ఉల్లాస్‌ అక్షరాంధ్ర వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఉల్లాస్‌ అక్షరాంధ్ర వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

Feb 11 2026 7:17 AM | Updated on Feb 11 2026 7:17 AM

ఉల్లాస్‌ అక్షరాంధ్ర వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

ఉల్లాస్‌ అక్షరాంధ్ర వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

● మార్చి 29 వరకు కార్యక్రమం నిర్వహణ

ఒంగోలు సబర్బన్‌: ఉల్లాస్‌ అక్షరాంధ్ర వాల్‌పోస్టర్‌ను కలెక్టర్‌ పి.రాజాబాబు ఆవిష్కరించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో వయోజన విద్య ఉపసంచాలకుడు బి.జగన్‌మోహనరావుతో కలిసి ఆయన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఉల్లాస్‌ అక్షరాంధ్ర కార్యక్రమం మార్చి 29 వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రెండు గంటల పాటు కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లో కూడా పనిచేస్తాయన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఉల్లాస్‌ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మార్చి 29న జరిగే ఉల్లాస్‌ అక్షరాంధ్ర ఫైనల్‌ పరీక్షకు అభ్యాసకులను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ బీసీహెచ్‌ ఓబులేసు, డివిజనల్‌ సూపర్‌వైజర్‌ టి.పోతురాజు, డీపీఓ ముప్పూరి వెంకటేశ్వర రావు, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, జెడ్పీ సీఈఓ చిరంజీవి, మెప్మా ఒంగోలు ప్రతినిధి రాణిలతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement