breaking news
Karimnagar
-
విద్యాశాఖకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి
కరీంనగర్ టౌన్/కరీంనగర్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్ది, కరీంనగర్ జిల్లాను విద్యారంగంలో రాష్ట్రస్థాయి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖపై ఎంఈవోలు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, కోఆర్డినేటర్లతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఈవో చైతన్య జైనీ, కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి శ్రీనివాసు ఉమారాణి శ్రీనివాసుపాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయండి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జిల్లాను ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. తొలి విడత కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను సెప్టెంబర్‌లోపు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, పెద్ద ఎత్తున గహప్రవేశాలు జరిగేలా చూడాలన్నారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లోఎంపీడీవోలు, గృహ నిర్మాణశాఖ అధికారులతో తొలివిడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, రెండో విడతలో అర్హులైన లబ్ధిదారుల ఎంపికపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు గడువులోగా పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో పవన్ కుమార్, గృహ నిర్మాణ శాఖ పీడీ గంగారాం ఎంపీడీవోలు, గృహ నిర్మాణశాఖ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ నగరంగా కరీంనగర్
● కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్‌కార్పొరేషన్: రాష్ట్రంలోనే అభివృద్ధిలో కరీంనగర్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం నుంచి నగరానికి నిధుల వరద పారిస్తామని చెప్పారు. శుక్రవారం నగరపాలక సంస్థ 38వ డివిజన్ లక్ష్మినగర్‌లో రూ.50లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి, 3వ డివిజన్ విద్యారణ్యపురిలో రూ.48.5లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. హౌసింగ్‌బోర్డుకాలనీలోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. లక్ష్మినగర్‌లో వేసిన నూతన బోరు బావిని పరిశీలించారు. కాలనీవాసులు సంజయ్‌పై పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమపై విశ్వాసం ఉంచి నగరపాలక సంస్థలో అధికారాన్ని కట్టబెట్టారన్నారు. ప్రజల విశ్వాసాన్ని కొనసాగిస్తూ వంద రోజుల్లోనే నిధులు తీసుకొచ్చామని తెలిపారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు దేవసాని సరస్వతి, సాదవేణి లావణ్య, బోయినిపల్లి ప్రవీణ్‌రావు, తోట అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు అర్చక పోస్టులుకరీంనగర్కల్చరల్: రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో అర్చకులు, పరిచారకులు, వంట స్వాములు తదితర పోస్టులకు నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 191 మంది అభ్యర్థులకు నియామక పత్రాలందగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు ఎంపికయ్యారు. వేములవాడ నుంచి శ్రీవైష్ణవ అర్చకులుగా మరింగంటి శ్రీవత్సవాచార్యులు, బూర్గడ్డ నందకుమార్ ఎంపికయ్యారు. సిరిసిల్ల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి బీట్రూరి నవీన్‌కుమార్ నియమితులయ్యారు. బెజ్జంకి చెందిన శేషం శ్రీవత్సవ యాదగిరిగుట్ట దేవస్థానంలో పరిచారకుడిగా నియామకం పొందారు. కరీంనగర్ మార్కెట్ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి గోదావరిఖనికి చెందిన గోవర్ధనగిరి గిరిధరాచార్యులు అర్చకుడిగా ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అర్చకులు, పరిచారకులు ప్రభుత్వ నియామకాలు పొందడంపై శ్రీవైష్ణవ సేవాసంఘం ప్రతి నిధులు హర్షం వ్యక్తం చేశారు. పీచర కృష్ణమాచార్యులు, గోవర్ధనగిరి శశిరనాచార్యులు, యా దగిరి ఆచార్యులు, కన్నయ్య, అనంత ఆచార్యులు, వెంకటేశ్వర్లు నూతనంగా నియామక పత్రాలు పొందిన వారిని అభినందించారు. పాఠశాల విద్యార్థులకు ఏఐ, డిజిటల్ పాఠాలుకరీంనగర్సిటీ: అన్న, అక్క మెంటర్షిప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ అటానమస్ కళాశాలకు చెందిన బీకాం, బీబీఏ ఐదో సెమిస్టర్ విద్యార్థులు, బీకాం ఆరు, మూడో సెమిస్టర్ విద్యార్థులు శుక్రవారం దేశరాజ్‌పల్లి, రామడుగు, నాగిరెడ్డిపల్లి తదితర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఎస్సారార్ ప్రభుత్వ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కల్వకుంట రామకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులను అధునాతన సాంకేతిక ప్రపంచానికి సిద్ధం చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమన్నారు. మెంటర్షిప్ అధికారులు మధు రాజేశ్, డాక్టర్ మల్లారెడ్డి, ఎం.ఆంజనేయులు, గుర్రం రాజేందర్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి.నితిన్, టి.రాజయ్య, ఉన్నత విద్య ఐకాస చైర్మన్ కడారు సురేందర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు దీటి పద్మజ, టి.పద్మ, టి.సంపత్‌కుమార్, కళాశాల స్టాఫ్ క్లబ్ సెక్రటరీ ఎం. శ్రీనివాస్‌రెడ్డి, ఐక్యూ ఏసీ సమన్వయకర్త డాక్టర్ హర్ జ్యోతికౌర్, సమన్వయకర్తలు అర్జున్, రాజు, మల్లేశం, మారుతి పాల్గొన్నారు. -
గద్దపాక హైస్కూల్లో విచారణ
శంకరపట్నం: గద్దపాక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎంఈవో లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. ఐదుగురు విద్యార్థులు.. 8 మంది ఉపాధ్యాయులు అనే కథనం సాక్షిలో శుక్రవారం ప్రచురితమైంది. స్పందించిన డీఈవో చైతన్య జైన్ గద్దపాక హైస్కూల్లో విచారణ చేయాలని ఆదేశాల మేరకు శంకరపట్నం ఎంఈవో పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులున్నారు? ఎంతమంది ఉపాధ్యాయులు వచ్చారని హెచ్ఎం రమేశ్‌ను ప్రశ్నించారు. 7, 9, 10 తరగతుల్లో విద్యార్థులు పాఠశాలలో చేరకపోవడంపై ఉపాధ్యాయులందరి నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకున్నారు. గ్రామంలో 6 నుంచి 10వతరగతి వరకు 70 మంది విద్యార్థులుంటే.. ఐదుగురే గద్దపాక ప్రభుత్వ పాఠశాలకు వచ్చి మిగతా విద్యార్థులు ఎక్కడికి పోతున్నారని ప్రతీ టీచర్‌తో మాట్లాడారు. 9వతరగతిలో విద్యార్థులేరని సెల్ఫోన్లో నిమగ్నమయిన టీచర్ వివరణ తీసుకున్నారు. పూర్తి నివేదికను డీఈవోకు అందించనున్నట్లు ఎంఈవో తెలిపారు. -
వీసీ కుర్చీకి వినతి
పరీక్షలకు అనుమతించాలని కోరుతూ లా కాలేజీ విద్యార్థులు శుక్రవారం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ గేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. యూనివర్సిటీలో గత సంవత్సరం నుంచి జరుగుతున్న అటెండెన్స్ గందరగోళంలో భాగంగా శుక్రవారం కూడా విద్యార్థులను పరీక్షలకు అనుమతించలేదన్నారు. వీసీ ఆదేశంతో ఎలాంటి ఇటర్నల్ అంటెడెన్స్ రూల్ లేకున్నా కూడా లా విద్యార్థులను అటెండెన్స్ అనే ఒక్క బూచిని చూపెట్టి పరీక్షకు అనుమతి నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ లేకపోవడంతో ఆయన కుర్చీకి వినతిపత్రాన్ని అందజేశారు. యూనివర్సిటీ ప్రధాన గేట్ వద్ద 5 గంటలు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యలను పరిశీలిస్తామని తెలపడంతో నిరసన విరమించారు. – కరీంనగర్‌సిటీ -
కరీంనగర్‌దే.. అగ్రస్థానం
జననం.. మరణం..1,7111,1552,8664,767కరీంనగర్3,1747,9413,032పెద్దపల్లి1,8694,9012,257సిరిసిల్ల1,5707,21947,71122,4187,0623,6743,8273,38818,87115,2508,03110,0848,78711,7677,768జగిత్యాల19,5356,5283,02425,2933,504మొత్తంబాలికలుబాలురుమొత్తంమొత్తంపురుషులుమహిళలు -
మానేరు దాటితే ఫైన్!
వాగు రెండు జిల్లాలకు మధ్యలో ఉంటుంది. ఈ మాత్రం దానికి పెద్దపల్లి జిల్లా మీదుగా రాకూడదంటే ఎలా అని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి హెచ్చరికలు గతంలో తామెప్పుడూ చూడలేదని, అన్ని అనుమతులు ఉంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల మధ్య రవాణా చేసుకునే వీలున్నప్పుడు పెద్దపల్లి జిల్లాకు ఈ ఆదేశాలు ఎందుకు వర్తించడంలేదో తమకు అర్థం కావడంలేదని అంటున్నారు. ఒకే రాష్ట్రంలో ఒకే మైనింగ్ పాలసీ ఉండాలని కానీ, జిల్లాకో పాలసీ ఏంటని నిలదీస్తున్నారు. దీనిపై క్వారీ నిర్వాహకులు, ఇటుకబట్టీ వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. – సాక్షిప్రతినిధి,కరీంనగర్మానేరు నదీతీరం మీదుగా జగిత్యాలకు మట్టిదుబ్బ లోడుతో వెళ్తున్న లారీలను పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. అన్ని అనుమతి పత్రాలు చూపినా వాహనాలను సీజ్ చేశారు. ఇసుక అక్రమంగా తరలించిన నేరానికి జరిమానా విధిస్తున్నామని పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ఆదేశాలు జారీచేయడంతో వ్యాపారులు అవాక్కయ్యారు. మట్టిదుబ్బ లారీలను సీజ్ చేసి ఇసుక అక్రమ రవాణా అంటూ ఆదేశాల్లో ఎలా పేర్కొంటారంటూ వాపోతున్నారు. అన్ని అనుమతులు ఉన్న తమను ఎందుకు వేధిస్తున్నారని ఆరాతీయగా.. తమ జిల్లా నుంచి వాహనాలు రాకూడదని, అది అక్రమమని అందుకే కేసులు పెడుతున్నామని మైనింగ్, పోలీసు డిపార్ట్మెంట్ అధికారులు పేర్కొంటున్నారు. -
హే..కృష్ణా..గోదారి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టులో పంటల సాగు పరిస్థితీ అగమ్యగోచరంగా తయారైంది. వర్షాలు రాక కృష్ణాలో నీరు లేకపోవడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా వానాకాలం సీజన్లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోనే 11 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఈసారి కూడా 10.50 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా అంచనాలు తలకిందులయ్యాయి. గతేడాది జూలై 14 నాటికి రెండు జిల్లాల్లో 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి ఇప్పటివరకు 40 వేల ఎకరాల్లో కూడా సాగు కాలేదు. వర్షాలు లేకపోవడం, సాగర్‌నుంచి నీటి విడుదలపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఆయకట్టు రైతులు వరిసాగు చేయడం లేదు. ఇక ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు కూడా ఈసారి నీరు విడుదల కాలేదు. దీంతో బోర్లు, బావుల కింద కేవలం 40 వేల ఎకరాల్లో పంటలు వేశారు. గోదావరి పరిస్థితీ అంతే..మరోవైపు గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కాళేశ్వరం బరాజ్‌లకు ఆశించిన స్థాయిలో వరద ప్రవాహాలు చేరడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు, తాగునీటి అవసరాలు, భూగర్భజలాల పునరుద్ధరణపై రైతుల్లో ఆందోళన నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌తో పాటు ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నిల్వలు గత సంవత్సరాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. తొలకరి వర్షాలను నమ్ముకుని విత్తనాలు వేసిన రైతులు ఇప్పటికే నష్టపోయారు. వరి నాట్లు, పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్ వంటి ఆరుతడి పంటలు చాలాచోట్ల మొలకెత్తకుండానే దెబ్బతిన్నాయి.ఖరీఫ్ సాగు అంచనా, సాగైన విస్తీర్ణం (ఎకరాల్లో)సాగు అంచనా 1,32,38,446 ఇప్పటివరకు సాగైంది 59,83,971 వరి సాగు అంచనా 65,95,645 ఇప్పటివరకు సాగు 6,39,956 పత్తి సాగు అంచనా 47,41,541 ఇప్పటివరకు సాగు 41,12,099 రాష్ట్రంలో వర్షపాతం (1 జూన్–16 జూలై 2026)సాధారణం 236.4మి.మీ.నమోదు158.4మి.మీ.లోటు 33 శాతం -
‘డబుల్ ఇళ్ల’ ఆక్రమణకు యత్నం
కరీంనగర్‌రూరల్: తీగలగుట్టపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు మంజూరు చేయాలని, సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ఆక్రమించుకునేందుకు యత్నించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ నాయకత్వంలో ఎర్రజెండాలతో ఇండ్ల వద్దకు వెళ్లారు. ఇండ్ల వద్ద పెరిగిన ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు తొలగించి చదును చేశారు. స్థానికులతో కలిసి ఆక్రమించుకునేందుకు యత్నించగా రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వహయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పటివరకు పేదలకు పంపిణీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. పార్టీ నగర కార్యదర్శి కె.సురేందర్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పద్మ, అంజలి, కార్యదర్శులు మురళి, సంతోషచారి పాల్గొన్నారు. -
బాలుడిని కబళించిన డీజిల్ ట్యాంకర్
● స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి వస్తుండగా ఘటన కోరుట్ల: అన్నతో కలిసి ఆనందంగా బయల్దేరిన బాలుడిని డీజిల్ ట్యాంకర్ కబళించిన సంఘటన పట్టణంలోని వేములవాడ రోడ్డులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని వేములవాడరోడ్డులో నివాసముండే మగ్గిడి రవి, సుమ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు చాణక్య తన స్నేహితుడిని బస్టాండ్‌లో దింపేందుకు బయలుదేరగా.. చిన్న కుమారుడు జశ్వంత్ (13) కూడా వస్తానన్నాడు. ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లారు. స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి తిరిగి ఇంటికి బయల్దేరారు. ఇంటి సమీపంలోకి రాగానే బైక్ వేగం తగ్గించారు. అదే సమయంలో కోరుట్ల వైపు నుంచి వేములవాడ వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో జశ్వంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. చాణక్యకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. జశ్వంత్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మరికొన్ని నిమిషాల్లో బడికి వెళ్లేవాడివి.. అంతలోనే ఈ లోకాన్ని వీడావా కొడుకా అంటూ తల్లిదండ్రులు రోధించిన తీరు స్థానికులను కలచి వేసింది. బాలుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరీంనగర్‌పైనే ధ్యాస
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్: తన ధ్యాస అంతా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. గురువారం నగరపాలకసంస్థ 36వ డివిజన్ మారుతినగర్లో రూ.60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు, 27వ డివిజన్ శివాజీనగర్‌లో రూ.49 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి కరీంనగర్‌తో పాటు, పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. యూసీఎఫ్, యూఐడీఎఫ్, స్మార్ట్ సిటీ,అమృత్ తదితర పథకాల్లో భాగంగా వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నగరరూపురేఖలు మారుస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో విద్యార్థులకు 20 వేల సైకిళ్లు అందించామని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా పదోతరగతి విద్యార్థులకు మరో 20 వేల సైకిళ్లను ఉచితంగా అందిసామన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు తోట అనిల్ పాల్గొన్నారు. -
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్
● పలువురికి అస్వస్థత ● చికిత్స పొందుతున్న బాధితులు ● అందరూ రెస్టారెంట్లో బిర్యానీ తిన్న వారే.. సిరిసిల్లటౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్లలో మళ్లీ ఫుడ్ పాయిజన్ కేసులు కలకలం రేపాయి. మొన్న కేసీఆర్‌నగర్‌లో పానీపూరి, నిన్న బాలాజీ స్వీట్‌హౌస్‌లో బల్లి పడిన సంఘటనలు మరువకముందే ఓ రెస్టారెంట్లో బిర్యాని తిన్న కస్టమర్లు సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల–కరీంనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఓ రెస్టారెంట్లో ఈనెల 14వ తేదీ రాత్రి పలువురు కస్టమర్లు బిర్యాని తిన్నారు. వారంతా బుధవారం మధ్యాహ్నం నుంచి వాంతులు, కడుపునొప్పి, జ్వరం బారినపడ్డారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫుడ్ పాయిజన్‌గా వైద్యులు గుర్తించారు. అయితే గురువారం వరకు ఒక్కొక్కరుగా మొత్తంగా పది మంది పట్టణంలోని పలు ఆస్పత్రుల్లో చేరారు. మిగతా వారి వివరాల కోసం అధికారులు విచారణ చేపట్టారు. ఆస్పత్రుల్లో చేరిన బాధితులు జిల్లా ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నం ఇల్లంతకుంట మండలానికి చెందిన చొప్పరి వంశీ(22), శ్రీకాంత్, శ్రావణ్, రవి అనే యువకులు చేరగా గురువారం రాత్రి సిరిసిల్లకు చెందిన మల్లికార్జున్, శ్రీనాథ్, శ్రీనిధి అడ్మిట్ అయ్యారు. స్థానికంగా ఉండే రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో చిన్నబోనాలకు చెందిన రోషన్, రాహుల్, ప్రదీప్, అక్షిత, వేదశ్రీ చికిత్స పొందుతున్నారు. వీరంతా కడుపునొప్పి, తీవ్ర జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. పలువురికి ఇన్ఫెక్షన్ అధికంగా ఉండటంతో ఆస్పత్రిలోనే అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నట్లు ఆయా ఆస్పత్రుల వైద్యులు పేర్కొన్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారుల విచారణ సంఘటనపై డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనూష ఆధ్వర్యంలో అధికారులు విచారణ చేపట్టారు. ఆస్పత్రుల్లోని బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. హోటల్లో బిర్యాని తిన్నందుకే అస్వస్థతకు గురైనట్లు బాధితులు తెలపడంతో విచారణ చేపడుతున్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష వివరించారు. -
● సబ్‌స్టేషన్ ముట్టడి
గంగాధర: పదిహేను రోజులుగా వ్యవసాయానికి సరిగా విద్యుత్ సరఫరా కావడం లేదని, తరచూ అంతరాయం కలుగుతోందని, తమ సమస్యను పట్టించుకునే వారు కరువయ్యారని మండలంలోని చర్లపల్లి (ఎన్) గ్రామానికి చెందిన రైతులు గురువారం గంగాధరలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రాత్రి పూట వ్యవసాయ విద్యుత్ ఉండడం లేదని, పొద్దంతా తరచూ అంతరాయం ఏర్పడుతోందని, అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు లేక నారుమడులు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. ఎస్సై వంశీకృష్ణ రైతులు, విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
విదేశీ చదువులకు ‘అంబేద్కర్ విద్యానిధి’
కరీంనగర్‌టౌన్: విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే దళిత విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం గొప్ప అవకాశంగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతోంది. ఇటీవల ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను పెంచడంతో మరింత మందికి ప్రయోజనం చేకూరనుంది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఏటా 210 మందికి సాయం అందించగా, ప్రస్తుతం దాన్ని 500 మందికి విస్తరించారు. అభ్యర్థి చేరే కోర్సు ఫీజు ఆధారంగా ఆర్థిక సహాయం మంజూరు చేస్తారు. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత దేశాల్లో పీజీ, పీహెచ్డీ ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ పథకం తోడ్పడుతోంది. ప్రతిభే ఎంపికకు ప్రామాణికం తెలంగాణ ఈ– పాస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన ధ్రువపత్రాలను జతచేసిన అనంతరం రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది. జీఆర్ఈ, జీమ్యాట్, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ పరీక్షల్లో సాధించిన ప్రతిభతో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. విదేశీ విశ్వవిద్యాలయం నుంచి ప్రవేశ లేఖ పొందిన వారికి ఆర్థిక సాయం విడుదల చేస్తారు. కోర్సులో విద్యా పురోగతి సంతప్తికరంగా ఉంటేనే తదుపరి విడతల నిధులు మంజూరు అవుతాయి. అర్హతలు కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. జీఆర్ఈ/జీమ్యాట్ లేదా సంబంధిత ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించాలి. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ పరీక్షలో ప్రతిభ చూపాలి. ఒక కుటుంబం నుంచి ఒక్క విద్యార్థికే అవకాశం. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు పాస్‌పోర్టు సైజు ఫొటో, ఆధార్, రేషన్ కార్డు, స్థానికత ధ్రువపత్రం, బోనాఫైడ్, పదో తరగతి, డిగ్రీ మార్కుల మెమోలు, టీసీ, జీఆర్ఈ/జీమ్యాట్ స్కోర్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌పోర్టు కాపీ, విదేశీ విశ్వవిద్యాలయం ప్రవేశ లేఖ తదితర పత్రాలు సమర్పించాలి. దళిత విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం 10 దేశాల్లో ఉన్నత విద్యకు అవకాశం ఆగస్టు 31 వరకు గడువుఅర్హులైన దళిత విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎంపిక ప్రక్రియ నిర్వహించి అర్హులను తుది జాబితాలో ఎంపిక చేసి ప్రభుత్వ పరంగా అంబేద్కర్ విద్యానిధి పథకాన్ని అందజేస్తాం. – భాగ్యలక్ష్మి, ఎస్సీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ -
అన్న.. అక్క.. ఏఐ పాఠం
గంభీరావుపేట(సిరిసిల్ల): అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని దృషి్ోట్ల పెట్టుకొని ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆర్టిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ శ్రీఅన్న.. అక్క.. మెంటార్షిప్శ్రీ(ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్) పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఏఐ పాఠాలు’ బోధిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే సాంకేతికాంశాల్లో అవగాహన కల్పించడంతోపాటు నిష్ణాతులుగా తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశ్యం. జిల్లా వ్యాప్తంగా గంభీరావుపేట, అగ్రహారం డిగ్రీ కళాశాలలకు చెందిన 80 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గంభీరావుపేట కళాశాలలో నోడల్ అధికారులుగా శ్రవణ్‌కుమార్, ఆది విష్ణు, మహేశ్ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. అమలు ఇలా.. ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు ఏఐ పాఠాలు బోధిస్తున్నారు. ఒక్కో డిగ్రీ కళాశాలకు దాదాపు 40 నుంచి 50 పాఠశాలలు కేటాయించారు. 6 నుంచి 8వ తరగతి పిల్లలకు డిజిటల్ లిటరసీ ఇంటర్నెట్ సేఫ్టీ కంప్యూటేషన్, థింకింగ్, ఏఐలోని ప్రాథమికాంశాలు, 9, 10వ తరగతులకు మెషీన్ లెర్నింగ్ బేసిక్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఏఐ ఎథిక్స్ అంశాలపై బోఽధిస్తున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రోజువారీ ఉపాధ్యాయులు కాకుండా డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులతో ఏఐ డిజిటల్ బోధన కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఐఐటీ, సాంకేతిక కళాశాల అధ్యాపకులు మెంటర్లుగా పనిచేస్తున్నారు. అంశాల ఎంపిక, బోధన ప్రక్రియ రూపకల్పనకు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. జిల్లా స్థాయిలో డీఈవోలు, మండల స్థాయిలో ఎంఈవోలు, పాఠశాలలో హెచ్ఎంలు పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ బడుల్లో డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులతో బోధన నూతన కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం -
తాగుడు వద్దన్నందుకు ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం: తాగుడు మానేయాలని భార్య సూ చించినందుకు మనస్తాపంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని యామపూర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాస బుచ్చన్న, లక్ష్మీ భార్యాభర్తలు బుచ్చన్న మద్యానికి బానిసయ్యాడు. లక్ష్మీ వద్దని వారిస్తోంది. దీంతో మనస్తాపం చెందిన బుచ్చన్న (65) బాత్రూంలో ఉరేసుకున్నాడు. బుచ్చన్న కుమారుడు రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జగిత్యాలక్రైం: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి గుండెపోటుతో చనిపోయిన జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన బత్తిని జలపతి (30) మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరింది. జలపతి ఐదేళ్ల క్రితం జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. జూన్ 29న అక్కడే గుండెపోటుతో మృతిచెందాడు. గురువారం మృతదేహం అనంతారం చేరుకోగా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. జలపతికి భార్య లావణ్య, కూతురు ఉన్నారు. ● మరొకరికి తీవ్ర గాయాలు వేములవాడఅర్బన్: మున్సిపల్ పరిధి నాంపల్లి శివారులోని కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన వంగ శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. గాయపడ్డ వేములవాడ మండలం చీర్లవంచకు చెందిన గాజుల సాయిలక్ష్మన్ను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరూ కలిసి కరీంనగర్ నుంచి బైక్‌పై సిరిసిల్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. -
ప్రతిభకు కొలమానం
కరీంనగర్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందుకు నిర్వహించే తొలిమెట్టు కార్యక్రమ షెడ్యూల్‌ను విద్యాశాఖ ఖరారు చేసింది. గతంలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు ఆప్‌లైన్‌లో బేస్‌లైన్ టెస్ట్ నిర్వహించే వారు. మూడేళ్లుగా రెండో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో అన్ని జిల్లాలకు ఒక్కేసారి నిర్వహించగా, ఈసారి జిల్లావారీగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ నెల 23 నుంచి షెడ్యూల్ ఖారారు చేసింది. అభ్యాస సామర్థ్యం గుర్తించేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని అంచనా వేసి, వారి బలాలు, బలహీనతలను గుర్తించేందుకు విద్యాశాఖ బేస్‌లైన్ పరీక్షకు శ్రీకారం చుట్టింది. 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉమ్మడి జిల్లాలో ఈనెల 23 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల ఫలితాలను విశ్లేషించి విద్యార్థులకు అవసరమైన ప్రత్యేక బోధన అందించడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే కార్యాచరణను అమలు చేయనున్నారు. చదవడం నుంచి గణితం వరకు ప్రాథమిక తరగతుల విద్యార్థులకు చదవడం, రాయడం, చదివింది అర్థం చేసుకోవడం వంటి భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు. సరళ పదాలు, గుణింతాలు, ఒత్తుల పదాలు, వాక్యాలు, పేరాలను నిర్దిష్ట వేగంతో, తప్పులు లేకుండా చదివే సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. గణితంలో 1, 2 తరగతుల విద్యార్థులకు సంఖ్యల గుర్తింపు, కూడికలు, తీసివేతలు, 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు కూడికలు, తీసివేతలు, గుణకం, భాగహారం అంశాలపై పరీక్ష ఉంటుంది. పాఠ్యాంశాల ఆధారంగా కనీస అభ్యాస సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు ఇస్తారు. ఉమ్మడి జిల్లాలో బేస్‌లైన్ పరీక్ష నిర్వహించే తేదీలు జూలై జిల్లా 2–5 తరగతుల విద్యార్థులు 23, 24 కరీంనగర్ 22,308 23, 24 జగిత్యాల 31,445 25, 27 పెద్దపల్లి 15,411 28, 29 రాజన్న సిరిసిల్ల 17,202 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు బేస్‌లైన్ పరీక్షలు ఆన్లైన్లో మూడు విడతల్లో పరీక్ష ఉమ్మడి జిల్లాలో ఈ నెల 23 నుంచి ప్రారంభం ఫలితాల ఆధారంగా ప్రత్యేక బోధనయాప్లో నమోదు.. ప్రత్యేక కార్యాచరణ పరీక్షల కోసం ప్రశ్నపత్రాలను ఇప్పటికే ఆన్లైన్ ద్వారా జిల్లాలు, మండలాలకు పంపించారు. పరీక్షలు పూర్తయిన అనంతరం ఫలితాలను తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయనున్నారు. ఈ వివరాలను ఎస్సీఈఆర్టీఈ విశ్లేషించి విద్యార్థుల అభ్యాస లోపాలను గుర్తిస్తుంది. అనంతరం ఆయా లోపాల నివారణకు ప్రత్యేక బోధన, శిక్షణ కార్యక్రమాలు అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించనుంది. దీంతో ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయి స్పష్టంగా తెలిసి, విద్యా ప్రమాణాల పెంపునకు మార్గం సుగమం కానుంది. పరీక్ష నిర్వహణపై ఇప్పుటికే రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి క్షేత్ర స్థాయికి తగు ఆదేశాలు అందాయి. బేస్‌లైన్ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
సార్లు ఫుల్.. విద్యార్థులు నిల్
కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. చాలా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య కన్నా ఉపాధ్యాయులు సంఖ్య ఎక్కువగా ఉంది. ఉన్న ఒకరిద్దరిని విద్యార్థులను సమీప పాఠశాలల్లో సర్దుబాటు చేయాల్సిన విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. సమయానికి పాఠశాలకు వచ్చి, కాలక్షేపం చేసి వెళ్లడం ఉపాధ్యాయుల వంతవుతోంది. సర్కారు నుంచి రూ.వేలల్లో జీతాలు తీసుకుంటూ ఉపాధ్యాయులు ఖాళీగా ఉంటున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తుండగా.. విద్యార్థులు రాకపోవడంతో తమకూ బాధాకరంగా ఉందని, ప్రభుత్వ ఆదేశాలనుసారం పనిచేస్తామని ఆయా పాఠశాలల ప్రభుత్వ టీచర్లు చెబుతున్నారు.శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు ఎనిమిది మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. గురువారం ఒకే విద్యార్థి హాజరయ్యాడు. ఈ విద్యాసంవత్సరంలో 7,9,10 తరగతుల్లో విద్యార్థులు లేరు. 6వ తరగతిలో ఒకరు, 8వ తరగతిలో నలుగురు ఉన్నారు. గ్రామంలో 6వ తరగతి నుంచి 10వతరగతి వరకు చదివే 40మంది కేశవపట్నం, సైదాపూర్ మండలం సోమారం మోడల్‌స్కూల్, కేశవపట్నం కేజీబీవీలో, 25మంది ప్రైవేటు, గురుకులాల్లో చదువుతున్నారు. ఐదు రోజుల పాటు బడిబాట నిర్వహించినా విద్యార్థులు రాకపోవడంతో తమకూ ఇబ్బందిగా ఉందని హెచ్ఎం రమేశ్ తెలిపారు. -
దేశం దాటిన బంగారం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసు దర్యాప్తులో కొత్త విషయం వెలుగుచూసింది. ఈ ఏడాది మే 3న జరిగిన దోపిడీలో సుబోధ్ సింగ్ ముఠా రూ.88లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఎలాంటి ఆధారాలు లేని కేసు దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది. ఆధునిక సాంకేతికతతో బిహార్‌లోని జైలులో ఉన్న సుబోధ్ సింగ్, అతని అనుచరులు దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. ఇప్పటివరకు కేసులో సుబోధ్ సింగ్, రఽఘునాథ్ కర్మాకర్, రావిష్ కుమార్, జైనుల్లావుద్దీన్, అమర్‌సింగ్, మెహతాబ్‌ఖాన్, సూర్యమణి, ఆధిల్ఖాన్ను అరెస్టు చేసి కరీంనగర్ జైలులో ఉంచారు. దేశవ్యాప్తంగా 27 నేరారోపణల్లో నిందితుడిగా ఉన్న సుబోధ్‌సింగ్‌ను జూలై 2న బిహార్ హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడి జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా తన అనుచరులకు ప్రత్యేకమైన యాప్ రూపొందించి నేరాలు చేసేందుకు ఆదేశాలు ఇస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు, ఆ యాప్‌ను పనిచేయకుండా నిలిపివేశారు. మే 3న కరీంనగర్లో దోపిడీ చేసిన ఆభరణాలను ధర్మపురి మీదుగా ఛత్తీస్‌ఘడ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని అసాన్సోల్ నగల వ్యాపారికి విక్రయించినట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఆరాతీయగా బంగారాన్ని బీహార్ సరిహద్దుల మీదుగా నేపాల్ తరలించారని తెలుసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. 18న నూతన డీఎస్పీలకు పాఠంగా దోపిడీ కేసు రాష్ట పోలీస్ దర్యాప్తు చరిత్రలో కఠినమైన కేసుల్లో ఒకటిగా పీఎంజే దోపిడీ కేసు రికార్డుకెక్కింది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి చేసిన దోపిడీని ఛేదించిన సందర్భాన్ని డిపార్ట్మెంట్లో చేరనున్న ప్రతీ పోలీస్ తెలుసుకోవాలని హోంశాఖ నిర్ణయించింది. ఇటీవల ఎంపికై న డీఎస్పీలకు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ఈనెల 18న కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పాఠంగా బోధించనున్నారు. ఘటనకు ముందు రెక్కీ, దోపిడీ చేసిన విధానం, ఆధారాలు లేకుండా పరారైన వైనం, ఒక్కొక్క పనికి ఒక్కో వరుసలో నేరస్తులను ఉపయోగించిన తీరు, ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా దొంగలు సంప్రదింపులు జరిపిన విధానం, బిహార్ జైలులో ఉండి ఈ మొత్తం దోపిడీకి స్కెచ్ వేసిన సుబోధ్‌సింగ్‌ను కరీంనగర్‌కు తరలించే వరకు జరిగిన ఘటనలను ఫొటోలు, వీడియోల రూపంలో గౌస్ ఆలం స్వయంగా వివరించనున్నారు. ఇకపై డిపార్ట్మెంట్లోకి కొత్తగా వచ్చే కానిస్టేబుల్ దగ్గర నుంచి డీఎస్పీల వరకు పీఎంజే దోపిడీ కేసును కేస్ స్టడీగా బోధించాలని పోలీస్‌శాఖ నిర్ణయించనుంది.పీఎంజే చోరీ కేసులో అరెస్టు అయి కరీంనగర్ జైలులో రిమాండ్‌లో ఉన్న రఽఘునాథ్ కర్మాకర్, రావిష్ కుమార్, జైనుల్లావుద్దీన్, అమర్‌సింగ్, మెహతాబ్‌ఖాన్, సూర్యమణి, ఆధిల్ఖాన్కు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తన గ్యాంగ్ చేసే నేరాల తరఫున వాదించేందుకు సుబోధ్ సింగ్ కొంతమంది లాయర్లను నియమించుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ లాయర్‌ను బెయిల్ ఇప్పించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. రిమాండ్ ఖైదీలు ఉన్న నిందితులకు లాయరు ఇప్పటికే బెయిల్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. -
జిల్లెల్లగుట్టల్లో ఆదిమానవుల రాతిచిత్రాలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో అరుదైన ఆదిమానవుల నివాస స్థావరం వెలుగుచూసింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల సమీపంలోని సరిగుండ్లగుట్టల్లో సుమారు 10వేల సంవత్సరాల క్రితం నాటి(రాతియుగం) అరుదైన రాతి చిత్రాలను ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ సభ్యులు గురువారం తమ పరిశోధనలో కనుగొన్నారు. చిత్రాలతోపాటు ఆదిమానవులు రాతి పనిముట్లను పదును పెట్టుకోవడానికి ఉపయోగించిన రాతి తావులు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. జిల్లాలోని మూలవాగు, మానేరువాగు పరివాహక ప్రాంతాలైన రామప్పగుట్టలు, నాంపల్లి, సితారిగట్టు, బుర్కగుట్ట, మైసమ్మగుండు వంటి ప్రదేశాల్లో ఇప్పటికే ఇలాంటి చారిత్రక చిత్రాలు లభించాయి. తాజాగా సరిగుండ్లగుట్టల్లో వెలుగుచూశాయి. ఈ చారిత్రక ఆధారాలను ప్రభుత్వం వెంటనే సంరక్షించి, భవిష్యత్ తరాలకు అందించాలని చారిత్ర పరిశోధకులు రమేశ్ బృందం కోరుతున్నారు. 27 నుంచి ఎల్ఎల్బీ సెమిస్టర్ పరీక్షలుకరీంనగర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బీ ద్వితీయ సంవత్సరం సెమిస్టర్ పరీక్షల తేదీలను అధికారులు గురువారం ప్రకటించారు. రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 27న ప్రారంభమై ఆగస్టు 5న ముగియనున్నాయి. నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28న ప్రారంభమై ఆగస్టు 6న ముగియనున్నాయి. వివరాలకు సంబంధిత కళాశాల, విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.సురేశ్ కుమార్ సూచించారు. -
అమ్మవారికి దొండకాయల మాల అలంకరణ
విద్యానగర్(కరీంనగర్): నగునూర్‌లోని శ్రీదుర్గాభవా నీ ఆలయంలో ఆ షాఢమాసం శా కాంబరీ ఉత్సవా ల్లో భాగంగా గురువారం అమ్మవారి ని దొండకాయల మాలలతో అలంకరించారు. ప్రధానార్చకుడు పవనకష్ణ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, భక్తులు పాల్గొన్నారు.ఉత్తమ బ్యాంక్‌గా కేడీసీసీబీకరీంనగర్అర్బన్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ)కి అవార్డు వరించింది. నాబార్డ్ స్థాపించి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో గురువారం అవార్డును అందజేశారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకును రాష్ట్రంలోనే బెస్ట్ పెర్ఫార్మింగ్ డీసీసీబీగా గుర్తించగా, రూరల్ డెవలప్మెంట్ స్పెషల్ సెక్రటరీ దానకిశోర్ చేతులమీదుగా అవార్డ్ స్వీకరించారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా.నవీన్ నికోలస్, నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్, రిజర్వ్ బ్యాంకు రీజినల్ డైరెక్టర్ చిన్మయి కుమార్, కేడీసీసీబీ సీఈవో ఎన్.సత్యనారాయణరావు, జనరల్ మేనేజర్లు బి.శ్రీధర్, మహమ్మద్ రియాజుద్దీన్, డీజీఎం బ్రహ్మానంద రావు పాల్గొన్నారు. జాతీయ సదస్సులో కొండపాక ఉపాధ్యాయుడువీణవంక: విద్యాబోధనలో హస్తకళల వినియోగంపై సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్టీ)నిర్వహిస్తున్న జాతీయస్థాయి శిక్షణలో తెలంగాణ ఉపాధ్యాయ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో ఈ నెల 8నుంచి 17వరకు జరుగుతున్న సదస్సులో వీణవంక మండలం కొండపాక పాఠశాల ఉపాధ్యాయుడు ముదిగంటి రా జేందర్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి మొ త్తం 11మంది ఉన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాల ప్రదర్శన ద్వా రా తెలుగు వారి జీవనశైలిని జాతీయ వేదికపై ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. నేటి నుంచి క్లస్టర్ గేమ్స్చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయంలో శుక్ర, శనివారాల్లో హైదరాబాద్ రీజియన్ స్థాయి 34వ క్లస్టర్ గేమ్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో తెలంగాణలోని పదిహేను నవోదయ విద్యాలయాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో హ్యాండ్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పోటీలను ప్రారంభిస్తారని, సంకల్ప్ స్కిల్ ల్యాబ్, మ్యాథ్స్ పార్క్, ప్రముఖ జాతీయ నాయకులు, శాస్త్రవేత్తల విగ్రహాలను ప్రారంభిస్తారని తెలిపారు. పవర్‌కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ లైన్ల పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.గీతాభవన్ ఫీడర్ పరిధిలోని మంకమ్మతోట, రాంనగర్, పద్మనగర్, పారమిత స్కూల్, రాజీవ్ పార్కు, ధన్గర్‌వాడీ స్కూల్, లేబర్ అడ్డ రోడ్డు ప్రాంతాలతో పాటు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు 11 కె.వీ.ఐబీ ఫీడర్ పరిధిలోని కోర్టు చౌరస్తా, పాత డీఐజీ బంగ్లా, ఐబీ చౌరస్తా, సర్కస్ మైదానం, పద్మనాయక కల్యాణ మంటపం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్‌లోని హెచ్‌కేఎం చారిటబుల్ ఫౌండేషన్‌లో ఏజీఎం, డీజీఎం, ప్రొడక్షన్ మేనేజర్, స్టోర్స్ ఇన్చార్జి, క్వాలిటీ ఇన్చార్జి, క్వాలిటీ ఎగ్జిక్యూటివ్, హెల్పర్స్, కుక్, చెఫ్ పోస్ట్‌లకు ఈనెల 21న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిపుపతిరావు తెలిపారు. డిగ్రీతోపాటు హోటల్, ఫుడ్, హాస్పిటలిటీ, ఫుడ్ టెక్నాలజీ అర్హతలున్న వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు సంబందిత ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయంలో హాజరు కావాలన్నారు. వివరాలకు 99633 57250 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
బద్దెనపల్లిలో గేదెల దొంగతనం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో గేదెలను దొంగలించిన అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు దొంగలను గురువారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.1.30 లక్షలు రికవరీ చేసినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ కె.నాగేశ్వరరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు. గత మే 23న బద్దెనపల్లికి చెందిన ఆరేటి పోచయ్యకు చెందిన రెండు గేదెలు, ఆరేటి వెంకటేశ్‌కు చెందిన ఒక గేదెను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. బాధితుల ఫిర్యాదుతో తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల గుర్తింపు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగతనానికి పాల్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వీర్ల వెంకటరావు(35), చిత్తూరి గంగాధర్(33), వీర్ల మల్లికార్జునరావులుగా గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లగా ముగ్గురిలో ఇద్దరు (వెంకటరావు, గంగాధర్) దొరికారు. మరో నిందితుడు మల్లికార్జునరావు పరారీలో ఉన్నాడు. కేసును చాకచక్యంగా ఛేదించిన తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి, అదనపు ఎస్సై ఎం.మల్లేశం, సిబ్బంది సంపత్‌కుమార్, శ్రీనివాస్‌లను సీఐ అభినందించారు. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ -
బోధన అనుభవం కలుగుతుంది
అన్న, అక్క ఏఈ శిక్షణ కార్యక్రమంతో విద్యార్థులకు బోధన అనుభవం కలుగుతుంది. సేవాభావం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. భవిష్యత్‌లో మంచి అవకాశాలను ఎంచుకునే విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. శిక్షణలో పాల్గొంటున్న విద్యార్థులకు రెండు క్రెడిట్స్ వస్తాయి. – ప్రొఫెసర్ విజయలక్ష్మి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, గంభీరావుపేట మెంటార్షిప్లో భాగంగా మాకు నాగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కేటాయించారు. లెర్న్ టుగెదర్.. లివ్ టుగెదర్.. లీడ్ టుమారో.. అనే కాన్సెప్ట్‌తో విద్యాశాఖ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇది మాకు భవిష్యత్‌లో ఎంతగానో ఉపయోగపడుతుంది. నోడల్ ఆఫీసర్లు మా సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ సలహాలు, సూచనలు చేస్తున్నారు. – మహ్మద్ అంజద్, బీకాం ఫైనలియర్ విద్యార్థి -
అమ్మను చూద్దామని.. కానరాని లోకాలకు
చందుర్తి(వేములవాడ): తండ్రి చిన్ననాడే మృతిచెందగా తల్లి అమ్మమ్మ వద్దే ఉంటుండడంతో అమ్మను, అమ్మమ్మను చూసేందుకు వెళ్తూ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన వడ్నాల రాజేశ్వరీ వివాహాన్ని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో చేశారు. వీరికి కొడుకు రాజు, కూతురు జన్మించిన తర్వాత తండ్రి మృతిచెందాడు. అప్పటి నుంచి రాజేశ్వరీ ఇద్దరి పిల్లలతో తల్లిగారి ఊరు బావుసాయిపేటలోనే ఉంటోంది. కొడుకు రాజు వేములవాడలోని పెద్దమ్మ యాదవ్వ ఇంట్లో ఉంటూ ఇంటర్ చదువుతూ, హెయిర్ సెలూన్లో పనిచేస్తున్నాడు. గురువారం అమ్మను, అమ్మమ్మను చూసేందుకు బావుసాయిపేటకు స్నేహితుడు కోనరావుపేట మండలం జై సేవాలాల్ భూక్యారెడ్డితండాకు చెందిన భూక్యా ఆకాశ్‌తో బైక్‌పై బయలుదేరాడు. చందుర్తి మండలం ఎన్గల్ శివారులో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో వడ్నాల రాజు(17) అక్కడిక్కడే మృతి చెందగా, భూక్యా ఆకాష్ తల వెనుక భాగం పగిలింది. వెంటనే 108 అంబులెన్స్‌లో వేములవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన కారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపెల్లికి చెందిందని తెలిసింది. వీరు అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా మృతుడి తల్లి రాజేశ్వరీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. సైడ్బర్మ్స్ లేకనే ప్రమాదం వేములవాడరూరల్ మండలం హన్మాజిపేట నుంచి చందుర్తి మండలం ఎన్గల్, బండపల్లి మీదగా కోనరావుపేట మండలం బావుసాయిపేట వరకు 10.8 కిలో మీటర్లు తారు రోడ్డు పోశారు. కానీ నాలుగేళ్లు గడుస్తున్నా రోడ్డుకు ఇరువైపులా సైడ్బర్మ్స్ మొరం పోయించకపోవడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. సైడ్బర్మ్స్ పోయించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు చర్చించుకున్నారు. ఎన్గల్ శివారులో బైక్‌ను ఢీకొట్టిన కారు సంఘటన స్థలంలోనే యువకుడి మృతి మరొకరికి తీవ్ర గాయాలు -
పూడిక పేరుతో ఇసుక లూటీ
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం ఖాజీపూర్ శివారులోని మానేరు వాగులో పూడికతీత పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, ఖాజీపూర్ క్వారీని రద్దు చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గ్రామస్తులతో కలిసి గురువారం ఖాజీపూర్ చౌరస్తాలో కరీంనగర్– వేములవాడ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఆర్డీవో షర్మిల అక్కడికి చేరుకుని, క్వారీ అంశాన్ని కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కమలాకర్ మాట్లాడుతూ ఖాజీపూర్ మానేరు వాగులో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని అన్నారు. ఇసుక లారీలు రోడ్డెక్కితే అడ్డుకుంటామని హెచ్చరించారు. సర్పంచ్‌లు కోమటిరెడ్డి అంజనీకుమార్, పెంచాల అంజనేయులు, తాండ్ర శ్రీనివాస్, రెడ్డవేణి మధు, రాజశేఖర్, పిల్లి మహేశ్ పాల్గొన్నారు. -
ఒకే విద్యార్థి.. ఒక్క టీచర్
మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని అడ్డరోడ్డులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకేఒక్క విద్యార్థి ఉన్నారడు. మూడో తరగతి చదువుతున్న అతడికి బో ధించేందుకు ఒకే ఉపాధ్యాయుడు ఉండడం గమనార్హం. గొర్రెగుండంలో ఇద్దరు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, తాటిపల్లి అనుబంధం కొంపల్లె ప్రాథమిక పాఠశాలలో నలుగురు విద్యార్థులకు ఒకరు బోధి స్తున్నారు. అడ్డరోడ్డు పాఠశాలలో గతేడాది ఐదుగురు విద్యార్థులు ఉండగా.. ఈ ఏడాది ఒక్కడే మిగిలిపోయాడు. ప్రతి పాఠశాలలో కనీసం 20మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్దేశించామని ఎంఈవో నీలగిరి జయసింహారావు తెలిపారు. -
'అమ్ములు'కు కన్నీటి వీడ్కోలు..!
ప్రేమకు భాష ఉండదు.. బంధానికి రక్తసంబంధమే అక్కర్లేదు.. మనసుకు దగ్గరైన ప్రాణం దూరమైతే.. ఆ బాధ మనిషి దైనా, మూగజీవిదైనా ఒక్కటే. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ ఘటన అదేవిషయాన్ని గుర్తు చేసింది. 14ఏళ్లుగా తమ కుటుంబలో సభ్యురాలిగా, పిల్లలా, తోడుగా ఉన్న పెంపుడు శునకం ‘అమ్ములు’ అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. యజమానులు కన్నీరుమున్నీరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. బిస్కెట్ వేసిన మమకారాణికి.. గోదావరిఖని గాం«దీనగర్‌కు చెందిన గుండేటి లక్ష్మీ–మల్లేశం దంపతులు 14 ఏళ్ల క్రితం పదిరోజుల వయసున్న కుక్కపిల్ల ఇంటి ముందు తిరుగుతుంటే.. బిస్కెట్లు వేశారు. ఈ మమకారాణికి పిల్లశునకం ఏకంగా ఇంట్లోకే వచ్చింది. అక్కున చేర్చుకున్న దంపతులు ‘అమ్ములు’ అని పేరు పెట్టారు. అప్పటినుంచి వారి కుటుంబంలో సభ్యురాలే అయింది. సంతోషం, బాధలు, పండుగల్లోనూ, ఒంటరితనంలోనూ అమ్ములు వారి వెంటే ఉండేది. వనదేవతలకు ఎత్తు బంగారం గతంలో ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అమ్ములు కోలుకోవాలని వనదేవతలకు మొక్కుకున్నారు. రెండుసార్లు ఎత్తు బంగారం సమర్పించారు. ఆ మొక్కు ఫలించి అమ్ములు కోలుకోవడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆరోగ్యం క్షీణించి.. తుదిశ్వాస విడిచి.. అమ్ములు వయసు మీద పడింది. నెలరోజుల క్రితం పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. లక్ష్మి–మల్లేశం దంపతులు చిన్నపిల్లను చూసుకున్నట్లు ప్రతిరోజూ అన్నం తినిపించారు. మందులు వేశారు. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రారి్థంచారు. అయినా విధి కరుణించలేదు. బుధవారం ఉదయం అమ్ములు తుదిశ్వాస విడిచింది. హిందూ సంప్రదాయంగా అంత్యక్రియలు అమ్ములు చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరు న విలపించారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మూగజీవిపై చూపిన ప్రేమ, ఆప్యాయత, గౌరవం స్థానికులను కదిలించింది. పిల్లలు అమెరికాలో.. అమ్ములు తోడుగా.. క్యాండిల్స్ తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న మల్లేశం–లక్ష్మి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరూ వివాహాల అనంతరం ఉద్యోగ రీ త్యా అమెరికాలో స్థిరపడ్డారు. పిల్లలు దూరంగా ఉండటంతో అమ్ములే తమకు ఓదార్పు, తోడు, ఆత్మీయతగా మారింది. ‘మా పిల్లలు దూరంలో ఉన్నా.. అమ్ములు మా పక్కనే ఉండేది. మా సంతోషాల్లోనూ, మా బాధల్లోనూ తోడుండేది. ఇప్పుడు ఇల్లు ఖాళీగా అనిపిస్తోంది. అమ్ములు లేనిలోటు ఎలా భర్తీ చేసుకోవాలో తెలియడం లేదు’ అని దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. కాశీలో కలుపనున్న అస్థికలు.. అమ్ములుతో తమ అనుబంధం మరణంతో ముగియదని భావిస్తున్న దంపతులు.. అస్థికలను భద్రపరుస్తామని తెలిపారు. అమ్ములు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ త్వరలో కాశీకి వెళ్లి గంగానదిలో అస్థికలను నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. ‘మా కుటుంబ సభ్యురాలిగా జీవించిన అమ్ములకు చేయాల్సిన చివరి ధర్మం అదే..’ అని దంపతులు భావోద్వేగంగా తెలిపారు. -
విధుల్లో ఉండగానే కంప్యూటర్ ఆపరేటర్‌ను లాక్కెళ్లే యత్నం..!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో దారుణం చోటుచేసుకొంది. తప్పతాగిన ఇద్దరు నగరపాలకసంస్థ కంప్యూటర్ ఆపరేటర్లు, విధుల్లో ఉన్న ఓ మహిళా కంప్యూటర్ ఆపరేటర్‌ను లైంగికవేధింపులకు గురిచేశారు. ఒక దశలో ఆమెను చుట్టుముట్టి నిర్మానుష్యప్రాంతానికి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నగరపాలకసంస్థలోని ఓ విభాగంలో పనిచేస్తున్న మహిళా కంప్యూటర్ ఆపరేటర్ సీతారాంపూర్ ప్రాంతంలో ఎస్ఐఆర్ విధులు చేపడుతున్నారు. ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం ఆమె విధుల్లో ఉండగా, అక్కడికి మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు వచ్చారు. ఆమెను చుట్టుముట్టి లైంగికవేధింపులకు దిగారు. ఒక దశలో నిర్మానుష్యప్రాంతానికి బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అక్కడ జనాలు ఉండడంతో వీలుపడలేదు. ఆమెను దుర్భాషలాడుతూ తమతో రావాలని, తమకు కంపెనీ ఇవ్వాలంటూ వేధించారు. దీంతో తాను కమిషనర్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తే, ఉన్నతాధికారులు అని కూడా చూడకుండా వారు ఏమీ చేయలేరంటూ దుర్భాషలాడారు. గట్టిగా హెచ్చరించడంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా భర్త మరణంతో కారుణ్య ఉద్యోగం పొందిన ఆమెపై గత ఏడాదిన్నరగా వేధింపులు జరుగుతుండడం గమనార్హం. అప్పట్లోనే బాధిత మహిళ వేధింపులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాగా, సదరు కంప్యూటర్ ఆపరేటర్‌తో క్షమాపణ చెప్పించారు. విచారణకు ఆదేశంతనను వేధిస్తున్న ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లపై చర్యతీసుకోవాలని ఈ నెల 13వ తేదీన బాధిత ఆపరేటర్ నగరపాలకసంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చే సింది. కమిషనర్ విచారణకు ఆదేశించారు. బుధవా రం నగరపాలకసంస్థ అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణ చేపట్టింది. నిందితులు తమకు రాజకీయ పలుకుబడి ఉందంటూ, తమను ఎవరూ ఏం చేయలేరంటూ బాధిత మహిళను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఇలానే రాజకీయ పలుకుబడితోనే బయటపడ్డారని, మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విధుల్లో ఉన్న మహిళా కంప్యూటర్ ఆపరేటర్‌ను లైంగికంగా వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు. -
వానాకాలం.. ఉక్కపోతలో జనం
● 36 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు ● వేసవిని తలపిస్తున్న వాతావరణం కరీంనగర్: వానాకాలంలో వాతావరణం మండు వేసవిని తలపిస్తోంది. ఆకాశం నుంచి అమృతం కురవాల్సిన సమయంలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరిత ఉష్ణోగ్రతలు సాధారణంగా కన్నా అధికంగా మారడంతో ఏర్పడిన ఎల్‌నినో పంజా విసురుతోంది. దీని ప్రభావంతో వాతావరణం వేడెక్కుతోంది. జిల్లావ్యాప్తంగా ఉదయం 9గంటల నుంచే భానుడు భగభగమంటూ నిప్పులు కురిపిస్తున్నాడు. సాయంత్రం 6 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటోంది. మండే ఎండలతో పాటు అధిక ఉక్కపోత బెంబేలెత్తిస్తోంది. సగటు ఉష్ణోగ్రతలు 36డిగ్రీలు దాటిపోవడంతో పాటు ఊపిరాడకుండా చేస్తున్న ఉక్కపోత ప్రజలను అవస్థలకు గురిచేస్తోంది. పొద్దంతా, రాత్రి సమయాల్లో ఏసీలు, కూలర్లు లేనిదే క్షణం గడవడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత భయానకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.కరీంనగర్‌క్రైం: రాష్ట్ర 5వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కరీంనగర్ కమిషనరేట్ క్రీడాకారులు సత్తా చాటారు. వివిధ క్రీడాంశాల్లో 11 పతకాలు సాధించి జోన్–3లో అగ్రస్థానంలో నిలిచారు. 90కిలోల బాడీ బిల్డింగ్ విభాగంలో పీసీ పి.రాజు, యోగాలో ఏఆర్పీసీ ఎ.శంకర్ స్వర్ణం సాధించారు. 85 కిలోల బాడీ బిల్డింగ్‌లో ఏఆర్పీసీ ఎస్.నరేందర్, 80 కిలోల బాడీ బిల్డింగ్‌లో పీసీ ఎండీ.వహాజుద్దీన్, ఆర్మ్ రెజ్లింగ్‌లో ఏఆర్పీసీ వి.సాయి మాధవ్, 65 కిలోల ఆర్మ్ రెజ్లింగ్‌లో డబ్ల్యూపీసీ ఎ.స్వప్న రజత పతకాలు గెలు చుకున్నారు. సాయి మాధవ్ 55 కిలోల బాక్సింగ్‌లో, పీసీ జె.శ్రీనివాస్ 81 కిలోల జూడోలో కాంస్య పతకాలు సాధించారు. డబ్ల్యూపీసీ ఎం.అరుణ బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ విభాగాల్లో మూడు కాంస్య పతకాలు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు. విజేతలను సీపీ గౌస్ ఆలం అభినందించారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దుకరీంనగర్ కార్పొరేషన్: నగరంలో తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించొద్దని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. బుధవారం రిజర్వాయర్‌ను, ఏఈ కార్యాలయంపై నూతనంగా నిర్మిస్తున్న రెండో అంతస్తు భవన పనులను పరిశీలించారు. చివరి దశ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీటి సంపు, మోటారు పంపుల పనితీరును పరిశీలించారు. నగరవ్యాప్తంగా ప్రజల తాగునీటికి ఇబ్బందులు రాకుండా సమయం ప్రకారం నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. తాగునీటి సంపు, మోటార్ పంపుల షెడ్డు చుట్టూ సిమెంట్ ఫ్లోరింగ్ పనులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ నీటి ట్యాంకర్లు, ఇతర వాహనాల కోసం ప్రత్యేక షెడ్డు నిర్మించాలన్నారు. ఏఈ సతీశ్, వర్క్ ఇన్స్పెక్టర్ పర్షరాములు పాల్గొన్నారు. పవర్‌కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కె.వీ.కమాన్ ఫీడర్ పరిధిలోని షాషామహల్, లక్ష్మీనగర్ చౌరస్తా, గాయత్రీనగర్ ప్రాంతాలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రేకుర్తి సబ్‌స్టేషన్ పరిధిలోని రేకుర్తి, శాతవాహన కాలనీ, విపార్క్ వెనక భాగం, పాతవాడ, కొత్తవాడ, రేకుర్తి కంటి ఆసుపత్రి, ఇందిరమ్మకాలనీ, స్వామికాలనీ, షేకాబ్ కాలనీ, సమ్మక్క గద్దెలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, రూరల్ ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, జి.రఘు తెలిపారు. -
ఆడుకుంటూ వెళ్లి.. శవమై వచ్చి..
ఫెర్టిలైజర్‌సిటీ/రామగుండం సరదాగా క్రికెట్ ఆడుతున్న విద్యార్థుల్లో ఒకరు క్రికెట్ బాల్‌కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం లింగాపూర్‌లోని రామగుండం మోడల్ స్కూల్లో బుధవారం సాయంత్రం ఈఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. లింగాపూర్ మోడల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి వెంచర్ల సాత్విక్(13) స్నేహితులతో కలిసి పాఠశాల మైదానాంలో క్రికెట్ ఆడుతున్నాడు. బాల్ ప్రహరీ బయటపడడంతో సాత్విక్‌తోపాటు మరో విద్యార్థి శ్రీకర్ వెతుకుతూ ముందుకు సాగారు. సమీపంలోని బావిలో కనిపించిన బాల్ కోసం ఒకరికొకరు చేతులు పట్టుకొని దానిని తీసేందుకు యత్నించారు. ఈ క్రమంలో సాత్విక్ చేయి జారి అందులో పడిపోయాడు. మరోవిద్యార్థి ఒక్కసారిగా కేకలు వేయడంతో పీఈటీ శ్రీనివాస్ వెంటనే అక్కడకు చేరుకొని శ్రీకర్‌ను బయటకు లాగారు. సాత్విక్ అప్పటికే నీటిలో మునిగిపోయాడు. స్థానికులు వచ్చి సాత్విక్‌ను బయట తీయగా అప్పటికే మృతిచెందాడు. ప్రిన్సిపాల్, ఇన్చార్జి ప్రిన్సిపాల్‌కు సస్పెన్షన్‌కు ఉత్తర్వులు విద్యార్థి మృతి విషయాన్ని నిరసిస్తూ వివిధ రాజకీయ పార్టీల నేతలు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్(పీఈటీ)ను బాధ్యత వహించి, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని సుమారు మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు. చివరకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌తో మాట్లాడారు. బాధ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. దీంతో ప్రిన్సిపాల్ పంబాల సదానందం, వైస్ ప్రిన్సిపాల్ జె.శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబంలో ఒకరికి పాఠశాలలో ఒప్పంద కార్మికుడిగా అవకాశం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. అక్కతో కలిసి రోజూ బడికి.. వెంచర్ల సాత్విక్ ఎనిమిది, అక్క శ్రీవైష్ణవి పదో తరగతి లింగాపూర్ మోడల్ స్కూల్లో చదువుతున్నారు. తల్లిదండ్రులు ఎన్టీపీసీలో కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని సాకుతున్నారు. ఎన్టీపీసీ సమీపంలోని ఖాజీపల్లి స్వగ్రామం. అక్కతో కలిసి రోజూ బడికి వచ్చే సాత్విక్ మృతితో పాఠశాలతోపాటు స్వగ్రామంలోనూ విషాదం అలముకుంది. క్రికెట్‌బాల్ కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయి వ్యవసాయ బావిలోపడి విద్యార్థి దుర్మరణం లింగాపూర్ మోడల్ స్కూల్ సమీపంలో ఘటన -
పాఠశాలను సందర్శించిన డీఈవో
వీణవంక: వీణవంక మండలం ఘన్ముక్కుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈవో ప్రశాంత్‌రెడ్డి తనిఖీ చేశారు. ‘8 మంది టీచర్లు.. 9 మంది విద్యార్థులు’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ విచారణ జరపాలని డీఈ వోకు ఆదేశాలు జారీ చేశారు. ఎంఈవో శోభారాణితో కలిసి డీఈవో పాఠశాలను సందర్శించారు. 9మంది విద్యార్థులకు 8మంది ఉపాధ్యాయులు ఉండటంపై విచారణ జరిపారు. బుధవారం ఆరుగురు విద్యార్థులు హాజరైనట్లు తెలుసుకున్నారు. సర్పంచ్ గాజుల శంకర్, ఉపసర్పంచ్ అనిల్‌రెడ్డి, వార్డు సభ్యులు పాఠశాలలో అధికారులతో చర్చించారు. త్వరలోనే పాఠశాలను మోడల్ స్కూల్లో కలిపేందుకు గ్రామస్తుల వాగ్మూలం తీసుకొన్నట్లు తెలిసింది. ఈ అంశంపై విచారణ జరిపామని, ఉన్నధికారులకు నివేదిక అందిస్తామని డీఈవో తెలిపారు. -
హోంగార్డుల బదిలీలు షురూ..
గురువారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2026సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా పరిధిలో ఇటీవల జరిగిన హోంగార్డుల బదిలీల ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి, సిద్దిపేట, హన్మకొండలో పనిచేస్తున్న 373 మందిని ఈనెల 3న సీపీ గౌస్ ఆలం బదిలీ చేశారు. అంతర్గత, సాంకేతిక కారణాలు, ఆర్ఐ, ఇతర అధికారుల జోక్యం, రాజకీయ ఫైరవీలుతో ప్రక్రియ నెమ్మదించింది. గతేడాది జరిగిన హోంగార్డు బదిలీలపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో తాజా బదిలీలపై హోంగార్డులు అనాసక్తితో ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న ఏడు జిల్లాల పోలీస్ అధికారులు సైతం రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వకపోవడంతో పాతస్థానంలో కొనాసాగాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై ‘బదిలీ అయినా కదపరే’ శీర్షికన ‘సాక్షి’ విశ్లేషణాత్మక కథనం ప్రచురించింది. సీపీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు హోంగార్డులకు రిలివింగ్ ఆర్డర్స్ ఇస్తున్నారు. మంగళ, బుధ వారాల్లో పలువురు హోంగార్డులు సిరిసిల్ల, జగిత్యాలకు రిలివింగ్ ఆర్డర్స్ తీసుకుని వెళ్లారు. మిగిలిన వారికి త్వరలోనే ఆర్డర్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు ‘సాక్షి’కి వివరించారు. -
జాతీయ కీర్తి.. కావాలి సారథి
కరీంనగర్ అర్బన్: దేశవ్యాప్తంగా కీర్తి గడించిన కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సారథి లేకుండా సాగుతోంది. గత జూన్ 11తో పర్సన్ ఇన్చార్జి పాలన ముగిసింది. కలెక్టర్ సదరు బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పరిపాలన స్తంభించింది. కీలక వ్యవహారాలన్నీ అటకెక్కాయి. వ్యాపారులు రుణా ల కోసం దరఖాస్తు చేస్తే ఫైళ్లు గుట్టల్లా పెరిగిపోతున్నాయి. ప్యాక్స్‌ల పరిస్థితి అంతే. నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను ప్రకటించాల్సి ఉండగా కేవలం 8కే పరిమితం కాగా, మిగతా 123 పాత పాలకవర్గాలతో నెట్టుకొస్తున్నాయి. ఘనకీర్తి.. ఎందుకీ దుస్థితి 2005–06లో రూ.57.92కోట్ల నష్టాలతో ఉన్న కేడీసీసీబీ పరిస్థితులు చైర్మన్ నియామకంతో పూర్తిగా మారిపోయాయి. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సేవలందిస్తుండగా దేశంలోనే ఉత్తమ అవార్డులు వరించాయి. గతంలో రూ.402కోట్లుగా ఉన్న బ్యాంకు వ్యాపారం నేడు రూ.8వేల కోట్లకు చేరింది. గత పదేళ్లుగా ఏటా రూ.వంద కోట్ల లాభాలు గడిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ వాణిజ్య బ్యాంకులకు పోటీనిస్తోంది. గ్రామీణ ప్రజానీకానికి వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలివ్వడం, రుణేతర సేవలు, పెట్రోల్ బంకులు, ఫంక్షన్ హాళ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, జనౌషధి కేంద్రాలు, గిడ్డంగులు, సోలార్ ప్లాంట్లు, డ్రోన్ల సేవలు, వ్యాపార సముదాయాలు, వాటర్ ప్లాంట్లు వంటి సేవలందిస్తోంది. చైర్మనా.. పర్సన్ ఇన్‌చార్జా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చైర్మన్లను, డైరెక్టర్లను నియమించగా సదరు పాలకవర్గాన్ని తొలగించి పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్‌ను నియమించారు. సదరు పరిపాలన గడువు గత నెల 11తో ముగిసింది. నామినేటేడ్ పద్ధతిలో పాలకవర్గాన్ని ప్రకటిస్తారని భావించినప్పటికీ నేటికీ జాప్యం జరుగుతుండటం పరిపాలనపై ప్రభావం చూపుతోంది. నిర్ణయాలు తీసుకోవాలంటే జనరల్ బాడీ మీటింగ్ తప్పనిసరి కాగా.. రుణాల ఫైళ్లు పేరుకుపోతున్నాయి. మానకొండూరులో ఎనిమిది మినహా.. ఉమ్మడి జిల్లాలో మానకొండూరు నియోజకవర్గంలో 8 ప్యాక్స్‌లు మినహా పాలకవర్గాలను ప్రకటించలేదు. మానకొండూరు, దేవంపల్లి, గట్టుదుద్దెనపల్లి, మెట్పల్లి, గద్దపాక, తాడికల్, పోరండ్ల, నుస్తులాపూర్ పాలకవర్గాలను నామినేటేడ్ చేశారు. ఊ టూరు, బెజ్జంకి, ఇల్లంతకుంట, గాలిపల్లి పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరో 123 సంఘాలు అధికారులతోనే సాగుతున్నాయి. 131 చైర్మన్, 131 వైస్ చైర్మన్ పదవులతో పాటు ఒక్కో సహకార సంఘంలో 13మంది డైరెక్టర్లుంటారు. వీరి మద్దతుతో చైర్మన్, వైస్ చైర్మన్లు నియమితులయ్యేవారు. ప్రభుత్వం నామినేటెడ్ నిర్ణయంతో ఇక వీరంతా నామినేటెడ్ పద్ధతిలోనే భర్తీ జరగాల్సి ఉండగా నేటికి స్పష్టత లేదు.అవార్డు ఇచ్చిన చేతితో ఎలా తొలగిస్తాంచొప్పదండి: రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలను నియమిస్తూ వస్తున్న సహకారశాఖ అధికారులకు జాతీయస్థాయిలో మూడు అవార్డులు అందుకున్న చొప్పదండి పీఏసీఎస్ పాలకవర్గాన్ని రద్దు చేయడం సవాల్‌గా మారింది. పీఏసీఎ స్‌లకు కాంగ్రెస్ ఆశావహులను చైర్మన్, డైరెక్టర్లుగా నియమిస్తుండగా, చొప్పదండి పీఏసీఎ స్లో కొత్త పాలకవర్గం నియామకం తలనొ ప్పిగా మారింది. చొప్పదండి సహకార సంఘం దేశంలోని 96వేల సహకార సంఘాలకు ఆదర్శంగా నిలిచింది. 29 రాష్ట్రాల్లోని సహకారశాఖ అధికారులు, పాలకవర్గాలు ఇక్కడి పనితీరును పరిశీలించారు. ఇటీవల పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో జిల్లా సహకార అధికారి బాధ్యతలు స్వీకరించినా కోర్టు తీర్పు మేరకు పాత పాలకవర్గమే కొనసాగుతోంది. పీఏసీఎస్‌లకు నూతన పాలకవర్గాల ఏర్పాటు నేపథ్యంలో చొప్పదండిలో సందిగ్ధం నెలకొంది. -
కళాకారుడికి చేయూత
వేములవాడరూరల్: వేములవాడకు చెందిన కళాకారుడు మారం ప్రవీణ్‌కుమార్(పప్పి) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వైద్యానికి రూ.లక్షల్లో అవసరం అవుతుండగా.. దాతల సాయం కోరుతూ ‘సాక్షి’ దినపత్రికలో ’కళాకారునికి కష్టకాలం’ శీర్షికన ఈనెల 12న కథనం ప్రచురితమైంది. వేములవాడ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాదాడి గజానందరావు కథనానికి స్పందించారు. 30ఏళ్లుగా తన వెంట ఉంటూ, కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న ప్రవీణ్‌కు రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తానని, ఆపరేషన్ తరువాత కూడా మూడు నెలల వరకు ఖర్చులు భరిస్తానని తెలిపారు. మారం ప్రవీణ్ మాట్లాడుతూ కష్టాల్లో తోడుగా నిలిచినందుకు గజానందరావుకు కృతజ్ఞతలు తెలిపాడు. గజానందరావు మానవతా దృక్పథాన్ని పట్టణ ప్రజలు అభినందించారు. మరికొంత మంది ఆర్థికసాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. -
24 ఏళ్ల తరువాత తెరవబడినది
ఇల్లందకుంట: ఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లి గ్రామంలో విద్యార్థులు లేక 24ఏళ్లుగా మూతబడి ఉన్న పాఠశాలను తిరిగి ప్రారంభించారు. సర్పంచ్ మర్రి శ్రీనివాస్‌రెడ్డి చొరవతో పాఠశాలలో నూతనంగా 15 మంది చేరగా.. బుధవారం డీఈవో ప్రశాంత్‌రెడ్డి పాఠశాలను పునః ప్రారంభించారు. స్థానిక ప్రజల సహకారంతో పాఠశాలను తిరిగి ప్రారంభించామని సర్పంచ్ తెలిపారు. పాఠశాలలో అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని డీఈవో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి మర్రి జైసాల్రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ కర్ర అశోక్‌రెడ్డి, ఎంఈవో కొర్ర రాములు పాల్గొన్నారు. -
మోడల్ సిటీగా మారుస్తాం
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్‌ను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. రూ.840 కోట్ల యూసీఎఫ్ నిధులతో మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రతి మట్టి రోడ్డును సీసీ రోడ్డుగా మారుస్తామని హామీ ఇచ్చారు. యూఐడీఎఫ్ నిధులు రూ.50 కోట్లతో చేపట్టిన పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. నగరపాలక సంస్థ 47వ డివిజన్ రాంనగర్‌లోని సిద్ధార్థ స్కూల్ వద్ద రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు, డ్రైన్, 62వ డివిజన్ మంకమ్మతోట శ్రీరాం బుక్ స్టాల్ నుంచి మోర్ సూపర్ మార్కెట్ వరకు రూ.98 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీం కింద కేంద్రం మంజూరు చేసిన రూ.840 కోట్ల నిధులతో కరీంనగర్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. స్మార్ట్‌సిటీ నిధులతో కరీంనగర్లో పార్కింగ్ సమస్య లేకుండా రూ.25 కోట్లతో శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. దసరా నాటికి కరీంనగర్, వరంగల్ హైవే రోడ్డు అందుబాటులోకి తెస్తామన్నారు. కరీంనగర్ జగిత్యాల హైవే పనులను ప్రారంభిస్తామని, గన్నేరువరం బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టబోతున్నామని అన్నా రు. మేయర్ కె.శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్‌రావు, నగర పాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్, కార్పొరేటర్లు గాజే రమ, పెద్దపల్లి జితేందర్, ఎన్నం లక్ష్మి, కల్వకుంట్ల ప్రమోద్‌రావు పాల్గొన్నారు. -
ఆషాఢ విరామం.. శ్రావణ ఉత్సాహం
వేములవాడ: ఎప్పుడూ బిజీగా ఉండే వేములవాడ రాజన్న ఆలయం ఎదుటి వీధి ఆషాఢం మొదలుకావడంతో సైలెంట్ అయిపోయింది. నిత్యం భక్తుల రద్దీతో వ్యాపారసంస్థలు సందడిగా ఉండేది. కానీ ప్రస్తుతం పలు వ్యాపారసంస్థలు మూసివేసి కనిపిస్తున్నాయి. ఆషాఢంలో రాజన్న దర్శనానికి భక్తులు తక్కువగా వస్తుంటారు. దీంతో రాజన్న ఆలయం ఎదుట ఉన్న వ్యాపారులు తమ వ్యాపారాలకు సెలవు పెడతారు. ఈ పక్షం రోజుల్లో తమకు నచ్చిన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తుంటారు. పూజా సామగ్రి, టోపీలు, జనరల్‌స్టోర్స్, కొబ్బరికాయలు, బెల్లం, కుంకుమ, హోటళ్లు, లాడ్జీలు, బట్టల వ్యాపారులు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. సంఘటితంగా ప్రయాణాలు ఒకరో ఇద్దరో కాదు.. ఇక్కడి వ్యాపారులు బ్యాచ్‌లుగా ఏర్పడతారు. ఒకే వీధిలోని వ్యాపారులు కలిసి పక్షం రోజులకు పైగా లాంగ్‌టూర్లు ప్లాన్ చేసుకుంటారు. అయ్యప్ప, కాశీ, రామేశ్వరం, తిరుపతి పుణ్యక్షేత్రాలతోపాటు ఊటి, కేరళ, కులుమనాలి వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇందుకోసం నెల రోజుల ముందే బుకింగ్స్, ప్లానింగ్స్ జరిగిపోతాయి. మానసిక ఉల్లాసంతోపాటు రానున్న శ్రావణమాసం రద్దీకి సరికొత్త ఉత్సాహంతో సిద్ధమవుతుంటారు. ఏడాది పొడవునా వచ్చే భక్తులకు అవసరమైన వస్తువులను దుకాణంలో అందుబాటులో ఉంచుతాం. పండగలు, సెలవు రోజుల్లో తీరిక ఉండదు. ఆషాఢంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో దుకాణాలు మూసివేసి వ్యాపార కుటుంబాలతో కలిసి యాత్రలకు వెళ్తాం. దీని ద్వారా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. – తమ్మిశెట్టి అర్జున్, బొమ్మల దుకాణం, వేములవాడ రోజువారీ వ్యాపార ఒత్తిడిలో ఒకరినొకరు పలకరించుకునే తీ రిక ఉండదు. కానీ ఈ ఆషాఢం టూర్లతో అందరం కలిసి ప్ర యాణిస్తాం. ఒకే దగ్గర వండుకుని తింటాం. ఈ పదిహేను రోజులు వ్యాపారాలు బంద్ చేసి ఇలా వెళ్లి.. నూ తన ఉత్సాహంతో తిరిగి వస్తాం. శ్రావణ మాసం నాటికి కొత్త ఉత్సాహంతో షాపులు తెరుస్తాం. – సాయి, హోటల్ నిర్వాహకుడు, వేములవాడ రాజన్న సన్నిధిలో ఆషాఢ విరామం దొరకడంతో ఏటా యాత్రలకు వెళ్తాం. జిల్లాలోనే ఈ సంప్రదాయం వేములవాడలో ప్రత్యేకం. కొంతమంది దుకాణాలను సర్దుకోవడం, రినోవేషన్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. మేమంతా ఏటా పోచమ్మకు బోనాలు తీస్తాం. – పిన్నింటి హన్మండ్లు, రాజరాజేశ్వర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు కొత్త ప్రదేశాల సందర్శనలో వ్యాపారులు బిజీ బృందాలుగా విహారయాత్రలకు.. మూతబడ్డ వ్యాపార సంస్థలు సైలెంట్ అయిన గుడి వీధులు నూతనోత్సాహంతో శ్రావణమాసానికి సిద్ధం -
తప్పతాగి.. చుట్టుముట్టి.. చేయిపట్టి
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో దారుణం చోటుచేసుకొంది. తప్పతాగిన ఇద్దరు నగరపాలకసంస్థ కంప్యూటర్ ఆపరేటర్లు, విధుల్లో ఉన్న ఓ మహిళా కంప్యూటర్ ఆపరేటర్‌ను లైంగికవేధింపులకు గురిచేశారు. ఒక దశలో ఆమెను చుట్టుముట్టి నిర్మానుష్యప్రాంతానికి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నగరపాలకసంస్థలోని ఓ విభాగంలో పనిచేస్తున్న మహిళా కంప్యూటర్ ఆపరేటర్ సీతారాంపూర్ ప్రాంతంలో ఎస్ఐఆర్ విధులు చేపడుతున్నారు. ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం ఆమె విధుల్లో ఉండగా, అక్కడికి మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు వచ్చారు. ఆమెను చుట్టుముట్టి లైంగికవేధింపులకు దిగారు. ఒక దశలో నిర్మానుష్యప్రాంతానికి బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అక్కడ జనాలు ఉండడంతో వీలుపడలేదు. ఆమెను దుర్భాషలాడుతూ తమతో రావాలని, తమకు కంపెనీ ఇవ్వాలంటూ వేధించారు. దీంతో తాను కమిషనర్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తే, ఉన్నతాధికారులు అని కూడా చూడకుండా వారు ఏమీ చేయలేరంటూ దుర్భాషలాడారు. గట్టిగా హెచ్చరించడంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా భర్త మరణంతో కారుణ్య ఉద్యోగం పొందిన ఆమైపె గత ఏడాదిన్నరగా వేధింపులు జరుగుతుండడం గమనార్హం. అప్పట్లోనే బాధిత మహిళ వేధింపులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాగా, సదరు కంప్యూటర్ ఆపరేటర్‌తో క్షమాపణ చెప్పించారు. విచారణకు ఆదేశం తనను వేధిస్తున్న ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లపై చర్యతీసుకోవాలని ఈ నెల 13వ తేదీన బాధిత ఆపరేటర్ నగరపాలకసంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చే సింది. కమిషనర్ విచారణకు ఆదేశించారు. బుధవా రం నగరపాలకసంస్థ అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణ చేపట్టింది. నిందితులు తమకు రాజకీయ పలుకుబడి ఉందంటూ, తమను ఎవరూ ఏం చేయలేరంటూ బాధిత మహిళను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఇలానే రాజకీయ పలుకుబడితోనే బయటపడ్డారని, మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విధుల్లో ఉన్న మహిళా కంప్యూటర్ ఆపరేటర్‌ను లైంగికంగా వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు. -
చలో యువత.. ఖేలో ఇండియా
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్రానికి 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 ఆతిథ్యం దక్కడం తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా మహోత్సవం ద్వారా తెలంగాణ యువతకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులకు అపూర్వ అవకాశాలు లభించనున్నాయి. ఉమ్మడి జిల్లా కొన్నేళ్లుగా రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను అందిస్తోంది. కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, వుషు, రెజ్లింగ్, జూడో, రగ్బీ, సాఫ్ట్‌బాల్, జిమ్నాస్టిక్స్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. సదుపాయాల అభివృద్ధికి ఊతం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణతో తెలంగాణలో క్రీడా సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే పలు క్రీడా అకాడమీలు, శిక్షణ కేంద్రాలు, మినీ స్టేడియాలు, పాఠశాలస్థాయి క్రీడా వేదికలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ గేమ్స్ నేపథ్యంలో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కేవలం ఒక క్రీడా పోటీ మాత్రమే కాదు. భావితర భారత క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే వేదిక. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కరీంనగర్లో జూడో, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఖోఖో, జగిత్యాలలో బాక్సింగ్, సిరిసిల్లలో కబడ్డీ ఖేలో ఇండియా సెంటర్లు కొనసాగుతున్నాయి. ఇక వారు పతకాల వేటకు ప్రాక్టీస్‌ను ప్రారంభించగా.. నిర్వాహకులు రాష్ట్రంలో జరిగే పోటీలపై సన్నాహాలు ప్రారంభించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం క్రీడా రంగానికి గొప్ప గౌరవం. ఈ అవకాశంతో యువ క్రీడాకారులకు జాతీయస్థాయి పోటీల అనుభవం లభిస్తుంది. తెలంగాణ దేశంలో ప్రముఖ క్రీడా రాష్ట్రంగా గుర్తింపు పొందుతుంది. ఉమ్మడి జిల్లాలో అపారమైన క్రీడా ప్రతిభ ఉంది. ఈ గేమ్స్ ద్వారా ఆ ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుంది. – గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ ఆతిథ్యం నిదర్శనం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణతో సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కరీంనగర్ జిల్లా నుంచి మరింత మంది జాతీయ క్రీడాకారులు ఎదిగే అవకాశం ఉంది. – నందెల్లి మహిపాల్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఖేలో ఇండియా యూత్ క్రీడలు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. పాఠశాలలు, కళాశాలల నుంచి మరింత మంది క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణకు లభించిన ఈ గౌరవం ప్రతి క్రీడాభిమానిని ఆనందపరుస్తోంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. – తుమ్మల రమేశ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు గ్రామీణ క్రీడాకారుల కలల వేదికంటున్న క్రీడా విశ్లేషకులు ఇక సాధనపై కన్ను.. పతకాల వేటలో క్రీడాకారులు ఉమ్మడి జిల్లా క్రీడా ప్రతిభకు మరో సువర్ణావకాశం -
జీజీహెచ్‌లో ఓపీ ఇలా
1,0631,1271,1121,5281,2841,039జూలై10జూలై13జూలై7ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేస్తున్న జూనియర్ డాక్టర్లుజూలై11జూలై 8జూలై14వైద్య వృత్తిలో కొనసాగేవారు అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న వారు మరింత నిబద్ధతతో పనిచేయాలి. కరీంనగర్ జీజీహెచ్‌లో పనిచేసే సీనియర్ వైద్యులు మొక్కుబడిగా విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో పేద ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్న కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారగా.. నెలకు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్న కొందరు సీనియర్ వైద్యులు.. ప్రభుత్వ విధులను గాలికొదిలేసి, ప్రైవేటు ప్రాక్టీస్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా 500 పడకలతో కొనసాగుతుండగా వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – కరీంనగర్ఆస్పత్రిలో విధులు నిర్వహించే సీనియర్ వైద్యుల తీరు ’వచ్చామా.. హాజరుపడ్డామా.. వెళ్లామా’ అన్నట్లుగా తయారైంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు రావడం, హాజరు నమోదు చేసుకోవడం, తిరిగి ప్రైవేటు క్లినిక్ వైపో లేదా ఇళ్ల వైపో సర్దుకోవడం కొందరికి అలవాటుగా మారింది. రోగులకు వైద్యం అందించాల్సిన వారు గంట కూడా అందుబాటులో లేకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఓపీలకు సీనియర్ల డుమ్మా జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి ప్రతిరోజు 1,000 నుంచి 1,200 మందికి పైగా అవుట్‌పేషెంట్ (ఓపీ) సేవల కోసం వస్తుంటారు. ఓపీ విభాగాల్లో ఉండాల్సిన సీనియర్ వైద్యులు డుమ్మా కొడుతున్నారు. నిర్వహణ భారం సీనియర్ రెసిడెంట్లు, హౌస్సర్జన్లపైనే పడుతోంది. అనుభవజ్ఞులైన వైద్యులు లేకపోవడంతో, జూనియర్లకు అవగాహన లేక, తెలిసిన మందులు రాసి పంపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా రోజూ జరుగుతున్న తంతే కావడంతో, ప్రశ్నించే వారే లేరనే ధీమాతో కొందరు వైద్యులు వ్యవహరిస్తున్నారు. వార్డుల్లో అధ్వానం ఓపీ పరిస్థితి ఇలా ఉంటే, ఇన్‌పేషెంట్ వార్డుల పరిస్థితి అధ్వానంగా మారింది. వార్డుల్లో రోగులను పరిశీలించే నాథుడే కరువయ్యాడు. నర్సులు, జూనియర్ డాక్టర్ల భరోసాతోనే వార్డులు నడుస్తున్నాయి. సీనియర్ వైద్యుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రాణభయంతో కొందరు మధ్యలోనే డిశ్చార్జ్ చేయించుకుని, అప్పులు చేసైనా వైద్యం చేయించుకుంటామని ప్రైవేటుకు పరుగుతీస్తున్నారు. రాబోయేది జ్వరాల సీజన్ ఇది వర్షాకాలం.. వచ్చేది జ్వరాల సీజన్. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌తో వందల సంఖ్యలో రోగులు ఆస్పత్రికి బారులుతీరే ప్రమా దం ఉంది. ప్రస్తుతం ఉన్న అరకొర సేవలకే రోగులు నరకం చూస్తుంటే, జ్వరాల సీజన్లో ఎవరు పట్టించుకుంటారని ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి, విధులకు ఎగనామం పెడుతున్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సూపరింటెండెంట్ లీవ్ వెనుక మతలబేంటి? ఆసుపత్రి పరిపాలనను గాడిన పెడుతూ, వైద్యులను పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్ నెల రోజులుగా సెలవులో ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఆస్పత్రిలో జరుగుతున్న అవకతవకలపై గతంలో కలెక్టరేట్‌కు పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. కలెక్టర్ సదరు అధికారిని మందలించారని, ఆ కారణంతోనే సుదీర్ఘ సెలవుపై వెళ్లారనే ప్రచారం సాగుతోంది. తను వ్యక్తిగత కారణాలతోనే లీవులో వెళ్లినట్లు, మరో రెండు రోజుల్లో విధుల్లో చేరుతానని సూపరింటెండెంట్ వివరించారు. -
ఠాణా మెట్లెక్కని ఎగ్లాస్పూర్
● ప్రశాంతతకు నిలయం ● సామరస్యానికి నిదర్శనం ● ఐక్యతకు ఆదర్శం కోనరావుపేట(వేములవాడ): చుట్టూ ఎత్తయిన గుట్టలు.. గ్రామంలోకి స్వాగతం పలికే చెట్లు.. ఆకుపచ్చని పొలాలు మ ధ్యలో అందంగా కనిపించే ఇళ్లతో ఎగ్లాస్పూర్ ప్రశాంతంగా ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఆ పల్లె ఐకమత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. గ్రామస్తులు సామరస్యంగా ఉంటూ సమస్యలను ఊరిలోనే పరిష్కరించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పోలీస్‌స్టేషన్ గడప ఈ గ్రామస్తులు తొక్కలేదు. శాంతియుత జీవనం రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామస్తులు శాంతియుత జీవనాన్ని పాటిస్తున్నారు. 750 మంది జనాభా ఉన్న గ్రామంలో ఇంటిపన్ను, నల్లాబిల్లు చెల్లించడంతో పాటు వివాదరహితంగా పేరుగాంచింది. గ్రామంలో తలెత్తే సమస్యలను గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుంటున్నారు. కుటుంబ కలహాలు, వ్యవసాయ భూముల సరిహద్దు సమస్యలు, ఇతర చిన్న తగాదాలు తలెత్తినప్పుడు సంబంధిత కుటుంబాలను ఒకే చోట కూర్చోబెట్టి పెద్దల సమక్షంలో చర్చించి పరిష్కారం చూపుతారు. పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా సామరస్యపూర్వకంగా రాజీ కుదుర్చుతారు. అన్నింటిలోనూ ఆదర్శం గ్రామస్తులు ఐకమత్యంతో అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. పారిశుధ్యం, పచ్చదనం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ప్రతీ విషయంలో గ్రామ ప్రయోజనాలనే ముందుంచే సంస్కృతి ఎగ్లాస్పూర్ ప్రత్యేకత. ఉపాధిహామీలో ప్రతి ఒక్కరు వంద రోజుల పనిదినాలను పూర్తిచేసుకుంటారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉంటారు. గ్రామ స్వరూపం జనాభా 750 ఓటర్లు 490 గృహాలు 190 జాబ్‌కార్డులు 230 -
సీఎంపై పోలీసులకు ఫిర్యాదు
గోదావరిఖని: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా, ఆత్మహత్యలకు ఉసిగొల్పేలా ఉన్నాయని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. బుధవారం గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) 2023లోని సంబంధిత సెక్షన్ల కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరారు. ఈనెల 11న హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులపై మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజానికి సరైన సంకేతం కాదన్నారు. రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, రైతుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు చెల్కలపల్లి శ్రీనివాస్, బొడ్డుపెల్లి శ్రీనివాస్, దొమ్మేటి వాసు, కిరణ్‌జీ తదితరులు పాల్గొన్నారు. గంగాధర: మండల పరిధిలోని ఎల్లమ్మదారిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాటస్థావరంపై పోలీసులు బుధవారం దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లమ్మదారి పరిసర ప్రాంతాల్లో కొందరు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడి చేసి పేకాటరాయుళ్లను పట్టుకున్నామని వీరి నుంచి రూ. 52,380 నగదుతో పాటు 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొరు. అరెస్టయిన వారిని గంగాధర, కొత్తపల్లి, నారాయణపూర్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించామని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, దాడిలో ఆర్ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుళ్లు వెంకట్, తిరుపతి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. జమ్మికుంట: పట్టణంలోని శ్రీదుబ్బామల్లికార్జునస్వామి ఆలయం సమీపంలో రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే హెడ్‌కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కొలనూరు గ్రామానికి చెందిన దాసరి రామూర్తిగౌడ్ (51) జమ్మికుంట హౌజింగ్‌బోర్డు కాలనీకి వలస వచ్చాడు. 20 ఏళ్లుగా స్థానికంగా నివాసం ఉంటూ కేబుల్ అపరేటర్‌గా ఉపాధి పొందుతున్నాడు. కొన్నాళ్లుగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడు. సోమవారం రాత్రి మాతా వైష్ణోదేవి కాట్రా ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య సుజాత, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు నమోదు చేశామని రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. మృతదేహాన్ని కొలనూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఖాకీలకు ‘దొంగ’ పాఠం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసు దర్యాప్తులో కొత్త విషయం వెలుగుచూసింది. ఈ ఏడాది మే 3న జరిగిన దోపిడీలో సుబోధ్ సింగ్ ముఠా రూ.88లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఆభరణాలను ధర్మపురి మీదుగా ఛత్తీస్‌ఘడ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని అసాన్సోల్ నగల వ్యాపారికి విక్రయించినట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఆరాతీయగా బంగారాన్ని బిహార్ సరిహద్దుల మీదుగా నేపాల్ తరలించారని తెలుసుకున్నారు. కాగా, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి చేసిన దోపిడీని ఛేదించిన సందర్భాన్ని డిపార్ట్మెంట్లో చేరనున్న ప్రతీ పోలీస్ తెలుసుకోవాలని హోంశాఖ నిర్ణయించింది. ఇటీవల ఎంపికైన డీఎస్పీలకు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ఈనెల 18న కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పాఠంగా బోధించనున్నారు. ఘటనకు ముందు రెక్కీ, దోపిడీ చేసిన విధానం, ఆధారాలు లేకుండా పరారైన వైనం, ఒక్కొక్క పనికి ఒక్కో వరుసలో నేరస్తులను ఉపయోగించిన తీరు, ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా దొంగలు సంప్రదింపులు జరిపిన విధానం, బిహార్ జైలులో ఉండి ఈ మొత్తం దోపిడీకి స్కెచ్ వేసిన సుబోధ్‌సింగ్‌ను కరీంనగర్‌కు తరలించే వరకు జరిగిన ఘటనలను ఫొటోలు, వీడియోల రూపంలో గౌస్ ఆలం స్వయంగా వివరించనున్నారు. ఇకపై డిపార్ట్మెంట్లోకి కొత్తగా వచ్చే కానిస్టేబుల్ దగ్గర నుంచి డీఎస్పీల వరకు పీఎంజే దోపిడీ కేసును కేస్ స్టడీస్‌గా బోధించాలని పోలీస్‌శాఖ నిర్ణయించనుంది. -
8 మంది టీచర్లు.. 9 మంది విద్యార్థులు
వీణవంక (హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్కుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు లేక వెలవెలబోతోంది. హెచ్ఎంతో పాటు 8 మంది ఉపాధ్యాయులుండగా ఒకరు డిప్యుటేషన్‌పై ఇతర స్కూల్‌కు వెళ్లారు. దీంతో హెచ్ఎంతో కలిపి ఏడుగురు ఉపాధ్యాయులుండగా.. విద్యార్థులు తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. 6వ తరగతిలో ఇద్దరు, ఏడులో ఒకరు, ఎనిమిదిలో ఇద్దరు, తొమ్మిదిలో ఒకరు, పదిలో ముగ్గురు విద్యార్థులున్నారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ బోర్డుతో పాటు అన్నీ మౌలిక వసతులున్నా విద్యార్థుల్లేరు. రెండేళ్లుగా విద్యార్థులు సరిపడా లేకున్నా ఉపాధ్యాయులు మాత్రం కొలువు తీయడంపై విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు ఉత్తమ పాఠశాలగా గుర్తింపు పొంది ఇప్పుడు విద్యార్థుల్లేని దుస్థితి నెలకొంది. పాఠశాలకు ఆనుకొని కూత వేటు దూరంలో మోడల్ స్కూల్ ఉంది. ఈ పాఠశాలను అందులో కలపాలని అధికారులు చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై హెచ్ఎం శ్రీనివాస్‌ను వివరణ కోరగా వేసవి సెలవుల్లో ఇంటింటికీ తిరిగాము కానీ విద్యార్థులు రాలేదని చెప్పుకొచ్చారు. అలాగే ఎంఈవో శోభారాణిని వివరణ కోరగా గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో మోడల్ స్కూల్ ఉందని, దీంతో విద్యార్థులు ఆ స్కూల్‌కే వెళ్తున్నారని అందుకే సంఖ్య తగ్గిందని తెలిపారు. -
ఆడుతూ.. పాడుతూ
మానకొండూర్: చిన్నారుల పాదాలు సర్కారు బడి వైపు బుడిబుడి అడుగులు వేస్తున్నాయి. పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. ప్రభుత్వ వినూత్న ఆలోచనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ బడుల బలోపేతమే ధ్యేయంగా తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో ప్రీ ప్రైమరీ ప్రవేశాలు జోరందుకున్నాయి. జూలై 2వరకు 974మంది అడ్మిషన్లు తీసుకోగా.. జూలై 9 నాటికి ఆ సంఖ్య 1,160కు చేరింది. 14 నాటికి మరో 70 మంది నూతనంగా ప్రవేశాలు తీసుకున్నారు. రెండు వారాల వ్యవధిలో 256 మంది కొత్తగా జాయిన్ అయ్యారు. విద్యాశాఖ చేపట్టిన ప్రత్యేక నమోదు కార్యక్రమాలు, గ్రామస్థాయిలో ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు కల్పిస్తున్న అవగాహనతో ప్రీపైమరీ తరగతి గదులు కళకళలాడుతున్నాయి.ప్రభుత్వ బడుల బలోపేతమే ధ్యేయంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ధ్యేయంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను మండలాల వారీగా ఎంపిక చేసింది. ఆయా పాఠశాలలకు ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను నియమించారు. స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు బోధిస్తుండగా తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 83 ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఎంపిక చేయగా రామడుగు, గంగాధర, చిగురుమామిడి, హుజూరాబాద్, జమ్మికుంట, తిమ్మాపూర్, కొత్తపల్లి, శంకరపట్నం, మానకొండూర్, సైదాపూర్ మండలాల్లోని ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఒక్కో తరగతి గది 20 నుంచి 34 మంది వరకు చిన్నారులతో కళకళలాడుతున్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం రాబోతుంది. గతంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మాధ్యమం లేక పోవడంతో పిల్లలు ప్రైవేటు బాట పట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రీప్రైమరీ తరగతులు ఏరా్పాటు చేస్తోంది. జిల్లాలో 83 బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నాం. వీటి అభివృద్ధికి రూ.లక్ష వరకు నిధులు వెచ్చిస్తాం. గదులను అందంగా తీర్చుదిద్దుతాం. – ప్రశాంత్‌రెడ్డి, డీఈవో -
ప్రతీ విద్యార్థి ‘నవోదయ’ రాసేలా చూడండి
కరీంనగర్ టౌన్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం కల్పించే జేఎన్వీఎస్టీ–2027 పరీక్షకు జిల్లాలోని అర్హత కలిగిన ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసేలా దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే ఆదేశించారు. చొప్పదండి నవోదయలో 2027 –28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై మంగళవారం జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న సుమారు 11వేల మంది విద్యార్థులు ఉన్నారని, అందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. డీఈవో ప్రశాంత్‌రెడ్డి, జెడ్పీ సీఈవో పవన్ కుమార్, డీపీవో జగదీశ్వర్, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అయాజ్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపల్ కమిషనర్లు కిషన్, మల్లికార్జున్, నాగరాజు, చొప్పదండి నవోదయ ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. హుజూరాబాద్: మధ్యాహ్న భోజన సిబ్బంది వంటగదులను పరిశుభ్రంగా ఉంచి, విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని డీఈవో నరెడ్ల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. గంగిశెట్టి మధురమ్మ ట్రస్ట్ చైర్మన్ జగదీశ్వర్ ఆధ్వర్యంలో మండలంలోని 120మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు, సహాయకులకు మంగళవారం పట్టణంలో చీరలు పంపిణీ చేశారు. సిబ్బందికి బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంఈవో విడపు శ్రీనివాస్, అకడమిక్ మానిటరింగ్ అధికారి కర్ర అశోక్ రెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎంలు దేవారం మేరి శోభారాణి, అనురాధ, శ్రీభవాని పాల్గొన్నారు. కరీంనగర్: వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధుల (వీపీడీ) పర్యవేక్షణలో ప్రతి వైద్యాధికారి, సూపర్వైజర్, ఫీల్డ్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంహెచ్‌వో శ్రీరామ్ సూచించారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ‘వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధుల సర్వైలెన్స్– అవసరం అమలు’ అనే అంశంపై నిర్వహించిన ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. శ్రీరామ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అనుమానిత కేసులను వెంటనే నివేదించి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో రాజగోపాల్రావు, వైద్యులు మహమ్మద్ షుజాయత్, మనోహర్, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ సిటీ: విద్యార్థులు ట్యాలీలో నూతన అకౌంటింగ్ సాంకేతికతను నేర్చుకోవాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ సూచించారు. ఎస్‌యూ వాణిజ్యశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కోసం చేపట్టిన ‘అకడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్–100 రోజుల కార్యాచరణ’లో భాగంగా ‘‘కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ యూజింగ్ ట్యాలీ ఈఆర్పీ 9ఏ స్కిల్ డెవలప్మెంట్ వర్క్‌షాప్’ అనే మూడు రోజుల శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. విద్యార్థులకు ట్యాలీ ఈఆర్పీ 9లో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ నిర్వహణ, వౌచర్ ఎంట్రీ, జీఎస్టీ అకౌంటింగ్, ఇన్వెంటరీ, పేరోల్, బ్యాంకింగ్, ఆర్థిక నివేదికలు, డేటా భద్రతపై శిక్షణ ఇవ్వనున్నారు. వీసీ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ నూతన అకౌంటింగ్ సాంకేతికతలను నేర్చుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ పి.సతీశ్‌కుమార్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ ఎన్.వి. శ్రీరంగప్రసాద్ పాల్గొన్నారు. -
అంధత్వాన్ని జయించిన ఆత్మవిశ్వాసం
వేములవాడరూరల్: ఆయనకు చూపు లేదు. పట్టుదల.. కఠోరదీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు వేములవాడరూరల్ ఎంపీడీవో కవికోట శ్రీనివాస్. అంధుడు కావడంతో బ్రెయిలీ లిపిలో విద్యాభ్యాసం చేశారు. పట్టుదలతో చదివి గ్రూప్–4 జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం వేములవాడరూరల్ ఎంపీడీవోగా విధులు నిర్వరిస్తున్నారు. ఆయన జీవితం.. ఉద్యోగ విధులపై ప్రత్యేక కథనం. అంధుల స్కూల్లో విద్యాభ్యాసం కరీంనగర్ పట్టణానికి చెందిన కవికోట నర్సింహాచారి–భాగ్యలక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు. శ్రీనివాస్ తండ్రి వెటర్నరీ లైవ్‌స్టాక్ అసిస్టెంట్‌గా పని చేయగా తల్లి గృహిణి. పెద్దకొడుకు శ్రీనివాస్ కరీంనగర్‌లోని అంధుల ఆశ్రమ పాఠశాలలో బ్రెయిలీ లిపీలో 10వ తరగతి పూర్తి చేశాడు. ఇంటర్ కరీంనగర్లో పూర్తి చేసిన ఆయన అంధుడు కావడంతో అధ్యాపకులు చెప్పిన పాఠాలను ఆ రోజుల్లో టేప్‌రికార్డుల్లో నమోదు చేసి చెల్లెలు ధనలక్ష్మి సహకారంతో నోట్స్ రాసుకునేవారు. 1997లో ప్రభుత్వ శారీరక వికలాంగులకు గ్రూప్–4 పరీక్ష నిర్వహించగా ఉత్తీర్ణత సాధించాడు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోగా.. 1997 డిసెంబర్ 30న ఉద్యోగం కరీంనగర్ జిల్లా పరిధిలోని మహదేవ్పూర్ మండలం సూరారం జెడ్పీ హైస్కూల్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. కొద్దిరోజుల తరువాత సిద్దిపేట జిల్లాకు చెందిన కళావతితో వివాహమైంది. వీరికి కుమారుడు మణిదీప్, కూతురు శివదీపిక ఉన్నారు. అనంతరం కరీంనగర్ పరిధిలోని బోయినపల్లి, తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ జెడ్పీహెచ్ఎస్లో పనిచేశారు. అదే సమయంలో అంధ ఉద్యోగుల సంఘం ఎంప్లాయీస్ యూనియన్‌గా తన సేవలను అందించారు. 2013లో సీనియర్ సహాయకుడిగా పదోన్నతిపై కాల్వశ్రీరాంపూర్ ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. 2017లో సూపరింటెండెంట్‌గా మంథని ఎంపీడీవో కార్యాలయానికి పదోన్నతిపై వెళ్లారు. 2019 డిసెంబర్ 4న సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండల ప్రజాపరిషత్‌లో పదోన్నతిపై ఎంపీడీవోగా చేరారు. 2020లో అక్కడి నుంచి ముత్తారం ఎంపీడీవోగా బదిలీపై వెళ్లారు. 2024 ఫిబ్రవరి 12న వేములవాడరూరల్ ఎంపీడీవో కార్యాలయానికి బదిలీపై వచ్చి ప్రస్తుతం కొనసాగుతున్నారు. రెండేళ్లుగా ఇక్కడ 17 గ్రామాలకు ఎంపీడీవోగా కొనసాగుతూ ప్రతిరోజు విధుల్లో భాగంగా రోజుకు రెండు నుంచి మూడు గ్రామాలు తోటి ఉద్యోగుల సహాయంతో వెళ్తుంటారు. ప్రతీ గ్రామంలో జరిగే సమావేశాలకు, అభివృద్ధి పనులకు వెళ్లి పనుల పర్యవేక్షణ, ప్రజలకు పలు సూచనలు అందిస్తారు. విధి నిర్వహణలో సాంకేతికత చూపు లేకపోయినా ఇబ్బంది పడకుండా తనకున్న సాంకేతికతతో అన్ని పనులను పర్యవేక్షిస్తారు. మొబైల్ఫోన్లో ఉంటే టాక్ బ్యాక్ అనే అప్లికేషన్ ఆధారంగా సెల్‌ఫోన్‌లోని ఫైల్స్, ఫోన్‌బుక్‌లోని పేర్లు చదవడానికి వాడుకుంటారు. తెలంగాణ అంధుల అధ్యక్షుడిగా.. తెలంగాణ అంధుల అధ్యక్షుడిగా తోటి అంధులకు ధైర్యం కల్పిస్తూ ఎన్నో విషయాలు చెబుతుంటారు. ఆ సంఘానికి రెండు దఫాలు వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం తెలంగాణ అంధుల అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అంధులకు చేరేలా ఎన్నో విషయాలు వారికి చెబుతూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు.. పనుల పరిశీలన చూపు లేదు.. మనోనేత్రంతో చూస్తాడు కళ్లు లేకున్నా క్షేత్రస్థాయి పర్యటనలు వేములవాడ రూరల్ ఎంపీడీవో శ్రీనివాస్ జీవనశైలిఎంపీడీవోగా విధులు ని ర్వహిస్తూ గ్రామాలు పర్యటిస్తున్న సందర్భంలో చాలా మంది నిరుపేదలు కుటుంబ పరిస్థితులు నాకు వివరిస్తారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు నిరుపేదలకు చేరడమే నా లక్ష్యం. అప్పుడే నాకు నిజమైన సంతృప్తినిస్తుంది. ఉద్యోగంలో ఏ రోజు కూడా అంధుడని బాధపడలేదని, ఎక్కడ విధులు నిర్వహించినా అధికారులు, తోటి ఉద్యోగులు తనకు తోడుగా నిలిచి ఎంతో తోడ్పాటు అందిచారు. – కవికోట శ్రీనివాస్, ఎంపీడీవో, వేములవాడరూరల్ -
మండలాల వారీగా ఇప్పటివరకు నమోదైన వర్షపాతం(మి.మీలలో)
సైదాపూర్ 62.5 తిమ్మాపూర్ 81.3 మానకొండూరు 88.0 జమ్మికుంట 86.3 హుజూరాబాద్ 90.1 వీణవంక 85.4 శంకరపట్నం 81.1 చొప్పదండి 61.6 చిగురుమామిడి 73.2 కరీంనగర్ అర్బన్ 83.7 కొత్తపల్లి 84.1 కరీంనగర్ రూరల్ 89.6 గన్నేరువరం 80.2 ఇల్లందకుంట 87.3 గంగాధర 71.5 రామడుగు 69.9 -
హ్యాండ్‌వాష్ మరిచినట్లేనా?
మంథనిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో అపరిశుభ్రత నెలకొంటే వ్యాధులు ప్రబలుతాయని ముందస్తు చర్యలు చేపట్టేవారు. ఇందుకోసం గతంలో మధ్యాహ్న భోజన సమయంలో హ్యాండ్‌వాష్ చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకునేవారు. దీనికోసం ప్రతీపాఠశాలలో ప్లాట్‌ఫామ్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అనేక పాఠశాలల్లో హ్యాండ్‌వాష్ ప్లాట్‌ఫామ్స్ కానరాకపోగా నల్లాలు నిరుపయోగంగా మారాయి. నిరుపయోగంగా ప్లాట్‌ఫామ్‌లు పెద్దపల్లి జిల్లాలోని అనేక పాఠశాలల్లో విద్యార్థులు పరిశుభ్రత పాటించేలా హ్యాండ్‌వాష్ ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేసి నల్లాలు అమర్చారు. గతేడాది వసతుల కల్పనపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పిల్లలు చేతులు శుభ్రం చేసుకునేలా నల్లాలను ఏర్పాటు చేసింది. నిర్వహణ లోపంతో చెత్త, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. చేతులు శుభ్రం చేసుకునేలా.. విద్యార్థులకు శుభ్రతపై అవగాహన కల్పించేలా గత ప్రభుత్వం పాఠశాలల్లో హ్యాండ్‌వాష్ ప్రవేశపెట్టింది. మధ్యాహ్న భోజన సమయంలో ప్రతీవిద్యార్థి చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. హ్యాండ్‌వాష్ నల్లాలు లేని పాఠశాలల్లో బకెట్లలో నీళ్లు పెట్టి చేతులు శుభ్రం చేయించేవారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతపై కూడా అవగాహన కల్పించేవారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా అనేక పాఠశాలల్లో హ్యాండ్‌వాష్ కానరావడం లేదు. విద్యార్థుల ఆరోగ్యంపై.. సీజనల్ వ్యాధులు ప్రబలే వర్షాకాలంలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ చూ పించాల్సి ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు భోజనం చేసే ముందు చేతులు శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలి. అలాగే వ్యాధులబారిన ప డుకుండా ముందస్తు జాగ్రత్తల గురించి వివరించా ల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నా ఇప్పటివరకు విద్యార్థుల పరిశుభ్రతపై ఎవరూ శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. మధ్యాహ్న భోజన సమయంలో చేతులు శుభ్రం చేసుకునేలా చూస్తున్నా. కొన్ని పాఠశాలల్లో ప్రత్యేకంగా చేతులు శుభ్రం చేసుకునేలా ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఎక్కడైనా ప్లాట్‌ఫామ్‌లు వినియోగంలో లేకపోతే ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. – దాసరి లక్ష్మి, మండల విద్యాధికారి, మంథని సర్కార్ బడుల్లో కానరాని పరిశుభ్రత నిరుపయోగంగా హ్యాండ్‌వాష్ ప్లాట్‌ఫామ్‌లు విద్యార్థుల ఆరోగ్యంపై అవగాహన కరువు శ్రద్ధ చూపాలంటున్న తల్లిదండ్రులు -
ఆత్మీయం.. అపూర్వం
జ్యోతినగర్: ఎన్టీపీసీ జెడ్పీహెచ్ఎస్ 1989–90 పదోతరగతి బ్యాచ్ విద్యార్థులు దాదాపు 36 ఏళ్లతర్వాత ఒకచోటుకు చేరుకుని జ్ఞాపకాలను పంచుకున్నారు. హెచ్ఎం జయరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా తమ పాఠశాల, గురువులను మరువకుండా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని హెచ్ఎం పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆటలు, పాటలు, సరదాలు, శిక్షలు అన్నీ గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి బెంచీలు, టీచర్ల మాటలు, లంచ్ బాక్స్‌లు ఇప్పటికీ కళ్ల ముందు కదులుతున్నాయని అని ఒకసారి గుర్తుచేసుకున్నారు. సామాజిక సేవకు శ్రీకారం పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారంగా గడియారం బహూకరించారు. పదో తరగతిలో 500 మార్కులకుపైగా సాధించిన ఐదుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు (క్యాష్ అవార్డులు)అందజేశారు. కార్యక్రమంలో రాజ్‌కుమార్, రాంబాబు, సమ్మిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శ్రీధర్‌రావు, ప్రహ్లాద్‌రావు, శ్రీనివాసు, లలిత కుమారి, అనుపమ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత అందరం ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉంది. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని స్నేహితులతో సంతోషంగా గడిపాం. – మేరుగు సరస్వతి, వెంకట్రావుపేట, మంచిర్యాల జిల్లా 36 ఏళ్ల తర్వాత కలిసిన ఆత్మీయులు ఆకట్టుకున్న ఎన్టీపీసీ జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం -
సుల్తానాబాద్ పెగ్ గోదాం ముట్టడి
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని పెగ్ గోదామును రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు మంగళవారం ముట్టడించారు. ఉమ్మడి జిల్లాలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల ధాన్యాన్ని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని పెగ్ గోదాము, సుగ్లాంపల్లి, సుద్దాల–,1, 2, కాట్నపల్లి, పెద్దపల్లి, రాఘవాపూర్, పెద్దకలువలకు తరలించి పెద్దపల్లి మిల్లర్లు ధాన్యం నిల్వ చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని అన్నారు. వింగ్స్ ఆక్షన్ ఆప్షన్ పేరిట సొంత జిల్లా మిల్లర్లకు అవకాశం లేకుండా పోతోందని అన్నారు. పెద్దపల్లి జిల్లా కోటాస్థలాన్ని కూడా ఇతర జిల్లాల వారు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. దీంతో బియ్యం ఉత్పతిలో ఆలస్యం అవుతోందని తెలిపారు. కరీంనగర్లో నగునూరు, కొత్తపల్లితోపాటు నాలుగైదు పెగ్ గోదాములు ఉన్నా పెద్దపల్లి జిల్లాకు తరలించడం సరికాదన్నారు. జిల్లాలో 140 రైసుమిల్లుల్లో 4 లక్షల టన్నుల ధాన్యం లుందని, ఇతర జిల్లాలకు చెందిన మరో 40 వేల టన్నుల ధాన్యం వచ్చిందని తెలిపారు. సీఎంఆర్ తర్వాత బియ్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో తెలియడం లేదని, ద్వారా మిల్లింగ్ ఆలస్యమై, తర్వాత తాము డీఫాల్టర్లుగా మారుతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల బియ్యం సుల్తానాబాద్‌కు రాకుండా కట్టడి చేయాలని సివిల్ సప్లయ్ అధికారులను డిమాండ్ చేశారు. సమస్యను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, అయినా ఇతర జిల్లాల నుంచి వస్తూనే ఉందని అన్నారు. అనంతరం ఎఫ్‌సీఐ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి తిరుపతిరెడ్డి, నగునూరి అశోక్ కుమార్, చీటీ కేశవరావు, ఎడవెల్లి విజయ్‌పాల్‌రెడ్డి, ప్రసాద్, సముద్రాల ధర్మేందర్, పల్ల వాసు, రాజన్నప్రసాద్, వెంగల్రావు, అల్లంకి శ్రీనివాస్, మల్లారెడ్డి, దుగ్యాల సంతోష్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సాగర్‌రావు, మారుతి పాల్గొన్నారు. ఒక్కటైన రైస్ మిల్లర్లు గతంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాలుగు గ్రూ పులుగా విడిపోయి ఎవరికి వారే అధికారులను కలిసి తమకు కోటా కేటాయించాలని విన్నవించేవారు. గోదాములు ఖాళీ లేక సమస్య జటిలం కావడంతో కొందరు గ్రూపుల మధ్య కుదుర్చారు. సమస్య తలెత్తినప్పుడు ఒక్కతాటిపైకి రావడంతో పలు సమస్యలు పరిష్కరించుకోవచ్చని భావిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మిల్లర్లకే కేటాయించాలి రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నాయకుల డిమాండ్ -
తల ఉండే మాట్లాడుతున్నారా?
కరీంనగర్‌కార్పొరేషన్: ‘నీకు నువ్వే అపరమేధావి అనుకుంటున్నవ్. కరువును రాజకీయానికి వాడుకొంటున్నవ్. కాళేశ్వరం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నెకరాలకు నీళ్లిచ్చారో చెప్పు’? అంటూ ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై మండిపడ్డారు. మంగళవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతాంగానికి ఒరిగిందేమిటని ప్రశ్నించారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని ఎకరాలకు కాళేశ్వరం నీళ్లిచ్చారో అప్పటి బీఆర్ఎస్ మంత్రులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి రైతుల పొట్టలు కొట్టి మెదక్ జిల్లాకు నీళ్లుతీసుకెళ్లారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులతోనే ఉమ్మడి జిల్లా రైతాంగానికి నీళ్లు అందుతున్నాయన్నారు. ఎస్సారెస్పీ ఆయకట్టు 8 లక్షల ఎకరాలని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో అంతకుమించి ఒక్క ఎకరం కూడా ఆయకట్టు పెరగలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయనిగా ఉందన్నారు. మేడిగడ్డ కుంగిందని, అన్నారం, సుందిళ్లలో బుంగలు పడ్డాయన్నా రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారంరోజుల్లో రిపోర్ట్ ఇస్తుందని, ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వర్షాభావంతో పంటమార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం అన్నదాతలను రెచ్చగొట్టే ప్రయత్నంచేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, సుడా మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు నర్సింగం, జగన్‌రెడ్డి, మల్లేశం ఉన్నారు. -
గ్రామాభివృద్ధిలో డీఆర్డీఏదే కీలకపాత్ర
● కలెక్టర్ చిత్రా మిశ్రా కరీంనగర్ అర్బన్: గ్రామీణాభివృద్ధి, పేద కు టుంబాల సంక్షేమం, మహిళల ఆర్థిక సాధికా రతకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస కీలక భూమిక పోషిస్తోందని కలెక్టర్ చిత్రామిశ్రా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో డీఆర్డీఏ అధికారులతో సమీక్షించారు. పెన్షన్లు, వీబీజీ రామ్ జీ ఉపాధి హామీ పథకం పనులు, ప్లాంటేషన్, స్వచ్ఛ భారత్ మిషన్, బ్యాంకు లింకేజీ, పెన్షన్ల మ్యాపింగ్, హెచ్ఆర్ విభాగం పనితీరు, శ్రీనిధి కార్యకలాపాలు, మహిళా సంఘాల బలోపేతం అంశాలపై అధికారుల కు సూచనలు చేశారు. గ్రామాల సమగ్రాభివృద్ధిలో డీఆర్డీఏ పాత్ర ఎంతో కీలకమని, పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే సంస్థ ప్రధాన ధ్యేయంగా ఉండాలన్నారు. ప్రతి అధికారి కర్తవ్యనిష్టతో పనిచేస్తూ కార్యాలయాన్ని ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దాలని సూచించారు. ఏ అంశంలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకుండా ముందుకు సాగాలని ఆదేశించారు. స్వశక్తి మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మహిళల ఆర్థిక అభ్యున్నతికి బ్యాంకు లింకేజీలు, ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బీవీజీ రామ్ జీ పనులను గ్రామాల అభివృద్ధిలో భాగంగా పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ గీత పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాలను ఢీకొన్న కారు
● ఇద్దరికి స్వల్ప గాయాలు ● నిలిచిన విద్యుత్ సరఫరా జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి శివారు.. జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. రోడ్డు కిందివైపు ఉన్న రెండు విద్యుత్ స్తంభాలను ఢీకొని చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. జగిత్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు పని నిమిత్తం కారులో కోరుట్లకు వెళ్తుండగా.. అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రెండు స్తంభాలు విరగడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతు చేపట్టి విద్యుత్ సరఫరా పునరద్ధరించారు. -
సర్ విధుల్లో స్టాఫ్!
కరీంనగర్ కార్పొరేషన్: గడువు సమీపిస్తుండడంతో నగరంలో ఎస్ఐఆర్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. నిర్ణీత గడువు 24వ తేదీకి మరో తొమ్మిదిరోజులే మిగిలి ఉండగా, ఆ లోగా వందశాతం ప్రక్రియను పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో నగరపాలకసంస్థ స్టాఫ్ సర్ ప్రక్రియలో తిరుగుతుండగా, రెగ్యులర్ సేవల్లో జాప్యంతో బల్దియాకు వచ్చిన ప్రజలు నిరాశగా వెనుదిరుగుతున్నారు. సర్‌లోనే అంతా ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ నగరంలో మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు ఆన్లైన్ నమోదు 30శాతం కూడా దాటడం లేదు. గడువు పొడిగింపు ఉండదు, నిర్ణీత గడువులోగా వందశాతం పూర్తిచేయాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నగరంలో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంచేసేందుకు బల్దియా స్టాఫ్‌ను పూర్తిగా క్షేత్రస్థాయికి పంపించారు. ఎస్ఐఆర్ సూపర్వైజర్లుగా నగరపాలకసంస్థ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, వార్డు అధికారులు, మానిటరింగ్ అధికారులుగా ఇంజినీరింగ్, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ అధికారులు, బీఎల్వోలకు సపోర్టింగ్ స్టాఫ్‌గా కంప్యూటర్ ఆపరేటర్లు, శానిటేషన్ జవాన్లు, శానిటేషన్ కార్మికుల సేవలనూ వినియోగించుకొంటున్నారు. ఓటర్లకు ఇచ్చిన ఫారాలను పూరించారా, తిరిగి ఇచ్చారా అనేది శానిటేషన్ కార్మికులు, జవాన్లు ఇంటింటికి తిరిగి ఆరా తీస్తున్నారు. -
సాగుడెట్లా..?
గత జూన్‌లో కురిసిన వర్షం: 13రోజులు నమోదైన వర్షపాతం: 162.6మిల్లిమీటర్లు గత జూలైలో (13వరకు) కురిసిన వర్షం:8రోజులు నమోదైన వర్షపాతం: 172.8మి.మీలు నెల పడిన వర్షం పడాల్సినది వర్షపాతం జూన్ 84.3 124.3 లోటు వర్షం జూలై (ఇప్పటివరకు) 72.7 237.7 లోటువర్షంకరీంనగర్ అర్బన్: ఎల్‌నినో ప్రభావం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. సకాలంలో కురవాల్సిన వర్షాలు ముఖం చాటేయడంతో సాగు నేలలోని మొక్కలు వాడిపోతున్నాయి. ఈ నెలలో 13రోజులు గడువగా ఇప్పటికి 3 రోజులు వర్షం పడటం.. అంతంతమాత్రమే కావడం సాగు రంగాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. గతంలో అతివృష్టితో సాగురంగం కుదేలవగా తాజాగా డ్రైస్పెల్(ఎక్కువ రోజులు వర్ష విరామం)తో అన్నదాతను ఆందోళనలో పడేస్తోంది. మెట్ట ప్రాంతాల్లో ఘోరం మెట్ట ప్రాంతాలైనా గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాలు కరవులో అతలాకుతలమవుతున్నాయి. గతంలో కరవు మండలాలుగా ప్రకటించిన దాఖలాలుండగా ఈ మూడు మండలాలు సదరు జాబితాలో ఉండేవి. ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ పనులతో పాటు చెట్లను వృద్ధి చేయడం వంటి వాటితో పరిస్థితి మారిపోగా ఎల్‌నినోతో మళ్లీ మొదటికొచ్చింది. అత్యల్ప వర్షపాతం నమోదవుతోంది. ఇప్పటివరకు నమోదైన వర్షపాతాన్ని గమనిస్తే అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే. మొత్తంగా జిల్లా సగటున లోటు వర్షపాతమే నమోదైందని గణాంక శాఖ స్పష్టం చేస్తోంది. ముంచుకొస్తున్న విత్తన గడువు ఆశించిన వర్షపాతం లేకపోవడంతో పంటలు సాగు చేసేందుకు రైతులు అచితూచి వ్యవహరిస్తున్నారు. కాలువలు పారకపోగా వాగుల్లోనే జల కళ లేదు. ప్రాజెక్టులు అడుగంటగా.. ఎల్ఎండీ డెడ్ స్టోరేజీకి చేరింది. ఈ క్రమంలో విత్తన గడువు ముంచుకొస్తుండగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ‘సాగు’డన్నది అంతుచిక్కడం లేదు. ఈ నెల 15వరకు పత్తి సాగు చేసుకోవచ్చు. ఆ తరువాత విత్తుకుంటే దిగుబడిపై ప్రభావం పడుతుంది. కంది, మినుము, పెసర పంటలను జులై 15వ తేదీ వరకు విత్తుకోవాలన్నది శాస్త్రవేత్తల మాట. కందిని పత్తి, మొక్కజొన్న పంటల్లో అంతర పంటగా సాగు చేయొచ్చు. ఇక వరికి సంబంధించి దీర్ఘకాలిక రకాలను జూన్ 20వరకు, మధ్యకాలిక రకాలు జూలై 10వరకు నార్లు పోయాలి. జూలై 31వరకు స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకునేందుకు అనుకూలం. ఆగస్టు 15వరకు అన్ని రకాల వరి నాట్లు పూర్తి చేయాలి. నార్లు పోసుకున్నప్పటికి ప్రస్తుత పరిస్థితుల క్రమంలో నాట్లు వేసుకోవడం కష్టమే. బావులు, బోర్ల కింద నాట్లు వేస్తుండగా కాలువల కింద ఇంకా పొలాలను సిద్ధం చేయలేదు. ఇక మిరప పంటను జూలై 15వరకు నాటుకోవచ్చు. నారు పోసుకుని నాటుకోవచ్చు. నేరుగా సాలు పద్ధతిలో కూడా మిరప విత్తనాలను నాటవచ్చు. మొక్కజొన్న పంటను జూలై 15 వరకు సాగు చేసుకోవచ్చు. మొక్కజొన్నను ఏక పంటగా కాకుండా కందితో కలిపి అంతర పంటగా వేసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతుండగా వర్షలేమి వల్ల విత్తనం ఎలా మొలుస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పోరాడి ఓడిన సాయి తిరుమల్
పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం సాయితిరుమల్గౌడ్ మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. గతనెల 21న గ్రామశివారులో బైక్ అదుపుతప్పి కిందపడడంతో తలకు తీవ్రగాయమై కోమా లోకి వెళ్లాడు. తొలుత కరీంనగర్, ఆ తర్వాత హైద రాబాద్లోని కిమ్స్‌కు.. చివరకు గాంధీ ఆస్పత్రికి తరలించి దాదా పు 22రోజులపాటు చికిత్స అందించారు. అయినా, సాయి తిరుమల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోకగా విషమించి సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. పొన్నం శంకర్– రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, సాయి తిరుమల్ కు మారుడు. శంకర్ స్థానిక అల్ట్రాటెక్ సిమెంట్ కంపె నీలో లోడింగ్ విభాగంలో కార్మికుడిగా పనిచేస్తున్నా డు. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు అ కా ల మరణంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆపన్నహస్తం అందించినా దక్కని ప్రాణాలు సాయి తిరమల్గౌడ్ వైద్యచికిత్స కోసం దాదాపు రూ.20లక్షల వరకు ఖర్చు చేశారు. పేద కుటుంబం కావడంతో స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు సోషల్‌మీడియా ద్వారా దీనస్థితిని గురించి వివరిస్తూ వైద్యచికిత్సలకు సహకారం అందించాలని ప్రచారం నిర్వహించారు. ఈనేపథ్యంలో మానవతావాదులు, మిత్రులు, బంధువులు, గ్రామస్తులు, గౌడకులస్తులు తమకు తోచినంత విరాళాలు అందజేశారు. అందరూ కలిసి పెద్దఎత్తున ఆర్థికసాయం చేసినా.. సాయి తిరుమల్ ప్రాణాలు దక్కకపోవడంతో సాయం అందించిన వారందరూ తీవ్ర మనోవేదన చెందారు. 22 రోజులుగా ఆస్పత్రిలోనే.. ఆపన్నహస్తం అందించినా దక్కని ప్రాణాలు ఈసాలతక్కళ్లపల్లి గ్రామంలో విషాదం -
ఇసుక క్వారీ రద్దు చేయాలి
కొత్తపల్లి: కొత్తపల్లి మండలం ఖాజీపూర్ పరిధిలోని మానేరు వాగులో నిర్వహిస్తున్న ఇసుక క్వారీని రద్దు చేయాలని సర్పంచ్ కోమటిరెడ్డి అంజనీకుమార్ ఆధ్వర్యంలో క్వారీ వద్ద మూడు రోజులుగా గ్రామస్తులు ధర్నా చేపట్టారు. మంగళవారం మహిళలు, రైతులు అధిక సంఖ్యలో హాజరై నిరసన వ్యక్తం చేశారు. ఇసుకను తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని తెలిపారు. ఇసుక తరలింపు వల్ల గ్రామస్తుల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీని కొనసాగించడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. స్థానికుల ఆరోగ్యం, జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ క్వారీని రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
యూఐడీఎఫ్ పనులు షురూ
● నేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ సిటీలో యూఐడీఎఫ్ నిధులు రూ.50 కోట్లతో చేపట్టనున్న పనులకు మోక్షం లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం 62వ డివిజన్లో రూ. కోటితో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గతంలో యుఐడీఎఫ్ నిధులకు సంబంధించి టెండర్ ప్రక్రియ రద్దు కావడం, కొత్త పాలక వర్గం కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభించడం తెలిసిందే. 62 వ డివిజన్లోని మంకమ్మతోట శ్రీరాం బుక్ స్టాల్ నుంచి సీసీ రోడ్డు నిర్మాణం కానుండడంతో స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.డీఈవోగా చైతన్య జైనీకరీంనగర్టౌన్: జిల్లా విద్యాశాఖ అధికారిగా ఖమ్మం డీఈవో చైతన్య జైనీని నియమిస్తూ పా ఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కరీంనగర్లో పనిచేసిన చైతన్య జైనీ ఖమ్మం జిల్లాకు బదిలీపై వెళ్లారు. తాజాగా కరీంనగర్‌కు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు తీసుకున్న డీడీకరీంనగర్ టౌన్: జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ డిప్యూటీ డైరెక్టర్‌గా భాగ్యలక్ష్మి మంగళవారం రాత్రి బాధ్యతలు తీసుకున్నారు. ఈమేరకు ఆమె కలెక్టర్ చిత్రామిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. -
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు
● నాలుగు టిప్పర్లు సీజ్ ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని వివిధ ప్రాంతాల్లోంచి అధిక లోడ్‌తో మట్టి తరలిస్తున్న నాలుగు టిప్పర్లను ఎర్రగుంటపల్లి గ్రామ శివారులో మంగళవారం రవాణాశాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందంలోని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ హరిత యాదవ్, రియాజ్ పట్టుకున్నారు. ఓవర్ లోడ్‌తో రోడ్లపై వెళ్తున్న వాహనాల నియంత్రణ కోసం దాడులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే అధికలోడ్‌తో మట్టి తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పట్టుకుని కేసు నమోదు చేసి సీజ్ చేశామన్నారు. ఏఎంవీఐ హరిత యాదవ్ మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువుతో వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఫిట్‌నెస్‌పై పాఠశాలల యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. -
రండి ‘ఇన్స్పైర్’ చేద్దాం
● భవిష్యత్ శాస్త్రవేత్తలకు కేరాఫ్ ఇన్స్పైర్ మనక్ ● నేటినుంచి ఆన్లైన్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ● 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు సువర్ణావకాశం ● ప్రతీపాఠశాల నుంచి ఐదు వినూత్న ఆలోచనలకు నామినేషన్ ● సెప్టెంబర్ 15వరకు దరఖాస్తుల దాఖలుకు గడువుఆరు నుంచి పదో తరగతి వరకు అవకాశం ఇన్స్పైర్ మనక్ 2026–27లో భాగంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ స్వీయ ఆలోచనలతో రూపొందించిన సాంకేతిక ఆవిష్కరణలను సమర్పించవచ్చు. యంత్రాలు, పరికరాలు, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, విద్య, రవాణా, ఇంధన పొదుపు, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి ప్రజల దైనందిన జీవితానికి ఉపయోగపడే ఏ రంగానికై నా సంబంధించిన కొత్త ఆలోచనలను ఈ కార్యక్రమం ద్వారా నామినేట్ చేసుకునే అవకాశముంది. పాఠశాల నుంచి 5 ప్రదర్శనలు ప్రతి పాఠశాల నుంచి గరిష్టంగా ఐదు వినూత్న ఆలోచనలను ఎంపిక చేసి అధికారిక వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా సమర్పించవచ్చు. జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు నామినేషన్లు చేసుకునేందుకు వీలుంటుంది. ఎంపికై న ప్రతి విద్యార్థి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.10 వేలు ప్రోత్సాహక నగదును నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థులు తమ నమూనాలను అభివృద్ధి చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. జిల్లా సాయి నుంచి జపాన్ సకూర వరకు ఇన్స్పైర్ మనక్ ఎంపిక ప్రక్రియ పలు దశల్లో కొనసాగుతుంది. జిల్లాస్థాయిలో ఎంపికై న ప్రదర్శనల్లో 10 శాతం రాష్ట్రస్థాయికి, అక్కడి నుంచి మరో 10శాతం జాతీయస్థాయి ప్రదర్శనలకు ఎంపికవుతాయి. జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్–60 ఆవిష్కరణలకు రాష్ట్రపతితో ప్రత్యేక సమావేశంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఎంపికయ్యే టాప్–5 వినూత్న ఆవిష్కరణలను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జపాన్ సకురా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌కు పంపిస్తారు. ఎలాంటి ప్రదర్శనలు సమాజంలో లేదా దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు సాంకేతిక పరిష్కారం చూపే కొత్త ఆలోచనలై ఉండాలి. ఇంటర్నెట్ లేదా యూట్యూబ్ చూసి కాపీ కొట్టిన పాత మోడల్స్ కాకుండా, సొంతంగా ఆలోచించిన సరికొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 2025– 26లో ఇన్స్పైర్ ప్రదర్శనలు ఉమ్మడి జిల్లాలో 2025–26 సంవత్సరానికి గాను 360 ప్రదర్శనలు ఎంపికయ్యాయి. జగిత్యాల నుంచి 123, కరీంనగర్ నుంచి 112, రాజన్న సిరిసిల్ల 67, పెద్దపల్లిలో 60 నమూనలు ఎంపికయ్యాయి. త్వరలో ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రాంతంలో జిల్లాస్థాయిలో ఇన్స్పైర్ మనాక్ ప్రదర్శన పోటీలు జరుగనున్నాయి. సప్తగిరికాలనీ(కరీంనగర్): నేటి పోటీ ప్రపంచంలో పాఠ్యపుస్తకాల పరిజ్ఞానమే కాకుండా, సృజనాత్మక ఆలోచనలు, సమస్యలకు శాసీ్త్రయ పరిష్కారాలను కనుగొనే సామర్థ్యం విద్యార్థులకు ఎంతో అవసరం. అలాంటి ఆవిష్కరణాత్మక భావాలను వెలికితీసి, జాతీయస్థాయిలో గుర్తింపు కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనక్ 2026–27 కార్యక్రమానికి ఆన్లైన్లో నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. -
కన్న కూతురిపై లైంగికదాడి
జగిత్యాలక్రైం: కన్న కూతురుపైనే ఓ తండ్రి మ ద్యం మత్తులో లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జగిత్యాల రూ రల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై ఆమె తండ్రితోపాటు ఓ యువకుడు కూడా అత్యాచారానికి పాల్పడగా.. ఆమె గర్భందాల్చింది. గుట్టుచప్పుడు కాకుండా గర్భస్రావం చేయించారు. జరిగిన విషయం తల్లికి వివరించింది. దీంతో ఆమె మంగళవారం పోలీ సులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తండ్రితోపాటు, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. సభ్యసమాజం తలదించుకునేలా తండ్రే కన్న కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మెట్పల్లి: పట్టణంలోని టీ చర్స్ కాలనీలో మంగళవా రం అబూసోఫియాన్ (4 పై కుక్క దాడి చేసింది. పా ఠశాల నుంచి వచ్చిన తరువాత ఇంటి ముందు ఆడుకుంటున్న అబూపై కుక్క దాడి చేసింది. ఈ సంఘటనలో చేతికి గాయమైంది. ఇదే కాలనీలో సోమవారం కూడా ఇద్ద రు చిన్నారులు, ఓ వృద్ధుడిపై దాడి చేశాయి. కుక్కల బెడద తీవ్రంగా ఉందని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ● పంచాయితీ పెద్దమనిషి హత్య కొడిమ్యాల: వ్యవసాయ భూమి గట్టు వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకా రం.. డబ్బుతిమ్మయ్యపల్లి కి చెందిన గాజుల రాజనర్సయ్య, గాజుల రాజయ్య మధ్య కొద్దిరోజులుగా వ్యవసాయ భూమి వి వాదం కొనసాగుతోంది. వివాదానికి సంబంధించిన పంచాయితీలో గాజుల రాజయ్య తరఫున కాంపెల్లి హనుమయ్య పెద్దమనిషిగా వ్య వహరిస్తున్నాడు. తనకు వ్యతిరేకంగా నిలిచాడ నే ఆగ్రహంతో రాజనర్సయ్య హనుమయ్యపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం మరోసారి పంచాయితీ జరగగా.. భూమి గట్టు అంశంపై హనుమయ్య మాట్లాడిన తీరుతో రాజనర్స య్య ఆగ్రహానికి గురయ్యాడు. సాయంత్రం హనుమయ్య ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై డెయిరీలో పాలు పొసేందుకు వెళ్తున్నండగా అడ్డగించి గొడవకు దిగాడు. వెంటతెచ్చుకున్న కర్రతో హనుమయ్య తలపై బలంగా కొట్టాడు. రక్తస్రా వం కా వడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. జగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలం పోతా రానికి చెందిన దువ్వాక రజిత మంగళవారం ఉదయం తన హోటల్లో ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి అంబార్ అడిగాడు. ఆమె ఇవ్వబోతుండగా.. కారంపొడి చల్లి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును కత్తెరతో కట్ చేసేందుకు యత్నించాడు. రజిత తీవ్రంగా ప్రతిఘటించడంతోపాటు, గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గీత తెలిపారు. -
చంపేసి.. బావిలో పడేసి..
హుజూరాబాద్: హుజూరాబాద్‌లోని మామిండ్లవాడకు చెందిన చింత సునీత(35) అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. సహజీవనం చేసిన వ్యక్తే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి, సోమవారం హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి వివరాలు వెల్లడించారు. హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింత సునీత భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి హుజూరా బాద్ పట్టణంలోని మామిండ్లవాడలో నివాసం ఉంటోంది. కొన్నేళ్లుగా జమ్మికుంటరోడ్డులోని మోతె కిరణ్‌తో సహజీవనం చేస్తోంది. సునీత పక్కింట్లో ఉండే ముతోజు భాగ్యతో స్నేహంగా ఉంతోంది. తరచూ వీరిద్దరూ కలిసి తిరుగుతుండటంతో సునీత వ్యభిచారం చేస్తోందని కిరణ్ అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. ఈ నెల 10న కిరణ్, సునీత కలిసి మద్యం తాగారు. మళ్లీ గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన కిరణ్ సునీత గొంతు నులిమాడు. చీరతో గొంతు బిగించాడు. కాలితో మెడపై తొక్కి హత్య చేశాడు. మృతదేహాన్ని ముతోజు భాగ్య ఇంటి సమీపంలోని బావిలో పడేశాడు. అక్కడి నుంచి కరీంనగర్ పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 13న హుజూరాబాద్‌కు వచ్చాడనే సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించాడు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, రిమాండ్ చేశారని ఏసీపీ వెల్లడించారు. సహజీవనమే ప్రాణం తీసింది వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ వివరాలు వెల్లడించిన ఏసీపీ మాధవి -
సార్వత్రిక విద్య వరం
కరీంనగర్‌టౌన్: కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రెగ్యులర్‌గా బడికి వెళ్లి చదువుకోనివారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సిస్టమ్(టాస్) అండగా నిలుస్తోంది. బడికి వెళ్లకుండానే వారి పని, వృత్తులు చేసుకుంటూ నేరుగా 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తోంది. 14 ఏళ్లు దాటినవారు టెన్త్, 15 ఏళ్లు దాటి 10వ తరగతి పాసైన వారు ఇంటర్ పరీక్షలకు హాజరుకావచ్చు. కారుణ్య నియమాకాలు, ఉద్యోగాల్లో పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి సార్వత్రిక విద్య ఓ వరం. 2008–09లో ప్రారంభం సార్వత్రిక విద్యను ప్రభుత్వం 2008–09లో ప్రవేశపెట్టింది. మొదట్లో చదువు మధ్యలో మానేసిన వారికి పదో తరగతి చదివేందుకు అవకాశం ఉండేది. 2010–11 నుంచి ఇంటర్ విద్యకు అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్ కోసం 72 సెంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు www. telagana openschool.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవ చ్చు. ఇందులో పాసయినవారికి సార్వత్రిక విద్యాపీఠం వారు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఇవి సాధారణ విద్యార్థులకిచ్చే సర్టిఫికెట్ల మాదిరిగానే పనిచేస్తాయి. ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలి. అపరాద రుసుంతో ఆగస్టు 28 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పదో తరగతిలో ప్రవేశానికి.. సార్వత్రిక విద్యను అభ్యసించేందుకు 14 ఏళ్ల నుంచి 50 ఏళ్లు ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు. పదో తరగతి చదవాలనుకున్న వారికి ఎలాంటి విద్యార్హత లేకున్నా ప్రవేశం పొందవచ్చు. వయసు నిర్ధారణకు తహసీల్దార్ లేదా మున్సిపాలిటీ అధికారులు జారీ చేసిన ధ్రువపత్రాలు ఉండాలి. గతంలో ప్రాథమిక పాఠశాలలో చేరిన వారు మధ్యలో బడి మానేస్తే అప్పటి బదిలీపత్రం, టీసీ, స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, రెండు ఫొటోలతో ప్రవేశం పొందవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ వారికి టెన్త్‌కు రూ.150, అడ్మిషన్ ఫీజు 5 సబ్జెక్టులకు రూ.1,400, ప్రతి అదనపు సబ్జెక్టుకు రూ.200 చెల్లించాలి. రిజర్వ్డ్ కేటగిరివారికి అడ్మిషన్ ఫీజు రూ.1,000 ఉంటుంది. ఇంటర్లో చేరాలంటే.. ఇంటర్ అడ్మిషన్‌కు 15 ఏళ్లు ఉండి పదో తరగతి పాసయినవారు అర్హులు. పదో తరగతి ఒరిజినల్ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, రెండు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. సైన్స్ గ్రూపులు సైతం అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌కు జనరల్ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300, అడ్మిషన్ ఫీజు రూ.1,500, ప్రతి అదనపు సబ్జెక్టుకు రూ.300, రిజర్వ్డ్ కేటగిరి వారు అడ్మిషన్ ఫీజు రూ.1,200 చెల్లించాలి. స్టడీ సెంటర్లలో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీసేవ ఆన్లైన్ రశీదు జత చేసి ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ పరిశీలనకు నిర్ణీత సమయంలో పంపించాలి. దూరవిద్యలో పది, ఇంటర్ చదివేందుకు అవకాశం బడికి వెళ్లలేని వారికి సువర్ణావకాశం ప్రారంభమైన అడ్మిషన్లు ఈ నెల 28 వరకు దరఖాస్తుకు గడువు -
మల్లన్న సన్నిధిలో అగ్నిగుండాలు
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో సోమవారం వేకువజామున అగ్నిగుండాల మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు భక్తులు పెద్దపట్నం ఉత్సవాలు తిలకించి జాగరణలో పాల్గొన్నారు. భక్తులు అగ్నిగుండాల నిప్పుకణికల్లో శరణు శరణు అంటూ నడిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈవో సదయ్య, ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య ఏర్పాట్లు చేశారు. టికెట్ తీసుకున్నా అగ్నిగుండాలు దాటనీయరా? టికెట్ తీసుకున్నా ఓదెల మల్లన్న అగ్నిగుండాలు దాటనీయరా అంటూ ఆలయ సిబ్బందిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వేకువజామున పలువురు భక్తులు అగ్నిగుండాలు దాటేందుకు రూ.200 వెచ్చించి టికెట్ తీసుకున్నారు. అగ్నిగుండాలు దాటేందుకు పెద్దసంఖ్యలో భక్తులు ఉండడంతో అడ్డుకున్నారని, అక్రమంగా డబ్బు వసూలు చేశారని నిరసన వ్యక్తం చేశారు. కాగా, అగ్నిగుండాలు దాటే కార్యక్రమంలో శాంతి భద్రతల సమస్యలు ఎదురయ్యాయని ఈవో తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు అకస్మాత్తుగా రావడంతో ఇబ్బందులు తలెత్తి ఆపేసినట్లు పేర్కొన్నారు. -
యాజమాన్య పద్ధతులతో పంటలకు రక్షణ
కరీంనగర్ అర్బన్: వానాకాలం సాగులో ఇప్పటివరకు తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో యాజమాన్య పద్ధతులతో పంటలు కాపాడుకోవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఅర్డినేటర్ మధుకర్ వివరించారు. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైందని, వర్షాలు అసమానంగా కురవడంతో రైతులు పంటల యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వివరించారు. ఇప్పటికే విత్తిన పంటలకు నేలలో తేమను నిల్వ ఉంచేందుకు కలుపు మొక్కలను తొలగించి తేమ నష్టాన్ని తగ్గించాలని, వరుసల మధ్య పంట అవశేషాలు లేదా గడ్డి వేసి మల్చింగ్ చేయాలని సూచించారు. వర్షాలు పడే వరకు యూరియా వేయరాదని, మొక్కల్లో తేమ ఒత్తిడి తగ్గించేందుకు 1శాతం పొటాషియం క్లోరైడ్ లేదా 19:19:19 నీటిలో కరిగే ఎరువు లీటరుకు 10 గ్రాములు ఆకులపై పిచికారీ చేయాలన్నారు. మొక్కజొన్నలో మొలకలు సరిగా రాకపోతే 7–10 రోజుల్లో గ్యాప్ ఫిల్లింగ్ చేయాలని, వర్షం వచ్చే వరకు నత్రజని ఎరువులు వేయకుండా వేచి ఉండాలన్నారు. మంచి వర్షం వచ్చిన తర్వాత మాత్రమే నాట్లు వేయాలన్నారు. ఇంకా విత్తనం వేయని భూముల్లో 50–75 మి.మీ. సమృద్ధిగా వర్షం పడిన తర్వాత మా త్రమే స్వల్పకాలిక రకాల విత్తనాలు వేయాలన్నారు. మేత పంటలుగా జొన్న లేదా సజ్జ సాగు చేయవచ్చని తెలిపారు. అలాగే వర్షాలు పడే వరకు అధిక మో తాదులో రసాయన ఎరువులు వేయకుండా వాతావరణ సూచనలను అనుసరించి వ్యవసాయ పనులు చేపట్టాలని కోరారు. బస్సు సీట్ల కోసం కొట్లాటవేములవాడఅర్బన్: వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు సీట్ల కోసం కొట్లాడుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రావణ్–రజిత దంపతులు సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. కుటుంబంతో కలిసి వేములవాడకు వచ్చారు. సికింద్రాబాద్‌కు చెందిన మరో కుటుంబం కూడా వేములవాడకు వచ్చి సోమవారం తిరుగు ప్రయాణంలో తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. సికింద్రాబాద్ బస్సు రాగానే సీట్ల కోసం శ్రవణ్–రజిత దంపతులకు మరో కుటుంబానికి మధ్య వాగ్వాద జరిగింది. ఈక్రమంలో ఎదుటి కుటుంబం వారు శ్రావణ్, రజితలపై పిడుగుద్దులతో దాడి చేశారు. శ్రావణ్‌కు ముక్కు నుంచి రక్తం కారగా.. ఇరు కుటుంబాల వారు పోలీస్‌స్టేషన్ చేరుకొని పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువురికి పోలీసులు కౌన్సెలింగ్ చేసి, పంపించి వేశారు. భీమన్నకు నీరా‘జనం’వేములవాడ: భీమన్నకు సోమవారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆరుద్ర నక్షోత్రవం పురస్కరించుకుని శివుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి, డీఈవో నవీన్ పరిశీలించారు. రైతులకు ప్రధాన శాస్త్రవేత్త మధుకర్ సూచన -
ట్రాక్టర్‌ను తగలబెట్టిన దుండగులు
కథలాపూర్: మండలంలోని చింతకుంటలో నాగం గంగరాజంకు చెందిన ట్రాక్టర్‌ను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధితుడి కథనం ప్రకారం.. పొలం దున్ని ట్రాక్టర్‌ను గ్రామశివారులో ఉంచాడు. సోమవారం ఉదయం వెళ్లి చూడగా పూర్తిగా కాలిపోయి ఉంది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): నిరుపేద కుటుంబంలో పుట్టి వైద్యవిద్య ఎంఎస్(జనరల్ సర్జరీ) పూర్తి చేసిన కర్నె బాలయ్య కుమార్తె శ్రావ్యను బస్వాపూర్ పాలకవర్గం సోమవారం సన్మానించింది. సర్పంచ్ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రావ్య పట్టుదల, ఆత్మవిశ్వాసంతో వైద్యవిద్యను పూర్తి చేయడం గ్రామానికి గర్వకారణమన్నారు. ఉపసర్పంచ్ అనిల్, వార్డు మెంబర్లు మోతె మహేశ్, సజ్జనం ప్రశాంత్, శ్రీకాంత్, దేవరాజు పాల్గొన్నారు. -
టీ పెట్టుమని చెప్పి.. తిరిగిరాని లోకాలకు
కరీంనగర్‌క్రైం: అప్పటివరకు అంతా బాగానే ఉంది.. ఉదయాన్నే గుడికి వెళ్లి వచ్చాడు. భార్యతో ‘టీ పెట్టు’ అని చెప్పి రెండో అంతస్తుకు వెళ్లాడు. టీ సిద్ధమైందని భార్య పిలిచింది. అతడి నుంచి సమాధానం లేదు. అనుమానంతో పైకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కిందకు దించగా.. అప్పటికే ప్రాణాలు విడిచాడు. కరీంనగర్లో సోమవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఓ కుటుంబాన్ని తీవ్రశోకంలో ముంచింది. భగత్‌నగర్‌కు చెందిన కోడూరి సందీప్‌కుమార్(40) వ్యాపారం చేస్తుంటాడు. ఉదయం గుడికి వెళ్లొచ్చాడు. భార్య సమతను టీ పెట్టమని చెప్పి రెండో అంతస్తుకు వెళ్లాడు. టీ తయారు చేసి పిలిచినా స్పందించలేదు. పైకి వెళ్లి చూడగా బెడ్రూమ్లో ఫ్యాన్‌కు బెడ్షీట్లతో ఉరివేసుకొని కనిపించాడు. సమత కేకలు విని ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ప్రాణం ఉందేమోనన్న ఆశతో కిందకు దించారు. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. తండ్రి ఇక తిరిగిరాడన్న విషయం తెలియని ఇద్దరు చిన్నారులను చూసి కుటుంబసభ్యులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి భార్య రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది. ఆ చీటీలో ‘రూ.4 లక్షలు’! ఘటన అనంతరం లభించిన ఓ చీటీ కీలకంగా మారింది. అందులో ‘రామారావు దగ్గర రూ.4 లక్షలు’ అని రాసి, సందీప్‌కుమార్ సంతకం చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఆ రూ.4 లక్షలు ఎవరికి సంబంధించినవి? సందీప్‌కు రావాల్సినవా? ఆర్థిక లావాదేవీల్లో ఏమైనా వివాదాలు ఉన్నాయా? అనే అంశాలు విచారణలో తేలాల్సి ఉంది. సందీప్‌కుమార్ అప్పులు చేయడం, తనకు రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు మృతుడి భార్య వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరుపుతున్నట్లు సీఐ రాంచందర్‌రావు తెలిపారు. గుడికి వెళ్లొచ్చిన కొద్దిసేపటికే వ్యాపారి బలవన్మరణం ఇద్దరు చిన్నారులకు తీరని శోకం.. కుటుంబంలో విషాదం అప్పుల ఒత్తిడే కారణమంటూ భార్య ఫిర్యాదు -
రైలు కింద పడి గుర్తు తెలియని వృద్ధుడి ఆత్మహత్య
జమ్మికుంట: రైలు కింద పడి గుర్తు తెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం మండలంలోని బిజిగిరిషరీఫ్, జమ్మికుంట రైల్వే స్టేషన్ల మధ్య దిగువ రైల్వేలైన్‌లో ఏపీ సంపర్క్ కాంత్రి ఎక్స్‌ప్రెస్ కింద పడి గుర్తుతెలియని(63) వృద్ధుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు, అధారాలు లేవని, లేత పింక్ కలర్ టీషర్ట్, నలుపు రంగు నెక్కర్ ధరించాడన్నారు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, వివరాలు తెలిసిన వారు సెల్ నంబర్ 9949304574, 8712658604ను సంప్రదించాలని తెలిపారు. బైక్ ఢీకొని వృద్ధుడు మృతిపాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి మారేడుపల్లిలో సోమవారం బైక్ ఢీకొని గ్రామానికి చెందిన దర్శనాల మల్లయ్య(70) మృతిచెందాడు. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాలు.. దర్శనాల లక్ష్మి–మల్లయ్య దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయం మల్లయ్య తన భార్యను బైక్‌పై పొలం వద్ద దింపి రిటర్న్ తీసుకుంటుండగా బండారి పోచయ్య అనే ఉపాధ్యాయుడు వేగంగా వచ్చి బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో మల్లయ్య తలకు తీవ్ర గాయాలైనాయి. చికిత్స నిమిత్తం ధర్మారం ఆసుపత్రికి, పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ట్రాక్టర్ పై నుంచి పడి రైతు..ఇల్లంతకుంట(మానకొండూర్): పొలం దున్ను తూ ట్రాక్టర్ పై నుంచి బురదలో పడిపోయి యువరైతు ఊపిరాడక మరణించాడు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపిన వివరాలు. మండలంలోని రేపాకకు చెందిన రోండ్ల చంద్రశేఖర్‌రెడ్డి(25) తన వ్యవసాయ భూమిలో నాటు వేసేందుకు సోమవారం ట్రాక్టర్‌తో దున్నుతున్నాడు. ఈక్రమంలో ట్రాక్టర్‌పై నుంచి బురదలో పడిపోవడంతో ఊపిరాడకుండా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన తండ్రి మాధవరెడ్డి తన కొడుకును బయటకు తీసుకొచ్చి పరిశీలించగా అప్పటికే చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. అద్దె బస్సు డ్రైవర్ తొలగింపుసిరిసిల్ల అర్బన్: వేములవాడ అర్బన్ మండలం అనుపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక విచారణలో భాగంగా హైర్ బస్సు డ్రైవర్ ఎం.నరన్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రకాశ్‌రావు సోమవారం తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతిచెందారు. పలువురు కూలీలు గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటనపై టీజీఎస్ఆర్టీసీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తుందని ప్రకాష్‌రావు పేర్కొన్నారు. ఆరురోజుల పాటు కూనారం రైల్వేగేటు మూసివేతపెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి–కూనారం మార్గంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ 39వ గేటు ప్రాంతంలో అత్యవసరంగా రైల్వే ట్రాక్ మరమ్మతు పనులను మంగళవారం నుంచి చేపడుతారు. ఈనెల 19 వరకు పనులు జరుగుతాయని, దీంతో పెద్దపల్లి–కూనారం రైల్వేగేటును ఆరురోజుల పాటు మూసి వేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని, ఇందుకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. -
ఆరాధనోత్సవం.. జానకమ్మ స్వరాభిషేకం
ఎస్. జానకితో అప్పటి ధర్మకర్తల మండలి సభ్యులు నందిపేట సుదర్శన్ యాదవ్ ప్రముఖ గాయని ఎస్. జానకితో వేములవాడ గాయని కే. రాధిక 2003లో వేములవాడకు వచ్చిన సందర్భంగా ఉమేశ్‌శర్మ నివాసంలో భోజనం చేస్తున్న గాయని జానకి వేములవాడ: జానకమ్మ పాడితే అమృతవర్షం కురిసినట్లు ఉంటుంది. జానకమ్మ గొంతు మాయస్వరపేటిక. మనిషి ఒక్కరే.. విభిన్న స్వరాలుగా పాడడం ఆమె ప్రత్యేకత. ఇది వేములవాడ ప్రజలు 2003లో ప్రత్యక్షంగా విని.. మంత్రుముగ్ధులయ్యారు. రాజన్న సన్నిధిలో 2003లో నిర్వహించిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో గానకోకిల జానకమ్మ గళం నుంచి జాలువారిన అమృత వర్షం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. జానకమ్మ పాడిన శ్రీరావమ్మ దుర్గమ్మ్ఙ కీర్తన ఓ అద్భుతం. నలుగురు వేర్వేరు వ్యక్తులు పాడుతున్నట్లుగా నాలుగు భిన్నమైన స్వరాలతో ఆలపించి అబ్బురపరిచారు. అప్పటి క్షణాలను ఈ ప్రాంత సంగీత ప్రియులు, గాయకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. జానకమ్మ గళం నుంచి జాలువారిన అమ్మవారి పాట త్యాగరాజ ఉత్సవాల్లో అద్భుత ఘట్టంగా నిలిచిందని కళాకారులు అభిప్రాయపడుతున్నారు. మనిషి ఒక్కరు.. గొంతులు నాలుగు త్యాగరాజ ఆరాధనోత్సవంలో ప్రత్యేక ఆకర్షణ -
‘జ్యోతిష్మతి’ విద్యార్థులకు స్కాలర్షిప్
విద్యార్థులకు చెక్కులు అందజేస్తున్న కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, తిమ్మాపూర్: జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(అటానమస్) కళాశాల యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కళాశాలలో బీటెక్‌లో చేరిన ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ఏటా రూ.18 వేల చొప్పున స్కాలర్షిప్ ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. దానిని అమలు చేయడం సోమవారం నుంచి ప్రారంభించింది. లలితాపూర్ గ్రామానికి చెందిన నల్లెంగి మేఘన, కరీంనగర్‌కు చెందిన సఫూరా షర్మిన్ సీఎస్ఈ విభాగంలో చేరారు. ఒక్కొక్కరికి రూ.18వేల స్కాలర్షిప్ చెక్కులు అందుకున్నారు. జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, షాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు. చైర్మన్ మాట్లాడుతూ కళాశాలలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ఏటా రూ.18 వేల చొప్పున నాలుగేళ్లు రూ.72 వేలు స్కాలర్షిప్ అందజేయనున్నట్లు వివరించారు. కళాశాల సెక్రటరీ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ అధ్యాపకులు పాల్గొన్నారు. బీటెక్‌లో చేరిన విద్యార్థులకు ఏటా రూ.18 వేలు నాలుగేళ్లలో రూ.72 వేల లబ్ధి సద్వినియోగం చేసుకోవాలంటున్న కళాశాల యాజమాన్యం -
నేరాల నియంత్రణలో అలసత్వం వద్దు
కరీంనగర్‌క్రైం: కేసుల దర్యాప్తులో అలసత్వాన్ని సహించేది లేదని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశా రు. కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 2026 తొలి అర్ధవార్షిక నేరాల సమీక్షలో 2025, 2026 తొలి ఆరు నెలల నేరాల గణాంకాలను పరిశీలించారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నిర్దేశిత గడువులోగా చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూనే నేరగాళ్లతో కఠినంగా వ్యవహరించాలన్నారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయ్‌కుమార్, మాధవి, యాదగిరిస్వామి, శ్రీనివాస్ జి.వేణుగోపాల్ పాల్గొన్నారు. పలువురు పోలీసులకు రివార్డు పీఎంజే జువెల్లరీ చోరీ కేసును ఛేదించి, నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, కరీంనగర్ టూ టౌన్ సీఐ సృజన్‌రెడ్డితో పాటు పలువురికి సీపీ గౌస్ ఆలం రివార్డులు అందించారు. కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నగరపాలకసంస్థ కమి షనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను సోమవారం నగరంలోని కోతిరాంపూర్, కాపువాడ, ఆదర్శనగర్, వావిలాలపల్లి తదితర ప్రాంతాలలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితాను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను పూరించడం, ఆన్లైన్ పోర్టల్ నమోదు చేయడంలో ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వరాదని బీఎల్వోలకు సూచించారు. ప్రతి రోజు ఒక్కో బీఎల్వో 200 ఎన్యుమరేషన్ ఫారాలను ఆన్లైన్లో చేయాలన్నారు. కార్పొరేటర్లు వైద్యుల అంజన్‌కుమార్, సాదవేని సుజాత శ్రీనివాస్ పాల్గొన్నారు. కరీంనగర్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం కరీంనగర్‌లోని తెలంగాణ ఉద్యమ అమరవీరుడు, దివంగత కానిస్టేబుల్ కిష్టయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిష్టయ్య చిత్రపటానికి నివాళి అర్పించారు. కిష్టయ్య కూతురు ప్రియాంక మెడిసిన్ పీజీ విద్యాభ్యాసం ఫీజు చెక్కును అందజేశారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, సంజయ్ ఉన్నారు. కొత్తపల్లి: 132/33 కె.వీ.వావిలాలపల్లి విద్యుత్స్టేషన్ నిర్వహణ పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంతోష్‌నగర్, భాగ్యనగర్, మహాశక్తి ఆలయం, జ్యోతినగర్, గీతాభవన్ వెనక ప్రాంతం, సెయింట్ జాన్స్ స్కూల్, విద్యానగర్, శ్రీరాంనగర్ కాలనీ, కొత్తయాస్వాడ, విజయదుర్గకాలనీ, చైతన్యపురి, 11 కె.వీ.పీటిసీ ఫీడర్ పరిధిలోని పిటిసీ, బుల్ స్టేషన్, శ్రీహరినగర్, సంతోష్‌నగర్, కుర్మవాడ, రాంనగర్ ప్రాంతా ల్లో విద్యుత్ నిలిపివేయన్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు 11 కె.వీ.రాంచంద్రాపూర్ ఫీడర్ పరిధిలోని రామచంద్రాపూర్, సప్తగిరికాలనీ, సాయిబాబా, అంజనాద్రి ఆల యం, శ్రీనగర్‌కాలనీ, ఏవోస్ కాలనీ, పొన్నం కనకయ్య హోటల్, వెంకటాద్రికాలనీ, మల్లికా ర్జునకాలనీ, జానకీరాంకాలనీ, 33/11 కె.వీ. బ్యాంక్ కాలనీ ఫీడర్ పరిధిలో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2, 1 ఏడీఈలు ఎం.లావణ్య, పి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రేకుర్తి సబ్‌స్టేషన్ పరిధిలో 132 కె.వీ.వావిలాలపల్లి సబ్ స్టేషన్ నిర్వహణ పనులు చేపడుతున్నందున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 32/11 కె.వీ.రేకుర్తి సబ్‌స్టేషన్ పరిధిలోని రేకుర్తి, కంటి ఆసుపత్రి, ఇందిరమ్మకాలనీ, స్వామికాలనీ, షేకాబ్కాలనీ, సీతారాంపూర్, జగిత్యాల రోడ్డు, ఆర్టీసీకాలనీ, గౌడ్స్ కాలనీ, సమ్మక్క గద్దెలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ జి.రఘు తెలిపారు. -
● కదం తొక్కిన భవన నిర్మాణ కార్మికులు
కరీంనగర్: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ నెల 9 నుంచి 14 వరకు పనులు బంద్ చేసి ఆందోళన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావు సంఘీభావం ప్రకటించారు. కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ చిత్రామిశ్రాకు వినతిపత్రం ఇచ్చారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు, కార్మిక భవన నిర్మాణానికి స్థలం, నిధుల కేటాయింపు చేయాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మిక కుటుంబాలకు ‘కార్మికబంధు’ పేరిట రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలన్నారు. లేబర్ కార్డు గడువును 70ఏళ్లకు పెంచాలన్నారు. -
కదపరే!
బదిలీ అయినాసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో జరిగిన హోంగార్డుల బదిలీలు మరోసారి విమర్శల పాలవుతున్నాయి. గతేడాది మేలో జరిగిన బదిలీలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో ఈసారి పూర్తి పారదర్శకంగా నిర్వహించామని చెబుతున్నా.. ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. బదిలీలు జరిగి రెండు వారాలు గడిచినా ఇంతవరకు వారికి రిలీవ్ ఆర్డర్స్ రాకపోవడంపై డిపార్ట్మెంట్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ బదిలీలపై హోంగార్డులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. బదిలీ అయిన మెజారిటీ హోంగార్డుల్లో నేటికీ రిలీవ్ ఆర్డర్స్ రాలేదు. రాజకీయంగా, అధికారుల పరంగా పరపతి ఉన్న హోంగార్డులు ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు వచ్చి విధుల్లో చేరడంతో ఈ విమర్శల జోరు మరింత పెరిగింది. హోంగార్డుల వాట్సాప్ గ్రూపుల్లో బదిలీపర్వాన్ని పరస్పర విమర్శలతో హోరెత్తిస్తున్నారు. అసలేం జరిగింది..? 2016లో జిల్లాల పునర్విభజన జరిగింది. ఉమ్మడి జిల్లా సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలుగా విడిపోయాయి. కొన్ని మండలాలు జయశంకర్భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండలో విలీనమయ్యాయి. ఆయా మండలాల్లో విధులు నిర్వహించే హోంగార్డులందరికీ ఇప్పటికీ కరీంనగర్ యూనిట్ కేంద్రం. వారి బదిలీలు నేటికీ ఇక్కడి నుంచే అవుతాయి. 2016 తరువాత తొమ్మిదేళ్లకు (2025మే) హోంగార్డుల బదిలీలు అయ్యాయి. ఆ సమయంలో నిబంధనలు పాటించలేదని ఉన్నతాధికారులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి విమర్శలేవీ రాకుండా సీపీ గౌస్ఆలం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తి పారదర్శకంగా డ్రా విధానంలో 373 మంది హోంగార్డుల బదిలీ ప్రక్రియ చేపట్టారు. (నిబంధనల ప్రకారం ప్రత్యేక మినహాయింపులు పొందిన వితంతు మహిళలు, తీవ్ర అనారోగ్య బాధితులు, మానసిక వికలాంగ పిల్లలు ఉన్నవారు, జూన్ 2027 లోపు ఉద్యోగ విరమణ చేయనున్న వారిని మినహాయించారు) రిలీవ్ ఆర్డర్స్ రావడంలో జాప్యం.. బదిలీ ప్రక్రియపై హోంగార్డుల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. రాలేమని కొందరు.. వస్తమని కొందరు బదిలీపై హోంగార్డులు పెదవి విరుస్తున్నారు. బదిలీ అయిన ఏడాది కాకముందే చిన్న ఉద్యోగులమైన తమపై బదిలీ వేటు వేస్తే ఎలా అని అంటున్నారు. పిల్లల స్కూలు ఫీజు చెల్లించామని, ఇపుడు బదిలీ అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రిలీవ్ ఆర్డర్స్ కూడా ఆలస్యం అవుతుండటంతో బదిలీల ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చాలామంది హోంగార్డులు విధుల్లో చేరేందుకు సుముఖంగా లేరు. మరికొందరు తాము ఉన్న చోటు నుంచి కదలబోమంటూ పైరవీలు ప్రారంభించారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారు రిలీవ్ ఆర్డర్స్ తెచ్చుకున్నారని, లేనివారు అక్కడే ఉండిపోయారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీ ప్రక్రియను ప్రభావితం చేస్తామని కొందరు ఆర్ఐలు డబ్బులు అడుగుతున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.రిలీవ్ ఆర్డర్స్ అందడంలో కొంత జాప్యం ఉన్నమాట వాస్తవమే. ప్రాధాన్యక్రమంలో అందరినీ రిలీవ్ చేస్తున్నాం. ఇందుకోసం ఏడు యూనిట్లతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయి. కొందరు బదిలీ ఇష్టం లేని హోంగార్డులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బదిలీలను అత్యంత పారదర్శకంగా చేశాం. కుటుంబ, వ్యక్తిగత సమస్యలకు ముందే మినహాయింపు ఇచ్చాం. బదిలీని ప్రభావితం చేస్తామని ఎవరు చెప్పినా నమ్మవద్దు. బదిలీల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చు. – గౌస్ ఆలం, కరీంనగర్ సీపీ -
కరీంనగర్
గరిష్టం/కనిష్టం34.0/26.0మంగళవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 20267జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్‌కు 24 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. గరిష్టంగా రూ.8,300కు వ్యాపారులు కొనుగోలు చేశారు. మంగళవారం సెలవని ఇన్చార్జి సూపర్వైజర్ సురేందర్ తెలిపారు.చొప్పదండి: మహా శైవాక్ష యోగం ఏర్పడిందని పండితులు ప్రచారం చేయడంతో సోమవారం ఉదయం నుంచి శివకేశవాలయానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. -
పకడ్బందీగా విలేజ్ డైరెక్టరీ సర్వే
కరీంనగర్ అర్బన్: పాపులేషన్ సెన్సస్– 2027లో భాగంగా విలేజ్ డైరెక్టరీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో జీపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆగస్టు 10నుంచి సెప్టెంబర్ 8వరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలు, మున్సిపాలిటీలలో విలేజ్ డైరెక్టరీ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్, ఆస్పత్రులు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక, మాధ్యమిక విద్యాసంస్థలు, పశువైద్య సేవలు తదితర మౌలిక వసతులతో కూడిన తొమ్మిది సెక్షన్ల సమాచారాన్ని నిర్దిష్ట నమూనాలో సేకరించి పాపులేషన్ సెన్సస్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఈ సమాచారాన్ని సంబంధిత 16 మండలాల చార్జ్ ఆఫీసర్లు/తహసీల్దార్లు, మూడు మున్సిపాలిటీల కమిషనర్లు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పరిశీలించి, అవసరమైన సవరణలు చేసి పాపులేషన్ సెన్సస్ డిపార్ట్మెంట్కు పంపిస్తారని అన్నారు. రాష్ట్ర సెన్సస్ అధికారులు ధృవీకరించి, పాపులేషన్ సెన్సస్ డిపార్ట్మెంట్, ఢిల్లీకి ఫార్వర్డ్ చేస్తారు. తుది పరిశీలన అనంతరం ప్రతి జిల్లాకు డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్‌బుక్ (డీసీహెచ్‌బీ) విడుదల చేయబడుతుందని కలెక్టర్ తెలిపారు. అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రాందత్తా రెడ్డి, జిల్లా గణాంక అధికారి, అడిషనల్ డిస్ట్రిక్ట్ సెన్సస్ ఆఫీసర్ వెల్ది కిషన్ రావు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు వేగవంతం చేయండిరెడ్క్రాస్ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. ప్రజావాణి అనంతరం వివిధ అంశాలపై అధికారులతో మాట్లాడారు. సభ్యత్వ నమోదులో ఇప్పటికే రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో ఉందని, ఉద్యోగులు స్వచ్ఛందంగా సభ్యత్వం స్వీకరించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులకు అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రొత్సహించాలన్నారు. అన్ని హంగులతో సిద్ధం చేయండినూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ చిత్రామిశ్రా పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. నూతన హెలిప్యాడ్‌ను పరిశీ లించారు. భవనంలో నీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్, సానిటేషన్ తదితర మౌలిక సదుపాయాల్లో లోపాలు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. పాత కలెక్టరేట్ భవనానికి అవసరమైన రినోవేషన్ పనులను వెంటనే ప్రారంభించి, అత్యవసర మరమ్మతులను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని సూచించారు. -
● పట్టుకోండి చూద్దాం
నగరంలో కోతులతో పాటు కుక్కల బెడద పెరిగిపోయింది. ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో ఓ సైన్యంలా సంచరిస్తున్నాయి. ఆయా ప్రాంతాల వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు నగరంలోని విద్యానగర్‌కు ఓ కొండెంగను తీసుకొచ్చారు. దానికి కుక్కల బెడద తప్పడం లేదు. ఎక్కడ కనిపించినా వెంటాడి తరుముతున్నాయి. వాటిని చూసిన కొండెంగ గేటుపై నుంచి చెట్టువైపు, గోడలపై దూకుతూ ‘పట్టుకోండి చూద్దాం’ అంటూ సవాల్ విసురుతున్న దృశ్యం ‘సాక్షి’కి కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
అర్జీలు ఆలస్యం చేయకండమ్మా
కరీంనగర్ అర్బన్: ‘అమ్మా.. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే అధికారులు కావాలని ఆలస్యం చేస్తున్నారు. మా సమస్యను మరింత జటిలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని పలువురు బాధితులు వాపోయా రు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి అధిక సంఖ్యలో ప్రజలు రాగా తమ అర్జీలను కలెక్టర్ చిత్రామిశ్రాకు అందజేశారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవో షర్మిల అర్జీలు స్వీకరించారు. మొత్తం 255 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో వివరించారు.మొత్తం అర్జీలు: 255, హౌజింగ్: 59 ఆర్డీవో, కరీంనగర్: 57 కరీంనగర్ కార్పొరేషన్: 50 ఆర్డీవో, హుజూరాబాద్: 28 టీజీఎన్పీడీసీఎల్: 10 -
నులి పురుగులను నలిపేద్దాం
కరీంనగర్: కడుపులో నులిపురుగుల కారణంగా పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనతతో అలసిపోతారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. శారీరక మానసిక అభివృద్ధి మందకొడిగా ఉంటుంది. నులిపురుగులను నిర్మూలించడానికి డ బ్ల్యూహెచ్వో, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య కుంటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏటా రెండు విడతల్లో జాతీ య నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 13న సో మవారం నుంచి ఆల్బెండజోల్ మాత్రలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు, అంగన్వాడీ కేంద్రాలతోపాటు బడి బయట ఉండే పిల్లలకు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలు వే యించనున్నారు. జిల్లాలో 2,59,365 మంది 1 నుంచి 19 లోపు పిల్లలు ఉన్నారు. 924 పాఠశాలలు, 66 జూనియర్ కాలేజీలు, 777 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా 632 మంది ఆశాలు, 777 మంది అంగన్వాడీ టీచర్లు, 990 మంది పాఠశాల, కళాశాలల ప్రతినిధులు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీలో పాల్గొంటారు. మాత్రలు ఇలా ఇవ్వాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నులి పురుగుల నివారణ మాత్రలు తప్పనిసరైనా కొన్ని పరిస్థితుల్లో వైద్య సిబ్బంది సూచన మేరకే వేయాలి. జ్వరం, దగ్గు, ఇతర జబ్బులతో ఉన్నా, ఏవైనా ఇతర మందులు వాడుతున్న పిల్లలకు ఈ మాత్ర ఇవ్వడంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు మాత్రను ఒక గ్లాసు నీటితోపాటు నమిలి మింగాలి. తప్పనిసరిగా ఆరోగ్య కార్యకర్త సమక్షంలో వారి మార్గదర్శనంలోనే ఈ మాత్రను వినియోగించాలి. సంక్రమణ విధానమిదీ.. కడుపులో నులి పురుగులున్న పిల్లల మలంతో నులి పురుగుల గుడ్లు నేలను కలుషితం చేస్తాయి. ఈ గుడ్లు నేలలో లార్వాగా వృద్ధి చెందుతాయి. ఇతర పిల్లలు ఆహారం ద్వారా, మురికి చేతుల ద్వారా లార్వా చర్మంలోకి పోవడంతో నులిపురుగుల సంక్రమణ జరుగుతుంది. దీంతో గుడ్లు, లార్వాలు క్రిములుగా వృద్ధి చెంది తిరిగి గుడ్లను ఉత్పత్తి చేసి పిల్ల లకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి.పిల్లలందరికీ మాత్రలు వేయాలి 1–19 ఏళ్లు ఉన్న పిల్లలకు ఆ ల్బెండజోల్ మాత్రలు వయస్సును బట్టి సూచించిన డోస్ ప్రకారం వేయాలి. అన్ని స్కూ ళ్లు, కళాశాలల్లో పిల్లలకు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో వేయాలి. బడిబయటి పిల్లలను గుర్తించి వారికి కూడా మాత్రలు వేస్తాం. – డాక్టర్ శ్రీరామ్, డీఎంహెచ్‌వో -
డ్రంకెన్ డ్రైవ్లోడూప్లికేట్లు
కరీంనగర్‌క్రైం: మద్యం తాగి వాహనం నడిపితే చట్టం ముందు నిలబడాల్సిందే. ప్రమాదాలకు కారణమయ్యే డ్రంకెన్ డ్రైవ్‌ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, అదే చట్టాన్ని అమలు చేయాల్సిన కొందరు సిబ్బంది.. డ్రంకెన్ డ్రైవ్ కేసులనే ‘ఆదాయ వనరు’గా మార్చుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు కరీంనగర్ పోలీసుశాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. డబ్బులు చెల్లిస్తే అసలు నిందితుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదా? అతడి స్థానంలో మరొకరిని నిలబెట్టారా? ఫేక్ చలాన్లతో రికార్డులను తారుమారు చేశారా? ఒక్కో కేసుకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేశారా? ఈ వ్యవహారం ఎంతకాలంగా సాగుతోంది? దీనివెనుక కేవలం ముగ్గురు సిబ్బందే ఉన్నారా.. లేక మరింత పెద్ద నెట్వర్క్ పనిచేసిందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.త రైటర్.. కోర్టు డ్యూటీ.. కీలక లింక్ స్టేషన్లో కేసుల రికార్డులు నిర్వహించే స్థాయి నుంచి కోర్టుకు కేసులను తీసుకెళ్లే ప్రక్రియ వరకు పరస్పర సహకారం లేకుండా ఇలాంటి వ్యవహారం సాగడం సాధ్యమేనా అనే ప్రశ్న పోలీసు వర్గాల్లోనే వినిపిస్తోంది. స్టేషన్ రికార్డులు, కేసు పత్రాలు, కోర్టు హాజరు ప్రక్రియలో ఎక్కడెక్కడ మార్పులు జరిగాయో విచారణ కమిటీ నిగ్గుతేల్చాల్సి ఉంది. కేవలం కింది స్థాయి సిబ్బందితోనే ఇంతటి వ్యవహారం జరిగిందా లేక మరెవరైనా సహకరించారా? ఎవరి అండతో ఈ దందా సాగింది? అనే కోణంలోనూ విచారణ జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. జైలు భయమే పెట్టుబడిగా.. డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన కొందరు వాహనదారులకు కోర్టుకు వెళ్తే జైలు శిక్ష పడుతుందనే భయం ఉంటుంది. ఇదే భయాన్ని కొందరు సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు నుంచి సులభంగా బయటపడే మార్గం చూపిస్తామంటూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. సాధారణంగా డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తే చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కోవాలి. అయితే డబ్బులు చెల్లించిన వారి స్థానంలో ‘డూప్లికేట్’ వ్యక్తులను కోర్టుకు పంపించారనే ఆరోపణలు అత్యంత తీవ్రమైనవిగా మారాయి. ఇదే నిజమైతే ఇది కేవలం అవినీతి వ్యవహారంతో ముగిసిపోయే అంశం కాదని, న్యాయ ప్రక్రియనే తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా చూడాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫేక్ చలాన్ల వెనుక కథేంటి..? ఈ వ్యవహారంలో ‘ఫేక్ చలాన్లు’ ఉపయోగించారనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. చలాన్లు నిజమైనవా? వాటిలో నమోదైన వివరాలు ఎవరివి, ప్రభుత్వ ఖాతా లో ఎంత మొత్తం జమైంది, వాహనదారుల నుంచి వాస్తవంగా ఎంత వసూలైంది? మధ్యలో ఎంత మొత్తం చేతులు మారింది? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. వాహనదారుడి నుంచి రూ.15 వేలు లేదా రూ.30 వేలు తీసుకుని.. ప్రభుత్వానికి మాత్రం జరిమానా పేరుతో తక్కువ మొత్తం చెల్లించారా.. లేక అసలు చలాన్లనే తారుమారు చేశారా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ‘డూప్లికేట్’ వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు నిందితుల స్థానంలో ఇతర వ్యక్తులను కోర్టుకు పంపించారనే ఆరోపణలు నిజమైతే.. ఆ డూప్లికేట్ వ్యక్తులు ఎవరు? వారిని ఎవరు సమకూర్చారు? ఒక్కోసారి కోర్టుకు హాజరైనందుకు వారికి ఎంత చెల్లించారు? ఒకే వ్యక్తి అనేక కేసుల్లో హాజరయ్యాడా? వారి గుర్తింపు పత్రాలు ఎలా చూపించారు? కోర్టు రికార్డుల్లో ఎవరి పేర్లు నమోదయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. డ్రంకెన్ డ్రైవ్ కేసుల తేదీలు, వాహనదారుల వివరాలు, బ్రీత్ అనలైజర్ రికార్డులు, ఫొటోలు, వీడియోలు, కోర్టుకు హాజరైన వ్యక్తుల వివరాలను సరిపోల్చితే అసలు వ్యవహారం బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఒక కానిస్టేబుల్ సస్పెన్షన్‌తో ఈ వ్యవహారం ముగిసిపోకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరోపణలు నిజమైతే.. ఎంతకాలంగా ఈ వ్యవహారం సాగింది, మొత్తం ఎన్ని డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు జరిగాయి..ఎంత డబ్బు చేతులు మారింది? డూప్లికేట్ వ్యక్తులు ఎంతమంది, ఫేక్ చలాన్లు ఎన్ని? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరికి పాత్ర ఉంది? అనే అంశాలను పూర్తిస్థాయిలో బయటపెట్టాల్సిన అవసరం ఉంది. చిన్న చేపలను పట్టుకుని పెద్దవారిని వదిలేస్తారా? లేక తీగ లాగి డొంక కదిలిస్తారా..? అన్నది ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారుల విచారణపై ఆధారపడి ఉంది. ముగ్గురితోనే ముగిస్తారా..? మూలాల్లోకి వెళ్తారా? సీపీ దృష్టికి విషయం.. కదిలిన యంత్రాంగం డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో అవకతవకల వ్యవహారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం దృష్టికి వెళ్లడంతో సంబంధిత కేసుల వివరాలను తెప్పించి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఏఆర్ ఏసీపీ సి.ప్రతాప్ ఆధ్వర్యంలో ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రాథమికంగా అవకతవకల ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఒక ఆర్ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసి.. వీరిలో ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని, ఇద్దరిపై విచారణ కొనసాగుతోందని సీపీ వెల్లడించారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం కేసు తీవ్రతను తెలియజేస్తోంది. -
ఇస్కాన్ మందిరం నిర్మాణానికి కృషి
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్‌కల్చరల్: నగరంలోని ఈ నెల 16న మహాలక్ష్మీ ఆలయం నుంచి వైశ్యభవన్ వరకు నిర్వహించే జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం రథయాత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. ఏటా వేలాది మంది భక్తుల భాగస్వామ్యంతో రథోత్సవం వైభవంగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. కరీంనగర్– సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఇస్కాన్ రాధా–గోవింద మందిర నిర్మాణానికి కేటాయించిన మూడెకరాల్లో ఆలయ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమయ్యేలా తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. అ నంతరం ఇస్కాన్ మందిరంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని దర్శించుకున్నారు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, హరిశంకర్, గుగ్గిళ్ల జయశ్రీ, గు గ్గిళ్ల శ్రీనివాస్, డాక్టర్ ఎల్.రాజభాస్కర్‌రెడ్డి, తు మ్మల రమేశ్‌రెడ్డి, కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి, రాళ్లబండి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఓటరు నమోదుకు హెల్ప్డెస్క్కరీంనగర్టౌన్: నగరంలోని కిసాన్‌నగర్, చింతకుంటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓట రు నమోదు, ఎస్ఐఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) స హాయ కేంద్రాలను ఆదివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయడమే వీటి ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రభు త్వ యంత్రాంగం, బీఎల్వోల సమన్వయ లోపం వల్ల నగరంలో ఇప్పటివరకు కేవలం 14 శాతం మా త్రమే ఓటరు సవరణ ప్రక్రియ పూర్తయిందని తెలి పారు. ఈనెల 24 లోపు మిగిలిన ప్రక్రియను ము గించాల్సి ఉందని, ఆన్లైన్ సర్వర్లు సరిగ్గా పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ స్వయంగా రంగంలోకి దిగి, 10 కేంద్రాల ద్వారా ప్రజలకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను పూర్తి చేసేందుకు ఉచిత సేవలు అందిస్తోందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకో వాలని కోరారు. కార్పొరేటర్ గడ్డి ప్రదీప్‌కుమార్ నాయకులు పాల్గొన్నారు. -
కాళేశ్వరంపై విష ప్రచారం సరికాదు
కరీంనగర్‌కల్చరల్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ విషప్రచారం సరికాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం నగరంలోని ఓ హోట్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాళేశ్వరం ఎత్తిపోతల పంపులను వెంటనే ప్రారంభించి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. రిటైర్డ్ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల సూచనలను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. ప్రస్తుతం భారీ మొత్తంలో నీరు సముద్రంలో కలిసిపోతోందని, రైతుల అవసరాలకు దానిని వినియోగించే చర్యలు చేపట్టాలని కోరారు. దూరదృష్టితోనే మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారని, దెబ్బతిన్న పిల్లర్ మరమ్మతుకు ఎల్అండ్టీ సంస్థ ముందుకు వచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. మరమ్మతులు పూర్తయితే రాజకీయంగా క్రెడిట్ దక్కదనే భావనతో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం వల్ల భద్రాచలానికి ముప్పు ఉందన్న సీఎం వ్యాఖ్యలను ఖండించారు. కాళేశ్వరం పంపులను తక్షణమే ప్రారంభించి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మేయర్ రవీందర్‌సింగ్, రఘువీర్‌సింగ్, ఓరుగంటి రమణారావు, ముత్యాల బలరాంరెడ్డి, ఏలేటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
వైభవం.. మల్లన్న పెద్దపట్నం
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి పెద్దపట్నం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో సదయ్య, చైర్మన్ చీకట్ల మొండయ్య, ప్రధాన అర్చకుడు దూపం వీరభద్రయ్య ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులు చేశారు. సుమారు 100 మంది ఒగ్గు పూజారులు పసుపు, కుంకుమలతో మూడు గంటలపాటు పెద్దపట్నాలు వేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు, ట్రాన్స్‌కో ఏడీఏ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
కరీంనగర్‌టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్ డీఏలు విడుదల చేసి తక్షణమే పీఆర్సీ అమలు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కృషి భవన్లో జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి అధ్యక్షతన జరిగిన 16వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సంబంధమైన సమస్యలు పరిష్కరించాలన్నారు. ఉద్యోగ విరమణ పొందినవారికి పీఆర్సీ బకాయిలు, గ్రాట్యుటీ తదితర బిల్లులు ఒకేసారి చెల్లించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చకినాల రామ్మోహన్, వెద్యుల రాజిరెడ్డి, బి.శ్యాం, కె.నారాయణరెడ్డి, ఎం.రఘుశంకర్‌రెడ్డి, కె.చంద్రమౌళి, హుమేరా జబీన్, టి.తిరుపతిగౌడ్, ఎ.శ్రీనివాస్, ఆర్.శంకరయ్య, బి.రమేశ్, ఎస్.చక్రధర్, యు.శంకర్, ఎస్.సంపతి, ఎస్.అంజయ్య, కె.కిషన్‌రెడ్డి, తూముల తిరుపతి, ఎం.సదానందం, సీహెచ్.దేవేందర్, వి.రాంకిరణ్, పి.అరుణాదేవి, కె.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ‘నేను సైతం’ పుస్తకం ఆవిష్కరణకరీంనగర్కల్చరల్: కరీంనగర్‌లోని గణాంకభవన్‌లో ఆదివారం భవానీ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో కవి వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన నేను సైతం పుస్తకాన్ని రిటైర్డ్ ఆర్డీవో మహేశ్వర్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రావు మాట్లాడుతూ సమాజంలోని విభిన్న వర్గాల జీవన వాస్తవాలు, సామాజిక సమస్యలు, మానవీయ విలువలను ప్రతిబింబించే రచనలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. సాహితీ గౌతమి ప్రధాన కార్యదర్శి కొత్త అనిల్‌కుమార్ మాట్లాడుతూ కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సాహిత్య కార్యక్రమాలను ఆన్లైన్ వేదికగా కొనసాగించి రచయితలను ప్రోత్సహించిన వైరాగ్యం ప్రభాకర్ సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కవులు అన్నాడి గజేందర్, బొమ్మకంటి కిషన్ దామరకుంట శంకరయ్య, పెద్దిరాజు సత్యనారాయణరాజు, ఎస్.సంపత్‌కుమార్, ఎర్రోజు వెంకటేశ్వర్లు, యుగంధర్ జనగాని, రాపర్తి వెంకటేశ్వర్లు, గుండు రమణయ్య పాల్గొన్నారు. డయల్ 100కు తక్షణ స్పందన కరీంనగర్‌క్రైం: కుటుంబ తగాదాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కరీంనగర్ టూటౌన్ బ్లూకోల్ట్స్ సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడారు. విద్యానగర్‌కు చెందిన సంపత్ ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లినట్లు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో డయల్ 100కు సమాచారం అందింది. టూ టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్‌రెడ్డి ఆదేశాలతో బ్లూకోల్ట్స్ సిబ్బంది విష్ణు, రాకేశ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అతడిని గుర్తించి ప్రాణాలు కాపాడారు. అనంతరం ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించిన సిబ్బందిని ఇన్స్పెక్టర్ అభినందించారు. -
అక్రమాలకు సెలవు
కరీంనగర్‌టౌన్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సెలవుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీస్ రికార్డుల (ఎస్ఆర్) డిజిటలైజేషన్ పూర్తికావడంతో ఇకపై అన్నిరకాల సెలవులకు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతీ ఉద్యోగికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయించి వ్యక్తిగత సేవా వివరాలను డిజిటల్ విధానంలో నిర్వహించనుంది. ఇప్పటివరకు కొన్ని చోట్ల సెలవు పెట్టినా.. హాజరు నమోదైనట్లు చూపించడం, సర్వీస్ రికార్డుల్లో మార్పులు చేయడం వంటి అక్రమాలకు అవకాశం ఉండేదనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త విధానంతో అలాంటి వాటికి పూర్తిగా అడ్డుకట్ట పడనుంది. పూర్తయిన ఆన్లైన్ ప్రక్రియ ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీసు రికార్డు బుక్ నిర్వహణలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం డిజిటలైజేషన్ ప్రక్రియను తెరమీ దికు తెచ్చింది. డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ (డీడీవో) సమక్షంలో ప్రతీ ఉద్యోగి తన సర్వీస్ రికార్డుల్లోని వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే గడువు జూన్ 8 కావడంతో సదరు ప్రక్రియ పూర్తయింది. అక్రమాలకు చెక్ ప్రస్తుత విధానంలో ఉద్యోగుల సర్వీసు రికార్డులను డీడీవోలు మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు. ప్రతీ ఉద్యోగి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి విరమణ అయ్యే వరకు ఆయన సెలవులు, ఇంక్రిమెంట్లు, ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఆర్జిత సెలవులు, రిమార్కులు వంటివి సర్వీస్ రికార్డు ద్వారా తెలుస్తాయి. కాగా, మామూళ్ల మత్తులో కొందరు డీడీవోలు ట్రెజరీ అధికారులతో కుమ్మకై ్క సెలవులు వాడుకున్నా వాడలేదని వివరాలు నమోదుచేస్తూ ప్రభు త్వ ఖజానాకు కన్నం వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శిశు సంరక్షణ సెలవుల విషయంలోనూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని, విదేశాలకు వెళ్లినా, దీర్ఘకాలిక సెలవులో ఉన్నా బినామీలను పెట్టి నెలవారి వేతనాలు డ్రా చేసుకున్న ఘట నలూ గతంలో చోటు చేసుకున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వం సర్వీసు బుక్‌ను ఆన్లైన్ ఉంచాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ వల్ల భవిష్యత్తులో ఈ–పెన్షన్, పేరోల్ ప్రాసెసింగ్ వంటి సేవలు సులభంగా, మరింత వేగవంతంగా అందనున్నాయి. -
పల్లెదారులకు డిజిటల్ కోడ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దేశంలోని కోట్లాది గ్రామీణుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ కగార్ విజయవంతమైన నేపథ్యంలో గ్రామాలను మరింత వేగంగా చేరుకునేందుకు ఈ బృహత్తర ప్రాజెక్టు చేపట్టింది. గ్రామీణ రోడ్లను బలోపేతం చేసి వాటిని జిల్లా, జాతీయ రోడ్లతో కలిపే గ్రామ అంతర్గత రోడ్ కోడింగ్ అండ్ గ్రేడింగ్ విధానానికి రూపకల్పన చేసింది. ఫలితంగా మారుమూల పల్లెటూరు రోడ్లకు సైతం డిజిటల్ నంబర్లు కేటాయించి మ్యాపింగ్ చేస్తారు. తద్వారా ప్రతీ పల్లెటూరులోని రోడ్డుకు ఒక విశిష్ట గుర్తింపు ఉంటుంది. మొన్నటివరకూ గ్రామాల్లో నావిగేషన్ గుర్తింపు కష్టంగా ఉండేది. ఫలితంగా పోలీసు, ఫైర్, అంబులెన్స్, పోస్టల్ సిబ్బంది సకాలంలో గమ్యాన్ని చేరుకునేందుకు ఇబ్బంది పడేవారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇకపై ఆ కష్టాలేవీ ఉండవు. ఈ ప్రాజెక్టును మరింత ప్రభావ వంతంగా అమలు చేసేందుకు ప్రజా సంప్రదింపుల డాక్యుమెంట్ (కన్సల్టేషన్ డాక్యుమెంట్)ను విడుదల చేసింది. దీని ని జూన్ 24 నుంచి ప్రారంభించగా.. గడువు ఈ నెల 14తో ముగియనుంది. స్థానిక సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామీణుల నుంచి ఈ సలహాలు, సూచనలను కోరింది. తెలంగాణలో 10 వేలకుపైగా పల్లెలు ఈ పథకం విజయవంతంగా అమలైతే తెలంగాణలోని దాదాపు 10,954 పల్లెలకు కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల నుంచి మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి, మంచిర్యాల వంటి సరిహద్దు, అటవీ ప్రాంతాలున్న జిల్లాలకు మున్ముందు మరింత మెరుగైన సేవలు అందుతాయి. తపాలాశాఖకు చెందిన డిజిపిన్ జియోస్పేషియల్ టెక్నాలజీని వాడుతూ గ్రామ మంచిత్ర పోర్టల్ ద్వారా అనుసంధానిస్తూ ప్రక్రియ సాగుతోంది. దీనివల్ల ప్రతీ పల్లెటూరు రహదారికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపు లభిస్తుంది. -
బాల్యం విశేషాలు నాతో పంచుకున్నారు
విశిష్ట గాయని ఎస్.జానకి 2004లో సిరిసిల్లకు విచ్చేసిన సందర్భంగా అప్పటి సీఐ పోలీస్ ఉమామహేశ్వరశర్మ ఇంట్లో కలిశాను. సిరిసిల్లలో గడిపిన రోజుల గురించి నాతో చెప్పుకొచ్చారు. ఆమె తండ్రి ఆయుర్వేద వైద్యంలో సిద్ధహస్తులు కావడంతో సిరిసిల్ల సర్ దేశాయి ఇక్కడికి ఆహ్వానించారు. వేంకటేశ్వర ఆలయం వద్ద ఉన్నటువంటి తిమ్మయ్యగారి బంగ్లాలో ఉన్నట్టు చెప్పారు. నా స్నేహితులతో కలిసి చాలాసేపు ముచ్చటించి భోజనం చేసి గడిపిన సమయం మా జీవితంలో మరువలేనిది. – గుడ్ల రవి, సిరిసిల్ల టౌన్ క్లబ్ మాజీ అధ్యక్షుడు -
బోర్డులు ఏర్పాటు చేయాలి
ఆలయ పరిసరాల్లో మునుల గుహ, కొండల రాయుడి కోట ఉందనే విషయం తెలియక కేవలం స్వామి వారిని దర్శించుకొని తిరిగి వెళ్లిపోయిన. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఆల య ప్రాశస్త్యంతోపాటు పర్యాటక ప్రాంతాల వివరాలు తెలిపే బోర్డులు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేయాలి. కొండగట్టు అభివృద్ధికి అధికారులు చొరవ చూపాలి. – ఎం.సురేందర్‌నాయక్, హైకోర్టు న్యాయవాది, భక్తుడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఆలయ ప్రాశస్త్యం తెలిసేలా ఆలయ పరిసరాల్లో బోర్డులు ఏర్పాటు చేస్తాం. – అంజనారెడ్డి, కొండగట్టు ఆలయ ఈవో -
ఊరుకు కీడు సోకిందని..
● శివారులో వన భోజనాలకు తరలిన గ్రామస్తులు జమ్మికుంట: ఊరుకు కీడు సోకిందని, అందుకే గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులంతా ఊరు విడిచి వంటలకు వెళ్లిన ఘటన జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని అబాది జమ్మికుంట గ్రామంలో కొన్ని నెలలుగా వరస మరణాలు సంభవిస్తున్నాయి. గ్రామ పెద్దల ఆలోచన చేసి వేద పండితులను సంప్రదించగా.. ఊరి కీడు పోవాలంటే గ్రామస్తులంతా ఊరు వదిలి వంటలకు వెళ్లాలని సూచించారు. 2 రోజుల ముందే గ్రామంలో డప్పు చాటింపు వేయించారు. అందరూ కలిసి గ్రామం అవతల ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వంటలకు వెళ్లారు. చీకటి పడ్డ తర్వాత ఇంటి బాట పట్టారు. -
అంజన్న ప్రాశస్త్యంపై నిర్లక్ష్యం
అధ్వానంగా మునుల గుహకు వెళ్లే దారి కొండల రాయుడి కోట వద్ద ప్రకృతి సోయగాలు ● అస్తవ్యస్తంగా మునుల గుహకు వెళ్లే దారి ● దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీకొండగట్టు ఆంజనేయస్వామిని మన రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారు. ప్రతీ మంగళ, శనివారాల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లిస్తారు. మునుల గుహ.. కొండల రాయుడి కోట.. ● కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లోని మునుల గుహ, కొండల రాయుడి కోటకు వెళ్లే దారులు మల, మూత్రాలు, చెత్తాచెదారంతో మూసుకుపోవడంతో చారిత్రక అంశాలు మరుగున పడుతున్నాయి. ఆలయ పరిసరాల్లో పర్యాటకులను ఆకర్షించేలా పెద్ద పెద్ద బండ రాళ్ల మధ్య మునుల గుహలో విశాలమైన స్థలం చూపరులను ఆకట్టుకుంటోంది. ● కొత్త కోనేరు సమీపంలో ఉన్న గుహలో మునులు తపస్సు చేసుకునేవారని, స్వామివారిని దర్శించుకునేందుకు మునులు వచ్చేవారని భక్తుల విశ్వాసం. మునుల గుహకు వెళ్లే దారి నిర్వహణను పట్టించుకోకపోవడంతో.. భక్తులకు మునుల గుహ ఉందనే విషయమే తెలియని పరిస్థితి నెలకొంది. ● బేతాళ స్వామి ఆలయానికి ఎదురుగా పెద్ద పెద్ద బండ రాళ్ల మధ్య కొండల రాయుడి కోట ఉండేదని, కొండల రాయుడు నిత్యం స్వామివారిని పూజిస్తూ మునులు, అడవి జంతువుల నుంచి భక్తులకు రక్షణ కల్పించేవాడని, నేటి బండ రాళ్లపై కొండల రాయుడి గుర్రం అడుగు గుర్తు ఉందని స్థల పురాణం చెబుతోంది. పర్యాటకులను ఆకట్టుకునేలా ఉన్న పెద్ద బండ రాళ్ల వద్ద ఇనుప చువ్వలతో బారికేడ్ ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొస్తే.. మరింతమంది పర్యాటకులను ఆకట్టుకునే అవకాశముంది. ఎందుకీ వెనకడుగు..? రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించేందుకు అధికారులు చొరవ చూపడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకొని తిరుగు పయనమవుతున్నారు. నీతి అయోగ్ రూపొందించిన దర్శనీయ స్థలాల్లో ఒకటిగా స్థానం సంపాదించుకున్న కొండగట్టు ఆలయ ప్రాశస్త్యం తెలిపేందుకు అధికారులు అడుగు ముందుకు వేయడం లేదు. కానరాని బోర్డులు ఎత్తయిన వృక్షాలు.. వివిధ రకాల వన మూలికల చెట్లు.. పెద్ద పెద్ద బండ రాళ్లు.. ప్రకృతి సోయగాలు కొండగట్టుకొచ్చే భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కొండగట్టు ఆలయ పరిసరాల్లోని ఉప దేవాలయాలు, చారిత్రక నేపథ్యమున్న ప్రాంతాలను వివరించే బోర్డులు ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలానికి పైగా భక్తులు కోరుతున్నా.. అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. పడి ఉన్న అంజన్న విగ్రహం ఆలయానికి ఉత్తర ద్వారం వైపు ఉన్న సులభ్ కాంపెక్స్ సమీపంలో సిమెంట్‌తో చేసిన ఆంజనేయస్వామి విగ్రహం పడి ఉండడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో స్వామివారి విగ్రహం పడి ఉండడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. -
ప్రాణం తీసిన సహజీవనం
మెట్పల్లి: సహజీవనం ఓ మహిళ ప్రాణాలు తీసింది. ఓ వ్యక్తితో కలిసి ఉన్న ఆమెను అతడి కళ్ల ముందే దారుణంగా హత్య చేశారు. ఈ ఘాతుకానికి అతడి కుటుంబ సభ్యులే పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు.. చింతలపేటకు చెందిన కర్రె సునీత(34)కు వివాహమై ఇద్దరు కుమారులున్నారు. కొంతకాలం క్రితం ఆమె భర్త మరణించాడు. ఆ తర్వాత కోరుట్లకు చెందిన గంగారెడ్డి అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. దీనికి అభ్యంతరం తెలుపుతూ వస్తున్న గంగారెడ్డి కుటుంబ సభ్యులు పది రోజుల క్రితం సునీతపై దాడికి దిగినట్లు తెలిసింది. ఈ దాడిలో ఆమె ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇరువురు మెట్‌పల్లిలోని శాంతినగర్‌కు వచ్చి నివాసముంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం గంగారెడ్డి, సునీత ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమె మెడపై పదునైన ఆయుధంతో దాడి చేశారు. అడ్డుకోబోయిన గంగారెడ్డిపైనా దాడికి యత్నించారు. అనంతరం ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో సునీత అక్కడికక్కడే మృతిచెందగా.. గంగారెడ్డి చేతికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారమందుకున్న జగిత్యాల డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ సురేశ్‌బాబు, ఎస్ఐ కిరణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. తన తండ్రితో సహజీవనం వద్దని చెప్పినా సునీత పట్టించుకోకపోవడంతోనే గంగారెడ్డి కొడుకు తన స్నేహితుడితో కలిసి హత్య చేసినట్లు తెలిసింది. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. కలిసి ఉంటున్న వ్యక్తి కళ్లెదుటే మహిళ దారుణ హత్య -
బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
వీర్నపల్లి: వీర్నపల్లి మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మద్దిమల్లతండాకు చెందిన కడావత్ పీరు, మద్దిమల్ల గ్రామానికి చెందిన వీరవేణి వెంకటయ్య తమ ద్విచక్ర వాహనాలపై వేర్వేరుగా వెళ్తున్నారు. వెంకటయ్య విద్యుత్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తుండగా.. విధి నిర్వహణలో భాగంగా గర్జనపల్లి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సబ్ స్టేషన్ ప్రాంతంలో 2 వాహనాలు అదుపు తప్పి ఎదురెదురుగా బలంగా ఢీకొట్టుకున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన 108 సిబ్బంది.. క్షతగాత్రులను ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అనుమానం పెనుభూతమై..● బీపీఎం రిషికను వేధించిన అత్తింటివారు ● గడ్డి మందు తాగిన వైనం ● చికిత్స పొందుతూ మృతి ● ఐదుగురిపై కేసు ఓదెల: అత్తింటివారి వేధింపులు తాళలేక రిషిక(24) గడ్డి మందు తాగగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. పొత్కపల్లి ఎస్సై సనత్‌కుమార్‌రెడ్డి, మృతురాలి తండ్రి చొప్పరి భూమేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామానికి చెందిన రిషికతో ఓదెల మండలం పిట్టలఎల్లయ్యపల్లెకు చెందిన పిట్టల నవీన్‌కు సంవత్సరంన్నర క్రితం వివాహమైంది. రిషిక ఓదెల మండలం గుండ్లపల్లెలో బ్రాంచ్ పోస్టు మాస్టర్‌గా పని చేస్తోంది. పిట్టలఎల్లయ్యపల్లెలో భర్త పిట్టల నవీన్, అత్త, మామ పిట్టల విజయ, కొంరయ్య, ఆడపడుచు, ఆమె భర్త పెండం రమ్య, పెండం శ్రీకాంత్ ప్రతిరోజు అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా వేధించేవారు. మానసిక క్షోభకు గురైన రిషిక తనలో తాను బాధపడుతూ ఈనెల 3న మధ్యాహ్నం గడ్డి మందు తాగింది. హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా.. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందింది. రిషిక మృతికి కారకులైన భర్త పిట్టల నవీన్, అత్త పిట్టల విజయ, మామ పెద్దపల్లి మార్కెట్ డైరెక్టర్ పిట్టల కొంరయ్య, ఆడపడుచు పెండం రమ్య, ఆడపడుచు భర్త పెండం శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అప్పులే ప్రాణం తీశాయి
అప్పులు తీర్చే దారి లేక శనివారం రాత్రి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరు వ్యవసాయం, కొడుకు ఉపాధి కోసం అప్పులు చేయగా.. మరొకరు పిల్లలను చదివించలేక, చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణం పొందారు. ఈ ఇద్దరు కూడా ముస్తాబాద్ మండలానికి చెందినవారే. ముస్తాబాద్(సిరిసిల్ల): తనకున్న రెండెకరాల్లో బోర్లు వేసినా నీరు రాక వ్యవసాయం సాగలేదు. ఒక్కాగానొక్క కొడుకును ఉపాధి కోసం దుబాయ్‌కి పంపినా ఆదాయం రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై జ్యోతి కథనం ప్రకారం.. ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన ఈరవేణి పర్శరాములు(42) తనకున్న రెండెకరాల్లో వరి పంట వేశాడు. అప్పులు చేసి బోర్లు వేయించినా నీరు పడలేదు. కుమారుడు తేజను కువైట్ దేశానికి పంపించాడు. 4 నెలల క్రితం తేజ కువైట్‌లో సరైన పని లేదని స్వగ్రామానికి వచ్చాడు. వ్యవసాయానికి, కుమారుడిని కువైట్‌కు పంపేందుకు రూ.13లక్షల వరకు చేసిన అప్పులు ఎలా తీర్చేదంటూ పర్శరాములు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించక ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత శనివారం రాత్రి దూలానికి చీరతో ఉరేసుకున్నాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. కుమారులకు ఉన్నత చదువులు చెప్పించలేక.. చేసిన అప్పులు తీర్చలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై జ్యోతి కథనం మేరకు.. ముస్తాబాద్ మండలం ఆవునూర్‌కు చెందిన బండి లావణ్య(38) భర్త రవి ఉపాధి కోసం మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. ఆయనకు సరైన జీతం లేక ఇంటికి డబ్బులు పంపించడం లేదు. రవి దుబాయ్‌కి వెళ్లేందుకు అప్పులు చేశాడు. మరోవైపు ఇద్దరు కుమారులు వికాస్, వినయ్ చదువులకు లావణ్య ఇబ్బందులు పడుతోంది. బీడీలు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. వినయ్ ఉన్నత చదువులకు డబ్బులు అవసరం కాగా.. అవి సమకూరలేదు. రూ.5లక్షల అప్పులు ఎలా తీర్చేదని లావణ్య తీవ్ర మానసిక వేదనకు గురై శనివారం రాత్రి ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు వికాస్‌ను బయటకు పంపింది. చీరతో దూలానికి ఉరేసుకుంది. వికాస్ ఎంత అరిచినా తలుపులు తీయలేదు. కళ్లేదుటే తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో వికాస్ రోదనలు మిన్నంటాయి. భార్య కడసారి చూపునకు కూడా రవి దుబాయ్ నుంచి రాలేకపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ముస్తాబాద్ మండలంలో ఇద్దరి బలవన్మరణం -
జానకమ్మ బాల్యం.. జ్ఞాపకాలు అమూల్యం
సిరిసిల్లటౌన్: గానకోకిల.. మధురగాయని జానకమ్మ బాల్యం సిరిసిల్లలోనే గడిపారు. ఇక్కడ గడిపిన క్షణాలను ఆమె పలు సందర్భాలలో ప్రస్తావించారు. శ్రీశాల క్షేత్ర వేంకటేశ్వరస్వామి ఆలయం.. ఉదరవాగు నుంచి నీళ్లు తెచ్చుకోవడం.. వేములవాడకు ఎడ్లబండిలో వెళ్లి బాలనాగమ్మ సినిమా చూసిరావడం.. ఆ సినిమాలోని పాటలను చుట్టుపక్కల ఇళ్లల్లో పాడిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జానకమ్మ మరణంతో సిరిసిల్ల ప్రజలు మధురగాయని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. బాల్యంలో ఆమెతో కలిసి పెరిగిన వారు అప్పటి విషయాలు చర్చించుకుంటున్నారు. తిమ్మయ్య గారి బంగ్లాలో.. జానకమ్మ తండ్రి శ్రీరామమూర్తి వృత్తిరీత్య ఆయుర్వేద వైద్యుడు. వీరి కుటుంబం దాదాపు ఆరేళ్లు సిరిసిల్లలోనే ఉన్నారు. అప్పుడు తిమ్మయ్యగారి బంగ్లాలో ఉండేవారు. బాల్యంలో మానేరు తీరాన ఆటపాటలు, అప్పట్లో ఇక్కడ చూసిన ఓ సర్కస్ గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మానేరు నది ఉపకాల్వ ఉదరవాగు నుంచి తమ ఇంటికి మంచినీరు తీసుకెళ్లిన గుర్తులను ఆమెతో పెరిగిన సహచరులు గుర్తుకు తెచ్చుకున్నారు. శ్రీసిరిసిల్లలో గడిపిన ఆ రోజులు నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవ్ఙి అని జానకమ్మ ఎప్పుడూ చెబుతుండేవారు. సిరి వెలుగుల ఆత్మీయ సత్కారం 2001లో సిరిసిల్లలో నిర్వహించిన సిరి వెలుగుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా స్థానిక సాహితీవేత్తలు, అభిమానులు జానకమ్మను సత్కరించుకున్నారు. ఆ సమయంలో జానకమ్మ ఇక్కడి ప్రజల ఆత్మీయతకు కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పట్లో సిరిసిల్ల ప్రాంతంలో రైతాంగ పోరాటాలు ఉధృతంగా సాగడంతో కుటుంబ పరిస్థితుల రీత్యా వారి కుటుంబం మద్రాసు(చైన్నె) తరలి వెళ్లాల్సి వచ్చింది. ఆమె కుటుంబం నివసించిన అద్దె ఇల్లు తిమ్మయ్యగారి బంగ్లా ప్రస్తుతం ప్రముఖ వ్యాపారి గరిపెల్లి ప్రభాకర్ ఖాళీ స్థలంలో ఉండేదని చరిత్రకారులు తెలిపారు. వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కనే ఉండడంతో చిన్నప్పటి నుంచి శ్రీవారి పాటలు పాడేవారని పేర్కొన్నారు. గాయనిగా కీర్తిప్రతిష్ఠలు పొందిన జానకమ్మ సిరిసిల్లలోనే స్వరాలాపనలో తొలి అడుగులు పడ్డాయని ఇక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సిరిసిల్లలోనే తొలి స్వరాలాపన పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావన -
గల్ఫ్ వెళ్లేందుకు ఆల్ ఫ్రీ
వేములవాడ: యూఏఈలో ఉద్యోగం చేయాలనుకునే గల్ఫ్ అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ ఏడీఎన్‌హెచ్ క్యాటరింగ్ కంపెనీలో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి ప్రముఖ రిక్రూట్మెంట్ సంస్థ జీటీఎం ఇంటర్నేషనల్ ఉచిత నియామకాలను చేపడుతోంది. ఈ ఉద్యోగాలకు వీసా, ఫ్లయిట్ టికెట్, రిక్రూట్మెంట్ ప్రక్రియ అంతా ఫ్రీగా నిర్వహించనుందని ప్రకటించింది. క్లీనర్లు, వెయిటర్లు, డ్రైవర్లు, హెవీ వెహికల్ మెకానిక్స్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయని సంస్థ ప్రతినిధి చీటి సతీశ్‌రావు ఆదివారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్లు, పాస్‌పోర్ట్, సీవీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. వెయిటర్ ఇంటర్వ్యూ తేదీ: జూలై 15, బుధవారం. జీతం: 1,200 ఏఈడీ(సుమారు రూ.32 వేలు), ఉచిత భోజనం, వసతి, రవాణా. అర్హత: వెయిటర్‌గా అనుభవం ఉండి ఇంగ్లిష్ మాట్లాడడం రావాలి. వయస్సు: 21 నుంచి 40 సంవత్సరాల్లోపు. క్లీనర్ ఇంటర్వ్యూ తేదీ: జూలై 17, శుక్రవారం. జీతం: 950 ఏఈడీ(సుమారు రూ.26వేలు), ఉచిత భోజనం, వసతి, రవాణా. వయస్సు: 19 నుంచి 40 సంవత్సరాల్లోపు. డ్రైవర్ యూఏఈ లైసెన్స్, వాలిడిటీ తప్పనిసరి. లైట్ డ్రైవర్ జీతం: 1,800 ఏఈడీ(సుమారు రూ.48వేలు). హెవీ డ్రైవర్ జీతం: 2,800 ఏఈడీ(సుమారు రూ.75 వేలు), గది, భోజనం, రవాణా. హెవీ వెహికల్ మెకానిక్స్ రంగం ఇంటర్వ్యూ తేదీ: జూలై 17, శుక్రవారం. సంబంధిత రంగంలో అనుభవమున్నవారు అర్హులు. సీనియర్ మెకానిక్ జీతం: 7,000 ఏఈడీ(రూ.1.90లక్షలకు పైగా). మెకానిక్ జీతం: 3,500 ఏఈడీ(రూ.93వేలకు పైగా). ఆటో ఎలక్ట్రికల్–ఏసీ టెక్నీషియన్ జీతం: 2,500 ఏఈడీ(రూ.66వేలకు పైగా). అసిస్టెంట్ మెకానిక్ జీతం: 2,100 ఏఈడీ(రూ.56వేలకు పైగా). డెంటర్ టెక్నీషియన్(టిన్‌స్మిత్) జీతం: 2,100 ఏఈడీ(రూ.56వేలకు పైగా). పెయింటర్ టెక్నీషియన్ జీతం: 2,100 ఏఈడీ(రూ.56వేలకు పైగా). ఇంటర్వ్యూ వేదికలు అభ్యర్థులు పైన పేర్కొన్న తేదీల్లో ఉదయం 10 గంటలకు తమకు దగ్గర్లోని జీటీఎం ఇంటర్నేషనల్ కార్యాలయాల్లో స్వయంగా హాజరు కావాలి. తమ డాక్యుమెంట్లను gulfjobsgtm@gmail.com మెయిల్ చేసి కన్ఫర్మేషన్ పొందొచ్చు. ఆర్మూర్ 8332013999, నిజామాబాద్ 8686860999, జగిత్యాల 8332042299, సిరిసిల్ల 8332017122, సికింద్రాబాద్ 8332052299 నంబర్లలో సంప్రదించాలి. ఈ రిక్రూట్మెంట్ పూర్తిగా ఉచితమని, ఏడీఎన్‌హెచ్ క్యాటరింగ్ కంపెనీ వీసాల కోసం, టికెట్ కోసం లేదా మరే ఇతర ప్రక్రియ కోసమైనా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే 9989107011 నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సతీశ్‌రావు కోరారు. క్యాటరింగ్ కంపెనీలో ఉచితంగా వీసా, ఫ్లయిట్ టికెట్ డబ్బులడిగితే ఫిర్యాదు చేయండి -
రాజన్న సన్నిధిలో మధుర గానం
వేములవాడ: దక్షిణ భారత సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన గాన కోకిల ఎస్.జానకి ఇక లేరనే వార్త సంగీతాభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో 2003లో జరిగిన త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాల్లో ఆమె పాల్గొన్న క్షణాలను ఆదివారం వేములవాడ కళాకారులు గుర్తు చేసుకున్నారు. ఆ ఉత్సవాల్లో పాల్గొన్న జానకమ్మ తన మధుర గానంతో రాజన్న క్షేత్రాన్ని సంగీతమయంగా మార్చారు. ఆమె ఆలపించిన త్యాగరాజ కీర్తనలు భక్తులను పరవశింపజేయగా.. సంగీత ప్రియులు, స్థానిక కళాకారులకు స్ఫూర్తిగా నిలిచాయి. జానకమ్మ వంటి గాయని వేములవాడ వేదికపై గానం చేయడం అదృష్టంగా భావిస్తున్నారు. ఆమె స్వరం, సంగీతంపై ఉన్న అంకితభావం ఎప్పటికీ మరువలేమని ఇక్కడి కళాకారులు భావోద్వేగంగా చెప్పుకుంటున్నారు. జానకమ్మ భౌతికంగా దూరమైనా.. రాజన్న సన్నిధిలో ఆమె ఆలపించిన రాగాలు, భక్తి గీతాలు వేములవాడ సంగీతాభిమానుల హృదయాల్లో చిరకాలం మార్మోగుతూనే ఉంటాయని వారు నివాళి అర్పించారు. ఎస్.జానకి ఈనెల 11న కన్నుమూసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఆమె మరణ వార్తతో దేశవ్యాప్తంగా సంగీతాభిమానులు, కళాకారులు నివాళి అర్పిస్తున్నారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో అనేక భాషల్లో దాదాపు 48వేల పాటలు ఆలపించి చెరగని ముద్ర వేశారు. వేములవాడ రాజన్న ఉత్సవాల ఇన్చార్జి రామయ్యశర్మ మాట్లాడుతూ.. 2003లో జానకి వేములవాడకు వచ్చారని, అప్పటి ఈవో కేశవులు, ట్రస్టు బోర్డు చైర్మన్ శికారి విశ్వనాథం చేతుల మీదుగా ఘనంగా సత్కరించినట్లు చెప్పారు. త్యాగరాజ కీర్తనలతో అలరించిన జానకమ్మ వేములవాడ వేదికపై ఆలపించిన ఆ స్వరం ఇక జ్ఞాపకాల్లోకి.. స్థానాచార్యుడి కుటుంబంతో అనుబంధం -
తెల్లవారితే పెళ్లి.. వరుడి ఆత్మహత్య
● నాన్నకు అన్నం పెట్టివస్తా.. అంటూ వెళ్లి ● ఇంట్లో ఉరివేసుకున్న యువకుడు కరీంనగర్ క్రైం: తెల్లవారితే పెళ్లి. బంధుమిత్రుల సందడి. వేడుకల హడావుడి. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు. అంతలోనే విషాదం. తండ్రికి భోజనం పెట్టి వస్తానంటూ ఫంక్షన్‌హాల్ నుంచి వెళ్లిన పెళ్లికొడుకు తిరిగి రాలేదు. వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబసభ్యులకు విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటన కరీంనగర్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన మహ్మద్ అబ్దుల్ రావూఫ్(28) హైదరాబాద్‌లో ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల కుటుంబసభ్యులు వివాహం నిశ్చయించారు. జూలై 10న వివాహం జరిపేందుకు నిర్ణయించారు. జూలై 9న కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహ కార్యక్రమం జరుగుతోంది. రాత్రి సుమారు 9గంటలకకు రావూఫ్ కూడా కుటుంబ సభ్యులతో అక్కడే ఉన్నాడు. పక్షవాతంతో మంచానికే పరిమితమైన తన తండ్రి ఇంటివద్ద ఉన్నాడని, ‘నాన్నకు భోజనం పెట్టి వస్తా’ అంటూ ఇంటికి వెళ్లాడు. రెండు గంటలు గడిచినా తిరిగి రాకపోవడంతో బంధువులు ఇంటికి వెళ్లారు. రావూఫ్ ఉరికి వేలాడుతూ కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని టూటౌన్ సీఐ సృజన్‌రెడ్డి తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. రూ.3.20లక్షలకు బెల్ట్‌షాపు వేలంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో మద్యం బెల్ట్‌షాపు నిర్వహణకు శనివారం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. పోటాపోటీగా సాగిన వేలంపాటలో రూ.3.20 లక్షలకు ఒకరు దక్కించుకున్నారు. ఈ డబ్బులు చెల్లించి రెండేళ్లపాటు గ్రామంలో బెల్టుషాపు నిర్వహంచుకోవచ్చని గ్రామస్తులు నిర్ణయించారు. వేలంపాటలో బెల్ట్‌షాపు దక్కించుకున్న వ్యక్తి కాకుండా ఇతరులు గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.25వేలు జరిమానా విధిస్తామని, సమాచారం ఇచ్చిన వారికి రూ.5వేలు పారితోషికం అందజేస్తామని తీర్మానించారు. -
రామన్నపేటలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో
ప్లాస్టీక్ నివారణ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామంలో స్వప్న స్వదేశ్ ఫౌండర్ డా.స్వప్నరావు ఆధ్వర్యంలో ఇంటింటికీ కాటన్ బ్యాగులు ఉచితంగా పంపిణీ చేశారు. ఏప్రిల్‌లో మహిళా సాధికారత కేంద్రం కుట్టుశిక్షణ ప్రారంభించి మూడు బ్యాచ్‌ల్లో 60 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చా రు. ప్లాస్టిక్ భూతంతో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య గుర్తించారు. తన సంస్థలో శిక్షణ పొందిన మహిళల ద్వారానే కాటన్ బ్యాగ్‌లు తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేసినట్లు స్వప్నరావు తెలిపారు. -
ఎకో ఫ్రెండ్లీ బిజినెస్
ప్లాస్టిక్‌తో పర్యావరణం దెబ్బతింటోందని ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించింది. చిరు వ్యాపారులకు పర్యావరణ హితమైన నాన్ ఓవెన్, జ్యూట్ (జనపనార),పేపర్ బ్యాగుల తయారీ ఒక అద్భుతమైన ఉపాధి మార్గంగా మారింది. పుష్కరకాలం క్రితం సిరిసిల్లను ప్లాస్టిక్ నిషేధ పట్టణంగా మున్సిపాలిటీ ప్రకటించింది. ఫలితంగా చిరు వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలు, నిరుద్యోగులు కుటీర పరిశ్రమగా ఆయా ఉత్పత్తుల తయారీ వ్యాపారాలను ఎంచుకుని ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. నాన్ ఓవెన్ బ్యాగులను అతి తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్నారు. సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు, బట్టల షాపులు, స్వీట్ స్టాల్స్‌లో వీటిని వినియోగిస్తున్నారు. జ్యూట్ (జనపనార)తో తయారయ్యే బ్యాగులు చాలాకాలం మన్నుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల రిటర్న్ గిఫ్ట్‌లు, లంచ్ బ్యాగులు, షాపింగ్ మాల్స్‌లో వాడుతున్నారు. ఇక పేపర్ బ్యాగులను బేకరీలు, మెడికల్ షాపులు, ఫ్యాషన్ బ్రాండ్లలో ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా అందిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఇంట్లోనే తయారి విక్రయాలతో చిరు వ్యాపారులు ఈ బిజినెస్‌ను ఎంచుకున్నారు. తయారు చేసిన బ్యాగులపై వ్యాపార సంస్థల పేర్లు, లోగోలను ప్రింట్ చేస్తూ..కస్టమర్ల నుంచి ఆర్డర్లు పొందుతున్నారు. ప్లాస్టిక్ నిషేధం నేపథ్యంలో జూట్ బ్యా గుల వ్యాపారాన్ని ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్నాం. పశ్చిమ బెంగాల్ నుంచి జ్యూట్ బ్యాగులను తెప్పిస్తున్నాం. రూ.40 నుంచి రూ.500 వి లువైన బ్యాగులున్నాయి.పెళ్లిళ్లు, శుభకార్యాలకు, గిఫ్ట్‌లకు, షాపింగ్‌కు మహిళల హ్యాండ్‌బ్యాగులు విక్రయిస్తున్నాం. కళా త్మక డిజైన్లతో బ్యాగులను కస్టమర్లు ఇష్టపడుతున్నారు. ఇవి చాలాకాలం మన్నికతో ఉండటంతోపాటు నూరుశాతం ప ర్యావరణ హితంగా ఉంటాయి. ఆర్డర్లను బట్టి బల్క్‌లో తె ప్పించి స్టాక్‌ను హోల్‌సేల్‌గా, రిటైల్‌గా కస్టమర్లకు అందిస్తాం. – తిరునగరి శ్రీలత, జ్యూట్ బ్యాగుల వ్యాపారి -
పండుగ వేళ తీరని శోకం
చొప్పదండి: ఇంట్లో పండుగ చేసుకుందామని బంధువులను పిలిచిన వ్యక్తి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని రుక్మాపూర్‌లో జరిగింది. ఎస్ఐ నరేశ్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కట్ట రాజేశం(40) ఈ నెల 9న తన ఇంట్లో మైసమ్మ పండుగ నిర్వహించేందుకు వివిధ గ్రామాల్లోని బంధువులను పిలిపించాడు. అదేరోజు రాత్రి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన కోసం శుక్రవారం ఉదయం బంధువులు వెతకగా గ్రామ శివారులోని నర్సరీలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది కనిపించాడు. మృతుడికి ఒక కుమార్తె, నవోదయ విద్యాలయంలో చదువుతున్న ఒక కుమారుడు ఉన్నారు. మూడేళ్లుగా మద్యానికి బానిసై, సరిగ్గా పనికి వెళ్లడం లేదని ఆత్మహత్యపై అనుమానం లేదని మృతుడి భార్య కట్ట రజిత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
ఉరేసుకుని యువకుని బలవన్మరణం
వెల్గటూర్: ఉరేసుకుని ఓ యువకుడు బలవన్మరణా నికి పాల్పడిన ఘటన మండలంలోని మొక్కట్రా వుపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం.. గ్రామానికి చెందిన మేకల గణేష్ (25) వారం క్రితం తన భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ పని దొరక్కపోవడంతో శనివారం వేకువజామున ఇంటికి వచ్చారు. గణేశ్ తన భార్యతో గొడవపడి పుట్టింటికి పంపించాడు. తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరేసుకున్నాడు. తల్లి మధ్యాహ్నం వచ్చి చూసేసరికి శవమై కనిపించాడు. ఉపాధి లేకనే జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడని గణేశ్ తల్లి శాంతవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జ్ ఎస్సై రవీందర్ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిమల్యాల: ఈనెల ఐదున రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న జగిత్యాలకు చెందిన కావేటి వెంకన్న (46) శనివారం మృతి చెందాడు. ఎస్సై సందీప్ కథనం ప్రకారం.. వెంకన్న కొండగట్టులో ఓ శుభాకార్యం నిమిత్తం వెళ్లి.. తిరిగి వెళ్తుండగా నూకపల్లి వరదకాలువ సమీపంలో బైక్ అదుపు తప్పి.. కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. వెంకన్న తల్లి ఉమామహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఐదేళ్ల క్రితం తండ్రి.. ఇప్పుడు తల్లి ..● అనాథలుగా మారిన చిన్నారులు హుజూరాబాద్: ఐదేళ్ల క్రితం తండ్రి కేన్సర్‌తో చనిపోగా.. శనివారం తల్లి బావిలో శవమై కనిపించింది. దీంతో ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారగా.. పట్టణంలోని మామిండ్లవాడలో విషాదం నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. మామిండ్లవాడకు చెందిన చిందం సునీత(45) భర్త ఐదేళ్లక్రితం గొంతు కేన్సర్‌తో చనిపోయాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు శ్రీలేఖ, శివాని ఉన్నారు. సునీత కొన్నాళ్లుగా పట్టణానికి చెందిన మోతో కిరణ్‌తో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ ఎప్పుడూ గొడవ పడుతుండేవారని స్థానికులు తెలిపారు. శుక్రవారం రాత్రి కిరణ్– సునీత కలిసే ఉండగా.. ఉదయం నిద్ర లేచే సమయానికి సునీత కనబడలేదు. స్థానికంగా ఉండే ముత్తోజు భాగ్య శనివారం తన ఇంటి ఆవరణలో ఉన్న చేదబావిలో నీటిని తోడేందుకు బకెట్‌ను వేసింది. మృతదేహం కనిపించటంతో కౌన్సిలర్ భర్త బండ నవీన్‌కు తెలిపింది. ఆయన పోలీస్, అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని బయటకు తీయగా చింత సునీతగా గుర్తించారు. మృతదేహం మెడకు నలుపు రంగు చీరతో ఉరివేసినట్లు ఉంది. సునీత ఆత్మహత్య చేసుకుందా లేక హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సీఐ కరుణాకర్ కేసు నమోదు చేశారు. చిన్నారులు తల్లి మృతదేహం వైపు చూస్తూ ఏడ్చిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది. షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధంపెగడపల్లి: మండలంలోని రాజరాంపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన మాదాసు రాజయ్య శనివారం పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు లేచి ఇంట్లో ఉన్న దుస్తులు, ఇతరత్రా వస్తువులు, రూ.30 వేలు, స్టడీ సర్టిఫికెట్లు దగ్గమయ్యాయి. గ్రామస్తులు మంటలను ఆర్పివేశారు. మొత్తంగా రూ.3లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ ఇస్లావత్ రమేశ్‌నాయక్, గ్రామస్తులు కోరుతున్నారు. -
ఏకో బ్యాగు
● సింగిల్యూజ్డ్ కవర్లతో ప్రమాదం ● అవగాహన పెంచుకుంటున్న ప్రజలు ● పలు ప్రాంతాల్లో నాన్ ఓవెన్, జ్యూట్ బ్యాగ్‌ల విక్రయాలు ● ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి ● ఉపాధి మార్గంతో పాటు పర్యావరణ హితం సిరిసిల్లటౌన్/బోయినపల్లి(చొప్పదండి)/కోనరావుపేట/జమ్మికుంట/కాల్వ శ్రీరాంపూర్/వేములవాడ: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ చిరు వ్యాపారులు నాన్ ఓవెన్, బ్యాగులను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను శాశ్వతంగా దూరం చేస్తూ చిరు వ్యాపారులు పేపర్ బ్యాగులు, జూట్‌బ్యాగులు, నాన్ వోవెన్ బ్యాగుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు. ప్లాస్టిక్ కవర్లతో కలిగే నష్టాలను గ్రామాల్లో వివరిస్తూ పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు జూట్, పేపరు బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. ప్లాస్టిక్ రహిత పల్లెలుగా కొన్ని గ్రామాలు అడుగులు వేస్తుండగా.. వాడినవారికి జరిమానా విధిస్తున్నారు. వేములవాడ ఫంక్షన్‌హాళ్లలో ప్లాస్టిక్‌ను నిషేధించాలని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అధ్యక్షతన మే 30న తీర్మానించారు. పలు ఫంక్షన్‌హాళ్లలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ.. స్టీల్ పాత్రలు వాడుతున్నారు. జూట్ బ్యాగులతో ఉపాధి, ప్లాస్టిక్‌ను నిషేధించిన గ్రామాలపై సండే స్పెషల్..! -
అమ్మను కరోనా తీసుకెళ్లింది
కోల్‌సిటీ: తల్లి మరణంతో కుంగిపోయిన అక్కాచెల్లెళ్లు మహిమ ఐశ్వర్య, కృప మహిమ ఐశ్వర్యను విధి మరోసారి విషాదంలోకి నెట్టింది. కాలం చేసిన గాయం కాలక్రమంలో మానుతుందనుకుంటే రోడ్డు ప్రమాదంలో తండ్రిని కూడా తీసుకెళ్లి అనాథలను చేసింది. తల్లి, తండ్రి మరణంతో దిక్కుతోచక రోదిస్తున్న వారిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. తమ జీవితాల్లో చీకట్లు అలుముకున్నా.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు తండ్రి నేత్రాలను దానం చేసి మానవత్వాన్ని చాటారూ అక్కాచెల్లెళ్లు. మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన మునిమందా లక్ష్మణ్(45) రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆయన మృతితో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న మహిమ ఐశ్వర్య, పదో తరగతి చదువుతున్న కృప మహిమ ఐశ్వర్య అనాథలయ్యారు. బరువెక్కిన ప్రతి హృదయం.. తండ్రి పార్థివదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించిన ఆ ఇద్దరు బిడ్డలు.. అంతిమయాత్రలో శవపేటిక ముందు నడుస్తూ తండ్రికి వీడ్కోలు పలికారు. ఆ దృశ్యం చూసిన ప్రతీఒక్కరి హృదయం బరువెక్కింది. అండగా నిలిచిన హోంగార్డులు దుఃఖంతో కుంగిపోయిన ఆ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులూ వెంటాడాయి. నిరుపేద కుటుంబం కావడంతో లక్ష్మణ్ అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి కూడా లేకపోయింది. విషయం తెలుసుకున్న గోదావరిఖనిలోని తోటి హోంగార్డులు ఆర్థిక సాయం చేసి గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేలా అండగా నిలిచారు. విషాదంలోనూ తండ్రి నేత్రాలు దానం ఇంతటి విషాదంలోనూ ఆ ఇద్దరు కూతుళ్లు సమాజ హితం కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తండ్రి నేత్రాలను దానం చేసి మరో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకొచ్చారు. వారి నిర్ణయంతో వరంగల్ ఎంజీఎంలో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ లక్ష్మణ్.. మృతుడి నేత్రాలు సేకరించారు. తమ జీవితాల్లో చీకట్లు అలుముకున్న వేళ మరోఇద్దరి జీవితాల్లో వెలుగు నింపాలన్న వారి కుమార్తెల నిర్ణయం ప్రతీఒక్కరిని కదిలించింది. నాన్నను ప్రమాదం కబళించింది అనాథలైన ఇద్దరు కూతుళ్లు కన్నీరుచూసి బరువెక్కిన ప్రతీగుండె విషాదంలోనూ తండ్రి నేత్రాలు దానం చేసిన బిడ్డలు -
ప్లాస్టిక్ రహిత దిశగా పల్లెలు
ప్లాస్టిక్‌తో కలిగే నష్టాలను వివరిస్తూ వాటిని నిషేధించే దిశగా గ్రామాలు అడుగులేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ధర్మారం, పల్లిమక్త గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గాలు కృషి చేస్తున్నాయి. గ్రామంలోని దుకాణాదారులకు, వారంవారం జరిగే అంగడిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్‌తో కలిగే నష్టాలు, పేపర్ బ్యాగులతో ప్రయోజనాలను వివరిస్తున్నారు. గ్రామసభలు ఏర్పాటు చేసి పేపర్, జ్యూట్ బ్యాగులు వినియోగించాలని కోరుతున్నారు. ప్లాస్టిక్ వాడితే రూ.వెయ్యి జరిమానా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేశ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, చిరువ్యాపారులతో ఇటీవల సమావేశాలు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు అమ్మినా, వినియోగించినా రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నట్లు హెచ్చరించారు. ఎవరి ఇంటిముందు ప్లాస్టిక్ వ్యర్థాలు క్నపడినా జరిమానా తప్పదని గ్రామంలో టాంటాం వేయించారు. జూలపల్లి మాజీ జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ గ్రామాల్లో విస్తృతంగా బట్ట సంచుల పంపిణీ చేశారు. ధర్మారం గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, వాటి వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. వారసంతలో అమ్మకందార్లు పేపర్, జ్యూట్ బ్యాగులు వినియోగించాలని కోరుతున్నాం. ఈ నిబంధనలను అతిక్రమించేవారికి జరిమానాలు విధించాలని గ్రామపంచాయతీ తరపున నిర్ణయం తీసుకున్నాం. – మిర్యాల్‌కార్ బాలాజీ, సర్పంచ్, ధర్మారం -
వద్దు కొడుకా అన్నా వినలే..
● ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటై.. ఆపై అప్పుల పాలై ● పురుగుల మందు తాగిన యువకుడు ● చికిత్స పొందుతూ మృతి మానకొండూర్: ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడిన యువకుడు అప్పులు చేశాడు. వాటిని తీర్చేదారి లేక పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన పెరుమాండ్ల పవన్ కల్యాణ్ (25) డిగ్రీ పూర్తిచేశాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. ఆపై అప్పుల పాలయ్యాడు. విషయం ఇంట్లో తెలిసింది. శ్రీఆన్లైన్ బెట్టింగులు పెట్టొద్దు బిడ్డాశ్రీ అంటూ నెలక్రితమే తల్లి పద్మ, అన్న పవన్‌కుమార్ నచ్చజెప్పారు. పవన్ కల్యాణ్ చేసిన అప్పు రూ.లక్ష వరకు తీర్చారు. అయిన తీరుమార్చుకోని కల్యాణ్ మళ్లీ ఆన్లైన్ బెట్టింగులకు ఆలవాటు పడ్డాడు. అప్పు తీర్చే మార్గం తెలియక ఈ నెల 6న ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. శనివారం చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి తల్లి పద్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ శ్రీలత తెలిపారు. చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు● సీఎం సభకు వెళ్లి వస్తుండగా ఘటన మేడిపల్లి: జగిత్యాల – కోరుట్ల రహదారిపై మండలకేంద్రం సమీపంలో ఆర్టీసీ బస్సు చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో బస్సు ముందుభాగంగా ధ్వంసమైంది. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఖమ్మంలో శుక్రవారం జరిగిన సమావేశానికి పంపించారు. ప్రజలను వారి స్వగ్రామంలో దింపిన డ్రైవర్ స్వామి, కండక్టర్ నరసింహ నిర్మల్ బయల్దేరారు. శనివారం వేకువజామున మండలకేంద్రం శివారుకు చేరుకోగానే బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్ గాయపడ్డారు. ఇద్దరిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మేడిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశామన్నారు. -
కళాకారుడికి కష్టకాలం
● అనారోగ్యంతో ఆసుపత్రిలో.. వేములవాడరూరల్: ఎవరైనా అత్యవసరంగా రక్తం కోసం ఎదురు చూస్తున్నారంటే రెప్పపాటున వారి వద్ద వాలి రక్తదానం చేస్తాడు. కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్నానంటే తనకు తోచిన సహాయం అందిస్తాడు. సినిమా హీరో చిరంజీవి అభిమానిగా.. వేములవాడలో ప్రముఖ కళాకారుడిగా పేరున్న మారం ప్రవీణ్‌కుమార్(పప్పి) ప్రస్తుతం అనారోగ్యం బారిన పడి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర ఎంతో ఉందని చెబుతున్న పాలకులు.. కళాకారులకు కష్టాలు వస్తే మాత్రం కనికరించడం లేదు. ఉద్యమకారులు, కళాకారులపై ప్రత్యేకంగా ఇటీవల ప్రభుత్వం కమిటీ వేసింది. కానీ ఇప్పటికే ఎంతోమంది ఉద్యమకారులు, కళాకారులు వివిధ కారణాలతో ఆర్థిక పరిస్థితి బాగా లేక అకాల మరణాలు చెందారు. వేములవాడ పట్టణానికి చెందిన ప్రవీణ్ కూడా ఒక కళాకారుడిగా వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగే శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శంకరుడి వేషధారణతో 3 రోజులపాటు ఆలయ ప్రాంతంలో తిరుగుతూ భక్తులను అలరించాడు. లివర్ సమస్యతో నెల రోజులుగా ఆసుపత్రుల వెంట తిరుగుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. 1997 నుంచి డాన్స్ మాస్టర్, డైరెక్టర్, యాక్టర్‌గా చేశాడు. వందలాది పాటలకు హీరోగా చేశాడు. ఎంతోమంది కళాకారులను తయారు చేశాడు. ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్(ఐటీఎఫ్) సంస్థను స్థాపించి ఫౌండర్‌గా ఉన్నాడు. లఘు చిత్రాలు తీస్తూ సామాజిక సేవకుడిగా ఆపదలో ఉన్నవారికి 25సార్లకు పైగా రక్తదానం చేశాడు. లివర్ రీప్లాంటేషన్ చేయాల్సి ఉండగా.. సర్జరీకి రూ.25లక్షల నుంచి రూ.30లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. మెడిసిన్, ఆసుపత్రి ఖర్చులకు మరో రూ.15లక్షలు ఖర్చవుతుందన్నారు. విషయం తెలుసుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు సభ్యులు ఇటీవల రూ.27వేలు అందజేశారు. ఎవరైనా దాతలు ఆర్థిక సాయం చేయాలనుకుంటే ఫోన్ నంబర్ 8125358565కు పంపాలని ఆయన వేడుకుంటున్నాడు. -
ఉపాధి.. అవగాహన
కుట్టుమిషన్, ఎంబ్రాయిడింగ్, మగ్గంవర్క్తో ఉపాధి పొందుతూ.. ప్లాస్టిక్ రహిత కాటన్, పేపర్ డిజైన్ బ్యాగ్‌లు తయారు చేసి 10మందికి ఉపాధి కల్పిస్తున్నారు జమ్మికుంట పరిధిలో ధర్మారానికి చెందిన కంది కట్ల పద్మ. పద్మ మహిళ సంఘం నాయకురాలిగా ఉన్నారు. మెప్మా చేయుతతో కుట్టు శిక్షణ తీసుకొని ఎంబ్రాయిడింగ్, మగ్గంవర్క్ చేస్తున్నారు. మిగిలిపోయిన కాటన్ బట్టతో ఉచితంగా హ్యాండ్‌బ్యాగ్‌లు తయారు చేసి ఇస్తున్నారు. వీటితో పాటు కాటన్, పేపర్ బ్యాగ్‌లు, వాటర్ బాటిల్ పట్టే సంచులు, ఇంట్లో అలంకరణగా పెట్టుకునేందుకు క్లాత్‌తో ప్రింటెడ్ ఫొటోప్రేమ్‌లు, శుభకార్యలకు గిప్ట్‌లు అందిస్తున్నారు. పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ.. పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. -
అబుదాబి వెళ్లే వారికి షాక్
వేములవాడ: ఉపాధి కోసం యూఏఈ (అబుదాబీ) వెళ్లాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం కొత్త నిబంధనలతో షాకిచ్చింది. వీసాల కోసం ఇకపై విధిగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనతో ఆ దేశం వెళ్లే ప్రతిఒక్కరిపై అదనంగా దాదాపు రూ.11 వేల నుంచి రూ. 12 వేల వరకు ఆర్థిక భారం పడనుంది. వీసా ప్రక్రియ కూడా నెలరోజులు ఆలస్యమవుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్లాట్ లభించక ఇబ్బంది పడుతున్నారు. పీసీసీ ఎలా తీసుకోవాలి..? ● పాస్‌పోర్ట్ పొందే విధానంలో పీసీసీని తీసుకోవాల్సి ఉంటుంది. ● ఆన్లైన్ సెంటర్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ● కేటాయించిన తేదీన పాస్‌పోర్ట్ కేంద్రానికి వెళ్లి వచ్చిన తర్వాత పోలీస్ విచారణ ఉంటుంది. ● ప్రక్రియ పూర్తయిన తర్వాత వారం పది రోజుల్లో పీసీసీ సర్టిఫికెట్ చేతికి వస్తుంది. ● ఈ ప్రక్రియకు అధికారికంగా రూ.500 ఫీజు ఉంటే మీ సేవ కేంద్రం నిర్వాహకులు మరో రూ.500వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అటెస్టేషన్ ఖర్చులే అదనం పీసీసీ సర్టిఫికెట్ వచ్చినంత మాత్రాన సరిపోదు. అసలైన ఖర్చంతా ఇక్కడే మొదలవుతుంది. దేశంలోని యూఏఈ ఎంబసీ కౌన్సులేట్ కేంద్రాలైన హైదరాబాద్, త్రివేండ్రం లేదా ఢిల్లీలలో ఏదో ఒక చోట ఈ సర్టిఫికెట్‌పై తప్పనిసరిగా ధ్రువీకరణ చేయించాల్సి ఉంటుంది. ఈ అటెస్టేషన్ ప్రక్రియకు 300 దిర్హామ్‌ల వరకు ఖర్చవుతుందని గల్ఫ్ ప్రతినిధులు చెబుతున్నారు. మొత్తంగా రూ.12 వేల అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ ఫీజులు, రానుపోను ప్రయాణ ఖర్చులు, ఎంబసీ అటెస్టేషన్ ఫీజులన్నీ కలుపుకొంటే ఒక్కొక్కరిపై దాదాపు రూ. 11 వేల నుంచి రూ.12 వేలు వరకు అదనపు భారం పడుతోంది. పైగా ఈ కొత్త రూల్ వల్ల వీసాలు చేతికి అందడానికి అదనంగా నెల రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది నిరుద్యోగ గల్ఫ్ కార్మికులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ‘పీసీసీ’ నిబంధన అదనంగా రూ.12 వేల భారం వీసాల జారీ మరో నెల ఆలస్యం యువతపై ఆర్థిక భారం.. ఆపై తిప్పలు -
నాడు తండ్రి.. నేడు తల్లి మృతి
గొల్లపల్లి: ఆ ఇంటిని తొమ్మిది నెలల క్రితం విధి వెక్కిరించింది. ఆర్థిక ఇబ్బందుల సుడిగుండంలో చిక్కుకున్న కుటుంబ పెద్ద గడ్డిమందు తాగి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. రెక్కలు తెగిన పక్షిలా మారినప్పటికీ ముగ్గురు పిల్లలను గుండెకు హత్తుకుని కన్నీళ్లను దిగమింగుతూ ఆ తల్లి కూలీ పనిచేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తోంది. ఒంటరితనం, అప్పులభారం, పిల్లల భవిష్యత్‌పై ఆందోళన ఆమెను కుదురుగా ఉండనీయలేదు. మనోవేధనకు గురైన ఆ తల్లి చివరకు ముగ్గురు బిడ్డలను నడిరోడ్డుపై వదిలేసి తనువు చాలించింది. ఈ ఘటన గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో శనివారం విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. రాపల్లికి చెందిన కళ్లపల్లి హరీశ్, గౌతమి దంపతులకు వర్షిత (13), రోహన్ (11), రోహిత్ (7) సంతానం. వీరు స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. హరీశ్ ఆర్థిక ఇబ్బందులతో గడ్డి మందు తాగి తొమ్మిది నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి ముగ్గురు చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న గౌతమి తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. ఆర్థిక కష్టాలు తీర్చే దారి లేక జీవితంపై విరక్తితో ఇంట్లోనే ఉరేసుకుంది. అనాథలైన పిల్లలు నాడు తండ్రి చనిపోయినా.. ఆయన లేని లోటును భర్తీ చేసిన తల్లి కూడా మృతిచెందడంతో ఆ పసిపిల్లలు శవం ముందు ఏడుస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి. అమ్మా లే.. ఆకలేస్తుందంటూ రోదించిన తీరు గ్రామాన్ని కన్నీటిసంద్రంలో ముంచేసింది. అనాథలైన ముగ్గురుపిల్లల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ చిన్నారులను ఆదుకునేందుకు మానవతావాదులు ముందుకు రావాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
సిటీలో సర్ స్లో.. 24వ తేదీ డెడ్‌లైన్
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ నగరంలో గడువులోగా వందశాతం పూర్తి కావడం గగనంగానే కనిపిస్తోంది. ఈ నెల 24వ తేదీలోగా వందశాతం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కావాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయగా ఇప్పటివరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 18 శాతం ఆన్లైన్ పూర్తయింది. మరో 12 రోజుల్లో 82 శాతం ప్రక్రియను పూర్తి చేయాలంటే కష్టపడాల్సిన పరిస్థితి. 18 శాతమే ఆన్లైన్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 390 పోలింగ్ బూత్‌లు ఉండగా, నగరపాలకసంస్థ పరిధిలో దాదాపు 315 వరకు ఉన్నాయి. ఓటరుకు ఎన్యుమరేషన్ ఫామ్‌లు ఇచ్చి, తిరిగి తీసుకొనే ప్రక్రియను గత నెల 25వ తేదీన చేపట్టగా, ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. బీఎల్వోలు సంబంధిత బూత్‌ల పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్ అందించారు. పూరించి తిరిగి ఇచ్చిన ఫాంలను ఆన్లైన్ చేస్తున్నారు. కొంతమంది నేరుగా ఆన్లైన్ చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 18 శాతం మాత్రమే ఎన్యుమరేషన్ ఫామ్‌ల ఆన్లైన్ ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 24వ తేదీలోగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మరోసారి హెచ్చరించింది. దీనితో 12 రోజుల వ్యవధిలో 82 శాతం పూర్తి చేయడం అధికారులకు పెను సవాల్‌గా మారింది. ఫారాలు అందలే... ఎన్యుమరేషన్ ఫామ్‌ల పంపిణీ వందశాతం పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా డివిజన్లలో ఇప్పటివరకు ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫామ్‌లు అందలేదు. ఆయా ఓటర్లు స్థానికంగా లేకపోవడం, ఇతర పాత్రాలకు అద్దెకు వెళ్లడం, ఫోన్‌నంబర్లు మారడం, ఫోన్లలో దొరకకపోవడం తదితర కారణాలతో ఫామ్‌లు ఇవ్వలేకపోయారు. అంతేకాకుండా కొంతమంది ఓటర్లకు సంబంధించి ముద్రించిన ఫామ్‌లు కూడా సంబంధిత బీఎల్ఓలకు రాకపోవడం మరో కారణం. దీంతో ప్రక్రియకు గడువు సమీపిస్తున్నప్పటికీ ఫామ్ ఇవ్వలేదని బీఎల్వోలకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఫామ్ నింపడమే సమస్య సర్ ప్రక్రియలో ఓటరుకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫామ్ నింపడమే ప్రధాన సమస్యగా మారింది. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఓటరు పేరిట ఉన్న ఫామ్‌ను అందిస్తున్నారు. ఓటరు ఆ ఫామ్‌ను పూర్తి చేసి తిరిగి బీఎల్ఓకు అందచేస్తే ఆన్లైన్ చేస్తారు. చాలా మంది ఫామ్‌లను పూరించే బాధ్యత బీఎల్వోలకు అప్పగిస్తున్నారు. తామే ఫామ్ నింపితే ఎక్కడ తప్పు పోతుందో, ఓటుంటుందో పోతుందో అనే ఆందోళనతో ఎక్కువగా ఓటర్లు బీఎల్ఓల వైపే మొగ్గుచూపుతున్నారు. మరికొంతమంది బీఎల్ఓలకు కూడా ఫామ్‌లు నింపడం, ఆన్లైన్ చేయడం సక్రమంగా రాకపోవడంతో పని ఒత్తిడి పెరిగిపోతోంది.సర్ ప్రక్రియ వేగం పెంచేందుకు ప్రతి బీఎల్వోకు నగరపాలకసంస్థ నుంచి సపోర్టింగ్ స్టాఫ్‌ను ఇచ్చాం. సూపర్వైజర్లు, మానిటరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. బీఎల్ఓలకు ఆన్లైన్ ఆపరేటర్లను కూడా ఇచ్చాం. దీనితో ఆన్లైన్ ప్రక్రియ వేగం అందుకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గడువులోగా పూర్తి చేస్తామనే విశ్వాసం ఉంది. – ప్రఫుల్ దేశాయ్, ఈఆర్వో, నగరపాలకసంస్థ కమిషనర్ -
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026
సిరిసిల్ల/విద్యానగర్: గానకోకిల ఎస్.జానకి బాల్యం సిరిసిల్లలోనే సాగింది. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి సంపతులకు 1938 ఏప్రిల్ 23న జన్మించిన జానకీ.. 1945 ప్రాంతంలో సిరిసిల్లలో ఉన్నారు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు కావడంతో ఉద్యోగరీత్యా కార్మికక్షేత్రానికి వచ్చారు. సిరిసిల్లలోనే జానకి సంగీత ఓనమాలు నేర్చుకున్నారు. తన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం కూడా ఇక్కడే సాగింది. స్థానిక నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి ఆమెకు మెళకువలు నేర్పారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే సిరిసిల్లలో మొట్టమొదటి సారిగా స్టేజీఎక్కి పాట పాడారు. తన చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఎడ్లబండిలో వేములవాడకు వెళ్లి ‘బాలనాగమ్మ’ సినిమా చూసినట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ సినిమాలోని పాటలను అచ్చంగా అలాగే అనుకరిస్తూ.. ఏడుస్తూ.. పాడటంతో అందరూ అభినందించారని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ పాట కోసం తనను పలువురు ఇళ్లలోకి పిలుచుకుని పాడించుకునే వారని చెప్పారు. సిరిసిల్ల వీధుల్లో పెరిగిన జానకీ ఆ తర్వాత మద్రాసు (చైన్నె) చేరుకుని వేలాది పాటలు పాడి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే దిగ్గజ గాయనిగా ఎదిగారు. సంగీత ప్రయాణానికి పునాది వేసిన ప్రాంతంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. బాల్య స్మృతులు వెతుక్కుంటూ సిరిసిల్లకు.. గాయని జానకి తన బాల్య స్మృతులను వెతుక్కుంటూ 2002లో సిరిసిల్లకు వచ్చారు. 64 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చిన ఆమె చిన్నప్పుడు మెదిలిన లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ పరిసరాల్లోనే తాను ఆడుకున్నానని, ఉదారువాగు నుంచి మంచినీటిని బిందెళ్లో తెచ్చేవారమని గుర్తుచేశారు. అప్పటి సిరిసిల్ల సీఐ ఉమామహేశ్వరశర్మ గాయని ఎస్.జానకిని సత్కరించారు. జానకి మరణించినట్లు తెలియడంతో పలువురు సిరిసిల్ల వాసులు సంతాపం తెలిపారు.మన బాలగాయనే.. గానకోకిల! -
హర్డిల్ అదిరే
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లావ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉందని డీవైఎస్వో వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో శనివారం నిర్వహించిన స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూల్ డౌన్ ఎక్సర్సైజ్ గురించి వివరించారు. ఫిజి యోథెరపిస్ట్ కృష్ణ ప్రసాద్, ఫుట్‌బాల్ కోచ్ రహీం, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు అంతటి శంకరయ్య, ఆడేపు శ్రీనివాస్, ఎస్జీఎఫ్ కార్యదర్శి బి.వేణుగోపాల్ పాల్గొన్నారు. -
విశ్వవిద్యాలయ స్థాయి క్రీడలకు పెద్దపీట
కరీంనగర్ సిటీ: విద్యార్థులలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు అధునాతన సింథటిక్ ట్రాక్ దోహదపడుతుందని శాతవాహన యూ నివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్ తెలిపారు. శాతవాహన క్రీడా మైదానంలో సుమారు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ పనులకు రిజిస్ట్రార్ సతీశ్ కుమార్‌తో కలిసి శనివారం భూమి పూజ చేశారు. ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ క్రీడా వసతులను బలోపేతం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన, బలమైన యువతను దేశానికి అందించవచ్చని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ సతీశ్ కుమార్ మాట్లాడుతూ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా ట్రాక్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వీసీ ఓఎస్డీ హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్‌కుమార్, ఆర్ట్స్, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, విశ్వవిద్యాలయ ఇంజినీర్ ప్రకాశ్‌రావు పాల్గొన్నారు. మహిళా ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలికరీంనగర్ క్రైం: మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు మర్యాదగా వ్యవహరించాలని సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. శనివారం కరీంనగర్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నిర్వహణ తీరుతో పాటు బాధితులకు అందుతున్న సేవలను పరిశీలించారు. పెండింగ్‌లో కేసులను సమీక్షించి, వాటి ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా బాధితులకు ‘భూమిక’ ద్వారా అందిస్తున్న కౌన్సెలింగ్ సేవలపై ఆరా తీశారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ పుల్లయ్య ఉన్నారు. కొత్తపల్లి: విద్యుత్ తీ గలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేప థ్యంలో ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.వావిలాలపల్లి ఫీడర్ పరిధిలోని హోండా షోరూం, పాత అలహాబాద్బ్యాంక్, జెండా గద్దె ప్రాంతాలు, ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.శివనగర్ ఫీడర్ పరిధిలోని శివనగర్, సప్తగిరికాలనీ, రాంచంద్రాపూర్ కాలనీ, ప్రగతినగర్, రాంనగర్, ఉదయం 9.30 నుంచి 11.30 వరకు 11 కె.వీ.భగత్‌నగర్, కలెక్టర్ కాంప్లెక్స్ ఫీడర్ల పరిధిలోని కట్టరాంపూర్, వేంకటేశ్వరకాలనీ, విఘ్నేశ్వరకాలనీ, భగత్‌నగర్, ఎర్రగుట్ట, ముకరంపుర, బస్టాండ్, కలెక్టర్ ఆఫీసు, వన్‌టౌన్, జెడ్పీ ఆఫీసు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1,2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. రేకుర్తిలో.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రేకుర్తి సబ్‌స్టేషన్ పరిఽ దిలోని సమ్మక్క గద్దెలు, కంటి ఆసుపత్రి, ఇందిరమ్మ కాలనీ, స్వామికాలనీ, షేక్బీకాలనీ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ‘వసూళ్ల’ దందా?కరీంనగర్ క్రైం: కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల వ్యవహారంలో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికి కోర్టుకు వెళ్తే జైలు శిక్ష పడుతుందనే భయంతో పోలీసులను సంప్రదించిన కొందరు వాహనదారుల నుంచి రూ.15వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. స్టేషన్‌రైటర్, కోర్టు కానిస్టేబుల్ కుమ్మకై ్క డబ్బులిచ్చిన వారి స్థానంలో డూప్లికేట్ వ్యక్తులను కోర్టుకు పంపించడం, ఫేక్ చలాన్లు చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. విషయం తెలిసి సీపీ ఏఆర్ ఏసీపీ సి.ప్రతాప్‌తో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ జరిపి ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఆర్ఎస్సై, కానిస్టేబుల్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. దీని వెనక ఎవరున్నా చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. -
ఎకో బ్యాగు..
ఇతనిపేరు గాలి పరశురాములు. సిరిసిల్ల. నేత కుటుంబం. 1995లో ఆర్టిస్టుగా జీవితా న్ని ప్రారంభించాడు. 2000 దశకం తర్వాత వచ్చిన ఫ్లెక్సీలతో ఉపాధి కరువైంది. పర్యావరణానికి హాని కలిగించే ఫ్లెక్సీలతో ఉపాధి లేక ప్రత్యామ్నాయం వైపు ఆలోచన చేశా డు. 2011లో నాన్‌వోవెన్ బ్యాగును చూశా డు. అప్పటికి సిరిసిల్లలో అవి తయారు కావట్లేదు. లోతుగా పరిశీలన జరిపి, ముడిసరుకులు తెచ్చి ఇంట్లోనే రూ.లక్ష పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాడు. ఇప్పుడు తనతో పాటు ఐదుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. సిరిసిల్ల, ధర్మపురి, కొండగట్టు తదితర ప్రాంతాల నుంచి ఆర్డర్లు పొందుతూ నాన్ వోవెన్ బ్యాగులు సరఫరా చేస్తున్నాడు. -
ఓటు గోవిందా!
తాత పేరు లేదా?స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లావాసులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా రెండు పేర్లున్న సింగరేణి కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు ఓటర్లుగా మారిన వారి పిల్లలకు తాతలు, నానమ్మలు కీలకంగా మారారు. రెండు దశాబ్దాల కింద సొంతూళ్ల వారు వేసిన ఓట్లే ప్రస్తుత సర్‌లో సాయపడుతున్నాయి. మారుపేరుతో సింగరేణిలో విధులు నిర్వహించిన పలు సింగరేణి కార్మికులు సర్ ప్రక్రియలో తమ సొంత పేర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. 2002లో మారుపేరుతో పనిచేసిన కార్మికుల్లో చాలామంది సొంతూళ్లకు వచ్చాక సొంతపేరుతో ఓటు నమోదు చేయించుకున్నారు. వీరందరి ఓట్లకు మ్యాపింగ్ చేసే సమయంలో 2002 జాబితాలో వీరు ఓటేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. దీంతో వీరు, కుటుంబ సభ్యులు తమ ఓట్లు పోయినట్లేనని ఆందోళన చెందుతున్నారు. – సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
శనివారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2026
కాడెడ్లు పోయి.. పాడి ఆవు వచ్చిందిఎల్నినో సాగురంగాన్ని సంక్షోభంలోకి నెట్టుతోంది. అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. వర్షాల్లేక పని లేకుండా పోయింది. రైతులు ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తున్నారు. కొందరు పాడి పరిశ్రమను ఆశ్రయిస్తూ ఆవులు, గేదెలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత జీవన పోరాటంలో ఇవి తప్పడం లేదని రామడుగు మండలం షానగర్‌కు చెందిన రైతు సైనాల లక్ష్మయ్య తెలిపాడు. తనకున్న కాడెడ్లను అమ్మి ఒక పాలిచ్చే ఆవును కొనుగోలు చేశానని, పంటలపై నమ్మకం లేదని, పాల వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నట్లు వివరించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు
● సీపీ గౌస్ ఆలం గన్నేరువరం: శాంతిభద్రతల పరిరక్షణ, నేరా ల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని సీపీ గౌస్ ఆలం అన్నారు. మండలంలోని ఖాసీంపేటలో 9, పారువెల్లలో 8, గునుకులకొండాపూర్‌లో 4 సీసీ కెమెరాలను, వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలోని ప్రతి మూలను సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంచాలన్నదే పోలీసుల ముఖ్య ఉద్దేశం అన్నారు. మరో 700 కెమెరాలు అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. పిల్లలు, యువత ఆన్లైన్ గేమింగ్ బారిన పడి డబ్బులు పోగొట్టుకుని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలన్నారు. రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, సీఐ బొల్లం రమేశ్, ఎస్సై నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
భూ సర్వే వేగవంతం చేయండి
కరీంనగర్‌అర్బన్: జిల్లాలో భూముల సర్వే, రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్డీవోలు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో చేపట్టిన భూముల సర్వే నంబర్లపై రీ–సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 70 గ్రామాల్లో భూముల సర్వే నంబర్లపై సర్వే చేపడుతున్నామని, ఇప్పటికే ఏడు గ్రామాల్లో పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. సుమారు 94,637 ఎకరాల భూముల సర్వే చేపట్టనున్నట్లు వివరించారు. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి 10మంది బీఎల్వోలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందిరమ్మ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు షర్మిల, జలకుమారి పాల్గొన్నారు. -
3.. 16.. 17.. 23
‘ప్రచేష్ట–గ్రేడింగ్’లో మెరిసిన మన జిల్లాలుసాక్షి,పెద్దపల్లి: కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్– 2.o (2024–25) నివేదికలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెరుగైన పనితీరు కనబరిచింది. పాఠశాల విద్యా వ్యవస్థ నాణ్యత, అభ్యసన ఫలితాలు, వసతులు, డిజిటల్ లెర్నింగ్, సమాన విద్యావకాశాలు, పరిపాలన వంటి ఆరు కీలక డొమైన్ల ఆధారంగా నిర్వహించిన ఈ అంచనాలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో 3వ స్థానాన్ని సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. 600 మార్కులకు 51 శాతం నుంచి 60 శాతం వరకు స్కోరు సాధించిన జిల్లాలను ‘ప్రచేష్ట–1’ గ్రేడింగ్ పరిధిలోకి చేరుస్తారు. 324 స్కోర్‌తో పెద్దపల్లి ప్రచేష్ట–1 గ్రేడింగ్‌లో చేరింది. 41 శాతం నుంచి 50 శాతం స్కోర్ సాధించిన సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాలు ప్రచేష్ట–2 గ్రేడింగ్‌లో చోటు సాధించాయి. -
మీ సేవ.. యూరియా బుకింగ్
ప్రభుత్వం మీ సేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లావ్యాప్తంగా 173 మీసేవ కేంద్రాల ద్వారా శుక్రవారం నుంచి బుకింగ్ ప్రారంభమైంది. రైతులు మీ సేవ కేంద్రంలో పట్టాదారు పాసుపుస్తకం, సెల్ నంబర్, ఎన్ని బస్తాలు అవసరం, ఎరువులదుకాణం వివరాలు నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. అనంతరం ఎక్కడి దుకాణంలో యూరియా లభిస్తుందో ఐడీ నంబర్ వస్తుంది. రెండు రోజుల్లోగా సంబంధిత దుకాణం నుంచి యూరియా తీసుకెళ్లొచ్చు. ఇందుకు మీసేవ నిర్వాహకులు యూజర్ చార్జీల కింద రూ.10 తీసుకుంటున్నారు. – కరీంనగర్‌రూరల్ -
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం
చొప్పదండి: పట్టణ శివారులో నిర్మించిన వంద పడకల ఆస్పత్రి వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో ఆస్పత్రిని పరిశీలించడానికి బీఆర్ఎస్ నాయకులు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. బీఆర్ఎస్ నాయకులు గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నింగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. రవి శంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో వందపడకల ఆస్పత్రి పనులను ప్రా రంభించామని, కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి తేవడంలో ఆలస్యం చేస్తోందని విమర్శించా రు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే ఆసుపత్రిని ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఏనుగు రవీందర్‌రెడ్డి, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, బత్తిని సంపత్‌గౌడ్, గంగారెడ్డి, రవీందర్ పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ కళాశాల శాశ్వత భవనానికి భూమిపూజ
కరీంనగర్‌సిటీ: హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామంలో రూ.29 కోట్లతో నిర్మించే శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాల శాశ్వత భవనాలకు శుక్రవారం రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గనులు, భూగర్భ వనరులశాఖ మంత్రి వివేక్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ శాతవాహన విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల తొలి విద్యా సంవత్సరం విజయవంతంగా పూర్తిచేసుకుని, రెండో విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులకు అత్యున్న త ప్రమాణాల సాంకేతిక విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రూ.15 కోట్ల వ్యయంతో అత్యాధునిక హాస్టల్ భవనాల నిర్మాణానికి విశ్వవిద్యాలయ పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు వెల్ల డించారు. త్వరలోనే హాస్టల్ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. విద్యార్థులకు లాప్ టాప్‌లు, సైకిళ్లు పంపిణీ చేశారు. ఎస్‌యూ వీసీ ఉమేశ్ కుమార్, రిజిస్ట్రార్ సతీశ్ కుమార్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ పాల్గొన్నారు. అర్హులందరికీ ఓటుహక్కు ఉండాలిచిగురుమామిడి: అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటుహక్కు కల్పించే బాధ్యత బీఆర్ఎస్ బీఎల్ఏలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ సూచించా రు. చిగురుమామిడిలో శుక్రవారం బీఎల్ఏలతో అవగాహన సమావేశం నిర్వహించారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు అన్ని గ్రామాల్లో ఓటరు సవరణ ఫారాలను పూర్తి వివరాలతో పొందుపర్చి ఓటర్లకు సహకరించాలన్నారు. జూలై 24 వరకు గడువు ఉన్నందున సాధ్యమైనంత త్వరగా జాబితా ఫారాల ను బీఎల్వోలకు అందజేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు మాట్లాడుతూ దొంగ ఓట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులపై ఉందన్నారు. నాయకులు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మామిడి అంజయ్య, ఆకవరం శివప్రసాద్ పాల్గొన్నారు. రూరల్ సబ్ డివిజన్లో -
విద్యారంగం నిర్వీర్యం
కరీంనగర్‌టౌన్: విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. శుక్రవారం వామపక్ష విద్యార్థి సంఘాల అధ్వర్యంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ పాటించారు. తెలంగాణ చౌక్ నుంచి బైక్ ర్యాలీగా ప్రభుత్వ విద్యాసంస్థలను బంద్ చేయించేందుకు వెళ్తున్న ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్బీ, ఏఐఎఫ్డీఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పీటీసీకి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజు భారాన్ని తగ్గించాలన్నారు. ఎన్ఈపీ–2020ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి రాణాప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
చదువుల వేదిక ముస్తాబు
జిల్లా కేంద్రంలోని నూతన గ్రంథాలయ భవనం తుది మెరుగులు దిద్దుకుంటోంది. భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా, త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు విజ్ఞానం, శాస్త్ర సాంకేతికతపై అవగాహన కల్పించేలా భవనం గోడలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. పుస్తకాలు చదువుతున్న విద్యార్థుల చిత్రాలు, పుస్తకాల వరుసలు, అంతరిక్షం, గ్రహాలు, విజ్ఞానానికి సంబంధించిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. – కరీంనగర్‌కల్చరల్ -
బ్రేక్‌కు అడ్డుపడిన టిఫిన్ బాక్స్
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): టిఫిన్ బాక్స్ బ్రేక్‌కు అడ్డుపడి అదుపుతప్పిన ప్రైవేటు స్కూల్ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన గురువారం కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెగడపల్లిలోని ప్రైవేటు స్కూల్‌కు చెందిన బస్సు ఉదయం మంగపేట, తెనుగుపల్లె, కూనారం గ్రామాలకు చెందిన సుమారు 40 మంది విద్యార్థులను బస్సులో తీసుకెళ్తుండగా ప్రమాదానికి గురయింది. విద్యార్థులు క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. స్కూల్ బ్యాగు నుంచి టిఫిన్ బాక్స్ జారిపడి బ్రేక్‌కు అడ్డు వచ్చిందని డ్రైవర్ పేర్కొన్నాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ఈఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఫైనాన్స్‌లో కొత్తబస్సులు కొనుగోలు చేశామని, దేవుడి దయతో విద్యార్థులు, డ్రైవర్ క్షేమంగా బయటపడటం అదృష్టంగా భావిస్తున్నట్లు స్కూల్ కరస్పాండెంట్ పేర్కొన్నారు. అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన స్కూల్ బస్సు -
అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
కరీంనగర్‌టౌన్: గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్‌లు, కార్యదర్శులు పని చే యాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్వి ని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పంచాయతీల సమగ్ర అభివృద్ధిపై సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులపైనే ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకునే దిశగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. పంచాయతీరాజ్ డిప్యూటీ కమి షనర్ కె.అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈజీఎస్ కింద అమలు చేస్తున్న వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టొచ్చన్నారు. జిల్లా పంచాయతీ అధి కారి జగదీశ్వర్ మాట్లాడుతూ.. సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో పని చేయా లన్నారు. జెడ్పీ సీఈవో పవన్‌కుమార్, డీఆర్డీవో గీత, పీఆర్ డీఈ జనార్దన్ పాల్గొన్నారు. చామనపల్లిలో శిక్షణ కలెక్టర్ పర్యటనకరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చామనపల్లిలో గురువారం శిక్షణ కలెక్టర్ హరిప్రసాద్ పర్యటించారు. కంపోస్టుషెడ్, నర్సరీ, వైకుంఠధామం, రింగ్కంపోస్టులను పరిశీలించారు. తడి, పొడి చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ తీరును పంచాయతీ కార్యదర్శి మహేందర్రావును అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. సర్పంచ్ బోగొండ ఐలయ్య, ఉపసర్పంచ్ దూడం శ్రీనివాస్, జీపీవో వీరేశం, ఫీల్డ్అసిస్టెంట్ అంజనేయులు పాల్గొన్నారు. పాఠశాలల్లో ‘అన్న, అక్క మెంటర్షిప్’ కరీంనగర్‌సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రా రంభించిన అన్న, అక్క మెంటర్‌షిప్‌లో భాగంగా గురువారం ఎస్సారార్ కళాశాల బీకాం, బీబీఏ ఐదో సెమిస్టర్, బీకాం థర్డ్ సెమిస్టర్ విద్యార్థులు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఏఐ, డిజిటల్ లర్నింగ్ శిక్షణపై తరగతులు ప్రా రంభించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్, మెంటర్షిప్ జిల్లా నోడల్ అధికారులు మధు, రాజేష్, మల్లారెడ్డి, ఆంజనేయులు, గుర్రం రాజేందర్, ఉన్నత విద్య జేఏసీ చైర్మన్ కడారు సురేందర్ రెడ్డి, హెచ్ఎంలు, శ్రీనివాస్ రెడ్డి, హర్ జ్యోతి కౌర్, సమన్వయకర్తలు పాల్గొన్నారు. నకిలీ ఎరువులు పట్టివేతకరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం మొ గ్ధుంపూర్లో బుధవారం వ్యవసాయాధికారులు నకిలీ ఎరువులను పట్టుకున్నారు. గ్రామంలో ఇద్దరు రైతుల వద్ద నకిలీ ఎరువులున్నాయనే సమాచారంతో ఏవో సత్యం తనిఖీలు చేపట్టారు. ఒక్క రైతు వద్ద 9 బస్తాలు, మరో రైతు వద్ద 12 బస్తాల కోరమండల్ పేరిట 28–28–0 కాంప్లెక్స్ ఎరువులు లభించాయి. వీటిని కోరమండల్ కంపెనీ ప్రతినిధులు వచ్చి పరిశీలించి తమ ఉత్పత్తి కాదని నిర్ధారించారు. ఓ వ్యక్తి త మకు విక్రయించాడని రైతులు తెలిపారు. ఏవో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. దరఖాస్తులు ఆహ్వానంచొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు ప్రిన్సిపాల్ కె.బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తులను జూలై 31లోగా నవోదయ వెబ్సైట్ ద్వారా పంపించాలని కోరారు. ఐదోతరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. మల్యాల, జగిత్యాల, మెట్పల్లిలో చదువుతున్న ఐదోతరగతి విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు నవోదయ విద్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
బతుకుబాటలో బలి
వేములవాడఅర్బన్: బతుకుదెరువు వెతుక్కుంటూ వచ్చిన వలసజీవి ఊపిరి ఆగిపోయింది. తోటి కూలీలతో కలిసి నాట్లు వేసి వస్తుండగా మృత్యువు రూపంలో వచ్చిన ఆర్టీసీ బస్సు ఓ కూలి నిండు ప్రాణాలను బలిగొంది. అప్పటి వరకు అందరితో కలిసి ఆడుతూ.. పాడుతూ పని చేసిన వ్యక్తి రోడ్డుపై రక్తపు మడుగులో విగతజీవిగా పడిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు, బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా పౌర్ణ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ఈనెల 5న బోయినపల్లి మండలం జగ్గారావుపల్లెకు వచ్చారు. గురువారం ఉదయం తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లో వరినాటు వేసేందుకు 23 మంది కూలీలు టాటా ఏస్ వాహనంలో వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా వేములవాడ మండలం అనుపురం స్టేజీ వద్ద వీరి వాహనాన్ని వెనుక నుంచి సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టింది. బస్సు వేగంగా ఢీకొట్టడంతో ఆటో రోడ్డు కిందకు పల్టీలు కొట్టింది. ఈ సంఘటనలో వాసుదేవ్ అతుల్(35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో 17 మంది మహిళలు, మిగతా ఆరుగురు పురుషులు, డ్రైవర్ ఉన్నారు. గాయపడ్డ వారిలో వేములవాడ ఏరియా ఆస్పత్రికి 13 మందిని, సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి 8 మందిని 108లో తరలించారు. తీవ్రంగా గాయపడ్డ అర్చన, రంజి ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు ఆర్టీసీ బస్సు ఏటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టగా.. ఆటో ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు నిమ్మపల్లికి చెందిన గంగాధర్ గాయపడ్డాడు. సంఘటన స్థలంలో వలస కూలీలు రోడ్డుపై పడిపోవడంతో వాతావరణం భీతావహంగా మారింది. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ఎస్పీ మహేశ్ బీ గీతే, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, టౌన్ సీఐ వీరప్రసాద్తో కలిసి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలి సిరిసిల్లటౌన్/వేములవాడఅర్బన్: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వైద్యాధికారులను ఆదేశించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేములవాడ, సిరిసిల్ల ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి పరామర్శించారు. వైద్యాధికారులు, ఆస్పత్రి సూపరింటెండెంట్లతో మాట్లాడి బాధితులకు అత్యవసర వైద్యసేవలు అందేలా చూడాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గడ్డం నర్సయ్య, ఆర్ఎంవో డాక్టర్ సుమన్ మోహన్‌రావు తదితరులున్నారు. ఉపాధి వెతుక్కుంటూ జిల్లాకు వచ్చిన వలస కూలీలు నాట్లు వేసి వస్తుండగా వెనుక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు టాటా ఏస్ వాహనంలో 23 మంది కూలీలు ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం పరామర్శించిన విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేశ్ బీ గీతే -
700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 700 సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యమని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని సీపీ గౌస్ ఆలం అన్నారు. జమ్మికుంట టౌన్, రూరల్ సీఐలు రామకృష్ణ, పులి వెంకట్ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నీ విజేతలకు బహుమతులు అందించారు. క్రికెట్ టోర్నీ ప్రారంభించారు. కోరపల్లి, సైదాబాద్ గ్రామాల్లో 21సీసీ కెమెరాలు ప్రారంభించారు. ప్రీప్రైమరీ పాఠశాలను ప్రారంభించారు. జమ్మికుంటలో ఆటో డ్రైవర్లు, విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ యువత సైబర్ నేరాలు, ఆన్లైన్ గేమింగ్, డ్రగ్స్, మత్తు పదార్థాలువి నియోగంతో జీవితాలు నాశనం చేసుకోకుండా క్రీడలపై దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల్లో పోలీసులే కాకుండా ప్రతి పౌరుడు బాధితులకు సహకారంగా నిలవాలన్నారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి, ఎస్సైలు అవుల తిరుపతి, స్వాతి, క్రాంతి కుమార్, శేఖర్‌రెడ్డి, ఎంఈవో హేమలత పాల్గొన్నారు. -
జనరేటర్‌తో నారుమడికి నీరు
● ఆరు రోజుల క్రితం కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ ● పట్టించుకోని అధికారులు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆరు రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోగా.. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. విసిగివేసారిపోయిన రైతు జనరేటర్ సాయంతో నారుమడిని బతికించుకుంటున్నాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన దాసరి సత్తయ్యకు రాచర్లతిమ్మాపూర్ శివారులో తనకున్న నాలుగెకరాల్లో వరి సాగుచేసేందుకు నారు పోసి, దుక్కిని సిద్ధం చేశాడు. ఈక్రమంలోనే ఆరు రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. ఈ విషయమై విద్యుత్ అధికారులను కలిస్తే వారు స్పందించలేదు. దీంతో నారుమడికి నీరు అందించేందుకు రోజుకు రూ.2500 వెచ్చించి జనరేటర్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికై నా విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు చేయాలని రైతులు కోరుతున్నారు. -
ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలి
కరీంనగర్ అర్బన్: జిల్లాలో లోటు వర్షపాతం నమోదవుతున్నందున్న, ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం, వానాకాలం సాగు, తదుపరి కార్యాచరణ అంశంపై వ్యవసాయ, నీటిపారుదల తదితరశాఖల అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు లోటు వర్షపాతం ఉందని, ఎల్ నినో ప్రభావం కూడా కనిపిస్తున్నందున ఆరుతడి పంటలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు వంటి పంటల సాగు ఆవశ్యకత తెలియజేయాలని ఆదేశించారు. ఆన్లైనలో యూరియా అమ్మకాల ప్రక్రియ కొనసాగుతున్నందున జిల్లాలో ఎరువుల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని స్పష్టం చేశారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వడ్లను మాత్రమే సాగు చేయాలని, తద్వారా బోనస్ పొందవచ్చని సూచించారు. సదరు రకాలను ప్రతి రైతుకు తెలియజేయాలని అన్నారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మండలాల వారీగా సమీక్షిస్తానని తెలిపారు. అధికారుల సూచనలు రైతులు పాటించాలని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు. వీబిజిరామ్ జి పథకం అమలుకు సరైన ప్రణాళిక రూపొందించి కూలీలకు వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలని తెలిపారు. -
ఆసరాగా ఉంటావనుకుంటే అనాథను చేశావా కొడుకా
రుద్రంగి(వేములవాడ): ఆసరాగా ఉంటావనుకుంటే అనాథను చేశావా కొడుకా.. అంటూ ఆ మాతృమూర్తి రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అవిటివాడిగా మారిన యువకుడు మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. రుద్రంగి ఎస్సై మోతిరాంనాయక్ తెలిపిన వివరాలు. రుద్రంగి మండల కేంద్రనికి చెందిన రాగుల స్వామి(25) ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. మద్యంమత్తులో బుధవారం అర్ధరాత్రి ఉరివేసుకున్నాడు. స్వామి చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో తల్లి కష్టపడి పెంచింది. చేతికందిన కొడుకు తోడుగా ఉంటాడనుకునే సమయంలో ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. తల్లి సుజాత ఫిర్యాదుతో కేసు చేశారు. కదిలించిన తల్లి రోదనలు మద్యంమత్తులో యువకుని ఆత్మహత్య -
సర్కారు ప్రోత్సాహం.. రైతుల్లో ఉత్సాహం
కరీంనగర్ రూరల్: జిల్లా రైతులకు ఆయిల్‌పామ్ తోటలపై అవగాహన లేదు. ప్రభుత్వ ప్రోత్సాహంతో తొలిసారిగా ఆయిల్‌పామ్ సాగు చేశారు. ప్రస్తుతం దిగుబడి ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఎస్సారెస్పీ నీటివిడుదల, వ్యవసాయబావులు, చెరువులు, కుంటల్లో నీళ్లు సమృద్ధిగా ఉండటంతో వరి మాత్రమే సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును పెంపొందించాలనే లక్ష్యంతో ఉద్యానశాఖ అధికారులకు మండలాలవారీగా లక్ష్యాన్ని నిర్ధేశించింది. అధికారుల ప్రోత్సాహంతో కరీంనగర్‌తోపాటు మెట్టప్రాంతమైన చొప్పదండి నియోజకవర్గాల్లో ఆయిల్పామ్పంట సాగు పెరిగింది. జిల్లావ్యాప్తంగా 2వేల ఎకరాల్లో సాగు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో 2023లో ఆయిల్‌పామ్ తోటల సాగు ప్రారంభమైంది. ప్రభుత్వం ఆయిల్‌పామ్ మొక్కలను 90శాతం సబ్సిడీపై పంపిణీ చేసింది. ఒక్కో మొక్కకు రైతులు రూ.20 వెచ్చించారు. అంతేకాకుండా 70నుంచి 90శాతం సబ్సిడీపై ప్రభుత్వం డ్రిప్ పరికరాలు, నిర్వహణ ఖర్చు కింద సంవత్సరానికి ఎకరానికి రూ.4200 చొప్పున నాలుగేళ్లు చెల్లించింది. అధికారుల ప్రోత్సహంతో జిల్లాలో మొత్తం 2,468 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ పంటను సాగు చేశారు. వరి,పత్తి పంటల కన్నా ఎరువుల వినియోగం తక్కువగా ఉంటుంది. మొక్కలకు ఎలాంటి చీడపీడలు ఆశించే అవకాశం లేకపోవడంతో రైతులపై క్రిమి సంహరక మందుల కొనుగోలు భారం తప్పింది. ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు జిల్లాలో 2022–23 ఏడాదిలో నాటిన మొక్కలు ప్రస్తుతం కోత దశకు చేరుకున్నాయి. ఒక్కో చెట్టుకు 10 కిలోల నుంచి 25 కిలోల బరువున్న గెలలతో దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం ఎకరానికి 3టన్నుల నుంచి 4టన్నులు, 6సంవత్సరాల అనంతరం కనీసం 10టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖాధికారి స్వాతి తెలిపారు. ఆయిల్‌పామ్ 30 ఏళ్ల వరకు ప్రతినెల దిగుబడి వస్తుందని వివరించారు. ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్ ద్వారా ఆయిల్‌పామ్ గెలలను కొనుగోలు చేస్తున్నారు. వారం రోజుల నుంచి కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లోని గ్రామాల్లో గెలలను అధికారులు కొనుగోలు చేసి సిద్ధిపేటలోని కంపెనీకి తరలిస్తున్నారు. నాలుగేళ్లక్రితం టన్ను ధర రూ.12వేలుండగా ప్రస్తుతం రూ.23,783 చెల్లిస్తున్నారు. గెలలను తీసుకున్న వారం రోజుల్లో రైతుల బ్యాంకుఖాతాల్లో డబ్బులను జమచేస్తున్నారు.2023 సంవత్సరంలో 5.20 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలను నాటాను. ప్రస్తుతం గెలలు కోతకు వచ్చి దిగుబడి ప్రారంభమైంది. మొదటి విడతగా 12 టన్నులను విక్రయించగా రూ.2,82,984 బ్యాంకు ఖాతాలో జమైనవి. – మిల్కూరి నరేశ్, మల్లాపూర్, గంగాధర ఆయిల్‌పామ్ పంట దిగుబడి కొనుగోలుకు కచ్చితమైన మార్కెటింగ్ వ్యవస్థ ఉంది. సుమారు 30 ఏళ్లపాటు రైతులకు స్థిరమైన ఆదాయం వస్తోంది. ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకుని రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకురావాలి. – సి.జగన్మోహన్రెడ్డి, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి -
చేపలవేటకు వెళ్లి జలసమాధి
హుజూరాబాద్ రూరల్: చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారుడు చెరువులో మునిగి జలసమాధి అయ్యాడు. ఈ ఘటన హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామంలోని పెద్ద చెరువులో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన ఈర్ల రవీందర్ తోకలపల్లి, రాజపల్లి, చెల్పూర్ గ్రామాలకు చెందిన సుమారు యాభై మంది మత్స్యకారులతో కలిసి చెల్పూరు చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పడుతున్న సమయంలో రవీందర్ కాలికి ఉన్న కడెం వలలో చిక్కుకోవడంతో మునిగిపోయాడు. గమనించిన తోటి మత్స్యకారులు కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే నీటిని మింగడంతో ప్రాణాలు విడిచాడు. రవీందర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉ న్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దివ్యాంగురాలిపై లైంగికదాడి చేసిన వ్యక్తిపై పదేళ్ల జైలుజగిత్యాలజోన్: దివ్యాంగురాలిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల జైలుతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదనపు జడ్జి సునీత గురువారం తీర్పు చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.1.50లక్షల ఆర్థిక సహాయం అందించాలని తీర్పు ఇచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిట్ల నర్సయ్య కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. అందరూ కూలీ చేసుకుని జీవిస్తారు. చిన్న కూతురు మూగ, చెవిటి, మానసిక వైకల్యంతో బాధపడుతోంది. 2024 జూన్ 13న కుటుంబసభ్యులు కూలీ పనులకు వెళ్లారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటికి రాగా.. చిన్న కూతురు ఇంట్లో కనిపించలేదు. కూతురు కోసం చుట్టపక్కల వెదుకుతుండగా.. అదే గ్రామానికి చెందిన ఓరుగంటి శ్రీనివాస్ ఆ యువతిని బైక్‌పై ఎక్కించుకుని వెళ్లినట్లు చుట్టు పక్కలవారు చెప్పారు. కుటుంబసభ్యులు సమీపంలోని మామిడితోట వద్దకు వెళ్లగా.. బైక్ పార్క్ చేసి ఉంది. యువతిపై శ్రీనివాస్ లైంగికదాడికి పాల్పడుతూ కనిపించాడు. వారిని గమనించిన శ్రీనివాస్ అక్కడినుంచి పారిపోయాడు. బాధితులు గొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ రాంనర్సింహారెడ్డి దర్యాప్తు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేసి.. కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్‌కుమార్, బి.రాజు, వి.శ్రీధర్ సాక్ష్యాలు ప్రవేశపెట్టడంతో శ్రీనివాస్‌కు జైలుశిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ.. రూ.1.50 లక్షల పరిహారం అందించాలని సూచించారు. ఏసీబీ వలలో పీఆర్ ఏఈ● రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టివేత కరీంనగర్‌క్రైం: కరీంనగర్ జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ పైడి సతీశ్ గురువారం రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కా డు. కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. సతీశ్ ప్రస్తుతం చొప్పదండి మండలంలో ఉద్యోగం చేస్తున్నాడు. గంగాధర మండలానికి ఇన్చార్జిగా ఉన్న సమయంలో నాగిరెడ్డిపూర్‌లో ఉపాధిహామీ కింద చేపట్టిన సీసీ రోడ్ల పనుల ఎం–బుక్‌లో కొలతలు నమోదు చేసి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు పంపించేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.10 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. గురువారం సాయంత్రం కరీంనగర్లో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సతీశ్‌ను అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు తెలిపారు. -
సీఎం సభకు బస్సులు.. ప్రయాణికుల తిప్పలు
● రెండు రోజులపాటు బస్సుల కొరత ● బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తున్న వైనం జగిత్యాలటౌన్: ఖమ్మంలో శుక్రవారం జరిగే సీఎం రేవంత్‌రెడ్డి సభకు ఆర్టీసీ జగిత్యాల డిపో నుంచి 40 బస్సులను వివిధ ప్రాంతాలకు తరలించారు. దీంతో జగిత్యాల బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సుల కొరత కారణంగా గురువారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అడపదడపా వచ్చిన బస్సుల్లో ఎక్కేందుకు జనం ఎగబడ్డారు. ప్లాట్ ఫాంకు వచ్చిన బస్సుల్లోకి ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పార్టీలు, ప్రభుత్వం నిర్వహించే సభలకు ఆర్టీసీ బస్సులను తరలించడం షరా మామూలుగా మారిందని, ప్రతీసారి ఇదే ఇబ్బంది ఎదురవుతోందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగే సభకు గురువారమే బస్సులు తరలించడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే నిలిచిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సీఎం సభ పేరుతో ఉన్న కొద్ది బస్సులను కూడా తరలించడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖమ్మం రీజియన్ పరిధిలోనే 12 డిపోలు ఉండగా.. దూరప్రాంతమైన జగిత్యాల డిపో నుంచి బస్సులు తరలించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై డీఎం రమేశ్‌ను వివరణ కోరగా.. సీఎం సమావేశానికి 40బస్సులు కేటాయించామని, అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, రద్దీ లేని రూట్లలో నడిచే బస్సులను రద్దీ ఉన్న రూట్లలో సర్దుబాటు చేశామన్నారు. -
కరీంనగర్లో ‘బిన్యూ మొబైల్స్’ సంబరాలు
● మై విలేజ్ షో గంగవ్వ, చందు సందడి కరీంనగర్: ప్రముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం శ్రీబిన్యూ మొబైల్స్శ్రీ గురువారం కరీంనగర్ స్టోర్‌లో శ్రీకొత్తగా మీ లాగేశ్రీ అనే కాన్సెప్ట్‌తో వేడుకలను నిర్వహించింది. వేడుకల్లో ప్రముఖ శ్రీమై విలేజ్ షోశ్రీ టీం సభ్యులు గంగవ్వ, చందు, రవి, శ్రీకాంత్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. బిన్యూ అందిస్తున్న సరికొత్త లైఫ్ స్టైల్ ప్రోడక్టులను వారు తమ గ్రామీణ శైలిలో కస్టమర్లకు పరిచయం చేస్తూ అలరించారు. ఈ సందర్భంగా ఒప్పొ రెనో–16 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వర్షాకాలం కానుకగా బిన్యూ కస్టమర్లకు సంస్థ కాంబో ఆఫర్లను ప్రకటించింది. దీంతోపాటు 18 నెలల జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి, సీఈవో సాయి నిఖిలేష్ తెలిపారు. కరీంనగర్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
సరుకులు ప్రియం
ఉచిత బియ్యం..విద్యానగర్(కరీంనగర్): రేషన్‌కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యాన్ని కేంద్రం, కిలో బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నా.. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి. గతంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మార్పు చేసి బియ్యం రూపాయికి కిలో చొప్పున, పామాయిల్ ప్యాకెట్, గోధుమలు, ఉప్పు, పప్పు, చింతపండు, సబ్బులు అందించాయి. ప్రస్తుత ప్రభుత్వం నిత్యావసర సరుకులు ఇవ్వడం మానేసింది. పెదవి విరుస్తున్న పేదలు బియ్యం ఉచితంగా ఇస్తుండగా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఒక్కోసారి నాణ్యతలేమితో ఇస్తుండడంతో బియ్యంపై పేదలే పెదవి విరుస్తూ అయినకాడికి అమ్ముకుని మార్కెట్లో మేలు రకాలను కొనుక్కుంటున్నారు. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు పెరిగిన ఇంధన ధరలతో నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వంటనూనెలు 50శాతం పెరగడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. రెండేళ్ల కిత్రం ఒక మధ్యతరగతి కుటుంబం ఇంటి సరుకులకు నెలకు రూ.2 వేల నుంచి రూ.3వేలు వెచ్చించే వారు. ప్రస్తుతం రూ.6వేల నుంచి 7వేలు వెచ్చించినా సరిపడా సరుకులు రావడం లేదు. రెండేళ్ల కిత్రం క్వింటాల్ బియ్యం రూ.2,500– 3,000 ఉండగా ప్రస్తుతం రూ.5,000 నుంచి రూ.6,500 పలు కుతోంది. మొన్నటి వరకు కిలో పల్లినూనె రూ.120 ఉండగా ప్రస్తుతం రూ.185 అయింది. పప్పులు, చింతపండు, గోధుమలు, మిర్చి పౌడర్ తదితర వస్తువుల ధరలు మూడింతలు పెరిగాయి. కూరగా యల్లో టమాట కిలో రూ.30 పలుకుతుండగా, మిగతావి కిలో రూ.60కి తక్కువ లేవు. భారమంతా ప్రజలపైనే.. పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యావసర వస్తువుల ధర లు పెరగడానికి కారణం కాగా, పెరిగిన భారాన్ని ప్రజలపై రుద్దడంతో సామాన్యుడు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. వీటికి తోడు రోగాలతో వైద్యానికి అప్పు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని నిత్యావసర వస్తువుల ధరలను కట్టడి చేయాలని సామాన్యులు కోరుతున్నారు.నలుగురున్న సామాన్యుడి కుటుంబం నెలవారీ ఖర్చునెల ఆదాయం రూ.8వేల–15వేలు ఇంటి అద్దె రూ.4,500 నిత్యావసర వస్తువులు రూ.3,500 పాలు అరలీటర్ రూ.900 కూరగాయలు రూ.1,000 కరెంట్ బిల్ రూ.450 స్కూల్ ఫీజులు(ఒక్కరికి) రూ.3,000 సెల్ రీచార్జి(ఇద్దరికి) రూ.650 వైద్యం,ఇతర ఖర్చులు రూ.1,000 మొత్తం ఖర్చు రూ.15,000 -
రూ.700 కోసం వివాదం
● మధ్యవర్తిపై మైనర్ దాడి మల్యాల: పెద్దపులి వేషం వేసేందుకు తీసుకున్న అప్పు విషయమై ఇద్దరి మధ్య గొడవ జరుగగా.. వద్దని వారించిన మధ్యవర్తిపై బాలుడు రాడ్‌తో దాడి చేసి గాయపరిచిన ఘటన మల్యాలలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ కథనం ప్రకారం.. మండలకేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన సఖీనా బేగం బంధువైన రిజ్వాన్ వద్ద అదే కాలనీలో నివాసముంటున్న మైనర్ అప్పుచేశాడు. ఇటీవల మొహర్రం పురస్కరించుకుని మైనర్ పెద్దపులి వేషం వేసేందుకు రూ.700 అప్పుగా తీసుకున్నాడు. ఈ విషయమై ఈనెల 8న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సఖీనా బేగం భర్త పాషాఖాన్ గొడవ జరిగే ప్రాంతానికి వెళ్లి ఇద్దరిని వారిస్తుండగా.. సదరు మైనర్ ఆవేశంలో సమీపంలోని ట్రాక్టర్ రాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో పాషాఖాన్ తలకు తీవ్ర గాయమైంది. అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాషాఖాన్ భార్య సఖినా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మైనర్‌ను గురువారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం హబ్సీపూర్‌కు చెందిన దావనపల్లి గవాస్కర్ (37) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గవాస్కర్ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. కుటుంబసభ్యులు గురువారం ఉదయం పనికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. సింగరేణి కార్మికుడి భార్య.. గోదావరిఖని(రామగుండం): స్థానిక పవర్‌హౌస్‌కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడి భార్య పిల్లలమర్రి రాజేశ్వరి అలియాస్ రేవతి(38) గురువారం వేకువజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్న రాజేశ్వరి గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రి, హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చికిత్స తీసుకున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంటి పైకప్పునకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త సదానందం ఓసీపీ–3లో హెడ్ ఓవర్‌మెన్‌గా పనిచేస్తుండగా, ఒక కూతురు ఉంది. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్సై అనూష తెలిపారు. నిప్పంటించుకొని వృద్ధుడు..కొత్తపల్లి(కరీంనగర్): రేకుర్తి కాళోజీనగర్కు చెందిన శంకరోళ్ల గంగారావు (80) అనే వృద్ధుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది బుధవారం అర్థరాత్రి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కొత్తపల్లి పోలీస్ ఇన్స్పెక్టర్ బిల్ల కోటేశ్వర్ తెలిపారు. మృతుడి కుమారుడు పురుషోత్తంరావు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు మహిళ ఆందోళనజగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం వె ల్దుర్తి గ్రామానికి చెందిన మహిళ నిహారిక పురుగుల మందు డబ్బాతో గురువారం కలెక్టరేట్లో ఆందోళన చేపట్టింది. వివరాలు.. వెల్దుర్తి సర్పంచ్ భర్త తనను వేధిస్తున్నాడని, తనకు తండ్రి వారసత్వంగా ఇ చ్చిన 30 గుంటల భూమిని చదును చేసుకుంటుండగా అడ్డుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తహసీల్దార్ తనకు అనుకూలంగా చె ప్పినా సర్పంచ్ వినడం లేదని ఆరోపించింది. కలెక్టరేట్లోనైనా తనకు న్యాయం జరుగుతుందని వచ్చి నిరసన తెలిపింది. అయితే మందు డబ్బా వెంట తెచ్చుకోవడంతో అక్కడే ఉన్న పోలీసులు డబ్బాను లాక్కుని ఇంటికి పంపించారు. -
డిపోలకు పోతెనే సీటు
శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులు ప్లాట్‌ఫాం వద్దకు రాకముందే ప్రయాణికులు డిపో వద్దకు పరుగు తీసి బస్సులు ఎక్కుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో ఒకేసారి బస్సు ఎక్కేందుకు పోటీ పడటంతో తోపులాట చోటుచేసుకుంటోంది. ప్రమాదాల అవకాశాలు పెరగడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని ఆర్టీసీ సిబ్బంది అంటున్నారు. డిపో వద్ద బస్సులు ఎక్కకుండా చర్యలు తీసుకుని, నిర్ణీత ప్లాట్‌ఫాం వద్ద బస్సులు ఆగేలా అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. -
ఏబీవీపీ ఆవిర్భావ సంబరాలు
కరీంనగర్‌టౌన్: ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ ఎదిగి దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులను చైతన్యవంతం చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ అన్నారు. కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినో త్సవం, 78వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థాని క కోర్ట్ చౌరస్తా నుంచి గీతా భవన్ వరకు ర్యాలీ నిర్వహించి సంఘం జెండా ఆవిష్కరించారు. రావుల కృష్ణ మాట్లాడుతూ.. 78 ఏళ్లుగా విద్యార్థుల హక్కుల పరిరక్షణ, నాణ్యమైన విద్య కోసం ఉద్యమాలు, సామాజిక సేవ, నాయకత్వ వికా సం వంటి రంగాల్లో ఏబీవీపీ విశేష సేవలు అందిస్తోందన్నారు. జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి యోగేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి, కన్వీనర్ నిత్య, జోనల్ ఇన్చార్జిలు ఆకాష్, ప్రశాంత్, కార్యకర్తలు శివ, నవీన్, య శ్వంత్, కావ్య, విద్యార్థులు పాల్గొన్నారు. -
వనమహోత్సవానికి సిద్ధం చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: వన మహోత్సవానికి మొక్కలను సిద్ధం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం నగరంలోని పద్మనగర్‌లోని నగరపాలక సంస్థ నర్సరీని సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టబోయే వన మహోత్సవాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. నగరవ్యాప్తంగా గు ర్తించిన స్థలాల ప్రకారం మొక్కలు నాటేందుకు గుంతలను తీయాలన్నారు. ఇన్చార్జి ఈఈ లచ్చిరెడ్డి, ఏఈ నర్మద పాల్గొన్నారు. వందశాతం మ్యాపింగ్ చేయాలి నగరంలోని ప్రతి బీఎల్వో వందశాతం ఓటర్ మ్యాపింగ్ చేయాలని కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. గురువారం నగరంలోని జ్యోతినగర్, మంకమ్మతోట, రేకుర్తి తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. నగరంలో ఎక్కడా ఎవరూ విస్మరణకు గురికాకుండా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సర్వే చేయాలన్నారు. సర్‌కు సహకరించాలి నగరంలో చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రఫుల్‌దేశాయ్ కోరారు. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. నగరంలో ఎస్ఐఆర్ జరుగుతున్న తీరుపై చర్చించారు. -
ప్రాణం మీదకు తెచ్చిన వేగం
సిరిసిల్లటౌన్: అతివేగం ప్రాణం మీదకు తెచ్చింది. కారు అతివేగంగా కల్వర్టును ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్‌కు చెందిన జి.రాంగోపాల్‌రావు మత్య్సశాఖలో రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్. అదే గ్రామానికి చెందిన గన్నె మల్లయ్యతో కలిసి కరీంనగర్‌కు కారులో వెళ్తున్నారు. కొత్తచెరువు శివారులోని కల్వర్టును 85 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టాడు. బెలూన్స్ తెరుచుకోవడంతో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాగా రాంగోపాల్‌రావు తలకు, మల్లయ్య కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది శ్రీనివాస్, అనిల్ క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో బంధువులు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కల్వర్టును ఢీకొట్టిన కారు ఇద్దరి పరిస్థితి విషమం -
గోదావరిలో పూజారి శవం
ఇబ్రహీంపట్నం: మండలంలోని ఎర్దండిలో గంగమ్మమాత, రామాలయం ఆలయ పూజారి కులకర్ణి ప్రణవ నరహరి (28) గోదావరిలో శవమై తేలాడు. ఆదివారంసాయంత్రం రామాలయంలో పూజలు చేసిన ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెదుకుతున్నారు. బుధవారం కూడా గ్రామస్తులతో కలిసి వెదుకుతుండగా.. గోదావరిలో శవమై కనిపించాడు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో దారితప్పి గోదావరివైపు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి ఈత రాక మృతి చెందినట్లు నరహరి తండ్రి దత్తత్రేయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. ఉరేసుకుని ఒకరి ఆత్మహత్యమెట్పల్లిరూరల్: ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెట్పల్లి మండలం మేడిపల్లిలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాశబోయిన అరుణ్(35)కు భార్య రోజతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పది రోజుల క్రితం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో రోజ పిల్లలతో కలిసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన అరుణ్ ఇంట్లో ఉరేసుకున్నాడు. అరుణ్ పెద్దనాన్న బాబయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పనులు చేయక.. మద్యానికి బానిసై.. సుల్తానాబాద్ రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన భూపతి తిరుపతి(47) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్ర కుమార్ కథనం ప్రకారం.. తిరుపతి పనులు ఏమీ చేయకుండా తిరుగుతున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. దీతో భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. మనస్తాపం చెందిన తిరుపతి రోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడు. తల్లి మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిమ ఆస్పత్రిలో విద్యుత్‌షార్ట్ సర్క్యూట్కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ ఆస్పత్రిలో బుధవారం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం ఏర్పడింది. ఆస్పత్రి వర్గాల కథనం మేరకు ఆపరేషన్ థియేటర్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలేర్పడి పొగలు వ్యాపించాయి. వెంటనే ఆప్రమత్తమైన సిబ్బంది థియేటర్ సమీపంలోని వార్డుల్లో ఉన్న రోగులను వేరే ప్రాంతానికి తరలించారు. చిన్నషార్ట్ సర్క్యూట్‌తో ఏర్పడిన మంటలను ఆర్పివేసి యథాతథంగా ఆపరేషన్ థియేటర్‌ను నిర్వహించారు. ఇంటి తాళం పగలగొట్టి చోరీ గంగాధర: వుండలంలోని మధురానగర్ చౌరస్తాలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. బొడ్ల శ్రీనివాస్ మొదటి అంతస్తును విజయ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చి గ్రౌండ్ ఫ్లోర్‌కు తాళం వేసి ఉంచాడు. బుధవారం ఉదయం విజయ్ కిందికి రాగా ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో పాటు తన బైక్ కనిపించలేదు. వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇచ్చాడు. దొంగలు బీరువా పగుల గొట్టి రెండు గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించారని బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. ఆలయాల్లో.. శంకరపట్నం: మండలంలోని లింగాపూర్ ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తులు, భక్తులు తెలిపిన వివరాలు.. గ్రామంలోని పెద్దమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లోని అమ్మవారి విగ్రహాలపై నగలు, భక్తులు హుండీలో వేసిన కానుకలు దోచుకెళ్లారు. దొంగలు హుండీలను పగలగొట్టి సమీపంలోని బీడు భూముల్లో పడేశారు. బుధవారం ఆలయానికి వెళ్లిన భక్తులు చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. -
నీలి విప్లవానికి నీటిగండం
నీటి మట్టం తగ్గిపోయిన నాగారం చెరువు నీళ్లు లేక వెలవెలబోతున్న సుందిళ్ల బ్యారేజీ మంథనిరూరల్: మత్స్యకారులకు ఉపాధి మెరుగుపర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న చేపపిల్లల పంపిణీకి ఈసారి నీటిగండం ఏర్పడుతోంది. వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు సాధారణ వర్షాలు తప్ప భారీవానలు కురవలేదు. దీంతో జిల్లాలోని అనేక చెరువులు, జలాశయాలు అడుగంటి పోతున్నాయి. ఏటా జూలై, ఆగస్టలోనే చేపపిల్లలు పంపిణీ చేస్తున్నారు. ఈసారి పంపిణీ ప్రక్రియపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన జారీచేయలేదు. మరోవైపు వర్షాలు లేక చెరువుల్లోకి నీళ్లు రాలేదు. చేపల పెంపకం ఎలా అని మత్స్యకారుల్లో ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 281 సొసైటీలు పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా 281 మత్స్యకార సొసైటీలు ఉండగా 13,450 మంది సభ్యులు ఉన్నారు. అలాగే జిల్లాలోని 263 గ్రామ పంచాయతీల పరిధిలో 1,073 చెరువులు, కుంటలు ఉన్నాయి. చెరువులు, కుంటలతోపాటు జలాశయాల్లో ప్రభుత్వం ఏటా చేపపిల్లలు విడుదల చేస్తోంది. రెండేళ్లుగా పంపిణీ సక్రమంగా జరడంలేదు. మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు దూరమవుతున్నాయి. వానలు కురువక.. నిండని చెరువులు ఏటా వర్షాకాలం ప్రారంభమైన నెలరోజుల వ్యవధిలోనే భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండలా మారేవి. జూన్చివరి వారం నుంచి జూలై, ఆగస్టు మాసాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి చేపపిల్లల పంపిణీ ప్రారంభించేవారు. ఈసారి వర్షాలు కురువక చెరువులు నిండకపోగా జలాశయాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం సైతం ఇప్పటివరకు పంపిణీపై స్పష్టత ఇవ్వడంలేదు. మత్స్యకారులకు చేపలతో ఉపాధి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే చేపపిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. గత ప్రభుత్వం చెరువులతోపాటు జలాశయాల్లోనూ చేపపిల్లలను వదిలిపెట్టడంతో అనేకమంది మత్స్యకారులు చేపలు పట్టుకుని ఉపాధి పొందారు. చేపపిల్లల పంపిణీపై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఏటా జూలైలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టులో చేపపిల్లలు పంపిణీ చేస్తాం. ఈసారి టెండర్ ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన వెంటనే చేపపిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తాం. – నరేశ్ నాయుడు, జిల్లా మత్స్యశాఖ అధికారి,పెద్దపల్లి వర్షాలు లేక చెరువులు, జలాశయాలు వెలవెల చేపపిల్లల పంపిణీపై స్పష్టత ఇవ్వని సర్కారు ఈసారైనా పంపిణీ ఉన్నట్లా? లేనట్లా? ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు -
ఇక కాగితరహిత సేవలు
గొల్లపల్లి: ప్రజలు, విద్యార్థులకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా.. పారదర్శకంగా అందించేందుకు మీసేవ కేంద్రాలు సరికొత్త డిజిటల్ హంగులను అద్దుకున్నాయి. కాలయాపనను తగ్గించి, అవినీతికి తావులేకుండా జిల్లా యంత్రాంగం కాగిత రహిత (పేపర్ లెస్) పాలన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అటు రెవెన్యూ సేవల్లో విప్లవాత్మక మార్పులతో పాటు, ఇటు విద్యార్థుల కోసం సరికొత్తగా ఎస్సెస్సీ ఈ–మెమోల సేవలను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులకు వరం ఎస్సెస్సీ ఈ–మెమో ఉన్నత చదువుల కోసం అడ్మిషన్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న వేళ విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మీసేవ పోర్టల్‌లో తాజాగా ఎస్సెస్సీ మెమో ఈ–కాపీ అనే సరికొత్త సేవను ప్రవేశపెట్టింది. 2004 నుంచి 2024వ సంవత్సరం వరకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ డూప్లికేట్ ఈ–మెమోను మీసేవ ద్వారా పొందవచ్చు. కేటగిరీ ఏ కింద ఒక్కో దరఖాస్తుకు కేవలం రూ.62 రుసుం చెల్లిస్తే సరిపోతుంది. సురక్షిత సర్టిఫికెట్ అభ్యర్థి వివరాలను నమోదు చేసిన వెంటనే మీసేవ సెక్యూర్ బేస్ సర్టిఫికెట్‌పై ఈ–మెమో ప్రింట్ రూపంలో అందుతుంది. ఒరిజినల్ మెమోలు పోగొట్టుకున్న వారికి.. అత్యవసరంగా కావాల్సిన వారికి ఈ డిజిటల్ మెమో ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. పూర్తిగా కాగిత రహితం.. ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా రెవెన్యూ సేవల దరఖాస్తు ప్రక్రియలో సరికొత్త పేపర్ లెస్ విధానాన్ని అధికారులు అమల్లోకి తెచ్చారు. ఇకపై కులం, ఆదాయం, నివాస, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ల కోసం దరఖాస్తుదారులు ఎలాంటి పత్రాలను ఆఫీసుల్లో సమర్పించాల్సిన అవసరం లేదు. తహసీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో దరఖాస్తుదారులను భౌతికపత్రాల కోసం వేధించవద్దని జిల్లా ఉన్నతాధికారులు తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ సంస్థ ప్రవేశపెట్టిన నూతన మొబైల్ అప్లికేషన్ ద్వారానే తహసీల్దార్లు ఆన్లైన్లోనే పత్రాలను పరిశీలించి.. వేగంగా డిజిటల్ సంతకాలతో సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. సమయం, డబ్బు ఆదా.. డిజిటల్ విప్లవంలో భాగంగా తీసుకొచ్చిన ఈ నూతన సంస్కరణలు ప్రజలకు, విద్యార్థులకు అటు సమయాన్ని, ఇటు డబ్బును ఆదా చేస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. దళారుల బెడద లేకుండా.. కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా నేరుగా మీసేవ కేంద్రాల ద్వారా ఈ సరికొత్త సేవలను జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. మీసేవలో ‘డిజిటల్’ విప్లవం ఆన్లైన్లోనే ఎస్సెస్సీ ఈ–మెమోలు దరఖాస్తుకు రూ.62 రుసుం విద్యార్థులకు సువర్ణావకాశం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు -
అసెస్మెంట్ కాపీ ఎలా వచ్చింది..?
జగిత్యాల: జగిత్యాల బల్దియా నుంచి అసెస్మెంట్ కాపీ బయటకు రావడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెస్మెంట్ (మున్సిపల్ పరిధిలో ఇళ్లు లేదా ఆస్తి వివరాలు నమోదు చేసి, పన్ను చెల్లించడానికి జారీ చేసే పత్రం) కాపీలు ఇవ్వడం 2019లోనే నిషేధించారు. ఇంటి నంబరు ద్వారానే ఎవరైనా స్థిరాస్థుల క్రయవిక్రయాలు చేసుకుంటారు. తాజాగా జగిత్యాలలో అసెస్మెంట్ కాపీ బయటకు రావడం.. అందులో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ సంతకం ఫోర్జరీ చేసినట్లు ఉండడం జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. జగిత్యాల బల్దియాలో ఇప్పటికే ఏడాదిలోనే దాదాపు పదిమందికి పైగా కమిషనర్లు మారారు. ఇటీవల గ్రూప్–1 అధికారి అయిన సత్యప్రణవ్ ఇక్కడకు వచ్చారు. తాజాగా ఆయన సంతకం ఫోర్జరీ కావడం గమనార్హం. బల్దియాలో అధికారుల సంతకాలే ఫోర్జరీ చేస్తున్నారంటే ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టంకాదు. అక్రమాల వెల్లువ.. మున్సిపాలిటిలో గతంలో ఇదే రెవెన్యూ విభాగంలో ఓ భూకుంభకోణానికి సంబంధించి కమిషనర్, ఆర్వో సస్పెండ్ అయ్యారు. మరో కమిషనర్ సంతకాన్ని బల్దియాలోనే పనిచేస్తున్న ఓ వ్యక్తి ఫోర్జరీ చేసిన ఘటన వెలుగుచూసింది. అయినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకుండా వదిలేయడం గమనార్హం. అధికారులు, సిబ్బంది అక్రమాలు, అవినీతిపై అటు ఏసీబీ, ఇటు విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో 17 గంటల పాటు సోదా చేశారు. ప్రతి రికార్డును పట్టుకెళ్లారు. కొన్ని శాఖల అధికారులను కరీంనగర్‌కు పిలిపించారు. తాజాగా ఘటన జరగడంతో అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కమిషనర్ సంతకం ఫోర్జరీపై అదనపు కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలిసింది. వాస్తవంగా అసెస్మెంట్ కాపీ ఇవ్వకుండానే ఇంటి నంబరు ద్వారానే రిజిస్ట్రేషన్ చేస్తారు. మున్సిపాలిటీకి ఆస్తిపన్ను కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఇలా రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది తమకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఫోర్జరీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు జగిత్యాలక్రైం: మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆస్తి రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించిన సమిండ్ల రాజేశ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. పట్టణంలోని ఇంటి నంబరు 3–5–128కు సంబంధించిన అసెస్మెంట్ సర్టిఫికెట్‌ను నకిలీ (ఫోర్జరీ)గా తయారుచేసి దానిపై మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉపయోగించినట్లు గుర్తించారు. కమిషనర్ సంతకం ఫోర్జరీ ద్వారా రిజిస్ట్రేషన్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కమిషనర్ ఫోర్జరీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు -
బఫర్‌జోన్‌లో భవనాలు
● మూలవాగు, కట్టుకాలువ తీరంలో యథేచ్ఛగా నిర్మాణాలు ● కొన్నింటిని కూల్చినా.. మరికొన్ని యథాతథం ● ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు ఇది కోనాయపల్లి నుంచి వేములవాడ మూలవాగులోకి వచ్చే కట్టుకాలువ. ఈ కాలువ ఒడ్డున నిర్మించిన భవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రియల్టర్లు కొందరు ప్రజాప్రతినిధులకు, అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి పనులకు అనుమతినిచ్చినట్లు చర్చ సాగుతోంది. వేములవాడ:ఆధ్యాత్మిక క్షేత్రంలో అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వేములవాడలోని మూలవాగు, కట్టుకాలువల తీరంలో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నారు. ఇదంతా అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోపణల వెల్లువ గతంలో మూలవాగు ఒడ్డున నిర్మించిన అక్రమ భవనాలను జిల్లా అధికారులు కూల్చివేశారు. కొన్నింటిని పాక్షికంగా ధ్వంసం చేసినా మరికొన్ని భవనాల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో అక్కడితోనే కూల్చివేతలు ఆగిపోయాయి. కోనాయపల్లి నుంచి వేములవాడ మూలవాగులో కలిసే కట్టుకాలువను ఆనుకుని ఉన్న బఫర్‌జోన్‌లోనూ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. అధికారుల అలసత్వం వెనుక ‘మామూళ్ల’ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మౌనం వెనుక మతలబేమిటి? జిల్లా అధికారులు కొన్ని రోజుల క్రితం కూల్చివేతలు ప్రారంభించినా, అవి ‘కంటితుడుపు’ చర్యలుగానే మిగిలిపోయాయి. కోర్టు పరిధిలో ఉన్నాయనే సాకుతో అధికారులు కొన్ని భవనాలపై మౌనం వహిస్తుండడం వెనుక అధికారుల మామూళ్ల వ్యవహారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బఫర్‌జోన్‌లో నిర్మాణాలకు ఎలా అనుమతులు లభించాయనే అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బఫర్‌జోన్‌లో భనాలు నిర్మిచినట్లు ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటాం. ఇటీవల బైపాస్‌రోడ్డులో ఓ ప్రహరీ కాలువ ఒడ్డున నిర్మించడంతో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో కూల్చివేశాం. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేయాలని కోరుతున్నాం. – అభినవ్, టౌన్ ప్లానింగ్ అధికారి, వేములవాడ -
విధులు ముగించుకుని వెళ్తుండగా ఢీకొన్న లారీ
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తావద్ద లారీ ఢీకొన్న ప్రమాదంలో రాఘవాపూర్ పీహెచ్సీలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న ధనలక్ష్మి (38) మృతిచెందింది. బుధవారం విధులను ముగించుకుని భర్త బోసెల్లి సురేశ్‌తో కలిసి స్కూటీపై వస్తుండగా కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై నుంచి కిందపడ్డ ధనలక్ష్మి నడుముపై నుంచి లారీ వెళ్లడంతో మృతిచెందింది. ఆమె భర్త స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై నరేశ్ పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధనలక్ష్మికి యశస్వి, ఆధ్యశ్రీ కూతుళ్లు ఉన్నారు. మృతురాలి సోదరుడు కుక్క సతీశ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన నల్లగొండ జిల్లా హనుమంతులపల్లికి చెందిన డ్రైవర్ శ్రీశైలంపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు. అక్కడికక్కడే స్టాఫ్‌నర్స్ మృతి గాయపడిన భర్త -
ఊపిరాడకుండా చేసి.. ఆభరణాలు దొంగిలించి..
● వృద్ధురాలిది హత్య అని అనుమానంగోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చంద్రబాబుకాలకి చెందిన ఎల్లపూల రమణమ్మ(65) అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భర్తకు ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్‌లోని కుమారుని వద్దకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అక్కడే చనిపోగా అంత్యక్రియలూ అక్కడే చేశారు. భర్త డెత్ సర్టిఫికెట్ కోసం గతనెల 10న గోదావరిఖనిలోని తన ఇంటికి వచ్చింది. ఈనెల 30న అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. ఆమె మెడ లోని బంగారు గొ లుసు, చెవికమ్మలు, ఐదు తులాల బంగారు గాజులు కనిపించలేదని ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేశారు. పీఎంఈ నివేదికతో హత్యగా అనుమానం? పీఎంఈ నివేదిక ఆధారంగా వృద్ధురాలిని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు అనుమానిస్తూ కేసును తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అనుమా నితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో సీసీ ఫు టేజీలు, ఇతర వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా రు. చనిపోయే సమయంలో బాధితురాలు పెద్దగా ప్రతిఘటించకపోవడంతో తెలిసినవారే హత్య చేసి నట్లుగా పోలీసులు అనుమానిస్తూ అన్నికోణాల్లోంచి దర్యాపు ప్రారంభించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి కుమారుడితో మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏసీపీ రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి ద్వారా కేసు పురోగతిపై ఆరా తీశారు. -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
కరీంనగర్‌సిటీ: ఔషధాల పరిశోధనల్లో నూతన సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని శాతవాహన వీసీ ఉమేశ్‌కుమార్ అన్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో ‘సహజ సిద్ధ ఔషధాల ఆవిష్కరణలో కృత్రిమ మేధస్సు పాత్ర’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. మన దేశ ప్రాచీన సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికత కృత్రిమ మేధస్సుతో అనుసంధానించడం ద్వారా సరికొత్త ఔషధాలను కనుగొనవచ్చని తెలిపారు. రిజిస్ట్రార్ ఆచార్య సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, సహజ సిద్ధమైన మూలికా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలంటే శాసీ్త్రయమైన డేటా, పరిశోధనలు ఎంతో అవసరమన్నారు. డా.ఎస్.రమాకాంత్, డాక్టర్ జయంతి, డా.సరసిజ, నమ్రత తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరూ ఇద్దరే..!
సాక్షి, పెద్దపల్లి: ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన రెవెన్యూ, పోలీస్‌శాఖలు ప్రజలకు రక్షణ, సేవలు అందించడం పక్కన పెట్టి.. భూ తగాదాలనే ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కలెక్టరేట్లో కలెక్టర్ రెవెన్యూ, పోలీస్ అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. సివిల్ పంచాయితీల్లో పోలీసుల జోక్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల అండతో కొందరు అవినీతికి పాల్పడుతున్నారని హెచ్చరించడంతో రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం లోపించి ‘కోల్డ్‌వార్’ మొదలైందనే ప్రచారం సాగుతోంది. ఫలితంగా ఈ రెండు శాఖల పనితీరు చర్చనీయాంశంగా మారింది. సామాన్యులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల మెట్లు ఎక్కినా.. పోలీస్‌స్టేషన్ గడప తొక్కినా.. ‘ఆమ్యామ్యాలు’ చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని, అవినీతిలో రెండు శాఖలూ ఒకటేననే చర్చ నడుస్తోంది. రెవెన్యూలో ‘రేట్’ దందా రెవెన్యూ రికార్డుల సవరణ నుంచి భూముల రిజిస్ట్రేషన్ వరకు ప్రతీ పనికి రేటు నిర్ణయించడం గమనార్హం. అధికారులు నేరుగా డబ్బులు తీసుకోకుండా.. కిందిస్థాయి సిబ్బంది లేదా ప్రైవేట్ ఆన్లైన్ కేంద్రాల ఆపరేటర్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారసత్వ పట్టాలు చేసేందుకు కుటుంబసభ్యులందరు హాజరైనా రకరకాల కొర్రీలు పెడుతూ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు లంచం డిమాండ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. తమకు చెప్పకుండా స్లాట్ బుక్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం చేయడం, ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారింది. సత్వరమే జారీ చేసే పహణీ, కుల, ఆదాయం తదితర ఽధ్రువపత్రాల జారీకి ఆన్లైన్ కేంద్రాల ఆపరేటర్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారని అంటున్నారు. పోలీస్స్టేషన్లలో ‘పెద్దరాయుడి’ తీర్పులు చట్టప్రకారం సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు. ఆక్రమణలు, దాడులు, బెదిరింపులను క్రిమినల్ కేసుగా పరిగణించి చర్యలు తీసుకోవాలి. కానీ, అనేక పోలీస్స్టేషన్లలో దీనికి భిన్నంగా జరుగుతోంది. ‘ఇక్కడ సివిల్ కేసులు పరిష్కరించబడవు‘ అని బోర్డులు ఉన్నా.. తెరవెనుక ప్రతీ వివాదాన్ని ‘సెటిల్’ చేస్తున్నారని అంటున్నారు. బాధితుల ఫిర్యాదులను ఎఫ్ఐఆర్గా నమోదు చేయడానికి బదులు, స్టేషన్లలోనే రాజీ చర్చలు జరుపుతూ, అంగ, అర్ధబలం ఉన్నవారికి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూవివాదాలపైనే ఎక్కువ దృష్టి రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడంతో వ్యవసాయ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో భూ వివాదాలు గతంకన్నా రెట్టింపయ్యాయి. పోస్టింగ్‌ల కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్న కొందరు అధికారులు.. ఆ పెట్టుబడిని రాబట్టుకునేందుకే శాంతిభద్రతల కన్నా సివిల్ సెటిల్మెంట్లపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2010లో అప్పటి ప్రభుత్వం జారీచేసిన నిబంధనల ప్రకారం.. సివిల్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసి 15 రోజుల్లోగా విచారణ పూర్తిచేయాలి. ఆ ఉత్తర్వులు అటకెక్కడంతో స్టేషన్లకే పరిమితమైన ‘సెటిల్మెంట్’ సంస్కృతి సామాన్యుడిని మరింత సంక్షోభంలోకి నెడుతోంది. ఉన్నతాధికారులు స్పందించి, వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. -
స్వచ్ఛతలో డీఆర్సీ సెంటర్లు కీలకం
కరీంనగర్‌కార్పొరేషన్: స్వచ్ఛతలో డీఆర్సీ సెంటర్లు కీలకమని అదనపు కలెక్టర్ హరిప్రసాద్ అన్నారు. బుధవారం నగరంలోని హౌసింగ్‌బోర్డుకాలనీ డీఆర్సీ సెంటర్‌ను సందర్శించారు. సెంటర్లో రీసైక్లింగ్ పనులను పరిశీలించారు. తడి, పొడి చెత్త సేకరణ వివరాలు, తడి చెత్త ద్వారా కంపోస్టు తయారీ, పొడి చెత్త వ్య ర్థాల రీ సైక్లింగ్ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర పరిశుభ్రతలో తడి, పొడి చెత్త నిర్వహణ ప్రక్రియ ఎంతో ప్రధానమన్నారు. నగరాన్ని స్వచ్ఛ కరీంనగర్‌గా మార్చడంలో డ్రై రీసోర్స్ సెంటర్ల పాత్ర ఎంతో ప్రాధాన్యత కలి గిందన్నారు. డీఆర్సీసీ నిర్వాహకులు పొడి చెత్తను ప్లాస్టిక్, అట్టముక్కలు తదితర వస్తువులను సెగ్రిగేషన్ చేసి వాటి వివరాలను నమో దు చేసుకోవాలన్నారు. నగరపాలక సహాయ కమిషనర్ రాజమనోహర్, పర్యావరణ ఇంజినీర్లు స్వామి, రమేశ్, శానిటేషన్ సూపర్ వైజర్ శ్యామ్ రాజ్ పాల్గొన్నారు. కరీంనగర్‌అర్బన్: జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ పనులను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలని ఆర్అండ్ఆర్ భూ సేకరణ కమిషనర్ కే.శివకుమార్ నాయుడు అధికా రులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, భూ సేకరణ విభాగం, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధి కారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్ మానేరు, గౌరవెల్లి రిజర్వాయర్ కాలువలు, కాకతీయ కాలువ, కాళేశ్వరం ప్రాజెక్టు, కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్, మానేరు రివర్‌ఫ్రంట్ తదితర ప్రాజెక్టుల భూ సేకరణ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, ఇరిగేషన్‌తో పాటు అన్నిశాఖల అధికారులు పరస్పర సమన్వయంతో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, పునరావాసం (ఆర్అండ్ఆర్) అంశాలను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు తక్షణమే పరిహారం అందించాలన్నారు. కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ, జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. డీఆర్వో, భూ సేకరణ విభాగం ఇన్చార్జి ఎస్డీసీ. స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్‌రావు పాల్గొన్నారు. తిమ్మాపూర్: మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేడ్కర్, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్న రామ్ విగ్రహాల ఆవిష్కణకు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యానారాయణ అడ్డుపడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. తిమ్మాపూర్‌లో బుధవా రం మాట్లాడుతూ.. తాను అంబేద్కర్ భవనంతో పాటు బస్టాండ్ ప్రాంతాన్ని అంబేద్కర్ హబ్‌గా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఆవిష్కరణకు నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. నాటి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విగ్రహాల ఆవిష్కరణను అడ్డుకున్నారని, ప్రస్తుత ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అనుమతి ఇవ్వడంతో ఆవిష్కరణకు సిద్ధమవుతుండగా కొంతమంది మరోసారి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విగ్రహాల ను తాళ్లతో బంధించి, పాత బట్టలతో ముసుగులు పెట్టి అవమానించడం బాధాకరమన్నా రు. విగ్రహాలతో రాజకీయం మానుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విగ్రహాలపై ముసుగులు వేసిన వారిపై ఎస్సీ ఎస్టీ చైర్మన్, కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, సంపత్, మైపాల్‌రెడ్డి, తిరుపతి, కొమురయ్య అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.


