: జిల్లా వ్యాప్తంగా ఈ–కేవైసీ చేయించుకోని రేషన్‌కార్డుదారులకు రేషన్ సరఫరా నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పలువురు కార్డుదారులు ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు. పనుల కాలం కావడంతో రేషన్‌షాపుల వద్దకు వెళ్లలేక పలువురు లబ్ధిదారులు రేషన్ తీసుకోవడం లేదు. దీంతో రేషన్‌కార్డు ద్వారా వచ్చే ఇతర పథకాలు కూడా ఆగిపోనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని 21 మండలాల్లో 743 రేషన్ షాపుల్లో 10,15,212 మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఇప్పటి వరకూ 36,205 మంది ఈ–కేవైసీ చేయించుకోలేదు. ఈనెలాఖరులోపు ఈ–కేవైసీ చేయించుకోకుంటే రేషన్‌తోపాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి. పలువురు వలసపోవడం, ఈ–కేవైసీపై అవగాహన లేకపోవడం, రేషన్ డీలర్ల నిర్లక్ష్యం తదితర కారణాలతో ఈ–కేవైసీ చేయించుకోలేకపోయారు. ఎక్కువగా జిల్లా కేంద్రమైన మార్కాపురంలోనే 3620 మంది కార్డుదారులు ఈ–కేవైసీ చేయించుకోవాలి. కనిగిరిలో 2409, గిద్దలూరులో 2319, త్రిపురాంతకంలో 2138, యర్రగొండపాలెంలో 2527, పామూరులో 2209, దోర్నాలలో 2218 మంది లబ్ధిదారులు ఈ–కేవైసీకి దూరంగా ఉన్నారు. స్పెషల్ డ్రైవ్ చేయించకపోతే వీరందరికీ రేషన్‌తోపాటు ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోనున్నాయి. మొత్తం రేషన్‌కార్డులు: 10,15,212జిల్లాలో మొత్తం రేషన్ దుకాణాలు: 743ఈ–కేవైసీ చేయించుకోనివారు: 36,205నెలాఖరులోపు చేయించుకోవాలి ఈనెలాఖరులోపు ఈ–కేవైసీ చేయించుకోని రేషన్కార్డుదారులందరూ తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. లేకపోతే రేషన్ నిలిపేస్తారు. ప్రతి ఒక్కరూ రేషన్, పథకాలు పొందాలంటే ఈ–కేవైసీ తప్పనిసరి. – చిరంజీవి, తహశీల్దార్ -
దొంగాట..కాసుల వేట
ఒంగోలు సిటీ: ఏడాదంతా పుస్తకాలతో కుస్తీపడిన విద్యార్థులకు వేసవిలో ఉత్సాహం..ఉల్లాసం.. ఆరోగ్యం అందించేందుకు ఏటా శాప్ ఆధ్యర్యంలో ప్రత్యేక క్రీడా శిబిరాలు జరుగుతుంటాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ విద్యార్థులకు సుమారు 25 కిపైగా క్రీడాంశాల్లో 55 శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి శాప్ జిల్లాకు రూ.6.54 లక్షలు కేటాయించింది. వీటి ద్వారా ఆయా క్రీడల కోసం అవసరమైన పరికరాల కొనుగోలుతోపాటు ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాల్సి ఉంది. శిక్షణ శిబిరాలు ప్రారంభమై పక్షం రోజులు దాటుతున్నా మొక్కుబడిగా శిబిరాలు సాగుతున్నాయి. శాప్ ఇచ్చిన నిధులను ఖర్చు చేయకపోగా క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ ఒంగోలులోని మినీ స్టేడియంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సంక్రాంతి సంబరాలు..క్రీడలతో సంప్రదాయ వేడుకలు అంటూ ఫ్లెక్సీ వేశారు. అయితే పోటీలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా పక్కనే అధికార పార్టీ నేత ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలకు వచ్చిన వారితో నాలుగు ఆటలు ఆడించి మమ అనిపించారు. ప్రత్యేక శిబిరాలు ఇలా.. జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఒంగోలులో ఫుట్‌బాల్, సెపక్తక్రా, బాక్సింగ్, ఖోఖో, కరాటే, రైఫిల్ షూటింగ్, స్కేటింగ్, స్విమ్మింగ్, తైక్వాండో, పవర్ లిఫ్టింగ్లతోపాటు, ఆర్చరీ, అథ్లెటిక్, ఫెన్సింగ్, చెస్, కబడ్డీ, బ్యాడ్మింటన్, జూడో క్రీడల్లో శిక్షణ శిక్షణ ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జరుగుమల్లిలో పవర్ లిఫ్టింగ్, కారుమూడివారిపాలెంలో హ్యాండ్‌బాల్, పామూరులో బాల్‌బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్ శిక్షణ ఏర్పాటు చేశారు. ఆలకూరుపాడులో వాలీబాల్, అల్లూరు వాలీబాల్, కరేడులో హ్యాండ్‌బాల్, కబడ్డీ, సింగరాయకొండలో హ్యాండ్‌బాల్, ఎస్‌ఎన్‌పాడులో హాకీ, బ్యాడ్మింటన్, బిట్రగుంటలో వెయిట్‌లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, వైపాలెంలో అథ్లెటిక్స్, ఖోఖో, బ్యాడ్మింటన్, కనిగిరిలో బ్యాడ్మింటన్, ఖోఖో, మార్కాపురంలో బాక్సింగ్, వాలీబాల్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, గిద్దలూరులో టెన్నిస్, పంగులూరులో ఖోఖో, కబడ్డీ క్రీడలకు శిక్షణ ఇస్తున్నారు. శాప్ ఇచ్చిన నిధుల నుంచి పరికరాలకు రూ.2,32,440, మైదానాలు సిద్ధం చేసేందుకు రూ.1,65,000 ఖర్చు చేయాల్సి ఉంది. అయితే క్రీడా పరికరాలు కొనుగోలు చేయలేదు. శిక్షణకు సంబంధించి పై నుంచి వచ్చిన పరికరాలను ఇంత వరకు క్యాంపులకు పంపిణీ చేయలేదు. మైదానం లోపల కనీస వసతుల్లేకుండా మొక్కుబడిగా సిద్ధం చేశారు. శిబిరాలకు వచ్చే విద్యార్థులు తాగునీటి కోసం కూడా అల్లాడుతున్నారు. పౌష్టికాహారంలోనూ చేతివాటం.. క్రీడల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు పౌష్టికాహారాన్ని కూడా అందించాలి. ఇందుకోసం రూ.2,57,400 ఖర్చు చేయాలి. పాలు, గుడ్డు, ఇతర బలమైన ఆహారాన్ని ఒక్కో రోజు ఒక్కోటి చొప్పున అందించాల్సి ఉంది. అయితే వీటిల్లోనూ అధికారులు చేతివాటం చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి విద్యార్థికి రూ.6 ఇవ్వాల్సి ఉండగా ఏఒక్క విద్యార్థికీ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు.వేసవి శిక్షణ శిబిరాల్లో పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇవ్వాలి. అయితే షటిల్ బ్యాడ్మింటన్ శిక్షణ కోసం అనధికారికంగా ఒక్కొక్కరి వద్ద రూ.1000 చొప్పున 30 మంది వద్ద రూ.30 వేలు వసూలు చేసినట్లు సమాచారం. కోచ్‌లనే ఆ డబ్బులు వసూలు చేయమని అధికారే చెప్పడం గమనార్హం. షటిల్ కాక్‌లకు కూడా డబ్బులు వసూలు చేశారు. ఉచితంగా ఇవ్వాల్సిన శిక్షణకు డబ్బులు వసూలు చేయమన్న విషయంలో విభేదాలతో కోచ్ విరమించుకోవడంతో ఒంగోలు నగరంలో షటిల్ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం నిలిచిపోయింది. ఇలా వేసవి శిక్షణ శిబిరాలు క్రీడాకారులకు ఉపయోగపడకపోగా సంబంధిత అధికారులకు ఆదాయవనరుగా మారాయి. -
అర్హతను బట్టి ఉద్యోగాలు కల్పించాలి
● కౌశల్ కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ రాజాబాబు సమీక్ష ఒంగోలు సబర్బన్: కౌశల్ కార్యక్రమంలో భాగంగా గతేడాది నిర్వహించిన సర్వేలో నమోదు చేసుకున్న నిరుద్యోగ యువతకు వారి అర్హత మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. సంబంధిత అధికారులతో శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సర్వేలో నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి వారి ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసే జాబ్‌మేళాలలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కూడా మొదటి విడత నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రత్యేక జాబ్‌మేళాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగాల కోసం ఆసక్తిగా సర్వేలో వివరాలు నమోదు చేసుకున్న యువతకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్దిష్ట సమయాలలో పరీక్షలు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఆయా విషయాలపై నిరుద్యోగ యువతకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో సచివాలయాల నోడల్ ఆఫీసర్ సువార్త, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
‘జలధార’ ఉద్యమంలా చేపట్టాలి
● కలెక్టర్ పి.రాజా బాబు ఒంగోలు సబర్బన్: ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి జలధార–జలహారతి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకువెళ్లాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సాధించిన పురోగతిపై వాటర్ షెడ్, నీటిపారుదల శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ శనివారం అమరావతి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన పనులు, వాటిలో సాధిస్తున్న పురోగతిని వివరించారు. సమావేశంలో డ్వామా పీడీ జోసఫ్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, భూగర్భజల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు వన్‌టౌన్: సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లోని విద్యార్థులకు సురక్షిత మంచి నీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఆ శాఖ డెప్యూటీ డైరక్టర్ ఎన్ లక్ష్మా నాయక్ అన్నారు. ఒంగోలు అంబేడ్కర్ భవనంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాల వసతి గృహ అధికారులకు సురక్షిత తాగునీటిని అందించే విధానంపై శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఫీల్డ్ టెస్ట్ కిట్లపై వార్డెన్లకు ప్రత్యక్ష అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి హాస్టల్‌కు ఎఫ్‌టీకే కిట్లను పంపిణీ చేస్తామని, ప్రతినెలా నీటి నాణ్యత పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో ఒంగోలు ఏఎస్డబ్ల్యూఓ రబియా, అద్దంకి ఏఎస్డబ్ల్యూఓ స్వరూప, దర్శి ఏఎస్డబ్ల్యూఓ, కనిగిరి అసిస్టెంట్ డైరెక్టర్ ఆది లక్ష్మి, శివనాయక్, కొండపి ఏఎస్డబ్ల్యూఓ జాన్ ప్రసాద్, బేస్తవారిపేట ఏఎస్డబ్ల్యూఓ రామకృష్ణారెడ్డి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం: తన స్నేహితులతో కలిసి గంజాయి దమ్ము పీకుతూ మరో రౌండ్ ఇవ్వలేదని యువకుడు పోలీస్ స్టేషన్ కాంపౌండ్‌లో ఉన్న సెల్ టవర్ ఎక్కిన సంఘటన శనివారం మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి చుక్కలు చూపించిన ఆ యువకుడు కిందికి దిగివచ్చిన తరువాత గంజాయి ఇప్పించండి సార్ అని ఎస్సై దేవకుమార్ను అడిగాడు. స్థానిక తిరుమలగిరి కాలనీకి చెందిన ఉడతల హనుమంతు తన స్నేహితులతో కలిసి గంజాయి తాగుతున్నాడు. చివరగా తనకు దమ్ము ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి అక్కడ ఉన్న టవర్ ఎక్కాడు. తనకు గంజాయి ఇప్పిస్తేనే తాను కిందికి దిగివస్తానని, లేకుంటే కిందికి దూకుతానని పోలీసులను బెదిరించాడు. అక్కడికి చేరిన పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది హనుమంతును కిందికి దించారు. కాగా హనుమంతు పుటుగా మద్యం తాగి టవర్ ఎక్కాడని పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం గమనార్హం. నీకు ఏమి కావాలని కిందికి దిగివచ్చిన ఆ యువకుడిని ఎస్సై ప్రశ్నించగా మద్యం కావాలని అడిగాడని ఆ ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. మత్తులో ఉన్న హనుమంతును 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. -
ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026
చౌక దుకాణాలే రేషన్ మాఫియాకు అడ్డాగా మారిపోతున్నాయి..అధికార పార్టీ టీడీపీ నేతల కనుసన్నలో నడుస్తున్న ఈ దుకాణాలకు వెళ్తున్న లబ్ధిదారులకు వింత పరిస్థితి ఎదురవుతోంది. బియ్యం లేవు.. వేలి ముద్రలు వేసి ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లండంటూ హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే దాడులకు తెగబడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా పేదల బియ్యాన్ని కొల్లగొడుతున్న రేషన్ మాఫియా పోర్టుల ద్వారా విదేశాలకు తరలించి రూ.కోట్లు గడించి జేబులు నింపుకుంటున్నారు. ఈ తంతు అధికారులకు తెలిసినా ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, మామూళ్ల మత్తులో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క కందుకూరు నియోజకవర్గం, పరిసర నియోజకవర్గాల నుంచి దాదాపు 1200 టన్నుల మేర బియ్యం పక్కదారి పడుతోంది.పేదోడి ముద్దనుమింగేస్తున్న మాఫియా..మధ్య వ్యాపారులు మిల్లర్లు రూ.18 నుంచి 20 వరకు ఇస్తారు. రైస్ మిల్లుల్లో పాలిష్ పట్టి నేరుగా కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారు. అక్కడ కేజీకి రూ.30 నుంచి రూ.35 వరకు విక్రయిస్తున్నారు. పాలిష్ పట్టిన మిల్లు నిర్వాహకులకు కేజీకి రూపాయి ఇస్తారు. ఇలా సరాసరి కేజీకి రూ.15 వరకు సిండికేట్‌కు లాభం వస్తుంది. ఈ లాభాలన్నీ నియోజకవర్గ అధికార పార్టీ పెద్దలకు చేరుతుంది. నియోజకవర్గం నుంచి ప్రతి నెలా సుమారు 800 నుంచి 900 టన్నులు బియ్యం వరకు పక్కదారి పడుతోందని తెలుస్తోంది. సమీప నియోజకవర్గాల నుంచి మరో 200 నుంచి 300 టన్నులు పోర్టుకు చేరుతోందని సమాచారం. మధ్యవర్తులు, వాహనాల ఖర్చులు అన్ని పోను ఎలా చేసుకున్నా నెలకు కోటి రూపాయలు సిండికేట్ జేబుల్లోకి చేరుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వైఎస్సార్ సీపీ నేత హత్య కేసు ముమ్మర విచారణ
● వివరాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్, క్లూస్ టీమ్‌లు సీఎస్‌పురం (పామూరు): వైఎస్సార్ సీపీ నేత మిరియం బాబుచౌదరి (42) శుక్రవారం దారుణ హత్యకు గురైన నేపథ్యంలో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. మండలంలోని పెద్దగోగులపల్లెలో పామూరు సీఐ వినోద్‌కుమార్ పర్యవేక్షణలో శనివారం విచారణ చేపట్టారు. హత్య జరిగిన ప్రాంతంలో గుంటూరు ఫోరెన్సిక్ బృందం, కనిగిరి క్లూస్ టీమ్‌లు రక్తనమూనాలు, వేలిముద్రలు సేకరించాయి. నిందితుడు హత్యకు వాడిన కత్తి, ఇతర ఆధారాలు పోలీసు అధికారులు సేకరించారు. దీనిపై సీఐ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా మిరియం బాబుచౌదరి హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితులను అరెస్టు చేసి వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. -
టోల్‌ప్లాజా వద్ద వసూల్ రాజా!
టంగుటూరు: టంగుటూరు టోల్ ప్లాజా అడ్డాగా ఒక రవాణా శాఖ అధికారి అక్రమ వసూళ్లకు తెరలేపాడు. శనివారం సింగరాయకొండలో సంత కావడంతో శుక్రవారం రాత్రి 1 గంట నుంచి సంతకు తరలించడానికి ఆవులను తరలించే ఆటోలు, గొర్రెల లారీలు, వరి కోత మిషన్లు, పశువుల లారీలకు ఒంగోలు వైపు నుంచి వందల సంఖ్యలో వస్తున్నాయి. అదే అదునుగా చూసుకున్న రవాణా శాఖ అధికారి ఆవుల ఆటోల వద్ద రూ.500, గొర్రెల లారీల వద్ద రూ.2 వేలు, వరికోత మిషన్ల వద్ద రూ.500, పశువుల లారీల వద్ద రూ.2 వేలు ముక్కు పిండి మరీ వసూలు చేశారు. ఏదైనా వాహనం నిబంధనలు అతిక్రమిస్తే చలానాలు వేయాలి. కానీ వాటికి సంబంధించినవేవీ లేకుండా వసూళ్లకు పాల్పడుతున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. అసలే టోల్‌ప్లాజా సర్వర్ లోపంతో వాహనాలు బారులు తీరి వాహనదారులు ఇబ్బంది పడుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా రవాణా శాఖ అధికారి వలన ట్రాఫిక్ జామై వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మార్కాపురం రూరల్: మార్కాపురం మండలం చింతగుంట్ల సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెం గ్రామానికి చెందిన చౌడవ కోటేశ్వరరావు (55)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి మేడూరి నాగమల్లేశ్వరరావుగా తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగమల్లేశ్వరరావు తన స్వగ్రామం మార్కాపురం మండలం ఎల్బీఎస్ నగర్లో ఉన్న పొలం ఆన్లైన్ పనుల కోసం తన స్నేహితుడు కోటేశ్వరరావుతో కలిసి బైకుపై నరసరావుపేట నుంచి బయల్దేరాడు. చింతగుంట్ల సమీపంలో బైపాస్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్లోకి వెళ్లేందుకు ఒక్కసారిగా మోటార్ సైకిల్ మలుపు తిప్పాడు. అదే సమయంలో శ్రీశైలం వైపు నుంచి గిద్దలూరు దిశగా వెళ్తున్న కారు వెనుక నుంచి వెగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ నడుపుతున్న కోటేశ్వరరావుకు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగమల్లేశ్వరరావుకు స్వల్ప గాయాలుకాగా స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మార్కాపురం రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ఉద్యమం
కందుకూరు: ప్రజా రవాణా వ్యవస్థలో ప్రధానరంగమైన ఆర్టీసీ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందని, ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రభుత్వ యత్నాలను అడ్డుకుంటామని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం స్థానిక డిపో వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సులు కొనే ప్రతిపాదనను ప్రభుత్వం చేస్తోందని, దీని ద్వారా ఆర్టీసీ డిపోలను ఖాళీ చేయించే కుట్రకు ప్రభుత్వం తెరలేపుతోందన్నారు. విద్యుత్ బస్సులను పూర్తిగా ఆర్టీసీ సంస్థకే అప్పగించాలన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 60 శాతం పోస్టులను భర్తీ చేయాలన్నారు. సీ్త్ర శక్తి పథకం విజయవంతం కావాలంటే 3 వేల కొత్త బస్సులను కొని ఆర్టీసీకి ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న డీఆర్సీ అరియర్స్‌ను క్లియర్ చేయడంతో పాటు, 12వ పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ మాత్రమే నడిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు మహేష్‌బాబు, గ్యారేజీ అద్యక్ష, కార్యదర్శులు స్వామి, రహంతుల్లా, సిసిఎస్ డిలిగేట్ నల్లూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే సహించం పొదిలి: ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రభుత్వ యత్నాలను అడ్డుకుంటామని స్థానిక ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చెప్పారు. స్థానిక ఆర్టీసీ గ్యారేజీ గేటు వద్ద మహ్మద్ అబ్దుల్ బాజీ అధ్యక్షతన శనివారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటుకు అప్పగించడం ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ఎత్తుగడలో భాగమేనని విమర్శించారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరిట డిపోలను ఖాళీ చేసి, ఉద్యోగులను ఇతర డిపోలకు తరలించే విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ అరియర్స్, కొత్త డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ వెంటనే చెల్లించాలన్నారు. ధర్నాలో డిపో గౌరవాధ్యక్షుడు ఎం.షరీఫ్, స్టేట్ కమిటీ సభ్యులు పి.కొండలరావు, పీఎన్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, డిపో సెక్రటరీ పి.ఓబులేసు, ఎంఎన్.మీరా, బ్రహ్మయ్య, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి స్వామికి సమస్యల ఏకరువు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ గ్రామ పంచాయతీలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పాల్గొనగా, స్థానిక ప్రజలు సమస్యలు ఏకరువు పెట్టారు. స్థానిక ఎస్సీకాలనీకి చెందిన ఉపాధి హామీ పథకం మహిళా కూలీలు తమ కాలనీలో తాగునీటి సమస్య ఉందని, ఇటీవల బోర్లు వేసినప్పటికీ వేసవి కావడంతో చాలడం లేదని మంత్రికి తెలిపారు. రామతీర్థం నీరు గ్రామానికి వస్తున్నాయే తప్ప ఎస్సీకాలనీకి రావడం లేదన్నారు. రామతీర్థం నీరు ఎస్సీకాలనీ వరకు వచ్చేలా పైపులైను వేయాలని కోరారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, మురుగునీరు సక్రమంగా పారడం లేదని, మురుగు కాల్వలు నిర్మించాలని మంత్రిని కోరారు. తాతయ్య ఎస్టీకాలనీ వద్ద గల మేళం వాగు చెరువుకు ఉన్న రెండు తూముల నుంచి నీరు లీకవుతోందని, కొత్త తూములు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మంత్రి స్వామి మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తూతూమంత్రంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర... రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాతసింగరాయకొండలో తూతూమంత్రంగా జరిగిందన్న విమర్శలు వినిపించాయి. గ్రామంలో మూడు నెలలకుపైగా పారిశుధ్య కార్మికులు లేరని, ఈ కార్యక్రమం కోసం ముందు రోజు ఇద్దరిని పనిలోకి తీసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా జంట గ్రామాలైన మూలగుంటపాడు నుంచి ఇద్దరిని, సింగరాయకొండ నుంచి ఆరుగురిని తీసుకొచ్చి కార్యక్రమాన్ని మమ అనిపించారని, మంత్రి స్వామి కూడా రోడ్లు శుభ్రం చేసే కార్యక్రమం కాకుండా రోడ్లు తిరిగే కార్యక్రమం చేశారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య కార్మికులు లేకపోవటంతో గ్రామ పంచాయతీకి కేటాయించిన ట్రాక్టరు గ్రామ సచివాలయం వద్దే సంవత్సర కాలంగా నిరుపయోగంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. టీడీపీలో బయటపడిన వర్గ విభేదాలు... స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయన్న ప్రచారం మండలంలో జోరుగా సాగుతోంది. పాత సింగరాయకొండ గ్రామ పంచాయతీ ఆ మండల టీడీపీ అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య స్వగ్రామం. గ్రామ పంచాయతీలో గ్రావెల్ మాఫియా ప్రధాన సూత్రధారులైన మించల బ్రహ్మయ్య, గాలి హరిబాబు రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నారు. కొంత కాలంగా ఈ రెండు వర్గాలు ఉప్పు–నిప్పుగా ఉన్నాయి. మంత్రి స్వామి రాక సందర్భంగా గాలి వర్గం వేసిన ఫ్లెక్సీలలో మించల బ్రహ్మయ్య ఫొటో వేయకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల గాలి హరిబాబు తన వర్గాన్ని, గ్రావెల్ సామ్రాజ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు తన బంధువులను పార్టీలో చేర్చుకోవటానికి ఆసక్తి చూపగా, ఆ ప్రయత్నానికి మించల బ్రహ్మయ్య అడ్డుపడ్డాడన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. గాలి వర్గం బలపడితే తనకు తలనొప్పి అవుతుందని బ్రహ్మయ్య భావిస్తున్నాడని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. శనివారం కార్యక్రమం గాలి వర్గం నిర్వహించగా, బ్రహ్మయ్య వర్గం దూరంగా ఉంది. చాలా మంది నాయకులు కూడా హాజరు కాలేదని, దీనిపై మంత్రి స్వామి కూడా అసహనం వ్యక్తం చేశారని పార్టీలో చర్చ నడుస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా ఉపాధి హామీ పథకం కూలీలకు ముందుగానే మస్టర్లు వేసి వారందరినీ ట్రాక్టర్ల ద్వారా కార్యక్రమానికి తరలించారని చర్చించుకుంటున్నారు. దీనికితోడు కొంతకాలంగా మంత్రి స్వామి, దామచర్ల సత్య ఇద్దరూ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని, కానీ, శనివారం మంత్రి స్వామి మాత్రమే పాల్గొన్నారని, వారిద్దరి మధ్య కూడా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకే సత్య వర్గం కూడా స్వామి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం ఉంది. స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో టీడీపీలోని వర్గ విభేదాలు బయటపడ్డాయని మండలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పాత సింగరాయకొండలో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న మంత్రి స్వామి ఉపాధి కూలీలతో కార్యక్రమం నిర్వహణ పక్క పంచాయతీల నుంచి పారిశుధ్య కార్మికుల తరలింపు బయటపడిన టీడీపీలోని వర్గ విభేదాలు మండలస్థాయి నాయకులపై మంత్రి స్వామి అసహనం -
డీజిల్ భారం..!
మార్కాపురం: ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో ఆర్టీసీపై అదనపు భారం పిడుగు పడింది. అసలే నష్టాల బాటలో నడుస్తున్న ఏపీటీడీ (ఆర్టీసీ) పరిస్థితి డీజిల్ ధర పెంపుతో మరింత దయనీయంగా మారింది. రోజుకు సుమారు 1.30 లక్షల రూపాయల భారం పడుతుండగా, నెలకు సగటున 40 లక్షల రూపాయల భారం పడుతోంది. శుక్రవారం ఉదయం ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. డీజిల్ లీటరుపై 3.16 రూపాయలు, పెట్రోల్ 3.14 రూపాయలు పెంచాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 7 డిపోలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో అద్దంకి, కందుకూరు, ఒంగోలు డిపోలు ఉన్నాయి. మార్కాపురం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పొదిలి డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలోని బస్సులు రోజూ 2,12,124 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. దీంతో డీజిల్ కూడా రోజుకు సుమారు 38,515 లీటర్లు వినియోగిస్తున్నాయి. లీటర్ ధర రూ.3.16 పెరగడంతో ఆ భారం ఆర్టీసీపై పడింది. ఇవి కాక ఆయా డిపోల్లో హైర్ బస్సులు కూడా తిరుగుతున్నాయి. ఇప్పటికే నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీకి పెరిగిన డీజిల్ ఖర్చులు అదనపు భారం కానున్నాయి. లీటరు డీజిల్ సగటున 6 కిలోమీటర్లలోపే వస్తోంది. కొన్ని బస్సులకు 5 కిలోమీటర్లు మాత్రమే వస్తోంది. దీంతో నెలకు సుమారు 40 లక్షల రూపాయలు ఆర్టీసీపై అదనపు భారం పడుతోంది. ఆయిల్ కంపెనీలు మరోసారి ధరలు పెంచుతాయన్న వార్తలు వినిపిస్తుండటంతో అదనపు భారం మళ్లీ పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డీజిల్ ధరల పెరుగుదలతో జిల్లాలో ఆర్టీసీకి నెలకు రూ.40 లక్షల అదనపు భారం ఉమ్మడి జిల్లాలో 7 ఆర్టీసీ డిపోలు ప్రతిరోజూ 2,11,674 కిలోమీటర్ల ప్రయాణం మొత్తం బస్సుల సంఖ్య 527 డీజిల్ వినియోగం 38,515 లీటర్లు డిపో బస్సుల తిరిగే డీజిల్ వాడకం సంఖ్య కిలోమీటర్లు (లీటర్లలో) మార్కాపురం 88 33,661 6124 పొదిలి 62 23,870 4160 కనిగిరి 89 36,768 6658 గిద్దలూరు 64 27,646 4910 అద్దంకి 39 15,557 2783 కందుకూరు 78 31,463 5540 ఒంగోలు 107 43,159 8338 మొత్తం 527 2,12,124 38,515 -
ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి
ఒంగోలు సిటీ: ఓటర్ల జాబితా సవరణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ (ఎస్ఐఆర్) పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ప్రకాశం జిల్లాలోని వైఎస్సార్ సీపీ బీఎల్ఏ లకు ఓటర్ల ప్రత్యేక జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పై నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, అబ్జర్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, మండల బూత్ అధ్యక్షులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ జూన్ 15వ తేదీ నుంచి ఎస్ఐఆర్ ప్రారంభమవుతుందని, ఈలోపే అన్ని నియోజకవర్గాల్లో బూత్ ఏజెంట్లను నియమించుకొని రిటర్నింగ్ అధికారికి సమర్పించాలన్నారు. ప్రతి ఓటరును బీఎల్ఓలతో కలిసి వెరిఫై చేసి డూప్లికేట్ ఓట్లను, డెత్ ఓటర్లను తొలగించాలని, ఈ విషయంలో అధికార పార్టీ ఓట్లను జాగ్రత్తగా పరిశీలించాలని కోరారు. ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని, ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి సంతకం చేసి బీఎల్ఓ లకు ఇవ్వాలని సూచించారు. డూప్లికేట్ ఓట్ల తొలగింపులు చేపడతారని, ఇందులో నిజమైన ఓటర్ల తొలగింపు జరిగితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. మార్పులు, చేర్పులు, మరణించినవారి పేర్లను పరిశీలించి తొలగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రతి బీఎల్ఏ 2025 ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జోనల్ ఇన్చార్జ్ పుత్తా శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఎస్ఐఆర్ పై దృష్టి పెట్టి పనిచేస్తుందని, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జాగ్రత్తలు తీసుకొని ఓటర్ల సవరణ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఓటుని పరిశీలించాలన్నారు. అనేక రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ వల్ల ముఖ్యమంత్రులే ఓడిపోయారని, ప్రతి ఓటరు మనకు ముఖ్యమని, దానికి అనుకూలంగా పని చేయాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ నిర్వహించాలన్నారు. ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ లో 34 లక్షలు, గుజరాత్లో 68 లక్షలు, తమిళనాడులో 74 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 91 లక్షల ఓట్లను తొలగించారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, మాజీ మంత్రి కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కసుకుర్తి ఆదెన్న, కేవీ.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షులు కఠారి శంకరరావు, మండల పార్టీ అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, దుంపా చెంచిరెడ్డి, మన్నే శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, మండల నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు. -
బాలుడు అనుమానాస్పద మృతి
అర్ధవీడు: ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని రంగాపురం ఎస్సీ కాలనీలో శనివారం జరిగింది. అందిన వివరాల ప్రకారం..అర్ధవీడు మండలం రంగాపురం ఎస్సీ కాలనీకి చెందిన గడెం అభిలాష్ (17) అనే బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అభిలాష్ తల్లిదండ్రులు మరణించడంతో రంగాపురంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ కంభం పట్టణంలో ఐటీఐ చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అనూమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్సై శివ నాంచారయ్య సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● రూ.1.50 లక్షల నష్టం కొత్తపట్నం: మండలంలోని గుండమాల గ్రామం పెద్దపాలేనికి చెందిన పిన్ని లక్ష్మణరావుకు సంబంధించిన వేట సామగ్రి శనివారం అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. వంజరం, కనగుర్త చేపల వేటకు వినియోగించే మూడు టంగీస్ వలలు ఉదయం అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. ఒక వల పూర్తిగా కాలిపోగా, రెండు వలలు పాక్షికంగా కాలిపోయి పూర్తిగా పనికిరాకుండా పోయాయి. మొత్తం మూడు వలలు పనికిరాకుండా పోయాయని, వాటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ● కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పెద్దదోర్నాల: వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనుల వద్ద అస్సోం రాష్ట్రానికి చెందిన కార్మికుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన ఈ నెల 9వ తేదీన జరిగినట్లు భావిస్తుండగా సోదరుని ఫిర్యాదుతో శనివారం వెలుగు చూసింది. ఎస్సై వెంకట రమణయ్య అందించిన వివరాల ప్రకారం.. బసంత్‌కుమార్ రభ (36) పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో కార్మికుడిగా విధులు నిర్వహించేందుకు ఈ నెల 8వ తేదీన మండల పరిధిలోని కొత్తూరు వద్దకు వచ్చాడు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లోని కొల్లంవాగు వద్ద కార్మికుడిగా విధుల్లో చేరినట్లు సమాచారం. ఆ మరుసటి రోజు నుంచి అతను కనిపించకుండా మాయమయ్యాడు. బసంత్‌కుమార్ రభను పనిలో పెట్టుకున్న సదరు ఏజెంట్ ఈ విషయాన్ని అస్సోంలోని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అతని సోదరుడు సుమంత్కుమర్ రభ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్, బ్యాగు తదితర వస్తువులు అతనికి కేటాయించిన గదిలోనే వదిలి వెళ్లినట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. -
హైవేలపై బ్లాక్ స్పాట్ల పరిశీలన
● అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన డీటీసీ సుశీల ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్ స్పాట్లను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఆర్.సుశీల శనివారం పరిశీలించారు. పోలీస్ అధికారులు, జాతీయ రహదారుల అధికారులతో కలిసి ఎన్‌హెచ్–16 గుడ్లూరు సర్కిల్ పరిధిలోని మోచర్ల మొదలుకుని అద్దంకి సర్కిల్ పరిధిలోని మేదరమెట్ల వరకూ బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. ప్రమాదాలు జరిగేలా ఉన్న ప్రాంతాలు, ఇప్పటి వరకూ ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. ఈ సందర్భంగా డీటీసీ ఆర్.సుశీల మాట్లాడుతూ కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశాల మేరకు 5 బ్లాక్ స్పాట్లపై జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినట్లు చెప్పారు. జిల్లా మొత్తం మీద 23 బ్లాక్ స్పాట్లు ఉన్నాయన్నారు. 13 బ్లాక్ స్పాట్లను ఫిబ్రవరి నెలలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేశామన్నారు. మిగిలిన 10 బ్లాక్ స్పాట్లకుగానూ ఐదు బ్లాక్ స్పాట్లను జాయింట్ ఇన్స్పెక్షన్ చేశామన్నారు. జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన ప్రదేశాలలో ఉలవపాడు మండలం చాగొల్లు ఫ్లై ఓవర్, ఎన్ హెచ్–16లో గుడ్లూరు మండలం మోచెర్ల, తెట్టు, చేవూరు క్రాస్ రోడ్, ఎస్‌హెచ్ – 1678లో కందుకూరు మండలం ఓగూరు వద్ద ఆంజనేయ కోల్డ్ స్టోరేజ్ ప్రాంతాలు ఉన్నాయని వెల్లడించారు. అదేవిధంగా మేదరమెట్ల కొండ ప్రాంతం సమీపంలోని జాతీయ రహదారిని కూడా పరిశీలించి రహదారి ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి వాటిపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఎన్‌హెచ్ 16పై వాహన తనిఖీలు చేపట్టి వాహనంపై టార్పాలిన్ కట్టకుండా, సరైన రికార్డులు లేకుండా ఇసుక తోలుతున్న 4 ట్రాక్టర్లు, ట్రైలర్లను సీజ్ చేశారు. జాయింట్ ఇన్స్పెక్షన్లో ఎన్‌హెచ్–16 పీడీ అనీల్ కుమార్, ఎన్‌హెచ్–1678 అధికారులు, కందుకూరు డీఎస్పీ, సీఐ, దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, సీఐలు, రవాణా శాఖ ఒంగోలు కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) శ్రీనివాసరావు, దర్శి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ పరిశపోగు రవికుమార్, ఇతర పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యమం ఉధృతం
రైతులను ఆదుకునేందుకుఒంగోలు సబర్బన్: పొగాకు కొనుగోళ్లలో మాంద్యం సృష్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. ఐటీసీ గుత్తాధిపత్యంతో రైతులు నిలువునా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒంగోలు–2 వేలం కేంద్రాన్ని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు పార్టీ నాయకులతో కలిసి శనివారం సందర్శించారు. పొగాకు వేలం కేంద్రం–2లో పొగాకు వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. వేలం కేంద్రంలోని పొగాకు బోర్డు అధికారులతో, పొగాకు రైతులతో వేలం తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ పొగాకు వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తే కానీ గుత్తాధిపత్యాన్ని వహిస్తున్న ఐటీసీకి బుద్ధిరాదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా పొగాకు రూ.38 వేలు వరకూ కొనుగోలు చేశామని, ప్రస్తుతం పంట పండించాలంటే ఖర్చులు పెరిగి రూ.30 వేల వరకూ అవుతున్నాయని చెప్పారు. ఈ నష్టాన్ని రైతులు ఏవిధంగా భరిస్తారని నిలదీశారు. ఇదేవిధంగా ఉంటే రైతులు పొగాకు క్రాప్ హాలిడే ప్రకటిస్తే పొగాకు వ్యాపారులు ఏమవుతారని ప్రశ్నించారు. పొగాకు బోర్డు ఈడీని కలుస్తాం, వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారా కేంద్ర మంత్రులను కలిసి పరిస్థితిని వివరిస్తామన్నారు. లంచాలు మరిగి రైతులను గాలికి వదిలేశారు వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడొచ్చినా వ్యాపారుల పక్షాన ఉంటూ పర్సంటేజీలు దండుకోవటమే పనిగా పెట్టుకుంటున్నారన్నారు. ఈ ఏడాది కిలో పొగాకుపై రూ.80 దండుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం లంచాలు మరిగి రైతులను గాలికి వదిలేస్తుందని ధ్వజమెత్తారు. ఒక్క సిగరెట్టుకు రూ.0.70 పైసలు మాత్రమే ఖర్చవుతుందని, కానీ రూ.10 నుంచి రూ.20 వరకూ అమ్ముకొని కంపెనీలు అత్యధికంగా లాభాలు గడిస్తున్నాయన్నారు. రైతుల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు వేద్దామంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేవన్నారు. కనీసం కిలోకు రూ.200 కూడా రావటం లేదన్నారు. వేలం కేంద్ర పొగాకు రైతు నాయకుడు సునీల్ బాబు మాట్లాడుతూ టీడీపీకి చెందిన ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీకృష్ణదేవరాయలుతో పాటు మరికొంత ఎంపీలను కలిసి సమస్యను వివరించినా ప్రయోజనం లేదన్నారు. కార్యక్రమంలో మద్దిపాడు మాజీ ఏఎంసీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు మన్నె శ్రీనివాసరావు, నాగులుప్పులపాడు మండల పార్టీ అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ, మద్దిపాడు ఎంపీపీ కోటిరెడ్డి, సంతనూతలపాడు మండల పార్టీ అధ్యక్షుడు దుంపా చెంచి రెడ్డి, వేలం కేంద్రం పొగాకు రైతు నాయకుడు వడ్డెళ్ల ప్రసాదు, సునీల్ బాబు, వైఎస్ఆర్ సీపీ నాయకులు బొట్ల రామారావు, పాలడుగు రాజేష్ పాల్గొన్నారు. -
ఏసీబీ డీఎస్పీగా శిరీష
ఒంగోలు సిటీ: ఒంగోలు ఏసీబీ డీఎస్పీగా ఎస్.శిరీష శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల్లో అవినీతి పెరుగుతోందన్నారు. పింఛన్లు, రేషన్, భూమి సమస్యలు, మున్సిపల్ సేవలు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాల్లో కొంతమంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు ఇస్తే వారి పనులు తాము దగ్గరుండి రూపాయి ఖర్చు లేకుండా చేయిస్తామని తెలిపారు. అవినీతిని అరికట్టేందుకు ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు ఇవ్వాలన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్లయితే వెంటనే 9440446189, 9440446187, 8333925624 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చాన్నరు. మీ వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుతారని చెప్పారు -
రెండేళ్లలో కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత
చీమకుర్తి రూరల్: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. కూనంనేనివారిపాలెం గ్రామంలో ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం 25వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం రాత్రి నిర్వహించిన తిరునాళ్లలో వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రభపై పమిడి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో పాటు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, ఆరుగాలం అష్టకష్టాలు పడి పొగాకు పండించిన రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు. రైతన్నల పక్షాన వైఎస్సార్ సీపీ నాయకులు పోరాడితే వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడంలో చూపుతున్న శ్రద్ధ పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించడంలో లేదని విమర్శించారు. ప్రజలకు మాట ఇస్తే నెరవేర్చే వ్యక్తి జగనన్నే అని, ఎన్నికల సమయంలో ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి సంక్షేమ పథకాలు నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద ప్రజలకు అండగా సంక్షేమ పథకాలు అమలు చేసిన జగనన్నను ఎన్ని కష్టాలు వచ్చినా మనమందరం సమష్టి కృషితో మళ్లీ సీఎం చేసుకోవాలని అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలోనే రైతులకు అండ: మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి అందిందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించకుండా పేద ప్రజలను, మహిళలను, గిట్టుబాటు ధరలు ఇవ్వక రైతులను మోసగించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, గ్రామపార్టీ అధ్యక్షుడు యర్రగుంట్ల మోహన్, యర్రగుంట్ల వసంతరావు, బొడ్డపాటి హరిబాబు, నల్లూరి నారాయణ, మండల రైతు విభాగం అధ్యక్షుడు నల్లూరి రామచంద్రారావు, గోరంట్ల రామకృష్ణ, వేమూరి బాలకృష్ణ, పేరాబత్తిన పేరయ్య, పాటిబండ్ల గంగయ్య, సుందరరామిరెడ్డి, పాలడుగు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
2 ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగ చోరీ
తాళ్లూరు: పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేసి రాగితీగ చోరీ చేసిన సంఘటన తాళ్లూరు మండంలోని నాగంబొట్లపాలెం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన రైతులు సోము వెంకట నరసింహారెడ్డి, కె.పిచ్చిరెడ్డి, వెంకటరెడ్డి, నగేష్ తమ వ్యవసాయ బోర్ల కోసం ఏర్పాటు చేసుకున్న రెండు ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సుమారు 20 ఎకరాల్లో పశుగ్రాసం, వరి నారు సాగు చేశామని, ట్రాన్స్ఫార్మర్లు చోరీ కావడంతో పంటలు ఎండుముఖం పట్టే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోరీపై పోలీసులు, విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ● ప్రకాశం, మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు ● అర్ధరాత్రి బైకులపై చక్కర్లు కొడితే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరిక ఒంగోలు సిటీ: ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేసినట్లు ఎస్పీ హర్షవర్థన్‌రాజు పేర్కొన్నారు. రాత్రి సమయంలో అనవసరంగా, అనుమానాస్పదంగా తిరిగేవారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో 780 వాహనాలు తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 103 వాహనాలు, అలాగే మార్కాపురం జిల్లాలో 552 వాహనాలు తనిఖీ చేసి 133 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు ఈ–చలానా విధించినట్లు చెప్పారు. రాత్రి వేళ 11 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులు, చెడునడత కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చెప్పారు. నేరాల నియంత్రణతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
వివిధ హోదాల్లో వైఎస్సార్సీపీ నాయకుల నియామకం
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వారు వరుసగా స్టేట్ స్టూడెంట్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా దర్శికి చెందిన దుగ్గిరెడ్డి నారాయణరెడ్డిని, స్టేట్ స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీగా కనిగిరికి చెందిన మునగాల హరీశ్వరరెడ్డిని, స్టేట్ సోషల్ మీడియా వింగ్ సెక్రటరీగా మార్కాపురానికి చెందిన దగ్గుల సాగర్‌రెడ్డిని, స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీగా మార్కాపురానికి చెందిన గాయం వెంకటేశ్వరరెడ్డిని నియమించినట్లు తెలిపారు. అలాగే జిల్లా నూర్‌బాషా/దూదేకుల విభాగం ప్రెసిడెంట్‌గా కొండపికి చెందిన షేక్ రజియా హుస్సేన్‌ను, జిల్లా బీసీ సెల్ సెక్రటరీగా కనిగిరికి చెందిన వంకదారి వెంకటరాజా నియమించారు. అలాగే ఒంగోలు సిటీ మహిళా విభాగం ప్రెసిడెంట్ గా ఒంగోలుకు చెందిన ఎస్కే.రషుదా, ఒంగోలు నియోజకవర్గ మహిళా విభాగం ప్రెసిడెంట్ గా ఒంగోలుకు చెందిన బడుగు మాధవీలతను నియమించారు. ఒంగోలు సిటీ: ఒంగోలు ఏసీబీ డీఎస్పీగా ఎస్.శిరీష శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల్లో అవినీతి పెరుగుతోందన్నారు. పింఛన్లు, రేషన్, భూమి సమస్యలు, మున్సిపల్ సేవలు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాల్లో కొంతమంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు ఇస్తే వారి పనులు తాము దగ్గరుండి రూపాయి ఖర్చు లేకుండా చేయిస్తామని తెలిపారు. అవినీతిని అరికట్టేందుకు ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు ఇవ్వాలన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్లయితే వెంటనే 9440446189, 9440446187, 8333925624 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చాన్నరు. మీ వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుతారని చెప్పారు. మార్కాపురం టౌన్: రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో వర్క్ ఔట్సోర్సింగ్ పేరుతో అన్ని విభాగాల ప్రైవేటీకరణకు ప్రభుత్వం సిద్ధమైందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్క్ ఔట్ సోర్సింగ్ విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఔట్సోర్సింగ్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలను మున్సిపల్ కార్మికులకు వెంటనే అమలు చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బరాయుడు, జీ హరి, చెన్నకేశవులు, చిన్నరాయుడు, శ్రీను, దాసు, రషీదు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ బలోపేతమే లక్ష్యంగా కమిటీల ఏర్పాటు
సింగరాయకొండ: నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలోపేతమే లక్ష్యంగా మండల, గ్రామ కమిటీలను పూర్తి చేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆరు మండలాల మండల పార్టీ అధ్యక్షులకు దిశా నిర్దేశం చేశారు. డాక్టర్ సురేష్ శుక్రవారం మార్కాపురంలోని జార్జి ఇంజినీరింగ్ కాలేజి నుంచి జూమ్ మీటింగ్‌లో వర్చువల్ గా మండల పార్టీ అధ్యక్షులకు పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేశారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ మండల, గ్రామ కమిటీల నియామకం పూర్తి చేయటం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ప్రతి గ్రామంలో పర్యటించి గ్రామ కమిటీలను పూర్తి చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయానికి కృషి చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు మసనం వెంకట్రావు, పిన్నిక శ్రీనివాసరావు, చింతపల్లి హరిబాబు, బచ్చల కోటేశ్వరరావు, దుద్దుగుంట మల్లిఖార్జునరావు, ఇంకొల్లు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
హమ్మయ్యా.. బతికిపోయాం!
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారులు మంటలు వ్యాపించిన ప్రాంతంలో కాలిపోయిన పెయింట్ డబ్బాలు ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్తున్న ప్రయాణికులు ఉలవపాడు: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధమై 14 మంది సజీవ దహనం కాగా, మరో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడిన సంఘటన మరువక ముందే అదే తరహా ఘటన ఉలవపాడు మండలంలో చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి తిరుపతికి 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో ఉలవపాడు మండల పరిధిలోని రాజుపాలెం–చాగల్లు మధ్య జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గురైన బస్సును ఓవర్ టేక్ చేస్తున్న మరో వాహనం డ్రైవర్ జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. కావేరి ట్రావెల్స్ బస్సు పంక్చర్ కాగా అలాగే దూసుకెళ్తుండటంతో ఒత్తిడి అధికమై తొలుత పొగలు, కాసేపటికే మంటలు వ్యాపించాయి. ప్రయాణికులంతా హుటాహుటిన దిగి తమ లగేజీని తీసేసుకోవడంతో ఆస్తి నష్టం కూడా తప్పింది. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేవు బస్సు కళ్ల ముందే దగ్ధమవడాన్ని చూసిన ప్రయాణికులు భీతిల్లారు. దారిన వెళ్తున్న వ్యక్తి అప్రమత్తం చేయకుంటే తమ పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోందని ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. బస్సులో మంటలు ఆర్పేందుకు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేవని, అత్యవసర ద్వారం తెరిచే టూల్ కిట్ కూడా కనిపించలేదని, అందరం ముందు ద్వారం నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ప్రయాణికులు పేర్కొన్నారు. బస్సులో ఉన్న కొంత నీటిని టైర్ వద్ద మంటలపై పోసినా చల్లారకపోవడంతో ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేసినప్పటికీ ప్రయాణికులకు సమాధానం కరువైంది. మంటలు చెలరేగిన బస్సు టైరు పక్కనే ఉండే లగేజీ క్యాబిన్లో పెయింట్ డబ్బాలు ఉన్నాయని, వీటి మూలంగానే వేగంగా మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయి ఉంటుందని ప్రత్యక్ష సాక్షులైన ప్రయాణికులు తెలిపారు. ప్రయాణికుల క్షేమం గాలికి.. ప్రమాద సమయంలో బస్సు నుంచి దిగిన ప్రయాణికులను ఎవరూ పట్టించుకోలేదు. కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోగా, అదే సంస్థకు చెందిన బస్సులు హైవేలో వెళ్తున్నా ఒక్కటీ ఆపలేదు. ప్రయాణికులు చేతులెత్తి అర్థిస్తున్నా స్పందన లేకపోవడంతో శాపనార్థాలు పెడుతూ ప్రైవేట్ కార్లు, ఇతర వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లారు. అధికారుల పరిశీలన ఘటనా స్థలాన్ని కందుకూరు ఆర్టీఓ నాగలక్ష్మి, కందుకూరు సీఐ అన్వర్ బాషా, ఉలవపాడు ఎస్సై సుబ్బారావు పరిశీలించారు. బస్సు డ్రైవర్ల వద్ద ప్రమాద వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హైవే రోడ్ సేఫ్టీ పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఉలవపాడు మండలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు 36 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు సురక్షితం బస్సులో కనీస వసతులు లేవు బస్సు చాలా పాతగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే బయటకు వెళ్లడానికి అత్యవసర ద్వారం కూడా లేదు. మంటలు ఆర్పేందుకు మంచి నీళ్లు పోశారు. హైవేలో వెళ్తున్న మరో బస్సు నుంచి కార్బన్ డయాకై ్సడ్ సిలిండర్లు తీసుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు తప్ప ఈ బస్సులో మాత్రం సిలిండర్లు ఉంచలేదు. బస్సు పంక్చర్ అయి పెద్ద శబ్ధం వచ్చింది. కొంత సేపటి తర్వాత పొగలు వస్తుండటంతో వెనుక వస్తున్న వారు గమనించి అప్పమత్తం చేశారు. మొత్తం మీద పెద్ద గండం నుంచి బయటపడ్డాం. – వినోద్, హోటల్ వ్యాపారి, హైదరాబాద్ -
ఈనాం భూములకు పట్టాలివ్వండి
సంతమాగులూరు(అద్దంకి): మండలంలోని కొమ్మాలపాడు, సజ్జాపురం, మక్కెనవారిపాలెం తదితర గ్రామాల్లోని 4,800 ఎకరాల ఈనాం భూములకు పట్టాలు ఇప్పించాలని కలెక్టర్ రాజాబాబును కొమ్మాలపాడు గ్రామస్తులు కోరారు. మండలంలోని సజ్జాపురం గ్రామంలో కలెక్టర్ శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గ్రామంలో భూములకు సంబంఽధించి వచ్చిన అర్జీలను రీసర్వే సమయంలో సరిచేస్తామని, మండల సర్వేయర్ సాంబశివరావు, వీఆర్ఓ సామ్యేల్ అర్జీదారులకు చెప్పడంపై మండిపడ్డారు. సమస్యలు ఏకరువు మట్టికొండకు చుట్టూ ఉన్న భూమిని ఆక్రమించి అందులోకి జీవాలను తోలుకెళ్లనీయడం లేదని, మట్టి కోసం వెళ్తున్న వారిని అడ్డగిస్తున్నారని స్థానికులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నూతన పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ బైకు బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. సబ్‌స్టేషన్ నుంచి బల్లికురవ మండలంలోని చెన్నుపల్లి, మార్టూరు వెళ్లడానికి ఉన్న మట్టిరోడ్డును పొడిగించి మెటల్ రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఏల్చూరు నుంచి సజ్జాపురం కూడలికి నెహ్రు నగర్ రోడ్డును కలపాలని కోరారు. కొప్పరం పంచాయతీ పరిధిలో రెండు గ్రానైట్ క్వారీల నుంచి వచ్చే కాలుష్యాన్ని తాము భరిస్తున్నామని, ఆదాయం మాత్రం కొప్పరం పంచాయతీ వెళ్తోందని, అలా కాకుండా తమ పంచాయతీకి ఆదాయం కేటాయించాలని కోరారు. పల్లె నిద్ర కార్యక్రమంలో జేసీ కల్పనాకుమారి, అద్దంకి ఆర్డీఓ జాన్సన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్‌రెడ్డి, అద్దంకి ఆర్డీఓ జాన్సన్, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రవిబాబు, ఎంపీడీఓ జ్యోతిర్మయి తదితర అఽధికారులు పాల్గొన్నారు. పల్లె నిద్రలో కలెక్టర్ రాజాబాబుకు కొమ్మాలపాడు రైతుల వినతి గ్రానైట్ ఆదాయం రెవెన్యూ గ్రామానికి జమ చేయాలని వేడుకోలు -
అప్రమత్తంగా ఉండాలి
ఓటర్ల జాబితా సవరణపైమార్కాపురం: ఓటర్ల జాబితా సవరణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్(ఎస్ఐఆర్)పై వైఎస్సార్ సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సూచించారు. శుక్రవారం పట్టణంలోని విహారి లాడ్జిలో మార్కాపురం పట్టణ, రూరల్, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి టౌన్, రూరల్ మండలాల వైఎస్సార్ సీపీ బీఎల్ఏలకు ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ శ్రేణులందరికీ స్వగ్రామంలో ఓటు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉంటే వారి ఓటును స్వగ్రామంలో మాత్రమే ఉండేలా చూడాలన్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు, అభిమానుల ఓట్లను అధికార పార్టీ వారు కావాలని తొలగించే అవకాశం ఉందని, అటువంటి వాటిని గుర్తించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేద్దామని, మళ్లీ ఓటుహక్కు కల్పించేందుకు పోరాడుదామని చెప్పారు. బీఎల్ఏలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. 2002లో ఓటర్ల రివిజన్ జరిగిందని, మళ్లీ ఇప్పుడు జరుగుతోందని చెప్పారు. 2002, 2025 ఓటర్ల జాబితాను పరిశీలించి రివిజన్ చేస్తారన్నారు. ప్రతి ఓటరూ ఎన్యుమరేషన్ ఫారాన్ని, ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి సంతకం చేసి బీఎల్ఓలకు ఇవ్వాలని సూచించారు. డూప్లికేట్ ఓట్ల తొలగింపులు చేపడతారని, ఇందులో నిజమైన ఓటర్ల తొలగింపు జరిగితే తన దృష్టికి తేవాలని అన్నా రాంబాబు స్పష్టం చేశారు. మార్పులు, చేర్పులు, మరణించిన వారి పేర్లను పరిశీలించి తొలగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి జోనల్ ఇన్చార్జి పుత్తా శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్తో యూపీలో 2.85 కోట్ల మంది, మధ్య ప్రదేశ్‌లో 34 లక్షలు, గుజరాత్లో 68 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 91, తమిళనాడులో 74 లక్షల మంది ఓటర్లను తొలగించారన్నారు. ముందుగా ఓటర్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తారని, దానిని గమనించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల అధికారికి ఇవ్వాలన్నారు. ఓటర్ మ్యాపింగ్ ప్రకారం రివిజన్ జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాను దగ్గరపెట్టుకోవాలని, నిశితంగా పరిశీలించాలని, తొలగించిన ఓటర్లలో మరణించిన వారివి కాకుండా ఇతరుల ఓట్లు ఎవరైనా ఉన్నాయేమో బీఎల్ఏలు పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో అన్నా కృష్ణచైతన్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు షంషేర్ ఆలీబేగ్, కేవీ రమణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, పార్టీ పోలింగ్ బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పత్తి రవిచంద్ర నియోజకవర్గంలోని ఆయా మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు సలీమ్, చెంచిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, శంకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, జెడ్పీటీసీ నారు బాపన్‌రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు కాశయ్య, సోషల్ మీడియా అధ్యక్షుడు రఫీ, పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యంరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పుత్తా శివశంకర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్నా రాంబాబు మార్కాపురం నియోజకవర్గ బీఎల్ఏలకు అవగాహన హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జోనల్ ఇన్‌ఛార్జి పుత్తా శివశంకర్‌రెడ్డి -
భూ తగాదాలో ఒకరు దారుణ హత్య
సీఎస్‌పురం(పామూరు): భూ వివాదం విషయంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం సీఎస్‌పురం మండలంలోని పెద్దగోగులపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఈ హత్య అనంతరం భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు, మృతుని తండ్రి కథనం మేరకు.. గోగులపల్లి గ్రామ సమీపంలో సర్వే నంబర్ 362/2లో 4 ఎకరాల భూమికి సంబంధించి మిరియం వెంకటేశ్వర్లు, అదే గ్రామానికి చెందిన చిలంకూరి రమేష్‌రెడ్డి మధ్య వివాదం తలెత్తగా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో పలుమార్లు పెద్దల వద్ద పంచాయితీ పెట్టి చర్చించారు. కాగా, గురు, శుక్రవారాల్లో చిలంకూరి రమేష్‌రెడ్డి సదరు పొలంలో పని చేయిస్తుండగా మిరియం వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు బాబు పనులను అడ్డుకున్నారు. కోర్టులో కేసు ఉండగా పనులు చేయడం సరికాదని చెప్పి ఇంటికొచ్చారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం మిరియం వెంకటేశ్వర్లు తన పొలానికి బైక్‌పై రమేష్‌రెడ్డి ఇంటి మీదుగా వెళ్తుండగా రమేష్‌రెడ్డి మడ్డుకత్తితో దాడికి యత్నించాడు. వెంకటేశ్వర్లు తృటిలో తప్పించుకోగా గొంతు వద్ద స్వల్ప గాయమైంది. రమేష్‌రెడ్డి, అతనితోపాటు ఉన్న కొటాలుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాడి గురించి కుమారుడు బాబుకు తెలియజేయడంతో బైక్‌పై భార్గవ్ అనే యువకుడితో కలిసి ఊళ్లోకి వస్తున్నాడు. రోడ్డు వైపు వెళ్తున్న రమేష్‌రెడ్డి బృందానికి బాబు ఎదురపడగా అక్కడే నిలువరించారు. కొటాలుపల్లెకు చెందిన వ్యక్తులు బాబును బంధించగా రమేష్‌రెడ్డి కత్తితో గొంతు, చాతీ మధ్య పొడిచాడు. దీంతో బాబు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. బాబుతో బైక్‌పై వచ్చిన యువకుడు భయాందోళనకు గురై కేకలు వేసి సమీపంలోని వారిని పిలిచాడు. బాబును కారులో పామూరు సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతునికి భార్య అనసూయ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడు వ్యవసాయం చేస్తుంగా, నిందితుడు ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. సంఘటన స్థలాన్ని పామూరు సీఐ దుర్గాసి వినోద్‌కుమార్, ఇన్చార్జి ఎస్సై కట్టా అనూక్ పరిశీలించారు. పామూరు సీహెచ్‌సీలో మృతుడి తండ్రి, క్షతగాత్రుడు మిరియం వెంకటేశ్వర్లుకు ప్రథమ చికిత్స అందించారు. వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ పరామర్శ మిరియం బాబు మృతి చెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానిక జెడ్పీటీసీ మేకల శ్రీనివాసయాదవ్, వైస్ ఎంపీపీ దుగ్గిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పలువురు వైద్యశాలకు చేరుకున్నారు. బాబు మృతదేహాన్ని పరిశీలించి, మృతుని తండ్రి వెంకటేశ్వర్లును పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎస్‌పురం మండలం గోగులపల్లి గ్రామంలో ఘటన హత్యానంతరం గ్రామంలో భయానక వాతావరణం -
శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026
çßæÐ]l$ÃĶæ*Å..º-†-MìS´ùĶæ*… ♥ ఉలవపాడు మండలంలో జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. 36 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. రక్షిత మంచినీటి పథకాలు దెబ్బతింటున్నాయి జరుగుమల్లి మండలంలో పాలేరులో ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు. పాలేరు పరిసరాల్లో భూగర్భ జలాలు అడుగంటి రక్షిత మంచినీటి పథకాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. జేసీబీ, టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా జరగటంతో పాలేరులో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల కారణంగా వరదల సమయంలో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. – యర్రా రామకృష్ణ, వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం కొండపి నియోజకవర్గ అధ్యక్షుడు ఇసుక తవ్వకాలతో వరద భయం మండలంలోని పాలేరులో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. వీరు ఇష్టారాజ్యంగా జేసీబీతో తవ్వి భారీ గుంతలు ఏర్పాటు చేయటంతో భూగర్భ జలాలు అడుగంటి రక్షిత మంచినీటి పథకాలకు నీరు సరఫరా కాని దుస్థితి ఉంది. ఇసుక తవ్వకాల వలన నది దిశ మార్చుకుని వరదల సమయంలో ఊరుపై వరదలు వచ్చే అవకాశం ఉంది. – పిన్నిక శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, జరుగుమల్లి మట్టి మేతగాళ్లు నిబంధనలకు నిలువునా పాతరేస్తున్నారు. నిరాటంకంగా కొండల్ని పిండి చేసేస్తున్నారు. చెరువులను చెరపట్టిస్తున్నారు. కాల్వలను కనిపించకుండా మాయం చేస్తున్నారు. ఇష్టారీతిగా తవ్వుకో, దోచుకో, తినుకో అని దోపిడీ సూత్రాన్ని పాటిస్తున్నారు. ‘‘ఎక్కడైనా తవ్వుకోండి. ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకోండి. ఎవరూ అడ్డుకోరు. ఎవరైనా ఆపితే చూద్దాం’’ అంటూ అధికార పార్టీ నేతలు అభయం ఇస్తుండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రూ.కోట్లు విలువజేసే సంపదను కొల్లకొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొండపి నియోజకవర్గంలో భారీ యంత్రాలతో రేయింబవళ్లు తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి.తవ్వుకో దోచుకో తినుకో! -
భారం రూ. కోటి..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలపై పెనుభారాన్ని మోపుతోంది. రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకొని శుక్రవారం ఉదయం నుంచే పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతున్నామని ప్రకటించింది. దాంతో వాహనదారుల గుండెల్లో బాంబు పేలినంత పనయింది. పశ్చిమాశియాలో యుద్ధం కారణంగా క్రూడాయిల్ దిగుమతి మందగించడంతో ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెంచడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాహనదారులపై ప్రతి రోజూ రూ.కోటికి పైగా భారం పడుతోంది. జిల్లాలో మొత్తం వాహనాలు 5.72 లక్షలు ఉన్నాయి. వాటిలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలు 4.10 లక్షలు ఉన్నాయి. పెట్రోలు వాడే ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఇతర వాహనాలు కలుపుకొని 6,500 వరకూ ఉన్నాయి. ఇకపోతే ఆటోలు జిల్లాలో 30,500, లారీలు 25,000, ట్రాక్టర్లు 13,000, కార్లు 25,000, ట్రావెల్స్ బస్సులు, స్కూలు, కాలేజీ బస్సులు, మినీ బస్సులతో పాటు ఇతర వాహనాలు మొత్తం కలిపి 1,55,500 ఉన్నాయి. ప్రతి రోజూ డీజిల్ భారం రూ.75 లక్షలు పడుతుండగా, పెట్రోలు భారం రూ.31 లక్షలు వరకూ ఉంది. అంటే మొత్తంగా పెట్రోలు, డీజిల్ భారం జిల్లా ప్రజలపై రోజుకు రూ.1.06 కోట్లు పడుతున్నట్లు అంచనాలు వెల్లడిస్తున్నాయి. మహిళలకు ఫ్రీ బస్సుల దెబ్బ నుంచి కోలుకోకముందే.... మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించటంతో ఆటోలు నడిపే చాలా మంది ఈ వృత్తి నుంచి మానుకున్నారు. మాలాంటి వాళ్లం వేరే వృత్తి చేతకాక ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ఇక ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరతో ఆటో ద్వారా జీవించాలంటే కష్టంగా మారనుంది. ప్రతి రోజూ నాగులుప్పలపాడు నుంచి ఒంగోలుతో పాటు ఇతర ప్రాంతాలకు ప్యాసింజర్లను రవాణా చేస్తుంటాను. చార్జీ పెంచితే ప్రయాణికులు ఊరుకోరు. పెంచకపోతే గిట్టుబాటు కాదు. ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతున్నాం. – కన్నెదారి అజయ్, ఆటో డ్రైవర్, నాగులుప్పలపాడు డీజిల్ పెరగటంతో జీవనం గగనంగా మారింది ఉన్నట్లుండి డీజిల్ పెరగటంతో జీవనం గగనంగా మారింది. ఇప్పటికే ఉన్న ధరలతో ఒంగోలులో ఆటో నడపాలంటేనే చాలా కష్టంగా మారింది. సర్వీసు రూ.20 అంటేనే చాలా ఎక్కువగా ప్రయాణికులు భావిస్తున్నారు. ప్రతి రోజూ రూ.500లకు డీజిల్ కొట్టిస్తే ఆయిల్ ఖర్చులు పోను కనీసం రూ.300 మిగలటం కూడా కష్టంగా మారింది. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరతో వృత్తిని కొనసాగించటం చాలా కష్టం. ఇక ఆటో రిపేరు వచ్చిందంటే ఆరోజు ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే ఒంగోలు నగరంలో దాదాపు 2 వేల ఆటోలు వరకూ ఆపేశారు. – చల్లాపల్లి సురేష్ బాబు, ఆటో డ్రైవర్, ఒంగోలు -
పొగాకు రైతులను ఆదుకోవాలి
వేలం అధికారితో మాట్లాడుతున్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి, అన్నా రాంబాబు, నాయకులు వేలం తీరును పరిశీలిస్తున్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి, అన్నా రాంబాబు, వైఎస్సార్ సీపీ నాయకులుపొదిలి: అష్టకష్టాలకోర్చి పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతుంటే సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి విమర్శించారు. పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబుతో కలిసి గురువారం పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని బూచేపల్లి సందర్శించారు. రైతులు, వేలం కేంద్రం అధికారులతో మాట్లాడారు. మార్కెట్ పరిస్థితి, పొగాకు నాణ్యత గురించి వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ తక్షణమే మార్క్‌ఫెడ్‌కు రూ.500 కోట్లు కేటాయించి పోటీ మార్కెట్ చేయించి పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వేలంలో సుమారు 60 శాతం మేర నోబిడ్ బేళ్లను రైతులు తిరిగి తీసుకెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. వేలం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోందన్నారు. గత సంవత్సరం పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి వేలం కేంద్రాన్ని సందర్శించిన విషయాన్ని బూచేపల్లి గుర్తు చేశారు. ఆ సమయంలో రైతుల నుంచి జగన్‌కు లభించిన ఆదరణ చూసి తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం.. రైతులపై, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిందని తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించడంపై ఉన్న శ్రద్ధ పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎందుకు లేదని ప్రశ్నించారు. ధరలు లేవని రైతులు చేస్తున్న ఆందోళనలను కూడా చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. పొగాకు బేళ్లు తగలబెడుతున్నా, వేలం ఆపి రోడ్డు మీదకు వస్తున్నా.. రైతుల వైపే ప్రభుత్వం చూడటం లేదన్నారు. పొగాకు కొనుగోలు చేసే వ్యాపారులకు రైతుల బాగోగులతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తారని, కానీ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరించడం సరికాదని, తప్పనిసరిగా రైతులను ఆదుకోవాల్సిందేనని అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా రూ.36 వేలకు కొనుగోలు... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో క్వింటా పొగాకును రూ.36 వేలకు కొనుగోలు చేశారని, కానీ, ఇప్పుడు రూ.22 వేలకు కూడా ఎందుకు కొనుగోలు చేయటం లేదో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని బూచేపల్లి శివప్రసాదరెడ్డి నిలదీశారు. బ్యారన్‌కు రూ.5 లక్షల మేరకు రైతులకు నష్టం వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం కూలీలకు కూడా రైతులు డబ్బులిచ్చే పరిస్థితి లేదన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ పంటకూ రైతులకు గిట్టుబాబు ధర లేదని మండిపడ్డారు. రైతులకు అండగా ఉంటాం : అన్నా రాంబాబు వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు మాట్లాడుతూ నీటిని రవాణా చేసి మరీ పొగాకుకు నీటి తడులు అందించి రైతులు ఎంతో కష్టపడి పొగాకు పండించారన్నారు. కానీ, పొగాకును గిట్టుబాటు ధరకు వేగంగా కొనుగోలు చేసేందుకు ముందుకు రావటం లేదని పలువురు రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులకు ధర పెంచే పరిస్థితి లేదన్నారు. ఈ సమయంలో ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రైతుల పొగాకును అధిక ధరకు కొనుగోలు చేయించాలన్నారు. రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కొనకనమిట్ల ఎంపీపీ ఎం.మురళి, జెడ్పీటీసీ సభ్యుడు అక్కిదాసరి ఏడుకొండలు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డి, నాయకుడు మోరా శంకరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యక్కలి శేషగిరిరావు, రామసుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఆవుల వెంకట సుబ్బారెడ్డి, కొండ్రగుంట శ్రీనివాసరావు, దొరిశల సుబ్బారెడ్డి, మండల మాజీ ఉపాధ్యక్షుడు ఉన్నం శ్రీనివాసులు, ఫిరోజ్, పార్టీ నాయకులు ఆనికాళ్ల ఈశ్వరరెడ్డి, కొత్తపులి బ్రహ్మారెడ్డి, రైతు విభాగం నాయకుడు బీరం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పని చేయకుండా.. పంచేసుకుంటూ..!
కందుకూరు: గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం(వీబీ–జీరామ్ జీ)లో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కూలీలకు మంజూరు చేసే సొమ్ముతోపాటు మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టే పనుల్లో అందినకాడికి దండుకుంటున్నా అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ సొమ్మును అధికార పార్టీ చోటా నాయకులు, ఉపాధి హామీ అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది వాటాలేసుకుని ఆరగిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. సాంకేతికతా.. చట్టుబండలా? ఉపాధీ హామీ పథకంలో అవినీతిని అరికట్టేందుకు నూతన సాంకేతికతను ప్రవేశపెట్టినా అక్రమాలను అడ్డుకోలేకపోతోంది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లుగా టీడీపీ కార్యకర్తలను నియమించుకుని అక్రమాలకు తెరతీశారు. కందుకూరు ప్రాంతంలో అడ్డగోలుగా చేపట్టిన పనులే అందుకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో కుంటలు, రోడ్లు, కాల్వలు అభివృద్ధి చేయకుండానే చేసినట్లు చూయించడంతో నివ్వెరపోవడం ప్రజల వంతయింది. కందుకూరు మండల పరిధిలో 167–బి జాతీయ రహదారి మార్జిన్లో జేసీబీలతో పనులు చేసిన కాల్వల్లో మళ్లీ కూలీలతో పని చేయించినట్లు చూపారు. మహదేవపురం పంచాయతీ పరిధిలోని ఓవీ రోడ్డులో సీటీఆర్ఐ సమీపంలో ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా జేసీబీతో పనులు చేశారు. అదే ప్రాంతంలో ఇటీవల కూలీలతో తూతూ మంత్రంగా పనులు చేయించారు. అలాగే ఓగూరు గ్రామం నుంచి కోల్డ్‌స్టోరేజ్ వరకు జాతీయ రహదారి పక్కన చేసిన పనులదీ ఇదే పరిస్థితి. ఇలా అనేక గ్రామాల్లో పనులు చేసినట్లు నమోదు చేసి బిల్లులు డ్రా చేస్తున్నారు. దీంతో పథకం కింద అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు ఖర్చవుతున్నాయి కానీ ఫలితం మాత్రం శూన్యం. గ్రామాల్లో లేనివారి పేర్లతో మస్తర్ ఉపాధీ హామీ పథకంలో దొంగ మస్తర్లను అరికట్టేందుకు కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టారు. పని ప్రదేశం నుంచి కూలీల ఫొటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని నిర్ణయించారు. అయితే దొంగ మస్తర్లు వేసే వారికి ఇవేవీ అడ్డురావడం లేదు. గ్రామంలో ఏనాడూ లేని వారి పేర్లతో మస్తర్లు వేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను, ప్రస్తుతం కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల పేర్లను జాబ్‌కార్డుల్లో నమోదు చేసి వారి ఫొటోలు కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. నూతన సాంకేతికత అద్భుతంగా పని చేస్తుంటే ఇలా హాజరు వేయడం ఎలా సాధ్యపడుతోందనేది మిలియన్ డాటర్ల ప్రశ్నగా మిగిలింది. లింగసముద్రం మండలం వెంగళాపురం పంచాయతీ పరిధిలో కళ్యాణ్‌రామ్ అనే విద్యార్థి గుడ్లవల్లేరులోని కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ప్రస్తుతం అతను కాలేజీలోనే ఉన్నాడు. కానీ బుధవారం వేసిన మస్తర్లో మాత్రం అతని పేరు, ఫొటో నమోదు చేశారు. అలాగే నందిని అనే ఇంటర్ విద్యార్థిని అసలు పనికే వెళ్లదు. కానీ ఆమె పేరు మస్తర్లో ఉంది. కందుకూరు మండలంలోని పాలూరు దొండపాడు గ్రామంలో పలువురు కూలీలు ఏ రోజూ పనికి వెళ్లిన పాపాన పోలేదని, గ్రామంలో చిల్లరకొట్టు నిర్వహిహించుకుంటున్న వారి పేర్లను రోజూ మస్తర్లో నమోదు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ప్రతి గ్రామంలో ఇదే తరహా వ్యవహారం నడుస్తోంది. అయినా సరే ఎన్ఆర్ఈజీఎస్ అధికారులకు ఇవేవీ కనిపించవు. పనులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నట్లు రికార్డులు తయారు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో అడ్డగోలుగా సాగుతున్న పనులు పనులకు హాజరు కాని, నగరాల్లో ఉంటున్న వారి పేర్లపై దొంగ మస్తర్లు పనులకు హాజరైన వారికి కూలి ఇవ్వాలంటే లంచం ముట్టజెప్పాల్సిందే అవినీతి బయటపడకుండా చోటా లీడర్లు, అధికారులు కుమ్మక్కు ఉపాధి హామీ పథకంలో వెలుగు చూస్తున్న అవినీతి విచిత్రాలు -
ఒంగోలు కమిషనర్‌గా వెంకట కృష్ణయ్య
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా టి.వెంకట కృష్ణయ్య గురువారం బాధ్యతలు చేపట్టారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆయన చాంబర్లో ఫైలుపై సంతకాలు పెట్టి విధుల్లో చేరారు. అనంతరం కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. ఒంగోలు నగర పరిస్థితులపై కలెక్టర్‌తో కొంతసేపు చర్చించారు. అనంతరం నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్, రెవెన్యూ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నగరంలోని పరిస్థితులపై సమీక్షించారు. ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 48 ఎయిడెడ్ పాఠశాలలకు ఒకే టీచర్ ఉన్నారని, మరో టీచర్‌ను కేటాయించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఒకే టీచర్‌తో అన్ని తరగతులకు బోధన జరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒకే టీచర్ ఉన్న ఎయిడెడ్ పాఠశాలలు మండలాల వారీగా ఒంగోలు 9, నాగులుప్పలపాడు 5, మద్దిపాడు 2, చీమకుర్తి 1, బేస్తవారిపేట 1, కనిగిరి 2, హనుమంతునిపాడు 2, వెలిగండ్ల 3, కంభం 3, మార్కాపురం 2, గిద్దలూరు 4, కొమరోలు 2, అద్దంకి 1, పర్చూరు 2, యద్దనపూడి 1, ఉలవపాడు 1 చొప్పున ఉన్నాయన్నారు. ఆయా పాఠశాలల్లో ఒకే టీచర్ పనిచేస్తున్నందున విద్యార్థులకు సరైన బోధన జరగక, ఉపాధ్యాయులకు సెలవు మంజూరు కాక అటు యాజమాన్యం, ఇటు మండల విద్యాశాఖ అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జిల్లాలో మిగులుగా ఉన్న 202 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించి విద్యాబోధనకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబును కోరారు. -
కూటమి పాలనలో కుదేలవుతున్న రైతులు
● రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు సిటీ: సీఎం చంద్రబాబు పాలనలో గిట్టుబాటు ధర లభించక రైతులు కుదేలవుతున్నారని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఒంగోలు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యంతో మొక్కజొన్న, పొగాకు, మిర్చి, ఆక్వా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. వ్యాపారులతో కుమ్మకై ్క ఫీడు ధరలు పెంచడం దారుణమన్నారు. దీనిపై ఆక్వా రైతులు నిరసనలు చేస్తూ రోడ్డెక్కారన్నారు. మొక్కజొన్న రైతులు మొక్కజొన్నలను రోడ్డుపై పారబోసి ఆందోళన చేశారన్నారు. రైతులకు ఎలాంటి బీమా సౌకర్యం లేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో రైతులకు అన్నిరకాల సేవలు అందుబాటులో ఉంచామన్నారు. గిట్టుబాటు ధర లభించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. ముందు తీసుకున్న భూములకే న్యాయం చేయలేదని, ఇప్పుడు మళ్లీ భూములు తీసుకుని వారికి తీరని అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. అమరావతి రైతులకు ప్లాట్లు ఇచ్చి సౌకర్యాలు కల్పించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి వెంట మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్లు మాదాసి వెంకయ్య, వై.ఎం.ప్రసాద్‌రెడ్డి, పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, పాలడుగు శ్రీనివాసరావు, నటారు జనార్దనరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, రాయపాటి అంకయ్య, నారపరెడ్డి, మధు, దేవరపల్లి అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఆంక్షల చట్రం
యంత్రం.. కూటమి వారికే వ్యవసాయ పరికరాలు ఏ ప్రభుత్వమైనా రైతులకు సంబంధించిన పథకాలు అమలుచేసే సమయంలో పార్టీలు చూడకూడదు. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం తమ పార్టీ సానుభూతిపరులకే వ్యవసాయ పరికరాలు అందించేలా పథకం అమలు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రైతులందరికీ కాకుండా కొందరికే వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేలా పథకాన్ని రూపొందించడం శోచనీయం. ఆన్లైన్ దరఖాస్తులు తొలుత ఇన్చార్జి మంత్రికి పంపడమేమిటి.. అనంతరం జేసీ లాగిన్‌కు రావడం ఏమిటి..? అర్హులైన వారందరికీ పరికరాలిచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా.? ఇదంతా చూస్తుంటే అన్నదాతకు వెన్నుపోటు పొడిచే విధంగా ఉంది. – డాక్డర్ చింతలపూడి అశోక్‌కుమార్, వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి రైతులను ఆదుకోవాలి వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో ఉన్న ఇ–కేవైసీ నిబంధనలు ఎత్తివేసి జిల్లాకు కనీసం రూ.20 కోట్లు బడ్జెట్ కేటాయించాలి. రైతులకు అవసరమైన పనిముట్లను సకాలంలో అందరికీ అందించాలి. పంట నష్టపరిహారం కూడా త్వరగా చెల్లించాలి. గతేడాది తుఫాన్లకు పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయ రుణాలు ఇవ్వాలి. – ఉడుముల కోటిరెడ్డి, వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ మెంబర్ మార్కాపురం/అద్దంకి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు ఒక్క వ్యవసాయ పనిముట్టు కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది పథకం అమలు చేస్తామని చెప్పడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లక్షల మంది రైతులు వ్యవసాయ యంత్ర పరికరాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రభుత్వం కేటాయించిన అతి తక్కువ బడ్జెట్‌తో పాటు విధించిన ఆంక్షలు చూసి ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బడ్జెట్లో రూ.7.35 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. కానీ, ఉమ్మడి జిల్లాలో 2,69,635 మంది రైతులుండగా, దాదాపుగా 1,42,349 హెక్టార్లలో ఖరీఫ్ సీజన్లో పంటల సాగు ఉంటుందని అంచనా వేశారు. మార్కాపురం జిల్లాలో 1,53,660 మంది రైతులుండగా ఈ ఏడాది 86,349 హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయవచ్చని అంచనా వేశారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 1,15,975 మంది రైతులు ఉండగా, 56 వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగు ఉండొచ్చని అంచనా వేశారు. ప్రధానంగా పత్తి, మిర్చి, వరి, సజ్జ, జొన్న, తదితర పంటలు సాగుచేయనున్నారు. రైతులకు శాపంగా మారిన నిబంధనలు... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి దాదాపు 7.35 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో మార్కాపురం జిల్లాకు రూ.3.15 కోట్లు, ప్రకాశం జిల్లాకు రూ.4.20 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులు చూస్తేనే ఏమాత్రం సరిపోవని అర్థమవుతోంది. ప్రధానంగా ఇ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం విధించిన నిబంధన సాధారణ రైతులకు శాపంగా మారింది. ఇందులో 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, 5 ఎకరాలు పైబడిన రైతులకు 40 శాతం సబ్సిడీ ఇస్తారు. మరొక నిబంధన ప్రకారం 3 సీజన్లలో ఇ క్రాప్ తప్పనిసరిగా నమోదు చేసుకుని ఉండాలి. ప్రధానంగా మినీ ట్రాక్టర్లు, ట్రక్కులు, పోస్టు హార్వేస్టు, తైవాన్ స్ప్రేయర్లు, హార్వెస్టింగ్ పనిముట్లు, విత్తనపు గొర్రులు ఇలా 9 రకాల పనిముట్లు అందజేస్తారు. రైతుల ఎంపిక తీరుపై తీవ్ర విమర్శలు... ఈ నెల 19 తుది గడువుగా పేర్కొన్నప్పటికీ సర్వర్ ఓపెన్ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వివరాలన్నీ జిల్లా ఇన్చార్జి మంత్రి లాగిన్‌కు వెళ్లి అక్కడ పరిశీలన అనంతరం జేసీ లాగిన్‌కు వస్తాయి. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అయితే, ఇక్కడే తిరకాసు ఉంది. ఇ–క్రాప్‌లో నమోదైన రైతులందరికీ గ్యారంటీగా పరికరాలు వస్తాయని లేదు. మంత్రి లాగిన్, అక్కడి నుంచి జేసీ లాగిన్‌కు వస్తాయి. లాటరీ ద్వారా ఎంపిక చేస్తామనే విధానం పట్ల రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివలన అర్హులైన రైతులకు రికమెండేషన్ ఉంటేనే యాంత్రీకరణ పథకం వస్తుందని అర్థమవుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,69,635 రైతులుంటే.. బడ్జెట్లో 7.35 కోట్ల రూపాయలే కేటాయించారని, అవి ఏమాత్రం సరిపోవని, అందుకే రైతుల సంఖ్య తగ్గించేందుకు ఎంపిక ప్రక్రియను లోపభూయిష్టంగా నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే రైతులు దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎక్కువగా మినీ ట్రాక్టర్లు, ట్రక్కులు, విత్తనపు గొర్రులు, తైవాన్ స్ప్రేయర్లపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. మండల కేటాయింపులు తక్కువ స్థాయిలో ఉండటం, రైతులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సిఫార్సు ఉన్నవారికే వ్యవసాయ పనిముట్లు వస్తాయనే భావనతో పలువురు ఆసక్తి చూపడం లేదు. నిబంధనలు సడలించి బడ్జెట్ పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
పనికి రాకపోతే సగం.. వస్తే రూ.100 నుంచి రూ.150
ఉపాధి హామీ కూలీల సొమ్మును దోచుకోవడం రెండేళ్లుగా నిత్యకృత్యంగా మారింది. పని చేయకుండానే మస్తర్ వేస్తే ఓ రేటు, పనికి వచ్చినా కూలి ఇచ్చేందుకు మరో రేటును నిర్ణయించి మరీ ఫీల్డ్ అసిస్టెంట్లు వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైసలివ్వలేదంటే మరుసటి వారం నుంచి ఆ కూలీలను పనులకు రానిచ్చే పరిస్థితి లేదు. ఇదిలా ఉండగా గ్రామంలో ఉండి కూడా పనులకు వెళ్లని వారి పేర్లను మస్తర్లో నమోదు చేస్తున్న ఎఫ్‌ఏలు.. సదరు కూలీకి వచ్చే సొమ్ములో సగం దిగమింగేస్తున్నారు. ఇలా ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో పేర్లు నమోదు చేసి నొక్కేస్తున్నా అధికారులు కళ్లకు గంతలు కట్టుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారమంతా కష్టపడి పని చేసిన కూలీలు తమకు రావాల్సిన సొమ్ము తీసుకోవడానికి కూడా రూ.100 నుంచి రూ.150 చెల్లించాల్సి వస్తోంది. కందుకూరు మండలంలోని ఓగూరు గ్రామంలో వారానికి రూ.600 కూలి దక్కగా అందులో రూ.150 ఫీల్డ్ అసిస్టెంట్ డిమాండ్ చేయడంతో వివాదం నడుస్తోంది. ఇదెక్కడి అన్యాయం అంటూ గ్రామంలోని కూలీలు ప్రశ్నిస్తున్నారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది
కురిచేడు: పెళ్లికి హాజరైన యువకుడు చేతివాటం ప్రదర్శించి నగదు, బంగారతో ఉడాయించాడు. అయితే అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో డామిట్ కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే.. యోహోషువా అనే యువకుడు యువకుడు త్రిపురాంతకంలోని బంధువుల ఇంట్లో శుభాకార్యానికి హాజరయ్యారు. అక్కడ రూ.4 లక్షల నగదు, బంగారంతో ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం చింతలచెరువు రైల్వే బ్రిడ్జి సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడి గాయపడ్డాడు. దారిన పోయే వారు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది మహబూబ్ బాషా, నరేష్‌బాబులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేశారు. అక్కడే అసలు కథ మొదలైంది. క్షతగాత్రుడి తన పేరు యోహోషువా అని, తనది కురిచేడు మండలంలోని కాటంవారిపల్లె గ్రామమని, తాము చాలా కాలం క్రితం విజయవాడ వెళ్లి అక్కడ స్థిరపడ్డామని 108కి సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. తాను తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి త్రిపురాంతకం వెళ్లి వస్తున్నట్లు తెలిపాడు. కానీ కాటంవారిపల్లె గ్రామ చరిత్రలో ఆ పేరు ఉన్న కుటుంబం లేదని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో క్షతగాత్రుడు కావాలనే అబద్ధం చెబుతున్నట్లు గ్రహించిన 108 సిబ్బంది అతని వద్ద ఉన్న ఫోన్లో నంబర్ తీసుకొని అతని భార్యకు సమాచారం ఇచ్చారు. తన భర్త రూ.4 లక్షల నగదు, బంగారం తీసుకొని ఉడాయించాడని, బంధువుల ఇంట్లో శుభకార్యం జరుగుతుందని, అక్కడ నుంచి వాటిని తెచ్చాడని తెలిపింది. అతను త్రిపురాంతకం నుంచి ఉడాయించగానే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతని ఫోన్‌నంబరు సిగ్నల్ ఆధారంగా సంఘటనా స్థలానికి చేరారు. 108 సిబ్బంది ద్విచక్ర వాహనం, నగదు, ఆభరణాలు పోలీసులకు అప్పగించి క్షత గాత్రుడిని మెరుగైన వైద్యం నిమిత్తం వినుకొండలోని వైద్యశాలకు తరలించారు. రోడ్డు ప్రమాదంతో చోరీ విషయం వెలుగులోకి -
పరారీలోనే హత్య కేసు నిందితుడు
ఒంగోలు టౌన్: ఒంగోలులో హత్యకు గురైన దివ్యాంగురాలు, ఇరిగేషన్ శాఖ ఉద్యోగి మోరేపల్లి ఆదిలక్ష్మి అంత్యక్రియలు పూర్తయ్యాయి. భర్త వరప్రసాద్ స్వగ్రామమైన త్రిపురాంతకం మండలం మిల్లంపల్లి గ్రామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న వెంకటరమణ కోసం మూడు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఘటన అనంతరం నిందితుడు వెంకటరమణ సీఎస్‌పురం మండలం బొంతువారిపల్లికి వెళ్లి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితురాలి భర్త వరప్రసాద్ నుంచి నిందితుడికి సంబంధించిన వివరాలు సేకరించి వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి ఒంగోలులోని శ్రీరామ లాడ్జిలో ఆదిలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆదిలక్ష్మి హత్య ఘటనపై దివ్యాంగుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఒంగోలులో దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో రిమ్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీఆదిలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలిశ్రీ, శ్రీహంతకుడిని వెంటనే పట్టుకోవాలిశ్రీ అంటూ నినాదాలు చేస్తూ జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. డీఆర్ఓకు వినతిపత్రం సమర్పించిన అనంతరం అంధుల సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగ మహిళను దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఆదిలక్ష్మి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, కుమారునికి పూర్తి స్థాయిలో ఆర్థిక, విద్యా సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్పీడీ చట్టం–2016ను పటిష్టంగా అమలు చేసి దివ్యాంగుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని దివ్యాంగుల సంఘాలు పేర్కొన్నాయి. -
నిబంధనలు ఉల్లంఘిస్తే బస్సులు సీజ్ చేస్తాం
ఒంగోలు సబర్బన్: స్కూల్, కాలేజీ బస్సులు నిబంధనలు పాటించకుంటే సీజ్ చేస్తామని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఆర్ సుశీల హెచ్చరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రవాణా శాఖాధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం డీటీసీ మాట్లాడుతూ జిల్లాలో 744 స్కూల్, కాలేజీ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. బస్సులన్నీ నిబంధనల ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. జిల్లాలో 250 బస్సులను తనిఖీ చేయగా 137 బస్సులు నిబంధనలతో ఉన్నాయని, నిబంధనలు లేని 113 బస్సులను వెనక్కి తిప్పి పంపామన్నారు. నిబంధనల ప్రకారం స్కూల్ బస్సులన్నీ అత్యవసర ద్వారం, అత్యవసర కిటికీలు, అన్ని కిటికీలకు రైలింగ్స్, స్పీడ్ లిమిట్ జీపీఎస్ సిస్టం, ఇతర భద్రతా పరికరాలు అమర్చుకోవాలని సూచించారు. జిల్లాలో 23 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు జిల్లా వ్యాప్తంగా రహదారులపై ప్రమాదాలకు ఆస్కారం ఉన్న 23 బ్లాక్ స్పాట్స్ గుర్తించినట్లు పేర్కొన్నారు. అందులో ఫిబ్రవరిలో 13 ప్రాంతాలను పరిశీలించామని, తాజాగా మరో ఐదు బ్లాక్ స్పాట్స్‌ను పరిశీలించినట్లు పేర్కొన్నారు. అలవలపాడు క్రాస్ రోడ్, వెంకటాపురం క్రాస్ రోడ్, తిమ్మన్నపాలెం విలేజ్ జంక్షన్, యాదవ హోటల్, పైలాన్ సెంటర్ దగ్గర, మేదరమెట్ల, ద్వారకా నగర్ జంక్షన్, అద్దంకిలోని ప్రాంతాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో దర్శి డీఎస్పీ బాల మురళీకృష్ణ, దర్శి సీఐ ఎండ్లూరి రామారావు, నేషనల్ హైవేస్ –16 ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. స్కూలు బస్సులకు ఎఫ్‌సీ తప్పనిసరి జిల్లా వ్యాప్తంగా 23 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు డిప్యూటీ ట్రాన్స్పోర్సు కమిషనర్ సుశీల -
ముగిసిన హనుమజ్జయంతి వేడుకలు
అద్దంకి: ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 14న ప్రారంభమైన హనుమజ్జయంతి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. గురువారం స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం, పూర్ణాహుతి, మండప దేవతా పూజలు, హోమం, పూర్ణాహుతి, బలిహరణ, మండపోద్వాసన పూజలు చేశారు. కార్యక్రమాలను ఆలయ పాలకమండలి చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్‌రావు, పాలకమండలి సభ్యులు, ఏసీ తిమ్మానాయుడు పర్యవేక్షించారు. యర్రగొండపాలెం/అద్దంకి: చిన్న వయసులోనే సుగర్ వ్యాధి బారినపడి చావుబతుకుల మధ్య ఉన్న పసిబిడ్డల వైద్యానికి తమ వంతు సాయమందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. యర్రగొండపాలెం మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్ల ఆరోగ్య పరిస్థితిపై శ్రీఆదుకోండయ్యా.. ఈ పసి బిడ్డలను..శ్రీ శీర్షికన శ్రీసాక్షిశ్రీలో గురువారం ప్రచురితమైన కథనానికి గురువారం పలువురు దాతలు స్పందించారు. అద్దంకి మండలంలోని శింగరకొండ ప్రసన్నాజనేయస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చిన్ని శ్రీమన్నారాయణ రూ.5 వేలు అందజేశారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన దాతలు మరో రూ.25 వేలు బాధిత కుటుంబం బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు ఆ పసిబిడ్డల బంధువులు తెలిపారు. తాళ్లూరు: మిద్దె ఎక్కుతూ ప్రమాదవశాత్తు మెట్ల పై నుంచి కాలుజారి వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం..మండలంలోని నాగంబొట్లపాలెం గ్రామానికి చెందిన యర్రగొర్ల ఆంజనేయులు మూడు రోజుల క్రితం మాధవరంలో బంధువుల దేవర కొలుపులకు వెళ్లాడు. కొలుపుల్లో భాగంగా మూడో రోజు ఆదివారం బంధువులు భోజనాలు మిద్దైపె ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మెట్లు ఎక్కుతుండగా కాలుజారి కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం గురువారం మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ● రూ.5 లక్షల విలువైన రొయ్యలు మృత్యువాత కొత్తపట్నం: రొయ్యల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుమందు పోయడంతో రొయ్యలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన కొత్తపట్నం సమీపంలోని బకింగ్ హామ్ బ్రిడ్జి పక్కన జరిగింది. వివరాల్లోకి వెళితే..కొత్తపట్నం గ్రామానికి చెందిన పురిణి కోటయ్య నెల రోజుల క్రితం ఎకరా చెరువును కౌలుకు తీసుకొని రొయ్యలు సాగు చేశాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పురుగుమందు డబ్బాను చెరువులో వేశారు. గురువారం కోటయ్య చెరువు వద్దకు వెళ్లి చూడగా రొయ్య పిల్లలన్నీ పైకి తేలి ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రొయ్య పిల్లల కొనుగోలు, బ్లీచింగ్, మందులు, విద్యుత్ బిల్లులు కలుపుకొని రూ.5 లక్షల వరకు ఖర్చయిందని, మొత్తం నష్టపోయాయని కన్నీరు మున్నీరుగా విలపించాడు. -
కావేరి ట్రావెల్స్‌లో మంటలు.. 36 మంది ప్రయాణికులు..
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు వ్యాపించాయి. మంటలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కనే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.ఈ ఘటనకు సంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలోని ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు బస్సు నుంచి పొగలు వచ్చాయి. బస్సు ఇంజిన్ నుంచి వస్తున్న పొగలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కనే బస్సును నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దింపేశాడు. దీంతో, ప్రయాణికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. -
దిగజారిన నిమ్మ ధర
హనుమంతునిపాడు: నిమ్మకాయలకు ఈ వారంలో ధర భారీగా తగ్గింది. గత నెలలో నిమ్మకాయ నాణ్యత, సైజును బట్టి కొనుగోలుదారులు రైతు వద్ద నుంచి కిలో రూ.100 నుంచి రూ.120ల పైగా కొనుగోలు చేశారు. అయితే బుధవారం నిమ్మకాయల ధర కేజీ ఒక్కసారిగా రూ.30 నుంచి రూ.35 లకు పడిపోయింది. రైతుల వద్ద కిలో కాయ నాణ్యతను బట్టి సన్నకాయ రూ.30 నుంచి రూ.35, పెద్ద సైజు రూ.50 వరకు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు చెప్తున్నారు. ఒక వైపు ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దిగుబడి కూడా తగ్గింది. అయినా కనిగిరిలో వ్యాపారులు కుమ్మకై ్క ఒకే మాటమీద ఉండి రైతులను మోసం చేస్తూ ధరలు దిగ్గోస్తున్నారని నిమ్మ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిమ్మకు ధరలేక కోత కూలీలు, ఆటో చార్జీలు కూడా రావడం లేదని చెప్తున్నారు. నిమ్మ రైతులను మద్దతు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులు గాయం వెంకటరెడ్డి, జిలానీ, దేవదానం, కృష్ణారెడ్డి తదితరులు కోరుతున్నారు. -
ఏకేయూలో ప్రీ పీహెచ్డీ పార్ట్ 1 ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలో పరిశోధక విద్యార్థులకు (ప్రీ.పి.హెచ్.డి పార్ట్–1) 2023–24 కు సంబంధించి డిసెంబరులో నిర్వహించిన పరీక్షల ఫలితాలను వైస్ ఛాన్సలర్ డీవీఆర్ మూర్తి బుధవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 52 మంది విద్యార్థులు హాజరుకాగా 94.23 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పరీక్షల నియంత్రణాధికారి (సీఈ) ప్రొఫెసర్ సోమశేఖర తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను వైస్ చాన్సలర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిర్మలమణి, డీన్ అకడమిక్స్ ప్రొఫెసర్ జి.రాజమోహనరావు, తదితరులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పీజీ పరీక్షల కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.శ్రీనివాసులు, పరీక్షల విభాగం పర్యవేక్షకులు సూడా శివరాం, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు
మార్కాపురం: తర్లుపాడు మండలంలోని సీతానాగులవరంలో వీరాంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు బుధవారం ఉత్సాహంగా సాగాయి. ఆరు పండ్ల విభాగంలో నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన బీరంబుల్స్, జూపల్లి ప్రభాకర్‌రెడ్డి ఎడ్ల జత 5265.4 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని, ఇదే ఎడ్ల జత 4852.1 అడుగుల దూరం లాగి ద్వితీయ బహుమతిని, మార్కాపురం జిల్లా కంభం మండలం దర్గా గ్రామానికి చెందిన డీవీకె బుల్స్, లాయర్ కృష్ణ ఎడ్ల జత 4506 అడుగులు లాగి తృతీయ బహుమతిని సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన బీహెచ్‌కె బుల్స్, విజయలక్ష్మి నాయుడు ఎడ్ల జత 4 వేల అడుగులు లాగి నాల్గవ బహుమతిని, మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన ముడియాల వెంకటేశ్వరరెడ్డికి చెందిన ఎడ్ల జత 2018 అడుగులు లాగి 5వ బహుమతిని సాధించినట్లు తెలిపారు. -
తిరుచిరాపల్లి ఇన్‌కంటాక్స్ చీఫ్ కమిషనర్‌గా విజయలక్ష్మి
సింగరాయకొండ: తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి ఇన్‌కంటాక్స్ చీఫ్ కమిషనర్‌గా 1992 ఐఆర్ఎస్ బ్యాచ్ అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సతీమణి టీహెచ్ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఈనెల 11వ తేదీ ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈమె 33 సంవత్సరాలుగా ఇన్‌కంటాక్స్ అధికారిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించి ఆయా స్థానాలకు వన్నెతెచ్చిన ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందారు. తన విధి నిర్వహణలో జాయింట్ కమిషనర్‌గా బెంగళూరు, రాయచూర్‌లో, అడిషనల్ కమిషనర్‌గా కర్నూలులో, కమిషనర్‌గా చైన్నెలో, ప్రిన్సిపల్ కమిషనర్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వహించారు. విజయలక్ష్మి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో ఈసీఈ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. ఐఏఎం బెంగళూరులో ఎంబీఏ కోర్సు చేసి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి ప్రజా విధానాలపై సింగపూర్ యూనివర్శిటీ, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రత్యేక డిగ్రీ సాధించారు. -
కన్నతల్లిపై కర్కశత్వం
కందుకూరు: మంచంలో నుంచి లేవలేని స్థితిలో ఉన్న 85 ఏళ్ల కన్నతల్లిపై క్రూరంగా ప్రవర్తించాడు ఓ ప్రబుద్ధుడు. కర్రతో తీవ్రంగా కొడుతూ రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. కందుకూరు పట్టణంలోని పోతురాజుమిట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణం బుధవారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలు.. పోతురాజుమిట్ట ప్రాంతానికి చెందిన తన్నీరు నర్సమ్మ అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో పెద్ద కుమారుడు, కుమార్తె చనిపోగా, ఓ కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ప్రస్తుతం ఆమె చిన్న కుమారుడైన ప్రసాద్ వద్ద ఉంటోంది. ఆమె పేరిట ఉన్న పొలం, ఇల్లు కూడా ప్రసాద్‌కే రాసిచ్చింది. ప్రసాద్‌కు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ప్రసాద్ పెట్టే హింసను భరించలేక పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. బేల్దారి పనులు చేసే ప్రసాద్‌కు మద్యం తాగి తిరగడం దినచర్యగా మారింది. ఈ క్రమంలో 85 ఏళ్ల వయసున్న తల్లిని గత కొంతకాలంగా తీవ్రంగా హింసిస్తున్నాడు. ప్రతినెలా ఆమెకు వచ్చే పింఛను డబ్బు కూడా లాగేసుకుంటూ క్రూర మృగంలా ప్రవర్తించసాగాడు. తల్లిని కర్రతో కొడుతూ హింసిస్తున్న సమయంలో బంధువులు వీడియో తీసి బుధవారం సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. నిందితుడు ప్రసాద్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు కందుకూరు టౌన్ ఎస్సై శివనాగరాజు తెలిపారు. వృద్ధురాలిని సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కన్న తల్లిని దారుణంగా కొట్టిన రాక్షసుడిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 85ఏళ్ల వృద్ధురాలిని కొట్టి హింసిస్తున్న కుమారుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ రాక్షసుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
అంధ మహిళా ఉద్యోగి దారుణ హత్య
ఒంగోలు టౌన్: మూడు బృందాలతో గాలింపు : ఎస్పీ ఇరిగేషన్ శాఖ ఉద్యోగి ఆదిలక్ష్మి మిస్సింగ్‌పై ఫిర్యాదు అందగానే దర్యాప్తు ప్రారంభించామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీరామ్ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించామని ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. వెంకటరమణ అనే వ్యక్తి పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోశాడని, హత్యకు గల కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని చెప్పారు. నిందితుని జాడ కోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. లాడ్జిల్లో తనిఖీలను ముమ్మరం చేస్తామని చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి.. అంధురాలు ఆదిలక్ష్మిని దారుణంగా హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నగరంలోని అంధులు డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి హత్య జరిగిన లాడ్జి ముందు అంధులు ధర్నా చేశారు. పోలీసులు పక్కాగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేయాలని, మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. నమ్మకంగా లాడ్జికి తీసుకెళ్లి గొంతు కోసి చంపిన దుండగుడు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ హర్షవర్థన్ రాజు -
ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం
● పొదిలి సమీపంలో బైక్‌ను ఢీకొట్టిన కారు పొదిలి రూరల్: వేగంగా వెళ్తున్న కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన పొదిలి మండలంలోని మాదాలవారిపాలెం–సలకనూతల గ్రామాల మధ్య బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. పొదిలి మండలంలోని గోగినేనివారిపాలెం, దేవరపాలెం గ్రామాలకు చెందిన ఐదుగురు యవకులు రెండు ద్విచక్ర వాహనాలపై శ్రీశైలం వెళ్తున్నారు. మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు మార్గమధ్యంలో సలకనూతల సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దేవరపాలేనికి చెందిన పుత్తూరి అనీల్(22) అక్కడకక్కడే మృతి చెందగా గోగినేనివారిపాలేనికి చెందిన దాసరి అంకబాబు(20)కు తీవ్రగాయాలయ్యాయి. మరో బైక్‌పై వెళ్తున్న యువకులు 108కు సమాచారం ఇవ్వగా.. క్షతగాత్రుడు అంకబాబును పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో తలమల్ల సమీపంలో అంకబాబు మృతి చెందాడు. ప్రమాద తీవ్రతకు బైకు ముందు టైరు వేరుపడి కారు ముందు భాగంలో ఇరుక్కుపోయింది. అదే సమయంలో పొదిలి పర్యటనకు వస్తున్న కలెక్టర్ విజయసునీత సంఘటన స్థలంలో ఆగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని ఎస్సై సూరెడ్డి రాజేష్ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమి త్తం పొదిలి వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతులు ఇరువురూ బావబామ్మర్ది కొడుకులు. మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలతో పొదిలి ఆసుపత్రి ఆవరణ మిన్నంటింది. -
రెండో రోజు ఏపీ ఈఏపీ సెట్‌కు 236 మంది గైర్హాజరు
ఒంగోలు సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ –2026 ఆన్లైన్ సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్టులు) పరీక్ష ఒంగోలులోని 6 పరీక్ష కేంద్రాల్లో, మార్కాపురంలోని 2 పరీక్ష కేంద్రాల్లో బుధవారం రెండో రోజు జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 236 మంది గైర్హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో ఒంగోలులోని పరీక్ష కేంద్రాల్లో మొత్తం 3,278 మంది విద్యార్థులకు గాను 3136 మంది హాజరుకాగా, 142 మంది గైర్హాజరయ్యారు. అలాగే మార్కాపురంలో మొత్తం 1140 మందికి గాను 1046 మంది హాజరుకాగా, 94 మంది గైర్హాజరయ్యారు. ● తలమళ్లలో ‘నేను బడికి పోతాను’ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ విజయసునీత పొదిలి రూరల్: పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు..మంచి నడవడిక, సభ్యత నేర్పే బడిలో అని కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. పొదిలి మండలంలోని తలమళ్ల ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో ‘నేను బడికి పోతాను’ కార్యక్రమంపై బుధవారం నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఉప్పలపాడులో పదో తరగతి ఫెయిలై శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సమయం తక్కువగా ఉన్నందున తగిన ప్రణాళికలతో సాగి అనుకున్న ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం ఏడుగురు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలో ఉండే వసతులపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మార్కాపురం డిప్యూటీ డీఈఓ ఎం.శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ–2 నాగలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి● డీవైఎఫ్ఐ డిమాండ్ ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖతో సహా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో వెంటనే భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేవీ పిచ్చయ్య, కె.ఎఫ్ బాబు బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు ద్రోహం చేయొద్దన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఇంజినీరింగ్ కోర్సులు చేసి కోచింగ్ లు తీసుకొని ఏఈ, ఏఈఈ ఉద్యోగాల కోసం అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారన్నారు. విద్యుత్ శాఖలో గత ఐదేళ్ల నుంచి ఏఈ, ఏఈఈ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. విద్యుత్ శాఖలో 1500 కు పైగా ఏఈ, ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌కో 285, ఏపీ జెన్కోలో 975, ఏపీ ఈపీడీసీఎల్ 75, ఏపీ ఎస్పీడీసీఎల్లో 1275, ఏపీ సీపీడీసీఎల్‌లో 542 మొత్తం ఖాళీలు ఉన్నాయి అన్నారు. ఒక్క విద్యుత్ శాఖ లోనే 3782 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతున్నారని, పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు పెంచితే మరో రెండేళ్లు వీరు కొనసాగుతారని, దీనివల్ల నిరుద్యోగులు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ లో వస్తున్న నోటిఫికేషన్లో విద్యుత్ శాఖలో 1500 ఏఈ, ఏఈఈ పోస్టులు రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి ఇంజినీరింగ్ పోస్టులు 600 పైగా ఖాళీలు ఉంటే జాబ్ క్యాలెండర్లో మాత్రం కేవలం 132 ఇంజినీరింగ్ పోస్టులు చూపించారన్నారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించి 1000 కి పైగా పోస్టులు ఖాళీలు ఉండగా 328 పోస్టులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సంబంధించి 550 ఖాళీలు ఉంటే జాబ్ క్యాలెండర్లో 21 మాత్రమే చూపించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి భయపడి వయసు పెంచుకుంటూపోతే నిరుద్యోగుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రస్తుతం విద్యుత్ శాఖలో 34,582 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని, వారిలో వచ్చే నాలుగు సంవత్సరాలులో 80 శాతం మంది రిటైర్డ్ అవుతున్నారన్నారు. తక్షణమే ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి రెగ్యులర్ పరిధిలో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
పారిశుధ్య నిర్వహణ లోపభూయిష్టం
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదంటూ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ పి.రాజాబాబు మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. బుధవారం ఒంగోలులోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన పారిశుధ్యం అధ్వానంగా ఉండటంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య పనులతో పాటు మురుగు కాలువలు శుభ్రంగా ఉండాలని సూచించారు. అలాగే నిరుపయోగంగా ఉన్న కార్పొరేషన్ స్థలాలను పరిశీలించారు. తొలుత కలెక్టర్ నగర పరిధిలోని కొత్త మామిడిపాలెంలో ఉన్న కంపోస్టింగ్ యూనిట్‌ను సందర్శించి సేంద్రియ వ్యర్థాలను ఎరువుగా మార్చే పద్ధతిని పరిశీలించి నిర్వాహకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెత్త సంపద కేంద్రాన్ని సందర్శించారు. చెత్త సంపద కేంద్రాలు పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. తదుపరి కలెక్టర్ గాంధీ పార్కును సందర్శించి పార్కు నిర్వహణను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న వాకింగ్ ట్రాక్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పార్కు పక్కనే నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. పీవీఆర్ స్కూల్ పక్కన నిర్మిస్తున్న సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పరిశీలించి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఊట చెరువు ప్రాంతాన్ని సందర్శించి నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించి ఈ స్థలాలను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అద్దంకి బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ స్థలాన్ని, పాత కూరగాయల మార్కెట్ స్థలాన్ని, బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఒంగోలు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజినీర్ ఐషయ్య, ఎంహెచ్ఓ వైష్ణవి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
50 క్వింటాళ్ల మొక్కజొన్నలు దగ్ధం
అద్దంకి: ఆరు ఎకరాల్లో పండిన మొక్కజొన్న కండెలు కోత కోసి కుప్ప వేయగా ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన అద్దంకి మండలంలోని గోవాడ పంచాయతీ సాధునగర్ పొలాల్లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన రైతు గానుగపెంట ఆదాం ఈ ఏడాది ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. మొక్కలు పడిపోవడంతో కండెలు కోయించి కుప్పగా పోశాడు. గురువారం కండెలను ఇంటికి తోలుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే కండెలకు నిప్పంటుకోవడంతో దాదాపు 50 క్వింటాళ్ల మొక్కజొన్న అగ్నికి ఆహుతయ్యాయి. అసలే ధర లేదు.. పండించిన పంట అగ్గిపాలైందని కన్నీటి పర్యంతమయ్యాడు. పొలంలో మొక్కజొన్న ఎండు ఆకుపై సిగరెట్ ఆర్పకుండా పడేయడంతో మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. -
రాష్ట్రంలో యువతపై దాడులు దారుణం
దర్శి: రాష్ట్రంలో యువతపై దాడులు చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కర్నూలు పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం ఆలియాస్ బాలుపై అక్రమ కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు యువజన విభాగం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్శిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏతప్పూ చేయని బాలసుబ్రహ్మణ్యంను పోలీసులను ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి ఆత్మహత్యలకు పాల్పడే లా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా బాలు ఇంటికి పోలీసులు వెళ్లి అన్యాయంగా హింసించారన్నారు. పోలీసుల వేధింపులు తాళలేక బాలు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. యువత రాజకీయాల్లో ఉండకూడదని వారిపై తప్పుడు కేసులు పెట్టడం, అన్యాయంగా జైలుకు పంపడం, వేధింపులకు గురిచేయడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. నిరుద్యోగ యువతకు ఇస్తామన్న రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వమని ప్రశ్నించినందుకు ఇంతగా వేధింపులు, పైశాచికత్వానికి దిగుతారా అని మండిపడ్డారు. ప్రశ్నించే వారిని టార్గెట్ చేసి తప్పుడు కేసులు బనాయించి వారికి ఎక్కడా ఉద్యోగాలు రాకుండా, ఏ పోటీ పరీక్షల్లో పాల్గొననీయకుండా, ఆర్ధిక సంస్థల నుంచి అప్పులు పుట్టకుండా ప్రశ్నించే యువతను అణిచివేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీకి బలం యువకులే అని, అలాంటి యువతపై పోలీసులు అరాచకానికి దిగితే మాత్రం సహించేది లేదన్నారు. న్యాయపరంగా, చట్టపరంగా వాటిని ఎదుర్కొంటామని చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా చేస్తే కచ్చితంగా బుద్ధి చెప్తామన్నారు. కార్యక్రమంలో దర్శి, ముండ్లమూరు, కురిచేడు మండల పార్టీ కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్‌రెడ్డి, విద్యార్థి విభాగం జోనల్ ఇన్చార్జ్ దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, క్రిష్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుంటు పోలయ్య, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఇరుగుల శ్రీనివాసరెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షుడు ఒంటేలు మల్లిఖార్జున్, జిల్లా ప్రధాన కార్యదర్శి యరమల మధుసూదన్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి సన్నీ బాబు, తాళ్లూరు యువజన విభాగం అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు కోట బుచ్చన్న చౌదరి, నాయకులు పాణెం మజ్ఞువలి, షేక్ అమీర్‌బాషా, అన్నవరపు రవి, దామెర్ల రామ్మోహన్రావు, తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
పరిహారం కరువైంది!
మోంథా ముంచింది..మార్కాపురం: మోంథా తుపాను ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేసింది. గత ఏడాది అక్టోబర్ 26 నుంచి మోంథా తుపాను ప్రారంభమైంది. 27, 28 తేదీల్లో భారీవర్షం కురిసింది. 28వ తేదీ ఒక్క రోజే రికార్డు స్థాయిలో 25.68 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. పత్తి, వరి, కంది, మినుము, సజ్జ, మొక్కజొన్న, అనుములు, పొగాకు, మిర్చి, నువ్వులు, జొన్న, వేరుశనగ, పెసర, బొబ్బరు, కొర్ర, ఆముదం, అలసందతో పాటు ఉద్యానవన పంటలు వేలాది ఎకరాల్లో భారీగా దెబ్బతిన్నాయి. నష్టాన్ని తారుమారు చేసి.. వాస్తవానికి మోంథా తుపాను ధాటికి ఉమ్మడి జిల్లాలో మొత్తం 90 వేలకు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల వద్ద నుంచి వచ్చిన ఒత్తిడిలతో మొత్తం పట్టనష్టం నివేదికలను మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తొలుత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 62,500 ఎకరాల్లో పట్టనష్టం వాటిల్లిందంటూ జిల్లా అధికారులు పంటల వారీగా వివరాలను విడుదలజేశారు. అలాగే 385 గ్రామాల్లోని దాదాపు 30 వేల మందికి పైగా రైతులు నష్టపోయారని లెక్కల్లో చూపించారు. తర్వాత నవంబరు 5వ తేదీ విడుదల చేసిన నివేదికలో అంకెల గారడీ చేసి కేవలం 32 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తేల్చేశారు. ఇందులో ప్రధానంగా పత్తి 8313 హెక్టార్లు, వరి 1557 హెక్టార్లు, సజ్జ 1388 హెక్టార్లు, మొక్కజొన్న 1260, మినుములు 26 హెక్టార్లు, వేరుశనగ 17, కందులు 89 హెక్టార్లలో నష్టపోయినట్లు నివేదికలు ప్రభుత్వానికి పంపారు. ఆరు నెలలు దాటుతున్నా రైతులకు అందాల్సిన పరిహారం ఇంతవరకూ అందలేదు. ఖరీఫ్‌లో నష్టపరిహారం రబీ సీజన్ దాటినా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మరో 15 రోజుల్లో ప్రారంభమవుతున్న ఖరీఫ్ సీజన్లో పెట్టుబడుల కోసం రైతులు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకోసం అవసరమయ్యే ఖర్చుల కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో.. నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రకృతి అనుకూలించకపోయినా, వర్షాలు పడి పంట నష్టం జరిగినా, వర్షంలేక పంటలు ఎండిపోయినా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లోనే ఆ పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడంతో రైతులు ఇబ్బందులు లేకుండా, పెట్టుబడుల కోసం ఇతరులను ఆశ్రయించకుండా వ్యవసాయం చేశారు. పరిహారం వెంటనే ఇవ్వాలిగత ఏడాది అక్టోబరు చివరిలో వచ్చిన మోంథా తుపాను తాకిడికి జిల్లా వ్యాప్తంగా సాగైన పంటలు దెబ్బతిన్నాయి. ఇంతవరకూ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. తక్షణమే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి. – జీ సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు సంఘం కార్యదర్శి తుపానుతో రూ.10 లక్షలు నష్టపోయా నేను ఈ ఏడాది 50 ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. అయితే పంట వేసిన 60 రోజులకు మోంథా తుపాను వచ్చి పంట మొత్తం పూర్తిగా నష్టం జరిగింది. జిల్లా స్థాయి అధికారులు మా పంటలను పరిశీలించి న్యాయం చేస్తాం, పరిహారం అందేలా చేస్తామని నా దగ్గర నుంచి పంటకు సంబంధించిన వివరాలన్నీ తీసుకున్నారు. అప్పటికే నేను ఎకరాకు సుమారుగా రూ.20 వేల చొప్పున మొత్తం 50 ఎకరాలకు రూ.10 లక్షలు వరకు ఖర్చు చేశాను. తుపాను వల్ల పంట మొత్తం పోయి నష్ట పోవడంతో ఆ తరువాత తిరిగి మళ్లీ పంట సాగు చేయలేకపోయాను. రూ.10 లక్షల నష్టంలో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిహారం అందించలేదు. – గోపతోటి శ్యామ్యూల్, వరి రైతు, తిమ్మసముద్రం -
పోక్సో కేసులో మహిళా అధికారికి ఐదేళ్ల జైలు శిక్ష
ఒంగోలు: పోక్సో కేసులో ఓ మహిళా ప్రత్యేక అధికారికి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు అందించిన వివరాల మేరకు.. 2018 జూన్ 26న ఓ విద్యార్థిని పట్ల అదే విద్యాలయంలో మహిళా ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహిళ అసభ్యకరంగా ప్రవర్తించారు.ఈ ఘటనపై అప్పటి మర్రిపూడి ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషిటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం మహిళా ప్రత్యేక అధికారికి 5 సంవత్సరాల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధించారు. బాధిత విద్యార్థినికి రూ.22 వేలు పరిహారం అందించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చర్యలు చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
ప్రశాంతంగా ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు
ఒంగోలు సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2026 ఆన్లైన్ సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్టులు) పరీక్ష ఒంగోలులోని 6 పరీక్ష కేంద్రాల్లో, మార్కాపురంలోని 2 పరీక్ష కేంద్రాల్లో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ప్రస్తుతం ఇంజినీరింగ్ విభాగంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు పూటలా జరుగుతాయి. ఒంగోలులోని 6 పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన పరీక్షకు మొత్తం 929 మంది విద్యార్థులకు గాను 888 మంది హాజరుకాగా, 41 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో మొత్తం 929 మంది విద్యార్థులకు గాను 888 మంది హాజరు కాగా, 41 మంది గైర్హాజరయ్యారు. అలాగే మార్కాపురంలో రెండు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 285 మంది విద్యార్థులకు గాను 272 మంది హాజరుకాగా, 13 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో మొత్తం 285 మందికి గాను, 271 మంది హాజరుకాగా, 14 మంది గైర్హాజరయ్యారు. -
ఇనుప కొట్టులో బంగారం చోరీ!
చీమకుర్తి: దుకాణంలో దాచి ఉంచిన బంగారం, వెండి, నగదు పోయిందంటూ చీమకుర్తికి చెందిన అద్దేపల్లి నగేష్ మంగళవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అందిన సమాచారం మేరకు వివరాలు.. పట్టణంలోని ఇసుకవాగు సెంటర్ సమీపంలో నగేష్ ఇనుప వస్తువులు, ఇతర సామగ్రి విక్రయించే హార్డ్‌వేర్ దుకాణం నిర్వహి స్తున్నాడు. రోజూ లాగే సోమవారం రాత్రి 10 గంటలకు దుకా ణం మూసి ఇంటికెళ్లాడు. మంగళవారం ఉదయం దుకాణానికి వచ్చి చూడగా అల్మరా తెరిచి ఉంది. తాను దాచి ఉంచిన 33.5 సవర్ల బంగారం, 2.5 కేజీల వెండి, రూ.8 లక్షల నగదు కనిపించకపోవడంతో నగేష్ హుటాహుటిన వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, చీమకుర్తి సీఐ ప్రసాద్, ఎస్సై సంపత్‌కుమార్ పరిశీలించారు. క్లూస్ టీమ్‌తోపాటు పోలీసు జాగిలాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. దుకాణం వెనుక వైపు నుంచి దొంగలు లోనికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. పోలీసుల తర్జనభర్జన! ఇళ్లకు సంబంధించిన ఇనుప వస్తువులు, ఇతర సామగ్రిని విక్రయించే దుకాణంలో భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు ఎలా ఉంచాడని అనుమానాలు వ్యక్తమవడంతో ఫిర్యాదుదారుడిని పోలీసులు లోతుగా విచారించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. 33.5 సవర్ల బంగారం, 2.5 కేజీల వెండి, రూ.8 లక్షల నగదు పోయిందని బాధితుడి ఫిర్యాదు సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, పోలీసులు క్లూస్ టీమ్, స్నిఫర్ డాగ్‌తో ఆధారాల సేకరణ -
తాగునీటి పనుల్లో నిర్లక్ష్యం వీడాలి
● అధికారులతో సమీక్షలో కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: తాగునీటికి సంబంధించిన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. నిబంధనల మేరకు పనిచేయకపోతే కాంట్రాక్టర్లతోపాటు అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కొండపి నియోజకవర్గంలో తాగునీటి సంబంధిత నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పనుల గురించి కలెక్టర్‌కు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ.. ఆశించిన స్థాయిలో పురోగతి కచ్చితంగా సాధించాలని స్పష్టం చేశారు. పెండింగ్ పనులను తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం ఉండదన్నారు. కాంట్రాక్టర్లు ఉద్దేశపూర్వకంగా పనులను జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీపీఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మహేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అద్దంకి: మోటారు సైకిల్‌ను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన అద్దంకి పట్టణంలో అద్దంకి–నార్కెట్‌పల్లి రహదారిపై ద్వారకానగర్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. అద్దంకి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన పల్లెపు పుల్లయ్య(60) అద్దంకిలో ఉన్న తన భార్య చెంచమ్మను తీసుకుని వెళ్లేందుకు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో బైకు ద్వారకా నగర్ సమీపంలో యూటర్స్ తీసుకుంటుండగా కారు ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిపోయిన పుల్లయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు. హనుమంతునిపాడు: ఆకతాయి నిప్పు వేయడంతో అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగి చెట్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన హనుమంతునిపాడు మండలంలోని కొండారెడ్డిపల్లి, రశీదుపురం పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కనిగిరి రేంజ్ ఫారెస్టు అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే అటవీ ప్రాంతం కొంత మేర కాలి బూడిదైంది. సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న జాయాయిల్ తోటలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేసినట్లు ఫారెస్ట్ రేంజర్ ఆరిఫ్ ఖాన్ తెలిపారు. సాక్షి టాస్క్‌ఫోర్స్: మండలంలోని సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో పేకాట శిబిరంపై మంగళవారం టాస్క్‌ఫోర్స్ సీఐ భీమానాయక్ ఆధ్వర్యంలో ఎస్సై చెంచయ్య, సిబ్బంది దాడి చేశారు. 10 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.65,500 నగదు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేత, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్‌కు చెందిన మామిడి తోటలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. పట్టుబడిన జూదరుల్లో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నారని, నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా పేకాట, కోడిపందేలు, బెట్టింగు కార్యకలాపాలు సాగుతుంటే 112కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. -
టోల్ ప్లాజా!
స్థానికంవసూల్ రాజా.. టంగుటూరు: జాతీయ రహదారిపై రయ్యిమని దూసుకెళ్లే వాహనదారులకు టంగుటూరు టోల్ ప్లాజాలో చుక్కలు చూపిస్తున్నారు. హైవేపై ప్రయాణం సాఫీగా సాగుతోంది అని భావించేవారంతా అక్కడికి వెళ్లగానే అధిక సమయం నిరీక్షించి సహనం కోల్పోతున్న పరిస్థితి. సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టంగుటూరు టోల్ ప్లాజాలో టోల్ ఫీజు, ఓవర్ లోడ్ పేరుతో భారీ జరిమానా వసూలు చేయడంపై చూపుతున్న శ్రద్ధ వాహదారులకు అందించాల్సిన సౌకర్యాల విషయంలో మాత్రం లేశమంతైనా చూపడం లేదు. దీంతో టోల్ ప్లాజా వద్ద రోజూ ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి వాహదారులు, అత్యసర పనుల నిమిత్తం వెళ్లేవారు, కాలేజీ విద్యార్థులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ సిబ్బంది తీరుతో అంబులెన్సులకు సైతం బ్రేకులు పడుతున్నాయి. ఎమ్మెల్యేల వాహనాలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్న పరిస్థితి. అంబులెన్సు వస్తున్న సమయంలో కూడా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించకుండా టోల్ ప్లాజా అధికారులు, సిబ్బంది చోద్యం చూస్తున్నారు. ఓవర్ లోడ్ పేరుతో భారీగా వసూళ్లు టంగుటూరు టోల్ ప్లాజాలో ఓవర్ లోడ్ పేరుతో దందాకు తెరలేపడం వివాదాస్పదంగా మారింది. ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి మరీ లారీల నుంచి రోజూ రూ.2 లక్షలకు పైనే ఓవర్ లోడ్ ఫీజు పేరుతో గుంజుతున్నారు. వాస్తవానికి రవాణా శాఖ అధికారులు విధించించాల్సిన ఓవర్ లోడ్ ఫీజును టోల్ ప్లాజాలో వసూలు చేస్తూ వాహనదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అటు ప్రభుత్వంగానీ, ఇటు రవాణా శాఖ అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. వాహనదారులపై పోలీసులతో దాడి టోల్ ప్లాజాలో వాహనదారులను కట్టడి చేయడం కోసం సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ యాజమాన్యం ఆరుగురు కానిస్టేబుళ్లను నియమించుకుంది. ఒక్కో కానిస్టేబుల్‌కు నెలకు రూ.లక్ష వేతనం చెల్లిస్తోంది. ముగ్గురు పగలు, మరో ముగ్గురు రాత్రి వేళ విధులు నిర్వహించేలా బాధ్యతలు అప్పగించింది. టోల్ ప్లాజాలో అడ్డగోలు విధానాలను ఎవరైనా ప్రశ్నించినా, లారీలకు జరిమానా విధించిన సమయంలో డ్రైవర్లు ఎదిరించినా కానిస్టేబుళ్లు క్షణాల్లో ప్రత్యక్షమై చేయిచేసుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి టోల్ ప్లాజాలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. టోల్ ప్లాజాలో వాహనాల రద్దీని తగ్గించి, సమయాన్ని ఆదా చేయడం కోసం కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఫాస్ట్ ట్యాగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. టోల్ ప్లాజాలో నిర్దేశిత ఎల్లో లైన్ కంటే ముందు 10 సెకన్ల కంటే వాహనాలు నిలిచి ఉంటే టోల్ ఫీజు చెల్లించనక్కర్లేదని కేంద్ర రవాణా శాఖ స్పష్టం చేసింది. అయితే టంగుటూరు టోల్‌ప్లాజాలో ఆ నిబంధన అమలు కావడం లేదు. రోజూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్నా వాహనదారుల ముక్కు పిండి మరీ టోల్ వసూలు చేస్తున్నారు. పలువురు వాహదారులు ఎల్లో లైన్ నిబంధనను గుర్తు చేస్తూ టోల్ ఫీజు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తే సిబ్బంది వాగ్వివాదానికి దిగుతుండటం గమనార్హం. టంగుటూరు టోల్ ప్లాజాలో వాహనదారులకు నిత్య నరకం ఓవర్ లోడ్ పేరుతో లారీల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు ఈ నేపథ్యంలో కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు అంబులెన్స్‌ల్లో రోగులు, అత్యవసరంగా వెళ్లే వారికి తప్పని తిప్పలు పోలీసులకు ఫిర్యాదు చేసినా మారని పరిస్థితి రోజూ ట్రాఫిక్ జామ్ఝాటం టోల్ ప్లాజా యాజమాన్యం ఓవర్ లోడ్ పేరుతో లారీలను భారీ సంఖ్యలో నిలిపేస్తుండటంతో రోజూ గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. నిత్యం ఇదే తీరు కొనసాగుతుండటంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారుల కష్టాలు అన్నీఇన్నీ కాదు. ఈ నేపథ్యంలో పలువురు వాహనదారులు సహనం నశించి పోలీసులకు ఫిర్యాదు చేస్తుండటంతో కాసేపు మాత్రం ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత పరిస్థితి మొదటికొస్తోంది. -
స్వాహా..!
స్థానికంశోత్రియం భూములు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించండి ● అధికారులకు కలెక్టర్ విజయసునీత ఆదేశం మార్కాపురం: మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఎం.విజయసునీత ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు శాఖల వారీగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు సంతృప్తికరంగా పనిచేయాలని, పారిశుధ్యం, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, పాఠశాలలకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను సీజన్ నాటికి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నెలలో నాలుగు శుక్రవారాలు జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ పులి శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ మోహన్‌రావు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ పద్మావతి, మైక్రో ఇరిగేషన్ పీడీ జెన్నెమ్మ, జిల్లా రవాణాశాఖ అధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. హైవేపై కారు దగ్ధం ● జేసీబీని ఢీకొనడంతో పేలిన పెట్రోల్ ట్యాంక్ ● త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద సంఘటన త్రిపురాంతకం: వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న జేసీబీని ఢీకొట్టడంతో పెట్రోల్ ట్యాంకర్ పగిలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం కాగా, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన రామచంద్రరావుతోపాటు మరో నలుగురు కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ క్రమంలో రాజుపాలెం వద్ద ఎదురుగా వస్తున్న జేసీబీని ఢీకొట్టారు. జేసీబీ తొట్టి కారు వెనుక భాగంలోని పెట్రోల్ ట్యాంక్‌కు బలంగా తగలడంతో ఒక్కసారిగా పేలిపోయి మంటలు ఎగసిపడ్డాయి. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు హుటాహుటిన కిందకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. అందరూ చూస్తుండగానే కారు మంటల్లో కాలిపోయింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివరామయ్య తెలిపారు. టీడీపీ నాయకుడి జోక్యంతోనే భూకబ్జాకు దిగారు నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకుని జోక్యంతోనే తమ గ్రామానికి చెందిన కొంతమంది భూ కబ్జాకు పాల్పడుతున్నారు. పోలీసులను పురమాయించి మమ్మల్ని హెచ్చరించారు. భూమిపై ఎటువంటి అధికారంలేని వారు గతంలో మాకు పట్టాలు ఇచ్చిన భూమిలో దిగి జేసీబీలతో శుభ్రం చేసుకుంటుంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు. అధికార పార్టీకి చెందిన వారికి అధికారులు మద్దతు ఇస్తే పేదల పరిస్థితి ఏం కావాలి. – ఎనిబెర ప్రసాద్, బాధితుడు, నడిగడ్డ పట్టాలు ఎలా రద్దు చేస్తారు మాకు 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన పట్టాలు ఏ విధంగా రద్దు చేస్తారు. అందుకు సంబంధించిన నోటీసు కూడా మాకు అందలేదు. మా పట్టా భూమిలో ఇతరులు దిగి శుభ్రం చేసుకుంటుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. తాము వ్యవసాయం చేసుకుంటామంటే బెదిరిస్తున్నారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలి. – నూనె ఏలియా, బాధితుడు, నడిగడ్డ నా భూమికి హద్దులు చూపించాలి నాకు 20 సంవత్సరాల క్రితం పొలం పట్టా ఇచ్చారు. అప్పట్లో నేను వ్యవసాయం చేసుకునేదానిని. కొంతమంది బెదిరించి భూమిలో దిగకుండా చేశారు. అప్పటి నుంచి వ్యవసాయం చేయకపోవడం వలన చిల్లచెట్లు ఏపుగా పెరిగాయి. భూమి ఎక్కడ ఉందో గుర్తించలేకపోతున్నాం. గతంలో మాకు పట్టా ఇచ్చిన ప్రకారం 50 సెంట్ల భూమికి హద్దులు చూపించాలి. – నూనె ఎలిశమ్మ, బాధితురాలు యర్రగొండపాలెం: ఖరీదైన శోత్రియం భూములు కాజేసేందుకు పచ్చ నేతలు బరి తెగించారు. అధికారం చేతిలో మదంతో.. ఏం చేసినా అడిగేవారు లేరన్న అహంకారంతో టీడీపీ నాయకులు పేట్రేగిపోతున్నారు. శోత్రియం భూములపై ఎటువంటి హక్కు లేకపోయినప్పటికీ దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి చదును చేయిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం భూమిలేని పేదలకు ఇచ్చిన పట్టాలు రద్దు అంటూ ఆర్డీఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేయించడం టీడీపీ నేతల భూదాహానికి నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. త్రిపురాంతకం మండలంలోని ముక్తింపురం(నడిగడ్డ)లో 1 నుంచి 35 వరకు ఉన్న సర్వే నంబర్లలో దాదాపు 380 ఎకరాల పొలం ఉంది. దీనిని శోత్రియం భూమిగా గతంలోనే ప్రభుత్వం గుర్తించింది. 2006లో 3వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నడిగడ్డలో భూమి లేని ఎస్సీ, ఎస్టీ రైతులతోపాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారికి ఒక్కొక్కరికి 50 సెంట్ల ప్రకారం అప్పటి కలెక్టర్ ఉదయలక్ష్మి 120 ఎకరాల్లో పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు పొందిన రైతులు 2008 వరకు ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో నడిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు కోర్టుకు వెళ్లి స్టేటస్కో తీసుకొచ్చారు. దీంతో అప్పటి ఆర్డీఓ, తహసీల్దార్ పొలంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడంతోపాటు, అప్పటి వరకు పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న అర్హత కలిగిన రైతులపై కేసులు పెట్టారు. ఈ వివాదం జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లింది. ఒక వర్గంవారిపైనే ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చిందని అధికారులను మందలించి, తప్పుడు కేసులను ఎత్తివేయించారు. ఆ తరువాత రెండో వర్గం వారు తరచూ బెదిరిస్తుండటంతో పట్టాలు పొందిన రైతులు తమ పొలంలోకి అడుగుపెట్టలేకపోయారు. అప్పట్లోనే టీడీపీ వర్గీయులు లాయర్ ద్వారా కోర్టు నోటీసులు ఇప్పించారు. గత్యంతరం లేని స్థితిలో రైతులు కూడా లాయర్ ద్వారా కోర్టులో తమ వాదన వినిపించారు. ఈ కేసును రిజర్వులో పెట్టిన కోర్టు, సమగ్రంగా విచారణ జరపాలని అప్పటి జేసీకి ఆదేశాలు జారీచేసింది. రెండు వర్గాలను జేసీ పిలింపించి విచారించారు. ఈ సమయంలో తమ వద్ద ఉన్న ఆధారాలు చూపించాలని ఆయన కోరారు. రైతులు తమ వద్ద ఉన్న 3వ విడత కింద కలెక్టర్ పంపిణీ చేసిన పొలం పాస్‌పుస్తకాలు, పట్టాలు చూపించారు. రెండో వర్గం వారు మాత్రం ఆ భూమిపై హక్కు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారు. తమ పూర్వీకుల కాలం నుంచి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని, తమకు కూడా 380 ఎకరాల్లో పూర్తిగా పట్టాలు ఇవ్వాలని కోరారు. దీంతో ఈ వివాదాన్ని జేసీ పెండింగ్‌లో పెట్టారు. తమకు అనుకూలంగా జేసీ నడుచుకోలేదన్న దుగ్ధతో రెండో వర్గం మరోమారు కోర్టును ఆశ్రయించింది. జేసీ ఈ కేసును సమగ్రంగా విచారించలేదని ఆరోపిస్తూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకుడి జోక్యంతో ఆర్డీఓ ద్వారా ఆ భూమిపై ప్రొసీడింగ్స్ ఇప్పించారు. టీడీపీ ముఖ్యనేత ఆదేశాలతోనే త్రిపురాంతకం సీఐ, ఎస్సై నడిగడ్డకు వచ్చి శోత్రియం భూముల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించి, తమ భయభ్రాంతులకు గురిచేశారని పట్టాలు పొందిన రైతులు ఆరోపిస్తున్నారు. తమకు పట్టాలు ఇచ్చిన భూమి కాకుండా అక్కడ మరో 260 ఎకరాల వరకు భూమి ఉందని, పేదలకు దక్కాల్సిన భూమిని అధికార టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు అధికారులంతా సిద్ధమయ్యారని మండిపడుతున్నారు. భూమిపై హక్కుఉన్నట్లు పట్టాలు చూపిస్తున్న బాధితులు భూ హక్కున్న వారిని హెచ్చరిస్తున్న పోలీసులు 2006లో పట్టాలు పంపిణీ చేస్తున్న అధికారులు ఘనంగా బూచేపల్లి సుబ్బారెడ్డి వర్ధంతి 20 ఏళ్ల క్రితం ఇచ్చిన పట్టాలు రద్దు అంటూ తప్పుడు ప్రచారం టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులు అనుమతి లేకున్నా జేసీబీలతో భూములు చదును చేస్తున్న వైనం అయినా అటువైపు కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు తమకు ఇచ్చిన పట్టాలకు భూమి చూపాలని అడుగుతున్న బాధితులు -
రన్‌వేపై స్పిరిట్ ట్యాంకర్ బీభత్సం
సింగరాయకొండ: మద్యం మత్తులో స్పిరిట్ ట్యాంకర్ డ్రైవర్ సృష్టించిన బీభత్సం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందగా, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జాతీయ రహదారిపై విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్‌వేపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పామూరు నుంచి మామిడికాయల లోడ్‌తో విజయవాడ వెళ్తున్న ఆటోను హైవే పక్కన గోల్డెన్ కేఫ్ రెస్టారెంట్ సమీపంలో నిలిపి డ్రైవర్ టీ తాగేందుకు వెళ్లాడు. గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు జి.బాపనరెడ్డి, జి.వేణుప్రకాష్రెడ్డి కరేడు నుంచి రూ.9 లక్షల నగదు తీసుకొని వస్తూ ఆ మామిడికాయల ఆటో సమీపంలో తమ బైక్ ఆపి ఫోన్లో మాట్లాడుతున్నారు. అదే సమయంలో చైన్నె నుంచి కాకినాడకు స్పిరిట్ తీసుకురావడానికి వెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో మామిడికాయల ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఆటో బోల్తా కొట్టగా, అందులో ఉన్న మామిడికాయల ట్రేలు ఫోన్ మాట్లాడుకుంటున్న ఇద్దరిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. బాపనరెడ్డి పరిస్థితి విషమించి మృతి చెందారు. కాగా, సంఘటన స్థలంలో పడి ఉన్న రూ.9 లక్షల నగదును 108 సిబ్బంది వేణు, సౌజన్య ఆస్పత్రిలో క్షతగాత్రుడు వేణుప్రకాష్రెడ్డికి అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జరుగుమల్లి ఇన్చార్జి ఎస్సై మహేంద్ర తెలిపారు. -
ప్రతి ఫిర్యాదును విచారించండి
● ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్‌రాజు మార్కాపురం: ప్రతి ఫిర్యాదుపై సంబంధిత పోలీసు అధికారులు సమగ్రంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశించారు. సోమవారం మార్కాపురం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. వివిధ సమస్యలపై 32 ప్రజలు అర్జీలు అందజేశారు. వాటిపై ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో ఎస్పీ మాట్లాడారు. ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిలో వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించాలన్నారు. ఫిర్యాదుల్లో సివిల్, భూమి, ఆర్థిక తగాదాలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ నాగరాజు, గిద్దలూరు, పొదిలి, కంభం సీఐలు సురేష్, రాజేష్‌కుమార్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో 74 ఫిర్యాదులు... ఒంగోలు సిటీ: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి 74 ఫిర్యాదులు అందాయి. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి.శ్రీధర్, పోలీస్ అధికారులు పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను వివరంగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, వేధింపులు, తదితర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో కందుకూరు సీఐ షేక్ అన్వర్ బాషా, సింగరాయకొండ సీఐ శ్రీహరి, అద్దంకి అర్బన్ సీఐ సుబ్బరాజు, ప్యానల్ అడ్వకేట్ బి.బాలాజీసింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
భూగర్భ జలాలు పెంచాలి
ఒంగోలు సబర్బన్: ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వర్షం నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. జలధార – జలహారతి – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జలవనరులు, డ్వామా, గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న జలధార – జలహారతి – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, సాగునీటి సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా నీటి సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై 14వ తేదీ వరకు వంద రోజుల కార్యాచరణతో జలధార పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో ఒక చెరువును పునరుద్ధరించాలని సూచించారు. ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, గ్రౌండ్ వాటర్ డీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దుప్రజలకు తాగునీటి సరఫరా, నాణ్యత విషయంలో లోపాలు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా తీరుపై సోమవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. క్లోరినేషన్, ట్యాంకుల క్లీనింగ్లకు జిల్లావ్యాప్తంగా ఉమ్మడిగా ఒక తేదీని నిర్ణయించాలని ఆదేశించారు. గ్రామాల్లో కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీటినే ప్రజలు తాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ దిశగా నీటి వనరుల నిర్వహణ, పరిశుభ్రతపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస సంజయ్ పాల్గొన్నారు. అధికారులతో సమీక్షలో కలెక్టర్ రాజాబాబు -
● ప్రసన్నాంజనేయునికి 108 రకాల నైవేద్యాల సమర్పణ
అద్దంకి: మండలంలోని శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రంలో ఈ నెల 9వ తేదీ నుంచి హనుమత్ జయంతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం హనుమత్జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. సోమవారం నిత్య పూజలతోపాటు, స్వామివారికి 108 రకాల మధుర ఫలాలతో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించారు. స్వామి వారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం, పంచామృత దశ విధ ద్రవ్యాలతో మహన్యాస పూర్వక ఏకాదశ మన్యుసూక్త వారాభిషేకం, నాగవల్లీ దళార్చన, తమలపాకులతో అర్చన, యధావిధి హోమ, మంటపారాధన కార్యక్రమాలు, చండీ హోమం, చతుర్విధ స్వస్తి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమానికి ఉభయ దాతలుగా కనుమళ్ల గ్రామానికి చెందిన గుంజి కృష్ణారావు, రామాదేవి దంపతులు, కాట్రగడ్డ అనీల్‌కుమార్, శ్రీవిద్య దంపతులు, కాట్రగడ్డ వెంకట సాయిరామ్, ప్రియాంక దంపతులు వ్యవహరించారు. సాయంత్రం స్వామి వారిని అశ్వవాహనంపై ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని ఏసీ తిమ్మానాయుడు, ఆలయ పాలక మండలి చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్‌రావు, పాలకమండలి సభ్యులు పర్యవేక్షించారు. -
60 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
గుడ్లూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుడ్లూరు పోలీసులు సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. రాజుపాలెం రోడ్డులోని రామాలయం వద్ద ఆగి ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా తెల్ల గోతాల్లో ఉన్న బియ్యం మూటలు కనిపించాయి. దీంతో వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి పరిశీలించారు. వాటిలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకొని విచారించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఐవీ వెంకట్రావు తెలిపారు. కేసులో డ్రైవర్ మల్లికార్జునతో పాటు ఎస్.మురళిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. -
చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి
ఒంగోలు సిటీ: రాజకీయ లబ్ధికోసం కాకుండా మహిళలను గౌరవించేలా చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లును వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఒంగోలులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు ఎం.విజయ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘ నాయకురాలు వీ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల పట్ల కపట కన్నీరు కారుస్తూ చట్ట సభల్లో రిజర్వేషన్ బిల్లులు ఆమోదించకుండా కొర్రీలు వేస్తున్నారని తెలిపారు. నిజంగా మహిళల పట్ల ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ ఒక్క బిల్లునే ప్రవేశపెట్టి ఆమోదించవచ్చు కదా అని ప్రశ్నించారు. గత 30 సంవత్సరాలుగా మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం మహిళా సంఘాల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో చేస్తున్న ఆందోళనలను వివరించారు. ఏ ప్రభుత్వం వచ్చినా మహిళలకు న్యాయం చేస్తామని చెప్పడం తప్ప ఆచరణలో ఎక్కడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అయినా మహిళా బిల్లును ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎం విజయ మాట్లాడుతూ రాజ్యసభలో పాటు రాష్ట్ర శాసనసభమండలిలో కూడా 33 శాతం రిజర్వేషన్ కోసం వచ్చే వర్షాకాల సమావేశంలో కొత్త రాజ్యాంగ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా హక్కులను రాజకీయ కవచంలా వాడుకోవడం మానుకొని ఎటువంటి జాప్యం లేకుండా బిల్లును ఆమోదించాలని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. పీవోడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు సీహెచ్ పద్మ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును జతచేసి పార్లమెంట్లో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎస్ రావమ్మ, జిల్లా కార్యదర్శి అనంతలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ లక్ష్మి, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ కవిత, మహిళా అభ్యుదయ సంఘం నాయకురాలు నాగేంద్రమ్మతో పాటు వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026
గ్లాసు పార్టీలో నేతల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో జనసేన రెండు, మూడు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ ముఖ్యనేతలుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. ఒంగోలులో జరిగిన స్థానిక సంస్థల డీ లిమిటేషన్ ప్రక్రియ సమావేశం ఆగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ సమావేశానికి రియాజ్ డుమ్మా కొట్టడం, రియాజ్‌పై బాలినేని పరోక్ష విమర్శలు చేయడంతో వారి మధ్య వివాదం మరింత ముదిరి పాకానపడనుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. వర్గాలు రగిలి..సీఐలు, ఎస్సైలకు సూచనలిస్తున్న ఎస్పీ హర్షవర్ధనరాజు సమావేశంలో మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి బాలాజీ ఒంగోలు సమావేశంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన జనసైనికులు కొందరు తమ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు సహకరించడంలేదని ఆరోపణలు చేశారు. డీ లిమిటేషన్ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మరల్చుకుంటున్నారని, ఉద్దేశపూర్వకంగానే జనసేనకు నష్టం కలిగేలా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గౌతంరాజుని వేదిక మీదకు పిలవగానే కొందరు కార్యకర్తలు ఒక్కసారిగా తిరగబడ్డారు. ఇన్చార్జికు వ్యతిరేకంగా విమర్శలు చేశారు. అందరూ ఒక్కసారిగా వాదన పెట్టుకోవడంతో వేదిక వద్ద ఉద్రిక్తంగా మారింది. అలాగే నెల్లూరు జిల్లా నాయకుడు, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌ను వేదిక మీదకు పిలవగానే అదే జిల్లాకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం. జిల్లా జనసేన పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పేరుకు జనసేన పార్టే కానీ ఇందులో జనసైనికులు ఎవరూలేరన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుచరుడిగా వ్యవహరిస్తుండడాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరినప్పుడు ఎమ్మెల్యే దామచర్ల నేరుగా పవన్ కల్యాణ్‌ను విమర్శించినప్పటికీ రియాజ్ స్పందించకపోవడం, ఆ తరువాత కూడా జనసేన కార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపకుండా ఎమ్మెల్యే దామచర్ల అనుచరుడిగా, పక్కా టీడీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని జనసైనికులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. -
పొగాకు రైతు పోరుబాట
మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల పరిధిలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో నోబిడ్ల వంకతో 70 శాతం పొగాకు బేళ్లను వెనక్కి పంపిస్తుండడంతో రైతులు ఆగ్రహంతో సోమవారం వేలం నిలిపేశారు. చండ్రపాడు, గాడిపర్తివారిపాలెం గ్రామాలకు చెందిన దాదాపు 350 మందికి పై గా రైతులు పొగాకును వేలం కేంద్రానికి తీసుకురా గా అధిక శాతం బేళ్లను తిరస్కరించారు. విషయం తెలిసి రైతు సంఘం నాయకులు కొనుగోలు కేంద్రా న్ని సందర్శించారు.జిల్లా రైతు సంఘం ప్రధాన కా ర్యదర్శి జజ్జర జయంత్ బాబు మాట్లాడుతూ చంద్ర బాబు ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి పొగాకు రైతులకు తిప్పలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు బ్యారెన్‌కు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని మండిపడ్డారు. ఈనెల 18వ తేదీన పొగాకు రైతుల సమస్యలపై ఒంగోలులో సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి
ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించాలని, పెండింగ్ డీఏలను ప్రకటించి, ఆర్థిక బకాయిలపై ఒక రూట్‌మ్యాప్ ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై డిమాండ్ చేశారు. యూటీఎఫ్ వ్యవస్థాపకుడు దివంగత దాచూరి రామిరెడ్డి పదో వర్ధంతి సందర్భంగా సామ్రాజ్యవాదం– యుద్ధం– భారతదేశంలో దాని ప్రభావం అనే అంశంపై స్థానిక యూటీఎఫ్ భవనంలో ఉపన్యాసం నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మూరి శ్రీనివాసరావుతో పాటు యూటీఎఫ్ సీనియర్ నాయకుడు డీ వీరాంజనేయులు, సీనియర్ జర్నలిస్టు వీ రాంభూపాల్, రాష్ట్ర కార్యదర్శి ఎస్ రవి మాట్లాడారు. పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో అత్యున్నతమైన ఫలితాలు సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలుపుతూ యూటీఎఫ్ కార్యకర్తలు స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో పాల్గొని విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థను కాపాడాలన్నారు. ప్రపంచ ప్రజానీకం యుద్ధం వద్దు శాంతి కావాలని ముందుకొస్తున్నారని చెప్పారు. యుద్ధానికి మూలం సామ్రాజ్యవాదం, గ్లోబలైజేషన్ అని ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం ప్రతి ఒక్కరిపై పడుతుందన్నారు. దాని పర్యవసానంగా వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరతతో చాలా ఇబ్బందులు ఎదుర్కొని, పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చైతన్యంతో కూడిన కార్యకర్తలు సంఘానికి అవసరమన్నారు. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించేతత్వం ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు నేర్పించినప్పుడు భవిష్యత్తులో మంచి పౌరసమాజం నిర్మితమవుతుందని చెప్పారు. దాచూరి రామిరెడ్డి లాంటి నాయకులు సంఘంలో తయారవ్వాలని పరిస్థితులకు అనుగుణంగా సంఘ కార్యక్రమాలు రూపొందించి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ఉపాధ్యాయులు సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు వై వెంకట్రావు, ఎన్ చిన్నస్వామి, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవీ శేషయ్య, జిల్లా కార్యదర్శులు ఎం సంధ్యారాణి, వై ఎస్ ఎన్ జ్యోతి, యం మాల కొండయ్య, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి, స్వర్ణ దుర్గ, వెంకట ప్రసాద్, ఎం శ్రీను, యూటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
13, 14 తేదీల్లో రాష్ట్రస్థాయి పశుప్రదర్శన పోటీలు
మార్కాపురం: తర్లుపాడు మండలంలోని సీతానాగులవరంలో వీరాంజనేయస్వామి ఉత్సవాల సందర్భంగా ఈనెల 13, 14 తేదీల్లో రాష్ట్రస్థాయి పశుప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా 13వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు 6 పాలపండ్ల విభాగం పోటీలు నిర్వహిస్తామని, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు అందజేస్తామన్నారు. 14వ తేదీ గురువారం 7 గంటల నుంచి కేటగిరి విభాగంలో పోటీలు నిర్వహిస్తామని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు అందజేస్తామన్నారు. ● మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసుల గుర్తింపు గిద్దలూరు రూరల్: పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నివాసం ఉంటున్న జడ్జి కె.భరత్ చంద్ర నివాసంలోకి గుర్తుతెలియని ఆగంతకుడు ప్రవేశించాడు. ఆగంతకుడు జడ్జి ఇంట్లోకి ప్రవేశించడంతోనే పెంపుడు కుక్కలు అతడిని చూసి అరవడంతో కోర్టు సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ వ్యక్తిని పోలీసులు విచారించగా..అతడి మానసిక పరిస్థితి సక్రమంగా లేదని పేరు సైతం చెప్పలేకపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి పేరు పూర్తి వివరాలను ఎవరైన తెలిస్తే చెప్పాలని పోలీసులు అతడి ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వివాహ వేడుకలో ఉప్పు వివాదం ● ముగ్గురికి గాయాలు గిద్దలూరు రూరల్: వివాహ వేడుకల్లో భోజనం వద్ద తలెత్తిన వివాదంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని బురుజుపల్లె గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన విశ్వనాఽథ్, రేణుకల వివాహం సందర్భంగా పెళ్లి కుమార్తె బంధువులు రంగనాయకులు, గాజ వెంకటేశ్వర్లు, సావిత్రిలు భోజనం వద్ద కూర్చున్నారు. భోజనంలో ఉప్పు తక్కువైందని చెప్పడంతో పెళ్లికుమారుడి తరపు బంధువులు లక్ష్మయ్య, పీరయ్యలు ఉప్పును చేతితో వేస్తుండగా స్పూన్‌తో వేయాలని గాజ వెంకటేశ్వర్లుకు చెందిన వారు చెప్పారు. దీంతో ఈ విషయమై మాట మాట పెరిగి ఘర్షణ పెరిగి లక్ష్మయ్య, పీరయ్యలు మరో నలుగురు కలిసి వారిపై రాళ్లతో దాడి చేశారు. గాయపడిన సావిత్రి, వెంకటేశ్వర్లు, రంగనాయకులు చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు లక్ష్మయ్య, పీరయ్యలపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
వార్డుల విభజనకు సర్వం సిద్ధం..!
మార్కాపురం మున్సిపల్ కార్యాలయం మార్కాపురం పట్టణ వ్యూ మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురం మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరగనుంది. ఇప్పుడున్న 35 వార్డుల స్థానంలో మరో 5 వార్డులు పెరగనున్నాయి. దీంతో మొత్తం 40 వార్డులు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి మున్సిపల్ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 17న 40 వార్డులకు సంబంధించి డ్రాఫ్ట్ పబ్లిష్ చేయనున్నారు. 18 నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రస్తుతం మార్కాపురం మున్సిపాలిటీలో 35 వార్డులు ఉన్నాయి. మొత్తం 85,292 మంది ప్రజలు ఉండగా 58,400 మంది ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల విభజన జరుగుతోంది. 1400 నుంచి 1500 ఓట్ల మధ్య వార్డులు ఉండేలా అధికారులు విభజన చేస్తున్నారు. పెరగనున్న పట్టణ పరిధి.. గత ఏడాది డిసెంబర్ 30న మార్కాపురం జిల్లా నూతనంగా ఏర్పాటైంది. నూతనంగా ఏర్పడిన మార్కాపురంలో పట్టణ పరిధి కూడా పెరుగుతోంది. కలెక్టరేట్ నుంచి కళాశాల రోడ్డులోని వై జంక్షన్ వరకూ సుమారు 6 కిలోమీటర్ల పొడవునా పట్టణం విస్తరించి ఉంది. సమీప గ్రామాల నుంచి ప్రజలు ఉపాధి కోసం మార్కాపురం పట్టణానికి వలస వస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అధికారులు కూడా వార్డులను విభజిస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం జనాభా ఎక్కువ ఉన్న వార్డులను గుర్తించి ఆ ప్రాంతాలను విభజించి నూతన వార్డులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. 17, 18, 19 తదితర వార్డుల నుంచి వార్డుల పెంపుదల ఉన్నట్లు తెలుస్తుంది. నూతన వార్డులతో మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. షెడ్యూల్ ఇలా.. త్వరలో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మున్సిపల్ వార్డు విభజన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 17న వార్డుల డ్రాఫ్టును సిద్ధం చేయడం, 18 నుంచి 24 వరకూ ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం మే 25 నుంచి జూన్ 5 వరకూ అభ్యంతరాలను పరిశీలించి కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపుతారు. వచ్చిన ప్రతిపాదనలను కలెక్టర్ జూన్ 6 నుంచి జూన్ 11 వరకూ పరిశీలించి నివేదికను కమిషనర్ అండ్ డైరెక్టరేట్‌కు పంపుతారు. అక్కడ తుది ఆమోదం తరువాత జూన్ 12 నుంచి 23 మధ్య పరిశీలన అనంతరం జూన్ 24 నుంచి 26 మధ్య తుది గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. దీంతో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు నేతృత్వంలో సిబ్బంది వార్డుల విభజన ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. మార్కాపురం మున్సిపాలిటీలో పెరగనున్న వార్డులు 35 నుంచి 40కి పెరగనున్న వార్డులు ఈ నెల 17న ప్రకటన 18 నుంచి అభ్యంతరాల స్వీకరణ -
గంగమ్మకు ఎమ్మెల్యే తాటిపర్తి నివాళి
పెద్దదోర్నాల: అనారోగ్యంతో మృతి చెందిన పెద్దదోర్నాల ఎంపీపీ గుమ్మా పద్మజా యల్లేష్ నానమ్మ మృతికి యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఘన నివాళులర్పించారు. ఎంపీపీ పద్మజా యల్లేష్ నానమ్మ ఒంటేరు గంగమ్మ అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హుటాహుటిన మండల కేంద్రంలోని ఎంపీపీ ఇంటికి చేరుకుని గంగమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఒంటేరు రమణయ్య, ఎంపీపీ గుమ్మా పద్మజ, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మా యల్లేష్లను ఆయన పరామర్శించి వారికి ప్రగాడ సానుభూతిని ప్రకటించారు. నివాళులర్పించిన వారిలో మండల పార్టీ కన్వీనర్ గంటా రమణారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దర్శనం నాగయ్య, మార్కెట్ యార్డు కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ఒంటేరు నాగేఽశ్వరరావు, జేసీబీ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అలలతో ఆటవిడుపు
క్వాడ్ బైక్‌పై తీరాన్ని చుట్టేస్తూ..వేసవి సెలవులు..ఆదివారం కలిసి రావడంతో కొత్తపట్నం సముద్ర తీరం పర్యాటకులతో నిండిపోయింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ సముద్ర తీరంలో అలలతో ఆటవిడుపుగా సేదతీరారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కేరింతలు కొట్టారు. గుర్రంపై, క్వాడ్ బైక్‌లో షికార్లు చేశారు. చిన్నారులు ఇసుకలో గూళ్లు కట్టుకుని ఆడుకున్నారు. కొత్తపట్నం సముద్రతీరంలో పర్యాటకుల సందడితీరంలో చిన్నారుల కేరింత– సాక్షి, ఒంగోలు -
జలవనరులా..వ్యర్థాల నిలయాలా..?
సింగరాయకొండ: రక్షిత మంచినీటి చెరువులను కొందరు అక్రమార్కులు కలుషితం చేస్తున్నారు. చెరువుల్లో ఫ్యాక్టరీ వ్యర్థాలు, రోడ్డు వ్యర్థాలతో పాటు యాసిడ్ వ్యర్థాలు సైతం వేస్తున్నారు. దీంతో దాహం తీర్చే నీరు కలుషితంగా మారి ప్రజలకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. మండలంలోని కలికవాయ ఎర్రకుంట చెరువు, మూలగుంటపాడు జువ్వలగుంట చెరువులు రక్షిత మంచినీటి పధకాలకు ఉపయోగపడుతుండగా కొందరు అక్రమార్కులు ఈ చెరువుల్లో ఫ్యాక్టరీ వ్యర్థాలు వేస్తూ కలుషితం చేస్తున్నారని దీంతో చెరువులు కలుషితమవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కలికవాయ చెరువులో ఫ్య్క్టారీ యాసిడ్ వ్యర్థాలు కలికవాయ ఎర్రగుంట చెరువులోని నీటిని గ్రామస్తులు రక్షిత మంచినీటి అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ చెరువులో 5 బోర్లు వేసి రక్షిత మంచినీటి పథకం నిర్వహిస్తున్నారు. కానీ ఇటీవల అక్రమార్కులు ఫ్యాక్టరీలోని యాసిడ్ వ్యర్థాలను తీసుకుని వచ్చి చెరువులోని గుంతలో పోయగా శనివారం దాన్ని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా అధికారులు పట్టించుకోవడంతో స్థానికులు జేసీబీతో యాసిడ్ వ్యర్థాలు ఉన్న గుంతను పూడ్చి చెరువులో నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకు భాద్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మరమ్మతు చేసిన వ్యర్థాలను కూడా చెరువులో పోస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జువ్వలగుంట చెరువులో ఫ్యాక్టరీ వ్యర్థాలు మండలంలోని మూలగుంటపాడు పంచాయతీలోని జువ్వలగుంట చెరువులో ఆదివారం సమీపంలోని ఫ్యాక్టరీకి చెందిన వ్యర్థాలను ట్రాక్టర్ల ద్వారా తీసుకుని వచ్చి పోసి మరీ తగలబెడుతున్నారు. ఈ వ్యర్థాలను ఫ్యాక్టరీ నుంచి తరలించే కాంట్రాక్టును తీసుకున్న వ్యక్తి ఈ విధంగా చెరువులో వ్యర్థాలను పోసి తగలబెడుతున్నారని, అంతేకాక సమీపంలో రక్షిత మంచినీటి పథకం సంపు కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులను డంపింగ్ యార్డులుగా భావిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని రక్షిత మంచినీటి పథకాలను, చెరువులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. కలికవాయ ఎర్రకుంట చెరువులో నీటి పక్కన పోసిన యాసిడ్ వ్యర్థాలు జువ్వలగుంట చెరువులో వేసిన ఫ్యాక్టరీ వ్యర్థాలు కలికవాయ ఎర్రకుంట చెరువులో పోసిన యాసిడ్ వ్యర్థాలు కలికవాయ ఎర్రకుంట చెరువులో పోసిన రోడ్డు వ్యర్థాలు కలికవాయ ఎర్రకుంట చెరువులో పోసిన యాసిడ్ వ్యర్థాలు మంచినీటి చెరువులను కలుషితం చేస్తున్న అక్రమార్కులు కలికవాయ ఎర్రకుంట చెరువులో యాసిడ్ వ్యర్థాలు, రోడ్డు వ్యర్థాలు జువ్వలగుంట చెరువులో ఫ్యాక్టరీల వ్యర్థాలు రక్షిత మంచినీటి పథకాలకు ఇబ్బంది చెరువులు కలుషితం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు
అద్దంకి: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా ఆదివారం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం మండపారాధన, విశేష అభిషేకాలు నిర్వహించారు. సీతారాముల స్వామివారికి స్నపన, ఉత్సవ మూర్తులకు తిరుమంజనం సేవ నిర్వహించారు. అర్చన, మండప దేవతా పూజలు, హోమాలు, బలిహరణ, సూర్య నమస్కారాలు మహానివేదన, పంచహారతులు నిర్వహించారు. కళ్యాణం సందర్భంగా స్వామివార్లకు మల్లికాపుష్ప అర్చన నిర్వహించారు. ప్రదోషకాలార్చన, చతుర్వేద స్వస్తి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఉభయ దాతలుగా బంధుకవి ప్రవీణ్, మధుమాలతి దంపతులు వ్యవహరించారు. రాత్రికి గజవాహన సేవ నిర్వహించారు. విశేషంగా ఉత్సవ మూర్తులకు రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పాలకమండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్‌రావు, ఏసీ తిమ్మానాయడు, పాలకమండలి సభ్యులు, సిబ్బంది పర్యవేక్షించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. -
చేపల కోసం చెరువు ఖాళీ
కందుకూరు: సాగునీటి చెరువుల్లో చేపల పెంపకందార్లు చేపలు పట్టుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. చేపలు పట్టుకునే పేరుతో చెరువులోనీ నీటిని బయటకు వెళ్లగొడుతున్నారు. ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామంలోని గోకులచెరువు ఇందుకు ఉదాహరణ. గోకులచెరువులో ప్రస్తుతం రెండు అడుగుల మేర నీళ్లు ఉన్నాయి. చెరువులో ఉన్న నీటిని వేసవి సీజన్ కావడంతో గ్రామంలోని పశువులకు, గొర్రెలకు ఉపయోగించుకుంటున్నారు. వేసవిలో మూగజీవాలకు చెరువు నీరు ప్రస్తుతం దాహార్తిని తీరుస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆ చెరువులో చేపలు పెంచుకున్న వారు చెరువుని నీటిని ఖాళీ చేసే పనిలో ఉన్నారు. చేపలు పట్టుకోవాలనే ఉద్దేశంతో చెరువు నీటిని ట్రాక్టర్ మోటార్ పెట్టి బయటకు వెళ్లగొడుతున్నారు. చెరువులోని నీటిని ఇలా వృథాగా బయటకు వెళ్లగొట్టడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ అవసరం లేకుండా నీటిని తోడేస్తున్నారని, దీని వల్ల భవిష్యత్‌లో వర్షాలు పడకపోతే చెరువు పూర్తిగా ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పశువుల నీటి అవసరాలకు కూడా నీరు దొరికే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. నీటిని అక్రమంగా బయటకు పంపుతున్న వ్యక్తులను ప్రశ్నిస్తే ఇరిగేషన్ అధికారుల అనుమతితోనే నీరు వెళ్లగొడుతున్నామని సమాధానం చెప్తున్నారని, అధికారులు అడ్డగోలుగా ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఇరిగేషన్ అధికారులు నీటిని బయటకు పంపేందుకు అధికారికంగా ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. అదే సందర్భంలో ఇరిగేషన్ అధికారులకు ఈ విషయం తెలిసినా చూసీచూడనట్లు వదిలేసి సదరు వ్యక్తులకు సహకరిస్తున్నట్లు సమాచారం. -
లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాటం
ఒంగోలు టౌన్: కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు స్పష్టం చేశారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.లేబర్ కోడ్లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గజిట్ నోటిఫికేషన్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా కాలం సుబ్బారావు మాట్లాడుతూ...స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మికుల చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొని రావడం దుర్మార్గమన్నారు. ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం మొండిగా లేబర్ కోడ్లను అమలు చేయాలను కోవడం సమర్ధనీయం కాదన్నారు. ఉద్యోగులకు, కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరించిన గత ప్రభుత్వాలు ఏమయ్యాయో ప్రధానమంత్రి మోడీ ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు. ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయానికి తావు లేదనుకోవడం ప్రజా స్వామ్యానికి సిగ్గుచేటన్నారు. ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ లేబర్ కోడ్లను అమలు చేస్తూ ఇచ్చిన గజిట్ నోటిఫికేషన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మికులను బలి చేయాలనుకోవడం అవివేకమన్నారు. దేశంలో సంపద సృష్టించేది కార్మికులు, ఉద్యోగులేనని, కార్పొరేట్లు కాదన్న విషయం గ్రహించాలన్నారు. కార్మికులు, ఉద్యోగులు హక్కులు కాలరాస్తున్న మోడీ ప్రభుత్వానికి సమయం వచ్చినప్పుడు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తంబి శ్రీనివాసులు, సయ్యద్ బాషా, ఆర్ మాలకొండయ్య, జి.రమేష్, దాసరి మల్లికార్జున రావు, డి.రమేష్ పాల్గొన్నారు. -
ఒంగోలులో బాలల తెలుగు మహాసభలు
ఒంగోలు మెట్రో: వచ్చే డిసెంబర్లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు బాలల కోసం ఒంగోలు మండలం కొప్పోలులోని నెక్ట్స్‌జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ మాస్ట్రో గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నెక్ట్స్‌జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఆదివారం నిర్వహించిన ‘ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 14 సంవత్సరాల్లోపు తెలుగు బాలబాలికలు ఈ మహాసభల్లో పాల్గొంటారని అన్నారు. బాలబాలికలచే అష్టావధానం, హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాట, తప్పెట గుండ్లు, పద్యధారణ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కెన్యా దేశాధ్యక్షుడు, మన రాష్ట్రపతిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించామని తెలిపారు. తమ సంగీత సాహిత్యాలతో తెలుగు భాషకు ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చిన ప్రముఖులు ప్రకాశం జిల్లాలో ప్రభవించారని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘ అధ్యక్షుడు పొన్నూరు శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగు భాషోద్యమం గృహోద్యమంగా రావాలనే ఉద్దేశంతో బాలలకు తెలుగు మహాసభలు నిర్వహించడం భాషా వికాసానికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ సభలకు ప్రకాశం జిల్లా రచయితల సంఘంతో పాటు జిల్లాలోని అన్ని సాహిత్య, కళాసంఘాల సహకారం ఉంటుందని చెప్పారు. మహాసభల జాతీయ సంచాలకురాలు కొల్లి రామావతి మాట్లాడుతూ ఇప్పటికే పలు జిల్లాల్లో సన్నాహక సదస్సులు ఏర్పాటు చేశామని అన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సంచాలకులు, నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ రామచంద్రుని రమేష్ కృష్ణ, ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి యత్తపు కొండారెడ్డి, ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు మూడమంచు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం పాలూరి శివప్రసాద్, కప్పగంతుల మధుసూదనశాస్త్రి, అన్ను విజయ కుమారి, అరుణ, పి.రాజ్యలక్ష్మి, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, ఎస్ఎండీ రఫీ, గాడేపల్లికి దివాకరదత్తు, నల్లూరి కాంతి, అంగలకుర్తి ప్రసాదు, నారాయణ బాలసుబ్రహ్మణ్యం, పిన్ని వెంకటేశ్వర్లు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, బీనీడి కృష్ణయ్య, నెమ్మాని సీతారామమూర్తి, ఐ.మురళీకృష్ణ, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, సయ్యద్ ఇస్మాయిల్, ఎంవీఎస్ శాస్త్రి, గణపతిరాజు వెంకట మల్యాద్రి పాల్గొని జిల్లాలోని సంగీత, సాహిత్య, కళా, నాటక రంగ ప్రముఖుల గురించి ప్రసంగించారు. అనంతరం గజల్ శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు. -
మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): సంతనూతలపాడు మండల పరిధిలోని ఎండ్లూరు డొంక సమీపంలో జిల్లా మహిళా ప్రాంగణంలో నిరుద్యోగ మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 15 నుంచి 45 ఏళ్లలోపు నిరుద్యోగ మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తారని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9963005209 నంబర్‌ను సంప్రదించాలన్నారు. గిద్దలూరు రూరల్: నల్లమల ఘాట్ రోడ్డులో లారీ బోల్తాపడి నాలుగు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిన ఘటన మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో ఆదివారం జరిగింది. గిద్దలూరు నుంచి నంద్యాల వైపుగా వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు రోడ్డుకు అడ్డంగా బోల్తాకొట్టింది. దీంతో నంద్యాల నుంచి గిద్దలూరుకు వచ్చి వెళ్లే వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న లారీని పక్కకు తొలగించారు. ఒంగోలు టౌన్: వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న కారణంగా మార్కాపురం, ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయాల్లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించనున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, సాధ్యమైనంత త్వరగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు అందజేయాలని సూచించారు. మార్కాపురం టౌన్: మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం జరగనున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమం వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని వేళల్లో మార్పు చేసినట్లు కలెక్టర్ ఎం.విజయసునీత తెలిపారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ పీజిఆర్ఎస్ జరుగుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలని, అదేవిధంగా 1100 నంబర్‌కు ప్రజలు ఎవరైనా కాల్చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు వారి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని తెలిపారు. -
రేషన్‌కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవాలి
మార్కాపురం టౌన్: రేషన్‌కార్డుల్లో ఉన్న సభ్యులంతా తప్పనిసరిగా ఈకైవెసీ చేయించుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి అంకయ్య అన్నారు. ఆదివారం నిర్వహించిన డీలర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా 10,15,212 కార్డులు ఉన్నాయని, అందులో 9,48,003 మంది ఈ కేవైసీ చేయించుకున్నారని, మిగిలిన వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకునేందుకు డీలర్లు కార్డుదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈకేవైసీ చేయించుకోకుంటే భవిష్యత్‌లో అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. సమావేశంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు, ఎన్ఫోర్సుమెంట్ డీటీ ఆర్ సాలమ్మ, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం జాస్తి.. వసతి నాస్తి..!
చీమకుర్తి: నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ వసతి గృహాలకు అవసరమైన భవనాల నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో అరకొర వసతులతో అవస్థపడుతూ విద్యార్థులు చదువులు కొనసాగించాల్సి వస్తోంది. పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వ అలసత్వంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న హాస్టల్ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో విద్యార్థులు ప్రాణాలు అరచేత పట్టుకుని గడపాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఒక్క పైసా విదల్చకపోవడంతో.. జిల్లా మినరల్ ఫండ్ అయిన డీఎంఎఫ్ నిధులతో ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల నిర్మాణానికి కలెక్టర్ చర్యలు చేపట్టారు. వాటిలో చీమకుర్తి ఎస్సీ బాలికల హాస్టల్‌కు రూ.2 కోట్లు, సంతనూతలపాడు ఎస్సీ బాలుర హాస్టల్‌కు రూ.2 కోట్లు, ఒంగోలులోని సంతపేటలో డీఆర్ఆర్ఎం హైస్కూలు దగ్గరున్న బాలికలకు చెందిన రెండు హాస్టళ్లకు రూ.6.15 కోట్లు, సక్కుబాయమ్మ కాలేజీ బాలికల హాస్టల్‌కు రూ.4.50 కోట్లు, ఒంగోలులోని అంజయ్యరోడ్డులో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్‌కు రూ.3.70 కోట్లు మంజూరు చేశారు. పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్ భవనానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.6 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం మీద 7 హాస్టళ్ల భవనాలకు కేంద్రంతో పాటు జిల్లా డీఎంఎఫ్ నిధులు మొత్తం కలిపి రూ.19.70 కోట్లు మంజూరయ్యాయి. వాటి నిర్మాణానికి రెండు సంవత్సరాల నాడు టెండర్లు పిలిచారు. కానీ, నిధుల విడుదలతో పాటు వేగవంతంగా పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టల్ భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నారు. హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మించే క్రమంలో విద్యార్థులను అద్దె భవనాల్లోకి తరలించారు. కానీ, అద్దె భవనాల యజమానులు అడిగినంత అద్దెలను ప్రభుత్వం చెల్లించకపోవడం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తున్న అద్దెలు సరిపోకపోవడంతో అద్దె భవనాల యజమానులు అసంతృప్తితో విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అద్దె భవనాలలో కనీసం మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ హాలు, తాగునీటి సదుపాయలు కూడా సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసి వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కొంత మంది తమ పిల్లలను హాస్టళ్ల నుంచి తీసుకెళ్లి గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో చేర్పించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నూతన విద్యా సంవత్సరానికై నా హాస్టళ్ల భవన నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా, ఆ దిశగా కూడా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. హాస్టళ్ల నిర్మాణాలను పరిశీలిస్తే.. ఆ విషయం అర్థమవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించాల్సిన నిధులతో పనిలేనందున కేవలం కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న డీఎంఎఫ్ నిధులను త్వరితగతిన విడుదల చేసి హాస్టళ్ల భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, వచ్చే నెలలో పాఠశాలలు తెరిచే సమయానికి అందుబాటులోకి తీసుకొచ్చి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అలసత్వంతో రెండేళ్లుగానత్తనడకన వసతి గృహాల నిర్మాణం రూ.19.70 కోట్లతో నిర్మాణంలో ఉన్న 7 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు ఒక పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.6 కోట్లు జిల్లా డీఎంఎఫ్ నుంచి మిగిలిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేకపోయినా.. ఉన్న నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కూడా పూర్తయ్యేలా లేని హాస్టళ్లు అద్దె భవనాల్లో అరకొర వసతులతో కునారిల్లుతున్న విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు హాస్టళ్ల భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి : హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న హాస్టళ్ల భవనాలను రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి త్వరగా పూర్తి చేయాలి. వచ్చే జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభించే సమయానికి విద్యార్థులు అద్దె భవనాల్లోని హాస్టళ్లలో చేరేందుకు సుముఖంగా లేరు. అందువలన విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం సరిపడా నిధులు విడుదల చేసి నిర్మాణంలో ఉన్న హాస్టల్ భవనాలను వెంటనే పూర్తి చేయాలి. తొట్టెంపూడి రామారావు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు -
ఆటోను ఢీకొట్టిన బైక్
● బీటెక్ విద్యార్థి మృతి జరుగుమల్లి(సింగరాయకొండ): రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న ఆటోను మోటారు సైకిల్ ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరుగుమల్లి మండల పరిధిలోని పాలేరు బ్రిడ్జిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గుంటూరు నగరం కొరిటిపాడులోని సాకేతనగర్ వీధికి చెందిన కారసాని రేవంత్ మణి చినకోటిరెడ్డి(21) తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్శిటీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు సెలవులు కావడంతో మోటారు సైకిల్‌పై గుంటూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో పాలేరు బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా రాంగ్రూట్లో వస్తున్న ఆటోను తప్పించబోయి బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటో తిరగబడగా, రేవంత్ మణి చినకోటిరెడ్డికి కాలు, చేయి విరిగి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి యువకుడు మృతి చెందాడు. మృతుని తండ్రి శివరామిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. ఒంగోలు టౌన్: జిల్లా కోర్టులోని కార్యాలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి తెగబడటం సంచలనం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలోని రెండో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు, స్పెషల్ మొబైల్ కోర్టుల్లోని కార్యాలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి చోరీకి యత్నించారు. రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టిన దుండగులు ప్రాపర్టీ గదిలో ప్రవేశించారు. అలాగే స్పెషల్ మొబైల్ కోర్టు తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించిన వ్యక్తులు రెండు బీరువా తాళాలను కోశారు. మిగిలిన బీరువాల హ్యాండిల్స్‌ను తిప్పి వదిలేశారు. శుక్రవారం ఉదయం కోర్టుకు వచ్చిన సిబ్బంది చూసి సమాచారం ఇవ్వడంతో జ్యుడిషియల్ అధికారులు ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కోర్టు వద్దకు చేరుకుని విచారణ ప్రారంభించారు. క్లూస్ టీంను రప్పించి సాక్ష్యాధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఒన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే ముఖ్యమైన పత్రాలేవీ పోలేదని కోర్టు సిబ్బంది పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ప్రాపర్టీ గదిలో ఏముంటాయి? కోర్టు ప్రాపర్టీ గదిలో చోరీకి యత్నించడం చర్చనీయాంశంగా మారింది. కోర్టు ప్రాపర్టీ గదిలో విలువైన చెక్కులు, ఆస్తి కేసులకు సంబంధించి ఒరిజినల్ దస్తావేజులు, క్రిమినల్ కేసులకు సంబంధించి పోలీసులు సేకరించిన కీలక సాక్ష్యాధారాలను ప్రాపర్టీ గదిలో భద్రపరుస్తారని సమాచారం. ఇక్కడ ఏఆర్ పోలీసులతో పాటుగా కోర్టు గార్డు కూడా నిత్యం కాపలా ఉంటారని తెలుస్తోంది. అయినా చోరీకి తెగబడటంపై న్యాయశాఖ వర్గాలతోపాటు ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి కోరారు. శుక్రవారం ప్రకాశం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ వరప్రసాద్‌ను జిల్లా నాయకులు కలిసి ఆ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 మే 25వ తేదీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నంబర్ 24 ప్రకారం ఎయిడెడ్ పాఠశాలల్లో సర్ ప్లస్ ఉపాధ్యాయులను ప్రతినెలా ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని కోరారు. కానీ, ప్రకాశం జిల్లాలో 12 ఎయిడెడ్ పాఠశాలల్లో గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులు లేక 37 మంది ఉపాధ్యాయ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. జీవో నంబర్ వన్ ప్రకారం సర్ ప్లస్‌గా ఉన్న 165 మంది ఉపాధ్యాయులకుగానూ మొత్తం 202 మంది ఎయిడెడ్ మిగులు ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా సీనియార్టీ జాబితా రూపొందించి వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. -
చెమట చుక్కల కష్టం బుగ్గిపాలు
● రూ.లక్షకు పైగా ఆస్తి నష్టం ముండ్లమూరు: వ్యవసాయ భూమిలో వ్యర్థాలను ఓ రైతు తగలబెడుతుండగా.. పక్కనే ఉన్న మరో రైతుకు చెందిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన ముండ్లమూరు మండలంలోని వేంపాడు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఒకరు తన పొలంలో చెత్తకు నిప్పు అంటించాడు. ఈ సమయంలో గాలులకు నిప్పు రవ్వలు ఎగసిపడి పక్కనే ఉన్న పోలేరు అనే రైతుకు చెందిన మొక్కజొన్న తోటకు అంటుకున్నాయి. మారెళ్ల నుంచి వేంపాడు వస్తున్న కొందరు రైతులు పరిస్థితిని గమనించి వేంపాడు గ్రామస్తులకు విషయం తెలియజేశారు. వారు పొలాల వద్దకు వెళ్లే లోపే కోత దశలో ఉన్న 4 ఎకరాల మొక్కజొన్న పంట, డ్రిప్ పైపులు, డీప్‌బోర్ స్టార్టర్ పెట్టె, నీళ్ల పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు చుట్టుపక్కల ఉన్న పంటలకు వ్యాపించే అవకాశం ఉండటంతో ట్రాక్టర్ రోటావేటర్ సాయంతో పొలం చుట్టూ దున్నారు. మంటలు అదుపులోకి రావడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, అగ్ని ప్రమాదం కారణంగా రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. -
సంబరాలు ముగిశాయి సమస్యలు మిగిలాయి
మార్కాపురం: కొత్త జిల్లాగా మార్కాపురం ఆవిర్భవించి ఐదు నెలలైనా ఇంకా పాలనాపరమైన బాలారిష్టాలను దాటలేదు. కీలకమైన జిల్లా స్థాయి అధికారులతో పాటు వివిధ శాఖల్లోని సిబ్బంది నియామకం పూర్తిస్థాయిలో కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ఏడాది డిసెంబరు 30న మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ను మాత్రమే నియమించారు. కీలకమైన పోలీసు బాస్, వ్యవసాయశాఖ, ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, డీఈఓ, విద్యాశాఖ, ఆర్టీఓ, ఆర్టీసీ, వెటర్నరీ, డీపీఓ తదితర శాఖలకు పూర్తి స్థాయిలో అధికారులను నియమించలేదు. మార్కాపురంలో ఉండే డివిజన్ స్థాయి అధికారులనే మార్కాపురం జిల్లాకు ఇన్చార్జిలుగా నియమించారు. ఆయా కార్యాలయాల్లో ఒక గదిని జిల్లా అధికారులకు కేటాయిస్తున్నట్లుగా జిల్లా ప్రారంభ కొత్తలో ఫొటోలు తీసి మమ అనిపించారు. అంతకుమించి ఒక్క నూతన కార్యాలయం కానీ, జిల్లా స్థాయి రెగ్యులర్ అధికారిని కానీ ప్రభుత్వం నియమించకపోవడంతో పాలన నత్తనడకతో పోటీపడుతోంది. దీంతో ముఖ్యమైన ఫైల్స్, పాలనా వ్యవహారాల కోసం స్థానిక అధికారులు జిల్లా కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. జిల్లా ఏర్పాటై 5 నెలలు కావస్తున్నా ఇంత వరకూ పూర్తిస్థాయిలో అధికారులను నియమించలేదు. దీంతో ప్రధానమైన శాఖల్లో స్థానికంగా ఉండే అధికారులు నిర్ణయం తీసుకోలేక ఒంగోలులో ఉండే ప్రకాశం జిల్లా అధికారుల నిర్ణయాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కాపురం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు రూ.50 కోట్లు ప్రకటించారు. అయితే ఆ నిధులు ఇంతవరకూ వచ్చాయో లేదో కూడా తెలీదు. మరో వైపు తాత్కాలిక కలెక్టరేట్ నిర్మాణం కోసం ఖర్చుచేసిన అధికారులు, కూటమి కాంట్రాక్టర్లు బిల్లులు రాక తలలు పట్టుకుంటున్నారు. జిల్లా అధికారులను పూర్తి స్థాయిలో నియమించకపోవడంతో ఆయా శాఖలకు ఆఫీసుల నిర్మాణం కూడా ఇప్పట్లో లేనట్టు తెలుస్తోంది. కేవలం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్యాలయాలు మాత్రమే సుంకేశుల పునరావాస కాలనీలో ఉన్న పాఠశాలలో ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో పలు సెక్షన్లలో సిబ్బంది కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఇంకా వ్యవసాయ, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, నీటి పారుదల, తాగునీటి విభాగం తదితర శాఖల్లో కూడా సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సబ్ స్టాఫ్‌లను కూడా నియమించలేదు. కేవలం జిల్లా మాత్రమే ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఒంగోలు నుంచి అధికారుల రాక.. పోక.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్కు స్థానిక అధికారులతో పాటు కొంతమంది జిల్లా స్థాయి అధికారులు ఒంగోలు నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ను నియమించినా మిగిలిన శాఖల అధికారుల నియామకం జరగకపోవడంతో ఒంగోలు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వ్యవసాయ శాఖ డీఏఓ కార్యాలయాలు మాత్రం తాత్కాలికంగా భూసార పరీక్షల కేంద్రం కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు కానీ ప్రారంభించలేదు. జిల్లా ఏర్పాటై 5 నెలలు కావస్తున్నా కీలకమైన ఎస్పీని నియమించకపోవడంతో ప్రకాశం జిల్లా ఎస్పీ మార్కాపురం జిల్లాకు ఇన్చార్జి ఎస్పీగా వ్యవహరిస్తున్నారు. కొత్త జిల్లాకు జిల్లా స్థాయి అధికారులు లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. కొన్ని ఫైల్స్ ఆమోదం కోసం ఒంగోలుకు తీసుకెళ్లి సంతకాలు చేయిస్తున్నారు. దీంతో జిల్లా ఏర్పాటుకు ముందున్న పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులను నియమించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. మార్కాపురం జిల్లాలో అధికారుల కొరత మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఇన్‌చార్జిలే దిక్కు -
‘రామ్ జీ..’ పనికి రాలేం!
బేస్తవారిపేట: ఎండలు తీవ్రరూపం దాల్చాయి. వ్యవసాయ పనులు కూడా మందగించాయి. అయినప్పటికీ వీబీజీరామ్‌జీ పథకం కింద పనులు చేసేందుకు కూలీలు ముందుకు రావడం లేదు. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో పనులు చేసినా ఫలితం లేదని కూలీలు భావిస్తున్నారు. చంద్రబాబు సర్కారు కొత్తగా ఫేస్ యాప్ అటెండెన్స్ విధానాన్ని తీసుకురావడంతో హాజరు నమోదు సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూలీలు చెబుతున్నారు. కారణాలు ఏవైనప్పటికీ రోజువారీ కూలీల లక్ష్యంలో నాలుగో వంతు కూడా పనులకు హాజరు కావడం లేదని వీబీజీరామ్‌జీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లో 2,05,111 జాబ్‌కార్డుల్లో 3,71,879 మంది యాక్టివ్ కూలీలు ఉన్నారు. వీరిలో 46,791 మంది మాత్రమే పనులకు హాజరవుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మౌలిక వసతులు దూరం శ్రీఉపాధిశ్రీ పనులు నిర్వహించే ప్రదేశంలో వేతనదారుల కోసం కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పనికి వెళ్లే వారికి నిలువ నీడ కరువైంది. కనీసం మంచినీరు కూడా అందుబాటులో ఉంచడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు. పనిలో ఉండగా ఏదైనా జరిగితే ఊళ్లోకి రావాల్సిందే. ప్రాథమిక వైద్యం కోసం మెడికల్ కిట్లు కూడా ఉంచడం లేదు. పని ప్రదేశంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాల్సి ఉంది. వేతన జీవులకు అదనపు భత్యం జమ చేయాల్సి ఉంది. సౌకర్యాలు లేక.. ఎండ వేడిమికి తాళలేక చెట్ల కింద సేద తీరాల్సి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గరిష్టంగా 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మునుముందు ఎండల తీవ్రతను ఊహించుకుంటేనే భయమేస్తోందని అంటున్నారు. వేసవి అలవెన్స్ ఎక్కడ? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకంలో ఫిబ్రవరి నుంచి మే వరకు కూలీలు చేసిన పనికి 30 శాతం అదనపు భత్యం చెల్లించారు. ప్రయాణ, కరువు భత్యం ఖర్చు కింద గడ్డపారకు రూ.10, తట్టకు రూ.5, మంచినీటికి రూ.5, ఐదు కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వచ్చే వారికి రూ.20 చొప్పున ఇవ్వాల్సి ఉంది. వీటితో పాటు పని ప్రదేశాల్లో కూలీలకు నీడ కల్పించి విశ్రాంతి తీసుకునేలా చూడాలి. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై చిన్నచూపు చూడటంతో రెండేళ్లుగా కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా పెరిగిన ఎండలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. వేతనం మంజూరులో నెలల తరబడి జాప్యం పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కరువు టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు, గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి వేసవి అలవెన్స్ ప్రకటించడంలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం మండే ఎండలో అవస్థలు పడలేక పనులకు కూలీల వెనుకడుగు మార్కాపురం జిల్లాలో 3,71,879 మంది యాక్టివ్ కూలీలు రోజూ పని చేస్తోంది 46,791 మందే.. -
మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాల సరఫరా
● డీఈఓ రేణుక ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జాతీయ పాఠ్య పుస్తకాలు ఈనెల 8వ తేదీ నుంచి మండల విద్యా వనరుల కేంద్రాలకు మొదటి దశలో సరఫరా చేసినట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. శుక్రవారం ఏపీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా మండల విద్యా వనరుల కేంద్రాలకు పుస్తకాల సరఫరాకు జెండా ఊపి డీఈఓ రేణుక, ఏటీఎం సయ్యద్ మెహబూబి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని తెలిపారు. ఒంగోలులోని పాఠ్యపుస్తకాల గోడౌన్‌కు 11 లక్షల పాఠ్యపుస్తకాలు వచ్చాయని, వాటిని మొదటి విడతగా మండల కేంద్రాలకు పంపించినట్లు చెప్పారు.జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య 2.34 లక్షల మంది ఉన్నారన్నారు. జూన్ మొదటి వారంలోగా పుస్తకాలను బడులకు అందించే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి టి.కిషోర్ బాబు, మేనేజర్ పేరయ్య, సీనియర్ అసిస్టెంట్ జిందా బాషా తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీల్లో కర్నూలు జిల్లా ఎడ్ల సత్తా
కంభం: రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి తిరునాళ్లను పురస్కరించుకొని మండలంలోని రావిపాడు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పాలపండ్లసైజు బండలాగుడు పోటీలను గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. పోటీల్లో మొత్తం 17 జతల ఎడ్లు పాల్గొనగా కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన బీఎల్ఎన్ బుల్స్ శశాంక్ శ్రేయ ఎడ్లు 4500 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. గిద్దలూరు మండలం మోడంపల్లికి చెందిన దేమ శ్రీరాములు ఎడ్లు 4200 అడుగులు లాగి ద్వితీయ స్థానం, రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన విజయలక్ష్మి ఎడ్లు, పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందిన వినోద్ కుమార్ ఎడ్లు 4200 అడుగుల దూరం లాగి మూడవ, నాల్గవ స్థానాల్లో దర్శి మండలం రాజంపల్లికి చెందిన శివన్నారాయణ ఎడ్లు 4087 అడుగులు లాగి 5వ స్థానం, రావిపాడుకు చెందిన పిదప శరభారెడ్డి ఎడ్లు 3916.9 అడుగులు లాగి ఆరో స్థానం, రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన సూరా చైత్రా రెడ్డి, పూజితారెడ్డి ఎడ్లు 3830.5 అడుగులు లాగి 7వ స్థానం, మండలంలోని సైదాపురానికి చెందిన సబ్బసాని శశిధర్ రెడ్డి, నెమలిదిన్నె చెన్నారెడ్డి ఎడ్లు 3706.2 అడుగులు లాగి ఎనిమిదో స్థానంలో నిలిచాయి. -
దళారులకే
కోతకు వచ్చి పడిపోయిన మొక్కజొన్న పంట అద్దంకి: కూటమి ప్రభుత్వంలో రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. ఆరుగాలం పండించిన పంటలకు మద్దతు ధరకు కొనుగోలు చేసే వారే లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు తాము చెప్పిందే మద్దతు ధర అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అటు ప్రభుత్వం కొనుగోలు చేయక.. పండించిన పంటను నిల్వ చేసుకునే శక్తి లేక దళారులు అడిగిన కాడికి అమ్ముకుని రైతులు నష్టాల పాలవుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 60 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు, బేస్తవారిపేట, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు, తాళ్లూరులో అధికంగా సాగు చేస్తారు. అలాగే కనిగిరి, అద్దంకి నియోజకవర్గాల్లో సైతం మొక్కజొన్న సాగు చేస్తున్నారు. అత్యధికంగా గిద్దలూరు నియోజకవర్గంలో 20 వేలకుపైగా సాగవుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర ప్రకటించడంతో ఇన్నిరోజులు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఆశపడ్డారు. గతేడాదికి మించిన లాభాలు ఉంటాయని మురిసిపోయారు. తీరా విక్రయించే సమయానికి వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. కనీస మద్దతు ధర, వ్యాపారులు కొనుగోలు చేసే ధరకు భారీ వ్యత్యాసం ఏర్పడింది. మొక్కజొన్నలు క్వింటాకు మద్దతు ధర రూ.2400 ఉండగా రూ.1600లకు కొనుగోలు చేస్తున్నారు. ధర ఆశాజనకంగా లేకపోవడంతో కొందరు రైతులు ఇంటికి చేర్చుకుని గోతాల్లో పట్టి మండెలు కట్టారు. ఇంకొందరు కోతలు కోస్తున్నారు. ఇంకొందరు ధర వచ్చిన సమయంలో విక్రయించుకోవచ్చనే ఉద్దశంతో కోల్డ్ స్టోరేజీల్లో భద్రపర్చుకుంటున్నారు. పసుపుదీ అదే దారి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 900 నుంచి 1100 ఎకరాల్లో పసుపు సాగులో ఉంది. ఎక్కువగా గిద్దలూరు, కంభం, రాచర్ల, బేస్తవారిపేట, కొమరోలు, సంతమాగులూరు, తాళ్లూరు, పామూరు, అర్ధవీడు, సీఎస్‌పురం, దర్శి తదితర మండలాల్లో సాగు చేస్తున్నారు. వీటిలో అత్యధిక శాతం గిద్దలూరు నియోజకవర్గంలోనే ఉంది. తెగుళ్ల కారణంగా దిగుబడి సగానికి సగం పడిపోయింది. బాగా పండితే ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. తెగుళ్లు సోకడంతో చాలా మందికి 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. దాంతో పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పడిపోయిన ధరలు మూడు నెలల కిందట క్వింటా పసుపు ధర రూ.14 వేలు పలకగా, ప్రస్తుతం రూ.9 వేల మధ్య పలుకుతోంది. గుంటూరు, కడప మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ అయి రైతులను దోచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపిస్తూ ధరలు భారీగా తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్రలోని శాంగ్లీ మార్కెట్లో మాత్రం క్వింటా రూ.12 వేలకు కొంటున్నారని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పంట కళ్లాల్లో ఆరబోసి కొమ్ములను వండే ప్రక్రియ ప్రారంభమైంది. శింగరకొండపాలెంలో పసుపు కొమ్ములను వండుతున్న రైతుదోచేస్తున్న దళారులు ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతలకు అడుగడుగునా గండాలే అన్నట్లు తయారైంది పరిస్థితి. ఎన్నో కష్టాలకోర్చి సాగుచేసి పంటలను అమ్ముకోవడానికి రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్లు, రవాణా, మద్దతు ధర, దళారులు ఇలా అన్నిచోట్లా ఆటంకాలే. కనీస మద్దతు ధర లభించకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వచ్చిన ధరలకే తెగనమ్ముకుంటున్నామని రైతన్న వాపోతున్నాడు. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న, పసుపు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కూటమి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి, మద్దతు ధర అంటూ రైతులను మోసం చేసింది. మద్దతు ధరను ప్రకటించడంతోనే సరి పెట్టింది. మొక్కజొన్న, పసుపు పంటలకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇదే అదనుగా దళారులు రైతులను దగా చేస్తున్నారు. తక్కువ ధరలకు కొనుగోలు చేసి ముంచేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పంటలకు మద్దతు ధర ప్రకటించడంతో పాటు మండలానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. దీంతో దళారులు సైతం మద్దతు ధర కంటే అధిక ధరలకు కొనుగోలు చేయడంతో రైతులు లాభపడ్డారు. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో సచివాలయ ఉద్యోగికి చోటు
కంభం: స్థానిక కందులాపురం కాలనీకి చెందిన యామర్తి సంతోష్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో హైదరాబాదులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన భారీ సంగీత కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన 2 వేల మంది కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొనగా అందులో ప్రతిభ కనబరిచిన 777 మందిని ఎంపిక చేశారు. విజయవాడలోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సంతోష్ గిన్నిస్ వరల్డ్ రికార్డు అవార్డును అందుకున్నారు. సంతోష్ బేస్తవారిపేట మండలం పెద్దఓబినేనిపల్లి సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు. ఒంగోలు టౌన్: గ్రామాభివృద్ధి కోసం పనులు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా సర్పంచ్‌లను కుత్సిత రాజకీయ ప్రయోజనాల కోసం వేధించడం సరికాదని సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో దాదాపుగా రూ.20 కోట్లకు పైగా చేసిన పనులకు సంబంధించి నిధులు ఉన్నప్పటికీ చెల్లింపులు చేయకుండా మహిళా సర్పంచులను ఇబ్బందులు పెడుతున్న అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల బిల్లులను చెల్లించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా సర్పంచులను మాత్రమే టార్గెట్ చేశారని ఆరోపించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా, బాపట్లకు చెందిన సర్పంచుల బకాయిలపై ఆదివారం ఒంగోలులో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు. -
గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి విఫలం
టంగుటూరు: రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టంగుటూరు పొగాకు వేలం కేంద్రం వద్ద శుక్రవారం ఆదిమూలపు సురేష్ రైతులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వేలం కేంద్రాన్ని సందర్శించి స్వయంగా వేలం పూర్తయ్యే వరకు ప్రతి పొగాకు బేలును పరిశీలించారు. ఫలితంగా రోజుటికన్నా తిరస్కరణ బేళ్లు తగ్గడంతో పాటు, ప్రతి రోజు కంటే రూ.10 అధికంగా వచ్చాయని రైతులు తెలిపారు. శుక్రవారం టంగుటూరు వేలం కేంద్రంలో 320 బేళ్లు వస్తే అందులో కేవలం 201 బేళ్లు కొన్నారు. 119 బేళ్లు తిరస్కరించారు. వీటిలో అత్యధికంగా 108 బేళ్లను ఐటీసీ కంపెనీ కొనుగోలు చేసిందని, దీనిని బట్టి ఈ కంపెనీ ఆధిపత్యం ఏవిధంగా కొనసాగుతుందో అర్థమవుతుందని సురేష్ అన్నారు. అనంతం వేలం నిర్వహణ అధికారి సత్య శ్రీనివాస్, పొగాకు బయ్యర్లతో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు, తిరస్కరణ బేళ్లు లేకుండా చూడాలన్నారు. కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర లేకపోతే రైతులు అప్పుల పాలుకాక ఏమవుతారన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు కొండంత ఆశలు చూపి అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించడం దారుణమని ధ్వజమెత్తారు. రైతు సంక్షేమం కోసం వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది 148 మిలియన్ల పొగాకు పంట ఉత్పత్తి అవ్వగా వేలం ప్రారంభమై 45 రోజులైనా ఇప్పటి వరకు కేవలం 2.5 మిలియన్ల కేజీలు కొనుగోలు చేయడం దారుణమన్నారు. ప్రస్తుతం ఇస్తున్న ధరలకు రైతు ఎకరాకు రూ.50 వేలు నుంచి రూ.70 వేలకు పైగా నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు వేలం కేంద్రాలకు వచ్చే పొగాకు బేళ్లలో 55 శాతం బేళ్లు వెనక్కి తిప్పి పంపుతున్నారని, వెల్లంపల్లి వేలం కేంద్రంలో అయితే 62 శాతం బేళ్లు వెనక్కి పంపారని దీంతో రైతుపై అదనపు భారం పడటంతో పాటు ఒక్కో బేలుకు 2 కేజీలు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. సంక్షోభం దిశగా పొగాకు మార్కెట్ పొగాకు మార్కెట్ సంక్షోభం దిశగా పయనిస్తోందని ఆదిమూలపు సురేష్ అన్నారు. రైతు ఆశించిన స్థాయిలో ధరలు పెరగడం లేదు, మార్కెట్ మరింత పతనమై తిరస్కరణ బేళ్లు భారీగా పెరుగుతున్నాయన్నారు. ఈ రీజియన్‌లో 53.67 శాతం బేళ్లు వెనక్కిపోతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ ఉచిత సలహాలు ఇస్తూ ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టిపెట్టాలంటుంటే రైతుల్లో ఆందోళన పెరుగుతోందన్నారు. మార్కెట్ పరిస్థితిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణపై రైతు కమిటీల ప్రతినిధులు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆరు మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు చింతపల్లి హరిబాబు, మసనం వెంకట్రావు, బచ్చల కోటేశ్వరరావు, పిన్నిక శ్రీనివాసులు, దూదిగుంట మల్లికార్జున, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, ఇంకొల్లు సుబ్బారెడ్డి, రాష్ట్ర రైతు నాయకులు పూసపాటి నర్సారెడ్డి, టంగుటూరు టౌన్ అధ్యక్షుడు కొమ్ము సురేంద్ర, జిల్లా రైతు విభాగం కార్యదర్శి వల్లంరెడ్డి రమణారెడ్డి, జోగి నరసింహారావు, శ్రీపతి విజయ్, పులిచర్ల కోటయ్య, మేదరమెట్ల భరత్‌రెడ్డి, గవదకట్ల వెంకీ, మండల రైతు విభాగం అధ్యక్షుడు తక్కెలపాటి సుధాకర్, రాయిండ్ల వెంకటనారాయణ, సింగమనేని బ్రహ్మయ్య, మన్నం వెంకయ్య, ఉప్పలపాటి రామరాజు, ఉప్పలపాటి శివరామరాజు, వలివర్తి శ్రీనివాసరాజు, పేరూరి కమలాకర్, అక్కుల శ్రీనివాసరెడ్డి, లింగారెడ్డి సురేంద్ర రెడ్డి, సనగర కోటి, దావులూరి సునీల్, మేడికొండ రాములు, బత్తిన మనోహర్, కొమ్మాలపాటి మధు, నరసారెడ్డి, అనీల్‌రెడ్డి, వేణురెడ్డి, భాస్కరరెడ్డి, భాస్కర్, తానికొండ రామచంద్ర, పోకూరి వెంకటేశ్వర్లు, పచ్చవ వంశీకృష్ణ, పల్నాటి వెంకటేశ్వర్లు, ఆల్ల శ్రీనివాసరెడ్డి, మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వైస్ ఎంపీపీ వేము ప్రసాదు, గొట్టిపాటి మురళి, మాలపాటి మాలకొండయ్య, బూదా రమణారెడ్డి, బొలినేని నాగేశ్వరరావు, కముజుల బ్రహ్మారెడ్డి, కొమ్ము ప్రభుదాస్, షేక్ సుల్తాన్, షేక్ కరీం, సయ్యద్ ఆబీద్ ఆలీ, కేసవరపు కృష్ణారెడ్డి, జి.అశోక్‌రెడ్డి, ప్రభాకరరెడ్డి, బుజ్జమ్మ, రాపూరి ప్రభావతి, చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు, కే వెంకారెడ్డి, మాదాల శంకర్, దాసరి శేషయ్య, సుదర్శి వెంకట్రావు, సోమిశెట్టి సురేషు, పమిడి హరికృష్ణ, రైతులు పాల్గొన్నారు. వేలం ప్రక్రియ పరిశీలిస్తున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ -
హనుమజ్జయంతి వేడుకలకు శింగరకొండ ముస్తాబు
అద్దంకి రూరల్: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న హనుమజ్జయంతి వేడుకలకు శింగరకొండ ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా దేవస్థానం ఎదుట చలువ పందిళ్లు వేసి విద్యుద్దీపాలంకరణ చేశారు. 12వ తేదీ స్వామి వారికి కదలీ ఫలార్చన, సాయంత్రం 4 గంటలకు 3 వేల మందితో కోటి తలంబ్రాల శోభాయాత్ర, సాయంత్రం 7 గంటలకు సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన కార్యనిర్వాహక అధికారి తిమ్మనాయుడు తెలిపారు. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
మార్కాపురం: విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులో చోటుచేసుకుంది. గొట్టిపడియ గ్రామానికి చెందిన తంగిరాల శ్రీనివాసరెడ్డి(23) మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులో గల శివాజీనగర్‌లో నివాసముంటూ టెంట్ హౌస్‌లో పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం కంభం రోడ్డులోని ఎల్ఐసీ ఆఫీసు పక్క వీధిలో గల ఇంటి వద్ద లైటింగ్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ వైర్లు మెయిన్ లైనుకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. మార్కాపురం: బెంగళూరు నుంచి మార్కాపురానికి అతివేగంతో ప్రయాణిస్తున్న ఆర్వీటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును మార్కాపురం వద్ద గురువారం రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. విజయవాడ రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలోని కంట్రోల్ రూము అధికారుల పర్యవేక్షణలో భాగంగా బెంగళూరు నుంచి మార్కాపురం వస్తున్న బస్సు 80 కిలోమీటర్లకు మించి ప్రయాణిస్తున్నట్లు గుర్తించి స్థానిక రవాణాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మార్కాపురం ఎంవీఐలు మాధవరావు, భాస్కరరావులు బస్సును సీజ్ చేశారు. ఇటీవలే అన్నీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో వీఎల్టీడీ (వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ డివైజ్)ను ఏర్పాటుచేసి 80 కిలోమీటర్ల వేగం దాటిన బస్సులను గుర్తించి సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి అతి వేగంగా నడిపే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్సును సీజ్ చేసి డిపోకు తరలించినట్లు తెలిపారు. టంగుటూరు: కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన మండలంలోని కొణిజేడు–పొందూరు గ్రామాల మధ్య గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు..మండలంలోని కొణిజేడు–పొందూరు గ్రామాల మధ్య ఉన్న ఇలగలేరు సమీపంలో జామాయిల్ కర్ర కొడుతున్న కూలీలకు కుళ్లిపోయిన వావన రావడంతో చుట్టుపక్కన పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అక్కడ ఆధార్‌కార్డు కనిపించింది. అందులో మృతుని పేరు బీహార్‌కు చెందిన సాకి సహానిగా గుర్తించారు. మృతుడు చనిపోయి 20 రోజులు దాటిందని, మృతదేహం బాగా కుళ్లిపోయిందని ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు. -
శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026
‘లైట్’గా తీసుకుంటే ముప్పే! వాహనాలకు విచ్చలవిడిగా అధిక సామర్థ్యంతో కూడిన ఎల్ఈడీ లైట్ల వినియోగంతో ఎదురుగా వస్తున్న వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. పేరుకే ఫ్యామిలీ దాబాలు.. బార్లలోలా మద్యం సర్వీస్ జరుగుతోంది. కేవలం ఆహార పదార్థాలు మాత్రమే అందించాల్సిన దాబాల్లో మూడు విస్కీలు, ఆరు బీర్లు అన్న విధంగా అమ్మకాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున కోడి కూసేదాకా దాబాలు తెరిచే ఉంచడంతో మందు, విందులకు కేరాఫ్‌గా మారాయి. ఊరిబయట హాయిగా సిట్టింగ్ సౌకర్యం కూడా ఉండటంతో బార్ కంటే నయమని మందుబాబులు దాబాల బాట పడుతున్నారు. నెలవారీ మామూళ్లకు అలవాటు పడిన అబ్కారీ శాఖాధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. -
10న తెలుగు వెలుగులు సాహిత్య సదస్సు
ఒంగోలు మెట్రో: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా తెలుగు వెలుగుల సాహిత్య సదస్సును ఈ నెల 10వ తేదీ ఒంగోలులోని నెక్ట్స్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించనున్నట్లు పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ప్రఖ్యాత కవులు, సాహితీ మూర్తులు పాల్గొని ప్రకాశం జిల్లా తెలుగు వెలుగులపై ప్రసంగిస్తారని వెల్లడించారు. జిల్లాలోని కవులు, రచయితలు, భాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విశిష్ట సాహిత్య సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఒంగోలు సబర్బన్: ఒంగోలు ఆర్డీఓగా టి.చంద్రశేఖరనాయుడు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్డీఓగా పనిచేసిన లక్ష్మీప్రసన్న అమరావతి బదిలీ కావడంతో నూతన ఆర్డీఓగా చంద్రశేఖరనాయుడు బాధ్యతలు తీసుకున్నారు. చీరాల ఆర్డీఓగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు చంద్రశేఖరనాయుడు వచ్చారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం జేసీ కల్పనా కుమారిని మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. ఒంగోలు సబర్బన్: స్కూల్, కాలేజీ బస్సులకు నిబంధనల ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఆర్.సుశీల స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని స్కూల్, కాలేజీ బస్సులను రవాణా శాఖ అధికారులచే గురువారం ఆకస్మికంగా తనిఖీ చేయించారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ జిల్లాలోని 744 స్కూలు, కాలేజీల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏఐఎస్ 63 నిబంధనలు పాటించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. యాజమాన్యాలు రవాణా శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇతర అవసరమైన పత్రాలను నవీకరించుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. హెవీ లైసెన్స్ కలిగి ఐదేళ్ల అనుభవం ఉన్న 60 సంవత్సరాల్లోపు వారిని డ్రైవర్లుగా నియమించుకోవాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులను సీజ్ చేస్తామని చెప్పారు. దొనకొండ: దొనకొండలోని విమానాశ్రయాన్ని మంగళగిరి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి బృందం గురువారం పరిశీలించింది. విమానాశ్రయం చుట్టూ భూమి హద్దులు, హెలీప్యాడ్, రన్ వేలను పరిశీలించారు. విమానాశ్రయానికి చెందిన భవనం పైకి ఎక్కి పూర్తి సమాచారం సేకరించారు. మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది.. అదనంగా ఎంత కేటాయించారు.. ఆ భూముల పరిస్థితి ఏమిటి.? నీటి వనరులు, తదితర మౌలిక సదుపాయాల గురించి రెవెన్యూ సిబ్బందితో చర్చించారు. విమానాశ్రయానికి సంబంధించిన అనేక విషయాల గురించి విమానాశ్రయ కేర్ టేకర్ రామకృష్ణతో చర్చించారు. దొనకొండ విమానాశ్రయంలో విమాన శిక్షణ కేంద్రం (ఎఫ్‌టీఏ) ఏర్పాటు దిశగా చర్యలు జరుగుతున్నాయని గీతాంజలి తెలిపారు. త్వరలో ఎయిర్పోర్ట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ విమానాశ్రయాన్ని సందర్శిస్తారని, ఈ నేపథ్యంలో పరిశీలనకు వచ్చామని ఆమె వివరించారు. డిప్యూటీ కలెక్టర్ వెంట తహసీల్దార్ రమాదేవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
పంచాయతీల్లో..స్పెషల్ సమస్యలు..!
● సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం ● మార్కాపురం జిల్లాలో 406 పంచాయతీలకుగానూ 176 మందే స్పెషల్ ఆఫీసర్లు ● కొన్ని మండలాల్లో ఒక అధికారికి 5 పంచాయతీల బాధ్యతలు ● అదనపు బాధ్యతలు చూడలేకపోతున్న స్పెషల్ ఆఫీసర్లు ● సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజల గగ్గోలు మార్కాపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడం, సచివాలయాల వ్యవస్థకు ప్రాధాన్యత తగ్గించడంతో గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు సతమతమవుతున్నారు. చిన్నచిన్న పనులకు కూడా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పంచాయతీల్లో కనీస వసతులు కరువై ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 2వ తేదీతో సర్పంచ్ల పదవీకాలం కూడా ముగియడంతో 3వ తేదీ నుంచి గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో సర్పంచ్ల స్థానంలో మండల స్థాయి అధికారులైన తహసీల్దార్, ఎంపీడీఓ, డిప్యూటీ తహసీల్దార్, ఎంఈఓ, ఈఓఆర్డీ, వ్యవసాయ, హార్టీకల్చర్, ఐసీడీఎస్, పంచాయతీరాజ్ ఏఈ, డీఈ, వెటర్నరీ అసిస్టెంట్లను గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. అదనపు భారంతో అరకొరగా విధులు... మార్కాపురం జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో ఉన్న 21 మండలాల్లో 406 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటన్నింటికి కలిపి 176 మంది అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. సాధారణంగా ప్రతి పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలి. కానీ, పూర్తి స్థాయిలో అధికారులు లేకపోవడంతో ఒక్కొక్క అధికారికి 5 నుంచి 6 పంచాయతీలు కేటాయించారు. దీంతో వీరు సొంత శాఖ బాధ్యతలు చూడటంతో పాటు తమకు కేటాయించిన గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ, ఇతర సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి బాధ్యతలు చూడాల్సి ఉంది. అదనపు భారం కారణంగా అవన్నీ వారు చూడలేకపోతుండటంతో పంచాయతీల్లో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గ్రామ పంచాయతీల్లో అస్తవ్యస్తంగా పాలన... మార్కాపురం జిల్లాలో స్పెషల్ ఆఫీసర్ల నియామకం గందరగోళంగా మారింది. ఒక్కొక్క అధికారికి 5 నుంచి 6 పంచాయతీలు అప్పగించారు. త్రిపురాంతకం మండలంలో 24 పంచాయతీలకు ఏడుగురు అధికారులను మాత్రమే కేటాయించారు. దోర్నాల మండలంలో 14 పంచాయతీలకు ఐదుగురు, హనుమంతునిపాడు మండలంలో 23 పంచాయతీలకు 8 మంది, కొనకనమిట్ల మండలంలో 26 పంచాయతీలకు 8 మంది, సీఎస్ పురం మండలంలో 23 పంచాయతీలకు 8 మంది, కనిగిరిలో 25 పంచాయతీలకు 8 మంది అధికారులను నియమించారు. వారంతా తాము నిర్వర్తిస్తున్న బాధ్యతలతో పాటు అదనంగా స్పెషల్ ఆఫీసర్ల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నారు. తమకు కేటాయించిన గ్రామాలకు మొక్కుబడిగా వెళ్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు మండలాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. పంచాయతీ కార్యదర్శులు ఉన్నప్పటికీ వారికి రొటీన్ కార్యక్రమాలే సరిపోతున్నాయి. స్పెషల్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా తయారై ప్రజలు అవస్థపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి స్పెషల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించేలా చూడాలని, సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆందోళనే ఆయుధంగా!
ధరలు దారుణంగా..కొండపి వేలం కేంద్రంలో పొగాకు బేళ్లను పరిశీలిస్తున్న కంపెనీల ప్రతినిధులుసింగరాయకొండ: చంద్రబాబు ప్రభుత్వ తీరుతో తమకు తీవ్రంగా నష్టం జరుగుతోందని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలం కేంద్రాల్లో పొగాకు బేళ్ల కొనుగోళ్లలో కంపెనీల ప్రతినిధులు మాయాజాలం ప్రదర్శించి ధరలు దిగ్గోయడంపై మండిపడుతున్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంపై ఆగ్రహిస్తున్నారు. మద్దతు ధరల కోసం ఆందోళన దిశగా అడుగులు వేస్తుండగా.. పొగాకు రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేపట్టిన ముందస్తు చర్యల కారణంగా పొగాకు రైతులకు మద్దతు ధర లభించి లాభాల వర్షం కురిసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో రెండో సంవత్సరం కూడా పొగాకు రైతుకు నష్టం తప్పేలా లేకపోవడంతో ఆందోళన బాట పడుతున్నారు. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గింది. అదనపు ఖర్చు కారణంగా ఎకరాకు రూ.7 వేల వరకు ఖర్చు పెరిగింది. కానీ, ఈ సంవత్సరం వేలం ప్రారంభంలో కేజీ ధర రూ.250 ఉండగా, తర్వాత ధరలు పెరుగుతాయని ఆశించిన రైతుకు నిరాశే మిగిలింది. ధరలు పెరగకపోగా క్రమేనా తగ్గుతూ కేజీ రూ.232కు పడిపోయింది. ప్రస్తుతం అది కాస్తా రూ.200 మాత్రమే ఉండటంతో రైతులు పోరుబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత ధరలతో పొగాకు రైతుకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి తమను ఆదుకునేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. 82,475 హెక్టార్లలో పొగాకు సాగు... పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో 11 వేలం కేంద్రాలుండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రీజియన్ పరిధిలో 82,475 హెక్టార్లలో పొగాకు పంట సాగైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2026–27లో పంట సీజన్‌కు సంబంధించి ఒంగోలు రీజియన్ పరిధిలో 90.20 మిలియన్ కేజీల పొగాకు పండించటానికి బోర్డు అనుమతి ఉండగా, సుమారు 130 మిలియన్ కేజీల పొగాకు పండించినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం తగ్గినట్లు బోర్డు అధికారులు తెలియజేస్తున్నారు. తగ్గిన ధరలతో దిగాలు... ఈ సంవత్సరం జిల్లాలోని 11 వేలం కేంద్రాల్లో మొదటి విడతగా మార్చి 25వ తేదీ కందుకూరు–1, పొదిలి వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. రెండో విడతగా ఏప్రిల్ 9వ తేదీ కొండపి, ఒంగోలు, కనిగిరి, డీసీ పల్లి, కలిగిరి, వెల్లంపల్లి వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వేలం ప్రారంభం నుంచి బ్రైట్ గ్రేడ్ పొగాకు కేజీ ధర రూ.250 పలకగా, మిగిలిన గ్రేడ్లు రూ.240 నుంచి రూ.220 వరకు పలికాయి. ప్రస్తుతం కేవలం రూ.200 మాత్రమే ఉండగా సరాసరి ధర రూ.225 మాత్రమే లభిస్తోంది. దీంతో ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కర్ణాటకలో పొగాకుకు కేజీ సరాసరి ధర రూ.230 వచ్చిందని, ఇక్కడ కూడా ఆ స్థాయిలో వచ్చే అవకాశం ఉందని భావించినప్పటికీ ప్రస్తుతం కేజీ సరాసరి ధర రూ.225 మాత్రమే పలకటంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటూ పోరుబాట పడుతున్నారు. గిట్టుబాటు ధర లభించేనా... ప్రస్తుతం వేలం కేంద్రాల్లో లభిస్తున్న ధరలు చూస్తే రైతులకు నిద్రపట్టని పరిస్థితి నెలకొంది. కొండపి నియోజకవర్గంలోని కొండపి వేలం కేంద్రంలో కేజీ సరాసరి ధర రూ.227 ఉండగా, టంగుటూరులో కేజీ ధర రూ.233 మాత్రమే ఉంది. దీంతో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ ప్రకారం రైతుకు ఒక్కో బ్యారన్‌కు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నష్టం వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత ధరలతో ఆత్మహత్యలే శరణ్యం... ఈ సంవత్సరం ధరలు తగ్గటంతో పాటు ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా కొనుగోలు దారులు లేక ధరలు మరింత దిగజారే పరిస్థితి నెలకొంది. ఒకవేళ కేంద్రానికి బేళ్లు తీసుకెళ్తే వాటికి నానా పరీక్షలు చేసి కొనుగోలు చేయటంతో పాటు భారీగా వెనక్కి పంపుతున్నారు. ఒక రోజు 30 శాతం, మరో రోజు 40 శాతం, గురువారం అయితే 55 శాతం బేళ్లు వెనక్కి పంపారని కొండపి పొగాకు వేలం కేంద్రం పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అయితే ఆత్మహత్యలే శరణ్యమని, ఇక కౌలు రైతుల పరిస్థితి చెప్పటానికి వీలులేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ పోరుబాట... పొగాకుకు మద్దతు ధర లభించకపోవటంతో రైతులు వేలం కేంద్రాల వారీగా పోరుబాట పడుతున్నారు. గురువారం పొదిలి వేలం కేంద్రం పరిధిలో రైతులు పోరుబాట పట్టగా శుక్రవారం వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో పొగాకు రైతులు టంగుటూరు పొగాకు వేలం కేంద్రం వద్ద మద్దతు ధర కోసం ఽనిరసన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం 7.30 గంటల నుంచి నిరసన కార్యక్రమం జరుగుతుందని, పొగాకు రైతులతో పాటు వైఎస్సార్ సీపీలోని వివిధ విభాగాల రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఆదుకోవాలని డిమాండ్... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి పంటలకు మద్దతు ధరలు కల్పించి ఆదుకున్న విషయాన్ని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. గతంలో వ్యాపారులు సిండికేట్ అయి పొగాకు ధరలు పడిపోతుంటే.. ఆనాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి ఆదుకుంది. కానీ, నేడు చంద్రబాబు ప్రభుత్వంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని, పొగాకు బోర్డు అధికారులు పొగాకు సాగు తగ్గించండి.. ప్రత్యామ్నాయ పంటలు పండించండని చెప్పడమే తప్ప, ఆ ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న ఆలోచన చేయడం లేదని విమర్శిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకు కష్టాలే తప్ప లాభాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ధరల పెంపు నిర్ణయాన్ని విరమించాలి
ఒంగోలు సబర్బన్: రొయ్య మేత ధరల పెంపుదల ప్రతిపాదన విరమించుకోవాలని రొయ్యల రైతుల సంఘం ప్రకాశం జిల్లా కమిటీ అధ్యక్షుడు దుగ్గినేని గోపినాథ్ డిమాండ్ చేశారు. నగరంలోని కర్నూలురోడ్డులోని రొయ్య రైతుల సంఘ కార్యాలయంలో గురువారం రొయ్యల రైతుల సంఘం ప్రకాశం జిల్లా కమిటీ సమావేశం గోపీనాఽథ్ అధ్యక్షతన నిర్వహిచంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేత ధరలు పెంచాలని యాజమాన్యాలు చేస్తున్న ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించి రొయ్యల రైతులపై ఖర్చులు భారం పడకుండా ఆదుకోవాలన్నారు. రొయ్యల మేత తయారు చేసే కంపెనీలు సిండికేట్‌గా మారి ప్రస్తుతం మేత తయారీ ఉత్పత్తి ఖర్చులు పెరిగాయనే సాకును చూపి ఫీడ్ ధరలను పెంపుదల చేయాలని నిర్ణయించుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరాయని గుర్తు చేశారు. దీన్ని ముఖ్యమంత్రి వెంటనే అనుమతి నిరాకరించి ధరల పెంపుదల ప్రయత్నాలను అడ్డుకొని రొయ్య రైతులపై పెట్టుబడి ఉత్పత్తి ఖర్చులు భారం పడకుండా చూడాలని కోరారు. ప్రస్తుతం రొయ్యల రైతులకు ఉత్పత్తి ఖర్చులు పెరిగి సాగు గిట్టుబాటు కావడం లేదన్నారు. మరో వైపు రొయ్యలకు సంక్రమిస్తున్న వివిధ రకాల వైరస్ వల్ల చెరువుల్లో వేసిన రొయ్యలు చనిపోతూ తీవ్రంగా నష్టపోతున్నారు. రొయ్యల ఫీడ్ తయారీలో వాడే ముడి పదార్థాల్లో వచ్చిన వ్యత్యాసాన్ని సాకుగా చూయించి రొయ్యల మేత ధరలను పెంచాలని చూడటం దారుణమన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఒకసారి ధరలు పెంచారని, మళ్లీ ధరలు పెంచితే రొయ్య రైతులకు పెనభారంగా మారుతుందన్నారు. వాస్తవానికి ఫీడ్ తయారీలో వాడే ముడి పదార్థాల ధరలు కంపెనీలు చెబుతున్నట్లుగా భారీ స్థాయిలో ఏం పెరగలేదన్నారు. పెరిగిన ధరలతో ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని, మళ్లీ ఫీడ్ ధరలు పెరిగితే రొయ్యల సాగుకు రైతులు దూరం కావాల్సి వస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోంచాలని కోరారు. సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు పమిడి సుబ్బానాయుడు, సహాయ కార్యదర్శి బత్తుల రమేష్ రెడ్డి ఉపాధ్యక్షుడు జిల్లా నాయకులు సీహెచ్ రమణయ్య, వి.వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు రాము పాల్గొన్నారు. రొయ్య రైతుల సంఘ జిల్లా అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాథ్ -
దళితులపై దాడులు సహించం
వూర్కాపురం టౌన్: దళితులపై దాడులు చేస్తే సహించేది లేదని జైభీమ్‌రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడా శ్రావణ్‌కుమార్ హెచ్చరించారు. సోమవారం మార్కాపురం వచ్చిన ఆయన మార్కాపురం జిల్లా మాల జేఏసీ నాయకులు, మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులకు ఏ సమస్య వచ్చినా తాను ముందు ఉంటానని చెప్పారు. రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ.. దళితుల మధ్య చిచ్చుపెట్టి రిజర్వేషన్లను పూర్తిగా తొలగించే కుట్రలో భాగంగానే వర్గీకరణ చేశారని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ 20 శాతం పెంచాలని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారి వెంట మార్కాపురం జిల్లా జేఏసీ అధ్యక్షుడు శాంత కుమార్, మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శామ్యుల్, యోహన్, రాజశేఖర్, ఏడుకొండలు, లక్ష్మీనారాయణ, కృష్ణారావు తదితరులు ఉన్నారు. న్యాయవాది జడా శ్రావణ్‌కుమార్ -
వృద్ధులకు చట్టాలపై అవగాహన అవసరం
ఒంగోలు వన్‌టౌన్: వృద్ధులు తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఒంగోలు నగరంలోని సమతా మహిళా వృద్ధాశ్రమాన్ని సందర్శించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులతో మాట్లాడారు. వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల చట్టాలు, రక్షణ అంశంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల లీగల్ సర్వీసెస్ కమిటీల ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సమతా వృద్ధాశ్రమం నిర్వాహకులు అంకబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
మొక్కజొక్క పంట దగ్ధం
● రూ.2.5 లక్షలు సష్టం తాళ్లూరు: కోతకు వచ్చిన మొక్కజొక్క పంట ఆగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన మండలంలోని రామభద్రాపురం గ్రామ పొలాల్లో గురువారం జరిగింది. ప్రమాదంలో రైతులు కై పు వెంకటేశ్వరరెడ్డి, కై పు రమణారెడ్డి చెందిన పంట కాలి బూడిడైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..పొలాల్లో మోటర్ వద్ద ఉంటే విద్యుత్ తీగలు ట్రిప్ అవ్వడంతో నిప్పు రవ్వలు వ్యాపించి మూడున్నర ఎకరాలు మొక్కజొన్న పంట అగ్గిపాలైనట్లు తెలిపారు. పంట దిగుబడి బాగా వచ్చిందని, దాదాపు రూ.2.5 లక్షలు సష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోత దశలో ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకం
● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: దేశాన్ని కొల్లగొట్టిన బ్రిటీష్ ముష్కరులను గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకమని ఎస్పీ హర్షవర్థన్ రాజు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్రిటీష్ ముష్కరులను దేశం నుంచి తరిమి కొట్టేందుకు మన్యంలోని ప్రజలను చైతన్యం అలుపెరుగని పోరాటాలు చేశాడని గుర్తు చేశారు. ఆయన ప్రాణత్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నేటి యువత అల్లూరి జీవితాన్ని అధ్యయనం చేయాలని, కులమతాలకతీతంగా దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఐ సీతారామి రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో మొక్కజొక్క పంట దగ్ధం
● సుమారు రూ.3 లక్షల సష్టం తాళ్లూరు: కోతకు వచ్చిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రమణాలవారి పాలెం పొలాల్లో బుధవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన కై పు రమణారెడ్డి 1.5 ఎకరాలు, కై పు వెంకట రామిరెడ్డి 3.5 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. మరికొద్ది రోజుల్లో పంట కోయాల్సి ఉంది. పొలం గట్టు వెంట ఉన్న విద్యుత్ తీగలు ట్రిప్ అవ్వడంతో నిప్పు రవ్వలు పడి మొక్కజొన్న తోటకు మంటలు వ్యాప్తించాయి. ఐదు ఎకరాల్లో పంట కాలి బూడిదైంది. పంట దిగుబడి బాగా వచ్చిందని, రూ.3 లక్షల మేర సష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
విమర్శల విస్తరణ..!
చీమకుర్తి: ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తొలి నుంచి తీవ్ర విమర్శల పాలవుతోంది. తాజాగా నాలుగు లైన్ల విస్తరణ పొడవును కుదించడంపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో జిల్లా రూపురేఖలు మార్చేస్తామంటూ సీఎంతో పాటు స్థానిక పాలకులు ప్రగల్భాలు పలికారు. అందులో భాగంగా ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు 113 కి.మీ పొడవున ఫోర్‌లైన్‌గా పీపీపీ పద్ధతిలో రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. టీడీపీ స్థానిక నాయకులు సైతం ఊహల్లో తేలారు. అదిగో ఫోర్‌లైన్, ఇదిగో టెండర్లు, ఇక టోల్గేట్లు పెట్టుకోవడమే తరువాయి అంటూ రెండు సంవత్సరాల నుంచి అధికార పార్టీ నాయకులు, అధికారులు ఊదరగొడుతున్నారు. దాని కోసం ఏడాది నుంచి మూడు సార్లు సర్వేలు చేయించారు. సంతనూతలపాడు, చీమకుర్తి, పొదిలి ప్రాంతాలలో అదనంగా బైపాస్‌లు నిర్మించడం, అవసరమైన భూమి సేకరించటం పూర్తయితే ఫోర్‌లైన్ నిర్మాణం చేపట్టడమే అని ఆర్అండ్బీ అధికారులు కూడా స్థానిక నాయకులు తానా అంటే తందానా అన్నట్లు బాకాలు ఊదారు. తీరా.. తాజాగా తెలిసిన సమాచారంతో అందరూ అవాక్కయ్యారు. ఒంగోలు సమీపంలోని ట్రిపుల్ ఐటీ కాలేజీ నుంచి పొదిలి వరకు మాత్రమే ఫోర్‌లైన్‌ను పరిమితం చేస్తూ ఆర్అండ్బీ అధికారులు ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించారు. గతంలో ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు 113 కి.మీ పొడవున ఫోర్‌లైన్ నిర్మిస్తామని చెప్పిన అధికారులు.. దానిని కేవలం పొదిలి వరకు.. అంటే దాదాపు 42 కి.మీ మాత్రమే నిర్మిస్తే సరిపోతుందని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పొదిలి నుంచి పెద్దగా ట్రాఫిక్ సమస్య ఉండదంటూ అక్కడి నుంచి డబుల్‌లైన్ నిర్మాణానికి డీపీఆర్ పంపారు. రెండేళ్లుగా ఊరిస్తూ.. చివరకు ఉసూరుమనిపించడంపై విమర్శలు... ఫోర్‌లైన్ విస్తరణతో ఒంగోలు నుంచి మార్కాపురం జిల్లా వరకు రాకపోకలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ప్రజలు, వాహనదారులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. తీరా ఇప్పుడు లేదనడంతో ఉసూరుమంటూ ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు నుంచి సంతనూతలపాడులోని ట్రిపుల్ ఐటీ కాలేజీ (8.2 కి.మీ) వరకు ఫోర్‌లైన్ ఉంది. ఒంగోలు నుంచి పొదిలికి మొత్తం 50 కి.మీ ఉండగా, దానిలో ఇప్పుడున్ను 8.2 కి.మీ ఫోర్‌లైన్ తీసేస్తే.. మిగిలిన 42 కి.మీ మాత్రమే నిర్మించనున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. ఇప్పటి వరకు రూ.3.50 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా.. జిల్లాలోని ఒకేఒక ఫోర్‌లైన్‌కు నిధులు కేటాయించలేకపోవడం శోచనీయమని ప్రభుత్వ వైఖరిని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. చివరకు సగానికి కుదించడం ఏంటో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీమకుర్తి బైపాస్‌పై రాజకీయ ఒత్తిళ్లు... ఫోర్‌లైన్ నిర్మాణంలో భాగంగా సంతనూతలపాడు, చీమకుర్తి, పొదిలి పట్టణాలకు వెలుపల బైపాస్‌లు నిర్మించాల్సి ఉంది. అయితే, చీమకుర్తిలో ఇప్పటికే సాగర్ కాలువ ఉత్తరం వైపు కట్టపై డబుల్ లైన్‌తో బైపాస్ ఉంది. దాన్నే ఫోర్‌లైన్‌గా మార్చేలా ఆర్అండ్బీ అధికారులు డీపీఆర్‌లో పొందుపరిచారు. ఇప్పుడున్న బైపాస్‌ను ఆనుకునే ఫోర్‌లైన్ నిర్మిస్తే పీపీపీ పద్ధతిలో కాంట్రాక్టర్‌కు, ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని అధికారుల అంచనా కాగా, సాగర్ కాలువకు దక్షిణంవైపున్న రెండో కట్ట మీద నిర్మిస్తే ఆ కట్టవైపున్న పొలాలకు మంచి గిరాకీ వస్తుందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అధికార పార్టీ నాయకులంతా స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న బైపాస్‌ను ఆనుకుని నిర్మిస్తే రోడ్డుకు ఆనుకుని ఉన్న పెద్ద పెద్ద భవనాలు, ఇతర నిర్మాణాలు ఫోర్‌లైన్ విస్తరణలో పోయే ప్రమాదం ఉందని, వాటిని రక్షించినట్లు అవుతుందనే ఉద్దేశంతో పాటు రెండోవైపు నిర్మిస్తే.. రియల్ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు వీలుంటుందని ఎవరికి నచ్చిన డ్రామాలు వారు ఆడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్అండ్బీ అధికారులు మాత్రం ఇప్పుడున్న బైపాస్‌ను ఆనుకుని మాత్రమే ఫోర్‌లైన్ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం డీపీఆర్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. వేలాది వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు... చీమకుర్తిలోని గ్రానైట్ లారీలు, కంకర టిప్పర్లతో పాటు ఇతర వాహనాలు వేలాదిగా చీమకుర్తి నుంచి ఒంగోలు వైపు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. 50 టన్నుల నుంచి దాదాపు 100 టన్నుల సామర్థ్యంతో గ్రానైట్ రాళ్ల ట్రాలీలు రాకపోకల కారణంగా రోడ్లు, కల్వర్టులు ఛిద్రమవుతున్నాయి. వాహనాల సామర్థ్యానికి తగినట్లుగా రోడ్లు, కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా ఆర్అండ్బీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొదిలి వరకే ఫోర్‌లైన్ నిర్మాణం గతంలో ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు ఫోర్‌లైన్ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. కానీ, ఇప్పుడు తయారు చేసిన డీపీఆర్ ప్రకారం ఒంగోలు నుంచి 8.2 కి.మీ.. అంటే సంతనూతలపాడు ట్రిపుల్ ఐటీ కాలేజీ నుంచి పొదిలి వరకు మాత్రమే ఫోర్‌లైన్ నిర్మాణం చేపట్టేందుకు డీపీఆర్ తయారు చేశారు. ప్రభుత్వానికి డీపీఆర్ పంపించాం. చీమకుర్తి బైపాస్‌లో ఇప్పుడున్న రోడ్డును ఆనుకునే ఫోర్‌లైన్ విస్తరణ ఉంటుంది. – రాంనాయక్, ఆర్అండ్బీ ఎస్ఈ సాగర్ కాలువ రెండో కట్టపై ఫోర్‌లైన్ నిర్మిస్తేనే చీమకుర్తి అభివృద్ధి చీమకుర్తి బైపాస్‌ను ఆనుకుని పెద్ద పెద్ద భవనాలు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. వాటికి ఇబ్బంది లేకుండా సాగర్ కాలువ రెండో కట్టవైపు ఫోర్‌లైన్ నిర్మిస్తే అటువైపు కూడా చీమకుర్తి పట్టణం అభివృద్ధి చెందుతుంది. – కుంచాల రాంబాబు, చీమకుర్తి ప్రస్తుతం ఉన్న డబుల్ లైన్ రోడ్డు ఇరుకుగా ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కర్నూలు రోడ్డుపై రామతీర్థం వద్ద రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి దారుణంగా మరణించాడు. చీమకుర్తి–సంతనూతలపాడు సరిహద్దులో ఎర్రగుడిపాడు, మర్రిచెట్లపాలెం వంటి పలు ప్రధాన ప్రాంతాల్లో వారానికి రెండు మూడు ప్రమాదాలు జరుగుతూ నెలకు ఐదారుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ కేంద్రం శివారులోని కర్నూలు రోడ్డులో కల్వర్టుకు పెద్ద రంధ్రం పడి వాహనాల రాకపోకలకు రాత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టుపై ట్రాఫిక్ నియంత్రణ బోర్డును బోర్లించి ఆర్అండ్బీ అధికారులు చేతుల దులుపుకున్నారు. కల్వర్టుకు పడిన రంధ్రాన్ని పూడ్చలేదు. కల్వర్టుకు పక్కగా రోడ్డు వేయలేదు. అదే విధంగా సంతనూతలపాడులోని ట్రిపుల్ ఐటీ కాలేజీ వద్ద రోడ్డు సగం తెగిపోవడంతో మొదట సిమెంట్ పైపులతో మరమ్మతులు చేసినా ఫలితం లేకపోవడంతో మరోసారి మరమ్మతులు చేశారు. ప్రమాదకరంగా మారిన సంతనూతలపాడు కల్వర్టు (రెడ్ సర్కిల్లో నెలల తరబడి రంధ్రం పడిన ప్రాంతం)సంతనూతలపాడు ట్రిపుల్ ఐటీ వద్ద ఇప్పటికే రెండు సార్లు మరమ్మతులు చేసిన ప్రాంతం (రెడ్ సర్కిల్లో) నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పొడవును కుదించడంపై తీవ్ర విమర్శలు తొలుత ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు 113 కి.మీ పొడవున విస్తరించేందుకు చర్యలు ప్రస్తుతం ఒంగోలు నుంచి పొదిలి వరకు 42 కి.మీ మాత్రమే విస్తరించేందుకు ఏర్పాట్లు పొదిలి నుంచి రెండు లైన్లకే పరిమితం చేస్తూ ప్రభుత్వానికి అధికారుల డీపీఆర్ చీమకుర్తి బైపాస్‌ను ఆనుకునే ఫోర్‌లైన్ విస్తరణ సాగర్ కాలువ రెండో కట్ట వైపునకు మార్చేందుకు స్థానిక నాయకుల రాజకీయ ఒత్తిళ్లు -
హోంగార్డు ఇంట్లో చోరీ
గిద్దలూరు రూరల్: పట్టణంలోని నంద్యాల రోడ్డులో టిడ్కో గృహాల సమీపంలో గల జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న హోంగార్డు ఇంట్లో చోరీ జరిగిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. అందిన వివరాల ప్రకారం.. ఆవుల కాశయ్య అనే హోంగార్డు కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం కలసపాడులో బంధువుల వివాహానికి వెళ్లాడు. ఇంటికి తాళాలు వేసి వెళ్లగా, దుండగులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా బద్దలుగొట్టి అందులోని రెండు జతలు బంగారు కమ్మలు, రెండు ఉంగరాలు, వెండి వస్తువులు చోరీ చేశారు. సుమారు రూ.2 లక్షల విలువ గల ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చీమకుర్తి రూరల్: మండలంలోని కూనంనేనివారిపాలెం పరిధిలోని బావిలో ప్రమాదవశాత్తూ పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. చీమకుర్తికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పాలడుగు శ్రీనివాసరావు (65) అటువైపుగా వెళ్తూ ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందినట్లు తెలిసింది. ఒంగోలు వన్‌టౌన్: జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆర్ఆర్బీ, అసిస్టెంట్ లోకో పైలెట్, గ్రూప్–డీ పరీక్షలతో పాటు ఏపీ హైకోర్టులో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి ఎస్.నిర్మలాజ్యోతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, అర్హులైన కులాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 20వ తేదీలోగా ఏపీ బీసీ స్టడీ సర్కిల్, ఒంగోలు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 100 మంది అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాతో పాటు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షలోపు ఉండాలన్నారు. ఆధార్, బ్యాంక్ పాస్ పుస్తకం, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అక్నాలడ్జెమెంట్ ఫొటోస్టాట్ కాపీలను జతపరచాలన్నారు. వాటితో పాటు 2 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను కార్యాలయంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా కార్యాలయం నంబర్లు 08592–231232, 9989285530ను సంప్రదించాలని సూచించారు. -
రైతుల గోడు పట్టదా చంద్రబాబు?
యర్రగొండపాలెం: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు బుధవారం మోటారు బైక్‌లపై ర్యాలీగా స్థానిక మార్కాపురం రోడ్‌లోని బొప్పాయి తోట వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు మార్కెట్లో కనీస ధర లభించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలుల బీభత్సానికి బొప్పాయి, అరటి, బత్తాయి, నిమ్మ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతులు పెట్టుబడి కోసం చేసిన అప్పు తీరే మార్గం కానరాక సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకుడికి రైతుల బాధలు ఏమీ పట్టవని, కేవలం ఆయనకు కావలసింది ఎలక్షన్లు, కలెక్షన్లేనని దుయ్యబట్టారు. గిట్టుబాటు ధరలు, అకాల వర్షాలతో పంట నష్టం గురించి కనీస ప్రస్తావన చేయకపోవడం కలెక్షన్ బాబు నైజానికి నిదర్శనమన్నారు. అధికారులు సైతం కలెక్షన్ బాబుకు కొమ్ముకాస్తూ ప్రజల కష్టాలను పట్టించుకోవడం మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే రైతుల కష్టాలు, ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. బాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం వ్యవసాయాధారిత రాష్ట్రాన్ని చంద్రబాబు దివాళా దిశగా తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంతోపాటు రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసి కష్టాలపాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా మిర్చి రూ.24 వేల ధర పలకగా.. బాబు గద్దెనెక్కిన తర్వాత రూ.9 వేలకు పడిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్యాస్ కొరత వల్ల డ్రయ్యర్లు పనిచేయక ఎక్కడిక్కడ పంట ఉత్పత్తులను రోడ్లపై ఆరబోసుకొని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. కమర్షియల్ డీజిల్ ధర పెరగడం వల్ల రైతులపై పెట్టుబడి భారం పెరిగిపోయిందన్నారు. పల్లెల్లో తాగునీటి కష్టాలను తీర్చలేని దుస్థితిలో చంద్రబాబు సర్కారు ఉండటం ప్రజల ధౌర్భాగ్యమన్నారు. వైఎస్ జగన్ పాలనలో మాదిరిగా రైతులకు మద్దతు ధర, పరిహారం అందించకుంటే కలెక్టరేట్‌తోపాటు వ్యవసాయ, అనుబంధ విభాగాల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముందుగా ఉద్యాన శాఖాధికారి పి.ఆదిరెడ్డికి అకాల వర్షాలతో బొప్పాయి రైతులకు కలిగిన నష్టం గురించి వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు వై.వెంకటేశ్వరరెడ్డి, కె.ఓబులరెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, పి.కృష్ణారెడ్డి, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సయ్యద్ జబీవుల్లా, షేక్.మహమ్మద్ కాశిం, ఒంగోలు సుబ్బారెడ్డి, చిట్టె వెంకటేశ్వరెడ్డి, వెన్నా రమణారెడ్డి, వాగ్యా నాయక్, ఎల్.రాములు, సింగా ప్రసాద్, ఆవుల వీర కోటిరెడ్డి, ఆవుల రమణారెడ్డి, పి.రాములు నాయక్, తిరుమలరెడ్డి చిన్న వీరారెడ్డి, రాగాల వెంకటయ్య, సురేష్ నాయక్, సరళ, శార, అరుణాబాయి, జి.బాలకోటిరెడ్డి, షేక్.మునాఫ్ పాల్గొన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేదు.. నష్ట పరిహారం ఊసు అసలే లేదు దెబ్బతిన్న బొప్పాయి తోట వద్ద నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి పొలాల బాట పట్టిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు -
కోనేరులో పడి వృద్ధుడు మృతి
ఉలవపాడు: కోనేరులో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన ఉలవపాడులో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. ఉలవపాడులోని వేణుగోపాల స్వామి ఆలయం కోనేరులో మృతదేహం తేలుతుండటాన్ని బుధవారం ఉదయం స్థానికులు గమనించి, ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేశారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతుడిని సన్నెబోయిన రమణయ్య(70)గా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. బంధువులంతా కలిసి మృతదేహాన్ని బయటకు తీసి ఆయన స్వగృహానికి తరలించారు. మంగళవారం రాత్రి కోనేరులో పడి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. -
ఆలయంలో చోరీకి విఫలయత్నం
పెద్దారవీడు: మండల కేంద్రమైన పెద్దారవీడులో ఆంజనేయస్వామి ఆలయంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఈ సంఘటన బుధవారం ఉదయం వెలుగుచూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామానికి చెందిన ఔకు నాగేశ్వరరావు మద్యం మత్తులో ఆంజనేయస్వామి ఆలయం తలుపు పగలగొట్టాడు. హుండీ పగలగొట్టేందుకు వీలుపడకపోవడంతో గర్భగుడిలోని బీరువా తెరిచేందుకు పూనుకున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన వ్యక్తి మంచి నీటి సరఫరా మోటారు ఆపేందుకు వెళ్తూ.. ఆలయంలో శబ్దాలు రావడాన్ని గమనించాడు. గ్రామస్తులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో అందరూ చుట్టుముట్టి దొంగను పట్టుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన జేబులో ఉన్న రూ.1600 చూపించాడని స్థానికులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై సైదుబాబు చెప్పారు. ● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: వేసవి వడగాల్పులను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు సూచించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో తరచూ మంచినీరు తాగాలని, డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. బుధవారం ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ వెల్ఫేర్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్, నిమ్మ రసం, మజ్జిగ లాంటి ద్రవాలు తాగాలని చెప్పారు. సమ్మర్ కిట్‌లో ఎండ తీవ్రత నుంచి కాపాడే టోపీలు, సన్ గ్లాసెస్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు ఉన్నాయని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గేంత వరకు సమ్మర్ కిట్లను క్రమం తప్పకుండా వినియోగించాలని చెప్పారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ హజరత్తయ్య, ట్రాఫిక్ ఎస్సైలు కోటయ్య, శివ ప్రసాద్, మాల్యాద్రి పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026
కరువు నేలకు వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. గోరంత నిధులు విదిల్చి కొండంత ప్రచారాన్ని చేస్తోంది. వెలిగొండకు అన్యాయం చేసే ఊరుకోమని, ఉద్యమం చేస్తామని వైఎస్సార్ సీపీ ప్రకటించిన నేపథ్యంలో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రాయానాయుడు మంగళవారం ప్రాజెక్టును సందర్శించి నానా హంగామా చేశారు. రాత్రంతా టన్నెల్లో తిరిగి హడావుడి చేశారు. ఇంతవరకూ పునరావాస ప్యాకేజీని ఇవ్వకుండా పదే పదే ప్రాజెక్టు ప్రారంభంపై ప్రకటనలు చేస్తుండడం గమనార్హం.పారని నిధులు..మార్కాపురం: జూలై కల్లా వెలిగొండ నీటిని పారిస్తాం.. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం.. మేమే శంకుస్థాపన చేశాం.. మేమే ప్రారంభిస్తాం.. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరులశాఖామంత్రి నిమ్మల రామానాయుడు తరచుగా చెప్పే మాటలు ఇవి. చెప్పే మాటలకు, చేతలకు అసలు పొంతన ఉండదని మరోసారి నిరూపించుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు సైతం ప్రాజెక్టును తరుచూ సందర్శిస్తూ చేస్తున్న హడావుడి అంతా ఇంతాకాదు. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం జిల్లాకు వచ్చారు. రూ.456 కోట్ల వ్యయంతో దోర్నాల మండలంలోని గంటవానిపల్లి వద్ద ఫీడర్ కెనాల్ లైనింగు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా నిర్వహించిన సభలో ఈ ఏడాది జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తిచేసి నీరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఫీడర్ కెనాల్ పనులు మాత్రం నత్తతో పోటీ పడుతున్నాయి. మంత్రి హడావుడి ఇలా.. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో మంత్రి నిమ్మల రామానాయుడు హంగామా చేస్తున్నారు. గత ఏడాది నవంబరు నుంచి మంగళవారం వరకూ ఎనిమిది సార్లు పర్యటించారు. గతేడాది నవంబరు 7న, నవంబరు 12న, డిసెంబరు 12, ఈ ఏడాది జనవరి 23న, ఫిబ్రవరి 25న, ఏప్రిల్ 7న, మే 5,6 తేదీల్లో మంత్రి రామానాయుడు వెలిగొండ టన్నెల్ పనులను పరిశీలించారు. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. జూలైనాటికి వెలిగొండ నీళ్లు ఇస్తారా అంటే.. ఇస్తామంటారు.. ఎలా అంటే చెప్పరు.. ఇదిలా ఉండగా సోమవారం మార్కాపురం పట్టణంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించింది. సభకు హాజరైన వారంతా వెలిగొండ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, ప్రభుత్వ తీరు మారకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని నాయకులు హెచ్చరించారు. దీంతో మంత్రి రామానాయుడు హడావుడిగా మంగళవారం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. పనుల పురోగతిని సమీక్షించారు. పనులు వేగంగా జరగడం లేదంటూనే రాత్రంగా టన్నెల్లో తిరుగుతూ హడావుడి చేశారు. పరిహారం ఊసే లేదు... వెలిగొండ నీరు టన్నెల్స్ నుంచి సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల డ్యామ్‌కు చేరాలంటే 11 ముంపు గ్రామాల్లోని 7270 కుటుంబాలకు సుమారు రూ.950 కోట్ల పరిహారాన్ని చెల్లించాలి. ఇదే సమయంలో నిర్వాసితుల కోసం కడుతున్న ఆర్అండ్ఆర్ కాలనీల్లో పక్కా గృహాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలి. ఇవేమీ లేకుండా జూన్ నాటికి టన్నెల్ పనులు పూర్తిచేసి నీటిని విడుదల చేస్తామనే హామీ ఎలా అమలవుతుందో అర్థంకాక అటు అధికారులు, ఇటు జిల్లా ప్రజలు, ముంపు గ్రామాల నిర్వాసితులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించినా ఇవన్నీ పూర్తికావాలంటే కనీసం ఐదారు నెలల సమయం పడుతుంది. మంత్రి చెబుతున్న హామీ ప్రకారం వచ్చే నెలాఖరుకు టన్నెల్స్ పనులు పూర్తయి జూలైకి నీరు రావాలి. టన్నెల్–1లో సుమారు 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉంది. టన్నెల్–2 లో 12వ కిలోమీటరు వద్ద టీబీఎం మిషన్ ఇరుక్కుపోయి ఉంది. దాన్ని తొలగించాలన్నా చాలా సమయం పడుతుంది. కావాల్సింది రూ.2540 కోట్లు.. ఇచ్చింది రూ.412 కోట్లుమొత్తం ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.9081 కోట్ల నిధులు కావాలి. ఇప్పటి వరకూ రూ.5451 కోట్లు ఖర్చుచేశారు. భూ సేకరణకు రూ.484 కోట్లు, పునరావాసానికి రూ.184 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.2540 కోట్లు కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది బడ్జెట్లో రూ.412 కోట్లు మాత్రమే కేటాయించారు. హెడ్ రెగ్యులేటర్, రిటైనింగ్ వాల్, వింగ్స్‌కు సంబంధించిన పనులు టన్నెల్ 2లో సుమారు 2400 మీటర్ల లైనింగు పనులు పూర్తి కావాల్సి ఉంది. ఫీడర్ కెనాల్లో 5.3 కిలో మీటర్ల రిటైనింగ్ వాల్ కాంక్రీట్ నిర్మాణం చేశారు. 20 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ లైనింగులో 5 శాతం మాత్రమే పూర్తయింది. రెండు రోజుల క్రితమే టీబీఎం మిషన్‌ను తొలగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. టీబీఎం తొలగిస్తేనే నీళ్లు బయటకు వస్తాయి. టన్నెల్–2లో కొన్నిచోట్ల బండరాళ్లు ఊడిపడుతున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అటు ఆర్అండ్ఆర్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టక, ఇటు పరిహారం ఇవ్వక, మరో వైపు పనులు పూర్తికాక ఇలా.. సమస్యల నడుమ జూలై నాటికి వెలిగొండ నీళ్లు ఇస్తామంటున్నారు. అది ఎలా సాధ్యమో దేవుడికే తెలియాలి. -
ఓర్వలేక..వికృత చేష్టలు
టంగుటూరు: టీడీపీ నాయకుల దాష్టీకాలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటవుతుందనే అహంకారంతో విర్రవీగుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు కొత్తగా ఇళ్లు నిర్మించుకున్నా ఓర్వలేకపోతున్నారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరునిగా ఉన్న కంకణాల శ్రీను ఇటీవల కొత్తగా ఇంటిని నిర్మించుకున్నాడు. దాన్ని కూడా ఓర్వలేని గ్రామ టీడీపీ నాయకులు తమ అక్కసు ప్రదర్శించారు. గ్రామ సచివాలయ అధికారులైన సెక్రటరీ, మహిళా పోలీసులను పంపించి కంకణాల శ్రీను కుటుంబానికి చెందిన సొంత స్థలంలోకి ప్రవేశించి ఇంటి గేటు ముందు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కాలువ తీసే నెపంతో మూడు సార్లు అక్రమంగా తవ్వకాలు జరిపారు. గృహప్రవేశ కార్యక్రమం నేపథ్యంలో గేటు ముందు రోడ్డును తవ్వేసి వికృతానందం పొందారు. టీడీపీకే చెందిన వేజండ్ల శ్రీను అనే వ్యక్తిని పంపించి ఈ స్థలం నాదేనంటూ పనులకు అడుగడుగునా ఆటంకం కల్పించారు. ఇది మా సొంత స్థలమని ఇంటి డాక్యుమెంట్లు చూపించినా అధికారులు పట్టించుకోకుండా గ్రామ సెక్రటరీ తవ్వకాలు చేయించి అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించారు. టీడీపీ సానుభూతిపరుడు వేజండ్ల శ్రీనుకు ఈ స్థలంతో ఏమాత్రం సంబంధం లేదని ఆయన వద్దనున్న ఇంటి డాక్యుమెంట్లు రుజువు చేస్తున్నా, సెక్రటరీ మాత్రం అతడికే వత్తాసు పలుకుతున్నాడు. గ్రామ సెక్రటరీ టీడీపీ కార్యకర్తలా మితిమీరి జోక్యం చేసుకుంటున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
స్నేహపూర్వక వాతావరణంతోనే కేసుల పరిష్కారం
సింగరాయకొండ: లాయర్‌కు, జడ్జికి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉన్నప్పుడే కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని కర్ణాటక హైకోర్టు జడ్జి కే మన్మథరావు అన్నారు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మొదటి వార్షికోత్సవంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జడ్జి మన్మథరావు మాట్లాడుతూ న్యాయవాదిగా పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తిగా కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నానని, తాను కర్ణాటక హైకోర్టు జడ్జిగా 2 నెలల్లో 234 కేసులు పరిష్కరించానన్నారు. నేడు న్యాయవాది ఆలోచనలో మార్పులు రావాలని, అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను 31 సంవత్సరాలు న్యాయవాదిగా ఉన్నప్పుడు స్థానికంగా కోర్టు ఉండాలని కలలు కన్నానని, తాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి అయ్యాక ఆ కలను సాకారం చేసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం కందుకూరుకు రెండు అదనపు కోర్టులు మంజూరయ్యాయని, వాటిలో ఒక కోర్టు సింగరాయకొండకు తీసుకుని రావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ వీ లీలా శ్యాంసుందరి మాట్లాడుతూ తాను పనిచేసిన కోర్టుల్లో అత్యధిక కేసులు ఈ కోర్టులోనే ఉన్నాయన్నారు. తాను మూడు లోక్‌అదాలత్‌లలో సుమారు 1,350 కేసులు పరిష్కరించానని, సాధారణ కేసులు దాదాపు 1,500లకు పైగా పరిష్కరించానని వివరించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి మన్మథరావును, జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ వీ లీలా శ్యాంసుందరిని ప్రత్యేకంగా అడ్వకేట్లు సత్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ శ్రీనివాసులు, ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు, చావలి రమేష్‌బాబు, లాయర్లు రాయి రమేష్, కె నరశింహారావు, బక్కముంతల వెంకటేశ్వర్లు, సీఐ పీ శ్రీహరి, ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, బీ మహేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు అండగా నిలిచిన జగనన్న
ముండ్లమూరు: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి అండగా నిలిచారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కొనియాడారు. మండలంలోని ఈదర గ్రామంలో కొలువై ఉన్న అంకాలమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా భీమవరం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆమె మాట్లాడారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చి అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి అండగా నిలిచారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నగదు ప్రతి విద్యార్థి ఖాతాలో నేరుగా జమ చేసి విద్యార్థుల ఉన్నత చదువులకు దోహదపడ్డారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నవరత్న పథకాలతో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా పేదలను మోసం చేశారని మండిపడ్డారు. వచ్చే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కార్యకర్తకు, నాయకులకు బూచేపల్లి కుటుంబం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మానందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిదేవర అంజయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ ప్రధాన కార్యదర్శి మేకల వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ నాయకులు ఉన్నారు. -
‘రెవెన్యూ’చింతలు తీరేనా..!
మార్కాపురం టౌన్: కలెక్టరేట్ అయినా, గ్రామ స్థాయి అయినా ఎక్కడ సమావేశం పెట్టినా వచ్చే అర్జీలు రెవెన్యూవే. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థంకాక రైతులు ప్రతి సోమవారం తమ రెవెన్యూ సమస్యలపై అర్జీలు ఇస్తున్నా అతి తక్కువ సంఖ్యలోనే పరిష్కారమవుతున్నాయి. దీంతో వీటి పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి వన్ మంత్ వన్ విలేజ్–4 విజిట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో ప్రతి నెలా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో వరుసగా నాలుగు వారాలపాటు నాలుగు విడతలుగా ప్రత్యేక గ్రామ సదస్సులు నిర్వహిస్తారు. గ్రామస్థుల భూ, రెవెన్యూ సమస్యలపై అర్జీలను గ్రామంలోనే స్వీకరించి, పరిశీలించి, చట్టబద్ధంగా పరిష్కరించడం ముఖ్య ఉద్దేశం. ప్రత్యేకంగా రీసర్వే గ్రామాలు, ఎక్కువ సంఖ్యలో పెండింగ్, రెవెన్యూ ఫిర్యాదులు ఉన్న గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ సదస్సుల్లో తహశీల్దార్, ఎంపీడీఓ, మండల సర్వేయరు, రెవెన్యూ ఇన్స్పెక్టరు తదితర అధికారులు హాజరవుతారు. వీటిలోనైనా ఏమేరకు సమస్యలు పరిష్కారం అవుతాయో వేచి చూడాల్సిందే. గతంలో రెవెన్యూ సమస్యలు మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారానికి నోచుకోకపోతే ఒంగోలులోని కలెక్టరేట్‌కు వెళ్లి అర్జీలు ఇచ్చేవారు. అయితే మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ఇక్కడి కలెక్టరేట్లోనే అర్జీలు ఇస్తున్నారు. జిల్లా ఏర్పాటు నుంచి ఇప్పటి వరకూ రెవెన్యూ సమస్యలపై వేలల్లో అర్జీలు వచ్చాయి. దీంతో రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ ఎం విజయసునీత మొదటి ప్రాధాన్యతగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశిస్తున్నా క్షేత్ర స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రతి సోమవారం ఒకే సమస్యపై అర్జీలను ఇస్తుండటంతో వీటికి పరిష్కారమార్గం ఎక్కడ దొరుకుతుందో అర్థంకాక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా మ్యుటేషన్, ఆన్లైన్, భూ ఆక్రమణలు, పొలం తగాదా సమస్యలు వస్తున్నాయి. జనవరి నుంచి మే మొదటి వారం వరకూ మార్కాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో మొత్తం సుమారు 2308 అర్జీలు రాగా అందులో రెవెన్యూ సమస్యల అర్జీలే సుమారు 1108 ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం చూస్తాం.. చేస్తాం.. అంటున్నారు. రైతులు, ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడమే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రతినెలా ఒక గ్రామం.. నాలుగు రెవెన్యూ సదస్సులు మార్కాపురం టౌన్: జిల్లాలో రెవెన్యూ సమస్యలను గ్రామ స్థాయిలో పరిష్కరించేందుకు వన్ మంత్.. వన్ విలేజ్.. 4 విజిట్స్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం విజయసునీత బుధవారం తెలిపారు. ఆమేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో ప్రతి నెలా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు వారాల పాటు నాలుగు విడతలుగా రెవెన్యూ గ్రామ సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. ఆ గ్రామానికి సంబంధించిన భూములు, రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామంలోనే స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు. ఎక్కువ రెవెన్యూ ఫిర్యాదులు వస్తున్న గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. తహశీల్దార్, ఎంపీడీఓ, మండల సర్వేయరు, ఆర్ఐ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. భూ సరిహద్దు వివాదాలు, మ్యూటేషన్, కుటుంబ భూ వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రీసర్వే సమస్యలు, 22ఏ నిషేధిత ఆస్తుల వివరాలు, దారుల వివాదాలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని, గురువారం నుంచి జిల్లాలో ప్రారంభిస్తామని తెలిపారు. -
తీగలేరు కాలువకు కూటమి ప్రభుత్వం తిలోదకాలు
యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలంలో తాగు, సాగునీరు అందించే తీగలేరు(టీ–5) కాలువకు చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలు పలికిందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలుదఫాలుగా వెలిగొండ ప్రాజెక్ట్‌ను సందర్శించడమే పనిగా పెట్టుకున్నారని, టీ–5 కాలువ ఆ ప్రాజెక్ట్‌లో అంతర్ భాగమేనన్న విషయాన్ని ఆయన మరిచిపోయినట్లుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా మంత్రి చూపు ఆ కాలువ వైపు వెళ్లనట్లుందని, నేటికీ భూ సేకరణ, టెండర్ ప్రక్రియ మొదలు కాలేదన్నారు. దశాబ్దాల తరబడి పుల్లలచెరువు మండల ప్రజలు తాగునీటి కోసం అలమటించి పోతున్నారని, సాగు నీటి సమస్యతో రైతులు వ్యవసాయం చేయలేక సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని, టీ–5 కాలువతోనే ఈ సమస్యలు పరిష్కరించవచ్చన్న విషయాన్ని పక్కకు పెట్టినట్లుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో మండలంలో నెలకొన్న నీటి సమస్యను గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆ కాలువకు రూ.83 కోట్లు బడ్జెట్లో కేటాయించారని ఆయన గుర్తుచేశారు. మండల ప్రజల తాగునీటితోపాటు దాదాపు 11 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, యర్రగొండపాలెం ప్రాంతంలో భూగర్భ జలాలు మెండుగా ఉంటాయన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం టీ–5పై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల సమస్యలు అర్థం చేసుకొని తక్షణమే కాలువ పనులు ప్రారంభించాలని తాటిపర్తి డిమాండ్ చేశారు. లేకుంటే కాలువ కోసం ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
మంత్రి చెప్పారు.. బోరు పీకారు!
పొన్నలూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచీ తెలుగు తమ్ముళ్ల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. తాము ఏమి చేసిన అడిగేవారు లేరంటూ అధికార మదంతో సామాన్య ప్రజలు, రైతులపైనా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. రైతులు వినియోగించుకుంటున్న డీప్‌బోర్ ప్రభుత్వం వేసిందని సాకుగా చూపి రెండేళ్లుగా వేధిస్తున్న పచ్చ నేతలు.. మంత్రి అండతో నిర్ధాక్షిణ్యంగా మోటారు పీకేయించడం కొండపి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పొన్నలూరు మండలంలోని చెరుకూరు గ్రామంలో వ్యవసాయ రైతు నేలపాటి మాలకొండయ్యకు 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సుమారుగా 30 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం రోడ్డు పక్కన బోరు బావి తవ్వించి చేతిపంపు ఏర్పాటు చేసింది. కాలక్రమంలో చేతిపంపు మరమ్మతులకు గురికావడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు హెడ్‌ను తొలగించి తీసుకెళ్లారు. మట్టితో పూడిపోయిన డీప్బోర్ను మాలకొండయ్యతోపాటు మరికొందరు రైతులు కలిసి సొంత డబ్బు వెచ్చించి రీబోర్ చేయించారు. విద్యుత్ మోటారు బిగించి, విద్యుత్ శాఖకు రూ.1.50 లక్షలు చెల్లించి ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేయించుకున్నారు. సుమారు 20 ఏళ్లుగా ఆ డీప్‌బోరును మాలకొండయ్యతోపాటు చుట్టుపక్కల పొలాల రైతులు వినియోగించుకుంటున్నారు. మంత్రి ఆదేశాలతో తొలగింపు.. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన క్షణం నుంచే మాలకొండయ్యతోపాటు మిగిలిన రైతులను గ్రామ టీడీపీ నాయకులు వేధించడం ప్రారంభించారు. డీప్ రహదారిలో ఉందని, అది గతంలో టీడీపీ జమానాలో వేసిందని చెబుతూ బెదిరింపులకు దిగారు. దీనిని మాలకొండయ్యతోపాటు మిగిలిన రైతులంతా వ్యతిరేకించడంతో టీడీపీ నేతలు మరింత రెచ్చిపోయారు. డీప్‌బోర్ తొలగించాల్సిందేనంటూ మంత్రి డీబీవీ స్వామి వద్ద పంచాయితీ పెట్టి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలిచ్చేలా ఒత్తిడి చేశారు. ఈ నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో పాల్గొనేందుకు మంత్రి స్వామి చెరుకూరు వస్తుండగా.. ఓ గంట ముందుగానే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వ్యవసాయ మోటార్లు తొలగించే యంత్రం ఉపయోగించి ఆగమేఘాలపై డీప్బోర్లో ఉన్న మోటారు తొలగించి పక్కన పడేశారు. కొందరు టీడీపీ నాయకులు చేసిన పని, మంత్రి స్వామి వ్యవహరించిన తీరు గ్రామంలోని టీడీపీ సానుభూతిపరులకు కూడా నచ్చలేదు. మోటారు తొలగింపు విషయమై పింఛన్ల పంపిణీ సమయంలో మంత్రి స్వామిని నిలదీయాలని గ్రామస్తులు సిద్ధం కాగా టీడీపీకి చెందిన కొందరు నేతలు కలగజేసుకుని సమస్యను పరిష్కరిస్తామని సర్దిచెప్పడం గమనార్హం. దీంతో బాధిత రైతులు కూడా మిన్నుకుండిపోయారు. చెరుకూరులో రైతులపై రాజకీయ కక్ష సాధింపులు మంత్రి స్వామి ఆదేశంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారుల అత్యుత్సాహం డీప్‌బోర్ నుంచి మోటారు తొలగించిన వైనం మంత్రి స్వామి, తెలుగు తమ్ముళ్ల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం -
మాస్టర్ ప్లాన్ అనుమతికి అభ్యంతరాల స్వీకరణ
● జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ చీమకుర్తి: చీమకుర్తి మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసేందుకు రూపొందించిన వివరాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కమిషనర్ వై.రామకృష్ణయ్య మంగళవారం మీడియా ద్వారా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 5వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు చీమకుర్తి మున్సిపల్ కార్యాలయం లేదా మెయిల్ ద్వారా అభ్యంతరాలను తెలియజేయాలని తెలిపారు. చీమకుర్తి పట్టణాన్ని రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్, ఇండస్ట్రీ కేటగిరీలుగా విభజించినట్లు కమిషనర్ తెలిపారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అనుబంధంగా మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్‌కు హద్దులుగా ఉత్తరం వైపు నాయుడుపాలెం, బండ్లమూడి, పల్లామల్లి, తూర్పు వైపు గురవారెడ్డిపాలెం, పేర్నమిట్ట, దక్షిణం గోనుగుంట, ఆర్ఎల్ పురం, పడమర ఆర్ఎల్ పురం, బూదవాడ గ్రామాల సరిహద్దులుగా నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తే రోడ్ల ప్రాధాన్యతను బట్టి 100 అడుగుల వెడల్పు నుంచి విస్తరణ చేపట్టే అవకాశం ఉంటుదని చెప్పారు. ఇక మీదట ఎక్కడంటే అక్కడ పరిశ్రమలు పెట్టుకోవడానికి వీలు కాదని, అనుమతినిచ్చిన ప్రాంతంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రోడ్లు, కాలువలు, తాగునీటి వ్యవస్థలో అభివృద్ధి మెరుగుగా మారుతుందని కమిషనర్ తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అభ్యంతరాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఇసుకాసురుల విధ్వంసకాండ
● పాలేరు నదిని తొలిచేస్తున్న టీడీపీ నేతలు ● జోరుగా టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా ● ధ్వంసమవుతున్న రోడ్లు ● అవస్థలు పడుతున్న ప్రజలు సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికార పార్టీ నేతలు పాలేరు నదిని కుళ్లబొడిచేస్తున్నారు. రేయింబవళ్లు భారీ వాహనాలతో తవ్వకాలు చేస్తూ నదీ గర్భాన్ని తొలిచేస్తున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో పాలేరు నది పొన్నలూరు, జరుగుమల్లి మండలాల్లో ప్రవహిస్తోంది. పాలేరు నది పరివాహక ప్రాంతాల్లో జేసీబీల ద్వారా ఇసుకను టిప్పర్లకు తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా రెండు, మూడు జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. వాహనాలను చీమకుర్తి, సంతనూతలపాడు, మర్రిపూడి, పొదిలి వైపు ఇసుక టిప్పర్లను తరలిస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. ఇసుకను టిప్పర్ల ద్వారా బహిరంగంగానే రవాణా చేస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇసుక వ్యాపారుల దందాకు అడ్డేలేకుండా పోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ సమీక్షిస్తున్నా అక్రమ రవాణాకు అడ్డుపడడం లేదు. ధ్వంసమవుతున్న రోడ్లు: అధిక లోడుతో లారీలు కామేపల్లి నుంచి కొండపి వైపు వెళ్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కామేపల్లి– నేతివారిపాలెం మధ్య రోడ్డు ధ్వంసమైంది. కొండపి–అనకర్లపూడి మధ్య రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కొండపి, పెరిదేపి గ్రామాల మధ్య కూడా రోడ్డు ధ్వంసం కావడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి.. టన్ను ఇసుకను రూ.900 నుంచి రూ.1100 వరకు విక్రయిస్తున్నారు. కొన్ని లారీలు ఆరు టన్నుల నుంచి 12 టన్నులు వరకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాయి. కొండపి మీదగా దాదాపు రోజుకు సుమారుగా 50 లారీల ద్వారా ఇసుక రవాణా జరుగుతోంది.ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయాన్ని టీడీపీ నేతలు బొక్కేస్తున్నారు. పట్టపగలు ఇసుక తరలిస్తున్న టిప్పర్ -
పోలీసు కుటుంబాల చిన్నారులకు వేసవి శిక్షణ
ఒంగోలు టౌన్: పోలీసు కుటుంబాల చిన్నారులకు మానసిక ఉల్లాసం, వారిలోని నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంప్–2026ను మంగళవారం ఎస్పీ ప్రారంభించారు. పరుగు పందెం, ఫుట్ బాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్ క్రీడలను ప్రారంభించిన ఎస్పీ చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నెల రోజుల పాటు ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లలను మాత్రమే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. క్రీడలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, శారీరక, మానసిక అభివృద్ధికి చాలా ముఖ్యమైనవన్నారు. క్రమశిక్షణ అలవడుతుందని, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, గెలుపోటములను సమానంగా స్వీకరించే వ్యక్తిత్వం వృద్ధి చెందుతుందని వివరించారు. నెల రోజుల క్యాంపు చిన్నారుల జీవితంలో ఒక మధురానుభూతిని మిగుల్చుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని పోలీసు కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ శిబిరంలో చిన్నారులకు పోలీస్ చిల్డ్రన్స్ కమిటీ ప్రసిడెంట్, హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణా రెడ్డి, సీతారామి రెడ్డి, ఏఆర్ ఎస్సైలు ప్రసాద్, బాషా, సురేష్, తిరుపతి స్వామి, క్రీడాకారులు పాల్గొన్నారు. క్యాంపును ప్రారంభించిన ఎస్పీ హర్షవర్థన్ రాజు -
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026
అక్రమ మద్యాన్ని అరికట్టాల్సిన ఎకై ్సజ్ అధికారులు తన జేబులు నింపుకుంటూ విక్రయదారులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతైనా అమ్ముకోండి ప్రతి వారం మామూళ్లు పక్కాగా ఇచ్చుకోండి అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఉన్నతాధికారి తన చేతికి మట్టి అంటకుండా కిందిస్థాయి సిబ్బంది ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఫోన్ పే వసూళ్ల దందా జరుగుతోందంటూ ఆబ్కారీ ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవోదయ కార్యక్రమానికి సంబంధించిన బిల్లుల్లో కూడా చేతివాటం ప్రదర్శించినట్టు ప్రచారం జరుగుతోంది. పర్మిట్ రూములకు సంబంధించి సాక్షిలో కథనం రావడంతో పాత తేదీలతో హడావుడిగా లైసెన్స్‌లు జారీ చేసినట్టు తెలిసింది.కిక్కు అధరహో!సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నీ అధికార పార్టీ కీలక నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. అధికారం చేతిలో ఉండడంతో మద్యం దుకాణాల్లో బహిరంగంగానే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల పక్కా ప్లాన్ ప్రకారం మద్యం దుకాణాల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకుండా చేస్తున్నారు. కేవలం అధికార పార్టీ కీలక నాయకులు, వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్లలో మాత్రమే అవి అందుబాటులో ఉండేలా చేస్తున్నారని తెలుస్తోంది. బ్రాండెడ్ మద్యం కోసం దుకాణాలకు వెళ్లిన మద్యం ప్రియుల సరుకు దొరకడంలేదు. ఫలానా బార్‌కు వెళ్లండి అక్కడ దొరుకుతుందని మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందే సలహా ఇస్తున్నారని తెలిసింది. అక్కడకు వెళితే రూ.50 నుంచి రూ.300 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మార్పీ ప్రకారం మద్యం విక్రయించేలా చూడాల్సిన ఎకై ్సజ్ శాఖ కీలక అధికారి మామూళ్ల మత్తులో ఇటువైపు తొంగిచూడడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి కీలక అధికారి పర్యవేక్షణలో ఒక టాస్క్‌ఫోర్స్ టీం పనిచేస్తుంది. ఇందులో ఒక ఏఈఎస్, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, 10 నుంచి 15 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తుంటారు. ఈ టీం జిల్లాలోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి విక్రయించకుండా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఎమ్మార్పీకి మించి మద్యాన్ని విక్రయిస్తుంటే వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అయితే ఈఎస్ టీం ఇప్పటి వరకు కనీసం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలను గాలికి వదిలేసి కేవలం లంచాలు వసూలు చేసేందుకే ఆ బృందం పనిచేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా విజయవాడ నుంచి వచ్చిన స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీం మాత్రం 4 కేసులు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర బృందం గుర్తించిన అక్రమాలను జిల్లా బృందం గుర్తించకపోవడంపై పలు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.నవోదయం’ బిల్లులు కై ంకర్యం...నిన్నా మొన్నటి వరకు మద్యం దుకాణాలకు పర్మిట్ లైసెన్స్ మంజూరు చేయకుండా ముడుపుల కోసం ఫైళ్లను పెండింగ్ పెట్టిన కీలక అధికారి మంగళవారం సీఐలతో సమావేశం ఏర్పాటు చేసి హడావుడిగా లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. పర్మిట్ రూములకు సబంధించి సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో సదరు అధికారి హడావుడిగా అధికారులతో సమావేశమైనట్టు తెలిసింది. గత అక్టోబర్ నెలలో లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మార్చిలో లైసెన్సు మంజూరు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ మార్చిలో లైసెన్సులు మంజూరు చేసి వుంటే గత 5 నెలలుగా పర్మిట్ రూంలు అనధికారికంగా నిర్వహించినట్లు కీలక అధికారి ఒప్పుకున్నట్లే కదాని క్షేత్రస్థాయి ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. పైసల కోసం పర్మిట్ రూంలకు లైసెన్సులను జారీ చేయకుండా పెండింగ్ పెట్టడం ఒక తప్పయితే మార్చిలో లైసెన్స్ జారీ చేసినట్లు తప్పుడు తేదీలతో లైసెన్సులు జారీ చేయడం మరో తప్పన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లాలో ఎమ్మార్పీకన్నా అధికంగా మద్యం విక్రయాలు కేసులు నమోదు చేయకుండా చోద్యం చూస్తున్న ఈఎస్ టీం 4 కేసులు నమోదు చేసిన స్టేట్ టాస్క్‌ఫోర్స్ బృందం నెలవారీ మామూళ్ల మత్తులో అధికారులు సాక్షి కథనంతో పాత తేదీలతో హడావుడిగా పర్మిట్ రూమ్‌లకు లైసెన్స్‌ల జారీ నవోదయ 2.0 నిధులు మింగేసినట్టు ఆరోపణలు కానిస్టేబుల్‌తో ఫోన్‌పే ద్వారా వసూళ్లునాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గత ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన జిల్లా కేంద్రమైన ఒంగోలు పోలీసు పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ‘నవోదయం 2.0’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 9 ఎకై ్సజ్ సర్కిల్ స్టేషన్లలో భారీ ఎత్తున నాటుసారా వ్యతిరేక ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. నాటు సారా ప్రభావిత ప్రాంతాలైన యర్రగొండపాలెం, మార్కాపురం, దోర్నాల, పుల్లల చెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు తదితర మండలాల్లో విస్తృతంగా నాటుసారా వ్యతిరేక ప్రచారం నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రచార రథాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో సమావేశాలు, అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎకై ్సజ్, ఫారెస్ట్, పోలీసు, పంచాయతీ, వైద్యారోగ్య శాఖ అధికారులను సమన్వయం చేసుకొని ప్రచారం చేశారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా ఎకై ్సజ్ సీఐలకు రూ.17 లక్షలు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌కు రూ.4 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల నుంచి పోలీసు స్టేషన్ స్థాయిని బట్టి, వారు నిర్వహించిన కార్యక్రమాల ఆధారంగా నిధులను కేటాయించాల్సి ఉంది. అదేవిధంగా సీఐలకు నిధులు కేటాయించిన కీలక అధికారి వారి నుంచి 50 శాతం ముడుపులను బలవంతంగా వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ముడుపులను తన టీంలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ మొబైల్ ఫోన్‌కు ఫోన్ పే చేయించుకున్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని విచారిస్తే అసలు గుట్టు రట్టవుతుందని క్షేత్రస్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. 50 శాతం కమీషన్ వసూలుపై కొందరు సీఐలు భగ్గుమంటున్నారని తెలిసింది. అంతటితో ఆగకుండా గత ఈఎస్ కోసం మంజూరైన రూ.4 లక్షలను నిబంధనల ప్రకారం ఆయనకు చెల్లించకుండా గుట్టుచప్పుడు కాకుండా కీలక అధికారి నొక్కేసినట్లు విశ్వసనీయ సమాచారం. కీలక అధికారి వసూళ్లపై కొందరు ఉద్యోగులు మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
చాకిరేవు కుంటనుతవ్వేస్తున్న రియల్టర్లు
● చాకిరేవు కుంటను కాపాడాలని సీపీఎం డిమాండ్ ఒంగోలు టౌన్: నగరంలోని 10వ డివిజన్ పరిధిలోని కొప్పోలులో ఉన్న చాకిరేవు కుంటలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో పలువురు నాయకులు మంగళవారం చాకిరేవు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 20 రోజులుగా కొందరు రియల్టర్లు చాకిరేవు కుంటను తవ్వి తమ వెంచర్లకు మట్టిని తోలుకుపోతున్నా అఽధికారులకు పట్టకపోవడం దారుణమన్నారు. మైనింగ్ శాఖ అఽధికారుల అనుమతి లేకుండా మట్టిని ఎలా తవ్వుకుంటారని, అయినా చెరువులు, కుంటల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుంటే మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎలా మిన్నకుంటారని ప్రశ్నించారు. ప్రకృతి సిద్ధమైన చెరువులు, కుంటలు, వాగులను కాపాడాల్సిన బాధ్యత అఽధికారులపై ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దేనికి సంకేతమని నిలదీశారు. కుంటను 20 అడుగుల లోతుకు తవ్వడం వల్ల భూగర్భ జలాలు ఉప్పునీటిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎక్స్లేటర్ల ద్వారా తవ్వకాలు చేపట్టి వందలాది ట్రాక్టర్ల మట్టిని తోలుకుంటున్నారని తెలిపారు. మట్టిని తవ్వుకొని టిప్పుల లెక్కన అమ్ముకుంటున్నారని ఆరోపించారు. చాకిరేవు వద్ద పెద్ద సంఖ్యలో నిలిచి ఉన్న ట్రాక్టర్లు చీమలదండులా కనిపిస్తున్నా అధికారుల కంటికి కనిపించకపోవడం వింతగా ఉందని విస్మయం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి చాకిరేవు కుంటను కాపాడాలని, కుంటను గ్రామాభివృద్ధి కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆంజనేయులు, కోటయ్య, రాఘవరావు, వెంకటరావు, జి.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
ఒంగోలు: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అల్లు సత్యానంద్‌ను కలెక్టర్ పి.రాజాబాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. స్థానిక జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్లో కలెక్టర్ కలుసుకున్నారు. లింగసముద్రం: కుటుంబ కలహాలతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లింగసముద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో మంగళవారం జరిగింది. ఎస్సై రాంబాబు అందించిన వివరాల ప్రకారం..ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఇండ్ల వెంగళరావు (32) కుటుంబ కలహాలతో తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు సమాచారం ఇవ్వడంతో అక్కడి వెళ్లి మృతదేహాన్ని కిందకు దించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ● తప్పిన పెనుప్రమాదం యర్రగొండపాలెం: కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో ఆ చెట్టు కాలిపోయింది. ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పిందని త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వెల్లంపల్లిలోని ఒక ఇంటి ఆవరణలో ఉన్న భారీ కొబ్బరి చెట్టుపై పెద్ద శబ్ధంతో పిడుగు పడింది. దాని తాకిడికి చెట్టు పూర్తిగా కాలిపోయింది. చెట్టుపై నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండటంతో పరిసర ప్రాంతాలకు చెందిన వారు భయంతో పరుగులు తీశారు. పిడుగుపాటు సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆ గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పిడుగు కొబ్బరి చెట్టుపై కాకుండా ఇళ్ల మధ్యలో పడిఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని వారు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులకు కూడా ఎటువంటి హాని జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. -
వైభవంగా పాలేటి గంగమ్మతల్లి తిరునాళ్ల
పీసీపల్లి: మండల పరిధిలోని వెంగళాపురం సమీపంలో పాలేటి నది ఒడ్డున వెలసిన పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు మంగళవారం వైభవంగా సాగాయి. మంగళవారం గంగమ్మతల్లిని బొల్లావులతో అలవలపాడు, గుదేవారిపాలెం, రామాపురం గ్రామాల మీదుగా ఊరేగించారు. అనంతరం అమ్మవారిని నిధిలోకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. యాదవుల కులదైవమైన గంగమ్మతల్లిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం పొంగళ్లతో తిరునాళ్ల ముగుస్తుంది. తిరునాళ్లను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మొక్కుబడులు ఉన్న వారు తిరునాళ్లకు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. తిరునాళ్లను పురస్కరించుకొని గంగమ్మ తల్లికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కందుకూరు ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న కాటంరాజు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదవుల అన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ నాయకులు వెంగళాపురానికి చెందిన పాతకొట్టు పిచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకట్రావు, బాలయ్య చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలు ఆకట్టుకున్నాయి. తిరునాళ్లను పురస్కరించుకొని జాతీయస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరునాళ్లను పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 250 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. -
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
● రైతు సంఘం డిమాండ్ మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ రైతు సమితి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలని, క్వింటాకు రూ.2400 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మార్కాపురం జాయింట్ కలెక్టర్, డివిజనల్ అధికారికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా కన్వీనర్ దేవండ్ల శ్రీనివాసులు, నియోజకవర్గ కార్యదర్శి పీ కొండయ్య, సీపీఐ నాయకులు అందె నాసరయ్య, ఏఐటీయూసీ కార్యదర్శి కాసీం, నాయకులు శంకరరావు, నాగయ్య, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దేవండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 13 జిల్లాల్లో 12.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసినట్లు తెలిపారు. మార్చి చివరి నుంచే పంట దిగుబడులు మార్కెట్లోకి వస్తున్నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2400 మద్దతు ధర ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం అమలు విషయంలో ఆలస్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులు క్వింటాకు రూ.700 నుంచి రూ.800 వరకు నష్టపోతున్నారని, వ్యాపారులకు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మొక్కజొన్నకు పూర్తి మద్దతు ధర చెల్లించాలన్నారు. ఇప్పటికే తక్కువ ధరలకు అమ్ముకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మేరకు వ్యాపారులు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మద్యం మత్తులో తమ్ముడిని కడతేర్చిన అన్న
దొనకొండ: మద్యం మత్తులో తమ్ముడిపై రాళ్ల దాడి చేసి అన్న హతమార్చిన ఘటన ఘటన మండలంలోని రుద్రసముద్రం ఎస్సీ కాలనీలో మంగళవారం జరిగింది. హతుడి భార్య కోటేశ్వరి కథనం ప్రకారం..కందుల చిన్న కాశయ్యపై అతని సోదరుడు పెద్ద కాశయ్య మద్యం తాగి వెంటపడి రాళ్ల దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధం నెపంతో తన భర్తను హతమార్చాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కందుల పెద్ద కాశయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటనా స్థలాన్ని దర్శి సీఐ రామారావు పరిశీలించారు. బెల్టుషాపుతోనే గొడవలు గ్రామంలో ఏర్పాటు చేసిన బెల్టుషాపులో రేయింబవళ్లు మద్యం అందుబాటులో ఉంటుంది. దీంతో గ్రామస్తులు మద్యానికి బానిసై గొడవలకు దిగుతున్నారు. గ్రామంలోని బెల్టుషాపును తొలగించాలని గ్రామస్తులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశామని, అయినా చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. -
ఐపీఎల్ వీఐపీ టికెట్ల దందాలో టీడీపీ కార్యకర్తలు
కందుకూరు: హైదరాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు పట్టుబడటం స్థానికంగా సంచలనం కలిగించింది. క్రికెట్ బెట్టింగ్, పేకాట, మోసాలు చేయడంలో ఆరితేరిన అశోక్‌చౌదరి బృందం ఈ టికెట్లు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో వారి ఆగడాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఘట్టమనేని అశోక్‌చౌదరి ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ కీలక కార్యకర్త. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల ఆసరాగా ఈ ముఠా భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.పలుకూరుకు చెందిన అశోక్‌చౌదరి, కంకణాల దినేష్, సింగమనేని వేణుమాధవ్ మిత్రులు. గ్రామంలో టీడీపీ కీలక కార్యకర్తలు. కందుకూరు ప్రాంతంలో టీడీపీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా హడావుడి అంతా అశోక్చౌదరిదే. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉండడంతో వీరు సంపాదనకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు ఎదురే లేదన్నట్లు క్రికెట్ బెట్టింగ్ దందాను నడిపించడంతోపాటు వీఐపీల పేరుతో భారీ మోసాలకు పాల్పడసాగారు. దీన్లో భాగంగా తమిళనాడుకు చెందిన ఆశిష్, సెంథిల్, తన్సిల్తో కలిసి వీరు ముఠాగా ఏర్పడ్డారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి వీఐపీ కాంప్లిమెంటరీ టికెట్లు సంపాదించి వాటిని బ్లాక్‌లో మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.దీనికిగాను గవర్నర్లు, మంత్రులు, న్యాయమూర్తుల పేరుతో వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు నకిలీ లెటర్హెడ్లను పంపి అక్కడి నుంచి ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్లు పొందేవారు. అలా పొందిన టికెట్లను బ్లాక్మార్కెట్లో ఒక్కొక్కటి రూ.22 వేలకు అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. వీఐపీ లెటర్హెడ్లతో టికెట్లు పొందుతున్న ఈ ముఠా వ్యవహారంపై అనుమానం రావడంతో హెచ్‌సీఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తుండగా అశోక్‌చౌదరి, దినేష్, వేణుమాధవ్‌లను రెండు రోజుల కిందట అరెస్టు చేశారు. వీరంతా పలుకూరుకు చెందినవారు కావడంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో వీరి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.ఈ ముఠాలో కీలక సూత్రధారి అశోక్‌చౌదరి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. గ్రామంలో దురుసుగా ప్రవర్తించడం, టీడీపీ కార్యక్రమాల సందర్భంగా బైక్‌లతో హంగామా చేయడం పరిపాటి అని చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు, వీఐపీలతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటుంటాడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, పలువురు టీడీపీ ముఖ్యులు, ఐసీసీ చైర్మన్ జైషాతో దిగిన ఫొటోలను పెట్టుకున్నాడు. ఇలా ఫొటోలతో తననుతాను ప్రమోట్ చేసుకుంటూ క్రికెట్ బెట్టింగ్ దందా, టికెట్ల బ్లాక్‌మార్కెట్ ముఠా నడిపిస్తున్నాడు. -
వైఎస్సార్ విగ్రహం కూల్చివేత
సంతమాగులూరు (అద్దంకి): సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామంలో గతంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కూల్చివేశారు. సిమెంటు పిల్లరుపై స్లాబు వేసి దానిపై ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ట్రాక్టర్లతో లాగించి పడేశారని ఆ గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి చర్యలు దారుణమని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి డాక్డర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. -
మామిడి రైతు కుదేలు
గాలివానకు సింగరాయకొండ: మండలంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు మామిడి చెట్లకు ఉన్న కాయల్లో సుమారు 70 శాతం రాలిపోయాయి. 300 టన్నుల వరకూ కాయ రాలిందని, ప్రస్తుతం టన్ను ధర రూ.70 వేలు ఉందని, మొత్తం రూ.2 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో శానంపూడి, కనుమళ్ల, సోమరాజుపల్లి, పాతసింగరాయకొండ ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో మామిడి సాగు చేశారు. ఈ సంవత్సరం చెట్లకు పూత సరిగా రాక, ఒకవేళ పూత వచ్చినా తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా రాలిపోయి దాదాపు 70 శాతం చెట్లకు సక్రమంగా కాపు లేదు. అరకొరగా కాసిన కాయలు కాపాడుకుంటున్నామని, ప్రస్తుతం ధర కూడా బాగానే ఉందని, ఈ తరుణంలో ఆదివారం రాత్రి హఠాత్తుగా వీచిన ఈదురుగాలులు, వర్షానికి కాయ మొత్తం రాలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెట్టుపై మామిడికాయలు లేత దశలో ఉన్నాయి. వేడిగాలులు వీస్తుండటంతోమరో 10 రోజులు దాటితే పక్వానికి వచ్చి మంచి ధర వచ్చేది. కానీ, గాలులకు కాయ రాలిపోవడంతో కేజీ రూ.10కి మాత్రమే అడుగుతున్నారు. టన్ను ధర రూ.10000 మాత్రమే పలుకుతుండటంతో నష్టాలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంవత్సరం ప్రకృతి కారణంగా భారీగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని మామిడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యానవన శాఖాధికారులు మాత్రం ప్రకృతి వైపరీత్యాల కారణంగా మామిడి తోట పూర్తిగా ధ్వంసమైతే తప్ప రైతుకు నష్టపరిహారం రాదంటున్నారు. ఈదురుగాలుల వలన జరిగిన నష్టాన్ని అంచనా వేయటంగానీ, నష్టపరిహారం వచ్చే అవకాశంగానీ లేదని చెప్పడంపై రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం టన్ను ధర రూ.70 వేలు నష్టపరిహారం రాదంటున్న ఉద్యానవన శాఖాధికారులు -
చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
కంభం: వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు ఎస్సై శివక్రిష్ణారెడ్డితో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. బేస్తవారిపేట మండలం జగ్గంబొట్ల కృష్ణాపురం గ్రామానికి చెందిన భూపని సాయి చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గతేడాది ఆగస్టు 24న అర్ధరాత్రి పట్టణంలోని షిరిడిసాయినగర్లో ఓఇంట్లో బంగారు నగలు, నగదును అపహరించాడు. అదే ఏడాది నవంబర్ 28న పట్టణంలోని ఆర్టీిసీ బస్టాండ్ సమీపంలో గల దుర్గా వైన్‌షాపులో నగదు, ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన మండలంలోని నడింపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి బీరువా పగులగొట్టి బంగారు కమ్మలు, వెండి పట్టీలు దోచుకెళ్లాడు. 17వ తేదీన మండలం రావిపాడు గ్రామంలో భీమేశ్వరస్వామి ఆలయంలో గుడి తలుపులు పగులగొట్టి బంగారు తాళిబొట్టు, చిన్న ఉంగరం, వెండి పట్టీలు, 18వ తేదీన అర్ధవీడు మండలంలోని మాగుటూరు గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయం గుడి తలుపులు పగులగొట్టి హుండీలోని సుమారు రూ.10 వేల నగదును అపహరించుకు వెళ్లాడు. పైచోరీలకు సంబంధించి కేసులు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్న సమయంలో సోమవారం కంభం చెరువుకట్టకు వెళ్లే దారిలోని అంకాళమ్మ గుడి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు. 20 గ్రాముల బంగారు నగల రికవరీ.. నిందితుడి భూపని సాయి వద్ద నుంచి రూ. 2.50 లక్షలు విలువ కలిగిన 20 గ్రాముల బంగారు నగలు, 25 తులాల వెండి పట్టీలు, రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటితో పాటు పట్టణంలోని గణేష్‌నగర్‌లో జరిగిన ఓ చోరీలో అచ్చి చిన్నసైదారావు అనే నిందితుడిని కూడా అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 20 గ్రాముల బంగారు నగలు రికవరీ చేసినట్లు తెలిపారు. పై కేసులను త్వరగా ఛేదించడంలో, నిందతుడిని చాకచక్యంగా అరెస్టు చేసి దొంగిలించిన సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన సీఐ కే మల్లికార్జున, ఎస్సై శివక్రిష్ణారెడ్డిని, సిబ్బంది కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, రంగస్వామిలను డీఎస్పీ అభినందించారు. -
తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
పీసీపల్లి: జిల్లాలో ప్రసిద్ధి చెందిన మండల పరిధిలోని వెంగళాపురం సమీపంలో పాలేటి నది ఒడ్డున వెలసిన భగీరథ పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్లకు అన్నీ ఏర్పాట్లు చేశారు. సోమవారం గంగమ్మ తల్లిని రామాపురం, గుదేవారిపాలెం, అలవలపాడులో గ్రామోత్సవం నిర్వహించి మంగళవారం సాయంత్రానికి ఆలయం వద్దకు ఉత్సవ విగ్రహాన్ని తీసుకువస్తారు. ఈసందర్భంగా తిరునాళ్ల ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం పరిశీలించి మాట్లాడారు. 250 మందితో తిరునాళ్లకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, ఒక డీఎస్పీ, ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్సైలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈయన వెంట ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, కనిగిరి సీఐ శ్రీనివాసులు, పీసీపల్లి ఎస్సై నరసింహారావు, కనిగిరి ఎస్సై సందీప్, హెచ్‌ఎంపాడు ఎస్సై రాజకుమార్ ఉన్నారు. ఎంపీడీవో కృష్ణారావు, తహసీల్దార్ ఉషా, డాక్టర్ యశ్విత వైద్యశిబిరానికి ఏర్పాట్లను పరిశీలించారు. బేస్తవారిపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన సోమవారం రాత్రి మండలంలోని పెంచికలపాడు సమీపంలో జరిగింది. పెద్దారవీడు మండలం బద్వీడుకు చెందిన యోగయ్య, మార్కాపురానికి చెందిన పీ శ్రీనులు మోటార్ సైకిల్‌పై కంభం వైపు వెళ్తున్నారు. పెంచికలపాడు సమీపంలోకి రాగానే గేదెలు అడ్డురావడంతో రెండు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో యోగయ్య, శ్రీనులు రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో వైద్యశాలకు తరలించారు. -
కలెక్టర్ మీ కోసంకు 186 వినతులు
ఒంగోలు సబర్బన్: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి మొత్తం 186 వినతులు వచ్చాయి. కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతి, డీపీఓ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. ఏదైనా కారణంతో ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే దానికి గల కారణాలను అర్జీదారునికి అర్థమయ్యే విధంగా ఎండార్స్‌మెంటు ఇవ్వాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ● కలెక్టర్ విజయసునీత మార్కాపురం టౌన్: ప్రజల నుంచి సమస్యలపై అందిన అర్జీలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయసునీత ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూకు సంబంధించిన అర్జీలు అధికంగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మొత్తం 169 అర్జీలు వచ్చాయని, వాటిలో రెవెన్యూకు సంబంధించి 108, ఇతర సమస్యలపై 61 అర్జీలు వచ్చాయని వెల్లడించారు. కార్యక్రమంలో జేసీ పి.శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు ప్రభాకర్, శివరామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 49 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీ హర్షవర్థన్‌రాజును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాఽధితులతో మాట్లాడి సమస్య పూర్వాపరాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. చట్టపరంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వచ్చే వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారి సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని వ్యక్తులు స్థానికంగా పోలీసు స్టేషన్‌లోగానీ, సబ్ డివిజన్ కార్యాలయంలోగానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఒంగోలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ వెంకటేశ్వరరావు, కొండపి సీఐ రవనయ్య, దర్శి సీఐ రామారావు, ప్యానల్ అడ్వకేట్ బాలాజీ సింగ్ పాల్గొన్నారు. -
మార్కాపురం పోలీ్స్ గ్రీవెన్స్‌కు 33 వినతులు
మార్కాపురం: పట్టణంలోని ఇన్చార్జి ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీ్స్ గ్రీవెన్స్‌కు 33 అర్జీలు అందాయి. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల నుంచి అర్జీదారులు వచ్చి వారి సమస్యలపై వినతిపత్రాలు అందించినట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. వాటిని ఆయా పోలీస్ స్టేషన్లకు పంపించి చట్టపరిధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు. సివిల్, చీటింగ్ సమస్యలపై అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మార్కాపురం, త్రిపురాంతకం, పామూరు సీఐలు అల్తాఫ్ హుస్సేన్, హస్సన్, వినోద్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఊరుకోం..
వెలిగొండకు అన్యాయం చేస్తే మార్కాపురం/మార్కాపురం టౌన్/మార్కాపురం రూరల్: తమది డబుల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెబుతున్న చంద్రబాబు సర్కార్‌కు అసలు ఇంజన్ ఉందా..లేదా.? అని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కన్వీనర్, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల పోరాట సమాలోచన, తాగు, సాగునీటికై పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై సోమవారం మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అధ్యక్షత వహించారు. శైలజానాఽథ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై టూర్ నుంచి వచ్చిన తరువాత చంద్రబాబు ఏమైనా మాట్లాడతాడా అని ఎదురుచూస్తుంటే.. ఏమీ లేకపోగా వైఎస్సార్ సీపీ నాయకులపై వారి మంత్రులు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. ఈ ప్రాంత వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టుకు బాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టుకు చేస్తున్న అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమరావతి పేరుతో దోపిడీ మానుకుని వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పంటలు పండుతాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను అవకాశం వచ్చిన చోటల్లా చెబుతూనే, మన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించాలన్నారు. వెలిగొండకోసం పోరాటం : బూచేపల్లి వెలిగొండ ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు పోరాటం చేస్తామని దర్శి ఎమ్మెల్యే, పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు.. ఆ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రైతులు బాగుండాలంటే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. బాబు పోవాలి–జగన్ రావాలి అనే నినాదంతో ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు షంషీర్ అలీబేగ్, కేవీ రమణారెడ్డి, వైవీ రావు, వెన్నా హనుమారెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, పిడతల ప్రవీణ్‌కుమార్, బి.అశోక్‌కుమార్‌రెడ్డి, బి.రామారావు, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి, కొండపి, ఒంగోలు నియోజకవర్గాలకు చెందిన పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
ముందస్తు పన్నుతో రాయితీ
● మెగా ట్యాక్స్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: గ్రామ పంచాయతీల ఆర్థిక పురోభివృద్ధికి ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కలెక్టర్ పి.రాజాబాబు కోరారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నుల మెగా ట్యాక్స్ మేళా’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్ల ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ప్రత్యేక రాయితీలు ఉన్నాయని తెలిపారు. మే 31వ తేదీలోపు 2026–27 సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ (రిబేటు) లభిస్తుందన్నారు. జిల్లాలోని గృహ యజమానులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్వహణ వంటి పనులు పంచాయతీల ఆదాయంపైనే ఆధారపడి ఉంటాయని తెలిపారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా పన్నులు చెల్లించి గ్రామ ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు. మే నెలాఖరు వరకు నిర్వహించే ఈ మేళాపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ కల్పన కుమారి, డీపీఓ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర జిల్లా స్థాయి అధికారులు, పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
దిగజారుతున్న టీడీపీ నాయకులు
● వై.పాలెం ఎమెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్న నాయకుల వరకూ దిగజారుడు పరిస్థితుల్లో ఉన్నారని, ప్రతిపక్షానికి చెందిన వారిని ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని వై.పాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వారు గుర్తుంచుకోవాలన్నారు. ఈ నెల 1వ తేదీ ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ నుంచి యర్రగొండపాలెం వస్తుండగా, మాచర్లలో మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ ఇన్చార్జి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి కేక్ కట్ చేయించారు. పిన్నెల్లి ఆధ్వర్యంలో అక్కడికి చేరిన ప్రజలను చూసి ఓర్వలేక మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తన వర్గీయులతో సోషల్ మీడియాలో చేయిస్తున్న తప్పుడు ప్రచారాన్ని తాటిపర్తి ఖండిచారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రజల మన్ననలతో 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి.. పక్క నియోజకవర్గంలోని దళిత ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు చేయడాన్ని కూటమి నాయకులు జీర్ణించుకోలేక విమర్శించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఒక దళిత ఎమ్మెల్యేను సన్మానించడాన్ని సహించలేకపోవడం ఏంటో అర్థం కావడంలేదన్నారు. పిన్నెల్లి చరిష్మా, ప్రత్యక్ష రాజకీయాలను ఎదుర్కోలేక టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి విచక్షణ కోల్పోయి సోషల్ మీడియా వ్యక్తుల వెనకుండి తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నాడని తాటిపర్తి విమర్శించారు. ఈ పరిస్థితులను చూస్తుంటే.. దళిత వర్గాల పట్ల జూలకంటి ఆలోచన ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోందని అన్నారు. మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఓబులరెడ్డి, నాయకులు ఆవుల వీరకోటిరెడ్డి, పప్పర్తి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యపు తీరు.. అందని నీరు!
దొనకొండ: వేసవిలో మంచి నీటి సమస్య ఉత్పన్నం కాకూడదన్న అధికారుల మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. సాగర్ జలాలు సరఫరా చేసేందుకు అవకాశం ఉన్న గ్రామాల్లో సైతం పాలకుల నిర్లక్ష్యం మూలంగా మంచినీటి కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకుండా కొర్రీలు పెట్టడంతో చందవరం సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ పరిధిలోని వేలాది మంది తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పంపిన ప్రతిపాదనలను సైతం చంద్రబాబు సర్కారు బుట్టదాఖలు చేయడంతో గ్రామాల్లో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. మరమ్మతుల్లో జాప్యం వేసవి కాలం ప్రారంభమై రెండు నెలలైంది. అంతకంటే ముందే నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉండగా క్షేత్ర స్థాయిలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. దీంతో ప్రభుత్వంతోపాటు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గృహాల్లో బోర్లు లేని వారు తాగేందుకు, వాడుకునేందుకు నీరు లేక దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చందవరం రిజర్వాయర్ వద్ద మోటార్లు, పైప్‌లైన్ లీకేజీ మరమ్మతు పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం దొనకొండ మండల ప్రజలకు శాపంగా మారింది. చందవరం సాగర్ నీటి రిజర్వాయర్, పంప్ హౌస్, మినరల్ ఫిల్టర్లు, కొత్త మోటార్లు, పైపులైన్లు, ఇతరత్రా నిర్వహణ పనులకు రూ.2.5 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ పనులకుగాను టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణ లోపం, బిల్లుల మంజూరులో జాప్యం వెరసి కాంట్రాక్టర్లు సగం పనులు కూడా పూర్తి చేయలేదు. దీంతో ఈ ఏడాది వేసవి ప్రారంభానికి ముందు నుంచే దొనకొండ ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. దొనకొండలోని ముస్లిం బజార్, వీవీపురం, బేతేలుపురం, అరబస్తాన్, ఓబ్బాపురంలోని ప్రజలకు రెండు నెలలుగా గుక్కెడు మంచినీటి సరఫరా చేయలేదు. ప్రత్యామ్నాయం శూన్యం చందవరం వద్ద 855 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన మొదటి సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్ద పంపింగ్ మోటార్ల మరమ్మతులు జాప్యమయ్యే సూచనలున్నాయని అధికారులు గ్రహించినా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. అవసరమైన ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి సమస్యను పరిష్కరించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాగా, కొన్ని గ్రామాల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తూ అధికంగా బిల్లులు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చందవరం వద్ద పనులు ఎప్పటికి పూర్తవుతాయో, మంచి నీరు ఎప్పుడు సరఫరా చేస్తారో తెలియక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జ్ డీఈ నారాయణస్వామిని వివరణ కోరగా.. ‘సమ్మర్ స్టోరేజీ వద్ద పనులు పూర్తయ్యాయి. మెయిన్ పైపులైన్ ద్వారా త్వరలో నీరు సరఫరా చేస్తాం. గ్రామాల్లో నీరు సరఫరా చేసే బాధ్యత పంచాయతీ అధికారులదే’ అని చెప్పారు. దొనకొండ మండలంలో తాగునీటి అగచాట్లు రెండు నెలలుగా సరఫరా కాని సాగర్ జలాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో పాలకులు విఫలం మండు వేసవిలో విలవిల్లాడుతున్న ప్రజలు రెండు నెలలుగా తాగు నీటి కష్టాలు సాగర్ జలాల సరఫరా గురించి అధికారులను అడిగితే పనులు చేస్తున్నామని మాట దాటేస్తున్నారు. ప్రభుత్వం రూ.2.5 కోట్లు నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు మందకొడిగా సాగాయి. నీరు ఎప్పుడు సరఫరా చేస్తారో చెప్పకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా నెలల సమయం కాలయాపన చేయడం సరికాదు. – షేక్.రసూల్, దొనకొండ ముస్లిం బజారుఅధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు దొనకొండకు సాగర్ జలాలు సరఫరా కాక సుమారు రెండు నెలలు కావస్తోంది. ఏ అధికారిని అడిగినా రాజకీయ నాయకుల్లా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఏప్రిల్ నెల పూర్తయింది. ఎండ ప్రతాపం ఎక్కువైంది. ఇళ్లలో వేసుకున్న డీప్‌బోర్లలో కూడా నీరు అడుగంటాయి. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి నీరు ఎప్పుడిస్తారో అధికారులు ప్రకటించాలి. మంచి నీటి కోసం అధికారులకు ఫోన్ చేస్తే కనీసం సమాధానం చెప్పడం లేదు. – బి.జయరావు, ఓబ్బాపురం -
పెద్దదోర్నాలలో గడ్డి లారీ బీభత్సం
పెద్దదోర్నాల: మండల కేంద్రమైన పెద్దదోర్నాలలో గడ్డి లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ ప్రజలను కాసేపు గడగడలాడించింది. చెలరేగుతున్న మంటలతో ప్రయాణిస్తున్న లారీ దెబ్బకు శ్రీశైలం రహదారిలోని దుకాణాదారులు వణికిపోయారు. వివరాలు.. నంద్యాల జిల్లా మైదుకూరు నుంచి గడ్డి లోడుతో శ్రీశైల పుణ్యక్షేత్రంలోని గోశాలకు బయలుదేరిన లారీ ఆదివారం మధ్యాహ్నం పెద్దదోర్నాల చేరుకుంది. శ్రీశైల ముఖద్వారం ఆర్చి వద్ద గడ్డి రోళ్లకు విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో క్షణాల వ్యవధిలోనే లారీలోని గడ్డికి పూర్తిగా మంటలు వ్యాపించాయి. దీంతో లారీ డ్రైవర్ దిక్కుతోచని స్థితిలో రహదారి పొడవునా గడ్డి రోళ్లను పడేసుకుంటూ వెళ్లాడు. రహదారిపై ఒకటిన్నర కిలోమీటర్ల మేర గడ్డి రోళ్లు పడటంతో దట్టమైన పొగ, మంటలతో నిండిపోయింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు తమ వద్ద ఉన్న నీటితో మండుతున్న గడ్డి రోళ్లను ఆర్పే ప్రయత్నం చేశారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి లారీని శ్రీశైల రహదారిలోని నిర్మాణుష్య ప్రాంతానికి తరలించాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు స్థానిక యువకులు సహకారం అందించారు. తగలబడుతున్న గడ్డి రోళ్లను లారీ నుంచి కింద పడేశారు. మంటలు అర్పటంలో సహకరించిన యవకులకు అగ్నిమాపక కేంద్ర అధికారి మాల్యాద్రి, ఏఎస్సై పోలురాజు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ప్రమాదంలో రూ.40 వేల విలువ చేసే గడ్డి కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. విద్యుత్ తీగలు తగిలి లారీలో చెలరేగిన మంటలు శ్రీశైలం రహదారి పొడవునా పడిపోయిన గడ్డి రోళ్లు మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది -
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నేడు మార్కాపురంలో భారీ సదస్సు
మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టుపై జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలోని కాలేజీ రోడ్డులో ఉన్న సౌజన్య ఫంక్షన్ హాలులో సోమవారం ఉదయం 10 గంటలకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. ఈ సదస్సుకు ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, టి.మాధవరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి, పార్లమెంటు కన్వీనరు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎస్.శైలజానాథ్, రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గాల ఇన్చార్జిలు, పలువురు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, రైతు సంఘ మండల అధ్యక్షులు, సాగునీటి సంఘ నిపుణులు, మాజీ సర్పంచ్‌లు హాజరుకావాలని కోరారు. వెలుగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాల పోరాట సమాలోచన, తాగు, సాగునీరు, వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేయాలనే డిమాండ్లపై సదస్సు నిర్వహిస్తున్నట్లు అన్నా రాంబాబు తెలిపారు.అన్నా రాంబాబు -
మంత్రి కోసం దేవుడైనా ఆగాల్సిందే..!
ఉలవపాడు: సూర్యాస్తమయానికి ముందే కన్నుల పండువగా జరగాల్సిన రథోత్సవం మంత్రి, ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడం వలన ఏకంగా రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. దేవదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆలస్యంగా రావడంతో చివరకు చీకట్లో రథోత్సవం జరిగింది. మండల కేంద్రమైన ఉలవపాడులోని వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రథోత్సవం నిర్వహించారు. ఉదయం రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలుని కళ్యాణం నిర్వహించారు. ఈ ఏడాది రూ.80 లక్షలతో నూతన రథం తయారు చేశారు. ట్రయల్ రన్ కూడా ఈ నెల 1న పూర్తయింది. ఈ రథం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమం పూర్తయి సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభం కావాలి. కానీ 6.30 గంటలకు మంత్రి, ఎమ్మెల్యే వచ్చారు. శిలాఫలకం ఆవిష్కరించి రథోత్సవం ప్రారంభమయ్యేసరికి 7 గంటలు దాటి చీకటి పడిపోయింది. చీకటి పడిన తర్వాత రథోత్సవం ప్రారంభం కావడం ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రతి ఏడాది చీకటి పడేలోపు రథం తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. కానీ, ఈ ఏడాది 7 గంటలకు ప్రారంభమైంది. భక్తులు దాదాపు రెండు గంటల పాటు రథం కదులుతుందని ఎదురుచూస్తూ నిలబడాల్సి వచ్చింది. రాజకీయ నాయకులు ఏకంగా వేణుగోపాల స్వామినే కదలకుండా ఆపివేసిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎందరో మంత్రులు, ఎమ్మెల్యేలు రథోత్సవానికి హాజరయ్యారు. కానీ, ఎప్పుడూ రథోత్సవాన్ని ఆలస్యం చేయలేదు. రథం తిరుగుతున్న సమయంలోనే వారు వచ్చి దర్శించుకుని వెళ్లిపోయేవారు. కానీ, ఇలా దేవుడిని ఆపడం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భారీగా భక్తులు హాజరైనప్పటికీ దేవుడికి సమయానికి జరగాల్సిన ఉత్సవాన్ని ఇలా ఆలస్యం చేయడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. -
దంచికొట్టిన గాలివాన
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో బీభత్సం ● మధ్యాహ్నం వరకు మండిపోయిన ఎండఒంగోలు సిటీ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండ మండిపోయింది. 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్కాపురంలో 43 డిగ్రీలు, కనిగిరిలో 42, ఒంగోలులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 4 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి గాలి వీచడం ప్రారంభమైంది. క్రమంగా పెనుగాలులు వీచాయి. రాత్రి 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో గాలివాన దంచికొట్టింది. జనజీవనం స్తంభించేంతగా సుమారు గంటకుపైగా గాలివాన అతలాకుతలం చేసింది. సాయంత్రం వాతావరణం చల్లబడిందని ప్రజలు ఊపిరి పీల్చుకునేలోపే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం అసౌకర్యానికి గురయ్యారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మార్కాపురం జిల్లాలోని కంభంలో అరటి తోటలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభం కుప్పకూలడంతో పాటు ఇళ్లపై రేకులు లేచి కిందపడ్డాయి. కనిగిరి నియోజకవర్గంలోనూ గాలివాన కారణంగా రేకులు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలవాలాయి. ప్రకాశం జిల్లావ్యాప్తంగానూ గాలివాన భయానకం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని ఒంగోలు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గాలివానకు జనం అవస్థపడ్డారు. మెరుపులతో కూడిన ఉరుముల శబ్దాలకు నగరం దద్దరిల్లింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి అసౌకర్యం తలెత్తింది. విద్యుత్ సరఫరా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపింది. -
ఆనందం ఆవిరి.. ఆందోళన ముసిరి..
● భీకర గాలులకు ఎగ్జిబిషన్లు అతలాకుతలం ● ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు ఒంగోలు టౌన్: పెనుగాలులు సృష్టించిన బీభత్సానికి ఒంగోలు నగరం చిగురుటాకులా వణికింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఈదురుగాలులు వీయడంతోపాటు వర్షం పడటంతో నగరంలోని మూడు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని ఊర చెరువు, గుంటూరు రోడ్డులోని ఏ వన్ ఫంక్షన్ హాల్ ఎదురు, నార్త్ బైపాస్‌లోని ఎగ్జిబిషన్లలో దుకాణాల రేకులు గాలులకు ఎగిరిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటి అలుముకోవడంతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. నార్త్ బైపాస్‌లోని ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్ పడిపోయినట్లు పుకార్లు వచ్చాయి. దీంతో డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. డ్రాగన్ లైట్ల వెలుగులో రేకులను తొలగించారు. మిగిలిన ఎగ్జిబిషన్లను డ్రాగన్ లైట్ల వెలుగులో పరిశీలించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నార్త్ బైపాస్‌లోని పల్నాడు ఫర్నిచర్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ సైన్ బోర్డు గాలుల ధాటికి విరిగి రోడ్డుపై పడింది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో సైన్ బోర్డు తొలిగించారు. ఏ వన్ ఫంక్షన్ హాల్ ఎదుట ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మోకాలి లోతు నీరు నిలిచాయి. భీకర గాలుల ధాటికి ఒంగోలు నగరంలో పలుచోట్ల దుకాణాల పైకప్పులు ఎగిరిపోయాయి. -
మెటీరియల్ అమోఘం.. మార్కులే ‘సాక్షి’
విద్యార్థి దశలో భవితకు పదో తరగతి పునాది. టెన్త్‌లో సాధించే మార్కులు పైచదువుల అడ్మిషన్‌కు, ఉద్యోగాల సాధనకు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల విజయానికి తోడుగా నిలవాలని భావించిన ‘సాక్షి’ యాజమాన్యం.. ప్రత్యేక స్టడీ మెటీరియల్ రూపొందించింది. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్ అందజేసింది. అంతేకాకుండా ‘సాక్షి భవిత’లో టెన్త్ విద్యార్థుల కోసం మాక్ టెస్టులు, సబ్జెక్టుల వారీ విశ్లేషణలు ప్రచురించింది. ఇటీవల టెన్త్ ఫలితాలు విడుదల కాగా, ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పలువురు ‘సాక్షి’తో తమ మనోగతాన్ని పంచుకున్నారు. అత్యధిక మార్కుల సాధనకు ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ దోహదపడిన తీరును వివరిస్తూ సంతోషం వెలిబుచ్చారు. – చీమకుర్తి రూరల్/ బల్లికురవ/పుల్లలచెరువు సులభంగా సాధన సరైన సమయంలో ‘సాక్షి’ యాజమాన్యం స్టడీ మెటీరియల్ పంపిణీ చేసింది. టెక్స్ట్ బుక్‌లు, నోట్స్‌తో కుస్తీ పట్టే పని లేకుండా సులభంగా, సమగ్ర సమాచారంతో అన్ని విభాగాలను కవర్ చేస్తూ ప్రచురించిన స్టడీ మెటీరియల్ చదివి 585 మార్కులు తెచ్చుకున్నా. మండల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించేందుకు స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది. – టి.పవన్‌కుమార్, పుల్లలచెరువు జెడ్పీ పాఠశాల నూరు శాతం ఉత్తీర్ణత ‘సాక్షి’ అందజేసిన మెటీరియల్ చదివాం. మోడల్ పేపర్లను ఉపాధ్యాయులు ప్రాక్టీస్ చేయించారు. దాంతో మా పాఠశాలలో నూరు శాతం ఉత్తీర్ణత సాఽధించాం. నేను 576 మార్కులు సాధించి మండల స్థాయిలో సత్తా చాటడం సంతోషంగా ఉంది. – కె.లోహిత్దత్త, కూకట్లపల్లి (బల్లికురవ) మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేశా.. పదో తరగతి పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి ‘సాక్షి’ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేశా. 515 మార్కులు సాధించా. మా పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనతోపాటు ‘సాక్షి’ మెటీరియల్ కూడా మెరుగైన పలితాలు సాధించడానికి దోహదపడింది. – యద్దనపూడి లోకేష్, బండ్లమూడి జెడ్పీహెచ్ (చీమకుర్తి) ● ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌పై టెన్త్ విద్యార్థుల మనోగతం ● మార్కుల సాధనలో కీలకంగా భవిత పాఠాలు, మాక్ టెస్టులు పుల్లలచెరువు జెడ్పీ హైస్కూల్లో ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో విద్యార్థులు (ఫైల్) ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో గాడిపర్తివారిపాలెం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు (ఫైల్) ‘సాక్షి’ ప్రోత్సాహం అద్భుతం ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ను అందజేయడం విద్యార్థులకు ప్రోత్సాహాన్నిచ్చింది. మా ప్రాక్టిస్‌కు మోడల్ పేపర్లు బాగా ఉపయోగపడ్డాయి. దాంతోపాటు ఉపాధ్యాయులు బోధనతో 575 మార్కులు సాధించా. ‘సాక్షి’కి కృతజ్ఞతలు. – ఎస్కే షర్మిల, రావినూతల(మేదరమెట్ల) సాక్షి అందజేసిన మెటీరియల్ బాగా ఉపయోగపడింది. నేను అందులో మోడల్ పేపర్లను క్షుణ్ణంగా చదివా. ఉపాధ్యాయులు ఇచ్చిన గైడెన్స్‌తో 550 మార్కులు సాధించాను. మంచి మార్కులు రావడానికి దోహదపడిన ‘సాక్షి’కి అభినందనలు. – ఎ.సాయి, తిమ్మాయపాలెం(అద్దంకి) పోటీ పరీక్షలకూ పనికొస్తుంది ‘సాక్షి’ మీడియా పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్ పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యేందుకు బాగా సహకరించింది. ఈ మెటీరియల్‌ను భద్రపరచుకుంటే అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. టీచర్ల సహకారం, ‘సాక్షి’ ప్రోత్సాహంతో 563 మార్కులు సాధించగలిగా. – కె.చిన్న మరియమ్మ, కేజీబీవీ, పుల్లలచెరువు -
కుటుంబ కలహాలతో యువకుని ఆత్మహత్య
కనిగిరి రూరల్: కుటుంబ సమస్యల కారణంగా ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై టి.సందీప్ కుమార్ కథనం మేరకు.. పీసీపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన నాగులూరి శ్రీనివాసులు(30) భార్యతో గొడవపడి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఆదివారం కనిగిరి పట్టణ సమీపంలోని చింతలపాలెం మోడల్ స్కూల్ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు వీఆర్వోకు సమాచారం అందించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026
వెలుగొండ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేకుండా పోతోంది. ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా పరిస్థితి తయారవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లలో అరకొరగా నిధులు కేటాయించడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ప్రాజెక్టు పరిస్థితి నెలకొంది. పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోవడంతో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ త్యాగాలకు విలువ లేకుండా పోయిందంటూ ఆవేదన చెందుతున్నారు. వారి తరఫున పోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మార్కాపురంలో నేడు సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం...బాబు బురిడీ..వెలుగొండ గారడీ..!మార్కాపురం: నాడు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి నేనే శంకుస్థాపన చేశా.. నేనే పూర్తి చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచినప్పుడల్లా ఊదరగొడుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మరోవైపు వచ్చే జూన్, జూలైలో వెలుగొండ ప్రాజెక్టుకు నీరిస్తామని ఇటీవల ప్రకటించారు. కాగా, పునరావాస కాలనీల్లో పనులు పూర్తి కాకుండా వెలిగొండ నీటిని విడుదల చేస్తే తమ భవిష్యత్తు ఏమిటంటూ ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడేందుకు వైఎస్సార్ సీపీ నడుం బిగించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి, వెలుగొండ ప్రాజెక్టు పనులపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నేడు మార్కాపురంలో సదస్సు నిర్వహించనుంది. పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులపై కూటమి ప్రభుత్వం కక్ష... మార్కాపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో శాశ్వతంగా కరువు నివారించే పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆయా కాలనీల్లో గుడి, బడి, అంగన్వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటర్ ట్యాంకులు, పంచాయతీ భవనాలు, సిమెంటు రోడ్లు నిర్మించారు. పలు కాలనీల్లో గృహ నిర్మాణాలకు పూనుకున్నప్పటికీ 2024లో ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనుల కోసం ముంపు గ్రామాల ప్రజలు ఆశగా ఎదురుచూశారు. కానీ, అవేమీ జరగలేదు. దీంతో తమ త్యాగానికి గుర్తింపు లేకుండా పోతోందని ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిలో నిరాశ, నిస్తేజం అలముకున్నాయి. అయితే తరచూ రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టు పురోగతిపై సమీక్షకు వస్తున్నప్పటికీ పునరావాస పనుల్లో మాత్రం పురోగతిలేదు. పునరావాస కాలనీల్లో పనులు చేపడతామని చెప్పినప్పటికీ ఇంతవరకూ ప్రారంభం కాలేదు. గతేడాది మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రోజు, ఈ ఏడాది ఫిబ్రవరి 25న మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలుగొండపై మహిళలు, ప్రజలు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం పట్ల ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటే చెబుతూ.. జూన్, జూలైలో నీళ్లిస్తామనడంతో సర్వత్రా ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తమవుతోంది. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో మొత్తం 11 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తాతలనాటి ఊర్లను వదిలి ఇళ్లు, పొలాలను త్యాగంచేసి బయటకు వచ్చేందుకు ప్రజలు సిద్ధమవగా, వారి పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు, ఇళ్లు కట్టించాలని కోరుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై నిర్లక్ష్యం... పశ్చిమ ప్రాంతంలో శాశ్వతంగా కరువు నివారించడంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందించే వెలుగొండ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా మార్కాపురం వచ్చిన చంద్రబాబు.. తాను అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టుకు అత్యధిక నిధులు కేటాయించి త్వరగా పూర్తిచేస్తానని చెప్పారు. కానీ, గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం రూ.309.13 కోట్లు, ఈ ఏడాది బడ్జెట్లో రూ.412 కోట్లు మాత్రమే కేటాయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇలా అయితే పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులు ఎప్పుడు పూర్తిచేస్తారో అర్థం కావడం లేదని, అదే సమయంలో నీళ్లు వదిలితే తాము ఊర్లను వదిలి ఎక్కడుండాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి తమను కూటమి ప్రభుత్వం మోసం చేసిందనే భావన ముంపు గ్రామాల ప్రజల్లో ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దృష్టి సారించకపోవడంతో పునరావాస కాలనీల్లో పిచ్చిచెట్లు, చిల్లచెట్లు మొలిచి పెద్దవై అరణ్యాన్ని తలపిస్తున్నాయి. విషసర్పాలు, అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల పునరావాస కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగాయి. మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తండా నిర్వాసితులకు మార్కాపురం మండలం కుంటవద్ద, పెద్దారవీడు మండలం సుంకేశుల, కలనూతల, చింతలముడిపి గ్రామాల వారికి గోగులదిన్నె వద్ద, సుంకేశులలోని ఎస్సీలకు తోకపల్లి వద్ద కలనూతలలో, కొంతమంది నిర్వాసితులకు ఇడుపూరు వద్ద కాలనీలు ఏర్పాటు చేశారు. వాటిలో సిమెంటు రోడ్లు, వాటర్ ట్యాంకులు, కమ్యూనిటీ హాలు, పాఠశాలలు నిర్మించారు.పునరావాస పనులు వెంటనే ప్రారంభించాలి : ప్రభుత్వం పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వెంటనే చేపట్టాలి. వెలుగొండ నిర్వాసితులకు వెంటనే ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. నాటి ఒప్పందం ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ రూ.14 లక్షలతో పాటు పునరావాస కాలనీల్లో పక్కా గృహం కట్టించి ఇవ్వాలి. కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. – తుమ్మా వెంకటరెడ్డి, గొట్టిపడియ, మార్కాపురం మండలంకాలనీల్లో అభివృద్ధి ఎప్పుడు : పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులు నత్తనడకతో పోటీపడుతున్నాయి. సుంకేశుల పునరావాసకాలనీ చిల్లచెట్లతో నిండిపోయింది. బడి, గుడి, కమ్యూనిటీ హాలు మాత్రమే కట్టగా, ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు నీళ్లు వదిలితే మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. పునరావాస కాలనీల్లో త్వరగా పనులు పూర్తిచేయాలి. – జి.రమేష్, మాజీ సర్పంచ్, సుంకేశుల -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు అద్దంకి: స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అద్దంకి పట్టణంలోని రేణింగవరం రహదారిలో నల్లవాగు సమీపంలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. ప్రమాదంలో కొండపి నియోజకవర్గం మర్రిపూడి మండలంలోని కెల్లంపల్లికి చెందిన జి.ప్రవీణ్‌కుమార్(24) అక్కడిక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి శివప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రుడిని 108 సిబ్బంది అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్టులో చేపలు పడుతుండగా తెప్ప బోల్తా పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు అనకాపల్లి జిల్లా నుంచి కొందరు వ్యక్తులు నెల రోజుల క్రితం రాళ్లపాడు వచ్చారు. రోజూలాగే తెప్పలో వెళ్లి చేపలు పడుతుండగా ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో పెనుగాలులు వీయడంతో తెప్ప బోల్తా పడింది. అందులో ఉన్న వ్యక్తి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపేశారు. గల్లంతైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. అద్దంకి: గుండ్లకమ్మ వంతెనపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అద్దంకి–దర్శి రహదారిలో ఆదివారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. అద్దంకి పట్టణంలోని ఇందిరా నగర్‌కు చెందిన ఎం.అనిల్(35) హైదరాబాద్‌లో బేల్దారి పని చేస్తున్నాడు. అంకమ్మ కొలుపులు నిర్వహిస్తుండటంతో అద్దంకి వచ్చాడు. శనివారం రాత్రి కొలుపుల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఆదివారం ఉదయం మద్యం మత్తులో ఇంటికి ఫోన్ చేసి శ్రీనేను శ్మశానంలో పడుకుని ఉన్నాశ్రీ అని చెప్పాడు. ఆ తర్వాత కొంత సేపటికే గుండ్లకమ్మ వంతెన పైనుంచి ఎవరో వ్యక్తి దూకాడని తెలియడంతో భార్య, బంధువులు అక్కడికి చేరుకున్నారు. వంతెనపై విడిచిపెట్టిన చెప్పులు, సెల్‌ఫోన్ ఆధారంగా నదిలో దూకింది అనిల్ అని నిర్ధారించుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ సుబ్బరాజు గజ ఈతగాళ్లను తీసుకొచ్చి మృతదేహాన్ని వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనిల్ ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కావాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో కంపకళ్లి ఉత్సవం
హనుమంతునిపాడు: చెన్నకేశవ నామ స్మరణతో హనుమంతునిపాడు మండలం నల్లగండ్ల పంచాయతీలోని చిన్నగొల్లపల్లి గ్రామం మారుమోగింది. ఐదు రోజులుగా సాగుతున్న శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు కంపకళ్లి కార్యక్రమంతో ఆదివారం ముగిశాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం చెన్నకేశవస్వామి భక్తులు కంపకళ్లిలో పాల్గొని మొక్కులు చెల్లించారు. పోలీసు బందోబస్తు మధ్య సాగిన ఈ ఉత్సవం ఆద్యంతం భక్తిశ్రద్ధలతో సాగింది. ముందుగా చెక్కా వంశస్తులు కంపకళ్లిపై దొర్లిన తర్వాత భక్తులు సైతం అదే రీతిలో మొక్కులు చెల్లించారు. గజవాహనంపై కొలువైన చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తితో కంపకళ్లి ప్రదక్షిణల అనంతరం పోతురాజుల వీర కేకల నడుమ భక్తులు గోవింద నామాన్ని స్మరిస్తూ కంపకళ్లి దొర్లి మొక్కులు చెల్లించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎస్సై రాజ్‌కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఈఓ గిరిరాజ నరిసింహబాబు, కమిటీ సభ్యులు జగన్మోహన్రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఫిట్‌నెస్‌లేని విద్యా సంస్థల బస్సులపై చర్యలు
ఆదివారంసత్యమేవ జయతే3-5-2026మార్కాపురం: ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా విద్యార్థులను తీసుకెళ్లే బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ చండ్రా రాంబాబు హెచ్చరించారు. శనివారం మార్కాపురం డీటీఓ కార్యాలయంలో జిల్లాలోని వివిధ విద్యాసంస్థల యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రతి పాఠశాల బస్సు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు చేయించుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలన్నారు. బస్సుల్లో స్పీడ్ కంట్రోల్ పరికరాన్ని బిగించుకోవాలని, ఫస్టు ఎయిడ్ కిట్లు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. పరిమిత వేగంలోనే బస్సులు నడపాలన్నారు. మరో ఎంవీఐ భాస్కర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు. www.sakshi.com‘గ్రామం ప్రగతిపథంలో ఉంటే ఎవ్వరూ ముఠా కక్షల జోలికి వెళ్లరు’ -
ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే గిట్టుబాటు ధరలు
● పొగాకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు ఒంగోలు టౌన్: ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే పొగాకు రైతులకు న్యాయం జరుగుతుందని, లేకపోతే గిట్టుబాటు ధరలు లభించడం కష్టమేనని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు పిలుపునిచ్చారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో శనివారం పొగాకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పమిడి వెంకటరావు మాట్లాడుతూ పొగాకు రైతులను ఆదుకునే లక్ష్యంతో ఏర్పడిన పొగాకు బోర్డు కంపెనీలతో మిలాఖత్ అయి రైతులను దగా చేస్తోందని విమర్శించారు. ఆరుగాలం కష్టించి పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధరల కోసం పోరాటాలు చేయాల్సి వస్తోందని చెప్పారు. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తేగానీ పొగాకుకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. సంఘ జిల్లా కార్యదర్శి జజ్జూరి జయంతిబాబు మాట్లాడుతూ గతేడాది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వేలం కేంద్రాల చుట్టూ తిరిగారని, ఈ ఏడాది ఒక్కరు కూడా వేలం కేంద్రం వైపునకు రాలేదని తెలిపారు. గతేడాది క్వింటా రూ.28 వేలు ప్రకటించి కొనుగోలు చేస్తేనే కొద్దిపాటి నష్టంతో రైతులు బయటపడ్డారని, ఈ ఏడాది గతం కంటే తగ్గించి రూ.25 వేలకు కొనుగోలు చేస్తే బ్యారన్‌కు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోందని వివరించారు. గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా ఈ ఏడాది 49 శాతానికి పెంచి రైతులను నిండా ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పొగాకు బోర్డు, మరోవైపు కంపెనీలు రైతులను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. సమావేశంలో ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి వీరారెడ్డి, రైతు సంఘ జిల్లా నాయకుడు పరిటాల కోటేశ్వరరావు, కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి బాలకోటయ్య, సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, రైతు నాయకులు టి.శ్రీకాంత్, బెజవాడ శ్రీను, కనపర్తి సుబ్బారావు, వేజండ్ల సింగయ్య, ముప్పరాజు బ్రహ్మయ్య, వాసు, మల్లికార్జునరావు, తుళ్లూరి వెంకటరావు పాల్గొన్నారు. పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 18వ తేదీ పొగాకు సదస్సు నిర్వహించాలని సమావేశం తీర్మానం చేసింది. -
వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు, పిల్లలు, మహిళలు ఉదయం 11 గంటలు దాటితే బయటకు రాకుండా ఉండటం మంచిది. వడదెబ్బకు గురైతే ప్రాణాంతకం కావచ్చు. వీలైనంత వరకూ మంచినీరు, కొబ్బరినీరు, పండ్ల రసాలు తరచూ తీసుకోవాలి. రోడ్డుమీద అమ్మే వివిధ రకాల రంగుపానీయాలు తీసుకోవద్దు. కలుషిత ఆహారం, రోడ్డుపై అమ్మే జంక్ ఫుడ్స్ తినవద్దు. కూలి పనులు చేసేవారు వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే గొడుగు, టోపీతో పాటు వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవాలి. వడగాడ్పులు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – మనష్యే, డిప్యూటీ డీఎంహెచ్ఓ, మార్కాపురం


