breaking news
Karimnagar District Latest News
-
వెళ్లిరా.. వినాయక
కరీంనగర్‌కల్చరల్/కరీంనగర్‌క్రైం/మానకొండూర్/కొత్తపల్లి: మహారాష్ట్ర బ్యాండ్ల హోరు.. డప్పుల దరువు.. ఒగ్గుడోలు విన్యాసాలు.. యువత తీన్మార్ స్టెప్పులు.. మహిళల కోలాటాలు.. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో కరీంనగరం మార్మోగింది. నవరాత్రులపాటు పూజలందుకున్న గణనాథుడికి బుధవారం భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. జోరువానను సైతం లెక్కచేయకుండా భక్తులు శోభాయాత్రలో పాల్గొని గణపతులను నిమజ్జనానికి తరలించారు. పూణే, మహారాష్ట్ర బ్యాండ్ల బృందాల లయబద్ధమైన సంగీతం వేడుకలకు మరింత ఊపునిచ్చింది. యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ అలంకరించిన వాహనాలపై గణనాథులను టవర్‌సర్కిల్‌కు తీసుకొచ్చారు. అక్కడ గణేశ్ ఉత్సవ కమిటీ, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవ పూజలు నిర్వహించారు. పాతబజార్‌లోని ఒకటో నంబర్ గణనాథుడికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, గంగుల కమలాకర్, కలెక్టర్ చిత్రామిశ్రా, సీపీ గౌస్ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చింతకుంట, కొత్తపల్లి, మానకొండూర్ చెరువుల వైపు నిమజ్జనానికి తరలించారు. వర్షంలో తడుస్తూనే నిమజ్జన కార్యక్రమాలు కొనసాగించారు. మానకొండూర్‌లో అర్ధరాత్రి దాటినా భారీ విగ్రహాలు ఒక్కటి కూడా చెరువుకు చేరలేదు. కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ వద్ద తెల్లవార్లూ నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. రాంనగర్‌లోని రెండు భారీ వినాయకుల వద్ద సందడి నెలకొంది. పలు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, ప్రసాదాలు అందించాయి. నిమజ్జనం సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. -
● జాయిన్ చేసుకొని చేతులెత్తేస్తున్న వైద్యులు ● ఆరోగ్యశ్రీ నిధులు రాకపోవడమే కారణమా? ● ఇంప్లాంట్లు కొనుగోలు చేయలేని నిరుపేదలు ● నిస్సహాయ స్థితిలో ప్రైవేటుకు పరుగులు
కరీంనగర్: పేదలకు అత్యవసర వైద్యం అందించేందుకు కోట్లాది రూపాయలతో జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన క్రిటికల్‌కేర్ యూనిట్ బాధితులకు బాసటగా నిలవడం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నిరుపేదలు ఆపరేషన్లకు నోచుకోవడం లేదు. కాళ్లు, చేతులు విరిగి ఆపరేషన్ కోసం వస్తున్నవారిని చేర్చుకొని రోజుల తరబడి ఆసుపత్రిలో ఉంచి.. చివరకు సర్జరీ చేయకుండానే బయటకు పంపుతున్నారు. ఆరోగ్యశ్రీలో నిధులు విడుదల కాకపోవడం వల్లే కొన్ని ఆపరేషన్లు నిలిచిపోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నా స్పష్టత ఇవ్వకపోవడంతో రోగులు అయోమయానికి గురవుతున్నారు. ఆపరేషన్ చేస్తామన్న ఆశతో రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండి, చివరకు ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నారు. -
క్రిటికల్ కేర్.. ఆపరేషన్లు రేర్
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన కుమార్(45) బస్సు ప్రమాదంలో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఎడమ కాలి రెండు వేళ్లు తొలగించాల్సి ఉండటంతో గాంధీ నుంచి ఇక్కడకు పంపించారు. 20 రోజుల క్రితం చేరిన కుమార్‌ను నాలుగు రోజుల క్రితం ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి సర్జరీ చేయకుండానే వెనక్కి పంపించారు.రామడుగు మండల పరిధిలోని షానగర్‌కు చెందిన సుగుణ(60) కాలు విరగడంతో 20రోజుల క్రితం జీజీహెచ్‌లోని క్రిటికల్‌కేర్‌లో చేరింది. ఐదు రోజుల క్రితం ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లినా.. సర్జరీ చేయకుండానే తిరిగి వార్డుకు తీసుకొచ్చారు. టీహెచ్ఆర్ ఆరోగ్యశ్రీలో రాకపోవడంతో ఇంప్లాంట్ రూ.70 వేలతో కొనుగోలు చేయాలని సూచించారు. అంత మొత్తం తమవద్ద లేవని చెప్పడంతో ఎంజీఎంకు వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయింది. -
పీఐసీ రగడ
కరీంనగర్ అర్బన్: కేడీసీసీబీ పీఐసీ పోస్టు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. కొండూరు రవీందర్రావు ఈ నెల 21న పర్సన్ ఇన్చార్జీ(పీఐసీ)గా బాధ్యతలు స్వీకరించారు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా బాధ్యతలెలా స్వీకరిస్తారని సహకారశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు తానే బాధ్యతలు చేపట్టడం, పీఐసీగా ప్రకటించుకోవడాన్ని తప్పుబడుతున్నారు. ఈ విషయమై కలెక్టర్ చిత్రామిశ్రా అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు డీసీవోను చర్యలకు ఆదేశించినట్లు సమాచారం. కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావును పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని డీసీవో రామానుజాచార్యులు ఆదేశించగా లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సీఈవో చెబుతున్నారు. అసలేం జరిగింది? బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సహకార సంఘాలకు 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి కేడీసీసీబీ చైర్మన్‌గా కొండూరు రవీందర్రావు కొనసాగారు. కేడీసీసీబీ పరిధిలో మొత్తం 131 ప్రాథమిక సహకార సంఘాలుండగా కరీంనగర్ జిల్లాలో 28, జగిత్యాల 50, పెద్దపల్లి 20, రాజన్న సిరిసిల్ల 23, సిద్దిపేట 4, వరంగల్ 2, భూపాలపల్లి జిల్లాలో 4 ప్యాక్స్లున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఎన్నికలు నిర్వహించకపోగా పాలకవర్గాల పదవీకాలం 2025 ఫిబ్రవరితో ముగిసింది. ఏడాది గడువు పొడిగించగా, 2025 డిసెంబర్ 19న కీలక నిర్ణయం తీసుకుంటూ ప్యాక్స్, డీసీసీబీలకు పాలకవర్గాలను రద్దు చేసింది. ప్రభుత్వ అధికారులను పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమించగా కేడీసీసీబీకి కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. గడువు ముగియకముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై పాలకవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. మే 12వరకు పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్ కొనసాగగా అప్పటి నుంచి పాలకవర్గం లేదు. కొండూరు బాధ్యతలపై గరంగరం 2005 నుంచి వరుసగా కేడీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికవుతున్న కొండూరు రవీందర్రావు 2025 డిసెంబర్ 19న జీవో 598 ప్రకారం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. హైకోర్టు 598 జీవోను కొట్టివేస్తూ పాత జీవో 386 ప్రకారం పాలకవర్గాలను కొనసాగించాలని ఆదేశాలిచ్చిందని అందుకే బాధ్యతలు చేపట్టానని రవీందర్రావు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర సహకారశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని జిల్లా యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ఇదిలా ఉంటే కేడీసీసీబీ పరిధిలో పాత పాలకవర్గాలు తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నామినేటెడ్ నియామకాలు ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో ప్రాథమిక సహకార సంఘాలకు పాలకవర్గాలను ప్రకటిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 25 సంఘాల వరకు చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు డైరెక్టర్లను నియమించింది. ఒక్కో సొసైటీకి 13మందితో పాలకవర్గాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో కొండూరు రవీందర్రావు బాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. అధికార ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల సిఫారసుల క్రమంలో పాలకవర్గాలను ప్రకటిస్తున్నారు. కాగా కేడీసీసీబీలో మే 12 నుంచి రుణాలు మంజూరు కావడం లేదు. పాలకవర్గాలను నియమిస్తే తప్పా రూ.10లక్షలకు మించి రుణాలు మంజూరయ్యే అవకాశఽం లేదు. వ్యవసాయ, వ్యాపార, విద్య రుణాలు స్తంభించిపోయాయి.కొండూరుకు చెక్ – గంభీరావుపేట ప్యాక్స్ చైర్మన్‌గా వేషాల వెంకట్ కొండూరు రవీందర్‌రావుకు ప్రభుత్వం చెక్ పెట్టింది. నామినేటెడ్ పద్ధతిలో సింగిల్ విండో చైర్మన్లను ప్రకటిస్తుండగా తాజాగా గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా వేషాల వెంకట్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 13మందితో పాలకవర్గాన్ని ప్రకటించగా.. రవీందర్రావు ఇక కేడీసీసీబీకి దూరం కానున్నారు. కేడీసీసీబీ చైర్మన్ పదవి ఉండాలంటే ప్యాక్స్ చైర్మన్ పదవి ఉండాల్సిందే. ఇన్నాళ్లు గంభీరావుపేట ప్యాక్స్ చైర్మన్‌గా కొండూరు కొనసాగినందునే కేడీసీసీబీలో ఆ హోదా లభించగా.. తాజా ప్రభుత్వ ఉత్తర్వులతో కొండూరుకు చెక్ పడినట్లేనని అంతా భావిస్తున్నారు. -
ఇదేం వసతి.. ఇవేం సౌకర్యాలు..?
కరీంనగర్ క్రైం: విద్యార్థులు, వయోవృద్ధులు, దివ్యాంగులకు అందుతున్న సేవలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ బుధవారం కరీంనగర్లో తనిఖీలు నిర్వహించారు. రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. వంటశాల, స్టోర్‌రూం, వసతి గదులు, మరుగుదొడ్లు, భోజన ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సేవలను పరిశీలించారు. వంటగది, మరుగుదొడ్ల అపరిశుభ్రతతో పాటు నాణ్యత లేని కూరగాయలు, ఆహార పదార్థాలను గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్ఖానగడ్డలోని ప్రభుత్వ వయోవృద్ధులు, దివ్యాంగుల వసతి గృహాన్ని సందర్శించి, వసతి, భోజనం, పరిశుభ్రత, వైద్య పరీక్షలు, మందుల పంపిణీ తదితర అంశాలపై ఆరా తీశారు. డీఎల్ఎస్ఏ సభ్యులు, న్యాయవాదులు ఏ.కిరణ్‌కుమార్, పెరుక రంగయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎలుగు తణ్మయి, ప్యానెల్ న్యాయవాది నజీమా సుల్తానా పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్: ప్రతిష్టాత్మకమైన అర్బ న్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్)లో భాగంగా నగరంలో చేపట్టనున్న మూడు ప్రాజెక్ట్‌లకు యూసీఎఫ్ స్టేట్ స్టీరింగ్ కమిటీఆమోదం తెలి పింది. దీంతో రూ.840 కోట్లతో చేపట్టనున్న మూడు ప్రాజెక్ట్‌లకు మార్గం సుగమమైంది. బుధవారం హైదరాబాద్ నుంచి యూసీఎఫ్ స్టీరింగ్ కమిటీ చైర్మన్, డీటీసీపీ దేవేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, అదనపు కమిషనర్ ఆయాజ్, ఎస్ఈ సంపత్ రావు, డీఈ దేవేందర్ రెడ్డి, ఏఈ సతీశ్, ఏసీపీ వేణు పాల్గొన్నారు. యూ సీఎఫ్ కింద ఎంపికై న నగరంలో చేపట్టనున్న మోడల్ రోడ్ల నిర్మాణం, స్టాం వాటర్ డ్రైన్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనలు, టెక్నికల్, డిజైన్లు, టెండర్, పనులు తది తర అంశాలపై చర్చించారు. ప్రాజెక్టులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయడానికి అనుసరించాల్సిన భవిష్యత్తు ప్రక్రియలపై యూసీఎఫ్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన వెంటనే క్షేత్రస్థాయి పనులు ప్రారంభించి, నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టులను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. కరీంనగర్: 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిభిరానికి విశేష స్పదన లభించింది. బుధవారం స్థానిక రాంనగర్‌లోని ప్రభుత్వ ఆయుష్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా డీఎంహెచ్‌వో రాజగోపాల్రావు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని ప్రజలకోసం ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. శిబిరంలో 500కు పైగా ఆయుర్వేద, హోమియో, యునాని వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. వైద్యులు ఆయుర్వేద ఔషధమొక్కలు నాటారు. ఆయుష్ జిల్లా నిర్వహణ అధికారి శేఖర్, ఆయుర్వేద, యునాని సీనియర్ వైద్యాధికారులు జంగయ్య, షఫిక్ అహ్మద్, కరీంనగర్ జిల్లా ఆయుష్ డీపీఎం ప్రవీణ్ కుమార్, ఆయుర్వేద వైద్యులు నీరజ, వెంకటేశ్వర్లు హోమియో వైద్యురాలు సంధ్య, నేచురోపతి వైద్యురాలు రజిత, యునాని వైద్యులు అప్సానా పాల్గొన్నారు. విద్యానగర్(కరీంనగర్): ఇంటర్ అడ్మిషన్స్ గడువును ఈనెల 26 వరకు 3 రోజుల పాటు పొడిగించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాఽశాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రతి అడ్మిషన్‌ను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. -
భక్తులకు డిజిటల్ చెల్లింపులతో టికెట్లు
వేములవాడ: భీమేశ్వర ఆలయంలో డిజిటల్ కియోస్క్‌లను ఈవో రమాదేవి బుధవారం ప్రారంభించారు. భీమేశ్వర సదన్ వసతి గృహం సమీపంలో, ఆలయ ప్రాంగణంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్యూలైన్ల తిప్పలు లేకుండా వేగవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో డిజిటల్ కియోస్క్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ కియోస్క్‌ల ద్వారా లడ్డూ, పులిహోర ప్రసాదాల టికెట్లను, ఇతర పూజా టికెట్లను సులభంగా పొందే వెసులుబాటు కలిగిందన్నారు. డీఈవో నవీన్, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ పాల్గొన్నారు. రాజన్న ట్రస్టుకు రూ.లక్ష విరాళంవేములవాడ: రాజన్న ట్రస్టుకు పట్టణానికి చెందిన వ్యాపారి నగుబోతు వీణరఘురాం దంపతులు రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఆలయ ఈవో రమాదేవికి బుధవారం అందించారు. ఈ సందర్భంగా దాతలకు స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అధికారులు అందించారు. బైక్ దొంగకు రెండేళ్ల జైలుతంగళ్లపల్లి(సిరిసిల్ల): ద్విచక్ర వాహనం చోరీ కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఈమేరకు సిరిసిల్ల రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి గడ్డం మేఘన బుధవారం తీర్పునిచ్చినట్లు తంగళ్లపల్లి ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. గతేడాది జూన్ 30న బద్దెనపల్లి శివారులోని పౌల్ట్రీఫామ్ వద్ద జిందం రాజకుమార్‌కు చెందిన బైక్ చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఇల్లంతకుంటకు చెందిన దుర్మిట్ల నరేశ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి ఎస్సై ఉపేంద్రచారి దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఏపీపీ సందీప్ ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించగా కోర్టు మానిటరింగ్ అధికారులు సాక్షులను హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో మేజిస్ట్రేట్ నిందితుడు నరేశ్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఇంట్లో చొరబడి.. చోరీ చేసి..తిమ్మాపూర్: రామకృష్ణ కాలనీ గ్రామంలో అర్ధరాత్రి దొంగలు కలకలం సృష్టించారు. గ్రామానికి చెందిన కొమ్ము రాధ మంగళవారం తన కూతుర్లతో కలిసి ఇంట్లో పడుకోగా.. అర్ధరాత్రి దాటిన తర్వాత అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. గమనించిన ఆమె కేకలు వేయడంతో పరారయ్యారు. రెండు బైకులు పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించా రు. ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.50 వేలు ఎత్తుకెళ్లారని మహిళా రోదించింది. ఎస్సై అన్వర్ సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. ఘటనపై ఫిర్యాదు తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
ఉద్యమస్ఫూర్తిని ఆవిష్కరించాం
● ‘దక్కన్ సర్కార్’ సినిమా దర్శకుడు కళా శ్రీనివాస్గంభీరావుపేట(సిరిసిల్ల): తెలంగాణ నేల కథను, అచ్చమైన యాస, ఉద్యమ స్ఫూర్తిని తెరపై ఆవిష్కరించామని ‘దక్కన్ సర్కార్’ సినిమా దర్శకుడు, గాయకుడు కళా శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని సీతారామస్వామిని బుధవారం దర్శించసందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామానికి చెందిన శ్రీనివాస్ దాదాపు 3వేల ఆల్బమ్ సాంగ్స్, 20కి పైగా షార్ట్ ఫిలిమ్స్, 50కిపైగా డాక్యుమెంటరీ ఫిలిమ్స్, వెయ్యికిపైగా స్టేజీ షోలు నిర్వహించాడు. కళా శ్రీనివాస్ నిర్మాతగా, దర్శకుడిగా మారి తెలంగాణ ఉద్యమ నేపథ్యం, సామాజిక పరిస్థితులు, గ్రామీణ ప్రజల స్థితిగతులు, సహజ సంఘటనల ఆధారంగా ‘దక్కన్ సర్కార్’ అనే సినిమాను రూపొందించారు. రెండేళ్ల కష్టంతో సినిమా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సినిమా సెన్సార్ బోర్డు పరిధిలో ఉందన్నారు. డిసెంబర్ నెలలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూలోని అంశాలు ఆయన మాటల్లోనే.. తెలంగాణ కథ తెలంగాణ ఉద్యమంలో 300 స్టేజీల్లో కళా ప్రదర్శనలు ఇచ్చాను. దాదాపు 30 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలోని పల్లెల్లో తిరిగాను. ప్రజల జీవన విధానం, వారి కష్ట సుఖాలు పరిశీలించాను. సామాజిక, రాజకీయ పరిస్థితులూ గమనించాను. తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు దక్కన్ ప్రాంతంగా పిలిచేవారు. దక్కన్ పేరుతో అనేకాంశాలు ఉన్నాయి. ఈ అంశాలపై తీసిన మూవీ కాబట్టి దక్కన్ సర్కార్ అని పేరు పెట్టాం. పైసల్లేక షూటింగ్ ఆగింది నేను రచయితను.. గాయకున్ని. సామాన్య పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. సహజంగానే ఆర్థిక సవాళ్లు ఎదురయ్యాయి. అప్పుడప్పుడు పైసల్లేక షూటింగ్ ఆపిన సందర్భాలు ఉన్నాయి. హీరో చాణక్య ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి. తనని కొన్ని నెలలపాటు తెలంగాణలోని అనేక గ్రామాల్లోకి తీసుకెళ్లాను. వారి యాస, భాషను పరిచయం చేశాను. సినిమా హీరో పాత్రకు అనుగుణంగా మార్చాను. వంద మంది నటీనటులతో షూటింగ్ సినిమాలో దాదాపు 100 మంది నటీనటులు పనిచేశారు. మరో 50 మంది సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు. నేను షార్ట్ ఫిలిమ్స్, స్టేజీ షోలు చేసిన అనుభవం ఉన్నందున సమన్వయం చేసుకోగలిగాను. ప్రశ్నించేతత్వం చెప్పాం ఈ సినిమా ద్వారా యువతకు మంచి సందేశం ఇచ్చాం. గ్రామాలు, పట్టణాల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయాల్లో యువకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.. వాటిని ఎలా ప్రశ్నించాలి, పరిష్కరించుకోవాలో సినిమాలో చూపించాం. -
రోడ్డు ప్రమాదంలో మహిళ...
హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొంకటి సులోచన(45) మృతి చెందింది. మండలంలోని చెల్పూరుకు చెందిన కొంకటి సులోచన– రమేశ్ దంపతులు బైక్‌పై పెద్దపాపయ్యపల్లి నుంచి చెల్పూర్ వెళ్తున్నారు. మార్గమధ్యలో వెనుకనుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. సులోచన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న రమేశ్‌ను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సులోచన చెల్పూర్ సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయారు. సురేశ్ బీజేపీ నాయకుడిగా కొనసాగుతున్నారు. హుజూరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల చొరవ.. సొత్తు స్వాధీనం
● సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీ కేసు ఛేదన ● పూర్తిస్థాయిలో ఆభరణాల రికవరీ ● పోలీసుల పనితీరుకు అభినందనలు మంథని: చేతికందిన సొమ్ము కాదు.. భవిష్యత్‌కు భరోసా కోసం దాచుకున్న బంగారం ఒక్కరాత్రిలోనే చోరీకి గురవడంతో ఆ కుటుంబం మనోవేదనకు గురైంది. వారి ఆవేదనను అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితులను గుర్తించారు. సొత్తును పూర్తిస్థాయిలో రికవరీ చేశారు. వివరాలు.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లిలో ఈనెల 18న పంగ శ్రీకాంత్ ఇంటి తాళం పగులగొట్టిన దొంగలు సుమారు రూ,7 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీచేశారు. దీనిపై ఈనెల 19న సాక్షి దినపత్రిలో ‘ఉన్నదంతా ఊడ్చేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. బాధితుడి ఆడబిడ్డ దాచుకున్న ఆభరణంతోపాటు కూతురు, కుమారుడి కానుకలూ చోరీకి గురైనవాటిలో ఉన్నాయి. భరోసా ఇచ్చారు.. మాట నిలబెట్టుకున్నారు సమాచారం అందిన వెంటనే రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు సీఐ స్వామి నేతృత్వంలో ఎస్ఐ సందీప్‌కుమార్, కానిస్టేబుల్లు రమేశ్, శివకుమార్ మరికొందరు పోలీసులు వేగవంతంగా దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తూ నిందితుల కదలికలను గుర్తించి మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారినుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చోరీ జరిగిన కొద్దిరోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసుల పనితీరును ప్రజలు అభినందించారు. -
ఆకట్టుకున్న రెస్క్యూ విన్యాసాలు
గనిలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్న జట్టు ఫస్ట్ ఎయిడ్ నిర్వహిస్తున్న మహిళా సభ్యులు గనిలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న మహిళా జట్టు గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని–యైటింక్లయిన్‌కాలనీలోని మెయిన్ రెస్క్యూ స్టేషన్లో రెండురోజుల పాటు నిర్వహించే రెస్క్యూ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రెస్క్యూ బృందాలు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రధానంగా బొగ్గు గనిలో జరిగే ప్రమాదాల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించి సకాలంలో పైకి తీసుకొచ్చే ప్రక్రియ హైలెట్‌గా నిలిచింది. థియరీ, ఫస్ట్‌ఎయిడ్ టెస్ట్‌లు మెయిన్ రెస్క్యూ స్టేషన్లో నిర్వహించగా, రెస్క్యూ, రికవరీ పోటీలో బొగ్గు ఉత్పత్తి నిలిపివేసిన జీడీకే–7ఎల్ఈపీ గనిపై కొనసాగాయి. -
సోషల్‌మీడియాలో పోస్టు.. రిమాండ్
రుద్రంగి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన మోతె నితిన్ మంగళవారం మండల వాట్సాప్ గ్రూపులో రామకృష్ణ అనే కానిస్టేబుల్‌కు పోలీస్ ఉన్నతాధికారులను ఉద్దేశించి ఓపెన్ చాలెంజ్ చేస్తూ వాయిస్ రికార్డు పోస్టు చేశాడు. బుధవారం జరిగే వినాయక నిమజ్జనంలో లా ఆండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తానని, పోలీస్ కానీ, ఆర్మీ కానీ వచ్చినా కంట్రోల్ కాకుండా చేస్తానని, తనతో గొడవ పెట్టుకున్నవారిని చంపుతానని లేదా తాను అయినా చస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన రుద్రంగి ఎస్సై మోతీరాంనాయక్ విచారణ చేపట్టి.. బుధవారం మోతె నితిన్‌ను అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు. చందుర్తి సీఐ రవీందర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం, ఇతర పండుగల సమయంలో ప్రజలందరూ భక్తితోపాటు సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఎన్టీపీసీ ఎలక్ట్రాన్ క్విజ్‌లో మద్రాస్ ఐఐటీ విజయం
జ్యోతినగర్: ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎలక్ట్రాన్ క్విజ్ ప్రాంతీయ రౌండ్ చైన్నెలోని ఎంఎంఏ ఆడిటోరియంలో బుధవారం ఉత్సాహభరితంగా సాగింది. ప్రాథమిక రౌండ్లో ఇద్దరు సభ్యులతో కూడిన 230 జట్లు పోటీపడగా.. ఆరుజట్లు గ్రాండ్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. గ్రాండ్ ఫైనల్లో ఐఐటీ మద్రాస్ జట్టు విజేతగా నిలిచింది. మరో ఐఐటీ మద్రాస్ జట్టు రన్నరప్‌గా నిలవగా.. రాజలక్ష్మి ఇంజినీరింగ్ కళా శాల జట్టు మూడోస్థానాన్ని దక్కించుకుంది. ప్రము ఖ క్విజ్మాస్టర్ గౌతమ్బోస్ క్విజ్ నిర్వహించారు. ఎన్టీపీసీ ఈడీ (హెచ్ఆర్), రీజినల్ హెడ్ ఆఫ్ హెచ్ఆర్ (నార్త్–సౌత్) ఎస్ఎన్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. విజ్ఞాన ఆధారిత కార్యక్రమాల ద్వారా దేశాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. విజేతలకు బహుమతులను అందించారు. ప్రాంతీయ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు 2026 అక్టోబర్ 7న న్యూఢిల్లీలో జరిగే సెమీస్‌కు అర్హత సాధించాయి. -
పిడుగుపాటుకు మహిళ మృతి
జూలపల్లి/ధర్మారం: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని బాలరాజుపల్లెలో వ్యవసాయ పనులు వేస్తున్న కూలీలపై పిడుగుపడి మారం అంజయ్య(50) అక్కడికక్కడే మృతి చెందగా, దోనూరు లక్ష్మి(45) తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలు.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లికి చెందిన మారం అంజమ్మ, కొత్తూరుకు చెందిన దోనూరు లక్ష్మితోపాటు మరికొందరు మహిళలు పత్తి కలుపు తీసేందుకు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని బాలరాజుపల్లెకు బుధవారం చేరుకున్నారు. వారు పనుల్లో ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. దీంతో కూలీలు సమపంలోని చెట్టుకిందకు వెళ్లారు. ఈసమయంలోనే చెట్టుపై పిడుగుపడగా మారం అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, దోనూరు లక్ష్మి కాళ్లు, చేతులు కదలకుండాపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. లక్ష్మిని కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ మల్లేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చామనపల్లి సర్పంచ్ భర్త కొమ్మ నాగరాజు, బాలరాజుపల్లె సర్పంచ్ కుంటూరి అంజమ్మ కూలీల వద్దకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. -
అప్పులబాధతో గీతకార్మికుడి ఆత్మహత్య
కోనరావుపేట(వేములవాడ): అప్పుల బాధలు, ఇతర సమస్యలు భరించలేక ఓ గీతకార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలకేంద్రానికి చెందిన లింగాపురం వెంకటి(60) గ్రామంలోనే గీతకార్మికునిగా పనిచేసుకుంటున్నాడు. వెంకటికి సంతానం లేదు. ఇల్లు కూడా లేకపోవడంతో తమ్ముడు నారాయణ ఇంట్లోనే ఉంటున్నాడు. అనారోగ్య సమస్యలతో అప్పు కావడంతో ఇబ్బందులు పడుతున్నాడు. బుధవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన వెంకటి శివంగాలపల్లిరోడ్డులోని డంపింగ్‌యార్డ్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోంచి వెళ్లిన వెంకటి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. డంపింగ్‌యార్డ్ సమీపంలో గొర్లను మేపుతున్న కాపరికి ఫోన్‌రింగ్ వినబడి, పొదల్లోకి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. కోనరావుపేట ఎస్సై రామ్మోహన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమకు బ్లడ్ ఆర్ట్
● రక్తంతో అపురూప చిత్రాలు ● కానుకలు ఇచ్చేందుకు సిరిసిల్ల యువత ఆసక్తి సిరిసిల్ల అర్బన్: పెన్సిల్ ఆర్ట్.. వాటర్‌కలర్స్ ఆర్ట్.. చూశాం. కానీ సిరిసిల్లలో ఇటీవల బ్లడ్ ఆర్ట్ ఫేమస్ అయ్యింది. తమ ఆప్తులకు.. అత్యంత ఇష్టమైన వారి పుట్టిన రోజులు.. పెళ్లిరోజులకు కానుకలు ఇచ్చేందుకు చాలా మంది ఈ బ్లడ్ ఆర్ట్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. సిరిసిల్లకు చెందిన వెంగళ గణేశ్ అనే చిత్రకారుడు సామాజిక రుగ్మతలపై అనేక చిత్రాలు గీశారు. ఎయిడ్స్ నిర్మూలన, కుటుంబ నియంత్రణ, బాల్య వివాహాలు, పిల్లల విక్రయాలు, నేత కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలు వివిధ అంశాలపై ఆలోచన రేకేత్తించే చిత్రాలు తన కలం నుంచి జాలువారాయి. ఈక్రమంలోనే కొంతకాలంగా రంగుల స్థానంలో రక్తం వచ్చింది. కొన్ని చుక్కల రక్తంతో మంచి చిత్రాన్ని గీసి ఇస్తున్నాడు. రక్తంతో చిత్రాలు తమకు ఇష్టమైన వారికి కానుక ఇచ్చేందుకు చాలా మంది ఈ రక్తంతో గీసిన(బ్లడ్ ఆర్ట్) చిత్రాలు ఇస్తున్నారు. తమ రక్తాన్ని ల్యాబరేటరీకి వెళ్లి సిరంజీలో తీసుకొని వచ్చి గణేశ్‌కు ఇస్తే.. మనం ఎవరి చిత్రం కావాలంటే వారిది గీసి.. ఫొటోఫ్రేమ్ చేసి ఇస్తాడు. ఇలా రెండేళ్లుగా బ్లడ్ ఆర్ట్ వేస్తున్నాడు. రెండేళ్లలో 360 వరకు చిత్రాల వేసినట్లు తెలిపాడు. రక్తం సేకరణలో భద్రతపై ఆందోళన? ప్రధానంగా 2023లో తమిళనాడులో ఈ తరహా బ్లబ్ ఆర్ట్ ప్రేమికులకు బహుమతిగా ఇవ్వడం ట్రెండ్‌గా మారింది. అయితే రక్తం సేకరణలో భద్రత ప్రమాణాలపై ఆందోళనలు వ్యక్తం కావడంతో అక్కడి ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తోంది. ప్రేమ అంటే అండగా ఉండటం తల్లిదండ్రులు, ఆప్తులపై ప్రేమ ఉంటే వారితో సమయం గడపడం, వృద్ధాప్యంలో అండగా నిలవడం చేయాలని.. ఇలా రక్తంతో వేసిన చిత్రాలు అంతకంటే విలువైనవి కాదని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా రక్తం సేకరణ విషయంలో శిక్షణ లేని వ్యక్తులు, అనుమతి లేని ల్యాబ్‌లకు వెళ్లడం ప్రమాదకరమని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
చింతకుంట కెనాల్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు నిమజ్జనానికి సిద్ధమైన కొత్తపల్లి చెరువుమానకొండూర్ చెరువులో పూడికతీత పనులుకరీంనగర్ కార్పొరేషన్: గణేశ్ నిమజ్జనానికి నగరపాలకసంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. ఆరు పాయింట్ల ల్లో విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఇందు కు 11 క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. బుధ, గురువారాలు నిమజ్జనం పూర్తయ్యేంత వరకు పాయింట్ల వారిగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. అదనపు కమిషనర్ ఆయాజ్, డీసీపీ బషీర్, డీఈ దేవేందర్‌కు మానకొండూర్ బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ కమిషనర్ వేణు మాధవ్, ఏసీపీ శ్రీధర్, డీఈ వెంకటేశ్వర్లుకు కొత్తపల్లి, డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దిన్, ఏసీపీ వేణు, డీఈ శ్రీనివాస్ చింతకుంటలో పర్యవేక్షించనున్నారు. బొమ్మకల్, దుర్శేడ్‌లో అదనపు కమిషనర్ సువార్త, ఈఈ లచ్చిరెడ్డి విధుల్లో ఉంటారు. ఎస్ఈ సంపత్‌రావు, ఏసీపీ వేణు, డీఈ ఓం ప్రకాశ్‌కు టవర్‌సర్కిల్, అదనపు కమిషనర్ రాజమనోహర్, శానిటరీ సూపర్ వైజర్ శ్యాంరాజ్, ఏంహెచ్‌వో సుమన్‌కు పారిశుధ్య బాధ్యతలు అప్పగించారు. ఆరు నిమజ్జన పాయింట్లు నగరపాలక సంస్థతో పాటు కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మానకొండూరు మండలాల నుంచి దాదాపు రెండు వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం మానకొండూరు, కొత్తపల్లి చెరువులు, చింతకుంట కెనాల్‌తో పాటు, బొమ్మకల్ చెరువు, దుర్శేడ్ వాగు, గోపాల్పూర్ చెరువుల వద్ద ఏర్పాట్లు చేశారు. ప్రతి నిమజ్జనం పాయింట్ వద్ద లైటింగ్ ఏర్పాటు చేశారు. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు 11 క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నగరపాలకసంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. టవర్‌సర్కిల్, కమాన్‌చౌరస్తా, రాంనగర్ వద్ద శోభాయాత్ర స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. టవర్సర్కిల్తో పాటు కూడళ్లు, పాయింట్ల వద్ద లైటింగ్, పూలతో అలంకరించారు. ఈ సారి నిమజ్జన ఏర్పాట్లకు బల్దియా రూ.1.50 కోట్లు కేటాయించింది. నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని మేయర్కొలగాని శ్రీనివాస్ సూచించారు. మంగళవారం నిమజ్జన పాయింట్లను, టవర్‌సర్కిల్ సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు.● మానకొండూరు చెరువుకు వెళ్లే వాహనాలు హైదరాబాద్ రోడ్డులోని కరీంనగర్ వంతెన, అలుగునూర్ మీదుగా మానకొండూరు చెరువుకు చేరుకోవాలి. నిమజ్జనం తరువాత సదాశివపల్లి జంక్షన్ నుంచి కేబుల్ వంతెన మీదుగా నగరంలోకి రావాలి. ● కొత్తపల్లి చెరువులో భారీ విగ్రహాలు కొత్తగా ఏర్పాటు చేసిన పాయింట్ వద్ద నిమజ్జనం చేయాలి. అనంతరం కొత్తపల్లి వంతెన మీదుగా మల్కాపూర్ వెళ్లాలి. చిన్న విగ్రహాలను పాత పాయింట్ వద్ద నిమజ్జనం చేయాలి. ● చింతకుంట కెనాల్ వద్ద భారీ విగ్రహాలను క్రేన్ల సాయంతో నిమజ్జనం చేసిన అనంతరం వాహనాలు చింతకుంట గ్రామం లోపలి నుంచి తిరిగి వెళ్లాలి. -
రైతులకు ఉచిత న్యాయ సేవలు
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్‌క్రైం: రైతులు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్ సూచించారు. కొత్తపల్లి రైతు వేదికలో మంగళవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు కోర్టు ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉచిత న్యాయవాది, న్యాయ సలహా పొందవచ్చన్నారు. న్యాయ సాయం కోసం 15100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు. భరోసా కేంద్రంలో సేవలు పరిశీలనకరీంనగర్లోని భరోసా కేంద్రాన్ని జిల్లా న్యా య సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ సందర్శించారు. రి కార్డులు పరిశీలించారు. మధ్యవర్తిత్వ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. జిల్లాలో 31 మంది శిక్షణ పొందిన న్యాయవాదులు మధ్యవర్తులుగా ఉన్నారన్నారు.విజయవంతం చేయండికరీంనగర్ అర్బన్: గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ నూతన పాలక మండలి ఆధ్వర్యంలో జిల్లా మహాసభ ఈనెల 26న నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్ తెలిపారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో మహాసభ పోస్ట ర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా రాష్ట్రమంత్రులు వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమైక్య ఫెడరేషన్ చైర్మన్ కె.సరిత తిరుపతయ్య, లైవ్ స్టాక్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, యాదవ కురుమ చైర్మన్ రఘునాథ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. పత్తి కొనుగోళ్లు షురూ జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్‌కు ఖరీఫ్ సీజన్లో కొత్త పత్తి ఉత్పత్తులను రైతులు తీసుకొచ్చారు. మంగళవారం మార్కెట్ చైర్పర్సన్ పూల్లూరి స్వప్న పూజలు చేసి కొనుగోళ్లను ప్రారంభించారు. క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,272 పలికింది. మార్కెట్‌కు ముగ్గురు రైతులు తొమ్మిది క్వింటాళ్లను తీసుకురాగా.. కనిష్ట ధర రూ.7,011కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. గ్రేడ్–2 కార్యదర్శి రాజా, అడ్తిదారులు సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. లంచం అడిగితే సమాచారం ఇవ్వండిగంగాధర: ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు, బిల్లులకు ఎవరైనా లంచం అడిగినా, పథకం అమలులో ఇబ్బందులకు గురిచేసినా ఫిర్యాదు చేయాలని తెలంగాణ హౌజింగ్ కార్పొరేషన్ విజిలెన్స్ అధికారి డి.నాగరాజు సూచించారు. ఒద్యారం గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించారు. బిల్లుల చెల్లింపు విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసారా అని ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తెలంగాణ హౌజింగ్ కార్పొరేషన్ అధికారులకు, టోల్‌ఫ్రీ నంబర్ 18005995991కు ఫిర్యాదు చేయాలని సూచించారు. హౌసింగ్ డీఈఈ వెంకటరమణ, ఏఈ యశ్వంత్, పంచాయతీ కార్యదర్శి శ్యామల పాల్గొన్నారు. పిడుగుపాటుతో రైతు మృతిచొప్పదండి: మండలంలోని చాకుంటకు చెందిన నరేందర్‌రెడ్డి (60) పిడుగు పాటుతో తన వ్యవసాయ పొలం వద్ద మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. నరేందర్ రెడ్డికి మండలంలోని వెదురుగట్ట శివారులో వ్యవసాయ పొలం ఉంది. మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగు మీద పడి మృతి చెందాడు. రాత్రి వరకు భర్త ఇంటికి రాకపోవడంతో భార్య మంగ కుటుంబసభ్యులతో కలిసి వ్యవసాయపొలం వద్దకు వెళ్లగా నరేందర్‌రెడ్డి విగతజీవిగా కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. -
కల్తీ.. ఆరోగ్యం గల్తీ!
ఇది బావుపేటలోని ఆహార సంస్థ. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలోని పలు స్వీట్‌షాపులు, బేకరీలకు ఆహార వస్తువులు సరఫరా చేస్తారు. పాలతో తయారు చేయాల్సిన స్వీట్లను మైదాతో తయారు చేస్తున్నారు. మైసూర్ పాక్ కూడా అంతేనని అధికారుల తనిఖీల్లోనూ వెల్లడైంది.కమాన్ సమీపంలో చిప్స్ తయారు చేసే కేంద్రమిది. నాసిరకం అలుగడ్డలను, పురుగు పట్టిన వాటితో చిప్స్ తయారు చేస్తున్నారు. వివిధ రకాల రంగులు వాడి రసాయనాలను వినియోగిస్తున్నారు.కరీంనగర్ అర్బన్: కల్తీ, కాలం చెల్లిన వస్తువులు ఆహార తయారీని శాసిస్తున్నాయి. ఆహార భద్రత శాఖ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నా జంకు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నోటీసులు, జరిమానాలకే పరిమితమవడమే అందుకు కారణమన్న వాదన వినిపిస్తుండగా క్రిమినల్ కేసులు నమోదు చేయడమే పరిష్కారమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాలం చెల్లిన మసాలాలు, సాస్‌లు వినియోగిస్తుండగా 20నుంచి 25 రకాల వండిన ఆహార పదార్థాలను డీప్ ఫ్రిజ్‌లో నిల్వ చేసి మరుసటి రోజు భోజనప్రియులకు అందిస్తున్న హోటళ్లకు కొదువ లేదు. నీళ్ల నుంచి నూనె దాకా.. పెద్ద రెస్టారెంట్లలోనూ కనీస నాణ్యత పాటించడం లేదు. నీళ్లను ఫ్రీగా ఇవ్వాల్సి ఉండగా బయట రేటు కన్నా రెండు మూడింతల ఎక్కువ ధరకు క్వాలిటీ లేని వాటర్ బాటిళ్లను అంటగడుతున్నారు. నూనెలను ఒకట్రెండు సార్లు వాడాక మార్చాల్సి ఉన్నా మార్చడం లేదు. పలు రెస్టారెంట్లలో కల్తీ నూనె వాడుతున్నట్లు సమాచారం. మసాలాలు, పసుపు, కారం, పాలు, ఐస్‌క్రీం, స్వీట్లు, నూనె, నెయ్యి అన్ని కల్తీయే. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చే మార్గాలకే మొగ్గు చూపుతున్నారు. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ వాహనమేదీ ఆయిల్ ట్రేడర్లు, బేకరీలు, హోటళ్లు, టిఫిన్ సెంట ర్లు, పండ్ల దుకాణాలు, కేఫ్‌లు, కూల్‌డ్రింక్ షాపులు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు, ఇతర నిత్యవసర సరుకుల కల్తీకి ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక బృందం మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ వాహనంతో అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేయాల్సి ఉండగా సదరు వాహనం జాడే లేదు.కల్తీ ఫుడ్ తింటే ఆరోగ్యసమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కలరింగ్ ఏజెంట్లు, క్లాస్ 2 ప్రిజర్వేటివ్వాడకం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదముంది. పేగు, ప్యాంక్రియాటిక్ కేన్సర్ల ముప్పు ఉంటుంది. నిల్వ ఉంచిన ఫుడ్ వల్ల కాలేయ సమస్యలు వస్తాయి. హెపటైటిస్సీ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వండిన ఫుడ్‌ను మళ్లీ హీట్ చేసి తింటే డయేరియా వంటి సమస్యలు వస్తాయి. -
పెట్టుబడి పేరిట రూ.10 కోట్లకు టోకరా
కరీంనగర్‌క్రైం: రూ.కోట్లలో పెట్టుబడి మోసానికి పాల్పడిన కేసులో కరీంనగర్ పోలీసులు ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. సీపీ గౌస్ ఆలం మంగళవారం ఆయన కార్యాలయంలో నిందితుల అరెస్టు చూపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శ్రేయ ఇన్ఫ్రా ఆండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెట్టుబడి పథకాలు నిర్వహిస్తూ తక్కువ కాలంలో పెట్టుబడులను రెండు, మూడింతలు చేస్తామంటూ ప్రజలను నమ్మించి రూ.10కోట్ల నగదు సేకరించారు. 2020లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఏర్పాటు చేసిన సంస్థ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించి పెట్టుబడులు సేకరించారు. నెట్వర్క్ చైన్ విధానంలో పాత పెట్టుబడిదారులకు చెల్లింపులు చేస్తూ మరికొంత మందిని ఆకర్షించారు. 2024 మే నుంచి చెల్లింపులు నిలిచిపోవడంతో పలువురు బాధితులు మోసపోయినట్లు గుర్తించా రు. బాధితుడు గుగులోత్ శివరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, సీపీ ఆదేశాలతో దర్యాప్తును సీపీఎస్‌కు బదిలీ చేశారు. సీసీఎస్ సీఐ ఆర్. ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి సెప్టెంబర్ 18న లక్నోలోని నిందితుల నివాసాల్లో దాడులు నిర్వహించింది. ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ రాయ్, రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను లక్నో చీఫ్ జుడీషియల్ మే జిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సీఐ ఆర్.ప్రకాశ్‌గౌడ్, ఎస్ఐ డి.మహిపాల్ రెడ్డిని సీపీ అభినందించారు. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్లో, సీసీఎస్ పోలీసులను సంప్రదించాలని సీపీ తెలిపారు. -
పాదచారులకు ఊరట
సాక్షిప్రతినిధి, కరీంనగర్: వరంగల్– కరీంనగర్ నగరాలను కలిపే ఎన్‌హెచ్ 563 విషయంలో పాదచారులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వరంగల్– కరీంనగర్ మధ్య దూరాన్ని 2 గంటల నుంచి 40 నిమిషాలకు కుదించిన ఈ ఫోర్‌లేన్‌పై పలు చోట్ల రోడ్డు దాటేందుకు ఇబ్బందులుగా ఉందని ఇటీవల భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ విషయమై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్పందించింది. రెండు జిల్లాలను కలుపుతూ దాదాపు 68 కిమీ మేర నిర్మించిన ఈ జాతీయ రహదారిపై దాదాపు 8 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు ఎన్హెచ్ఏఐ ముందుకొచ్చి ంది. ఆయా ప్రాంతాల్లో పాదచారులు భద్రంగా రోడ్డు దాటేందుకు అవకాశముంది. దివ్యాంగులు, ముసలి వాళ్లు ఎక్కేందుకు ఈ వంతెనలకు మెట్లతో పాటు లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలుకు ఉన్నట్లే ఇవి కూడా కాన్కోర్స్ తరహా లిఫ్టులు కావడం గమనార్హం. దాదాపు రూ.18 కోట్ల వ్యయంతో.. భారత్ మాల యోజన కింద దాదాపు రూ.2,486 కోట్లకుపైగా వ్యయంతో చేపట్టిన 68 కిమీల పొడవైన ఎన్‌హెచ్– 563పై వాహనాలు గరిష్టంగా 100 కిమీ వేగంతో వెళ్లేలా నిర్మించారు. రహదారిపై 9 వంతెనలు, 23 చిన్న వంతెనలు, 5 బైపాస్ రోడ్లు, 25 అండర్ పాస్‌లు ఏర్పాటు చేశారు. సెప్టెంబరు మొదటివారం నుంచి ట్రయల్‌రన్‌కు అనుమతించారు. అధికారులు– ప్రజలకు సమన్వయ లోపంతో కొన్ని గ్రామాలకు ఈ రహదారి ప్రమాదకరంగా మారింది. రోడ్డు దాటేందుకు సరైన మార్గం లేకపోవడంతో వేలాదిమంది ఇబ్బందులు పడుతున్నారు. ట్రయల్ అనంతరం పలు గ్రామాల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో 8 గ్రామాలను గుర్తించిన ఎన్హెచ్ఏఐ ఆయా గ్రామాల్లో పాదచారుల కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జి (ఎఫ్వోబీ)లను దాదాపు రూ.18 కోట్ల అంచనావ్యయంతో నిర్మించనుంది. ఇవి కరీంనగర్ జిల్లాలో నాలుగు, హన్మకొండ జిల్లాలో మరో నాలుగు ఉండటం గమనార్హం. పాదచారుల కోసమే: ఎన్హెచ్ఐఏ ‘రోడ్డు నిర్మాణం అనంతరం ఇటీవల ట్రయల్ రన్ మొదలు పెట్టాం. ఆయా గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పాదచారులకు ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయో అధ్యయనం చేశాం. మొత్తం 8 గ్రామాల్లో ఎఫ్‌వోబీలు నిర్మించాలని నిర్ణయించాం. కేంద్రం నుంచి రూ.18 కోట్ల విడుదలకు రంగం సిద్ధమైంది. వీలైనంత త్వరగా ఆయా గ్రామాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడతాం. ప్రతీ వంతెనకు మెట్లతోపాటు లిఫ్టులు ఏర్పాటు చేస్తాం. ఎన్‌హెచ్ 563 విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా మాకు తెలియజేయండి. సమస్యపై అధ్యయనం చేసి వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం’ అని ఎన్హెచ్ఏఐ అఽధికారులు ‘సాక్షి’కి తెలిపారు.ఎఫ్‌వోబీలు నిర్మించే గ్రామాలివే.. శంకరపట్నం, శంషాబాద్, గొల్లపల్లి, కొత్తగట్టు, శాంతినగర్, కోతుల నడుమ, సూరారం, బావుపేట -
ఆర్టీసీలో ఎన్నికల సైరన్
కరీంనగర్‌టౌన్: పదేళ్ల తర్వాత టీజీఎస్ ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కార్మిక సంఘాల్లో సందడి మొదలైంది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో ఎన్నికల వేడి రాజుకుంది. టీఎంయూ పోటీపై అని శ్చితి నెలకొనగా.. యూనియన్ల మధ్య పొత్తులు, కూటములు కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు యూనియన్లు వ్యూహాలు పన్నుతున్నాయి. ఏ సంఘానికి కార్మికుల మద్దతు లభిస్తుందన్నది అక్టోబర్ 17న వెలువడే ఫలితాలతో తేలనుంది. 2,830 మంది ఓటర్లు రీజియన్ పరిధిలో కరీంనగర్–1, కరీంనగర్–2, హుస్నాబాద్, హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, వేములవాడ, మంథని, గోదావరిఖని, సిరిసిల్ల డిపోల్లో 2,830 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,340 మంది డ్రైవర్లు, 955 మంది కండక్టర్లు, 376 మంది మెయింటెనెన్స్ సిబ్బంది, 132 మంది ఎగ్జిక్యూటివ్ సిబ్బంది, 19 మంది రీజియన్ కార్యాలయ ఉద్యోగులు, నలుగురు మెడికల్, ముగ్గురు ఫైనాన్స్, ఒకస్టోర్ ఉద్యోగి ఉన్నారు. టీఎంయూ దారెటు? 2016లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ రీజియన్‌లో తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) విజ యం సాధించింది. ఈసారి ఆ సంఘం రాష్ట్ర నాయకత్వం రెండు వర్గాలుగా విడిపోవడం, వివాదం కోర్టుకు వెళ్లడంతో పోటీపై అనిశ్చితి నెలకొంది. రీజియన్‌లో బలమైన సభ్యత్వం ఉన్న టీఎంయూ పోటీకి దూరమైతే.. ఇతర సంఘాలకు మద్దతు ఇవ్వడం ద్వారా తమ బలాన్ని చాటుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. జేఏసీలో కీలకంగా వ్యవహరించిన టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిపోల్లో గేట్ మీటింగ్‌లు చేపడుతున్నారు. ఎస్‌డబ్ల్యూయూ(ఐఎన్టీయూసీ)తో పోటీకి సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. గుర్తులు కేటా యించిన అనంతరం మరికొన్ని యూనియన్ల మధ్య పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ఇలా ఎన్నికల్లో భాగంగా సోమవారం పోటీ చేసేందుకు యూనియన్ల నుంచి సమ్మతి పత్రాలు స్వీకరించారు. మంగళవారం డిపో మేనేజర్ల ద్వారా రిట ర్నింగ్ అధికారులకు డ్రాఫ్ట్ అభ్యంతరాలకు ఆహ్వా నం, 24న ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 25న తుదిజాబితా, 26న గుర్తుల కేటాయింపు జరగనుంది. 29న డమ్మీ బ్యాలెట్ పేపర్ల సమీకరణ, అక్టోబర్ 9న రహస్య బ్యాలెట్ ద్వారా పోలింగ్, అక్టోబర్ 14, 15న పోస్టల్ బ్యాలెట్, 17న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని కార్మికశాఖ అధికారులు వెల్లడించారు. -
జిల్లాలో తనిఖీలు.. కేసుల వివరాలు
ఇప్పటివరకు చేసిన తనిఖీలు: 150 శాంపిళ్లు సేకరించినవి: 51 శాంపిల్స్ ఫెయిల్: 16 కేసుల నమోదు: 16 జరిమానా: రూ.5.25 లక్షలుజిల్లా జనాభా: 10,43,087 కరీంనగర్ నగర జనాభా: 4.30లక్షలు జిల్లాలో హోటళ్లు,రెస్టారెంట్లు, బార్లు: సుమారు 2,500 టిఫిన్ సెంటర్లు: 2,100 ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లు: 450 చిరుతిళ్ల తయారీ కేంద్రాలు: 54అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్: 01 గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్: 01 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్: 01 జూనియర్ అసిస్టెంట్: 01 శాంపిళ్లు సేకరించేవారు: 02(ఔట్ సోర్సింగ్) అటెండర్: 01(ఔట్ సోర్సింగ్)నగరంలోని వావిలాలపల్లిలో గల హోటల్లో ఇదీ పరిస్థితి. పాడైన చికెన్ వాడుతూ బిర్యానీ తయారు చేస్తున్నారు. కల్తీ, కాలం చెల్లిన మాంసం, హానికర సింతటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. -
శుఛీ.. రుఛీ
కరీంనగర్ అర్బన్: కల్తీకి కాదేదీ అనర్హమన్నట్లు ఉంది అక్రమార్కుల తీరు. పాలు లేకుండా కోవ తయారు చేసే ఘనులకు జిల్లాలో కొదువ లేకపోగా నాణ్యత లేని ఆహార పదార్థాలను వడ్డిస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఓ వైపు తనిఖీలు జరుగుతున్నా ఎలాంటి జంకు లేకపోవడం విస్తుగొల్పుతోంది. అనతికాలంలో సంపన్నులు కావాలనే దురాశకు తోడు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే తప్పవంటూ పక్కదారి పడుతున్నారు. జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్‌రెడ్డి మాత్రమే తనిఖీలు నిర్వహిస్తున్నారు. గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్‌రెడ్డి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జోడు పదవులతో ఉన్నారు. రోహిత్‌రెడ్డి 5జిల్లాల వరకు ఇన్చార్జి కాగా ఫుడ్ కంట్రోలర్ 9 జిల్లాలకు ఇన్చార్జి. జిల్లా జనాభాకు అనుగుణంగా పోస్టులు లేకపోగా ఉన్న పోస్టులను ఇతర జిల్లాలకు మళ్లించడం ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. పలు హోటళ్లలో తనిఖీల సందర్భంగా సేకరించిన నమూనాల్లో అత్యధికం ఆరోగ్యానికి హానికరమని ఫలితాలొచ్చాయ్. నాణ్యత ప్రమాణాలు లేకపోవడం, మిస్‌బ్రాండ్ కేసులు నమోదవడం జిల్లాలో జరుగుతున్న కల్తీ, అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. చిన్నపాటి తోపుడు బండ్ల నుంచి కార్పొరేట్ సూపర్ బజార్లు, చిన్న బజ్జీల బండి నుంచి ప్రముఖ హోటళ్ల వరకు కల్తీ సాధారణమైపోతుంది.నిల్వ పదార్థాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. నూనెలో వేపిన మాంసాన్ని మళ్లీ వేయించడం వల్ల కేన్సర్ కారక వ్యాధులు వెంటాడే ప్రమాదముంది. ఎప్పటి ఆహార పదార్థాలను అప్పుడు తింటేనే శరీరానికి ఆరోగ్యం. ఫుడ్‌లో కలర్స్ వాడటం ప్రజారోగ్యంతో ఆటలాడటమే. – సాయిని నరేందర్, ఎండీ చెస్ట్, క్రిటికల్ కేర్ ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించం. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటివారినైనా వదలం. తనిఖీలు నిరంతరం జరుగుతుంటాయి. – రోహిత్‌రెడ్డి, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్నగరంలోని ప్రముఖ బార్ ఇది. ఆహార పదార్థాలు తయారు చేసే ప్రాంతంలో అపరిశుభ్రంగా ఉంది. ముందు రోజు మిగిలిపోయిన బాయిల్డ్, చికెన్ ఐటమ్స్, కార్న్, వెజ్ ఐటమ్స్ వినియోగిస్తున్నారు. కేవలం ఇవి రెండే కాదు జిల్లా కేంద్రంలోని హెచ్చు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నాణ్యత డొల్ల.. ఆరోగ్యం కల్ల. -
ఆలకించి.. పరిష్కరించండి
కరీంనగర్ అర్బన్: ఓ వైపు ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాం పేరిట సర్కారుబడి విద్యార్థులకు టిఫిన్ సరఫరాకు చర్యలు చేపడుతుంటే రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిని సమస్యల అర్జీలు చుట్టుముట్టాయి. కలెక్టర్ చిత్రా మిశ్రా అర్జీలను స్వీకరించగా పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. అదనపు కలెక్టర్లు డి.శ్రీనివాస్‌రెడ్డి, అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో షర్మిల పాల్గొన్నారు. మొత్తం 145 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు.మొత్తం అర్జీలు: 145, హౌజింగ్: 37 కరీంనగర్ కార్పొరేషన్: 32, వారధి: 12 -
చలో చింతకుంట ఉద్రిక్తం
కొత్తపల్లి/కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్: గణేశ్ నిమజ్జనోత్సవానికి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కరీంనగర్ నగర శివారులోని చింతకుంట కెనాల్ వద్ద బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. చింతకుంట వద్ద ప్రధాన రహదారులను దిగ్భందించి రాస్తారోకో చేపట్టారు. గణపతి బొప్పా మోరియా.. హిందూ పండుగలంటే చిన్నచూపా.. అంటూ రహదారిపై బైఠాయించారు. సుమారు గంటపాటు ఆందోళన చేపట్టిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పీటీసీకి తరలిస్తుండగా పోలీసు వాహనాలను నాయకులు అడ్డుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, కార్పొరేటర్లను పీటీసీ తరలించారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌పై లాఠీచార్జీ చేశారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ హిందూ పండుగలంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరో పించారు. అర టీఎంసీ నీరు విడుదల చేయాలని కోరినా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు మాట్లాడుతూ ఎస్సారెస్పీలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ నిమజ్జనానికి విడుదల చేయడంలో ఎందుకు ఆలస్యం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. నీటి విడుదలపై ఓ కాంగ్రెస్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. నిమజ్జన ఏర్పాట్లపై రాజకీయాలు తగవు.. గణేశ్ నిమజ్జన ఏర్పాట్ల విషయంలో బీజేపీ అనవసర రాజకీయాలు చేస్తోందని సుడా మాజీ చైర్మన్ కె.నరేందర్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి అనంతుల రమేశ్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ వైద్యుల అంజన్‌కుమార్ మండిపడ్డారు. సోమవారం వేర్వేరుగా మాట్లాడుతూ కరీంనగర్లో గత కొన్నేళ్లుగా గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని, నిమజ్జనానికి నీటి విడుదల అంశాన్ని బీజేపీ రాజకీయం చేయడం సరికాదన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ల జోక్యంతో ఎస్సారెస్పీ నుంచి ప్రత్యేకంగా నీళ్లు విడుదల అయ్యాయని తెలిపారు. నీళ్లు మంగళవారం నాటికి చింతకుంటకు చేరుతాయని వెల్లడించారు. పవిత్రమైన పండుగలను రాజకీయాలకు వేదికగా మార్చడం బీజేపీ నాయకు లు మానుకోవాలని, ప్రజాసమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని హితవు పలికారు. -
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
కొత్తపల్లి(కరీంనగర్): గణేశ్ నిమజ్జనోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. చింతకుంట కెనాల్, కొత్తపల్లి చెరువు నిమజ్జన పాయింట్లను సోమవారం డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, స్థానిక కార్పొరేటర్లు వాసాల రమేశ్, ప్రదీప్‌తో కలిసి పరిశీలించారు. ‘సమయం లేదు గణేశా’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించారు. కొత్తపల్లి నూతన నిమజ్జన పాయింట్ వద్ద ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గుర్రపు డెక్కను వలతో కట్టడి చేయాలని నిర్ణయించారు. లైటింగ్, తాగునీరు, పారిశుధ్యం వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. చెరువులు, కెనాల్ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నగరపాలక సంస్థ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మానకొండూర్‌లో సాగుతున్న ఏర్పాట్లు మానకొండూర్: మానకొండూర్ చెరువుకట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్లు సాగుతున్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది చెత్తను తొలగిస్తున్నారు. విద్యుత్ అధికారులు లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. క్రషర్ డస్టు పోసి చదును చేస్తున్నారు. -
కొండా లక్ష్మణ్‌కు నివాళి
కరీంనగర్: కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఎన్టీ ఆర్ చౌరస్తా వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి సోమవారం మేయర్ శ్రీనివాస్, పద్మశాలి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వా సాల రమేశ్, జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం నివాళి అర్పించారు. మేయర్ మాట్లాడుతూ పదవుల కన్నా ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, మాసం గణేశ్, తేల్ల లక్ష్మి, దేవసాని సరస్వతి, వేముల కవిత, పడిశెట్టి లక్ష్మి, పద్మశాలి సంఘం నాయకులు అలసభద్రయ్య, గడ్డం శ్రీరాములు, పోలు సత్యనారాయణ, ఒడ్నాల రవీందర్, మార్త ప్రకాశ్ పాల్గొన్నారు. మతిస్థిమితం లేని వృద్ధుడి వద్ద రూ.1.15 లక్షలుకరీంనగర్క్రైం: మతిస్థిమితం కోల్పోయి కరీంనగర్ బస్టాండ్‌లో తిరుగుతున్న హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన మాడిశెట్టి కిష్టయ్యను వన్‌టౌన్ పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం వేకువజామున 3గంటలకు పెట్రోలింగ్ సిబ్బంది రాజ్‌కుమార్, భాస్కర్ బస్టాండ్‌లో వృద్ధుడిని గమనించారు. అతని సంచిలో రూ.1,15,500 నగదు ఉన్నట్లు గుర్తించారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వృద్ధుడితో పాటు నగదును వారికి అప్పగించారు. కేడీసీసీబీ పీఐసీగా ‘కొండూరు’ బాధ్యతలుకరీంనగర్ అర్బన్: కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (కేడీసీసీబీ) ఇన్చార్జి అధికారిగా కొండూరు రవీందర్రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సుదీర్ఘ కాలం చైర్మన్‌గా సేవలందించగా కాంగ్రెస్ ప్రభుత్వం 2025 డిసెంబర్ 19న 598 జీవో జారీ చేసి కలెక్టర్‌ను పీఐసీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా రవీందర్రావు మాట్లాడుతూ, జీవో నంబర్ 598ను నిలిపివేసిన తదుపరి హైకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు డీసీవో తక్షణ చర్యలు తీసుకోవాలని జూన్ 12, 2026న ఉత్తర్వులు వచ్చాయని కానీ డీసీవో సదరు విషయాన్ని తెలుపలేదని అన్నారు. కోర్టు ఆదేశాల క్రమంలోనే పీఐసీగా బాధ్యతలు చేపట్టానని వివరించారు. గత 6నెలల కాలంలో బ్యాంకు వ్యాపారం రూ.50కోట్లకు పైగా తగ్గిందని వివరించారు. బ్యాంకులో విద్య, గృహరుణాలకు సంబంధించిన అనేక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. వార్డు మెంబర్ల చలో హైదరాబాద్‌కరీంనగర్ టౌన్: వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ కరీంనగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ‘హలో వార్డు మెంబర్స్.. చలో హైదరాబాద్’ పోస్టర్‌ను వార్డు సభ్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అతికం రాజశేఖర్‌గౌడ్ ఆవిష్కరించారు. వార్డు సభ్యులకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం, హెల్త్ ఇన్సూరెన్స్, అకాల మరణానికి రూ.10 లక్షల పరిహారం, శిలాఫలకాలపై పేర్ల నమోదు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వార్డు సభ్యుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుముల నవీన్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల సాంబయ్యగౌడ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కామెర తిరుమల, సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు గంగాధర గంగజమున, జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు ఆకుల శ్రీదేవి, రాష్ట్ర గౌరవ సలహాదారు గడప కోటేశ్ కుమార్ పాల్గొన్నారు. -
ఆడవేషంలో ఏటీఎం దొంగలు.. కరీంనగర్లో భారీ లూటీ!
తెలంగాణ: కరీంనగర్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా వరుస చోరీలకు పాల్పడుతోంది. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంతోపాటు నగర శివారులోని దుర్శేడ్‌లో శని వారం రాత్రి రెండు ఎస్బీఐ ఏటీఎంలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి సుమారు రూ.15.70 లక్షలకు పైగా నగదును ఎత్తుకెళ్లారు. మొదట తిమ్మాపూర్ లో సుమారు రూ.7.13 లక్షలకు పైగా.. తర్వాత దుర్శేడ్‌లో రూ.8.55 లక్షల నగదు చోరీ అయింది.చోరీల్లో పాల్గొన్న ముగ్గురు నిందితులు ఆడవేషంలో వచ్చి.. ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేసి చోరీ అనంతరం మహారాష్ట్రకు చెందిన ఫేక్ నంబర్ ప్లేట్ ఉన్న స్కార్పియోలో పరారైనట్లు పోలీ సులు గుర్తించారు. వీరితోపాటు మరో వ్యక్తి డ్రైవర్‌గా వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. ఘటనలో హరియాణాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయంపై దర్యాప్తు సాగుతోంది. చోరీ అనంతరం మంచిర్యాల మీదుగా మహా రాష్ట్ర వైపు వెళ్లి ఉండొచ్చని అనుమాని స్తున్నారు. ఇటీవల జరిగిన పీఎంజే జ్యువెలరీ చోరీ తరహాలోనే ముందస్తు రెక్కీ, టార్గె ట్ ఎంపిక, వేగవంతమైన ఆపరేషన్, పరారీ కనిపిస్తుండటంతో పోలీసులు ఈ ఘటన లను ఆ కోణంలోనూ పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.ఘటన స్థలాలను అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగి వేలిము ద్రలు సేకరించాయి. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. జిల్లాలోని రేణికుంట, పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్ టోల్ గేట్ల వద్ద నిందితులు వినియోగించిన వాహనం రికార్డు కాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల మీదుగా వచ్చి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. -
రోడ్డు ప్రమాదంలో మహిళ..
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దాడి శారద(50) అనే మహిళ మృతిచెందినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 11.20 గంటలకు కూకట్ల కనకమ్మ అనే మహిళ కరీంనగర్ వెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తుండగా.. సమీపంలో ఉన్న శారదతో మాట్లాడుతున్న క్రమంలో గోదావరిఖని నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ఎగిరి కింద పడగా.. కారు ఆపకుండా వెళ్లిపోయింది. స్థానికులు చికిత్స నిమిత్తం ఇద్దరిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శారద మరణించింది. కనకమ్మకు కాళ్లు, చేతులు విరగగా.. చికిత్స పొందుతోంది. మృతురాలికి భర్త ఓదెలు, ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. కుమారుడు ఉదయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
నేటి నుంచి ఎస్జీఎఫ్ అండర్–19 క్రీడాపోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను వెలికితీసేందుకు ప్రతిష్టాత్మక స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 టోర్నమెంట్లు, క్రీడాఎంపికల పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి అక్టోబర్ చివరి వరకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఎంపికల పోటీలు జరగనున్నట్లు అండర్–19 కార్యదర్శి బన్సిలాల్ తెలిపారు. ఉమ్మడి జిల్లాస్థాయి ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు కళాశాల ఒరిజినల్ ఐడెంటిటీ కార్డులతోపాటు వాటి జిరాక్స్ కాపీ, లాంగ్ మెమో జిరాక్స్, ఇంటర్ మార్కుల షీట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బోనఫైడ్ సర్టిఫికెట్, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. బాలురకు కరీంనగర్‌లోని సాన్వి కళాశాలలో కబడ్డీ పోటీలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఉదయం 9 గంటలకు కళాశాలలో రిపోర్టు చేయాలని సూచించారు. రేపు అండర్–14 క్రికెట్ జట్టు ఎంపికకరీంనగర్స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న అండర్–14 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఈనెల 22న నిర్వహించనున్నట్లు కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మనోహర్‌రావు, ఉపాధ్యక్షులు ఎన్.మురళీధర్‌రావు, సి.మహేందర్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ మీసేవ కేంద్రం నుంచి పొందిన జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, పూర్తి క్రికెట్ యూనిఫామ్‌తో అలుగునూర్లోని కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మైదానానికి 22న ఉదయం 8.30 గంటలకు హాజరు కావాలని సూచించారు. 31–09–2012 నుంచి 01–09–2014 మధ్య జన్మించిన క్రీడాకారులు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు కేడీసీఏ ఇండోర్ ఇన్చార్జి డి.క్రాంతికుమార్‌ను సంప్రదించాలని, వివరాలకు 8688768775కు ఫోన్ చేయాలని సూచించారు. ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టం కేబుల్ చోరీఓదెల: కాజీపేట్ నుంచి బల్లార్షా సెక్షన్ల మధ్యలో కొలనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రూ.2లక్షల విలువ చేసే ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టం కేబుల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ప్రత్యక్ష సాక్షి రాజశేఖర్ కథనం ప్రకారం.. శనివారం రాత్రి టీవీఎస్ ఎక్సెల్, స్ల్పెండర్ బైక్‌పై నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి వచ్చారు. రైల్వే స్టేషన్ల మధ్యలో ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టం కోసం వేస్తున్న 250 మీటర్ల కేబుల్‌ను చోరీ చేసి బైక్‌లపై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతలో స్థానికులు ఎవరంటూ అరవడంతో వెంటనే కేబుల్‌ను టీవీఎస్ ఎక్సెల్‌పై పెట్టుకొని పరుగెత్తారు. మరో బైక్‌ను వదిలివెళ్లారు. సూపర్వైజర్ రాజశేఖర్ పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై సనత్కుమార్రెడ్డికి ఫోన్ చేసి వివరించారు. వెంటనే పోలీసులు చేరుకొని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
సమయం లేదు గణేశా!
కొత్తపల్లి: కొత్తపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జన వేడుకలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు కొనసాగుతున్నా.. చెరువులో విస్తరించిన గుర్రపు డెక్క సంకటంగా మారింది. గుర్రపు డెక్క తొలగింపు పనులు ప్రారంభించినప్పటికీ.. ఆశించినస్థాయిలో పురోగతి కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. యంత్రాలతో పనులు చేపట్టినా గుర్రపు డెక్క పూర్తిస్థాయిలో తొలగకపోవడంతో సమస్య అలాగే కొనసాగుతోంది. నిమజ్జనానికి గడువు సమీపిస్తున్న వేళ పనులను వేగవంతం చేయాల్సి ఉంది. పొదలతోనూ ఇబ్బందులే చెరువు కట్టకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలతో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. చెట్ల పొదలను పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో నిమజ్జనా నికి వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో వాహనాలు తరలివచ్చే సమయంలో పొదలతో కట్ట పరిధి తెలియక అదుపు తప్పేందుకు ఆస్కారం ఉంది. వేదిక మార్పుతో ట్రాఫిక్ తిప్పలు? కొత్తపల్లి చెరువు వద్ద ఈ ఏడాది నిమజ్జన వేదికను చెరువు కట్టపైకి మార్చడంతో ట్రాఫిక్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారి నుంచి కట్టపైకి వాహనాలను మళ్లించే క్రమంలో రద్దీ ఏర్పడే అవకాశముంది. ఒకే వైపు నుంచి వాహనాల రాకపోకలు సాగాల్సి ఉండటంతో నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ సమస్య మరింత పెరగనుంది. నిమజ్జనానికి వచ్చే భక్తులు, ఉత్సవ నిర్వాహకుల వాహనాలతో పాటు సాధారణ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడనుంది. నిమజ్జనానికి మూడు రోజులే వినాయక నిమజ్జనానికి మూడు రోజులే గడువు ఉండటంతో ఏర్పాట్లపై భక్తుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిమజ్జన ప్రాంతంలో గుర్రపు డెక్కను పూర్తిస్థాయిలో తొలగించడంతో పాటు వాహనాల రాకపోకలకు మార్గాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. చివరి నిమిషంలో హడావుడి చేయకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తే నిమజ్జనం ప్రశాంతంగా జరిగే అవకాశం ఉంటుంది. గుర్రపు డెక్క, చెట్ల పొదల తొలగింపు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని భక్తులు, స్థానికులు, వినాయక ఉత్సవ కమిటీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
నీళ్లివ్వకుంటే రోడ్లపైనే నిమజ్జనం
కరీంనగర్ కార్పొరేషన్: ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు వదలకపోతే రోడ్లపైనే వినాయక నిమజ్జనం చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్య వస్తే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. నగరపాలకసంస్థ నూతనంగా కొనుగోలు చేసిన రెండు ఫాగింగ్ మిషన్లు, 66 ట్రైసైకిళ్లను ఆదివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మా ట్లాడుతూ.. గతంలో అవసరం ఉంటే నిమజ్జనానికి మూడు రోజుల ముందే ఎస్సారెస్పీ నుంచి నీళ్లు వదిలేవారన్నారు. ఈ సారి నీళ్లు విడుదల చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఇప్పటికే మాట్లాడానని తెలిపారు. గతంలో 15టీఎంసీలు ఉన్నా నీళ్లు వదలారని, ఇప్పుడు 40టీఎంసీలు ఉన్నాయన్నారు. నిమజ్జనానికి నీళ్లు వదలకపోతే రోడ్లపైనే నిమజ్జనం చేయాల్సి వస్తుందన్నారు. నగరంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధతో నూతనంగా వాహనాలు కొంటున్నామన్నారు. చెత్త తరలించేందుకు గతంలో రెండు డివిజన్లకు ఒక ఆటో, ట్రాక్టర్ ఉండేదన్నారు. డివిజన్‌కో రిక్షా చొప్పున 66 రిక్షాలు అందుబాటులోకి తెచ్చామన్నా రు. ఫాగింగ్ మిషన్ గతంలో నెలకొసారి డివిజన్‌కు వచ్చేదని, ఇప్పుడు వారం, పదిరోజులకోసారి ఫాగింగ్ అందుబాటులోకి వస్తుందన్నారు. వీటితో పాటు ల్యాడర్, వైకుంఠరథాలు, జేసీబీ కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. టవర్‌సర్కిల్‌లో పార్కింగ్ సమస్య తీర్చేందుకు రూ.25 కోట్లతో భవనం నిర్మిస్తున్నామన్నారు. అనంతరం నగరపాలకసంస్థ కార్యాలయంలో వినాయకుడికి పూజలు చేశారు. కార్పొరేటర్లు వాసాల రమేశ్, వైద్యుల అంజన్‌కుమార్, బండారి వేణు, బోయినపల్లి ప్రవీణ్‌రావు, బండ రమణారెడ్డి, వరాల నర్సింగం, సోమిడి వేణు, రాజేందర్, ప్రభావతి, జయశ్రీ పాల్గొన్నారు. -
పల్లెబడికి సాంకేతిక రెక్కలు
● సుకన్య ఎస్టీఈఎం ల్యాబ్‌కు ధర్యపూర్ మోడల్ స్కూల్ ఎంపిక ముత్తారం: పుస్తకాలతో కుస్తీ పట్టే బాలికల్లో దాగి ఉన్ననైపుణ్యాలను వెలికి తీసి.. ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సుకన్య ఎస్టీఈఎం ల్యాబ్‌లు ఎంతోగానో దోహదం చేస్తున్నాయి ప్రధానంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్(ఎస్టీఈఎం)పై ఆసక్తి పెంచుతోంది. తెలంగాణలో ధర్యపూర్ మోడల్ స్కూల్ ఎంపిక మనదేశంలో ఇప్పటివరకు 32 సుకన్య ఎస్టీఈఎం ల్యాబ్‌లు ఉన్నాయి. ఈ ఏడాది 26 స్కూళ్ల ఎంపికవగా అందులో తెలంగాణ నుంచి ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలం ధర్యపూర్ మోడల్ స్కూల్‌కు చోటుదక్కింది. ప్రస్తుతం ల్యాబ్ పనులు ప్రారంభమయ్యాయి. పాఠశాల నుంచే విమానయాన రంగం వైపు.. సుకన్య ఎస్టీఈఎం ల్యాబ్ ద్వారా ఆరు నుంచి పదో తరగతి వరకు బాలికలకు ప్రయోగాత్మక విద్య అందిస్తారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమటిక్స్తోపాటు ఏవియేషన్, ఏరో మోడలింగ్ కెరీర్ వైపు ప్రోత్సాహం అందిస్తారు. చిన్నవయసులోనే విమానం ఎలా ఎగురుతుంది, ఇందుకు ఉపయోగించే సాంకేతిక ఏమిటి? మోడల్ విమానాన్ని ఎలా తయారనే ఆలోచనలకు ల్యాబ్ ప్రయోగం కోసం ఉపయోగపడుతుంది. సాధారణంగా తరగతి గదిలో చదివే విషయాలను విద్యార్థులు ప్రయోగాలు, మోడల్స్, డిజిటల్ పరికరాలు తదితర కార్యకలపాల ద్వారా స్వయంగా చేసి నేర్చుకునేలా ఎస్టీఈఎం ల్యాబ్‌లు రూపొందించారు. -
వక్ఫ్‌లో చేర్చడం అన్యాయం
చొప్పదండి: మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 18లో గల నాలుగెకరాలు వక్ఫ్ పరిధిలో చేర్చడం అన్యాయమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. బాధితులను ఆదివారం కలిసి మాట్లాడారు. 60 ఏళ్ల క్రితం అన్నం రాజు కుటుంబీకుల వద్ద రిజిష్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసిన భూముల్లో గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నాక ఇప్పుడు వక్ఫ్ పరిధిలోని భూమి అంటు 2020లో రికార్డుల్లో చేర్చడం ఏంటని ప్రశ్నించా రు. ఖాస్రా పహాణీల నుంచి ధరణి పోర్టల్ వరకు రికార్డుల్లో పట్టా కాలమ్, కబ్జా కాలంలలో నమోదు కాగా, అకస్మాత్తుగా భూమిని వక్ఫ్ బోర్డు ఖాతాలో ఎందుకు చేర్చారో సమాధానం చెప్పాలన్నారు. సర్వే నంబర్ 18లో వక్ఫ్ బోర్డు పేరు తొలగించి బాధితుల పేర్లు నమోదు చేయాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు మొగిలి మహేశ్, తోట కోటేశ్, ఎడ్ల సురేశ్, దొంతిసారపు సంపత్, పెద్ది వీరేశం, ఓర్గల తిరుపతి, బాధితులు బియ్యాల వెంకటేశ్, సందనవేని కొమురయ్య, లంక చంద్రమౌళి, దాడి మల్లయ్య, కొమురయ్య, చంద్రశేఖర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. కొత్త క్రీడను పరిచయం చేసిన కరీంనగర్కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా నుంచి కొత్త క్రీడను పరిచయం చేయడం అభినందనీయమని కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల డీవైఎస్‌వోలు శ్రీనివాస్ గౌడ్, సురేశ్‌కుమార్, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మొలంగూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ ముఫాజిల్ అహ్మద్ రూపొందించిన ఫీల్డ్ బేస్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల బుక్‌ను ఆదివారం ఫిలింభవన్‌లో ఆవిష్కరించారు. 2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్ ఈవెంట్లకు ఆతిథ్యమిస్తున్న తరుణంలో కొత్త క్రీడను పరిచయం చేయడం గర్వ కారణం అన్నారు. టీఎస్ పెట అధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, టీజీపెట అధ్యక్షుడు అంతటి శంకరయ్య, పీపీఈటీఏ అధ్యక్ష,కార్యదర్శులు బత్తిని శ్రీధర్‌గౌడ్, గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. నవోదయ దరఖాస్తుకు మరోచాన్స్ చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయంలోని తొమ్మిది, పదకొండో తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 30వరకు దరఖాస్తు చేసే అవకాశం కల్పించినట్లు ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఎనిమిదోతరగతి చదువుతున్న వారు, వచ్చే ఏడాది తొమ్మిదో తరగతిలోకి, పదోతరగతి చదువుతున్న వారు పదకొండో తరగతిలోకి ప్రవేశం పొందేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 10న నిర్వహిస్తామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
మురుగు.. రోడ్డుపై పరుగు
కరీంనగర్ కార్పొరేషన్: నగరం నుంచి వెళ్లే రాజీవ్‌రహదారి మురుగునీటితో అధ్వానంగా మారింది. హైవే రోడ్డు వెంట డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగు రోడ్డుపైకి చేరుతోంది. దీంతో దుకాణ దారులు, నివాసితులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్వహణ కూడా సాధ్యం కాని దుస్థితికి డ్రైనేజీ చేరడంతో, కొత్తగా నిర్మించడం తప్ప మరో దారి లేని పరిస్థితి నెలకొంది. కానీ, హైవే నిర్వహణను చూడాల్సిన సంస్థ ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో సమస్య జఠిలమవుతోంది. మూసుకుపోయిన పాత డ్రైనేజీలు హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్‌రహదారి నగరంలోనూ బద్దం ఎల్లారెడ్డి జంక్షన్ నుంచి బొమ్మకల్ బైపాస్ వరకు కొనసాగుతుంది. ఈ బైపాస్ వెంట డ్రైనేజీ నిర్వహణ సరిగా లేక డర్టీ హైవేగా మారింది. నిత్యం వేలాది వాహనాలు వెళ్లే ఈ రోడ్డు వెంట మురుగు నిలవడం సర్వ సాధారణంగా మారింది. రోడ్డు వెంట ఉన్న దుకాణదారులు తమ వ్యాపారాలు కొనసాగించే క్రమంలో అక్కడక్కడా ఉన్న పాత డ్రైనేజీలు పూర్తిగా మూసుకుపోయాయి. దీంతో మురుగు డ్రైనేజీలకు వెళ్లలేక రోడ్డెక్కుతున్నాయి. నగరంలో రాజీవ్‌రహదారి బైపాస్ దిగువ ప్రాంతంలో ఉండడంతో సహజంగానే ఎగువ ప్రాంతంలోని మురుగు, వరదనీళ్లు బైపాస్కు వస్తుంటాయి. డ్రైనేజీ లేకపోవడంతో రోడ్డు వెంట రోజుల తరబడి మురుగు ఉంటోంది. వర్షాకాలంలో ఈ సమస్య మరింతగా ఉంటోంది. శాశ్వత నిర్మాణాలే పరిష్కారం హైవే వెంట మురుగునీళ్లు నిలిచిపోవడంతో, డ్రైనేజీలను తెరిచేందుకు నగరపాలకసంస్థ అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యపడడం లేదు. రోడ్డు వెంట ఎక్కువగా ఆటోమొబైల్ షాప్‌లు ఉండడం, వాటి వ్యర్థాలు డ్రైనేజీల్లో పేరుకుపోవడంతో జెట్మిషన్లు పెట్టినా డ్రైనేజీ పునరుద్ధరణ కావడం లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో హైవే నిర్వహణ చేయాల్సిన హెచ్‌కేఆర్ సంస్థ కొత్తగా డ్రైనేజీలు నిర్మిస్తే తప్ప పరిష్కారం లభించే అవకాశం కనిపించడం లేదు. రోజుల తరబడి రోడ్డు వెంట మురుగునీళ్లు నిలిచి ఉండడం, వర్షం పడితే నీళ్లు సగం రోడ్డును ఆక్రమించడం బైపాస్‌లో నిత్యం జరుగుతున్న తంతు. ఇప్పటికై నా నిర్వహణ అధికారులు హైవే వెంట మురుగునీళ్లు నిలవకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలని ఆయా ప్రాంత వాసులు కోరుతున్నారు. -
వంటింట్లో ఉల్లి లొల్లి
కరీంనగర్‌అర్బన్: ఉల్లి ధర ఘాటెక్కింది. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. ఎన్నడూ లేని విధంగా సెంచరీకి చేరువైంది. ఎల్‌నినో ప్రభావం.. బ్లాక్ మార్కెట్ నేపథ్యంలో ధర ఆకాశన్నంటగా విస్తుపోవడం వినియోగదారుని వంతవుతోంది. ధరలను నియంత్రించాల్సిన విభాగం మొద్దునిద్రలో జోగుతుండడంతో మరికొన్ని రోజుల్లో పండగలు ఎలా చేసుకునేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఎల్‌నినో.. కృత్రిమ కొరత జిల్లాలో ఉల్లిగడ్డ వినియోగం ఎక్కువ. నిత్యం 40 టన్నుల విక్రయాలు జరుగుతుండగా వ్యాపారుల ఎత్తుగడ మొదలైంది. గత నెలలో ఉల్లి కిలో రూ.30 పలుకగా నెల రోజుల వ్యవధిలోనే రూ.90కి చేరడం ఆందోళనకర పరిణామం. కర్నూలు, మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతి అయ్యేది. ఎల్‌నినోతో పంట సాగు తగ్గిందని తెలుస్తోంది. పలుచోట్ల అధిక వర్షాల క్రమంలో ఉల్లిని సాగు చేసిన రైతులు వాటిని ఆరబెట్టేందుకు వీలు కాకపోవడంతో పంటను తీయడం లేదు. దీంతో సరఫరా బాగా తగ్గిపోయి ధరలు పెరుగుతున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు అంటున్నారు. ఉల్లి సరఫరా కొంత తగ్గగానే హోల్‌సేల్ వ్యాపారులు అప్రమత్తమయ్యారు. దుకాణాల్లో ఉన్న ఉల్లిని రహస్య ప్రాంతాలకు తరలించి నిల్వ చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు కొరత సృష్టిస్తున్నారని చిరు వ్యాపారులు వివరించారు. రాయితీపై సరఫరా జరిగేనా? గతంలో ఉల్లి గడ్డ రూ.90 దాటగా ప్రభుత్వమే రాయితీపై సరఫరా చేసింది. రేషన్ కార్డుల ద్వారా కిలో రూ.50కి విక్రయించారు. జిల్లాలో విరివిగా కౌంటర్లు ఏర్పాటు చేసి పౌరసరఫరాల, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో ఉల్లిగడ్డలు విక్రయించాయి. ఎల్‌నినో నేపథ్యంలో పనులు అంతంతమాత్రమే కాగా సకల వర్గాల ఆర్థిక పరిస్థితి అంతంతే. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే బాసటగా నిలవాల్సిన అవసరముంది.ఉల్లి ధర (కిలోకు)..హోల్‌సేల్ తెల్ల ఉల్లిగడ్డ: రూ.80 ఎర్ర ఉల్లిగడ్డ: రూ.70 రిటేల్ తెల్ల ఉల్లిగడ్డ: రూ.90 ఎర్ర ఉల్లిగడ్డ: రూ.80 -
‘సాధన’ చేయాల్సిందే..
● అభ్యసన సామర్థ్యాన్ని పెంచేందుకు వర్క్‌బుక్స్ ● తొలిసారి ఈ ఏడాది నుంచి ప్రవేశం గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంపొందించడంతోపాటు పాఠ్యాంశాలపై పట్టు సాధించేలా ప్రత్యేక సాధన పుస్తకాలు(వర్క్‌బుక్స్) రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా తొలిసారిగా వర్క్‌బుక్స్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని హైస్కూల్, మోడల్, కేజీబీవీలు కలిపి 131 పాఠశాలల్లో చదువుతున్న 22,471 మంది విద్యార్థులకు వర్క్ బుక్స్ పంపిణీ చేశారు. మొదటి విడతగా నాన్ లాంగ్వేజెస్ వర్క్‌బుక్స్ అందించారు. లాంగ్వేజెస్ వర్క్‌బుక్స్ రావాల్సి ఉంది. పాఠ్యాంశం బోధన పూర్తయిన తర్వాత వర్క్‌బుక్స్‌లో సాధన చేయించనున్నారు. బోధన సమయంలో 15 నుంచి 20 నిమిషాలు వర్క్‌షీట్ సాధనకు కేటాయించనున్నారు సంసిద్ధతకు తొలి పది మొదటి 10 సంసిద్ధత వర్క్‌షీట్స్ తరగతుల్లో విద్యార్థులు నేర్చుకున్న భావనల ఆధారంగా రూపొందించారు. విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని గుర్తించి, ప్రస్తుత తరగతి అభ్యసనానికి అవసరమైన పునాదిని బలోపేతం చేయనున్నారు. పాఠం పుర్తయితే ప్రతీ పాఠం చివర ప్రత్యేకంగా పునశ్చరణ వర్క్‌షీట్ అందించారు. పాఠం మొత్తం పూర్తయిన అనంతరం ఒక పీరియడ్‌లో విద్యార్థులతో దీనిని పూర్తి చేయించనున్నారు. స్వతంత్ర సాధన.. ఉపాధ్యాయుల మార్గదర్శనం విద్యార్థులు వర్క్‌షీట్స్ సాధ్యమైనంత వరకు స్వతంత్రంగా పూర్తిచేయాలి. అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, సహకారం అందించాల్సి ఉంది. వర్క్‌షీట్స్ పూర్తయిన తర్వాత వాటిని ఉపాధ్యాయులు పరిశీలించి, తప్పులను సరిదిద్ది సంతకం చేయనున్నారు. చాలా మంది విద్యార్థుల్లో కనిపించే సాధారణ తప్పులను గుర్తించి తరగతి స్థాయిలో చర్చించనున్నారు. ఆయా తప్పులకు కారణాలను వివరించి, విద్యార్థులు వాటిని అధిగమించేలా స్పష్టత కల్పించనున్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంపునలకు దోహదపడేలా విద్యాశాఖ ఈ ఏడాది నుంచి వర్క్‌బుక్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశాం. వర్క్‌బుక్స్ నిర్వహణ గురించి సంబంధిత సబ్జెక్టు టీచర్లు అవగాహన కల్పిస్తున్నారు. – శ్రీరాం మొండయ్య, డీఈవో, రాజన్న సిరిసిల్ల -
ఏటీఎం దొంగలు..?
మహారాష్ట్ర వైపు కరీంనగర్‌క్రైం/కరీంనగర్‌రూరల్/తిమ్మాపూర్: అసలే రాజీవ్ రహదారి.. ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. పోలీస్ పెట్రోలింగ్, హెచ్‌కేఆర్ సంస్థ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. అయినా దొంగలు ఎలాంటి తనుకుబెణుకు లేకుండా నిమిషాల వ్యవధిలో ఏటీఎంలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి నగదు ఎత్తుకెళ్లడం విస్మయానికి గురిచేస్తోంది. నిందితులు లేడీ గెటప్‌లో వచ్చి చోరీలకు పాల్పడడం సంచలనం సృష్టించింది. చోరీల కలకలం కొద్దిరోజుల క్రితం పీఎంజే జువెల్లరీలో చోరీ.. ఆ తర్వాత భగత్‌నగర్‌లోని ఓ ఇంట్లో భారీ దోపిడీ.. తాజాగా ఏటీఎంల చోరీతో కరీంనగర్ మరోసారి వార్తల్లో నిలిచింది. పీఎంజే, భగత్‌నగర్ చోరీలను రోజుల వ్యవధిలో చేధించిన పోలీసులు.. ఈ కేసులో అంతే వేగంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండు ఏటీఎంలు రాజీవ్ రహదారి వెంట ఉండడం, వేకువజామున జనసంచారం తక్కువగా ఉండడం.. వారు రావడం.. పనిపూర్తి చేసుకుని త్వరగా పరారయ్యేందుకు అవకాశాలను పోలీసులు మ్యాపింగ్ చేశారు. నలుగురు వ్యక్తులు (ఒకరు పంజాబీ డ్రెస్‌తో) వచ్చి తిమ్మపూర్‌లో వేకువజామున 3గంటల నుంచి 3.10 గంటల వరకే పనికానిచ్చారు. 3.34గంటలకు దురే్శ్డ్కు చేరుకుని అక్కడ కేవలం 8 నిమిషాల్లో పని పూర్తిచేసుకున్నారు. నిందితులు ఏటీఏంలను నిమిషాల వ్యవధిలోనే బద్దలుకొట్టి సునాయాసంగా పారిపోయారంటే పక్కా ప్రొఫెషనల్స్ అని పోలీసులు భావిస్తున్నారు. స్వల్ప వ్యవధిలో.. తిమ్మాపూర్ మండలకేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంను ఆదివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో దొంగలు గ్యాస్ కట్టర్లతో కట్ చేసి రూ.7,13,400 నగదు దోచుకెళ్లారు. లేడీ గెటప్‌లో ఉన్న ఓ దొంగ ఏటీఎం సెంటర్లోకి వెళ్లి సీసీ కెమెరాలపై కెమికల్ స్ప్రే చేసి పగులగొట్టాడు. కెమెరాలు పనిచేసినా దోపిడీ దృశ్యాలు నమోదు కాలేదు. ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దుర్శేడ్‌లోని ఏటీఎంలో 3.30 గంటల ప్రాంతంలో చోరీకి పాల్పడ్డారు. గ్యాస్‌కట్టర్‌తో ఏటీఎంను కట్ చేసి రూ.8,85,100 నగదు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన వెంటనే ఢిల్లీ నుంచి పోలీసులకు సమాచారం రావడంతో దుర్శేడ్‌కు రాగా.. అప్పటికే దొంగలు పరారయ్యారు. రెండు ఏటీఎం సెంటర్లను అదనపు డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, సీఐలు నిరంజన్‌రెడ్డి, రమేశ్, ఎస్సై అన్వర్ సందర్శించారు. స్కార్పియో చుట్టూ దర్యాప్తు చోరీలో ఉపయోగించిన స్కార్పియో మహారాష్ట్ర (ఎంహెచ్ 03 ఈబీ 4258) రిజిస్ట్రేషన్‌గా నమోదై పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. అయితే ఆ వాహనంపై ఉన్న నంబర్ ప్లేట్ నకిలీదిగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. రేణికుంట, బసంత్‌నగర్ టోల్గేట్ల వద్ద ఆ వాహనం రికార్డు కాకపోవడం ఆసక్తికరంగా మారింది. టోల్గేట్లు ఉన్న ప్రధాన మార్గాలను కావాలనే తప్పించి.. గ్రామీణ రహదారుల మీదుగా జిల్లాలోకి ప్రవేశించి.. తిరిగి ప్రత్యామ్నాయ మార్గాల మ్యాప్‌ను ముందుగానే సిద్ధం చేసుకున్నారా..? అనేది తేలాల్సి ఉంది. మరోవైపు పెద్దపల్లి వైపు వాహనం వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అక్కడి నుంచి రైలు మార్గంలో ఉత్తరాది వైపు వెళ్లారా..? మంథని మీదుగా ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లారా..? లేదా పెద్దపల్లి వరకు అదే వాహనంలో వెళ్లి అక్కడి నుంచి వేరే వాహనంలో తప్పించుకున్నారా తేలాల్సి ఉంది. చోరీలో హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినీఫక్కీలో చోరీలు ఇటీవల విడుదలైన ద్రిదం, ప్రీతంఅండ్పెట్రో వెబ్ సీరిస్‌లలో అచ్చం ఇలాగే ఏటీఎం చోరీ దృశ్యాలు ఉండడం గమనార్హం. మే 3న కరీంనగర్‌లోని పీఎంజే జ్యూవెలరీ దోపిడీతో పోల్చితే నేరానికి ముందు రెక్కీ, టార్గెట్ ఎంపిక, ఆపరేషన్ తక్కువ సమయంలో పూర్తి చేయడం, అనంతరం జిల్లా దాటి పరారయ్యే ప్రయత్నం వంటి అంశాలు కనిపిస్తున్నాయి. టార్గెట్లు మారుతున్నా.. నిందితులు ప్రణాళికలో రెక్కీ, భద్రతా లోపాల గుర్తింపు, వేగవంతమైన ఆపరేషన్, తప్పించుకునే మార్గం కీలకంగా మారుతున్నాయా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఏటీఎం చోరీలో అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయం ఉందన్న అనుమానంతో పోలీస్ అధికారులు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రాజీవ్ రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాలు, టోల్గేట్ల పరిసరాలు, పెట్రోల్ బంకులు, హైవే జంక్షన్లు.. గ్రామీణ రహదారుల వద్ద ఉన్న కెమెరాలు.. వాహనం కదలికలకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు, క్లూస్‌టీంల ద్వారా సేకరించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వేగంగా ఏటీఎం దోపిడీ ఘటనల దర్యాప్తు కీలకంగా మారిన నిందితుల స్కార్పియో వాహనం టోల్గేట్లకు చిక్కకుండా గ్రామీణమార్గాల్లో ఎంట్రీ, ఎగ్జిట్..? మంచిర్యాల మీదుగా మహారాష్ట్ర వైపు పరారీపై దర్యాప్తు తిమ్మాపూర్‌లో రాజీవ్ రహదారి పక్కనే ఏటీఎం రద్దీ ఉన్నా.. దర్జాగా దోపిడీ -
నైపుణ్యం పెంపు లక్ష్యం
సుకన్య ఎస్టీఈఎం ల్యాబ్ ద్వారా గ్రామీణ బాలికల్లో నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తా. విద్యార్థులు ప్రతీఅంశంపై ప్రయోగం చేయొచ్చు. ల్యాబ్ మంజూరు చేసిన మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్, డీఈవోకు కృతజ్ఞతలు. – కేసరి సంతోష్‌కుమార్, ప్రిన్సిపాల్, ధర్యపూర్ మోడల్ స్కూల్, ముత్తారం, పెద్దపల్లి జిల్లా పేద విద్యార్థుల్లో సాంకేతిక విద్య పేదవిద్యార్థు జీవితాల్లో సాంకేతిక విద్య ద్వారా వెలుగు నింపడమే లక్ష్యం. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో సుకన్య ఎస్టీఈఎం ల్యాబ్‌ను రాష్ట్రంలోనే మంథని నియోజకవర్గానికి మంజూరు చేయించాం. ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్లో ఏఐ ఆధారిత విద్యాబోధనకు ఎంపికై ంది. – శ్రీధర్‌బాబు, ఐటీ, పరిశ్రమల మంత్రి -
గంటకే ఆగమాగం
కరీంనగర్ కార్పొరేషన్: నగరాన్ని వరద ముంచెత్తింది. ఆదివారం మధ్యాహ్నం కొద్దిసేపు కురిసిన భారీ వర్షంతో నగరం జలమయమైంది. చాలా ప్రాంతాల్లోని వీధులు, రోడ్లు కాలువలను తలపించాయి. ఇండ్లల్లోకి వరద చేరింది. డ్రైనేజీలు సక్రమంగా లేని ప్రాంతాల్లో మురుగు రోడ్డెక్కింది. మేయర్ కొలగాని శ్రీనివాస్ వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, సహాయక చర్యలు చేపట్టారు. ఉక్కపోత.. కుండపోత నగర ప్రజలను ఆదివారం ఉదయం ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేయగా, మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా, మరికొన్ని చోట్ల సాధారణంగా వర్షం పడింది. దాదాపు గంట పాటు పడిన భారీ వర్షంతో ముకరంపుర, మంచిర్యాల చౌరస్తా, జ్యోతినగర్, మంకమ్మతోట, లక్ష్మినగర్, గణేశ్‌నగర్, సాయినగర్, కాశ్మీర్‌గడ్డ తదితర ప్రాంతాల్లో రోడ్లు, వీధులు జలమయం అయ్యాయి. సాయికృష్ణ థియేటర్ సమీపంలో ఇళ్లలోకి వరద నీళ్లు చేరాయి. ముకరాంపుర విమానం వీధి ఏరియాలో మామూలుగానే వీధులు, ఇండ్లు నీట మునిగాయి. లక్ష్మినగర్‌లోని నయూం మసీదు ప్రాంతంలో డ్రైనేజీ లేకపోవడంతో వీధుల్లో మురుగు పారింది. గీతాభవన్ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా ప్రాంతాలు మళ్లీ చెరువులను తలపించాయి. వరద, బురద కారణంగా ఆయా ప్రాంతాల్లోని నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలి వర్షంతో ప్రజలు ఇబ్బంది పడకుండా, అత్యవసర సేవలకు అధికారులు సిద్ధంగా ఉండాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలను డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి సందర్శించారు. 31, 52, 53, 59, 60, 64వ డివిజన్లలో పర్యటించి, వర్షపు నీళ్లు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి, తొలగించాలని అధికారులను ఆదేశించారు. డిజాస్టర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్పొరేటర్లు పడాల శ్రీజ అజయ్‌గౌడ్, కొంపెల్లి శ్వేత రామన్, మాజిద్ హుస్సేన్, బియాబని ఉన్నారు. -
భద్రతతో నిమజ్జనం
● భక్తులు, ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు పాటించాలి ● ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుపుకోవాలి పెద్దపల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాలు జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నిత్యపూజలు, అన్నదానాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో గణపతి మండపాలు ఆధ్యాత్మికత సంతరించుకున్నాయి. ఇంతటి సందడిగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు.. చివరిరోజు.. నిమజ్జనం సందర్భంగా మరింత సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా భారీ విగ్రహాల శోభాయాత్ర, చెరువులు, కుంటల్లో నిమజ్జనం సందర్భంగా ఏమాత్రం ఏమరుపాటుగా ఉండొద్దని అంటున్నారు. అపశ్రుతులకు కారణాలివే.. నిమజ్జనం సందర్భంగా ప్రధానంగా నీటిలోకి దిగడం, లోతు తెలియని ప్రాంతాల్లోకి వెళ్లడం, పిల్లలను పర్యవేక్షణ లేకుండా వదిలేయడం, విగ్రహాలను తరలించే వాహనాలపై నిర్లక్ష్యంగా ప్రయాణించడం, విద్యుత్ తీగల సమీపంలో ఊరేగింపులు నిర్వహించడం వంటి కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆరుగురు విద్యార్థులు నీటమునిగి మృతి చెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. నీటిలోకి దిగొద్దు.. గణేశ్ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నిర్ణయించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలి. చెరువులు, కుంటలు, వాగుల్లో లోతు తెలియని ప్రాంతాల్లోకి దిగకూడదు. ముఖ్యంగా పిల్లలు, ఈత రానివారు నీటి వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. నిమజ్జనం పేరుతో నీటిలోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలి. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండపాలు, ఊరేగింపు మార్గాల్లో విద్యుత్ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యుత్ తీగలకు విగ్రహాలు, అలంకరణలు తగలకుండా ముందుగానే మార్గాన్ని పరిశీలించాలి. అనధికార విద్యుత్ కనెక్షన్లకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. పోలీసులు కూడా గణేశ్ ఉత్సవాల సందర్భంగా విద్యుత్ భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించాలి నిమజ్జన శోభాయాత్రలో నిర్ణయించిన మార్గం, సమయాలను పాటించాలి. వాహనాలపై అధిక సంఖ్యలో భక్తులు ఎక్కకుండా చూడాలి. విగ్రహాల తరలింపునకు ఉపయోగించే వాహనాలు, క్రేన్లు సురక్షితంగా ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా పోలీసుల సూచనలను పాటించాలి. భారీవిగ్రహాల తరలింపులో ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు, రహదారి వెడల్పు, వంతెనల సామర్థ్యం వంటి అంశాలను అధికారులు ముందుగానే పరిశీలిస్తున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో.. పోలీసుల సూచనల మేరకు మాత్రమే నిమజ్జనం చేయాలి. నీటిలోకి దిగకుండా నిర్ణయించిన ప్రదేశం నుంచే నిమజ్జనం చేయాలి. రద్దీ ప్రాంతాల్లో తోపులాట జరగకుండా క్యూలైన్లను పాటించాలి. వాహనాలను నిర్దేశిత ప్రదేశాల్లోనే నిలిపివేయాలి. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు, వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకూడదు. గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాలి పకడ్బందీగా ఏర్పాట్లు వినాయక విగ్రహాల నిమజ్జన ప్రాంతాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, గ్రామపంచాయతీ, వైద్య, ఆరోగ్యశాఖలు సమన్వయంతో పనిచేస్తున్నారు. భక్తులు, ఉత్సవ కమిటీలు సహకరించాలి. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ రూట్‌మ్యాప్ ప్రకారమే నిమజ్జనం పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, గోదావరిఖని లాంటి ప్రధాన ప్రాంతాల్లో పోలీసుల రూట్‌మ్యాప్ ప్రకారమే విగ్రహాలు నిమజ్జనం చేయాలి. నిమజ్జనం సందర్భంగా ఎవరూ మద్యం తాగొద్దు. అల్లరి మూకలపై పోలీసుల నిఘా ఉంటుంది. – రాంరెడ్డి, డీసీపీ, పెద్దపల్లిభక్తి శ్రద్ధలతో వేడుక.. -
నాలుగో రైల్వేట్రాక్ ఏర్పాటుకు కసరత్తు
రామగుండం: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట–బల్హర్షా మధ్య నాలుగో రైల్వేలైన్ ఏర్పాటుకు రైల్వే మంత్రిత్వశాఖ పచ్చజెండా ఊపింది. ఇందుకోసం 250 కి.మీ. మేర డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్), ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేసింది. మొత్తం రైల్వేట్రాక్‌లో 80శాతం తెలంగాణ, 20శాతం మహారాష్ట్ర పరిధిలోకి ఉంటుంది. ట్రాక్ నిర్మాణ అంచనా వ్యయం రూ.3,500 కోట్లు అని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. మూడోలైన్ పూర్తయిన వందరోజుల్లోనే.. గ్రాండ్ ట్రంక్ రూట్లోని మూడో ట్రాక్ పూర్తిచేసిన వందరోజుల్లోనే నాలుగో లైన్‌కు ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుట్రాక్కు ఇరువైపులా రైల్వేస్థలాలను గుర్తించి చదును చేసి ఎస్సీఆర్ పేరిట ఎరుపురంగు హద్దు రాళ్లు వేస్తున్నారు. కొన్నిచోట్ల పంటలు సాగుచేస్తున్న రైతులను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీచేస్తున్నారు. ప్రత్యేకాధికారుల నియామకం కాజీపేట–బల్హర్షా మధ్య నాలుగో రైల్వేలైన్ నిర్మాణానికి రైల్వే మంత్రిత్వశాఖ ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. మంచిర్యాల జిల్లాలోని తాండూర్, బెల్లంపల్లి మండలాల పరిధిలోకి వచ్చే రైల్వేలైన్‌కు బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మందమర్రి, మంచిర్యాల మండలాలకు మంచిర్యాల ఆర్డీవో, అంతర్గాం, రామగుండం, పెద్దపల్లి, ఓదెల, పాలకుర్తి మండలాల పరిధిలో వచ్చే రైల్వేలైన్ పర్యవేక్షణకు పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, జమ్మికుంట, హుజూరాబాద్ పరిధిలో హుజూరాబాద్ ఆర్డీవోను పర్యవేక్షణాధికారులను నియమించింది. వీరు ఎగ్జిక్యూషన్, మెయింటెనెన్స్, మేనేజ్మెంట్, ఆపరేషన్ తదితర అంశాల బాధ్యతలు కలిగి ఉంటారని పేర్కొంది. అధిక ఆదాయం వచ్చే అవకాశం.. నాలుగో రైల్వేలైన్ వినియోగంలోకి వస్తే వస్తు, సామగ్రి రవాణా, ప్రయాణికుల రాకపోకలు మరింత పెరుగుతాయి. రైళ్లవేగం గరిష్టంగా గంటకు 130 కి.మీ.కు చేరుకుంటుంది. గూడ్సురైళ్ల ద్వారా బొగ్గు, సిమెంట్, గ్రానైట్, ముడిసరుకులు ఇతరత్రా ఎగుమతుల్లో వేగం పుంజుకుంటుంది. ఇది పరిశ్రమలకు ఊరటనిచ్చే అంశమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తద్వారా దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు రూ.వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు -
క్రీడల్లో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తేవాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: క్రీడల్లో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని అన్నారు. అంబేద్కర్ స్టేడియంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య క్రీడలు శనివారం ముగిశాయి. ఈసందర్భంగా విజేతలకు డీఈవో ట్రోఫీలు ప్రదానం చేశారు. మహిళా వ్యాయామ ఉపాధ్యాయులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే తనవద్దకు నేరుగా వచ్చి తెలియజేయవచ్చని పేర్కొన్నారు. విద్యాశాఖ ప్లానింగ్ ఆఫీసర్ మిల్కూరి శ్రీనివాస్, డీసీఈబీ కార్యదర్శి భగవంతరావు, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి బన్సిలాల్, పీడీలు, పీఈటీలు, పెటా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. అండర్– 14 బాలుర విజేతలు అండర్– 14 బాలుర ఖోఖో విభాగంలో చొప్పదండి మండలం ప్రథమ, కొత్తపల్లి మండలం ద్వితీ య, కబడ్డీలో కరీంనగర్‌అర్బన్ మండలం ప్రథమ, చొప్పదండి మండలం ద్వితీయ, వాలీబాల్‌లో కొత్తపల్లి మండలం ప్రథమ, వీణవంక మండలం ద్వితీయ స్థానంలో నిలిచాయి. -
మురిపించిన మూషికం
కరీంనగర్ రాంనగర్లో చాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం రోబోటిక్ మూషిక ప్రదర్శన ఆకట్టుకుంది. స్వామివారికి కాశి గంగాహారతి తరహాలో ప్రత్యేక హారతి సమర్పించారు. సీపీ గౌస్ఆలం ఈ ప్రదర్శనను ప్రారంభించగా, చిన్నారులు, యువత రోబోటిక్ మూషికంతో ఫొటోలు దిగుతూ సరదాగా గడిపారు. ‘డోబో రోబోటిక్స్’ రూపొందించిన వినూత్న వాహనం భక్తులకు సరికొత్త అనుభూతి అందించిందని నిర్వాహకుడు తుమ్మల రేవంత్‌రెడ్డి, కార్పొరేటర్ గాజ రమా తెలిపారు. సీపీతో పాటు ఏసీపీలు ప్రదర్శనను తిలకించారు. – కరీంనగర్‌కల్చరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
సమన్వయంతో కేసుల సత్వర పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ కరీంనగర్‌క్రైం: న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ అన్నారు. శనివారం కరీంనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని అస్త్ర కన్వెన్షన్ హాలులో నిర్వహించిన న్యాయ, పోలీస్‌శాఖ అధికారుల సమన్వయ సమావేశంలో మాట్లాడారు. నూతన క్రిమినల్ చట్టాల నేపథ్యంలో న్యాయవ్యవస్థలో డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ ఆధారాల నిర్వహణ కీలకంగా మారిందన్నారు. ఇంటర్–ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసిజేఎస్)తో శ్రీవన్ డేటా–వన్ ఎంట్రీశ్రీ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా పోలీస్ దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, కోర్టు రికార్డులను డిజిటల్ విధానంలో అనుసంధానం చేయవచ్చన్నారు. దీంతో సమయం ఆదా కావడంతో పాటు కేసుల విచారణలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, కోర్టు, పోలీస్‌శాఖలు సమన్వయంతో పనిచేస్తే కేసుల పరిష్కార ప్రక్రియలో జాప్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ఈ–ఎఫ్ఐఆర్లను కోర్టులు సకాలంలో స్వీకరించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వాటి పర్యవేక్షణకు అవసరమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. సమన్ల జారీ ప్రక్రియలోనూ సాంకేతికత వినియోగించాలని సమావేశంలో నిర్ణయించారు. తీర్పుల ప్రతులు, సాక్షుల వాంగ్మూలాలను సకాలంలో ఆన్లైన్ చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు. గంగాధర పోలీస్‌స్టేషన్ పరిధిలో పాత కేసులకు కోర్టు పరిధి మారిన నేపథ్యంలో వాటి స్వీకరణకు సంబంధించిన అంశాలను సమావేశంలో పరిశీలించారు. న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సోషల్‌మీడియా దుర్వినియోగం వద్దు
భావ ప్రకటన స్వేచ్ఛకు సోషల్‌మీడియా మంచి వేదిక. ప్రజలకు విజ్ఞానాన్ని పంచేందుకు చక్కటి సాధనం. దురదృష్టవశాత్తూ దీన్ని దుర్వినియోగానికి వాడుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కాలంలో వచ్చే కంటెంట్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి. ఫేక్ కంటెంట్‌తో సమాజంలో అలజడులు రేపే, రెచ్చగొట్టే కంటెంట్, వీడియోలపై రిపోర్టు చేస్తే చర్యలు తీసుకుంటాం. – గౌస్ ఆలం, సీపీ, కరీంనగర్ సోషల్ మీడియా ఫేమ్, పరిచయాలు, తాత్కాలిక ఆకర్షణలు జీవిత నిర్ణయాలను ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడాలి. వ్యక్తిగత స్వేచ్ఛతోపాటు కుటుంబ బాధ్యతను గుర్తుంచుకోవాలి. అప్పుడే సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబ బంధాలను కాపాడుకోగలుగుతాం. – ప్రీతి, మానసిక వైద్య నిపుణురాలు -
గణపతి సేవలో కలెక్టర్
కరీంనగర్‌అర్బన్/కరీంనగర్‌కల్చరల్ : నిత్యం విరామం లేకుండా పరిపాలనలో నిమగ్నమయ్యే కలెక్టర్ చిత్రామిశ్రా శనివారం ఆధ్యాత్మిక సేవలో తరించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. అధికారులు, సిబ్బందికి స్వయంగా భోజనం వడ్డించారు. అదనపు కలెక్టర్లు డి.శ్రీనివాస్‌రెడ్డి, అశ్విని తానాజీవాకడే, నగరపాలక కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, డీఆర్వో స్వామి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఔట్పోస్ట్కరీంనగర్క్రైం: నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణచౌక్, మంచిర్యాల చౌరస్తాలో నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. వీటిని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం శనివారం ప్రారంభించారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఔట్‌పోస్ట్‌లు ఉపయోగపడతాయని సీపీ తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సమయంలో తక్షణ చర్యలు చేపట్టేందుకు ఔట్‌పోస్టులు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి, ఇన్స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వపర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ లైన్ మరమ్మతు పనుల కారణంగా ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్–2 ఏడీఈ లావణ్య తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 11 కేవీ ఐబీ, సంతోష్‌నగర్ ఫీడర్ల పరిధిలోని సర్కస్ గ్రౌండ్ ప్రాంతం, పద్మనాయక కల్యాణ మండపం, జ్యోతినగర్, గీతాభవన్ వెనుక ప్రాంతం, కార్పెంటర్ సొసైటీ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. -
● గుర్తింపు కోసం హద్దులు దాటుతున్న కంటెంట్ ● వైష్ణవి భర్త హరిబాబు హత్య అనంతరం నిందితుడి వీడియో ● ఈశ్వర్‌సాయి ఉదంతంలోనూ ప్రైవేటు వీడియోలు లీక్ ● ఇంటర్వ్యూ చూసి 20 ఏళ్ల పగ తీర్చుకున్న యువకుడు ● సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆందోళన
19 ఏళ్ల వైష్ణవి యూట్యూబర్. సోషల్ మీడియాలో ఫేమస్. వైష్ణవిని సోషల్ మీడియాలో చూసి మనసు పారేసుకున్న హరిబాబు.. ఆమెనే ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం దంపతుల మధ్య విభేదాలు చెలరేగి వైష్ణవి హత్యకు దారితీసింది. వైష్ణవి హత్యపై పగపెంచుకున్న ఆమె సోదరుడు సంతోష్ సోషల్‌మీడియా వేదికగా హరిబాబును చంపుతానని ప్రతినబూనాడు. అన్నట్లుగానే హత్య చేసి, తానే చంపానంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. ఒక ప్రాణం తీసి నెటిజన్ల నుంచి మద్దతు కోరడం సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ ఉదంతం వైష్ణవి–హరిబాబుల ప్రాణాలు పోవడంతోపాటు సంతోష్‌ను జైలు పాలుజేసింది. -
డిజిడల్ చదువులు!
కరీంనగర్‌సిటీ: దేశంలో విద్యారంగం డిజిటల్ విప్లవంతో సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఒకవైపు అల్టిమేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), యానిమేటెడ్ 3డీ లెర్నింగ్, విజువల్ గ్రాఫిక్స్, ఇంటరాక్టివ్ ప్యానెల్స్ విద్యాబోధనను శాసిస్తున్నాయి. నేటి తరం విద్యార్థుల చేతుల్లో స్మార్ట్ఫోన్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నాయి. కాగా, ఉత్తర తెలంగాణలోనే వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు దిక్సూచి అయిన కరీంనగర్ ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లాంటి పెద్ద కళాశాలల్లో నేటికీ పాతకాలపు బ్లాక్ బోర్డ్ (నల్లబల్ల) విధానమే రాజ్యమేలుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఆధునిక సౌకర్యాలతో దూసుకుపోతుంటే ప్రభుత్వ కాలేజీలు మాత్రం ఇంకా సుద్దముక్కల ధూళిలోనే మగ్గిపోతున్నాయి. స్వయం ప్రతిపత్తి నాక్ ‘ఏ’ గ్రేడ్ ఉన్నా క్లాస్‌రూమ్‌ల రూపురేఖలు మాత్రం మారలేదు. ఎస్సారార్ కాలేజీలో 14కు పైగా కోర్సులు ఉండగా 37 తరగతి గదుల్లో విద్యాబోధన సాగుతోంది. వీటిలో కేవలం 8 మాత్రమే నామమాత్రం డిజిటల్ బోర్డులు.. మిగిలిన 29 తరగతి గదుల్లో చాక్పీస్లతోనే విద్యాబోధన సాగుతోంది. 1956లో ఏర్పాటైన ఎస్సారార్ ప్రభుత్వ కళాశాలకు ఘనమైన చరిత్ర ఉంది. ఈ కాలేజీలో చదువుకున్న ఎందరో మహానుభావులు, శాస్త్రవేత్తలు, అధికారులు దేశ విదేశాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం కాలేజీకి యూజీసీ అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా, జాతీయస్థాయి గుర్తింపు అయిన నాక్ ఏ గ్రేడ్ కూడా లభించాయి. నిబంధనల ప్రకారం అటానమస్ కాలేజీలకు సొంత విద్యా ప్రమాణాలు, ఆధునిక బోధనా పద్ధతులను ఏర్పాటు చేసుకునే పూర్తి ఆర్థిక, పరిపాలనా స్వేచ్ఛ ఉంటుంది. కానీ, నిధుల కొరతనో లేక అధికారులు, పాలకుల సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇక్కడ మెజార్టీ క్లాస్‌రూమ్‌లలో డిజిటల్ బోర్డులు అందుబాటులోకి రాలేదు. సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ), కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ లాంటి ప్రాక్టికల్, గ్రాఫికల్ విజువలైజేషన్ సబ్జెక్టులను కూడా నల్లబల్లపైనే బొమ్మలు గీసి వివరించాల్సిన పరిస్థితి అధ్యాపకులకు ఎదురవుతోంది. హ్యూమన్ అనాటమీ, కెమికల్ బాండింగ్స్, ఎకనామిక్స్ గ్రాఫ్‌లు లేదా కంప్యూటర్ కోడింగ్ వంటి క్లిష్టమైన పాఠాలను డిజిటల్ బోర్డుల ద్వారా యానిమేషన్స్ రూపంలో చూపిస్తే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది. కాగా, గంటల తరబడి థియరీ క్లాసులకే పరిమితం కావడంతో విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రాక్టికల్ పరిజ్ఞానం లోపిస్తోందని విద్యానిపుణులు పేర్కొంటున్నారు. టెక్నాలజీతో కూడిన జిజ్ఞాస పోటీల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు. సంప్రదాయ బోర్డుల వాడకం కేవలం బోధనా నాణ్యతనే కాకుండా విద్యార్థులు, అధ్యాపకుల ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తోంది. రోజుకు 4 నుంచి 5 గంటల పాటు సుద్దముక్కలతో బోర్డుపై రాయడం, దానిని తుడవడం వల్ల వచ్చే చాక్ డస్ట్ (సుద్ద ధూళి) ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. దీంతో చాలా మంది సీనియర్ అధ్యాపకులు దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందులు, ఆస్తమా, స్కిన్ అలర్జీల బారిన పడుతున్నారు. ముఖ్యంగా క్లాస్రూమ్ ముందు వరుసలో కూర్చునే విద్యార్థులు కూడా ఈ దుమ్ముతో దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో అటానమస్, కార్పొరేట్ కాలేజీల్లో ‘ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్’ ద్వారా బోధిస్తున్నారు. దీంతో అక్కడి విద్యార్థులు సబ్జెక్టును త్వరగా అవగతం చేసుకుని గ్లోబల్ మార్కెట్లో క్యాంపస్ ప్లేస్మెంట్లలో సులభంగా ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రుసా వంటి గ్రాంట్ల ద్వారా రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ కాలేజీల్లో నామమాత్రంగా డిజిటల్ స్క్రీన్లు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారు. కానీ, ఎస్సారార్ కాలేజీలో ఎలాంటి డిజిటల్ క్లాస్‌రూం ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసిన చోట సరైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లేక, సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు రిపేర్ చేసే మెయింటెనెన్స్ ఫండ్స్ లేక చాలా చోట్ల మూలనపడ్డాయి. ప్రభుత్వ కాలేజీలను కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే నామమాత్రపు విద్యా కేంద్రాలుగా కాకుండా, ఆధునిక నాలెడ్జ్ హబ్‌లుగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మేధావులు పేర్కొంటున్నారు.ఇన్చార్జిల పాలనతో ఇక్కట్లు జిల్లాలోని 18 కాలేజీల్లో మూడు అటానమస్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 8 కాలేజీలకు మాత్రమే పూర్తిస్థాయి ప్రిన్సిపాల్స్ ఉన్నారు. 1,600 పైగా విద్యార్థులు కలిగిన ఎస్సారార్ డిగ్రీ, పీజీ కాలేజీ ఇన్చార్జిల పాలనలోనే కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా మహిళ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఎస్సారార్ కాలేజీ ఎఫ్ఏసీ హోదాలో బాధ్యతలు అప్పగించారు. వీటితో పాటు గంగాధర డిగ్రీ కాలేజీకి కూడా ఇదే ప్రిన్సిపాల్‌ను ఇన్చార్జిగా నియమించారు. దాదాపు రెండేళ్లుగా ఇన్చార్జిల పాలనతో నడుస్తోంది. పదేళ్లలో ఎస్సారార్ కాలేజీలో చెప్పుకోతగ్గ అభివృద్ధికి నోచుకోలేదని, కరీంనగర్ ప్రభుత్వ మహిళ డిగ్రీ, పీజీ కాలేజీ అటానమస్ హోదాలో అభివృద్ధిలో దూసుకుపోతోందని పలువురు పేర్కొంటున్నారు. సదరు కాలేజీలో 35 తరగతులకు అన్నీ డిజిటల్ క్లాస్రూంలే ఉన్నాయి. విద్యార్థుల డిమాండ్లు సంప్రదాయ బ్లాక్ చాక్‌పీస్ బోర్డుల స్థానంలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వందశాతం డిజిటల్ బోర్డులు సాధ్యం కాకపోయినా.. కనీసం నల్లబల్లలతో పాటు డిజిటల్ స్క్రీన్లను కలిపి ఉపయోగించే ‘బ్లెండెడ్ లెర్నింగ్’ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి, విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని విద్యార్థి సంఘాలు, మేధావులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
కరీంనగర్ జోరు.. ప్రత్యర్థుల బేజారు
కొత్తపల్లి(కరీంనగర్): నిజామాబాద్‌లో 3 రోజులుగా నిర్వహించిన టీజీ ట్రాన్స్‌కో/డిస్కం రాష్ట్రస్థాయి ఇంటర్ సర్కిల్ బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్ పోటీల్లో కరీంనగర్ జట్టు సత్తా చాటింది. బాస్కెట్‌బాల్‌లో చాంపియన్‌గా నిలవడంతోపాటు టేబుల్ టెన్నిస్‌లో తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. శనివారం జరిగిన బాస్కెట్‌బాల్ ఫైనల్లో కరీంనగర్ జట్టు ఖమ్మం జట్టుపై 45–20 స్కోరుతో ఘన విజయం సాధించి విజేతగా నిలిచింది. బాస్కెట్‌బాల్ జట్టు కెప్టెన్ ఈఎల్పీ రాజు కీలక సమయాల్లో ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. జట్టు మేనేజర్, సీనియర్ ప్లేయర్ ఎ.రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. క్రీడాకారులు విశ్వతేజ, వినీత్, మేఘనాథ్, రమేశ్, సుధీర్‌కుమార్, రంగు వెంకటనారాయణ, వినీల్, ప్రశాంత్, మోయిన్ పాషా తదితరులు అద్భుతంగా రాణించారన్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి ఎస్ఈలు అభినందించారు. బాస్కెట్‌బాల్‌లో చాంపియన్.. టేబుల్ టెన్నిస్‌లో తృతీయ స్థానం -
మన్నెంపల్లిలో ఉద్రిక్తత
● పాత పంచాయతీ భవనం కూల్చివేత ● అడ్డుకునేందుకు యత్నించిన పంచాయతీ పాలకవర్గం తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో శనివారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ పాత భవనం కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ భవనాన్ని ఏ మహిళా సంఘానికి ఇవ్వాలనే విషయంపై కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మహిళా సంఘాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈక్రమంలోనే శనివారం అర్ధరాత్రి తర్వాత అధికారులు పోలీసుల అండదండలతో గ్రామంలోకి వచ్చి ఆ భవనాన్ని కూల్చివేయించారు. మన్నెంపల్లి గ్రామపంచాయతీ పాత భవనం కూల్చివేత హైడ్రామాను తలపించింది. కొన్ని రోజులుగా అధికార పార్టీకి చెందిన మహిళా సంఘాల సభ్యులు, పంచాయతీ పాలకవర్గం మధ్య ఈ భవనం విషయంలో వివాదం కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున పోలీస్ బలగాలతో గ్రామంలోకి వచ్చిన అధికారులను పంచాయతీ పాలకవర్గం సభ్యులు అడ్డుకున్నారు. అయినా బలవంతంగా జేసీబీతో భవనాన్ని కూల్చివేశారు. అడ్డుకునే యత్నం చేసిన సర్పంచ్ భర్త పొన్నం అనిల్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రైనీ కలెక్టర్ పాత పంచాయతీ భవనం బాగుందని చెప్పినా కలెక్టర్‌కు తప్పుడు రిపోర్టులు ఇచ్చి కూల్చివేత ఆర్డర్ తెచ్చారని గ్రామ సర్పంచ్ పొన్నం సునీత ఆరోపించారు. అధికార పార్టీ నేతలు పంచాయతీ సెక్రెటరీని బెదిరించి.. పోలీస్ ప్రొటెక్షన్ కావాలని రాత్రికి రాత్రే నోటీసులు తెచ్చుకున్నారన్నారు. పాలకవర్గానికి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నుకోబడిన తన ఆత్మగౌరవాన్ని పోలీసులు, అధికారులు దెబ్బతీశారంటూ సర్పంచ్ కన్నీరు పెట్టుకున్నారు. దళితుడైన ఉపసర్పంచ్‌పై పోలీసులు చేయిచేసుకున్నారని ఆరోపించారు. గ్రామపంచాయతీని కూల్చేందుకు వచ్చిన సీఐ బొల్లం రమేశ్ భవనాన్ని కూల్చొద్దని అడ్డుకున్న గ్రామస్తులపై, సర్పంచ్ భర్తపై దురుసుగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపించారు. సీఐ తీరుపై సీపీకి ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ సునిత తెలిపారు. పాత పంచాయతీ భవనంలో విలువైన రికార్డులు ఉన్నాయని, భవనాన్ని బుల్డోజర్తో కూల్చివేయడంతో అవి అందులోనే ధ్వంసమయ్యాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కూల్చివేస్తామని చెప్పినా వినలేదు పాతపంచాయతీ భవనం కూల్చేందుకు కలెక్టర్ ఆర్డర్ ఉందని పోలీసులు గ్రామానికి వచ్చారు. రెండు రోజుల్లో భవనం మేమే కూల్చివేస్తామని చెప్పినం. అందులో విలువైన సామగ్రి ఉందన్నా పోలీసులు వినిపించుకోలేదు. ఎమ్మెల్యే కవ్వంపల్లి ఒత్తిడితో పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. – సునీత, సర్పంచ్, మన్నెంపల్లి -
‘పుష్కర’ పనులకు శ్రీకారం
● 2027లో గోదావరి పుష్కరాలు ● జూన్ 26 నుంచి జూలై 7 వరకు.. ● ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం ధర్మపురి: గోదావరికి పుష్కరాల సమయం ఆసన్నమవుతోంది. మరో 8 నెలల్లో నిర్వహించే పుష్కరాల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లను పునరుద్ధరించి భక్తులు నడవడానికి సరికొత్త రూపంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణకాశిగా ప్రసిద్ధి చెందిన ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి పుణ్యక్షేత్రంతోపాటు శాతవానుల తొలి రాజధాని కోటిలింగాల ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. తీర్థంగా, క్షేత్రంగా విరాజిల్లుతున్న లక్ష్మినృసింహుడి క్షేత్రంలో గోదావరి పుష్కరాలను 12 రోజులపాటు నిర్వహించడానికి పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడం కోసం అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రత్యేక చొరవతో కోట్లాది నిధులు విడుదలయ్యాయి. ధర్మపురి నియోజకవర్గంలోని కోటిలింగాల, రాయపట్నం, తిమ్మాపూర్, ఆరెపెల్లి, దొంతాపూర్, మగ్గిడి, ఎడపెల్లి, రాజారం, దమ్మన్నపేట తదితర గోదావరి తీర ప్రాంతాల్లో పనులు చేపట్టనున్నారు. పుష్కరాల కోసం రూ.132 కోట్లు గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం రూ.132 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.110 కోట్లకు అనుమతి లభించింది. ఘాట్ల అభివృద్దికి మరో రూ.22.16కోట్లకు అనుమతి వచ్చింది. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక పనులు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఘాట్ల విస్తరణ పనులు గతంలో నిర్మించిన పుష్కరఘాట్లు నడవడానికి వీలు లేకుండా ఉండడంతో వాటిని పునరుద్ధరించి భక్తులకు అనుకూలంగా మార్చనున్నారు. గోదావరిలోని మంగలిగడ్డ ఘాట్ 102 మీటర్లు. వాటిలో మెట్ల విస్తరణ, స్టాంప్ట్ కాంక్రీట్ క్లాడింగ్, నవహారతి వేదికలు, నవనారసింహస్వామి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. హరిత ఘాట్ 247 మీటర్లు ఉండగా.. వాటిలో విస్తరణ, అభివృద్ధి చేపట్టనున్నారు. మహాలక్ష్మిఘాట్ 70 మీటర్లు ఉండగా మెట్ల విస్తరణ, అభివృద్ధి చేయనున్నారు. మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా 20 గదులు నిర్మించనున్నారు. ప్రతి యూనిట్లో 5 ప్రత్యేక గదులు ఉండేలా చూస్తారు. నూతనంగా 129 మీటర్ల స్నానఘాట్లు నిర్మించనున్నారు. హరిత ఘాట్ నుంచి మహాలక్ష్మి ఘాట్ వరకు 85 మీటర్లు విస్తరించనున్నారు. హరిత నుంచి మంగలిగడ్డ ఘాట్ వరకు 11 మీటర్లు, మంగలిగడ్డ ఘాట్ నుంచి వీఐపీ, సంతోషిమాత ఘాట్ వరకు 33 మీటర్లు ఉంటుంది. ఇందులో దివ్యాంగులు, వీల్‌చైర్ వినియోగదారులకు ర్యాంప్‌లు నిర్మించనున్నారు.భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులతో ధర్మపురిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతాం. అభివృద్ధి పనులకు ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదు. – అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మంత్రి -
నువు లేక.. నేను లేనని..
● భర్త మృతి తట్టుకోలేక ఆత్మహత్య ● అనాథలైన ఇద్దరు చిన్నారులు ● కంటతడి పెట్టించిన ఘటన జూలపల్లి: భార్య, భర్త, ఇద్దరు పిల్లలు.. చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం.. కూలీనాలీ చేసుకుని బతుకుతున్న సామాన్య కుటుంబం.. కానీ, అనారోగ్యం ఆ కుటుంబ పెద్దను కబళించింది. ఉన్నంతకాలం ప్రేమ, ఆప్యాయత పంచిన పెనిమిటి ఒక్కసారిగా దూరం కావడంతో భార్య తట్టుకోలేకపోయింది. ఆయనలేని బతుకు తనకెందుకని అనుకుందో ఏమో.. కనీసం తన ఇద్దరు చిన్నారుల భవిష్యత్‌ను కూడా పట్టించుకోలేదు. చావైనా, బతుకై నా భర్తతోనే అని భావించి తనూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు, ఎస్ఐ మల్లేశ్ కథనం ప్రకారం.. కాచాపూర్ గ్రామానికి చెందిన దర్శనాల సతీశ్‌కు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లెకు చెందిన వసంతతో గతంలో వివాహం అయ్యింది. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన సతీశ్ చికిత్స పొందుతూ 36రోజుల క్రితం చనిపోయాడు. దీంతో వసంత తీవ్రంగా కుంగిపోయింది. అప్పట్నుంచి ముదావహంగా ఉంటోంది. భర్తలేని బతుకెందుకని మదనపడుతూ వస్తోంది. ఈక్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అనాథలైన ఇద్దరు చిన్నారులు.. తండ్రి సతీశ్, తల్లి వసంత కానరాని లోకాలకు వెళ్లడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారులు, తల్లిదండ్రుల చేతుల్లో ఎదగాల్సిన జీవితాలు అనాథలుగా మారడం గ్రామస్తుల్ని కలచివేసింది. మృతిరాలి తల్లి గోదరి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. -
లక్నవరం అందాలకు ఫిదా
● ఐలాండ్–2లో ఎన్టీపీసీ బృందం సందడి ● తెలంగాణ టూరిజం ఆతిథ్యం అద్భుతమని ప్రశంసలు గోవిందరావుపేట: ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు అందాలు, ఐలాండ్ల ప్రత్యేకతలు రామగుండం ఎన్టీపీసీ ఉన్నతాధికారులను ఆకట్టుకున్నాయి. రామగుండంలోని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సమంత తదితర ఉన్నతాధికారులు శనివారం లక్నవరం సరస్సును సందర్శించారు. ఐలాండ్–2లో బోటింగ్ చేశారు. ప్రకృతి అందాల నడుమ రాత్రి క్యాండిల్ లైట్ డిన్నర్ ఆస్వాదించి అక్కడే బసచేశారు. ముందుగా ఉన్నతాధికారులకు కోయ బృందంతో స్వాగతం పలికారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల మధ్య రాత్రిబస చేయడం తమకు మంచి అనుభూతిని కలిగించిందని ఉన్నతాధికారులు ఆనందం వ్యక్తం చేశారు. లక్నవరం ప్రకృతి సోయగాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు తెలంగాణ టూరిజం చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం హోటల్స్ జీఎం కె.నాథన్, అజీమ్ జంగయ్య, లక్నవరం హరిత మేనేజర్ శివశంకర్, హెచ్‌వోడీ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికుల భద్రత
ఆస్తుల పరిరక్షణ..నిరంతరం శ్రమిస్తున్న ఆర్పీఎఫ్ జవాన్లు ● నేడు ఆర్పీఎఫ్ ఆవిర్భావ వేడుకలురామగుండం: రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) జవాన్లు నిత్యం శ్రమిస్తున్నారు. 1985 సెప్టెంబర్ 20న పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా కేంద్ర సాయుధ బలగాల హోదా కల్పించడంతో జాతీయ భద్రతాదళంగా ఆవిర్భవించింది. దీంతో ఏటా సెప్టెంబర్ 20న ఆర్పీఎఫ్ రైజింగ్ డే నిర్వహించుకుంటారు. ● ప్రయాణికుల భద్రత, ఆస్తుల రక్షణ: ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి అందించడం ఆర్ఫీఎఫ్ లక్ష్యం. రైల్వే సంపద, వసతులు, కార్గో చోరీ నివారణ, రైల్వేస్టేషన్లు, లైన్లను పర్యవేక్షిస్తూ నేరాలను అరికట్టడం వీరి విధి. ● ఆపరేషన్లు నిర్వర్తించడం: రైల్వేస్టేషన్లలో తప్పిపోయిన, అపహరణకు గురైన, ఇళ్లనుంచి పారిపోయిన వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడాన్ని ‘ఆపరేషన్ నన్హే ఫరిస్తే’గా పేర్కొంటారు. కదులుతున్న రైలు ఎక్కే, దిగే క్రమంలో పడిపోయే ప్రయాణికులను గుర్తించి ప్రాణాలకు తెగించి కాపాడుకోడవం ‘ఆపరేషన్ జీవన్ రక్ష’గా పేర్కొంటారు. ప్రయాణికులు రైళ్లలో మరిచిపోయిన విలువైన లగేజీలను గుర్తించి తిరిగి వారికి అప్పగించడం ‘ఆపరేషన్ అమానత్’గా పేర్కొంటారు. డ్రగ్స్, గంజాయి మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టడమే ‘ఆపరేషన్ నార్కోస్’గా పేర్కొంటారు. ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణికులు వారు గమ్యస్థానం చేరే వరకు భద్రత, ధైర్యం అందించడమే ‘మేరీ సహేళి’ పథకంగా అభివర్ణిస్తారు. రైల్వేలో మహిళా ప్రయాణికుల రక్షణ నిమిత్తం ప్రత్యేక స్క్వాడ్లు నిరంతరం గస్తీ తిరుగుతుంటాయి. ● ఆధునిక సాంకేతిక సవాళ్లతో విధుల నిర్వహణ: రైల్వేస్టేషన్లలో నేరాలను అరికట్టడం, అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్‌తో నిందితులను గుర్తించడం, ఈ–టికెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ ముఠాలపై నిఘా చేయడానికి ‘ఆపరేషన్ ఉపలబ్ద్’ ద్వారా అత్యాధునిక సాఫ్ట్వేర్ల వినియోగం. వీటితో పాటు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కమాండో తరహా శిక్షణ, డాగ్ స్క్వాడ్ ఆధునిక ఆయుధాల వినియోగంపై ఆర్పీఎఫ్కు నిరంతరం ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడం. అవగాహన కోసం ఏటా సెప్టెంబర్ 20న ఆర్పీఎఫ్ ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడం అంటే మరోసారి మా విధులను గుర్తు చేసుకోవడంమే. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుంటూ రైల్వే ఆస్తుల పరిరక్షణ, నిఘా విభాగాల సమాచారంతో చోరీలు, నిషేధిత వస్తువుల రవాణాపై ఉక్కుపాదం మోపడం మా నిరంతరం ప్రక్రియ. – నవీన్‌కుమార్, సికింద్రాబాద్ డివిజనల్ సీనియర్ సెక్యూరిటీ కమిషనర్ -
తండ్రి మందలించాడని.. విద్యార్థి ఆత్మహత్య
తెలంగాణ: కాలేజీకి వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో కొడుకు ఉరేసుకొని మృతిచెందిన ఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్ గ్రామంలో జరిగింది. ఆకునూర్‌కు చెందిన ఒజ్జ ఉప్పలయ్య సింగరేణి విశ్రాంత ఉద్యోగి. ఉప్పలయ్య మొదటి భార్యకు ఐదుగురు సంతానం.ఆమె చనిపోగా ఉమను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కుమారుడు ఒజ్జ హర్షవర్ధన్ (17). హుజూరాబాద్‌లో ఐటీఐ చదువుతున్నాడు. ఈనేపథ్యంలో కాలేజీకి సరిగా వెళ్లడం లేదని తండ్రి ఉప్పలయ్య మందలించాడు. దీంతో హర్షవర్ధన్ ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.comఇదీ చదవండి: శంషాబాద్: గణేశ్ నిమజ్జనం కోసం వెళ్లి వస్తుండగా.. -
ఆదాయం పెంపుపై దృష్టి సారించండి
కరీంనగర్‌కార్పొరేషన్: నగరపాలకసంస్థ ఆదాయ పెంపుపై దృష్టి సారించాలని కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరపాలకసంస్థకు చెందిన సముదాయాల్లోని దుకాణాల నుంచి క్రమం తప్పకుండా నెలవారి అద్దె వసూలు చేయాలన్నారు. యజమానుల నుంచి బకాయిలు కట్టించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని, బకాయిలు పడ్డ యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. నోటీసులకు కూడా స్పందించని బకాయిదారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కమిషనర్ ఆయాజ్, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్మొహియొద్దిన్, వేణుమాధవ్, ఆర్వోలు తదితరులు పాల్గొన్నారు. -
వెదురు సాగును ప్రోత్సహించాలి
కరీంనగర్: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించగల వెదురుసాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రపంచ వెదురు దినోత్సవాన్ని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వెదురు సాగుతో పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు స్థిరమైన ఆదాయ మార్గాలు లభిస్తాయని పేర్కొన్నారు. తరతరాలుగా వెదురు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మేదరి కులస్తుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. మేదరి కుల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చింతల మల్లేశం, కార్యనిర్వాహక అధ్యక్షుడు అలిపిరెడ్డి చంద్రమౌళి, బొల్లం రామస్వామి, ఎనుగందుల రమేశ్, బొమ్మిడి వేణుగోపాల్, బొల్లం నారాయణ, మొలుగూరి రవీందర్, అలిపిరెడ్డి రామస్వామి, మొగులూరి రాజ్ కుమార్, చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ మంటలు..!
● ఎలక్ట్రిక్ బస్సులపై మంటల నీడ ● కరీంనగర్–2 డిపోలో మరో బస్సులో అగ్ని ప్రమాదం ● వరుస ఘటనలతో ప్రయాణికుల భద్రతపై ఆందోళనకరీంనగర్టౌన్: ప్రజా రవాణాలో ఆధునికతకు ప్రతీకగా వచ్చిన ఎలక్ట్రిక్ బస్సులపై మంటల నీడ కమ్ముకుంటోంది. కరీంనగర్–2 డిపోలో శుక్రవారం మరో బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. డిపో నుంచి బస్సు బయటకు వస్తున్న సమయంలో బ్యాటరీల పైభాగంలో మంటలు చెలరేగడాన్ని డ్రైవర్ గుర్తించాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులు బస్సులో ఎక్కకముందే ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే దీనిని ఒక్క ఘటనగా మాత్రమే చూడాల్సిన పరిస్థితి లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కరీంనగర్లో ఎలక్ట్రిక్ బస్సుల్లో బ్యాటరీ ప్రాంతం నుంచి మంటలు రావడం గతంలోనూ నమోదైంది. 2025 జూన్‌లో కరీంనగర్–2 డిపోకు చెందిన ఓ బస్సులో బ్యాటరీ భాగం నుంచి మంటలు చెలరేగాయి. 2026 జూన్ 21న కరీంనగర్–హైదరాబాద్ మార్గంలో వెళ్తున్న మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించడంతో ప్రాణనష్టం తప్పింది. ఆ సమయంలో బస్సులో సుమారు 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఒకే చోట.. పదేపదే ఎందుకు? కరీంనగర్–2 డిపోలోనే వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రధాన ప్రశ్నగా మారింది. 2026 జూలైలో వెలువడిన నివేదిక ప్రకారం కరీంనగర్– 2 డిపో పరిధిలో ఏడాది వ్యవధిలో మూడు ఎలక్ట్రిక్ బస్సుల అగ్ని ప్రమాద ఘటనలు నమోదయ్యాయి. వాటిలో రెండు కేవలం పది రోజుల వ్యవధిలోనే జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మూడు ఘటనల్లోనూ బ్యాటరీ ప్రాంతం నుంచే మంటలు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. అయితే అసలు సాంకేతిక కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా తేలలేదు. ఆందోళనకు దారితీసిన ఘటనలు కరీంనగర్లో చోటుచేసుకున్న వరుస ఘటనల నేపథ్యంలోనే 2026 జూలైలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్రవ్యాప్తంగా జేబీఎం సంస్థ తయారు చేసిన సుమారు 500 ఎలక్ట్రిక్ బస్సుల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. జేబీఎం సంస్థ నుంచి సాంకేతిక పరిశీలన, భద్రతా ధ్రువీకరణ కోరినట్లు నివేదికలు వెల్లడించాయి. అనంతరం దశలవారీగా తనిఖీలు నిర్వహించి, కొన్ని బస్సులకు సామర్థ్య ధ్రువీకరణ ఇచ్చి తిరిగి రోడ్డుపైకి తీసుకొచ్చారు. బ్యాటరీ భద్రతే కీలక ప్రశ్న ఎలక్ట్రిక్ బస్సుల్లో బ్యాటరీ సముదాయం అత్యంత కీలకమైన భాగం. బ్యాటరీలో లోపం, విద్యుత్ తీగల అమరిక, అనుసంధానాలు, విద్యుత్ నింపే వ్యవస్థ, ఉష్ణోగ్రత నియంత్రణ లేదా ఇతర సాంకేతిక సమస్యలు అగ్ని ప్రమాదానికి కారణమయ్యాయా? అన్నది నిపుణుల స్థాయిలో తేల్చాల్సిన అంశం. అయితే ప్రతీ ఘటనకు కారణం బ్యాటరీ లోపమేనని ముందుగానే నిర్ధారించడం కూడా సరికాదు. కరీంనగర్లో జరిగిన ఘటనలపై సమగ్ర సాంకేతిక దర్యాప్తు, తయారీ సంస్థ నివేదిక, రవాణా సంస్థ నిర్వహణ రికార్డులు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది.ఒక్కసారి మంటలు చెలరేగితే విద్యుత్ బస్సులో ప్రయాణించే వందలాది మంది ప్రయాణికుల పరిస్థితి ఏమిటన్నదే అసలు ఆందోళన. డ్రైవర్లు, కండక్టర్లు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై తగిన శిక్షణ పొందుతున్నారా? ప్రతీ బస్సులో బ్యాటరీ ఉష్ణోగ్రత, పొగ లేదా ఇతర అసాధారణ పరిస్థితులను ముందుగానే గుర్తించే వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా? డిపోల్లో బ్యాటరీ తనిఖీలకు ప్రత్యేక నిపుణులు ఉన్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు అవసరం. ప్రజా రవాణా వాహనం కావడంతో ‘ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం’ కంటే ‘ప్రమాదం జరగకముందే గుర్తించి నివారించడం’ అత్యంత ముఖ్యం. వరుస ఘటనల నేపథ్యంలో బస్సుల భద్రతపై సమగ్ర సాంకేతిక పరిశీలన నిర్వహించి, లోపాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. -
చట్టాలపై అవగాహనతోనే సురక్షిత సమాజం
కరీంనగర్‌క్రైం/కరీంనగర్‌టౌన్ : చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా నేరాలకు దూరంగా ఉండి సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్‌సింగ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ (ఆర్ట్స్)లో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే రాజ్యాంగ హక్కులు, పౌర బాధ్యతలపై అవగాహన ఉండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం, రవాణాపై ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులు, సోషల్ మీడియా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం 15100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎ.కిరణ్‌కుమార్, పెరుక రంగయ్యపటేల్, చిట్టి చంద్రప్రకాష్‌రెడ్డి, డీఐఈవో ఎ.సత్యనారాయణ, ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎన్.పద్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం న్యాయసేవల అవగాహన కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలిజమ్మికుంట: ప్రశాంతంగా గణేశ్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని సీపీ గౌస్ ఆలం అన్నారు. పట్టణంలోని నాయిని చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను శుక్రవారం సీపీ, మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోలీస్, మున్సిపల్ అధికారులకు ప్రజలు సహకరిస్తూ సురక్షితంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి, టౌన్ సీఐ రామకృష్ణ, కమిషనర్ మల్లికార్జునస్వామి, కౌన్సిలరు పాల్గొన్నారు. కరీంనగర్‌అర్బన్: పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఈహెచ్ఎస్, సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం తక్షణం నిర్ణయాలు తీసుకోవాలని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం టీఎన్జీవో భవన్లో నిర్వహించిన సమావేశంలో చైర్మన్, జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్‌గౌడ్ మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఈ నెల 18న సమావేశం నిర్వహిస్తుందని ప్రకటించడంతో, తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో ఉత్కంఠతో ఎదురుచూశారని, మరోసారి వాయిదా వేయడంపై ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోందని అన్నారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించేలా వ్యవహరించకుండా, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంగెం లక్ష్మణ్‌రావు, డాక్టర్ అరవింద్‌రెడ్డి, గూడ ప్రభాకర్‌రెడ్డి, విజయకుమార్, ఇరుమల్ల శారద, మారుపాక రాజేశ్‌భరద్వాజ్, నాగరా జు, సత్యనారాయణ, నరేశ్ పటేల్, సునీత, సూర్య, శైలజ, సుస్మిత, అజ్గర్‌అలీ, కోట రామస్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్‌అర్బన్: మూడురోజులుగా వేసవిని మరిపిస్తుండగా గురువారం రాత్రి నుంచి ఒక్కసారిగా చల్లబడింది. ఉక్కపోతతో సకల వర్గాలు సతమతం కాగా జిల్లావ్యాప్తంగా చిరుజ ల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. రేణికుంట(తిమ్మాపూర్)లో అత్యధికంగా 2.3సెంటిమీటర్ల వర్షపాతం నమోదవగా, ఇందుర్తి(చిగురుమామిడి)లో 2.3సెం.మీలు, ఖాసీంపేట(గన్నేరువరం)లో 1.9, దుర్శేడ్(కరీంనగర్ రూరల్)లో 1.6, ఈదులగట్టెపల్లి(మానకొండూరు)లో 1.4, చింతకుంట(కొత్తపల్లి)లో 1.2, వెన్కపల్లి(సైదాపూర్)లో 1.0, బోర్నపల్లి(హుజూరాబాద్)లో 1.0, మల్యాల(ఇల్లందకుంట) 6.8మి.మీ, కరీంనగర్ అర్బన్ 3.8మి.మీ, కొత్తగట్టు(శంకరపట్నం)లో 3.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ప్రభుత్వ విద్య బలోపేతానికి చర్యలు చేపట్టాలి
కరీంనగర్‌టౌన్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న విద్యా బస్‌యాత్రలో భాగంగా శుక్రవారం కరీంనగర్ ఫిల్మ్‌భవన్‌లో విద్యావంతులు, మేధావులు, సామాజిక కర్తలతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడారు. వేగంగా పెరుగుతున్న ప్రైవేట్ విద్య ఖర్చులను నియంత్రించాలన్నారు. ఒకట్రెండు ప్రతిష్టాత్మక పాఠశాల ప్రాజెక్టులు చేపట్టడం వల్ల పాఠశాల విద్య ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించలేమని, ప్రతీ చిన్నారికి నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చేలా చేయలేమన్నారు. మరో మాజీ అధికారి ఎం.చంపాలాల్ మాట్లాడుతూ, తెలంగాణలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సంక్షోభ రంగాలు విద్య, వైద్యం, సేద్యం అని అన్నారు. విద్యా కార్యకర్త డా.ధర్మేంద్ర నదిమెంట్ల మాట్లాడుతూ, ఉపాధ్యాయ సంఘాలు తమ హక్కులు, సంక్షేమం కోసం పోరాడుతూనే విద్యా వ్యవస్థలో సానుకూల మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక కార్యకర్త చంద్రప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన విలువైన భూములను పరిరక్షించాల్సిన ప్రాధాన్యతను వివరించారు. ముప్పూరి కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘం నాయకుడు సుంకసేన ప్రభాకర్‌రావు , కోర్ కమిటీ సభ్యులు నిఖిల్, విజయకృష్ణ, ప్రొఫెసర్ పద్మజా, ఎన్.రుబీనా తదితరులు పాల్గొన్నారు. -
స్వగ్రామానికి మతిస్థిమితం లేని వృద్ధురాలు
బోయినపల్లి(చొప్పదండి): మతి స్థితిమితం లేని ఓ వృద్ధురాలిని ఎస్సై ఎన్.రమాకాంత్ ఆ ధ్వర్యంలో పోలీసులు స్వగ్రామానికి ఆటోలో తరలించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండికి చెందిన వృద్ధురాలు కల్వకుంట్ల హేమలత మతిస్థిమితం కోల్పోయి బోయినపల్లి నుంచి దేశాయిపల్లి వెళ్లే రోడ్డుపై పడి ఉంది. ఏఎస్సై గంగరా జం, బ్లూకోల్ట్స్ సిబ్బంది లక్ష్మణ్, పర్శరామ్ గమనించి వివరాలు తెలుసుకున్నారు. ఏఎస్సై గంగరా జం గుండి గ్రామ సర్పంచ్‌తో ఫోన్లో మాట్లాడి ఆటోలో స్వగ్రామానికి పంపించారు. వృద్ధురాలి వెంట హోంగార్డ్ పర్శరామ్ను పంపినట్లు పేర్కొన్నారు. -
రైతులకు ఇబ్బంది కలగకుండా భూముల రీసర్వే
చిగురుమామిడి/సైదాపూర్: రైతులకు ఇబ్బంది కలగకుండా భూముల రీసర్వే చేపట్టాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. శుక్రవారం చిగురుమామిడి మండలం ఉల్లంపల్లిలో ఆర్డీవో షర్మిలతో కలిసి సర్వే వివరాలు తెలుసుకున్నారు. రైతులకు తప్పనిసరిగా సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని, హద్దుల వివరాల నమోదులో పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో రెండు బృందాలుగా రీసర్వే చేస్తున్నామని తహశీల్దార్ కనకయ్య కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఆయిల్‌పాం నర్సరీ ఏర్పాటుకు ఓదెల మల్లన్న గుట్టవద్ద స్థలాన్ని, గునుకులపల్లి నుంచి లంబాడిపల్లి ద్వారా చిగురుమామిడి మండల కేంద్రానికి నిర్మించే రోడ్డును పరిశీలించారు. సర్పంచ్‌లు అలువాల శంకర్, గునుకుల మధుసూదన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వభూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్లో ఎస్సారెస్పీ భూములను పరిశీలించారు. భూముల ప్రస్తుత పరిస్థితి, వినియోగం వివరాలను తహసీల్దార్ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. భూములకు సంబందించి సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. -
హోరాహోరీగా ఎస్జీఎఫ్ క్రీడలు
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎస్జీఎఫ్ క్రీడలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. శుక్రవారం అండర్– 17 బాలురకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. జిల్లాలోని 16 మండలాల నుంచి 500 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. విజేతలకు డీసీఈబీ చైర్మన్ భగవంతరావు, జిల్లా విద్యా శాఖ సెక్టోరియల్ అధికారి అశోక్‌రెడ్డి ట్రోఫీలు ప్రదానం చేశారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి బన్సిలాల్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, అంతటి శంకరయ్య, వేణుగోపాల్, పోతన శ్రీనివాస్, ఆర్.నరసయ్య, గిన్నె లక్ష్మణ్, వీరన్న, వంగపల్లి సూర్యప్రకాష్, బిట్ర శ్రీనివాస్, యూనిష్‌పాష, కొమురోజు కృష్ణ, చందా శ్రీనివాస్, ఎల్వీ రమణ, బాలసాని రాజకుమార్, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. కాగా, శనివారం అండర్– 14 బాలురకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు బన్సిలాల్ తెలిపారు. అండర్– 17 బాలుర విజేతలు అండర్– 17 బాలుర విభాగం ఖోఖోలో మానకొండూర్ మండలం ప్రథమ, చొప్పదండి మండలం ద్వితీయ, కబడ్డీలో చొప్పదండి మండలం ప్రథమ, తిమ్మాపూర్ మండలం ద్వితీయ, వాలీబాల్‌లో చొప్పదండి మండలం ప్రథమ, కరీంనగర్‌రూరల్ మండలం ద్వితీయ స్థానం సాధించాయి. -
కరీంనగర్
శనివారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20267మిడ్‌మానేరులో 22 టీఎంసీలు బోయినపల్లి: మిడ్‌మానేరులో నీటిమట్టం 22.308 టీఎంసీలకు చేరింది. మానేరు, మూలవాగు, వరదకాల్వ మీదుగా శుక్రవారం 100 క్యూసెక్కుల వరద వస్తోంది. మళ్లీ మంటలు..! ఎలక్ట్రిక్ బస్సులపై మంటల నీడ కమ్ముకుంటోంది. కరీంనగర్–2 డిపోలో శుక్రవారం మరో బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. వాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. -
అప్పు డబ్బుల కోసం టవరెక్కిన వ్యక్తి
గంగాధర: వ్యాపారం చేద్దామని డబ్బులు తీసుకొని సొంతానికి వాడుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వడం లేదని, తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన అర్కుటి కొమురయ్య శుక్రవారం సాయంత్రం సెల్ టవరెక్కాడు. బాధితుడు తెలిపిన వివరాలు.. కురిక్యాలకు చెందిన జాగిరపు శ్రీనివాస్‌రెడ్డి వ్యాపారం చేద్దామని కొమురయ్య వద్ద 2012లో రూ.24 లక్షలు తీసుకొని సొంతానికి వాడుకున్నాడు. డబ్బులు ఇవ్వాలని కొమురయ్య ఒత్తిడి చేయగా 2015లో ప్రామిసరీ నోటు రాసిచ్చాడు. 2016లో డబ్బులు చెల్లిస్తా ఇంటికి రమ్మని ప్రామిసరీ నోటు తీసుకున్నాడని కొమురయ్య ఆరోపించాడు. డబ్బులు అడిగితే శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతడి సోదరుడు నర్సింహారెడ్డి, తండ్రి నారాయణరెడ్డి బెదిరిస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. తనకేమైన జరిగితే రూ.24 లక్షలు బాకీ ఇచ్చిన డబ్బుతో పాటు, తన కుటుంబానికి నష్టపరిహారంగా రూ.కోటి ఇప్పించాలని నోట్ రాశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కిందకు దిగాలని కొమురయ్యను కోరగా, డబ్బు ఇచ్చే వరకు దిగనని అక్కడే ఉన్నాడు. అప్పు విషయమై పోలీసులు, శ్రీనివాస్‌రెడ్డిని ఫోన్లో ఆరా తీయగా, తాను డబ్బులు ఇచ్చేది లేదని, కొమురయ్య కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నాడని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెస్టివల్‌కు అల్ఫోర్స్ విద్యార్థులు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి సౌత్ సైన్స్ డ్రామా పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై టన్లు విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. స్థానిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన అభినందన సభలో విద్యార్థులు మాన్యశ్రీ, ఎన్.ఇషిత, ఈ.శ్రీకర్‌రెడ్డి, ఎం.ఆద్య, ఎం.ఆశానా, వై.శృతిజ్ఞ (7వ తరగతి), ఎన్.రేహాంశ్ సాయవి, సీహెచ్ రేహాన్ కార్తికేయను అభినందించారు. సైన్స్‌ను ప్రయోగాత్మకంగా, విశ్లేషణాత్మకంగా నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెరుగుతాయన్నారు. విద్యార్థులు సైన్స్‌పై పట్టు సాధించి పోటీ పరీక్షలు, వివిధ పోటీల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కరీంనగర్‌లోని సైన్స్ టాలెంట్ మ్యూజియంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు త్వరలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని, అక్కడా విజయం సాధించి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. -
మహిళ మృతదేహం గుర్తింపు
కరీంనగర్‌రూరల్: బొమ్మకల్ పరిధి కృష్ణానగర్‌కాలనీలో గురువారం కాలిపోయిన స్థితిలో లభించిన గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని కాపువాడకు చెందిన శ్రీరాముల కవిత(47)గా కుటుంబసభ్యులు గుర్తించినట్లు కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. రిటైర్డు డెప్యూటీ తహసీల్దార్ శ్రీరాముల రాంచంద్రం కుమార్తె కవితకు 1998లో దేవాదాశాఖ ఉద్యోగి రమేశ్‌తో వివాహం జరిగింది. 2014లో భర్త మృతిచెందడంతో మంకమ్మతోటలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అటెండర్‌గా పనిచేస్తోంది. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న కవిత గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరి కల్యాణి గార్డెన్ సమీపంలోని చెట్ల పొదల్లో ఒంటిపై పెట్రోల్ లేదా మండే పదార్థాన్ని ఉపయోగించి నిప్పంటించుకుంది. శుక్రవారం పత్రికల్లో వచ్చిన వార్త, ఫొటోలను కుటుంబసభ్యులు చదివి ఆస్పత్రిలోని మృతదేహం పరిశీలించి గుర్తించారు.తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రూ.1.38 కోట్ల పాతనోట్ల పట్టివేత
● 8 మంది నిందితుల అరెస్ట్కాజీపేట: కేంద్ర ప్రభుత్వం సుమారు పదేళ్ల క్రితం రద్దు చేసిన రూ.1.38 కోట్ల విలువ చేసే పాత కరెన్సీని రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాజీపేట చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలోని వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో సోదా చేశారు. దీంతో 2016లో ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాహనంలో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముల్లా అబ్బాస్ (47), మంచిర్యాల జిల్లా హాజీపూర్ ప్రాంతానికి చెందిన బాసవేని మల్లేశ్, కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన తంగళ్ల కృష్ణమోహన్, సిద్దిపేటకు చెందిన కుక్కల సంపత్, హనుమకొండకు చెందిన రైనాకుల శ్రీధర్, పల్లపు రాజు, వరంగల్ కరీమాబాద్‌కు చెందిన మహంకాళి శ్యాంసుందర్, నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన మాంకాల గణేశ్‌ను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి నోట్ల సరఫరాకు సహకరించినట్లు చెప్పారు. ఆ వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉండగా, పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ శ్యాంసుందర్, ఎస్సైలు మౌనిక, శివ, తాళ్లపల్లి యాదగిరి, శ్రీనివాస్, సిబ్బంది సునీత, అశోక్‌కుమార్, శ్రీధర్, క్రాంతికుమార్, కుమారస్వామి, విష్ణు, వినయ్ పాల్గొన్నారు. -
కట్టిపడేస్తున్న కళా సిల్క్
కరీంనగర్: చేనేత వస్త్రాల అందం.. హస్తకళల ప్ర త్యేకతను నగరవాసులకు చేరువ చేసేందుకు కరీంనగర్లో కళాసిల్క్ సంస్థ ఆధ్వర్యంలో చేనేత వస్త్ర మేళా ఏర్పాటు చేశారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో ని శ్రీరాజరాజేశ్వర కల్యాణమండపంలో నిర్వహిస్తు న్న ఈ ప్రదర్శన, అమ్మకాల మేళా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణకు చెందిన గ ద్వాల్, నారాయణపేట, పోచంపల్లి చేనేత వస్త్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అస్సాం మూగా, ఎరి సిల్క్, బి హార్ భాగల్పూర్ సిల్క్, టస్సర్, ఛత్తీస్‌గఢ్ కోసా సి ల్క్, గుజరాత్ బాంధనీ, కచ్ ఎంబ్రాయిడరీ, జ మ్మూకశ్మీర్ ఎంబ్రాయిడరీ, పశ్మీనా శాల్స్, కర్ణాటక ప్రింటెడ్ శారీస్, మధ్యప్రదేశ్ చందేరి, మహేశ్వరి, రాజస్తాన్ కోటా, బంధానీ, బ్లాక్, సంగనేరి ప్రింట్ల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌కు చెందిన బనారస్, లక్నో డ్రెస్ మెటీరియ ల్స్ హ్యాండ్లూమ్స్ విక్రయిస్తున్నా రు. నగరవాసులు మేళాను సందర్శించి చేనేత, హస్తకళా ఉత్పత్తులను ఆదరించాలని నిర్వాహకులు కోరారు. -
పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు
● ఎస్పీ మహేశ్ బీ గీతేఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన(పోక్సో) కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. రూ.వెయ్యి జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మైనర్ బాలికను మధ్యప్రదేశ్‌కు చెందిన చతుర్‌సింగ్ మున్నా అనే వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో ఎల్లారెడ్డిపేట అప్పటి సీఐ బన్సిలాల్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అప్పటి డీఎస్పీ చంద్రశేఖర్ దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు కానిస్టేబుళ్లు 19 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఝాన్సీ వాదించారు. నేరం రుజువు కావడంతో నిందితుడు చతుర్‌సింగ్ మున్నాకు 20 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించారు. -
ఉన్నదంతా ఊడ్చేశారు
● అడవిసోమన్‌పల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ ● తోబుట్టువు దాచిన నెక్లెస్.. చిన్నారుల కానుకలు అపహరణ ● నాలుగున్నర తులాల బంగారం.. 31తులాల వెండి ● రూ.47వేల నగదును ఎత్తుకెళ్లిన దుండగులు మంథనిరూరల్: తాళం వేసిఉన్న ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు ఉన్నదంతా ఊడ్చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లిలో కలకలం రేపింది. అడవిసోమన్‌పల్లి గ్రామానికి చెందిన పంగ శ్రీకాంత్ ఇంట్లో గురువారం రాత్రి జరిగిన చోరీలో దాచుకున్న నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, 31 తులాల వెండి, రూ.47వేల నగదు అపహరించారు. బాధితుల కథనం ప్రకారం.. పంగ శ్రీకాంత్ మంథనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. పది రోజులుగా నైట్‌డ్యూటీ చేస్తున్నాడు, గురువారం యథావిధిగా నైట్ డ్యూటీకి వెళ్లగా అతని భార్య స్వప్న ఇంటికి తాళం వేసి సమీపంలోని తల్లిగారింట్లో పిల్లలతోకలిసి నిద్రించేందుకు వెళ్లింది. శుక్రవారం తెల్లవారుజామున శ్రీకాంత్ తల్లి దుర్గమ్మ అటువైపుగా వెళ్లగా ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి లోనికి వెళ్లింది. బీరువా తెరిచి ఉండి సామాన్లు చిందరవందరగా పడి ఉండటంతో దొంగలు పడినట్లు గుర్తించి కోడలు స్వప్నకు చెప్పింది. వారువచ్చి గమనించగా బంగారు ఆభరణాలు, వెండి, నగదు కన్పించలేదు. ఈమేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవలే కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకలు శ్రీకాంత్ – స్వప్న దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇటీవలనే కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు వచ్చిన బంగారు, వెండి కానుకలను బీరువాలో దాచిపెట్టగా వాటిని దొంగలు ఎత్తుకు పోయినట్లు వారు బోరున విలపించారు. తోబుట్టువు బంగారు నెక్లెస్ కూడా.. పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన శ్రీకాంత్ తోబుట్టువు తన ఆడబిడ్డకు నెక్లెస్ ఇచ్చి మెడలో వేసుకోమంది. ఆ తర్వాత ఆ నెక్లెస్‌ను ఇక్కడే దాచి పెట్టమని చెప్పింది. అంతేకాకుండా శ్రీకాంత్ నూతనంగా ఇంటి నిర్మాణం చేసుకుంటుండగా డబ్బులు లేక అర్థాంతరంగా ఆగిపోవడంతో సోదరి విషయం తెలుసుకుని పనులు పూర్తి చేసుకోమని రూ.50వేలు ఇచ్చి వెళ్లింది. బీరువాలో దాచిపెట్టిన తోబుట్టువు నెక్లెస్‌తోపాటు ఆమె ఇచ్చిన రూ.50వేలలో మిగిలిన ఉన్న రూ.47వేలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీంలతో.. సమాచారం అందుకున్న మంథని సీఐ స్వామి, ఎస్ఐ సందీప్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరించారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. -
ట్రేడ్‌లైసెన్స్ లేదని వైన్స్‌కు నోటీస్‌లు
బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో శ్రీరామ వైన్‌షాపు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి పాశం అనిల్ శుక్రవారం నోటీస్ జారీ చేశారు. అలాగే పర్మిట్ రూమ్‌కూ ట్రేడ్‌లైసెన్స్ లేదని నోటీసులో పేర్కొన్నారు. వైన్‌షాపు నిర్వహణకు ట్రేడ్‌లైసెన్స్ తీసుకోవాలని గత ఏప్రిల్ 24న నోటీస్ జారీచేసినా నిర్వాహకులు స్పందించలేదన్నారు. ఇదే చివరి నోటీస్‌గా పేర్కొంటూ ఒక్క రోజులో అవసరమైన పత్రాలు చూపించి జీపీలో ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు నోటీస్‌లో హెచ్చరించారు. విషజ్వరంతో బాలుడు మృతివెల్గటూర్(ధర్మపురి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలకేంద్రానికి చెందిన మంతెన యశ్వంత్ (8) విషజ్వరంతో మృతిచెందాడు. బాలుడికి మూడురోజులుగా తీవ్ర జ్వరం రావడంతో కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రిలో తల్లిదండ్రులు చికిత్స చేయించారు. శుక్రవారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. బాలుడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. హత్య కేసులో నిందితుడి అరెస్ట్జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెరకాలనీకి చెందిన సూర వెంకటేశ్ (22)ను గురువారం సాయంత్రం హత్య చేసిన అతని తండ్రి సూర రాజయ్య అలియాస్ రెడ్డిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. హత్యకు గురైన వెంకటేశ్ జులాయ్‌గా తిరుగుతూ నిత్యం మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను తీవ్రంగా వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడటంతో మనస్తాపానికి గురైన తండ్రి రాజయ్య గొడ్డలితో తలపై కొట్టడంతో వెంకటేశ్ అక్కడకిక్కడే మృతిచెందాడన్నారు. నేటినుంచి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైలు రామగుండం: ప్రయాగ్‌రాజ్(ఉత్తరప్రదేశ్)–తిరునల్వేలీ(తమిళనాడు) మధ్య నార్త్ సెంట్రల్ రైల్వే (ఉత్తర మధ్య రైల్వే జోన్)కు చెందిన ప్రత్యేక రైలును ఈనెల 19వ తేదీ నుంచి ప్రతీ శనివారం నెలరోజుల పాటు (నాలుగు ట్రిప్పులు) నడిపించనున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రయాగ్‌రాజ్–తిరునల్వేలి(04171) మధ్య నడిచే ప్రత్యేక రైలు ప్రయాగ్‌రాజ్‌లో ఉదయం 10.20గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.22గంటలకు రామగుండం చేరుకుంటుంది. తిరునల్వేలి–ప్రయాగ్‌రాజ్(04172) మధ్య నడిచే రైలు తిరునల్వేలిలో సోమవారం రాత్రి 11.30గంటలకు బయలుదేరి బుధవారం వేకువజాము 12.48గంటలకు రామగుండం చేరుకుంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో కేవలం రామగుండంలోనే హాల్టింగ్ కల్పించారు. అక్టోబర్ 10వ తేదీ వరకు మాత్రమే రాకపోకలు సాగించనుంది. ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకొని 21 బోగీలను ఏర్పాటు చేయడంపై ప్రయాణికుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మల్కపేటలో ఒకరికి డెంగీ?కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేటలో ఒకరికి డెంగీ నిర్ధారణ అయినట్లు సమాచారం. గ్రామానికి చెందిన శివ(14) డెంగీ లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం. జ్వరంతో బాధపడుతున్న బాలుడిని చికిత్స కోసం సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా గ్రామంలో గత వారం రోజుల క్రితమే డెంగీ కేసు నమోదైంది. -
ఎస్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
● జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్జ్యోతినగర్: ఎస్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. గురువారం ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు కార్యకలాపాలు, ఉద్యోగుల పని పరిస్థితులు, సంస్థలో అమలవుతున్న వివిధ సంక్షేమ చర్యలను తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. షెడ్యూల్డ్ తెగల ఉద్యోగుల సంక్షేమం, రిజర్వేషన్ విధానం అమలు, సమాన అవకాశాలు, శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు, ఫిర్యాదుల పరిష్కారంపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించిందని అన్నారు. ఉద్యోగులతో ముఖాముఖి ఎస్టీ ఉద్యోగులు, ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలు, సమస్యలను తెలుసుకున్నారు. ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడంతోపాటు, వారి అభివృద్ధి, సాధికారతకు ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని ఆయన సూచించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై చర్చ ఎన్టీపీసీ సంస్థ చేపడుతున్న సీఎస్సార్ కార్యక్రమాలను కమిషన్ ప్రతినిధి బృందం పరిశీలించింది. గిరిజనులు, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోని ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను యాజమాన్యం కమిషన్‌కు వివరించింది. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి వెంట డైరెక్టర్ డాక్టర్ పి.కళ్యాణ్‌రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. -
యువతి ఆత్మహత్యపై విచారణ వేగవంతం
● సింగరేణి అధికారుల నిర్లక్ష్యంపై దృష్టి ● రంగంలోకి దిగిన ఏసీపీగోదావరిఖని: ప్రేమ పేరుతో వేధింపులకు గురైన యువతి తాండ్ర అక్షితరాణి ఆత్మహత్య సంఘట నపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. లాంగ్‌లీవ్‌లో వెళ్లి వచ్చి బాధ్యతలు స్వీకరించిన గోదావరిఖని ఏసీపీ రమేశ్ గురువారం అమ్మాయి బంధువులను తన కార్యాలయానికి పిలిచి కేసులో పూర్వపరాలను తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈకేసులో పాలిటెక్నిక్ కళా శాల లెక్చరల్ జెట్టి నవీన్ పాత్ర, జీడీకే–2వ గని ఓవర్‌మెన్ అనిల్‌కుమార్ ఏమి చేశాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. జనవరిలో జీడీకే–2వ గనిలో 15రోజుల పాటు శిక్షణకు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న ఓవర్‌మెన్ రవికుమార్ తనపై అత్యాచారం చేశాడని పేర్కొంటూ ఆర్జీవన్ సింగరేణి అధికారులకు అక్షితరాణి చేసిన ఫిర్యాదుపై ఆర్జీవన్ యాజమాన్యం కమిటీ వేసి పూర్వపరాలు పరిశీలించింది. కమిటి అన్ని విషయాలు పరిశీలించిన తర్వా త జరిగిన అన్యాయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవాలని లిఖిత పూర్వకంగా సూచించినట్లు యువతికి యాజమాన్యం పేర్కొంటోంది. మళ్లీ ఈఅంశం సెప్టెంబర్‌లో తెరపైకి వచ్చింది. బొమ్మకంటి రవికుమార్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాననే సూసైడ్ లేఖ సెల్ఫోన్లో ఫొటో లభించడంతో ఆ కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. సెల్ఫోన్లో ఫొటో కాకుండా అసలు కాపీ ఎక్కడుందని పోలీసులు ఆరా తీస్తున్నారు. లభించిన సాఫ్ట్ కాపీని కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపించి నిజాలు తేల్చే పనిలో పోలీసులున్నారు. సూ సైడ్ నోట్ ఎప్పుడు రాసింది? ఎప్పుడు బయటకు వచ్చింది? అనే విషయాలపై దృష్టిసారించారు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యంపై దృష్టి బాధిత యువతి ఫిర్యాదు చేసినా సింగరేణి అధికారులు ఎందుకు చర్య తీసుకోలేదని, దీనిపై సింగరేణి అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
ట్రావెల్ బస్సు ఢీకొని ఒకరి మృతి
సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబాద్ బస్టాండ్ వద్ద గురువారం ట్రావెల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మెర్రి శంకర్ (50) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై చంద్రకుమార్ వివరాల ప్రకారం.. మానకొండూర్ మండలం ఊటూరుకు చెందిన మెర్రి శంకర్ కూతురు స్రవంతి అత్తగారి ఇళ్లయిన శ్రీరాంపూర్ నుంచి సుల్తానాబాద్‌కు వస్తుండటంతో తీసుకరావడానికి ద్విచక్రవాహనంపై సుల్తానాబాద్ బస్టాండ్‌కు వచ్చాడు. కూతురు వచ్చేసరికి ఆలస్యం అవుతుండటంతో బస్టాండ్ వైపు నుంచి కూడివైపునకు మృతుడు దాటుతుండగా పెద్దపల్లి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ట్రావెల్ బస్సు ఢీకొంది. తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
చెక్ పంచాయితీ!
కరీంనగర్‌టౌన్: గ్రామపంచాయతీల్లో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించింది. ఇదంతా బాగానే ఉన్న క్షేత్రస్థాయిలో మాత్రం సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మధ్య జాయింట్ చెక్ పవర్ విభేదాలకు కారణమవుతుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలు, నేరుగా పంచాయతీలకు నిధుల మంజూరు, ప్రతీ పంచాయతీకి కార్యదర్శి నియామకం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కావడంతో ఇద్దరి సమ్మతి లేనిదే నిధులు డ్రా చేసేందుకు వీలు లేకుండాపోయింది. దీంతో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కరించుకుంటుండగా, కొన్ని గ్రామాల్లో నిధుల వినియోగంపై సమన్వయం లేక అధికారుల వద్దకు పంచాయితీలు వస్తున్నాయి. ఎన్నికలు జరిగి 9 నెలలు అవుతున్నా గ్రామస్థాయి రాజకీయాలు చల్లారడం లేదు. మాట వినని సర్పంచ్‌లను తమదారికి తెచ్చుకునేందుకు కొందరు ఉపసర్పంచ్లు చెక్‌లపై సంతకాలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 318 గ్రామపంచాయతీలకు గాను 50 శాతానికి పైగా గ్రామాల్లో వివాదాలే కనిపిస్తున్నాయి. అయితే వాటాల పంపకంలో తేడాలు రావడంతోనే చెక్‌పవర్ సమస్యలు తలెత్తుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కువ మంది సర్పంచ్, ఉపసర్పంచ్లు నిరక్షరాస్యులు కావడంతోనే నూతన పంచాయతీరాజ్ చట్టం, విధులు, బాధ్యతలపై అవగాహన కరువైనట్లు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీరాజ్ అధికారులు చట్టాలపై అవగాహన కల్పిస్తే కొంత మేరకై నా వివాదాలు సద్దుమనిగే అవకాశం ఉంటుంది. చెక్ పవర్లో మార్పులకు యోచన! గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై ఉమ్మడి చెక్ పవర్ నిబంధనల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరూ సంతకాలు చేస్తేనే చెక్కులు చెల్లుబాటవుతున్నాయి. సమన్వయం లేక పలు గ్రామాల్లో చాలా చెక్కులు నిలిచిపోయి అభివృద్ధి పనులు, సిబ్బంది జీతాల చెల్లింపులకు ఆటంకం ఏర్పడుతోంది. కొత్త నిబంధనల ప్రకారం ఉపసర్పంచ్ వారంలోగా చెక్కుపై సంతకం చేయాల్సి ఉంటుంది. నిరాకరిస్తే కారణాన్ని కలెక్టర్‌కు తెలియజేయాలి. నిర్ణీత సమయంలో సంతకం చేయకుంటే కలెక్టర్ అనుమతితో పంచాయతీ కార్యదర్శి సంతకంతో చెక్కు ఆమోదించే అవకాశం ఉంటుంది. పదేపదే నిరాకరిస్తే చెక్ పవర్ శాశ్వత రద్దుకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు నిబంధనలు రానున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. పోటాపోటీగా ఫిర్యాదులు గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్లు రెండువర్గాలుగా విడిపోయి పోటీపోటీగా అధికారులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో పోటాపోటీగా ఫిర్యాదు చేస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే గ్రామస్థాయి నాయకులకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో పార్టీలవారీగా విడిపోతు న్న సర్పంచ్, ఉపసర్పంచ్లు ఎవరిదారి వారిదే అ న్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు, అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వస్తుండగా, మరికొన్ని గ్రామాల్లో సర్పంచ్ల ఒంటెద్దు పోకడలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులంతా ఓ వర్గంగా ఏర్పడి సర్పంచ్‌లపై ఎదురుదాడికి దిగుతున్నారు. దీనికి తోడు గ్రామ వీడీసీల తీర్మానాలు వివాదాలకు దారితీస్తున్నాయి. చిన్నచిన్న సమస్యలు పంచాయతీల్లోనే పరిష్కరించుకునే అవకాశం ఉన్నా పంతం నెగ్గించుకునేందుకు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. నేతల అండదండలతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ కక్షపూరిత వాతావరణానికి దారి తీస్తున్నారు. అభివృద్ధికి అడ్డంకులు మునుపెన్నడూ లేని విధంగా ఈసారి గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను మంజూరు చేస్తున్నాయి. ఆ నిధులను సర్పంచ్, ఉపసర్పంచ్ సమ్మతితోనే అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాగా, వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో గ్రామప్రగతి గాడితప్పే అవకాశముంది. సకాలంలో నిధులు ఖర్చు చేయక అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. దీనికి తోడు అధికారుల ఒత్తిడి పెరిగిపోయి సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. ఎన్నికల్లో హామీలిచ్చి అభివృద్ధి పనులు చేయకుంటే ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. -
ఆటల వేదికపై అదరహో..
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం గురువారం సరికొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. జిల్లా పాఠశాలల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–14 బాలికల కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. గెలుపే లక్ష్యంగా మైదానంలోకి దిగిన బాలికలు ముందస్తుగా ఎక్సర్సైజ్లు చేస్తూ మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే పీఈటీలు, పీడీలు క్రీడాకారిణులకు విలువైన సూచనలిస్తూ.. వ్యూహాలను వివరిస్తూ కనిపించారు. కబడ్డీ కోర్టులో ప్రత్యర్థి జట్టు రైడర్‌ను బోల్తా కొట్టిస్తూ మన బాలికలు చేసిన టాకిల్స్ ప్రేక్షకులను అబ్బురపరిచి వారెవ్వా అనిపించాయి. మ్యాచ్ ఆడేటప్పుడు ఎలాంటి ఆభరణాలు పెట్టుకోకూడదని అంపైర్లు స్పష్టం చేయడంతో.. ఒక క్రీడాకారిణి కాలి పట్టీలను తోటి క్రీడాకారిణి సహాయంతో తీసి క్రీడా నిబంధనలను గౌరవించింది. అటు వాలీబాల్ కోర్టులో బంతిని ప్రత్యర్థి కోర్టులోకి పంపేందుకు బాలికలు అద్భుతమైన టెన్నిస్ సర్వీస్‌లతో పాయింట్ల వర్షం కురిపించారు. భానుడి ప్రతాపానికి మైదానం వేడెక్కినా బాలికల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. -
నాగ్‌పూర్ టు కరీంనగర్
● 2 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్ కరీంనగర్‌క్రైం: నాగ్‌పూర్ నుంచి గంజాయి కొనుగోలు చేసి కరీంనగర్లో విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని కరీంనగర్ త్రీ టౌన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. త్రీ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ హౌసింగ్‌బోర్డుకాలనీ వరాహస్వామి ఆలయ సమీపంలో గురువారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న హౌసింగ్‌బోర్డుకాలనీకి చెందిన సయ్యద్ ముబీన్, అజ్మత్‌పురకు చెందిన మొహమ్మద్ యూనస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా సుమారు 2 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్లు లభించాయి. కొంత మొత్తాన్ని తమ అవసరాలకు వినియోగించడంతో పాటు, మిగిలిన గంజాయిని కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీశ్, త్రీటౌన్ ఇన్స్పెక్టర్ తిరుమల్, ఎస్సై చేరాలు, శ్రీకాంత్, సురేందర్, సిబ్బందిని సీపీ గౌస్ ఆలం అభినందించారు. -
శాతవాహనలో ప్రజాపాలన దినోత్సవం
కరీంనగర్‌సిటీ: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్శిటీలో వీసీ ఉమేశ్‌కుమార్, రిజిస్ట్రార్ పి.సతీశ్‌కుమార్‌తో కలిసి జాతీయజెండా ఆవిష్కరించారు. అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ కె.పద్మావతి, డా.ఎన్వీ శ్రీరంగప్రసాద్, డా.ఎస్.రమాకాంత్, సీఓఈ డా.డి.సురేశ్‌కుమార్ పాల్గొన్నారు. మహిళా డిగ్రీ కళాశాలలో.. కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.అఫ్సరీ ఉస్మానీ జాతీయ జెండా ఆవిష్కరించారు. పరీక్షల నియంత్రణాధికారి డా.జి.శ్రీనివాస్‌రెడ్డి, ప్రజాపాలన సమన్వయకర్త పి.స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మ చీరలెక్కడ?
మొత్తం బతుకమ్మ చీరలు 1,18,576 స్వయం సహాయక సంఘాలు: 5,411 సభ్యులు: 55,129 బతుకమ్మ చీరల పంపిణీ: 28 వేలు పెండింగ్‌లో ఉన్న సభ్యులు: 27,129 (18 ఏళ్లు నిండి తెల్లరేషన్‌కార్డు ఉన్న మహిళలు, యువతులు: 6,955 ఇంకా ఇవ్వాల్సిన చీరలు : 83,621?)కరీంనగర్‌కార్పొరేషన్: పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా మారింది నగరపాలకసంస్థ అధికారుల తీరు. మళ్లీ బతుకమ్మ పండుగ వస్తున్నా, గతేడాది బతుకమ్మ చీరలు ఇప్పటికీ పంపిణీ చేయలేని దురావస్థలో బల్దియా ఉంది. లక్షా 18 వేల చీరలు నగరానికి వస్తే, ఇప్పటివరకు కేవలం 34 వేల చీరలు మాత్రమే పంపిణీ చేశారు. ఆ తర్వాత చీరల ఊసే మరిచిపోయారు. అసలు మిగిలిన 84 వేల చీరలు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. మే నెలలో పంపిణీ తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ బతుకమ్మకు ప్రభుత్వం చీరలు అందిస్తుండడం తెలిసిందే. గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని, ఈ ప్రభుత్వం కూడా కొనసాగించింది. గతేడాది (2025) బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసినా, స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకే ముందుగా ఇస్తామని ప్రకటించింది. తర్వాత 18 ఏళ్లు నిండిన తెల్లరేషన్‌కార్డు ఉన్న యువతులు, మహిళలకు అందజేయాలని నిర్ణయించింది. గ్రామాల్లో ముందుగానే చీరలు పంపిణీ చేసినా, నగరపాలకసంస్థ పరిధిలో మాత్రం ఈ ఏడాది మే నెలలో చీరలు పంపిణీ చేశారు. నగరానికి లక్షా 18 వేల చీరలు ప్రతిసారి బతుకమ్మ పండుగకు ముందు చీరలు పంపిణీ చేయడం ఆనవాయితీ అయినా గతేడాది బతుకమ్మ చీరలు మాత్రం బతుకమ్మ పండుగ తర్వాత పంపిణీకి నోచుకున్నాయి. నగరపాలకసంస్థకు 1,18,576 చీరలు వచ్చాయి. స్వశక్తి మహిళా సంఘాల సభ్యులతో పాటు, అర్హులైన 18 ఏళ్లు నిండినవారికి పంపిణీ చేశారు. అయితే నగరంలో మొత్తం స్వశక్తి సంఘాల మహిళలు 55,129 మంది ఉండగా, కేవలం 28 వేల మందికి మాత్రమే చీరలు పంపిణీ చేశారు. మిగతా 27,129 మందికి ఇప్పటివరకు చీరలు అందలేదు. ఇక స్వశక్తి మహిళలు కాకుండా కేవలం 6,955 మందికి మాత్రమే చీరలు అందించారు. మొత్తంగా చూస్తే 34,955 చీరలు పంపిణి చేయగా, 83,621? చీరలు పంచాల్సి ఉంది. మిగిలిన 83,621 చీరలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. మరో నెల రోజుల్లో మళ్లీ బతుకమ్మ పండుగ వస్తున్నా, గతేడాది బతుకమ్మ చీరల పంపిణీ ఇప్పటికీ నోచుకోకపోవడం అధికారుల పనితీరును తెలియజేస్తోంది.బతుకమ్మ చీరలు నగరంలో దాదాపు 70 వేలు పంపిణీ చేశాం. ఇంకా చీరలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే 70 వేల చీరలు ఇచ్చినా, ఆన్లైన్లో చూపించడం లేదు. లబ్ధిదారుల ఆధారాలు తీసుకునే సమయంలో సాంకేతికంగా ఇబ్బంది ఎదురవుతోంది. అందుకే చీరలు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతోంది. – మానస, టీఎంసీ, నగరపాలకసంస్థ -
కన్నవాడే కడతేర్చాడు
● వేధింపులు భరించలేక కొడుకును హత్య చేసిన తండ్రి ● జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెరకాలనీలో విషాదంజగిత్యాలక్రైం: కని.. పెంచిన తల్లిదండ్రులను పెళ్లీడుకొచ్చిన కొడుకు నిత్యం వేధింపులకు గురిచేయడంతో భరించలేక కన్న తండ్రే తన కొడుకును కడతేర్చిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెరకాలనీలో చోటుచేసుకుంది. ఒడ్డెరకాలనీకి చెందిన సూర రాజయ్య, చిలుకమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సూర వెంకటేశ్ (22) చదువు మానేసి జులాయిగా తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇటీవల అతిగా మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వాలని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం కూడా తండ్రిని వేధించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజయ్య గొడ్డలితో కొడుకు తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్‌ను అంబులెన్స్‌లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రూరల్ సీఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వేధింపులు భరించలేకే కొడుకును హత్య చేయడంతో విషాదం చోటుచేసుకుంది. -
పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
అవమానంతో వ్యక్తి ఆత్మహత్యకరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన బిజిలి రాజయ్య(45) అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాలు.. రాజయ్య రెండేళ్లక్రితం కుమార్తె వివాహం కోసం గర్రెపల్లికి చెందిన బిజిలి మల్లయ్య వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. చెల్లించడంలో ఆలస్యం కావడంతో రెండురోజులక్రితం పందులను తీసుకెళ్లాడు. పందులకు రూ.35వేల ధర నిర్ణయించి మిగిలిన రూ.65వేలు నాలుగు నెలల్లో చెల్లించాలని కుల పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందం చేసుకున్నప్పటికీ, వాయిదా ప్రకారం డబ్బులివ్వకుంటే ఇంటికి తాళం వేస్తానని మల్లయ్య బెదిరించడంతో రాజయ్య మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రమా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వివాహిత అదృశ్యం.. కేసు నమోదురామడుగు: దత్తోజీపల్లి గ్రామానికి చెందిన తోట్ల మమత(30) అనే వివాహిత అదృశ్యమైంది. మమత బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త నరేశ్ గురువారం రామడుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. గంజాయి రవాణా కేసులో నిందితుడికి మూడేళ్ల జైలుగోదావరిఖనిటౌన్: గంజాయి రవాణా, విక్రయానికి పాల్పడిన ఫైవింక్లయిన్‌కు చెందిన నిందితుడు షేక్ కాజా గౌసుద్దీన్‌కు మూడేళ్ల కఠిన కారాగా శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి కె.సునీత గురువారం తీర్పు వెలువరించారు. 2021లో గోదావరిఖని ఫైవింక్లయిన్ చౌరస్తా వద్ద వన్‌టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా కొత్తగూడెం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2,900 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని అప్పటి వన్‌టౌన్ సీఐ రమేశ్‌బాబు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఏ1 నిందితుడు చనిపోవడంతో ఏ2 నిందితుడు షేక్ కాజా గౌసుద్దీన్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో జిల్లా న్యాయమూర్తి నిందితునికి మూడేళ్ల ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమాన విధించారు. -
గుర్తుతెలియని మహిళ మృతదేహం
కరీంనగర్‌రూరల్: బొమ్మకల్‌లోని కృష్ణానగర్‌కాలనీలో గురువారం అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. సుమారు 30 నుంచి 40 ఏళ్ల వయస్సు గల మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా ఉన్నట్లు వివరించారు. మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేతభీమదేవరపల్లి : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల శివారు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం భీమదేవరపల్లి శివారులో వాహనాల తనిఖీలో భాగంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల డ్రైవర్లను అనుమతి పత్రాలు చూపించాలని కోరామని, వారి వద్ద అనుమతి పత్రాలు లేని కారణంగా మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సిరిసిల్లటౌన్/తిమ్మాపూర్: వినాయక చవితి పండుగకు ఇంటికి వచ్చి.. తిరిగి హాస్టల్‌కు వెళ్లిన విద్యార్థిని కరీంనగర్లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన సిరిసిల్లలో విషాదం నింపింది. జిల్లా కేంద్రంలోని శివనగర్‌కు చెందిన కొడుముంజ మహేందర్ వెల్డింగ్‌షాప్ నిర్వహిస్తూ.. భార్య గాయత్రి, ముగ్గురు కుమార్తెలతో జీవిస్తున్నారు. పెద్దకూతురు మధుశ్రీ హైదరాబాద్‌లో బీటెక్ చదువుతుండగా, చిన్న కూతురు శ్రీనిధి సిరిసిల్లలో తొమ్మిదో తరగతి, రెండో కూతురు శ్రీవిద్య కరీంనగర్లో ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ డిప్లోమా చదువుతోంది. వారం క్రితం సెలవులు ఉండడంతో వినాయక చవితికి ఇంటికొచ్చి మంగళవారం తిరిగి హాస్టల్‌కు వెళ్లింది. బుధవారం రాత్రి హాస్టల్ నుంచి స్నేహితులతో కలిసి బయటకు వచ్చి.. తిరిగి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో సిరిసిల్లకు చెందిన శ్రీవిద్య మృతిచెందగా, మరో విద్యార్థిని భావన గాయపడింది. హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే.. హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తన కూతురు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని మృతురాలు శ్రీవిద్య తండ్రి మహేందర్ ఆరోపిస్తున్నారు. కాలేజీకి సమీపంలోని ఎస్.ఆర్.రెడ్డి హాస్టల్లో ఉంటున్న తన కూతురు ఈనెల 16న ఆరోగ్యం సరిగా లేనందున కళాశాలకు వెళ్లలేదన్నారు. భావన తన కూతురిని బయటకు తీసుకెళ్లిందని, హాస్టల్లో ఉండే శ్రీలోహిత, శివప్రసన్న కూడా ఉన్నారన్నారు. -
చిన్నచూపు సరికాదు
మెజార్టీ గ్రామాల్లో ఉప సర్పంచులను సర్పంచులు చులకనగా చూస్తున్నారు. చెక్ పవర్ విషయంలో యథాస్థితి కొనసాగించాలి. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉపసర్పంచ్‌లకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వాలి. – దుస్స కుమార్, ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి గ్రామాల్లో అభివృద్ధికి సర్పంచ్, ఉపసర్పంచ్లు సహకరించాలి. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలి. చెక్కులపై సంతకాలు చేయని ఉపసర్పంచ్‌లపై ఫిర్యాదులు చేస్తే పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో పనులు వేగవంతమయ్యేలా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలి. – జగదీశ్వర్, డీపీవో -
మృతదేహం గుర్తింపు
రామగుండం: రైల్వేస్టేషన్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట డ్రైనేజీలో రైల్వే పోలీసులు గుర్తించిన మృతదేహం రైల్వేస్టేషన్ ఏరియా శివాజీనగర్ కాలనీకి చెందిన గుంజపడుగు శ్యాం(35)గా గుర్తించినట్లు జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్చార్జి గంగారపు తిరుపతి తెలిపారు. మృతదేహానికి గురువారం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించామని, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మూడేళ్లలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి శివాజీనగర్‌లో నివాసముండే గుంజపడుగు నారాయణ–రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు శంకర్, శ్యాం. నారాయణ కుటుంబపోషణ నిమిత్తం సింగరేణి కాంట్రాక్టర్ వద్ద క్రేన్ ఆపరేటర్‌గా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తుంటాడు. ఈనేపథ్యంలో పెద్ద కుమారుడు శంకర్ స్థానికంగా సెలూన్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండగా 2023 సెప్టెంబర్‌లో రాజీవ్ రహదారిపై నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడికి భార్య అనూష, రవితేజ, విశ్వతేజ కుమారులున్నారు. ఆ తర్వాత ఏడాదిన్నర వ్యవధిలోనే 2025 జనవరిలో నారాయణ భార్య రాజేశ్వరి క్యాన్సర్‌తో కన్నుమూసింది. చిన్న కుమారుడు శ్యాం(35) నాలుగు రోజుల క్రితం తన బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో భాగ్యనగర్ రైలు ఎక్కి రామగుండం వస్తున్న క్రమంలో రైల్వేస్టేషన్ దాటిపోయిన తర్వాత రైలు నుంచి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్ పక్కనున్న డ్రైనేజీలో పడి మృతిచెందగా మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మూడేళ్ల వ్యవధిలో తన కళ్ల ముందే ఇద్దరు కుమారులు, భార్య ఏకంగా ముగ్గురు కుటుంబసభ్యులను కోల్పోవడంతో గుంజపడుగు నారాయణ ఒంటరి వాడయ్యాడు. -
ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాలి
మానకొండూర్: ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాల్సిన అసవరం ఉందని విద్యా కమిషన్ మాజీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ (టీపీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘విద్యా బస్సుయాత్ర’ గురువారం మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గంగిపల్లిలోని శ్రీసరస్వతి విద్యాలయం, చెంజర్ల ప్రాథమిక పాఠశాల, గట్టు దుద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలల పరిస్థితులు తెలుసుకున్నారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య, కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. కనీస సౌకర్యాలతో పాటు ఎలాంటి ప్రమాణాలు ఉండాలో 52 అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు వెల్లడించారు. మన స్కూళ్లలో ఐరోపా (యూరోపియన్) స్థాయి సౌకర్యాలు కల్పించడం అసాధ్యమేమీ కాదని, సరిగ్గా ప్రణాళికలు రచిస్తే ఇది సాధ్యమవుతుందన్నారు. ఉపాధ్యాయులకు తగిన గ్రేడింగ్ విధానం అమలు చేయాలని సూచించారు. సర్కారు బడుల రూపురేఖలు మార్చకుంటే భవిష్యత్‌లో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామన్నారు. ప్రొఫెసర్ పద్మ, డాక్టర్ ఎంవీ రెడ్డి, ఎం.చంపాలాల్, రుబీనా, టి.నిర్మల, అశోక్‌కుమార్, ఎం.కుమార్, నిఖిల్, విజయ్, కృష్ణ, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న 70వ జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. గురువారం అండర్– 14 బాలికలకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. అంతకుముందు పోటీలను జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం అండర్– 17 బాలురకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బన్సిలాల్ తెలిపారు. కవ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, అంతటి శంకరయ్య, ఎస్జీఎఫ్ మాజీ కార్యదర్శి వేణుగోపాల్, పోతన శ్రీనివాస్, నరసయ్య, గిన్నె లక్ష్మణ్, వీరన్న, వంగపల్లి సూర్యప్రకాష్, బిట్ర శ్రీనివాస్, యూనిష్ పాష, కొమురోజు కృష్ణ, చందా శ్రీనివాస్, ఎల్వీ రమణ, బాలసాని రాజకుమార్, దత్తాత్రేయ పాల్గొన్నారు. అండర్–14 బాలికల విజేతలు ఖోఖో పోటీల్లో గంగాధర మండలం ప్రథమ, తిమ్మాపూర్ మండలం ద్వితీయ, కబడ్డీలో జమ్మికుంట మండలం ప్రథమ, కరీంనగర్ అర్బన్ మండలం ద్వితీయ, వాలీబాల్‌లో కొత్తపల్లి మండలం ప్రథమ, శంకరపట్నం మండలం ద్వితీయ స్థానంలో నిలిచాయి. -
కాపర్ వైర్ దొంగల ముఠా అరెస్టు
● ముగ్గురి రిమాండ్.. పరారీలో ఒకరు ● 39 కిలోల కాపర్ వైరు, మొబైల్ ఫోన్, ఆటో స్వాధీనం ● వివరాలు వెల్లడించిన సీఐ మాదాసు రాజ్కుమార్మల్యాల: కొద్ది నెలలుగా ట్రాన్స్ఫార్మర్లు పగులగొట్టి కాపర్ వైరు చోరీ చేస్తున్న దొంగలముఠాను మల్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ రాజ్‌కుమార్, ఎస్సై ఎస్.సందీప్‌కుమార్ దొంగల ముఠా వివరాలు వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన తపాల బాబు, మంచిర్యాల వికాస్‌నగర్‌కు చెందిన కోట శ్రీను, పల్లపు సురేశ్, సూర సురేశ్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్‌వైరు దొంగిలిస్తున్నారు. వైర్‌ను ముద్దగా చేసి.. విక్రయించి.. వచ్చిన డబ్బును పంచుకునేవారు. ఇలా మల్యాల, వెల్గటూర్, ధర్మపురి, గొల్లపల్లి, బుగ్గారం మండలాల్లోని వివిధ గ్రామాల్లో మొత్తం తొమ్మిది దొంగతనాలకు పాల్పడ్డారు. 10 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్‌వైరును చోరీ చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు నిందితులపై నిఘా వేయగా.. గురువారం కొండగట్టు వద్ద కోట శ్రీను, పల్లపు సురేశ్, సూర సురేశ్ అనుమానాస్పదంగా తిరుతుగుతుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి ప్యాసింజర్ ఆటో, మొబైల్ ఫోన్, ట్రాన్స్ఫార్మర్ పగులగొట్టే ప్రత్యేక పరికరం, 39 కిలోల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నామని సీఐ వెల్లడించారు. ఏ–1 నిందితుడు తపాలా బాబు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు చేధించడంలో కృషి చేసిన ఎస్సై సందీప్‌కుమార్, కానిస్టేబుల్ రాజేందర్, ఆంజనేయులు, విక్రాంత్‌ను ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు. -
న్యాయ చట్టాలపై అవగాహన అవసరం
కరీంనగర్‌సిటీ: మానవ జీవితంలో చట్టాల ప్రాముఖ్యత, సాంకేతికత, వనరులను సరైన మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన ఉండాలని డీఎస్ఎల్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్‌సింగ్ అన్నారు. గురువారం శాతవాహన విశ్వవిద్యాలయ న్యాయ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, ర్యాగింగ్ వంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ కె.పద్మావతి, వీసీ యు.ఉమేశ్‌కుమార్, రిజిస్ట్రార్ పి.సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సు లక్ష్యాలు, ఉద్దేశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. తరగతి గదుల్లో విజ్ఞానాన్ని నేర్చుకొని దేశాభివృద్ధికి వినియోగించాలని సూచించారు. సైబర్‌క్రైం అధికారి మహేశ్, యాంటీ డ్రగ్స్ అధికారి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్‌క్రైం: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీపీవో కార్యాలయంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ జాతీయజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, చట్టబద్ధ పాలనతో పాటు సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించడం పోలీసు వ్యవస్థ ప్రథమ కర్తవ్యమన్నారు. పౌరులకు సత్వర న్యాయం అందేలా పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా ప నిచేయాలని సూచించారు. అదనపు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. మండపాల పరిశీలన రామడుగు: రామడుగు, చొప్పదండి మండలా ల్లో పలు వినాయక మండపాలను గురువారం సీపీ గౌస్ ఆలం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్వామి జీ సంఘటిత్దాస్ పరిశీలించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యాయం జరగకుంటే ఐదువేల మందితో ధర్నాతిమ్మాపూర్: మండలంలోని మొగిలిపాలెం సర్పంచ్ తాట్ల తిరుపతిపై ఇటీవల జరిగిన దాడిని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఖండించారు. గురువారం సర్పంచ్‌ను పరామర్శించారు. ఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. గ్రామస్తుల మద్దతుతో గెలిచిన సర్పంచ్ తనకు నచ్చిన విధంగా గ్రామాభివృద్ధి చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కొంతమంది అడ్డుపడి దాడి చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ చైర్మన్ హోదాలో ఉన్న నిందితున్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. న్యాయం జరగకుంటే అవసరమైతే 5 వేల మందితో ధర్నా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అధైర్యపడవద్దని సర్పంచ్‌ను ఓదారుస్తూ, బీఆర్ఎస్ పార్టీతోపాటు ముదిరాజ్ సమాజం పూర్తి అండగా ఉంటుందన్నారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. 21, 22వ తేదీల్లో క్యాంపులుసప్తగిరికాలనీ(కరీంనగర్): దివ్యాంగ పిల్లల ఉపకరణాల గుర్తింపు కోసం పాఠశాల విద్యాశాఖ తరఫున ఈ నెల 21,22న అసెస్మెంట్ క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ తెలిపారు. 21న కరీంనగర్‌లోని భవిత కేంద్రం, 22న హుజురాబాద్ జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. 5 నుంచి 18 ఏళ్ల వయస్సు గల దివ్యాంగ పిల్లలు ఉపకరణాల గుర్తింపునకు అర్హులని, క్యాంపుకు వచ్చే వారు ఆధార్, తెల్ల రేషన్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ, సదరం సర్టిఫికెట్లతో రావాలని తెలిపారు. -
రాజన్న సేవలో సినీపాటల రచయిత చంద్రబోస్
వేములవాడఅర్బన్: రాజన్న అనుబంధ ఆలయం భీమేశ్వరస్వామి ఆలయంలో తెలుగు సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత కనకండ్ల సుభాష్ చంద్రబోస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇటీవల వివాహమైన తన కుమారుడు, కోడలితో కలిసి ఆలయానికి విచ్చేసిన చంద్రబోస్ దంపతులు, కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడెమొక్కు చెల్లించుకోవడంతోపాటు అభిషేకం, నిత్య కల్యాణం తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదములు అందజేశారు. -
నేరాల నియంత్రణకు చర్యలు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ టౌన్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాన్ని రాజన్న జోన్–3 డీఐజీ, సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ మంగళవారం సీపీ గౌస్ ఆలంతో కలిసి సందర్శించారు. కార్యాలయంలో వి విధ విభాగాలను పరిశీలించారు. అ నంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల ని యంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలన్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, సున్నితమైన ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రామచందర్‌రావు, తిరుమల్, పుల్లయ్య, డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నాలుగేళ్లు సహజీవనం.. పెళ్లికి నిరాకరణ
మంచిర్యాలక్రైం: భర్త సరిగా చూసుకోవడం లేదని ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. భర్తకు విడాకులు ఇప్పించిన అతడు నాలుగేళ్లు ఆమెతో సహజీనం చేశాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. ఆడపిల్లల అని తెలిసి అబార్షన్ చేయించాడు. తీరా పెళ్లికి నిరాకరించడంతో అటు భర్త, కన్నవారికి దూరమై.. ఇద్దరు పిల్లలతో ఎలా జీవించాలో తెలియక ఈ నెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పెల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తితో వివాహామైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతడు విదేశానికి వెళ్లేవాడు. ఇద్దరు మధ్య గొడవల కారణంగా విడిపోయారు. ఈ క్రమంలో బాధిత వివాహిత స్నేహితురాలి స్నేహితుడు మందమర్రికి చెందిన మహేష్‌తో కలిసి మందమర్రి పాలచెట్టు ప్రాంతానికి చెందిన షారుఖ్‌పాష పరిచయమయ్యాడు. ఈ ముగ్గురు కలిసి తరచూ బాధిత మహిళ ఇంటికి వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో షారుఖ్పాషకు బాధిత మహిళతో సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో ఆమెతో భర్తకు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించాడు. కలిసి జీవనం సదరు వివాహితను పెళ్లి చేసుకుంటానని, ఇద్దరు కూతుళ్లను చూసుకుంటానని షారుఖ్‌పాష నమ్మించి రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని క్యాతనపల్లిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొంతకాలం సహజీవనం చేశారు. ఈ విషయం అతడి తల్లిదండ్రులకు కూడా తెలియడంతో నాలుగేళ్లుగా కలిసే ఉంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆమెకు అబార్షన్ చేయించగా.. మూడోసారి మంచిర్యాల బస్టాండ్ సమీపంలోని ఓ స్కానింగ్ సెంటర్లో లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో మళ్లీ అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరు పెద్ద మనుషులను పిలిపించి షారుఖ్‌ఖాన్‌పై ఆమె ఒత్తిడి తేగా నిరాకరించాడు. దీంతో ఆ మహిళ దోమలమందు, జ్వరం గోలీలు వేసుకుని ఈనెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ విషయమై సీఐ ప్రమోద్‌రావు స్పందిస్తూ బాధితురాలి ఫిర్యాదు మేరకు షారుఖ్‌పాషపై కేసు నమోదు చేసి రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు. ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించిన ప్రియుడు వివాహిత మహిళ ఆత్మహత్యాయత్నం -
కూలీ పనికి వెళ్తూ అనంత లోకాలకు..
చొప్పదండి: పట్టణంలోని13వ వార్డుకు చెందిన బైర రాజ్‌కుమార్ (32) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజ్‌కుమార్ కరీంనగర్లో కూలీ పని చేస్తుంటాడు. మంగళవారం ఉదయం తన సోదరి నగునూరు ఆసుపత్రిలో నర్సింగ్ చదువుతున్న బైర నిఖిత, ఆమె స్నేహితురాలు పిట్టల ఉషశ్రీలను బైక్‌పై తీసుకొని ఆసుపత్రిలో దించి పనికి పోవడానికి బయలుదేరాడు. రుక్మాపూర్ శివారులోని చాకుంట ఎక్స్‌రోడ్డు సమీపంలో ఎదురుగా వస్తున్న పెద్ద ట్రాలీ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో రాజ్‌కుమార్, నిఖిత, ఉషశ్రీకి గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాజ్‌కుమార్ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌రెడ్డి తెలిపారు. భార్య గర్భిణి చొప్పదండిలోని జ్యోతినగర్‌కు చెందిన రాజ్‌కుమార్‌కు ఏడేళ్ళ క్రితం వివాహం అయింది. ఇప్పటికే ఆరేళ్ల పాప ఉండగా, మృతుడి భార్య కవిత తొమ్మిది నెలల గర్భిణి. రోడ్డు ప్రమాదంలో అన్న మృతిచెంది, చెల్లి గాయాల పాలవడం స్థానికంగా విషాదం నింపింది. -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
చొప్పదండి: రెండు పెళ్లిల్లు జరిగినా విడాకులు కావడంతో మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఆర్నకొండలో జరిగింది. ఎస్సై నరేశ్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆర్నకొండకు చెందిన గంగాధర గంగయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నాగరాజు (33) కారు డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. 2016లో వివాహం చేయగా కొద్ది రోజులకే భార్యతో విడాకులయ్యాయి. అనంతరం మరో వివాహం జరిపించగా గతేడాది రెండో భార్యతో కూడా విడాకులయ్యాయి. దీంతో మద్యానికి బానిసైన నాగరాజు ఈ నెల 13న స్నేహితులతో మద్యం తాగడానికి వెళ్లగా రాత్రి అతడి తమ్ముడు అనిల్ ఇంటికి తీసుకువచ్చాడు. తిరిగి ఉదయం లేచి చూసేసరికి తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతిచెంది ఉన్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పీజీ సీటు రాలేదని వైద్యుడి.. కరీంనగర్‌రూరల్: తీగలగుట్టపల్లికి చెందిన ఎంబీబీఎస్ డాక్టర్ గౌతమ్ (39) పీజీలో సీటు రాలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. గౌతమ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి కాంట్రాక్టు పద్ధతిలో ధర్మారం మండలం నందిమేడారం పీహెచ్సీలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. నెల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రెండు పర్యాయాలు పీజీ సీటు కోసం ప్రవేశపరీక్ష రాసినా మెరిట్ మార్కులు రాక సీటు లభించలేదు. కొంతకాలంగా మనోవేదనతో ఉన్న గౌతమ్ ఆదివారం రాత్రి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం తల్లిదండ్రులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఉరేసుకొని యువకుడి..వేములవాడరూరల్:వేములవాడరూరల్ మండలం మర్రిపల్లికి చెందిన గొర్రె అవినాశ్(22) సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. అవినాశ్ బైండ్ల పని చేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తూ డబ్బులు వృథాగా ఖర్చు చేస్తుండేవాడని అన్నారు. తల్లిదండ్రులు చాలాసార్లు చెప్పినప్పటికీ వినకుండా సోమవా రం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మైనర్ బాలికను వేధించిన యువకుడి రిమాండ్ శంకరపట్నం: మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురిచేసిన నిందితుడిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రేకుర్తికి చెందిన నగూర్ రవి బాలికను పెళ్లి చేసుకోవాలంటూ వేధించడంతో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి హుజూరాబాద్ కోర్టులో ప్రవేశపెట్టామని, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు. -
టిఫిన్ రెడీ!
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: ఉదయం పూట కడుపు నిండా తిండి లేకుండా పాఠశాలకు వచ్చే పిల్లవాడు పాఠంపై ఎంతమేర దృష్టి పెట్టగలడు? పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఈ ప్రశ్నకు సమాధానం ఎన్నో కుటుంబాల ఆర్థిక పరిస్థితితో ముడిపడి ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు పనులకు వెళ్లే తొందర.. పిల్లలను పాఠశాలకు పంపించే ఆత్రుత.. ఫలితంగా కొందరు విద్యార్థులు అల్పాహారం లేకుండానే బడిబాట పడుతుంటారు. ఈ పరిస్థితిని మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాం’ జిల్లాలో వేలాది మంది విద్యార్థులకు అండగా నిలవనుంది. కరీంనగర్ మార్కెట్ యార్డులో సుమారు రూ.8 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను బుధవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. రోజుకు 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించే సామర్థ్యంతో ఈ కిచెన్‌ను రూపొందించారు. దీని ద్వారా కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లోని 17 మండలాల్లో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 49,025 మంది విద్యార్థులకు అల్పాహారం అందనుంది. పేదింటి పిల్లలకు పెద్ద ఊరట ఉదయం వేళ తల్లిదండ్రులు కూలీ పనులు, ఉద్యోగాలకు వెళ్లే కుటుంబాల్లో పిల్లలకు అల్పాహారం సిద్ధం చేయడం కష్టంగా మారుతుంటుంది. అలాంటి విద్యార్థులకు పాఠశాలలోనే పోషకాహారంతో కూడిన అల్పాహారం అందడం వల్ల ఆకలి సమస్య కొంతమేర తీరనుంది. ఆకలితో తరగతిలో కూర్చోవాల్సిన పరిస్థితి తగ్గడంతో పిల్లలు పాఠాలపై మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. అల్పాహారం కేవలం కడుపు నింపే ఆహారం మాత్రమే కాదు, పిల్లల ఆరోగ్యం, ఏకాగ్రత, తరగతి గది భాగస్వామ్యం, హాజరు, విద్యా పనితీరుకు దోహదపడే అంశం. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఇది అదనపు ప్రయోజనం. నీరసం, అలసట లేకుండా.. ఉదయం ఆకలితో ఉండటం వల్ల వచ్చే నీరసం, అలసటను తగ్గించేందుకు పోషకాహారం ఉపయోగపడుతుంది. సమయానికి అల్పాహారం అందితే ఆలస్యంగా పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ చదువుపై దృష్టి పెట్టేందుకు ఇది దోహదం చేయనుంది. కొడంగల్ నియోజకవర్గంలో.. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన కార్యక్రమం ద్వారా విద్యార్థుల హాజరు 75 నుంచి 90 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏకాగ్రత, తరగతి గది భాగస్వామ్యం, సమయపాలనలోనూ సానుకూల మార్పులు నమోదయ్యాయి. వంట బాధ్యత నుంచి టీచర్లకు విముక్తి కేంద్రీకృత వంటశాల మరో ముఖ్యమైన ప్రయోజనం. పాఠశాలల్లో వంట, ఆహార ఏర్పాట్లకు వెచ్చించే సమయం, సిబ్బంది శ్రమ తగ్గడం. దీంతో ఉపాధ్యాయులు పూర్తిగా బోధన, విద్యార్థుల అభ్యాసంపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. దోస, ఇడ్లీ, పూరీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ వంటి విద్యార్థులకు సుపరిచితమైన ఆహార పదార్థాలతో వారపు మెనూను రూపొందించారు. అవసరమైన పోషకాలను దృష్టిలో పెట్టుకుని వయస్సుకు తగిన మోతాదులో ఆహారం అందించనున్నారు. మెనూ రూపకల్పనలోనూ సహకారం తీసుకున్నారు. 49 వేల కుటుంబాలకు పరోక్ష ప్రయోజనం జిల్లాలో 49,025 మంది విద్యార్థులకు అల్పాహారం అందించడం అంటే దాదాపు అంతే సంఖ్యలో కుటుంబాలకు పరోక్షంగా ఊరట కల్పించడమే. రోజూ పిల్లల ఉదయపు అల్పాహారం కోసం అయ్యే ఖర్చు, సమయం కొంతమేర ఆదా కావడంతో పేద కుటుంబాలకు ఇది ఆర్థికంగా ఉపయోగకరంగా మారనుంది. అందుకే కరీంనగర్‌లోని ఈ కిచెన్‌ను కేవలం వంటశాలగా కాకుండా పేదింటి పిల్లల ఆక లిని తీర్చే కేంద్రంగా, వారి చదువుకు ఊతమిచ్చే కేంద్రంగా చూడాల్సిన అవసరం ఉంది. పోషకాహారంతో వారపు మెనూ విద్యార్థులకు పరిచయమైన ఆహార పదార్థాలతో మెనూ రూపొందించారు. సోమవారం ఇడ్లీ–సాంబార్, మంగళవారం పూరీ–ఆలూకుర్మా, బుధవారం దోశ–చట్నీ, గురువారం ఉప్మా–చట్నీ, శుక్రవారం మిల్లెట్‌ఇడ్లీ–సాంబార్, శనివారం బోండా–చట్నీ అందించనున్నారు. రోజు విడిచి రోజు పాలు కూడా అందించనున్నారు. పోషక సమతుల్యత, వయస్సుకు తగిన మోతాదును దృష్టిలో పెట్టుకుని, ఎన్ఐఎన్ సహకారంతో మెనూ రూపొందించారు. రాత్రి ఒంటి గంటకు వంట మొదలు కిచెన్‌లో కుకింగ్, క్లీనింగ్, డ్రైవింగ్ తదితర విభాగా లు కలిపి మొత్తం 100 మంది పనిచేస్తారు. రాత్రి 1 గంట నుంచే కూరగాయల కటింగ్ మొదలవుతుంది. ఉదయం 4 గంటలకు వంటలు ప్రారంభమై 6 గంటలకల్లా ముగుస్తాయి. ప్రతీ బడిలో ఉదయం.8.30 గంటల వరకు టిఫిన్ చేరిపోతుంది. ప్రతీ మండలానికి రెండు చొప్పున మొత్తం 34 ఆటోలు సిద్ధం చేస్తున్నారు. తిరిగి 11 గంటలకల్లా కిచెన్‌కు చే రతాయి. అక్కడ పాత్రలను అత్యాధునిక విధానంలో శుభ్రం చేస్తారు. తొలిదశలో కరీంనగర్‌రూరల్, చి గురుమామిడి, సైదాపూర్ మండలాల పాఠశాలల కు అందజేసి క్రమంగా అన్ని మండలాలకు విస్తరిస్తామని కిచెన్ నిర్వాహకులు, హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.నియోజకవర్గాల వారీగా లబ్ధి పొందే విద్యార్థులు నియోజకవర్గం విద్యార్థుల సంఖ్య హుస్నాబాద్ 16,544కరీంనగర్ 16,355మానకొండూర్ 8,645చొప్పదండి 7,481మొత్తం 49,025కమ్యూనిటీ కిచెన్ పిల్లల ఆరోగ్యమే పెట్టుబడి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మొత్తం 17,72,291 మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా 31 జిల్లాల్లో కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు ప్రతిపాదించారు. సుమారు రూ.245 కోట్లతో ఈ వంటశాలు ఏర్పాటు చేయనున్నారు. కడుపు నిండితేనే చదువుపై దృష్టి.. ఆరోగ్యం ఉంటేనే భవిష్యత్తుపై ఆశ. ఈ రెండు అంశాలను కలిపే ప్రయత్నంగా ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాం’ నిలుస్తోంది. కరీంనగర్లో ప్రారంభమవుతున్న కమ్యూనిటీ కిచెన్ ద్వారా వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉదయాన్నే పోషకాహారం అందడం వారి విద్యాభ్యాసానికి చిన్న అడుగు అయినా.. భవిష్యత్‌కు మాత్రం పెద్ద బలం. -
పైరు కొన ఊపిరికి ప్రాణం
● జిల్లావ్యాప్తంగా దంచికొట్టిన వాన ● అయినా 5 మండలాల్లో లోటే కరీంనగర్‌అర్బన్: కొన ఊపిరితో ఉన్న పంటలకు వర్షం జీవం పోసింది. మూడు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా వాగులువంకలు, మినీ చెరువులు జలకళ సంతరించుకున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా వర్షాలు దంచికొడుతుండగా పలుచోట్ల వరద ఏరులైపారింది. జిల్లాలో వ్యవసాయ రంగమే కీలకం. 65శాతం మంది సాగును నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కళ్లల్లో వత్తులు వేసుకుని వాన కోసం నిరీక్షించారు. చెరువులకు జలకళ.. పారుతున్న వాగులు ఎగువన ఎస్సారెస్పీ జలాశయంలోకి ఎగువ నీరు వస్తుండగా, మధ్యమానేరు జలాశయం దాదాపు నిండుకోగా దిగువ మానేరు నీటి మట్టం పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లుండగా 1,376 చెరువులున్నాయి. దిగువ మానేరు జలాశయం, శనిగరం ప్రాజెక్టు, మధ్యమానేరు, ఎగువమానేరు జలాశయాలకు ఒకింత జలకళ సంతరించుకోగా వస్తున్న వరద నీటితో చెరువులు, కుంటలు కాసింత భరోసానిస్తున్నాయి. కాకతీయ కెనాల్, వరదనీటి కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఆశాజనకంగా నీరు చేరనుందని సమాచారం. 10వేల ఎకరాలకు పైగా బీడే జిల్లాలో పంటల సాగు సరళి పరిశీలిస్తే ఎల్‌నినో ప్రభావం పడింది. వానాకాలం పంటల సాగు అంచనా 3,44,420 ఎకరాలు కాగా 3,34,028 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. గతంలో ఇదే సమయంలో 3,44,446 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. పెసలు, కందులు, మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరగగా వరి సాగు అంచనాకు 13,266 ఎకరాలు తగ్గింది. మూడు మండలాల్లో సాధారణానికి మించి మూడురోజులుగా వర్షం కురుస్తుండగా ఆది, సోమవారాల్లో దంచికొట్టింది. అయినా జిల్లావ్యాప్తంగా 5 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదవడం ఆందోళనకర పరిణామం. కొత్తపల్లి, వీణవంక, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలను లోటు వర్షపాతమే వెంటాడుతోంది. గంగాధర, రామడుగు, గన్నేరువరం మండలాల్లో సాధారణానికి మించి నమోదవగా చొప్పదండి, కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్, మానకొండూరు, తిమ్మాపూర్, చిగురుమామిడి, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.జిల్లాలో వర్షపాత వివరాలిలా నెల సాధారణం నమోదైన వర్షం వర్షపాతం పడినరోజులు జూన్ 124.5 84.7 08 జూలై 237.7 243.5 12 ఆగస్టు 203.6 146.7 16 సెప్టెంబర్ 83.6 95.5 05(ఇప్పటివరకు) వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం మండలం వర్షపాతం సెంటి మీటర్లలో శంకరపట్నం (తాడికల్) 9.9 రామడుగు (గుండి) 8.4 చిగురుమామిడి (ఇందుర్తి) 7.7 మానకొండూరు(ఈదులగట్టెపల్లి) 4.9 గంగాధర (బూరుగుపల్లి) 4.6 చొప్పదండి (ఆర్నకొండ) 4.0 సైదాపూర్ (వెన్కెపల్లి) 3.8 వీణవంక 3.8 కరీంనగర్‌రూరల్ (దుర్శేడ్) 3.5 జమ్మికుంట 3.3 కొత్తపల్లి(అసిఫ్‌నగర్) 2.9 గన్నేరువరం (ఖాసీంపేట) 2.7 కరీంనగర్‌అర్బన్ 2.5 తిమ్మాపూర్(రేణికుంట) 2.4 ఇల్లందకుంట(మల్యాల) 2.1 హుజూరాబాద్(బోర్నపల్లి) 2.0 -
బస్సుకు చుట్టుకున్న విద్యుత్‌వైర్లు
హన్మకొండ చౌరస్తా: మూల మలుపు తిరుగుతున్న ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు చుట్టుకోవడం.. డ్రైవర్ అలానే ముందుకు వెళ్లడంతో చెట్ల కొమ్మలు విరిగిపడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడే ఉన్న పలువురు అప్రమత్తంగా ఉండడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హనుమకొండ వస్తోంది. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ మూలమలుపు వద్దకు చేరుకోగానే పక్కనే ఉన్న వృక్షం పక్కనుంచి వెళ్లిన విద్యుత్ వైర్లు బస్సుకు చుట్టుకున్నాయి. గమనించని బస్సు డ్రైవర్ వేగంగా నడపడంతో భారీ వృక్షం కొమ్మలు విరిగి రోడ్డు పక్కనే పార్కింగ్ చేసిన ఆటోలు, ద్విచక్రవాహనాలపై పడ్డాయి. దీంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని లేదా గాయాలు కాకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు అతివేగంగా నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అక్కడున్న పలువురు ఆరోపించారు. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బస్సుపై పడిన కొమ్మలను తొలగించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. చెట్టుకొమ్మలు విరిగిపడి పలు వాహనాలు ధ్వసం -
కొద్దిసేపట్లో విమాన ప్రయాణం.. అంతలోనే దుర్మరణం
కరీంనగర్ రూరల్/శంషాబాద్: కంటైనర్ చేసిన బీభత్సంతో అదుపుతప్పిన బస్సు హోటల్ల్లో దూసుకెళ్లిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లేందుకు కొద్దిసేపట్లో విమానం ఎక్కాల్సిన అతడు పరలోకాలకు వెళ్లాడు. ఈ విషాదకర ఘటన శంషాబాద్‌లో కిషన్‌గూడ ఆర్వోబీ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ఆర్జీఐఏ సీఐ సంజీవులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 5.30 గంటలకు వర్షం కురుస్తోంది. ఆ సమయంలో శంషాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కంటైనర్ డివైడర్ మధ్యలోకి దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొంది. అదే సమయంలో బెంగళూరు నుంచి బాచుపల్లికి వెళ్తున్న సెవెన్ హిల్స్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుపై స్తంభం విరిగి పడడంతో నియంత్రణ కోల్పోయిన బస్సు డ్రైవర్ సాధిక్ రోడ్డు పక్కనే నిలిపి ఉన్న వాహనాలను ఢీకొట్టి హోటల్లోని ముందుకు భాగంలోకి తీసుకెళ్లాడు. చాయ్ కోసం ఆగితే ప్రాణం పోయింది.. కరీంనగర్ జిల్లా కేంద్రం రజ్వీచమన్ రోడ్డు సిటిజన్ కాలనీకి చెందిన మొహమ్మద్ మోహియుద్దీన్.. తన కుమారుడు మహ్మద్ అజీమొద్దీన్ (26)ను దుబాయ్‌కి పంపేందుకు కుటుంబసభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. ఎయిర్‌పోర్టు బ్రిడ్జి సమీపంలోని హోటల్ వద్ద చాయ్ తాగేందుకు కారు నిలిపారు. కారులోంచి బయటికి వచ్చిన అజీమొద్దీన్ను బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. కళ్లేదుటే అజీమొద్దీన్ మృతి చెందడంతో కుటుంబసభ్యులను శోకసంద్రంలో ముంచింది. బస్సు బీభత్సం బస్సు హోటల్లోకి దూసుకెళ్లడంతో అక్కడే బోండాలు వేస్తున్న గ్యాస్ స్టౌవ్‌కు మంటలంటుకున్నాయి. పాన్‌షాప్ పూర్తిగా ధ్వంసమైంది. వాహనాలు సైతం ధ్వంసం కాగా బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకులోనై హాహాకారాలు చేయడంతో పక్కనే ఈవీ చార్జింగ్ కోసం వచ్చిన ఓ యువకుడితో పాటు హోటల్ వద్ద ఉన్న మరికొందరు యవకులు ఎమర్జెన్సీ డోర్ తెరిచి ప్రయాణికులను బయటికి తీశారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కరెంటు సరఫరాను నిలిపివేయించారు. స్వల్పంగా గాయపడిన పదిమందిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన బస్సు డ్రైవర్ సాధిక్‌ను ఆస్పత్రికి తరలించారు. కంటైనర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్‌ను ఢీకొని బీభత్సం సృష్టించిన కంటైనర్ అదుపు తప్పి హోటల్లోకి దూసుకెళ్లిన బస్సు యువకుడి మృతి.. పది మందికిపైగా గాయాలు నాలుగు వాహనాలు ధ్వంసం -
హియరింగ్‌కు డుమ్మా సర్!
సాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి జిల్లాలో సర్ నోటీసులు జారీ అవుతున్నా విచారణ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. నోటీసులు అందుకున్నవారు నిర్ణీత తేదీల్లో హియరింగ్‌కు హాజరు కావడంలేదు. కేటాయించిన తేదీలు గడిచిపోవడం.. రీషెడ్యూల్ చేయాల్సి రావడం వంటి పరిణామాలతో ెపెండింగ్ కేసులు పెరుగుతున్నా యి. ఆదివారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, రాజ న్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో కలిపి 6,94,517 సర్ నోటీసులు జనరేట్ కాగా.. ఇందులో 6,12,976 డెలివరీ చేశారు. 81,541 నోటీసులు డెలివరీ కాలేదు. మరోవైపు హియరింగ్ తేదీల్లో గైర్హాజరు కావడంతో 3.21 లక్షలకుపైగా నోటీసులు ల్యాప్స్ అయ్యాయి. నిర్దేశిత గడువులోగా ఎంతదరు విచారణకు హాజరవుతారు? ఎంతమంది గైర్హాజరవుతారనేది కీలకంగా మారింది. నోటీసులు అందినా.. హాజరు ఎక్కడ? నోటీసు డెలివరీ పూర్తయ్యాక సదరు వ్యక్తికి హియరింగ్ తేదీ కేటాయిస్తారు. ఆ తేదీన హాజరు కాకపోతే అది ల్యాప్స్ అవుతుంది. అదేఅంశంపై మరోసారి తేదీ కేటాయించాల్సి వస్తోంది. ఇప్పటికే పెద్దసంఖ్యలో నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఇలాంటి గైర్హాజరీలు పెరిగితే హియరింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా కరీంనగర్, జగిత్యాలలో విచారణకు ఓటర్లు గైరాజరవుతున్నారు. కారణాలు అనేకం హియరింగ్ తేదీలు ల్యాప్స్ కావడానికి ప్రధానంగా నోటీసుల డెలివరీలో జాప్యం ఒక కారణంగా కనిపిస్తోంది. నోటీసు అందిన తర్వాతే సంబంధిత వ్యక్తి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. భారీ సంఖ్యలో నోటీసులు ఉండటంతో ప్రతీదానిని ని ర్ణీత సమయంలో డెలివరీ చేయకపోవడం, నోటీసు అందుకునే సమయానికి విచారణ తేదీ ముగిసిపోవడం, లేదా తక్కువ సమయం ఉండటం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే నోటీసులు అందుకున్న వారు స్థానికంగా కాకుండా హైదరాబాద్ తదితర దూరప్రాంతాల్లో ఉండటం కూడా హియరింగ్‌కు హాజరుకావడం లేదంటున్నారు. ఒకవేళ గడువురోజు హాజరైనా పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉండటం, వచ్చిన వారు అధిక సంఖ్యలో ఉండంతో చాలామంది విచారణకు హాజరుకాకుండానే వెనుతిరుగుతున్నారు. విచారణకు హాజరు పెంచడమే కీలకం నోటీసులు జారీచేయడంపైనే అధికార యంత్రాంగం దృష్టి సారిస్తోంది. నోటీసు అందుకున్న వారు నిర్ణీత తేదీన విచారణకు హాజరై తమ వాదనలు, ఆధారాలు సమర్పించినప్పుడే ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో హియరింగ్ తేదీ, సమయం, వేదికపై స్పష్టమైన సమాచారం అందించడం, గైర్హాజరైన వారికి వెంటనే తదుపరి తేదీ కేటాయించడం, పెండింగ్ కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. లేకపోతే ఒకే కేసుకు పదేపదే తేదీలు కేటాయించే పరిస్థితి ఏర్పడి.. ఇప్పటికే ఉన్న పెండింగ్ తేదీలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
గల్ఫ్ ఏజెంట్‌పై ఎస్పీకి ఫిర్యాదు
జగిత్యాల క్రైం: గల్ఫ్ పంపిస్తానని డబ్బులు తీసుకుని జగిత్యాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్ మోసం చేశాడని బాధితులు మంగళవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పట్టణంలో గల్ఫ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న వ్యక్తి ఐదుగురి నుంచి రూ.2.37లక్షలు తీసుకుని మస్కట్ పంపించాడని, అక్కడ పనిలేక వాపస్ వచ్చామని, తమకు నష్టం చేసిన ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిపై విచారణజగిత్యాల: కథలాపూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ.. ఓ ఉపాధ్యాయురాలిని వేధించి సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడిని ఫిర్యాదుల కమిటీ ఆధ్వర్యంలో పోష్ యాక్ట్ 2013 ప్రకారం మంగళవారం విచారించారు. తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఓ ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన విషయం తెల్సిందే. నివేదిక ఆధారంగా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈనెల 15న వ్యక్తిగతంగా హాజరై తన వాదనలు, ఆధారాలు సమర్పించాలని ఫిర్యాదుల కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు అతడిని కమిటీ విచారణ చేపట్టింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్‌కు పంపించామని కమిటీ సభ్యులు తెలిపారు. సిరిసిల్లలో ఇరు వర్గాల ఘర్షణ సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో ఆదివారం కొందరు కర్రలతో దాడులు చేసుకోగా.. ఇరువర్గాల్లోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇటీవలే జరిగిన ఓ సామాజిక వర్గం ఎన్నికల విభాదాలే ఘర్షణకు కారణమతి ఆరోపణలున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘డబుల్’ నిరసన
మండలంలోని గుండ్లపల్లి స్టేజీ నుంచి ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని బీజేపీ నాయకులు మంగళవారం గన్నేరువరం రోడ్డులో గుంతలోని నీటిలో కాగితపు పడవలతో నిరసన తెలిపారు. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం గుండ్లపల్లిస్టేజీ వద్ద ధర్నా చేసి 30 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రా నందున ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి సిద్ధమని హెచ్చరించారు. బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్, బీజేవైఎం అధ్యక్షుడు మచ్చ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. – గన్నేరువరం -
క్వారీలో ప్రమాదంలో ఒకరు మృతి
గంగాధర: మండలంలోని సర్వారెడ్డిపల్లి సమీపంలోని గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో సుదధగోని అంజయ్య(40) మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన అంజయ్య పీఎస్ఆర్ గ్రానైట్ క్వారీలో స్టోన్ కటింగ్ మిషన్ హెల్పర్‌గా పని చేస్తున్నారు. సోమవారం వేకువజామున బయటకు వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు బండరాయి జారి తలపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
కడుపునొప్పితో భార్యాభర్తల మృతి!
● ఫుడ్ పాయిజన్‌గా అనుమానం ● మృతురాలు మూడు నెలల గర్భిణి రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలో నివాసం ఉండే దంపతులు అజయ్ కుమార్ కారే(28) – దినేశ్వరి కారే(25) కడుపునొప్పితో తీవ్రఅస్వస్థతకు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లా లాంజీ తాలూకా ధర్మార గ్రామానికి చెందిన అజయ్‌కుమార్ కారే– దినేశ్వరి కారే భార్యాభర్తలు. వీరికి రెండేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి నిమిత్తం సెంటినరీకాలనీకి వలస వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారు. భవన నిర్మాణ రంగంలో మేసీ్త్ర పనులు చేసుకుంటున్నారు. ఈనెల 13న రాత్రి సుమారు 9 గంటల సమయంలో భార్యాభర్తలు భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి 00.30గంటలకు దినేశ్వరికి కడుపునొప్పి రావడంతో భర్తతోపాటు బంధువులకు విషయం తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికి నొప్పి తగ్గుతుందని భావించి నిద్రపోయింది. ఉదయం దినేశ్వరి, అజయ్‌కుమార్‌కు కూడా కడుపునొప్పి రావడంతో ఇద్దరినీ వారి యజమాని రోశయ్య కారులో కమాన్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈనెల 14న ఉదయం సుమారు 10.20 గంటలకు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి అజయ్‌కుమార్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మరోవైపు.. చికిత్స పొందుతున్న దినేశ్వరి కూడా మృతి చెందింది. దీంతో వారికుటుంబ సభ్యులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. అయితే, పోరెన్సిక్ నివేదిక తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని మంథని సీఐ స్వామి తెలిపారు. కాగా, దినేశ్వరి ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. -
మా గోడు పట్టించుకోండి సారూ..
గంగాధర: తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని, గ్రామస్తులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని 38 రోజులుగా రిలే నిరహార దీక్షలు చేస్తున్న గంగాధర మండలం నారాయణపూర్ వాసులు తమ గోడు పట్టించు కోండి సారూ.. అంటూ మంగళవారం మధురానగర్‌లోని ప్రజా కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి సమస్యలు విన్నవించారు. చెరువుకట్ట పనులు పూర్తయితే తమ గ్రామంలోకి జాలు నీరు వస్తుందని, ఇండ్లలోకి పాములు, తేల్లు వస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలోని కొన్ని ఇండ్లను మాత్రమే ముంపు కింద తీసుకొని తమకు అన్యాయం చేయవద్దన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ను నారాయణపూర్‌కు తీసుకువచ్చి సమస్యను వివరించానని గుర్తు చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామస్తులను జిల్లా కలెక్టర్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వద్దకు తానే తీసుకెల్తానని హామీ ఇచ్చారు. ముంపు కింద తీసుకున్న ఇండ్లు అర్హత లేనివైతే విచారణ చేపట్టి తొలగించాలని తహసీల్దార్ రజితకు సూచించారు. నగర అభివృద్ధిలో ఇంజినీర్లే కీలకం కరీంనగర్‌కార్పొరేషన్: నగర అభివృద్ధికి ఇంజినీర్లు వెన్నెముక లాంటి వారని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా నగరపాలకసంస్థ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నవ సమాజ నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ కరీంనగర్‌ను ఆధునిక, సుందర, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ఇంజినీర్లు మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. కెనాల్లోకి నీరు విడుదల చేయాలి కొత్తపల్లి(కరీంనగర్): వినాయక నిమజ్జన నిర్వహణకు చింతకుంట కెనాల్లోకి నీటిని విడుదల చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. చింతకుంట కెనాల్ నిమజ్జన కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఎస్సారెస్పీలో నీరు లేనందున విడుదలపై అనుమానాలున్నట్లు సమాచారం ఉందని, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వంతో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేయాలని సూచించారు. ఎస్సారెస్పీ సీఈ సుమతితో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే కనీసం 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి అడ్డుకట్ట వేయడం ద్వారా 10–12 అడుగుల మేర నీటిని నిల్వ చేయవచ్చని తెలిపారు. నిమజ్జన సమయంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్ ప్రదీప్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆశీర్వాద దీపం’.. రక్తదాన శిబిరాలు
కరీంనగర్: గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకు ని ఈనెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘సేవా సంకల్ప్ అభియాన్–జన్ సేవా హీ ప్రభు సేవా’ పేరిట దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం కరీంనగర్లో మాట్లాడారు. గురువారం సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో ప్రజలు దీపాలు వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో ఉండాలని ప్రార్థించాలని సంజయ్ పిలుపునిచ్చారు. అదే రోజు దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరా లు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ‘సేవ–అంకితభావం–25 ఏళ్లు’, ‘వికసిత భారత్’ అంశాలపై చిత్రలేఖనం, ప్రసంగ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 25 నుంచి వచ్చేనె ల 7 వరకు ‘అంగన్ మిలన్ సేవ’లో భాగంగా అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను సన్మానిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామా ఆర్టిస్టుల్లా మా రాయని బండి సంజయ్ విమర్శించారు. అవినీతి అనే నాణేనికి ఆ రెండు పార్టీలు బొమ్మా బొరుసులాంటివని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలంతా శుద్ధపూసలా? ఒక్క అవినీతి కూడా చేయలేదా? అని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడుతున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ అవినీతిపై బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగించలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కేంద్రం ఆదుకోవాలని కోరుతున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలోనూ భూములు అమ్ముకుని ప్రభుత్వం నడిపే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ తరహా పరిస్థితుల్లోకి రాష్ట్రం వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విమోచన దినోత్సవం ఘనంగా.. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని సంజయ్ తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా విమోచన దినోత్సవాలు నిర్వహించడంతో పాటు తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చుతామని ప్రకటించారు. మేయర్ కొలగాని శ్రీనివా స్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్‌రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
ఇయ్యాల్టి నుంచి జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 70వ జిల్లాస్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అండర్–14, 17 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బన్సిలాల్ తెలిపారు. ఈ టోర్నమెంట్ ద్వారా ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనే కరీంనగర్ జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. హాజరయ్యే క్రీడాకారులు ఎల్జిబిలిటీ ఫాంతో రిపోర్ట్ చేయాలని సూచించారు. 16న అండర్– 17 బాలికలకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్,– 17న అండర్– 14 బాలికలకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, 18న అండర్– 17 బాలురకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, 19న అండర్ 14 బాలురకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తారు. -
గణేశ్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
కరీంనగర్‌క్రైం:గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో నేర నియంత్రణ, పెండింగ్ కేసులు, సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారుల భద్రత, డ్రగ్స్, ట్రాఫిక్ తదితర అంశాలపై సమీక్షించారు. గణేశ్ మండపాల వద్ద సీసీ కెమెరాలు, వలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. మానకొండూరు, కొత్తపల్లి, చింతకుంట తదితర నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, విద్యుత్ సదుపాయం, గజ ఈతగాళ్లతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శోభా యాత్ర మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియాలో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల 12న నిర్వహించిన జాతీయ లోక్ అదా లత్‌లో కమిషనరేట్ పరిధిలో 4,268 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి.కృష్ణమూర్తి పాల్గొన్నారు. అర్బన్ బ్యాంకు సమావేశం వాయిదాకరీంనగర్ అర్బన్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేఽశం అనుకున్నట్లే వాయిదా పడింది. కోరం ఉంటేనే సమావేశం జరగాల్సి ఉండగా వన్ బై టెన్ హాజరుకావాల్సి ఉండగా సుమారు 1800 మంది వస్తే సర్వసభ్య సమావేశానికి అవకాశం ఉంటుంది. ఆదివారం స్థానిక అంబేద్కర్ మైదానంలో జరిగిన సమావేశానికి 300 మంది మాత్రమే హాజరయ్యారు. కరీంనగర్, గంగాధర, జగిత్యాల బ్రాంచ్‌లకు సంబంధించి 8వేలకు పైగా సభ్యులున్నారు. కోరం నిండాలంటే మరో 1500 మంది అవసరం కాగా కొంత సేపు వేచిచూశారు. చివరికి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు బ్యాంక్ సీఈవో శ్రీనివాస్ వెల్లడించారు. వాయిదా పడ్డ సమావేశాన్ని ఈ నెల 27న రెవెన్యూ గార్డెన్లో నిర్వహించాల్సిందిగా కోరుతూ జిల్లా సహకార అధికారికి లేఖ రాసినట్టు పీఐసీ చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి వివరించారు. పీఐసీ సభ్యులు మడుపు మోహన్, లక్ష్మణరాజు, ముక్క భాస్కర్, అలుగు విద్యాసాగర్, మూల లక్ష్మి, మార్క రాజు, నాగుల సతీష్, మంగి రవి, షాముద్దీన్, సాయికృష్ణ, ముద్దసాని క్రాంతి పాల్గొన్నారు. ‘దళిత బంధు’ నేను తెప్పిస్తాజమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గానికి రెండో విడత దళిత బంధు నిధులు ఎలా తెప్పి ంచాలో తనకు తెలుసని మాజీ మంత్రి, ఎంఎంఎస్ వ్యవస్థాపకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన మాదిగల అత్మీయ సమ్మేళనంలో మోత్కుపల్లి నర్సింహులు, కాంగ్రెస్ హు జూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ నియోజకవర్గంలో దళితబంధు రెండో విడత రావడం లేదని పలువురు తనను కలిశారని, ఇప్పటికే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో చర్చించగా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. స్వాతంత్య్రం నుంచి రెడ్లే సీఎంలు ఉన్నారని, మాదిగల ఓట్లతోనే గెలిచారన్నారు. రూ.10వేల కోట్ల విలువైన లీడ్ క్యాప్ భూములను కాపాడి మాదిగలకు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ప్రణవ్ మాట్లాడుతూ దళితబంధు నిధుల విడుదల ప్రక్రియ ను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం 8వేల మందికి నిధులు ఇవ్వకుండా ఓట్ల కోసం వాడుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం 2025లో తిరిగి గ్రౌండింగ్ చేసి 5వేల మందిని గుర్తించిందన్నారు. కరీంనగర్‌టౌన్: రైస్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు మిల్లర్లు నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించారు. రైస్ మిల్ ఇండస్ట్రీపై ఆధారపడి వేలాది మంది కార్మికులు జీవిస్తున్నారని, వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. -
ప్రజా రవాణా మరింత చేరువ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘టీజీఎస్ ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా మేనేజ్మెంట్ పనిచేస్తోంది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నాం. ఇప్పుటివరకు 6.91 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి ద్వారా ప్రయాణించి, రూ.308.84 కోట్ల వరకు లబ్ధి పొందారు. ఈ పథకం గొప్ప మైలురాయి సాధించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ పాలసీ పరిధిలోనిది. రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో 997బస్సులు రోజుకు 3లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి. తద్వారా రూ.2.5కోట్ల ఆదాయం సమకూరుతోంది’ అని ఆర్టీసీ కరీంనగర్ ఆర్ఎం రాజు పేర్కొన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వివరించారు. -
ఏకదంతుడి ఆగమనం
సోమవారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026మార్కెట్లో సందడి.. నేడు వినాయక చవితికరీంనగర్ కల్చరల్: చవితి పండుగ వచ్చేసింది. గల్లీగల్లీలో సంబురాలు తీసుకొచ్చింది. ఊరూరా గణేశ్ ఆగమనం వైభవంగా జరుగుతుండగా.. మార్కెట్లో పండుగశోభ నెలకొంది. గణనాథుడి పూజకు అవసరమైన సామగ్రి, విగ్రహాల కొనుగోలుతో ఆదివారం కరీంనగర్ మార్కెట్ కిటకిటలాడింది. మట్టి, పర్యావరణహిత ప్రతిమలు వివిధ ఆకృతులు, పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి. నచ్చిన విగ్రహాన్ని కొనుగోలు చేస్తూ.. భక్తులు డప్పుచప్పుళ్లు.. డీజే మోతలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. భాద్రపద శుద్ధ చవితి సోమవారం రోజున ప్రారంభమయ్యే ఉత్సవాలు నవరాత్రుల పాటు కొనసాగుతాయి. ఊరూవాడ గణపతి బప్పా నామస్మరణలతో మార్మోగనుంది. వెలుగులు విరజిమ్మే మండపాలు.. భజనలు.. పూజలు.. అభిషేకాలు .. అర్చనలు.. అన్నదానాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది.నగర శివారులోని వినాయకుల విక్రయ దుకాణం నుంచి భారీ విగ్రహాన్ని తీసుకెళ్తున్న నిర్వాహకులుమార్కెట్లో పూజకు పత్రి కొనుగోలు చేస్తున్న భక్తులుబుజ్జి గణపయ్యలను పరిశీలిస్తూ.. -
దాచింది ఎందుకో!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కొత్తగా కొనుగోలు చేసిన శానిటేషన్ వాహనాలు వినియోగంలోకి తీసుకురాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడు నెలల నుంచి కోర్టు ట్యాంక్ ఆవరణలోనే వృథాగా ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే క్రమంలో బేరం కుదరకనే ఉపయోగంలోకి తేవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త వాహనాల కొనుగోలు నగరంలో శానిటేషన్ పనులకు కొత్తగా స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. స్వచ్ఛ ట్రాక్టర్లను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఆ ట్రాక్టర్లపై డ్రైవర్లను నియమించే సమయంలోనూ శానిటేషన్ అధి కారులు కొందరు పోస్టులు అమ్ముకున్నట్లు, రూ.35 వేలు ఇస్తేనే డ్రైవర్‌గా నియమించారనే ఆరోపణలు వచ్చాయి. స్వచ్ఛ ఆటోల్లో కొన్ని వినియోగంలోకి తీసుకురాగా, ఐదు ఆటోలు గత ఏడు నెలలుగా కోర్టుట్యాంక్ ఆవరణలో వృథాగా పడి ఉండడం ఇప్పుడు వివాదంగా మారింది. ఇటీవల రెండు ఫాగింగ్ ఆటోలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడంతో పారిశుధ్య వాహనాల వినియోగం అధికంగా ఉంటుంది. రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన వాహనాలను వినియోగంలోకి తేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. బేరం కుదరకనే బల్దియా డబ్బుతో కొనుగోలు చేసిన స్వచ్ఛ ఆటోల నిర్వహణ భారం పడకుండా, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్న ట్లు సమాచారం. ప్రైవేట్ వ్యక్తులు ప్రతి ఇంటి నుంచి రూ.50 వసూలు చేస్తుంటారు. మున్సిపల్ ఆటోలు వసూలు చేయవు. నగరపాలకసంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేసిన ఆటోలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నం పక్కదారి పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆటో డీజిల్, డ్రైవర్, లేబర్, నిర్వహణను తప్పించుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారు. సదరు వ్యక్తి ఇంటింటి నుంచి రూ.50 వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నగరవ్యాప్తంగా ఇంటి నుంచి చెత్త సేకరించేందుకు రూ.50 వసూలు చేసే విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు మొగ్గుచూపుతున్నారు. ఉన్నతాధికారుల నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలుచుకొన్న కొంతమంది అధికా రులు అవినీతికి తెరతీశారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఆటో అప్పగించాలంటే రూ.లక్ష కార్పొరేషన్లో డిపాజిట్ చేయాలని, రూ.లక్ష తమకు ఇవ్వాలంటూ బేరం సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. బేరం కుదరక, కొన్ని ఆటోలను నెలల తరబడి వృథాగా ఉంచుతున్నట్లు ప్రచారం సాగుతోంది.రూ.2 లక్షలకు అమ్ముకుంటున్నారు – సర్దార్ రవీందర్ సింగ్, మాజీ మేయర్ స్వచ్ఛ ఆటోలను ప్రైవేట్ వ్యక్తులకు రూ.2 లక్షలకు అమ్ముకుంటున్నారని మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. ఆదివారం కోర్టుట్యాంక్ ఆవరణలోని వాహనాలను పరిశీలించారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలు ప్రారంభం కాకముందే మరమ్మతులకు పోయేలా ఉన్నాయన్నారు. ఎంహెచ్ ఒక వాహనానికి రూ.2 లక్షలకు మాట్లాడుకున్నట్లు తమకు అనుమానం ఉందన్నారు. ఓ వైపు దోమలు విజృంభిస్తుంటే మరో వైపు ఫాగింగ్ మిషన్లు ప్రారంభించక పోవడం ఏంటని ప్రశ్నించారు. నగరపాలకసంస్థ కమిషనర్ ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. -
ఇంటింటా అందిస్తూ..
సిరిసిల్లటౌన్/పెద్దపల్లి/మెట్పల్లి/ధర్మపురి: సిరిసిల్ల బల్దియా, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏటా ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది సైతం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సిరిసిల్లలోని చింతోజు భాస్కర్ మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పదేళ్లుగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. 24వ వార్డులో మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీనిధి పరస్పర సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. పదిహేనేళ్లుగా వార్డులోని 350 ఇళ్లకు మట్టి వినాయకులను అందిస్తున్నారు. శివనగర్ రాజరాజేశ్వరస్వామి ఆలయం వేదికగా ఏడాదికి 2 వేల వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తున్నారు. ● పెద్దపల్లికి చెందిన దేవసాని పద్మ కుటుంబం పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పదేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ● మెట్పల్లి లయన్స్‌క్లబ్ సభ్యులు మట్టి గణపతులను పూజించాలని ప్రచారం చేస్తున్నారు. 2009లో మెట్పల్లిలో లయన్స్‌క్లబ్ ఏర్పాటు చేశారు. ఏటా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు తెలిపారు. ● ధర్మపురికి చెందిన గాజు భాస్కర్ పట్టణంలోని వివిధ వార్డుల్లో 500 మందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు వద్దని.. మట్టి విగ్రహాలను పూజిద్దామని ప్రచారం చేస్తున్నారు. -
త్వరలో కరీంనగర్లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్
కరీంనగర్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను త్వరలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాం పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌లో ప్రారంభించింది. విశేష స్పందన లభించడంతో మధిర, మంథని, మంచిర్యాల ప్రాంతాల్లోనూ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. ఈ పద్ధతి విజయవంతం కావడంతో కరీంనగర్లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ సిద్ధం చేసారు. ఇక్కడి నుంచి కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజక వర్గ పరిధిలోని 17 మండలాల్లో ఉన్న 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 49,025 మంది విద్యార్థులకు ప్రతిరోజూ రుచికరమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారాన్ని అందిస్తారు. మెనూలో ప్రతిరోజు ఒక వైరెటీ ఉంటుంది. సోమవారం ఇడ్లీ– సాంబార్, మంగళవారం: పూరి– ఆలు కుర్మా, బుధవారం దోష– చెట్నీ, గురువారం ఉప్మా– చెట్నీ, శుక్రవారం మిల్లెట్ ఇడ్లీ– సాంబార్, శనివారం బోండా– చట్నీ అందించనున్నారు. విద్యార్థులకు రోజు విడిచి రోజు పాలు అందిస్తారు. ఉదయం పూట పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత, పాఠశాల హాజరు మెరుగుపడేలా కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నారు. -
ఉత్సాహంగా చెస్ ఎంపికలు
కరీంనగర్‌స్పోర్ట్స్: యునైటెడ్ కరీంనగర్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అండర్–15 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా పలువురిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. బాలుర విభాగంలో కట్టా శ్రీవాస్తవ్, వాసుదేవ్, విశ్రుత్ రామ్, కూన సదంజన మన్వీర్సింగ్ ఎంపికయ్యారు. బాలికల విభాగంలో సామ సహస్రరెడ్డి, కూన వైష్ణవి, లక్షణ వాత్సల్య రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వీరిని జిల్లా చదరంగ సమాఖ్య బాధ్యులు అంతగిరి రాజేంద్రప్రసాద్, విశ్వనాథ్ ప్రసాద్, కొప్పర్తి శివయ్య, చీఫ్ ఆర్బిటర్ ప్రేమ్ సాగర్ అభినందించారు. -
అదుపు తప్పిన ట్రాక్టర్.. ఒకరికి తీవ్రగాయాలు
శంకరపట్నం: మండలంలోని తాడికల్ నేషనల్ హైవే– 563 బ్రిడ్జి క్రింద ఆదివారం ట్రాక్టర్ అదుపుతప్పింది. కేశవపట్నం గ్రామానికి చెందిన పాశం జశ్వంత్ (14) తీవ్రంగా గాయపడ్డాడు. కేశవ పట్నం మెయిన్ రోడ్డుకు చెందిన 16ఏళ్ల లోపు సుమారు 20మంది బాలురు వినాయక విగ్రహం కొనుగోలు చేసేందుకు ట్రాక్టర్లో బయల్దేరారు. తాడికల్ అండర్‌పాస్ బ్రిడ్జి కింద ట్రాక్టర్ అదుపుతప్పింది. ట్రైలర్ ఒకవైపు ఒరిగింది. వాహనంలో ఉన్న జశ్వంత్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మిగతావారు ట్రాక్టర్‌పై నుంచి రోడ్డుపై దూకేశారు. జశ్వంత్‌ను ఈఎంటీ సతీశ్‌రెడ్డి ప్రథమ చికిత్స చేసి 108లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. -
సౌత్‌జోన్ స్విమ్మింగ్ పోటీలకు ఎంపిక
హుజూరాబాద్: పట్టణాని కి చెందిన యువ స్విమ్మర్ రిమోన్ జాతీయస్థాయి దిశగా అడుగు వేశాడు. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఈ నెల 15 నుంచి 18వరకు నిర్వహించనున్న సీబీఎస్ఈ సౌత్‌జోన్ స్వి మ్మింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. అండర్–14 విభాగంలోని 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో పోటీ పడనున్నాడు. పోటీల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్ 12న కోచ్‌తో కలిసి వరంగల్ నుంచి రైలులో తిరునెల్వేలికి బయలుదేరాడు. ఇటీవల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో గోల్డ్‌మెడల్ సాధించి సౌత్‌జోన్ పోటీలకు అర్హత సాధించాడు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధంతో సీబీఎస్ఈ ఈ పోటీలను నిర్వహిస్తోంది. చదువులోనూ.. క్రీడల్లోనూ రాణింపు హన్మకొండ భీమారంలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రిమోన్ చదువులోనూ ప్రతిభ కనబరుస్తూ తరచూ మొదటి ర్యాంక్ సాధిస్తున్నాడు. చిన్నతనం నుంచే ఈతపై ఆసక్తి ఉండటాన్ని గమనించిన తాత చందా గాంధీ అతడిని హుజూరాబాద్ క్లబ్ స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లి ప్రోత్సహించారు. ప్రస్తుతం స్విమ్మింగ్‌తో పాటు ఫుట్‌బాల్‌లోనూ రిమోన్ ప్రతిభ చూపుతున్నాడు. -
మట్టి కొరత.. ఇత్తడి విగ్రహం
కోరుట్లటౌన్: కోరుట్లలోని గాంధీరోడ్డులో గల పద్మశాలీ సంఘం భవనంలో 52 ఏళ్లుగా ఇత్తడి గణపతి ప్రతిష్టాపన ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇత్తడి గణపతిని దర్శించుకునేందుకు కోరుట్లతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. సుమారు 52ఏళ్ల క్రితం మట్టి దొరకని కరువు పరిస్థితుల్లో విగ్రహం తయారీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అప్పటి పద్మశాలీ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మద్రాసు నుంచి ఇద్దరు శిల్పులను కోరుట్లకు రప్పించి పంచలోహాలతో గణపతి విగ్రహాన్ని తయారు చేయించారు. అప్పటి నుంచి నేటి వరకు అదే విగ్రహానికి పూజలు చేస్తున్నారు. నవరాత్రులు ముగిసిన అనంతరం ఇత్తడి గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పవిత్ర జలాలను విగ్రహంపై చల్లి తిరిగి పద్మశాలీ సంఘం భవనానికి తీసుకువచ్చి భద్రపరుస్తారు. -
యోగా చాంపియన్ కరీంనగర్
కరీంనగర్‌స్పోర్ట్స్/కొత్తపల్లి: కరీంనగర్ కొత్తపల్లిలో ని అల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో జరుగుతున్న 13వ రాష్ట్రస్థాయి యోగా పోటీలు శనివారంతో ము గిశాయి. కరీంనగర్ జిల్లా క్రీడాకారులు మొత్తంగా 43 పాయింట్లు సాధించి వరుసగా 17వ సారి ఓవరాల్ చాంపియన్ షిప్ కై వసం చేసుకున్నారు. తలో 17 పాయింట్లతో రంగారెడ్డి, మేడ్చల్ ద్వితీయస్థానం, 11 పాయింట్లతో నిజామాబాద్ మూడోస్థానంలో నిలిచాయి. పోటీల్లో రాణించిన క్రీడాకారులను అక్టోబర్ 3 నుంచి జైపూర్‌లో జరిగే జాతీయ పోటీలకు ఎంపిక చేసినట్లు తెలంగాణ యోగా సంఘం ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి తెలిపా రు. విజేతలకు అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి ట్రోపీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే డిసెంబరులో తెలంగాణలో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో యోగా క్రీడాకారులు అత్యధిక పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ యోగాకు కరీంనగర్ చిరునామాగా నిలవడం ఆనందంగా ఉందన్నారు.ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.సిద్ధారెడ్డి మాట్లాడుతూ వరుసగా 17వసారి కరీంనగర్ చాంపియన్‌గా నిలవడం ఇక్కడి క్రీడా ప్రతిభకు నిదర్శనం అన్నారు. తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, కన్నకృష్ణ, కమలాకర్, గుంటి రామకృష్ణ, మనోజ్, స్వరూపాచారి, గంగాధర్, కిష్టయ్య, మల్లీశ్వరీ, ఆనంద్ కిశోర్, సందీప్ పాల్గొన్నారు. -
ఎనౖభై ఏళ్ల వేడుక
సిరిసిల్లటౌన్: 80ఏళ్ల గణపయ్య ఉత్సవాలకు సిరిసిల్ల ముస్తామైంది. స్వాతంత్య్రానికి ముందే స్థానిక గాంధీచౌక్‌లో అప్పటి పుర ప్రముఖులు రుద్ర శంకరయ్య, మడూరి అంబాజి, భీమనాఽథిని నారాయణ, కుడిక్యాల రాజా రాం, ఎలగొండ నారాయణ మొదటి గణపతిని నెలకొల్పారు. ప్రస్తుతం మార్కండేయ భవనంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 80వ వార్షికోత్సవం జరుపుతుండగా అధ్యక్షుడిగా దూడం శంకర్ ఉన్నారు. ఆర్యవైశ్యులు ఆధ్వర్యంలో 1948 నుంచి నవరాత్రులకు అంకురార్పణ చేశారు. పెద్దబజారు హన్మాన్ ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎనభై ఏళ్లక్రితం పట్టణ ప్రముఖులు వినాయక ఉత్సవ సంఘం నెలకొల్పారు. వారి ఆదర్శంలోనే మేము వేడుకలు జరుపుతున్నాం. ప్రతి ఏడాది ఏకదంతుడికి నిత్య కై ంకర్యాలు, అన్నదానాలు ఇదే విధంగా నిర్వహిస్తాం. – డి.శంకర్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు -
63 ఫీట్ల ఎకో గణేశుడు
హైదరాబాద్ తర్వాత పెద్దపల్లికి గుర్తింపు వచ్చేలా భారీ మట్టిగణపతిని ఏర్పాటు చేస్తున్నాం. నవరాత్రోత్సవాల్లో ప్రముఖుల ప్రవచనాలు, లక్షపుష్పార్చన, మహాహారతి, సహస్రదీపాలంకరణ ఇలా రోజుకో ప్రత్యేక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. – శివంగారి సతీశ్, ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడుపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈసారి 63అడుగుల పంచముఖ గణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు శివంగారి సతీశ్ ఆధ్వర్యంలో ఏటా భారీ ఎకో గణేశుడు పూజలందుకుంటున్నాడు. 31ఏళ్లుగా ఉత్సవాలను నిర్వహిస్తుండగా.. ఎనిమిదేళ్లుగా భారీ మట్టి గణపతులను ఏర్పాటు చేస్తున్నారు. 36 ఫీట్ల ఎత్తుతో మొదలై ఈ ఏడాది 63 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంటున్నాడు. ఖైరతాబాద్ తర్వాతిస్థానంలో పెద్దపల్లిలోనే భారీ గణేశుడు కొలువుదీరేలా నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. -
లోక్ అదాలత్‌లో 4,384 కేసులు పరిష్కారం
● జిల్లా జడ్జి ఎస్.శివకుమార్ కరీంనగర్‌క్రైం: రాజీ ద్వారా కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని, అందుకు లోక్ అదా లత్ సరైన వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్.శివకుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్‌లో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 4,384 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. వీటిలో సివిల్ 19, క్రిమినల్ 4,241, సైబర్ క్రైం 15, కోర్టుకు రాని కేసులు 50 పరిష్కరించినట్లు తెలిపారు. మోటారు ప్రమాద కేసులు 59 పరిష్కరించి, బాధితులకు రూ.3,27,43,000 పరిహారం అందిచినట్లు పేర్కొన్నారు. రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలనుకునే వారు పోలీ సు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని సూచించారు. సీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్‌జీ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లలో రాజీ చేయదగిన క్రిమినల్ కేసుల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తున్నామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్ పాల్గొన్నారు. సమయపాలన పాటించాలికరీంనగర్: జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాల ని, లేకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు ఆదేశించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యం కోసం వచ్చే వారికి తప్పనిసరి అందుబాటులో ఉండాలన్నారు. శనివారం నగరంలోని బుట్టి రాజారాంకాలనీ పీహెచ్‌సీతో పాటు పలు ఆస్పత్రులను సందర్శించి వైద్యులతో మాట్లాడారు. హాజరు రిజిస్టరు పరిశీలించారు. అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని ఆందోళనమానకొండూర్: మండలంలోని శ్రీనివాస్‌నగర్ శివారులో నేషనల్ హైవే 563పై గ్రామానికి చెందిన మహిళలు ఆందోళన చేపట్టారు. నేషనల్ హైవేతో వ్యవసాయ పొలాలకు రాకపోకలు దూరమయ్యాయని, అండర్‌పాస్‌లు ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రెండు అడుగుల దూరంలో ఉన్న వ్యవసాయ భూములు ఇప్పుడు 3 కిలోమీటర్ల దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల వద్దకు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, హార్వేస్టర్లు వెళ్లేలా అండర్‌పాస్ ఏర్పాటు చేయాలన్నారు. అక్కడికి చేరుకున్న నేషనల్ హైవే సిబ్బంది సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమింపజేశారు. బర్త్ సర్టిఫికెట్.. బహుపరాక్కరీంనగర్ అర్బన్: జనన, మరణ ధ్రువీకరణ పత్రం ఇక మరింత కఠినతరమైంది. వయసు ఎక్కువుంటే ఆర్డీవో ద్వారా తీసుకుంటామనుకుంటే పొరపాటే. మారిన నిబంధనల క్రమంలో బర్త్ సర్టిఫికెట్ కావాలంటే కోర్టును ఆశ్రయించాల్సిందే. జనన ఽధ్రువీకరణ పత్రాల జారీలో భారత ప్రభుత్వం మార్పులు చేయగా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలిచ్చింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్(అమెండ్మెంట్) యాక్ట్ 2026 ప్రకారం జనన, మరణాల ఆలస్య రిజిస్ట్రేషన్‌కు సంబంధించి నిబంధనలు మార్చారు. జననం లేదా మరణం జరిగి రెండు సంవత్సరాలలోపు అయితే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటే ఆర్డీవో ధ్రువపత్రాన్ని జారీ చేస్తారు. అలాగే జననం లేదా మరణం జరిగి రెండు సంవత్సరాలు దాటితే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జారీ చేయనున్నారు. రికార్డులను పరిశీలించి నిర్ధారణ అయితేనే ఽధ్రువపత్రం జారీ చేస్తారు. -
ఊరంతా ఒకే దేవుడు
మంథని రూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామంలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు ఉంటారు. అందరు కలిసికట్టుగా ఒకే మాటపై నిలబడతారు. అందరికి ఏదోఒక కుటుంబ బంధం ఉంటుంది. ప్రతీ పండుగను కలిసి చేసుకుంటారు. 30ఏళ్లుగా గ్రామస్తులు ఒక్కతాటిపై నిలిచి ఊరు మొత్తంలో ఒకే గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. గ్రామ నడిబొడ్డున ప్రతిమను ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి ఊరంతా కలిసి గోదావరినదిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1990లో నలుగురు వ్యక్తులు కలిసి గణనాథుడిని ప్రతిష్టించాలని ఆలోచన చేశారు. తాటా కులతో మండపం వేశారు. అదే ఆనవాయితీతో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. -
మంథనిలో శతాబ్దపు ఉత్సవాలు
మంథని: మంత్రపురిలో 110 ఏళ్లుగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్థానిక బ్రాహ్మణ సామాజికవర్గం వంటలు చేసేందుకు నాగ్‌పూర్‌కు వెళ్లేవారు. అక్కడి సాంప్రదాయాన్ని మంథనికి తీసుకొచ్చి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. నాగ్‌పూర్, మంథని మినహా దేశంలో ఎక్కడా సిద్ధి..బుద్ధి(భార్యలు) విగ్రహాలతో గణేశ్ దర్శనం లభించదు. మంథని పెంజేరుకట్ట హనుమాన్ ఆలయంలో సిద్ధి, బుద్ధి గణపతి ఉత్సవాలను 1916 నుంచి నిర్వహిస్తున్నారు. మోతారాం గారి రాజేశ్వర్‌రావు, టక్కేగారి మల్లన్న, మంథని లింగయ్య ఆధ్వర్యంలో ఆనాడు ఉత్సవాలు జరిగేవి. నడివీధిలో 1918 నుంచి నిర్వహిస్తున్నారు. మందాట వీదిలో గత 65 ఏళ్లుగా అఖండ గండదీపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. -
డీజేలు బంద్.. సోషల్ మీడియాపై నిఘా
ఈసారి గణేశ్ మండపాల కోసం 3వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. అందులో 1000వరకు ఆన్లైన్లో, మిగిలినవి ఆఫ్‌లైన్‌లో వచ్చాయి. అన్నింటికి అనుమతులు ఇచ్చాం. నిమజ్జనం ఏ రూట్లో వెళ్లాలి? ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర అంశాలపై అవగాహన కల్పించాం. మండపాల వద్ద ఏ ర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాం. మండపాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశాం. ఫైర్ సేఫ్టీ నిబంధనలు, ఏర్పాట్లు వివరిస్తూ గైడ్లైన్ బుక్‌లు ఇచ్చాం. ప్రతీరోజూ ఒక భక్తుడు మండపంలో నిద్రించాలి. ఆసుపత్రులు, కొన్ని సున్నిత ప్రాంతాల వద్ద ఇబ్బందులు కలిగే నేపథ్యంలో డీజేలకు అనుమతి లేదు. సాధారణ స్పీకర్లు వాడుకోవచ్చు. నిమజ్జన కేంద్రాల వద్ద ఏర్పాట్ల విషయంలో మైనింగ్ (క్రేన్లు), అంబులెన్స్ (హెల్త్), శానిటేషన్ (మున్సిపల్), లైటింగ్ (ఎలక్ట్రిసిటీ), రోడ్లు (ఆర్ అండ్ బీ), ఆర్టీసీ, అగ్నిమాపక, ఇరిగేషన్ అన్నిశాఖలతో సమన్వయం చేస్తున్నాం. కమిషనరేట్ పరిధిలో అవకాశమున్న మూడు సున్నిత ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. పండుగ నేపథ్యంలో సోషల్ మీడియాపై నిరంతరం నిఘ ఉంది. సహయోగ్ పోర్టల్ ద్వారా కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియాపై 24 గంటల నిఘా పెట్టాం. ఎలాంటి వదంతులు, నెగెటివ్ కామెంట్లు పెట్టినా చర్యలు తీసుకుంటాం. కంటెంట్‌ను వెంటనే డిలిట్ చేస్తాం. వదంతులు నమ్మొద్దు. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా సమీపంలోని పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. మండపాల వద్ద ప్రతీ రోజు గస్తీ నిర్వహిస్తాం. బైక్ పెట్రోలింగ్ టీంలు, పెట్రోకార్లతో 24 గంటలపాటు గస్తీకి ఏర్పాటు చేశాం. నిమజ్జనం రోజూ ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఎలక్ట్రిసిటీ, హెల్త్, పోలీస్, ఫైర్, మున్సిపల్, ఇరిగేషన్, మైనింగ్, ఆర్టీసీ, ఆర్అండ్ బీ తదితర శాఖలతో కలిసి జాయింట్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నాం. ఆయాశాఖల సిబ్బంది 24 గంటలపాటు మూడు షిప్టుల్లో అందుబాటులో ఉంటారు. శోభాయాత్ర నుంచి నిమజ్జన పాయింట్ల వరకు ఎక్కడ ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కారం చేసేలా ప్రణాళికలు రూపొందించాం. చింతకుంట, మానకొండూరు వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్తపల్లి చెరువు వద్ద రోడ్డు ఇరుకుగా ఉండటంతో విగ్రహాలతో వచ్చే వాహనాల ఎంట్రీ, ఎగ్జిట్లకు లక్ష్మీపూర్ వైపుగా ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నాం. ఇందుకోసం కలెక్టర్, ఇతర శాఖల అధికారులతో కొత్తపల్లి చెరువును పరిశీలించాల్సి ఉంది. ఇక్కడ అనుమతి వస్తే.. 300 వరకు విగ్రహాలు నిమజ్జనం చేసే వీలు దొరుకుతుంది. నిమజ్జనం రోజు మూడు నుంచి ఐదు ప్లాటూన్ల అదనపు బలగాలు వచ్చే అవకాశముంది.సీపీ గౌస్ ఆలం -
మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లి
● ఏరడపల్లిలో మాయలేడీ వీరంగంశంకరపట్నం: మంచినీళ్లు అడిగి ఓ మాయలేడీ మహిళ మెడలోంచి బంగారం దోచుకెళ్లింది. ఈ ఘటన శంకరపట్నం మండలం ఏరడపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కలకుంట్ల కమలాకర్‌రావు వ్యవసాయ పనులకు వెళ్లాడు. ఇంట్లో అతని భార్య సరోజన ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 2:30 గంటలకు గుర్తు తెలియని మహిళ వచ్చింది. తనకు ఏమైనా సాయం చేయాలని కోరింది. మంచి నీళ్లు కావాలని ఇంట్లోకి ప్రవేశించింది. ఒంటరిగా ఉందని గ్రహించి సరోజన మెడపై కత్తిపెట్టి బెదిరించింది. మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కుంది. సరోజనను ఇంట్లో బంధించి పారిపోయింది. సరోజన కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు తెరిచారు. కమలాకర్‌రావు ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాస్, ఎస్సై శేఖర్‌రెడ్డి పరిశీలించారు. గ్రామంలో సీసీఫుటేజీలు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులపై ఆగ్రహం
పెద్దపల్లి: ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులతో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శ్యామ్ ఉరివేసుకుని మృతి చెందాడని ఆరోపిస్తూ గ్రామస్తులు శుక్రవారం స్థానిక ఫైనాన్స్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. శ్యామ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.70 వేల అప్పు తీసుకున్నాడు. నాలుగు నెలలుగా వాయిదాలను సక్రమంగా చెల్లిస్తూ వచ్చాడు. ఈనెల కూలి సరిగా లభించక వాయిదా సకాలంలో చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ నిర్వాహకులు ఇంటి వద్దకు వచ్చి దుర్భాషలాడుతూ మానసికంగా వేధించారు. తీవ్ర మనస్తాపానికి గురైన శ్యామ్ ఉరివేసుకుని ఆత్మహత్య చెందాడు. ఆగ్రహించిన గ్రామస్తులు పెద్దపల్లికి చేరుకుని ఫైనాన్స్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిర్వాహకులు అప్పటికే కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారు. శ్యామ్‌కు ఇద్దరు సంతానం. అతడి మృతితో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రుణవసూళ్ల పేరుతో వేధింపులకు పాల్పడే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
అసెంబ్లీలో మనోళ్ల ముచ్చట
● భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి ● రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ● ముంపు గ్రామాల్లో ఫ్యాక్టరీలు అవసరం ● వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గోదావరిఖని/వేములవాడ: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలు శుక్రవారం జరిగగిన అసెంబ్లీ సమావేశాల్లో తమ గళం వినిపించారు. మిడ్‌మానేరు నిర్వాసిత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరగా.. తమ నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కోరారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలి మిడ్‌మానేరు ముంపు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటీ, ఇతర పరిశ్రమలు నెలకొల్పాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. పరిశ్రమలు, ఐటీ రంగాల స్థాపనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు కింద వేములవాడ పరిసరాల్లో సుమారు 12 గ్రామాలు ముంపునకు గురై ప్రజలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముంపు గ్రామాలను సందర్శించి సమస్యలు పరిశీలించారని గుర్తుచేశారు. పరిశ్రమల స్థాపనకు సరిపడా స్థలంతోపాటు జలాశయం ద్వారా అవసరమైన నీటి లభ్యత ఉందని సభ దృష్టికి తెచ్చారు. గల్ఫ్ వలసలకు అడ్డుకట్ట ఈ ప్రాంతం నుంచి ఉపాధి వెతుక్కుంటూ యువత భారీసంఖ్యలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారని, స్థానికంగా పరిశ్రమలు నెలకొల్పితేనే వలసలను శాశ్వతంగా నివారించవచ్చని విప్ విజ్ఞప్తి చేశారు. మహిళలకు అత్యాధునిక కుట్టు శిక్షణ కేంద్రాలను సిరిసిల్ల అపారెల్ పార్కు తరహాలో ఆధునిక హంగులతో షెడ్లను ఏర్పాటు చేసి యువతులు, మహిళల కోసం అత్యాధునిక కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. తద్వారా షర్టులు, ప్యాంట్లు, కుర్తాల తయారీ వంటి రంగాల్లో మహిళలకు స్వయం ఉపాధి చేకూరుతుందని వివరించారు. ఈ ప్రాంత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయండి.. రామగుండం నియోజకవర్గంలోని యువత ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. నియోజకవర్గ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిపై అసెంబ్లీలో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో ఐటీ సెంటర్ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రామగుండం ఇండస్ట్రియల్ బెల్ట్ అని, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా పేరుగాంచిందన్నారు. 800 మెగావాట్ల పవర్‌ప్లాంట్ పెట్టాలని, ఇందుకోసం 1,800 ఎకరాలను రైతుల నుంచి సేకరించి ఇచ్చారని అన్నారు. వారితో మాట్లాడి పరిశ్రమలు పెట్టాలని, లేనిపక్షంలో ఆ భూమిని వాపస్ తీసుకుని పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. బొగ్గు, విద్యుత్, నీళ్లు అన్నీ ఉన్న ప్రాంతమని, అంతర్గాంలో 500ఎకరాలు, రాయదండిలో 500ఎకరాలు, బసంత్‌నగర్‌లో వంద ఎకరాలు ఉన్నాయని, ఇక్కడ ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎయిర్‌పోర్టు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, కానీ ఫిజిబిలిటీ రిపోర్టు రాలేదని సభ దృష్టికి తీసుకెళ్లారు. ‘మన జిల్లా.. మన ఊరు’ విషయాన్ని గుర్తించి ఐటీమంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకోవాలని స్పీకర్ ద్వారా కోరారు. -
అట్టహాసంగా యోగా పోటీలు
● 24 జిల్లాల నుంచి వెయ్యి మంది క్రీడాకారులు హాజరు ● ప్రారంభించిన నరేందర్‌రెడ్డి, యోగా సంఘం బాధ్యులుకరీంనగర్స్పోర్ట్స్/కొత్తపల్లి: రాష్ట్రస్థాయి యోగా పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో 13వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల చాంపియన్‌షిప్ పోటీలకు 24 జిల్లాల నుంచి వెయ్యి మంది క్రీడాకారులు హాజరయ్యారు. తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పోషకుడు వి.నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. సబ్ జూనియర్ విభాగంలో 8–10, 10–12, 12–14, జూనియర్ విభాగంలో 14–16, 16–18 వయసు విభాగంలో పోటీలు నిర్వహించగా, రాణించిన ముగ్గురిని జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ 2036లో దేశంలో జరిగే ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు యోగాలో పాల్గొనే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రవీందర్ సింగ్ మాట్లాడుతూ జిల్లా అసోసియేషన్ యోగా అభివృద్ధికి విశేష కృషి చేస్తోందన్నారు. తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచేవారిని రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్, నల్గొండ క్రీడాకారుల యోగాసనాలు అబ్బురపరిచాయి. మల్లీశ్వరి, రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పోటీల్లో పాయింట్ల కేటాయింపును పారదర్శకంగా చూపించేందుకు తొలిసారిగా ఆన్‌స్క్రీన్ ప్రదర్శన ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.సిద్ధారెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి జి.జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు టి.రమేశ్‌రెడ్డి, యోగా సంఘం ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ, కమలాకర్, టి.మనోజ్ కుమార్ పాల్గొన్నారు. -
రాజన్నకు లాకర్ అందజేత
వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్(టీజీబీ) వేములవాడ శాఖ సిబ్బంది సుమారు రూ.45 వేల విలువైన లాకర్‌ను ఈవో రమాదేవికి శుక్రవారం అందజేశారు. ఆలయ పీఆర్వో పెరుక శ్రీనివాస్, అకౌంట్ అడ్వయిజర్ ఆగమరావు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వేములవాడ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయాలువేములవాడ: వేములవాడకు చెందిన నలుగు రు యువకులు ప్రయాణిస్తున్న వాహనం హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. వేములవాడకు చెందిన చందు, రాకేశ్, గౌతమ్, కళ్యాణ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వృద్ధురాలి మృతి రామగుండం: ఐవోసీ ఇందిరమ్మకాలనీ వద్ద రాజీవ్ రహదారిని శుక్రవారం రాత్రి బద్రిపల్లి గ్రామానికి చెందిన నాంసాని భూదమ్మ(80) రోడ్డు దాటుతోంది. కరీంనగర్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై సంధ్యారాణి తెలిపారు. విద్యుత్ కంచె తాకి రైతు..రుద్రంగి(వేములవాడ): పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి ఓ రైతు మృతిచెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రూప్లానాయక్ తండాలో విషాదం నింపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు. వన్యప్రాణుల నుంచి పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి రూప్లానాయక్తండాకు చెందిన రైతు భూక్య చందర్(52) శుక్రవారం అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని రుద్రంగి ఎస్సై మోతీరాం పరిశీలించి శవ పంచనామా చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మట్టి వాహనాలు సీజ్ పాలకుర్తి: పాలకుర్తి మండలం కన్నాల బోడగుట్ట నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు లారీలు, ఒక పొక్లెయిన్‌ను అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. తహసీల్దార్ సునీత హాధ్వర్యంలో ఆర్ఐ సంతోష్, జూనియర్ అసిస్టెంట్ మల్కారెడ్డితో పాటు రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని లోడ్‌చేస్తున్న ఒక పొక్లెయిన్, రెండు లారీలు సీజ్‌చేసి బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డీజే నిర్వాహకుల బైండోవర్ పెద్దపల్లిరూరల్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో డీజే వినియోగించవద్దంటూ పోలీసులు డీజే నిర్వాహకులను శుక్రవారం పెద్దపల్లి తహసీల్దా ర్ రాజయ్య ఎదుట బైండోవర్ చేశారు. నవరాత్రోత్సవాలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై నరేశ్ కోరారు. హెడ్ మాస్టార్‌పై కేసుసుల్తానాబాద్రూరల్: సుల్తానాబాద్ సబ్ ట్రెజరీలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్‌ను బెదిరించిన జూలపల్లి మండలం కుమ్మరికుంట హైస్కూల్ హెచ్ఎం మహేశ్‌పై గురువారం కేసు నమోదు చేసిన విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. హెచ్ఎం మహేశ్ గురువారం సుల్తానాబాద్‌లోని సబ్ ట్రెజజరీ అఫీస్‌కు వచ్చి తన స్కూల్ బ్యాంక్ అకౌంట్స్‌ను ఎందుకు తిరస్కరించారని అడిగారు. సరైన పత్రాలు సమర్పించలేకపోవడంతో తిరస్కరించినట్లు సీనియర్ అకౌంటెంట్ చెప్పినా వినకుండా ‘నీ అంతు చూస్తా’ అని భయబ్రాంతులకు గురిచేశారు. సీనియర్ అకౌంటెంట్ భాగ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. విదేశాల్లో ఉపాధి అవకాశాలువిద్యానగర్(కరీంనగర్): తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీలశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నమోదిత రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అర్హత, నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనెల 18న పేర్ల నమోదు కార్యక్రమం కరీంనగర్‌లోని నెహ్రూ యువకేంద్రంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శుక్రవారం తెలిపారు. వివరాలకు www. tomcom. telangana. gov. in వెబ్సైట్ లేదా 080 35524946 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
వినాయక చవితికి ప్రత్యేక రైళ్లు
● కోల్‌బెల్ట్‌వాసులకు సౌకర్యం ● నేటినుంచి సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రాకపోకలురామగుండం: వినాయక చవితి సందర్భంగా శనివారం నుంచి కోల్‌బెల్ట్ ప్రాంతాలకు రెండు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ‘చవితి పండుగకు ప్రత్యేక రైళ్లు ఏవీ’ శీర్షికన సాక్షి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనంపై స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం నుంచి వరుస సెలవులు రావడంతో హైదరాబాద్– సికింద్రాబాద్ జంట నగరాల నుంచి ప్రజలు స్వస్థలాలకు తరలివస్తున్నారు. వీరికోసం రెండు రోజులపాటు జనసాధారణ్ స్పెషల్ రైలు(07235) సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య నడిపిస్తారు. సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.10గంటలకు బయలుదేరుతుంది. చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్రోడ్డు, సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ఆగుతుంది. సిర్పూర్కాగజ్నగర్–సికింద్రాబాద్(07236) మధ్య నడిచే రైలు కాగజ్‌నగర్‌లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది. అయితే, పండుగ తర్వాత 15వ తేదీ నుంచి తిరుగు ప్రయాణాలకు సైతం మరోరెండు రోజులు ప్రత్యేక రైళ్లను నడిపించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కాగా, జాల్నా–తిరుపతి(07814/15 –వీక్లీ)రైలు నిజామాబాద్, పెద్దపల్లి మీదుగా రాకపోకలను నవంబర్ 27వరకు పొడిగించారు. అదేవిధంగా హెచ్ఎస్ నాందేడ్–తిరుపతి(07603/04వీక్లీ) నిజామాబాద్, పెద్దపల్లి మీదుగా నడిచే రైలు రాకపోకలను నవంబర్ 25 వరకు పొడిగించారు. -
ముఖం ఛిద్రమైనా.. ప్రాణం కాపాడారు
● జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స కోల్‌సిటీ: రోడ్డు ప్రమాదంలో ముఖం, దవడ ఎముకలు ఛిద్రమైన ఓ వ్యక్తికి గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. వైద్యులు, బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం కనగర్తిలో వ్యవసాయం చేసుకునే జీడి సదానందం గతనెల 30న రాత్రి జమ్మికుంట సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జమ్మికుంట, హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవడంతో ఈనెల 2న స్థానిక జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి అడ్మిట్ చేసుకున్నారు. ‘లీ ఫోర్ట్–3 బైలాటరల్ ఫ్రాక్చర్’ సదానందం ‘లీ ఫోర్ట్–3 బైలాటరల్ ఫ్రాక్చర్’కు గురయ్యాడని దంతవైద్య బృందం గుర్తించింది. డెంటల్ హెచ్‌వోడీ సుమలత ఆధ్వర్యంలో ఈనెల 9న మాక్సిల్లోఫేషియల్ సర్జన్ డాక్టర్లు శ్రవణ్ తేజ, లహరి, నైనా, అనెస్థీషియా హెచ్‌వోడీ భానులక్ష్మి, డాక్టర్లు రాజేశ్వరి, కరుణాకర్‌తో కలిసి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. అరుదైన విధానంతో ఆపరేషన్.. బాధితుని ముఖం, దవడ ఎముకలు విరగడంతో సాధారణ పద్ధతిలో శ్వాసనాళంలో ట్యూబ్ అమర్చడం సాధ్యం కాలేదు. దీంతో అనెస్థీషియా, డెంటల్ వైద్యులు ‘సబ్మెంటల్ ఇంట్యూబేషన్’ అనే అరుదైన విధానాన్ని ఉపయోగించి గడ్డం కింద నుంచి శ్వాస ట్యూబ్ అమర్చారు. నాణ్యమైన ఇంప్లాంట్లతో ముఖ ఎముకలను పునర్నిర్మించి, రెండు వైపులా విజయవంతంగా ఫిక్స్ చేశారు. సదానందం కోలుకోవడంతో శుక్రవారం వైద్యులు డిశ్చార్జి చేశారు. ఆపద సమయంలో అండగా నిలిచిన వైద్యుల సేవలను జీవితాంతం మచ్చిపోలేమంటూ బాధితుడు, అతడి కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. వైద్య బృందాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ హిమబిందుసింగ్, ఆర్ఎంవో కృపాబాయి అభినందించారు. -
తల్లీకొడుకులకు కన్నీటి వీడ్కోలు
● జాడలేని భర్త.. కడసారి చూపునకు నోచుకోని వైనం ● మనవడి చితికి తాత.. తల్లి చితికి పెద్ద కొడుకు నిప్పు ● చిన్నాభిన్నమైన కుటుంబంమల్యాల: ఆర్థిక ఇబ్బందులు.. అప్పులు ఆ కుటుంబాన్ని చీకట్లోకి నెట్టేశాయి.. నిన్నటి వరకు కంటికి రెప్పలా కాపాడుతూ.. నిత్యం పాఠశాలకు ఆలస్యం అవుతుందంటూ ఉదయమే నిద్రలేపే అమ్మ జాడ కానరావడం లేదు. తమ్ముడి అల్లరి వినపడడం లేదు. నెల రోజుల క్రితం ఉపాధి పేరిట ముంబయి వెళ్లిన తండ్రి జాడ లేదు. ఓ మూలకు తాత.. మరో మూలన పదకొండేళ్ల మనుమడు.. తల్లి చితికి పెద్ద కొడుకు నిఖిలేశ్, మనువడు శశాంక్ చితికి తాత నిప్పు పెట్టిన విషాదకర ఘటన అక్కడున్నవారిని కలచివేసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మల్యాలకు చెందిన గుండేటి కవిత(36) ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో కుమారుడితోపాటు ఈ నెల 10న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మద్యానికి బానిసైన భర్త ఒకవైపు.. సుమారు రూ.20లక్షలకుపైగా ఉన్న అప్పులు తీర్చే మార్గం కానరాక చిన్న కుమారుడితోపాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది. కడసారి చూపునకు నోచుకోని వైనం కుమారుడు శశాంక్‌తో సహా భార్య కవిత ఆత్మహత్య చేసుకోగా, భర్త గుండేటి దశరథం చివరి చూపునకు కూడా నోచుకోలేదు. మద్యానికి బానిసై న దశరథం కొంతకాలం గ్రామంలో పనిచేసి, ఉపాధి కోసం ముంబయి వెళ్లాడు. ఇప్పటి వరకు అతడి జాడలేదు. కవిత ఆత్మహత్య సమాచారాన్ని బంధువుల ద్వారా ముంబయిలో దశరథంకు చేరవేసేందుకు ప్రయత్నించగా అక్కడ లేడని తేలింది. 24గంటల తర్వాత మృతదేహం లభ్యం ఆత్మహత్య చేసుకున్న కవిత మృతదేహం లభ్యం కాగా, చిన్నారి శశాంక్(7) మృతదేహం కోసం 24గంటలపాటు బావిలో మోటార్లు ఆన్ చేసి, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. శుక్రవారం వేకువజామున శశాంక్ మృతదేహం లభ్యమైంది. తల్లి చితికి పదకొండేళ్ల కొడుకు, శశాంక్ చితికి తాత పండిత్ నిప్పంటించారు. తల్లీకొడుకుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
వైద్యం వికటించి గర్భిణి మృతి
● కొండాపూర్‌లో విషాదంకోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్‌లో ఆరు నెలల గర్భిణీ హారిక(25) మృతితో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన మల్యాల ప్రభాకర్–లక్ష్మి దంపతుల పెద్ద కూతురు హారికకు ఎనిమిది నెలల క్రితం కొడిమ్యాల మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణీ. వైద్యపరీక్షల కోసం ఇటీవల సిరిసిల్ల బస్టాండ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా.. గర్భంలో శిశువు ఎదుగుదల లేదని వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ శస్త్రచికిత్స చేసి శిశువును తొలగించారు. అనంతరం హారిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనలతో బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం రాత్రి హారిక మృతిచెందింది. భర్త బతుకుదెరువు కోసం గల్ఫ్‌లో ఉండగా, పెళ్లయిన ఎనిమిది నెలలకే హారిక అనంతలోకాలకు వెళ్లడంతో కొండాపూర్, రామకృష్టాపూర్ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొండాపూర్‌లో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. -
కష్టాలు హై..వే!
మానకొండూర్: ఎన్‌హెచ్– 563.. 68 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి.. కరీంనగర్– వరంగల్ మధ్య కొన్నేళ్లు నరకం చూసిన వాహనదారుల చిరకాల కోరిక. గుంతల రోడ్లపై రెండున్న గంటల ప్రయాణంతో ఇబ్బంది పడ్డ వాహనదారులు ఇప్పు డు రయ్రయ్యంటూ గమ్యం చేరుతున్నారు. ట్రయ ల్ రన్ నేపథ్యంలో సాఫీ ప్రయాణంతో పాటు సమ యం ఆదా అవుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్‌హెచ్–563 పక్కన ఉన్న గ్రామాల ప్రజలు తమ ఊరి నుంచి విశాలమైన రోడ్డు పడిందని మురిసిపోయే లోపే.. ఇవేం హైవే కష్టాలు అంటూ తల పట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల వద్ద ప్రారంభమయ్యే కరీంనగర్– వరంగల్ జాతీయ రహదారి మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్, అన్నారం, మానకొండూర్, ముంజంపల్లి, ఈదులగట్టెపల్లి, ఖాదర్‌గూడెం, చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి, శంశాబాద్, తాడికల్, అంబాల్‌పూర్, కేశవపట్నం, మొలంగూర్, కొత్తగట్టు లింగాపూ ర్ గుండా వరంగల్ వరకు విస్తరించింది. ఆయా గ్రామాలకు నేషనల్ హైవే నుంచి వెళ్లేందుకు అండర్‌పాస్ లేకపోగా.. రోడ్డు దాటేందుకు సర్కస్‌ఫీట్లు చేయాల్సి వస్తోంది. ఒక్కో గ్రామంలో ప్రజలు ఒక్కో కరమైన సమస్యతో సతమతమవుతున్నారు. -
విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా చర్యలు
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ● దుర్శేడ్ 220 కె.వీ.సబ్‌స్టేషన్ అకస్మిక తనిఖీ కొత్తపల్లి(కరీంనగర్): పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా చర్యలు చేపట్టాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. కరీంనగర్ జిల్లా దుర్శేడ్‌లోని 220 కే.వీ. విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. లోడ్ పరిస్థితులు, విద్యుత్ ప్రసార తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రిడ్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్ఈ శ్రీనివాస్, ఎస్ఈ (ఆపరేషన్స్) ఏ.విజయేందర్‌రెడ్డి, డీఈ టెక్నికల్ ఉపేందర్, డీఈ (ఆపరేషన్) జంపాల రాజం పాల్గొన్నారు. విద్యుత్ భద్రతకు పెద్దపీటకొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా నివారించి ‘జీరో యాక్సిడెంట్’ లక్ష్యాన్ని సాధించేందుకు కరీంనగర్ సర్కిల్ పరిధిలో సమగ్ర భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఈ ఏ.విజయేందర్ రెడ్డి తెలిపారు. జనవరి నుంచి ఇప్పటివరకు వదులుగా ఉన్న విద్యుత్ లైన్ల వద్ద 3,011 మిడిల్ పోల్స్, బలహీనంగా ఉన్న స్తంభాల స్థానంలో 1,694 నూతన స్తంభాలు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. పశువులు, రైతులకు ప్రమాదాలు జరగకుండా 78 ట్రాన్స్ఫార్మర్ గద్దెల ఎత్తు పెంచినట్లు వెల్లడించారు. పాత విద్యుత్ లైన్ల స్థానంలో 9,143 మీటర్ల మేర నూతన లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, సరైన ఎర్తింగ్ లేని 2,514 ప్రాంతాల్లో ఎర్తింగ్ వ్యవస్థలను సరిచేసినట్లు తెలిపారు. ఫీడర్లలో ఇండక్షన్ ఏర్పడే అవకాశం ఉన్న 520 ప్రాంతాలను గుర్తించి సాంకేతిక చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
కరీంనగర్
గరిష్టం/కనిష్టం32.0/24.0శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20267నృసింహునికి మొక్కులు ధర్మపురి: శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రధాన, అనుబంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. పవర్‌కట్ ప్రాంతాలుకొత్తపల్లి: శనివారం ఉదయం 10 నుంచి 2గంటల వరకు 11 కె.వీ.వేంకటసాయి ఫీడర్ పరిధిలోని లక్ష్మీనగర్, రాఘవేంద్రనగర్‌లో విద్యుత్ ఉండదని ఏడీఈ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. -
ఆసనం.. అసమానం
ఆసనంలో అద్భుతం.. ఏకాగ్రతలో అసమానం.. కరీంనగర్లో జరిగిన 13వ రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో చిన్నారులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్న వయసులోనే యోగాతో అద్భుతమైన శారీరక సమతుల్యత, ఏకాగ్రతను సాధిస్తూ అబ్బురపరిచారు. శరీరాన్ని విల్లులా వంచుతూ.. కాళ్లను తలపైకి చేర్చుతూ.. చేతులపై శరీరాన్ని నిలబెడుతూ చేసిన యోగా విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. ప్రతి ఆసనం వెనుక నెలల తరబడి సాధన, ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కనిపించాయి. వయసు చిన్నదైనా సాధనలో పెద్దలకే సవాల్ విసిరేలా వారి విన్యాసాలు సాగాయి. – కరీంనగర్ స్పోర్ట్స్ -
రీసర్వేలో వేగం పెంచాలి
కరీంనగర్ అర్బన్/తిమ్మాపూర్: జిల్లాలో జరుగుతు న్న భూ భారతి రీసర్వే ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సర్వే కోసం ప్రభుత్వం 70 గ్రామాలను ఎంపిక చేసింద న్నారు. ప్రస్తుతం 16 గ్రామాల్లో కొనసాగుతున్న ప్రక్రియను వేగవంతం చేస్తూ మరో 15 గ్రామాల్లో రీ సర్వే ప్రారంభించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో రైతులకు అవగా హన కల్పించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కిషన్‌రావు పాల్గొన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు మిస్ కావొద్దు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల జాబితా పరిశీలనను జాగ్రత్తగా చేపట్టాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. తహసీల్దార్ కర్ర శ్రీనివాస్‌రెడ్డిని ప్రక్రియ వివరాలు అడి గి తెలుసుకున్నారు. నో మ్యాపింగ్, కరెక్షన్స్‌కు నోటీసులు అందించిన ప్రతి వ్యక్తి నుంచి అవసరమైన డాక్యుమెంట్లు సేకరించాలని సూచించారు. బీఎల్వోలు చేపడుతున్న ప్రక్రియను రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఓటర్ల పేర్ల తొలగింపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అర్హులైన ఓటర్ల పేరు పొరపాటున కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలన్నారు. నోటీసులు అందించిన వారి నుంచి సరైన ధ్రువీకరణ పత్రాలు తీసుకుని, వాటి ఆధారంగా మాత్రమే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల నిరసన
కరీంనగర్: బ్యాంకింగ్ సమస్యల పరిష్కారానికి వివిధ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం కరీంనగర్లో నిరసన ర్యాలీ చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో భాగంగా నగరంలోని కేడీసీసీ బ్యాంకు నుంచి తెలంగాణ చౌక్ మీదుగా యూనియన్ బ్యాంక్ బస్టాండ్శాఖ వరకు ర్యాలీ నిర్వహించారు. స్కేల్–4, పైస్థాయి అధికారులకు పీఎల్ఐ చెల్లింపులో వివక్షను విడనాడాలన్నారు. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ ఉద్యోగులు వి.దామోదర్, రాకేశ్, వెంకటేశ్, హరికృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, పోచయ్య, ప్రవీణ్, రాజు, రవీందర్, త్రివేణి, స్పందన, హరీశ్, మాధవరావు, హరి, సాయి పాల్గొన్నారు. -
అండర్‌పాస్ వేయాలి
సర్వీస్ రోడ్డు తప్పనిసరివినతి పత్రం ఇచ్చాంనేషనల్ హైవేపై యూటర్న్ ఉంటుందని అనుకున్నాం. ఆ యూటర్న్ కచ్చితంగా మూసి వేసుడేనని తెలిసింది. యూటర్న్ దారి మూసి వేయడంతో మా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారికి రెండు వైపుల గ్రామం, వ్యవసాయ భూములు ఉన్నాయి. తప్పకుండా అండర్ పాస్ ఏర్పాటు చేయాలి. – గాలి సంపత్, ఖాదర్గూడెంమా గ్రామానికి సర్వీస్ రోడ్డు లేకపోవడంతో గుట్టపక్కనున్న ప్రత్యామ్నాయ దారి గుండా ఇంటికి చేరుకుంటున్నాం. రోడ్డుకోసం ధర్నా, రాస్తారోకోలు చేశాం. కలెక్టర్, నేషనల్ హైవే అధికారులు పరిస్థితిని పరిశీ లించా రు. అయినా సర్వీస్ రోడ్డు వేయలే. – మీస శ్రీనివాస్, ఈదులగట్టెపల్లిశంశాబాద్ నేషనల్ హైవేకు రెండు వైపుల ఉంది. అండర్ పాస్ లేకపోవడంతో గట్టుదుద్దెనపల్లి గుండా తిరి గి వస్తున్నాం. దూరం పెరిగింది. శంశాబాద్కు వెళ్లేందుకు అనువైన చోట అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చాం. – కొయ్యడ రామస్వామి, శంషాబాద్ -
ఇలాగైతే మిల్లులు నడపలేం
కరీంనగర్ అర్బన్: సమస్యలు పరిష్కరించకుండా మిల్లులు ఎలా నడపగలమని రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోనగిరి శశికిరణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిల్లింగ్ సమస్యలకు పరిష్కా రం చూపేవరకు మిల్లులు తెరవమని స్పష్టం చేశా రు. సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నమనేని సుధాకర్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం రైస్ మిల్లర్ల సంఘం భవనం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. రైస్‌మిల్లర్లు, హమాలీలు, డ్రైవర్లు, ఆపరేటర్లు వేల సంఖ్యలో పాల్గొనగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. శశికిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ చేయూత లేకపోవడం వల్లే రైస్ మిల్లులు సంక్షోభంలోకి నెట్టబడ్డాయని ఆరోపించారు. రబీ 2025–26లో వచ్చిన ధాన్యంలో అధిక భాగం బాయిల్డ్ రైస్‌కు అనుకూలంగా ఉందని, రారైస్ మిల్లింగ్ చేస్తే వైట్ చాకీ పర్సంటేజీ, నూక శాతం అధికంగా వస్తుందన్నారు. అలాంటప్పుడు నిర్దేశిత నాణ్యత, రికవరీ సాధించడం ఆచరణలో ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మిల్లర్లకు రావాల్సిన మిల్లింగ్, డ్రాయేజ్, కస్టోడియన్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జీలు సకాలంలో చెల్లించాలన్నారు. బోయినపల్లి ప్రభాకర్‌రావు, గిరిధర్‌లాల్ డొడియ, వీరకుమార్, మల్లారెడ్డి, గంగారెడ్డి, నర్సింగరావు పాల్గొన్నారు. -
ప్రాచీన విజ్ఞానాన్ని భద్రపరచాలి
కరీంనగర్ కల్చరల్: జిల్లాలోని ప్రాచీన తాళపత్రాలు, గ్రంథాలు, శాసనాలు, పురాతన రచనలను గుర్తించి భద్రపరచాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జ్ఞాన్ భారతం మిషన్‌లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్కృతం, తెలుగు, ఉర్దూ, అరబిక్, పర్షియన్ తదితర భాషల్లో తాళపత్రాలు, రాగి లోహాలు, రాతిపై చెక్కిన పురాతన రచనలు, పద్యాలు, శాసనాలను గుర్తించాలన్నారు. జిల్లాలో మరుగునపడిన విలువైన గ్రంథాలు, శాసనాలను సేకరించి డిజిటలైజ్ చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎవ రి వద్దయినా పురాతన గ్రంథాలు, తాళపత్రాలు, శాసనాల సమాచారం ఉంటే 96409 67943కు తెలియజేయాలని సూచించారు. కరెంట్ ఇవ్వలేని కాంగ్రెస్చిగురుమామిడి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు, కరెంటు ఇవ్వలేని దుస్థితిలో ఉందని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నా యకుడు ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవల మరణించిన మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ కుటుంబసభ్యులను శుక్రవారం చిగురుమామిడిలో పరామర్శించారు. రవీందర్ చిత్రపటా నికి పూలువేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు ఆరు గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కరెంటు సరిగా అందక రై తులు ఆందోళనకు దిగుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, శ్రీరామ్శ్యామ్, జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, పోలోజు సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. మీటింగ్‌కు వస్తేనే ఓటు హక్కుకరీంనగర్ అర్బన్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సర్వసభ్య సమావేశానికి స భ్యులు విధిగా హాజరుకావాలని, వరుసగా రెండుసార్లు గైర్హాజరైతే ఓటు హక్కు కోల్పోతారని కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ పీఐసీ చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక బ్యాంకు కార్యాలయంలో మాట్లాడుతూ కరీంనగర్ పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, మధురానగర్శాఖలకు సంబంధించిన సర్వసభ్య సమావేశం ఈ నెల 13న బీఆర్.అంబేద్కర్ స్టేడియంలో ఉదయం 11:00 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి కోరం తప్పనిసరని, అర్హత కలిగిన 1/10 సభ్యులు హాజరు కావాలని తెలిపారు. వరుసగా రెండు సర్వసభ్య సమావేశాలకు హాజరు కాని సభ్యులు నిబంధనల ప్రకారం ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి సభ్యుడు సమావేశానికి విధిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. కరీంనగర్‌టౌన్: మహిళలు తమ హక్కులపై అ వగాహన పెంచుకొని, అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత ఐలమ్మ అన్నారు. శుక్రవారం వాగేశ్వరీ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సాధికారత అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళల భద్రత, విద్య, సమాన అవకాశాలు, ఆత్మగౌరవం, హక్కులపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. తెలంగాణ చరిత్రలో ధైర్యం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించా రు. కళాశాల చైర్మన్ బీవీఆర్. గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. హిమవాణి ఎడ్యూకేషనల్ సొసై టీ జాయింట్ సెక్రటరీ రత్న, గంపల శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రమణ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి యోగా పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో శుక్రజువారం నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న 13వ రాష్ట్రస్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ ఏర్పాట్లను గురువారం అసోసియేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డిలు పరిశీలించారు. 25 జిల్లాల నుంచి 900 మంది బాల బాలికలు పాల్గొననున్నట్లు తెలిపారు. పోటీలను ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మేడిపల్లి సత్యం, ఆల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి, రాష్ట్ర యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు జాల మనోహర్‌లు ప్రారంభిస్తారని తెలిపారు. -
20వేల మట్టి గణపతి ప్రతిమలు
కరీంనగర్‌కార్పొరేషన్: వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు నగరపాలక సంస్థ నడుం బిగించింది. ఏటా ఇస్తున్నమాదిరిగానే ఈసారీ మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా అందచేస్తోంది. నగరపాలకసంస్థ పరిధిలోని 66 డివిజన్లకు గాను ప్రతీ డివిజన్‌కు 300 చొప్పున ప్రతిమలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. గురువారం మేయర్ కొలగాని శ్రీనివాస్ గణపతి ప్రతిమల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. మట్టి గణపతి ప్రతిష్ఠించాలి పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఇంటా మట్టి గణపతిని ప్రతిష్ఠించాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), రసాయన రంగులతో తయారు చేసే విగ్రహాలతో నీటి వనరులు కలుషితమై పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు సర్దార్ రవీందర్ సింగ్, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, కాంతాల జగన్‌రెడ్డి, తాటి ప్రభావతి, గుగ్గిళ్ల జయశ్రీ, అధికారులు పాల్గొన్నారు. -
నేనేం పాపం చేశానమ్మా?
మల్యాల: ముక్కుపచ్చలారని పసివాడు.. రాత్రి హాయిగా తల్లి ఒడిలోనే నిద్రపోయాడు. వేకువజామునే అమ్మ నిద్ర లేపింది. ఎందుకు లేపిందో తెలియని ఆ పసివాడు అమ్మ చేయిపట్టుకుని ఆమె వెంటే నడిచాడు. ఎటు తీసుకెళ్తుందో తెలియని ఆ చిన్నారి అడుగులు చివరకు కాటివరకు తీసుకెళ్తాయని ఊహించలేకపోయాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే.. కొడుకును బావిలో తోయడం.. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. తాను చనిపోతే తన కొడుకును ఎవరు చూస్తారనుకుందో..? కొడుకు ప్రాణం తీసేందుకు ఆ తల్లి మనసుకు ఎన్ని గాయాలయ్యాయో..? తెలియదుగానీ.. ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని బావిలో తోసిందనే వార్తతో ప్రజల కళ్లు వరదలై పారాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన గుండేటి కవిత, దశరథం భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు నిఖిలేష్ (12), శశాంక్(7) కుమారులు సంతానం. కవిత బీడీలు చుడుతూ.. బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. దశరథం ఉపాధి కోసం ముంబాయి వెళ్లాడు. అప్పటినుంచి కవిత మామ పండిత్, ఇద్దరు కుమారులతో కలిసి గుడిపేట వెళ్లే దారిలో ఉన్న సొంతింట్లో ఉంటోంది. ● అన్నా.. నేను చనిపోతున్నా కవిత కుటుంబ పోషణకు కొందరి వద్ద అప్పు చేసినట్లు తెల్సింది. ఆ అప్పులకు వడ్డీ చెల్లించే క్రమంలో మరింత అప్పు చేయాల్సి వచ్చింది. అలా అప్పు రూ.20లక్షల వరకు చేరినట్లు సమాచారం. అప్పు ఇచ్చిన వారు చెల్లించాలని కోరుతుండడం.. భర్త డబ్బులు పంపించకపోవడంతో కొన్నాళ్లుగా మనస్తాపం చెందుతోంది. గురువారం వేకువజామున 3.40 గంటలకు కవిత తన సోదరుడు కొమురయ్యకు ఫోన్ చేసి ‘అన్నా నేను చనిపోతున్నా..’ అని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. అనంతరం చిన్న కుమారుడు శశాంక్‌ను వెంటబెట్టుకుని వెళ్లింది. (ఈ చిత్రాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.) నేరుగా గుడిపేట వెళ్లే మార్గంలో ఉన్న వ్యవసాయ బావిలో శశాంక్‌ను తోసి.. తానూ దూకినట్లు తెలుస్తోంది. కవిత ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో కంగారుపడిన కొమురయ్య సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ బావుల్లో వెదికాడు. ముత్యంపేట మీదుగా గుడిపేట వెళ్లే మార్గంలో వెదుకుతుండగా.. ఓ వ్యవసాయ బావి వద్ద తల్లీకొడుకుల చెప్పులు, సెల్‌ఫోన్ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఫైరింజన్, గజ ఈతగాళ్లతో బావిలో గాలిస్తుండగా.. ఉదయమే కవిత మృతదేహం నీటిలో తేలింది. శశాంక్ కోసం రాత్రి వరకూ గాలిస్తూనే ఉన్నా.. ఆచూకీ దొరకలేదు. ● కన్నీమున్నీరైన కుటుంబ సభ్యులు..స్థానికులు కొడుకును బావిలో వేసి.. తల్లి ఆత్మహత్య చేసుకుందన్న వార్త తెలియడంతో గుడిపేట, ముత్యంపేట, మల్యాలకు చెందిన వందలాదిమంది బావి వద్దకు చేరుకున్నారు. కవిత మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో.. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కొడుకును బావి లో ఎందుకు తోసిందో.. అంటూ కన్నీరు పెట్టుకున్నారు. శశాంక్ తరచూ అనారోగ్యం బారిన పడు తుండడంతో తాను చనిపోతే అతడిని ఎవరూ చూ సుకోరని భావించి బావిలో తోసినట్లు తెలుస్తోంది. శశాంక్ కోసం గాలిస్తున్న గ్రామస్తులురోదిస్తున్న బంధువులు కొడుకును నిద్రలేపి తీసుకెళ్లిన తల్లి ముందుగా బావిలో తోసి తానూ దూకి.. తల్లి మృతదేహం లభ్యం.. చిన్నారి కోసం గజఈతగాళ్ల గాలింపు మిస్టరీగా తల్లీకొడుకుల ఘటన -
21 నుంచి ఎస్జీఎఫ్ పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 షెడ్యూల్ విడుదలైంది. గురువారం కరీంనగర్ డీఐఈవో సత్యనారాంజనేయ, అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్ క్రీడా తేదీలను ప్రకటించారు. ఈ నెల 21 నుంచి అక్టోబర్ చివరి వరకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఎంపికల పోటీలు జరగనున్నాయి. అక్టోబర్ 31 వరకు 29 క్రీడాంశాల్లో ఈ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి క్రీడల తేదీల్లో వచ్చే మార్పుల ఆధారంగా ఉమ్మడి జిల్లా ఎంపిక తేదీల్లోనూ మార్పులు ఉండే అవకాశం ఉందని ఎ్స్జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్ తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికై నవారు తల్లిదండ్రులు లేదా ప్రిన్సిపాల్ సమక్షంలో హామీపత్రాన్ని సమర్పించాలన్నారు. వివరాలకు 9652637637 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. క్రీడా పోటీలు.. తేదీలు ఇవే.. సెప్టెంబర్ 21,22 తేదీల్లో కరీంనగర్ రేకుర్తిలోని సాన్వీ కళాశాలలో బాలబాలికలకు కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. 23,24న రేకుర్తి ఢిల్లీ డిఫెన్స్ కాలేజీలో బాలబాలికలకు వాలీబాల్ పోటీలు ఉంటాయన్నారు. 25,26న నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఖోఖో పోటీలు నిర్వహిస్తారు. 27న ఢిల్లీ డిఫెన్స్ కాలేజీలో హ్యాండ్‌బాల్ పోటీలు, 28న జీనియర్ అకాడమీ కరీంనగర్లో చెస్ పోటీలు ఉంటాయన్నారు. 29న స్పోర్ట్స్ స్కూల్లో వుషు, రెజ్లింగ్, జిమ్నాస్టిక్ పోటీలు, 30న అంబేడ్కర్ స్టేడియంలో బాలురకు క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న అంబేడ్కర్ స్టేడియంలో బాలబాలికలకు బాస్కెట్‌బాల్, రగ్బీ, కరాటే, బాక్సింగ్, తైక్వాండో, తాంగ్తా పోటీలు నిర్వహిస్తారు. 2న జగిత్యాలలోని పొన్నాల గార్డెన్లో బాలబాలికలకు కురాషా, గట్కా, మల్లాకంబ్, ఫెన్సింగ్ పోటీలు, 3న ఇదే వేదికపై కలరిపయట్టు, వెయిట్‌లిఫ్టింగ్, స్కేటింగ్, సాఫ్ట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నారు. 5న గోదావరిఖనిలోని జేఎన్ స్టేడియంలో బాలబాలికలకు బేస్‌బాల్, ఫుట్‌బాల్ పోటీలు ఉంటాయి. 6న తిమ్మాపూర్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఆర్చరీ పోటీలు, 7న అంబేడ్కర్ స్టేడియంలో బాలికలకు క్రికెట్ పోటీలు, బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహిస్తారు. 8న స్టోర్ట్స్ స్కూల్ కరీంనగర్లో బాలికలకు అథ్లెటిక్ పోటీలు, బాలబాలికలకు స్విమ్మింగ్ పోటీలు ఉంటాయి. ఇక్కడే 9న బాలురకు అథ్లెటిక్ పోటీలు నిర్వహిస్తారు. 26న అంబేడ్కర్ స్టేడియంలో బాలబాలికలకు హాకీ పోటీలు, 28న కరీంనగర్ రేకుర్తిలోని ఎస్వీజేసీ మైదానంలో నెట్‌బాల్ పోటీలు, 30న అంబేడ్కర్ స్టేడియంలో సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఇదే రోజు నగరంలోని కేహెచ్ఆర్ అకాడమీలో బాలబాలికలకు టేబుల్ టెన్నీస్ పోటీలు ఉంటాయి. 31న అంబేడ్కర్ స్టేడియంలో బాలబాలికలకు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తారు. టెన్నిస్, సాఫ్ట్ టెన్నిస్, స్క్వాష్, షూటింగ్, జూడో, సెపక్ తక్రా క్రీడల తేదీలు, వేదికలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. షెడ్యూల్ విడుదల చేసిన డీఐఈవో -
డిజిటల్ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించాలి
కరీంనగర్‌సిటీ: సైబర్ భద్రత, డిజిటల్ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయం 100 రోజుల అకడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా, కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, సామాజిక శాస్త్రాల విభాగం, శాతవాహన యూనివర్సిటీ లా కాలేజ్ సహకారంతో శ్రీడిజిటల్ యుగంలో సైబర్ భద్రతశ్రీ అనే అంశంపై గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ విద్యార్థుల్లో సైబర్ అవగాహనతో పాటు డిజిటల్ బాధ్యతను పెంపొందించాలని అధ్యాపకులకు సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగం రిసోర్స్ పర్సన్స్ ఫబ్హా అఫ్రీన్, ప్రియా రాఘవేంద్ర శ్రీసైబర్ నేరాలు– మహిళల భద్రతశ్రీ అనే అంశం గురించి వివరించారు. రిజిస్ట్రార్ పి.సతీశ్‌కుమార్, కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్ కె.పద్మావతి, ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి అఫ్సరీ ఉస్మాని, బి.అనిల్ సింగ్ పాల్గొన్నారు. ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ ఇమ్రాన్ కరీంనగర్ కార్పొరేషన్: ఎన్ఎస్ యూఐ జిల్లా అ ధ్యక్షుడిగా మహమ్మద్ ఇమ్రాన్ ని యామకం అ య్యాడు. రాష్ట్రంలోని 34 జిల్లాల కు అధ్యక్షులను నియమిస్తూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కరీంనగర్‌కు ఇమ్రాన్‌ను అధ్యక్షుడిగా నియమించారు. ఇమ్రాన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణకు ఇమ్రాన్ కృతజ్ఞతలు తెలిపాడు. కొత్తపల్లి: అక్రమ అరెస్టు అప్రజాస్వామికమని, తన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్‌కుమార్ గౌడ్ తెలిపారు. గురువారం తెల్లవారుజామున గృహనిర్బంధం చేసి, అనంతరం కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారని అసహనం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను అడ్డుకోలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కరీంనగర్‌కార్పొరేషన్: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద దళితులు నడిచిన రోడ్డును పాలు, పసుపు నీళ్లతో శుద్ధిచేసిన బీఆర్ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏసీపీకి ఫిర్యాదు చేశారు. దళితులు నడిస్తే రోడ్డు అపవిత్రమైందనడం బీఆర్ఎస్ కుల అహంకారానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ములకల మల్లేశం, సముద్రాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి కరీంనగర్: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల (సైన్స్ వింగ్)లో అవగాహన, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్యంపై వ్యాసరచన పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సైకియాట్రిస్ట్, తెలంగాణ స్టేట్ ఐఎంఏ అధ్యక్షుడు పొరండ్ల కిషన్ మాట్లాడుతూ మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. చైర్మన్ శ్రీనివాస్ శ్రీరాముల, కోచైర్మన్ రాజు, అధ్యక్షుడు శివకాంత్ పటేల్, కార్యదర్శి బట్టు వినోద్ పటేల్, కోశాధికారి మేతుకు కె.చైతన్య, జాయింట్ సెక్రటరీ ఐతా సూరజ్, కోలా అన్నారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తున్న లయన్స్‌క్లబ్ బాధ్యులు -
తొలిదశలో గుర్తిస్తే చికిత్స అందించొచ్చు
కరీంనగర్: క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని హైదరాబాద్ మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అంకాలజిస్టు డాక్టర్ అన్వేశ్, డాక్టర్ నీలేశ్, డాక్టర్ స్నేహ తెలిపారు. కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి 126 మంది హాజరై పరీక్షలు చేయించుకోగా, 16 మందికి పాజిటివ్‌గా గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. క్యాన్సర్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతీ నెల రెండో గురువారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో ఉచిత స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయనితెలి పారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ సంపత్, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, పీఆర్ అబ్దుల్ వకీల్ పాల్గొన్నారు. -
పుట్టగొడుగుల సాగుతో అదనపు ఆదాయం
కొత్తపల్లి: తక్కువ స్థలంలో పుట్టగొడుగుల సాగు చేపట్టడం ద్వారా రైతులు అదనపు ఆదాయం, స్వయం ఉపాధి పొందవచ్చని డాక్టర్ ఎం. రాజేంద్రప్రసాద్ తెలిపారు. మండలంలోని చింతకుంట మన ఆదర్శ రైతు ఉత్పత్తి కంపెనీ లిమిటెడ్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గురువారం రైతులు, మహిళలకు శ్రీఆరోగ్య పుట్టగొడుగులుశ్రీ సాగుపై ప్రాయోగిక శిక్షణ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై రైతులు దృష్టి సారించాలని ఎఫ్‌పీవో చైర్మన్ శంకరయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు వైష్ణవి, ఆస్నా, హంపీ, కార్తీక్, శిరీష, శివ పాల్గొన్నారు. -
ఎస్సారార్‌లో జాబ్‌మేళా
కరీంనగర్‌సిటీ: కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ కళాశాలలో ఐసీఐసీఐ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎన్ఐఐటీ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ప్రాసెసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీశ్ మాట్లాడుతూ ఎంపికై న వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా కళాశాలలో జాబ్ మేళాలు, క్యాంపస్ నియామకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ డ్రైవ్‌కు 50 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. కెరీర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్ కె.సుధాకర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ హర్జ్యోత్ కౌర్, సీనియర్ కౌన్సిలర్లు మనోజ్ కుమార్, రాకేశ్ పాల్గొన్నారు. కరీంనగర్: రపైవేట్ పట్టా భూములను 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐకి వినతిపత్రం సమర్పించారు. జాడి బాల్‌రెడ్డి, కుంట తిరుపతి, హరీశ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గుజ్జ శ్రీనివాస్, కార్పొరేటర్ వాసా ల రమేశ్ పాల్గొన్నారు. రేకుర్తిలోని సుమారు 125, విద్యానగర్‌లోని 16 సర్వే నంబర్లను 22–ఏ నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఐలమ్మ వర్ధంతి.. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని శాతవాహన యూనివర్సిటీ ఎదుట బీజేపీ పశ్చిమ జోన్ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. శ్రీనివాస్, నరేశ్, సంతోష్, చంద్రగిరి వేణు, పరశురాములు పాల్గొన్నారు. ఒకరి అనుమానాస్పద మృతికరీంనగర్క్రైౖం: నగరంలోని కోతిరాంపూర్‌కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వన్‌టౌన్ పోలీసుల వివరాలు.. కోతిరాంపూర్‌కు చెందిన బండ మల్లేశం (45) గతంలో మేసీ్త్రగా పనిచేసే వాడు. ఐదేళ్లుగా మద్యానికి బానిసయ్యడు. బుధవా రం రాత్రి మల్లేశం చాతిలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


