విషాదంలో అంబానీ కుటుంబం : కన్యాదానం చేసిన నా రెండో అమ్మ! | Tina Ambani sister demise emotional Ambani family mourns | Sakshi
Sakshi News home page

విషాదంలో అంబానీ కుటుంబం : కన్యాదానం చేసిన నా రెండో అమ్మ!

Apr 3 2026 4:52 PM | Updated on Apr 3 2026 5:12 PM

Tina Ambani sister demise emotional Ambani family mourns

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ  భార్య, మాజీ బాలీవుడ్ నటి టీనా అంబానీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె పెద్ద సోదరి జర్నా కన్నుమూశారు. తన సోదరి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న టీనా అంబానీ, సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు.ప్రస్తుతం ఆమె తన సోదరిని కోల్పోయిన బాధలో ఉండటంతో, యావత్ అంబానీ కుటుంబం ఈ విషాదంలో మునిగిపోయింది.

టీనా అంబానీ, తన అక్క జర్నా మరణ వార్తను తన సోషల్ మీడియాలో పంచుకుంటూ, తన సోదరి జ్ఞాపకార్థం ఒక భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. జర్నా తనకు కేవలం అక్క కాదు,  రెండో తల్లిలాంటిది, తన జీవితంలో ఆమె పాత్ర వెలకట్టలేనిది అంటూ ఆమెను గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా తన వివాహ సమయంలో జర్నా స్వయంగా కన్యాదానం చేసి, ఆప్యాయతాను రాగాలతో తనను అత్తవారింటికి పంపించారని భావోద్వేగానికి లోనయ్యారు.

ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్‌ లేఆఫ్‌ : ఈ టెకీ ప్లాన్‌ మామూలుగా లేదు!

ఆమె చాలా ప్రేమగల వ్యక్తిత్వమని, ఆమె తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ సంతోషాన్ని పంచేదని టీనా వర్ణించారు. జర్నా హుందాగా దయగా ఎపుడూ నవ్వుతూ అందరిలోనూ సంతోషాన్ని నింపేవారని సానుకూల శక్తితో అక్కచెల్లెళ్లందరికీ, వారి పిల్లలకు, మనవళ్లకు స్ఫూర్తి  అని తన సోదరికి నివాళులర్పించారు.  "మా కుటుంబానికి జర్నా ఒక వెలుగు. ఓం శాంతి, నా జియా. నీవు లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. నీవు పంచిన ప్రేమ తరతరాలకూ గుర్తుండిపోతుంది," అని రాసుకొచ్చారు. టీనా అంబానీ షేర్ చేసిన ఈ పోస్ట్‌ను చూసి అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ఆమె మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆమెకు 55, అతడికి 25 : రూ 60 కోట్లు, లగ్జరీకార్లు

Advertisement
 
Advertisement
Advertisement