ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

Feb 4 2026 7:26 AM | Updated on Feb 4 2026 7:26 AM

ఎన్ని

ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం నూతన ఆవిష్కరణలకు శ్రీకారం ప్రారంభ దశలోనే కుష్ఠును నివారించవచ్చు

కరీంనగర్‌ అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు జితేందర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. పోలింగ్‌ రోజున పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతున్న విధానాన్ని మైక్రో అబ్జర్వర్లు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. విధుల నిర్వహణలో తప్పకుండా గుర్తింపు కార్డు ధరించాలని అన్నారు. పోలింగ్‌ ముందు రోజు మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని, మాక్‌ పోలింగ్‌, ఓటింగ్‌, పోలింగ్‌ ఏజెంట్ల నియామకం వంటివి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఎన్ని కల ఆడిట్‌ అబ్జర్వర్‌ ఎం.మనోహర్‌, నోడల్‌ అధికారి, జెడ్పీ సీఈవో శ్రీనివాస్‌, మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌ మోహినుద్దీన్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ఆంజనేయులు పాల్గొన్నారు.

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు పెద్దపీట వేయాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన వర్సిటీలో పరిశోధన పర్యవేక్షకులకు నూతన ఉత్తర్వుల పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీహెచ్‌డీ చేయడానికి పరిశోధకులు ముందుకు వస్తున్న తరుణంలో చాలామంది విశ్వవిద్యాలయ అధ్యాపకులు పదవీ విరమణ చేయడం వల్ల పరిశోధనలలో ఖాళీ ఏర్పడిందన్నారు. వాటిని భర్తీ చేయడానికి విశ్వవిద్యాలయం ఉ న్నత విద్య మండలి సహకారంతో విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న సహాయ, సహ ఆచార్యులకు పర్యవేక్షకులుగా పదోన్నతులు కల్పించిందని తెలిపారు. వర్సిటీతో పాటు వివిధ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు తెలుగులో 5, వృక్షశాస్త్రంలో 5, వాణిజ్యశాస్త్రంలో 7గురును పర్యవేక్షకులుగా గుర్తించి ఉత్తర్వులు అందించడం జరిగిందని వీసీ ఉమేశ్‌కుమార్‌ వివరించారు.

కరీంనగర్‌: కుష్ఠువ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చని లెప్రసీ అండ్‌ ఎయిడ్స్‌ జిల్లా అధికారి డాక్టర్‌ సుధా అన్నారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఓపీ ఆవరణలో కుష్ఠువ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుధా మాట్లాడుతూ... మహాత్మా గాంధీ కుష్టు రోగులకు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. కుష్టు వ్యాధి లక్షణాలు, వ్యాధి తీవ్రత, చికిత్స విధానం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభించే వైద్య సేవల గురించి ఆమె వివరించారు. కుష్ఠు పూర్తిగా నయమయ్యే వ్యాధి అని, ప్రారంభదశలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి వైకల్యం రాకుండా పూర్తిగా కోలుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంవోలు డాక్టర్‌ శిల్ప, డాక్టర్‌ నవీన్‌, డాక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.

7న ఓవైసీ బహిరంగ సభ

విద్యానగర్‌(కరీంనగర్‌): ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ ఈనెల 7న కరీంనగర్‌ రానున్నారు. మహాత్మా జ్యోతి బాపూలే మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందు కు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం ఉమ్మడి జిల్లా ఎంఐఎం పార్టీ పరిశీలకుడు యా సర్‌ ఆర్ఫాత్‌, కరీంనగర్‌ అధ్యక్షుడు సయ్యద్‌ గులాం అహ్మద్‌ హుస్సేన్‌ పరిశీలించారు.

ఎన్నికల్లో మైక్రో   అబ్జర్వర్ల పాత్ర కీలకం 
1
1/3

ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

ఎన్నికల్లో మైక్రో   అబ్జర్వర్ల పాత్ర కీలకం 
2
2/3

ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

ఎన్నికల్లో మైక్రో   అబ్జర్వర్ల పాత్ర కీలకం 
3
3/3

ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement