నేడు ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు
త్రిపురాంతకం: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా తగు ఏర్పాట్లు చేశారు. 13వ తేదీ ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్వికరణం, పంచగవ్య ప్రాశనతో మహాశివరాత్రి మహోత్సవాల అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి రోజు బాలాత్రిపురసురదీదేవి, శ్రీపార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాల్లో విశేష అర్చనలు, రుద్రహోమం, బలిహరణ, విశేషపూజలు, ప్రదోషకాల పూజలు జరగనున్నాయి. 15వ తేదీ మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున 3 గంటలకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, రాత్రి 11:30 గంటలకు లింగోద్భవ కాల రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, 12:30 గంటలకు స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. 17వ తేదీ మంగళవారం రథాంగ హోమం, రథాంగ బలి, రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 18వ తేదీ రుద్రహోమం, వసంతోత్సవం, నాగవల్లి, మూకబలి, ధ్వజావదోహణ ప్రత్యేక పూజలు, 19వ తేదీ శయనోత్సవం ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు ఇబ్బంది పడకుండా దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆలయాల వద్ద సామాజిక సత్ర నిర్వాహకులు భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
● శ్రీశైలంకు 140..కోటప్పకొండకు 78 ఆర్టీసీ బస్సులు
● జిల్లా ప్రజా రవాణాధికారి జి.సత్యనారాయణ వెల్లడి
ఒంగోలు టౌన్: మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణాధికారి జి.సత్యనారాయణ తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 7 ఆర్టీసీ బస్ డిపోల నుంచి శ్రీశైలం క్షేత్రానికి 140, కోటప్పకొండ క్షేత్రానికి 78 ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ డిపోలోని ఆయన ఛాంబర్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొగిలిచెర్ల 25, భైరవకోన 23, త్రిపురాంతకం 12, రామతీర్థం 8, సంగమేశ్వరం 5, పునుగోడు 2కు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు వివరించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా కనిగిరి, గిద్దలూరు నుంచి నేరుగా శ్రీశైలానికి, పొదిలి, దర్శి నుంచి కోటప్పకొండకు, పొదిలి, కనిగిరి నుంచి మార్కాపురం జిల్లా త్రిపురాంతకానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పాకల బీచ్ ఫెస్టివల్‌కు 12 బస్సులు నడపుతున్నట్లు తెలిపారు. కందుకూరు 4, కనిగిరి 2, పొదిలి 2, అద్దంకి 2, ఒంగోలు నుంచి 2 బస్సులు నడిపేలా నిర్ణయించినట్లు చెప్పారు. గత ఏడాది కంటే అదనంగా 50 బస్సులను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు.
● భారీగా తరలివెలుతున్న భక్తజన సందోహం
● రాత్రి పూట ప్రయాణాలకూ అనుమతినిచ్చిన అటవీశాఖ
పెద్దదోర్నాల: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల పుణ్యక్షేత్రంలో జరిగే బ్రహ్మాత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా శ్రీశైలం తరలివెళుతున్నారు. దీంతో యాత్రికులు, భక్తులతో మండల కేంద్రంలో రద్దీ వాతావరణం నెలకొంది. పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ శ్రీశైలం ఘాట్ రోడ్డులో రాత్రి వేళ ప్రయాణాలకు అనుమతినిచ్చింది. దీంతో ఈ నెల 13వ తేదీ శుక్రవారం రాత్రి నుంచి 16వ తేదీ వరకు రాత్రి వేళల్లో పుణ్యక్షేత్రానికి నిరంతరం ప్రయాణించే వెసులుబాటు భక్తులకు లభించింది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా శ్రీశైలం చేరుకుంటున్నారు. అధిక శాతం భక్తులు కాలి నడకన నల్లమల అటవీ ప్రాంతం గుండా పుణ్య క్షేత్రానికి చేరుకుంటున్నారు. వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో పలువురు భక్తులు రైళ్ల ద్వారా మార్కాపురం చేరుకుని అక్కడి నుంచి శ్రీశైలం వస్తున్నారు. బ్రహాత్సవాలల్లో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి చూపుతుండటంతో పండుగకు ముందే రద్దీ అధికంగా ఉంది.
ఒంగోలు: ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 149 బార్‌లలోని 40వేల మంది అడ్వకేట్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రకాశం జిల్లాలో 1600 మంది ఉండగా అందులో 821 మంది ఒక్క ఒంగోలు బార్ అసోసియేషన్‌లోనే ఉన్నారు. ఉదయం 10.30గంటలనుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు చేపట్టారు.
బరిలో 143 మంది:
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియలో మొత్తం 143 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి నుంచి మొత్తం 23 మంది రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు ఎన్నిక కావాల్సి ఉండగా అందులో ఐదుగురు మహిళా అభ్యర్థులు తప్పనిసరి . వీరందరినీ ప్రాధాన్యతా ఓటు ప్రకారం ఎన్నుకుంటారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన అడ్వకేట్ కనీసం ఐదుగురికి ఓటు వేయాల్సి ఉంటుంది. అలాగే గరిష్టంగా 23 మంది వరకు ప్రాధాన్యత ఓటు వేయాలి. ప్రాధాన్యత ఓటు కూడా సంఖ్యలకు బదులుగా ఆంగ్ల వర్ణమాలలోని ఒకటవ బడి పెద్ద అక్షరాలను మాత్రమే వినియోగించాలి. పొరబాటున ఓకే ప్రాధాన్యత ఓటు ఒకరికంటే ఎక్కువమందికి వేస్తే అది చెల్లుబాటు కాదు. ఇలాంటి అనేక నిబంధనలు ఉండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు తమదైన శైలిలో వాయిస్ కాల్స్, సంక్షిప్త సందేశాలు, సామాజిక మాధ్యమాలు, కరపత్రాల పంపిణీ, హోర్డింగ్‌లు ఏర్పాటు వంటి వాటి ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే బాధ్యతను ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు భాస్కరరావు వ్యవహరిస్తారు. ఒంగోలు బార్ అసోసియేషన్ హాలులో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఎన్నికలను అన్ని ఏర్పాట్లు చేశారు.
ఒంగోలు టౌన్: కార్మిక నగర్ బాధిత పేదలపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇస్లాంపేటకు చెందిన షేక్ అల్లాబక్షు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది బాధితులతో పాటుగా మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 4వ తేదీన కొందరు వ్యక్తులు కార్మికనగర్‌లో పేదల ఇళ్లను కూల్చివేయడం తెలిసిందే. ఆ తరువాత బుధవారం సాయంత్రం స్థల యజమానులుగా చెప్పుకొంటున్న ప్రైవేటు వ్యక్తులు ఫెన్సింగ్ వేసేందుకు వెళ్లారు. వారిని బాధితులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తమపై కార్మిక నగర్ వాసులు దాడికి ప్రయత్నం చేశారని అల్లాబక్షు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.
ప్రకాశం జిల్లాలో 1600 మంది
ఒంగోలు బార్ అసోసియేషన్‌లో ఓటు హక్కు కలిగిన వారు 821
నేడు ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు
నేడు ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు


