15న రామాపురంలో పెద్ద బండలాగుడు పోటీలు | - | Sakshi
Sakshi News home page

15న రామాపురంలో పెద్ద బండలాగుడు పోటీలు

Feb 13 2026 5:26 AM | Updated on Feb 13 2026 5:26 AM

15న ర

15న రామాపురంలో పెద్ద బండలాగుడు పోటీలు

15న రామాపురంలో పెద్ద బండలాగుడు పోటీలు పొదిలి ఎస్సైగా రాజేష్‌ బాధ్యతల స్వీకరణ 132 కేవీ అండర్‌లైన్‌ సర్వే అడ్డగింత ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

రాచర్ల: మండలంలోని గుడిమెట్ట పంచాయతీ రామాపురంలో సిద్ధిభైరవేశ్వరస్వామి మహా శివరాత్రి తిరుణాళ్ల మహోత్సవం సందర్భంగా 15వ తేదీ ఆదివారం జిల్లాస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తి ఉన్న ఎడ్ల యజమానులు 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా రూ.500 ప్రవేశ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుతిగా రూ. 50 వేలు, రెండో బహుమతిగా రూ.30, మూడవ బహుమతిగా రూ.20 వేల అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు 99639 70858 సంప్రదించాలని కోరారు.

పొదిలి: పొదిలి ఎస్సైగా సూరెడ్డి రాజేష్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. రామాయపట్నం మైరెన్‌ ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆయన బదిలీపై పొదిలికి వచ్చారు. శాంతి భద్రతలతో పాటు, ట్రాఫిక్‌ సమస్యపై దృష్టి సారించి పరిష్కారం చేస్తామని రాజేష్‌ చెప్పారు. ఆయన్ను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సింగరాయకొండ: మండల పరిధిలోని విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ వద్ద గురువారం 132 కేవీ అండర్‌లైన్‌ సర్వే పనులను ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ పై నుంచి వెళ్తున్న కేబుల్‌ లైనును తొలగించి అండర్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం సర్వే చేస్తున్నామని అధికారులు తెలిపారు. దీంతో జేఏసీ సభ్యులు ప్రస్తుతం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ రద్దు కోసం పోరాడుతున్నామని, సర్వేను నిలిపివేసి సహకరించాలని సర్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారులు సర్వే పనులు నిలిపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

క్యాబిన్‌లో ఇరుక్కున్న

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌

చీమకుర్తి రూరల్‌: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదం మండల పరిధిలోని మర్రిచెట్లపాలెం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళితే..ఒంగోలు–కర్నూలు రహదారిపై చీమకుర్తి వైపు నుంచి వస్తున్న గ్రానైట్‌ లారీ, కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ వెళ్తుండగా మర్రిచెట్లపాలెం వద్ద ఎదెరుదురుగా వస్తూ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైర్లకు గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా ఎస్కార్ట్‌ సహాయంతో బయటకు తీశారు. బస్సులోని ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు.

15న రామాపురంలో  పెద్ద బండలాగుడు పోటీలు 1
1/2

15న రామాపురంలో పెద్ద బండలాగుడు పోటీలు

15న రామాపురంలో  పెద్ద బండలాగుడు పోటీలు 2
2/2

15న రామాపురంలో పెద్ద బండలాగుడు పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement