breaking news
Prakasam District Latest News
-
నడిపేది ఇద్దరే.. నలిగేది ఎందరో!
మార్కాపురం: జిల్లా విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. మార్కాపురం జిల్లా ఏర్పడి 8 నెలలు కావస్తున్నా తగినంత మంది సిబ్బందిని నియమించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో మార్కాపురం మండలంలోని దరిమడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాత్కాలికంగా డీఈఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని 1,328 పాఠశాలలు, 90,621 మంది విద్యార్థులకు సంబంధించిన విద్యా వ్యవహారాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఉండాల్సింది 46 మంది.. పనిచేసేది ఇద్దరే! కార్యాలయంలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీలు), నలుగురు సూపరింటెండెంట్లు, 20 మంది సీనియర్ అసిస్టెంట్లు, 26 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇతర ఆఫీసు సబార్డినేట్లు ఉండాలి. సుమారు 46 మంది సిబ్బంది అవసరం కాగా.. ప్రస్తుతం డీఈఓతో కలిపి కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. ప్రధానంగా 46 మంది చేయాల్సిన పనిని డీఈఓ, మరో ఉద్యోగి మాత్రమే నిర్వర్తిస్తుండటంతో వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. పనుల్లో తీవ్ర జాప్యం సిబ్బంది లేమి కారణంగా రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో పాటు పలు కీలక వ్యవహారాల్లో జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా ఉపాధ్యాయుల సర్వీసు వ్యవహారాలు, మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ల పంపిణీ, విద్యార్థుల డేటా అప్డేట్, ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికల తయారీ తదితర పనులు మందకొడిగా సాగుతున్నాయి. సవాల్‌గా టెట్ పరీక్షలు ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్న టెట్‌కు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ల నియామకం, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం అధికారులకు కత్తి మీద సాములా మారింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే డీఈఓ కార్యాలయంలో సిబ్బందిని నియమించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
పైసలిస్తేనే పరిహారం
● వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంపై టీడీపీ నేతల కన్ను ● రూ.లక్షకు రూ.10 నుంచి రూ.15 వేలు కమీషన్ డిమాండ్ ● సాంకేతిక సమస్యలు పరిష్కరించి పరిహారం ఇప్పిస్తామంటూ బేరాలు మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన పరిహారంపై టీడీపీ నాయకులు కన్నేశారు. కొంతమంది టీడీపీ నాయకులు బ్యాంకు మేనేజర్ల సాయంతో నిరక్షరాస్యుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పరిహారంలో కొంత సొమ్ము నొక్కేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పది రోజుల నుంచి గొట్టిపడియ, కలనూతల, సుంకేసుల గ్రామాల్లో టీడీపీ నాయకులు ఇదే పనిపై బిజీగా ఉంటున్నారు. ఇందుకు అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని నిర్వాసితులను అక్కడికి రప్పించుకుని సెటిల్మెంట్లు చేస్తున్నారు. మార్కాపురం పట్టణ శివారులోని తర్లుపాడు రోడ్డులో ఉన్న కేఫ్‌లను అడ్డాగా మార్చుకుంటున్నారు. లక్షకు రూ.పది నుంచి రూ.15 వేలు ఇస్తే మీకున్న సమస్యలను సెట్‌చేసి పరిహారం నగదు మీ ఖాతాల్లో జమచేయిస్తామని హామీ ఇస్తున్నారు. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని 11 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. అయితే ఈ గ్రామాల్లో పలువురు నిరక్షరాస్యులకు బ్యాంకు నిబంధనలు తెలియకపోవడం, వారి అకౌంట్లు కేవైసీ కాకపోవడం, కొంతమంది పేర్లు తప్పుగా పడటం, మరికొంతమంది పేర్లు ఆధారు కార్డులో, బ్యాంకుల్లో వేరు వేరుగా ఉండటంతో వారి ఖాతాల్లో పరిహారం సొమ్ము జమయ్యేందుకు సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న టీడీపీ నాయకులు రంగ ప్రవేశం చేసి కమీషన్ ఇస్తే పరిహారం ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు. ముఖ్యంగా మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, పెద్దారవీడు మండలంలోని చింతలముడిపి గిరిజనుల నిరక్షరాస్యతను క్యాష్ చేసుకునేందుకు ఓ టీడీపీ నేత గత పది రోజులుగా బిజీగా ఉన్నాడు. ఇందుకు మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులోని ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజరు తనకు సహకారం అందిస్తున్నట్లు తెలిసింది. సాంకేతిక సమస్యను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని చింతలముడిపి చెంచు గిరిజనుల ఖాతాల్లో జమ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ప్రభుత్వం నెల రోజుల నుంచి విడతల వారీగా నష్టపరిహారాన్ని వారి బ్యాంకులకు జమ చేస్తోంది. ఇప్పటికి రూ.300 కోట్లు విడుదల చేయగా ఇంకా రూ.600 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే టీడీపీ దళారులు పరిహారం అందకుండా అడ్డుకుంటున్నట్టు తెలిసింది. కొంతమంది గిరిజనులు తమ తాండ అయిన చింతలముడిపి వదిలి వివిధ ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. ఇదే సమయంలో వారి వివరాలు తెలుసుకున్న సదరు టీడీపీ నేత ఒక బ్యాంకు మేనేజరుతో మాట్లాడుకుని పరిహారంలో కమీషన్ దండుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిసింది. సుంకేశుల గ్యాప్‌లో భాగంగా చింతలముడిపి తాండ మునిగిపోనుంది. దీంతోపాటు కాటంరాజు తాండలో కూడా గిరిజనుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అక్కడ కూడా ఒక కూటమి నేత డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికారులు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ చేయకపోతే బ్యాంకర్లు, టీడీపీ నేతల ఖాతాల్లోకి పరిహారం జమ కానుంది. -
సీఎం ప్రకటనతో పొగాకు ధరలు డీలా
● ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పమిడి వెంకటరావు, జజ్జూరి జయంతిబాబు ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వలన పొగాకు కొనుగోలు చేసే వారు లేకుండా పోయారని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పమిడి వెంకటరావు, జజ్జూరి జయంతిబాబు విమర్శించారు. స్థానిక ఎల్బీజీ భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల పొగాకు రైతులు జాతీయ రహదారుల దిగ్భందనం కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంలో సీఎం సమీక్ష చేసి ధరలను ప్రకటించారని వివరించారు. హై గ్రేడ్ పొగాకు కేజీ రూ.230, మీడియం గ్రేడ్ రూ.190, లో గ్రేడ్ రకం రూ.110 కొనుగోలు చేయాలన్న ప్రకటన వ్యాపారులకు మరింత స్వేచ్ఛనిచ్చినట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వ్యాపారులకు అనుకూలంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనగా అభివర్ణించారు. ఇప్పటి వరకు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు అప్పటి నుంచి అస్సలు మాట వినని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థల చేత కొనుగోలు చేయించాలని కోరితే కేజీకి రూ.10 బోనస్ ఇస్తామని చెప్పడం రైతులను దారుణంగా మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు రీజియన్‌లో 142 మిలియన్ల కేజీలు కొనుగోలు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ధరలు అదుపు చేయడంలో కూటమి విఫలం ఒంగోలు టౌన్: నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఐద్వా మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో మంగళవారం ఐద్వా జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోక పోవడంతోపాటుగా కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తుండడంతో నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటాయని చెప్పారు. బియ్యం ధరలు 40 నుంచి 50 శాతం పెరిగాయని, మినుములు ప్రతి కిలోకు 40 రూపాయల వరకు పెరిగిందని, ఉప్పు, పప్పు, వంట నూనెలు ప్రతి ఒక్కటీ 20 శాతానికి పైగానే పెరిగాయని వివరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అంత్యోదయ అన్నయోజన పథకంలో దేశంలో 9 కోట్ల మంది ఉన్నారని, ఇప్పటి వరకు వారికి 35 కేజీల బియ్యం ఇస్తుంటే ఇప్పుడు మోదీ కేవలం 7 కేజీల బియ్యం మాత్రమే ఇస్తుందని తెలిపారు. ప్రజలందరికీ ఆహార ధాన్యాలు, 16 రకాల నిత్యావసర వస్తువులను అందజేయాలని డిమాండ్ చేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎస్కే మున్వర్ సుల్తానా అధ్యక్షత వహించిన సమావేశంలో బి.రాజ్యలక్ష్మి, ఎస్కె మల్లికా, ఎం పద్మ, జి.ఆదిలక్ష్మి, గోవిందమ్మ పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
మార్కాపురం టౌన్: నూతన జిల్లాలో తొలి స్వాతంత్య్ర దిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ విజయసునీత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వేడుకల ఏర్పాట్లు, వెలిగొండ ప్రాజెక్టుపై ఆమె సమీక్షించారు. ఈ నెల 15న స్థానిక ఎస్వీకేపీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న వేడుకలకు విద్యార్థులు, ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్తో పాటు తాగునీరు, పారిశుధ్యం, షామియానాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, సాంస్కృతిక ప్రదర్శనలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టాళ్లు, వినూత్న శకటాలు ఏర్పాటు చేయాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో నిర్వాసితుల పునరావాసానికి అధికారులు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్వాసితుల కాలనీల్లో తాగునీరు, రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో జేసీ పి.శ్రీనివాసులు, ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, డీఈఓ సుబ్బారావు, డ్వామా పీడీ సువార్త, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, తహసీల్దార్ చిరంజీవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం కలెక్టర్ విజయ సునీత -
ఏకేయూ ‘లా’ ఫలితాల విడుదల
ఒంగోలు సిటీ: ఏకేయూ(ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం) పరిధిలోని లా కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి (2023–24 అడ్మిటెడ్ బ్యాచ్) సంబంధించిన ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. వీసీ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు వీటిని విడుదల చేశారు. పరీక్షల నియంత్రణాధికారి (సీఈ) ప్రొఫెసర్ జి.సోమశేఖర వివరాలు వెల్లడిస్తూ.. ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్సుకు 51 మంది హాజరుకాగా 50 మంది (98.04 శాతం), మూడేళ్ల కోర్సుకు 282 మంది హాజరుకాగా 278 మంది (98.58 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వీసీ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు, సీఈ సోమశేఖర అభినందించారు. కార్యక్రమంలో పీజీ ప్రొఫెషనల్ కోర్సుల కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.అమృతవల్లీ దేవి, బీఈడీ కోర్సుల కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.శ్రీనివాసు పాల్గొన్నారు. -
మంత్రులకు పట్టదు.. రైతులకు గిట్టదు !
ఒంగోలు సబర్బన్: నానా అవస్థలు పడి పండించిన పొగాకును వేలం కేంద్రాలకు తీసుకెళితే దిగజారుతున్న ధరలను చూసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. 1980 దశకంలో పోరాటం చేసి పోలీసుల తుపాకీ గుళ్లకు గుండెలను ఎదురొడ్డి మరీ సాధించుకున్న మద్దతు ధరలు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మరీ దిగ‘‘జారిపోతున్నాయని’’ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క రైతులు మాత్రం కనీసం మద్దతు ధర దేవుడెరుగు...గిట్టుబాటు ధర అయినా దక్కకపోతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పొగాకు కంపెనీల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేయటం...సరాసరి కేజీ పొగాకును రూ.200 తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని ఆదేశించినప్పుడల్లా పొగాకు కంపెనీలు మాత్రం అప్పటి వరకు ఉన్న ధర కంటే మరీ దిగకోసి కొనుగోలు చేస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆదేశాలను కంపెనీలు బేఖాతరు చేస్తుండడం వెనుక పెద్ద కుట్రదాగి ఉందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. తీవ్ర సంక్షోభంలోకి.. ప్రకాశం, నెల్లూరు, పల్నాడు జిల్లాలకు చెందిన దక్షిణాది ప్రాంత నల్లరేగడి, తేలికపాటి నేలల్లో పొగాకు పండిస్తున్న రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుతున్నారు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి కనీస ధర రూ.200 లోపు అమ్ముడవుతున్న బేళ్లను, నో బీడ్ బేళ్లను కొనుగోలు చేయించడం మొదలుపెడితే మార్కెట్లో పోటీ పెరిగి కనీస సరాసరి ధర పెరుగుతుందని రైతులు అంటున్నారు. అప్పుడు కొంతవరకై నా తక్కువ నష్టాలతో బయట పడతామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రకటనలతో కాలక్షేపం చేయకుండా రైతుల పక్షాన నిలబడాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంతో పోలిస్తే పతనం అంచున ధరలు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు ధరలు బాగా పెరిగాయి. 2023–24 మార్కెటింగ్ సీజన్ మొత్తం సరాసరి అమ్మకం ధర కిలో రూ.288.65 పలికింది. అదే టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే అదికాస్తా 2024–25 మార్కెటింగ్ సీజన్ మొత్తం సరాసరి అమ్మకం ధర కిలోకు రూ.248.86 కు పడిపోయింది. ఈ ఏడాది 2025–26 జూలై నెలలో సరాసరి అమ్మకం ధర తేలిక నేలల్లో రూ.191.74, ఆగస్టు ఒకటో తేదీకి రూ.187.40కి పడిపోయింది. 7వ తేదీకి 181.67కు పతనమైంది. నల్లరేగడి నేలల్లో ఆగస్టు 7వ తేదీ వరకూ సరాసరి అమ్మకం ధర రూ.192.20గా ఉంది. ఒక్క ఒంగోలు రెండు వేలం కేంద్రాలు మినహా మిగిలిన కేంద్రాల్లో సరాసరి అమ్మకం ధర రూ.200 లోపే ఉంది. తిరస్కరణలకు సంబంధించి 11 వేలం కేంద్రాల్లో 31 శాతం నుంచి 36 శాతానికి పెరిగింది. ఫలితంగా రైతులు పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఈ ఏడాది తగ్గిన ఉత్పత్తి.... పొగాకు బోర్డు లెక్కల ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఉత్పత్తి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024–25లో బోర్డు ద్వారా అమ్మిన పొగాకు 240.64 మిలియన్ కేజీలు. ఈ సంవత్సరం బోర్డు చెబుతున్న ఉత్పత్తి అంచనా 232 మిలియన్ కేజీలు. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉత్పత్తి తగ్గిందని బోర్డు లెక్కలు చెబుతున్నాయి. మార్క్‌ఫెడ్‌ను దింపిన వైఎస్ జగన్... చరిత్రలో మొట్ట మొదటి సారిగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు చేయించారు. దీంతో కంపెనీలు పోటీ పడి కొనుగోలు చేశాయి. ఫలితంగా పొగాకు రైతుల పాలిట బంగారంగా మారింది. ఇప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి లో బిడ్లను, నో బిడ్లను ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస ధర రూ.200కు కొనుగోలు చేయిస్తే మార్కెట్లో పోటీ పెరిగి సరాసరి ధర పెరిగి రైతులు కొంత వరకై నా సంక్షోభం నుంచి బయట పడతారని రైతు సంఘాలు అంటున్నాయి. ఇది తప్ప ఇంకొక మార్గం లేదని స్పష్టం చేస్తున్నాయి. 52.57 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు... పొగాకు రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. వేలం ప్రారంభమై 110 రోజులు దాటినా ధరల్లో స్థిరత్వం కనిపించకపోగా.. కనిష్ట, సరాసరి ధరలు పతనమవుతున్నాయి. కొనుగోలు కంపెనీల మోసాకలకు అడ్డుకట్ట వేయాల్సిన పాలకులు హెచ్చరికలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు పొగాకు బోర్డు కార్యాలయంలో సమావేశమై రైతులకు మెరుగైన ధరలు కల్పించాలని కంపెనీలకు సూచించిన రోజే ఒంగోలు–2 వేలం కేంద్రంలో ఎఫ్–5 రకం పొగాకు ధర కిలో రూ.130కి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక వైపు కడుపుమండిన రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు గొట్టిపాటి, స్వామి మాత్రం పొగాకు కంపెనీల యాజమాన్యాలకు ఉత్తుత్తి హెచ్చరికలు జారీ చేస్తున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కేజీ రూ.300 కు కొనుగోలు చేస్తేనే గిట్టుబాటు కేజీ పొగాకు రూ.300 కొనుగోలు చేస్తేనే గిట్టుబాటు ధర లభిస్తుంది. వ్యాపారులు కుమ్మకై ్క ధరలను దిగ్గోస్తున్నారు. కనిష్ట ధర సరాసరి కేజీ రూ.250 కి తగ్గితే నష్టం వాటిల్లుతుంది. రైతులు ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మార్క్‌ఫెడ్ ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసే బేళ్ల కన్నా తిరస్కరణ చేసే బేళ్లే ఎక్కువగా ఉన్నాయి. దాంతో అదనపు ఖర్చు రైతులపై పడుతుంది. వేలానికి తీసుకొచ్చే అన్ని బేళ్లను కొనుగోలు చేయాలి. – కిరణ్, పొగాకు రైతు, కొండపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మద్దతు ధర లేక ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. గతంలో కేజీ రూ.360 కి కొనుగోలు చేసిన పొగాకును నేడు కేజీ రూ.200కి కూడా కొనడం లేదు. ఒక బ్యారన్‌కు దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించి రైతులను ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలి. లేకుంటే రైతుల ఉసురు తగులుతుంది. – సురేష్, పొగాకు రైతు, కొండపి ఉమ్మడి జిల్లాలో వేలం కేంద్రాలు ప్రారంభమై 110 రోజులు దాటిపోయింది. ఒంగోలు రీజియన్ పరిధిలో 11 వేలం కేంద్రాల పరిధిలో అధికారిక, అనధికారిక పొగాకు కలుపుకుని దాదాపు 130 మిలియన్ కేజీల వరకు అమ్మకాలు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 52.57 మిలియన్ కేజీలు మాత్రమే మార్కెట్లో వేలం జరిగింది. ఇంకా 78 మిలియన్ కేజీలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఇదే గత సంవత్సరం 110 రోజుల్లో 111.29 మిలియన్ కేజీలు అమ్మకాలు జరిగాయి. త్వరలో కర్నాటకలో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. అదే జరిగితే వ్యాపారులు అక్కడికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. -
స్టైఫండ్‌పై మాట నిలబెట్టుకోండి
ఒంగోలు టౌన్: జూనియర్ డాక్టర్లు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, స్టై ఫండ్ పెంపుపై ఇచ్చిన మాట నిలుపుకోవాలని జూనియర్ డాక్టర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు జి.భార్గవ సాయి డిమాండ్ చేశారు. జీజీహెచ్ ఆవరణలో మంగళవారం జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. స్టై ఫండ్ పెంచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భార్గవ సాయి మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకనుగుణంగా స్టైఫండ్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పటి నుంచో స్టై ఫండ్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇప్పటికే అనేక సార్లు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళినా ప్రయోజనం లేకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో సమ్మెకు దిగినట్లు వివరించారు. మొదటిరోజు సమ్మె తరువాత కూడా ఎలాంటి స్పందన లేకపోతే సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమ్మె సందర్భంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్య సేవలను నిలిపేసినట్లు వివరించారు. రెండో రోజు సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఆ తరువాత ప్రభుత్వ స్పందన కోసం సమయం ఇస్తామని, అయినా స్పందించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పారు. సామాన్య రోగులకు వైద్య సేవలు అందించే విషయంలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ సమ్మెలో జుడా కార్యదర్శి ఎస్. క్రిస్సికాంత్, ఫైజా పఠాన్, జీషిత, సుప్రియా తదితరులు పాల్గొన్నారు.డాక్టర్ ప్రియాంకకు నివాళిగా కొవ్వొత్తుల ప్రదర్శన... రాజమండ్రి యువ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక మృతికి నివాళులు తెలుపుతూ జుడా ఆధ్వర్యంలో సాయంత్రం మెడికల్ కాలేజీ అసెంబ్లీ పాయింట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జోహార్ డాక్టర్ ప్రియాంక అంటూ నినాదాలు చేశారు. మద్యం మత్తులో వాహనంతో గుద్ది డాక్టర్ ప్రియాంక మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. నిందితులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు సిటీ: సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సి.వి.రేణుక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం పదేళ్ల సర్వీసు పూర్తి చేసి, ఎలాంటి సివిల్, క్రిమినల్, శాఖాపరమైన కేసులు లేని ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, గురుకులాలు, కేజీబీవీ, డైట్ కళాశాలల ఉపాధ్యాయులు ఇందుకు అర్హులన్నారు. దరఖాస్తులను నేరచరిత్ర లేదని తెలిపే ధ్రువీకరణ పత్రాలతో జతచేసి ఈ నెల 18లోగా ఎంఈఓలకు అందజేయాలన్నారు. ఎంఈఓలు వాటిని పరిశీలించి 20వ తేదీలోగా ఉప విద్యాశాఖాధికారులకు, అక్కడి నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు డీఈఓ కార్యాలయానికి పంపాలని సూచించారు. గడువు దాటిన తర్వాత వచ్చే ప్రతిపాదనలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. సింగరాయకొండ: మొక్కు తీర్చుకునేందుకు కుటుంబంతో సహా అన్నవరం వెళ్లగా.. గుర్తుతెలియని దుండగులు ఇంటి దొడ్డి దారి గుండా చొరబడి చోరీకి యత్నించిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక మినీ బైపాస్ రోడ్డులోని శిఖాకొల్లువారి వీధికి చెందిన కొత్తూరి రాధాకృష్ణమూర్తి కుటుంబంతో కలిసి ఈనెల 6న అన్నవరం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం పనిమనిషి వచ్చి చూడగా, వెనుక దొడ్డి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న రాధాకృష్ణమూర్తి వచ్చి చూడగా, లోపల బీరువా ధ్వంసమై వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. మొదట 48 గ్రాముల బంగారం, రూ.1.20 లక్షల నగదు పోయినట్లు ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు తమ ఇంట్లో ఎలాంటి నగదు, విలువైన వస్తువులు పోలేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో ఎస్సై సుధీర్‌కుమార్ క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే నిందితులు ఎవరనేది తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. -
మోదీ జోడి .. దోపిడీ పాలన
కనిగిరిరూరల్: కేంద్రంలో, రాష్ట్రంలో మోదీ, చంద్రబాబు జోడి.. దోపిడీ పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు. సీపీఐ ప్రచార పాదయాత్ర ముగింపు సందర్భంగా .. ‘బద్లావ్ జరూరీ హై’..బహిరంగ సభ సోమవారం కనిగిరిలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక క్లబ్ రోడ్డులో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ యాసీన్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం అధోగతి పాలైందన్నారు. నిరుద్యోగులకు భద్రత, ఉపాధి కరువైందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, కనీస మద్దతు ధర కరువైందన్నారు. 12 ఏళ్ల మోదీ పాలనలో 152 సార్లు దేశంలో ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయని, ఎందరో నిరుద్యోగులు అన్యాయం అయ్యారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల పాలనలో మట్టి, మైనింగ్, మద్యం ఇలా రకాల దోపిడీలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా మాయగా అభివర్ణించారు. నిమ్జ్ నత్తనడకలో ఉందని, ట్రిపుల్ ఐటీలో కదలిక కరువైందని, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన అంతా కాగితాల్లోనే జరుగుతోందని విమర్శించారు. పీపీపీ పేరుతో పేదవర్గాల పీక నొక్కుతున్న చంద్రబాబు: పీపీపీ విధానం పేరుతో చంద్రబాబు దోచుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఈశ్వరయ్య విమర్శించారు. అందులో భాగంగానే పేదవర్గాలకు విద్యను దూరం చేసేలా మార్కాపురంలో మెడికల్ కాలేజీని పీపీపీ చేసేందుకు పన్నాగం పన్నుతున్నారన్నారు. రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలను పీపీపీ చేస్తే.. పేదలు వైద్య విద్యకు పూర్తిగా దూరమవుతారని చెప్పారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరణ చేస్తున్నారని, త్వరలో ఆర్టీసీని కూడా ప్రవేటు పరం చేస్తారని విమర్శించారు. చంద్రబాబు తన సీఎం సీటు తప్పా అన్నీ పీపీపీకి అప్పగిస్తారని ఎద్దేవా చేశారు. వెనుకబడిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి రూ.25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, రాష్ట్ర సమితి సభ్యులు సయ్యద్ యాసీన్, వై రవీంద్రబాబు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా వర ప్రసాదిని వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం తక్షణం రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పీసీపల్లి మండలాన్ని వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో చేర్చాలన్నారు. తొలుత స్థానిక కామ్రెడ్ సయ్యద్ హనీఫ్ స్థూపం వద్ద నుంచి పట్టణ పుర వీధుల గుండా సభా స్థలి వరకు ఎర్ర జెండా చేతబూని ర్యాలీ చేశారు. కార్యక్రమంలో సయ్యద్ మౌలాలి, ఎస్కే గులాం హుస్సేన్, పందిటి మోహన్, పాలపర్తి మస్తాన్, ఎస్కే వై మస్తాన్, కరుణా నిధి, బృంగి సుబ్రహ్మణ్యం, పోతల ప్రభాకర్, సీహెచ్ పవన్ కళ్యాణ్, జీ బాలిరెడ్డి, ఎస్డీ ఆర్ట్ మోలాలి, తాహీద్, ఇఫ్రాజ్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఈకేవైసీ’ లేకుండా.. ఇవ్వరండోయ్ గ్యాస్ బండ!
మార్కాపురం: వంటగ్యాస్ వినియోగదారులకు ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ చమురు కంపెనీలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నెల 15వ తేదీలోపు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ సరఫరా నిలిచిపోతుందన్న ప్రచారంతో వినియోగదారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏజెన్సీల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ వేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తుండటంతో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. వృద్ధులు, మహిళలకు నరకప్రాయం.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 25,16,696 గ్యాస్ కనెక్షన్లు ఉండగా వాటిలో 53,396 ఈకేవైసీ చేయలేదు. గ్యాస్ కనెక్షన్లు అధికంగా మహిళల పేరు మీదే ఉండటంతో వారే నేరుగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. వయసు పైబడిన వారు, అనారోగ్యంతో బాధపడేవారు, కనీసం నడవలేని వృద్ధులు సైతం ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తీరా కష్టపడి అక్కడికి చేరుకున్నాక బయోమెట్రిక్ యంత్రాల్లో వేలిముద్రలు సరిపోలక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదేపదే ఏజెన్సీల చుట్టూ తిరగలేక వృద్ధులు అవస్థలు పడుతున్నారు. పనులొదులుకుని.. పడిగాపులు కాసి.. ఈకేవైసీ గురించి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పూర్తిస్థాయిలో అవగాహన లేదు. తీరా విషయం తెలిసి ఏజెన్సీల వద్దకు వస్తే అక్కడేమో సర్వర్ సమస్య వేధిస్తోంది. వందలాది మంది ఒకేసారి రావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో రోజువారీ కూలీలు, చిరుద్యోగులు తమ పనులు వదులుకుని మరీ క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోంది. ఈకేవైసీ పేరుతో గ్యాస్ కనెక్షన్ కట్ చేస్తే ప్రత్యామ్నాయంగా మళ్లీ కట్టెల పొయ్యే దిక్కవుతుందని, ముఖ్యంగా గ్యాస్ మీదే ఆధారపడే పట్టణవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో క్యాంపులకు డిమాండ్ హడావుడిగా గడువు పెట్టి భయభ్రాంతులకు గురిచేసే కంటే, ముందుగా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, గ్రామాల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఈకేవైసీ ప్రక్రియను సులభతరం చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 14,93,872 ఈకేవైసీ చేయనివి 25,835 మార్కాపురం జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 10,22,824 ఈకేవైసీ చేయనివి 25,561 15వ తేదీలోగా ఈకేవైసీ చేసుకోకుంటే కనెక్షన్ కట్! తీవ్ర ఆందోళనలో వంటగ్యాస్ వినియోగదారులు సర్వర్ల సమస్యలతో ఏజెన్సీల వద్ద గంటల తరబడి పడిగాపులు పడని వేలిముద్రలు.. వృద్ధులు, మహిళలకు తప్పని తిప్పలు.. గ్రామాల వారీగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ 15లోగా ఈకేవైసీ పూర్తి చేయాల్సిందే.. గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. ప్రస్తుతం ఎవరి పేరుపై కనెక్షన్ ఉంటే వారే నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఆధార్ నంబర్ నమోదు చేయించి, వేలిముద్రలు వేసి ఈకేవైసీ పూర్తి చేయాలి. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలి. – డి.అంకయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి, మార్కాపురం -
కొడుకు కోసం.. భార్యను కడతేర్చి..
కురిచేడు: మండలంలోని కల్లూరు గ్రామ శివారు పొలాల్లో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న కొడుకును తనకు దూరం చేస్తోందనే కోపంతో కట్టుకున్న భార్యనే భర్త పక్కా పథకం ప్రకారం బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మంగళవారం దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, సీఐ రామారావు సమక్షంలో కురిచేడు ఎస్సై జి.కోటయ్య నిందితుడి వివరాలు మీడియాకు వెల్లడించారు. కొడుకు కోసం మొదలైన గొడవలు.. దొనకొండ మండలం చందవరం గ్రామానికి చెందిన వేల్పుల రవణమ్మకు పాపిరెడ్డిపల్లికి చెందిన పెద్దిబోయిన వెంకటేశ్వర్లుతో సుమారు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు అవినాష్ ఉన్నాడు. ఐదేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో మానసిక ఒత్తిడికి గురైన రవణమ్మ.. కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెకు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స చేయిస్తున్నారు. వెంకటేశ్వర్లు అప్పుడప్పుడూ అత్తగారింటికి వెళ్లి వస్తున్నప్పటికీ, కొడుకును మాత్రం పంపేవారు కాదు. గత జూన్‌లో చందవరం వెళ్లిన వెంకటేశ్వర్లు.. తన కొడుకును తనతో పంపాలని భార్య, అత్తమామలు, బావమరిది మల్లికార్జునను కోరాడు. వారు ససేమిరా అనడంతో.. కొడుకును అప్పగించకపోతే భార్యను చంపేస్తానని బెదిరించి వచ్చాడు. పథకం ప్రకారం నమ్మించి.. జూలై 31న రవణమ్మ తమ్ముడు మల్లికార్జున ఆమెను తీసుకొచ్చి భర్త వద్ద వదిలిపెట్టాడు. అయితే కొడుకును తీసుకురాలేదనే కోపంతో దంపతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఈ నెల 4న ఉదయం 8 గంటలకు భర్తకు చెప్పకుండా రవణమ్మ పుట్టింటికి బయలుదేరింది. గమనించిన వెంకటేశ్వర్లు వెతుక్కుంటూ వెళ్లి కనిగిరి బస్టాండ్ వద్ద ఆమెను కలిశాడు. తానే స్వయంగా బైక్‌పై పుట్టింటి వద్ద దించుతానని నమ్మించాడు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బైక్‌పై బయలుదేరి కొనకనమిట్ల, దొనకొండ మీదుగా చందవరం వస్తూ.. కల్లూరు గ్రామ పరిధిలోని ఎన్ఎస్పీ కెనాల్ వద్ద పొలాల్లో గొర్రెల బేరం మాట్లాడుకుని వెళ్దామని నమ్మించాడు. సాయంత్రం 4 గంటల సమయంలో కెనాల్ దాటిన తర్వాత మధుసూదన్ రెడ్డికి చెందిన పొలంలోని ఎరువుల షెడ్డు వద్దకు తీసుకెళ్లాడు. భార్య అక్కడే చీర పరుచుకుని పడుకోగా, నిద్రలోకి జారుకున్న విషయాన్ని గమనించిన వెంకటేశ్వర్లు.. పక్కనే ఉన్న బండరాయిని రెండు చేతులతో ఎత్తి ఆమె తలపై బలంగా వేశాడు. రవణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, నిందితుడు అక్కడినుంచి పాపిరెడ్డిపల్లికి పరారయ్యాడు. మృతురాలి తల్లి వేల్పుల ఆదిలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొడుకును తనకు దక్కకుండా అడ్డుపడుతున్న భార్యను చంపేస్తే గొడవలు ఉండవనే ఉద్దేశంతోనే నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. గుంటూరు పారిపోయేందుకు యత్నిస్తున్న వెంకటేశ్వర్లును మంగళవారం కురిచేడు–పడమటి గంగవరం రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వివరించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ మోహనరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కల్లూరు వద్ద మహిళ హత్య కేసు మిస్టరీ ఛేదన నిందితుడి అరెస్టు.. వివరాలు వెల్లడించిన పోలీసులు -
అదుపుతప్పి మినీ ట్రక్ బోల్తా
యర్రగొండపాలెం: మండలంలోని గురిజేపల్లి సమీపంలో హైవేపై మంగళవారం ఓ మినీ ట్రక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వలస కూలీలు జి.లోకేష్, జి.రాజు, జి.శేఖర్, వైశాలి, విజయ్, నరసింహులు, సంధ్య గాయపడ్డారు. కనిగిరి ప్రాంతానికి చెందిన 15 మంది కూలీలు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దౌలతాబాద్‌కు పనుల నిమిత్తం వెళ్లి, తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాహనం రోడ్డుకు అడ్డంగా పడటంతో కాసేపు రాకపోకలకు అంతరాయం కలగగా.. హైవే క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.దేవకుమార్ తెలిపారు. ఏడుగురు వలస కూలీలకు గాయాలు -
ఆర్టీసీలో షాపులకు టెండర్ల ఆహ్వానం
ఒంగోలు టౌన్: ఆర్టీసీలో షాపుల నిర్వహణకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రజా రవాణాధికారి జి.సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోడా అండ్ కూల్ డ్రింక్స్, స్వీట్ బేకరి, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్, వాటర్ కియోస్క్, పాప్ కార్న్ చిప్స్, ఇంటర్నెట్ అండ్ జిరాక్స్, సెల్ కార్నర్, డైరీ పార్లర్, సైకిల్ స్టాండ్, డార్మిటరీ, ఏటీఎం, ఏటీబీ ఏజెన్సీ స్టోర్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. సి క్లాస్ బస్స్టేషన్లలో బస్ స్టేషన్, టాయిలెట్స్ నిర్వహిస్తూ స్టాల్స్ నిర్వహణ, షాపుల పూర్తి వివరాల కోసం ఆర్టీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. టెండర్‌దారులు షాపుల ప్రదేశాలను నిర్ధారించుకున్న తరువాత మాత్రమే టెండర్లలో పాల్గొనాలని తెలిపారు. ఈ నెల 20వ తేదీలోపు టెండర్లను ఒంగోలులోని జిల్లా ప్రజా రవాణాధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు టెండర్‌దారుల సమక్షంలో బాక్స్ తెరుస్తారన్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, అద్దంకి బస్సు డిపోలు, మార్కాపురం జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, పొదిలి, గిద్దలూరు డిపోల్లో మేనేజర్ కార్యాలయంలో 19వ తేదీ వరకు దరఖాస్తులు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వ్యక్తులు ఈ టెండర్లలో పాల్గొనాలని కోరారు. -
పరిహారం ఇవ్వకుండా కదలం..
మార్కాపురం టౌన్: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించి తగిన సమయం ఇస్తే గ్రామాలను ఖాళీ చేసి వెళ్లేవారమని, అలా కాకుండా ఇప్పటికిప్పుడు నోటీసులు ఇచ్చి గ్రామాలను ఖాళీ చేయాలంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు సోమవారం కలెక్టరేట్ వద్దకు గుండంచర్ల, గొట్టిపడియ, కలనూతల, సుంకేశుల తదితర గ్రామాలకు చెందిన వందల సంఖ్యలో నిర్వాసితులు చేరుకున్నారు. వీరిని కలెక్టర్ వద్దకు వెళ్లకుండా పోలీసులు గేటువద్ద ఆపారు. గేటువద్ద కొంతసేపు తమ డిమాండ్లను పరిష్కరించాలని నిర్వాసితులు నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు పోలీసులను, గేట్లను నెట్టుకుంటూ లోనికి వెళ్లారు. కలెక్టరేట్ గేటు వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని భీష్మించారు. దీంతో కలెక్టరేట్లో ఉన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బయటకు వచ్చి నిర్వాసితులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే కలెక్టర్ బయటకు వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడంతో కొంతసేపటి తరువాత బయటకు వచ్చిన కలెక్టర్ ప్రభుత్వ నిర్ణయం మేరకు నోటీసులు ఇచ్చామని, నీళ్లొదిలే సమయానికి ఖాళీచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. నిర్వాసితులు తమకు ఆర్‌ఆర్‌ప్యాకేజీ ఇవ్వకపోవడంతోపాటు 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చిన తరువాత 6 నెలల సమయం ఇవ్వాలని కోరారు. ఇప్పటికీ సుమారు 2500 మందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చానని, ఇంకా 4500 మంది నష్టపరిహారం రావాల్సి ఉండగా తరువాత 18 ఏళ్లు నిండినవారు సుమారు 1500 మంది ఉన్నారని, గెజిట్‌లో తమ పేర్లు రానివారు సుమారు 400 మంది ఉన్నారని, అందరికీ న్యాయం జరిగితేనే గ్రామాలను ఖాళీ చేస్తామని నిర్వాసితులు స్పష్టం చేశారు. నిర్వాసితులకు అండగా అన్నా రాంబాబు.. ముంపు గ్రామాల నిర్వాసితులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కలెక్టరేట్‌కు వచ్చి నిర్వాసితులతో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులు, ఆవేదనను తెలుసుకున్నారు. ప్రభుత్వం అనాలోచితంగా ముందుకెళితే 13 గ్రామాల్లోని ముంపు గ్రామాల నిర్వాసితులు తమ ఇళ్లు ఖాళీచేసి రోడ్డున పడతారని, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి వారికి తక్షణమే న్యాయం చేయాలని అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. అనంతరం పీజీఆర్ఎస్లో ఉన్న కలెక్టర్ విజయసునీత, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు వద్దకు వెళ్లి నిర్వాసితుల డిమాండ్లను, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో ఆలోచించి వారి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కందులను చుట్టిముట్టిన నిర్వాసితులు: కలెక్టరేట్ వద్ద నిర్వాసితుల ధర్నా చేస్తుండగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని నిర్వాసితులు చుట్టుముట్టారు. ఎమ్మెల్యేగా తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరులోగా ఇల్లు ఖాళీ చేయాలని చెబుతున్నారని, ఇలా అయితే తాము ఎక్కడ నివశించాలని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అదే సమయంలో ఎమ్మెల్యే మాట్లాడేందుకు ప్రయత్నించగా నిర్వాసితులు తమ డిమాండ్ల పరిష్కారం గురించి తప్ప ఏమీ వినమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం ప్రతినిధులు వేల్పుల చెన్నారెడ్డి, తుమ్మా వెంకటరెడ్డి, నల్లబోతుల కొండయ్య, బుర్రి వెంకటేశ్వర్లు, ఏనుగుల సురేష్, ఎమ్మార్పీఎస్ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మరో క్విట్ ఇండియా ఉద్యమం నిర్మిస్తాం
ఒంగోలు టౌన్: ఢిల్లీ నడిబొడ్డున జరిగిన రైతాంగం ఉద్యమం, జంతర్ మంతర్‌లో జరిగిన విద్యార్థి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా ఉద్యమాలను నిర్మించినప్పుడే కేంద్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి గుణపాఠం చెప్పగలమని అఖిల భారత కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య స్పష్టం చేశారు. కార్పొరేట్ అనుకూల విధానాలు, రైతు వ్యతిరేక ఒప్పందాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా మరో క్విట్ ఇండియా తరహా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముందని చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు పోరాటం కొనసాగాలని చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద జైలు భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం భారీ నిరసన చేపట్టారు. ఆందోళనకారులను అరెస్టు చేసి ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించి సొంత పూచికత్తు మీద వదిలిపెట్టారు. ఈ సందర్భంగా రావుల వెంకయ్య మాట్లాడుతూ...ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకొని దేశ వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతిలో పెడుతుందని విమర్శించారు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రుపాయణ రుణాలను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించమంటే నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జజ్జురి జయంతిబాబు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమెరికాకు జూనియర్‌గా వ్యవరిస్తుందని వ్యాఖ్యానించారు. రూ.90 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెట్టే పొగాకు రైతుల సమస్యలను విస్మరించి తక్కువ ధరకు పొగాకు కొనుగోలు చేయడం దారుణమన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పొగాకు రైతులు బ్యార్నీకి రూ.5 లక్షల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాలకు రైతుల ఉసురు తగులుతుందన్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ అన్నం పెట్టే రైతుల కడుపులు కొడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ నిధులు, పనిదినాలను తగ్గించి వేసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా దేశం ఆర్థికంగా బలోపేతం కాదని స్పష్టం చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు ముడి సరుకు ఇవ్వకుండా యరజర్ల, వలేటివారిపాలెం ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూములను జిందాల్ కంపెనీకి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో సాగర్, ఎస్కే మాబు, కె.రమాదేవి, ఈదర అన్నపూర్ణ, పి.కల్పన, చీకటి శ్రీనివాసరావు, బాలకోటయ్య పాల్గొన్నారు. విద్యార్థి, యువత, రైతులు, కార్మికులు ఐక్యపోరాటాలు చేయాలని పిలుపు జైలు భరోలో పలువురు రైతు నాయకుల అరెస్టు -
‘పెద్ద’ వ్యవహారం.. నెలకు రూ.60 లక్షల వ్యాపారం!
అద్దంకి(సంతమాగులూరు): అద్దంకి నియోజకవర్గంలో రోజుకో చోట ‘మట్టి’ దుమారం రేగుతోంది. స్థానిక ముఖ్య నేత ఆశీస్సులతో పసుపు దండు అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు చెరువు టీడీపీ సానుభూతిపరుల అక్రమ తవ్వకాలతో గుల్లవుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి భారీ పొక్లెయిన్లు, టిప్పర్లతో అడ్డగోలుగా మట్టిని తోడేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. రూ.లక్షల్లో దోపిడీ.. ఈ చెరువు నుంచి రోజూ 400 నుంచి 500 ట్రక్కుల మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ప్రైవేటు ఇళ్ల స్థలాల మెరక కోసం తరలిస్తున్నారు. ట్రక్కుకు రూ.400 వంతున వసూలు చేస్తుండటంతో.. రోజుకు సుమారు రూ.2 లక్షలకు పైగా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.60 లక్షల మేర మట్టి దోపిడీ సాగుతోంది. పట్టించుకోని అధికారులు.. చిన్నపాటి తప్పు జరిగితేనే పరుగులు తీసే రెవెన్యూ, మైనింగ్ అధికారులు.. ఇంత భారీ స్థాయిలో యంత్రాలతో మట్టిని లూటీ చేస్తున్నా పట్టిపట్టనట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడా నేతల అండదండలతోనే ఈ అక్రమ దందా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. కూటమిలో భాగస్వామి అయిన జనసేన నాయకులు సైతం ఈ మట్టి దోపిడీ వెనుక ఎవరున్నారంటూ బహిరంగంగానే ప్రశ్నిస్తుండటం గమనార్హం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి టీడీపీ నేతల అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేతల మట్టి తవ్వకాలతో కొమ్మాలపాడు చెరువు గుల్ల రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టి తరలిస్తూ రోజుకు రూ.2 లక్షల దోపిడీ చెరువులో పొక్లెయిన్లు, టిప్పర్లు కవాతు చేస్తున్నా కదలని అధికారులు -
బాధితులకు సత్వర న్యాయం
మార్కాపురం: బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని మార్కాపురం ఓఎస్డీ నవజ్యోత్ మిశ్రా తెలిపారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లాలోని 21 మండలాల ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత స్టేషన్లకు పంపి వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఎంతో నమ్మకంతో పోలీసుల వద్దకు వచ్చే ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయానికి రాలేని వారు స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ లేదా సబ్‌డివిజన్ కార్యాలయాల్లో కూడా తమ ఫిర్యాదులు అందజేయవచ్చని సూచించారు. కాగా, ఈ గ్రీవెన్స్‌కు భూవివాదాలు, ఆర్థిక లావాదేవీలు, మోసాలు, కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులకు సంబంధించి మొత్తం 44 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఎస్పీ డాక్టర్ నాగరాజు, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఓఎస్డీ నవజ్యోత్ మిశ్రా వెల్లడి పోలీస్ గ్రీవెన్స్‌కు 44 ఫిర్యాదులు -
మతిస్థిమితం లేని మహిళపై టీడీపీ నేత దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తాళ్లూరు మండలంలోని గుంటి గంగమ్మ తల్లి దేవస్థానం వద్ద మతిస్థిమితం లేని ఒంటరి మహిళపై ఆలయ చైర్మన్, కూటమి నేత సానే సురేష్ కర్రతో అమానుషంగా దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ సమీపంలో తిరుగుతూ ఉండే అన్నపూర్ణ అనే మహిళపై సురేష్ విచక్షణారహితంగా దాడి చేశాడు. దర్శి నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత గొట్టిపాటి లక్ష్మి అండదండలతోనే అతడు తనపై ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమె.. దాడి అనంతరం దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి, ఓ అబల అని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా, సదరు చైర్మన్ సురేష్ గతంలోనూ ఓ వ్యక్తిపై ఇలాగే దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అమానుష ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి, నిజానిజాలు వెలికితీయాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది. కర్రతో చితకబాదిన గుంటిగంగ ఆలయ చైర్మన్ సానే సురేష్ ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితురాలు.. -
ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతుందని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం మాటలతో కాలం వెల్లబుచ్చుతోందని డైఫీ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న విమర్శించారు. నగరంలోని ఎల్బీజీ భవనంలో డైఫీ జిల్లా 19వ మహాసభలు సోమవారం జరిగాయి. సభలకు డైఫీ జిల్లా నాయకులు కేవీ పిచ్చయ్య, పి.కిరణ్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది టీచర్ పోస్టులు, పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మిగిలిపోయిన టీచర్ ఉద్యోగాలకు డీఎస్సీ ప్రకటించాలని కోరారు. ఖాళీగా ఉన్న 20 వేల పోలీసు పోస్టులకు గాను కేవలం 6100 పోస్టులు మాత్రమే భర్తీ చేశారని, మిగిలిన 14 వేల పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని నిలిబెట్టుకోవాలన్నారు. పరిశ్రమల ఏర్పాటు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. డైఫీ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న యూనివర్శిటీ అభివృద్ధిని పాలకులు పట్టించుకోవడం లేదని, దీంతో యూనివర్శిటీ ఏర్పడినప్పుటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని తెలిపారు. ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలు నిర్మించకుండా విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం అడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీజీహెచ్‌లో ఓపీ కౌంటర్లు పెంచాలని, డ్యూటీ డాక్టర్లను, నర్సింగ్ స్టాఫ్‌ను , పారిశుధ్య కార్మికులను పెంచాలని డిమాండ్ చేశారు. 15 మందితో నూతన కమిటి ఎంపిక... డైఫీ జిల్లా నూతన కమిటీ ఎంపిక జరిగింది. కార్యదర్శిగా కేఎఫ్ బాబు, అధ్యక్షునిగా కేవీ పిచ్చయ్య, ఉపాధ్యక్షులుగా కిరణ్, సహాయ కార్యదర్శిగా యు.కిరణ్, కమిటి సభ్యులుగా మోహన్, రాము, ప్రేమ్ కుమార్, బాలాజీ, దానియేలు, మల్లికార్జునలతో సహా మొత్తం 15 మందితో కమిటీ ఏర్పాటైంది. సభలో జీవి కొండారెడ్డి, కంకణాల రమాదేవి, వీరాస్వామి మాట్లాడారు. అనంతరం ఒంగోలు వాన్‌పిక్, దొనకొండ, చీమకుర్తి శిల్పారామం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని, కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని తీర్మాణాలు చేశారు. టంగుటూరు: దళిత వీఆర్ఏపై డిప్యూటీ తహసీల్దార్ శ్రీనాథ్ గత నెల 26వ తేదీన మద్యం మత్తులో దాడి చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు లేకపోవడంతో బాధితుడు సోమవారం సోషల్ మీడియాలో మద్యం మత్తులో డీటీ మాట్లాడిన మాటల వీడియోలను వైరల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం మేరకు.. టంగుటూరు అంబేడ్కర్ నగర్లో ఉన్న వీఆర్ఏ కారుమంచి తేజ ఇంటికి 26వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనాథ్ మద్యం తాగిన మత్తులో వచ్చి సంబంధం లేని విషయాల్లో తిడుతూ అతనిపై దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కున్నాడు. ఏవేవో చెక్ చేసి ఏమీ లేవు ‘మాల నా..కొ.. చంపేస్తాను’ అంటూ కులం పేరుతో తిడుతూ గొంతు పట్టుకొని పిసుకుతూ గోడకేసి కొట్టాడు. అయితే అదే రోజున టంగుటూరు ఎస్సైకి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. బాధితుడు భయంతో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఒంగోలు కలెక్టర్ స్పందనలో తన గోడు వెళ్లబోసుకుని న్యాయం చేయమని అర్జీ ఇచ్చారు. నేరం చేసిన వారికి అనుకూలంగా కేసును నీరుగాస్తూ బాధితుడిని బెదిరిస్తుండటంతో గత్యంతరం లేక సోషల్ మీడియాలో డీటీ మాట్లాడిన వీడియోలు పెట్టినట్లు తెలుస్తోంది. -
సీపీఎం నేతపై ఎమ్మెల్యే కందుల రుసరుస!
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల ధర్నాలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి సోమయ్య మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న నిర్వాసితుల వద్దకు ఎమ్మెల్యే రాగా.. వారి న్యాయమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సోమయ్య డిమాండ్ చేశారు. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే కందుల.. ‘నీ చరిత్రంతా నాకు తెలుసు.. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ఙ్ అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సోమయ్య అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీనీ సంగతి కూడా నాకు పూర్తిగా తెలుసు.. నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? పాతికేళ్లుగా ప్రజా సమస్యలపైనే పోరాడుతున్నా తప్ప ఎలాంటి ఆస్తులు కూడబెట్టుకోలేదు. నేను ఎక్కడా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. నా చరిత్ర ఏంటో ఇప్పుడే ఇక్కడే చెప్పు’ అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ఇద్దరు నేతల మధ్య వాడివేడిగా వాగ్వాదం జరగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు అక్కడున్న నిర్వాసితులు జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఒంగోలు వన్‌టౌన్: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎ. సత్యానంద్ అన్నారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం ఉదయం ఒంగోలులోని దోనేపూడి రాఘవయ్య మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా మాట్లాడారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెట్లను పెంచడం, నీటిని పొదుపుగా వినియోగించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. సత్యానంద్, తాత్కాలిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్. రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు తదితరులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణకు విద్యార్థులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరం జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–నిర్కా) (సీటీఆర్ఐ) ద్వారా నాణ్యమైన వర్జీనియా పొగాకు విత్తనాలను 2026–27 సీజన్‌కు రైతులకు ఈనెల 13వ తేదీ నుంచి విక్రయిస్తారని ఆ సంస్థ డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ ఓ ప్రకటనలో తెలిపారు. రాజమండ్రిలో నిర్కా (పూర్వపు సీటీఆర్ఐ), కందుకూరులో ఉదయం 10 గంటల నుంచి విక్రయిస్తారన్నారు. పొగాకు విత్తనాలు నిర్కా సీడ్ పోర్టల్ ద్వారా మాత్రమే విక్రయిస్తామన్నారు. విత్తనాల కొనుగోలు కోసం పొగాకు బోర్డు వారు జారీ చేసిన బ్యారన్ రిజిస్ట్రేషన్ పాస్‌బుక్ (టీబీజీఆర్.బుక్) తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. కిలో ఒక్కింటికి రూ.1300లకు విక్రయిస్తామన్నారు. విత్తన విక్రయాలు క్యాష్‌లెస్ లావాదేవీలు యూపీఐ (గూగుల్‌పే, ఫోన్‌పే), క్రెడిట్‌కార్డ్, డెబిట్‌కార్డ్ ద్వారా మాత్రమే అనుమతిస్తామన్నారు. పొగాకు బోర్డు ద్వారా రిజిస్టర్ చేయించిన కమర్షియల్ నారుమడులకు సంబంధించిన రైతులకు కిలో విత్తనానికి రూ.2200 చొప్పున విక్రయిస్తామన్నారు. ఇతరుల వద్ద లేదా దళారుల వద్ద విత్తనాలు కొనవద్దని సూచించామని నిర్కా డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ తెలిపారు. -
హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన
ఒంగోలు సబర్బన్: ప్రజల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించడంతో పాటు అపోహలు, వివక్షను తొలగించే దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. ప్రకాశం భవన్‌లోని పీజీఆర్ఎస్ మందిరంలో సోమవారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(ఏపీశాక్స్) రూపొందించిన శ్రీఆరోగ్య కరదీపికశ్రీ, ఆరోగ్య సమాచార క్యూఆర్ కోడ్ కరపత్రాలను ఆవిష్కరించారు. శాసీ్త్రయ అవగాహనతోనే వ్యాధిని అరికట్టవచ్చని జిల్లా అదనపు వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో రెండు నెలల పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ జి.బాలాజీ తెలిపారు. వ్యాధి నివారణ, పరీక్షలు, చికిత్సపై ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జేసీ కల్పనాకుమారి, డీఆర్వో, వైద్యారోగ్య అధికారులు, హెల్ప్ సంస్థ పీడీ బీవీ సాగర్, సీఎస్ఓ ఎస్.సాయి, జీఆర్ఓ, ఎస్ఎన్ఐఆర్డీ ప్రోగ్రామ్ మేనేజర్లు ఎస్.కె.పీర్‌బాషా, వెంకటేశ్వర్లు, లింక్ వర్కర్స్ స్కీం డీపీఎం గాలి సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య కరదీపిక ఆవిష్కరణలో కలెక్టర్ రాజాబాబు -
యువకుడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు
తాళ్లూరు: యువకుడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన తాళ్లూరులో జరిగింది. గ్రామానికి చెందిన అనుపర్తి రత్నకుమార్ అనే యువకుడు గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం రాత్రి ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన రత్నకుమార్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందారు. అందరూ వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రత్నరాజు ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా కుటుంబ సభ్యులకు 9949332873 సెల్ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. -
హత్య కేసులో నలుగురు అరెస్ట్
యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలేనికి సమీపంలో గత నెల 12వ తేదీ జరిగిన హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. ఆదివారం త్రిపురాంతకం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. పుల్లలచెరువు మండలంలోని కవలకుంట్ల గ్రామానికి చెందిన నారు వెంకట రామిరెడ్డి మద్యం సేవిస్తూ అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో భార్యాపిల్లలను సక్రమంగా చూసుకోకుండా తిరుగుతున్న రామిరెడ్డి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి రామసముద్రానికి చెందిన ఆయన మామ దేసిరెడ్డి వీరయ్య సాగుచేసుకోవటానికి కొంత మేర పొలం అప్పజెప్పాడు. ఆ పొలాన్ని సాగుచేసుకుంటూ వెంకట రామిరెడ్డి అక్కడే ఉండేవాడు. తాను చేసిన రూ.10 లక్షల అప్పులు తీర్చుకుంటానని డబ్బులు అడిగాడని, పండించుకోవటానికి పొలం ఇవ్వడంతో పాటు నువ్వు చేసిన అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వాలా..? ఇక్కడ ఉంటే మా నాన్న ఇచ్చిన పొలం, డబ్బులు కాజేస్తావు, నిన్ను ఊరిలో లేకుండా చేస్తానని అతని బావ వీరారెడ్డి బెదిరించాడు. తన తండ్రి వద్ద ఉన్న డబ్బు, ఆస్తి తానే అనుభవించాలన్న దురుద్దేశంతో గత నెల 12వ తేదీ రామసముద్రం గ్రామానికి చెందిన చిలకల అక్కిరెడ్డి, దేసిరెడ్డి నాగ అంజిరెడ్డి, యర్రగొండపాలెం మండలంలోని అయ్యంబొట్లపల్లి గ్రామానికి చెందిన తోకల చిన్న మూర్తయ్య, మరో ఇద్దరిని కలుపుకుని మద్యం సేవించడానికి తన బావ రామిరెడ్డిని పిలుచుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న రామిరెడ్డి ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. హతుడు మద్యం సేవించి బోర్లాపడి చనిపోయినట్లు చిత్రీకరించి శవాన్ని అక్కడే వదలేసి నిందితులు వెళ్లిపోయారు. ముందుగా రామిరెడ్డి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ తర్వాత హత్య కేసుగా నిర్ధారణ చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిని మార్కాపురం ఏజేఎఫ్ఎం కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ జి.అస్సాన్, ఎస్సై బి.శివరామయ్య, దర్యాప్తులో సహకరించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు -
శాంతియుత ర్యాలీకి ఆంక్షలా.?
● మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: డీఎస్సీలో అవకతవకలపై వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సోమవారం కొండపి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన శాంతియుత ర్యాలీకి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తుండటంపై ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వైఎస్సార్ సీపీ చేపట్టిన ఉద్యమం మలిదశకు చేరుకుందని, చివరిగా నిర్వహించే శాంతియుత ర్యాలీకి అనుమతికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోలీసులు నిరాకరించడం బాధాకరమని అన్నారు. దీనికితోడు సింగరాయకొండ పోలీసులు పార్టీ నాయకులు, కార్యకర్తలను తీసుకెళ్లేందుకు ప్రైవేటు వాహనదారులు సహకరించవద్దని, సహకరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారని, ఈ విషయాన్ని కారు స్టాండ్ ప్రతినిధులు గమనించాలని కోరుతూ ఆ మండల యూనియన్ నాయకులు పెట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరలైందని సురేష్ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేందుకు పోలీసులు యత్నించగం దుర్మార్మమన్నారు. ఇప్పటికే తమ పార్టీ అధినేత, రాష్ట్ర, జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. శాంతియుతంగా నిర్వహించే ర్యాలీకి అడ్డంకులు సృష్టించవద్దని, అనుమతులిచ్చి సహకరించాలని పోలీసులకు ఆదిమూలపు సురేష్ విజ్ఞప్తి చేశారు. -
సోమవారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కనిగిరిరూరల్: వరుణుడి కరుణ కోసం ముస్లింలు కనిగిరిలో ప్రత్యేక నమాజ్, దువా చేశారు. దుర్భిక్షం పోవాలని, వర్షాలు సంవృద్ధి కురవాలని, భూగర్భజలం మట్టం పెరిగి.. నీటి సమస్య పోవాలని, పచ్చని పంటలతో పొలాలు కళకళలాడాలని అల్లాను ప్రార్థిస్తూ ఆదివారం ఉదయం స్థానిక ఈద్గా వద్ద పట్టణంలోని ముస్లింలు ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, మాజీ అంజుమన్ కమిటీ అధ్యక్షుడు ఎస్కే జంషీర్ అహమ్మద్, మాజీ కౌన్సిలర్ సయ్యద్ నాయబ్ రసూల్, మాజీ టెలికాం అడ్వయిజరీ కమిటీ మెంబర్ ఎస్కే ఖాదర్‌వలి పలువురు నాయకులు, మసీద్ కమిటీల పెద్దలు పాల్గొన్నారు.పొదిలి రూరల్: వర్షాలు సంవృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ పొదిలి మండలంలోని ఈగలపాడు గ్రామ ప్రజలు గ్రామ దేవత పోలేరమ్మతల్లికి ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలని భక్తులు పోలేరమ్మను వేడుకుంటూ ఆదివారం ఉదయం అమ్మవారి మూల విరాట్‌కు అభిషేకాలు చేశారు. గ్రామం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పోలేరమ్మ ఆలయం వద్దకు బాణాసంచా, మంగళవాయిద్యాలు, డప్పుల సందడితో ఊరేగింపుగా ఉత్సవ విగ్రహానికి నీరు వారు పోసి బయలు దేరారు. పోలేరమ్మ దేవతకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
మత్తు వదలరా.. మద్యం మత్తు వదలరా..!
గిద్దలూరు రూరల్: మత్తు వదలరా.. మద్యం మత్తు వదలరా.. ఆ మత్తులోనే జీవితం చిత్తు అవును రా... అంటూ ఓ సినీ కవి పాడిన పాట గిద్దలూరులోని మందుబాబులకు ఇట్టే సరిపోతోంది. పట్టణంలోని రాచర్ల గేటు సెంటర్ సమీపంలో గల ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆదివారం మద్యం మత్తులో పడి ఉన్న ఓ వ్యక్తిని లేపేందుకు అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విశ్వప్రయత్నం చేశాడు. పూటుగా మద్యం తాగిన ఆ వ్యక్తి గమ్యస్థానానికి వెళ్లలేని పరిస్థితిలో గుడి వద్ద కిందపడిపోయాడు. దీంతో ఓ కానిస్టేబుల్ పక్కనే ఉన్న హోటల్ నుంచి మగ్గుతో నీళ్లు తీసుకొచ్చి మద్యం సేవించిన వ్యక్తి మొహం మీద చల్లి పైకి లేపాడు. రోడ్డు మీద నుంచి బలవంతంగా లేపి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా కొమరోలు బస్టాండ్ సమీపంలో మరో వ్యక్తి మూసివేసిన షాపు మెట్ల మీద మద్యం మత్తులో పడిపోయి ఉన్నాడు. ఇలా మద్యం మత్తులో తూగుతున్న వ్యక్తులను చూసి మహిళలు, పిల్లలు జంకుతున్నారు. మద్యానికి బానిసైన వ్యక్తులు ఈ విధంగా ఇష్టానుసారంగా తాగుతూ..ఊగుతూ రోజూ రోడ్లకు అడ్డంగా, రోడ్ల పక్కన కిందపడి దొర్లుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతుండటమే ఇందుకు కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు. -
ౖపైపె రంగులు, విగ్రహాలు, బొమ్మల కొలువులేనా.. బాగుచేసేదేమైనా ఉందా..?
● ఒక మోస్తరు వర్షం కురిస్తేనే జలమయమవుతున్న ఒంగోలు నగరం ● గతేడాది మోంథా తుఫాన్‌కు అతలాకుతలం ● పోతురాజుకాలువలో పూడికతీత పనుల్లో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం ● వరద నీరు వెళ్లే మార్గం లేక నగరంలో విలయతాండవం ● అసలు సమస్యలు పక్కనబెట్టి ౖపైపె మెరుగులతో మభ్యపెడుతున్న పాలకులు ● ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లయిన సందర్భంగా సుందరీకరణ అంటూ కలెక్టర్ సైతం హడావిడి ● స్వాగత ఆర్చీలు, విగ్రహాలు, పెయింటింగ్‌లు, ఆర్ట్ గ్యాలరీలు, ప్రముఖుల చిత్రాలతో ఫేమ్ వాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ● వరద, మురుగు సమస్యలు పరిష్కరించకుండా.. మౌలిక వసతులు లేకుండా.. ౖపైపె మెరుగులు ఎందుకంటున్న ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే ఒంగోలు నగర ప్రజలకు వరద భయం పట్టుకుంటోంది. ఒక మోస్తరు వర్షం కురిసినా నగరంలోని ప్రధాన రహదారులు సైతం జలమయమవుతున్నాయి. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పలు లోతట్టు కాలనీల్లో రోజుల తరబడి వర్షం నీరు నిలిచిపోతోంది. ఇళ్లలోకి సైతం నీరు చేరి ఎంతో మంది నిరుపేద, మధ్య తరగతి ప్రజలు ఉండటానికి, తినడానికి సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో పాటు ప్రధాన డ్రైనేజీ కాలువ అయిన పోతురాజుకాలువ పూర్తిగా పూడికతో నిండిపోవడంతో దాని చుట్టుపక్కల కాలనీలన్నింటికీ వర్షాకాలంలో వరద ముప్పు పొంచి ఉంటోంది. చిన్నపాటి వర్షం కురిసినా నగరంలోని కర్నూలు రోడ్డు, ఊరచెరువురోడ్డు, ఉత్తర బైపాస్, గుంటూరు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్, అద్దంకి బస్టాండ్ సర్కిల్లోని ప్రధాన రోడ్లన్నీ మోకాలి లోతు నీటితో నిండిపోతున్నాయి. వాహనాలు, ప్రజల రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఆయా రోడ్ల పక్కనున్న షోరూంలు, షాపుల ముందు నీరు నిలిచి రోజుల తరబడి వ్యాపారాలు లేక దుకాణదారులు నష్టపోతున్నారు. నగర శివారుకాలనీల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. వర్షం కురిసినప్పుడల్లా ఇళ్లలోకి నీరు చేరి కూలి పనులు మానుకుని వాటిని తోడిపోసుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోంథాకు మునిగిన నగరం... గత సంవత్సరం అక్టోబర్‌లో మోంథా తుఫాన్ ప్రభావానికి కురిసిన భారీ వర్షాలకు నగరంలోని ప్రధాన డ్రైనేజీ కాలువ అయిన పోతురాజుకాలువ పూడిక తీయకపోవడం వలన పొంగిపొర్లింది. నగరంలోని వెంకటేశ్వరకాలనీ, నెహ్రూకాలనీ, బలరాంకాలనీ, భరత్‌కాలనీ, ప్రకాశంకాలనీ, సత్యనారాయణపురం, వంటకాలనీ, గోపాలనగరం, కరుణాకాలనీ, భగత్‌సింగ్‌కాలనీ, పాపాకాలనీ, తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అయినప్పటికీ ఆ తర్వాత కూడా పోతురాజుకాలువలో పూడిక తీయకుండా పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రస్తుతం మళ్లీ వర్షాకాలం రావడంతో నగర ప్రజలు భయపడుతున్నారు. గత ప్రభుత్వంలో పోతురాజుకాలువ అభివృద్ధి పనులు.. నేడు పూడిక కూడా తీయని వైనం... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పోతురాజుకాలువ అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఇరువైపులా కాంక్రీట్ గోడలతో పాటు కాలువలో సిమెంట్ ఫ్లోరింగ్ పనులను కొంతమేరకు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఆయా పనులు నిలిచిపోయాయి. ఇటీవల పడవలతో పోతురాజుకాలువ పూడికతీత పనులంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆర్భాటంగా ప్రారంభించి ప్రచారం చేసుకున్నారు. కానీ, పూడికతీత పనులు పూర్తిగా కొనసాగలేదు. తూతూమంత్రంగా చేసి వదిలేయడంతో ప్రస్తుతం పోతురాజుకాలువ మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు, చిల్లచెట్లు, పిచ్చిమొక్కలు, గుర్రపుడెక్కతో పూడిపోయింది. చుక్క నీరు కూడా ప్రవహించే పరిస్థితి లేకుండా పోయింది. గత సంవత్సరం మోంథా తుఫాన్ వర్షానికి నగరం జలమయమై నగర ప్రజలు పడిన ఇబ్బందులు చూసి కూడా పాలకులు, అధికారులకు కనువిప్పు కలగకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గుర్రాలు, సింహాలు, విగ్రహాలు ఎందుకంటూ ప్రజల ప్రశ్నలు... వర్షాలకు నగరం మునగకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచని పాలకులు, అధికారులు.. నగరంలో గుర్రాలు, సింహాలు, విగ్రహాలు, గోడలకు రంగులు వంటి పనికిరాని ౖపైపె మెరుగులు దిద్దడంపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి వచ్చే నెలాఖరుకు 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నగరంలోకి ప్రవేశించే ప్రధాన మార్గాలలో స్వాగత ఆర్చీలు, కూడళ్లలో ప్రముఖుల విగ్రహాలు, ఒంగోలు నగర చారిత్రక నేపథ్యం, విశిష్టతను తెలిపేలా పెయింటింగ్, పచ్చదనం పెంపు, ఆర్ట్ గ్యాలరీలు, ప్రముఖుల చిత్రాలతో ఫేమ్ వాల్స్ ఏర్పాటు చేస్తామని శనివారం నగరంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ప్రకటించడంపై కూడా విమర్శలొస్తున్నాయి. నగర సుందరీకరణ పేరుతో ప్రజలకు ఉపయోగపడని పనులు చేసే బదులుగా నగరంలో వర్షం నీరు నిల్వ ఉండకుండా చూడాలని, మురుగు, చెత్త లేకుండా నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, రోడ్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని, తాగునీటి సమస్య తీర్చాలని, ఇతర మౌలిక వసతులను మెరుగుపరిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని నగరవాసులు సూచిస్తున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ పాలకులకు, ప్రస్తుత ఒంగోలు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న కలెక్టర్ రాజాబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు. మౌలిక వసతులు మెరుగుపరిచిన తర్వాతే నగర సుందరీకరణ దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు. ఇకనైనా ప్రజలకు కావాల్సిన పనులు చేస్తారో.. ఆర్భాటాలకు పోయి ౖపైపె మెరుగులు దిద్ది ప్రజాధనం వృథా చేస్తారో వేచిచూడాలి మరి. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఒంగోలు -
ఉషు జిల్లా జట్టు ఎంపిక
ఒంగోలు సిటీ: 13వ సబ్‌జూనియర్ ప్రకాశం జిల్లా ఉషు చాంపియన్ షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి ఉషు చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారు. వివిధ వెయిట్ కేటగిరీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులతో జిల్లా ఉషు జట్టును ఎంపిక చేశారు. ఎంపికై న జిల్లా క్రీడాకారులు ఆగస్టు 16, 17 తేదీల్లో ఒంగోలు టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించనున్న 13వ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ ఉషు చాంపియన్ షిప్–2026 పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననున్నారు. జిల్లా స్థాయి ఉషు పోటీలకు జిల్లా ఉషు చైర్మన్ పి.ప్రకాష్ బాబు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.భాస్కరరావు, మాంటిస్సోరి స్కూల్ డైరెక్టర్ శబరినాథ్, ప్రిన్సిపల్ ఎస్కే నూరుద్దీన్ క్రీడాకారులను అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు క్రీడాకారులకు సూచించారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న ప్రతి క్రీడాకారుడికి సంఘ సభ్యులు ఈ వెంకటేష్, చంద్రశేఖర్, వెంకట నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, నిర్వాహకులను అభినందించారు. -
ఆదివాసీల అభివృద్ధికి కృషి
● జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మార్కాపురం: ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు చెప్పారు. ఆదివాసి దినోత్సవాన్ని పట్టణంలోని డ్వాక్రాబజార్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం జిల్లాలో ఏడు మండలాల్లో గిరిజనులు అధికంగా ఉన్నారని మార్కాపురంలో గిరిజన భవన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వారికి అందాల్సిన పథకాలను అందించేందుకు సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో హాస్టల్స్ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారి జీవన విధానం మెరుగుపడాల్సి ఉందని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను అందరూ గౌరవించాలన్నారు. గిరిజనులకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఆర్డీఓ శివరామిరెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ చిరంజీవి, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
6వ తరగతి ప్రవేశ పరీక్షకు గడువు పొడిగింపు
ఒంగోలు సిటీ: ఒంగోలులోని జవహర్ నవోదయ పాఠశాలలో 6వ తరగతికి అడ్మిషన్లకు నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారని ప్రిన్సిపల్ సి.శివరాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం జిల్లా పరిధిలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు జవహర్ నవోదయ పాఠశాలలో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఈ అడ్మిషన్లకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2027–28వ సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 10వ తేదీ వరకు గడువు పొడిగించారన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో దరఖాస్తు పత్రాల్లో ఏమైనా తప్పులుంటే సవరణకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వలేటివారిపాలెం: మండలంలోని మాలకొండలో వెలసిన మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం శనివారం రూ.11,31,191 వచ్చినట్లు ఆలయ ఈఓ పీ శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుంకుమార్చన ద్వారా రూ.24,480, తలనీలాలు రూ.39,450, ప్రత్యేక దర్శనం రూ.3,92,300, రూం అద్దెలు రూ.24,420, లడ్డు ప్రసాదాలు రూ.2,19,170, అన్నదానానికి రూ.2,28,106లు, ఇతర విరాళాలు కలిపి ఆదాయం రూ.11,31,191 వచ్చినట్లు చెప్పారు. మార్కాపురం: మార్కాపురం జిల్లా ఆర్టీసీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరుగా జీ వెంకటేశ్వర్లు శనివారం అధికార బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు ఆర్టీసీ డిపో మేనేజరుగా పనిచేస్తూ పదోన్నతిపై మార్కాపురం జిల్లా డీపీటీఓగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను డిపో మేనేజరు లావణ్య, అసిస్టెంట్ డిపో మేనేజరు సత్యనారాయణ (ఫైనాన్స్) సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. వెలిగండ్ల (కనిగిరిరూరల్): వెలిగండ్ల మండలం కొటాలపల్లి స్వర్ణ సచివాలయ వెల్ఫేర్ ఉద్యోగి వెంకట కృష్ణపై దాడి చేసిన ఘటనలో ఆరుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదైంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విధులకు ఆటంకం కలిగించి, అతనిపై దాడి చేసి గాయపరచిన టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కే ఇంద్రభూపాల్ రెడ్డి, మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మైన్స్ డీడీపై లోకాయుక్తలో ఫిర్యాదు
బానిసల కంటే ఘోరంగా కార్మికుల బతుకులు సంతనూతలపాడు దీక్షా శిబిరంలో బూచేపల్లి, పక్కన వెంకాయమ్మ, డాక్టర్ మేరుగు మర్రిపూడిలో ఆదిమూలపు సురేష్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న బూచేపల్లి వెంకాయమ్మ, పక్కన శివప్రసాద్‌రెడ్డి, తూమాటి మాధవరావు దర్శి దీక్షలో పాల్గొన్న బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి మార్కాపురంలో దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, నాయకులు సాక్షి టాస్క్‌ఫోర్స్: పెండింగ్ కేసు ఉండగా పదోన్నతి ఇవ్వడంపై జిల్లా గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్ టీ రాజశేఖర్‌పై లోకాయుక్తలో ఒకరు ఫిర్యాదు చేశారు. రాజశేఖర్ నెల్లూరు జిల్లాలో ఏడీగా పనిచేసే సమయంలో ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో ఆయన ఏ–5గా ఉన్నారు. ఒక గ్రానైట్ క్వారీలో పెట్టుబడులు పెట్టించి యజమానికే తెలియకుండా క్వారీని అన్యాక్రాంతం చేయటం, పెట్టుబడులను మళ్లించడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు క్వారీ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 2023 మే 11వ తేదీ వివిధ సెక్షన్ల కింద రాజశేఖర్‌పై కేసు నమోదైంది. ఆ కేసు పెండింగ్‌లో ఉండగానే డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి ఇచ్చారు. కేసు పెండింగ్‌లో ఉండగా కీలకమైన గనుల శాఖ డీడీగా పదోన్నతి ఎలా ఇచ్చారని పంగులూరు గ్రామానికి చెందిన పులిపాటి హేబేలు ఏపీ లోకాయుక్తలో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ప్రముఖ అడ్వొకేట్ జడా శ్రావణ్ కుమార్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. దానిపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. ఒంగోలు టౌన్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లతో దేశంలోని కార్మికుల బతుకు బానిసల కంటే ఘోరంగా తయారైందని, రోజుకు 8 గంటలకు బదులుగా 12 గంటలు పనిచేయించుకుంటున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లయ్యలింగం భవనంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో శనివారం కార్మిక సంఘాల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జైలు భరో కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 29 చట్టాలను మోదీ ప్రభుత్వం ఒక్క కలం పోటుతో రద్దు చేయడంతో కార్మికులు హక్కులను కోల్పోయారని తెలిపారు. సమావేశంలో కాలం సుబ్బారావు, మహేష్, ప్రభాకర్, శ్రీరామ శ్రీనివాసరావు, ఎంఏ సాలార్, ఎస్.సాయి, తదితరులు పాల్గొన్నారు. -
లోకేష్ రాజీనామా చేయాల్సిందే
వంచనపై నిరసన హోరు..! దగా డీఎస్సీతో నిరుద్యోగ యువతను మోసగించిన నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని, అక్రమాలపై విచారణ జరిపించాలని నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినదించారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో శనివారం కొనసాగాయి. – సాక్షి నెట్వర్క్ ఒంగోలు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలో మాట్లాడుతున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఒంగోలు సిటీ: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రిలే దీక్షలో పాల్గొని ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బూచేపల్లి విలేకర్లతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో దగా డీఎస్సీలో అన్నీ అక్రమాలే జరిగాయన్నారు. ఆది నుంచి పాదర్శకత లోపించిందని విమర్శించారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు అమ్ముకునేందుకు, కూటమి నాయకుల పిల్లల కోసం స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి నాలుగు శాతానికి పెంచారని ఆరోపించారు. ఒక్కో ఉద్యోగాన్ని సుమారు రూ.15 లక్షలకు అమ్ముకున్నారని విమర్శించారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువతను మోసం చేశారని ఆరోపించారు. వేలాది ఉద్యోగాలు ఇచ్చామంటూ అసత్య ప్రకటనలు చేస్తున్నారని, అవి కేవలం పేపరుకే పరిమితమయ్యాయని ధ్వజమెత్తారు. విజయవాడ, విశాఖ జిల్లాల్లో ఉన్న అత్యంత విలువైన భూములు వివిధ కంపెనీలకు కారు చవగ్గా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునే వారి కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను అమలు చేశారని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.7,500 కోట్లు బకాయిలు పెట్టిందని ఆయన మండిపడ్డారు. ఈ నిధులను ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పొగాకు రైతులకు అన్యాయం.. మద్దతు ధరలు లభించక, కనీస పెట్టుబడులు రాక పుట్టెడు కష్టాల్లో మునిగిపోయిన పొగాకు రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచి పోరాడుతుందని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. పండించిన పంటకు కనీసం పెట్టుబడి రావాలంటే క్వింటా రూ.20 వేలకు అమ్ముడు కావాలన్నారు. అది చేయకుండా కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తోందని విమర్శించారు. క్వింటా రూ.10 వేలు ఇస్తామని చెప్పడం ఎంతవరకూ న్యాయమని ఆయన ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంది.. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడిచేయడం సరికాదని బూచేపల్లి అన్నారు. కనిగిరిలో ఆందోళన చేస్తున్న బలహీన వర్గాలకు చెందిన దద్దాల నారాయణను పోలీసులు దౌర్జన్యంగా ఈడ్చుకుని వెళ్లారని, ఈ ప్రభుత్వానికి బలహీన వర్గాలంటే చిన్నచూపని ఆయన ధ్వజమెత్తారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు పోయాయన్నారు. సంపద సృష్టిస్తానన్న ఆయన ఉన్న సంపదంతా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రూ.వేల కోట్లు అప్పులు తెచ్చి అమరావతిలో కుమ్మరిస్తున్నాడన్నారు. రెండేళ్లలో ప్రజలే చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు అసెంబ్లీ పరిశీలకులు వై.వెంకటేశ్వర్లు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు. -
చైన్‌లింక్ సంస్థ మోసం వెలుగులోకి..
● డిపాజిటర్లను ముంచిన ఎన్టీఎల్ చైన్ లింక్ సంస్థ ● దర్శిలో 3 వేల మందికి పైగా బాధితులు ● రూ.21 వేలు కడితే రోజుకు రూ.750 ఇస్తామని చెప్పిన నిర్వాహకులు ● అలా నలుగురిని చేరిస్తే రూ.10 వేలు ఇస్తామని మోసం ● డబ్బులు పడటం లేదని లబోదిబోమంటున్న బాధితులు దర్శి: ఎన్టీఎల్ అనే చైన్‌లింక్ సంస్థ పేరుతో యాప్‌లో డిపాజిట్ల రూపంలో డబ్బులు కట్టించుకుని చేతులెత్తేసిన మోసం దర్శి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ బారిన పడిన బాధితులు సుమారు 3 వేల మందికి పైగా ఉన్నట్లు సమాచారం. తొలుత ఒక్కొక్కరు రూ.21 వేలు కడితే రోజుకు రూ.750 లెక్కన 2 సంవత్సరాలు చెల్లిస్తామని చెప్పి కస్టమర్ల వద్ద ఖాతాలు ఓపెన్ చేయించారు. ఇలా నలుగురిని చేర్పిస్తే చేర్పించిన వారికి రూ.10 వేలు ఇస్తామని నమ్మబలికారు. దీంతో కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయని కొందరు అత్యాశకు పోయి తమ బంగారం సైతం బ్యాంకుల్లో పెట్టి తెచ్చి డబ్బులు వెచ్చించారు. ఎక్కువగా మహిళలు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. కొందరు వేలల్లో, మరి కొందరు రూ.లక్షల్లో కూడా డబ్బులు పెట్టి మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు. సుమారు నాలుగు నెలల క్రితం ప్రారంభమైన ఈ చైన్‌లింక్ వ్యవహారంలో పది రోజులుగా డబ్బులు పెట్టిన వారికి తిరిగి తమ ఖాతాల్లో డబ్బులు పడటం లేదు. దీంతో ఆ సంస్థ వారిని ప్రశ్నిస్తుండటంతో ఖాతాల్లో డబ్బులు వేయాలంటే టాక్స్‌లు కట్టాలని, అందుకు మరి కొంత డబ్బులు చెల్లిస్తే వెంటనే ఖాతాల్లో మీకు రావాల్సిన డబ్బులు వస్తాయని నమ్మబలికారు. దీంతో వారి మాటలు నమ్మిన కొందరు మళ్లీ డబ్బులు వేశారు. అయినా డబ్బులు పడకపోవడంతో ప్రస్తుతం ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఎల్లా మాసన్ అనే ఆమె ఫారిన్ నంబర్లతో మెసేజ్‌లు పెడుతుందని, అంతకు మించి నిర్వాహకులు ఎవరూ ఫోన్లో మాట్లాడరని బాధితులు చెబుతున్నారు. ఆశ చూపించి మోసం చేశారు... మొదట కట్టిన వారికి ఖాతాల్లో చెప్పిన ప్రకారం డబ్బులు వేశారు. ఆ తరువాత వేయాల్సిన డబ్బులు నిదానంగా పంపుతూ ఎక్కువ డిపాజిట్లు సేకరించుకున్నారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి డబ్బులు పడ్డ వారి చేత సమావేశాల్లో లక్షల్లో లాభాలు వచ్చినట్లు వారి చేతే చెప్పించారు. దీంతో అత్యాశకు పోయి తమ ఇంట్లో వారికి కూడా తెలియకుండా భారీ మొత్తాల్లో డబ్బు పెట్టినట్లు సమాచారం. ఈవిధంగా రూ.కోట్లలో డబ్బు రాగానే ఇక ఖాతాదారులకు సమాధానం చెప్పకుండా ఫోన్లు కూడా ఎత్తకుండా ఉడాయించారు. ఇక్కడ కనీసం ఒక కార్యాలయం కూడా లేకుండా ఇలా డబ్బులు ఎలా కట్టారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో చేరి తరువాత చేర్పించిన వాళ్లు సైతం లబోదిబోమంటున్నారు. -
మెగా డీఎస్సీపై తక్షణమే విచారణ చేపట్టాలి
మర్రిపూడి: మెగా డీఎస్సీ 2025లో జరిగిన అక్రమాల్లో పాలుపంచుకున్న రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శనివారం ఏపీజెన్ జెడ్ వార్ 3వ రోజు రిలే నిరాహార దీక్షను పార్టీ మండల అధ్యక్షుడు ఇనుకొల్లు సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రైతుపక్షాన, బడుగు, బలహీనులు, ప్రజల పక్షాన, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీ సైనికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కదిలితే కేసులు, మైక్ పెడితే కేసు, ఫ్లెక్సీ కడితే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో ఇన్చార్జ్గా సమర్థుడైన ఆదిమూలపు సురేష్‌ను నియమించారని, ఆయనకు ప్రతిఒక్కరూ అండగా నిలిచి కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలన్నారు. రాబోయే రోజుల్లో కూటమి నేతలకు తగిన బుద్ధిచెప్పాలన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతను మోసగించిన ప్రభుత్వం... మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ 2025 డీఎస్సీలో అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ముందు తన పదవికి లోకేష్ రాజీనామా చేసి విచారణలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కోర్టులో తన నిజాయితీని నిరూపించుకోవాలని, ఆ తర్వాతే మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మునుపెన్నడూ లేని విధంగా దొడ్డిదారిన ఉద్యోగాలిచ్చి వ్యాయామ ఉపాధ్యాయులకు మొండిచేయి చూపారన్నారు. కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులు కుదేలయ్యారని, పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేక చేసిన అప్పులు తీర్చలేక రైతన్న నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో నాయకుల పరిస్థితి దోచుకో, దాచుకో తినుకో అన్న చందంగా ఉందన్నారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో విద్యకు పెద్దపీట వేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారని చెప్పారు. పేద విద్యార్థుల కోసం విద్యాకానుక, వసతి దీవెనతో పాటు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశ పెట్టడం, జగనన్న గోరుముద్ధ పేరుతో వారికి మేనమామలా అండగా ఉండి విద్యలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారన్నారు. 16 వేల ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చారన్నారు. సచివాలయ ఉద్యోగాలు, 6 వేల పాఠశాలలకు రోస్టర్ విధానం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదని అన్నారు. కూటమి ప్రభుత్వం రోస్టర్ విధానాన్ని రద్దు చేసిందన్నారు. పారదర్శకత లేదు.. కమిట్మెంట్ లేదు, ప్రశ్నపత్రాల్లో గోప్యత లేదు... పేపర్ లీకేజీలో అనేక సాక్ష్యాలు కనిపించినా ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు. ఇసుక, గ్రావెల్, భూ దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు. పేద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యం పక్కదోవ పడుతున్నా అధికారులు పట్టించుకోరన్నారు. ఇసుక, మట్టి అక్రమ రవాణాపై మైన్స్ అధికారులు 132 కేసులు బుక్ చేసి రూ.22 లక్షలు జరిమానా విధించారని, ఇసుకాసురులకు మంత్రి ఆశీస్సులు మెండుగా ఉండటంతో దోపిడీదారులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని, తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, పార్టీ మండల అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసరావు, మసనం వెంకట్రావు, దుద్దుకుంట మల్లికార్జురెడ్డి, బచ్చల కోటేశ్వరరావు, ఇనుకొల్లు సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మాకినేని సుధారాణి వెంకట్రావు, నాయకులు బోద రమణారెడ్డి, మారంరెడ్డి గంగాధర్‌రెడ్డి, పరిటాల సునీల్ కుమార్, వనిపెంట మల్లికార్జునరెడ్డి, మాకినేని హరీష్, పూనూరి సంజీవరెడ్డి, పెట్లూరి సత్యన్నారాయణ, చెరుకూరి భాస్కర్, ఇనుకొల్లు సుబ్బారెడ్డి, బొల్లినేని నాగేశ్వరరావు, సామంతల శ్రీకాంత్‌రెడ్డి, మేదరమిట్ల భరత్ బెజవాడ వెంకటేశ్వర్లు, యనమల మాదవి, కోమట్ల వెంకారెడ్డి, కే మధు, జే వేణు, చుండూరి సురేష్, బత్తుల మనోహర్, శ్రీపతి విజయ్, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, చెన్నపరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొమ్ము సురేంద్ర, బీ శ్రీహరి, పంది కోటేశ్వరరావు, కముజుల బ్రహ్మారెడ్డి, ఏ కోటేశ్వరారవు, కే ఇజ్రాయిల్ ఉన్నారు. మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలి రిలే నిరాహార దీక్షలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, మాజీ మంత్రి సురేష్ -
వైఎస్సార్ సీపీ నుంచి పలువురి సస్పెన్షన్
ఒంగోలు సిటీ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఒంగోలు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర వలంటరీ విభాగం కార్యదర్శి గోనెల మేరి, సిటీ కార్యదర్శి గోనెల శివ, నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షురాలు పేరం ప్రసన్న, సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మెట్టెల వెంకటేష్ (వెంకు), సిటీ 6వ డివిజన్ అధ్యక్షుడు కటారి సాయి, బీసీ జిల్లా విభాగం అధ్యక్షుడు బొట్ల సుబ్బారావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వీరితో పాటు కొండపి నియోజకవర్గానికి చెందిన జిల్లా బూత్ కమిటీ విభాగం అధ్యక్షుడు పుట్టా వెంకటరావు, నియోజకవర్గ గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు కొమ్ము ప్రభుదాస్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు దుగ్గిరాల పేరరాజు, కసుకుర్తి నవీన్, కసుకుర్తి శివాజీ (బద్రి)లను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. మార్కాపురం: మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా త్వరలో వినూత్న కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నట్టు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ టీ జీవన్ తెలిపారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 7.15 గంటలకు ప్రసారమయ్యే ఉదయ కిరణాలు కార్యక్రమంలో ప్రతి గురువారం మానసిక ఆరోగ్యంపై, ప్రతి శనివారం సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 8.35 గంటలకు ప్రసారమయ్యే హలో ఎఫ్ఎం కార్యక్రమంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. సోమ, బుధ, శుక్రవారాల్లో వాట్సప్ ద్వారా పాటలు కోరే కార్యక్రమం, మంగళ, గురు, శనివారాల్లో లైవ్ ఫోన్ ఇన్ ద్వారా పాటలు కోరవచ్చని అన్నారు. సోమ, బుధ, శుక్ర వారాల్లో ఉదయం 9.30 మహిళల కోసం లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ఉంటుందన్నారు. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 7.15 గంటలకు పాడిపంటల వివరాలు, మంగళ, గురు, శనివారాల్లో కిసాన్ వాణి కార్యక్రమాలు ఇల్లు–వాకిలీ ప్రసారమవుతుందన్నారు. రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే యువవాణిలో వివిధ రకాల అంశాలపై యువతకు సమాచారం అందిస్తామన్నారు. పోటీ పరీక్షల శిక్షణ, కాలేజీ క్యాంపస్ ప్రోగ్రామ్స్, నూతన వ్యాపారాలు తదితర కార్యక్రమాలు ప్రసారం చేస్తారన్నారు. ఈనెల 9వ తేదీన ఆకాశవాణి 34వ ఆవిర్భావ దిన వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మార్కాపురం ఆకాశవాణి ప్రసారాలను ఓటీటీతో అనుసంధానం చేశామని, వేవ్స్ ద్వారా కార్యక్రమాలు వినవచ్చన్నారు. దీనితోపాటు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్లో కూడా ప్రసారాలాను వినవచ్చని చెప్పారు. మార్కాపురం ప్రాంతానికి చెందిన స్థానిక గాయకులు, రచయితలు, కవులు, మేధావులు, జానపద కళాకారులు, వివిధ రంగాల నిపుణులు ప్రతిభ చాటేందుకు ఆకాశవాణి ముందుంటుందన్నారు. ఒంగోలు సిటీ: ఏపీ టెట్‌లో భాగంగా జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పరీక్షకు 640 మంది అభ్యర్థులకు గాను 570 మంది హాజరైనట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. 70 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. జిల్లాలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా పరీక్ష కేంద్రంలో రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం సెషన్‌కు 220 మందికి గాను 206 మంది హాజరు కాగా, 14 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 220 మందికి 188 మంది హాజరయ్యారు. 32 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కేంద్రంలో ఉదయం 100 మందికి 90 మంది, మధ్యాహ్నం 100 మందికి 86 మంది పరీక్ష రాశారు. రెండు సెషన్లలో కలిపి 24 మంది గైర్హాజరయ్యారు. ఒంగోలు వన్‌టౌన్: ఒంగోలు రూడ్ సెట్ సంస్థలో ఆగస్టు 17 నుంచి పురుషులకు 13 రోజుల పాటు సీసీ టీవీ కెమెరా ఇన్‌స్ట్టాలేషన్, సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ పీ శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగులు అర్హులని, వయసు 19 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. శిక్షణ పొందగొరే వారు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ కలిగి ఉండాల న్నారు. శిక్షణ కాలంలో ఉచిత శిక్షణతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారని తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు 9573363141 ఫోన్ నంబర్ ను సంప్రదించాలన్నారు. -
తల్లీకూతురులే నిందితులు..!
కంభం: పట్టణంలో ఈ నెల 4వ తేదీ జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులైన తల్లీకూతుర్లను అరెస్టు చేసి సొత్తును రికవరీ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. కంభం పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు వెల్లడించారు. స్థానిక నెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆసియా ఇంట్లో ఈ నెల 4వ తేదీ దొంగతనం జరిగింది. బంగారు నగలు అపహరణకు గురవగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంభం సీఐ కె.మల్లికార్జున ఆధ్వర్యంలో ఎస్సై శివకృష్ణారెడ్డి సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టి గురువారం రాత్రి 8 గంటల సమయంలో మార్కాపురంలోని దోర్నాల బస్టాండు సెంటర్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన 72 గ్రాముల బంగారు నగలు రికవరీ చేశారు. నగలు అమ్మేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోయిన నిందితులు... ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆసియా ఇంట్లో గతంలో 20 రోజులు పనిచేసి మానేసిన కంభం పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన సయ్యద్ కరీమున్ చోరీ చేసేందుకు పన్నాగం పన్ని ఆమె తల్లి సయ్యద్ ఖాసింబీ, అర్థవీడు మండలం గన్నేపల్లి గ్రామానికి చెందిన షేక్ నాగూర్‌వలిని కలుపుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు అక్కడికి చేరుకుని తల్లిని, నాగూర్‌వలిని బయట కాపాలాపెట్టి లోపలికి వెళ్లిన కరీమున్ దివాన్‌కాట్ మీద ఉన్న బంగారు నగల పర్సును తీసుకురాగా, ముగ్గురూ కలిసి ఉడాయించారు. వారు దొంగతనం చేసి పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం కావడంతో వాటి ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దొంగిలించిన సొత్తును హైదరాబాదులో అమ్మేందుకు ప్రయత్నించగా.. అక్కడ ఎవరూ కొనకపోవడంతో మార్కాపురం వచ్చి నగలు అమ్మేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయారు. నేరానికి పాల్పడిన వారితో పాటు దొంగ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి అనుముల వీరయ్య (సంజనా జ్యూయలరీస్ యజమాని)పై కూడా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చేధించిన ఎస్సై శివకృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లను డీఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. చోరీ జరిగిన ఇంట్లో సీసీ కెమెరాలు ఉండటం వలనే నిందితులను త్వరగా పట్టుకోగలిగామని, అందువలన ప్రజలు, వ్యాపారులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు. విలేకరుల సమావేశంలో సీఐ మల్లికార్జున, ఎస్సై శివకృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. కంభంలో చోరీ కేసు ఛేదించిన పోలీసులు 72 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం -
ఘనంగా చేనేత దినోత్సవం
● చేనేత కార్మికులను సన్మానించిన డీఆర్ఓ వెంకటరమణ ఒంగోలు సబర్బన్: జాతీయ చేనేత దినోత్సవాన్ని ఒంగోలులోని కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట రమణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన కళావైభవానికి చేనేత రంగం ప్రతీక అని కొనియాడారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ఆసరాగా నిలిచి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,210 మంది చేనేత కార్మికులు ఉన్నారని, 12 చేనేత సహకార సంఘాలు విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ప్రధానంగా రూపుదిద్దుకునే జాకార్డ్ డిజైన్ చీరలు, సెమీ గద్వాల్ చీరలు, లుంగీలు, డ్రెస్ మెటీరియల్స్, షర్టింగ్ వస్త్రాలకు మార్కెట్లో మంచి ఆదరణ ఉందన్నారు. సమాజంలోని ప్రతిఒక్కరూ చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసి నేతన్నల శ్రమకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించాలని డీఆర్వో పిలుపునిచ్చారు. అనంతరం పలువురు చేనేత కార్మికులను సత్కరించారు. -
హామీలు ఏమయ్యాయి బాబు
యర్రగొండపాలెం: ఎన్నికల ముందు, అధికారం చేజిక్కించుకున్న తరువాత ఇచ్చిన హామీలు ఏమయ్యాయి చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. దగా డీఎస్సీపై జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి శుక్రవారం ఆయన సంఘీభావం తెలిపి వారికి నిమ్మ రసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలతోపాటు రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నెలకు రూ.3 వేలు ఇస్తామని కల్లబొల్లి మాటలుచెప్పి గద్దెనెక్కిన తరువాత చంద్రబాబు ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదని, రూ.3 వేలు భృతి ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అధికారం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను తొక్కేయాలి, నరికేయాలని చెప్పి ఎన్నో విధాలుగా వారిని ఇబ్బంది పెడుతున్నారే తప్ప మీ అజెండా ప్రజాశ్రేయస్సు కాదని, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని కాదన్నారు. ఎంతకాడికి జగన్మోహన్రెడ్డిపై బురదజల్లాలనేదే తప్ప వేరే ఆలోచనేలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి నాడు–నేడు కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తృప్తికరంగా ఉండేదని చెప్పారు. ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా తయారు చేశారని, అసలు ఆయన క్వాలిఫికేషన్ చంద్రబాబు కుమారుడు అని తప్ప మరేమైనా అర్హత ఉందా అని ప్రశ్నించారు. లోకేష్ మొదటి సారి ఎమ్మెల్యే అయిన తరువాత ఇంతపెద్ద మంత్రి పదవి ఇస్తే డీఎస్సీ పరీక్షలు సరిగా నిర్వహించడం చేతకాలేదన్నారు. పేపర్ లీకవడం వల్లే మీ ఆఫీసులో ఉన్నవారికి ర్యాంకులు వచ్చాయన్నారు. పచ్చ వర్గీయుల కోసమే 2 శాతం స్పోర్ట్స్ కోటా నుంచి 4 శాతానికి పెంచారని అన్నారు. డీఎస్సీ ఉద్యోగస్తులందరి వద్ద రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు తీసుకొని ఉద్యోగాలు అమ్ముకున్నారని అన్నారు. పేదలంతా చదువుకోవాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు వర్గాలందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేశారని, ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి కరోనా మహమ్మారి సమయంలో కూడా పేద విద్యార్థులు ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలను తూట్లు పొడుస్తున్నారని, లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండే అర్హతలేదని, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యాశాఖలో అవినీతి జరిగిందంటే అది ఆంధ్ర రాష్ట్రంలోనేనని రిపోర్ట్లు చెప్తున్నాయని, విద్యార్థులు తింటున్న తిండిలో ఈగలు, బొద్దింకలు, రాసే పరీక్షల్లో పేపర్ లీక్‌లు, ఇచ్చే ఉద్యోగాలలో డబ్బుల మూటలకు అమ్ముకుంటున్నది నారా లోకేష్ శాఖేనని అన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగులకు కాకుండా ఎటువంటి అర్హత లేకున్నా సూట్‌కేసులు ఇచ్చిన అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై నిరుద్యోగులు, విద్యార్థులు, పేదల పక్షాన వైఎస్సార్ సీపీ నిలబడుతుందని అన్నారు. నారా లోకేష్ విద్యాశాఖకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రిలే దీక్షలో కూర్చున్న వారికి బూచేపల్లి, తాటిపర్తి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, మండలాల పార్టీ అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు దోగిపర్తి సంతోష్ కుమార్, పట్టణ అధ్యక్షుడు కందూరి కాశీవిశ్వనాథ్, త్రిపురాంతకం మండల ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్.బుజ్జి, సయ్యద్ జబీవుల్లా, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఏలూరి వెంకట నారాయణరెడ్డి, వెన్నా వెంకటేశ్వరరెడ్డి, ఇంటిలెక్చువల్ జిల్లా అధ్యక్షుడు అంగిరేకుల ఆదినారాయణ పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడు అరెస్టు
కందుకూరు: ఇటీవల ఉలవపాడు మండలం చాగొల్లు గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ అన్వర్‌బాషా తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ చాగొల్లు గ్రామానికి చెందిన ఉప్పుటూరి రమణయ్య ఇంటి ముందు అరుగుపై కూర్చుని ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన నత్తా అభిలాష్ అనే యువకుడు కొబ్బరికాయలు కొట్టే కత్తితో రమణయ్యపై విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చాడు. గతంలో ఉన్న పాతకక్షల నేపథ్యంలో ఈ హత్యకు పాల్పడినట్లు మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉలవపాడు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అభిలాష్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఉలవపాడు, కందుకూరు రూరల్ ఎస్సైలు సుబ్బారావు, బాలకృష్ణ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కురిచేడు: మండలంలోని అలవలపాడు అడ్డరోడ్డు వద్ద శుక్రవారం పట్టపగలే ఓ మహిళ మెడలోంచి దుండగులు బంగారు నానుతాడు లాక్కెళ్లారు. ఎస్సై జి.కోటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పడమర గంగవరం సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న బత్తుల స్వరాజ్యలక్ష్మి విధుల నిమిత్తం ఉదయం కురిచేడు నుంచి ఆటోలో అలవలపాడు రోడ్డు వద్దకు చేరుకుంది. అక్కడ తనను తీసుకెళ్లే ద్విచక్ర వాహనం కోసం ఎదురుచూస్తుండగా.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి, ఈ రోడ్డు ఏ ఊరు వెళ్తుందని అడిగారు. ఆమె అలవలపాడు వెళ్తుందని చెబుతూ మొబైల్ చూసుకుంటున్న సమయంలో, క్షణాల్లో మెడలోని 10 గ్రాముల నానుతాడును లాక్కొని ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
డ్రగ్స్‌ను శాశ్వతంగా నిర్మూలించాలి
దర్శి: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహోద్యమంశ్రీలో భాగంగా శుక్రవారం దర్శి పట్టణంలో 700 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే బూచేపల్లి, జెడ్పీ చైర్పర్సన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు. చిన్నతనం నుంచే యోగా, ధ్యానం అలవాటు చేసుకుని సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు జీవీ రత్నం, బ్రహ్మకుమారీస్ దర్శి, పొదిలి కేంద్రాల ఇన్‌చార్జ్‌లు బీకే ఉష, లత, నాయకులు వెన్నపూస వెంకటరెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి, సోము దుర్గారెడ్డి, కేవీ రెడ్డి, మేడం మోహన్‌రెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, బండి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బూచేపల్లి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ దర్శిలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ -
పోలీసుల అత్యుత్సాహం
ఒంగోలు సిటీ: డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అద్దంకిలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం పోలీసులు తొలగించారు. దీంతో దీక్షా శిబిరాన్ని అద్దంకి వైఎస్సార్ సీపీ ఆఫీసుకు తరలించారు. అదేవిధంగా కందుకూరులో వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరం వద్ద పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రిలే దీక్షలు చేస్తున్న అభ్యర్థులు నీడ కోసం దీక్షా శిబిరం వద్ద టెంట్లు వేసుకునేందుకు కూడా పోలీసులు అనుమతించ లేదు. దీంతో ఎండ తీవ్రత దృష్ట్యా గొడుగులు వేసుకుని దీక్షను కొనసాగించారు. -
ధరల దడ..!
పొగాకు రైతును కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు సరాసరి అమ్మకం ధరలు క్రమంగా తగ్గిపోతుండడం, మరోవైపు వేలం కేంద్రాల్లో తిరస్కరణ బేళ్ల సంఖ్య పెరుగుతుండడం సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది. దీనికితోడు పొగాకు కొనేందుకు వ్యాపారులు మొండికేస్తున్నారు. ఇలా అయితే మిగిలిన పంటకు ఎన్ని నెలలు పడుతుందో అనే ఆందోళన రైతుల్ని వెంటాడుతోంది. ప్రస్తుతం కందుకూరు, కొండపి, టంగుటూరు వేలం కేంద్రాల్లో ఆరో రౌండ్ మొదలైంది. ప్రారంభం నుంచే ధరలు రైతులకు షాక్‌నకు గురిచేస్తున్నాయి. శుక్రవారం పొదిలి వేలం కేంద్రంలో రైతులు కొద్దిసేపు వేలాన్ని అడ్డుకున్నారు. కందుకూరు/కొండపి/టంగుటూరు/పొదిలి: పొగాకు ధరలు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇప్పటికే 6వ రౌండ్ అమ్మకాలు ప్రారంభమైనా ధరల్లో ఏమాత్రం పెరుగుదల నమోదు కావడం లేదు. పైగా ధరలు మరింత పతనం దిశగా పయనిస్తున్నాయి. కందుకూరులో రెండు వేలం కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. కనిగిరి రోడ్డులోని ఒకటో వేలం కేంద్రంలో పరిధిలో శుక్రవారం నాటికి ఐదు రౌండ్ల వేలం ప్రక్రియ ముగిసింది. బ్రైట్ గ్రేడ్ పొగాకు కేజీ రూ.160 నుంచి రూ.170 మధ్యలోనే కొనసాగుతోంది. అలాగే పామూరు రోడ్డులోని రెండో వేలం కేంద్రంలో 6వ రౌండ్ పొగాకు అమ్మకాలు పూర్తయ్యాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. దీంతో కేజీ పొగాకు సరాసరి ధరలు అమాంతం పడిపోతున్నాయి. ప్రస్తుతం ఒకటో వేలం కేంద్రంలో సరాసరి ధర రూ.208 ఉంటే, రెండో వేలం కేంద్రంలో సరాసరి ధర రూ.203కి పడిపోయింది. ఈ ధరలు మరింత పతనమయ్యే దిశగా కొనసాగుతున్నాయి. అదే సందర్భంలో నో బిడ్లు కూడా అధికంగా నమోదవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండపి వేలం కేంద్రంలో శుక్రవారం నుంచి ఆరో రౌండ్ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజే రైతులకు షాక్ తగిలింది. 2025 – 26 పొగాకు వేలం కేంద్రంలో కొనుగోలు ప్రారంభించిన నాటి నుంచి పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఎన్నో ఆశలతో పొగాకు వేలానికి రైతులు సిద్ధపడగా.. రైతుల ఆశలపై వ్యాపారులు నీళ్లు చల్లుతున్నారు. గత సంవత్సరం కేజీ గరిష్ట ధర రూ.360 పలకగా, ఈ సంవత్సరం ప్రారంభ ధర గరిష్టంగా రూ.250తో ప్రారంభమైంది. రానురాను గరిష్ట ధర పెరుగుతోందన్న ఆశతో రైతులు వేలం కేంద్రానికి పొగాకు బేళ్లను తీసుకొస్తుండగా కేవలం కొన్ని బేళ్లకు మాత్రమే గరిష్ట ధర రూ.250కి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కొండపి వేలం కేంద్రంలో వేలం మొదటి రౌండు ప్రారంభం రోజు ధరలు రైతుకు షాకిచ్చాయి. 5వ రౌండ్ ముగింపు రోజు సరాసరి రూ.195.12 ఉండగా, ఆరో రౌండు ప్రారంభం రోజు రూ.184.02 పలికింది. అంటే ఒక్కసారిగా సరాసరి ధర రూ.11కి పడిపోయింది. దీంతో రైతులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ రౌండ్‌లోనైనా వ్యాపారస్తులు రైతుల మీద కనికరం చూపి గిట్టుబాటు ధర వస్తుందని ఆశించగా, రైతులకు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉండగా శుక్రవారం 383 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వేలం కేంద్రం నిర్వహణ అధికారి ఎం.శంకర్రావు తెలిపారు. టంగుటూరు వేలం కేంద్రంలో శుక్రవారం ప్రారంభమైన ఆరో రౌండ్లో కనిష్ట ధర ఒకేసారి రూ.10 తగ్గించారు. తిరస్కరణ బేళ్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. బేళ్లను వేలం కేంద్రానికి తీసుకెళ్లడం, తిరస్కరణ గురైన వాటిని తిరిగి తీసుకెళ్తుండడంతో ఒక్కోదానికి రూ.1000 వరకూ నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఆగి.. సాగి... పొదిలి వేలం కేంద్రానికి శుక్రవారం రైతులు 993 చెక్కులు తీసుకెళ్లారు. వాటిలో 430 చెక్కులకు వేలం జరిగే సరికి 210 రిటర్న్ అయ్యాయి. దీంతో ఆందోళన చెందిన రైతులు వేలాన్ని కొంతసేపు అడ్డగించారు. అనంతరం వ్యాపారులతో రైతులతో అధికారులు చర్చలు జరిపారు. దీంతో వేలం ప్రారంభమైంది. ఎప్పటిలాగానే నోబిడ్లు ఎక్కువగా నమోదయ్యాయి. వచ్చిన బేళ్లలో 41 శాతం నోబిడ్లు అయ్యాయి. -
పాముకాటుతో వివాహిత మృతి
కొమరోలు (బేస్తవారిపేట): పాముకాటుతో వివాహిత మృతి చెందిన సంఘటన కొమరోలు మండలంలోని రౌతుపల్లిలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన అవిశనేని లక్ష్మీదేవి (45) పొలంలో చిక్కుడు కాయలు కోస్తున్న సమయంలో పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు కారులో గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త శ్రీనివాసులు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్దదోర్నాల: మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురం గ్రామంలో అడవి పందులు పంటలను ధ్వంసం చేశాయి. గ్రామానికి చెందిన రైతులు చిన్ని వెంకటేశ్వర్లు, ఎల్లయ్యలు తమ ఐదెకరాల పొలంలో అరటి, బొప్పాయి సాగు చేశారు. గురువారం రాత్రి తోటల్లోకి చొరబడిన అడవి పందులు పంటను పూర్తిగా నాశనం చేయడంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. పుల్లలచెరువు: ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పుల్లలచెరువు శివారులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పుల్లలచెరువు తండాకు చెందిన రామావత్ రాంబాబు నాయక్(42) పని నిమిత్తం ఉమ్మడివరం వెళ్లి తిరిగి బైక్‌పై వస్తున్నాడు. గ్రామానికి సమీపంలోని మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయాడు. తలకు బలంగా రాయి తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని తండా వాసులు కోరుతున్నారు. ఒంగోలు టౌన్: బాలిక(17)పై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.శైలజ శుక్రవారం తీర్పునిచ్చారు. 2017 సెప్టెంబర్ 15న నగరంలోని మారుతీనగర్‌కు చెందిన మార్తల మహేంద్రారెడ్డి(21).. బాలికను దొనకొండ మండలం ఇండ్లచెరువులోని తన బంధువుల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి వన్‌టౌన్ సీఐ వై.రామారావు కేసు నమోదు చేయగా, అప్పటి డీఎస్పీ పి.శ్రీధర్ నిందితుడిని అరెస్ట్ చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసిన న్యాయమూర్తి.. బాధితురాలికి అదనంగా రూ.4 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. సింగరాయకొండ: మండలంలోని కనుమళ్ల పంచాయతీ పరిధిలో కందుకూరు మార్గంలో శుక్రవారం సంభవించిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చిన్న కనుమళ్ల గ్రామానికి చెందిన చొప్పర కొండమ్మ, మెండా వరలక్ష్మి ఉపాధి హామీ పనుల కోసం ఉదయం 5.30 గంటలకు నడిచి వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. మరో ఘటనలో.. సింగరాయకొండకు చెందిన షేక్ సుబానీ కందుకూరు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా జగనన్న కాలనీ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయాలైన అతన్ని ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్.సుధీర్‌కుమార్ తెలిపారు. -
లాభాలొచ్చే పంటలు సాగుచేయాలి
మద్దిపాడు: తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే పంటలను ఎంపిక చేసుకుని రైతులు సాగు చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. మద్దిపాడు మండల కేంద్రంలోని నటరాజ కళామందిరం ప్రాంగణంలో శుక్రవారం ఉదయం వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉందని, అందువలన నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను రైతులు సాగు చేసుకోవాలని చెప్పారు. వ్యవసాయంపై రైతులకు మరింత అవగాహన కల్పించేందుకు రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులంతా ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని, తద్వారా భూసారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో తిరిగి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. రెగ్యులర్ పంటలు కాకుండా వాతావరణానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే రైతులకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. సముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రతల కారణంగా వర్షాలు సకాలంలో ఉండవన్నారు. అందువలన రైతులు తగిన విధంగా పంటలు వేసుకోవాలన్నారు. ఎల్‌నినో కారణంగా పశుగ్రాసం కొరత కూడా ఏర్పడే అవకాశాలున్నాయని, దానిని ఎదుర్కొని పశువులను సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. అనంతరం పలువురు రైతులు తమ అభిప్రాయాలను అధికారులకు తెలిపారు. చివరిగా రైతులకు పీఎండీఎస్ విత్తనాలను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. ఎల్‌నినో నేపథ్యంలో పంటల సాగుకు సంబంధించిన వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు, వ్యవసాయ శాస్త్రవేత్త రమేష్, డీపీఎం సుభాషిణి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి గోపీచంద్, ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు, ఇన్చార్జి ఎంపీడీఓ కిషోర్‌కుమార్, తహసీల్దార్ ఆదిలక్ష్మి, వ్యవసాయశాఖ ఏఓ, ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఉండేలా చూసుకోవాలి రైతులకు కలెక్టర్ రాజాబాబు సూచన -
మట్టి దోపిడీకి మంత్రి ఆశీస్సులు!
మేదరమెట్ల: అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పింది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతల కక్షసాధింపు చర్యలు శృతిమించుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులే లక్ష్యంగా పచ్చ మూకలు రెచ్చిపోతున్నాయి. పాలనా యంత్రాంగాన్ని, పోలీసులను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యర్థులను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నాయి. అస్మదీయులకు అండ.. నియోజకవర్గంలో చట్టం రెండు కళ్లతో వ్యవహరిస్తోంది. మంత్రికి అత్యంత ఆప్తులైన ‘షాడో’ నేతలు అంతా తామై చక్రం తిప్పుతున్నారు. టీడీపీ నాయకులు, వారి అనుచరులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. అదే వైఎస్సార్సీపీకి చెందిన వారు ఏ చిన్న పని చేసుకున్నా.. నిబంధనల పేరుతో అడ్డుకుని వేధింపులకు గురిచేస్తున్నారు. కూటమిలో అంతర్గత కుంపట్లు ఉన్న చోట, బలహీన వర్గాలపైనా ఈ పచ్చ సెగలు తీవ్రంగా తగులుతున్నాయి. పచ్చ నేతల డైరెక్షన్.. పోలీసుల ఓవరాక్షన్ కొరిశపాడు మండలం అనమనమూరులో తాజాగా జరిగిన ఘటనే ఈ పచ్చపాతానికి సజీవ సాక్ష్యం. అనమనమూరులో ఓ చెరువు ఏర్పాటు కోసం నిబంధనల మేరకు మట్టిని తరలిస్తున్న వాహనాలను గురువారం పోలీసులు అకారణంగా అడ్డుకున్నారు. మట్టితో ఉన్న టిప్పర్లను బలవంతంగా మేదరమెట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ హైడ్రామా వెనుక మంత్రి రథసారధుల డైరెక్షన్ ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ, ఇదే సమయంలో తిమ్మనపాలెం చెరువులో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నా ఏ ఒక్క అధికారీ అటు వైపు కన్నెత్తి చూడలేదు. పైగా వారికి ఆటంకం కలిగించవద్దని సాక్షాత్తూ మంత్రి నుంచే మౌఖిక ఆదేశాలు ఉన్నాయని అధికారులు దబాయించడం వారి బరితెగింపునకు నిదర్శనం. సామాన్య ప్రజల్లోనూ ఈ పచ్చపాతంపై తీవ్ర చర్చ జరుగుతోంది. కీలుబొమ్మలుగా మారిన అధికారులు వాస్తవానికి మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య సమన్వయంతో జరగాల్సిన పనులను.. టీడీపీ నేతలు తమ రాజకీయ పలుకుబడితో భ్రష్టు పట్టిస్తున్నారు. అనమనమూరు ఘటనలో పోలీసులు పూర్తిగా అధికార పార్టీ నేతల చేతిలో కీలుబొమ్మలుగా మారారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పైవాళ్ల ఆదేశాలు ఉన్నాయి.. మేమేం చేయలేం.. ఏమైనా ఉంటే మీరే వాళ్లతో మాట్లాడుకోండి’ అని పోలీసులు బాధితులకు చెప్పడం చూస్తే వ్యవస్థ ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. చివరకు మైనింగ్ రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ ఏడీ రామచంద్ర ఆదేశాలతో జియాలజిస్టు సురేష్‌కుమార్‌రెడ్డి, మరో ముగ్గురు టెక్నికల్ సిబ్బంది శుక్రవారం మేదరమెట్ల స్టేషన్‌లోని టిప్పర్లను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిమానా విధించి వాహనాలను విడుదల చేశారు. అధికారులు నిబంధనల ప్రకారం కాకుండా, పచ్చ నేతల కనుసన్నల్లో పనిచేస్తూ సామాన్యులను, వైఎస్సార్సీపీ శ్రేణులను వేధిస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ నేతల బరితెగింపు తిమ్మనపాలెంలో యథేచ్ఛగా సాగుతున్న అడ్డగోలు తవ్వకాలు వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా పనులకు ఆటంకాలు ప్రభుత్వ అధికారులు, పోలీసులను పావులుగా వాడుకుంటున్న వైనం అనమనమూరులో మట్టి టిప్పర్ల సీజ్ వెనుక మంత్రి ‘షాడో’ల ఒత్తిడి -
గ్రామాల్లో సమగ్రాభివృద్ధిపై సర్వే చేయాలి
ఒంగోలు సబర్బన్: గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సమగ్రాభివృద్ధిపై సర్వే చేయాలని డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్ బుక్ (డీసీహెచ్‌బీ) అధికారి ఓ.శ్రీవాణి సచివాలయాల సిబ్బందికి సూచించారు. జనాభా లెక్కలకు సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బందికి శుక్రవారం ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఒంగోలు ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోని మండల వనరుల కేంద్రం భవన్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శ్రీవాణి మాట్లాడుతూ.. 2011లో జనగణన జరిగిందని, ఆ తర్వాత 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ సందర్భంగా వాయిదా పడిందని తెలిపారు. అందువలన ప్రస్తుతం జనగణన చేపడుతున్నట్లు చెప్పారు. సర్ కార్యక్రమానికి ముందు జనగణనలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించటం జరిగిందన్నారు. ప్రస్తుతం జనగణనను పురస్కరించుకుని రెండో విడతలో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో పాటు 2011తో పోలిస్తే ప్రస్తుతం ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందనేది స్పష్టంగా డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్ బుక్‌లో నమోదు చేయాలన్నారు. మొత్తం ఎనిమిది రకాల అంశాలను నమోదు చేయాలని వివరించారు. ప్రభుత్వానికి సంబంధించిన స్కూళ్లు, రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, శానిటేషన్, ఈ 15 సంవత్సరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి గ్రాంట్లు వచ్చి అభివృద్ధి జరిగిందనే అంశాలపై సమగ్రంగా సర్వే నిర్వహించాలని వివరించారు. అప్పటి పరిస్థితిని, ఇప్పటి పరిస్థితిని పోల్చుతూ నివేదికలు తయారు చేయాలన్నారు. ఒక్కో రెవెన్యూ విలేజ్‌ని ఒక యూనిట్‌గా తీసుకుని సర్వే చేయాల్సి ఉందన్నారు. డీసీహెచ్‌బీ శిక్షణ కార్యక్రమాన్ని డీఆర్ఓ వెంకట రమణ, ఒంగోలు రూరల్ తహసీల్దార్ కృష్ణమోహన్ సందర్శించారు. ఒంగోలు అర్బన్, ఒంగోలు రూరల్, కొత్తపట్నం, టంగుటూరు మండలాలకు ఒంగోలులో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు రూరల్ డిప్యూటీ తహసీల్దార్ కొల్లిబోయిన అశోక్, రూరల్ ఆర్ఐ శ్రీకంఠ శ్రీనివాసరావు, ఏఎస్ఓ బ్రహ్మయ్య, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగిపై టీడీపీ నేతల దాడి
వెలిగండ్ల (కనిగిరిరూరల్): వారు అడిగిన సర్టిఫికెట్‌ను వెంటనే ఇవ్వలేదనే కోపంతో.. టీడీపీ మండల నాయకుడు కే ఇంద్రభూపాల్‌రెడ్డి, అతని అనుచరులు కలిసి సచివాలయ ఉద్యోగిపై దాడి చేసి కొట్టి తలపై తీవ్రగాయాలు చేసిన ఘటన మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలం కొటాలపల్లి స్వర్ణ సచివాలయంలో శుక్రవారం జరిగింది. బాధితుడి కథనం మేరకు ఇటీవల సచివాలయ ఉద్యోగి కె.వెంకటకృష్ణ కొటాలపల్లికి బదిలీపై వచ్చి వెల్ఫేర్ అసిస్టెంట్‌గా ఉంటూ సిబ్బంది కొరత వలన డిజిటల్ అసిస్టెంట్ బాధ్యతలను కూడా తీసుకున్నారు. ఈ తరుణంలో ఎలికా అంజయ్య కుమార్తెకు ఓబీసీ, కుల ధ్రువీకరణ పత్రం కావాలని అంజయ్య స్నేహితుడు వచ్చి అడిగాడు. అయితే ఆ సర్టిఫికెట్లను ఇప్పటికే జూన్ 23న తీసుకుని ఉన్నారు. అవి మూడేళ్ల వరకు చెల్లుబాటు అవుతాయి. కానీ వారు మాత్రం మళ్లీ సదరు పత్రాలు కావాలని, అవసరం అని చెప్పారు. దీంతో కుల ధ్రువీకరణ పత్రం అందజేశారు. అయితే ఓబీసీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్లో నెటివిటీ తేడాగా ఉంది. కనిగిరి నెటివిటీగా చూపిస్తోంది. దీని వల్ల మీ అమ్మాయి కౌన్సిలింగ్‌కు ఇబ్బంది జరుగవచ్చని.. దాని పై తనకు పూర్తి అవగాహన లేదని, మరో చోట చేయించుకుంటే మంచిదని తాను చెప్పినట్లు కే వెంకట కృష్ణ తెలిపారు. దీని పై అంజయ్య వచ్చి.. ‘‘మా ఊర్లో సచివాలయం పెట్టుకుని.. మేం బయటకు ఎందుకు వెళ్లాలి. పని చేతకానప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకని’’ దుర్భాషలాడారు. తనది ఆపోస్టు కాదని.. కేవలం ఎవరూ లేనందు వల్లే ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇన్చార్జిగా ఉన్నానని వెంకటకృష్ణ చెప్పినా వినకుండా గురువారం గొడవ చేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు గుంపుగా టీడీపీ నేతలు వచ్చి దాడి... గురువారం జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని.. వెలిగండ్ల టీడీపీ మండల నాయకుడు కేలం ఇంద్రభూపాల్ రెడ్డి, అతని అనుచరులు, అంజయ్య మరి కొందరు కలిసి శుక్రవారం వచ్చి..కాపు కాసి ఆఫీసులో ఎవరూ లేని సమయంలో వెంకటకృష్ణతో అనవసరంగా గొడవకు దిగి దుర్భాషలాడారు. విచక్షణా రహితంగా దాడి చేసి తలపై కొట్టి, పిడిగుద్దులు గుద్ది తనను హత్యచేసేందుకు ప్రయత్నించగా బయటకు పరిగెత్తినట్లు బాధితుడు వాపోయాడు. తన ఫోన్ కూడా లాక్కుని భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితుడు కే వెంకట కృష్ణ విలేకర్లకు తెలిపారు. ఈమేరకు క్షతగాత్రుడు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
మెగా నిరసన
దగా డీఎస్సీదర్శిలో నిరాహార దీక్షలో మాట్లాడుతున్న బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి టంగుటూరు దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న డాక్టర్ ఆదిమూలపు సురేష్ మార్కాపురంలో దీక్షకు మద్దతు తెలుపుతున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, అన్నా రాంబాబుమెగా డీఎస్సీ స్కాంపై వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలతో ఉమ్మడి జిల్లా హోరెత్తిపోయింది. అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చేంత వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతినబూనారు. శుక్రవారం రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వైపాలెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చుండూరి రవిబాబు, చింతలపూడి అశోక్‌కుమార్, దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. – సాక్షి నెట్వర్క్ -
మొక్కవోని దీక్ష.. పోలీసుల కక్ష.!
కనిగిరిలో పోలీసులు దీక్షలు భగ్నం చేసేందుకు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పోలీసులు ఉదయాన్నే కూల్చి వేశారు. శిబిరాలు నిర్వహించేందుకు పార్టీ నాలుగు రోజులుగా అనుమతి కోరుతూనే ఉంది. ఉద్దేశపూర్వకంగానే అనుమతివ్వని పోలీస్ అధికారులు.. దీక్షా శిబిరానికి ఎలాంటి అనుమతులు లేవంటూ బుధవారం రాత్రి వేసిన టెంట్లను గురువారం వేకువజామునే తొలగించారు. తమకు పైనుంచి ఒత్తిడి ఉందంటూ నిర్ధాక్షణ్యంగా తొలగించారు. దీంతో వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్, పార్టీ శ్రేణులు, యువత, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక చర్చి సెంటర్ రోడ్డులో బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలిపారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ.. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా.. ఎవరికీ ఇబ్బంది జరగకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయిస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందంటూ ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని, ప్రైవేటు స్థలాల్లో కూర్చుని నిరసన తెలుపుకోవాలని కనిగిరి, పామూరు సీఐలు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులతో వచ్చి బలవంతం చేశారు. వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ మాట్లాడుతూ 20 ఏళ్ల నుంచి కనిగిరిలో అన్ని పార్టీలకు చెందిన వారు నిరసనలు, ధర్నాలు చేసుకునే ప్రదేశమైన పీవీఆర్ పార్క్ వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేస్తే పర్మిషన్ ఇవ్వకుండా పైనుంచి ఒత్తిడి వచ్చిందంటూ తొలగించారని, మళ్లీ ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నిరసన తెలుపుతుంటే ఇక్కడ ఖాళీ చేయమంటున్నారని, మేం ఏం తప్పు చేశామని పోలీసులకు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా..? అని నిలదీశారు. ఇక్కడేమైనా జంగిల్ రాజ్ పాలన సాగుతోందా.. అంటూ తీవ్రంగా ప్రతిఘంటించారు. కనిగిరి ఇన్చార్జి డీఎస్పీ పి.శ్రీధర్ నేతృత్వంలో పోలీసు బలగాలు మొహరించాయి. పార్టీ నాయకులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ ఇన్చార్జి దద్దాల నారాయణతో పాటు, పార్టీ శ్రేణులను పోలీసులు దౌర్జన్యంగా రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తాయి. అనంతరం పార్టీ కనిగిరి ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలో దాదాపు గంట సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా దద్దాల మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాల్లో, అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉండి పోరాటం చేస్తామని, మూడు రోజుల పాటు కనిగిరిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సాక్షి నెట్వర్క్: డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టాలని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు విద్యార్థి సంఘాలతో కలిసి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్షలు చేపట్టారు. అయితే, కనిరిగి పట్టణంలో పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు అత్యుత్సాహం చూపించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ‘ప్రశ్నిస్తే.. గొంతు నొక్కేస్తారా..? ఇది ప్రజాస్వామ్యమా.. లేక రెడ్‌బుక్ రాజ్యాంగమా’ అన్న తీరులో పోలీసులు వ్యవహరించారు. దర్శిలో సైతం పోలీసులు దీక్షను భగ్నం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఈ పోరాటం ఆగదని, అరెస్టులు, దాడులు తమను ఆపలేవని, డీఎస్సీ కుంభకోణానికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ దీక్ష శిబిరాల వద్ద నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు నినదించారు. నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం ఆగదని హెచ్చరించారు. దర్శిలో... దర్శిలోనూ రిలే నిరాహారదీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు శతవిధాలా యత్నించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం పది గంటలకు విద్యార్థి సంఘాల నేతలతో కలిసి వైఎస్సార్ సీపీ నాయకులు దీక్షను ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చి శిబిరాన్ని ఖాళీ చేయాలని హడావిడి చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు సీఐ రామారావు తన బృందంతో వచ్చి శిబిరాన్ని తొలగించాలంటూ హంగామా చేశారు. ఈ రోజుకు ఇక్కడే నిర్వహిస్తామని, శుక్రవారం నుంచి వేరే చోటకు మారుస్తామని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు సమాధానం చెప్పారు. సాయంత్రం 3.30 గంటలకు డీఎస్పీ బాలమురళీకృష్ణ వచ్చి శిబిరాన్ని తొలగించాలని పట్టుబట్టారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని శివప్రసాద్‌రెడ్డి డీఎస్పీకి చెప్పారు. కొంతసేపటి తర్వాత తొలిరోజు దీక్షను ముగించారు. మిగిలిన రెండు రోజులు వేరే ప్రాంతంలో శిబిరం ఏర్పాటు చేస్తామని శివప్రసాదరెడ్డి తెలిపారు. వై.పాలెంలో... డీఎస్సీ–2025లో అక్రమాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని యర్రగొండపాలెంలో నిరుద్యోగులు గళమెత్తారు. వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు గురువారం స్థానిక యూనియన్ బ్యాంక్ సమీపంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రారంభించారు. సాయంత్రం వరకు దీక్షలో కూర్చున్నారు. తొలిరోజు రిలే నిరాహార దీక్షలో నియోజకవర్గంలోని వివిధ విభాగాల నాయకులతో పాటు నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలి : అన్నా రాంబాబు మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్ ఆదేశాలతో గురువారం మార్కాపురంలో రిలే దీక్షలు ప్రారంభించారు. తొలిరోజు దీక్షలో మార్కాపురం, పొదిలి మండలాలకు చెందిన 70 మంది నిరుద్యోగులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నా మాట్లాడుతూ సమాజ భవిష్య త్తును తీర్చిదిద్దే పవిత్రమైన ఉపాధ్యాయ పోస్టులను వక్రమార్గంలో కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో టీడీపీ కార్యకర్తలకు దొడ్డి దారిన ఉద్యోగాలిచ్చి అర్హులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో పోస్టుల అమ్మకాలు : ఆదిమూలపు సురేష్ కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లిలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. దీక్షల్లో పెత్త ఎత్తున యువత పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి వేలాది ఉద్యోగాలను ఒక్కో పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. అర్హులైన డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ : మాజీ మంత్రి మేరుగు నాగార్జున సంతనూతలపాడులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నిర్వహించిన దీక్షలను మాజీ మంత్రి, పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మేరుగు నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ నిరుద్యోగుల పట్ల దగా డీఎస్సీగా మారిందని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో భారీగా అవినీతి జరిగిందని, అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నైతిక విలువలుంటే లోకేష్ రాజీనామా చేయాలి : బుర్రా మధుసూదన్‌యాదవ్ కందుకూరులో మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున రిలే దీక్షలు చేపట్టారు. మాజీ మంత్రి, పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి బుర్రాతో కలిసి అభ్యర్థుల మెడలో పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. డీఎస్పీలో జరిగిన అక్రమాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏమాత్రం నైతిక విలువలున్నా డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ వెంటనే మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తొలి రోజు దీక్షలో పెద్ద ఎత్తున డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు, యువత పాల్గొన్నారు. కనీసం క్రీడా మైదానంలోకి దిగని వారు కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించారని, బంగారు పతకాలు సాధించిన వారిని ఉద్యోగానికి అనర్హులుగా చేశారని డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే : చుండూరి రవిబాబు రాష్ట్రంలో దగా పాలన నడుస్తోందని.. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలోని పోస్టులు అమ్ముకుని నిరుద్యోగులను మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహారదీక్షను రవిబాబు ప్రారంభించారు. లోకేష్ రాజీనామా చేయాలి.. షేమ్ షేమ్ లోకేష్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మోర్మోగింది. ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. డీఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు : కేపీ నాగార్జునరెడ్డి డీఎస్సీ 2025 నిర్వహణలో జరిగిన భారీ అవినీతి, అక్రమాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని.. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి కేపీ నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రం అర్ధవీడులో జెండా చెట్టు వద్ద వైఎస్సార్ విగ్రహం సమీపాన రిలే నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడారు. ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు జరిగిన రిలే నిరాహార దీక్షకు ప్రజలు, నిరుద్యోగుల నుంచి మద్దతు లభించింది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగించిన దీక్షల్లో కూర్చున్న వారికి నాగార్జునరెడ్డి నిమ్మరసం తాగించి విరమింపజేశారు. అద్దంకిలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు... డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై అద్దంకిలో వైఎస్సార్ సీపీ నాయకులు భగ్గుమన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. దీనికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై మద్దతు ప్రకటించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. దీక్షలు చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులకు పార్టీ లీగల్ సెల్ నాయకులు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంతనూతలపాడులో దీక్షలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, నాయకులు, కార్యకర్తలుకందుకూరులో మాట్లాడుతున్న నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్, పక్కన మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డిఅర్ధవీడులో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కేపీ నాగార్జునరెడ్డి, నాయకులు అద్దంకిలో రిలే దీక్షలు ప్రారంభించి మద్దతుగా కూర్చున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్డర్ చింతలపూడి అశోక్‌కుమార్, నాయకులు డీఎస్సీ అక్రమాలపై గర్జించిన విద్యార్థులు, వైఎస్సార్ సీపీ నేతలు అక్రమ అరెస్టులతో ఉద్రిక్తత -
నేడు చేనేత దినోత్సవ ర్యాలీ
ఒంగోలు సబర్బన్: చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఒంగోలు నగరంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 7వ తేదీ 12వ చేనేత దినోత్సవాన్ని ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఒంగోలులోని ప్రకాశం భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరి చర్చి సెంటర్ మీదుగా కలెక్టర్ బంగ్లాకు చేరుకుంటామన్నారు. అక్కడ కలెక్టర్ పి.రాజాబాబు చేనేతలను ఘనంగా సన్మానిస్తారని తెలిపారు. ● దీనివెనుక మర్మమేమిటో చంద్రబాబు చెప్పాలి ● 10న జైలు భరో ● సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడి ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు పొగాకు ధరలపై సమీక్ష నిర్వహించినప్పుడల్లా ధరలు తగ్గిపోతున్నాయని, దీని వెనుక రహస్యం ఏమిటో ఆయనే చెప్పాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని తరిమెల నాగిరెడ్డి భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల పాలిట ఆపద్బాంధవులుగా నిలబడాల్సిన పాలకులు యమధర్మరాజులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీకి ఒకరోజు ముందు ఏ రకమైన పొగాకునైనా కిలో రూ.200కు తక్కువ కాకుండా కొనుగోలు చేయాల్సిందిగా చంద్రబాబు జూన్ నెలలో ఆదేశించారని, అవేమీ అమలు కాలేదని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయని కార్పొరేట్ వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. జూలై 29వ తేదీ జాతీయ రహదారుల దిగ్బంధనం చేపడితే.. ఒకరోజు ముందు 28వ తేదీ చంద్రబాబు గ్రేడ్–1 రకం పొగాకు కిలో రూ.230కి, మీడియం రకం 190కి, లో గ్రేడ్ రకం 110కి కొనుగోలు చేయాలని చెప్పడం, ధరల్లో వ్యత్యాసానికి కిలోకు రూ.20 సహాయం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. 1000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థలచే కొనుగోలు చేయాలని రైతులు కోరుతుంటే.. రూ.20 ఇస్తామని ప్రకటించడంలో ఉద్దేశ్యం ఏమిటో చెప్పాలని రంగారావు నిలదీశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను చులకనగా చూస్తున్నాయని, న్యాయం చేస్తున్నట్లు నటిస్తూ రైతుల గొంతులు కోయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రైతులకు న్యాయం చేయమని అడుగుతుంటే కార్పొరేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత వైఖరికి నిరసనగా ఈ నెల 10వ తేదీ జైలు భరో కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. క్విట్ ఇండియా డేని పురస్కరించుకుని ఒంగోలు, కందుకూరు, కొండపి, సంతనూతలపాడు, అద్దంకి కేంద్రాలుగా జైలు భరో చేపట్టనున్నట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో నాయకులు ఎస్.లలిత కుమారి, జజ్జూరి జయంతిబాబు, పరిటాల కోటేశ్వరరావు, గుళ్లాపల్లి వెంకటరావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు వన్‌టౌన్: భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి ఢాయి ఆఖర్ జాతీయ లేఖా రచనా పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ మహ్మద్ జాఫర్ సాధిక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యత పెంపొందించడం, లేఖా రచన కళను ప్రోత్సహించడం, సృజనాత్మకతను వెలికి తీయడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమన్నారు. పోటీలు రెండు విభాగాలలో ఉంటాయన్నారు. ఎన్వలప్ విభాగంలో ఏ4 సైజు పేపర్‌పై గరిష్టంగా 1000 పదాలతో లేఖ రాయాలన్నారు. ఇన్‌ల్యాండ్ లెటర్కార్డు విభాగంలో గరిష్టంగా 500 పదాలతో లేఖ రాయాలన్నారు. తెలుగు, హిందీ, ఆంగ్లం లేదా భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భారతీయ భాషలోనైనా స్వహస్తాలతో లేఖలు రాయాలన్నారు. టైపు, కంప్యూటర్ ముద్రణలను పోటీలకు అనుమతించరన్నారు. పోటీల్లో విజేతలకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు, తృతీయ బహుమతిగా రూ.5 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతిగా రూ.10 వేలు అందించనున్నట్లు చెప్పారు. పాల్గొనదలచిన వారు తమ లేఖలను అక్టోబర్ 31వ తేదీలోపు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ప్రకాశం డివిజన్, భాగ్యనగర్ 2వ లైన్, ఒంగోలు–523001 అనే చిరునామాకు పంపించాలన్నారు. -
అధికార పార్టీ నేతల దౌర్జన్యం
లింగసముద్రం (కందుకూరు రూరల్): లింగసముద్రం మండలంలోని ముత్యాలపాడు పంచాయతీ ముత్తంవారిపాలెం గ్రామానికి చెందిన వై.మాల్యాద్రికి ఐదెకరాలు పొలం ఉంది. ఇందులో ఒక ఎకరా వీరాఘవపురం వాగు బోరంబోకు భూమి కలిసి ఉంది. ఈ పొలాన్ని ఎప్పుటి నుంచి మాల్యాద్రి సాగు చేసుకుంటున్నాడు. అందులో పత్తి పంట సాగు చేశాడు. అయితే పై ఎత్తున ఉన్న చెరువుకు వెళ్లేందుకు రోడ్డు వేయాలని టీడీపీ నాయకులు ప్లాన్ చేశారు. మాల్యాద్రి వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తి. దీంతో మాల్యాద్రిని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో ఆ ఎకరా పొలంలో రోడ్డు వేసేందుకు పూనుకున్నారు. పొలంలో రోడ్డు నిర్మాణానికి తనకు అభ్యంతరం లేదని, పొలం మధ్యలో కాకుండా ఒక వైపున రోడ్డు వేసుకోవాలని మాల్యాద్రి సూచించాడు. కానీ మాల్యాద్రిని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో టీడీపీ నాయకులు పొలం మధ్యలో నుంచి రోడ్డు వేశారు. ఒక పక్కన వేసుకుంటే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. నాకు పంట సాగు చేసుకునేందుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అధికారులను, నాయకులను చెప్పినా పట్టించుకోకుండా దౌర్జన్యంగా రోడ్డు వేశారు. అందులో ప్రస్తుతం పత్తి పంట సాగు చేసి ఉంది. కొంత కాయతో ఉంది. మరి కొంత పత్తి తీసి ఉంది. కనీసం పత్తినైనా తీసుకునే వరకు ఆగాలని వేడుకున్నా ఆగకుండా పంటను ధ్వంసం చేసి రోడ్డు వేశారని మాల్యాద్రి వాపోయాడు. పత్తి పంటను ధ్వంసం చేసి నడి పొలంలో నుంచి రోడ్డు వేసి వారి పైశాచిక ఆనందం పొందుతున్నారు. చెరువుకు వెళ్లే దారికి పొలం చివరి ఒక వైపు వేసినా ఇబ్బంది ఉండదు. కానీ టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తోటి రైతును ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఆ వాగు వెంబడి ఎంతో కాలం నుంచి మల్యాద్రితో పాటు మరి కొందరు వాగు పోరంబోకు భూమిని ఆయా రైతులు పొలాల్లో కలుపుకొని సాగు చేసుకుంటున్నారు. లింగసముద్రం, గుడ్లూరు ఎస్సైలతో పాటు పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసుకొని రోడ్డు వేస్తున్నారు. ఒక పద్ధతి పాడు లేకుండా, రైతులకు ఉపయోగకరంగా లేకపోయినా కావాలనే కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ విధంగా అధికారులను ఉపయోగించుకొని రోడ్డు వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పత్తి పంట పొలంలో మధ్యలో రోడ్డు ఏర్పాటు పోలీస్ పహారాలో రోడ్డు వేసిన టీడీపీ నాయకులు నేతలు, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు -
నేతన్న సేవ..పచ్చ నేతలకే..!
కనిగిరిరూరల్: చేనేత కార్మికులకు రుణాలు అందించేంకు ప్రభుత్వం ‘నేతన్న సేవలో’ పథకం ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం కేవలం పచ్చ నేతలకే నన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ఆశీస్సులు, సిఫార్సులు ఉన్న వారి దరఖాస్తులను మాత్రమే ‘నేతన్న సేవలో’ స్కీం లాగిన్‌లో అధికారులు అప్ లోడ్ చేసినట్లు కనిగిరి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. కొన్ని గ్రామాల్లో దరఖాస్తుదారుల వద్ద అధికార పార్టీ నేతలు, సచివాలయ అధికారులు మిలాఖత్ అయి హస్తలాఘవం చూపించారనే ఆరోపణలున్నాయి. నేత వృత్తిలో ఉన్న వాస్తవ కార్మికుడు కాకుండా..అనర్హుల దరఖాస్తులు కూడా అన్లైన్ చేసినట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు, అధికారులు చేనేత కార్మికుడిగా ఐడీ కార్డు ఇప్పించడం, అతని చేత దరఖాస్తు చేయించడం.. ఈ తంతు జరిపినందుకు లబ్ధిదారుని వద్ద నుంచి రూ.7వేల వరకు నజరానాలు తీసుకున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రూ.25 వేలు రుణం వస్తున్నండటంతో వారు కిమ్మనకుండా అమ్యాయ్యాలు ఇస్తున్నట్లు సమాచారం. ఈ లాలుచీలో సచివాలయం నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారుల వరకు తలాపాపం తిలా పిడికెడు అన్న చందంగా భాగస్వామ్యం ఉన్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవ అర్హుల దరఖాస్తులు కనీస పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ పలుకుబడి.. సిఫార్సులు ఉన్న వారందరి దరఖాస్తులు అన్లైన్ చేయడం పట్ల అర్హత కల్గిన నేతన్నలు మండిపడుతున్నారు. గతంలో ఒక్కటి లేని చోట నేడు పదుల సంఖ్యలో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సారిగా చేనేత కార్మికులకు రుణాల మంజూరు ‘నేతన్న సేవలో’ స్కీంకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. అయితే కొన్ని చోట్ల రెండ్రోజుల్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరణ పూర్తి చేశారు. నియోజకవర్గంలో సగం మందికి పైగా వాస్తవ అర్హుత కల్గిన నేతన్నల దరఖాస్తుల అన్లైన్ కాలేదు. అందిన సమాచారం ప్రకారం కనిగిరి మండలంలోని 25 పంచాయతీలు, 20 సచివాలయ వార్డుల్లో 11 సచివాలయాల్లో మాత్రమే చేనేత కార్మికుల రుణాలకు దరఖాస్తుల స్వీకరణ జరిగినట్లు తెలిసింది. కనిగిరి మండలంలో బడుగులేరులో 4, చల్లగిరిగిల్లలో 33, చిన ఇర్లపాడులో 45, చిన అలవలపాడులో 5, యడవల్లిలో 205, గోసులవీడులో 64, గుడిపాడులో 36, ఏరువారిపల్లిలో 29, వంగపాడులో 8, పునుగోడులో 3, తాళ్లూరులో 81 దరఖాస్తులు అన్లైన్లో నమోదు చేసినట్లు తెలిసింది. గతంలో కనీసం ఒక్కరికి కూడా అర్హత లేని చోట ఇప్పుడు అధికార పార్టీ నేతలు నేతన్న ఐడీ కార్డులు ఇప్పించి అప్లికేషన్ పెట్టించినట్లు ప్రచారం సాగుతోంది. అర్జీలు కూడా స్వీకరించని అధికారులు మరీ దుర్మార్గం ఏమిటంటే కనీసం ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల అర్జీలు స్వీకరించడానికి కూడా సచివాలయ వెల్ఫేర్ అధికారులు ఇష్టపడలేదు. రెండ్రోజులు గడిచిన తర్వాత, చివరి సమయంలో అన్లైన్ గడువు ముగిసిన తర్వాత సచివాలయ అధికారి వెబ్సైట్లో దరఖాస్తులు నమోదు చేసినట్లు గుడిపాడుకు చెందిన చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎంపీడీఓ ఖాదర్‌బాషాను చేనేతలు అడగ్గా..5వ తేది 1.45 నిమిషాలకే తాము లిస్ట్ ఫైనల్ చేసి పంపామని.. తాను ఏమీ చేయలేనని, గడువు ముగిసిందని.. అవకాశం ఉంటే రెండో విడతలో చూద్దాం అంటూ దాటవేస్తున్నారు. కనీసం బాధితులతో మాట్లాడేందుకు కూడా ఎంపీడీఓ ఇష్ట పడడం లేదు. దీని బట్టిచూస్తే.. అధికారులు ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అధికారపార్టీ నేతల సిఫార్సు ఉంటేనే నేతన్న దరఖాస్తులు అన్లైన్.. గుడిపాడులో మగ్గం నేతల దరఖాస్తులు తీసుకొని వైనం కనీసం అర్జీ తీసుకోవడానికి ఇష్టపడని ఎంపీడీఓ గడువు ముగిసిన తర్వాత ఆన్లైన్ చేసిన వెల్ఫేర్ అధికారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్న బాధితులు -
డీఎస్సీపై సీబీఐ విచారణ చేపట్టాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి దర్శి (కురిచేడు): 2025 డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, రిజర్వేషన్ల ఖరారు, ఉద్యోగాల భర్తీలో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. దగా డీఎస్సీపై దర్శిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నాయకులతో కలిసి శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై డీఎస్సీ అవకతవకలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని, ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. అంతేగాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా రూ.1,500 కోట్ల బకాయి ఉన్నారన్నారు. వారందరూ ఫీజులు చెల్లించలేక, విద్యాదీవెన, వసతి దీవెన పథకం నిధులు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివి ఇంజినీర్లు, డాక్టర్లు కావాలని కలలు కని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యాదీవెన పథకాల ద్వారా నగదు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఆయా పథకాలు అమలు చేశారని తెలిపారు. కానీ, కూటమి ప్రభుత్వంలో డీఎస్సీ పరీక్షలలో చంద్రబాబు, లోకేష్ అనుయాయులకు ఉద్యోగాలు దోచిపెట్టేందుకు 2 శాతం ఉన్న స్పోర్ట్స్ కోటాను 4 శాతానికి పెంచి వారికిష్టం వచ్చిన వారు పరీక్షలు రాసినా..రాయకపోయినా, పాసైనా..కాకపోయినా స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకుని ఆ కోటాలో ఉద్యోగాలిచ్చి ఒక్కో పోస్టుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్ముకున్నారని బూచేపల్లి విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌కు చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి తమ నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దర్శి మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యదర్శి గుంటు పోలయ్య, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కొల్లా విజయభాస్కర్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.దేవప్రసాదు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఇరుగుల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ టీయూసీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి లక్ష్మిరెడ్డి, కేవీ రెడ్డి, పోశం మధుసూదనరెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి, 8, 1, 5 వార్డుల కౌన్సిలర్లు మోహనరెడ్డి, బాబు, దర్శి మండల యూత్ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. -
ఎన్ని కేసులు పెట్టినా భయపడం
కనిగిరి రూరల్: ప్రతిపక్ష పార్టీలు, ఇతర పార్టీలు ఎవరైనా గత 20 ఏళ్ల నుంచి కనిగిరిలో పీవీఆర్ పార్క్ వద్దనే నిరసనలు, ధర్నాలు చేసేవారని, ఈ విషయం అందరికీ తెలుసని, కానీ ఈసారి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్ సీపీ నియోజకరవ్గ ఇన్చార్జి దద్దాల నారాయణయాదవ్ ధ్వజమెత్తారు. పోలీసు అధికారులు కూడా కనీస న్యాయం లేకుండా అధికార పార్టీకి తలొగ్గి పనిచేయడం సరికాదన్నారు. దీన్ని మేము గుర్తుపెట్టుకుంటామని, కనిగిరి చరిత్రలో ఇలాంటీ నీచ రాజకీయాన్ని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం కనిగిరిలో నిర్వహించిన దీక్ష అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడారు. డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలు జరిగాయన్నారు. స్పోర్ట్స్ కోటాలోని పోస్టుల నియామకాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కొత్త కొత్త జీవోలతో డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం చేశారని వివరించారు. కూటమి ప్రభుత్వం పెద్దల అనుచరులకు పోస్టుల విక్రయాలు జరిగాయని విమర్శించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారా..? జాబ్ క్యాలెండర్ ఎక్కడా..? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఏమైందని ధ్వజమెత్తారు. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు, యువత, విద్యార్థుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందని, కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని దద్దాల స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కనిగిరి పట్టణ అధ్యక్షుడు ఎస్కే అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీలు మడతల కస్తూరిరెడ్డి, గుంటక తిరుపతిరెడ్డి, గంగసాని హుసేన్‌రెడ్డి, చప్పిడి వెంకట సుబ్బయ్య, ఓకే రెడ్డి, సూరసాని మోహన్‌రెడ్డి, కల్లూరి రామిరెడ్డి, యక్కంటి శ్రీనివాసులరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, సిరుప వెంకట గోవర్దన్‌రెడ్డి, కటికల వెంకటరత్నం, మూలే గోపాల్‌రెడ్డి, పులి శాంతి గోవర్దన్‌రెడ్డి, ఎస్కే గయాజ్, ఆయిమల్ల నాగమణి, వాకుమళ్ల రాజశేఖర్‌రెడ్డి, సంగటి మహేంద్రారెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, డాక్టర్ రసూల్, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, ఎస్కే రహీం, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, భారతి, సుస్మిత, ఇండ్లా భాను, ప్రత్తి సురేష్‌రెడ్డి, పి.ఆదాం, పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్కే పాచ్ఛా, పోలక సిద్దారెడ్డి, తాతపూడి సురేష్‌బాబు, ఎర్రబల్లి దేవరాజ్, శ్యామల సాంబశేఖర్రెడ్డి, పలుకూరి భాస్కర్, డి.రవియాదవ్, భాస్కర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రాములు, మిట్టా రమేష్‌రెడ్డి, ఎలికా నారాయణ, కాకర్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులు ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న లారీ
టంగుటూరు: ఓ కేసులో నిందితున్ని తీసుకువెళ్లేందుకు వినియోగించిన పోలీసుల కారును లారీ ఢీకొట్టింది ఈ సంఘటన టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలోని ఐఓసీ ఎదుట గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్సై ఫణి భూషణ్ తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ స్టేషన్‌కు చెందిన పోలీస్ సిబ్బంది నెల్లూరులోని ఓ వ్యక్తిని ఓ కేసుపై పీటీ వారంటీ కోసం వెళ్తున్నారు. ఈ క్రమంలో వల్లూరు సమీపంలోకి వచ్చేసరికి ఐఓసీఎల్‌లో గ్యాస్ నింపేందుకు వెళుతుండగా ఒరిస్సా నుంచి వెనక వస్తున్న లారీ బలంగా తాకింది. ప్రమాదంలో కారు కుడిభాగం దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదు. టంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. -
దోపిడీ కోసమే దగా డీఎస్సీ
వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే తాటిపర్తి, నాయకులు యర్రగొండపాలెం: విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ పూర్తిగా అసమర్థుడని, డీఎస్సీ 2025లో పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడిన ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర చరిత్రలో విద్యాశాఖను ఇంతలా దిగజార్చిన మంత్రి మరొకరు లేరన్నారు. గురువారం వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు స్థానిక యూనియన్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జీవో నంబర్ 74ను రద్దు చేసి, ఇష్టానుసారంగా 447 జీవోను తెచ్చి అక్రమార్కులకు గేట్లు తెరిచారని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు అమ్ముకున్న తర్వాత ఆ జీవోను నిలిపివేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి కింద ఒక్క రూపాయి ఇవ్వలేదని, 20 లక్షల ఉద్యోగాల హామీ గాలికొదిలేశారని విమర్శించారు. నేమ్ చేంజర్‌గా మారిన చంద్రబాబు.. గేమ్ చేంజర్ అయిన శ్రీఅమ్మ ఒడిశ్రీని సర్వనాశనం చేశారని, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. డీఎస్సీ క్వాలిఫై అయి నష్టపోయిన అభ్యర్థుల పక్షాన పోరాడుతున్నారన్నారు. యువత బాగుంటేనే కుటుంబం క్షేమంగా ఉంటుందని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు నాలుగు రోజుల పాటు రిలే దీక్షలు కొనసాగుతాయని, చివరి రోజు భారీ ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి రాజీనామా చేసిన తరహాలోనే నారా లోకేశ్ కూడా తప్పుకోవాలని హితవు పలికారు. అంతకుముందు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు దోగిపర్తి సంతోష్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు కందూరి కాశీవిశ్వనాథ్, జిల్లా అధికార ప్రతినిధి ఏలూరి వెంకట నారాయణరెడ్డి, త్రిపురాంతకం ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, పుల్లలచెరువు జెడ్పీటీసీ వాగ్యానాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, ఇంటిలెక్చువల్ సెల్ జిల్లా అధ్యక్షుడు అంగిరేకుల ఆదినారాయణ, ముస్లిం మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బుజ్జి, సయ్యద్ జబీవుల్లా, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్, ఆళ్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. రిలే దీక్షలో నిరసన గళం రిలే నిరాహార దీక్షలో వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్ధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐ.వి.సుబ్బారావు, కందూరి గురుప్రసాద్, పబ్బిశెట్టి శ్రీనివాసులు, వై.రాంబాబు, జి.కృష్ణారావు, వై.వెంకటేశ్వరరెడ్డి, శేషసేనారెడ్డి, ఎం.ఆదిశేషు, ఒంగోలు సుబ్బారెడ్డి, టి.సత్యనారాయణరెడ్డి, జానకి రఘు, కె.నాగార్జునరెడ్డి, షేక్.మహమ్మద్ కాశిం, షేక్.కాశింపీరా, షేక్.వలీ, ఆర్.బద్దునాయక్, ఒంటేరు నాగేశ్వరరెడ్డి, సింగా ప్రసాద్, మంద సుబ్బారెడ్డి, పి.వెంకటేశ్వర్లు, పి.మంత్రూనాయక్, చెవుల ఆంజయ్య, వీరయ్య, టి.రాంబాబు, అచ్చయ్య, చెన్నయ్య, జాన్, ఒ.లక్ష్మిరెడ్డి, కె.వెంకటరెడ్డి, రాజయ్య, జి.చిన్నశ్రీనివాసరెడ్డి, బయ్యన్న, నాసరయ్య, శ్యాం, బి.వెంకటరత్నం, బాలకోటిరెడ్డి, శేషిరెడ్డి, రాజు, శివరామకృష్ణ, రామయ్య, బబుల్‌రెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు. మండల పార్టీ ఉపాధ్యక్షుడు దోగిపర్తి సంతోష్‌కుమార్ నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేశారు. -
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మేలు
ఒంగోలు వన్‌టౌన్: శ్రీమీడియేషన్ ఫర్ నేషన్ 3.0శ్రీ కార్యక్రమంలో భాగంగా మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ఒంగోలు చర్చి సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీని ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎ.సత్యానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతో ఉపయోగకరమైన విధానమన్నారు. దీనిద్వారా సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందన్నారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రజలకు దీనిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి, ఇతర అదనపు జిల్లా న్యాయమూర్తులు, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చావలి రమేష్ బాబు, మధ్యవర్తిత్వ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గం మార్కాపురం: వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమమైన మార్గమని జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి వి.భవానీ అన్నారు. గురువారం మార్కాపురం కోర్టు ప్రాంగణం నుంచి ప్రెస్‌క్లబ్, కంభం సెంటరు మీదుగా పాతబస్టాండు గడియార స్తంభం సెంటరు వరకూ మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జి బి.దేవేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి జె.కిశోర్‌కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.బాలాజీ, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.శాంతాకుమారి, సీఐ అల్తాఫ్ హుస్సేన్, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.మాబూఆలీ, న్యాయవాది షేక్ జహీర్ సలామ్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికే ‘పల్లె నిద్ర’
● కలెక్టర్ రాజాబాబు జె.పంగులూరు: గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను తెలుసుకుని, అధికారుల సమక్షంలోనే అక్కడికక్కడే పరిష్కరించడమే శ్రీపల్లె నిద్రశ్రీ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. మండలంలోని తూర్పు కొప్పెరపాడులో బుధవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 13 పల్లె నిద్రలు నిర్వహించామని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మండలంలోని 21 గ్రామాలకు 21 మంది జిల్లా స్థాయి అధికారులను పంపి సమస్యలు సేకరించామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అనంతరం గర్భిణులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, డీపీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ నారాయణరావు, సీపీవో టి.వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
డీఎస్సీ మొత్తం అక్రమాలమయం
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్చార్జి డాక్టర్ అశోక్‌కుమార్ అద్దంకి: కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని దగా డీఎస్సీ అని వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్డర్ చింతలపూడి అశోక్‌కుమార్ ధ్వజమెత్తారు. డీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖామంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నియోకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమానికి ఎస్సీ సెల్ నాయకుడు నగేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చింతలపూడి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని మాయమాటలు చెప్పారని, రెండేళ్లలో ఒక్క పైసా కూడా భృతి ఇవ్వలేదన్నారు. పేద, మధ్య తరగతి పిల్లల కోసం వైఎస్సార్ తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్ పథకానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. డీఎస్పీ పరీక్షా పేపర్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారో, వాళ్లే ఎగ్జామ్ రాసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచు్ుచ్కన్నారంటే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? అని ప్రశ్నించారు. మెగా డీఎస్సీలో యువ నాయకుని వెంట నడిచిన వారికి ఉద్యోగాలు ఇచ్చిన విషయం అందరికీ తెలుసన్నారు. స్పోర్ట్స్ కోటా అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా పోస్టులు అమ్ముకున్నారని మండిపడ్డారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా పేకాటను కూడా స్పోర్ట్స్ కోటాలో కలిపి ఉద్యోగాలిచ్చారంటే ఎంత బరితెగించారో అర్థం చేసుకోవాలన్నారు. డీఎస్సీ ఎగ్జామిషన్లో పేకాట కూడా అనుమతిస్తారా అని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కేటగిరీలో అర్హులకు అందాల్సిన ఉద్యోగం అందకుండా వాళ్ల ఆధీనంలో ఉన్న కేటగిరీలకి వివిధ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వారికి కూడా ఉద్యోగాలు రాలేదన్నారు. ఉద్యోగాలు ఏ విధంగా అమ్ముకున్నారో ఆధారాలతో సహా ఆడియోలు బయటపెడితే ఎక్కడా అవకతవకలు జరగలేదంటున్నారని, ఇందులో సీఎం, విద్యా శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం వాటా ఎంతో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. అర్హులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం జాయింట్ సెక్రటరీ కోయి అంకారావు, కుంచాల శ్రీ విద్య, జజ్జర ఆనందరావు, కొల్లా భువనేశ్వరి, నియోజకవర్గ పరిశీలకుడు కేవీవీ ప్రసాద్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ కల్లి అంజనీ ప్రసాద్‌రెడ్డి, ఈదా శ్రీనివాసరెడ్డి, జడా విజయ్‌కుమార్, మండల కన్వీనర్లు గుజ్జుల జగన్మోహన్రెడ్డి, పాలపర్తి శ్రీధర్, ప్రశాంత్‌రెడ్డి, మధుబాబు, మట్టపూడి బాజీ వలి, రావిపాటి కాశీదేవి, స్వాతి, ఇస్తర్ల వెంకట్రావు, అధ్యక్షుడు రాజశేఖర్, జక్కుల బ్రహ్మయ్య, మురహరి యాదవ్, కనమర్లపూడి శ్రీనివాసరావులు డీఎస్సీ అక్రమాల గురించి ప్రసంగించారు. తక్షణమే విద్యాశాక మంత్రి అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ విజయసునీత మార్కాపురం టౌన్: వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యలపై మార్కాపురం కలెక్టరేట్ ఎం విజయసునీత గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వెలుగొండ ప్రాజెక్ట్ ఎస్ఈ అబూద్ ఆలీ, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు వెంకట శివరామిరెడ్డి, అజయ్‌కుమార్, ముంపు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కంభం: రైలు కిందపడి మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానిక కంభం రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..కంభంలోని వాసవీ స్కూల్ సమీపంలో నివాసముంటున్న చాట్ల క్లైమ్(23) గత కొంత కాలంగా మతి స్థిమితం సక్రమంగా లేకపోవడంతో వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం నంద్యాల వైపు వెళ్లే గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల, మొండెం వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో నగర విద్యార్థిని గుంటూరి పూజిత సత్తా చాటింది. రెండు రోజుల కిందట విడులైన సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో ఆమె ఆలిండియా 8వ ర్యాంకు సాధించింది. పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన గుంటూరి పూజిత నగరంలోనే ఉంటూ సీఎంఈ విద్యనభ్యసిస్తోంది. సీఎంఏ ఫౌండేషన్‌లో సైతం ఆలిండియా 16వ ర్యాంకు సాధించిన ఆమె, ఇంటర్‌లోనూ సత్తా చాటడంతో పలువురు అభినందనలు తెలిపారు. ఒంగోలు టౌన్: ఒంగోలు రైల్వేస్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మరణించాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... ఒంగోలు– కొత్తపట్నం ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద రైలు ఢీకొనడంతో సుమారు 55 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు లభ్యం కాలేదు. ఛామన ఛాయ కలిగిన, 5.5 అడుగుల ఎత్తు ఉన్నాడు. లైట్ బిస్కట్ కలర్ చొక్కా, నలుపు రంగు ప్రింటెడ్ లుంగీ ధరించి ఉన్నాడు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీరాం తెలిపారు. లింగసముద్రం: మహిళను వేధించిన కేసులో వ్యక్తికి ఏడాది జైలుశిక్ష, రూ.3,,500 జరిమానా విధించినట్లు ఎస్సై రాంబాబు తెలిపారు. వివరాల్లోకి వెళితే..అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మహిళను ఆమె ఇంటి ముందు ఉన్న చింత జగదీష్ అసభ్యకరంగా మాట్లాడి దుర్భాషలాడటంతో 2019 నవంబర్‌లో లింగసముద్రం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కందుకూరు కోర్టులో కేసు విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో జగదీష్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.3,500 జరిమానా విధించారు. జరిమానా కట్టలేని పక్షంలో మరూ మూడు నెలల జైలుశిక్ష ఉంటుందని జడ్జి తీర్పు ఇచ్చారు. ● సచివాలయ ఉద్యోగి మృతి త్రిపురాంతకం (యర్రగొండపాలెం): పట్టుమని మూడు పదుల వయసు నిండకముందే గుండెపోటుతో ఓ సచివాలయ ఉద్యోగి మృతి చెందారు. వివరాలు.. త్రిపురాంతకం మండలంలోని దూపాడు సచివాలయం–2లో డి.గంగాధర్ (27) డిజిటల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్కాపురంలో నివాసం ఉండే ఆయన రోజూ మాదిరిగానే గురువారం విధులకు హాజరయ్యేందుకు బస్సులో దూపాడు వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అదే బస్సులో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చేరుకుని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో, మార్కాపురంలో ఉన్న తన తమ్ముడికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అక్రమాలు
ఒంగోలు టౌన్: ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఆ అసోసియేషన్ కమిటీ సభ్యుడు నాగభూషుని రాధాకృష్ణ ఆరోపించారు. స్థానిక సంతపేటలోని ఆయన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కమిటీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3న నామినేషన్లు స్వీకరిస్తామని ప్రకటించారని, అయితే జిల్లా కార్యదర్శిగా పోటీ చేసేందుకు వెళ్లిన తనను నామినేషన్ వేయనివ్వకుండానే అడ్డుకున్నారని మండిపడ్డారు. సభ్యత్వం కొనసాగడం లేదంటూ కనీసం పత్రాలు కూడా తీసుకోకుండానే తిరస్కరించడం అన్యాయమన్నారు. నిబంధనల ప్రకారం అభ్యర్థి నామినేషన్ వేసిన తర్వాత స్క్రూటినీలో పరిశీలించి తిరస్కరించాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ బైలాలో సభ్యత్వ రుసుము రూ.200 అని రాసుకుని, వాస్తవానికి రూ.500 వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నామినేషన్ ఫీజు కింద ఏకంగా రూ.10 వేలు చెల్లించాలని చెప్పడాన్ని తనతో పాటు మరికొందరు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. అసోసియేషన్ కార్యదర్శి వేమూరి సుబ్బారావు రాజీనామా చేసిన తర్వాత కొత్త కార్యదర్శిని ఎన్నుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా అడ్హాక్ కమిటీని నియమించారని తప్పుబట్టారు. కొందరు నాయకులు వరుసగా మూడు, ఐదు పర్యాయాలుగా వివిధ పదవుల్లో పాతుకుపోయి ఇతరులకు అవకాశం ఇవ్వకుండా గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని విమర్శించారు. ఇదేంటని ప్రశ్నిస్తే శ్రీదిక్కున్న చోట చెప్పుకోశ్రీ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, ఇలాంటి కమిటీ వ్యవహారశైలితో ఫార్మసీ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, కమిటీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఫార్మాసిస్టులు వేమూరి సుబ్బారావు, పూర్ణచంద్రరావు, రాజగోపాల్, రమేష్, భాను తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ వేయకుండానే తిరస్కరించారు సభ్యత్వ రుసుము, నామినేషన్ ఫీజుల పేరిట దోపిడీ నిబంధనలకు విరుద్ధంగా అడ్హాక్ కమిటీల ఏర్పాటు అసోసియేషన్ కమిటీ సభ్యుడు నాగభూషుని రాధాకృష్ణ ఆరోపణ -
రోటావేటర్‌లో పడిన రైతు
● రెండు కాళ్లు తెగిపోయిన వైనం అద్దంకి: రోటావేటర్‌లో పడి ప్రమాదవశాత్తు ఓ రైతు తన రెండు కాళ్లను కోల్పోయిన హృదయవిదారక ఘటన అద్దంకి మండలంలోని కలవకూరులో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టిబోయిన వెంకట్రావు తన పొలంలో రోటావేటర్తో దుక్కి దున్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ట్రాక్టర్ మీద కూర్చుని ఉండగా, ప్రమాదవశాత్తు జారి కింద పడటంతో రెండు కాళ్లు రోటావేటర్ బ్లేడ్లలో పడి తెగిపోయాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. కష్టపడి పనిచేసుకునే రైతుకు ఇలాంటి దుస్థితి పట్టడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
రొయ్యల మేత బ్యాగ్‌ల చోరీ ముఠా అరెస్టు
టంగుటూరు: రొయ్యల చెరువుల వద్ద రొయ్యల మేత బ్యాగులను దొంగలించి ఆటోలో తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్సై ఫణిభూషణ్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ ఉదయం 6 గంటలకు మండలంలోని కేసుపాలెం గ్రామంలో దిలీప్‌కు చెందిన రొయ్యల చెరువు వద్ద 8 బస్తాల రొయ్యలు దొంగలించినట్లు బాధితులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఎస్ఐ ఫణి భూషణ్ గురువారం ఆటోలో వెళుతున్న నలుగురు నిందితులు వాయిల స్వామి, డిబయ గమాంగో ఎలాష్ గమాంగో, షేక్ హరుణ్ రషీద్ అనే వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి 8 బస్తాల రొయ్యల మేతను స్వాధీనం చేసుకున్నారు. రాజేష్ అనే నిందితుడిని పట్టుకోవాల్సి ఉందన్నారు. నిందితుల నుంచి ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను సింగరాయకొండ కోర్టులో హాజరుపరుచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఒంగోలు టౌన్: ఇంటి నుంచి వెళ్లిన ఒక యువకుడు ఐదు రోజుల తరువాత వాగులో శవమై తేలాడు. పోలీసుల కథనం ప్రకారం.. త్రోవగుంటకు చెందిన అరుణ్ కుమార్ (28) రాడ్ బెండింగ్ పనిచేస్తుంటాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ దగ్గర నివసిస్తున్నాడు. అవివాహితుడైన అరుణ్ కుమార్ తరుచుగా మద్యం తాగి తిరుగుతుంటాడు. ఆదివారం ఉదయం నుంచి కనిపించక పోయే సరికి కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలోని ముదిగొండ వాగులో శవమై తేలాడు. ఆత్మహత్యా, ప్రమాదమా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పీఎల్పీ యాదవ్
మార్కాపురం: వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మార్కాపురం పట్టణానికి చెందిన న్యాయవాది పిన్నిక లక్ష్మీప్రసాద్ యాదవ్ (పీఎల్పీ యాదవ్), ఐటీ వింగ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కె.వి.నారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు దక్కడం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. తమ నియామకానికి సహకరించిన మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు పీఎల్పీ యాదవ్, నారాయణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. త్రిపురాంతకం: రాష్ట్ర స్థాయి పారా ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన దివ్యాంగ విద్యార్థిని డోల అనూషకు త్రిపురాంతకంలోని ఎస్బీఐ సిబ్బంది గురువారం చేయూత అందించారు. పుట్టుకతోనే అంధురాలైన అనూష.. ఆటలతో పాటు చదువుపై శ్రద్ధ చూపుతుండటంతో మెరుగైన విద్య కోసం ఐఈఆర్టీ సిబ్బంది బాలవిజయ, నజీర్ చొరవ తీసుకున్నారు. ఆమెను ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలంలోని హిల్ ప్యారడైజ్ స్కూల్లో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ అలవాల శ్రీనివాసరావు, డిప్యూటీ మేనేజర్ శ్రీనుబాబు, క్యాష్ ఆఫీసర్ శివారెడ్డి.. ఆ విద్యార్థినికి అవసరమైన బ్యాగులు, బెడ్షీట్లు, నిత్యావసర వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవోలు కె.మల్లికార్జున నాయక్, తేలుకుట్ల రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
పసుపుగల్లులో 4 ట్రాన్స్ఫార్మర్ల చోరీ
ముండ్లమూరు: మండలంలోని పసుపుగల్లు గ్రామ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల చోరీ స్థానిక రైతులను తీవ్ర ఆందళనకు గురిచేస్తోంది. బుధవారం తెల్లవారుజామున నాలుగు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. గుర్తుతెలియని దుండగులు పొలాల్లో దిమ్మెల పైనున్న ట్రాన్స్ఫార్మర్లను కిందకు దించి, వాటిని ధ్వంసం చేసి లోపలి రాగితీగను అపహరించుకుపోయారు. గ్రామానికి చెందిన రైతులు ఏరువ సుబ్బారెడ్డికి చెందిన 16 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు.. కోటా శ్రీనివాసరెడ్డి, యారంకోట శ్రీనివాస్‌రెడ్డి, కాటం తిమ్మారెడ్డికి చెందిన 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేశారు. ఉదయాన్నే రైతులు పొలాలకు వెళ్లి చూడగా ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడంతో చుట్టుపక్కల వెతకగా అవి ధ్వంసమై కనిపించాయి. వారు గ్రామంలోకి వచ్చి విషయం చెప్పడంతో, మిగతా రైతులు కూడా తమ ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి చూసుకునేందుకు పొలాలకు పరుగులు తీశారు. చోరీ విషయాన్ని గ్రామ లైన్మెన్ సోమ్లానాయక్‌కు తెలపగా, ఆయన విద్యుత్ శాఖ ఏఈ అంకబాబుకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు గస్తీ.. అదే సమయంలో చోరీ! బుధవారం రాత్రి దర్శి సీఐ వై.రామారావు తమ సిబ్బందితో కలిసి చింతలపూడి పొలాల వైపు గస్తీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కొందరు రైతులు వెళ్లి, దక్షిణం వైపు పొలాల్లో నాలుగు ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురైన విషయాన్ని సీఐ దృష్టికి తీసుకెళ్లారు. -
హౌసింగ్ సొసైటీ పేరుతో లూటీ
పొదిలి: 80 ఏళ్ల క్రితం సామాజిక దృక్పథంతో ఏర్పాటైన సొసైటీ..నేడు బెదిరించి వసూళ్లకు పాల్పడుతోంది. వివరాల్లోకి వెళితే..1951లో వేమూరి విశ్వనాథశర్మ అధ్యక్షునిగా పొదిలి రూరల్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీగా ఏర్పాటు రిజిష్టర్ చేయించారు. ఆ సమయంలో సొసైటీ పేరుతో 87 ఎకరాలు సేకరించారు. ఈ 87 ఎకరాల్లో సామాజిక అవసరాలకు కొంత మినహాయించి 347 ప్లాట్లు వేశారు. అప్పట్లో ఒక్కో ప్లాట్‌కు రూ.300 ధర నిర్ణయించి 267 మంది సభ్యులకు విక్రయించారు. స్థలాలను కొనుగోలు చేసిన సభ్యులు కొంత మంది గృహాలు నిర్మించుకొని నివాసముంటున్నారు. మరికొంత మంది స్థలాలను ఇతరులకు అమ్ముకున్నారు. 1969లోనే సొసైటీ కార్యక్రమాలు నిలిచిపోయినట్లుగా చెబుతున్నారు. కప్పం కట్టాలంటూ బెదిరింపు 1969లోనే సొసైటీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అయితే ఆరేడు సంవత్సరాలుగా మళ్లీ సొసైటీ వ్యవహారాలు తెరపైకి వచ్చాయి. కడప నుంచి వచ్చినట్లుగా చెబుతున్న వ్యక్తి, అప్పటి సొసైటీ చైర్మన్ ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాలంటే తమకు కప్పం కట్టాల్సిందేనని కొంత సొమ్ము వసూలు చేసుకున్నారు. కొంత మంది వారు అడిగినంత ముట్టచెప్పి రిజిష్టర్ చేయించుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే వసూళ్ల పర్వం కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ సొసైటీ వ్యవహారాలు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు సొసైటీ నిర్వహిస్తున్నామని, త్రీ మెన్ కమిటీ సొసైటీ నిర్వహణ చూస్తోందని ఉత్తర్వులు చూపిస్తున్నారు. దీంతో ఎప్పుడో దశాబ్దాల నాడు స్థలాలు కొనుగోలు చేసిన వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. నోటీసుల పేరుతో భయభ్రాంతులు ఇటీవల కొంత మంది సొసైటీ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారి వద్దకు వచ్చి ‘ సొసైటీ స్థలం నీ పేరున ఉందని, లేదా అందులో ఉన్న భవనం మీ పేరున ఉందని, సొసైటీ రిజిష్ట్రర్ చేస్తేనే చెల్లుతుందని, అలా చేయించుకోకపోతే ఇతరులకు కేటాయిస్తామని పేర్కొంటూ సొసైటీ పేరున నోటీసులు ఇస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఇప్పటికే 9 మందికి నోటీసులు ఇచ్చారు. వారం పది రోజుల వ్యవధిలో కొన్ని స్థలాలను ఇతరులకు సొసైటీ పేరున రిజిష్టర్ చేయించారు. దీంతో దశాబ్దాల నాడు కొనుగోలు చేసి అనుభవం, ఆధీనంలో ఉన్న సభ్యులకు ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నారు. ఈ విషయమై సొసైటీ ప్రస్తుత చైర్మన్ మీగడ ఈశ్వరరెడ్డి వివరణ ఇస్తూ అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవని చెప్పారు. ఒక్కొక్కరికి ఐదారు ప్లాట్లు ఉన్నాయని, అవి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సొసైటీ బాడీ రద్దు కాలేదని, కొనసాగుతూనే వస్తుందన్నారు. ఇప్పుడు త్రీ మెన్ కమిటీ కార్యకలాపాలను చూస్తుందని చెప్పారు. అక్రమ నిర్మాణాలపై కమిటీ ఫిర్యాదు చేస్తుందన్నారు. ఆక్రమణదారులకు, బావులు పూడ్చి భవనాలు నిర్మించిన వారికి ఇప్పటికే పలు పర్యాయాలు నోటీసులు పంపించినా సమాధానం రాలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రే న్యాయం చేయాలి జూనియర్ కాలేజీ రోడ్డులోని మా స్థలంలోకి పాశం రాజు అనే వ్యక్తి చదును చేసేందుకు రాగా అడ్డుకున్నాం. ఈశ్వరరెడ్డి ఈ స్థలం రాసిచ్చాడని, మీకు చెల్లదని దౌర్జన్యానికి దిగారు. పోలీసులను పిలిచి మమ్మల్ని స్టేషన్‌కు రావాలని ఒత్తిడి చేయాలని చూశారు. కానీ ఆ స్థలం మాది కావడంతో మేం ఎక్కడకు రావాల్సిన అవసరం లేదని చెప్పాం. ఏ విధంగానైనా స్థలం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలి. – చీతిరాల శేషగిరిరావు, నాగలక్ష్మి, బాధితులు -
పెద్దపులి మృతిపై హైపవర్ కమిటీ విచారణ
రాచర్ల: నల్లమల అటవీ ప్రాంతంలో (నాగార్జునసాగర్ృశ్రీశైలం టైగర్ రిజర్వ్) ఇటీవల జరిగిన పెద్దపులి మృతిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ బుధవారం విచారణ చేపట్టింది. విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి, ప్రభుత్వ అటవీ సలహాదారు పి.మల్లికార్జునరావు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి రాహుల్‌పాండే, వైల్డ్‌లైఫ్ సభ్యుడు షేక్ ఇమ్రాన్ సిద్ధిఖీ బృందం రాచర్ల మండలంలోని జేపీ చెరువు పరిధిలో పర్యటించింది. తెట్టుమడుగులో పులి కళేబరం లభ్యమైన ప్రదేశంతో పాటు లోతువాగు, పులిని చంపినట్లుగా భావిస్తున్న ప్రాంతాలను నిశితంగా పరిశీలించింది. కాగా, ఈ కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితుల నుంచి అధికారులు ఏడు పులి గోర్లు, ఓ నాటు తుపాకీ, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. విచారణ ఆధారాలతో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నారు. కార్యక్రమంలో మార్కాపురం, గిద్దలూరు డీడీపీటీ( డిప్యూటి డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్)లు అబ్దుల్ రవూఫ్, నిషాకుమారి, రేంజ్ ఆఫీసర్ వీరస్వామి, డీఆర్వో వంశీకృష్ణకుమారి, ఫారెస్టు బీట్ ఆఫీసర్ కనకరావు తదితరులు పాల్గొన్నారు. -
ఒంగోలులో రెచ్చిపోయిన దొంగలు
● ఆంధ్రకేసరి నగర్, సమతానగర్‌లో రెండు చోరీలు ● మొత్తం 50 సవర్ల బంగారం, నగదు అపహరణ ఒంగోలు టౌన్: జిల్లా కేంద్రమైన ఒంగోలులో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. బుధవారం రెండు వేర్వేరు ఇళ్లలో తాళాలు పగులగొట్టి భారీగా బంగారం, నగదు దోచుకెళ్లి ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఆంధ్రకేసరి నగర్లో నివాసం ఉండే ఆలపాటి సత్యానందరావు, సుజాత దంపతులు కర్నూలు రోడ్డులో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. మధ్యాహ్నం సుజాత తిరిగి రాగా, మెట్లపై ఓ అపరిచితుడు కనిపించి పైనున్న బ్యాచిలర్ల వద్దకు వచ్చానని చెప్పి వెళ్లిపోయాడు. ఆమె పైకి వెళ్లి చూడగా ఇంటి తాళాలతో పాటు లోపల బీరువా పగలగొట్టి ఉంది. అందులోని 30 సవర్ల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. లైన్మెన్ ఇంట్లో 20 సవర్ల చోరీ.. ఎస్పీ కార్యాలయం, తాలూకా, రూరల్ పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంలోని సమతానగర్‌లో మరో దొంగతనం జరిగింది. రెండో వీధిలో నివాసం ఉండే విద్యుత్ లైన్మెన్ నాగరాజు, ప్రైవేట్ నర్సుగా పనిచేస్తున్న ఆయన భార్య ఎప్పటిలాగే ఉదయం విధులకు వెళ్లారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బీరువాలోని 20 సవర్ల బంగారం, నగదును దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు. కురిచేడు: మండలంలోని కల్లూరు గ్రామ పొలాల్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పొలాల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న గదిలో నేలపై పడుకుని ఉన్న మహిళ తలపై పెద్ద బండరాయితో మోది కిరాతకంగా చంపేశారు. స్థానికుల సమాచారంతో బుధవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దొనకొండ మండలం దేశిరెడ్డిపల్లి గ్రామస్తుల వివరాల ప్రకారం.. దొనకొండ మండలం చందవరం గ్రామానికి చెందిన కోటినేని రమణ(25)కు కనిగిరి ప్రాంతం పాపినేనిపాలేనికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కలహాలు ఉండటంతో రమణ పుట్టింటికి వచ్చేసింది. అయితే వారం క్రితం భర్త చందవరం వచ్చి రమణను తనవెంట తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆమె కల్లూరు పొలాల్లో విగతజీవిగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేసి ఉంటాడా? లేక మరేమైనా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
9న అండర్–14 ఉషు జట్టు ఎంపిక
ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లా ఉషు అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–14 జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఈనెల 9న ఉదయం 10 గంటలకు ఒంగోలులోని మాంటిస్సోరి స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. 2012 జనవరి 1 నుంచి 2017 డిసెంబర్ 31 మధ్య జన్మించిన బాలురు, బాలికలు అర్హులని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న వారు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ ఫొటోలు, గత క్రీడా సర్టిఫికెట్లతో ఉదయం 9.30 గంటలకల్లా హాజరు కావాలని స్పష్టం చేశారు. వివరాలకు 90108 61207, 98484 99330ను సంప్రదించాలని సూచించారు. తాళ్లూరు: మోటారు ఫ్యూజులు వేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ విషాద ఘటన మండలంలోని తురకపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. చంద్రగిరి వెంకటరెడ్డి (53) ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. మోటారు వేయగా నీరు రాకపోవడంతో కరెంట్ లేదని గమనించాడు. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి ఫ్యూజులు వేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. వెంకటరెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాడేపల్లి రూరల్: తాడేపల్లి కృష్ణాకెనాల్ పరిధిలో గుంటూరు వెళ్లే రైల్వే మార్గంలో ఓ వ్యక్తి మృతదేహం ఉందనే సమాచారంతో బుధవారం తాడేపల్లి కృష్ణాకెనాల్ జీఆర్పీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ట్రాక్‌పై రెండు ముక్కలుగా పడిఉన్న మృతదేహాన్ని పక్కకు తీశారు. ఏఎస్ఐ రత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం రైల్వేట్రాక్‌పై 50 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ వ్యక్తి రెండు ముక్కలుగా పడి ఉన్నాడని, అతని జేబులో వెతగ్గా ఆధార్ కార్డు లభించిందని, అయితే ఆధార్‌కార్డులో ఉన్న వ్యక్తి ఇతను ఒకటేనా అన్నది అనుమానంగా ఉందని తెలిపారు. ఆధార్‌కార్డులో వీర్ల గురవయ్య, ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం, పోలేపల్లి గ్రామం అని ఉందని, ఆ గ్రామంలో విచారణ చేస్తే తప్ప ఆధార్ కార్డులో ఉన్న వ్యక్తి, మృతి చెందిన వ్యక్తి ఒక్కరా కాదా అనేవిషయం తెలియదన్నారు. మృతదేహాన్ని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో గుంటూరు రైల్వే ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. మేదరమెట్ల: మండల పరిధిలోని తిమ్మనపాలెంలో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. ఎస్ఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో తెల్లబాటి రాఘవ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన భార్య ఉద్యోగిని కావడంతో ఆమెను వదిలిపెట్టేందుకు రాఘవ ఒంగోలు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. లోపల బీరువా తెరిచి, వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది. ఎంత నగదు, ఆభరణాలు చోరీకి గురయ్యాయనే వివరాలపై బాధితుల నుంచి సమాచారం సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● బీరు సీసాలతో పరస్పర దాడులు ● సంతనూతలపాడు శివారులో ఘటన ఒంగోలు టౌన్: మద్యం మత్తులో రౌడీ మూకలు వీరంగం సృష్టించాయి. ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడి చేసుకున్న ఘటన సంతనూతలపాడు సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా ఉన్న మన్నే రామాంజనేయులు, వన్‌టౌన్ పరిధిలో రౌడీషీటర్ అయిన కొత్త హరీష్ వర్గీయులు మంగళవారం రాత్రి సంతనూతలపాడు నుంచి ఒంగోలు వచ్చే మార్గంలో కోల్డ్ స్టోరేజీ వద్ద గల మద్యం దుకాణానికి చేరుకున్నారు. పీకలదాకా మద్యం తాగి వాగ్వాదానికి దిగారు. గొడవ ముదిరి ఒకరిపై మరొకరు మద్యం సీసాలతో దాడులు చేసుకోవడంతో రెస్టారెంట్‌లోని జనం పరుగులు తీశారు. ఈ దాడిలో కొత్త హరీష్‌కు గాయాలు కాగా, జీజీహెచ్‌కు తరలించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం హరీష్ ఆస్పత్రి నుంచి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. హరీష్ ఫిర్యాదు మేరకు ఒంగోలుకు చెందిన మన్నే రామాంజనేయులు, అభి నాయుడు, మనో, నితిన్‌లపై సంతనూతలపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రామాంజనేయులు ముఠా కోసం గాలిస్తున్నామని, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అజయ్‌బాబు తెలిపారు. -
చాగల్లులో పోలీస్ పికెట్
● ఆధారాలు సేకరించిన ఆర్ఎఫ్ఎస్ఎల్ టీమ్ ఉలవపాడు: మండలంలోని చాగల్లులో సోమవారం రాత్రి జరిగిన మెండా కోటయ్య హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. మంగళవారం గుంటూరు నుంచి వచ్చిన ఆర్ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ బృందం కందుకూరు సీఐ అన్వర్ బాషా, ఎస్ఐ సుబ్బారావు సమక్షంలో ఘటనా స్థలాన్ని పరిశీలించింది. రక్తపు మరకలు, అడుగుజాడలను సేకరించింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, పాతకక్షలు భగ్గుమనకుండా ముందస్తుగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అదుపులో ఉన్న నిందితుడు అభిలాష్‌ను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ● పరిశ్రమల యజమానులతో కలెక్టర్ రాజాబాబు మద్దిపాడు: యువతలో నైపుణ్యాభివృద్ధికి ఫ్యాక్టరీల యాజమాన్యాలు సహకరించి, తగిన శిక్షణ ఇప్పించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. బుధవారం మండల పరిధిలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో పలు ఫ్యాక్టరీలను ఆయన పరిశీలించారు. అనంతరం ఏపీఐఐసీ కార్యాలయంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న వారికి ఉపాధి కల్పించాలని, నైపుణ్య శిక్షణ సంస్థల ద్వారా కామన్ ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశ్రామికవేత్తలు ప్రస్తావించిన స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ, తాగునీరు, పోలీస్ పెట్రోలింగ్ సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తామన్నారు. ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ ఏర్పాటు, గ్రీనరీ పెంపు, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు.. ఏపీఐఐసీకి వెళ్లే దారిలో హైవేపై లీకై న పైప్‌లైన్‌ను కలెక్టర్ పరిశీలించారు. హైవే అధికారుల అనుమతితో పైపులు మారుస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బీవీ నాగేశ్వరరావు తెలపగా.. హైవే అధికారులతో తాను మాట్లాడతానని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పారిశ్రామిక అధికారి శ్రీనివాసరావు, ఏపీఐఐడీసీ ఎస్ఎం మదన్మోహన్, ఆర్డీఓ చంద్రశేఖరనాయుడు, డీపీఓ అనుపమ, కార్మిక శాఖ అధికారి గౌస్‌బాషా, పలువురు పారిశ్రామిక వేత్తలు అధికారులు పాల్గొన్నారు. -
రక్తమోడిన రహదారి
హనుమంతునిపాడు: కంభం–కనిగిరి రహదారిపై హనుమంతునిపాటు మండల పరిధిలోని హాజీపురం అడ్డరోడ్డు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ప్యాసింజర్ ఆటోలో సుమారు 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరికి చెందిన గాయత్రి పాల ఆటో పాలు పోసి హాజీపురం వైపు నుంచి కనిగిరి వస్తోంది. అదే సమయంలో కనిగిరి నుంచి గుడిపాటిపల్లి వైపు వెళ్తున్న ప్యాసింజర్ ఆటో హాజీపురం అడ్డరోడ్డు క్రాసింగ్ వద్దకు రాగానే, ఈ రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన రామ్ లఖన్ సాహా అనే యువకుడు దుర్మరణం చెందాడు. చీమకుర్తిలో ఉంటున్న అతను దాసళ్లపల్లి గ్రామంలోని రైతు రాయి మొరలి వద్ద డోజర్ మెకానిక్, పొక్లెయిన్ ఆపరేటర్‌గా పనిచేసేందుకు ప్యాసింజర్ ఆటోలో వెళ్తున్నాడు. ప్రమాద ధాటికి లఖన్ సాహా కాలు పూర్తిగా తెగిపోయి పాల ఆటో ట్రాలీకి వేలాడింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన కోమాలోకి వెళ్లాడు. అతడిని 108 వాహనంలో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సాయంత్రం 6 గంటల సమయంలో మృతి చెందినట్లు ఎస్సై రాజ్‌కుమార్ వెల్లడించారు. క్షతగాత్రులు వీరే.. ఈ ప్రమాదంలో చిన్నమల్లవరం గ్రామానికి చెందిన కోనంకి నాగేశ్, గుడిపాటిపల్లికి చెందిన కొండెపోగు సుదీప్, కొండెపోగు మిరియమ్మ, సందీప్, రాముకు చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దాసళ్లపల్లికి చెందిన చింతపూడి లక్ష్మి, పి.వెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులందరినీ 108 వాహనం ద్వారా కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు. హాజీపురం అడ్డరోడ్డు వద్ద పాల ఆటో, ప్యాసింజర్ ఆటోల ఢీ ప్రమాదంలో బీహార్‌కు చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ మృతి మరో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు -
సవాల్ రాజాగా మారారు..
వసూల్ రాజా..కందుకూరు రూరల్: ‘కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వసూళ్ల రాజా.. సవాల్ రాజాగా మారినట్లు కనిపిస్తుందని’ వైఎస్సార్ సీపీ కందుకూరు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఎద్దేవా చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా దోపిడీ చేసిన డబ్బుతో ఎన్నికలకు వెళదామని ఎమ్మెల్యే సవాల్ చేస్తున్నారన్నారు. దాదాపు ఎనిమిది గ్రామాల ప్రజలు కోరిక మేరకు ఆ గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి వారికి రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి అందించాలన్నారు. ఆ గ్రామాలకు మంచి చేస్తే సవాల్‌ను స్వీకరిస్తానని పేర్కొన్నారు. మున్సిపాలిటీకి కనెక్టివిటీ ఉన్న గ్రామాలను వదిలేసి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కలుపుతూ ఆ గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండా మీ రాజకీయ ప్రయోజనాల కోసం సవాలు చేస్తున్నట్టు ఉందే తప్ప మరొకటి కనిపించడం లేదన్నారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించి బడుగు బలహీన వర్గాలు నిరుపేదలకు వైద్యం అందకుండా చేసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంచుతున్నామని డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఈ రెండేళ్లలో పింఛన్లు పంచుతూ ఫొటోలు దిగడం, ప్రెస్మీట్లు పెట్టి ప్రతిపక్షాన్ని విమర్శించడం తప్ప ఏం సాధించారని ప్రశ్నించారు. రోడ్లు వేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రధాన రహదారి వదిలివేసి ఎక్కడో సందుల్లో గొందుల్లో సైడ్ కాలువల్లో బిట్లు బిట్లుగా రోడ్లు వేస్తూ అదే అభివృద్ధి అంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. దూరంగా ఉన్న గ్రామాల విలీనం దారుణం.. కందుకూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ దురుద్దేశంతోనే దూరంగా ఉన్న ప్రాంతాలను స్థానిక ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఆ గ్రామాలను మున్సిపాలిటీలో కలిపి అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారన్నారు. గ్రామస్తులు మాకు మున్సిపాలిటీ వద్దని, పంచాయతీలు గానే ఉంచాలని కోరుకుంటున్నా తెలుగుదేశం పార్టీ వారి రాజకీయ అవసరాల కోసం దూరంగా ఉన్న గ్రామాలను విలీనం చేస్తున్నారన్నారు. ఆనందపురం, శామీరపాలెం, చుట్టుగుంట, దివివారిపాలెం, గనిగుంట పంచాయతీలుగా ఏర్పడి ఉంటే ఆ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. మున్సిపాలిటీకి ఎంతో దూరంగా ఉన్న గ్రామాలతో ఆర్థికభారం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. స్థానిక ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా వారి రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడటం సరైనది కాదని హితవు పలికారు. మీ రాజకీయ ఉద్దేశాలతో దాదాపు ఎనిమిది గ్రామాల ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులు పాలు చేయడం సరైనది కాదన్నారు. ఇప్పటికై నా ఆ గ్రామాలను పంచాయతీలుగా మార్చి అనంతరం మీ మున్సిపాలిటీల్లో నిరభ్యంతరంగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని గ్రామస్తులు అంటున్నారని పేర్కొన్నారు. ఆనందపురం, శామీరపాలెం, గనిగుంట గ్రామాలను మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ల దూరంగా ఉన్నా అర్బన్‌లో కలపడం వల్ల ఉపాధి హామీ పథకాన్ని గ్రామస్తులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. దీని వల్ల స్థానికంగా ఉండే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఉపాధికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలు గౌరవించాలి ఎన్నికలకు తామూ ఎప్పుడూ సిద్ధమేనని బుర్రా స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక గ్రామాల ప్రజలు మున్సిపాలిటీ వద్దు మా గ్రామాలను పంచాయతీలుగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ఆపే వరకు పోరాటం సాగిస్తూనే ఉంటామన్నారు. భూములు ఇచ్చిన రైతులు, ఇళ్లు కోల్పోయిన ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. రామాయపట్నం పోర్ట్ ప్రైవేటీకరణ ఆపమని డిమాండ్ చేస్తే కేసులు పెట్టించిన రెడ్ బుక్ రాజ్యాంగ బుద్ధి నీదని ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ పోరాడుతుంటే డైవర్ట్ చేయడానికి ఈ సవాల్ చేస్తున్నావు తప్ప కందుకూరు మున్సిపాలిటీపై ప్రేమ లేదన్నారు. పోలీసులను, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి కూటమి ప్రభుత్వం రామాయపట్నం పోర్టును ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారన్నారు. గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు రోడ్డు మీదకు వస్తే వారికి సంఘీభావంగా వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు పెట్టి వేధించడం రెడ్‌బుక్ రాజ్యాంగం కాదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో రేషన్ బియ్యం, ఇసుక, మద్యం, మట్టి మాఫియా, రోడ్డు నిర్మాణ పనులు నిర్మాణంలో జరుగుతున్న అవినీతి గురించి సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో డీఎస్సీ రాసిన నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయాలను ప్రశ్నిస్తూ రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారన్నారు. ఆ యువతకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఉండి సీబీఐతో విచారణ చేయాలని అడుగుతున్నామన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, కందుకూరు అధ్యక్షుడు ఈదర రమేష్, జిల్లా అధికార ప్రతినిధులు ముప్పవరపు కిషోర్, బద్దిపూడి జయరావు, కందుకూరు నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు నలమోతు చంద్రమౌళి, పట్టణ ఉపాధ్యక్షుడు తల్లపనేని గోపి, ముప్పరాజు సుభాని, మందలపు మహేష్, ముప్పరాజు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మార్కాపురం: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మార్కాపురం ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఓఎస్డీ నవజ్యోత్ మిశ్రా, డీఎస్పీ నాగరాజుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మిషన్ హరితాంధ్ర కార్యక్రమంలో భాగంగా రెండు జిల్లాల్లో ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు విద్యార్థులు యువత ఉద్యోగులు స్వచ్ఛందంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. వాయు కాలుష్య నివారణకు మొక్కల పెంపకం ఉపయోగపడుతుందన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్, పట్టణ రూరల్ ఎస్సైలు విశ్వనాథరెడ్డి, వేమన సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 10 వ తేదీన జైలు భరో కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బుధవారం సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు, రైతు, కౌలు రైతు సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం ద్వారా దేశీయ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సవరణల పేరుతో జీ రాంజీ పథకాన్ని తీసుకొచ్చిందని, దీని వల్ల గ్రామీణ నిరుపేద, మధ్య తరగతి ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని, ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం తగదని డిమాండ్ చేస్తూ ఈ నెల 10 వ తేదిన క్విట్ ఇండియాడేని పురస్కరించుకొని కేంద్ర కమిటీ పిలుపు మేరకు జైలుభరో చేయనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు, కందుకూరు, అద్దంకి రెవెన్యూ డివిజన్ కేంద్రాల వద్ద సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లో జైలుభరో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో కాలం సుబ్బారావు, పమిడి వెంకటరావు, జజ్జూరి జయంతిబాబు, శ్రీకాంత్, బెజవాడ శ్రీను, నెరుసుల వెంకటేశ్వర్లు, వడ్డే హనుమారెడ్డి, టంగుటూరి ప్రభాకర్, బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు సిటీ: రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి వంటి సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాలతో ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో ఈ దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. తొలిరోజు 6వ తేదీ ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో, 7వ తేదీ యువజన విభాగం ఆధ్వర్యంలో, 8వ తేదీ ఒంగోలు నగర పార్టీ ఆధ్వర్యంలో, 9వ తేదీ కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ దీక్షలకు చుండూరి రవిబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, వై.వెంకటేశ్వర్లు నాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజా ఉద్యమకారులు, వక్తలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, నిరుద్యోగ యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం ప్రకటించాలని చుండూరి రవిబాబు కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. -
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ఒంగోలు సిటీ: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ఉద్యోగులు బదిలీలు, పదోన్నతులు, వేతనాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2004లో కేజీబీవీలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సాధారణ (జనరల్) బదిలీలు నిర్వహించకపోవడంతో పలువురు ఉద్యోగులు రెండు దశాబ్దాలుగా ఒకేచోటే విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండు నెలలుగా జీతాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు. గత మే 6న సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) కార్యాలయం బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ.. ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇతర శాఖల్లో బదిలీలు పూర్తయినా కేజీబీవీ ఉద్యోగుల విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రూ.6.20 కోట్ల వేతన బకాయిలు... ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 38 కేజీబీవీల్లో బోధన, బోధనేతర సిబ్బంది, క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లు, అకౌంటెంట్లు, సైట్ ఇంజినీర్లు, ఫిజియోథెరపిస్టులు, మెసెంజర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు తదితర విభాగాల్లో సుమారు 1,400 మంది పనిచేస్తున్నారు. వీరిలో 850 మందికిపైగా టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. మండల విద్యాశాఖ కార్యాలయాలు, పాఠశాలల్లో మరో 550 మందికిపైగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కేజీబీవీల్లో సీఆర్టీ, పీజీసీఆర్టీలకు నెలకు రూ.26,555, నాన్‌టీచింగ్ సిబ్బందికి రూ.7 వేల నుంచి రూ.17 వేల వరకు, ఇతర ఉద్యోగులకు రూ.23 వేల వరకు వేతనం అందుతోంది. వీరికి ప్రతి నెలా సుమారు రూ.3.10 కోట్ల మేర వేతనాలు చెల్లించాల్సి ఉండగా, రెండు నెలలుగా జీతాలు విడుదల కాకపోవడంతో మొత్తం రూ.6.20 కోట్ల బకాయిలు పేరుకుపోయినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. కుటుంబాల జీవనాధారం వేతనాలే కావడంతో రెండు నెలలుగా జీతాలు అందక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్, జూలై నెలల్లో పిల్లల స్కూల్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం ఖర్చులు, ఇంటి అద్దెలు, నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. పెరిగిన ధరలతో ఉన్న జీతాలే సరిపోవడం లేదని, ఇప్పుడు అవి కూడా ఆలస్యమవుతుండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని చెబుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. వేతనాల విడుదలలో జాప్యం వల్ల కుటుంబాల నిర్వహణ కష్టతరంగా మారుతోందని, ఇకపై ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కడుపు కాలుతోంది..కేజీబీవీలు, విద్యాశాఖ పరిధిలోని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సాధారణ విధులతో పాటు వివిధ సర్వేలు, యాప్‌ల నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. కేజీబీవీల్లో పనిచేసే సిబ్బందితో రాత్రి విధులు కూడా చేయిస్తున్నప్పటికీ, అందుకు తగిన వేతనం, ప్రోత్సాహం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
ముండ్లమూరు: మండలంలోని పెద్ద ఉల్లగల్లు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మోతుకూరి వంశీకృష్ణ(27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడి ఒంటిపై పలుచోట్ల గాయాలు ఉండటంతో ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుడి తల్లి పద్మావతి బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న వంశీకృష్ణ గత కొంతకాలంగా మానసిక స్థితి సరిలేక సతమతమవుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు వైజాగ్‌లోని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ఇటీవల స్వగ్రామం ఉల్లగల్లుకు చేరుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి అద్దంకి డిపోకు చెందిన బస్సు ఎక్కి కండక్టర్‌తో గొడవ పడ్డాడు. దీంతో కండక్టర్ బస్సును ముండ్లమూరు పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతలోనే వంశీకృష్ణ బస్సు అద్దాలు పగలగొట్టి, వైర్లు పీకేశాడు. దీంతో పోలీసులు వంశీకృష్ణను అదుపులోకి తీసుకుని స్టేషన్లో ఉంచి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తండ్రి సుబ్బారావు, కొందరు బంధువులు కలిసి బాడుగ కారులో వంశీకృష్ణను వైజాగ్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలో మంగళగిరి సమీపానికి చేరుకోగానే వంశీకృష్ణ మృతి చెందినట్లు తండ్రి సుబ్బారావు.. తన భార్య పద్మావతికి, బావమరిది సురేష్‌కు సమాచారం ఇచ్చారు. మృతిపై అనుమానాలు బుధవారం మృతదేహాన్ని ఉల్లగల్లుకు తీసుకురాగా.. వంశీకృష్ణ మెడ, ఒంటిపై పలుచోట్ల గాయాలు ఉండటాన్ని తల్లి పద్మావతి గమనించారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి సుబ్బారావు, బంధువులతో పాటు పోలీసులపైనా తమకు అనుమానాలు ఉన్నాయని మేనమామ సురేష్ ఆరోపించారు. తల్లి పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముందుగా దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చేస్తే తమకు న్యాయం జరగదని, ఒంగోలు జీజీహెచ్‌లో పోస్టుమార్టం చేయాలని మేనమామ, బంధువులు పట్టుబట్టారు. దీంతో మృతదేహాన్ని ఒంగోలుకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న వంశీకృష్ణ మంగళవారం రాత్రి బస్సులో వీరంగం సృష్టించడంతో పోలీసులకు అప్పగింత తండ్రి ఆధ్వర్యంలో వైజాగ్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి మృతుడి శరీరంపై గాయాలు.. భర్త, పోలీసులపై తల్లి, మేనమామల అనుమానం బంధువుల డిమాండ్‌తో ఒంగోలు జీజీహెచ్‌లో పోస్టుమార్టం -
డీఎస్సీ పక్కా స్కామ్
పొన్నలూరు: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న భారీ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించి, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయ ఆవరణలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కొండపి నియోజకవర్గ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో కీలకమైన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డీఎస్సీ స్కామ్‌పై సమగ్ర విచారణ, పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి వంటి ప్రధాన డిమాండ్లతో ఈ కార్యక్రమం చేపట్టారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సురేష్ మాట్లాడుతూ.. డీఎస్సీ పరీక్షల నిర్వహణను చంద్రబాబు ప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా చేపట్టిందని విమర్శించారు. పారదర్శకతను గాలికొదిలేసి, ప్రశ్నాపత్రం తయారీ, డిజిటల్ నిర్వహణను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం ద్వారా పేపర్ లీకేజీకి ప్రభుత్వమే గట్టి పునాది వేసిందని ఆరోపించారు. జీవో నంబర్ 74కు విరుద్ధంగా తమ వారికి మేలు చేసేలా కొత్త జీవోలు సృష్టించి, స్పోర్ట్స్ కోటా పేరుతో దారుణాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. సకల శాఖల మంత్రిగా చలామణి అవుతున్న నారా లోకేష్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే ఏళ్ల తరబడి కష్టపడి చదివిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు–నేడుతో బడుల రూపురేఖలు మార్చితే.. నేడు బాబు సర్కారు అరకొర నిధులతో సరిపెడుతూ ఇంగ్లిష్ మీడియంను సైతం ఎత్తివేసి పేదలకు ఆంగ్ల విద్యను దూరం చేసిందని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చడం ద్వారా విద్యార్థులకు సుమారు రూ.9 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. నిరుద్యోగ భృతి అమలు చేయనందుకు ఒక్కో నిరుద్యోగికి ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున బాకీ పడిందని ఎద్దేవా చేశారు. అబద్ధపు హామీలతో నిలువునా మోసం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా కొత్త పింఛన్లు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500, 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛన్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రెండు నెలలుగా పొగాకు రైతులు మద్దతు ధర కోసం ఉద్యమిస్తుంటే సీఎం చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించినా ప్రజల పక్షాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి, బచ్చల కోటేశ్వరరావు, చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసులు, ఇంకొల్లు సుబ్బారెడ్డి, ఎంపీపీ కొండాబత్తిన మాధవరావు, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, మారంరెడ్డి గంగాధర్, పరిటాల సునీల్‌కుమార్, సిరిగిరి గోపాల్‌రెడ్డి, పిల్లి తిరుపతిరెడ్డి, బద్దెల మోహన్, కొల్లిపూడి గురుబ్రహ్మ, దేవరపల్లి యశ్వంత్‌రెడ్డి, కాటా మాధవరావు, మన్నెం చినవెంకటేశ్వర్లు, యర్రా రామకృష్ణ, కనపర్తి గోవిందమ్మ, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, జ్యేష్ట వేణు, వంశీకృష్ణ, గొల్లపూడి రవణయ్య, కొమ్మలపాటి మదన్మోహన్, బత్తిన మనోహర్, చుండూరి సురేష్, మేదరమిట్ల భరత్‌రెడ్డి, శ్రీపతి విజయ్, తిప్పలూరి రవీంద్ర, బొడపాటి శ్రీహరి, మాకినేని హరీష్, పూనూరి సంజీవరెడ్డి, షేక్ సుల్తాన్, సామంతుల శ్రీకాంత్‌రెడ్డి, కోమట్ల వెంకారెడ్డి, లింగబత్తిన నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి టెట్
మార్కాపురం టౌన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను జిల్లాలో ఈనెల 5 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎస్. సుబ్బారావు మంగళవారం తెలిపారు. మార్కాపురం పట్టణంలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల, డాక్టర్ శామ్యూల్ జార్జి ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి జిల్లా స్థాయిలో శ్రీటెట్ సెల్శ్రీను ఏర్పాటు చేశామని, వివరాలకు 98859 34789, 63022 43533ను సంప్రదించవచ్చని సూచించారు. పరీక్షా కేంద్రాలకు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామని, పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను హాలులోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. సంతనూతలపాడు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంతనూతలపాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక అంబేడ్కర్ కాలనీకి చెందిన కసుకుర్తి వాణికుమారి(33) సోమవారం సాయంత్రం సంఘం కాలనీలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై అజయ్ బాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె భర్త వేణును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించామని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై తెలిపారు. ● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు ఒంగోలు టౌన్: ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికుల నివాసాలు పశువుల పాకలను తలపిస్తున్నాయని, ప్రైవేటు సంస్థల్లో కార్మిక చట్టాలు అమలు కాక వారి బతుకులు బండబారుతున్నాయని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఒంగోలులోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 30 నుంచి జులై 31 వరకు జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లో 46 బృందాలతో సర్వే నిర్వహించినట్లు తెలిపారు. 50 రకాల పనులు చేస్తున్న కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. గ్రానైట్, ఆక్వా, మాల్స్, ఆస్పత్రుల్లో 8 గంటలకు బదులు 12 గంటలు పనిచేయించుకుంటూ కేవలం రూ.300 నుంచి రూ.500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. కలెక్టర్ నిర్ణయించిన కనీస వేతనం(రూ.708 నుంచి రూ.1062 వరకు) అమలు కావడం లేదని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి కనీస సౌకర్యాలు లేవన్నారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు 6 నుంచి 12 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కలెక్టర్, కార్మిక శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని బకాయిలు ఇప్పించడంతో పాటు, ప్రతి నెలా కనీస వేతనం అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు పి.కల్పన, మంజుదార్, జి.శ్రీనివాసులు, రమేష్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం
ముండ్లమూరు: ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు సైకోలా వీరంగం సృష్టించాడు. కండక్టర్‌ను దూషించడమే కాకుండా, అడ్డుకున్న ప్రయాణికుడిపై స్క్రూ డ్రైవర్‌తో దాడికి తెగబడ్డాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే బస్సు అద్దాలు పగులగొట్టి, వైర్లు కత్తిరించి నానా హంగామా చేశాడు. ముండ్లమూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉల్లగల్లుకు చెందిన మోతుకూరి వంశీ కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం అద్దంకి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పొదిలి నుంచి అద్దంకి వెళ్తుండగా ఉల్లగల్లులో అతడు బస్సు ఎక్కాడు. కండక్టర్ అన్నమ్మ టికెట్లు ఇస్తుండగా, వంశీ ఆమెను అసభ్య పదజాలంతో దూషించాడు. దీన్ని గమనించిన పసుపుగల్లుకు చెందిన ప్రయాణికుడు సారెడ్డి అమరారెడ్డి.. కండక్టర్‌ను ఎందుకు తిడుతున్నావని ప్రశ్నించాడు. దీంతో రెచ్చిపోయిన వంశీ తన వద్ద ఉన్న స్క్రూ డ్రైవర్‌తో అమరారెడ్డిపై దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనతో బస్సులో ఉన్న సుమారు 30 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. డ్రైవర్ పుల్లారావు చాకచక్యంగా వ్యవహరించి నేరుగా ముండ్లమూరు పోలీస్ స్టేషన్ వద్ద బస్సు నిలిపాడు. పోలీసులు బయటకు వచ్చేలోపే వంశీ బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు, స్టీరింగ్ వద్ద ఉన్న వైర్లను పీకేశాడు. ఎట్టకేలకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, నిందితుడు వంశీ గతంలోనూ పలు నేరాలకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డీఎస్సీ అక్రమాల్లో లోకేశ్ హస్తం
కందుకూరు: డీఎస్సీ–2025 నియామకాల్లో చోటుచేసుకున్న భారీ అక్రమాలు, అవకతవకలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్రా మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలు బహిర్గతమైన తర్వాత అభ్యర్థుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోందన్నారు. కూటమి పాలనలో తమ బతుకులు ఆగమయ్యాయని నిరుద్యోగులు కన్నీరు పెడుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలు జరిగితే.. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించిందని గుర్తుచేశారు. కానీ, మన రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడిని వెనకేసుకొస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీబాబు వస్తే జాబు వస్తుందిశ్రీ అన్న మాయమాటలు నమ్మి యువత ఓట్లేస్తే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ.. చంద్రబాబుకు సీఎం, పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం, లోకేశ్‌కు మంత్రి పదవులు మాత్రం దక్కాయని ఎద్దేవా చేశారు. తోడల్లుడి కనుసన్నల్లో జూడో పోస్టులు స్పోర్ట్స్ కోటా ముసుగులో డీఎస్సీలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని బుర్రా ఆరోపించారు. జూడో క్రీడ కింద ఏకంగా 39 పోస్టులు కేటాయించారని, ఈ జూడో కేటగిరీకి లోకేశ్ స్వయానా తోడల్లుడు, విశాఖ ఎంపీ అయిన భరత్ అధ్యక్షుడు కావడంతోనే ఈ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. దీనిపై అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన యువతను నేడు రోడ్డెక్కేలా చేసిన పాపం చంద్రబాబుదేనని మండిపడ్డారు. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన అభ్యర్థులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిందని ధ్వజమెత్తారు. మెరిట్ జాబితాను పలుమార్లు మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. యువతకు న్యాయం జరిగే వరకు, మంత్రి లోకేశ్ రాజీనామా చేసి సీబీఐ విచారణకు ఆదేశించే వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫి, కందుకూరు, ఉలవపాడు, లింగసముద్రం మండలాల అధ్యక్షులు ఈదర రమేష్, నన్నం పోతురాజు, నోటి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా సెక్రటరీ తోకల కొండయ్య, రాష్ట్ర బూత్ జాయింట్ సెక్రటరీ గణేశం గంగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిశోర్, బద్దిపూడి జయరావు, జిల్లా ఇంటెలెక్చువల్ అధ్యక్షుడు రావులకొల్లు బ్రహ్మానందం, రాష్ట్ర కల్చరల్ విభాగం అధికార ప్రతినిధి వల్లూరి కోటేశ్వరరావు, బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ పెయ్యల రమేష్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు బిళ్లా రమణయ్య, కార్యదర్శి చీమల రాజా, పాశం కొండయ్య, యువజన విభాగం అధ్యక్షుడు మద్దసాని నవీన్‌యాదవ్, ఐటీ విభాగం అధ్యక్షుడు పాలవల్లి అమర్నాథ్రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఉచ్చులూరి రవీంద్ర, పల్నాటి చెన్నయ్య, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు చింతలపూడి సుధాకర్, మహిళా విభాగం అధ్యక్షురాలు తుళ్లూరి ఆదిలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే అక్రమ నియామకాలపై ప్రశ్నిస్తున్న డీఎస్సీ అభ్యుర్థులకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు స్పోర్ట్స్ కోటా పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ -
సమన్వయంతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
ఒంగోలు వన్‌టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. మంగళవారం ప్రకాశం భవనంలో కలెక్టర్, ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. గత నివేదికను డీటీసీ ఆర్.సుశీల వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల ఒంగోలు, అద్దంకి, సంతమాగులూరులో ప్రమాద ప్రాంతాలను తాము సందర్శించామని, క్షేత్రస్థాయిలో అందరూ సమిష్టిగా పనిచేస్తూ వాహనదారులకు భద్రతా నియమాలపై నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరిజూలై మధ్య ప్రమాద మరణాలు 18.5%, ప్రమాదాలు 3.5% తగ్గాయన్నారు. అధికారుల స్పందన సమయం 8 నిమిషాలకు తగ్గిందన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు 39,182 మందికి రూ.2.38 కోట్లు, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 1,869 మందికి రూ.కోటి జరిమానా విధించి 67 మందికి జైలు శిక్ష పడేలా చేశామన్నారు. 9 వేల ఎల్ఈడీ లైట్లు తొలగించామన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్యసేవ కోఆర్డినేటర్ హేమంత్, ఆర్అండ్బీ ఎస్ఈ రవి నాయక్, పంచాయతీరాజ్ ఎస్ఈ అశోక్, ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. -
అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలి
ఒంగోలు సిటీ: జిల్లాలో ఐసీడీఎస్ నిబంధనలకు విరుద్ధంగా అంగన్వాడీ కార్యకర్తల భర్తీకి ఇచ్చిన నోటిఫికే షన్లను రద్దు చేసి, అర్హులైన హెల్పర్లకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్ప ర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్య దర్శి ఈదర అన్నపూర్ణ డిమాండ్ చేశారు. సోమవారం ఒంగోలు ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద బాధిత హెల్పర్లతో కలిసి ఆమె నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ.. ప్రమోషన్ల కోసం ఇచ్చిన దరఖాస్తులను పక్కనపెట్టి, అధికారులు ప్రలోభాలకు గురై ఏకపక్షంగా భర్తీ నోటిఫికేషన్లు ఇవ్వ డం అన్యాయమన్నారు. ఒక మంత్రి సొంత నియోజకవర్గమైన టంగుటూరు ప్రాజెక్టు పరిధిలోని పాకల, వాసేపల్లిపాడు సెక్టార్లలో అర్హతలున్నా హెల్పర్లకు ప్రమోషన్లు నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. మరో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు ప్రాజెక్టు పరిధిలోని ధేనువకొండలో ఏకంగా ప్రమోషన్ దరఖాస్తులనే నిరాకరించడం అధికారుల తీరుకు నిదర్శనమన్నారు. హెల్పర్లకు ప్రస్తుతం ప్రమోషన్లు ఇవ్వకపోతే వయసు రీత్యా భవిష్యత్తులో కార్యకర్త అయ్యే అవకాశాన్ని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, జిల్లా అధికారులు జోక్యం చేసుకుని అక్రమంగా నోటిఫికేషన్లు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలని, లేకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ ఇంద్రావతి, టంగుటూరు, ఒంగోలు ప్రాజెక్టుల కార్యదర్శులు క్రాంతికుమారి, కె.హెమీమా, హెల్పర్లు జ్యోతి సరస్వతి, నాగమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేయాలి ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకురాలు అన్నపూర్ణ -
మెగా కాదు దగా డీఎస్సీ
కనిగిరి రూరల్: కూటమి ప్రభుత్వంలో చేపట్టిన 2025 మెగా డీఎస్సీ నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందని, నిరుద్యోగ యువతకు తీవ్ర ద్రోహం చేసిన ఈ స్కామ్‌పై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్.కె.అబ్దుల్ గఫార్ అధ్యక్షతన టౌన్‌హాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కారు నిరుద్యోగులను దారుణంగా వంచించిందని ధ్వజమెత్తారు. అర్హులైన అభ్యర్థులకు కాకుండా ఐటీడీపీ (జీఖీఈ్క) కార్యకర్తలకు, టీడీపీ నాయకులకే ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు, ఏటా జాబ్ క్యాలెండర్, 20 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ఆయన నిలదీశారు. మెగా డీఎస్సీ దగాపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని, అర్హులైన ప్రతి అభ్యర్థికీ న్యాయం చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు, 10వ తేదీన నిరసన ర్యాలీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు నేతలు సైతం డీఎస్సీ అక్రమాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు మడతల కస్తూరిరెడ్డి, గుంటక తిరుపతిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చింతగుంట్ల సాల్మన్ రాజు, ఓ.కె.రెడ్డి, ఆవుల భాస్కర్‌రెడ్డి, మూలే గోపాల్‌రెడ్డి, తమ్మనేని సుజాతరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గంగసాని హుస్సేన్‌రెడ్డి, యక్కంటి శ్రీనివాసులరెడ్డి, సూరసాని మోహన్‌రెడ్డి, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, కటికల వెంకటరత్నం, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు రాచపూడి మాణిక్యరావు, గూడూరి అబ్రహం లింకన్, భువనగిరి వెంకటయ్య, కాకర్ల వెంకటేశ్వర్లు, మితికాల గురవయ్య, ఏలిక నారాయణ, వేసపోగు గురుప్రసాద్, వాకమల్ల రాజశేఖర్‌రెడ్డి, డాక్టర్ ఎస్కే నాయబ్ రసూల్, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, శ్యామల సాంబశేఖర్రెడ్డి, పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, పోలక సిద్ధారెడ్డి, శ్రీరామ శ్రీనివాసులు, గూడూరి అనిల్, తాతపూడి సురేష్, తాతపూడి నాని, షేక్ బారా షరీఫ్, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, బచ్చు వెంగళరావు గుప్తా, దరిశి ఫణి, చెన్నుపాటి వెంకటరావు చౌదరి, దాదిరెడ్డి మాలకొండరెడ్డి, పల్నాటి భాస్కర్‌రెడ్డి, ముత్యాల ప్రతాప్, ఎస్.కె.సన్నీ పాషా, కలికాయి నారాయణ, మద్ది తిరుపతయ్య, మేడం ఆదినారాయణరెడ్డి, డాక్టర్ షేక్ గౌస్ బాషా, గాలి నాగేశ్వరరావు, బాపట్ల కొండలరావు, గుంటక రమణారెడ్డి, సానికొమ్ము మధుసూదన్‌రెడ్డి, మారం వెంకటేశ్వరరెడ్డి, భూమిరెడ్డి రామచంద్రారెడ్డి, పి.ఆదాము, గొంగటి మహేందర్‌రెడ్డి, ఎం.వెలుగొండయ్య, మేకల మాల్యాద్రి, శీలం సుదర్శన్, దాసరి మురళి, పలుకూరి భాస్కర్, ఎలిక అచ్చయ్య, శెట్టిపల్లి కొండయ్య, ఎస్.వెంకటేశ్వరరెడ్డి, కన్నేటి సుబ్బారెడ్డి, కనుమర్ల వెంకటేశ్వరరెడ్డి, వేముల శివ, గజ్జల కోటిరెడ్డి, చిలకల నారాయణరెడ్డి, శ్యామల ప్రసాద్‌రెడ్డి, ముక్కు వేణుగోపాల్‌రెడ్డి, ఎరబ్రెల్లి శౌరి, భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, మూలే దశరథరెడ్డి, కత్తి మరియబాబు, షేక్ సన్నీ, బలసాని మోహన్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ స్కామ్‌పై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి నిరుద్యోగులను వంచించి టీడీపీ కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చారు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలి ఈ నెల 6 నుంచి 9 వరకు రిలే దీక్షలు, 10న భారీ నిరసన ర్యాలీలు వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ -
భరోసా రాదు
బీమా లేదు..రైతులను పట్టించుకోవడం లేదు ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదు. గత ఏడాది అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా చీతిరాల కతువకు నీరు ఇష్టారాజ్యంగా వదలడంతో కతువ చుట్టు పక్కల పొలాలన్నీ నీటమునిగాయి. వరి, అరటి, పసుపు పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయి. పది రోజులుగా నీటిలో ఉండటంతో ఏ ఒక్క పంట చేతికందలేదు. అధికారులు వచ్చి పంట నమోదు చేసుకున్నారు. ఒక్కరికీ రూపాయి ఇవ్వలేదు. – చిట్టే మల్లికార్జున, రైతు, సోమవారిపేట ప్రభుత్వమే బీమా చెల్లించాలి రైతులు పండించిన ఏ పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదు. గత ఏడాదిలో వరుసగా వచ్చిన అకాల వర్షాలు, తుఫాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ ఏడాది ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే కొంతమేర రైతులకు ఉపశమనం ఉంటుంది. – ఆవుల శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బేస్తవారిపేట: గత ప్రభుత్వం అమలుపరిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని టీడీపీ ప్రభుత్వం అటకెక్కించింది. అప్పులు చేసి పంటలు సాగు చేసే తమకు ప్రభుత్వం నుంచి ఏ మాత్రం ప్రోత్సాహం అందడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత రెండేళ్లలో కాస్తోకూస్తో పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైన టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాదైనా ఆదుకుంటుందన్న ఆశతో ఉన్న రైతులపై ప్రీమియం భారం కూడా వేయడాన్ని అన్నదాతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాణిజ్య బ్యాంకుల్లో పంట రుణాలు పొందాలంటే రైతుకు ఇష్టమున్నా లేకున్నా తప్పనిసరిగా బీమా ప్రీమియం మొత్తాన్ని బ్యాంకర్లు రైతుకు ఇచ్చే రుణంలో ముందుగానే మినహాయించుకుని తీసుకుంటున్నారు. మాకు బీమా వద్దు, ప్రీమియం చెల్లించలేమన్నా ఊరుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. వరి పంటకు ప్రీమియం గణనీయంగా పెంచారు. గత ఏడాది ఎకరాకు రూ.80 ఉన్న ప్రీమియం ఈ ఏడాది ఏకంగా రూ.300లకు పెంచారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి పంట సాగు చేసే ప్రతి రైతు పంటల బీమా పొందాలంటే ప్రీమియం చెల్లించాల్సిందే. దెబ్బతిన్న పంటలకు దక్కని పరిహారం: ● గత ఏడాదిలో మోంథా తుపానుతో పంటలు దెబ్బతిన్నాయి. రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పత్తి 35,750 ఎకరాలు, సజ్జ 7,300, వరి 9,500, మొక్కజొన్న 7,100, ఇతర పంటలు 36 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. తుపాను వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నేటికీ పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి. ● 2024 డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన ఫెంగల్ తుఫాన్ ధాటికి జిల్లాలోని పది మండలాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. శనగ పంట 5,506 హెక్టార్లు, మినుము 1,902 హెక్టార్లు, పొగాకు 1,333 హెక్టార్ల, మినుములు 1902 హెక్టార్లు పంట నష్టం జరిగింది. అప్పట్లో 7650 మంది రైతులు 25,540 ఎకరాల్లో హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ● 2024 అక్టోబర్ కురిసిన అధిక వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. అక్టోబర్ 13 నుంచి 21వ తేదీ వరకు ముసురుపట్టి భారీ వర్షాలు పడటంతో దాదాపు 24,700 ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. నేటికి రైతులకు ఒక్క రూపాయి ప్రభుత్వం విడుదల చేయలేదు. సంకటంగా సాగు మేదరమెట్ల: పత్తి పైరు మినహా మిగిలిన పంటలకు ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన పథకం కింద నమోదుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు పొడిగించారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొరిశపాడు మండలంలో ఏ సర్వే నంబరు పొలంలో ఏ పైరు వేస్తామనే కచ్చితమైన అంచనాకు సింహభాగం రైతులు రాలేదు. బ్యాంకు రుణాలు పొందేందుకు వెళ్లిన రైతులు కూడా తికమక పడుతున్నారు. రుణపరపతి పొందేటప్పుడు చెప్పిన సర్వే నంబరులో ప్రస్తుతం ఏ పంట వేస్తారనేది నమోదు చేయాలి. అలా పంట పేరు నమోదు చేయాలంటే వర్షాలు ఎప్పుడు సంపూర్ణంగా పడతాయో తెలియని పరిస్థితి. ఒక వేళ రుణం పొందే సర్వే నంబరులో ప్రస్తుతం ఒక పంట పేరు రాసి, రేపు మరో పంట సాగు చేస్తే ... ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే అప్పుడు పరిహారానికి అర్హత ఉండదని బ్యాంకర్లు రైతులకు చెప్తున్నారు. ఇదే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట పేరు నమోదు చేసుకునేందుకు కూడా రైతులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. తక్కువ నీటి వసతితో ఫలసాయం ఇచ్చే అపరాలను సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచించి అంతటితో తమ పని అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు. గత ఏడాది జూలై మాసాంతానికి కురిసిన వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది జూలై నెలాఖరు నాటికి కురిసిన వర్షపాతం నామమాత్రమే. వ్యవసాయశాఖ అధికారుల గణాంకాల ప్రకారం జూలై మాసాంతానికి 98.5 మీ.మీ వర్షపాతం నమోదు కావాలి. అయితే మాసాంతానికి కేవలం 4.2 మీ.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో సాగు సంకటంగా తయారైంది. ఈ క్రమంలో ఈ ఏడాది వరకు తమ భూముల్లో పంటలు సాగు చేసే సమయంలో క్రాప్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి పంట నమోదు ప్రక్రియకు వెసులుబాటు కల్పించాలని రైతులు కోరుతున్నారు. రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేసింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు వైఎస్సార్ సీపీ పాలన స్వర్ణ యుగంలా నడిచింది. పండించిన పంటలకు మద్దతు ధర, ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో నష్టపరిహారం పంపిణీ చేశారు. 2019 ఖరీఫ్ సీజన్ నుంచి జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి రైతు వేసిన పంటలను ఈ–క్రాప్ నమోదు చేయించి ఉచిత పంటల బీమా అమలు చేశారు. రైతులు సాగు చేసే మొత్తం విస్తీర్ణానికి చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించింది. సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా పథకం వర్తించడంతో పంటలకు నష్టం వాటిల్లిన పరిస్థితుల్లో రైతులకు పరిహారం అందించారు. వైఎస్సార్ ఇన్పుట్ సబ్సిడీ కింద 50,878 మంది రైతులకు రూ.23.27 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు 4,20,980 మంది రైతులకు రూ.245.68 కోట్లు అందించింది. 2023–24 వ్యవసాయ సీజన్లో మిర్చి క్వింటా రూ.22– రూ.23 వేల ధర పలికింది. అనంతరం కూటమి ప్రభుత్వం రాగానే రూ.10 వేలకు పడిపోయింది. -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టండి
సంతనూతలపాడు: మెగా డీఎస్సీ–2025లో జరిగిన విచ్చలవిడి అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ చేపట్టాలని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేరుగు మాట్లాడుతూ నీట్ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగానే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు. సంతనూతలపాడులోని పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ నాయకులతో కలిసి సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు బొట్ల రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. స్వయంగా హైకోర్టు ఆదేశించినా ఇంతవరకు విచారణ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. డీఎస్సీలో ఉద్యోగాలు ఇప్పించేందుకు రూ.15 లక్షలు డిమాండ్ చేస్తున్న వీడియోలు, ఆడియో టేపులు ప్రభుత్వానికి సమర్పించినా ప్రయోజనం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే విచారణపై తమకు నమ్మకం లేదని, సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలన్నారు. 2025 డీఎస్సీ తక్షణమే రద్దుచేసి మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో మెరిట్ లిస్టు ప్రకారం కాకుండా మనీ లిస్టు ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఊసే లేదని, అసలు అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా అని నిలదీశారు. యువత ధర్మ యుద్ధానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఐటీఐ, డిప్లొమా వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోందన్నారు. ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు, 10వ తేదీ నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారు బాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, సంయుక్త కార్యదర్శి వేమా శ్రీనివాసరావు, పాలడుగు రాజీవ్, రాష్ట్ర వాణిజ్య విభగం కార్యదర్శి కృష్ణారెడ్డి, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు, మండవ అప్పారావు, శ్రీమన్నారాయణ, దుంపా యలమందరెడ్డి, ఎంపీపీలు యద్దనపూడి శ్రీనివాసరావు, బి.విజయ, వాకా అరణ కోటిరెడ్డి, మాజీ ఏఎంసీ అధ్యక్షుడు ఇనగంటి పిచ్చిరెడ్డి, బొడ్డు కోటేశ్వరరావు, ఎస్ వెంగారెడ్డి, ఎస్ వెంకటరావు, స్టేట్ మైనారిటీ సెల్ నాయకుడు మస్తాన్, జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు పి.రామారావు, పార్టీ నాయకులు దుంపా అజయ్ రెడ్డి, చీదర్ల శేషు, పాటిబండ్ల గంగయ్య, రావి లక్ష్మయ్య, మక్కెన రాజేంద్ర, రవి, అన్వేష్, మహేష్, శ్రీకాంత్, పాలడుగు సుబ్బు, మొగులశెట్టి వెంకటేశ్వర్లు, కుంచాల రాంబాబు, కురాకుల సుబ్బారెడ్డి, బలరామయ్య పాల్గొన్నారు. -
అర్హుల ఓట్లు ఉండేలా బీఎల్ఏలు పనిచేయాలి
పామూరు: సర్ ప్రక్రియ ముగిసి తుది ఓటర్ల జాబితా వచ్చే వరకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా బీఎల్ఏలు పనిచేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణయాదవ్ అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయానికి సోమవారం వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి, ఇన్చార్జ్ దద్దాల మండలపార్టీ అధ్యక్షుడు గంగసాని హుసేన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్‌పై మాట్లాడారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ, ఓటర్ల జాబితా ఇతర విషయాలపై స్థానిక నాయకులతో చర్చించారు. ఎన్యుమరేషన్ అనంతరం వచ్చిన జాబితాను పరిశీలించి వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న ఓట్లను నిశితంగా పరిశీలించి వారు ఓటుకు అర్హులై ఉంటే తగు ధ్రువీకరణ పత్రాలు బీఎల్ఓలకు అందజేసి ఓటు తొలగింపునకు గురికాకుండా చూడాలన్నారు. నూతన ఓటర్లకు దరఖాస్తు చేయించాలని సూచించారు. అనంతరం బూచేపల్లి, ఇన్చార్జ్ దద్దాలను మండల పార్టీ అధ్యక్షుడు గంగసాని హుసేన్‌రెడ్డి పలువురు ఘనంగా సన్మానించారు. అనంతరం సీఎస్‌పురం కోఆప్షన్ సభ్యుడు షేక్.మహబు గృహప్రవేశ కార్యక్రమానికి తరలివెళ్లారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుబ్బయ్య, కోఆప్షన్ షేక్.నాయబ్‌రసూల్, టీచర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు కల్లూరి రామిరెడ్డి, అంబటి కొండారెడ్డి, మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్.గయాజ్, యూత్ మండల అధ్యక్షుడు ఇర్రి కృష్ణారెడ్డి, ఎస్టీసెల్ శ్రీరామ శ్రీనివాసులు, కందుల శ్రీనివాసులురెడ్డి, ఎంపీటీసీ షేక్.అబ్దుల్, యాటా రాఘవేంద్ర, తుపాకుల ఆంజనేయరెడ్డి, ఎలికా అచ్చయ్య, కోడూరి రామసుబ్బారెడ్డి, మాలెం అంజిరెడ్డి, కోడూరి రామసుబ్బారెడ్డి, కొత్తూరి రవిబాబు, సుబ్రమణ్యం, సూరిబాబు, మర్రి రాజుయాదవ్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘ఇన్ ప్రాసెస్’తో కాలయాపన చేయొద్దు
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కారంలో ‘ఇన్ ప్రాసెస్’ (ప్రగతిలో ఉంది) అంటూ కాలయాపన చేసే ధోరణిని ఇకపై ఎంతమాత్రం సహించేది లేదని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 332 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను కేవలం ఆన్లైన్ రికార్డుల కోసం మమ అనిపించకుండా, నియమనిబంధనలకు లోబడి క్షుణ్ణంగా చదివి, బాధితులకు సంతృప్తికరమైన, శాశ్వత పరిష్కారం చూపేలా క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న ‘ఇన్ ప్రాసెస్’ కేసుల సంఖ్యను తక్షణమే తగ్గించాలని ఆదేశించారు. ఆగస్టు 15 తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తీసుకుంటామని, దీనిపై త్వరలోనే అధికారులతో చర్చిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వెంకటరమణ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి మాధురి, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మలతతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. డ్రైనేజీ ప్రమాదం నుంచి కాపాడండి చెరువుకొమ్ముపాలెం గ్రామంలోని కొత్తపాలెం ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన భారీ డ్రైనేజీ కాలువ తమ పాలిట శాపంగా మారిందని ఆ కాలనీవాసులు కలెక్టర్ ఎదుట వాపోయారు. ఈ మేరకు రెబ్బవరపు రాజుతో పాటు సుమారు 40 మంది గ్రామస్తులు ‘మీ కోసం’కు వచ్చి తమ కష్టాలను ఏకరువు పెట్టారు. ఆరడుగుల లోతు, నాలుగడుగుల వెడల్పుతో నిర్మించిన కాలువకు స్లాబ్ వేయకుండా వదిలేయడంతో.. గత నాలుగు నెలల వ్యవధిలో పది మందికి పైగా చిన్నారులు అందులో పడి తీవ్ర గాయాలపాలయ్యారని వివరించారు. ఐదు రోజుల క్రితం రెబ్బవరపు రాజ్‌కుమార్ కాలుజారి పడటంతో కాలు విరిగి మంచాన పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మిస్తారా’ కథనాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సదరు కథనాన్ని తాను చదివానని చెప్పిన కలెక్టర్.. తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ వెంకట కృష్ణయ్యను పిలిచి, వెంటనే గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కరేడులో దేవాదాయ భూముల అన్యాక్రాంతం ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అదే గ్రామానికి చెందిన దగ్గుమాటి సుబ్బరామిరెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కరేడులోని చెన్నకేశవ స్వామి, లక్ష్మీపతి స్వామి దేవస్థానాలకు సర్వే నంబర్ 826/1 తదితర సర్వే నంబర్లలో 20.60 ఎకరాల భూమి ఉందన్నారు. ఇందులో సుమారు 14 ఎకరాలను ఎలాంటి అనుమతులు, వేలం పాట లేకుండానే గ్రామానికి చెందిన నల్లపరెడ్డి ఈశ్వరరెడ్డి, అల్చూరి కోటిరెడ్డి, రామాల కృష్ణారెడ్డి ఆక్రమించి పది రోజుల క్రితం జామాయిల్ నాటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవాదాయ శాఖ ఈఓతో కుమ్మకై ్క వారు ఈ దారుణానికి పాల్పడ్డారని, ఇదే విషయమై ఈఓను ప్రశ్నిస్తే ‘మీకు చేతనైంది చేసుకోండి’ అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. దేవస్థాన భూముల్లో అవకతవకలు జరిగాయని, తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం ‘మీ కోసం’లో అధికారులకు కలెక్టర్ రాజాబాబు హెచ్చరిక గ్రీవెన్స్‌లో 332 వినతుల స్వీకరణ -
‘తీగ’ లాగితే దొంగలు దొరికారు!
సంతమాగులూరు (అద్దంకి): చెడు వ్యసనాలకు బానిసలై, సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విద్యుత్ స్తంభాల వైర్లను అపహరిస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను సంతమాగులూరు పోలీసులు అడ్డరోడ్డు వద్ద అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలానికి చెందిన పల్లపు వెంకట సాయికుమార్ (ప్రస్తుతం యద్దనపూడి మండలం పూనూరు నివాసి), బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన మునిపల్లి ఏసుబాబు, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలేనికి చెందిన లంకా వరప్రసాద్, తాటియేకుల నాగేంద్ర, తన్నీరు చిట్టిబాబు, మంచికలపూడి వెంకటేశ్వర్లు, తాడేపల్లికి చెందిన గంగుల కృష్ణ స్నేహితులు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాల్లోని విద్యుత్ స్తంభాల మధ్య ఉండే అల్యూమినియం వైర్లను కత్తిరించి అమరావతి సమీపంలోని ఎర్రబాలెంలో ఉన్న ఓ వ్యాపారికి విక్రయిస్తుంటారు. అలాగే సంతమాగులూరులోని పీవీఆర్ రెసిడెన్సీ స్టోర్ రూమ్ తాళాలు పగులగొట్టి అందులోని సర్వీస్ వైరును కూడా అపహరించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై గతంలో సంతమాగులూరులో రెండు, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు, బాపట్ల జిల్లా అనుములదీవి, వేమూరు, గుంటూరు జిల్లా తెనాలిలో మూడు, దుగ్గిరాలలో ఒకటి, పల్నాడు జిల్లా చిలకలూరిపేట, వినుకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 7 కిలోల రాగి వైరు, 150 కిలోల అల్యూమినియం వైరు, నిచ్చెన, కారు, వైరు కట్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సంతమాగులూరు ఎస్సై వి.నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్సై వై.నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్ జిల్లా విద్యుత్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్ ఏడుగురు నిందితుల నుంచి 7 కిలోల రాగి, 150 కిలోల అల్యూమినియం వైరు, కారు, పనిముట్లు స్వాధీనం మీడియాకు వివరాలు వెల్లడించిన దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ -
అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించండి
యర్రగొండపాలెం: జిల్లాలో పూర్తిగా వెనకబడిన ప్రాంతమైన యర్రగొండపాలెం నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా పేరుకొని పోయి ఉన్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సమస్యలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లానని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నిరుద్యోగుల ఉపాధి పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలన్నారు. యర్రగొండపాలెం పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు వైద్యసేవల కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాలకు వెళ్తుంటారని, అక్కడికి వెళ్లేందుకు రోగులు, గర్భిణులు, వృద్ధులు, అత్యవసర వైద్య అవసరాల దృష్ట్యా నేరుగా బస్సు సర్వీసులు ప్రారంభించాలని ఆయన కోరారు. జాతీయ రహదారి నియోజకవర్గ కేంద్రం గుండా వెళ్తుందని, సరైన లైటింగ్, సైన్ బోర్డులు లేకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి అర్హత ఉన్నప్పటికీ వారిని జాబితాలో చేర్చలేదని, వారికి న్యాయం జరిగేలా ప్రత్యేక పరిశీలనచేసి వెంటనే వారిని పునరావాస జాబితాలో చేర్చాలన్నారు. గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్లు, లైట్లు, ఫ్యాన్లు చెడిపోవడం వలన గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరమ్మతుల కోసం సంబంధిత అధికారులు గ్రామాలకు వెళ్లడంలేదని, సోలార్ వ్యవస్థల నిర్వహణ కోసం ప్రత్యేక టెక్నీషియన్‌ను నియమించి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర ప్రాతిపదికన రోడ్ల పనులు చేపట్టాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖకు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల చేయకపోవడంతో గ్రామీణ తాగునీటి నిర్వహణ పనులు నిలిచిపోయాయని, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు విడుదలచేసి తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. -
ఎల్‌నినో సెగ!
మిర్చి రైతుకు పెద్దారవీడు: ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతన్న కళ్లలో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. చినుకై నా పడుతుందేమోనని రోజూ ఎదురుచూస్తున్నా.. మేఘాలు కమ్ముకుని నిరాశపరుస్తూ వెళ్లిపోతున్నాయి. ఊహించినట్లుగానే ‘ఎల్‌నినో’ ప్రభావం ఈ ఏడాది మిర్చి రైతుల పాలిట శాపంగా మారుతోంది. గతేడాది నష్టాలను పూడ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈసారి అధిక విస్తీర్ణంలో మిర్చి సాగుకు రైతులు ఆసక్తి చూపారు. అందుకు అనుగుణంగా ముందస్తుగానే పొలాలను సిద్ధం చేసుకున్నారు. కానీ, నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నెలాఖరుకల్లా వరుణుడు కరుణించకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షేడ్నెట్లలోనే ముదురుతున్న నారు సాధారణంగా విత్తనం నాటిన 40 రోజులకు మిర్చి మొక్కలను పొలంలో నాటాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతులు ముందస్తుగా షేడ్నెట్లలో నారు పెంచుకున్నారు. ఒక్కో మొక్కకు 80 పైసల నుంచి రూ.1.50 వరకు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు. కొందరు రైతులు విత్తనాలిచ్చి ట్రేల లెక్కన ఒప్పందంపై నారు పెంచుకుంటున్నారు. రోజులు గడుస్తున్నా వర్షాలు లేకపోవడంతో ఆ మొక్కలన్నీ నర్సరీల్లో ముదిరిపోతున్నాయి. బోరుబావుల ద్వారా నీటి వసతి ఉన్నప్పటికీ.. ఎండల తీవ్రత దృష్ట్యా ఇప్పుడు మొక్కలు నాటినా బతికే పరిస్థితి లేదని రైతులు వెనుకడుగు వేస్తున్నారు. మరో పది రోజుల్లోపు పొలాల్లో నాట్లు వేయకపోతే, నర్సరీల్లో నారంతా పనికిరాకుండా పోతుందని, రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతుందని అటు రైతులు, ఇటు నర్సరీ నిర్వాహకులు వాపోతున్నారు. వేలాది మంది ఉపాధిపై ప్రభావం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల పరిధిలో మిర్చి సాగుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ దాదాపు 200కు పైగా షేడ్‌నెట్ నర్సరీలు నిర్వహిస్తున్నారు. ఎకరాకు 18 వేల ట్రేల చొప్పున మిరప నారు పెంచుతున్నారు. ఈ నర్సరీల ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 2 వేల మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి లభిస్తోంది. వర్షాభావం ఇలాగే కొనసాగి మిర్చి సాగు నిలిచిపోతే.. అటు రైతులు, నర్సరీ నిర్వాహకులతో పాటు కూలీల ఉపాధికి సైతం గండిపడే ప్రమాదం పొంచి ఉంది. వర్షాభావంతో సాగుపై నెలకొన్న సందిగ్ధం షేడ్నెట్లలోనే ముదురుతున్న మిరప నారు మరో పది రోజులు దాటితే రూ.లక్షల్లో నష్టం ఆకాశం వైపు ఆశగా చూస్తున్న అన్నదాతలు వర్షం పడకుంటే నారు వదిలేయాల్సిందే.. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల వల్ల మిరప సాగు బాగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నర్సరీ నిర్వాహకులకు విత్తనాలిచ్చి నారు పెంచుకుంటున్నాం. ఇక్కడి నర్సీరీల నిర్వాహకులు కూడా ఎక్కువ శాతం రైతులు కావడంతో మేలు రకం నారు దొరుకుతుందన్న నమ్మకం ఉంది. ఇంకో పది రోజుల్లో నాట్లు వేయాలి. సకాలంలో వర్షం కురవకపోతే లక్షలు నష్టపోతాం. – కాసు వెంకటేశ్వరరెడ్డి, రైతు, పెద్దారవీడు -
మంత్రి అండతో నిషేధిత భూముల్లో గోల్మాల్
అద్దంకి: మంత్రి గొట్టిపాటి రవికుమార్ అండదండలతో అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన పచ్చ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ధ్వజమెత్తారు. మంత్రి అండదండ లేకుంటే చెరువులను పట్టా ల్యాండుగా మార్చే అధికారం ఎవరికి ఉందని ప్రశ్నించారు. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేసి, నిస్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇలాకాలో భూ కబ్జాలపై ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. కోర్టుల నుంచి తెచ్చిన ఆధారాలను చూపుతూ కబ్జాలు ఎలా చేశారో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులు, కుంటల భూములు నిషేధ భూముల జాబితాలో నుంచి తొలగించడం ఎక్కడా వీలు కాదన్నారు. అద్దంకిలో చెరువులు, కుంటలను పట్టా ల్యాండ్లుగా మార్చడం చాలా సులభమని ఎద్దేవా చేశారు. ఆ ప్రక్రియ చాలా సులువు గా జరిగిపోతోందన్నారు. అదేమని ఉన్నతాధికారులను అడిగితే మీరు న్యాయ పరంగా వెళ్లండని చెప్పడం వింటే ఆశ్చర్యం వేస్తోందన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించినవివీ.. మండలంలోని కలవకూరు గ్రామ సర్వే నంబరు 1928లో 1954కు ముందు నుంచి ఈనాంగా 14.83 ఎకరాల భూమి ఉందని చింతలపూడి తెలిపారు. అది ఆగస్టు నెల 7వ తేదీ 2025న పట్టా ల్యాండ్‌గా కన్వర్ట్ చేశారని చెప్పారు. ఉత్తర అద్దంకిలోని సర్వే నంబరు 1926లో 6.36 ఎకరాల కుంట పోరంబోకును పోరంబోకు భూమిగా మార్చారన్నారు. అందులో 11 సెంట్లు కాలువగా చూపి, మిగిలిన దానిలో కుంట ఉన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నారు. ఇదంతా మీ టీడీపీ సానుభూతిపరుడే హైకోర్టులో వేసి బయటకు తీయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. అది మీ ఆస్థాన పత్రికలో రావడం నిజం కాదా? అతన్ని బెదిరిస్తే బెదిరిపోయి, హైకోర్టులో కేస్ విత్‌డ్రా చేసుకోబోతే, కోర్టు అతనికి మొట్టికాయలు వేసి, ఆ భూమికి సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగడానికి వీలు లేదని, తీర్పును వెలువరించిన విషయాన్ని ఉటంకించారు. కబ్జాలను కాపాడేందుకే ఊరచెరువు ప్రాజెక్టు.. తన వారి కబ్జాలను కాపాడేందుకే ఊరచెరువు ప్రాజెక్టును మంత్రి బయటకు తెచ్చారని చింతలపూడి ఆరోపించారు. చెరువు ఆక్రమణలు తొలగించి అందులో అభివృద్ధి చేస్తే అభినందించడానికి తాను ముందుంటానన్నారు. సర్వేనంబరు 95 నంబర్లో ఏక మొత్తంగా 132 ఎకరాల ఊర చెరువు విిస్తీర్ణం ఉందన్నారు. అందులో కొంత మంది నిరుపేదలు నిలవడానికి తావు లేక గుడిసెలు వేసుకుంటే అది బూచిగా చూపి కబ్జాలు చేశారన్నారు. అధికారులు కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం చెరువులోని 32 ఎకరాల్లో ఇంటి నిర్మాణాలు, ఐదెకరాల్లో రోడ్లు ఉండగా, 1.80 ఎకరాల్లో శ్మశానం, ఒక ఎకరంలో ప్రభుత్వ భవనాలు ఉన్నాయన్నారు. 32.42 ఎకరాలు ఆక్రమణలకు గురైందని చెప్పారు. అందులో 338 మంది ఆక్రమణదారులు ఉండగా, అందులో 150 మంది నిరుపేదలని వివరించారు. దానిపై స్థానికుడు కోర్టుకు వెళితే ఆక్రమణలు తొలగించాలని కోర్టు తీర్పు ఇస్తే ఇంత వరకూ అధికారులు ఏ చర్య తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. దానిపై రిట్ వేయడం, అధికారులు పెనాల్టీ కట్టడం నిజం కాదా? అని ప్రశ్నించారు. పేదల పక్షాన నిలబడతా.. తెలియక రియల్టర్ల మాయలో పడి ప్రభుత్వ ఆస్తులు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించి ఇవ్వాలని చింతలపూడి డిమాండ్ చేశారు. వారి పక్షాన తాను అండగా నిలబడతానన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను కోర్టు మెట్లు ఎక్కించి పేదలకు పరిహారం ఇప్పించేలా చూస్తామని హెచ్చరించారు. పార్టీ తరఫున, పేదల తరఫున న్యాయ పోరాటం చేస్తానన్నారు. కోర్టులో కేసు వేస్తామని చెప్పారు. సమావేశంలో బాపట్ల జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జ్యోతి రోశయ్య, శింగరకొండపాలెం మాజీ సర్పంచ్ యెర్రిబోయిన వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు లక్కెనబోయిన రవి, రావినూతల గ్రామపార్టీ అధ్యక్షుడు రఘురామయ్య ఉన్నారు. -
ఎడారిని తలపిస్తున్న పంట పొలాలు
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా జిల్లాలో చినుకు జాడలేదు. పచ్చదనంతో కళకళలాడాల్సిన పొలాలు వర్షాభావంతో ఎడారిని తలపిస్తూ బీడుగా మారాయి. వానలు లేక చాలామంది రైతులు సాగుకు దూరమయ్యారు. అరకొర బోరు నీటితో కొందరు పత్తిని కాపాడుకుంటుండగా.. మెట్ట ప్రాంతాల్లో వేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పనులు లేక రైతులు, వ్యవసాయ కూలీలు అల్లాడుతున్నారు. అసలు వర్షాలు కురుస్తాయో, లేదోనన్న ఆందోళన వారిలో నెలకొంది. వానలు పడితే ప్రత్యామ్నాయ పంటలైనా వేసుకుందామని రైతులు భూములు దున్ని సిద్ధంగా ఉంచుకున్నారు. మొత్తానికి రైతులకు వ్యవసాయం కత్తిమీద సాములా మారింది. -
దేశభక్తి ఇనుమడించేలా స్వాతంత్య్ర వేడుకలు
ఒంగోలు సబర్బన్: స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఆగస్టు 15న నిర్వహించే 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దేశభక్తి ఇనుమడించేలా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ పి.రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజుతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు ఉండాలన్నారు. పాఠశాల విద్యార్థుల చేత దేశభక్తి, మత సౌభ్రాతృత్వం, సామరస్యం ప్రతిబింబించేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అధికారులతో ఒక కమిటీని వేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)ని ఆదేశించారు. ప్రొటోకాల్ నిబంధనలు పాటిస్తూ వీఐపీ గ్యాలరీ, వేదిక (డయాస్) ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డయాస్ చుట్టూ అనవసరమైన రాకపోకలను నిషేధిస్తామని తెలిపారు. దేశభక్తిని చాటిచెప్పే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కవాతు, ఆకర్షణీయమైన పోలీస్ బ్యాండ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి, డివిజనల్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కందుకూరు రూరల్: మండలంలోని పలుకూరు గ్రామంలో డెంగీ కేసు నమోదైంది. ఇటీవల జ్వరంతో కందుకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వ్యక్తికి డెంగీ నిర్ధారణ అయింది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో పారిశుధ్యం అధ్వానంగా తయారై డెంగీ కేసులు నమోదవుతున్నాయి. కందుకూరు: పట్టణంలో సోమవారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దారిన పోయే వారిని వెంటబడి మరీ కరవడంతో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఓవీ రోడ్డులోని పాత స్టేట్ బ్యాంక్ సమీపంలో పాఠశాల నుంచి వస్తున్న ఆషీర్ అనే చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేయగా, స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మరికొందరినీ ఆ కుక్క కరిచింది. గాయపడిన సుమారు 15 మంది బాధితులు ఏరియా ఆస్పత్రికి పరుగులు తీశారు. వైద్యులు వారికి యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స అందించారు. పట్టణంలోని ప్రతి వీధిలో పదుల సంఖ్యలో వీధికుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి భయంతో బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నామన్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు. -
ఇన్చార్జ్ డీఈఓగా సీవీ రేణుక బాధ్యతలు
ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లా ఇన్చార్జ్ డీఈఓగా ఏపీఎస్ఈఆర్ఎంసీ సంయుక్త డైరెక్టర్ సీవీ రేణుక సోమవారం బాధ్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లా డీఈఓ గా ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయా అధికారులు తమ రెగ్యులర్ బాధ్యతలతో పాటు ఈ అదనపు బాధ్యతలను నిర్వహించాలని, వెంటనే బాధ్యతలు స్వీకరించి నివేదిక అందజేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి (2024–25 అడ్మిటెడ్ బ్యాచ్) నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఏకేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్.మూర్తి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు సోమవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు వివిధ కోర్సులకు సంబంధించి మొత్తం 894 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 92.62 ఉత్తీర్ణత శాతంతో 828 మంది విద్యార్థులు పాసైనట్లు సీఈ ప్రొఫెసర్ జి.సోమశేఖర తెలిపారు. ఆంధ్ర కేసరి యూనివర్సిటీ స్థాయిలోను, ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఏకేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు, సీఈ ప్రొఫెసర్ జి.సోమశేఖర అభినందించారు. నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాల విడుదల కార్యక్రమంలో పీజీ ప్రొఫెషనల్ కోర్సుల కో ఆర్డినేటర్ డాక్టర్ ఎ.అమృతవల్లి దేవి, బీఎడ్ కోర్సుల కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రజా ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి
● పోలీస్ గ్రీవెన్స్‌లో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఒంగోలు టౌన్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తూ, చట్టపరిధిలో విచారణ జరిపి బాధితులకు సాధ్యమైనంత వరకు సత్వర న్యాయం అందించేలా పోలీసు అధికారులు కృషి చేయాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ’మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి ఎస్పీ స్వయంగా వినతులు స్వీకరించి, వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా సమస్యలపై ఎస్పీ వెంటనే స్పందించి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా నిర్దేశిత సమయంలోగా ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. అవసరమైతే అధికారులే స్వయంగా ఘటనా స్థలాలను సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్.యుగంధర్ బాబు, కందుకూరు సీఐ అన్వర్ బాషా, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ప్యానల్ అడ్వకేట్ బి.బాలాజీ సింగ్, గ్రీవెన్స్ ఎస్సై షేక్ యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2026
గిద్దలూరు అటవీశాఖ పరిధిలోని అభయారణ్యంలో వేటగాళ్లు, అటవీ సంపదను కొల్లగొట్టే అక్రమార్కుల అడుగులు పడుతుండటంతో అలజడి ఎక్కువైంది. రెండు నెలల వ్యవధిలోనే నాలుగు పులులు మృత్యువాత పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అభయారణ్యంలోకి ఇతరులు ప్రవేశించేందుకు అటవీశాఖలోని ఇంటి దొంగల ప్రమేయం ఉందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.● నల్లమల అభయారణ్యంలో అలజడి ● 2 నెలల వ్యవధిలో నాలుగు పులులు మృత్యువాత ● అడవిలో అనుమతులు లేని అడుగులు ● అటవీశాఖలో ఇంటి దొంగలు ఎవరు? గిద్దలూరు రూరల్: దేశంలోనే అతిపెద్ద టైగర్ జోన్‌గా పేరుగాంచిన నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ పరిధిలో మార్కాపురం, ఆత్మకూరు, గిద్దలూరు, నంద్యాల అటవీశాఖ డివిజన్లు కలిసి 3,800 హెక్టార్లలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. విశాలమైన అటవీ ప్రాంతంలో కలప, వెదురు నరికే వారి గొడ్డలి చప్పుళ్లతో పాటుగా వేటగాళ్ల తుపాకీ శబ్దాలకు వన్యప్రాణులు బిక్కు బిక్కు మంటున్నాయి. గడిచిన రెండు నెలల వ్యవధిలో ఆత్మకూరు నాగలూటి వద్ద ఒకటి, నంద్యాల డివిజన్ గుండ్లబ్రహ్మేశ్వరంలో ఒకటి, చలమ దిగువమెట్ట మధ్యలో రైల్వేట్రాక్ పై ఒకటి, రాచర్ల బీటు పరిధిలో ఒకటి మొత్తం నాలుగు పులులు మృత్యువాతపడ్డాయి. నల్లమలలో 80కిపైగా వరకు పులులు ఉండవచ్చని అటవీ శాఖాధికారుల అంచనా. 2022 నుంచి 2026 వరకు గుండ్లకమ్మ రేంజి పరిధిలో దుప్పి, జింక, ఉడుము, కణతి, నెమలి, అడవి పందులు, వంటి ఇతర వన్యప్రాణులను వేటాడిన కేసులు 50 కి పైగా నమోదయ్యాయని సమాచారం. వేటగాళ్ల చేతిలో గాయపడిన వన్యప్రాణులకు అటవీశాఖ అధికారులు చికిత్స అందించి సురక్షితంగా అభయారణ్యంలో వదిలిన సంఘటనలు అనేకం జరిగాయి. అటవీశాఖ వారి అనుమతులు లేనిదే అభయారణ్యంలో బయటివారు ఎలా అడుగు పెట్టగలుగుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గిద్దలూరు డివిజన్లోని రాచర్ల బీటులో పెద్దపులి మరణించడం అటవీశాఖను ఉలిక్కిపడేలా చేసింది. గత నెల 31వ తేదీన అంబచెరువు, తట్టేమడుగు పరిసర ప్రాంతాల్లో లోతువాగులో పెద్దపులి కళేబరం కనిపించింది. అప్పటికి మరణించి 15 రోజులై ఉంటుందని భావిస్తున్నారు. ఇన్నిరోజులు ఒక పులి చనిపోయిన విషయం ఎందుకు బయటకు రాలేదు? కింది స్థాయి ఉద్యోగుల గస్తీ లేకపోవడమా.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులిని వేటగాళ్లు చంపారా లేదా సహజమరణమా, అభయారణ్యంలో చనిపోయిన పులి వద్దకు ఎవరు వెళ్లారు, గోర్లు తీసే సమయం లేక పులి నాలుగు కాళ్లను నరికి ఎవరు తీసుకెళ్లారు అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పటి వరకు రాలేదు. పులి మృతదేహం గుండ్లకమ్మ రేంజి రాచర్ల బీటులో లభ్యమైనా తురిమెళ్ల రేంజీలో చనిపోతే తమ సరిహద్దులో తీసుకొచ్చి వేశారనే విషయమై రెండు రేంజిల్‌లోని అటవీశాఖ అధికారులు వాదనలకు దిగుతున్నట్లు సమాచారం. రెండు రేంజిలకు సంబంధించిన సరిహద్దుల్లో పులి చనిపోవడం వారికి పెద్ద తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. గిద్దలూరు అటవీశాఖ పరిధిలో గుండ్లకమ్మరేంజి, తురిమెళ్లరేంజి, బేస్తవారిపేట రేంజి, గిద్దలూరు రేంజి, స్క్వాడ్ రేంజి, డీఈటీ రేంజీ, మొత్తం 6 రేంజీలు ఉన్నాయి. బేస్తవారిపేటకు రేంజర్ ఎం.వీరాస్వామి, గిద్దలూరుకు సత్యనారాయణరెడ్డి, తురిమెళ్లకు బి.మదుప్రియాంక మాత్రమే ఉన్నారు. గుండ్లకమ్మ, డీఈటీ రెండు రేంజీలకు వీరస్వామి అదనపు బాధ్యత వహిస్తున్నారు. స్క్వాడ్ రేంజికి అందులో ఉన్న డీఆర్ఓ శేషయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గుండ్లకమ్మరేంజి ఆఫీసర్, డీఈటీ రేంజిలను సుమారు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న బేస్తవారిపేట రేంజి ఆఫీసర్‌కు అప్పగించి దగ్గరలో ఉన్న గిద్దలూరు రేంజీ ఆఫీసరు సత్యనారాయణరెడ్డికి అప్పగించకపోవడంలో ఆంతర్యం ఏమిటో అటవీశాఖ ఉన్నతాధికారులకే తెలియాలి.అడవితో పాటుగా అడవిలోని వన్యప్రాణులను సంరక్షించాల్సిన అటవీశాఖ కేవలం అభయారణ్యంలో జరిగే చెక్‌డ్యామ్‌లు, బిల్డింగ్ పనులు, బేస్‌క్యాంపు నిర్మాణాలు, రోడ్డు వంటి ఇతర పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ఇంజినీరింగ్ సెక్షన్ పై ఎలాంటి అనుభవం లేని అటవీశాఖ ఉద్యోగులతో ఇటువంటి అన్ని పనులను వారే దగ్గర ఉండి పని చేయిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఆ వారి సమయం అంతా ఇటువంటి పనులకే పరిమితమైతే ఇక అడవితో పాటుగా వన్యప్రాణుల సంరక్షణను విస్మరించారు. -
శిశువును కొనుగోలు చేసిన దంపతుల అరెస్టు
● వారికి ఢిల్లీ నుంచి తోడుగా వచ్చిన ఆలం అరెస్టు లబ్బీపేట(విజయవాడతూర్పు): కొన్నేళ్లుగా సంతాన సాఫల్య చికిత్సలు పొందినా పిల్లలు పుట్టని ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులు ఢిల్లీలో శిశువును అక్రమంగా కొనుగోలు చేశారు. అక్కడి నుంచి శిశువును తీసుకుని సొంతూరుకి వెళ్తున్న పరిస్థితిలో ఆదివారం విజయవాడలో పోలీసులకు చిక్కారు. రాజీవ్‌గాంధీ పార్కు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి వద్ద నవజాత శిశువు ఉండటంతో అనుమానం వచ్చి విచారణ చేయగా అక్రమంగా కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. ఆ దంపతులతో పాటు, వారికి ఢిల్లీ నుంచి తోడుగా వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి మానవ అక్రమ రవాణా, శిశువు కొనుగోలు– అమ్మకం యాక్ట్‌లపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..ప్రకాశం జిల్లా పోలవరానికి చెందిన కొనతం వెంకట కృష్ణారెడ్డి, శివపార్వతి దంపతులకు పిల్లలు లేక పోవడంతో అనేక ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య చికిత్సలు పొందారు. చివరికి ఢిల్లీలో ఉన్న ఓ ఐవీఎఫ్ సెంటర్‌కు వెళ్లగా అక్కడ ఇక పిల్లలు జన్మించరని నిర్ధారించారు. అదే ఆస్పత్రిలో పనిచేసే అమ్రిన్‌తో వారికి పరిచయం ఏర్పడింది. డబ్బులకు శిశువును విక్రయించేలా ఆమెతో దంపతులు మాట్లాడుకున్నారు. అమ్రీన్ సూచన మేరకు విడతల వారీగా రూ.6.59 లక్షలు ఆ దంపతులు చెల్లించారు. పాపను తీసుకోవడానికి రావాలని చెప్పడంతో వెంకట కృష్ణరెడ్డి, శివపార్వతి ఇటీవల ఢిల్లీ వెళ్లారు. అక్కడ అమ్రీన్ ఒక ఆడ శిశువును వారికి ఇచ్చి, తోడుగా తన భర్త సయ్యద్ ఆలంను పంపించింది. తనిఖీల్లో పట్టుబడింది ఇలా.. వెంకట కృష్ణారెడ్డి, శివపార్వతి దంపతులు నవజాత శిశువును తీసుకుని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న తరుణంలో రాజీవ్‌గాంధీ పార్క్ వద్ద మహిళా స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసవి తన సిబ్బందితో కలిసి తనిఖీలో చేస్తుండగా చిక్కారు. అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత, టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ కె.లతా కుమారి, సౌత్ ఏసీపీ మానసల సూచన మేరకు వారిని విచారణ చేయగా అక్రమంగా శిశువును కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎక్కువ డబ్బుల సంపాదించాలని.. బిహార్‌లోని న్యూకరీమ్గంజ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆలం, అమ్రీన్ ఢిల్లీకి వలస వెళ్లారు. అక్కడ అమ్రీన్ ఓ ఐవీఎఫ్ సెంటర్లో పనిచేస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పిల్లలు లేని వారిని కలిసి డబ్బులకు పిల్లలను విక్రయించాలనుకున్నారు. అలా శిశువును విక్రయించి పోలీసులకు చిక్కారు. -
ధాన్యం, బియ్యం ధరలు ౖపైపెకి
సింగరాయకొండ: చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగా వరిధాన్యం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంపై అటు రైతులు, ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరిధాన్యం కోతల సమయంలో ప్రభుత్వాలు ఎక్స్‌పోర్టుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పెద్దగా డిమాండ్ లేక దళారులు ధరలు దిగ్గోసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం కూడా వరికోతల సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా చివరి దశలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు చేసినట్లు చూపించి చివరికి మమ అనిపించారు. తీరా రైతుల దగ్గర ధాన్యం నిల్వలు అయిపోయాక విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వడంతో ధాన్యం లేక ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కోతల సమయంలో ఎగుమతులకు అనుమతి ఇచ్చి ఉంటే రైతులకు లబ్ధి చేకూరేదని అంటున్నారు. ఇటీవల ఎగుమతులకు అనుమతి వచ్చిన తరువాత ధాన్యం 75 కేజీల జీలకర మసూర, కేఎన్ఎం రకం రూ.2,700 ఉండగా ఆదివారానికి జీలకర మసూర రకం రూ.2,800 లు ఉండగా, కేఎన్ఎం రకం రూ.3 వేలు ఉంది. చివరకు ధాన్యం ధరలు గత 50 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా షేర్ మార్కెట్‌ను తలపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. రోజురోజుకూ ధరలు పెరుగుతుండటంతో రైతులు కూటమి ప్రభుత్వ పనితీరును విమర్శిస్తున్నారు. ప్రభుత్వ చర్యలు రైతుల నోట్లో మట్టికొట్టి దళారులకు, బడా వ్యాపారులకు లబ్ధిచేకూర్చేలా ఉన్నాయని మండిపడుతున్నారు. మరో పక్క ధాన్యం ధరలు పెరగటంతో బియ్యం ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. 25 కేజీల జీలకర రకం మసూర రకం నిన్నటి వరకు రూ.1,200 నుంచి రూ.1,300 ఉండగా ప్రస్తుతం రూ.1,500 నుంచి రూ.1,600 ఉన్నాయని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం ధరలు అమాంతం పెరగటంతో వ్యాపారులు సాధారణ బియ్యం లో రేషన్ బియ్యం కలుపుతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రేషన్ బియ్యం పక్కదారులు పట్టకుండా తగిన చర్యలు తీసుకుని బియ్యం ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
విద్యుదాఘాతానికి ట్రాలీ డ్రైవర్ మృతి
సీఎస్‌పురం(పామూరు): విద్యుదాఘాతానికి జేసీబీ టిప్పర్ ట్రాలీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మండలంలోని ఉప్పలపాడు గ్రామ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జేసీబీ టిప్పర్ ట్రాలీ డ్రైవర్ మాదినేని వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవర్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం జేసీబీని టిప్పర్ ట్రాలీ వాహనంపై ఎక్కించుకుని నిర్మాణంలోఉన్న హైవే మీదకు తీసుకువెళ్తుండగా ఉప్పలపాడు గ్రామ సమీపంలో రోడ్డుపైన ఉన్న విద్యుత్‌వైర్లు గాలికి ప్రమాదవశాత్తు జేసీబీకి తగలగా విద్యుదాఘాతానికి గురై మాదినేని వెంకటసుబ్బయ్య(50) అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై మృతుని సోదరుడు బాలక్రిష్ణ ఇచ్చిన పిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం వెంకటసుబ్బయ్య భౌతికకాయాన్ని కనిగిరి వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య మాధవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అప్పటివరకు తమతో ఉన్న భర్త ఇలా మృత్యువాత పడటంతో భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
సమ్మె కాలపు వేతనం చెల్లించాలి
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థలో కార్మికులకు పెండింగ్‌లో ఉన్న గత సమ్మె కాలపు వేతనం వెంటనే చెల్లించాలని పారిశుధ్య కార్మికులు మస్టర్ పాయింట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సంతపేటలోని వార్డు సచివాలయంలోని మస్టర్ పాయింట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆందోళనకు దిగారు. సీఐటీయూ పారిశుధ్య కార్మికులు యూనియన్ నగర కార్యదర్శి టి.విజయమ్మ మాట్లాడుతూ పారిశుధ్యం కార్మికులు గత మూడు నెలల నుంచి సమ్మె కాలపు వేతనాలు ఏడు రోజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులకు అనేక దఫాలుగా విన్నవించుకున్నా సమస్యలు పరిష్కారం చేయట్లేదని ధ్వజమెత్తారు. స్థానిక ఐదో డివిజన్ మస్టర్ పాయింట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం జీఓ వచ్చి మూడు నెలలు అవుతున్నా నేటికీ ఒంగోలు పారిశుధ్య కార్మికులకు వేతనం చెల్లించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వేతనంతో పాటు సమ్మెకాల వేతనం కూడా చెల్లిస్తామని చెప్పారని, కానీ వేతనం ఒకటో తేదీన వేసినా కానీ సమ్మె కాలపు వేతనం రాలేదన్నారు. వెంటనే సమ్మె కాలం వేతనం ఇవ్వాలని. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, తల్లికి వందనం కార్మికులందరికీ వర్తింపచేయాలని నినాదాలు చేశారు. నాయకులు కె.శ్రీనివాసరావు, యు.రత్నకుమారి, ఆర్.శ్రీనివాసరావు, జి.నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఽ ప్రభుత్వం జీఓ ఇచ్చినా నిర్లక్ష్యం సంతపేట సచివాలయం వద్ద పారిశుధ్య కార్మికుల నిరసన -
ఉన్నత విద్యకు ఆటంకం
విద్యావ్యవస్థలో సంస్కరణల సంగతి దేవుడెరుగు.. ఉన్న వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ఇప్పటికే పాఠశాల విద్యను భ్రష్టు పట్టించిన ప్రభుత్వం ఉన్నత విద్యా వ్యవస్థనూ గాడితప్పిస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు లబ్ధిచేకూర్చేలా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఫలితంగా విద్యార్థులంతా గత్యంతరం లేక ప్రైవేటు కాలేజీల్లో చేరాల్సి వస్తోంది.కంభం: రెండేళ్లుగా విద్యా వ్యవస్థ పతనావస్థలో ఉంది. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ విద్యను పట్టించుకోకుండా ప్రైవేటు, కార్పొరేట్‌కు వంత పాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలను నిర్వీర్యం చేశాడు. ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు ప్రభుత్వం నేటికీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు బీటెక్, ఇతర కోర్సుల్లో చేరిపోతుండగా డిగ్రీ చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఎదురు చూపు తప్పడం లేదు. విద్యారంగంలో సంస్కరణలంటూ చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో అది ఆచరణకు నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది కూడా అడ్మిషన్లలో జాప్యమే.. గతేడాది (2025–26) కూడా చంద్రబాబు ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేయడంతో తీవ్ర జాప్యం చేసింది. దీంతో డిగ్రీలో చాలా ఆలస్యంగా చేరాల్సి వచ్చింది. అడ్మిషన్లు ఆలస్యం కావడంతో తరగతులు ఆలస్యంగా ప్రారంభమై సిలబస్ పూర్తి చేయడానికి అధ్యాపకులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ సారైనా అడ్మిషన్ల నోటిఫికేషన్ సకాలంలో విడుదలవుతుందనుకుంటే ఇంత వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రైవేట్ కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రైవేటు కళాశాలలకు లబ్ధి చేకూరేలా ఉన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు, కమ్యూనిస్టు నాయకులు చెబుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి అడ్మిషన్లు పూర్తయిన తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయి. చాలా ప్రైవేటు కళాశాలల్లో మాత్రం ఇప్పటికే విద్యార్థులను చేర్చుకొని తరగతులు ప్రారంభించేశారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వారి అడ్మిషన్లను ఆన్లైన్ చేసుకునేందుకు ఇప్పటికే విద్యార్థుల నుంచి అవసరమైన సర్టిఫికెట్లను తీసుకొని సిద్ధంగా ఉంచుకున్నారు. దీని వల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంతగూడు కరువు.. మార్కాపురం జిల్లాలో 29 ప్రైవేటు డిగ్రీ కళాశాలలుండగా 4 చోట్ల (యర్రగొండపాలెం, కనిగిరి, కంభం, దోర్నాల) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. యర్రగొండపాలెం, కనిగిరి కళాశాలలకు సొంత భవనాలుండగా, కంభం, దోర్నాలలో ఇంటర్మీడియెట్ కళాశాలలోనే పైన ఉన్న గదుల్లో తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. 2008 డిసెంబర్లో అప్పటి కంభం ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులు రెడ్డి కృషితో కంభంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేశారు. కళాశాల నిర్మాణానికి స్థలం లేకపోవడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే నిర్వహించేలా నిర్ణయం తీసుకొని తరగతులు జరపడం ప్రారంభించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దోర్నాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైంది. కళాశాలలో సుమారు 150 మంది విద్యార్థులుండగా సొంత భవనం లేకపోవడంతో జూనియర్ కళాశాలలోనే పైన ఉన్న గదుల్లో డిగ్రీ తరగతులను బోధిస్తున్నారు. గతేడాది మార్కాపురం సబ్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని మైదానంలో ఓ వైపున డిగ్రీ కళాశాల కోసం ఒక ఎకరా స్థలాన్ని పరిశీలించి మంజూరు కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపించినా ఇంకా అమలుకు నోచుకోలేదు. దోర్నాలలో అధికారులు సొంత స్థలం కేటాయించడంలో జాప్యం వహిస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్పైనా సందిగ్ధం.. ఎఫ్ఆర్ఎస్ ద్వారా విద్యార్థుల హాజరు నిబంధన పెడుతుండటంతో కళాశాలల యాజమాన్యాలు సందిగ్ధంలో పడ్డాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పైనే ఆధారపడి నిర్వహిస్తున్న కళాశాలలకు 80 శాతం హాజరుండాలనే నిబంధన మరింత తలనొప్పిగా మారనుంది. యాప్‌లు సక్రమంగా పనిచేయకపోవడం, ఫేస్‌లు సరిగా పడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు. -
కూలీల ఆటో బోల్తా
● 10 మందికి గాయాలు యర్రగొండపాలెం: కూలి పనులకు వెళ్తున్న ఆటో ఆదుపుతప్పి బోల్తా పడి 10 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని నరసాయపాలెంకు చెందిన కూలీలు ఆది వారం ఒక ఆటోలో పనుల నిమిత్తం త్రిపురాంతకం వెళ్తున్న సమయంలో రామసముద్రం ఎస్సీ కాలనీ వద్ద ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించే ప్రయత్నంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో సి.నాగలక్ష్మమ్మ, పి.మునెమ్మ, శివానీ, రాజయ్య, నాగలక్ష్మి, కె.మస్తానమ్మ, పాశం మస్తానమ్మ, బాలయ్య, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆటోలో 15 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగలక్ష్మమ్మ, నాగలక్ష్మి, మస్తానమ్మ -
అడ్డగోలుగా నిర్మిస్తారా..?
అధికారం ఉందని నీళ్లుంటే నా మనవడు బతికేవాడా... డ్రైనేజీ కాలువలో నీళ్లు ఉండిఉంటే నా మనవడు బతికే వాడా అంటూ క్షతగాత్రుడు రాజ్‌కుమార్ నాయనమ్మ రత్తమ్మ బోరున విలపిస్తోంది. కాలువలో నీళ్లు లేవుకాబట్టి కాలు విరిగి ప్రాణాలు నిలబడ్డాయి. అదే నీళ్లు ఉండి జోరుగా పారుతుంటే ప్రాణాలు దక్కేవేనా అంటూ రోదించింది. విరిగిన కాలు కదపనీయట్లేదు. పట్టుకుంటే ఏడుస్తున్నాడు. రాత్రింబవళ్లూ నిద్ర లేకుండా పిల్లాడు అల్లాడిపోతున్నాడు. – రెబ్బవరపు రత్తమ్మ, రాజ్ కుమార్ నాయనమ్మ ఎమ్మెల్యే వచ్చినప్పుడు స్లాబు వేయమని వేడుకున్నాం. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన రావు గ్రామానికి వచ్చినప్పుడు డ్రైనేజీ కాలువ మీద స్లాబు వేయమని వేడుకున్నాం. పిల్లలు ఆడుకుంటూ కాలువలో పడి తీవ్రగాయాల పాలవుతున్నారని కూడా చెప్పాం. కానీ ఎమ్మెల్యే కూడా కనీసం పట్టించుకోలేదు. స్లాబు వేసి ఉంటే రెండో తరగతి విద్యార్థి రాజ్ కుమార్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. – మందా దీప, అమూల్య తల్లి.. ఒంగోలు సబర్బన్: అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ డ్రైనేజీ..గ్రామంలోని చిన్నారులకు ప్రాణ సంకటంగా మారింది. అసలు కట్టాల్సిన చోట డ్రైనేజీ కట్టకుండా అడ్డగోలుగా నూతనంగా నిర్మాణం చేపట్టారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్ చెరువుకొమ్ముపాలెంలోనే. ఆ డివిజన్‌కు కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ పీఠమెక్కిన మహిళా ప్రజాప్రతినిధి ఏరియాలోనే. చెరువుకొమ్మపాలెంలో సదరు మహిళా నేత సొంత భవనం పక్కనే ఉన్న డ్రైనేజీని కాదని పడమరగా తీస్తే భవనం పోతుందని నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలోని రోడ్డుకు తూర్పుగా తీసి బడుగుల రేకుల షెడ్లను కూలగొట్టించి మరీ డ్రైనేజీ నిర్మాణం చేపట్టే విధంగా అధికారులను పురమాయించారు. ఆ డ్రైనేజీ ప్రస్తుతం చెరువుకొమ్ముపాలెంలోని కొత్తపాలెం ఎస్సీ కాలనీవాసులకు ప్రాణాలపైకి వచ్చింది. అలా నిర్లక్ష్యంగా వదిలిస్తే ఎలా..? చెరువుకొమ్ముపాలెం గ్రామంలో బీఈడీ కాలేజీకి ఎదురుగా ఉన్న కొత్తపాలెం ఎస్సీ కాలనీ ముందు నూతనంగా నిర్మించిన భారీ డ్రైనేజీ కాలువ ఆ కాలనీలో చిన్నారుల పాలిట శాపంగా మారింది. ఆరడుగుల లోతులో నాలుగడుగుల వెడల్పులో డ్రైనేజీ నిర్మాణం చేశారు. అంత పెద్ద డ్రైనేజీ ఒంగోలు నగరంలో కూడా లేదు. అయితే ఆ భారీ డ్రైనేజీ మీద స్లాబు వేయకుండా వదిలేశారు. దాంతో ఆ పాలెంకు చెందిన చిన్నారులు ఆడుకుంటూనో, దాటే సమయంలోనో జారి ఆ కాలువలో పడి కాళ్లు, చేతులు విరగ్గొట్టు కోవటంతో పాటు తీవ్ర గాయాలపాలవుతున్నారు. గత మూడు, నాలుగు నెలల నుంచి దాదాపు 10 మందికి పైగా చిన్నారులు ఆ డ్రైనేజీ కాలువలో పడి తీవ్రగాయాల పాలయ్యారు. గాయాలపాలైన చిన్నారులంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులే గాయాల పాలైన వారందరో..? కాలనీకి చెందిన రాజ్‌కుమార్ రెండో తరగతి చదువుతున్నాడు. పెళ్లూరులోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా కాలు జారీ స్లాబు వేయకుండా వదిలేసిన డ్రైనేజీ కాలువలో పడటంతో కాలు విరిగింది. డ్రైనేజీ కాలువలో పడి రోదిస్తున్న రాజ్ కుమార్‌ను రోడ్డున వెళ్లే వారు గమనించి బయటకు తీశారు. కుంటల్లో పడి ఐదుగురు చిన్నారుల మృత్యువాత.... చెరువుకొమ్ముపాలెం గ్రామంలోనే రెండు కుంటల్లో ప్రమాదవశాత్తూ పడటంతో ఐదుగురు చిన్నారులు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. జూలైలోనే ఈ రెండు ప్రమాదాలు సంభవించటంతో గ్రామం మొత్తం ఒక్కసారిగా శోకసంద్రంలోకి వెళ్లిపోయింది. అక్రమంగా మట్టి తవ్వటంతో లోతైన గొయ్యలుగా మారటంతో చిన్నారులు దిగిన వెంటనే లోతు తెలియకు ప్రాణాలు కోల్పోయారు. చెరువుకొమ్ముపాలెం నుంచి కందులూరుకు వెళ్లే డొంకలో అక్రమంగా గ్రావెల్ కోసం తవ్విన కుంటలో పడి ఒకే రోజు నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆ తరువాత గుర్రంవారి చెరువులో పడి మరో చిన్నారి మృతి చెందాడు. అడ్టగోలుగా నిర్మాణం చేపట్టారు కొత్త పాలెం ఎస్సీ కాలనీ వద్ద నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయీలో డ్రైనేజీనిర్మించారు. మాజీ మహళా ప్రతినిది భవనం పోకుండా ఉండేందుకు పడమర వైపు ఉన్న పాత డ్రైనేజీ కాలువ స్థానంలో నిర్మాణం చేయాల్సింది పోయి తూర్పు వైపు నిర్మాణం చేయించారు. దాంతో ప్రస్తుతం ఎస్సీ కుటుంబాలకు చెందిన చిన్నారులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు కూడా అడ్డగోలుగా నిర్మాణం చేపట్టారు. – పూసపాటి సమర సింహా రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రోడ్డుకు పడమర వైపు నిర్మించాలని పోరాటం చేశాం.. డ్రైనేజీ నిర్మాణాన్ని రోడ్డుకు పడమర వైపు నిర్మాణం చేయాలని నిర్మాణ సమయంలో పోరాటం చేశాం. రోడ్డుకు పడమర వైపు 30 అడుగులు ఖాళీ స్థలం ఉంది. అది డ్రైనేజీ నిర్మాణం కోసమే గతంలో వదిలారు. ఆ స్థానంలోనే పాత డ్రైనేజీ కాలువ కూడా ఉంది. గ్రామానికి చెందిన దళిత నాయకుడు ఒకరు కావాలని ఈ కాలనీ మీద కక్షకట్టి మరీ మేయరుకు చెప్పి మరీ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాడు. – తాటిపర్తి రాగయ్య, వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి... చెరువుకొమ్ముపాలెం ఎస్సీ కాలనీలో లోతైన డ్రైనేజీతో భయం భయం.. నిబంధనలకు విరుద్ధంగా డ్రైనేజీ నిర్మాణం మహిళా ప్రజాప్రతినిధి భవనం కాపాడేందుకు పాత డ్రైనేజీ కాదని కొత్త డ్రైనేజీ నిర్మాణం డ్రైనేజీపై సిమెంట్ స్లాబు వేయకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్న చిన్నారులు -
రాజగోపుర నిర్మాణానికి వైవీ అంగీకారం
● రాజగోపురం నిర్మాణానికి రూ.2 కోట్లు వ్యయం అద్దంకి: మండలంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో రాజగోపురాల పునఃనిర్మాణ కార్యక్రమానికి దేవదాయ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. రాజగోపుర నిర్మాణానికి ముందుకు వచ్చే దాతల నుంచి అంగీకార పత్రాలను దేవస్థాన అధికారులు తీసుకుంటారన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ వైవీ భద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తండ్రి వైవీ పోలిరెడ్డి గతంలో ఇదే క్షేత్రంలో పడమర రాజగోపురాన్ని కట్టించారు. దాని పునఃనిర్మాణంలో భాగంగా అదే రాజగోపురాన్ని మళ్లీ తామే కట్టించేందుకు ఆదివారం వైవీ భద్రారెడ్డి ఆలయ ఏసీ మదమంచి తిమ్మాయనాయుడికి అంగీకార పత్రం అందజేశారు. కనిగిరిరూరల్: బేస్ బాల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం మండలంలోని కంచర్లవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా మల్లెబోయిన మల్లికార్జున, కార్యదర్శిగా మద్దులూరి కొండలరావు, జాయింట్ సెక్రటరీగా పొట్టేండ్ల బసవయ్యలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సీహెచ్ విజయ భాస్కర్‌రెడ్డి, డీఎస్ఏ అబ్జర్వర్ సుకుమార్, బేస్‌బాల్ స్టేట్ అసోసియేషన్ నుంచి అబ్జర్వర్ రాజేంద్రనాథ్, న్యాయవాది దెవేండ్ల బాలాజీ, పీఈటీలు హజరత్‌రెడ్డి, ప్రసాద్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తి: వర్షాలు కురవాలని, పశువులకు పశుగ్రాసం కావాలని యాదవ రాజుల కుటుంబాలు ఆదివారం చీమకుర్తిలోని పోలేరమ్మ తల్లికి పొంగళ్లు పెట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఇళ్ల వద్దే వారు పొంగళ్లు పెట్టుకొని మేళ తాళాలతో ఊరేగింపుగా అమ్మవారికి నైవేద్యం పెట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. అమ్మవారిని సుందరంగా నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి తమ కోర్కెలను తీర్చాలని మొక్కుకున్నారు. -
అభివృద్ధి ప్రాజెక్టులను ప్రైవేటుపరం చేస్తే పోరాటం
ఒంగోలు సిటీ: ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందని, వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని తన స్వగృహంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇచ్చామని, అలాగే మత్స్యకారుల అభ్యున్నతి కోసం ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా అలాంటి నిర్ణయాలు తీసుకుంటే వైఎస్సార్ సీపీ ప్రజలతో కలిసి ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. రైతుల తరఫున పోరాడతాం.. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మామిడి, పొగాకు, అరటి, పత్తి, శనగ తదితర పంటలకు రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఉప్పు సాగు చేసే రైతులు కూడా ధరలు లేక తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. రైతుల పంటలకు న్యాయమైన ధరలు లభించే వరకు వైఎస్సార్సీపీ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని వెల్లడించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో పొగాకు రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, అవసరమైన సమయంలో ప్రభుత్వమే కొనుగోళ్లు చేపట్టి రైతులకు అండగా నిలిచిందని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. రైతు సంక్షేమమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని, రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. పొగాకు రైతుల విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతో తాము మాట్లాడతామన్నారు. ఈ మధ్యకాలంలో జీఎస్టీ తగ్గిస్తేనే ఈ వ్యాపారులు ముందుకు వచ్చే పరిస్థితి ఉందని, కేంద్రమంత్రులతో, పార్లమెంట్లో కూడా ఈ అంశం గురించి మాట్లాడతామన్నారు. వైవీ సుబ్బారెడ్డి వెంట మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య తదితరులు ఉన్నారు. -
పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించండి
మార్కాపురం రూరల్: వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో ముంపు నిర్వాసితులకు అవసరమైన అన్ని మౌలిక వసతులకు ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని మార్కాపురం కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. శనివారం మార్కాపురం జిల్లాలోని పెద్దారవీడు మండల పరిధిలోని దేవరాజుగట్టు, తోకపల్లి, మార్కాపురం మండలంలోని వేములకోట, ఇడుపూర్–1, ఇడుపూర్–2 పునరావాన కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జేసీ పి.శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కాలనీల లేఅవుట్లు, పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలనీలకు వెళ్లే అప్రోచ్ రోడ్లు, తాగునీటి సరఫరా, విద్యుద్ధీకరణ పనులకు ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా జంగిల్ క్లియరెన్స్ పూర్తికాని ప్రాంతాల్లో వెంటనే పొదలను తొలగించి భూమిని లెవలింగ్ చేసి మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని సూచించారు. -
వైఎస్ జగన్ సీఎం కావాలంటూ పాదయాత్ర
పీసీపల్లి: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2029లో ముఖ్యమంత్రి కావాలని, కనిగిరి ఎమ్మెల్యేగా డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గెలవాలని కోరుకుంటూ పీసీపల్లి మండలం గుదేవారిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మండల ప్రచార కమిటీ అధ్యక్షుడు రేగుల బాలయ్య చౌదరి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు పీసీపల్లి నుంచి తిరుమల వరకు పాదయాత్రను శనివారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన నెలకుర్తి నాగేశ్వరరావు చౌదరి, కుందురు నాగేశ్వరరావు చౌదరి, మన్యం వెంకట్రావు చౌదరి, మక్కిన బాలకష్ణ చౌదరి, ఏనుగంటి నవీన్ చౌదరి, రేగుల సుధాకర్ చౌదరి, ఏనుగంటి రవి చౌదరి, రేగుల బాలాజీ చౌదరి, ఎడ్ల తేజ చౌదరి, చెందిన కొంతమంది యువకులు చేస్తున్న పాదయాత్రను పాలేటి గంగమ్మ ఆలయం వద్ద నుంచి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మారి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేలా చూడాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండి రైతులు బాగుండాలని కోరుకున్నారు. పాదయాత్ర ఎనిమిది రోజులు పాటు జరుగుతుందని వారు తెలిపారు. దద్దాల నారాయణ యాదవ్ ను ఆలయ పూజారులు, స్థానికులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గోపవరపు బొర్రా రెడ్డి, ఓకే రెడ్డి, పోలు జయరాం రెడ్డి, యారవ నరసింహం చౌదరి, జీ ఆదినారాయణ రెడ్డి, ఎర్రం రెడ్డి మోహన్ రెడ్డి, చెన్నుపాటి వెంకట్రావు చౌదరి, భూమిరెడ్డి కొండారెడ్డి, వాకమల్ల రాజశేఖర్ రెడ్డి, సుదర్శనం, మాలి, శ్రీకాంత్, నారాయణ, రవి, నజీర్ భాష, శ్రీను, గొబ్బిళ్ళ శ్రీనివాస్ యాదవ్, రాజారెడ్డి, తదితరులు ఉన్నారు. -
అమాత్యులూ..తగునా..!
మేదరమెట్ల: అధికారులు చేసిన తప్పునకు మూడు దశాబ్దాలుగా గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. గ్రామ కంఠం ఎండో మెంట్ భూమిగా రికార్డుల్లో తప్పుగా నమోదైంది. ఈ సమస్యను పరిష్కరించమని మంత్రులను వేడుకుంటున్నా మోక్షం లభించలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. కొరిశపాడు మండలంలో దైవాలరావూరులోని చెన్నకేశవ స్వామి దేవస్థానం విస్తీర్ణం 33 సెంట్లు. అయితే అది రెవెన్యూ రికార్డులలో 33 ఎకరాలుగా నమోదైంది. దీంతో ఆ 33 ఎకరాల పరిధిలో క్రయ, విక్రయాలు నిలిచాయి. బ్యాంకు రుణాలు పొందేందుకు ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో ఆస్తి ఉండీ... ఏదన్నా అవసరానికి వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగిన పీఏసీఎస్ భవన నిర్మాణం దైవాలరావూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి నూతన భవనం నిర్మించాలని సంఘ పాలకవర్గం, సభ్యులు భావించారు. అందుకు సంబంధించి స్థలం ఇచ్చేందుకు దాతలు ముందుకొచ్చారు. భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయి. అయితే సదరు స్థలం ఎండోమెంట్ పరిధిలో చేరిన 33 ఎకరాల్లో ఉంది. దీంతో ఆ స్థలం సొసైటీకి రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుకాక నిర్మాణం ఆగింది. పలుమార్లు మంత్రి గొట్టిపాటి దృష్టికి తీసుకెళ్లినా.. సదరు 33 ఎకరాల పరిధి ఎండోమెంట్లో చేరటంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామానికి పలు సందర్భాల్లో వచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు. అందులో గ్రామానికి చెందిన పలువురు పెద్దలతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు. అయితే నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. గ్రామస్తులు వెళ్లినపుడు మంత్రి రవికుమార్ దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం లభించలేదు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు మంత్రులకు తీరికలేదా అంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. రెండు విభాగాల అధికారులు సైతం మాటలతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడుతున్నారు. -
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026
గత ప్రభుత్వంలో భృతి ఇచ్చారు చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రామాయపట్నం పోర్టు నిర్వాసిత మత్స్యకారుల జీవనం అగమ్యగోచరంగా మారింది. పోర్టు నిర్మాణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, ఇటు సముద్రంపై ఆధారపడి సాగే వేట దెబ్బతినడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్వాసిత మత్స్యకారులకు చెల్లించాల్సిన భృతిని సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. నాలుగు సంవత్సరాలకు సంబంధించిన భృతి డబ్బులు పెండింగ్ పెట్టి వారి జీవితాలతో ఆటలాడుతోంది. మరోపక్క రామాయపట్నం పోర్టును ప్రైవేట్‌పరం చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడంతో నిర్వాసితుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. వేట లేక ఇబ్బందులు పడుతున్నాం వేటసాగక..భృతి రాక..వచ్చే ప్రభుత్వంలో ప్రతి పైసా చెల్లిస్తాం కందుకూరు: మత్స్యకారులకు చంద్రబాబు ప్రభుత్వం కుచ్చుటోపీ వేట లేక... భృతి రాక ఇక్కట్లు -
పెన్షన్ కోసం వృద్ధులు పడిగాపులు
యర్రగొండపాలెం: పింఛన్ కోసం పడికాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పింఛన్ తీసుకోవాలన్న ఆదుర్దాతో శనివారం వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 6 గంటలకే మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని జి.ఉమ్మడివరం పరిధిలోని వృద్ధులు, దివ్యాంగులు, ఇతరులు ఆ గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ పింఛన్ ఇచ్చే నాథుడు కనిపించకపోవడంతో 11 గంటల వరకు వారు అక్కడికి సమీపంలో ఉన్న జాతీయ రహదారి డివైడర్లపై కూర్చొని సంబంధిత పంచాయతీ కార్యదర్శి కోసం ఎదురు చూడటం పలువురుని కలచివేసింది. ఎందుకమ్మా ఇక్కడ ఉన్నారని ప్రశ్నిస్తే.. ‘‘ఈ రోజు 1వ తేదీ అయ్యా..పింఛన్ కోసం పొద్దున్నే వచ్చాం. ఇప్పటి వరకు పింఛన్ ఇచ్చే సారు రాకపోవడంతో ఇక్కడ కూర్చొని ఆయన కోసం ఎదురు చూస్తున్నామని’’ వారు బదులిచ్చారు. ఇంటివద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాల్సిన సిబ్బంది వృద్ధులు, దివ్యాంగులు అనికూడా చూడకుండా వారిని తమ వద్దకే రప్పించుకుంటున్నారని, వారికి కనీసం కనికరం కూడా లేకుండా పోయిందని పలువురు వ్యాఖ్యానించారు. -
396 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
ఒంగోలు టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 396 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా 12.62 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్పీ హర్షవర్థన్‌రాజు తెలిపారు. అదేవిధంగా బహిరంగంగా మద్యం సేవించిన 2,669 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. బహిరంగంగా మద్యం సేవించిన 853 ప్రదేశాలను వారితోనే శుభ్రం చేయించినట్లు తెలిపారు. 11,127 ఈ చలానాల ద్వారా మోటారు వాహన చట్టం కింద ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు వివరించారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో జూలై 1 నుంచి 31వ తేదీ వరకు నేర గణాంకాలకు సంబంధించిన వివరాలను స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఎస్పీ విడుదల చేసి విశ్లేషించారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా 3 కేసులు నమోదు చేసి 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 8.890 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. కోడి పందేలు, పేకాట, మట్కా తదితర జూదాలపై దాడులు నిర్వహించి 239 మందిని అదుపులోకి తీసుకున్నామని, 45 కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి 12,43,870 రూపాయల నగదు, 5 కోళ్లు, 37 మోటారు సైకిళ్లు, 48 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాలో 922 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న 3,581 మంది చిరువ్యాపారులపై టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కోర్టులో జరిమానాలు, శిక్షలు విధించినట్లు వివరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వ హిస్తూ చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తమ పరిధి లోని గ్రామాలు, వార్డులను సందర్శించి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళా చట్టాలు, గంజా యి, ఇతర మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు, చట్టపరమైన శిక్షల గురించి అవగాహన కల్పించినట్లు చెప్పారు. సైబర్ నేరాలు, లోన్ యాప్స్, క్రికెట్ బెట్టింగులు, రహదారి నియమాలు, హెల్మెట్ వినియోగం, కొత్త చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటుగా చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 3,581 మంది చిరువ్యాపారులపై న్యూసెన్స్ కేసులు బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై 2,669 కేసులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జూలై నెల నేర గణాంకాలు విడుదల చేసిన ఎస్పీ హర్షవర్థన్‌రాజు -
జీవనం భారం
జీతం దూరం.. ● మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) ఉపాధ్యాయులకు రెండు నెలలుగా నిలిచిన వేతనాలు ● ప్రభుత్వం, విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా టెక్నికల్ సమస్యలు ● ప్రకాశం జిల్లాలో 200 మంది ఉపాధ్యాయులకు ఇబ్బందులు ● వేతనాలు విడుదల చేయాలంటూ వేడుకోలు ఒంగోలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా తలెత్తిన సాంకేతిక కారణాలు చూపుతూ వేతనాల చెల్లింపులు నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే స్వల్ప వేతనాలతో జీవనం సాగిస్తున్న ఉపాధ్యాయులు.. రెండు నెలలుగా జీతాలు నిలిచిపోయి తీవ్ర స్థాయిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో, ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో దాదాపు 200 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు సేవలందిస్తున్నారు. జూన్ నెలలో బదిలీల అనంతరం కొత్త పాఠశాలల్లో చేరిన ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు జీతాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక సమస్యలంటూ సాకులు... ఉపాధ్యాయుల తప్పిదం లేకపోయినా.. పొజిషన్ ఐడీల మ్యాపింగ్, క్యాడర్ స్ట్రెంత్ డిస్ప్లే, ఇతర సాంకేతిక ప్రక్రియలు పూర్తికాకపోవడంతో బిల్లులు సమర్పించలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రెండు నెలలుగా వేతనాలు అందక వారి కుటుంబాల పోషణ, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, బ్యాంకు రుణాల చెల్లింపులు వంటివన్నీ చేసుకోలేక ఎంటీఎస్ ఉపాధ్యాయులు సతమతం అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఆటంకం లేకుండా బోధన కొనసాగిస్తున్నామని, కానీ, కనీస వేతనాలు కూడా సకాలంలో అందకపోవడం విచారకరమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలను సాకులుగా చూపుతూ ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తమను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని అంటున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని పొజిషన్ ఐడీల మ్యాపింగ్, క్యాడర్ స్ట్రెంత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పెండింగ్ జీతాలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ అధికారుల వైఫల్యమే కారణం ఎంటీఎస్ ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర ఐటీ సెల్‌లోని నిధి భవన్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలలుగా వారికి జీతాలు నిలిచిపోయి అవస్థపడుతున్నారు. కనీస వేతనంతో పనిచేసే ఉపాధ్యాయులకు రెండు నెలల నుంచి జీతాలు అందకపోవడానికి రాష్ట్ర విద్యాశాఖ అధికారుల వైఫల్యమే కారణం. బదిలీలు జరిగినప్పుడు వెంటనే వారి ఐడీ నంబర్లను మ్యాపింగ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర విద్యాశాఖ అధికారులపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించి ఎంటీఎస్ ఉపాధ్యాయుల వేతనాలను తక్షణమే చెల్లించాలి. – షేక్ అబ్దుల్ హై, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఆరోగ్యవంతమైన సమాజం కోసం శ్రద్ధ పెట్టాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద్ ఒంగోలు వన్‌టౌన్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం అందరూ శ్రద్ధ పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఏ సత్యానంద్ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ సహకారంతో జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా జిల్లాలోని జ్యుడీషియల్ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం వైద్య శిబిరాన్ని సత్యానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత న్యాయ సేవలతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడే కార్యక్రమాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ శాఖ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బ్రమరాంబ మాట్లాడుతూ ఆయుష్ వైద్య విధానాల ప్రాధాన్యాన్ని వివరించారు. హాజరైన న్యాయమూర్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు టి.రాజ్యలక్ష్మి, పి.లలిత, పూర్ణిమ, శైలజ, కే శ్యాంబాబు, డి.దీన, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు వి.పల్లవి, సీహెచ్‌వీ రామకృష్ణ, జూనియర్ న్యాయమూర్తులు పాల్గొన్నారు. శిబిరంలో పలువురు వైద్య సేవలను వినియోగించుకున్నారు. -
పెద్దపులి మృతిపై విచారణ
● సంఘటన స్థలంలో విస్తృతంగా తనిఖీలు రాచర్ల: మండలంలోని జేపీ చెరువు సమీపంలోని అంబచెరువు, తెట్టెమడుగు అటవీ పరిసర ప్రాంతంలోని లోతువాగులో శుక్రవారం ఓ పెద్దపులి కళేబరం వెలుగు చూసిన విషయం తెలిసిందే. గిద్దలూరు రూరల్ సీఐ జె.రామకోటయ్య, రాచర్ల ఎస్సై ఎం.శివతో పాటు గిద్దలూరు, గుండ్లకమ్మ రేంజ్ ఆఫీసర్ వీరస్వామి కలిసి శనివారం పెద్దపులి కళేబరం లభించిన ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పెద్దపులి అనారోగ్యంతో మృతి చెందిందా లేదా కలుషిత నీరు తాగడం ద్వారా మృతి చెందిందా.. పెద్దపులి మరణం వెనుక వేటగాళ్ల ప్రమేయం ఉందా అన్న కోణాల్లో కేసు దర్యాప్తు ప్రారంభించారు. గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ (డీడీపీటీ) అధికారి నిషాకుమారితో పాటు నంద్యాల జిల్లా ఆత్మకూరు ఫారెస్టు డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ (డీడీపీటీ) అధికారి విగ్నేష్ అప్పోవ్ అధ్వర్యంలో పెద్దపులి కళేబరం లభ్యమైన ప్రదేశం నుంచి యానాదుల కాలనీతో పాటు జేపీ చెరువులో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. పెద్దపులి కళేబరానికి నిర్వహించిన పోస్టుమార్టానికి సంబంధించిన అధారాలతో అటవీశాఖ అధికారులు, పోలీసుల సమన్వయంతో వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో రిటైర్ట్ టీచర్ మృతి
ఒంగోలు టౌన్: ఊరి నుంచి వచ్చిన కుమారుడిని ఇంటికి తీసుకెళ్తుండగా కారు ఢీకొనడంతో ఒక రిటైర్డ్ టీచర్ మృతి చెందారు. ఒంగోలు తాలూకా పోలీసుల కథనం ప్రకారం... నాగులుప్పలపాడు గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ నన్నపనేని రాజారావు కుమారుడు రాఘవ చైన్నెలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. శని, ఆదివారాలు సెలవు కావడంతో శుక్రవారం రాత్రి రైలులో ఒంగోలు వచ్చాడు. రాత్రి 12 గంటలకు రైల్వేస్టేషన్ వద్దకు వచ్చిన రాజారావు.. కుమారుడిని రిసీవ్ చేసుకుని బైకుపై ఇంటికి బయలుదేరారు. త్రోవగుంట దాటిన తర్వాత చీరాల రోడ్డులోకి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఎగిరి రోడ్డు మీద పడిన రాజారావు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు రాఘవకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని జీజీహెచ్‌కి తరలించి చికిత్స చేస్తున్నారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● గ్రానైట్ కార్మికుడి మృతి ● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు సంతమాగులూరు (అద్దంకి): రెండు మోటార్ బైకులు ఎదురెదురుగా ఢీకొట్టుకున్న ఘటనలో గ్రానైట్ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన సంతమాగులూరు గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సోం రాష్ట్రానికి చెందిన రోహిత్ అలీ (21) స్థానిక విజయసాయి గ్రానైట్‌లో పనిచేస్తుంటాడు. ఇతను మరో యువకుడు హమీద్‌తో కలిసి మోటార్ బైకుపై నరసరావుపేట వెళ్తున్నారు. ఈ క్రమంలో బైకు లక్ష్మీపురం సమీపంలోకి చేరుకోగానే సంతమాగులూరు గ్రామానికి చెందిన మెరుగుమల్లి గోపీచంద్, మెరుగుమల్లి రాంచరణ్‌లు పయనిస్తున్న మోటార్ బైకు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో రోహిత్ అలీ మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి గాయాలు కావడంతో వారిని నరసరావుపేటలోని వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు. కంభం: రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం తెల్లవారు జామున కంభం చెరువు అలుగు సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన కె.రంగనాయకులు (50) బేల్దారి మేస్త్రిగా పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై నాగులవరం రైల్వేగేటు సమీపంలో అలుగు వద్ద గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. -
గుండ్లకమ్మలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య
అద్దంకి: ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదుగానీ వృద్ధురాలు నీటిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అద్దంకి–దర్శి రహదారిలోని గుండ్లకమ్మ వంతెనపై శనివారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. మండలంలోని చెరువుకొమ్ముపాలేనికి చెందిన మలాది కోటేశ్వరమ్మ (80)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓ కుమారుడు గుంటూరులో ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్నాడు. ఈమె ఆ కుమారుని వద్ద ఉంటోంది. పింఛన్ నగదు తీసుకోవడం కోసం ఇటీవల అద్దంకి వచ్చింది. పింఛన్ నగదు తీసుకుంది. ఈ క్రమంలో ఏమైందో ఏమోగానీ అద్దంకి–దర్శి రహదారిలోని గుండ్లకమ్మ వెంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈమె దూకే సమయంలో వంతెనపై నుంచి వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ ఆమెను దూకొద్దని కేకలు వేసి దిగి వచ్చే సరికే చెప్పులు విప్పి నదిలోకి దూకింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదుతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతురాలికి మతిస్థిమితం లేకే ఇలా చేసిందని బంధువులు చెబుతున్నారు. -
డీఎస్సీలో పేకాటకూ స్పోర్ట్స్ కోటా...
ఒంగోలు సబర్బన్: రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదని, విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ దగా డీఎస్సీని నిర్వహించి నిరుద్యోగులను నిలువునా మోసం చేశాడని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. పేకాటకు కూడా స్పోర్ట్స్ కోటా కల్పించి తన మనుషులకు, పార్టీ కేడర్‌కు అడ్డగోలుగా డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చాడంటే లోకేష్ మంత్రిగా పనికొస్తాడా అని ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై, ఫీజు రీయింబర్స్‌మెంటు విధానం, నిరుద్యోగభృతి ఇవ్వని వైనాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పార్టీ నాయకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, దగాపడిన డీఎస్సీ అభ్యర్థులు ఒంగోలు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కలెక్టరేట్లోని పరిపాలనాధికారి (ఏఓ) సాయి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లలో ఒక డీఎస్సీ నిర్వహించి 16 వేల ఉద్యోగాలు నిస్పక్షపాతంగా ఇవ్వలేని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక డీఎస్సీలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎన్ని అక్రమాలకు, అవినీతి పాల్పడ్డాడో చెప్పనలవికాదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి విడతలోనే ఒకే సారి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 1.36 లక్షల ఉద్యోగాలు, వైద్య విభాగంలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. మొత్తంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 5.50 లక్షల నుంచి 6 లక్షల ఉద్యోగాలు నిస్పక్షపాతంగా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దని గుర్తు చేశారు. ఒంగోలు అసెంబ్లీ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ ఒక డీఎస్సీ సక్రమంగా నిర్వహించలేని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. డీఎస్సీ ఉద్యోగాలను వేలం పాటలో పెట్టి ఒక్కో ఉద్యోగాన్ని రూ.20 లక్షలకు అమ్ముకున్న లోకేష్ ఆ పదవికి తగడని మండిపడ్డారు. పేకాటను కూడా స్పోర్ట్స్ కోటా కిందకు తీసుకొచ్చి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమని సమాధానం చెబుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ అల్లుడు భరత్‌కు జూడో అసోసియేషన్ ఉంది, రవికుమార్ అనే మరో నాయకునికి సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఉంది. వీళ్లిద్దరూ కలిసి 75 మందికి సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించుకున్నారన్నారు. 430 ఉద్యోగాలు ఒక్కో ఉద్యోగాన్ని రూ.20 లక్షల చొప్పున అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. అద్దంకి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ బాబు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకై తే జన్‌జీ యువత దేశ రాజధానిలో పోరాటం చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయించారని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీలో చేసిన అక్రమాలపై అదేస్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. యువత కోసం వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అవినీతిపై సీబీఐ చేత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు కాదు సాక్ష్యాలతో నిరూపిస్తామని సవాలు విసిరారు. లోకేష్‌కు నిజాయితీ ఉంటే రాజీనామా చేసి మా పార్టీకి చెందిన మాజీ మంత్రులతో చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ లోకేష్ నిర్వహించిన దగా డీఎస్సీతో నిరుద్యోగులు మోసపోయారన్నారు. విద్యాశాఖను భ్రష్టు పట్టించారని విమర్శించారు. పేరుకే సీఎంగా చంద్రబాబు అని పెత్తనం మొత్తం లోకేష్ చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6,500 కోట్లు పేరుకుపోయాయన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిలువునా మోసం చేశారన్నారు. ఈనెల 10వ తేదీ వరకూ ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి అదెన్న, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, రాష్ట్ర పార్టీ కార్యదర్శి, అద్దంకి నియోజకవర్గ పరిశీలకుడు కర్నేటి ప్రసాద రావు, పార్టీ కార్యదర్శులు బొట్ల రామారావు, కె.వి రమణారెడ్డి, దామరాజు క్రాంతి కుమార్, పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్, పోశం మధుసూదన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
సొరంగ నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
● కొల్లంవాగు వరకు ప్రయాణించి పనుల పరిశీలన పెద్దదోర్నాల: మండల పరిధిలో పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులను మార్కాపురం కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు శుక్రవారం పరిశీలించారు. ప్రత్యేక వాహనంలో సొరంగం ద్వారా కొల్లంవాగుకు చేరుకుని లైనింగ్, టీబీఎం యంత్ర విడిభాగాల తొలగింపు పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. నష్టపరిహారం పొందిన నిర్వాసితులను అక్కడ నుంచి తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ అబూతాలిం, ఈఈ కృష్ణారెడ్డి, మేఘా ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఉలవపాడు: ఉలవపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక తప్పిపోయినట్లు ఆమె తల్లి ఫిర్యాదు మేరకు మొదట బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ బాలికను అదే గ్రామానికి చెందిన పి.వెంకట్రావు ప్రేమ పేరుతో మోసం చేసి బలవంతంగా తీసుకెళ్లినట్లు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ తెలియడంతో బాలిక స్టేట్మెంట్ మేరకు ఆమెను బలవంతంగా తీసుకెళ్లిన వెంకట్రావుపై అత్యాచారం, పోక్సో కేసు కింద వెంకట్రావుకు రిమాండ్‌కి తరలించారు. బాలిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి నిరాకరించడంతో ఒంగోలులోని బాలసదన్‌లో చేర్పించామని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ వెంట సీఐ ఎస్కే.అన్వర్‌బాషా, ఎస్సై సుబ్బారావు ఉన్నారు. -
కనీస వేతనాల కోసం స్కీం వర్కర్ల కన్నెర్ర
ఒంగోలు టౌన్: రోజుకో ఆందోళనతో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద హోరెత్తుతోంది. ఒకరోజు పొగాకు రైతులు, మరో రోజు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, తాజాగా అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, స్కీం వర్కర్లు పోరుబాట పట్టడంతో నిత్యం నినాదాలతో మార్మోగుతోంది. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద స్కీం వర్కర్లు మహా ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, వెలుగు వీఏఓలు, ఆర్పీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు భారీగా తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సుమారు మూడు గంటలకు పైగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఇది హెచ్చరిక... ఎన్నికల హామీలను విస్మరించి మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ఉద్యమం ఒక హెచ్చరిక అని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చేది స్కీం వర్కర్లేనని, కానీ వారికి ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పెన్షన్, బీమా వంటి కనీస హక్కులు దక్కకుండా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అంగన్వాడీ కార్యకర్తల చేత బండ చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వమని అడుగుతుంటే స్పందించకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వెలుగు వీఓఏలకు కనీస వేతనంతో పాటుగా రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిరుద్యోగుల మీద రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, దీన్ని అడ్డుకట్ట వేయకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ స్కీం వర్కర్లు రోడ్డెక్కడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ధర్నాకు అధ్యక్షత వహించిన అంగన్వాడీ వర్కర్స్, అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ మంజుదార్ మాట్లాడుతూ యాప్‌ల పేరుతో స్కీం వర్కర్లపై అదనపు భారం మోపుతున్న ప్రభుత్వం వారిచేత సాఫ్ట్వేర్ ఉద్యోగుల మాదిరిగా పనిచేయించాలని చూస్తుందని ఆరోపించారు. దేశంలోనే అత్యల్ప వేతనం ఇస్తూ మధ్యాహ్న భోజన కార్మికుల చేత వెట్టిచాకిరి చేయించడం సిగ్గుచేటన్నారు. అనంతరం ప్రకాశం భవనం నుంచి ర్యాలీగా బయలుదేరి చర్చి సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. మహా ధర్నాలో స్కీం వర్కర్లకు చెందిన వివిధ యూనియన్ల నాయకులు సీహెచ్ ఇందిరావతి, పీవిఆర్ శ్రీనివాసులు, జాన్‌బాబు, జీ.శేషయ్య, అరుణ, రాజ్యలక్ష్మి, హెమీమా, ధనలక్ష్మి, కోటేశ్వరమ్మ, శేషమ్మ, పి.ఆంజనేయులు, టి.రంగారావు, రాము, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా!
కంభం: రోడ్డు ప్రమాదాల్లో జనం ప్రాణాలు కోల్పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని హైవే అధికారులపై మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైవే, పోలీస్, ఆర్అండ్బీ అధికారులతో కలిసి గురువారం సాయంత్రం అనంతపురంృఅమరావతి జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్స్పాట్లను ఆమె పరిశీలించారు. కంభం నుంచి బేస్తవారిపేట వెళ్లే మార్గంలోని యూటర్న్, కందులాపురం కూడలిలో ప్రమాదాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. యూటర్న్ వద్ద మార్జిన్ తక్కువగా ఉండటం, రైల్వే ఫ్లైఓవర్ పైనుంచి వాహనాలు వేగంగా వస్తుండటంతో కందులాపురం కూడలి నుంచి వైజంక్షన్ మధ్య తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, గత రెండు నెలల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు, పోలీసులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డీఎస్పీ నాగరాజు కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక, రిఫ్లెక్టివ్ సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పాదచారులు దాటే చోట రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని, రోడ్డు పక్కన పొదలు తొలగించి విజిబిలిటీ మెరుగుపరచాలని, అవసరమైన చోట ఇంజినీరింగ్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్, డీఎస్పీ యు.నాగరాజు, సీఐ మల్లికార్జున, ఇన్చార్జి డీటీఓ రాంబాబు, ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాసరావు, హైవే అధికారి మల్లికార్జునరెడ్డి, ఎంవీఐలు మాధవరావు, భాస్కరరావు, డీఈ నరసింహులు, తహసీల్దార్ కిరణ్, ఎస్సైలు శివకృష్ణారెడ్డి, రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. హైవే అధికారులపై కలెక్టర్ విజయ సునీత ఆగ్రహం అనంతపురం–అమరావతి హైవేపై బ్లాక్స్పాట్ల పరిశీలన -
ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు
అద్దంకి: నార్కెట్‌పల్లి – అద్దంకి – మేదరమెట్ల(నామ్) రహదారిపై తరచూ సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. గురువారం ఎస్పీ హర్షవర్థన్ రాజు, రవాణా శాఖ అధికారులతో కలిసి అద్దంకి పట్టణంతో పాటు సంతమాగులూరు మండలంలోని అడ్డరోడ్డు తదితర ప్రాంతాల్లోని బ్లాక్ స్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామ్ రహదారిలో ప్రమాదకరంగా ఉన్న కూడళ్ల వద్ద డ్రోన్ ద్వారా సర్వేలు నిర్వహించి అవసరమైన రక్షణ చర్యలు చేపడతామన్నారు. రోడ్లపై వాహనాలను నిలిపి రవాణాకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే ఆ వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. జనావాసాలు ఉండే ప్రాంతాల్లో పీఏ సిస్టం ద్వారా వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు. రోడ్లపై ఆక్రమణలు లేకుండా చూడాలని, ఫుట్‌పాత్‌లను ఆక్రమించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూడళ్ల వద్ద సూచికలు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయాలని, శింగరకొండ మలుపు వద్ద తారు రోడ్డు వేయాలని అధికారులకు సూచించారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ.. రోడ్లు, ఫుట్‌పాత్‌లపై షాపులు లేకుండా పోలీసు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. హైవే నుంచి సర్వీస్ రోడ్లలోకి వెళ్లే ప్రదేశాల్లో ఆక్రమణలకు తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామ కూడళ్ల వద్ద మైక్‌ల ద్వారా వాహనదారులు, పాదచారులను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో డీటీసీ సుశీల, అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, ఆర్అండ్బీ ఎస్ఈ నాయక్, ఎక్స్‌ప్రెస్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్‌రాజు అద్దంకి, సంతమాగులూరు అడ్డరోడ్డులో బ్లాక్ స్పాట్ల పరిశీలన -
కదంతొక్కిన కార్మికులు
ఒంగోలు టౌన్: కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలివ్వాలని, దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో కార్మికులు కదంతొక్కారు. సీఐటీయూ రాష్ట్ర వ్యాప్త పిలుపుతో జిల్లా నలుమూలల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని కనీస వేతనాల కోసం నినదించిన కార్మికులు, ఉద్యోగులతో కలెక్టరేట్ పరిసరాలు దద్దరిల్లాయి. ఎటుచూసినా ఎర్ర జెండా రెపరెపలు కనిపించాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇదే పరిస్థితి కొనసాగితే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న 55 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ ఽవిమర్శించారు. ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలను సవరించాల్సిన ప్రభుత్వాలు చట్టాన్ని తుంగలోకి తొక్కడం అన్యాయమని తప్పుబట్టారు. కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటించే పాలకులు.. కార్మికులకు జీవనోపాధికి సరిపడా వేతనాలు పెంచకపోవడం దారుణమని మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో బతుకు భారంగా మారిందని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రానైట్ క్వారీలు, పాలిషింగ్ యూనిట్లు, ఆక్వా కంపెనీలు, పొగాకు గోదాములు, ప్రైవేటు వైద్య విద్యా సంస్థలలో పనిచేస్తున్న కార్మికులకు 8 నుంచి 13 వేల రూపాయల వేతనాలిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 గంటల పనిదినం చట్టాన్ని ఉల్లంఘించి 12 గంటలు పనిచేయించుకుంటున్నా.. ఓవర్ టైంకు వేతనాలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 8 గంటల పనిదినాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్, చెల్లింపు సెలవులు వంటి చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని కోరారు. ఐద్వా నగర ప్రధాన కార్యదర్శి జీ ఆదిలక్ష్మి, తదితరులు మాట్లాడారు. -
వీడ్ మ్యాట్‌తో భూసారం పెంపు
● రాష్ట్ర ఉద్యానవన శాఖ డీడీ జమదగ్ని ఒంగోలు సబర్బన్: ఉద్యాన రైతులు తమ పొలాల్లో వీడ్ మ్యాట్ వేసుకోవడంతో పాటు, పీఎండీఎస్ ద్వారా భూసారాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఏవీఎస్వీ జమదగ్ని సూచించారు. ఎల్‌నినో ప్రభావ పరిశీలనకు ప్రకాశం జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆయన గురువారం ఒంగోలు మండలం యర్రజెర్లలో పర్యటించారు. మామిడి, నిమ్మ, కూరగాయల పంటలను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎల్‌నినో నుంచి పంటలను కాపాడుకునేందుకు తోటల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని, ఎక్కువ నీరు అవసరమయ్యే దీర్ఘకాలిక పంటలకు బదులు తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి వై.గోపీచంద్, అధికారులు సంధ్య, కృష్ణవేణి, శ్రీచరిత, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన ప్రమాదం
అద్దాలు ఊడిపోయి, కిటికీలు జామైన డొక్కు బస్సులు.. ఒక రేకుల డబ్బాలో గులకరాళ్లేసి ఊపినట్లు గడగడ శబ్ధంతో దూసుకుపోతుంటే జనం గుండెల్లో గుబులు.. తరచూ మరమ్మతులకు గురై నడిరోడ్డుపై ఆగిపోతున్న బస్సులు.. అసలే కండీషన్ లేని బస్సుల్లో పరిమితికి మించిన ప్రయాణికులు.. బస్సులు ముక్కుతూ మూలుగుతూ నడుస్తుండటంతో చిన్నపాటి ప్రమాదం జరిగినా పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. పాత డొక్కు బస్సుల్లో ప్రయాణం చేయాలంటే పెద్ద సాహసం చేసినట్లుంటుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఒంగోలు టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 504 బస్సులు ఉన్నాయి. అందులో మార్కాపురం జిల్లాలో 303 బస్సులు, ప్రకాశం జిల్లాలో 201 బస్సులు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో పల్లె వెలుగు బస్సులు 102 ఉండగా, ఇవన్నీ 10 నుంచి 15 సంవత్సరాల కిందటివే కావడం గమనార్హం. పల్లె వెలుగు తర్వాత ప్రయాణికులు ఎక్కువగా ఎక్కేది ఎక్స్‌ప్రెస్ బస్సులే. ఇవి 13 ఉండగా, మరో 18 అద్దె బస్సులున్నాయి. ఇవి కూడా 10 ఏళ్ల క్రితం కొన్నవే. 48 సూపర్ లగ్జరీ బస్సులుండగా వాటిలో మాత్రమే కొత్త బస్సులు కనిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త బస్సులు కొనుగోలు చేశారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని తామే తీసుకొచ్చినట్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవాలు చేసి ప్రచారం చేసుకున్నారు. సురక్షిత ప్రయాణాన్ని గాలికొదిలేసిన కూటమి.... గతేడాది ఆగస్టు 15వ తేదీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం అమలుకు ముందు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలంటే ఇప్పుడున్న బస్సులు సరిపోవని చెప్పిన కూటమి పాలకులు.. కొత్తగా ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయకుండానే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది కాలంలో ఒక్క బస్సు కొన్న పాపాన పోలేదు. దాంతో ఉచిత బస్సులో ప్రయాణించేవారికి నరకం కనిపిస్తోంది. బస్సు పరిమితి 60 మంది కాగా, 80 నుంచి 120 మంది వరకు ప్రయాణికులు ఎక్కుతున్నారు. అసలే డొక్కు బస్సులు కావడంతో కదల్లేకపోతున్నాయి. బస్సులో చిన్నారులు, గర్భిణులు ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతున్నారని మహిళా కండక్టర్లు చెబుతున్నారు. బస్సుల ఫిట్నెస్ బాగుంటేనే.. నిజానికి బస్సులను రోడ్డు మీదకు పంపించే ముందు గ్యారేజీలోనే ఫిట్నెస్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. బ్రేకులు ఎలా పనిచేస్తున్నాయి.. క్లచ్ బాగుందా, టైర్ల పరిస్థితి ఏమిటి, స్టీరింగ్ బాగుందా అనేది సరిచూసుకోవాల్సి ఉంది. అన్నీ బాగుంటేనే బస్సులు గ్యారేజీ నుంచి బయటకు రావాలి. అయితే, ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు తర్వాత బస్సు కండీషన్లను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని సిబ్బంది వాపోతున్నారు. ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో ఉన్న బస్సులను రోడ్డెక్కించక తప్పని పరిస్థితి ఉందని తెలుస్తోంది. దీంతో తరచూ బస్సులు మొరాయించడం, సగం దూరం ప్రయాణించాక మొండికేయడం, టైర్లు ఊడిపోవడం, స్టీరింగ్ జామ్ కావడం వంటివి జరుగుతున్నాయని ఆర్టీసీ ఉద్యోగులు కొందరు చెబుతున్నారు. ఎక్కడ ఆగుతాయో తెలియదు... ఈ ఏడాది మే నెలలో గిద్దలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్లింది. తిరుగు ప్రయాణంలో మార్గం మధ్యలో ఆగిపోయింది. దాంతో బస్సులోని ప్రయాణికులను మరో బస్సు ఎక్కించి పంపించారు. ఇటీవల మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మార్కాపురం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే దరిమడుగు సమీపంలోని గుండ్లకమ్మ బ్రిడ్జి వద్దకు రాగానే టైర్ ఊడిపోయింది. బస్సు నుంచి ఊడిపోయిన టైర్ సుమారు 200 మీటర్ల దూరం వరకు దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 70 మంది వరకు ప్రయాణికులున్నారు. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలు విషయం తెలిసిన తర్వాత ప్రయాణికులు ప్రాణాలు అరచేత పట్టుకుని నిశ్చేష్టులుగా నిలబడిపోయారు. అద్దంకి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దర్శి వెళ్తోంది. మార్గం మధ్యలో శంకరాపురం వద్దకు రాగానే బస్సులోంచి పొగలు వచ్చాయి. భయపడిపోయిన ప్రయాణికులు గట్టిగా కేకలు పెట్టారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను దించేశాడు. ఆ సమయంలో బస్సులో 80 మంది వరకు ప్రయాణికులు ఉండటంతో పొగలకు ఊపిరాడక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. విజయవాడ నుంచి నెల్లూరు వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సు గుడ్లూరు మండలం చేవూరు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులున్నారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది.బస్సు దిగిపోయిన డ్రైవర్లు... పరిమితికి మించి రెట్టింపు ప్రయాణికులు బస్సు ఎక్కడంతో ఈ బస్సులు నడపలేమంటూ ఉమ్మడి జిల్లా పరిధిలో పలు చోట్ల డ్రైవర్లు బస్సులు నిలిపేసిన సంఘటనలూ ఉన్నాయి. పొదిలి డిపో పరిధిలో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారు. ఎక్కడైనా బస్సు అదుపుతప్పితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఈ బస్సును నడపలేనంటూ డ్రైవర్ వెళ్లి పోయాడు. విషయం తెలిసిన ఆర్టీసీ డిపో మేనేజర్, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బస్సు డ్రైవర్‌ను వెతికి పట్టుకుని బుజ్జగించి తిరిగి డ్యూటీకి పంపించారు. ఈ నెల 11వ తేదీ కంభం నుంచి అర్ధవీడు లోయకు వెళ్లే బస్సులో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. డోరు వద్ద వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు. డ్రైవర్ ఎంత చెప్పినా వినకపోవడంతో బస్సు ఆపేసి దిగిపోయాడు. ఏడు నెలల క్రితం కొండపి మండలం దాసిరెడ్డిపాలెంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ ఘటనలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయినా పాలకుల్లో ఎలాంటి చలనం లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. పరిమితికి మించిన ప్రయాణికులను పర్యవేక్షించడం శక్తికి మించిన పని కావడంతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆర్టీసీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏకేయూ రిజిస్ట్రార్‌కు బ్రిటన్ సొసైటీ ఫెలోషిప్
ఒంగోలు సిటీ: స్థానిక ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వ్యవస్థాపక రిజిస్ట్రార్, రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ బి.హరిబాబు ప్రపంచ ప్రఖ్యాత రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ (ఆర్.ఎస్.సీ), యునైటెడ్ కింగ్డమ్ వారి ప్రతిష్టాత్మక ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ (ఎఫ్.ఆర్.ఎస్.సీ)కి ఎంపికయ్యారు. రసాయనశాస్త్ర పరిశోధన, బోధన, శాసీ్త్రయ నాయకత్వం, ఉన్నత విద్యాభివృద్ధికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించి ఈ అంతర్జాతీయ గౌరవాన్ని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ సభ్యత్వ బృందం అధికారికంగా అభినందనలు తెలియజేస్తూ.. ఇకపై ఆయన తన పేరుకు ఎఫ్.ఆర్.ఎస్.సీ అనే గౌరవ హోదాను ఉపయోగించవచ్చని తెలిపింది. హరిబాబుకు విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు అభినందనలు తెలిపారు. ఒంగోలు సబర్బన్: మార్కెట్లో బియ్యం ధరలు స్థిరంగా ఉండాలని, ఇష్టమొచ్చినట్లు పెంచుకుంటూపోతే ఊరుకునేది లేదని జాయింట్ కలెక్టర్ (జేసీ) కల్పనా కుమారి రైస్ మిల్లర్లను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిల్లర్లు, అనుబంధ సంస్థల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇటీవల బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆగస్టు 1 నుంచి ఒంగోలులోని లాయర్‌పేట, దిబ్బలరోడ్డు, కొత్తపట్నం బస్టాండ్, కందుకూరు రైతు బజార్లలో, రైస్ మిల్లుల వద్ద వినియోగదారుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు జేసీ వెల్లడించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారితో పాటు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, రైతు బజారు ఎస్టేట్ ఆఫీసర్లు, జిల్లాలోని రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. -
బోనస్ పేరుతో దగా..
ఒంగోలు టౌన్: పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించమని వంద రోజులుగా పోరాడుతుంటే రూ.20 బోనస్ ఇస్తామని చెప్పడం దుర్మార్గమని, పొగాకు రైతులను మోసం చేసేందుకు సీఎం చంద్రబాబు యత్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పొగాకు రైతులకు రూ.128 కోట్లు బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. లక్షల కోట్ల రూపాయల విదేశీ మాదకద్రవ్యం వస్తున్నప్పుడు రైతుల కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. గురువారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు వైఖరి పచ్చిబూటకమని ధ్వజమెత్తారు. పొగాకు కొనుగోలు విషయంలో మార్కెట్లో పోటీ ఏర్పాటు చేయడం ఒక్కటే పరిష్కారమని తేల్చి చెప్పారు. నెలల తరబడి పొగాకు రైతులు రోడ్డెక్కి పోరాడుతుంటే రూ.20 చేతిలో పెట్టి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. 2018లో కూడా చంద్రబాబు ఇలాగే చేశారని, గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అప్పుడు కూడా ఇదే విధంగా రూ.20తో మోసం చేశారని గుర్తు చేశారు. అందులో కేంద్రం వాటా రూ.15 కాగా, రాష్ట్రం తరఫున కేవలం రూ.5 మాత్రమేనని అన్నారు. ఈ ప్రకటనల ద్వారా సిండికేటైన వ్యాపారులను బాబు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వ్యాపారుల మీద ఒత్తిడి చేయకుండా రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు వైఖరిని అందరూ గమనిస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పొగాకు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డారని చెప్పారు. రైతుల జోలికి రావడానికి వ్యాపారులు భయపడిపోయారన్నారు. కోవిడ్ మహమ్మారి వంటి సంక్షోభ సమయంలో కూడా ఆక్వా రైతులకు జగనన్న అండగా నిలిచి కాపాడారని గుర్తు చేశారు. ఆనాడు జగనన్న ఇచ్చిన ప్రోత్సాహంతో మన కంపెనీలు ప్రపంచ కంపెనీలతో పోటీపడ్డాయని చెప్పారు. ప్రభుత్వం నష్టపోవాలని కోరుకోవడం లేదని, రైతులు నష్టపోకూడదని మాత్రమే చెబుతున్నామని స్పష్టం చేశారు. నోరుతెరిచి మాట్లాడని ఎమ్మెల్యే జనార్దన్... పొగాకు కొనుగోలుపై ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన రివ్యూలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు ఉన్నారని చుండూరి రవిబాబు తెలిపారు. పొగాకు రైతుల గురించి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నోరుతెరిచి ఒక్క మాట కూడా మాట్లడలేదని విమర్శించారు. మన జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉండి కూడా ప్రయోజం లేకుండా పోయిందన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు మాట్లాడుతూ జీఎస్టీ పేరుతో పొగాకు రైతులను దగా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. జీఎస్టీ తగ్గించాలని వాణిజ్య మంత్రిని కోరితే ఆమె సానుకూలంగా స్పందించారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడాన్ని తప్పుబట్టారు. జీఎస్టీ తగ్గితో వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందిగానీ రైతులకు ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు. రైతులను నిర్లక్ష్యం చేస్తే 2029 ఎన్నికల్లో మరిచిపోలేని విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నెం శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజీవ్, అధికార ప్రతినిధి బెజవాడ రాము, యువజన నాయకుడు దేవా, జిల్లా కార్యదర్శి జి.రవి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి యరజర్ల రమేష్, నాయకుడు దేవరపల్లి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇల్లు కూల్చిన నిందితులపై కేసు నమోదు
పొన్నలూరు: మండలంలోని చెరుకూరు గ్రామంలో ఇల్లు కూల్చిన ఘటనలో నిందితులపై ఎట్టకేలకు కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. కుంచాల నరసింహం ముప్పై ఏళ్ల క్రితం స్థలం కొని, 1993లో పక్కా ఇల్లు నిర్మించుకున్నాడు. ఆయన మరణానంతరం కుమారుడు మాధవరావు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. వారు ఊరిలో లేని సమయంలో ఈ నెల ఇరవైవ తేదీన కుంచాల మాల్యాద్రి పొక్లెయిన్‌తో ఇంటిని పూర్తిగా కూల్చేసి, ఆనవాళ్లు లేకుండా చదును చేశాడు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, స్థానిక ఎస్సై అసలు ఫిర్యాదు తీసుకోలేదు. బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేసినా, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఎస్సై తిరిగి బాధితుడిపైనే తప్పుడు కేసు నమోదు చేశాడు. పోలీసుల తీరును తప్పుబడుతూ మంగళవారం శ్రీసాక్షిశ్రీలో శ్రీపొన్నలూరు ఎస్సై తలబిరుసు.. బాధితుడిపైనే కేసుశ్రీ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. బుధవారం కొండపి సీఐ రమణయ్య ఆధ్వర్యంలో అధికారులు చెరుకూరు చేరుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు నిందితులను కూడా స్వయంగా విచారించారు. వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాత, ఇల్లు కూల్చివేసిన ప్రధాన నిందితుడు కుంచాల మాల్యాద్రితోపాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులపై కూడా స్థానిక పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. యర్రగొండపాలెం: ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి జూనియర్ అథ్లెట్ల ఎంపిక పోటీలను శనివారం స్థానిక మాచర్ల రోడ్డులోని గిరిజన గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు పి.రామచంద్రరావు, పి.గోపిచంద్‌రెడ్డి గురువారం తెలిపారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ప్రతిభ చూపి ఎంపికై న క్రీడాకారులు తిరుపతిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ఉమ్మడి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు. శనివారం ఉదయం 8 గంటలకల్లా క్రీడా మైదానంలో రిపోర్ట్ చేయాలన్నారు. ఇతర వివరాలకు కోచ్ డి.రాజునాయక్ (76750 26220)ను సంప్రదించాలని వారు కోరారు. -
వైఎస్సార్ సీపీలో పలువురు నాయకులకు పదవులు
మార్కాపురం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులకు పార్టీ పదవులు కేటాయిస్తూ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. మార్కాపురం పట్టణానికి చెందిన టి.సత్యనారాయణను రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీగా, కొండ్రగుంట సుబ్బారావును స్టేట్ ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రటరీగా, మొఘల్ సిరాజ్తుల్లాబేగ్ను రాష్ట్ర మున్సిపల్ వింగ్ జనరల్ సెక్రటరీగా, నాలి కొండయ్య యాదవ్‌ను రాష్ట్ర మున్సిపల్ వింగ్ కార్యదర్శిగా నియమించారు. రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా గొలమారి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఎస్ఈ సెల్ కార్యదర్శిగా అక్కిదాసరి ఏడుకొండలు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా సూరెడ్డి భూలక్ష్మి, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా ఎం.మురళీకృష్ణను నియమించారు. అదేవిధంగా కనిగిరికి చెందిన కాకర్ల వెంకటేశ్వర్లు పార్టీ రజక విభాగం కనిగిరి నియోజకవర్గ అధ్యక్షునిగా నియమితులవగా, సంతనూతలపాడుకు చెందిన బి.రామాంజనేయులు రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. -
ఆయకట్టు అరిగోస!
● ముండ్లమూరు మండలంలో ప్రశ్నార్థకంగా 10 వేల ఎకరాల సాగు ●రూ.88 కోట్లతో నిర్మించిన 4 ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యం పర్యవేక్షణ లేక దొంగలపాలైన ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్ వైర్లు గత వైఎస్సార్సీపీ హయాంలో సస్యశ్యామలంగా ఆయకట్టు బాబు సర్కారు రాగానే నిరుపయోగంగా మారిన ప్రాజెక్టులు ముండ్లమూరు: అన్నదాతల పక్షపాతిగా గొప్పలు చెప్పుకొనే కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు పాలకుల నిర్లక్ష్యంతో మూలనపడ్డాయి. ముండ్లమూరు మండలం మారెళ్ల పరిధిలోని నాలుగు ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారడంతో ఏకంగా 10 వేల ఎకరాల ఆయకట్టు బీడుగా మారి అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. తమ కళ్లెదుటే పంట పొలాలు ఎండుతున్నా కూటమి సర్కారుకు కనీసం చీమకుట్టినట్లయినా లేకపోవడం వారి రైతు వ్యతిరేక విధానాలకు అద్దం పడుతోంది. నాడు సస్యశ్యామలం.. నేడు సర్వనాశనం మండలంలోని మారెళ్ల, మక్కెనవారిపాలెం, జమ్మలమడక, గంగనపాలెం, సుంకరవారిపాలెం, నూజిల్లపల్లి, నాయుడుపాలెం, రామకృష్ణాపురం గ్రామాల రైతుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు గుండ్లకమ్మ నదిపై నాబార్డ్ నిధులు రూ.88 కోట్లతో నాలుగు ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక పథకం పూర్తికాగా, ఆ తర్వాత మరో మూడు ప్రాజెక్టుల ద్వారా 9,200 ఎకరాలను సాగులోకి తెచ్చారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి ఈ పథకాలు అద్భుతంగా పనిచేశాయి. మాగాణి, ఆరుతడి పంటలతో ఆయకట్టు సస్యశ్యామలంగా కళకళలాడింది. నిర్వహణ శూన్యం.. చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టులు నిర్వహణ లేక నిర్వీర్యమయ్యాయి. కనీస పర్యవేక్షణ కరవవడంతో ట్రాన్స్ఫార్మర్లు, ప్యానెల్ బోర్డులు, కేబుల్ వైర్లు దొంగలపాలయ్యాయి. పైప్లైన్లు పగిలిపోయి లీకవుతున్నా వాటిని బాగుచేసే నాథుడే కరువయ్యాడు. కనీసం ఆ ప్రాజెక్టుల వద్దకు వెళ్లే దారులు కూడా ముళ్లపొదలతో కప్పబడిపోయాయి. ఆర్థిక భారంతో అన్నదాతల అవస్థలు రూ.కోట్లు వెచ్చించిన ప్రాజెక్టులు కళ్లెదుటే శిథిలమవుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో, వర్షాలపై ఆధారపడి సుబాబుల్, జామాయిల్ తోటలు సాగు చేసుకుంటున్నారు. మరికొందరు దారిలేక గుండ్లకమ్మ నది వద్ద సొంత ఖర్చులతో ఆయిల్ ఇంజన్లు పెట్టుకుని, పైప్లైన్ల ద్వారా నీరు తెచ్చుకుని మొక్కజొన్న, గడ్డి పెంచుకుంటున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ స్పందించి, చోరీకి గురైన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి, ఎత్తిపోతల పథకాలను తక్షణమే పునరుద్ధరించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిరుపయోగంగా మారిన ఎత్తిపోతల పధకం ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు పరిస్థితి ఇలా.. -
వసూల్ రాజాలపై వేటు..
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థలో అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గతంలోనే బీపీఎస్‌లో టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన అక్రమాలు, అప్పటి కమిషనర్ కే వెంకటేశ్వరరావు అవినీతి బాగోతం, భారీ దోపిడీలకు సంబంధించి ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురించింది. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీ ‘క్రమ డబ్బీకరణ’ అనే శీర్షికతో కథనం, ఏప్రిల్ 12వ తేదీ ‘అవినీతి ఇంటింత కాదయా’, ఏప్రిల్ 13న ‘సారు..కాజేస్తున్నారు’ అనే శీర్షికలతో సాక్షి దినపత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. దాంతో ఏం చేయాలో పాలుపోని కమిషనర్ నెల రోజులు ప్రత్యేకంగా సెలవుపై ఏప్రిల్ 14వ తేదీ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులపై చర్యలు వెంటాడాయి. కమిషనర్ సహా ఆరుగురిని సస్పెండ్ చేయాలని ఆదేశం... ఒంగోలు నగరపాలక సంస్థలో ఎన్నడూ లేని విధంగా అవినీతి ఒక కుదుపు కుదిపింది. ఒంగోలులో భవనాల అక్రమ నిర్మాణాల విషయంలో అవినీతికి పాల్పడినట్లు తేలడంతో గతంలో కమిషనర్‌గా పనిచేసిన కే వెంకటేశ్వరరావుతో పాటు మరో ఐదుగురిపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ చర్యలకు ఉపక్రమించారు. అక్రమాలకు పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రాయపూడి, అమరావతిలోని కార్యాలయ డైరెక్టర్‌ను ఆదేశించారు. చర్యలు తీసుకోవాలని సూచించిన వారిలో కమిషనర్ కే వెంకటేశ్వరరావుతో పాటు టీపీఓగా పనిచేస్తున్న కే బాబూరావు, టీపీఎస్‌గా పనిచేస్తున్న షేక్ రసూల్, టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి వార్డు కార్యదర్శులుగా పనిచేస్తున్న కే జోషి, శిరీష, జీ సాయి మురళీకృష్ణ ఉన్నారు. అదేవిధంగా పదవీ విరమణ చేసిన ఏసీపీ జడ్.సుధాకరరావు, టీపీఎస్ ఎన్.నారాయణరావుల పెన్షన్లు నిలుపుదల చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నార్త్ బైపాస్ రోడ్డులో అక్రమంగా కాంప్లెక్స్... ఒంగోలు నగరంలోని నార్త్ బైపాస్ రోడ్డు, గుంటూరు రోడ్డులోని మంగమ్మ కాలేజీ జంక్షన్ వద్ద భూసేకరణ కింద ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో అనుమతులకు మించి నిర్మిస్తున్న భారీ షాపింగ్ మాల్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ.30 లక్షలకు పైగా లబ్ధిపొంది నిబంధనలకు విరుద్ధంగా ప్లాన్ అప్రూవల్ ఇచ్చారు. ఇంత జరుగుతున్నా ఆర్అండ్బీ అధికారులు అవినీతి రొచ్చులో పడి తెలిసీతెలియనట్లు వ్యవహరించారు. భూసేకరణ కింద నేషనల్ హైవే నుంచి నష్టపరిహారం పొంది మళ్లీ అదే స్థలంతో పాటు ఆర్అండ్బీ రోడ్డు స్థలం ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు లాడ్జ్ నిర్మాణాలు చేయగా.. వాటిపై ప్రముఖ న్యాయవాది డీఎస్ బాబు ఫిర్యాదుపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు గుంటూరు ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్ విచారణ చేశారు. వారి విచారణలో ఫిర్యాదు దారుడు అయిన డీఎస్ బాబు నుంచి పూర్తి వివరాలు సేకరించి బిల్డింగ్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు నిర్ధారణ కావడంతో చర్యలు చేపట్టారు. రత్నదీప్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోనూ... నగరంలోని మంగమూరు రోడ్డులో రత్నదీప్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోనూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. ఈ భవనం విషయంలో హైకోర్టు స్టే ఆదేశాలను ధిక్కరించి కోట్ల రూపాయల లంచాలతో రాత్రికిరాత్రే అక్రమంగా బీపీఎస్ కింద రెగ్యులరైజేషన్లు చేశారు. లేబర్ సెస్ రూ.2 కోట్లు చెల్లించాలని రత్నదీప్ బిల్డింగ్‌కు డిమాండ్ నోటీసును మున్సిపల్ అధికారులు అంటించారు. అదేవిధంగా వీఎల్టీ ట్యాక్స్ రూ.2.40 కోట్లు చెల్లించాలని మరో నోటీసు అంటించారు. అయినా బీపీఎస్ కింద అవేమీ పట్టించుకోకుండా రెగ్యులరైజ్ చేశారు. దాంతో న్యాయవాది డీఎస్ బాబు హైకోర్టులో గత ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులపై తక్షణ ఏసీబీ/సీబీఐ దర్యాప్తు, క్రిమినల్ కేసులు, ఆస్తుల జప్తు, అక్రమ అనుమతుల రద్దు కోరుతూ పిటీషన్ వేయడంతో వారందరిపై వేటు పడింది. -
ఒకే బడిలో చదువుతున్నా.. ఖాతాలు మారాయెలా?
బేస్తవారిపేట ఎంపీపీ స్కూల్లో గుంటి స్వప్న, చిరంజీవి దంపతుల కుమారుడు చిస్లోన్ రెండో తరగతి చదువుతున్నాడు. గతేడాది ఒకటో తరగతిలో ఇదే బడిలో చదివినందుకు పూర్తిస్థాయిలో రూ.13 వేలు అందాయి. ఈ ఏడాది మాత్రం విచిత్రంగా స్వప్న ఖాతాలో రూ.3 వేలు మాత్రమే జమ చేసి, మిగతా రూ.10 వేలు సంబంధిత ప్రైవేట్ స్కూల్‌కు జమ చేస్తున్నట్లు మెసేజ్ వచ్చింది. ప్రైవేటు బడి ముఖమే చూడని తమకు ఈ సందేశం రావడంపై తలలు పట్టుకుంటున్నారు. దీనిపై హెచ్ఎంను నిలదీస్తే.. సచివాలయంలో తేల్చుకోండంటూ ఉచిత సలహా ఇచ్చారని తల్లిదండ్రులు వాపోతున్నారు. -
ప్రభుత్వ బడిలో చదువు.. ప్రైవేటుకు నిధులు!
బేస్తవారిపేట మండలం ఖాజీపురంకు చెందిన నాగేంద్ర, దివ్య దంపతుల కుమార్తె నిఖితకు ఏలూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆర్టీఈ కింద సీటొచ్చింది. వారు స్వగ్రామానికి తిరిగి రావడంతో పాపను అక్కడే చేర్పించకుండా.. ఖాజీపురం ప్రభుత్వ పాఠశాలలో వేశారు. అయితే, ‘తల్లికి వందనం’ కింద దివ్య ఖాతాలో రూ.1,500 మాత్రమే జమయ్యాయి. మిగతా సొమ్ము ఆ ఏలూరు ప్రైవేట్ స్కూల్‌కు జమ చేస్తున్నట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అసలు చదవని బడికి డబ్బులెలా వెళ్తాయని ఎంఈఓ, హెచ్ఎంల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదని ఆ దంపతులు ఆవేదన చెందుతున్నారు. -
తొలి స్వాతంత్య్ర వేడుకలు మధుర స్మృతిగా నిలవాలి
● మార్కాపురం కలెక్టర్ విజయ సునీత మార్కాపురం: నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా, జిల్లా చరిత్రలో మధుర స్మృతి గా నిలిచిపోయేలా నిర్వహించాలని కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో నిర్వహిస్తున్న తొలి వేడుకల్లో భాగస్వాములు కావడం అధికారులందరికీ అరుదైన అవకాశమన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఆహ్వాన పత్రికలను అక్షర దోషాలు లేకుండా రూపొందించి ముందస్తుగా అందజేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించాలన్నారు. వేడుకలకు హాజరయ్యేవారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలతోపాటు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన త్రిపురాంతకం, భైరవకోన, నెమలిగుండం, ఇష్టకామేశ్వరి, చెన్నకేశవ స్వామి ఆలయాల విశిష్టతను చాటేలా శకటాలు ప్రదర్శించాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన పాటించాలని, విధుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో జేసీ పులి శ్రీనివాసులు, డీఆర్ఓ వెంకటశివరామిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
స్నేహితుడి తల్లి చివరిచూపునకు వెళ్తూ..
● రైలు నుంచి జారిపడి మృతి నెల్లూరు(క్రైమ్): స్నేహితుడి తల్లి మరణించడంతో చివరిచూపు కోసం వెళ్తున్న యువకుడు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. ఒంగోలు తంగెళ్ల ఖాసీం వీధికి చెందిన ఎస్.వెంకట చైతన్య(23) తన స్నేహితులతో కలిసి బెంగళూరులో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. ఒంగోలులో స్నేహితుడి తల్లి మరణించడంతో చివరిచూపు కోసం బుధవారం ఒంగోలు వచ్చేందుకు బలూర్ఘాట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. ఇది నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ మీదకు చేరుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆయన రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ● అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించకుండానే రోడ్ల విస్తరణ కందుకూరు: పట్టణంలో చేపడుతున్న రోడ్ల విస్తరణలో భాగంగా పలు చోట్ల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు, రోడ్లను విశాలంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ఈ పనుల్లో పలుచోట్ల పాత అడ్డంకులను తొలగించకుండానే రోడ్లు వేస్తున్నారు. దీని వల్ల మరింత ప్రమాదకరంగా మారతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా కనిగిరి రోడ్డు నుంచి బలిజపాలేనికి వెళ్లే రోడ్డును అధికారులు విస్తరిస్తున్నారు. ఇది నాలుగు రోడ్ల కూడలి. అటు కనిగిరి రోడ్డు, కోవూరు రోడ్డు, బలిజపాలెంకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం బలిజపాలెంలోకి వెళ్లే రోడ్డును ఇరువైపులా విస్తరిస్తున్నారు. అయితే రోడ్డుకు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని అలాగే ఉంచి చుట్టూ రోడ్డు వేస్తున్నారు. అలాగే రోడ్డుకు మరోవైపు ఉన్న ట్రాన్స్ఫార్మర్ను అక్కడి నుంచి మార్చలేదు. దీని వల్ల ఆ ప్రాంతంలో విస్తరణ పనులు పూర్తయిన తరువాత వేగంగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఆందోళన స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రదర్శిస్తున్న ఈ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వృద్ధురాలి గొంతు కోసిన దుండగులు
● అద్దంకిలో దారుణం ● డబ్బు కోసమేనని అనుమానం అద్దంకి: పట్టణంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. స్థానిక కట్టకిందపాలేనికి చెందిన వృద్ధురాలు మున్నంగి లక్ష్మిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడిచేశారు. భర్త, పిల్లలు లేని ఆమె.. ఓ బిర్యానీ సెంటర్ వద్ద భిక్షాటన చేస్తూ రాత్రి పూట అక్కడే నిద్రిస్తుంటుంది. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును కాజేసేందుకు దుండగులు ఆమె మెడపై కత్తితో కోసి పరారైనట్లు తెలుస్తోంది. రక్తపు మడుగులో పడిఉన్న బాధితురాలిని గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను ఒంగోలు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. రిక్షాల బజారులో పట్టపగలే చోరీ ● షాపుకు వెళ్లి వచ్చే సరికి బీరువాలోని నగలు మాయం ఒంగోలు టౌన్: నగరం నడిబొడ్డున పట్టపగలే దొంగలు పడ్డారు. ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు దర్జాగా బీరువా షెల్ఫ్ పగులగొట్టి నగలు, నగదుతో ఉడాయించారు. పోలీసుల కథనం ప్రకారం... కొత్త కూరగాయల మార్కెట్లో కిరాణా దుకాణం నిర్వహించే కారుమూరి వెంకట అశోక్‌కుమార్ కుటుంబంతో కలిసి నగరంలోని రిక్షాల బజారులో నివాసం ఉంటున్నారు. ఉదయం 6 గంటలకు అశోక్‌కుమార్ దుకాణానికి వెళ్లారు. 10.30 గంటలకు ఆయన భార్య మౌలిక దుకాణానికి వెళ్లగానే..అశోక్ ఇంటికి వచ్చి మధ్యాహ్నం వరకు విశ్రాంతి తీసుకున్నారు. ఎప్పటిలాగే మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భార్యకు భోజనం తీసుకొని తల్లి విజయలక్ష్మితో కలిసి దుకాణానికి వెళ్లారు. 2 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా బీరువా వద్ద దుస్తులు గందరగోళంగా పడి ఉన్నాయి. బీరువా లోపలి షెల్ఫ్ తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి పరిశీలిస్తే అందులోని మూడు సవర్ల బంగారు కడియం, 3 ఉంగరాలు, చెవిబుట్టలు మొత్తం కలిపి 49 గ్రాముల బంగారు నగలు, రూ.12,500 నగదు కనిపించలేదు. వెంటనే టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే దొంగలు పడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డెక్కిన పొగాకు రైతులు
ఒంగోలు సబర్బన్: గుండె మండిన పొగాకు రైతులు జిల్లాలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై 95 రోజులు కావస్తున్నా గిట్టుబాటు ధర ఇవ్వకుండా నో బిడ్ల పేరుతో వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన పొగాకును తిరిగి వెనక్కు పంపించటాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలోని త్రోవగుంట వద్ద, టంగుటూరు టోల్ ప్లాజా వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ నినాదాలు చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలిపిన నిరసనతో దాదాపు గంటకు పైగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందుగా పోలీసులు పొగాకు రైతుల ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ఒంగోలు నగరానికి దక్షిణాన ఒకచోట, ఉత్తర బైపాస్ వద్ద రెండు చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి మరీ వాహనాల రాకపోకలను ఆపేశారు. ఆందోళన అనంతరం పోలీసులు పొగాకు రైతులను, రైతు నాయకులను బలవంతంగా పోలీస్ వాహనాల్లో ఎక్కించి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా ప్రకాశం జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పొగాకు పంటకు సీ గ్రేడుకు కిలో రూ.110 అని ప్రకటించటాన్ని తీవ్రంగా ఖండించారు. రైతులను నిలువునా నష్టాలపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ నీట్ పేపరు లీకేజీలో యువత ఢిల్లీలో ఆందోళన చేసిన మాదిరిగా ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వాలు దిగిరావన్నారు. రాష్ట్ర మంత్రులు, అధికారులు కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఢిల్లీ వెళితే పొగాకు రైతులకు మేలు జరుగుతుందని సంతోష పడ్డామని, కానీ చర్చల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పొగాకు ధరలు తగ్గించి ప్రకటించటం దారుణమని మండిపడ్డాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సీ గ్రేడ్ పొగాకు రూ.110 అని ప్రకటించటం అత్యంత దారుణమైన మాటన్నారు. ఏ గ్రేడ్‌కు రూ.240, బీ గ్రేడ్‌కు రూ.190 అని ప్రకటించటమంటే పొగాకు రైతును నిలువునా మోసం చేయటమేనని అన్నారు. సరాసరి కిలో పొగాకు ధర రూ.250 దక్కితేనే రైతు అప్పుల పాలు కాకుండా ఉంటాడన్నారు. అంటే మేలు రకం పొగాకు కిలో రూ.300లకు పైగా ధర పలికితేనే రైతుకు గిట్టుబాటవుతుందని చెప్పారు. ప్రభుత్వమే దిగివచ్చి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి రూ.1000 కోట్లు కేటాయించి పొగాకును కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు, కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.లలిత కుమారి మాట్లాడుతూ పొగాకు రైతుకు అందరూ అండగా నిలవాలన్నారు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్న ప్రభుత్వాలు పొగాకు రైతుల కోసం కేవలం రూ.1000 కోట్లు కేటాయించి పొగాకును కొనుగోలు చేయలేరా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా కళ్లు తెరిచి ప్రభుత్వం పొగాకు రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘాల నేతలు జజ్జూరి జయంత్ బాబు, కిలారు పెద్దబ్బాయి, టి.శ్రీకాంత్, వడ్డే హనుమారెడ్డి, పెంట్యాల హనుమంతరావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, కాలం సుబ్బారావు, చీకటి శ్రీనివాస రావు, బంకా సుబ్బారావు, తోట తిరుపతయ్య, ఎంఎస్ సాయి, కోడూరి నాంచార్లు, పద్మతో పాటు వందలాది మంది పొగాకు రైతులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై మొహరించిన పోలీసులు ఒంగోలు టౌన్: పొగాకు రైతులు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాతీయ రహదారు దిగ్బంధనానికి పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. జాతీయ రహదారి వెంట కీలక జంక్షన్లు, పొగాకు ఎక్కువగా సాగు చేసే గ్రామాలకు సంబంధించిన రహదారులు, టంగుటూరు, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే పోలీసులను నియమించారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహంగా ఉన్న రైతులు ఎక్కడ హద్దులు దాటుతారోనని పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఏఎస్పీ (అడ్మిన్) యుగంధర్ బాబు పర్యవేక్షణలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయ కృష్ణ, రూరల్ సీఐ శేషగిరిరావు, చీమకుర్తి, మద్దిపాడు, రూరల్, తాలుకాలకు చెందిన ఎస్సైలు, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసు సిబ్బందిని భారీగా మోహరించారు. డ్రోన్ కెమెరాలతో నిరసన కార్యక్రమాన్ని సమీక్షించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చాలా చోట్ల రూట్ డైవర్షన్ చేసి వాహనాలను పంపించారు. అయితే రైతులు ఎక్కడా తమ పరిధిని దాటి వ్యవహరించలేదు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. మంత్రి స్వామికి పొగాకు రైతుల సమస్యలు పట్టవా... టోల్ ప్లాజాకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంత్రి డోలా స్వామికి పొగాకు రైతుల కష్టాలు కనపడటం లేదా అని రైతు సంఘాల నాయకులు ప్రశ్నించారు. ట్రాక్టర్ ర్యాలీ, అన్ని వేలం కేంద్రాల్లో నిరసనలు తెలిపినా, వేలం కేంద్రాలు రోజులు తరబడి నిలుపుదల చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతుల జాతీయ రహదారి దిగ్బధనం నేపథ్యంలో దర్శి డీఎస్పీ బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 130 సిబ్బందిని మొహరించారు. దాదాపు అర్ధగంట పాటు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలుపుతున్న సమయంలో అరెస్టు చేసి టంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు, రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు పరిటాల కోటేశ్వరరావు, సీఎస్ సాగర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, రైతు సంఘం, కార్మిక సంఘం నాయకులు సింగయ్య, కొండారెడ్డి, ఆర్ మోహన్, లక్ష్మీ, ప్రభాకర్, వెంకట్రావు, రఘురాం, పమిడి నాగేశ్వరరావు, రమాదేవి, ఏసుపోగు బాలకోటయ్య తదితరులను మొత్తం 34 మంది రైతులను అరెస్ట్ చేశారు. టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద.. టంగుటూరు: పొగాకు రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రూ.1000 కోట్లు కేటాయించి ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది పొగాకు రైతులు బుధవారం టంగుటూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిని నిర్బంధించారు. టంగుటూరు, కొండపి, కందుకూరు వేలం కేంద్రాల పరిధిలోని గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ మార్కెట్లో పొగాకు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలు దిగజార్చారన్నారు. గత ఏడాది కేజీ సరాసరి రూ.250 ఉంటే, ఈ ఏడాది సరాసరి రూ.190కు పడిపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు వ్యాపారుల ప్రయోజనాలకే పనిచేస్తున్నాయని మండిపడ్డారు. -
ఇసుక మాఫియా బరితెగింపు
సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అరికట్టాల్సిన అధికారులూ వారికి వంతపాడుతున్నారు. పాలేరులో దోపిడీయే లక్ష్యంగా ఇసుక దందా సాగిస్తూ సహజ వనరులను కొల్లగొడుతున్న టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు, మైనింగ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినా పొన్నలూరు మండల రెవెన్యూ, పోలీసు, ఎంపీడీవో కార్యాలయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మంత్రి స్వామి ఆదేశాలకు జీహుజూర్ అంటూ పట్టీపట్టనట్లు ఉంటూ ఇసుక దోపిడీకి అండగా నిలుస్తున్నారు. ఈ అక్రమ దందాకు పొన్నలూరు మండలం వేంపాడు, ఉప్పలదిన్నె రీచ్‌లు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి అక్రమ ఇసుక తవ్వకాలు చేయొద్దని ఆయా ప్రాంతాల గ్రామస్తులు ఎన్నిసార్లు వేడుకున్నా, పత్రికలు పలుమార్లు కథనాలు రాసినా అక్రమార్కులు పట్టించుకోకుండా ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా జేసీబీలతో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. వేంపాడు గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు దాసరి వెంకటేశ్వర్లు పలుమార్లు ఇసుక తవ్వకాలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా తవ్వకాలు ఆపకపోవడంతో చివరకు హైకోర్టులో రెండుసార్లు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయటంతో స్పందించిన కోర్టు ఈ ఏడాది మార్చి, జూన్ నెలలో ఈ దోపిడీని అరికట్టాలని.. మీరు తీసుకున్న చర్యలను తెలియజేయాలని అధికారులను ఆదేశించింది. టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోండి: పాలేరులో ఇసుక దందాకు పాల్పడుతున్న పొన్నలూరు మండల టీడీపీ నాయకులు నాగిరెడ్డి పాలెంకు చెందిన పార్టీ మండల అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు కుమారుడు అనుమోలు సుధా, వేంపాడుకు చెందిన దాసరి కృష్ణారావు, పూరిమిట్ల మాల్యాద్రి, బైరుడ్ల ఇజ్రాయిల్, మాజీ ఎంపీపీ కొండగుంట శ్రీనివాసరావు, కొండగుంట సురేష్, జరుగుమల్లి టీడీపీ మండల అధ్యక్షుడు పోకూరి రవి లను మైనింగ్ శాఖ అధికారులు పలుమార్లు హెచ్చరించటంతో పాటు వీరిపై 132 కేసులు నమోదు చేసి రూ.25 లక్షలు జరిమానా కింద వసూలు చేశారు. అయినా వీరిలో మార్పు రాలేదు. అక్రమ ఇసుక రవాణాను వీరు వృత్తి గా మార్చుకున్నారని, వారిని గ్రామ బహిష్కరణ చేయాలని, పీడీ యాక్టు నమోదు చేయాలని, వాల్టా యాక్టు విధించాలని కోరుతూ జిల్లా మైనింగ్ శాఖ అధికారి టీ రాజశేఖర్ మార్చి 24వ తేదీ, జూన్ 3వ తేదీ మండల తహశీల్దార్, ఎస్సై, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక హైకోర్టు కూడా పలుమార్లు ఇసుక దందా పై సదరు అధికారులకు అక్షింతలు వేసింది. కానీ వీరికి మాత్రం హైకోర్టు ఆదేశాల కన్నా మంత్రి స్వామి ఆదేశాలే శిరోధార్యమయ్యాయి. దీనిని బట్టి నియోజకవర్గంలో వ్యవస్థలు ఏవిధంగా నాశనం అయ్యాయో అర్థమవుతుంది. ఇసుక దందాపై హైకోర్టు హెచ్చరికలు: ఇసుక దందాపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఎన్నిసార్లు అధికారులను హెచ్చరించినా పట్టించుకోకపోవటంతో ఆగ్రహించిన హైకోర్టు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుకు, పొన్నలూరు ఎంపీడీఓ, తహశీల్దార్, ఎస్సైలకు తదుపరి విచారణకు వచ్చేటప్పుడు మీరు తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిని బట్టి నియోజకవర్గంలో ఇసుక దోపిడీ ఏవిధంగా సాగుతోందో, వ్యవస్థలను మంత్రి స్వామి ఎలా చిన్నాభిన్నం చేశారో అర్థమవుతుంది. నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి వ్యవస్థలను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. మంత్రి స్వామిని బర్తరఫ్ చేయాలి నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. హైకోర్టు ఆదేశాల కన్నా మంత్రి స్వామి ఆదేశాలు మాత్రమే అధికారులు పాటిస్తూ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇసుక దోపిడీలో పొన్నలూరు మండల ముఖ్య టీడీపీ నాయకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు పాటిస్తూ వీరిని గ్రామ బహిష్కరణ చేసి, వీరిపై పీడీ యాక్టు, వాల్టా చట్టం నమోదు చేయాలి. మంత్రి స్వామి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. లేదా సీఎం చంద్రబాబు మంత్రి స్వామిని బర్తరఫ్ చేయాలి. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి -
రవాణా శాఖ అధికారుల తనిఖీలు
ఒంగోలు సబర్బన్: రోడ్డు భద్రతా నిబంధనల్లో భాగంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో మోటార్ వాహన తనిఖీ అధికారులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. సీటు బెల్టు ధరించని వాహనదారులపై, ద్విచక్రవాహనాలను హెల్మెట్ లేకుండా నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎల్ఈడీ లైట్లను గుర్తించి, సంబంధిత వాహనాలను నిలిపివేసి ఆ ఎల్ఈడీ లైట్లను తొలగించారు. మొత్తం 47 వాహనాలకు రూ.65 వేల జరిమానా విధించారు. మోటార్ వాహన తనిఖీ అధికారి రామచంద్రరావు, సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారులు జయప్రకాశ్, ధర్మేంద్ర, భానుప్రకాశ్, జశ్వంత్ పాల్గొన్నారు. మద్దిపాడు: ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకుంటూ రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఐటీ శాఖ స్పెషల్ కమిషనర్ మల్లవరపు సూర్యతేజ అన్నారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే నువ్వులు, జొన్న, సజ్జలు, రాగులు వంటి పంటలు సాగు చేయాలని సూచించారు. రైతులకు వివిధ పంటల్లో వస్తున్న చీడపీడలను గుర్తించడానికి, ఎరువుల పంపిణీ, వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రైతులు యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేస్తున్న విధానాలను పరీక్షించారు. ఏపీ ఏఐఎంఎస్ యాప్ రైతులకు ఎంత ఉపయోగకరంగా ఉందన్న విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మద్దిపాడు మండలం, గుంటూరు జిల్లాలో ఎడ్లపాడు గ్రామాలను పైలెట్ ప్రాజక్టు కింద 5 వేల ఎకరాలు తీసుకుని ఆయా గ్రామాల్లో సాగునీటి వసతి పరిశీలించి రైతులకు సూచనలు సలహాలు ఇస్తూ ఆదాయం వచ్చే పంటలను వేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు మేలు జరగడమే తన తుది లక్ష్యమన్నారు. మండలంలోని బసవన్నపాలెం, సీతారాంపురం, నేలటూరు, అన్నంగి గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు సరిగా అందడం లేదని రైతులు తెలుపగా, త్వరలోనే ఆయా ప్రాంతాలలో టవర్ నిర్మానం చేపట్టి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ శ్రీనివాసరావు, ఏఓ స్వర్ణలత, రైతులు, వీఏఏలు పాల్గొన్నారు. -
లేని భూమిని చూపి.. రూ.25 లక్షల టోకరా!
కురిచేడులో అనుమతి లేని ఓ లేఔట్ కురిచేడు: తనది కాని భూమిని చూపి, లేఔట్ వేసి వప్లాట్లు విక్రయిస్తున్నట్లు నమ్మించి ఏకంగా రూ.25 లక్షలు దోచుకున్న ఘరానా మోసం కురిచేడులో వెలుగుచూసింది. ఎస్సై జి.కోటయ్య కథనం ప్రకారం.. విజయవాడ భారతి ఇంటర్మీడియట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న పావులూరి నీలిమకు బుల్లా విజయ్‌కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కురిచేడు మండలం పడమరగంగవరం సర్వే నంబర్ 89/2లోని 6.95 ఎకరాల భూమి తనదేనని నమ్మబలికాడు. దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్‌తో ఇక్కడ భూములకు భారీ డిమాండ్ ఉంటుందని ఆశ చూపాడు. అతని మాటలు నమ్మిన నీలిమ.. మొదట రూ.3.25 లక్షలతో రెండు ప్లాట్లు (డాక్యుమెంట్ నంబర్ 1681/2025), ఆ తర్వాత రూ.20 లక్షలతో మరో 2 వేల చదరపు గజాల స్థలాన్ని (డాక్యుమెంట్ నంబర్ 13847/2025) రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే డాక్యుమెంట్లలో ఉన్న స్థలానికి, భౌతికంగా చూపించిన భూమికి పొంతన లేకపోవడంతో మోసపోయానని ఆమె గ్రహించారు. దీనిపై నిలదీయగా విజయ్‌కుమార్ ముఖం చాటేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కన్వర్షన్ లేకుండానే దందా.. వ్యవసాయ భూములను జాయింట్ కలెక్టర్(జేసీ) ద్వారా కన్వర్షన్ చేయకుండానే మండలంలో 10కి పైగా అక్రమ లేఔట్లు వెలిశాయి. వీటికి పంచాయతీ కార్యదర్శులు సైతం అప్రూవల్ ఇస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. జిల్లా అధికారులు మొద్దునిద్ర వీడి కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు మరింత మోసపోయే ప్రమాదం పొంచి ఉంది. విజయవాడ మహిళ ఫిర్యాదుపై చీటింగ్ కేసు నమోదు కురిచేడు మండలంలో రోజుకో భూదందా వెలుగులోకి.. జేసీ కన్వర్షన్ లేకుండా సాగు భూముల్లో ప్లాట్లు -
అడవికి ప్రాణం.. అంతులేని గంభీరం
పులుల రక్షణ ఛత్రంగా నల్లమల అభయారణ్యం పులి గాండ్రిస్తే అడవి దద్దరిల్లుతుంది! జీవవైవిధ్యాన్ని రక్షించడంలో, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో అడవికి రారాజు అయిన పెద్దపులి పాత్ర అత్యంత కీలకమైనది. దేశంలోనే అతిపెద్దదైన నల్లమలలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఈ చారల అందాల స్వేచ్ఛా విహారానికి సురక్షిత నిలయంగా మారింది. దట్టమైన నల్లమల అరణ్యంలో పులులు రాజసంగా అడుగులేస్తూ తమ సంతతిని గణనీయంగా వృద్ధి చేసుకుంటున్నాయి. ఒకవైపు అక్రమార్కులు, వేటగాళ్ల ముప్పు పొంచి ఉన్నా.. అటవీశాఖ ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులు, రెస్క్యూ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్ల వంటి కట్టుదిట్టమైన పరిరక్షణ చర్యల వల్ల నల్లమలలో బెబ్బులి రొమ్ము విరిచి తిరుగుతోంది. 2022 గణాంకాల ప్రకారం నల్లమలలో 63 పెద్దపులులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 87కు చేరి ఉంటుందని అటవీ శాఖ అధికారుల అంచనా. పచ్చని అడవికి ప్రాణమైన మన జాతీయ జంతువును కాపాడుకోవడం, భావితరాలకు అందించడం ఎంతో అవసరం. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. – పెద్దదోర్నాల నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ముఖచిత్రం విస్తరించిన జిల్లాలు నంద్యాల, మార్కాపురం, పల్నాడు. పాత విస్తీర్ణం 3,727.82 చ.కి.మీ అదనంగా కలిపిన విస్తీర్ణం 2,149 చదరపు కిలోమీటర్లు. కొత్త హోదా : ఎకో సెన్సిటివ్ జోన్ పులుల ప్రధాన ఆహారం జింకలు, దుప్పులు, అడవి పందులు. -
31న దివ్యాంగ క్రికెటర్ల ఎంపిక
ఒంగోలు సిటీ: డీసీసీఏపీ, డీఏసీఏల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ‘అమరావతి ఇన్‌క్లూజివ్ క్రికెట్ కప్–2026’ టోర్నీకి ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి శారీరక దివ్యాంగ క్రికెటర్ల ఎంపిక పోటీలు ఈ నెల 31న నిర్వహించనున్నారు. ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కళాశాల మైదానంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఎంపిక పోటీ ఉంటుందని అసోసియేషన్ జిల్లా కన్వీనర్ జి.సుబ్బయ్య తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ సొంత క్రికెట్ కిట్‌తో పాటు ఆధార్, సదరమ్ సర్టిఫికెట్, యూడీఐడీ కార్డుల జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరు కావాలని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వివరాలకు 80969 29907, 91335 03822ను సంప్రదించాలని కోరారు. అద్దంకి: పట్టణంలో బైకు చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులకు ఎనిమిది నెలల జైలు శిక్ష పడినట్లు సీఐ సుబ్బరాజు మంగళవారం తెలిపారు. గత ఏడాది జూలై 19న స్థానిక హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద తన బైకు చోరీకి గురైందని తోటకూర నంది కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా వినుకొండకు చెందిన కె.వెంకటసాయి, కె.సాయి కృష్ణను పోలీసులు నిందితులుగా గుర్తించి సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారు నేరం అంగీకరించడంతో కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అఖిల వారికి ఎనిమిది నెలల చొప్పున జైలు శిక్ష విధించారు. అనంతరం నిందితులను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీఐ వివరించారు. ● పెద్దదోర్నాల మండలం కటకానిపల్లెలో ఘటన పెద్దదోర్నాల: మండల పరిధిలోని కటకానిపల్లెలో 60 వ్యవసాయ బోర్లకు చెందిన విద్యుత్ కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. మంగళవారం వేకువజామున విద్యుత్ సరఫరా కాగానే పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు.. బోర్ల వద్ద వైర్లను కత్తిరించి ఉండటాన్ని గమనించారు. వ్యవసాయ బోర్లతో పాటు గ్రామానికి తాగునీరు అందించే బోర్ల వైర్లను సైతం దుండగులు అపహరించారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో కేబుల్స్ చోరీ కావడం రైతుల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై బాధిత రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్దదోర్నాల: ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఐనముక్కల కొండారెడ్డి కాలనీ సమీపంలో కర్నూలు–గుంటూరు రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకట రమణయ్య కథనం ప్రకారం.. యడవల్లికి చెందిన దూదేకుల మహబూబ్ పీరా(46) ద్విచక్ర వాహనంపై దోర్నాల వైపు వస్తుండగా ఐనముక్కల వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన 108 సిబ్బంది సయ్యద్ భాషా, శ్రీనివాసులు వెంటనే అతడిని పెద్దదోర్నాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సారావుపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత హత్య కేసులో నలుగురు అరెస్టు కనిగిరిరూరల్: వివాహిత హత్య కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం రాత్రి తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. కనిగిరిలోని అర్బన్ కాలనీకి చెందిన ప్రతిభా భారతి (33) మృతికి కారణమైన భర్త గంటా పీటర్ ప్రమోద్ కుమార్, అతని అన్న, మరో ఇద్దరిని మంగళవారం ఉదయం డీఎస్పీ ఎం శ్రీధర్, ఎస్సై జి.సందీప్ తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 10 వరకు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. -
పొన్నలూరు ఎస్సై తలబిరుసు.. బాధితుడిపైనే కేసు!
● అక్రమంగా ఇంటి కూల్చివేతపై బాధితుడి ఫిర్యాదు బేఖాతరు ● గ్రీవెన్స్ అర్జీ మేరకు ఎస్పీ ఆదేశించినా కేసు కట్టని ఎస్సై ● మంత్రి స్వామి కనుసన్నల్లో బాధిత కుటుంబంపైనే ఎదురు కేసు పొన్నలూరు: సామాన్య ప్రజలకు అండగా నిలబడి న్యాయం చేయాల్సిన పోలీసులు దారి తప్పుతున్నారు. న్యాయం, అన్యాయం విచక్షించకుండా అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా సామాన్యులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బాధితుడి సమస్య పరిష్కరించాలని ఎస్పీ స్థాయి ఉన్నతాధికారులు ఆదేశించినా స్థానిక ఎస్సై బేఖాతరు చేస్తున్న తీరు పొన్నలూరు మండలంలో చర్చనీయాంశంగా మారింది. మండలంలోని చెరుకూరుకు చెందిన కుంచాల మాధవరావు తనకు వారసత్వంగా వచ్చిన పక్కా గృహంలో 25 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు గ్రామంలో లేని సమయం చూసి, అదే గ్రామానికి చెందిన కుంచాల మాల్యాద్రి పొక్లెయిన్‌తో మాధవరావు ఇంటిని కూల్చివేసి ఆనవాళ్లు లేకుండా చదును చేశాడు. తన అర్హత పత్రాలతో న్యాయం చేయాలని శనివారం బాధితుడు పొన్నలూరు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించగా.. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎస్సై కనీసం ఫిర్యాదు కూడా తీసుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేసి వెనక్కి పంపారు. దీంతో బాధితుడు సోమవారం గ్రీవెన్స్‌లో ఎస్పీ ఎదుట సమస్యను మొరపెట్టుకున్నాడు. బాధితుని ఫిర్యాదుపై విచారించి కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయం ఆదేశించినా స్థానిక ఎస్సై పట్టించుకోలేదు. పోలీస్ బాస్ ఆదేశాలను సైతం పక్కనపెట్టి మంత్రి స్వామి కనుసన్నల్లో వింత నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి విచారణ చేపట్టకుండానే, ఇంటిని కూల్చిన మాల్యాద్రి వద్దనే సోమవారం ఎస్సై ఫిర్యాదు స్వీకరించారు. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ స్థలాన్నే వారు ఆక్రమించి, తమపై దౌర్జన్యం చేసినట్లు మాల్యాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బాధితుడు మాధవరావు, అతని భార్య లక్ష్మి, బావ నరసింహంపై ఎస్సై అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం. మంత్రి స్వామి ఆదేశాలతోనే పోలీసులు ఈ విధంగా తమపై ఎదురు కేసు పెట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఇలా తప్పు చేసిన వారికి వత్తాసు పలుకుతూ సామాన్యులపై కేసులు బనాయించడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై వివరణ కోరేందుకు ఎస్సైని ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సెంట్రల్ కమిటీ జాయింట్ సెక్రటరీగా ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి రేడియాలజీ విభాగం హెచ్ఓడి డా.నరసింహాచారి ఎన్నికకావడంపై జిల్లా ప్రభుత్వ వైద్యుల సంఘం (జీడీఏ) కార్యవర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం డా.నరసింహాచారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఏడుకొండలరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు డా.నరసింహాచారి కృషి చేయాలని కోరారు. సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జీడీఏ రాష్ట్ర కార్యదర్శి డా.నటరాజ్, గౌరవాధ్యక్షుడు డా.మస్తాన్ బాషా, గర్నింగ్బాడీ సభ్యులు డా.తిరుపతి రెడ్డి, డా.శ్రీదేవి పాల్గొన్నారు. -
గుండ్లకమ్మ నదికి నీళ్లొదిలారు..
మద్దిపాడు: గుండ్లకమ్మ నదిపై మల్లవరం వద్ద ఉన్న రిజర్వాయర్ నుంచి నదిలోకి పూర్తిగా నీరు వదలడం నిలిపేశారు. ఈ క్రమంలో గుండ్లకమ్మ నీటి కోసం ఆధారపడి ఉన్న మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తమకు రిజర్వాయర్ నుంచి నదిలోకి నీరు విడుదల చేయించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జునను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం మల్లవరం వద్ద ఉన్న రిజర్వాయర్‌ను పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. మార్గమధ్యంలోనే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్దకు వచ్చి రిజర్వాయర్‌లో నీటిమట్టం పరిశీలించారు. గత ప్రభుత్వంలో 19 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్‌లో నీరు నిలిచినప్పుడు కూడా గుండ్లకమ్మ నదిలోకి నీరు విడుదల చేశారన్నారు. దీంతో నదిపై ఆధారపడి ఉన్న దిగువ గ్రామాల ప్రజలు, పశువులకు నీరు, మేత పెట్టుకునేందుకు సరిపోయాయని, కానీ ప్రస్తుతం ఆ విధంగా నీటిని విడుదల చేయకుండా నిలుపుదల చేయడం మంచి పద్ధతి కాదని ఆయన అధికారులకు తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ పనైనా తాను సహించబోనని స్పష్టం చేశారు. దీంతో రిజర్వాయర్ జేఈ రామాంజనేయులు ఉన్నతాధికారులకు విషయం తెలిపి వెంటనే ఏడో నంబర్ గేటు ఎత్తి 250 క్యూసెక్కుల నీటిని గుండ్లకమ్మ నదిలోకి విడుదల చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు వాకా కోటిరెడ్డి, పోలవరపు శ్రీమన్నారాయణ, పోలిలేని కోటేశ్వరరావు, పాలడుగు రాజీవ్, బొమ్మల రామాంజనేయులు, అన్వేష్, గుడ్డపాతల రవి, కాకర్ల వెంకటేష్, దుడ్డు వినోద్‌కుమార్, కందుల డానియేలు, నాదెండ్ల మహేష్, మద్దినేని శ్రీకాంత్, రావూరి ప్రసన్నకుమార్‌రెడ్డి, జగన్నాథ్ కోటిలింగం, వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, పోకూరి శ్రీరాములు, రావూరి అశోక్‌రెడ్డి, ఎడవల్లి మోహన్‌రావు, పైనం ప్రసాదరావు, రాయపాటి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘మామూలు’ ఇస్తేనే మస్టర్!
పొదిలి రూరల్: ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు అరకొర వేతనాలు.. వీటికి తోడు ఉపాధి హామీ సిబ్బంది లంచాల వేధింపులతో కూలీలు విలవిల్లాడుతున్నారు. ‘అధికారం మాది.. అడిగినంత ఇస్తేనే పని.. లేదంటే దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ పొదిలి మండలంలో కొందరు సిబ్బంది బరితెగిస్తున్నారు. మండలంలోని తుమ్మగుంట పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్ఏ) వై.మల్లికార్జునరావు తీరుపై ఉపాధి కూలీలు మండిపడుతున్నారు. మంగళవారం ఎంపీడీఓ శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు. పని కావాలంటే వారానికి రూ.400 లంచం ఇవ్వాలని ఎఫ్ఏ డిమాండ్ చేస్తున్నాడని వాపోయారు. వంద మంది పనికి వెళ్తే.. డబ్బులిచ్చిన 70 మందికే డిమాండ్ పెట్టి, మిగతా వారికి పని ఇవ్వకుండా వివక్ష చూపుతున్నాడని బీరం రంగమ్మ, బీరం వెంకటరత్తమ్మ, చినగోపాల్రెడ్డి, లక్ష్మి, కృష్ణవేణి, తిరుపతమ్మ, నాగార్జునరెడ్డి, చెంచయ్య తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అడిగినంత ఇవ్వలేదన్న కక్షతో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు చేసిన పనికి సంబంధించిన మస్టర్లను తమ వద్దే ఉంచి అప్లోడ్ చేయలేదని ఎంపీడీఓకు చూపించారు. మే నెలలో రెండు వారాల పాటు చేసిన పనికి కూడా మస్టర్ వేయలేదని, దీనిపై ఏపీఓకు మొరపెట్టుకున్నా ‘ఆ డబ్బులు మర్చిపోండి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వారు ఆరోపించారు. కూలీల ఫిర్యాదుపై ఎంపీడీఓ శ్రీనివాసరావు స్పందిస్తూ.. కూలీలతో దురుసుగా వ్యవహరిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న సదరు ఫీల్డ్ అసిస్టెంట్‌ను విధుల నుంచి తొలగించేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తానని చెప్పారు. పని కావాలంటే వారానికి రూ.400 ఇవ్వాలని ఎఫ్ఏ డిమాండ్ ఎంపీడీఓకు మొరపెట్టుకున్న తుమ్మగుంట ఉపాధి కూలీలు -
దోచుకో.. పంచుకో.. తినుకో..
దీక్షా శిబిరంలో కూర్చున్న మాజీ మంత్రి సురేష్ సంఘీభావం తెలుపుతున్న జంకె వెంకటరెడ్డి మార్కాపురం: రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని మాయమాటలు చెప్పిన కూటమి నేతలు.. గద్దెనెక్కిన తర్వాత ‘డీపీటీ’(దోచుకో.. పంచుకో.. తినుకో) విధానాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండేపి ఇన్‌ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. మార్కాపురంలో డాక్యుమెంట్ రైటర్లు తమ సమస్యల పరిష్కారం కోసం తొమ్మిది రోజులుగా చేస్తున్న సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలం నుంచి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుస్తున్న డాక్యుమెంట్ రైటర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ కార్యాలయాలను పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) విధానంలోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వెంటనే 396 జీవోను ఉపసంహరించుకోవాలన్నారు. మెడికల్ కళాశాలలు, జీజీహెచ్‌లను ఇప్పటికే పీపీపీలోకి తెచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖను కూడా ఆ దిశగా తీసుకెళ్లడం దారుణమన్నారు. పీపీపీ విధానం వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని, ‘మాకింత ఇవ్వు.. మిగిలింది నువ్వు తీసుకో’ అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే లేఖరుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమ్మెకు జంకె, ఏఐటీయూసీ మద్దతు డాక్యుమెంటు రైటర్ల పెన్‌డౌన్ సమ్మెకు వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి సంఘీభావం ప్రకటించి, ప్రభుత్వం వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ కూడా సమ్మెకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టి.సుబ్బారావు, స్టార్ మస్తాన్, ప్రకాష్, గోవర్ధన్ పాల్గొన్నారు. ఇదే చంద్రబాబు ప్రభుత్వ విధానం.. సంపద సృష్టి బూటకం దస్తావేజు లేఖరుల సమ్మెలో మాజీ మంత్రి సురేష్ ధ్వజం 396 జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే జంకె, ఏఐటీయూసీ నేత రవీంద్రనాఽథ్ -
ధర్నా చేసినప్పుడే వేతనాలు..లేకపోతే ఒట్టిచేతులు
ఒంగోలు టౌన్: రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో సహనం నశించిన జీజీహెచ్ పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు శానిటేషన్ ఏజన్సీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పెద్ద సంఖ్యలో పారిశుధ్య కార్మికులు నిరసనకు దిగి వేతనాల కోసం నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ధర్నాలు చేసినప్పుడు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, లేకపోతే చాకిరి చేయించుకుంటూ ఒట్టి చేతులు చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికుల వేతనాలను సకాలంలో ఇప్పించడంలో జీజీహెచ్ ఉన్నతాధికారులు విఫలమవడం దారుణమని పలువురు పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు అడిగితే ప్రభుత్వం బడ్జెట్ పెట్టలేదని చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని విమర్శించారు. వేతనాలు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. పారిశుధ్య కాంట్రాక్టర్‌ను తొలగించాలి: సీఐటీయూ పారిశుధ్య కార్మికుల చేత బండచాకిరి చేయించుకుంటూ కనీస వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్న ఏజన్సీని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు. జీజీహెచ్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మే, జూన్ నెల వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. వేతనాల గురించి ప్రశ్నించినప్పుడల్లా ఇంకా బడ్జెట్ రాలేదని జవాబు చెబుతున్నారని, దీనికి కార్మికులు బాధ్యత వహించాలా అని ప్రశ్నించారు. జీజీహెచ్‌లో పారిశుధ్య విభాగంలో 240 మంది కార్మికులు పని చేస్తున్నారని, వీరిలో ఎక్కువగా మహిళలు ఉన్నారని తెలిపారు. సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయని, కార్మికులు విధులకు హాజరవడానికి రవాణా ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సీఐటీయూ నగర కన్వీనర్ టి.మహేష్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా వేధించడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఏజన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని అధికారులు ఇప్పుడు రాయబారాలు చేయడం ఏమిటని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు విజయమ్మ, యూనియన్ నాయకులు సుబ్బారావు, జాలమ్మ, సీపీఐ నాయకులు కొత్తకోట వెంకటేశ్వరరావు, ఎంఏ సాలార్ తదితరులు పాల్గొన్నారు. -
ఓట్లు తొలగించేందుకు పన్నాగం
యర్రగొండపాలెం: అధికారులు కింది స్థాయి సిబ్బందికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండా అన్ఫైన్డబుల్ కింద నమోదు చేయించడం చంద్రబాబు ప్రభుత్వం పన్నిన పన్నాగంలో భాగమేనని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో 45 లక్షల ఓటర్లను తొలగింపులో సింహ భాగం ఆచూకీ దొరకటం లేదంటే వీరంతా రాష్ట్రం నుంచి పారిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ఆ ఓటర్లను కావాలని తొలగించారన్న ఆరోపణలు వస్తున్నా అందుకు సమాధానం చెప్పగలిగే సత్తా అధికారంలో ఉన్న టీడీపీ పెద్దలకు లేదని అన్నారు. కనిపించకుండా పోయారంటున్న ఓటర్లను కనిపెట్టకపోవడం అంటే ఈ ప్రభుత్వం సక్రమంగా పాలన చేస్తుందా.. లేకుంటే నిద్రపోతుందా అన్న అనుమానం వస్తోందని, ఒక వేళ ఆచూకీ దొరకలేదంటున్న వారు మరో చోట ఎన్రోల్ అయిఉంటే ఆచూకీ దొరకలేదని ఏ విధంగా అంటున్నారని ప్రశ్నించారు. సక్రమంగా ఎన్నికల్లో నెగ్గలేని చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకమిదని ఆయన విమర్శించారు. ఎన్నికల కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థగా పనిచేయాలని, కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేయకూడదన్నారు. లోకేశ్ రాజీనామా చేయాలి నైతిక బాధ్యత తీసుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే తాటిపర్తి డిమాండ్ చేశారు. నీట్ యూజీ పేపర్ లీక్‌పై బాధ్యత వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అంతకంటే పెద్ద స్కాం డీఎస్సీ కుంభకోణం సాక్ష్యాధారాలతో సహా బయటపడితే అందుకు మీరు నైతిక బాధ్యత ఎందుకు వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ కారణంగా కాక్రోచ్ జరిపిన ఆందోళనను తలపించేలా రాష్ట్రంలోని యువత, విద్యార్థులు సిద్ధమవుతున్నారని, అంతకంటే ముందుగానే లోకేశ్ రాజీనామా చేయడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. ఒంగోలు సిటీ: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఫీజు రీయింబర్స్మెంట్ విధానం, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒంగోలులో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఒంగోలులోని అంబేడ్కర్ భవన్ నుంచి శాంతియుతంగా ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ కు ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. -
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వీడండి
మార్కాపురం టౌన్: రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ఈ విభాగంలో సమస్యల పరిష్కారం తక్కువగా ఉందని కలెక్టర్ విజయసునీత అన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటి నుంచైనా నిర్లక్ష్యం వీడి సమస్యల పరిష్కారంపై దృష్టిపెడితే జిల్లాకు మంచిపేరు వస్తుందన్నారు. ఆ దిశగా అధికారులు కృషిచేయాలన్నారు. మొత్తం 286 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూకు సంబంధించి 134, ఇతర సమస్యలపై 152 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు శివరామిరెడ్డి, అజయ్‌కుమార్, రవాణాశాఖాధికారి ఆర్ రాంబాబు, జిల్లా వ్యవసాయాధికారి బాలాజీనాయక్, లీడ్‌బ్యాంకు మేనేజర్ షాహీర్, మున్సిపల్ కమిషనరు నారాయణరావు, ఆర్టీసీ డీఎం లావణ్య, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి: మార్కాపురం పట్టణానికి చెందిన రాచమడుగు తిరునారాయణమూర్తి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, శ్రీరామచంద్రమూర్తి తదితరులు నరసింహాపురం గ్రామ రెవెన్యూ ఇలాఖాలో ఉన్న తమ పొలాలను తమకు తెలియకుండా తమ సోదరుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, వాటిపై విచారణ జరిపి ఆన్లైన్ రద్దుపరిచి న్యాయం చేయాలని పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించారు. 1989 జూలై 11న తమ తల్లిదండ్రులు సోదరులందరికీ ఆస్తి పంపకాలు రాశారన్నారు. అయితే తమకు తెలియకుండా సోదరుడు తమ పొలాలను కూడా రిజిస్టరు చేయించుకుని అన్యాక్రాంతం చేశారని ఫిర్యాదు చేశారు. నా కొడుకు అన్నం పెట్టడం లేదయ్యా... తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిని కుమారుడు తనపేరును రాయించుకుని ఇప్పుడు అన్నంకూడా పెట్టడంలేదని కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన చింతగుంట్ల నాగేంద్రమ్మ కలెక్టరేట్‌కు వచ్చి అర్జీ ఇచ్చింది. ఇదే విషయమై తాను ఈఏడాది మార్చి 3వ తేదీన అర్జీ ఇవ్వగా, ఆర్డీఓ, తహశీల్దార్ తన కుమారుడిని పిలిపించి మాట్లాడటంతో బాగా చూసుకుంటానని చెప్పాడని, కొద్దిరోజుల తరువాత మళ్లీ ఇబ్బందులు పెడుతున్నాడని ఆమె తెలిపారు. తనకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్‌ను కోరారు. ఇదే విషయమై తాను ఈనెల 18 కంభంలో జరిగిన గ్రీవెన్స్‌లో కూడా అర్జీ ఇచ్చానని, ఇప్పటికై నా తనకు న్యాయం చేయాలని విన్నవించారు. ఆర్ఆర్ ప్యాకేజీలో నాపేరు చేర్చండి.. వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా తమ గ్రామం ముంపునకు గురవుతుందని, ఆర్ఆర్ ప్యాకేజీ సర్వే సమయంలో తాము జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉండటం వలన తమ పేరు ప్యాకేజీలో చేర్చలేదని పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామానికి చెందిన దర్శనం మేరీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేరు జాబితాలో చేర్చి నష్టపరిహారం అందించాలని కోరారు. ఆన్లైన్లో మా పేర్లు నమోదు చేయండి: వారసత్వంగా వచ్చిన తన పొలాలను తనపేరుపై ఆన్లైన్ చేయాలని గోగులదిన్నె గ్రామానికి చెందిన చిలుకూరి జగన్మోహన్రెడ్డి పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చారు. ఈ సమస్యపై తాను గతంలోనే అర్జీలు ఇచ్చారని తెలిపారు ఒంగోలులో 308 అర్జీలు... ఒంగోలు సబర్బన్: మీ కోసం కార్యక్రమంలో అందిన అర్జీల పరిష్కారంపై జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ఒంగోలులోని ప్రకాశం భవనంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్ఓ పి.వెంకటరమణ, డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్‌రెడ్డి, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి మాధురి, డీపీఓ అనుపమ తదితర అధికారులతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మొత్తం 308 అర్జీలు రాగా, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అర్జీదారుల్లో సంతృప్తి స్థాయిని పెంచే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలువురు లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను కలెక్టర్ అందజేశారు. తొలుత దివ్యాంగుల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ విజయసునీత -
భ్రమరా వెంచర్స్‌పై దర్యాప్తు చేయించండి
మార్కాపురం: మార్కాపురం పట్టణ శివార్లలో ఏర్పాటు చేసిన భ్రమరా వెంచర్స్‌లో ఉన్న ఆక్రమణలు, ఆరోపణలపై సమగ్రమైన దర్యాప్తు చేయించాలని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులుకు వినతిపత్రం అందించి విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్కాపురం రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, దేవదాయ భూములు, నీటి చెరువులు, కుంటలు, పంట కాలువలు, చెరువు నుంచి ఆయకట్టు భూములకు నీరు వెళ్లే ప్రధాన కాలువలు, వాటికి ఇరువైపులా ఉండే సర్వీసు రోడ్డు మార్జిన్లు, వాగులు తదితర వాటిని కొందరు దురాక్రమణ చేసి స్వాధీన పరుచుకున్నారన్నారు. వాటి పక్కనే ఉన్న పట్టా భూములను కూడా కలుపుకుని ఆక్రమించిన భూమి అసలైన సర్వేనంబరు కాకుండా తప్పుడు సర్వేనంబర్ల ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో రాసి అమ్మకాలు చేస్తూ ప్రభుత్వ ఆస్తులను దోపిడీ చేస్తున్నారని అన్నారు. భ్రమరా వెంచర్స్ వారు ప్రభుత్వ భూములు, చెరువులకు నీరు వచ్చే వాగు, బండ్ల రస్తాలను కలుపుకున్నారనే అభియోగాలు ఉన్నాయని అన్నారు. ఆ వెంచరుకు రహదారి సౌకర్యంలేదని, నీళ్లు వచ్చే వాగుకు అడ్డంగా కల్వర్టులు కట్టి తారురోడ్డు వేశారని అన్నారు. దీనివలన చెరువుకు రావాల్సిన నీరు ఆగిపోయి వ లోతట్టు ప్రాంతం మునిగిపోతుందన్నారు. ఇప్పటికే చెరువులు పూడ్చి రోడ్డు వేసే ప్రాంతానికి పక్కనే చెరువులో అంతర్భాగమైన ప్రాంతాన్ని పట్టా భూములని చెప్పి మట్టితోలారని అన్నారు. ఇంత జరుగుతున్నా నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. చెరువులో ఎఫ్టీఎల్ (చెరువు నిండే పూర్తి సామర్ధ్యం) ఆపైన 50 మీటర్ల వరకూ బఫర్‌జోన్ ఉంటుందన్నారు. అందులో కూడా శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని అన్నారు. మార్కాపురం పరిసర ప్రాంతాల్లో దేవదాయ శాఖ భూములు చాలా ఉన్నాయని, అందులో కూడా భారీగా ఆక్రమణలు జరిగాయన్నారు. ఆశాఖ అధికారులు వ్యక్తిగత లబ్ధి కోసం కొందరికి మాత్రమే నోటీసులు ఇచ్చి కొన్ని ఆస్తులను స్వాధీన పరుచుకున్నారని, మరికొందరు ఆక్రమణదారులపై ఉదాసీనంగా ఉంటూ ఆస్తులను స్వాధీనపరుచుకోలేదన్నారు. వారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. దీనివలన దేవదాయశాఖ ఆస్తులు కోల్పోతోందన్నారు. కొందరు అధికారుల సహకారంతో వాస్తవ సర్వే నంబర్లతో కాకుండా వేరే నంబర్లు వేసి నిషేధిత భూములను సైతం రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. భూ దోపిడీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. చెరువును దురాక్రమణదారుల నుంచి కాపాడాలన్నారు. మార్కింగ్ విషయంలో అపోహలు తొలగించండి.. పట్టణంలో రోడ్ల విస్తరణ పేరుతో వివిధ ప్రాంతాల్లో మార్కింగ్ ఇచ్చారని, దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని అన్నా రాంబాబు విజ్ఞప్తి చేశారు. మార్కింగ్ ఇచ్చే భవన యజమానులకై నా సమాచారం అందించాలని కోరారు. ఈ మార్కింగ్ ఎవరు వేస్తున్నారో అర్థంకాక అందరూ ఆందోళనకు గురవుతున్నారన్నారు. కలెక్టరేట్ భవనాల విషయంలో ఆలోచించండి.. కలెక్టరేట్ భవనాల విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, ఆలోచించి అందరి అభిప్రాయం తీసుకొని నిర్మించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా నిర్మించాలన్నారు. జీవితకాలం ప్రజలకు ఉపయోగపడే అంశం ఇది అన్నారు. ఈ విషయమై జేసీ సానుకూలంగా స్పందించారని, భ్రమరా వెంచర్స్‌పై అధికారుల కమిటీని నియమించినట్లు చెప్పారన్నారు. పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. తాము చేసిన ఆరోపణలు నిజమైతే వెంచర్స్‌లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని రాంబాబు కోరారు. ఈయన వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మీర్జా షంషేర్ ఆలీబేగ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలీమ్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల్లో వివిధ హోదాల్లో ఉన్న బట్టగిరి తిరుపతిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, గౌస్ మొహిద్దీన్, బొగ్గరపు శేషయ్య, నాలి కొండయ్య, మౌలాలీ, గఫూర్, సీయం ఖాశీం, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
ఉద్యోగాలిప్పిస్తామంటూ ఘరానా మోసం
దర్శి: ‘‘నాకు ఓఎస్డీతో పరిచయాలున్నాయి... అంతకంటే పెద్దపెద్ద వాళ్లు కూడా బాగా తెలుసు. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు చిటికెలో ఇప్పిస్తాను’’ అంటూ నమ్మబలికి డబ్బులు వసూలు చేసి నకిలీ నియామక ఆర్డర్లు చేతిలో పెట్టిన ఘరానా మోసగాన్ని డీఎస్పీ బాలమురళీకృష్ణ కటకటాల వెనక్కు నెట్టారు. దర్శి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలులోని నీలాయపాలెం మార్కెట్ సెంటర్లో నివాసం ఉంటున్న ముత్తన నాగరాజు ఒక కన్సల్టెన్సీ కార్యాలయం పెట్టి అధికార పార్టీ మంత్రుల ఓఎస్డీలు తెలుసు, కలెక్టర్లు తెలుసు.. అంతకంటే పెద్దవారు తెలుసు అని చెప్పుకుంటూ ఒంగోలులో హోంగార్డుగా పని చేస్తున్న గోపాల కృష్ణ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. అతని భార్యకు ఔట్‌సోర్సింగ్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. ఉద్యోగం కోసం అతని వద్ద రూ.12 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత తన వద్ద ఉన్న గొంతులు మార్పులు చేసి వినిపించే ఫీచర్ ఉన్న సెల్ఫోన్లో ఇతరులతో మాట్లాడించి ఓఎస్డీగారు మాట్లాడతారని చెప్పి నమ్మించాడు. పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెబుతూ బోల్తాకొట్టించాడు. ఆ తరువాత ఒక నకిలీ ఆర్డర్ కాపీ చేయించి హోంగార్డుకు అందజేసి ఉద్యోగ నియామకపత్రం వచ్చిందని, వారు ఫోన్ చేసినప్పుడు మాట్లాడి జాయిన్ అవ్వాలని చెప్పాడు. ఆ తరువాత డిగ్రీ చదివిన అదే హోంగార్డుకు ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికాడు. మళ్లీ వారి వద్ద రూ.9 లక్షలు తీసుకున్నాడు. ఇదే తరహాలో ఫోన్లో మాట్లాడించి ఆర్డర్ కాపీ కూడా ఇచ్చాడు. ఆ తరువాత హోంగార్డు ఆయా కార్యాలయాల్లో సంప్రదించి మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన డీఎస్పీ బాలమురళీ కృష్ణ ఆధ్వర్యంలో బల్లికురవ ఎస్సై నాగరాజుకు వచ్చిన సమాచారం మేరకు బల్లికురవ బస్టాండ్ వద్ద నిందితుడిని అరెస్ట్‌చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఆయన వద్ద ఉన్న రూ.3.50 లక్షల నగదు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే నిందితుడు గతంలో మూడు కేసుల్లో రూ.3 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఇంకా ఇతని బాధితులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ జరుగుతోందని తెలిపారు. ఇలా నకిలీ పత్రాలు ఇచ్చి ఇటీవల ఉద్యోగాల పేరుతో డబ్బులు స్వాహా చేసే మోసగాళ్ల వలలో పడిన యువత తమను సంప్రదిస్తున్నారని చెప్పారు. యువతను ఇలాంటి వారు ఎవరైనా సంప్రదించినా వెంటనే తమకు వివరాలు అందజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఏడో తరగతి చదువుకున్న వ్యక్తి డిగ్రీలు చేసిన వారిని మోసం చేస్తున్నారని యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. చాకచక్యంతో నిందితుడిని పట్టుకున్న డీఎస్పీ బాలమురళీకృష్ణ, ఎస్సై నాగరాజులను ఎస్పీ అభినందించారు. వారికి రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ శేషగిరిరావు పాల్గొన్నారు. -
కంభం చెరువుపై కోలాహలం
కంభం: తేరాతేజి (గరికతొక్కుడు) పండుగ సందర్భంగా సోమవారం కంభం చెరువుకట్టపై కోలాహలం నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ప్రజలు కుటుంబ సమేతంగా భారీగా కంభం చెరువు కట్టకు చేరుకున్నారు. నూతన దంపతులు కంభం చెరువులో వారి పెళ్లినాటి దండలు వదిలి మొక్కులు తీర్చుకున్నారు. కుటుంబ సభ్యులతో ఎంతో మంది సరదాగా గడిపారు. పిల్లలు, నూతన జంటలు సెల్ఫీలు తీసుకుంటూ చెరువు కట్టపై సందడి చేశారు. ఇంటి వద్ద తయారు చేసి తెచ్చుకున్న వంటకాలను పిల్లాపాపలతో కలిసి కట్టపై కూర్చుని ఆరగించారు. కట్టపై ఉన్న దీనాషావళి దర్గా వద్ద కొబ్బరికాయలు, బూందితో ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలువురు భక్తులు దర్గాపై చాదర్లు కప్పి మొక్కులు తీర్చుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కట్టపైకి వచ్చిన ప్రజలకు కూలింగ్ వాటర్ అందజేశారు. కంభం ఎస్సై శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కట్టపై వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. సాయంత్రం సూర్యాస్తమయంలో కంభం చెరువు అందాలు సందర్శకులను ఆహ్లాదపరిచాయి.


