త్యాగధనుడు పొట్టిశ్రీరాములు | - | Sakshi
Sakshi News home page

త్యాగధనుడు పొట్టిశ్రీరాములు

Mar 17 2026 7:25 AM | Updated on Mar 17 2026 7:25 AM

ఒంగోలు సబర్బన్‌: తెలుగుజాతికి గుర్తింపు కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా కృషిచేసిన పొట్టి శ్రీరాములు త్యాగ ధనుడని వక్తలు కీర్తించారు. ఆయన పోరాట స్ఫూర్తి ఎందరికో ఆదర్శమని కొనియాడారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని సీవీఎన్‌ రీడింగ్‌ రూమ్‌ సమీపంలోని ఆయన విగ్రహానికి మంత్రి స్వామి, కలెక్టర్‌ పి.రాజాబాబు, జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా లక్ష్యసాధనకు పూనుకున్న పొట్టి శ్రీరాములు నేటి తరానికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం అసాధారణ నిర్ణయం తీసుకుని దాన్ని సాధించేలా చిత్తశుద్ధితో ముందుకు సాగిన పొట్టి శ్రీరాములు మన అందరికీ గర్వకారణమన్నారు. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్‌ హాలులో పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆయన పోరాట స్పూర్తి ఎందరికో ఆదర్శం

ఒంగోలులో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement