అయ్యో పాపం ‘సహస్ర’ | - | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం ‘సహస్ర’

Mar 5 2026 7:23 AM | Updated on Mar 5 2026 7:23 AM

సిరిసిల్లటౌన్‌: అమ్మ పొత్తిళ్లలో అడుకునే వయసులో ఓ చిన్నారి ప్రమాదకర వ్యాధితో పోరాడుతోంది. కాలేయం పాడవడంతో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతోంది. ఖరీదైన వైద్యం చేయించే ఆర్థిక పరిస్థితి లేక ఆ తల్లిదండ్రుల పడుతున్న కష్టాలు చెప్పలేనివిగా ఉన్నాయి. దాతలు చేయి అందిస్తే తమ కూతురును కాపాడుకుంటామని వేడుకుంటున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన అంబటి వేణు నేతకార్మికుడు. భార్య వర్ష పెట్టికోట్స్‌ కుడుతుంటుంది. వీరికి ముగ్గురు సంతానం అమృత, సహస్ర, అన్విత్‌సాయి. ఐదేళ్ల క్రితం పెద్ద కూతురు అమృత లివర్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చనిపోయింది. ఆ చిన్నారికి రూ.2లక్షలతో చికిత్స చేయించినా ప్రాణం దక్కలేదు. పదిహేను రోజుల క్రితం రెండో కూతురు సహస్రకు తీవ్ర జ్వరం రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగు రోజులు దాటినా తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేర్పించగా.. పరీక్షించిన వైద్యులు లివర్‌ మార్పిడి చేయాలని చెప్పారు. ఇప్పటికే రూ.5లక్షలు ఖర్చు చేశామని ఇప్పుడు రూ.30లక్షల వరకు ఆపరేషన్‌కు ఖర్చు అవుతుందని తెలిపారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దాతలు 99122 31674లో సంప్రదించాలని కోరుతున్నారు.

చిన్నారికి ఎంత కష్టం

లివర్‌ మార్పిడితో బతికే అవకాశం

పేద బతుకులకు కావాలి ఆపన్నహస్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement