breaking news
Prakasam District News
-
ఇసుకాసురులు
కొత్తపట్నం: ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. మండలంలో అధికారిక ఇసుక క్వారీ లేకపోయినా ఇసుకను జోరుగా తవ్వి తరలిస్తున్నారు. ఈ అక్రమ దందా అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లుగా వ్యహరిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒక వేళ లోడుతో పట్టుకుంటే వారికి ఇష్టమొచ్చిన వారిని వదిలిపెడుతున్నారు. మండలంలో మోటుమాల, కొత్తపట్నం, గమళ్లపాలెం, వజ్జిరెడ్డిపాలెం, రాజుపాలెం, మడనూరు గ్రామాల్లో ఇసుక రవాణా కొనసాగుతోంది. రోజుకు వందల ట్రాక్టర్లు తవ్వేస్తున్నారు. మోటుమాల గ్రామంలో కస్తూబా గాంధీ వనరుల కేంద్రం పక్కనే ఇసుక తవ్వి తరలిస్తున్నారు. పక్కనే ఉన్న ప్రహరీ అంచునే ఇసుక తీస్తున్నారు. దీంతో ప్రహరీ పడిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. -
రాష్ట్రంలో కీచకపాలన
ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే మహిళలపై దాడులు, పిల్లలపై లైంగికదాడులు అధికమయ్యాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం దుంపా రమణమ్మ అధ్యక్షతన ఒంగోలులోని అంబేడ్కర్ భవనం నుంచి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు శాంతియుతంగా ర్యాలీగా వెళ్లారు. అనంతరం వినతిపత్రం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దుంపా రమణమ్మ మాట్లాడుతూ రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గుంటూరులో మహిళను వివస్త్ర చేసి దాడి చేసిన ఘటనతో అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళకు న్యాయం చేసే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. హామీల అమలులో విఫలం: హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకపాలన, అక్రమ కేసులతో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల కోసమే పనిచేస్తోందన్నారు. టీడీపీ కార్యకర్తలు ఏ పనిచేయాలన్నా డబ్బులు దోచుకోవడమే పనిపెట్టుకొని ఆరాచకాలు చేస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ల పరిపాలనలో ఇలాంటి కీచకపర్వాలు జరగలేదన్నారు. రోడ్డు పై ఒక మహిళను వివస్త్రను చేయడం దారుణమన్నారు. గంజాయి బ్యాచ్ ఎక్కువయ్యారని, వీటిని అరికట్టకపోతే త్వరలోనే కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఒక మహిళా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుచేటన్నారు. పోలీస్ వ్యవస్థల నిద్రపోతుందా.. మాజీ మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పులి శాంతి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కీచకపాలన నడుస్తోందని విమర్శించారు. అత్యాచారాలు, హత్యలు, అరాచకం వంటి సంఘటనలు రాష్ట్రంలో పెచ్చరిల్లుపోయాయన్నారు. గుంటూరులో మహిళపై దాడి చేసి వివస్త్రను చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు చేస్తే తాట తీస్తాం అన్న పవన్‌కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు..? పవన్‌కళ్యాణ్ మీకు సోషల్ మీడియా లేదా, ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వలేరా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధ ఉందా లేక నిద్రపోతుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ సభ్యురాలు బత్తుల పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో పిల్లలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఎక్కడ చూసినా మహిళలు, పిల్లల్లో అభద్రతా భావం ఏర్పడిందన్నారు. స్కూల్‌కు వెళ్లిన పిల్లలు తిరిగివస్తారో లేదో అనే భయంలో ఆందోళనలో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పట్టపగలే ఒక మహిళను రోడ్డుపై కొట్టి వివస్త్రను చేసి, జాకెట్ చించి ఆమెను అన్ని రకాలుగా అవమానించిన సంఘటనతో రాష్ట్రంలో ఒక కీచకపాలన నడుస్తోందన్నారు. ఒక మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. స్కూల్, కాలేజీ, అసలు మహిళలకు ఎక్కడ భద్రత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు శాంతి భద్రతలు కల్పించలేని పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందని విమర్శించారు. గత ప్రభుత్వంలో పిల్లల కోసం రక్షణ కమిటీలు, మహిళల కోసం యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేశారని, ఇప్పుడు అవి ఎక్కడ పనిచేస్తున్నాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని సుజాత, ఒంగోలు సిటీ మహిళా అధ్యక్షురాలు షైక్ రషీద, స్టేట్ మహిళ విభాగం జనరల్ సెక్రటరీ సన్నపురెడ్డి రమణమ్మ, జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలు పసుమర్తి గోవిందమ్మ, సిటీ అంగన్వాడీ అధ్యక్షురాలు శోభలత, సంతనూతలపాడు ఎంపీపీ బుడం గుంట విజయ, కొండపి మాజీ ఏఎంసీ చైర్మన్ ప్రభావతి, సంతనూతలపాడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నారా విజయలక్ష్మి, రాష్ట్ర కల్చర్ వింగ్ అధ్యక్షురాలు కాకర్లపూడి రజిని, జిల్లా మహిళా విభాగం జనరల్ సెక్రటరీ సంధ్య, మహిళా నాయకులు బడుగు మాధవిలత, సాధం విజయలక్ష్మి, బొప్పరాజు జ్యోతి, నాగమణి, సుస్మిత, మహిళలు నాయకులు, ఒంగోలు నగర అధ్యక్షులు కఠారిశంకరరావు, సంతనూతలపాడు మండల అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, చెంచిరెడ్డి, పల్నాటి వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
ఇన్చార్జి డిప్యూటీ డీఈఓల నియామకం
మార్కాపురం: జిల్లాలోని మార్కాపురం, కనిగిరి డివిజన్లకు ఇన్చార్జి డిప్యూటీ డీఈఓలను నియమిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం ఇన్చార్జి డిప్యూటీ డీఈఓగా పెద్దారవీడు ఎంఈఓ–1గా పనిచేస్తున్న పీ శ్రీనివాసులును, కనిగిరి ఇన్చార్జి డిప్యూటీ డీఈఓగా పీసీపల్లి ఎంఈఓ–1 జీ సంజీవిలను నియమించారు. విద్యార్థుల తల్లిదండ్రులు లీప్యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ సుబ్బారావు తెలిపారు. స్కూల్ డెవలప్మెంట్ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ఒంగోలు టౌన్: నిరుపేద, మధ్య తరగతికి చెందిన రవాణా కార్మికుల జీవితాలతో ఆటలాడుకోవడం తగదని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు అన్నారు. రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంట వెంటనే డీజిల్, పెట్రోలు ధరలను పెంచి రవాణా కార్మికుల నడ్డి విరిచారని విమర్శించారు. నాలుగు సార్లు ధరలు పెంచడమంటే కార్మికుల మీద దాడి చేయడమేనని స్పష్టం చేశారు. ఒంగోలు నగరంలో ఆటో కార్మికులకు స్టాండు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ పోలీసుల చొరవతో అద్దంకి బస్టాండు సెంటర్, నెల్లూరు బస్టాండు సెంటర్లలో స్టాండు ఏర్పాటు చేసుకున్నారని, మిగిలిన ప్రాంతాల్లో కూడా స్టాండు ఏర్పాటు చేయాలని కోరారు. రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30వ తేదీ కలెక్టరేట్ వద్ద ఽచేయనున్న ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బంకా సుబ్బారావు, తంబి శ్రీనివాసులు, మహేష్ ప్రసాద్, బసవరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఎస్టీయూ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు రూపొందించిన ప్రత్యేక టెట్ మెటీరియల్‌ను డీఈఓ సీవీ రేణుక మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గవిని శివశంకర్ మాట్లాడుతూ టెట్ మెటీరియల్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్షలో విజయం సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నాణ్యమైన అధ్యయన సామగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డీఈవో రేణుక మాట్లాడుతూ ఎస్టీయూ రూపొందించిన టెట్ మెటీరియల్ ఎంతో బాగుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ చల్లా శ్రీనివాసులు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు డి.నాగయ్య, ఎస్టీయూ నాయకులు కె. రవికిరణ్ యాదవ్, ఎస్కే ఖాదర్ బాషా, జి.పూర్ణయ్య, కె.మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వమే చట్టాలు అమలు చేయకపోతే ఎలా!
● ఎన్జీవో మార్కాపురం తాలూకా యూనిట్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస శాస్త్రి మార్కాపురం: ప్రభుత్వమే చట్టాలను అమలు చేయకపోతే ఎలా అని ఎన్జీవో మార్కాపురం తాలూకా యూనిట్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస శాస్త్రి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో గ్రామాలను ఖాళీ చేసేందుకు సిద్ధపడిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వాలు పెద్ద మనసుతో వ్యవహరించాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో 18 ఏళ్లు నిండిన యువతి యువకులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో పాల్గొన్న యువకులకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టంలో నిర్వాసితుల పూర్తి విధి విధానాలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డీ తిరుపతిరెడ్డి, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జి కొండయ్య, సీఐటీయూ మార్కాపురం పట్టణ కార్యదర్శి పందిటి రూబేను, కార్ స్టాండ్ వర్కర్స్ యూనియన్ ట్రెజరర్ బలుసు పార్టీ కాశయ్య తదితరులు ఈ దీక్షలకు సంఘీభావం తెలియజేస్తూ మాట్లాడారు. ఈ దీక్ష కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం కో–కన్వీనర్ దగ్గుపాటి సోమయ్య, నిర్వాసిత గ్రామాల్లోని యువతీ, యువకులు, బొల్లవరం మల్లికార్జున, మద్దూరి శశింద్ర, పవన్, అంజి, రంగ సాయిలు, మండ్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేల ‘సివిల్ ’వార్
మార్కాపురం: ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ‘సివిల్’ వార్‌కు దారితీసింది. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరవర్గాలు నడి రోడ్డుపైనే ఘర్షణ పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ వేశారని రైతులతో కలసి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రంగా స్పందించారు. మార్కాపురం ఎమ్మెల్యేనే ఇదంతా చేయిస్తున్నాడంటూ తన సొంత మీడియా గ్రూప్‌లో సోమవారం రాత్రి పోస్ట్ చేయించడం సంచలనాన్ని రేకెత్తించింది. ప్రస్తుతం వీరి మధ్య వివాదం టీడీపీ అధిష్టానం వద్దకు చేరినట్టు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రమైన మార్కాపురంలో గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త భ్రమరా వెంచర్స్ పేరుతో రెండేళ్ల క్రితం 91 ఎకరాల్లో ప్లాట్లు వేశారు. వెంచర్‌కు రహదారి కోసం ఉన్న పలువురు స్థల యజమానుల నుంచి స్థలాలను తీసుకుని, రోడ్డు వేశారు. ఇక్కడే వివాదం మొదలైంది. భ్రమరా వెంచర్స్ రహదారికి ఇరువైపులా ఫెన్సింగ్ వేశారు. దీంతో రహదారికి ఇరుపక్కలా ఉన్న స్థలాలకు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో వారం రోజులుగా ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. స్థలాల యజమానులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని కూడా తీసుకున్నారు. రైతులు, స్థల యజమానులు జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు ఆర్టీఓ, ఎమ్మార్వో, ఇరిగేషన్ అధికారులు వెంచర్ వద్దకు వెళ్లారు. రోడ్డుకు ఇరువైపులా వేసిన ఫెన్సింగ్‌ను తీసివేశారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన ఘర్షణలో భ్రమరా వెంచర్స్‌కు చెందిన ఇద్దరు, స్థల యజమాని ఒకరు గాయపడ్డారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి దాడి చేయించారని గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త ఆరోపించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధికారులతో కుమ్మకై ్క భ్రమర వెంచర్‌ని ధ్వంసం చేశారని ఎమ్మెల్యే మాధవి పేరుతో ఉన్న మీడియా గ్రూపులో ఆమె పీఆర్ఓ సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల జేశారు. భ్రమర సంస్థ ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు కూడా తమపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు కమిషనర్‌గా ఉన్నప్పుడు పులి శ్రీనివాసులు అవినీతిని ఎమ్మెల్యేగా గల్లా మాధవి ప్రశ్నించారని, దానిని దృష్టిలో పెట్టుకొని ఆయన తమ సంస్థపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు సంచలనాన్ని రేకెత్తించాయి. అధిష్ఠానం దృష్టికి ఎమ్మెల్యేల పంచాయితీ.. రియల్ వెంచర్ విషయంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్థాయిలో జరుగుతున్న వివాదం ఆ పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. చిన్న బాస్ దృష్టికి కూడా ఈ విషయాన్ని చేరవేసినట్టు సమాచారం. -
బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేయాలి
ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై చట్టపరంగా విచారణ చేసి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసంలో ప్రజల నుంచి ఆయన నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చిన 90 మంది బాధితులు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలు సావధానంగా విని సానుకూలంగా స్పందిచారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎస్పీ ఫిర్యాదుదారుల వివరాలను తెలియజేసి, క్షేత్రస్థాయిలో విచారణ చేసి చట్టపరంగా పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని, వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగించాలని చెప్పారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ పి.శ్రీధర్, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వరరావు, గుడ్లూరు సీఐ రమేష్, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ప్యానెల్ అడ్వకేట్ బాలాజీ సింగ్, మీకోసం ఎస్సై యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు -
ఈవీఎం గోదాముల పరిశీలన
ఒంగోలు సబర్బన్: నగరంలోని భాగ్యనగర్ ఉన్న ఈవీఎం గోదామును కలెక్టర్ పి.రాజాబాబు సోమవారం పరిశీలించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సందర్శించి గోదాం షట్టర్లకు వేసిన తాళాలు, సీల్‌ను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో కల్పిస్తున్న భద్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఆర్ఓ పీవీ రమణ, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఉన్నారు. మార్కాపురం: ప్రజల నుంచి వచ్చే అర్జీలను గడువు లోగా పరిష్కరించాలని ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా అన్నారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్క్రా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా విచారించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు. ఫిర్యాదుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్నవారికి ప్రత్యేక శ్రద్ధతో స్పందించి, వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, జాబ్ ఫ్రాడ్, అత్తరింటి వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్, త్రిపురాంతకం సీఐ అస్సన్, టీవీ పల్లి ఎస్సై శివ బసవరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: పరీక్ష పేపర్ల లీకేజీలను నిరసిస్తూ ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించి లాఠీచార్జి చేయించడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరాస్వామి ఖండించారు. లాఠీచార్జికి నిరసనగా ఎస్ఎఫ్ఐ కార్యాలయం నుంచి సాయిబాబా గుడి వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు చౌరస్తాలో మానవహారం చేపట్టారు. మోదీ ప్రభుత్వం వచ్చాక బిజేపీ పాలిత రాష్ట్రాల్లో పరీక్ష పేపర్లు లీకవడం నిత్యకృత్యంగా మారిందని విమర్శించారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్న అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారిని వెనకేసుకొని రావడం చాలా దారుణమన్నారు. విద్యార్థుల జీవితాలకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం వారి గొంతులు నొక్కేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులను ఉసిగొప్పి లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పన్నారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వినోద్, విద్యార్థులు పాల్గొన్నారు. ఘట్కేసర్: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను మృతుడి కుటుంబీకులు దానం చేసి మానవతను చాటుకున్నారు. ఘట్కేసర్ పోలీసుల వివరాల ప్రకారం..ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధేనువకొండ గ్రామానికి చెందిన గుంజి శ్రీను (40) యాదాద్రి భువనగరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న వెంకిర్యాలలో పనులు పూర్తి చేసుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా అవుషాపూర్ దీక్ష హోటల్ వద్ద బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు వెంటనే బీబీగనర్ ఎయిమ్స్ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం విషమించి సోమవారం బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. దు:ఖ సముద్రంలో ఉన్నా సమాజ హితం కోసం మృతుడి భార్య గుంజి శ్రావణి, కుటుంబ సభ్యులు అవయవ దానం చేయడానికి ముందుకొచ్చారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ చార్జీల మోత..
ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోతున్న ఈ పరిశ్రమకు విద్యుత్ బిల్లులు మరింత భారంగా మారాయి. ఎన్నికల ముందు కూటమి పెద్దలు విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ట్రూ అప్ చార్జీల పేరుతో వీరబాదుడు బాదేశారు. అంతేకాకుండా పరిశ్రమలకు ఇవ్వాల్సిన సబ్సిడీ అరకొరగా ఇచ్చింది. రూ.50 లక్షలు సబ్సిడీ రావాల్సి ఉంటే కేవలం 10 శాతం ఇచ్చారని పరిశ్రమల నిర్వాహకులు వాపోతున్నారు. మిగిలిన సబ్సిడీ వస్తుందో రాదోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఏఎంఆర్ కంటైనర్ పాసులతో నష్టం.. బయ్యర్లు ఒక కంటైనర్ లో 4200 అడుగుల గ్రానైట్ ఫినిషింగ్ మెటీరియల్ ఈజిప్టు, వియత్నాం, దుబాయ్, ఆస్ట్రేలియా, తదితర దేశాలకు ఎగుమతులు చేస్తుంటారు. 4200 అడుగులకు మైనింగ్ బిల్లు 1 అడుగుకు రూ.12 చొప్పున రూ.50,400 అవుతుంది. కానీ బయ్యర్లు ఏఎంఆర్ సంస్థ దగ్గర రూ.35 వేలకు తీసుకుంటున్నారు. దీంతో బయ్యర్లకు ఒక కంటైనర్‌కు రూ.15,400 మిగులుతుంది. బయ్యర్లు ఏఎంఆర్ ఇస్తున్న పాస్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివలన గ్రానైట్ పరిశ్రమల యజమానులు ప్రభుత్వానికి చెల్లించిన మైనింగ్ బిల్లు వారి దగ్గర వృథాగా మిగిలిపోతోంది. ఇది గ్రానైట్ పరిశ్రమల యజమానులకు అదనపు భారం పడుతోంది. -
మున్సిపల్ ఫీజుల పేరుతో సైబర్ ట్రాప్
కనిగిరి రూరల్: సైబర్ కేటుగాళ్లు రోజుకో తరహాలో ప్రజలకు టోకరా వేస్తున్నారు. కనిగిరిలో ఇప్పటికే సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పలువురు చిక్కుకుని నష్టపోయి ఉన్నారు. తాజాగా కనిగిరి మున్సిపాలిటీలో ఫీజుల వసూళ్ల పేరుతో పట్టణ వ్యాపారస్తులు, దుకాణదారులు, లాడ్జి యజమానులు, హాస్పిటల్స్ వారిని సైబర్ నేరగాళ్లు ట్రాప్‌లో వేసేందుకు పన్నాగం పన్నారు. ఒకరిద్దరు ట్రాప్‌లో చిక్కుకుని వెంటనే అప్రమత్తమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ క్యూ ఆర్ కోడ్లు పంపి నగదు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. పట్టణంలోని గార్లపేట రోడ్డులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్‌కు, ఓ లాడ్జి యజమానికి కూడా సైబర్ నేరగాళ్ల ఫోన్ చేశారు. వెంటనే వారికి అనుమానం వచ్చింది. ఇది సైబర్ నేరగాళ్ల మోసంగా భావించి అప్రమత్తమాయ్యరు. ఎలాంటి నగదు చెల్లించకుండా వారి వాయిస్ రికార్డు చేశారు. ఓ రెస్టారెంట్, ఓ హోటల్ యజమాని మాత్రం నమ్మి క్యూర్ కోడ్‌కు కొంత నగదు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు వ్యక్తులు వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించారు. తాము ఎటువంటి ఫోన్లు చేయలేదని సిబ్బంది, అధికారులు స్పష్టం చేశారు. దీంతో అది సైబర్ నేరగాళ్ల పనిగా భావించి అందరూ అప్రమత్తమయ్యారు. ఫేక్ వసూళ్లపై అప్రమత్తంగా ఉండాలి : కమిషనర్ శ్రీధర్ కనిగిరిలో ట్రైడ్ లైసెన్స్ ఫీజు పేరుతో ఫోన్ చేసి స్కానర్ పెట్టి సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ సూచించారు. సైబర్ నేరగాళ్ల మోసాల ట్రాప్‌లో పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. ట్రైడ్ లైసెన్స్ ఫీజులు జనవరి, ఫిబ్రవరిలోనే అధికారికంగా వసూలు చేస్తామని, ప్రస్తుతం ఎలాంటి వసూళ్లు లేవని స్పష్టం చేశారు. ఇంటి పన్నులు, వగైరా పన్నుల విషయంలో అనుమానాస్పద కాల్ వచ్చినా.. డబ్బులు అడిగినా.. వారిపై ఎటువంటి అనుమానం కలిగినా.. వెంటనే మున్సిపల్ కార్యాలయం నంబర్ 79939 37001కు కాల్ చేయాలని, లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పట్టణ ప్రజలు, వ్యాపారులకు కమిషనర్ సూచించారు. మార్కాపురం: 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. వేల కోట్లు వెచ్చించి ప్రాజెక్టు నిర్మిస్తున్నా ప్రాజెక్టు నిర్వాసితులపై ఖర్చు నామమాత్రమేనన్నారు. వెంటనే నిర్వాసితులందరికీ న్యాయమైన ఆర్అండ్ఆర్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును జాతికి అంకితం చేసే నాటికి 18 ఏళ్ల వయసు నిండిన యువతి, యువకులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని నిర్వాసితుల సంఘం కో కన్వీనర్ దగ్గుపాటి సోమయ్య సోమవారం ఆర్డీఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం దారుణమన్నారు. ఈ సందర్భంగా పరిహారం చెల్లించాలని నిర్వాసితులతో కలిసి నినాదాలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మా బాలనాగయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె. విజయ్‌కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి.వందన్ కుమార్, బొల్లవరం మల్లికార్జున, మండ్ల అనిల్, పెద్ద పాండు, రంగసాయులు, యశ్వంత్, అంజి, భీమవరం ప్రసాద్, దూదేకుల ఖాశీంపీరా, మద్దూరి శశింద్ర పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్లు వాడిన స్కానర్లు.. కనిగిరిలో వెలుగుచూసిన మోసం -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన స్కూల్ బస్సు
సంతనూతలపాడు: స్కూల్ బస్సు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన సంఘటన సోమవారం సంతనూతలపాడు మండలంలోని చిలకపాడు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వేములపాడు నుంచి ఒంగోలు వెళ్తున్న సరస్వతీ స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో ఎనిమిది మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఒకరిద్దరికి స్వల్ప గాయాలవగా, విద్యుత్ స్తంభం నేలకొరిగింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన స్థలాన్ని ఎస్సై వేజెండ్ల అజయ్‌బాబు పరిశీలించారు. వరుస బస్సు ప్రమాదాలతో ఆందోళన... సంతనూతలపాడు మండలంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం మద్దులూరు సమీపంలో అనకళ్లపూడి గ్రామం నుంచి మద్దులూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపక్కన బోల్తా పడింది. ఈ బస్సులో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉండగా, మొత్తం 14 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మండలంలో సింగిల్ లైన్ రహదారుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
గురుకులం సెక్యూరిటీ గార్డుల వేతనాలు ఇవ్వాలి
ఒంగోలు టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు 7 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తుందని, ఇప్పటికై నా వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యం.రమేష్ కోరారు. ఈ మేరకు సోమవారం స్పందనలో కలెక్టర్ పి.రాజాబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ అంబేడ్కర్ గురుకులంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు సేవా సుప్రీం ఏజెన్సీ సకాలంలో వేతనాలు చెల్లించకుండా వేధిస్తోందని తెలిపారు. నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించకుండా కేవలం రూ.9 వేలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. సెక్యూరిటీ గార్డులుగా తీసుకొని వీరి చేత సంబంధంలేని అదనపు పనులు చేయిస్తున్నారని, స్వీపింగ్, క్లీనింగ్, బాత్రూములు కడిగించడం వంటి పారిశుధ్య పనులు చేయిస్తున్నారని చెప్పారు. ఇతర పనులు చేసే సిబ్బంది ఎవరైనా సెలవు పెడితే వారి పనులను సెక్యూరిటీ గార్డుల చేత చేయించడం అలవాటైపోయిందన్నారు. అంతేకాకుండా కార్మిక చట్టాల ప్రకారం సెక్యూరిటీ గార్డులకు సెలవులు ఇవ్వడంలేదని, అత్యవసర సమయాల్లో కూడా సెలవులు మంజూరు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని, ఈఎస్ఐ, సెలవులు వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే జీతాలు చెల్లించకపోతే ఈ నెల 30వ తేదీ కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎల్.స్వాతి, శ్రావణి, వాణి, రజియా, హైమావతి, ప్రియ పాల్గొన్నారు. -
పరిశ్రమ నల్లబడి
గ్రానైట్‌కు గడ్డు రోజులు.. చీమకుర్తి రూరల్: ఒకప్పుడు దేశ, విదేశాలకు గ్రానైట్ ఎగుమతుల్లో అగ్రగామిగా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమ నిలిచింది. చీమకుర్తి, రామతీర్థం, బూదవాడ, యల్లయ్యనగర్, మర్రిచెట్లపాలెం, సంతనూతలపాడుల్లో 1200లకు పైగా పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌కు చైనాతో పాటు గల్ఫ్ దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ముడిరాళ్లు ఎక్కువగా చైనాకు, పాలిష్ చేసిన స్లాబులు ఇరాన్, ఇరాక్, ఖతార్, సౌదీ, కువైట్, దుబాయ్, వియత్నాంలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు ఇక్కడ నుంచి నెలకు సుమారు 5 వేలకు పైగా కంటైనర్లు సముద్రమార్గం ద్వారా ఎగుమతులు జరిగేవి. కరోనా తరువాత ఎగుమతులు భారీగా పడిపోయాయి. యుద్ధానికి ముందు 2500 నుంచి 3 వేల కంటైనర్లు వెళ్తున్నాయి. యుద్ధంతో దాదాపు ఎగుమతులు నిలిచిపోయాయి. ఇది ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. యుద్ధానికి తోడు ఏఎంఆర్ సంస్థ అమలు చేస్తున్న పాస్‌ల విధానం కూడా పరిశ్రమలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని గ్రానైట్ పరిశ్రమల యజమానులు ఆరోపిస్తున్నారు. క్వారీల నుంచి మైనింగ్ బిల్లుతో ముడి రాయిని కొనుగోలు చేసి ప్రాసెసింగ్ అనంతరం ఫినిషింగ్ మెటీరియల్‌ను విక్రయించే సమయంలో పరిశ్రమల యజమానులు ప్రభుత్వానికి రాయల్టీతో పాటు ఇతర చెల్లింపులు చేస్తున్నా బయ్యర్లకు ఏఎంఆర్ సంస్థ కేవలం రూ.35 వేలకే పోర్టుకు గ్రానైట్ ఫినిషింగ్ మెటీరియల్ తరలించే పాస్‌లు జారీ చేస్తుండటంతో పరిశ్రమల వద్ద బిల్లుతో కొనుగోలు చేసే పరిస్థితి తగ్గిపోయిందని అంటున్నారు. ప్రభుత్వానికి చెల్లించిన రాయల్టీ, మైనింగ్ బిల్లుల వ్యయం తిరిగి రాక పరిశ్రమల యజమానులు ఆర్థిక భారీ నష్టాలను చవిచూస్తున్నట్లు వాపోతున్నారు. రెండు కట్టర్లతో పనిచేసే ఒక గ్రానైట్ పరిశ్రమ ప్రతి నెలా సుమారు 44 మీటర్ల రాయికి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి వస్తోందని, ఆ వ్యయాన్ని ఫినిషింగ్ మెటీరియల్ అమ్మకాల ద్వారానే భర్తీ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అయితే బయ్యర్లు ఏఎంఆర్ పాస్‌లను వినియోగించడంతో పరిశ్రమల ద్వారా జరిగే బిల్లింగ్ తగ్గిపోయి, పరిశ్రమలను కొనసాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న గ్రానైట్ పరిశ్రమను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఏఎంఆర్ పాస్‌ల విధానాన్ని సమీక్షించాలని, పరిశ్రమలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల యజమానులు విజ్ఞప్తి చేశారు. బ్లాక్ లో మైనింగ్ బిల్లు నెలలో 20వ తేదీ వరకు 1 మీటరుకు రూ.1500 నుంచి 1700 వరకు మైనింగ్ బిల్లు అమ్ముతుంటారు. 25వ తేదీ దాటగానే ఒక మీటరుకు రూ.2 వేల నుంచి రూ.2500 వరకు మైనింగ్ బిల్లు విక్రయిస్తారని గ్రానైట్ పరిశ్రమల యజమానులు అంటున్నారు. -
అధికారులపై కన్నెర్ర ‘జేసీ’
మార్కాపురం: ‘ ఏం తమాషాగా ఉందా.. ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోరా.. ’ అంటూ అధికారులపై జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం దళితులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్‌కు ఇంతియాజ్, చిన్నా, లింగమయ్య, మరికొంత మంది కలిసి భ్రమర వెంచర్స్‌లో జరుగుతున్న గొడవలు, దాడులను వివరిస్తూ న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్‌ను కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను తన వద్దకు రావాలని ఆదేశించారు. అయితే ఉన్నత స్థాయి అధికారి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలపై తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పట్టణ శివారులోని భ్రమర వెంచర్ సమీపంలో తమకు 3.53 సెంట్ల భూమి ఉందని, ఆ భూమికి వెళ్లే దారిని వెంచర్ యాజమాన్యం అక్రమంగా ఇనుప కంచె, గేటు నిర్మించి మూసివేస్తోందని బాధితులు ఆరోపించారు. గేటు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వెళ్లగా వెంచర్ మేనేజర్‌తో పాటు మరికొందరు తమపై దాడి చేసి కుల, మత దూషణలకు పాల్పడ్డారని, రాడ్లు, కట్టెలతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి తమకు రక్షణ కల్పించాలని జేసీకి వినతిపత్రం అందజేశారు. భూమికి వెళ్లే దారిని మూసివేసేందుకు ఎలాంటి అనుమతులు ఇచ్చారని ఇరిగేషన్ శాఖ అధికారులను ప్రశ్నించారు. ఈ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, నిబంధనలపై పూర్తి వివరాలతో విచారణ జరిపి, సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను జేసీ ఆదేశించారు. మరోవైపు, దాడి ఘటనపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయికి వెళితేనే సమస్యల పరిష్కారం మార్కాపురం టౌన్: క్షేత్రస్ధాయిలో అధికారులు పర్యటించినప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అన్నారు. మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 527 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూకు సంబంధించి 155, ఇతర సమస్యలపై 372 వచ్చినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిస్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడి పని చేయాలన్నారు. పరిష్కరించదగ్గ వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సమస్యపై పదేపదే తిప్పుకోవడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఇప్పటికై నా అన్ని శాఖల అధికారులు పద్ధతి మార్చుకొని పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు వెంకట శివరామిరెడ్డి, అజయ్ కుమార్, హౌసింగ్ పీడీ మోహన్ రావు, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆర్ఆర్ ప్యాకేజీలో అన్యాయం: పెద్దారవీడు మండలం సుంకేశుల గ్రామానికి చెందిన గుడ్డెపోగు సుబ్బులు ఆర్ఆర్ ప్యాకేజీలో పేరు లేదని పీజీఆర్ఎస్లో విన్నవించారు. 2006లో విడుదల చేసిన గెజిట్ లిస్టులో తన పేరులేదని, అప్పటికే తనకు 18 సంవత్సరాలు నిండాయని చెప్పారు. తనకు నలుగురు కుమార్తెలు ఉన్నారని, ఆర్ఆర్ ప్యాకేజీ గెజిట్ లిస్టులో తన పేరు నమోదు చేసి న్యాయం చేయాలని కోరాడు. గుడ్డెపోగు సుబ్బులు -
అటవీ భూములు అమ్మకానికి..
కురిచేడు: ఖాళీ జాగా కనిపిస్తే చాలు పచ్చగద్దలు వాలిపోతున్నాయి. అటవీ, రెవెన్యూ భూములు వేటినీ వదలకుండా ఆక్రమించి, అక్రమంగా విక్రయించి టీడీపీ నాయకులు సొమ్ముచేసుకుంటున్నారు. తాజాగా కురిచేడు మండలం పడమర వీరాయపాలెంలో అటవీ భూములపై వారి కన్ను పడింది. వందల ఎకరాలు ఆక్రమించి అనధికారికంగా విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. పడమరవీరాయపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వేనంబరు 8 లో 527.5 ఎకరాల విస్తీర్ణం ఉంది. అందులో సుమారు 200 ఎకరాలు అక్రమంగా విక్రయించారు. సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న ధనికులు, ఎన్ఆర్ఐలను తీసుకొచ్చి తక్కువ ధరలకు భూములు ఇప్పిస్తామని నమ్మబలికి వారికి కట్టబెడుతున్నారు. ఆ తరువాత దానికి చుట్టూ కంచె ఏర్పాటుచేసి, దున్నించి సాగుచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇటు అటవీశాఖ, అటు రెవెన్యూ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దొనకొండ మండలం బాదాపురం వద్ద నుంచి కురిచేడు మండలం ముష్ట్ల గంగవరం వద్ద గుండ్లకమ్మ వాగు వరకు అటవీ శాఖకు చెందిన 13 వేల ఎకరాలు భూమి ఉంది. అందులో సర్వే నంబరు 8లో 527.5 ఎకరాల విస్తీర్ణం ఉంది. దానికి హద్దుల కోసం గత 50 ఏళ్లుగా అటవీ–రెవెన్యూ శాఖల మధ్య వివాదం ఏర్పడింది. అదికాస్త సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. మండలంలోని పడమరవీరాయపాలెం గ్రామంలోని ఎస్సీలు, బీసీలు సుమారు 150 మందికి 1988 లో అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ అబ్బన్న ఆ భూమిలో పట్టాలు ఇచ్చారు. దానిని అటవీశాఖ అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించింది. దానిపై 2014 లో పడమర వీరాయపాలెం గ్రామ ఎస్సీలు తమ పట్టాలకు హద్దులు చూపాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దాంతో అటవీ అధికారులు తమకు సర్వేనంబరు 8 లో ఉన్న భూమి వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉందని రికార్డులు చూపి ఆ పట్టాలను రద్దు చేయించింది. దాంతో గత్యంతరం లేక రెవెన్యూ అధికారులు సుమారు 70 మంది ఎస్సీలకు అదే గ్రామ సర్వేనంబరు 63, 64, 65 లలో పట్టాలు మంజూరు చేశారు. ఇదే అదనుగా భావించిన ఆక్రమణదారులు అటవీ భూములను విక్రయించటం ప్రారంభించారు. దాదాపు 200 ఎకరాలు విక్రయించారు. సర్వేనంబరు 8 లోని భూమి ప్రభుత్వానిదని, దానిని ఆక్రమించినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా ఆక్రమణదారులు ఆ బోర్డులను తొలగించి అధికార పార్టీ అండతో క్రయవిక్రయాలు చేపట్టారు. ఆ భూముల్లో సోలార్ ప్యానల్ లు ఏర్పాటు చేసి బోర్లు వేసి, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటున్నారు. అటవీ భూములకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు గ్రామాల్లో లోవోల్టేజి సమస్య ఉంది ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయమంటే మీన మీషాలు లెక్కించే విద్యుత్ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలోని భూములకు విద్యుత్ లైన్లతోపాటు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా ఇవ్వటం వెనుక ఆంతర్యమేమిటో ఆశాఖ అధికారులకే తెలియాలి. ఇప్పటికై నా కలెక్టర్, ఫారెస్టు సెటిల్మెంట్ అధికారి, అటవీశాఖ ఉన్నతాధికారులు కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేసి అటవీ భూములు విక్రయించిన వారిపై, కొన్న వారిపై, దానిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేసిన వారిపై చర్యలు తీసుకొని అటవీ భూమిని కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు. సుమారు 200 ఎకరాల ఆక్రమణ వివాదాస్పద అటవీ భూమికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు -
కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్
● కలెక్టర్ విజయసునీత మార్కాపురం టౌన్: విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవష్యత్ ఉంటుందని కలెక్టర్ ఎం విజయసునీత అన్నారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ –2026 అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మరింత ఉత్సాహం, పట్టుదల పెరిగి విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారన్నారు. ప్రతి విద్యార్థి ఒకశక్తి కేంద్రమని, ధైర్యంతో లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. విద్యార్థులు నైపుణ్యాలను నేర్చుకొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల విద్య ద్వారానే కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుపై ప్రత్యేక దృష్టి సారించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. అనంతరం జిల్లాలో షైనింగ్ స్టార్స్ అవార్డుకు ఎంపికై న 134 మంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి అవార్డు, రూ.20వేల నగదు చెక్కును తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి, ఇంటర్మీడియెట్ బోర్డు డీఐఈఓ స్వరూపరాణి, డీఈఓ సుబ్బారావు, డీసీఈబీ కార్యదర్శి సుధాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నింటా అధ్వానమే..
అర్ధవీడు: పురుగులు పట్టిన అన్నంతో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంది. విద్యార్థులకు బోధన కూడా అంతంత మాత్రమే. పాఠశాల నిర్వహణ, విద్యాబోధన రెండింటిలోనూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. బాధ్యులపై చర్యలు తప్పవని ఆర్జేడీ బీ లింగేశ్వరరెడ్డి, డీఈఏ ఎస్ సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 18వ తేదీన అర్ధవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పురుగులు పట్టిన అన్నం, మురిగిన కోడిగుడ్లు విద్యార్థులకు పెట్టడంతో వారు అన్నం తినలేక ఇంటికి వెళ్లిపోయిన ఘటనపై ‘మాకొద్దు బాబోయ్ ఈ మధ్యాహ్న భోజనం’ అన్న శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు సోమవారం పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. సోమవారం మధ్యాహ్న భోజనం ఆలస్యంగా 2 గంటలకు అందించారు. అప్పటి దాకా విద్యార్థులు ఆకలితో ఉండాల్సి వచ్చింది. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతపై వివరాలు అధికారులు అడిగి తెలుసుకున్నారు. అన్నంలో పురుగులు కనిపించడం తీవ్ర నిర్లక్ష్యమని, సంబంధిత పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ ఇంకొల్లు సుజాతతో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. భోజన నాణ్యతపై జిల్లా అధికారులకు ఎందుకు తెలియజేయలేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వీడాలని మిడ్ డే మీల్స్ పరిశీలకుడు ఎంఈవో 2 ఎం లక్ష్మీనాయక్ ను హెచ్చరించారు. మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహణ సరిగా లేదని, ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య సమ న్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు బోధించే విద్య కూడా అంతంత మాత్రంగానే ఉందని, పనితీరు మెరుగు పరుచుకోవాల ని ఉపాధ్యాయులను హెచ్చరించారు. ఇకపై నెలకొకసారి పాఠశాలను సందర్శిస్తామన్నారు. -
దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్
● మాజీ ఎమ్మెల్యేలు అన్నా, జంకె, కేపీలకు వినతిపత్రం అందజేత మార్కాపురం టౌన్: జీఓ నంబరు 396ను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సోమవారం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు పెన్‌డౌన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబుకు, మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, కేపీ కొండారెడ్డి, సీపీఐ నాయకుడు అందె నాసరయ్యతో పాటు పలువురు నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల సంఘ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు మాట్లాడుతూ దాదాపు 40 నుంచి 50 మంది దస్తావేజు లేఖరులు ఏళ్ల తరబడి ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబరు 396ను ఉపసంహరిచుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా 10 రోజుల పాటు పెన్‌డౌన్ చేపట్టామన్నారు. కార్పొరేట్ సంస్థలకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న దస్తావేజు లేఖరులు రోడ్డున పడనున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నాకు వివరించారు. కార్యక్రమంలో స్టార్ మస్తాన్, వీ శ్రీను, బూదాల బెంజిమెన్, జహీర్ రాజా, జంకె వెంకటేశ్వరరెడ్డి, గొగిరెడ్డి లక్ష్మిరెడ్డి, కుమార్ స్వామిరెడ్డి, ఐ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో.. ఒంగోలు సిటీ: ఒంగోలులో కూడా దస్తావేజు లేఖరులు పెన్‌డౌన్ చేసి నిరసన తెలిపారు. దస్తావేజు లేఖరుల ఉపాధికి గండికొట్టే జీఓ నంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు వారికి మద్దతు తెలిపారు. -
నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావ్..చంద్రబాబు!
దర్శి: రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావు చంద్రబాబు.. అని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య ప్రశ్నించారు. ఆగస్టు 8 నుంచి 9వ తేదీ వరకు జరిగే భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా 19వ మాహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీ పిచ్చయ్య మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి మెగా డీఎస్సీ విడుదల చేసి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొనకొండ పారిశ్రామిక క్యారిడార్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, జిల్లాలో డీఎస్సీలో ఖాళీ టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ భర్తీ చేయాలని, రామాయపట్నం పోర్టు బీపీసీఎల్ ఇండో సోలార్ కంపెనీల్లో నిర్వాసితులు, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం పోరాడే సంఘం ఒక్క డీవైఎఫ్ఐ మాత్రమే అన్నారు. అందరికీ విద్య అందరికీ ఉపాధి లక్ష్యంతో డీవైఎఫ్ఐ సంఘం పనిచేస్తోందని, జిల్లా మహాసభల్లో ఈ సమస్యలన్నింటిపై చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులు యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు షేక్ పీరా సాహెబ్, మండల కార్యదర్శి ఆర్.జెస్సిపాల్, మండల ఉపాధ్యక్షుడు కళ్యాణ్ పాల్గొన్నారు. -
పంచాయతీరాజ్ డీఈఈ వేధింపులు
ఒంగోలు సబర్బన్: అభివృద్ధి పనులు చేసినా బిల్లులు మంజూరు చేయించకుండా పంచాయతీరాజ్ డీఈఈ కే కృష్ణమోహన్ వేధిస్తున్నాడంటూ సంతనూతలపాడు జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ సోమవారం కలెక్టర్ పి.రాజాబాబుకు ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు మండల పరిషత్ వర్క్స్ కమిటీ చైర్మన్ కే రమణతో కలిసి ఒంగోలులోని కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిషత్ నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడం లేదని తెలిపారు. గ్రామ పంచాయతీ వర్క్స్ కమిటీ తీర్మానాలిచ్చినా బిల్లులు చేయకుండా డీఈఈ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కలెక్టర్‌కు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా పరిషత్‌కు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు ముందుకు సాగకుండా పంచాయతీరాజ్ డీఈఈ కృష్ణమోహన్, ఇంజినీరింగ్ అధికారులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు, పూర్తి కావాల్సిన పనులకు దాదాపు రూ.80 లక్షల వరకు ఎంబీ రికార్డు చేయకుండా పెండింగ్‌లో పెట్టి ఇబ్బందులు కలిగిస్తున్నారని కలెక్టర్‌కు తెలిపారు. గతంలో తాను సంతనూతలపాడు పంచాయతీ సర్పంచ్‌గా ఉన్న కాలంలో కూడా దాదాపు రూ.60 లక్షల నిధులకు సంబంధించిన పనులు పూర్తి చేసినప్పటికీ రికార్డు చేయకుండా, బిల్లులు రాకుండా నానా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆ నిధులకు సంబంధించి 2011వ సంవత్సరంలో ఏపీ హైకోర్టులో కేసు వేసినా.. బిల్లులు చెల్లించాలని కోర్టు ఆదేశించినా నేటికీ పెడచెవినపెట్టి వేధిస్తున్నారన్నారు. హైస్కూలు, మండల కాంప్లెక్స్‌లోని భవనాల ప్రారంభోత్సవ సమయంలో వివిధ రకాల నిర్మాణాలు, రోడ్ల పనుల బిల్లులు, జగనన్న కాలనీలో కల్వర్టులు, రోడ్ల బిల్లులు చేయాల్సి ఉందన్నారు. ఒక్క సంతనూతలపాడులోనే దాదాపు రూ.80 లక్షల విలువైన పనులు ఇంకా చేయాల్సినవి మిగిలి ఉన్నాయన్నారు. గతంలో ఇతనిపై కేసు వేశామనే అక్కసుతో దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఇబ్బందిపెడుతున్నాడని కలెక్టర్‌కు వివరించారు. డీఈఈ కృష్ణమోహన్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, మంజూరైన నిధులకు సంబంధించిన పనులకు గ్రామ పంచాయతీ తీర్మానాలు, వర్క్ ఆర్డర్లు ఇప్పించి పూర్తి చేయించాలని కలెక్టర్‌కు దుంపా రమణమ్మ విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులు చేసినా బిల్లులు మంజూరు చేయించకుండా ఇబ్బందులు మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన జెడ్పీటీసీ సభ్యురాలు దుంపా రమణమ్మ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్న కలెక్టర్ రాజాబాబు అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు : కలెక్టర్ రాజాబాబు సమస్యల పరిష్కారం కోసం ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రకాశం భవనంలో ఎస్సీ, ఎస్టీల కోసం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో జేసీ కల్పనాకుమారి, డీఆర్ఓ రమణ, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్‌రెడ్డి, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావుతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత ముఖ్యమన్నారు. బలహీనవర్గాల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోనని చెప్పారు. రెవెన్యూయేతర సమస్యలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేకంగా విచారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్ అర్జీలను పరిష్కరిస్తున్న తీరుపై ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ద్వారా, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నందున ప్రజలతో వ్యవహరించే విధానం, సమస్యలను పరిష్కరిస్తున్న పద్ధతి సక్రమంగా ఉండాలన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తెరిగి అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులందరూ ప్రతిరోజూ ముందుగా ఆన్లైన్లో గ్రీవెన్స్ అర్జీల స్టేటస్ గమనించాలని కలెక్టర్ చెప్పారు. సాంకేతిక కారణాల వలన పరిష్కరించలేని సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పెరగనున్న పోలింగ్ స్టేషన్లు
మార్కాపురం టౌన్ వ్యూ మార్కాపురం: నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో పోలింగ్ కేంద్రాలు పెరగనున్నాయి. ఇందుకు అధికారులు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 21 మండలాలు ఉన్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 1,200 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఉన్న వాటిని సవరిస్తూ కొత్తగా పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపాలని సూ చించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో 42 కొత్త పోలింగ్ కేంద్రాలకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రస్తుతం 1103 కేంద్రాలు ఉండగా 42 పెరగటం ద్వారా మొత్తం 1145 అవ్వనున్నాయి. మార్కాపురంలో 2, కనిగిరిలో 1 పోలింగ్ కేంద్రం లొకేషన్ మార్పు కోసం ప్రతిపాదించారు. గిద్దలూరు నియోజకవర్గంలో 10 మంది ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరొక పోలింగ్ కేంద్రానికి మార్చాలని కోరటంతో దానికి కూడా నివేదిక తయారు చేశారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల వివరాలు నియోజకవర్గం ప్రస్తుతం పెరిగేవి మొత్తం మార్కాపురం 257 20 277 గిద్దలూరు 284 3 287 యర్రగొండపాలెం 265 2 267 కనిగిరి 297 17 314 మొత్తం 1103 42 1145 -
ఇన్ సర్వీస్ టెట్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్
మార్కాపురం: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ (పేపర్–1ఏ) పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను మార్కాపురం జిల్లా విద్యాశాఖ అధికారి సామ సుబ్బారావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఎస్టీయూ రూపొందించే ప్రతి స్టడీ మెటీరియల్ ఉపాధ్యాయులు ఉపయోగించుకోవాలన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రయ్య మాట్లాడుతూ టెట్ పేపర్–1ఏకు సంబంధించిన తెలుగు, ఇంగ్లిష్, సైకాలజీ, మెథడాలజీలపై సమగ్రంగా స్టడీ మెటీరియల్ రూపొందించామని తెలిపారు. త్వరలో పేపర్–1ఏ అభ్యర్థుల కోసం ఆఫ్‌లైన్ మోడల్ పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా అసిస్టెంట్ ఎగ్జామినేషన్ కమిషనర్ కొండారెడ్డి, డీసీఈబీ కార్యదర్శి ఎం.సుధాకర్, బంగారు బాల్యం కన్వీనర్ గిరిధర్ శర్మ, గిద్దలూరు ఎంఈఓ అశ్విని కుమార్, సీహెచ్ గాలయ్య, యూసఫ్ షరీఫ్, అక్కల నారాయణ, వెంకటరమణ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
రైతు కష్టం అగ్నికి ఆహుతి
సంతనూతలపాడు (చీమకుర్తి): ఏడాది పొడవునా కష్టపడి పండించిన పొగాకు పంట బుగ్గిపాలైంది. ఇంట్లో దాచుకున్న రూ.1.05 లక్షల నగదు కాలిబూడిదైంది. వాటితో పాటు 5 సవర్ల బంగారం, 5 బస్తాల ధాన్యం మంటల్లో కలిసిపోయాయి. పొలానికి సంబంధించిన పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లన్నీ దహనమయ్యాయి. పక్కపక్క పోర్షన్లలో అన్నదమ్ములు నివాసం ఉంటున్న పెంకుటిళ్లు పూర్తిగా కాలి బొగ్గులే మిగిలాయి. సంతనూతలపాడు మండలం గంగవరం గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకెళ్తే.. ఆదివారం వేకువజామున అందరూ గాఢనిద్రలో ఉండగా, మలసాని శేషయ్యకు చెందిన ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అందరూ ఉలిక్కిపడి లేచి చూసే సరికి ఇంటి నిండా మంటలు ఎగసిపడుతున్నాయి. శేషయ్య భార్య రత్తమ్మ ఇంట్లో, శేషయ్య ఇంటి బయట పడుకున్నారు. ఇంట్లో మంటలకు రత్తమ్మకు మెళకువ వచ్చి బయటకు పరిగెత్తింది. తన భర్తతో పాటు అందరినీ పిలుస్తూ కేకలు వేసింది. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఫైరింజన్ కోసం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్‌తో వచ్చిన సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. అప్పటికే ఇంట్లోని అన్నదమ్ముల రెండు పోర్షన్లతో పాటు పొగాకు చెక్కులు, బంగారం, నగదు, ధాన్యం పూర్తిగా కాలిబూడిదయ్యాయి. వాటి విలువ దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. తహసీల్దార్ నారాయణరెడ్డి, వీఆర్ఓ దాసరి శ్రీనివాసులు ప్రమాదం జరిగిన ఇంటిని, కాలిపోయిన పొగాకు, వస్తువులను పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన విధానాన్ని మండల విద్యుత్ శాఖ ఏఈ పీ గోపీ పరిశీలించారు. తనను పొగాకు బోర్డు ఆదుకోవాలని, ప్రభుత్వం తమ వంతు సాయం చేయాలని అధికారులకు శేషయ్య విన్నవించుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెంకుటిల్లు దగ్ధం 15 పొగాకు బేళ్లు, రూ.1.05 లక్షల నగదు, 5 సవర్ల బంగారం, 5 బస్తాల ధాన్యం బుగ్గిపాలు సుమారు రూ.20 లక్షల వరకు నష్టం -
పేకాట శిబిరంపై దాడి
● రూ.2 లక్షల పైగా నగదు, 12 మోటార్ సైకిళ్లు, 12 మొబైల్ ఫోన్లు స్వాదీనం ● 13 మంది అరెస్టు కొనకనమిట్ల: మండలంలోని నాగిరెడ్డిపల్లి సమీపంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పొదిలి సీఐ రాజేష్ సిబ్బందితో మఫ్టీలో వెళ్లి మెరుపు దాడి చేశారు. భారీ బెట్టింగ్‌లతో పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షలకు పైగా నగదు, 12 మొబైల్ ఫోన్లు, 12 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం 13 మందిని పొదిలి కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, పేకాట, జూదం, కోడిపందేలు, అసాంఘిక చర్యలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు సీఐ తెలిపారు. కాగా పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో కూటమి నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం● రూ.40 వేల నగదు, కమ్మలు, ఉంగరం అపహరణ పామూరు: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం పామూరు సీతారామునితోట 4వ లైన్ మొలకాపురి నారాయణ ఇంట్లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..పామూరు సీతారామునితోట 4వ లైన్లో స్థానిక 108 ఈఎంటీ నారాయణ కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. నారాయణ 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు 108 వాహనానికి నైట్‌డ్యూటీకి వెళ్లాడు. దీంతో భార్య మల్లీశ్వరి, పిల్లలు రాత్రి 10.30 గంటలకు పడుకునేందుకు వాళ్ల పుట్టింటికి వెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి వెళ్లి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళం తీసి ఉండగా అందులోని రూ.40 వేల నగదు, జత బంగారు కమ్మలు, బంగారు ఉంగరం చోరీకి గురయ్యాయి. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదుచేయనున్నట్లు నారాయణ తెలిపారు. ముండ్లమూరు: ట్రాన్స్ఫార్మర్ చోరీలు ఆగడం లేదు. ఓ పక్క పోలీసులు నిందితులను పట్టుకున్నామని ప్రకటిస్తుంటే మరో పక్క చోరీలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. మండలంలోని పసుపుగల్లులో ఆదివారం తెల్లవారుజామున దుండగులు రెండు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి అందులోని రాగితీగను అపహరించారు. గ్రామానికి దక్షిణం వైపు ఉన్న మారం నాగిరెడ్డి, సింగంరెడ్డి రమణారెడ్డిలకు చెందిన రెండు ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. రైతులు ఆదివారం ఉదయాన్నే పొలాలకు వెళ్లగా ట్రాన్స్ఫార్మర్లు కనిపించలేదు. అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూడగా రెండు ట్రాన్స్‌ఫారాలను ధ్వంసం చేసి కింద పడేసి అందులోని రాగి తీగను అపహరించారు. లైన్‌మన్ సోమ్లానాయక్ పరిశీలించి ఏఈ అంకబాబుకు తెలియజేశారు. ఎస్సై పి.కోటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు 14 ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. పోలీసులు గస్తు కాస్తున్నా దొంగతనాలు ఆగడం లేదు. పొదిలి రూరల్: టమోటా లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున కుంచేపల్లి సమీపంలో పాల కేంద్రంలో దగ్గర జరిగింది. వివరాల్లోకి వెళితే..గిద్దలూరు వైపు నుంచి పొదిలి మీదుగా టమోటా కాయలతో బొలెరో వాహనం అద్దంకి వైపు వెళ్తుంది. కుంచేపల్లి దగ్గరకు వచ్చే సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపు తప్పి పక్కన ఉన్న చింత చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనం ముందుభాగం పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు కాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదంలో వాహనం నడుపుతున్న కడప జిల్లాకు చెందిన డ్రైవర్ అర్షద్వలి వాహనంలో ఇరుక్కుపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటన చేరుకున్నారు. వాహనాన్ని పరిశీలించగా డ్రైవర్ లోపల ఇరుక్కున్న ఉండటంతో వెంటనే డోర్‌ను పగలగొట్టి తీయగా డ్రైవరు అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు టౌన్: ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఏళ్ల తరబడి సేవలు చేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ఈ నెల 31వ తేదీన కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు సీహెచ్ మంజుదార్ పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల కార్యాయంలో ఆదివారం ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా నాయకురాలు పరిశుద్ధం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంజుదార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. వేతనాల పెంపుతో పాటుగా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ధర్నాలో జిల్లాలోని ఆశా వర్కర్లంతా విధిగా పాల్గొనాలని కోరారు. తొలుత ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోటేశ్వరమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
బలహీనం!
అడవి తల్లి అడవితల్లి ఒడిలో ఉండే గిరిజన మహిళలు పౌష్టికాహారం అందక బలహీనపడుతున్నారు. తగినంత రక్తం లేక రక్తహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గర్భిణుల్లో రక్తహీనత అధికంగా కనపడుతోంది. కాన్పుల సమయంలో రక్తం తక్కువై ఇబ్బందులు పడుతున్న సందర్భాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం అందించే పౌష్టికాహారం కూడా సాంకేతిక కారణాలతో గర్భిణులకు అందడం లేదు. అడవిలో ఉండే ప్రాణాలు.. ఏమైనా అడిగేదెవరు..అన్నట్లు అధికారులెవరూ వారి ఊసే పట్టించుకోవడం లేదు. పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజనులను రక్తహీనత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా గర్భిణుల పాలిట ఇది పెనుశాపంగా మారుతోంది. కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నట్లు సర్కారు చెబుతున్నా పౌష్టికాహారం మాత్రం వారి దరికి చేరడం లేదు. గిరిజన గూడేల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి ఆస్పత్రులు నిర్మిస్తున్నా నాడి పట్టే వైద్యులు కరువయ్యారు. అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యం కోసం మైళ్ల కొద్దీ దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అరకొర వైద్య సదుపాయాలతో అల్లాడిపోతూ.. తీరా ఆస్పత్రులకు చేరేలోపే జరగరాని అనర్థాలు జరిగిపోతున్నాయి. దశాబ్దాలుగా గిరిజనులను పట్టిపీడిస్తున్న రక్తహీనత, మాతాశిశు మరణాలకు ముగింపు లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాలు తీస్తున్న రక్తహీనత, విషజ్వరాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న 82 గిరిజన గూడేల్లో ఏటా మలేరియా, అతిసారం, టైఫాయిడ్‌తో పాటు విషజ్వరాలు గిరిజనులను కాటేస్తూనే ఉన్నాయి. దీనికి తోడు అడుగడుగునా రక్తహీనత వారి ప్రాణాల మీదకు తెస్తోంది. గూడేల్లో చోటుచేసుకుంటున్న అధిక శాతం మాతాశిశు మరణాలకు ప్రధాన కారణం రక్తహీనతే కావడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం.. సగటు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే హిమోగ్లోబిన్ 11 శాతానికి తగ్గకూడదు. గర్భిణుల్లో ఇది 12 శాతం ఉండాలి. కానీ, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని చెంచుల్లో ఇది 9 శాతం కంటే తక్కువే ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. గర్భిణుల్లో అయితే మరీ దారుణంగా 8 నుంచి 6 శాతమే ఉంటోంది. చింతల గూడేనికి చెందిన కుడుముల మంతమ్మ అనే మహిళకు కేవలం 3 శాతం హిమోగ్లోబిన్ ఉండటంతో ఇటీవల వైద్యులు రక్తం ఎక్కించి కాన్పు చేయాల్సి వచ్చింది. అలాగే జల్లా గురవమ్మకు 8 శాతం, తుమ్మలబైలుకు చెందిన భూమని లింగేశ్వరికి 7.6 శాతం మాత్రమే రక్తం ఉన్నట్లు నిర్ధారణ కావడం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఆధార్ లింక్ లేక.. అందని పౌష్టికాహారం గిరిజన గర్భిణులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వాలు కోట్లు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు శూన్యంగా మారింది. ‘పోషణ్ ప్లస్’ పథకంలో భాగంగా యాప్‌లో పేరు నమోదైన గర్భిణులకు నెలకు 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అర లీటరు నూనె, 2 కిలోల మల్టీ గ్రెయిన్ ఆటా, కిలో రాగిపిండి, అరకిలో బెల్లం, అరకిలో ఖర్జూరాలు, అర కిలో చిక్కీలు, 5 లీటర్ల పాలు, 25 గుడ్లు పంపిణీ చేయాలి. కానీ ఆధార్‌కు ఫోన్ నంబర్ అనుసంధానం కాకపోవడంతో అంగన్వాడీల ద్వారా అందాల్సిన ఈ ఫలాలు చెంచులకు చేరడం లేదు. ఒక్క పెద్దదోర్నాల మండల పరిధిలోని పలు గిరిజన గూడేల్లో సుమారు 350 మందికి పైగా గిరిజన గర్భిణీలు ఉండగా, వారిలో సగం మందికి ఆధార్‌కు ఫోన్ నంబర్లు లింక్ కాలేదు. ఫలితంగా వారికి ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారం అందడం లేదు. గూడెం విడిచి బయటకు రాలేని అమాయక చెంచులకు ఆధార్ అనుసంధానంపై అధికారులు కనీస అవగాహన కల్పించడం లేదు. ఇప్పటికై నా అధికారులు కళ్లు తెరిచి, గిరిజన గర్భిణులను మండల కేంద్రాలకు తీసుకొచ్చి ఆధార్‌కు ఫోన్ నంబర్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలని, తద్వారా వారికి పౌష్టికాహారం, మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని గిరిజనులు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. -
నదీ గర్భాలను చెరబట్టారు
అద్దంకి: నదీ గర్భాలను ఇసుకాసురులు చెరబట్టారు. అధికార పార్టీ అండతో ఇసుకను దోచుకుంటూ నదులకు గర్భ శోకం కలిగిస్తున్నారు. రాత్రి సమయాల్లో, ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతాల్లోని నదులు, వాగుల వద్ద పొక్లెయినర్లతో ఇసుకను తవ్వి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు మండలాల పరిధిలో వాగులు, నదులు ఉన్నాయి. వాటి లో అద్దంకి, బల్లికురవ మండలాల పరిధిలోని గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. అద్దంకి మండలంలోని గోపాలపురం, తిమ్మాయపాలెం, రామాయపాలెం, వేలమూరిపాడు, బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం, సంతమాగులూరులోని గురిజేపల్లి సమీపంలోని వలేరు వాగుల్లో ఇసుకను ఇసుకాసులు పొక్లెయిన్లతో, ట్రక్కులతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ అండ.. పొక్లెయినర్‌తో ఇసుక తవ్వి తరలించే వారికి అధికార పార్టీ అండ ఉందని స్థానికులు చెబుతున్నారు. లేకుంటే ఇంత విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతాయనే విమర్శలు లేకపోలేదు. ఈ క్రమంలో అధికారులు సైతం మిన్నకున్నారనే ఆరోపణలున్నాయి. ఊట బావుల వద్ద ఇసుక తవ్వకాలు.. అద్దంకి, తిమ్మాయపాలెం, రామాయపాలెం తదితర గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన ఊటబావుల వద్ద సైతం ఇసుక ఎత్తుతుండడంతో ఊట బావుల్లో నీటి ఊట తగ్గిపోయి తాగునీటి ఇబ్బందులు ఏర్పడతాయని పలుసార్లు ప్రజలు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు చెప్పినా ఫలితం లేదు. దాంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఇసుక రీచ్ లేకుండా తవ్వకాలు.. వాల్టా చట్టం ప్రకారం ఇసుక నిల్వలు సరైన లోతులో లేని చోట ఇసుక రీచ్‌లు కేటాయించలేదు. అందులో అద్దంకి నియోజకవర్గంలోని గుండ్లకమ్మ నది, ఇతర మండలాల్లో వాగులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నదులు, వాగుల వద్ద ఇసుక తోడేయడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగుంటే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు పట్టించుకుని ఇసుకాసురుల ఆట కట్టించాలని స్థానికులు కోరుతున్నారు. -
భ్రమరా వెంచర్స్ వద్ద ఘర్షణ
మార్కాపురం: గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి మార్కాపురం పట్టణ శివార్లలో ఏర్పాటు చేసిన భ్రమరా వెంచర్స్ వద్ద ఆదివారం సాయంత్రం రైతులకు, వెంచర్స్ ప్రతినిధులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. భ్రమరా వెంచర్స్ ప్రతినిధులు తమను తమ పొలాల్లోకి పోనివ్వకుండా ఫెన్సింగ్‌తో పాటు ఇనుప గేట్లు పెడుతున్నారని సమాచారం రావడంతో పలువురు పొలాల రైతులు అక్కడికి వెళ్లారు. అదే సమయంలో అక్కడ గేట్ పెట్టేందుకు జరుగుతున్న సన్నాహాలు చూడటంతో రైతులు వెంచర్స్ ప్రతినిధులను ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. భ్రమర సంస్థ ప్రతినిధులు డయల్ 100కు కాల్ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రైతు ఇంతియాజ్‌తోపాటు మరికొందరు తాము గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చామని చెప్పగా.. పోలీసులు తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయంతో తనకు సంబంధం లేదని మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడాలని తహసీల్దార్ సమాధానమిచ్చినట్లు సమాచారం. గేటు ఉంచాలా.. తొలగించాలా అని తహసీల్దార్‌ను పోలీసులు అడగగా తొలగించాలని సూచించారు. దీంతో ఇరువర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు.. సోమవారం తహసీల్దార్‌ను కలిసి మరోమారు మాట్లాడుకోవాలని సూచించి వెళ్లారు. అయితే భ్రమర ప్రతినిధులు తమ ఎండీ ఆదేశాల మేరకు మధ్యాహ్నం సమయంలో గేట్ల వద్ద కాంక్రీట్ వర్క్ చేయిస్తుండగా ఇంతియాజ్ వర్గీయులు వెళ్లి అడ్డగించారు. గేట్లు తొలగించి పక్కన పడేయడంతో తీవ్ర ఘర్షణకు దారితీసింది. తమపై వెంచర్స్ ప్రతినిధులు దాడిచేశారని అంబటిపూడి కిరణ్, ఆనెకరి మల్లిఖార్జున తెలిపారు. తమను కాళ్లతో తొక్కి స్క్రూడ్రైవర్లతో, ఇతర మారణాయుధాలతో దాడులు చేశారని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెంచర్స్ నుంచి బయటపడ్డారని తెలిపారు. తాము చట్టప్రకారమే పోతున్నామని వెంచర్స్ ప్రతినిధులు అంటున్నారు. ఈ ఘర్షణలో అనీల్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. కిరణ్, మల్లిఖార్జున జీజీహెచ్‌కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. గాయపడిన వెంచర్స్ ప్రతినిధులు పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకుని బాధితుల స్టేట్మెంట్ కోసం జీజీహెచ్‌కు వెళ్లారు. ఇదిలా ఉండగా నాలుగు రోజుల క్రితం కూడా తమ పొలాలను ఆక్రమిస్తూ తమకే అమ్మాలని బెదిరిస్తున్నారని పలువురు దళితులు వెంచర్స్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం భ్రమరా వెంచర్స్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. నలుగురికి గాయాలు -
కాపుల అభ్యున్నతికి పాటుపడిన ముద్రగడ
ఒంగోలు వన్‌టౌన్: కాపుల కోసం తన రాజకీయ జీవితాన్ని తృణప్రాయంగా వదిలేసి, కాపుల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని కాపు నేతలు కొనియాడారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు రామ్‌నగర్‌లోని జిల్లా కాపు సంఘ కార్యాలయంలో ఆదివారం ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కాపు సంఘ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ కుమార్ మాట్లాడుతూ ముద్రగడ ఎంఎల్ఎగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారని..నీతి, నిజాయతీ అంటే ముద్రగడేనన్నారు. చిన్న మాట కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం, కాపుల ఐక్యత కోసం ముద్రగడ ఉద్యమం చేస్తేనే కాపు కార్పొరేషన్ ఏర్పాటైందన్నారు. ఈ కార్పొరేషన్ల ద్వారానే పేద కాపులు రుణాలు పొందారని చెప్పారు. కాపుల రిజర్వేషన్ల కోసం ఏన్నో రకాలుగా ప్రయత్నించారన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు ఐ ఘనశ్యామ్, టి రామస్వామి, వెంకటేశ్వర్లు, మంత్రి శ్రీనివాసరావు, ఎస్ సాయిబాబా పాల్గొన్నారు. -
పొగాకు రైతుల సత్తా చూపిస్తాం
ఒంగోలు టౌన్: గత 90 రోజులుగా రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నా పొగాకు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం, పొగాకు బోర్డు, కంపెనీలు తాత్సారం చేస్తుండటంతో విసిగివేసారిన రైతులు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 కల్లా పొగాకు కొనుగోలు చేయకపోతే 29న జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే ఆగస్టు 7వ తేదీ చలో అమరావతి కార్యక్రమం చేపడతామన్నారు. తద్వారా రైతుల సత్తా ఏంటో చూపుతామని తేల్చి చెప్పారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో ఆదివారం నిర్వహించిన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశానికి ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి అధ్యక్షత వహించగా, మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు పాల్గొని మాట్లాడారు. వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 28వ తేదీలోపు రూ.1000 కోట్లు కేటాయించకపోతే 29వ తేదీ జిల్లాలోని సింగరాయకొండ నుంచి మద్దిపాడు మండలంలోని గ్రోత్ సెంటర్ వరకు రాష్ట్ర, జాతీయ రహదారులను దిగ్బంధించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. పొగాకు అధికంగా పండించే ప్రాంతాల్లో రైతాంగాన్ని చైతన్యపరుస్తూ ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు బైకులతో చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. పొగాకు రైతులతో పాటుగా మొక్కజొన్న, శనగ రైతులతో రహదారులను దిగ్బంధిస్తామన్నారు. వర్జీనియా పొగాకు వలన దేశానికి కోట్లాది రూపాయల విదేశీ మాదక ద్రవ్యం వస్తుందని తెలిపారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు బోర్డును ఏర్పాటు చేసి పొగాకుకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు 1975 నాటికే చట్టం చేశాయని గుర్తు చేశారు. ఈ చట్టాన్ని తుంగలో తొక్కడం వలన పొగాకు సంక్షోభం వచ్చిందన్నారు. పొగాకు వ్యాపారులు ప్రీ వెరికేటర్లతో చేతులు కలిపి వంచనతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 7వ తేదీ చలో అమరావతి కార్యక్రమం చేపడతామని తేల్చి చెప్పారు. జుజ్జురి జయంతిబాబు, ఎస్.లలిత కుమారి, కోడూరి నాంచార్లు, కొండ్రగుట్ల సుబ్బారావు, పమిడి వెంకటరావు, పి.ప్రభాకర్, చెరుకూరి శ్రీనివాస్, పరిటాల కోటేశ్వరరావు, హనుమంతరావు, జి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయకుంటే జాతీయ రహదారులను దిగ్బంధిస్తాం ఈ నెల 23 నుంచి 26 వరకు బైకులతో పొగాకు రైతుల చైతన్య యాత్ర 29న జాతీయ, రాష్ట్రీయ రహదారుల దిగ్బంధం అప్పటికీ స్పందించకపోతే ఆగస్టు 7న చలో అమరావతి -
OÐðlsŒæ M>ÓÆŠḥtæjË*sîæ
తెల్ల రాయిపై పచ్చ గద్దలు ●పీసీపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పచ్చ నేతల కన్ను సహజ సంపదపై పడింది. కనిగిరి నియోజకవర్గంలో ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వైట్ క్వార్ట్జ్ (తెల్ల రాయి) నిక్షేపాలను అధికార టీడీపీ నేతలు బకాసురుల్లా దిగమింగుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అటవీ, రెవెన్యూ, బంజరు భూముల్లో నిబంధనలకు పాతరేసి, ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ కోట్లు గడిస్తున్నారు. ’అధికారం మాదే.. అడిగేదెవరు?’ అన్న చందంగా పచ్చ గద్దలు రెచ్చిపోతుంటే, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతూ చోద్యం చూస్తున్నారు. కనిగిరి ప్రాంతంలో లభించే గ్రేడ్1 తెల్ల రాయికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ టన్ను రాయి రూ.7 వేల నుంచి రూ. 8 వేల వరకు పలుకుతుండగా, విదేశాలకు ఎగుమతి చేస్తే అది ఏకంగా రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ధర పలుకుతోంది. ఈ భారీ లాభాలపై కన్నేసిన టీడీపీ నేతలు సిండికేట్‌గా ఏర్పడ్డారు. నెల్లూరు, గుంటూరు, విజయవాడ, గూడూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన అక్రమార్కులు కనిగిరిలో వాలిపోయారు. ఈ సిండికేట్ శాసనమే ఇక్కడ వేదంగా మారింది. స్థానికంగా ఎవరు తెల్ల రాయి తరలించాలన్నా టన్నుకు రూ.1500 చొప్పున సిండికేట్‌కు ‘కప్పం’ కట్టాల్సిందే. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని గూడూరుకు చెందిన ఓ వ్యక్తి ద్వారా జిల్లా స్థాయి అధికారులకు, రాజకీయ నేతలకు వాటాల రూపంలో చేరవేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు, మారిటైం బోర్డులో ముఖ్య పాత్ర పోషిస్తున్న నాయకుడే ఈ తతంగాన్నంతా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘దమ్ముంటే పట్టుకోండి.. పట్టుకున్నా విడిపించుకునే సత్తా మా సిండికేట్‌కు ఉంది’ అంటూ ఈ తెల్ల రాయి కేటుగాళ్లు బహిరంగంగానే సవాళ్లు విసురుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు రాయల్టీ రూపంలో చేరాల్సిన కోట్ల రూపాయల ఆదాయం పచ్చ నేతల జేబుల్లోకి వెళుతోంది. ఈ అక్రమ దందాకు మైనింగ్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పరోక్షంగా సహకారం అందిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ’తలా పాపం తిలా పిడికెడు’ అన్నట్లుగా అన్ని శాఖల అధికారులకు నెలవారీ మామూళ్లు ముడుతుండటంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రజలు, రైతులు అక్రమ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే, ఆ సమాచారాన్ని ముందుగానే మాఫియాకు చేరవేస్తున్నారు. తీరా నామమాత్రంగా తనిఖీలకు వెళ్లి, ఎందుకూ పనికిరాని రాయిని సీజ్ చేసినట్లు నాటకాలు ఆడుతూ పత్రికలకు ఫోజులిస్తున్నారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కనిగిరి నియోజకవర్గం ఇప్పుడు అక్రమ మైనింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కనిగిరి మండలంలోని చీరల దిన్నె, గురువాజీపేట, ఎర్ర ఓబనపల్లె, మాల కొండాపురం, సీఎస్ పురం మండలంలోని రెడ్డిగారి కొత్తపల్లి, హరి వేముల, వెలిగండ్ల మండలంలోని పద్మాపురం, మొగిలిచర్ల, కట్ట కింద పల్లి.. అలాగే హనుమంతునిపాడు, పామూరు, పీసీ పల్లి తదితర మండలాల్లోని పదుల సంఖ్యలో గ్రామాల్లో రాత్రికి రాత్రే భారీ జేసీబీలతో కొండలను సైతం పిండి చేస్తున్నారు. మినరల్స్ పేరుతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యార్డుల్లో ఈ ఖనిజాన్ని నిల్వ చేసి, కూలీలతో పగలగొట్టించి గ్రేడింగ్ చేస్తున్నారు. గోనె సంచుల్లో ప్యాక్ చేసి, ఒక్కో లారీలో 30 నుంచి 40 టన్నుల సరుకును ఎక్కించి, రాత్రికి రాత్రే లారీల్లో విశాఖపట్నానికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి సముద్ర మార్గంలో చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కొండలు సైతం పిండి.. మాఫియా మంత్రాంగం.. మౌనంగా అధికార యంత్రాంగం పచ్చ సిండికేట్‌కు కప్పం కట్టాల్సిందే.. -
వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు సిగ్గుచేటు
కందుకూరు: ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన రామాయపట్నం పోర్టును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ మరోపక్క పోర్టు పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్ అన్నారు. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి నియోజకవర్గ ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలతో పాటు మరికొందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పోర్టు నిర్మాణ పనులు గత ప్రభుత్వంలో ఎంతమేరకు పూర్తి చేశారు, ప్రస్తుత ప్రభుత్వం ఎంత శాతం పనులు పూర్తి చేశారు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు ప్రయత్నం చేశారు. అయితే పోర్టు సందర్శనకు అనుమతి లేదంటూ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులను అడ్డుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు నేతలను నిర్బంధించి ముందుకు కదలకుండా వందల మంది పోలీసులు అడుపడ్డారు. పోర్టు నిర్మాణంలో ప్రభుత్వ నిర్వాహకం ఎక్కడ బయటపడుతుందోనని ఉద్దేశంతో పోర్టు సందర్శనకు నేతలను అనుమతించకుడా జాగ్రత్త పడ్డారు. గత ప్రభుత్వంలో దాదాపు పనులు పూర్తి చేసి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా పోర్టును సిద్ధం చేశారు. కానీ రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోగా, ప్రస్తుతం రూ. 5వేల కోట్లు విలువ చేసే పోర్టును కేవలం రూ 1500కోట్లకు తన సొంత మనుషులకు కట్టబెట్టేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ రామాయపట్నం పోర్టు పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా వేల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో పాటు, పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, స్థానిక నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పోర్టు నిర్మాణం, నిర్వహణ ఉండాలని నినదించారు. ప్రైవేట్ వ్యక్తులకు పోర్టును ఇవ్వడం వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు మాత్రం పోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా ఎవర్ని అనుమతించకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు నమోదు కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి నియోజకవర్గ ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలతో పాటు మరికొందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పోర్టు వద్ద జరిగే ఆందోళన కార్యక్రమానికి అనుమతి కోరుతూ బుర్రా మధుసూదన్‌యాదవ్ పేరుతో పది రోజులు ముందుగానే పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్వయంగా తన ఈ–మెయిల్ ద్వారా పోర్టు సందర్శనకు అనుమతించాలంటూ పోర్టు సీఈఓకు మెయిల్ చేశారు. ఈ దరఖాస్తులపై ఎటువంటి సమాధానం ఇవ్వని పోలీసులు, శనివారం వైఎస్సార్ సీపీ చేపట్టిన ఆందోళనకు అనుమతి లేదంటూ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులపై కేసులు నమోదు చేయడం గమనార్హం. చేవూరు గ్రామ వీఆర్వో గల్లా వినోద్‌కుమార్ నుంచి ఫిర్యాదు తీసుకుని గుడ్లూరు పోలీస్ స్టేషన్లో క్రైం నంబర్ 72/2026, 126(2), 189(2), 221, 285ఆర్/డబ్ల్యూ, 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద పలువురు నేతలపై కేసులు నమోదు చేశారు. వీరిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కందుకూరు, కావలి నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు బుర్రా మధుసూదన్‌యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, గణేశం గంగిరెడ్డి, షేక్రఫి, కాపులూరి మధుసూదన్, బిల్లా రమణయ్య, చేపల బాలాజీ, అప్పబోయిన రాజేష్ తదితరులపై కేసులు నమోదు చేశారు. అక్రమ కేసులు దుర్మార్గం పోర్టు పరిరక్షణ కోసం చేసిన ఆందోళనలపై ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు అక్రమంగా కేసులు నమోదు చేయడంపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ చేతగానితనానికి అక్రమ కేసులు ఒక నిదర్శనమన్నారు. ఇటీవల కాలంలో పొగాకు రైతులకు అండగా పోరాటం చేస్తే రైతులపై అక్రమంగా కేసులు పెట్టడం, తాజాగా పోర్టు కోసం పోరాడితే కేసులు పెట్టడం చూస్తుంటే ప్రజా ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామే తప్ప కేసులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోర్టు ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ ఆద్వర్యంలోనే పోర్టు ఉండాలని డిమాండ్ చేశారు. రామాయపట్నం పోర్టు పరిరక్షణ కోసం పోరాడితే కేసులు పెడతారా ప్రభుత్వ చేతగానితనానికి ఇది నిదర్శనం వైఎస్సార్ సీపీ నేతలపై కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్ -
ప్రభుత్వ ఆదాయానికి గండి
ఈ అక్రమ రవాణా ద్వారా ప్రతిరోజూ కనిగిరి నియోజకవర్గం నుంచి 5 నుంచి 8 భారీ లారీలు (సుమారు 320 టన్నుల) గ్రేడ్1 తెల్ల రాయి నిత్యం దేశం దాటి విదేశాలకు తరలిపోతోంది. ఈ లెక్కన రోజూ లక్షల రూపాయల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులు లేవని, ఖజానా ఖాళీ అయిందని ఒకపక్క గగ్గోలు పెడుతుంటే, మరోపక్క ఆ పార్టీ నేతలే ఈ స్థాయిలో సహజ వనరులను దోచుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కనిగిరిలో రెచ్చిపోతున్న ఈ వైట్ క్వార్జ్ట్ మాఫియాపై ఉక్కుపాదం మోపకపోతే, రాబోయే తరాలకు మిగిలేది కేవలం రాళ్ల గుట్టలేనని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్యవైశ్యులపై పెరుగుతున్న దాడులు
ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 25 నెలల్లో వ్యాపారులు దెబ్బతిన్నారు..రౌడీయిజం పెరిగిపోయిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఒంగోలు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అధ్యక్షతన ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సమ్మేళనం నిర్వహించారు. అంతకు ముందు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైఎస్సార్ విగ్రహానికి, పొట్టి శ్రీరాములు, గాంధీజీ, వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఆర్యవైశ్యులపై దాడులు జరిగాయని, వ్యాపారులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులు ఎక్కువయ్యాని ఆయన ధ్వజమెత్తారు. ఆర్యవైశ్యులపై రౌడీషీట్లు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం చేసిన తప్పులు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తే అందరిపైనా కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే ఆర్యవైశ్యులకు మేలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్యవైశ్యులకు ఎంతో మేలు జరిగిందని వెల్లంపల్లి చెప్పారు. మొన్నటి వరకూ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులకు ఆర్యవైశ్య మహాసభ అండగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఇక్కడ సైతం అవినీతి రాజ్యమేలడం దురదృష్టకరమన్నారు. ఈ మహాసభలో పోస్టు కావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుల సిఫారసు కావాలి, అలాగే రూ.లక్షలు డిమాండ్ చేస్తుండడం దుర్మార్గమన్నారు. నేడు నిర్మితమవుతున్న ఆర్యవైశ్య మహాసభ భవనానికి రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు వ్యాపారులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్యవైశ్య మహాసభకు నామినేషన్ వేస్తే కేసు, ఈ ప్రభుత్వం కేసులు పెట్టడం తప్ప చేసిన మేలు ఏమీ లేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కాణిపాకం నుంచి అరసవిల్లి వరకూ ప్రతి దేవస్థానం కమిటీలో ఆర్యవైశ్యులకు స్థానం కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వంలో టీటీడీ, కనక దుర్గమ్మ, ద్వారకా తిరుమల పాలకమండలి కమిటీల్లో ఆర్యవైశ్యులకు స్థానం కల్పించలేదని ఆరోపించారు. ప్రముఖ దేవస్థానాల కమిటీ పాలకమండళ్లలో సభ్యులుగా ఆర్యవైశ్యులు పనికిరారా అని ఆయన ప్రశ్నించారు. తమను ఓటు బ్యాంకుగానే కూటమి చూడడం దారుణమన్నారు. అలాగే ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వకపోవడం సరికాదని, దీనిపై కూటమి ప్రభుత్వ పెద్దలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులపై దాడులు, అక్రమ కేసులు: ఇదే జిల్లా పొదిలికి చెందిన అవినాష్ అనే వ్యాపారస్తుడు లారీని రోడ్డుపై పెట్టాడని ఎస్ఐ చితకబాదాడు, అప్పుడు ఆ ఘటన వివాదాస్పదం కావడంతో మూడు రోజులు వీఆర్‌కు పంపి వెంటనే మార్కాపురంలో పోస్టింగ్ ఇవ్వడం దారుణమన్నారు. పొట్టిశ్రీరాములు ట్రస్ట్‌లో పనిచేస్తున్న వ్యక్తి ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఆర్యవైశ్యులను ప్రభుత్వం చులకన భావంతో చూస్తోందని ధ్వజమెత్తారు. దాడులు చేయడం, హింసించడం, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం చేస్తోందని విమర్శించారు. ఆర్యవైశ్యులు భయపడే రోజులు పోయాయన్నారు. కూటమి ప్రభుత్వం తీరుతో చాలా మంది వ్యాపారులు వ్యాపారాలు లేక అవస్థలు పడుతున్నారన్నారు. అసలే ఆర్థికంగా కష్టాలు పడుతున్న వారిపై వాణిజ్యపన్నుల శాఖ అధికారులు వేధింపులకు పాల్పడడం సరికాదన్నారు. ఈ ప్రభుత్వంలోని ఆర్యవైశ్య దద్దమ్మలు ఏం చేస్తున్నారని, ఇలా దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం.. కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులపై జరుగుతున్న దాడులను అధికార పార్టీలో ఉన్న ఆర్యవైశ్య పెద్దలు ఎందుకు స్పందించడం లేదని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నారాంబాబు ప్రశ్నించారు. ప్రస్తుతం ఆర్యవైశ్యుల్లో చైతన్యం వచ్చిందని, రానున్న రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఆర్యవైశ్య మహాసభ పార్టీలకతీతంగా నడవాలి.. కూటమి ప్రభుత్వ హయాంలో రెండేళ్లుగా ఆర్యవైశ్యులపై దాడులు పెరిగిపోయాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్ మండిపడ్డారు. కూటమి పార్టీలోని ఆర్యవైశ్య పెద్దల తీరుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అందుకు ఈ సభకు వచ్చిన అనూహ్య స్పందనే నిదర్శనమన్నారు. ఆర్యవైశ్య మహాసభలో పదవులు కావాలంటే టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసులు అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్య మహాసభ నడవాలని, లేని పక్షంలో వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్యవైశ్యులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని, వారికి అన్ని సమయాల్లో అండగా నిలుస్తానని వైఎస్సార్సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు హామీ ఇచ్చారు. అన్ని వర్గాలను మోసం చేసినట్టే కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులను మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు జాబు కావాలంటే బాబు రావాలని అన్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. చంద్రబాబు మాటలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా మోసపోయారో అదే విధంగా ఆర్యవైశ్యులు దగా పడ్డారని ఆర్టీఐ మాజీ కమిషనర్ రేపాల శ్రీనివాస్ ఆరోపించారు. ఆర్యవైశ్యులను చంద్రబాబు ఓటు బ్యాంకుగా చూస్తున్నారని విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య విమర్శించారు. తనపై ఎలాంటి నేరపూరిత కేసులు లేకపోయినా రౌడీషీట్ పెట్టారని ఆయన ఆరోపించారు. ఆర్యవైశ్యులపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు మిట్ట కరుణాకర్, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మోటామర్రి సదానందం, కోటప్పకొండ దేవస్థానం మాజీ బోర్డు మెంబరు దివ్వెల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఆర్యవైశ్యులు మాట్లాడుతున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ -
ఇరుకు దారిలో.. ప్రాణాలు అరచేతిలో..
సంతనూతలపాడు(చీమకుర్తి): ఆర్టీసీ బస్సు తిరగబడిన ఘటనలో గాయాలు మినహాయిస్తే ప్రయాణికులు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారని బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం ఉదయం 8.30 గంటల సమయలో కొండపి–సంతనూతలపాడు రూట్లో మద్దులూరు రొయ్యల ఫ్యాక్టరీ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రయాణికులు ఆర్తనాదాలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ బయట పడ్డారు. అనకర్లపూడి–మద్దులూరు మధ్య రోడ్డు ఇరుకుగా ఉండటం వలన ఎదురెదురు వాహనాలు ఒక దానికి ఒకటి దారి ఇచ్చే పరిస్థితి లేదు. కొండపి నుంచి సంతనూతలపాడు మీదుగా ఒంగోలు వచ్చే బస్సు మద్దులూరు వద్దకు రాగా.. అదే సమయంలో ఒంగోలు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుకు దారి ఇచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి నియోజకవర్గం కొండపికి రాకపోకలు సాగించే రోడ్డును కూడా కనీసం రెండు బస్సులు తిరిగేటంత వెడల్పు చేసుకోలేకపోవడం దారుణమని, ప్రభుత్వ విధానంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యే పరామర్శించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని రొటీన్ డైలాగ్‌లు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన 10 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సంతనూతలపాడు ఎంఈఓ ఎన్వీఎస్ కుమార్, చిలకపాడు హైస్కూలు హెచ్ఎం స్వప్నరాజు పరామర్శించారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమని నిర్ధారించిన సంతనూతలపాడు ఎస్సై అజయ్‌బాబు కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. కొండపి సీహెచ్‌సీకి క్షతగాత్రుల తరలింపు కొండపి: సంతనూతలపాడు మండలం పరిధిలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు ప్రయాణికులను కొండపి సీహెచ్‌సీకి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీహెచ్‌సీకి 36 మందిని తరలించగా వారిలో స్వల్పగాయాలైన 18 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేసి పంపగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన 15 మందిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేశారు. బస్సులో సుమారు 75 మంది వరకు ఉన్నారని, బస్సు అంతా నిండుగా ఉందని సీట్లు నిండిపోగా సుమారు 20 మందికి పైగా నిల్చుని ఉన్నారని ఓ ప్రయాణికుడు తెలిపారు. బస్సు కూడా నెమ్మదిగానే వెళుతుందని ఆ క్రమంలో మలుపు వద్దకు రాగానే హఠాత్తుగా ఎదురుగా మరో బస్సు వచ్చిందని, దానిని దాటే క్రమంలో బస్సు డ్రైవర్ నెమ్మదిగా బస్సును రోడ్డు మార్జిన్లోకి దించాడన్నారు. కానీ మార్జిన్లు సక్రమంగా లేకపోవటంతో బస్సు ఒక పక్కకు వాలి పోతుండటాన్ని గమనించామని, ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని తెలిపారు. చివరకు కొద్దిపాటి దెబ్బలతో బస్సులోంచి బయట పడగలిగామని వివరించారు. చిల్లచెట్లు బాగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ఈ సంఘటన జరిగిందని తెలిపారు. -
ప్రజలకు అండగా నిరంతర పోరాటం
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలపై నిరంతరం పోరాడుతుందని, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జగన్ 2.ఓ సూపర్ యాప్ వాల్ పోస్టర్లను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణంగా దేశ, రాష్ట్ర రాజకీయాలపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న పోరాటాలపై, నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలపై వీడియోలు, ఆడియోలు, ఫొటోలు ఈ యాప్‌లో డౌన్ లోడ్ చేయవచ్చని, తద్వారా విస్తృతంగా ప్రచారం చేసే అస్త్రంగా ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ప్రతి పక్షం అంటే ప్రజల పక్షం నిలిచేదని, అటు వంటి స్థానంలో ఉన్న తమ పార్టీ 25 సమస్యలపై కార్యక్రమాలను చేపట్టిందని, పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి అనేక సమస్యలను పరిష్కరించిందని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కకు నెట్టేసి దళారులకు నాయకత్వం వహిస్తోందని ఆయన విమర్శించారు. టీడీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడి భూ కబ్జాలు, అక్రమంగా రేషన్, ఇసుక, మట్టి దందా చేస్తున్నారని అన్నారు. ఇటువంటి అన్యాయాలు, అక్రమాలపై జగన్ 2.ఓలో పోస్ట్ చేయవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మండలాల పార్టీ అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు కందూరి కాశీవిశ్వనాథ్, వివిధ విభాగాల నాయకులు ఆళ్ల ఆంజనేయరెడ్డి, కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, సూరె వెంకట రమేష్, సయ్యద్ జబీవుల్లా, ఐ.వి.సుబ్బారావు, వై.వెంకటేశ్వరరెడ్డి, శేషం రంగబాబు, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సంతోష్ కుమార్, ఎల్.రాములు, గార్లపాటి శార, పి.రాములు నాయక్, ఆర్.అరుబాయి, పల్లె సరళ, వాడాల పద్మ, షేక్ కాశింపీరా, షేక్.ఫయాజ్, జి.కృష్ణారావు, కాకుమాను సురేష్, కొండయ్య, నాగయ్య, మురారి గాలయ్య, కందూరి గురుప్రసాద్, ఎం.రాజశేఖర్, సురేష్ నాయక్, తిరుమలరెడ్డి చిన్న వీరారెడ్డి, వెంకట నారాయణ, గూడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచకాలపై ప్రశ్నిస్తున్న జగనన్న -
ఉద్రిక్తంగా హైవే దిగ్బంధనం.. పలువురిపై కేసులు
బుర్రా మధుసూదన్ యాదవ్‌ను బలవంతంగా లాక్కెళుతున్న పోలీసులు పోలీసుల తీరును నిరసిస్తూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, బుర్రా మధుసూదన్‌యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి కోల్కత్తా–చైన్నె జాతీయ రహదారిపై బైఠాయించారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మరోసారి రంగ ప్రవేశం చేసిన పోలీసులు నాయకులను బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాకాణిని, బుర్రాలను పోలీసులు బలవంతంగా పక్కకి లాగిపడేశారు. అదేవిధంగా బుర్రాను లాక్కెళ్లే ప్రయత్నంలో పెద్ద ఎత్తున తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే రోడ్డుపై బైఠాయించిన మహిళా నేతలను లేడీ పోలీసులు పక్కకి లాగేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేసినందుకు వైఎస్సార్సీపీ నేతలపై గుడ్లూరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, బుర్రా మధుసూదన్‌యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలతో పాటు కందుకూరు నాయకులు గణేశం గంగిరెడ్డి, షేక్ రఫి, బిళ్లా రమణయ్య, కాపులూరి మధుసూదన్‌యాదవ్, చేపల బాలాజీ, కాట్రగడ్డ వెంకట్రావ్, కావలి నియోజకవర్గానికి చెందిన కామరాజు తదితరులపై కేసు నమోదు చేశారు. -
గాలిలో భవనం..!
● నేలమట్టంలో ఉన్న భవనాన్ని పైకిలేపి ఎత్తు పెంచుతున్న ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థ చీమకుర్తి: ఎప్పుడో తాతలు, తండ్రుల కాలంలో కట్టిన ఇళ్లు కాలక్రమంలో నేలమట్టంలో ఉంటుంటాయి. దీని వలన వర్షం నీరు లోనికి చేరడం వంటి సమస్యతో పాటు వాస్తుపరంగా కూడా సమస్యగా భావిస్తుంటారు. చీమకుర్తికి చెందిన గోవిందరెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పల్లంలో ఉన్న తన ఇంటి ఎత్తు పెంచేందుకు హైదరాబాద్‌కు చెందిన ట్రయాంగిల్ హౌస్ లిఫ్టింగ్ సంస్థ సివిల్ ఇంజినీర్ నాగేంద్రబాబును సంప్రదించారు. వారు కొద్ది రోజుల క్రితం పని ప్రారంభించారు. హైడ్రాలిక్ జాకీలతో ఆ ఇంటిని దాదాపు 5 అడుగులు పైకి లేపారు. పాత పునాది స్థానంలో కొత్త పునాది కూడా నిర్మిస్తున్నారు. తన సంస్థ ద్వారా ఇప్పటికే మొత్తం 300 భవనాలకుపైగా పైకిలేపినట్లు నాగేంద్రబాబు తెలిపారు. సంతమాగులూరు (అద్దంకి): వివాహేతర సంబంధం నేపథ్యంలో సంతమాగులూరు మండలంలోని పాతమాగులూరు గ్రామంలో ఈ నెల 16వ తేదీ జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శేషగిరిరావు ఆ వివరాలు వెల్లడించారు. పాతమాగులూరు గ్రామానికి చెందిన హతుడు సజ్జల పిచ్చిరెడ్డి నాలుగు సంవత్సరాలుగా నిందితుడు చల్లా విష్ణువర్దన్ తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనిపై పిచ్చిరెడ్డిని, తన తల్లిని అనేకసార్లు విష్ణువర్దన్ మందలించాడు. గతంలో రెండుసార్లు పిచ్చిరెడ్డితో గొడవపడ్డాడు. ఈ నెల 16వ తేదీ 4 గంటల సమయంలో సూళ్లూరుపేట నుంచి వచ్చి ఇంటికివెళ్లిన విష్ణువర్దన్.. తన తల్లితో కలిసి ఉన్న పిచ్చిరెడ్డి పై ఆగ్రహంతో దాడి చేశాడు. ప్రాణభయంతో పారిపోతున్న పిచ్చిరెడ్డిని పాతమాగులూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న రామాంజనేయ సెల్‌షాప్ వరకు వెంబడించి మరీ అక్కడున్న ఇటుక రాయితో నుదుటిపై విచక్షణారహితంగా కొట్టాడు. తీవ్రగాయాలపాలైన పిచ్చిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం అడ్డరోడ్డు ప్రాంతంలో విష్టువర్దన్ను అరెస్టు చేశారు. అతన్ని అద్దంకి కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యమమై కదిలి.. ఉవ్వెత్తున రగిలి!
రామాయపట్నం పోర్టు సందర్శన భగ్నానికి అడుగడుగునా కుట్ర కందుకూరు: రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్‌యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, స్థానిక రైతులు చేపట్టిన భారీ ఆందోళనను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పక్కా ప్రణాళిక అమలు చేసింది. పోలీసులను అడ్డుపెట్టుకుని పోర్టు పరిసర ప్రాంతాలకు కూడా ఎవరూ వెళ్లకుండా ముందస్తు కుట్రకు తెరతీసింది. దీనిలో భాగంగానే శనివారం పోర్టువైపు వెళ్లిన వైఎస్సార్ సీపీ శ్రేణులను, స్థానిక రైతులు, యువతను అడ్డుకున్నారు. దీని కోసం వందల సంఖ్యలో పోలీసులను మొహరింప చేశారు. డీఎస్పీలు, సీఐలు, పదుల సంఖ్యలో ఎస్సైలు, వందల మంది కానిస్టేబుళ్లను పోర్టు పరిసర ప్రాంతాల్లో మొహరించి అడ్డుకున్నారు. పైగా పోర్టు నిషిద్ధ ప్రాంతం అన్న తరహాలో దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్లకుండా భారీ అడ్డంకులు ఏర్పాటు చేశారు. దీని కోసం 16వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న చేవూరు నుంచి పోర్టులోకి వెళ్లే రహదారిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోర్టుకు కిలోమీటరు దూరంలోనే రోడ్డుకు అడ్డంగా ఇనుప రేకులతో భారీ అడ్డుగోడ కట్టి, పోర్టు పనులకు వినియోగించే భారీ టిప్పర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. దీనిని చూస్తుంటే ప్రభుత్వం ఏవిధంగా భయపడుతుందో అర్థమవుతుందని, పోర్టు నిర్మాణం సక్రమంగా జరిగితే ఎందుకు ప్రభుత్వం అడ్డుకుంటోందని నిలదీశారు. సందర్శనకు అనుమతి లేదని పోర్టు అధికారులు లెటర్ ఇచ్చారని, వారి ఆదేశాల మేరకు ఎవర్నీ అనుమతించడం లేదంటూ పోలీసులు చెప్పడం గమనార్హం. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా.. పోర్టు ప్రైవేటీకరణ నేపథ్యంలో పోర్టు వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ బుర్రా మధుసూదన్ యాదవ్ పేరుతో పోలీసులకు పది రోజుల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా తన సొంత మెయిల్ ద్వారా పోర్టు సీఈఓకి మెయిల్ చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు అడ్డుకున్న సందర్భంలో కాకాణి బహిర్గతం చేశారు. అయినా సరే ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా పోర్టు అధికారులు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేశారు. అలాగే పోర్టు అధికారులకు చేసిన విన్నపానికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. ముందుగా ప్రకటించినట్టుగా ఆందోళనకు దిగారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసులను సహకారంతో కుట్రపన్నిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే పోర్టుకు భూములిచ్చిన రైతులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. తాము ప్రభుత్వ ఆధ్వర్యంలో పోర్టు నిర్మిస్తామంటే భూములు ఇచ్చాం తప్పా, ప్రైవేట్ వ్యక్తులకు కాదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టును ప్రైవేటీకరించడం వల్ల తమ లక్ష్యంగా నీరుగారిపోతుందని, తమ పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. జీవనోపాధి కోల్పోయిన మత్య్సకారులకు ఇస్తామన్న భృతిని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టును ప్రైవేట్‌పరం చేస్తే ఊరుకునేది లేదంటూ, ప్రాణాలైనా అర్పించి పోర్టును కాపాడుకుంటామంటూ నినదించారు. నిరసన ర్యాలీ సందర్భంగా పోలీస్ బందోబస్తు మహిళా నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు రామాయపట్నం పోర్టును కాపాడాలని వైఎస్సార్ సీపీ పిలుపునిస్తే.. ఆందోళనను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. పోర్టు దారులన్నింటినీ దిగ్బంధించి, శాంతియుత నిరసనను భగ్నం చేసేందుకు అడుగడునా కుట్రలు పన్నింది. దాదాపు ఐదుగంటల పాటు సహనంగా ఉన్న పార్టీ నాయకులు, రైతులు, యువకులు ఆగ్రహంతో జాతీయ రహదారిపై బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యేలను సైతం లాగిపడేసి అరెస్టు చేయడమే కాకుండా కేసులు పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. -
ప్రజల ఆస్తులను దోచుకోవడమే అభివృద్ధా..
కందుకూరు: ఒకపక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ నిత్యం ప్రజలను మభ్యపెడుతూ మరోపక్క ప్రజల ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పనిచేస్తున్నారని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రామాయపట్నం పోర్టు ముట్టడి సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. పోర్టు నిర్మాణంలో 95 శాతం పనులు పూర్తయి కేవలం 5 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ఈ దశలో రూ.5 వేల కోట్లు విలువైన పోర్టుని రూ.1500 కోట్లకు కారుచౌకగా కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. దీని వల్ల పోర్టు కోసం భూములిచ్చిన రైతులు, మత్య్సకారుల ప్రయోజనాలు ఏం కావాలని ప్రశ్నించారు. స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయన్నారు. పోర్టు నిర్మాణంతో జీవనోపాధి కోల్పోయిన మత్య్సకారులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం నెలకు రూ.3 వేల భృతిని మత్య్సకారులకు ప్రకటించింది. జగన్ ప్రభుత్వంలో పక్కాగా అందిన భృతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు ఇవ్వడం లేదని కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిలదీశారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్న చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ని బంగాళాఖాతంలో కలి పేందుకు ప్రజలు అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ గిఫ్ట్ రామాయపట్నం పోర్టు: బుర్రా కందుకూరు ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ రామాయపట్నం పోర్టు అని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. అటువంటి పోర్టును చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పోర్టులో జరిగే అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వస్తే పోలీసులు అడ్డుకున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఆందోళనను అడ్డుకునేందుకు మూడు రోజుల నుంచి పోలీసులు వేధిస్తున్నారని చెప్పారు. పోలీసులు ప్రజల మనోభావాలను, ఆస్తులను కాపాడేలే కాని చంద్రబాబు కోసం పనిచేయడం తగదన్నారు. పేదల పొట్టకొట్టేలా నిర్ణయాలు తీసుకుంటూ కేసులు పెడతామంటూ రైతులు, యువతను బెదిరిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను కొనుగోలు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటీకరణ నిలిపి వేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పోర్టు నిర్మాణం పూర్తి చేసి నిర్వహించాలని, లేదంటే భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. తీర ప్రాంత అభివృద్దే లక్ష్యం: రామిరెడ్డి రామాయపట్నం పోర్టు, జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ద్వారా తీర ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం జగన్మోహన్రెడ్డి కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే, కావలి నియోజకవర్గ ఇన్చార్జ్ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగానే నాలుగు పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్లు చేపట్టారన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం సరైన విధానం కాదని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. -
‘రెడ్‌బుక్’ రాజ్యాంగంతో చంద్రబాబు అరాచకం
మార్కాపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ‘రెడ్‌బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. సివిల్ వివాదంలో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అడ్డగోలుగా హత్యాయత్నం కేసులు బనాయించడం అత్యంత దుర్మార్గమన్నారు. మార్కాపురం జిల్లా పెద్దారవీడు పోలీసుల అక్రమ కేసుల కారణంగా అరెస్టయి, మార్కాపురం జిల్లా కోర్టుకు గురువారం రాత్రి హాజరైన బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దారవీడు మండలం తోకపల్లి పంచాయతీ హనుమాన్ జంక్షన్ కుంట వద్ద 25 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన 71 సెంట్ల స్థలంలో వైఎస్సార్సీపీ నేతలు దుద్దేల వెంకటరెడ్డి, భవనం వెంకటరెడ్డి తదితరులు గదులు నిర్మించారని పేర్కొన్నారు. ఇటీవల ఈ స్థలంపై దుగ్గెంపూడి పిచ్చిరెడ్డి అల్లుళ్లు ఉద్దేశపూర్వకంగా వివాదం సృష్టించారని, కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా ఖాతరు చేయకుండా ప్రత్యర్థులు నిర్మాణాలు చేపడుతుంటే అడ్డుకోని పోలీసులు.. తమ సొంత స్థలంలోకి వెళ్లిన వెంకటరెడ్డి సహా 9 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఏకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. ‘డ్రోన్ కెమెరాల విజువల్స్ చూసి హత్యాయత్నం కేసులు ఎలా పెడతారు? రెడ్‌బుక్ అమలు అంటే రక్తాన్ని పారించడమా? సివిల్ పంచాయతీలను పరిష్కరించేందుకు కోర్టులున్నాయి. కానీ లా అండ్ ఆర్డర్‌ను అధికార పార్టీ నాయకులు తమ సొంత అవసరాలకు వాడుకుంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడుంది?’ అని ఎమ్మెల్యే చంద్రశేఖర్ పోలీసులను నిలదీశారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఒక ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడం వారి దమననీతికి నిదర్శనమన్నారు. ఈ వ్యవహారంలో ఎస్పీ తక్షణమే జోక్యం చేసుకుని అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని, తప్పుడు కేసులు బనాయించిన అధికారులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్యాయంగా ప్రవర్తించిన అధికారులను న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్దారవీడు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. సొంత స్థలంలోకి వెళ్తే వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నం కేసులా? పోలీసుల తీరుపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం అక్రమ కేసులపై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిక -
పోర్టు ప్రైవేటీకరణను నిలిపేయాలి
కందుకూరు: రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరరించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022లో వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.4,929 కోట్ల ఖర్చుతో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టి దాదాపు పోర్టు పనులు పూర్తి చేశారన్నారు. పోర్టులో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారని, దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాదాపు ఏడాది పాటు పోర్టు పనులను మూలనపడేసిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తి చేసి పోర్టును ప్రారంభించలేకపోయారని ఆరోపించారు రూ.5 వేల కోట్లు విలువ చేసే పోర్టును కేవలం రూ.1500 కోట్లకు కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఏపీ మారిటైం బోర్డు బిడ్లు పిలవడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా 50 ఏళ్ల దీర్ఘకాలానికి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తోందని, పోర్టు నిర్మాణానికి తీసుకున్న రూ.2079 కోట్లను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉందన్నారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు. రూ.1కే లీజు: ప్రైవేట్‌పరం చేసేందుకు జారీ చేసిన టెండర్లలో పెట్టిన నిబంధనలు దారుణంగా ఉన్నాయని, రెండో దశలో పోర్టు అభివృద్ధికి కేవలం రూ.1కే లీజు అప్పగించడం, పోర్టులో ప్రభుత్వ ఈక్విడిటీ కేవలం 12 శాతం మాత్రమే ఉండడం దారుణమని బుర్రా మండిపడ్డారు. ఇప్పటికే బీపీసీఎల్ కంపెనీ పోర్టులో ఒక బెర్తును రిజర్వ్ చేసుకుందని, మరోపక్క పోర్టు పక్కనే ఇండోసోల్ పరిశ్రమ భారీ సోలార్ ప్యానల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి కీలకమైన పోర్టు పరిధిని తగ్గించి, విస్తరణ, నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వెనుక ఎంత దారుణమైన కుట్ర దాగి ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే గారు.. ప్రజలకు వాస్తవాలు చెప్పండి రామాయపట్నం పోర్టు విషయంలో వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలను వల్లె వేస్తూ నియోజకవర్గ ప్రజలను వంచించే ప్రయత్నం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేస్తున్నారని బుర్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ మోడల్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం అన్న రీతిలో మాట్లాడుతున్నారని, పీపీపీ పేరుతో ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం సరైనదా అని ప్రశ్నించారు. ఒకపక్క నియోజకవర్గ అభివృద్ధికి కీలకమైన పోర్టును ప్రైవేట్‌పరం చేస్తుంటే ఎమ్మెల్యే తాడేపల్లిలో ప్రెస్‌మీట్ పెట్టి ప్రైవేట్‌కరణను స్వాగతించడం సిగ్గుచేటన్నారు. దీని వల్ల పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలతో పాటు, నిరుద్యోగ యువత ఆశలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టును ప్రైవేట్‌పరం చేయడం వల్ల స్థానిక నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇప్పటికై నా నిజాలు తెలుసుకుని ప్రజల పక్షాన నిలబడేందుకు కృషి చేయాలని హితవు పలికారు. పోర్టు ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపడుతున్నామని, ప్రజలు, యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫి, జిల్లా సెక్రటరీ తోకల కొండయ్య, రాష్ట్ర బూత్ జాయింట్ సెక్రటరీ గణేశం గంగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిశోర్, జిల్లా ఇంటెలెక్చువల్ పోరం అధ్యక్షుడు రావులకొల్లు బ్రహ్మానందం, వలేటివారిపాలెం, ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం మండలాల అధ్యక్షులు అనుమోలు లక్ష్మీనరశింహం, నన్నం పోతురాజు, కాపులూరి క్రిష్ణ, నోటి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు నలమోతు చంద్రమౌళి, బద్దిపూడి జయరావు, వెలిచర్ల దనకోటేశ్వరరావు, పాలవల్లి అమర్నాధ్రెడ్డి, గేరా మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణలంక ఖాకీల్లా వ్యవహరించొద్దు
సింగరాయకొండ: లాకప్ డెత్‌లతో రాష్ట్రస్థాయిలో వివాదాస్పదంగా మారిన కృష్ణలంక పోలీసుల్లాగా వ్యవహరించవద్దని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు న్యాయం చేయాలని సింగరాయకొండ ఎస్సై ఎల్.సుధీర్‌కుమార్‌ను మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. మసీదు నిర్మాణ వివాదంలో వైఎస్సార్ సీపీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్‌పై అక్రమంగా కేసు నమోదు చేసి, స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన.. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సైను నిలదీశారు. ప్రజాస్వామ్యంలో పోలీసుల తీరు పక్షపాతంగా ఉండకూడదన్నారు. ‘వైఎస్సార్సీపీ వాళ్లు స్టేషన్‌కు రావద్దు.. కేవలం టీడీపీ వారికే న్యాయం చేస్తాం’ అని చెప్పడం దారుణమని, అలాంటప్పుడు పీఎస్ ముందు బోర్డు పెట్టుకోవాలని మండిపడ్డారు. ఒక సివిల్ వివాదానికి సంబంధించి క్రిమినల్ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. స్టేషన్‌కు వచ్చేవారి పట్ల అసభ్య పదజాలం వాడటం మానుకోవాలన్నారు. తాను అంత సులువుగా స్టేషన్ వరకు రానని, మళ్లీ రప్పించే ప్రయత్నం చేయవద్దన్నారు. అక్రమ కేసు నమోదుపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. కుట్రపూరితంగానే కేసు: సుల్తాన్ ఈ ఘటనపై షేక్ సుల్తాన్ మాట్లాడుతూ.. పకీరుపాలెంలో మసీదు నిర్మాణం కోసం 2023లో సాజిద్ అనే వ్యక్తి 4 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చాడన్నారు. తాను కార్యదర్శిగా ఉన్న కమిటీ ఆధ్వర్యంలో బేస్మెంట్, పిల్లర్లు నిర్మించగా.. ఆ తర్వాత నిధుల లేమితో పనులు ఆగడంతో కమిటీ అధ్యక్షుడు దాదా.. శ్లాబ్ వరకు పూర్తి చేశాడన్నారు. అయితే మినార్ల నిర్మాణ విషయంలో ఇరువురి మధ్య తలెత్తిన చిన్న వాగ్వాదాన్ని సాకుగా చూపి దాదా.. తనపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని చెప్పారు. అంతేకాకుండా, దాత ఇచ్చిన స్థలంలో శ్లాబు వరకు నిర్మాణం జరిగినా.. అసలు ఎలాంటి కట్టడాలు జరగలేదని సాకు చూపి స్థల రిజిస్ట్రేషన్‌ను కుట్రపూరితంగా రద్దు చేయించారని సుల్తాన్ ఆరోపించారు. అనంతరం దాదాపై కేసు నమోదు చేయాలని కోరుతూ సుల్తాన్ వర్గీయులు, ముస్లింలు ఎస్సైకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కేసును నిరసిస్తూ మాజీ మంత్రి డాక్టర్ సురేష్‌తో పాటు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు స్టేషన్‌కు తరలివచ్చారు. ఎస్సైకి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరిక పార్టీలకతీతంగా న్యాయం చేయాలని హితవు -
దీక్ష బూని!
రైతుల పక్షానఒంగోలు టౌన్/ఒంగోలు సిటీ: వేలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా పొగాకు రైతులను ఆదుకోలేక చంద్రబాబు ప్రభుత్వం తన అసమర్ధతను నిరూపించుకుందని వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర రెడ్డి విమర్శించారు. పొగాకు రైతుల దీక్షలకు పోలీసులు అనుమతివ్వలేదని, కానీ ప్రజలు, పొగాకు రైతుల అనుమతి ఉందన్నారు. నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఏం చేసుకుంటావో చేసుకోమని భారీ ఎత్తున పొగాకు రైతులు నేరుగా కలెక్టరేట్ వద్దకు వచ్చి దీక్షలో పాల్గొన్నారని, ఇది రైతుల ఆగ్రహానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సోమవారం వస్తే చాలు కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాలు ప్రజలు, రైతుల నిరసనలతో దద్దరిల్లి పోతున్నాయని తెలిపారు. ప్రభుత్వ అసమర్ధ పాలనపై ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు వివిధ రీతుల్లో ఉద్యమాలు చేస్తున్నారని, ప్రభుత్వం మీద వ్యతిరేకతతో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో పొగాకు రైతులు, గ్రామీణ ప్రజలు ఓటు ద్వారా కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని, తమ పార్టీ కార్యకర్తలు, నాయకులను వేధించిన ఉద్యోగులను రిటైర్డ్ అయినా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి కేసులు పెడతామని హెచ్చరించారు. రైతులను మోసం చేసిన చంద్రబాబు: కాకాణి రాష్ట్రంలోని రైతులకు యూరియా ఇప్పించలేని ముఖ్యమంత్రి చంద్రబాబు అనతికాలంలోనే 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన ఘనుడని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి విరుచుకు పడ్డారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత 45 నెలల పాటు కనిపించకుండా పోయిన చంద్రబాబు ఆఖరి నిమిషంలో బయటకు వచ్చాడని, కానీ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వెంటనే ప్రజల మధ్యకు వచ్చి పోరాడుతున్నారని కితాబిచ్చారు. రైతులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. మట్టి, ఇసుక, మెగా డీఎస్సీని దగా డీఎస్సీ మార్చడం వంటి దోపిడీ పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. 99 పైసలకే ఎకరం భూములిస్తున్న కూటమి ప్రభుత్వం లో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న లోకేష్ అవసరమైతే ఊరికే ఇస్తానంటున్నాడని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుందని ఎద్దేవా చేశారు. జగనన్న పాలనలో ప్రజలకు ఉపయోగపడేలా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, విద్యా సంస్థలను నిర్మిస్తే జగనన్న సృష్టించిన ఆస్తులను చంద్రబాబు దోచుకుంటున్నాడని, రామాయపట్నం పోర్టు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో సిండికేట్ పాలన: తాటిపర్తి చంద్రశేఖర్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నడవడంలేదని, సిండికేట్ల పాలన నడుస్తోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విరుచుకుపడ్డారు. వాళ్లే వ్యాపారాలు చేస్తున్నారని, వాళ్లే లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధరల కోసం రోడ్డెక్కాల్సి రావడం బాధాకరమన్నారు. అండగా నిలబడాల్సిన ప్రభుత్వమే దళారి అవతారమెత్తి ప్రజల్ని లూఠీ చేస్తోందని మండిపడ్డారు. డీఆర్సీ మీటింగులో మాట్లాడడానికి లేచిన వెంటనే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కెమెరాలను ఆపించి మీడియాను బయటకు పంపించారని ఆరోపించారు. చేసేది తప్పుడు పనులు కనుక తామెక్కడ ప్రశ్నిస్తామోనన్న భయంతో మీడియాను బయటకు పంపించారని తెలిపారు. పరిపాలన చేతకాక పోలీసులను ప్రయోగిస్తున్నారని, బూడిద పార్టీ ప్రభుత్వంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. చంద్రబాబుకు రైతులను ఆదుకోవాలన్న ఆలోచనలేదు: ఆదిమూలపు చంద్రబాబుకు పొగాకు రైతులను ఆదుకోవాలన్న ఆలోచనలేదని, ఆయన హృదయం పాషాణమని మాజీ మంత్రి, కొండపి ఇన్చార్జి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. రైతుల సంక్షేమమన్నా, ప్రజా సంక్షేమ పథకాలన్నా చంద్రబాబు వ్యతిరేకిస్తారని మండిపడ్డారు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేస్తే రైతులు ఇబ్బందుల నుంచి బయటపడతారని తెలిపారు. పొగాకు రైతుల కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. కంపెనీలకు అమ్ముడుపోయిన చంద్రబాబు: మేరుగు నాగార్జున చంద్రబాబు ప్రభుత్వం కంపెనీలకు అమ్ముడుపోయి పొగాకు రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి, సంతనూతలపాడు ఇన్చార్జి మేరుగు నాగార్జున విమర్శించారు. పొగాకును అమ్ముకోవడానికి రైతులు రోడ్డెక్కి పోరాటాలు చేస్తుంటే జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ దాచుకున్నారని ప్రశ్నించారు. జగన్ పాలనలో క్వింటా పొగాకు రూ.36 వేలు ఉంటే నేడు చంద్రబాబు పాలనలో రూ.16 వేలకు పడిపోయిందన్నారు. పొగాకు రైతుల గురించి మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలను దొంగలంటూ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే చర్చకు ముందుకు రావాలని సవాల్ విసిరారు. పొగాకు రైతుల గురించి మాట్లాడితే దొంగలంటారా: చుండూరి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల గురించి దీక్షలు చేస్తుంటే ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ దొంగమాటలు మాట్లాడుతున్నారని ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ఖండించారు. పొగాకు రైతులు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడటానికి ఎమ్మెల్యేలు వెళితే చంద్రబాబు సొరుగులోంచి పుస్తకాలు తీసి వారి చరిత్ర చెబుతున్నారని, చంద్రబాబు జనాల్నే కాదు సొంతపార్టీ ఎమ్మెల్యేలనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడితే దొంగలంటున్నారని, ఎవరు దొంగలో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఆర్బీకేలతో రైతులకు మేలు చేసిన జగన్ : నాగార్జున రెడ్డి రైతును రాజును చేయాలని మహానేత రాజశేఖర్ రెడ్డి కలలుకన్నారని, ఆయన ఆశయాల మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్బీకేలు తీసుకొచ్చారని గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి కె.నాగార్జున రెడ్డి తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను కనీసం మనిషిగా కూడా చూడడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు. పొగాకు రైతులను పట్టించుకోని పాలకులు: దద్దాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవని కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు. 2025లో బ్యారన్‌కు 37 క్వింటాళ్లకు అనుమతిచ్చిన ప్రభుత్వం రూ.16 వేలకు మించి కొనుగోలు చేయడం లేదన్నారు. రైతుల వద్ద పొలం లేకుండా చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పొగాకు బోర్డుకు బాధ్యత లేదా: బత్తుల పొగాకు రైతుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన పొగాకు బోర్డు ఏం చేస్తోందని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. రైతుల నుంచి వందలాది కోట్ల రూపాయలు సెస్ చేయడమేనా బోర్డుపని అని నిలదీశారు. కేంద్రానికి కోట్లాది రూపాయల విదేశీమారక ద్రవ్యం తీసుకొస్తున్న పొగాకు రైతుల పట్ల నిర్లక్ష్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పనికిరాదని హితవు పలికారు. ఈ నిరసన దీక్షలో రైతు నాయకులు రాయపాటి అంకయ్య, బొడ్డు కోటేశ్వరరావు, విజయ భాస్కర్‌రెడ్డి, చింతపల్లి హరి, సుల్తాన్, బి.కోటేశ్వరరావు, ఇంద్రసేనా రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ దీక్షలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణా రెడ్డి, వై.వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకరరావు, లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ప్రసాద్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవ ప్రసాద్, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బంగారు బాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, కొత్తపట్నం మండలాధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు పార్టీ మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, సంతనూతలపాడు పార్టీ మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహగౌడ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రా రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, వైఎస్సార్ సీపీ నాయకులు సీఎం వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరక్టర్ గోనుగుంట్ల రజనీ, గాయం సావిత్రి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ, కిరీటి, దాసరి కరుణాకర్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్, రాష్ట్ర నాయకులు క్రాంతి కుమార్, ఖాదర్ బాషా, పోలవరపు శ్రీమన్నారాయణ, మలిశెట్టి దేవా, మీరావలి, వెంకటేశ్వర్లు, గున్నా అమర్, గౌతం అశోక్, సన్నీ, శ్రీకాంత్, శోభాలత, షేక్ రషీద, ధర్నాసి హరిబాబు, పమిడి వెంకటేశ్వర్లు, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.మీ తాత సొమ్ము ఇస్తున్నావా చంద్రబాబు: బూచేపల్లి పొగాకు రైతులను ఆదుకోవడానికి రూ.500 కోట్లు మంజూరు చేయడం లేదని, రైతులకు మీ తాత సొమ్ము ఇస్తున్నారా అని దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. పొగాకు సాగుకు బ్యారన్‌కు లక్షలాది రూపాయల ఖర్చు వస్తుందని, క్వింటా రూ.20 వేలకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడం అన్యాయమన్నారు. క్వింటా పొగాకు రూ.20 వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించినా అధికారులు, కంపెనీలు బేఖాతరు చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోవడం లేదంటే ఆ పదవికి చంద్రబాబు అనర్హుడని తేల్చి చెప్పారు. జగనన్న పాలనలో క్వింటా రూ.36 వేలకు కొనుగోలు చేశారని, పొగాకు రైతులు ఎంతో ప్రయోజనం పొందారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు మద్దతుగా నిలబడితే రైతులను రెచ్చగొడుతున్నారని కూటమి పాలకులు విమర్శలు చేయడం దారుణమన్నారు. ఎన్ని కేసులు పెట్టినా పొగాకు రైతులకు అండగా నిలబడతానని, అవసరమైతే జిల్లాకు జగన్‌ను తీసుకొస్తామని చెప్పారు. మా కుటుంబంపై అక్రమ కేసులు: బూచేపల్లి వెంకాయమ్మ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా బూచేపల్లి కుటుంబం మీద అక్రమంగా కేసులు బనాయించడం మామూలై పోయిందని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, మహానేత వైఎస్ కుటుంబంతో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. చెప్పిన మాట మీద నిలబడే నాయకుడు రాజశేఖర్ రెడ్డి పాలన రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగనన్న దమ్మున్న సీఎంగా పేరు తెచ్చుకున్నారన్నారు. పొగాకు రైతుల కోసం వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. -
ఉపాధికి ఉరి.. బినామీలకు సిరి!
● కూటమి నేతల బినామీల కోసమే రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ● రూ.5 వేల కోట్ల ప్రాజెక్టు.. రూ.1,500 కోట్లకే ధారాదత్తం వెనుక కుట్ర ● వైఎస్ జగన్ కలకు, స్థానిక నిరుద్యోగుల ఉపాధికి చంద్రబాబు మంగళం ● ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై భగ్గుమంటున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు ● పోర్టు పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మరో మహోద్యమానికి సై ఉలవపాడు: రామాయపట్నం పోర్టు నిర్మాణం వెనుక దశాబ్దాల పోరాట చరిత్ర ఉంది. వైఎస్సార్ సీపీతో సహా ఎన్నో ప్రజా సంఘాలు ఈ పోర్టు కోసం ఉద్యమించాయి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి రాగానే పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అడ్డంకులన్నీ అధిగమించి, రికార్డు సమయంలో దాదాపు 95 శాతం పనులు పూర్తి చేయించి ప్రారంభానికి సిద్ధం చేశారు. ప్రభుత్వమే ఈ పోర్టును నిర్వహించడం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయంతో పాటు, ఈ ప్రాంత వాసులకు వేలాదిగా ఉద్యోగాలు లభిస్తాయని వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. కానీ, చంద్రబాబు అధికారంలోకి రాగానే సీన్ రివర్స్ అయింది. 2014–2019 మధ్య కాలంలో కేంద్రం నిధులిస్తానన్నా నిర్లక్ష్యం చేసి, తీరా 2019 ఎన్నికల ముందు ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు ‘బుల్లి పోర్టు’కు కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకొన్న బాబు.. ఇప్పుడు ఏకంగా పోర్టును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే దుర్మార్గపు కుట్రలకు పదునుపెట్టారు. దోపిడీకి పక్కా స్కెచ్.. టెండర్ల ముసుగులో హైడ్రామా తొలిదశలో 850.79 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సుమారు రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ పోర్టు నిర్మాణం జరిగింది. ఇంతటి భారీ ఆస్తిని కూటమి సర్కారు నిస్సిగ్గుగా తమ అనుకూల కార్పొరేట్ సంస్థలకు, టీడీపీ బినామీలకు కట్టబెట్టేందుకు టెండర్ల ముసుగులో నాటకమాడుతోంది. తొలిదశ పోర్టు నిర్వహణతో పాటు విస్తరణ పనుల పేరుతో 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ.. ఆ తర్వాత దాన్ని మరో 20 ఏళ్లు పొడిగించుకునేలా (మొత్తం 50 ఏళ్లు) ప్రైవేటు వ్యక్తులకు రాసిచ్చేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన ఈ పోర్టును కేవలం రూ.1500 కోట్ల ‘ఆఫ్ ప్రీమియం’ ధరకే కట్టబెడుతుండటం కూటమి ప్రభుత్వ అవినీతికి, బరితెగింపునకు నిదర్శనం. ఆ రూ.1500 కోట్లు కూడా ఒకేసారి కట్టాల్సిన పనిలేదు. ముందుగా రూ. 750 కోట్లు చెల్లించి, మిగతా మొత్తం తీరికగా పది వాయిదాల్లో కట్టుకోవచ్చని టెండర్ డాక్యుమెంట్లో పేర్కొనడం చూస్తుంటే.. దీని వెనుక ఎంతటి భారీ ’క్విడ్ ప్రో కో’ దాగి ఉందో ఇట్టే అర్థమవుతోందని విశ్లేషకులు మండిపడుతున్నారు. పొట్ట చేతబట్టి.. వలస పోవాల్సిందేనా? పోర్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాల నిరుద్యోగ యువతకు వేలాదిగా ఉద్యోగాలు వస్తాయని, పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ప్రజలు ఎంతో ఆశపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పోర్టు ఉంటే రిజర్వేషన్ల ద్వారా స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు దక్కేవి. కానీ, ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తుండటంతో స్థానికుల ఉపాధి ఆశలపై చంద్రబాబు సర్కారు నిలువునా నీళ్లు చల్లింది. ప్రైవేటు యాజమాన్యాలు ఏ పొరుగు రాష్ట్రం వారినో తీసుకొచ్చి ఇక్కడ పనులు చేయించుకుంటే, మా పిల్లలు పొట్టచేత పట్టుకుని వలసలు పోవాల్సిందేనా? అని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోర్టు పరిరక్షణకు వైఎస్సార్ సీపీ పోరుబాట రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తమ హక్కులను, ఉపాధి అవకాశాలను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్న ప్రభుత్వ తీరుపై దళిత, బహుజన, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ దోపిడీని అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ నడుం బిగించింది. ప్రజాధనంతో నిర్మించిన పోర్టును ప్రభుత్వమే నిర్వహించాలని, స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. పచ్చ నేతల దోపిడీ నుంచి రామాయపట్నం పోర్టును కాపాడుకునేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మరో మహోద్యమానికి ప్రకాశం, నెల్లూరు ప్రాంత ప్రజలు సన్నద్ధమవుతున్నారు. అస్మదీయుల కోసం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వ మెడలు వంచుతామని వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు. రామాయపట్నంలో ‘బాబు’ తాబేదార్ల లంగరు హక్కులు కాలరాస్తున్నారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 95 శాతం పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా కట్టబెట్టడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ చర్య. ఇది స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల చేతగానితనానికి నిదర్శనం. పోర్టును ప్రభుత్వమే నిర్వహిస్తే పారిశ్రామికాభివృద్ధి జరిగి పేదలకు ఉపాధి లభిస్తుంది. ప్రైవేటీకరణను తక్షణమే ఆపకపోతే కేసులు, జైళ్లకు వెరవకుండా పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపడతాం. – బుర్రా మధుసూదన్ యాదవ్, వైఎస్సార్ సీపీ కందుకూరు ఇన్చార్జ్ -
మంత్రి గారి ఊరు.. దళితులకివ్వరా నీరు!
టంగుటూరు: రాష్ట్రంలో కూటమి సర్కారు వివక్షాపూరిత పాలనకు ఈ ఘటనే సజీవ సాక్ష్యం. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి స్వామి స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో ఎస్సీ, ఎస్టీలు గుక్కెడు మంచినీటి కోసం అలమటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ కాలనీలపై చిన్నచూపు చూస్తూ, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దళితులు మండిపడుతున్నారు. మంత్రి స్వామి తన సొంత గృహానికి రామతీర్థం జలాశయం నుంచి ఏకంగా 4 అంగుళాల పైపుతో భారీ పైప్‌లైన్ వేయించుకుని జలకళ ఉట్టిపడేలా చేసుకున్నారు. కానీ, పక్కనే ఉన్న ఎస్సీ, ఎస్టీ కాలనీలకు మాత్రం ఆరు నెలల క్రితం కేవలం పైపులు వేసి చేతులు దులుపుకొన్నారు. ఎప్పుడో అడపాదడపా మొక్కుబడిగా నీళ్లు వదులుతూ పక్షపాత బుద్ధిని చాటుకుంటున్నారు. మంత్రిగారి ఇంటికి ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా? అని కాలనీవాసులు నిలదీస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని తాము, చేతి చమురు వదిలించుకుంటూ ట్యాంకర్లతో నీరు కొనుక్కునే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు కళ్లు తెరిచి తమ దాహార్తి తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం రేపు
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఒంగోలు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యులు ఈ సమావేశంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మార్కాపురం టౌన్: గురువారం రాత్రి ప్రకటించిన నీట్ యుజీ ఫలితాల్లో మార్కాపురం విద్యార్థి నాదెళ్ల నిహాల్ జాతీయ స్థాయిలో 438వ ర్యాంకు సాధించాడు. ఎన్ఎస్ లా అగ్రికల్చర్, హార్టీకల్చర్ కళాశాలల చైర్మన్ చంద్రమౌళి కుమారుడు నిహాల్. ఈ సందర్భంగా విద్యార్థిని విశ్రాంత ప్రిన్సిపల్ డేవిడ్లివింగ్ స్టన్, వార్డెన్ నజీర్, డాక్టర్ మచ్చ శివశంకర్, ఎస్ వెంకటేశ్వర్లు, గుంటక చెన్నారెడ్డి, ఆడిటర్ తోట సత్యనారాయణ, బద్రీనాథ్ తదితరులు సన్మానించారు. మార్కాపురం టౌన్: జిల్లాలో 134 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డు–2026కు ఎంపికై నట్లు కలెక్టర్ ఎం. విజయసునీత తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం షైనింగ్ స్టార్స్–2026 అవార్డ్స్ బహుమతి ప్రదానోత్సవంపై జిల్లాలోని ఎంఈఓలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ అవార్డుకు ఎంపికై న విద్యార్థులకు రూ.20 వేల నగదుతో పాటు సర్టిఫికెట్ ఇస్తారన్నారు. మార్కాపురంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 20వ తేదీన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్, రూ.20 వేల నగదు అందజేస్తారన్నారు. అదేవిధంగా మెగా పీటీఎం 3.1 కు సంబంధించి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ మొబైల్లో ‘లీప్ యాప్’ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సరి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ ఎస్.సుబ్బారావు, డీసీఈబీ సెక్రటరీ ఎం.సుధాకర్, జిల్లాలోని అందరు ఎంఈవోలు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: రాష్ట్రంలో శరవేగంగా కోవిడ్ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కోవిడ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణితో కలిసి కోవిడ్ షెడ్లను శుక్రవారం పరిశీలించారు. కోవిడ్ సన్నద్ధతలో భాగంగా అవసరమైన సిబ్బందిని కేటాయించాలని ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలతకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ అనుమానితులను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఐసోలేటెడ్ కేబిన్ ఏర్పాట్లతోపాటు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా బెడ్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. ఈ పరిశీలనలో నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి, ఏఆర్ఎంఓ డాక్టర్ సునీల్ గవాస్కర్ పాల్గొన్నారు. -
20లోగా ఎన్పీసీఐ లింకేజ్ తప్పనిసరి
ఒంగోలు వన్‌టౌన్: పదో తరగతి పాసై ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఈ నెల 22న ‘తల్లికి వందనం’ నిధులు జమకానున్నాయని, ఇందుకు విద్యార్థులు తమ బ్యాంకు లేదా పోస్టల్ ఖాతాలకు తప్పనిసరిగా ఆధార్, ఎన్పీసీఐ అనుసంధానం చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎన్.లక్ష్మానాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ లింక్ చేసిన బ్యాంకు ఖాతా కాపీని గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు అందజేసి ఎన్పీసీఐ పోర్టల్‌లో మ్యాపింగ్ చేయించుకోవాలన్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ కానివారు వెంటనే పోస్టాఫీసులో కొత్త ఖాతా తెరిచి.. ఈ నెల 20లోగా ఎన్పీసీఐ అనుసంధానం పూర్తి చేసుకోవాలని సూచించారు. ● ఇన్చార్జి జేడీఏ బాలాజీనాయక్ మార్కాపురం: జిల్లాలో ఎరువుల పంపిణీ, అక్రమాల నియంత్రణకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జి జిల్లా వ్యవసాయాధికారి బాలాజీ నాయక్ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 21 మండలాలకు చెందిన రైతులు ఎరువుల సమస్యలపై 92810 65282 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జూన్ 8వ తేదీ నుంచి రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే), ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా, డీఏపీ ఎరువులను తప్పనిసరిగా యాప్ ద్వారానే పంపిణీ చేస్తారని స్పష్టం చేశారు. రైతులు సాగు చేసిన పంట ఆధారంగా, శాస్త్రవేత్తల సిఫార్సు మేరకే ఎరువులు అందజేస్తామన్నారు. వ్యాపారులు ఎరువులు ఇవ్వకపోయినా, అధిక ధరలకు విక్రయించినా, ఇతర మందులు కొనాలని బలవంతపెట్టినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ఆర్ఎస్కేలలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. వివరాలకు స్థానిక వ్యవసాయ అధికారి లేదా ఆర్ఎస్కే సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. సింగరాయకొండ: మండలంలోని పాకల రైల్వేగేటు సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి(45) దుర్మరణం పాలయ్యాడు. ఒంగోలు జీఆర్పీ ఎస్సై శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ వైపు వెళ్తున్న షాలిమార్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి ఒంటిపై, చేతిపై ’కుసుమ’ అనే పచ్చబొట్లు ఉన్నాయి. గులాబీ, బ్లూ, తెలుపు రంగుల అడ్డపట్టీల కాలర్ టీషర్టు, నిలువు గీతల లుంగీ ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. వివరాలు తెలిసిన వారు 9247575632 నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. సీఎస్‌పురం: మండలంలోని కోవిలంపాడు వద్ద 167బీ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం కారు బోల్తాపడిన ఘటనలో ఓ ప్రధానోపాధ్యాయుడికి గాయాలయ్యాయి. పామూరుకు చెందిన బైరెడ్డి వెంగళరెడ్డి డీజీపేట ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని కారులో తిరిగి వెళ్తుండగా కోవిలంపాడు వద్ద ఒక్కసారిగా పిల్లలు అడ్డువచ్చారు. వారిని తప్పించే క్రమంలో కారును పక్కకు తిప్పగా ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి, ముందు టైరు పేలి రోడ్డుపై బోల్తా కొట్టింది. కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆయనకు తల, ఛాతీకి గాయాలు కాగా 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి పామూరు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఒంగోలు తీసుకెళ్లారు. సంఘటన స్థలాన్ని సీఎస్‌పురం ఎస్సై పి.వెంకటేశ్వరరెడ్డి పరిశీలించి విచారణ చేపట్టారు. ● రూ.1.30 లక్షల నగదు, 7 బైక్‌లు స్వాధీనం జరుగుమల్లి(సింగరాయకొండ): మండలంలోని నందనవనం గ్రామ పంచాయతీ పరిధిలోని పొలాల్లో గురువారం అర్ధరాత్రి పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై భాగ్యరాజ్ తమ సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించారు. నిందితుల నుంచి రూ.1,30,200 నగదు, 7 బైక్‌లు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎంటీఎస్ ఉపాధ్యాయుల బిల్లులు ఎనేబుల్ చేయాలి
● డీఈఓకు ఎస్టీయూ నాయకుల వినతి మార్కాపురం: జిల్లాలో జూన్ నెలలో బదిలీపై వచ్చిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతభత్యాల బిల్లులను ’నిధి’ యాప్‌లో వెంటనే ఎనేబుల్ చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎర్రయ్య కోరారు. ఈ మేరకు మార్కాపురం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సామ సుబ్బారావుకు సంఘం నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రయ్య మాట్లాడుతూ.. బదిలీపై విధుల్లో చేరిన ఉపాధ్యాయుల బిల్లులు నిధి యాప్‌లో సమర్పించేందుకు వీలుకాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొని, వారికి సకాలంలో జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంటీఎస్ జిల్లా అధ్యక్షుడు వజ్రం శ్రీనివాసులు, ఉపాధ్యాయులు రామకోటేశ్వరరావు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. -
రూ.2 కోట్ల గోల్మాల్.. దొడ్డవరం పీఏసీఎస్ కార్యదర్శిపై వేటు
● సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన డీసీఓ శ్రీనివాసరావు మద్దిపాడు: మండలంలోని దొడ్డవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో భారీ కుంభకోణంలో బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. సంఘంలో సుమారు రూ.4 కోట్ల మేర నిధుల అవకతవకలు జరిగాయంటూ ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ (డీసీఓ) శ్రీనివాసరావు ప్రాథమికంగా విచారణ చేపట్టారు. రూ.2 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆయన నిర్ధారించారు. దీంతో నిధుల గోల్‌మాల్‌కు బాధ్యురాలిగా చేస్తూ పీఏసీఎస్ కార్యదర్శి కె. శ్రీవాణిని సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ జరిపి, ఆమైపె కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ పాలకవర్గ కమిటీ సభ్యులకు డీసీఓ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లోనే పీఏసీఎస్ కమిటీ సభ్యులు సమావేశమై.. సస్పెన్షన్‌కు గురైన కార్యదర్శిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ● సచివాలయ సేవల వల్లే మేదరమెట్లకు ఐఎస్ఓ గుర్తింపు మేదరమెట్ల: వైఎస్సార్ సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలను ఇస్తోంది. ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించడంలో మెరుగైన పనితీరు కనబరిచిన మేదరమెట్ల పంచాయతీ ప్రతిష్టాత్మక ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికెట్‌ను కై వసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికై న 23 పంచాయతీల్లో మేదరమెట్ల ఒకటి కావడం విశేషం. పారిశుధ్యం, రికార్డుల నిర్వహణ, అర్జీల పరిష్కారంలో చూపిన ప్రతిభకుగాను బుధవారం గ్రామ కార్యదర్శి లక్ష్మీకాంత్ రాష్ట్ర రాజధానిలో ఈ సర్టిఫికెట్ అందుకున్నారు. సచివాలయ వ్యవస్థ వల్లే ఈ ఘనత సాధ్యమైందని మాజీ సర్పంచ్ బొనిగల ఎలీశమ్మ పేర్కొన్నారు. ‘జగనన్న నాటిన సచివాలయ వ్యవస్థ అనే విత్తనం నేడు పారదర్శక సేవలనే ఫలాలను ఇస్తోంది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ భద్రారెడ్డి సహకారంతోనే ఈ స్థాయికి చేరాం. ప్రభుత్వం మారినా సచివాలయాల కృషికి ప్రతిష్టాత్మక ఐఎస్ఓ గుర్తింపు రావడం ఎంతో గర్వకారణం’ అని ఆమె హర్షం వ్యక్తం చేశారు. -
బావిలో జారిపడి విలేకరి మృతి
సంతనూతలపాడు (చీమకుర్తి): బావి ఒడ్డుపై కూర్చొని ఉన్న ప్రజాశక్తి విలేకరి కందుల వెంకట కృష్ణప్రసాద్ (60) ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటన సంతనూతలపాడులో గురువారం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సీఐ శేషగిరిరావు, ఎస్సై అజయ్‌బాబులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కామేపల్లివారిపాలెంలో నివాసం ఉంటున్న ప్రసాద్ మరణాన్ని కుటుంబ సభ్యులతో పాటు మీడియా మిత్రలు జీర్ణించుకోలేకపోతున్నారు. భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. బైక్ దొంగల ముఠా అరెస్టు ● రూ.15 లక్షల విలువైన 15 మోటార్ సైకిళ్ల స్వాధీనం ● నిందితుల్లో ఇద్దరు యువకులు, ఒక బాలుడు ● వివరాలు వెల్లడించిన చీమకుర్తి సీఐ, ఎస్సై చీమకుర్తి: ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను చీమకుర్తి శివారు ప్రాంతంలో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ. 15 లక్షల విలువైన 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ డి.ప్రసాద్, ఎస్సై ఎల్.సంపత్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చీమకుర్తి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన ఇంకొల్లు పోలిరెడ్డి రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన తన టీవీఎస్ రేడాన్ బైక్‌ను ఇంటి ముందు ఉంచగా చోరీకి గురైంది. దీనిపై ఆయన ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వాహనాల చోరీలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో గురువారం అనుమానాస్పదంగా కనిపించిన మద్దిపాడు మండలం కొలచనకోటకు చెందిన దేవరకొండ దినేష్ కుమార్, బల్లికురవ మండలం కొప్పెరపాడుకు చెందిన కలుపుకూరి శరత్ బాబుతో పాటు మరో మైనర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాల గుట్టు రట్టయింది. వీరి నుంచి రికవరీ చేసిన 15 బైకుల్లో.. చీమకుర్తికి చెందిన టీవీఎస్ రేడాన్, స్ప్లెండర్ ప్లస్, గ్లామర్, మార్టూరుకు చెందిన రెండు యూనికార్న్‌లు, టంగుటూరులో చోరీ చేసిన పల్సర్, శింగరాయకొండకు చెందిన యూనికార్న్, క్లాసిక్ ఉన్నాయి. అలాగే మద్దిపాడు ప్రాంతానికి చెందిన ప్యాషన్ ప్లస్, క్లాసిక్, రెండు సీబీ యూనికార్న్‌లు, బల్లికురవకు చెందిన గ్లామర్, దర్శికి చెందిన పల్సర్, గుంటూరు జిల్లా కొత్తపేట నుంచి అపహరించిన మరో పల్సర్ ఉన్నట్లు పోలీసులు వివరించారు. -
కౌలు రైతులకు అవగాహన కల్పించాలి
ఒంగోలు సబర్బన్: కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, హక్కులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులకు సూచించారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్ఎస్) వారు కౌలు రైతుల కోసం రూపొందించిన ప్రచార కరపత్రాలను తన చాంబర్లో గురువారం జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కౌలు రైతులు తమ హక్కులు తెలుసుకుని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కౌలు రైతులకు పంట రుణాలు, పంటల బీమా, సాగు ధ్రువీకరణ పత్రాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా కో–ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు, దర్శి ఏరియా కో–ఆర్డినేటర్ గుంటూరు నాగమణి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి బిళ్ల శరత్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: వార్డు సచివాలయాల్లో స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు రికార్డులు పక్కాగా ఉండాలని సంబంధిత విభాగం జిల్లా అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆదేశించారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పీర్లమాన్యంలో స్వర్ణ వార్డు కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. పలు అంశాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించిన ఎస్ఈడీ డేటా వెరిఫికేషన్‌ను పరిశీలించారు. ప్రతి రికార్డును ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. స్పెషల్ ఆధార్ క్యాంపు పరిశీలన... ఒంగోలు నగరంలోని ఏకేవీకే కాలేజీలో నిర్వహిస్తున్న స్పెషల్ ఆధార్ క్యాంపును కూడా గురువారం వెంకటేశ్వరరావు సందర్శించారు. ఆధార్ క్యాంపులో ప్రజలకు సిబ్బంది అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. స్పెషల్ ఆధార్ క్యాంపులో ఫేజ్ – 2 కింద జూలై 21 నుంచి 24వ తేదీ వరకు పేర్లలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడం, ఎంబీయూ అప్డేట్, పుట్టిన తేదీ కరెక్షన్స్ చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రత్యేకంగా స్కూలు, కాలేజీ విద్యార్థులు ఇలాంటి పొరపాట్లు ఉంటే ప్రత్యేక ఆధార్ సెంటర్‌కు వచ్చి సరిచేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒంగోలు సిటీ: రోల్‌బాల్ జిల్లా క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీ సింగరాయకొండలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా రోల్‌బాల్ సెక్రటరీ కె.అనీల్‌కుమార్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–11, అండర్–14, అండర్–17, ఆపై విభాగాల్లో పోటీలు నిర్వహించి క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. పాల్గొనే క్రీడాకారులు అదేరోజు ఉదయం 8.30 గంటలకు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని సూచించారు. జిల్లా నలుమూలల నుంచి అర్హులైన క్రీడాకారులు పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాలకు 9100553717 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఒంగోలు వన్‌టౌన్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ స్పెషల్ లోక్ అదాలత్‌లు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్‌వీ రామకృష్ణ తెలిపారు. ఒంగోలులోని జిల్లా న్యాయస్థానం ఆవరణలోని బార్ అసోసియేషన్ హాలులో న్యాయవాదులతో గురువారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్పెషల్ లోక్ అదాలత్‌లలో ఎక్కువ సంఖ్యలో చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించే విధంగా న్యాయవాదులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చావలి రమేష్‌బాబు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. -
అక్రమార్కులకే పట్టాభిషేకం!
లోకాయుక్త ఆదేశాలు బేఖాతర్.. కురిచేడు: పేదలకు దక్కాల్సిన సాగుభూమి భూబకాసురుల పాలవుతోంది. అధికార పాలకుల అండదండలు, రెవెన్యూ అధికారుల కాసుల కక్కుర్తి తోడై సర్కారు భూములకు రెక్కలొస్తున్నాయి. కంచే చేను మేసిన చందంగా.. రక్షణ కల్పించాల్సిన అధికారులే అసైన్డ్ (డీకేటీ) భూములను అడ్డగోలుగా ఆన్లైన్ చేస్తూ అక్రమార్కులకు కట్టబెడుతున్నారు. లోకాయుక్త కోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తూ.. కురిచేడు మండలంలో సాగుతున్న ఈ అవినీతి బాగోతం విస్మయం కలిగిస్తోంది. పర్వతం లాంటి ఈ భూదోపిడీలో కిందిస్థాయి అధికారులను బలిచేసి.. అసలు సూత్రధారులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. రికార్డుల మాయాజాలం ఇలా.. మండలంలోని పొట్లపాడు గ్రామంలో పాత సర్వే నంబరు 22ను విభజించి 619 నుంచి 663 వరకు కొత్త నంబర్లు ఇచ్చారు. అలాగే పాత సర్వే నంబరు 99ను విభజించి మరికొన్ని సర్వే నంబర్లుగా సబ్ డివిజన్ చేశారు. వీటితో పాటు సర్వే నంబర్లు 81, 85, 87లో ప్రభుత్వ గయాళు భూమి ఉంది. ఇందులో గతంలో కొందరు పేదలకు డీకేటీ పట్టాలు ఇచ్చారు. చట్టప్రకారం ఈ భూములను అమ్మడానికి వీల్లేదు. కానీ, నిబంధనలకు పాతరేసి ఈ భూమి మొత్తాన్ని అక్రమార్కుల పేరిట ‘కొనుగోలు ద్వారా సంక్రమించినట్లు’ ఆన్లైన్ చేసేశారు. ఖాతా నంబరు 1199తో నీలకంఠన్ ప్రభాకరన్ పేరిట 17 సర్వే నంబర్లలో ఏకంగా 42.70 ఎకరాలు, ఖాతా నంబరు 1200తో చింతా వెంకటేశ్వరరావు పేరిట మరో 17 సర్వే నంబర్లలో 38.69 ఎకరాలను ఆన్లైన్ చేసి అధికారికంగా భూకబ్జాకు తెరతీశారు. తహసీల్దార్‌పై వేటు.. అసలు దొంగలకు రక్షణ ఈ భారీ కుంభకోణంపై గతంలో ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కంటితుడుపు చర్యగా అప్పటి తహసీల్దార్ వరకుమార్‌ను సస్పెండ్ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆ భూమిని ఆన్లైన్ నుంచి తొలగించాలని, అది ప్రభుత్వ భూమి అని, ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భూమి వద్ద రెవెన్యూ అధికారులు ఓ హెచ్చరిక బోర్డు కూడా పాతారు. కానీ లోపాయికారీ ఒప్పందాలతో కథ వేరేలా నడిచింది. చింతా వెంకటేశ్వరరావు పేరిట ఉన్న 38.69 ఎకరాల్లో.. సర్వే నంబరు 631–2లో 3.48 ఎకరాలు, 635–1లో 4.82 ఎకరాలు (మొత్తం 8.30 ఎకరాలు) రికార్డుల్లో అలాగే ఉంచి, మిగతాది మాత్రమే ఆన్లైన్లో తొలగించారు. ఇక నీలకంఠన్ ప్రభాకరన్ పేరిట ఉన్న 42.70 ఎకరాల భూమిని నేటికీ ఆన్లైన్ నుంచి తొలగించకపోవడం రెవెన్యూ అధికారుల బరితెగింపునకు నిదర్శనం. కోర్టు ఆదేశాలు ధిక్కరించి.. ఈ భూదోపిడీపై ఆ గ్రామానికి చెందిన ఓ రైతు ఏపీ లోకాయుక్తను ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. జిల్లా రెవెన్యూ అధికారులు వాటిని బుట్టదాఖలు చేశారు. ఆక్రమణదారులు మళ్లీ ఆ భూమిని దున్ని చదును చేస్తున్నా.. రెవెన్యూ అధికారులు చోద్యం చూడటమే అందుకు నిదర్శనం. పైగా అది సర్వే నంబర్ 87 లోనిదని, పేదలు విక్రయించుకున్నారంటూ కబ్జాదారులకే వత్తాసు పలకడం వారి అనైతికతను స్పష్టం చేస్తోంది. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి.. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాలకుల అండతో పేదల భూములను స్వాహా చేస్తున్న కబ్జాకోరుల నుంచి సర్కారు భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పేదల అసైన్డ్ భూములు స్వాహా.. పాలకుల అండతో రెవెన్యూ లీలలు చేతులు మారుతున్న లక్షల రూపాయలు.. అందినకాడికి దండుకుంటున్న అధికారులు కురిచేడు మండలంలో పేట్రేగిపోతున్న భూబకాసురులు -
నిమ్మ రైతు కంట కన్నీటి చెమ్మ
● ఎల్‌నినో ప్రభావంతో నిలువునా ఎండుతున్న తోటలు ● చేసేదేమీ లేక చెట్లను నరికేస్తున్న రైతులుకొనకనమిట్ల: ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారాయి. వానలు లేక, ఎండల తీవ్రతకు కొనకనమిట్ల మండలంలో నిమ్మతోటలు నిలువునా ఎండిపోతున్నాయి. చినారికట్ల తదితర గ్రామాల్లో రైతులు సుమారు 600 ఎకరాల్లో నిమ్మ సాగు చేశారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోవడం, తోటలకు సరిపడా నీరు అందకపోవడంతో పచ్చని చెట్లు మాడిపోతున్నాయి. కళ్లెదుటే కాయలు కాసే చెట్లు ఎండిపోతుండటంతో కన్నీరు దిగమింగుకుంటూ రైతులు వాటిని గొడ్డలితో నరికేస్తున్నారు. తక్షణమే సకాలంలో వర్షాలు కురవకపోతే మిగిలిన తోటలకూ గొడ్డలివేటు తప్పదని, ఈ ఏడాది పెట్టుబడులు కూడా దక్కవని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రయాణికులకు చుక్కలు..!
బాబు సభకు బస్సులు.. ఒంగోలు టౌన్: పల్నాడు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం నిర్వహించనున్న రుణమేళా సభకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తుండటంతో పెద్ద సంఖ్యలో జనాలను తరలించడానికి ఆర్టీసీ బస్సులు కేటాయించారు. దీనిపై ప్రయాణికుల నుంచి, ముఖ్యంగా ఉచిత బస్సు లబ్ధిదారులైన మహిళా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఏడు ఆర్టీసీ డిపోల నుంచి మొత్తం 170 ఆర్టీసీ బస్సులను నరసరావుపేట తరలించినట్లు సమాచారం. అందుకోసం గురువారం మధ్యాహ్నం నుంచే బస్సులను డిపోలకు తరలించారు. దాంతో ఎక్కడికక్కడ ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. పల్లెవెలుగు బస్సులన్నీ నరసరావుపేటకే... ఒంగోలు డిపోలో మొత్తం 85 పల్లెవెలుగు బస్సులున్నాయి. అందులో 35 అద్దె బస్సులు కాగా, మిగిలిన 50 బస్సులు ఆర్టీసీకి చెందినవి. ఈ 50 బస్సుల్లో 40 బస్సులను నరసరావుపేట పర్యటనకు కేటాయించారు. గురువారం సాయంత్రం నరసరావుపేట అర్బన్‌లో ఒంగోలు ఆర్టీసీ డిపో బస్సులు రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అక్కడి నుంచి రాత్రికి రాత్రి పల్నాడు జిల్లాలోని వివిధ గ్రామాలకు బస్సులు పంపించి భారీగా జన సేకరణ చేయనున్నట్లు సమాచారం. ఒక్క ఒంగోలు నుంచే కాకుండా ప్రకాశం జిల్లాలోని కందుకూరు, అద్దంకి ఆర్టీసీ డిపోల నుంచి కూడా బస్సులు పంపించారు. అద్దంకి డిపో నుంచి 15 బస్సులు, కందుకూరు డిపో నుంచి 20 బస్సులు పంపించారు. అదేవిధంగా మార్కాపురం జిల్లాలో మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, పొదిలి డిపోలు ఉండగా, మార్కాపురం డిపో నుంచి 35 బస్సులు, గిద్దలూరు డిపో నుంచి 20 బస్సులు, కనిగిరి డిపో నుంచి 30 బస్సులు, పొదిలి డిపో నుంచి 20 బస్సులను నరసరావుపేట తరలించినట్లు సమాచారం. దీంతో గురువారం సాయంత్రం నుంచి ఆయా డిపోల్లో పల్లెవెలుగు బస్సుల కోసం మహిళా ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. రెండుమూడు గంటలకో బస్సు వస్తుండటంతో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా పెరిగి వారి మధ్య తోపులాటలు జరిగాయి. శుక్రవారం ప్రయాణం నరకమే... ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 7 డిపోల నుంచి 170 బస్సులను ముఖ్యమంత్రి సభకు తరలించడంతో శుక్రవారం ప్రయాణం నరకంగా మారుతుందని ఆర్టీసీ ఉద్యోగులే చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిదంటున్నారు. తిరిగి శనివారం ప్రయాణికులకు పల్లెవెలుగు బస్సులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. గతేడాది ఆగస్టు 15వ తేదీ నుంచి సీ్త్ర శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నారు. దీంతో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిందిగానీ, దానికి తగినట్లు బస్సులు లేవు. తరచూ ఏదోక కార్యక్రమం పేరుతో ముఖ్యమంత్రి సభలకు జనాలను తరలించడానికి పల్లెవెలుగు బస్సులు తరలిస్తుండటంపై ప్రజలు, ఆర్టీసీ కార్మిక సంఘాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. -
చినుకు రాలక.. మొక్క కదలక..
● వన నర్సరీల్లో నిరుపయోగంగా 4 లక్షల మొక్కలు హనుమంతునిపాడు: ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు పచ్చదనానికి గొడ్డలిపెట్టుగా మారాయి. వానలు ముఖం చాటేయడంతో హనుమంతునిపాడు, హాజీపురం అటవీ, ఉపాధి హామీ నర్సరీల్లో పెంచిన సుమారు 4 లక్షల మొక్కలు పంపిణీకి నోచుకోక అక్కడే ఉండిపోయాయి. నర్సరీల్లో ఎర్రచందనం, టేకు, నేరేడు, మామిడి తదితర పండ్ల, అటవీ జాతి మొక్కలను లక్షలు వెచ్చించి పెంచారు. వర్షాలు లేకపోవడంతో పొలం గట్లు, కుంటలు, రోడ్లకిరువైపులా నాటాల్సిన ఈ మొక్కలన్నీ నర్సరీలకే పరిమితమయ్యాయి. సమయం మించిపోతుండటంతో మొక్కలు పరిమితికి మించి పెరిగిపోతున్నాయి. వాటిని మరో కవర్లోకి మార్చి పెట్టే క్రమంలో వాడిపోతున్నాయి. వర్షాలు కురిస్తేనే పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. -
4 సవర్ల బంగారం చోరీ
బల్లికురవ: మండలంలో వరుస చోరీలతో ప్రజలు, రైతులు బెంబేలెత్తుతున్నారు. బుధవారం అర్ధరాత్రి అంబడిపూడి గ్రామంలోని వల్లపు వెంకటేశ్వర్లు ఇంటి వెనుక భాగం నుంచి దొంగలు ప్రవేశించి బీరువాలో ఉంచిన సుమారు 4 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. బీరువాలో బట్టలు చెల్లాచెదురుగా పడేశారు. ఇంటి వరండాలో నిద్రిస్తున్న వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు గురువారం ఉదయం తలుపులు తీయగా చోరీ జరిగినట్లు గుర్తించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై నాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లు పరిశీలించి ఆధారాలు సేకరించాయి. వారం రోజుల్లోపు మండలంలోని వల్లాపల్లి, నక్కబొక్కలపాడు, కొణిదెన గ్రామాల పొలాల్లోని వ్యవసాయ బోర్లకు అమర్చిన సుమారు 30 మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే వైర్ల చోరీకి పాల్పడ్డారు. బొర్ల కింద సాగు చేసిన పంటలు కాపాడుకొనేందుకు తిరిగి అమర్చుకుంటున్నా దొంగలు తమ పని తాము చేసుకెళ్తున్నారు. ముండ్లమూరు: ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ముండ్లమూరు సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పులిపాడు గ్రామానికి చెందిన గంగవరపు బాలకోటయ్య కుమారుడు కాశింబాబు (21) రెండు నెలలుగా ముండ్లమూరులో సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడు. రోజూ పులిపాడు నుంచి వచ్చి వ్యాపారం చూసుకుని రాత్రికి తిరిగి వెళ్లేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో షాపు మూసివేసి తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. అద్దంకి–దర్శి ప్రధాన రహదారిపై ముండ్లమూరు విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోకి రాగానే, పక్కనే ఉన్న పొలాల్లోంచి మెయిన్ రోడ్డు పైకి వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ (ఏపీ 26 టీటీ 4192) కాశింబాబు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడి తండ్రి బాలకోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జరుగుమల్లి (సింగరాయకొండ): ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో ఓ గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన జరుగుమల్లి మండల పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. రైల్వే జీఆర్పీ ఎస్సై శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. కె.బిట్రగుంట గ్రామానికి చెందిన తాతపూడి ఏసురత్నం(48) గొర్రెలు మేపుకుంటూ సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. అదే సమయంలో విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న మెము రైలును అతడు గమనించలేదు. రైలు బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైన ఏసురత్నం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏసురత్నం మృతితో స్థానిక ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆశలు !
పొగచూరిన రాష్ట్రంలో పొగాకు రైతుల కష్టాలు తీరడం లేదు. ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. సగటు ధర కిలోకి రూ.200 లోపే పలుకుతోంది. వేలం కేంద్రాల వద్ద తిరస్కరణలు(నోబిడ్) ఎక్కువగా ఉండడంతో రైతులు దిగాలు పడుతున్నారు. వేలం ప్రారంభమై దాదాపు 90 రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పురాకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. వేలం కేంద్రాల్లో అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆందోళనలు చేపడుతోంది. ఇందులో భాగంగా గురువారం కనిగిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నారు. -
ముద్రగడ మృతి తీరని లోటు
● ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్ సీపీ నేతల నివాళులు ఒంగోలు సిటీ: ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, దర్శి నియోజకవర్గ పరిశీలకుడు మాదాసి వెంకయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం తన నిబద్ధత, ముక్కుసూటితనం, రాజీలేని పోరాట స్ఫూర్తితో రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని స్మరించారు. ముద్రగడ మరణం ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడని, కాపు రిజర్వేషన్ల కోసం దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజీలేని పోరాటం చేశారన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా పనిచేసినా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే సామాజికవర్గ హక్కులకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ముద్రగడ పద్మనాభమేనన్నారు. కార్యక్రమంలో అరిగా మల్లికార్జునరావు, కొణికి రోశయ్య, పాలడుగు శ్రీనివాసరావు, తోట బాబి (నవీన్), అడుసుమల్లి ప్రసన్న, మల్లిశెట్టి దేవా, హనుమంతరావు, పల్లపోతు వెంకయ్య, బండారు ప్రభాకర్, కాపు నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
నోబిడ్ పేరుతో సగ భాగం రిటన్
కనిగిరి టుబాకో యార్డు పరిధిలో గత వారం రోజులుగా జరుగుతున్న వేలాన్ని పరిశీలిస్తే.. ప్రతి రోజు రైతులు తెచ్చిన సగం బేళ్లు నోబిడ్ పేరుతో తిరస్కరిస్తున్నారు. సోమవారం సీతారాంపురం క్లస్టర్ రైతులు 450 బేళ్లు తెస్తే.. కేవలం 220 బేళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. దాదాపు 230 బేళ్లను వెనక్కి పంపారు. కొనుగోలు చేసిన చెక్కుల్లో కూడా 30 శాతం మాత్రమే గరిష్ట ధర వేయగా.. దాదాపు అన్నింటికీ కనిష్ట ధర రూ.160 ధర ఇచ్చారు. దీంతో పొగాకు రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వాస్తవానికి పశ్చిమ ప్రకాశంలో పొగాకు ఏ గ్రేడ్ పొగాకు ఉత్పత్తి 50 శాతం కూడా మించదు. మిగిలిన పొగాకు ఇతర గ్రేడ్లు వస్తాయి. గ్రేడ్ 2,3 రకాలకు రూ.160లు మించి ఇవ్వటం లేదు. దీంతో సగటు ధర రూ.200లోపు దిగజారింది. ప్రస్తుతం వస్తున్న ధరలతో బ్యారన్‌కు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పొగాకు రైతు దీక్షకు తరలి రండి
● మాజీ మంత్రి మేరుగు నాగార్జున మద్దిపాడు: రైతన్నకు అండగా నిలుద్దాం పొగాకు రైతుల కోసం పోరాడదామని సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17వ తేదీ శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించే రైతు దీక్షలో రైతు సంఘాల నాయకులు, పొగాకు రైతులు పాల్గొనాలని కోరారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన పొగాకు రైతు దీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముద్రగడ మృతికి మేరుగు సంతాపం మద్దిపాడు: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతికి వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున బుధవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ముద్రగడ మృతి వార్త విన్న వెంటనే తాను దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. ఆయన మృతి విచారకరమని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. భార్య రాజీకి రావాలని.. ● పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం మార్కాపురం టౌన్: భార్య, భర్తల మధ్య గొడవల నేపథ్యంలో భార్య రాజీకి రావాలని ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్ ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన మార్కాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది. గతంలో మార్కాపురం టౌన్ ఎస్ఐ వద్ద ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేసిన షేక్ ఆరిఫ్‌కు తన భార్యతో గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం భార్య తరఫు బంధువులు ఎస్కే ఆరిఫ్ ఇంటికి వచ్చి..ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుందామన్నారు. ఇదే సమయంలో ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకరికొకరు తిట్టుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే తన భార్యతో పోలీసులు కేసు రాజీచేస్తారని భావించిన ఆరిఫ్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుని లోపలికి వచ్చాడు. అది గమనించి పోలీసులు అతని ఒంటిపై దుస్తులు తొలగించారు. అయితే ఈ సంఘటనపై ఎస్సై విశ్వనాథరెడ్డిని వివరణ కోరగా ఆరిఫ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
నిధులివ్వకుండా..పనులెలా..?
ఒంగోలు సబర్బన్: నిధులివ్వకుండా ఉమ్మడి జిల్లాలో పనులు ఎలా జరుగుతాయని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు ధ్వజమెత్తారు. నిధుల లేమితో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ప్రకాశం భవన్లో బుధవారం జిల్లా రివ్యూ కమిటీ(డీఆర్సి) సమావేశం నిర్వహించారు. గతేడాది నవంబర్‌లో జరిగిన డీఆర్సీలో లేవనెత్తిన అనేక సమస్యలకు అధికారుల వద్ద సమాధానాలు లేకుండా పోయాయి. నిధులు విడుదల చేయకుండా పరిష్కారం ఏవిధంగా ఉంటుందన్నది ప్రతిపక్ష సభ్యుల వాదన. దానికి తోడు ఇన్చార్జ్ మంత్రి ఆనం మాత్రం సమావేశంలో కాకి లెక్కలు చెప్పి మ..మ అనిపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత వెలిగొండకు రూ.2,900 కోట్లు ఖర్చు చేశామని మంత్రి ఆనం చెప్పటంతో ప్రజా ప్రతినిధులు ఒక్కసారిగా ఒకరిమొఖం ఒకరు చూసుకున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం మరింత సమన్వయంతో చురుకుగా వ్యవహరించాలని ప్రకాశం, మార్కాపురం జిల్లాల అధికారులను ఇన్చార్జి మంత్రి ఆనం చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఉండవని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా అధికార పార్టీకి చెందిన నాయకులే సాగు నీటి చెరువులు, ప్రాజెక్టుల్లో ఉన్న చేపలు పట్టడానికి నీటిని బయటకు వదులుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆరోపించడం గమనార్హం. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు చేపలు పట్టుకునేందుకు చెరువులో నీళ్లు ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నారని సమావేశంలో వాపోయారు. దీనికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైతం గొంతుకలిపారు. ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితుల్లో ఇలాంటి చర్యల వలన ఆయా చెరువుల్లో నీరు వృథా కావడంతో పాటు సమీప గ్రామాల్లోని భూగర్భ నీటిమట్టం కూడా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కాపురం, పొదిలిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తినప్పుడు ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు సరఫరా చేసిన వారికి రెండేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మార్కాపురం ఎమ్మెల్యే ఆరోపించారు. సొంత డబ్బా కోసమే..: యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి ‘‘రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నాయకులు సొంత డబ్బా కొట్టుకోవటానికే డీఆర్సీ సమావేశం పెట్టారు. ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలోని సమస్యలను ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళుతుంటే ఆయన పట్టించుకోవడం లేదు’’ అంటూ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చెప్పాల్సిన సమాధానం టీడీపీ ఎమ్మెల్యే చెప్పటం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం గొంతు నొక్కటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి టీ–5 కాలువ నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కాలువ నిర్మాణం ద్వారా మార్కాపురం జిల్లాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. తన నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. అధికారులకు సీసీ రోడ్ల విషయంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు. కనీసం మంచినీటి బోర్లకు మరమ్మతుల కూడా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఎయిమ్స్‌కు బస్సు సౌకర్యం కల్పించాలని, మార్కాపురం జిల్లాలో పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వెలిగొండ నుంచి చిన్న స్పెల్లింగ్ దోషాలతో 1150 మంది పరిహారం పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారని, దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక పక్కేమో వెలిగొండ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ప్రాజెక్టు పరిధిలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాత్రం పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. -
టీడీపీ కార్యాలయంలో ప్రోటోకాల్ రగడ
యర్రగొండపాలెం: వేదికపై తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుగు తమ్ముళ్లు కుమ్ములాడుకున్నారు. ఈ సంఘటన బుధవారం యర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగింది. ప్రతి నెలా 3వ బుధవారం మండల స్థాయి సమావేశాలు నిర్వహించి సమస్యలపై చర్చించాలని టీడీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఆయా మండలాల్లో తెలుగు తమ్ముళ్లు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశాలకు వేళ్లపై లెక్కించే కార్యకర్తలు పాల్గొంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో అనుకున్న స్థాయిలో కార్యకర్తలు పాల్గొనలేదు. పుల్లలచెరువు మండల సమావేశం ముటుకుల గ్రామంలో శ్రీసర్‌శ్రీ బ్యానర్ తగిలించుకొని నిర్వహించారు. మండల కేంద్రంలో సమావేశం నిర్వహిస్తే టీడీపీలో ఉన్న వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎక్కడ బాహాబాహీకి దిగుతారోనన్న ఉద్దేశంతో ముటుకులలో సమావేశం నిర్వహించారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. యర్రగొండపాలెం మండల పార్టీ కార్యాలయంలో సమావేశం ప్రారంభమైన వెంటనే మండల స్థాయిలో నాయకత్వం వహిస్తున్న ఒక నాయకుడు లేచి సమావేశాల సమయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎవరంటే వారు వేదికలపై కూర్చొని తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. వెంటనే మరో తెలుగు తమ్ముడు కలుగ చేసుకోవడంతో వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. వెనువెంటనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన గొడవ బయటికి రానీయకుండా నాయకులు జాగ్రత్తపడినా నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు మాత్రం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పార్టీ అధిష్టానానికి చేరిన రచ్చ టీడీపీ కార్యాలయంలో జరిగిన రచ్చ ఆ పార్టీ అధిష్టానానికి చేరింది. ఇక్కడ జరిగిన సంఘటన గురించి అధినాయకులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు సమాచారం. రచ్చ బహిరంగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో స్థానిక బస్టాండ్ సెంటర్లో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ఉదయం పార్టీ కార్యాలయంలో ఇద్దరు తెలుగు తమ్ముళ్ల రగడ సాయంత్రానికి రచ్చకెక్కింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ రెండు వర్గాలకు నచ్చచెప్పే పనిలో పడ్డారు. సెంటర్లో ఏమాత్రం గొడవలు జరిగితే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని ఎస్సై ఎం.దేవకుమార్ హెచ్చరించారు. ఎస్సై ఇరువర్గాలకు చెందిన నాయకులకు నచ్చచెప్పి వారిని బస్టాండ్ సెంటర్ నుంచి పంపించేశారు. -
ప్రకాశం జిల్లా మొత్తం ఓటర్లు 13,99,006
బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026డిజిటైజ్ చేసింది 12,69,595ఉమ్మడి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తేల్చేస్తున్నారు. మందగమనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 22 రోజులైనా సరే సగానికి సగం పర్సెంటేజీ కూడా పూర్తి కాలేదు. చివరి వారం రోజుల్లో పరుగులు తీయించినా లక్ష్యానికి దూరంగా ఉండిపోయింది. ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ, వచ్చిన ఫారాలను డిజిటైజ్ చేయడం అనుకున్నంత వేగంగా సాగలేదు. చివరి 4 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 30 శాతం డిజిటైజ్ చేశామని అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. అధికారిక గణాంకాలే దీనికి నిదర్శనం.డిజిటైజ్ చేసింది 8,21,481వివిధ కేటగిరీల్లో లేనివారిగా తేల్చినవి 87,291సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి జిల్లాలో 2752 పోలింగ్ కేంద్రాల పరిధిలో జూన్ 15 నుంచి సర్ కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం జూలై 14తో ముగియాల్సి ఉంది. అయితే ఈ నెల 24వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు వెలువడ్డాయి. ముందుగా ప్రకటించిన దానికి ప్రకారం 14వ తేదీతో ముగించాల్సి ఉన్నందున అధికారులు రకరకాలుగా కుస్తీ పట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా పర్సెంటేజీ చూపించుకోవటానికి ఆబ్సెంట్(లేరు)ను ఎక్కువ చేసి చూపించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 78,422 మందిని ఆబ్సెంట్గా చూపించారు. ప్రకాశం జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 51460 మంది, మార్కాపురం జిల్లా పరిధిలో 26,962 మందిని ఆబ్సెంట్గా చూపించారు. ఫారాలు ఇచ్చి సంతకాలు పెట్టని వారిని కూడా ఆబ్సెంట్ కింది చూపించినట్లు సమాచారం. చివరి రెండు రోజుల ముందు వరకూ 80 శాతం ఉన్న డిజిటైజేషన్ చివరి రోజుకు 100 శాతం పూర్తయిందని చూపించారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆబ్సెంట్ కింద 51460 మంది ఓటర్లు ఉంటే మిగతా కేటగిరీల కింద 77,951 మంది ఓటర్లను చూపించారు. వారిలో చనిపోయిన వారు 40,737, వలసల కింద 23,025 మంది, వేరొక చోట ఓటు కలిగిన వారు 13,746 మంది, ఇతరులు 443 మందిగా తేల్చారు. ఉన్న ఓటర్లలో 1,29,411 మందిని పాత ఓటర్ల జాబితా నుంచి తీసేసినట్లయింది. అలాగే మార్కాపురం జిల్లా పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లోని 21 మండలాల్లో మంగళవారం సాయంత్రానికి మొత్తం 87,291 ఓటర్లు పెండింగులో చూపారు. ఇందులో 22,123 మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. 28,998 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్టు అధికారులు తేల్చారు. 8,647 మంది ఓటర్లను డబుల్ ఎంట్రీలుగా గుర్తించారు. ఫారాలు తీసుకొని ఇవ్వని వారు 561 మందిని ఇతర జాబితాలో చేర్చారు. ఇక 26,962 మంది ఓటర్లను ఆబ్సెంట్ కింద గుర్తించారు. సర్ ప్రోగ్రాం గడువు పొడిగించడంతో అధికారులు వీరిపై దృష్టి సారించాల్సి ఉంది. వివిధ కేటగిరీల్లో లేనివారిగా తేల్చినవి 1,29,411 -
నేడు డీఆర్సీ సమావేశం
ఒంగోలు సబర్బన్: కలెక్టరేట్లో బుధవారం నిర్వహించే డీఆర్సీ సమావేశానికి సంబంధించి అధికారులందరూ సరైన నివేదికలతో హాజరు కావాలని, సమాధానాలు చెప్పటానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పి.రాజబాబు అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించనున్న డీఆర్సీ మీటింగ్‌పై సమీక్ష మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నవంబర్– 2025న జరిగిన డీఆర్సీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన పలు అంశాలపై తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు సమస్యలు, అన్నదాత సుఖీభవ, ఆర్డబ్ల్యూఎస్ తదితర అంశాలను ప్రజా ప్రతినిధులు లేవనెత్తే అవకాశం ఉన్నందున విషయాలను వివరించేలా సంబంధిత అధికారులు ఉండాలన్నారు. సమస్యలను సమగ్రంగా వివరించాలని, అంతేకాకుండా ఆర్థిక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఎంత పనిచేశావయ్యా
● ఒక హత్య.. రైలు పట్టాలపై ముగిసిన నాలుగు ప్రాణాలు● ఏఓ హత్య కేసులో ఏ1 నిందితుడు భార్యా, పిల్లలతో ఆత్మహత్య సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ తోటపల్లిగూడూరు (పొదలకూరు) : బుచ్చిరెడ్డిపాళెం వ్యవసాయశాఖ అధికారి శ్రీహరి హత్యోదంతం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఆస్తి కోసం మేనబావను హత్య చేసిన బావమరిది హరికృష్ణ ఉదంతం వెలుగులోకి రావడం, ఉలిక్కి పడిన నిందితుడు హరికృష్ణ కుటుంబంతో కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్లో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ రెండు కుటుంబాల్లో కన్నీటి సుడులు మిగిల్చింది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పోలీస్‌శాఖ అవినీతి, నిర్లక్ష్యం వెరసీ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు హరికృష్ణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘోర కలికి కారణమైంది. ఆ రోజే స్పందించి ఉంటే.. వ్యవసాయశాఖ అధికారి శ్రీహరి హత్య జరిగిన రోజే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఉంటే.. ఈ రోజు ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేది కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసును ఆ రోజే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలోనే కాదు.. ప్రస్తుతం దర్యాప్తు దశలో కూడా పోలీస్ శాఖ నిర్లిప్తత, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ కదలికలపై నిఘా పెట్టలేకపోయారు. హరికృష్ణ తన కుటుంబ సభ్యులతో టచ్‌లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. భార్యాపిల్లలు ఆమె పుట్టింట్లో ఉండగా, మంగళవారం తెల్లవారుజామున వచ్చి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హరికృష్ణ, అతని కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్, కదలికలపై నిఘా ఉండి ఉంటే.. అభం శుభం తెలియని చిన్నారులతో పాటు జీవితాన్ని పంచుకున్న భార్య బతికుండేది. వారేం తప్పు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన రోజునే హరికృష్ణ తాను చనిపోతున్నానంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చినా.. పోలీస్‌శాఖ నిర్లిప్తంగా వ్యవహరించిందని జిల్లా ప్రజలు నిందిస్తున్నారు. తెల్లవారుజామున ఇంటికొచ్చి.. హరికృష్ణ మంగళవారం తెల్లవారు జామున ఇంటికొచ్చాడు. భార్య ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకుని సింగరాయకొండకు వెళ్లాడు. అక్కడే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల భయం పట్టుకొని అరెస్ట్ చేస్తే బయటకు రావడం కష్టంగా మారుతుందని తన భార్య, పిల్లలు దిక్కులేని వారవుతారనే ఉద్దేశంతోనే హరికృష్ణ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. వెంటాడిన అమావాస్య ఏఓ శ్రీహరి గత నెల 15వ తేదీన అమావాస్య నాడు హత్యకు గురయ్యాడు. సరిగ్గా నెల తిరగకుండానే అదే అమావాస్య అయిన 14వ తేదీ మంగళవారం హరికృష్ణ తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడడం యాధృచ్ఛికంగానే భావిస్తున్నారు. నిందితుడి కదలికలపై నిఘా లేకపోవడంతోనే ఈ దారుణం పోలీసులు అప్రమత్తంగా ఉండి ఉంటే.. ఆ కుటుంబం బతికి ఉండేది పోలీస్ శాఖ అవినీతే ఆ కుటుంబంలో పెను విషాదం హత్య కేసులో ఇరుక్కుని.. కుటుంబాన్ని బలి తీసుకొని జల్సాలకు అలవాటు పడ్డాడు. ఖర్చులు బాగా పెట్టేవాడు. అంతే స్థాయిలో అప్పుల పాలయ్యాడు. దీంతో ఆస్తిని కాజేయాలని బావ హత్య కేసులో ఏ–1 నిందితుడిగా మారాడు. చివరకు పోలీసులు గాలిస్తున్నారని అరెస్టుకు భయపడి తనతో పాటు అభం శుభం తెలియని చిన్న పిల్లలు, భార్యతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. ఏఓ శ్రీహరికి రెండో వివాహానికి హరికృష్ణ చెల్లిని ఇచ్చారు. శ్రీహరి మేనమామ కూడా కావడం వల్ల ఇద్దరి మధ్య ఆస్తి వ్యవహారాలు ఉండేవి. ఈ క్రమంలో శ్రీహరిని..హరికృష్ణ అంతమొందించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసులో హరికృష్ణకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా ఏ–1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ తప్పించుకొని తిరుగుతున్నాడు. హత్య కేసులో ఇరుక్కుని తన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు కుటుంబాన్ని కూడా బలి తీసుకున్నాడు. బుచ్చిరెడ్డిపాళెం ఏఓ శ్రీహరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హతుని బావమరిది కుడుముల హరికృష్ణ (32) ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్‌కు వెళ్లి భార్య ప్రణతి (29), కుమార్తె మూగాంబిక (5), కుమారుడు కౌశిక్(3)లతో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఘోరకలి తోటపల్లిగూడూరు మండలం వరిగొండ పంచాయతీ రావులవారి కండ్రికలో విషాదం నెలకొంది. -
హడావుడిగా సర్చేసి
ఒంగోలు సబర్బన్: జిల్లాలో 1649 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 13,99,006 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. వీరిలో 40,737 మంది ఓటర్లు చనిపోయారని, 23,025 మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లారని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను 100 శాతం డిజిటైజేషన్ చేశామన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ 90.75 శాతం అయిందన్నారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ గడువును ఎన్నికల సంఘం పది రోజులు పొడిగించినందున పూర్తిస్థాయిలో అర్హులందరూ ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు కొనసాగిస్తామన్నారు. బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో బీఎల్ఏలు సహకరిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఓటర్లను కావాలని తొలగించే ప్రక్రియే జరగలేదన్నారు. బీఎల్ఓలకు రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏలు బాగా సహకరించారన్నారు. ఓటర్లకు ఎలాంటి అపోహలకు తావులేకుండా సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. -
కష్టాల రొయ్య..
ఒకవైపు పెరుగుతున్న సాగు వ్యయం, మరోవైపు పడిపోతున్న రొయ్యల రేటుతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు కూడా రాని స్థితిలో రైతు కుదేలవుతున్నాడు. నాణ్యత లేని సీడ్‌తోపాటు డీజిల్ ధరలు సైతం పెరగడంతో సాగు మరింత భారంగా మారింది. అండగా నిలవాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపుతుండడంతో సాగు కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సింగరాయకొండ: జిల్లాలో సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, గూడ్లూరు, ఉలవపాడు, ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల పరిధిలో సుమారు 20 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇందులో దాదాపు 13 వేల ఎకరాలు ’టైగర్’ రొయ్యలు, మిగిలిన 7 వేల ఎకరాలను ’వనామీ’ సాగు చేస్తున్నారు. ఒకప్పుడు డాలర్ పంటగా గుర్తింపు పొందిన ఆక్వాసాగు చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో రైతులు సాగు చేయాలంటే భయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యకు ధర లేదని ఎక్స్‌పోర్టర్లు ధరల్లో భారీగా కోత విధిస్తుండగా, కూటమి ప్రభుత్వ అండతో రొయ్యల మేత కంపెనీలు ధరలు ఇష్టారాజ్యంగా పెంచటం రైతులకు పెను భారంగా మారింది. ప్రస్తుతం మేత ధరలకు తగ్గట్టుగా రొయ్యల రేటు పెరగడంలేదు. వీటన్నింటికీ తోడు మోనో కంపెనీ రొయ్య పిల్లలు నాశిరకంగా ఉండటంతో ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. భారంగా కరెంటు చార్జీలు ఎన్నికల సందర్భంగా అందరికీ కరెంట్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దానిని గాలికొదిలేయడం కూడా రైతులకు ఇబ్బందిగా మారింది. సన్నకారు రైతులకు మాత్రమే కరెంటు సబ్సిడీ యూనిట్‌కు రూ.1.50 లభిస్తుండగా మిగిలిన రైతులకు యూనిట్ ధర రూ.4.50 లు ఉందని రైతులు వాపోతున్నారు. ఇటీవల ఫీడ్ధర కేజీకి రూ.14 పెంచి ప్రభుత్వం నుంచి ఒత్తిడి తేవటంతో కేవలం రూ.2 లు మాత్రమే తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. కరెంటు సబ్సిడీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతులు రావాల్సి ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. అనుకూలించని వాతావరణం ఆక్వాకు పెరిగిన సాగు ఖర్చులతో పాటు వాతావరణ మార్పులు కూడా అనుకూలంగా లేవు. జూలై నెల వచ్చినా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, చెరువుల్లో పరిమితికి మించి రొయ్య పిల్లలను సాగు చేయటంతో తెల్లమచ్చ తెగులు సోకుతోంది. మోనో కంపెనీ రొయ్యలు నాశిరకంగా కారణంగా పిల్లల్లో ఎదుగుదల సరిగా లేదని, దీంతో ఖర్చులు పెరిగి ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన రొయ్య ధరలు: ఆక్వా సాగు ఖర్చులు తగ్గట్లు రొయ్యల కొనుగోలు ధరలు ఉండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైగర్ రొయ్య కేజీ 20 కౌంట్ ధర రూ.700 ఉంటే తప్ప గిట్టుబాటు కాదు. ప్రస్తుతం కేజీ ధర 20 కౌంట్ రూ.640, 30 కౌంట్ రూ.530లకు గాను రూ.470 మాత్రమే ఉంది. ఇలాగైతే సాగు చేయటం కష్టమని ఓ రైతు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రేడియేటర్ ధర సుమారు రూ.5 వేలు అదనంగా పెరిగిందని, డీజిల్ ఇంజన్లు అద్దె నెలకు పవర్‌ను బట్టి రూ.4 వేల నుంచి రూ.7 వేలకు పెరిగాయన్నారు. సాగు తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెంచి, తీరా రొయ్యల పట్టుబడులు జరిగేటప్పుడు మాత్రం వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని, గత్యంతరం లేక తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఎక్స్‌పోర్టర్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదని, ఇలాగైతే ఆక్వా సాగుకు క్రాప్ హాలిడే ఇవ్వడం తప్ప గత్యంతరం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గ్రంథాలయ సెస్ చెల్లించాలి
● అధికారులను ఆదేశించిన జేసీ కల్పనా కుమారి ఒంగోలు సబర్బన్: గ్రంథాలయాభివృద్ధికి తోడ్పడాలని, సకాలంలో గ్రంథాలయ సెస్ సంస్థకు అందేలా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లో మంగళవారం గ్రంథాలయ సెస్ అభివృద్ధి కమిటీ సమావేం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రంథాలయానికి రావాల్సిన బకాయిలు త్వరలో జమ చేయాలని కమిటీ సభ్యులుగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా ఆడిట్ అధికారి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులను ఆదేశించారు. సమావేశానికి కన్వీనర్‌గా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.సుధాకర్ రావు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: కాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి పార్టీకి తీరనిలోటని పలువురు పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గం ఇన్చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు వై వెంకటేశ్వర్లు ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పొగాకు రైతు కంట రక్త కన్నీరు
ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం పొగాకు రైతులను గాలికొదిలేసిందని, మద్దతు ధర రాక రైతు కంట రక్త కన్నీరు కారుతోందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అన్ని రకాల పంటలు సాగుచేసే లక్షలాది మంది రైతులు మద్దతు ధర లభించక అల్లాడుతున్నారన్నారు. ముఖ్యంగా పొగాకు రైతు మద్దతు ధర కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని ధ్వజమెత్తారు. తాము పండించిన పంటను తగలబెట్టుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అధికారులతో, కంపెనీలతో మాట్లాడుతున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు తప్ప రైతుల పక్షాన నిలబడడం లేదని ఆరోపించారు. కంపెనీలు దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పొగాకు రైతుకు మద్దతుగా ఆందోళనలు... పొగాకు రైతులు కష్టాలు పడుతుంటే ప్రభుత్వం ఆదుకోకుండా చోద్యం చూస్తోందని, దున్నపోతుపై వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తోందని బూచేపల్లి ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ వారి పక్షాన నిలబడి పోరాడతామన్నారు. అందులో భాగంగా ఈ నెల 16, 17 తేదీల్లో నిరసన దీక్షలు చేపడుతున్నామన్నారు. 16వ తేదీన కనిగిరిలో ఆర్టీఓ కార్యాలయం వద్ద, 17వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ దీక్షలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వం దిగి వచ్చి మార్క్‌ఫెడ్‌తో కొనుగోలు చేసేంత వరకూ ఆందోళనలు చేస్తామన్నారు. గత సంవత్సరం కష్టాల్లో ఉన్న పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పొదిలికి వచ్చి వెళ్లారని, ఫలితంగా కంపెనీలు పొగాకును కొనుగోలు చేశాయని గుర్తు చేశారు. రైతులకు న్యాయం జరిగిందన్నారు. ఇటీవల ఒంగోలు కేంద్రంగా పార్టీలకతీతంగా జరిగిన ట్రాక్టర్ల ర్యాలీకి వేలాదిగా రైతులు తరలి వచ్చి నిరసన వ్యక్తం చేయడం మీకు కనబడడం లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదే పరిస్థితులు కొనసాగితే రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే మేలుకొని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యే సమీక్షలు చేస్తున్నారే తప్ప రైతులకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయండి.. వేలం కేంద్రాల్లో కంపెనీలు రైతుల వద్ద నుంచి పొగాకు కొనుగోలు చేయకపోతే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి కొనుగోలు చేయాలని బూచేపల్లి డిమాండ్ చేశారు. మా ప్రభుత్వ హయాంలో మార్క్‌ఫెడ్ ద్వారా రూ. 300 కోట్ల వరకూ వెచ్చించి పొగాకును కొనుగోలు చేసి మంచి ధర వచ్చాక అమ్మకాలు చేశామన్నారు. ఫలితంగా రైతులకు, ప్రభుత్వానికి మేలు జరిగిందని చెప్పారు. ఈ ఏడాది వేలం ప్రారంభమై 88 రోజులు కావస్తోందన్నారు. గతేడాది ఇదే సమయానికి సుమారుగా 75 మిలియన్ కేజీలు కొనుగోలు చేశారని, ప్రస్తుతం 35 మిలియన్ కేజీలు కూడా కొనుగోలు చేయలేదన్నారు. సీఎం చంద్రబాబు రెండు సార్లు సమావేశాలు నిర్వహించి నోబిడ్ ఉండకూడదని చెప్పారని, అయినా ఎలాంటి ఉపయోగం లేదని బూచేపల్లి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించేలా దృష్టి పెడుతున్నారే తప్ప రైతులకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమన్నారు. మద్దతు ధరల కోసం రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న వారిలో అన్ని పార్టీలకు చెందిన రైతులు ఉన్నారని, ఇటీవల ఒంగోలులో జరిగిన ర్యాలీలో మీ పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్యారన్‌కు రూ.3 లక్షల వరకూ రైతులు నష్టపోతున్నారన్నారు. మా ప్రభుత్వ హయాంలో కేజీ రూ.320కి పైగా కొనుగోలు చేశారని, ప్రస్తుతం రూ.200లకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. రూ.1000 కోట్లు కేటాయించి రైతులను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని మా నాయకుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతామని, ఆయన్ను ఇక్కడకు తీసుకొచ్చి ఉద్యమం చేస్తామన్నారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసిందన్నారు. నెలకు రూ.15 వేల కోట్లకు పైగా అప్పు చేస్తున్న ప్రభుత్వం ఒక్క రోజు అప్పు రూ.500 కోట్లు ఇచ్చి మార్కెట్లో పోటీ తెస్తే పొగాకుకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించకుండా, కంపెనీల వారిని పిలిచి వార్నింగ్ ఇచ్చాం.. కొనకపోతే నీ సంగతి తెలుస్తాం అని మాట్లాడటం తప్ప రైతులకు న్యాయం చేయటం లేదని విమర్శించారు. వార్నింగ్ ఇస్తే ఎవరు రిస్క్ తీసుకుంటారనీ, ప్రైవేటు వ్యక్తులపై ఇతనికి ఏం అధికారం ఉంటుందని విమర్శించారు. అనంతరం పొగాకు రైతు దీక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ.రమణారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, కనిగిరి జెడ్పీటీసీ కస్తూరిరెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంచార జాతుల పిల్లల భవిష్యత్తు ముఖ్యం
● పిల్లలను విధిగా బడులకు పంపించండి ● సంచార జాతుల అవగాహన సదస్సులో కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: సంచార జాతుల వారు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పిల్లలను విధిగా బడులకు పంపించాలని కలెక్టర్ పి .రాజాబాబు సంచార జాతుల వారిని కోరారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో మంగళవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంచార జాతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సంచార జాతుల వారు వారి పిల్లలను ఏ బడిలోనైనా చేర్పించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, సంచార జాతులు వారి సమస్యల సాధనకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. వారికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, హెల్త్ కార్డులు, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు వంటివి విధిగా ఉండాలని అన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంచార జాతులైన, జంగం, మొండి బండ, పాముల, బుడబుక్కల తదితర కులాల నుండి మౌనిక, లలితమ్మ, వెంకటమ్మ, శ్రీనివాసరావు, లక్ష్మ, చిన్నమ్మ తదితరులు తమ తమ సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముప్పూరి వెంకటేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మల జ్యోతి, సంచార జాతుల సంఘం అధ్యక్షుడు పొగడ్తలచిన్న చెంచయ్య, జంగమ సంఘం అధ్యక్షుడు ముసునూరి కోటేశ్వరరావు, సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రామయ్య, సంచారజాతుల జిల్లా సంఘం అధ్యక్షుడు పొగడ్తల వెంకటేశ్వర్లు, యువజన అధ్యక్షుడు చిన్నకత్తుల రాజేష్, పాముల సంఘం అధ్యక్షుడు దాయాది, కార్యదర్శి నాగులూరి సామ్యూల్ పలువు సంచర జాతులు వారు పాల్గొన్నారు. -
క్షుద్ర పూజల కలకలం
ఒంగోలు టౌన్: నగరం నడిబొడ్డున గోపాల్ నగర్లో క్షుద్ర పూజల కలకలం సృష్టించింంది. అయితే తమ బిడ్డ అనారోగ్యంతో చనిపోయాడని తల్లిదండ్రులు చెబుతుండగా.. లేదు క్షుద్రపూజల వల్లనే చనిపోయాడని బాలుడి తాత, బాబాయ్‌తో పాటుగా ఇరుగు పొరుగువారు చెబుతుండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..నగరంలోని గోపాల్‌నగర్ ఒకటో లైన్ ఎక్స్టెన్షన్ తిరుపతమ్మ గుడి సమీపంలో కటారి కిరణ్ కుమార్, నాగలత దంపతులు జీవిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం కాగా పెద్ద కుమారుడు రిత్విక కళ్యాణ్ చక్రవర్తికు ఆరేళ్ల వయసు. పుట్టుకతో పోలియో వ్యాధితో పాటు మానసిక వికలాంగుడు. సరిగా మాటలు కూడా రావు. కిరణ్ దంపతులు చక్రవర్తికి చికిత్స నిమిత్తం అనేక వైద్యశాలలు తిరిగారు. పుట్టుకతో వచ్చిన వ్యాధి కావడంతో తగ్గదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలో ఉన్న ఒక మహిళ నెల్లూరులో సయ్యద్ మొబినా అని ఒక మహిళ ఉందని, ఆమెకు ఒంట్లో దుర్గమ్మ తల్లి వస్తుందని, అక్కడకు వెళితే బాబుకు వ్యాధి నయమవుతుందని నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన కిరణ్, నాగలత దంపతులు కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లా కొడవలూరులో వున్న మొబినా దగ్గరకు వెళుతున్నారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం గోపాల్నగర్లోనే ఒక ఇల్లు అద్దె తీసుకొని మొబీనా ఇక్కడికే వచ్చి ఉంటుంది. చికిత్స పేరుతో బాలుడు చక్రవర్తిని తన వద్దే ఉంచుకొని ప్రతి రోజు మంత్రాలు చదువుతూ పూజలు చేయడం మొదలు పెట్టింది. ఇరుగు పొరుగుకు వినిపించకుండా పాటలు పెట్టి... బాలుడు చక్రవర్తిని తాళ్లతో కిటికీకి కట్టి వేప మండలు, తాళ్లతో కొడుతుండేదని స్థానికులు చెబుతున్నారు. బాలుడి కేకలు ఎవరికీ వినిపించకుండా పెద్ద శబ్దంతో పాటలు పెట్టేదని చెబుతున్నారు. బాలుడి ముఖఃం మీద కుంకుమ చల్లుతూ పెద్ద పెట్టున కేకలు పెడుతూ మొబీనా మంత్రాలు చదివేదని , దాంతో బాలుడి కళ్లల్లో కుంకుమ పడి ఊపిరాడక ఇబ్బంది పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మొబీనా దెబ్బలకు తాళలేక శనివారం ఉదయం బాలుడు చక్రవర్తి చనిపోయాడని, అయితే ఆదివారం మధ్యాహ్నం 3.35 గంటలకు బాలుడిని బతికిస్తానంటూ చెప్పిన మొబినా సమీపంలోని పుట్ట వద్ద పూజలు చేసిందని చెబుతున్నారు. అప్పటికీ బాలుడు చక్రవర్తి బతకలేదన్నారు. బాలుడి తండ్రి కిరణ్ మృతదేహాన్ని స్వయంగా భుజం మీద వేసుకొని తీసుకెళ్లినట్లు ప్రతక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బాలుడు చక్రవర్తి చనిపోయిన విషయం తెలుసుకున్న కిరణ్ సోదరుడు కిషోర్ ఘటనా స్థలానికి చేరుకొని ఇంట్లో పూజలు చేస్తున్న మొబీనాను బెల్టుతో కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చాడని దీంతో అసలు విషయం చుట్టుపక్కల వారికి తెలిసిందని చెబుతున్నారు. కిరణ్ తండ్రి ఏడుకొండలు , బాబాయ్ కిషోర్ తాలుకా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అనారోగ్యంతోనే నా కుమారుడు మరణించాడు అనారోగ్యంతోనే మా కుమారుడు చనిపోయాడని మృతుడు చక్రవర్తి తండ్రి కిరణ్, తల్లి నాగలత చెప్పారు. మొబినా సమక్షంలో తాలుకా పోలీసులు వీడియో రికార్డు చేశారు. ఈ సందర్భంగా బాలుడి తలిదండ్రులు కిరణ్, నాగలత మాట్లాడుతూ మొబీనాకు ఈ మరణంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పడం గమనార్హం. పక్షవాతంతో పుట్టిన తన కుమారుడికి వ్యాధి నయం కాదని వైద్యులు చెప్పడంతో తెలిసిన వారి ద్వారా మొబీనా దగ్గరకు వెళ్లామని, ఆమె ఆయిల్ మసాజ్ చికిత్స చేసిన తరువాతే తన కుమారుడు లేచి కూర్చుంటున్నాడని తెలిపారు. ఇదే విషయాన్ని తాలుకా పోలీసులకు రాత పూర్వకంగా రాసిచ్చారు. మంత్రగత్తెను వెంటనే అరెస్టు చేయాలి క్షుద్ర పూజల పేరుతో ఆరేళ్ల బాలుడిని అమానుషంగా చంపివేసిన మంత్రగత్తైపె, ఆమెకు సహకరించిన వారిపై హత్యా నేరం నమోదు చేయాలని, వెంటనే వారిని అరెస్టు చేయాలని ఏపి హేతువాద సంఘ అధ్యక్షుడు ఎంకే బేగ్, నాయకులు నజీర్, పూర్వ అధ్యక్షుడు శిఖా చంద్రశేఖర్‌బాబు డిమాండ్ చేశారు. పోలియో వ్యాధితో సచ్చు పడిపోయిన కాళ్లలో చలనం తెప్పిస్తానని చెప్పిన మంత్రగత్తె క్షుద్ర పూజలలో భాగంగా బాలుడిని చిత్ర హింసలు పెట్టిందని స్థానికులు చెబుతున్న మాటలను సాక్ష్యంగా తీసుకోవాలని కోరారు. ఆరేళ్ల బాలుడి మృతిపై రకరకాల పుకార్లు క్షుద్ర పూజలు చేశారంటున్న బాలుడి తాత, బాబాయ్, స్థానిక మహిళలు అనారోగ్యంతో చనిపోయాడని చెబుతున్న బాలుడి తల్లిదండ్రులు పరారీలో మంత్రగత్తె సయ్యద్ మొబినా 20 రోజుల నుంచి గోపాల్ నగర్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయని, ఆరేళ్ల బాలుడిని ఒక గదిలో బంధించి వేప మండలతో చిత్రహింసలు పెడుతుందని స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చినా సరైన స్పందన రాలేదని ఆరోపిస్తున్నారు. బాలుడు చనిపోయిన తరువాత, మృతుడి బాబాయ్, తాత పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత మాత్రమే స్పందించారని , సకాలంలో స్పందించి ఉంటే ఈ అమానుషం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చక్రవర్తికి ఆరోగ్యం బాగు చేస్తానని చెప్పి మొబీనా రూ.3 లక్షలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజనిజాలను తేల్చాలని, హత్య, మోసం కేసులు నమోదు చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అయితే దీనిపై తాలు సీఐ విజయకృష్ణను వివరణ కోరగా...గోపాల్ నగర్లో క్షుద్ర పూజల వలన ఆరేళ్ల బాలుడు చక్రవర్తి మరణించాడని చెప్పడం అవాస్తవమన్నారు. చక్రవర్తి అనారోగ్యంతో చనిపోయినట్లు బాలుడి తల్లిదండ్రులే చెబుతున్నారన్నారు. పోలియో వ్యాధితో బాధపడుతున్న చక్రవర్తి ఆరోగ్యం క్షీణించడం వల్లే చనిపోయాడని భావిస్తున్నామని తెలిపారు. -
సంస్కరణ పేరుతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం
ఒంగోలు సిటీ: రాష్ట్రస్థాయిలో వేలాది మంది ఉపాధ్యాయులను తరలించి అసెంబ్లీని ముట్టడిస్తామని ఫ్యాప్టో రాష్ట్ర నాయకురాలు చెన్నుపాటి మంజుల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నిమిత్తం మంగళవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ర్యాలీ, పికెటింగ్ ధర్నా నిర్వహించారు. స్థానిక పాత జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీకి ఫ్యాప్టో చైర్మన్ కె.ఎర్రయ్య నాయకత్వం వహించగా, జిల్లా సెక్రటరీ జనరల్ ఎస్.ఎండి. రఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఫ్యాప్టో నాయకురాలు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే ఈ ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను తక్షణమే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని, ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలన్నారు. టెట్‌ను ఆన్‌న్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించి కనీస ఉత్తీర్ణత మార్కులు నిర్ణయించాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు. అదే విధంగా 2025 బదిలీల్లో రిలీవర్ లేక రిలీవ్ కాలేని ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలని, జిల్లా గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ నియామకంలో సీనియారిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని, మున్సిపల్ ఉపాధ్యాయుల పీఎఫ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎంటీఎస్ టీచర్ల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని, జీఓ నం.342 ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అవసరమైన సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉన్నత పాఠశాలలో నాన్–టీచింగ్ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లను నియమించాలని, కేజీబీవీ, మోడల్, గురుకుల, ఎయిడెడ్ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని, సాధారణ బదిలీలతో పాటు అంతర్ జిల్లా బదిలీలు కూడా నిర్వహించాలని కోరారు. ఆందోళనకు మద్దతుగా ప్రకాశం జిల్లా జేఏసీ చైర్మన్ సీహెచ్. శరత్‌బాబు, పెన్షనర్స్ నాయకులు సుబ్బారావు, జీవీ శేషయ్య, ఏఐటీయూసీ నాయకులు వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు రమేష్ పాల్గొని ఫ్యాప్టో ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. కె. ఎర్రయ్య, ఎస్.ఎండి. రఫీ, ఎస్.కే. అబ్దుల్ హై, బి. శేషారావు, కె. దేవసహాయం, వెంకట్రావు, వై. సీనయ్య, దార్ల జయరావు, అన్వర్‌బాష, రాష్ట్ర నాయకులు ఎస్ రవి, బి. వెంగళరెడ్డి, డి. శ్రీనివాసులు, కె.మోహన్‌న్‌రావు, పీవీ. సుబ్బారావు, వేమ శేషు, కిలారి వెంకటేశ్వర్లు, గవిని శివశంకర్, చేతల వెంకటేశ్వర్లు, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది ఉపాధ్యాయులతో అసెంబ్లీని ముట్టడిస్తాం ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద ర్యాలీ -
చేతికొచ్చిన కొడుకు చేజారిపోయాడు
చీమకుర్తి: చేతికి అందొచ్చిన కొడుకు ప్రైవేట్ కంపెనీలో స్థిరపడ్డాడు అనుకునే తరుణంలో రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే..చీమకుర్తి మండలం పల్లామల్లికి చెందిన వేలూరి శివసాయి పవన్(25) హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా 10 నెలలుగా పనిచేస్తున్నాడు. మరో రెండు నెలలు చేస్తే కంపెనీలో పర్మినెంట్ చేస్తామని ఇటీవలే కంపెనీ యాజమాన్యం చెప్పినట్లు మృతుడి తండ్రి వేలూరు వేణుబాబు తెలిపారు. ఐటీఐ, డిగ్రీ చేసి ఎలక్ట్రీషియన్‌గా కంపెనీలో ఉన్న వందలాది మంది ఉద్యోగులలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న శివసాయి పవన్ ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించటం కంపెనీలోని తోటి ఉద్యోగులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తన కడుపులో ఇబ్బందిగా ఉందని, మెడికల్ షాపుకు వెళ్ళి ట్యాబ్లెట్లును తెచ్చుకుందామని స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. బైకును నడుపుతున్న శివసాయి పవన్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న కాకినాడకు చెందిన మరో వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. శివసాయి పవన్ మృతదేహాన్ని మంగళవారం పల్లామల్లి తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. కొడుకు కుటుంబానికి అండగా ఉండాటనుకుంటున్న తరుణంలో దూరం కావడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చాడం ఎవరి వల్లా కాలేదు. బతుకుదెరువుకు వెళ్లి శవమై తిరిగొచ్చాడు హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొని పల్లామల్లికి చెందిన ఎలక్ట్రీషియన్ మృతి -
రైతులను బెదిరిస్తే చూస్తూ ఊరుకోం..
అద్దంకి రూరల్: ౖరెతులకు వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వకుండా వారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం అని అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అద్దంకి నియోజకవర్గంలోని రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా వారికి కనెక్షన్లు ఇవ్వకుండా మంత్రి నుంచి రికమండేషన్ లెటర్ తీసుకురావాలని విద్యుత్ శాఖ అధికారులు కోరటంతో రైతులు అశోక్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ అసలే వర్షాలు లేక ఇబ్బందులకు గురవుతున్న రైతులు విద్యుత్ కనెక్షన్లకు దరఖాస్తులు పెడితే మంత్రి అనుమతులు కావాలని అధికారులే చెప్పటం ఏంటని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం కూడా సంతమాగులూరు మండలంలోని మామిళ్లపల్లి గ్రామ రైతులు విద్యుత్ కనెక్షన్లు పెట్టుకుంటే కనెక్షన్లు ఇవ్వకపోవటంతో రైతులు కోర్టులో పిటిషన్ వేశారన్నారు. సంబంధిత అధికారులకు కనెక్షన్లు ఇవ్వండి అని కోర్టు ఆదేశించినా దానిని ధిక్కరించడంతో రైతులు మళ్లీ కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టు చీవాట్లు పెడితే అప్పుడు ఆ రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని గుర్తుచేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బల్లికురవ మండలంలో రైతులకు 1200 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని చెబుతున్నారని, ఇవి ఒక్క బల్లికురవ మండలానికేనా లేక అద్దంకి నియోజకవర్గం మొత్తానికా అని ప్రశ్నించారు. రైతులు కనెక్షన్లు పొందాలంటే టీడీపీ కార్యాలయాల చుట్టూ తిరగాలా లేక ఆ పార్టీలో చేరాలా అని ప్రశ్నించారు. గత 45 రోజుల నుంచి అద్దంకి మండలంలోని కలవకూరు రైతులను తిప్పుతూ అధికారుల ఇప్పుడు మంత్రి సిఫార్సు కావాలంటున్నారని, తాను స్వయంగా విద్యుత్ అధికారులతో ఫోన్లో మాట్లాడితే తమకు రాజకీయ ఒత్తిడిలు ఉన్నాయని అధికారులు తెలిపారన్నారు. సమస్యను మేము అడిగితే అధికారులను, రైతులను బెదిరించి గుండాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. మీరు చేసే గుండాగిరికి బదులుగా తాము గాంధీగిరి చేస్తామన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే వైఎస్సార్సీపీ వారికి ఎలాంటి సహాయం చేయవద్దని చెప్పారన్నారు. అదే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలు, మతాలు, కులాలు చూడకండా అర్హతున్న వారికి అన్ని పథకాలు అందాయని చెప్పారు. రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోతే విద్యుత్ కార్యాలయం ఎదుటే రైతులతో కలిసి గాంధీగిరి చేస్తామన్నారు. ఇప్పటికై నా కళ్లు తెరిచి రైతులకు మేలు చేయాలని కోరారు. లేకుంటే రైతుల పక్షాన పోరాడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఈదా శ్రీనివాసరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రామకోటేశ్వరరావు, జ్యోతి రోశయ్య, మాజీ కౌన్సిలర్ బాలు, రైతులు స్థానిక నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ -
మౌలిక వసతుల కల్పనకు చర్యలు
మార్కాపురం టౌన్: వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలో మౌలిక వసతుల కల్పనకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం రెవెన్యూ, వెలిగొండ ప్రాజెక్టు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, నీటి వసతి, పైపులైన్లు, ఇతర సదుపాయాలను అక్కడ ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు నెలాఖరుకు అన్ని కాలనీలో వసతులను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. అదేవిధంగా పునరావాస పరిహారం కింద ఇంకా ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి వంటి అంశాలను వారంలో జాబితా తయారు చేసి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, వెలిగొండ ప్రాజెక్టు ఎస్ఈ అబూ తాలిం, ఈఈ శ్రీనివాసరావు, ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, కంభం ఎస్డీసీ సత్యనారాయణ,ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: జిల్లాలో రూ.13.43 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. జిల్లా పారిశ్రామిక విస్తరణ, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. జిల్లాలోని పరిశ్రమలకు సంబంధించిన వివిధ రకాల రాయితీల కోసం వచ్చిన 44 క్లెయిమ్‌లను పరిశీలించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పరిశ్రమల అనుమతుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించారు. పరిశ్రమల స్థాపన, అనుమతులు, ఇతర అంశాల్లో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. పెద్దదోర్నాల: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి టిఫిన్ హోటల్ దగ్ధమైంది. ఈ సంఘటన యడవల్లి సమీపంలోని నయారా పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం జరిగింది. ఈ సంఘటనలో యడవల్లికి చెందిన బత్తుల బాలవెంకటేశ్వర్లుకు చెందిన హోటల్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో తన కుమార్తెకు చెందిన 10వ తరగతి, ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్లతో పాటు, రెండు ఫ్రిజ్‌లు కాలిపోయినట్లు బాధితుడు వాపోయాడు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఒంగోలు సిటీ: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026 కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత నిర్ణయించిన గడువుకు బదులుగా ఈ నెల 20వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులు సెల్ఫ్ నామినేషన్, ఐదుగురు ఫెలో టీచర్ల సిఫార్సు లేదా లీప్ యాప్ ద్వారా పనితీరు ఆధారిత ఎంపిక విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన ఉపాధ్యాయులు గడువు లోగా దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చే దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు తదుపరి చర్యలు చేపడతామని డీఈఓ వెల్లడించారు. గుడ్లూరు: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బిగిస్తుండగా కిందపడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఏలూరుపాడు శాంతినగర్‌లో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన మల్లికార్జున కరెంట్ పనులకు వెళుతుంటాడు. అదే క్రమంలో శాంతినగర్‌లో సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ బిగించే సమయంలో కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కావలి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య ఉన్నారు. పామూరు: సిమెంట్ లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి మండలంలోని మోపాడు గ్రామం వద్ద పామూరు కందుకూరు 167బి జాతీయ రహదారిపై జరిగింది. వలేటివారిపాలెం మండలం కాకర్లపాలెం గ్రామానికి చెందిన మితుకుల్ల అచ్యుత్ కుమార్ హీరోహోండా బైక్‌పై పామూరు వైపుకు వస్తున్నాడు. పామూరు వైపు నుంచి దుకూరు వైపుకు వెళ్తున్న సిమెంట్‌లారీ బైక్‌ను ఢీకొట్టగా మోటార్‌సైక్లిస్ట్ మితుకుల్ల అచ్యుత్‌కుమార్(37) రోడ్డుపై పడగా తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై కట్టా అనూక్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన సిమెంట్ లారీని పామూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనలో ఇతర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వరిసాగుకు నీళ్లొదలండి
కంభం: ‘అదును దాటి పోతుంది వరి సాగుకు చెరువు నీళ్లు వదలండి’ అంటూ సోమవారం కంభం చెరువు ఆయకట్టు రైతులు స్థానిక ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇరిగేషన్ డీఈ సీహెచ్ రామారావు, ఏఈ శ్రీనివాస నాయక్‌ను చుట్టుముట్టిన రైతులు వరి నారుమడులు సిద్ధం చేసుకునేందుకు అదును దాటిపోతుందని, ఇప్పటి వరకు తూములు ఎత్తకుంటే వరి నాట్లు ఎప్పుడు వేసుకోవాలని ప్రశ్నించారు. పదిహేను రోజులుగా రైతులు ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా స్పందించకుండా అదును దాటిన తర్వాత నీళ్లొదినా ఫలితం లేదని, దిగుబడులు రావని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కంభం, పోరుమామిళ్లపల్లి, చిన్నకంభం, నల్లకాల్వ, హజరత్‌గూడెం, రావిపాడు, దరగా, ఔరంగబాదు, తదితర గ్రామాల రైతులు ఈ ఖరీఫ్‌కు వరి వేసేందుకు ఇప్పటికే వరి విత్తనాలు తెచ్చుకొని నారుమడులు తయారు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని అధికారులకు తెలిపారు. కంభం ఎస్సై శివకృష్ణారెడ్డి సిబ్బందితో కలసి ఇరిగేషన్ కార్యాలయం వద్దకు చేరుకొని రైతులు, అధికారులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. డీఈ మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆయకట్టుకు దూరంగా ఉన్న గ్రామాల పొలాలకు నీరందించలేమని తెలిపారు. కార్యక్రమంలో కంభం చెరువు అభివృద్ధి కమిటీ చైర్మన్ పార్శ ఆదయ్య, రైతులు పాల్గొన్నారు. -
బూచేపల్లి వైద్య శిబిరానికి విశేష స్పందన
కమలాకర్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మేరుగు నాగార్జున, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కొమ్మూరి కనకారావు, కసుకుర్తి ఆదెన్న, వేమా శ్రీనివాసరావు తదితరులు రోగులకు మందులు పంపిణీ చేస్తున్న బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మేరుగు నాగార్జున చీమకుర్తి: బూచేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం చీమకుర్తిలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చీమకుర్తితో పాటు చుట్టుపక్కల గ్రామాలు, మండలా ల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి సద్వినియోగం చేసుకున్నారు. సినీ హీరో బూచేపల్లి కమలాకర్‌రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా గుంటూరు పెదకాకాని లోని శంకర నేత్రాలయ వారి సహకారంతో నిర్వహించగా, వైద్య పరీక్షల కోసం 1700 మందికిపైగా హాజరయ్యారు. వారిలో కంటి ఆపరేషన్లు అవసరమైన 600 మందిని ఎంపిక చేసినట్లు బూచేపల్లి ట్రస్ట్ తెలియజేసింది. బూచేపల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేసిన 12వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని కమలాకర్‌రెడ్డి తల్లి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కమలాకర్‌రెడ్డి సోదరుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, డాక్టర్ బీ జవహర్ ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమలాకర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని బూచేపల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఉచిత మెగా కంటి వైద్యశిబిరం ద్వారా వందలాది మంది రోగులకు వైద్య సదుపాయం కల్పించడం అభినందనీయమని కొనియాడారు. గత 12 సంవత్సరాలుగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది మందికి కంటి ఆపరేషన్లు చేయించటం బూచేపల్లి కుటుంబం మానవీయతకు నిదర్శనమని ప్రశంసించారు. తొలుత బూచేపల్లి కమలాకర్‌రెడ్డి పార్కులోని స్మారకం వద్ద కమలాకర్‌రెడ్డి చిత్రపటానికి గజమాలలతో బూచేపల్లి వెంకాయ మ్మ, బూచేపల్లి శివప్రసాదరెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. బూచేపల్లి కల్యాణ మండపం వద్ద కమలాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వైద్యశిబిరానికి వచ్చిన రోగులతో పాటు వైఎస్సార్ సీపీకి చెందిన దాదాపు 6 వేల మంది పాల్గొన్నారు. కంటి ఆపరేషన్లకు ఎంపికై న 600 మందిని దశల వారీగా శంకర నేత్రాలయకు తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్లు చేయించి మందులు కూడా ఉచితంగా అందించి తిరిగి చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపం వద్దకు చేర్చనున్నట్లు బూచేపల్లి ట్రస్ట్ నిర్వాహకులు తీసుకున్నారు. ఆపరేషన్లు అవసరం లేని వారికి కూడా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, నాయకులు మన్నం శ్రీధర్, చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు తెల్లమేకల గాంధీ, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, బీమన వెంకట్రావు, తప్పెట బాబూరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 1700 మందికిపైగా హాజరు కంటి ఆపరేషన్లకు 600 మంది ఎంపిక బూచేపల్లి కమలాకర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా బూచేపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ -
చంద్రబాబు ప్రభుత్వం విఫలం
కనిగిరి రూరల్: పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులతో కలిసి కనిగిరిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారికి జరుగుతున్న అన్యాయం, నష్టం గురించి దద్దాల నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు న్యాయం చేయాలంటూ పొగాకు బోర్డు సూపరింటెండెంట్‌తో దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడారు. గిట్టుబాటు ధరలు, బేళ్ల కొనుగోలు, నో బిడ్లు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ కూటమి సర్కార్‌లో ఏ పంటకూ గిట్టుబాటు, మద్ధతు ధరలు దక్కడం లేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా మేలు జరిగిందన్నారు. పొగాకు పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించి ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులను ఆదుకున్నారని చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అందుకు భిన్నంగా జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతులకు న్యాయం చేయాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ఈ నెల 16వ తేదీ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు దద్దాల వెల్లడించారు. రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్కే అబ్దుల్‌గఫార్, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సూరసాని మోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, నాయకులు కటికల వెంకటరత్నం, యక్కంటి శ్రీనివాసులరెడ్డి, పోలక సిద్దారెడ్డి, పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, మండాది కృష్ణారెడ్డి, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, ఆయిమల్ల నాగమణి, ప్రత్తి సురేష్‌రెడ్డి, పలుకూరి భాస్కర్, సూరసాని చంద్రశేఖర్‌రెడ్డి, రేగుల బాలయ్య చౌదరి, సూరసాని చినకాశిరెడ్డి, గోబ్బిళ్ల శ్రీను, కల్లూరి రవీంద్రారెడ్డి, ఎస్కే మహాబూబ్ బాషా, పాపాబత్తిన నాగేశ్వరరావు, మారం వెంకటేశ్వరరెడ్డి, బచ్చు వెంగళరావు గుప్తా, రాచర్ల నరేష్ గుప్తా, ఇండ్లా శ్రీకాంత్, ఇండ్లా భాను, సుస్మిత తదితరులు పాల్గొన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ఘోర వైఫల్యం కనిగిరి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణయాదవ్ కనిగిరిలో 16న పొగాకు రైతు దీక్షను విజయవంతం చేయాలని పిలుపు -
15 నుంచి ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమాలు
మార్కాపురం: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల 15 నుంచి ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. కలెక్టరేట్లో రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమంపై సోమవారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. 15 నుంచి అంగన్వాడీ, పాఠశాల ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమాలను ప్రారంభించాలని తెలిపారు. అంగన్వాడీ పిల్లలకు ఆరోగ్య పరీక్షలను ఏడాది రెండుసార్లు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏడాది ఒకసారి నిర్వహించాలని సూచించారు. ఈ స్క్రీనింగ్ కార్యక్రమాలను ఏఎన్‌న్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, మెడికల్ ఆఫీసర్లు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో 5 ఏళ్ల లోపు అంగన్వాడీ పిల్లలు సుమారు 54,868 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న సుమారు 96,048 మంది విద్యార్థులకు ఆరోగ్య స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి పద్మావతి, ఆర్బీఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ డి. చంద్రశేఖరరావు పాల్గొన్నారు. అనంతరం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
23న ఒంగోలు జాతి పశువుల బహిరంగ వేలం
నాగులుప్పలపాడు: చదలవాడ పశుక్షేత్రంలో ఈ నెల 23వ తేదీ ఒంగోలు జాతి పశువులకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు పశు ఉత్పతి క్షేత్రం ఉపసంచాలకుడు డా.బి.రవి తెలిపారు. ఈ వేలంలో ఒంగోలు జాతి ఒట్టి ఆవులు 8, పెయ్య దూడలు 16, ఒంగోలు జాతి కోడె దూడలు 25, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు 2 మొత్తం 51 పశువులకు చదలవాడ పశుక్షేత్రంలో 23వ తేదీ ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేలంలో పాల్గొనే రైతులు రూ.5 వేల ధరావత్తు చెల్లించాలన్నారు. వివరాలకు 93929 01049 నంబరును సంప్రదించాలన్నారు. తాళ్లూరు: తమకు ఆరు నెలలుగా జీతాలు అందలేదంటూ రామతీర్థం స్కీం కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తూర్పు గంగవరం సచివాలయం వద్ద ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద సాగర్ నీటిని నిలిపేసి పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ స్కీం కార్మికులు మాట్లాడుతూ అగ్రిమెంట్లో ఉన్న నిబంధనల ప్రకారమే జీతాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, బ్యాంక్ అకౌంట్ ద్వారా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆరు నెలలుగా నిలిపేసిన జీతాలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక రెవెన్యూ భవన్లో జేఏసీ నాయకులు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంతో నిర్వహించనున్న చర్యల్లో ఉద్యోగుల కోర్కెలు తీరాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీజేఏసీ అమరావతి 21 డిమాండ్లతో పోరాటం చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. ప్రభుత్వం చర్చల కోసం మంత్రుల కమిటీని నియమించింది. ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వంతో సచివాలయంలో చర్చించింది. సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు, మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ తదితర ప్రధానమైన 21 డిమాండ్లను మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లారన్నారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ ఎస్.పోలయ్య, మహిళా వింగ్ జనరల్ సెక్రెటరీ సీహెచ్.శ్రీదేవి, విజయ లక్ష్మి, హసీనా, ఒంగోలు డివిజన్ అధ్యక్షుడు బి.సత్యసాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఊతకోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్‌స్టేషన్ ఎదుట వృద్ధురాలి నిరసన
ముండ్లమూరు: న్యాయం చేయాలని కోరుతూ వృద్ధురాలు స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. వివరాల్లోకి వెళితే..ముండ్లమూరు మండలం కొక్కెర కొండయ్యపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు సంపతి వెంకటమ్మకు చెందిన పొలాన్ని, ఇంటిని లాక్కోని కోడలు బయటకు నెట్టింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా ఏఎస్సై రూ.55 వేలు తీసుకొని న్యాయం చేస్తానని నమ్మబలికాడు. కానీ ఎన్ని రోజుల నుంచి పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో సోమవారం ఉదయం 10గంటలకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన వృద్ధురాలు ఏఎస్సై పవన్ వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించుకుంది. మధ్యాహ్నం వరకు ఎర్రని ఎండలో నిలబడి ఉంది. అయినా ఎవరూ పట్టించుకున్న వారే లేరు. చివరకు విలేకరులు వచ్చి ఫొటోలు తీసుకోవడంతో పోలీసులు వచ్చి ఆమెను లోపలికి తెసుకెళ్లి ఆమె కోడలిపై కేసు పెట్టారు. కానీ ఏఎస్సై తీసుకున్న నగదు మాత్రం ఇవ్వలేదు. కానీ సోమవారం రాత్రి కూడా వృద్ధురాలిని స్టేషన్‌కు పిలిపించి రాజీ ప్రయత్నాలు చేయడం గమనార్హం. న్యాయం చేస్తానని ఏఎస్సై నగదు తీసుకున్నాడు 75 ఏళ్ల వయసులో నన్ను ఇబ్బంది పెడుతున్నారని కన్నీరు -
మంగళవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2026
బూచేపల్లి వైద్య శిబిరానికి విశేష స్పందన బూచేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీమకుర్తిలో నిర్వహించిన ఉచిత మెగా కంటివైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 1700 మందికిపైగా హాజరయ్యారు.వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రెండు నెలల్లోనే మంజూరు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాలంటే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సిఫారసు లేఖ తీసుకురావాలని అధికారులు చెబుతుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక బోర్లు వేయాల్సి వచ్చిన రైతులకు కనెక్షన్లు ఇవ్వకుండా నెలల తరబడి తిప్పించడంపై రైతులు, రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
అర్జీల పరిష్కారంపై శ్రద్ధ చూపాలి
మార్కాపురం: ప్రజల నుంచే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, జవాబుదారీగా ఉండాలని ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ మీకోసం నిర్వహించారు. అందిన ఫిర్యాదులపై పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడి తక్షణం విచారించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువు లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్న వారికి ప్రత్యేక శ్రద్ధతో స్పందించి వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పోలీసు కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయాలలో, సబ్ డివిజన్లో కార్యాలయాల్లో అందజేయాలన్నారు. ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, ఉద్యోగాల పేరుతో మోసం, వేధింపులు వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. డీఎస్పీ నాగరాజు, సీఐలు అల్తాఫ్ హుస్సేన్, వినోద్, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దదోర్నాల: గుండెపోటుతో అసిస్టెంట్ ఫారెస్టు బీట్ ఆఫీసర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నల్లగుంట్లలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..నల్లగుంట్లకు చెందిన మోహన్‌బాబు అసిస్టెంట్ ఫారెస్టు బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం నల్లగుంట్ల బీట్ పరిధిలో తాను ఎక్కడెక్కడ విధులు నిర్వహించిన సమాచారాన్ని ఫారెస్టు గ్రూపులో అధికారులకు తెలియపరిచాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. మృతునికి భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మోహన్‌బాబు మృతిపై ఫారెస్టు అధికారులు తీవ్ర వ్యక్తం చేశారు. ఒంగోలు సబర్బన్: రాష్ట్ర సమాచార శాఖ (ఆర్టీఐ) కమిషనర్ డాక్టర్ చావలి సునీల్ సోమవారం జిల్లాలో పర్యటించారు. తొలుత ఒంగోలులోని ప్రకాశం భవనంలో కలెక్టర్ పి.రాజాబాబును కలిశారు. అనంతరం స్థానిక జీజీహెచ్, మున్సిపల్ కార్యాలయం, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్లను సందర్శించారు. ఆయా కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం అమలవుతున్న తీరును పరిశీలించారు. సమాచార హక్కు విషయంలో ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బోర్డులు, సమాచార అధికారుల పేర్లు ప్రదర్శించాలని సూచించారు. -
అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ విజయసునీత మార్కాపురం: ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయసునీత హెచ్చరించారు. కలెక్టరేట్లో తన ఛాంబర్లో సోమవారం జేసీతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఎరువుల పంపిణీ కోసం ఏపీ ఏఐఎంఎస్(ఏపీ ఎయిమ్స్)యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ప్రతి రైతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని తమకు కావాల్సిన ఎరువులను తెచ్చుకోవచ్చాన్నారు. వ్యాపారులు ఎవరైనా ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, ఎరువులను పక్కదారి పట్టించినా, వివిధ రకాల ఎరువులను కచ్చితంగా కొనుగోలు చేయాలని రైతులను ఇబ్బంది పెట్టినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీని వలన రైతులు విచక్షాణ రహితంగా ఎరువులు వాడటం, బ్లాక్ మార్కెటింగ్ తగ్గుతుందన్నారు. యూరియా, డీఎపీ తదితర ఎరువులు అన్నికూడా యప్ ద్వారా ఆర్ఎస్కేలు, డీలర్ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది రైతులు ఉన్నారని, ఇప్పటి వరకు 1.17లక్షల మంది రైతులు యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారని చెప్పారు. ఈ ఏడాది వర్షాభావంతో ఖరీఫ్ సీజన్ ఆలస్యంగా ప్రారంభవుతుందని చెప్పారు. దీంతో ఎరువులను కొద్ది మంది రైతులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. యూరియా 12,779 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4,400 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా జిల్లాలో 120 టన్నుల యూరియా, 300 టన్నుల డీఏపీ మాత్రమే రైతులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఎరువుల అమ్మకాలపై టాస్క్ఫోర్సును ఏర్పాటు చేస్తున్నామని, టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెస్తున్నామని, ఏ డీలర్ అయినా రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 650 హెక్టార్లలో పత్తి సాగు చేశారని, వర్షాలు పడితే కంది, ఇతరత్రా పంటలు సాగవుతాయన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎరువుల అమ్మకాలపై మార్కాపురంలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి డీఏఓ బాలాజీ నాయక్ పాల్గొన్నారు. -
కొనసాగిన పచ్చ దందా..!
తప్పు కప్పిపుచ్చుతూ..సాక్షి టాస్క్‌ఫోర్స్: దర్శి నియోజకవర్గంలో టీడీపీ ముఖ్యనేత కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీసులు, ప్రభుత్వ అధికారులు రోజురోజుకూ ఇంకాస్త దిగజారిపోతున్నారు. ఏకంగా పచ్చ కండువాలు కప్పుకున్నట్లుగా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రోజుకో రకంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ చూసి నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కురిచేడు మండలంలో వెంచర్ వేసిన వ్యక్తిని ఆదివారం అక్రమంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. సోమవారం తమ పచ్చ దందాను కొనసాగించారు. సదరు వెంచర్‌కు అనుమతులు లేవంటూ వెంచర్ ముఖద్వారం గోడకు నోటీసులు అంటించారు. కురిచేడు మండలంలో ఈ రెండేళ్లలో 100 ఎకరాలకుపైగా పొలాలను వెంచర్లుగా మార్చారు. అయితే, విజయవాడకు చెందిన వ్యక్తులు నమశ్శివాయపురం పంచాయతీ మల్లాయపాలెం రెవెన్యూ విలేజ్‌లో వెంచర్లు వేసిన 13 సర్వే నంబర్లలో 26.56 ఎకరాల భూమిలో వేసిన ఒక్క వెంచర్‌కు మాత్రమే అనుమతులు లేవని గ్రామ కార్యదర్శి ద్వారా సోమవారం నోటీసులు అంటించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఆ వెంచర్ యజమాని విజయవాడ, రాజమహేంద్రవరం నుంచి బస్సులో కొనుగోలుదారులను తీసుకురాగా.. అదే సమయంలో పోలీసులు వచ్చి బస్సును నిర్బంధించి అక్కడకు వచ్చిన వారిని వేరే వాహనాలు చూసుకుని వెళ్లాలంటూ పంపించి వేశారు. దీనిపై సోమవారం పత్రికల్లో కథనాలు రావడం, పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. సోమవారం వెంచర్ వద్ద గ్రామ కార్యదర్శితో నోటీసులు అంటించారు. వెంచర్లో ఉన్న బస్సును పంపించి వేసి నోటీసులు అంటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పంచాయతీ, రెవెన్యూ అధికారులకు సంబంధించిన విషయంలో ఆదివారం పోలీసులు రంగ ప్రవేశం చేయడం వెనుక గొట్టిపాటి లక్ష్మి హస్తం ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. పోలీసుల తీరుపై సాక్షి దినపత్రికలో ‘వెంచర్ వేస్తే వాలిపోతున్న టీడీపీ గద్దలు’ అనే శీర్షికతో సోమవారం కథనం ప్రచురితమవడంతో అందరూ తేలుకుట్టిన దొంగలు మాదిరిగా వ్యవహరించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు, టీడీపీ ముఖ్య నేతపై వచ్చిన నిందను తొలగించేందుకు పంచాయతీ అధికారులను పురమాయించి నోటీసులు అంటించారని ప్రజలు విమర్శిస్తున్నారు. గొట్టిపాటి లక్ష్మికి వెంచర్ యజమాని డబ్బులు ఇవ్వలేదనే ఇలా చేస్తోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కురిచేడు మండలంలోని వెంచర్‌కు అనుమతులు లేవంటూ నోటీసులు ఆదివారం వెంచర్ యజమానినిఅదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం వెంచర్ గోడకు నోటీసులు -
మాజీ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి
ఒంగోలు టౌన్: మాజీ కానిస్టేబుల్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడిచేసిన సంఘటన కలకలం సష్టించింది. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని కేశవస్వామిపేటకు చెందిన కొప్పుల సాయికుమార్ గతంలో కానిస్టేబుల్‌గా పనిచేయగా, వివిధ కారణాలతో సర్వీసు నుంచి రిమూవ్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నగరంలోని కృష్ణుడి విగ్రహం వద్ద శివాలయం సెంటర్లో సాయికుమార్‌పై దాడి చేశారు. ఈ దాడిలో సాయి కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. రాత్రి 3 గంటల సమయంలో సాయికుమార్‌ను ఎవరో కొట్టి పడేసి వెళ్లారని దండే దినేష్ అనే వ్యక్తి సాయి కుమార్ వదిన మల్లీశ్వరికి ఫోన్ చేసి చెప్పాడు. ఆమె వెళ్లేసరికే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాయి కుమార్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మల్లీశ్వరి ఫిర్యాదు మేరకు ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేకాట గొడవలే ఈ దాడికి కారణమని ప్రచారం జరుగుతోంది. -
మోదీ వ్యతిరేక ఓటర్లను తొలగించడమే సర్
ఒంగోలు టౌన్: కేంద్రంలోని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో అసంతృప్తికి గురైన ప్రజలను, ప్రతిపక్ష పార్టీల అనుకూల ఓటర్లను తొలగించడానికే సర్ ప్రక్రియను చేపట్టారని మేలుకో ఆంధ్రప్రదేశ్ సంస్థ రాష్ట్ర కో కన్వీనర్ షేక్ సుభాన్ అన్నారు. దేశంలో 1952 నుంచి ఓట్ల మార్పులు, చేర్పుల ప్రక్రియ జరుగుతున్నా నేడు మోదీ పాలనలో చేస్తున్న సర్ ప్రక్రియలో ఉద్దేశాలు వేరుగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మాదాల నారాయణ స్వామి భవనంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎస్ భారతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుభాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 52 శాతం సర్ ప్రక్రియ పరిశీలన పూర్తయిందని, రేపు గడువు ముగిసే సమయానికి మిగిలిన ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో ఆలోచించుకోవాలని చెప్పారు. సర్ ప్రక్రియను మరో నెల రోజుల పాటు పొడిగించాలని కోరారు. ప్రగతిశీల మహిళాసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పద్మ మాట్లాడుతూ ఓటు హక్కుకు పౌరసత్వానికి మధ్య సంబంధం తీసుకొని రావడం రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పారు. వలసలు, గిరిజనులు, మహిళలు, ముస్లింలు సర్ ప్రక్రియ ద్వారా ఓటు హక్కును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మన దేశంలో 6.23 కోట్లను తొలగించారని తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు సీఎస్ సాగర్, సూర్య కుమారి, కృష్ణారావు, రావులపల్లి లక్ష్మి, ఆర్.మోహన్, సుశీల, సీతారావమ్మ, సుజాత, అమ్మాజీ, హనుమంతరావు, దారా సుబ్బారావు, ఎల్.రాజశేఖర్, వైవీ కృష్ణారావు పాల్గొన్నారు. ● డీఈఓ సీవీ రేణుక ఒంగోలు సిటీ: ఓపెన్ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక సూచించారు. నగరంలోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్లకు సోమవారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగోన్నతి అవకాశాలు కల్పించడంలో ఓపెన్ స్కూల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జిల్లాలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లను పెంచేందుకు కోఆర్డినేటర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. స్టడీ సెంటర్ల నిర్వహణ, పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ (పీసీపీ) తరగతుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. -
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ఒంగోలు సబర్బన్: మీకోసం అర్జీల పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజా బాబు స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్ఓ పి.వెంకటరమణ, డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, డీపీఓ అనుపమ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చిరంజీవి ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 261 అర్జీలు వచ్చాయి. వీటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కింద స్థాయి సిబ్బంది ఇచ్చే నివేదికలపై ఆధారపడకుండా జిల్లా స్థాయి అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించి ఈ అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మీకోసం అర్జీలకు పరిష్కారం, ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్‌లో సానుకూల ప్రజాభిప్రాయం పెంపు కోసం ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నందున అధికారులు కూడా ఇదే స్ఫూర్తితో మరింత చురుకుగా పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. మీకోసం అర్జీలకు సకాలంలో సహేతుక పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎన్నాళ్లీ అప్పుల బతుకులు ● ఏడాది నుంచి పెండింగ్ జీతాలు ఇప్పించాలని కలెక్టర్‌కు వినతి కురిచేడు: స్థానిక గ్రామ పంచాయతీ కార్మికులకు ఏడాది నుండి జీతాలు చెల్లించకపోవటంతో అప్పులు ఇచ్చేవారు లేక, తమ కుటుంబాలను పోషించుకోలేక వేరే పనులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చివరి సారిగా కలెక్టర్ రాజాబాబుకు తమ గోడు వినిపించుకునేందుకు సోమవారం కార్మికులందరూ చలో కలెక్టర్ కార్యాలయం అంటూ బయలు దేరి వెళ్లారు. గ్రామంలో ఒక్కరోజు చెత్త తీయకపోతే ఎక్కడ చెత్త అక్కడ పేరుకుని దుర్గంధం వెదజల్లుతూ గ్రామం అంతా చెత్తమయమైంది. గతంలో కూడా చాలాసార్లు పంచాయతీ కార్మికులు సమ్మె చేసినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికై నా పంచాయతీ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయి వేతనాలు వెంటనే ఇచ్చి గ్రామంలో చెత్తపేరుకుపోకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడండి ● గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు భూముల్లో చేపల చెరువులు ● కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన మండలంలోని ధేనువకొండ గ్రామస్తులు అద్దంకి: గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు భూముల్లో చేపల చెరువులను వేయకుండా అడ్డుకోవాలని కోరుతూ సోమవారం ఒంగోలులో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో మండలంలోని ధేనువకొండ గ్రామానికి చెందిన గోకతోటి గోపీకృష్ణ, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, సింగంపల్లి రాజుతోపాటు మరో 50 మంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఽమోదేపల్లి గ్రామ రెవెన్యూలో 251,252,253,149, 250 సర్వే నంబర్లలోని భూమి గుండ్లకమ్మ ప్రాజెక్టులో ముంపులో పోగా, ఆయా భూముల రైతులకు పరిహారం ఇచ్చారు. అయితే కొందరు అక్రమార్కులు ఆభూముల్లో చేపల చెరువులను తవ్వుతున్నారని చెప్పారు. సుమారు 100 ఎకరాల్లో చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వేస్తున్నారన్నారు. చేపల చెరువుల నిర్మాణం వలన మాపట్టా భూముల నుంచి వర్షపు నీరు నదిలోకి వెళ్లకుండా ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున చేపల చెరువుల నిర్మాణాలను అధికారులు అడ్డుకోవాలని విన్నవించారు. చెరువుల నుంచి విడిచిన కలుషిత నీటి వలన తమ గేదెలు రోగాల బారిన పడకుండా కాపాడాలని కోరారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడండి
మార్కాపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడి పనిచేయాలని కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు మొత్తం 238 అర్జీలురాగా, వీటిలో రెవెన్యూకు సంబంధించి 150, ఇతర సమస్యలపై 88 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.విజయ సునీత మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు సరిగా దృష్టి సారించడం లేదని, ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, కనిగిరి ఆర్డీవో అజయ్ కుమార్, కంభం ఎస్డీసీ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్చార్జి అధికారి బాలాజీ నాయక్, డీఎంహెచ్‌వో వాణిశ్రీ, విద్యుత్ శాఖ ఎస్ఈ ఖరీం, లీడ్ బ్యాంక్ మేనేజర్ షాహీర్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తమ్ముడి ఆచూకీ తెలపండి: సుమారు రూ.50 నుంచి రూ.60 లక్షల మేర ఇచ్చి సొంత తమ్ముడు బుర్ర ప్రసాద్ రెడ్డి చేతిలో ఘోరంగా మోసపోయానని అంజలి ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి బాగా సంపాదించి మిమ్మల్ని బాగా చూసుకుంటానని నమ్మించి మోసం చేసి పత్తా లేకుండా పారిపోయాడన్నారు. గతంలో ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పందన ద్వారా అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విసిగిపోయిన అంజలి చేసిన అప్పులకు వడ్డీలకు కట్టలేక అల్లాడుతున్నానని స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు గోడు వెళ్లబోసుకుంది. తమ్ముడి ఆచూకీ తెలపాలని వేడుకుంది. మెస్‌చార్జీలు పెంచాలని కలెక్టర్‌కు వినతి ప్రభుత్వం హాస్టళ్ల మెస్ చార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. సంక్షేమ హాస్టళ్ల మెస్ బిల్లు విషయంలో ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కురిపిస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొమ్ము విజయ్ అన్నారు. ఇప్పటికే రూ.1600 ఉన్న మెస్ బిల్లుకి 10 శాతం పెంచారు, అంటే ఒక విద్యార్థికి రూ.160 మాత్రమే పెంచారన్నారు. వసతి గృహాల మెనూ చార్ట్ మాత్రం కనువిందుగా ఉందని, కానీ అమలు చేయడంలో లోపం జరుగుతోందన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా ఉపాధ్యక్షుడు వందన్ కుమార్, పట్టణ నాయకులు రాము, తరుణ్ పాల్గొన్నారు. -
పాలేరులో ఇరుక్కున్న ఇసుక టిప్పర్
జరుగుమల్లి(సింగరాయకొండ): పాలేరు నదిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ ఇరుక్కున్న సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరుగుమల్లి మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ కంపెనీ గోడౌన్ సమీపంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం పాలేరు నదిలో జరుగుమల్లి, చింతలపాలెం, సతుకుపాడు ప్రాంతంలో రాత్రి పూట టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ విషయం తెలిసి కూడా రెవెన్యూ, పోలీసు, మైనింగ్, గ్రామ పంచాయతీ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించటమే కాక ట్రాక్టర్ల ద్వారా తప్ప టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా చేయడం లేదని నమ్మబలుకుతున్నారు. ఈ క్రమంలో గ్యాస్ కంపెనీ గోడౌన్ సమీపంలో పాలేరు నదిలో భారీ చైన్ యంత్రాలతో ఇసుక లోడింగ్ చేసుకుని వస్తున్న టిప్పర్ ఇసుకలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన సుమారు రాత్రి 3 గంటల సమయంలో జరగ్గా తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో రెండు భారీ చైన్ యంత్రాల సహాయంతో టిప్పర్‌ను బయటకు తీశారు. ఇసుక టిప్పర్ పాలేరులో ఇరుక్కున్న విషయం రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలిసినా వారు ఆ పక్కకు కూడా పోలేదని, యంత్రాలను, టిప్పర్‌ను పట్టుకుని కేసు నమోదు చేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండలంలో ఇసుక అక్రమ రవాణా సాగుతుందనడానికి ఈ టిప్పరే సాక్ష్యమని స్థానికులంటున్నారు. ఇకనైనా అధికారులు మామూళ్ల మత్తులో తూగకుండా ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు ఆదివారం ఒంగోలులో పర్యటించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్ ) ప్రక్రియలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఓటర్ల వివరాల డిజిటైజేషన్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆయన వెంట డీఆర్ఓ వెంకటరమణ, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఇతర అధికారులు ఉన్నారు. గిద్దలూరు రూరల్: మద్యం మత్తులో యువకుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పట్టణంలోని కుమ్మరాంకట్టసెంటర్ సమీపంలోని సాయిఅమృత వైన్స్ వద్ద ఆదివారం జరిగింది. వైన్స్ షాపులో నుంచి యువకుడు పూటుగా మద్యం సేవించి వచ్చి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ మీద పడుకున్న ఓ సాధువును విచక్షణా రహితంగా రోడ్డుపైకి లాక్కుంటూ వచ్చి కొట్టాడు. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. కొంతసేపటి తరువాత వారిని స్థానికులు రోడ్డు మీద నుంచి పక్కకు నెట్టేశారు. దీంతో రోడ్డు మీద నిలిచిన వాహనాలు వెళ్లేందుకు వీలుపడింది. మద్యం మత్తులో ఎవరిపై ఎందుకు ఘర్షణ పడుతున్నారో తెలియని అయోమయ స్థితిలో మద్యం సేవించిన వారు ప్రవర్తిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
● బేరింగ్ విరగడంతో ఊడిపోయిన టైర్ ● సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు మార్కాపురం రూరల్: మండలంలోని దరిమడుగు గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ బ్రిడ్జి వద్ద శనివారం మాచర్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణిస్తున్న సమయంలో బస్సు బేరింగ్ విరగడంతో ఒక టైర్ ఊడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. అనంతరం ఆర్టీసీ అధికారులు మరో బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా తరలించారు. కాపర్ వైర్లు దొంగిలిస్తున్న ముఠా అరెస్టు ● 400 కిలోల కాపర్ వైర్ స్వాధీనం చీమకుర్తి రూరల్: ట్రాన్స్ఫార్మర్లలో కారప్ వైర్లు దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని చీమకుర్తి, సంతనూతలపాడు, తాళ్లూరు, ముండ్లమూరు, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ పోలీస్స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో రాత్రిళ్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి వాటిలోని కాపర్ వైర్లను దొంగిలించి విక్రయిస్తున్న ముఠాను సీఐ దుర్గాప్రసాద్ అరెస్ట్ చేశారు. నిందితులు పొలా నెహెమియా, గురునాథం రత్న కుమార్, పోలా రాజేష్, నాగులూరి మరియబాబు, పొగడ్త నాంచారయ్యలను ఈ నెల 11వ తేదీ ఎర్రగుడిపాడు రోడ్డులో చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్ తన సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 400 కిలోల కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. యర్రగొండపాలెం: మండలంలోని మెట్టబోడు తండా వద్ద స్కూటీని వెనుక వైపు నుంచి కారు ఢీకొన్న సంఘటనలో బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..రియాన్(5) తన తండ్రి రత్నరాజుతో స్కూటీపై పిల్లికుంట తండాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో టోల్‌గేట్‌కు సమీపంలో హైదరాబాద్ నుంచి కనిగిరికి వెళ్తున్న కారు అతివేగంగా వెనక నుంచి ఢీకొట్టడంతో తండ్రి కుమారుడు రోడ్డుపై కిందపడ్డారు. తండ్రి రత్నరాజు తీవ్రంగా గాయపడగా రియాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రత్నరాజును 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. ఆయన భార్య హెల్త్ కమ్యూనిటీ సెంటర్లో విధులు నిర్వర్తిస్తుంది. మెట్టబోడు తండాలో ఒకరి ఆరోగ్యం బాగలేదని సమాచారం రావడంతో ఆయనకు మందులు ఇచ్చిరమ్మని భర్త రత్నరాజుకు చెప్పింది. తండ్రితో పాటు బాలుడు స్కూటీపై వెళ్లి మృత్యువడిలోకి చేరాడు. కాగా స్కూటీని ఢీకొన్న కారు సంఘటన స్థలంలో నిలిపి క్షతగాత్రులను వైద్యశాలలో చేర్పించే ప్రయత్నం చేయకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. సంఘటన తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ టీం ఆ కారును వెంబడించి యర్రగొండపాలెంలో నిలిపి కారు డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌లో అప్పచెప్పారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.దేవకుమార్ తెలిపారు. త్రిపురాంతకం (యర్రగొండపాలెం): మండలంలోని మిట్టపాలెంకు సమీపంలో రైతు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. పుల్లలచెరువు మండలంలోని కవలకుంట్ల గ్రామానికి చెందిన నారు వెంకటరామిరెడ్డి(35) అనే రైతు తన భార్య స్వగ్రామమైన త్రిపురాంతకం మండలంలోని రామసముద్రం వద్ద పొలం కౌలుకు తీసుకొని అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రామిరెడ్డి మిట్టపాలెం శివారు ప్రాంతంలో శవమై కనిపించాడు. తన ద్విచక్రవాహనం అక్కడే ఉండటంతో పాటు అతని ముఖంపై గాయాలు ఉన్నట్లు తెలిసింది. రామిరెడ్డిని ఎవరైనా హతమార్చి ఉంటారా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. విషయం తెలుసుకున్న త్రిపురాంతకం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం క్లూస్ టీంను పిలిపించి ముమ్మరంగా విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకుకేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివరామయ్య తెలిపారు. -
ఎస్ఎస్ ట్యాంక్‌లో మునిగి బాలుడు మృతి
యర్రగొండపాలెం: సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో మునిగి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన త్రిపురాంతకం మండలంలోని గొల్లపల్లిలో ఆదివారం జరిగింది. పాఠశాలకు సెలవు కావడంతో గ్రామానికి చెందిన ఉప్పలపాటి తిరుమలబాబు(13) మరో ఇద్దరు మిత్రులతో కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ వద్దకు వెళ్లారు. అక్కడ వారు ఈత కొట్టేందుకు లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలో దిగారు. తిరుమలబాబు లోతు ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లి నీటిలో మునిగి పోయాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే తోటి మిత్రులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కొంతమంది అక్కడికి వచ్చి తిరుమలబాబును బయటికి తీసుకొని వచ్చారు. అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడని ఆ గ్రామస్తులు తెలిపారు. జాతీయ రహదారిపై రాస్తారోకో గ్రామానికి అతి సమీపంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు తగిన రక్షణ లేకపోవడం వల్లనే తిరుమలబాబు మృతి చెందాడని ఆ గ్రామానికి చెందిన పలువురు ఆరోపించారు. వెంటనే ఎస్ఎస్ఎన్ ట్యాంక్‌కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, బాలుడి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు వారు జాతీయ రహదారిపై బైఠాయించి రాకపోకలను స్తంభించారు. పోలీసులు జోక్యంచేసుకొని వారిని నచ్చచెప్పి రాస్తారోకోను విరమింప చేశారు. వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే తాటిపర్తి ట్యాంక్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఫెన్సింగ్ లేకపోవడం వల్లే బాలుడు మృతికి ప్రధాన కారణమని, తాగేనీటికి రక్షణ కల్పించకపోవడం వలన ప్రజలకు కూడా హాని జరుగుతుందని, వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ట్యాంక్ చుట్టూ ఫెన్సింగ్ వేయాలని రాస్తారోకో అర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
మామిడిలో పురుగులొచ్చేశాయ్..
ఉలవపాడు: వారం రోజుల నుంచి వాతావరణంలో మార్పులు మామిడి రైతులకు చేటు తెచ్చాయి. వారం రోజుల క్రితం కురిసిన వర్షం, ఆ తరువాత చల్లటి వాతావరణంతో మామిడి కాయలకు పురుగులు వచ్చేశాయి. చల్లటి వాతావరణంతో పండు ఈగ ప్రభావం ప్రారంభమైంది. మామిడి సీజన్ చివరి దశకు చేరడంతో దాదాపు కాయలన్నీ కోసేశారు. చివరి దశలో కేవలం 5 నుంచి 10 శాతం తోటల్లో మాత్రం కాయలు వచ్చాయి. చివరి దశ కాయలు మంచి రేటు వస్తాయని మామిడి రైతులు ఆశించారు. కానీ ఊహించని విధంగా మామిడి కాయలలో పురుగులు ప్రారంభమయ్యాయి. కాయలను కోసి చూస్తే చాలు లోపల నుంచి పురుగులు బయటకు వస్తున్నాయి. అధిక రేటు పెట్టి కాయలు కొన్నా లోపల పురుగులు వస్తున్నాయి. ఈ ఏడాది మూడు నెలల సీజన్ లో ఎక్కడా పురుగులు తగలలేదు. వేడిమి అధికంగా ఉండడంతో కాయలు సైతం రుచిగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉలవపాడు ప్రాంతంలో కాయలు కొంటే పురుగులు వస్తున్నాయి. దీని కారణంగా ఎంతో ఆశతో తినాలని పంపించిన మామిడి కాయలు పురుగులు రావడంతో మామిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఉలవపాడు మామిడి నాణ్యత కోల్పోయిందన్నది మాత్రం వాస్తవం. -
మితిమీరిన వేగమే కారణాలు
మితి మీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్ల అధికంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల సమయంలో నిద్రమత్తులో కూడా ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్బాలున్నాయి. ఈ నెల 3వ తేదీ అర్థరాత్రి కంభంలో హైవే రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గిద్దలూరుకు చెందిన నలుగురు మృత్యువాత పడగా, అంతకు ముందు జంగంగుంట్ల తిప్పాయపాలెం మద్యలో జరిగిన ఓ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు, జంగంట్లలో హైవే బస్సును ఢీకొని అర్థవీడు మండలానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు, ఇలా ఇటీవల హైవే రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతూ రహదారి రక్తసిక్తమవుతుంది. వీటితో పాటు కంభం– గిద్దలూరు, చిన్నకంభం– బేస్తవారిపేట, కంభం– తర్లుపాడు రోడ్డులో పలు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడిన సంఘటనలు ఇటీవల కాలంలో జరిగాయి. -
కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటాలు
మార్కాపురం: కార్మికుల సమస్యల పరిష్కారం, కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాల కల్పన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేయనున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఎం. రమేష్‌బాబు తెలిపారు. మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీ కార్మికులకు వేతనాల పెంపు, ఉద్యోగులుగా గుర్తింపు కల్పిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. కార్మికుల ఆందోళనలను అణచివేయడానికి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను వినియోగిస్తోందని, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే చర్యలను ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. సచివాలయ హెల్త్ సెక్రటరీలు, గ్రేడ్–3 ఏఎన్ ఎంలకు వెంటనే పదోన్నతులు కల్పించి, వారిని పూర్తిగా వైద్యశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 49 యాప్‌ల నిర్వహణ, ఫీల్డ్ డ్యూటీలు, బయోమెట్రిక్ హాజరు విధానం కారణంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పదోన్నతుల జాప్యంతో వేలాది మంది ఉద్యోగులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందడం లేదని, ప్రమాదాల్లో గాయపడిన లేదా మృతి చెందిన కార్మికులకు వెంటనే నష్టపరిహారం చెల్లించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కార్మిక సంఘాల నాయకులకు వినతిపత్రాలు సమర్పించే అవకాశాన్ని కూడా కల్పించడం లేదని విమర్శించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత సాధన కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఎం.రమేష్‌బాబు స్పష్టం చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీ కృష్ణగౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు అందే నాసరయ్య, జిల్లా కార్యదర్శి సయ్యద్ యాసిన్, జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి షేక్ ఖాసిం తదితర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
రక్తదాహం..!
రహదారుల కంభం: జాతీయ రహదారి రక్తమోడుతోంది. అనంతపురం–అమరావతి(ఎన్‌హెచ్ 544–డీ)పై గడిచిన రెండు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు 15 మంది మృత్యువాత పడి పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారంటే ప్రమాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తరుచూ జరుగుతున్న ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు తగ్గడం లేదు. లారీలు, ఆటోలు, ద్విచక్రవాహనాలతో పాటు ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తరుచూ ప్రమాదాలు.. కొమరోలు మండలం తాటిచెర్లమోటు మొదలు బేస్తవారిపేట, కంభం, మార్కాపురం, పెద్దారవీడు మండలం కుంట వరకు గడిచిన రెండు నెలల్లో 12కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 15 మంది మృత్యువాత పడగా మరో 15 మందికి పైగా తీవ్రగా యాలపాలయ్యారు. వీటితో పాటు పలు చోట్ల జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయాల పాలయ్యారు. అనంతపురం – అమరావతి జాతీయరహదారి వెళ్లే కొమరోలు మండలం తాటిచర్ల మోటు, బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు, మోక్షగుండం, కంభం మండలం జంగంగుంట్ల, మార్కాపురం మండలం తిప్పాయిపాలెం, చింతకుంట్ల, పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు, హనుమాన్ జంక్షన్ కుంట మధ్యలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ హాట్ స్పాట్లుగా మారుతున్నాయి. నివారణ చర్యలేవి..? హైవేపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు వాటి నివారణకు తూతూమంత్రంగా మాత్రంగా చర్యలు తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. హైవేపై అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, యూటర్న్, మూలమలుపుల వద్ద లైటింగ్ లేకపోవడం, సూచికలు ఏర్పాటు చేయకపోవడం, హైవే మార్జిన్లు ప్రమాదకరంగా ఉండటం పట్టణాల్లో నుంచి వెళ్లే హైవే రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలతో రోడ్డు కుంచించుకుపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేపై తరచూ మరమ్మతుల పేరిట చిప్స్ చల్లి వదిలేస్తుండటంతో ద్విచక్రవాహనదారులు, ఇతర వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, కార్లు నడిపే వారు సీటు బెల్టు ధరించాలని, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని పోలీసులు నిత్యం చెబుతున్నా వాహనదారులు వాటిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రజలకు, వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా వాహనదారుల్లో ఏ మాత్రం చలనం రావడం లేదు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో మలుపుల వద్ద, సెంటర్ల వద్ద పోలీసులు రక్షణ మిర్రర్లను ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తరుచూ ప్రమాదాలతో రక్తసిక్తమవుతున్న జాతీయ రహదారి అనంతపురం– అమరావతి హైవేపై పెరిగిపోతున్న ప్రమాదాలు తాటిచెర్లమోటు – కుంట మధ్యలో అధిక ప్రమాదాలు 2 నెలల్లో 15 మంది మృత్యువాత హైవేలపై కానరాని హెచ్చరిక బోర్డులు ప్రమాదకరంగా యూ టర్న్ లు -
అతివేగానికి యువకుడు బలి
● కొత్త బైకును బాబాయ్‌కు చూపించాలని వేగంగా వంతెను ఢీకొట్టడంతో ప్రమాదం సంతనూతలపాడు(చీమకుర్తి): ‘కొత్త బైక్..బాబాయ్‌కి చూయించాలనే ఉత్సాహంతో తెల్లవారుజామున 4 గంటలకు అతివేగంతో వెళుతూ నిర్మాణంలో ఉన్న ఢీకొట్టడంతో తీవ్ర రక్తస్రావమై యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సంతనూతలపాడు సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే...సంతనూతలపాడుకు చెందిన క్రాంతికుమార్(20) హైదరాబాద్‌లో బేల్దార్ పనులు చేస్తుంటాడు. శనివారం కొత్త బైకును కొన్నాడు. ఆ బైక్‌పై ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు నుంచి సంతనూతలపాడు బయలుదేరాడు. ఈ క్రమంలో సంతనూతలపాడు శివారులో ఒంగోలు వైపు వచ్చే కర్నూల్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న వంతెనను చీకట్లో గుర్తించలేదు. కొత్త బండి కావడంతో వేగంగా వస్తూ ఉండటంతో నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఎలాంటి హెచ్చరికలు సక్రమంగా లేకపోవడంతో వంతెన మొదటి గోడను ఢీకొట్టాడు. వేగం తీవ్రతకు వంతెనకు చివరలో ఉన్న నాలుగో గోడ కల్వర్టులో ఎగిరి పడ్డాడు. గోడలకు ఇనుప చువ్వలతో కాంక్రీట్ పోస్తూ నాలుగు గోడలను నిర్మిస్తున్నారు. గోడలకు ఉన్న చువ్వలు గుచ్చుకోవడం, సుమారు 7–8 అడుగులు ఎగిరి పడటంతో శరీరానికి తీవ్ర గాయాలు కావడం, చీకట్లో ఎవరూ చూడకపోవడంతో తీవ్ర రక్త స్రావమై మృతి చెందాడు. బైకు రోడ్డు మీద పక్కకు పడి నుజ్జునుజ్జయింది. ఎస్సై అజయ్‌బాబు వివరాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం
గిద్దలూరు రూరల్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ బరస్ట్ అయి మంటలు చెలరేగి ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట తాండా వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే..అనంతపురం నుంచి విజయవాడకు వెళుతున్న బాలాజీ ట్రావెల్స్ బస్సు వెనుకాల టైర్ ఒక్కసారిగా పగిలిపోవడంతో పాటుగా పెద్ద శబ్ధం వచ్చి అదే సమయంలో టైర్ చక్రాల నుంచి స్వల్పంగా మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపి మంటలను అదుపులోనికి తీసుకొచ్చాడు. అనంతరం పగిలిపోయిన బస్సు టైర్‌ను తొలగించి మరమ్మతులు చేశారు. సమాచారం అందుకున్న సీఐ కె.సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని బస్సు కండీషన్‌ను పరిశీలించారు. మరమ్మతుల అనంతరం బస్సు ప్రయాణికులతో గమ్యస్థానానికి బయలుదేరి వెళ్లింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
సత్తాచాటిన అలగనూరు ఎడ్లజత
పామూరు: మండలంలోని బొట్లగూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కమ్మవారిపాలెం రఘునాథపురం గ్రామంలో అచ్చమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఎడ్ల బండలాగుడు పోటీల్లో నంద్యాల జిల్లా అలగనూరు ఎడ్లజత ప్రథమ స్థానంలో నిలిచింది. పోటీల్లో మొత్తం 5 జతల ఎడ్లు పాల్గొనగా నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన కట్టుబడి రోలీమేడం ఎడ్లజత పందెపు రాయిని నిర్దేశిత సమయంలో 2003.1 అడుగులు లాగి ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. అదేవిధంగా వీరికి చెందిన మరో ఎడ్లజత పందెపు రాయిని 263 అడుగులు లాగి 5వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం రంగసాయిపల్లెకు చెందిన మార్తాల వెంకట సుబ్బారెడ్డి ఎడ్లజత 1859.3 అడుగులు లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ రెడ్డిపాలెం కారసాని హేమచంద్రారెడ్డి ఎడ్లజత 1500 అడుగులతో తృతీయ స్థానంలో నిలిచాయి. తెలంగాణ నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం కొప్పోలు గ్రామం ఐతరాజు సత్యనారాయణ ఎడ్లజత 1328.10 అడుగులు లాగి నాల్గవ స్థానంలో నిలిచాయి. పోటీల్లో విజేతలకు బహుమతులు వరుసగా ప్రథమ రూ.50 వేలు పల్లపు కుటుంబ సభ్యులు, ద్వితీయ రూ.40 వేలు విఠల్, దుర్గాప్రసాద్, శ్రీకాంత్, మణికంఠలు, తృతీయ రూ.25 వేలు డేరంగుల శ్రీను, నాల్గవ బహుమతి రూ.10 వేలు పైడిమళ్ల రమణ, 5వ బహుమతి ఆలయ కమిటీ సమకూర్చగా వాటిని ఆలయ కమిటీ సభ్యులు విజేతలకు అందజేశారు. -
ఆర్‌ఎస్‌కేలతో లేఖర్లకు చెల్లు చీటీ
అద్దంకి: నాలుగైదు దశాబ్దాలుగా దస్తావేజు లేఖరులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబాలు, కూటమి ప్రభుత్వ అనాలోచిత చట్టంతో బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వ తీరుతో జిల్లాలో 4500 మంది దస్తావేజు లేఖర్లు ఉపాధి కోల్పోనున్నారు. వారితోపాటు డీటీపీ ఆపరేటర్లు, రైటరు అసిస్టెంట్లు, వెండర్ల కుటుంబాలు ఉపాధికి గండిపడనుంది. రిజిస్ట్రేషన్‌కు ముందు జరిగే ప్రక్రియలో లేఖర్లను తప్పించి ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం జీవో నంబరు 396ను తెచ్చింది. తద్వారా ఆర్ఎస్కే (రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు) ఏర్పాటుతో క్రయ విక్రయదారుల డాక్యుమెంట్లను తయారు చేయాలని నిర్ణయించింది. దాంతో ఉమ్మడి జిల్లాలోని 18 సబ్‌రిజిస్ట్రార్ కేంద్రాల పరిధిలో సమారు 4500 మంది కుటుంబాలు ఉపాధి కోల్పోనున్నాయి. ప్రైవేటీకరణతో పారదర్శకతకు భరోసా ఉంటుందా? రిజిస్ట్రేషన్ ప్రక్రియలో డ్యాక్యుమెంట్ల తయారీలో రైటర్లదే కీలకపాత్ర. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే భూమి, ఇళ్లు, వివాహ ధ్రువీకరణ, మార్ట్గేజ్, తదితర పత్రాల తయారీలో లేఖర్లు ఎన్నో సంవత్సరాల అనుభవంతో డాక్యుమెంటును తయారు చేసి, ఆధార్, రిజిస్ట్రేషన్ సేవా రుసుముల రసీదులను జత చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తీసుకెళితేనే అవి ఏ ఇబ్బంది, ఎటువంటి పోరబాటూ లేకుండా, ప్రభుత్వ ఆధీనంలో రిజిస్టర్ అవుతూ ఉంటాయి. దాంతో న్యాయపరిధిలో డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ వచ్చేలా చూడటంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పేరిట ప్రైవేటుకు అప్పగిస్తే పారదర్శకత లోపించే అవకాశం ఉంది. అంతేకాకుండా సమాన్యులకు ఈ సేవ దూరం అయ్యే ప్రమాదం ఉంది. వేలమంది రైటర్లు, అసిస్టెంట్లు, డీటీపీ ఆపరేటర్లు, వెండర్ల కుటుంబాలు ఒక్కసారిగా ఉపాధి కోల్పోనున్నాయి. గతంలో పెన్‌డౌన్.. రైటర్లు గతంలో రెండు రోజుల పాటు పెన్‌డౌన్ చేశారు. ఈ పెన్‌డౌన్‌ను భూమి విక్రయించేవారు రిజిస్ట్రేషన్‌కు డాక్యుమెంటు సిద్ధం చేసే సమయంలో ఆధార్ ఓటీపీ విధానం, అలాగే పీడీఈ (పబ్లిక్ డేటాఎంట్రీ) రైటర్ కాకుండా సబ్‌రిజిస్ట్రార్ తన లాగిన్‌లో చేయాలంటూ డిమాండ్ చేస్తూ పెన్‌డౌన్‌కు సిద్ధమయ్యారు. అప్పట్లో నిసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం తెచ్చిన 396 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ పరంగానే రిజిస్ట్రేషన్ కార్యాక్రమాలను నిర్వహించాలని, లేఖరులుగా ఉన్న కుటుంబాలు, దాన్ని ఆధారంగా చేసుకుని బతుకుతున్న కుటంబాల పొట్ట కొట్టవద్దని వేడుకుంటున్నారు. లేఖర్లు కోరుతున్నవి ఇవే.. ప్రత్యామ్నాయ సేవా కేంద్రాల ఏర్పాటు చేయవద్దని, రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టవద్దని కోరుతున్నారు. దస్తావేజు లేఖరుల లైసెన్స్‌లను పునరుద్ధరించాలని, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, అసిస్టెంట్ల ఉపాధిని పరిరక్షించాలని సీనియర్ రైటర్లు ఎన్ సుబ్బారావు, డీ శ్రీనివాసరావు, సురేశ్, పవన్, తదితరులు కోరుతున్నారు. -
వీలైనంత త్వరగా డిజిటైజేషన్ పూర్తి చేయండి
మార్కాపురం టౌన్: సర్ ప్రక్రియలో భాగంగా జరుగుతున్న ఎన్యూమరేషన్ డిజిటైజేషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.విజయ సునీత బీఎల్ఓలను ఆదేశించారు. మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, జవహర్ నగర్ కాలనీ, నాయుడు బజార్ బజార్, తర్లపాడు రోడ్ లోని రామిరెడ్డి బజార్ తదితర ప్రాంతాల్లో ఆదివారం సర్ కార్యక్రమంలో జరుగుతున్న డిజిటైజేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా బీఎల్వోలు తమ వద్ద ఉన్న క్లెయిమ్స్ పెండింగ్‌లో ఉంచుకోవద్దన్నారు. కచ్చితంగా వస్తారు అనుకున్న వారికి ఫోన్ చేసి వివరాలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రక్రియను ఈరోజు సాయంత్రం కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
పచ్చనేతలదే గుట్టు
సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026గంజాయి గుప్పు..సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లా కేంద్రమైన ఒంగోలులో తరచుగా గంజాయి పట్టుబడుతోంది. విశాఖ నుంచి రైలు మార్గం ద్వారానే కాకుండా రోడ్డు మార్గంలో లారీలు, కార్లు, మోటారు బైకుల ద్వారా గంజాయిని తరలిస్తున్నారు. వీటిలో అత్యధికంగా తమిళనాడు, కేరళకు సంబంధించిన నిందితులే పట్టుబడుతున్నారు. అయితే ఇటీవల ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో బాలాజీ నగర్ వద్ద పోలీసులకు పట్టుబడిన 10 కిలోల గంజాయి స్థానికంగా విక్రయాలు చేయడానికి తీసుకొని వచ్చిందేనని పోలీసుల విచారణలో నిర్ధారించడం తెలిసిందే. స్థానికంగా పేరు మోసిన ఒక పాత నేరస్తుడు ఒంగోలులో గంజాయిని విక్రయించడానికి ఒడిశా నుంచి తరలించినట్లు సమాచారం. జిల్లా మీద నుంచి భారీగా రవాణా జరుగుతున్న గంజాయి వెనక అధికార పార్టీకి చెందిన పెద్దల హస్తముందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఒంగోలు నగరంలో గంజాయి మత్తులో గొడవలు జరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని కర్నూలు రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని టీ స్టాల్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే గంజాయి తాగి ఉన్న పొన్నూరు ప్రసాద్ అనే వ్యక్తి వడియాల సుబ్బారావు అనే యువకుడిని కత్తితో గొంతు మీద పొడిచాడు. ప్రస్తుతం సుబ్బారావు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. టోల్‌ప్లాజాల వద్ద గస్తీ కళ్లు గప్పి.. గత నెల 2వ తేదీ అర్ధరాత్రి ఒంగోలు శివారులోని కల్వరి టెంపుల్ సమీపంలో ఆగి ఉన్న మినీ లారీలో 250 కిలోల గంజాయి పట్టుబడింది. అర్ధరాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఐషర్ వాహనాన్ని నగరంలోని అరవ కాలనీకి చెందిన కొడియం లోకేష్ అనే యువకుడు బైకు మీద ఇంటికి తిరిగి వస్తూ వెనక నుంచి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలై మరణించాడు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల తనిఖీలో ఐషర్ మినీ లారీలో రహస్యంగా తరలిస్తున్న గంజాయి కనిపించింది. బస్తాలలో ఉన్న గంజాయిని చూసి పోలీసులు విస్మయానికి గురయ్యారు. ఆ తరువాత పోలీసుల విచారణలో సుమారు 250 కిలోలకు పైగా గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు. ఇంత పెద్ద మొత్తంలో జాతీయ రహదారి మీదుగా గంజాయి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ నుంచి ఒంగోలు వరకు అనేక టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఒక్క ఒంగోలు జిల్లాలోనే ఒకవైపు మార్టూరు సమీపంలో బొల్లాపల్లి టోల్‌ప్లాజా ఉంది. ఇటువైపు టంగుటూరు టోల్ ప్లాజా ఉంది. ఇక్కడ నిత్యం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. అయినా ఈ మార్గం గుండా తరచుగా కార్లలో, మోటారు బైకుల్లో దర్జాగా గంజాయి తరలి పోతోంది. టంగుటూరు టోల్ప్టాజా వద్ద తరచుగా గంజాయి పట్టుబడుతుండడం దీనికి నిదర్శనమని చెప్పవచ్చు. అంతేకాకుండా ఐషర్ వాహనం మరమ్మతుల కారణంగా ఒంగోలు శివారులో నిలిచినట్లు చెబుతున్న దాంటో ఎంత వాస్తవముందన్న దానిపై కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భారీగా గంజాయి రవాణా జరుగుతున్న సమయంలో లారీకి ముందు వెనక పలు మోటారు వాహనాలలో గంజాయి మాఫియా సభ్యులు అనుసరిస్తుంటారని, మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చినా నిముషాల్లో సరుకు మాయం చేస్తారని తెలుస్తోంది. ఒంగోలులో సరుకు దించడానికి ఆగి ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో అసలు గుట్టుబయట పడింది. లేకపోతే గుట్టుగా గంజాయి తరలివెళ్లిపోయేది. గంజాయి రవాణా వెనక పెద్ద తలకాయల హస్తమున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అధికార పార్టీ కీలక నాయకుడి అనుచరులు గంజాయి రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో పోలీసుల అండదండలు కూడా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు కీలక నాయకుడి నియోజకవర్గంలో పోలీసు అధికారి ఒకరు టాస్క్‌ఫోర్స్ అధికారులను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పట్టుబడుతున్న గంజాయి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటించడంలో సహకరిస్తున్న పెద్ద తలకాయ ఎవరనేది నిస్పక్షపాతంగా విచారణ జరపితేనే కాని బయటపడే అవకాశాలు లేవు. టాస్క్ఫోర్సు అధికారులు మొక్క్బుడిగా దాడులు నిర్వహిస్తున్నారని, గంజాయి అక్రమ రవాణా మూలాలు విషయంపై దృష్టిసారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో, లేదా ప్రత్యేకంగా తనిఖీలు చేసినప్పుడో పెద్దమొత్తంలో తరలిస్తున్న గంజాయి పట్టుబడటం చర్చనీయాంశమవుతోంది. యువత గంజాయి మత్తులో జోగుతున్నారు. ఆ మత్తులోనే దాడులకు, ఇతర నేరాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న రెండు టోల్‌ప్లాజాలను దాటి గంజాయి తరలిపోతుండటం వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటించడంలో సహకరిస్తున్న పెద్ద తలకాయ ఎవరనేది నిస్పక్షపాతంగా విచారణ జరిపితేనే కానీ బయటపడే అవకాశాలు లేవు. టాస్క్ఫోర్సు అధికారులు మొక్కుబడి దాడులతో సరిపెడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రామాయపట్నం పోర్టు ప్రజల ఆస్తి
కందుకూరు రూరల్: రామాయపట్నం పోర్టు కందుకూరు ప్రజల ఆస్తి అని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కందుకూరు ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఈ పోర్టును ప్రారంభించారని తెలిపారు. శర వేగంగా నిర్మించిన రామాయపట్నం పోర్టును తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తిని పప్పు బెల్లాల్లాగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు ప్రాంత ప్రజల ఎన్నో సంవత్సరాల చిరకాల కోరిక సాకారమయ్యే సందర్భంలో కూటమి ప్రభుత్వం కుట్రజేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోందన్నారు. అత్యంత చవకగా అమ్మటం పేద ప్రజల పట్ల ఉన్న కపట ప్రేమకు నిదర్శనమని విమర్శించారు. రామాయపట్నం పోర్టు పూర్తయి అనుబంధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద ప్రజలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేవని అన్నారు. రామాయపట్నం పోర్టు ద్వారా ఆక్వారంగం ఉత్పత్తులు ఎగుమతై మత్స్యకార రంగానికి, రవాణా రంగానికి, చుట్టుపక్కల ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరిగే పోర్టును ప్రైవేటుపరం చేయడమంత దుర్మార్గమైన విషయం మరొకటి లేదన్నారు. కందుకూరు ప్రాంత ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం, ప్రేమ ఉంటే తక్షణం చంద్రబాబు నాయుడు రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, పార్లమెంటు సభ్యుడు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికపై మన్ను పోసేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వారి గెలుపునకు ఓట్లు వేసిన ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను తక్షణం ఆపాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్రెడ్డి పరిపాలనా కాలంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి 95 శాతం పోర్టును పూర్తి చేస్తే మిగిలిన పనులను పూర్తి చేయలేక కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు తెగనమ్మడం దుర్మార్గమైన చర్య అన్నారు. దీని వల్ల స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కమీషన్లకు కక్కుర్తి పడి పోర్టు ప్రైవేటీకరణకు అంగీకరించారని తీవ్రంగా విమర్శించారు. తక్షణం ప్రైవేటీకరణను ఆపకపోతే ఈ ప్రాంత యువత, నిరుద్యోగ, కార్మిక, కర్షక, మహిళ, మేధావులను కలుపుకొని వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. ప్రైవేటీకరణ ఆపే వరకు ఎన్ని ఇబ్బందులు, నిర్బంధాలు ఎదురైనా కేసులు, జైలు కూడా లెక్కచేయకుండా ఈ ప్రాంత ప్రజల హక్కు కోసం ఉద్యమిస్తామన్నారు. -
ప్రకాశించిన దివ్యగానం
● ప్రముఖ గాయని ఎస్ జానకికి ఒంగోలుతో అనుబంధం ఒంగోలు టౌన్/ఒంగోలు మెట్రో/ఒంగోలు సబర్బన్: ‘‘నీలి మేఘాలలో...గాలి కెరటాలలో నీవు పాడే పాటా వినిపించు ఈ వేళా..’’ అంటూ తెలుగు నేల నలుచెరగులా తేనెలొలికే ఆ గొంతుతో అలరించిన మధురగాయని ఎస్ జానకి పాటల పూదోటను వదిలి దిగికేగారు. ఎనభై ఎనిమిదేళ్ల వయసులో కూడా మూడేళ్ల పసిపాపలా పాడగలిగే ఆ మధుర గాయకురాలికి మన ఒంగోలు నగరంతో గుర్తు చేసుకోదగ్గ అనుబంధం ఉంది. ఒంగోలుకు చెందిన ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ దగ్గర జానకమ్మ శిష్యరికం చేశారు. తిరుపతి సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన కొంతకాలం ఒంగోలులో నివాసం ఉన్నారు. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నవారిలో ఒంగోలుకు చెందిన ఐ.మురళీ కృష్ణ కూడా ఒకరు. ఒంగోలు జిల్లా మలేరియా కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న మురళీకృష్ణ టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ గాయకుడిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో వెంకటేశ్వర స్వామి పాటలు పాడుతున్నారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో జానకమ్మతో కలిసి మురళీకృష్ణ వెంకటేశ్వర స్వామి గేయాలు ఆలపించారు. జానకమ్మ మరణ వార్త తెలిసిన ఆయన ఈ విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. గొప్ప గాయకురాలిగా పేరొందినప్పటికీ ఏమాత్రం గర్వం లేకుండా అందరితో కలిసి పోయే గొప్ప వ్యక్తిత్వం జానకమ్మ సొంతమని మురళీ కృష్ణ చెప్పారు. అలాగే 1989 నుంచి జిల్లాలో అనేక కార్యక్రమాల్లో జానకమ్మ పాల్గొన్నారు. ఒంగోలు సీవీఎన్ రీడింగ్ రూం, ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఒంగోలులో జరిగిన శత గీత సంగీత విభావరిలో, 2013 ఏప్రిల్ 12, 13, 14 తేదీల్లో నిర్వహించిన తెలుగు మహాసభల్లో ఆమె పాల్గొన్నారు. ఒంగోలుకు చెందిన ఈలపాట అర్లయ్య సంగీత కచేరీలో ఆమె పాల్గొన్నారు. జానకమ్మ మరణం సంగీతాభిమానులకు తీరనిలోటని ఒంగోలుకు చెందిన సాహితీవేత్త మురళీధర్‌రెడ్డి అన్నారు. -
రోదిస్తునది!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పాలేరు నది ఇసుకాసురులకు ఆదాయ వనరుగా మారింది. నదికి ఒక ఒడ్డు కొండపి నియోజకవర్గంలో, మరో ఒడ్డు కందుకూరు నియోజకవర్గంలో ఉండడంతో అక్రమార్కులకు వరంగా మారింది. ఫిర్యాదు చేస్తే తమ పరిధి కాదంటూ పోలీసులు పట్టించుకోక పోవడంతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. శుక్రవారం రాత్రి ఇదే తంతు జరిగింది. కొండపి నియోజకవర్గ పరిధిలోని దావగూడూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, వారి అనుచరులు పాలేరులో జేసీబీలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని చింతలపాలెం గ్రామస్తులు కందుకూరు రూరల్ పోలీసులకు, జరుగుమల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కందుకూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అయితే తవ్వకాలు జరుపుతున్నది అధికార పార్టీకి చెందిన నాయకుల మనుషులని తేలడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. జరుగుమల్లి పోలీసులైతే అటు వైపు కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇక చేసేదేమీ లేక చింతలపాలెం గ్రామస్తులే ఇసుకాసురులపై ఎదురుతిరిగారు. జేసీబీతో గ్రామంలోని రక్షిత మంచినీటి పథకమైన బావి పక్కనే తవ్వకాలు జరపడం సరికాదంటూ అడ్డుకున్నారు. చింతలపాలెం గ్రామస్తులు వస్తున్నారని సమాచారం అందడంతో ట్రాక్టర్లను అక్కడ నుంచి తరలించేశారు. ఈ విషయం తెలుసుకున్న దావగూడూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తమ అనుచరులు 50 మందితో వచ్చి వారితో వాగ్వాదానికి దిగారు. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేసు నమోదు కాలేదు.. శుక్రవారం రాత్రంతా జేబీలతో ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నా పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక తవ్వకాలపై జరుగుమల్లి ఎస్ఐకు ఫిర్యాదు చేసినా అటు పక్కకే రాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కందుకూరు రూరల్ ఎస్ఐ బాలకృష్ణ వచ్చి దావగూడూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులను మందలించి, యంత్రాలను తీసుకెళ్లిపోండి అని చెప్పి వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు. ఎస్ఐ వెళ్లిపోయిన కొద్ది సేపటి నుంచే ఇసుక తవ్వకాలు జరిపారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము పాలేరు నది వద్ద తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లేముందు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని తెలిపారు. సమస్య పరిష్కరిస్తాం.. రాత్రి నుంచి తెల్లవారే వరకు జరుగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోని పోలీసులు శనివారం మధ్యాహ్నం ఇరుగ్రామాలకు చెందిన వారితో చర్చించారు. కందుకూరు సీఐ అన్వర్‌బాషా, రూరల్ ఎస్సై బాలకృష్ణ, తహశీల్దార్ పీ మురళి వచ్చారు. ఇరు గ్రామాల వారిని పిలిపించి నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి వెళ్లిపోయారని చింతలపాలెం గ్రామస్తులు తెలిపారు. అయితే అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా వెళ్లిపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదంతా చూస్తుంటే అధికార పార్టీ నేతలకు చెందిన ఇసుక అక్రమ రవాణాదారులకు ఏవిధంగా కొమ్ముకాస్తున్నారో అర్థమవుతోందని గ్రామస్తులు అంటున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనపై కందుకూరు రూరల్ ఎస్సై బాలకృష్ణను వివరణ కోరగా తాను రాత్రి పాలేరు వద్దకు వెళ్లేసరికి అందరూ వెళ్లిపోయారని, పాలేరు లో ట్రాక్టరు ఇరుక్కుపోవటంతో దానిని జేసీబీతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప ఇసుక రవాణా జరగలేదని తెలిపారు. జరుగుమల్లి ఎస్సై భాగ్యరాజ్‌ను వివరణ కోరగా తనకు ఎలాంటి సమాచారం తెలియదని, ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. తెల్లవారుజామున టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్న దృశ్యంతరచూ వివాదాలువాస్తవానికి ఇసుక వ్యాపారం కొండపి నియోజకవర్గంలో చింతలపాలెం, కందుకూరు నియోజకవర్గంలో పలుకూరు పంచాయతీలోని రామనాథపురం, వెంకన్నపాలెం గ్రామస్తులు చేసేవారు. దావగూడూరు గ్రామస్తులు మాత్రం తమ ఇంటి అవసరాలకు మాత్రమే ఇసుకను తరలించేవారు. ఇటీవల దావగూడూరు వాసులు కూడా ఇసుక వ్యాపారంలోకి రావటంతో గత కొద్ది రోజులుగా చింతలపాలెం, దావగూడూరు, రామనాథపురం, వెంకన్నపాలెం గ్రామాల మధ్య తరచూ ఇసుక వివాదాలు జరుగుతున్నాయి. -
పాపం పసికూన
ముండ్లమూరు: ఏ తల్లి కన్న బిడ్డో.. ఊరి చివర జొన్నచేలో గాయాలతో పది రోజుల పసికందు పడి ఉండటం చూపరులను కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆడపిల్ల భారమైందనో...మరేదైనా కారణమో తెలియదు కానీ ముండ్లమూరు గ్రామ శివారులో తాళ్లూరు వెళ్లే మార్గంలోని జొన్న చేలో పది రోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. వీచే గాలులకు జొన్న చేను ఆకులు ఆ పసిపాప లేత శరీరంపై రాపిడి జరిగి రక్త స్రావం కావటం, ఆకలితో నోరెండిపోయి ఆ పసిప్రాణం బిగ్గరగా ఏడుస్తోంది. తెల్లవారు జామున గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఊరు బయట బహిర్భూమికి వెళ్లిన క్రమంలో ఏడుపు విని పాపను గుర్తించిన వారు 108లో ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం ముండ్లమూరు ఎస్సై ఎం కోటేశ్వరరావు, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బీవీ సాగర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి పీ దినేష్ కుమార్ లకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి ఈ విషయాన్ని జిల్లా మహిళా శిక్షణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ పద్మ సునందకు తెలియజేసి వారి ఆదేశాల మేరకు పసిపాపను ముండ్లమూరు అంగన్వాడీ సూపర్వైజర్ బీ ఇంద్ర, అంగన్వాడీ కార్యకర్త కల్పన, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఔట్రిచ్ వర్కర్లు పాపను తమ సంరక్షణకు తీసుకుని ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవ కోసం ఒంగోలు రిమ్స్ హాస్పటల్ కు తరలించారు. పాప పూర్తిగా కోలుకున్న తర్వాత ఒంగోలు రాంనగర్ లోని మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహలో చేర్పించారు. పాపను ఎవరు పడేశారు ఎందుకు పడేశారు అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
కళ్ల ముందే బోటు ప్రమాదం
● ఐదు నిమిషాల్లో మరో బోటులో మేం ఎక్కేవాళ్లం ● టూర్‌కు వెళ్లిన గొల్ల సాయి నవీన్ కందుకూరు రూరల్: వియత్నంలో బోట్ ప్రమాదం మా కళ్ల ముందే జరగడం మమ్మల్ని కలిచివేసిందని ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కీర్తి సెల్ షాప్ యజమాని గొల్ల సాయి నవీన్ తెలిపారు. ‘‘లావా సెల్‌ఫోన్ కంపెనీ వారు ఏర్పాటు చేసిన టూర్‌కు ఆంధ్ర, తమిళనాడుకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు, సిబ్బంది వియత్నం టూర్‌కు ప్లాన్ చేశారు. టూర్‌కు 8వ తేదీ బయలుదేరి వెళ్లాం. వియత్నం బీచ్‌లో బోట్ షికారుకు వెళ్లేందుకు మేమంతా అక్కడికి వెళ్లాం. మొదటి బోటులో కొందరు ఎక్కి కొంత దూరం వెళ్లగానే కళ్లముందే బోటు తిరగబడటం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. ప్రమాదంలో కొంతమంది చనిపోయారని తెలిసి భయభ్రాంతులకు లోనయ్యాం. మరో ఐదు నిమిషాల్లో రెండో బోటులో నాతో పాటు మరి కొందరు ఎక్కాల్సి ఉంది. ఇంతలో ఈ ప్రమాదం జరిగింద‘ని నవీన్ వాపోయారు. మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ బి.మహాలక్ష్మిని కలెక్టర్ ఎం.విజయ సునీత సస్పెండ్ చేశారు. శనివారం ఆమె తర్లుపాడు రోడ్డులోని ఎస్సీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో వసతులు సక్రమంగా లేవని, మెనూ ప్రకారం ఆహారం అందించడంలేదని విద్యార్థులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అలాగే తాగునీటి ఆర్ఓ ప్లాంటు మరమ్మతులకు గురైందని, దీంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వంటగది, హాస్టల్ పరిసరాలు సరిగా లేకపోవడంతో హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. కలెక్టర్ వెంట ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
నీరివ్వరా..?
సాగులపడినా కంభం: కూటమి ప్రభుత్వంలో పాలకుల నుంచి అధికారుల వరకూ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అన్నదాతను అడుగడుగునా అవస్థలకు గురిచేస్తున్నారు. పంటల సాగుకు నీరివ్వడం మొదలు.. విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం వరకూ అన్ని విషయాల్లో చంద్రబాబు ప్రభుత్వం రైతులను కష్టాలు పెడుతూనే ఉంది. తాజాగా కంభం చెరువు ఆయకట్టుకు సాగునీటి సరఫరా గురించి పట్టించుకునేవారు లేకుండా పోయారంటూ ఆయా రైతులు ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక కంభం చెరువు ఒకసారి నిండితే ఆయకట్టులో మూడు సంవత్సరాల పాటు పంటలు పండించవచ్చనేది నానుడి. అలాంటి చెరువులో ప్రస్తుతం సుమారు 14 అడుగుల మేర నీరుంది. ఆయకట్టు రైతులు ఒక్క కారు వరి సాగుచేసుకునేందుకు నీరివ్వాలని కోరుతూ ఇరిగేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, ఇరిగేషన్ అధికారులు స్పందించడం లేదు. గతంలో చెరువులో నీటి మట్టాన్ని బట్టి రైతులు పంటలు సాగుచేసుకునేందుకు అధికారులే నీరిచ్చేవారు. ప్రస్తుతం రైతులే కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీనిపై రైతులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరిస్తారనే ఆశతో నారుమడులకు సిద్ధం చేసుకున్న రైతులు... కంభం చెరువులో నీరుండటంతో ఆయకట్టులో వరి సాగుకు విడుదల చేస్తారనే ఆశతో రైతులు ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేశారు. తూములెత్తితే నారుమడులు వేసుకోవాలనే ఉద్దేశంతో భూములు సిద్ధం చేసుకున్నారు. కొందరు రైతులు పసుపు విత్తనాలు నాటుకుంటున్నారు. కంభం చెరువు ద్వారా కంభం మండలంలోని కంభం, చిన్నకంభం, పోరుమామిళ్లపల్లి, దర్గా, కందులాపురం, నడింపల్లి, ఔరంగబాదు, ఎల్.కోట, హజరత్‌గూడెం, బేస్తవారిపేట మండలంలోని జేబీకే పురం, చింతలపాలెం, సోమవారిపేట, బేస్తవారిపేట, పాపాయపల్లి గ్రామాలకు నీరందుతుంది. కంభం చెరువులో కంభం, చిన్నకంభం, పెద్దకంభం తూములుండగా.. వాటి నుంచి పంట కాలువల ద్వారా పొలాలకు నీరు చేరుతుంది. 20 రోజులుగా అన్నదాతల ప్రదక్షిణలు... గత 20 రోజులుగా కంభ చెరువు ఆయకట్టు రైతులు వరి సాగుకు నీరివ్వాలని కోరుతూ ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నారు. చెరువులో నీరున్నా రైతులకు ఎందుకు వదలరంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్నామని, ఈ ఏడాది వరి సాగుచేసుకోకుంటే తినడానికి గింజలు కూడా దొరకవని వాపోతున్నారు. రైతుల పట్ల అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి నీరు వదలకపోతే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. జూలై 1 నుంచి నారుమడులు వేయాల్సి ఉండగా, ఇప్పటికీ నీరివ్వలేదని, అదును దాటిన తర్వాత పంటలు వేసుకున్నా దిగుబడులు సరిగా రావని ఆందోళన చెందుతున్నారు. అలా జరిగితే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. గతంలో ఓ మారు అదును దాటిన తర్వాత పంటలు వేసే సరికి ఎకరాకు నాలుగైదు బస్తాలకు మించి దిగుబడి రాని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కూలీలుగా మారిపోతున్న రైతులు... కంభం ప్రాంతం పేరు చెబితే గుర్తుకొచ్చేది కంభం చెరువు. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం పట్ల పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడా పరిస్థితులు కనబడటం లేదు. ఓ వైపు వర్షాలు లేక.. మరో వైపు కంభం చెరువులోని నీటిని పంటలకు వదలక.. నాలుగైదు ఎకరాల సొంత పొలాలున్న రైతులు సైతం కూలీలుగా మారిపోతున్నారు. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. ప్రస్తుతం చెరువులో నీరున్నప్పటికీ.. తర్వాత తాగునీటి సమస్య ఏర్పడుతుందన్న నెపంతో వరి సాగుకు వదలకపోవడం అన్యాయమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెరువులో పది అడుగుల మేర నీరున్నా సాగుకు వదిలేవారని, ప్రస్తుతం 14 అడుగుల వరకూ ఉన్నాగానీ ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. కంభం చెరువు ఆయకట్టులో వరి సాగుకు నీరివ్వాలని రైతుల వేడుకోలు ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు ఖరీఫ్‌లో అదును దాటిపోతోందంటూ ఆందోళన కంభం చెరువులో ప్రస్తుతం సుమారు 14 అడుగుల మేర నీరు ఆయకట్టుకు విడుదల చేయకుండా జాప్యం చేస్తున్న ఇరిగేషన్ అధికారులు -
16న కనిగిరిలో పొగాకు రైతు దీక్ష
కనిగిరి రూరల్: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో.. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మార్క్‌ఫెడ్ ద్వారా రూ.500 కోట్లు కేటాయించి ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 16వ తేదీ ఉదయం కనిగిరిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద పొగాకు రైతు దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక పార్టీ ఆఫీసులో పార్టీ నేతలు, రైతు నాయకులతో కలిసి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. ఆనాటి సీఎం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. పొగాకు రైతులకు గిట్టుబాటు, మద్దతు ధరలు లభించి ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. ఆనాడు కనిగిరి ప్రాంతంలోని టుబాకో బోర్డు పరిధిలో 7.5 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి కాగా, ఆ మొత్తాన్ని కంపెనీలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. రైతుకు కేజీ గరిష్ట ధర రూ.350 నుంచి రూ.360 వరకు ఇచ్చారని, కనిష్ట ధర రూ.270 నుంచి రూ.280 వరకు ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక పొగాకు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని విమర్శించారు. రైతుకు కనీస పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులు రోడ్లెక్కి రాస్తారోకోలు చేస్తున్నా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. పొగాకు బేళ్లను కొనుగోలు చేయక, గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని తెలిపారు. కంపెనీల బయ్యర్లు, అధికారులు కుమ్మకై ్క పొగాకు రైతులకు అన్యాయం చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రెండేళ్ల నుంచి పొగాకు రైతుకు సరైన ధర లేదన్నారు. పొగాకు రైతుల సమస్యలపై చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమంలో నియోజకవర్గంలోని రైతులంతా అధిక సంఖ్యలో పాల్గొనాలని దద్దాల పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీ సభ్యుడు మడతల కస్తూరిరెడ్డి, ఓకే రెడ్డి, రైతు సంఘ జిల్లా కార్యదర్శి సూరసాని మోహన్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రాచపుడి మాణిక్యరావు, గోపవరపు బొర్రారెడ్డి, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, సిరుపవెంకట గోవర్దన్‌రెడ్డి, పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, మూలే గోపాల్‌రెడ్డి, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, వాకమల్ల రాజశేఖర్‌రెడ్డి, బత్తుల మాలి, యరబ్రల్లి దేవరాజు, పలుకూరి భాస్కర్, ఎస్కే మీరావలి, వంటిపెంట శివకృష్ణారెడ్డి, సూరసాని చంద్రశేఖర్‌రెడ్డి, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, ప్రత్తి సురేష్‌రెడ్డి, సూరసాని చిన్న కాశిరెడ్డి, శిగా కృష్ణారావు, పల్నాటి భాస్కర్‌రెడ్డి, భూమిరెడ్డి కొండారెడ్డి, దర్శి ఫణికుమార్, బచ్చు వెంగళరావు గుప్తా, దర్శి సుబ్రహ్మణ్యం, మూలే రాజశేఖర్‌రెడ్డి, పాతకొట్టు పిచ్చిరెడ్డి, దమ్ము వెంకటయ్య, ఓంకార్, ద్రోణాదుల చెంచులు, ద్రోణాల మధుసూదన్‌రావు, కాసుల బాలగురవయ్య, బాపట్ల కొండలరావు, కన్నేటి సుబ్బారెడ్డి, పైడాల రామ్మోహన్‌రెడ్డి, ఎస్కే పీరా హుస్సేన్, తిరుమలపూడి మహేష్, మూలే మాల్యాద్రిరెడ్డి, ఎస్కే మహబూబ్‌బాషా, పిల్లి రఘురామిరెడ్డి, యా బేజ్, ముద్దా పౌలు తదితరులు పాల్గొన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల పిలుపు పొగాకు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ధ్వజం -
ఎస్.కొత్తపల్లిలో చోరీ
● రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి అపహరణ పెద్దారవీడు: మండలంలో ఎస్.కొత్తపల్లి గ్రామంలో ఇమ్మశెట్టి వెంకటేశ్వర్లు ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి నగలు అపహరణకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లోని పంచలో కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర్లు నిద్రిస్తుండగా, అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనుక ఉన్న తలుపును పగులగొట్టి లోనికి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు బీరువాను కూడా పగలగొట్టారు. అందులో ఉన్న బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లారు. వాటి విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. కూలి పనులు చేసుకుని సంపాదించిన సొమ్మంతా దొంగలు ఎత్తుకెళ్లారంటూ వాపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఒంగోలు నుంచి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు త్రిపురాంతకం సీఐ హాసాన్, ఎస్ఐ సైదులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల దేవరాజుగట్టు గ్రామంలో కూడా దొంగలు పడి దాదాపు రూ.5 లక్షల విలువైన బంగారు నగలు చోరీ చేశారు. మండలంలోని పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు, బోర్ల కేబుల్ వైర్లు దొంగిలించారు. ఆ ఘటనలు మరవకముందే మళ్లీ దొంగతనం జరగడంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
విద్యుదాఘాతంతో బేల్దారి మేస్త్రి మృతి
పామూరు: విద్యుదాఘాతంతో బేల్దారీ మేస్త్రి మృతిచెందిన సంఘటన పామూరు మండలంలోని మార్కొండాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై కట్టా అనూక్ తెలిపిన వివరాల ప్రకారం... మార్కొండాపురం గ్రామానికి చెందిన దగ్గుపాటి పెద్ద వెంగయ్య తన భార్య దగ్గుపాటి రాములమ్మ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో బేల్దారి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. నెల్లూరు జిల్లా నర్రవాడలో జరుగుతున్న వెంగమాంబ తిరునాళ్లకు వెళ్లేందుకు నిజామాబాద్ నుంచి మూడు రోజుల క్రితం మార్కొండాపురం వచ్చారు. తిరునాళ్ల చూసుకుని మార్కొండాపురంలోని ఇంట్లో ఉండగా, శనివారం ఉదయం దగ్గుపాటి రాములమ్మ ఇంటిని శుభ్రం చేసే క్రమంలో పైప్‌తో నీరుకొట్టి చీపురుతో చిమ్ముతోంది. టీవీ దగ్గర నీటితో తుడుస్తూ టీవీ పక్కనున్న ప్లగ్బాక్సు తీసే క్రమంలో ఆమె ఎడమచేతి కి కరెంట్‌షాక్ తగిలి కిందపడి గట్టిగా కేకలు వేసింది. బయట ఉన్న ఆమె భర్త దగ్గుపాటి పెద్ద వెంగయ్య హుటాహుటిన ఇంట్లోకి వచ్చి ప్లగ్ బాక్స్ పట్టుకోబోగా.. నాకు షాక్ తగిలింది.. నువ్వు జాగ్రత్త అని రాములమ్మ చెప్పింది. పెద్ద వెంగయ్య జాగ్రత్తగా ప్లగ్‌బాక్స్ తీసి పక్కకు పెట్టే క్రమంలో అతని ఎడమచేతికి విద్యుత్‌షాక్ తగిలి కిందపడి పోయి కేకలు వేశాడు. రాములమ్మ, ఆమె అత్త, సమీపంలో నివాసం ఉంటున్న తుపాకుల నాగార్జున మరికొంతమంది వచ్చి కర్రతో వైర్లు పక్కకు తీసి వైద్యం కోసం కనిగిరి వైద్యశాలకు తరలించగా, దగ్గుపాటి పెద్ద వెంగయ్య (45)ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఆ మేరకు రాములమ్మ ఫిర్యాదు ఇవ్వగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కట్టా అనూక్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భర్త ఆకస్మిక మృతితో భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు
● ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఒంగోలు టౌన్: సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పోలీసులు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ హర్షవర్థన్‌రాజు సూచించారు. మిషన్ యూత్ 4 – ప్రకాశం పోలీసు హాకథాన్ 2026 కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కళ్యాణ మండపంలో శనివారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... మహానగరాల్లో నిర్వహించే హ్యాకథాన్‌ను ప్రకాశం జిల్లాలో నిర్వహించడం అభినందనీమన్నారు. పోలీసు శాఖతో పాటు సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాల కోసం యువత ముందుకు రావడం సంతోషించదగిన విషయమన్నారు. హ్యాకథాన్‌లో 12 సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే లక్ష్యంతో 45 జట్లు పాల్గొనడం విశేషమని, ఢిల్లీ, చైన్నె, హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి యువత పాల్గొనడం స్ఫూర్తినిస్తుందని చెప్పారు. హాకథాన్‌లో రూపొందించిన పరిష్కారాలను పోలీసు శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించి పోలీసింగ్‌కు ఆచరణాత్మకంగా ఉన్న వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ హ్యాకథాన్ నిర్వహణకు స్రవింటిక్స్ టెక్నాలజీస్ ఎల్ఎల్పీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించగా, ఆర్వియాన్ లెర్నెడ్ ఎడ్జ్ ఎల్ఎల్పీ ఇంక్యూబేషన్ భాగస్వామిగా సహకారం అందించిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, రూరల్ సీఐ శేషగిరిరావు, ఐటీ కోర్ సీఐ జగదీష్, పెర్ల మహేష్ కుమార్, నార్నే వెంకట ఫణీంద్ర సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కిడ్నాప్ ● జీతం అడిగినందుకు దాడి చేసి చితకబాదిన బస్సు యజమాని ● దాడి చేస్తున్నప్పుడు వీడియో చిత్రీకరించి బెదిరింపులు ● తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు సాక్షి టాస్క్‌ఫోర్స్: జీతం డబ్బులు అడిగిన పాపానికి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యజమాని బస్సు డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి దాడి చేయడం కలకలం సృష్టించింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామానికి చెందిన మిడసల శ్యామ్‌కుమార్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్న అతడిని డ్రైవర్‌గా పనిచేసే స్నేహితుడైన వడకుప్ప వంశీ స్రవంతి ట్రావెల్స్ బస్సుకు హాల్టింగ్ డ్రైవర్‌గా పంపించాడు. పది రోజుల పాటు డ్యూటీ చేసిన శ్యామ్.. ఆ డ్యూటీ తాలూకు డబ్బు ఇవ్వమని ట్రావెల్స్ అధినేత సూరికి ఫోన్ చేసి అడిగాడు. నాకేం సంబంధం లేదు, నిన్ను హాల్టింగ్ డ్రైవర్‌గా పంపించిన వంశీనే అడగమని సూరి చెప్పాడు. ఈ విషయం గురించి వంశీని అడిగితే నాకు తెలియదు, బస్సు ఓనర్నే అడుగమని సలహా ఇచ్చాడు. దాంతో శ్యామ్ మళ్లీ బస్సు యజమాని సూరికి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు. దాంతో ఆగ్రహానికి గురైన ఓనర్ సూరి నువ్వు ఎవడివిరా నా కొడక.. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ నోటికొచ్చినట్లు బూతులు తిట్టాడు. దీంతో శ్యామ్ బంధువులు కొందరు టంగుటూరు టోల్ ప్లాజా వద్ద స్రవంతి ట్రావెల్స్ బస్సును ఆపి డబ్బులు అడిగారు. దాంతో రేపు ఇస్తానని సూరి నమ్మబలికాడు. మరుసటి రోజు శ్యామ్ మరొక బస్సుకు హైదరాబాద్ డ్యూటీకి వెళ్లి వస్తుండగా.. ఒంగోలు రాగానే ఒక పథకం ప్రకారం బస్సు ఆపాడు. బస్సులో నిద్రపోతున్న శ్యామ్‌ను కిడ్నాప్ చేసి బొలెరో వాహనంలో తీసుకెళ్లాడు. పలుచోట్ల బొలెరోను తిప్పుతూ కర్రలతో, కాళ్లతో చితకబాదారు. మూడు గంటల పాటు తిప్పిన తర్వాత మంగమూరు జంక్షన్ వద్ద శ్యామ్ తప్పించుకున్నాడు. శ్యామ్‌ను బస్సు ఓనర్ సూరి కొడుతున్నప్పుడు వీడియో చిత్రీకరించి ఆ వీడియోలను శ్యామ్ వాట్సాప్‌కు పంపించారు. నిన్ను చంపేస్తామని, నీకు చేతనైంది చేసుకోమంటూ బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాలుగు ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగ చోరీ
ముండ్లమూరు: నాలుగు ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ధ్వంసం చేసి వాటిలోని రాగి తీగను చోరీ చేసిన సంఘటన శుక్రవారం రాత్రి ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రా మానికి చెందిన బిజ్జం రమణారెడ్డి, మారం శ్రీనివాసరెడ్డి, మేడగం శ్రీనివాసరెడ్డికి గ్రామానికి దక్షిణం వైపు పొలాలున్నాయి. వాటిలో ఏర్పాటు చేసుకున్న 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లను దిమ్మెలపై నుంచి కిందికి దించిన దొంగలు.. వాటిని పగలగొట్టి లోపలున్న రాగి తీగను చోరీ చేశారు. శనివారం ఉద యాన్నే పొలాలకు వెళ్లిన రైతులు గమనించి ముండ్లమూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం పోలీసులు సంఘటన స్థలంలో వేలిముద్రలు సేకరించింది. పొదిలి: మురుగు కాలువలో పడి యువకుడు మృతిచెందిన సంఘటన శనివారం పొదిలి పట్టణంలోని బుగ్గచలం ట్యాంకు వద్ద జరిగింది. స్థానికంగా నివాసం ఉండే గుర్నాథం సుధాకర్ కుమారుడు రాజేష్ (19) పాల వాహనం పనికి పోతుంటాడు. శనివారం కూడా బండికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. మధ్యాహ్నం కూడా పోలీస్‌స్టేషన్ పరిసరాల్లో కనిపించినట్లు పలువురు చెబుతున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ మురుగు కాలువలో బోర్లాపడి మృతిచెంది ఉన్నాడు. కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రాజేష్ చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
వ్యసనాలకు బానిసై.. వరుస చోరీలు
బేస్తవారిపేట: మద్యంతో పాటు ఇతర చెడు వ్యసనాలకు బానిసై ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, కంభం సీఐ మల్లికార్జున తెలిపారు. శుక్రవారం బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను వారు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా నల్లతుమ్మాయపల్లికి చెందిన గురునాధం బ్రహ్మయ్య ఊళ్ల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం చేస్తూ ప్రస్తుతం కనిగిరి మండలం రామాయపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఇతను వరుసకు బావ అయిన నాగులూరి నాగరాజుతో కలిసి గత నెల 18న బేస్తవారిపేట మండలం పాపాయిపల్లెలో, 2025లో ముండ్లమూరు మండలం పెద్ద పుల్లగల్లు, పూరిమెట్ల గ్రామాల్లో ఇళ్ల ముందు నిద్రిస్తున్న మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు అపహరించాడు. అలాగే నాగులుప్పలపాడు మండలంలో ఓ దుకాణంలో నగదు చోరీ చేశాడు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన కంభం సీఐ మల్లికార్జున, ఎస్సై శివకృష్ణారెడ్డిల బృందం గురువారం సాయంత్రం కోనపల్లె అడ్డరోడ్డు వద్ద నిందితుడు బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుంది. అతని నుంచి రూ.10 లక్షల విలువైన మూడు బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదును రికవరీ చేశారు. నిందితుడిపై గతంలో తెలంగాణ రాష్ట్రంలోని రేపల్లి, తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, డక్కిలి, సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లలోనూ పలు కేసులు ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించిన సీఐ, ఎస్సైలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఆపరేషన్‌లో చురుగ్గా పాల్గొన్న కానిస్టేబుళ్లు ఎం.వెంకటేశ్వర్లు, ఎం.అంకయ్య, మరో వెంకటేశ్వర్లుకు క్యాష్ రివార్డులు అందజేశారు. యువకుడిని కటకటాల్లోకి నెట్టిన పోలీసులు రూ.10 లక్షల విలువైన నగలు, రూ.30 వేల నగదు రికవరీ వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు -
అడ్డగోలుగా మద్యం విక్రయం.. మందుబాబుల వీరంగం!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం దుకాణాల నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కుతుండగా.. మందుబాబులు రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారు. జిల్లా కేంద్రాలైన ఒంగోలు, మార్కాపురంతోపాటు మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన వందలాది మద్యం దుకాణాలు కోడి కూయక ముందే తెరుచుకుంటున్నాయి. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకే మద్యం అమ్మాలన్న రూల్స్‌ను అధికార పార్టీ నేతలు బేఖాతరు చేస్తున్నారు. రాత్రి 11 దాటినా యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇంత బహిరంగంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు, బార్లు ఏర్పాటు చేయడం, అడ్డగోలుగా బెల్టు షాపులు నిర్వహిస్తుండటంతో తాగిన మత్తులో కొందరు ప్రధాన రహదారులపైనే పడిపోతున్నారు. దీంతో మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మార్కాపురం దోర్నాల బస్టాండ్ వద్ద ఓ మందుబాబు ఏకంగా ఆర్టీసీ బస్సుకు అడ్డంగా పడుకుని ట్రాఫిక్‌ను స్తంభింపజేశాడు. ఇక ముండ్లమూరు మండలం ఈదరలో నిబంధనలు పూర్తిగా గాలికొదిలారు. టీ కొట్ల కన్నా ముందే మద్యం షాపు షట్టర్లు తెరిచారు. ఒంగోలు మంగమూరు రోడ్డు సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన బార్ అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా తెరిచే ఉండటం పోలీసులు, ఎకై ్సజ్ అధికారుల తీరును తేటతెల్లం చేస్తోంది. ఉదయం 6 గంటలకే తెరుచుకుంటున్న వైన్ షాపులు రోడ్లపైనే తాగుబోతుల న్యూసెన్స్.. ట్రాఫిక్‌కు ఆటంకం చోద్యం చూస్తున్న ఎకై ్సజ్, పోలీసు అధికారులు -
సమయం లేదు.. ‘సర్’ వేగవంతం చేయండి
యర్రగొండపాలెం: ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మ్యాపింగ్‌ను మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వారి ఓట్లను గుర్తించి త్వరితగతిన మ్యాపింగ్ చేయాలన్నారు. శుక్రవారం పెద్దారవీడు మండలం బి.చెర్లోపల్లి గ్రామంలో శ్రీసర్‌శ్రీ ప్రక్రియపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామంలో మొత్తం 1,816 ఓట్లకు గాను ఇంకా 207 ఓట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే గుర్తించి మ్యాపింగ్ చేసేలా బీఎల్ఓ, బీఎల్ఏలు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానికంగా ఓటు ఉన్నవారికి మాత్రమే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, ఇతర లబ్ధి అందుతాయన్న విషయాన్ని వలస వెళ్లిన వారికి వివరించాలన్నారు. మరో ప్రాంతంలో ఓటు పొందే అవకాశం కూడా ఉండదని, ఈ విషయమై దూరప్రాంతాల్లో ఉన్నవారికి అవగాహన కల్పించి శ్రీసర్శ్రీలో భాగస్వాములను చేయాలని సూచించారు. కొత్త ఓటర్లకు అవకాశం 2002 జాబితాలో మ్యాపింగ్ కాని వారు.. ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి దరఖాస్తుకు జత చేసి ఓటు హక్కు పొందవచ్చని ఎమ్మెల్యే వివరించారు. అలాగే, 18 ఏళ్లు నిండిన యువతకు కొత్తగా ఓటు హక్కు పొందే అవకాశం ఉందని, వారి అర్జీలను పరిశీలించి ఓటరుగా నమోదు చేయాలన్నారు. డిజిటలైజేషన్ నత్తనడక నియోజకవర్గంలో మొత్తం 2,08,318 మంది ఓటర్లకు ‘సర్’ ఫారాలు పంపిణీ చేయగా, ఇప్పటివరకు కేవలం 1,69,182 ఫారాలు మాత్రమే డిజిటలైజ్ చేసినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నత్తనడక తీరుతో నిర్దేశిత గడువులోగా ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో అర్థం కావడం లేదని ఆయన పెదవి విరిచారు. గ్రామాల్లోని బీఎల్ఓలు పూర్తి సమయం కేటాయించి, బాధ్యతాయుతంగా డిజిటలైజేషన్ వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో బీఎల్ఓలు రవితేజ, దయానిధి, బీఎల్ఏలు ఎం.కోటేశ్వరరావు, కె.వెంకటేశ్వరరెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఒంగోలు సుబ్బారెడ్డి, పెద్దారవీడు, యర్రగొండపాలెం మండలాల పార్టీ అధ్యక్షులు పాలిరెడ్డి కృష్ణారెడ్డి, ఏకుల ముసలారెడ్డి, ముస్లిం మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్.బుజ్జి, ఇంటిలెక్చువల్ జిల్లా అధ్యక్షుడు అంగిరేకుల ఆదినారాయణ, స్థానిక నాయకులు మూల లక్ష్మీరెడ్డి, మూల జగదీశ్వరరెడ్డి, ఒద్దుల లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఓటు ఉంటేనే ప్రభుత్వ పథకాల లబ్ధి కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలి డిజిటలైజేషన్ నత్తనడకపై ఎమ్మెల్యే అసంతృప్తి బి.చెర్లోపల్లిలో ‘సర్’ ప్రక్రియపై అవగాహన సదస్సు -
తిప్పుకుంటున్నారు..
లంచం ఇచ్చినాసాక్షి టాస్క్‌ఫోర్స్: కోడలు బారి నుంచి కాపాడి తన పొలం తనకు తిరిగి ఇప్పించేందుకు ఓ వృద్ధురాలి నుంచి రూ.55 వేలు లంచం తీసుకున్న ఓ ఏఎస్సై చివరికి ఆ పని చేయకపోగా అదిగో ఇదిగో అంటూ రోజుల తరబడి పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటూ ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్న ఘటన ఇది. తనకు పోలీసులు తీరని అన్యాయం చేశారని కనిపించిన వారందరికీ ఆ వృద్దురాలు చెప్పుకుంటోంది. న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వస్తే డబ్బులు తీసుకుని అన్యాయం చేస్తున్నారని కన్నీరుమున్నీరై విలపిస్తోంది. ముండ్లమూరు మండలం కొక్కెర కొండయ్యపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు సంపతి వెంకటమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటమ్మకు గ్రామంలో తొమ్మిది ఎకరాల పొలం ఉంది. ఇద్దరు కుమారులకు ఏడు ఎకరాలు ఇచ్చి తన బతుకుదెరువు కోసం రెండెకరాలు ఉంచుకుంది. అయితే, పెద్ద కొడుకు చనిపోవడంతో పెద్ద కోడలు మిగిలిన రెండెకరాలు కూడా తనవేనంటూ అడ్డం తిరిగింది. తనను కొట్టి పొలంలోకి ఎవరూ రాకుండా అడ్డుకుందని వెంకటమ్మ ఆరోపిస్తోంది. అలాగే, తాను ఉంటున్న ఇల్లు కూడా తనదేనంటూ పెద్దకోడలు బయటకు గెంటేసిందని వాపోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని వెంకటమ్మ దర్శి సీఐ రామారావును ఆశ్రయించింది. ఆయన ఏఎస్సైను కలవాలని పంపించారు. దీంతో ముండ్లమూరు ఏఎస్సై పవన్‌ను వెంకటమ్మ కలిసింది. న్యాయం చేయాలంటే డబ్బులు ఇవ్వాలని ఆయన బేరం పెట్టాడని, దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో రూ.55 వేలు ఇచ్చినట్లు వెంకటమ్మ తెలిపింది. ఆ తర్వాత ఆమె తనకు న్యాయం జరుగుతుందన్న ఆశతో రోజూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. కొత్త ఎస్సైగారు వస్తున్నారు.. నీకు న్యాయం చేస్తారని ఏఎస్సై నెలరోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. రోజూ రావడం, స్టేషన్ మెట్లపై కూర్చుని వెళ్తున్నట్లు ఆమె తెలిపింది. కొత్త ఎస్సై వచ్చాక ఆయన్ను కలవాలని ప్రయత్నించగా కలవనీయకుండా రేపు రా.. ఎల్లుండి రా.. అంటూ వెనక్కు పంపుతున్నారని ఆమె వాపోయింది. దీంతో తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలీక బాధితురాలు శుక్రవారం విలేకరులను సంప్రదించింది. ఏఎస్సై తన వద్ద తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వడంలేదని, తనకు న్యాయం చేయడంలేదని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఉన్నతాధికారులు స్పందించి తనకు తగు న్యాయం చేయాలని వృద్ధురాలు వేడుకుంటోంది. -
బాధ్యతలు చేపట్టిన ఓఎస్డీ
మార్కాపురం: మార్కాపురం జిల్లా తొలి ఓఎస్డీగా ఐపీఎస్ అధికారి నవజ్యోత్ మిశ్రా శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2021 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన స్వరాష్ట్రం బీహార్. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా మార్కాపురం ఓఎస్డీగా నియమితులయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనను మార్కాపురం డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు, సీఐ అల్తాఫ్ హుస్సేన్, ఇతర ఎస్సైలు, పోలీసు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. స్థల వివాదం.. పీసీపల్లి: మండలంలోని అడవిపల్లి గ్రామంలో గేదెలు కట్టే స్థలం విషయమై రెండు కుటుంబాల మధ్య శుక్రవారం తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోడూరి నరసింహ స్థలంలో కొద్దికాలంగా మూలే రమణయ్య తన గేదెలను కడుతున్నాడు. వద్దని నరసింహ వారించడంతో, ఆ గేదెలను కోడూరి కొండారెడ్డి స్థలంలో కట్టాడు. దీంతో కొండారెడ్డి కుటుంబ సభ్యులు గేదెలను విప్పేయడంతో వివాదం రాజుకుంది. ఇరు వర్గాలకు చెందిన నరసింహ, కొండారెడ్డి, మల్లికార్జున, మాలకొండయ్య, రమణయ్య, పెద్దిరెడ్డి, శ్రీను తదితరులు ఒకరిపైఒకరు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. దాడిలో కొండారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. ఈ వివాదంపై గురువారమే ఎస్సై నరసింహారావు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశామని, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. -
ఎక్స్‌ప్రెస్ హైవే పనుల అడ్డగింత
అద్దంకి: మండలంలోని తిమ్మారెడ్డిపాలెంలో తమ పొలాల్లో నుంచి వెళుతున్న రోడ్లో పోయిన భూమి తాలూకు నష్టపరిహారం చెల్లంచడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరగినా ఫలితం లేదని వాపోయారు. దాంతో వారు శుక్రవారం రోడ్డు పనులు జరుగుతున్న ప్రదేశంలో టెంట్ వేసి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో భూములు కోల్పోయిన రైతులు పాల్గొన్నారు. మార్కాపురం: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విధానాన్ని ప్రైవేటు పరం చేయవద్దని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి సుబ్బారావు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ హుస్సేన్‌పీరా, పిన్నిక శివకుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. ప్రభుత్వం ఇటీవల జీవో నం 396ను విడుదల చేసిందని, ఈ జీవో ద్వారా రిజిస్టర్ ఆఫీసులోని దస్తావేజు లేఖరులు, వారి వద్ద పనిచేసే డీటీపీ ఆపరేటర్లు, సహాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ జీవో ప్రకారం నూతన పీపీపీ విధానం ద్వారా టెండర్లలో పాల్గొనే ప్రైవేటు సంస్థల వారికి రిజిస్ట్రేషన్ చట్టాలపై అవగాహన లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడతారని, ప్రజలకు వారి ఆస్తి పేపర్లు నేరుగా అందవని, దూర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయని వారు తెలిపారు. పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు సంస్థల జోక్యం వలన ప్రజల ఆస్తులకు భద్రత కరువవుతుందన్నారు. ఇన్ని నష్టాలు, కష్టాలు కలగజేసే జీవోనెం 396ను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. డిమాండ్లను ప్రభుత్వానికి తెలపాలన్నారు. అనంతరం స్ధానిక ఎమ్మెల్యే, జనసేన నాయకులకు కూడా వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు స్టార్ మస్తాన్, కిరణ్, కుమార్‌రెడ్డి, రామిరెడ్డి, సీతారెడ్డి, పిన్నిక వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని బీపీఎడ్, డీపీఎడ్ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఏకేయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్.మూర్తి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు శుక్రవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు బీపీఎడ్ కోర్సుకు సంబంధించి మొత్తం 963 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 93.46 ఉత్తీర్ణత శాతంతో 900 మంది విద్యార్థులు పాసైనట్లు తెలిపారు. డీపీఎడ్ కోర్సుకు సంబంధించి మొత్తం 155 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 87.10 ఉత్తీర్ణత శాతంతో 135 మంది విద్యార్థులు పాసైనట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ జి.సోమశేఖర తెలిపారు. ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, సీఈ ప్రొఫెసర్ జి.సోమశేఖర, ఫైనాన్స్ ఆఫీసర్ కేవీ.కృష్ణారావు అభినందించారు. కార్యక్రమంలో పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల కో ఆర్డినేటర్ డాక్టర్.ఎ.అమృతవల్లి దేవి, బీఎడ్ కోర్సుల కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్.శ్రీనివాసు, సూడా శివరాం పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర 7 కోర్సుల ఫలితాలను వైస్ చాన్సలర్ డీవీఆర్ మూర్తి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏసీఈ ప్రొఫెసర్ భారతీదేవి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీలో మొత్తం రెగ్యులర్, సప్లమెంటరీ విద్యార్థినీ విద్యార్థులు 7,517 మంది కాగా వారిలో 6,689 మంది హాజరయ్యారు. వారిలో 54.09 శాతం ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. విద్యార్థులను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, ఏసీఈ ప్రొఫెసర్ భారతీదేవి అభినందించారు. కార్యక్రమంలో ఏసీఈ సహాయకులు డాక్టర్ సురేష్, కార్యాలయ సహాయ సిబ్బంది పాల్గొన్నారు. -
అంగన్వాడీల నిరసన గళం
ఒంగోలు టౌన్: వేతనాల పెంపుదల, పనిఒత్తిడి తగ్గింపు, ప్రీస్కూలు బలోపేతం, బకాయిల చెల్లింపు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు ఒంగోలు కలెక్టరేట్‌ను దిగ్బంధించారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్వాడీలు చేపట్టిన ధర్నాకు పోలీసులు భారీగా మోహరించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన అంగన్వాడీలు కలెక్టరేట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వరరావు, టూ టౌన్ ఎస్సై పున్నారావు ఆధ్వర్యంలోని పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాన గేట్లను మూసివేయడంతో పోలీసులకు, అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది. దాంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసుల తీరును నిరసిస్తూ అంగన్వాడీలు చేసిన నినాదాలతో కలెక్టరేట్ పరిసరాలు దద్దరిల్లాయి. కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇవ్వాలని అంగన్వాడీ యూనియన్ నాయకులు పట్టుబట్టారు. కలెక్టరేట్ గేట్లను మూసి వేసి అడ్డుకోవడంతో మండుటెండను సైతం లెక్కచేయకుండా అంగన్వాడీలు గేట్ల వద్దనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్వాడీల వేతనాల పెంపు కోసం 42 రోజులపాటు చేసిన సమ్మె తాలూకు బకాయిలు వెంటనే చెల్లించాలని, తెలంగాణ కంటే ఎక్కువగా వేతనాలు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని గత రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రెండు బడ్జెట్లు పెట్టినా అంగన్వాడీల వేతనాల పెంపుపై కనీసం చర్చించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్పర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలతో కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టమని చెప్పారు. పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాాట్యుటీ, వేతనంతో కూడిన సెలవులతో సహా అంగన్వాడీలకు సామాజిక, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు అద్దెలు, విద్యుత్ బిల్లులు, ప్రయాణ వ్యయాలు, అదనపు గ్యాస్ సిలిండర్ల ఖర్చును స్వంత జీతాల నుంచి భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ మాట్లాడుతూ అంగవాడీల సమస్యలను పరిష్కరించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జీవీ కొండారెడ్డి, కాలం సుబ్బారావు, యూనియన్ నాయకురాళ్లు జయప్రద, ధనలక్ష్మి, హమీమా, రాజేశ్వరి, క్రాంతి, పద్మావతి, శారద, శేషమ్మ, మస్తాన్ బి, వరలక్ష్మి, చిన్నమ్మాయి, ఆదిలక్ష్మి, మంజుదార్, జి.వెంకటేశ్వర్లు, టి.రాము, మహేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ముట్టడి మార్కాపురం: జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడీలకు కనీస వేతనాల కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన చేశారు. శుక్రవారం అంగన్వాడీలు డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ శివరామిరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని, అంగన్వాడీలపై పనిభారం తగ్గించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలనాగయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. యూనియన్ నాయకులు ఆర్డీఓ శివరామిరెడ్డికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆవులయ్య, మాలకొండయ్య, రూబెన్, సురేష్, అంగన్వాడీ యూనియన్ నాయకులు లక్ష్మి, ప్రభావతి, రమ, మల్లేశ్వరి, అరుణకుమార్, భారతి తదితరులు పాల్గొన్నారు. -
దుకాణంలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు
కురిచేడు: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి దుకాణం పైకి దూసుకెళ్లిన ఘటన గురువారం అర్ధరాత్రి కురిచేడులో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పామూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న పూజిత ట్రావెల్స్‌కు చెందిన బస్సు (ఎన్ఎల్ 01 బి 3198) కురిచేడు బస్టాండ్ సెంటర్ వద్దకు రాగానే అదుపుతప్పింది. నేరుగా వెళ్లి బస్టాండ్ ఆవరణలోని రజనీ ఫ్యాన్సీ స్టోర్‌ను బలంగా ఢీకొట్టింది. సాధారణంగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు రాత్రి వేళల్లో ఆ దుకాణం వద్దే లగేజీలు పెట్టుకుని బస్సుల కోసం వేచి చూస్తుంటారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు బలంగా ఢీకొట్టడంతో దుకాణం ముందున్న రేకులు పూర్తిగా వంగిపోయాయి. అక్కడే ఉన్న ఓ ద్విచక్ర వాహనం పాక్షికంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్టాండ్ సెంటర్లోని ప్రజలు అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై జి.కోటయ్య అక్కడికి చేరుకున్నారు. ట్రావెల్స్ యజమానిని పిలిపించి నష్టపరిహారం విషయం మాట్లాడతామని దుకాణ యజమానికి ఎస్సై హామీ ఇచ్చారు. దీంతో ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా బస్సును హైదరాబాద్‌కు పంపించివేశారు. కురిచేడు బస్టాండ్ సెంటర్లో అర్ధరాత్రి ఘటన దుకాణం రేకులు, ద్విచక్ర వాహనం ధ్వంసం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడంటూ స్థానికుల ఆందోళన -
రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు మృతి
సింగరాయకొండ: ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని వృద్ధుడు(65) మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని సోమరాజుపల్లి రైల్వేగేటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. రైల్వే జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతి నుంచి పూరీ వెళ్తున్న రైలు సోమరాజుపల్లి రైల్వేగేటు సమీపంలోకి రాగానే, పట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడి జేబుల్లో ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడు చామనఛాయ రంగుతో సుమారు 5.7 అడుగుల ఎత్తు ఉన్నాడు. ఆకాశరామన్న రంగు (స్కై బ్లూ) నిండు చేతుల చొక్కా, బ్లూ, బ్లాక్, తెలుపు రంగుల చిన్న చెక్స్ ఉన్న లుంగీ, నీలం, తెలుపు రంగులోని గళ్ల టవల్ ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని సూచించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఒంగోలు జీఆర్పీ ఎస్సై శ్రీరామ్ వెల్లడించారు. ● రూ.58,680 నగదు స్వాధీనం యర్రగొండపాలెం: మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామ శివారులోని పొలాల్లో పేకాట (కోతముక్క) ఆడుతున్న స్థావరంపై పోలీసులు శుక్రవారం మెరుపు దాడి చేశారు. పక్కా సమాచారంతో నిర్వహించిన ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.58,680 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎం.దేవకుమార్ తెలిపారు. పట్టుబడిన పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. యర్రగొండపాలెం: మండలంలోని హనుమంతుని చెంచుగూడేనికి చెందిన గిరిజన మహిళ, అంగన్వాడీ టీచర్(31) అదృశ్యమైనట్లు ఎస్సై ఎం.దేవకుమార్ శుక్రవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. సదరు మహిళ గత నెల 28వ తేదీన యర్రగొండపాలెం వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. రాత్రి అయినా ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె తండ్రి భూమని ఈదన్న శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పొగాకు రైతుల కోసం ధర్నాలకు సిద్ధం
మద్దిపాడు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ధర్నాలు చేయడానికి సన్నద్ధమవుతున్నామని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని ఈనెల 16వ తేదీన కనిగిరిలో, 17వ తేదీ ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించ తలపెట్టినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ధర్నాకు పొగాకు రైతులందరూ తరలి రావాలని కోరారు. వారం రోజుల క్రితం కడుపు మండిన రైతులు వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో వేలం నిలిపేసినా వారి గోడు పట్టించుకునే వారు లేరని, కలెక్టర్ వచ్చినా కంపెనీల వారికి పట్టదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎప్పుడో చేతులెత్తేశాడని, ముఖ్యమంత్రి చంద్రబాబు కేజీ రూ.200కు తక్కువకు కొనుగోలు చేయడానికి వీలులేదని చెప్పినా కంపెనీల వారు ఒక్క రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో జిల్లాలో పొగాకు రైతులు ఉన్నారని, పంటలో నష్టం వస్తే తీవ్రంగా నష్టపోయేది ఇక్కడివారేనన్నారు. ఇటీవల మంత్రి గొట్టిపాటి రవి, పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్, పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారిలు వేలం కేంద్రాన్ని సందర్శించిన క్రమంలో నోబిడ్లు ఉండకూడదంటూ గట్టిగా వ్యాపారులకు చెప్పినా వారు వినిపించుకునే పరిస్థితి లేకుండాపోయిందని విమర్శించారు. ఇందరు చెప్పినా కంపెనీల వారు వారికి నచ్చిన రేటు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఎఫ్–1 బేళ్లకు కేజీ రూ.240 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని, ఎఫ్–2, ఎఫ్–3 రకం బేళ్లు రూ.160 నుంచి రూ.170 మధ్యలో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. రైతులకు ఎఫ్–1 రకం బేళ్లు తక్కువగా వస్తాయి. పంటలో ఎక్కువ శాతం ఎఫ్2, ఎఫ్–3 రకం బేళ్లు వస్తాయని చెప్పారు. ఇక లోగ్రేడు పొగాకు కొంటారో కొనరో తెలియని స్ధితి, కొంటే ఎంతకు కొంటారో అన్న విషయంపై రైతులలో ఆందోళన నెలకొందని, దీని వలన పొగాకు రైతుకు సరాసరి రూ.200 వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇదేవిధంగా వేలం కొనసాగితే ఒక బ్యారన్‌కు సుమారు రూ.5 లక్షలు నష్టం వచ్చే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.250 కోట్లతో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి వ్యాపారుల సిండికేట్‌ను బద్దలు చేశారని, దీంతో రైతులకు మంచి ధర లభించడమే కాకుండా రైతుల కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు రైతు సంఘాలు, ఇతర పార్టీలను కలుపుకుని గతంలో పొదిలిలో పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్ జగన్ వచ్చిన సంగతి ఆయన గుర్తు చేశారు. ప్రశ్నిస్తే కేసులు, ధర్నాలు చేస్తే నాయకులపై కేసులు పెడుతున్నారని, ఎంతకాలం ఈ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతారంటూ ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో 16వ తేదీ కనిగిరిలో, 17న ఒంగోలు కలెక్టరేట్ వద్ధ ధర్నాలు మాజీ మంత్రి మేరుగు నాగార్జున -
పాడి చినుకుటాకై !
మర్రిపూడి: మండలంలో పనిచేస్తున్న ఇద్దరు బీఎల్ఓలపై కలెక్టర్ రాజాబాబు సస్పెన్షన్ వేటు వేసినట్లు తహశీల్దార్ జనార్దన్ శుక్రవారం తెలిపారు. మండలంలోని కూచిపూడి 28వ బూత్‌లో 1050 మంది ఓటర్లు ఉన్నారు. అయితే వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వీ నరేంద్రబాబును 28వ బూత్‌కు బీఎల్ఓగా నియమించారు. నరేంద్ర ఓటర్లకు సంబంధించిన దరఖాస్తుల పంపిణీలో నిర్లక్ష్యం వహించాడని ఈఆర్ఓ రవికుమార్ గుర్తించి, ఉన్నతాధికారులకు నివేదించాడు. అలాగే మర్రిపూడి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బీవీ నాయుడుకు మండలంలోని 22వ పోలింగ్ బూత్ అధికారిగా అదనపు బాద్యతలు ఇచ్చారు. పీఎస్ నాయుడుకు రేగలగడ్డ, దుగ్గిరెడ్డిపాలెం, పొట్టిరెడ్డిపాలెం గ్రామాలను అప్పగించారు. ఈ గ్రామాల్లో 1163 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 293 దరఖాస్తులను డిజిటలైజేషన్ (25.19 శాతం) చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించారని ఈఆర్ఓ రవికుమార్ గుర్తించి నివేదికను కలెక్టర్ రాజాబాబుకు పంపారు. దీంతో కలెక్టర్ ఇద్దరు బీఎల్ఓలను సస్పెండ్ చేశారు. రేగలగడ్డ 22 వ బూత్‌కు మర్రిపూడి గ్రామ వ్యవసాయ సహాయకుడు చిరంజీవిని, అలాగే కూచిపూడి 28వ పోలింగ్ బూత్‌కు ఇంజనీర్ అసిస్టెంట్ కే మాలకొండయ్యను నియమించినట్లు తహశీల్దార్ జనార్దన్ తెలిపారు. మార్కాపురం రూరల్: జిల్లా కేంద్రమైన మార్కాపురం మండలంలోని పెద్ద యాచవరం, రాజుపాలెం, పెద్ద నాగులవరం గ్రామాల్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో రాజకీయ జోక్యం పెరుగుతోంది. కొందరు టీడీపీ నాయకులు బీఎల్వోలపై ఒత్తిడి తెస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. తటస్థ ఓటర్లు, వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను తమకు అందజేస్తే వాటిని తమ యాప్‌లో అప్లోడ్ చేస్తామని బీఎల్వోలపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. అయితే బీఎల్వోలు అందుకు అంగీకరించకపోవడంతో వారిని బెదిరిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎన్నికల అధికారులు స్పందించి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా బీఎల్వోలకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మార్కాపురం: ఉమ్మడి జిల్లాలో రైతులకు వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమే ప్రధాన ఆదాయ వనరు. రైతులు పాడి గేదెలను కన్నబిడ్డల్లా చూసుకుంటారు. ఉమ్మడి జిల్లాలో వేలాది మంది పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో పొలాల్లో పచ్చిగడ్డి లేదు. గడ్డి కొరతతో పశువులకు సరిపడా మేత అందకపోవడంతో పాల ఉత్పత్తి క్రమంగా తగ్గుతోంది. గతంలో రోజుకు ఇచ్చిన పాలతో పోల్చితే ప్రస్తుతం పశువులు తక్కువ పాలు ఇస్తున్నాయని, గడ్డి కొరతే కారణమని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్డి ధరలు విపరీతంగా పెరగడంతో పశుపోషణ వ్యయం భారీగా పెరిగింది. ఒక వైపు పశుగ్రాసం ఖర్చు, మరోవైపు పాలదిగుబడులు తగ్గడంతో పాడి రైతులకు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా మిగులుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల టన్నుల పశుగ్రాసం అవసరం కాగా, ప్రస్తుతం సుమారు 8 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా 1.5 లక్షల టన్నులు కావాల్సి ఉంది. పశ్చిమ ప్రాంతంలో లక్ష టన్నులకుపైగా గడ్డి అవసరం కాగా, పక్క జిల్లాల నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. అధిక ధరలు వెచ్చించి... పశుగ్రాసం కొరతతో మార్కాపురం జిల్లా వాసులు అధికంగా పల్నాడు, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాల నుంచి అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అక్కడ టన్ను రూ.14 వేల నుంచి రూ.15 వేల చొప్పున కొనుగోలు చేసుకుని ట్రాక్టర్ల ద్వారా ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. రవాణా ఖర్చు కూడా అదనపు భారంగా మారుతోంది. సబ్సిడీపై పశుగ్రాసం అందించాలని, పచ్చిమేత సాగును ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పశుగ్రాస కొరత కొనసాగితే జిల్లాలో పాల ఉత్పత్తి మరింత తగ్గే ప్రమాదం ఉంది. తగ్గిన పాల ఉత్పత్తి... రోజుకు 3 గేదెలు ఉంటే 15 కిలోల గడ్డి ఖర్చవుతుంది. ఈ లెక్కన నెలకు 450 కిలోల గడ్డి అవసరం. నాటు గేదె అయితే రోజుకు 3 నుంచి 4 లీటర్లు, ముర్రా జాతి గేదైలెతే రోజుకు 12 నుంచి 13 లీటర్ల పాలు ఇస్తుంది. గతంలో రోజుకు 10 నుంచి 12 లీటర్ల వరకూ పాలిచ్చే గేదెలు ప్రస్తుతం 7 నుంచి 8 లీటర్లు, 4 లీటర్లు ఇచ్చే గేదెలు 2 లీటర్లు మాత్రమే పాలు ఇస్తున్నాయి. గడ్డి ధరలు పెరగడంతో పాటు పశుదాణా, మందులు, ఇతరత్రా ఖర్చులతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గడ్డి కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పాల ఉత్పత్తి తగ్గడంతో పాడి రైతుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హర్యానా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, చైన్నె, తదితర ప్రాంతాల నుంచి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చుచేసి కొనుగోలు చేసిన మేలు వన్నె జాతి పశువులను సైతం సగం రేటుకే తెగనమ్ముకుంటున్నారు. పల్నాడు నుంచి టన్ను రూ.4 వేల ప్రకారం గడ్డి కొనుగోలు చేశాను. వర్షాలు లేకపోవడంతో పొలాల్లో పచ్చిగడ్డి దొరకడం లేదు. దీంతో పశువులకు ఎండు గడ్డి పెట్టాల్సి వస్తోంది. టన్ను రూ.4 వేల నుంచి రూ.4,500 వరకూ ఖర్చవుతోంది. పశుపోషణ భారంగా మారుతోంది. ప్రభుత్వం సబ్సిడీపై ఎండుగడ్డి ఇవ్వాలి. గడ్డి డిపోలు ఏర్పాటు చేయాలి. – చెంచిరెడ్డి, రైతు, మార్కాపురం -
ఖరీఫ్..!
వరుణించనిశుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026ఖరీఫ్ సీజన్ మొదలై 40 రోజులు దాటినా వరుణుడుకరుణించకపోవడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతన్న గుండెల్లో ఆందోళన మేఘాలు కమ్ముకున్నాయి. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయగా, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతును మరింత కష్టాల్లోకి నెట్టింది. జిల్లాలో 55,774 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 1,700 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. ప్రధాన పంటల విత్తనాలు నేలను తాకలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోతుండగా, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి, బీమా, కౌలు రైతులకు సాయం వంటి ప్రతి అంశంలో రైతు అగచాట్లు పడుతున్నాడు. వరుణుడి కోసం ఆకాశం వైపు, ప్రభుత్వ సాయం కోసం అధికారుల వైపు ఆశగా ఎదురుచూస్తూ ఈ ఖరీఫ్‌లో ఎలా గట్టెక్కాలా అనే ఆందోళనలో అన్నదాత కొట్టుమిట్టాడుతున్నాడు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతన్నలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా చినుకు రాలక సాగు ముందుకు సాగడం లేదు. వాన చినుకు సంగతి దేవుడెరుగు.. విత్తనం నుంచి పంటల బీమా వరకు అన్నదాతలను సమస్యలు వెంటాడుతున్నాయి. ఒకపక్క అరకొరగా పెట్టుబడి సాయం.. కౌలు రైతులకు రిక్తహస్తం.. అందని మోంథా పరిహారం.. జాడలేని కరువు సాయం.. ఇలా రైతన్నను అన్నిరకాల ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. అదునుకు సబ్సిడీ విత్తనాలు సైతం అందక నానాపాట్లు పడుతున్నారు. ఎరువుల కోసం ప్రవేశపెట్టిన యాప్‌తో ఎరువుల పంపిణీ సకాలంలో అందక అగచాట్లు పడుతున్నారు. రైతులు విత్తులోనే ఆర్థికంగా నష్టపోతున్నారు. దీంతో కౌలు రైతుల చేతిలో చిల్లిగవ్వ లేక పెట్టుబడి కోసం అప్పుల వారి చుట్టూ తిరుగుతూ అష్టకష్టాలు పడుతున్నారు. 2024–25 ఖరీఫ్ సీజన్ నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఆ ఏడాది ఖరీఫ్‌లో సగానికి సగం పంటలు కూడా సాగుకాలేదు. 1025–26లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈ ఖరీఫ్ సీజన్ 2026–27తో ప్రారంభమైంది. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా మారింది. 40 రోజులు.. 1,700 హెక్టార్లు... ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 40 రోజులు కావస్తోంది. ఒక పక్క వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండగా సర్కారు ప్రోత్సాహం లేక రైతులు పంటల సాగుకు వెనకాడుతున్నారు. సీజన్ ప్రారంభమై ఇన్ని రోజులైనా.. ఇప్పటి వరకూ కేవలం 1,700 హెక్టార్లలోనే వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇప్పటి వరకూ ప్రధాన పంటల సాగు ఊసేలేకుండా పోయింది. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 55,774 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగుచేయాల్సి ఉంది. సాగు పరిస్థితిని తలచుకుంటేనే రైతన్న గుండె గుబేలవుతోంది. చంద్రబాబు పాలన మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. చంద్రబాబు పాలన ప్రారంభమైన 2024–25లో ఖరీఫ్ సీజన్లో ఈ సమయానికి వివిధ పంటలు కేవలం 1,300 హెక్టార్లలోనే సాగయ్యాయి. 2025–26 ఖరీఫ్ సీజన్లో 1,550 హెక్టార్లలోనే వివిధ పంటలు సాగు చేశారు. మరి 2026–27 ఖరీఫ్ సీజన్లో 1,700 హెక్టార్లలో మాత్రమే వివిధ రకాల పంటలు సాగు చేశారు. పంట రకం సాగు సాగు కందులు 25440 02 వరి 10142 712 సజ్జ 2773 85 మొక్కజొన్న 3047 111 మినుములు 1926 22 పెసర 222 00 నువ్వులు 2195 19 వేరుశనగ 681 478 ఆముదం 294 06 పత్తి 6997 82 పొగాకు 1536 00 చెరకు 106 152 వర్షాలు కురవక కొత్త పిలకలు రాలేదు నేను ఒకటిన్నర ఎకరా మెట్ట పొలంలో జామాయిల్ సాగు చేస్తున్నా. మూడు నెలల క్రితం చెట్లు కొట్టేశాను. ఇటీవల వర్షాలు కురవకపోవడంతో ఇంత వరకు కొత్త పిలకలు రాలేదు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే రెండు సంవత్సరాలలో మళ్లీ కోతకు వస్తాయి. అదే వర్షాలు కురవకపోతే కోతకు వచ్చేసరికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. వర్షాల కోసం ఎదురుచూస్తున్నాను. – ధన్నాసి ప్రభాకరరావు, రైతు, పాతసింగరాయకొండ వర్షం కోసం ఎదురుచూస్తున్నా నాకు ఒకటిన్నర ఎకరా మెట్ట పొలం ఉంది. ప్రతి సంవత్సరం కంది పంట సాగు చేస్తాను. ఈసారి వర్షాలు కురవకపోవటంతో కంది సాగు చేయటానికి అవకాశం లేదు. వర్షం కోసం ఎదురుచూస్తున్నా. వర్షాలు కురవకపోతే ఆర్థికంగా నష్టపోవాల్సిన దుస్థితి. – కోవూరి పెద్దన్న, రైతు, మర్రిపూడి అడుగంటుతున్న భూగర్భ జలాలు... జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కావటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశంతో పాటు తూర్పు ప్రకాశంలోనే భూగర్భ జలాలు లోలోపలకు వెళ్లిపోతున్నాయి. జూన్ మాసంలో అడపాదడపా వర్షాలు పడినా భూ తాపానికి నీరు నిలబడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్‌లో 57 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంటే 50 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఇక, జూలైలో 87 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంది. వేడిగాలులకు అక్కడక్కడా తుంపర్లు పడ్డాయిగానీ ఇంత వరకూ సరైన వర్షం జల్లు ఒక్కటి కూడా పడలేదు. దాంతో పంట భూములు బీటలు వారి పగుళ్లిచ్చే పరిస్థితులు దాపురిస్తున్నాయి. రాయలసీమలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనబడుతోంది. అక్కడి పరిస్థితులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా కనపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాంతో రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. -
కిల్కారీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఎస్జీఎఫ్ సెక్రటరీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం మార్కాపురం: మార్కాపురం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) సెక్రటరీ నియామకం కోసం వ్యాయామ ఉపాధ్యాయులు (పురుషులు/మహిళల) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.సుబ్బారావు తెలిపారు. అండర్ – 14, 17 స్కూల్ గేమ్స్ సెక్రటరీ పోస్టుకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు వ్యక్తిగత వివరాలను, ప్రతిభా ఫలితాలను తెలుపుతూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ● గర్భిణులకు రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు సూచన ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కిల్కారీ సేవలను గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని కిల్కారీ రీజినల్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజు సూచించారు. నగరంలోని పాపాకాలనీలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా నోడల్ ఆఫీసర్ రాజేశ్వరితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గర్భధారణ అనంతరం నాలుగో నెల నుంచి శిశువుకు ఒక సంవత్సరం వచ్చేంత వరకు ప్రతి నెలా కిల్కారీ వాయిస్ వస్తుందని తెలిపారు. ఈ కాల్స్ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన వైద్య పరీక్షలు, పౌష్టికాహారం, ఏఎన్సీ పరీక్షలు, ప్రసవ ప్రణాళిక, తల్లి పాల ప్రాముఖ్యత, నవజాత శిశువు సంరక్షణ, డయేరియా, న్యూమోనియా నివారణ, కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి సలహాలు, సూచనలు చేశారు. ప్రతి గర్భిణీ, బాలింతలు కిల్కారీ నంబర్ 911600403660 నమోదు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ యామిని, వైద్య సిబ్బంది, గర్భిణులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతానికి యువకుడి బలి
కొత్తపట్నం: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన యువకుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రం కొత్తపట్నంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపట్నం గ్రామానికి చెందిన పులి భద్రినారాయణ (22) కూలి పనులు చేస్తుంటాడు. స్థానిక చైతన్య స్కూల్ దగ్గరలో అదే గ్రామానికి చెందిన బొబ్బాల శ్రీనివాసరావు పొలానికి నీరు పెట్టేందుకు జీతానికి చేరాడు. మూడేళ్ల నుంచి ఆయన దగ్గరే జీతానికి పనిచేస్తున్నాడు. ఇసుక మెట్ట భూమి అందులో పశువులకు కావాల్సిన గడ్డి పెంచుతున్నాడు. ఎప్పటిలాగే ఆ గడ్డికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటారు వేసి నీరు పెడుతున్నాడు. ఇంతలో కరెంట్ పోయింది. మళ్లీ కరెంట్ వచ్చిన వెంటనే మోటార్ వేసేందుకు వెళ్తూ విద్యుత్ తీగ గడ్డిలో తెగిపడిపోయి ఉండగా దానిపై కాలు వేశాడు. ఆ వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి మృతుడి తండ్రి పులి శ్రీనుకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న విద్యుత్ లైన్మెన్ శ్రీనివాసరావు ట్రాస్ఫార్మర్ ఆపి విద్యుత్ తీగలను తొలగించారు. ఎస్సై సుధాకర్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. చేతికి వచ్చిన కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సింగరాయకొండ: వెూటారు సైకిల్ అదుపుతప్పి రావినూతల కృష్ణ (49) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని శానంపూడి చెరువు వద్ద గురువారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బేల్దారి పనిచేస్తున్న శానంపూడికి చెందిన కృష్ణ పనిపై సింగరాయకొండ వచ్చి మధ్యాహ్నం భోజనం కోసం బైకుపై స్వగ్రామం వెళ్తున్నాడు. చెరువు మలుపు వద్ద మోటారు సైకిల్ ప్రమాదవశాత్తు అదుపు తప్పడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న రావినూతల సుధీర్, రావినూతల వంశీలు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించి ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్‌కుమార్ వివరించారు. -
గొట్లగట్టు రామాలయంలో చోరీ
కొనకనమిట్ల: మండలంలోని గొట్లగట్టు రామాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయానికి చెందిన అత్యంత పురాతనమైన, రూ.లక్షల విలువ చేసే పంచలోహ ఉత్సవ విగ్రహాలను అపహరించుకుపోయారు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. రామాలయం వెనుక ఉన్న కల్యాణ మండపం ఆవరణలో రామనవమి ఉత్సవాల్లో స్వామివారిని ఊరేగించే హనుమంత, గరుడ వాహన విగ్రహాలను ఉంచేవారు. పంచ లోహాలతో రూపొందించిన ఈ విగ్రహాలపై కన్నేసిన దుండగులు బుధవారం రాత్రి వేళ మాటువేసి మరీ చోరీకి పాల్పడ్డారు. కళ్యాణ మండపం వెనుక భాగం గుండా లోపలికి ప్రవేశించిన దొంగలు, హనుమంత వాహనాన్ని బల్లపై నుంచి తొలగించి తీసుకెళ్లారు. గరుడ వాహనాన్ని కూడా అపహరించే క్రమంలో చేయి విరగ్గొట్టి మరీ తీసుకెళ్లినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ విగ్రహాల విలువ మార్కెట్లో సుమారు రూ.20 లక్షలకు పైగానే ఉంటుందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. పనిచేయని సీసీ కెమెరాలు ఆలయంలో గతంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, అవి ఇప్పుడు పని చేస్తున్నాయా? లేదా? అన్నది ఎవరికీ తెలియని పరిస్థితి. నిఘా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే ఈ దొంగతనాలకు కారణమని స్థానికులు మండిపడుతున్నారు. గతంలో కూడా ఇదే రామాలయంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలు చోరీకి గురైన ఘటనను గుర్తుచేస్తూ, ఆలయ భద్రతపై అధికారుల నిర్లక్ష్యం ఎంతలా ఉందో అర్థమవుతోందని పేర్కొంటున్నారు. సీసీ కెమెరాలు పనిచేస్తే దొంగల ఆమూకీ కనుగొనే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పంచలోహ హనుమంత, గరుడ వాహనాలపై దొంగల కన్ను రూ.20 లక్షల విలువైన విగ్రహాల అపహరణ! సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై గ్రామస్తుల అసహనం -
కలెక్టర్.. కాసేపు టీచర్..!
మార్కాపురం టౌన్: క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ ఎం.విజయ సునీత గురువారం మార్కాపురం మండలం రాయవరంలో కేజీబీవీలో విద్యార్థినులతో కలెక్టర్ సరదాగా ముచ్చటించారు. ఉన్నత చదువులే ఉజ్వల భవిష్యత్తుకు మార్గాలని, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండి లక్ష్యం వైపు పయనించాలని సూచించారు. స్వయంగా బ్లాక్‌బోర్డుపై సౌర కుటుంబం గురించి బోధించి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ● పదోన్నతిపై ‘అప్పా’కు జ్యోతిరాణి ఒంగోలు టౌన్: ఒంగోలు అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) పోస్టు ఏడాది తర్వాత ఎట్టకేలకు భర్తీ అయింది. ఈ మేరకు ఎన్.యుగంధర్ బాబును ఆ స్థానంలో నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. యుగంధర్ బాబు ప్రస్తుతం నంద్యాల అడిషనల్ ఎస్పీ(అడ్మిన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నంద్యాల డీఎస్పీగా పని చేసిన ఆయన, పదోన్నతి పొంది అదే జిల్లాలో ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా పనిచేసిన నాగేశ్వరరావు పదోన్నతిపై బదిలీ అయినప్పటి నుంచి ఈ పోస్టు ఏడాదికి పైగా ఖాళీగా ఉంది. అదేవిధంగా, పీటీసీలో డీఎస్పీగా పనిచేస్తూ ఏఎస్పీగా పదోన్నతి పొందిన పి.జ్యోతిరాణిని ‘అప్పా’కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆమె వెయిటింగ్లో ఉన్నారు. -
రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
● మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తాం, లక్షల ఉద్యోగాలిస్తాం, స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వైఎస్ జగన్ హయాంలో సృష్టించిన సంపదను ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తుల కోసం చంద్రబాబు సంపద సృష్టిస్తున్నారన్నారు. రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణలు చూస్తే మెడికల్ కాలేజీలు, కాలేజీలు, పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, బీమా సేవలు.. ఇలా ప్రతీ చోటా ఇదే తంతు అని గుర్తు చేశారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు ఆధ్వర్యంలో రామాయపట్నం పోర్టు కృష్ణార్పణం అయిపోతోందన్నారు. 850 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 5 వేల కోట్లతో నిర్మించిన రామాయపట్నం పోర్టును సైతం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఈ పోర్టు పనులు 95 శాతం పూర్తయ్యాయన్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు ఇలా ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలాంటి లీజులపై సమీక్షిస్తామని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల సంగతి ఏమైందో అందరూ చూశారని.. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. ఒంగోలు సబర్బన్: జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఇన్టిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ (ఐసీడీఎస్) ప్రాజెక్టు డైరెక్టర్‌గా పద్మ సునంద గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబును ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క బహూకరించారు. మార్కాపురం: తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న ముత్తోజు సుధాకర్‌ను మార్కాపురం డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ (డీసీఈబీ)గా నియమిస్తూ మార్కాపురం జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా, సింగపూర్ విద్యా విధానాలను నిశితంగా పరిశీలించిన వ్యక్తిగా గుర్తింపు పొందడంతో పాటు నైపుణ్య అభివృద్ధిపై ప్రభుత్వానికి సుధాకర్ నివేదిక సమర్పించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో సైన్సు ఫెయిర్‌లో పాల్గొ ని బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ, విద్యార్థులు మెరుగైన ఫలితాల సాధన కోసం ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తానని అన్నారు. ఒంగోలు వన్‌టౌన్: జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 11వ తేదీ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి, అదనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి సీహెచ్‌వీ రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరువర్గాల అంగీకారంతో సామరస్యంగా పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ మంచి వేదికని అన్నారు. ఇలా పరిష్కరించుకోవడం అనేది ఇరువర్గాలు గెలిచినట్టేనని తెలిపారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌లలో రాజీపడదగిన అన్ని క్రిమినల్, సివిల్ కేసులు, మోటార్ సంబంధ వ్యాజ్యాలు, వివాహ సంబంధ కేసులు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. తద్వారా సివిల్ కేసుల్లో న్యాయస్థానాల్లో చెల్లించిన ఫీజులు తిరిగి పొందవచ్చన్నారు. లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం కోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సత్యానంద ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో 27 బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ ఉపయోగించుకోవాలని కోరారు. -
అన్నదాతపై ఎరువుల పిడుగు!
కొండపి: ప్రకృతి ప్రకోపాలు, మద్దతు ధర లేక అగచాట్లు.. వెరసి వ్యవసాయం అంటేనే ఇప్పుడు పీడకలగా మారింది. ఆరుగాలం కష్టపడినా పెట్టిన పెట్టుబడి సైతం చేతికందని దుస్థితిలో ఉన్న రైతులను ఎరువుల ధరల పెంపు మరింత పాతాళానికి నెట్టేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం కుంటుపడటమే కాకుండా, ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో అన్నదాతలు ఆందోళనలో మునిగిపోయారు. జిల్లాలో నైరుతి రుతుపవనాల కారణంగా ఆశించిన వర్షం కురవలేదు కానీ అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పడుతుండటంతో ఖరీఫ్ సాగుకు రంగం సిద్ధమైంది. విత్తనాలు నాటేందుకు రైతులు సిద్ధమవుతుండగా, ఎరువుల షాపుల ముందు కనిపిస్తున్న ధరల పట్టికలు వారి గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. యూరియా, డీఏపీ ధరల్లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, పంట దిగుబడికి ప్రాణాధారమైన కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. బస్తాకు రూ.300 నుంచి ఏకంగా రూ.700 వరకు ధరలను పెంచేయడంతో, సాగు ఖర్చు ఊహించని విధంగా తడిసి మోపెడవుతోంది. బ్లాక్ మార్కెట్ దందా ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, ఎరువుల కొరతను సాకుగా చూపుతూ కొందరు డీలర్లు బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. అధిక ధరలు చెల్లిస్తేనే ఎరువులు దొరుకుతున్నాయని, లేదంటే నిల్వలు లేవని సమాధానం వస్తోందని రైతులు వాపోతున్నారు. పాలన గాలికి వదిలేసిన సర్కారు, ఎరువుల పంపిణీలో కనీస పర్యవేక్షణ కూడా చేయడం లేదు. పగ్గాల్లేని దోపిడీ కేంద్ర ప్రభుత్వం కేవలం కొన్ని ఎరువులకే రాయితీని పరిమితం చేసి, కాంప్లెక్స్ ఎరువుల ధరలను నిర్ణయించే అధికారాన్ని తయారీ కంపెనీలకే వదిలేసింది. దీంతో కంపెనీలు ఇష్టానుసారంగా ధరలను పెంచి రైతుల నడ్డి విరుస్తున్నాయి. అసలే గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్నకు, ఇప్పుడు పెరిగిన ఎరువుల ధరలు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారాయి. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పెట్టుబడి భారం పెరగడంతో, వ్యవసాయం వదిలేయాలన్న ఆలోచన వారిలో వ్యక్తమవుతోంది. అన్నదాతల ఆక్రందన ‘పంట వేస్తే ఎరువులు దొరకవు, దొరికితే కొనే ధర ఉండదు. మరి మేం సాగు చేయడం ఎందుకు’ అని అన్నదాతలు రోదిస్తున్నారు. పాలకులు క్షేత్రస్థాయి పరిస్థితులను విస్మరించి, ప్రకటనలకే పరిమితం కావడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని, ఎరువుల ధరల పెంపును నిలుపుదల చేయాలని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. -
ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాలి
ఒంగోలు సబర్బన్: ఐవీఆర్ఎస్ కాల్స్ ఆధారంగా మాత్రమే టార్గెట్లు నిర్ణయించడం వలన ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోందని, ఫీల్డ్ స్థాయి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని జిల్లా అధికారుల దృష్టికి ఉద్యోగ సంఘాల నేతలు తీసుకెళ్లారు. స్థానిక ప్రకాశం భవన్లో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గురువారం జాయింట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) పి.వెంకట రమణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల సేవ, సంక్షేమం, పరిపాలనా సంబంధిత అంశాలు, పలు ముఖ్య సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలియజేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రస్తావించిన ప్రధాన అంశాలు... జిల్లా స్థాయిలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను 13–07–2026లోపు పూర్తి చేయాలి. సచివాలయ ఉద్యోగులను అత్యవసర పరిస్థితులు మినహా ప్రభుత్వ సెలవు దినాల్లో విధులకు పిలవకూడదు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్ల పరిష్కారానికి ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలి. మహిళా ఉద్యోగులను సాయంత్రం 6 గంటల తర్వాత విధుల్లో కొనసాగించకుండా తగిన ఆదేశాలివ్వాలి. ఒంగోలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో క్రెచ్ సదుపాయం ఏర్పాటు చేయాలి. ప్రకాశం భవన్, జీజీహెచ్, పాత రిమ్స్, తదితర కార్యాలయాల్లో శౌచాలయాల నిర్వహణ, పరిశుభ్రత మెరుగుపరచాలి. ఐపీహెచ్ఎస్–2022 నిబంధనల ప్రకారం 247 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 4వ స్టాఫ్ నర్స్ పోస్టులు మంజూరు చేయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. అదేవిధంగా బీఎల్ఓ విధులకు సంబంధించి సస్పెన్షనన్కు గురైన కొంతమంది ఉద్యోగుల సమస్యలను కూడా ఉద్యోగ సంఘాలు సమావేశంలో ప్రస్తావించాయి. సంబంధిత ఉద్యోగులపై జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను విచారణ పూర్తయ్యే వరకు నిలిపివేసి మానవతా దృక్పథంతో పునరాలోచించి వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సమావేశంలో చర్చించిన సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకట రమణ హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా పరిపాలనా అధికారి సాయి శ్రీనివాస్, కలెక్టరేట్ సిబ్బంది, ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.శరత్ బాబు, కార్యదర్శి ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్‌రెడ్డి, కార్యదర్శి వరకుమార్, పలు సంఘాల నేతలు పొల్గొన్నారు. డీఆర్ఓకు పలు ఉద్యోగ సంఘాల నేతల అర్జీలు... ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకట రమణకు పలు ఉద్యోగ సంఘాల నేతలు గురువారం ప్రకాశం భవనంలో నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అనంతరం వినతిపత్రాలు అందించారు. ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి వరకుమార్, సహాధ్యక్షుడు మసూద్ అలీ, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు మోటా శ్రీనివాసరావులు కలిసి ఉద్యోగుల సమస్యలపై అర్జీలిచ్చారు. అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలపై ఎస్టీయూ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి గవిని శివశంకర్, తదితరులు అర్జీ అందించారు. -
ఈకేవైసీ వెంటనే పూర్తి చేసుకోవాలి
ఒంగోలు సబర్బన్: బ్యాంకు ఖాతాదారులందరూ వారి ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈకేవైసీ) వివరాలను వెంటనే నవీకరించుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ మేనేజర్ జి.వెంకట రమణారావు కోరారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మార్గదర్శకాల మేరకు ప్రతి ఒక్క బ్యాంకు ఖాతాదారుడు దీనిని తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. స్థానిక బ్యాంకు ఆర్ఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖాతాదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారా ఓటీపీ ఆధారిత ఈకేవైసీని సులభంగా పూర్తిచేసుకోవచ్చన్నారు. అలాగే, సమీపంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సందర్శించి కూడా ఈకేవైసీ వివరాలను నవీకరించుకోవచ్చని తెలిపారు. ఈకేవైసీని సకాలంలో పూర్తి చేయడం ద్వారా బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయన్నారు. అలాగే ఖాతాల భద్రత మరింత బలోపేతం అవుతుందన్నారు. ఇంకా కేవైసీ పూర్తి చేయని ఖాతాదారులు ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. బ్యాంకు శాఖ, కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా ఈ సేవలు పొందవచ్చని చెప్పారు. ఖాతాదారుల సౌకర్యార్థం బ్యాంకు అన్ని శాఖల్లో ఈకేవైసీ ప్రక్రియను సులభతరం చేసినట్లు ఆయన వివరించారు. మరిన్ని వివరాలకు సమీపంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించాలని ఆయన కోరారు. -
గంజాయి మత్తులో కత్తితో దాడి
● గొంతులో పొడవడంతో పరిస్థితి విషమం ఒంగోలు టౌన్: గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన ఒక వ్యక్తి చాకుతో దాడి చేయడంతో బాధితుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... మద్దిపాడు మండలం నేలటూరు గ్రామానికి చెందిన వడియాల సుబ్బారావు ఒంగోలులో బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. గురువారం ఒంగోలులోని కర్నూలు రోడ్డులో ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఒక టీ స్టాల్ వద్ద కూర్చుని ఉండగా, చీమకుర్తి మండలం నిప్పట్లపాడు గ్రామానికి చెందిన పొన్నూరు ప్రసాద్ అక్కడకు వచ్చాడు. అప్పటికే ప్రసాద్ గంజాయి సేవించి ఉన్నాడు. దానికితోడు మద్యం తాగి ఉన్నాడు. టీ స్టాల్ వద్ద సుబ్బారావుకు, ప్రసాద్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. గంజాయి, మద్యం మత్తులో ఉన్న ప్రసాద్.. పక్కనే ఉన్న కత్తి తీసుకుని దాడికి పాల్పడ్డాడు. సుబ్బారావు మెడ మీద కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్ర గాయాలతో పడిపోయిన సుబ్బారావును వెంటనే ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం సుబ్బారావు పరిస్థితి విషమంగా ఉంది. దాంతో అతడిని మెరుగైన చికిత్స కోసం స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నాడు. -
బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్‌పై శిక్షణ
మార్కాపురం: జిల్లా స్థాయిలో 2026–27 బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్‌పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కాపురం డీఆర్డీఏ పీడీ శివన్నారాయణ మాట్లాడుతూ.. ప్రతి మండల సమాఖ్య ఈసీ సభ్యులకు శిక్షణనిచ్చి, నిర్దేశిత బడ్జెట్ ప్లాన్‌ను ఎన్ఆర్ఎల్ఎం లాగిన్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఏపీడీ నీలకంఠారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సుస్థిర జీవనోపాధులు వంటి అంశాల్లో విజన్, మిషన్, వ్యూహరచనతో ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. డీపీఎం ఓ.లక్ష్మిరెడ్డి, ఏపీఎంలు పి.రమేష్‌బాబు, యల్సీ ఎం.వెంకిరెడ్డి శిక్షకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో మార్కాపురం ఏపీఎం పిచ్చయ్య, పది మండలాల ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లు, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. -
వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరికి సంకెళ్లు
దర్శి: దేవాలయాల్లో వరుస చోరీలు, రాత్రిపూట ఇళ్లలో, షాపుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ వై.రామారావు తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. సీఐ రామారావు ఆధ్వర్యంలో తాళ్లూరు ఎస్సై మల్లికార్జునరావు, దొనకొండ ఎస్సై రామకృష్ణలు తమ సిబ్బందితో కలిసి నిందితులను అరెస్టు చేసి సుమారు రూ.3.50 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, ఇత్తడి గంటలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5వ తేదీ రాత్రి తాళ్లూరు మండలం నాగంబొట్లవారిపాలెం శివారులోని కాటమరాజు దేవాలయంలో ఇత్తడి గంటలు చోరీకి గురైన ఘటనపై తాళ్లూరు ఎస్సై మల్లికార్జునరావు కేసు నమోదు చేసి పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచారు. నిందితుడు పొదిలికి చెందిన పొదిలి నరసింహారావును అదుపులోకి తీసుకుని విచారించగా కాటమరాజు గుడిలో ఇత్తడి గంటలు దొంగతనం చేసినట్లు తేలింది. అంతేగాక దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగినపూడి శివాలయంలో హుండీ పగులగొట్టి వెయ్యి నగదు, నల్లబోతువారిపాలెంలోని పోలేరమ్మ దేవాలయంలో హుండీ పగులగొట్టి రూ.10 వేల నగదు అపహరించినట్లు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.60 వేల విలువైన 40 ఇత్తడి గంటలు (సుమారు 50 కిలోల బరువు) స్వాధీనం చేసుకున్నారు. పొదిలి పట్టణంలో జరిగిన ద్విచక్ర వాహనం చోరీ కేసులో కూడా ఇదే నిందితుడి ప్రమేయం ఉన్నట్లు తేలింది. రూ.90 వేల విలువైన ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పొదిలి నరసింహారావుపై గతంలో వివిధ పోలీస్స్టేషన్లలో సుమారు 40 చోరీ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మరో కేసులో దొనకొండ ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో కలిసి దొనకొండ మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన మేకల ధనరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నెల 3వ తేదీన దొనకొండలోని ఒక కొరియర్ కార్యాలయంలో రూ.50 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ దొంగిలించినట్లు తేలింది. పడమటి వెంకటాపురం గ్రామంలో పగటి సమయంలో ఒక ఇంట్లో చొరబడి 8 గ్రాముల నల్లపూసల దండ, 4 గ్రాముల చెవి దిద్దులు, రూ.50 వేల నగదు దొంగిలించినట్లు గుర్తించారు. ఈ రెండు కేసుల్లో నిందితుల నుంచి రూ.45 వేల నగదు, మొబైల్ ఫోన్, నల్లపూసల దండ, చెవి దిద్దులు కలిపి సుమారు రూ.2 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను దర్శి న్యాయస్థానంలో హాజరు పరుస్తామని సీఐ రామారావు వివరించారు. కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన దర్శి సీఐ రామారావు, తాళ్లూరు ఎస్సై మల్లికార్జునరావు, దొనకొండ ఎస్సై రామకృష్ణ, పోలీసు సిబ్బంది నాయక్, శ్రీను, గిరి, మహేష్, మాలకొండయ్యలను ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. దేవాలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే నేరాలను మరింత సమర్థంగా అరికట్టవచ్చని సీఐ రామారావు వివరించారు. మొత్తం రూ.3.50 లక్షల సొత్తు స్వాధీనం నిందితుల వివరాలు వెల్లడించిన దర్శి పోలీసులు -
సర్ కార్యక్రమంపై కలెక్టర్ అసహనం
ఒంగోలు సబర్బన్: నగరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం జరుగుతున్న తీరుపై కలెక్టర్ పి.రాజాబాబు అసహనం వ్యక్తం చేశారు. కొందరు బీఎల్ఓలు, ఏబీఎల్ఓల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని గాంధీనగర్ వద్ద ఉన్న వార్డు సచివాలయాన్ని గురువారం ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బీఎల్వోలు చేస్తున్న ఓటర్ల నమోదు ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. ఈఆర్ఓలు ఎంతమంది ఉన్నారని వివరాలడిగి తెలుసుకున్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో అలసత్వం వహిస్తున్న బీఎల్ఓ, అడిషనల్ బీఎల్ఓ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. వారి స్థానంలో వేరే వారిని నియమించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మొబైల్ యాప్ ద్వారా ఓటరు నమోదు ప్రక్రియ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. సవరణ ప్రక్రియను త్వరితగతిన, కచ్చితత్వంతో, సమర్థవంతంగా పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఏ ఒక్కరూ సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో మిగిలిపోకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్లందరి పేర్లు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ కల్పనా కుమారి, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట కృష్ణయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పలు సచివాలయాలను తనిఖీ చేసిన జేసీ... జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి గురువారం ఒంగోలు నగరంలోని పలు సచివాలయాలను తనిఖీ చేశారు. తొలుత వెంకటేశ్వరకాలనీలో పర్యటించారు. అనంతరం గద్దలకుంట–2 సచివాలయాన్ని సందర్శించారు. ఆయా సచివాలయాల పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఓటర్ల వివరాల డిజిటైజేషన్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఇతర అధికారులు ఉన్నారు. కొందరు బీఎల్ఓలు, ఏబీఎల్ఓల పనితీరు సక్రమంగా లేదంటూ ఆగ్రహం ఒంగోలు నగరంలోని పలు సచివాలయాల ఆకస్మిక తనిఖీ -
లారీని ఢీకొట్టిన మరో లారీ
అద్దంకి: నిలిపి ఉంచిన లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అద్దంకి పట్టణ శివారులోని నల్లవాగు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సంతమాగులూరు మండలం అడ్డరోడ్డుకు చెందిన దత్తు, దుర్గ, హనుమాయమ్మలు తమ లారీని రోడ్డు పక్కన నిలిపి, డివైడర్ మధ్యలో గడ్డి తొలగింపు పనులు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్డుపై శ్రీస్టాప్ కోన్శ్రీలను ఏర్పాటు చేశారు. అయితే, అటుగా వచ్చిన మరో లారీ వేగంగా దూసుకొచ్చి, రోడ్డుపై నిలిపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు కావడంతో, అందులో కూర్చున్న దత్తు (పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలం ఈరాటం గ్రామం) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు తీవ్ర శ్రమకోర్చి బయటకు తీశారు. ఒకరి పరిస్థితి విషమం బాధితులను 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో దుర్గను మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఆస్పత్రికి తరలించగా, హనుమాయమ్మ అద్దంకిలో చికిత్స పొందుతోంది. మృతుడు దత్తుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
14న ఒంగోలు కలెక్టరేట్ ముట్టడి
ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రధాన సమస్యల పరిష్కారంపై ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ, అలాగే టెట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 14వ తేదీన ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించే ర్యాలీ, పికెటింగ్‌ను విజయవంతం చేయాలని ఫ్యాప్టో ప్రకాశం జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది. స్థానిక మల్లయ్య భవననంలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కే.ఎర్రయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎస్ఎండీ రఫీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఫ్యాప్టో నాయకురాలు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని నియమించి, మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలిగిస్తున్న టెట్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 14న జరిగే ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. జూలై 14 ఉదయం 9.00 గంటలకు పాత జెడ్పీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ ప్రారంభమై, ఉదయం 11 గంటలకు ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద పికెటింగ్ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాలైన ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్–257, ఏపీటీఎఫ్–1938, బీటీఏ, హెచ్ఎం అసోసియేషన్, ఎస్ఏఏఎస్, ఎస్సీ–ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, రూట, పీఈటీ అసోసియేషన్ నాయకులు కే.ఎర్రయ్య, అబ్దుల్ హై, శేషారావు, లక్ష్మీనారాయణ, దేవసహాయం, ఎస్.ఎం.డి. రఫీ, దార్ల జయరావు, కార్యవర్గ సభ్యులు పీవీ సుబ్బారావు, చల్లా శ్రీనివాసులు, గవిని శివశంకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ, పికెటింగ్‌ను విజయవంతం చేయాలని ఫ్యాప్టో పిలుపు -
అంగన్వాడీపై టీడీపీ నేతల కక్షసాధింపు!
కందకూరు: మండలంలోని ఓగూరు ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంపై కొందరు అధికార పార్టీ నేతలు రఘుబాబు, మనోహర్, మరికొందరు కక్షగట్టడం చర్చనీయాంశమైంది. ఎటువంటి అవినీతి లేకపోయినా, అంగన్వాడీ కార్యకర్తను, ఆయాలను తొలగించాలనే దురుద్దేశంతో పదేపదే ఫిర్యాదులు చేస్తూ ఐసీడీఎస్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గత వారం రోజుల్లో అధికారులు పలుమార్లు తనిఖీలు చేపట్టారు. లబ్ధిదారులు మాత్రం సరుకులు సక్రమంగా అందుతున్నాయని, కార్యకర్త పనితీరు బాగుందని అధికారులకు నివేదించారు. అయినప్పటికీ, తమకు నచ్చినట్లుగా లేదని రాస్తేనే సంతకాలు చేస్తామంటూ అధికారులను ఫిర్యాదుదారులు బహిరంగంగానే బెదిరించడం గమనార్హం. ఇక ఫిర్యాదుదారుల్లో ఒకరైన రేషన్ డీలర్ రఘుబాబు మూడు నెలలుగా కందిపప్పు సరఫరా నిలిపివేసి, అదే విషయాన్ని అంగన్వాడీ కార్యకర్తపై నెట్టేయాలని చూడటం వివాదాస్పదమవుతోంది. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి, ఫిర్యాదుదారుల పట్ల మెతకగా వ్యవహరిస్తూ సర్దుకుపోవాలని కోరడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగ్వాడీ సిబ్బంది కుటుంబాన్ని టీడీపీలో చేరాలని అధికారులు పరోక్షంగా చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి మహిళా ఉద్యోగులను మానసిక వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మూడు నెలలగా అంగన్వాడీకి వచ్చే కంది పప్పు ఇవ్వని డీలర్ పైగా లబ్ధిదారులకు సరుకులు ఇవ్వడం లేదని వరుసగా ఫిర్యాదులు తనిఖీలో అంతా బాగానే ఉన్నట్లు తేల్చిన అధికారులు -
మైనర్‌పై లైంగికదాడి
● నిందితుడిపై పోక్సో కేసు నమోదు అద్దంకి రూరల్: మైనర్ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలితో ఫోన్లో మాట్లాడి, ఆ సంభాషణను రికార్డు చేసిన ఇద్దరు వ్యక్తులు.. సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితులు సోమవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, మంగళవారం కేసు నమోదైంది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీఐ సుబ్బరాజుకు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు పులి వికాస్, కిరణ్‌కుమార్, బాలిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మార్కాపురం టౌన్: ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి ఎస్.కె.మహమ్మద్ ఖాశీం తెలిపారు. డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా 100 మందిని ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి రెండు నెలల పాటు శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 17వ తేదీలోపు ఒంగోలులోని ఏపీబీసీ స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9989285530, 8985090926ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ● ఎన్‌హెచ్ పీడీ అనిల్‌కుమార్ రెడ్డి టంగుటూరు: జాతీయ రహదారి(ఎన్‌హెచ్ 16) పక్కన ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, వెంచర్ల యజమానులు అప్రోచ్ రోడ్ల కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ బాటలను తొలగించే ప్రక్రియను మంగళవారం టోల్ ప్లాజా వద్ద ఆయన పర్యవేక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, విజయవాడ ఆర్ఓ సూచనల మేరకు సింహపురి ఎక్స్‌ప్రెస్ వే అధికారులతో కలిసి అక్రమంగా నిర్మించిన బాటలను జేసీబీతో తొలగించారు. అనుమతి లేకుండా రోడ్ల పక్కన వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఇకపై నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ హెడ్ జైరామ్ అమర్ బాబు, పోలీస్, టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: ఎమ్మార్పీ ధరకే రైతులకు ఎరువులు అందజేయాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం జిల్లాలో ఎరువుల నిల్వలు, ధరలపై వ్యవసాయ అధికారులు, డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతులకు యాప్ ద్వారా మాత్రమే ఎరువులు ఇవ్వాలని, అదే సమయంలో బిల్లులు అందజేయాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రసాయనిక ఎరువులు వాడకం తగ్గించడంతోపాటు నానో ఎరువులు, జీవ ఎరువులు, సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ ఇన్చార్జి అధికారి బాలాజీ నాయక్, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం ఏడిఏలు రాజశ్రీ, జైనులాబ్దిన్, వెంకటరమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ● నడి రోడ్డుపై పడి గొంతెండి ఒకరు మృతి గిద్దలూరు రూరల్: మద్యం మత్తులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన దిగువమెట్ట గ్రామంలోని చెంచుకాలనీ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. గుర్తుతెలియని వ్యక్తి మద్యం మత్తులో చెంచుకాలనీ సమీపంలో సంచరిస్తూ రోడ్డుపై బోర్లా పడిపోయాడు. అతడిని ఎవరూ పట్టించుకోకపోవడంతో గొంతు ఎండి మరణించాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉంటుందని, నలుపు రంగు ప్యాంట్ ధరించి, చొక్కా లేకుండా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడికి నోటి వెంట రక్తపు మరకలు ఉండటంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
జనసేన నేతల దాష్టీకం.. హోటల్‌పై దౌర్జన్యం!
సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికార పార్టీ అండ ఉందని, కూటమి నాయకులు చెలరేగిపోతున్నారు. భూ వివాదం పేరుతో జనసేన మండల అధ్యక్షుడు కేతినేని మురళి తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాలలో వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్ నిర్వహిస్తున్న హోటల్‌పై దాడి చేసి, బీభత్సం సృష్టించారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలు.. పెద్దదోర్నాలలో జాతీయ రహదారి పక్కన కేతినేని మురళికి చెందిన స్థలంలో అబ్దుల్ మజీద్ హోటల్ నిర్వహిస్తున్నారు. లీజు గడువు ఇటీవల ముగిసింది. అయితే తాను కోటి రూపాయల ఖర్చుతో నిర్మించిన హోటల్‌ను మరి కొంతకాలం కొనసాగించనివ్వాలని మజీద్ విజ్ఞప్తి చేయగా మురళి అంగీకరించలేదు. ఉన్నపళంగా స్థలాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో వివాదం రాజుకుంది. ఈ క్రమంలో మంగళవారం ఇరువర్గాలు కలిసి చర్చించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కొంత మంది వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడ వేచి ఉండగా.. మురళి తన అనుచరులతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన దాదాపు 20 మంది మహిళలను వెంటబెట్టుకుని హోటల్లోకి దూసుకొచ్చారు. శాంతియుతంగా మాట్లాడుకుందామనుకున్న వేళ, జనసేన కార్యకర్తలు దాడికి తెగబడటంతో భోజనం చేస్తున్న కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. కస్టమర్లను బెదిరించి బయటకు గెంటేయడంతోపాటు హోటల్లోని ఫ్రిజ్‌లు, కుర్చీలు, టేబుళ్లు, ఇతర విలువైన సామగ్రిని రోడ్డుపైకి విసిరేశారు. అంతటితో ఆగకుండా హోటల్‌కు తాళం వేసి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాష్టీకంపై బాధితుడు మజీద్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ అజయ్‌కుమార్, ఎస్సైలు దేవకుమార్, వెంకటరమణయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అడ్డుకోబోయిన వైఎస్సార్ సీపీ మైనార్టీ నేతపై అరాచకం కస్టమర్లను బెదిరించి, సామగ్రిని బయటకు విసిరేసిన వైనం -
అమరువీరుల స్ఫూర్తికి శాశ్వత నిలయం
నాగులుప్పలపాడు: మాదిగ సమాజ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈదుమూడి గ్రామంలో వేలాది కార్యకర్తల నడుమ మంగళవారం శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ దేశంలో సామాజిక ఉద్యమాల కోసం ప్రాణత్యాగం చేసిన మాదిగ అమరవీరులకు ఇప్పటి వరకు తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లోటును భర్తీ చేయడానికే ఉద్యమం పుట్టిన ఊరు ఈదుమూడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు. సమానత్వం కోసం మాదిగల రిజర్వేషన్ ఉద్యమమని స్పష్టం చేశారు. దళితుల హక్కుల పరిరక్షణ, సామాజిక సమానత్వం కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో, మాదిగ హక్కుల సాధనలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం కీలకపాత్ర పోషించిందన్నారు. ఉద్యమ చరిత్రను విస్మరించి విమర్శలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యులు కొమ్మూరి గరటయ్య, సంధ్య ఆక్వా చైర్మన్ కృష్ణ కుమారి, జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు ఆనంద్, నండూరి నరశింహరావు, మానికొండ శ్రీధర్, పానుగంటి షాలేమ్ రాజు, ఏటుకూరి విజయ్ కుమార్, రావినూతల కోటి తదితరులు పాల్గొన్నారు. -
పనుల జాడ లేదు.. ప్రచారమే అట్టహాసం!
క్రెడిట్ చోరీపై ప్రజల విస్మయం సింగరాయకొండ: వీబీజీ రాంజీ(ఉపాధి హామీ) పథకంపై అవగాహన కల్పించేందుకు సింగరాయకొండ మండలం కనుమళ్ల గ్రామ సచివాలయానికి వచ్చిన కేంద్ర బృందానికి, ఉపాధి కూలీలు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. కూలీల సమస్యలు విన్న కేంద్ర బృందం విస్మయానికి గురికాగా.. పక్కనే ఉండి ఈ పరిణామాన్ని గమనిస్తున్న స్థానిక అధికారులు కంగుతిన్నారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా చెరువులు, కాలువలు, పశువుల షెడ్ల వంటి పనులతో ఉపాధి మెరుగుపడుతుందని వివరించారు. ఈ పథకంపై మీకు అవగాహన ఉందా అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ అడిగిన ప్రశ్నకు స్థానిక కూలీ వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు. క్షేత్రస్థాయిలో పనులు సక్రమంగా జరగడం లేదని కుండబద్ధలు కొట్టారు. చేసిన పనులనే పదే పదే చేస్తూ నిధులు వృథా చేస్తున్నారని ఆరోపించారు. కూలీ డబ్బులు నెలల తరబడి రాక ఉపాధి హామీ కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. పశువుల షెడ్ల మంజూరులో జాప్యం చేయడమే కాకుండా, ఉపాధి హామీ జాబ్ కార్డులు సైతం ఇవ్వడం లేదని కూలీలు కళ్లగుంట వరలక్ష్మి, ఈదర వెంకటేశ్వర్లు తదితరులు కేంద్ర బృందం ఎదుట వాపోయారు. ఈ సమయంలో ఏపీఓ సుభాషిణి స్పందిస్తూ.. కొన్ని ఫీడర్ చానళ్లు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని తొలగించాల్సి ఉందని అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు. కేంద్ర బృందం ఎదుట బట్టబయలైన వాస్తవాలు సింగరాయకొండలో వీబీజీ రాంజీపై కూలీలకు అవగాహన జాబు కార్డుల మంజూరు, కూలి విడుదలలో జాప్యంపై ప్రజల మొర గత ప్రభుత్వంలో ఏర్పాటైన బాతుల యూనిట్‌ను పరిశీలించి ప్రశంస -
కిడ్నీలో రాళ్లకు జీజీహెచ్‌లో లేజర్ చికిత్స
ఒంగోలు టౌన్: అత్యంత ఆధునిక లేజర్ విధానంలో కిడ్నీలో రాళ్లకు జీజీహెచ్‌లో ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. మంగళవారం తన చాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల దిబ్బయ్య అనే వ్యక్తి కిడ్నీలో రాళ్ల సమస్యతో జీజీహెచ్ వైద్యులను సంప్రదించారని తెలిపారు. యూరాలజీ నిపుణుడు డాక్టర్ కిరణ్ కుమార్ బృందం వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స అవసరమని నిర్ధారించారన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల ఖర్చయ్యే లేజర్ విధానంలో ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహించినట్లు వివరించారు. కిడ్నీ రాళ్లకే కాకుండా మూత్రాశయ రాళ్లు, ప్రోస్టేట్ సమస్యలకు కూడా లేజర్ విధానంలో శస్త్ర చికిత్సలు చేయడానికి అవకాశం ఉందన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ మాట్లాడుతూ జీజీహెచ్‌లో ఆధునాతన వైద్య పరికరాలు, అంకితభావం కలిగిన వైద్యులు ఉన్నారని తెలిపారు. అత్యంత ఖరీదైన చికిత్సలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నామని చెప్పారు. దిబ్బయ్యకు విజయవంతంగా ఆపరేషన్ చేసిన డాక్టర్ కిరణ్ కుమార్, డా.మాలకొండారెడ్డి, డా.రసూల్, డా.జయసుందరంలను సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో ఆర్ఎంఓ డా.మాధవీలత, ఏఆర్ఎంఓ డా.సునీల్ గవాస్కర్, డా.ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. -
రాహుల్ మృతి కేసును సాంకేతికతతో ఛేదిస్తాం
సింగరాయకొండ: మండలంలోని పాతసింగరాయకొండ నరసింహస్వామి దేవస్థానం సమీపంలోని బావిలో అంకం రాహుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును అత్యాధునిక సాంకేతికతతో ఛేదిస్తామని ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాకు చెందిన రాహుల్ మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించామన్నారు. కేసును సీఐ శ్రీహరి నేతృత్వంలో వేగంగా దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అంతకుముందు రాహుల్ మృతదేహం లభ్యమైన బావిని ఎస్పీ పరిశీలించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్సై ఎల్.సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ● రూ.4 లక్షల విలువైన గొలుసు అపహరణ మర్రిపూడి: మండలంలోని జువ్విగుంట స్టేట్‌బ్యాంక్ సమీపంలో మంగళవారం ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ధర్మవరం గ్రామానికి చెందిన బాధితురాలు బారెడ్డి కొండమ్మ బ్యాంకు పనిపై ఎక్స్ఎల్ వాహనంపై వెళ్తుండగా, జువ్విగుంట శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. వెనుక నుంచి వచ్చిన ఇద్దరు అగంతకులు కొండమ్మను అడ్డగించి, శ్రీచిలంకూరుకు దారి ఎటు?శ్రీ అని అడిగారు. ఆమె సమాధానం చెప్పేలోపే, వెనుక కూర్చున్న దుండగుడు మెడలోని సుమారు 4 లక్షల విలువైన బంగారు గొలుసును లాక్కొని పొదిలి వైపు పరారయ్యారు. బాధితురాలు కేకలు వేస్తూ వెంటపడినా ఫలితం లేకపోయింది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి హెల్మెట్ ధరించగా, వెనుక కూర్చున్న వ్యక్తి ముఖానికి గుడ్డ కట్టుకోవడంతో వారిని గుర్తించలేదని బాధితురాలు వాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మార్కాపురం టౌన్: మార్కాపురం వైజంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయవరం గ్రామానికి చెందిన గాయం వెలుగొండారెడ్డి (70) మృతి చెందారు. స్కూటీపై పట్టణంలోకి వస్తున్న వెలుగొండారెడ్డిని ఎదురుగా వచ్చిన టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. భార్య సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేశారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం ఉదయం మార్కాపురం పట్టణానికి వెళ్లి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి శవమై రావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ట్రాక్టర్ బోల్తాపడి ఇంజినీరింగ్ విద్యార్థి.. లింగసముద్రం శాయిపేటలో ట్రాక్టర్ పంక్చర్ వేయించుకుని వస్తుండగా, అది అదుపుతప్పి కాలువలో బోల్తా పడటంతో రాళ్లపాడు గ్రామానికి చెందిన పొడపాటి ప్రసాద్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్ కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. పంక్చర్ వేయించుకుని వస్తానని చెప్పి వెళ్లిన కొడుకు విగతజీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వాహనం ఢీకొని పాదచారుడు.. అద్దంకి: స్థానిక నామ్ రహదారిపై అన్న క్యాంటీన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రామ్‌నగర్‌కు చెందిన శ్రీను అనే పాదచారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నడుచుకుంటూ వెళ్తున్న శ్రీనును వేగంగా వచ్చిన వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు టౌన్: ఒంగోలు రైల్వే స్టేషన్లో మంగళవారం పోలీసులు, రైల్వే భద్రతా దళాలు చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. సీసీఎస్ సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ, జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి ఒంగోలు మీదుగా సింగరాయకొండ వైపు వెళ్తున్న పూరీ ఎక్స్‌ప్రెస్‌లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రైలులో తరలిస్తున్న 10 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒడిశాకు చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, సమాచారం ఉన్న వారు 1972, 112 లేదా వాట్సాప్ నంబర్ 9121102266కు ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు. తనిఖీల్లో ఎస్సైలు శ్రీరామ్, చెంచయ్య, ఏఎస్ఐ మహబూబ్ బాషా పాల్గొన్నారు. -
స్వాప్నికుడు..!
భవిష్యత్ ● రైతు రుణమాఫీతో అన్నదాతలకు అండగా నిలిచిన మహానేత ● వైఎస్సార్ హయాంలోనే శరవేగంగా వెలిగొండ నిర్మాణం ● గుండ్లకమ్మ, రామతీర్థంలకు జలసవ్వడులు ● ఒంగోలు కేంద్రంగా రిమ్స్ ఆస్పత్రి, మెడికల్ కళాశాల ● నేడు వైఎస్సార్ జయంతి కాలం కదిలిపోతోంది. కానీ కొన్ని జీవితాలు కాలంగర్భంలో కలిసిపోవు. తరతరాల చరిత్రలో శాశ్వత అధ్యాయాలుగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన జీవితమే ఆయనది. అధికారం ఆయనకు కిరీటం కాదు. ప్రజల జీవితాలను మార్చేసిన సాధనం. సంక్షేమాన్ని ప్రభుత్వ విధానంగా కాక, సామాజిక న్యాయానికి ప్రతీకగా కోట్లాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన పాలకుడు. విద్యను పేదవాడి హక్కుగా, వైద్యాన్ని ప్రతి కుటుంబానికి భరోసాగా, వ్యవసాయాన్ని అన్నదాత ఆత్మగౌరవంగా, పారిశ్రామికాభివృద్ధిని యువత భవిష్యత్‌కు పునాదిగా మలచాలన్న దూరదృష్టి కలిగిన స్వాప్నికుడు. కరువునేలపై జల జీవం పోసి, బంజరు భూములను బంగారు నేలగా మార్చిన అపర భగీరథుడు. ఆయన హయాంలోనే వెలిగొండ పురుడుపోసుకుంది. రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టుల ద్వారా జలసవ్వడులు చేశాయి. రైతు మోముపై చిరునవ్వు తొణికిసలాడింది. తరతరాల అభ్యున్నతికి డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి వేసిన శాశ్వత పునాదులు ఎంతో మందికి ఆసరాగా నిలిచాయి. నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఆయన గుర్తులు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.477 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.20 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారు. శరవేగంగా పనులు సాగుతున్న సమయంలో ఆయన మరణంతో ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. 2014 నుంచి 2019 చంద్రబాబు పాలనలో వెలిగొండ దాదాపుగా మూలనపడింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపుగా పనులన్నీ పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఎన్నికల కోడ్ వల్ల నిలిచిన అరకొర పనులు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రకటనలతో గారిడి చేస్తోంది. రైతుకు స్వర్ణయుగం.. రైతు రుణమాఫీ ఫైలుపై రాజన్న తొలి సంతకం చేశారు. 2004 మే నెలకు ముందు జిల్లాలో 63,559 మంది బకాయిలు రద్దు చేశారు. అప్పటికే జిల్లా వ్యాప్తంగా 71,321 మంది రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. జిల్లాలో రైతు భరోసా అందుకున్న రైతులు 2.96 లక్షల మంది ఉన్నారు. రాజన్న మరణం తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులకు గడ్డుకాలంగా మారింది. రాజన్న తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతుకు మంచి రోజులొచ్చాయి. ఐదేళ్లూ రైతులకు అండగా నిలవడంతో రైతులు లాభాలతో పండగ చేసుకున్నారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తొలి ఏడాది రైతులకు అందించే సాయానికి ఎగనామం పెట్టారు. అన్నదాత సుఖీభవ పేరుతో రెండో ఏడాది లబ్ధిదారుల సంఖ్యను భారీగా కుదించేశారు. ప్రస్తుతం 2.5 లక్షల మందికి మాత్రమే ఇస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లుగా జిల్లాలో మిర్చి, పొగాకు, పత్తి, శనగ, ధాన్యం, మామిడి ఇలా దేనికీ కనీస మద్దతు ధరలేక రైతులు అల్లాడిపోతున్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సాయం పేదరికం కారణంగా ఏ ఒక్కరి చదువులు ఆగిపోకూడదంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించారు. లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులభ్యసించారు. చంద్రబాబు పాలనలో ఆ పథకం నీరుగారడంతో పేద విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తిరిగి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేయడం ద్వారా విద్యార్థులకు అండగా నిలిచారు. ఆ ఐదేళ్లలో 3,09,817 మంది విద్యార్థులకు విద్యా దీవెన, 2,72,315 మంది విద్యార్థులకు వసతి దీవెన ద్వారా కోట్ల రూపాయల సాయం అందించారు. -
ఇంత దారుణమా..సర్..
ఉలవపాడు: సర్ కార్యక్రమం కూటమి నాయకుల కనుసన్నల్లో జరుగుతోంది. కూటమి నాయకులకు అధికారులు జీహుజూర్ అనడంతో సర్ కార్యక్రమం కాస్త అభాసుపాలవుతోంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండల పరిధిలో మొత్తం 53 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. 45,219 మంది ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీయఎల్ఓలు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. మండల పరిధిలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీఎల్ఏ కు కొన్ని చోట్ల సమాచారం కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. ఇక ఉలవపాడులో అయితే బీఎల్ఓలుగా ఉన్న అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల బండ్ల మీద తిరుగుతూ వారి చెప్పింది తూచ తప్పకుండా చేస్తున్నారు. ఉలవపాడులోని 243 పోలింగ్ బూత్‌కు చెందిన మహిళా బీఎల్ఓ ఏకంగా టీడీపీ నాయకుని బండి మీద తిరుగుతూ వారు చెప్పినట్లు చేస్తున్నారు. 241 పోలింగ్ బూత్ బీఎల్ఓ కేవలం టీడీపీ బీఎల్ఏని మాత్రమే తీసుకుని ప్రతి ఇంటికీ తిరుగుతున్నారు. మండల పరిధిలో అధిక శాతం బీఎల్ఓలు ఓటుకు సంబంధించిన పేపర్లను ఇళ్లకు వచ్చి ఇచ్చారు.. కానీ పూర్తిచేసిన వాటిని తీసుకెళ్లడం లేదు. కేవలం టీడీపీ నాయకులతో వెళ్లిన ఓట్లకు సంబంధించిన సమాచారం మాత్రం ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. పలువురు టీడీపీ నాయకులు దగ్గరుండి కంప్యూటర్ ఆపరేటర్లలా ఓట్ల నమోదు చేయిస్తున్నారు. సర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి పర్యవేక్షణ చేయాల్సిన తహశీల్దార్ రవిశంకర్ అసలు కార్యక్రమం గురించి ఎక్కడా తనిఖీలు చేసినట్లు గానీ పరిశీలించినట్లు గానీలేదు. -
ఆరేళ్ల బాలుడు అదృశ్యం
ఒంగోలు టౌన్: మరో చిన్నారి అదృశ్యమయ్యాడు. అప్పటి వరకు తల్లితో కలిసి ఉన్న ఆరేళ్ల బాలుడు రిచర్డ్ రేయాన్స్ ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. అంతే ఇక ఎంత వెదికినా కనపడక పోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. బాలుడి తల్లి ప్రత్యూష తెలిపిన వివరాల ప్రకారం...ఒంగోలుకు చెందిన చంద్రపాటి ప్రత్యూష మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలోని దుర్గా నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా చేస్తున్నారు. భర్త చంద్రశేఖర్‌తో కలిసి సోమవారం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొన్నారు. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు రిచర్డ్ రేయాన్స్కు ఆరేళ్లు. మాటలు రావు. మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ప్రత్యూష మంగళవారం రేయాన్స్ను తీసుకొని కాలేజీకి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఆమె విధుల్లో ఉండగా రేయాన్స్ కాలేజీ గేటు తీసుకొని బయటకు వచ్చాడు. కాలేజీ వాచ్మెన్ చూసి గట్టిగా కేకలేయడంతో భయపడి ఊర్లోకి పరుగులు తీశాడు. మార్గం మధ్యలో ఒక దుకాణం వద్ద ఆగి చాక్లెట్ కొనుక్కొని తిన్నాడు. కాసేపటి తరువాత ఇంటి సమీపంలో ఆడుకుంటూ కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. బాలుడిని పలకరిస్తే భయంతో బిత్తర చూపులు చూస్తున్నాడని, గ్రామానికి కొత్త కావడంతో బాలుడ్ని గుర్తు పట్టలేకపోయామంటున్నారు. ఆ తరువాత బాలుడు అదృశ్యమయ్యాడు. గ్రామంలో ఎవరికీ కనిపించలేదు. బాలుడి కోసం గాలిస్తున్న తల్లిదండ్రులు ఎంత సేపటికీ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు బాలుడు అదృశ్యం కాగా రాత్రి చీకటి పడినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. డ్రోన్ కెమెరాలతో గాలింపు.. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ హర్షవర్థన్ రాజు పోలీసులను అప్రమత్తం చేశారు. 20 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పీ చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చేరుకొని తల్లిదండ్రులతో మాట్లాడారు. గ్రామస్తులను విచారించారు. డ్రోన్ కెమెరాలు, పోలీసు డాగ్‌లతో ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులతో పాటు గ్రామస్తులు కూడా బాలుడి కోసం పరిసరాలు అనువణువూ గాలిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామంలోకి వచ్చారేమో ఆరా తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసినట్లు ఎస్పీ తెలిపారు. పక్క జిల్లాల పోలీసు స్టేషన్లకు బాలుడి వివరాలను పంపించినట్లు చెప్పారు. మాకు శత్రువులు ఎవరూ లేరు: చంద్రపాటి ప్రత్యూష, బాలుడి తల్లి మేము ఈ ఊరికి నిన్ననే వచ్చాం. ఇక్కడ మాకు శత్రువులు ఎవరూ లేరని బాలుడి తల్లి ప్రత్యూష చెప్పారు. బాబుకు మాటలు రాకపోవడంతో తన వద్దనే ఉంచుకుంటానని, మధ్యాహ్నం వరకు తనతో కాలేజీలోనే ఉన్నాడని, 3 గంటల తరువాత బయటకు వెళ్లాడని కన్నీరు మున్నీరయ్యారు. ఊరు కొత్త కావడంతో పిల్లాడు ఎక్కడో తప్పిపోయాడని భావిస్తున్నామని, పోలీసులు, గ్రామస్తుల సహకారంతో బాబు దొరకాలని కోరుకుంటున్నానని తల్లి ప్రత్యూష కన్నీరు పెట్టుకున్నారు. ఉలిక్కిపడ్డ చెరువుకొమ్ముపాలెం.. ఆరేళ్ల బాలుడు రిచర్డ్ రేయాన్స్ ఆదృశ్యం కావడంతో చెరువుకొమ్ముపాలెం గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. గత నెల 5వ తేదీ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో మునిగి మరణించడం తెలిసిందే. ఆ దుర్ఘటన గ్రామస్తులు ఇంకా మరిచిపోలేదు. తిరిగి ఇప్పుడు గ్రామంలో ఒక బాలుడు అదృశ్యమయ్యాడన్న వార్త గ్రామస్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులతో కలిసి బాలుడిని గాలిస్తున్నారు.


