● కలెక్టర్ విజయసునీత
మార్కాపురంటౌన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎం విజయసునీత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో ఆదివారం విద్యాశాఖాఽధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతరం, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే బస్సు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పారు. మార్కాపురం జిల్లాలో మొత్తం 22 కేంద్రాల్లో 9,502 మంది విద్యార్థులు సఫ్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఏవైనా సమస్యలుంటే 08592 281275 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మాస్‌కాపీయింగ్ జరగకుండా ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ శివరామిరెడ్డి, ఇంటర్‌బోర్డు ఆర్‌ఐఓ ఆంజనేయులు, రమణారెడ్డి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.


