ప్రతీక్‌ యాదవ్‌కు యోగి నివాళులు : కీలకంగా పోస్ట్‌మార్టం నివేదిక | Prateek Yadav postmortem reveals he died due to blood clot in lungs | Sakshi
Sakshi News home page

ప్రతీక్‌ యాదవ్‌కు యోగి నివాళులు : కీలకంగా పోస్ట్‌మార్టం నివేదిక

May 13 2026 5:49 PM | Updated on May 13 2026 5:57 PM

Prateek Yadav postmortem reveals he died due to blood clot in lungs

సమాజవాదీ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, బీజేపీ నాయకురాలు అపర్ణ యాదవ్ భర్త ప్రతీక్ యాదవ్ (38) మరణానికి గల కారణాలను పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. అలాగే ఆయన శరీరంపై ఉన్న గాయాలు 'యాంటీమార్టం' (మరణానికి ముందే జరిగినవి) అని నివేదిక పేర్కొంది.


ప్రతీక్ యాదవ్ "మాసివ్ పల్మనరీ థ్రోంబోఎంబోలిజం" (Massive Pulmonary Thromboembolism) కారణంగా సంభవించిన "కార్డియోరెస్పిరేటరీ కొలాప్స్" వల్ల చనిపోయారని పోస్టుమార్టం నివేదిక ప్రకారం, తేల్చి చెప్పింది. 

కార్డియోరెస్పిరేటరీ కొలాప్స్  అంటే
ఊపిరితిత్తులలోని ధమనులలో (లంగ్స్‌లో బ్లడ్ క్లాట్‌ )రక్తపు గడ్డలు అడ్డుపడటం వల్ల శ్వాసక్రియ మరియు రక్త ప్రసరణ ఆగిపోయి, గుండె ఊపిరితిత్తులు ఒక్కసారిగా విఫలమయ్యాయి. తదుపరి విశ్లేషణ కోసం గుండె , ఇతర అంతర్గత అవయవాలను (విసెరా) భద్రపరిచారు. 

మరోవైపు ప్రతీక్ ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వల్ల కలిగే సమస్యలతో బాధపడుతూ మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ, ఆయన పరిస్థితి చాలా కాలంగా విషమంగానే ఉందని  సమాచారం. 

38 ఏళ్ల ప్రతీక్ యాదవ్, బుధవారం ఉదయం లక్నోలోని తన నివాసంలో ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని సమాచారం అందగానే మెడికల్ టీమ్ ఆయన నివాసానికి చేరుకుంది. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో లక్నోలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన  ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం 5:55 గంటలకు ఆయన మరణించారని సివిల్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జి.పి. గుప్తా  వెల్లడించారు.

ప్రతీక్ యాదవ్  ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు. అఖిలేష్ యాదవ్‌కు సోదరుడు (సవతి తమ్ముడు). ప్రతీక్ ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వల్ల కలిగే సమస్యలతో బాధపడుతూ మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ, ఆయన పరిస్థితి చాలా కాలంగా విషమంగానే ఉందని సమాచారం. ప్రతీక్‌ ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులను, రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ ప్రతీక్‌ మృతదేహానికి నివాళర్పించారు. ఆయన భార్య అపర్ణయాదవ్‌ను ఓదార్చారు.

Advertisement
 
Advertisement
Advertisement